లండన్: యూకేలోని ఐర్లాండ్‌లో ఒక సరస్సులో ఈత కొట్టేందుకు వెళ్లిన ఇద్దరు కేరళ యువకులు మృతి చెందారు. సోమవారం యూకే సెలవురోజు కావడంతో ఒక స్నేహితుల బృందం డెర్రీ లేదా లండన్ డెర్రీలోని ఎనాగ్‌లాఫ్‌లో ఉన్న సరస్సు వద్దకు ఈత కొట్టేందుకు వెళ్లారు. ఐతే అనుకోకుండా కేరళకు చెందిన సెబాస్టియన్, రూవెన్ సైమన్ అనే ఇద్దరు యువకులు ఆ సరస్సులో గల్లంతై చనిపోయారు.
ఉత్తర ఐరీష్ నగరంలోన ఉన్న కేరళ అసోసియేషన్ ఆ ఇద్దరు యువకులకు నివాళులర్పించింది. ఈ విషాద ఘటన పట్ల స్థానిక కౌన్సిలర్ రాచెల్ ఫెర్గూసన్ కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అంతేకాదు ఉత్తర ఐర్లాండ్ పోలీస్ సర్వీస్ ఆ ఇద్దరు యువకుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. ఐతే ఈ ఘటనలో ఒక వ్యక్తి సురక్షితంగా రక్షించామని, అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.
ఈ సంఘటనా స్థలంలో మరో ముగ్గురు వ్యక్తులు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు డెర్రీ/లండన్ డెర్రీ మేయర్, స్ట్రాబేన్ డిస్ట్రిక్ట్ కౌన్సిలర్, సాండ్రా డఫీ కూడా ఈ సంఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలోని సరస్సులు, నదులలో ఈత కొడుతున్నప్పుడు ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.
(చదవండి: అఫ్గాన్ పైలెట్లకు శిక్షణ ఇస్తున్న యూఎస్...ఐ డోంట్ కేర్ అంటున్న రష్యా)
Comments
Please login to add a commentAdd a comment