Peanut
-
రిపబ్లికన్లకు ‘ఉడుత సాయం’!
న్యూయార్క్: నేడు మొదలవుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇప్పటిదాకా ట్యాక్స్‌లు, అబార్షన్ హక్కులు, అక్రమ వలసలు ప్రధాన అంశాలుకాగా చిట్టచివర్లో ఒక ఉడుత చొరబడింది! రేబిస్ అనుమానంతో దాన్ని అధికారులు చంపేయడం చర్చనీయంగా మారింది. రిపబ్లికన్లు దీన్ని తమ ప్రచారాంశంగా మార్చుకున్నారు. బుల్లి టోపీలు, గమ్మతైన ట్రిక్కులతో మిఠాయిలపై గెంతుతూ ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారిన ఈ ఉడుతకు ‘పీనట్’ అని పేరు. న్యూయార్క్‌లో మార్క్ లాంగో అనే వ్యక్తి ఏడేళ్లుగా పెంచుతున్నాడు. దీంతోపాటు నక్కలా చిన్నగా ఉండే రఖూన్ అనే జీవినీ పెంచుతున్నాడు. ఈ వన్య ప్రాణుల పెంపకానికి అనుమతి, లైసెన్స్ తప్పనిసరి. అవి లేకపోవడంతో అధికారులు వాటిని స్వాదీనం చేసుకున్నారు. ఉడుత ఇటీవల ఒకరిని కరిచిందట. దాంతో ప్రాణాంతకర రేబిస్ వ్యాధి ప్రబలే ఆస్కారముందంటూ పీనట్, రఖూన్ రెండింటినీ గత వారం విషమిచ్చి చంపేశారు. దీన్ని రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ రన్నింగ్ మేట్ వాన్స్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘బైడెన్ సర్కారు నిరంకుశ పాలనకు ఇది నిదర్శనం. ప్రభుత్వం మతిలేని, దయలేని యంత్రంగా మారింది. అనాథ ఉడుతను నిర్దయగా చంపేసింది. ఇలాంటి ఉడుతలను సైతం ట్రంప్ కాపాడగలరు’’ అంటూ మస్క్ పోస్ట్ చేశారు. ‘‘6 లక్షల మంది నేరస్తులు, 13 వేల మంది హంతకులు, 16 వేల మంది రేపిస్టులు స్వేచ్ఛగా అమెరికాలోకి అడుగు పెట్టేలా చేసిన డెమొక్రటిక్ ప్రభుత్వం ఒక పెంపుడు ఉడుతను మాత్రం బతకనీయలేదు’’ అంటూ వాన్స్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కుకీస్ తింటున్నారా? ఐతే ఓ డ్యాన్సర్ ఇలానే తిని..
కుకీస్ అంటే ఇష్టంగా తినేవారు ఈ ఘటన వింటే మాత్రం తినేందుకు ఆలోచిస్తారు. ఎందుకంటే ఓ ప్రోఫెషనల్ డ్యాన్సర్ ఈ కుకీస్ తిని నిండు జీవితాన్ని కోల్పోయింది. ఈ ఘటన ఒకరకంగా అందరిలోనూ తీవ్ర భయాందోళనలను రేకెత్తించింది. కుకీస్ ఎంతవరకు తినొచ్చు మంచిదేని అన్నంత అనుమానాలకు దారితీసింది. అస్సలు కుకీస్ తినడం వల్ల ప్రాణం పోవడం ఏమిటీ? అసలేం ఏం జరిగింది.. వివరాల్లోకెళ్తే..ఓర్లా బాక్సెండేల్ అనే 25 ఏళ్ల ప్రోఫెషనల్ డ్యాన్సర్ కుకీస్ తిన్న తర్వాత జనవరి 11న అనాఫిలాక్టిక్ షాక్‌కి సంబంధించిన తీవ్ర అలెర్జీకి గురై మరణించింది. అయితే కుకీస్ వేరుశెనగతో చేసినవి. తమ బిడ్డ చనిపోవడానికి కారణం సదరు కకీస్ తయారు చేసే కంపెనీయే అంటూ కోర్టుని ఆశ్రయించారు ఆమె బంధువులు. ఇక బాధితరుఫు న్యాయవాది ఆ కుకీస్ ప్యాకెట్‌పై వేరుశెనగకు సంబంధించిన సమాచారం ఇవ్వడంలో విఫలమైందని, ఆహార పదార్థాల్లో కంపెనీ చూపిన నిర్లక్ష్యంధోరణి కారణంగానే తన క్లయింట్ మరణించిందని వాదించారు. తప్పుగా లేబుల్ చేసిన కుకీస్ వల్ల బాధితురాలు ప్రాణాలు పొగొట్టుకుందని అన్నారు. ఈ ఘటనతో యూకే నగరంలోని స్టీవ్ లియోనార్డ్ స్టోర్ల నుంచి వెనిలా ఫ్టోరెంటైన్ కుకీలను కొనేందు జనాలు జంకుతున్నారు. నిజానికి ఓర్లా 2018లో డ్యాన్స్ చేసేందుకు న్యూయార్క్ నగరానికి వెళ్లారు. అప్పుడే ఆమె ఒక సూపర్ మార్కెట్ నుంచి ఈ కుకీస్‌లను కొని, తినడం జరిగింది. చివరికి డ్యాన్స్ కార్యక్రమంలో పాల్గొనకుండానే ఆస్పత్రి పాలై చనిపోవడం జరిగింది. అయితే ఈ ఘటనపై సూపర్ మార్కెట్ స్పందించి.. ఈ కుకీలను తయారు చేసి, తమ మార్కెట్‌కి సరఫరా చేసే లాంట్ ఐలాండ్ బేకీరీయే దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొంది. పైగా ఈ దిగ్బ్రాంతికర ఘటనకు సదరు సూపర్ మార్కెట్ సీఈవో ఓ వీడియోలో సానుభూతి వ్యక్తం చేశారు కూడా. బాధితురాలు కూడా దర్యాప్తులో నిర్లక్ష్యపూరితంగా తయారు చేసిన కుకీస్ వల్లే చనిపోయినట్లు పేర్కొంది. అయితే బాధితురాలి తరుఫు న్యాయవాది తయారీ దారులు లేదా అమ్మకందారుల నిర్లక్యానికి ఓ ప్రాణం బలవ్వడమే గాక ఓ కుటుంబానికి తీరని విషాదం మిగిల్చిందంటూ వాదన వినిపించారు. అయితే కుకీస్ తయారీదారు కుకీస్ యునైటెడ్ కంపెనీ మాత్రం అందుకు తాము బాధ్యులం కాదని తెగేసి చెప్పింది. అమ్మకందారులు తప్పుగా లేబుల్ చేయండంతో తలెత్తిన తప్పిందంగా పేర్కొంది. తాము మార్కెట్‌కి ఉత్పత్తిని సరఫరా చేయడానికి ముందే ఎలాంటి ఇన్‌గ్రేడియంట్స్ వాడతామన్నది కూడా ముందుగానే సదరు సూపర్ మార్కెట్‌తో మాట్లడటం జరుగుతందని అందువల్ల ఇది ఎట్టిపరిస్థితుల్లోనూ తమ తప్పిదం కాదని వాదించింది. అందువల్ల దయచేసి వినియోగుదారులందరూ కుకీస్ కొనే ముందు దేనితో తయారు చేశారు, తయారీ తేదీ వివరాలు చూసుకుని కొనుగోలు చేయండి. ఇక్కడ ఎవరీ వ్యాపారం వారిదే మనుషల జీవితాలకు గానీ, వారి ఆరోగ్యానికి గానీ ప్రాముఖ్యం ఇవ్వవు, తప్పిదానికి బాధ్యత కూడా వహించవు అన్నది గుర్తు ఎరగాలి. ఎంత సేల్స్ చేశాం ఎంత ఆదాయం వచ్చింది అన్నదానికే ప్రాధాన్యత ఇస్తున్నంత సేపు ఇలాంటి ఘటనలు పునరావృతమవుతూనే ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త!. మన సంరక్షణ మనమే చూసుకోవాలి తప్పదు. (చదవండి: ఆ కవలలు పుట్టగానే వేరయ్యారు! మళ్లీ 19 ఏళ్ల తర్వాత..) -
పీనట్ ఐస్‌క్రీమ్ ఎప్పడైనా ట్రై చేశారా? సింపుల్ రెసిపి
పీనట్ ఐస్‌క్రీమ్ తయారీకి కావల్సినవి: స్వీటెండ్ కండెన్సడ్ మిల్క్ – 400 గ్రాములు హెవీ క్రీమ్ – 480 ఎమ్ఎల్,పీనట్ బటర్ – 250గ్రాములు వేరుశనగలు – 70 గ్రాములు (దోరగా వేయించి, తొక్క తీసి, కచ్చాబిచ్చా చేసుకోవాలి) తయారీ విధానమిలా: ముందుగా ఒక పెద్ద గిన్నెలో హెవీ క్రీమ్ వేసుకుని హ్యాండ్‌హెల్డ్ మిక్సర్‌తో బాగా నురుగు వచ్చేలా, క్రీమీగా చేసుకోవాలి. దానిలో కండెన్సడ్ మిల్క్, పీనట్ బటర్ వేసుకుని.. బాగా కలుపుకోవాలి. మెత్తగా క్రీమీగా మారిన తర్వాత.. దానిలో కచ్చాబిచ్చా చేసుకున్న వేరుశనగ ముక్కల్ని కలుపుకోవాలి. అనంతరం ఆ మొత్తం మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని.. సమాంతరంగా చేసుకోవాలి. 6 గంటలు పాటు ఫ్రిజ్‌లో పెట్టుకుని.. ఆ తర్వాత సర్వ్ చేసుకోవాలి. -
ఆమెకు నట్ ఎలర్జీ.. విమానం ఎక్కగానే ఏం చేసిందంటే..
విమానంలో ప్రయాణానికి సిద్ధమైన ఆ ప్రయాణికురాలు ఫ్లయిట్లో అందుబాటులో ఉన్న మొత్తం 48 పల్లీల ప్యాకెట్లనూ కోనుగోలు చేసింది. విమానంలో ఎవరూ పల్లిలు తినకూడదనే ఉద్దేశంతోనే ఆమె అలా చేసింది. ఆమె ఇలా వింతగా ప్రవర్తించడం వెనుక పెద్ద కారణమే ఉంది. నట్ ఎలర్జీ బాధితురాలు తన విమాన ప్రయాణంలో మొత్తం 45 పల్లీల ప్యాకెట్లను కొనుగోలు చేసింది. 27 ఏళ్ల లియా విలియమ్స్ విమానయాన సంస్థ యూరోవింగ్స్కు చెందిన విమానంలో జర్మనీలోని ఇసెల్డోర్ఫ్ నుంచి లండన్‌లోని హీథ్రూ విమానాశ్రయం వరకూ ప్రయాణించాల్సి ఉంది. ఈ సమయంలోనే ఆమె విమానంలో అందుబాటులో ఉన్న అన్ని పల్లీల ప్యాకెట్లను కొనుగోలు చేసింది. విమాన ప్రయాణం ప్రారంభించే ముందు ఆమె ఫ్లయిట్ క్యాబిన్ క్రూతో తనకున్న ఎలర్జీ గురించి చెప్పడంతో పాటు, ఇతరులు పల్లీలు తిన్నప్పుడు కూడా తనకు ఇబ్బందిగా ఉండటుందని, అందుకే విమానంలోని ప్రయాణికులకు పల్లీలు అందుబాటులో ఉంచవద్దని కోరింది. అయితే విలియమ్స్ విన్నపాన్ని వారు తిరస్కరించారు. ఇది ఎయిర్‌లైన్స్ నియమాలకు విరుద్ధమని తేల్చిచెప్పేశారు. దీంతో విలియమ్స్ విమానంలో అందుబాటులో ఉన్న పల్లీల ప్యాకెట్లన్నింటినీ కోనుగోలు చేసింది. ఒక్కో ప్యాకెట్ మూడు యూరో(సుమారు రూ.200) చొప్పున మొత్తం 45 ప్యాకెట్లను కొనుగోలు చేసింది. తనకు ఎదురైన అనుభవం గురించి విలియమ్స్ మాట్లాడుతూ .. తన సమస్య గురించి చెప్పినప్పుడు క్యాబిన్ క్రూ అస్సలు పట్టించుకోలేదన్నారు. అప్పుడు తానే ఆ పల్లీల ప్యాకెట్లనన్నింటినీ కొనుగోలు చేశానని చెప్పారు. వాటి ఖరీదు ఎంతో తెలియనప్పటికీ, వాటిని కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యానన్నారు. ప్రయాణికుల సమస్యలను పట్టించుకోనందుకు యూరోవింగ్స్ సిగ్గుపడాలని ఆమె అన్నారు. ఇది కూడా చదవండి: ఆ భారీ షాపింగ్ మాల్లో కనిపించని క్యాషియర్.. మరి పేమెంట్ ఎలాగంటే.. -
గల్లీలో పల్లీలు అమ్ముకుంటూనే వరల్డ్ ఫేమస్ అయ్యాడు
ఎప్పుడో రెండు నెలల కిందట మొదలైన ‘కచ్చా బాదాం’ మేనియా.. మళ్లీ తెర మీద ఊపేస్తోంది. అందుకు కారణం.. అంజలీ అరోరా అనే అమ్మాయి అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ తరుణంలో తన ఇన్‌స్టా రీల్లో హాట్ హాట్‌గా చిందులేసిన ఆ అమ్మాయిని పోలీసులు అరెస్ట్ చేశారనే వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. అంతేకాదు.. కచ్చా బాదం సాంగ్ హక్కులు తన పేర ఉండేలా చర్యలు తీసుకోవాలంటూ ఈ పాట ఒరిజినల్ క్రియేటర్ పోలీసులను ఆశ్రయించాడంటూ కొన్ని మీడియా హౌజ్‌లలో కథనాలు వెలువడుతున్నాయి. ఇంతకీ ఈ కచ్చా బాదం లొల్లి ఏంటి? వైరల్ అవుతున్న ఆ వార్తల్లో నిజమేంత? చూద్దాం.. ఏడాది కిందట.. గల్లీలలో సైకిల్ మీద, బైక్ మీద తిరుగుతూ పచ్చి పల్లీలు(కచ్చా బాదాం) అమ్ముకునే ఓ వ్యక్తి పాట సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. ‘పాత సామాన్లు ఇచ్చి.. పచ్చి పల్లీలు తీసుకెళ్లండంటూ’ గల్లీలో తిరుగుతూ తనదైన శైలిలో పాడుతూ జనాల్ని ఆకట్టుకునేవాడు భూబన్ బద్యాకర్. అతని వీడియోలు కొన్ని వాట్సాప్ స్టేటస్‌ల ద్వారా ‘ఎక్తారా’ అనే యూట్యూబ్ ఛానెల్‌కు చేరాయి. దీంతో ఒక ఫుల్‌లెంగ్త్ వీడియో తీసి, ఎడిట్ చేసి యూట్యూబ్‌లో వదలడంతో 21 మిలియన్‌కి పైగా వ్యూస్ వచ్చాయి. అలా కచ్చా బాదాం వెర్షన్ ఫేమస్ కావడం మొదలైంది. ఆపై ఆ పాట ఇన్‌స్టాగ్రామ్‌కు చేరగా.. సింగర్, మ్యూజీషియన్ నజ్మూ రియాఛాట్ ఆ వీడియోను రీమిక్స్ చేసి వదిలాడు. అలా ఆ రీమిక్స్ వెర్షన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండ్ కావడం మొదలైంది. మరోవైపు బాదం అఫీషియల్ ర్యాప్ వెర్షన్‌ను భూబన్తో కలిసి కట్టారు రోన్ఈ, ప్రగ్యా అనే ర్యాపర్లు. అలా యూట్యూబ్‌కు అఫీషియల్‌గా ర్యాప్ సాంగ్ ద్వారా పరిచయం అయ్యాడు ఆ పల్లీలు అమ్ముకునే చిరువ్యాపారి. ఆ వీడియోకు ఇప్పటిదాకా 33 మిలియన్ వ్యూస్పైగా వచ్చాయి. ఆపై ఎన్నెన్నో వెర్షన్లు వస్తూనే ఉన్నాయి. కానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో కచ్చా బాదాం పాపులర్ అయ్యింది మాత్రం నజ్మూ రియాఛాట్ వెర్షన్‌తోనే!. View this post on Instagram A post shared by Nazmu Reachat (@nazmureachat) రండమ్మా.. రండి పశ్చిమ బెంగాల్‌లోని లక్ష్మీనారాయణపూర్ కురల్జురీ గ్రామం.. భూబన్ స్వస్థలం. భార్యతో పాటు ముగ్గురు పిల్లల తండ్రైన భూబన్.. పచ్చి పల్లీలు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. పాత సామాన్లు, పగిలిపోయిన వస్తువులకు బదులు పల్లీలు ఇస్తూ.. వాటిని జంక్ షాపుల్లో అమ్మి జీవనం కొనసాగిస్తున్నాడు. అలా అమ్మేయగా వచ్చిన డబ్బు రూ.250 నుంచి 300రూ. మాత్రమే. ఆ అమ్మడంలోనూ.. స్థానిక భాషలో అరవడంలోనూ ప్రత్యేకత ఉండాలనేది అతని తాపత్రయం. అదే అతనిని ఓవర్ నైట్ సెన్సేషన్ చేసేసింది. అందిన ఆర్థిక సాయం.. కచ్చా బాదం పాట ఇన్స్టాగ్రామ్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. నెటిజనులు, స్థానిక నేతల దగ్గరి నుంచి సెలబ్రిటీల దాకా అంతా అడిక్ట్ అయిపోయారు. కొరియాతో పాటు ఆఫ్రికా దేశాలకు సైతం పాకేసింది. షార్ట్ వీడియోస్‌లో రికార్డు స్థాయిలో వీడియోలతో కచ్చా బాదం రీమిక్స్ ఏలుతుండగా.. ఆ సాంగ్ ఒరిజినల్ క్రియేటర్ భూబన్ బద్యాకర్కి తగిన గుర్తింపూ దక్కింది. ఒకానొక దశలో పాట మీద రైట్స్ కోసం ఆయన్ని పోలీసులను ఆశ్రయించాడనే వార్త ఒకటి చక్కర్లు కొట్టింది. View this post on Instagram A post shared by Khaby Lame (@khaby00) అయితే అందులో వాస్తవం ఉంది. అయితే ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. కాపీ రైట్స్ వ్యవహారం తమ చేతుల్లో లేదంటూనే.. భూబన్‌కి కొంత ఆర్థిక సాయం చేశారు. అంతేకాదు పలువురు పొలిటీషియన్లు, స్థానికులు, ఆయనకు చాలా సాయం అందించారు. ప్రభుత్వం కూడా స్పందించి.. తనకు ఇంటి స్థలం ఇవ్వాలని కోరుతున్నాడు భూబన్. ఎప్పటిలాగానే తన వ్యాపారం చేసుకుంటూ.. అడపా దడపా ఇంటర్నెట్లో కనిపించాలని అనుకుంటున్నాడు. అంతేకాదు త్వరలో టీమిండియా దాదా సౌరవ్ గంగూలీతో కలిసి ఓ రియాలిటీ షోలో(దాదాగిరి అన్లిమిటెడ్ సీజన్9లో) భూబన్ బద్యాకర్ సందడి చేయబోతున్నాడు. అదీ సంగతి! ఎవరీ అంజలి.. అంజలి అరోరా.. వయసు 22 ఏళ్లు. టిక్‌టాక్ ఉన్న టైంలో పాపులర్ అయిన నార్త్ నిబ్బీ. ఢిల్లీకి చెందిన! అంజలి ఒకవైపు మోడల్‌గానే రాణిస్తూ.. ఆ పాపులారిటీతో కొన్ని షార్ట్ ఫిల్మ్స్, ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తోంది. ఈ తరుణంలో కచ్చా బాదాం వెర్షన్‌కి ఈ అమ్మడు వేసిన స్టెప్స్ యూత్‌ని ఎట్రాక్ట్ చేసింది. ఆ ఒక్క వీడియోతో అంజలి ఫాలోవర్స్ ఒక్కసారిగా పెరిగిపోయారు. అయితే ఆమె వీడియోస్‌ను తీసేది ఆమె తండ్రే. పైగా ఆమె చిందులూ హాట్ హాట్‌గా ఉన్నాయి. అందుకే ఆమెపై ట్రోలింగ్ కూడా అదే స్థాయిలో జరిగింది. నార్త్ నుంచి సౌత్ దాకా దేశం మొత్తం.. బాషాబేధాలకు అతీతంగా సోషల్ మీడియాలో ఆమె కచ్చా బాదాం వెర్షన్ వైరల్ అయ్యింది. అంజలి ఇన్స్పిరేషన్తో మరికొందరు అమ్మాయిలు సైతం అలాంటి డ్యాన్స్‌లకే ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు. ఈ తరుణంలో హాట్ డ్యాన్సులు వేసినందుకు ఆమె అరెస్ట్ అయ్యిందంటూ ఓ పుకారు చెలరేగగా.. అందులో వాస్తవం లేదని ఆమె తండ్రి స్థానిక మీడియా ఛానెల్స్‌కు వివరణ ఇచ్చాడు. View this post on Instagram A post shared by Anjali Arora (@anjimaxuofficially) -
వీడి తెలివికి ఆస్కార్, నోబెల్ కూడా తక్కువే..!
స్మగ్లింగ్ నుంచి నియంత్రించడానికి ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా పూర్తి స్థాయిలో అరికట్టలేకపోతున్న మాట వాస్తవం. ముఖ్యంగా విమానాశ్రయల్లో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటాయి. మనం కూడా నిత్యం ఎయిర్‌పోర్టులో అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టివేత వంటి వార్తల్ని అనేకం చూస్తూనే ఉంటాం. అయితే కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పడానికి జనాలు ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తారో చెప్పుకొచ్చారు ఓ సీనియర్ కస్టమ్స్ అధికారి. ఓ వ్యక్తి ఏకంగా వేరు శనకాయల్లో డ్రగ్స్‌ని కుక్కి స్మగుల్ చేయడానికి ప్రయత్నించాడని గుర్తు చేసుకున్నారు నార్బర్ట్ అల్మేడియా అనే వ్యక్తి 2000 - 2005 వరకూ కస్టమ్స్ అధికారిగా విధులు నిర్వహించాడు. అయితే ఏ దేశంలో అనే వివరాలు పేర్కొనలేదు. ఈ క్రమంలో జనాలు ఎలాంటి వస్తువులను ఎక్కువగా స్మగుల్ చేయడానికి ప్రయత్నించేవారు.. అందుకు ఏలాంటి మార్గాన్ని ఎంచుకునేవారో తెలిపారు. స్మగ్లింగ్‌కు గురయ్యే వాటిల్లో ఎక్కువగా తాబేళు పిల్లలు, తేళ్లు, ఆహార పదార్థలతో పాటు డ్రగ్స్‌ను కూడా ఉండేవని తెలిపారు. అయితే వీటన్నింటిలో డ్రగ్స్‌ని తరలించడం కోసం జనాలు రకరకాల ప్రయత్నాలు చేసేవారని గుర్తు చేసుకున్నారు. కార్పెట్‌ను డ్రగ్స్‌లో ముంచి తీసుకురావడం.. కంప్యూటర్లలో డ్రగ్స్‌ను నింపి పైన ఉత్త గ్లాస్‌ను అంటించడం.. ఆఖరికి సూట్‌కేస్‌లు, వీల్ చైర్లలో కూడా డ్రగ్స్‌ను తరలించడానికి ప్రయత్నించేవారు అని తెలిపారు. అయితే వీటన్నింటికి కన్నా ఆసక్తికర సంఘటన ఒకసారి చోటు చేసుకుందని తెలిపారు. ఒక వ్యక్తి వేరు శనక్కాయల లోపల డ్రగ్స్‌ను కుక్కి స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నించాడు. అతన్ని అరెస్ట్ చేసినప్పటికి కూడా అతని సృజనాత్మక ఆలోచనని మెచ్చుకోలేకుండా ఉండలేకపోయాను అని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ స్టోరీ ప్రస్తుతం తెగ వైరలవుతోంది. డ్రగ్స్‌ని వేరు శనక్కాయల్లో తరలించే ఆలోచన వచ్చినందుకు సదరు వ్యక్తికి ఆస్కార్, నోబల్ కన్నా ఉత్తమ అవార్డు ఇవ్వాలి అని.. ఇలాంటి పనుల కోసం కాకుండా సమాజ శ్రేయస్సు కోసం బుర్రను వాడితే మంచిదని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. -
వెలుగులు నింపే ‘ఓలిక్’ వేరుశనగ!
వేరుశనగలో అత్యంత మేలైన , మెట్ట ప్రాంత రైతులకు అధిక రాబడిని అందించే రకాలేవి? ఓలిక్ యాసిడ్ ఎక్కువ శాతం ఉండే రకాలు! ఎందుకని?.. సాధారణ వేరుశనగలు 2 నెలల్లోనే మెత్తబడి పోతాయి. వీటిలో ఓలిక్ యాసిడ్ 45–50% వరకు ఉండటమే కారణం. కాబట్టి, ఇటువంటి వేరుశనగలతో వివిధ ఉత్పత్తులను తయారు చేయటం కష్టం. ఓలిక్ యాసిడ్ 80% వరకు ఉంటే.. 9 నెలల వరకు మెత్తబడి పాడు కాకుండా నిల్వ చేయొచ్చు! అంతేకాదు.. ఓలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండే వేరుశనగలు వినియోగదారుల ఆరోగ్యానికి కూడా అనేక విధాలుగా మేలు చేస్తాయి. అందుకే.. మన దేశంలో, ఇతర ఆసియా దేశాల్లోని ఆహార శుద్ధి కంపెనీలు ఆస్ట్రేలియా నుంచి ఓలిక్ యాసిడ్ 80% వరకు ఉన్న వేరుశనగలను ప్రతి ఏటా వేలాది టన్నులు దిగుమతి చేసుకుంటున్నాయి. ఓలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండే వేరుశనగ రకాలను మనమే అభివృద్ధి చేసుకోగలిగితే ఎంతబావుంటుందో కదా..? ఆ రకాలు అధిక ఉష్ణోగ్రతను, బెట్టను, తిక్క తెగులు, తుక్కు తెగుళ్లను కూడా సమర్థవంతంగా తట్టుకొనగలిగినవైతే మన రైతులకు మరింత మేలు కదూ? సరిగ్గా ఏడేళ్ల క్రితం డా. పసుపులేటి జనీలకు ఈ ఆలోచన వచ్చింది. మెదక్ జిల్లా పటాన్‌చెరులోని అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధనా సంస్థ(ఇక్రిశాట్)లోని వేరుశనగ వంగడాల అభివృద్ధి విభాగంలో ముఖ్య శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. ఆమె నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఏడేళ్ల పాటు కొనసాగించిన పరిశోధన సఫలీకృతమైంది. గుజరాత్‌లోని జునాగఢ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని తిరుపతి పరిశోధనా కేంద్రం, ప్రొ.జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని పాలెం పరిశోధనా కేంద్రం, తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు కూడా ఈ పరిశోధనలో, క్షేత్రప్రయోగాల్లో పాలుపంచుకున్నారు. జన్యుమార్పిడి విత్తనాలు కావు.. తిరిగి వాడుకోవచ్చు.. ఇక్రిశాట్లో డా. జనీల ఆధ్వర్యంలో 2011 నుంచి ఓలిక్ యాసిడ్ అధికంగా ఉండే వంగడాలపై పరిశోధనలు ప్రారంభమయ్యాయి. ఓలిక్ యాసిడ్ అధికంగా ఉండే అమెరికన్ వంగడం(సనోలిక్95ఆర్)తో స్థానిక వంగడాలను సంకరపరచి 16 కొత్త వంగడాలను రూపొందించారు. జన్యుమార్పిడి పద్ధతులను అనుసరించలేదు. మాలిక్యూలర్ మార్కర్స్తోపాటు అనేక సాంకేతికతలను వినియోగించడం ద్వారా సాధారణం కన్నా 3–4 ఏళ్ల ముందుగానే పరిశోధనను తక్కువ ఖర్చుతోనే కొలిక్కి తెచ్చామని డా. జనీల సంతోషంగా చెప్పారు. ఓలిక్ యాసిడ్ 80% వరకు ఉండే ఐ.సి.జి.వి. 03043 అనే రకంతో పాటు మరో రెండు వేరుశనగ వంగడాలు విడుదలకు సిద్ధమయ్యాయి. ఈ రకాలను సాగు చేసే రైతులు తమ పంట నుంచి కొన్ని కాయలను పక్కన పెట్టుకొని తిరిగి విత్తనంగా వాడుకోవచ్చు. స్థానికంగా క్షేత్ర ప్రయోగాలు చేసిన తర్వాత వేరుశనగ విస్తారంగా సాగయ్యే గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాల్లో 2017లో ప్రయోగాత్మకంగా సాగు చేయించారు. వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్‌కు చెందిన నరసింహారెడ్డి తదితర రైతులు అధిక దిగుబడులు సాధిస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో ఇప్పటివరకూ రైతులు ఇష్టపడి సాగుచేస్తున్న వేరుశనగ రకాల కన్నా (5–15% నుంచి 84% వరకు) అధిక దిగుబడి వచ్చిందని, ఓలిక్ యాసిడ్ 80% వరకు వచ్చిందని డా. జనీల ‘సాక్షి సాగుబడి’కి తెలిపారు. సాధారణంగా మన వేరుశనగ గింజల్లో 48% వరకూ వచ్చే నూనె దిగుబడి.. ఐ.సి.జి.వి. 03043 రకంలో 53% రావటం విశేషమన్నారు. ఆరోగ్యదాయకం.. ఓలిక్ యాసిడ్ అధికంగా ఉండే వేరుశనగలు వినియోగదారులకు మరింత ఆరోగ్యదాయకమైనవి. ఓలిక్ యాసిడ్ తక్కువగా ఉండే సాధారణ వేరుశనగలు లేదా వాటితో తయారు చేసిన ఆహారోత్పత్తులు రెండు నెలల్లో మెత్తబడుతాయి. కాబట్టి, ఆహార శుద్ధి కర్మాగారాల యాజమాన్యాలు ఆస్ట్రేలియా నుంచి 9 నెలల పాటు నిల్వ సామర్థ్యం కలిగిన, అధిక ఓలిక్ యాసిడ్ ఉండే వేరుశనగలను ఏటా భారీగా దిగుమతి చేసుకుంటున్నాయి. ఇప్పుడు సిద్ధమైన కొత్త వంగడాలు పూర్తిగా సాగులోకి వస్తే ఈ కంపెనీలు విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉండదు. మన దేశంలోని ఆహార శుద్ధి కర్మాగారాలకు ఇంకా ఓలిక్ యాసిడ్ ప్రాధాన్యంపై తగినంత చైతన్యం లేదని ఆమె అన్నారు. వీరిలో చైతన్యం పెంపొందించడంతోపాటు రైతులకు కొత్త వంగడాలను అందిస్తే పరిశ్రమకు, రైతులకు, వినియోగదారులకు కూడా మేలు కలుగుతుంది. ఓలిక్ యాసిడ్ అధికంగా ఉండడం వల్ల వేరుశనగ నూనె వాసన మెరుగ్గా ఉంటుందని, గుండె జబ్బుల నివారణతోపాటు అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఒనగూరతాయని ఆమె అన్నారు. రైతుల ఉత్పత్తిదారుల సంఘాలు ఆహార శుద్ధి కంపెనీలతో ముందస్తు ఒప్పందాల మేరకు ఈ వంగడాలను సాగు చేయాలని సూచిస్తున్నారు. ఈ వంగడాలను సాగు చేయటం వల్ల రైతులకు అధిక ఉత్పత్తితోపాటు కనీసం 10% అధిక ధర కూడా లభిస్తుందని డా. జనీల చెబుతున్నారు. గుజరాత్లో సుమారు 8 వేల మంది రైతులతో కూడిన ఖెదుత్ ఫుడ్స్ అండ్ ఫీడ్స్ అనే సంస్థ ద్వారా ప్రయోగాత్మకంగా కొత్త వంగడాలను సాగు చేయించారు. మార్కెట్ అవసరాలకు తగినంత నాణ్యత కలిగిన వేరుశనగలను వారు పండించి లబ్ధిపొందుతున్నారని డా. జనీల వివరించారు. ప్రస్తుతం దేశంలో 48 లక్షల హెక్టార్లలో వేరుశనగ సాగవుతోంది. ఇక్రిశాట్ రూపొందించిన కొత్త వంగడాలు తక్కువ ఎరువులు, పురుగుమందులతోనే మంచి దిగుబడినిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.అత్యధికంగా 40 వరకు ఊడలు వస్తున్నందున ప్రతికూల వాతావరణాన్ని తట్టుకుంటాయని చెబుతున్నారు. సేంద్రియ వ్యవసాయదారులు కూడా ఈ వంగడాలను సాగు చేయడం ద్వారా మంచి గిట్టుబాటుధర పొందడానికి అవకాశం ఉంటుందంటున్నారు. చెట్టుకు 30కి పైగా కాయలున్నాయి..! పదేళ్లుగా వేరుశనగను సాగు చేస్తున్నా. కె6, టాగ్ 24 రకాలు మచ్చ(తిక్క) తెగులును తట్టుకోవటం లేదు. దిగుబడి 3, 4 క్వింటాళ్లే వస్తున్నది. ఈ ఏడాది ఐ.సి.జి.వి. 03043 రకం సాగు చేశా. మచ్చ తెగులును తట్టుకోవటంతో చేనంతా పచ్చగా ఉంది. ఊడలు ఎక్కువగా వచ్చాయి. 60 రోజుల తర్వాతే ఊడలు వస్తున్నాయి. చెట్టుకు 30కి పైగా కాయలు ఉన్నాయి. 5 నెలల పంట కాలం. ఆకుమచ్చ తెగులు రాలేదు కాబట్టి ఆకు రాల్లేదు. మంచి పశుగ్రాసం కూడా వస్తుంది. తుప్పు తెగులు ఒకటి, రెండు మొక్కలకు తప్ప రాలేదు. 10 రోజుల్లో కాయలు కోస్తాం. బాగా లాభదాయకంగా ఉంటుందనుకుంటున్నా. – మల్లాయపల్లి నరసింహారెడ్డి (86869 55757), వేరుశనగ రైతు, శ్రీరంగాపూర్, వనపర్తి జిల్లా నారాయణ, కె6 కన్నా అధిక దిగుబడి.. ఉత్పత్తిదారుల సంఘాలకు విత్తనాలిస్తాం! ఈ కొత్త వేరుశనగ వంగడాలను ఆంధ్రప్రదేశ్‌లో సాగు చేయించగా.. నారాయణ రకంతో సమానంగా దిగుబడి వచ్చింది. ఓలిక్ యాసిడ్ 80% వచ్చింది. అధిక ఉష్ణోగ్రతను, బెట్టను, తుప్పు తెగులు, తిక్క తెగులును తట్టుకున్నాయి. తెలంగాణలో కె6 కన్నా మెరుగైన దిగుబడి వచ్చింది. 2018లో కూడా క్షేత్రస్థాయి ప్రయోగాలు కొనసాగుతాయి. ఆ తర్వాత అధికారికంగా విడుదల అవుతాయి. అయితే, ఈ లోగానే కొంత మేరకు విత్తనోత్పత్తి కోసం వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాలకు, జాతీయ విత్తన సంస్థ(ఎన్.ఎస్.సి.)కు వచ్చే ఖరీఫ్ నాటికి కొత్త విత్తనాలను అందించాలనుకుంటున్నాం. – డా. పసుపులేటి జనీల (99899 30855), ముఖ్య శాస్త్రవేత్త, ఇక్రిశాట్, పటాన్చెరు, మెదక్ జిల్లా. p.janila@cgiar.org వేరుశనగ రకాల మధ్య తేడాలను వివరిస్తున్న రైతు నరసింహారెడ్డి – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
సెనగ తినగ
పట్టీలంటే మనకు తెలిసినవల్లా కాళ్లకు వెండి పట్టీలు... నాల్కకు పల్లీపట్టీలు కానీ శనగలతోనూ టేస్టీగా పట్టీలు ఒత్తుకోవచ్చు!రోటీలంటే మన మటుకు మనం ఎరిగినవి గోధుమరొట్టె, జొన్నరొట్టె లేదా మినపరొట్టెలే. అయితే శనగరోటీలనూ కాల్చుకోవచ్చు! వడలంటే మనమెరిగినవి పెసరవడలూ, గారెలే. కానీ ఒడలు పులకరింపజేసే శనగవడలూ చేసుకోవచ్చు. ఆత్మారాముడు... అదేనండీ సోల్ శాంతించేలా రోల్స్... మనసు పొంగేలా శనగపొంగలీ వండుకోవచ్చు. ఇవన్నీ తనివితీరేలా తినేయవచ్చు... తేన్చేయవచ్చు.కానీ ఒక్కటి మాత్రం ష్యూర్... ఈ శనగ ఐటమ్స్‌లో ఏది చూసినా... ఏది తిన్నా అటు రుచుల వానతో... ఇటు లాలాజలవర్షంతో నోరంతా చిరపుంజీ అయిపోవడం ఖాయం. కాసేపట్లో ప్లేట్లోనివి మాయం అయిపోవడమూ ఖాయం. పట్టీస్ కావల్సినవి: ఆలివ్ ఆయిల్ – టేబుల్ స్పూన్; క్యారట్ తరుగు – 2 టీ స్పూన్లు; ఉల్లిపాయ తరుగు – 2 టేబుల్ స్పూన్లు; వెల్లుల్లి రెబ్బలు – 4 (కచ్చాపచ్చాగా దంచాలి); ఉప్పు – తగినంత; ఉడికించిన సెనగలు – కప్పు; బ్రెడ్ క్రంబ్స్ పొడి – 2 టేబుల్ స్పూన్లు; నిమ్మరసం – టీ స్పూన్; సోంపు (కచ్చాపచ్చాగా దంచాలి) – అర టీ స్పూన్; మిరియాల పొడి – చిటికెడు తయారీ: కడాయిలో ఆలివ్ ఆయిల్, కూరగాయల ముక్కలు వేసి ఉడికించాలి. ఉడికించిన శనగలను వడకట్టి, గరిటెతో లేదా పప్పు గుత్తితో వాటిని కచ్చాపచ్చాగా చిదపాలి. దీంట్లో బ్రెడ్ క్రంబ్స్ పొడి, సోంపు, ఉప్పు, నిమ్మరసం, మిరియాల పొడి వేసి కలపాలి. కూరగాయల మిశ్రమం చల్లారిన తర్వాత శనగల మిశ్రమంలో వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని చేత్తో ఉండలుగా చేసి, అదిమి పెనం మీద రెండువైపులా కాల్చుకోవాలి. వడల్లాగ నూనెలో వేసి కూడా వేయించుకోవచ్చు. గుగ్గిళ్లు కావల్సినవి: ఉడికించిన శనగలు – కప్పు; ఉల్లిపాయ తరుగు – 2 టేబుల్ స్పూన్లు; వెల్లుల్లి రెబ్బలు – 4 (కచ్చాపచ్చాగా దంచాలి); ఉప్పు – తగినంత; ఆలివ్ ఆయిల్ – టేబుల్ స్పూన్; కరివేపాకు – రెమ్మ; నిమ్మరసం – టీ స్పూన్; నూనె – రెండు టీ స్పూన్లు; ఎండుమిర్చి – 2 ; పచ్చిమిర్చి – 1 (నిలువుగా కట్ చేయాలి); కొత్తిమీర – టీ స్పూన్; పోపు గింజలు – అర టీ స్పూన్ తయారీ: కడాయిలో నూనె వేసి, వేడయ్యాక పోపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు, వెల్లుల్లి వేయించాలి. దీంట్లో ఉడికించిన శనగలు, ఉప్పు వేసి కలపాలి. చివరగా కొత్తిమీర చల్లి దించాలి. పైన నిమ్మరసం పిండి సర్వ్ చేయాలి. రోల్స్ కావలసినవి: సెనగలు – కప్పు; సెనగపప్పు – ఒకటిన్నర టీ స్పూన్; యాలకులు – 2; దాల్చిన చెక్క – చిన్నముక్క; నూనె – 4 టేబుల్ స్పూన్లు; తరిగిన ఉల్లిపాయలు – ముప్పావు కప్పు; టొమాటో తరుగు – ముప్పావు కప్పు; అల్లం తరుగు – టీ స్పూన్; పచ్చిమిర్చి తరుగు – ఒకటిన్నర టీ స్పూన్; ధనియాల పొడి – టీ స్పూన్; కారం – అర టీ స్పూన్; గరం మసాలా – అర టీ స్పూన్; చోలే మసాలా – ముప్పావు టీ స్పూన్; ఉప్పు – తగినంత; రోటీస్ – 2, గుండ్రంగా తరిగిన ఉల్లిపాయలు – కొన్ని తయారి: రాత్రిపూట సెనగలు కడిగి, తగినన్ని నీళ్లు పోసి నానబెట్టాలి. ఉదయాన ప్రెషర్ కుకర్‌లో వడకట్టిన సెనగలు, ఒకటిన్నర కప్పు నీళ్లు, యాలకులు, దాల్చిన చెక్క వేసి మూత పెట్టి 3 విజిల్స్ పెద్ద మంట మీద, మరో మూడ్ విజిల్స్ సన్నని మంట మీద ఉంచి దించేయాలి. కడాయి స్టౌ మీద పెట్టి నూనె వేసి, కాగాక ఉల్లిపాయలు వేయించాలి. దీంట్లో టోమాటో, అల్లం, పచ్చిమిర్చి తరుగు వేసి మూడు నిమిషాల సేపు వేయించాలి. దీంట్లో ధనియాల పొడి, కారం, గరం మసాలా వేసి మరో ఐదు నిమిషాలు ఉడికించాలి. మిశ్రమం బాగా ఉడికి, నూనె పైకి తేలాలి. అప్పుడు ఉడికిన సెనగలు, మసాలా, రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు, ఉప్పు వేసి సన్నని మంట మీద మళ్లీ ఉడికించాలి. గ్రేవీ పూర్తిగా పొడిబారేంతవరకు స్టౌ మీదే ఉంచాలి. ఒక గిన్నెలో గుండ్రంగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, చాట్ మసాలా వేసి కలపాలి. రోటీ మధ్యలో పైన ఉల్లిపాయ రింగులు, ఆ పైన సిద్ధంగా చేసుకున్న శనగల మిశ్రమాన్ని ఉంచి, రోటీ మొత్తం సెట్ అయ్యేలా స్పూన్‌తో సర్దాలి. పైన కొత్తిమీర, ఉల్లిపాయల తరుగు వేసి రోటీ చివరలు పట్టుకొని 3 సార్లు చుట్టాలి. దీని చుట్టూత టిష్యూ పేపర్ని చుట్టి, వెంటనే అందించాలి. పొంగలి కావలసినవి: సెనగలు – రెండు కప్పులు (నానబెట్టినవి); పాలు – 6 కప్పులు; బెల్లం – ఒకటిన్నర కప్పు; నెయ్యి – తగినంత; జీడిపప్పు – 10; కిస్మిస్ – 10; ఏలకులు – 5, కొబ్బరి తురుము – అరకప్పు. తయారి: ముందుగా సెనగలను నానబెట్టుకొని వాటిలోంచి ఒకటిన్నర కప్పుల శనగలను తీసుకునిమెత్తగా రుబ్బుకోవాలి. స్టౌ మీద మూకుడు ఉంచి అందులో కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్లను వేయించుకుని తీసేయాలి. తరవాత అందులోనే గోధుమరవ్వ వేయించి తీయాలి. మరికాస్త నెయ్యి వేసి, రుబ్బిన సెనగలముద్దను వేసి వేయించాలి. కొద్దిగా వేగిన తరవాత అందులో గోధుమరవ్వ, పాలుపోసి ఉడికించాలి. మిగిలిన శనగలు, బెల్లం, వేయించి ఉంచుకున్న జీడిపప్పు, కిస్మిస్ వేయాలి. దించేముందు కొబ్బరితురుము, ఏలకులపొడి వేయాలి. ఇది వేడివేడిగా తింటే మంచిరుచిగా ఉంటుంది. రోటీ కావలసినవి: గోధుమపిండి – 250గ్రా.; సెనగలు – 100గ్రా.; ఉప్పు – తగినంత; ధనియాల పొడి – 2 టీ స్పూన్లు; జీలకర్రపొడి – 2 టీ స్పూన్లు; కారం – 2 టీ స్పూన్లు; నూనె – తగినంత. తయారి: సెనగలను ఒకరోజు రాత్రంతా నానబెట్టుకోవాలి. నానిన సెనగలను శుభ్రంగా నీళ్లతోకడిగి కుకర్లోపెట్టి నాలుగు విజిల్స్ వచ్చేదాకా ఉంచి దించేయాలి. సెనగలు చల్లారిన తరవాత మిక్సీలో వేసి మెత్తగారుబ్బుకోవాలి. ఈ మెత్తగా రుబ్బిన సెనగల ముద్దలోగోధుమపిండి వేసి కలపాలి. తరవాత ఇందులో తగినంత ఉప్పు, ధనియాలపొడి, జీలకర్రపొడి, కారం, కొద్దిగా నూనె వేసి అన్నీ కలిసేలా కలపాలి. తరవాత కొద్దిగా నీరు పోస్తూ చపాతీపిండిలా కలుపుకుని గంటసేపు నాననివ్వాలి. తరవాత ఈ పిండిని ఉండలుగా చేసుకుని చపాతీలాగ ఒత్తి పెనం మీద వేసి నెయ్యితో కాని నూనెతో కాని కాల్చుకోవాలి. ఈ రోటీలను ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర పచ్చిమిర్చి, పెరుగు లేదా టొమాటో సాస్‌తో కాని, పుదీనా చట్నీతో కాని తింటే రుచిగా ఉంటాయి. వడలు కావలసినవి: శనగలు – 250 గ్రా.; పచ్చిశనగపప్పు – 100 గ్రా.; బియ్యం – గుప్పెడు; పచ్చిమిర్చి – 5; ఉల్లిపాయలు – 2; కరివేపాకు – రెండురెమ్మలు; కొత్తిమీర – చిన్నకట్ట; ఉప్పు – తగినంత; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారి: ఒకరోజు రాత్రంతా శనగలను ఒక గిన్నెలో, పచ్చిశనగపప్పు బియ్యం కలిపి మరొక గిన్నెలో నానబెట్టాలి. ఉదయాన్నేవాటిని శుభ్రంగా కడిగి నీరు ఒంపేసి, విడివిడిగానే మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి. ఈ రుబ్బిన వాటిని ఒక గిన్నెలో వేసి అందులో పచ్చిమిర్చితరుగు, ఉల్లితరుగు, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు వేసి కలపాలి. బాణలిలో నూనె పోసి బాగా కాగాక, కలిపి ఉంచుకున్న ఈ ముద్దను వడల మాదిరిగా చేత్తో ఒత్తి, నూనెలో వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించి, టిష్యూ పేపర్మీదకు తీసుకోవాలి. వీటిని టొమాటో సాస్ లేదా టొమాటో కెచప్‌తో తింటే బావుంటాయి. -
పనీర్ సలాడ్
క్విక్ రెసిపీ తయారి సమయం: 15 నిమిషాలు కావలసినవి: ఆపిల్ ముక్కలు – కప్పు; కీరా – ఒకటి (చెక్కుతీసి చిన్న ముక్కలుగా కట్ చేయాలి); పచ్చి బఠాణీ – గుప్పెడు; క్యారట్ – రెండు పనీర్ ముక్కలు – అర కప్పు ; ఉప్పు – రుచికి సరిపడా; నూనె – టీ స్పూన్; మిరియాల పొడి – పావు టీ స్పూన్; తేనె – అర టేబుల్ స్పూన్ తయారి: ముందుగా బఠాణీని కొద్దిగా ఉడకబెట్టుకుని నీటిని వంపేసుకోవాలి. క్యారట్‌ని సన్నగా తురిమిపెట్టుకోవాలి. పాత్రలో ఒక టీ స్పూన్ నూనె వేడయ్యాక పనీర్ ముక్కలు వేసి గోధుమరంగు వచ్చేలా వేయించి పక్కన పెట్టుకోవాలి. పై పదార్థాలన్నీ ఒక పాత్రలో ఒకదాని తరవాత ఒకటి వేసి, దీంట్లో తేనె జత చేసి కలియబెట్టి అందించాలి. -
కరువుతో చితికిపోతున్నాం
-
పచ్చి బఠాణీ.. పట్టపు రాణి..!
గట్టి బఠాణీ తినాలంటే బలమైన దంతసిరి ఉండాల్సిందే! సుతిమెత్తని పచ్చి బఠాణీలకు అలాంటి ఇబ్బందులుండవు. ఎలాంటి వంటకాల్లోనైనా ఇట్టే ఇమిడిపోతాయి. ఏ రుచిలోనైనా చక్కగా ఒదిగిపోతాయి. కాలక్షేపం బఠాణీలని తీసిపారేస్తారు గానీ, కండర పుష్టికి కూడా ప్రశస్తమైనవి బఠాణీలు. ఒక్కసారి తిని చూస్తే, ఎంతటి వారైనా.. గింజ కొంచెం.. రుచి ఘనం.. అని నోరారా ప్రశంసించకుండా ఉండలేరు. పసందైన విందుభోజనాలకు పట్టపురాణి ఆకుపచ్చని పచ్చిబఠాణీ.. కావాలంటే ఈ వెరైటీలు ప్రయత్నించి చూడండి! సగ్గుబియ్యం - పచ్చిబఠాణీ కట్లెట్స్ కావలసినవి: సగ్గుబియ్యం - గ్లాసు; పచ్చి బఠాణీలు - అర గ్లాసు; బొంబాయిరవ్వ - గ్లాసు; జీలకర్ర - పావు టీ స్పూను; సోడా - చిటికెడు; ఉల్లి తరుగు - అర కప్పు; పచ్చిమిర్చి పేస్ట్ - తగినంత; అల్లం వెల్లుల్లి పేస్ట్ - తగినంత; నూనె - తగినంత; ఉప్పు - తగినంత; ఉడికించిన బంగాళదుంప పేస్ట్ - అర కప్పు; కొత్తిమీర - తగినంత తయారీ: సగ్గుబియ్యం మునిగేవరకు నీళ్లు పోసి గంటసేపు నానబెట్టాక, నీళ్లు తీసేయాలి బఠాణీలో నీళ్లు పోసి గంటసేపు నానబెట్టాక, నీళ్లు తీసేసి, మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా పట్టుకోవాలి బొంబాయిరవ్వలో సగ్గుబియ్యం బఠాణీ పేస్ట్, బంగాళదుంప పేస్ట్ వేసి బాగా కలిపి చివరగా నూనె తప్ప మిగతా పదార్థాలన్నీ వేసి (అవసరమనుకుంటే కొద్దిగా నీళ్లు) పకోడీల పిండిలా కలిపి పెట్టుకోవాలి స్టవ్ మీద పెనం పెట్టి, కాలాక నూనె వేసి, తడి వస్త్రంపై ఈ మిశ్రమాన్ని చిన్న ఉండగా పెట్టి కట్లెట్ సైజులో చేతితో చేసి పెనం మీద వేసి చుట్టూ నూనె వేసి బాగా కాలిన తర్వాత తీసి ఉల్లిపాయ ముక్కలతో కలిపి తింటే బాగుంటుంది. కలిపిన పిండిని వడల మాదిరిగా, పకోడీలలాగ కూడా నూనెలో వే సి కూడా చేసుకోవచ్చు. పచ్చి బఠాణీ - ఆనపకాయ ఖీర్ కావలసినవి: పచ్చి బఠాణీలు - కప్పు; పచ్చి కోవా - అర కప్పు; ఆనపకాయ - కప్పు; పంచదార - కప్పు; పచ్చికొబ్బరి తురుము - పావు కప్పు; నెయ్యి - 3 టీ స్పూన్లు; పాలు - 5 కప్పులు; జీడిపప్పు + బాదం పప్పులు - గుప్పెడు; ఎండు ద్రాక్ష - 15; ఏలకుల పొడి - చిటికెడు; కర్బూజ గింజలు - టీ స్పూను తయారీ: పచ్చి బఠాణీలను గంటసేపు నానబెట్టి, ఉడికించి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన ఉంచాలి ఆనపకాయ తురుములో కొన్ని పాలు పోసి ఒక విజిల్ రాగానే దించేయాలి స్టౌ మీద బాణలి వేడయ్యాక నెయ్యి వేసి కరిగిన తర్వాత పచ్చిబఠాణీ పేస్టు వేసి పది నిమిషాలు ఉంచి, (ఆపకుండా కలుపుతుండాలి) ఆనపకాయ తురుము కూడా వేసి ఐదు నిమిషాలు కలిపి ఆ తరవాత కోవా, పాలు, పంచదార వేసి బాగా కలపాలి ఏలకుల పొడి, డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి రెండు నిమిషాలు ఉంచి దించేయాలి వేడివేడిగా తింటే రుచిగా ఉంటుంది ఫ్రిజ్‌లోఉంచి చల్లగా తింటే హాయిగా ఉంటుంది. పచ్చి బఠాణీ పరోఠా కావలసినవి: గోధుమ పిండి - 3 కప్పులు; పచ్చి బఠాణీలు - కప్పు; పచ్చి మిర్చి ముద్ద - తగినంత; నువ్వులు - అర టీ స్పూను; నూనె - తగినంత; కొత్తిమీర కరివేపాకు - తగినంత; నెయ్యి - టీ స్పూను; జీలకర్ర - అర టీ స్పూను; ఉప్పు - తగినంత తయారీ: పచ్చి బఠాణీలను గంట సేపు నానబెట్టి, కుకర్‌లో ఉంచి ఒక విజిల్ వచ్చాక దించేయాలి చల్లారాక మెత్తగా గ్రైండ్ చేయాలి గోధుమపిండిలో పచ్చి బఠాణీ ముద్ద వేసి, నూనె తప్ప మిగతా పదార్థాలన్నీ వేసి బాగా కలిపి, నీళ్లు వేస్తూ చపాతీ పిండిలా కలిపి, అరగంటసేపు నాననివ్వాలి ఉండలు చేసుకుని, చపాతీ మాదిరిగా ఒత్తి, పెనం మీద వేసి రెండు వైపులా నూనె వేస్తూ, కాల్చాలి పెరుగుతో తింటే రుచిగా ఉండటమే కాకుండా, ఆరోగ్యానికి కూడా మంచిది. పచ్చి బఠాణీ తాలికలు కావలసినవి: బియ్యప్పిండి - 3 కప్పులు; పచ్చి బఠాణీలు - కప్పు; పచ్చిమిర్చి ముద్ద - తగినంత; ఉప్పు - తగినంత; మెంతి కూర - 2 కప్పులు; పల్లీల పొడి - టేబుల్ స్పూను; నూనె - తగినంత; కొత్తిమీర కరివేపాకు - కొద్దికొద్దిగా; ఆవాలు, జీలకర్ర - టీ స్పూను చొప్పున; మినప్పప్పు - టీ స్పూను; ఉల్లి తరుగు - కప్పు తయారీ: బఠాణీలు ఉడికించి గ్రైండ్ చేయాలి మూడు కప్పుల నీళ్లలో కొద్దిగా ఉప్పు జత చేసి, స్టవ్‌మీద ఉంచి మరిగాక, మెత్తగా గ్రైండ్ చేసిన పేస్ట్‌ను వేసి కలిపి, బియ్యప్పిండి కూడా పోసి కలిపి దించాలి పిండిని ముద్దగా చేసి మురుకుల గొట్టంలో పెట్టి, చిల్లుల పళ్లెంలో వేసి ఆవిరిపై ఉడికించుకోవాలి మొత్తం పిండిని ఈ విధంగా చేసి పక్కన ఉంచాలి బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కొత్తిమీర, కరివేపాకు వేసి వేగాక ఉల్లి తరుగు, మెంతి కూర కూడా వేసి ఉడికిన తర్వాత తగినంత పచ్చి మిర్చి పేస్ట్, ఉప్పు వేసి రెండు నిమిషాలు ఉడికాక, ఉడికించిన బియ్యప్పిండి మురుకులు వేసి బాగా కలపాలి వేడయ్యాక పల్లీల పొడి వేసి కలిపి దించేయాలి. -
నేనే... నంబర్ వన్!
నాకు పోటీయే లేదు.. నేనే నంబర్ వన్.. అన్నట్లు చూస్తున్న ఈ శునకం నిజంగానే నంబర్ వన్ . కాకపోతే.. ఇది గెలిచింది ప్రపంచంలోనే అతి అందవికారమైన శునకాల పోటీలో. కుక్కల్లో అతిచిన్నదైన చిహువాహువా జాతి, ఒళ్లంతా బొచ్చుతో బొమ్మలా ఉండే షిట్జూ జాతి శునకాల కలయిక వల్ల పీనట్ అనే ఈ శునకం పుట్టి ఉంటుందని, అందుకే ఇలా ఏ జాతిదో కూడా తెలియకుండా తయారైందని చెబుతున్నారు. చూస్తేనే డోకొచ్చేలా ఉంది కాబట్టే.. శుక్రవారం కాలిఫోర్నియాలోని పెటలుమాలో జరిగిన ‘ప్రపంచంలోనే అతి అందవికారమైన శునకాల పోటీ’లో ఇది ట్రోఫీ గెలుచుకుని ఇలా ఫొటోలకు ఫోజిచ్చింది. -
చేయి తడపాలట!
అనంతపురం అగ్రికల్చర్, న్యూస్‌లైన్ : వేరుశనగ కొనుగోలు కేంద్రాల్లో ఆయిల్‌ఫెడ్ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ‘అయినవారికి ఆకుల్లో.. కానివారికి కంచాల్లో’ అన్న చందంగా వారి తీరు ఉంది. ఎవరికీ అన్యాయం జరగకుండా సీనియారిటీ ప్రకారం టోకెన్లు, రసీదులు ఇస్తున్నట్లు ఒకవైపు ఘనంగా చెబుతున్నా.. లోలోపల మాత్రం తమ వారిని పిలిచి మరీ తూకాలు వేసి పంపుతున్నారు. దీంతో ఇప్పటికే వారం, పది రోజులు పడిగాపులు కాస్తున్న రైతులు ఇంకా ఎదురుచూడాల్సి వస్తోంది. ఈ తంతును కళ్లారా చూస్తున్న రైతులు కన్నెర్ర చేస్తున్నారు. ఇదేమిటని నిలదీసే ప్రయత్నం చేస్తున్నా అధికారులు మాత్రం ఏమీ ఎరగనట్లు రైతులనే దబాయిస్తున్నారు. మరీ ఎక్కువ రభస చేస్తే ఇంకా ఎన్ని రోజులు ఉండాల్సి వస్తుందోనన్నఆందోళనతో రైతులు మిన్నకుండిపోతున్నారు. ఎవరికీ అనుమానం కలగకుండా ఆయిల్‌ఫెడ్ అధికారులు తమకు అనుకూలమైన వారికి, వ్యాపారులకు రెడ్ కార్పెట్ వేస్తున్న వైనం బుధవారం ‘న్యూస్‌లైన్’ పరిశీలనలో వెల్లడైంది. అనంతపురం మార్కెట్ యార్డులోని కొనుగోలు కేంద్రంలో తమ వారికి తూకాలు వేయకుండా... పక్కనున్న పండ ్లమార్కెట్ ప్రాంగణంలోని మూడు షాపుల్లో రహస్యంగా కాటాలు పెట్టడం కనిపించింది. అక్కడున్న వందలాది వేరుశనగ బస్తాలను హమాలీలు తూకాలు వేస్తున్నా రైతులు మాత్రం కనిపించలేదు. రాత్రిళ్లు కూడా అక్కడ తూకాలు వేస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని గమనించిన రైతులు బుధవారం ఆయిల్‌ఫెడ్ మేనేజర్ ఏకాంబరరాజు, మరో అధికారి ప్రభాకర్రెడ్డిలను నిలదీశారు. ‘ఎవరికీ అన్యాయం చేయం... సీనియారిటీ ప్రకారం టోకెన్ల వారీగా తూకాలు వేస్తామన్నారు. అటువైపు షాపుల్లో వేరుశనగ బస్తాలు, కాటా మిషన్ ఉన్నాయి కదా’ అని అడిగితే నీళ్లు నమలడం వారి వంతైంది. రైతులకు సరైన జవాబు చెప్పకుండా పైగా వారినే దబాయించే ప్రయత్నం చేశారు. దీంతో కాసేపు రైతులు, అధికారుల మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. పండ్ల మార్కెట్‌కు వెళ్లిన రైతులు షాపులను మూసేసి... కాటా మిషన్ బయటపడేశారు. పది రోజులవుతున్నా తూకాలు వేయకుండా అధికారులు తాత్సారం చేస్తున్నారని శింగనమల మండలం పెరవలికి చెందిన ఆదినారాయణ, రాప్తాడు మండలం బుక్కచెర్లకు చెందిన సంగాలప్ప, లింగనపల్లికి చెందిన హనుమంతరెడ్డి, అనంతపురం రూరల్ మండలం పూలకుంటకు చెందిన అంజినరెడ్డి తదితర రైతులు వాపోయారు. గుత్తిలోనూ మార్కెట్ యార్డు అధికారిపై రైతుల ఆగ్రహం గుత్తి, న్యూస్‌లైన్: ఆరుగాలం కష్టించి పండించిన ఉత్పత్తులను అమ్ముకుందామని వస్తే, అధికారులు సైతం తమ జీవితాలతో ఆడుకుంటున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం గుత్తి మార్కెట్ యార్డులో వేరుశనగ కొనుగోలు కేంద్రంలో గోనె సంచులు లేవన్న కారణంగా అధికారులు వేరుశనగ కాయల తూకాలను నిలిపివేశారు. దీంతో ఆగ్రహించిన రైతులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాదాపు రెండు వారాలుగా తినీతినక పడిగాపులు కాస్తున్నా అధికారులకు కొంచెం కూడా దయ, కరుణ లేకుండాపోయిందన్నారు. అనంతరం మార్కెట్ యార్డు కార్యదర్శి గోవిందరెడ్డితో సుమారు అరగంట సేపు వాగ్వాదానికి దిగారు. రైతులకు బదులుగా వ్యాపారులు, దళారులకే ప్రాధాన్యమిస్తూ వారి సరుకును మాత్రమే తూకం వేస్తున్నారని మండిపడ్డారు. వెంటనే తూకాలు వేయిస్తామని ఆయన హామీ ఇవ్వడంతో ఆందోళన విర మించారు.