Chandragiri
-
ఏనుగుల దాడిలో టీడీపీ యువనేత మృతి
తిరుపతి, సాక్షి: చంద్రగిరి మండలంలో ఘోరం చోటు చేసుకుంది. ఏనుగుల దాడిలో టీడీపీ యువనేత రాకేశ్ చౌదరి(33) మృతి చెందాడు. రాకేష్ చంద్రగిరి ఐటీడీపీ అధ్యక్షుడిగా, కందులవారిపల్లి ఉప సర్పంచ్‌గా ఉన్నాడు. తమ పార్టీ యువనేత హఠాన్మరణంపై తెలుగు దేశం పార్టీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలం చిన్నరామాపురం, కొంగరవారిపల్లిలో శనివారం రాత్రి ఏనుగులు సంచరించాయి. మామిడిమాను గడ్డ గ్రామ పంటపొలాలపై ఏనుగుల గుంపు దాడి చేస్తుందన్న సమాచారంతో రాకేష్‌తో పాటు మరికొందరు అక్కడికి వెళ్లారు. అరుస్తూ వాటిని కొంతదూరం తరిమారు. ఈ క్రమంలో.. అవి తిరగబడడంతో పరుగులు తీశారు. ఓ ఏనుగు వాళ్లపై దాడికి దిగడంతో అంతా చెట్లెక్కి లైట్లు ఆఫ్ చేసుకున్నారు. అయితే.. రాకేష్ వాళ్లలో ముందు ఉండడం, తెల్ల చొక్కా ధరించి ఉండడంతో, పైగా అతని చేతిలో లైట్ ఆన్ చేసి ఉండడంతో ఏనుగు అతనిపై దాడికి దిగింది. తొండంతో ఎత్తి చెట్లకు కొట్టి.. కిందపడేసి తొక్కింది. దీంతో రాకేష్ అక్కడికక్కడే మృతి చెందాడు.రాకేష్‌కు భార్య, ఒక కూతురు ఉన్నారు. ఈయన సీఎం కుటుంబానికి సన్నిహితుడిగా తెలుస్తోంది. రాకేశ్ మృతి వార్త తెలుసుకొని ఎమ్మెల్యే పులివర్తి నాని ఘటనాస్థలికి చేరుకొని స్థానికులతో మాట్లాడారు. -
Mohan babu: గన్ సరెండర్ చేసిన మోహన్‌బాబు
-
మోహన్ బాబు 24వరకు టైమ్ అడిగారు: రాచకొండ సీపీ
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన మంచు ఫ్యామిలీలో కొద్దిరోజులుగా గొడవలు, కేసులు వంటి ఘటనలు జరుగుతున్నాయి. జల్పల్లిలో తన నివాసం వద్ద మీడియా ప్రతినిధిని మోహన్‌బాబు కొట్టడంతో ఆయనపై కేసు నమోదు అయింది. ఇప్పటికే ఆయన మీద మనోజ్ కూడా ఒక కేసు పెట్టడం జరిగింది. ఆపై మనోజ్‌పై కూడా ఒక కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే, మోహన్ బాబు ఫ్యామిలీపై రాచకొండ సీపీ తాజాగా మీడియాతో మాట్లాడారు.'ఇప్పటికీ మంచు కుటుంబంపై 3 FIRలు నమోదు అయ్యాయి. వాటిపై మేము విచారణ ప్రారంభించాము. చట్టప్రకారంగా మాత్రమే మేము చర్యలు తీసుకుంటాం. మోహన్ బాబు అరెస్ట్ విషయంలో ఆలస్యం లేదు. ఆయనకు ఇప్పటికే నోటీసు ఇచ్చాము. కానీ, డిసెంబర్ 24 వరకు టైమ్ అడిగారు. కోర్టు సమయం ఇచ్చింది కాబట్టి మేము అరెస్ట్ చేయలేదు.మోహన్ బాబు విచారణపై మేము కూడా కోర్టును ఆశ్రయిస్తాము. ఆయన వద్ద రెండు గన్స్ ఉన్నాయి. కానీ, రాచకొండ స్టేషన్ నుంచి ఆయన ఎలాంటి పర్మిషన్ గన్స్ ఇవ్వలేదు. మరోకసారి మోహన్‌బాబుకు నోటీసు ఇస్తాం. అప్పుడు ఆయన తప్పకుండా విచారణకు రావాలి. లేదంటే వారంటీ ఇష్యు చేస్తాము. ఒకవేళ మళ్లీ విచారణకు ఆయన రాకపోతే కోర్టు అనుమతి తీసుకోవాలి. లేదంటే చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం.' అని సీపీ అన్నారు.లైసెన్స్డ్ గన్స్ సరెండర్ చేసిన మోహన్ బాబుమోహన్బాబు తన వద్ద ఉన్న లైసెన్స్డ్ గన్ను సరెండర్ చేశారు. ఆయన ఇంట్లో వివాదాలు రావడంతో తుపాకుల్ని సరెండర్ చేయాలని పోలీసులు కోరారు. దీంతో తన పీఆర్వో ద్వారా డబుల్ బ్యారెల్ గన్ను చంద్రగిరి పోలీసులకు అప్పగించారు. ఆయన వద్ద రెండు గన్స్ ఉన్నాయి. డబుల్ బ్యారెల్ గన్‌తో పాటు స్పానిష్ మెడ్ గన్ ఉంది. -
వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్‌గా చేసుకొని టీడీపీ నేతల దాడి
-
చంపేస్తా!.. జర్నలిస్టులకు టీడీపీ ఎమ్మెల్యే భార్య బెదిరింపులు
సాక్షి, తిరుపతి జిల్లా: ఎమ్మెల్యే పులివర్తి నాని భార్య సుధారెడ్డి నుంచి ప్రాణ హాని ఉందని.. రక్షణ కల్పించాలంటూ చంద్రగిరి జర్నలిస్టులు పోలీసులను ఆశ్రయించారు. సోషల్ మీడియా వాట్సాప్ గ్రూప్ "చంద్రగిరి రాజకీయం" గ్రూప్‌ను డిలీట్ చేయాలని, లేకుంటే చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారని సీఐ సుబ్బరామిరెడ్డికి పాత్రికేయులు ఫిర్యాదు చేశారు."చంద్రగిరి రాజకీయం" వాట్సాప్ గ్రూప్‌లో ఎమ్మెల్యే నానికి వ్యతిరేకంగా పోస్ట్‌లు పెడుతున్నారంటూ ఈ నెల 13న సుధారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అడ్మిన్లుగా ఉన్న వారిని ఐదుగురు జర్నలిస్టులపై ఆమె కేసు పెట్టారు. మెసేజ్‌లు పెట్టిన వారిని వదిలివేసి, తమపై కేసులు పెట్టడం ఏంటీ? అంటూ బాధిత జర్నలిస్టులు ప్రశ్నిస్తున్నారు.ఇదీ చదవండి: తిరుపతిలో మిస్సింగ్ కలకలం.. హైదరాబాద్‌కి బాలిక? -
పోలీస్ స్టేషన్లోనే మహిళపై చెప్పుతో దాడి
సాక్షి, టాస్‌్కఫోర్స్: చంద్రగిరి ఎమ్మెల్యే నాని అనుచరులు ఇష్టమొచి్చనట్లు లేచిపోతున్నారు. పోలీసులన్నా, చట్టాలన్నా లెక్కలేకుండా వ్యవహరిస్తున్నారు. తనపై ఫిర్యాదు చేయడానికి వచి్చన రజక సామాజిక వర్గానికి చెందిన దంపతులు, వారికి మద్దతుగా వచి్చన సమీప బంధువువైన మహిళపై పోలీస్ స్టేషన్లోనే సీఐ ఎదురుగా నాని అనుచరుడు చెప్పుతో దాడికి దిగాడు. బాధితుల కథనం మేరకు వివరాలు.. చంద్రగిరి మండలంలోని అగరాలకు చెందిన భవిత, సురేష్ దంపతులు అదే గ్రామానికి చెందిన టీడీపీ నేత, ఎమ్మెల్యే పులివర్తి నాని అనుచరుడు జయచంద్రారెడ్డి మధ్య గత కొంత కాలంగా ఆరి్థక లావాదేవీలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయనగర్ కాలనీలోని వారి ఇంటిని రిజిస్ట్రేషన్ చేసివ్వాలంటూ జయచంద్రారెడ్డి హెచ్చరించాడు. ఈ క్రమంలో శనివారం చంద్రగిరికి సమీపంలోని ఓ గెస్ట్‌హౌస్‌కు పిలిచి బెదిరించి, విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డాడు. బాధితులు చంద్రగిరి పోలీసులను ఆశ్రయించగా.. రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో ఫిర్యాదు స్వీకరించేందుకు పోలీసులు నిరాకరించారు. దీంతో బాధితులు తిరుపతి ఎస్పీని ఆశ్రయించి జయచంద్రారెడ్డిపై ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు సీఐ బాధితులను మళ్లీ స్టేషన్‌కు పిలిచి విచారణ ప్రారంభించారు. బాధితులకు సహాయంగా వారి సమీప బంధువు చంద్రమ్మ తదితరులు కూడా స్టేషన్‌కు చేరుకున్నారు. సీఐ సమక్షంలోనే చెప్పుతో దాడి సీఐ ఇచి్చన సమాచారాన్ని అందుకుని స్టేషన్‌కు వచి్చన జయచంద్రారెడ్డి సీఐ ముందే బాధితులను మరోసారి బెదిరిస్తూ.. ‘‘లం..! నాకే ఎదురు చెబుతావా’’ అంటూ అసభ్య పదజాలంతో రెచి్చపోయాడు. ఈ క్రమంలోనే బాధితులకు సాయంగా వచి్చన మహిళను చెప్పుతో కొట్టాడు. దీంతో బాధితులు కన్నీరు పెట్టుకుంటూ సీఐ గది నుంచి బయటకు వచ్చారు. ఈ ఘటన క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని సద్దుమణిగేలా చేసేందుకు ఎమ్మెల్యే నాని అనుచరులు రంగంలోకి దిగారు. వారు స్టేషన్లో సీసీ ఫుటేజీ మాయం చేసేందుకు ప్రయత్నించారని బాధితులు వాపోయారు. -
అక్రమ రవాణాకు పోలీస్ ఎస్కార్ట్!
సాక్షి ప్రతినిధి, తిరుపతి: సీఎం చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లె ఉన్న చంద్రగిరి నియోజకవర్గంలో పోలీసుల అండదండలతో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. రామచంద్రాపురం మండలం బొప్పరాజుపల్లి, పాడిపేట నుంచి మట్టి, ఇసుక ప్రతి రోజూ రాత్రిళ్లు 30 టిప్పర్లలో తిరుపతికి తరలి వెళ్తోంది. ఈ దందాను అరికట్టాల్సిన పోలీసులే ఎమ్మెల్యే పులివర్తి నాని ఆదేశాలతో ఆ వాహనాలకు రక్షణ కల్పిస్తుండడం విస్తుగొలుపుతోంది. -
చంద్రబాబు నిర్ణయంపై హిందూ సంఘాల ఆగ్రహం
-
చంద్రగిరిలో మరోసారి రెచ్చిపోయిన టీడీపీ రౌడీలు
-
చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని డ్రామా బట్టబయలు
సాక్షి, తిరుపతి: ఎన్నికల సమయంలో ప్రస్తుత చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని డ్రామాలను స్వీమ్స్ డాక్టర్లు బట్టబయలు చేశారు. రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన పద్మావతి మహిళా వర్శిటీ వద్ద పోలింగ్ అనంతరం మే 14వ తేదీన జరిగిన ఘటనలో పులివర్తి నానికి ఎలాంటి గాయాలు కాలేదని స్విమ్స్ వైద్య నివేదికలు తేల్చి చెప్పాయి.స్విమ్స్ ఆసుపత్రిలో నాని తల, శరీరం, చేయి, కాలికి తీసిన ఎక్స్‌రే, ఎంఆర్ఐ, సిటీ స్కానింగ్.. ఇలా ఆరు రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. అందులో ఒక్కదానిలోనూ ఆయన గాయపడినట్లు వెల్లడికాలేదు. వైద్య నివేదికలు అన్ని కూడా ఆయన సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా తేల్చాయి. రాజకీయ లబ్ధి కోసం పులివర్తి నాని నాటకాలు ఆడినట్లు తేటతెల్లమైంది.మే 14వ తేది మధ్యాహ్నం 3గంటల తర్వాత సంఘటన జరిగితే దాదాపు రెండు గంటలకు పైగా వర్శిటీ పరిసరాల్లోనే నాని హుషారుగా నడుస్తూ కనిపించిన పులివర్తి నాని వీడియో దృశ్యాలు ఆశ్చర్య పరుస్తున్నాయి. ర్యాలీ, ధర్నాలో పాల్గొన్న నాని.. చక్కగా నేలపై కూర్చుని ఆందోళనలు చేశారు. నాడు ఆ వీడియోలు విస్తృతంగా వైరల్ అయ్యాయి. నడుస్తూ వెళ్లిన పులివర్తి నాని.. తర్వాత వీల్ చైర్లో ప్రత్యక్షమై నటన ప్రదర్శించారు. ఒక్క గాయం లేదని వైద్య నివేదికలు స్పష్టం చేశాయి.తలకు, శరీరానికి, చేతికి, భుజానికి, పొట్టకు, కాలికి ఇలా అన్ని పరీక్షలను విడుదల చేశారు. ఎక్స్‌రేలు, ఎంఆర్ఐలు, సిటీ స్కానింగ్. వైద్య పరీక్షలు అన్నిటిలోనూ నానికి ఎలాంటి గాయాలు లేవని, ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్య నివేదికలు వెల్లడించాయి. నాని స్వార్థంతో చేసిన నాటకం వల్ల అనేక మంది అమాయకులు జైలులోనూ, వారి కుటుంబసభ్యులు ఇంటి వద్ద రోదిస్తున్నారు. ఎలాంటి గాయాలు లేని వ్యక్తి పెట్టిన కేసులో 37 మంది జైలు పాలయ్యారు. నెలల తరబడి జైలులో ఉంచారు. -
చంద్రగిరి DSPపై వేటు
-
చంద్రగిరి DSPపై వేటు
-
చంద్రగిరి DSPపై వేటు
-
తిరుపతి: చంద్రగిరిలో ఘోర రోడ్డు ప్రమాదం
తిరుపతి, సాక్షి: చంద్రగిరిలో ఈ వేకువ ఝామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కొంగరవారిపల్లి వద్ద ఓ కారు అదుపు తప్పి కల్వర్ట్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. మృతులు నెల్లూరువాసులుగా పోలీసులు చెబుతున్నప్పటికీ.. వాళ్ల వివరాలను మాత్రం వెల్లడించలేదు. కారు కల్వర్ట్‌లో ఇరుక్కున్న స్థితిని బట్టి అతివేగం, నిద్రమత్తు ఈ ప్రమాదానికి కారణాలుగా పోలీసులు అంచనా వేస్తున్నారు. గడ్డపార సాయంతో ఇరుక్కున్న కారు డోర్లను బద్ధలుకొట్టి మృతదేహాలను పోలీసులు బయటకు తీశారు. ప్రమాదానికి గురైన కారు నెంబర్ AP 26 BH 3435 కాగా.. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. -
పులివర్తి నానికి గాయాలవ్వలేదు, ఆయనదంతా డ్రామా: చెవిరెడ్డి
సాక్షి, తిరుపతి: చంద్రగిరిలో అల్లర్లపై స్పందించిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పందించారు. పులివర్తి నానిని తాను రాజకీయ ప్రత్యర్థిగానే చూశానని..తనపై ఎన్ని విమర్శలు చేసినా తిరిగి విమర్శ చేయలేదని తెలిపారు. తన బావ మరిదిపై పులివర్తి నాని చేయి చేసుకున్నాడని, నామినేషన్ రోజు తన కారుపై దాడి చేశారని మండిపడ్డారు. తనను ఎంత ఇబ్బంది పెట్టినా నానిపై ఒక్క కేసు పెట్టలేదని పేర్కొన్నారు.శ్రీ పద్మావతి వర్సిటీ వద్ద ఘర్షణలో నానికి గాయాలు కాలేదని, అక్కడి నుంచి యాక్టివ్‌గా నాని నడుచుకుంటూ వెళ్లిపోయారని అన్నారు. రెండు గంటల తర్వాత వీల్‌చైర్‌లో ఉన్నాడని, ఇదంతా డ్రామా అని తెలిపారు. పులివర్తి నాని డ్రామాల వల్ల నియోజకవర్గంలో శాంతి భద్రతలు దెయ్యతిన్నాయని విమర్శించారు.‘ఎవరినో విమర్శలు చేయాలని, తప్పు పట్టడం నా ఉద్దేశ్యం కాదు. ఒక అవాస్తవం ప్రచారం చేస్తుంటే...వాస్తవాలు మీ దృష్టికి తీసుకువస్తున్నా. సామాజిక శాస్త్రంలో పట్టా పుచ్చుకున్న వాడిని, న్యాయ శాస్త్రంలో పట్టా పుచుకున్నవాడిపి. కర్మ సిద్ధాంతం నమ్ముకున్న వాడిని. గత అయిదేళ్లుగా నాపై విమర్శలు చేస్తున్నా, ఏ రోజు చిన్న విమర్శ చేయలేదుజచంద్రగిరిలో నారా లోకేష్ పాదయాత్ర చేస్తే ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగలేదు. నారా భువనేశ్వరి పర్యటన చాలా ప్రశాంతంగా జరిగింది. పులివర్తి నాని , అతని భార్య అసభ్య పదజాలంతో నన్ను రోజు తిడుతూ ఉన్నారు. పోలింగ్ రోజు మోహిత్ కారు దగ్ధం చేశారు. సర్పంచ్ ఇంటికి నిప్పు పెట్టారు. సుధాకర్ అనే వ్యక్తి కాలికి బుల్లెట్ దిగింది, చెన్నై అపోలో చికిత్స పొందుతూ ఉన్నాడు. కాలికి తీవ్రగాయం అయ్యింది. మాపై విష ప్రచారం చేస్తున్నారు,పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి చిత్తూరు మహానటి ప్రదర్శన చేశారు. స్విమ్స్ ఆసుపత్రిలో పేషెంట్‌ను చూసేందుకు వచ్చిన బంధువుపై దాడి చేశారు. నాయకుడు అనేవాడు ఆదర్శంగా ఉండాలి. ’ అని తెలిపారు. -
బదిలీల తర్వాతే హింస!
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక అందచేశారు. పోలింగ్ రోజు, ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లు జరగడానికి కారణాలను నివేదించారు. ఈసీ ఆదేశాల మేరకు ఢిల్లీ వచ్చిన వారిద్దరూ గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్(సీఈసీ) రాజీవ్‌కుమార్, కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్సింగ్ సంధూలతో సమావేశమయ్యారు. దాదాపు 30 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో అల్లర్లకు కారణాలను విశ్లేషించారు.అధికారుల బదిలీ తర్వాతే అల్లర్లు..సమస్యాత్మక ప్రాంతాలైన పల్నాడు, చంద్రగిరి, తాడిపత్రిని దృష్టిలో ఉంచుకుని ముందుగానే భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సీఎస్ జవహర్‌రెడ్డి ఈసీకి తెలిపారు. హఠాత్తుగా పోలీసు అధికారులను బదిలీ చేయడం, కొత్తగా బాధ్యతలు స్వీకరించిన వారికి క్షేత్రస్థాయి పరిస్థితులపై పూర్తి అవగాహన లేకపోవడం వల్ల అల్లర్లకు దారి తీసిందని తాము గుర్తించినట్లు పేర్కొన్నారు. పోలింగ్ రోజు, మరుసటి రోజు పల్నాడు, కారంపూడి, మాచవరం, తాడిపత్రి, తిరుపతి, చంద్రగిరి, అనంతపురం, కృష్ణా జిల్లా, నర్సీపట్నం తదితర చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నట్లు చెప్పారు. ఎస్పీ స్థాయి అధికారి నుంచి ఎస్ఐ వరకు హఠాత్తుగా బదిలీలు చేయడంతో ఇదే అదునుగా అల్లర్లకు పాల్పడినట్లు వివరించారు. అల్లర్లు జరిగిన ప్రాంతాలన్నింటిలోనూ పోలీసు అధికారుల ఆకస్మిక బదిలీలే హింసకు కారణమని పేర్కొన్నట్లు తెలిసింది.కౌంటింగ్ రోజు జాగ్రత్త..రాష్ట్రంలో ఇకపై ఎక్కడా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్, డీజీపీని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. అల్లర్లకు కారకులపై కఠినంగా వ్యవహరించాలని సూచించింది. జూన్ 4న కౌంటింగ్ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పటిష్ట బందోబస్తు కల్పించాలని పేర్కొంది. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేయాలని, ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే పోలీసు అధికారులు, సిబ్బందిపై వేటు తప్పదని హెచ్చరించినట్లు సమాచారం. ఎస్పీ స్థాయి అధికారి నుంచి హోంగార్డు వరకు ప్రతి ఒక్కరూ శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత ఉందని, దీనిపై నిశితంగా పర్యవేక్షించాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్ సూచించినట్లు తెలిసింది. -
వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..
-
సీఎం జగన్ రాకతో చంద్రగిరిలో పండగ వాతావరణం
-
సొంత ఇంటి కల సాకారం
-
చంద్రగిరి మండలంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం
-
వైయస్ఆర్ సీపీలోకి భారీగా చేరికలు
-
పాలకుడిగా కాదు సేవకుడిగా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటా: మోహిత్ రెడ్డి
-
జన సంద్రమైన చంద్రగిరి
తిరుపతి రూరల్: వైఎస్సార్సీపీ శ్రేణులతో చంద్రగిరి జన సంద్రమైంది. ఆత్మీయ సమ్మేళనం జన ఉప్పెనను తలపించింది. ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నాయకత్వంలో తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం తిరుపతి రూరల్ మండలంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. నియోజకవర్గం నలుమూలల నుంచి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. దాదాపు 25 వేల మందికి పైగా హాజరయ్యారు. ఆత్మీయ సమ్మేళనానికి ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి ఆర్కే రోజా, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, ఎంపీలు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, రెడ్డెప్ప, డాక్టర్ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్యే జయదేవనాయుడు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీకి చంద్రగిరి నియోజకవర్గాన్ని కంచుకోటగా మార్చారని, నిబద్ధత, నిజాయితీ, క్రమశిక్షణ, అంకితభావంతో చెవిరెడ్డి రాజకీయాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించారని పలువురు కొనియాడారు. రానున్న ఎన్నికల్లో చంద్రగిరి ఎమ్మెల్యేగా చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిని ఆదరించాలని నాయకులంతా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎంవైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రోత్సాహంతో పార్టీలకు అతీతంగా నియోజకవర్గంలో అభివృద్ధి పనులను చేపట్టినట్టు తెలిపారు. -
అందాల పోటీల్లో మెరిసిన చంద్రగిరి సంజన..
చంద్రగిరి (తిరుపతి రూరల్): జాతీయ స్థాయి అందాల పోటీల్లో చంద్రగిరి యువతి మెరిసింది. ఈ నెల 16న జైపూర్‌లో జరిగిన ‘స్టార్ మిస్ టీన్ గ్లోబ్ ఇండియా–2023’ పోటీలలో చంద్రగిరికి చెందిన సంజన మిస్ ఇండియా కిరీటం కైవశం చేసుకుంది. కాగా, ఫైనల్స్‌లో 47 మంది పాల్గొనగా.. వారిలో స్టార్ మిస్ టీన్ గ్లోబ్ ఇండియాగా సంజన ఎంపికైంది. ఆ వివరాలను ఆమె తల్లిదండ్రులు గురువారం మీడియాకు తెలిపారు. చంద్రగిరి మాజీ ఎంపీటీసీ అల్లతూరు మోహన్ మనమరాలైన సంజన మోడలింగ్‌పై మక్కువ పెంచుకుంది. 2023 మేలో బెంగళూరులో ప్రిలిమినరీ రౌండ్లో 300 మందికి పైగా బాలికలు జూమ్ కాల్లో పాల్గొనగా.. ఫైనల్స్‌కు 57 మంది ఎంపికయ్యారు. వారిలో సంజన ఒకరు. ఈ నెల 16 నుంచి జైపూర్‌లో జరిగిన గ్రాండ్ ఫైనల్లో 47 మంది పాల్గొనగా.. వారిలో సంజన మొదటి స్థానం పొందింది. ఇది కూడా చదవండి: మీ ఓటు ఉందా?.. చెక్ చేసుకోండి -
సీఐ సార్ చొరవ.. కేంద్రం మెచ్చిన చంద్రగిరి ఠాణా
నాడు: చుట్టూ ముళ్లపొదలు.. ఏ మూల చూసినా పాముల పుట్టలు.. దశాబ్దాలుగా గుట్టలుగా పడి శిథిలావస్థకు చేరుకున్న వాహనాలు.. అస్తవ్యస్త పార్కింగ్.. కళావిహీనంగా చెట్లు.. సరైన బోర్డు కూడా లేని పోలీస్ స్టేషన్...రంగులు వెలిసి పాత భవనాలను తలపించే దుర్గంధంతో సిబ్బంది ఇబ్బందిగా పనిచేసేవారు. అస్తవ్యస్తంగా ఉండేది తిరుపతి జిల్లా చంద్రగిరి పోలీస్ స్టేషన్. నేడు : ఒక అధికారి బదిలీపై అక్కడికి వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి కేవలం 20 రోజుల్లోనే స్టేషన్ రూపురేఖలు మార్చారు. భవనాలకు అందమైన రంగులు వేయించా డు. ప్రాంగణంలో పిచ్చి మొక్కలను తీయించాడు. చెట్లను ట్రిమ్మింగ్ చేయించారు. వాహనాలను స్టేషన్ వెనుక పార్కింగ్ చే యించారు. స్టేషన్‌కు వచ్చేవారు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండేలా చిన్నసైజు పార్క్‌ను తీర్చిదిద్దారు. స్టేషన్లో రికార్డు రూమును డిటలైజ్ చేసి అందమైన ర్యాక్‌లతో వాటిని ముస్తాబు చేశారు. సిబ్బందికి విశ్రాంతి గదినీ ఏర్పాటు చేశారు. తిరుపతి రూరల్: చంద్రగిరి పీఎస్‌లో నూతనంగా సీఐగా బాధ్యతలు స్వీకరించిన రాజశేఖర్ స్టేషన్ రూపురేఖలను మార్చేశారు. ఇది చూసి చంద్రగిరి డీఎస్పీ యశ్వంత్, తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి ఆయన్ను అభినందించారు. రాష్ట్ర డీజీపీ ద్వారా సమాచారం అందుకున్న ఢిల్లీకి చెందిన బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(బీపీఆర్డీ) బృందం ఇటీవల చంద్రగిరి పోలీస్‌స్టేషన్‌ను సందర్శించింది. స్టేషన్ ప్రాంగణం, వివిధ సమస్యలపై వచ్చే అర్జీదారులకు అందిస్తున్న సేవలు, రికార్డుల మెయింటెనెన్స్ వంటి అంశాలను పరిశీలించింది. ఇతర స్టేషన్లతో పోల్చితే ఇక్కడ ఏర్పాట్లు, పరిసరాల శుభ్రత, రికార్డుల నిర్వహణ భేషుగ్గా ఉన్నాయని బీపీఆర్డీ బృందం పర్యవేక్షణాధికారి బాలచంద్రన్ చంద్రగిరి సీఐ రాజశేఖర్‌ను అభినందించారు. త్వరలో బీపీఆర్డీ జాతీయస్థాయిలో పోలీస్ స్టేషన్లకు ర్యాంకులు కేటాయించనున్నారు. అయితే అద్భుతంగా తీర్చిదిద్దిన చంద్రగిరి పోలీస్ స్టేషన్‌కు అత్యత్తుమ ర్యాంకు వచ్చే అవకాశం ఉందని తిరుపతి జిల్లా పోలీస్ అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మనసు పెడితే స్టేషన్లను అద్భుతంగా తీర్చిదిద్దవచ్చని నిరూపించిన సీఐ రాజశేఖర్‌ను పలువురు పోలీస్ అధికారులు అభినందిస్తున్నారు. -
తిరుపతి: వీడిన కొత్తశానంబట్ల మంటల మిస్టరీ
సాక్షి, తిరుపతి: ఉన్నట్లుండి గడ్డివాములకు నిప్పంటుకోవడం.. ఇళ్లలో బట్టలకు మంటలు.. ఒకానొక టైంలో తాళం వేసిన ఇళ్లలోని బీరువాలో బట్టలు తగలబడిపోవడం.. జిల్లాలో గత నెలరోజులుగా చర్చనీయాంశంగా మారింది శానంబట్ల(కొత్త) గ్రామ మంటల మిస్టరీ. భయభ్రాంతులతో బిక్కుబిక్కుమంటూ గడిపారు ఆ ఊరి ప్రజలు. ఒకానొక టైంలో ఇది ఊరికి పట్టిన శాపమంటూ ఊరు విడిచిపోయారు కొందరు. అయితే తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈ మిస్టరీని పోలీసులు ఎట్టకేలకు చేర్చారు. ఆకతాయిల పనిగా మొదలై.. ఇది ప్రతీకార చర్యగా కొనసాగిందని నిర్ధారించారు. చంద్రగిరి మండలం కొత్తశానంభట్ల గ్రామం లో మంటల మిస్టరీ చేధించారు పోలీసులు. తొలుత కొందరు ఆకతాయిలు ఓ గడ్డివాముకు నిప్పు పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఇదనుగా తల్లి బంధువులపై విద్వేషంతో రగిలిపోతున్న కీర్తి అనే మహిళ.. తొలుత ఎదురింట్లో గడ్డివాముకు నిప్పు పెట్టింది. ఆ తర్వాత వరుసగా బంధువుల ఇళ్లలో నిప్పు పెడుతూ వచ్చింది. కేవలం అగ్గిపుల్లలతోనే నిప్పు పెడుతూ ఊరందరినీ భయభ్రాంతులకు గురి చేసిందామె. ఈలోపు అగ్ని ప్రమాదంలో నష్టపోయివారికి కొందరు ఆర్థిక సాయం అందిస్తూ వచ్చారు. దీంతో అత్యాశకు పోయిన గ్రామంలోని ఇద్దరు.. కావాలనే తమ ఇళ్లలో నిప్పు పెట్టుకున్నారు. దర్యాప్తులో ఇదంతా గుర్తించిన పోలీసులు.. కీర్తితో పాటు ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. సోమవారం ఉదయం వాళ్లను మీడియా ముందు ప్రవేశపెట్టి పూర్తి వివరాలను వెల్లడించనున్నారు ఎంఆర్‌పల్లి పోలీసులు. ఇదిలా ఉంటే.. ఉన్నట్లుండి గడ్డి వాములు తగలబడి పోవడం, బీరువాలు, కప్‌బోర్డుల్లోని బట్టలకు నిప్పంటుకోవడంలాంటి పరిణామాలతో కొత్తశానంభట్ల గ్రామస్తులు వణికిపోయారు. తొలుత పిల్లపాలెం అన్నదమ్ములకు సంబంధించిన నాలుగు ఇళ్లలో, వారి పొలాల్లో మాత్రమే మంటలు వ్యాప్తి చెందగా.. ప్రస్తుతం ఇతరుల ఇళ్లలోనూ మంటలు వ్యాపించడంతో ప్రజలు వణికిపోయారు. ఈ మంటల వెనుక కారణం ఏంటో తేల్చే పనిలో పోలీసులు తలమునకలయ్యారు. క్లూ టీంతో ఆధారాలు సేకరిస్తూ.. గ్రామంలో భారీగా పికెటింగ్ నిర్వహించారు. అదే సమయంలో.. ఇది గ్రామ దేవత శాపమని, ఓ బుడబుక్కలవాడి శాపమని, కాదు.. 40 ఏళ్ల కిందట సైతం ఇలాగే మంటలు వ్యాపించేవని కొందరు వృద్ధులు ప్రచారంలోకి దిగడం గమనార్హం. -
అట్టహాసంగా చంద్రగిరి ఐపీఎల్ టోర్నీ ప్రారంభం (ఫొటోలు)
-
జగనన్న కాలనీల్లో శర వేగంగా ఇళ్ల నిర్మాణ పనులు
-
కారుకు నిప్పు పెట్టడంతో ఓ వ్యక్తి సజీవ దహనం
-
చంద్రగిరిలో రూ.430 కోట్ల అభివృద్ధి పనులు చేశాం : చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
-
తిరుపతి జిల్లా : చంద్రగిరి మండలం రామిరెడ్డి పల్లిలో ఘనంగా పశువుల పండుగ (ఫొటోలు)
-
బ్యాంకులో రుణం ఇప్పిస్తానని.. నెల రోజులు గదిలో బంధించి
సాక్షి, తిరుపతి, చెన్నై: బ్యాంకులో రుణం ఇప్పిస్తానని చెప్పి తనను నిర్బంధించి నెల రోజులు అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలు కోరంది. ఆమె దళిత సంఘం నేతలతో కలిసి చంద్రగిరిలో విలేకరులతో మాట్లాడింది. తాను కుమార్తెతో కలిసి తిరుపతి రూరల్ మండలంలో ఉంటూ ఒక పాఠశాలలో స్వీపర్‌గా పనిచేస్తున్నట్లు తెలిపింది. వెదురుకుప్పం మండలం బలిజిపల్లె దళితవాడకు చెందిన నాగరాజు తరచూ మాట్లాడేవాడని పేర్కొంది. తనకు బ్యాంకులో రుణం ఇప్పించాలని కోరడంతో నవంబర్ 17న బైక్‌లో గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లి గదిలో నిర్బంధించాడని, పలుమార్లు అత్యాచారం చేశాడని పేర్కొంది. పాకాల మండలం దామలచెరువులోని బంధువుల ఇంటికి తీసుకెళ్లి అక్కడా అత్యాచారానికి పాల్పడినట్లు వాపోయింది. తనను వదిలిపెట్టకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో తన స్వగ్రామమైన వెదురుకుప్పం మండలం బలిజిపల్లె దళితవాడలో విడిచి వెళ్లాడని తెలిపింది. అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్యకు యత్రించడంతో గ్రామస్తులు అండగా నిలిచారని వెల్లడించింది. వారి సాయంతో ఈ నెల 6న తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. ఎస్పీ దిశ పోలీసులకు కేసును బదిలీ చేశారని వెల్లడించింది. డీఎస్పీ రామరాజు కేసు దర్యాప్తు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. -
తల్లిని ఓదార్చుతూ.. తండ్రి పాదాలను ముద్దాడుతూ.. (ఫొటోలు)
-
తిరుపతి జిల్లా చంద్రగిరి బాలికల పాఠశాల వద్ద గంజాయి అమ్మకాల కలకలం
-
ధనమే తల్లి ధనమే తండ్రి ధనమే దైవమా..
తల్లి.. తండ్రి.. ఈ లోకంలో కనిపించే ప్రత్యక్ష దైవాలు. నవమాసాలు మోసి, ప్రాణం పోయే నొప్పులను పంటి బిగువన భరించి జన్మనిచ్చేది తల్లి అయితే.. బిడ్డ ముసిముసి నవ్వులకు మురిసిపోతూ.. బుడి బుడి అడుగుల్లో సంతోషం వెతుక్కుంటూ.. కంటికి రెప్పలా కాపాడుకునేది తండ్రి. రక్తం పంచిన వీరిద్దరినీ మించిన బంధం మరొకటి ఉండదు..కష్ట మొచ్చినా, నష్టమొచ్చినా కడుపులో దాచుకొనే నేస్తాలూ ఈ ఇద్దరే. అమ్మ లేనిదే ముద్ద దిగదు.. నాన్న లేనిదే కాలం గడవదు.. పిల్లలకు వీళ్లే రెండు కళ్లు. తాము తినకపోయినా పిల్లల కడుపు నిండితే చాలనుకునే తల్లిదండ్రులు.. కాస్త వయస్సు పైబడితే చాలు, అదే పిల్లలకు చేదవుతున్నారు. తమ బతుకు వారి రక్తమాంసాలనే విషయం మరిచి.. చచ్చినప్పుడు వెంట రాని డబ్బు కోసం కాటికి కాలు చాచిన ఎండు కట్టెలను వీధిన పడేస్తున్న ఘటన కడు దయనీయం. పుట్టినప్పుడు.. పెరుగుతున్నప్పడు.. అమ్మానాన్నలపై ఎనలేని ప్రేమ. పెరిగే కొద్దీ, ఓ తోడు ఇంటికి చేరగానే ఆ బంధం క్రమంగా బరువవుతోంది. ఈ రోజు వాళ్లు.. రేపు మనం అనే విషయాన్ని మరిచి, కళ్లను కమ్మేసిన కరెన్సీ పొరలు మానవ సంబంధాలను కనుమరుగు చేస్తున్నాయి. మట్టినే నమ్ముకున్న ఓ రైతు, రెక్కలు ముక్కలు చేసుకొని ఇద్దరు పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. ఓ ఇంటి వాళ్లను చేసి ఉన్నంతలో పంచిపెట్టాడు. ఇక్కడే.. అన్నదమ్ములు, తోడి కోడళ్ల మధ్య అగ్గి రాజుకుంది. ఎక్కువ తక్కువలు బేరీజు వేసుకొని.. చివరకు సమస్య పరిష్కారం అయ్యే వరకు ఇంట్లోకి రావద్దంటూ గెంటేయడం మానవత్వానికి మాయని మచ్చగా నిలుస్తోంది. చంద్రగిరి: మండల పరిధిలోని కొటాల గ్రామానికి చెందిన చెంగల్‌రామ నాయుడు(86), నాగభూషణమ్మ(75) దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. పెద్ద కుమారుడు యోగానంద తిరుపతిలోని ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపనీలో జూనియర్ అసిస్టెంట్‌గా.. చిన్న కుమారుడు దేవరాజులు టీటీడీకి చెందిన సాంస్కృతిక విభాగంలో నెల్లూరులో పనిచేస్తున్నారు. ఇటీవల కొటాల గ్రామంలోని సర్వే నంబర్ 445లోని చెంగల్‌రామ నాయుడుకు చెందిన వ్యవసాయ భూమిలో 54 సెంట్లను యోగానందకు, 15 సెంట్లను దేవరాజులకు రిజిస్ట్రేషన్ చేయించాడు. అయితే 20 ఏళ్ల క్రితం చెంగల్‌రామ నాయుడు నిర్మించిన ఇంట్లో భార్యతో కలసి ఉంటున్నాడు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం యోగనంద పాత ఇంటిని మరింత సౌకర్యవంతంగా కట్టుకోవడానికి బ్యాంకు లోను అవసరమని తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి నాగభూషణమ్మ, తమ్ముడు దేవరాజు సంతకాలు లేకుండా వృద్ధ దంపతులు నివాసం ఉంటున్న ఇంటిని తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. పంపకాల్లో అన్యాయమని.. సోమవారం రాత్రి యోగానంద ఇంట్లో ఉండగా అతని భార్య విశ్వేశ్వరి(వేద) వృద్ధులు ఉంటున్న ఇంటి వద్దకు వెళ్లి ఆస్తి పంపకాల్లో అన్యాయం చేశారంటూ గొడవకు దిగింది. మేము కోరిన మేరకు ఆస్తి పంపకాలు చేయలేదని, అడిగిన మేరకు రాసివ్వకపోతే అంతు చూస్తామంటూ బెదిరింపులకు పాల్పడింది. వృద్ధాప్యం కారణంగా తాను ఎక్కడికీ రాలేనని, నడిచేందుకు కూడా వీలులేని పరిస్థితిల్లో ఉన్నామని కోడలితో కన్నీరు పెట్టుకున్నా ఫలితం లేకపోయింది. గ్రామ పెద్దల వద్ద పంచాయితీ పెట్టి పరిష్కరించుకోవాలని చెప్పినా వినిపించుకోకుండా తిట్ల దండకం అందుకుంది. అంతటిలో ఆగకుండా తీవ్ర ఆగ్రహంతో ఇల్లు తన భర్త యోగానంద పేరిట ఉందంటూ వృద్ధులను బయటకు గెంటేసి తాళం వేసింది. బంధువుల ఇంట్లో ఆశ్రయం కోడలు ఇంట్లో నుంచి గెంటేయడంతో రాత్రి వేళ వృద్ధ దంపతుల పరిస్థితి దయనీయంగా మారింది. నడవలేని స్థితిలోని భార్యతో ఎక్కడికి వెళ్లాలో తెలియక కన్నీరుమున్నీరయ్యాడు. గ్రామ పెద్దలు కోడలికి సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఒప్పుకోకపోవడంతో చివరకు బంధువుల ఇంట్లో తలదాచుకోవాల్సి వచ్చింది. అప్పటి వరకు ఎంతో గుట్టుగా సంసారం నెట్టుకొచ్చినా, ఇద్దరు కొడుకులు ఉండి మరో ఇంట్లో ఉండాల్సి రావడంతో ఆ దంపతులు కుమిలిపోయారు. విధిలేక పోలీసుస్టేషన్‌కు.. ఆ రాత్రి కన్నీళ్లతో గడిచిపోయింది. ఇక బంధువులకు భారం కాలేక, న్యాయం జరుగుతుందనే ఆశతో అతి కష్టం మీద పోలీసుస్టేషన్‌కు చేరుకున్నారు. కొడుకు, కోడలికి సర్దిచెప్పి న్యాయం చేయాలని చంద్రగిరి ఎస్ఐ వంశీధర్‌ను వేడుకున్నారు. కనీసం పోలీసుస్టేషన్ మెట్లు కూడా ఎక్కలేని పరిస్థితుల్లో ఉన్న వృద్ధుల వద్దకే వెళ్లి ఎస్ఐ కన్నీళ్లు తుడిచే ప్రయత్నం చేశారు. వృద్ధ దంపతుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఎట్టకేలకు ఓ చిన్న గది ఒక రాత్రి బంధువుల ఇంట్లో తల దాచుకొని, మరుసటి రోజు పోలీసుస్టేషన్‌కు వెళ్లిన వృద్ధ దంపతులకు కాస్త ఊరట కల్పించేందుకు గ్రామ పెద్దలు రంగంలోకి దిగారు. యోగానంద, అతని భార్య విశ్వేశ్వరితో చర్చించి, గట్టిగానే హెచ్చరించారు. కుమారుడి స్వాధీనంలోని ఇంట్లోనే వృథాగా ఉన్న ఓ గదిలో వృద్ధ దంపతులు ఉండేందుకు అతి కష్టం మీద ఒప్పించారు. కనీస సౌకర్యాలు లేని ఆ గదిని చూసి నాగభూషణమ్మ ఈ వయస్సులో తమకు ఇదేమి ఖర్మ అంటూ కన్నీరుమున్నీరైంది. అల్లారు ముద్దుగా పెంచినా.. ఇద్దరూ కొడుకులే కావడంతో జీవిత చరమాంకంలో ఎలాంటి లోటు ఉండదనుకున్నాం. ఈ వయస్సులో ఆస్తి పంపకాల వద్ద పెద్ద కొడుకు, కోడలు చేస్తున్న అరాచకం కన్నీరు పెట్టిస్తోంది. నా భార్యకు ఇటీవల ఆపరేషన్ జరగడంతో కనీసం కూర్చోలేని పరిస్థితి. కష్టపడి ఇల్లు కట్టి, కొడుక్కు ఉద్యోగం తీయిస్తే నిలువ నీడ లేకుండా చేశారు. ఇలాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకు రాకూడదు. ఈ వయస్సులో మాకు ఇంకేమీ వద్దు, మా ఇంట్లో మమ్మల్ని ఉండనిస్తే చాలు. – చెంగల్‌రామ నాయుడు మమ్మల్ని మోసం చేశారు 2006లో మా మామ చెంగల్‌రామ నాయుడు ఆస్తి భాగపరిష్కారంలో నన్ను, నా భర్తను మోసం చేసి మా మరిదికి అనుకూలంగా వ్యవహరించారు. మెయిన్ రోడ్డులోని పొలం కాకుండా మాకు లోపలి భాగం ఇచ్చారు. అడిగితే అదేం లేదని, మీకు మెయిన్ రోడ్డులోనే ఉంటుందని చెప్పడంతో అప్పట్లో సంతకాలు చేశాం. ఇప్పుడు మా మరిది ఆ స్థలాన్ని అమ్మే ప్రయత్నం చేస్తున్నాడు. ఇదే విషయమై అత్తమామలను సోమవారం రాత్రి ప్రశ్నిస్తే పత్రాలు ఎలా ఉంటే అలా చేసుకోండని అంటున్నారు. 2003లో అత్తమామలు ఉంటున్న ఇంటిని మాకు రిజిస్ట్రేషన్ చేయించారు. అందుకే మా ఇంటికి మాకు ఇమ్మంటున్నా. – విశ్వేశ్వరి, యోగానంద భార్య, కొటాల -
భర్తతో విడాకులు.. మరొకరిని పెళ్లాడి.. మూడురోజుల పాటు...
సాక్షి, చంద్రగిరి: మహిళను నిర్భంధించి మూడు రోజుల పాటు వ్యక్తి అత్యాచారం చేసినట్లు బాధితురాలు చంద్రగిరి పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు గురువారం రాత్రి కేసు నమోదు చేశారు. బాధితురాలి కథనం మేరకు, ఉగ్రప్రత్యంగిరా ఆలయ వెనుక భాగంలోని ఓ అపార్ట్మెంట్లో మహిళా తన పిల్లలతో కలసి నివాసముంటోంది. మొదటి భర్తతో విడాకులు తీసుకున్న ఆమె, 2019లో రాజేష్ అనే మరో వ్యక్తిని వివాహమాడింది. అయితే రాజేష్‌తో గొడవలు రావడంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తోంది. ఈ క్రమంలో యాదవ సంఘం ద్వారా బాల వీరబ్రహ్మం, జయపాల్, వెంకీ ఆమెకు పరిచయం అయ్యారు. బాల వీరబ్రహ్మం ఆమెను, భర్త రాజేష్‌ను కలుపుతామని నమ్మబలికి పరిచయం పెంచుకున్నాడు. ఆ తరువాత కొన్ని రోజుల నుంచి వీరబ్రహ్మం వేధించడంతో బాధితురాల కోర్టులో కేసు వేసింది. దీంతో ఈ నెల 17వ తేదీన రాత్రి బాల వీరబ్రహ్మం ఆ మహిళ నివాసానికి చేరుకుని, కోర్టులో వేసిన కేసును వాపసు తీసుకోవాలంటూ కోరాడు. ఆమె దానికి నిరాకరించడంతో పగబట్టిన వీరబ్రహ్మం ఈనెల 20న మరోసారి ఆమెపై దాడి చేసి, నిర్బంధించాడు. మూడు రోజుల పాటు అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు వాపోయింది. చివరకు వీరబ్రహ్మం చెప్పినట్లు చేస్తానని బాధితురాలు చెప్పడంతో ఆమెను విడిచిపెట్టాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన కృష్ణవేణి 23నన తిరుపతి రుయాలో చికిత్స తీసుకుని, గురువారం రాత్రి ఆమె చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎస్ఐ హిమబిందు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మంత్రి పెద్దిరెడ్డి కాన్వాయ్కి తప్పిన ప్రమాదం
చంద్రగిరి: తిరుపతి జిల్లా చంద్రగిరి మండల పరిధిలోని పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారి నడింపల్లి వద్ద మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. తన నియోజకవర్గంలోని కార్యక్రమాలను ముగించుకుని మంత్రి పెద్దిరెడ్డి ఆదివారం సాయంత్రం తిరుపతికి పయనమయ్యారు. ఈ క్రమంలో మంత్రికి కాన్వాయ్‌గా వస్తున్న వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని, రోడ్డుకు అటువైపున దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు అవ్వలేదు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సమీక్షించి అనంతరం మంత్రి కాన్వాయ్‌కు మరమ్మతులను నిర్వహించి, అక్కడ నుంచి తిరుపతికి తరలించారు. -
ఎమ్మెల్యే చెవిరెడ్డికి ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం
తిరుపతి రూరల్: ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి ప్రతిష్టాత్మక ‘ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‘లో స్థానం లభించింది. పర్యావరణ హితాన్ని కోరుతూ 1.24 లక్షల మట్టి విగ్రహాలను తయారు చేయించడంతో పాటు ప్రజలకు ఉచితంగా ఇంటింటికీ అందిస్తున్న ఆయన అవార్డుకు అర్హత సాధించారు. శనివారం తిరుపతి రూరల్ మండలం చిగురువాడ అకార్డ్ స్కూల్ ఆవరణలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ కోసం ఎమ్మెల్యే చెవిరెడ్డి చేస్తున్న కృషిని గుర్తిస్తూ ‘ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్’ సంస్థ ప్రతినిధులు అవార్డుతో పాటు గోల్డ్ మెడల్, ప్రశంసా పత్రాన్ని అందజేశారు. అంతేకాకుండా తమ సంస్థ శాశ్వత సభ్యత్వాన్ని కూడా ఉమాశంకర్ అందించారు. ఏటా కొనసాగిస్తాం: ఎమ్మెల్యే చెవిరెడ్డి దేశ చరిత్రలో ఎక్కడా లేనివిధంగా చంద్రగిరి నియోజకవర్గంలో 1.24 లక్షల మట్టి విగ్రహాలు ఎక్కడికక్కడ తయారు చేసి పంపిణీ చేస్తున్నట్టు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వివరించారు. ఏటా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామన్నారు. పదేళ్లుగా చంద్రగిరి నియోజకవర్గంలో మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా ప్రతి ఇంటికి పంపిణీ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో తుడా వీసీ హరికృష్ణ, కార్యదర్శి లక్ష్మి, వెస్ట్ డీఎస్పీ నరసప్ప, అకార్డ్ స్కూల్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి, డైరెక్టర్లు ప్రశాంత్, వివేక్ పాల్గొన్నారు. కాగా, ‘మట్టి వినాయకుని పూజిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం.. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ను నిషేధిద్దాం’ అంటూ ప్లకార్డ్‌లు చేత బట్టి విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే చెవిరెడ్డితో పాటు తుడా వీసీ హరికృష్ణ ప్లకార్డులు చేతబట్టి ర్యాలీలో పాల్గొన్నారు. -
పర్యావరణ హితమే లక్ష్యంగా....
తిరుపతి రూరల్: పర్యావరణ హితమే లక్ష్యంగా..ప్రభుత్వ విప్, తుడా చైర్మన్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి 1.24 లక్షల బంకమట్టి విగ్రహాల తయారీకి శ్రీకారం చుట్టారు. పదేళ్లుగా చెవిరెడ్డి బృహత్తర కార్యక్రమాన్ని చేపడుతున్నారు. గురువారం తిరుచానూరు మార్కెట్ యార్డ్‌లో బంకమట్టి విగ్రహాల తయారీని ఆయన పరిశీలించారు. విగ్రహాల తయారీకి అవసరమైన బంకమట్టి మిశ్రమాన్ని కలపడంలో కుమ్మరి కార్మికులతో కలిసి పాలుపంచుకున్నారు. చెవిరెడ్డి మాట్లాడుతూ..చంద్రగిరి నియోజకవర్గంలో ప్రతి ఏటా, ప్రతి ఇంటికీ బంకమట్టితో తయారుచేసిన వినాయక విగ్రహాలను పంపిణీతో పాటు పూజించేలా ప్రోత్సహించటం ఆనవాయితీగా వస్తోందన్నారు. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని 25 ప్రదేశాల్లో.. 7 వేల మంది కుమ్మరి కార్మికులు 25 రోజులుగా బంకమట్టి విగ్రహాల తయారీలో నిమగ్నమయ్యారని, 2,500 టన్నుల బంకమట్టిని ఉపయోగించినట్లు చెప్పారు. ప్రజలకు గణనాథుని పూజించే విధానంపై బుక్‌లెట్‌ను అందించనున్నట్లు తెలిపారు. 2వేల మంది వలటీర్లతో ఈ విగ్రహాలను ఇంటింటికీ పంపిణీ చేస్తామన్నారు. -
హాస్టల్ గోడ దూకి.. 150 సీసీ కెమెరాల కళ్లుగప్పి..
చంద్రగిరి(తిరుపతి జిల్లా): అర్ధరాత్రి హాస్టల్ గోడ దూకి నలుగురు విద్యార్థినులు పారిపోయిన ఘటన చంద్రగిరిలో కలకలకం సృష్టించింది. వెస్ట్ డీఎస్పీ నరసప్ప కథనం మేరకు.. విజయనగరం, విజయవాడ, కడప, విశాఖపట్నం ప్రాంతాలకు చెందిన నలుగురు విద్యార్థినులు చంద్రగిరి మండలం తొండవాడ సమీపంలో కంచి కామకోటి పీఠం ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంప్రదాయ పాఠశాలలో ఉంటూ చంద్రగిరిలోని శ్రీనివాస డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నారు. చదవండి: వివాహేతర సంబంధం.. భర్తను అడ్డు తొలగిస్తే కలసి జీవించవచ్చని.. వీరిలో ఇద్దరు విద్యార్థినులు మైనర్లు. వీరు డిగ్రీ చదువుకుంటూ.. హాస్టల్లో వేదాలు, హిందూ సంప్రదాయాలు నేర్చుకుంటున్నారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఈ నలుగురు అమ్మాయిలు హాస్టల్ వెనుక వైపు నుంచి 8 అడుగుల ఎత్తయిన గోడదూకి పారిపోయారు. హాస్టల్ ఇన్చార్జి లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. విద్యార్థినుల ఆచూకీ గుర్తించేందుకు నాలుగు బృందాలను రంగంలోకి దింపినట్లు డీఎస్పీ తెలిపారు. కాగా, హాస్టల్ నుంచి వెళ్లే మూడు రోజులకు ముందు ఏమి జరిగిందనే కోణంలో పోలీసులు విచారిస్తున్నట్టు తెలిసింది. ఓ బయటి వ్యక్తి సెల్‌ఫోన్ నుంచి విద్యార్థినులు శుక్రవారం సాయంత్రం రెండు సార్లు ఎవరితోనో మాట్లాడినట్లు తెలుస్తోంది. సుమారు 350 మంది ఉన్న హాస్టల్లో 150కి పైగా సీసీ కెమెరాలు, 10 మంది సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. అయినా విద్యార్థినులు పారిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. -
టీడీపీ నేతల దాష్టీకం
చంద్రగిరి/పుంగనూరు: తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోని టీడీపీ నేతలు బరితెగించిన రెండు వేర్వేరు ఘటనలివి. స్వయానా మేనకోడళ్లయిన చెల్లెలి కుమార్తెలు ఇల్లు కట్టుకుంటున్నారన్న కారణంతో ఓ మేనమామ వారిని నానా దుర్భాషలాడిన ఘటన తిరుపతి జిల్లా చంద్రగిరిలో జరగ్గా.. వైఎస్సార్సీపీ కౌన్సిలర్‌పై టీడీపీ వర్గీయులు మారణాయుధాలతో దాడిచేసి హత్యాయత్నానికి పాల్పడ్డ ఘటన చిత్తూరు జిల్లా పుంగనూరు మున్సిపాల్టీలో జరిగింది. ఈ ఘటనలకు సంబంధించిన వివరాలివీ.. ఇల్లు కట్టుకుంటున్నందుకు.. చంద్రగిరిలో చాకలి వీధికి చెందిన మాలినికి ఆమె తల్లి అమినాబి ద్వారా 2007లో పసుపు–కుంకుమ కింద కొంత స్థలం వచ్చింది. ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో ఇంతకాలం ఇంటి నిర్మాణం చేపట్టలేదు. కానీ, 15 రోజుల క్రితం ఆమె కుమార్తెలు ఇంటి నిర్మాణం ప్రారంభించారు. దీంతో వారి మేనమామ అయిన టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు గౌస్‌బాషా.. కన్నా, చోటులతో కలిసి ఆదివారం ఇంటి నిర్మాణ పనులను అడ్డుకున్నాడు. ఎందుకు అడ్డుకున్నారంటూ మాలిని కుమార్తెలు ప్రశ్నించగా గౌస్‌బాషా వారిని నోటికి వచ్చినట్లుగా దుర్భాషలాడాడు. వీరిద్దరిలో ఒకరు నిండు గర్భిణీ అయిన సుల్తానా బేగంపై దాడికి యత్నించగా సొంత చెల్లెలు అయిన మాలినీతో కూడా గౌస్‌బాషా అసభ్యంగా మాట్లాడాడు. దీంతో అతనితోపాటు కన్నా, చోటులపై చర్యలు తీసుకోవాలని మాలిని కుమార్తెలు పోలీసులను ఆశ్రయించారు. వీరి నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్‌పై హత్యాయత్నం మరో ఘటనలో.. పుంగనూరు మున్సిపాలిటీ వైఎస్సార్సీపీ కౌన్సిలర్ మనోహర్ తన స్వగ్రామమైన కుమ్మరగుంటకు ఆదివారం వెళ్లారు. అక్కడ మాజీ సర్పంచ్ శంకరప్ప, గ్రామస్తులతో కలసి వైఎస్సార్సీపీ ప్రభుత్వ పథకాల అమలుపై చర్చించుకుంటుండగా పుంగనూరు, వనమలదిన్నె, మేకంజామనపల్లెకు చెందిన టీడీపీ నేతలు చిన్నమోహన్‌నాయుడు, ప్రేమకుమార్ నాయుడు, ప్రసాద్ నాయుడు, మాధవరెడ్డి, సీవీ రెడ్డి, బుల్లెట్ పవన్, శ్రీకాంత్, పోలీస్ గిరి, రాజేంద్ర, సత్య వాహనాల్లో కుమ్మరగుంటకు వచ్చి మనోహర్‌ను నానా దుర్భాషలాడుతూ ప్రభుత్వాన్ని, సీఎంను, మంత్రి పెద్దిరెడ్డిని విమర్శిస్తూ కర్రలు, ఇనుపరాడ్లు, రాళ్లతో కొట్టి చంపే ప్రయత్నం చేశారు. గ్రామస్తులు 108కు సమాచారం అందించి తీవ్రంగా గాయపడ్డ మనోహర్‌ను పుంగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మనోహర్‌కు ఛాతిపైన, కాళ్లపైన తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. మనోహర్‌ను ఎంపీ రెడ్డెప్ప, ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, రాష్ట్ర జానపదకళల సంస్థ చైర్మన్ నాగభూషణం తదితరులు పరామర్శించారు. -
చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు
చంద్రగిరి: ఓ పెళ్లి నిశ్చితార్థం కార్యక్రమానికి బయలుదేరిన బస్సు (కేఎల్30 ఏ 4995) చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం భాకరాపేట ఘాట్‌లో శనివారం రాత్రి బోల్తా పడింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా, మరో 45 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. అనంతపురం జిల్లా ధర్మవరంలోని మారుతినగర్‌కు చెందిన పట్టు చీరల వ్యాపారి (కోమలి శిల్క్ హౌస్) మలిశెట్టి మురళి కుమారుడు మలిశెట్టి వేణు (25)కు చిత్తూరు జిల్లా పుత్తూరు సమీపంలోని నారాయణవనంకు చెందిన ఓ యువతితో ఆదివారం నిశ్చితార్థం జరగాల్సి ఉంది. వేణుతో పాటు కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు 55 మంది శనివారం ఓ ప్రైవేట్ బస్సులో తిరుపతికి బయలుదేరారు. రాత్రి 10 గంటల సమయంలో మార్గంమధ్యలో తిరుపతికి 20 కిలోమీటర్ల దూరంలో భాకరాపేట ఘాట్‌లో బస్సు ఒక్కసారిగా 300 అడుగుల లోతున్న లోయలోకి దూసుకెళ్లింది. చుట్టూ చిమ్మ చీకటి, ముళ్ల పొదలు, బండరాళ్ల మధ్య ఏం జరిగిందో తెలియక ప్రయాణికులు హడలిపోయారు. కాపాడండి సారూ.. అంటూ పెద్ద పెట్టున కేకలు వేశారు. బస్సు పల్టీలు కొట్టడంతో ఆ కుదుపులకు కొందరి కాళ్లు, చేతులు విరిగిపోయాయి. మరికొందరికి తీవ్రగాయాలు కావడంతో బస్సు మొత్తం రక్తమయమైంది. అయ్యా.. కాపాడండి.. బస్సు పల్టీలు కొడుతూ లోయలో పడిపోగానే అందులో ఉన్న వారు భయంతో కేకలు పెట్టారు. కొందరు కిటికీల్లోంచి బయటకు వచ్చినా, చీకట్లో వారికేమీ కనిపించలేదు. చిన్న పిల్లలు గుక్క పట్టి ఏడుస్తుండగా, మహిళల ఆర్తనాదాలు మిన్నంటాయి. ప్రయాణికుల ఆర్తనాదాలు విన్న వాహనదారులు లోయలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. ముళ్ల కంపలు, రాళ్లు, రప్పల మధ్య అతికష్టం మీద లోయలోంచి కొందరు క్షతగాత్రులను పైకి తీసుకొచ్చారు. మరికొందరు బస్సులోనే చిక్కుకుపోవడంతో వారిని తీయడానికి అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు భాకరాపేట, చంద్రగిరి పోలీసులతో ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. కలెక్టర్ హరినారాయణన్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుమారుడు హర్షితరెడ్డి హుటాహుటిన అక్కడికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షించారు. 250 నుంచి 300 అడుగుల లోతు నుంచి క్షతగాత్రులను పైకి తీసుకొచ్చేందుకు వందలాది మంది పోలీసులు, రోప్ బృందాలు, స్థానికులు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఒక్కొక్కరికి ఆరుగురు చొప్పున సాయపడాల్సి వచ్చింది. ఒకరిని పైకి తీసుకొచ్చేందుకు అరగంటకు పైగా సమయం పట్టింది. లైట్లు ఒకరు పట్టుకొని, మరొకరు తాడు సాయంతో.. ఇలా ప్రమాదకర స్థితిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆరుగురి మృతదేహాలు లభ్యం కాగా, 35 మంది క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 20 అంబులెన్స్‌లలో తిరుపతి రుయాకు తరలించారు. కాగా, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం అతివేగమే కారణం ప్రమాదకరమైన మలుపులు ఉన్న భాకరాపేట ఘాట్ రోడ్డులో ఈ బస్సు డ్రైవర్ ఎక్కువ వేగంతో నడిపినట్లు సమాచారం. నిత్యం ఈ రహదారిలో వెళ్లే డ్రైవర్లు మాత్రమే వేగంగా వెళ్లడానికి వీలుంటుంది. అలాంటిది ప్రమాదానికి గురైన బస్సు డ్రైవర్ అనుభవ రాహిత్యం వల్లే వేగాన్ని కంట్రోల్ చేయలేకపోవడం వల్ల ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ఈ ఘటన జరగడానికి ముందు సమీపంలోని పెట్రోల్ బంకులో బస్సుకు డీజిల్ పట్టించారు. ఆ సమయంలో బస్సును ముందుకు కదిల్చే క్రమంలో ర్యాష్ డ్రైవింగ్‌పై పలువురు డ్రైవర్‌ను హెచ్చరించారు. జాగ్రత్తగా వెళ్లాలని చెప్పారు. ఇది జరిగిన కాసేపటికే ఘాట్ మొదటి మలుపు వద్దే బస్సు లోయలోకి దూసుకెళ్లింది. ఐదు పల్టీలు కొట్టినట్లు ఓ ప్రయాణికుడు తెలిపాడు. ఈ ఘటనలో వధూ వరుల కుటుంబాల వారు, బంధు మిత్రులు విషాదంలో మునిగిపోయారు. కాగా, 2000లో ఇదే ఘాట్‌లో ఓ పెళ్లి బృందం బస్సు బోల్తా పడి 12 మంది మృతి చెందారు. -
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు మృతి
-
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు మృతి
సాక్షి, చిత్తూరు: జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టిన ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. చంద్రగిరి మండలం ఐతేపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. విశాఖ నుంచి కాణిపాకం వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుల్లో రెండేళ్ల చిన్నారి, ఓ మహిళ ఉన్నారు. బోల్తాపడిన కారు నాగర్ కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకు వచ్చిన కారు మార్చాల సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు యువతులు ఉన్నారు. మృతులు మహబూబాబాద్‌కు చెందిన కిరణ్మయి (22), పిఎ పల్లికి చెందిన శిరీష (20), కొండమల్లే పల్లి అన్నేపక అరవింద్ (23) గా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వ్యక్తిని ఆసుప్రతికి తరలించారు. టీచర్ మృతి మరోవైపు ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం బోరాజ్ చెక్‌పోస్టు వద్ద జరిగిన ప్రమాదంలో బైక్‌పై వెళుతున్న ఉపాధ్యాయురాలు పద్మ మరణించారు. బైక్‌ను ట్రక్కు ఢీ కొట్టడంతో ఉపాధ్యాయురాలు అక్కడికక్కడే మృతి చెందింది. -
భారీగా ఎర్రచందనం స్వాధీనం
కడప అర్బన్/చంద్రగిరి: వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో శనివారం పోలీసులు పెద్ద ఎత్తున ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకుని ఐదుగురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. మూడు వాహనాలను సీజ్ చేశారు. వైఎస్సార్ జిల్లా కాశినాయన మండలం ఆకులనారాయణ పల్లి సమీపంలోని అడవుల్లో నిందితులు ఎర్రచందనం చెట్లను నరికి, దుంగలుగా తయారుచేసి వాహనాల్లోకి ఎక్కించి తరలించడానికి సిద్ధంగా ఉంచారు. ఆ సమయంలో పోరుమామిళ్ల సీఐ రమేష్‌బాబు, ఎస్ఏ కాశినాయన ఎస్ఐ అరుణ్‌రెడ్డి తమ సిబ్బందితో దాడి చేసి నలుగురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 455 కిలోల బరువున్న 20 ఎర్రచందనం దుంగలు, 2 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో జిల్లాలోని బి.మఠం మండలం సోమిరెడ్డి పల్లెకు చెందిన దేవర్ల సుబ్రమణ్యం, ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం మీనేకళ్లు గ్రామానికి చెందిన రావూరి ఉమాశంకర్, కొమరోలు మండలం అక్కపల్లికి చెందిన ధనపాటి రమణయ్య, అదే మండలానికి చెందిన భూమ వసంతకుమార్ ఉన్నారు. ఎవరైనా ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడినా, వారికి సహకరించినా కఠినచర్యలు తీసుకుంటామని ఎస్పీ అన్బురాజన్ హెచ్చరించారు. కూరగాయల మాటున.. చిత్తూరు జిల్లా టాస్క్‌ఫోర్స్ ఎస్పీ ఆదేశాల మేరకు.. ఆర్ఎస్ఐ వాసు సిబ్బందితో కలసి శనివారం 3 గంటల సమయంలో మూలపల్లి వద్ద వాహన తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో ఓ ఐచర్ వాహనం ఆపకుండా వేగంగా అధికారులను దాటి వెళ్లిపోవడంతో దానిని వెంబడించారు. కొంతదూరం వెళ్లగానే వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ముళ్లకంపలోకి దూసుకెళ్లింది. వాహనం తనిఖీ చేయగా సుమారు 14 ఎర్రచందనం దుంగలు ఉన్నాయి. ఆర్ఎస్ఐ వాసు మాట్లాడుతూ.. ఐచర్ వాహనం కింది భాగంలో ఎర్రచందనం ఉంచి, దానిపైన చెక్కలు ఏర్పాటు చేసి కూరగాయలను రవాణా చేసే వాహనం మాదిరి చేశారని తెలిపారు. దాడుల్లో పట్టుబడిన డ్రైవర్ తిరుపతికి చెందిన ప్రభాకర్‌గా గుర్తించామన్నారు. అనంతరం వాహనంతో పాటు ఎర్రచందనం, నిందితుడిని చంద్రగిరి పోలీసులకు అప్పగించారు. -
పుడమి సాక్షిగా.. పచ్చదనమే లక్ష్యం
మధురానగర్(విజయవాడ సెంట్రల్)/తిరుపతి రూరల్: కృష్ణా జిల్లా విజయవాడ, చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ఆదివారం సాక్షి మీడియా గ్రూప్, ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ‘పుడమి సాక్షిగా..’ కార్యక్రమాన్ని నిర్వహించారు. విజయవాడ పడవల రేవు సెంటర్ నుంచి మధురానగర్ జంక్షన్ వరకూ అవగాహన ర్యాలీ నిర్వహించగా, చంద్రగిరి నియోజకవర్గం వకుళాపురంలో వందలాది మంది విద్యార్థులతో మొక్కలు నాటారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, చంద్రగిరిలో జరిగిన కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ విప్, తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణతోనే భావితరాలకు బంగారు భవిష్యత్తని మంత్రులు చెప్పారు. భూ తాపాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడుకునేందుకు సాక్షి మీడియా రెండేళ్లుగా చేపడుతున్న మొక్కలు నాటే కార్యక్రమాన్ని వారు అభినందించారు. ప్రకృతి వనరుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రులు పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణలో సాక్షి మీడియా గ్రూప్‌తో కలిసి.. రానున్న రోజుల్లోనూ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని, గతేడాది పుడమి సాక్షిగా కార్యక్రమం తర్వాత చంద్రగిరి నియోజకవర్గంలో 10 లక్షల మొక్కలు నాటినట్లు చెవిరెడ్డి చెప్పారు. కార్యక్రమాల్లో కృష్ణా జిల్లా కలెక్టర్ జె.నివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైఎస్సార్సీపీ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి దేవినేని అవినాష్, విజయవాడ సీపీ టీకే రాణా, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు నరేంద్ర, ఎండీ రుహుల్లా, సాక్షి డీజీఎం కేఎస్ అప్పన్న, కృష్ణా జిల్లా బ్యూరో ఇన్చార్జ్ ఓ.వెంకట్రామిరెడ్డి, సాక్షి టీవీ బ్యూరో చీఫ్ వి.శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ కరస్పాండెంట్ ఎన్.సతీష్, రవీంద్రరెడ్డి పాల్గొన్నారు. చిన్నారులు స్కేటింగ్ చేస్తూ ర్యాలీలో ఆకర్షణగా నిలిచారు. -
మృత్యుంజయురాలు జిషిత డిశ్చార్జ్
తిరుపతి తుడా/రాజాం: చిత్తూరు జిల్లా చంద్రగిరి సమీపంలోని ఐతేపల్లి మలుపు వద్ద జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువును జయించిన జిషిత (2)ను ఆస్పత్రి నుంచి మంగళవారం డిశ్చార్జ్ చేశారు. తిరుపతిలోని రుయా చిన్నపిల్లల ఆస్పత్రిలో 2 రోజులపాటు వైద్యులు చికిత్స అందించారు. ఆ బాలిక రెండు కాళ్లు, తొడ భాగంలో విరిగిన ఎముకలకు కట్టు వేశారు. బిడ్డను చూసుకునేందుకు శ్రీకాకుళం నుంచి ఇక్కడికి వచ్చి ఉండలేని పరిస్థితుల నేపథ్యంలో బాలికను డిశ్చార్జ్ చేయాలని బంధువులు విజ్ఞప్తి చేశారు. తదుపరి చికిత్సను విశాఖలో అందించేందుకు ఏర్పాట్లు చేసుకున్నామని వైద్యాధికారులకు నచ్చచెప్పడంతో జిషితను డిశ్చార్జ్ చేశారు. రుయా సూపరింటెండెంట్ డాక్టర్ భారతి, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ వర్కింగ్ చైర్మన్ బండ్ల చంద్రశేఖర్ రాయల్ రాత్రి 7.00 గంటల సమయంలో అంబులెన్స్‌లో చిన్నారి జిషితను రైల్వేస్టేషన్‌కు పంపించారు. -
కుటుంబం కనుమరుగు.. మృత్యుంజయురాలికి మెరుగైన చికిత్స
తిరుపతి తుడా: చిత్తూరు జిల్లా చంద్రగిరి సమీపంలోని ఐతేపల్లి మలుపు వద్ద జాతీయ రహదారిపై ఆదివారం చోటుచేసుకున్న ఘోర ప్రమాదంలో దుర్మరణం పాలైన ఏడుగురి మృతదేహాలను సోమవారం వారి బంధువులకు అప్పగించారు. మృత్యువును జయించిన జిషితకు తిరుపతి రుయా ఆస్పత్రిలో వైద్య నిపుణులు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. చిన్నారి రెండు కాళ్లకు తొడ భాగంలో ఎముకలు విరిగినట్టు గుర్తించారు. బాలికకు ఎలాంటి శస్త్ర చికిత్స అవసరం లేదని వైద్యులు తెలిపారు. చిన్నారి షాక్ నుంచి తేరుకోకపోవడంతో తరచూ ఉలిక్కి పడుతోంది. కడుపు ఉబ్బడం, ఆ భాగంలో కొంతమేర నలుపెక్కడంతో వివిధ రకాల పరీక్షలు చేశారు. కడుపుపై బలమైన దెబ్బ తగలడం వల్ల లోపల ఏదైనా ఒక పార్ట్ నలగడం లేదా రక్తం గడ్డకట్టి ఉండొచ్చని భావిస్తున్నారు. చిన్నారికి ప్రాణాపాయం లేదని డాక్టర్ మనోహర్ చెప్పారు. అమ్మానాన్నలు, అవ్వాతాతలను కోల్పోయి చికిత్స పొందుతున్న జిషిత ఆలనా పాలన మహిళా కానిస్టేబుల్ శాంతి చూస్తున్నారు. మృతదేహాల అప్పగింత మొక్కు చెల్లించుకోవడానికి తిరుమలకు కారులో బయల్దేరిన మెరైన్ ఇంజనీర్ సురేష్‌కుమార్ కుటుంబ సభ్యుల్లో ఏడుగురు మృతి చెందగా, రెండేళ్ల పాప జిషిత ప్రాణాలతో బయటపడిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఆదేశాలతో ఫోరెన్సిక్ విభాగాధిపతి మమత ఆధ్వర్యంలో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. కలెక్టర్ హరినారాయణన్, అర్బన్ ఎస్పీ వెంకట అప్పల నాయుడు పర్యవేక్షణలో మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆర్డీవో కనకన రసారెడ్డి, డీఎస్పీ నరసప్ప మృతుల బంధువులతో తరచూ మాట్లాడుతూ సూచనలు ఇచ్చారు. ఏడుగురి మృతదేహాలు, నగదు, వస్తు సామగ్రిని డీఎస్పీ నరసప్ప, సీఐ శ్రీనివాసులు సమక్షంలో బంధువులకు అప్పగించారు. రెండు అంబులెన్స్‌లలో మృతదేహాలను శ్రీకాకుళం, విజయనగరంలోని వారి స్వస్థలాలకు తరలించారు. మేం కూడా వచ్చి ఉంటే బతికివారేమో.. తిరుపతికి వారితో కలిసి తాము కూడా రావాల్సి ఉందని, తక్కువ సమయం ఉండటంతో రాలేకపోయామని సురేష్‌కుమార్ తోడల్లుడు మధు చెప్పారు. వాళ్లతో కలిసి తాము కూడా వచ్చి ఉంటే అంతా బతికే వారేమోనన్నారు. అంతా కలిసి బయలుదేరి ఉంటే ప్రైవేట్ వాహనంలోనో, రైలులోనో బయల్దేరేవాళ్లమని, అలా చేసి ఉంటే ఈ ఘటన జరిగేది కాదన్నారు. మృత్యుంజయురాలు జిషితను కంటికి రెప్పలా కాపాడుకుంటామని చెప్పారు. -
ఏడుగురిని బలి తీసుకున్న మలుపు.. ఆ ఇంట్లో ఇప్పుడు శ్మశాన నిశ్శబ్దం
6 People Died in a Road Accident Near Chandragiri Zone: అమ్మా.. నాన్నా.. తాతా.. నానమ్మా.. అన్న పలకరింపులతో వారం కిందటి వరకు ఈ ఇల్లు సందడిగా ఉండేది. ఇప్పుడు ఆ ఇంటి పరిసరాల్లో శ్మశాన నిశ్శబ్దం అలముకుంది. ఆరుగురు కుటుంబ సభ్యులు ఉన్న ఈ ఇంటిలో ఒక్క చిన్నారిని మాత్రమే మృత్యుదేవత విడిచిపెట్టింది. మిగిలిన వారందరినీ మింగేసి ఆ పసిదానికి కన్నీటి జ్ఞాపకాలను మిగిల్చింది. రాజాం/తిరుపతి రూరల్/ తిరుపతి తుడా : ఏ వీధికి వెళ్లినా వారి మాటలే. ఏ అరుగున విన్నా వారి ముచ్చట్లే. ఆదివారం ఉదయం చంద్రగిరి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలంలోని మేడమర్తిని ఏడిపించింది. ఈ ఊరిలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు దుర్మరణం పాలవ్వడంతో ఊరుఊరంతా ఆదివారం గుండెలవిసేలా రోదించింది. గ్రామానికి చెందిన కంచరాపు శ్రీరామమూర్తి(65)తో పాటు అతని భార్య సత్యవతి(55), కుమారుడు సురేష్‌కుమార్(35), కోడలు మీనా (28), మనవరాలు జోష్మిక నందిత(ఏడునెలలు)తో పాటు పూసపాటిరేగకు చెందిన ఆయన వియ్యంకులు పైడి గోవిందరావు(58), వియ్యంకురాలు పైడి హైమావతి(53) చంద్రగిరి వద్ద జరిగిన కారు ప్రమాదంలో మృతి చెందారు. పెద్ద మనవరాలు జిషిత మాత్రమే ప్రాణాలు దక్కించుకుంది. తిరుపతి నుంచి కాణిపాకం వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ విషయం తెలిసిన వెంటనే మృతుల స్వగ్రామం మేడమర్తిలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. శ్రీరామమూర్తి ఇంటిల్లిపాదీ తీర్థయాత్రకు వెళ్లి ప్రాణాలు కోల్పోవడంతో ఆముదాలవలసలో ఉంటున్న ఆయన సోదరుడు రంగారావు భోరున విలపిస్తున్నారు. తిరుపతి సమీపంలో ఉన్న తమ బంధువులను సంఘటనా స్థలానికి పంపించి సమాచారం తెలుసుకుంటున్నారు. ప్రమాదంలో మృతి చెందిన మీనా సోదరి శ్రీలత కన్నీరుమున్నీరవుతున్నారు. చిత్రంలో నవ్వుతూ కనిపిస్తున్న వారు సురేష్, మీనా, జిషిత. సురేష్‌కు ఐదేళ్ల కిందట వివాహం కాగా.. ఇద్దరు పిల్లలు ఉన్నారు. మూడేళ్ల కిందటే మెరైన్ ఇంజినీర్‌గా కొలువు సాధించడంతో ఆ కుటుంబం ఆర్థికంగా స్థిరపడుతోంది. ఆ ఆనందాన్ని ఆవిరి చేస్తూ సురేష్, మీనాను మృత్యువు తీసుకెళ్లిపోయింది. రెండేళ్ల చిన్నారి ఒంటరిగా మిగిలిపోయింది. మృత్యుమలుపు..! పూతలపట్టు– నాయుడుపేట జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు సంభిస్తున్నాయి. చిత్తూరు– తిరుపతి మార్గంలో కొత్తగా ప్రారంభించిన సువిశాలమైన హైవేపై కొన్ని మలుపులు మృత్యు ఘంటికలను మోగిస్తున్నాయి. ముఖ్యంగా చంద్రగిరి సమీపంలో అగరాల వద్ద మలుపునకు ఎన్నో ప్రాణాలు బలవుతున్నాయి. ఆదివారం ఉదయం కారు ప్రమాదం కూడా ఇక్కడే సంభవించింది. శ్రీకాకుళం జిల్లా మేడమర్తి గ్రామానికి చెందిన ఒకే కుటుంబంలోని ఏడుగురిని ఈ మలుపే బలితీసుకుంది. గతంలో ఈ ప్రాంతంలోనే జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తొమ్మిదిమంది కర్ణాటక వాసులు దుర్మరణం పాలవడం స్థానికులు మర్చిపోకముందే మరో ఘటన సంభవించడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డుపై ప్రమాదాల నివారణకు సంబంధిత అధికారులు కనీస జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. కనీసం సూచిక బోర్డులైనా ఏర్పాటు చేయించాలని కోరుతున్నారు. నమ్మలేకపోతున్నాం రెండురోజుల కిందటే శ్రీరామమూర్తి కుటుంబంతో తిరుపతి వెళ్లా డు. సొంతకారులో వెళుతున్నానని, త్వరగా వచ్చేస్తాంలే అని చెప్పాడు. ఆదివారం ఉద యం కూడా ఫోన్లో మాట్లాడాం. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. – కేవీ రమణ, మేడమర్తి మాతోనే చదువుకున్నాడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సురేష్‌కుమార్ ఐదో తరగతి వరకూ మాతోనే గ్రామంలో చదివాడు. ఉన్నత విద్య, ఇంటర్, బీటెక్ కోర్సులను శ్రీకాకుళం, విశాఖపట్నంలో పూర్తి చేశాడు. అందరితో సరదాగా ఉండేవాడు. చిన్నకూతురు మొక్కు కోసం తిరుపతికి వెళుతున్నామన్నాడు. ఇంతలో ఇలా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. – కె.రాము, మేడమర్తి -
మొక్కు తీర్చుకునేందుకు వెళుతూ మృత్యు ఒడికి..
గంటకు 130 కిలోమీటర్ల వేగం.. సుదూర ప్రయాణంతో అలసట.. ఆపై మధ్యాహ్నం భోజనం తర్వాత చిన్న కునుకు.. అదే సమయంలో చిన్నపాటి మలుపు.. ముందు వెళ్తున్న ఆటోను ఓవర్టేక్ చేయబోయిన కారు అదుపు తప్పింది. డివైడర్‌ను ఢీకొని పల్టీలు కొట్టింది. కొంచెం ముందుకెళ్లి కల్వర్టును ఢీకొట్టి మంటల్లో చిక్కుకుపోయింది. అప్పటికే మాటేసిన మృత్యువు ముగ్గుర్ని సజీవ దహనం చేసింది. మరో నలుగుర్ని విగత జీవులుగా మార్చింది. మొత్తంగా రెండు కుటుంబాలకు చెందిన ఏడుగుర్ని కబళించింది. తిరుపతి రూరల్/రాజాం: చిత్తూరు జిల్లా చంద్రగిరి సమీపంలోని ఐతేపల్లి మలుపు వద్ద జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ఘోర ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం మేడమర్తి, విజయనగరం జిల్లా పూసపాటిరేగకు చెందిన ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. ముందు వెళ్తున్న ఆటోను కారు ఓవర్టేక్ చేయబోగా అదుపు తప్పింది. డివైడర్‌ను ఢీకొని వంద మీటర్ల మేర ముందుకు దూసుకెళ్లి మూడు పల్టీలు కొట్టి కల్వర్టును ఢీకొట్టింది. డివైడర్‌ను ఢీకొన్న సమయంలోనే పెట్రోల్ ట్యాంక్ పగిలిపోగా.. కల్వర్టును ఢీకొట్టిన సమయంలో ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో మెరైన్ ఇంజనీర్ కంచా రపు సురేష్‌కుమార్ (40), అతని భార్య మీనా (33), వీరి చిన్న కుమార్తె జోష్మిక నందిత (6 నెలలు), సురేష్‌కుమార్ తండ్రి శ్రీరామమూర్తి (65), తల్లి సత్యవతి (55), మామ పైడి గోవిందరావు, అత్త హైమావతి మృత్యువాత పడ్డారు. సురేష్, మీనా దంపతుల పెద్దకుమార్తె జోషిత (2) గాయాల పాలై మృత్యువును జయించినా.. తన వాళ్లందరినీ పోగొట్టుకుని అనాథగా మిగిలింది. ఈ ఘటనలో సురేష్, తండ్రి శ్రీరామమూర్తి, తల్లి సత్యవతి కారులోనే సజీవ దహనమయ్యారు. సురేష్ చిన్నకుమార్తె జోష్మిక నందిత, భార్య మీనా, అత్త హైమావతి, మామ గోవిందరావు గాయాల పాలై ప్రాణాలొదిలారు. ప్రమాదం జరిగిందిలా.. శ్రీకాకుళం జిల్లా మేడమర్తికి చెందిన కంచారపు శ్రీరామమూర్తి, విజయనగరం జిల్లాకు చెందిన పైడి గోవిందరావు తమ కుటుంబ సభ్యులతో కలిసి సొంత కారులో శ్రీవారి దర్శనార్థం ఆదివారం తిరుపతికి చేరుకున్నారు. సోమవారం వారికి దర్శనం స్లాట్ కేటాయించారు. ఆదివారం కాణిపాకం వినాయకస్వామిని దర్శించుకున్నారు. భోజనం అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు కాణిపాకం నుంచి తిరుమల బయలుదేరారు. అతివేగంగా వస్తున్న కారు పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారిపై చంద్రగిరికి సమీపంలో ఐతేపల్లి వద్ద టర్నింగ్లో అదుపు తప్పడంతో ప్రమాదానికి గురైంది. ఓ వైపు కారు నుంచి వచ్చిన అగ్నికీలలకు తోడు కారు తునాతునకలై ఇనుప ముక్కలు శరీరాల్లోకి దూసుకుపోవడంతో లోపల ఉన్నవారు పెద్దపెట్టున ఆర్తనాదాలు చేశారు. దీంతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. రెండు కుటుంబాలకు చెందిన ఏడుగురు దుర్మరణం పాలవడంతో బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. -
డబ్బుల కోసం వక్రమార్గం
చంద్రగిరి: కొందరు విద్యార్థులు సులభంగా డబ్బులు సంపాదించవచ్చనే ఆశతో వక్రమార్గం పట్టారు. గంజాయి రవాణా చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఈ వివరాలను తిరుపతి వెస్ట్ డీఎస్పీ నరసప్ప మీడియాకు వెల్లడించారు. తిరుపతికి చెందిన 9 మంది యువకులు మంగళవారం ఉదయం నరసింగాపురం రైల్వేస్టేషన్ నుంచి చంద్రగిరికి వస్తున్నారు. వీరిని సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ విజయ్‌కుమార్ నాయక్, హిమబిందు తమ సిబ్బందితో కలిసి ఆపేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వారు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. రేజర్ల జాన్తరుణ్(బీటెక్), దిలీప్‌కుమార్(ఇంటర్), గుణసాగర్(బీకాం), అఖిల్‌రెడ్డి(బీకాం), పెరుగొండ హర్ష(హోటల్ మేనేజ్మెంట్)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు తమ లగేజీ బ్యాగుల్లో దాచిన 5.4 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారైన శ్రావణ్, రాజేష్, రూపేస్, హరీష్‌ల కోసం గాలిస్తున్నారు. వీరిలో కొందరు చదువుకుంటుండగా, మరికొంత మంది ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారు. గంజాయి రవాణాను అడ్డుకున్న పోలీసులను తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ వెంకట అప్పలనాయుడు అభినందించి.. రివార్డులు ప్రకటించారు. -
నారా చంద్రబాబునాయుడు ఘోర పరాజయం
సాక్షి ప్రతినిధి, తిరుపతి: కుప్పం నియోజకవర్గంలోని జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో టీడీపీ ఓటమి సరే కానీ, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఓడిపోవడం ఏమిటని అనుకుంటున్నారా! అయితే ఈ లెక్క చూడండి. బాబుకు ఘోర పరాభవంతో కూడిన పరాజయం దక్కిందని అందరూ ఒప్పుకుంటారు. చివరికి టీడీపీ శ్రేణులు కూడా. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కుప్పం నుంచి ఓ రకంగా చావు తప్పి కన్నులొట్టపోయిన చందంగా చంద్రబాబు గెలుపొందారు. అప్పటికి వరుసగా ఆరుసార్లు గెలిపించిన కుప్పంలో ఈ దఫా కొన్ని రౌండ్లలో వెనక్కు వెళ్లి, మరికొన్ని రౌండ్లలో ముందుకొచ్చి మొత్తంగా కుప్పం నుంచే ఏడోసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగోలా బయటపడ్డారు. కానీ ఆ తర్వాత జరిగిన ప్రతి స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ చంద్రబాబుకు దారుణ పరాజయమే మిగిలింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలోని 89 పంచాయతీలకు గాను 74 చోట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరచిన అభ్యర్థులు విజయం సాధించగా, 14 చోట్ల టీడీపీ మద్దతుదారులు, ఒక చోట కాంగ్రెస్ పార్టీ మద్దతుదారు విజయం సాధించారు. తాజాగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల్లోనూ టీడీపీ తుడిచి పెట్టుకుపోయింది. గుడుపల్లె, శాంతిపురం, రామకుప్పం, కుప్పం జెడ్పీటీసీ స్థానాలను వైఎస్సార్సీపీ అభ్యర్థులు భారీ మెజారిటీతో చేజిక్కించుకున్నారు. వైఎస్సార్సీపీ కుప్పం జెడ్పీటీసీ అభ్యర్థి ఏడీఎస్ శరవణ 17,358 ఓట్ల మెజారిటీతో విజయం సాధించగా, గుడుపల్లె అభ్యర్థి కృష్ణమూర్తి 11,928 ఓట్ల ఆధిక్యతతో, శాంతిపురం అభ్యర్థి శ్రీనివాసులు 16,893 ఓట్ల ఆధిక్యతతో.. రామకుప్పం అభ్యర్థి కే రాఘవరెడ్డి 16,118 ఓట్ల ఆధిక్యంతో టీడీపీ అభ్యర్థులపై విజయం సాధించారు. వైఎస్సార్సీపీ ఏకపక్ష విజయం నాలుగు మండలాల్లోని మొత్తం 68 ఎంపీటీసీ స్థానాలకు గాను 63 స్థానాలను (ఇందులో ఒకటి ఏకగ్రీవం) వైఎస్సార్సీపీ భారీ మెజారిటీతో గెలుచుకుంది. కేవలం మూడు ఎంపీటీసీలు మాత్రమే టీడీపీ గెలుపొందగా, రెండు ఎంపీటీసీ స్థానాల్లో అభ్యర్థుల మృతితో ఎన్నిక జరగలేదు. కుప్పం మండలంలోని 21 ఎంపీటీసీ స్థానాలకు 20 స్థానాల్లో ఎన్నికలు జరగ్గా... వైఎస్సార్సీపీ 18 చోట్ల విజయం సాధించగా, టీడీపీ రెండింట మాత్రమే గెలుపొందింది. గుడుపల్లె మండలంలో 13కు గాను 12 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలు జరగ్గా, అన్నింటినీ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. రామకుప్పం మండలంలో 16కు 16, శాంతిపురం మండలంలో 18కి 17 ఎంపీటీసీ స్థానాలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. మొత్తంగా కుప్పం నియోజకవర్గంలోని నాలుగు జెడ్పీటీసీల్లో వైఎస్సార్సీపీకి 84,160 ఓట్లు, టీడీపీకి 21,863 ఓట్లు వచ్చాయి. ఈ లెక్కన వైఎస్సార్సీపీకి 62,297 ఓట్ల ఆధిక్యం లభించింది. ఇలా అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన ప్రతి ఎన్నికలోనూ వైఎస్సార్సీపీ ఏకపక్షంగా విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఇది చంద్రబాబుకు దక్కిన ఘోర పరాభవంగానే రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. చిత్తూరులో టీడీపీ చిత్తు చిత్తు ► చంద్రబాబునాయుడి సొంత జిల్లా చిత్తూరులో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేసిన కుప్పం మినహా మిగిలిన 13 అసెంబ్లీ నియోజకవర్గాలనూ వైఎస్సార్సీపీనే గెలుచుకుంది. ఇప్పుడు కుప్పంతో సహా మొత్తం 14 నియోజకవర్గాల్లోని అన్ని జెడ్పీటీసీ స్థానాల్లోనూ వైఎస్సార్సీపీ అభ్యర్థులే తిరుగులేని విజయం సాధించారు. ► జిల్లాలో మొత్తం 65 జెడ్పీటీసీ స్థానాలుండగా, 30 స్థానాలు గతంలోనే ఏకగ్రీవమయ్యాయి. రెండు స్థానాల్లో అభ్యర్థుల మృతితో ఎన్నికలు నిలిచిపోగా, మిగిలిన 33 స్థానాల్లో జరిగిన ఎన్నికల కౌంటింగ్‌లో అన్ని స్థానాల్లోనూ వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. గెలుపొందిన ప్రతి స్థానంలోనూ టీడీపీ అభ్యర్థులపై భారీ ఓట్ల మెజారిటీ రావడం విశేషం. ► జిల్లాలోని 886 ఎంపీటీసీ స్థానాల్లో 410 చోట్ల వైఎస్సార్సీపీకి, టీడీపీకి 8, సీపీఐకి 1, ఇతరులకు 14 స్థానాల్లో ఏకగ్రీవాలయ్యాయి. 34 ఎంపీటీసీ స్థానాల్లో వివిధ కారణాల వల్ల ఎన్నికలు జరగలేదు. ఎన్నికలు జరిగిన 419 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 389 స్థానాల్లో విజయం సాధించగా, టీడీపీ కేవలం 25 స్థానాలతో సరిపెట్టుకుంది. స్వతంత్రులు ఐదు చోట్ల గెలుపొందారు. ► మొత్తంగా ఎన్నికలు జరగని 34 స్థానాలను మినహాయిస్తే, 852 ఎంపీటీసీలకు గాను799 స్థానాల్లో వైఎస్సార్సీపీ, 33 స్థానాల్లో టీడీపీ, సీపీఐ 1, ఇతరులు 19 చోట్ల గెలుపొందారు. మొత్తంగా చూస్తే.. టీడీపీ ఆవిర్భావం తర్వాత జిల్లాలో ఇంతటి దారుణమైన ఫలితాలను తొలిసారిగా చవిచూసిన బాధ కంటే, చివరికి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఈ స్థాయిలో పార్టీ కుప్పకూలడం ఇప్పుడు ఆ పార్టీ నేతలకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. కుప్పంలో చరిత్ర తిరగరాసిన ఫ్యాన్ చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ తొలిసారిగా చరిత్ర తిరగ రాసింది. జెడ్పీటీసీ వ్యవస్థ మొదలైన తర్వాత మొదటిసారిగా టీడీపీకి అక్కడ బోణీ లేకుండా పోయింది. 1989 నుంచి స్థానిక సంస్థలకు సంబంధించిన ప్రతి ఎన్నికలోనూ టీడీపీ పై చేయి సాధిస్తూ వచ్చింది. 2006లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో శాంతిపురం జెడ్పీటీసీ సభ్యుడిగా కాంగ్రెస్ అభ్యర్థి సుబ్రహ్మణ్యంరెడ్డి గెలుపొందారు. మిగిలిన మూడు చోట్ల టీడీపీ అభ్యర్థులే గెలుపొందారు. అదే ఏడాది రామకుప్పం ఎంపీపీగా కాంగ్రెస్ అభ్యర్థి వెంకటమ్మ గెలుపొందారు. మిగిలిన ఎంపీపీలన్నీ టీడీపీ గెలిచింది. 2014లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో నాలుగు జెడ్పీటీసీ స్థానాలు, అన్ని ఎంపీపీలనూ టీడీపీనే గెలుచుకుంది. అయితే 2021లో మొత్తం సీన్ రివర్స్ అయింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన, కుప్పంలో జరిగిన అభివృద్ధి పనుల వల్లే ఇక్కడి ప్రజలు సైకిల్‌కు పంక్చర్ చేసి, ఫ్యాన్‌కు పట్టం కట్టారు. చంద్రబాబు సొంతూరులో వైఎస్సార్సీపీ జెండా ప్రతిపక్ష నేత చంద్రబాబు స్వగ్రామం చంద్రగిరి నియోజకవర్గం నారా వారిపల్లెలోనూ వైఎస్సార్సీపీ అభ్యర్థి తిరుగులేని విజయం సాధించారు. నారావారిపల్లె గ్రామం ఉన్న చిన్నరామాపురం ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి రాజయ్య, టీడీపీ అభ్యర్థి గంగాధరంపై 1,399 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. ఎంపీటీసీ పరిధిలో మొత్తం 3,040 ఓట్లు ఉంటే 2,061 ఓట్లు పోలయ్యాయి. ఆదివారం జరిగిన కౌంటింగ్‌లో వైఎస్సార్సీపీకి 1,704 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి గంగాధరంకు కేవలం 305 ఓట్లు వచ్చాయి. చంద్రబాబుకు రాజకీయ జీవితం ప్రసాదించిన చంద్రగిరి మండలంలోని 16 ఎంపీటీసీలు, ఒక జెడ్పీటీసీ స్థానం సైతం వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఇక్కడ టీడీపీ ఒక్క ఎంపీటీసీ స్థానం కూడా గెలవలేదు. -
సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని మోడల్ ఆస్పత్రిగా మారుస్తామన్న ఎమ్మెల్యే
-
చంద్రగిరిలో టీడీపీ ఇసుక దందా..
సాక్షి,చంద్రగిరి: మండలంలో టీడీపీ నాయకులు ఇసుక దందా కొనసాగిస్తున్నారు. చంద్రబాబు హయాం నుంచి అలవాటైన అక్రమ రవాణా నేటికీ కొనసాగుతోంది. స్థానికులెవరైనా ఫిర్యాదు చేస్తే వారిపై దాడులకు తెగబడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. చంద్రబాబు సొంత పంచాయతీ కందులవారిపల్లి కేంద్రంగా టీడీపీ మాఫియా ఏర్పాటైంది. శేషాపురానికి చెందిన టీడీపీ నాయకులు, నారావారిపల్లికి చెందిన చంద్రబాబు బంధువుతో కలసి, బుధవారం రాత్రి నుంచి బీమానదిలో ఇసుక తవ్వకం మొదలుపెట్టారు. రెండు జేసీబీలు, పది ట్రాక్టర్లను ఉపయోగించి కందులవారిపల్లి నుంచి పులిచెర్లకు ఇసుకను తరలిస్తున్నారు. మరికొన్ని ట్రాక్టర్ల ద్వారా ఇసుకను కొత్తపేటకు తరలిస్తున్నారు. ట్రాక్టర్ ఇసుకను రూ.5 వేలు చొప్పున విక్రయిస్తున్నారు. వాగులు, వంకల్లో ఇసుక ఖాళీ భీమా నది పరిసర ప్రాంతాల్లోని వంకలు, వాగుల్లో ఇప్పటికే ఇసుకను తోడేశారు. దీంతో సమీప బావులు, బోర్లలో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. పంటల సాగుకు నీరందడం లేదని రైతులు వాపోతున్నారు. అక్రమ రవాణాదారులపై ఫిర్యాదు చేస్తే దౌర్జన్యాలు, దాడులు చేస్తున్నారన్న భయంతో వెనకడుగు వేస్తున్నారు. నాలుగు రోజుల నుంచి యథేచ్ఛగా ఇసుక రవాణా సాగుతుండడం గమనార్హం. పట్టించుకోని యంత్రాంగం అక్రమ ఇసుక రవాణాపై సమాచారం ఉన్నప్పటికీ అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. స్థానికంగా ఉండే వీఆర్ఓ, వీఆర్ఏలతో పాటు గ్రామ పోలీసులు సైతం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అధికారుల్లో కొందరు గుట్టుగా అక్రమ రవాణాదారులకు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. డీఎస్పీ ఆదేశాలు బేఖాతర్ ఇసుక అక్రమ రవాణాపై సమాచారం అందుకున్న డీఎస్పీ నరసప్ప బుధవారం రాత్రి స్థానిక పోలీసులను అప్రమత్తం చేశారు. వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లి ఇసుక తవ్వుతున్న వాహనాలను సీజ్ చేయాలని చెప్పారు. అయితే డీఎస్పీ ఆదేశాలు బేఖాతర్ చేస్తూ నిమిషాల వ్యవధిలో ఇసుక స్మగ్లర్లకు సమాచారం అందించారు. హుటాహుటిన బీమానది నుంచి జేసీబీలు, ట్రాక్టర్లను మళ్లించేశారు. వారు వెళ్లిన తర్వాత రంగంలోకి దిగిన పోలీసులు, అక్కడ ఏమీ లేదంటూ చేతులు దులుపుకుని వెనుదిరగడం కొసమెరుపు. -
చిత్తూరు జిల్లా: దిశయాప్ డౌన్‌లోడ్‌లో చంద్రగిరి నియోజకవర్గం రికార్డ్
-
దిశ యాప్ డౌన్లోడ్లలో చంద్రగిరి రికార్డ్
తిరుపతి రూరల్: అక్కచెల్లెమ్మల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ యాప్ డౌన్లోడ్లలో చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రికార్డు సృష్టించింది. ఆ నియోజకవర్గంలో 1.6 లక్షల కుటుంబాలు ఉండగా శనివారం నాటికి 1,77,363 మంది మహిళలు దిశ యాప్‌ను తమ స్మార్ట్ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకున్నారు. తద్వారా దిశ యాప్ డౌన్లోడ్లలో రాష్ట్రంలోనే చంద్రగిరి నియోజకవర్గం ప్రథమ స్థానంలో నిలిచింది. దేశానికే ఆదర్శంగా నిలిచేలా ‘దిశ’ యాప్ అమలుకు సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుడితే.. చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మహిళలంతా యాప్‌ను డౌన్లోడ్ చేసుకునేలా ప్రత్యేకంగా పర్యవేక్షించారు. సీఎం వైఎస్ జగన్ సంకల్పం మేరకు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పం మేరకు ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ముందుకు కదిలారు. నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల్లో ఉన్న మహిళా సంఘాలు, సంఘ మిత్రలు, మహిళా పోలీస్‌లకు ‘దిశ ’ యాప్ పట్ల అవగాహన కల్పించేందుకు సంకల్పించారు. ఇందుకు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో భారీ అవగాహన సదస్సును నిర్వహించారు. సదస్సుకు హాజరైన ప్రతి ఒక్కరితో దిశ యాప్‌ను డౌన్లోడ్ చేయించారు. అనంతరం మండలాలు, గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి యాప్ పట్ల అవగాహన కల్పించాలని వలంటీర్లు, వార్డు సభ్యులు, మహిళా పోలీస్‌లకు దిశానిర్దేశం చేశారు. యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఓ అన్నయ్య తోడున్నట్టేనని వివరించాలన్నారు. ఆపద ఎదురైతే ‘దిశ‘ యాప్ ద్వారా నిమిషాల్లో పోలీసుల రక్షణ ఉంటుందని చెప్పాలన్నారు. ప్రయాణాల్లోనూ ఎంతో భద్రత ఉంటుందని వివరించాలని సూచించారు. ఇలా నిత్యం వలంటీర్ నుంచి సచివాలయాల సిబ్బంది, వార్డు మెంబర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అధికారుల వరకు ప్రతి ఒక్కరితో టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ ప్రోత్సహించారు. సంబంధిత అధికారులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించి దిశ లక్ష్యాన్ని అధిగమించారు. -
చంద్రగిరి నియోజక వర్గం లో ఆక్సిజన్ కోవిడ్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే చెవిరెడ్డి
-
చంద్రగిరి నియోజకవర్గం లో సంపూర్ణ లాక్ డౌన్
-
అత్యాధునిక వసతులతో 250 పడకల కోవిడ్ కేర్ సెంటర్
తిరుపతి రూరల్: చిత్తూరు జిల్లా చంద్రగిరి సమీపంలోని తొండవాడలో హీరా కళాశాలకు చెందిన ఐదు అంతస్తుల భవనంలో అత్యాధునిక వైద్య సదుపాయాలతో 250 పడకల కోవిడ్ కేర్ సెంటర్‌ను ప్రభుత్వ విప్, తుడా చైర్మన్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. బాధితులకు మెరుగైన వసతి, వైద్య సౌకర్యాలు కల్పించేందుకు ఎమ్మెల్యే సొంత నిధులను వెచ్చించారు. అత్యవసర వైద్యం కోసం 10 ఆక్సిజన్ బెడ్లు అందించారు. అక్కడ పనిచేస్తున్న 101 మంది సిబ్బందికి ప్రభుత్వం అందించే గౌరవ వేతనాలకు తోడు ప్రతి ఒక్కరికీ ప్రతి నెలా అదనంగా రూ. 2,500ను అందిస్తామని ప్రకటించారు. అంటే ప్రతి నెలా రూ. 2.52 లక్షలను చెల్లించనున్నారు. రోగులకు పౌష్టికాహారం కోసం బుధవారం చేపలు, ఆదివారం చికెన్‌తో కూడిన భోజనం కూడా అందించనున్నారు. అలాగే వారికి పేస్ట్, బ్రెష్, దుప్పటి, మెడికల్ కిట్ తదితర 34 వస్తువులతో కూడిన ప్రత్యేక కిట్లను ఇస్తున్నారు. ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు చెస్, క్యారమ్స్ వంటి గేమ్స్‌తో కూడిన రిక్రియేషన్ సెంటర్, ఆధ్యాత్మిక, సామాజిక గ్రంథాలతో కూడిన గ్రంథాలయాన్ని సిద్ధం చేశారు. ప్రతి గదిలో టీవీలు ఏర్పాటుచేసి రోజుకు రెండు చిత్రాలను ప్రదర్శించనున్నారు. ప్రతి ఫ్లోర్లో వేడి నీరు, చల్లని నీరు వచ్చేలా ఏర్పాట్లు చేశారు. 24 గంటలు వైద్య సేవలు అందించేందుకు షిప్ట్‌కు ఇద్దరు చొప్పన వైద్యులు అందుబాటులో ఉంటారు. కోవిడ్ కేర్ సెంటర్లోని ప్రతి ఫ్లోర్‌కు ఇన్చార్జిలను నియమించారు. ఆ ఫ్లోర్లో ఉండే బాధితులతో వాట్సాప్ గ్రూప్‌ను క్రియేట్ చేయించారు. తమ సమస్యలను బాధితులు వాట్సాప్ ద్వారా తెలిపితే వాటిని సత్వరమే పరిష్కరిస్తారు. గతంలో తిరుచానూరు వద్ద ఏర్పాటు చేసిన పద్మావతి కోవిడ్ కేర్ సెంటర్లో చెవిరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని ఏర్పాటు చేసిన వసతులు, నాణ్యమైన భోజనం వల్ల దేశవ్యాప్తంగా సెంటర్‌కు మంచి పేరు వచ్చింది. -
సొంత నిధులతో 150 ఆక్సిజన్ బెడ్లు
తిరుపతి తుడా: చంద్రగిరి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో కోవిడ్–19 మహమ్మారిని కట్టడి చేసేందుకు, ప్రజలను రక్షించుకునేందుకు నడుం బిగించారు. రూ.25 లక్షల సొంత నిధులతో 150 ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. మంగళవారం నారావారి పల్లె పీహెచ్‌సీని, చంద్రగిరి ఏరియా ఆస్పత్రిని అధికారులతో కలిసి సందర్శించిన ఆయన తుడా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని తిరుచానూరు సమీపంలో ఉన్న శ్రీ పద్మావతి కోవిడ్ సెంటర్లో కరోనా బాధితులకు మెరుగైన సేవలు అందిస్తున్నామన్నారు. ప్రస్తుతం పద్మావతి నిలయంలో వెయ్యి మంది కరోనా బాధితులకు సేవలు అందుతున్నాయని చెప్పారు. చంద్రగిరికి సమీపంలో మరో 500 మంది కరోనా బాధితులకు సౌకర్యవంతంగా కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు చేపట్టామన్నారు. ఆక్సిజన్ కొనుగోలుకు రూ.25 లక్షలు ఖర్చవుతుందని, ఆ మొత్తాన్ని తానే సొంతంగా భరించనున్నటేకట ప్రకటించారు. చంద్రగిరి ప్రాంతీయ ఆస్పత్రిలో ఆక్సిజన్ సౌకర్యంతో 100 పడకలు, నారావారి పల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో 50 పడకల బెడ్లు ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. కాగా, హోమ్ ఐసొలేషన్‌లో ఉండే వారికి 34 రకాల వస్తువులతో 2,500 కిట్లను ముందస్తుగా సిద్ధం చేశామని చెవిరెడ్డి చెప్పారు. కరోనా బాధితులకు టెలీ మెడిసిన్, టెలీ కాన్ఫరెన్స్ అందుబాటులోకి తెస్తున్నామన్నారు. నియోజకవర్గంలో ఏడు కోవిడ్ మెడికల్ షాప్‌లు, ఏడు అంబులెన్సులు ఏర్పాటు చేస్తామన్నారు. -
ఎమ్మెల్యే చెవిరెడ్డి దాతృత్వం: చంద్రబాబు గ్రామంలోనూ..
తిరుపతి : మహమ్మారి కరోనా వైరస్ బాధితుల కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముందుకు వచ్చారు. కరోనా బాధితుల కోసం తన సొంత ఖర్చులతో ప్రత్యేకంగా చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తన నియోజకవర్గం చంద్రగిరి పరిధిలో మొత్తం రూ.25 లక్షల వ్యయంతో ఏకంగా 150 ఆక్సిజన్ బెడ్లను సిద్ధం చేయిస్తున్నట్లు ఎమ్మెల్యే చెవిరెడ్డి తెలిపారు. కరోనా బాధితుల కోసం ప్రత్యేకంగా కేర్ సెంటర్ల ఏర్పాటు కోసం రూ.25 లక్షల సొంత నిధులతో 150 ఆక్సిజన్ బెడ్లు సిద్దం అవుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. చంద్రగిరిలో 100 బెడ్లు, 500 పడకలతో చంద్రగిరిలోనే మరొక కోవిడ్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. దీంతోపాటు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారిపల్లెలో 50 బెడ్లు ఏర్పాటు చేస్తుండడం విశేషం. ప్రజలకు సత్వర కరోనా సేవలే లక్ష్యంగా పని చేస్తున్నట్లు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి దాతృత్వంపై నియోజకవర్గ ప్రజలతో పాటు చాలామంది అభినందిస్తున్నారు. చదవండి: 25 రోజుల్లో 23 లక్షల కరోనా టెస్టులు చదవండి: ‘బరాత్’లో పీపీఈ కిట్‌తో చిందేసిన అంబులెన్స్ డ్రైవర్ -
చంద్రగిరిలో ఓటర్లకు టీడీపీ నగదు పంపిణీ
తిరుపతి రూరల్: చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ ఓటుకు రూ.వెయ్యి చొప్పున పంపిణీ చేస్తోంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అగ్రవర్ణాల వారికి రూ.వెయ్యి, ఎస్సీ కాలనీల్లో రూ.2 వేలు, ఎస్టీ కాలనీల్లో రూ.3 వేలు, కేజీ చికెన్ చొప్పున బుధవారం రాత్రి పంపిణీ చేశారు. టీడీపీ శ్రేణులు ఇంటింటికీ వెళ్లి నగదుతోపాటు మద్యం సీసాలు కూడా ఇచ్చారు. టీడీపీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించినా చంద్రబాబు సొంత నియోజకవర్గం చంద్రగిరిలో మాత్రం టీడీపీ అభ్యర్థులు విచ్చలవిడిగా నగదు, మద్యం పంపిణీ చేస్తున్నారు. -
చంద్రగిరిలో బాబుకు షాక్
తిరుపతి రూరల్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు సొంత గ్రామంలోనే పార్టీ శ్రేణులు షాక్ ఇస్తున్నారు. చంద్రబాబు నిర్ణయాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని తమ్ముళ్లు తెగేసి చెబుతున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో మొత్తం ఆరు జెడ్పీటీసీ, 95 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. అందులో ఐదు జెడ్పీటీసీ, 90 ఎంపీటీసీ పదవులు ఏకగ్రీవమయ్యాయి. చంద్రగిరి మండలంలో జెడ్పీటీసీ, చంద్రబాబు సొంత ఊరు ఉన్న నారావారిపల్లితో పాటు మొత్తం 5 ఎంపీటీసీ స్థానాలకు మాత్రమే ఈ నెల 8న ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలను బహిష్కరించాలని చంద్రబాబు ఆదేశించడంపై టీడీపీ నేతలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. లక్షలు ఖర్చు పెట్టుకుని, నెలల తరబడి ప్రచారం చేయగా.. పోలింగ్ సమీపిస్తున్న వేళ ఎన్నికల్ని బహిష్కరించాలని చంద్రబాబు పిలుపు ఇవ్వడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు ఆదేశాలను పట్టించుకునేది లేదని తమ్ముళ్లు తెగేసి చెప్తున్నారు. చంద్రబాబు సొంత ఊరు నారావారిపల్లిలో స్వయంగా బంధువులే ఆయన ఆదేశాలను గాలికి వదిలేసి ఎంపీటీసీ అభ్యర్థి తరఫున గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు. -
‘చంద్రగిరి’లో 84% ఓట్లు వైఎస్సార్సీపీ అభిమానికే
తిరుపతి రూరల్: చిత్తూరు జిల్లా చంద్రగిరి పంచాయతీ ఎన్నికల్లో సర్పంచిగా ఎన్నికైన వైఎస్సార్సీపీ అభిమాని రికార్డుస్థాయిలో ఓట్లు సాధించారు. మొత్తం చెల్లిన ఓట్లలో దాదాపు 84 శాతం ఆమెకే వచ్చాయి. ఈ నెల 21న జరిగిన ఎన్నికల్లో సర్పంచిగా వైఎస్సార్సీపీ అభిమాని ముద్దికుప్పం రూప.. టీడీపీ మద్దతుదారుగా పోటీచేసిన మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు బాపనపట్టు అమ్ములుపై 5,751 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. పంచాయతీలో మొత్తం 8,987 ఓట్లు పోలయ్యాయి. వీటిలో 198 ఓట్లు చెల్లలేదు. 116 ఓట్లు నోటాకు పడ్డాయి. మిగిలిన 8,673 ఓట్లలో రూపకు 7,212 ఓట్లు (దాదాపు 84 శాతం) వచ్చాయి. మొత్తం 18 వార్డుల్లోను వైఎస్సార్సీపీ అభిమానులే గెలిచారు. సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలతో పాటు ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చంద్రగిరి అభివృద్ధికి చేపట్టిన పనులతో వైఎస్సార్సీపీకి ప్రజలు మద్దతుగా నిలిచారని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. -
కార్యకర్తల సంక్షేమం నా బాధ్యత: చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
సాక్షి, చంద్రగిరి: ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మనం విధేయులం..మనమంతా కుటుంబ సభ్యులుగా మెలుగుదాం. కార్యకర్తల సంక్షేమం నా బాధ్యత.’ అంటూ ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం చిన్నగొట్టిగల్లు, ఎర్రవారిపాళెం మండలాల కార్యకర్తల ఆత్మీ య సమ్మేళన కార్యక్రమాన్ని ముక్కోటి సమీపంలోని నారాయణి కల్యాణ మండపంలో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, కళాశాల స్థాయిలోనే వైఎస్సార్ కుటుంబంతో తనకు అనుబంధం ఉందన్నారు. పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలని, వారి సంక్షేమం తన బాధ్యత అని హామీ ఇచ్చారు. తన సంపాదనలో 75శాతం ప్రజా సంక్షేమం కోసం ఖర్చు చేస్తానని, 25శాతం మాత్రమే తన కుటుంబానికి వెచ్చిస్తానని వెల్లడించారు. పార్టీలో కొనసాగే ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం ఉంటుందన్నారు. పార్టీకి విధేయతగా ఉండే కార్యకర్తలు పరస్పరం గౌరవించుకోవాలని సూచించారు. అప్పుడే పార్టీకి తగిన గుర్తింపు ఉంటుందని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. చదవండి: (గిరిజనుల హక్కులు కాలరాసిన చంద్రబాబు) అన్ని మండలాల్లో ఎమ్మెల్యే కార్యాలయాలు దేశంలో ఎక్కడా లేని విధంగా చంద్రగిరి నియోజకవర్గం అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తోందని ఆయన తెలిపారు. పార్టీ విధేయతకు, క్రమశిక్షణకు మనం స్ఫూర్తిదాయకంగా నిలవాలని చెవిరెడ్డి పిలుపునిచ్చారు. కరోనా కష్ట కాలంలో ప్రజలకు భరోసా కల్పించామని గుర్తు చేశారు. ఇంటింటికి మాస్కులు, శానిటైజర్లు, విటమిన్ సిరప్లు, టాబ్లెట్లు, పండ్లు, కూరగాయలు పంపిణీ చేశామని గుర్తు చేశారు. ఇప్పుడు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసుకోవాల్సిన ఆవశ్యకత నెలకొందన్నారు. అన్ని మండలాల్లో ఎమ్మెల్యే కార్యాలయాలు 15 రోజుల్లో అందుబాటులోకి రానున్నాయని వివరించారు. ఎమ్మెల్యే కార్యాలయాల్లో ప్రతి కార్యకర్త అందుబాటులో ఉండి ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని ఆయన కోరారు. చదవండి: (‘ఉపాధి’లో వ్యవసాయానికే పెద్దపీట) -
ఆమె లేని జీవితం వద్దంటూ!
సాక్షి, చంద్రగిరి: ప్రేమించిన యువతికి వివాహమైందని జీవితంపై విరక్తి చెంది ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం..మండలంలోని ఆముదాల కోనకు చెందిన మురళి, జానకి దంపతుల కుమారుడు సునీల్(20) గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. అయితే ఆ యువతికి వారం క్రితం వివాహం కావడంతో కుంగిపోయాడు. దీంతో అమ్మమ్మ ఊరైన తొండవాడకు వెళ్లాడు. తన స్నేహితుల వద్ద తన ప్రేమగాథను చెప్పుకుని బాధపడేవాడు. (సైకో డాక్టర్.. భార్య కాపురానికి రాలేదని..) ఈ నేపథ్యంలో బయటకు వెళ్లిన అతడు శనివారం రాత్రి అమ్మమ్మ ఇంటికి రాలేదు. తొండవాడ సమీపంలోని ఓ ప్రైవేటు వెంచర్ వద్ద చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉండటం ఆదివారం వెలుగులోకి వచ్చింది. స్థానికులు గుర్తించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. తిరుపతి ఎస్వీ మెడికల్ కాలేజీలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కుటుంబ కలహాలతో వివాహిత.. పూతలపట్టు (చిత్తూరు రూరల్) : హెయిర్ ఆయిల్ తాగి ఓ మహిళ మృతి చెందిన ఘటన పూతలపట్టు మండలంలో చోటు చేసుకుంది. వివరాలు... మండలంలోని రంగంపేటకు చెందిన కుప్పమ్మ (34) కుటుంబ కలహాల కారణంగా మనస్తాపానికి గురై ఆదివారం ఇంట్లో ఉన్న హెయిర్ ఆయిల్ తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పూతలపట్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (ప్రేమ వివాహం.. భర్త హత్య) -
ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించండి
సాక్షి, చంద్రగిరి: రెండు మనసులు ఒకటి కావడంతో ప్రేమ వివాహం చేసుకోవడంతో, తమ ప్రాణాలకు అపాయం ఉందంటూ ఓ ప్రేమ జంట గురువారం మీడియాను ఆశ్రయించింది. తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలంటూ వేడుకుంది. వివరాల్లోకి వెళితే.. చిన్నగొట్టిగల్లు మండలం కమ్మపల్లికి చెందిన మహేంద్ర నాయుడు, లక్ష్మిదేవి ఏ.రంగంపేట సమీపంలో ఓ ప్రైవేటు హాస్టల్ నడుపుతున్నారు. వీరి కుమారుడు రిత్విక్, పుంగనూరు ఎస్ఎన్ పేటకు చెందిన వెంకటరాజు, సరస్వతి కుమార్తె అఖిల ఏ.రంగంపేట సమీపంలోని ఓ విద్యాసంస్థలో 2016–17లో కలసి చదువుకున్నారు. చదవండి: మొదటి రాత్రే భార్యను హత్య చేసి.. వారి పరిచయం కాస్త ప్రేమగా మారింది. వీరి ప్రేమ వివాహాన్ని పెద్దలకు తెలియజేశారు. కులాలు వేరుకావడంతో పెద్దలు వీరి పెళ్లికి అడ్డుచెప్పారు. దీంతో వారిద్దరూ బుధవారం కడపలో వివాహం చేసుకుని, గురువారం చంద్రగిరికి చేరుకున్నారు. అఖిల తల్లిదండ్రుల నుంచి ప్రాణహాని ఉండడంతో మీడియాను ఆశ్రయించినట్లు ఆ ప్రేమ జంట తెలిపింది. పెద్దలను కాదని ప్రేమ వివాహం చేసుకోవడంతో తమ ప్రాణాలకు ముప్పు ఉందని, తమకు రక్షణ కల్పించాలని ఆ జంట మీడియా ద్వారా పోలీసులను వేడుకుంది. చదవండి: జేసీ బ్రదర్స్ చాతుర్యం: స్క్రాప్‌లోనూ స్కాం -
25 లక్షల సీ-విటమిన్ టాబ్లెట్ల పంపిణీ: చెవిరెడ్డి
సాక్షి, తిరుపతి: కరోనా నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నియోజకవర్గంలోని 1.60 లక్షల కుటుంబాలకు 25 లక్షల సీ–విటమిన్ టాబ్లెట్లు అందించారు. ఒక్కో కుటుంబానికి 15 చొప్పున వీటిని పంపిణీ చేశారు. సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు రూరల్ ఎంపీడీఓ కార్యాలయంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి ఈ టాబ్లెట్లు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. (ఈ రోజు నాకెంతో ప్రత్యేకం: మహేష్) చంద్రగిరి నియోజకవర్గంలోసి విటమిన్స్ టాబ్లేడ్స్ పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కార్డు లేని వారికీ ఉచిత రేషన్ చంద్రగిరి నియోజకవర్గంలో రేషన్‌కార్డులేని కుటుంబాలు 6 వేలు ఉన్నాయని, వాటికి ఉచితంగా రేషన్ అందించాలని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆదేశించారు. ఆదివారం తుమ్మలగుంటలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. కరోనా నియంత్రణకు చేపడుతున్న చర్యలపై ఆరా తీశారు. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని ఆదేశించారు. (చంద్రబాబుకు నమస్కరిస్తున్నా: చెవిరెడ్డి) -
సొంత జిల్లాలో చంద్రబాబుకు ఎదురుగాలి
సాక్షి, తిరుపతి : చంద్రబాబు సొంత జిల్లాలోనూ టీడీపీకి ఊహించిన పరాభవం ఎదురైంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు చేతులెత్తేశారు. మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సొంత నియోజకవర్గం శ్రీకాళహస్తిలో నాలుగు జెడ్పీటీసీ, 64 ఎంపీటీసీ స్థానాలను వైఎస్సార్సీపీ ఏకగ్రీవం చేసుకుంది. జిల్లాలో మొత్తం 65 జెడ్పీటీసీ స్థానాలు ఉంటే... 29 మంది వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 858 ఎంపీటీసీ స్థానాలకు గాను.. 323 మంది వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గంలోని 6 జెడ్పీటీసీ స్థానాల్లోనూ వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 69 ఎంపీటీసీ స్థానాల్లో 66 స్థానాలను వైఎస్సార్సీపీ, 3 స్థానాలను టీడీపీ ఏకగ్రీవం చేసుకున్నాయి. తిరుపతి కార్పొరేషన్‌లోని 50 డివిజన్లలో ఇప్పటికే 16 వార్డుల్లో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిసింది. పలమనేరు మున్సిపాలిటీలోని 26 వార్డుల్లో 10 మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, నారాలోకేశ్‌లు ఎంతగా ప్రయత్నించినా వైఎస్సార్సీపీ ప్రభంజనాన్ని ఆపలేకపోతున్నారు. చంద్రగిరిలో చంద్రబాబుకు షాక్.. తిరుపతి రూరల్: చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు షాక్ తగిలింది. నియోజకవర్గం పరిధిలోని 95 ఎంపీటీసీలకు గాను 86 ఎంపీటీసీలు వైఎస్సార్సీపీకే దక్కాయి. టీడీపీకి దక్కింది కేవలం నాలుగే. చంద్రగిరితో పాటు అన్ని మండలాల్లో ఎంపీపీలు వైఎస్సార్సీపీ అభ్యర్థులే ఎన్నిక కానున్నారు. ఐదు జెడ్పీటీసీలు సైతం అధికార పార్టీ కైవసం చేసుకుంది. కేవలం ఒక జెడ్పీటీసీ, ఐదు ఎంపీటీసీలకు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి. ఇందులోనూ వైఎస్సార్సీపీ అభ్యర్థులే గెలుపొందే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపట్టిన పథకాలు, స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ భాస్కర్‌రెడ్డి నాయకత్వంపై నమ్మకంతోనే ఈ ఫలితాలు వచ్చాయని స్థానికులు పేర్కొంటున్నారు. చరిత్ర సృష్టించిన తంబళ్లపల్లె బి.కొత్తకోట (చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ చరిత్ర సృష్టించింది. స్థానిక సంస్థల ఎన్నికల చరిత్రలో తొలిసారిగా అన్ని స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. నియోజకవర్గంలో 72 ఎంపీటీసీ స్థానాలుండగా 71 స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు, ఒక స్థానంలో స్వతంత్య్ర అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 6 జెడ్పీటీసీ స్థానాల్లో అన్నింటా వైఎస్సార్సీపీ అభ్యర్థులే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కృష్ణాలో వైఎస్సార్సీపీ జోరు కృష్ణా జిల్లాలో రెండు జెడ్పీటీసీ స్థానాలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు మండల జెడ్పీటీసీ స్థానం నుంచి వైఎస్సార్ సీపీ రాష్ట్ర పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ సభ్యుడు డాక్టర్ దుట్టా రామచంద్రరావు కుమార్తె దుట్టా సీతారామలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కైకలూరు నియోజకవర్గం మండవల్లి జెడ్పీటీసీ స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి ముంగర విజయనిర్మల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండవల్లి మండలంలో 14 ఎంపీటీసీలకు గాను అత్యధిక స్థానాలను వైఎస్సార్సీపీ ఏకగ్రీవం చేసుకోవడంతో ఎంపీపీ స్థానం కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. కళాకు పరాభవం రేగిడి మండలంలోని పెదసిర్లాం, అంబాడ స్థానాలకు ఏకగ్రీవంగా ఎన్నికైన వైఎస్సార్సీపీ అభ్యర్థులు సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావుకు ఘోర పరాభవం ఎదురైంది. ఆయన సొంత మండలం రేగిడి ఎంపీపీ పదవిని వైఎస్సార్సీపీ ఏకగీవ్రంగా దక్కించుకుంది. శనివారం ఉపసంహరణ ముగిసే సరికి ఈ మండలంలోని మొత్తం 20 ఎంపీటీసీ స్థానాల్లో 11 చోట్ల ఏకగ్రీవమయ్యాయి. ఎన్నికలకు ముందే వైఎస్సార్సీపీకి సగం కన్నా ఎక్కువ స్థానాలు దక్కడంతో ఎంపీపీ పదవి చేజిక్కించుకున్నట్టే. తన సొంత మండలానికి చెందిన నాయకులు షాక్ ఇవ్వడంతో ఆయన ఖంగుతిన్నారు. మూడు చోట్ల టీడీపీ అభ్యర్థులు అసలు నామినేషన్లే వేయలేదు. ఎనిమిదిచోట్ల వేసిన నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. కాగా, వంగర ఎంపీపీ పీఠాన్ని కూడా వైఎస్సార్సీపీ వశపర్చుకుంది. రాజాం నియోజకవర్గంలో రెండు ఎంపీపీలను ఏకగ్రీవంగా దక్కించుకుంది. మాజీ మంత్రి యనమలకు చుక్కెదురు కాకినాడ: టీడీపీ హయాంలో చక్రం తిప్పిన అప్పటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడికి స్థానిక సంస్థల ఎన్నికల్లో చుక్కెదురైంది. తుని మున్సిపాలిటీలో ఆరు డివిజన్లలో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నియోజకవర్గంలో ఐదుగురు ఎంపీటీసీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
సంక్రాంతి సంబరాలు: రంకెలేసిన ఉత్సాహం
సాక్షి, చంద్రగిరి/వెదురుకుప్పం: మండలంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. పండుగలో మూడో రోజైన గురువారం జిల్లాలోనే ఎడ్ల పందేల(జల్లికట్టు)కు ప్రసిద్ధి చెందిన రంగంపేట గ్రామంలో జల్లికట్టు నిర్వహించారు. వీక్షించడానికి మండలం నుంచే కాకుండా జిల్లా నలుమూలల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున విచ్చేశారు. దీంతో రంగంపేట గ్రామం జనసంద్రమైంది. గ్రామ ప్రారంభం నుంచి చివరి వరకు ఇసుకవేస్తే రాలనంతగా జనంతో నిండిపోయింది. గ్రామంలోని పశువులను పందేలకు వదలడంతో యువకులు కేరింతలు కొడుతూ వాటిని నిలువరించేందుకు పోటీపడ్డారు. మహిళలు సైతం మేడలు ఎక్కి ఆసక్తికరంగా జల్లికట్టును వీక్షించారు. పౌరుషంతో పరుగులు తీస్తున్న కోడెగిత్తలను నిలువరించేందుకు యువకులు ఉత్సాహం చూపారు. పశువులకు కట్టిన పలకలను సొంతం చేసుకునే ప్రయత్నంలో పలువురు యువకులు గాయాలపాలయ్యారు. సుమారు 4 గంటల పాటు ఉల్లాసంగా జల్లికట్టు సాగింది. ఎడ్ల పందేలు తిలకించడానికి చెట్టు పైకి ఎక్కిన జనం పందేలను తిలకించిన మోహన్‌బాబు పశువుల పందేలను శ్రీవిద్యానికేతన్ అధినేత, సీనియర్ నటుడు డాక్టర్ మంచు మోహన్‌బాబు, ఆయన తనయుడు, నటుడు మంచు మనోజ్ తిలకించారు. మోహన్‌బాబు పశువుల పందేలను తిలకించడానికి రావడంతో అభిమానులు పెద్ద ఎత్తున ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ఆయనతో ఫొటోలు తీసుకోవడానికి ఎగబడ్డారు. మాంబేడులో.. వెదురుకుప్పం మండలం మాంబేడులో జల్లికట్టు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని యువకులు కోడెగిత్తలను నిలువరించడానికి ఉత్సాహం చూపారు. -
చిత్తూరు జిల్లా రంగంపేటలో జల్లికట్టు జోరు..
-
రంగంపేటలో వేడుకగా జల్లికట్టు!
సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లా రంగంపేటలో జల్లికట్టు వేడుక అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సంప్రదాయ క్రీడను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల జనం పెద్దసంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఇక్కడి వీధులన్ని కిక్కిరిసిపోయాయి. మేడలు, మిద్దెలు ఎక్కి జనం జల్లికట్టును ఆసక్తిగా తిలకిస్తున్నారు. సినీ నటుడు మోహన్‌బాబు, ఆయన తనయుడు మనోజ్‌బాబు కూడా జల్లికట్టును తిలకించేందుకు ఇక్కడికి వచ్చారు. ఓ మిద్దెపై నుంచి వారు జల్లికట్టు ఉత్సవాన్ని తిలకించారు. ప్రస్తుతం జల్లికట్టు జోరుగా సాగుతోంది. జల్లికట్టులో భాగంగా పరిగెత్తుకొస్తున్న కోడెగిత్తలను పట్టుకునేందుకు యువకులు ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. అయితే, ఈ వేడుకలో ఎప్పటిలాగే చిన్న చిన్న అపశ్రుతులు చోటుచేసుకుంటున్నాయి. దూసుకొస్తున్న కోడెగిత్తలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న గాయాలపాలవుతున్నారు. ఎద్దులను అదుపుచేసే క్రమంలో 20 మందికి గాయాలు అయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఇక, జల్లికట్టు ఈ పేరు వినగానే చిత్తూరు జిల్లా కూడా గుర్తుకు వస్తుంది. పశువుల పండుగ పేరుతో నిర్వహించే ఈ జల్లికట్టుకు రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ప్రతి ఏటా సంక్రాంతి సందర్బంగా నిర్వహించే ఈ జల్లికట్టును తిలకించడాని వేలాదిమంది వస్తారు. చిత్తూరు జిల్లాలో జల్లికట్టు చాలా ప్రాంతాలలో జరుగుతున్నా... చంద్రగిరి మండలం రంగంపేట హైలెట్ గా నిలుస్తోంది. ఇవాళ ఉదయాన్నే పశువులకు పూజలు చేస్తారు. అనంతరం కోడిగిత్తలను అలంకరిస్తారు. కొమ్ముల మధ్య చెక్క పలకలు, కొమ్ములకు కొత్త తవళ్లు చూడతారు. గుంపులు గుంపులుగా వీధిలోకి వదులుతారు. కొమ్ములు తిరిగిన కోడె గిత్తలు పరుగులు తీస్తుంటే వాటిని నిలువరించడానికి యువకులు పోటీ పడతారు.. ప్రాణాలను సైతం లెక్క చేయరు. ఎందుకంటే కోడె గిత్తలను నిలువరించిన వారిని సాహస వంతులుగా ఈ ప్రాంత వాసులు భావిస్తుంటారు. అందుకే యువకుల కేరింతల మధ్య కోడె గిత్తలను పట్టుకోవడానికి పోటీ పడతారు. ఈ దృశ్యాలను తిలకించదానికి రంగంపేటకు వేలమంది హాజరవుతారు. ఇది తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం కాబట్టి జల్లికట్టును ఓ పండుగలా చేసుకొంటారు. -
చంద్రగిరి మండలంలో జల్లికట్టు సంబరాలు
-
చంద్రగిరి మండలంలో జల్లికట్టు సంబరాలు
సాక్షి, చిత్తూరు: జిల్లాలోని చంద్రగిరి మండలం కందులవారుపల్లిలో జల్లికట్టు సంబరాలు ఘనంగా జరిగాయి. కోడెగిత్తలను ఉరికిస్తూ యువత ఈ వేడుకలో పాల్గొన్నారు. కోడెగిత్తలను పట్టుకునేందుకు పోటాపోటీగా ప్రయత్నించారు. ఎద్దుల కొమ్ములకు ఉన్న బహుమతులు పొందేందుకు ఎగబడ్డారు. అయితే, కోడె గిత్తల వేగాన్ని అందుకోలేక యువకులు కొంత బేజారెత్తిపోయారు. ఈ క్రమంలో పోటీలో పాల్గొన్న పలువురు యువకులకు గాయాలయ్యాయి. జల్లికట్టు వేడుకలను చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి గ్రామస్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. -
‘సీఎం జగన్‌ను విమర్శిస్తే తాట తీస్తా’
సాక్షి, చిత్తూరు: చంద్రగిరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకి ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీ వారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలపమన్నాను తప్ప తప్పుగా మాట్లాడలేదన్నారు. కానీ తిరుమలలో రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు వర్గవిభేదంగా ఉన్నాయని ఆరోపించారు. చంద్రబాబు సీఎం అయితే సత్కారాలు చేస్తారు.. జగన్ సీఎం అయితే విమర్శలు చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఎంతో మంది సినిమా వాళ్లు లబ్ధి పొందరాని పృథ్వీరాజ్ గుర్తు చేశారు. సీఎం జగన్‌ను ఎవరు విమర్శించిన తాట తీస్తానంటూ హెచ్చరించారు. పులి కడుపున పులే పుడుతుంది కానీ లోకేష్ పుట్టడని పృథ్వీరాజ్ ఎద్దేవా చేశారు. -
‘టిక్ టాక్’ కోసం అడవులకు వెళ్లి..
-
‘టిక్ టాక్’ కోసం అడవులకు వెళ్లి..
సాక్షి, చంద్రగిరి: టిక్ టాక్ మోజు ఓ విద్యార్థిని అడవి పాలు చేసింది. శేషాచలం అడవుల్లో టిక్ టాక్ చేస్తూ ఓ విద్యార్థి దారి తప్పాడు. చివరికి పోలీసుల సహాయంతో బయటపడ్డాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో చోటుచేసుకుంది. కలకడ మండలం మంగళపల్లి గ్రామానికి చెందిన మురళికృష్ణ శ్రీవిద్యానికేతన్‌లో మైక్రోబయాలజీ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. టిక్ టాక్ మోజులో పడ్డ మురళికృష్ణ ఆదివారం ఉదయం శేషాచలం అడవుల బాట పట్టాడు. అడువుల్లో ఓ కొండపైన జాతీయ జెండాను నుంచి వందనం చేశాడు. సాయంత్రం తిరిగి వచ్చే సమయంలో చీకటి పడటంతో దారి తప్పిపోయాడు. ఎటు వెళ్లాలో తెలియక అవస్థలు పడ్డాడు. దారి తప్పి తిరుగుతున్న మురళికృష్ణ తన స్నేహితులకు లొకేషన్ షేర్ చేశాడు. మూర్ఛ వ్యాధితో సృహతప్పి పడిపోయాడు. మురళికృష్ణ అడవిలో చిక్కుకుపోయిన విషయాన్ని అతడి స్నేహితులు పోలీసులకు తెలిపారు. చంద్రగిరి పోలీసులు అర్ధరాత్రి మురళికృష్ణ రక్షించడానికి అటవీ అధికారులతో కలిసి అడవిలో జల్లెడ పట్టారు. సోమవారం తెల్లవారుజామున ఆచూకీ గుర్తించి పోలీసులు అతడిని రక్షించారు. వైద్యం కోసం పోలీసులు మురళికృష్ణను రుయా ఆసుపత్రికి తరలించారు. -
చంద్రగిరిలో గెలుపు చరిత్రాత్మకం : వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, చంద్రగిరి(చిత్తూరు) : చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గమైన చంద్రగిరిలో 43వేల భారీ మెజార్టీతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది చరిత్రాత్మకమైన గెలుపని టీటీడీ చైర్మన్, వైఎస్సార్సీపీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో జరిగిన వైఎస్సార్సీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ హయాంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై పెట్టిన తప్పుడు కేసులు ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. పార్టీలకు అతీతంగా నవరత్నాల పథకాలను లబ్ధిదారులందరికీ చేరేలా చూస్తామని స్పష్టం చేశారు. బడ్జెట్లో నవరత్నాల పథకాలకు ప్రభుత్వం తగినన్నినిధులు కేటాయించడం శుభపరిణామమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తుడా చైర్మన్, ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లె చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోకి రాగా ఆయన కుప్పం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. -
తిరుపతి పలమనేరు ఘటన బాధాకరం
-
స్నానం చేస్తుండగా వీడియో తీసి....
సాక్షి, చంద్రగిరి: స్నానం చేస్తుండగా ఓ బాలిక (14)ను బాలుడు (16) వీడియోలు తీసి, లైంగిక దాడులకు పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన స్నేహితుల కోరిక కూడా తీర్చాలంటూ ఆ బాలుడు వేధించడంతో బాధిత బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకోగా, మరో బాలుడు పరారయ్యాడు. గ్రామస్తుల కథనం మేరకు.. చంద్రగిరి మండలం, పనపాకం హరిజనవాడకు చెందిన ఓ బాలిక చంద్రగిరి సంక్షేమ హాస్టల్లో చదువుకుంటోంది. చిన్నతనంలోనే తల్లి మృతిచెందడం, తండ్రి వికలాంగుడు కావడంతో బాలికను నానమ్మ పోషిస్తోంది. వేసవి సెలవులు కావడంతో నెల రోజుల నుంచి బాలిక ఇంటివద్దే ఉంది. బాలిక తన ఇంటి వద్ద స్నానం చేస్తుండగా అదే గ్రామానికి చెందిన బాలుడు సెల్‌ఫోన్‌తో వీడియో తీశాడు. ఆపై బాలికను బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం వీడియోను తన స్నేహితులైన మరో ముగ్గురు మైనర్లు, జగపతి (23)లకు షేర్ చేసి వారి కోరిక కూడా తీర్చాలని, లేకుంటే వీడియోలను సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు. యువకుల బెదిరింపులు తారస్థాయికి చేరడంతో బాలిక నాలుగు రోజుల క్రితం తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీనిని గుర్తించిన బాలిక నానమ్మ వారించి విషయం తెలుసుకుని స్థానికులకు వివరించింది. దీంతో సోమవారం గ్రామస్తులు చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు వీడియో తీసిన బాలుడుతో పాటు అతని ముగ్గురు స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు. మరో మైనర్ పరారయ్యాడు. దళిత బాలికపై లైంగిక దాడికి పాల్పడటంతో పాటు ఆమెను బెదిరించిన యువకులపై నిర్భయ కేసు నమోదు చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కాగా, పనపాకం హరిజనవాడకు చెందిన ఆ యువకులు టీడీపీ కార్యకర్తలు కావడంతో అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు కేసు నీరు గార్చేందుకు యత్నిస్తున్నారని తెలిసింది. దీనిపై సీఐ మాట్లాడుతూ.. బాలికపై లైంగిక దాడి విషయంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.