
చంద్రగిరిలో ప్రచారం చేస్తున్న టీడీపీ శ్రేణులు
తిరుపతి రూరల్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు సొంత గ్రామంలోనే పార్టీ శ్రేణులు షాక్ ఇస్తున్నారు. చంద్రబాబు నిర్ణయాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని తమ్ముళ్లు తెగేసి చెబుతున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో మొత్తం ఆరు జెడ్పీటీసీ, 95 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. అందులో ఐదు జెడ్పీటీసీ, 90 ఎంపీటీసీ పదవులు ఏకగ్రీవమయ్యాయి. చంద్రగిరి మండలంలో జెడ్పీటీసీ, చంద్రబాబు సొంత ఊరు ఉన్న నారావారిపల్లితో పాటు మొత్తం 5 ఎంపీటీసీ స్థానాలకు మాత్రమే ఈ నెల 8న ఎన్నికలు జరుగుతున్నాయి.
ఎన్నికలను బహిష్కరించాలని చంద్రబాబు ఆదేశించడంపై టీడీపీ నేతలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. లక్షలు ఖర్చు పెట్టుకుని, నెలల తరబడి ప్రచారం చేయగా.. పోలింగ్ సమీపిస్తున్న వేళ ఎన్నికల్ని బహిష్కరించాలని చంద్రబాబు పిలుపు ఇవ్వడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు ఆదేశాలను పట్టించుకునేది లేదని తమ్ముళ్లు తెగేసి చెప్తున్నారు. చంద్రబాబు సొంత ఊరు నారావారిపల్లిలో స్వయంగా బంధువులే ఆయన ఆదేశాలను గాలికి వదిలేసి ఎంపీటీసీ అభ్యర్థి తరఫున గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment