చంద్రగిరి మండలంలో నేడు జల్లికట్టు
చిత్తూరు : చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో నేడు జల్లికట్టు నిర్వహించనున్నారు. అందుకోసం ఎ.రంగంపేట, రామిరెడ్డిపల్లె, పుల్లయ్యగారిపల్లె, నాగయ్యవారిపల్లెలో భారీ ఎత్తున్న జల్లికట్టుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే జల్లికట్టు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయా గ్రామస్తులను పోలీసులు హెచ్చరించారు. ఆయా గ్రామాలలో ఇప్పటికే ఆంక్షలు విధించామని పోలీసులు తెలిపారు. అలాగే ఎద్దుల యజమానులకు నోటీసులు జారీ చేశామని పోలీసులు వెల్లడించారు.