packets
-
ఎటు చూసినా చెత్తే..!
సాక్షి, హైదరాబాద్: పారిశుధ్యానికి కేంద్రం ఎక్కువ ప్రాధాన్యతనిస్తోంది. స్వచ్ఛభారత్ పేరుతో దేశవ్యాప్తంగా ఈ మేరకు చర్యలు చేపట్టి అమలు చేస్తోంది. నిత్యం లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే రైళ్ల విషయంలోనూ ‘స్వచ్ఛతా పక్వారా’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కానీ ప్రయాణికుల్లోనే మార్పు రావటం లేదని, బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని పక్షం రోజుల పాటు రైళ్లు, రైల్వే స్టేషన్ల పరిసరాలు, వర్క్‌షాపులు, రైల్వే ఉద్యోగులు నివాసం ఉండే కాలనీల్లో స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహించారు. పక్షం రోజుల్లో ఏకంగా 544 టన్నుల చెత్త పోగవడం చూసి అధికారులు నివ్వెరపోయారు. పారిశుధ్యంపై రైల్వే ప్రత్యేక దృష్టి గత కొంతకాలంగా రైళ్లు, రైల్వే స్టేషన్లలో చాలా మార్పులు సంతరించుకుంటున్నాయి. అధునాతన రైళ్లతో పాటు స్టేషన్లలో అన్నిరకాల వసతులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటున్నాయి. రైళ్లు, స్టేషన్లు పరిశుభ్రంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రత్యేకంగా ఆదేశించారు. అంతేగాక స్వయంగా చీపురు పట్టి స్వచ్ఛతా కార్యక్రమాల్లో పాల్గొంటుండటంతో రైల్వే అధికారులూ అప్రమత్తంగా ఉంటున్నారు. స్టేషన్లను శుభ్రపరిచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా, ప్రైవేటు సంస్థలకు కాంట్రాక్టు బాధ్యతలు అప్పగించి క్రమం తప్పకుండా శుభ్రపరిచేలా చూస్తున్నారు. రైళ్లలో కూడా శుభ్రపరిచే సిబ్బందిని ఉంచి, ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు రాకముందే క్లీన్ చేసేలా ఏర్పాట్లు చేశారు. అయితే ప్రయాణికుల నుంచి మాత్రం దీనికి ఎలాంటి సహకారం లభించడం లేదని రైళ్లు, స్టేషన్లలో దర్శనమిచ్చే చెత్త స్పష్టం చేస్తోంది. పట్టించుకోని ప్రయాణికులు కాగితాలు, ప్లాస్టిక్ కవర్లు, మిగిలిపోయిన తినుబండారాలు, కాఫీ/టీ కప్పులు, భోజన ప్యాకెట్లు, విస్తరాకులు.. ఇలాంటి వాటన్నిటినీ ఇష్టారాజ్యంగా ఎక్కడపడితే అక్కడ విసిరేస్తున్నారు. దీంతో రైళ్లు, రైల్వే స్టేషన్లు, పరిసరాలు చెత్తతో నిండిపోతున్నాయి. సిబ్బంది ఎన్నిసార్లు శుభ్రం చేసినా మళ్లీ చెత్త పోగవుతోంది. ఇటీవల పక్షం రోజుల పాటు 639 రైల్వే స్టేషన్లు, 180 రైళ్లలో స్వచ్ఛతా పక్వారా కార్యక్రమాలను అధికారులు నిర్వహించారు. రైల్వే స్టేషన్లలో, రైళ్లలో చెత్త వేసేందుకు ప్రత్యేకంగా డస్ట్బిన్లు ఉన్నా, విచ్చలవిడిగా చెత్త విసురుతున్నట్టు అధికారులు గుర్తించారు. మొత్తం 544 టన్నుల చెత్తను పోగేసిన అధికారులు.. చెత్తను విసురుతూ పట్టుబడ్డ 857 మంది నుంచి రూ.4.5 లక్షల జరిమానా వసూలు చేశారు. 21,685 మందికి కౌన్సెలింగ్ నిర్వహించారు. పోగైన చెత్తలో 42 టన్నుల ప్లాస్టిక్ వ్యర్ధాలుండటం విశేషం. ఇక రైల్వే ప్రాంగణాల్లో 436 టన్నుల తుక్కును సేకరించారు. అవసరమైన ప్రాంతాల్లో కొత్తగా చెత్త కుండీలను ఏర్పాటు చేశారు. 3,510 కి.మీ. నిడివిగల ట్రాక్‌ను కూడా ఈ సందర్భంగా శుభ్రం చేశారు. అయితే స్వచ్ఛతా పక్వారా పేరుతో ఎప్పుడో ఓసారి నిర్వహించే కార్యక్రమాలతో ఫలితం అంతగా ఉండదని, రైళ్లు, రైల్వే స్టేషన్లలో నిత్యం తనిఖీలు నిర్వహిస్తూ చెత్త వేసే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని, వారికి కౌన్సెలింగ్ ఇవ్వటం ద్వారా మార్పు తెచ్చేందుకు ప్రయతి్నంచాలనే సూచనలు వస్తున్నాయి. -
నిత్యావసరాలు కొంటున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి
కిరాణాలు, సూపర్ మార్కెట్లలో వివిధ వస్తువులను ప్యాకెట్లరూపంలో విక్రయిస్తున్నారు. వీటిపై తయారీ, గడువు తేదీ, బరువు, ధర స్టిక్కర్లు వేయకుండానే విక్రయిస్తున్నారు. ప్రజలు వివిధ పనులతో బిజీగా ఉండటంతో వ్యాపారులు దానిని అవకాశంగా మార్చుకుని ప్యాకెట్ల రూపంలో వస్తువులు అంటగడుతున్నారు. సూపర్ మార్కెట్ల నుంచి చిన్న కిరాణాల్లోనూ ప్యాకింగ్‌పై అన్ని వివరాలు ఉండాలి. వ్యాపారులు నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. పావుకిలో, అర్ధకిలో, కిలో రూపంలో ప్యాకెట్లు నింపుతూ వ్యాపారులు విక్రయిస్తున్నారు. దీంతో తూకంలో తేడాలు వస్తున్నాయి. తూనికలు, కొలతల శాఖ అధికారులు దాడులు చేస్తూ కేసులు నమోదు చేస్తున్నారే తప్ప.. తదుపరి చర్యలపై పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. అనుమతి లేకుండానే.. ● నిబంధనల ప్రకారం నిత్యావసరాలను ప్యాక్ చేయాలంటే తూనికలు, కొలతల శాఖ అధికారుల అనుమతులు తీసుకోవాలి. ● ప్యాకెట్‌పై ఎమ్మార్పీ, మ్యానుప్యాక్చరింగ్ డేట్, కమొడిటీ, టోల్‌ఫ్రీ నంబరు ఉండాలి. ● కానీ, అనుమతి లేకుండానే కిరాణాల్లో కందిపప్పు, పెసరపప్పు, చక్కెర, గోధుమపిండి, మైదాపిండి ప్యాక్ చేస్తూ విక్రయిస్తున్నారు. ● చిప్స్, మురుకులు, ఖార, బొందీ తదితర తినుబండారాలనూ ప్యాకెట్లలోనే విక్రయిస్తున్నారు. ● హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి పెద్దపెద్ద బస్తాల్లో సరుకులను తీసుకొచ్చి ప్యాకెట్లుగా మార్చి అమ్ముతున్నారు. ● మరోవైపు.. పన్నులు తప్పించుకోవడానికి వ్యాపారులు జీరో దందాకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. ● తద్వారా ప్రభుత్వానికి పన్నులు ఎగవేస్తున్నారని విమర్శలు ఉన్నాయి. జాడలేని అధికారులు.. జిల్లాలో 20 మండలాలతో ఉండగా, ప్రస్తుతం జిల్లా ఇన్స్పెక్టర్తోపాటు, సిబ్బంది ఉన్నారు. జిల్లా పెద్దగా ఉండటం, అధికారులు తక్కువగా ఉండటంతో తనిఖీలు చేయడం లేదనే ఆరోపణలున్నాయి. దీంతో వ్యాపారులదే ఇష్టారాజ్యంగా మారింది. షాపుల్లో తరాజు, బాట్లు వ్యత్యాసం రాకుండా నిత్యం తనిఖీలు చేయాల్సిన అధికారులు.. అలాంటివేమీ చేయడం లేదు. ఏటా కిరాణం వారు తరాజులు, బాట్లకు స్టాంపు వేయించుకోవాలి. ఎలక్ట్రానిక్ కాంటాల వారు సంవత్సరానికోసారి రెన్యూవల్ చేయించుకోవాలి. గ్రామాల్లో అమ్మకాలు.. ● గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా మసాలా పొడులు, ఖారాప్యాకెట్లు, వివిధ వస్తువులు, ఉల్లిగడ్డలు ట్రాలీల్లో తీసుకెళ్లి అమ్ముతుంటారు. ● వీటిని చిన్నచిన్న కవర్లలో పోసుకుంటూ విక్రయిస్తుంటారు. ● వీటిపై ఎలాంటి ముద్రణ, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉండడంలేదు. ● ఇటీవల అధికారులు ఇద్దరిపై కేసు నమోదు చేశారు. ధరల్లో తేడాలు.. కొన్ని షాపుల్లో ఎమ్మార్పీ కన్నా ఎక్కువ రేట్లకు విక్రయిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. ముఖ్యంగా సినిమా థియేటర్లలో, బేకరీల్లో ఇస్టారాజ్యంగా రేట్లకు విక్రయిస్తున్నారు. కొత్త సినిమా రోజు సినిమా థియేటర్లలో ఒక కూల్‌డ్రింక్ రూ.30 నుంచి రూ.40 వరకు విక్రయిస్తున్నారు. ఒక పాప్‌కార్న్ రూ.20కి అమ్ముతున్నారు. వాటర్‌బాటిల్ రూ.40, చిప్స్ రూ.20కి విక్రయిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌కు చెందిన ప్రభుత్వ ఉద్యోగి సినిమాకు వెళ్లాడు. పాప్‌కార్న్ కొనుగోలు చేశాడు. దానికి ఎలాంటి స్టిక్కర్లేదు. ప్యాకెట్ రూ.40కిపైగా ధరకు అమ్మాడు. దీంతో అతడు లీగల్ మెట్రోలజీ వెబ్సైట్లో ఫిర్యాదు చేశాడు. అధికారులువెంటనే థియేటర్‌కు వెళ్లి కేసు నమోదు చేశారు. జగిత్యాల అశోక్‌నగర్‌కు చెందిన ఉపాధ్యాయుడు కూరగాయల మార్కెట్‌కు వెళ్లాడు. కూరగాయలు కొనుగోలు చేశాడు. కిలోకు పావుకిలో వరకు తక్కువగా రావడంతో అధికారులకు ఫిర్యాదు చేశారు. ముద్రణ ఉండాలి ప్రతీ ప్యాకెట్‌పై వస్తువుపై సంబంధిత కంపెనీ ముద్రణ, కన్జ్యూమర్ నంబరు, ఎమ్మార్పీ ఉండాలి. లేకుంటే చర్యలు తీసుకోవాలి, ప్రతీరోజు తనిఖీలు చేస్తున్నాం. నిబంధనలు అతిక్రమిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నాం. ఎలక్ట్రానిక్ మిషన్ వారు సంవత్సరానికోసారి, తరాజుబాట్ల వారు రెండు సంవత్సరాలకోసారి ముద్ర వేయించుకోవాలి. లేకుంటే చర్యలు తీసుకుంటాం. – అజీజ్‌పాషా, తూనికలు, కొలతల ఇన్స్పెక్టర్ -
ఆమెకు నట్ ఎలర్జీ.. విమానం ఎక్కగానే ఏం చేసిందంటే..
విమానంలో ప్రయాణానికి సిద్ధమైన ఆ ప్రయాణికురాలు ఫ్లయిట్లో అందుబాటులో ఉన్న మొత్తం 48 పల్లీల ప్యాకెట్లనూ కోనుగోలు చేసింది. విమానంలో ఎవరూ పల్లిలు తినకూడదనే ఉద్దేశంతోనే ఆమె అలా చేసింది. ఆమె ఇలా వింతగా ప్రవర్తించడం వెనుక పెద్ద కారణమే ఉంది. నట్ ఎలర్జీ బాధితురాలు తన విమాన ప్రయాణంలో మొత్తం 45 పల్లీల ప్యాకెట్లను కొనుగోలు చేసింది. 27 ఏళ్ల లియా విలియమ్స్ విమానయాన సంస్థ యూరోవింగ్స్కు చెందిన విమానంలో జర్మనీలోని ఇసెల్డోర్ఫ్ నుంచి లండన్‌లోని హీథ్రూ విమానాశ్రయం వరకూ ప్రయాణించాల్సి ఉంది. ఈ సమయంలోనే ఆమె విమానంలో అందుబాటులో ఉన్న అన్ని పల్లీల ప్యాకెట్లను కొనుగోలు చేసింది. విమాన ప్రయాణం ప్రారంభించే ముందు ఆమె ఫ్లయిట్ క్యాబిన్ క్రూతో తనకున్న ఎలర్జీ గురించి చెప్పడంతో పాటు, ఇతరులు పల్లీలు తిన్నప్పుడు కూడా తనకు ఇబ్బందిగా ఉండటుందని, అందుకే విమానంలోని ప్రయాణికులకు పల్లీలు అందుబాటులో ఉంచవద్దని కోరింది. అయితే విలియమ్స్ విన్నపాన్ని వారు తిరస్కరించారు. ఇది ఎయిర్‌లైన్స్ నియమాలకు విరుద్ధమని తేల్చిచెప్పేశారు. దీంతో విలియమ్స్ విమానంలో అందుబాటులో ఉన్న పల్లీల ప్యాకెట్లన్నింటినీ కోనుగోలు చేసింది. ఒక్కో ప్యాకెట్ మూడు యూరో(సుమారు రూ.200) చొప్పున మొత్తం 45 ప్యాకెట్లను కొనుగోలు చేసింది. తనకు ఎదురైన అనుభవం గురించి విలియమ్స్ మాట్లాడుతూ .. తన సమస్య గురించి చెప్పినప్పుడు క్యాబిన్ క్రూ అస్సలు పట్టించుకోలేదన్నారు. అప్పుడు తానే ఆ పల్లీల ప్యాకెట్లనన్నింటినీ కొనుగోలు చేశానని చెప్పారు. వాటి ఖరీదు ఎంతో తెలియనప్పటికీ, వాటిని కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యానన్నారు. ప్రయాణికుల సమస్యలను పట్టించుకోనందుకు యూరోవింగ్స్ సిగ్గుపడాలని ఆమె అన్నారు. ఇది కూడా చదవండి: ఆ భారీ షాపింగ్ మాల్లో కనిపించని క్యాషియర్.. మరి పేమెంట్ ఎలాగంటే.. -
ఎవ్వరూ మాట్లాడని కేరళ కథ! యావత్ సమాజం సేవ చేసేలా..!
'సేవ' అంటే ఆయా వ్యక్తుల వారికి తోచిన రీతిలో అనాథలకు, అభాగ్యులకు తమ సర్వీస్‌ని అందిచడం. కొందరూ కొన్ని స్వచ్ఛంద సంస్థల మద్దతు కూడా సేవలందిస్తారు. అలా ఇలా కాకుండా యావత్తు సమజాన్ని మహత్తర సేవ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడం అంటే మాటలకందని విషయం. అలా సాధ్యమా! అనిపిస్తుంది కూడా. ఔను! సాధ్యమే అంటూ కేరళకు చెందిన ఓ యువజన సంస్థ చేసి చూపించింది. కేరళలో వేలాది మహిళలు తమ కుంటుంబానికి సరిపడా వంట కంటే అదనంగా వండుతారు. ఒకరికో లేదా ఇద్దరికో సరిపడే ఆహారం అయ్యి ఉండొచ్చు. అయితే వారు చేసిన భోజనం పొట్లం ఏ అతిధికి చేరుతుందో ఎవరో తింటారో వారికి తెలియదు. అయినా వారంతా తమ వంతుగా ఈ సేవలో భాగమవుతున్నారు. దీన్ని కేరళలో 'పోతిచూరు' అంటారు. 'పోతిచోరు' అంటే భోజనం పొట్లం అని అర్థం. అలా అందించేవాళ్లు ధనవంతులు కారు. వారంతా సామాన్య ప్రజలు. వారు వండుకునే దానిలో కొంచెం ఇలా ప్యాక్‌చేసి పొట్లాల రూపంలో అందిస్తారు. ఇలా మొత్తం 40 వేల పోతిచోరు(భోజనం పొట్లాలు) వస్తాయంటే నమ్ముతారా?. ఔను} స్వచ్ఛందంగా చిన్న చితక పనులుచేసుకునే ప్రజల దగ్గర నుంచి యువత వరకు అందరూ ఇలా తమకు తోచినన్ని ఆహార పొట్లాలను ఇవ్వడం జరుగుతోంది. ఇలా కేరళలో 2017 నుంచి జరుగుతోంది. ఆ భోజన పోట్లాలన్ని ఆయా జిల్లాలోని ప్రభుత్వా ఆస్పత్రులకు వచ్చే పేదలకు, ప్రయాణికులకు, వృద్ధులకు చేరతాయి. దీన్ని సీపీఐ(ఎం) యువజన సంస్థ అయిన డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డీవైఎఫ్ఐ) 2017లో తిరువనంతపురం మెడికల్ కాలేజ్‌లో 300 పోతిచోరు ప్యాకెట్లతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీన్ని "హృదయపూర్వం" అని కేరళలో పిలుస్తారు. దీని అర్థం హార్టీ మీల్ పార్సెల్ అని. ఆ తర్వాత ఆరేళ్లకు క్రమక్రమంగా కేరళలోని 14 జిల్లాలోని 50 ఆస్పత్రులకు ప్రతి రోజు 40 వేల పోతిచోరులు పంపిణీ చేసే స్థాయికి వచ్చిందని డీవైఎఫ్ఐ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ ఏఏ రహీమ్ చెప్పారు. ఈ హృదయపూర్వం కార్యక్రమం కోసం ప్రత్యేక కిచెన్ కమ్యూనిటీఏమి లేదు. ఆ ఆహారపు పొట్లాలన్ని ఒక్కక్కొరి ఇళ్ల నుంచి సేకరించినవేనని చెబుతున్నారు. ఈ డీవైఎఫ్ఐ కార్యకర్తలు పక్కా ప్రణాళికతో హృదయపూర్వం కార్యక్రమం కోసం పోతిచోరు పంపిణీకి శ్రీకారం చుట్టారు. ప్రతి ఏడాది ఆహార పంపిణీకి సంబంధంచిన క్యాలెండర్ ముందుగానే పక్కాగా సిద్ధం చేస్తారు. ఆ జాబితా ఆధారంగా డీవైఎప్‌ఐ మండలి కమిటీలతో పంచుకుంటారు. ఆ తర్వాత మండల కమిటీలు ఒకదాని తర్వాత మరొకటి ఆహార పంపిణీ బాధ్యతలను తీసుకుంటాయి. ముందుగా డీవైఎఫ్ఐ కార్యకర్తలు వారి ప్రాంతంలోని ఇళ్లను సందర్శించి మరుసటి రోజు మధ్యాహ్నం భోజనం కోసం అదనంగా ఒకరికి భోజనం వండమని కోరతారు. కానీ వారంతా ఇద్దరు లేదా మూడు నుంచి ఐదు వరకు ఆహారపొట్లాలు సమకూర్చడం విశేషం. ఇక ఆ తర్వాత కార్యకర్తల ఈ సేకరించిన అదనపు ఆహారాన్ని నియమించిన ప్రభుత్వ ఆస్పత్రులలో పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమం మొత్తం సమాజం మద్దుతునే జయప్రదంగా జరుగుతోంది. ఈ కార్యకర్తలు, వరదలు, లాక్డౌన్ సమయంలో ఆకలితో అలమటించే అభాగ్యులకే గాక డ్యూటీలో ఉండే పోలీసు సిబ్బందికి, ప్రయాణికులకు ఆ ఆహారపొట్లాలను అందిస్తారు. ఇలా పంపిణీ చేసే కార్యక్రమంలో చాలా ఆసక్తికరమైన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. వాటిలో ఓ ఆసక్తికరమైన ఘటన.. మలప్పురం మంపాడ్ ఎంఈఎస్ కళాశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రాజేష్ మోంజీ ఈ ఏడాది జనవరిలో తన తల్లి చికిత్స కోసం కోజికోడ్ మెడికల్ కాలేజీలో ఉన్నారు. ఆయనకు ఈ పోతిచోరు పొట్లం అందింది. ఆయన ఆ పొట్లం విప్పి చూడగా.. ఒక చిన్నారి రాసిన చిన్న కాగితపు నోటు కనిపించింది. ఆ నోట్లో ఇలా ఉంది.."చెట్టా, చెచీ, ఉమ్మా, తథా, అమ్మా..అని ఉంది. అంటే ఈ ఫుడ్ పార్శిల్ ఎవరికి అందుతుందో వారు ముందుగా నన్ను క్షమించండి. మా అమ్మ ఇంట్లో లేదు. నేను స్కూల్‌కి వెళ్లే తొందరలో దీన్ని సిద్ధం చేశాను. ఆహారం రుచిగా లేదు. అలాగే మీరు త్వరగా కోలుకోండి." అని రాసి ఉంది. ఆ పోతిచూరులో ఉన్న ప్రతి బియ్యపు గింజలో ఆ చిన్నారి ప్రేమతో నిండిపోయింది అని ఉపాధ్యాయుడు తన ఫేస్బుక్ పోస్ట్‌లో పేర్కొన్నాడు. నిజానికి ఇది కేవలం ఆహార కాదు అంతకుమించినది. ఈ భోజన పంపిణీని దాతృత్వంగా భావించొద్దు ఎందుకంటే ప్రస్తుతం యువతో పెరుగుతున్న స్వార్థాన్ని అంతం చేసేందుకు ఇది చక్కగా దోహదపడుతోంది అన్నారు సీపీఎం రాజ్యసభ ఎంపీ ఏఏ రహీమ్. కాగా, ఈ ఆహారపొట్లాల సేకరణలో భాగం పంచుకుంట్ను ఓ గృహిణి మాట్లాడుతూ..పోతిచోరు సేకరణ తేది ఎప్పుడూ అని తెలుసుకుని...ఇలా పిడికెడు అన్నం పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. నేను చేయగలిగినంతలో చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది అని ఆమె చెబుతోంది. -
చిన్న ప్యాక్స్ ఎత్తుగడ, దూసుకుపోతున్న వ్యాపారం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బిస్కట్స్, స్నాక్స్, సబ్బులు, టీ, కాఫీ పొడులు.. ఇలా ఉత్పాదన ఏదైనా మారుమూల పల్లెల్లోని దుకాణాల్లో రూ.1, రూ.2, రూ.5, రూ.10 ధరలో లభించే చిన్న ప్యాక్‌లే ఎక్కువగా దర్శనమిస్తుంటాయి. ఉత్పాదనను వినియోగదారుడికి అలవాటు చేయడం, అక్కడి ప్రజల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కంపెనీలు ఇలా చిన్న ప్యాక్‌లను అందుబాటులోకి తెచ్చాయి. ఇటువంటి చిన్న ప్యాక్‌లు ఇప్పుడు ప్రధాన నగరాల్లోని రిటైల్ షాపుల్లో ఇబ్బడిముబ్బడిగా దర్శనమిస్తున్నాయి. ఆధునిక రిటైల్ ఔట్లెట్లు, ఆన్లైన్ వేదికల్లోనూ ఇవి చొచ్చుకువచ్చాయి. ఇందుకు రిటైల్ ద్రవ్యోల్బణం కారణమని ఎఫ్ఎంసీజీ రంగ కంపెనీలు చెబుతున్నాయి. ఆహారోత్పత్తుల ధరలు అధికంగా ఉండడంతో భారత్‌లో వార్షిక రిటైల్ ద్రవ్యోల్బణం జనవరిలో 6.52 శాతం నమోదైంది. దేశంలో ఎఫ్ఎంసీజీ మార్కెట్ 2020లో రూ.9.1 లక్షల కోట్లు ఉంది. 2025 నాటికి ఇది రెండింతలు అవుతుందన్న అంచనాలు ఉన్నాయి. వినియోగం పెరిగేందుకు.. భారత్‌లో ఫాస్ట్ మూవింగ్ కంజ్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) పరిశ్రమ 2022 అక్టోబర్-డిసెంబర్లో 7.6 శాతం వృద్ధి చెందింది. అంత క్రితం త్రైమాసికంలో ఇది 9.2 శాతంగా ఉంది. నిత్యావసరాలతోపాటు ఇతర విభాగాల్లోనూ ప్రముఖ తయారీ కంపెనీలు చిన్న ప్యాక్స్‌ను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాయి. తక్కువ ధరలో లభించే చిన్న బ్రాండ్స్, ప్రైవేట్ లేబుల్ ఉత్పత్తుల వైపు కస్టమర్లు మళ్లకుండా పెద్ద బ్రాండ్లు ఈ వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. ఒక్కో కుటుంబం నెలవారీ చేసే ఖర్చులపై ఒత్తిడి ఉండడం కూడా మరో కారణం. ముడిసరుకు వ్యయాలు పెరుగుతుండడంతో కంపెనీలు ప్యాక్ బరువు తగ్గించడం లేదా ధర పెంచడమో చేస్తున్నాయి. ధర పెంచిన ఉత్పత్తుల అమ్మకాలు తగ్గుతున్నాయని కంపెనీలు చెబుతున్నాయి. వినియోగం పెరిగేందుకు చిన్న ప్యాక్‌లను కొనసాగించాల్సిందేనని రిసర్చ్ కంపెనీ నీల్సన్ఐక్యూ తెలిపింది. ఆహారేతర విభాగాల్లో ఇవి డిమాండ్‌ను పెంచుతాయని వివరించింది. విక్రయాల్లో 50 శాతం దాకా.. చిన్న ప్యాక్‌ల వాటా మొత్తం అమ్మకాల్లో కంపెనీని బట్టి 50 శాతం వరకు ఉందంటే మార్కెట్ తీరుతెన్నులను అర్థం చేసుకోవచ్చు. గడిచిన రెండు నెలల్లో నగరాల్లో మొత్తం విక్రయాల్లో చిన్న ప్యాక్‌ల వాటా 5 శాతం పెరిగిందని కంపెనీలు అంటున్నాయి. మొత్తం సేల్స్‌లో చిన్న ప్యాక్‌ల వాటా ఏకంగా 50 శాతం ఉందని పార్లే ప్రొడక్ట్స్ వెల్లడించింది. నగరాల్లో గడిచిన రెండు మూడు నెలల్లో పెద్ద ప్యాక్‌లకు బదులుగా చిన్న ప్యాక్‌ల విక్రయాలే అధికంగా ఉన్నాయని కంపెనీ సీనియర్ కేటగిరీ హెడ్ మాయంక్ షా తెలిపారు. గతంలో ఇలా ఉండేది కాదన్నారు. సాధారణంగా ఈ ట్రెండ్ గ్రామీణ ప్రాంతాలకే పరిమితం అని చెప్పారు. ద్రవ్యోల్బణ ఒత్తిడి కారణంగా నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో చిన్న ప్యాక్‌ల వైపు మార్కెట్ మళ్లుతోందని సుస్పష్టం అవుతోందని విప్రో కంజ్యూమర్ కేర్ చెబుతోంది. ద్రవ్యోల్బణం ప్రధాన సవాల్‌గా ఉందని కోకా-కోలా ఇండియా తెలిపింది. ఇతర విభాగాల్లోనూ.. మిల్క్, న్యూట్రీషన్ విభాగాల్లో అందుబాటు ధరలో ప్యాక్‌లను పరిచయం చేయాలని దిగ్గజ సంస్థ నెస్లే నిర్ణయించింది. ఇప్పటికే ఈ కంపెనీ కెచప్, చాకొలేట్స్, కాఫీలో చిన్న ప్యాక్స్‌ను విక్రయిస్తోంది. ‘పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అన్ని బ్రాండ్స్‌లో అందుబాటు ధరలో విక్రయించేందుకు చిన్న ప్యాక్‌లు దోహదం చేస్తున్నాయి. చిన్న ప్యాక్‌లు లక్ష్యంగా ఇతర విభాగాల్లో విస్తరిస్తున్నాం. ఇది సత్ఫలితాలను ఇస్తోంది’ అని కోక–కోలా ఇండియా, సౌత్‌వెస్ట్ ఆసియా ప్రెసిడెంట్ సంకేత్ రే తెలిపారు. పెప్సి, మిరిండా, మౌంటెయిన్ డ్యూ సింగిల్ సర్వ్ బాటిల్స్ అమ్మకాలు ఇతర ప్యాక్‌లను మించి నమోదయ్యాయి. గెలాక్సీ, స్నిక్కర్స్, ఎంఅండ్ఎం బ్రాండ్ల చాకొలేట్లను విక్రయిస్తున్న మార్స్ రిగ్లీ రూ.10 ధరలో లభించే ప్యాక్‌లను నగరాల్లోనూ ప్రవేశపెడుతోంది. ఈ ఏడాది ద్వితీయార్ధంలో మాత్రమే ద్రవ్యోల్బణం తగ్గుతుందని, దీనిని దృష్టిలో పెట్టుకుని పంపిణీ, ధర నిర్ణయిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. -
మంత్రి ఉచిత చక్కెరకు మహిళ తిరస్కారం
సాక్షి, యశవంతపుర: ఏదైనా ఉచితంగా ఇస్తామంటే ఎవరైనా ఎగబడతారు, పైగా తమకు ఇంకొంచెం ఎక్కువ ఇవ్వాలని బతిమాలతారు. కానీ బాగలకోట జిల్లా బీళగిలో మంత్రి మురుగేశ్ నిరాణి అనుచరులు ఉచితంగా పంచిన చక్కెరను ఒక మహిళ ఇంటి బయట పడేసింది. ఈ వీడియో సోషల్ వీడియాలో వైరల్‌గా మారింది. మంత్రి మద్దతుదారులు బీళగిలో ఇంటింటికీ ఉచితంగా కొంత పంచదారను పంచారు. కార్యకర్తలు ప్యాకెట్లను ఆమె ఇంట్లోకి తీసుకెళ్లి ఇవ్వగా, వద్దని తిరస్కరించింది. లేదు, తీసుకోవాల్సిందేనని వాటిని ఇంట్లో పెట్టి వెళ్లిపోయారు. ఆమె ప్యాకెట్లను తీసి ఇంటి బయట పడేసింది. ఆమె నిజాయితీని చూసిన నెటిజన్లు అభినందించారు. ఈ వీడియోను యల్లప్ప హెగ్డే అనే సామాజిక కార్యకర్త సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. (చదవండి: పెళ్లికి వెళ్లి వస్తూ మృత్యు ఒడికి.. ) -
చిప్స్ ప్యాకెట్లతో నులి వెచ్చటి దుప్పట్లు!
చాలా మంది పేదవాళ్ల కోసం తమకు తోచినరీతిలో రకరకాలు సహాయ సహకారాలు అందించడం గురించి విని ఉన్నాం. అంతెందుకు వాళ్లకు ఉండేందకు వసతి, మూడు పూటలా భోజనం వంటి రకరకాల ఏర్పాట్లు చేసిన గొప్ప గొప్ప వ్యక్తులను కూడా చూశాం. కానీ 11 ఏళ్ల బాలిక తనకు వీలైనంతలో అది కూడా పర్యావరణ రహితంగా నిరాశ్రయులకు ఉపయుక్తంగా ఉండేలా దుప్పట్లు తయారు చేసి తనకున్న దొడ్డ మనసును చాటుకుంది. (చదవండి: ఒమిక్రాన్ ప్రమాదకారి కాదని అనుకోవద్దు, ఆస్పత్రుల్లో చేరుతున్నారు.. ప్రాణాలు పోతున్నాయ్) అసలు విషయంలోకెళ్లితే....యూకేలో వేల్స్‌లోని ప్రిస్టాటిన్కు చెందిన 11 ఏళ్ల అలిస్సా డీన్ నిరాశ్రయుల కోసం దుప్పట్లను తయారు చేస్తోంది. చలికాలంతో వెచ్చని దుప్పట్లు లేక బాధపడుతున్న అభాగ్యులను సురక్షితంగా ఉంచే నిమిత్తం దుప్పట్లను తయారు చేయాలనుకుంది. అంతేకాదు దుప్పట్లు తయారు చేసే నిమిత్తం ప్లాస్టిక్ సంచులను సేకరించడం మొదలు పెట్టింది. ఈ క్రమంలో ఆమె టోపీలు, చేతికి వేసుకును గ్లౌజులు, చాక్లెట్ ట్రీట్ వంటి తదితర ప్యాకెట్లను ఉపయోగించి 80 దుప్పట్లను తయారు చేసింది. అయితే ఒక్కో దుప్పటి తయారు చేయడానికి 44 ప్యాకెట్లు అవసరం. అంతేకాదు విరామ సమయంలో అలిస్సా, ఆమె తల్లి రకరకాల సంచులను సేకరించే పనిలో నిమగ్నమౌతారు. ఈ మేరకు ప్రతి దుప్పటిని ఇస్త్రీ చేసి వెదర్ ప్రూఫింగ్(అన్ని వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఉండేలా) చేసి ఇస్తామని అలిస్సా తెలిపింది. అయితే తాము వారికి మన్నికైన మంచి దుప్పట్లు ఇవ్వాలనుకున్నాం అని అన్నారు. అయితే వీటిని తయారుచేసేందుకు ఆమె కూతురు తన పాకెట్ మనీ ఉపయోగించేది. కానీ ఇప్పుడూ తాము నిధులను సమకూర్చుకుంటున్నాం అని అన్నారు. అంతేకాదు తాము తయారు చేసే దుప్పట్లు డెన్బిగ్షైర్తో పాటు కాన్వీ, ఫ్లింట్షైర్ అంతటా పంపిణీ చేశాం అని చెప్పారు. ఈ మేరకు అలిసా, ఆమె తల్లి ఫేస్బుక్ సాయంతో దుప్పట్లు తయారు చేయడానికి అవసరమైన ప్యాకెట్లను సేకరిస్తామని తెలిపారు. (చదవండి: క్యూఆర్ కోడ్ ఉన్నపెప్సీ ట్రక్‌లను తగలబెట్టేస్తా!) -
ఆకలిపై పోరులో డ్రీమ్ కేర్
వాషింగ్టన్ : అమెరికా లోని వాషింగ్టన్ డీసీ మెట్రో ఏరియాకి చెందిన కుషాల్ దొండేటి నిర్వహిస్తోన్న డ్రీం కేర్ ఫౌండేషన్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజషన్ ఆహార ప్యాకెట్లను సరఫరా చేసింది. ఫండ్ రైజింగ్ ద్వారా సుమారు రూ. 2.62 లక్షలను డ్రీం కేర్ ఫౌండేషన్ సమీకరించింది. ఈ నిధులతో పది వేల మీల్ ప్యాకెట్లను తయారు చేశారు. ఒక్కో ప్యాకెట్లో ఆరుగురికి సరిపడా ఆహారం ఉంటుంది. దీన్ని అమెరికా, ఇండియాతో పాటు పలు దేశాల్లోని అవసరం ఉన్న చోటుకి పంపారు. ఈ కార్యక్రమంలో రైజ్ ఎగైనెస్ట్హంగర్ అనే స్వచ్చంధ సంస్థ సైతం సహాయ సహకారాలు అందించింది. హై స్కూల్ స్థాయిలోనే ఫండ్ రైజింగ్ ద్వారా అమెరికా, ఇండియాలతో పాటు ఆకలితో ఉన్న వారికి సాయపడే విధంగా కార్యక్రమాలు చేపడుతున్న కుషాల్‌ను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో 60 మంది స్కూలు విద్యార్థులు పాల్గొన్నారు. -
రోజుకు 50 వేల ఫుడ్ ప్యాకెట్లను..
-
వాటర్ ప్యాకెట్ల తరహాలో చీప్ లిక్కర్
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో టెట్రా ప్యాక్‌లలో మద్యం అమ్మకాలు చేపట్టబోతోంది. వాటర్ ప్యాకెట్ల తరహాలో చీప్ లిక్కర్ ప్యాకెట్లు తయారుచేసి డిసెంబర్ నుంచి మార్కెట్లోకి ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 180 ఎంఎల్, 90 ఎంఎల్ ప్యాక్‌ల తయారీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పార్టీ ఫిరాయించిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి డిస్టిలరీస్‌లో ఈ టెట్రాప్యాకెట్లు ఉత్పత్తి కానున్నాయి. -
గుట్కా ప్యాకెట్ల స్వాధీనం
లక్సెట్టిపేట : అక్రమంగా గుట్కా ప్యాకెట్లు అమ్ముతున్న చంద్రశేఖర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు స్థానిక ఎస్‌హెచ్‌వో భూమేశ్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. ఆదివారం మండల కేంద్రంలోని బీట్ బజార్లో ద్విచక్రవాహనంపై గుట్కాలు అమ్ముతుండగా వాహనాన్ని, వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుట్కాల విలువ సుమారు రూ.10 వేలు ఉంటుంది. కేసు నమోదు చేశారు. ఈ దాడిలో హెడ్ కానిస్టేబుల్ రాజేశ్ పాల్గొన్నారు. -
లిక్విడ్ డిటర్జెంట్లతో పిల్లలకు ప్రమాదం!
అమెరికాః లిక్విడ్ లాండ్రీ డిటర్జెంట్ లతో పిల్లలకు ప్రమాదం అంటున్నారు వైద్య నిపుణులు. లిక్విడ్ డిటర్జెంట్ల లో భారీగా రసాయనాలను వినియోగిస్తారని అందుకే ఆ లిక్విడ్స్ ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాలు చూపించడమే కాక మరణానికి కూడ దారితీస్తాయని చెప్తున్నారు. డిటర్జెంట్ లిక్విడ్స్ వినియోగం పిల్లల్లో శ్వాసకోశ వ్యాధులు, గుండెజబ్బులను వ్యాపింపజేయడంతోపాటు.. ఒక్కోసారి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని ఆన్ లైన్ జనరల్ పిడియాట్రిక్స్ లో ప్రచురించిన తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. లిక్విడ్ డిటర్జెంట్లు పిల్లలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయని అమెరికాలో నిర్వహించిన సర్వేలు చెప్తున్నాయి. జనవరి 2013 నుంచి డిసెంబర్ 2014 వరకు అమెరికాలోని పాయిజన్ కంట్రోల్ సెంటర్లు అందుకున్న సుమారు 62,254 ఫోన్ కాల్స్ ద్వారా ఎక్కువ శాతం లాండ్రీ, డిష్ వాష్ డిటర్జెంట్ ప్యాకెట్లతో ఆరేళ్ళలోపు పిల్లలకు తీవ్ర ఆనారోగ్యాలు చేకూరుతున్నట్లు తెలుసుకున్నారు. రెండేళ్ళ అధ్యయన కాలంలో ఈ సమస్య 17 శాతం పెరిగినట్లుగా కూడ చెప్తున్నారు. పాయిజన్ కంట్రోల్ సెంటర్లకు డిటర్జెంట్ లిక్విడ్లతో పిల్లలకు కలుగుతున్న నష్టాలపై రోజుకు 30 కన్నా ఎక్కువ కాల్స్ వచ్చేవని, లిక్విడ్ డిటర్జెంట్ లకు ఎక్స్పోజ్ అయిన పిల్లల్లో కనీసం రోజుకు ఒక్కరైనా ఆస్పత్రిలో చేరే పరిస్థితి ఉందని చెప్తున్నారు. అంతేకాదు డిటర్జెంట్ల వల్ల ఏకంగా ఇద్దరు పిల్లల మరణాలు కూడ నమోదైనట్లు అధ్యయనకారులు కనుగొన్నారు. అయితే లిక్విడ్ లాండ్రీ డిటర్జెంట్లలో ప్రమాదకర రసాయనాలు ఉంటాయని, అవి పిల్లలకు హాని కలిగిస్తాయన్న విషయాన్ని చాలా కుటుంబాలు గుర్తించలేకపోయాయని, నేషన్వైడ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ స్టడీ సహ రచయిత, టాక్సాలజీ ఛీఫ్ మార్సెల్ కాస్వెంట్ సూచించారు. ఆరేళ్ళ లోపు వయసున్న పిల్లలు ఇంట్లో ఉంటే వారు లాండ్రీ డిటర్జెంట్లకు ఎక్స్పోజ్ అవ్వకుండా ఆయా కుటుంబాలు శ్రద్ధ వహించాలని అధ్యయనకారులు సూచిస్తున్నారు. అంతేకాక తక్కువ టాక్సిక్ వినియోగించే సంప్రదాయ డిటర్జెంట్లను వినియోగించాలని సలహా ఇస్తున్నారు. అయితే డిటర్జెంట్లను మాత్రం పిల్లలకు సాధ్యమైనంత దూరంగానే ఉంచాలని హెచ్చరిస్తున్నారు. -
రూ.4.20 లక్షల విలువైన గుట్కా స్వాధీనం
కైకలూరు: ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడుల్లో రూ.4.20 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు బయటపడ్డాయి. కృష్ణా జిల్లా కైకలూరు మండలంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. కైకలూరు పట్టణం దానె గూడెం ప్రాంతంలో కాశీ విశ్వనాథం అనే వ్యక్తి ఇంటిపై దాడి చేసి రూ.4 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను పట్టుకున్నారు. అదేవిధంగా మండలంలోని ఆటపాకలో నాయుడు అనే వ్యక్తి ఇంటిపై సోదాలు జరిపి రూ.20 వేల విలువైన గుట్కాలను పట్టుకున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ అధికారి వైటీ నాయుడు తెలిపారు. -
కారులో గంజాయి స్వాధీనం
చిట్టమూరు: మండలంలోని ఎల్లసిరి గ్రామంలో కారులో దాచి ఉంచిన గంజాయి ప్యాకెట్లను శుక్రవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇన్చార్జి సీఐ రత్నయ్య కథనం మేరకు... ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి ఎల్లసిరిలో బ్లాక్ కలర్ ఉన్న ఫోర్డ్ ఫియోస్టో ఏపీ 16ఏఏ 4658 కారు అనుమానాస్పదంగా ఉండడంతో చిట్టమూరు ఎస్సై రవినాయక్‌కు సమాచారం అందింది. కారును పరిశీలించగా లాక్ చేసి ఉంది. దీంతో శుక్రవారం నెల్లూరు నుంచి కారు మెకానిక్‌ను పిలిపించి లాక్ ఓపెన్ చేశారు. తహశీల్దార్ వెంకట సునీల్ ఆధ్వర్యంలో కారులో ఉన్న 142 గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి బ్లూ లగేజీ కవర్లలో ఒక్కో ప్యాకెట్లో సుమారు 2.5 కిలోలో ఉంది. మొత్తం 317 కిలోలు ఉందని, వీటి విలువ సుమారు రూ. 10 లక్షలు ఉంటుందన్నారు. తహశీల్దార్ఎన్డీపీఎస్ యాక్ట్ ద్వారా వివరాలు నమోదు చేసి పోలీసులకు అప్పగించారు. కారుకు రెండు నంబర్లు పేట్లు ఉన్నాయని, ఒకటి ఆంధ్రా రిజిస్ట్రేషన్ కాగా, వెనుక పక్క టీఎన్ 07.ఏఏ.3567 నెంబరు ఉందన్నారు. ఈ నెంబర్లు కూడా ఫేక్ అని పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతంలో గంజాయి లభించడంపై పలు అనుమానాలు: మండలంలో ఇంత వరకు గంజాయి దొరికిన దాఖలాలు లేకపోవడంతో పలు అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. ఐదు రోజులుగా గ్రామం నడి బొడ్డున ఈ ప్రాంతం వారికి సంబంధాలు లేకుండా ఇంత పెద్ద మొత్తంలో గంజాయితో సహా కారు వదిలి వెళ్లడంపై పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. -
పల్లెకు పాలూ..పెరుగు
అరేయ్ చిన్నోడా.. పాల చెంబు అందుకొని బూదమ్మ పెద్దమ్మ ఇంటికెళ్లి పాలు తీసుకురారా.. అదే చేత్తో ఇంకో గిలాస పట్టుకెళ్లి పెరుగు కూడా తీసుకురా... ఇదీ పల్లెల్లో నిన్నామొన్నటివరకు వినిపించిన మాట. ఇటీవల కాలంలో పాడిపరిశ్రమ అభివృద్ధి పేరిట పట్టణాల్లో ఏర్పడ్డ డెయిరీలు పెద్ద ఎత్తున పాలసేకరణ చేపడుతున్నాయి. దీంతో పల్లెల్లో ఉత్పత్తయిన పాలు డెయిరీలకు వెళ్లి.. తిరిగి ప్యాకెట్లలో పల్లెలకు చేరుతున్నాయి. దీంతో పల్లెల్లో పాలకూ పెరుగుకూ కొరత ఏర్పడటంతో పాటు వాటి ధరలు రెట్టింపవుతున్నాయి. -పెద్దపల్లి పెద్దపల్లి : పల్లెల్లోని కిరాణ షాపుల్లో పప్పు, ఉప్పు, అగ్గిపెట్టే, సిగరేట్ ఇవి మాత్రమే అమ్మే వ్యాపారులు ఇప్పుడు పట్టణాల నుంచి పాలప్యాకెట్లు, పెరుగు ప్యాకెట్లు తెచ్చి విక్రయిస్తున్నారు. కిరాణషాపుల్లో పాలూ, పెరుగు ప్యాకెట్లను చూసి ఒకనాటి పల్లెజీవనాన్ని తలుచుకున్నవారు ఆశ్చర్యపోతున్నారు. ఒకప్పుడు ఇంటింటికీ ఓపాడి గేదెను పెంచుకొని పొరుగింటివారికి మర్యాదగా పాలూ, పెరుగు, మజ్జిగ ఉచితంగా ఇచ్చేవారు. కాస్త దూరపు బంధువులుగా ఉన్నవారికి మాత్రం సాధారణ ధరకే పాలూ, పెరుగును విక్రయించేవారు. పట్టణాల్లో పాడిపరిశ్రమ రంగాన్ని అభివృద్ధి పర్చడంకోసం ఏర్పాటు చేసిన డెయిరీలతో పల్లెల మర్యాద మాయమవుతోంది. ఇంట్లో ఉన్న చిన్నోడు పాల చెంబు అందుకొని ‘ఆవలివాడ’కెళ్లి పాలుతెచ్చే రోజులు పోయాయి. ఇప్పుడు ఎవరు కూడా ఇలా అరలీటర్, లీటర్ పాలు పోసేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో బజారుకు వెళ్లి కిరాణషాపుల్లో లభించే పాలప్యాకెట్లు తెచ్చి టీ చేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. రోజుకు లక్షలీటర్లు జిల్లాలో వివిధ పాలకేంద్రాల ద్వారా రోజుకు లక్షలీటర్లపాల సేకరణ కొనసాగుతోంది. విజయ, ప్రియ, తిరుమల డెయిరీలతోపాటు ముల్కనూరు మహిళా స్వకృషి డెయిరీ ఆధ్వర్యంలో పాల సేకరణ ఎక్కువగా జరుగుతోంది. పెద్దపల్లిలోని పాలసేకరణ కేంద్రం ఎనిమిదే ళ్ల క్రితం ప్రారంభించగా అప్పుడు 600 లీటర్లు సేకరించగా ప్రస్తుతం సేకరణ 2,630 లీటర్లకు పెరిగింది. రైతులు ఎక్కువగా పాలసేకరణ కేంద్రానికే పాలు అందించడానికి ఇష్టపడుతుండడంతో ఈ కేంద్రాల వ్యాపారం వర్ధిల్లుతోంది. గంగిగోవుపాలు గరిటడైనా చాలు గంగి గోవుపాలు గరిటడైనా చాలు అన్న పదం సామెతగా మిగిలిపోయే రోజులు వస్తున్నాయి. అప్పుడు మా ఇంట్లో ఆవు ఉండేది అనే జ్ఞాపకాలుగా దేశవాళీ ఆవులు నిలుస్తున్నాయి. రైతులు జెర్సీ ఆవుల పెంపకంపై దృష్టిపెట్టడంతో దేశవాళీ సంపదకు గడ్డురోజులు వచ్చాయి. ప్రభుత్వం సైతం విదేశీ ఆవుల పెంపకానికే రుణాలు ఇచ్చి ప్రోత్సహించడంతో స్థానిక సంపద కనుమరుగవుతోంది. కేవలం పట్టణాల్లో మాత్రమే గోమాతను పూజించే ఒక వర్గం దేశవాళీ ఆవులపై మమకారం చూపుతోంది. అవికూడా ఒకటి రెండు మినహాయిస్తే పెద్దసంఖ్యలో కనిపించడం లేదు. పెద్దకల్వలలో బట్టీ పాలు.. సింగరేణి కాలనీలకు... 30 ఏళ్ల నుంచి పెద్దపల్లి మండలం పెద్దకల్వల పాలబట్టీ నుంచి గోదావరిఖని, మందమర్రి, మంచిర్యాల ప్రాంతాలకు డబ్బాల ద్వారా పాలు తరలిస్తున్నారు. ఇక్కడి గ్రామంలోని బట్టీ(పొయ్యి)వద్ద కాచి వేడిచేసిన పాలను డబ్బాలతో తీసుకెళ్లి కార్మిక కుటుంబాలకు అందిస్తున్నారు. 30 ఏళ్ల క్రితం 2 వేల లీటర్ల పాలు ఈ గ్రామం సరఫరా చేసేది. ప్రస్తుతం అవి 200 లీటర్లకు పడిపోయాయి. ప్రతీ ఇంటికి రెండు పాడిగేదెలు ఉండేవని, వాటి సంఖ్య 2వేలకు పైనేనని వ్యాపారం మానేసిన వారు తెలిపారు. ఇప్పుడు ఊరంతా కలిపితే 200 కూడా పాడిగేదెలు లేవని చెప్పాడు. అయినా గ్రామంలో ఆనవాయితీగా వస్తున్న బట్టీ పాల వ్యాపారాన్ని ఓ కుటుంబం కొనసాగిస్తోంది. చిన్నబోయిన సింగరేణి రైలు ప్రతీ ఉదయం జమ్మికుంట, బిజిగిరి షరీఫ్, పొత్కపల్లి, ఓదెల, కొత్తపల్లి, కొలనూర్ రైల్వేస్టేషన్లో ఉదయం సింగరేణి రైలు ఆగిందంటే చాలు పదుల సంఖ్యలో పాలడబ్బాలు కిటికీలకు కొక్కెం వేసి తగిలించేవారు. అలా ప్రతీరోజు కోల్‌బెల్ట్ ప్రాంతానికి నాలుగైదువేల లీటర్ల పాలు డబ్బాల ద్వారా తీసుకెళ్లేవారు. దాని ద్వారా పదుల సంఖ్యలో కూలీలు, యువకులు పాలవ్యాపారంతో జీవనం సాగించేవారు. ప్రస్తుతం గ్రామాలకు కంపెనీల వాహనాలు రావడంతో రైతులు తమ పాలను డబ్బాలకు పోస్తున్నారు. స్థానికంగా విక్రయించడానికి ఇష్టం చూపకపోవడంతో డెయిరీ సంస్థలు గ్రామాలకు పరుగులు తీస్తున్నాయి. -
పాలూ ప్రియమే
కొడవలూరు, న్యూస్‌లైన్: ఇప్పటికే అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగి అష్టకష్టాలు పడుతున్న ప్రజలకు పాల ధర అదనపు భారమవుతోంది. ఇప్పటికే జిల్లాలోని కొన్ని ప్రైవేటు డెయిరీలు ధరను పెంచేయగా ప్రభుత్వ రంగ సంస్థ విజయా డెయిరీ 17వ తేదీన అధికారికంగా ప్రకటించనుంది. మొత్తంగా అన్ని డెయిరీలు కలిపి 20వ తేదీ లోపు ధర పెంచాలని నిర్ణయించాయి. లీటర్‌కు రెండు రూపాయలు పెంచుతుండటంతో జిల్లా వాసులపై అదనంగా నెలకు రూ.42 లక్షల భారం పడనుంది. మధ్యతరగతి ప్రజలపై ఇది తీవ్ర ప్రభావం చూపనుంది. పాల ప్యాకెట్లను ఎక్కువగా మధ్య తరగతి వారే వినియోగిస్తున్నారని అంచనా. రోజుకు లీటరు పాలు వినియోగించే వారు ఇకపై నెలకు అదనంగా రూ.60 వెచ్చించాలి. కుంటి సాకులే పాల ధర పెంపునకు సేకరణ ధర, డీజిల్ ధరల పెరుగుదలను డెయిరీలు కారణం చూపుతున్నా అవి కుంటుసాకులేనని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దొడ్ల డెయిరీ వారయితే ఈ కారణాలు చూపుతూ కరపత్రాలు కూడా పంపిణీ చేస్తున్నారు. అయితే రైతులకిచ్చే పాల ధర ఇటీవల కాలంలో పెంచిన దాఖలాలు లేవు. కొద్ది నెలల క్రితం మాత్రమే కాస్త పెంచారు. రైతుల వద్ద కొనే పాలలో పది శాతం వెన్న ఉంటే లీటరుకు రూ.46 చెల్లిస్తామని ప్రకటించారు. ధర నిర్ణయించే సమయంలో మాత్రం వెన్న శాతం ఆరు నుంచి ఏడు లోపే ఉన్నట్లు చూపి ధర తగ్గించేస్తున్నారు. సగటున ఒక్కో రైతుకు లీటర్‌కు రూ.34 మాత్రమే లభిస్తుంది. డీజల్ ధర పెరుగుదల నిజమే అయినప్పటికీ డెయిరీల వారు కేవలం పాల రవాణాకు మాత్రమే దానిని వినియోగిస్తారు. దీనినే ప్రధాన కారణంగా చూపి పాల ధరను ఒక్కసారిగా లీటరుకు రూ.రెండు పెంచడం దారుణమని వినియోగదారులు మండిపడుతున్నారు.