bananas
-
మామిడి, అరటి.. ఉత్పత్తిలో మనమే మేటి
సాక్షి, అమరావతి: అరటి పండ్లు, మామిడి ఉత్పత్తిలో దేశంలోనే అంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నివేదిక వెల్లడించింది. అరటి పండ్లను ఉత్పత్తి చేసే ప్రధాన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 18.1 శాతంతో మొదటి స్థానంలో ఉందని.. అలాగే మామిడి ఉత్పత్తిలోనూ దేశంలోనే అత్యధికంగా 5.0 మిలియన్ మెట్రిక్ టన్నులతో ఏపీ ప్రథమ స్థానంలో ఉందని తెలిపింది. దేశంలో ప్రధానంగా అరటి పండ్లు, మామిడి, ద్రాక్ష పండ్ల ద్రవ్యోల్బణం, ఉత్పత్తిపై ఆర్బీఐ తన అధ్యయన నివేదికను విడుదల చేసింది. అరటిపండ్ల ఉత్పత్తిలో ఏపీ తరువాత స్థానాల్లో మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాలున్నాయని.. ఇవన్నీ దేశం మొత్తం అరటి పండ్ల ఉత్పత్తిలో 80 శాతం వాటాను కలిగి ఉన్నాయని నివేదిక వివరించింది.ఇక ఆంధ్రప్రదేశ్‌లో అరటి పండ్ల ఉత్పత్తి కేంద్రాలుగా తూర్పు గోదావరి, పశి్చమ గోదావరి, కర్నూలు, కడప ఉన్నాయి. అలాగే, దేశంలో రెండో అతి ముఖ్యమైన పండు అరటి పండేనని నివేదిక తేల్చిచెప్పింది. ఇక దేశంలో అరటి పండ్ల ఉత్పత్తి 2012–13లో 26.5 మిలియన్ మెట్రిక్ టన్నులుండగా.. 2022–23 నాటికి అది 36.6 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెరిగిందని ఆర్బీఐ తెలిపింది. అలాగే, దేశం నుంచి అరటి ఎగుమతులు 2013–14లో 35 వేల మెట్రిక్ టన్నులుండగా.. 2022–23లో అది 376 వేల మెట్రిక్ టన్నులకు పెరిగింది. అరటిపండ్ల అతిపెద్ద వినియోగదారుగా మన దేశమే ఉందని కూడా తెలిపింది. దేశీయ ఫార్మ్‌గేట్ 2021–22లో అరటి కిలో ధర రూ.14 నుంచి రూ.15 ఉండగా.. 2022–23లో రెండింతలు పెరిగి కిలో రూ.27 నుంచి 28 రూపాయలైందని నివేదిక పేర్కొంది.మామిడి ఉత్పత్తి, సాగులో ఏపీ ఆధిపత్యం.. మరోవైపు.. మామిడి ఉత్పత్తి, సాగులోనూ ఆంధ్రప్రదేశ్ ఆధిపత్యం చెలాయిస్తున్నట్లు నివేదిక తెలిపింది. దేశంలో మామిడి సాగు విస్తీర్ణంలో 17 శాతం వాటాతో.. 5.0 మిలియన్ టన్నుల ఉత్పత్తితో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని నివేదిక పేర్కొంది. ఆ తర్వాత 12 శాతం వాటాతో ఉత్తరప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. దేశంలో మొత్తం మామిడి ఉత్పత్తిలో ఏపీ వాటా 23 శాతమని కూడా పేర్కొంది. మామిడి సాగు ప్రధాన రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, బిహార్, కర్ణాటక, గుజరాత్, తమిళనాడు, తెలంగాణలు దేశవ్యాప్తంగా 75 శాతం ఉత్పత్తి కలిగి ఉన్నాయని నివేదిక తెలిపింది. -
అరటి పండ్లు పండిపోతున్నాయని పడేస్తున్నారా?
మనం మార్కెట్ నుంచి అరటి పళ్లు తీసుకుస్తాం. కానీ వాటిని ఉపయోగించే లోపలే పాడేపోతుంటాయి. ఎందుకంటే? అరటిపళ్లు తొందరగా పండి పోతాయి. బాగా పండినవి తినలేం కూడా. వాటిని ఏం చేయాలో తెలియక చాలా ఇబ్బంది పడుతుంటారు. చూస్తు..చూస్తూ.. పడేయబుద్ధికాక ఓ పక్కా..! మరోవైపు వృధా చేస్తున్నామేమో! అనే ఫీలింగ్‌తో తెగ బాధ పడిపోతుంటా. అందువల్లే చాలామంది అరటిపళ్లను ఇంట్లో జనం ఎక్కువమంది ఉన్నారు, తింటారు అనుకుంటేనే కొంటున్నారు. అలాంటప్పుడు అలా పండిన అరటి పండ్లను పడేయకుండా చక్కగా ఉపయోగించుకునేలా రెసిపీలు చేసుకోవచ్చట. అవేంటో చూద్దామా!. మన వంటకాల్లో పండిన అరటి పళ్లును ఐదు రకాలుగా వాడొచ్చట. అంతేగాదు వాటితో చేసిన రెసిపీలను పిల్లలు పెద్దలు వదలకుండా లాగించేస్తారట కూడా. ఇంతకీ అవేంటంటే. బనానాపూరీలు: ఇది టీ టైం అల్పహారంగా చెప్పొచ్చు. ఇది మంగళూరు వంటకం. మనం ఎప్పటిలా చేసే పూరీలకు విభిన్నంగా మంచి రుచిని అందిస్తాయి ఈ బనానా పూరీలు. గోధుమ పిండిలో వేడి పాలు, పండిన అరటిపండ్లు, సుగంధద్రవ్యాలు కలిపి పూరీల మాదిరిగా చేస్తే వెరైటీ వంటకాన్నీ ఆస్వాదించడమే గాకుండా పండిన అరటిపళ్లను పడేయకుండా చక్కగా ఉపయోగించగలుగుతాం. ఈ వంటకం అన్ని వయసుల వారికి తప్పక నచ్చుతుంది. అరటిపండు రైతా! ఏంటిదీ అరటిపండు రైతా అని భయపడకండి. అదేనండి సలాడ్ మాదిరిగానే ఈ పండిన అరటిపండ్లను చక్కగా పెరుగులో కలిపి, కొద్దిపాటి డ్రైప్రూట్స్ జోడించి చిన్న చిన్న బౌల్లో వేసి అందిస్తే వావ్ అంటూ లాగించేస్తారు. ఇది మార్నిగ్ టైంలో మంచి బ్రేక్‌ఫాస్ట్‌గా పనిచేస్తుంది. దీనిలో కాల్షియం, ఫైబర్, పోటాషియం తదితర విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. పైగా పిల్లలకు మంచి బలం కూడా. బనానా వడలు! ఇది కూడా టీ టైం స్నాక్స్ లాంటివే. అరటికాయ బజ్జీలు విన్నాం కానీ ఇలా అరటిపండ్లతో వడలేంటి అని ఆశ్చర్యపోకండి. పండిన అరటి పండ్లను వడలలో ఉపయోగించడం వల్ల లోపలి తీపి భాగం వడంతటికి స్ప్రెడ్ అయ్యి టేస్టీగా ఉంటుంది. ఇవి క్రంచి క్రంచిగా, టేస్టీగా మంచి ఫీల్‌ని ఇచ్చే స్నేక్స్ అని చెప్పొచ్చు అరటిపండు కొబ్బరి చట్నీ అరటిపండుతో కొబ్బరి చట్నీ ఏంటండీ? అని భయపడకండి. కొబ్బరి అరటితో ఓ క్రీమ్‌లాంటి లిక్విడ్ వస్తుంది. దీనికి కొద్దిగా సుగంధద్రవ్యాలు జోడిస్తే మంచి వాసనతో కూడిన రుచి ఉంటుంది. దీన్ని దోసలు, ఇడ్లీలలో స్వీట్ చట్నీ మాదిరిగా వాడొచ్చు. మన భాషలో చెప్పాలంటే అరటి పండు జామ్ అనుకోండి. ఎలా ఉంటుందా? అని సందేహించొద్దు. ఎందుకంటే? కమ్మటి కొబ్బరితో అరటిపళ్లలోని తీపి కలగలస్తే దాని టేస్టే వేరబ్బా!. ఓసారి ట్రై చెయ్యండి మీకే తెలుస్తుంది. అంతేకాదండోయ్ మెత్తని పండిన అరటిపళ్లతో స్నేక్స్, బ్రేక్‌ఫాస్ట్ వంటివి చేయడం చాలా సులభం. పైగా వివిధర రకాలుగా రెసిపీల రూపంలో చేసిస్తే మన ఇంటిల్లపాదికి సకల పోషకాలను అందించినవారమవుతాం. ఇంకేందుకు ఆలస్యం వృధా చెయ్యకుండా ట్రై చేసి చూస్తారు కదూ!. (చదవండి: చికూ ఫెస్టివల్ గురించి విన్నారా? ఆ ఫ్రూట్ కోసమే ఈ పండుగ!) -
కోనసీమ నుంచి తమిళ సీమకు.. అరటిపండ్లలో ఈ అరటి వేరయా..!
‘అరటిపండ్లలో ఎర్ర చక్కెరకేళి అరటి వేరయా..’ అంటారు పండించే రైతులు, వైద్యనిపుణులు. సాధారణ అరటి కన్నా మిన్నగా అరుదైన పోషకాలు ఉండే ఈ పండును ఆరోగ్యదాయినిగా భావిస్తారు. పండించే రైతుకు నిలకడైన ఆదాయాన్ని అందించే ఈ రకం అరటికి చెన్నై మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. గోదావరి లంకల్లో పండే ఈ రకం అరటి తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు ఎగుమతి అవుతోంది. ఈ ఎగుమతుల విలువ ఏటా కోట్లలో ఉంటోంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం పరిధిలో ఎర్ర చక్కెరకేళి సాగు అధికం. కొత్తపేట, ఆత్రేయపురం, రావులపాలెం, అలమూరుతో పాటు అయినవిల్లి, అంబాజీపేట మండలాల్లో ఈ రకం పంటను సాగుచేస్తారు. తూర్పు గోదావరి జిల్లా పెరవలి, పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ, తణుకు ప్రాంతాల్లో కూడా ఈ రకం అరటి సాగు ఎక్కువే. ఈ మూడు జిల్లాల్లో సుమారు రెండువేల ఎకరాల్లో ఈ పంట సాగవుతోందని అంచనా. ఎకరాకు 700 నుంచి 800 చెట్ల వరకు పెంచుతారు. అధికంగా గోదావరి లంక భూముల్లో ఈ పంటను సాగుచేస్తారు. ఇక మైదాన ప్రాంతంలోని కొబ్బరి తోటల్లో అంతరపంటగా కూడా వేస్తారు. – సాక్షి, అమలాపురం ధర ఘనం ఎర్ర చక్కెరకేళి అరటిపండుకు మంచి డిమాండ్ ఉంది. దీని గెల ధర ఏడాదిలో సగటున రూ.350 వరకు ఉంటోంది. డిమాండ్ అధికంగా ఉన్నప్పుడు రూ.400 నుంచి రూ.500 వరకు పలుకుతోంది. ప్రస్తుతం రావులపాలెం మార్కెట్లో గెల సైజును బట్టి రూ.200 నుంచి రూ.500 వరకు ధర ఉంది. అప్పుడప్పుడు ధరలు నేల చూపులు చూసినా సీజన్లో ఢోకా ఉండదని చెబుతున్నారు. కర్పూరం, చక్కెరకేళి, అమృతపాణి వంటి రకాలతో పోలిస్తే ఎర్ర చక్కెరకేళీకి నిలకడైన ధర ఉంటోంది. రావులపాలెం కేంద్రంగా.. ఈ మూడు జిల్లాల్లో పండే అరటిపంటను రావులపాలెం మార్కెట్ యార్డు నుంచి ఎగుమతి చేస్తుంటారు. ఇక్కడి నుంచే ఎర్ర చక్కెరకేళి అధికంగా తమిళనాడు, తక్కువ మొత్తంలో కేరళకు ఎగుమతి అవుతోంది. సాధారణంగా ఫిబ్రవరిలో మొదలయ్యే సీజన్ ఆగస్ట్ వరకు ఉంటుంది. ప్రస్తుతం రోజుకు 6 నుంచి 10 వ్యాన్ల గెలలు ఎగుమతి అవుతున్నాయి. ఒక్కో వ్యాన్‌లో 350 వరకు గెలలుంటాయి. వీటివిలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందని అంచనా. ఏటా రూ.52 కోట్ల మేర ఎర్ర చక్కెరకేళి ఎగుమతులు జరుగుతాయి. సీజన్లో యార్డు వద్దకు రాకుండా నేరుగా రైతు తోటల వద్ద నుంచే రవాణా చేస్తుంటారు. పోషకాలు అధికం ఎర్ర చక్కెరకేళి అరటిలో ఎక్కువగా ఉన్న పొటాషియం ఎంతో మేలు చేస్తుంది. ఈ అరటి శరీరంలో క్యాల్షియం పెంచుతుంది. ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. సాధారణ అరటిపండ్లలో కన్నా దీన్లో పోషకాలు అధికం. ఖనిజాలు, విటమిన్లు, పీచు పదార్థాలు, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. ఇతర అరటిపండ్ల కన్నా బీటా కెరోటిన్ అధికం. ఇది గుండె ధమనుల్లో రక్తం గడ్డకట్టకుండా చూస్తుంది. తక్కువ కేలరీలు ఉన్నందున బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఆహారం. విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం. హిమోగ్లోబిన్ శాతాన్ని గణనీయంగా పెంచుతుంది. సాగులో ప్రతికూలతలు ఎర్ర చక్కెరకేళి సాగుకు కొన్ని ప్రతికూలతలున్నాయి. సాధారణ అరటి దిగుబడి ఎనిమిది నెలలకే మొదలవుతుంది. ఇది ఏడాదిన్నర సమయం పడుతుంది. కార్శి తోటగా సాగుచేయడం పెద్ద ప్రయోజనకరం కాదు. బలమైన పోషకాలున్న నేలలు అవసరం. ఇతర అరటి రకాల కన్నా ఎరువులు, పురుగుమందులు అధికంగా వినియోగించాలి. పెట్టుబడి సైతం ఎకరాకు రూ.లక్ష అవుతుంది. చెట్టు ఎత్తు పెరుగుతున్నందున తుపాన్లు, భారీ వర్షాలు, వరదల సమయంలో పడిపోయే ప్రమాదం ఎక్కువ. తమిళనాడు ఎగుమతులపైనే వ్యాపారం రావులపాలెం మార్కెట్ యార్డ్‌కు వచ్చే అరటిగెలల్లో 10 శాతం ఎరుపు చక్కెరకేళి అరటి గెలలు ఉంటాయి. ఇవి ఎక్కువగా తమిళనాడుకు, తక్కువగా కేరళకు ఎగుమతి అవుతాయి. స్థానికంగా కొనుగోలు చేయడం చాలా తక్కువ. తమిళనాడు మార్కెట్‌పైనే ఇక్కడ వ్యాపారం ఆధారపడి ఉంటోంది. కానీ దీనికి నిలకడైన ధర మాత్రం దక్కుతోంది. – కోనాల చంద్రశేఖరరెడ్డి, అరటి వ్యాపారి, రావులపాలెం పెట్టుబడి అధికం ఎర్ర చక్కెరకేళి సాగులో పెట్టుబడి అధికం. ఇతర అరటి రకాల సాగు కన్నా ఎకరాకు రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు అధికం. పంటకాలం కూడా ఎక్కువ. ఒకసారి మాత్రమే మంచి దిగుబడి వస్తుంది. కార్శి పంట దిగుబడి పెద్దగా రానందున గిట్టుబాటు కాదు. కానీ ధర మాత్రం లాభసాటిగా ఉంటోంది. మంచి దిగుబడి వచి్చ, రికార్డుస్థాయి ధర ఉన్నప్పుడు మాత్రం ఎకరాకు రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు లాభం వస్తోంది. – పెదపూడి బాపిరాజు, రైతు, వాడపాలెం, కొత్తపేట మండలం ఆరోగ్యానికి ఎంతో మేలు ఎరుపు రకం అరటిపండ్లలో చక్కెరకేళి రకంలో ఇతర రకాల అరటిపండ్ల కన్నా వైవిధ్యకరమైన పోషకాలున్నాయని గుర్తించారు. బీటా కెరోటిన్ అనే పిగ్మెంట్ మిగిలిన పండ్ల కన్నా ఎక్కువగా ఉంటుంది. అధికంగా పొటాషియం, విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. రక్తపోటు, ఒబేసిటీ బాధితులకు ఇది మంచిది. – వడ్డాది సురేశ్, ఎండీ జనరల్, వడ్డాది ఆస్పత్రి, రాజమహేంద్రవరం -
శివయ్య ప్రసాదం.. మూగజీవులకు ఆహారం
రాజంపేట టౌన్ (అన్నమయ్య జిల్లా): కార్తీక మాసం సందర్భంగా వందలాది మంది భక్తులు శివాలయాలకు తరలి వచ్చి దీపాలను వెలిగించి స్వామివారికి పండ్లను ప్రసాదంగా ఉంచుతారు. ఆ పండ్లను భక్తులు తమ వెంట తీసుకెళ్లకుండా అక్కడే ఉంచి వెళ్లిపోతారు. వందలాది మంది భక్తులు వదిలి వెళ్లే వివిధ రకాల పండ్లు పెద్ద సంఖ్యలో ఉంటాయి. ప్రధానంగా భక్తులు దీపాలను వెలిగించాక స్వామివారికి అరటి పండ్లను ప్రసాదంగా పెడతారు. ఒక్క రాజంపేట పట్టణంలోని శివాలయంలోనే కార్తీక సోమవారం రోజు ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులు స్వామివారికి ప్రసాదంగా పెట్టే అరటి పండ్లు వేల సంఖ్యలో ఉంటాయి. ఈ కారణంగా కొన్ని గంటల వ్యవధిలోనే ఆలయ ప్రాంగణమంతా వేల సంఖ్యలో అరటి పండ్లు పడి ఉంటాయి. అయితే ఈ పండ్లు నిరుపయోగమవుతున్నాయని పట్టణంలోని ఈడిగపాళెంకు చెందిన నరసింహా అనే ఎలక్ట్రీషియన్ గుర్తించాడు. పండ్లను మూగజీవులకు ఆహారంగా పెడితే ఒక రోజు అయినా అవి కడుపు నింపుకోగలవన్న ఆలోచన ఆయనలో తట్టింది. అనుకున్నదే తడవుగా తన షాపునకు చుట్టుపక్కల ఉండే చిరు వ్యాపారులు, దినసరి కూలీల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లి, భక్తులు శివాలయ ప్రాంగణంలో ఎక్కడ పడితే అక్కడ వదిలిన అరటి పండ్లను ఏరుకొని మూగజీవులకు ఆహారంగా పెడతామని చెప్పాడు. వారు కూడా నరసింహా ఆలోచన సరైనదేనని భావించి కార్తీక మాసంలో భక్తులు శివాలయంలో స్వామివారికి ప్రసాదంగా పెట్టే అరటి పండ్లతో పాటు కొబ్బెర చిప్పలను మూగజీవులకు ఆహారంగా పెట్టేందుకు ముందుకు వచ్చారు. 2016వ సంవత్సరం నుంచి కరోనా సమయంలో మినహా ప్రతి ఏడాది కార్తీక మాసంలో నరసింహాతో పాటు చిరువ్యాపారులు, దినసరి కూలీలైన వెంకటనరసయ్య, రమణ, బీవీ సురేంద్ర, ఉమాశంకర్‌లు శివాలయంలోని అరటి పండ్లను గోతాల్లో వేసుకొని ప్రత్యేక వాహనంలో రాపూరు ఘాట్‌లో ఉండే కోతులకు ఆహారంగా పెడుతున్నారు. కార్తీక మాసంలో ప్రతి మంగళవారం ఈ చిరు వ్యాపారులు, దినసరి కూలీలు తమ పనులను సైతం మానుకొని ఆటో బాడుగను కూడా వారే భరించి మూగజీవులకు చేస్తున్న సేవకు పట్టణ వాసులచే ప్రసంశలు, అభినందనలు అందుకుంటున్నారు. రాపూరు ఘాట్‌లో కోతులు పెద్ద సంఖ్యలో ఉంటాయని, వాటికి ఎవరు కూడా ఆహారం పెట్టే పరిస్థితి ఉండదని అందువల్ల ప్రతి ఏడాది కార్తీకమాసంలో ఈసేవా కార్యక్రమం చేపడుతున్నట్లు వారు తెలిపారు. (క్లిక్ చేయండి: వెయ్యేళ్ల అన్నమయ్య ‘కాలి’బాట.. ఎక్కడుందో తెలుసా!) -
అరటి పండ్లను తింటున్నారా ? అయితే జాగ్రత్త..
శ్రీకాకుళం: ప్రస్తుతం కాలంలో ప్రతి ఒక్కరూ ఉద్యోగ, వ్యాపార, క్రీడా, తదితర పనుల్లో బిజీగా ఉంటున్నారు. ఆరోగ్యంగా ఉండేందుకు ఎక్కువ మంది ఫలాలను తీసుకుంటున్నారు. వైద్యులు కూడా పండ్లు జాతులు, కూరగాయలు అధికంగా తీసుకోవాలని సూచిస్తారు. అయితే ఆరోగ్యానిచ్చే పండ్లు, కూరగాయలను సైతం కొంత మంది వ్యాపారులు రసాయనాలతో మాగపెడుతున్నారు. దీంతో ప్రజలు అరోగ్యం బారితన పడుతున్నారు. లాభార్జనే ధ్యేయం.. వ్యాపారులు లాభార్జనే ప్రధానధ్యేయంగా ప్రజలను అడ్డదారుల్లో మోసగించి వారి అనారోగ్యాలకు కారణమవుతున్నారు. తక్కవ కాలంలో ఎక్కవ సంపాదించాలనే ధ్యేయంతో ఎక్కవమంది వ్యాపారులు గోదాంలో అరటి, బొప్పాయి, కర్బూజ, ఆపిల్ పక్వానికి రాకముందే పలు రకాల రసాయనాలను పూస్తున్నారు. దీనివల్ల వాటిలో సహజత్వం కోల్పోయి అధికంగా మెరుపు కనిపిస్తుంది. దీంతో కొనుగోలు దారులు సులువుగా మోసపోతున్నారు. అరటిలో మోసాలు అధికం.. అన్ని కాలాల్లో కూడా అరటి పండ్లకు గిరాకీ ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని వ్యాపారులు కార్బన్‌మోనాక్సైడ్ పౌడర్‌ను పిచికారీ చేయిస్తున్నారు. లిక్విడ్ రూపంలో మరికొన్ని రసాయనపదార్థాలు వినియోగించిన బకెట్లలో అరటి గెలలు వేసి మగ్గబెడుతున్నారు. కానరాని దాడులు.. ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న వ్యాపారులుపై దాడులు చేయాల్సిన సంబంధిత అధికారులు ఎక్కడా కనిపించడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. వ్యాపారులు అరటి గెలలు వేలాడిదీసి, వాటికి కార్బైడ్‌తో మగ్గపెడుతున్న విషయం తెలిసినా ప్రశ్నించేవారే కరువయ్యారు. దీంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారే ఆరోపణలున్నాయి. అమలుకాని ఆహార భద్రతాచట్టాలు ఆహారభద్రతా చట్టం 2006 (ఫుడ్‌సేప్టీ స్టాండర్డ్‌యాక్ట్)ప్రకారం ప్రజలు ఆహారపదార్థాలు కలుíÙతం చేస్తున్నవారిపై దాడులు చేయాలి. పండ్లపై కార్బైడ్ వినియెగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాలు ఆదేశాలిస్తున్నా క్షేత్రస్థాయిలో అమలుకు జరగడంలేదు. -
అయ్యవారికి అరటి గెల.. తెలుసుకోవాలంటే 170 ఏళ్లు వెనక్కి వెళ్లాల్సిందే..
టెక్కలి(శ్రీకాకుళం జిల్లా): భీష్మ ఏకాదశి పర్వదినం.. చెట్లతాండ్ర అనే గ్రామంలో లక్ష్మీనృసింహ స్వామి ఆలయ ప్రాంగణమంతా అరటి సువాసన. యువకులు గెలలు లెక్క పెడుతున్నారు. వంద దాటాయి.. వెయ్యి దాటాయి.. సమయం గడుస్తోంది గానీ లెక్క తేలడం లేదు. గెలలన్నీ పూర్తయ్యే సరికి వచ్చిన లెక్క ఎనిమిది వేలు. చదవండి: ‘ఎల్లువొచ్చి గోదారమ్మా’.. బిందెలన్నీ అక్కడ తయారైనవే! ఎనభై ఏళ్ల కిందట ఊరిలో మొదలైన ఈ సంప్రదాయం ఇప్పుడు సరిహద్దులు చెరిపేస్తూ ఇతర రాష్ట్రాలకూ పాకింది. ఎక్కడెక్కడ నుంచో భక్తులు వచ్చి ఇక్కడ అరటి గెలలు కడుతున్నారు. ఇంత పెద్ద ఎత్తున గెలలు కట్టినా ఎన్నడూ లెక్కలో పొరపాటు రాలేదు. అసలు ఈ అరుదైన సంప్రదాయం ఎలా మొదలైంది.? ఆలయ నిర్మాణం వెనుక విశేషాలేంటో తెలుసుకోవాలంటే 170 ఏళ్లు వెనక్కి వెళ్లాలి. సంతబొమ్మాళి మండలంలోని చెట్లతాండ్ర. పెద్ద ప్రత్యేకతలు ఏమీ లేవు. అన్ని పల్లెల్లాగానే సా దాసీదా గ్రామం. కానీ ఇక్కడ ప్రతి ఇంటిలో నిర్వహించే శుభ కార్యానికి ముందు పరావస్తు అయ్యవారికి మొదట పూజలు నిర్వహించి ఆ తర్వా తే పనులు మొదలుపెడతారు. 170 ఏళ్ల కిందట ఈ ఊరికి వచ్చిన స్వామీజీ పేరే పరావస్తు అయ్యవారు. అరటి గెలల సంప్రదాయానికి మూల కారణం ఆయనే. అయ్యవారు జీవ సమాధిగా మారిన స్థలానికి ఆనుకుని నిర్మాణం చేసిన లక్ష్మీ నృసింహస్వామి ఆలయం ఇప్పటికి 170 ఏళ్ల కిందట.. ప్రస్తుతం నౌపడ ఆర్ఎస్.. అప్పట్లో రాళ్లపేట రైల్వే స్టేషన్లో చెట్లతాండ్ర గ్రామానికి చెందిన కుమ్మరి వృత్తిదారులు కుండలు అమ్మడానికి వెళ్లారు. పరావస్తు అయ్యవారు అనే స్వామి వారి వద్దకు వెళ్లి తనను చెట్లతాండ్ర గ్రామానికి తీసుకెళ్లాలని కోరారు. దీంతో కుమ్మరి వృత్తిదారులు స్వామిని గ్రామానికి తీసుకువచ్చారు. అప్పట్లో ఉన్న పాఠశాల వద్ద గ్రామానికి చెందిన పంగ అప్పలనాయుడుకు చెందిన స్థలంలో పర్ణశాల ఏర్పాటు చేసి అయ్యవారికి ఆతిథ్యం ఇచ్చారు. ఆయన నిత్యం లక్ష్మీనృసింహ స్వామిని ఆరాధించేవారు. గ్రామం చుట్టుపక్కల సత్సంగాలు నిర్వహించే వారు. ఈతి బాధలు ఉన్న వారికి స్వామి వద్దకు వెళ్లి సమస్యలు చెప్పుకుని సాంత్వన పొందేవారు. ఇలా 45 ఏళ్ల పాటు ఆయన ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇన్నేళ్లూ ఆయన వద్ద ఉన్న అక్షయ పాత్ర ద్వారా ప్రసాదాలు ఇచ్చే వారని భక్తులు చెప్పుకునేవారు. పరావస్తు అయ్యవారు జీవసమాధిగా మారిన స్థలంలో పుట్టిన మర్రిచెట్టు 45 ఏళ్ల కైంకర్యాల తర్వాత ఆయన అక్కడే జీవ సమాధి పొందారు. ఆయన జీవ సమాధిగా మారిన ప్రదేశంలో కొద్ది రోజులకే మర్రి చెట్టు పుట్టింది. దీంతో ఆ మర్రిచెట్టు అయ్యవారికి ప్రతిరూపంగా భావించారు. ఆ తర్వాత గ్రామం మధ్యలో సుమారు ఎకరా స్థలాన్ని కేటాయించి లక్ష్మీ నృసింహ స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించారు. మొదట్లో వడపప్పు, పానకం నైవేద్యంగా సమర్పించేవారు. రోజు రోజుకూ భక్తులు ఆరాధన పెరుగుతుండడంతో 80 ఏళ్ల కిందట అరటి గెలలను కట్టడం ప్రారంభించారు. ఈ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. మొదట్లో గ్రామంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో భక్తులు మాత్ర మే అరటి గెలలు కట్టేవారు. ఆ తర్వాత జిల్లాలు, రాష్ట్రాలు దాటి భక్తులు ఇక్కడకు చేరుకుని అరటి గెలలు కట్టడం ప్రారంభించారు. అరటి గెలల సంఖ్య పదుల నుంచి వేలకు చేరింది. ఈ ఏడాది నిర్వహించిన భీష్మ ఏకాదశి ఉత్సవాలకు ఏకంగా 8 వేలకుపై చిలుకు అరటి గెలలు కట్టారు. ఒక్కటీ మిస్ కాదు చెట్లతాండ్ర గ్రామంలో గల పరావస్తు అయ్యవారు శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయం ఆవరణలో భక్తులు వేల సంఖ్యలో అరటి గెలలు కడుతుంటారు. అయితే తిరిగి అరటి గెలలు తీసుకునే క్రమంలో ఏ ఒక్క అరటి గెల కూడా మిస్ కాదు. గ్రామంలో యువకులంతా ఎంతో బాధ్యతగా చూసుకుంటారు. మూడు రోజుల తర్వాత కొంత మంది భక్తులు అరటి గెలలను ఇంటికి తీసుకువెళ్తారు. మరి కొంత మంది స్వామి వద్దనే ఉంచేస్తారు. దశాబ్దాలుగా జరుగుతున్న ఈ ఉత్సవంలో ఏ రోజూ అరటి గెలలు పోయాయి అనే మాట రాలేదని ఉత్సవాల కమిటీ సభ్యులు చెబుతున్నారు. చిన్నప్పటి నుంచి చూస్తున్నా.. మా ఊరిలో నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అయ్యవారి సన్నిధిలో అరటి గెలల మహోత్సవాన్ని చూస్తున్నాను. ఏటా భక్తులు పెరుగుతున్నారు. -పి.జగ్గయ్య, చెట్లతాండ్ర, సంతబొమ్మాళి మండలం. బాధ్యతగా ఉంటాం మా గ్రామంలో ఏటా భీష్మ ఏకాదశి నుంచి మూడు రోజుల పాటు పరావస్తు అయ్యవారు లక్ష్మీ నృసింహాస్వామి ఆలయంలో ఎంతో బాధ్యతగా ఉత్సవాలు నిర్వహిస్తాం. వేలాదిగా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా యువకులంతా సమష్టిగా పనిచేస్తారు. భక్తులకు అన్నదానం నిర్వహిస్తాం. ఆంధ్రా, ఒడిశా, తెలంగాణ ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. -పి.అసిరినాయుడు, సర్పంచ్, చెట్లతాండ్ర -
ఏపీ నుంచి 42,935 టన్నుల అరటి ఎగుమతి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ నుంచి 2020–21లో 42,935 మెట్రిక్ టన్నుల అరటి పళ్లు ఎగుమతి అయినట్లు కేంద్రం తెలిపింది. స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ అయిన అగ్రికల్చరల్, ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్టస్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ (అపెడా) వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల విధానం కింద ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, కడప జిల్లాలను ఎగుమతులకు అనువైన అరటిసాగుకు సానుకూలమైన ప్రాంతాలుగా గుర్తించిందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలసి అరటి ఎగుమతుల కోసం అపెడా అనేక చర్యలు చేపడుతోందని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర వాణిజ్యశాఖ సహాయమంత్రి అనుప్రియ పటేల్ సమాధానం ఇచ్చారు. జాతీయ పరిశోధనా సంస్థలు, ఉద్యానవన విశ్వవిద్యాలయాల సహకారంతో అరటి సాగును ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థల ఏర్పాటును ప్రోత్సహిస్తూ అంతర్జాతీయ సర్టిఫికేషన్‌కు అవసరమైన సాగు విధానాలను అమలు చేస్తోందన్నారు. క్రయ–విక్రయదారులతో సమావేశాలు నిర్వహిస్తూ ఎంపికచేసిన క్లస్టర్లలో నూరుశాతం టిష్యూ కల్చర్ అరటిని సాగుచేసేందుకు ప్రోత్సహిస్తోందని తెలిపారు. అరటి ఎగుమతుల రవాణాకు వీలుగా ముంబైలో పోర్టుకు నేరుగా ప్రత్యేక రైలును ప్రవేశపెట్టినట్లు చెప్పారు. దేశంలో 1,57,919 పంచాయతీలకు బ్రాడ్‌బ్యాండ్ సదుపాయం ఈ ఏడాది జూలై 9 నాటికి దేశంలో 1,57,919 పంచాయతీలకు బ్రాడ్‌బ్యాండ్ సదుపాయం కల్పించినట్లు కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ సహాయమంత్రి కపిల్ మోరేశ్వర్ తెలిపారు. 2023 ఆగస్టుకల్లా అన్ని గ్రామాలకు బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించాలని లక్ష్యం పెట్టుకున్నట్లు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. భారత్‌నెట్ ప్రాజెక్ట్ ఫేజ్–1 కింద కేవలం అండర్‌గ్రౌండ్ ఆప్టిక్ ఫైబర్ కేబుల్ కింద గ్రామ పంచాయతీలకు బ్రాడ్‌బ్యాండ్ సేవలు కల్పించే పనులు చేపట్టడంతో రైట్ ఆఫ్ వే సమస్యలతో ప్రాజెక్ట్ అమలులో ఇబ్బందులు తలెత్తాయన్నారు. భారత్‌నెట్ ఫేజ్–2 కింద ఆంధ్రప్రదేశ్‌తో సహా 8 రాష్ట్రాల్లో 65 వేల పంచాయతీలకు బ్రాడ్‌బ్యాండ్ సదుపాయం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సారథ్యంలో అమలు జరుగుతోందని, లక్ష్యం మేరకు పనులు జరగనందున ప్రాజెక్టు గడవుపై ప్రభావం పడుతోందని పేర్కొన్నారు. -
ప్రశాంతమైన నిద్రకు ఈ ఐదు తినండి!
మీరు తీసుకున్న ఆహారంలో మసాలాలు ఎక్కువగా ఉన్నా, అది హైప్రోటీన్ డైట్ అయినా అది నిద్రలేమికి దారితీస్తుందని చెబుతున్నారు నిద్రానిపుణులు. రాత్రి ఆహారానికి, నిద్రకు దగ్గరి సంబంధం ఉంటుందంటున్నారు శామీ మార్గో అనే ప్రముఖ స్లీప్ ఎక్స్పర్ట్. ఆమె ఇటీవలే ‘ద గుడ్ స్లీప్ గైడ్’ అనే పుస్తకం రాశారు. రాత్రివేళల్లో మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల అది నిద్రపై దుష్ప్రభావం చూపుతుందని పేర్కొంటున్నారు శామీ మార్గో. మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారం, ఆల్కహాల్, కాఫీ, కొవ్వులు ఎక్కువగా ఉండే పదార్థాలు, చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలు... ఈ ఐదూ నిద్రను దూరం చేస్తాయనీ, అయితే... అరటిపండ్లు, బాదం (ఆల్మండ్స్), తేనె, ఓట్స్, గోరువెచ్చని పాలు... ఈ ఐదూ ప్రశాంతంగా నిద్రపట్టేలా చేసే మంచి ఆహారాలని పేర్కొన్నారు శామీ. తగ్గుతున్న అడవులూ... పెరుగుతున్న దోమలూ, వ్యాధులు! ప్రపంచవ్యాప్తంగా అడవులు తగ్గుతున్న కొద్దీ... అక్కడి వనాల్లో పెరగాల్సిన దోమలూ నగరాల్లోకి వచ్చేస్తున్నాయట. ఇటీవల అమెరికాలో జికా, డెంగ్యూ, ఎల్లో ఫీవర్, చికన్ గున్యా వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో దోమలు అకస్మాత్తుగా, విపరీతంగా పెరగడానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు అక్కడి పరిశోధకులు. దాంతో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. కొన్ని దోమ జాతులు నీళ్లలో పెరిగినట్లుగానే మరికొన్ని దోమలు అడవుల్లోని ఆకుపచ్చ వనాల్లో మాత్రమే తమ జీవనచక్రాన్ని కొనసాగించాలి. కానీ అవి అడవుల నరికివేత విపరీతంగా సాగుతున్న నేపథ్యంలో ఆ అడవి దోమలు నగరాలకు వలస వస్తున్నాయని చెబుతున్నారు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన పరిశోధకులు. ఈ పరిశోధక బృందానికి నేతృత్వం వహించిన మార్మ్ కిల్పాట్రిక్స్ తమ పరిశోధన వివరాలను వెల్లడిస్తూ గత ఐదు దశాబ్దాల్లో దోమల సంఖ్య పెరగాల్సిన దానికంటే పది రెట్లు అధికంగా పెరిగాయని పేర్కొంటున్నారు. ఫలితంగా జికా, డెంగ్యూ, ఎల్లో ఫీవర్, చికన్ గున్యా వంటి దోమ ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులూ, వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతోందని బెంబేలెత్తుతున్నారు. ఇది డిసీజ్ బర్డెన్ పెంచడంతో పాటు పర్యావరణాన్నీ మరింతగా దెబ్బతీసి మరిన్ని ఉత్పాతాలకు కారణమవుతుందని పరిశోధకులు ఆందోళన చెందుతున్నారు. -
పగుళ్లకు కాంప్లిమెంట్స్
కవులకేం పన్లేదు. ఊరికే కూర్చొని కవితలు అల్లేస్తుంటారు. పాదాల్ని పద్మాలు అంటారు. తమలపాకులు అంటారు. అయినా పనీపాట ఉన్న స్త్రీల పాదాలు ‘పద్మాలంత సున్నితంగా, తమలపాకులంత కోమలంగా’ ఎలా ఉంటాయి చెప్పండి! కానీ కవుల భావుకతను మరీ అంత తీసిపడేయనక్కర్లేదు. ఒక ఆలోచనైతే కలిగించారు కదా.. పాదాలు మృదువుగా ఉంటే అందంగా ఉంటాయని! అలా అందంగా, శుభ్రంగా పాదాలను ఉంచుకోడానికి ప్రయత్నిస్తే పాపం కవుల కల్పనను గౌరవించినవాళ్లమూ అవుతాం, మనకూ కొన్ని కాంప్లిమెంట్స్ వస్తాయి. ఇప్పుడైతే పగుళ్ల పాదాలను చిన్న టిప్‌తో అందంగా ఎలా మార్చుకోవచ్చో చూద్దాం. ఏం చేయాలి? బాగా పండిన అరటిపండ్లు రెండు తీసుకోండి. చక్కగా గుజ్జులా చెయ్యండి. కాస్త పచ్చిగా, పచ్చగా ఉన్న పండ్లయినా ఓకే అనుకోకండి. పూర్తిగా పండని అరటిపండ్లలో ఆసిడ్స్ ఉంటాయి. అవి చర్మంతో దురుసుగా ప్రవర్తిస్తాయి. ఇప్పుడు ఆ పండిన అరటిపండ్ల గుజ్జును మెల్లిగా పాదమంతా రుద్దండి. కాలి వేళ్లు, వేళ్ల సందులకు కూడా గుజ్జును చేర్చి, చిన్న మసాజ్‌లాంటిది ఇవ్వండి. అలా రెండు పాదాలకూ రాసి, 20 నిముషాల పాటు అలాగే ఉంచేయండి. 20 నిముషాల తర్వాత శుభ్రమైన నీటితో (చల్లనివి గానీ, గోరు వెచ్చనివి గానీ) కడిగేయండి. ఎన్నిసార్లు ? పడుకోబోయే ముందు ప్రతి రోజూ చెయ్యాలి. అలా కనీసం రెండు వారాలు లేదా ఫలితాలతో మీరు సంతృప్తి చెందేవరకు చెయ్యాలి. చేస్తే ఏమౌతుంది? అరటిపండు సహజసిద్ధమైన మాయిశ్చరైజర్. అంటే చర్మాన్ని తేమగా ఉంచే స్వభావం గలది. అరటిపండులో ఉండే విటమిన్ ఎ, బి6, సి లలో చర్మాన్ని మెత్తబరిచి, పొడిబారకుండా ఉంచే గుణాలు ఉంటాయి. ఇవన్నీ కలిసి పాదాలను మృదువుగా మార్చేస్తాయి. మడమల పగుళ్లకు ఇది తిరుగులేని మంత్రం. -
బిల్లు చూసి కళ్లు తేలేసిన నటుడు..!
చంఢీగర్ : పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని మనందరికీ తెలుసు. కానీ, అంతకంతకూ పెరుగుతున్న ధరల దెబ్బకు సామాన్యుడు వాటివంక కన్నెత్తి చూడాలంటేనే వణికిపోతున్నాడు. జేబుకు చిల్లు పడుతుందేమోనని జాగ్రత్త పడుతున్నాడు. సంపన్నులకు అలాంటిదేం ఉండదు. ఎంతంటే అంత పెట్టి కొంటారు. అయితే, బాలీవుడ్ నటుడు రాహుల్ బోస్‌కు మాత్రం ఓ ఫైవ్‌స్టార్ హోటల్ ఊహించని షాక్ ఇచ్చింది. జిమ్ చేసిన అనంతరం రెండు అరటి పండ్లు ఆర్డర్ ఇచ్చిన అతను బిల్ చూసి కళ్లు తేలేశాడు. రెండు బనానాలకు ఏకంగా రూ.443 బిల్ చేశారు. ‘పండ్లు కూడా చెడు చేస్తాయనడానికి ఇదే ఉదాహరణ. ఇంత ధరపెట్టి కొంటే బాధగా ఉండదా..!’ అని ట్విటర్లో ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. వాటిపై జీఎస్టీ కూడా వేశారని పేర్కొన్నాడు. బోస్ ట్వీట్‌పై కొందరు కామెంట్లు చేశారు. తాజా పండ్లపై జీఎస్టీ వేయడం అన్యాయమని ఒకరు.. పట్టపగలే దోచేస్తున్నారని మరొకరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అయినా, భారీ మొత్తంలో చార్జీలు వసూలు చేస్తున్న ఆ హోటల్ ఉండటమెందుకు.. వేరొక లగ్జరీ రూమ్‌లోకి షిఫ్ట్ కావొచ్చు కదా’ అని ఇంకొకరు బోస్కి సలహా ఇస్తున్నారు. ‘సినిమా హాళ్లలో కూడా అడ్డగోలుగా దోచుకుంటున్నారు. టికెట్లు, పాప్‌కార్న్‌కు భారీగా వసూలు చేస్తున్నారు. నువ్ మరో హోటల్‌కి మారడం మంచిది. అరటి పండ్లు బయట కూడా దొరుకుతాయి. అక్కడ కొనుక్కో’అని ఇంకో అభిమాని సూచించాడు. దిల్ దడ్కనే దో, మిస్టర్ అండ్ మిసెస్ అయ్యర్, ది జపనీస్ వైఫ్, విశ్వరూపం-2 సినిమాల్లో బోస్ నటించారు. You have to see this to believe it. Who said fruit wasn’t harmful to your existence? Ask the wonderful folks at @JWMarriottChd #goingbananas #howtogetfitandgobroke #potassiumforkings pic.twitter.com/SNJvecHvZB — Rahul Bose (@RahulBose1) July 22, 2019 -
అరటి పండ్లను ఎత్తుకెళ్లిన స్థానికులు..
చివ్వెంల(సూర్యాపేట) : వేగంగా వస్తున్న డీసీ ఎం అదుపు తప్పి బోల్తాపడంది. ఈ సంఘటన చివ్వెంల మండలం బీబీగూడెం గ్రామశివారులో సూర్యాపేట-ఖమ్మం రహదారిపై ఆదివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం నుంచి సూర్యాపేటకు అరటి పండ్ల లోడుతో వస్తున్న డీసీఎం బీబీగూడెం గ్రామ శివారులో అదుపు తప్పి బోల్తాపడింది. ప్రమాదంలో అరటి పండ్ల ట్రేలు కిందపడడంతో గమనించిన స్థానికులు, రహదారిపై వెళ్తున్న వాహనచోదకులు ట్రేలతో సహా అరటి పండ్లను తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ బి.ప్రవీణ్‌కుమార్ వెంటనే సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పండ్ల విలువ రూ.లక్ష వరకు ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. తమకు ఇంతవరకు ఎవరు ఫిర్యాదు అందలేదని ఎస్ఐ తెలిపారు. -
పెను ప్రమాదంలో అరటి పండు
సాక్షి, వెబ్ డెస్క్ : పండ్లలో అందరికీ ప్రీతిపాత్రమైనది అరటి పండు. అలాంటి అరటి పండు భవిష్యత్ తరాలకు అందుబాటులో ఉండదా?. శాస్త్రవేత్తలు ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఓ ట్రాపికల్ వ్యాధి అరటి పంటను పట్టి పీడిస్తోంది. పరిస్థితి ఇలానే కొనసాగితే అరటి పండును భవిష్యత్‌లో చూడలేమని శాస్త్రేవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏంటా వ్యాధి? పనామా వ్యాధి ఆఫ్రికా, ఆసియా ఖండాల్లో అతి వేగంగా వ్యాప్తి చెందుతోంది. పనామా వ్యాధి ఫంగల్ జాతికి చెందినది. పనామా వ్యాధి అరటి చెట్టు వేర్లపై ప్రభావం చూపి దాన్ని చనిపోయేలా చేస్తుంది. భయాందోళనలు ఆసియా, ఆఫ్రికాల్లో విపరీతంగా ప్రభావం చూపుతున్న పనామా వ్యాధి దక్షిణ అమెరికా ఖండానికి సోకుతుందేమోనని భయపడుతున్నారు. దక్షిణ అమెరికాలో కావెండిష్ అరటి పండ్లు బాగా ఫేమస్. అత్యంత రుచికరంగానూ ఉంటాయి. పనామా వ్యాధి వల్ల ఈ పండు అంతరించి పోయే ప్రమాదం ఉంది. అయితే, చిమ్మచీకట్లలో వెలుగులా మెడగాస్కన్ అరటి పండు పరిశోధకుల ఆశలు రేకెత్తిస్తోంది. పనామా వ్యాధిని తట్టుకుని నిలబడగల శక్తి ఈ అరటికి ఉంది. అయితే, కారడవిలో ఉన్న అరటిని ప్రజలకు అందేలా చేయడం అతి కష్టమైన పని. -
మెదడుకు చురుకుదనం
⇔ అరటిపండులో చక్కెర... సుక్రోజ్, ఫ్రక్టోజ్, గ్లూకోజ్ వంటివి సహజరూపంలో ఉంటాయి. పీచు పదార్థాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. రెండు అరటిపండ్లు తింటే 90 నిమిషాల సేపు పని చేయవచ్చని పరిశోధనల్లో రుజువైంది. అందుకే క్రీడాకారులు ఎక్కువగా అరటిపండు తీసుకుంటారు. అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవడానికి అరటిపండు మంచి ఆహారం. కాబట్టి ప్రతిరోజూ అరటిపండు తింటే శక్తితోపాటు జీర్ణవ్యవస్థ పని తీరు మెరుగవుతుంది. ⇔ ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ (పిఎంఎస్) సమస్య ఉన్న వాళ్లు పీరియడ్స్‌కు కనీసం వారం ముందు నుంచి ప్రతిరోజూ అరటిపండు తింటుంటే ఆ సమయంలో ఆందోళన, ఉద్వేగం వంటి లక్షణాలు అదుపులో ఉంటాయి. ⇔ డిప్రెషన్ వ్యాధిగ్రస్తుల మానసిక స్థితిలో అరటిపండు తినడానికి ముందు, తిన్న తర్వాత గణనీయమైన మార్పులు వస్తున్నట్లు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ⇔ ఇందులో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. ఎనీమియాను అరికడుతుంది. బ్లడ్‌ప్రెజర్‌ను అదుపులో ఉంచుతుంది. గుండెపోటును నివారించడంలో బాగా పని చేస్తుంది. ⇔ ఇందులోని పొటాషియం మెదడును అప్రమత్తంగా ఉంచుతుంది. రెండు వందల మంది విద్యార్థుల మీద నిర్వహించిన పరిశోధనలో ఈ విషయం నిర్థారణ అయింది. క్రమం తప్పకుండా ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో కాని, మధ్యాహ్న భోజనం తర్వాత కాని అరటిపండు తిన్న వారిలో మెదడు మరింత చురుకుగా పని చేస్తుందట. -
నిలువెత్తు గెల!
ఆరడుగుల ఎత్తు, 25 అత్తాలు అబ్బురపరచిన అరటి గెల సాధారణంగా మూడడుగుల ఎదిగే అరటి గెల ఏకంగా ఆరడుగులు పెరిగి అబ్బుర పరుస్తోంది. రావులపాలెం ప్రాంతంలో అరుదుగా కనిపించే కర్ణాటక చెక్కరకేళీగా పిలిచే బూడిద బక్కీస్ రకానికి చెందిన భారీ గెలను స్థానిక అరటి మార్కెట్‌కు బుధవారం అమ్మకానికి తీసుకువచ్చారు. రావులపాలానికి చెందిన మల్లిడి త్రినాథరెడ్డి తన ఇంటి పెరడులో పెంచిన చెట్టుకు కాసిన గెల పక్వానికి రావడంతో తన సైకిల్‌పై యార్డుకు తీసుకువచ్చాడు. ఆ గెలను కొనేందుకు వ్యాపారులు పోటీ పడ్డారు. చివరికి కొమరాజులంకకు చెందిన కర్రి శ్రీనివాసరెడ్డి రూ.650కు కొనుగోలు చేశారు. ఈ గెలలో మొత్తం 25 అత్తాలు ఉండగా, ఒక్కో అత్తంలో సుమారు 20 నుంచి 25 కాయలు ఉన్నాయి. మొత్తంగా సుమారు 600 కాయలు ఉంటాయని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ గెలను అంతా ఆసక్తిగా తిలకించారు. - రావులపాలెం -
40 అరటిపండ్లు బలవంతంగా తినిపించారు
ముంబై: ముంబై పోలీసులు ఒక దొంగకు అక్షరాల 40 అరటి పండ్లతో చక్కని విందు భోజనం పెట్టారు. ఇదేదో కొత్త రకం శిక్ష అనుకుంటున్నారా? కానేకాదు.. ఇదంతా నేరాన్ని వెలుగులోకి తెచ్చేందుకు పోలీసులు పడిన తంటా! ఇదేంటి నేరాన్ని రాబట్టేందుకు పోలీసులు ఇలా కూడా చేస్తారా అనుకుంటున్నారా? అవును అక్షరాలా ఇది నిజం. ముంబైలోని ఒక మహిళ గొలుసును దొంగతనం చేసిన ఓ దొంగ అది పోలీసులకు తెలియకూడదని ఆమాంతం దాన్ని మింగేశాడు. దీంతో పోలీసులు వెంటనే అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లడం... ఎనీమా (కడుపు ఖాళీ చేయడం) చేయించడం అన్ని చకచకా జరిగిపోయాయి. ఇంతచేసిన పాపం పోలీసులకు ఆశించిన ఫలితం దక్కలేదు. దీంతో ఆసుపత్రి సిబ్బంది ఆపరేషన్ చేద్దామని ఓ ఉచిత సలహా పడేశారు. కానీ గొలుసు రేటు కంటే కూడా ఆపరేషన్‌కు అయ్యే ఖర్చుకు బెంబెలెత్తిపోయిన పోలీసులు, గొలుసు ఎలా బయటకు తీయాలో మాకు తెలుసని వెళ్లిపోయారు. ఆ తర్వాత దొంగకు అరటిపండ్లు తినిపించడం.. మల విసర్జనకు పంపడం.. గొలుసు కోసం వెతకడం.. ఇలా ఏకంగా ఒక రోజంతా ఆ దొంగకు 40 అరటిపండ్లు బలవంతంగా తినిపించి ఎట్టకేలకు గొలుసును రాబట్టారు. ఇలాంటిది మొదటిసారేం కాదని గతేడాది ఏప్రిల్, జూలైలో ఇలాంటి అరటి విందు కార్యక్రమాలు జరిగాయని ముంబై పోలీసు సీనియర్ ఇన్స్పెక్టర్ శంకర్ ధనవాడే తెలిపారు. కాగా ఇటీవలే హైదరాబాద్‌లోనూ ఇలాంటి తరహా ఘటనే జరగడం కొసమెరుపు. -
అశ్వాలకు అరటిపళ్లే ఇష్టం
పరిపరి శోధన మానవమాత్రుల ఇష్టాయిష్టాల గురించి శాస్త్రవేత్తలు చాలా పరిశోధనలు చేశారు. అయితే, మూగజీవాల అభి‘రుచు’లపై పెద్దగా శ్రద్ధపెట్టలేదు. ఆ లోటును తీరుద్దామనుకున్నారో ఏమో! ఇంగ్లాండ్‌కు చెందిన డెబోరా గుడ్విన్ అనే శాస్త్రవేత్త అశ్వరాజాల అభి‘రుచు’లపై శ్రద్ధగా పరిశోధన సాగించాడు. ఈ పరిశోధనలో అతగాడు చాలా కొత్త సంగతులనే కనిపెట్టాడు. అశ్వాలకు క్యారట్ల కంటే అరటిపళ్లే ఎక్కువ ఇష్టమని లోకానికి వెల్లడించాడు. అంతేకాదు, అశ్వరాజాలు ఇష్టపడే ఆహార పరిమళాలు వరుసగా మెంతులు, అరటిపళ్లు, చెర్రీలు, దనియాలు, క్యారట్లు, పిప్పరమింట్ వాసనలేనని నిగ్గు తేల్చాడు. ఇంతకీ ఈ పరిశోధన వల్ల ఉపయోగం ఏముందని అనుకుంటున్నారా? గుడ్విన్ దొరవారు ఫలశ్రుతిని కూడా సెలవిచ్చారు. గుర్రాల కోసం ఫుడ్ సప్లిమెంట్స్ తయారు చేసే కంపెనీలు తన పరిశోధనను దృష్టిలో ఉంచుకుని, అశ్వరాజాలు ఇష్టపడే పరిమళాలతో ఉత్పత్తులను రూపొందిస్తే లాభపడగలవని ఢంకా బజాయించి చెబుతున్నాడు. -
పండ్ల పైపొట్టు... ఆరోగ్యానికి తొలిమెట్టు
అరటిపండ్ల లాంటి తొక్క వలిచి తినే పండ్లను మినహాయిద్దాం. ఇక ద్రాక్షలాంటి పండ్లను వలిచే ప్రసక్తే ఉండదు. కానీ... మామిడి, జామ, ఆపిల్, కివీ వంటి పండ్ల మాటేమిటి? తొక్కతో పాటు అలాగే తినేసే అవకాశం ఉన్నా... చాలామంది రుచికి కాస్త అడ్డు అనే వంకతో తొక్కను వలిచే తింటారు. అయితే తొక్కతో పాటు తినగలిగే ఆ పండ్లను తొక్కతోనే తినడం మంచిదంటున్నారు నిపుణులు. పండ్ల లోపలి భాగం రక్షణ కోసం ఏర్పాటైన ఆ పొట్టే... మన ఆరోగ్యానికి కవచం అవుతుందంటున్నారు. రండి ఆ కవచాన్ని తొడుక్కుందాం మనం! పొట్టు తీయకుండా తినగలిగే పండ్లన్నింటినీ పొట్టు వొలుచుకోకుండా తినడమే మేలు. ఎందుకంటే పండ్లలో ఎన్ని పోషకాలు ఉంటాయో, వాటికి మించిన కీలకమైన పోషకాలు అనేకం ఉంటాయి. మలబద్దకాన్ని నివారించే పీచుపదార్థాలు పొట్టులోనే ఎక్కువగా ఉంటాయి. ద్రాక్షపండు పొట్టులో పోషకాలివే... ఈ పండులోని పొట్టులో ఉన్న పోషకాలు చాలా ఎక్కువ. మొత్తం పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాల్లో 20 శాతం ఈ పలుచని పొట్టులోనే ఉంటాయి. యాంటీయాక్సిడెంట్ పోషకాలు వయసు పైబడుతున్న కొద్దీ జరిగే అనర్థాలను నివారిస్తాయి. అందుకే ద్రాక్షపొట్టుతో యౌవనం చాలాకాలం నిలుస్తుంది. పొట్టులోని పెక్టిన్ అనే పోషకం సుఖవిరేచనం అయ్యేలా చేస్తుంది. తియ్యగా ఉన్నప్పటికీ ఈ పండు తాలూకు గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ కాబట్టి డయాబెటిస్ రోగులూ నిక్షేపంగా తినవచ్చు. జామపండు పొట్టు... పోషకాలు జామపొట్టులోని పిగ్మెంట్ క్యాన్సర్ నివారణకు తోడ్పడుతుంది. అలాగే 100 గ్రాముల ఈ పండులో 5.4 గ్రాముల పీచు ఉంటుంది. ఈ పీచు సైతం ప్రధానంగా పొట్టులోనే ఎక్కువ. పండులో ఉండే విటమిన్-సితో పోలిస్తే ఈ పండు పొట్టులోని సి- విటమినే ఎక్కువ. ఇది వ్యాధినిరోధకతశక్తిని గణనీయంగా పెంచుతుంది. కాబట్టి వ్యాధులేవీ దరిచేరకుండా ఉండాలన్నా, సాఫీగా మలవిసర్జన జరగాలన్నా జామపండు మేలు. మామిడి తొక్క చేసే మేలెంతో..! మామిడిపండ్ల పొట్టులో ఉండే పోషకాల తీరు చాలా ప్రత్యేకమైనది. ఈ పండు పొట్టులో ‘రెస్వెరట్రాల్’ అనే పదార్థం ఉంటుంది. రెడ్వైన్లో ఉండేది కూడా ఇదే పదార్థం. ఇది కొవ్వులను చాలా వేగంగా కరిగిస్తుంది. అందుకే లావెక్కేవారు పొట్టుతోపాటు మామిడిపండును తింటే బరువు పెరగడం వేగంగా జరగదు. పైగా మామిడి తొక్కలో ఉండే పోషకాలు కొవ్వు కణాలు త్వరగా పెరగకుండా చేస్తాయి. కాబట్టి తొక్కతో తినేవారు చాలాకాలం పాటు చక్కగా స్లిమ్‌గా ఉంటారు. పండుకంటే పొట్టులోనే ఎక్కువ పోషకాలు ఉండే ఆపిల్ ఆపిల్‌లో లోపలున్న పండు కంటే తొక్కలోనే పోషకాలు ఎక్కువ. ఆపిల్ తొక్కలో కంటికి మేలు చేసే ‘ఏ-విటమిన్’, వ్యాధినిరోధకశక్తి పెంచే ‘సి-విటమిన్లు’ పండులో కంటే ఎక్కువని యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయిస్‌కు చెందిన అధ్యయనవేత్తలు చేసిన పరిశోధనల్లో తేలింది. ఇక పీచు విషయానికి వస్తే... మొత్తం పండులోకంటే పొట్టులోనే మూడింట రెండు వంతుల పీచు ఉంటుంది. ఆరోగ్యానికి మేలు చేసే క్యాల్షియమ్, పొటాషియమ్, ఫాస్పరస్, ఫోలేట్, ఐరన్ వంటి పోషకాలన్నీ పండు కంటే పొట్టులోనే ఎక్కువ. కివీ పండునూ తొక్కతోనే తినడం మేలు కివీ పండును తినదలచినవారు దీన్ని పొట్టు తీయకుండా తినడం మంచిది. ఈ పొట్టులో యౌవనాన్ని చాలాకాలం పాటు నిలిచేలా చేసే యాంటీ ఆక్సిడెంట్లు, వ్యాధినిరోధకశక్తి పెంచే విటమిన్-సి పుష్కలంగా ఉంటాయి. ఈ విషయం గుర్తుంచుకోండి పొట్టుతో పాటు తినే పండ్లను తప్పనిసరిగా నల్లా (కొళాయి) లాంటి జారే నీటిలో చాలాసేపు శుభ్రంగా కడిగాకే తినాలి. ఎందుకంటే ఇటీవల ద్రాక్ష వంటి పండ్లపై పిచికారీ చేసే రసాయనాలు చాలా ఎక్కువ. కాబట్టి అవన్నీ కొట్టుకుపోయేలా నల్లా నుంచి జారే నీళ్లలో (రన్నింగ్ వాటర్) చాలాసేపు కడిగాకే పండ్లు తినాలని గుర్తుంచుకోండి. సుజాతా స్టీఫెన్ న్యూట్రీషనిస్ట్, సన్‌షైన్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
ప్రతిభలో గుడ్డు మాయం..!
కుళ్లిన అరటిపండ్లే పోషకాహారం చాలీచాలని కూరలతో భోజనం భద్రాచలం : ప్రభుత్వ వసతి గృహాలు, పాఠశాలలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడింది. దీంతో విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. చివరకు సరైన పౌష్టికాహారం కూడా అందటం లేదు. విలీన మండలాల్లో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. భద్రాచలం సమీపంలోని ప్రతిభ పాఠశాలను మంగళవారం ‘సాక్షి’ పరిశీలించగా, ఇది తేటతెల్లమైంది. 6 నుంచి ఇంటర్ వరకూ ఉన్న ఇక్కడ 420 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. పాఠశాలకు అనుబంధంగానే వసతి గృహం కూడా ఉంది. మధ్యాహ్న భోజనంలో గుడ్డు పెట్టలేదు. పప్పు, వంకాయ కూర వండినప్పటకీ అవి సరిపోలేదు. పలువురు విద్యార్థులు భోజనం చేయకుండానే కూరలు అయిపోయాయి. చివరకు ఉపాధ్యాయల కోసం దాచిన వంకాయ కూరను అప్పటికప్పుడు తీసుకొచ్చి వడ్డించా రు. చాలా మందికి పప్పు కూడా సరిపోలేదు. పప్పు కావాలని అడిగిన వారిపై వడ్డించే సిబ్బంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. ఇక పిల్లలు మంచినీరు తాగడానికి గ్లాసులు కూడా లేకపోవటంతో భోజనం చేసిన ప్లేట్లే శుభ్రం చేసుకుని వాటితోనే నీటి కోసం పరుగులు తీయడం కనిపించింది. పెరుగులో కలుపుకునే ఉప్పును అక్కడున్న ఓ కుర్చీలో పోయగా, దుమ్ము దూళి పడుతున్నప్పటకీ నిర్వాహకులు పట్టించుకోవడం లేదు. కుళ్లిన అరటిపండ్లు పంపిణీ... గుడ్లు అయిపోయినందునే ఇవ్వలేకపోయామని పాఠశాల డిప్యూటీ వార్డెన్ సలీంఖాన్ తెలిపారు. కాగా, విద్యార్థులకు కుళ్లిన అరిటపండ్లనే పెట్టారు. పిల్లలు భోజనం చేసే డార్మిటరీ హాల్లో ఒక ట్రేలో అరిటిపండ్లును కుప్పగా వేశారు. అయితే అవన్నీ కుళ్లి నీళ్లు కారుతున్నాయి. అయినా వాటినే విద్యార్థులు తినాల్సి వచ్చింది. ఇవి తింటే రోగాలు వస్తాయని తెలిసీ కూడా పాఠశాల నిర్వాహకులు ఇలా వ్యవహరించటం విమర్శలకు తావిస్తోంది. అడిగేవారు లేరని... ఆంధ్రలో విలీనమైన ప్రాంతంలో ఈ పాఠశాల ఉండటంతో భద్రాచలం ఐటీడీఏ అధికారులు పర్యవేక్షించడం లేదు. ఆంధ్ర అధికారులు ఇటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. దీంతో విలీన మండలాల్లో ఉన్న ప్రభుత్వ వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే పౌష్టికాహారంలో కోత పెడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి మెనూ ప్రకారం పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల వారు కోరుతున్నారు. -
పౌష్టికాహారం కష్టమే!
ఇందూరు: వసతి గృహాల విద్యార్థులకు ఇది చేదు వార్తే. సంక్షేమాధికారుల విన్నపాన్ని ఇన్చార్జి కలెక్టర్ మన్నిస్తే, మార్పు చేసిన మెనూ వెంటనే అమలులోకి వస్తుంది. విద్యార్థులకు అరకొరగానే పౌష్టికాహారం అందుతుంది. జిల్లాలో ఎస్సీ 67, ఎస్టీ 13, బీసీ 42, మొత్తం 122 ప్రభుత్వ సంక్షేమ వసతిగృహలున్నాయి. ఒక్కో వసతి గృహంలో 50 నుంచి 80 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. పెరుగుతున్న నిత్యావసరాల ధరలు వార్డెన్లకు ఇబ్బందిగా మారాయి. గుడ్లు, అరటి పండ్ల సరఫరాకు ఏజేన్సీలు లేకపోవడంతో వార్డెన్లే తమ జేబుల్లోంచి డబ్బులు వెచ్చించి కొనుగోలు చేయాలని ప్రభుత్వం గతంలో సూచించింది. నెల నెలా బిల్లులు సమర్పిస్తే నిధులు మంజురు చేస్తామని చెప్పడంతో జిల్లాలోని అందరు వార్డెన్లు తమ జేబుల్లోంచి ఖర్చు పెట్టి గుడ్లు, అరటి పండ్లు కొంటున్నారు. ధరలు పెరిగినప్పటికీ ప్రభుత్వం ఇచ్చే నిధులు మాత్రం పెరగడంలేదు. ప్రస్తుతం ఒక గుడ్డు చిల్లర ధర రూ.4.50 నుంచి రూ.5 వరకు పలుకుతోంది. ఇటు అరటి పండ్లు డజనుకు రూ.45 నుంచి 50 వరకు ఉంది. ప్రభుత్వం మాత్రం పాత ధరలకు తగ్గట్టుగానే నిధులును మంజురు చేస్తోంది. గుడ్డుకు రూ.3.75 పైసలు, అర టి పండుకు రూ. 3.50 పైసలు మాత్రమే అందిస్తోంది. ఫలితంగా తాము నష్టపోతున్నామని వార్డెన్లు పేర్కొంటున్నారు. ఈపాటికే వార్డెన్లు పాత మెనూలోనే అనాధి కారికంగా కోతలు విధించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆరు నుంచి ఐదు రోజులకు గతంలో వారానికి ఆరు రోజులు విద్యార్థులకు గుడ్లు, అరటిపండ్లు పెట్టేవారు. ఇపుడు ఐదు రోజులే అందించనున్నారు. ఈ లెక్కన చూస్తే నెలకు నాలుగు, ఏడాదికి 48 గుడ్లు, అరటిపండ్లు విద్యార్థులకు దూరం అవుతున్నాయి. వీటిని ఇవ్వనిరోజు స్నాక్స్, బఠానీలు, అల్పాహారం పెడుతామని సంక్షేమాధికారులు చెబుతున్నారు. కూరగాయల భోజనం దూరం వారంలో ఒక రోజు పౌష్టికాహారం గుడ్డు, అరటి పండు విద్యార్థులకు దూరమౌతుంటే, ఇటు రుచికరమైన భోజనమూ అందటంలేదు. టమాట ధర కిలో రూ.80లకు చేరగా పచ్చి మిర్చి కిలో రూ.60కి చేరింది. ఉల్లి, బెండకాయ ధరలు కూడా ఆకాశాన్నంటాయి. పప్పులు, నూనెల ధరలు కూడా అదే దారిలో ఉన్నాయి. పప్పు, కూరగాయల భోజనం తప్పనిసరికావడంతో తక్కువ నాణ్యతతో కూడిన భోజనం వండి విద్యార్థులకు పెడుతున్నారు. నీళ్ల పప్పు అన్నంతోనే సరిపెడుతున్నారు. కూరగాయల స్థానంలో దోస, సోరకాయ, వంకాయ వండుతున్నారు. అసలైన కూరగాయల భోజనం చేయక చాలరోజులవుతోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.