Liquid
-
టీడీపీ ఎమ్మెల్యేల అక్రమ సంపాదనపై కేంద్రమంత్రి పెమ్మసాని సంచలన వ్యాఖ్యలు
సాక్షి, గుంటూరు: టీడీపీ ఎమ్మెల్యేల అక్రమ సంపాదనపై ఆ పార్టీ ఎంపీ, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతికి పాల్పడే ఎమ్మెల్యేలు వాళ్ళ రాజకీయ భవిష్యత్తును ఒకసారి చూసుకోవాలని హెచ్చరించారు.ఓ కార్యక్రమంలో పాల్గొన్న పెమ్మసారి చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఒకేసారి ఎమ్మెల్యే అయితే చాలు అనుకునే వాళ్ళు చేసుకోవచ్చు. మళ్లీ మళ్లీ ఎమ్మెల్యేలు అవ్వాలనుకున్నవారు ఎవరు అవినీతికి పాల్పడిన అది తప్పే. లిక్కర్ షాపులు నిర్వహించుకోవాలంటే అందుకు పెద్దమొత్తంలో వాటాలు అడుగుతున్న ఎమ్మెల్యేల నుంచి సమస్యలు ఎదురవ్వొచ్చు. వ్యవస్థ గురించి మాట్లాడాలంటే ఇంకా పెద్ద సమస్యలు ఉన్నాయి.ఇవాళ ఎన్నికలంటే డబ్బులతో కూడుకున్న పెద్ద ప్రక్రియ. ఈ వ్యవస్థను చూస్తుంటే ఒకరకంగా అసహ్యం వేస్తుంది. నీతిగా నిజాయితీగా రాజకీయాలు చేయాలి ప్రజా సేవ చేయాలనే వారికి రాజకీయాలు దూరమయ్యాయి.ఎన్నికలు వచ్చాయంటే నాయకులు డబ్బుల కోసం పీక్కుతింటున్నారు. ప్రజలు కూడా మాకు డబ్బు రాలేదని అడుగుతున్నారు’ అని పెమ్మసాని చంద్రశేఖర్ టీడీపీ ఎమ్మెల్యేల అక్రమ సంపాదనపై మండిపడ్డారు. -
చలికాలంలో పిండినల్లి, చీడపీడలు : ఇవి చల్లుకుంటే చాలు
శీతాకాలం చలి వాతావరణంలో ఉష్ణోగ్రత తక్కువగా, గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. రసం పీల్చే పురుగులు, వైరస్ తెగుళ్ల వ్యాప్తికి ఇది అనువైన కాలం. కుండీల్లో, పెరట్లో ఆకుకూరలు, టమాటా, చిక్కుడు, వంగ, మిరప, బీర, ఆనప తదితర పంటలు చీడపీడల బారిన పడకుండా చూసు కోవడానికి ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలి. చీడపీడలు రానీయని టీకాలన్నమాట. జనవరి ఆఖరులో చలి తగ్గేవరకు వీటిని పాటించాలి. జీవామృతంను 1:10 పాళ్లలో నీటిలో కలిపి ప్రతి 10–15 రోజులకోసారి క్రమం తప్పకుండా పిచికారీ చేస్తుంటే పంటలు ఆరోగ్యంగా పెరుగుతాయి. చీడపీడలను తట్టుకునే శక్తి పెరుగుతుంది.ఘా చ్ఛాదన: కుండీలు, మడుల్లో కూరగాయ మొక్కలు/చెట్ల చుట్టూ గడ్డీ గాదంతో ఐదారు అంగుళాల మందాన ఆచ్ఛాదనగా వేస్తే మంచిది. ఇంటిపంటల్లో పెద్ద పురుగులు కనిపిస్తే వాటిని చేతితో ఏరేయడం ఉత్తమం. శీతాకాలంలో పంటలనాశించే కొన్ని పురుగులుటమాటా, వంగ, ఆకుకూరలతోపాటు మందారం, చామంతి, గులాబీ వంటి పంటలపై పిండినల్లి(మీలీ బగ్), తామర పురుగు(త్రిప్స్) తరచూ కనిపిస్తుంటాయి. వీటితోపాటు పేనుబంక, దీపపు పురుగులు, తెల్లదోమ, ఎర్రనల్లి కూడా ఆశిస్తుంటాయి. పిండినల్లి: పిండినల్లి మొక్కలను ఆశించి రసం పీల్చుతుంటుంది. అందువల్ల మొక్క పెరుగుదల నిలిచిపోతుంది. ఇది సోకినప్పుడు పళ్లు తోముకునే బ్రష్‌ను ముంచి తుడిచేస్తే పోతుంది. కలబంద రసం లేదా వేపనూనె లేదా సబ్బు నీళ్లలో బ్రష్‌ను ముంచి తుడిచేయాలి. పేనుబంక: దీన్నేమసిపేను అని కూడా అంటారు. కంటికి కనిపించనంత చిన్న పేన్లు బంకవంటి తీపి పదార్థాన్ని విసర్జిస్తుంటాయి. ఈ తీపి కోసం చీమలు చేరతాయి. మొక్కల మీద చీమలు పారాడుతూ ఉంటే పేనుబంక లేదా పిండినల్లి సోకిందన్నమాటే. పచ్చదోమ: ఆకుపచ్చగా ఉండే చిన్న దోమలు ఆకుల నుంచి రసం పీల్చుతుంటాయి. పచ్చదోమ ఆకుల చివర్ల నుంచి పని మొదలు పెడతాయి. కాబట్టి ఇది సోకిన ఆకులు కొసల నుంచి లోపలి వరకు ఎండి΄ోతూ ఉంటాయి. బీర, ఆనప వంటి పెద్ద ఆకులుండే పంటలను పచ్చదోమ ఎక్కువగా ఆశిస్తూ దిగుబడిని తగ్గించేస్తాయి. తామరపురుగు: తామర పురుగు సోకిన మిరప ఆకులకు పైముడత వస్తుంది. మిరప కాయలు వంకర్లు తిరుగుతాయి. వాటిపై చారలు ఏర్పడతాయి. దీన్ని గజ్జి తెగులు, తామర తెగులు అని కూడా అంటారు. బూడిద తెగులు: చల్లని వాతావరణంలో శిలీంద్రం వేగంగా వ్యాపించడం వల్ల బూడది తెగులు వస్తుంది. ఇది సోకిన పంటల ఆకులపై తెల్లని పొడి కనిపిస్తుంది. మిరప, వంగ, టమాటా, ఆకుకూరలపై ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది. రసంపీల్చే పురుగులు: ముందుజాగ్రత్త పిచికారీలురసం పీల్చే పురుగులు పంటల జోలికి రాకుండా ముందుగానే జాగ్రత్తపడడం ఉత్తమం. వేపాకు రసం లేదా వావిలి ఆకుల కషాయం లేదా వేప నూనె లేదా వేపపిండి కషాయంను (వీటిలో ఏదైనా ఒక దాన్ని గానీ లేదా ఒక దాని తర్వాత మరొక దాన్ని మార్చి మార్చి గానీ) ప్రతి 7–10 రోజులకోసారి పిచికారీ చేయాలి. వేపాకు రసం: పావు కిలో వేపాకులు రుబ్బి + 5 లీటర్ల నీటిలో కలిపి అదే రోజు పంటలపై చల్లాలి(10 కిలోల వేపాకులు రుబ్బి 100 లీటర్ల నీటిలో కలిపి ఎకరంలో పంటలకు చల్లవచ్చు). వావిలి ఆకుల కషాయం: 2 లీటర్ల నీటిలో 350 గ్రాముల వావిలి ఆకులు వేసి 2 లేదా 3 పొంగులు వచ్చే వరకు మరిగించి.. చల్లార్చిన తర్వాత ఆ కషాయంలో 10 లీటర్ల నీటిలో కలిపి పంటలపై పిచికారీ చేయాలి(5 కిలోల వావిలి ఆకుల కషాయాన్ని 100 లీటర్ల నీటిలో కలిపితే ఎకరానికి సరిపోతుంది). వేప నూనె: మార్కెట్లో దొరుకుతుంది. సీసాపై ముద్రించిన సాంద్రతకు తగిన మోతాదులో పిచికారీ చేయాలి.వేపకాయల పిండి రసం: 10 లీటర్ల నీటిలో అర కేజీ వేపకాయల పిండి(వేపగింజల పిండి 300 గ్రాములు చాలు)ని పల్చటి గుడ్డలో మూటగట్టి.. 4 గంటలు నానబెట్టాలి. ఆ తర్వాత మూటను నీటిలో నుంచి తీసి పిండాలి. ఇలా అనేకసార్లు ముంచుతూ తీస్తూ పిండాలి. అదే రోజు పిచికారీ చేయాలి లేదా రోజ్ క్యాన్ ద్వారా మొక్కలపై చల్లవచ్చు. ఈ కషాయాలు, రసాలను పిచికారీ చేసేముందు 10 లీటర్లకు 5 గ్రాముల(100 లీటర్లకు 200 గ్రాముల) సబ్బు పొడి లేదా కుంకుడు రసాన్ని కలపాలి. నూనె పూసిన ఎరలు: నూనె పూసిన ఎరలు(స్టిక్కీ ట్రాప్స్) వేలాడదీస్తే పురుగులను ఆకర్షించి నశింపజేస్తాయి. తామర పురుగులను ఆకర్షించడానికి తెలుపు, తెల్లదోమలను నీలం, పచ్చదోమలను పసుపుపచ్చ ఎరలను వాడాలి. టమాటా, వంగ, మిర్చి వంటి ప్రతి 20 కూరగాయ మొక్కలకు ఒక్కో రకం ఎరలను రెండేసి చొప్పున వేలాడదీయాలి. ఎరలను మార్కెట్లో కొనొచ్చు. లేదా ఆయా రంగుల డబ్బాలు లేదా ΄్లాస్టిక్ షీట్లు ఉంటే వాటికి నూనె లేదా గ్రీజు రాసి వేలాడదీయవచ్చు.రసంపీల్చే పురుగుల తీవ్రత ఎక్కువగా ఉంటే?రసంపీల్చే పురుగులు ఇప్పటికే మొక్కలకు తీవ్రస్థాయిలో ఆశించి ఉంటే పైన పేర్కొన్న పిచికారీలు కొనసాగిస్తూనే.. తెల్లటి షేడ్‌నెట్‌ను మొక్కలపై గ్రీన్హౌస్ మాదిరిగా రక్షణగా ఏర్పాటు చేయాలి. ఇనుప తీగతో డోమ్ ఆకారం చేసి దానిపై తెల్లని షేడ్‌నెట్ చుట్టేస్తే సరి. – డా. గడ్డం రాజశేఖర్ సుస్థిర వ్యవసాయ కేంద్రం, సికింద్రాబాద్ -
రూ.5 వేలతో మొదలైన రూ.14000 కోట్ల కంపెనీ.. సామాన్యుడి సక్సెస్ స్టోరీ!
M P Ramachandran Success Story: సక్సెస్.. ఈ పదం వినటానికి లేదా చూడటానికి చాలా చిన్నదిగానే ఉండొచ్చు. కానీ సాధించాలంటే అహర్నిశలు కష్టపడాల్సి ఉంటుంది, ఎన్నో త్యాగాలు చేయాల్సి ఉంటుంది. అయితే సంకల్పం ఉంటే తప్పకుండా విజయం సొంతమవుతుందని ఇప్పటికే చాలా మంది నిరూపించారు, ఈ కోవకు చెందిన వారిలో ఒకరు జ్యోతి ల్యాబ్స్ ఫౌండర్ 'మూతేడత్ పంజన్ రామచంద్రన్' (M. P. Ramachandran). ఈయన గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 1983లో కేరళ త్రిస్సూర్‌లో జన్మించిన రామచంద్రన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత ముంబైలో అకౌంటెంట్‌గా పనిచేయడం ప్రారంభించాడు. కొన్ని సంవత్సరాలు అక్కడ పనిచేసిన తరువాత ఆ కంపెనీ మూసివేశారు. దీంతో ఏమి చేయాలో తోచక ఇంటికి వచేసాడు. లిక్విడ్ ఫ్యాబ్రిక్ వైట్నర్ ఉజాలా ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకోవాలనే తపనతో ఉండే రామచంద్రన్.. అప్పట్లో తెలుపు రంగు దుస్తులకు సరైన లిక్విడ్ అందుబాటులో ఉండేది కాదు, దీన్ని దృష్టిలో ఉంచుకుని ఒక లిక్విడ్ ఫ్యాబ్రిక్ వైట్నర్ 'ఉజాలా'ను తయారు చేసాడు. రామచంద్రన్ ఈ లిక్విడ్ ఫ్యాబ్రిక్ వైట్నర్ను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి, సోదరుడి నుంచి రూ. 5000 తీసుకుని తమకున్న కొంత భూమిలోనే ఒక చిన్న కంపెనీ స్టార్ట్ చేసాడు. దీనికి తన కూతురు జ్యోతి పేరు పెట్టాడు. ప్రారంభంలో అనుకున్న రీతిలో ఉజాలా అమ్మకాలు ముందుకు సాగలేదు, కానీ పట్టు వదలకుండా కొంతమంది సేల్స్ గర్ల్స్‌ని నియమించి ఆ ఏడాది రూ. 40000 ఆదాయం పొందాడు. ఇదీ చదవండి: బాలీవుడ్ బ్యూటీ 'కిమ్ శర్మ' కొత్త లగ్జరీ కారు.. ధర తెలిస్తే అవాక్కవుతారు! ఇతర ఉత్పత్తులు & వార్షిక ఆదాయం క్రమంగా తమ ప్రొడక్ట్ మీద నమ్మకం భారీగా పెరిగింది. దీంతో జ్యోతి లేబొరేటరీస్ మరిన్ని ఉత్పత్తులను తయారు చేయడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగానే ఎక్సో, ప్రిల్, మిస్టర్ వైట్, మార్గో, మాక్సో వంటి అనేక ఉత్పతులు పుట్టుకొచ్చాయి. దెబ్బకు విదేశీ కంపెనీలు సైతం మూసుకోవాల్సి వచ్చింది. ప్రారంభంలో ఎన్నో ఆటంకాలు, ప్రత్యర్థులు జిత్తులను ఎదుర్కొని కంపెనీని దినదినాభివృద్ధి చెందించడంలో రామచంద్రన్ కృషి చేసాడు. కేవలం రూ. 5000తో ప్రారంభమైన జ్యోతి ల్యాబ్స్ వార్షికాదాయం నేడు ఏకంగా రూ. 14,000 కోట్లకు చేరినట్లు సమాచారం. -
షాకింగ్! ప్రపంచంలోనే ఖరీదైన లిక్విడ్: చిన్న డ్రాప్ ధర పదివేలకు పైనే
సాక్షి,ముంబై: విషపూరిత జీవుల్లో ఒకటి తేలు. తేలు కుడితే వచ్చే బాధ వర్ణనా తం. అది అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది. మరి అలాంటి తేలు విషం ప్రపంచంలోనే ఖరీదైన లిక్విడ్‌గా నిలుస్తుండటం విశేషం. అందుకే ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల తేళ్లను పెంచుతూ వాటి నుంచి విషాన్ని సేకరించి విక్రయిస్తుంటారు. మార్కెట్లో దీని విలువ ఎంతో తెలిస్తే నోరెళ్ల బెడతారు. దాదాపు లీటరుకు వందకోట్ల రూపాయలకు పై మాటే. అత్యంత ప్రమాదకరమైన డెత్‌స్టాకర్ తేలు విషం భారీ ఖరీదు పలుకుతోంది. బిజినెస్ ఇన్సైడర్ నివేదిక ప్రకారం డెత్‌స్టాకర్ అనే తేలు విషంలో మనుషులకి ప్రాణాంతకం కాదు గానీ, అంతకుమించిన మంచి గుణాలున్నాయి. 2021 నాటికి విషం చుక్క ధర 130 డాలర్లు. 4 లీటర్ల డెత్ స్టాకర్ జాతికి చెందిన తేలు విషం ధర 320 కోట్ల రూపాయలుగా ఉంది. ఒక తేలు ఒకసారి రెండు మిల్లీగ్రాముల విషాన్ని మాత్రమే ఇస్తుంది. అంటే ఒక లీటర్ విషం కావాలంటే 10 లక్షల తేళ్ల నుంచి విషం సేకరించాల్సి ఉంటుంది. బ్రిటానికా డాట్ కాం ప్రకారం, డెత్‌స్టాకర్ స్కార్పియన్ విషం గ్యాలన్ ధర 39 మిలియన్ల డాలర్లు. గ్యాలన్ విషంకోసం 2.64 మిలియన్ల సార్లు విషం తీయాలి లేదంటే 27 లక్షల తేళ్లనుండి విషాన్ని సేకరిస్తే ఒక గాలన్ నిండుతుందన్నమాట. (అమెరికాలో ఉద్యోగం వదిలేసి: ఇండియాలో రూ.36 వేలకోట్ల కంపెనీ) ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన తేలు డెత్‌స్టాకర్ తేళ్లు నార్త్ ఆఫ్రికానుంచి మిడిల్ ఈస్ట్‌లోని ఎడారి ప్రాంతాల్లోనే కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా సహారా, అరేబియన్, థార్ సెంట్రల్, సెంట్రల్ ఏషియా ఎడార్లు జీవిస్తుంటాయి. వీటి విషంలో న్యూరో టాక్సిన్స్, క్లారోటాక్సిన్స్.. క్యారిబ్డోట్యాక్సిన్స్, సిల్లాటాక్సిన్స్, ఏజిటాక్సిన్స్ ఉంటాయి. అంతేకాదు ఈ విషాన్ని సేకరించిందేందుకు ఒక ప్రత్యేకమైన పరికరాన్ని ఉపయోగిస్తారు. తేళ్ల కొండిలకు పరికరం ద్వారా విష గ్రంధుల వద్ద అతి సున్నితంగా కరెంట్ షాక్ ఇచ్చారు. అప్పుడు వాటంతట అవే విడుదల చేసే విషాన్ని సేకరిస్తారు. ప్రాణం పోసే విషం! ఎందులో వాడతారంటే? ఈ తేలు విషాన్ని క్యాన్సర్ కణితులను గుర్తించడంలోనూ, మలేరియా చికిత్సలో కూడా ఉపయోగిస్తారట. అందుకే దీనికి ఇంత డిమాండ్. అలాగే మెదడు కణితుల చికిత్సల, డయాబెటీస్ నివారణలోనూ ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. డెత్‌స్టాకర్ స్కార్పియన్స్ విషంలో ఉండే క్లోరోటాక్సిన్ని కొన్నిరకాల క్యాన్సర్ల చికిత్సలో ఉపయోగపడుతుంది. అంతేకాదు, క్యాన్సర్ గడ్డలుఎక్కడ, ఏపరిమాణంలో ఉన్నాయో గుర్తించవచ్చట. అయితే డెత్‌స్టాకర్ స్కార్పియన్ విషం ప్రాణాంతకమైంది కాదు. ఇది కుడితే భయంకరమైన నొప్పి ఉంటుంది తప్పితే ఆరోగ్యకరమైన వయోజనులను చంపేంత విషపూరితమైంది కాదని స్వయంగా పరిశోధకులు వెల్లడించారు. కానీ పిల్లలు, వయోవృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. -
ఆలౌట్ లిక్విడ్ తాగి బాలుడి మృతి
మియాపూర్: దోమల నివారణకు వినియోగించే ఆలౌట్ లిక్విడ్‌ను తాగిన ఏడాదిన్నర బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ నాగేశ్వర్రావు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా కోయిర్ గ్రామానికి చెందిన ఎండీ జుబేర్, పరీ్వనా బేగం దంపతులు శేరిలింగంపల్లిలోని తారానగర్‌లో నివాసముంటున్నారు. వీరికి నలుగురు పిల్లలు. జుబేర్ డ్రైవర్ పని చేస్తున్నారు. శుక్రవారం ఉదయం జుబేర్ విధులకు వెళ్లగా.. పరీ్వనాబేగం ఇంటి పనుల్లో నిమగ్నమైంది. ఏడాదిన్నర బాలుడు అబ్బు జాకీర్ ఇంట్లో ఆడుకుంటూ దోమల నివారణకు వాడే ఆలౌట్ లికి ్వడ్‌ను తాగాడు. కొద్దిసేపు తర్వాత బాలుడు ఏడుస్తుండటంతో పరీ్వనాబేగం వెళ్లి పరిశీలించగా జాకీర్ నోట్లోంచి లిక్విడ్ వాసన వచి్చంది. చికిత్స నిమిత్తం నిలోఫర్‌కు తరలించారు. అక్కడ శుక్రవారం అర్ధరాత్రి జాకీర్ మృతిచెందాడు. బాలుడి తండ్రి జుబేర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చందానగర్ పోలీసులు తెలిపారు. -
విషాదం.. మస్కిటో లిక్విడ్ తాగి ఏడాదిన్నర బాలుడు మృతి
సాక్షి, హైదరాబాద్: చందానగర్ లో విషాదం చోటుచేసుకుంది. మస్కిట్ లిక్విడ్ తాడి ఏడాదిన్నర బాలుడు మృత్యువాతపడ్డాడు. వివరాలు.. తారానగర్‌లో నివాసముంటున్న జుబేర్ దంపతులకు ఏడాదిన్నర వయసున్న కొడుకు జాకీర్ ఉన్నాడు. శనివారం బాలుడు ఇంట్లో ఆడుకుంటూ.. పొరపాటున అలౌట్ లిక్విడ్ తాగేశాడు. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన తల్లిదండ్రులు బాలుడి బట్టలపై అలౌట్ లిక్విడ్ వాసన రావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే చిన్నారి అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. బాలుడి మరణంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. తల్లిదండ్రుల రోదనలు చూసి స్థానికులు కంటతడి పెట్టుకున్నారు. -
అసలే ఎండాకాలం.. ఇవి తాగేందుకు తయారా? డాక్టర్ల చెప్తున్న ఆ జాగ్రత్తలేంటి...
ఉదరం తేలికగా అనిపించాలంటే.. మలినాలు పోవాలంటే.. ఒత్తిడి నుంచి ఉపశమనం కలగాలంటే.. శరీరానికి తక్షణ శక్తి రావాలంటే.. చర్మం ఆరోగ్యంగా కనిపించాలంటే? అన్నింటికీ అదే మందు.. అదే విందు కూడా అన్నట్టు మారుతోంది. సులభంగా సేవించే వీలు, ఇన్‌స్టాంట్‌గా కలిగే మేలు.. దీంతో ద్రవాహారమే శరణ్యం అంటోంది నవతరం. లిక్విడ్ డైట్‌పై నవతరంలో పెరుగుతున్న మోజు మోతాదు మించితే ప్రమాదకరమేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. శరీరంలో నుంచి మలినాలు తొలగించి తేలికపరిచే డిటాక్స్ డ్రింక్స్, శరీరానికి అవసరమైన పోషణను అందించే ఎనర్జీ డ్రింక్స్.. ప్రొటీన్ షేక్ సప్లిమెంట్స్.. ఇలా ఒక్కో అవసరానికి ఒక్కో డ్రింక్.. అన్నట్టుగా అందుబాటులో ఉన్న ఈ పానీయాలు... గత ఏడాది చివరి నుంచీ బాగా ప్రాచుర్యంలోకి వచ్చేశాయి. వేసవిలో లిక్విడ్ డైట్ల వెల్లువ మరింత పెరగనుంది. ఈ నేపథ్యంలో ఇవి అవసరమా? ఈ ట్రెండ్ ఆరోగ్యకరమైనదేనా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అతి కాకుంటే అనర్థం కాదు.. ‘డిటాక్స్ డ్రింక్స్ అతిగా తాగకపోతే ఆరోగ్యకరమైనవే. అయితే ‘చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బయోటిన్, ఇతర కొల్లాజెన్ పానీయాల వంటి సప్లిమెంట్లతో సరిపుచ్చుకోవాలి హెర్బల్ టీలు వంటి సహజ డిటాక్స్ పానీయాలు సహజమైన నోని, గిలోయ్, తేనె కలిపినవి, ఇతర ఆయుర్వేద పానీయాలను మితంగా తీసుకుంటే మంచిదే. అయితే.. ప్రిజర్వేటివ్‌లను కలిగి ఉన్న సింథటిక్ డిటాక్స్ డ్రింక్స్ మంచి కంటే ఎక్కువ హాని చేస్తాయి’ అని ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రి పరిశోధనా కేంద్రానికి చెందిన వైద్యుడు డాక్టర్ పి. ప్రసాద్ స్పష్టం చేశారు. వ్యాధి పీడితుల ఆహారం అది.. ‘లిక్విడ్ డైట్లను జబ్బుపడినవారి డైట్‌గా పిలుస్తారు. ఎందుకంటే ఆహారాన్ని నమలడం మింగడం కష్టంగా ఉన్న వ్యక్తులకు తరచుగా ఇవి సిఫార్లు చేస్తాం. కాకపోతే ఇప్పుడు ‘సప్లిమెంట్ రంగం బాగా విస్తరించేసింది. పోటాపోటీగా సప్లిమెంట్లను ఆహారంగా మార్చేసి విక్రయిస్తోంది. సప్లిమెంట్లను అవసరమైన వ్యక్తుల కోసం మాత్రమే సూచిస్తాం. అవి ఆరోగ్య సమస్యలు లేని సరిపడా బీఎంఐ (బాడీ మాస్ ఇండెక్స్) కలిగి ఉన్న వారికి ఇవి తప్పనిసరి కాదు’ అని అపోలో హాస్పిటల్స్‌కు చెందిన క్లినికల్డైటీషియన్ డాక్టర్ ఎం.గాయత్రి అంటున్నారు. వేసవిలో ఇలా... సహజంగానే వేసవిలో ద్రవాహారాలు తీసుకోవడం పెరుగుతుంది. అది మంచిదే కూడా. అయితే.. తేలికగా జీర్ణం చేసుకోవడానికో మరో కారణంతోనో అలవాటైన ఆహారాన్ని పక్కన పెట్టేసి మరీ లిక్విడ్ డైట్‌కి మళ్లడం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. ‘సాధారణంగా మనం రోజుకు మూడుసార్లు ఆహారం తీసుకుంటాం. కానీ వేసవిలో ఆకలి మందగిస్తుంది. కాబట్టి ఒకసారి ఆహారం తీసుకోవడం మానేసి, లిక్విడ్ ఫుడ్ ద్వారా భర్తీ చేయవచ్చు. అంతే తప్ప ఆహారానికి ప్రత్యామ్నాయంగా సంపూర్ణ లిక్విడ్ డైట్‌ని ఎప్పుడూ సూచించం, అది విటమిన్ మినరల్ లోపాలకు పోషకాహార అసమతుల్యతకు కారణమవుతుంది’ అని న్యూట్రిషనిస్ట్ డాక్టర్ సుజాత స్టీఫెన్ అంటున్నారు. బరువు తగ్గాలనుకునే వ్యక్తులు ఒకపూట భోజనాన్ని విటమిన్ సి– రిచ్ ఫ్రూట్ జ్యూస్‌తో భర్తీ చేయవచ్చు. ఇది వారికి శక్తినిస్తుంది. ఒత్తిడిని తగ్గించడంలో ఉపకరిస్తుంది అని సూచించారామె. -
అరటి పండ్లను తింటున్నారా ? అయితే జాగ్రత్త..
శ్రీకాకుళం: ప్రస్తుతం కాలంలో ప్రతి ఒక్కరూ ఉద్యోగ, వ్యాపార, క్రీడా, తదితర పనుల్లో బిజీగా ఉంటున్నారు. ఆరోగ్యంగా ఉండేందుకు ఎక్కువ మంది ఫలాలను తీసుకుంటున్నారు. వైద్యులు కూడా పండ్లు జాతులు, కూరగాయలు అధికంగా తీసుకోవాలని సూచిస్తారు. అయితే ఆరోగ్యానిచ్చే పండ్లు, కూరగాయలను సైతం కొంత మంది వ్యాపారులు రసాయనాలతో మాగపెడుతున్నారు. దీంతో ప్రజలు అరోగ్యం బారితన పడుతున్నారు. లాభార్జనే ధ్యేయం.. వ్యాపారులు లాభార్జనే ప్రధానధ్యేయంగా ప్రజలను అడ్డదారుల్లో మోసగించి వారి అనారోగ్యాలకు కారణమవుతున్నారు. తక్కవ కాలంలో ఎక్కవ సంపాదించాలనే ధ్యేయంతో ఎక్కవమంది వ్యాపారులు గోదాంలో అరటి, బొప్పాయి, కర్బూజ, ఆపిల్ పక్వానికి రాకముందే పలు రకాల రసాయనాలను పూస్తున్నారు. దీనివల్ల వాటిలో సహజత్వం కోల్పోయి అధికంగా మెరుపు కనిపిస్తుంది. దీంతో కొనుగోలు దారులు సులువుగా మోసపోతున్నారు. అరటిలో మోసాలు అధికం.. అన్ని కాలాల్లో కూడా అరటి పండ్లకు గిరాకీ ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని వ్యాపారులు కార్బన్‌మోనాక్సైడ్ పౌడర్‌ను పిచికారీ చేయిస్తున్నారు. లిక్విడ్ రూపంలో మరికొన్ని రసాయనపదార్థాలు వినియోగించిన బకెట్లలో అరటి గెలలు వేసి మగ్గబెడుతున్నారు. కానరాని దాడులు.. ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న వ్యాపారులుపై దాడులు చేయాల్సిన సంబంధిత అధికారులు ఎక్కడా కనిపించడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. వ్యాపారులు అరటి గెలలు వేలాడిదీసి, వాటికి కార్బైడ్‌తో మగ్గపెడుతున్న విషయం తెలిసినా ప్రశ్నించేవారే కరువయ్యారు. దీంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారే ఆరోపణలున్నాయి. అమలుకాని ఆహార భద్రతాచట్టాలు ఆహారభద్రతా చట్టం 2006 (ఫుడ్‌సేప్టీ స్టాండర్డ్‌యాక్ట్)ప్రకారం ప్రజలు ఆహారపదార్థాలు కలుíÙతం చేస్తున్నవారిపై దాడులు చేయాలి. పండ్లపై కార్బైడ్ వినియెగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాలు ఆదేశాలిస్తున్నా క్షేత్రస్థాయిలో అమలుకు జరగడంలేదు. -
తొలిసారిగా.. అర లీటర్ సీసాలో బస్తా యూరియా
సాక్షి, అమరావతి: సంప్రదాయ యూరియా కన్నా శక్తివంతంగా పనిచేసే నానో యూరియా త్వరలోనే మార్కెట్లోకి రాబోతోంది. భారత రైతుల ఎరువుల సహకార సంస్థ (ఇఫ్కో) దీనిని ఇటీవల ఆవిష్కరించింది. ఎరువుల తయారీ రంగంలో ఇదో అద్భుత ఆవిష్కారం. నానో టెక్నాలజీపై కొన్నేళ్లుగా పరిశోధనలు సాగుతుండగా.. ప్రపంచంలోనే తొలిసారిగా నానో యూరియాను ఇఫ్కో నానో బయో టెక్నాలజీ పరిశోధన సంస్థ అభివృద్ధి చేసింది. ఏమిటీ నానో యూరియా.. తరతరాలుగా మనందరికీ తెలిసిన సంప్రదాయ యూరియా తెల్లటి గుళికల రూపంలో ఉంటుంది. బస్తాలలో వస్తుంది. దీని స్థానంలో ఇప్పుడు ద్రావణం రూపంలో ఉండే యూరియాను తయారు చేశారు. 45 కిలోల యూరియాను కేవలం 500 మిల్లీలీటర్ల సీసాలో పట్టేలా చేశారు. అంటే బస్తా యూరియాలో ఉండే పోషకాలు ఈ చిన్న సీసాలోకి వచ్చాయి. పైగా ఇది మహా శక్తివంతంగా పనిచేస్తుంది. ఈ సీసాలో 40 వేల పీపీఎంల నైట్రోజన్ ఉంటుంది. భావి ఎరువుల మార్కెట్ రంగంలో ఇదో మేలి మలుపు అవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడున్న వేపపూత యూరియా కన్నా ఇది వ్యవసాయ రంగంలో పెద్ద మార్పు తెస్తుందని భావిస్తున్నారు. సంప్రదాయ యూరియా కన్నా ఇది తక్కువ ధరకు లభించడమే కాకుండా పంటల దిగుబడిని 8 శాతం పెంచుతుంది. 500 మిల్లీలీటర్ల నానో యూరియా బాటిల్ ధర రూ.240 కాగా.. యూరియా బస్తా ధర రూ.268. -
అచ్చెన్నాయుడు రాజీనామా చేస్తారా?
‘‘సభలో అచ్చెన్నాయుడు నోరు తెరిస్తే అబద్ధాలు చెబుతున్నారు. అక్రమ మద్యంపై మేం పెద్ద ఎత్తున కేసులు నమోదు చేస్తున్నాం. టీడీపీ హయాంలో గ్రామాల్లో యథేచ్ఛగా విస్తరించిన దాదాపు 43 వేల బెల్టుషాపులను మూసివేశాం. పర్మిట్ రూమ్‌లు కూడా లేకుండా చేశాం. మేం అధికారంలోకి వచ్చింది జూన్‌లో కాగా నెల తర్వాత మద్యం షాపులు 4,380 మాత్రమే ఉన్నాయి. ఎక్సైజ్ శాఖలో ఈ రికార్డులు కూడా ఉన్నాయి. జూలై 1వతేదీ నాటికి రాష్ట్రంలో 4,380 షాపులు ఉన్నట్లు తేలితే ఆయన (అచ్చెన్నాయుడు) రాజీనామా చేస్తారా? ఆయన రెడీ అంటే ఎక్సైజ్ శాఖ అధికారులు నిరూపిస్తారు. మేం అ«ధికారంలోకి వచ్చింది మే నెల చివర్లో. అయినా జూలై 1 నాటికి రాష్ట్రంలో 4,380 మద్యం దుకాణాలు ఉన్నాయని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్లు చెబుతున్నారంటే అవి టీడీపీ హయాంలో ఉన్నట్లే కదా? దుకాణాల సంఖ్య 4,380 నుంచి 3,456కు వచ్చాయంటే తగ్గినట్లే కదా? దాన్ని కూడా అచ్చెన్నాయుడు వక్రీకరిస్తూ మాట్లాడుతున్నారు. (ఈ సందర్భంగా టీడీపీ హయాంలో మద్యం షాపుల కొనసాగింపునకు సంబంధించి 2017 మార్చి 22న జారీ చేసిన జీవోను ప్రదర్శించారు. దాని ప్రకారం 2015 నుంచి 17 వరకు రెండేళ్లకు నిర్ణయించిన 4,380 మద్యం షాపులను మరో రెండేళ్లు (2017 నుంచి 19) ఎలా కొనసాగించిందీ వివరించారు.) మేం ఈ ఏడాది మే చివరిలో అధికారంలోకి వచ్చాం. నెల తర్వాత అంటే జూలై 1 నాటికి రాష్ట్రంలో 4,380 మద్యం షాపులున్నాయి. ఇప్పుడు వాటి సంఖ్యను దాదాపు 25 శాతం తగ్గించి 3,456కి మాత్రమే అనుమతి ఇచ్చాం. అయినా కావాలని ఒక పద్ధతి ప్రకారం సభను తప్పుదోవ పట్టిస్తున్నారు. (ఈ సందర్భంగా మద్యపాన నిషేధానికి సంబంధించి తాను విపక్ష నేతగా ఉండగా పాదయాత్రలో ఏం మాట్లాడానో ముఖ్యమంత్రి జగన్ వీడియో ప్లే చేసి చూపించారు. నెల్లూరు జిల్లాలో మహిళా సదస్సులో మాట్లాడిన వీడియోతో పాటు మరో వీడియోను కూడా సభలో ప్రదర్శించారు) అన్ని విషయాలూ దగ్గర ఉన్నా సభను ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టిస్తూ అబద్ధాలు ఆడుతున్నారు. ఈ మనిషి (అచ్చెన్నాయుడు) అబద్ధాల మీద అబద్ధాలు చట్టసభలో చెబుతుంటే, వీటిని రికార్డుల్లోకి తీసుకునే కార్యక్రమం ఎలా ఆమోదయోగ్యం? నిజాలు మాత్రమే సభ దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి. కానీ ఒక పద్ధతి ప్రకారం అబద్ధాలు మాత్రమే చెప్పే ఇటువంటి వ్యక్తికి మళ్లీ సభలో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకండి. బెల్టు షాపులు తీసేసినప్పుడు, మద్యం అమ్మకాలు కూడా ఒకరికి 6 నుంచి 3 బాటిల్స్‌కు తగ్గించినప్పుడు, ఎడాపెడా కేసులు పెడతా ఉన్న పరిస్థితుల్లో ఎవడో డ్రెస్ వేసుకుంటాడంట! డ్రెస్‌కు జేబులు ఉంటాయంట. గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి బాటిళ్లు అమ్ముతాడంట. ఈ మూడు విషయాల మీద టీడీఎల్పీ ఉప నేత అచ్చెన్నాయుడి మీద నేను ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తున్నా. -
ఆ ద్రావం తాగితే అతీత శక్తులు..!!
సాక్షి, వెబ్ డెస్క్ : 2018 ఈ ఏడాదిలో ఇప్పటికే చాలా రకాల వింతలు జరిగాయి. మరీ ముఖ్యంగా వంటల విషయంలో. ఎలాంటి పానీయం తీసుకోకుండా టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడిని తినడం నుంచి లిక్విడ్ డిటర్జెంట్‌ను గడగడా తాగేయడం లాంటి వీడియోలు నెట్టింట్లో సంచలన సృష్టించాయి. తాజాగా 17 వేల మందికి కలిగిన సరికొత్త కోరిక గురించి తెలిస్తే షాక్‌కు గురవుతారు. ఈజిప్టులోని అలెగ్జాండ్రియా నగరం కింద భూమి లోపల 16 అడుగుల లోతులో నల్లరాతి శవకోష్టిక లభ్యమైన సంగతి తెలిసిందే. దాదాపు 2000 ఏళ్ల క్రితం శవకోష్టికను భూస్థాపితం చేశారు. శాపానికి గురవుతామా? అనే భయాల మధ్య ఈజిప్టు పురాతత్వ కౌన్సిల్ చీఫ్ ఆదేశాల మేరకు ఇటీవల ఆ శవకోష్టికను తెరిచారు. అందులో ముగ్గురు వ్యక్తుల మమ్మీలు బయల్పడ్డాయి. అయితే, ఆ మూడు మమ్మీలు ఎరుపు రంగులో ఉన్న ఓ ప్రత్యేక ద్రావంలో మునిగి ఉన్నాయి. మమ్మీలను బయటకు తీసిన పరిశోధకులు అవి రోమన్ రాజ కుటుంబానికి చెందినవి కావని తేల్చారు. ఈ సంఘటనను కళ్లప్పగించుకుని చూసిన కొందరు ఇప్పుడు ఆ ఎరుపు రంగు ద్రావాన్ని తాగేందుకు తమను అనుమతించాలని కోరుతున్నారు. ఈ మేరకు ఛేంజ్.ఆర్గ్ అనే ఓ వెబ్సైట్ పిటిషన్‌ను సైతం దాఖలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 17 వేల మందికి పైగా శవ కోష్టికలో ఉన్న ద్రావాన్ని తాగడానికి ఇష్టపడుతున్నారని, వారికి అవకాశం ఇవ్వాలనేది సదరు పిటిషన్ సారాంశం. శాపగ్రస్తమైన నల్లరాతి శవకోష్టికలోని ఆ ద్రావాన్ని తాగితే అతీత శక్తులు సంక్రమిస్తాయని, ఆ తర్వాత చనిపోతామని వారందరూ విశ్వసిస్తున్నారని పిటిషనర్ మెక్కెన్డ్రిక్ పేర్కొన్నారు. మరణించే హక్కును గురించి ప్రస్తావిస్తూ సదరు ద్రావాన్ని తాగేందుకు వారికి అనుమతి ఇవ్వాలని ఆయన పిటిషన్లో కోరారు. అయితే, ఈజిప్టు పురాతత్వ శాఖ మాత్రం వేల మంది ప్రజలు శవకోష్టికలోని ద్రావాన్ని తాగేందుకు ఆసక్తి కనబరచడంపై ఆందోళన వ్యక్తం చేసింది. సదరు ద్రావం ఒట్టి మురికి నీరు మాత్రమేనని పేర్కొంది. ఎముకలు, ఇతర శరీర భాగాల నుంచి ఆ ద్రవం తయారైందని తెలిపింది. దానికి ఎలాంటి అతీత శక్తులు లేవని కొట్టిపారేసింది. దీనిపై అరిజోనా స్టేట్ యూనివర్శిటీలోని బయోడిజైన్ ఇనిస్టిట్యూట్‌లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న రోల్ఫ్ హాల్డెన్ మాట్లాడుతూ.. కుళ్లిపోతున్న శరీరాలను నుంచి ఆ ద్రవం తయారైవుంటుందని చెప్పారు. వేల సంవత్సరాలుగా అలానే ఉన్న ఆ ద్రవంలో అతి భయంకరమైన బ్యాక్టీరియా, వైరస్లు ఉంటాయని హెచ్చరించారు. పొరబాటున ఆ ద్రవాన్ని తాగితే విపత్కర పరిస్థితిని ఎదుర్కొక తప్పదని పేర్కొన్నారు. శవ కోష్టికను తెరిచారు.. శాపం తగిలిందా..? -
బుర్ఖాల కోసం ప్రత్యేక లిక్విడ్ వాష్...
అన్ని వస్త్రాలూ ఒకలా ఉండవు. అలాగే అన్నింటికి ఒకే రకమైన వాషింగ్ ఉత్పత్తులూ పనికిరావు. ముఖ్యంగా ఖరీదైన ఫ్యాబ్రిక్స్ ఉపయోగించి రూపొందించే దుస్తుల కోసం మరింత జాగ్రత్తగా వాషింగ్ ఉత్పత్తులను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని బుర్ఖాల కోసం నగరానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఓ వైవిధ్యభరితమైన వాషింగ్ లిక్విడ్‌ని రూపొందించారు. సాక్షి, సిటీబ్యూరో: ‘డార్క్ కలర్ బుర్ఖాలు, వెయిల్స్, స్టోల్స్... వంటివి కొంత కాలం తర్వాత రంగులను కోల్పోయి కళావిహీనంగా మారుతున్నట్టు మా కాలేజ్ డేస్‌లో స్వయంగానూ, స్నేహితుల అనుభవాల ద్వారా గుర్తించాం. అప్పుడే వాటికి సరైన క్లీనింగ్ డిటర్జెంట్ మార్కెట్లో లభించడం లేదని అర్థమైంది’ అంటూ చెప్పారు మసరత్ ఖాటూన్, మెహనూర్ ఖాటూన్. నగరానికి చెందిన ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు చదువు పూర్తయిన తర్వాత ఇదే అంశంపై చేసిన మార్కెట్ స్టడీ కూడా ఈ విషయాన్నే నిర్ధారించడంతో... వాషింగ్ ఉత్పత్తుల రంగంలోకి ప్రవేశించాలనుకున్నారు. ఒక సమస్యకు పరిష్కారంతో మార్కెట్లోకి ప్రవేశించాలనుకున్న వీరికి అప్పటికే కెమిస్ట్ అయిన తండ్రి సహకారం కూడా తోడైంది. ‘ఖరీదైన డిజైనర్ వేర్ గాఢమైన రసాయనాలతో తయారైన ఉత్పత్తుల వాడకం కారణంగా కాంతిహీనంగా మారుతున్నాయి. త్వరగా ఫేడ్ అవుతుండటంతో స్టోల్స్ తదితర వస్త్రాలను మహిళలు రెగ్యులర్‌గా వినియోగించలేకపోతున్నారు. బుర్ఖాకు వాడే క్లాత్ చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. కెమికల్‌తో తయారైన లిక్విడ్ వినియోగిస్తే త్వరగా చిరిగిపోవడం, షేడ్ అవడం జరుగుతుంది. ఈ సమస్యకు పరిష్కారంగా ఈ వుర్ఖా వాష్ రూపొందించాం’ అని చెప్పారు. బేగంపేటలోని మ్యారీగోల్డ్ హోటల్లో బుధవారం దీనిని విడుదల చేసిన సందర్భంగా వీరు మాట్లాడుతూ... ప్రస్తుతం లిక్విడ్ రూపంలో విడుదల చేస్తున్నామని, త్వరలోనే బాటిల్స్ రూపంలోనూ అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ ఉత్పత్తికి సంబంధించి రిసెర్చ్, ప్రయోగాలన్నీ చండీఘడ్‌లో చేశామని, నగరంలో తయారీ జరుగుతోందన్నారు. బుర్ఖాలకు సంబంధించి అందుబాటులోకి వచ్చిన తొలి వినూత్న వాషింగ్ ఉత్పత్తిగా వీరు పేర్కొన్నారు. -
నికో కార్పొరేషన్ మూసివేత!
కోల్‌కతా: మొండి బాకీల కేసులో కేబుల్ తయారీ సంస్థ నికో కార్పొరేషన్ లిక్విడేషన్ ప్రక్రియ ప్రారంభించాలని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) కోల్‌కతా బెంచ్ ఆదేశించింది. దివాలా చట్టంలోని సెక్షన్ 14 కింద కంపెనీపై ఈ చర్యలు తీసుకుంటారు. బోర్డ్ ఫర్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్ రీకన్స్ట్రక్షన్ (బీఐఎఫ్ఆర్) రద్దు తర్వాత ఎన్సీఎల్టీ ముందుకు వచ్చిన తొలి కంపెనీ నికోనే. బ్యాంకర్లు కాకుండా తామే స్వయంగా ఎన్సీఎల్టీని అశ్రయించినట్లు కంపెనీ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాజీవ్ కౌల్ చెప్పారు. తాము అన్ని విధాలుగా ప్రయత్నించినప్పటికీ కంపెనీ లిక్విడేషన్ ఆదేశాలు రావడం ఆశ్చర్యపరిచినట్లు తెలియజేశారు. ఉద్యోగులు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. నికో రెండు ప్లాంట్లలో (పశ్చిమ బెంగాల్‌లోని శ్యామ్‌నగర్, ఒడిషాలోని బారిపద) సుమారు 600 మంది కార్మికులు, ఉద్యోగులు ఉన్నారు. పునర్వ్యవస్థీకరణ కోసం ఇచ్చిన 270 రోజుల గడువు ముగియడంతో లిక్విడేషన్ అనివార్యంగా మారిందని నికో కార్పొరేషన్‌కి నిర్దేశించిన రిజల్యూషన్ ప్రొఫెషనల్ (ఆర్పీ) కునాల్ బెనర్జీ తెలిపారు. ఈ లోగా సంస్థ యాజమాన్యం సమర్పించిన పునర్వ్యవస్థీకరణ ప్యాకేజీని రుణదాతలు తిరస్కరించినట్లు వెల్లడించారు. వివిధ బ్యాంకుల నుంచి నికో సుమారు రూ. 186 కోట్ల మేర రుణాలు తీసుకుంది. ఇందులో అత్యధిక భాగం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి పొందినదే. -
ఇంటిప్స్
కిచెన్ షెల్ఫులు, తలుపులు రోజూ శుభ్రం చేస్తున్నా కూడా జిడ్డు పడుతుంటాయి. నెలకొకసారి లీటరు వేడి నీటిలో ఒక టేబుల్ స్పూన్ అమోనియా, రెండు టేబుల్ స్పూన్ల వెనిగర్ కలిపి స్ప్రే బాటిల్లో పోసుకుని జిడ్డుగా ఉన్న ప్రదేశాలలో స్ప్రే చేసి తడి పీల్చుకునే పొడి వస్త్రంతో తుడవాలి. గార పట్టేసిన సింకులు, టైల్స్, బాత్టబ్బులను శుభ్రం చేయడానికి నాలుగు లీటర్ల వేడి నీటిలో ఒక టేబుల్ స్పూన్ అమోనియా కలిపి వాడాలి. అవెన్ శుభ్రం చేయాలంటే ముందు అవెన్‌ను ఆన్ చేసి 65డిగ్రీల వేడి వచ్చిన తర్వాత ఆఫ్ చేయాలి. ఒక కప్పులో సగం వరకు అమోనియా పోసి అవెన్‌లో పై అరలో ఉంచాలి. ఒక పెద్ద గిన్నెలో వేడినీళ్ళు పోసి కింద అరలో పెట్టి అవెన్ మూసివేసి రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయాన్నే అమోనియా కప్పు, వేడి నీటి గిన్నెలను బయటకు తీసి కొద్ది సేపు అవెన్‌ను ఓపెన్ చేసి ఉంచాలి. ఒక లీటరు వేడి నీటిలో పాత్రలు శుభ్రం చేసే లిక్విడ్ కొంచెం, ఒక టేబుల్ స్పూను అమోనియా కలిపిన మిశ్రమంలో క్లాత్‌ను ముంచి అవెన్ అంతా తుడవాలి. -
యూరియాతో బెట్ట నుంచి విముక్తి
దేవనకొండ : ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితుల కారణంగా వాడుపట్టిన పంటలపై యూరియా ద్రావణం పిచికారి చేస్తే బెట్ట నుంచి తాత్కాలికంగా రక్షించుకోవచ్చని ఇక్రిషాట్ శాస్త్రవేత్త ప్రభాకర్పటాక్ తెలిపారు. శుక్రవారం ఆయన మండల పరిధిలోని కూకటికొండ, వెలమకూరు గ్రామాల్లో పర్యటించారు. లీటర్ నీటికి 10 గ్రా. యూరియా, 2గ్రా. జింక్‌సల్ఫేట్, గ్రాము బోరాన్‌ను కలిపిన ద్రావణాన్ని వాడుపట్టిన వేరుశెనగ పైరుపై పిచికారి చేయడం వల్ల బెట్ట నుంచి పంట కొన్ని రోజులు తట్టుకుంటుందన్నారు. అదష్టవశాత్తు వర్షాలు కురిస్తే పంటలు తిరుగుముఖం పట్టే అవకాశం ఉందన్నారు. ఆయన వెంట ఇక్రిషాట్ ఎస్ఓ ఆదినారాయణ, నల్లచెలిమల ప్రాజెక్టు ఆఫీసర్ మధుసూదన్ తదితరులున్నారు. -
ఆవుల మూత్రంలో బంగారం!
జునాఘడ్: గుజరాత్ లోని జునాఘడ్ జిల్లాలో ఎక్కువగా కనిపించే గిర్ జాతికి చెందిన ఆవుల మూత్రంలో బంగారం ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దాదాపు 400 గిర్ జాతి ఆవుల మూత్రంపై నాలుగేళ్ల పాటు విస్తృతంగా పరిశోధనలు జరిపిన జునాఘడ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ(జేఏయూ) లీటర్ మూత్రంలో మూడు మిల్లీ గ్రాముల నుంచి 10 మిల్లీ గ్రాముల వరకు బంగారం ఉన్నట్టు పేర్కొన్నారు. బంగారానికి సంబంధించిన ధాతువులు నీటిలో కలిసిపోయి ఆవుల మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. పూర్వీకుల చిత్రాల్లో మాత్రమే ఆవుల మూత్రంలో బంగారం ఉన్నట్లు తెలిసేదని, పరిశోధనలు చేయగా అది నిజమేనని తేలిందని శాస్త్రవేత్తలు తెలిపారు. కొన్ని రకాల కెమికల్ పద్ధతులను ఉపయోగించి ఆవుల మూత్రం నుంచి బంగారాన్ని బయటకు తేవచ్చని చెప్పారు. ఒంటె, గేదే, గొర్రె, మేకలపై కూడా ఇలాంటి పరిశోధనలు చేశామని చెప్పారు. అయితే, వాటి మూత్రంలో వ్యాధి నిరోధక శక్తికి సంబంధించి ఆధారాలేవీ కనిపించలేదని వివరించారు. గిర్ జాతికి చెందిన ఆవుల మూత్రంలో అనేక రకాల వ్యాధులకు నిరోధకంగా పనిచేసే లక్షణాలు ఉన్నట్లు వెల్లడించారు. ఈ పరిశోధనలు చేసే జేఏయూ ఫుడ్ టెస్టింగ్ లాబోరేటరీ ఏటా దాదాపు 50,000లకు పైగా పరీక్షలు జరుపుతుంది. ఎగుమతులు, డైరీ ప్రొడక్ట్స్, కూరగాయలు, దినుసులు, తేనే, పురుగుల మందులు తదితరాలపై పరిశోధనలు ఇక్కడ నిర్వహిస్తారు. ప్రస్తుతం గిర్ ఆవుల మూత్రం మనుషుల జబ్బులకు, వృక్షాల పెంపకానికి ఎలా పనిచేస్తుందో పరిశోధనలు చేస్తున్నట్లు శాస్త్రజ్ఞులు వివరించారు. -
లిక్విడ్ డిటర్జెంట్లతో పిల్లలకు ప్రమాదం!
అమెరికాః లిక్విడ్ లాండ్రీ డిటర్జెంట్ లతో పిల్లలకు ప్రమాదం అంటున్నారు వైద్య నిపుణులు. లిక్విడ్ డిటర్జెంట్ల లో భారీగా రసాయనాలను వినియోగిస్తారని అందుకే ఆ లిక్విడ్స్ ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాలు చూపించడమే కాక మరణానికి కూడ దారితీస్తాయని చెప్తున్నారు. డిటర్జెంట్ లిక్విడ్స్ వినియోగం పిల్లల్లో శ్వాసకోశ వ్యాధులు, గుండెజబ్బులను వ్యాపింపజేయడంతోపాటు.. ఒక్కోసారి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని ఆన్ లైన్ జనరల్ పిడియాట్రిక్స్ లో ప్రచురించిన తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. లిక్విడ్ డిటర్జెంట్లు పిల్లలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయని అమెరికాలో నిర్వహించిన సర్వేలు చెప్తున్నాయి. జనవరి 2013 నుంచి డిసెంబర్ 2014 వరకు అమెరికాలోని పాయిజన్ కంట్రోల్ సెంటర్లు అందుకున్న సుమారు 62,254 ఫోన్ కాల్స్ ద్వారా ఎక్కువ శాతం లాండ్రీ, డిష్ వాష్ డిటర్జెంట్ ప్యాకెట్లతో ఆరేళ్ళలోపు పిల్లలకు తీవ్ర ఆనారోగ్యాలు చేకూరుతున్నట్లు తెలుసుకున్నారు. రెండేళ్ళ అధ్యయన కాలంలో ఈ సమస్య 17 శాతం పెరిగినట్లుగా కూడ చెప్తున్నారు. పాయిజన్ కంట్రోల్ సెంటర్లకు డిటర్జెంట్ లిక్విడ్లతో పిల్లలకు కలుగుతున్న నష్టాలపై రోజుకు 30 కన్నా ఎక్కువ కాల్స్ వచ్చేవని, లిక్విడ్ డిటర్జెంట్ లకు ఎక్స్పోజ్ అయిన పిల్లల్లో కనీసం రోజుకు ఒక్కరైనా ఆస్పత్రిలో చేరే పరిస్థితి ఉందని చెప్తున్నారు. అంతేకాదు డిటర్జెంట్ల వల్ల ఏకంగా ఇద్దరు పిల్లల మరణాలు కూడ నమోదైనట్లు అధ్యయనకారులు కనుగొన్నారు. అయితే లిక్విడ్ లాండ్రీ డిటర్జెంట్లలో ప్రమాదకర రసాయనాలు ఉంటాయని, అవి పిల్లలకు హాని కలిగిస్తాయన్న విషయాన్ని చాలా కుటుంబాలు గుర్తించలేకపోయాయని, నేషన్వైడ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ స్టడీ సహ రచయిత, టాక్సాలజీ ఛీఫ్ మార్సెల్ కాస్వెంట్ సూచించారు. ఆరేళ్ళ లోపు వయసున్న పిల్లలు ఇంట్లో ఉంటే వారు లాండ్రీ డిటర్జెంట్లకు ఎక్స్పోజ్ అవ్వకుండా ఆయా కుటుంబాలు శ్రద్ధ వహించాలని అధ్యయనకారులు సూచిస్తున్నారు. అంతేకాక తక్కువ టాక్సిక్ వినియోగించే సంప్రదాయ డిటర్జెంట్లను వినియోగించాలని సలహా ఇస్తున్నారు. అయితే డిటర్జెంట్లను మాత్రం పిల్లలకు సాధ్యమైనంత దూరంగానే ఉంచాలని హెచ్చరిస్తున్నారు.