పనీర్‌ సలాడ్‌ | Paneer Salad | Sakshi
Sakshi News home page

పనీర్‌ సలాడ్‌

Published Sun, Mar 5 2017 11:29 PM | Last Updated on Tue, Sep 5 2017 5:17 AM

పనీర్‌ సలాడ్‌

పనీర్‌ సలాడ్‌

క్విక్‌ రెసిపీ

తయారి సమయం: 15 నిమిషాలు
కావలసినవి: ఆపిల్‌ ముక్కలు – కప్పు; కీరా – ఒకటి (చెక్కుతీసి చిన్న ముక్కలుగా కట్‌ చేయాలి); పచ్చి బఠాణీ – గుప్పెడు; క్యారట్‌ – రెండు పనీర్‌ ముక్కలు – అర కప్పు ; ఉప్పు – రుచికి సరిపడా; నూనె – టీ స్పూన్‌; మిరియాల పొడి – పావు టీ స్పూన్‌; తేనె – అర టేబుల్‌ స్పూన్‌
తయారి: ముందుగా బఠాణీని కొద్దిగా ఉడకబెట్టుకుని నీటిని వంపేసుకోవాలి. క్యారట్‌ని సన్నగా తురిమిపెట్టుకోవాలి. పాత్రలో ఒక టీ స్పూన్‌ నూనె వేడయ్యాక పనీర్‌ ముక్కలు వేసి గోధుమరంగు వచ్చేలా వేయించి పక్కన పెట్టుకోవాలి.  పై పదార్థాలన్నీ ఒక పాత్రలో ఒకదాని తరవాత ఒకటి వేసి, దీంట్లో తేనె జత చేసి కలియబెట్టి అందించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement