చిత్తూరులో నలుగురు ‘ఎర్ర’స్మగ్లర్ల అరెస్ట్‌ | Red Sandalwood four Smugglers Arrested In Chittoor | Sakshi
Sakshi News home page

చిత్తూరులో నలుగురు ‘ఎర్ర’స్మగ్లర్ల అరెస్ట్‌

Published Sun, Mar 21 2021 5:34 AM | Last Updated on Sun, Mar 21 2021 5:34 AM

Red Sandalwood four Smugglers Arrested In Chittoor - Sakshi

పోలీసుల అదుపులో ఉన్న స్మగ్లర్లు, స్వాధీనం చేసుకున్న ఎర్ర దుంగలు

చిత్తూరు అర్బన్‌: ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న రెండు వాహనాలతో పాటు నలుగురు స్మగ్లర్లను చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఎస్పీ సెంథిల్‌కుమార్, ఎస్‌ఈబీ ఏఎస్పీ రిశాంత్‌రెడ్డి, డీఎస్పీ సుధాకర్‌రెడ్డి శనివారం వివరాలు వెల్లడింఋచారు. పెనుమూరు క్రాస్‌ వద్ద తనిఖీలు చేస్తుండగా తిరుపతి వైపు నుంచి చిత్తూరుకు కారు, లారీ అతివేగంగా రావడాన్ని పోలీసులు గమనించారు.

వాటిని ఆపాలని ప్రయత్నించినా, పోలీసు వాహనాలను ఢీకొట్టి వారు ముందుకు పోనిచ్చారు. వెంటనే పోలీసులు ఆ వాహనాలను వెంబడించి పట్టుకుని నలుగురిని స్మగ్లర్లు శివయ్య, రిటైర్డ్‌ ఫారెస్ట్‌ ఉద్యోగి కె.కృష్ణయ్య, ఏ.కిరణ్, వి.బాలాజీలను అరెస్ట్‌ చేశారు. వాహనాల్లో సుమారు రూ.2.5 కోట్లు విలువ చేసే 5.2 టన్నుల బరువు గల 182 ఎర్రచందనం దుంగలను సీజ్‌ చేశారు. ప్రధాన నిందితుడు శివయ్యపై వైఎస్సార్‌ జిల్లాలో 10 ఎర్ర చందనం కేసులు, పీడీ యాక్టు సైతం ఉన్నట్టు గుర్తించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement