red sandal smugglers
-
Seshachalam Hills: మాట వినం..తాట తీస్తాం!
శేషాచల అడవుల్లో ఎర్ర స్మగ్లర్లు చెలరేగిపోతున్నారు. పోలీసుల కళ్లుగప్పి ఇష్టారాజ్యంగా అడవుల్లోకి చొరబడుతున్నారు. ఎర్రచందనం దుంగల నాణ్యత పరిశీలించేందుకు మొదట వాటి బెరడు తీసేస్తున్నారు. ఆపై నాణ్యత లేకుంటే అలాగే వదిలేస్తున్నారు. బెరడ తీసేయడంతో వందలాది వృక్షాలు నిలువునా ఎండిపోతున్నాయి. వీటి సంరక్షణ కోసం అధికారులు చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతుండడం విమర్శలకు తావిస్తోంది. సాక్షి, తిరుపతి జిల్లా: శేషాచలం అడవుల్లో గొడ్డళ్ల చప్పుడు ఆగనంటోంది. తమిళ కూలీలు ఇష్టారాజ్యంగా చొరబడుతూ ఎర్రచందనం చెట్లను నేలకూల్చుతున్నారు. వాటిని గుట్టుచప్పుడు కాకుండా సరిహద్దు దాటించి జేబులు నింపుకుంటున్నారు. ఇందులో బడా స్మగ్లర్ల హస్తం కూడా ఉన్నట్టు సమాచారం. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసుల కళ్లుగప్పుతున్నట్టు తెలుస్తోంది. క్వాలిటీ కోసం చంపేస్తున్నారు గతంలో ఎర్రచందనం వృక్షాలకు చిన్న పాటి రంధ్రం వేసి నాణ్యతను పరీక్షించేవారు. క్వాలిటీ ఉన్న చెట్లును నరికి తరలించేవారు. ఇప్పుడు కొత్త పంథాలో నాణ్యతను పరిశీలిస్తున్నారు. చెట్టును నరకకుండా పైన ఉన్న బెరడును తొలిచి నాణ్యతను చూస్తున్నారు. నాణ్యత లేకుంటే అలానే వదలేస్తున్నారు. బెరడు తీసేయడంతో ఎర్రచందనం చెట్లు నిలువునా ఎండిపోతున్నాయి. శేషాచలం మొత్తంగా కొన్నివందల చెట్లు ఇలా చనిపోయి ఉన్నట్టు తెలుస్తోంది. చదవండి: నెరవేరబోతున్న మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కల.. టన్ను రూ.1.5 కోట్లు ఎర్ర స్మగ్లర్లు నం.1 క్వాలిటీకే మెుదట ప్రాధాన్యత ఇస్తున్నారు. అడవిలో ఎన్ని కిలోమీటర్లు అయినా వెళ్లి నాణ్యమైన దుంగలు ఎంచుకుంటున్నారు. బహిరంగ వేలంలో నం.1(గ్రేడ్–1) ఎర్ర దుంగలు టన్ను రూ.1.5 కోట్లు పలుకుతున్నట్టు సమాచారం. ఆయుధాలతో ఎదురుదాడి అటవీ ప్రాంతంలో కూంబింగ్‌కు వెళ్లిన వారిపై తిరుగుబాటుకు సైతం కూలీలు లెక్కచేయడంలేదు. తమ వద్ద ఉన్న ఆయుధాలతో దాడికి దిగుతున్నారు. కొన్ని సందర్భాల్లో రాళ్ల వర్షం కురిపిస్తున్నారు. దట్టమైన అటవీప్రాంతం కావడంతో ఎర్రకూలీలను పూర్తిస్థాయిలో ఎదుర్కోవడం కొంత ఇబ్బందిగా ఉన్నట్టు తెలుస్తోంది. కాపాడుకుంటాం ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తాం. ఇప్పటికే ప్రభుత్వ, డిపార్టుమెంట్ ఆదేశలను పాటిస్తూ నిఘా పెట్టాం. వివిధ శాఖలతోపాటు అటవీసరిహద్దు గ్రామాల ప్రజల సహకారంతో ఎర్రచందనాన్ని కాపాడుకుంటాం. – పట్టాభి, రేంజర్, భాకరాపేట .. -
చిత్తూరులో నలుగురు ‘ఎర్ర’స్మగ్లర్ల అరెస్ట్
చిత్తూరు అర్బన్: ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న రెండు వాహనాలతో పాటు నలుగురు స్మగ్లర్లను చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్పీ సెంథిల్‌కుమార్, ఎస్ఈబీ ఏఎస్పీ రిశాంత్‌రెడ్డి, డీఎస్పీ సుధాకర్‌రెడ్డి శనివారం వివరాలు వెల్లడింఋచారు. పెనుమూరు క్రాస్ వద్ద తనిఖీలు చేస్తుండగా తిరుపతి వైపు నుంచి చిత్తూరుకు కారు, లారీ అతివేగంగా రావడాన్ని పోలీసులు గమనించారు. వాటిని ఆపాలని ప్రయత్నించినా, పోలీసు వాహనాలను ఢీకొట్టి వారు ముందుకు పోనిచ్చారు. వెంటనే పోలీసులు ఆ వాహనాలను వెంబడించి పట్టుకుని నలుగురిని స్మగ్లర్లు శివయ్య, రిటైర్డ్ ఫారెస్ట్ ఉద్యోగి కె.కృష్ణయ్య, ఏ.కిరణ్, వి.బాలాజీలను అరెస్ట్ చేశారు. వాహనాల్లో సుమారు రూ.2.5 కోట్లు విలువ చేసే 5.2 టన్నుల బరువు గల 182 ఎర్రచందనం దుంగలను సీజ్ చేశారు. ప్రధాన నిందితుడు శివయ్యపై వైఎస్సార్ జిల్లాలో 10 ఎర్ర చందనం కేసులు, పీడీ యాక్టు సైతం ఉన్నట్టు గుర్తించారు. -
పైకి చూస్తే పెళ్లి కారు.. లోన చూస్తే..
సాక్షి, తిరుపతి : టాస్క్‌ఫోర్స్ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఎర్ర చందనం స్మగ్లర్లను పట్టుకున్నారు. కారులో తరలించేందుకు సిద్ధమైన ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ ఆర్ఎస్ఐ వాసు కథనం మేరకు.. రేణిగుంట్ల సమీపంలోని తిరుమల నగర్ వద్ద సోమవారం రాత్రి కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు పెళ్లి కారు కనిపించింది. ఇది పెళ్లిళ్ల సీజన్ కాకపోవడంతో అనుమానం వచ్చిన పోలీసులు కారును క్షుణ్ణంగా తనిఖీ చేశారు.. పెళ్లి పేరుతో అందంగా అలంకరించిన కారులో స్మగ్లింగ్ చేస్తున్న ఎర్ర చందనం దుంగలను, నలుగురు స్మగ్లర్లను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. నిండ్ర మండలానికి చెందిన దొరవేలు, మంగళంకు చెందిన దిలీప్‌కుమార్, తేజ, నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలానికి చెందిన మస్తాన్‌లుగా గుర్తించారు. -
పోలీసులపై గొడ్డళ్లు, రంపాలతో దాడి..
సాక్షి, చిత్తూరు : చంద్రగిరి మండలం భీమవరం పాలెంకొండ వద్ద ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోయారు. తమకు ఎదురుపడ్డ టాస్క్‌ఫోర్స్ సిబ్బందిపై గొడ్డళ్లు, రంపాలు, రాళ్లతో దాడికి దిగారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఘటనలో ఫారెస్టు ఎఫ్‌బీవో కోదండకు గాయాలయ్యాయి. దీంతో పోలీసులు గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. జవ్వాదిమలైకి చెందిన నలుగురు స్మగ్మర్లను అరెస్టు చేశారు. వారివద్ద నుంచి 25 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్న పోలీసులు వెల్లడించారు. -
అక్రమార్కులకు కలప తరువు
చుట్టూ విశాలమైన అటవీప్రాంతాలు... అందులో అత్యంత విలువైన కలపనిచ్చే వృక్షాలు... పర్యావరణానికి తోడ్పడే అనుకూల వనాలు... ఇదీ విజయనగరం జిల్లా అనగానే గుర్తుకొచ్చే అంశాలు. కానీ ఇప్పుడు ఆ వనాలపై అక్రమార్కుల కన్ను పడింది. దానికి అధికారుల ఉదాశీనత తోడైంది. నామమాత్రంగానైనా ఏర్పడిన చెక్‌పోస్టుల పర్యవేక్షణ కొరవడింది. అందుకే దొరికిన కలపను ఎంచక్కా టింబర్డిపోల్లోనే నిల్వ చేస్తున్నారు. అక్కడ తమకు అనువైన రీతిలో తీర్చిదిద్దుతున్నారు. అనంతరం ఎలాంటి అనుమానం రాకుండా ఇతర జిల్లాలు... రాష్ట్రాలకు తరలించేస్తున్నారు. ఇటీవల అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. సాక్షిప్రతినిధి, విజయనగరం : జిల్లా అడవుల్లో టేకు ఎక్కువగా లభిస్తుంది. దాని తర్వాత స్థానంలో ఎర్రచందనం ఉంది. హుద్‌హుద్ తుఫాన్‌కు పడిపోయిన ఎర్రచందనం కలప సుమారు 13 టన్నులు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. దీనిని కొందరు పోగుచేసి నిల్వచేసుకున్నారు. ఆ కలపను తరలించడానికి అనుమతినివ్వాలంటూ 10 మంది మాత్రమే ప్రభుత్వానికి దరఖాస్తుచేసుకున్నారు. చాలా మంది అక్రమంగా స్మగ్లింగ్ చేసేస్తున్నారు. సాలూరు నియోజకవర్గం పాచిపెంట మండలంలో జాతీయరహదారి 26పై పి.కోనవలస గేటు వద్ద మార్కెట్‌యార్డు, ఎక్సైజ్, అటవీశాఖల చెక్‌పోస్టులు ఉన్నాయి. ఇన్ని చెక్‌పోస్టులు ఉన్నా ఆంధ్రా–ఒడిశా రాష్ట్రాల మధ్య అటవీ సంపద అక్రమ రవాణా యథేచ్ఛగా సాగిపోతోంది. పట్టుబడిన కలపకు హుద్‌హుద్ కలరింగ్ ఇటీవల జిల్లాలో వరుసగా ఎర్రచందనం పలుచోట్ల పట్టుబడింది. అయితే అది హుద్‌హుద్ సమయంలో కొట్టుకొచ్చిన కలప అని నిందితులు చెప్పుకొచ్చారు. సుమారు 10 టన్నులకు పైగానే ఉన్న ఎర్రచందనాన్ని ఇటీవల గరివిడి మండలం, తాటిగూడ గ్రామం రెవెన్యూ పరిధిలో ఉన్న మాంగనీస్ మైన్‌లో అటవీ అధికారులు పట్టుకున్నారు. గత ఫిబ్రవరి నెలలో జిల్లాలోని గంట్యాడ మండలం రామవరం గ్రామంలో కాకర్లపూడి రామకృష్ణంరాజు ఇంటిలో అద్దెకు ఉంటున్న బుద్దరాజు వర్మ అక్రమంగా ఎర్రచందనం నిల్వ చేసి గుట్టుచప్పుడు కాకుండా వ్యాపారం జరుపుతున్నారనే సమాచారంతో చిత్తూరు టాస్క్‌ఫోర్స్ టీమ్ దాడిచేసి గొడౌన్లు, పెంటకుప్పల్లో దాచి ఉంచిన కలపను బయటకు తీశారు. విజయనగరం మండలం కొండకరకాం గ్రామం అటవీ ప్రాంతం నుంచి ఎర్ర చందనాన్ని నిందితులు సేకరించారు. హుద్‌హుద్ సమయంలో పొలాల్లోకి కొట్టుకొచ్చిన ఎర్రచందనం దుంగల్ని అక్రమంగా దొంగిలించి గోడౌన్‌కు తరలించారు. మరికొంత కలపను కొనుగోలు చేసి దానిని కూడా నిల్వ చేశారు. ఈ సమాచారంతో అధికారులు కొండకరకారం, దాని పక్కనే ఉన్న కొండవెలగాడ గ్రామాల్లో విచారణ చేపట్టారు. గతేడాది డిసెంబర్లో ఎర్రచందనాన్ని లారీలో అక్రమంగా తరలిస్తుండగా జిల్లా అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. కొద్ది రోజుల క్రితం జిల్లా టీడీపీకి చెందిన కీలక నేతకు సంబంధించిన టింబర్ డిపోలో అటవీ అధికారులు తనిఖీలు నిర్వహించగా ఎర్రచందనం నిల్వలు కనిపించాయి. అయితే అవి హుద్‌హుద్ తుఫాన్లో సేకరించినవని, అనుమతుల కోసం దరఖాస్తు చేశామని నిర్వాహకులు చెప్పుకోవడం గమనార్హం. అనుమతులు లేకపోతే చర్యలు తప్పవు: హుద్‌హుద్ తుఫాన్ సమయంలో పడిపోయిన ఎర్ర చందనం చెట్లకు సంబంధించి అటవీశాఖకు తెలియజేసి, అనుమతులు తప్పకుండా తీసుకోవాలి. అనుమతులు తీసుకోకుండా ఎర్రచందనం నిల్వలున్నట్లు ఎక్కడైనా మేం గుర్తిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. జిల్లాలో 10 మంది అనుమతులు తీసుకున్నారు. 10 టన్నుల లోపు ఉన్న ఎర్ర చందనం చెట్లకు అనుమతులు ఇస్తాం. ఏ కలప రవాణాకైనా అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంటే వాటిని డీఎఫ్ఓ, స్క్వాడ్ డీఎఫ్ఓలు పరిశీలించిన అనంతరం అనుమతులు మంజూరు చేస్తాం. స్మగ్లింగ్‌ను అరికట్టడానికి దాడులు, తనిఖీలు నిర్వహిస్తున్నాం. ఇప్పటికే అనేక కేసులు నమోదు చేశాం. – గంపా లక్ష్మణ్, జిల్లా అటవీశాఖ అధికారి, (టెరిటోరియల్) ,విజయనగరం. -
శేషాచలం అడవుల్లో రెచ్చిపోయిన ఎర్రచందనం స్మగ్లర్లు
-
ఎర్ర స్మగ్లర్ల అరెస్ట్
గూడూరు: అంతర్రాష్ట్ర ఎర్ర చందనం స్మగ్లర్ల అరెస్ట్ చేసినట్లు జిల్లా క్రైమ్ ఓఎస్డీ టీపీ విఠలేశ్వరరావు తెలిపారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ వీఎస్ రాంబాబు, పట్టణ, రూరల్ సీఐలు సుబ్బారావు, అక్కేశ్వరరావులతో కలసి ఆయన శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వెలుగొండ ప్రాంతంలోని అటవీ ప్రాంతం నుంచి ఈ దుంగలను వాహనాల్లో తరలించే ప్రయత్నం చేస్తుండగా జిల్లా టాస్క్‌ఫోర్స్ సిబ్బందితోపాటు వెంకటాచల సత్రం, చిల్లకూరు, నాయుడుపేట ఎస్సైలు నాగరాజు, శ్రీనివాసరావు, రవినాయక్‌లు సిబ్బందితో కలసి ఏకకాలంలో దాడులు చేశారు. 40 దుంగలు, మూడు వాహనాలు, 11 సెల్ఫోన్లు, రూ.5,250 నగదును స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. వీటి విలువ సుమారు రూ.75 లక్షల వరకూ ఉంటుందన్నారు. అరెస్టైన వారు.. వెంకటాచలం మండల పరిధిలో జరిగిన దాడిలో కర్నాటకకు చెందిన అఫర్ఖాన్, వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన బుక్కా నాగేశ్వరనాయక్, కర్నూలు జిల్లాకు చెందిన కత్తి ఏడుకొండలు, చిల్లకూరు మండల పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన దాడిలో కర్నాటకకు చెందిన నవాజ్ షరీఫ్, కడప జిల్లాకు చెందిన బాదిచర్ల శివకుమార్, నంద్యాలకు చెందిన తులసి చిన్నిలను అదుపులోకి తీసుకున్నారు. నాయుడుపేట పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన దాడిలో కర్నాటకకు చెందిన అజాద్ అహ్మద్, నెల్లూరు జిల్లా రాపూరు గ్రామానికి చెందిన రేవూరి సురేష్, ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం పూసలపాడు గ్రామానికి చెందిన వి.రామిరెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు. ఒక కారు, ఒక మినీ లారీ, మరో ట్రక్ ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్ నిమిత్తం కోర్టుకు హాజరుపరచనున్నట్లు విఠలేశ్వరరావు తెలిపారు. ఎక్కడైనా ఎర్రచందనం స్మగ్లింగ్‌పై జిల్లా పోలీస్ వాట్సాప్ నంబర్ 9390777727కు మెసేజ్ చేయవచ్చని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. -
ఒంటిమిట్ట చెరువులో మృతదేహాల కలకలం..
-
టాస్క్‌ఫోర్స్ పోలీసులపై ఎర్రచందనం స్మగ్లర్ల దాడి
సాక్షి, తిరుపతి: శేషాచలం అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులపై ఎర్రచందనం స్మగ్లర్లు దాడి చేశారు. మంగళవారం వేకువజామున శ్రీవారి పాదాల సమీపంలో సిబ్బందిపై కత్తులు, రాళ్ళతో దాడికి తెగబడ్డారు. దీంతో ఓ కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. దాడి నుంచి తప్పించుకునేందుకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో స్మగ్లర్లు పారిపోయారు. సంఘటనా స్థలంలో 29 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా పారిపోయిన స్మగ్లర్ల కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. -
‘ఎర్ర’ దొంగల అరెస్టు
చిలమత్తూరు (హిందూపురం) : విలువైన ఎర్రచందనం దుంగలను కర్ణాటకకు అక్రమంగా తరలిస్తూ గతంలో తప్పించుకున్న ముగ్గురు దొంగలను ఎట్టకేలకు అరెస్టు చేసినట్లు హిందూపురం రూరల్ సీఐ నాగరాజానాయుడు శనివారం చిలమత్తూరు పోలీస్ స్టేషన్లో విలేకరులకు తెలిపారు. అరెస్టైన వారిలో అనంతపురం రాణినగర్‌కు చెందిన పి.బాబ్జాన్, జి.వెంకటరాజు, ఉప్పర హరి అనే వ్యక్తులు ఉన్నారని వివరించారు. వీరిని కొడికొండ చెక్‌పోస్టు సమీపంలోని టూరిజం హోటల్ సమీపంలో ఉండగా ఎస్ఐ శ్రీధర్, తమ సిబ్బందితో వెళ్లి పట్టుకున్నారని సీఐ తెలిపారు. ఇదే కేసులోని హైదరాబాద్‌కు చెందిన హరీ అనే మరో దొంగ పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని వెల్లడించారు. ఏఎస్ఐ సూర్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు. -
తిరుపతిలో తుపాకుల మోత
తిరుపతి: టెంపుల్ సిటీ తిరుపతిలో ఆదివారం అర్ధరాత్రి కాల్పుల మోతమోగింది. కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు పట్ణణ నగర శివారులోని ఎస్వీ జూపార్క్ సమీపంలో ఎర్రచందనం కూలీలు తారాసపడ్డారు. పోలీసులనుంచి తప్పించుకునే క్రమంలో స్మగ్లర్లు రాళ్లదాడికి దిగారు. అప్రమత్తమైన పోలీసులు స్మగ్లర్లను అడ్డుకునేందుకు గాలిలోకి కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో ఆర్ఎస్ఐ వాసుకు గాయాలయ్యాయి. పారిపోతున్న స్మగ్లర్లలో ఇద్దరిని పట్టుకున్న పోలీసులు.. ఘటనాస్థలం నుంచి 25 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పలువురు ఉన్నతాధికారులు పట్టుబడిన దొంగలను విచారించారు. -
శేషాచలంలో కాల్పుల మోత
* కూంబింగ్‌లో ఎదురుపడిన కూలీలు * పోలీసులపై రాళ్లవర్షం, గాల్లోకి రెండు రౌండ్ల కాల్పులు * అదుపులోకి ఐదుగురు చంద్రగిరి: చిత్తూరు జిల్లా శేషాచలం అటవీ ప్రాంతంలో శనివారం ఉదయం మరోసారి కాల్పుల మోత మోగింది. 70 మంది ఎర్రచందనం కూలీలు పోలీసులపై రాళ్లతో దాడికి దిగారు. దీంతో పోలీసులు రెండు రౌండ్లు గాల్లో కాల్పులు జరిపారు. ఐదుగురు కూలీలను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలను ఎస్ఐ భాస్కర్ తెలిపారు. చంద్రగిరి మండలంలోని అనంత గుర్రప్పగారిపల్లి దళితవాడ సమీపంలోని అటవీ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున సుమారు 30 మంది పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో జెర్రిబండ వద్ద ఎర్రకూలీలు సుమారు 70 మంది సేదదీరుతూ వంట చేసుకోవడాన్ని పోలీసులు గమనించారు. వారిని అదుపులోకి తీసుకోవడానికి మోహరించారు. పోలీసులను గమనించిన కూలీలు వారిపై రాళ్ల వర్షం కురిపించారు. దీంతో పోలీసులు రెండు రౌండ్లు గాల్లో కాల్పులు జరిపారు. కూలీలు తప్పించుకునేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో తమిళనాడు ధర్మపురి జిల్లాకు చెందిన రామరాజన్, గోవిందన్, మురుగన్, విమల్, గోవిందన్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 12 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. -
స్మగ్లర్లు అరెస్ట్ : రూ. 60 లక్షల ఎర్రచందనం స్వాధీనం
తిరుపతి : చంద్రగిరి మండలం ముంగళిపట్టు అటవీ ప్రాంతంలో శనివారం టాస్క్‌ఫోర్స్ ఉన్నతాధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఐదుగురు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి భారీగా ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్‌కు తరలించారు. పట్టుబడిన ఎర్రచందనం దుంగల విలువ రూ. 60 లక్షలు ఉంటుందని టాస్క్‌ఫోర్స్ ఉన్నతాధికారులు వెల్లడించారు. -
మరిన్ని విజయాలు సాధించాలి
రెడ్శాండల్స్ యాంటీ స్మగ్లింగ్ సెల్ టాస్క్‌ఫోర్స్‌కు ఎస్పీ అభినందన కడప అర్బన్ : రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముగ్గురు ఎర్రచందనం స్మగర్లు బొడ్డె వెంకట రమణ, ముఖేష్ బదానియా, మణి అన్నన్లను అరెస్టు చేసిన పోలీసు అధికారులను ఎస్పీ డాక్టర్ నవీన్‌గులాఠీ ప్రత్యేకంగా అభినందించారు. గురువారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో రెడ్శాండల్స్ యాంటీ స్మగ్లింగ్సెల్ టాస్క్‌ఫోర్స్ పోలీసు అధికారులు, సిబ్బందితో ఎస్పీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ధైర్య సాహసాలతో స్మగ్లర్లను అరెస్టు చేయడంలో కీలకభూమిక పోషించిన సిబ్బందిని పేరుపేరున అభినందించారు. భారీగా నగదు రివార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో టాస్క్‌ఫోర్స్ పోలీసు అధికారులు, సిబ్బంది మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. ముగ్గురు స్మగ్లర్లను అరెస్టు చేయడంలో కీలకపాత్ర పోషించిన నలుగురు డీఎస్పీలకు డీజీపీ కమాండేషన్ లెటర్ కోసం ఎస్పీ సిఫార్సు చేశారు. అలాగే నలుగురు ఇన్స్పెక్టర్లకు మెరిటోరియస్ సర్వీసు ఎంట్రీ ప్రకటించారు. అలాగే నగదు రివార్డులను ఎస్పీ చేతుల మీదుగా అందుకున్నారు. రివార్డులు అందుకున్న అధికారులు, సిబ్బంది ముగ్గురు స్మగ్లర్లను అరెస్టు చేయడంలో కృషి చేసిన డీఎస్పీలు ఫ్యాక్షన్ జోన్ బి.శ్రీనివాసులు, ఎస్బీ డీఎస్పీ ఎం.రాజగోపాల్‌రెడ్డి, రాజంపేట డీఎస్పీ అరవిందబాబు, కడప డీఎస్పీ ఈజీ అశోక్‌కుమార్, ఏఆర్ డీఎస్పీ మురళీధర్, సీఐలు బి.రాజేంద్రప్రసాద్, శ్రీరాములు, బీవీ శివారెడ్డి, వెంకటప్ప, ఆర్ఐ హరికృష్ణ, ఎస్ఐలు ఎస్కే రోషన్, హేమకుమార్, శివశంకర్, రాజరాజేశ్వర్‌రెడ్డి, రమేష్‌బాబు, పెద్ద ఓబన్న, కేవీ కొండారెడ్డి, ఎ.సురేష్‌రెడ్డి, అన్సర్‌బాష, ఎస్.మహబూబ్‌బాష, నాగమురళి, ఎస్బీహెచ్సీ మనోహర్వర్మ, హెచ్‌సీలు శ్రీనివాసులు, నాగార్జున, కానిస్టేబుళ్లు శ్రీహరి, వెంకటేశు, ప్రసాద్‌నాయుడు, కొండయ్య, శేఖర్, శ్రీనివాసులు, ఎస్కే నిస్సార్బాష, కె.రామకృష్ణ, రాజేంద్ర, సి.చంద్రశేఖర్, చంద్రశేఖర్, బి.సురేష్, ఎ.రవిశేఖర్, ఎన్.ప్రసాద్‌బాబు, శేఖర్, హోం గార్డు ఎ.విద్యాపతి, స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ సి.రామలింగ ఆచారి నగదు రివార్డులు అందుకున్నారు. -
శేషాచలంలో కూంబింగ్
♦ ఫారెస్ట్, టాస్క్ఫోర్సు భద్రతా దళాల తనిఖీలు ♦ ఎర్రచందనం స్మగ్లర్లు, కూలీల కోసం వేట సాక్షి, తిరుమల : శేషాచలం అడవుల్లో కూంబింగ్ ముమ్మరంగా సాగుతోంది. ఈనెల 7వ తేదీన శేషాచల పరిధిలోని శ్రీవారిమెట్టు ప్రాంతంలో టాస్క్ఫోర్సు కాల్పుల్లో 20 మంది కూలీలు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో చాలామంది కూలీలు తప్పించుకుని పారిపోయినట్టు టాస్క్ఫోర్సు దళాలు చెబుతున్నాయి. అంతకుముందే 2 వేల మంది దాకా ఎర్రచందనం చెట్లను నరికే కూలీలు శేషాచలం నలుమూలలా తిష్టవేసినట్టు టాస్క్ఫోర్సు, ఫారెస్ట్ విభాగాలకు సమాచారం ఉంది. ఈ మేరకు టాస్క్ఫోర్సు, అటవీ శాఖ సిబ్బంది బృందాలుగా విడిపోయి తూర్పు కనుమల్లో భాగమైన చిత్తూరు, వైఎస్ఆర్ కడప జిల్లాలోని శేషాచలంతో పాటు సరిహద్దు జిల్లాలైన నెల్లూరు, కర్నూలు జిల్లా అటవీ ప్రాంతాల్లోనూ విస్తృతంగా కూంబింగ్ చేస్తున్నారు. కాల్పుల ఘటన తర్వాత చిత్తూరు రేంజ్, తిరుపతి రేంజ్, మామండూరు రేంజ్ పరిధిలో భారీగా ఎర్రకూలీలతో పాటు ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు. కొందరు స్మగ్లర్లపై పీడీయాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. ఎన్కౌంటర్ ఘటనతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మధ్య ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో కూంబింగ్‌లో రోజువారీగా పట్టుబడుతున్న కూలీలు, స్మగ్లర్ల సమాచారాన్ని ఎప్పటికప్పుడు జిల్లా, రాష్ట్ర ఉన్నతాధికారులకు చేరవేస్తూ వారి ఆదేశాలతో తదుపరి చర్యలు తీసుకుంటుండటం గమనార్హం. శేషాచలంలో మరికొన్ని రోజులపాటు కూంబింగ్ నిర్వహించాలని రాజధాని నుంచి ఫారెస్ట్, టాస్క్ఫోర్సుకు ఆదేశాలందాయి. -
'ఎక్కడి నుంచో తెచ్చి కాల్చిచంపారు'
తిరుపతి : చిత్తూరు జిల్లాలోని తిరుపతి శ్రీవారి మెట్ల వద్ద మంగళవారం జరిగిన ఎన్ కౌంటర్లో మరణించిన ఎర్రచందనం కూలీలను వేరొక ప్రాంతం నుంచి తీసుకొచ్చి కాల్చి చంపారని పౌర హక్కుల సంఘం నేత క్రాంతి చైతన్య ఆరోపించారు. మృతదేహాల మీద బుల్లెట్ గాయాలను చూస్తే.. ఇది పక్కా బూటకపు ఎన్‌కౌంటరేనని తేలుతోందని గురువారం ఆయన చెప్పారు. మృతదేహాలలో ఎక్కడా బుల్లెట్లు లేవు, కేవలం అవి వారి శరీరాల నుంచి దూసుకెళ్లాయని చెప్పారు. కేవలం 5 నుంచి 10 మీటర్ల దూరం నుంచే కాల్పులు జరిగాయని అందువల్లే బుల్లెట్లు ఎర్రచందనం కూలీల శరీరాల నుంచి వెళ్లిపోయాయని పేర్కొన్నారు. కూలీల శవాల పక్కన పిడిలేని గొడ్డళ్లను పోలీసులు పడేయటాన్ని గమనించినట్లయితే వాటిని అప్పుడే కొనుక్కొచ్చిన విషయం తెలుస్తోందన్నారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో రాళ్లు కూడాలేవని, మరి రాళ్లతో ఎర్రచందనం కూలీలు ఎలా దాడి చేశారో పోలీసులే చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీసులు పిట్టకథ అల్లుతున్నారనడానికి ఇంతకన్నా ఉదాహరణ అవసరం లేదని పౌర హక్కుల సంఘం నేత క్రాంతి చైతన్య వెల్లడించారు. -
శేషాచలం ఎన్కౌంటర్ మృతుల గుర్తింపు
-
కాల్చేందుకు కాకపోతే.. ఆయుధాలెందుకు
-
కాల్చేందుకు కాకపోతే.. ఆయుధాలెందుకు
దోచుకుని పోతున్న వారిని కాల్చేందుకు కాకపోతే.. అసలు పోలీసులకు ఆయుధాలుండి ఉపయోగం ఏంటని మాజీ మంత్రి గాలి ముద్దు కృష్ణమనాయుడు అన్నారు. ఎర్రచందనం ఏపీ రాష్ట్ర సంపద అని, దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ఇప్పటికే రూ. 50 కోట్లకు పైగా విలువ చేసే ఎర్ర చందనం తరలిపోయిందని ఆయన తెలిపారు. శేషాచలం ఎన్కౌంటర్ విషయాన్ని ప్రస్తావిస్తూ.. పోలీసులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసినది మంచిపనేనని ఆయన అన్నారు. -
అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం స్వాధీనం
చిత్తూరు: జిల్లాలో ఎర్ర చందనం స్మగ్లింగ్ యధేచ్చగా కొనసాగుతోంది. ఎర్రచందనం స్మగ్లర్ల వ్యవహారం ఫారెస్ట్ అధికారులకు తలనొప్పిగా మారింది. వారి ఆగడాలను అరికట్టేందుకు పోలీస్ యంత్రాంగం ఎప్పటికప్పడూ చర్యలు చేపడుతూనే ఉంది. ఈ చర్యలో భాగంగా బుధవారం చిత్తూరు జిల్లాలోని రామచంద్రాపురం మండలం గంగిరెడ్డిపల్లి వద్ద టెంపోలో స్మగ్లర్ల స్థావరాలపై సోదాలు నిర్వహించారు. అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనాన్ని తరలిస్తున్న స్మగ్లర్లను పట్టుకునేందుకు పోలీసులు యత్నించారు. దీంతో విలువైన ఎర్రచందనాన్ని అక్కడే వదిలి స్మగ్లర్లు పరారైనట్టు పోలీసులు పేర్కొన్నారు. -
పోలీసులపై డీఎఫ్ఓ ఆగ్రహం
నెల్లూరు(నవాబుపేట): మల్లెంకొండ ఆటవీ ప్రాంతంలో శనివారం జరిగిన ఘటనపై జిల్లా అటవీశాఖ అధికారి శివాల రాంబాబు తీవ్రస్థాయిలో స్పందించారు. ఎర్రచందనం స్మగ్లర్లకు పోలీసుల్లో కొందరి సహకారం ఉందని ఆరోపించారు. అటవీశాఖ కార్యాలయం ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అటవీశాఖ బేస్‌క్యాంప్ సిబ్బందిని పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకోవడం సరికాదని పేర్కొన్నారు. ఈ విషయాన్ని కలెక్టర్ శ్రీకాంత్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. చిలకలమర్రి సమీపంలోని మల్లెంకొండ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున పోలీసులు తమ శాఖ బేస్‌క్యాంప్ సిబ్బంది నలుగురిని అదుపులోకి తీసుకున్నారన్నారు. వారిలో ఇద్దరిని వదిలేయగా,మరో ఇద్దరిపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారన్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న పీకేపాడుకు చెందిన ఎర్ర ఓబయ్య, సోమశిలకు చెందిన పరుచూరి మాలకొండయ్య రెండు నెలల క్రితమే విధుల్లోకి చేరారన్నారు. కేవలం రూ.6 నుంచి రూ.7 వేలు జీతంతో పనిచేస్తున్న బేస్‌క్యాంప్ సిబ్బందితో ఇలా వ్యవహరిస్తే భవిష్యత్తులో ఈ ఉద్యోగం చేసేందుకు ఎవరూ ముందుకు రారన్నారు. బేస్‌క్యాంప్ సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకుని 36 గంటల పాటు చిత్రహింసలకు గురిచేశారన్నారు. వారిపై బనాయించిన అక్రమ కేసులను ఎత్తివేయాలని కోరారు. ఈ విషయాన్ని ఎస్పీ సెంథిల్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదన్నారు. పోలీసులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరుతామని, న్యాయం జరగని పక్షంలో విధుల బహిష్కారానికి సిద్ధంగా ఉన్నామన్నారు. పరస్పర సహకారంతోనే స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట పరస్పర సహకారంతోనే స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు వీలవుతుందని డీఎఫ్ఓ రాంబాబు పేర్కొన్నారు. బేస్‌క్యాంప్ సిబ్బందిపై దాడి చేసి ఏదో సాధించామని పోలీసులు చెప్పడం సరికాదన్నారు. చిత్తూరుతో పాటు నెల్లూరులోనూ ఎర్రచందనం అక్రమ రవాణాకు పోలీసులు సహకరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయన్నారు. ఆయన వెంట ఆత్మకూరు, కావలి, ఉదయగిరి రేంజ్ ఆఫీసర్లు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మాల్యాద్రి, తదితరులు ఉన్నారు. -
పోలీసులపై కలప స్మగ్లర్ల రాళ్లదాడి
-
పోలీసులపై కలప స్మగ్లర్ల రాళ్లదాడి
వైఎస్సార్ జిల్లాలో కలప స్మగ్లర్లు మరోసారి రెచ్చిపోయారు. బాలుపల్లి అటవీ ప్రాంతంలో అటవీ శాఖాధికారులు, పోలీసులపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరపాల్సి వచ్చింది. అటవీ ప్రాంతంలో దాదాపు 30 మంది ఎర్రచందనం స్మగ్లర్లు అటవీ శాఖ అధికారుల బృందానికి కనిపించారు. వారిని పట్టుకోడానికి ప్రయత్నించగా రాళ్లతో దాడులకు పాల్పడ్డారు. వారిలో ఒక స్మగ్లర్‌ను మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ ఉన్నది తమిళనాడుకు చెందిన స్మగ్లర్లేనని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతానికి ఇంకా రైల్వే కోడూరు ప్రాంతంలోనే అధికారులు, పోలీసుల బృందం ఉన్నట్లు తెలుస్తోంది. స్మగ్లర్లను అదుపు చేసేందుకు అదనపు బలగాలను కూడా అక్కడకు మళ్లించారు. అయితే ఎంతమంది అధికారులు దాడిలో పాల్గొన్నారన్న విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు. గతంలో చిత్తూరు జిల్లా బాకరాపేటలో కూడా రాళ్లతో కలప దొంగలు, స్మగ్లర్లు దాడి చేశారు. ఇప్పుడు కూడా అలాగే జరిగింది.