తిరుపతిలో తుపాకుల మోత | police firing near sv zoo park in tirumala, red sandal smugglers arrested | Sakshi
Sakshi News home page

తిరుపతిలో తుపాకుల మోత

Published Mon, Feb 15 2016 9:27 AM | Last Updated on Tue, Aug 21 2018 7:18 PM

పట్టుబడ్డ ఎర్రచందనం స్మగ్లర్లను విచారిస్తున్న పోలీసులు - Sakshi

పట్టుబడ్డ ఎర్రచందనం స్మగ్లర్లను విచారిస్తున్న పోలీసులు

తిరుపతి: టెంపుల్ సిటీ తిరుపతిలో ఆదివారం అర్ధరాత్రి కాల్పుల మోతమోగింది. కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు పట్ణణ నగర శివారులోని ఎస్వీ జూపార్క్ సమీపంలో ఎర్రచందనం కూలీలు తారాసపడ్డారు. పోలీసులనుంచి తప్పించుకునే క్రమంలో స్మగ్లర్లు రాళ్లదాడికి దిగారు. అప్రమత్తమైన పోలీసులు స్మగ్లర్లను అడ్డుకునేందుకు గాలిలోకి కాల్పులు జరిపారు.

 

ఈ సంఘటనలో ఆర్ఎస్ఐ వాసుకు గాయాలయ్యాయి. పారిపోతున్న స్మగ్లర్లలో ఇద్దరిని పట్టుకున్న పోలీసులు.. ఘటనాస్థలం నుంచి 25 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పలువురు ఉన్నతాధికారులు పట్టుబడిన దొంగలను విచారించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement