అరటి పండ్లను ఎత్తుకెళ్లిన స్థానికులు.. | Dcm Van Accident In Suryapet | Sakshi
Sakshi News home page

అదుపు తప్పి అరటిపండ్ల డీసీఎం బోల్తా

Published Mon, Aug 20 2018 1:16 PM | Last Updated on Mon, Aug 20 2018 1:16 PM

Dcm Van Accident In Suryapet - Sakshi

అరటిపండ్లను తీసుకెళ్తున్న స్థానికులు 

చివ్వెంల(సూర్యాపేట) : వేగంగా వస్తున్న డీసీ ఎం అదుపు తప్పి బోల్తాపడంది. ఈ సంఘటన చివ్వెంల మండలం బీబీగూడెం గ్రామశివారులో సూర్యాపేట-ఖమ్మం రహదారిపై ఆదివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం నుంచి సూర్యాపేటకు అరటి పండ్ల లోడుతో వస్తున్న డీసీఎం బీబీగూడెం గ్రామ శివారులో అదుపు తప్పి బోల్తాపడింది. ప్రమాదంలో అరటి పండ్ల ట్రేలు కిందపడడంతో  గమనించిన స్థానికులు, రహదారిపై వెళ్తున్న వాహనచోదకులు ట్రేలతో సహా అరటి పండ్లను తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ బి.ప్రవీణ్‌కుమార్‌ వెంటనే సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పండ్ల విలువ రూ.లక్ష వరకు ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. తమకు ఇంతవరకు ఎవరు ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement