పర్యాటకుల.. సందడి
పర్యాటకుల.. సందడి
Published Sun, Oct 2 2016 11:52 PM | Last Updated on Mon, Sep 4 2017 3:55 PM
మండలంలోని పాకాల సరస్సు వద్ద పర్యాటకుల సందడి నెలకొంది. ఇటీవల కురిసిన వర్షాలతో సరస్సు మత్తడి పోస్తుండడంతో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు భారీగా తరలివస్తున్నారు. ఈ మేరకు ఆదివారం సెలవు రోజు కావడంతో సుమారు 5వేల మంది తరలివచ్చి మత్తడి అందాలను తిలకించి జలకాలాడారు. అలాగే సరస్సులో బోటు షికారు చేసి ఆనందంగా గడిపారు. కట్టమైసమ్మ వద్ద పూజలు చేసి కోళ్లు, యాటలు బలిచ్చి వనభోజనాలు చేశారు. - ఖానాపురం
Advertisement
Advertisement