శ్రీకాకుళం: ప్రస్తుతం కాలంలో ప్రతి ఒక్కరూ ఉద్యోగ, వ్యాపార, క్రీడా, తదితర పనుల్లో బిజీగా ఉంటున్నారు. ఆరోగ్యంగా ఉండేందుకు ఎక్కువ మంది ఫలాలను తీసుకుంటున్నారు. వైద్యులు కూడా పండ్లు జాతులు, కూరగాయలు అధికంగా తీసుకోవాలని సూచిస్తారు. అయితే ఆరోగ్యానిచ్చే పండ్లు, కూరగాయలను సైతం కొంత మంది వ్యాపారులు రసాయనాలతో మాగపెడుతున్నారు. దీంతో ప్రజలు అరోగ్యం బారితన పడుతున్నారు.
లాభార్జనే ధ్యేయం..
వ్యాపారులు లాభార్జనే ప్రధానధ్యేయంగా ప్రజలను అడ్డదారుల్లో మోసగించి వారి అనారోగ్యాలకు కారణమవుతున్నారు. తక్కవ కాలంలో ఎక్కవ సంపాదించాలనే ధ్యేయంతో ఎక్కవమంది వ్యాపారులు గోదాంలో అరటి, బొప్పాయి, కర్బూజ, ఆపిల్ పక్వానికి రాకముందే పలు రకాల రసాయనాలను పూస్తున్నారు. దీనివల్ల వాటిలో సహజత్వం కోల్పోయి అధికంగా మెరుపు కనిపిస్తుంది. దీంతో కొనుగోలు దారులు సులువుగా మోసపోతున్నారు.
అరటిలో మోసాలు అధికం..
అన్ని కాలాల్లో కూడా అరటి పండ్లకు గిరాకీ ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని వ్యాపారులు కార్బన్‌మోనాక్సైడ్ పౌడర్‌ను పిచికారీ చేయిస్తున్నారు. లిక్విడ్ రూపంలో మరికొన్ని రసాయనపదార్థాలు వినియోగించిన బకెట్లలో అరటి గెలలు వేసి మగ్గబెడుతున్నారు.
కానరాని దాడులు..
ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న వ్యాపారులుపై దాడులు చేయాల్సిన సంబంధిత అధికారులు ఎక్కడా కనిపించడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. వ్యాపారులు అరటి గెలలు వేలాడిదీసి, వాటికి కార్బైడ్‌తో మగ్గపెడుతున్న విషయం తెలిసినా ప్రశ్నించేవారే కరువయ్యారు. దీంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారే ఆరోపణలున్నాయి.
అమలుకాని ఆహార భద్రతాచట్టాలు
ఆహారభద్రతా చట్టం 2006 (ఫుడ్‌సేప్టీ స్టాండర్డ్‌యాక్ట్)ప్రకారం ప్రజలు ఆహారపదార్థాలు కలుíÙతం చేస్తున్నవారిపై దాడులు చేయాలి. పండ్లపై కార్బైడ్ వినియెగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాలు ఆదేశాలిస్తున్నా క్షేత్రస్థాయిలో అమలుకు జరగడంలేదు.
Comments
Please login to add a commentAdd a comment