Chittoor Police
-
గిఫ్ట్ కార్డుల పేరుతో వసూలు
చిత్తూరు అర్బన్: గిఫ్ట్‌కార్డుల పేరుతో ఘరానా మోసానికి పాల్పడిన ముఠాను చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. కార్లు, బైక్‌లు వచ్చాయంటూ నమ్మబలికి.. జీఎస్టీ, ఎన్వోసీ తదితరాల పేర్లతో లక్షలాది రూపాయలు కొట్టేసిన బిహార్, కర్ణాటకకు చెందిన నిందితులను పోలీసులు చిత్తూరులో చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ వివరాలను బుధవారం చిత్తూరు ఎస్పీ రిషాంత్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. వివరాలు.. బిహార్‌కు చెందిన ముకేశ్‌కుమార్ ఆన్లైన్ ద్వారా పలు వస్తువులు కొనుగోలు చేసిన 5 లక్షల మంది చిరునామాలను సంపాదించాడు. ప్రతి ఒక్కరి అడ్రస్‌కు ఓ ఉత్తరం, ఈ–కామర్స్ కంపెనీల స్టాంప్ ముద్రలతో గిఫ్ట్‌కార్డులు పంపించేవాడు. ఆ బహుమతిని సొంతం చేసుకునేందుకు తమను సంప్రదించాలంటూ ఆ ఉత్తరాల్లో తమ ఫోన్ నంబర్లు ఉంచేవాడు. ఇలా చిత్తూరు జిల్లాలో పలువురికి ఉత్తరాలతో పాటు గిఫ్ట్‌కార్డులు వచ్చాయి. వాటిని స్క్రాచ్ చేసి చూడగా.. కార్లు, బైకులు గెల్చుకున్నట్లు ఉంది. దీంతో వారు ఉత్తరంలోని నంబర్లకు ఫోన్ చేయగా.. కారు పంపించేందుకు గాను జీఎస్టీ కింద రూ.5 వేలు కట్టాలని నమ్మబలికారు. దీంతో చిత్తూరు జిల్లాకు చెందిన 26 మంది.. నిందితుడు చెప్పిన బ్యాంకు ఖాతాకు ఆ సొమ్మును జమ చేశారు. ఆ తర్వాత ఎన్వోసీ కోసమని, ట్యాక్స్ చెల్లించాలని రకరకాల పేర్లతో మభ్యపెట్టి రూ.లక్షల్లో వసూలు చేశారు. చివరకు తాము మోసపోయినట్లు తెలుసుకున్న బాధితులు జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఎస్పీ రిషాంత్‌రెడ్డి.. చిత్తూరు డీఎస్పీ సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. వన్‌టౌన్ సీఐ నరసింహరాజు, పెనుమూరు ఎస్ఐ అనిల్‌కుమార్ తదితర సిబ్బంది సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ప్రధాన నిందితుడు ముకేశ్‌తో పాటు కర్ణాటకకు చెందిన సందేష్, కిరణ్, హెచ్ఎస్ కిరణ్, జైనుల్ అబిద్లను చిత్తూరులోని ఫారెస్టు రోడ్డులో పట్టుకున్నారు. నిందితుల నుంచి నకిలీ గిఫ్ట్‌కార్డులు, 30 సెల్ఫోన్లు, 30 ఏటీఎం కార్డులు, రెండు ల్యాప్‌టాప్‌లు, రూ.1.80 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన పోలీసులను ఎస్పీ అభినందించి.. నగదు రివార్డులు అందజేశారు. -
రైల్వే ఉద్యోగాల పేరిట ఘరానా మోసం
చిత్తూరు అర్బన్: రైల్వే ఉద్యోగాల పేరిట నిరుద్యోగుల నుంచి రూ.1.27 కోట్లు వసూలు చేసి.. ఇళ్లు, పొలాలు కొనుగోలు చేసి దర్జాగా జీవిస్తున్న ఘరానా మోసగాడిని చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను డీఎస్పీ సుధాకర్‌రెడ్డి గురువారం మీడియాకు వెల్లడించారు. తవణంపల్లె మండలం అరగొండ పైపాకంకు చెందిన ముట్టుకూరు హేమంత్‌కుమార్ పదో తరగతి వరకు చదువుకున్నాడు. ఇతని తండ్రి రైల్వేలో ట్రాక్‌మెన్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన ఉద్యోగం చేసే సమయంలో కొందరు అధికారులతో హేమంత్ పరిచయాలు పెంచుకున్నాడు. ఈ క్రమంలో డ్రైవర్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి చిత్తూరుకు చెందిన జ్ఞానరాజ్ నుంచి రూ.4.50 లక్షలు, ప్రొటోకాల్ అటెండర్ పోస్టు ఇప్పిస్తానని చెప్పి సత్యనారాయణపురానికి చెందిన నేతాజీ నుంచి రూ.14 లక్షలు వసూలు చేశాడు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ పత్రిక జనవరి 29న హేమంత్ మోసాలపై ఓ కథనాన్ని ప్రచురించింది. దీనిపై డీఎస్పీ సుధాకర్‌రెడ్డి విచారణకు ఆదేశించారు. వన్‌టౌన్ సీఐ నరసింహరాజు నేతృత్వంలో ఎస్ఐలు శ్రీనివాసరావు, పద్మావతి దర్యాప్తు చేశారు. విచారణలో హేమంత్ మొత్తంగా రూ.1.27 కోట్లు నిరుద్యోగులను మోసగించి వసూలు చేసినట్లు తేలింది. నిందితుడు గురువారం చిత్తూరు ఆర్టీసీ బస్టాండులో తిరుగుతుండగా పోలీసులు చాకచక్యంగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. -
చిత్తూరులో నలుగురు ‘ఎర్ర’స్మగ్లర్ల అరెస్ట్
చిత్తూరు అర్బన్: ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న రెండు వాహనాలతో పాటు నలుగురు స్మగ్లర్లను చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్పీ సెంథిల్‌కుమార్, ఎస్ఈబీ ఏఎస్పీ రిశాంత్‌రెడ్డి, డీఎస్పీ సుధాకర్‌రెడ్డి శనివారం వివరాలు వెల్లడింఋచారు. పెనుమూరు క్రాస్ వద్ద తనిఖీలు చేస్తుండగా తిరుపతి వైపు నుంచి చిత్తూరుకు కారు, లారీ అతివేగంగా రావడాన్ని పోలీసులు గమనించారు. వాటిని ఆపాలని ప్రయత్నించినా, పోలీసు వాహనాలను ఢీకొట్టి వారు ముందుకు పోనిచ్చారు. వెంటనే పోలీసులు ఆ వాహనాలను వెంబడించి పట్టుకుని నలుగురిని స్మగ్లర్లు శివయ్య, రిటైర్డ్ ఫారెస్ట్ ఉద్యోగి కె.కృష్ణయ్య, ఏ.కిరణ్, వి.బాలాజీలను అరెస్ట్ చేశారు. వాహనాల్లో సుమారు రూ.2.5 కోట్లు విలువ చేసే 5.2 టన్నుల బరువు గల 182 ఎర్రచందనం దుంగలను సీజ్ చేశారు. ప్రధాన నిందితుడు శివయ్యపై వైఎస్సార్ జిల్లాలో 10 ఎర్ర చందనం కేసులు, పీడీ యాక్టు సైతం ఉన్నట్టు గుర్తించారు. -
ఓం ప్రతాప్ మృతి కేసులో చంద్రబాబుకు నోటీసులు
సాక్షి, చిత్తూరు : ఓం ప్రతాప్ మృతి కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి చిత్తూరు జిల్లా పోలీసులు నోటీసులు జారీ చేశారు. సీఆర్పీసీ సెక్షన్ 91 ప్రకారం పోలీసులు ఈ నోటీసులు జారీ చేశారు. ఓం ప్రతాప్ మృతిపై సాక్ష్యాధారాలు ఉంటే ఇవ్వాలని సదరు నోటీసుల్లో పేర్కొన్నారు. చంద్రబాబుతో పాటు ఎమ్మెల్సీ లోకేశ్, టీడీపీ నాయకుడు వర్ల రామయ్య కూడా ఈ నోటీసులు పంపారు. టీడీపీ నేతలు చేసిన ఆరోపణలపై ఆధారాలుంటే వారం రోజుల్లో తెలపాలని నోటీసులో పేర్కొన్నారు. సోమల మండలం పెద్దకాడ హరిజనవాడకు చెందిన ఓంప్రతాప్ (28) గతనెల 24న రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఓం ప్రతాప్ మృతిపై టీడీపీ నేతలు అనేక ఆరోపణలు చేసిన నేపథ్యంలో పోలీసులు ఈ నోటీసులు జారీ చేశారు. -
చిన్నారి వర్షిత హత్యకేసులో నిందితుడి అరెస్ట్
సాక్షి, చిత్తూరు: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిన్నారి వర్షిత హత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు పఠాన్ మహ్మద్ రఫీ (25) అలియాస్ గిడ్డును పోలీసులు అరెస్టు చేశారు. హత్యానంతరం గుండు లాంటి కటింగ్ చేయించుకుని తప్పించు తిరుగుతున్న రఫీని శనివారం చాకచక్యంగా పట్టుకున్నట్లు చిత్తూరు ఎస్పీ సెంథిల్‌కుమార్ మీడియాకు వివరించారు. ఈ నెల 7వ తేదీ చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలం గుట్టపాళ్యంకు చెందిన సిద్ధారెడ్డి, ఉషారాణి దంపతులు తమ మూడో కుమార్తె వర్షిత (5)ను తీసుకుని అంగళ్లు ప్రాంతంలోని ఓ వివాహ రిసెప్షన్‌కు హాజరయ్యారు. అక్కడ తప్పిపోయిన బాలిక మరుసటి రోజు ఉదయం కల్యాణ మండపం వెనుక శవమై తేలిన విషయం తెలిసిందే. హత్య జరిగిన రోజు రాత్రి వర్షిత ఓ ఉన్మాది వెంట వెళుతుండటాన్ని సీసీ ఫుటేజీల ద్వారా గుర్తించిన పోలీసులు అనుమానితుడి ఊహా చిత్రాన్ని అన్ని స్టేషన్లకు పంపించారు. తీరా ఈ దురాగతానికి పాల్పడింది చిన్నప్పటి నుంచే పిల్లలపై లైంగిక దురాగతాలకు పాల్పడుతున్న మదనపల్లె ప్రాంతంలోని బసినికొండకు చెందిన రఫీగా పోలీసులు గుర్తించారు. కురబలకోట మండలం అంగళ్లు ప్రాంతంలోని మొలకవారిపల్లెలో ఉంటున్న తన భార్య ఇంటికి వచ్చిన రఫీ పాపకు చాక్లెట్లు ఆశ చూపించి తీసుకెళ్లి అత్యాచారంచేసి ఆపై హత్య చేసినట్లు తేలడంతో నిందితుడ్ని అరెస్టు చేశారు. చిన్నతనంలోనే వక్రబుద్ధి.. జైలు పోలీసుల విచారణలో రఫీ దుర్మార్గపు వాంఛలు వెలుగుచూశాయి. బసినికొండలో 15 ఏళ్ల వయస్సున్నప్పుడే ఆరో తరగతి చదువుతున్న బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. అప్పట్లో పోలీసులు జువైనల్‌హోమ్‌కు తరలించారు. ఏడాదిన్న క్రితం అంగళ్లులో 12 ఏళ్ల వయస్సున్న బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. పాప తల్లిదండ్రులు, గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెనుకంజవేశారు. తాజాగా వర్షితను పొట్టనపెట్టుకున్నాడు. -
ఏముందో అక్కడ?
చిత్తూరు పోలీసు శాఖలో జరగాల్సిన బదిలీల కౌన్సెలింగ్‌లో అయినవారిని అందలం ఎక్కించడానికి కొందరు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారా..? ఇందులో భాగంగానే ఐదు ప్రధాన విభాగాలను అడగొద్దంటూ సిబ్బందికి ఆప్షనల్ ఫారమ్‌లో సూచించారా..? ఈ లెక్కన పదోన్నతి పొందిన సిబ్బందికి నిర్బంధ బదిలీ చేస్తున్నారా..? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇక్కడ పనిచేస్తున్న ఎస్పీ బదిలీ కావడంతో.. పోలీసుశాఖలో ‘కీ’లకంగా ఉన్న ఓ అధికారి బదిలీల వ్యవహారంలో రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాక్షి, చిత్తూరు అర్బన్: పోలీసుల బదిలీల కౌన్సెలింగ్ ఉత్తర్వులపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆప్షనల్స్‌గా కొన్ని విభాగాలను ఎంచుకోకూడదన్న నిబంధనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ శాఖలను ఎందుకు ఎంచుకోకూడదు? ఎవరికోసం ఆ నిబంధన పెట్టారు.. ఇంతకీ అక్కడ ఏముంది? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గత ఏడాది పెద్ద ఎత్తున పోలీసు సిబ్బందికి పదోన్నతులు కల్పించిన విషయం తెలిసిందే. చిత్తూరు పోలీసు జిల్లాలో 104 మంది కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా.. 46 మంది హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐలుగా పదోన్నతులు లభించాయి. వాస్తవానికి వీరికంతా పదోన్నతి వచ్చిన వెంటనే కౌన్సెలింగ్ నిర్వహించి ఏ స్టేషన్లలో ఖాళీ ఉంటే అక్కడ పోస్టింగ్‌లు ఇవ్వాలి. అప్పటికింకా ఎన్నికల హడావుడి కూడా లేదు. కనీసం ఈ ఏడాది జనవరిలో బదిలీలు చేసుంటే సరిపోయి ఉండేది. అలా కాకుండా సార్వత్రిక ఎన్నికలు మొత్తం పూర్తయ్యాక పదోన్నతి పొందిన 150 మంది సిబ్బందికి రెండు రోజుల్లో కౌన్సెలింగ్ నిర్వహించడానికి ఓ అధికారి తహతహలాడుతున్నారు. ఇప్పటికే విక్రాంత్ పాటిల్ స్థానంలో చిత్తూరు ఎస్పీగా అప్పలనాయుడును నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు సైతం జారీచేసింది. ఇలాంటి తరుణంలో బదిలీల కౌన్సెలింగ్ పూర్తిచేయాలని చూడడం విమర్శలకు దారితీస్తోంది. ఇంతకూ ఏముందో అక్కడ..? బదిలీల కౌన్సెలింగ్‌కు హాజరుకావాల్సిన 150 మంది సిబ్బందికి జిల్లా పోలీసుశాఖ నుంచి ఓ ప్రొఫార్మా అందింది. ఇందులో సొంత ఊరు కోరుకోకూడదనే ఓ అంశాన్ని ఉంచారు. ఇది బాగానే ఉంది. ఎక్కడకు బదిలీ కావాలో అయిదే స్టేషన్లను ఎంచుకోవాలి సూచించారు. ఇది కూడా బాగానే ఉంది. అయితే స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ), డీసీఆర్బీ (క్రైమ్ రికార్డ్స్), ఐటీ కోర్, డీటీసీ, పోలీస్ కంట్రోల్ రూమ్‌లను ఆప్షనల్‌గా ఎంచుకోకూడదని చెప్పడం వివాదానికి తెరలేపినట్లయ్యింది. అంటే ఈ ఐదు విభాగాల్లో ప్రస్తుతం పనిచేస్తున్నవారికి బదిలీలు ఉండవా..? చేయకూడదా..? మరెవరూ ఇక్కడ పనిచేయకూడదా..? వాటికి అంత ప్రత్యేకత ఏముంది..? అంటూ కడుపుమండిన సిబ్బంది అధికారులపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. పైగా ఈ ఐదు విభాగాల్లో ఓ సామాజికవర్గానికి చెందిన సిబ్బంది ఏళ్ల తరబడి పనిచేస్తున్నారు. గత ఐదేళ్లలో అయితే టీడీపీ నేతలు చెప్పిందే అన్నట్లు కొందరు నడుచుకుని రూ.లక్షలు కూడబెట్టుకున్నారు. అలాంటి వారిని కదిలించకుండా బదిలీల్లో వీటిని కోరుకోకూడదని చెప్పడం ఎంతవరకు సమంజసమని వారు అడుగుతున్నారు. పాతుకుపోయిన వారి పొజిషన్ ఏంటో..! జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో ఐదేళ్లకు పైగా పనిచేస్తున్న సిబ్బందిని కదిలించడానికి ఎవరూ సాహసం చేయలేకపోతున్నారు. గత ఏడాది కూడా ఐదేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న వారికి బదిలీల కౌన్సెలింగ్ చేపట్టలేదు. కొన్నిచోట్ల అటాచ్మెంట్ల పేరిట కాలం నెటుకొచ్చేవారు ఉన్నారు. పదోన్నతి పొందిన 150 మంది సిబ్బందికి స్టేషన్లు కేటాయించాలంటే లాంగ్ స్టాండింగ్, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ఆయా స్థానాల్లో కదిలించాలి. అప్పుడు ఏర్పడే ఖాళీలను కౌన్సెలింగ్‌లో ఉంచాలి. కనీసం స్టేషన్ల వారీగా ఏఎస్ఐ, హెడ్‌కానిస్టేబుల్ పోస్టులు ఎన్ని మంజూరయ్యాయనే వివరాలు కూడా చెప్పకుండా ఏకపక్షంగా బదిలీలు చేయడంపై సొంత శాఖలోని సిబ్బంది అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. -
సీరియల్ కిల్లర్ శుక్రవారపు హత్యలు
ఎన్నో హత్యలు.. కొన్ని పోలీసుల రికార్డుల్లో నమోదయ్యాయి. మరికొన్ని కాలేదు. మరెన్నో హత్యాయత్నాలు. 50కు పైగా చోరీలు.. దోపిడీలు. సైకో సీరియల్ కిల్లర్ మునస్వామిను పట్టుకోవడంలో చిత్తూరు పోలీసు యంత్రాంగం పడ్డ శ్రమ, కష్టం ఎందరో ప్రాణాలను నిలబెట్టింది. వరుస హత్యల కేసులో నిందితుడ్ని పోలీసులు అరెస్టు చూపించడంతో ఊపిరి పీల్చుకున్నట్లయ్యింది. అయితే మునస్వామి చేసిన దారుణాల్లో 99 శాతం శుక్రవారం అర్ధరాత్రి, తెల్లవారుజామునే చేయడం గమనార్హం. చిత్తూరు అర్బన్: ఉన్మాద హంతకుడు మునస్వామి (42)ను అరెస్టు వివరాలను మంగళవారం చిత్తూరు ఎస్పీ రాజశేఖర్‌బాబు మీడియాకు తెలియజేశారు. స్థానిక పోలీసు అతిథిగృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీలు ఐ.రామకృష్ణ, సుబ్బారావుతో కలిసి ఎస్పీ వివరాలను వెల్లడించారు. జిల్లాలో గత నెల 25న నగరికి చెందిన రత్నమ్మ (62), పాలసముద్రానికి చెందిన వళ్లియమ్మ (68) హత్య కేసుల్లో ఇతడు ఉన్మాది వ్యవహరించినట్లు స్పష్టం చేశారు. శుక్రవారం హత్యలు.. జిల్లాలో జరిగిన రెండు హత్యలతో పాటు ఈనెల 16న తమిళనాడు రాష్ట్రంలో చేసిన హత్యలున్నీ దాదాపు శుక్రవారమే చేసినట్లు విచారణలో తేలింది.వేలూరులోని కొండపాలయం వద్ద దైవయాన (60)ను , గతేడాది డిసెంబరు 9న (శుక్రవారం అర్ధరాత్రి), వేలూరు జిల్లా నెమలి తాలూకాలో శకుంతల (65)ను, అదే ఏడాది ఫిబ్రవరి నెల ఓ శుక్రవారం మరో హత్య, మేలోని మరో శుక్రవారంలో రూ.50 కోసం ఏడాదిన్నర వయస్సున్న బాలికను హత్య చేసినట్లు తమిళనాడు పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇవి కాకుండా ఈనెల 16న (శుక్రవారం) తమిళనాడులోని వేలూరు తాలిక్కాల్ గ్రామం శాంతమ్మ (65)పై బండరాయి వేసి హత్యాయత్నం, గతేడాది డిసెంబరు 9న (శుక్రవారం) వేలూరు జిల్లా నెమలి తాలూక పల్లికన్నత్తూరుకు చెందిన లక్ష్మి (45)పై రాయి వేసి హత్యాయత్నం, డిసెంబరు 30న (శుక్రవారం అర్ధరాత్రి) తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా పళ్లిపట్టు తాలూక త్యాగాపురంలో ప్రమీళ (25) అనే మహిళపై బండరాయి వేసి హత్యాయత్నాలకు పాల్పడ్డాడు. తల్లిదండ్రుల ప్రేమానురాగాలు పొందలేకపోవడం, నేరం చేసినప్పుడు పోలీసుల ప్రవర్తన, సమాజం తనను చూసిన విధానాలే మునస్వామి ఉన్మాది మారడానికి కారణమైనట్లు తేలింది. మరిన్ని కేసులు.. 1992లో తమిళనాడులోని వాలాజ ప్రాంతంలోని చేసిన చోరీ ఇతని నేర ప్రయాణానికి పునాదిగా మారింది. దాని తరువాత 1994లో రాణిపేటలో జరిగిన 3 చోరీల్లో నాలుగు నెలల జైలుశిక్ష, 1996లో రెండు చోరీల్లో 2 నెలల జైలుశిక్ష, 2000లో మూడు చోరీ కేసుల్లో 10 నెలల జైలుశిక్ష, 2001లో తొమ్మిది చోరీల్లో 10 నెలల జైలుశిక్ష, 2007లో ఓ హత్య, దోపిడీ, ఆరు చోరీల్లో 66 నెలల జైలుశిక్ష అనుభవిం చాడు. ఇప్పటి వరకు ఒక్కటి మినహా మిగిలిన హత్యలన్నీ మునస్వామి శుక్రవారమే చేసినట్లు పోలీసులు తెలిపారు. వృద్ధ మహిళల్ని చంపి.. మృతదేహాల ఛాతి భాగాన్ని పళ్లతో కొరకి మృనస్వామి వికృతానం దం పొందేవాడని విచారణలో స్పష్టమైంది. అత్యాచారం చేస్తే తనకు ఎయిడ్స్ సోకుతుందనే భయంతో అత్యాచారానికి పాల్పడలేదని విచారణలో తెలిపడం Výæమనార్హం. ఇక బంగారు ఆభరణాలు దొంగిలిస్తే వీటిని అమ్మేటప్పుడు పోలీసులకు దొరికిపోతామని ఎక్కడా బంగారం ముట్టేవాడుకాదు. కానీ హత్యా స్థలాల్లో అతడి వేలిముద్రలు నమోదయ్యాయి. పట్టించిన టెక్నాలజీ.. వేలిముద్రల ఆధారంగా దాదాపు 52 వేల పాత నేరస్తుల వేలిముద్రలను పరిశీలించిన పోలీసుశాఖకు వేలూరు జిల్లా పోలీసుల వద్ద ఉన్న ముద్రలతో సరిపోలాయి. వీటి ఆధారంగా చిత్తూరు పోలీసులు ఉపయోగిస్తున్న ఫేస్టాగర్ ఆధారంగా మునస్వామి ఫొటో ప్రత్యక్షమవడంతో అతన్ని కాపుకాసి పట్టుకోవడంతో మరిన్ని సీరియల్ హత్యలు జరగకుండా పోలీసులు నిరోధించారు. ఈ కేసు ఛేదనలో దాదాపు 60 మంది వరకు పోలీసు అధికారులు, సిబ్బంది కష్టపడ్డారు. ప్రధానంగా చిత్తూరు సీసీఎస్ డీఎస్పీ ఐ.రామకృష్ణ, అర్బన్ డీఎస్పీ సుబ్బారావుతో పాటు పశ్చిమ సీఐ ఎం.ఆదినారాయణ, వేలిముద్రల సేకరణ నిపుణులు దినేష్‌కుమార్, దస్తగిరీషా, స్పెషల్ పార్టీ, క్రైమ్ పార్టీ, తాలూక, పశ్చిమ విభాగం పోలీసుల్ని ఎస్పీ రాజశేఖర్‌బాబు అభినందించి నగదు రివార్డులను అందజేశారు. -
వ్యక్తి సజీవ దహనం..
-
మధుకరా.. భయంకరా!
4 హత్యలు.. 3 హత్యాయత్నాలు పదుల సంఖ్యలో దోపిడీలు బెంగళూరు ఏటీఎం కేసుతో సంచలనం నాలుగు రాష్ట్రాల ఖాకీలకు ముప్పుతిప్పలు చివరకు జిల్లా పోలీసులకు చిక్కిన వైనం చిత్తూరు (అర్బన్): 300 మంది పోలీసులు.. 25 ప్రత్యేక బృందాల కళ్లు గప్పి తిరుగుతున్నాడు.. నాలుగు రాష్ట్రాల పోలీసుల్ని ముప్పుతిప్పలు పెట్టాడు. చివరకు మదనపల్లె పోలీసులకు పట్టుపడ్డాడు. అతనే కొండయ్యగారి మధుకర్‌రెడ్డి. బెంగళూరులో ఏటీఎంలో మహిళపై హత్యాయత్నం కేసులో నిందితుడు. తంబళ్లపల్లె నియోజకవర్గం బాలిరెడ్డిగారి పంచాయతీ, దిగువపల్లెకు చెందిన కె.రామచంద్రారెడ్డి కుమారుడే మధుకర్‌రెడ్డి (38). పదో తరగతి చదువుకున్న ఇతనికి పెద్దలు పెళ్లి చేసినా ప్రవర్తన నచ్చక భార్య వదిలి వెళ్లిపోయింది. 2005లో దిగువపల్లెలో నీటి విషయమై ఆనందరెడ్డిపై బాంబులు వేసి చంపడంతో న్యాయస్థానం ఇతనికి జైలుశిక్ష విధించింది. శిక్ష అనుభవిస్తూ కడప జైలు నుంచి తప్పించుకున్న ఇతను నేరాలు చేయడమే ప్రవృత్తిగా ఎంచుకున్నాడు. తంబళ్లపల్లె కాకుండా హైదరాబాద్, మహబూబ్‌నగర్, పీలేరు ప్రాంతాల్లో మూడు హత్యలు చేసినట్లు పోలీసుల ఎదుట అంగీకరించాడు. అనంతపురం, కదిరి, ధర్మవరం, బెంగళూరు, జడ్చర్ల ప్రాంతాల్లో హత్యాయత్నాలు చేశాడు. మదనపల్లెలో తన తల్లిదండ్రులకు చెందిన ఓ ఇళ్లు ఉండటంతో తరచూ అక్కడి వస్తూ పోలీసులకు చిక్కాడు. పోలీసులకు షాక్... మధుకర్‌రెడ్డి కడప జైలు నుంచి తప్పించుకున్న విషయం మాత్రమే తొలుత పోలీసులకు తెలుసు. ఇటీవల పాత నేరస్తుల వేలి ముద్రలను ట్యాబ్‌లలో అప్లోడ్ చేసి వాళ్లను గుర్తించే సాఫ్ట్‌వేర్‌ను అమల్లోకి తీసుకొచ్చిన జిల్లా పోలీసులకు మధుకర్‌రెడ్డి దొరికిపోయాడు. గత నెల 30న మదనపల్లెలో గస్తీలో ఉన్న ఎస్ఐ తిప్పానాయక్ సిబ్బంది శ్రీనివాసులు, రాఘవలతో పాటు ఓ సీపీవోలు మధుకర్‌రెడ్డిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నాలుగు రోజులు విచారించిన పోలీసులకు దిమ్మదిరిగే వాస్తవాలు తెలిశాయి. నిందితుడు చెప్పిన విషయాలతో పీలేరులో యశోదమ్మ హత్య తరువాత కదిరిలోని ఏటీఎంలో డబ్బులు తీస్తున్న ఫుటేజీలను పోలీసులు గుర్తించారు. హైదరాబాద్, జడ్చర్ల, కదిరి, కేరళ, కర్ణాటక పోలీసులు ఇతన్ని పీటీ వారెంట్‌పై తీసుకుని దర్యాప్తు చేయనున్నారు. పదుల సంఖ్యలో మధుకర్రెడ్డిపై ఉన్న దోపిడీ కేసులను సైతం పోలీసులు విచారించాల్సి ఉంది. మధుకర్‌రెడ్డిని అరెస్టు చేయడంలో ప్రతిభ చూపించిన మదనపల్లె పోలీసుల్ని ఎస్పీ అభినందించారు. సీఐ హనుమంతప్పనాయక్‌తో పాటు ఎస్ఐ తిప్పానాయక్, సిబ్బంది శ్రీనివాస్, రాఘవ, నర్సిం హులు, మొహీద్దీన్‌లను అభినందించారు. మదనపల్లె డీఎస్పీ రాజేంద్రప్రసాద్, చిత్తూరు డీఎస్పీలు రామక్రిష్ణ, లక్ష్మీనాయుడు, సీఐ నాగరాజు, విజయకుమార్ పాల్గొన్నారు. -
పలమనేరులో నకిలీ దొంగల ముఠా అరెస్ట్
చిత్తూరు: పలమనేరులో అంతర్రాష్ట్ర నకిలీ దొంగల ముఠా గుట్టును చిత్తూరు జిల్లా పోలీసులు రట్టు చేశారు. వారి వద్ద నుంచి 20 గ్రాముల బంగారంతోపాటు నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ముఠా సభ్యులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి... దర్యాప్తు చేస్తున్నారు. -
పోలీసులు ఉక్కిరి బిక్కిరి
నేడు కేంద్ర మంత్రి,రేపు సీఎం రాక, 3 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు విధుల ఒత్తిడితోసతమతం తిరుపతి క్రైం : ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో పనిచేస్తున్న పోలీసులు ప్రస్తుతం పరుగులు తీయాల్సి వస్తోంది. ఒక వైపు నేరాల సంఖ్య పెరగడం, మరోవైపు ప్రముఖుల భద్రత కోసం క్షణం తీరిక లేకుండా పనిచేయాల్సి రావడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సిబ్బంది తక్కువగా ఉండడంతో పనిభారం పెరి గి ఒత్తిడికి గురవుతున్నా రు. నగరంలో శుక్రవారం కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు భారీ సభ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ముగిసే లోపే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం తిరుపతి వస్తున్నారు. 3వ తేదీ నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు మొదలుకానున్నాయి. దీంతో ఇంట్లో వారితో కూడా గడపలేకుండా పోతున్నారు. వీఐపీల తాకిడి ఆధ్యాత్మిక జిల్లా కావడంతో నిత్యం వీఐపీల తాకిడి ఉంటోంది. అదేవిధంగా ఏదో ఒక విషయంపై రాజ కీయ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు ఆందోళనలు చేస్తుం టారు. వీటికితోడు నేరాలతో పోలీసులపై పని భారం అమాంతం పెరిగిపోయింది. ప్రముఖల రక్షణ కోసం ఎండనక, వాననక తిరగాల్సి వస్తోంది. జిల్లాలో ఏ సంఘటనలు చోటు చేసుకున్నా అటువైపు పరుగులు తీయాల్సి వస్తోం ది. నగరంలో ఊహించని విధంగా పెరిగిన ట్రాఫిక్‌ను కట్టడి చేయాలంటే తలప్రాణం తోకకు వస్తోంది. శ్రీవారి బ్రహ్మోత్సవాలు మొదలుకాక ముందే వీఐపీల పర్యటనతో పోలీసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అటకెక్కిన వారాంతపు సెలవు జిల్లా పోలీసులకు పనిభారం ఎక్కువ కావడంతో వారాంతపు సెలవు ఇస్తామని గతంలో అధికారులు చెప్పారు. అమలు చేయడంలో నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్నారు. సీఎం చంద్రబాబు జిల్లాకు నెలకు రెండుసార్లయినా వస్తుంటారు. ఎప్పుడూ ఎవరో ఒక మంత్రి, ఏదో ఒక కమిటీ సభ్యులు వస్తూనే ఉంటారు. దీంతో ఎర్రటి ఎండలో పోలీసులు నిలబడి డ్యూటీ చేయాల్సిందే. 3 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు 3వ తేదీ నుంచి 11 వరకు జరగనున్నాయి. బందో బస్తులో 30 మంది డీఎస్పీలు, 65 మంది సీఐలు, 220 మంది ఎస్ఐలు, 470 మంది ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, 1700 మంది పీసీలు, 500 మంది హోంగార్డులు, 200 మంది మహిళా పీసీలు, 500 మంది మహిళా హోంగార్డులు, 15 టీమ్‌లకు చెందిన ఏఆర్, బాంబ్‌స్క్వాడ్, డాగ్‌స్క్వాడ్ సిబ్బంది పాల్గొననున్నారు. అప్పటి వరకు ఈ హడావుడి తగ్గే అవకాశం లేదు. -
పేకాటలో రూ.5 కోట్లు పోగొట్టుకున్నాడు
చిత్తూరు (అర్బన్): పేకాట వ్యసనంతో దాదాపు రూ.5 కోట్లు పోగొట్టుకున్నాడో వ్యాపారి. జరగాల్సిన నష్టం జరిగిపోయాక తమిళనాడులోని వేలూరు ఎస్పీ పగలవన్‌కు శనివారం ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా పాకాల మండలానికి చెందిన ఓ వ్యాపారి తిరుపతిలో వస్త్ర వ్యాపారం చేస్తున్నాడు. ఇతనికి పేకాట బలహీనత. ఈ నేపథ్యంలో చిత్తూరుకు చెందిన బీగాల్ సురేష్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. సురేష్ పేకాట జరిపిస్తూ రోజుకు జరిగే లావాదేవీల్లో 10 శాతం కమిషన్ తీసుకుంటాడని, పేకాటలో డబ్బు పోగొట్టుకున్న వాళ్లకు రోజుకు రూ.10 వడ్డి చొప్పున అప్పులు ఇస్తుంటాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇతని మాయలో పడ్డ తాను ఆరు నెలలుగా పేకాటకు మరింత బానిస అయినట్లు ఎస్పీ ఎదుట ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటికే సురేష్‌ను చిత్తూరు పోలీసులు పలుమార్లు అరెస్టు చేసినట్లు చెప్పాడు. కొంత కాలంగా సురేష్.. పొన్నై, వేలూరు, గుడియాత్తం ప్రాంతాల్లో ఓ వాహనం తిప్పుతూ అందులో పేకాట నిర్వహించి తన వద్ద రూ.5 కోట్ల వరకు కాజేసినట్లు వాపోయాడు. ఈ విషయం చిత్తూరు పోలీసులకు చెప్పడంతో.. పేకాట తమిళనాడులో సాగడంతో అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేయమని సూచించారన్నాడు. బీగాల్ సురేష్ ఫొటోను సైతం ఎస్పీకి అందజేశాడు. కేసు నమోదు చేసిన వేలూరు పోలీసులు సురేష్ కోసం గాలిస్తున్నారు. ఇతనితో పాటు పేకాట స్థావరాల్లో అధిక వడ్డీలకు నగదు ఇచ్చే మరో ముగ్గురు వ్యక్తుల కోసం సైతం తమిళనాడు పోలీసులు చిత్తూరులో గాలిస్తున్నారు. -
రూ. 4 కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం
చిత్తూరు : తమిళనాడులోని కృష్ణగిరి, చిత్తూరు రూరల్ పరిధిలో 196 ఎర్రచందనం దుంగలను పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా వారిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మూడు వాహనాలను కూడా పోలీసులు సీజ్ చేశారు. పట్టుబడిన ఎర్రచందనం విలువ రూ. 4 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. -
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
చిత్తూరు : తాళం వేసి ఉన్న ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాగుట్టును చిత్తూరు పోలీసులు రట్టు చేశారు. చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండల పరిధిలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 5 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అక్రమ అరెస్టులకు భయపడేది లేదు: చెవిరెడ్డి
తిరుపతి: అక్రమ అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదని చంద్రగిరి ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి స్పష్టం చేశారు. గురువారం తిరుపతి గ్రామీణ మండలం పేరూరు గ్రామంలోని రెవెన్యూ అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై ఆయన మండిపడ్డారు. రెవెన్యూ అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తోన్నారని ఆరోపించారు. ఎనిమిదేళ్లుగా ఆస్తిపన్ను, కరెంటు బిల్లులు కడున్నారని... అలాంటి పేదల ఇళ్లు కూల్చడం దుర్మార్గమని ఆయన పేర్కొన్నారు. బాధితులకు న్యాయం జరిగేందుకు కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. బాధితుడి పక్షాన వెళ్లినందుకు నన్ను అరెస్ట్ చేస్తారా ? అని పోలీసులపై చెవిరెడ్డి భాస్కరరెడ్డి మండిపడ్డారు. -
దొంగలకూ 'భయో' మెట్రిక్..!
ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగులు, కార్పొరేట్ సంస్థల్లోని సిబ్బంది, విద్యార్థుల హాజరు శాతం తెలుసుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తున్న బయోమెట్రిక్ యంత్రాలు ఇప్పుడు దొంగలకు సైతం వాడనున్నారు. క్రిమినల్స్ డిటెన్షన్ సిస్టమ్ (సీడీఎస్) పద్దతిని జిల్లా కేంద్రమైన చిత్తూరులో ప్రయోగాత్మకంగా ఉపయోగించనున్నారు. చిత్తూరు : సాధారణంగా బయోమెట్రిక్ యంత్రాలను ఉద్యోగుల హాజరు శాతానికి ఉపయోగిస్తుంటారు. ఇటీవల నిత్యావసర వస్తువుల పంపిణీ, అంగన్వాడీ కేంద్రాల్లో హాజరు శాతం తదితర వాటికి సైతం వాడుతున్నారు. ఇప్పడు దొంగలకు కూడా బయోమెట్రిక్ పరికరాలను ఉపయోగించనున్నారు. పోలీసుల బయోమెట్రిక్ యంత్రాలను ఉపయోగిస్తూ పాత నేరస్తులను పట్టుకోనున్నారు. ఆన్లైన్లో వివరాలు.. పొలాల్లోని మోటార్లకు ఉన్న వైర్లను చోరీ చేయడం, తాళాలు వేసిన ఇళ్లను పగులగొట్టి చోరీలు చేయడం, ద్విచక్రవాహనాల చోరీ, చైన్ స్నాచింగ్ జిల్లాలో ఎక్కువ సంఖ్య లో జరిగే చోరీలు ఇవే. పోలీసు స్టేషన్లలో నమోదవుతున్న నేరాల్లో ఇవి 40 శాతానికి పైనే ఉన్నాయి. ఈ నేరాలను చోరీలకు అలవాటు పడిన పాత నేరస్తులే ఎక్కువగా చేస్తున్నారు. వీరికి చెక్ పెట్టడానికి ఇటీవల జిల్లా పోలీసులు సీడీఎస్ అనే సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. ఇటీవల చిత్తూరుకు వచ్చిన డీజీపీ ఈ కొత్త వ్యవస్థను ప్రారంభించి, సీడీఎస్ కోసం ఐదు కొత్త ట్యాబ్‌లను సైతం అందజేశారు. ఈ ట్యాబ్‌ల్లో ఐదేళ్ల కాలంలో జిల్లాలో జరిగిన చోరీలు, పిక్‌పాకెటింగ్‌లకు సంబంధించిన 1860 మంది నేరస్తుల వేలి ముద్రలను నిక్షిప్తం చేశారు. వీటన్నింటినీ సీడీఎస్‌కు అనుసంధానం చేశారు. ముద్ర పడితే తెరపై బొమ్మ... రాత్రి పూట గస్తీలో ఉన్న పోలీసులు పాత నేరస్తుల ఉనికి గుర్తించడానికి, వాళ్ల మదిలో ఉన్న నేరప్రవృత్తి ఆలోచలను ముందస్తుగా పసిగట్టడానికి ట్యాబ్‌లను ఉపయోగించనున్నా రు. అనుమానితులు రాత్రులు, నిషేధిత ప్రాంతాల్లో తిరుగుతుంటే పోలీసులను వాళ్లను పిలిచి ముందుగా పేరు అడుగుతారు. దొంగ తన పేరు మురళి అని చెప్పి తప్పించుకోవడానికి చూస్తే వెంటనే అతని వేలి ముద్ర సేకరిస్తారు. సీడీఎస్‌లో నిక్షిప్తమైన సమాచారంలో పాత నేరస్తుడి పేరు రాజేష్ అని చూపిస్తుంది. దీనికి తోడు జిల్లాలో అతనిపై ఏయే పోలీసు స్టేషన్లలో కేసులు ఉన్నాయి? ఎక్కడ శిక్షలు పడ్డాయి? అనే అన్ని వివరాలు, ఫొటో తెరపై ప్రత్యక్షమవుతుంది. దీంతో వారిని అరెస్టు చేసే వీలు ఉంటుంది. అన్నీ పనులు త్వరగా పూర్తయితే జూన్ తొలి వారంలో ఈ పద్ధతిని జిల్లా కేంద్రంలో అమలు చేస్తారు. దశల వారీగా జిల్లా మొత్తం ఈ పద్ధతిని వినియోగించడాని పోలీసు శాఖ సిద్ధమవుతోంది. -
ఎయిర్ హోస్టెస్..ఆపై మోడల్..ఇప్పుడు స్మగ్లర్
ఖరీదైన కార్లు, విలాసవంతమైన జీవితం. పాశ్చాత సంస్కృతిని తలపించే విధంగా పబ్బులు, డిస్కోల్లో తైతక్కలు. అబ్బో.. ఇక చెప్పుకుంటూ వెళ్తే అంతటితో ఆగదు. పైగా ఎర్రచందనం స్మగ్లింగ్ చేయిస్తూ స్మగ్లర్లకు రూ. కోట్లలో నగదు పంపిణీ. ఇంత చేస్తున్నదీ ఓ యువతి. ఆమె పేరే సంగీత చటర్జీ. వైఫ్ ఆఫ్ లక్ష్మణ్.. చిత్తూరు పోలీసులు రెండు రోజుల క్రితం నిర్వహించిన ఆపరేషన్ రెడ్‌లో అరెస్టయ్యింది. ఈనెల 18న యువతిని చిత్తూరుకు తీసుకురావడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. చిత్తూరు (అర్బన్): సంగీత చటర్జీ పేరు ఆపరేషన్ రెడ్‌లో కొత్తగా తెర పైకి వచ్చి న పేరు. ఇప్పటికే ఈమె భర్త లక్ష్మణ్‌పై జిల్లాలో పదుల సంఖ్యలో కేసులున్నా యి. ఎర్రచందనం దుంగల్ని చెన్నై, ముంబాయ్‌తో పాటు విదేశాలకు సైతం తరలించేవాడు. 2014 జూన్‌లో ఇతన్ని అరెస్టు చేసిన చిత్తూరు పోలీసులు 2015 జూలై వరకు పీడీ యాక్టు కింద జైల్లో ఉంచారు. బెయిల్‌పై వచ్చిన లక్ష్మణ్ తన ప్రధాన అనుచరుడు విక్రమ్‌మెహందీతో కలిసి మళ్లీ ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ ఈ ఏడాది ఫిబ్రవరిలో చిత్తూరు పోలీసులకు పట్టుబడ్డారు. తీగ లాగిన పోలీసులకు సంగీత విషయం వెలుగు చూసింది. లక్ష్మణ్ అయిదేళ్ల క్రి తం సంగీతను రెండో పెళ్లి చేసుకున్నా డు. విలాసవంతమైన జీవనం సంగీత ప్రపంచం. కోల్‌కతాలో ఎయిర్హోస్ట్గా పనిచేసేప్పుడు పలువురు అంతర్జాతీ య స్మగ్లర్లతో ఈమెకు పరిచయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కొద్దిరోజుల తరువాత మోడల్‌గా రాణించి పలు యాడ్స్‌లో సైతం నటించింది. అయితే లక్ష్మణ్ జైల్లో ఉన్న సమయంలో ఉత్తర భారతానికి చెందిన పలువురు స్మగ్లర్లకు భారీగా నగదు ముట్టచెప్పి ఎర్రచందనం దుంగల్ని విదేశాలకు తరలినట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై లోతుగా విచారిస్తే సంగీత చటర్జీ పేరు బయటకొచ్చింది. బర్మా నుంచి సంగీత హవాలా రూపంలో చెన్నైకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్ మోజెస్ ద్వారా రూ.10 కోట్లకు పైగా చెల్లింపులు చేసినట్లు గుర్తించారు. ఈమెను పట్టుకోవడానికి చిత్తూరు ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ నుంచి అధికారులకు ఆదేశాలు అందాయి. చిత్తూరు మహిళా డీఎస్పీ గిరిధర్, పశ్చిమ సీఐ ఎం.ఆదినారాయణ తమ సిబ్బందితో కలిసి కోల్‌కతాకు చేరుకున్నారు. శనివారం సంగీత చటర్జీను కోల్‌కతాలోని న్యూగరియాలో అరెస్టు చేశారు. ట్రాన్సిట్ వారెంట్‌పై చిత్తూరుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తే స్థానికంగా ఇబ్బందులు వచ్చాయి. దీంతో ఆమెను అక్కడి కోర్టులో అరెస్టు చూపించారు. ఒకరోజు తరువాత సంగీత బెయిల్‌పై విడుదలైంది. ఈమెపై జిల్లాలో నాలుగు పోలీసు స్టేషన్లలో కేసులు ఉన్నాయి. యాదమరి, గుడిపాల, కల్లూరు, నిండ్ర స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. కోల్‌కతాలో బెయిల్ వచ్చినప్పటికీ ఈనెల 18న చిత్తూరుకు తీసుకురావడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇక సంగీత అరెస్టు సమయంలో సీజ్ చేసిన ఆరు బ్యాంకు ఖాతాలు, ఓ లాకర్ తాళాలు చిత్తూరు పోలీసుల వద్ద ఉన్నాయి. వీటిని తీసి చూస్తే మరిన్ని విషయాలు వెలుగు చూసే అవకాశం ఉందని పోలీసు అధి కారులు చెబుతున్నారు. -
ఉన్మాదిని విచారిస్తున్న పోలీసులు
చిత్తూరు (అర్బన్): చిత్తూరు జిల్లా ఐరాల మండలంలో శనివారం రాత్రి పట్టుబడ్డ ఉన్మాది బత్తల రామచంద్రను పోలీసులు విచారిస్తున్నారు. పలు హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్న ఇతను గత ఏడాది డిసెంబరులో కడప జైలులో జీవితఖైదు అనుభవిస్తూ పారిపోవడం, తాజాగా ఐరాలలో పోలీసులకు పట్టుబడటం తెలిసిందే. జైలు నుంచి ఎలా పారిపోయాడు..? ఇంతకాలం ఎక్కడ తలదాచుకున్నాడు..? అనే వివరాలను నిందితుడి నుంచి రాబట్టేందుకు చిత్తూరు పోలీసులు విచారిస్తున్నారు. విచారణ పూర్తయ్యాక ఇతన్ని అరెస్టుచూపే అవకాశం ఉంది. -
పోలీసుల అదుపులో మంత్రి బొజ్జల అనుచరుడు
చిత్తూరు : చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం అబ్బాబట్లపల్లె సమీపంలో భారీగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. అందుకు సంబంధించి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అనుచరుడి హస్తం ఉందని డ్రైవర్... పోలీసులకు తెలిపాడు. దీంతో బొజ్జల అనుచరుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పట్టుబడిన ఎర్రచందనం విలువ రూ. కోటి ఉంటుందని పోలీసులు చెప్పారు. -
మేయర్ దంపతుల కేసులో దర్యాప్తు పూర్తి
► నిందితుల వేట పూర్తి ► 23 మందిపై సిద్ధమవుతున్న చార్జిషీట్ ► వందమందికి పైగా సాక్ష్యులు..? ► ఈ వారంలోనే కోర్టుకు అభియోగ పత్రం చిత్తూరు: చిత్తూరు మేయర్ అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ల హత్య కేసులో నిందితుల అరెస్టుల పర్వం ముగిసింది. ఈ కేసులో అజ్ఞాతంలో ఉన్న నిందితుడు ఆర్వీటీ.బాబును అరెస్టు చూపడం ద్వారా ఇప్పటి వరకు కేసు నమోదైన 23 మందిని పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. హత్య జరిగిన తీరు, ప్రత్యక్ష సా క్ష్యుల వాంగ్మూలం నమోదు చేసిన పోలీసులు తాజాగా హైదరాబాదు నుంచి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్) రిపోర్టులు కూడా తెప్పించున్నారు. దీంతో కేసు దర్యాప్తు పూర్తయినట్లే. నిందితులపై చార్జ్‌షీట్ దాఖలు చేయడంపై సిద్ధమవుతున్న పోలీసులు ఈ వారంలోనే దాన్ని న్యాయస్థానానికి అందజేయనున్నారు. అందరూ దొరికినట్లే... గతేడాది నవంబరు 23న చిత్తూరు కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన అనురాధ, మోహన్ల హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. జంట హత్యల్లో ప్రధాన నిందితుడు చింటూ అలియాస్ చంద్రశేఖరేనని పోలీసు నిర్ధారణకు వచ్చారు. తొలుత అయిదు మందిపై కేసు నమోదు చేసిన పోలీసులకు దర్యాప్తులో పలు వాస్తవాలు వెలుగు చూశాయి. దీంతో ఈ సంఖ్య 23కు చేరుకుంది. గత వారం వరకు పరారీలో ఉన్న బుల్లెట్ సురేష్, ఆర్వీటీ.బాబులను అరెస్టు చూపించడంతో నిందితులంతా దొరికినట్లే అయ్యింది. ఫలితంగా ఇప్పటికే చార్జ్‌షీట్ తయారు చేస్తున్న పోలీసు అధికారులకు తాజా అరెస్టులు కాస్త ఉపసమనాన్ని ఇచ్చినట్టే. అయితే జంట హత్యల కేసులో ఇప్పటి వరకు అరెస్టయిన వాళ్లు, లొంగిపోయిన వాళ్లల్లో టీడీపీకు చెందిన వాళ్లే ఎక్కువగా ఉన్నారు. శ్రీకాహళహస్తీశ్వర ఆలయ ట్రస్టుబోర్డు సభ్యుడు కాసరం రమేష్, బుల్లెట్ సురేష్, మురుగ, ఆర్వీటీ.బాబు తదితరులంతా టీడీపీలో ఉంటూ ప్రధాన నిందితుడు చింటూకు సాయం చేసినట్లు, హత్య కుట్రలో పాలు పంచుకున్నట్లు పోలీసులు నేరాభియోగ పత్రాన్ని రూపొందిస్తున్నారు. వంద మందికి పైగా సాక్ష్యులు... ఈ జంట హత్యల కేసులో చిత్తూరుతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన 130 మందిని పోలీసులు విచారించారు. అయితే తుదకు కేసు మాత్రం 23 మందిపై నమోదు చేశారు. హత్య జరిగిన ప్రాంతంలో ప్రత్యక్షంగా చూసిన వ్యక్తులతో పాటు చింటూకు, మోహన్ దంపతులకు మధ్య ఉన్న వైరం, ఇతర ఆర్థిక లావాదేవీల తగాదాలు తెలిసిన దాదాపు వంద మందికి పైగా వ్యక్తుల్ని జంట హత్యల కేసులో సాక్ష్యులుగా చేర్చినట్లు తెలుస్తోంది. మేయర్ అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో కేసు త్వరగా విచారించడానికి ప్రభుత్వం ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు బాధ్యతలు అప్పగించి, ప్రత్యేకంగా షెడ్యూల్‌ను ఇచ్చే అవకాశాలున్నాయి. -
పావని మోసాలు ఎన్నని..!
‘సాక్షి’ కథనంతో ఎస్పీని ఆశ్రయించిన బాధితులు రూ.20 లక్షలు, రూ.30 లక్షలు, రూ.15 లక్షల ఆభరణాలు ఇచ్చినట్లు వెల్లడి తన భర్త మృతికి పావని కారణమని మరో మహిళ ఫిర్యాదు నిందితురాలికి అండగా నిలిచిన పోలీసులపై కూడా కేసు నమోదు చేయాలని ఎస్పీ ఆదేశం చిత్తూరు (అర్బన్): జిల్లాలో పలువురి మహిళల్ని మోసం చేసి, వారి బంగారు ఆభరణాలను ఫైనాన్స్ కంపెనీల్లో కుదువపెట్టి, అందరికీ కుచ్చుటోపీ పెట్టిన పావని మోసాలు కోకొల్లలుగా వెలుగులోకి వస్తున్నాయి. పావని చేసిన మోసాలపై ‘సాక్షి’ దినపత్రికలో మంగళవారం ‘ఖతర్నాక్ పావని’ శీర్షికతో ప్రచురితమైన కథనం సంచలనం సృష్టించింది. పలువురు బాధితులు చిత్తూరు ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్‌ను పోలీసు మైదానంలో కలిసి తమ గోడు నివేదించారు. ఎందరో బాధితులు చిత్తూరుకు చెందిన జ్యోత్స్న పావనిపై పోలీసులకు రాత పూర్వకంగా ఫిర్యాదు చేయడంతో పలువురు బాధితులు ముందుకొచ్చారు. వీళ్లల్లో నగరంలోని మార్కెట్‌వీధికి చెందిన వాణి అనే మహిళ ఎస్పీకు తన గోడు చెప్పుకుని కన్నీటి పర్యంతమైంది. తన ఆభరణాలు పావనికి ఇచ్చినా ఆమె తిరిగి ఇవ్వకపోవడంతో తన భర్త ఆదినారాయణగుప్త ఆమెను నిలదీయడానికి వెళ్లి గత ఏడాది ఏప్రిల్ 30న తవణంపల్లెలో శవమయ్యాడని, దీనిని పావని దంపతులే కారణమని పేర్కొంది. మరో మహిళ మాట్లాడుతూ, పావని మాటలు నమ్మి బంగారు ఆభరణాలు, రూ.లక్షల్లో డబ్బులిచ్చి మోసపోయామని చెప్పుకొచ్చింది. మరో వృద్ధురాలు మాట్లాడుతూ, ఇచ్చిన ఆభరణాలు అడిగినందుకు చింటూ వద్ద పావని తమను దోషిగా నిలబెట్టిందని మొగిలి, హరిదాస్, పరంధామలకు సైతం ఇందులో సంబంధం ఉందని పేర్కొన్నారు. పావని వ్యవహారంలో పోలీసు శాఖకు చెందిన కొందరు ఆమెకు అండగా నిలిచి తమకు అన్యాయం చేశారని మరో బాధితురాలు ఆరోపించింది. తాము పావని మాటల్లో పడి రూ.15 లక్షలు, రూ.20 లక్షలు, రూ. 30 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు ఇచ్చి ఇప్పటి వరకు వాటిని తీసుకోలేదని మరికొందరు ఎస్పీ వద్ద లబోదిబోమన్నారు. అందరి గోడూ ఆలకించిన ఎస్పీ దీనిపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని చిత్తూరు మహిళా పోలీస్‌స్టేషన్ డీఎస్పీ గిరిధర్‌ను ఆదేశించారు. అంతేకాకుండా ఇందులో ప్రమేయమున్న పోలీసులపై సైతం కేసు నమోదు చేయాలన్నారు. దీంతో మహిళల నుంచి వేర్వేరుగా ఫిర్యాదులు తీసుకున్న డీఎస్పీ, వాళ్ల వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అయితే పావనికి బంగారు ఆభరణాలు ఇచ్చిన వాళ్లంతా అధిక వడ్డీకు ఆశపడి ఇంట్లో భర్త, కుటుంబ సభ్యులకు కూడా తెలియకుండా మోసపోయినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగుచూడటం కొసమెరుపు! -
కరుకు తగ్గిన ఖాకీ
చిత్తూరు : చిత్తూరు పోలీసుల పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసాంఘిక శక్తులు విజృంభిస్తున్నాయి. ఈ క్రమంలోనే మేయర్ కఠారి అనురాధ, ఆమె భర్త కఠారి మోహన్ దారుణహత్యకు గురయ్యారు. కఠారి దంపతులు హత్య ప్రణాళికాబద్ధంగా రెక్కీ నిర్వహించి మరీ చేసిందే. ఒక్కసారిగా ఇద్దరి హత్యకు కుట్ర జరిగినా పోలీసు, ఇంటెలిజెన్స్ వ్యవస్థలు పసిగట్టలేకపోయారంటే వారి పనితీరు అర్థమవుతుంది. ఓ పోలీసు అధికారి పుణ్యమా అని చిత్తూరు పోలీసులు కులాలు, వర్గాలుగా విడిపోయి శాంతిభద్రతలను గాలికొదిలేశారనే విమర్శలున్నాయి. కఠారి దంపతుల హత్యోదంతంతో పోలీసుల పనితీరు చర్చనీయాంశమయింది. పోలీసులు, ఇంటెలిజెన్స్ పని తీరుపై సాక్షాత్తూ ముఖ్యమంత్రి సైతం ఆగ్రహం వ్యక్తం చేసినా పోలీసుల్లో స్పందన కనిపించలేదు. హత్య జరిగి మూడు రోజులవుతున్నా పోలీసులు నిందితుల వివరాలు వెల్లడించకపోవడం పైనా విమర్శలున్నాయి. చిత్తూరు ఎస్పీ శ్రీనివాస్ సమర్థుడైన అధికారిగా పేరు పొందినా ప్రస్తుతం ఆయన సిట్ ప్రత్యేకాధికారిగా ఐదు నెలలుగా హైదరాబాద్, విజయవాడకే పరిమితమయ్యారు. ఓటుకు నోటు కేసుకు సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం తెలంగాణ సీఎం కేసీఆర్ తదితరులపై నమోదు చేసిన ఫోన్ ట్యాపింగ్ తదితర కేసులకు ఈయన్ను ప్రత్యేక విచారణాధికారిగా ప్రభుత్వం నియమించింది. దీంతో ఎస్పీ శ్రీనివాస్ ఆ పనులకే పరిమితమయ్యారు. ఏఎస్పీ అన్నపూర్ణారెడ్డి ఇక్కడ శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారు. మరో ఏఎస్పీ రత్న ఉన్నా ఆపరేషన్ రెడ్‌కు మాత్రమే నిర్వహిస్తున్నారు. దీంతో ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందిన ఓ పోలీసు అధికారి అన్నీ తానై చిత్తూరు పోలీసు శాఖను నడిపిస్తున్నారు. శాంతిభద్రతల విషయాన్ని గాలికొదిలిన ఆ అధికారి కానిస్టేబుళ్ల నుంచి సీఐల వరకు కులాల ప్రాతిపదికన బదిలీలు చేస్తూ తన సామాజిక వర్గం, అనుకూలురైన అధికారులను నియమించే పనిలో మునిగితేలుతున్నారనే విమర్శలున్నాయి. నిబంధనలు, ప్రతిభ, సమర్థత ఆధారంగా కాకుండా పోలీసు బదిలీలు జరుగుతుండడంతో అధికారుల్లో నిర్లిప్తత చోటుచేసుకుని పనిచేసే ఆసక్తి సన్నగిల్లింది. ఉన్నతాధికారులపై అక్కసు, ఆక్రోశం వెళ్లగక్కే పరిస్థితి నెలకుంది. అధికారులు చిత్తశుద్ధితో పనిచేసే పరిస్థితి లేకపోవడంతో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోంది. రౌడీయిజం జోరు నగరంలో నాటుసారా వ్యాపారం, అక్రమ గ్రానైట్, ఇసుక రవాణా, లాటరీలు, దొంగతనాలు తదితర అక్రమ, అసాంఘిక కార్యక్రమాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. కొందరు పోలీసు అధికారులు అందినకాడికి దండుకుంటూ వీటిని పట్టించుకోవడంలేదనే ఆరోపణలున్నాయి. ఇటీవల రౌడీయిజంతో సెటిల్మెంట్లకు సైతం పాల్పడుతున్నారు. అధికార పార్టీకి చెందిన ఓ నేత ఇటీవల దూకు డు పెంచి పోలీసులపైనే ఎదురుతిరిగిన విషయం తెలిసిం దే. సదరు నేత తన కార్యాలయం వద్ద కొందరు వ్యాపారులను నిర్బంధించి దేహశుద్ధి చేయడమే కాక పిస్తోలు చూపి బెదిరించి పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేశారు. ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెళ్లి ఆ నేతను మందలించే ప్రయత్నం చేయగా సీఐపైనే తిరగబడ్డారు. అతని వద్ద నాగల్యాండ్ లెసైన్స్డ్ పిస్తోలు కూడా పట్టుబడింది. పోలీసుల భయం లేకపోవడం వల్లే నగరంలో తరచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. -
కేరళలో అంతర్జాతీయ ‘ఎర్ర’ స్మగ్లర్ అరెస్టు
చిత్తూరు (అర్బన్): ఆపరేషన్‌రెడ్‌లో భాగంగా చిత్తూరు పోలీసులు ఓ అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్‌ను అరెస్టు చేశారు. కేరళ రాష్ట్రంకు చెందిన అచ్చిపార లతీఫ్ (39) అనే స్మగ్లర్‌ను సోమవారం మన్నార్‌కాడ్‌లో అరెస్టు చేసిన చిత్తూరు పోలీసులు అక్కడి న్యాయస్థానంలో నిందితున్ని హాజరుపరచి చిత్తూరుకు తీసుకొస్తున్నారు. కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్ జిల్లా పల్లికాన్ను పోస్టుకు చెందిన లతీఫ్‌పై జిల్లాలో 13కు పైగా కేసులు ఉన్నాయి. ఇతను 2004 నుంచి ఎర్రచందనం స్మగ్లింగ్‌లో ఉన్నాడు. తొలుత డ్రైవర్‌గా పనిచేస్తున్న ఇతను, దాని తరువాత చేపల వ్యాపారం చేస్తూ అక్కడ రాణించక ఎర్రచందనం స్మగ్లింగ్‌లోకి దిగాడు. గత ఆరేళ్లుగా దుబాయ్‌లో ఉంటున్న ఇతను వెయ్యి టన్నులకుపైగా ఎర్రచందనాన్ని సింగపూర్, చైనా, దుబాయ్‌లకు స్మగ్లింగ్ చేశాడు. ఇటీవల జిల్లాలో పట్టుబడ్డ పలువురు అంతర్జాతీయ స్మగ్లర్లు ఇచ్చిన సమాచారంతో నిఘా ఉంచిన పోలీసులు కేరళలో ఉన్న లతీఫ్‌ను అరెస్టు చేశారు. ఈ ఆపరేషన్‌లో సీఐలు చంద్రశేఖర్, ఆదినారాయణరెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. -
చిత్తూరులో 30 మంది తమిళ కూలీలు అరెస్ట్
చిత్తూరు : చిత్తూరు బైపాస్ రోడ్డులో మంగళవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా తమిళనాడు నుంచి తిరుపతి వస్తున్న 30 మంది ఎర్రచందనం కూలీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అలాగే వారికి చెందిన రెండు వాహనాలను సీజ్ చేశారు. లారీలలోని రూ. కోటి విలువైన ఎర్రచందనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని అటవీశాఖ అధికారులకు అందజేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బడా స్మగ్లర్ అరెస్ట్
-
పోలీసుల అదుపులో స్మగ్లర్ సోము
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ పోలీసులు తనపై తప్పుడు కేసులు పెడుతున్నారని బడా స్మగ్లర్ సోము రవి ఆవేదన వ్యక్తం చేశారు. చెన్నైకి చెందిన బడా స్మగ్లర్ సోము రవిని తిరుపతి పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. అనంతరం అతడిపై పీడీ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేసి ... కడప సెంట్రల్ జైలుకు తరలించారు. తమిళనాడుకు చెందిన బడా స్మగ్లర్ సోము రవితోపాటు 11 మందిని తిరుపతి పోలీసులు చెన్నైలో అరెస్ట్ చేశారు. సోము రవిపై ఇప్పటి వరకు 23 ఎర్రచందనం అక్రమ రవాణ కేసులు నమోదయ్యాయని పోలీసులు వెల్లడించారు. ఇటీవల శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో 20 మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్‌పై తమిళనాడులో తీవ్ర నిరసనలు వ్యక్తం కావడం... చంద్రబాబు ప్రభుత్వంపై పలు రాజకీయ పార్టీ నాయకులు ఆరోపణలు చేసిన విషయం విదితమే. అదికాక ఎర్రచందనం స్మగ్లర్లను భరతం పట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. అందులోభాగంగా స్మగ్లర్లతో సంబంధాలున్న నటి నీతూను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
చంద్రగిరి మండలంలో నేడు జల్లికట్టు
చిత్తూరు : చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో నేడు జల్లికట్టు నిర్వహించనున్నారు. అందుకోసం ఎ.రంగంపేట, రామిరెడ్డిపల్లె, పుల్లయ్యగారిపల్లె, నాగయ్యవారిపల్లెలో భారీ ఎత్తున్న జల్లికట్టుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే జల్లికట్టు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయా గ్రామస్తులను పోలీసులు హెచ్చరించారు. ఆయా గ్రామాలలో ఇప్పటికే ఆంక్షలు విధించామని పోలీసులు తెలిపారు. అలాగే ఎద్దుల యజమానులకు నోటీసులు జారీ చేశామని పోలీసులు వెల్లడించారు. -
‘ఎర్రచందనం’పై సంఘటిత పోరాటం
తిరుపతిలో జనవరి మొదటి వారంలో సదస్సు కర్ణాటక,తమిళనాడు ఉన్నతాధికారులు హాజరు అన్ని శాఖలూ ఒకే వేదికపైకి అక్రమ రవాణా అరికట్టడమే లక్ష్యం ‘సాక్షి’తో చిత్తూరు ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ చిత్తూరు : ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకోవడమే లక్ష్యంగా అంతర్రాష్ట్ర స్థాయిలో అన్ని శాఖల అధికారులను ఒకే వేదికపైకి తెచ్చి సంఘటిత పోరాటానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చిత్తూరు ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని శాఖల ఉన్నతాధికారులతో పాటు అటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన పోలీసు, ఫారెస్టు ఉన్నతాధికారులతో పెద్ద ఎత్తున సదస్సు నిర్వహించనున్నట్లు ఎస్పీ చెప్పారు. రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు ఇప్పటికే ఈ సదస్సుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు. సోమవారం సాయంత్రం ఎస్పీ శ్రీనివాస్ ‘సాక్షి’తో మాట్లాడారు. చారిత్రక, విలువైన ఎర్రచందనాన్ని కాపాడడమే లక్ష్యంగా సంఘటిత పోరాటం చేస్తున్నట్లు చెప్పారు. చందనం అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టాలంటే మూడు రాష్ట్రాలు కలిసి పనిచేయాల్సి ఉందన్నారు. అందుకే కర్ణాటక,తమిళనాడు రాష్ట్రాల పోలీసు, ఫారెస్టు ఉన్నతాధికారులతో కలిసి చర్చించాల్సిన ఆవశ్యకతను గుర్తించామన్నారు. ఇదే విషయం డీజీపీ దృష్టికి తీసుకెళ్లామని ఎస్పీ తెలిపారు. తక్షణమే తిరుపతిలో సదస్సు నిర్వహించాలని డీజీపీ సోమవారం ఆదేశాలు జారీ చేసినట్లు ఎస్పీ తెలిపారు. తిరుపతి సదస్సులో మూడు రాష్ట్రాల డీజీపీలతో పాటు మూడు రాష్ట్రాలకు చెందిన పోలీసు, అటవీశాఖ ఉన్నతాధికారులతో పాటు న్యాయశాఖకు సంబంధించిన ముఖ్యులు సైతం పాల్గొంటారన్నారు. మన రాష్ట్ర సరిహద్దు అటవీప్రాంతాల పరిధిలోని ఆయా జిల్లాల ఎస్పీలు సైతం సదస్సులో పాల్గొంటారని ఆయన తెలిపారు. జనవరి మొదటివారంలోనే సదస్సు ఉంటుందన్నారు. సదస్సు అనంతరం చందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు యూక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తామన్నారు. తొలుత ఎర్రచందనం విలువ - అక్రమ రవాణా అరికట్టడడంపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఎంచుకున్నామన్నారు. ఇప్పటికే వర్క్‌షాపులు,కళాజాతాలతో ప్రజల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. చిత్తూరు ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు ఆయన చెప్పారు. సేఫ్ అండ్ సెక్యూరిటీకి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. నగరంలోని జ్యువెలరీ, షాపింగ్ మాల్స్ తదితర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. నగరంలో పట్రోలింగ్ కూడా తొందరలోనే ప్రారంభిస్తామన్నారు. పట్రోలింగ్ కోసం బ్లూ, వైట్ రక్షక్ వాహనాలను ఏర్పాటు చేస్తామన్నారు. సిగ్నల్స్‌కు సంబంధించి ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. మొదట రోడ్లల్లో అడ్డంకిగా ఉన్న వాటిని గుర్తించి తొలగిస్తామన్నారు. గుర్తించిన ప్రాంతాల్లో జంక్షన్ ఇంప్రూవ్మెంట్ చేస్తామన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో ట్రాఫిక్ పై అవగాహన కల్పిస్తామన్నారు.వివిధ వర్గాలు, యూనియన్లను ఇందులో భాగస్వాములు చేయనున్నట్లు చెప్పారు. ఖర్చుతో కూడుకున్న సిగ్నల్స్ వ్యవస్థ ఏర్పాటు కోసం కార్పొరేషన్‌తోపాటు వ్యాపారవేత్తలు, ఎన్జీవోలు, ఎన్ఆర్ఐలను సంప్రదించే ఆలోచనలో ఉన్నట్లు ఎస్పీ చెప్పారు. -
మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ అప్పు అరెస్ట్
తిరుపతి: మోస్ట్ వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్ అప్పు అలియాస్ అన్బు సెల్వంను పోలీసులు మంగళవారం చిత్తూరులో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని పోలీసు స్టేషన్‌కు తరలించి... తమదైన శైలిలో విచారించారు. ఈ సందర్భంగా అతడి నుంచి పలు కీలక విషయాలు రాబట్టినట్లు పోలీసులు తెలిపారు. ఎర్రచందనం అక్రమ రవాణాలో అప్పు అత్యంత కీలకంగా వ్యవహారించాడని పోలీసులు తెలిపారు. ఎర్రచందనం అక్రమ రవాణాలో తనకు సహకరించిన పలువురు వ్యక్తుల పేర్లను అప్పు వెల్లడించాడని పోలీసులు చెప్పారు. అప్పును శ్రీకాళహస్తి కోర్టులో బుధవారం పోలీసులు హాజరుపరచనున్నారు. అతడికి బెయిల్ ఇప్పించేందుకు చెన్నై లాయర్లు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో కంచి శంకరమఠం మేనేజర్ రామన్ హత్య కేసులో అప్పు ప్రధాన నిందితడని పోలీసులు తెలిపారు. చెన్నైలోని అప్పుకు ఓ హోటల్ కూడా ఉందని పోలీసులు పేర్కొన్నారు. అప్పు కోసం గత కొంత కాలంగా పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఆ క్రమంలో అప్పు బుధవారం పోలీసులకు చిక్కాడు. -
రెండు రోజుల్లో 46 మంది ‘ఎర్ర’ కూలీల అరెస్టు
* పట్టుబడిన ఓ స్మగర్ * రూ.50 లక్షల ఎర్రచందనం స్వాధీనం చిత్తూరు (అర్బన్) : జిల్లాలో రెండు రోజుల పాటు జరిపిన దాడుల్లో 46 మంది ‘ఎర్ర’ కూలీలు, ఒక స్మగ్లర్‌ను చిత్తూరు టాస్క్ఫోర్సు పోలీసులు పట్టుకున్నారు. శనివారం చిత్తూరులోని పోలీసు అతిథిగృహంలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ) కలిశల రత్న ఈ మేరకు వివరాలను వెల్లడించారు. నిందితులందరినీ పీలేరు, కేవీ పల్లె, వైవీ పాళెం, భాకరాపేట, రొంపిచెర్ల పరిధిల్లోని అటవీ ప్రాంతంలో పట్టుకున్నట్లు ఓఎస్డీ తెలిపారు. నిందితుల నుంచి టాటా సఫారి, సుమో, పికప్, రెండు మారుతి ఓమ్నీ వాహనాలతో పాటు 42 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.50 లక్షలు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 28న కే వీ పల్లె పోలీసు స్టేషన్ పరిధిలోని వడ్డివారిపల్లె బస్టాప్ వద్ద పోలీసులు ఆరుగురు ఎర్రకూలీలను పట్టుకున్నారు. టాటా సఫారి వాహనం, 8 ఎర్రచందనం దుంగల్ని స్వాధీనం చేసుకున్నారు. శనివారం సాయంత్రం అంబువారిపల్లె వద్ద 11 మంది కూలీలను పట్టుకున్నారు. సుమో వాహనాన్ని, 8 ఎర్రచందనం దుంగల్ని స్వాధీనం చేసుకున్నారు. ఎర్రావారిపాళెం పరిధిలోని రెడ్డిచెరువు వద్ద శుక్రవారం ఏడుగురు కూలీలను పట్టుకున్నారు. ఓ మారుతి వ్యాను, ఆరు ఎర్రచందనం దుంగల్ని స్వాధీనం చేసుకున్నారు. పీలేరు పోలీసు స్టేషన్ పరిధిలోని గుండ్లమల్లీశ్వర గుడి వద్ద 9 మంది ఎర్ర కూలీలను పట్టుకున్నారు. వారి నుంచి పిక్అప్ వ్యాను, 10 ఎర్రచందనం దుంగల్ని స్వాధీనం చేసుకున్నారు. వీరిలో పీలేరుకు చెందిన స్మగ్లర్ ఎం.భువనేశ్వర్‌రెడ్డి (20) ఉన్నాడు. ఇతడు గజ్జెల శ్రీనివాసులురెడ్డికి ప్రధాన అనుచరుడు. రొంపిచెర్ల పోలీసు స్టేషన్ పరిధిలోని మారుమరెడ్డిగారిపల్లె వద్ద ఉన్న నల్లగుట్ట ప్రాంతంలో శనివారం 11 మంది కూలీలను పట్టుకున్నారు. ఓ మారుతి వ్యాను, పది దుంగల్ని స్వాధీనం చేసుకున్నారు. భాకరాపేట పరిధిలోని వరకొండ అటవీ ప్రాంతంలో శని వారం నలుగురు కూలీలను పట్టుకున్నారు. ఐదు దుంగలు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో మదనపల్లె డీఎస్పీ రాజేంద్రప్రసాద్, పీలేరు సీఐ నరసింహులుతో పాటు పలువురు ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ దాడుల్లో ఎర్రావారిపాళెం పరిధిలో జ్ఞానేశ్వర్ అనే మేస్త్రీ, కెవి.పల్లె పోలీసు స్టేషన్ పరిధిలో పెంచలయ్య, నరసయ్య తప్పించుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి గాలిస్తున్నారు.