సాక్షి, చిత్తూరు : తిరుమలలో ఓ మహిళా దొంగ హల్‌చల్ చేసింది. మూసి ఉన్న దుకాణాలే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడింది. ఈ చోరీలకు సంబంధించిన వీడియోలు బయటకు రావటంతో సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు.. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు విధించిన లాక్‌డౌన్ కారణంగా తిరుమల వీధుల్లో జనసంచారం లేకపోవటంతో ఓ పారిశుద్ధ్య కార్మికురాలి కన్ను.. మూసి ఉన్న దుకాణాలపై పడింది. తరచుగా సీసీ కెమెరాలను పగలకొట్టి దుకాణాల్లోకి చొరబడేది. అందినకాడకి సరుకులను దోచుకెళ్లిపోయేది. అయితే ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీ కెమెరాల్లో రికార్డవటంతో మహిళ దొంగతనాలు వెలుగులోకి వచ్చాయి.
చదవండి : కత్తెరతో పొడిచి..ఆయువు తీసి...
Comments
Please login to add a commentAdd a comment