lake
-
సరస్సులో పడిపోయిన పారాగ్లైడర్.. వీడియో వైరల్
డెహ్రాడూన్:పారాగ్లైడింగ్ శిక్షణ తీసుకుంటున్న ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు సరస్సులో పడిపోయిన ఘటన ఉత్తరాఖండ్‌లో జరిగింది. పర్యాటక శాఖ నిర్వహిస్తున్న పారాగ్లైడింగ్ శిక్షణ కార్యక్రమంలో రిషి అనే వ్యక్తి అదుపుతప్పి తెహ్రీ సరస్సులో పడిపోయాడు.వెంటనే స్పందించిన ఎస్డీఆర్ఎఫ్ బృందం సభ్యులు రిషిని రక్షించారు. పారాగ్లైడింగ్ చేస్తూ రిషి సరస్సులో పడిపోవడం, అతడిని ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది బోటులో వచ్చి కాపాడడం చకచకా జరిగిపోయాయి. ఈ దృశ్యాలను కొందరు కెమెరాలో బంధించి సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. కొద్దిసేపటికే ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇదీ చదవండి: విమానంలో మహిళకు వేధింపులు.. వ్యక్తి అరెస్ట్ -
ఈ సరస్సులో దయ్యం ఉందట!
ఈ సరస్సు చూడచక్కగా ఉంటుంది. ఇందులోని నీళ్లు స్వచ్ఛంగా తళతళలాడుతూ ఉంటాయి. అయినా, జనాలు ఈ సరస్సు పేరు వింటేనే భయపడతారు. గుండెధైర్యం ఉన్న కొద్దిమంది ఇక్కడకు పిక్నిక్లకు వస్తుంటారు. అలాంటి వారు కూడా ఈ సరస్సు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ సరస్సులో దయ్యం ఉందన్న ప్రచారమే జనాల భయానికి కారణం. అమెరికాలోని లాంగ్ ఐలండ్‌లో ఉన్న ఈ సరస్సు పేరు ‘రోంకోంకోమా లేక్’. ఇక్కడి స్థానికులు ఈ సరస్సు నీళ్లల్లో అరికాళ్ల మునివేళ్లను ముంచడానికి కూడా భయపడతారు. రోంకోంకోమా సరస్సులో దయ్యం ఉందనే గాథకు మూలాలు పదిహేడో శతాబ్ది చివరికాలం నుంచి ఉన్నాయి. ఇక్కడి స్థానిక మూలవాసులైన ‘సెటాకెట్’ తెగకు చెందిన యువరాణి టుస్కావాంటా ఈ ప్రాంతంలో కట్టెలు కొట్టుకునేందుకు వచ్చే తెల్లజాతి యువకుడితో ప్రేమలో పడింది. టుస్కావాంటా తండ్రి వారి ప్రేమను నిరాకరించడంతో ఆమె సరస్సులో దూకి ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి ఆమె ఆత్మ ఈ సరస్సులోనే ఉందని, సరస్సులోకి వచ్చే పురుషులను బలిగొంటూ ఉందని లాంగ్ ఐలండ్ జనాలు చెప్పుకుంటుంటారు. గడచిన శతాబ్దకాలంలో ఈ సరస్సులో పడి 160 మందికి పైగా యువకులు అంతుచిక్కని పరిస్థితుల్లో మరణించారు. ఈ సరస్సులోని దయ్యం ఏడాదికి కనీసం ఒక యువకుడినైనా బలిగొంటుందని ఇక్కడి జనాల నమ్మకం. ఈ సరస్సు తీరంలో డేవిడ్ ఇగ్నేరీ (74) దాదాపు ముప్పయి ఏళ్ల పాటు లైఫ్‌గార్డ్‌గా పనిచేశాడు. తాను పనిచేసిన కాలంలోనే ఈ సరస్సులో పడి ముప్పయి మంది మరణించారని, వారందరూ యువకులేనని అతడు చెబుతున్నాడు. స్థానికుల నమ్మకాలు, భయాలకు తోడు ఈ సరస్సులో పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించడంతో ఇక్కడి జనాలు సరస్సులో పడి ఆత్మాహుతి చేసుకున్న యువరాణి కట్టెబొమ్మను భారీసైజులో ఇక్కడ నెలకొల్పారు. అమెరికా పర్యాటక శాఖ ఇక్కడ ఈ గాథను వివరిస్తూ, పెద్ద పెద్ద హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయడం విశేషం. -
టీవీ పాత్రికేయురాలి అనుమానాస్పద మృతి
ఢాకా: బంగ్లాదేశ్‌లో ఒక టీవీ జర్నలిస్టు రాజధాని ఢాకాలో ఓ సరస్సులో శవమై తేలారు. ఆమె ఆత్మహత్య చేసుకున్నారా, చంపి ఎవరైనా నీళ్లలో పడేశారా అనేది తెలియరాలేదు. మృతురాలిని గాజీ మీడియా గ్రూప్‌లోని బెంగాలీ బాషలో ప్రసారమయ్యే గాజీ టీవీ న్యూస్‌రూమ్ ఎడిటర్ సారా రహనుమాగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని ఢాకాలోని హతిర్జహీల్ సరస్సు నుంచి మంగళవారం అర్ధరాత్రి దాటాక 2గంటలపుడు పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. చనిపోవడానికి ముందు సారా ఫహీమ్ ఫైజల్ అనే వ్యక్తిని ట్యాగ్ చేస్తూ ఫేస్బుక్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టింది. ‘‘ నీలాంటి స్నేహితుడిని పొందడం సంతోషంగా ఉంది. నీ కలలను నెరవేర్చలేకపోతున్నందుకు క్షమించు. నీ జీవిత గమనంలో దేవుడు నీకు తోడుగా నిలుస్తాడు’ అని రాసుకొచి్చంది. ‘‘చస్తూ బతకడం కంటే చావడమే ఉత్తమం’ అంటూ అంతకుముందు మరో పోస్ట్ పెట్టింది. -
‘సార్.. మా చెరువూ తప్పిపోయింది!’
సాక్షి, హైదరాబాద్: కబ్జాకు ఏ చెరువూ కాదు అనర్హం అన్నట్టుగా గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు నగరం చుట్టుపక్కల ఉన్న అనేక చెరువులు ఆక్రమణకు గురయ్యాయి. హైదరాబాద్ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. గ్రేటర్ పరిధిలో ప్రస్తుతం ఓ మోస్తరు వాన కురిసినా కాలనీలను వరద ముంచెత్తుతోంది. రోడ్లే చెరువుల్ని తలపిస్తున్నాయి. ఇక భారీ వర్షం అంటే నగరజీవి బెంబేలెత్తిపోయే పరిస్థితి నెలకొంటోంది. చెరువులు, కుంటల్లాంటి జలవనరులు, నాలాలు ఆక్రమణలకు గురి కావడం వల్లే ఈ దుస్థితి ఏర్పడుతోందని పర్యావరణ పరిరక్షణ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు సామాన్య ప్రజలు సైతం దీనిపై స్పందిస్తున్నారు. ఇటీవలి కాలంలో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) చెరువుల్లో ఆక్రమణలపై కొరడా ఝళిపిస్తుండటంతో ఎవరికి వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ ప్రాంతంలో చెరువుల ఆక్రమణపై హైడ్రాతో పాటు ఇతర ప్రభుత్వ విభాగాలకు ఫిర్యాదు చేస్తున్నారు. మా చెరువేదీ అంటూ ప్రశ్నిస్తున్నారు. ఆక్రమణలు తొలగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఆధారాలతో సహా.. ‘తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని సర్దార్‌నగర్‌లో రికార్డుల ప్రకారం 8 ఎకరాల విస్తీర్ణంలో తుమ్మల చెరువు ఉండాలి. కానీ ప్రస్తుతం దాని అలుగు మాత్రమే కనిపిస్తోంది కానీ చెరువు కనిపించట్లేదు..’అని బీజేపీ నేత అందెల శ్రీరాములు యాదవ్ సోమవారం పహాడీషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) పరిధిలో ఉన్న జలవనరుల పరిరక్షణ కోసం.. ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్), బఫర్ జోన్లలో ఉన్న నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు 18 ప్రాంతాల్లో ఉన్న 158 అక్రమ నిర్మాణాలను తొలగించిన ఈ ఏజెన్సీ 43.94 ఎకరాల చెరువులు, ప్రభుత్వ భూములను కాపాడింది. ఈ నేపథ్యంలో ప్రధానంగా చెరువులు, కుంటలు, నాలాల ఆక్రమణలకు సంబంధించి ఈ విభాగానికి ఇబ్బడిముబ్బడిగా ఫిర్యాదులు వస్తున్నాయి. సాధారణంగా వివిధ విభాగాలకు చేసే ఫిర్యాదులకు బాధితులు, ప్రజలు.. పలు పత్రాలు, ఫొటోలు, ఆడియో, వీడియో సీడీల్లాంటివి జత చేస్తుంటారు. కానీ హైడ్రాకు వస్తున్న ఫిర్యాదులు మాత్రం కొత్త ఒరవడిని సృష్టిస్తున్నాయి. గూగుల్ మ్యాప్స్, గూగుల్ ఎర్త్ తరహా శాటిలైట్ ఫొటోలను జత చేసి మరీ ఫిర్యాదు చేస్తుండటం గమనార్హం. కాగా ఈ ఫిర్యాదులకు సంబంధించిన వివరాలను హైడ్రా, ఇతర విభాగాలు గోప్యంగా ఉంచుతున్నాయి. అయితే హైడ్రాకు ఫిర్యాదు చేస్తున్న వారిలో బాధితులతో పాటు సామాజిక కార్యకర్తలు, రాజకీయ నాయకులు, స్వచ్ఛంద సంస్థలకు చెందిన వారు ఉంటున్నట్లు సమాచారం. మాదాపూర్ ఖానామెట్‌లోని తమ్మిడికుంట చెరువు ఎఫ్టీఎల్లో ఉన్నట్టుగా చెబుతున్న సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్–కన్వెన్షన్‌పై.. ‘జనం కోసం’అనే సంస్థతో పాటు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ కూల్చివేత తర్వాతే హైడ్రాకు లెక్కకుమిక్కిలిగా ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రతి ఫిర్యాదునూ వివిధ కోణాల్లో పరిశీలించి, రికార్డులు తనిఖీ చేసిన తర్వాతే హైడ్రా చర్యలకు ఉపక్రమిస్తోంది. అన్ని అనుమతులతో దర్జాగా..! ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటల్లో.. అలాగే నాలాలపై నిర్మించిన కట్టడాల్లో రెండు రకాలైనవి ఉంటున్నాయి. కొన్నింటిని అసలు అనుమతులే తీసుకోకుండా నిర్మించేయగా.. మరికొన్నింటికి అవసరమైన అన్ని అనుమతులూ ఉండటం గమనార్హం. ఇరిగేషన్, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ తదితర శాఖల నుంచి అనుమతులు తీసుకుని మరీ నిర్మాణాలు చేపడుతున్నారు. వీటికి విద్యుత్ శాఖ అధికారులు కరెంట్ కనెక్షన్ ఇస్తుండగా.. ఇతర విభాగాలు రోడ్లు, డ్రైనేజీలు వంటి సదుపాయాలన్నీ కల్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అనేక చోట్ల లేఔట్లు, వెంచర్లు, అపార్ట్మెంట్లు కూడా యథేచ్ఛగా వెలిశాయి. ఈ క్రమంలో రూ.లక్షల నుంచి రూ.కోట్ల వరకు చేతులు మారాయన్నది బహిరంగ రహస్యమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముందే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు జారీ! ఏదైనా భవనం నిర్మాణం పూర్తి చేసుకున్న తర్వాత జీహెచ్ఎంసీ అధికారులు ఆద్యంతం పరిశీలించాల్సి ఉంటుంది. నిర్మాణంలో నిబంధనలు పూర్తి స్థాయిలో పాటించారని నిర్ధారించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మాత్రమే ‘నివాసానికి యోగ్యం’అంటూ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసీ) జారీ చేయాల్సి ఉంటుంది. అయితే రాజధానిలోని చెరువులు, కుంటలు, బఫర్ జోన్లలో నిర్మితమవుతున్న కొన్ని భవనాలకు పనులు పూర్తి కాకుండానే ఓసీలు జారీ అయిపోతున్నాయనే ఆరోపణలున్నాయి. దీనికి ఆ విభాగం అధికారుల అవినీతే కారణమనే ఆరోపణలు కూడా ఉంటున్నాయి. ఇలాంటి వ్యవహారాలకు సంబంధించి ఇప్పటికే కొన్ని ఫిర్యాదులు అందుకున్న హైడ్రా అధికారులు వాటిపై లోతుగా విచారణ జరుపుతున్నారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో కొన్ని నిర్మాణాలకు ప్రభుత్వ విభాగాలు అనుమతులు ఇవ్వడాన్ని గుర్తించిన హైడ్రా అధికారులు వాటిని రద్దు చేయాల్సిందిగా కోరుతూ హెచ్ఎండీఏకు లేఖ రాశారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆయా ప్రాంతాల్లో కూల్చివేతలు చేపట్టనున్నారు. ఆ అధికారుల గుండెల్లో రైళ్లు ప్రస్తుతానికి ఆయా నిర్మాణాల కూల్చివేతల పైనే హైడ్రా దృష్టి పెడుతోంది. ప్రభుత్వ భూముల పరిరక్షణ, చెరువుల కబ్జాల నిరోధం, విపత్తు స్పందన.. తదితర లక్ష్యాలతో ఏర్పాటు అయిన హైడ్రా జలవనరుల పరిరక్షణకే పెద్దపీట వేసి ముందుకు వెళ్తోంది. అయితే ఈ విభాగానికి ప్రత్యేక పోలీసుస్టేషన్ మంజూరైన తరువాత మరో అడుగు ముందుకు వేయనుంది. ఈ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన ప్రతి విభాగం, ఆయా అధికారుల పైనా విచారణ జరిపి, సంబంధిత శాఖలకు నివేదికలు ఇవ్వడంతో పాటు చర్యలకు సిఫారసు చేయనుంది. దీంతో ప్రస్తుతం ఆయా విభాగాలకు చెందిన అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. 10 వేలకు మిగిలింది 3,900 ఎకరాలే...నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ‘గ్రేటర్’తో పాటు చుట్టుపక్కల ఉన్న 56 చెరువుల పరిస్థితిపై అధ్యయనం చేసింది. 1979–2023 మధ్య 44 ఏళ్లలో అవి ఏ స్థాయిలో కబ్జాలకు గురయ్యాయో తేల్చింది. అప్పట్లో 10416.8 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ జలవనరులు గత ఏడాది నాటికి 3,974.1 ఎకరాలకు పడిపోయాయి. ఇలా మొత్తమ్మీద 61 శాతం మాయమై కేవలం 39 శాతం మిగిలినట్లు ఎన్ఆర్ఎస్సీ లెక్కకట్టింది. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో హైదరాబాద్ మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిస్థితుల్ని మార్చాలని కోరుతూ హైడ్రాకు నివేదిక సమర్పించింది. చెక్కు చెదరని హకీంపేట.. విస్తరించిన చెన్నపురంరాజీవ్ రహదారికి ఆనుకుని ఉన్న డిఫెన్స్ ఏరియా హకీంపేటలోని 18 ఎకరాల చెరువు మాత్రం ఇప్పటికీ అలాగే ఉందని ఎన్ఆర్ఎస్సీ సర్వే వెల్లడించింది. అలాగే ఈ సర్వేలో వెలుగులోకి వచ్చిన మరో ఆసక్తికర అంశం చెన్నపురం చెరువుకు సంబంధించింది. సికింద్రాబాద్ చంద్రపురికాలనీలో ఉన్న ఈ చెరువు విస్తీర్ణం 44 ఏళ్లల్లో పెరిగింది. 1979లో ఇది 16 ఎకరాల్లో విస్తరించి ఉండగా..2023 నాటికి 15 శాతం పెరిగి 18.2 ఎకరాలకు చేరింది. దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించిన హైడ్రా..చెరువు విస్తీర్ణం అలా పెరగడానికి కారణాలను విశ్లేషించాలని నిర్ణయించింది.ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్లూ వర్తించవు.. మూడు దశల్లో కార్యాచరణ అమలుహైడ్రా పరిధిలో ఉన్న ప్రతి చెరువు, కుంట పూర్వాపరాలు అధ్యయనం చేస్తున్నాం. కూల్చివేతలు అనేవి చట్ట ప్రకారం జరుగుతాయి. ఇలాంటి చర్యలు తీసుకునే ముందు ఆద్యంతం పరిశీలిస్తాం. నీటి వనరులు, ప్రభుత్వ స్థలాలు పూడ్చే ట్రాక్టర్లు, టిప్పర్లను కూడా భవిష్యత్తులో సీజ్ చేయనున్నాం. చెరువు, కుంటలకు సంబంధించిన ఎఫ్టీఎల్, బఫర్ జోన్లు, పార్కు స్థలాలకు ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్లు వర్తించవు. చెరువులు, కుంటలు, నాలాలు తదితరాల పరిరక్షణ కోసం హైడ్రా మూడు దశల్లో కార్యాచరణ అమలు చేస్తోంది. మొదటి దశలో ఇకపై ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఒక్క చదరపు అడుగు కూడా ఆక్రమణ కాకుండా చూస్తోంది. రెండో దశలో ఇప్పటికే ఆక్రమణలకు గురైన ప్రాంతాల్లో అనుమతి ఉన్నా, అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకుంటాం. మూడో దశలో ప్రస్తుతం బెంగళూరులో జరుగుతున్న మాదిరిగా చెరువుల పునరుద్ధరణ చేపడతాం. నగరంలో ఉన్నవి అన్నీ గొలుసుకట్టు చెరువులే. ఒకటి అలుగు పారితే ఆ నీరు నాలాలు, వాగుల ద్వారా మరో దాంట్లోకి వెళ్లాలి. ఆ పరిస్థితిని మళ్లీ తీసుకురావడానికి కృషి చేస్తాం. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఉన్న నిర్మాణాలు, లేఔట్లలో ప్రజలు ఫ్లాట్లు, స్థలాలు ఖరీదు చేయొద్దు. త్వరలో ఈ వివరాలను వెబ్సైట్లో పెడతాం. ఇప్పటికే ఇలా ఖరీదు చేసి నష్టపోయిన వాళ్లు ఉంటే బిల్డర్‌పై కేసు పెట్టండి.– ఏవీ రంగనాథ్, హైడ్రా కమిషనర్ -
మా చెరువు ఎక్కడ? దండం పెట్టి వేడుకున్న రైతు..
-
అనుమానాస్పద స్థితిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి
యాదాద్రి: అనుమానాస్పద స్థితిలో గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన గరిడేపల్లి మండల ఎల్బీనగర్ శివారు జానపహాడ్ మేజర్ కాలువలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సుమారు 40 ఏళ్ల వయస్సుగల వ్యక్తి మృతదేహం 2022 సంవత్సరం అక్టోబర్ 10వ తేదీన మేజర్ కాలువలో కొట్టుకు వచ్చినట్లు సీఐ చరమందరాజు ఆదివారం తెలిపారు. మృతుడి దేహంపై తెలుపు రంగు లుంగీ, నీలి, తెలుపు రంగు గడులుగల ఫుల్‌షర్ట్ ఉన్నదని, భుజంపై ఆంజనేయస్వామి పచ్చబొట్టు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ వ్యక్తిని ఎవరో వ్యక్తులు చంపి, చేతులు కట్టి, ప్లాస్టిక్ బ్యాగ్‌లో పెట్టి కాలువలో పడవేసినారని పంచాయతీ సెక్రెటరీ ఫిర్యాదు మేరకు గరిడేపల్లి పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు స్థానిక సీఐ కార్యాలయంలో సంప్రదించాలని ఆయన కోరారు. ఇవి చదవండి: ఉత్తర రింగుకు ఈపీసీ.. దక్షిణ రింగుకు బీఓటీ -
ఆధార్‌కార్డు మార్చే విషయంపై.. వివాహిత తీవ్ర నిర్ణయం!
నిజామాబాద్: భర్త వేధింపులతోనే వివాహిత నిజాంసాగర్ ప్రధాన కాలువలో పడి మృతిచెందినట్లు ఎస్సై సుధాకర్ గురువారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డి మండలం గండిమాసానిపేటకు చెందిన శిరీష(25), సతీశ్ దంపతులు. వీరికి ఏడాది బాబు యోగేశ్ ఉన్నాడు. తరచూ భర్త వేధింపులతో పాటు ఆధార్‌కార్డులో అడ్రస్ మార్పు విషయమై వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో మానసిక వేదనకు గురైన శిరీష బుధవారం తల్లిగారింటికి వెళ్తున్నాని చెప్పి కుమారుడు యోగేశ్‌తో కలిసి బస్సులో వెళ్లింది. మార్గమధ్యలో బస్సు దిగిన శిరీష నిజాంసాగర్ ప్రధాన కాలువ సమీపంలో ఉన్న చెట్టు కింద కుమారుడు యోగేశ్‌ను కూర్చోబెట్టి తాను కాలువలో పడి ఆత్మహత్య చేసుకుంది. నీటి ప్రవాహం ఎక్కువ ఉండడంతో మృతదేహం ఆచూకీ లభించలేదు. ప్రాజెక్టు నుంచి నీటి విడుదల నిలిపివేయడంతో గురువారం ఉదయం మృతదేహం లభ్యమైంది. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
హెలికాప్టర్ క్రాష్.. చిలీ మాజీ అధ్యక్షుడి మృతి
సాంటియాగో: చిలీ మాజీ అధ్యక్షుడు సెబాస్టియన్ పినేరా (74) హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారు. పినేరా ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దక్షిణ చిలీలోని ఓ సరస్సులో కూలిపోయింది. ప్రమాదం జరిగినపుడు హెలికాప్టర్లో పినేరాతో పాటు మరో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ప్రమాదంలో పినేరా ఒక్కరే మృతిచెందగా మిగతావారు గాయాలతో బయటపడ్డారు. ప్రమాద సమయంలో హెలికాప్టర్‌ను పినేరానే స్వయంగా నడిపినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిని అధికారికంగా ధృవీకరించలేదు. పినేరా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చిలీ ఆర్మీ ప్రకటించింది. చిలీ కన్జర్వేటివ్ పార్టీకి చెందిన పినేరా తొలిసారి 2010 నుంచి 2014 వరకు, రెండోసారి 2018 నుంచి 2023 వరకు దేశాధ్యక్షుడిగా పదవిలో ఉన్నారు. బిలియనీర్ అయిన పినేరా చిలీలోని అత్యంత ధనికుల్లో ఒకరు. ఆయన మృతి పట్ల దక్షిణ అమెరికా దేశాధినేతలతో పాటు పలువురు ఇతర దేశాల అధినేతలు సంతాపం వ్యక్తం చేశారు. ఇదీ.. చదవండి..పాక్ ఎన్నికల బరిలో ఆమె అంతంతే -
రొయ్యలు మాత్రమే ఉండే సరస్సు!
ఇది ప్రపంచంలోనే అత్యంత ఉప్పని నీరున్న సరస్సు. ఇది ఏ సముద్రంలోనూ కలవదు. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రానికి చెందిన మోనో కౌంటీ ఎడారి ప్రాంతంలో ఉందిది. అత్యధిక లవణసాంద్రత కలిగిన ఈ సరస్సు నీటిలో సాధారణ జలచరాలేవీ మనుగడ సాగించలేవు. ఇందులో చేపలు, పీతలు వంటివి మచ్చుకైనా కనిపించవు. అయితే, ‘బ్రైన్ష్రింప్’ అనే ఒక రకం రొయ్యలు మాత్రం ఈ సరస్సులో పుష్కలంగా ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకునే లక్షలాది పక్షులు ఏటా సీజన్లో ఈ సరస్సు వద్దకు వలస వస్తుంటాయి. దాదాపు 7.60 లక్షల ఏళ్ల కిందట సహజంగా ఏర్పడిన ఈ సరస్సు ఒక ప్రకృతి విచిత్రం. కొన్నేళ్ల కిందట కాలిఫోర్నియా ప్రభుత్వం ఈ సరస్సులో ఉప్పు సాంద్రతను తగ్గించడానికి ఇందులోకి మంచినీటిని విడుదల చేసింది. ఫలితంగా ఇందులో ‘బ్రైన్ష్రింప్’ రొయ్యల సంఖ్య తగ్గి, వలసపక్షుల రాక కూడా తగ్గిపోయింది. దీంతో పర్యావరణ ప్రేమికులు కోర్టుకెక్కి దీని సహజ స్థితిని పునరుద్ధరించేలా ఆదేశాలను సాధించారు. (చదవండి: బ్లూ సీ డ్రాగన్! చూడటానికీ అందంగా ఉందని టచ్ చేశారో అంతే..!) -
యూకేలో అదృశ్యమైన భారతీయ విద్యార్థి శవమై కనిపించాడు!
లండన్: గత వారం యూకేలో అదృశ్యమైన భారతీయ విద్యార్థి తూర్పు లండన్‌లోని కానరీ వార్ఫ్ సరస్సులో శవమై కనిపించాడు. డిసెంబర్ 14న అదృశ్యమైన గురష్మాన్ సింగ్ భాటియా(23 ) మృతదేహాన్ని కానరీ వార్ఫ్ సరస్సులో డైవర్లు బుధవారం గుర్తించారు. లాఫ్‌బరో యూనివర్శిటీకి చెందిన విద్యార్థి గురష్మాన్ సింగ్ భాటియా డిసెంబర్ 14న రాత్రి స్నేహితులతో కలిసి బయటకు వెళ్లాడు. ఆ క్రమంలో కానరీ వార్ఫ్ ప్రాంతంలో అదృశ్యమయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చివరిసారిగా సౌత్ క్వే ప్రాంతంలోని సీసీటీవీలో డిసెంబర్ 15న కనిపించాడు. కానీ ఆ తర్వాత ఆయన జాడ తెలియలేదు. చివరగా బుధవారం కానరీ వార్ఫ్ ప్రాంతంలోని సరస్సులో డైవర్లకు గురష్మాన్ సింగ్ మృతదేహం కనిపించింది. గురష్మాన్ సింగ్ మరణవార్త సమాచారాన్ని పంజాబ్‌లోని ఆయన కుటుంబానికి అందించామని పోలీసులు తెలిపారు. ఈ కేసులో సమగ్రంగా దర్యాప్తు చేపడుతామని డిటెక్టివ్ చీఫ్ సూపరింటెండెంట్ జేమ్స్ కాన్వే చెప్పారు. గురష్మాన్ సింగ్ అదృశ్యంపై భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ ఇప్పటికే స్పందించారు. గత నెలలో కూడా యూకేలో భారతీయ విద్యార్థి థేమ్స్ నది ఒడ్డున శవమై కనిపించాడు. ఇదీ చదవండి: కరోనాతో మాటను కోల్పోయిన బాలిక.. డాక్టర్లు ఏం చెబుతున్నారు? -
చెరువులోకి దూకిన దొంగ..గంటలు గడుస్తున్నా దొరకని దొంగ..
-
దయ్యాల సరస్సులో తేలియాడే ఊరు!
ఆఫ్రికాలోని పెద్ద సరస్సులో ఒకటైన నొకోవే సరస్సు దయ్యాల సరస్సుగా పేరుమోసింది. అయినా కొందరు ఆ సరస్సు నడిబొడ్డున తేలియాడే ఊరును నిర్మించుకున్నారు. ఈ ఊరి వెనుక నాలుగు శతాబ్దాల చరిత్ర ఉంది. ఆఫ్రికా పశ్చిమ ప్రాంత దేశమైన బెనిన్‌లో ఉంది ఈ ఊరు. దీని పేరు గాన్వీ. నాలుగు శతాబ్దాల కిందట యూరోప్ నుంచి వివిధ దేశాల వలస వర్తకులు ఇక్కడకు పెద్దసంఖ్యలో వస్తుండేవారు. ప్రస్తుతం బెనిన్‌గా పిలుచుకుంటున్న దేశంలో అప్పట్లో ఫోన్, దహోమి రాజ్యాలు ఉండేవి. ఈ రెండు రాజ్యాల సైన్యాల్లోనూ చాలా క్రూరులైన సైనికులు ఉండేవారు. వారు ఇక్కడి టొఫిను తెగకు చెందిన వారిని బందీలుగా పట్టుకుని, ఇక్కడకు వర్తకం కోసం వచ్చే పోర్చుగీసు వారికి బానిసలుగా అమ్మేసి, వారు తమ దేశం నుంచి తీసుకువచ్చే వస్తువులను ప్రతిఫలంగా తీసుకునేవారు. అయితే, ఫోన్, దహోమీ రాజ్యాల్లో నొకోవే సరస్సు దయ్యాల సరస్సు అనే నమ్మకం ఉండేది. సైనికులకు చిక్కకుండా తప్పించుకోవడానికి ఈ సరస్సు ఒక్కటే తగిన ప్రదేశమని నిర్ణయించుకున్న టొఫిను తెగ ప్రజలు చెక్క తెప్పలపై గుడారాలను నిర్మించుకుని, సరస్సులోనే నివసించడం మొదలుపెట్టారు. క్రమంగా ఈ సరస్సలోనే వారు తేలియాడే ఇళ్లను నిర్మించుకున్నారు. జనాభా పెరగడంతో సరస్సులో ఏకంగా తేలియాడే ఊరు తయారైంది. కాలం తెచ్చిన మార్పుల్లో ఫోన్, దహోమి రాజ్యాలు అంతరించాయి. తర్వాతికాలంలో ఇక్కడ అధికారం చలాయించిన ఫ్రెంచ్ పాలన కూడా అంతరించింది. ఈ ప్రాంతం ‘బెనిన్’ పేరుతో స్వతంత్ర దేశంగా అవతరించింది. అయినా అప్పట్లో ఇక్కడ స్థిరపడిన టొఫిను తెగ ప్రజలు తిరిగి నేల మీదకు రాకుండా, ఈ సరస్సులోని ఊరినే తమ శాశ్వత నివాసంగా చేసుకుని, తరతరాలుగా కొనసాగు తున్నారు. (చదవండి: చాయ్ తాగాలంటే కొండ ఎక్కాల్సిందే! శిఖరాగ్ర పానీయం!) -
సరస్సును ఖాళీ చేయిస్తారట.. ఎందుకంటే
ప్రముఖ ఆర్ అండ్ బీ గాయకుడు అషర్ మాజీ భార్య తమెకా ఫాస్టర్ తాజాగా జార్జియాలోని అతి పెద్ద సరస్సును ఖాళీ చేయించాలని అధికారులను కోరుతున్నారు. దానిలో ఆమె కుమారుడు 11 సంవత్సరాల క్రితం జెట్ స్కీ ఢీకొనడంతో మృతిచెందాడు. ఫ్యాషన్ డిజైనర్ తమెకా ఫాస్టర్ అట్లాంటాకు ఈశాన్యంగా ఉన్న 44-మైళ్ల పొడవైన రిజర్వాయర్ లేక్ లానియర్ "డ్రెయిన్, క్లీన్,రీస్టోర్" కోసం ఆన్లైన్ పిటిషన్ వేసి, 3 వేలకు మించిన సంతకాలను సేకరించారు. ఈ భారీ సరస్సు పూర్తిగా ఎండిపోయినప్పుడే అధికారులు దానిలోని ప్రమాదకర పదార్థాలను సురక్షితంగా తొలగించగలరని ఆమె అంటోంది. వ్యక్తిగత వాటర్‌క్రాఫ్ట్, వినోద కార్యక్రమాలలో నిమగ్నమయ్యేవారి రక్షణ కోసం సరస్సు వద్ద మెరుగైన భద్రతా చర్యలను చేపట్టాలని ఫోస్టర్ సూచించారు. ఆమె 11 ఏళ్ల కుమారుడు కిల్ గ్లోవర్ జూలై 2012లో లేక్ లానియర్లోని లోపలి ట్యూబ్‌పై తేలుతుండగా, వారి కుటుంబ స్నేహితుడు జెఫ్రీ హబ్బర్డ్ నడుపుతున్న జెట్ స్కీ ఆ బాలునిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కైల్ - బౌన్స్ టీవీ వ్యవస్థాపకుడు ర్యాన్ గ్లోవర్ కుమారుడు, అషర్ సవతి కొడుకు బ్రెయిన్ డెడ్‌కు గురయ్యాడు. అయితే ఆ బాలుడు చనిపోయే ముందు రెండు వారాల పాటు లైఫ్ సపోర్ట్‌లో ఉన్నాడు. ఈ నేపధ్యంలో హబ్బర్ట్పై హత్య కేసు నమోదయ్యింది. అతను దోషిగా నిర్ధారణ కావడంతో నాలుగు సంవత్సరాల జైలు శిక్ష, 15 ఏళ్ల పరిశీలన శిక్ష విధించారు. తన కుమారుని విషయంలో ఎదురైన ఈ సంఘటన సరస్సులో సరైన జోనింగ్, భద్రత, రక్షణ చర్యల తక్షణ అవసరాన్ని నొక్కి చెబుతున్నదని ఫోస్టర్ తన పిటిషన్లో పేర్కొన్నారు. జార్జియా డిపార్ట్మెంట్ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్ తెలిపిన వివరాల ప్రకారం సరస్సుపై భారీ ట్రాఫిక్ కారణంగా గత మూడు దశాబ్దాల్లో వందలాది పడవలు పరస్పరం ఢీకొన్నాయి. 1994-2018 మధ్య కాలంలో ఈ ప్రాంతంలో 170కు మించిన మరణాలు చోటుచేసుకున్నాయి. 73 ఏళ్ల క్రితం నాటి ఈ మానవ నిర్మిత సరస్సు నీటి ప్రవాహాలపై ప్రభావం చూపుతున్నదని, ఇది ఇక్కడ వినోద కార్యక్రమాల్లో పాల్గొనేవారికి ప్రమాదకరంగా పరిణమించిందని ఫోస్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాహూచీ రివర్కీపర్ కన్జర్వేషన్ గ్రూప్ తెలిపిన వివరాల ప్రకారం ఈ సరస్సు 5 మిలియన్ల ప్రజలకు తాగునీటిని అందిస్తున్నది. ఆస్కార్విల్లేలోని నల్లజాతి కమ్యూనిటీకి ముంపును తెచ్చిపెడుతూ ప్రమాదకరంగా పరిణమించిన ఈ సరస్సును ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని, తద్వారా ఇటువంటి విషాదాలను నివారించవచ్చని ఫోస్టర్ పేర్కొంది. ఈ లేక్‌లోని నీటిని తోడి వేసిన తరువాత నీటి సంబంధిత కార్యకలాపాల కోసం కఠినమైన నిబంధనలను అమలు చేయాలని, జోనింగ్‌ను ప్రవేశపెట్టాలని ఫోస్టర్ ప్రతిపాదించింది. కాగా ఫోస్టర్, అషర్లు 2009లో విడాకులు తీసుకున్నారు. వీరికి అషర్ రేమండ్, నావిడ్ అనే ఇద్దరు కుమారులున్నారు. ఇది కూడా చదవండి: ప్రపంచంలోనే అత్యంత ఘరానా మోసం.. అమెరికా సర్కార్కే షాక్! -
ఈ సరస్సు ఎంత ప్రమాదకరమంటే.. ఒడ్డున నిలుచున్న..
ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన సరస్సు. రష్యా పశ్చిమప్రాంతంలోని ఫెడరేషన్ ఆఫ్ షెల్యాబిన్స్క్లో దక్షిణ యూరల్ పర్వత సానువుల సమీపంలో ఉంది. ఈ సరస్సు పేరు కరాచే. ఇది మరీ అంత పెద్దది కాదు. కేవలం 900 మీటర్ల పొడవున విస్తరించిన ఈ సరస్సు ఒకచోట సన్నగా, ఇంకోచోట వెడల్పుగా కాస్త అడ్డదిడ్డంగా ఉంటుంది. అత్యధిక వెడల్పు గల ప్రదేశంలో దీని వెడల్పు 500 మీటర్లు. సాధారణంగా మొసళ్లతో నిండిన సరస్సులోకి అడుగు పెడితేనే ప్రమాదం. కాని, ఈ సరస్సు ఒడ్డున నిలుచున్నా ప్రమాదమే! ఇది పూర్తిగా రేడియో ధార్మిక వ్యర్థాలతో నిండిపోయి ఉండటమే దీనికి కారణం. ఇదివరకు ఈ సరస్సు సమీపంలోనే ఒక అణుకేంద్రం ఉండేది. అక్కడి వ్యర్థాలన్నీ ఈ సరస్సులోకి చేరడంతో ఇది అత్యంత ప్రమాదకరంగా మారింది. ప్రపంచంలోనే అత్యధిక రేడియో ధార్మికత గల సరస్సుగా 1951లోనే ఈ సరస్సు గిన్నిస్ బుక్‌లోకి ఎక్కింది. అప్పట్లో ఇక్కడ ఉన్న అణుకేంద్రం నుంచి వెలువడిన ప్లూటోనియం–239, యురేనియం–235 ఐసోటోప్స్ ఈ సరస్సులోకి చేరాయి. ఇవి అణ్వాయుధాల్లో ఉపయోగించే రకానికి చెందినవి. ఈ సరస్సుకు దిగువన ఉండే 24 గ్రామాలకు ఇదొక్కటే మంచినీటి వనరుగా ఉండేది. ఈ గ్రామాల్లో రేడియో ధార్మికత పెరగడంతో జనాలు వాటిని ఖాళీ చేశారు. దీని పరిసరాల్లోనూ గాలిలోకి కూడా తీవ్రస్థాయిలో రేడియో« దార్మికత చేరుతోంది. అమెరికన్ శాస్త్రవేత్తలు 1992లో ఈ సరస్సు ఒడ్డున గాలిలో ఉన్న రేడియో ధార్మిక ప్రభావంపై పరిశోధన చేశారు. ఇక్కడ నిలుచుంటే, గంటకు 5.6 సీవర్ట్‌ల రేడియో ధార్మిక ప్రభావానికి లోనయ్యే అవకాశాలు ఉన్నాయని, ఇది ఆరోగ్యంపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపుతుందని, దీర్ఘకాలంలో ప్రాణాంతకంగా కూడా మారే అవకాశాలు ఉన్నాయని తేల్చారు. (చదవండి: ఈ సరస్సు ఒడ్డున నిలుచున్నా ప్రమాదమే!) -
అది నిగూఢ రహస్యాన్ని దాచుకున్న సరస్సు.. రాత్రి కాగానే..
ప్రపంచంలో అంతుచిక్కని వింతలెన్నో ఉన్నాయి. వీటి రహస్యాల ముడి విప్పాలని శాస్త్రవేత్తలు ఏళ్ల తరబడి ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. అయినా ఫలితం లేకపోతోంది. అలాంటి అత్యంత వింత సరస్సు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వింతలు, విశేషాలు అందరినీ ఇట్టే ఆకర్షిస్తుంటాయి. ఈ కోవలోకి వచ్చే ఒక వింత సరస్సు అటు పరిశోధకులను, శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆ సరస్సులోని నీటి రహస్యం గురించి తెలుసుకోవాలని ప్రపంచవ్యాప్తంగా పలువురు శాస్త్రవేత్తలు తమ పరిశోధనలను నిరంతరం కొనసాగిస్తూనే ఉన్నారు. రాత్రయ్యే సరికి ఆ సరస్సులోని నీరు నీలి రంగులోకి ఎందుకు మారిపోతున్నదో ఇంతవరకూ ఎవరికీ అంతుచిక్కలేదు. ఈ నేపధ్యంలో పలువురు శాస్త్రవేత్తలు తమ వాదనలు వినిపించినా, అవి ఇప్పటివరకూ పూర్తిస్థాయి సమాధానాన్ని ఇవ్వలేదు. అదరగొట్టే ఉష్ణోగ్రత.. ఈ సరస్సు ఇండోనేషియాలో ఉంది. దీనిని కవాహ్ ఇజేన్ లేక్ అని అంటారు. ఇది చూసేందుకు ఇతర సరస్సుల మాదిరిగానే కనిపిస్తుంది. ఈ సరస్సులోని నీరు ఎంతో ఉప్పగా ఉంటుందని చెబుతారు. ఈ నీరు 200 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత కలిగివుండటం విశేషం. ఉదయం వేళలో ఈ సరస్సులోని నీరు సాధారణంగానే కనిపిస్తుంది. మధ్యరాత్రి సమయానికి గాఢమైన నీలిరంగులోకి మారిపోతుంది. అలాగే మెరుస్తూ కనిపిస్తుంటుంది. ఇది ఎంతో ఆకర్షించే విషయమైనప్పటికీ, టూరిస్టులు ఇక్కడికి రాకపోవడం విశేషం. సరస్సులోని వేడి నీటి కారణంగా ఇక్కడికి వచ్చేవారెవరూ ఎక్కువసేపు ఇక్కడ ఉండలేరు. శాస్త్రవేత్తలు కూడా ఈ కారణంగానే తమ పరిశోధనలు ముందుకు సాగడం లేదని చెబుతుంటారు. ఇది కూడా చదవండి: ఒడిశా రైలు ప్రమాద బాధితుల వింత ప్రవర్తన రసాయన వాయువులే కారణమా? పలు దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు ఈ సరస్సుపై లెక్కలేనన్ని పరిశోధనలు సాగించారు. అయితే ఇప్పటి వరకూ ఈ నీటి వెనుకనున్న రహస్యాన్ని ఎవరూ కనుగొనలేకపోయారు. ఈ సరస్సుకు సమీపంలో పలు అగ్నిపర్వతాలు ఉన్నాయని, అవి అప్పుడప్పుడు పేలు తుంటాయని, ఈ కారణంగానే ఈ ప్రాంతంలో భూకంపాలు వస్తుంటాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. అగ్నిపర్వతాలు పేలడం వలన హైడ్రోజన్ ఫ్లోరైడ్, సల్ఫ్యూరిక్ డయాక్సైడ్ తదితర వాయువులు వెలువడతాయి. ఈ వాయువుల రియాక్షన్ కారణంగానే సరస్సులోని నీటి రంగు మారుతుందని పరిశోధకులు భావిస్తున్నారు. అయితే ఈ విధంగా నిరంతరం వాయువులు వెలువడినప్పుడు ఉదయం వేళలో నీటి రంగు మారకుండా, రాత్రివేళలో మాత్రమే నీటి రంగు ఎందుకు మారుతున్నదనే ప్రశ్న అలానే మిగిలిపోయింది. మరి దీనికి సమాధానం ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి. ఇది కూడా చదవండి: ‘తాజ్’ యమ క్రేజ్.. ఆదాయంలో టాప్ వన్! -
బంజారా హిల్స్ లోటస్ పాండ్ చెరువులో చేపల మృత్యువాత
-
సిద్దిపేటలో విషాదం.. ముగ్గురి ప్రాణాలు తీసిన సెల్ఫీ సరదా.
సాక్షి, సిద్దిపేట, హైదరాబాద్: సెల్ఫీ సరదాకు ముగ్గురి ప్రాణాలు బలయ్యాయి. మూడేళ్ల బాలుడు సహా ఇద్దరు యువకులు చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయారు. గురువారం సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నెంటూరు వద్ద ఈ విషాదకర ఘటన జరిగింది. బేగంపేట ఎస్ఐ అరుణ్‌కుమార్ కథనం ప్రకారం.. హైదరాబాద్‌లోని యాకుత్‌పురాకు చెందిన షేక్ కైసర్ (28), అతని అన్నకొడుకు షేక్ ముస్తఫా (3), సమీప బంధువు, జగద్గిరిగుట్టకు చెందిన మహమ్మద్ సోహెల్ (17) గురువారం రాత్రి సిద్దిపేట (దుద్దెడ)లో జరగనున్న ఫంక్షన్లో పాల్గొనేందుకు తమ కుటుంబ సభ్యులతో కలసి గజ్వేల్ మండలం మక్తమాసాన్‌పల్లిలోని బంధువుల ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా గురువారం మధ్యాహ్నం వారు వర్గల్ మండలం నెంటూరు సామల చెరువు సమీపంలోగల బంధువుల పొలం వద్దకు వెళ్లారు. ఈ సమయంలో షేక్ ఖైసర్, మమ్మద్ సోహెల్‌లు ముస్తఫాను తీసుకుని సెల్ఫీలు దిగేందుకు సమీపంలో ఉన్న సామల చెరువుకు వెళ్లారు. అక్కడ సెల్ఫీలు దిగుతుండగా ప్రమాదవశాత్తు ముస్తఫా చెరువులో ఉన్న గుంతలో జారిపడ్డాడు. ఇది గమనించి అతడిని రక్షించే ప్రయత్నంలో సోహెల్, అతడిని కాపాడేందుకు ఖైసర్‌లు వరుసగా గుంతలో దిగారు. ఈత రాకపో వటంతో బాలుడితో పాటు వారిద్దరూ నీళ్లలో మునిగి చనిపోయారు. సమీపంలో వున్న కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకుని మొదట బాలుడి బయటకు తీసి చికిత్స కోసం తరలించగా అప్పడికే అతను మృతిచెందాడు. పోలీసులు స్థానికుల సహాయంతో చెరువు నుంచి ఖైసర్, సోహెల్ మృతదేహాలను వెలికి తీశారు. మృతుడు ఖైసర్‌కు భార్య, మూడు నెలల కూతురు ఉన్నారు. అప్పటిదాకా ఆడుతూ కళ్ల ముందు సంతోషంగా గడిపిన ముస్తఫా నీట మునిగి విగత జీవిగా మారటంతో తండ్రి జుబేర్, తల్లి అయేశాలు కన్నీరు మున్నీరై బోరుమని విలపించారు. కాగా మహ్మద్ సోహెల్ ఇటీవలే టెన్త్ పరీక్షలు రాశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తిరుపతిలో చారిత్రాత్మక, పురాతన కట్టడాల పరిరక్షణకు ముందడుగు
సాక్షి,తిరుపతి: తిరుపతి నగరంలోని చారిత్రాత్మకమైన, పురాతన కట్టడాలను పరిరక్షించుకోవడం కోసం, భవిష్యత్ తరాలకు వారసత్వ సంపదగా అందించడం కోసం యువనేత భూమన అభినయ్ రెడ్డి ముందడుగు వేశారు. తిరుపతి 39వ డివిజన్, చెన్నారెడ్డి కాలనీలో ఓ పురాతనమైన కొలను ఉంది. సుమారు 400 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణ దేవరాయలు శ్రీవారి దర్శనార్థం తిరుమలకు కాలినడకన వచ్చే భక్తులు సేద తీరడం కోసం, స్నానాలు చేయడం కోసం ఈ కొలను నిర్మించారు. ఈ కొలనుకు కృష్ణంనాయుడి గుంటగా వాడుకలోకి వచ్చింది. అయితే కాలక్రమేణా ఈ కొలను అన్యాక్రాంతం అవుతూ వచ్చింది. 2018 టీడీపీ హయాంలో వైఎస్సార్ కుటుంబం కార్యక్రమంలో భూమన కరుణాకర్ రెడ్డి చెన్నారెడ్డి కాలనీలో ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇందులో భాగంగా కృష్ణంనాయుడి గుంట కబ్జా కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి చేస్తామని చెప్పిన విధంగా ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి, డిప్యూటీ మేయర్ అభినయ్‌రెడ్డి ఆ గుంటను అభివృద్ధి పరచడానికి కౌన్సిల్లో చర్చించారు. నిధులు మంజూరు చేసి మరమ్మతులు ప్రారంభించారు. తాజాగా మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణంతో పాటు పురాతన కట్టడాలను పరిరక్షించడం కోసం అడుగులు వేశామని భూమన అభినయ్ తెలిపారు. శ్రీకృష్ణంనాయుడి గుంట పరిరక్షణకు మొదటి విడతగా 57 లక్షలు మంజూరు చేసిన కౌన్సిల్, మలి విడతగా మరో 50 లక్షలను ఇవ్వడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారని పేర్కొన్నారు. కొలనులో పూడికతీతతో పాటు ప్రహరీగోడ, పచ్చదనం పెంపొందించేలా మొక్కలు నాటి, సుందరంగా తీర్చిదిద్దనున్నట్లు ఆయన చెప్పారు. -
గుడికి వెళ్లొచ్చే సరికి కొడుకు మాయం.. అదృశ్యమైన గంటల్లోనే..
సాక్షి, హైదరాబాద్: అదృశ్యమైన బాలుడు కొన్ని గంటల్లో శవమై తేలిన ఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ జగదీశ్వర్‌రావు వివరాల ప్రకారం..లాల్‌వాణినగర్‌కు చెందిన యాతం మహేష్‌యాదవ్ కుమారుడు యువన్ (9) చిన్నప్పటి నుంచి మాటలు రాదు. ఈ నెల 2న వైకుంఠ ఏకాదశి సందర్భంగా తల్లితండ్రులు గుడికి వెళ్లి వచ్చేసరికి యువన్ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అర్ధరాత్రి వరకు గాలించినా ఫలితం లేకపోయింది. సీసీ కెమెరాలు పరిశీలిస్తే.. ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు ఇంట్లో నుంచి బయటకు వచ్చినట్లు రికార్డయింది. లాల్వాణీనగర్ ప్రధాన రహదారి మరో వైపు ఉన్న సీసీ కెమరా రికార్డులు పరిశీలిస్తే యువన్ అటు వైపు వచ్చినట్లుగా కనిపించలేదు. అనుమానం వచ్చిన పోలీసులు బండచెరువులో ప్రమాదవశాత్తు పడిపోయాడా అన్న కోణంలో వెతకడం ప్రారంభించారు. గుర్రపు డెక్కతీసే యంత్రం పై నుంచి గాలిస్తుండగా చెరువు చివర కాలిన శవాన్ని గుర్తించారు. ఒంటి మీద ఉన్న బట్టలు ఆదారంగా యువన్‌దే మృతదేహంగా నిర్ధారించారు. అనుమానాలెన్నో.. బండచెరువులో చెత్త వేయకుండా కంచె ఏర్పాటు చేశారు. యువన్ మృతదేహం దొరికిన ప్రాంతంలో కంచె తొలగించి ఉంది. దీనిపై ఆరా తీయగా చెరువులో పందులు పెంచుకునే వారు వాటికి ఆహారం వేయడానికి కంచె తొలగించారని పారిశుద్ధ్య సిబ్బంది చెబుతున్నారు. ఘటనా జరిగిన స్థలానికి ప్రధాన రహదారి కొద్దిదూరంలోనే ఉంది. కాలిపోయిన స్థితిలో మృతదేహం లభ్యమైంది.గస్తీ సిబ్బంది అప్రమత్తంగా ఉండివుంటే ఈ సంఘటనను గుర్తించి ఉండేవారని స్ధానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తమ కొడుకు చనిపోయాడని తల్లిదండ్రులు ఆరోపించారు. ఘటనా స్థలాన్ని డీసీపీ రక్షితామూర్తి, ఏసీపీ నర్సింహారెడ్డి పరిశీలించారు. జాగిలం కూడా అక్కడక్కడే తిరిగింది. -
విషాదం: చిన్నా.. నీ సాహసం వృథా అయ్యిందిరా!
ఆ చిన్నారి సాహసం వృథా అయ్యింది. స్నేహితుల్ని రక్షించాలనే తాపత్రయం.. చివరకు అతన్ని కూడా బలిగొంది. సెంట్రల్ ఇంగ్లండ్ బర్మింగ్హమ్ సోలిహల్ సరస్సు విషాదంలో ముగ్గురు పిల్లలు కన్నుమూయగా.. స్థానికంగా విషాదం అలుముకుంది. తన స్నేహితుల్ని కాపాడబోయి ప్రాణాలు అర్పించిన జాక్ జాన్సన్‌ను(10) తల్చుకుని స్థానికులు కంటతడి పెడుతున్నారు. ఇంగ్లండ్‌లో మైనస్ ఉష్ణోగ్రతల కారణంగా.. విపరీతంగా మంచు కురుస్తోంది. వాతావరణ ప్రభావంతో.. సోలిహల్‌లోని బాబ్స్ మిల్ పార్క్ దగ్గర ఓ సరస్సు గడ్డ కట్టుకుపోయింది. ఆదివారం మధ్యాహ్నాం నలుగురు చిన్నారులు ఆ సరస్సులో ఆడుకోవడానికి వెళ్లారు. హఠాత్తుగా ఓ చోట మంచు ఫలకం విరిగింది. దీంతో పిల్లలు నీళ్లలోకి మునిగిపోయారు. తన స్నేహితులు మునిగిపోతున్న విషయం ఒడ్డు నుంచి గమనించిన జాక్.. పెద్దలను పిలవాలనే సంగతి మరిచాడు. మరో మాట లేకుండా ధైర్యం చేసి నీళ్లలోకి దూకాడు. ఆ సమయంలో సైకిల్‌పై వెళ్తున్న ఓ యువతి.. కేకలు వేయడం ప్రారంభించింది. కానీ, జాక్ ప్రయత్నం ఫలించలేదు. పైగా క్షణాల్లో మంచు గడ్డ కట్టుకుపోవడంతో.. ఆ సరస్సు కిందే అతనూ చిక్కుకున్నాడు. సమాచారం అందుకోగానే.. పరుగున అక్కడికి చేరుకున్న జాక్ జాన్సన్ తాత, అతన్ని మిగతా పిల్లలను రక్షించే యత్నం చేసినా లాభం లేకుండా పోయింది. మంచు పొర మందంగా ఉండడంతో దానిని బద్ధలు కొట్టడం ఆలస్యం అయ్యింది. హుటాహుటినా సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు. ఓ అధికారి తన చేతులతో ఆ మంచు ఫలకాన్ని బద్ధలు కొట్టే యత్నం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. జనం చేరిన ఇరవై నిమిషాలకు.. పిల్లల్ని అచేతనంగా బయటకు తీశారు. నలుగురు పిల్లలను ఆస్పత్రికి తరలించగా.. అందులో ముగ్గురు(జాక్‌తో సహా) అప్పటికే కార్డియాక్ అరెస్ట్‌తో చనిపోయారని వైద్యులు ధృవీకరించారు. ఆరేళ్ల మరో చిన్నారి చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. ఇంకెవరైనా పిల్లలు అందులో ఇరుక్కుపోయారా? అనే కోణంలో అధికారులు గాలింపు చేపట్టారు. చివరకు ఎవరూ లేరని విషయం నిర్ధారించుకుని చర్యలు ఆపేశారు. చిన్నారుల మరణంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకోగా.. అంతా నివాళులు అర్పిస్తున్నారు. ప్రధాని రిషి సునాక్ సైతం ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
చెరువు కనిపించడం లేదంటూ కేటీఆర్‌కు ట్వీట్.. తీరా చూస్తే
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లి నియోజకవర్గంలోని కేపీహెచ్‌బీలోని లోధా అపార్టుమెంట్ వద్ద ఆరు నెలల క్రితం వరకు కనిపించిన చెరువు ప్రస్తుతం కనిపించడం లేదంటూ ఫ్యూచర్ ఫౌండేషన్స్ సొసైటీ ప్రతినిధులు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్లో చేసిన ఫిర్యాదు కలకలం రేపింది. ఇందుకు స్పందించిన మంత్రి కేటీఆర్ చెరువు కనిపించకపోవడం నిజమే కాబట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. If this👇is true, I assure you that stringent action will be taken on those who are responsible @CollectorRRD and @zckukatpally please inspect and submit a report to the Govt at the earliest@KTRoffice please follow up https://t.co/2LPyfdBgun — KTR (@KTRTRS) December 4, 2022 వెంటనే సంబంధిత చెరువును సందర్శించి త్వరగా ప్రభుత్వానికి రిపోర్టు ఇవ్వాలని జిల్లా కలెక్టర్, కూకట్పల్లి జోనల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. కేటీఆర్ ఆదేశాలతో ఉరుకులు, పరుగులు పెట్టిన మున్సిపల్ అధికారులు అసలు లోధా అపార్టుమెంట్ ప్రాంతంలో చెరువు ఎక్కడుందబ్బా అంటూ లేని చెరువు కోసం వెతుకులాడారు. ట్విట్టర్లో చెరువు కనిపించడం లేదంటూ పోస్ట్ చేసిన ఫోటోలను పరీక్షించి చూస్తే ఆర్టీఓ కార్యాలయం సమీపంలో ఉన్న సెల్లార్ గుంతలా అనిపించడంతో మూసాపేట సర్కిల్ ఉపకమిషనర్ రవికుమార్ ఇతర అధికారులు అక్కడికి వెళ్లి చూసి అవాక్కయ్యారు. sir, above said land pertains to Telangana state housing board & the water body shown in the image is not a lake. It was dug for a construction project but due to cancellation of project it was levelled to prevent accidents & water stagnation . Present situation is as below. pic.twitter.com/5dyufrurn5— zc_kukatpally (@zckukatpally) December 4, 2022 గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర గృహ నిర్మాణ మండలి ఆధ్వర్యంలో బహుళ అంతస్థుల భవనం నిర్మించి విక్రయించేందుకు చేపట్టిన నిర్మాణ పనుల్లో భాగంగా తవ్వి పూడ్చిన సెల్లార్ గుంత కావడంతో ఒక్కసారిగా ఊపిరిపీల్చుకున్నారు. వెంటనే దాదాపు పదేళ్ల క్రితం తవ్విన సెల్లార్ గుంతలో వర్షం కారణంగా నీళ్లు నిండిపోయి చెరువులా మారింది. సెల్లార్ గుంతలో పలుమార్లు చిన్నారులు పడి మృతి చెందారు. గత సంవత్సరం ముగ్గురు బాలికలు ఆడుకుంటూ వెళ్లి సెల్లార్ గుంతలో పడి మృతి చెందారు. దీంతో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధికారులతో మాట్లాడి సెల్లార్ గుంతను పూడ్చి వేయించారు. అంతేకాకుండా బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి ప్రభుత్వ పరంగా రూ.5లక్షలు, ఎమ్మెల్యే సొంతంగా రూ.3లక్షలు ఇచ్చారు. ఇదిలా ఉంటే ఎవరో ఎక్కడో అపార్టుమెంట్లో ఉంటూ గతంలో ఇక్కడ చెరువు ఉండేదని అక్కడ పక్షులను చూసేందుకు వెళ్లే వారమని ఇప్పుడు అది కనిపించడంలేదని ట్విట్టర్లో తప్పుడు ఫిర్యాదు చేయడం అధికారులతో పాటు స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: హాస్టల్లో ఉంటున్న కూతుర్ని చూసేందుకు వెళ్లి...అంతలోనే -
ఘోర ప్రమాదం.. సరస్సులో కూలిపోయిన విమానం
దార్ ఎస్ సలాం: ఆఫ్రికాలోని టాంజానియా దేశంలో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. 49 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ విమానం విక్టోరియా సరస్సులో కూలిపోయింది. బుకోబా నగరంలో ల్యాండింగ్ కావాల్సిన కొద్ది సమయానికి ముందే వాతావరణం అనుకూలించకపోవటంతో సరస్సులో పడిపోయింది. ప్రయాణికులను రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు అధికారులు. ‘ప్రెసిషన్ ఎయిర్ ఫ్లైట్ ప్రమాదానికి గురైంది. ఎయిర్‌పోర్ట్‌కు 100 మీటర్ల దూరంలో ఉన్న నీటిలో పడిపోయింది. పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి. ప్రయాణికులను రక్షించేందుకు భద్రతా బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.’ అని రీజనల్ పోలీస్ కమాండర్ విలియమ్ వాంపఘేల్ తెలిపారు. మరోవైపు.. విమానంలో ప్రయాణికులు 49 మంది ఉన్నట్లు స్థానిక మీడియాలు నివేదించగా.. ఆ సంఖ్య మరింత ఎక్కువగా ఉడొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. టాంజానియా ఆర్థిక రాజధాని దార్ ఎస్ సలాం నుంచి బుకోబాకు ప్రయాణిస్తోంది. ప్రెసిషన్ ఎయిర్ సంస్థ టాంజానియాలో అతిపెద్ద ప్రైవేటు విమానయాన సంస్థ. విమాన ప్రమాదం జరిగినట్లు ధ్రువీకరిస్తూ ఓ ప్రకటన చేసింది. ప్రమాద ఘటనా స్థలానికి సహాయక బృందాలను పంపామని, పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపింది. ఉత్తర టాంజానియాలో సఫారీ సంస్థకు చెందిన విమాన ప్రమాదంలో 11 మంది చనిపోయిన 5 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ ప్రమాదం జరిగింది. Precision Air plane crashes into Lake Victoria while trying to land in Tanzania; no word on casualties pic.twitter.com/EpRrgPvAVB — BNO News (@BNONews) November 6, 2022 ఇదీ చదవండి: వారెవ్వా.. సరికొత్త గిన్నిస్ రికార్డ్.. ‘కీహోల్’లోంచి ఏడు బాణాలు! -
Travel: మచ్చల సరస్సు.. అతి విచిత్రమైన జలాశయం.. ఎక్కడ ఉందంటే!
ప్రపంచంలోని అతి విచిత్రమైన జలాశయాల్లో ఇదొకటి. నీటిపైన ఏదో డిజైన్ ఏర్పడినట్లు కనిపిస్తోంది కదూ! ఇందులోని ఖనిజాల వల్ల ఈ సరస్సు ఇలా మచ్చలు మచ్చలుగా కనిపిస్తుంది. కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లో ఓసోయూస్ పట్టణానికి చేరువలో ఉందిది. నీటిపై నిండా మచ్చలతో కనిపిస్తూ ఉండటం వల్ల దీనికి ‘స్పాటెడ్ లేక్’ (మచ్చల సరస్సు) అనే పేరు వచ్చింది. ఈ సరస్సులో మెగ్నీషియం సల్ఫేట్, సోడియం సల్ఫేట్, కాల్షియం సల్ఫేట్ ఖనిజాలు అధిక సాంద్రతతో నిండి ఉన్నట్లు శాస్త్రవేత్తల పరీక్షల్లో తేలింది. అలాగే ఈ సరస్సు నీటిలో వెండి, టిటానియం లోహాలు కూడా స్వల్ప పరిమాణంలో ఉన్నట్లు తేలింది. మొదటి ప్రపంచయుద్ధ కాలంలో ఈ సరస్సులోని ఖనిజాలను ఆయుధాల తయారీకి వాడేవారు. ఇదివరకు ఈ సరస్సు నీటితో వివిధ వ్యాధులకు సంప్రదాయ వైద్యం చేసేవారు కూడా. ఈ వింత సరస్సును చూడటానికి పర్యాటకులు ఇక్కడకు పెద్దసంఖ్యలో వస్తుంటారు. చదవండి: Horned Orb Spider: ఈ కొమ్ముల సాలీడు చాలా సాధుజీవి తెలుసా? ప్రపంచంలోనే అత్యంత ఒంటరి వృక్షం.. 125 ఏళ్లుగా -
ఇద్దరి ప్రాణం తీసిన ఈత సరదా...
-
యూకేలో ఇద్దరు కేరళ యువకులు మృతి
లండన్: యూకేలోని ఐర్లాండ్‌లో ఒక సరస్సులో ఈత కొట్టేందుకు వెళ్లిన ఇద్దరు కేరళ యువకులు మృతి చెందారు. సోమవారం యూకే సెలవురోజు కావడంతో ఒక స్నేహితుల బృందం డెర్రీ లేదా లండన్ డెర్రీలోని ఎనాగ్‌లాఫ్‌లో ఉన్న సరస్సు వద్దకు ఈత కొట్టేందుకు వెళ్లారు. ఐతే అనుకోకుండా కేరళకు చెందిన సెబాస్టియన్, రూవెన్ సైమన్ అనే ఇద్దరు యువకులు ఆ సరస్సులో గల్లంతై చనిపోయారు. ఉత్తర ఐరీష్ నగరంలోన ఉన్న కేరళ అసోసియేషన్ ఆ ఇద్దరు యువకులకు నివాళులర్పించింది. ఈ విషాద ఘటన పట్ల స్థానిక కౌన్సిలర్ రాచెల్ ఫెర్గూసన్ కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అంతేకాదు ఉత్తర ఐర్లాండ్ పోలీస్ సర్వీస్ ఆ ఇద్దరు యువకుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. ఐతే ఈ ఘటనలో ఒక వ్యక్తి సురక్షితంగా రక్షించామని, అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఈ సంఘటనా స్థలంలో మరో ముగ్గురు వ్యక్తులు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు డెర్రీ/లండన్ డెర్రీ మేయర్, స్ట్రాబేన్ డిస్ట్రిక్ట్ కౌన్సిలర్, సాండ్రా డఫీ కూడా ఈ సంఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలోని సరస్సులు, నదులలో ఈత కొడుతున్నప్పుడు ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. (చదవండి: అఫ్గాన్ పైలెట్లకు శిక్షణ ఇస్తున్న యూఎస్...ఐ డోంట్ కేర్ అంటున్న రష్యా)