వైఎస్‌ఆర్ జిల్లాలో దారుణం జరిగింది. ఒంటిమిట్ట సమీపంలో కడప-తిరుపతి హైవే రోడ్డు పక్కన చెరువులో ఆదివారం 7మృతదేహాలు కలకలం సృష్టించాయి. చెరువు వైపు వెళ్తున్న స్థానికులు చెరువులో మృతదేహాలను చూసి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అధికారులు మృతదేహాలను వెలికి తీయించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే పోలీసులు ప్రాథమిక విచారణలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. మృతులు ఎర్రచందనం కూలీలుగా అనుమానిస్తున్నారు.