pakhala
-
పర్యాటకుల.. సందడి
మండలంలోని పాకాల సరస్సు వద్ద పర్యాటకుల సందడి నెలకొంది. ఇటీవల కురిసిన వర్షాలతో సరస్సు మత్తడి పోస్తుండడంతో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు భారీగా తరలివస్తున్నారు. ఈ మేరకు ఆదివారం సెలవు రోజు కావడంతో సుమారు 5వేల మంది తరలివచ్చి మత్తడి అందాలను తిలకించి జలకాలాడారు. అలాగే సరస్సులో బోటు షికారు చేసి ఆనందంగా గడిపారు. కట్టమైసమ్మ వద్ద పూజలు చేసి కోళ్లు, యాటలు బలిచ్చి వనభోజనాలు చేశారు. - ఖానాపురం -
ఖుషీఖుషీగా
మండలంలోని పాకాలలో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. ఇటీవల కురుస్తున్న వర్షాలతో పాకాల సరస్సు నీటిమట్టం 19.6 ఫీట్లకు చేరుకుంది. దీంతో జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన పర్యాటకులు పెద్దఎత్తున తరలివచ్చి పాకాల అందాలను వీక్షించారు. నర్సంపేట ఆర్డీఓ రామకృష్ణారెడ్డి, ఖానాపురం ఎస్సై దుడ్డెల గురుస్వామి కుటుంబ సమేతంగా సరస్సును సందర్శించారు. అనంతరం కాసేపు బోటింగ్ షికారుచేసి ఆనందంగా గడిపారు. – ఖానాపురం