
సాక్షి ప్రతినిధి, తిరుపతి: సీఎం చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లె ఉన్న చంద్రగిరి నియోజకవర్గంలో పోలీసుల అండదండలతో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. రామచంద్రాపురం మండలం బొప్పరాజుపల్లి, పాడిపేట నుంచి మట్టి, ఇసుక ప్రతి రోజూ రాత్రిళ్లు 30 టిప్పర్లలో తిరుపతికి తరలి వెళ్తోంది. ఈ దందాను అరికట్టాల్సిన పోలీసులే ఎమ్మెల్యే పులివర్తి నాని ఆదేశాలతో ఆ వాహనాలకు రక్షణ కల్పిస్తుండడం విస్తుగొలుపుతోంది.