విమానంలో ప్రయాణానికి సిద్ధమైన ఆ ప్రయాణికురాలు ఫ్లయిట్‌లో అందుబాటులో ఉన్న మొత్తం 48 పల్లీల ప్యాకెట్లనూ కోనుగోలు చేసింది. విమానంలో ఎవరూ పల్లిలు తినకూడదనే ఉద్దేశంతోనే ఆమె అలా చేసింది. ఆమె ఇలా వింతగా ప్రవర్తించడం వెనుక పెద్ద కారణమే ఉంది.
నట్ ఎలర్జీ బాధితురాలు తన విమాన ప్రయాణంలో మొత్తం 45 పల్లీల ప్యాకెట్లను కొనుగోలు చేసింది. 27 ఏళ్ల లియా విలియమ్స్ విమానయాన సంస్థ యూరోవింగ్స్‌కు చెందిన విమానంలో జర్మనీలోని ఇసెల్డోర్ఫ్ నుంచి లండన్‌లోని హీథ్రూ విమానాశ్రయం వరకూ ప్రయాణించాల్సి ఉంది. ఈ సమయంలోనే ఆమె విమానంలో అందుబాటులో ఉన్న అన్ని పల్లీల ప్యాకెట్లను కొనుగోలు చేసింది.
విమాన ప్రయాణం ప్రారంభించే ముందు ఆమె ఫ్లయిట్ క్యాబిన్ క్రూతో తనకున్న ఎలర్జీ గురించి చెప్పడంతో పాటు, ఇతరులు పల్లీలు తిన్నప్పుడు కూడా తనకు ఇబ్బందిగా ఉండటుందని, అందుకే విమానంలోని ప్రయాణికులకు పల్లీలు అందుబాటులో ఉంచవద్దని కోరింది. అయితే విలియమ్స్ విన్నపాన్ని వారు తిరస్కరించారు. ఇది ఎయిర్‌లైన్స్ నియమాలకు విరుద్ధమని తేల్చిచెప్పేశారు.
దీంతో విలియమ్స్ విమానంలో అందుబాటులో ఉన్న పల్లీల ప్యాకెట్లన్నింటినీ కోనుగోలు చేసింది. ఒక్కో ప్యాకెట్ మూడు యూరో(సుమారు రూ.200) చొప్పున మొత్తం 45 ప్యాకెట్లను కొనుగోలు చేసింది. తనకు ఎదురైన అనుభవం గురించి విలియమ్స్ మాట్లాడుతూ .. తన సమస్య గురించి చెప్పినప్పుడు క్యాబిన్ క్రూ అస్సలు పట్టించుకోలేదన్నారు. అప్పుడు తానే ఆ పల్లీల ప్యాకెట్లనన్నింటినీ కొనుగోలు చేశానని చెప్పారు. వాటి ఖరీదు ఎంతో తెలియనప్పటికీ, వాటిని కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యానన్నారు. ప్రయాణికుల సమస్యలను పట్టించుకోనందుకు యూరోవింగ్స్ సిగ్గుపడాలని ఆమె అన్నారు.
ఇది కూడా చదవండి: ఆ భారీ షాపింగ్ మాల్‌లో కనిపించని క్యాషియర్.. మరి పేమెంట్ ఎలాగంటే..
Comments
Please login to add a commentAdd a comment