లిక్విడ్ డిటర్జెంట్లతో పిల్లలకు ప్రమాదం! | Liquid laundry detergent packets dangerous to kids | Sakshi
Sakshi News home page

లిక్విడ్ డిటర్జెంట్లతో పిల్లలకు ప్రమాదం!

Published Wed, Apr 27 2016 12:35 PM | Last Updated on Sun, Sep 3 2017 10:53 PM

లిక్విడ్ డిటర్జెంట్లతో పిల్లలకు ప్రమాదం!

లిక్విడ్ డిటర్జెంట్లతో పిల్లలకు ప్రమాదం!

అమెరికాః లిక్విడ్ లాండ్రీ డిటర్జెంట్ లతో పిల్లలకు ప్రమాదం అంటున్నారు వైద్య నిపుణులు. లిక్విడ్ డిటర్జెంట్ల లో భారీగా రసాయనాలను వినియోగిస్తారని అందుకే ఆ లిక్విడ్స్ ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాలు చూపించడమే కాక మరణానికి కూడ దారితీస్తాయని చెప్తున్నారు. డిటర్జెంట్ లిక్విడ్స్ వినియోగం పిల్లల్లో శ్వాసకోశ వ్యాధులు, గుండెజబ్బులను వ్యాపింపజేయడంతోపాటు.. ఒక్కోసారి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని ఆన్ లైన్ జనరల్ పిడియాట్రిక్స్ లో ప్రచురించిన తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి.

లిక్విడ్ డిటర్జెంట్లు పిల్లలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయని అమెరికాలో నిర్వహించిన సర్వేలు చెప్తున్నాయి. జనవరి 2013 నుంచి డిసెంబర్ 2014 వరకు అమెరికాలోని పాయిజన్ కంట్రోల్ సెంటర్లు అందుకున్న సుమారు 62,254 ఫోన్ కాల్స్ ద్వారా ఎక్కువ శాతం లాండ్రీ, డిష్ వాష్ డిటర్జెంట్ ప్యాకెట్లతో ఆరేళ్ళలోపు పిల్లలకు తీవ్ర ఆనారోగ్యాలు చేకూరుతున్నట్లు తెలుసుకున్నారు. రెండేళ్ళ అధ్యయన కాలంలో ఈ సమస్య 17 శాతం పెరిగినట్లుగా కూడ చెప్తున్నారు. పాయిజన్ కంట్రోల్ సెంటర్లకు డిటర్జెంట్ లిక్విడ్లతో పిల్లలకు కలుగుతున్న నష్టాలపై రోజుకు  30 కన్నా ఎక్కువ కాల్స్ వచ్చేవని, లిక్విడ్ డిటర్జెంట్ లకు ఎక్స్పోజ్ అయిన పిల్లల్లో కనీసం రోజుకు ఒక్కరైనా ఆస్పత్రిలో చేరే పరిస్థితి ఉందని చెప్తున్నారు. అంతేకాదు డిటర్జెంట్ల వల్ల ఏకంగా ఇద్దరు పిల్లల మరణాలు కూడ నమోదైనట్లు అధ్యయనకారులు కనుగొన్నారు. అయితే లిక్విడ్ లాండ్రీ డిటర్జెంట్లలో ప్రమాదకర రసాయనాలు ఉంటాయని, అవి పిల్లలకు హాని కలిగిస్తాయన్న విషయాన్ని చాలా కుటుంబాలు గుర్తించలేకపోయాయని, నేషన్వైడ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ స్టడీ సహ రచయిత, టాక్సాలజీ ఛీఫ్ మార్సెల్ కాస్వెంట్ సూచించారు.

ఆరేళ్ళ లోపు వయసున్న పిల్లలు ఇంట్లో ఉంటే వారు లాండ్రీ డిటర్జెంట్లకు ఎక్స్పోజ్ అవ్వకుండా ఆయా కుటుంబాలు శ్రద్ధ వహించాలని అధ్యయనకారులు సూచిస్తున్నారు. అంతేకాక తక్కువ టాక్సిక్ వినియోగించే సంప్రదాయ డిటర్జెంట్లను వినియోగించాలని సలహా ఇస్తున్నారు. అయితే డిటర్జెంట్లను మాత్రం పిల్లలకు సాధ్యమైనంత  దూరంగానే ఉంచాలని హెచ్చరిస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement