కుకీస్ అంటే ఇష్టంగా తినేవారు ఈ ఘటన వింటే మాత్రం తినేందుకు ఆలోచిస్తారు. ఎందుకంటే ఓ ప్రోఫెషనల్ డ్యాన్సర్ ఈ కుకీస్ తిని నిండు జీవితాన్ని కోల్పోయింది. ఈ ఘటన ఒకరకంగా అందరిలోనూ తీవ్ర భయాందోళనలను రేకెత్తించింది. కుకీస్ ఎంతవరకు తినొచ్చు మంచిదేని అన్నంత అనుమానాలకు దారితీసింది. అస్సలు కుకీస్ తినడం వల్ల ప్రాణం పోవడం ఏమిటీ? అసలేం ఏం జరిగింది..
వివరాల్లోకెళ్తే..ఓర్లా బాక్సెండేల్ అనే 25 ఏళ్ల ప్రోఫెషనల్ డ్యాన్సర్ కుకీస్ తిన్న తర్వాత జనవరి 11న అనాఫిలాక్టిక్ షాక్‌కి సంబంధించిన తీవ్ర అలెర్జీకి గురై మరణించింది. అయితే కుకీస్ వేరుశెనగతో చేసినవి. తమ బిడ్డ చనిపోవడానికి కారణం సదరు కకీస్ తయారు చేసే కంపెనీయే అంటూ కోర్టుని ఆశ్రయించారు ఆమె బంధువులు. ఇక బాధితరుఫు న్యాయవాది ఆ కుకీస్ ప్యాకెట్‌పై వేరుశెనగకు సంబంధించిన సమాచారం ఇవ్వడంలో విఫలమైందని, ఆహార పదార్థాల్లో కంపెనీ చూపిన నిర్లక్ష్యంధోరణి కారణంగానే తన క్లయింట్ మరణించిందని వాదించారు. తప్పుగా లేబుల్ చేసిన కుకీస్ వల్ల బాధితురాలు ప్రాణాలు పొగొట్టుకుందని అన్నారు.
ఈ ఘటనతో యూకే నగరంలోని స్టీవ్ లియోనార్డ్ స్టోర్‌ల నుంచి వెనిలా ఫ్టోరెంటైన్ కుకీలను కొనేందు జనాలు జంకుతున్నారు. నిజానికి ఓర్లా 2018లో డ్యాన్స్ చేసేందుకు న్యూయార్క్ నగరానికి వెళ్లారు. అప్పుడే ఆమె ఒక సూపర్ మార్కెట్ నుంచి ఈ కుకీస్‌లను కొని, తినడం జరిగింది. చివరికి డ్యాన్స్ కార్యక్రమంలో పాల్గొనకుండానే ఆస్పత్రి పాలై చనిపోవడం జరిగింది. అయితే ఈ ఘటనపై సూపర్ మార్కెట్ స్పందించి.. ఈ కుకీలను తయారు చేసి, తమ మార్కెట్‌కి సరఫరా చేసే లాంట్ ఐలాండ్ బేకీరీయే దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొంది.
పైగా ఈ దిగ్బ్రాంతికర ఘటనకు సదరు సూపర్ మార్కెట్ సీఈవో ఓ వీడియోలో సానుభూతి వ్యక్తం చేశారు కూడా. బాధితురాలు కూడా దర్యాప్తులో నిర్లక్ష్యపూరితంగా తయారు చేసిన కుకీస్ వల్లే చనిపోయినట్లు పేర్కొంది. అయితే బాధితురాలి తరుఫు న్యాయవాది తయారీ దారులు లేదా అమ్మకందారుల నిర్లక్యానికి ఓ ప్రాణం బలవ్వడమే గాక ఓ కుటుంబానికి తీరని విషాదం మిగిల్చిందంటూ వాదన వినిపించారు.
అయితే కుకీస్ తయారీదారు కుకీస్ యునైటెడ్ కంపెనీ మాత్రం అందుకు తాము బాధ్యులం కాదని తెగేసి చెప్పింది. అమ్మకందారులు తప్పుగా లేబుల్ చేయండంతో తలెత్తిన తప్పిందంగా పేర్కొంది. తాము మార్కెట్‌కి ఉత్పత్తిని సరఫరా చేయడానికి ముందే ఎలాంటి ఇన్‌గ్రేడియంట్స్ వాడతామన్నది కూడా ముందుగానే సదరు సూపర్ మార్కెట్‌తో మాట్లడటం జరుగుతందని అందువల్ల ఇది ఎట్టిపరిస్థితుల్లోనూ తమ తప్పిదం కాదని వాదించింది.
అందువల్ల దయచేసి వినియోగుదారులందరూ కుకీస్ కొనే ముందు దేనితో తయారు చేశారు, తయారీ తేదీ వివరాలు చూసుకుని కొనుగోలు చేయండి. ఇక్కడ ఎవరీ వ్యాపారం వారిదే మనుషల జీవితాలకు గానీ, వారి ఆరోగ్యానికి గానీ ప్రాముఖ్యం ఇవ్వవు, తప్పిదానికి బాధ్యత కూడా వహించవు అన్నది గుర్తు ఎరగాలి. ఎంత సేల్స్ చేశాం ఎంత ఆదాయం వచ్చింది అన్నదానికే ప్రాధాన్యత ఇస్తున్నంత సేపు ఇలాంటి ఘటనలు పునరావృతమవుతూనే ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త!. మన సంరక్షణ మనమే చూసుకోవాలి తప్పదు.
(చదవండి: ఆ కవలలు పుట్టగానే వేరయ్యారు! మళ్లీ 19 ఏళ్ల తర్వాత..)
Comments
Please login to add a commentAdd a comment