MPTC & ZPTC Elections
-
తెలంగాణలో ముగిసిన ఎమ్మెల్సీ పోలింగ్.. ఓటింగ్ శాతం ఇదే..
04:00 PM ►తెలంగాణలో మొత్తం ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న పోలింగ్ ముగిసింది. ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలోని జెడ్పీటీసీల, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చెదురుమదురు ఘటనలు తప్ప ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. 14న కౌంటింగ్ జరగనుంది. ►కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎనిమిది కేంద్రాలలో పోలింగ్ పూర్తవగా..మొత్తం ఓట్లు 1324 ఉంటే 1320 ఓట్లు పోలయ్యాయి. అంటే 99.70 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. బీజేపీ ఎంపీ బండి సంజయ్, కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఓటు వేయలేదు. మరో వ్యక్తి చనిపోగా, సిరిసిల్లలో అనారోగ్యంతో ఓ ఎంపీటీసీ ఓటు వేయలేదు. ► స్థానిక సంస్థల ఎన్నికలలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ అలుగుబెల్లి రవీందర్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకోలేదు. ►ఆదిలాబాద్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. రికార్డ్ స్థాయిలో 91.78% పోలింగ్ నమోదైంది. ►భువనగిరిలో 197 ఓట్లకు 197 ఓట్లు పోల్ అయ్యాయి. ►ముగిసిన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 95 శాతం పోలింగ్ నమోదైంది. ►ఖమ్మం-మొత్తం 348ఓట్లకు గాను 338 ఓట్లు పోలింగ్ ►కల్లూరు-మొత్తం 115 ఓట్లకు గాను 114 ఓట్లు పోలింగ్ ►కొత్తగూడెం-మొత్తం 221ఓట్లకు గాను 209 ఓట్లు పోలింగ్ ►భద్రాచలం-మొత్తం 84ఓట్లకు గాను 79 ఓట్లు పోలింగ్.. ►మొత్తం 768ఓట్లకు గాను 740ఓట్ల పోలింగ్ ►నల్లగొండలో మొత్తం 235 ఓట్లకు గాను 229 ఓట్లు పోలయ్యాయి. ►సూర్యాపేట జిల్లాకేంద్రం లో 186 ఓట్లకు గానుక 183 పోలయ్యాయి. ►ఉమ్మడి మెదక్ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోలింగ్ ముగిసింది. జహీరాబాద్, నారాయణఖేడ్, తూప్రాన్, సిద్దిపేట పోలింగ్ కేంద్రల్లో 100శాతం పోలింగ్ నమోదైంది. కేసీఆర్ మినహా అందరూ ఎక్స్ అఫిషియో సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ►మొత్తం 1026 ఓటర్లకు గానూ, 1018 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ► సిరిసిల్లలో 99.50 శాతం పోలింగ్ నమోదైంది. మొత్త 201 ఓట్లు ఉండగా.. 200 ఓట్లు పోలయ్యాయి. 03:00 PM ►కరీంనగర్ ఎమ్మెల్సీ ఫలితాలు టీఆర్ఎస్ వైపు ఏకపక్షమే అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. పదవులు ఇస్తే సీఎం కేసీఆర్ దేవుడు లేకపోతే దయ్యంలా చూస్తారా అని ప్రశ్నించారు. ఈటల రాజేందర్ శిఖండీ రాజకీయాలు చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ►ఖమ్మం ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నిరసన వ్యక్తం చేశారు. ఓడిపోతామనే భయంతో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడుతుందని ఆరోపించారు. ఓటు హక్కు వినియోగించుకున్న టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఏం పని లేదని మండిపడ్డారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, జడ్పీ చైర్మన్ కమల రాజ్, ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి పోలింగ్ కేంద్రంలో మూడు గంటలు ఎలా ఉంటారని ప్రశ్నించారు. పోలింగ్ కేంద్రంలో ఉండి ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నా.. అధికారులు ప్రేక్షక పాత్ర వహించారని మండిపడ్డారు. 02:00 PM ►కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్నం రెండు గంటల వరకూ 76.06 శాతం పోలింగ్ నమోదు అయ్యింది ►యాదాద్రి భువనగిరి జిల్లా: చౌటుప్పల్ ఎన్నికల కేంద్రంలో 106 మందికి గాను 82 మంది ఓటు హక్కులను వినియోగించుకున్నారు. ► నల్లగొండ : ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం 2 గంటల వరకు 83.63 % నమోదదైంది 01:05 PM ► 1 గంట వరకు ఖమ్మంలో 58శాతం పోలింగ్ నమోదు ► మెదక్‌లో ఎమ్మెల్యే మాణికరావు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ► సంగారెడ్డిలో మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. కేసీఆర్ వరిధాన్యం పేరిట డైవర్ట్ పాలిటిక్స్‌కు తెరలేపారని విమర్శించారు. 12:05 PM ► ఉమ్మడి మెదక్‌లో మధ్యాహ్నం 12 గంటల వరకు 42.1 శాతం పోలింగ్ నమోదయ్యింది. ► నల్లగొండలో మధ్యాహ్నం వరకు 42.88 శాతం పోలింగ్ నమోదయ్యింది. ► సూర్యపేట జిల్లా పోలింగ్ కేంద్రంలో మధ్యాహ్నం వరకు 43.28 శాతం పోలింగ్ నమోదయ్యింది. ► యాదాద్రి భువనగిరి జిల్లాలో 64.97 శాతం, చౌటుప్పల్‌లో 66.98 శాతం ఓటింగ్ నమోదయ్యింది. ► సంగారెడ్డిలో అందోల్ డివిజన్ కార్యాలయంలో ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ► సిద్ధిపేటలో తొలిసారి స్థానిక సంస్థల ఎన్నికలలో మంత్రి హరీష్ రావు తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొలిసారి ఓటు వేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రజా నిధులు తప్పనిసరిగా ఓటుహక్కు వినియోగించుకోవాలన్నారు. ► నిర్మల్‌లో 81 శాతం పోలింగ్ నమోదయ్యింది. ► ఆదిలాబాద్‌లో 1గంట వరకు 77 శాతం ఓటింగ్ నమోదయ్యింది. 11:45 AM ► సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఓటుహక్కును వినియోగించుకున్నారు. ► భువనగిరి పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. ► కరీంనగర్ జడ్పీహాలులో మంత్రి గంగుల కమలాకర్ తన ఓటుహక్కు వినియోంచుకున్నారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ.. కొంత మంది కళ్లు మండుతున్నాయి. మాకు బలంలేదని బీజేపీ, కాంగ్రెస్‌లు ఎన్నికల నుంచి తప్పుకున్నాయి. అవి మాకు శుభసూచకమని గంగుల అన్నారు. ► టీఆర్ఎస్ కుటుంబ సభ్యులలో చిచ్చుపెట్టాలని కొందరు ఎన్నికలు తీసుకొచ్చారని మండిపడ్డారు. ఇండిపెండెంట్‌గా పోటిచేసిన రవీందర్ సింగ్‌కు ఈటల మద్దతు తెలుపుతున్నారని అన్నారు. ఈటల శిఖండి రాజకీయాలు మానుకోవాలని గంగుల హితవు పలికారు. 11: 15 AM ► రాజన్న సిరిసిల్లలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో మంత్రి కేటీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ► మంచిర్యాల బెల్లంపల్లిలో పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ భారతి హోళీకేరి పరిశీలించారు. 10: 48 AM ► ఖమ్మం పోలింగ్ కేంద్రంలో కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. ► నల్లగొండలో స్వతంత్ర అభ్యర్థి వంగూరి లక్ష్మయ్య తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. 10: 15 AM ► మిర్యాలగూడలోని ప్రభుత్వ పాఠశాలలోని ఎన్నికల కేంద్రాన్ని స్థానిక టీఆర్ఎస్ అభ్యర్థి కోటిరెడ్డి పరిశీలించారు. ► నల్లగొండలోని బాలికల జూనియర్ కాలేజీలో జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, చిన్నపరెడ్డి తమ ఓటు హక్కును వినియోంచుకున్నారు. 09: 25 AM ► కోరుట్ల ఎంపీడీవో కార్యాలయంలో ఎమ్మెల్యే విద్యాసాగర్ ఓటు హక్కును వినియోంచుకున్నారు. ► మంచిర్యాల జిల్లా ప్రజాపరిషత్‌లో ఎమ్మెల్యే బాల్క సుమన్, దివాకర్‌రావు, ఎంపీటీసీ, కౌన్సిలర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ►ఆసిఫాబాద్ జిల్లా కేంద్రాన్ని జెడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మీ, ఎమ్మెల్యే ఆత్రంసక్కు, ఎమ్మెల్సీ అభ్యర్థి దండె విఠల్ సందర్శించారు. 09: 15 AM ► యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆలేరు, శ్రీమతి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ► నల్లగొండ జిల్లాలోని బాలికల కాలేజ్‌లో ఎక్స్ అఫిషియో మెంబర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. 08: 25 AM ► కరీంనగర్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి అభ్యర్థి రవీందర్ సింగ్ ఎన్నికల కేంద్రానికి చేరుకున్నారు. ► సంగారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి నిర్మల జగ్గారెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ► కరీంనగర్లో ఇండిపెండెంట్ అభ్యర్థి మాజీ మేయర్ రవీందర్ సింగ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 08: 15 AM ► నల్లగొండ జిల్లాలో.. కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, ఆయన భార్య ఓటు హక్కును వినియోంచుకున్నారు. ► ఆదిలాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి గాను.. నిర్మల్‌లోని జిల్లా పరిషత్ కార్యాలయంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 08: 02 AM ► ఆదిలాబాద్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఎన్నికల కేంద్రానికి చేరుకున్నారు. థర్మల్ స్క్రీనింగ్ అనంతరం ఎమ్మెల్యే ఓటు వేయడానికి వెళ్లారు. ► నల్లగొండలో ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పుడిప్పుడే ఓటర్లు ఓటింగ్ సెంటర్‌కు చేరుకుంటున్నారు. ► కరీంనగర్ జిల్లాలో ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సాక్షి, హైదరాబాద్: 6 స్థానాలు.. 26 మంది అభ్యర్థులు.. 5326 మంది ఓటర్లు..37 పోలింగ్ కేంద్రాలు. శాసన మండలి స్థానిక సంస్థల కోటా ఎన్నికల పోలింగ్ శుక్రవారం ఉదయం 8గం. నుంచి సాయంత్రం 4 గం. వరకు జరగనుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి ఐదు జిల్లాలు.. ఆదిలాబాద్, మెదక్, నల్లగొండ, ఖమ్మం లో ఒక్కో స్థానానికి, కరీంనగర్లో రెండు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. 2,329 మంది పురుష ఓటర్లు, 2,997 మహిళా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఓటు హక్కును కలిగి ఉండగా, తొలిసారిగా.. ఎన్నికలు జరిగే ఉమ్మడి జిల్లాల పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా ఓటు హక్కు కల్పించారు. ఓటర్లలో ఎంపీటీసీ సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లే సుమారు మూడొంతుల మందికి పైగా ఉండటంతో అభ్యర్థుల గెలుపోటముల్లో వీరి పాత్ర కీలకం కానుంది. ఇందులో టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ఎక్కువ మంది ఉండటంతో ఎన్నికలు జరిగే ఆరు స్థానాల్లోనూ ఆ పార్టీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. మెదక్, ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థులు, ఇతర చోట్ల స్వతంత్రుల నుంచి టీఆర్ఎస్ అభ్యర్థులు పోటీ ఎదుర్కొంటున్నారు. అందరు కోవిడ్ నిబంధనలను పాటించాలని సీఈఓ శశాంక్ గోయల్ కోరారు. -
AP MPTC And ZPTC Election 2021 Results Live: విస్సన్నపేట జడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం
AP MPTC And ZPTC Election Live Updates 05:30PM ►సాయంత్రం 5.30 గంటల వరకు వెలువడిన జెడ్పీటీసీ ఫలితాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 11, టీడీపీ 3 స్థానాలు గెలుచుకున్నాయి. ఇందులో నాలుగు స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన పదిస్థానాలకు ఎన్నికలు జరిగాయి. ►ఎంపీటీసీ ఫలితాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవాలతో కలిపి 127, టీడీపీ 32, బీజేపీ 6, ఇతరులు 4స్థానాలను గెలుచుకున్నారు. మొత్తం 123 స్థానాలకు ఎన్నికలు జరగగా మరో 50 స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవం అయ్యాయి. 03:18PM పశ్చిమగోదావరి జిల్లా ►ఎన్నిక జరిగిన పెనుగొండ జడ్పీ స్థానాన్ని వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. ఎన్నికలు జరిగిన ఎంపీటీసీ స్థానాలు-14 ►వైఎస్సార్సీపీ-10 ►టీడీపీ-3 ►జనసేన-1 03:05PM తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం ఎన్నికలు జరిగిన ఎంపీటీసీ స్థానాలు - 21 ►వైఎస్సార్సీపీ - 9 ►టీడీపీ - 6 ►జనసేన - 3 ►ఇండిపెండెంట్ - 1 ►సీపీఎం - 1 ►సీపీఐ - 1 02:50PM తూర్పుగోదావరి జిల్లా ►ఏటపాక మండలంలో 11 ఎంపీటీసీ స్థానాలకు ముగిసిన ఓట్ల లెక్కింపు.. ►12 ఎంపీటీసీ స్థానాలు ఏటపాక మండలంలో ఉండగా కన్నాయిగూడెం ఎంపీటీసీ స్థానం వైఎస్సార్సీపీ ఏకగ్రీవం . ఎన్నికలు జరిగిన 11 స్థానాల్లో.. ► ఏటపాక - వైఎస్సార్సీపీ ► రాయనపేట - వైఎస్సార్సీపీ ► నెల్లిపాక - వైఎస్సార్సీపీ ► గుండాల - వైఎస్సార్సీపీ ► లక్ష్మీపురం - వైఎస్సార్సీపీ ► చోడవరం - టీడీపీ ► గొమ్ముకొత్తగూడెం - టీడీపీ ► నందిగామ - టీడీపీ ► టీపీ వీడు - టీడీపీ ► కృష్ణవరం - సీపీఐ ► విస్సాపురం - సీపీఎం మొత్తం 12 ఎంపీటీసీ స్థానాలకు గాను వైఎస్సార్సీపీ 6, సీపీఎం 1, సీపీఐ 1, టీడీపీ 4 గెలుచుకున్నాయి. 02:45PM కృష్ణా జిల్లా విస్సన్నపేట జడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం ►విస్సన్నపేట జడ్పీటీసీగా భారీ మెజార్టీతో గెలుపొందిన భీమిరెడ్డి లోకేశ్వరరెడ్డి ►లోకేశ్వరరెడ్డికి మిఠాయి తినిపించి అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి అనంతపురం: హిందూపురం నియోజకవర్గంలో గెలుపొందిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను ఎమ్మెల్సీ ఇక్భాల్, గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ ఎల్ఎం మోహన్ రెడ్డి అభినందించారు. 02:35PM విశాఖపట్నం ►టీడీపీ కంచుకోట ఆనందపురం జడ్పీటీసీగా వైఎస్సార్సీపీ అభ్యర్థి కోరాడ వెంకట్రావు ఘన విజయం ►1983 జిల్లా పరిషత్ ఆవిర్భావం నుంచి ఆనందపురంలో టీడీపీ అభ్యర్థులదే గెలుపు ►తొలిసారి 3576 ఓట్లతో వైఎస్సార్సీపీ అభ్యర్థి కోరాడ వెంకట్రావు జడ్పీటీసీగా విజయం ►ఆనందపురంలో టీడీపీ కంచుకోట శిథిలమైంది ►ఇది సీఎం జగన్‌కి కృతజ్ఞతగా ప్రజలు ఇచ్చిన గెలుపు - భీమిలి వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ ముత్తంశెట్టి మహేష్ 02:30PM అనంతపురం జిల్లా ►చిలమత్తూరు వైఎస్సార్ సీపీ జడ్పీటీసీ అభ్యర్థి అనూష 3,025 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 02:20PM నెల్లూరు జిల్లా ►ముగిసిన కోట ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ ►వైఎస్సార్సీపీ అభ్యర్థి షేక్ మొబీన్ భాష విజయం సాధించారు. 1.52PM ప.గో జిల్లాలో ముగిసిన పరిషత్ ఎన్నికల కౌంటింగ్ 15 ఎంపీటీసీ స్థానాలకు గాను తాళ్ళపూడి (మం) వేగేశ్వరపురం ఎంపీటీసీ- 2 వైఎస్సార్సీపీ అభ్యర్థి కొమిరెడ్డి వీర రాఘవమ్మ ఏకగ్రీవం కాగా 14 ఎంపీటీసీ, పెనుగొండ జడ్పీటీసీ స్థానానికి జరిగిన ఎన్నికలు 10 ఎంపీటీసీ స్థానాలు, పెనుగొండ జెడ్పీ స్థానాన్ని కైవసం చేసుకున్న వైఎస్సార్సీపీ జనసేన-1,టీడీపీ-3 ఎంపీటీసీ స్థానాలకు పరిమితం పెనుగొండ జడ్పీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థి పోడూరి గోవర్ధని 4,300 ఓట్లు మెజారిటీ తో గెలుపు అత్తిలి(మం)పాలూరు ఎంపీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థి శరఖడం రామలింగ విష్ణు మూర్తి 257 ఓట్ల మెజారిటీతో గెలుపు అత్తిలి (మం) ఈడూరు ఎంపీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థి సుంకర నాగేశ్వరరావు 225 ఓట్ల మెజారిటీతో గెలుపు భీమడోలు (మం) అంబరుపేట ఎంపీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థి దాసరి విజయ భాను 10 ఓట్ల మెజార్టీ తో గెలుపు... చాగల్లు ఎంపీటీసీ - 5 వైఎస్సార్సీపీ అభ్యర్థి ఉన్నమట్ల విజయకుమారి 969 ఓట్ల మెజార్టీతో గెలుపు దెందులూరు-1 ఎంపీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థి తాళ్లూరి నాగరాజు 85 ఓట్ల మెజారిటీతో గెలుపు దెందులూరు (మం) కొవ్వలి ఎంపీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థి గొల్ల నాగరాజు 58 ఓట్ల మెజార్టీ తో గెలుపు జంగారెడ్డిగూడెం (మం) లక్కవరం ఎంపీటీసీ- 2 వైఎస్సార్సీపీ అభ్యర్థి దల్లి వెంకట మోహన్ రెడ్డి 428 ఓట్ల మెజార్టీ తో గెలుపు. కుక్కునూరు (మం) మాధవరం ఎంపీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థి కుండా సూర్యనారాయణ182 ఓట్ల మెజారిటీతో గెలుపు నిడదవోలు(మం) తాళ్లపాలెం ఎంపీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్ధి బయ్యే కృష్ణబాబు 41 ఓట్ల మెజార్టీతో గెలుపు. పెరవలి (మం) కానూరు 2 ఎంపిటిసి వైఎస్సార్సీపీ అభ్యర్థి మత్తల ఉషారాణి 256 ఓట్లు మెజార్టీతో గెలుపు 1.20PM పశ్చిమగోదావరి: ► పెనుగొండ జడ్పీటీసీ స్థానంలో వైఎస్సార్సీపీ విజయం. వైఎస్సార్సీపీ అభ్యర్థి పోడూరి గోవర్ధని 4,300 ఓట్లు మెజారిటీతో గెలుపు 1.03PM కృష్ణా జిల్లా: ► జి.కొండూరు జడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. 4,893 ఓట్ల మెజారిటీతో మంద జక్రధరరావు విజయం ► విస్సన్నపేట జడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. 9,656 ఓట్ల భారీ మెజార్టీతో భీమిరెడ్డి లోకేశ్వరరెడ్డి విజయం 12.43PM ► నంద్యాల జడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకున్న వైఎస్సార్సీపీ అభ్యర్థి గోపవరం గోకుల్ కృష్ణ రెడ్డి. 12.20PM ప్రకాశం జిల్లా ►పర్చూరు మండలం చెరుకూరు-2 ఎంపీటీసీ స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్ది షేక్ బీస్మల్లా 878 ఓట్ల మోజార్టితో గెలుపు. ►పెద్దారవీడు మండలం తంగిరాలపల్లి ఎంపీటీసీ స్థానంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఉప్పలపాటి భాగ్యరేఖ 252 ఓట్ల మెజారిటీతో గెలుపు ► యద్దనపూడి మండలం పోలూరు ఎంపీటీసీగా వైఎస్సార్సీపీ అభ్యర్థి షేక్ ఖాసిం వలి 556 ఓట్లతో విజయం ► పీసీపల్లి మండలం మురుగుమ్మి ఎంపీటీసీలో వైఎస్సార్సీపీ అభ్యర్థి చెరుకూరి సతీష్ 61 ఓట్లతో విజయం 12.00PM చిత్తూరు: ► కుప్పం నియోజకవర్గంలో కొనసాగుతున్న వైఎస్సార్సీపీ ప్రభంజనం ► శాంతిపురం మండలం 64 పెద్దూరులో వైఎస్సార్సీపీ ఎంపీటీసీ స్థానాన్ని కైవసం చేసుకుంది. 11.54AM విజయనగరం ► గరివిడి మండలం వెదురుల్లవలస ఎంపీటీసీ స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి గుడివాడ శ్రీరాములు విజయం ► బలిజిపేట మండలం పెదపెంకి ఎంపీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థి గుల్లిపల్లి సునీత 1357 ఓట్ల మెజార్టీతో గెలుపు ► మెంటాడ మండలం కుంటినవలస ఎంపీటీసీలో వైఎస్సార్సీపీ అభ్యర్థి రావాడ ఈశ్వర రావు 610 ఓట్లు ఆధిక్యంతో గెలుపు ► నెల్లిమర్ల మండలం బూరాడపేట ఎంపీటీసీలో వైఎస్సార్సీపీ అభ్యర్థి సంగంరెడ్డి జగన్నాధం గెలుపు 11.48AM శ్రీకాకుళం ► హిరమండలం మండలం హిరమండలం 3 ఎంపీటీసీ స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి మీసాల రజినీ183 ఓట్ల మెజార్టీతో గెలుపు ► టెక్కలి 5వ వార్డు ఎంపీటీసీ స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి బసవల సంధ్యారాణి 897 ఓట్ల మెజారిటీతో గెలుపు ► రేగిడి మండలం ఉంగరాడ ఎంపీటీసీలో వైఎస్సార్సీపీ అభ్యర్థి పిల్లా రోజా 93 ఓట్ల మెజార్టీతో గెలుపు ►బూర్జ మండలం బూర్జ ఎంపీటీసీలో టీడీపీ అభ్యర్థి గెలుపు. ► కొత్తూరు మండలం దిమిలి ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి గెలుపు ► ఆమదాల వలస మండలం కట్యాచారులుపేట ఎంపీటీసీలో టీడీపీ అభ్యర్థి గెలుపు 11.15AM శ్రీకాకుళం ► కంచిలి మండలం తలతంపర ఎంపీటీసీలో వైఎస్సార్సీపీ అభ్యర్థి బృందావన్ సాహు(538) ఓట్ల మెజారిటీతో విజయం ► కవిటి మండలం కొజ్జిరియా ఎంపీటీసీలో వైఎస్సార్సీపీ అభ్యర్ధి కందుల దశరథ రావు 145 ఓట్ల మెజారిటీతో విజయం ► సీతంపేట-2 స్థానంలో వైస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి సవర చంద్రశేఖర్ 779 ఓట్ల మెజారిటీతో గెలుపు ► కంచిలి మండలం కుంబరినువంగా ఎంపీటీసీలో టీడీపీ అభ్యర్థి గెలుపు 11.03AM గుంటూరు ► ప్రత్తిపాడు మండలం నడింపాలెం-2 ఎంపీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థి పూర్ణి వెంకటేశ్వరరావు 200 ఓట్ల మెజారిటీతో గెలుపు. ► బెల్లంకొండ మండలం వెంకటాయపాలెం ఎంపీటీసీగా వైఎస్సార్సీపీ అభ్యర్థి చిట్టెంశెట్టి శివనాగమణి 587 ఓట్ల మెజారిటీతో గెలుపు. ► వేమూరు-1 వైఎస్సార్సీపీ అభ్యర్థి చెల్లం చర్ల కామేశ్వరి 467 ఓట్ల మెజారిటీతో విజయం ►చావలి-2 స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి సోమరవుతు జయలక్ష్మి 345 ఓట్ల మెజారిటీతో విజయం. 10.50AM విశాఖపట్నం: ► గోలుగొండ మండలం పాకలపాడు ఎంపీటీసీగా వైస్సార్సీపీ అబ్యర్ధి ఏళ్ల లక్మి దుర్గ 439 ఓట్లతో గెలుపు ► మాడుగుల మండలం వంటర్లపాలెంలో వైస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి అభ్యర్థి దండి నాగరత్నం 79 ఓట్లు తేడాతో గెలుపు. చిత్తూరు: ► నగరి రూరల్ మండలం నంబాకం ఎంపీటీసీ స్థానంలో 63 ఓట్లు మెజారిటీతో వైఎస్సార్సీపీ అభ్యర్థి గుణ శేఖర్‌రెడ్డి గెలుపు ►ఎస్ఆర్పురం మండలం వి.వి.పురం ఎంపీటీసీ స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆదిలక్ష్మి 269 ఓట్లతో విజయం ► గుడుపల్లి మండలం కనమనపల్లి ఎంపీటీసీ స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి వరలక్ష్మి 494 ఓట్లు మెజార్టీతో గెలుపు 10.40AM కర్నూలు: ►చగలమర్రి -3 ఎంపీటీసీ స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి వెళ్లంపల్లి వెంకటలక్ష్మీ గెలుపు ►చకరాజువేముల ఎంపీటీసీ స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి షాజహాన్ విజయం ►మల్లెపల్లి ఎంపీటీసీ స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి వై. మమత గెలుపు ► కృష్ణగిరి మండలం టి. గోకులపాడు ఎంపీటీపీగీ వైస్సార్సీపీ అభ్యర్ది రమేశ్వరమ్మ 60 ఓట్ల మెజార్టీతో గెలుపు ► ఆదోని మండలం ధానపురం గ్రామంలో వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి హనుమయ్య 157 ఓట్లతో విజయం. ► ఆదోని మండలం బైచిగేరి గ్రామంలో వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి కె.నాగభూషణ్ రెడ్డి 58 ఓట్లతో విజయం. ► ఆదోని మండలం హనువల్ గ్రామంలో వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి సి.ఇరన్న 437 ఓట్లతో గెలుపు. 10.30AM తూర్పు గోదావరి జిల్లా ► మారేడుమిల్లి మండలం దొర చింతలపాలెం ఎంపీటీసీగా వైఎస్సార్సీపీ అభ్యర్థి విజయం. ► సీతానగరం మండలం కాటవరం ఎంపీటీసీ స్థానంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తాడేపల్లి వెంకట్రావు 362 ఓట్ల మెజారిటీతో విజయం కృష్ణాజిల్లా ►పెనుగంచిప్రోలు మండలం కొనకంచి ఎంపీటీసీగా వైఎస్సార్సీపీ అభ్యర్థి కనగాల శ్రీనివాసరావు 602 ఓట్ల మెజార్టీతో గెలుపు ► నూజివీడు మండలం దేవరగుంట ఎంపీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్ధి నక్కా శ్రీనివాసరావు గెలుపు ► నాగాయలంక మండలం పర్రచివర ఎంపీటీసీ స్థానంలో 395 ఓట్ల మెజార్టీతో బుడిపల్లి ఆదిశేషు గెలుపు ► ఆగిరిపల్లి మండలం ఈదర-1 ఎంపీటీసీ స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా దొండపాటి కుమారి 30 ఓట్ల మెజారిటీతో గెలుపు అనంతపురం ►చిలమత్తూరు మండలం కొడికొండ ఎంపీటీసీ స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఇర్షాద్ బేగం గెలుపు ► పరిగి మండలం శాసనకోట ఎంపీటీసీ స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి నాగజ్యోతి 213 ఓట్ల మెజార్టీతో విజయం ► కొండాపూర్ ఎంపీటీసీ స్థానంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సునంద విజయం ► వానవోలు ఎంపీటీసీ రెండవ స్థానంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గాయత్రి బాయి విజయం ► గోరంట్ల-3 ఎంపీటీసీ స్థానంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సోమశేఖర్ విజయం ► డి.హీరేహాల్ మండలం చెర్లోపల్లి ఎంపీటీసీ టీడీపీ అభ్యర్థి మొండి మల్లికార్జున 315 ఓట్లతో విజయం. ► మడకశిర మండలం గోవిందాపురం ఎంపీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థి తాళ్లికేరమ్మ 82 ఓట్లతో విజయం ► పెనుకొండ మండలం రాంపురం ఎంపీటీసీ టీడీపీ అభ్యర్థి పద్మావతి విజయం. ► ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండలం మల్లెపల్లి-1 ఎంపీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థి చిలక మస్తాన్ రెడ్డి 409 ఓట్ల మెజార్టీ తో విజయం ► నార్పల మండలం బి. పప్పూరు ఎంపీటీసీగా పద్మాకర్ రెడ్డి 137 మెజారిటీతో ఘన విజయం ► కనగానపల్లి మండలం కొనాపురం వైస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి జీ. రాజేశ్వరి 369 ఓట్లతో విజయం 10.20AM ►నెల్లూరు జిల్లా: ► సైదాపురం మండలం ఆనంతమడుగు ఎంపీటీసీ స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి లెబాకు వెంకటరమణయ్య 270 ఓట్ల మెజారిటీతో విజయం ► గంగవరం ఎంపీటీసీలో 292 ఓట్ల మెజారిటీతో వైఎస్సార్సీపీ అభ్యర్థి సుమిత్రమ్మ విజయం కృష్ణాజిల్లా: ► ఆగిరిపల్లి (మం) ఈదర -1 ఎంపీటీసీలో దొండపాటి కుమారి(వైఎస్సార్సీపీ) 30 ఓట్లతో గెలుపు ► గన్నవరం (మం) చినఅవుటుపల్లి ఎంపీటీసీలో గంతోటి ప్రశాంతి(వైఎస్సార్సీపీ) 470 ఓట్లతో విజయం ► నూజివీడు (మం) దేవరగుంట ఎంపీటీసీలో నక్కా శ్రీనివాసరావు ( వైఎస్సార్సీపీ) 1150 ఓట్లతో గెలుపు ► నాగాయలంక (మం) పర్రచివర ఎంపీటీసీలో బుడిపల్లి ఆదిశేషు( వైఎస్సార్సీపీ) 395 ఓట్లతో గెలుపు ► ముదినేపల్లి (మం) ముదినేపల్లి ఎంపీటీసీలో మరీదు నాగలింగేశ్వరరావు( వైఎస్సార్సీపీ) 523 ఓట్లతో విజయం ► పెనుగంచిప్రోలు (మం) కొనకంచి ఎంపీటీసీలో కనగాల శ్రీనివాసరావు(వైఎస్సార్సీపీ) 602 ఓట్లతో గెలుపు ► ముదినేపల్లి (మం) వణుదుర్రు ఎంపీటీసీలో గుమ్మడి వెంకటేశ్వరరావు( టీడీపీ) 279 ఓట్లతో గెలుపు 10.14AM పశ్చిమ గోదావరి జిల్లా: ► భీమడోలు మండలం అంబరుపేట ఎంపీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థి దాసరి విజయభాను 10 ఓట్ల మెజార్టీతో గెలుపు ► దెందులూరు1 ఎంపీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థి తాళ్లూరి నాగరాజు 80 ఓట్ల మెజారిటీతో గెలుపు ► పెరవలి మండలం కానూరు 2 ఎంపీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థి మత్తల ఉషారాణి 256 ఓట్లు మెజార్టీతో గెలుపు ► కుక్కునూరు మండలం మాధవరం ఎంపీటీసీ స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి కుండా సూర్యనారాయణ182 ఓట్ల మెజారిటీతో గెలుపు ► అత్తిలి మండలంలోని పాలూరు ఎంపీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థి శరఖడం రామలింగ విష్ణు మూర్తి 257 ఓట్ల మెజారిటీతో గెలుపు ► చాగల్లు ఎంపీటీసీ 5 స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి మట్ల విజయకుమారి 969 ఓట్ల మెజార్టీతో గెలుపు ► జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం ఎంపీటీసీ- 2లో వైఎస్సార్సీపీ అభ్యర్థి దల్లి వెంకట మోహన్ రెడ్డి 428 ఓట్ల మెజార్టీతో గెలుపు. ► నిడదవోలు మండలంలోని తాళ్లపాలెం ఎంపీటీసీలో వైఎస్సార్సీపీ అభ్యర్థి బి.కృష్ణబాబు 40 ఓట్ల మెజారిటీతో గెలుపు 10.05AM ► వైఎస్సార్ జిల్లా ► ప్రొద్దుటూరు మండలం నంగానూరుపల్లి ఎంపీటీసీ వైఎస్సార్సీపీ చెందిన కృష్ట పాటి సంధ్య విజయం ► ముద్దనూరు మండలం కొర్రపాడు వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి పుష్పలత 420 ఓట్ల మెజార్టీతో గెలుపు ► జమ్మలమడుగు జడ్పీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థిని అశ్విని 650 ఓట్ల మెజార్టీతో గెలుపు ►కృష్ణాజిల్లా : గన్నవరం మండలం చిన్నఅవుటపల్లి ఎంపీటీసీ వైఎస్సార్సీపీ కైవసం ►వైఎస్సార్ సీపీ అభ్యర్థి గంతోటి ప్రశాంతి 470 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 09.20AM ► కృష్ణా జిల్లా: విస్సన్నపేట జడ్పీటీసీ పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల ఫలితాలు ►మొత్తం పోలైన ఓట్లు-32 ►వైఎస్సార్సీపీ-14 ►బీఎస్సీ -6 ►బీజేపీ-1 ►టీడీపీ-0 ►కాంగ్రెస్-0 ►సీపీఎం-3 ►చెల్లని ఓట్లు -8 08.30AM ► పశ్చిమ గోదావరి జిల్లా: చాగల్లు ఎంపీటీసీ స్థానానికి కౌంటింగ్ కొనసాగుతోంది. రెండు టేబుళ్ల ద్వారా కౌంటింగ్ అధికారులు నిర్వహిస్తున్నారు. ► నెల్లూరుజిల్లా: బాలాయపల్లి మండల పరిషత్ కార్యాలయంలో వెంగమాంబాపురం ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ►కోవూరు నియోజకవర్గం గంగవరం ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. కోడూరు మండల పరిషత్ కార్యాలయం కౌంటింగ్ సెంటర్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమలు చేశారు. ►కోట బిట్ 2 ఎంపీటీసీ ఎన్నికల కౌటింగ్ కోట మండల పరిషత్ కార్యాలయంలో కొనసాగుతోంది. 08.00AM ► రాష్ట్రంలోని 10 జడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ► పెనడ, విస్పన్న పేట, జి. కొడూరు జడ్పీటీసీ స్థానాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ► విజయనగరం: జిల్లాలోని 9 ఎంపీటీసీ స్థానాలకు ఓట్ల లెక్కిపు ప్రారంభమైంది. ► శ్రీకాకుళం: జిల్లాలోని ఒక జడ్పీటీసీ, 15 ఎంపీటీసీ స్థానాలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ► కర్నూల్ జిల్లా: వెల్దుర్తి మండలం మల్లెపల్లి ఎంపీటీసీ స్థానానికి ప్రారంభమైన కౌంటింగ్. కృష్ణగిరి మండలం టి. గోకులపాడు ఎంపీటీసీ స్థానానికి ప్రారంభమైన కౌంటింగ్. 07.57AM ► మరికాసేపట్లో ప్రారంభం కానున్న రాష్ట్రంలోని 10 జడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మంగళవారం ఎన్నికలు జరిగిన పది జెడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాల ఓట్లను గురువారం లెక్కించనున్నారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం తెలిపింది. ఎంపీటీసీ స్థానాల్లో ఫలితాలు ఉదయం పది గంటలకు తేలతాయని, జెడ్పీటీసీ స్థానాల్లో మధ్యాహ్నం 12 గంటలకల్లా తుది ఫలితం వెల్లడించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆ 757 ఓట్లతో తేలనున్న జమ్మలమడుగు జెడ్పీటీసీ ఫలితం వీటితోపాటు సెప్టెంబరు 19న రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల సమయంలో కేవలం రెండు పోలింగ్ బూత్‌లలో ఓట్ల లెక్కింపునకు వీలులేని పరిస్థితిలో ఫలితం ప్రకటన వాయిదాపడిన వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు జెడ్పీటీసీ స్థానం విజేత ఎవరో కూడా గురువారం తేలనుంది. అప్పట్లో ఈ జెడ్పీటీసీ స్థానంలో లెక్కింపు జరిగినంతవరకు వైఎస్సార్సీపీ అభ్యర్థి.. ఆ తర్వాత స్థానంలో ఉన్న బీజేపీ అభ్యర్థి కంటే 517 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు. ఆ జెడ్పీటీసీ స్థానం పరిధిలోని గొరిగనూరు ఎంపీటీసీ స్థానంలో మొత్తం 827 మంది ఓటర్లున్న రెండు పోలింగ్ కేంద్రాల్లో పోలైన ఓట్లు తడిసి లెక్కింపునకు వీలుగా లేవని అప్పట్లో కౌంటింగ్ సిబ్బంది తేల్చారు. మొదటి రెండు స్థానాల్లో ఉన్న అభ్యర్థుల మధ్య ఓట్ల తేడా 517గా ఉండడం, లెక్కించకుండా మిగిలిపోయిన ఓట్లు అంతకంటే ఎక్కువ ఉండడంతో అప్పట్లో ఆ ఎన్నికల ఫలితాన్ని ప్రకటించకుండా వాయిదా వేశారు. తాజాగా ఆ రెండు పోలింగ్ బూత్‌లలో మంగళవారం పోలింగ్ నిర్వహించగా 757 ఓట్లు పోలయ్యాయి. ఈ 757 ఓట్లే ఇప్పుడు ఆ జెడ్పీటీసీ విజేతను నిర్ణయించనున్నాయి. అప్పట్లో ఓట్లు తడిసిన కారణంగా ఆరు ఎంపీటీసీ స్థానాల ఫలితాల ప్రకటనను వాయిదావేశారు. రీ పోలింగ్ నిర్వహించడంతో ఆ ఆరు ఎంపీటీసీ స్థానాల ఫలితాలు కూడా గురువారం తేలనున్నాయి. -
టీడీపీ అక్రమాలపై ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు
సాక్షి, అమరావతి: మునిసిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ దౌర్జన్యాలకు, అరాచకాలకు పాల్పడుతోందని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్రావు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నికి సోమవారం ఫిర్యాదు చేశారు. వీటిపై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మీడియాతో అప్పిరెడ్డి మాట్లాడుతూ.. ప్రశాంతంగా జరుగుతున్న ఎన్నికలలో అలజడులు, ఆటంకాలు సృష్టించాలని, శాంతిభద్రతల సమస్య నెలకొనేలా చేయాలని చంద్రబాబు ప్రయత్నించారన్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగాలని వైఎస్సార్సీపీ కోరుకుంటోందని తెలిపారు. చంద్రబాబు రాబోయే ఓటమికి సాకులు వెదుకుతున్నారని, దానిలో భాగంగా కుప్పంలో దొంగఓట్లు అంటూ కొత్తపల్లవి అందుకున్నారని విమర్శించారు. ఓడిపోయే సమయంలో ఇలాంటి సాకులు రెడీ చేసిపెట్టుకునే అలవాటు చంద్రబాబుకు ఉందనే విషయం ప్రజలందరికీ తెలుసన్నారు. చంద్రబాబు అక్రమాలపై తాము చేసిన ఫిర్యాదుకు తగిన ఆధారాలు కూడా ఎన్నికల కమిషనర్‌కు అందచేశామని చెప్పారు. కమిషనర్‌ను కలిసిన వారిలో నవరత్నాల అమలు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నారాయణమూర్తి కూడా ఉన్నారు. -
AP: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు.. ముగిసిన పోలింగ్
రాష్ట్రంలో 10 జడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల పోలింగ్ సాయత్రం 5 గంటలకు ముగిసింది. ఈ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. క్యూలైన్లలో ఉన్న ఓటర్లకు ఓటు వేసే అవకాశం కల్పిస్తామని ఎన్నికల అధికారులు తెలిపారు. కాగా, ఈ నెల 18న ఓట్ల లెక్కింపు జరగనుంది. Live Updates TIME: 5:00PM అనంతపురం: అనంతపురం జిల్లాలోని చిలమత్తూరు జెడ్పీటీసీ, 16 ఎమ్పీటీసీలకు జరిగిన ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ కేంద్రాల గేట్స్‌ను అధికారులు మూసేశారు. 5 గంటల తర్వాత క్యూలైన్లలో ఉన్న వారికి మాత్రమే ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. జెడ్పీటీసీ, ఎమ్పీటీసీ ఎన్నికల్లో 65 శాతం పోలింగ్ నమోదైంది. Time 4:00 PM ►నెల్లూరు జిల్లా: కోట జడ్పీ హైస్కూల్లో జరుగుతున్న ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ సరళిని ఆర్డీఓ మురళీకృష్ణ పరిశీలించారు. సాయంత్రం 4 గంటలవరకు 56.3 శాతం పోలింగ్ నమోదు. ►పశ్చిమగోదావరి జిల్లా: పెనుగొండ మండలం జెడ్పీటీసీ ఎన్నికలో సాయంత్రం 4 గంటల వరకు 65.2 శాతం పోలింగ్ నమోదు. ► గుంటూరు జిల్లా: శావల్యాపురం మండలం వేల్పూర్ లో జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలకు వెళ్లిన టీడీపీ అభ్యర్థి పారా హైమావతి ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించారు. ఈ విషయాన్ని ఓటర్లు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. పోలింగ్ కేంద్రంలో క్యూ లైన్ లో ఓటర్ ను ప్రభావితం చేస్తున్న హైమావతిని పోలీసులు బయటికి పంపించారు. దీంతో ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ► తూర్పు గోదావరి జిల్లా: కోరుకొండ మండలం పశ్చిమ గానుగూడెంలో 4గంటలకు నమోదైన పోలింగ్ శాతం 73.64%. ► ప్రకాశం జిల్లా: పెద్దారవీడు మండలం తంగిరాల పల్లి ఎంపీటీసీ స్థానానికి సంబంధించి 4 గంటలకు 72.23% పోలింగ్ నమోదు. Time 3:00 PM ► కర్నూలు జిల్లా జిల్లాలో నంద్యాల జడ్పీటీసీ, బైచిగేరి, ధనాపురం, హానవాలు, చాగలమర్రి, టి. గోకులపాడు, మల్లేపల్లి, చాకరాజువేముల ఎంపీటీసీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో మధ్యాహ్నం 3 గంటలకు 57.33 శాతం పోలింగ్ నమోదు. ► నెల్లూరు జిల్లా కోవూరు మండలం గంగవరం ఎంపీటీసీ ఎన్నికలో 3 గంటలకు 62 శాతం పోలింగ్ నమోదు ► పశ్చిమగోదావరి జిల్లా: సాయంత్రం 3 గంటల వరకు నుగొండ మండలం జడ్పీ, ఎంపీటీసీ 59.97 శాతం పోలింగ్ శాతం. ► కృష్ణా జిల్లా జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ పెడన జడ్పీటీసీ 61.20 శాతం జి.కొండూరు జడ్పీటీసీ 54.92 శాతం విస్సన్నపేట జడ్పీటీసీ 44.49 శాతం ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ఆగిరిపల్లి (మం) ఈదర-1: ఎంపీటీసీ 74.88 శాతం గన్నవరం (మం) చినఅవుటుపల్లి - ఎంపీటీసీ 60.90 శాతం నూజివీడు (మం) దేవరకుంట - ఎంపీటీసీ 67.69 శాతం నాగాయలంక (మం) పర్రచివర - ఎంపీటీసీ 57.62 శాతం ముదినేపల్లి (మం) ముదినేపల్లి-2: ఎంపీటీసీ 49.23 వణుదుర్రు ఎంపీటీసీ 56.59 శాతం పెనుగంచిప్రోలు (మం) కొనకంచి- ఎంపీటీసీ 67.62 శాతం Time: 2:00 PM ► ప్రకాశం జిల్లా: పిసి పల్లి మండలం మురుగమ్మి ఎంపీటీసీ స్థానంలో ఇప్పటివరకు 78% పోలింగ్ నమోదు నమోదైంది. ► విశాఖ జిల్లా : ఆనందపురం మండలం వెల్లంకి, వేములవలస జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ మల్లికార్జున సందర్శించారు. జిల్లాలో జరుగుతున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఇప్పటివరకు 51 శాతం పోలింగ్ నమోదైంది. ► నెల్లూరు జిల్లా: సైదాపురం మండలం ఆనంతమడుగు ఎంపీటీసీ స్థానాన్నికి జరుగుతున్న పోలింగ్ సరళిని ఎన్నికల పరిశీలకులు బసంత్ కుమార్, గూడూరు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి పరిశీలించారు. ► తూర్పుగోదావరి జిల్లా: ♦ ఎటపాక మండలం 12 ఎంపీటీసీ స్థానాలకు 2 గంటలకు 69.4% శాతం పోలింగ్ నమోదైంది. ♦ వి ఆర్ పురం మండలం, చిన్నమట్టపల్లి ఎంపీటీసీ స్థానానికి 71% ఓటింగు నమోదు. ♦ కపిలేశ్వరపురం మండలం వాక తిప్ప నాగులచెరువు ఎంపీటీసీ స్థానానికి సంబంధించి 2 గంటలకు పోలింగ్ శాతం 55.90% ఓటింగు నమోదు. ♦ సీతానగరం మండలం కాటవరం ఎంపీటీసీ స్థానాలు సంబంధించి 2గంటలకు పోలింగ్ శాతం 60.6% ఓటింగు నమోదు. ♦ ఏజెన్సీ ప్రాంతం కావడంతో ముందస్తు ప్రణాళిక ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకే ముగిసిన పోలింగ్ .వి ఆర్ పురం మండలం, చిన్నమట్టపల్లి ఎంపీటీసీ స్థానానికి 72% పోలింగ్ నమోదు. Time: 1.25 PM ►గుంటూరు జిల్లా: ప్రత్తిపాడు మండలం నడింపాలెంలో జరుగుతున్న ఎంపీటీసీ ఎన్నికలను గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరీఫ్ పరిశీలించారు. ► కృష్ణాజిల్లా: మధ్యాహ్నం 1 గంట వరకు జి.కొండూరు జడ్పీటీసీలో 43.7 శాతం, విస్సన్నపేట జడ్పీటీసీలో 36 శాతం, పెడన జడ్పీటీసీ 48 శాతం పోలింగ్ నమోదైంది. ► కర్నూలు: జిల్లాలో నంద్యాల జడ్పీటీసీ, బైచిగేరి, ధనాపురం, హానవాలు, చాగలమర్రి, టి. గోకులపాడు, మల్లేపల్లి, చాకరాజువేముల ఎంపీటీసీ స్థానాల్లో మధ్యాహ్నం ఒంటి గంట 50.18 శాతం పోలింగ్. ► పశ్చిమగోదావరిజిల్లా: జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం12 గంటల వరకు పెనుగొండ జడ్పీటీసీలో 39.63 శాతం పోలింగ్ నమోదైంది. Time: 12.25 PM 10 జడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ► కృష్ణా జిల్లాలోని జి.కొండూరులో జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ సిద్దార్ధ్ కౌశల్ పరిశీలించారు. Time: 11.25 AM ► 10 జడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ► కృష్ణా జిల్లా: ఉదయం 11 గంటలకు జడ్పీటీసీ పోలింగ్ శాతాలు.. జి.కొండూరు జడ్పీటీసీ-28.18 శాతం, విస్సన్నపేట జడ్పీటీసీ- 16 శాతం, పెడన జడ్పీటీసీ-26.80 శాతం నమోదైంది. Time: 10.25 AM ► 10 జడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. Time: 9.30 AM ► 10 జడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ► కృష్ణాజిల్లా: ఉదయం 9 గంటలకు జీ.కొండూరు జడ్పీటీసీ పోలింగ్‌లో 10 శాతం, విస్సన్నపేట జడ్పీటీసీ పోలింగ్‌లో 8.5 శాతం, పెడన జడ్పీటీసీ పోలింగ్‌లో 10.24 శాతం పోలింగ్ నమోదైంది. ► కర్నూల్ జిల్లా: కృష్ణగిరి మాండలం టి.గోకులపాడు ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌లో 9 గంట వరకు 18.94 శాతం పోలింగ్ నమోదైంది. Time: 8.30 AM ► 10 జడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. వృద్దులు, వికలాంగులుకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇబ్బంది లేకుండా పోలింగ్ కేంద్రల వద్ద ఎన్నికల అధికారులు వీల్ చైర్లను ఏర్పాటు చేశారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ పోలీసులు అమలు చేస్తున్నారు. Time: 7.20 AM ► రాష్ట్రంలోని 10 జడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవాడానికి పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. Time: 7.00 AM ► రాష్ట్రంలోని 10 జడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. వివిధ కారణాలతో అప్పట్లో ఆగిపోయిన, గెలిచినవారు చనిపోయిన కారణంగా ఆయా స్థానాల్లో ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. మంగళవారం 954 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ► ఈ పోలింగ్‌లో 8,07640 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. జడ్పీటీసీ స్థానాల్లో 40 మంది, ఎంపీటీసీ స్థానాల్లో 328 మంది పోటీలో ఉన్నారు. ఓట్లను ఈనెల 18న లెక్కిస్తారు. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 10 జెడ్పీటీసీ స్థానాలకు, 123 ఎంపీటీసీ స్థానాలకు మంగళవారం ఎన్నికలు జరగనున్నాయి. వివిధ కారణాలతో అప్పట్లో ఆగిపోయిన, గెలిచినవారు చనిపోయిన కారణంగా ఆయా స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇవికాకుండా గతంలో ఓట్ల లెక్కింపు సమయంలో తడిసిన ఓట్ల కారణంగా లెక్కింపు ఆగిపోయిన వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు జెడ్పీటీసీ స్థానంలో రెండు బూత్‌లతోపాటు మరో ఆరు ఎంపీటీసీ స్థానాల్లోను మంగళవారం ఫ్రెష్ (రీ) పోల్ నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు చెప్పారు. మొత్తం 14 జెడ్పీటీసీ స్థానాలు, 176 ఎంపీటీసీ స్థానాల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీచేశారు. వీటిలో నాలుగు జెడ్పీటీసీ స్థానాలు, 50 ఎంపీటీసీ స్థానాల ఎన్నిక ఏకగ్రీవం అయిన సంగతి తెలిసిందే. మూడు ఎంపీటీసీ స్థానాల్లో ఎవరూ నామినేషన్ల దాఖలు చేయకపోవడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. మిగిలినచోట్ల 954 పోలింగ్ కేంద్రాల్లో మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. జెడ్పీటీసీ స్థానాల్లో 40 మంది, ఎంపీటీసీ స్థానాల్లో 328 మంది పోటీలో ఉన్నారు. మొత్తం 8,07,640 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఓట్లను ఈనెల 18న లెక్కిస్తారు. -
ఈ ‘పరిషత్’ ఎన్నికల్లో చిటికెన వేలిపై ‘సిరా’ గుర్తు
సాక్షి, అమరావతి: ఓటు హక్కు వినియోగించుకున్న ఓటరుకు సాధారణంగా ఎడమ చెయ్యి చూపుడు వేలిపై సిరా గుర్తు పెడుతుంటారు. కానీ.. ఈ నెల 16న జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటు వేసే ఓటరుకు ఎడమ చిటికెన వేలిపై సిరా గుర్తు వేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని బుధవారం నోటిఫికేషన్ జారీ చేశారు. చదవండి: 4 జెడ్పీటీసీలు ఏకగ్రీవమే పలుచోట్ల 14న సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు.. 16న పలుచోట్ల ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఒకే గ్రామంలో సర్పంచ్, వార్డు సభ్యుడు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నిక జరిగే అవకాశం ఉండటంతో ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో ఓటరుకు ఎడమ చెయ్యి చూపుడు వేలిపైనా.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటరు ఎడమ చెయ్యి చిటికెన వేలిపైన సిరా గుర్తు వేయాలని పేర్కొంది. -
అక్కడ మధ్యాహ్నం 2 వరకే పోలింగ్
సాక్షి, అమరావతి: ఈ నెల 16న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగే చోట సా.5 గంటల వరకు పోలింగ్ జరుగుతున్నప్పటికీ.. తూర్పు గోదావరి జిల్లాలోని 14 ఎంపీటీసీ స్థానాల్లో మాత్రం మ.2 గంటల వరకే పోలింగ్ నిర్వహించనున్నారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో శాంతిభద్రతల అంశానికి సంబంధించి జిల్లా కలెక్టర్ నుంచి అందిన నివేదిక మేరకు.. ఆ జిల్లాలో ఏటపాక మండలంలోని 12 ఎంపీటీసీ స్థానాలతో పాటు వీఆర్ పురంలోని చినమట్టపల్లి ఎంపీటీసీ, మారేడుమిల్లి మండలంలోని దొరచింతలవాని పాలెం ఎంపీటీసీ పోలింగ్ సా.5 గంటల వరకు కాకుండా మ.2 గంటల వరకే కొనసాగుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఆదేశాలు జారీచేశారు. 14, 16 తేదీల్లో సెలవు: ఇక గ్రామ సర్పంచి, వార్డు సభ్యుల ఎన్నికలు జరిగే చోట ఈ నెల 14న.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగే చోట ఈనెల 16న ప్రభుత్వ కార్యాలయాలతోపాటు ఇతర అన్ని రకాల సంస్థలకు సెలవు ప్రకటిస్తూ పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీచేశారు. అలాగే, పంచాయతీ ఎన్నికలు జరిగే చోట పోలింగ్ ముగిసే సమయానికి 44 గంటల ముందు నుంచీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగే చోట 48 గంటల ముందు నుంచి మద్యం అమ్మకాలను నిలుపుదల చేయాలని కూడా ఉత్తర్వులిచ్చారు. ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ సాక్షి, అమరావతి/నెల్లూరు సిటీ: నెల్లూరు కార్పొరేషన్‌తోపాటు 12 మునిసిపాలిటీలు, నగర పంచాయతీలతో పాటు వివిధ కార్పొరేషన్లలో జరుగుతున్న 353 డివిజన్లు, వార్డుల్లో ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారం ముగిసింది. నెల్లూరు కార్పొరేషన్లో 54 డివిజన్లకు ఎన్నికలు జరుగుతుండగా 8 డివిజన్లలో వైఎస్సార్సీపీ అభ్యర్థులు మాత్రమే బరిలో నిలిచినట్టు తెలిసింది. అనధికారికంగా అందిన సమాచారం మేరకు.. గుంటూరు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీలో ఒక వార్డులో, గురజాల నగర పంచాయతీలో ఆరు వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు మాత్రమే బరిలో ఉన్నారు. ప్రకాశం జిల్లా దర్శిలో ఒక వార్డు, చిత్తూరు జిల్లా కుప్పం మునిసిపాలిటీలో ఒక వార్డులో వైఎస్సార్సీపీ అభ్యర్థులు మినహా మిగిలినవారు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో ఈ వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఎన్నిక దాదాపు ఏకగ్రీవమేనని, అధికారిక ప్రకటన మాత్రమే వెలువడాల్సి ఉందని సమాచారం. గతంలో ఎన్నికలు నిలిచిన, గెలిచినవారి మరణంతో ఖాళీ అయిన వార్డులకు ప్రస్తుతం ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ తరహాలో ఎన్నికలు జరుగుతున్న గుంటూరు జిల్లా మాచర్ల మునిసిపాలిటీలోని 8వ వార్డు, రేపల్లెలోని 16, మచిలీపట్నంలో 32, నూజివీడు 27వ వార్డులో నామినేషన్ల ఉపసంహరణల అనంతరం వైఎస్సార్సీపీ అభ్యర్థులే బరిలో ఉన్నారు. -
ఏపీలో12 మున్సిపాలిటీలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల
-
ఓ వైపు తండ్రి మరణం.. మరోవైపు బాధ్యతల స్వీకారం
లావేరు: తండ్రి చనిపోయి కుటుంబంలో విషాదం నెలకొన్న సమయంలో ఓ ఎంపీటీసీ సభ్యుడు ప్రమాణ స్వీకారం చేయాల్సి వచ్చింది. తండ్రి లేడన్న బాధను పంటి బిగువన భరిస్తూ.. నీళ్లు నిండిన కళ్లతోనే ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం తామాడలో రౌతు నారాయణరావు ఎంపీటీసీగా గెలుపొందారు. శుక్రవారం ఆయన ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. కానీ అదే రోజు ఆయన తండ్రి పాపినాయుడు అనారోగ్యంతో మరణించారు. దీంతో తండ్రి అంత్యక్రియలు పూర్తి చేసి మండల పరిషత్ కార్యాలయానికి వచ్చి ప్రమాణ స్వీకారం చేశారు. చదవండి: తెలంగాణ పర్వతారోహకుడికి సీఎం జగన్ భారీ ఆర్థిక సహాయం -
పశ్చిమలో బట్టబయలైన టీడీపీ, జనసేన చీకటి పొత్తు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం, జనసేన పార్టీల చీకటి పొత్తు రాజకీయం పరిషత్ ఎన్నికల సాక్షిగా బట్టబయలైంది. ఆచంట మండలంలో టీడీపీ అభ్యర్థికి మండల పరిషత్ ఎన్నికల్లో జనసేన మద్దతిచ్చింది. మరోవైపు వీరవాసరంలో జనసేన మెజారిటీ స్థానాల్లో గెలుపొందినా.. తక్కువ స్థానాల్లోనే గెలుపొందిన టీడీపీకి ఎంపీపీ ఎన్నికల్లో మద్దతు ఇవ్వడం గమనార్హం. ఈ రెండు మండలాల్లోనూ ఈ అపవిత్ర పొత్తు ద్వారా టీడీపీ ఎంపీపీ స్థానాలను కైవసం చేసుకోగా.. జనసేన మండల పరిషత్ ఉపాధ్యక్ష పదవులతో సరిపెట్టుకుంది. మరోపక్క దీనిపై జిల్లాలోని జనసేన పార్టీకి చెందిన ఒక వర్గంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. సోమవారం జిల్లాలో మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికలు నిర్వహించారు. ఆచంట మండలంలో 17 ఎంపీటీసీ స్థానాలకు గాను టీడీపీ 7, వైఎస్సార్సీపీ 6, జనసేన 4 స్థానాల్లో విజయం సాధించాయి. జెడ్పీటీసీ స్థానాన్ని టీడీపీ దక్కించుకుంది. ఇక్కడ ఎంపీపీ ఎన్నికకు 9 మంది సభ్యుల మద్దతు అవసరం కాగా, జనసేనకు చెందిన నలుగురు సభ్యులు టీడీపీకి మద్దతు ఇవ్వడంతో ఎంపీపీ స్థానాన్ని ఆ పార్టీ దక్కించుకుంది. ఇక్కడ వైస్ చైర్మన్ పదవిని జనసేనకు ఇచ్చారు. దీనిపై జనసేనలోని మండల స్థాయి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక వీరవాసరం మండలంలో సీన్ రివర్స్‌గా ఉంది. జెడ్పీటీసీ స్థానంతో పాటు మెజార్టీ ఎంపీటీసీల్లో జనసేన గెలుపొందినా ఎంపీపీ స్థానాన్ని మాత్రం టీడీపీకి కట్టబెట్టింది. వీరవాసరం మండలంలో 19 ఎంపీటీసీ స్థానాలకు గాను 8 జనసేన, 7 వైఎస్సార్సీపీ, 4 టీడీపీ గెలుపొందాయి. జనసేన, టీడీపీకి చెరొక ఓటు అంటూ ఆ రెండు పార్టీలు ముందస్తు ప్రచారం చేసుకున్నాయి. దీనిలో భాగంగా 4 ఎంపీటీసీ స్థానాలు మాత్రమే ఉన్న టీడీపీకి ఎంపీపీ స్థానం కట్టబెట్టడం గమనార్హం. 8 ఎంపీటీసీలున్న జనసేన వైస్ చైర్మన్ పదవితో సరిపెట్టుకుంది. -
ప్రభుత్వంపై తప్పుడు ప్రచారానికే ఎల్లో మీడియా పరిమితం: సజ్జల
-
ఆత్మవిమర్శకు బదులు.. అపనిందలేస్తారా?: సజ్జల
సాక్షి, తాడేపల్లి: మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయంపై ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఆత్మవిమర్శ చేసుకోకుండా సీఎం వైఎస్ జగన్‌పై అపనిందలేస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. కుప్పం నియోజకవర్గంలో 66 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగితే కేవలం 3 స్థానాల్లో మాత్రమే టీడీపీ అభ్యర్థులను చంద్రబాబు గెలిపించగలిగారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో నివాసం ఉంటూ వలస పక్షుల్లా రాష్ట్రానికి వచ్చే చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్, బాబు భాగస్వామి పవన్ కళ్యాణ్.. సీఎం వైఎస్ జగన్‌కు నానాటికీ ప్రజల్లో పెరుగుతున్న మద్దతును చూసి ఓర్వలేక పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే.. ►ఇటీవల జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి 69.55 శాతం ఓట్లు వస్తే.. టీడీపీకి 22.27%, జనసేనకు 3.83%, బీజేపీకి 2.32% ఓట్లు వచ్చాయి. ►ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి 64.8%, టీడీపీకి 25.27%, జనసేనకు 4.34%, బీజేపీకి 1.48% ఓట్లు వచ్చాయి. ►2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి వచ్చిన ఓట్లు 50 శాతం అయితే.. ఇప్పుడు జెడ్పీటీసీల్లో దాదాపుగా 70శాతం ఓట్లు వచ్చాయి. పరిషత్ ఎన్నికల్లోనూ తిరుగులేని విజయం సా«ధించింది. సీఎం వైఎస్ జగన్, వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనపై ప్రజల ఆదరణ, విస్పష్టమైన అభిమానం వ్యక్తమైంది. ►గత రెండున్నరేళ్లుగా ఏపీలో ప్రతిపక్షాలు, ముఖ్యంగా టీడీపీ నిరాశ, నిస్పృహలతో సీఎం జగన్, రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తోంది. ఎల్లో మీడియా అయితే రోజూ అసత్య కథనాలతో సీఎం ప్రజాస్వామ్య పరిపాలనపై దాడిచేస్తున్నాయి. చెంప చెళ్లుమనిపించేలా తీర్పిచ్చినా.. ►‘పరిషత్’ ఫలితాలు వచ్చాకైనా టీడీపీకి సిగ్గు వస్తుందనుకున్నాం. అసలు ఎక్కడ లోపం ఉందో చూసుకోకుండా తాము ఎన్నికలు బహిష్కరించామని చంద్రబాబు అంటున్నారు. నిజంగా ఎన్నికలు బహిష్కరించి ఉంటే.. ఎందుకు అభ్యర్థులను పోటీకి దింపారు.. అయినా ప్రజలు చెంప చెళ్లుమనిపించేలా తీర్పు ఇచ్చారు. ►ఎంపీటీసీ ఎన్నికల్లో నియోజకవర్గాల వారీగా చూస్తే అచ్చెన్నాయుడు 4, బాలకృష్ణ 7, దేవినేని ఉమా 3, పరిటాల సునీత 9, ధూళిపాళ నరేంద్ర 12 స్థానాల్లో మాత్రమే వారి నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించుకున్నారు. కానీ, అత్యంత హీనంగా సాధించింది చంద్రబాబే. అయినా ఆయనకు బుద్ధిరాలేదు. ►ఎక్కడో గుజరాత్లో హెరాయిన్ దొరికితే.. దానికి సీఎం వైఎస్ జగన్‌కు ముడిపెడుతూ అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ►ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లో అక్కడక్కడా చెదరుమదురు ఘటనలు జరిగాయే తప్ప టీడీపీ, ఒక వర్గం మీడియా ఆశించినట్లు ఏమీ జరగలేదు. తప్పుడురాతలతో వంకరబుద్ధి చూపిస్తే ఎలా.. పరిషత్ ఎన్నికల ఫలితాల తర్వాత కూడా చంద్రబాబుతోపాటూ ఆయన్ని మోసే మీడియాలో ఏమాత్రం మార్పురాలేదు. నిధులు మళ్లించేస్తున్నారంటూ ‘ఈనాడు’ అక్కసు వెళ్లగక్కుతూ కథనం అచ్చేసింది. నిజానికి.. సివిల్ సప్లైస్ నుంచి రూ.5,800 కోట్లు, స్టేట్ డ్రింకింగ్ వాటర్ కార్పొరేషన్ నుంచి రూ.940 కోట్లు, స్టేట్ ఇరిగేషన్ డెవలప్మెంట్ ప్రాజెక్టు నుంచి రూ.1,200 కోట్లు, రైతు సాధికార సంస్థ నుంచి రూ.450 కోట్లు మొత్తం రూ.8,390 కోట్లను 2019 ఎన్నికలకు ముందు టీడీపీ సర్కారు పసుపు–కుంకుమకు మళ్లించేసింది. అదే సమయంలో ఆర్బీఐ నుంచీ రూ.5వేల కోట్లు డ్రా చేసి.. పసుపు–కుంకుమకు మళ్లించారు. మరి ఆ రోజు మీ పత్రిక ఎందుకు వీటి గురించి రాయలేదు? మీ బాధ ఏంటి? రాష్ట్ర ప్రభుత్వానికి అప్పు పుట్టకూడదు.. కేంద్రం మద్దతు ఇవ్వకూడదు.. కోర్టులు ద్వారా ఆడ్డుకోవాలి.. ఇవే మీ కుట్రలు, కుతంత్రాలు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటే సంతోషం కేంద్రంతో పవన్ కళ్యాణ్‌కున్న సత్సంబంధాలు ఉపయోగించి స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుని ఆ క్రెడిట్ వాళ్లే తీసుకుంటే చాలా సంతోషం. ఇక ఎంపీపీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలవకూడదనే ఉద్దేశంతో బీజేపీ, జనసేనకు టీడీపీ మద్దతిచ్చింది. కాపు, వైశ్య కార్పొరేషన్లు టీడీపీ హయాంలోనే బీసీ శాఖ పరిధిలో ఉన్నాయి. బ్రాహ్మణ కార్పొరేషన్ ఉత్తర్వులపై విమర్శలు చేయడం అంటే.. కోడిగుడ్డు మీద ఈకలు పీకడంలాంటిదే. వీటన్నింటినీ ఈబీసీ కిందకు మార్చే అవకాశముంది. మండల పరిషత్ రెండో ఉపాధ్యక్ష పదవిని కొత్తగా సృష్టిస్తూ ఆర్డినెన్స్ తేవాలని నిర్ణయించాం. చదవండి: Andhra Pradesh: డిగ్రీ కోర్సులు.. ఆంగ్ల మాధ్యమంలోనే! ‘మహిళా సంరక్షణ కోసం ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోంది’ -
ఆగిపోయిన చోట ఎన్నికల నిర్వహణపై కసరత్తు
సాక్షి, అమరావతి : వివిధ కారణాలతో సర్పంచి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఆగిపోయిన చోట తిరిగి నిర్వహించే అంశంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టి పెట్టింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలంసాహ్ని గురువారం పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఆ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో నీలంసాహ్నితో భేటీ అయ్యారు. ఎన్నికలు ఆగిపోయిన స్థానాల వివరాలు అందజేశారు. తిరిగి ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే విషయంపై చర్చించినట్లు తెలిసింది. -
పప్పు, తుప్పును నమ్ముకుంటే తెలంగాణలో పట్టిన గతే: కొడాలి నాని
సాక్షి, తాడేపల్లి: పరిషత్ ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 99 శాతం జెడ్పీటీసీ, 85 శాతం ఎంపీటీసీలు గెలిచినట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తెలిపారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడు రోజుల్లో ఎన్నికలు ఉండగా చంద్రబాబు, నిమ్మగడ్డ వాయిదా వేసి పారిపోయారని ఎద్దేవా చేశారు. కొత్త ఎన్నికల కమిషనర్ వచ్చాక మార్చిలో ఎన్నికల ప్రక్రియ కొనసాగిస్తే ఎక్కడా టీడీపీ గెలవదని లెక్కింపు ఆపేశారని విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రజలు దీవిస్తుంటే చూడలేని ఈ చంద్రబాబు ఎన్నికల బహిష్కరణ అంటారని మంత్రి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. 800 మంది టీడీపీ అభ్యర్థులు గెలిచారు.. వాళ్లందరూ చంద్రబాబుని ధిక్కరించినవాళ్లా? అని సూటిగా ప్రశ్నించారు. ఆ గెలిచిన వాళ్లలో ఒకరిని పార్టీ అధ్యక్షుడిగా పెట్టుకోండి అని సూచించారు. ప్రతిపక్షం ఖాళీ అయినట్టు చంద్రబాబు ఒప్పుకుంటున్నారని నాని పేర్కొన్నారు. ఈ పప్పు, తుప్పును నమ్ముకుంటే తెలంగాణలో పట్టిన గతేనని పడుతుందని జోస్యం చెప్పారు. అయ్యన్నపాత్రుడు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని.. తాను తలచుకుంటే ఇంకా దారుణంగా తిట్టగలనని ఆయన వార్నింగ్ ఇచ్చారు. -
MPTC Ashwini Trending: బాబు చుట్టూ.. ‘23’
కుప్పం: కుప్పం రాజకీయ చరిత్రలో 40 ఏళ్ల చంద్రబాబు ఏకఛత్రాధిపత్యానికి 23 ఏళ్ల అశ్వని బ్రేక్ వేశారు. కుప్పం మండలం మల్లానూరుకు చెందిన అశ్వని వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా 1,073 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆమె పోటీ చేసిన మల్లానూరు–2 సెగ్మెంట్లో టీడీపీ అభ్యర్థికి కేవలం 70 ఓట్లే వచ్చాయి. 4 దశాబ్దాలుగా కుప్పం ఎంపీపీగా చంద్రబాబు మద్దతుదారులే చక్రం తిప్పగా, ఈ సారి ఎంపీపీ అభ్యర్థి రేసులో నిలిచి.. బాబు కోటను బద్ధలు కొట్టారు. పీజీ చదివిన అశ్వని మొదటి నుంచీ వైఎస్సార్ కుటుంబానికి అభిమాని. ఎన్నికల ప్రచారంలో ఇక్కడికి వచ్చిన వైఎస్ జగన్‌కు రాఖీ కట్టి తన అభిమానాన్ని చాటుకున్నారు. -
MPTC, ZPTC Election Results: ఆ ఎనిమిది చోట్లా ఫలితాలు నిలిపివేత
సాక్షి, అమరావతి: ఏడు ఎంపీటీసీ, ఒక జెడ్పీటీసీ స్థానాల ఎన్నికల ఫలితాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) నిలిపివేసింది. వాటి పరిధిలోని మొత్తం 18 బూత్‌లలో రీపోలింగ్ నిర్వహించాలని జిల్లా అధికారులకు ఎస్ఈసీ ఆదేశించింది. ఆ బూత్‌లకు సంబంధించిన బ్యాలెట్ పత్రాలు పూర్తిగా తడిసిపోయి లెక్కింపునకు వీలుగా లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు జెడ్పీటీసీ స్థానంలోని గొరిగనూర్ ఎంపీటీసీ పరిధిలోనున్న రెండు పోలింగ్ బూత్‌లలో మొత్తం 742 ఓట్లు పూర్తిగా తడిసిపోయాయి. అయితే, అక్కడి ఓట్లన్నీ లెక్కించగా, అత్యధిక ఓట్లు దక్కించుకున్న అభ్యర్థి, రెండో స్థానంలో ఉన్న అభ్యర్థి మధ్య 517 ఓట్ల తేడా ఉంది. దీంతో అక్కడ రెండు బూత్‌ల పరిధిలో తడిసిపోయిన 742 ఓట్లు కీలకంగా మారాయి. దీంతో ఆ ఫలితాన్ని నిలిపివేయాలని జిల్లా అధికారులను ఎస్ఈసీ ఆదేశించింది. అదే సమయంలో గొరిగనూర్ ఎంపీటీసీ ఫలితాన్ని కూడా నిలిపివేశారు. బ్యాలెట్ పత్రాలు తడిసిపోయిన రెండు బూత్‌లలో రీపోలింగ్ నిర్వహించి, ఆ ఓట్ల ఆధారంగా జమ్ములమడుగు జెడ్పీటీసీ, గొరిగనూర్ ఎంపీటీసీ స్థానం ఫలితాలను అధికారులు ప్రకటిస్తారు. అలాగే.. ► శ్రీకాకుళం జిల్లా మందస మండలం అంబుగం ఎంపీటీసీ పరిధిలోని నాలుగు పోలింగ్ బూత్‌లు, ఆమదాలవలస కాత్యాచారులపేట ఎంపీటీసీ పరిధిలోని ఒక బూత్ పరిధిలో ఎక్కువ సంఖ్యలో బ్యాలెట్ పత్రాలు తడిసిపోవడంతో ఆ రెండు ఎంపీటీసీ స్థానాల ఫలితాలను కూడా నిలిపివేసి, అక్కడ రీ పోలింగ్ నిర్వహించాలని ఎస్ఈసీ ఆదేశించింది. ► ఇదే కారణంతో విశాఖపట్నం జిల్లా గోలుగొండ మండలం పాకాలపాడు ఎంపీటీసీ స్థానం ఫలితాన్నీ నిలిపివేశారు. అక్కడ రెండు బూత్‌లో రీపోలింగ్ నిర్వహిస్తారు. ► తూర్పు గోదావరి జిల్లా మారేడుమల్లి మండలం దోరచింతలపాలెం ఎంపీటీసీ, పెద్దాపురం మండలం పులిమేరు ఎంపీటీసీ స్థానం ఫలితాలను కూడా నిలిపివేశారు. దోరచింతలపాలెంలో ఏడు, పులిమేరులో ఒక బూత్‌లలో రీ పోలింగ్‌కు ఆదేశించారు. ► వైఎస్సార్ జిల్లా ముద్దనూరు మండలం కొర్రపాడు ఎంపీటీసీ ఫలితం కూడా బ్యాలెట్ పత్రాలు తడిసిన కారణంగానే నిలిచిపోయింది. ఇక్కడ ఒక బూత్ పరిధిలో రీపోలింగ్ జరుగుతుంది. ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ల ఎన్నికలను ఈ నెల 24, 25 తేదీలలో నిర్వహించేందుకు ఇప్పటికే నోటిఫికేషన్ జారీచేసినందున ఈ 18 చోట్లా 25వ తేదీ తర్వాతే రీ పోలింగ్ నిర్వహించే అవకాశముందని ఎస్ఈసీ అధికారులు వెల్లడించారు. -
‘ఏపీ ప్రజలకు చంద్రబాబు డ్రామా అంతా తెలుసు’
సాక్షి, విజయవాడ: పరిషత్ ఎన్నికల్లో టీడీపీ చిత్తుగా ఓడిందని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చిత్తుగా ఓడిన టీడీపీ నేతలు ఎన్నికలను బహిష్కరించామని చెప్పడం దారుణమన్నారు. గతంలో జయలలిత ఎన్నికలను బహిష్కరించినప్పుడు అన్నాడీఎంకే గుర్తుపై ఎవరూ పోటీ చేయలేదన్నారు. ఏపీ ప్రజలకు చంద్రబాబు డ్రామా అంతా తెలుసునని నారాయణ స్వామి అన్నారు. చదవండి: ‘వైఎస్సార్సీపీ విజయాన్ని ఎల్లో మీడియా వక్రీకరించింది’ ఆన్లైన్ టికెట్ విధానం మేమే అడిగాం: నిర్మాత కళ్యాణ్ -
ఈ ఫలితాలు నా బాధ్యతను మరింత పెంచాయి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ప్రజలందరి చల్లని దీవెనలతో పరిషత్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించిన సందర్భంగా సీఎం వైఎస్ జగన్ సోమవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో మాట్లాడుతూ.. ఈ ఫలితాలు ప్రతి కుటుంబం, ప్రతి మనిషి పట్ల తన బాధ్యతను మరింత పెంచాయని తెలిపారు. పరిషత్ ఎన్నికల విజయాన్ని అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. అక్షరాల 13,081 పంచాయతీలకు గాను 10,536 పంచాయతీల్లో(81 శాతం) వైఎస్సార్సీపీ మద్దతుదారులను ప్రజలు ఎన్నుకున్నారని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ ఏకంగా 75కు 74 చోట్ల (99 శాతం) వైఎస్సార్ అభ్యర్థులే గెలిచారని తెలిపారు. 86 శాతం ఎంపీటీలు, 98 శాతం జడ్పీటీసీ స్థానాల్లో గెలిపిచారని సీఎం జగన్ తెలిపారు. ప్రతి ఎన్నికల్లో సడలని ఆప్యాయతను ప్రజలు అందిస్తున్నారని చెప్పారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామని తెలిపారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని కొన్ని శక్తులు ప్రయత్నించాయన్నారు. అన్యాయపు మీడియా సంస్థలు అబద్ధాన్ని నిజం చేయాలని చూశారని అన్నారు. ప్రతిపక్షం ఓటమిని కూడా అంగీకరించలేని పరిస్థితుల్లో ఉందని తెలిపారు. ప్రజలకు మంచి జరగకుండా ప్రతిపక్షం అడ్డుకుంటోందన్నారు. కోవిడ్ పేరుతో గతంలో కౌంటింగ్ కూడా వాయిదా వేయించారని మండిపడ్డారు. ప్రభుత్వానికి తోడుగా ఉన్న ప్రజలకు రుణపడి ఉంటానని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. చదవండి: MPTC, ZPTC elections results: పంచాయతీ, మునిసిపల్‌ను మించి జైత్రయాత్ర ఏపీ పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ సరికొత్త రికార్డు -
ఏపీ పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ సరికొత్త రికార్డు
సాక్షి, విజయవాడ: పరిషత్ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్సీపీ సరికొత్త రికార్డ్ సృష్టించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం నమోదు చేసింది. అన్ని జడ్పీ చైర్మన్ల స్థానాలను వైఎస్సార్సీపీ దక్కించుకుని, 100 శాతం జడ్పీ ఛైర్మన్లను దక్కించుకున్న పార్టీగా రికార్డు సాధించింది. ఆదివారం విడుదలై షరిషత్ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్సీపీ విజయ ఢంకా మోగించింది. చదవండి: MPTC, ZPTC elections results: పంచాయతీ, మునిసిపల్‌ను మించి జైత్రయాత్ర ఇప్పటివరకు 7212 ఎంపీటీసీ స్థానాలకు ఫలితాలు విడుదల కాగా.. వైఎస్సార్సీసీ 5998 స్థానాలతో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది. కాగా, టీడీపీ 826 స్థానాలకు పరిమితమైంది. అదే విధంగా 512 జడ్పీటీసీ స్థానాల్లో ఫలితాల్ని ప్రకటించగా, వైఎస్సార్సీసీ 502 స్థానాలు గెలుచుకుంది. టీడీపీ-6, జనసేన-2, సీసీఎం-1,ఇతరులు-1 జడ్పీటీసీ స్థానాలకు పరిమితమయ్యాయి. -
గెలిచింది.. కానీ ఆమె లేదు!
కర్లపాలెం(బాపట్ల): పాపం.. ఆమె మరణించి గెలిచింది. ఎన్నికలు పూర్తయిన కొద్ది రోజులకే మృతిచెందిన ఆమె.. ఆదివారం జరిగిన ఓట్ల లెక్కింపులో ఎంపీటీసీగా విజయం సాధించింది. ఆమె బతికున్నట్టయితే ఎంపీపీగా ఎన్నికై ఉండేది కూడా. గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం–1 సెగ్మెంట్ నుంచి ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేసిన ఝాన్సీలక్ష్మి ఎన్నికల అనంతరం అనారోగ్యంతో మరణించారు. వైఎస్సార్సీపీ కర్లపాలెం మండల అధ్యక్షుడు దొంతిబోయిన సీతారామిరెడ్డి సతీమణి అయిన ఆమెను కర్లపాలెం ఎంపీపీ అభ్యర్థిగా పార్టీ అధిష్టానం ప్రకటించింది కూడా. సమీప టీడీపీ అభ్యర్థి పిట్ల వేణుగోపాల్‌రెడ్డిపై 134 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఆమె గెలిచిందని తెలియగానే.. ఆమెను తలుచుకుని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఇదిలా ఉండగా ఆమె భర్త సీతారామిరెడ్డిని పార్టీ నాయకులు ఊరేగింపుగా ఇంటి వరకూ తీసుకురావడంతో కుటుంబ సభ్యులు, కార్యకర్తలు ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం ఝాన్సీలక్ష్మి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చదవండి: Jupudi Prabhakar Rao: టీడీపీకి గుండు సున్నానే.. -
Youngest MPTC: చిన్న వయసులోనే.. ‘ఎంపీటీసీ’!
ద్వారకా తిరుమల: అతి చిన్న వయసులోనే ఎంపీటీసీ సభ్యురాలిగా గెలుపొందిన ఆ యువతిని పలువురు అభినందిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం సత్తెన్నగూడేనికి చెందిన 21 ఏళ్ల మానుకొండ షహీల డిగ్రీ పూర్తి చేసింది. ఇటీవలే ఆమెకు వివాహమైంది. మండలంలోని పంగిడిగూడెం–1 ఎంపీటీసీ స్థానానికి వైఎస్సార్సీపీ తరఫున బరిలో నిలిచి.. 557 ఓట్లకు పైగా మెజారిటీతో గెలుపొందింది. ఆమెను ఎమ్మెల్యే తలారి వెంకట్రావు తదితరులు అభినందించారు. మానుకొండ షహీల -
Jupudi Prabhakar Rao: టీడీపీకి గుండు సున్నానే..
సాక్షి, అమరావతి: టీడీపీ ఎన్నికల్లో పోటీ చేసినా, చేయకపోయినా దక్కే ఫలితం గుండు సున్నానే అని ప్రభుత్వ సలహాదారు (సామాజిక న్యాయం) జూపూడి ప్రభాకరరావు ఎద్దేవా చేశారు. సీఎం వైఎస్ జగన్ గత రెండున్నరేళ్లుగా సామాజిక విప్లవ పంథాను అనుసరిస్తున్నారని తెలిపారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జూపూడి ప్రభాకరరావు ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకు ఏ రోజూ రాజకీయాధికారం దక్కని వర్గాలకు ఇప్పుడు దాన్ని అందించిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. కొన్ని కుటుంబాలకే పరిమితమైన పదవులను బడుగు, బలహీనవర్గాలకు కూడా వందల్లో, వేలల్లో అందించారని కొనియాడారు. భారత రాజ్యాంగానికి ప్రతిరూపంగా సామాజిక న్యాయం ఏపీలోనే అమలవుతోందని సామాజిక న్యాయ నిపుణులు, శాస్త్రవేత్తలు సైతం కొనియాడుతున్నారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు సీఎంకు ఇస్తున్న మద్దతు చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారన్నారు. అందుకే ప్రజల దృష్టి మళ్లించేందుకు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో గెలవలేమని తెలుసుకుని ముందుగానే కాడి పారేసి పారిపోయారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రజల నమ్మకాన్ని పోగొట్టుకున్నారన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందుకున్న బడుగు, బలహీన వర్గాలన్నీ సీఎం జగన్‌కి అండగా నిలుస్తున్నారని తెలిపారు. టీడీపీతో ఉన్న వర్గాలేవో చంద్రబాబు చెప్పగలరా అని ప్రశ్నించారు. ఎస్సీలపై చంద్రబాబు వాడిన భాషను ఎప్పటికీ ఈ వర్గాలు మరిచిపోవన్నారు. దళిత మహిళా హోం మంత్రి సుచరితపై టీడీపీ మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి మాటలను ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. అలాంటి మాటలను నియంత్రించకుండా నవ్వుతూ కూర్చున్న చంద్రబాబు, టీడీపీ నేతలను ఏమనాలి అని ప్రశ్నించారు. చదవండి: AP MPTC, ZPTC elections results: వారెవా.. వలంటీర్! -
నిమ్మకూరులో వైఎస్సార్సీపీ విజయం
నిమ్మకూరు (పామర్రు): టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ స్వగ్రామమైన నిమ్మకూరులో వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి దాసరి అశోక్‌కుమార్ జయకేతనం ఎగురవేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పాలనకు ప్రజలు ఆకర్షితులై వైఎస్సార్సీపీకి మద్దతుగా నిలిచారని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అశోక్‌కుమార్ తన ప్రత్యర్థి వీరాంజనేయులుపై తొలుత రెండు ఓట్ల తేడాతో విజయం సాధించారు. దీనికి ప్రత్యర్థి రీ కౌటింగ్ జరపాలని డిమాండ్ చేయగా రీ కౌంటింగ్‌లో అశోక్‌కుమార్‌కు మరో 6 ఓట్లు ఆధిక్యం రాగా మొత్తం 8 ఓట్లు మెజార్టీతో విజయం సాధించారు. చదవండి: ప్రజాప్రయోజనాలకే పెద్దపీట -
‘మీ అందరి చల్లని దీవెనలతోనే ఈ అఖండ విజయం’
సాక్షి, అమరావతి: ‘దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలవల్లే ఈ అఖండ విజయం సాధ్యమైంది. మీరు చూపించిన ఈ ప్రేమాభిమానాలు రాష్ట్రంలోని ప్రతీ కుటుంబం, ప్రతీ మనిషిపట్ల నా బాధ్యతను మరింత పెంచింది’.. అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. పరిషత్ ఎన్నికల ఫలితాలపై ఆదివారం సీఎం ట్వీట్ చేశారు. ‘సోమవారం ఉదయంలోపు ఎంపీటీసీ, జడ్పీటీసీల పూర్తి ఫలితాలు వస్తాయి. అప్పుడు మరోసారి మీ అందరికీ వీడియో సందేశం ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను’.. అని సీఎం అందులో పేర్కొన్నారు. దేవుడి దయ, మీ అందరి చల్లనిదీవెనల వల్లే ఈ అఖండ విజయం సాధ్యమైంది! మీరు చూపించిన ఈ ప్రేమాభిమానాలు రాష్ట్రంలోని ప్రతి కుటుంబం పట్ల, ప్రతి మనిషిపట్ల నా బాధ్యతను మరింత పెంచాయి. 1/2 — YS Jagan Mohan Reddy (@ysjagan) September 19, 2021 -
ఓటమి భయంతోనే బహిష్కరణ నాటకం
సాక్షి, అమరావతి: పరిషత్ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని ముందే ఊహించి ప్రతిపక్ష టీడీపీ ఏడాదిన్నరగా ఏదో ఒక సాకుతో ఎన్నికల ప్రక్రియకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించినట్లు స్పష్టమవుతోంది. అధికార పార్టీకి వందకు వంద శాతం అనుకూలంగా వచ్చిన ఎన్నికల ఫలితాలపై కూడా ఆత్మ వంచనకు పాల్పడుతూ తాము ఎన్నికలను బహిష్కరించడం వల్లే ఇలాంటి ఫలితాలు వచ్చాయంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుండటం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. నిజానికి ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష టీడీపీ పార్టీ గుర్తుతో తన అభ్యర్థులకు బి–ఫామ్‌లు ఇచ్చింది. ఎన్నికల్లో అభ్యర్థులనూ నిలబెట్టింది. ప్రచారం కూడా చేయించింది. చివరకు పంచాయతీ, మునిసిçపల్ ఎన్నికల ఫలితాలకు మించి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజాదరణ ఉన్నట్లు అర్థమయ్యేసరికి పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ఉత్తుత్తి ప్రకటన చేసింది. అయితే విపక్షం ఎన్నికల్లో ప్రచారమూ చేసింది, డబ్బులూ పంచింది. కానీ ఎన్ని చేసినా ఫలితం లేదని బోధపడటంతో అసలు పరిషత్ ఎన్నికల పోటీ నుంచి తాము తప్పుకున్నట్లు ఇప్పుడు మరో నాటకాన్ని రక్తి కట్టిస్తోంది. ఏడాది పాటు దాటవేత టీడీపీ అధికారంలో ఉన్న సమయంలోనే సర్పంచుల పదవీ కాలం ముగిసినా ఓటమి భయంతో దాదాపు ఏడాది పాటు పంచాయతీ ఎన్నికలు నిర్వహించకుండా దాటవేస్తూ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆ ఫలితాలను చూసి బెంబేలెత్తి స్థానిక సంస్థల ఎన్నికలు జరగకుండా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో సహా ఆ పార్టీ నేతలంతా అడుగడుగునా అడ్డుపడిన విషయం తెలిసిందే. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కాగానే గ్రామ స్వరాజ్యానికి ప్రాధాన్యమిస్తూ ఆరేడు నెలలకే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై దృష్టి సారించగా, ఈ ప్రక్రియ మొదలు కాకముందే టీడీపీ నేతలు రిజర్వేషన్లపై కోర్టులో కేసులు దాఖలు చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉపాధి హామీ పథకం స్టేట్ కౌన్సిల్ సభ్యుడిగా నామినేటెడ్ పదవి పొందిన బిర్రు ప్రతాప్‌రెడ్డి రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతానికి పైబడి రిజర్వేషన్లు అమలు చేయడంపై కోర్టును ఆశ్రయించారు. ఓటమి భయంతో టీడీపీ నేత దాఖలు చేసిన కేసు కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్లను హైకోర్టు 50 శాతానికి పరిమితం చేసింది. ఎట్టకేలకు బరిలోకి.. ఎట్టకేలకు 2020 మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాగా టీడీపీ తరఫున పోటీకి అభ్యర్థులు మొహం చాటేశారు. రాష్ట్రంలో 660 జెడ్పీటీసీ స్థానాలుండగా 652 స్థానాలకు అప్పటి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. టీడీపీ 482 స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది. జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీకి 170 చోట్ల విపక్షాలకు అభ్యర్థులే లేకపోవడం గమనార్హం. ఇందులో 126 జెడ్పీటీసీ స్థానాలు వైఎస్సార్సీపీకి ఏకగ్రీవం కాగా ఎన్నికలు జరిగిన 44 చోట్ల టీడీపీ సహా ఇతర విపక్ష అభ్యర్థులు పోటీ చేయలేదు. ఎంపీటీసీ ఎన్నికల్లోనూ ప్రతిపక్షానికి 3,032 చోట్ల అభ్యర్థులే కరువయ్యారు. వారంలో పోలింగ్ ఉందనగా.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత మరో వారం రోజుల్లో పోలింగ్ నిర్వహించనున్న సమయంలో నాటి ఎస్ఈసీ నిమ్మగడ్డ కరోనా పేరుతో ప్రభుత్వానికి కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా ఆ ఎన్నికలను అర్థంతరంగా వాయిదా వేశారు. చంద్రబాబు ప్రోద్బలంతో టీడీపీ ప్రయోజనాల కోసమే నిమ్మగడ్డ ఎన్నికలను హఠాత్తుగా వాయిదా వేశారని వెల్లడవుతోంది. ఆ సమయంలో నిమ్మగడ్డ కేంద్రానికి ఓ లేఖ రాయడం, అది టీడీపీ రాష్ట్ర కార్యాలయంలోనే తయారైందన్న విమర్శలు వచ్చాయి. అవకాశం ఉన్నా నిర్వహించకుండా.. అర్థంతరంగా వాయిదా వేసిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను పక్కన పెట్టేసిన నిమ్మగడ్డ రమేష్ ఈ ఏడాది జనవరి–ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించారు. ఎన్నికల కోడ్ పేరుతో అధికార యంత్రాంగాన్ని బెదిరిస్తూ తన గుప్పిట్లో పెట్టుకునేందుకు యత్నించారు. మంత్రులు, ఐఏఎస్ అధికారులపై ఏకపక్షంగా చర్యలకు సిఫార్సులు చేశారు. అయినా 80 శాతం స్థానాల్లో వైఎస్సార్సీపీ సానుభూతిపరులే గెలిచారు. నిమ్మగడ్డ రమేష్ పదవిలో ఉన్నంతకాలం అవకాశం ఉన్నా పరిషత్ ఎన్నికలను నిర్వహించలేదన్న విమర్శలున్నాయి. న్యాయ వివాదాలతో లెక్కింపు జాప్యం.. నిమ్మగడ్డ తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్ని వాయిదా పడిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు ఏప్రిల్ 1వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసి 8న పోలింగ్ జరపాలని నిర్ణయించగా టీడీపీ నేత వర్ల రామయ్య హైకోర్టులో కేసు వేశారు. ఆయనతోపాటు ఇతర పార్టీల నేతలు వేసిన కేసులు కారణంగా పోలింగ్ జరిగిన తర్వాత కూడా ఓట్ల లెక్కింపు దాదాపు ఐదున్నర నెలలు ఆలస్యమైంది. ఓటమి భయంతో ఒక పక్క కేసులు వేసి అడ్డుకుంటూ మరోపక్క పార్టీ అభ్యర్థులకు టీడీపీ బీ ఫామ్‌లిచ్చి పోటీలో నిలిపింది. పరిషత్ ఎన్నికలను తమ పార్టీ బహిష్కరించినట్లు బుకాయిస్తూ మరోవైపు పార్టీ తరఫున బరిలో దిగిన అభ్యర్థులతో యథావిధిగా ప్రచారాన్ని నిర్వహించింది. సైకిల్ గుర్తుతో పోటీ చేసిన అభ్యర్థులు గెలిచేందుకు సర్వశక్తులూ ఒడ్డారు. టీడీపీ నిజంగానే ఎన్నికల్ని బహిష్కరిస్తే ఆ పార్టీ సంప్రదాయ ఓటర్లు ఎన్నికలకు దూరమై పోలింగ్ శాతం తగ్గిపోయి ఉండాలి కదా? అని ప్రశ్నిస్తున్నారు. ప్రజలు ఆ పార్టీని మరోసారి ఘోరంగా తిరస్కరించినట్లు ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. -
ఇక్కడ ప్రతిపక్షాలకు ఒక్క ఓటు కూడా రాలేదు
చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లె ఎంపీటీసీ స్థానంలో 1347 ఓట్ల మెజార్టీతో వైఎస్సార్సీపీ అభ్యర్థి రాజయ్య గెలుపొందారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి దత్తత తీసుకున్న నిమ్మకూరులో సైతం వైఎస్సార్సీపీ అభ్యర్థులే జయకేతనం ఎగురవేశారు. ఈ ఫలితాల తరహాలో మరో ఎంపీటీసీ ఫలితం సైతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వైఎస్సార్ కడప జిల్లా కమలాపూర్ మండలం దేవరాజుపల్లి ఎంపీటీసీని వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. ఇక్కడ మొత్తం 191 ఓట్లు ఉండగా వైఎస్సార్ సీపీ అభ్యర్థికి ఏకంగా 186 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థికి 5 ఓట్లు వచ్చాయి. ఇక ప్రధాన ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న టీడీపీ, బీజేపీలకు కనీసం ఒక్క ఓటు కూడా రాకపోవడం విశేషంగా మారింది. కనీసం స్వతంత్ర అభ్యర్థికి కూడా దాటలేకపోయారంటూ సోషల్ మీడియాలో ఛలోక్తులు విసురుతున్నారు కొందరు నెటిజన్లు. -
ట్రెండింగ్‌గా మారిన అశ్విని.. మరోసారి 23 సెంటిమెంట్
స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత ఒక్కసారిగా అశ్వినీ పేరు మార్మోగిపోతోంది. కుప్పం మండలం టీ సద్దుమూరు ఎంపీటీసీ స్థానం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన అశ్వినీ ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. 1989 నుంచి ఇక్కడ టీడీపీ పార్టీనే వరుసగా గెలుస్తూ వస్తోంది. అలాంటి స్థానంలో టీడీపీ అభ్యర్థిపై వైఎస్సార్సీపీ అభ్యర్థి అశ్విని 1073 ఓట్ల మెజారిటీతో విజయం సాధించడంతో ఆమె గురించి తెలుసుకోవాలనే ఆసక్తి జనాల్లో పెరిగింది. మరోసారి తెరపైకి 23 వైఎస్సార్సీపీ, టీడీపీల మధ్య నెలకొన్న పొలిటికల్ వార్‌లో 23 నంబర్‌కి ప్రత్యేకత ఉంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి వైఎస్సార్సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంది. ఆ తర్వాత 2019లో జరిగిన సాధారణ ఎన్నికల ఫలితాలు మే 23న వెల్లడయ్యాయి. అందులో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధిస్తే, టీడీపీ కేవలం 23 స్థానాలకే పరిమితం అయ్యింది. తాజాగా కుప్పంలో టీ సద్దుమూరు స్థానం నుంచి విజయం సాధించి వెలుగులోకి వచ్చిన అశ్విని వయస్సు కూడా 23 ఏళ్లే కావడం గమనార్హం. దిష్టి గట్టిగా తీయండమ్మా !! ఆ పాపిష్టి కళ్ళు అన్ని ఈ అమ్మాయి మీదే ఉన్నాయి ! pic.twitter.com/Ka7lCYwlh5 — Ram (@iamSidde) September 19, 2021 -
‘‘చంద్రగిరిలో చంద్రబాబు శంకరగిరి మాన్యాలు పట్టారు’’
సాక్షి, తాడేపల్లి: ‘‘ఆంధ్రప్రదేశ్ పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ దూసుకుపోతుంది. ఇంత చక్కని ఫలితాలు అందించిన ప్రజలకు కృతజ్ఞతలు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జనరంజక పాలన చేస్తున్నారు కాబట్టే ఇంత మంచి ఫలితాలు వస్తున్నాయి’’ అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘స్థానిక సంస్థలకు చాలా ప్రాముఖ్యత ఉంది. మహాత్మా గాంధీ చెప్పినట్లు స్థానికంగా పరిపాలన జరగాలి. ఈ ఎన్నికలు సరైన సమయంలో జరగాలని రాజ్యాంగంలో పొందుపరిచారు. కానీ గత ప్రభుత్వంలోనే గడువు ముగిసింది. రాజ్యాంగపరంగా ఎన్నికలు జరపాలి. చంద్రబాబు గెలవలేమని ఎన్నికలు పెట్టకుండా పారిపోయాడు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికలు పెట్టాలని కృషి చేశారు. అప్పుడు ప్రారంభించిన ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతోంది’’ అన్నారు. ‘‘ఈ లోపు చంద్రబాబు, ఆయనతో కలిసి కొన్ని దుష్ట శక్తులు ఎన్నో కుట్రలు చేశారు. అర్ధాంతరంగా వాయిదా వేయడం నుంచి ఎన్నికలు జరిగినా ఫలితాలను ప్రకటించకుండా చేశారు. అన్ని అవరోధాలు దాటుకుని ఈ రోజు ఫలితాలు వస్తున్నాయి. దీంతో మేము బహిష్కరించాం అని మాట్లాడుతున్నారు. పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో నువ్వు, నీ కొడుకు కాలికి బలపం కట్టుకుని తిరిగారు.. ఫలితాలు ఏమైనా మారాయా. కుప్పం కూడా కుప్పకూలి పోయింది... చంద్రగిరి శంకరగిరి మాన్యాలు పట్టింది. ఇక టీడీపీ మూసేయడానికి సిద్ధంగా ఉంది...తెలుసుకోలేకపోతే నీ ఖర్మ’’ అన్నారు అంబటి. ‘‘ఈ ఫలితాలు జగన్మోహన్రెడ్డి జనరంజక పాలన చేస్తున్నాడు కాబట్టే వస్తున్నాయి. ఇలాంటి చక్కని ఫలితాలను ఇస్తున్న ప్రజలకు కృతజ్ఞతలు. ఏ ఎన్నికలైనా ఒకే ఫలితాలను ఇస్తున్నారు కుట్రలు కుతంత్రాలు తప్ప ప్రజల మధ్యకు వెళ్లి గెలవాలని చంద్రబాబుకి లేదు. ఆయన అధికారంలోకి వచ్చిందే కుట్రల వల్ల మమ్మల్ని 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పరిపాలించమని ప్రజలు అధికారం ఇచ్చారు. ఇప్పుడు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. కావాలంటే టీడీపీ మొత్తం రాజీనామా చేయండి... మీ నియోజకవర్గాల్లో పోటీ చేసి తేల్చుకుందాం’’ అంటూ అంబటి సవాలు విసిరారు. చదవండి: పూర్తి ప్రజామోదంతో మెరుగైన పరిపాలన చేస్తాం: మంత్రి కురసాల -
‘ఇవి సీఎం జగన్‌కు ప్రజలు వెన్నుదన్నుగా నిలిచిన ఎన్నికలు’
సాక్షి, తాడేపల్లి: ఏపీలో పరిషత్ ఎన్నికలు చూస్తుంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయాల పరంపరం కొనసాగుతోందని వ్యవసాయశాఖ మంత్రి కురుసాల కన్నబాబు తెలిపారు. గత స్థానిక ఎన్నికలు చూసినా, ఇప్పుటి ఫలితాలు చూసినా అదే ట్రెండ్ కొనసాగుతోందన్నారు. ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి మాట్లాడుతూ.. గతంలో 80 శాతం వస్తే ఇప్పుడు అంతకు మించి రానున్నాయన్నారు. ఒక నాయకుడి నిబద్ధతకు ఇంతకంటే నిదర్శనం ఏముంటుందని పేర్కొన్నారు. అచ్చెన్నాయుడు ఏ ముహూర్తాన ఆ మాట అన్నాడో గానీ ఆ మాటలు అక్షర సత్యం అవుతున్నాయని తెలిపారు. చదవండి: ఎంపీటీసీ, జడ్పీటీసీ కౌంటింగ్: జిల్లాల వారీగా ఫలితాలు అయితే ఈ రోజు తాము బహిష్కరించాం కాబట్టే వైఎస్సార్సీపీ గెలిచిందని టీడీపీ నాయకులు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కానీ అప్పుడు టీడీపీ అన్ని ఎన్నికల్లో పాల్గొన్నారని, బీఫామ్ ఇచ్చారని, ప్రచారాలు చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు బహిష్కరణ అంటే ప్రజలు నమ్మరని అన్నారు. మున్సిపాలిటీల్లో ఒక్క తాడిపత్రి తప్ప అన్ని చోట్లా వైఎస్సార్సీపీ గెలిచిందని చెప్పారు. టీడీపీ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా ప్రజలు సీఎం జగన్ వెనుక ఉన్నారన్నారు. మీ వెనుక మేమున్నాం.. ముందుకెళ్లండి అంటూ సీఎంకు భరోసా ఇచ్చారని తెలిపారు. ఆ రోజు మూడు కరోనా కేసులు మాత్రమే ఉంటే ప్రభుత్వానికి కూడా సమాచారం లేకుండా నిలిపేశారని, ఎన్నికలు జరపొద్దని అడ్డుపడి, ఆ తర్వాత ఫలితాలను ఆపేశారన్నారు. ఇప్పుడు వీళ్లు ఎన్ని చేసినా ప్రజలు సీఎం జగన్ వెనకున్నామని స్పష్టం చేశారని పేర్కొన్నారు. చదవండి: ఎంపీటీసీ, జడ్పీటీసీ కౌంటింగ్: జిల్లాల వారీగా ఫలితాలు ‘ఇవి గాలివాటం ఎన్నికలు కాదు.. ఒక ముఖ్యమంత్రికి ప్రజలు వెన్నుదన్నుగా నిలిచిన ఎన్నికలు. ఏ రోజు స్థానిక ఎన్నికల్లో టీడీపీ ప్రజామోదాన్ని పొందినది లేదు. ఇప్పటికీ వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవడం లేదు. మొట్టమొదటి సారిగా రాష్ట్రంలో సామాజిక న్యాయానికి అర్థం చెప్పింది వైఎస్ జగన్. ఓటమికి కారణాలు వెతుక్కోవద్దు. కొత్త బాష్యాలు చెప్పొద్దు. పూర్తి ప్రజామోదంతో మెరుగైన పరిపాలన చేస్తాం. ఇప్పటికైనా ఒక నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించాలి. మీరు అమితంగా ప్రేమిస్తున్న అమరావతిలోనే మీకు మద్దతు లభించలేదు. ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు ఒకే రకమైన ఫలితాలు వస్తున్నాయి. 13కి 13 జిల్లా పరిషత్‌లను కైవసం చేసుకుంటాం. ఓడిపోయిన ప్రతిసారీ ఎన్నికలకు వెళదాం రండి అంటున్నారు. ఇవన్నీ ఎన్నికలు కాదా...? సిగ్గులేదా.. ఓటమిని ఒప్పుకోండి. మేము లేస్తే మా అంత వస్తాదులు లేరని తొడగొట్టడం మానండి.’ అని మంత్రి కురసాల హితవు పలికారు. -
నారావారిపల్లెలో చంద్రబాబుకు షాక్
సాక్షి, చిత్తూరు జిల్లా: పరిషత్ ఎన్నికల్లో నారావారిపల్లెలో చంద్రబాబుకు షాక్ తగిలింది. నారావారిపల్లి ఎంపీటీసీ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి గంగాధరం పరాజయం పొందారు. 1,347 ఓట్ల మెజార్టీతో వైఎస్సార్సీపీ అభ్యర్థి రాజయ్య గెలుపొందారు. టీడీపీకి అభ్యర్థికి కేవలం 307 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. చిత్తూరు జిల్లా కుప్పం మండలం టీ సడుమూరు ఎంపీటీసీ స్థానాన్ని వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. టీడీపీ అభ్యర్థిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అశ్విని(23).. 1073 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. చంద్రబాబుకు కుప్పం ప్రజలు షాకిచ్చారు.ఆయన నియోజకవర్గం కుప్పంలో టీడీపీ తుడిచిపెట్టుకుపోయింది. చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెలోనూ టీడీపీ దారుణ ఓటమి చెందింది. నాలుగు మండల్లాలోనూ వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది. కుప్పం మండలంలో 19 ఎంపీటీసీలకు వైఎస్సార్సీపీ-17, టీడీపీ -2 సాధించాయి. గుడిపల్లె మండలంలో 12కి గాను 12 ఎంపీటీసీలు వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. రామకుప్పం మండలంలో 16కి గాను 16 ఎంపీటీసీలు వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. శాంతిపురం మండలంలో 18కిగాను 15 ఎంపీటీసీలు వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. చదవండి: మాచర్ల నియెజకవర్గంలో వైఎస్సార్సీపీ క్లీన్‌స్వీప్.. ‘ప్రజలు సీఎం జగన్‌ను గుండెల్లో పెట్టుకున్నారు’ -
ఫ్యాన్..తుఫాన్
ఫ్యాన్ తుఫాన్ వేగంతో తిరిగింది. ఆ ధాటికి సైకిల్ తునాతునకలైంది. ప్రభుత్వంపై జనం కురిపించిన అభిమానం.. ప్రతిపక్షంలోని ఉద్ధండ నాయకులను సైతం మట్టి కరిపించింది. మైకుల ముందు, సోషల్ మీడియా వేదికల్లో రెచ్చిపోయే టీడీపీ నాయకుల అసలు బలమెంతో ఈ ఎన్నికలతో తేలిపోయింది. పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఆల్‌టైమ్ రికార్డు సాధించింది. అపురూపమైన పథకాలతో అద్భుత పాలన అందిస్తున్న వైఎస్ జగన్ సర్కారుపై సిక్కోలు జనం ఓట్ల రూపంలో ప్రేమను కురిపించారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : గెలుపంటే ఇదీ.. అనే రీతిలో వైఎస్సార్సీపీ ప్రాదేశికాలను చేజిక్కించుకుంది. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో విజయబావుటా ఎగురవేసింది. వైఎస్సార్ సీపీ ప్రభంజనం ముందు టీడీపీ ఏమాత్రం నిలవలేకపోయింది. పంచాయతీ, పురపాలక ఎన్నికల కంటే ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. జిల్లా చరిత్రలో ఎన్నడూ లేనంతగా అత్యధిక ఎంపీటీసీ స్థానాలను వైఎస్సార్ సీపీ గెలవడంతో పాటు ఎన్నికలు జరిగిన 37 జెడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకుంది. ఎంపీపీ స్థానా లు కూడా వైఎస్సార్ సీపీ వశమవుతున్నాయి. దీంతో జిల్లా రాజకీయ ముఖ చిత్రంలో కొత్త అధ్యా యం లిఖించినట్టైంది. తిరుగులేని విజయం.. దశాబ్దాలుగా సిక్కోలు టీడీపీకి కంచుకోటగా ఉంది. అలాంటి జిల్లాలో 37 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగితే అన్నింటినీ వైఎస్సార్ సీపీ గెలుచుకుని రికార్డు సృష్టించింది. అలాగే 667 ఎంపీటీసీ స్థానాలకు గాను ఏకగ్రీవాలతో కలుపుకుని 559 స్థానాలను వైఎస్సార్సీపీ గెలుచుకుంది. రెండు స్థానాల్లో స్వతంత్రులు ఏకగ్రీవమయ్యారు. టీడీపీ 81 స్థానా లకే పరిమితమైంది. ఇతరులు 12 స్థానాలను కైవసం చేసుకున్నారు. ఇందులో జనసేన, బీజేపీలు ఒక్కో స్థానానికి మాత్రమే పరిమితమయ్యాయి. 11 స్థానాల్లో ఎన్నికలు జరగలేదు. మిగిలిన రెండు స్థా నాల్లో రీపోలింగ్ జరగనుంది. మొత్తానికి 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 10 అసెంబ్లీలకు గాను ఎనిమిది దక్కించుకున్న వైఎస్సార్సీపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మరింత పుంజుకుంది. పార్టీ రహితంగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా 81.61శాతం సర్పంచ్ స్థానాలను గెలుచుకున్న వైఎ స్సార్సీపీ, పార్టీ గుర్తుపై జరిగిన మున్సిపల్ ఎన్నికలో 74.32శాతం స్థానాలను కైవసం చేసుకుంది. తాజాగా పరిషత్ ఎన్నికల్లో 84.40 శాతం స్థానాలను ఎగరేసుకుపోయింది. జెడ్పీటీసీ స్థానాల్లోనైతే 100 శాతం విజయాలను సాధించింది. ఆల్‌టైమ్ రికార్డు సిక్కోలు రాజకీయ చరిత్రను వైఎస్సార్సీపీ తిరగరాసింది. జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల విషయంలో స్వీప్ చేసి సరికొత్త రికార్డును సృష్టించింది. ఇన్ డైరెక్ట్ ఎన్నికలు జరిగాక పూర్తి స్థాయిలో విజయం సాధించిన పార్టీ గతంలో ఏ ఒక్కటీ లేదు. ఒక్క వైఎస్సార్సీపీకే ఆ ఘనత దక్కింది. 1995లో తొలిసారి ఇన్ డైరెక్ట్ ఎన్నికలు జరగ్గా 38 జెడ్పీటీసీ స్థానాలకు టీడీ పీ 34, కాంగ్రెస్ నాలుగు దక్కించుకున్నాయి. 2001 లో టీడీపీ 31, కాంగ్రెస్ ఏడు స్థానాలను కైవసం చేసుకున్నాయి. 2006లో కాంగ్రెస్‌కు 32, టీడీపీకి 6 దక్కాయి. 2014లో టీడీపీకి 22రాగా, వైఎస్సార్సీపీకి 16 వచ్చాయి. కానీ ఈ సారి ఎన్నికలు జరిగిన 37 స్థానాలను వైఎస్సార్సీపీ స్వీప్ చేసింది. అంతేకాదు 38 మండల పరిషత్‌లను దక్కించుకుంది. బోణీ కొట్టని టీడీపీ ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి ఎనిమిది మండలాల్లో టీడీపీ బోణీ కొట్టలేకపోయింది. నరసన్నపేట, అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి, నందిగాం, పలాస, భామిని, సీతంపేట, మందస, పాతపట్నంలో ఒక్క ఎంపీటీసీ స్థానాన్ని కూ డా టీడీపీ గెలుచుకోలేకపోయింది. ఇక జి.సిగడాం, కవిటి, జలుమూరు, సారవకోట మండలాల్లో ఒక్కో ఎంపీటీసీ స్థానానికే పరిమితమైంది. విశేషమేమిటంటే ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ సొంత ఎంపీటీసీ స్థానమైన కవిటి–2లో వైఎస్సార్సీపీ విజయం సాధించింది. మరో 14 మండలాల్లో టీడీపీ రెండేసి స్థానాలను మాత్రమే దక్కించుకుంది. భారీ మెజారిటీలు.. ఎమ్మెల్యేల కంటే కొందరు ప్రాదేశిక అభ్యర్థులకు ఎ క్కువ మెజారిటీ రావడం విశేషం. రేగిడి జెడ్పీటీసీగా 22,798ఓట్ల మెజార్టీతో వైఎస్సార్సీపీకి చెందిన పాలవలస ఇందుమతి, టెక్కలి జెడ్పీటీసీ స్థా నం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థి దువ్వాడ వాణి అత్యధికంగా 22,732 ఓట్ల మెజార్టీతో, నందిగాంలో వైఎ స్సార్సీపీ అభ్యర్థి పేరాడ భార్గవి 20 వేల ఓట్ల ఆధిక్యతతో, పాతపట్నం జెడ్పీటీసీ స్థానం నుంచి వైఎస్సార్సీపీకి చెందిన మామిడి మహాలక్ష్మి 16,328 ఓట్ల తేడాతో గెలిచారు. వైఎస్సార్సీపీ నుంచి విజ యం సాధించిన వారిలో అత్యధిక మంది 10వేలకు పైగా మెజార్టీతో గెలిచినవారే. పిరియా విజయ, ధర్మాన కృష్ణచైతన్య తదితరులు కూడా మంచి ఆధిక్యతను కనబరిచారు. ప్రజల గుండెల్లో వైఎస్ జగన్ రాష్ట్రంలో ప్రజాతీర్పు ముందు ప్రతిపక్షాల కుట్రలు తేలిపోయా యి. ఈ ఎన్నికల ఫలితాలతో ప్రజల గుండెల్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థానం ఏమిటో మరోసారి రుజువైంది. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ హవా స్పష్టంగా కనిపించింది. పోటీ చేస్తే ఘోరమైన ఫలితాలు వస్తాయని ముందే ఊహించి టీడీపీ పారిపోయింది. చాలా చోట్ల టీడీపీ నాయకుల పిలుపును కింది స్థాయి కార్యకర్తలు పట్టించుకోలేదు. పోటీ చేసి బోర్లా పడ్డారు. ప్రజలంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గుండెల్లో పెట్టుకున్నారు. – ధర్మాన కృష్ణదాస్, డిప్యూటీ సీఎం జగన్ పాలనకు నిదర్శనం రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న పాలనకు నిదర్శనమే పరిషత్ ఎన్నికల్లో జనం ఇచ్చిన తీర్పు . మంచి పాలనకు జనం మంచి తీర్పు ఇచ్చా రు. ప్రజాస్వామ్యంలో ప్రజలే శక్తివంతులు. ఈ ఫలితాలతో ప్రతిపక్షం విమర్శలు పస లేనివిగా తేలిపోయాయి. న్యాయవ్యవస్థ సరైన సమయంలో తీర్పునిచ్చి ప్రజలకు న్యాయం చేసింది. ఆమదాలవలస నియోజకవర్గంలో నాలుగు మండలాలు, జెడ్పీటీసీ స్థానాన్ని సైతం వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. – తమ్మినేని సీతారాం, స్పీకర్ అభాసుపాలైన టీడీపీ.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చే యడం లేదంటూ తో క ముడిచినట్లు నటించిన తెలుగుదేశం పా ర్టీ పోటీ చేసి ఓడిపోయి అభాసుపాలైంది. రెండేళ్ల పాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి లభించడం మన అదృష్టం. – డాక్టర్ సీదిరి అప్పలరాజు, రాష్ట్ర పశుసంవర్థక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖ మంత్రి -
Vizianagaram: విజయనగరంలో వైఎస్సార్సీపీ విజయబావుటా
సాక్షి, విజయనగరం: జిల్లాలో ఫ్యాన్‌గాలి బలంగా వీచింది. ప్రభంజనం సృష్టించింది. ప్రజాసంక్షేమ పాలనకు ఓటర్లు పట్టం కట్టారు. స్పష్టమైన ఆధిక్యాన్ని ఇచ్చారు. టీడీపీని మరోసారి గట్టిగా తిరస్కరించారు. ఓటరు తీర్పుతో స్థానిక సంస్థల చరిత్రలో తిరుగులేని ఆధిక్యం సాధించి ఫ్యాన్ సరికొత్త రికార్డును నెలకొల్పింది. గత సాధారణ ఎన్నికల్లోనూ, మున్సిపోల్స్‌లోనూ చావుదెబ్బ తిన్న టీడీపీ ఇప్పుడు పరిషత్ ఎన్నికల్లోనూ చతికిలపడింది. సీఎం జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వంపై టీడీపీ సహా విపక్ష పార్టీలు ఎన్ని నిరాధార ఆరోపణలు చేసినా ప్రజాతీర్పు స్పష్టంగా ఉంది. జిల్లా పరిషత్ చరిత్రలో గతంలో ఎన్నడూ చూడని అద్భుతం నెలకొంది. మొత్తం 34 జెడ్పీటీసీ స్థానాలనూ వైఎస్సార్సీపీ దక్కించుకుంది. ప్రతిపక్షాలకు ఒక్క సీటు కూడా దక్కలేదు. ఇక 33 మండల అధ్యక్ష పదవులను వైఎస్సార్సీపీ అభ్యర్థులు అధిరోహించనున్నారు. ఒక్క రామభద్రపురంలో మినహా టీడీపీ ఎక్కడా పోటీ ఇవ్వలేకపోయింది. ఏడు మండలాల్లో ఒక్క స్థానం కూడా దక్కలేదు. కేవలం 86 ఎంపీటీసీ స్థానాలకే పరిమితమైంది. ఏకగ్రీవాల సహా 444 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్సీపీ జెండా రెపరెపలాడింది. బీజేపీకి మాత్రం ఒకే ఒక్క ఎంపీటీసీ స్థానం దక్కింది. మిగతా విపక్ష పార్టీల జాడ కూడా కనిపించలేదు. 11 ఎంపీటీసీ స్థానాలు స్వతంత్ర అభ్యర్థులకు దక్కాయి. విజయనగరంలో వైఎస్సార్ సీపీ హవా... టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి కంచుకోటగా ఉన్న విజయనగరం జిల్లా ఇప్పుడు వైఎస్సార్సీపీ ఖిల్లాగా మారింది. గత సాధారణ ఎన్నికలలో విజయనగరం ఎంపీ సహా జిల్లాలోని తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లోనూ ఫ్యాన్ హోరెత్తిన సంగతి తెలిసిందే. తర్వాత జరిగిన విజయనగరం కార్పొరేషన్, మూడు మున్సిపాలిటీలు, ఒక నగర పంచాయతీ ఎన్నికలలోనూ వైఎస్సార్సీపీ విజయకేతనం ఎగురవేసింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీ మద్దతుదారులే విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇక జిల్లా పరిషత్, మండల పరిషత్లలోనూ తిరుగులేని విజయం సాధించారు. పరిషత్ ఎన్నికలకు ఏప్రిల్ నెలలో నోటిఫికేషన్ వచ్చింది. పోలింగ్‌కు ముందే మూడు జెడ్పీటీసీ స్థానాలు, 55 ఎంపీటీసీ స్థానాలను వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా దక్కించుకున్నారు. మెరకముడిదాం నుంచి వైఎస్సార్సీపీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్నశ్రీను) జెడ్పీటీసీగా ఏకగ్రీవమైన సంగతి తెలిసిందే. ఇక హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ఆదివారం జిల్లాలో పరిషత్తు ఓట్ల లెక్కింపు జరిగింది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లతో ప్రారంభించిన అధికారులు మధ్యాహ్నం 2 గంటలకల్లా ఎంపీటీసీ ఓట్ల కౌంటింగ్ పూర్తి చేశారు. సాయంత్రం ఏడు గంటలకల్లా జెడ్పీటీసీ ఫలితాల వెల్లడి ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. ఎక్కడా ఎలాంటి అల్లర్లు లేకుండా కౌంటింగ్ ప్రశాంతంగా ముగించడంలో జిల్లా కలెక్టరు ఎ.సూర్యకుమారి, ఎస్పీ ఎం.దీపిక సఫలమయ్యారు. జాయింట్ కలెక్టర్లు జీసీ కిశోర్‌కుమార్, మహేశ్‌కుమార్, వెంకటరావు, అశోక్, సబ్‌కలెక్టరు భావన, ఐటీడీఏ పీఓ కూర్మనాథ్‌తో ప్రత్యేకాధికారులు ప్రత్యేకంగా కృషి చేశారు. జిల్లా పరిషత్‌లో వైఎస్సార్సీపీ పాగా... వైఎస్సార్సీపీ తొలిసారిగా జిల్లా పరిషత్ పీఠాన్ని దక్కించుకుంది. అంతేకాదు జిల్లా పరిషత్ చరిత్రలో క్లీన్‌స్వీప్ చేసిన ఏకైక పార్టీ కూడా ఇదే కావడం విశేషం. మొత్తం 34 స్థానాల్లో మూడు స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకుంది. మిగిలిన 31 జెడ్పీటీసీ సీట్లను కూడా ప్రత్యక్ష పోరులో సొంతం చేసుకుంది. గెలుపొందినవారిలో డీసీసీబీ చైర్మన్ నెక్కల నాయుడుబాబు భార్య శ్రీదేవి కూడా ఉన్నారు. కొత్తవలస జెడ్పీటీసీగా ఆమె విజయం సాధించారు. మండలాల్లో తిరుగులేని ఆధిక్యం.... జిల్లాలోని 34 మండల పరిషత్‌లలో రామభద్రపురం మినహా మిగతా చోట్లా వైఎస్సార్సీపీ తిరుగులేని ఆధిక్యం చూపించింది. బాడంగి మండల పరిషత్‌లో మాత్రమే వైఎస్సార్సీపీ, టీడీపీలకు సమానంగా సీట్లు వచ్చాయి. గజపతినగరం, దత్తిరాజేరు, మెరకముడిదాం, గుర్ల, గరివిడి, సీతానగరం, కురుపాం మండలాల్లో టీడీపీకి ఒక్క ఎంపీటీసీ సీటు కూడా దక్కలేదు. ఎస్.కోట, ఎల్.కోట, బొండపల్లి, గంట్యాడ, బలిజిపేట, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలసలో కేవలం ఒక్కొక్క ఎంపీటీసీ సీటుకే పరిమితమైంది. అంతేకాదు ఏ ఒక్క మండలంలోనూ టీడీపీ డబుల్ డిజిట్ స్థానాలను సాధించలేకపోయింది. బీజేపీ జియ్యమ్మవలస మండలంలో ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది. 11 చోట్ల స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. రామభద్రపురం మండలంలోనే ముగ్గురు ఉన్నారు. అక్కడ మాత్రమే ఎంపీపీని నిర్ణయించడంలో కీలకం కానున్నారు. -
అనంతపురంలో వైఎస్సార్సీపీ ప్రభంజనం
ప్రాదేశిక ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించింది. ఎన్నిక ఏదైనా ‘రిజల్ట్ రిపీట్’ అంటూ మరోసారి నిరూపించింది. సార్వత్రిక, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో మాదిరే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ ‘ఫ్యాన్’ గాలి హోరెత్తింది. ఈ ధాటికి ‘సైకిల్’ తుక్కుతుక్కు అయ్యింది. సాక్షి ప్రతినిధి, అనంతపురం ‘ప్రాదేశిక’ పోరులో వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయదుందుభి మోగించారు. సమీప ప్రత్యర్థులపై భారీ మెజార్టీలతో గెలుపొందారు. ఏకంగా 60 జెడ్పీటీసీ, 762 ఎంపీటీసీ స్థానాలను తమ ఖాతాలో వేసుకున్నారు. ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం జిల్లాలోని 17 కేంద్రాల్లో చేపట్టారు. రాత్రి ఏడున్నర గంటలకల్లా పూర్తిస్థాయిలో ఫలితాలు వెలువడ్డాయి. ఓటరు తీర్పు ఏకపక్షమేనని తేలిపోయింది. జిల్లాలో 63 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా.. పోలింగ్‌కు ముందే వైఎస్సార్సీపీ అభ్యర్థి చనిపోవడంతో చిలమత్తూరు స్థానానికి ఎన్నిక నిర్వహించలేదు. మిగిలిన 62 స్థానాలకు కౌంటింగ్ జరిగింది. ఇందులో 60 స్థానాలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. అగళి స్థానాన్ని టీడీపీ దక్కించుకోగా.. రొళ్లలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. అలాగే మొత్తం 841 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. ఇందులో 50 ఏకగ్రీవమయ్యాయి. వైఎస్సార్సీపీ 49, టీడీపీ 1 స్థానాన్ని ఏకగ్రీవంగా దక్కించుకున్నాయి. పది చోట్ల అభ్యర్థులు చనిపోవడంతో ఎన్నిక నిర్వహించలేదు. మిగిలిన 781 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరగ్గా..ఆదివారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. వైఎస్సార్సీపీ 713, టీడీపీ 50, కాంగ్రెస్, బీజేపీ, జనసేన, సీపీఎం, సీపీఐ ఒక్కో ఎంపీటీసీ స్థానంలో గెలుపొందాయి. 13 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. ఏకగ్రీవాలతో కలిపి వైఎస్సార్సీపీ ఏకంగా 762 ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకుంది. టీడీపీ కేవలం 51 స్థానాలకు పరిమితమైంది. అన్ని డివిజన్లలో సై‘కిల్’ పంచాయతీ, మునిసిపల్ ఎన్నికల్లో మాదిరే ప్రాదేశిక ఎన్నికల్లోనూ టీడీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. స్థానిక సంస్థల్లో పూర్తిస్థాయిలో పట్టు కోల్పోయింది. టీడీపీ ముఖ్య నేతల ఇలాకాల్లోనూ ఆ పార్టీ కనీస ప్రభావం చూపలేదు. జిల్లాలోని ఐదు రెవెన్యూ డివిజన్లలోనూ సై‘కిల్’ కావడం గమనార్హం. అనంతపురం డివిజన్లో 19 జెడ్పీటీసీ, 254 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అన్ని జెడ్పీటీసీ స్థానాలతో పాటు 226 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించింది. టీడీపీకి 23 స్థానాలు మాత్రమే దక్కాయి. సీపీఎం ఒకటి, స్వతంత్ర అభ్యర్థులు నాలుగు ఎంపీటీసీ స్థానాలు గెలుపొందారు. ►ధర్మవరం డివిజన్లోని ఎనిమిది జెడ్పీటీసీ స్థానాలనూ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. అలాగే 79 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్సీపీ 74 చోట్ల గెలుపొందగా.. రామగిరిలో ఒక స్థానం, రాప్తాడు 2, కనగానపల్లెలో 2 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ►కళ్యాణదుర్గం డివిజన్లో మొత్తం 11 జెడ్పీటీసీ స్థానాల్లోనూ వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయభేరి మోగించారు. 143 ఎంపీటీసీ స్థానాలకు గానూ వైఎస్సార్సీపీ 137 స్థానాల్లో గెలుపొందగా.. కేవలం ఐదు చోట్ల టీడీపీ, ఒక చోట స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. ►పెనుకొండ డివిజన్లో 12 జెడ్పీటీసీలకు గాను పది స్థానాలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. మడకశిర అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని అగళి జెడ్పీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి గెలుపొందగా.. రొళ్ల స్థానంలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. అలాగే 183 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. 162 స్థానాలను వైఎస్సార్సీపీ దక్కించుకుంది. 13 స్థానాల్లో టీడీపీ, పరిగి మండలం కొడిగెనహళ్లి–3 స్థానంలో బీజేపీ అభ్యర్థి గెలిచారు. స్వతంత్ర అభ్యర్థులు ఏడు చోట్ల విజయం సాధించారు. ►కదిరి డివిజన్‌లోనూ టీడీపీకి పరువు పోయింది. 12 జెడ్పీటీసీ స్థానాలనూ వైఎస్సార్సీపీ ఖాతాలో వేసుకుంది. అలాగే 122 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. వైఎస్సార్సీపీ 114 స్థానాల్లో విజయదుందుభి మోగించింది. టీడీపీ ఆరు స్థానాలకే పరిమితమైంది. జనసేన, స్వతంత్ర అభ్యర్థులు ఒక్కో స్థానంలో గెలుపొందారు. ‘సంక్షేమ’ విజయం పంచాయతీ, మునిసిపల్ ఎన్నికలతో పాటు తాజాగా ప్రాదేశిక ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీ విజయానికి వైఎస్ జగన్ సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దోహదపడ్డాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు వర్తింపజేయడం, సచివాలయ వ్యవస్థ ద్వారా పారదర్శకంగా, జాప్యం లేకుండా లబ్ధి చేకూరుస్తుండడంతో ప్రజలు వైఎస్సార్సీపీకి అండగా నిలిచారని అంటున్నారు. మరోవైపు పార్టీ అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి మంచి ఫలితాలు సాధించగలిగారు. -
Kurnool: జెడ్పీపై తొలిసారి వైఎస్సార్సీపీ జెండా రెపరెపలు
కర్నూలు(అర్బన్): ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అధికార పార్టీ తిరుగులేని మెజారిటీ సాధించింది. సాధారణ ఎన్నికల్లో జిల్లాలోని 14 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకున్న వైఎస్సార్సీపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అదే దూకుడును ప్రదర్శించింది. జిల్లాలోని 53 మండలాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు తిరుగులేని మెజారిటీని సాధించారు. ఈ ఏడాది ఏప్రిల్ 8వ తేదీన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించగా..ఆదివారం జిల్లాలోని 11 ప్రాంతాల్లో ఓట్లను లెక్కించారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి అన్ని ప్రాదేశిక నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు మెజారిటీ పరంగా ముందంజలో సాగారు. జెడ్పీపై తొలిసారి వైఎస్సార్సీపీ జెండా రెపరెపలు ... జిల్లాపరిషత్‌పై తొలిసారి వైఎస్సార్సీపీ జెండా రెపరెపలాడనుంది. 2014లో జరిగిన ఎన్నికల్లో కూడా వైఎస్సార్సీపీ జెడ్పీటీసీలు మెజారిటీగా గెలుపొందినా, అధికార బలంతో తెలుగుదేశం పార్టీ పలువురు వైఎస్సార్సీపీ జెడ్పీటీసీలను కుట్రలు, కుంతంత్రాలతో మభ్యపెట్టి తమవైపు తిప్పుకొని జెడ్పీ పీఠాన్ని దొడ్డిదారిలో చేజిక్కించుకుంది. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్సీపీ అభ్యర్థులకు తిరుగులేని మెజారిటీని అందించారు. మొత్తం 53 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా, ఎన్నికల కంటే ముందే 16 జెడ్పీటీసీ స్థానాలు వైఎస్సార్సీపీ ఖాతాలో జమ అయ్యాయి. బీజేపీ అభ్యర్థి మృతితో నంద్యాల జెడ్పీటీసీ స్థానానికి ఎన్నిక నిలిచి పోగా, మిగిలిన 36 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. మొత్తం అన్ని స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. 672 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల విజయం... జిల్లాలో మొత్తం 807 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, వివిధ కారణాలతో 11 స్థానాలకు ఎన్నికలు నిర్వహించలేదు. మిగిలిన 796 ఎంపీటీసీల్లో 312 ఏకగ్రీవం కాగా, 484 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో ఏకగ్రీవాలను కలుపుకొని వైఎస్సార్సీపీ 672 స్థానాల్లో విజయ దుందుభి మోగించింది. టీడీపీ 105 స్థానాలను దక్కించుకుంది. ఐదు స్థానాలను బీజేపీ, మూడు స్థానాలను సీపీఐ గెలుపొందింది. స్వతంత్రులు 11 స్థానాల్లో విజయం సాధించారు. పలు ప్రాంతాల్లో సీపీఎం, జనసేన అభ్యర్థులు పోటీ చేసినా గెలుపొందలేకపోయారు. 25న జెడ్పీచైర్మన్, 24న ఎంపీపీల ఎన్నిక ఈ నెల 24న మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, 25న జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. మండల పరిషత్‌లకు ఉపాధ్యక్షులు, కో ఆప్షన్ సభ్యులను 24న ఎన్నుకోవాల్సి ఉంటుంది. అలాగే 25న జిల్లా పరిషత్‌కు ఇద్దరు కో ఆప్షన్ సభ్యులు, ఇద్దరు వైస్ చైర్మన్లను కూడా ఎన్నుకోవాల్సి ఉంటుంది. మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కో ఆప్షన్ సభ్యుని ఎన్నికకు సంబంధించి 20న నోటీస్ జారీ చేస్తారు. 24న ఉదయం 10 గంటలకు నామినేషన్లు స్వీకరిస్తారు. స్రూ్కటీనీ నిర్వహించిన అనంతరం 12 గంటలకు అభ్యర్థుల జాబితాను ప్రచురిస్తారు. మధ్యాహ్నం 1 గంట లోపు నామినేషన్ల ఉపసంహరణ పూర్తి అయిన అనంతరం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి కో ఆప్షన్ సభ్యులను ఎన్నుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు మండల ప్రజా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకుంటారు. 21న జిల్లా పరిషత్‌కు సంబంధించి ఇద్దరు కో ఆప్షన్ సభ్యులు, చైర్మన్, ఇద్దరు వైస్ చైర్మన్లను ఎన్నుకునేందుకు జిల్లా కలెక్టర్ నోటీసు జారీ చేస్తారు. 25న ఉదయం 10 గంటలకు నామినేషన్లను స్వీకరించి స్రూ్కటీనీ నిర్వహిస్తారు. అనంతరం 12 గంటలకు అభ్యర్థుల జాబితా ప్రచురించి 1 గంట వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇస్తారు. ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఇద్దరు కో ఆప్షన్ సభ్యులను ఎన్నుకుంటారు. ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మధ్యాహ్నం 3 గంటలకు చైర్మన్, ఇద్దరు వైస్ఛైర్మన్లను ఎన్నుకోవాలని ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రశాతంగా ఓట్ల లెక్కింపు జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్లను లెక్కించినట్లు జిల్లా కలెక్టర్ పీ కోటేశ్వరరావు తెలిపారు. ఆదివారం ఉదయం ఆయన రాయలసీమ విశ్వ విద్యాలయంలో జరుగుతున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియను పరిశీలించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ హరిప్రసాద్, డీఆర్డీఏ పీడీ వెంకటేశులు ఉన్నారు. పరిశీలకులు ప్రభాకర్‌రెడ్డి కూడా ఓట్ల లెక్కింపు కేంద్రాలను పరిశీలించారు. -
YSR Kadapa: కడప జిల్లాలో వైఎస్సార్సీపీ జయకేతనం
జిల్లాలో ఫ్యాను గాలి ఉధృతంగా వీచింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అప్రతిహత విజయం సాధించింది. ఓటర్లు ఆ పార్టీకి బ్రహ్మరథం పట్టారు. అధికార పార్టీ హవా ముందు టీడీపీ తుడిచిపెట్టుకుపోయింది. జెడ్పీ పీఠం వైఎస్సార్సీపీనే వరించనుంది. స్థానిక ఎన్నికల్లో వరుసగా తిరుగులేని విజయాలను నమోదు చేసుకుంటున్న అధికార పార్టీలో విజయోత్సాహం నెలకొంది. సాక్షి, వైఎస్సార్ కడప: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించింది. ఎన్నికలు ఏవైనా వైఎస్సార్సీపీ వైపే ప్రజలు నిలిచారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనకు మద్దతు ఇస్తూ తిరుగులేని ఆధిక్యతను అందించారు. కనీవినీ ఎరుగని రీతిలో అన్ని ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీకి స్పష్టమైన మెజార్టీని అందిస్తూ వస్తున్నారు. ఇటీవల జరిగిన కార్పొరేషన్, సర్పంచ్, మున్సిపాలిటీ ఎన్నికలతోపాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ ఓటు అస్త్రంతో వైఎస్సార్ సీపీకి పట్టం కట్టారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం రెండేళ్ల తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో టీడీపీకి ఘోర పరాభవం తప్పలేదు. వైఎస్సార్ సీపీ ప్రభంజనంలో కేవలం అంతంత మాత్రం సీట్లు దక్కించుకోలేక టీడీపీ సైకిల్ గాలికి కొట్టుకుపోయింది. ఊహించని దెబ్బకు టీడీపీ నాయకులు ఇంటి నుంచి బయటికి రాలేక ముఖం చాటేశారు. 92 స్థానాల్లో తిరుగులేని విజయం జిల్లా మొత్తం మీద 554 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 432 స్థానాలు ఏకగ్రీవం కాగా...అందులో 423 స్థానాలు వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. ఏడు స్థానాలను టీడీపీ, రెండు స్థానాలు బీజేపీకి ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 117 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఆదివారం వీటికి సంబంధించి కౌంటింగ్ జరగ్గా అందులో వైఎస్సార్సీపీ అభ్యర్థులకు తిరుగులేని మెజార్టీ లభించింది. 117 స్థానాలకుగాను 92 స్థానాల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు విజయకేతనం ఎగుర వేశారు. టీడీపీ కేవలం 11 స్థానాలకు పరిమితం కాగా, ఏడు స్థానాలు బీజేపీకి దక్కగా, మరో ఐదు స్థానాల్లో ఇండిపెండింగ్ అభ్యర్థులు అనూహ్యంగా విజయం సాధించారు. జమ్మలమడుగు మండలం గొరిగనూరు, ముద్దనూరు మండలం కొర్రపాడు ఎంపీటీసీలకు సంబంధించి బ్యాలెట్ బాక్సుల్లోకి నీరు చేర డంతో అధికారులు కౌంటింగ్ పెండింగ్‌లో ఉంచారు. వైఎస్సార్సీపీ ఖాతాలో 10 జెడ్పీటీసీలు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. 50 మండలాలకు చెందిన 38 జెడ్పీ స్థానాలు వైఎస్సార్సీపీకి ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 12 స్థానాలకు ఎన్నికలు జరగ్గా కోర్టు తీర్పు నేపథ్యంలో ఆదివారం కౌంటింగ్ నిర్వహించారు. ఇందులో వైఎస్సార్సీపీ అభ్యర్థులు 12 స్థానాలకుగాను 10 స్థానాల్లో విజయకేతనం ఎగురవేశారు. కేవలం టీడీపీకి గోపవరం జెడ్పీటీసీ స్థానం మాత్రమే దక్కింది. పేరుకే అభ్యర్థులు..కనిపించని ఓటు: జిల్లాలో ఎన్నికల్లో పోటీ చేసిన చాలామంది పేరుకే అభ్యర్థులుగా కనిపించారు. తీరా కౌంటింగ్ కేంద్రాల్లో చూస్తే వారికి ఒక్క ఓటు కూడా పడలేదు. చివరికి వారి ఓటు కూడా వారు వేసుకోలేదు. అభ్యర్థుల జాబితాలో పేరున్నా చివరికి వారికి ఒక్క ఓటు కూడా లేకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. రైల్వేకోడూరు ఎంపీటీసీ పరిధిలో ఇద్దరు అభ్యర్థులు అలా కనిపించగా, మిగిలిన చోట్ల కూడా ఇలా ఓటు పడని అభ్యర్థులు కనిపించారు. సంబరాల్లో వైఎస్సార్ సీపీ శ్రేణులు జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు సంబంధించి అత్యధిక స్థానాలు వైఎస్సార్ సీపీ కైవసం చేసుకోవడంతోపాటు ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. ఎక్కడికక్కడ స్థానిక నాయకులు, కార్యకర్తలు టపాసులు కాల్చి పండుగ నిర్వహించుకున్నారు. గెలిచిన అభ్యర్థులు స్వీట్లు తినిపించుకుని కేకులు పంచుతూ ఆనందంలో మునిగిపోయారు. ఆ ముగ్గురికి భారీ మెజార్టీ రైల్వేకోడూరు జెడ్పీటీసీ స్థానం నుంచి పోటీ చేసిన వైఎస్సార్సీపీ అభ్యర్థి పాలెంకోట రత్నమ్మ 25,100 ఓట్ల భారీ మెజార్టీతో ప్రత్యర్థి జనసేన అభ్యర్థి మధులతపై విజయం సాధించారు. ఇక్కడ టీడీపీ మూడో స్థానానికి పరిమితం కాగా, జిల్లాలోనే అత్యధిక మెజార్టీ రైల్వేకోడూరు అభ్యర్థికి దక్కింది. తర్వాత స్థానంలో నందలూరు వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి ఉషారాణి 20,556 ఓట్ల మెజార్టీతో ప్రత్యర్థి జనసేన అభ్యర్థి నాగమణిపై గెలుపొందారు. ఇక్కడ కూడా టీడీపీ మూడో స్థానానికే పరిమితమైంది. అలాగే చిట్వేలి వైఎస్సార్సీపీ అభ్యర్థి పుష్పలత కూడా 19,578 ఓట్ల భారీ ఆధిక్యంతో టీడీపీ అభ్యర్థిపై విజయం సాధించారు. సంక్షేమం, అభివృద్ధికే పట్టం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా జిల్లాలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాల ప్రభావం జిల్లాలో తీవ్రంగా ఉంది. ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టులతోపాటు పరిశ్రమలను సైతం ఏర్పాటు చేసి లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సర్వం సిద్ధం చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలోని ప్రాజెక్టులకు కృష్ణా జలాలను తరలించి సాగు, తాగనీటి కష్టాలను తీర్చింది. జిల్లా ప్రజలంతా వైఎస్ జగన్ పాలన పట్ల మరింత ఆకర్షితులయ్యారు. -
Chittoor: ఫ్యాన్‌కే పట్టం.. కుప్పంలోనూ బాబుకు మొండిచేయి
పల్లె ప్రజలు పరిషత్ పోరులోనూ ఏకపక్షంగా తీర్చునిచ్చారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలనే పునరావృతం చేశారు. సంక్షేమ పాలనకే పట్టం కట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటే ఉంటామని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించారు. టీడీపీని మట్టికరిపించారు. చంద్రబాబు కుతంత్రాలను ఓటుతో తిప్పికొట్టారు. కుప్పంలోనూ కర్రు కాల్చి వాత పెట్టారు. చివరకు నారావారిపల్లెవాసులు సైతం ‘నిన్ను నమ్మం బాబూ’ అని తేల్చేశారు. సాక్షి, తిరుపతి: జిల్లావ్యాప్తంగా ఆదివారం వెల్లడైన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాల్లో వైఎస్సార్సీపీ జయకేతనం ఎగురవేసింది. సొంత ఇలాకాలోనే చంద్రబాబుకు మరోసారి ఘోరపరాభవం ఎదురైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ పాలనకు సంపూర్ణ మద్దతు లభించింది. ఫ్యాను ప్రభంజనానికి సైకిల్ కొట్టుకుపోయింది. జిల్లాలోని అన్ని జెడ్పీటీసీ స్థానాలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. ఎంపీటీసీ స్థానాలను సైతం దాదాపు స్వీప్ చేసేసింది. దిమ్మ తిరిగే తీర్పు ఘనత వహించిన చంద్రబాబుకు ప్రజలకు చుక్కలు చూపించారు. సొంతూరు నారావారిపల్లె నుంచి ఏళ్ల తరబడి ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం వరకు దిమ్మ తిరిగే తీర్పునిచ్చారు. బాబు కోటగా భావించే కుప్పంలో వైఎస్సార్సీపీ అభ్యర్థులు భారీ ఆధిక్యంతో తిరుగులేని విజయం సాధించారు. కుప్పం నియోజకవర్గంలో ఎన్నికలు జరిగిన 4 జెడ్పీటీసీ స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులే గెలుపొందారు. 63 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తే 63 స్థానాల్లోని ఓటర్లు ఫ్యాను గుర్తు వైపే మొగ్గుచూపారు. టీడీపీని కేవలం 3 స్థానాలకే పరిమితం చేశారు. చంద్రగిరి నియోజకవర్గంలోని నారావారిపల్లె ప్రజలు సైతం చంద్రబాబును తిరస్కరించారు. చిన్న రామాపురం ఎంపీటీసీగా వైఎస్సార్సీపీ అభ్యరి్థకి ఓటేసి అత్యధిక మెజారిటీ కట్టబెట్టారు. మాజీ మంత్రికి షాక్ మాజీ మంత్రి అమరనాథ్‌రెడ్డికి పలమనేరు నియోజకవర్గ ప్రజలు షాక్ ఇచ్చారు. ఇక్కడి ఐదు జెడ్పీటీసీ స్థానాల్లో వైఎస్సార్సీపీనే గెలిపించారు. ముఖ్యంగా వి.కోట జెడ్పీటీసీ స్థానంలో ఫ్యాను గుర్తుకు 27,713 ఓట్ల ఆధిక్యతను అందించారు. మొత్తం 83 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తే 81 స్థానాలను వైఎస్సార్సీపీకి అందించారు. టీడీపీని కేవలం 2 స్థానాలకే పరిమితం చేశారు. నల్లారికి నగుబాటు పీలేరు నియోజకవర్గంలో నల్లారి వారికి నగుబాటు తప్పలేదు. ఇక్కడి ఐదు జెడ్పీటీసీలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. 67 ఎంపీటీసీ స్థానాలకు గాను ఫ్యాను 60 గెలుచుకుంటే, సైకిల్ 7 స్థానాలతో సరిపెట్టుకుంది. నగరి నియోజక వర్గంలో మొత్తం 5 జెడ్పీటీసీ స్థానాలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. 40 ఎంపీటీసీ స్థానాలకు గాను 37చోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలుపొందారు. గంగాధరనెల్లూరు, పూతలపట్టు, చిత్తూరు నియోజక వర్గాల్లోనూ వైఎస్సార్సీపీ అభ్యర్థుల హవా కొనసాగింది. మదనపల్లి నియోజక వర్గంలోని 3 జెడ్పీటీసీ స్థానాలను వైఎస్సార్సీపీ గెలుచుకుంది. 50 ఎంపీటీసీ స్థానాలకు గాను 49 చోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ప్రశాంతంగా కౌంటింగ్ చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా 11 కేంద్రాల్లో ఆదివారం నిర్వహించిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా ముగిసిందని ఇంచార్జి కలెక్టర్ రాజాబాబు తెలిపారు. కౌంటింగ్ అనంతరం కలెక్టరేట్లో ఆయన అధికారులతో కలిసి విలేకర్లతో మాట్లాడారు. జిల్లాలో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగలేదన్నారు. జెడ్పీ సీఈవో ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మండల, జిల్లా పరిషత్ అధ్యక్షుల ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేశామని వెల్లడించారు. 24వ తేదీన ఎంపీపీ, 25వ తేదీన జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో జేసీ (సంక్షేమం) రాజశేఖర్, జిల్లా పంచాయతీ అధికారి దశరథరామిరెడ్డి పాల్గొన్నారు. చదవండి: పంచాయతీ, మునిసిపల్‌ను మించి జైత్ర యాత్ర -
నెల్లూరు జిల్లాలో అధికార పార్టీకే పట్టం
సింహపురిలో వైఎస్సార్సీపీ మరో ప్రభంజనం సృష్టించింది. సార్వత్రిక ఎన్నికల నుంచి పరిషత్ ఎన్నికల వరకు ప్రజలు వైఎస్సార్సీపీకే జై కొట్టారు. జిల్లాలో వైఎస్సార్సీపీ జైత్రయాత్ర అప్రతిహతంగా కొనసాగుతోంది. ఆదివారం వెలువడిన పరిషత్ ఎన్నికల ఫలితాలతో టీడీపీ కంచుకోటలు బద్ధలయ్యాయి. జెడ్పీటీసీ స్థానాలను వైఎస్సార్సీపీ కీŠల్న్ స్వీప్ చేయగా, ఎంపీటీసీ స్థానాల్లో 90 శాతం సీట్లను వైఎస్సార్సీపీ దక్కించుకుంటే.. టీడీపీ 6.13 శాతానికి పరిమితమైంది. స్థానిక ఒప్పందాల నేపథ్యంలో స్వతంత్రులు, సీపీఎం, బీజేపీ, జనసేన అభ్యర్థులు 21 స్థానాల్లో స్వల్ప మెజార్టీలతో బయటపడ్డారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. జిల్లాలో అన్ని మండల పరిషత్‌లతో పాటు జిల్లా పరిషత్‌ను సొంతం చేసుకోనుంది. 46 జెడ్పీటీసీ స్థానాలు, 495 మంది ఎంపీటీసీ స్థానాలు అధికార పార్టీ కైవశం చేసుకుంది. టీడీపీ జాతీయ స్థాయి నాయకుడిగా భావించే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఇలాఖాలో సైతం ఘోర పరాభవం తప్పలేదు. మాజీ ఎమ్మెల్యేల స్వగ్రామాల్లో కూడా ప్రజలు టీడీపీ అభ్యర్థులను తిరస్కరించారు. జిల్లా ప్రజానీకం వైఎస్సార్సీపీ పక్షమేనని నిరూపించారు. ఎన్నికలు ఏవైనా సరే, ఎప్పుడైనా సరే తామంతా వైఎస్సార్సీపీ వెంటనేనని మరోసారి రుజువు చేశారు. 2019 సాధారణ ఎన్నికల్లో ఏకపక్షంగా ఫలితాలు కట్టబెట్టిన జిల్లా ప్రజలు దాదాపు 20 నెలల పాలన తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీకి జైకొట్టారు. గ్రామీణులకు అందుతోన్న సంక్షేమ పథకాలే స్థానిక సంస్థల తీర్పులో ప్రతిబింబించింది. మాజీ ఎమ్మెల్యేల స్వగ్రామాల్లో, ఇప్పటి వరకూ టీడీపీ మినహా మరే పార్టీ గెలుపొందని గ్రామాల్లో సైతం వైఎస్సార్సీపీ జయకేతనం ఎగరవేసింది. జిల్లాలో 554 ఎంపీటీసీ స్థానాల్లో 4 స్థానాలకు ఎన్నికలు నిలిచిపోయాయి. గంగవరం, వెంగమాంబపురం, అనంతమడుగు, కోట–2 ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులు మృతి కారణంగా నిలిచిపోయాయి. 550 స్థానాలకు 495 చోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయం చేజిక్కించుకున్నారు. కేవలం 34 స్థానాలకే మాత్రమే టీడీపీ పరిమితమైంది. సీపీఎం 5 , బీజేపీ 2 స్థానాలతో సరిపెట్టుకొగా, కేవలం ఒక్క ఎంపీటీసీ స్థానాన్ని జనసేన దక్కించుకుంది. 13 చోట్ల స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. జిల్లాలోని 46 జెడ్పీటీసీ స్థానాలు వైఎస్సార్సీపీ దక్కించుకుంది. ఏకగ్రీవంగా ఎన్నికైన ఇద్దరు వైఎస్సార్సీపీ అభ్యర్థులు పొట్లూరి సుబ్బమ్మ (జలదంకి–2), కల్లూరు జయరామయ్య (శిరసనంబేడు) మృతి చెందారు. ఈ స్థానాలతో పాటు నిలిచిపోయిన స్థానాలకు ఎన్నికలు అనివార్యం కానున్నాయి. ఆనం ఇంట మహిళ నేత ఆరంగ్రేటం జిల్లాలో ఆనం కుటుంబానికి 8 దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉంది. ఇప్పటి వరకు ఆనం ఇంటి మహిళా నేతలు ఎవరూ ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. తొలిసారిగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆనం విజయకుమార్‌రెడ్డి సతీమణి అరుణమ్మ రాజకీయ ఆరంగ్రేటం చేశారు. నెల్లూరు రూరల్ జెడ్పీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇకపై ప్రత్యక్ష రాజకీయాల్లో ఆనం ఇంటి నుంచి మహిళ నేత అరుణమ్మ ప్రజాసేవలో నిమగ్నం కానున్నారు. జిల్లా వ్యాప్తంగా 23 మంది మహిళా నేతలు జెడ్పీటీసీలుగా ఎన్నికయ్యారు. మరో 270 మంది ఎంపీటీసీలుగా మహిళలను ఎన్నుకున్నారు. వారిలో 23 మంది ఎంపీపీలు కానున్నారు. ఈ నెల 24న ఎంపీపీ, 25న జెడ్పీ చైర్మన్‌ను ఎన్నుకునేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ మేరకు ఎంతో కాలంగా నిరీక్షిస్తూ వచ్చిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు పదవీయోగం దక్కనుంది. గణనీయంగా పెరిగిన ప్రజామద్దతు సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలకు లభించిన మెజార్టీ కంటే స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో లభించిన గణనీయంగా పెరిగింది. కావలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి 14,117 ఓట్ల మెజార్టీతో విజయం దక్కించుకుంటే.. అదే స్థానిక సంస్థల ఫలితాల్లో అల్లూరు జెడ్పీటీసీ ఏకగ్రీవం కాగా, తక్కిన మూడు మండలాల్లో జెడ్పీటీసీ అభ్యర్థులకు 33,321 మెజార్టీ లభించింది. సర్వేపల్లె ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డికి 13,973 ఓట్లు మెజార్టీ దక్కగా, ఈ నియోజకవర్గంలోని జెడ్పీటీసీ అభ్యర్థులందరి మెజార్టీలు పరిశీలిస్తే 58,345 ఓట్లు అధికంగా దక్కించుకున్నారు. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి 38,720 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అక్కడ రాపూరు మండలం ఏకగ్రీవం కాగా, తక్కిన ఐదు మండలాల్లో జెడ్పీటీసీ అభ్యర్థుల మెజార్టీ 48,884 ఉండడం విశేషం. ఇలా ప్రతి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ పట్ల ప్రజామద్దతు గణనీయంగా పెరిగింది. మాజీ ఎమ్మెల్యేల స్వగ్రామాల్లో టీడీపీకి తిరస్కరణ టీడీపీ మాజీ ఎమ్మెల్యేల స్వగ్రామాల్లోనూ పరాభవం తప్పలేదు. వెంటకగిరి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ స్వగ్రామం కమ్మవారిపల్లె పంచాయతీలోని లింగసముద్రం ఎంపీటీసీ స్థానం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థి నావూరు కోటేశ్వరరావు 1,011 ఓట్లతో ఘన విజయం సాధించారు. అక్కడ టీడీపీ కంటే బీజేపీకి 4 ఓట్లు అధికంగా రావడంతో టీడీపీ మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు సొంతూరు పెద్దకొండూరులో టీడీపీ మట్టి కరిచింది. 1,025 ఓట్ల మెజార్టీతో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఇండ్ల చెంచమ్మ గెలుపొందింది. మాజీ ఎమ్మెల్యే బొల్లినేని కృష్ణయ్య స్వగ్రామంలో వైఎస్సార్సీపీ ఎంపీటీసీ రమాదేవి విజయం దక్కించుకుంది. టీడీపీ జాతీయ స్థాయి నేతగా ప్రకటించుకునే మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సొంత నియోజకవర్గం సర్వేపల్లెలో టీడీపీ కేవలం 2 ఎంపీటీసీ స్థానాలకు పరిమితమైంది. సోమిరెడ్డి నివాసం ఉంటున్న అల్లీపురం ఎంపీటీసీ సైతం వైఎస్సార్సీపీ దక్కించుకుంది. కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి స్వగ్రామం నార్త్‌రాజుపాళెం రెండు ఎంపీటీసీలను వైఎస్సార్సీపీ దక్కించుకుంది. మాజీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర స్వగ్రామం ఇసకపల్లిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి కొండూరు వాసు 1,079 ఓట్లు మెజార్టీతో గెలుపొందారు. సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం స్వగ్రామం భీమవరంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి నెలవల మమత విజయం దక్కించుంది. టీడీపీ కంచుకోటలుగా ఉండే స్థానాల్లో ఘోర ఓటమి చవిచూడాల్సిన అనుభవం ఆ పార్టీకి ఎదురయింది. దీనికి ప్రధాన కారణంగా పార్టీలు, వర్గాలతో నిమిత్తం లేకుండా అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందుతుండడమేనని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. -
Prakasam: విజయ పంకా..
పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనాన్ని సృష్టించింది. బ్యాలెట్ బాక్స్‌లు తెరిచి ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచీ ఫ్యాన్ స్పీడు కొనసాగింది. ఆ జోరుకు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకోవాలని టీడీపీ పన్నిన కుయుక్తులకు ప్రజలు ఓటుతో సమాధానమిచ్చారు. 55 జెడ్పీటీసీ, 628 ఎంపీటీసీ స్థానాల్లో విజయదుందుభి మోగించి జిల్లాలో తిరుగులేని శక్తిగా ఆవిర్భవించింది. వైఎస్సార్సీపీ అభ్యర్థుల విజయంతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగియడంతో అధికారయంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. సాక్షిప్రతినిధి, ఒంగోలు: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ హవా కొనసాగుతూనే ఉంది. గతంలో జరిగిన సర్పంచ్‌లు, మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీని మట్టి కరిపించి 90 శాతానికి పైగా స్థానాలను కైవసం చేసుకున్న వైఎస్సార్ సీపీ పరిషత్ పోరులోనూ అదే దూకుడు కొనసాగిస్తోంది. పరిషత్ పోరులో వైఎస్సార్సీపీ మరింత దూకుడు పెంచగా, టీడీపీ అడ్రస్ గల్లంతైంది. మిగిలిన పారీ్టల ఉనికి సైతం లేని పరిస్థితి. జిల్లాలో 56 మండలాలుండగా అందులో 55 మండలాల్లో మాత్రమే ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి టీడీపీ అడ్డంకులు సృష్టిస్తోంది. చివరకు ఎన్నికలయ్యాక కూడా కౌంటింగ్‌ను నిలిపేస్తూ వచ్చింది. ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పదని ముందుగానే తెలుసుకున్న టీడీపీ కోర్టులను అడ్డుపెట్టుకొని ఏడాదిగా ఎన్నికల ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. జిల్లాలో 55 జెడ్పీటీసీ స్థానాలకు గాను 14 జెడ్పీటీసీలను వైఎస్సార్సీపీ ఏకగ్రీవంగా గెలుచుకోగా, 41 చోట్ల ఎన్నికలు జరిగాయి. ఆదివారం జరిగిన కౌంటింగ్‌లో 41 జెడ్పీటీసీలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకొని జిల్లాలో ఉన్న 55 జెడ్పీటీసీలను తన ఖాతాలో వేసుకుంది. అదే విధంగా జిల్లాలో 784 ఎంపీటీసీ స్థానాలు ఉండగా అందులో 68 చోట్ల ఎన్నిక నిలిచిపోయిన విషయం తెలిసిందే. 348 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మొత్తం ఎన్నికలు జరిగిన 716 ఎంపీటీసీల్లో 628 వైఎస్సార్సీపీ, 64 టీడీపీ, 21 ఇండిపెండెంట్లు, బీజేపీ, సీపీఐ, సీపీఎం ఒక్కొక్క స్థానాన్ని దక్కించుకున్నాయి. వరుస విజయాలతో వైఎస్సార్సీపీ శ్రేణులు ఫుల్ జోష్‌లో ఉండగా, ఘోర పరాజయాల పరంపర కొనసాగుతుండటంతో టీడీపీలో తీవ్ర నైరాశ్యం నెలకొంది. మార్కాపురం, గిద్దలూరు నియోజకవర్గాల్లో అయితే టీడీపీ ఖాతా కూడా తెరవని పరిస్థితి. పది శాతం స్థానాలకు పరిమితమైన టీడీపీ: 2019 ఎన్నికల్లో జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలకు గాను 4 చోట్ల టీడీపీ ఎమ్మెల్యేలు విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వెలువడిన ఎంపీటీసీ ఫలితాల్లో జిల్లాలో పది శాతం స్థానాలను కూడా దక్కించుకోలేక చతికలపడింది. 55 జెడ్పీటీసీ స్థానాల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా గెలవలేని దుర్భర పరిస్థితి. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పారీ్టలకు అతీతంగా అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందిస్తుండటంతో ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరిగింది. టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచిన నియోజకవర్గాల్లో సైతం అన్ని జిల్లా పరిషత్, మండల పరిషత్‌లను వైఎస్సార్సీపీ క్లీన్‌స్వీప్ చేయటం చూస్తుంటే టీడీపీ పరిస్థితి ఎంత దిగజారిందో అర్థమవుతోంది. టీడీపీ ఎమ్మెల్యేలు జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశాలకు హాజరై సూచనలు చేయాల్సి ఉన్నా జిల్లా అభివృద్ధిని గాలికి వదిలేసి రాజకీయ డ్రామాలకు తెరతీయటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ప్రస్తుతం వెలువడిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాలు చూస్తుంటే టీడీపీ పై ప్రజల్లో ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో తేటతెల్లమవుతోంది. టీడీపీ పరిస్థితి ఇలా ఉంటే జనసేన, కాంగ్రెస్ పార్టీల ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. ఈ రెండు పారీ్టలు ఒక్క ఎంపీటీసీ స్థానాన్ని కూడా గెలవలేదు. చదవండి: పంచాయతీ, మునిసిపల్‌ను మించి జైత్ర యాత్ర -
మాచర్ల నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ క్లీన్‌స్వీప్..
సాక్షి, గుంటూరు: జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. ఈ నియోజకవర్గంలో మొత్తం అయిదు జెడ్పీటీసీ స్థానాలను, 71 ఎంపీటీసీ స్థానాలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. మాచర్ల మండలంలో మొత్తం 14 ఎంపీటీసీలకు గాను 14 స్థానాలను కైవసం చేసుకుని తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. దుర్గి మండలంలో మొత్తం 14 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్సీపీ గెలుపొందగా, వెల్దుర్తి మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలను వైఎస్సార్సీపీ దక్కించుకుంది. ► మాచర్ల మండలంలో మొత్తం ఎంపీటీసీ స్థానాలు 14 ► దుర్గి మండలంలో మొత్తం ఎంపీటీసీ స్థానాలు 14 ► వెల్దుర్తి మండలంలో మొత్తం ఎంపీటీసీ స్థానాలు 14 ►కారంపూడి మండలం లో మొత్తం ఎంపీటీసీ 15 ► రెంటచింతల మండలం మొత్తం ఎంపీటీసీ స్థానాలు 14 ► నియోజకవర్గంలో మొత్తం 71 ఎంపీటీసీ స్థానాలకు 71 వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. -
West Godavari: పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్సార్సీపీదే ఆధిక్యం
సాక్షి, ఏలూరు(పశ్చిమ గోదావరి) : పరిషత్ పోరులోనూ ఫ్యాన్ హవా కొనసాగింది. పల్లెపల్లెనా వైఎస్సార్ సీపీ జెండా రెపరెపలాడింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో భారీగా స్థానాలు దక్కించుకుని జిల్లాలో ప ట్టును మరోసారి చాటింది. టీడీపీ కంచుకోటగా ఉన్న మండలాల్లో సైతం వైఎస్సార్ సీపీ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. గణపవరం, ఏలూరు రూరల్ మండలాల్లో నూరు శాతం ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకున్నారు. జెడ్పీటీసీ అభ్యర్థులు కూడా రికార్డు మెజార్టీలు సాధించారు. మొత్తంగా 48 స్థానాలకు గాను 47 చోట్ల ఎన్నికల ప్రక్రియ జరగ్గా 45 స్థానాలను కైవసం చేసుకుంది. జిల్లాలోని నాలుగు కేంద్రాల్లో ఆదివారం ఉదయం 5 గంటల నుంచి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సుమారు 3,600 మంది సిబ్బంది ► ఏలూరు డివిజన్ పరిధిలో 16 జెడ్పీటీసీ, 302 ఎంపీటీసీ స్థానాలకు ఏలూరు సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ జరిగింది. ► నరసాపురం డివిజన్ పరిధిలో 12 జెడ్పీటీసీ, 218 ఎంపీటీసీ స్థానాలకు భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్లను లెక్కించారు. ► కొవ్వూరు డివిజన్ పరిధిలో 12 జెడ్పీటీసీ, 249 ఎంపీటీసీ స్థానాలకు తణుకు ఏఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ జరిగింది. ► జంగారెడ్డిగూడెం, కుక్కునూరు డివిజన్ల పరిధిలో 7 జెడ్పీటీసీ, 77 ఎంపీటీసీ స్థానాలకు జంగారెడ్డిగూడెం నోవా ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్లను లెక్కించారు. జెడ్పీటీసీలు ఇలా.. జిల్లాలో 48 జెడ్పీటీసీ స్థానాలకు గాను పెనుగొండ జెడ్పీటీసీ అభ్యర్థి ఒకరు మరణించడంతో అక్కడ నిలిచిపోయింది. ఇప్పటికే రెండు స్థానాలు ఏకగ్రీవం కా గా మిగిలిన 45 స్థానాలకు గాను వైఎస్సార్ సీపీ 43 స్థానాలు, టీడీపీ, జనసేన చెరో ఒక స్థానం చొప్పున గెలుపొందాయి. మొత్తంగా 45 స్థానాలతో వైఎస్సార్ సీపీ సత్తాచాటింది. జంగారెడ్డిగూడెం, ఏలూరు రూరల్ జెడ్పీటీసీ స్థానాలను వైఎస్సార్ సీపీ అభ్యర్థులు ఏకగ్రీవం కావడంతో అక్కడ ఎన్నిక జరగలేదు. 673 స్థానాల్లో విజయఢంకా జిల్లాలో 876 ఎంపీటీసీ స్థానాలకుగాను 73 ఏకగ్రీవమయ్యాయి. అభ్యర్థులు మరణించడం తదితర కార ణాలతో 22 చోట్ల ఎన్నికలు నిలిచిపోయాయి. 781 స్థానాలకు మాత్రమే పోలింగ్ జరిగింది. వైఎస్సార్ సీపీ 608, టీడీపీ 99, జనసేన 60, ఇతరులు 14 స్థానాల్లో గెలుపొందారు. ఏMýగ్రీవాలతో కలిసి 673 స్థానాలను వైఎస్సార్ సీపీ కైవసం చేసుకుంది. పెదవేగి, చాగల్లు మండలాల్లో ఒక్కో స్థానానికి రీకౌంటింగ్ జరిగింది. ఏలూరు (11), గణపవరం (19) మండలాల్లో అన్ని స్థానాలను వైఎస్సార్ సీపీ అభ్యర్థులు గెలుపొందారు. టీడీపీ ఒకటి.. జనసేన ఒకటి.. ఆచంట జెడ్పీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి ఉప్పలపాటి సురేష్‌బాబు గెలుపొందారు. వీరవాసరం జెడ్పీటీసీ స్థానంలో గుండా జయప్రకాష్ నాయుడు జనసేన తరçఫున గెలుపొందారు. టీడీపీ ఎమ్మెల్యేలకు భంగపాటు జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో గట్టి షాక్ తగిలింది. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సొంత మండలమైన పాలకొల్లులో 14 ఎంపీటీసీలకు 8 వైఎస్సార్ సీపీ కైవసం చేసుకోగా టీడీపీ ఐదు స్థానాలకు పరిమితమైంది. ఎమ్మెల్యే స్వగ్రామం అగర్తపాలెంలో ఎంపీటీసీ స్థానాన్ని వైఎస్సార్ సీపీ అభ్యర్థి గెలుపొందారు. ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు సొంత మండలం కాళ్లలోనూ వైఎస్సార్ సీపీ పట్టు సాధించింది. 19 ఎంపీటీసీ స్థానాలకు 15 చోట్ల వైఎస్సార్ సీపీ అభ్యర్థులు గెలుపొందగా టీడీపీ 2 స్థానాలతో సరిపెట్టుకుంది. ఎమ్మెల్యే స్వగ్రామం కలవపూడిలో వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ అభ్యర్థి విజయం సాధించారు. పకడ్బందీగా కౌంటింగ్ ఏలూరు, (మెట్రో): జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ పకడ్బందీగా జరిగింది. జిల్లా ఎన్నికల పరిశీలకులు, ఐఏఎస్ అధికారి సత్యనారాయణ, కలెక్టర్ కార్తికేయమిశ్రా జిల్లావ్యాప్తంగా పర్యటిస్తూ ఎప్పటికప్పుడు ఓట్ల లెక్కింపును విజయవంతంగా ముందుకు సాగించారు. జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఉదయం 6 గంటలకే కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించిన అధికారులు స్ట్రాంగ్‌రూమ్‌ల నుంచి ఉదయం 7, 8 గంటల మధ్యలో బ్యా లెట్ బాక్సులు తీసుకువచ్చి ఎంపీటీసీ, జెడ్పీటీసీ బ్యాలెట్‌పత్రాలు వేరు చేసి కట్టలు కట్టారు. ఉదయం 10 గంటలకు లెక్కింపు ప్రక్రియ మొదలైంది. అర్ధరాత్రి 1 గంట వరకు కౌంటింగ్ ప్రక్రియ సాగింది. మధ్యాహ్నం నుంచి ఏలూరులో వర్షం కురవడంతో బయట విధులు నిర్వహించే పోలీసులు, సిబ్బంది కాస్త ఇబ్బంది పడ్డారు. పార్టీల ఏజెంట్లు, అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. కౌంటింగ్‌ను జంగారెడ్డిగూడెం డివిజన్లో మధ్యాహ్నానికి పూర్తి చేసి మొదటి స్థానంలో నిలవగా రెండో స్థానంలో కొవ్వూరు డివిజన్, మూడో స్థానంలో నరసాపురం డివిజన్, చివరి స్థానంలో ఏలూరు డివిజన్ నిలిచాయి. 24 ఎంపీపీ.. 25న జెడ్పీ చైర్మన్ ఎన్నిక ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈనెల 24న ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కో–ఆప్షన్ మెంబర్ స్థానాలకు, 25న జిల్లాపరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్, కో–ఆప్షన్ సభ్యుల స్థానాలకు జిల్లా అధికారులు ఎన్నికలు నిర్వహించనున్నారు. పోలైనవి 53.. చెల్లనివి 47 భీమడోలు: భీమడోలు మండలంలో ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి పోలైన 53 పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో 47 చెల్లుబాటు కాలేదు. ఆరు ఓట్లు మాత్రమే చెల్లుబాటు కాగా వైఎస్సార్ సీపీ 4, టీడీపీ, జనసేనకు ఒక్కొ క్కటి చొప్పున వచ్చాయి. ఉద్యోగులు డిక్లరేషన్ పత్రంలో ఎంపీటీసీ స్థానాన్ని నమోదు చేయకపోవడంతో ఓట్లు చెల్లుబాటు కాలేదని ఎన్నికల అధికారులు తెలిపారు. దీని వల్ల జిల్లాలోనే భీమడోలు మండలంలో అత్యధికంగా ఓట్లు చెల్లబాటు కాకుండాపోయాయి. పోస్టల్ ఓటు వేసే తరుణంలో ఉద్యోగి తాము ఏ ఎంపీటీసీ స్థానానికి చెందిన ఓటరు అనే విషయాన్ని తెలియజేయాల్సి ఉంటుంది. అదే జెడ్పీటీసీ ఓటు కు మండలం పేరు నమోదు చేస్తే సరిపోతుంది. ఇదిలా ఉండగా జెడ్పీటీసీ స్థానానికి మా త్రం 72 ఓట్లలో 69 చెల్లుబాటు అయ్యాయి. -
బాబు ఇలాకాలో ఫ్యాన్ హవా
స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్సీపీ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. పరిషత్ ఎన్నికల ఫలితాల్లో రికార్డు స్థాయిలో స్థానాల్ని కైవసం చేసుకునే దిశగా దూసుకెళ్తోంది. ఇక టీడీపీకి గతంలో మంచి పట్టున్న కుప్పంలోనూ ఇప్పుడు వైఎస్సార్సీపీ హవా స్పష్టంగా కనిపిస్తోంది. చిత్తూరు జిల్లా కుప్పం మండలం టీ సడుమూరు ఎంపీటీసీ స్థానాన్ని వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. టీడీపీ అభ్యర్థిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అశ్విని(23).. 1073 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక చిత్తూరు జిల్లాలో 65 జడ్పీటీసీలకుగానూ ఇప్పటికి 29 స్థానాలను .. 841కి ఎంపీటీసీ స్థానాలకుగానూ.. 416 స్థానాలను కైవసం చేసుకుని ఆధిక్యంలో దూసుకుపోతోంది వైఎస్సార్సీపీ. మరోవైపు ఆదివారం ఉదయం మొదలైన ఆంధ్రప్రదేశ్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ వేగం పుంజుకుంది. పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ హవా కొనసాగుతోంది. పలు నియోజకవర్గాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్సీపీ స్పష్టమైన ఆధిక్యం కొనసాగిస్తోంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ జిల్లాల వారీ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Krishna: పంఖా ప్రభంజనం
సాక్షి, కృష్ణా: సంక్షేమ పాలనను జనం మెచ్చారు. ప్రాదేశిక ఎన్నికల్లో అధికార వైఎస్సార్ సీపీ అభ్యర్థులకు మద్దతుగా నిలిచారు. ఫలితంగా ఈ ఎన్నికల్లోనూ వైఎస్సార్ సీపీ ప్రభంజనం కొనసాగింది. పంచాయతీ ఎన్నికల మాదిరిగానే ఈ ఎన్నికల్లోనూ జిల్లా వాసులు ఆ పార్టీకి బ్రహ్మరథం పట్టారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పాలనకు మెచ్చి తిరుగులేని తీర్పునిచ్చారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థులకు ఏకపక్షంగా పట్టం కట్టారు. అత్యధిక స్థానాలే కాదు.. భారీ మెజార్టీలూ అందించారు. ఎంతలా అంటే.. కొన్ని మండలాల్లో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం అడ్రస్ గల్లంతయింది. ఆయా మండలాల్లో ఒక్క ఎంపీటీసీ స్థానాన్ని దక్కించుకోలేక చతికిలపడింది. పరిషత్ ఎన్నికల్లో అభ్యర్థులకు టిక్కెట్లు కేటాయించి, వారితో నామినేషన్లు వేయించి ఓటమి భయంతో బరి నుంచి తప్పుకుంది. అయినప్పటికీ ఆ పార్టీ అభ్యర్థులు పోటీలో కొనసాగారు. తొలి నుంచి వైఎస్సార్ సీపీ హవా ఆదివారం జిల్లాలోని 17 కేంద్రాల్లోని 46 కౌంటింగు హాళ్లలో పరిషత్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం ఎనిమిది గంటల నుంచి ప్రారంభమైది. తొలుత పోస్టల్ బ్యాలెట్లను, ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్లను లెక్కించారు. ఆరంభం నుంచి ఆఖరి వరకు ఏ దశలోనూ వైఎస్సార్ సీపీ అభ్యర్థులకు టీడీపీ అభ్యర్థులు గట్టి పోటీ ఇవ్వలేకపోయారు. జిల్లాలో మొత్తం 812 ఎంపీటీసీ, 49 జెడ్పీటీసీ స్థానాలున్నాయి. పురపాలకసంఘాల్లో విలీనంతో పెనమలూరు మండలంలో 48, మచిలీపట్నం మండలంలో 20, జగ్గయ్యపేట మండలంలో 21 వెరసి 89, ఏకగ్రీవమైన 69, అభ్యర్థులు మరణించడంతో ఆరు చోట్ల కలిపి 164 స్థానాలకు ఎన్నికలు జరగలేదు. 648 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 49 జెడ్పీటీసీ స్థానాలకు 41 చోట్లే ఎన్నికలు జరిగాయి. మచిలీపట్నం, పెనమలూరు, జగ్గయ్యపేటకు ఎన్నికలు జరగలేదు. జి.కొండూరు, విస్సన్నపేట, పెడనల్లో అభ్యర్థులు మృతి చెందడంతో వాయిదాపడ్డాయి. ఉంగుటూరు, మండవల్లి స్థానాల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 69 ఎంపీటీసీల్లో 67 మంది వైఎస్సార్ సీపీ, ఇద్దరు టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. ఫలితాలు ఇలా.. వైఎస్సార్ సీపీ 572, టీడీపీ 60, జనసేన 9, బీజేపీ, సీపీఐ, బీఎస్పీకి ఒక్కొక్క చోట, స్వతంత్రులు నాలుగు స్థానాల్లోను గెలుపొందారు. కోడూరు మండలంలో 13కు 13 ఎంపీటీసీలూ, పెడనలో 10కి 10 స్థానాలూ, బంటుమిల్లిలో 13కి 13, నందివాడలో 11 ఎంపీటీసీ స్థానాల్లో అన్నింటినీ, విస్సన్నపేట మండలంలో 17కు 17, గుడ్లవల్లేరులో 15కి 15, చాట్రాయిలో 15కి 15, మండవల్లిలో 14కు 14, ఎ.కొండూరులో 14కు 14, ఉంగుటూరు మండలంలో 16 ఎంపీటీసీలకు 15, నూజివీడులో 19కు 17, పెదపారుపాడులో 9కి 9 స్థానాలను వైఎస్సార్ సీపీ కైవశం చేసుకుంది. ఇలా జిల్లాలో చాలా మండలాల్లో టీడీపీ బోణీ కొట్టని పరిస్థితి ఏర్పడింది. జెడ్పీటీసీ స్థానాల్లోనూ హవా.. మరోవైపు జెడ్పీటీసీ స్థానాల్లోనూ వైఎస్సార్ సీపీ పూర్తి హవా కొనసాగించింది. మొత్తం 49 జెడ్పీటీసీ స్థానాల్లో ఇప్పటికే రెండు ఏకగ్రీవం కాగా ఆ రెండింటిని వైఎస్సార్సీపీ దక్కించుకుంది. వివిధ కారణాలతో ఆరు స్థానాలకు ఎన్నికలు జరగలేదు. ఎన్నికలు జరిగిన 41 స్థానాల్లో మోపిదేవిని టీడీపీ దక్కించుకోగా మిగిలిన 40 వైఎస్సార్ సీపీ పరమయ్యాయి. ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా జరగడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ► కైకలూరు నియోజకవర్గంలోని ముదినేపల్లి మండలంలో ముదినేపల్లి–2, వణుదురు ఎంపీటీసీ స్థానాల్లో అభ్యర్థుల మృతి వల్ల ఎన్నిక జరగలేదు. ► నూజివీడు నియోజకవర్గంలోని నూజివీడు మండలం దేవరగుంట స్థానం అభ్యర్థి మృతి వల్ల ఎన్నిక జరగలేదు. ► నందిగామ నియోజకవర్గంలోని వీరులపాడు మండలం వీరులపాడు సెగ్మెంట్ అభ్యర్థి వైఎస్ఆర్సీపీ మద్దతుతో సీపీఐ పారీ్టలో గెలిచారు. ► గన్నవరం నియోజకవర్గంలోని గన్నవరం అల్లాపురం సెగ్మెంట్ అభ్యర్థి మృతి చెందటంతో ఎన్నిక జరగలేదు. ► అవనిగడ్డ నియోజకవర్గంలోని నాగాయలంక మండలం పెదపాలెంలో అభ్యర్థి మృతి చెందటంతో ఎన్నిక జరగలేదు. -
Guntur: ఫ్యాన్ ప్రభంజనం
సాక్షి, గుంటూరు: వైఎస్సార్ సీపీ మరోమారు ప్రభంజనం సృష్టించింది. పరిషత్ ఎన్నికల్లో జయభేరి మోగించింది. తనకు ఎదురు లేదని నిరూపించింది. ఫ్యాన్ ధాటికి తెలుగుదేశం పార్టీ చిత్తయింది. మొదటి నుంచి ఆ పార్టీకి కంచుకోటైన గుంటూరు జిల్లాలోనే సైకిల్ తుక్కుతుక్కు అయింది. 2019 సాధారణ ఎన్నికల నుంచి ప్రారంభమైన టీడీపీ పతనం పరిషత్ ఎన్నికలతో సంపూర్ణమైందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పంచాయతీ, పురపాలకసంఘ ఎన్నికల్లోనూ టీడీపీ ఘోరపరాభవాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. జెడ్పీపై జయకేతనం జిల్లాలో జెడ్పీటీసీ స్థానాలన్నింటినీ వైఎస్సార్ సీపీ క్లీన్‌స్వీప్ చేసింది. జిల్లా పరిషత్‌పై జయకేతనం ఎగురవేసింది. ఎంపీటీసీ స్థానాల్లోనూ పూర్తి ఆధిక్యత ప్రదర్శించింది. ఒక్క దుగ్గిరాల తప్ప అన్ని మండల పరిషత్‌లనూ కైవసం చేసుకుంది. టీడీపీ సున్నా 2014 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ 23 జెడ్పీటీసీ స్థానాలు గెలుచుకోగా, టీడీపీ 34 స్థానాలు గెలిచి జిల్లా పరిషత్‌ను గెలుచుకుంది. 2021కి వచ్చే సరికి సీన్ రివర్స్ అయ్యింది. ఎన్నికలు జరిగిన, ఏకగ్రీవమైన మొత్తం 53 జెడ్పీటీసీ స్థానాలన్నింటినీ వైఎస్సార్ సీపీ గెలుచుకుంది. టీడీపీ గుడ్డుసున్నాగా మిగిలిపోయింది. ఎన్నికలు జరిగిన, ఏకగ్రీవమైన మొత్తం 797 ఎంపీటీసీ స్థానాల్లో 709 వైఎస్సార్ సీపీ గెలుచుకోగా, టీడీపీ 61కి పరిమితమైంది. జనసేన అభ్యర్థులు 11, ఒక స్థానంలో సీపీఐ అభ్యరి్థ, 15 చోట్ల స్వతంత్రులు గెలుపొందారు. అంతకు మించి.. ఇటీవల 973 పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా 768 వైఎస్సార్ సీపీ, 176 టీడీపీ, 17 జనసేన, 12 ఇతర అభ్యర్థులు చేజిక్కించుకున్నారు. 78.93శాతం సర్పంచ్ పదవులను అధికారపార్టీ దక్కించుకుంది. టీడీపీ 18.08 శాతానికి పరిమితమైంది. ఇప్పుడు ఎంపీటీసీ ఎన్నికల్లో అంతకుమించి విజయాన్ని వైఎస్సార్ సీపీ దక్కించుకుంది. 88.83 శాతం స్థానాల్లో పాగా వేసింది. టీడీపీ 7.65 శాతానికి పడిపోయింది. మాచర్లలో క్లీన్ స్వీప్ మాచర్ల నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ క్లీన్‌స్వీప్ చేసింది. మొత్తం 71 ఎంపీటీసీ స్థానాలు ఉంటే ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కృషితో 70 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దుర్గి మండలం ధర్మవరం గ్రామంలోని ఎంపీటీసీ స్థానానికి మాత్రమే ఎన్నిక జరిగింది. ఇప్పుడు ఆ స్థానంలోనూ వైఎస్సార్సీపీ అభ్యర్థి అరిగల గోవిందమ్మ గెలుపొందడంతో మొత్తం క్లీన్ స్వీప్ చేసినట్టయింది. ఇదిలా ఉంటే మాచర్ల, వెల్దుర్తి, దుర్గి, రెంటచింతల, కారంపూడి జెడ్పీటీసీ స్థానాలన్నీ గతంలోనే ఏకగ్రీవంగా వైఎస్సార్ సీపీ కైవసం చేసుకుంది. చదవండి: MPTC, ZPTC elections results: పంచాయతీ, మునిసిపల్‌ను మించి జైత్ర యాత్ర -
ఫ్యాన్‌టాస్టిక్ విక్టరీ
అదే ఫ్యాన్ ఫాలోయింగ్.. మొన్న పంచాయతీ.. నిన్న మున్సిపాలిటీ.. నేడు పరిషత్.. ఎన్నిక ఏదైనా గెలుపు వైఎస్సార్ సీపీదే. సంక్షేమ యజ్ఞంతో ఉజ్వల భవితకు భరోసా ఇస్తున్న జగనన్న పాలనకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. అందుకే పరిషత్ ఎన్నికల్లో సై‘కిల్’ కాగా, గ్లాసు బీటలు తీసింది. కమలం మరీ వాడిపోయింది. టోటల్‌గా సార్వత్రిక ఎన్నికల సీన్ రిపీట్ అయింది. సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: పరిషత్ పోరులోనూ పల్లె ప్రజలు వైఎస్సార్ సీపీకే బ్రహ్మరథం పట్టారు. జగన్ సంక్షేమ పాలనకు “జై’ కొట్టారు. మున్సిపల్, గ్రామ పంచాయతీ ఎన్నికల మాదిరిగానే ఈ ఎన్నికల్లోనూ ఏకపక్ష గెలుపుతో వైఎస్సార్ సీపీ జిల్లాలో ప్రభంజనం సృష్టించింది. మెజారిటీ జిల్లా, మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల్లో (జెడ్పీటీసీ, ఎంపీటీసీ) ఆ పార్టీ అభ్యర్థులు విజయదుందుభి మోగించారు. కడపటి వార్తలు అందేసరికి జిల్లాలోని దాదాపు అన్ని జెడ్పీటీసీ, ఎంపీటీసీల్లో వైఎస్సార్ సీపీ జెండా రెపరెపలాడేలా ఓటర్లు తీర్పు ఇచ్చినట్టు స్పష్టమైంది. జిల్లా పరిషత్ పీఠాన్ని వైఎస్సార్ సీపీ అధిష్టించడం ఖాయమైపోయింది. మొత్తం 61 జెడ్పీటీసీలకు గానూ అత్యధిక స్థానాల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు విజయబావుటా ఎగురవేశారు. ఫలితాలు వెల్లడి కావాల్సిన వాటిల్లో దాదాపు అన్నిచోట్లా విజయతీరాలకు దూసుకుపోతున్నారు. ఎన్నికలు జరిగిన 996 ఎంపీటీసీ స్థానాల్లో 90 శాతం విజయాలతో వైఎస్సార్ సీపీ తిరుగులేని మెజార్టీ సాధించే దిశగా పయనిస్తోంది. ఎన్నికల కంటే ముందు ఏకగ్రీవమైన ఎంపీటీసీ స్థానాల్లో సైతం మెజార్టీ స్థానాలు (77) వైఎస్సార్ సీపీ పరమయ్యాయి. తిరుగులేని ఈ ఫలితాలు పార్టీ శ్రేణులకు బూస్ట్ అందించాయి. ఈ ఫలితాల ద్వారా ప్రభుత్వానికి జిల్లా ప్రజలు మరోసారి మద్దతుగా నిలిచినట్టయ్యింది. ప్రతి ఇంటా రెండు మూడు సంక్షేమ పథకాలు అందుకుంటున్నందుకు గానూ ప్రజలు ప్రభుత్వ రుణాన్ని ఓట్ల రూపంలో తీర్చుకున్నారు. తుని నియోజకవర్గంలో 63 ఎంపీటీసీ స్థానాలకు గానూ 60 చోట్ల వైఎస్సార్ సీపీ అభ్యర్థులే విజయఢంకా మోగించారు. రాజానగరం నియోజకవర్గంలో 57కు 50 చోట్ల ‘ఫ్యాన్’ గాలి హోరెత్తింది. అనపర్తిలో 76కు 68 చోట్ల, పెద్దాపురంలో 44కు 37 చోట్ల వైఎస్సార్ సీపీ అభ్యర్థులు విజయం సాధించడం విశేషం. ‘ఫ్యాన్’కే మన్యసీమ మద్దతు పార్టీ ఆవిర్భావం నుంచీ వెన్నంటి నిలిచినట్టే ఈ ఎన్నికల్లో సైతం మన్యసీమ బిడ్డలు వైఎస్సార్ సీపీకి మద్దతుగా నిలిచారు. ఏజెన్సీని ఆ పార్టీ కంచుకోటగా నిలిపారు. టీడీపీని మట్టి కరిపించారు. రాష్ట్ర విభజన తరువాత విలీన మండలాల్లో తొలిసారి పార్టీ పరంగా జరిగిన పరిషత్ ఎన్నికల్లో ఆ మండలాల ప్రజలు వైఎస్సార్ సీపీకి తిరుగులేని ఆధిక్యతను కట్టబెట్టారు. ఇక్కడ నాలుగు మండలాలకు గానూ టీడీపీకి వీఆర్ పురం ఒక్కటే దక్కింది. కూనవరం, చింతూరు, ఎటపాక జెడ్పీటీసీ స్థానాలను వైఎస్సార్ సీపీ కైవసం చేసుకుంది. డివిజన్ కేంద్రం రంపచోడవరం సహా గంగవరం, దేవీపట్నం, అడ్డతీగల, వై.రామవరం తదితర జెడ్పీటీసీలతో పాటు మండల పరిషత్ పీఠాలను కూడా వైఎస్సార్ సీపీ గెలుచుకుంది. కోనసీమలోనూ అదే ప్రభంజనం కోనసీమలో సైతం వైఎస్సార్ సీపీ ప్రభంజనమే కొనసాగుతోంది. అమలాపురం, పి.గన్నవరం, రాజోలు, ముమ్మిడివరం, కొత్తపేట నియోజకవర్గాల్లో 16 మండల పరిషత్‌లు, జెడ్పీటీసీ స్థానాల్లో దాదాపు అన్నింటా వైఎస్సార్ సీపీ దూసుకుపోతోంది. ఈ 16 మండలాల్లో మొత్తం 305 ఎంపీటీసీలకు 90 శాతం స్థానాల్లో అధికార పార్టీ విజయకేతనం ఎగురవేసే దిశగా పరుగులు తీస్తోంది. మరోపక్క మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ రూరల్, రామచంద్రపురం నియోజకవర్గాల్లో వైఎస్సార్ సీపీ అప్రతిహతంగా పయనిస్తోంది. కుప్పకూలిన ‘దేశం’ కంచుకోటలు తెలుగుదేశం పార్టీకి ఒకప్పటి కంచుకోటలన్నీ వైఎస్సార్ సీపీ హోరుగాలిలో నిలవలేక పేకమేడల్లా కుప్పకూలిపోయాయి. ఏజెన్సీ, కోనసీమ, మెట్ట అనే వ్యత్యాసం లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ వైఎస్సార్ సీపీ విజయఢంకా మోగించింది. ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు టీడీపీ అధినేత చంద్రబాబు ఉత్తర కుమార ప్రగల్భాలు పలికినప్పటికీ తెలుగు తమ్ముళ్లు జనసేనతో అపవిత్ర పొత్తు పెట్టుకుని బరిలో నిలిచారు. ఈ రెండు పార్టీలూ అంతర్గత ఒప్పందం చేసుకుని బరిలో దిగినా జిల్లా ప్రజలు మాత్రం వారి అపవిత్ర కలయికను చీల్చి చెండాడారు. టీడీపీలో కాకలు తీరిన యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప వంటి నేతలు సైతం సొంత మండలాల్లో బోర్లా పడ్డారు. ఆయా ప్రాంతాల్లో ఆ పార్టీ ఉనికి కోసం పాకులాడటం కనిపించింది. ఆ ఇద్దరు నేతలూ కనీసం ఒక్క జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాన్ని కూడా దక్కించుకోలేక చేతులెత్తేశారు. టీడీపీలో నంబర్–2గా పిలిపించుకునే యనమల రామకృష్ణుడు స్వగ్రామం ఏవీ నగరంలో టీడీపీ కుప్పకూలిపోయింది. అక్కడ వైఎస్సార్ సీపీ అభ్యర్థి 1,240 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం విశేషం. చినరాజప్ప సొంత నియోజకవర్గం అమలాపురంలో అన్నింటా వైఎస్సార్ సీపీ హవానే కొనసాగుతోంది. ఒకప్పుడు టీడీపీకి కంచుకోటలైన తుని, రాజానగరం, ప్రత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం, మండపేట నియోజకవర్గాల్లో సైతం ప్రజలు ఆ పార్టీని కూకటివేళ్లతో సహా పెకలించివేశారు. ఆయా నియోజకవర్గాల్లోని జెడ్పీటీసీ, అత్యధిక ఎంపీపీ స్థానాల్లో వైఎస్సార్ సీపీ జోరు కొనసాగింది. -
Visakhapatnam: విశాఖపట్నం జిల్లాలో వైఎస్సార్సీపీ హవా
రెండేళ్ల క్రితం మొదలైన వైఎస్సార్సీపీ ప్రభంజనం అదే హోరు.. అదే జోరుతో కొనసాగుతోంది. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటిన అధికార పార్టీ.. పరిషత్ పోరులోనూ ప్రజల మద్దతుతో విజయ దుందుభి మోగించింది. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: పరిపాలన రాజధాని విశాఖ జెడ్పీ పీఠంపై వైఎస్సార్సీపీ జెండా రెపరెపలాడింది. జిల్లాలో మొత్తం 39 జెడ్పీటీసీ స్థానాలుండగా రెండు స్థానాలను మినహాయించి (ఒకటి ఏకగ్రీవం, మరొక స్థానంలో బరిలో ఉన్న అభ్యర్థి మరణించడంతో) 37 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. ఇందులో ఏకంగా 35 స్థానాలను అధికార వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. మిగిలిన రెండు స్థానాల్లో ఒకచోట టీడీపీ గెలువగా... మరో స్థానాన్ని సీపీఎం చేజిక్కించుకుంది. జిల్లా జెడ్పీ పీఠంపై ఎస్టీ మహిళ వైఎస్సార్సీపీ తరపున ఆసీనులు కానున్నారు. ఇక 39 మండలాల్లో 651 ఎంపీటీసీ స్థానాలకుగానూ 612 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. బ్యాలెట్ పేపర్లు వర్షపు నీటితో దెబ్బతినడంతో ఒక స్థానంలో (పాకలపాడు) కౌంటింగ్ నిలిపివేయగా.... 611 స్థానాల్లో మాత్రమే లెక్కింపు జరిపారు. వీటిలో 450 స్థానాల్లో వైఎస్సార్సీపీ, 118 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. ఇక బీజేపీ 6, సీపీఎం 3, కాంగ్రెస్ 2, సీపీఐ 2, జనసేన 2, స్వతంత్రులు 28 స్థానాల్లో గెలుపొందారు. వీటికి గతంలో వైఎస్సార్సీపీ ఖాతాలో పడిన 36 ఏకగ్రీవాలు కలుపుకుంటే ఆ పార్టీ అభ్యర్థులు మొత్తం 486 స్థానాల్లో జయకేతనం ఎగురవేశారు. యలమంచిలి నియోజకవర్గంలోని అన్ని స్థానాలను వైఎస్సార్సీపీనే క్లీన్‌స్వీప్ చేసింది. ఆ నియోజకవర్గంలోని 4 జెడ్పీ స్థానాలతో పాటు 58 ఎంపీటీసీలూ ఆ పార్టీ ఖాతాలోకే చేరాయి. ఫలితంగా ఈ నియోజకవర్గంలో స్థానిక సంస్థల్లో టీడీపీకి కనీసం ప్రాతిని«థ్యమే లేకుండా పోయింది. ఇక మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ప్రాతినిథ్యం వహించిన నర్సీపట్నంతోపాటు మరో సీనియర్ నేత మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి సొంత నియోజకవర్గం పెందుర్తిలోనూ ఆ పార్టీకి చావుదెబ్బ తగిలింది. ఒకవైపు జెడ్పీ పీఠాన్ని తిరుగులేని మెజార్టీతో దక్కించుకున్న వైఎస్సార్సీపీ.... అదే ఊపుతో అన్ని ఎంపీపీలనూ కైవసం చేసుకోనుంది. అయ్యన్న ఇలాకాలో...! మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ప్రాతినిథ్యం వహించిన నర్సీపట్నంలోనూ ఆ పార్టీకి పెద్ద దెబ్బ తగిలింది. అయితే, చావుతప్పి కన్నులొట్టపోయినట్టు 4 జెడ్పీటీసీ స్థానాల్లో ఒకటి దక్కించుకోగా... మిగిలిన మూడింటిలో వైఎస్సార్సీపీ జెండా ఎగిరింది. ఇక ఎంపీటీసీ స్థానాల్లో 58 స్థానాలకుగానూ 57లోనే కౌంటింగ్ జరిగింది. ఇందులో ఏకంగా 43 వైఎస్సార్సీపీ ఖాతాలో చేరాయి. టీడీపీ 14 స్థానాలకే పరిమితమయ్యింది. అంతేకాకుండా నియోజకవర్గంలోని అన్ని ఎంపీపీలనూ వైఎస్సార్సీపీ చేజిక్కించుకుంది. ఇక మరో టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ గతంలో ఎమ్మెల్యేగా ఉన్న పెందుర్తిలోనూ వైఎస్సార్సీపీనే విజయఢంకా మోగించింది. నియోజకవర్గంలోని 3 జెడ్పీలనూ వైఎస్సార్సీపీ గెలుపొందింది. 42 ఎంపీటీసీలలో... 34 స్థానాల్లో వైఎస్సార్సీపీ జెండా రెపరెపలాడింది. ప్రధానంగా గిరిజన ప్రాంతాల్లో మరోసారి వైఎస్సార్సీపీకి తిరుగులేదని నిరూపితమైంది. ఇక యలమంచిలి నియోజకవర్గంలో టీడీపీ తరపున స్థానిక సంస్థల్లో కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా ప్రాతినిథ్యం వహించే పరిస్థితి లేకుండా పోయింది. ప్రభావం చూపించని బీజేపీ, జనసేన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ, జనసేన పార్టీలు పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. కేవలం సీపీఎం మాత్రమే ఒక జెడ్పీటీసీ స్థానాన్ని దక్కించుకుంది. ఎంపీటీసీ స్థానాల్లో కూడా బీజేపీ–6, జనసేన–2 సీపీఎం–3, సీపీఐ–2, కాంగ్రెస్–2 స్థానాలకే పరిమితమయ్యాయి. అయితే, ఈ పార్టీలన్నింటికీ కలుపుకుని 15 ఎంపీటీసీలు రాగా..... స్వతంత్ర అభ్యర్థులు 28 ఎంపీటీసీలను చేజిక్కించుకోవడం గమనార్హం. ఉదయం నుంచే కౌంటింగ్....! ఈ ఎన్నికల్లో 5,76,725 మంది పురుషులు, 5,96,872 మంది మహిళలు (మొత్తం 11,73,601 మంది) ఓటింగులో పాల్గొన్నారు. ఎన్నికల కౌంటింగ్‌ను 1,282 మంది అధికారులు పర్యవేక్షించగా, 3,573 మంది సిబ్బంది లెక్కింపులో పాల్గొన్నారు. మొత్తం 39 కేంద్రాల్లో కౌంటింగ్ జరిగింది. ఉదయం 8 గంటల నుంచే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యింది. కౌంటింగ్ పర్యవేక్షణకు ఎన్నికల సంఘం నియమించిన ఐఏఎస్ అధికారి ఇంతియాజ్‌తో పాటు కలెక్టర్ ఎ.మల్లికార్జున ఉదయం నుంచే కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. ఎక్కడా ఇబ్బంది లేకుండా కౌంటింగ్ సాగేలా చూశారు. పాకలపాడులో కౌంటింగ్ నిలిపివేత పాకలపాడు ఎంపీటీసీ స్థానానికి జరిగిన ఎన్నికకు కౌంటింగ్ నిలిపివేశారు. బ్యాలెట్ బాక్సులోకి వర్షపునీరు చేరి బ్యాలెట్ పేపరు దెబ్బతినడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా అధికారులు కౌంటింగ్ నిలిపివేశారు. ఇక గొలుగొండ జెడ్పీ స్థానంలో వైఎస్సార్సీపీకి 6,900 మెజార్టీ ఉంది. అయితే, ఇంకా ఓట్లు లెక్కించాల్సిన బ్యాలెట్ బాక్సులో కేవలం 1,000 ఓట్లు మాత్రమే ఉన్నాయి. మెజార్టీ లెక్కించాల్సిన ఓట్ల కంటే ఎక్కువగా ఉండటంతో ఈ స్థానం వైఎస్సార్సీపీ ఖాతాలో చేరింది. పీఠం నుంచి పాతాళానికి...! వాస్తవానికి విశాఖపట్నం జిల్లాలో గతంలో టీడీపీ ఆధిపత్యం సాగించేది. 2014లో జరిగిన స్థానిక ఎన్నికల్లో 39 జెడ్పీ స్థానాల్లో 25 చోట్ల టీడీపీ గెలుపొందగా, 14 స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. జెడ్పీ పీఠాన్ని టీడీపీ చేజిక్కించుకుంది. ఏడేళ్ల తర్వాత జరిగిన స్థానిక పోరులో టీడీపీ 25 స్థానాల నుంచి కేవలం ఒకే ఒక స్థానానికే పరిమితమైపోయింది. ఎంపీటీసీ స్థానాల్లోనూ.. 2014లో 341 స్థానాలు రాగా ఇప్పుడు 118 స్థానాలకు పరిమితమైపోయింది. మరోవైపు కొన్ని స్థానాల్లో కనీసం రెండో స్థానంలో కూడా టీడీపీ నిలువలేకపోయింది. పరిపాలన రాజధానిగా విశాఖపట్నాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. టీడీపీ నేతలు వారి అధినేత నిర్ణయానికి అనుగుణంగా అమరావతికే మద్దతు పలికారు తప్ప విశాఖపట్నానికి అనుకూలంగా ఒక్కమాట మాట్లాడలేదు. అంతేకాకుండా రోజుకు ఒకటి చొప్పున టీడీపీ నేతల అవినీతి వ్యవహారం బయటకు వస్తుండటంతో ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ వ్యతిరేకతనే ఇప్పుడు ఓట్ల రూపంలో వారి చెంప చెళ్లుమనిపించారని అర్థమవుతోంది. -
ఎంపీటీసీ, జడ్పీటీసీ కౌంటింగ్: జిల్లాల వారీగా ఫలితాలు
AP MPTC, ZPTC Election Results: ఆంధ్రప్రదేశ్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ హవా కొనసాగుతోంది. పలు నియోజకవర్గాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్సీపీ అధిక్యంలో ఉంది. జిల్లాల వారీగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల సమాచారం.. ► విశాఖపట్నం: విశాఖపట్నం ( మొత్తం స్థానాలు) జడ్పీటీసీ(39) ఎంపీటీసీ( 651) వైఎస్సార్సీపీ 36 452 టీడీపీ 1 114 బీజేపీ 5 ఇతరులు 1 32 ► తూర్పు గోదావరి: తూర్పు గోదావరి ( మొత్తం స్థానాలు) జడ్పీటీసీ(61) ఎంపీటీసీ( 1086) వైఎస్సార్సీపీ 57 712 టీడీపీ 1 61 బీజేపీ 42 ఇతరులు 1 8 ► పశ్చిమ గోదావరి: పశ్చిమ గోదావరి ( మొత్తం స్థానాలు) జడ్పీటీసీ(48) ఎంపీటీసీ( 863) వైఎస్సార్సీపీ 45 642 టీడీపీ 1 80 బీజేపీ 3 ఇతరులు 1 50 ► కృష్ణా: కృష్ణా ( మొత్తం స్థానాలు) జడ్పీటీసీ(46) ఎంపీటీసీ( 723) వైఎస్సార్సీపీ 42 630 టీడీపీ 1 64 బీజేపీ 11 ఇతరులు 6 ► గుంటూరు : గుంటూరు ( మొత్తం స్థానాలు) జడ్పీటీసీ(54) ఎంపీటీసీ( 805) వైఎస్సార్సీపీ 53 704 టీడీపీ - 62 బీజేపీ 0 ఇతరులు 23 ► ప్రకాశం: ప్రకాశం ( మొత్తం స్థానాలు) జడ్పీటీసీ(55) ఎంపీటీసీ( 742) వైఎస్సార్సీపీ 55 649 టీడీపీ - 62 బీజేపీ 3 ఇతరులు 13 ► నెల్లూరు: నెల్లూరు ( మొత్తం స్థానాలు) జడ్పీటీసీ(46) ఎంపీటీసీ( 554) వైఎస్సార్సీపీ 46 494 టీడీపీ - 33 బీజేపీ 2 ఇతరులు 18 ► చిత్తూరు: చిత్తూరు ( మొత్తం స్థానాలు) జడ్పీటీసీ(65) ఎంపీటీసీ( 841) వైఎస్సార్సీపీ 63 817 టీడీపీ - 37 బీజేపీ 0 ఇతరులు 6 ► వైఎస్సార్: వైఎస్సార్ ( మొత్తం స్థానాలు) జడ్పీటీసీ(50) ఎంపీటీసీ( 858) వైఎస్సార్సీపీ 47 520 టీడీపీ 1 16 బీజేపీ 8 ఇతరులు 5 ► కర్నూలు: కర్నూలు ( మొత్తం స్థానాలు) జడ్పీటీసీ(53) ఎంపీటీసీ( 796) వైఎస్సార్సీపీ 52 672 టీడీపీ - 99 బీజేపీ 5 ఇతరులు 14 ► అనంతపురం: అనంతపురం ( మొత్తం స్థానాలు) జడ్పీటీసీ(63) ఎంపీటీసీ( 804) వైఎస్సార్సీపీ 61 742 టీడీపీ 1 47 బీజేపీ 1 ఇతరులు 1 14 ► శ్రీకాకుళం : శ్రీకాకుళం ( మొత్తం స్థానాలు) జడ్పీటీసీ(38) ఎంపీటీసీ( 667) వైఎస్సార్సీపీ 37 562 టీడీపీ - 76 బీజేపీ 2 ఇతరులు 10 ► విజయనగరం : విజయనగరం ( మొత్తం స్థానాలు) జడ్పీటీసీ(34) ఎంపీటీసీ( 549) వైఎస్సార్సీపీ 34 445 టీడీపీ - 85 బీజేపీ 2 ఇతరులు 10 -
Live: ఏపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రజా తీర్పు
AP Local Body Elections Results Live Updates: -
ఆ 23 మంది గెలిస్తే అక్కడ మళ్లీ ఎన్నికలే
సాక్షి, అమరావతి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ సుదీర్ఘకాలంపాటు జరిగినందువల్ల రాష్ట్రంలోని పలుచోట్ల ఓ విచిత్ర పరిస్థితి ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ఆదివారం జరగనున్న ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఓ 23 మంది అభ్యర్థులు గెలిచినా ఆ స్థానాల్లో మళ్లీ ఎన్నిక జరగడం అనివార్యం. ఎందుకంటే.. ఆయాచోట్ల వారు మరణించడమే కారణం. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ముగిసినా హైకోర్టు తీర్పు కారణంగా ఓట్ల లెక్కింపు ఐదున్నర నెలలపాటు నిలిచిపోయింది. ఈ కాలంలో పోలింగ్ జరిగిన పలు స్థానాల్లో పోటీచేసిన అభ్యర్థుల్లో 23 మంది మరణించినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయ అధికారులు నిర్ధారించారు. నేడు 'పరిషత్' ఫలితాలు ఎంపీటీసీ స్థానాల్లో పోటీచేసిన వారు 20 మంది మరణించగా.. జెడ్పీటీసీ స్థానాలలో పోటీచేసిన అభ్యర్థులు ముగ్గురు మరణించారు. దీంతో.. ఈ స్థానాల్లో మరణించిన అభ్యర్థులు గెలుపొందితే ఎలాంటి చర్యలు చేపట్టాలో తెలియజేయాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) కార్యాలయ వివరణ కోరుతూ ఆయా జిల్లాల అధికారులు లేఖ రాశారు. ఇందుకు కమిషన్ స్పందిస్తూ.. ఒకవేళ మృతిచెందిన అభ్యర్థులు విజయం సాధిస్తే ఆ ఫలితాన్ని వెల్లడించి, తిరిగి ఎన్నిక నిర్వహించాల్సిన స్థానాల జాబితాలో ఆ స్థానాలను చేర్చాలని అధికారులు స్పష్టంచేశారు. ఇక నామినేషన్ల ఘట్టానికి, పోలింగ్ ప్రక్రియ మధ్య కూడా ఏడాదిపాటు ఖాళీ ఏర్పడింది. ఈ సమయంలో మరణించిన వారి స్థానాల్లోనూ పోలింగ్‌ను నిలుపుదల చేశారు. -
AP MPTC, ZPTC Election Results: పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనం
లైవ్ అప్డేట్స్.. రాష్ట్రవ్యాప్తంగా 637 జెడ్పీటీసీ స్థానాల ఫలితాలు వెల్లడి కాగా వాటిలో 627 జెడ్పీటీసీ స్థానాలు వైఎస్సార్సీపీ సొంతం చేసుకుని తిరుగులేని ఆధిక్యతను ప్రదర్శించింది. ఇక ఎంపీటీసీ స్థానాల విషయానికి వస్తే ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల్లో వైఎస్సార్సీపీ ఏకంగా 8,075 ఎంపీటీసీ స్థానాలు గెలుచుకుని విజయ ఢంకా మోగించింది. ఇప్పటివరకు వెల్లడైన ఎంపీటీసీ స్థానాల ఫలితాలు ఇలా ఉన్నాయి. కృష్ణా: 648 ఎంపీటీసీ స్థానాల్లో 568 చోట్ల వైఎస్సార్సీపీ గెలుపు. ప్రకాశం: 784 ఎంపీటీ\సీ స్థానాల్లో 668 చోట్ల వైఎస్సార్సీపీ విజయకేతనం నెల్లూరు: 562 ఎంపీటీసీ స్థానాల్లో 400 వైఎస్సార్సీపీ 312 సొంతం చేసుకుని తిరుగులేని విజయం సొంతం చేసుకుంది. తూర్పు గోదావరి: 998 స్థానాల్లో 538 సొంతం చేసుకున్న వైఎస్సార్సీపీ. పశ్చిమ గోదావరి: 781 స్థానాల్లో 577 వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. విశాఖపట్టణం: 612 ఎంపీటీసీ స్థానాలకు వైఎస్సార్సీపీ 450 గెలుచుకుంది. విజయనగరం: 549 ఎంపీటీసీ స్థానాల్లో 433 వైఎస్సార్సీపీ కైవసం శ్రీకాకుళం: 668 ఎంపీటీసీ స్థానాల్లో 562 వైఎస్సార్సీపీ గెలుపు. వైఎస్సార్ కడప: 549 స్థానాల్లో 433 వైఎస్సార్సీపీ విజయం సాధించింది. అనంతపురం: 841 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్ సీపీ 763 సొంతం చేసుకుంది. చిత్తూరు: 886 ఎంపీటీసీ స్థానాల్లో 822 సొంత చేసుకుని వైఎస్సార్సీపీ తిరుగులేని ఆధిక్యత ప్రదర్శించింది. కర్నూలు: 807 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్సీపీ 718 గెలుపొందింది. రాష్ట్రవ్యాప్తంగా 412 జెడ్పీటీసీ స్థానాల ఫలితాలు వెల్లడి కాగా వాటిలో 404 జెడ్పీటీసీ స్థానాలు వైఎస్సార్సీపీ సొంతం చేసుకుని తిరుగులేని ఆధిక్యతను ప్రదర్శించింది. ఇక ఎంపీటీసీ స్థానాల విషయానికి వస్తే ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల్లో వైఎస్సార్సీపీ ఏకంగా 5,462 ఎంపీటీసీ స్థానాలు గెలుచుకుని విజయ ఢంకా మోగించింది. పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ పీఠం కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది. 48 స్థానాల్లో ఇప్పటికే 35 స్థానాల్లో విజయం సాధించింది. మరికొన్ని స్థానాల ఫలితాలు రావాల్సి ఉంది. ఎంపీటీసీ ఇప్పటివరకు 6,242 ఎంపీటీసీ స్థానాల ఫలితాలు వెలువడ్డాయి. వీటిలో అత్యధికంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 5,273 స్థానాలు కైవసం చేసుకుని విజయకేతనం ఎగురవేసింది. జెడ్పీటీసీ ఇక జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి 354 స్థానాల ఫలితాలు ప్రకటించారు. వీటిలో 348 జెడ్పీటీసీలను సొంతం చేసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్ని జిల్లాల జెడ్పీ పీఠాలను కైవసం చేసుకుంది. నాలుగు టీడీపీకి, రాగా ఒకటి సీపీఐ, స్వతంత్రుడు మరొకరు గెలిచారు. కోనసీమలోనూ వైఎస్సార్సీపీ జెండా రెపరెపలాడుతోంది. వెలువడుతున్న ఎన్నికల ఫలితాలన్నీ వైఎస్సార్సీపీ ఖాతాలోనే పడుతున్నాయి. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధిక జెడ్పీటీసీ స్థానాలను సొంతం చేసుకుంటోంది. విజయనగరం: నెల్లూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాల సరసన విజయనగరం చేరింది. విజయనగరంలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. ఉన్న 34 జెడ్పీటీసీ స్థానాల్లో ఆ పార్టీ విజయం సాధించింది. వైఎస్సార్ కడప జిల్లా: కడప జిల్లాలో 50 జెడ్పీటీసీ స్థానాలకు 46 వైఎస్సార్ సీపీ సొంతం చేసుకుంది. ప్రకాశం జిల్లా: ప్రకాశంలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. జిల్లాలోని 56 జెడ్పీటీసీ స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. చిత్తూరు జిల్లా: జెడ్పీ ఎన్నికలతో పాటు మండల పరిషత్ ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీ భారీ ఆధిక్యత ప్రదర్శించింది. చిత్తూరు జిల్లాలో 886 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్సీపీ 822 సొంతం చేసుకుని విజయదుంధుబి మోగించింది. కాగా టీడీపీ కేవలం 25 స్థానాల్లో గెలిచింది. ఈ విజయంతో వైఎస్సార్సీపీ 65 మండల పరిషత్‌లను సొంతం చేసుకుంది. నెల్లూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్. ఆయా జిల్లాల్లోని ఉన్న జెడ్పీటీసీ స్థానాలన్నింటిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది. కృష్ణా జిల్లా: 46 జెడ్పీటీసీ స్థానాల్లో 23 వైఎస్సార్సీపీ సొంతం. గుంటూరు: 54 జెడ్పీటీసీ స్థానాల్లో 27 వైఎస్సార్సీపీ విజయం ప్రకాశం: 56 స్థానాల్లో 56 సొంతం చేసుకున్న వైఎస్సార్సీపీ నెల్లూరు: జిల్లాలో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఉన్న 46 స్థానాలను వైఎస్సార్సీపీ సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది. విశాఖపట్టణం: 39 స్థానాల్లో 30 వైఎస్సార్సీపీ గెలుపు విజయనగరం: 34 జెడ్పీటీసీ స్థానాల్లో 25 వైఎస్సార్సీపీ విజయం సాధించింది. శ్రీకాకుళం: 38 జెడ్పీటీసీ స్థానాల్లో 20 వైఎస్సార్సీపీ కైవసం అనంతపురం: 63 స్థానాల్లో 35 సొంతం చేసుకున్న వైఎస్సార్సీపీ చిత్తూరు: 63 జెడ్పీటీసీ స్థానాల్లో 63 వైఎస్సార్సీపీ విజయం వైఎస్సార్ కడప: 50 స్థానాల్లో 44 గెలిచిన వైఎస్సార్సీపీ కర్నూలు: జెడ్పీటీసీ ఎన్నికల్లో ఉన్న 53లో 51 స్థానాలను వైఎస్సార్సీపీ సొంతం చేసుకుంది. తూర్పు గోదావరి: 61 జెడ్పీటీసీలకు 5 చోట్ల వైఎస్సార్సీపీ గెలిచింది. పశ్చిమ గోదావరి: 48 జెడ్పీటీసీ స్థానాల్లో 32 వైఎస్సార్సీపీ కైవసం. జిల్లా పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటివరకు 186 జెడ్పీటీసీ ఫలితాలు రాగా 184లో వైఎస్సార్సీపీ విజయం సాధించింది. జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయదుంధుబి. రాష్ట్రంలోని 13 జిల్లా పరిషత్‌లలో 11 జెడ్పీలు కైవసం చేసుకుంది. 144 జెడ్పీటీసీ స్థానాల్లో 142 వైఎస్సార్సీపీ సొంతం విజయనగరం జిల్లా: శృంగవరపుకోట నియోజకవర్గం లక్కవరపుపేట జెడ్పీటీసీ వైఎస్సార్సీపీ విజయం అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం: ముదిగుబ్బ జెడ్పీటీసీ వైఎస్సార్సీపీ విజయం గుంతకల్లు నియోజకవర్గం: గుత్తిలో జెడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం గుంతకల్లు నియోజకవర్గం: గుంతకల్లు జెడ్పీటీసీ వైఎస్సార్సీపీ విజయం కృష్ణాజిల్లా: పెడన నియోజకవర్గం కృత్తివెన్ను జెడ్పీటీసీ వైఎస్సార్సీపీ విజయం. పశ్చిమ గోదావరి: ఉంగుటూరు నియోజకవర్గం గణపవరం జెడ్పీటీసీ వైఎస్సార్సీపీ విజయం శ్రీకాకుళం: చీపురుపల్లి నియోజకవర్గం గుర్ల జెడ్పీటీసీ వైఎస్సార్సీపీ విజయం శ్రీకాకుళం: పాలకొండ నియోజకవర్గం వీరఘట్టం జెడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం ప్రకాశం: కందుకూరు గుడ్లూరు జెడ్పీటీసీ వైఎస్సార్సీపీ విజయం అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం బుక్కపట్నం జెడ్పీటీసీ వైఎస్సార్సీపీ గెలుపు ఆమడగూరు జెడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం ఓబులదేవచెరువు వైఎస్సార్సీపీ విజయం కొత్తచెరువు జెడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం నల్లమాడ జెడ్పీటీసీ వైఎస్సార్సీపీ విజయం బుక్కపట్నం వైఎస్సార్సీపీ సొంతం అనంతపురం: దర్శి నియోజకవర్గం కురిచేడు వైఎస్సార్సీపీ విజయం. చిత్తూరు: జీడీ నెల్లూరు నియోజకవర్గం ఎస్సార్ పురం జెడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం. 13,335 ఓట్ల మెజార్టీతో రమణ ప్రసాద్ రెడ్డి విజయం. వైఎస్సార్ కడప: రాజంపేట నియోజకవర్గం నందలూరు జెడ్పీటీసీ వైఎస్సార్సీపీ వశం. కర్నూలు: శ్రీశైలం నియోజకవర్గం మహానంది జెడ్పీటీసీ వైఎస్సార్సీపీ సొంతం. విశాఖపట్టణం: అనకాపల్లి నియోజకవర్గం అనకాపల్లి జెడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం. విశాఖపట్టణం: పాడేరు నియోజకవర్గం పాడేరు జెడ్పీటీసీ వైఎస్సార్సీపీ విజయం. ►అనంతపురం: పెనుగొండ నియోజకవర్గం పెనుగొండ జడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. 8,856 ఓట్ల మెజార్టీతో శ్రీరాములు గెలుపొందారు. పెనుగొండ నియోజకవర్గం సోమందేవపల్లి జడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. 4,348 ఓట్ల మెజార్టీతో డీసీ అశోక్ గెలుపు పొందారు. ►ఇప్పటివరకు 3129 ఎంపీటీసీ ఫలితాలు వైఎస్సార్సీపీ-2773, టీడీపీ-267, బీజేపీ-7 విశాఖపట్నం: యలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి జడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. 16,097 ఓట్ల మెజార్టీతో ధూళి నాగరాజు గెలుపొందారు. విశాఖ: అరకు నియెజకవర్గం పెదబయలు జడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. 500 ఓట్ల మెజార్టీతో బొంజుబాబు గెలుపొందారు. ప్రకాశం: యర్రగొండపాలెం నియోజకవర్గం యర్రగొండపాలెం జడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. 12,906 ఓట్ల మెజార్టీతో విజయభాస్కర్ గెలుపొందారు. చిత్తూరు జిల్లా: మదనపల్లి నియోజకవర్గం నిమ్మనపల్లి జడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. 5,464 ఓట్ల మెజార్టీతో ప్రమీలమ్మ గెలుపొందారు. మదనపల్లి నియోజకవర్గం రామ సముద్రం జడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. 9, 875 ఓట్ల మెజార్టీతో సీహెచ్ రామచంద్రారెడ్డి గెలుపొందారు. విజయనగరం: గజపతినగరం జడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. 17,971 ఓట్ల మెజార్టీతో గార తవుడు గెలుపొందారు. అనంతపురంలో రెచ్చిపోయిన టీడీపీ నేతలు అనంతపురం: జిల్లాలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. ఆత్మకూరు మండలం ముట్టాల ఎంపీటీసీ స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి విజయం సాధించారు. 65 ఓట్లతో వైఎస్సార్సీపీ అభ్యర్థి పుణ్యశ్రీ విజయం సాధించారు. దాంతో టీడీపీ నేతలు వాదనకు దిగారు. ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో వైఎస్సార్సీపీ విజయం పామర్రు మండలం నిమ్మకూరు ఎంపీటీసీ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. నిమ్మకూరును నారా లోకేష్ దత్తత తీసుకోగా, ఆయనను ప్రజలు విశ్వసించలేదు. చరిత్రలో తొలిసారి పామర్రు ఎంపీపీని వైఎస్సార్సీపీ దక్కించుకుంది. వైఎస్సార్సీపీ ప్రభంజనం చిత్తూరు: పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించింది. జీడీ నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్పురం జడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. 13,335 ఓట్ల మెజార్టీతో రమణ ప్రసాద్‌రెడ్డి గెలుపొందారు. జీడీ నెల్లూరు నియోజకవర్గం పాల సముద్రం జడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. 6,758 ఓట్ల మెజార్టీతో అన్బలగన్ గెలుపొందారు. చంద్రబాబుకు షాక్.. పరిషత్ ఎన్నికల్లో నారావారిపల్లిలో చంద్రబాబుకు షాక్ తగిలింది. నారావారిపల్లి ఎంపీటీసీ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి గంగాధరం పరాజయం పొందారు. 1,347 ఓట్ల మెజార్టీతో వైఎస్సార్సీపీ అభ్యర్థి రాజయ్య గెలుపొందారు. టీడీపీకి అభ్యర్థికి కేవలం 307 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ►ఇప్పటివరకు 1562 ఎంపీటీసీ ఫలితాలు వెలువడ్డాయి. వైఎస్సార్సీపీ 1399, టీడీపీ 120, బీజేపీ 7. ►వైఎస్సార్‌జిల్లా పరిషత్ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. 50కిగాను ఇప్పటివరకు 40 స్థానాలను వైఎస్సార్సీపీ గెలుచుకుంది. ప్రకాశం: త్రిపురాంతకం జడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. 10,930 ఓట్ల మెజార్టీతో మాకం జాన్‌పాల్ గెలుపొందారు. ప్రకాశం: కొనకనమిట్ల జడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం. 16,681 ఓట్ల మెజార్టీతో అక్కి దాసరి ఏడుకొండలు గెలుపు ప్రకాశం: గుడ్లూరు జడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం. 11,464 ఓట్ల మెజార్టీతో కొరిసిపాటి బాపిరెడ్డి గెలుపు ప్రకాశం: కురిచేడు జడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం. 5,930 ఓట్ల మెజార్టీతో వెంకట నాగిరెడ్డి గెలుపు ►పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ హవా కొనసాగుతోంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాల్లో ఫ్యాన్ దూసుకుపోతోంది. అనేక చోట్ల సింగిల్ డిజిట్‌కే టీడీపీ పరిమితమైంది. ►వైఎస్సార్ జిల్లా: నందలూరు జడ్పీటీసీ వైఎస్సార్ కైవసం చేసుకుంది. 20,849 ఓట్ల మెజార్టీతో గడికోట ఉషారాణి విజయం సాధించారు. ►కర్నూలు జిల్లాలో ఇప్పటివరకు 202 ఎంపీటీసీ ఫలితాలు.. మిగిలిన 282 ఎంపీటీసీ స్థానాలకు కొనసాగుతున్న కౌంటింగ్ వైఎస్సార్సీపీ-184, టీడీపీ-15 బీజేపీ-1, ఇతరులు-2 ►వైఎస్సార్ జిల్లాలో ఇప్పటివరకు 20 ఎంపీటీసీ ఫలితాలు దేవినేని ఉమా ఇలాకాలో వైఎస్సార్సీపీ హవా స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్సీపీ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. విజయవాడ: దేవినేని ఉమా ఇలాకాలో వైఎస్సార్సీపీ హవా ప్రదర్శించింది. గొల్లపూడిలో 10 ఎంపీటీసీలకు 10 వైఎస్సార్సీ కైవసం చేసుకుంది. ►వైఎస్సార్ జిల్లా: రాజుపాలెం మండలంలో వైఎస్సార్సీపీ క్లీన్‌స్వీప్. 9 ఎంపీటీసీ స్థానాలకు 9 వైఎస్సార్సీపీ కైవసం. ►విజయనగరం: మెరముడిదం మండలంలో వైఎస్సార్సీపీ క్లీన్‌స్వీప్. 16 ఎంపీటీసీలకు 16 వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. ►అనంతపురం: తాడిమర్రి మండలంలో వైఎస్సార్సీపీ క్లీన్‌స్వీప్. 9 ఎంపీటీసీ స్థానాలకు 9 వైఎస్సార్సీపీ కైవసం. ►చిత్తూరు: నిమ్మనపల్లి మండలంలో వైఎస్సార్సీపీ క్లీన్‌స్వీప్. 9 ఎంపీటీసీ స్థానాలకు 9 వైఎస్సార్సీపీ కైవసం ►ప్రకాశం: మర్రిపూడి మండలంలో వైఎస్సార్సీపీ క్లీన్‌స్వీప్. 11 ఎంపీటీసీ స్థానాలకు 11 వైఎస్సార్సీపీ కైవసం ►ప్రకాశం: మార్కాపురం జడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. 15,315 మెజార్టీతో వైఎస్సార్సీ అభ్యర్థి బాపన్నరెడ్డి విజయం సాధించారు. ►విశాఖపట్నం: 45 ఓట్ల మెజార్టీతో జీకే వీధి ఎంపీటీసీ(వైఎస్సార్సీపీ) గెలుపు ►ప్రకాశం: తుర్లుపాడు జడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. 10,335 ఓట్ల మెజార్టీతో వైఎస్సార్సీపీ అభ్యర్థి వెన్న ఇందిర గెలుపు పొందారు. ►ప్రకాశం: జిల్లాలో రెండు జడ్పీటీసీలు వైఎస్సార్సీపీ కైవసం ►చిత్తూరు: ఎస్ఆర్పురం జడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. 13,335 ఓట్ల మెజార్టీతో రమణ ప్రసాద్‌రెడ్డి గెలుపొందారు. ►కర్నూలు: మహానంది జడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం. 13,288 ఓట్ల మెజార్టీతో కేవీఆర్ మహేశ్వర్‌రెడ్డి గెలుపు పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ హవా చిత్తూరు: పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ హవా కొనసాగుతోంది. 1573 ఓట్ల మెజార్టీతో బుగ్గపట్నం ఎంపీటీసీ(వైఎస్సార్సీపీ) గెలుపు పొందారు. 1073 ఓట్ల మెజార్టీతో టీ.సదుం ఎంపీటీసీ(వైఎస్సార్సీపీ) గెలుపొందారు. ప్రశాంతంగా ఎన్నికల కౌంటింగ్ పరిషత్ ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా కొనసాగుతుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. రాత్రి లోపు పూర్తిస్థాయి ఫలితాలు ప్రకటిస్తామన్నారు. ఐదారు చోట్ల బ్యాలెట్ బాక్సుల్లో నీళ్లు చేరాయని తెలిపారు. బ్యాలెట్ బాక్సులు పూర్తిగా తెరిచాక స్పష్టత వస్తుందని ఆయన తెలిపారు. ►విజయనగరం: 44 ఓట్ల మెజార్టీతో గంజాయి భద్ర ఎంపీటీసీ(వైఎస్సార్సీపీ) గెలుపు ►అనంతపురం: 1331 ఓట్ల మెజార్టీతో వెన్న పూసపల్లి ఎంపీపీటీ(వైఎస్సార్సీపీ) గెలుపు ►కృష్ణా జిల్లా: 180 ఓట్ల మెజార్టీతో పాములంక ఎంపీటీసీ(వైఎస్సార్సీపీ) గెలుపు ►కృష్ణా: 585 ఓట్ల మెజార్టీతో ఆటపాక ఎంపీటీసీ(వైఎస్సార్సీపీ) గెలుపు ►విజయనగరం: 1629 ఓట్ల మెజార్టీతో ఉత్తరవల్లి ఎంపీటీసీ( వైఎస్సార్సీపీ) గెలుపు) ►ప్రకాశం: 1645 ఓట్ల మెజార్టీతో సంతమాగులూరుఏ-1 ఎంపీటీసీ(వైఎస్సార్సీపీ) గెలుపు ►ప్రకాశం: 434 ఓట్ల మెజార్టీతో ఊళ్లపాలెం ఎంపీటీసీ(వైఎస్సార్సీపీ) గెలుపు మాచర్ల నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ క్లీన్‌స్వీప్ గుంటూరు: మాచర్ల నియెజకవర్గంలో వైఎస్సార్సీపీ క్లీన్‌స్వీప్ చేసింది. ఐదు జీడ్పీటీసీ స్థానాలకు ఐదూ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. 71 ఎంపీటీసీ స్థానాలకు 71 వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. బాబు ఇలాకాలో ఫ్యాన్ గాలి.. చిత్తూరు జిల్లా: చంద్రబాబు ఇలాకాలో ఫ్యాన్ గాలి వీచింది. కుప్పం మండలం టీ సద్దుమూరు ఎంపీటీసీ స్థానం వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. టీడీపీ అభ్యర్థిపై వైఎస్సార్సీపీ అభ్యర్థి అశ్విని 1073 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. ►విజయనగరం: పరిషత్ ఎన్నికలల్లో వైఎస్సార్సీపీ హవా కొనసాగుతోంది. సీతానగరం మండలంలో 17 ఎంపీటీసీ స్థానాలకు ఆరు ఏకగ్రీవం కాగా, మిగిలిన 11 ఎంపీటీసీ స్థానాల్లో 5 చోట్ల వైఎస్సార్సీపీ విజయం సాధించింది. ►పశ్చిమగోదావరి: 613 ఓట్ల మెజార్టీతో శ్రీరామపురం ఎంపీటీసీ(వైఎస్సార్సీపీ) గెలుపు ►వైఎస్సార్ జిల్లా: 490 ఓట్ల మెజార్టీతో ఎస్.కొత్తపల్లి ఎంపీటీసీ(వైఎస్సార్సీపీ గెలుపు ►వైఎస్సార్ జిల్లా: 1682 ఓట్ల మెజార్టీతో పెద్దకారంపల్లి ఎంపీటీసీ (వైఎస్సార్సీపీ) గెలుపు ►వైఎస్సార్ జిల్లా: 490 ఓట్ల మెజార్టీతో ఎస్.కొత్తపల్లి ఎంపీటీసీ(వైఎస్సార్సీపీ గెలుపు ►వైఎస్సార్ జిల్లా: 1682 ఓట్ల మెజార్టీతో పెద్దకారంపలల్లి ఎంపీటీసీ (వైఎస్సార్సీపీ) గెలుపు ►కృష్ణా: 372 ఓట్ల మెజార్టీతో అక్కపాలెం ఎంపీటీసీ (వైఎస్సార్సీపీ) గెలుపు ►చిత్తూరు: 616 ఓట్ల మెజార్టీతో పాత వెంకటాపురం ఎంపీటీసీ(వైఎస్సార్సీపీ) గెలుపు ►వైఎస్సార్ జిల్లా: 883 ఓట్ల మెజార్టీతో ఊటుకురు-2 ఎంపీటీసీ(వైఎస్సార్సీపీ) గెలుపు ►అనంతపురం: 882 ఓట్ల మెజార్టీతో దంచర్ల ఎంపీటీసీ( వైఎస్సార్సీపీ) గెలుపు ►అనంతపురం: 729 ఓట్ల మెజార్టీతో అమ్మలదిన్నె ఎంపీటీసీ(వైఎస్సార్సీపీ) గెలుపు ►చిత్తూరు: 1573 ఓట్ల మెజార్టీతో బుగ్గపట్నం ఎంపీటీసీ(వైఎస్సార్సీపీ) గెలుపు ►అనంతపురం: రామగిరి జడ్పీటీసీ పోస్టల్ బ్యాలెట్లో వైఎస్సార్సీపీ ఆధిక్యం ►వైఎస్సార్ జిల్లా: జమ్మలమడుగు జడ్పీటీసీ పోస్టల్ బ్యాలెట్లో వైఎస్సార్సీపీ ఆధిక్యం ►వైఎస్సార్ జిల్లా: బంటుపల్లి జడ్పీటీసీ పోస్టల్ బ్యాలెట్లో వైఎస్సార్సీపీ ఆధిక్యం ►పశ్చిమగోదావరి: జీలుగుమిల్లి జడ్పీటీసీ పోస్టల్ బ్యాలెట్లో వైఎస్సార్సీపీ ఆధిక్యం ►కృష్ణా: పెడన జడ్పీటీసీ పోస్టల్‌బ్యాలెట్‌లో వైఎస్సార్సీపీ ఆధిక్యం ►పోస్టల్ బ్యాలెట్లో వైఎస్సార్సీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ►నెల్లూరు: 766 ఓట్ల మెజార్టీతో ఆమంచర్ల ఎంపీటీసీ(వైఎస్సార్సీపీ) గెలుపు ►పశ్చిమగోదావరి: వేలేరుపాడు జడ్పీటీసీ పోస్టల్ బ్యాలెట్లో వైఎస్సార్సీపీ ఆధిక్యం ►నెల్లూరు: కలిగిరి జడ్పీటీసీ పోస్టల్ బ్యాలెట్లో వైఎస్సార్సీపీ ఆధిక్యం వైఎస్సార్ జిల్లా: జమ్మలమడుగు జడ్పీటీసీ పోస్టల్ బ్యాలెట్లో వైఎస్సార్సీపీ ఆధిక్యం ►అనంతపురం: కనగాపల్లి జడ్పీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థి మారుతి ప్రసాద్ ఆధిక్యం ఉరవకొండ జడ్పీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థి పార్వతమ్మ ఆధిక్యం తనకల్లు జడ్పీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థి జక్కల జ్యోతి ఆధిక్యం పెద్దవడుగూరు జడ్పీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థి భాస్కర్‌రెడ్డి ముందంజ కంబదూరు జడ్పీటీసీ పోస్టల్ బ్యాలెట్లో వైఎస్సార్సీపీ ఆధిక్యం ►వైఎస్సార్ జిల్లా: కమలాపురం మండలం దేవరాజుపల్లి దేవరాజుపల్లి ఎంపీటీసీ (వైఎస్సార్సీపీ) గెలుపొందారు. 186 ఓట్ల మెజార్టీతో వైఎస్సార్సీపీ అభ్యర్థి చెన్నకేశవరెడ్డి విజయం సాధించారు. ►విజయనగరం: జిల్లా వ్యాప్తంగా పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 31 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. 31 జడ్పీటీసీ, 487 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్ జరుగుతోంది. కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి ఆన్లైన్ ద్వారా ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను జిల్లా కలెక్టర్ పర్యవేక్షిస్తున్నారు. ►పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం డివిజన్ పరిధిలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. పోస్టల్ బ్యాలెట్లో వైఎస్సార్సీపీ ఆధిక్యంలో ఉంది. ►ఆంధ్రప్రదేశ్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. 515 జడ్పీటీసీ, 7216 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్ జరుగుతోంది. ► 7,219 ఎంపీటీసీ.. 515 జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసిన వారి భవితవ్యం తేలబోతోంది. హైకోర్టు తీర్పు కారణంగా ఐదున్నర నెలలుగా ప్రజా తీర్పు స్ట్రాంగ్ రూంలకే పరిమితం అయిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 8వ తేదీన ఆయా స్థానాలకు జరిగిన పోలింగ్‌లో మొత్తం 1,29,55,980 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ►ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో పూర్తి స్థాయిలో కోవిడ్ నింబంధనలు పాటించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఇప్పటికే జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కౌంటింగ్ సిబ్బందితో పాటు అభ్యర్థుల తరుఫున హాజరయ్యే ఏజెంట్లు కరోనా వ్యాక్సినేషన్ వేయించుకొని ఉండాలనే ఆదేశాలు వెళ్లాయి. ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి మండలాల వారీగా ఒక్కో స్థానానికి ఒకటి చొప్పున 7,219 టేబుళ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 515 జెడ్పీటీసీ స్థానాల ఓట్ల లెక్కింపు కోసం వేరుగా 4,008 టేబుళ్లను సిద్ధం చేశారు. జిల్లాల వారీగా.. శ్రీకాకుళం: 37 జడ్పీటీసీ, 590 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్ విజయనగరం: 31 జడ్పీటీసీ, 487 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్ విశాఖపట్నం: 37 జడ్పీటీసీ, 612 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్ తూర్పు గోదావరి: 61 జడ్పీటీసీ, 996 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్ పశ్చిమ గోదావరి: 45 జడ్పీటీసీ, 781 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్ కృష్ణా: 41 జడ్పీటీసీ, 648 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్ గుంటూరు : 45 జడ్పీటీసీ, 571 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్ ప్రకాశం: 41 జడ్పీటీసీ, 368 ఎంపీటీసీ స్థానాలకుకౌంటింగ్ నెల్లూరు: 34 జడ్పీటీసీ, 362 ఎంపీటీసీ స్థానాలకుకౌంటింగ్ చిత్తూరు: 33 జడ్పీటీసీ, 419 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్ వైఎస్సార్: 12 జడ్పీటీసీ, 117 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్ కర్నూలు: 36 జడ్పీటీసీ, 484 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్ అనంతపురం: 62 జడ్పీటీసీ, 781 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్ సాక్షి, అమరావతి: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు ఎట్టకేలకు ఆదివారం వెల్లడి కాబోతున్నాయి. 7,219 ఎంపీటీసీ.. 515 జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసిన ఏడాదిన్నర తర్వాత నేడు వారి భవితవ్యం తేలబోతోంది. ఏప్రిల్ 8వ తేదీన ఆయా స్థానాలకు జరిగిన పోలింగ్‌లో మొత్తం 1,29,55,980 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. హైకోర్టు తీర్పు కారణంగా ఐదున్నర నెలలుగా ప్రజా తీర్పు స్ట్రాంగ్ రూంలకే పరిమితం అయిన విషయం తెలిసిందే. చదవండి: ఆ 23 మంది గెలిస్తే అక్కడ మళ్లీ ఎన్నికలే మూడు రోజుల క్రితమే హైకోర్టు డివిజన్ బెంచ్ ఓట్ల లెక్కింపునకు అనుమతించడంతో రాష్ట్ర వ్యాప్తంగా 206 కేంద్రాల్లోని 209 ప్రదేశాలలో ఓట్ల లెక్కింపు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఒక్కో కౌంటింగ్ కేంద్రంలో మండలాల వారీగా వేర్వేరుగా ఓట్ల లెక్కింపు కోసం వేర్వేరు హాళ్లను సిద్ధం చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు జిల్లాల్లో చేపట్టిన ఏర్పాట్లపై సమీక్షించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని శనివారం ఉదయం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులతో కలిసి ఓట్ల లెక్కింపు ప్రక్రియలో మొత్తం 44,155 మంది సిబ్బంది పని చేయనున్నారు. పూర్తి స్థాయిలో ఏర్పాట్లు ► ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో పూర్తి స్థాయిలో కోవిడ్ నింబంధనలు పాటించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఇప్పటికే జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కౌంటింగ్ సిబ్బందితో పాటు అభ్యర్థుల తరుఫున హాజరయ్యే ఏజెంట్లు కరోనా వ్యాక్సినేషన్ వేయించుకొని ఉండాలనే ఆదేశాలు వెళ్లాయి. ► ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి మండలాల వారీగా ఒక్కో స్థానానికి ఒకటి చొప్పున 7,219 టేబుళ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 515 జెడ్పీటీసీ స్థానాల ఓట్ల లెక్కింపు కోసం వేరుగా 4,008 టేబుళ్లను సిద్ధం చేశారు. చదవండి: 30 వరకు నైట్ కర్ఫ్యూ ఐదున్నర నెలల తర్వాత.. బ్యాలెట్ బాక్స్‌లు దాచి ఉంచిన స్ట్రాంగ్ రూంలను పోలింగ్ జరిగిన ఐదు నెలల తర్వాత తెరవనున్నారు. దీంతో మొదట బ్యాలెట్ బాక్స్‌లు శుభ్రం చేసుకోవడం వంటి కారణాలతో ఓట్ల లెక్కింపు ప్రక్రియ నీర్ణీత సమయం కంటే కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. దీనికితోడు బ్యాలెట్ పేపరు ద్వారా ఎన్నికలు కావడంతో లెక్కింపు ప్రక్రియ ఆలస్యమవుతుందని అధికారులు భావిస్తున్నారు. అయినప్పటికీ మధ్యాహ్నం రెండు గంటల సమయానికి దాదాపు అన్ని చోట్ల ఎంపీటీసీ ఎన్నికల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని.. జెడ్పీటీసీ ఫలితాలు మాత్రం రాత్రి వరకు సమయం పట్టే అవకాశం ఉందని అధికారుల వర్గాలు పేర్కొన్నాయి. అన్ని జాగ్రత్తల మధ్య కౌంటింగ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ సూచించిన మేరకు పూర్తి స్థాయిలో కోవిడ్ జాగ్రత్తలను పాటిస్తూ.. ఓట్ల లెక్కింపునకు తగిన రక్షణ ఏర్పాట్లు చేశాం. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేలా సిబ్బందికి శిక్షణ ఇచ్చాం. అభ్యర్థి, కౌంటింగ్ ఏజెంట్లు రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తయినట్లు ధృవీకరణ పత్రం చూపాలి. లేదా ర్యాపిడ్ యాంటి జెన్ టెస్ట్/ఆర్టీపీసీఆర్ టెస్ట్‌లో నెగటివ్ ఉంటేనే లెక్కింపు కేంద్రం లోపలికి అనుమతిస్తామని ఇప్పటికే తెలిపాం. రాష్ట్ర స్థాయిలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం. 13 జిల్లాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షించడానికి 13 మంది అధికారులను నియమించాం. – గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి -
MPTC, ZPTC Elections: కౌంట్‌డౌన్!
సాక్షి, అమరావతి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ నిర్వహణ ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ శుక్రవారం కలెక్టర్లు, జెడ్పీ సీఈవోలు, డీపీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్ తదితరులు పాల్గొంటారు. రాష్ట్రవ్యాప్తంగా 7,220 ఎంపీటీసీ స్థానాలకు, 515 జెడ్పీటీసీ స్థానాలకు ఈ ఏడాది ఏప్రిల్ 8వ తేదీనే ఎన్నికలు జరిగినప్పటికీ న్యాయ వివాదాలతో కౌంటింగ్ ప్రక్రియ వాయిదా పడింది. దాదాపు ఆరు నెలల అనంతరం గురువారం ఉదయం హైకోర్టు డివిజన్ బెంచ్ ఎన్నికల కౌంటింగ్ నిర్వహించేందుకు అనుమతించడంతో 19వ తేదీన కౌంటింగ్ జరపనున్నట్టు ఎన్నికల కమిషనర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. తేలనున్న అభ్యర్థుల భవితవ్యం వరుసగా చోటు చేసుకున్న వివిధ పరిణామాలతో పరిషత్ ఎన్నికల ప్రక్రియ సుదీర్ఘ కాలంగా కొనసాగుతోంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు మొదట 2020 మార్చి 7వ తేదీన నోటిఫికేషన్ జారీ అయింది. నోటిఫికేషన్ జారీ అయి ఇప్పటికి ఏడాదిన్నర దాటిపోయింది. ఆ నోటిఫికేషన్ ప్రకారం 2020 మార్చి 21వ తేదీన ఓటింగ్ ప్రక్రియ నిర్వహించి అదే ఏడాది మార్చి 24న కౌంటింగ్ పూర్తి చేయాలి. కానీ నామినేషన్ల దాఖలు, ఉపసంహరణ ప్రక్రియ ముగిసిపోయి అభ్యర్ధుల తుది జాబితా ఖరారైన తర్వాత అప్పటి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ కరోనా పేరుతో మార్చి 15వ తేదీన ఎన్నికల ప్రక్రియను వాయిదా వేశారు. తిరిగి ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి, మార్చిలో పంచాయతీ, మునిసిపల్ ఎన్నికలు నిర్వహించిన సమయంలో అవకాశం ఉన్నా ఉద్దేశపూర్వకంగానే పరిషత్ ఎన్నికలు జరపకుండా కాలయాపన చేశారనే విమర్శలున్నాయి. అనంతరం నిమ్మగడ్డ స్థానంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని బాధ్యతలు చేపట్టిన వెంటనే ఈ ఏడాది ఏప్రిల్ ఒకటవ తేదీన మధ్యలో ఆగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేసి 8వ తేదీన ఓటింగ్ ప్రక్రియను పూర్తి చేశారు. -
AP: 19న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్
సాక్షి, అమరావతి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ధర్మాసనం తాజాగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఈనెల 19వ తేదీన ‘పరిషత్’ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను చేపట్టి అదేరోజు ఫలితాలను వెల్లడించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని గురువారం రాత్రి నోటిఫికేషన్ జారీ చేశారు. ఆదివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా న్యాయస్థానం ఆదేశాల మేరకు కోవిడ్ నియంత్రణ చర్యలను కట్టుదిట్టంగా అమలు చేయాలని, విజయోత్సవాలు నిర్వహించరాదని ఎస్ఈసీ స్పష్టం చేశారు. పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఈనెల 18వతేదీ సాయంత్రం ఐదు గంటలలోగా కౌంటింగ్ ఏజెంట్ల వివరాలను ఆర్వోలకు అందచేయాలని సూచించారు. చదవండి: గ్రహణం వీడింది: సజ్జల ఆ వ్యాఖ్యలపై ఆక్షేపణ.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు అంతకుముందు ఉదయం హైకోర్టు ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఓట్ల లెక్కింపు సందర్భంగా కోవిడ్ మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. ఓట్ల లెక్కింపు చేపట్టవద్దని, ఫలితాలను వెల్లడించవద్దని గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేసింది. మరోవైపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు గతంలో ఏ దశలో నిలిచిపోయాయో అక్కడి నుంచి తిరిగి నిర్వహించేందుకు వీలుగా మళ్లీ తాజా నోటిఫికేషన్ జారీ చేయాలని ఆదేశిస్తూ సింగిల్ జడ్జి ఈ ఏడాది మే 21న ఇచ్చిన ఆదేశాలను ధర్మాసనం రద్దు చేసింది. ఈ తీర్పులో ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిపై న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలను ధర్మాసనం ఆక్షేపించింది. అలాంటి వ్యాఖ్యలు ఎంత మాత్రం అవసరం లేదని పేర్కొంది. సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేసినందున, ఆ తీర్పులోని వ్యాఖ్యలకు అంత ప్రాధాన్యం ఉండదని ధర్మాసనం స్పష్టం చేసింది. సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని దాఖలు చేసిన అప్పీల్‌ను అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ జవలాకర్ ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. చదవండి: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ నిమిత్తం ఈ ఏడాది ఆగస్టు 1న ఎన్నికల కమిషనర్ జారీ చేసిన నోటిఫికేషన్ పోటీ చేసే అభ్యర్థులందరికీ సమాన అవకాశాలు కల్పించలేదనడం అర్థం కాకుండా ఉందని తీర్పులో హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆ నోటిఫికేషన్ రాష్ట్రంలో పోటీ చేసే అభ్యర్థులందరికీ వర్తిస్తున్నప్పుడు అది ఏ రకంగా అభ్యర్థుల హక్కులను హరిస్తుందో అర్థం కావడం లేదంది. వాస్తవానికి జనసేన నేత అభ్యర్థన ఎన్నికలను ఎక్కడ ఆపారో ఆ దశ నుంచి కాకుండా తిరిగి మొదటి నుంచి పెట్టాలన్నదేనని, అయితే ఈ అభ్యర్థనను సింగిల్ జడ్జి తన తీర్పులో తిరస్కరించారని ధర్మాసనం తెలిపింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నాలుగు వారాల ముందు ఎన్నికల నియామావళిని అమలు చేయాలన్న వర్ల రామయ్య అభ్యర్థనను జనసేన నేత వ్యాజ్యంలో పరిగణలోకి తీసుకున్నారని అనుకున్నా.. ఏప్రిల్ 1న ఎన్నికల నోటిఫికేషన్ సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఉద్దేశపూర్వకంగా ఇచ్చారని సింగిల్ జడ్జి పేర్కొనడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ధర్మాసనం తన తీర్పులో స్పష్టం చేసింది. ఎన్నికల కమిషనర్ ఏప్రిల్ 1న ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడమే కాకుండా, ఎన్నికలను నిలుపుదల చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై వెంటనే ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేయడాన్ని సింగిల్ జడ్జి తన తీర్పులో తప్పుపట్టారని, ఇది ఎంత మాత్రం సరికాదని ధర్మాసనం తెలిపింది. చట్టబద్ధంగా అప్పీల్ దాఖలు చేసినప్పుడు దాన్ని విమర్శించాల్సిన అవసరం లేదని సూచించింది. ‘సుప్రీం’ ఆదేశాలను పాటించినట్లే ఎన్నికల నిర్వహణకు నాలుగు వారాల ముందు నియమావళిని అమలు చేయాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులను గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా అమలు చేశారని, ఇది సుప్రీంకోర్టు ఆదేశాలను సంతృప్తిపరచడమే అవుతుందని తీర్పు సందర్భంగా హైకోర్టు స్పష్టం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలకు 4 వారాల ముందు ఎన్నికల నియమావళిని అమలు చేయాలన్నది సుప్రీంకోర్టు ఆదేశమే తప్ప, ప్రతీ ఎన్నికకు 4 వారాల ముందు నియమావళిని అమలు చేయాలన్నది సుప్రీంకోర్టు ఉద్దేశం కాదని పేర్కొంది. పిటిషన్లో ప్రస్తావించకున్నా.. మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు నాలుగు వారాల పాటు ఎన్నికల నియమావళిని అమలు చేయనప్పుడు టీడీపీ నేత వర్ల రామయ్య ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని ధర్మాసనం తన తీర్పులో ప్రస్తావించింది. జనసేన నేత చిల్లపల్లి శ్రీనివాసరావు తన వ్యాజ్యంలో ఎన్నికల నియమావళి ఉల్లంఘన గురించి కనీసం ఎలాంటి అభ్యర్థన చేయలేదని తెలిపింది. అయినప్పటికీ సింగిల్ జడ్జి తన తీర్పులో ఎన్నికల నియమావళి ఉల్లంఘనను జనసేన ప్రస్తావించిందని, నియమావళిని అమలు చేయకపోవడం వల్ల పోటీ చేసే అభ్యర్థుల హక్కులకు విఘాతం కలిగినట్లు నిరూపించారని అందులో పేర్కొన్నారని ధర్మాసనం తెలిపింది. సింగిల్ జడ్జి తన తీర్పులో పేర్కొన్న విషయాలను జనసేన నేత తన పిటిషన్లో ప్రస్తావించలేదని ధర్మాసనం స్పష్టం చేసింది. -
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై తీర్పు వాయిదా
సాక్షి, అమరావతి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను తిరిగి నిర్వహించేందుకు వీలుగా తాజా నోటిఫికేషన్ ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ)ను ఆదేశిస్తూ సింగిల్ జడ్జి జారీచేసిన ఉత్తర్వులను సవాలుచేస్తూ ఎన్నికల కమిషనర్ దాఖలు చేసిన అప్పీల్‌పై హైకోర్టులో గురువారం వాదనలు ముగిశాయి. వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ వ్యవహారంలో తమ వాదనలు కూడా వినాలంటూ ఆ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు కొందరు దాఖలు చేసిన అనుబంధ వ్యాజ్యాలను అనుమతిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. సింగిల్ జడ్జి ఇటీవల ఇచ్చిన తీర్పుపై గురువారం ధర్మాసనం విచారణ జరిపింది. ఎస్ఈసీ తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నాలుగు వారాల ఎన్నికల నియమావళిని అమలుచేశాకే ఈ ఎన్నికలు నిర్వహించామని చెప్పారు. కోవిడ్‌వల్ల గతంలో ఎన్నికలు ఏ దశలో అయితే నిలిచిపోయాయో అక్కడి నుంచే కొనసాగించామన్నారు. దీనిని సింగిల్ జడ్జి సైతం సమర్థించారని వివరించారు. ఓట్ల లెక్కింపు ఒక్కటే మిగిలి ఉందని, బ్యాలెట్ బాక్సుల రక్షణ నిమిత్తం రోజుకు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఖర్చు అవుతోందని ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అడిగిందొకటి.. ఇచ్చింది మరొకటి... అలాగే, పోలింగ్ తేదీకి నాలుగు వారాల ముందు నుంచి ఎన్నికల నియమావళిని అమలుచేసేలా ఆదేశాలివ్వాలంటూ టీడీపీ నేత వర్ల రామయ్య పిటిషన్ దాఖలు చేయగా, ఎన్నికలను మొదటి నుంచి నిర్వహించేలా ఆదేశాలివ్వాలంటూ జనసేన పార్టీ మరో పిటిషన్ వేసిందన్నారు. కానీ, ఎన్నికల తేదీకి నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్‌ను అమలుచేయాలని జనసేన కోరలేదన్నారు. అయితే.. సింగిల్ జడ్జి మాత్రం వర్ల రామయ్య పిటిషన్‌ను కొట్టేసి, జనసేన పిటిషన్లో మాత్రం ఎన్నికల తేదీకి నాలుగు వారాల ముందు నియమావళిని అమలుచేయాలంటూ తీర్పునిచ్చారని నిరంజన్‌రెడ్డి ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అలాగే, ఎన్నికల కమిషనర్ గురించి సింగిల్ జడ్జి పలు వ్యాఖ్యలు చేశారని, వాటిని తీర్పు నుంచి తొలగించాలని కోరారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని సింగిల్ జడ్జి తీర్పును రద్దుచేయాలని నిరంజన్‌రెడ్డి ధర్మాసనాన్ని కోరారు. జనసేన తరఫున న్యాయవాది వి.వేణుగోపాలరావు వాదనలు వినిపించగా.. ఎన్నికల్లో పోటీచేసిన ఓ అభ్యర్థి తరఫున న్యాయవాది వీఆర్ఎన్ ప్రశాంత్ వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్. శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ, పిటిషనర్లు లేవనెత్తని అనేక అంశాలపై సింగిల్ జడ్జి ఉత్తర్వులిచ్చారని తెలిపారు. ఈ ఎన్నికల కోసం రూ.160 కోట్ల మేర ఖర్చయిందని.. అందువల్ల ఓట్ల లెక్కింపునకు అనుమతినివ్వాలని కోరారు. అందరి వాదనలు విన్న ధర్మాసనం, తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. -
AP: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల అంశంపై పూర్తైన వాదనలు
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టులో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల అంశంపై వాదనలు పూర్తయ్యాయి. తీర్పును హైకోర్టు రిజర్వ్‌లో ఉంచింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల అంశంపై రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫున లాయర్ నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. 2021 జనవరి 8 నుంచి మార్చి 10 వరకు సుప్రీంకోర్టు చెప్పిన 4 వారాల స్థానిక ఎన్నికల నియమావళి పూర్తయింది నిరంజన్ రెడ్డి కోర్టుకు తెలిపారు. డివిజన్ బెంచ్ ఆదేశాల మేరకే జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించామని, ఎన్నికలు జరిగిన తర్వాత ఓట్ల లెక్కింపుపై స్టే ఇవ్వడం సరికాదన్నారు. మున్సిపల్ ఎన్నికలకు 4 వారాల కోడ్ అమలు చేయలేదని నిరంజన్ రెడ్డి గుర్తు చేశారు. మున్సిపల్ ఎన్నికలకు 22 రోజులు మాత్రమే కోడ్ అమలు చేశారన్నారు. 4 వారాల కోడ్ కావాలని ఏ ఒక్క పార్టీ కూడా ఎస్ఈసీని అడగలేదని, ఈ కోడ్‌పై ఏ ఒక్కరు కోర్టుకు ఫిర్యాదు చేయలేదని లాయర్ నిరంజన్‌రెడ్డి హైకోర్టుకు తెలిపారు. కాగా, హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలతో ఏప్రిల్ 8న జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా 515 జెడ్పీటీసీ, 7220 ఎంపీటీసీ పదవులకు ఎన్నికలు జరిగాయి. -
మళ్లీ ఎన్నికలు.. తీర్పు మా హక్కులను కాలరాస్తోంది
సాక్షి, అమరావతి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఏ దశలో ఆగిపోయాయో అక్కడి నుంచి తిరిగి నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ)ను ఆదేశిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు తమ హక్కులను కాలరాసే విధంగా ఉందంటూ ఆ ఎన్నికల్లో పోటీచేసిన పలువురు హైకోర్టును ఆశ్రయించారు. సింగిల్ జడ్జి తీర్పును సవాలు చేస్తూ అప్పీల్ దాఖలు చేసేందుకు అనుమతినివ్వాలంటూ కృష్ణాజిల్లాకు చెందిన జొన్నల రామ్మోహనరెడ్డి, వేమూరి సురేశ్, భీమవరపు శ్రీలక్ష్మి, మండవ దేదీప్య, బేబీ షాలిని తదితరులు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై సోమవారం విచారణ జరిపిన హైకోర్టు.. ఈ వ్యాజ్యాలను కూడా ఈ నెల 27న విచారణకు రానున్న ఎస్ఈసీ అప్పీల్‌తో జతచేస్తున్నట్లు తెలిపింది. సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీల్ దాఖలు చేసేందుకు అనుమతి ఇచ్చే విషయంపై ఆ రోజున నిర్ణయిస్తామని ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్‌కుమార్‌గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. అప్పీళ్ల దాఖలుకు అనుమతి ఇస్తే మరింతమంది పోటీదారులు అప్పీళ్లు వేస్తారని, ఇలా ఎంతమంది వేస్తారో తెలియదని, అవన్నీ విచారించడం సాధ్యం కాదని తెలిపింది. ఈ సమయంలో పిటిషనర్ల న్యాయవాదులు వీఆర్ఎన్ ప్రశాంత్, నాగిరెడ్డి తదితరులు స్పందిస్తూ.. ఎన్నికల కమిషన్ వాదనలు పూర్తిచేసిన తరువాత అవసరమైన మేరకు కోర్టుకు సహకరిస్తామని తెలిపారు. దీంతో ధర్మాసనం ఈ వ్యాజ్యాలను ఎస్ఈసీ దాఖలు చేసిన అప్పీల్‌కు జతచేస్తామని, అప్పీల్ దాఖలుకు అనుమతినివ్వాలో లేదో ఆరోజు తేలుస్తామని పేర్కొంటూ విచారణను వాయిదా వేసింది. -
పరిషత్ ఎన్నికల రద్దు ఆదేశాలు నిలుపుదల
సాక్షి,అమరావతి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను తిరిగి నిర్వహించేందుకు వీలుగా తాజా నోటిఫికేషన్ ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ఆదేశిస్తూ సింగిల్ జడ్జి జారీ చేసిన ఉత్తర్వుల అమలును హైకోర్టు నిలిపివేసింది. అయితే ఈ అప్పీల్‌పై తేలేవరకు ఓట్ల లెక్కింపు చేపట్టరాదని, ఫలితాలను వెల్లడించరాదని ఎన్నికల కమిషన్‌ను హైకోర్టు ఆదేశించింది. అప్పీల్‌పై పూర్తిస్థాయిలో విచారణ నిర్వహిస్తామని పేర్కొంటూ తదుపరి విచారణను జూలై 27కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు గతంలో ఏ దశలో అయితే నిలిచిపోయాయో అక్కడి నుంచి తిరిగి నిర్వహించేందుకు వీలుగా మళ్లీ నోటిఫికేషన్ జారీ చేయాలంటూ సింగిల్ జడ్జి గత నెల 21న ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సీజే నేతృత్వంలోని ధర్మాసనం తాజాగా విచారణ జరిపింది. సింగిల్ జడ్జి తప్పు చేశారు...! రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. పోలింగ్ తేదీకి 4 వారాల ముందు ఎన్నికల నియమావళిని అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ టీడీపీ నేత వర్ల రామయ్య పిటిషన్ దాఖలు చేయగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను మొదటి నుంచి నిర్వహించేలా ఆదేశించాలంటూ జనసేన నేత చిల్లపల్లి శ్రీనివాసరావు వేర్వేరుగా పిటిషన్లు వేశారని తెలిపారు. నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్ అమలు చేయాలని శ్రీనివాసరావు తన పిటిషన్లో కోరలేదన్నారు. అయితే సింగిల్ జడ్జి మాత్రం వర్ల రామయ్య పిటిషన్‌ను కొట్టివేసి శ్రీనివాసరావు పిటిషన్లో ఎన్నికల తేదీకి నాలుగు వారాల ముందు నియమావళిని అమలు చేయాలంటూ ఉత్తర్వులిచ్చారన్నారు. ఈ విషయంలో సింగిల్ జడ్జి తప్పు చేశారని వివరించారు. ఈ సమయంలో జనసేన తరఫు న్యాయవాది వి.వేణుగోపాలరావు స్పందిస్తూ ఎన్నికల తేదీకి నాలుగు వారాల ముందు నియమావళిని అమలు చేయాలని వాదనల సమయంలో న్యాయమూర్తి దృష్టికి తెచ్చామని చెప్పారు. క్షుణ్ణంగా విచారణ అవసరం... ఈ మొత్తం వ్యవహారంపై లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. ఆగస్టు మొదటి వారంలో విచారణ జరుపుతామని ధర్మాసనం పేర్కొనగా జూలై మొదటి వారంలో చేపట్టాలని నిరంజన్‌రెడ్డి అభ్యర్థించారు. ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చిన బ్యాలెట్ బాక్సులను తిరిగి ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఇప్పుడు ఎన్నికలు ఏవీ లేవు కదా? అని ధర్మాసనం ప్రశ్నించగా తమిళనాడులో స్థానిక ఎన్నికలు జరగనున్నాయని నిరంజన్‌రెడ్డి చెప్పారు. జూలై మొదటి వారంలో సాధ్యం కాదని, అనేక ముఖ్యమైన కేసులను ఆ వారంలో విచారించాల్సి ఉందని ధర్మాసనం తెలిపింది. ఈ నేపథ్యంలో జూలై 27న విచారణ జరుపుతామని పేర్కొంటూ సింగిల్ జడ్జి ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడే మిగిలింది.. నిరంజన్‌రెడ్డి వాదనలను కొనసాగిస్తూ ఇప్పటికే పరిషత్ ఎన్నికలు పూర్తయ్యాయని, ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి మాత్రమే మిగిలి ఉందన్నారు. అందువల్ల సింగిల్ జడ్జి ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతున్నామన్నారు. రాజ్యాంగంలోని అధికరణ 226 కింద హైకోర్టు తనకున్న అధికారాలను ఎన్నికల నిర్వహణకు ఉపయోగించాలే కానీ అడ్డుకునేందుకు వాడరాదన్నారు. ఎన్నికల ప్రక్రియ ఒకసారి మొదలయ్యాక∙అసాధారణ పరిస్థితుల్లో మినహా న్యాయస్థానాలు జోక్యం చేసుకోరాదని సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తు చేశారు. ఎన్నికల ప్రక్రియలో న్యాయస్థానాల జోక్యానికి సంబంధించిన రాజ్యాంగంలోని అధికరణలు 243 ఓ, 329లకు సింగిల్ జడ్జి తనదైన శైలిలో భాష్యం చెప్పారని, అది ఎంతమాత్రం సరికాదన్నారు. 2019 నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. అప్పీల్‌పై వీలైనంత త్వరగా విచారణ జరిపేందుకు వీలుగా నిర్దిష్టంగా ఒక తేదీని ఖరారు చేసి తుది విచారణ చేపట్టాలని కోరారు. -
‘పరిషత్ ఎన్నికల తీర్పుపై డివిజన్ బెంచ్‌కు ప్రభుత్వం’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు ఫైనల్ కాదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. తీర్పు కాపీ వచ్చాక ఏమి చేయాలనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. గతంలో సింగిల్ బెంచ్ స్టే ఇస్తే డివిజన్ బెంచ్ ఎన్నికలు జరిపించిన విషయం మనం చూశాం అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. తీర్పు కాపీ వచ్చాక ఆ తీర్పును సవాల్ చేస్తూ, డివిజన్ బెంచ్‌కు వెళ్లే అవకాశం కూడా ఉందన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం తప్పా ఒప్పా అనేది పక్కన పెడితే, ఎన్నికల ప్రక్రియ ప్రారంభించిన తరువాత ఏ న్యాయ వ్యవస్థ కూడా ఇందులో జోక్యం చేసుకోకూడదని గతంలో ఇచ్చిన జడ్జిమెంట్స్ అనేకం ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. డివిజన్ బెంచ్ ఇచ్చే తీర్పునుబట్టి సుప్రీం కోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉంటుందని తెలిపారు. ఒక బెంచ్‌కు మరో బెంచ్‌కు మధ్య అభిప్రాయాలు మారుతూ ఉంటాయని చెప్పారు. ఈ విషయం ఫైనల్ అయ్యే వరకు టీడీపీ, జనసేనలు తమ తమ పద్ధతుల్లో వాదనలు చేస్తూనే ఉంటారన్నారు. ఏదేమైనా తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వస్తుందని ఆశిస్తున్నానని చెప్పారు. చదవండి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఏకగ్రీవాలు యథాతథం పరిషత్ ఎన్నికలు మళ్లీ పెట్టండి -
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల రద్దు హర్షణీయం
సాక్షి, అమరావతి: ఏప్రిల్‌లో జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయమని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏడాది క్రితం నోటిఫికేషన్ జారీ చేసి కోవిడ్ పరిస్థితుల కారణంగా ఎన్నికలు రద్దు చేశారని.. తిరిగి అదే నోటిఫికేషన్‌పై ఏడాది తరువాత జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు ఎన్నికలు నిర్వహించడం అంటే ఎన్నికల నిబంధనలు తుంగలో తొక్కినట్లేనని పేర్కొన్నారు. -
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఏకగ్రీవాలు యథాతథం
సాక్షి, అమరావతి: పరిషత్ ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ ఏకగ్రీవమైన ఎంపీటీసీ, జడ్పీటీసీలు యథాతథంగా ఉంటారని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికార వర్గాలు శుక్రవారం స్పష్టం చేశాయి. 2020 మార్చిలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 126 జడ్పీటీసీ స్థానాలు, 2,371 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమైన సంగతి తెలిసిందే. 2020 మార్చిలో జరిగిన నామినేషన్ల ప్రక్రియను హైకోర్టు రద్దు చేయలేదని.. కరోనా అనంతరం మధ్యలో ఆగిపోయిన ఎన్నికలను తిరిగి నిర్వహించడానికి ఇచ్చిన నోటిఫికేషన్‌ను మాత్రమే రద్దు చేసిందని రాష్ట్ర ఎన్నికల సంఘం, పంచాయతీరాజ్ శాఖ అధికార వర్గాలు వెల్లడించాయి. హైకోర్టు తీర్పుపై మీడియా, కొన్ని రాజకీయ పార్టీలు తప్పుగా ప్రచారం చేస్తున్నాయని వివరించాయి. 2020 మార్చిలో మధ్యలో ఆగిపోయిన ఎన్నికలను 2021 ఏప్రిల్‌లో తిరిగి నిర్వహించేటప్పుడు నోటిఫికేషన్‌కు, పోలింగ్‌కు మధ్య 4 వారాల గడువును పాటించలేదని మాత్రమే కోర్టు తప్పుపట్టిందని తెలిపాయి. ఈ ఏడాది ఏప్రిల్ 1న జారీ చేసిన నోటిఫికేషన్‌నే కోర్టు రద్దు చేసిందన్నాయి. 2020 మార్చిలో ఇచ్చిన ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం.. నామినేషన్ల ఉపసంహరణ వరకు జరిగిన ప్రక్రియంతా చెల్లుబాటులో ఉన్నట్లేనని వెల్లడించాయి. హైకోర్టు తాజా తీర్పు ప్రకారం.. ఏప్రిల్ 8న జరిగిన పోలింగ్ ప్రక్రియ మాత్రమే రద్దు అయినట్టుగా భావించాలని, అంతకు ముందు జరిగిన నామినేషన్లన్నీ చెల్లుబాటులో ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. తాజా తీర్పుపై డివిజన్ బెంచ్‌లో సవాల్ చేయాలని ఎస్ఈసీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. -
పరిషత్ ఎన్నికలు మళ్లీ పెట్టండి
సాక్షి, అమరావతి: పోలింగ్ ప్రక్రియ పూర్తయి అంతా ఫలితాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను మళ్లీ నిర్వహించాలని రాష్ట్ర హైకోర్టు స్పష్టంచేసింది. ఎన్నికల తేదీకి నాలుగు వారాల ముందు నుంచీ ఎన్నికల నియమావళి అమల్లో ఉండాలని, ఈ మేరకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయలేదు కాబట్టి ఈ ఎన్నికలను మళ్లీ నిర్వహించాలని జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తితో కూడిన సింగిల్ జడ్జి ధర్మాసనం శుక్రవారం తీర్పునిచ్చింది. ‘‘ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు గతంలో ఏ దశలో అయితే నిలిచిపోయాయో అక్కడి నుంచి తిరిగి నిర్వహించాలి. ఎన్నికల తేదీకి 4 వారాల ముందు నుంచి ఎన్నికల నియమావళిని అమలు చేయాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులను తూచా తప్పకుండా అమలు చేస్తూ, ఎన్నిల నిర్వహణ నిమిత్తం తాజా నోటిఫికేషన్ జారీ చేయాలి. ఈ ఏడాది ఏప్రిల్ 8న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా ఎన్నికల కమిషన్ ఏప్రిల్ 1న నోటిఫికేషన్ జారీ చేసింది. అది చట్టవిరుద్ధమైన నోటిఫికేషన్ కనక దానిని రద్దు చేస్తున్నాం’’ అని న్యాయస్థానం తన తీర్పులో పేర్కొంది. ఎన్నికల్లో పోటీ విషయంలో జససేన పార్టీ అభ్యర్థులకు సమాన అవకాశాలు కల్పించేలా ఆ నోటిఫికేషన్ లేదని కూడా హైకోర్టు ఆక్షేపించింది. ‘‘ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకునే విషయంలో రాజ్యాంగంలోని అధికరణ 243ఓ ప్రకారం ఎలాంటి నిషేధం లేదని కోర్టు స్పష్టం చేసింది. నాలుగు వారాల ముందు నుంచి ఎన్నికల నియమావళిని అమలు చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహిస్తోందంటూ తెలుగుదేశం పార్టీ నేత వర్ల రామయ్య దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఈ నోటిఫికేషన్ వల్ల తన చట్టబద్ధమైన, న్యాయబద్ధమైన, రాజ్యాంగబద్ధమైన హక్కుల ఉల్లంఘన జరిగిందని నిరూపించడంలో వర్ల రామయ్య విఫలమయ్యారని, అందువల్ల ఫలానా విధంగా వ్యవహరించేలా ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని కోరజాలరని హైకోర్టు తేల్చి చెప్పింది. పరిషత్ ఎన్నికలు గతంలో ఎక్కడ నిలిచిపోయాయో ఆ దశ నుంచి కాకుండా మొదటి నుంచి తిరిగి నిర్వహించేలా ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని కోరుతూ బీజేపీ నేత పాతూరి నాగభూషణంతో పాటు మరికొందరు వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్‌ను జారీ చేయాలన్న జనసేన పార్టీ పిటిషన్‌ను న్యాయమూర్తి పాక్షికంగా అనుమతించారు. టీడీపీ, బీజేపీ, జనసేన వేర్వేరుగా పిటిషన్లు... ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల తేదీకి నాలుగు వారాల ముందు నుంచి ఎన్నికల నియమావళిని అమలు చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహిస్తోందంటూ తెలుగుదేశం నేత వర్ల రామయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మొదట విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, ఎన్నికలకు 4 వారాల ముందు ఎన్నికల నియమావళిని అమలు చేయకపోవడం సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమంటూ పరిషత్ ఎన్నికలను ఆపేస్తూ ఏప్రిల్ 6న ఉత్తర్వులిచ్చారు. వీటిపై ఎన్నికల కమిషన్ ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ముందు అప్పీలు చేసింది. విచారణ జరిపిన ధర్మాసనం... షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించుకునేందుకు అనుమతినిచ్చింది. అయితే ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడిని మాత్రం చేపట్టొద్దని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. అలాగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల వ్యాజ్యాలపై తుది విచారణ జరిపి తీర్పునివ్వాలని సింగిల్ జడ్జిని ధర్మాసనం కోరింది. అయితే పరిషత్ ఎన్నికలు ఏ దశలో అయితే నిలిచిపోయాయో అక్కడి నుంచి నిర్వహించే నిమిత్తం ఈసీ ఏప్రిల్ 1న జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేసి, తాజాగా నామినేషన్లు దాఖలు చేసేందుకు నోటిఫికేషన్లు ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలంటూ జనసేన నేత చిల్లపల్లి శ్రీనివాసరావు హైకోర్టులో పిటిషన్ వేశారు. అలాగే ఎన్నికలను మొదటి నుంచి నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ బీజేపీ నేత నాగభూషణం తదితరులు మరో పిటిషన్ వేశారు. వీటన్నిటిపై న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ఇరుపక్షాల వాదనలు విన్నారు. శుక్రవారం ఆయన టీడీపీ, జనసేన పిటిషన్లలో ఉమ్మడి తీర్పు, బీజేíపీ పిటిషన్లో వేరుగా తీర్పు వెలువరించారు. వర్ల రామయ్య, బీజేపీ పిటిషన్లను కొట్టేసిన న్యాయమూర్తి, జనసేన పిటిషన్‌ను పాక్షికంగా అనుమతించారు. న్యాయమూర్తి తన తీర్పులో ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీ తీరును తప్పుపట్టారు. ఎన్నికల కమిషనర్‌ను ఉద్దేశించి ఘాటైన పదజాలం ఉపయోగించారు. ఎన్నికల కమిషనర్ సొంత భాష్యం చెప్పారు... ‘ఎన్నికల తేదీకి నాలుగు వారాల ముందు ఎన్నికల నియమావళిని అమలు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వుల పట్ల ఎన్నికల కమిషనర్ అవిధేయత చూపుతూ ఏప్రిల్ 8న ఎన్నికల నిర్వహించేందుకు వీలుగా ఏప్రిల్ 1న నోటిఫికేషన్ ఇస్తూ తొందరపాటు నిర్ణయం తీసుకున్నారు. తద్వారా ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు లేకుండా చేశారు. దీంతో జనసేన పార్టీ అభ్యర్థులకు పూడ్చలేని నష్టం జరిగింది. ఎన్నికల కమిషనర్ గతంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. తరువాత ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు. బాధ్యతలు తీసుకున్న రోజునే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియను పునః ప్రారంభించారు. ధృవీకరించిన కౌంటర్‌ను దాఖలు చేయలేదు. కారణాలేంటో ఆమెకే తెలుసు. కోర్టు తీర్పును ఆసాంతం చదవాలి. తీర్పులో అక్కడ కొంత, ఇక్కడ కొంత తీసుకుని దాని ఆధారంగా భాష్యం చెప్పడానికి వీల్లేదు. ఎన్నికల కమిషనర్ సుప్రీంకోర్టు తీర్పును చదవకుండా సొంత భాష్యం చెప్పారు. సుప్రీంకోర్టు చెప్పిన నాలుగు వారాల గడువు గరిష్ట పరిమితి అన్న నిర్ణయానికి వచ్చారు. దీన్ని ఆమోదించబోం.’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు. ‘‘ఏప్రిల్ 1 నోటిఫికేషన్ సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినట్లు ఈ కోర్టు భావిస్తోంది. సుప్రీం ఆదేశాలకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాల్సిందే. అయితే రాజ్యాంగ వ్యవస్థ అయిన ఎన్నికల కమిషన్ మాత్రం సుప్రీంకోర్టు ఉత్తర్వులను అగౌరవపరించింది. అందువల్ల ఏప్రిల్ 1న ఎన్నికల కమిషన్ జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నా’ అని జస్టిస్ సత్యనారాయణమూర్తి తన తీర్పులో వివరించారు. ఎన్నికల కమిషనర్ తొందరపాటు వల్ల అంత ఖర్చు... ‘గత ఏడాది జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో హింస, దౌర్జన్యాలు జరిగాయన్న కారణంతో ఎన్నికల ప్రక్రియను మొత్తం రద్దు చేసి తాజా నోటిఫికేషన్ జారీ చేసేందుకు ఆదేశాలు ఇవ్వడం సాధ్యం కాదు. ఎన్నికల నిర్వహణకు ఇప్పటికే రూ.160 కోట్లు ఖర్చు చేశామని, అందువల్ల మళ్లీ ఎన్నికలకు ఆదేశిస్తే ఖజానాపై భారం పడుతుందన్న ఎన్నికల కమిషన్ తరపు సీనియర్ న్యాయవాది వాదనలను కోర్టు తోసిపుచ్చుతోంది. గతంలో సింగిల్ జడ్జి ఎన్నికలను నిలిపేసినప్పుడు, ప్రభుత్వం చాలా హడావుడిగా ధర్మాసనాన్ని ఆశ్రయించి, ఎన్నికల నిర్వహణ ఉత్తర్వులు పొందింది. అప్పుడు ప్రభుత్వం కొంత ఓపిక పట్టి ఉంటే, ఎన్నికలకు ఖర్చు పెట్టిన డబ్బును కొంత కాలం వరకైనా ఆదా చేసి ఉండేది’ అని న్యాయమూర్తి స్పష్టం చేశారు. -
ఏపీ పరిషత్ ఎన్నికలను రద్దు చేసిన హైకోర్టు
సాక్షి, అమరావతి: ఏపీ పరిషత్ ఎన్నికలను హైకోర్టు రద్దు చేసింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని హైకోర్టు సూచించింది. పరిషత్ ఎన్నికలపై హైడ్రామా ఏప్రిల్ 8న ఏపీలో పరిషత్ ఎన్నికలు జరిగాయి. ఏప్రిల్ 1న పోలింగ్ తేదీలు ఎస్ఈసీ ప్రకటించింది. ఏప్రిల్ 6న పరిషత్ ఎన్నికలపై హైకోర్టు సింగిల్ బెంచ్ స్టే ఇవ్వగా, ఏప్రిల్ 8న హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే రద్దు చేసింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలతో ఎస్ఈసీ ఎన్నికలు నిర్వహించింది. ఏప్రిల్ 8న 515 జెడ్పీటీసీ, 7220 ఎంపీటీసీలకు ఎన్నికలు జరిగాయి. నేడు పరిషత్ ఎన్నికలు రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. చదవండి: రఘురామకృష్ణరాజు కేసు: కొట్టారన్నది కట్టు కథే AP Budget 2021: జన సాధికార బడ్జెట్ -
పరిషత్ ఎన్నికలపై తీర్పు వాయిదా
సాక్షి అమరావతి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఎన్నికల తేదీకి నాలుగు వారాల ముందు నియమావళి అమలు చేయకపోవడం సుప్రీం కోర్టు ఆదేశాలకు విరుద్ధమంటూ టీడీపీ నేత వర్ల రామయ్య పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేయగా దీన్ని సవాలు చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం.. ఎన్నికల నిర్వహణకు అనుమతిస్తూ ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి చేపట్టవద్దని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. ఈ వ్యాజ్యాలపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని సింగిల్ జడ్జికి ధర్మాసనం సూచించింది. మరోవైపు ఎన్నికలను మొదటి నుంచి నిర్వహించాలని కోరుతూ జనసేన నేత శ్రీనివాసరావు, బీజేపీ నేతలు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ సత్యనారాయణమూర్తి మంగళవారం విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ, వి.వేణుగోపాలరావు, ఎన్నికల కమిషన్ తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి తదితరులు వాదనలు వినిపించారు. ఎన్నికల నిర్వహణకు రూ.150 కోట్ల వ్యయం సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎన్నికల తేదీకి నాలుగు వారాల ముందు నియమావళిని అమలు చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై ఉందని వేదుల నివేదించారు. ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడంతో సింగిల్ జడ్జి ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకున్నారన్నారు. అయితే వర్ల రామయ్య ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునే అర్హత ఆయనకు లేదని సీవీ మోహన్‌రెడ్డి తెలిపారు. ఈ వ్యాజ్యం వెనుక వ్యక్తిగత ప్రయోజనాలు లేవని వర్ల చెబుతున్నందున ఇది ప్రజా ప్రయోజన వ్యాజ్యం అవుతుందని, దీనిపై ధర్మాసనమే విచారణ జరపాల్సి ఉంటుందన్నారు. నాలుగు వారాల గడువు గరిష్ట పరిమితి మాత్రమేనని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల నిర్వహణకు రూ.150 కోట్ల వరకు ఖర్చు అయిందని, ఎన్నికలను రద్దు చేస్తే మళ్లీ అంత పెద్ద మొత్తం ఖర్చు చేయాల్సి ఉంటుందని, ఇది ఖజానాపై భారం మోపడమే అవుతుందని కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ ఎన్నికలు పూర్తి అయ్యాయని, ఫలితాల కోసం అందరూ ఎదురు చూస్తున్నారని వివరించారు. ఫలితాల వెల్లడికి అనుమతి ఇవ్వాలని అభ్యర్థించారు. జనసేన తరపు న్యాయవాది వేణుగోపాల్ రావు వాదనలు వినిపిస్తూ ఎన్నికలలో బలవంతపు ఉపసంహరణలు జరిగాయన్నారు. పలు చోట్ల హింసాత్మక ఘటనల గురించి అప్పటి ఎన్నికల కమిషనర్ కేంద్రం దృష్టికి తెచ్చారని తెలిపారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. -
ఓట్ల లెక్కింపునకు అనుమతినివ్వండి
సాక్షి, అమరావతి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటనకు అనుమతినివ్వాలని హైకోర్టును రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) అభ్యర్థించింది. కౌంటింగ్, ఫలితాల ప్రకటనను పూర్తి చేసి, ఆ తరువాత ఎంపీపీ, జెడ్పీపీపీల కోఆప్టెడ్ సభ్యులు, చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికను కూడా పూర్తి చేస్తామని, దీంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ సంపూర్ణమవుతుందని వివరించింది. వీలైనంత త్వరగా కొత్త పాలక వర్గాలు బాధ్యతలు చేపడితే మేలన్న ఉద్దేశంతోనే ఈ అభ్యర్థన చేస్తున్నామంది. కోవిడ్ సెకండ్ వేవ్ సవాలు విసురుతోందని, అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో దీనిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొంది. హైకోర్టు ధర్మాసనం ఆదేశాల మేరకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓటింగ్ అనంతరం బ్యాలెట్ బ్యాక్సులను కట్టుదిట్టమైన భద్రత మధ్య స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచామంది. గతంలో టీడీపీ నేత వర్ల రామయ్య, జనసేన నేత చిల్లపల్లి శ్రీనివాసరావు దాఖలు చేసిన పిటిషన్‌కు సంబంధించి హైకోర్టులో ఎన్నికల కమిషన్ కార్యదర్శి కె.కన్నబాబు గురువారం పూర్తిస్థాయి కౌంటర్ దాఖలు చేశారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నియమావళి విషయంలో టీడీపీ, జనసేన నేతలు దాఖలు చేసిన వ్యాజ్యాలపై గురువారం న్యాయమూర్తి జస్టిస్ దుర్గాప్రసాదరావు విచారణ జరిపారు. పూర్తిస్థాయి వాదనల నిమిత్తం న్యాయమూర్తి తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేశారు. కాగా, వర్ల రామయ్య, చిల్లపల్లి శ్రీనివాసరావు పిటిషన్లను గతంలో విచారించిన సింగిల్ జడ్జి.. ఎన్నికలను వాయిదా వేయాలని తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఆ తీర్పుపై ఎస్ఈసీ ధర్మాసనాన్ని ఆశ్రయించింది. ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరపడానికి ధర్మాసనం అనుమతిచ్చిన విషయం విదితమే. అయితే ఎన్నికల ఫలితాలు ప్రకటించవద్దని ధర్మాసనం ఆదేశించిన నేపథ్యంలో ఎస్ఈసీ తన కౌంటర్లో ఫలితాల ప్రకటనకు అభ్యర్థించింది. ఎన్నికలను ఆపాలనే లక్ష్యంతోనే టీడీపీ నేత పిటిషన్ దాఖలు చేశారని, దానిని కొట్టివేయాలని కన్నబాబు కౌంటర్లో అభ్యర్థించారు. ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వుల కాపీని పరిశీలన నిమిత్తం తమ ముందుంచాలని ఎస్ఈసీ తరఫు న్యాయవాది సన్నపురెడ్డి వివేక్ చంద్రశేఖర్‌ను న్యాయమూర్తి ఆదేశించారు. అలాగే బీజేపీ నేతలు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కూడా ఈ వ్యాజ్యాలకు జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు. చదవండి: టీడీపీ మాజీ మంత్రి ఉమకు సీఐడీ నోటీసు ఆరోగ్యశ్రీలో ఉచితంగా గుండెమార్పిడి -
పరిషత్ ఎన్నికలు: రెచ్చిపోయిన టీడీపీ నేతలు
సాక్షి, అమరావతి/నెట్వర్క్: పరిషత్ ఎన్నికల పోరులో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు బరితెగించాయి. ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించినా పలుచోట్ల ఆ పార్టీ అభ్యర్థులు, కార్యకర్తలు విధ్వంసానికి పాల్పడ్డారు. అనేకచోట్ల జెడ్పీటీసీ, ఎంపీటీసీ టీడీపీ అభ్యర్థులు డబ్బులు పంపిణీ చేశారు. ఓటింగ్ సమయంలోను ఓటర్లను ప్రలోభాలకు గురిచేశారు. అభ్యంతరం తెలిపిన వైఎస్సార్సీపీ శ్రేణులపై దౌర్జన్యకాండను కొనసాగించారు. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం శివరామపురంలో వైఎస్సార్సీపీ నేత, ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ సోదరుడు, జెడ్పీటీసీ చీఫ్ ఏజెంట్ మద్దిశెట్టి రవీంద్ర కారుపై టీడీపీ వర్గీయులు గొడ్డలి, బండలతో దాడిచేశారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తుర్లుపాడు మండలం పోతలపాడులో ఏజెంట్ల మధ్య వివాదంతో కొద్దిసేపు పోలింగ్ నిలిచిపోయింది. పరిస్థితిని చక్కదిద్దడంతో పోలింగ్ జరిగింది. ఇదే జిల్లాకు చెందిన చెరుకూరు ఎంపీటీసీ–1 బ్యాలెట్ పత్రాలు వేరే కేంద్రానికి పంపడంతో అవి వచ్చే వరకు కొద్ది సమయం పోలింగ్ నిలిచిపోయింది. గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం గారపాడులో పోలింగ్ బూత్ వద్ద వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడి చేశారు. వైఎస్సార్సీపీ మహిళా కార్యకర్త నల్గొండ రమణకు చెయ్యి విరగ్గా, మరో కార్యకర్త నల్గొండ శ్రీను తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు లాఠీచార్జి చేసి దాడిచేస్తున్న వారిని తరిమికొట్టారు. తరువాత టీడీపీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో పోలింగ్ బూత్ వద్దకు దూసుకురాగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొంతసేపు పోలింగ్‌కు అంతరాయం ఏర్పడింది. ఈ దాడికి సంబంధించి టీడీపీకి చెందిన సతీష్, మరో 9 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పెదనందిపాడు మండలం రాజుపాలెంలో టీడీపీ వర్గీయుల దాడిలో వైఎస్సార్సీపీ ఎస్సీసెల్ మండల కన్వీనర్ పి.ప్రకాశరావు, మరొక కార్యకర్త తీవ్రంగా గాయపడ్డారు. శ్రీకాకుళం జిల్లా గార్రాజు చీపురుపల్లి టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి బగ్గు చంద్రశేఖర్ తన అనుచరులతో కలిసి మెట్టవలస ప్రాంతంలో బుధవారం అర్థరాత్రి దాటాక డబ్బులు పంచుతుండగా వైఎస్సార్సీపీ సానుభూతిపరులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. 10 మంది గాయపడ్డారు. వారిని రాజాం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సంతకవిటి మండలం తాలాడలో ఓటరు స్లిప్‌లలో వ్యత్యాసం కారణంగా గందరగోళం ఏర్పడి కొద్దిసేపు పోలింగ్ నిలిచిపోయింది. వైఎస్సార్ జిల్లా చాపాడు మండలం రాజువారివారిపేట పోలింగ్ కేంద్రంలో ఒక వృద్ధురాలు సిబ్బంది సాయంతో ఓటు వేసింది. ఆమె ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసిందని టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి పి.రాజేశ్వరి ఆ బ్యాలెట్ పత్రాన్ని లాక్కుని బయటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఆమెను ఎన్నికల సిబ్బంది, పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ, వైస్సార్సీపీ వర్గీయుల మధ్య వాగ్వాదం జరిగింది. ఎన్నికల విధులకు ఆటంకం కలిగించిన టీడీపీ అభ్యర్థి రాజేశ్వరిని పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం రాజుపాలెం మండలం వాసుదేవాపురంలో ఓటింగ్ సరళిని పరిశీలించేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ మండల కన్వీనర్, ఎంపీటీసీ అభ్యర్థి ఎస్ఏ నారాయణరెడ్డి వాహనంపై టీడీపీ నేతలు రాళ్లతో దాడికి తెగబడ్డారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం కొటాలలో ఓటర్లకు టీడీపీ నేతలు డబ్బులు పంచుతుండగా వైఎస్సార్సీపీ నేతలు గుర్తించి అడ్డుకున్నారు తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం పెదపట్నం లంక గ్రామంలో గురువారం తెల్లవారుజామున టీడీపీ, జనసేన కార్యకర్తలు డబ్బులు పంచుతుండగా వైఎస్సార్సీపీ వారు అడ్డుకున్నారు. దీంతో వారు దాడిచేయడంతో నలుగురు వైఎస్సార్సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. గాయపడినవారిని రాజోలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విజయనగరం జిల్లా ద్వారపూడి పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్ల స్లిప్పుల పంపిణీ విషయంలో టీడీపీ, వైఎస్సార్సీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు వారిని చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థిపై కూన రవికుమార్ వర్గీయుల దాడి పొందూరు: శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం పెనబర్తి వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి తమ్మినేని మురళీకృష్ణపై కూన రవికుమార్ వర్గీయులు గురువారం దాడికి పాల్పడ్డారు. పరిషత్ ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయంతో మరణాయుధాలు, కర్రలతో దాడులు చేసి వీరంగం సృష్టించారు. ఎంపీటీసీ అభ్యర్థి తమ్మినేని మురళీ, అతని భార్య సర్పంచ్ ఝాన్సీరాణి ప్రాణభయంతో అజ్ఞాతంలోకి వెళ్లారు. ►పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం బోడిగూడెం ఎంపీటీసీ స్థానానికి జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి చల్లా సుబ్బారావు అనే కార్యకర్త పోలింగ్‌బూత్ ఏజెంటుగా నమోదు చేసుకోగా.. అతనిపై 7వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో అదే గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. స్పృహ కోల్పోయిన సుబ్బారావును స్థానికులు ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ సుబ్బారావు చికిత్స పొందుతున్నాడు. గుంటూరు జిల్లా కారుచోలలో ఉద్రిక్తత యడ్లపాడు(చిలకలూరిపేట): గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం కారుచోల గ్రామంలో టీడీపీ వర్గీయుల కవ్వింపు చర్యలతో గురువారం రాత్రి ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పోలింగ్ ప్రక్రియ ముగిశాక గ్రామంలోని బొడ్డురాయి సెంటర్లో టీడీపీ వర్గీయులు రాళ్లు, కూల్‌డ్రింక్ సీసాలు, కర్రలతో దాడికి దిగారు. ఈ ఘర్షణలో వైఎస్సార్సీపీకి చెందిన ఏడుగురికి గాయాలయ్యాయి. టీడీపీకి చెందిన ముగ్గురు కూడా గాయపడ్డారు. చిలకలూరిపేట రూరల్ సీఐ ఎం.సుబ్బారావు, యడ్లపాడు, నాదెండ్ల పట్టణ ఎస్సైలతోపాటు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని 144 సెక్షన్ అమలు చేసి అల్లర్లు చెలరేగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చదవండి: బాబు చెప్పినా వినలేదు.. టీడీపీ నేతల హల్చల్ మార్ఫింగ్‌తోనే ఉమా ట్వీట్.. వాస్తవాల నిగ్గు తేల్చిన ‘ఫ్యాక్ట్ చెక్’ -
బాబు చెప్పినా వినలేదు.. టీడీపీ నేతల హల్చల్
సాక్షి, అమరావతి/గుడుపల్లె(చిత్తూరు జిల్లా): ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపును తీవ్రంగా వ్యతిరేకించి, తిరుగుబాటు చేసిన నేతలు, కార్యకర్తలు పార్టీ నిర్ణయాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఎన్నికల కోసం విస్తృతంగా పనిచేశారు. చంద్రబాబు చెబుతున్నా వినకుండా ఎన్నికల ప్రచారం చేసిన నాయకులు పోలింగ్ కేంద్రాల్లో తమ ఏజెంట్లను నియమించారు. గ్రామాల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి లబ్ధిపొందడానికి ప్రయత్నించారు. అనేకచోట్ల పోలింగ్ కేంద్రాల వద్ద ఆ పార్టీ నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఘర్షణలకు దిగారు. ఏకగ్రీవమైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు మినహా మిగిలిన అన్నిచోట్లా టీడీపీ అభ్యర్థులు దాదాపుగా పోటీలో ఉన్నారు. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిలు వారి కోసం ప్రచారం చేయడంతోపాటు వ్యూహాలు కూడా రూపొందించి ఎన్నికల ప్రక్రియలో భాగమయ్యారు. ►ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ ఏకంగా పోలీసు అధికారులతో గొడవకు దిగారు. ►శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ పార్టీ నేతలకు సూచనలిస్తూ హడావుడి చేశారు. ►పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కనుసన్నల్లో టీడీపీ నాయకులు పనిచేశారు. ►గుంటూరు జిల్లా ఈపూరు మండలం గోపువారిపాలెంలో టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్సీపీ కార్యకర్తలతో ఘర్షణకు దిగారు. ►కర్నూలు జిల్లా బేతంపల్లె పోలింగ్ కేంద్రం వద్ద ఆ పార్టీ నేతలు హల్చల్ చేశారు. ►ఇలా ప్రతిచోటా టీడీపీ నాయకులు, కార్యకర్తలు హడావుడి చేసి అధినేతను పూర్తిగా పక్కన పెట్టేసినట్లుగా వ్యవహరించారు. టీడీపీ చంద్రబాబు సొంతం కాదు.. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు సొంతం కాదని కుప్పంలో టీడీపీ నేతలు వ్యాఖ్యానించారు. కుప్పంలో టీడీపీ నేతలు పరిషత్ పోలింగ్‌లో చురుగ్గా పాల్గొన్నారు. ఈ నియోజకవర్గంలోని గుడుపల్లె మండలం కొడతనపల్లె ఎంపీటీసీ సెగ్మెంట్‌కు సంబంధించిన కొడతనపల్లె, చిన్నగొల్లపల్లె గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాల్లో టీడీపీ నాయకులు ఏజెంట్లను పెట్టుకుని ఎన్నికల్లో పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. ‘టీడీపీ అగ్రనాయకులకు మాత్రం పదవులు కావాలా? కార్యకర్తలకు పదవులు వద్దా? ఆయన ఎన్నికల్లో పోటీ చెయ్యొద్దంటే మేం పోటీ చేయకూడదా.. అదంతా కుదరదు మేం పోటీచేసి తీరుతాం’.. అని చంద్రబాబుపై మండిపడ్డారు. చదవండి: మార్ఫింగ్‌తోనే ఉమా ట్వీట్.. వాస్తవాల నిగ్గు తేల్చిన ‘ఫ్యాక్ట్ చెక్’ ‘ఆంధ్రజ్యోతి’ ఆక్రమణ అసలు కథ ఇదీ.. -
కొటియాలో ఒడిశా దౌర్జన్యకాండ..
సాలూరు: ఆంధ్రా–ఒడిశా సరిహద్దు వివాదాస్పద కొటియా గ్రూప్ గ్రామాల్లో ఒడిశా అధికారులు, పోలీసులు, నేతలు పేట్రేగిపోయారు. ఏపీలో గురువారం జరిగిన పరిషత్ ఎన్నికలకు వస్తున్న గిరిజనులను అడ్డుకుని వారిపై దౌర్జన్యానికి దిగారు. వారు వెళ్లే దారిలో అడ్డంగా బారికేడ్లు, గేట్లు పెట్టారు. కోవిడ్‌ను సాకుగా చూపుతూ కోరాపుట్ జిల్లా కలెక్టర్ 144 సెక్షన్ విధించడంతో ఒడిశా అధికారులు, పోలీసులు ఆ గ్రామాల్లో మోహరించి గిరిజనులను అడుగడుగునా అడ్డుకున్నారు. ఆంధ్రాలో తమ ఓటు హక్కును వినియోగించుకోకుండా అడ్డుకుంటున్న ఒడిశా పోలీసులపై గిరిజనం తిరగబడ్డారు. తాము ప్రతిసారీ ఓటు హక్కును వినియోగించుకుంటున్నామని, ఇప్పుడే ఎందుకు వద్దంటున్నారని నిలదీశారు. ఆంధ్రా ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను అందిస్తోందని.. తాము ఆంధ్రాలోనే ఉంటామని నినదించారు. దారికి అడ్డంగా నిలిచిన ఒడిశా పోలీసులు, అధికారులు, ప్రజాప్రతినిధులను తోసుకుంటూ ఓటేసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో పోలీసులు, గిరిజనుల మధ్య జరిగిన తోపులాటలో మహిళా గిరిజన ఓటర్లు రోడ్డుపై పడిపోయి స్వల్పంగా గాయపడ్డారు. అయినప్పటికీ పట్టుదలతో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వెళ్లారు. పట్టుచెన్నేరు, పగులుచెన్నేరుల్లో రోడ్డుకు అడ్డుగా ఒడిశా అధికారులు వేసిన గేట్లను తోసేసి తోణాం, మోనంగి పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నారు. విరుచుకుపడ్డ ఐటీడీఏ పీవో కొటియా గ్రామాలకు వెళ్తున్న గిరిజన సమీకృతాభి వృద్ధిసంస్థ (ఐటీడీఏ) పీవో ఆర్.కూర్మనాథ్‌ను ధూళిభద్ర, ఎగువశెంబి గ్రామాల సమీపంలో ఒడి శా అధికారులు అడ్డుకున్నారు. దీంతో పీవోకు, వారికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ ప్రాంతంలో 144 సెక్షన్ విధించే హక్కు మీకెక్కడదని. సుప్రీంకోర్టు స్టేటస్కో విధించిన అంశాన్ని ఆయన వారికి గుర్తుచేశారు. అడ్డంగా వేసిన బారికేడ్లను ఆయనే తోసేసి ముందుకు కదిలారు. ఆ గ్రామాల్లో ప్రజల వద్దకు వెళ్లి స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. దీంతో ధూళిభద్ర ప్రజలు కాలిబాటన, ఎగువశెంబి ప్రజలు అప్పటికే ఏర్పాటు చేసిన వాహనాల ద్వారా నేరెళ్లవలస పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. ఒడిశా అధికారులు చల్లగా జారుకున్నారు. విజయనగరం జిల్లా సబ్ కలెక్టర్ విధేహ్ ఖరే, ఎస్పీ రాజకుమారి, తదితరులు నేరెళ్లవలస, ధూళిభద్ర గ్రామాల్లో పర్యటించారు. చదవండి: పరిషత్ ఎన్నికలు: పోలింగ్ ప్రశాంతం.. రోజుకు 6 లక్షల మందికి టీకా: సీఎం జగన్ -
పరిషత్ ఎన్నికలు: పోలింగ్ ప్రశాంతం..
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా 515 జెడ్పీటీసీ, 7,220 ఎంపీటీసీ స్థానాలకు గురువారం జరిగిన పోలింగ్ స్వల్ప ఘటనలు మినహా ప్రశాంతంగా జరిగింది. మొత్తం 27,751 కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించగా 60.91 శాతం ఓటింగ్ నమోదైంది. గతంతో పోల్చితే ఓటింగ్ శాతం కాస్త తగ్గినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. కోవిడ్ కేసులు పెరుగుతుండటం, చివరి నిమిషం వరకు ఎన్నికల నిర్వహణపై ఉన్న అనిశ్చితి, కొన్ని ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇందుకు కారణమని తెలిపాయి. స్థానిక సంస్థల ఎన్నికలంటేనే పోలింగ్‌కు రెండు రోజుల ముందు ఎక్కువ హడావుడి ఉంటుంది. గ్రామంలో ఓటు ఉండి.. వివిధ కారణాలతో పొరుగు ఊళ్లలో తాత్కాలికంగా నివాసం ఉండేవారు ఈ రెండు రోజుల్లోనే స్వగ్రామాలకు చేరతారు. ఇలాంటి ఓటర్లు దాదాపు 10 శాతం వరకు ఉంటారని సమాచారం. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై ఆఖరి నిమిషం వరకు కొనసాగిన అనిశ్చితితో వారంతా స్వగ్రామాలకు చేరుకోలేకపోయారు. కొన్ని మండలాల్లో 81 శాతానికిపైనే ఓటింగ్.. గత వారం రోజులుగా పెరుగుతున్న కరోనా ఉధృతి పోలింగ్‌పై ప్రభావం చూపిందని అధికార వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కరోనా కేసుల నమోదు తక్కువగా ఉన్న జిల్లాల్లో మిగిలిన జిల్లాల కంటే 15 శాతానికిపైనే ఎక్కువగా ఓటింగ్ శాతం నమోదైంది. ప్రస్తుతం రాష్ట్రంలో పశ్చిమ గోదావరి, విజయనగరం జిల్లాల్లోనే అత్యల్పంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ జిల్లాల్లో అత్యధికంగా ఓటింగ్ శాతం నమోదు కావడం గమనార్హం. గురువారం రాష్ట్రంలో అతి తక్కువ కరోనా కేసులు నమోదైన పశ్చిమ గోదావరి జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధికంగా 68.27 శాతం ఓటింగ్ నమోదైంది. అతి తక్కువ కరోనా కేసులు నమోదైన రెండో జిల్లా విజయనగరం జిల్లాలో 67.13 శాతం ఓటింగ్ నమోదు కాగా, ఆ జిల్లాలోని డెంకాడ మండలంలో 81.71 శాతం ఓట్లు పోలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని మండలాల్లో 40 – 45 శాతం ఓట్లు మాత్రమే నమోదయినప్పటికీ.. విజయనగరం జిల్లాలో తక్కువ ఓటింగ్ శాతం నమోదైన సీతానగరం మండలంలో కూడా 56.84 శాతం ఓట్లు పోలయ్యాయి. రాష్ట్రంలో చాలా మండలాల్లో 75 శాతానికి పైనే ఓటింగ్ శాతం నమోదైందని.. అదే సమయంలో కొన్ని మండలాల్లో అత్యల్ప ఓటింగ్ శాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అత్యల్ప శాతం రాష్ట్రంలో 8 జిల్లాల్లో 60 శాతం పైబడే ఓటింగ్ నమోదు కాగా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అత్యల్పంగా 51.68, 53.52 పోలింగ్ శాతం నమోదైంది. పశ్చిమ గోదావరి, విజయనగరం జిల్లాలతోపాటు విశాఖపట్నం, తూర్పుగోదావరి, కృష్ణా, కర్నూలు, వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో 60 శాతానికి పైబడి ఓటింగ్ నమోదైంది. మూడు గ్రామాల్లో రీపోలింగ్.. కాగా, విజయనగరం, పశ్చిమ గోదావరి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున మూడు గ్రామాల్లో శుక్రవారం రీపోలింగ్ నిర్వహణకు జిల్లా అధికారుల నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ప్రతిపాదనలు అందాయి. విజయనగరం జిల్లా సీతానగరం మండలం అంటిపేట గ్రామంలో ఎంపీటీసీ ఎన్నికల బ్యాలెట్ పేపర్లో అభ్యర్థుల పేర్లు, గుర్తుల్లో తప్పులు దొర్లాయి. దీంతో ఆ ఎంపీటీసీ స్థానం పరిధిలోని మూడు పోలింగ్ బూత్‌లలో శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి 5 గంటల వరకు రీపోలింగ్ జరిపేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అనుమతి తెలిపింది. ♦నెల్లూరు జిల్లా ఏఎస్‌పేట మండలం చౌట భీమవరంలో ఒక పోలింగ్ బూత్‌లో బీజేపీ తరఫున ఏజెంట్‌గా కూర్చున్న వ్యక్తి బ్యాలెట్ బాక్స్‌ను అపహరించి నీళ్ల తొట్టిలో వేయడంతో అక్కడ కూడా రీపోలింగ్ జరగనుంది. ♦పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం రాపాక, సూరంపూడిలో కూడా ఒక బూత్‌లో శుక్రవారం రీపోలింగ్ నిర్వహిస్తారు. కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షణ.. ♦గురువారం రాష్ట్రవ్యాప్తంగా కొనసాగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ సరళిని విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని పర్యవేక్షించారు. ♦రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ సరళిని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి కమిషనర్ గిరిజా శంకర్ ఎప్పటికప్పుడు పరిశీలించారు. వెబ్‌కాస్టింగ్ విధానంలో ఆయా పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించారు. జిల్లాల్లో చెదురుమదురు ఘటనలు.. ♦శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండల కేంద్రంలోని జె.ఆర్.పురం పోలింగ్స్టేషన్లో ఓటరు స్లిప్పుల పంపిణీలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఐదుగురు ఎన్నికల అధికారులను కలెక్టర్ జె.నివాస్ సస్పెండ్ చేశారు. టీడీపీ శ్రేణులు ఎన్నికల్లో పాల్గొనవద్దంటూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటన ఇచ్చినా పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ కొత్తూరు మండలంలో మాతలలో ఓటు హక్కును వినియోగించుకోవడం గమనార్హం. అంతేకాకుండా ఈ ఎన్నికల్లో మాతల నుంచి టీడీపీ తరఫున ఆయన సతీమణి కలమట ఇందిర పోటీ చేశారు. ♦రామకుప్పం మండలంలో అత్యధిక జనాభా ఉన్న రామాపురం తండాలో కాకుండా ననియాల తండాలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయడంతో ప్రజలు పోలింగ్‌ను బహిష్కరించారు. ఈ విషయం తెలుసుకున్న చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప, కుప్పం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి భరత్, రెస్కో చైర్మన్ సెంథిల్ ఆ గ్రామాలకు వెళ్లి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు పోలింగ్‌లో పాల్గొన్నారు. విశాఖ ఏజెన్సీలోని ముంచంగిపుట్టు మండలంలో మూడు పంచాయతీల వారు నాటు పడవలపై మత్స్యగెడ్డ దాటి ఓటు హక్కు వినియోగించుకున్నారు. సుజనకోట పంచాయతీలోని 11 గ్రామాల గిరిజనులు గెడ్డ దాటి వచ్చి సుజనకోట పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇస్కపల్లి శంభునిపాళెం గ్రామస్తులు తమను ఎస్సీలుగా పరిగణించాలంటూ ఎన్నికలను బహిష్కరించారు. ♦ప్రకాశం జిల్లా పర్చూరు మండలం చెరుకూరులో బ్యాలెట్ పత్రాలు తారుమారు కావడంతో పోలింగ్‌లో కొంత జాప్యం జరిగింది. ♦పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలంలోని ఎల్ఎన్డీపేట, పైడిపాక, మామిడిగొంది, దేవరగొంది గ్రామస్తులు పోలింగ్‌ను బహిష్కరించారు. ఎల్ఎన్డీపేటలో ఎస్టీలు లేకపోయినా ఎస్టీలకు కేటాయించారని, పైడిపాక పునరావాస కేంద్రంలోని గిరిజనేతరులను ఇటికిలకోట గిరిజన పంచాయతీలో కలిపారని, మామిడిగొంది, దేవరగొంది గ్రామాలను ఒకే పంచాయతీగా ఏర్పాటు చేయాలని కోరుతూ ఎన్నికలను బహిష్కరించారు. ఇరగవరం మండలంలో రాపాక, సూరంపూడి ఎంపీటీసీ స్థానానికి బ్యాలెట్ పేపర్ మారిపోవడంతో ఎన్నిక నిలిపివేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల కాల్పుల్లో జవాన్లు మృతి చెందడంతో ఏపీలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. రాష్ట్రంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో 47.03 శాతం పోలింగ్ కేంద్రాలు ఉండటంతో పక్కాగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పరిషత్ ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన 27,751 పోలింగ్ కేంద్రాల్లో 6,492 సమస్యాత్మక, 6,314 అత్యంత సమస్యాత్మక, 247 కేంద్రాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఏజెన్సీ మండలాల్లో మధ్యాహ్నం 2 గంటలకే పోలింగ్‌ను పూర్తి చేసి బ్యాలెట్ బాక్సులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తాడేపల్లి కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పోలింగ్ ప్రక్రియపై నిఘా పెట్టి, వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించారు. అన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో 3,530 మందితో నిరంతర వెబ్ కాస్టింగ్ నిర్వహించారు. స్వల్ప ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతం: ఎస్ఈసీ నీలం సాహ్ని కొన్ని స్వల్ప ఘటనలు మినహా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 60.91 శాతం పోలింగ్ నమోదైందన్నారు. గుంటూరు జిల్లాలో పోలింగ్ విధులకు హాజరైన ముత్తుపల్లి జెడ్పీ స్కూల్ ఉపాధ్యాయుడు కోటేశ్వరరావు మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తున్నానన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఎన్నికల అబ్జర్వర్లతోపాటు పోలింగ్ సిబ్బంది, పోలీసులు బాగా కష్టపడ్డారని ప్రశంసించారు. చదవండి: వీడియో వైరల్: హైదరాబాద్‌కు రజనీకాంత్ రోజుకు 6 లక్షల మందికి టీకా: సీఎం జగన్ -
‘చంద్రబాబు ఎక్స్పైరీ అయిపోయిన టాబ్లెట్ లాంటివాడు’
సాక్షి, కృష్ణా : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎక్స్పైరీ అయిపోయిన టాబ్లెట్ లాంటివాడని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విమర్శించారు. గన్నవరం బాలుర హైస్కూల్లో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ జడ్పీటీసీ,ఎంపీటీసీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీలో లోకేష్ గుది బండలాంటి వాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు టీడీపీని బీజేపీలో విలీనం చేయడం ఖాయమన్నారు. తెలుగు తమ్ముళ్లు ఆలోచించుకోవాలని హితవు పలికారు. పంచాయతీల్లో 40 శాతం ఓట్లు వచ్చాయని టపాసులు కాల్చిన తండ్రి, కొడుకులు ఏపీలో ఎందుకు పారిపోయారని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఎన్నిక ముఖ్యమైనదని, చంద్రబాబు పరిషత్ ఎన్నికల నుంచి తప్పుకోవడం ఆడలేక మద్దెల ఓడు అన్న సామెతలా ఉందని మండిపడ్డారు. గత టీడీపీ ప్రభుత్వంలో అందించలేని సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పేద ప్రజలకు అందిస్తున్నారని వల్లభనేని వంశీ అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నాడని, కరోనా కష్ట కాలంలో కూడా ప్రజలకు అండగా ఉన్నాడని పేర్కొన్నారు. 2019 ఎన్నికల సమయంలో10వేలు కోట్ల రూపాయలు ఆడపడుచులకు ఇచ్చి మోసం చేయాలని చంద్రబాబు చూశాడని, అదే 10 వేలు కోట్లతో సీఎం జగన్ ఆడపడుచులకు సొంతింటి కల నెరవేర్చాని అన్నారు. తెలంగాణాలో ఓటుకు నోటు విచారణ వస్తుంది కాబట్టి టీడీపీని టీఆర్ఎస్లో విలీనం చేశాడని, ఓటుకు నోటు కేసుకు భయపడి 2024 వరకు ఏపీకి రాజధాని హైదరాబాద్‌లో హక్కు ఉన్న పారిపోయి వచ్చాడని దుయ్యబట్టారు. 2019 ఎన్నికల్లో ప్రధాని మంత్రి కావాలని చూసి రాష్టంలోనే చతికిల పడ్డాడని విమర్శించారు. అప్పుడు కేంద్ర ప్రభుత్వానికి దడిచి టీడీపీ రాజ్యసభ సభ్యులను బీజేపీలో సిగ్గులేకుండా విలీనం చేసాడు. చదవండి: డబ్బు రాజకీయం సృష్టికర్త చంద్రబాబే: వల్లభనేని వంశీ -
వైఎస్సార్ జిల్లా: టీడీపీ అభ్యర్థి వీరంగం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు మాస్క్ ధరించి ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. భారీ భద్రత నడుమ ఓటింగ్ సరళి సజావుగా సాగుతోంది. అయితే ఎన్నికల నిర్వహణను జీర్ణించుకోలేని టీడీపీ పలుచోట్ల దౌర్జన్యానికి తెగబడుతోంది. వైఎస్సార్ జిల్లా చాపాడు మండలం అయ్యవారిపల్లెలో టీడీపీ అభ్యర్థి రాజేశ్వరి వీరంగం సృష్టించారు. ఓటు వేయడం తెలియని ఓ వృద్ధురాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తోందంటూ బ్యాలెట్ పేపర్‌ను బయటకు తీసుకువచ్చారు. ఇక రాజేశ్వరి దౌర్జన్యాన్ని పోలీసులు అడ్డుకోవడంతో వారితో ఆమె వాగ్వాదానికి దిగారు. దీంతో పోలింగ్ కేంద్రంలో కాసేపటి వరకు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా పరిషత్ ఎన్నికల షెడ్యూల్‌కు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ నెల 1న జారీ చేసిన నోటిఫికేషన్లో తదుపరి చర్యలన్నీ నిలిపివేస్తూ సింగిల్ జడ్జి మంగళవారం జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ధర్మాసనం రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో, షెడ్యూల్ ప్రకారం ఈ ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైంది. 515 జెడ్పీటీసీ, 7220 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. జిల్లాల వారీగా పోలింగ్ జరిగే స్థానాలు శ్రీకాకుళం: 37 జెడ్పీటీసీ, 590 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ విజయనగరం: 31 జెడ్పీటీసీ, 487 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ విశాఖపట్నం: 37 జెడ్పీటీసీ, 612 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ తూర్పు గోదావరి: 61 జెడ్పీటీసీ, 1000 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ పశ్చిమగోదావరి: 45 జెడ్పీటీసీ, 781 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ కృష్ణా: 41 జెడ్పీటీసీ, 648 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ గుంటూరు: 45 జెడ్పీటీసీ, 571 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ ప్రకాశం: 41 జెడ్పీటీసీ, 387 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ నెల్లూరు: 34 జెడ్పీటీసీ, 362 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ చిత్తూరు: 33 జెడ్పీటీసీ, 419 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ వైఎస్ఆర్ జిల్లా: 12 జెడ్పీటీసీ, 117 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ కర్నూలు: 36 జెడ్పీటీసీ, 484 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ అనంతపురం: 62 జెడ్పీటీసీ, 782 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ -
ఏపీ పరిషత్ ఎన్నికలు
-
చంద్రగిరిలో ఓటర్లకు టీడీపీ నగదు పంపిణీ
తిరుపతి రూరల్: చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ ఓటుకు రూ.వెయ్యి చొప్పున పంపిణీ చేస్తోంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అగ్రవర్ణాల వారికి రూ.వెయ్యి, ఎస్సీ కాలనీల్లో రూ.2 వేలు, ఎస్టీ కాలనీల్లో రూ.3 వేలు, కేజీ చికెన్ చొప్పున బుధవారం రాత్రి పంపిణీ చేశారు. టీడీపీ శ్రేణులు ఇంటింటికీ వెళ్లి నగదుతోపాటు మద్యం సీసాలు కూడా ఇచ్చారు. టీడీపీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించినా చంద్రబాబు సొంత నియోజకవర్గం చంద్రగిరిలో మాత్రం టీడీపీ అభ్యర్థులు విచ్చలవిడిగా నగదు, మద్యం పంపిణీ చేస్తున్నారు. -
ఏపీలో ముగిసిన పరిషత్ ఎన్నికల పోలింగ్
Time: సాయంత్రం 5 గంటలు ఏపీలో పరిషత్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. క్యూలైన్లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 47.42 శాంతం పోలింగ్ నమోదైంది. Time: సాయంత్రం 4 గంటలు ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్నం 3 గంటల వరకు 47.42 శాతం పోలింగ్ నమోదైంది. శ్రీకాకుళం జిల్లా-46.46 శాతం విజయనగరం జిల్లా-56.57 శాతం విశాఖ జిల్లా- 55.29 శాతం తూర్పు గోదావరి- 51.64 శాతం పశ్చిమగోదావరి జిల్లా-55.4 శాతం కృష్ణా జిల్లా-49 శాతం గుంటూరు జిల్లా- 37.65 శాతం ప్రకాశం జిల్లా- 34.19 శాతం నెల్లూరు జిల్లా -41.8 శాతం చిత్తూరు జిల్లా-50.39 శాతం వైఎస్సార్ జిల్లా- 43.77 శాతం కర్నూలు జిల్లా- 48.40శాతం అనంతపురం జిల్లా: 45.70 శాతం Time: మధ్యాహ్నం 1.30 గంటలు ఏపీ పరిషత్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ► విశాఖపట్నం: కొయ్యూరు మండలం శరభన్నపాలెం గ్రామంలో అరకు పార్లమెంటు సభ్యరాలు ఎంపీ గోడ్డేటి మధవి ఓటు హక్కు వినిమెగించుకున్నారు. ► కర్నూలు: పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామంలో వైఎస్సార్సీపీ జిల్లా సమన్వయ కర్త బైరెడ్డి సిద్దార్థరెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ► విశాఖపట్నం: చోడవరం మండలం అంబేరుపురం పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే కరణం ధర్మ శ్రీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. Time: మధ్యాహ్నం 1.00 గంట ఏపీలో పరిషత్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటు వేయడానికి ఓటర్లు క్యూ లైన్లలో బారులు తీరారు. ► అనంతపురం: తోపుదుర్తి గ్రామంలో రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ► తూర్పుగోదావరి: తుని మండలం ఎస్.అన్నవరం జీపీహెచ్ స్కూల్లో ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా దంపతులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ► కృష్ణా : గన్నవరం బాలుర హైస్కూల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌లో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ► శ్రీకాకుళం: చంద్రబాబు నిర్ణయాన్ని మాజీ ఎమ్మెల్యే కలమట వెంకట రమణ ధిక్కరించారు. ఆయన తన భార్య ఇందిరతో కలిసి మాతల గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొత్తూరు మండలం మాతలలో టీడీపీ ఎంపీటీసీగా కలమట ఇందిర పోటీ చేశారు. Time: మధ్యాహ్నం 12.30 గంటలు ► శ్రీకాకుళం: పాతపట్నంలో ఎమ్మెల్యే రెడ్డి శాంతి, ఆమె కుటుంసభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ► శ్రీకాకుళం: జిల్లాలోని ఆముదాలవలసలో ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్ధానిక సంస్ధల ఎన్నికలు చాల శక్తివంతమైనవి అని తెలిపారు. ప్రజాస్వామ్యానికి ఊపిరి పోసే పెద్ద ప్రక్రియలో ఓటు చాల ముఖ్యమైనదని చెప్పారు. ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకొఇవాలన్నారు. ప్రజలు తమ ఓటు ద్వారా ఇచ్చిన తీర్పుకే అత్యంత ప్రాధాన్యత ఉంటుందని గుర్తు చేశారు. ► గుంటూరు: పెదనందిపాడు మండలం రాజుపాలెంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై టీడీపీ వర్గీయులు దాడికి తెగపడ్డారు. పోలింగ్ బూత్ వద్ద నిలబడి ఓటర్లకు తెలుగుదేశం పార్టీకి ఓటేయమని టీడీపీ నాయకులు చెబుతున్నారు. దీంతో టీడీపీ నాయకులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ నాయకులు అభ్యంతరం తెలిపారు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో రెచ్చిపోయిన టీడీపీ నాయకులు వైఎస్సార్సీపీ నాయకులపై దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు వైఎస్సార్సీపీ నాయకులు గాయపడ్డారు. Time: మధ్యాహ్నం 12 గంటలు ఏపీలో పరిషత్ ఎన్నికల పోలింగ్ కొనసాగుంతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 11 గంటల వరకు 21.65 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. జిల్లాల వారీగా పోలింగ్ నమోదు శాతాలు శ్రీకాకుళం జిల్లాలో 19.32 శాతం పోలింగ్ నమోదు విజయనగరం జిల్లాలో 25.68 శాతం పోలింగ్ నమోదు విశాఖపట్నం జిల్లాలో 24.14 శాతం పోలింగ్ నమోదు తూర్పుగోదావరి జిల్లాలో 25.00 శాతం పోలింగ్ నమోదు ప.గో జిల్లాలో 23.40 శాతం పోలింగ్ నమోదు కృష్ణా జిల్లాలో 19.29 శాతం పోలింగ్ నమోదు గుంటూరు జిల్లాలో 15.85 శాతం పోలింగ్ నమోదు ప్రకాశం జిల్లాలో 15.05 శాతం పోలింగ్ నమోదు నెల్లూరు జిల్లాలో 20.59 శాతం పోలింగ్ నమోదు కర్నూలు జిల్లాలో 25.96 శాతం పోలింగ్ నమోదు అనంతపురం జిల్లాలో 22.88 శాతం పోలింగ్ నమోదు వైఎస్ఆర్ జిల్లాలో 19.72 శాతం పోలింగ్ నమోదు చిత్తూరు జిల్లాలో 24.52 శాతం పోలింగ్ నమోదు ► నెల్లూరు: పొదలకూరు మండలం తోడేరు గ్రామంలో జడ్పీటీసీ పోలింగ్‌లో సర్వేపల్లి ఎమ్మెల్యే , వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. Time: ఉదయం 11.30 ► నెల్లూరు: ఎఎస్‌పేట మండలం పొనుగోడులో పరిషత్ ఎన్నికల పోలింగ్ నిలిచిపోయింది. రేపు(శుక్రవారం) రీ పోలింగ్ నిర్వహించాలని జిల్లా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. బీజేపీ ఏజెంట్ ప్రసాద్ బ్యాలెట్ బాక్స్‌ను ఎత్తుకెళ్లి నీటితొట్టిలో వేయటంతో వివాదం నెలకొంది. అడ్డుకునేందుకు యత్నించిన అధికారులను ప్రసాద్ తోసేసి బాక్స్ ఎత్తుకెళ్లాడు. ప్రస్తుతం బీజేపీ ఏజెంట్ ప్రసాద్ పరారీలో ఉన్నాడు. Time: ఉదయం 11.00 ఏపీ పరిషత్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. కృష్ణా జిల్లా గన్నవరం బాలుర హైస్కూల్లో పోలింగ్ బూత్‌లను సీపీ బత్తిన శ్రీనివాసులు పరిశీలించారు. విజయవాడ సిటీ పరిధిలోని 8 మండలాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందని తెలిపారు. తొలి మూడు గంటల్లో 13 శాతం ఓట్లు పోలయ్యాయని చెప్పారు. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి మండలానికి డీసీపీ స్థాయి అధికారిని నియమించామని చెప్పారు. ఇప్పటి వరకు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదన్నారు. ప్రజలు తమ ఓటు హక్కును ప్రశాంత వాతావరణంలో వినియోగించుకోవాలన్నారు. Time: ఉదయం 10.30 ► నెల్లూరు: ఎఎస్‌పేట మండలం పాముగోడులో పోలింగ్ కేంద్ర వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామంలో వృద్ధుడి ఓటు విషయంలో పోలింగ్ కేంద్రం వద్ద గొడవ జరిగింది. ఓటు వేసేందుకు వచ్చిన వైఎస్సార్సీపీ కార్యకర్తను అడ్డుకోవడంతో వివాదం చెలరేగింది. బీజేపీ ఏజెంట్ బ్యాలెట్ బాక్స్‌ను నీళ్లలో ముంచేయడంతో ఎన్నికలు అధికారులు పోలింగ్ నిలిపివేశారు. అడ్డుకునేందుకు యత్నించిన అధికారులను తోసేసి బీజేపీ ఏజెంట్ ప్రసాద్ బ్యాలెట్ బాక్స్ ఎత్తుకెళ్లి నీళ్లల్లో వేశాడు. ► తూర్పుగోదావరి: అమలాపురం రూరల్ మండలం సాకుర్రు గున్నేపల్లి పోలింగ్ వద్ద ఘర్షణ చోటు చేసుకుంది. బ్యాలెట్ పత్రాలపై జనసేన పార్టీ గుర్తు లేకపోవడంతో అభ్యర్థి ఆందోళన చేశారు. దీంతో పోలింగ్ ప్రక్రియను అధికారులు నిలిపివేశారు. ► విశాఖపట్నం: అరకు వ్యాలీలో ఎమ్మెలే చెట్టి ఫాల్గుణ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ► కర్నూలు: పాములపాడు మండలం మద్దూరు గ్రామంలో ఎమ్మెల్యే ఆర్థర్ ఓటు వేశారు. ► చిత్తూరు: చిత్తూరు మండలం పాలూరులో ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొన్న భీముని చెరువులో సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం ఓటు హక్కు వినియోగించుకున్నారు. Time: ఉదయం 10.00 ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 9 గంటల వరకు 7.76 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో 8.99 శాతం పోలింగ్ నమోదు విజయనగరం జిల్లాలో 9.01 శాతం పోలింగ్ నమోదు విశాఖ జిల్లాలో 8.83 శాతం పోలింగ్ నమోదు తూ.గో జిల్లాలో 4.59 శాతం పోలింగ్ నమోదు ప.గో జిల్లాలో 9.26 శాతం పోలింగ్ నమోదు కృష్ణా జిల్లాలో 9.32 శాతం పోలింగ్ నమోదు గుంటూరు జిల్లాలో 7.52 శాతం పోలింగ్ నమోదు ప్రకాశం జిల్లాలో 6.53 శాతం పోలింగ్ నమోదు నెల్లూరు జిల్లాలో 6.36 శాతం పోలింగ్ నమోదు చిత్తూరు జిల్లాలో 7.29 శాతం పోలింగ్ నమోదు వైఎస్ఆర్ జిల్లాలో 4.81 శాతం పోలింగ్ నమోదు కర్నూలు జిల్లాలో 9.58 శాతం పోలింగ్ నమోదు అనంతపురం జిల్లాలో 7.76 శాతం పోలింగ్ నమోదు ► తాడేపల్లి: కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పోలింగ్ ప్రక్రియపై నిఘా పెట్టి, వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్నామని రాష్ట్ర ఎన్నికల అధికారి గిరిజా శంకర్ తెలిపారు. అన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. 3,530 మందితో నిరంతరం వెబ్ కాస్టింగ్ జరుగుతోందని తెలిపారు. ► శ్రీకాకుళం: సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ఎస్పీ అమిత్‌బర్థార్ పర్యవేక్షించారు. శాంతి భద్రత చర్యలను సమీక్షించారు. Time: ఉదయం 9.30 పరిషత్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు పెద్ద ఎత్తున ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. ► విశాఖపట్నం: పాడేరు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ పోలింగ్ కేంద్రంలో పాడేరు ఎమ్మెల్యే కొట్టగూలీ భాగ్యలక్ష్మి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ► కృష్ణా: జిల్లాలోని నందివాడ మండలం జొన్నపాడు గ్రామంలో రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్‌ను చూసి భయపడి చంద్రబాబు పారిపోయాడని తెలిపారు. 2024 ఎన్నికల్లో కూడా చంద్రబాబు పారిపోతాడని చెప్పారు. పంచాయతీ ఎన్నికల మాదిరే, పరిషత్ ఎన్నికలు కూడా ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని అన్నారు. ► కృష్ణా: జిల్లా చందర్లపాడులో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్రావు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అవనిగడ్డలో ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, జడ్పీటీసీ అభ్యర్థి చింతలపూడి లక్ష్మీనారాయణ, దివి మార్కెట్ యార్డ్ చైర్మన్ కడవకోల్లు నరసింహారావు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ► పశ్చిమ గోదావరి: దెందులూరు నియోజకవర్గంలోని దుగ్గిరాల గ్రామంలోని అతి సమస్యత్మాక పోలింగ్ కేంద్రాం వద్ద జరుగుతున్న పోలింగ్ ప్రక్రియను ఏలూరుడీఎస్పి డాక్టర్ దిలీప్ కిరణ్ పరిశీలించారు. సమస్యత్మాక, అతి సమస్యత్మాక కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన పోలీసు భద్రత ఏర్పాటు చేశామని తెలిపారు. పోలింగ్ ప్రారంభమైన తర్వాత ఇప్పటి వరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ఓటర్లు తమ ఓటు హాక్కు వినియోగించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ► వైఎస్ఆర్ జిల్లా: నందలూరు మండలంలో చెన్నయ్యగారిపల్లెలో ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జునరెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. Time: ఉదయం 9.00 పరిషత్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటు వేయడానికి ఓటర్లు క్యూలైన్లలో బారులు తీరారు. ► తూర్పు గోదావరి: మామిడికుదురు మండలంలో జనసేన కార్యకర్తలు వీరంగం సృష్టించారు. పెదపట్నంలంక-సత్తెమ్మపేటలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడికి తెగపడ్డారు. ఓటర్లకు జనసేన డబ్బు పంచుతుండగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. జనసేన కార్యకర్తల దాడిలో నలుగురు వైఎస్సార్సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. ► శ్రీకాకుళం: పాలకొండలోని వీరఘట్టం మండలం వండువలో ఎమ్మెల్యే కళావతి ఓటు హక్కును వినియోగించుకున్నారు. Time: ఉదయం 8.30 ►వైఎస్ఆర్ కడప: జిల్లాని చాపాడు మండలం అయ్యవారిపల్లెలో టీడీపీ అభ్యర్థి దౌర్జన్యానికి తెగపడ్డారు. టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి రాజేశ్వరి బ్యాలెట్ పేపర్‌ను బయటకు తీసుకువచ్చారు. ► అనంతపురం: జిల్లాలో ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాల్లో నిఘా పెట్టామని ఎస్పీ సత్యయేసుబాబు తెలిపారు. తాడిపత్రి, రాప్తాడు, ధర్మవరంలో భారీ భద్రత ఏర్పాటు చేశామన్నారు. సున్నితమైన ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశామని పేర్కొన్నారు. Time: ఉదయం 8.00 పరిషత్ ఎన్నికల పోలింగ్ కోనసాగుతోంది. ఓటర్లు పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకోవడానికి తరలివస్తున్నారు. గుంటూరు పెదకాకానిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. Time: ఉదయం 7.30 పరిషత్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటు వేయడానికి ఓటర్లు తరలివసున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం కొండలరావు పాలెంలో ఎమ్మెల్యే కొఠారి అబ్బాయి చౌదరి ఓటు హక్కు వినియోగించుకున్నారు. Time: ఉదయం 7.00 ఆంధ్రప్రదేశ్‌లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఓటర్లు మాస్క్ ధరించి ఓటు హక్కు వినియోగించుకోవడానికి తరలివస్తున్నారు. 515 జెడ్పీటీసీ, 7220 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్ర 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 2గంటల వరకే పోలింగ్ జరుగుతుంది. కోవిడ్ నేపథ్యంలో ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. Time: ఉదయం 6.50 ఆంధ్రప్రదేశ్‌లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. 515 జెడ్పీటీసీ, 7220 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్ర 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 2గంటల వరకే పోలింగ్ జరుగుతుంది. జెడ్పీటీసీ ఎన్నికల బరిలో 2,058 మంది అభ్యర్థులు, ఎంపీటీసీ ఎన్నికల బరిలో 18,782 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పరిషత్ ఎన్నికల కోసం 27,751 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. పరిషల్ ఎన్నికల పోలింగ్‌లో 2,46,71,002 మంది తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. జిల్లాల వారీగా పోలింగ్ జరిగే స్థానాలు శ్రీకాకుళం: 37 జెడ్పీటీసీ, 590 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ విజయనగరం: 31 జెడ్పీటీసీ, 487 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ విశాఖపట్నం: 37 జెడ్పీటీసీ, 612 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ తూర్పు గోదావరి: 61 జెడ్పీటీసీ, 1000 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ పశ్చిమగోదావరి: 45 జెడ్పీటీసీ, 781 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ కృష్ణా: 41 జెడ్పీటీసీ, 648 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ గుంటూరు: 45 జెడ్పీటీసీ, 571 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ ప్రకాశం: 41 జెడ్పీటీసీ, 387 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ నెల్లూరు: 34 జెడ్పీటీసీ, 362 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ చిత్తూరు: 33 జెడ్పీటీసీ, 419 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ వైఎస్ఆర్ జిల్లా: 12 జెడ్పీటీసీ, 117 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ కర్నూలు: 36 జెడ్పీటీసీ, 484 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ అనంతపురం: 62 జెడ్పీటీసీ, 782 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ సాక్షి, అమరావతి: ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు అడ్డంకి తొలగిపోయింది. పరిషత్ ఎన్నికల షెడ్యూల్‌కు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ నెల 1న జారీ చేసిన నోటిఫికేషన్లో తదుపరి చర్యలన్నీ నిలిపివేస్తూ సింగిల్ జడ్జి మంగళవారం జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను తాజాగా హైకోర్టు ధర్మాసనం రద్దు చేసింది. షెడ్యూల్ ప్రకారం ఈ ఎన్నికల నిర్వహణకు అనుమతినిచ్చింది. అయితే సింగిల్ జడ్జి వద్ద ఉన్న రిట్ పిటిషన్ పరిష్కారం అయ్యేవరకు ఓట్ల లెక్కింపు చేపట్టవద్దని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. అదేవిధంగా ఫలితాలను కూడా ప్రకటించవద్దని స్పష్టం చేసింది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయిన తరుణంలో ఎన్నికలను నిలిపివేయడం సరికాదని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అప్పీల్‌ను పరిష్కరిస్తున్నట్లు పేర్కొన్న ధర్మాసనం.. సింగిల్ జడ్జి ముందున్న రిట్ పిటిషన్ ఏ రోజైతే విచారణకు ఉందో ఆ రోజు విచారణకు వచ్చేలా చూడాలని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది. ఎన్నికలను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సమయంలోనే వర్ల రామయ్య రిట్ పిటిషన్‌ను సింగిల్ జడ్జి అనుమతినిచ్చినట్లయిందని ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. వాస్తవానికి సింగిల్ జడ్జి వద్ద రిట్ పిటిషన్ అపరిష్కృతంగా ఉందని తెలిపింది. తాజాగా ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశాలు ఇవ్వడం ద్వారా సింగిల్ జడ్జి తుది తీర్పునిచ్చినట్లయిందని ధర్మాసనం పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాల తరువాత జరిగిన గ్రామ పంచాయతీ, పురపాలక ఎన్నికల సందర్భంగా నాలుగు వారాల పాటు ఎన్నికల నియమావళిని అమలు చేయలేదన్న విషయాన్ని సింగిల్ జడ్జి పరిగణలోకి తీసుకోలేదని ధర్మాసనం ఆక్షేపించింది. వర్ల రామయ్య ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునే అంశంపై సింగిల్ జడ్జి నిర్దిష్టంగా తేల్చలేదని వివరించింది. ఈ మొత్తం వ్యవహారంలో అనేక వివాదాస్పద అంశాలున్నాయని, వీటన్నింటిపై రిట్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా తేల్చాల్సి ఉందంది. అందువల్ల అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. -
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రేపే పోలింగ్
-
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్
సాక్షి, అమరావతి: ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు అడ్డంకి తొలగిపోయింది. పరిషత్ ఎన్నికల షెడ్యూల్‌కు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ నెల 1న జారీ చేసిన నోటిఫికేషన్లో తదుపరి చర్యలన్నీ నిలిపివేస్తూ సింగిల్ జడ్జి మంగళవారం జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను తాజాగా హైకోర్టు ధర్మాసనం రద్దు చేసింది. షెడ్యూల్ ప్రకారం ఈ ఎన్నికల నిర్వహణకు అనుమతినిచ్చింది. అయితే సింగిల్ జడ్జి వద్ద ఉన్న రిట్ పిటిషన్ పరిష్కారం అయ్యేవరకు ఓట్ల లెక్కింపు చేపట్టవద్దని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. అదేవిధంగా ఫలితాలను కూడా ప్రకటించవద్దని స్పష్టం చేసింది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయిన తరుణంలో ఎన్నికలను నిలిపివేయడం సరికాదని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అప్పీల్‌ను పరిష్కరిస్తున్నట్లు పేర్కొన్న ధర్మాసనం.. సింగిల్ జడ్జి ముందున్న రిట్ పిటిషన్ ఏ రోజైతే విచారణకు ఉందో ఆ రోజు విచారణకు వచ్చేలా చూడాలని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది. ఎన్నికలను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సమయంలోనే వర్ల రామయ్య రిట్ పిటిషన్‌ను సింగిల్ జడ్జి అనుమతినిచ్చినట్లయిందని ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. వాస్తవానికి సింగిల్ జడ్జి వద్ద రిట్ పిటిషన్ అపరిష్కృతంగా ఉందని తెలిపింది. తాజాగా ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశాలు ఇవ్వడం ద్వారా సింగిల్ జడ్జి తుది తీర్పునిచ్చినట్లయిందని ధర్మాసనం పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాల తరువాత జరిగిన గ్రామ పంచాయతీ, పురపాలక ఎన్నికల సందర్భంగా నాలుగు వారాల పాటు ఎన్నికల నియమావళిని అమలు చేయలేదన్న విషయాన్ని సింగిల్ జడ్జి పరిగణలోకి తీసుకోలేదని ధర్మాసనం ఆక్షేపించింది. వర్ల రామయ్య ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునే అంశంపై సింగిల్ జడ్జి నిర్దిష్టంగా తేల్చలేదని వివరించింది. ఈ మొత్తం వ్యవహారంలో అనేక వివాదాస్పద అంశాలున్నాయని, వీటన్నింటిపై రిట్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా తేల్చాల్సి ఉందంది. అందువల్ల అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులపై ఎస్ఈసీ అప్పీల్... పోలింగ్ తేదీకి నాలుగు వారాల ముందు ఎన్నికల నియమావళిని అమలు చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఎన్నికల కమిషన్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహిస్తోందంటూ టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల తేదీకి నాలుగు వారాల ముందుగా ఎన్నికల నియమావళిని అమలు చేయాలని సుప్రీంకోర్టు చెప్పిందని, అందుకు విరుద్ధంగా ఎన్నికలు నిర్వహించడం సరికాదంటూ ఎన్నికల నోటిఫికేషన్లో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. దీన్ని సవాలు చేస్తూ ఎన్నికల కమిషన్ కార్యదర్శి కె.కన్నబాబు మంగళవారం రాత్రి అత్యవసరంగా హౌస్ మోషన్ రూపంలో అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై బుధవారం ఉదయం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.. ఎన్నికల కమిషన్ తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ‘రిట్ పిటిషన్ దాఖలు చేసిన వర్ల రామయ్య ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఓటర్లు, ప్రజల కోసం వ్యక్తిగత హోదాలో ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేసినట్లు ఆయన తరఫు న్యాయవాది అంగీకరించారు. దీనిపై మేం సింగిల్ జడ్జి వద్ద అభ్యంతరం వ్యక్తం చేశాం. వర్ల రామయ్య పిటిషన్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం కిందకు వస్తుందని, దాన్ని ధర్మాసనమే విచారించాలని కోరాం. అయితే సింగిల్ జడ్జి మా వాదనను పట్టించుకోలేదు. ఎన్నికల నియమావళి అమలు విషయంలో ఎన్నికల కమిషన్‌కు విచక్షణాధికారాలున్నాయి. అసలు ఎన్నికల నియమావళికి చట్టపరమైన దన్ను ఏదీ లేదు. ప్రతి ఎన్నికకు 4 వారాల పాటు నియమావళిని అమలు చేయాల్సి వస్తే మూడు నాలుగు నెలల పాటు అభివృద్ధి కార్యక్రమాల అమలు నిలిచిపోతుంది. గ్రామ పంచాయతీల ఎన్నికల ప్రక్రియను 28 రోజుల్లో పూర్తి చేశాం. పురపాలక ఎన్నికలను 24 రోజుల్లో పూర్తి చేశాం. అయితే ఇంతకుముందు జరిగిన స్థానిక ఎన్నికల్లో 30 రోజుల ఎన్నికల నియమావళిని అమలు చేయలేదు. అప్పుడు ఎవరూ దీన్ని సవాలు చేయలేదు. ఒకసారి ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక అందు లో ఏ రకంగానూ జోక్యం చేసుకోరాదని సుప్రీం కోర్టు చెప్పింది. సమయాభావం వల్ల పూర్తి స్థాయి కౌంటర్ వేయలేకపోయాం. ప్రాథమిక కౌంటర్ దాఖలు చేశాం. గురువారం ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అందువల్ల ఎన్నికలను కొనసాగనివ్వండి’అని ధర్మాసనాన్ని సీవీ మోహన్‌రెడ్డి అభ్యర్థించారు. కోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిందే... వర్ల రామయ్య తరఫు సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపించారు. ‘ఈసీ రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ. హైకోర్టు ఆదేశాలు అయినా, సుప్రీంకోర్టు ఆదేశాలు అయినా వాటిని అమలు చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై ఉంది. తమకు అర్థమైన రీతిలో కోర్టు ఆదేశాలను అమలు చేస్తామంటే కుదరదు. ఎన్నికల తేదీకి ముందు 4 వారాల పాటు ఎన్నికల నియమావళిని అమలు చేయాలని సుప్రీం కోర్టు చెప్పినట్లుగా అమలు చేసి తీరాల్సిందే. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కేవలం 10 రోజులు మాత్రమే నియమావళిని అమలు చేస్తున్నారు’అని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో 4 వారాల నియమావళి అమలు కాలేదు... చివరగా ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపించారు. ‘స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మొదలైన నాటి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోనే ఉంది. గత ఎన్నికల్లో నాలుగు వారాల పాటు ఎన్నికల నియమావళి అమలు కాలేదు. కోవిడ్ వల్ల ఎన్నికలు ఆపేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఎన్నికలను వాయిదా వేసి ఎన్నికల నియమావళిని ఎత్తివేయకపోవడం వల్ల అభివృద్ధి కార్యక్రమాలన్నీ స్తంభించిపోతాయని సుప్రీంకోర్టుకు ప్రభుత్వం నివేదించింది. దీంతో ఎన్నికలు లేనప్పుడు నియమావళి అమల్లో ఉండరాదంటూ దాన్ని సడలించింది. పోలింగ్ తేదీకి నాలుగు వారాల ముందు నియమావళిని అమలు చేయాలని సూచించింది. అయితే ఈ నాలుగు వారాలన్నది గరిష్ట కాల పరిమితి. అంతేకానీ నిరవధికంగా నియమావళి ఉండాలన్నది సుప్రీంకోర్టు ఉద్దేశం కాదు. ఈ ఎన్నికలు పూర్తయితే కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో చేపట్టేందుకు అవకాశం ఉంటుంది. అసెంబ్లీలో బడ్జెట్ కార్యక్రమాలు కూడా చేపట్టలేదు. ఎన్నికల ప్రక్రియ మొదలైన తరువాత న్యాయస్థానాలు అందులో జోక్యం చేసుకోరాదని సుప్రీంకోర్టు ఎన్నో తీర్పులు చెప్పింది. ఈ కేసులో కూడా సింగిల్ జడ్జి జోక్యం చేసుకుని ఉండాల్సి కాదు’అని నివేదించారు. అందరి వాదనలు విన్న ధర్మాసనం సింగిల్ జడ్జి ఉత్తర్వులను రద్దు చేస్తూ యథాతథంగా పరిషత్ ఎన్నికల నిర్వహణకు అనుమతినిచ్చింది. చదవండి: నిమ్మగడ్డ నిర్వాకంతోనే.. -
ఆఖరి నిమిషంలో హైకోర్టు బ్రేక్
సాక్షి, అమరావతి: మరో గంటసేపటిలో ఎన్నికల ప్రచారం ముగుస్తుందన్న సమయంలో మంగళవారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను వాయిదా వేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. దీంతో సుదీర్ఘకాలంగా సాగుతున్న ఈ పరిషత్ ఎన్నికల ప్రక్రియ ఎప్పుడు ముగుస్తుందా అని అభ్యర్థుల్లో ఆందోళన, ఉత్కంఠ నెలకొంది. గతేడాది మార్చి 7న మొదలైన ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ కరోనా పేరుతో సుదీర్ఘకాలంపాటు వాయిదా పడిన సంగతి తెలిసిందే. గతేడాది మార్చి 21న పోలింగ్ జరగాల్సి ఉండగా.. 14న నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. ఇక అభ్యర్థులు ప్రచారం మొదలు పెట్టే సమయంలో కరోనా పేరుతో అదే నెల 15న అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఎన్నికలను అర్ధాంతరంగా వాయిదా వేశారు. మొదట పరిషత్ ఎన్నికలే జరగాల్సి ఉన్నప్పటికీ.. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను పూర్తి చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాల్సి ఉన్నప్పటికీ.. నిమ్మగడ్డ మాత్రం ఈ ఎన్నికలను గాలికొదిలేశారు. మొదట గ్రామ పంచాయతీ, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలను నిర్వహించిన ఆయన అవకాశం ఉన్నప్పటికీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించకుండానే తన పదవీకాలాన్ని ముగించారు. ఇటీవల రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్ని అప్పట్లో ఆగిపోయిన ఎన్నికలను ఆగిన చోట నుంచే తిరిగి కొనసాగించేందుకు వీలుగా ఈ నెల 1న నోటిఫికేషన్ జారీ చేశారు. దీని ప్రకారం 8న (గురువారం) పోలింగ్ జరగాల్సి ఉంది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు అభ్యర్థుల ప్రచారం కూడా ముగిసింది. అయితే అనూహ్యంగా మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఎన్నికలకు బ్రేక్ వేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. ► రాష్ట్రంలో 660 జెడ్పీటీసీ స్థానాల్లో 8 చోట్ల కోర్టు కేసులు, తదితర కారణాల వల్ల ఎన్నికలు జరగడం లేదు. మిగిలిన 652 జెడ్పీటీసీ స్థానాల్లో ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయగా, అందులో 126 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. వివిధ రాజకీయ పార్టీల తరఫున పోటీలో ఉన్న అభ్యర్థులు మృతి చెందడంతో 11 చోట్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి. మిగిలిన 515 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా మొత్తం 2,058 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ► అలాగే రాష్ట్రవ్యాప్తంగా 10,047 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. కోర్టు కేసులు, తదితర కారణాల వల్ల 375 చోట్ల ఎన్నికలు జరగడం లేదు. మిగిలిన 9,672 ఎంపీటీసీ స్థానాల్లో 2,371 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. వివిధ రాజకీయ పార్టీల తరఫున పోటీలో ఉన్న అభ్యర్థుల మృతి కారణంగా 81 చోట్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి. దీంతో ఎన్నికలు నిర్వహించాల్సిన 7,220 ఎంపీటీసీ స్థానాల్లో 18,782 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ► ఈ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో పోటీలో ఉన్న అభ్యర్థుల్లో ఇప్పటికే 116 మంది మరణించినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్, పంచాయతీరాజ్ శాఖ అధికారులు నిర్ధారించిన విషయం తెలిసిందే. -
నిమ్మగడ్డ నిర్వాకంతోనే..
సాక్షి, అమరావతి: రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్వాకం ఇప్పుడు ఇంకోసారి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియకు ఆటంకాలను తెచ్చిపెట్టింది. ఎన్నికల కొనసాగింపు నోటిఫికేషన్ జారీకి, పోలింగ్‌కు మధ్య నాలుగు వారాలపాటు ఎన్నికల కోడ్ అమలు చేయాలంటూ హైకోర్టు గురువారం జరగాల్సిన ఎన్నికలకు బ్రేక్ వేసిన సంగతి తెలిసిందే. గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలను నిర్వహించిన ఆయన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియను కూడా కొనసాగించి ఉంటే.. ఎటువంటి ఆటంకాలు వచ్చి ఉండేవి కావని అధికార వర్గాలు అంటున్నాయి. పరిషత్ ఎన్నికల నిర్వహణను పట్టించుకోని నిమ్మగడ్డ ఫిబ్రవరి 21కే గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మొత్తం ముగిసింది. దీని తర్వాత కూడా నిమ్మగడ్డ దాదాపు 20 రోజులపైనే గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్‌ను కొనసాగించారు. జనవరి 9 నుంచి మార్చి 11 వరకు 2 నెలలపాటు ఎన్నికల కోడ్‌ను అమలు చేశారు. ఆ సమయంలో కేవలం ఆరు రోజుల వ్యవధిలో ముగిసే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణను ఆయన పట్టించుకోలేదు. హైకోర్టు మంగళవారం వెలువరించిన తీర్పు ప్రకారం.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించాల్సి వస్తే దాదాపు మరో నెల పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్‌ను అమలు చేయాల్సి ఉంటుంది. కోడ్ అమలు అంటే.. సంక్షేమ పథకాలను ప్రభుత్వం అనేక ఆంక్షల మధ్య అమలు చేయాల్సి రావడమే. ఎన్నికల ప్రక్రియ ముగిశాక కూడా ఎన్నికల కోడ్ అమలు చేసిన నిమ్మగడ్డ ఉద్దేశపూర్వకంగానే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయకుండా ఆపారనే విమర్శలు వెల్లువెత్తాయి. సీఎస్ కోరినా పట్టించుకోకుండా.. గ్రామీణ ప్రాంతాల్లో కోడ్ అమల్లో ఉన్న సమయంలోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను కూడా చేపట్టాలని సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఫిబ్రవరి 15న నిమ్మగడ్డకు ప్రభుత్వం తరఫున ఒక లేఖను పంపారు. సీఎస్, ప్రభుత్వం సూచనలను పట్టించుకోకుండానే పంచాయతీ ఎన్నికలు ముగిశాక కూడా 20 రోజులకుపైనే నిమ్మగడ్డ కోడ్‌ను అమల్లో ఉంచారు. -
పరిషత్ పోరుపై 'స్టే'.. నేటి ఉదయం విచారణ
సాక్షి, అమరావతి: పరిషత్ పోరుకు సర్వం సిద్ధమైన దశలో హఠాత్తుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిలిపివేస్తూ సింగిల్ జడ్జి మంగళవారం మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్వులపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ హైకోర్టులో రాత్రి హౌస్ మోషన్ రూపంలో అప్పీల్ దాఖలు చేసింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేయాలని అభ్యర్థిస్తూ కమిషన్ కార్యదర్శి కన్నబాబు దాఖలు చేసిన ఈ అప్పీల్‌ను హైకోర్టు ధర్మాసనం బుధవారం ఉదయం 8 గంటలకు విచారించే అవకాశం ఉంది. సుప్రీం ఆదేశాలకు భిన్నంగా ఉన్నందున.. గురువారం జరగాల్సిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ నెల 1న జారీ చేసిన నోటిఫికేషన్లో తదుపరి చర్యలన్నీ తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకు నిలిపివేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు మంగళవారం అంతకుముందు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల తేదీకి నాలుగు వారాల ముందు ఎన్నికల నియమావళిని అమలు చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను ఎన్నికల కమిషన్ అమలు చేయలేదని, సుప్రీం ఆదేశాలకు భిన్నంగా ఉన్నందున నిలుపుదల చేయడం తప్పనిసరి అని పేర్కొన్నారు. అయితే సమయానుసారం ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత కమిషన్‌పై ఉన్నందున సుప్రీంకోర్టు ఆదేశాలను తు.చ. తప్పకుండా అమలు చేస్తామని పేర్కొంటూ తాజాగా నోటిఫికేషన్ జారీ చేయాలని సూచించారు. ఈ వివరాలతో ఈ నెల 15కల్లా అఫిడవిట్ దాఖలు చేయాలని ఎన్నికల కమిషన్‌ను ఆదేశిస్తూ టీడీపీ నేత వర్ల రామయ్య దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను అనుమతించారు. ఇదే సమయంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిమిత్తం గత ఏడాది మార్చి, మే నెలల్లో ఎన్నికల కమిషన్ జారీ చేసిన నోటిఫికేషన్లలో తదుపరి చర్యలన్నీ నిలుపుదల చేసేందుకు నిరాకరించారు. ఏపీ పంచాయతీరాజ్ ఎన్నికల నిర్వహణ నిబంధన రూల్ 7 ప్రకారం పరిస్థితులను బట్టి ఎన్నికల కార్యక్రమాన్ని మార్చడం, రీ నోటిఫై చేసే అధికారం ఎన్నికల కమిషన్‌కు ఉందని స్పష్టం చేస్తూ బీజేపీ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను కొట్టివేశారు. ఏ దశలో ఎన్నికలు నిలిచిపోయాయో ఆ దశ నుంచే కొనసాగిస్తే ఎన్నికల్లో పోటీ చేసే హక్కును నిరాకరించినట్లేనన్న బీజేపీ వాదనను కూడా న్యాయస్థానం తిరస్కరించింది. ప్రత్యేక పరిస్థితుల్లో జోక్యం చేసుకోవచ్చు.... ‘సాధారణంగా న్యాయస్థానాలు ఒకసారి ఎన్నికల ప్రక్రియ మొదలైన తరువాత ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకునేందుకు రాజ్యాంగంలోని అధికరణ 226 కింద తనకున్న విశేషాధికారాలను ఉపయోగించవు’ అని విచారణ సందర్భంగా జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు పేర్కొన్నారు. ‘ఈ విషయంలో అధికరణ 329 ప్రకారం నిషేధం ఉంది. అభ్యంతరం ఉన్న వ్యక్తులు సంబంధిత అథారిటీ ముందు ఎన్నికల పిటిషన్ దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎన్నికల అంశాల్లో అధికరణ 226 కింద న్యాయస్థానాలు న్యాయ సమీక్ష చేయరాదనడం అవాస్తవం. మోహిందర్ సింగ్ గిల్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం, న్యాయస్థానాలు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో జోక్యం చేసుకోవచ్చు. ఉదాహరణకు నిష్పాక్షిక ఎన్నికలకు అడ్డంకులు, అందరికీ ఎన్నికల్లో పోటీ చేసే సమాన అవకాశాలు కల్పించకపోవడం, ఎన్నికల పురోగతిని అడ్డుకోవడం, చట్ట ప్రకారం ఎన్నికలను నిర్వహించకపోవడం లాంటి చర్యలకు ఎన్నికల కమిషనర్ పాల్పడినా, ఉత్తర్వులు జారీ చేసినా అందులో న్యాయస్థానాలు జోక్యం చేసుకుని ఎన్నికలు నిరాటంకంగా జరిగేలా చూడవచ్చు. ఎన్నికల కమిషనర్, రిటర్నింగ్ అధికారుల తప్పులు ఎన్నికల షెడ్యూల్, పురోగతిని ప్రభావితం చేస్తుంటే అప్పుడు న్యాయస్థానాల జోక్యానికి అనుమతి ఉంది. ఎన్నికలను నిలుపుదల చేసేందుకు పిటిషన్ వేస్తే న్యాయస్థానం అందుకు తన విశేషాధికారాలను ఉపయోగించదు. ప్రత్యామ్నాయాలను చూసుకోవాలని పిటిషనర్‌కు చెబుతుంది’ అని తెలిపారు. నాలుగు వారాల పాటు నియమావళి.. ‘ఎన్నికలు తిరిగి నిర్వహించే ముందు ప్రభుత్వాన్ని సంప్రదించాలని కమిషన్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎన్నికల తేదీకి నాలుగు వారాల ముందు నియమావళిని తిరిగి అమలు చేయాలని ఆదేశించింది. ఈ ఉత్తర్వులను బట్టి చూస్తే ఎన్నికల నియమావళి అమలు విషయంలో సుప్రీంకోర్టు కమిషన్‌కు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. నియమావళి నాలుగు వారాల పాటు ఎన్నికలు జరిగే తేదీ వరకు అమల్లో ఉండాలన్నది సుప్రీంకోర్టు ఉత్తర్వుల ఉద్దేశం. నాలుగు వారాల గడువు గరిష్ట పరిమితి అన్న ఎన్నికల కమిషన్ తరఫు సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదనతో ఈ న్యాయస్థానం ఏకీభవించడం లేదు. ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టు ఉత్తర్వుల నుంచి పక్కకు తప్పుకున్నందున ఈ న్యాయస్థానం ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోగలదు. సుప్రీంకోర్టు ఆదేశాలకు ప్రతి ఒక్కరూ లోబడి ఉండాలి. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయడం మినహా ఎన్నికల కమిషన్‌కు మరో మార్గం లేదు. ఒకవేళ ఆ ఉత్తర్వుల అమల్లో ఇబ్బంది ఉందని ఎన్నికల కమిషన్ భావిస్తే సుప్రీంకోర్టు నుంచి తగిన ఆదేశాలు పొందాల్సింది. అంతే తప్ప ఏకపక్ష నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదు’ అని జస్టిస్ దుర్గాప్రసాదరావు తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణ ఓ దైవ కార్యం... ‘ఎన్నికల నిర్వహణ అనేది అలంకారప్రాయ సంప్రదాయం కాదు. అది ఒక దైవ కార్యం. సుప్రీంకోర్టు చెప్పిన విధంగా ఎన్నికల నియమావళిని అమలు చేయకపోతే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పే నైతిక హక్కు కమిషన్‌కు లేదు. తద్వారా మొత్తం ఎన్నికల ప్రక్రియ బలహీనమవుతుంది. ప్రస్తుత కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకార ఎన్నికల కమిషన్ నడుచుకోకపోవడం స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక, పారదర్శక ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించడమే. ఈ పరిస్థితుల్లో ఈ న్యాయస్థానం అధికరణ 226 కింద తనకున్న విశేషాధికారాలను ఉపయోగించి ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడం అనివార్యం’ అని పేర్కొంటూ తదుపరి విచారణను ఈ నెల 15కి వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ దుర్గాప్రసాదరావు ప్రకటించారు. ఎన్నికల నియమావళి అమలు తప్పనిసరి కాదు... ‘వర్ల రామయ్య వ్యక్తిగత హోదాలో దాఖలు చేసిన రిట్ పిటిషన్‌కు విచారణార్హత ఉందని చెప్పడం ద్వారా సింగిల్ జడ్జి తప్పు చేశారు. వ్యక్తిగత హోదాలో దాఖలు చేసిన ఈ వ్యాజ్యాన్ని కొట్టేసి ఉండాల్సింది. వర్ల రామయ్య ఏమీ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి కాదు. ఎన్నికల నియమావళికి చట్టబద్ధమైన దన్ను ఏదీ లేదు. నియమావళి తప్పనిసరి అని ఏ చట్టంలో లేదు. ఎన్నికల నియమావళి అన్నది భారత ఎన్నికల సంఘం అనుసరిస్తున్న ఓ విధానం మాత్రమే. ఒక్క మాటలో చెప్పాలంటే రాజకీయ పార్టీలను, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను నియంత్రించేందుకు తీసుకొచ్చిన ఓ మార్గదర్శకమే. అందువల్ల ఎన్నికల నియామవళి అమలు పూర్తిగా ఎన్నికల కమిషన్ విచక్షణపై ఆధారపడి ఉంటుంది. నియమావళి అమలు విషయంలో చట్టమే లేనప్పుడు, ఎన్నికల నియామావళి అమలు విషయంలో నిర్ణీత కాల వ్యవధి ఏదీ లేదన్న విషయాన్ని సింగిల్ జడ్జి పరిగణలోకి తీసుకుని ఉండాల్సింది. పరిస్థితులను బట్టి నియమావళి అమలు విషయంలో ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కమిషన్‌కు తన బాధ్యతలు ఏమిటో బాగా తెలుసు. కమిషన్ పనితీరు విషయంలో న్యాయస్థానాల జోక్యానికి పరిమితులున్నాయి. నియమావళి అమలు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మొత్తానికి భాష్యం చెప్పాలే కానీ ఒక్కో వాక్యానికి కాదు. ఎన్నికలను వాయిదా వేస్తూ గతంలో ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఎన్నికల కమిషన్ స్వతంత్రతను సమర్థించడం వల్లే జోక్యం చేసుకోలేదు. ఎన్నికల నియమావళి నిరవధికంగా కొనసాగడానికి వీల్లేదని సుప్రీంకోర్టు చెప్పింది. తద్వారా అన్నీ అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోతాయంది. అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకునే సుప్రీంకోర్టు ఎన్నికల నియమావళికి నాలుగు వారాల గరిష్ట గడువు విధించింది. నాలుగు వారాల కన్నా తక్కువ కాకూడదన్నదే సుప్రీంకోర్టు ఉద్దేశం. అంతేకానీ నాలుగు వారాలు కచ్చితంగా అమలు చేయాలన్నది ఉద్దేశం కాదు. ఎన్నికల కమిషన్ విధుల్లో జోక్యం చేసుకోరాదన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులను సింగిల్ జడ్జి పూర్తిస్థాయిలో పరిగణలోకి తీసుకోలేదు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని సింగిల్ జడ్జి ఉత్తర్వులను రద్దు చేయాలని అభ్యర్థిస్తున్నాం’ – అప్పీల్లో ధర్మాసనానికి ఎన్నికల కమిషన్ కార్యదర్శి కన్నబాబు వినతి -
డివిజన్ బెంచ్‌లో ఎస్ఈసీకి అనుకూలంగా తీర్పు రావాలి: సజ్జల
సాక్షి, అమరావతి: రెండు రోజుల్లో రాష్ట్రంలో పరిషత్ ఎన్నికలు జరగనుండగా.. ఏపీ హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం అందుబాటులో ఉన్న పార్టీ ముఖ్యనేతలతో చర్చించారు. తదుపరి చర్యలపై సమాలోచనలు జరిపారు. ఈ నేపథ్యంలో పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామాకృష్ణా రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘ఎన్నికల విషయంలో టీడీపీ పిల్ల చేష్టలకు పాల్పడుతోంది. పరిషత్ ఎన్నికలు బహిష్కరించిన టీడీపీ.. హైకోర్టుకు వెళ్లడంలో అర్థం లేదు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఏడాది క్రితం పూర్తి కావాల్సినవి.. కానీ ఆనాడు కూడా అన్యాయంగా, దురుద్దేశపూర్వకంగా ఎన్నికలను వాయిదా వేశారు’’ అని సజ్జల గుర్తు చేశారు. ‘‘పరిషత్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ప్రచారం ముగిసింది.. రెండు రోజుల్లో పోలింగ్ ఉండగా.. కోర్టుకు వెళ్లారు. ఈ అంశంలో ఎస్ఈసీ త్వరగా హౌస్‌మోషన్ పిటిషన్ వేయాలని ప్రభుత్వం కోరుకుంటుంది. కోవిడ్ విస్తరిస్తోన్న పరిస్థితుల్లో ఎన్నికలు త్వరగా పూర్తయితే చాలా మేలు జరిగేది. కోర్టుకు వెళ్లకుండా ఉంటే ఎన్నికలు త్వరగా పూర్తయ్యేవి. దాంతో వ్యాక్సినేషన్ త్వరగా పూర్తి చేసేందుకు అవకాశం ఉండేది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలకు అడ్డంకులు సృష్టించడం అన్యాయం. డివిజన్ బెంచ్‌లో ఎస్ఈసీకి అనుకూలంగా తీర్పు రావాలి’’ అని సజ్జల కోరుకున్నారు. చదవండి: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ఏపీ హైకోర్టు స్టే -
‘టీడీపీవి దిగజారుడు రాజకీయాలు’
కృష్ణా జిల్లా: టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకి ఓటమి భయంపట్టుకునే ఎన్నికల నుంచి పారిపోయాడని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పార్ధసారధి విమర్శించారు. సీఎం జగన్‌కు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూడలేకే టీడీపీ నాయకులు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతీ గడపకు చేరుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికలు ఏవైనా ప్రజలు వైసీపీకే బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. దాంతోనే చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని ఎద్దేవాచేశారు. ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న టీడీపీ పార్టీ తన స్వార్థం కోసం రాష్ట్ర భవిష్యత్తును కేంద్రం ముందు తాకట్టు పెట్టిందని ఎద్దేవా చేశారు. ప్యాకేజీ స్టార్ పవన్ కళ్యాణ్ ఐదేళ్లు ప్రశ్నించకుండా ఏంచేశారని ప్రశ్నించారు. ప్రజల్లో టీడీపీ పై నమ్మకం పోయిందని పార్థసారధి విమర్శించారు. చదవండి: నోటికొచ్చినట్లు మాట్లాడటం మానుకోండి: కొడాలి నాని -
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ఏపీ హైకోర్టు స్టే
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై హైకోర్టు స్టే విధించింది. దీంతో ఎన్నికలు తాత్కాలికంగా వాయిదా పడినట్లయ్యింది. పరిషత్ ఎన్నికలపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే స్టే విధిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జెడ్పీ, ఎంపీటీసీ ఎన్నికలపై నాలుగు వారాల కోడ్ అమలు చేయలేదన్న హైకోర్టు పేర్కొంది. దీనిపై ఈనెల 15వ తేదీలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. అయితే దీనికి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. దాంతో ఎల్లుండి జరగాల్సిన ఎన్నికలు వాయిదా పడ్డాయి. -
వైఎస్సార్సీపీలోకి టీడీపీ నేతల చేరికల వెల్లువ
సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సోమవారం పలువురు టీడీపీ నేతలు వైఎస్సార్సీపీలో చేరారు. వీరిలో జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ అభ్యర్థులు సైతం ఉండటం గమనార్హం. పరిషత్ ఎన్నికలను బహిష్కరించామన్న చంద్రబాబు పలాయన వాదంతో విభేదించి, మరోవైపు వైఎస్ జగన్ పాలనను మెచ్చి పార్టీ మారారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బాలాయపల్లి మండల టీడీపీ ఎంపీపీ అభ్యర్థి రాయి రమేష్‌చౌదరి, జెడ్పీటీసీ అభ్యర్థి రాయి దేవికాచౌదరి దంపతులు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీలో చేరారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ నాయుడు, తిరుపతి ఎంపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి సమక్షంలో చేరికలు జరిగాయి. విశాఖలో వరుస షాక్‌లు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల వేళ టీడీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఆ పార్టీని ఒక్కొక్కరిగా వీడుతున్నారు. ఆనందపురం మండలం కుసులవాడకు చెందిన టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి షిణగం శారద మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సమక్షంలో వెఎస్సార్సీపీలో చేరారు. మునగపాక మండలం పాటిపల్లి టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి జయలక్ష్మి నాగేశ్వరరావు యలమంచిలి ఎమ్మెల్యే యూవీ రమణమూర్తిరాజు సమక్షంలో వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. కె.కోటపాడు మండలం కింతాడ టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి బండారు అమ్మాజీ ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు కుమార్తె అనురా>ధ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం–1, 2 ఎంపీటీసీ స్థానాల టీడీపీ అభ్యర్థులు సూరాడ ఎర్రయ్య, మైలపల్లి ధనలక్ష్మి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. రావికమతం మండలంలోని పి.పొన్నవోలు టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి కొశిరెడ్డి రమణమ్మ, చోడవరం మండలం లక్కవరం–2 టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి మాధవి ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ సమక్షంలో వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. గుంటూరు జిల్లాలో చావుదెబ్బ గుంటూరు జిల్లా గొట్టిపాడులో టీడీíపీకి చావుదెబ్బ తగిలింది. టీడీపీ నేత, నాగార్జునసాగర్ కుడి కాలువ ప్రాజెక్ట్ కమిటీ మాజీ చైర్మన్ గుంటుపల్లి వీరభుజంగరాయలు, టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న మరికొందరు సోమవారం రాత్రి వైఎస్సార్సీపీలో చేరారు. అనంతరం వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి విప్పాల కృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ గుంటుపల్లి బాబూరావు, ఎంపీటీసీ అభ్యర్థులతో కలిసి ప్రచారం ప్రారంభించారు. ► క్రోసూరు మాజీ జెడ్పీటీసీ , టీడీపీ నేత చిలకా విల్సన్ గ్లోరి పెదబాబు తన అనుచర వర్గంతో ఎమ్మెల్యే నంబూరు శంకరరావు సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఆయనతోపాటు అచ్చంపేట మాజీ ఎంపీపీ గుడేటి అరుణ్‌కుమార్, అడ్వొకేట్ మేదర అనిల్‌కుమార్, మాజీ సర్పంచ్ గుడేటి మందయ్య, మరియదాసు, వేమవరపు ఏసోబు మరో 50 మందికి పైగా టీడీపీ కార్యకర్తలకు ఎమ్మెల్యే శంకరరావు కండువాలు కప్పి వైఎస్సార్సీపీలోకి ఆహ్వానించారు. ► నాదెండ్ల మండలం తూబాడు టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి గోళ్లమూడి బాలస్వామి తన వర్గీయులతో కలిసి సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్ర«హ్మానందరెడ్డి సమక్షంలో సోమవారం వైఎస్సార్సీపీలో చేరారు. -
నేటితో ముగియనున్న ‘పరిషత్’ ప్రచారపర్వం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పరిషత్ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఏప్రిల్ 8వ తేదీన జరుగనున్న ఎన్నికలు, 10వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇలా ఉండగా పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది సోమవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించి పలు సూచనలు జారీ చేశారు. కోవిడ్–19 నిబంధనలు పాటిస్తూ ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదేశించారు. పోలింగ్ సామగ్రి, పోలింగ్ సిబ్బందికి శిక్షణ, రవాణా ఏర్పాట్లు, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, సమాచార కేంద్రాలు, ఎన్నికల నిబంధనలు, కౌటింగ్ ఏర్పాట్లు వంటి అంశాలపై ద్వివేది సమీక్షించారు. 8న ప్రభుత్వ సెలవు.. నేగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1881 ప్రకారం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఏప్రిల్ 8వ తేదీన సెలవుదినంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ఏపీపీఆర్ యాక్ట్ 225ఏ ప్రకారం ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ముందస్తుగా 48 గంటల పాటు మద్యం అమ్మకాలను నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1988 ప్రకారం 8వ తేదీని ఉద్యోగులు, కార్మికులకు వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించింది. ఎన్నికల తేదీని స్థానిక సెలవుగా ప్రకటించడంతో ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించాలని ఆదేశించింది. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల భవనాలను ఒక రోజు ముందు నుంచి..అనగా 7వ తేదీ నుంచి వినియోగించుకోవడానికి అనుమతించింది. ప్రభుత్వ ఉద్యోగులు ఓటర్లను ప్రభావితం చేయరాదని, అలాగే ఎవరికి ఓటు వేశామన్న విషయాన్ని కూడా బహిర్గతం చేయకూడదని స్పష్టం చేసింది. చిటికెన వేలుపై సిరా గుర్తు గురువారం జరుగనున్న పరిషత్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే వారికి ఎడమ చేతి చిటికెన వేలుసై సిరా గుర్తు వేయాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. గత పంచాయతీ ఎన్నికల్లో ఎడమ చేతి చూపుడు వేలుకు సిరా గుర్తు వేసినందున అది ఇంకా చెరగకపోవడంతో చిటికెన వేలుకు సిరా గుర్తు వేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. -
జన సైనికులు.. జన సైకిల్‌గా మారారు..
సాక్షి, కృష్ణా జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రూరల్‌లో వైఎస్సార్సీపీ బలంగా ఉందనే చంద్రబాబు నాటకానికి తెరలేపారన్నారు. గ్రామాల్లో అభ్యర్థులు ప్రచారం చేయాలని బాబు ఇంటర్నల్ ఆదేశాలిచ్చారన్నారు. మళ్లీ ఓడిపోతామనే భయంతోనే చంద్రబాబు కుంటిసాకులు చెబుతున్నారని కొడాలి నాని దుయ్యబట్టారు. ‘‘పేమెంట్ కోసం సొల్లు కబుర్లు చెప్పే వ్యక్తి పవన్ కల్యాణ్. ఓటు హక్కు లేని పిల్లలతో సీఎం సీఎం అని పిలిపించుకునే వ్యక్తి పవన్. జన సైనికులు.. జన సైకిల్‌గా మారారని’’ ఆయన ఎద్దేవా చేశారు. కుమారుడు లోకేష్ మంగళగిరిలో ఓడిపోయినా చంద్రబాబు బుద్ధి రాలేదన్నారు. చంద్రబాబుకు డిపాజిట్లు కూడా వస్తాయో రావో చూసుకోవాలన్నారు. సీపీఎం, బీజేపీ నోటాతో పోటీ పడే పార్టీలంటూ మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు. చదవండి: ‘పవన్, లోకేష్.. ఇదో అజ్ఞానపు సంత’ భూమా అఖిలప్రియకు మరో ఎదురుదెబ్బ -
అంతా పబ్లిగ్గానే.. ‘కూన’ ఇలా చేశాడేంటి..!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఎన్నికల బహిష్కరణపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీసుకున్న నిర్ణయాన్ని సాక్షాత్తూ ఆ పార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు కూన రవికుమారే ధిక్కరించారు. చంద్రబాబు చెప్పినట్టుగా తాము వ్యవహరించాల్సిన అవసరం లేదన్నట్టుగా పరిషత్ ఎన్నికల బరిలో ప్రచారం ప్రారంభించారు. ఒకవైపు ఎన్నికలు బహిష్కరించాలని ప్రెస్‌మీట్ పెట్టి మరోవైపు తన నియోజకవర్గంలో బరిలో ఉన్న వారందరినీ ప్రచారం చేయించడంలో కూన రవికుమార్ ఘనత వహించారు. తన సొంత గ్రామమైన ఆమదాలవలస నియోజకవర్గం పొందూరు మండలంలోని కోటిపల్లి ఎంపీటీసీ సెగ్మెంట్ పరిధిలో తన భార్య కూన ప్రమీల తరఫున ఆది వారం నేరుగా ఆయన ప్రచారం చేశారు. ఇదే బాటలో జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతలు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే చంద్రబాబుపై తిరుగుబావుటా ఎగురవేసి ఎన్నికల బరిలో నిలబడతామంటున్నారు. కాదంటే అవుననిలే... టీడీపీ డ్రామాలాడే పార్టీ అని మరోసారి నిరూపించుకుంది. పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. ఆ వెంటనే రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అదే విషయాన్ని వెల్లడించారు. జిల్లాలో ఆ పార్టీ అధ్యక్షుడు కూన రవికుమార్ ప్రెస్‌మీట్ పెట్టి ఎన్నికలు బహిష్కరిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. కానీ ఆచరణలో తాము భిన్నమని ఆ పార్టీ నేత లు నిరూపిస్తున్నారు. చెప్పిందేదీ చేయమన్నట్టు గా సాక్షాత్తూ కూన రవికుమారే అధిష్టానం నిర్ణయాన్ని బేఖాతరు చేశారు. ఒకవైపు పార్టీ శ్రేణులంతా ఎన్నికలు బహిష్కరించాలని పిలుపుని చ్చి మరోవైపు తన భార్య ప్రమీల పోటీ చేస్తున్న పొందూరు మండలంలోని కోటిపల్లి ఎంపీటీసీ సెగ్మెంట్లో ఆదివారం ప్రచారం చేపట్టారు. కేడర్‌కు ఒక పిలుపునిచ్చి, ఆ పిలుపును తానే విస్మరించి ప్రచారం చేయడం టీడీపీలో చర్చనీయాంశమైంది. ఇక ఎమ్మెల్యే బెందాళం అశోక్ ఉన్న ఇచ్ఛాపురం నియోజకవర్గం, కళా వెంకటరా వు నియోజకవర్గమైన ఎచ్చెర్ల, పలాస, రాజాం, పాలకొండ, నరసన్నపేట తదితర నియోజకవర్గాల్లో కూడా సమావేశాలు పెట్టి పోటీ చేయాలని తీర్మానాలు చేసుకుని ఎన్నికల ప్రచారం ప్రారంభించడం ప్రాధాన్యత సంతరించుకుంది. చదవండి: చంద్రబాబుపై ‘తిరుగు’బావుటా! ఇక సన్యాసమే శరణ్యమా! -
చంద్రగిరిలో బాబుకు షాక్
తిరుపతి రూరల్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు సొంత గ్రామంలోనే పార్టీ శ్రేణులు షాక్ ఇస్తున్నారు. చంద్రబాబు నిర్ణయాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని తమ్ముళ్లు తెగేసి చెబుతున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో మొత్తం ఆరు జెడ్పీటీసీ, 95 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. అందులో ఐదు జెడ్పీటీసీ, 90 ఎంపీటీసీ పదవులు ఏకగ్రీవమయ్యాయి. చంద్రగిరి మండలంలో జెడ్పీటీసీ, చంద్రబాబు సొంత ఊరు ఉన్న నారావారిపల్లితో పాటు మొత్తం 5 ఎంపీటీసీ స్థానాలకు మాత్రమే ఈ నెల 8న ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలను బహిష్కరించాలని చంద్రబాబు ఆదేశించడంపై టీడీపీ నేతలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. లక్షలు ఖర్చు పెట్టుకుని, నెలల తరబడి ప్రచారం చేయగా.. పోలింగ్ సమీపిస్తున్న వేళ ఎన్నికల్ని బహిష్కరించాలని చంద్రబాబు పిలుపు ఇవ్వడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు ఆదేశాలను పట్టించుకునేది లేదని తమ్ముళ్లు తెగేసి చెప్తున్నారు. చంద్రబాబు సొంత ఊరు నారావారిపల్లిలో స్వయంగా బంధువులే ఆయన ఆదేశాలను గాలికి వదిలేసి ఎంపీటీసీ అభ్యర్థి తరఫున గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు. -
'పరిషత్' ఎన్నికలపై ముగిసిన వాదనలు
సాక్షి, అమరావతి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియను మొదటి నుంచీ ప్రారంభించాలని, ఇందుకోసం తిరిగి ఎన్నికల నోటిఫికేషన్‌ను జారీ చేసేలా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని కోరుతూ టీడీపీ, బీజేపీ వేర్వేరుగా హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యాల్లో వాదనలు ముగిశాయి. గత ఏడాది మార్చి, మే నెలల్లో జారీ చేసిన నోటిఫికేషన్లకు సంబంధించిన తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో పాటు ఎన్నిక తేదీకి నాలుగు వారాల ముందు ఎన్నికల నియమావళిని అమలు చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలన్న అభ్యర్థనలతో ఆ రెండు పార్టీలు దాఖలు చేసిన అనుబంధ వ్యాజ్యాలపై హైకోర్టు తన నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఇదే సమయంలో జనసేన దాఖలు చేసిన వ్యాజ్యంలో పూర్తి వివరాల సమర్పణకు ఎన్నికల కమిషన్ న్యాయవాది వివేక్ చంద్రశేఖర్ గడువు కోరడంతో న్యాయస్థానం అందుకు అంగీకరిస్తూ విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. వీలైన పక్షంలో మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు వెలువరించేందుకు ప్రయత్నిస్తానని న్యాయమూర్తి తెలిపారు. ‘సుప్రీం’ నిర్ణయాన్ని ఎలా ప్రశ్నిస్తారు ఎన్నికల కమిషన్ తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఏపీ పంచాయతీరాజ్ ఎన్నికల నిర్వహణ నిబంధనల్లోని రూల్–7 ప్రకారం పరిస్థితులను బట్టి ఎన్నికల కార్యక్రమాన్ని మార్చే, రీ నోటిఫై చేసే అధికారం ఎన్నికల కమిషన్‌కు ఉందన్నారు. దీనికి లోబడే కమిషన్ వ్యవహరిస్తోందని తెలిపారు. ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించిందని, ఏ దశలో అయితే ఆగిపోయాయో అక్కడి నుంచి ఎన్నికలు కొనసాగించాలని చెప్పిందన్నారు. కాబట్టి ఆ నిర్ణయాన్ని ప్రశ్నించడానికి వీల్లేదన్నారు. గత ఏడాది జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో ఏకగ్రీవాలు జరిగాయని, అభ్యర్థులందరికీ చట్ట ప్రకారం ఫాం–10 కూడా జారీ చేశామని చెప్పారు. ఇప్పుడు మొదటి నుంచీ ఎన్నికలు నిర్వహించాలంటే వారంతా నష్టపోతారని, అలాగే న్యాయపరమైన సమస్యలు కూడా వస్తాయని వివరించారు. న్యాయమూర్తి స్పందిస్త.. ఎన్నికలు వాయిదా వేస్తూ నోటిఫికేషన్ ఇచ్చిన నాటినుంచి ఇప్పటివరకు ఎంతో మందికి ఓటు హక్కు వచ్చిందని, తాజాగా నోటిఫికేషన్ ఇస్తే వారంతా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుంది కదా అని ప్రశ్నించారు. అలా అయితే ఎప్పటికీ ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని మోహన్‌రెడ్డి చెప్పారు. కొత్త ఓటర్లు వస్తూనే ఉంటారని, వారి కోసం ఎన్నికలను ఆపడం సరికాదన్నారు. టీడీపీ నేత వర్ల రామయ్య దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రస్తావిస్తూ.. ఆయన ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, అలాంటప్పుడు ఆయన హైకోర్టుకు వచ్చి మిగిలిన వారి తరఫున ఉత్తర్వులు కోరలేరని ఎస్ఈసీ తరఫు న్యాయవాది తెలిపారు. ఆయన దాఖలు చేసిన వ్యాజ్యం ప్రజా ప్రయోజనాల కిందకు వస్తుందని, దాన్ని ధర్మాసనమే విచారించాల్సి ఉంటుందని చెప్పారు. ఎన్నికల వల్ల వ్యాక్సినేషన్ ఉధృతంగా సాగడం లేదు ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. ఎన్నికలు ఉండటం వల్ల కోవిడ్ వ్యాక్సినేషన్ ఉధృతంగా సాగడం లేదన్నారు. ఎన్నికలు ముగిస్తే భారీ స్థాయిలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు. కేవలం 5–6 రోజుల ప్రక్రియ మాత్రమే మిగిలి ఉందని, అందువల్ల ఎన్నికలను ఏ రకంగానూ అడ్డుకోవడానికి వీల్లేదన్నారు. వర్ల రామయ్య తరఫున సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ, బీజేపీ తరఫున సీనియర్ న్యాయవాది పి.వీరారెడ్డి, జనసేన తరఫున జి.వేణుగోపాలరావు వాదనలు వినిపించారు. -
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై హైకోర్టులో విచారణ
-
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై హైకోర్టులో విచారణ
సాక్షి, అమరావతి: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై హైకోర్టు విచారణ చేపట్టింది. వాదనలు విన్న హైకోర్టు.. తీర్పును రిజర్వ్ చేసింది. వర్ల రామయ్య పిటిషన్‌కు విచారణ అర్హత లేదని ప్రభుత్వ తరఫు లాయర్ పేర్కొన్నారు. వర్ల రామయ్య వ్యక్తిగతంగా పిటిషన్ వేశారని.. ఆయన ఎక్కడా పోటీచేయట్లేదని.. ఎన్నికలతో ఆయనకు సంబంధంలేదని ప్రభుత్వ తరఫు న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించారు. ‘‘సుప్రీం ఆదేశాలను అమలు చేస్తూ ఎస్ఈసీ నోటిఫికేషన్ ఇచ్చింది. త్వరగా ఎన్నికలు పూర్తిచేసి ప్రజాసంక్షేమంపై ప్రభుత్వం దృష్టిపెడుతుంది. 4 వారాల ఎన్నికల నియమావళి కోడ్ ఉండాలని చట్టంలో ఎక్కడాలేదు. పిటిషనర్ కోరిన విధంగా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇస్తే.. గతంలో ఇదే కోర్టు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఏకగ్రీవాలు ఆమోదిస్తూ జారీ చేసిన ఉత్తర్వులకు విఘాతం కలుగుతుంది.ఒకసారి ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత వారి ఎన్నికను రద్దు చేసే అధికారం ఎన్నికల పిటిషన్ ద్వారా సవాల్ చేస్తేనే రద్దు చేసే అవకాశం ఉందని’’ ప్రభుత్వ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. చదవండి: చంద్రబాబుపై ‘తిరుగు’బావుటా! కుప్పం టీడీపీలో ముసలం.. -
ఎన్నికల బహిష్కరణకు కట్టుబడి ఉండాలి
తిరుపతి కల్చరల్: పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల బహిష్కరణ నిర్ణయానికి టీడీపీ నేతలు, కార్యకర్తలు కట్టుబడి ఉండాలని ఆ పార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న పిలుపునిచ్చారు. ఆయన శనివారం తిరుపతిలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న దౌర్జన్యాలకు పార్టీ నేతలు, కార్యకర్తలు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతోనే అధినేత ఎన్నికలను బహిష్కరిస్తున్నారన్న విషయాన్ని గుర్తించాలన్నారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక నిజాయితీగా జరిగితే టీడీపీ విజయఢంకా మోగిస్తుందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వైఎస్సార్సీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ టీడీపీ ఓట్లు చీల్చేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. -
టీడీపీ కోడ్ ఉల్లంఘన
ఇచ్ఛాపురం రూరల్: ఓ వైపు ఎన్నికలను బహిష్కరించామని చెబుతున్న టీడీపీ నేతలు మరోవైపు పల్లెల్లో స్వేచ్ఛగా సమావేశాలు పెట్టుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండల టీడీపీ నేతలైతే ఏకంగా అమ్మవారి ఆలయాన్నే తమ సమావేశానికి వేదికగా ఉపయోగించుకున్నారు. గుడి, బడి, ప్రభుత్వ కార్యాలయాలు వంటి ప్రదేశాల్లో ఎన్నికల సమావేశాలు నిర్వహించడం కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుంది. ఉత్కళాంధ్రుల ఆరాధ్య దైవంగా పూజలందుకుంటున్న ఇచ్ఛాపురంలోని ‘స్వేచ్ఛావతి అమ్మవారు ఆలయం’లో శనివారం టీడీపీ నాయకులు సమావేశం నిర్వహించి కోడ్‌ను ఉల్లంఘించారు. సమావేశానికి అనుమతిచ్చిన కమిటీపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఎంపీపీ దక్కత ఢిల్లీరావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో.. చంద్రబాబు విధించిన ఆంక్షలకు వ్యతిరేకంగా ఇచ్ఛాపురం మండలంలో 13 ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు పోటీ చేసి ప్రచారం చేయాలని తీర్మానించారు. -
బాబు, లోకేశ్ విభేదాలు బట్టబయలు
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాల మండలంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తుందని ప్రకటించడంతోనే తండ్రీ కొడుకులు చంద్రబాబు, లోకేశ్ మధ్య ఉన్న విభేదాలు బహిర్గతమయ్యాయని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) విమర్శించారు. మంగళగిరిలోని ఐబీఎన్ భవన్ ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రమంతా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరించామని చంద్రబాబు ప్రకటిస్తే.. లోకేశ్ ఇన్చార్జిగా ఉన్న మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాలలో ఆయన ఆదేశాలతోనే పోటీ చేస్తున్నామని ప్రకటించారని విమర్శించారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ సాధించిన అఖండ విజయాన్ని చూసి దిమ్మదిరిగిన చంద్రబాబు.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో మరింత ఘోర ఓటమి తప్పదని భయపడి ఎన్నికలను బహిష్కరించారన్నారు. అసలు ఆయనను ప్రజలు ఎన్నడో బహిష్కరించారని తెలిపారు. ఎన్నికల్లో ఓటమితో పాటు, వయసురీత్యా చంద్రబాబుకు మతి భ్రమించిందని, ఇకపై రాజకీయాలకు స్వస్తి పలికి, మనవడితో ఆడుకోవడం ఉత్తమమని హితవు పలికారు. దుగ్గిరాల పసుపు మార్కెట్లో వ్యాపారులంతా లోకేశ్ సామాజిక వర్గం వారు కావడంతో, వారి డబ్బులతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో గెలవాలని భావిస్తున్నారని విమర్శించారు. టీడీపీ ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా.. ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం ఖాయమని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. -
‘పరిషత్’ ఎన్నికలకు పక్కా ఏర్పాట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నితో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది శనివారం భేటీ అయ్యారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు జిల్లాల్లో పక్కా ఏర్పాట్లు చేసినట్టు ఆమెకు వివరించారు. ఎన్నికల ఏర్పాట్లపై చర్చించేందుకు ఆ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ కూడా ఎస్ఈసీతో వేరుగా భేటీ అయ్యారు. ఆ తరువాత ద్వివేది, గిరిజాశంకర్ తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో 13 జిల్లాల ఎన్నికల సూపర్వైజరీ అధికారులతో సమావేశమయ్యారు. సూపర్వైజరీ అధికారులు ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మేరకు జిల్లాల్లోని అధికారులను సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు తగిన చర్యలు చేపట్టాలని ద్వివేది ఆదేశించారు. -
పోటీలో ఉన్న పార్టీల అభ్యర్థులు చనిపోయిన చోట వేరుగా ఎన్నికలు
సాక్షి, అమరావతి: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో గుర్తింపు ఉన్న రాజకీయ పార్టీల తరఫున పోటీలో ఉండి, పోలింగ్‌కు ముందే మరణించిన వారి స్థానాల్లో ఈ నెల 8న కాకుండా వేరుగా.. వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) కసరత్తు చేపట్టింది. కరోనాతో ఏడాది క్రితం వాయిదా పడిన ఈ ఎన్నికల ప్రక్రియలో 2020 మార్చి 14న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఎన్నికల్లో ఏకగ్రీవంగా గెలిచిన వారితో పాటు పోటీలో ఉన్న మొత్తం 116 మంది అభ్యర్థులు చనిపోయినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్, పంచాయతీరాజ్ శాఖ అధికారులు నిర్ధారించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం.. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో ఉండి మరణించిన చోట మాత్రం ఈనెల 8నే పోలింగ్ యథావిధిగా నిర్వహిస్తున్నారు. కానీ, గుర్తింపు కలిగిన రాజకీయ పార్టీ తరఫున పోటీలో ఉండి అభ్యర్థి చనిపోయిన చోట మాత్రం ఎన్నికను తాత్కాలికంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే. 94 చోట్ల ఎన్నికలు వాయిదా ► ఎంపీటీసీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన 14 మంది అభ్యర్థులతో పాటు పోటీలో ఉన్న 87 మందితో కలిపి మొత్తం 101 మంది.. జెడ్పీటీసీ ఎన్నికల్లో ఏకగ్రీవమైన వారిలో ఇద్దరు, పోటీలో ఉన్న మరో 13 మంది కలిపి మొత్తం 15 మంది మరణించినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్, పంచాయతీరాజ్ శాఖ అధికారులు వెల్లడించారు. ► పోటీలో ఉండి మరణించిన 87 మంది ఎంపీటీసీ అభ్యర్థుల్లో ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు. నిబంధనల ప్రకారం.. ఈ ఐదు స్థానాల్లో ఈనెల 8న ఎన్నికలు యథావిధిగా కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు. కానీ, మిగిలిన 82 మంది గుర్తింపు కలిగిన రాజకీయ పార్టీల తరఫున పోటీలో ఉన్నందున అక్కడ ఎన్నికలు తాత్కాలికంగా వాయిదా వేశారు. ► పోటీలో కొనసాగుతూ మరణించిన 13 మంది జెడ్పీటీసీ అభ్యర్థుల్లో ఒకరు స్వతంత్ర అభ్యర్థి. ఆ స్థానంలో ఎన్నిక యథావిధిగా 8న ఎన్నిక జరుగుతుంది. గుర్తింపు కలిగిన పార్టీ అభ్యర్థులు చనిపోయిన 12 చోట్ల మాత్రం ఎన్నికలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ► ఇలా 82 ఎంపీటీసీ స్థానాలలో.. 12 జెడ్పీటీసీ స్థానాల్లో కలిపి మొత్తం 94 చోట్ల ఎన్నికలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఇక్కడ రాజకీయ పార్టీ తరఫున మాత్రమే మరో అభ్యర్థితో నామినేషన్‌కు అవకాశం ఇస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ► ఎన్నికలు వాయిదా పడిన 94 స్థానాల్లో తిరిగి ఎన్నికలు నిర్వహించేందుకు వారం రోజులలోపే కొత్త నోటిఫికేషన్ జారీచేసే అవకాశముందని ఎస్ఈసీ వర్గాలు వెల్లడించాయి. అయితే, వీటితో పాటు ఏకగ్రీవంగా గెలుపొందిన అభ్యర్థులు (ఎంపీటీసీ సభ్యులు 14 మంది, జెడ్పీటీసీ సభ్యులు ఇద్దరు) చనిపోయిన చోట్ల ఎన్నికలు జరిపే విషయంపై ఎస్ఈసీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. -
చంద్రబాబుపై ‘తిరుగు’బావుటా!
సాక్షి, అమరావతి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల బహిష్కరణ నిర్ణయంతో టీడీపీలో పుట్టిన ముసలం రోజురోజుకీ ముదురుతోంది. చంద్రబాబుకు వ్యతిరేకంగా పార్టీలో తిరుగుబాటు బలోపేతమవుతోంది. ఓటమి భయంతో పరిషత్ ఎన్నికల బరి నుంచి పలాయనం చిత్తగించిన ఆయనపై పార్టీలో చెలరేగిన ధిక్కార స్వరం మరింత బలం పుంజుకుంటోంది. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతల నుంచి క్షేత్రస్థాయి కార్యకర్తల వరకూ చంద్రబాబుపై బహిరంగంగానే ధ్వజమెత్తుతున్నారు. తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో ఆనాడు ఎన్టీరామారావు స్థాపించిన పార్టీని చంద్రబాబు అవమానించారని.. ఆత్మన్యూనతలోకి నెట్టేశారని.. చివరికి శూన్యత మిగిల్చారని వారంతా భగ్గుమంటున్నారు. జిల్లాలు, నియోజకవర్గాల వారీగా సమావేశాలు పెట్టుకుని మరీ చంద్రబాబు రాజకీయ దివాళాకోరుతనంపై మండిపడుతున్నారు. ‘పార్టీని నడిపించే వాడు నాయకుడుగానీ ఎన్నికల బరి నుంచి జారుకునేవాడు కాదు’.. అని టీడీపీ కేడర్ ఎద్దేవా చేస్తోంది. స్థానిక ఎన్నికలను బహిష్కరించాలన్న చంద్రబాబు నిర్ణయాన్నే బహిష్కరిస్తున్నామని నేతలు తేల్చిచెబుతున్నారు. అవసరమైతే ‘ఎంతవరకైనా’ వెళ్తామని హెచ్చరికలు జారీచేస్తున్నారు. ఎన్నికల్లో గెలవలేమని తెలిసినా ఆత్మస్థైర్యాన్ని కాపాడుకునేందుకు పోటీచేసి తీరుతామని పార్టీ శ్రేణులు స్పష్టంచేస్తున్నాయి. దీంతో.. చంద్రబాబుకు వ్యతిరేకంగా 2019 నుంచి టీడీపీలో అంతర్గతంగా రగులుతున్న అసమ్మతి కట్టలు తెంచుకుంటూ పార్టీలో కీలక మార్పుల దిశగా పరిణామాలు ఊపందుకుంటున్నాయి. నాడు కుట్ర.. నేడు తిరుగుబాటు! 1995లో ‘వైస్రాయ్ హోటల్’ కేంద్రంగా జరిపిన కుట్ర ద్వారా టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావును చంద్రబాబు అధికారం నుంచి తొలగించి అడ్డదారిలో సీఎం అయ్యారు. అందుకు భిన్నంగా నేడు చంద్రబాబుపై పార్టీలో బహిరంగంగా తిరుగుబాటు మొదలైంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించాలన్న ఆయన నిర్ణయం ఎదురుతిరిగింది. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అశోక్‌గజపతిరాజు, సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ శుక్రవారమే ధిక్కార స్వరం వినిపించగా.. శనివారం మరికొంతమంది నేతలు చంద్రబాబు నిర్ణయాన్ని బహిరంగంగానే వ్యతిరేకించారు. శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం జిల్లా వరకూ అంతటా ఇదే ధిక్కార స్వరం ప్రతిధ్వనించింది. ► పరిషత్ ఎన్నికల నుంచి తప్పుకోవడం ముమ్మాటికీ తప్పేనని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సీనియర్ నేత, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం కుండబద్దలు కొట్టారు. ► పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మాజీమంత్రి పితాని సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, జెడ్పీ మాజీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు తదితరులు చంద్రబాబు నిర్ణయంపై మండిపడ్డారు. ► తూర్పు గోదావరి జిల్లా మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మ, రాజానగరం మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్, తుని పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి యనమల కృష్ణుడు తదితరులు కూడా సమావేశాలు నిర్వహించి చంద్రబాబు నిర్ణయం పార్టీకి ఆత్మహత్య సదృశ్యమని దుయ్యబట్టారు. ► కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ► కర్నూలు జిల్లాలో మాజీ ఎమ్మెల్యే శివానందరెడ్డి అధినేత చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ► విశాఖపట్నం జిల్లాలో పెందుర్తి మాజీ ఎమ్మెల్యేలు బండారు సత్యన్నారాయణమూర్తి, గండి బాబ్జీ, చోడవరం మాజీ ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు చంద్రబాబు తీరుపై విరుచుకుపడ్డారు. ► ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోనూ అధినేత నిర్ణయాన్ని పార్టీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చంద్రబాబు నిర్ణయాన్ని ఆమోదించేదిలేదని.. తమ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులు బరిలో ఉంటారని వీరంతా తేల్చిచెప్పారు. ► మరికొందరు సీనియర్ నేతలు కూడా చంద్రబాబుకు వ్యతిరేకంగా అంతర్గతంగా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఓడతాం.. కానీ పోటీచేసి తీరుతాం ‘ఆ తండ్రీ కొడుకులకు ఏం పోయింది.. ఓడిపోయి హైదరాబాద్‌లో కూర్చున్నారు. కానీ, మేం గెలిచినా ఓడినా ఊళ్లలోనే ఉండాలి కదా’.. అని అధ్యక్షుడిపై తమ్ముళ్లు మండిపడుతున్నారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో మాదిరిగానే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ పార్టీకి ఘోర పరాభవం తప్పదని.. కానీ, గెలుపు కంటే ఎన్నికల్లో పోటీచేయడం రాజకీయ పార్టీగా తమ ధర్మమని చెబుతూ రాజకీయ పోరాట స్ఫూర్తిలేని చంద్రబాబు ఈ వాస్తవాన్ని గుర్తించలేరని ఆగ్రహావేశాలు వ్యక్తంచేస్తున్నారు. ఓటమి తప్పదని తెలిసినా సరే తాము మాత్రం పరిషత్ ఎన్నికల్లో పోటీచేస్తామని పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ల వద్ద వారు తేల్చిచెబుతున్నారు. అసలే చంద్రబాబు అసంబద్ధ నిర్ణయంపై రగలిపోతున్న పార్టీ నేతలు కార్యకర్తల ఒత్తిడితో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీచేసేందుకు పార్టీ అభ్యర్థులకు అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. జిల్లాల వారీగా పరిస్థితి ఎలా ఉందంటే.. ► చంద్రబాబు నిర్ణయానికి వ్యతిరేకంగా తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ నేతలు ద్విముఖ వ్యూహంతో వ్యవహరిస్తున్నారు. కొందరు అధిష్టానం నిర్ణయాన్ని బహిరంగంగా వ్యతిరేకిస్తూ ఎన్నికల బరిలో ఉంటామని ప్రకటించారు. మరికొన్ని నియోజకవర్గాల్లో జనసేనతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుని ఆ పార్టీ అభ్యర్థులకు మద్దతు ప్రకటిస్తున్నారు. ఇలా జిల్లాలో 70 శాతం జెడ్పీటీసీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు బరిలో ఉంటామని తేల్చిచెప్పారు. అనపర్తి, పిఠాపురం, రాజానగరం, మండపేట నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులు తాము పోటీచేస్తున్నామని ప్రకటించారు. అమలాపురం, రాజోలు, పి.గన్నవరం, ముమ్మిడివరం నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు జనసేనతో జట్టు కడుతున్నారు. ► పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, ఆచంట నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులు చంద్రబాబు నిర్ణయంతో సంబంధంలేదని.. పోటీచేయాలని అక్కడ ఎమ్మెల్యే రామానాయుడు, మాజీమంత్రి పితాని సత్యన్నారాయణ తమ్ముళ్లకు చెప్పడం గమనార్హం. ఇక.. చంద్రబాబు మాటలను పట్టించుకోవద్దని, దెందులూరు మండలంలో టీడీపీ నేతలు తమకు నచ్చిన విధంగా చేసుకోవచ్చని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రకటించారు. గోపాలపురం, దేవరపల్లి, నల్లజర్ల మండలాల్లో కూడా టీడీపీ అభ్యర్థులు పార్టీ నిర్ణయాన్ని దిక్కరించి పోటీకి సిద్ధమయ్యారు. జెడ్పీ మాజీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు ఇంటి వద్ద శనివారం సమావేశం నిర్వహించి ఎన్నికల్లో పోటీచేయాలని నిర్ణయించారు. నరసాపురం మండలంలో జెడ్పీటీసీ అభ్యర్థి పోటీలో ఉండటానికి నిర్ణయించి శనివారం ప్రచారం నిర్వహించారు. ► ఇక సొంత జిల్లాలోనూ చంద్రబాబుకు చుక్కెదురైంది. ఏకంగా 15 మండలాల్లో టీడీపీ అభ్యర్థులు అధినేత నిర్ణయాన్ని ధిక్కరిస్తూ బరిలో నిలిచేందుకు సిద్ధమయ్యారు. రామచంద్రపురం, తవణంపల్లె, గుడిపాల, చిత్తూరు రూరల్, నగరి, సత్యవేడు, నారాయణవనం, శాంతిపురం, కుప్పం, గుడుపల్లె, రామకుప్పం, నిమ్మనపల్లె, పెనుమూరు, కురబలకోట, పాలసముద్రం తదితర మండలాల్లో పోటీచేస్తామని తమ్ముళ్లు స్పష్టంచేశారు. ► అనంతపురం జిల్లా కల్యాణదుర్గం నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ టీడీపీ అభ్యర్థులు బరిలో ఉన్నారని నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి ప్రకటించారు. బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం మండలంలో పోటీలో ఉంటానంటూ టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి ప్రకటించి ప్రచారం నిర్వహించారు. ► చంద్రబాబు నిర్ణయం కర్నూలు టీడీపీనీ కుదిపేస్తోంది. పార్టీ నిర్ణయానికి కట్టుబడదామన్న సీనియర్ నేతలు కోట్ల, కేఈ కుటుంబాలపై వారి అనుచరులు ఎదురుతిరిగారు. పత్తికొండలో పార్టీ ఇన్చార్జి కేఈ శ్యామ్‌బాబు పత్తాలేకుండా పోయినప్పటికీ తాము పోటీచేస్తామని టీడీపీ అభ్యర్థులు చెబుతున్నారు. ఆలూరులో కూడా పార్టీ ఇన్చార్జ్ కోట్ల సుజాతమ్మ పోటీ వద్దని చెప్పినా సరే అభ్యర్థులు ససేమిరా అని బరిలో నిలిచారు. నందికొట్కూరులోనూ ఇదే పరిస్థితి. ► విశాఖ జిల్లా పెందుర్తి, చోడవరం మండలాల్లోనూ టీడీపీ అభ్యర్థులు పోటీలో ఉంటామని ప్రకటించారు. ► నెల్లూరు జిల్లా కోవూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు శనివారం సమావేశమై ఎన్నికల్లో పోటీచేయాలని నిర్ణయించారు. ► గుంటూరు జిల్లా వేమూరు, వినుకొండ, పెదకూరపాడు, ప్రత్తిపాడు, తాడికొండ, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించి పోటీ చేయాలని నిర్ణయించారు. టీడీపీలో కొనసాగుతున్న రాజీనామాల పర్వం ఇక పరిషత్ ఎన్నికల బహిష్కరణ నిర్ణయానికి వ్యతిరేకంగా తూర్పు గోదవరి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అ«ధ్యక్షుడు ఎస్విఎస్ అప్పలరాజు పార్టీ పదవులకు రాజీనామా చేశారు. జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం రాజుపాలెం, ముక్కొల్లు, రామకృష్ణాపురం, గోనాడ, భూపాలపట్నం గ్రామాల సర్పంచ్‌లు, మాజీ సర్పంచ్‌లు పార్టీకి రాజీనామా చేశారు. వైఎస్సార్సీపీలోకి చేరికలు.. మరోవైపు.. చంద్రబాబు నిర్ణయానికి వ్యతిరేకంగా పలువురు నేతలు టీడీపీకి రాజీనామాలు చేసి వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. కార్యకర్తలకు గౌరవం ఇస్తున్నందునే వైఎస్సార్సీపీలో చేరుతున్నామని ప్రకటించారు. చిత్తూరు జిల్లాలో చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నుంచి టీడీపీ తరఫున పోటీలో ఉన్న అభ్యర్థులు నారాయణస్వామి, అన్నయ్య, భూలక్ష్మి, తంగమణి ఆ పార్టీని వీడి వైఎస్సార్సీపీలో చేరారు. అలాగే, విశాఖ జిల్లా కశింకోట జెడ్పీటీసీ అభ్యర్థిగా టీడీపీ తరఫున నామినేషన్ వేసిన బుదిరెడ్డి చిన్నాతోపాటు వివిధ మండలాలకు చెందిన తొమ్మిది మంది ఎంపీటీసీ అభ్యర్థులు వైఎస్సార్సీపీలో చేరారు. పార్టీలో మార్పులపై ఊహాగానాలు ఇదిలా ఉంటే.. చంద్రబాబుకు వ్యతిరేకంగా టీడీపీలో పరిణామాలు వేగం పుంజుకున్నాయని ఆ పార్టీ నేతలే అంతర్గంగా చర్చించుకుంటున్నారు. నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశాల్లో పరిషత్ ఎన్నికల్లో పోటీ అంశంతోపాటు.. పార్టీలో భవిష్యత్ మార్పులపైనా చర్చలు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో పోటీచేయకూడదన్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలని చంద్రబాబు స్వయంగా కొందరు పార్టీ నేతలకు ఫోన్లుచేసి మరీ ఒప్పించేందుకు యత్నించారు. కానీ, ఆయనకు వ్యతిరేకంగా పార్టీలో వాదన బలం పుంజుకుంటోందని గుర్తించిన నేతలు అధినేత బుజ్జగింపులను ఏమాత్రం పట్టించుకోవడంలేదని సమాచారం. ‘ఇప్పుడు చంద్రబాబు అవసరం మాకు లేదు.. మా అవసరమే ఆయనకు ఉంది’.. అని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించడం టీడీపీలో భవిష్యత్ పరిణామాలను సూచిస్తోంది. ఈ పరిణామాలు టీడీపీలో ఎలాంటి మార్పులకు దారితీస్తాయన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. -
ఇక సన్యాసమే శరణ్యమా!
తానొకటి తలచిన దైవమొకటి తలచునట. అయ్యవారిని చేయబోతే కోతిబొమ్మ తయారైందట! అనుకున్నదొకటి, అయిం దొకటి. ఈ సందర్భాన్ని వివరించడానికి పుట్టిన నాటు సామెతలు, నీటు సామెతలు తెలుగులో కోకొల్లలు. ఇప్పుడు చంద్రబాబునాయుడు గురించిన ప్రస్తావన కూడా ఇటువంటి సందర్భమే. దేశ రాజకీయాల్లో తనంత సీనియర్మోస్ట్ ఎవరూ లేరని ఆయన స్వయంగా చెప్పుకున్నారు. ఆయన అభిప్రాయం ప్రకారమే ఇప్పుడాయన గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఏపీ పాలిటిక్స్. ఇంకో రెండు వారాల్లో ఆ గ్రాండ్ ఓల్డ్‌మ్యాన్‌కు 71వ హ్యాపీ బర్త్‌డే. ఆ వేడుక నాటికి తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవిలో కొనసాగే నైతిక హక్కును ఆయన కోల్పోబోతున్నారు. అదెలాగో చూద్దాం. ఏడాది కిందట అర్ధాంతరంగా ఆగిపోయిన జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికల ప్రక్రియ నిన్న పునఃప్రారంభమైంది. నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసిన తర్వాత, చంద్ర బాబు ప్రోద్బలం మేరకు అప్పటి ఎస్ఈసీ వాయిదా వేశారని అధికారపక్షం ఆరోపించింది. నిష్పాక్షికులైన పరిశీలకుల అభి ప్రాయం కూడా అదే. ఎన్నికల ప్రక్రియను ఏ దశలో వాయిదా వేస్తున్నానో, అదే దశ నుంచి మళ్లీ నిర్వహిస్తానని అప్పుడు స్వయంగా ఎస్ఈసీ ప్రకటించారు. తర్వాత సర్వోన్నత న్యాయ స్థానం కూడా ఆగిపోయిన దగ్గర్నుంచే ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది కూడా. అయినప్పటికీ మాజీ ఎస్ఈసీ తన మాటను నిలబెట్టుకోలేదు. సుప్రీం అభిప్రాయాన్ని గౌరవిం చలేదు. కొత్త ఎస్ఈసీ నీలం సాహ్నీ ఆగిపోయిన దగ్గరనుంచి ప్రారంభించారు. అన్ని అంశాలు పరి శీలించిన అనంతరమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ ముమ్మరంగా జరగాల్సిన నేపథ్యంలో మిగిలిపోయిన ఆరు రోజుల ప్రక్రియను ఇప్పుడే పూర్తిచేయవలసిన అవసరం ఉన్నదని ఆమె అభిప్రాయపడ్డారు. ఇది అప్రజాస్వామిక వైఖరని తప్పుబడుతూ ఎన్నికలను బహి ష్కరిస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. ఎన్నికలను బహిష్కరించడానికి తాను చెప్పిన కారణాలు నిజం కాదని ఆయనకూ తెలుసు. రాష్ట్ర ప్రజలకూ తెలుసు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ ఇంత ప్రశాంతంగా ఎన్నికలు జరగలేదని చంద్రబాబు రబ్బర్ స్టాంప్ ఎస్ఈసీ అధికారికంగా ప్రకటిం చారు. ఇంత ప్రశాంతంగా, స్వేచ్ఛగా ఎన్నడూ ఎన్నికలు జరగ లేదని రాష్ట్ర పోలీసు రికార్డులు కూడా చెబుతున్నాయి. తెలుగుదేశం పార్టీ తరఫున ఏకైక మునిసిపల్ చైర్మన్‌గా ఎన్నికైన జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలే స్వేచ్ఛాయుత ఎన్నికలకు సాక్ష్యం. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రజాస్వామ్యబద్ధ వైఖరి కారణంగానే తాను చైర్మన్ కాగలిగానని మీడియా ముందు జేసీ చెప్పారు. జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ ఎక్కడ ఆగిపోయిందో అక్కడినుంచే ప్రారంభిస్తామని స్వయంగా చంద్రబాబు రబ్బర్ స్టాంప్ ఎస్ఈసీ ప్రకటించిన విషయం ఒక వాస్తవం. ఆమేరకు సుప్రీంకోర్టు ఆదేశాలు మరో నిఖార్సయిన నిజం. కనుక ఎన్ని కల బహిష్కరణకు ప్రతిపక్ష నేత చెప్పిన కారణాలు కుంటి సాకులేనని తేటతెల్లమవుతున్నది. మరి అసలు కారణాలు ఏమిటి? అవి ఆయన బయటకు చెప్పుకోలేరు. అవి మింగలేరు, కక్కలేరు. ఇటువంటి సంకటస్థితిలో ఆయన కుంటిసాకును ఆశ్ర యించక తప్పలేదు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతల అంచనా ప్రకారం మూడు ప్రధాన కారణాలు ఆయన ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రేరేపించాయి. 1. పరాజయాల పరాభవం: వరుస ఎన్నికల్లో పరాజయాలు. అది కూడా అతి దారుణమైన పరాజయాలు ఆయనను బాధపెడ్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఏనాడూ ఎరుగని విధంగా తెలుగుదేశం పార్టీ దక్కించుకున్న సీట్లు కేవలం 13 శాతం. లోక్‌సభ సీట్లు 12 శాతం. గ్రామ పంచాయతీలు 12 శాతం. మునిసిపాలిటీలు ఒకటింపావు శాతం. కార్పొరేషన్లు సున్నా శాతం. పట్టణ ప్రాంతాల ప్రజలు తనను ఆదరిస్తారనే ఒక భ్రమ ఆయనకు ఉండేది. ఆ కారణంగా ఎస్ఈసీపై ఒత్తిడి తెచ్చి పరిషత్‌ల ఎన్నికల బదులు మునిసిపల్ ఎన్నికలను ముందుకు తెచ్చారు. మునిసిపాలిటీల్లో తాను సాధించే విజయాల ప్రభావం పరిషత్ ఎన్నికల మీద పడాలనేది ఆయన వ్యూహ మట. కానీ ఫలితాలు చూసిన తర్వాత దిమ్మతిరిగినంత పనైంది. మునిసిపాలిటీల సగటు లెక్క తీస్తే తెలుగుదేశం ఓటింగు బలం 30 శాతం దాటలేదు. ఈ పరిస్థితుల్లో ప్రాదేశిక ఎన్నికల్లో 25 శాతం మించి ఓట్లు రాబట్టలేమనే సంగతి ఆయనకు పూర్తిగా అర్థమైంది. అంటే చంద్రబాబును రెండో ఎక్కంతో హెచ్చించినా కూడా జగన్మోహన్రెడ్డిని ఓడించలేడు. ఇటువంటి అవమా నకరమైన పరిస్థితి నుంచి ఏదోరూపంలో బయటపడాలని బాబు సంకల్పించారు. 2. కార్యకర్తల తిరుగుబాటు భయం: స్థానిక ఎన్నికలు ప్రారంభం కావడానికి ముందునుంచే తన నాయకత్వం పట్ల కార్యకర్తల్లో విశ్వాసం సన్నగిల్లడం మొదలైంది. తన సొంత నియోజకవర్గంలోనే చంద్రబాబు కార్యకర్తల నుంచి కొంత అవమానకరమైన పరిస్థితిని ఎదుర్కొనవలసి వచ్చింది. గ్రామ పంచాయతీ, మునిసిపల్ ఎన్నికల ఫలితాలు ఇప్పటికే అవ మానాగ్నికి ఆజ్యం పోశాయి. ప్రాదేశిక ఫలితాలు మరింత దారుణంగా ఉండేది ఖాయం. ఆ తర్వాత కార్యకర్తలకు, నాయ కులకు తనపై గౌరవం సన్నగిల్లుతుంది. ఎవరి దారి వారు వెతుక్కునే ప్రయత్నాల్లో పడతారు. అందువల్ల మొత్తం స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియనే అక్రమంగా బ్రాండింగ్ చేసి ఎంతో కొంత పరువు కాపాడుకోవాలని ఆయన భావించారు. 3. గిట్టుబాటు బేరం కోసం: అధికారంలో వున్నప్పుడు రాష్ట్రంలో జరిగిన విచ్చలవిడి అవినీతి, రాజధాని పేరుతో తెర లేపిన సూపర్ కుంభకోణాలపై విచారణ జరిగితే అడ్డంగా దొరికిపోవడం ఖాయమని పార్టీ సీనియర్లు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వయసులో జైలు ఊచలు లెక్కించాల్సి రావడమన్న ఊహలతోనే ఆయన వణికిపోతున్నారట. సాధా రణ ఎన్నికల ఫలితాలు వచ్చిన తొలిరోజుల్లోనే పరిస్థితిని అంచనా వేసుకొని ఢిల్లీ ప్రభువుల శరణుజొచ్చారని అప్పట్లో రకరకాల వార్తలు వ్యాప్తిలోకి వచ్చాయి. తెలుగుదేశం పార్టీ నుంచి ఈ వార్తలపై ఎటువంటి అధికారిక ఖండనా ఇప్పటిదాకా రాలేదు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రైట్స్‌ను పూర్తిగా బీజేపీకి అప్పగించడానికి సంసిద్ధతను వ్యక్తం చేస్తూ రెండు రకాల ప్రతిపాదనలు వారి ముందు పెట్టారని వార్తలొచ్చాయి. అందులో మొదటిది తెలుగుదేశం కంపెనీని పూర్తిగా బీజేపీ టేకోవర్ చేయడం. రెండోది దాని స్వతంత్ర ప్రతిపత్తిని కొన సాగిస్తూ అనుబంధ సంస్థగా నడుపుకోవడం–ఈ రెంటిలో ఏదైనా తమకు సమ్మతమేననీ, బదులుగా కేసులు నడవకుండా సహకరించడంతోపాటు, డీల్ తర్వాత రోజుల్లో తండ్రీకొడుకు లకు గౌరవప్రదమైన స్థానం కల్పించాలని విజ్ఞప్తిని అంద జేశా రట. వాళ్లిద్దరి భవిష్యత్తునే చూసుకున్నారు తప్ప, పార్టీ స్థాపించినప్పటి నుంచీ సేవలందించిన తమ గురించి పట్టించుకోలేదన్న దుగ్ధ సీనియర్ నేతల్లో ఉన్నది. అందువల్లనే ఇటువంటి వివరాలన్నీ బయటకు వస్తున్నాయి. పెద్ద కంపెనీ ఏదైనా టేకోవర్ చేయబోయే ముందు తమ కంపెనీ లాభాల్లో ఉందనీ, ఫండమెంటల్స్ బాగున్నాయని లెక్కలు చూపడానికి చిన్న కంపెనీలు తంటాలు పడతాయి. తెలుగుదేశం లెక్కలు పెద్ద ఆకర్షణీయంగా కనిపించడం లేదు. అందుకు కారణాన్ని ‘అక్రమ ఎన్నికల’ మీదకు నెట్టి గిట్టుబాటు ధర సంపాదించాలన్న తాపత్రయం కూడా ఈ బహిష్కరణకు మరో కారణం. రకరకాల కోణాల్లో ఆలోచించి చంద్రబాబు ఎన్నికల బహిష్కరణ నిర్ణయాన్ని తీసుకున్నారు. కానీ ఈ నిర్ణయ పర్య వసానం తన రాజకీయ జీవితంలోనే ఊహించని ట్విస్టుగా మారబోతున్నదని ఆయన అంచనా వేయలేకపోయారు. చాలా ప్రాంతాల్లో కార్యకర్తలు, కొందరు నాయకులు బహిరంగంగానే అధినేత నిర్ణయాన్ని ధిక్కరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పార్టీ అధ్యక్ష స్థానంలో ఉన్న వ్యక్తి ఆదేశాన్ని పార్టీలోని మెజారిటీ సభ్యులు ధిక్కరించిన పక్షంలో ఆ వ్యక్తికి అధ్యక్షస్థానంలో కొన సాగే నైతిక అర్హత ఉంటుందా అనే ప్రశ్న ఇప్పుడు చర్చ నీయాంశం కానుంది. ఎన్నికల్లో ఇప్పటికే నామినేషన్లు దాఖలై ఉన్నందువలన 526 జెడ్పీటీసీ స్థానాల్లో, 7321 ఎంపీటీసీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు రంగంలో ఉన్నారు. మునిసిపల్ ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలను పరిశీలించి చేసిన విశ్లేషణ ప్రకారం ప్రాదేశిక ఎన్నికలు జరగ నున్న గ్రామీణ ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ ఓటింగ్ బలం 25 శాతంగా ఉండొచ్చని తేలుతున్నది. సుదీర్ఘకాలంపాటు అధి కారంలో ఉన్నందువల్ల బ్యాలెట్ పేపర్ మీద సైకిల్ గుర్తు కనపడగానే ఓటు వేసే సాధారణ ఓటర్లు ఇందులో నాలుగైదు శాతం మంది ఉండవచ్చు. మిగిలిన ఇరవై శాతం మంది తెలుగుదేశం పార్టీ ప్రాథమిక, క్రియాశీల సభ్యత్వం కలిగినవాళ్లు. ఇది లోకేశ్ లెక్కకు సరిపోతుంది. ఆయన ప్రధాన కార్యదర్శి హోదాలో గతంలో విడుదల చేసిన వివరాల ప్రకారం మొత్తం ఓటర్లలో దాదాపు ఇరవై శాతం మంది తెలుగుదేశం పార్టీ సభ్యులే. ఈ ఇరవై శాతం మంది పార్టీ అధినేత ఆదేశాలను కచ్చితంగా పాటించవలసి ఉంటుంది. వీరిలో సగంమంది కంటే ఒక్కరు అదనంగా ఓటింగ్‌లో పాల్గొన్నా మెజారిటీ సభ్యులు అధినేత నిర్ణయానికి వ్యతిరేకంగా ఉన్నట్టే లెక్క. ఉదాహరణకు ఒక ఎంపీటీసీ స్థానంలో పోటీచేసిన తెలుగుదేశం అభ్యర్థికి పార్టీ గుర్తు కారణంగా వ్యక్తిగత సంబంధాల కారణంగా ఒక ఐదు శాతం ఓట్లు పోలవుతాయి. (వ్యక్తిగతంగా ఇంతకంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకునే అభ్యర్థుల సంఖ్య చాలా తక్కువగానే ఉంటుంది.) ఈ ఐదుశాతం ఓట్లకు తోడుగా ఇరవై శాతంమంది పార్టీ సభ్యుల్లో సగానికంటే ఎక్కువమంది ఓట్లేశారనుకుం దాము. ఆ అభ్యర్థికి పదిహేను శాతం కంటే ఒక్క ఓటు అధి కంగా వచ్చినా ఆ ఎంపీటీసీ స్థానంలోని పార్టీ సభ్యులు పార్టీ అధినేత నిర్ణయాన్ని తిరస్కరించినట్టే. ఈవిధంగా ఎన్నికలు జరిగేచోట సగానికంటే ఎక్కువ (3662) ఎంపీటీసీ స్థానాల్లో ఆ పార్టీకి 15 శాతం మించి ఓట్లు పోలైతే రాష్ట్రవ్యాప్తంగా తెలుగు దేశం సభ్యులు పార్టీ అధినేతను ధిక్కరించినట్టే. అలాగే మెజా రిటీ జెడ్పీటీసీ స్థానాల్లో (263+1) 15 శాతం మించి ఓట్లు టీడీపీ అభ్యర్థులకు లభించినా పార్టీ సభ్యులు అధ్యక్షుడి మాటను ఖాతరు చేయలేదని అర్థం. ఒకవేళ మెజారిటీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు 15 శాతం ఓట్లను మించి సాధిస్తే అప్పుడు పార్టీ అధ్యక్షస్థానంలో కొనసాగే నైతిక అర్హత చంద్రబాబుకు ఉంటుందా? పార్టీ ప్రాథమిక సభ్యులు, క్రియాశీలక సభ్యులే లెక్కచేయని అధ్యక్షునిపై కార్య కర్తలకూ, నాయకులకూ గౌరవం మిగులుతుందా? పార్టీ సభ్యుల మద్దతు లేని అధ్యక్షుడు ఇతర పార్టీలతో చేసుకునే డీల్స్ సమర్థనీయమేనా? దీనికి సీనియర్ నాయకశ్రేణి అనుమతి స్తుందా? ఈ ప్రశ్నలకు తొందర్లోనే సమాధానాలు లభిస్తాయి. చంద్రబాబుకు అనుకోని అదృష్టం కలిసివచ్చి టీడీపీ ఓటుబ్యాంకు 25 శాతం నుంచి కిందకు కూడా పడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే తమ నాయకుడు ధీరోదా త్తుడయితేనే అనుచరులు, కార్యకర్తలు అమితంగా ప్రేమిస్తారు. నిజంగా కష్టాలు ఎదురైనా వెన్నుచూపని వాడైతేనే వెంట నడుస్తారు. పలాయనవాదిని జనం కూడా పట్టించుకోరు. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతులైన ఐదుగురు వ్యక్తుల్లో ఒకరిగా సోనియా గాంధీ వెలిగిపోతున్న రోజుల్లోనే ఆమెను ధిక్కరించిన జగన్మోహన్రెడ్డి వెంట తొలిరోజుల్లో ఎవరు న్నారు? ఏ పార్టీ వుంది? అయినా జనం విజ్ఞత మీద నమ్మ కంతో, తాను ఎంచుకున్న మార్గంపై అచంచల విశ్వాసంతో తల్లితో కలిసి ఎన్నికల్లో తలపడితే జాతీయ రికార్డును బద్దలు కొడుతూ ఓట్లు వరదెత్తలేదా? ధీరస్వభావానికి లభించే ఆదరణ అటువంటిది. భీరువు నాయకత్వాన్ని ఎందుకు సమ్మతిస్తారు? చంద్రబాబు ఎన్నికల బహిష్కరణ వెనుక ఒక భీరువును కనుక పార్టీ కార్యకర్తలు చూసినట్లయితే, ఏ ప్రయత్నం లేకుండానే ఆ పార్టీ ఓట్లు 15 శాతానికి పడిపోతాయి. కానీ పార్టీ పూర్తిగా చేజారిపోతుంది. కార్యకర్తలు, నాయకులు ఎవరి దారి వారు చూసుకుంటారు. ఈ రెండు పరిణామాల్లో ఏది జరిగినా చంద్ర బాబు నాయకత్వానికి ముప్పు వాటిల్లినట్లే. 71వ పుట్టినరోజు చంద్రబాబు రాజకీయ జీవితంలో తుది ఘట్టంగా మిగిలి పోవచ్చు. అనతికాలంలోనే ఆయనకు రాజకీయ సన్యాసం తప్పకపోవచ్చు. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
టీడీపీలో కాకరేపుతోన్న తిరుగుబాటు నేతల తీరు
సాక్షి, అమరావతి: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేయకూడదన్న చంద్రబాబు నిర్ణయం టీడీపీలో ముసలం పుట్టించింది. చంద్రబాబు నిర్ణయాన్ని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. టీడీపీలో తిరుగుబాటు నేతల తీరు కాకరేపుతోంది. చంద్రబాబు తీరుపై పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. పలు చోట్ల ప్రచారంలో టీడీపీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా... చంద్రబాబు నిర్ణయానికి వ్యతిరేకంగా విశాఖ పెందుర్తిలో బండారు సత్యనారాయణ ప్రచారం నిర్వహించారు. సబ్బవరంలోనూ బాబు నిర్ణయాన్ని టీడీపీ కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు. అభ్యర్థులు వెనక్కు తగ్గొద్దని టీడీపీ సీనియర్లు అభ్యర్థిస్తున్నారు. ప్రచారం చేయండి, పార్టీని బతికించుకోవాలంటూ అభ్యర్థిస్తున్నారు. పార్టీ బతకాలంటే పోటీలో ఉండాలని విశాఖ టీడీపీ సీనియర్లు అంటున్నారు. విజయనగరం జిల్లాలో ఒక జెడ్పీటీసీ, 12 ఎంపీటీసీల్లో ప్రచారం నిర్వహించారు. ఓడినా ఫరావాలేదు, పోటీలో ఉంటామని అభ్యర్థులు అంటున్నారు. తప్పుకునే ప్రసక్తే లేదని అశోక్ గజపతిరాజు వర్గం అంటున్నారు. చంద్రబాబుకు ధిక్కరణ.. గుంటూరు జిల్లా మంగళగిరి, దుగ్గిరాలలోనూ బాబుకు ధిక్కరణ ఎదురవుతుంది. చంద్రబాబు, లోకేష్ నిర్ణయం సరికాదని టీడీపీ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తూర్పుగోదావరిలో కొన్ని చోట్ల బాబు నిర్ణయానికి తమ్ముళ్లు తిలోదకాలిచ్చారు. చంద్రబాబు నిర్ణయాన్ని పార్టీలో కొందరు వ్యతిరేకిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. పార్టీ బీ - ఫారాలు ఇచ్చింది, వెనక్కి తీసుకోలేమన్నారు. పోటీలో ఉన్నవారు ఓటు బ్యాంకు చెదరకుండా చూస్తే తప్పేం లేదంటూ గోరంట్ల వ్యాఖ్యానించారు. పార్టీ కోసం ప్రచారం చేసే పోటీలో ఉన్నవారిపై చర్యలు అవసరం లేదని బుచ్చయ్య చౌదరి అన్నారు. పార్టీ పుట్టి ముంచడం ఖాయం.. పార్టీకి వ్యతిరేకంగా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని టీడీపీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ కంటే స్వప్రయోజనాల కోసమే చంద్రబాబు నిర్ణయాలు ఉన్నాయంటూ జ్యోతుల వ్యాఖ్యానించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేయకూడదన్న నిర్ణయంతో టీడీపీలో పుట్టిన ముసలం ఆ పార్టీ పుట్టి ముంచడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చదవండి: టీడీపీలో కల్లోలం: జ్యోతుల నెహ్రూ, అశోక్ గజపతి అసంతృప్తి జెండా ఎత్తేసిన చంద్రబాబు -
ఏపీ: హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన ఎస్ఈసీ
సాక్షి, అమరావతి: హైకోర్టులో ఎస్ఈసీ అఫిడవిట్ దాఖలు చేశారు. నిబంధనల ప్రకారమే ఆంధ్రప్రదేశ్‌లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహిస్తున్నామని ఎస్ఈసీ నీలం సాహ్ని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఎన్నికలు జరుపుతున్నామన్నారు. గత ఏడాది కరోనా కారణంగా ఎన్నికలు నిలిచిపోయాయని.. నిలిచిపోయిన ఎన్నికలను యథావిధిగా కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. గత ఏడాది నోటిఫికేషన్ ప్రకారంగా ఎన్నికల నిర్ణయం తీసుకున్నామని వివరించారు. రిట్ అప్పీల్‌ను డిస్మిస్ చేసి ఎన్నికలు సజావుగా జరిగేలా ఆదేశాలివ్వాలని హైకోర్టును ఎస్ఈసీ కోరారు. చదవండి: ఆటంకాలు లేవని తేలాకే నోటిఫికేషన్ జెండా ఎత్తేసిన చంద్రబాబు -
పంచాయతీ ,మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అడ్రస్ లేకుండా పోతుంది
-
టీడీపీ ఉపాధ్యక్ష పదవికి జ్యోతుల రాజీనామా
-
స్థానిక పరిస్థితుల ఆధారంగా నిర్ణయం
విజయనగరం రూరల్: పరిషత్ ఎన్నికలు బహిష్కరించాలని టీడీపీ తీసుకున్న నిర్ణయమే ఆఖరు కాదని, స్థానిక పరిస్థితుల ఆధారంగా పోటీలో ఉండాలా, లేదా అనేది నిర్ణయించుకుంటామని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు అశోక్ గజపతిరాజు చెప్పారు. అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై శుక్రవారం విజయనగరంలో మీడియాతో మాట్లాడారు. -
టీడీపీ ఉపాధ్యక్ష పదవికి జ్యోతుల రాజీనామా
జగ్గంపేట: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించాలని టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి శుక్రవారం రాజీనామా చేశారు. మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు గెలుపోటములు సహజమని, వాటికి సిద్ధపడి ముందుకు వెళ్లాలన్నారు. ఇందుకు విరుద్ధంగా ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత తరుణంలో ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని పార్టీ తీసుకున్న నిర్ణయం మనస్తాపం కలిగించిందని తెలిపారు. పార్టీకి సంబంధించిన రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడం ఇష్టం లేక తన పదవికి రాజీనామా చేశానని చెప్పారు. నియోజకవర్గంలో పార్టీ నాయకుడిగా, కార్యకర్తలకు అండగా ఉంటానని అన్నారు. తెలుగుదేశం పార్టీ క్యాడర్ చాలా చోట్ల గెలిచే అవకాశాలున్న తరుణంలో పార్టీ ఈ విధంగా నిర్ణయం తీసుకోవడం బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. పోటీ నుంచి తప్పుకోం రావికమతం : పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించినంత మాత్రాన తాము ఎన్నికల బరిలోంచి తప్పుకోమని విశాఖ జిల్లా రావికమతం మండల టీడీపీ నాయకత్వం తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో మేడివాడలో శుక్రవారం సాయంత్రం జరిగిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజు, నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి బత్తుల తాతయ్యబాబు మాట్లాడుతూ పార్టీ అభ్యర్థులు ఎన్నికల్లో పోటీలో ఉంటారని ధిక్కార స్వరం వినిపించారు. -
‘పరిషత్’ ఎన్నికలపై కోర్టుకెళ్లిన బీజేపీ
సాక్షి, అమరావతి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్ని నిలిచిపోయిన దశ నుంచి నిర్వహించడాన్ని చట్ట విరుద్ధంగా ప్రకటించి, ఎన్నికల ప్రక్రియను మొదటి నుంచీ నిర్వహించేలా ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని కోరుతూ బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. ఎన్నికల నోటిఫికేషన్లకు సంబంధించిన తదుపరి చర్యలన్నింటినీ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ బీజేపీ నేత పాతూరి నాగభూషణం, మరో ముగ్గురు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిని న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు శుక్రవారం హౌస్‌మోషన్ రూపంలో విచారించారు. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఎన్నికల కమిషన్, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. తదుపరి విచారణను శనివారం మధ్యాహ్నం 2.15 గంటలకు చేపడతామని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈ లోపు కౌంటర్లను పిటిషనర్ల తరఫు న్యాయవాదికి అందజేయాలని సూచించారు. ఎన్నికల కమిషన్ తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపించారు. -
మేము పోటీలో ఉంటాం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అధికార వైఎస్సార్సీపీని ఎదుర్కోగల సత్తా బీజేపీకి మాత్రమే ఉందనే మరోసారి నిరూపితమైందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై పార్టీ వైఖరిని తెలియజేస్తూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పేరుతో ఆ పార్టీ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసింది. బీజేపీ ఎన్నికల నుంచి ఎప్పుడూ తప్పుకోదని, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థులు పోటీ చేయబోతున్నారని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. ప్రజలు రాష్ట్రంలో బీజేపీని మాత్రమే నిజమైన ప్రతిపక్షంగా నమ్ముతున్నారని, ప్రజల కోసం మరింత బాధ్యతగా రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్రను తామే పోషించబోతున్నామని పేర్కొన్నారు. వైద్య పరికరాల స్కామ్‌పై విచారణ వేగవంతం చేయాలి చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2015లో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య కళాశాలల్లో వైద్య ఉపకరణాల కొనుగోలు, నిర్వహణ కాంట్రాక్టుల్లో జరిగిన అవినీతిపై సీఐడీ వేగంగా విచారణను పూర్తిచేసి అసలైన దోషులను న్యాయస్థానం ముందు నిలబెట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోము వీర్రాజు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి లేఖ రాసినట్టు ఆ పార్టీ శుక్రవారం మరో ప్రకటనలో పేర్కొంది. -
ఎన్నికల్ని బహిష్కరిస్తున్నాం
సాక్షి, అమరావతి: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చెప్పారు. ఈ ఎన్నికల్లో తాము పోటీలో లేమని ప్రజలు గమనించాలని కోరారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలంటే భయం లేదని కానీ ప్రస్తుత పరిస్థితుల్లో తమకు బహిష్కరించడం తప్ప వేరే మార్గం లేదని చెప్పారు. పార్టీ 40 ఏళ్ల చరిత్రలో తొలిసారి ఇంతటి కఠిన నిర్ణయం తీసుకోవాల్సివచ్చిందన్నారు. పంచాయతీ ఎన్నికల్ని నాలుగు దశల్లో పెట్టారని, ఈ ఎన్నికల్ని ఒకేదశలో ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. కొత్తగా వచ్చిన ఎస్ఈసీ ఉదయం బాధ్యతలు తీసుకుని సాయంత్రం నోటిఫికేషన్ ఇవ్వడం ఏమిటన్నారు. అసలు ఎన్నికలు పెట్టే అర్హత కొత్త ఎస్ఈసీకి ఉందా అని ప్రశ్నించారు. ఎస్ఈసీ రబ్బర్ స్టాంపుగా మారారని, సీఎం ఏం చెబితే అది చేస్తున్నారని ఆరోపించారు. సీఎంకు సలహాదారుగా పనిచేసిన వ్యక్తిని ఎస్ఈసీగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందే సీఎం, మంత్రులు 8వ తేదీన పోలింగ్, 10న కౌంటింగ్ జరుగుతాయని స్టేట్మెంట్లు ఇచ్చారని విమర్శించారు. ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత అఖిలపక్ష సమావేశానికి పిలిచారని, ముందురోజు 11 గంటలకు మీటింగ్ అని ఆరోజు రాత్రే నోటిఫికేషన్ విడుదల చేయడం దారుణమని చెప్పారు. అఖిలపక్షాలను పిలిచి ముందే నోటిఫికేషన్ ఎందుకిచ్చారో సమాధానం చెప్పాలన్నారు. హైకోర్టు రిటైర్డ్ జడ్జిని ఎస్ఈసీ చేస్తామన్నారని, అది ఏమైందని ప్రశ్నించారు. కరోనా ఉంది ఎన్నికలు వద్దన్న ప్రభుత్వం, కరోనా సెకండ్ వేవ్ ఉన్న సమయంలో అర్జెంట్‌గా ఎన్నికలెందుకు పెడుతుందో చెప్పాలన్నారు. దొంగ, పోలీస్ కలిస్తే ఏం అవుతుందో, ఇప్పుడు అదే అవుతోందని విమర్శించారు. ఈ ఎన్నికలు సజావుగా, స్వేచ్ఛాయుతంగా జరుగుతాయనే నమ్మకం లేదన్నారు. ఎన్నికల బహిష్కరణ పట్ల బాధ, ఆవేదన ఉన్నా ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకే కఠిన నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. గతంలో జయలలిత, జ్యోతిబసు వంటి నేతలు కూడా స్థానిక ఎన్నికలను బహిష్కరించారన్నారు. రౌడీయిజంతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని, వలంటీర్లు బెదిరించి ఓట్లు వేయించుకున్నారని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఫార్స్‌గా తయారయ్యాయన్నారు. వైఎస్సార్సీపీ అక్రమాలపై జాతీయస్థాయిలో పోరాడతామన్నారు. దౌర్జన్యాలు, అక్రమాలతో బలవంతపు ఏకగ్రీవాలు జరిగాయని, పోటీచేస్తామనే అభ్యర్థులను పోలీసులు బెదిరించారని ఆరోపించారు. అప్రజాస్వామిక నిర్ణయాల్లో భాగస్వాములం కాలేమన్నారు. బలవంతపు, అక్రమ ఏకగ్రీవాలపై ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదన్నారు. ఈ ఎన్నికలపై కొత్త నోటిఫికేషన్ ఇవ్వమని అడిగామని, అది ఇస్తే పోటీకి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఎన్నికల నిర్వహణ అప్రజాస్వామికమని హైకోర్టులో పిటిషన్ వేశామని, శనివారం విచారణ జరుగుతుందని తెలిపారు. అవసరమైతే దీనిపై సుప్రీంకోర్టుకు వెళతామని, కలిసి వచ్చే పార్టీలతో కలిసి పోరాడతామని చెప్పారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై ఆయన కుమార్తె సునీతారెడ్డి అడిగిన ప్రశ్నలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. పొలిట్‌బ్యూరో సమావేశం అంతకుముందు టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం జరిగింది. ఎన్నికల్ని బహిష్కరించాలని అప్పటికే తీసుకున్న నిర్ణయాన్ని సమావేశంలో చర్చకు పెట్టి చంద్రబాబు అందరితో ఉపన్యాసాలు చెప్పించారు. ఆ తర్వాత దాన్ని పొలిట్‌బ్యూరో నిర్ణయంగా చంద్రబాబు మీడియా సమావేశంలో వెల్లడించారు. -
ఆటంకాలు లేవని తేలాకే నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: మధ్యలో ఆగిపోయిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు నిబంధనల ప్రకారం ఎటువంటి ఆటంకాలు, అడ్డంకులు లేవని స్పష్టత వచ్చాకే ఎన్నికల కొనసాగింపునకు నోటిఫికేషన్ విడుదల చేసినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. తాను ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన వెంటనే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎక్కడ దాకా జరిగాయి, ఏవి ఎక్కడ ఆగిపోయాయన్న దానిపై సమీక్షించానని చెప్పారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, జిల్లా కలెక్టర్లు తదితరులతో ఎన్నికల సన్నద్ధతపై చర్చించాకే నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ‘రాష్ట్రంలో ఏడాది కిందట మధ్యలో ఆగిపోయిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఈ ఏడాది జనవరి 8వ తేదీనే తిరిగి మొదలైంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాయి. మునిసిపల్ ఎన్నికలు పూర్తయ్యాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు కూడా 2020 మార్చి 14వ తేదీకే నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయింది. కరోనా కారణంగా అప్పుట్లో ఎన్నికల వాయిదా పడ్డాయి. పోటీలో ఉండే అభ్యర్థుల జాబితాలు అప్పుడే ఖరారయ్యాయి. బ్యాలెట్ పేపర్ల ముద్రణ పూర్తయింది. ఏకగ్రీవంగా ఎన్నికైనవారికి రిటర్నింగ్ అధికారులు గెలుపు ధ్రువీకరణ పత్రాలు కూడా అందజేశారు. ఆ ఎన్నికలను కొనసాగించకుండా ఉండడానికి ఎటువంటి కారణాలు లేవు. అన్ని పరిశీలించాకే నిర్ణయం తీసుకున్నాం. ఈ నెల 8వ తేదీ ఎన్నికల పోలింగ్, 9న అవసరమైన చోట రీపోలింగ్ నిర్వహిస్తాం. 10వ తేదీన ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి ఉంటాయి..’ అని వివరించారు. ఎన్నికలు ఎక్కడ ఆగిపోయి ఉన్నాయో అక్కడ నుంచే మొదలు పెట్టినట్టు చెప్పారు. నోటిఫికేషన్ విడుదలతో పోటీలో ఉన్న అభ్యర్థులు శుక్రవారం నుంచే ప్రచారం కొనసాగించుకోవచ్చన్నారు. ఎన్నికల కోడ్ గురువారం రాత్రి నుంచే అమల్లోకి వచ్చిందని తెలిపారు. ఎన్నికల ప్రచారంలోను, పోలింగ్ సమయంలోను కరోనా జాగ్రత్తలు తీసుకునేలా కలెక్టర్లు, ఎస్పీలకు స్పష్టమైన ఆదేశాలిచ్చినట్లు చెప్పారు. ఏకగ్రీవాలపై ఇప్పటికే కోర్టు తీర్పిచ్చింది ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో ఏకగ్రీవాలపై ఇప్పటికే హైకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి ఎన్నికల నిర్వహణకు ఇబ్బందులు లేవని మీడియా ప్రతినిధులు అడిగిన ఒక ప్రశ్నకు నీలం సాహ్ని బదులిచ్చారు. ‘ఎన్నికలు ఇంకా ఆపడానికి నిబంధనల ప్రకారం ప్రత్యేకించి ఏ కారణాలు లేవు. ఎన్నికల నిర్వహణ ఇంకా ఆలస్యమయ్యే కొద్ది కరోనా వాక్సినేషన్ సమస్యలున్నాయి. ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉంది. అన్ని పరిస్థితులు పరిశీలించాక ఇప్పుడు ఎన్నికలు కొనసాగించడమే సముచితమం’ అని భావించినట్టు చెప్పారు. అందరి సహకారం అవసరం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిష్పక్షపాతంగా, స్వేచ్చగా, పూర్తి పారదర్శకంగా నిర్వహించడానికి ఓటర్లు, రాజకీయ పార్టీలు సహా అందరి సహకారం అవసరమని చెప్పారు. ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి వారినుంచి సలహాలు, సూచనలు తీసుకున్నట్టు తెలిపారు. స్థానిక ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఫిర్యాదుల సెల్ ఏర్పాటు చేసిందని, ఎలాంటి ఫిర్యాదులు, వినతులు వచ్చినా సత్వరమే పరిష్కరిస్తామని ఆమె చెప్పారు. -
జెండా ఎత్తేసిన చంద్రబాబు
సాక్షి, అమరావతి: రాష్ట్ర రాజకీయ యవనిక నుంచి టీడీపీ జెండాను చంద్రబాబు దాదాపు ఎత్తేశారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉంటూ కూడా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేయకూడదన్న నిర్ణయంతో రాజకీయంగా సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. అసెంబ్లీ, పంచాయతీ, మునిసిపల్ ఎన్నికల్లో మాదిరిగానే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా టీడీపీకి ఘోర పరాభవం తప్పదని బెంబేలెత్తి, స్థానిక సంస్థల ఎన్నికల నుంచి పలాయనం చిత్తగించడం టీడీపీ పాలిట ఆత్మహత్యా సదృశంగా మారుతోంది. టీడీపీలో ముసలం పుట్టించి చంద్రబాబు నాయకత్వంపై తిరుగుబాటు బావుటాకు నాంది పలుకుతోంది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుల నుంచి గ్రామ స్థాయి కార్యకర్తల వరకు చంద్రబాబుపై మండిపడుతున్నారు. సీనియర్ నేత అశోక్ గజపతి రాజు పొలిట్ బ్యూరో సమావేశానికి గైర్హాజరై అసమ్మతి వ్యక్తం చేయగా.. జ్యోతుల నెహ్రూ రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేసి ఆగ్రహం ప్రదర్శించారు. మరోవైపు ఇన్నాళ్లూ గ్రామాల్లో పార్టీ జెండా మోసిన టీడీపీ కార్యకర్తలు చంద్రబాబుపై భగ్గుమంటున్నారు. ‘మా ఎన్నికలు మీకు పట్టనప్పుడు మీరు పోటీ చేసే ఎన్నికలను మేమూ పట్టించుకోం. జెండా వదిలేస్తున్నాం’ అని తేల్చి చెబుతున్నారు. గెలుపోటములతో నిమిత్తం లేకుండా ఎన్నికల్లో పోటీ చేయాలన్న రాజకీయ పార్టీ ప్రాథమిక ధర్మాన్ని టీడీపీ విస్మరించిందని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. శుక్రవారం ఒక్క రోజులో వేగంగా జరిగిన ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో టీడీపీలో సంభవించనున్న కల్లోలానికి సంకేతంగా నిలుస్తున్నాయి. 2019 ఎన్నికలతో టీడీపీ పతనానికి నాంది ఐదేళ్లపాటు ప్రజా వ్యతిరేక విధానాలు, కుంభకోణాలతో సాగిన చంద్రబాబు పాలనకు 2019 ఎన్నికల్లో ప్రజలు ముగింపు పలకడంతోనే టీడీపీ పతనానికి బీజం పడింది. సొంతంగా ప్రజాదరణ లేని చంద్రబాబు ఇక పార్టీని అధికారంలోకి తేవడం కల్లేనని తేటతెల్లమైపోవడంతో టీడీపీ శ్రేణులు నీరుగారిపోయాయి. మరోవైపు అధికారంలోకి వచ్చిన సీఎం వైఎస్ జగన్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న దాదాపు 90 శాతం హామీలను ఏడాదిలోపే అమలు చేసి ప్రజాదరణను మరింత పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో 2020 ఫిబ్రవరి చివరి వారంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రకటించగానే చంద్రబాబు బెంబేలెత్తిపోయారు. ఏకంగా 126 జెడ్పీటీసీ స్థానాల్లో నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులే లభించకపోవడం ఆ పార్టీ దయనీయ స్థితికి అద్దం పట్టింది. ఎన్నికలు జరిగితే ఘోర పరాజయం తప్పదని అవగతమవడంతో అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ద్వారా చంద్రబాబు రాజకీయ కుతంత్రానికి తెరతీశారు. మరో వారం రోజుల్లో ఎన్నికల ప్రక్రియ ముగిసిపోతుందనగా కరోనా సాకుతో ఎన్నికలను అర్ధంతరంగా వాయిదా వేయించారు. నిమ్మగడ్డను అడ్డు పెట్టుకున్నా ఫలితం శూన్యం మరోవైపు టీడీపీకి ప్రయోజనం చేకూర్చేందుకు నిమ్మగడ్డ కొత్త ఎత్తుగడ వేశారు. మధ్యలో నిలిచిపోయిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కాకుండా పార్టీ రహితంగా నిర్వహించే పంచాయతీ ఎన్నికల ప్రక్రియ చేపట్టడం గమనార్హం. దాంతో ఎవరు గెలిచినా సరే తమ పార్టీ వారే అని చెప్పుకుని ముఖం చాటేసుకోవచ్చన్నది చంద్రబాబు ఎత్తుగడ. పంచాయతీ ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీ అభిమానులు దాదాపు 82 శాతం పంచాయతీలను గెలుచుకున్నారు. అయితే టీడీపీ బలపరిచ్చిన అభ్యర్థులు 40 శాతం పంచాయతీలు గెలిచారని చంద్రబాబు స్వయంగా ప్రెస్‌మీట్ పెట్టి మరీ దొంగ లెక్కలతో కనికట్టు చేసేందుకు యత్నించారు. తమ అనుకూల మీడియాలో ప్రచారం చేయించుకుని టీడీపీ శ్రేణులను కాపాడుకునేందుకు విఫలయత్నం చేశారు. కాగా, ఈ ఏడాది మార్చిలో జరిగిన మునిసిపల్ ఎన్నికలు చంద్రబాబు గాలి తీసేశాయి. ఎన్నికలు నిర్వహించి ఫలితాలు ప్రకటించిన 11 మునిసిపల్ కార్పొరేషన్లనూ వైఎస్సార్సీపీ గెలుచుకుంది. 75 మునిసిపాలిటీలలో ఏకంగా 74 మునిసిపాలిటీలను కైవసం చేసుకుంది. సీఎం వైఎస్ జగన్ వెన్నంటి ఉన్నామని ప్రజలు కుండబద్దలు కొట్టారు. భంగపాటు తప్పదని పలాయనం రాష్ట్ర ఎన్నికల కమిషన్ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియను ప్రకటించడంతో చంద్రబాబు పరిస్థితి మూలిగే నక్క మీద తాటి పండు పడినట్లయింది. అసలు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగనీయకుండా చేయడానికి ఆయన కొంత కాలంగా యత్నిస్తున్నారు. అందుకే గత ఏడాది నోటిఫికేషన్‌ను రద్దు చేసి కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయాలనే అసంబద్ధ వాదనను లేవనెత్తారు. చంద్రబాబు తెరచాటు రాజకీయ పార్ట్నర్ పవన్ కల్యాణ్ కూడా అందుకు వత్తాసు పలకడం గమనార్హం. ఇదే సమయంలో ఏకగ్రీవమైన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను రద్దు చేయడం కుదరదని హైకోర్టు స్పష్టం చేసింది. గతంలో ఎన్నికల ప్రక్రియ ఎక్కడైతే ఆగిందో.. తిరిగి అక్కడి నుంచే ప్రక్రియ కొనసాగుతుందని ఎన్నికల కమిషన్ పోలింగ్ తేదీని ప్రకటించడంతో చంద్రబాబు బెంబేలెత్తిపోయారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పట్ల అత్యంత ప్రజాదారణ ఉన్న ప్రస్తుత నేపథ్యంలో టీడీపీ కనీసం ఒక్క జిల్లాలో కూడా జెడ్పీ చైర్మన్ పీఠాన్ని గెలుచుకునే అవకాశాలు లేవు. చాలా జిల్లాల్లో ఒక్క జెడ్పీటీసీ స్థానాన్ని కూడా గెలుచుకుంటుందన్న నమ్మకం కూడా లేదు. రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించనున్న 660 మండల పరిషత్‌లలో కూడా కనీసం పదింటిని కూడా గెలుచుకుంటుందన్న విశ్వాసం లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో ఎన్నికలను ఎదుర్కొన్ని మరోసారి అంతటి ఘోర పరాజయాన్ని తట్టుకోడానికి చంద్రబాబు సాహసించలేకపోయారు. ఇప్పటికే తన నాయకత్వంపై పార్టీలో అంతర్గతంగా అసంతృప్తి రగులుతోందని ఆయన గుర్తించారు. తన తనయుడు లోకేశ్‌ను పార్టీ నేతలే కాదు, కార్యకర్తలు కూడా పట్టించుకోవడం లేదన్నదీ ఆయనకు తెలుసు. మరో వైపు జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి రావాలని కుప్పంలోనే కార్యకర్తలు చంద్రబాబు ఎదుటే డిమాండ్ చేశారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి రావాల్సిన ఆవశ్యకత ఉందని పార్టీ వేదికపైనే ప్రకటించారు. ఈ నేపథ్యంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేసి ఘోర పరాజయం మూటగట్టుకుంటే, పార్టీ నేతలు బహిరంగంగానే తన నాయకత్వంపై తిరుగుబాటు బావుటా ఎగుర వేస్తారని గుర్తించారు. అందుకే అసలు ఎన్నికల్లోనే పోటీ చేయకూడదని చంద్రబాబు నిర్ణయించారు. చారిత్రక తప్పిదం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేయకూడదన్న నిర్ణయంతో చంద్రబాబు రాష్ట్ర రాజకీయ రణ క్షేత్రం నుంచి టీడీపీ జెండాను దాదాపు ఎత్తేసినట్టేనని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారానే ఏ పార్టీ అయినా తమ కార్యకర్తలను కాపాడుకోగలదు. అందుకే గెలుపోటములతో నిమిత్తం లేకుండా పార్టీలు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేస్తుంటాయి. అందుకు భిన్నంగా చంద్రబాబు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించడం టీడీపీకి రాజకీయంగా ఆత్మహత్యా సదృశ్యమేనని, చారిత్రక తప్పిదమని విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు. అసలు ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేసి, పార్టీని అధికారంలోకి తెచ్చిన చరిత్ర చంద్రబాబుకు లేనేలేదని వారు గుర్తు చేస్తున్నారు. పోరాడింది ఎప్పుడు? ► 1995లో ఎన్టీరామారావును కుట్రతో తొలగించి చంద్రబాబు సీఎం అయ్యారు. ఆ తర్వాత చంద్రబాబు సీఎంగా ఉండగా జరిగిన 1996, 1998 లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ రాష్ట్రంలో రెండో స్థానానికే పరిమితమైంది. దాంతో బీజేపీతో పొత్తుపెట్టుకుని చంద్రబాబు 1999 ఎన్నికల్లో గట్టెక్కారు. ► 1998 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో 18 శాతం ఓట్లు సాధించి, నాలుగు ఎంపీ స్థానాలు గెలుచుకుంది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం 1998–99 మధ్య అణు పరీక్షలు నిర్వహించడం, కార్గిల్ యుద్ధంలో విజయం, ఒక్క ఓటు తేడాతో వాజ్‌పేయి పదవి కోల్పోవడం తదితర పరిణామాలతో అప్పటి ప్రధాని వాజ్‌పేయి ఇమేజ్ ఆకాశాన్ని అంటింది. దీన్ని గుర్తించిన చంద్రబాబు రాజకీయంగా సొమ్ము చేసుకునేందుకు 1999 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు. ► 2004 ఎన్నికల్లో ఓడిన చంద్రబాబు 2009 వరకు ప్రతిపక్ష నేతగా విఫలమయ్యారు. 2009లో మహా కూటమితో జట్టుకట్టినా సరే పార్టీని గెలిపించలేకపోయారు. ► రాష్ట్ర విభజన పరిస్థితుల నేపథ్యంలో జరిగిన 2014 ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా నరేంద్ర మోదీ అనుకూల పరిస్థితిని గమనించిన చంద్రబాబు.. బీజేపీ, జనసేనలతో పొత్తు పెట్టుకున్నారు. దీనికి తోడు అమలు సాధ్యం కాని హామీలతో ప్రజల్ని మోసగించడంతో అతికొద్ది శాతం ఓట్ల మెజార్టీతో టీడీపీ అధికారంలోకి వచ్చింది. అంతేగానీ ప్రతిపక్ష నేతగా పోరాడి ప్రజల ఆదరణ పొంది పార్టీని గెలిపించిన చరిత్ర చంద్రబాబుకు లేనే లేదు. చంద్రబాబుపై భగ్గుమన్న టీడీపీ నేతలు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేయకూడదన్న చంద్రబాబు నిర్ణయం టీడీపీలో ముసలం పుట్టించింది. చంద్రబాబు నిర్ణయంపై ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు తీవ్రంగా మండిపడుతున్నారు. అధినేతపై తిరుగుబాటుకు శుక్రవారం నిర్వహించిన టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశమే వేదిక కావడం గమనార్హం. ఎన్నికల్లో పోటీ చేయకూడదనే చంద్రబాబు నిర్ణయానికి ఆమోద ముద్ర వేయడమే ప్రధాన అజెండాగా ఈ సమావేశాన్ని నిర్వహించగా, అది కాస్త బూమరాంగ్ అయ్యింది. సాధారణంగా పార్టీ అధిష్టానం నిర్ణయాలపై బహిరంగంగా స్పందించని సీనియర్ నేత అశోక్ గజపతిరాజు తన అసంతృప్తిని కుండబద్దలు కొట్టారు. ఆయన ఏకంగా పోలిట్ బ్యూరో సమావేశానికి హాజరు కాకుండా తన అసమ్మతిని వెల్లడించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేయకూడదన్న చంద్రబాబు నిర్ణయం రాజకీయ తప్పిదమని ఆయన పార్టీ నేతల వద్ద వ్యాఖ్యానించారు. జిల్లా పార్టీ నాయకత్వాలు, నామినేషన్లు వేసిన అభ్యర్థులతో చర్చించకుండా ఈ నిర్ణయం ఏమిటన్న ఆయన ప్రశ్నకు టీడీపీ అధిష్టానం వద్ద సమాధానమే లేకుండా పోయింది. పార్టీ క్యాడర్‌ను ఇతర పార్టీలకు అప్పగిస్తారా.. మరోవైపు విజయనగరం జిల్లాలో తమ అభ్యర్థులు పోటీ చేస్తారని అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి గజపతి రాజు ప్రకటించడం టీడీపీలో కలకలం రేపుతోంది. చంద్రబాబు వైఖరిపై తీవ్ర నిరసనగా సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ పార్టీ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. మిగిలి ఉన్న కాస్తో కూస్తో పార్టీ క్యాడర్‌ను చంద్రబాబే చేజేతులా ఇతర పార్టీలకు అప్పగించేసినట్టు అయ్యిందని ఉత్తరాంధ్రలో పార్టీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించినట్టు సమాచారం. ఇక ప్రజా పోరాటాలు చేయమని కార్యకర్తలకు చెప్పే నైతిక హక్కును పార్టీ కోల్పోయిందని రాయలసీమకు చెందిన మాజీ మంత్రి ఒకరు అసంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో పార్టీ ఉనికి కాపాడుకోడానికి నానా పాట్లు పడుతున్న తమ కుటుంబం ఇక కాడి వదిలేయాల్సిందేనని టీడీపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కింజరాపు కుటుంబ సభ్యులే నిర్వేదం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. 40 ఏళ్లలో ఒక్క ఎన్నికల్లో కూడా పోటీ చేయకుండా ఉన్న చరిత్ర టీడీపీకి లేదని.. చంద్రబాబు తొలిసారి ఆ దురవస్థ పార్టీకి తీసుకు వచ్చారని ఉభయ గోదావరి జిల్లాల నేతలు మండి పడుతున్నారు. మీకేమో కానీ.. పరిషత్ ఎన్నికలు మాకు ముఖ్యం ఎన్నికల బహిష్కరణ నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతున్న మండల స్థాయి నేతలు, కార్యకర్తలు చంద్రబాబుపై ఆగ్రహావేశాలు వెళ్లగక్కుతున్నారు. ‘ఈ లెక్కన చంద్రబాబునో ఆయన కొడుకు లోకేశ్‌నో ముఖ్యమంత్రిని చేసేందుకు అవసరమైన ఎమ్మెల్యే ఎన్నికల్లో పార్టీ పోటీ చేస్తుంది. కానీ మేము జెడ్పీటీసీ సభ్యుడో, ఎంపీటీసీ సభ్యుడో అయ్యే అవకాశం ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం పార్టీ పోటీ చేయదా?’ అని స్థానిక నేతలు తమ నియోకజవర్గ ఇన్‌చార్జ్‌లను నిలదీస్తున్నారు. ‘ఎమ్మెల్యే ఎన్నికలు చంద్రబాబు కుటుంబానికి ఎంత ముఖ్యమో.. పరిషత్ ఎన్నికలు మాకూ అంతే ముఖ్యం. మా రాజకీయ ఉనికికి సంబంధించిన ఎన్నికలను చంద్రబాబు పట్టించుకోనప్పుడు ఇక ఆయనకు పదవులు తెప్పించడానికి అసెంబ్లీ ఎన్నికల కోసం మేమెందుకు పని చేస్తాం? ఇక టీడీపీ జెండాను వదిలేస్తున్నాం. మా దారి మేము చూసుకుంటాం’ అని వారు తేల్చి చెబుతున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేయకూడదన్న నిర్ణయంతో టీడీపీలో పుట్టిన ముసలం ఆ పార్టీ పుట్టి ముంచడం ఖాయమని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. ఇదో నాటకం! పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని చంద్రబాబు ప్రకటించినంత మాత్రాన పోలింగ్ రోజున టీడీపీ అభ్యర్థులు బరిలో ఉండకుండా పోరు. బ్యాలెట్ పేపర్లలో ఎక్కడికక్కడ ఆ పార్టీ అభ్యర్థుల పేరు, పార్టీ గుర్తు ఉంటుంది. స్వల్ప సంఖ్యలో అయినా ఓట్లు పడతాయి. టీడీపీకి ఇంత తక్కువ ఓట్లు వచ్చాయని ఎవరైనా అంటే.. తాము ఎన్నికలను బహిష్కరించినందు వల్లే ఇలా వచ్చాయని చెప్పుకోడానికి ఒక సాకు దొరుకుతుందనే బాబు ఈ నిర్ణయం తీసుకున్నారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. -
టీడీపీలో కల్లోలం: జ్యోతుల నెహ్రూ, అశోక్ గజపతి అసంతృప్తి
సాక్షి, హైదరాబాద్: పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన కొన్ని గంటలకే పార్టీకి ఊహించని షాక్ తగిలింది. చంద్రబాబు నిర్ణయాన్ని పార్టీలోని సీనియర్ నాయకులు వ్యతిరేకించారు. అసంతృప్తి వెళ్లగక్కారు. ఈ నేపథ్యంలో జ్యోతుల నెహ్రూ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆయన చంద్రబాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రకటించిన నిర్ణయానికి వ్యతిరేకంగా జ్యోతుల నెహ్రూ గళం విప్పారు. చంద్రబాబు నిర్ణయం నిరాశకు గురిచేసిందని పేర్కొన్నారు. పార్టీ నిర్ణయంతో విభేదిస్తున్నట్లు ప్రకటించారు. చంద్రబాబు నిర్ణయంపై మరో సీనియర్ నేత అశోక్ గజపతి రాజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేడర్ అభిప్రాయాలు చంద్రబాబుకు పట్టవా? అంటూ అసహనం వ్యక్తం చేశారు. నిజమైన కార్యకర్తలకు పార్టీలో న్యాయం జరగడం లేదని అన్నారు. చదవండి: ఓటమి భయంతోనే బాబు ఎన్నికల బహిష్కరణ -
‘ఓటమి భయంతోనే బాబు ఎన్నికల బహిష్కరణ’
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ పుట్టగతులు లేకుండా పోయిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీడీపీ జ్యోతిని ఆర్పేందుకు చంద్రబాబు కంకణం కట్టుకున్నారని చెప్పారు. ఓటమి భయంతోనే చంద్రబాబు ఎన్నికలను బహిష్కరించారని పేర్కొన్నారు. ఓటమికి భయపడేవాడు రాజకీయ నాయకుడు కాదని అన్నారు. ఆగిపోయిన ఎన్నికల ప్రక్రియను.. ప్రారంభిస్తే తప్పేంటని అంబటి రాంబాబు ప్రశ్నించారు. నిమ్మగడ్డ ఏకపక్షంగా ఎన్నికలు వాయిదా వేసినప్పుడు ఎందుకు అడగలేదని నిలదీశారు. చంద్రబాబు ఏనాడూ ఒంటరిగా అధికారంలోకి రాలేదని గుర్తుచేశారు. రేపు అసెంబ్లీ, పార్లమెంట్‌కు కూడా అభ్యర్థులు దొరకరని చంద్రబాబు త్వరలో పార్టీని కూడా రద్దు చేస్తారని ఎద్దేవా చేశారు. నువ్వు రాజకీయ నాయకుడివి కాదు.. పిరికివాడివి అంటూ మండిపడ్డారు. తిరుపతిలో కూడా పోటీ విరమించుకుంటారా అని ప్రశ్నించారు. వెన్నుపోటు ద్వారా రాజ్యాధికారం సాధించారు.. ఎన్నికలకు వెళ్లినా.. గెలిచేటట్టు లేదు చంద్రబాబుకు తెలిసే ఈ బహిష్కరణ నిర్ణయం తీసుకున్నారు అని అంబటి రాంబాబు అన్నారు. -
ఏపీ: రాజకీయ పార్టీలతో ఎస్ఈసీ సమావేశం
సాక్షి, విజయవాడ: రాజకీయ పార్టీలతో ఎస్ఈసీ నీలం సాహ్ని శుక్రవారం సమావేశం నిర్వహించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో పార్టీల సహకారంపై చర్చించారు. పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ నేతల అభిప్రాయాలను ఎస్ఈసీ తీసుకున్నారు. ఎన్నికల నిబంధనలు, ప్రచార నిబంధనలపై పార్టీలకు సూచనలిచ్చారు. సమావేశానికి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్‌వలీ, సీపీఎం నేత వైవీరావు హాజరయ్యారు. సమావేశానికి టీడీపీ, బీజేపీ, జనసేన హాజరుకాలేదు. ఎన్నికలు ఆపేందుకు కారణాలు కనిపించలేదు: ఎస్ఈసీ సమావేశం అనంతరం ఎస్ఈసీ నీలం సాహ్ని మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల నిర్వహణపై నిన్న నోటిఫికేషన్ జారీ చేశామన్నారు. నేడు నిర్వహించిన సమావేశంలో పార్టీల నేతల అభిప్రాయాలు తెలుసుకున్నామన్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్ ఉన్నందున ఎన్నికలు త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం కోరిందని తెలిపారు. గతేడాది మార్చిలో నిలిచిపోయిన దగ్గర నుంచి ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ నెల 8న పోలింగ్, 9న రిజర్వ్‌డే, 10న కౌంటింగ్ నిర్వహిస్తామని ఎస్ఈసీ వెల్లడించారు. నిన్నటి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందన్నారు. ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే మధ్యలో ఉందని.. గతంలోనే అభ్యర్థుల జాబితా పూర్తైందని పేర్కొన్నారు. ఎన్నికలు ఆపేందుకు కారణాలు కనిపించలేదన్నారు. కోర్టుల నుంచి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయకూడదని ఎక్కడా అభ్యంతరాలు లేవని తెలిపారు. ఫిర్యాదుల స్వీకరణకు ఎస్ఈసీ కార్యాలయంలో ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల నిర్వహణకు సహకరించాలని పార్టీలను కోరామని ఎస్ఈసీ పేర్కొన్నారు. ఎన్నికలు ఆలస్యమైతే వ్యాక్సినేషన్‌పై ప్రభావం పడుతుందని ఎస్ఈసీ నీలం సాహ్ని తెలిపారు. బహిష్కరించాల్సిన అవసరం ఏమొచ్చింది: లేళ్ల అప్పిరెడ్డి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ, పరిషత్ ఎన్నికల నిర్వహణకు సహకరిస్తామని ఎస్ఈసీకి చెప్పామని తెలిపారు. టీడీపీ, బీజేపీ, జనసేన హాజరుకాకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రతిపక్షానికి కావాల్సిన వ్యక్తి పదవిలో లేనప్పుడు సమావేశానికి హాజరుకారా? అని ఆయన ప్రశ్నించారు. సమావేశాన్ని బహిష్కరించాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగబోతున్నాయి. తమకు ఎన్నికలు ముఖ్యం కాదు.. ప్రజలే ముఖ్యమని లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. ఎన్నికల నిర్వహణపై గిరిజాశంకర్ సమీక్ష ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజాశంకర్ సమీక్ష నిర్వహించారు. అన్ని జెడ్పీ సీఈఓలు, డీపీఓలు, జిల్లా ప్రత్యేక అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఎన్నికల నిర్వహణపై మార్గదర్శకాలను వివరించారు. చదవండి: ఆగిన చోట నుంచే ఆరంభం: ఎస్ఈసీ నీలం సాహ్ని పరువు కోల్పోయేకంటే ఇదే బెటర్.. -
ఎన్నికల ప్రారంభం ప్రక్రియల్లో నీలం సాహ్ని
-
పరువు కోల్పోయేకంటే ఇదే బెటర్..
సాక్షి, అమరావతి: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్ని బహిష్కరించాలని తెలుగుదేశం పార్టీ యోచిస్తోంది. పంచాయతీ, మునిసిపల్ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన నేపథ్యంలో ఈ ఎన్నికల్లోనూ అవే ఫలితాలు పునరావృతమవుతాయని ఆ పార్టీ నేతలు ఒక నిర్ణయానికి వచ్చారు. అలాంటప్పుడు పోటీ చేసి పరువు పోగొట్టుకుని బాధపడడం కంటే, ఎదో ఒక వంకతో పోటీలో లేకుండా పక్కకు తప్పుకుంటే మంచిదని ఎక్కువ మంది నేతలు భావిస్తున్నారు. ఎన్నికలకు మళ్లీ కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని ఇప్పటికే టీడీపీ నేత వర్ల రామయ్యతో కొత్త ఎస్ఈసీ నీలం సాహ్నికి ఫిర్యాదు చేయించారు. గతంలో ఎన్నికల ప్రక్రియ ఎక్కడ ఆగిందో.. అక్కడి నుంచే మిగిలిన ప్రక్రియ కొనసాగుతుందని ఎస్ఈసీ నోటిఫికేషన్ ఇవ్వడంతో ఇక పోటీలో ఉంటే పరువు పోవడం ఖాయమని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో దౌర్జన్యాలు జరిగాయనే సాకు చూపి పోటీ నుంచి తప్పుకోవాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. శుక్రవారం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం జరిపి చంద్రబాబు అందులో ఈ నిర్ణయం ప్రకటిస్తారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. చదవండి: సీఎం జగన్ చిత్రపటానికి తెలంగాణ ఉద్యోగుల క్షీరాభిషేకం అమానుషం: ఒకే ఆటోలో వచ్చారని.. -
ఏపీ: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 8న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పోలింగ్ నిర్వహించనున్నారు. 10న ఫలితాలు ప్రకటించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అవసరమైనచోట్ల ఈనెల 9న రీపోలింగ్ నిర్వహించనున్నారు. గత ఏడాది మార్చి 14న ఎన్నికల ప్రక్రియ నిలిచిన చోట నుంచే ప్రక్రియ కొనసాగనుంది. 513 జెడ్పీటీసీ స్థానాలకు, 7230 ఎంపీటీసీ స్థానాలకు నేడు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. జెడ్పీటీసీ ఎన్నికల్లో 2,092 మంది అభ్యర్థులు, ఎంపీటీసీ ఎన్నికల్లో 19,002 మంది అభ్యర్థులు బరిలో నిలవనున్నారు. 126 జెడ్పీటీసీ స్థానాలు, 2371 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. చదవండి: పీఆర్సీపై ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు తెలుగు రాష్ట్రాల్లో కలకలం: ఎన్ఐఏ సోదాలు -
కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్
సాక్షి, అమరావతి: కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్ఈసీ నీలం సాహ్ని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కొనసాగింపుపై ఎస్ఈసీ కసరత్తు చేస్తున్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనీల్ కుమార్ సింఘాల్, వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్, అదనపు డీజీలు డాక్టర్ రవిశంకర్ అయ్యన్నార్, సంజయ్, ఎన్నికల కమిషన్ కార్యదర్శి కన్నబాబు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్‌గా గురువారం ఉదయం బాధ్యతలు స్వీకరించిన నీలం సాహ్ని.. అనంతరం గవర్నర్ బిశ్వభూషణ్‌ను కలిశారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియపై గవర్నర్‌తో చర్చించారు. ఎస్ఈసీ నీలం సాహ్నిని చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ కలిశారు. మిగిలిన ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీతో సీఎస్ చర్చలు జరిపారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్‌పై ఎస్ఈసీ, సీఎస్ చర్చించారు. ఎన్నికల ప్రక్రియను సత్వరం పూర్తిచేయాలని ఎస్ఈసీని సీఎస్ కోరారు. రేపు(శుక్రవారం) రాజకీయ పార్టీల నేతలతో ఎస్ఈసీ సమావేశం నిర్వహించనున్నారు. -
ఏపీ: గవర్నర్‌ను కలిసిన ఎస్ఈసీ నీలం సాహ్ని
సాక్షి, అమరావతి: గవర్నర్ బిశ్వభూషణ్‌ను ఎస్ఈసీ నీలం సాహ్ని గురువారం కలిశారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియపై గవర్నర్‌తో చర్చించారు. కాగా, ఎస్ఈసీ నీలం సాహ్నిని చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ కలిశారు. మిగిలిన ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీతో సీఎస్ చర్చలు జరిపారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్‌పై ఎస్ఈసీ, సీఎస్ చర్చించారు. ఎన్నికల ప్రక్రియను సత్వరం పూర్తిచేయాలని ఎస్ఈసీని సీఎస్ కోరారు. ఎన్నికలు పూర్తయితే వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాల్సి ఉందని సీఎస్ తెలిపారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ తేదీలపై చర్చించారు. సాయంత్రం ఎన్నికల ప్రక్రియపై ఎస్ఈసీ ప్రకటన చేసే అవకాశం ఉంది. గత ఏడాది జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తి అయ్యింది. కేవలం 6 రోజుల ఎన్నికల ప్రక్రియ మిగిలి ఉంది. వ్యాక్సినేషన్‌కు ఇబ్బంది కాకుండా ఎన్నికలు పూర్తిచేసే యోచనలో ప్రభుత్వం ఉంది. చదవండి: ఏపీ: ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్ని ఉద్యోగం పోయే చివరిరోజు శ్రీరంగనీతులా? -
టీకా ప్రక్రియపై ఎన్నికల ప్రభావం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రకియ అర్ధంతరంగా నిలిచిపోవడంతో కోవిడ్ వ్యాక్సినేషన్‌పై తీవ్ర ప్రభావం పడింది. 60 ఏళ్లు పైబడిన వారికి, వివిధ రకాల జబ్బులు గల 45 నుంచి 60 ఏళ్ల లోపు వారికి వేగంగా కోవిడ్ టీకా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ ముగియక పోవడంతో ఈ కార్యక్రమం మందకొడిగా కొనసాగుతోంది. రాష్ట్రంలో 60 ఏళ్లు దాటిన వారు 52,52,042 మంది ఉన్నారని ప్రభుత్వం గుర్తించింది. వీరిలో ఈ నెల 22వ తేదీ వరకు 5.11 లక్షల మందికి మాత్రమే కోవిడ్–19 టీకా వేయగలిగారు. రాష్ట్రంలో డయాబెటిస్, హైపర్ టెన్షన్, క్యాన్సర్, ఊపిరితిత్తుల జబ్బులు గల 45 – 60 ఏళ్ల మధ్య ఉన్న 6,31,299 మందికి కూడా టీకా వేయాలని ప్రభుత్వం గుర్తించింది. ఈ నెల 22 వరకు వీరిలో 2.19 లక్షల మందికి మాత్రమే టీకా వేయగలిగారు. మునిసిపల్ ఎన్నికలు ముగియడంతో పట్టణాల్లో సోమవారం నుంచి ముమ్మరంగా టీకా వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. కొత్త ఎన్నికల కమిషనర్ బాధ్యతలు చేపట్టగానే మిగిలిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయించి, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ముమ్మరంగా వ్యాక్సినేషన్ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. -
ఎన్నికలకు టైం లేదు!
సాక్షి, అమరావతి: తన హయాంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను జరిపే పరిస్థితి లేదని, కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా దీనికి కారణమని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించారు. ఈ నెలాఖరుతో పదవీ విరమణ చేయనున్న తనకు ఈ ఎన్నికలు నిర్వహించేందుకు తగినంత సమయం లేదన్నారు. ఈ మేరకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేరుతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాది క్రితం స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసినప్పుడు సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు ప్రకారం.. తిరిగి ఎన్నికలు నిర్వహించేటప్పుడు ప్రభుత్వంతో సంప్రదింపుల తర్వాతే కొత్త తేదీలను ఖరారు చేయాలని, పోలింగ్ తేదీకి నాలుగు వారాల ముందు నుంచి ఎన్నికల కోడ్ అమలు చేయాలని సూచించిందని నిమ్మగడ్డ అందులో పేర్కొన్నారు. ఎన్నికలకు నాలుగు వారాల ముందు కోడ్ అమలు చేయడం ద్వారా పంచాయతీ, మునిసిపల్ ఎన్నికలను నిర్వహించానని, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల విషయంలోనూ ఇదే విధానం అమలు చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆ బాధ్యత తదుపరి ఎస్ఈసీదే నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్ అమలు చేయాల్సి ఉండటం, పోలింగ్ సిబ్బందిని కోవిడ్ వారియర్స్‌గా గుర్తించి వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించడం, మరోవైపు తన పదవీ కాలం ఈ నెలాఖరు (మార్చి 31వ తేదీ)తో ముగుస్తున్న కారణంగా వాయిదా పడిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను తిరిగి నిర్వహించేందుకు షెడ్యూల్ ప్రకటించలేకపోతున్నట్లు నిమ్మగడ్డ పేర్కొన్నారు. తన తదుపరి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టేవారు ఈ ఎన్నికల నిర్వహణ బాధ్యత తీసుకుంటారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నిన్న అలా.. నేడు ఇలా దాదాపు నెలన్నర క్రితం కరోనా వ్యాక్సినేషన్ పూర్తయ్యేవరకైనా స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కోరినా నిమ్మగడ్డ నిరాకరించారు. ఎన్ని అవాంతరాలు తలెత్తినా తక్షణమే ఎన్నికలు నిర్వహించాల్సిందేనంటూ మొదట గ్రామ పంచాయతీ ఎన్నికలను నిమ్మగడ్డ ప్రారంభించిన విషయం తెలిసిందే. కరోనా వ్యాక్సినేషన్ పెద్ద ఎత్తున సాగుతున్న సమయంలో అలా మొండిగా వ్యవహరించిన నిమ్మగడ్డ ఇప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించలేకపోవడానికి అదే వ్యాక్సినేషన్‌ను సాకుగా చూపుతుండటం పట్ల అధికార, రాజకీయ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. -
కరోనా సాకు చెప్పి ఎన్నికలు అడ్డుకుంటున్నారు: సజ్జల
సాక్షి, అమరావతి : కోవిడ్ వ్యాక్సిన్ కోసం ఆనాడు ఎన్నికలు వాయిదా వేయమని కోరితే పట్టించుకోలేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కానీ ఇప్పుడేమో 6 రోజుల్లో పూర్తయ్యే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికకు వ్యాక్సినేషన్ సాకు చెప్పి అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. తాము ఈ 6 రోజుల్లో ఎన్నికలు పూర్తి చేసి కోవిడ్‌పై దృష్టి పెట్టాలనుకుంటున్నట్లు తెలిపారు. రానున్న ఎన్నికల కమిషనర్‌ను కూడా తాము అదే కోరతామని సజ్జల స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతాం కోవిడ్ విషయంలో వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నామని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. రానున్న రోజుల్లో కోటి మందికి వ్యాక్సినేషన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇక ప్రత్యేక హోదా విషయంలో ప్రతిపక్షంలో ఉండగా చాలా పోరాడినమని, ఆనాడు చంద్రబాబు హోదాను తాకట్టు పెట్టి ప్యాకేజీకి ఒప్పుకున్నారని విమర్శలు గుప్పించారు. చంద్రబాబు చేసిన పనికి ఆరోజే హోదా డిమాండ్ సగం చచ్చిపోయిందని దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా కోసం తాము అన్ని విధాలా పోరాడతామని పేర్కొన్నారు. చంద్రబాబులా దొంగాట ఆడకుండా నిరంతర పోరాటం చేస్తూనే ఉంటామని వివరించారు. ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించలేం మరోవైపు రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఇప్పుడు నిర్వహించలేమని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తెలిపారు. తన పదవీకాలం ఈనెల 31తో ముగుస్తుందని, తర్వాత వచ్చే కమిషనర్ ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. చదవండి: వ్యాక్సినేషన్ ప్రక్రియలో వేగం పెంచాలి: సీఎం జగన్ -
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు.. ఎస్ఈసీని ఆదేశించలేం
సాక్షి, అమరావతి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ)కు ఆదేశాలిచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రస్తుతానికి ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని లేదా మూడ్రోజుల పాటు సెలవుపై వెళ్తుండటాన్ని బట్టి ఎన్నికల కమిషనర్ ఎన్నికల బాధ్యతల నుంచి తప్పుకున్నారన్న ప్రాథమిక నిర్ణయానికి రాలేమని హైకోర్టు స్పష్టంచేసింది. అంతేకాక.. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌ను ఈ వ్యాజ్యంలో వ్యక్తిగత ప్రతివాదిగా చేర్చడంతో పాటు ఆయనపై తీవ్రమైన ఆరోపణలు చేశారని, అలాగే దురుద్దేశాలు ఆపాదించినందువల్ల మధ్యంతర ఉత్తర్వులు జారీచేసే ముందు కౌంటర్ దాఖలు చేసేందుకు ఆయనకు అవకాశమివ్వాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు ఆదేశాలు జారీచేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్ ఈ దశలో కోరజాలరని తేల్చిచెప్పింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఎన్నికల కమిషన్, నిమ్మగడ్డ రమేశ్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. కమిషన్ నిర్ణయాలపై న్యాయ సమీక్ష చేయవచ్చు పంచాయతీ, పురపాలక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అఖండ విజయం సాధించడంతో, తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలను కాపాడేందుకు, ఆ పార్టీని మరిన్ని ఇబ్బందుల నుంచి తప్పించేందుకే నిమ్మగడ్డ ఇప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించడం లేదంటూ గుంటూరు జిల్లా పాలపాడుకు చెందిన మెట్టు రామిరెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఎన్నికల నిర్వహించేలా ఎన్నికల కమిషన్‌కు ఆదేశాలిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలని ఆయన అనుబంధ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై గత వారం విచారణ జరిపి నిర్ణయాన్ని వాయిదా వేసిన న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు మంగళవారం తన నిర్ణయాన్ని వెలువరించారు. ఎన్నికల కమిషన్ నిర్ణయాలు న్యాయ సమీక్షకు అతీతమైనవి కావని, వాటిపై సమీక్ష చేయవచ్చునని అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలతో ఈ న్యాయస్థానం ఏకీభవిస్తోందని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. న్యాయ సమీక్ష రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో భాగమని తెలిపారు. నిమ్మగడ్డపై ఆరోపణలు చాలా తీవ్రమైనవి ‘ఇక ఈ వ్యాజ్యంలో చేసిన ఆరోపణల విషయానికొస్తే.. ఈ కోర్టు అభిప్రాయం ప్రకారం అవి చాలా తీవ్రమైనవి. నిమ్మగడ్డ రమేశ్‌ను వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చారు. ఆయనకు పక్షపాతాన్ని ఆపాదించారు. ఈ పక్షపాతానికి కొన్ని ఘటనలను కూడా ఉదహరించారు. అధికార పార్టీపట్ల శత్రుభావంతో వ్యవహరించారని ప్రమాణ పూర్వకంగా ఈ వ్యాజ్యంలో చెప్పారు. నిమ్మగడ్డ రమేశ్ తీరును మోసపూరితంగా, దురుద్దేశపూర్వకంగా, ఏకపక్షంగా, అక్రమాలుగా వర్గీకరించారు. కౌంటర్లు ఆహ్వానించిన తరువాత వీటన్నింటిపై కూడా లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉందన్నది ఈ కోర్టు అభిప్రాయం. ఈ విషయంలో ముఖ్యంగా నిమ్మగడ్డ రమేశ్ నుంచి కౌంటర్ ఆహ్వానించాలి. పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగియడానికి (ఈనెల 18) ముందు ప్రస్తుత పిటిషన్ దాఖలైంది. సాధారణంగా ఓ అధికార వ్యవస్థ తీసుకున్న నిర్ణయం తప్పయితే, తగిన నిర్ణయం తీసుకోవాలని మాత్రమే ఆ వ్యవస్థను ఈ న్యాయస్థానం ఆదేశించగలుగుతుంది. అంతేతప్ప దానిని ఫలానా విధంగా చేసి తీరాలని ఆదేశించలేదు. ప్రస్తుత కేసులో నిమ్మగడ్డ రమేశ్‌పై తీవ్రమైన ఆరోణలున్న నేపథ్యంలో కౌంటర్ దాఖలు చేసేందుకు ఆయనకు అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు కోరే హక్కు పిటిషనర్‌కు లేదు’.. అని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
పోలింగ్‌కు ముందే పోటీలో ఉన్న 100 మంది మృతి
సాక్షి, అమరావతి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థుల్లో సరిగ్గా వంద మంది పోలింగ్ జరగడానికి ముందే చనిపోయినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్, పంచాయతీరాజ్ శాఖల పరిశీలనలో వెల్లడైంది. మృతుల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన వారు సైతం కొందరు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గత ఏడాది మార్చి నెలలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన విషయం తెలిసిందే. నామినేషన్ల ఉపసంహరణ కూడా పూర్తయ్యాక, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ కరోనా పేరుతో ఎన్నికలను వాయిదా వేసిన విషయం కూడా తెలిసిందే. ఇటీవలే గ్రామ పంచాయతీ, మునిసిపల్ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో.. అప్పట్లో వాయిదా పడిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాల్సి వచ్చినా సన్నద్ధంగా ఉండేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్, పంచాయతీరాజ్ శాఖ అధికారులు ముందస్తు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో అప్పట్లో పోటీలో ఉన్న అభ్యర్థుల స్థితిగతులపై అధికారులు వాకబు చేసినట్టు తెలిసింది. 2020 మార్చి 15న ఎన్నికలు వాయిదా పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి 87 మంది, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి 13 మంది చనిపోయారని నిర్ధారించారు. మృతుల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన 8 మంది ఎంపీటీసీ సభ్యులు రాష్ట్రంలో 10,047 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, అందులో 9,692 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అప్పట్లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నోటిఫికేషన్ జారీ చేశారు. అందులో 2,371 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 7,321 స్థానాల్లో పోటీ జరుగుతుండగా, 19,000 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఏకగ్రీవంగా ఎన్నికైన 2371 మందిలో చిత్తూరులో ఐదుగురు.. విజయనగరం, అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్కొక్కరి చొప్పున 8 మంది చనిపోయారు. ఎన్నికలు జరగాల్సి ఉన్న మిగిలిన 7,321 ఎంపీటీసీ స్థానాల్లో పోటీలో ఉన్న 19 వేల మందిలో 79 మంది చనిపోగా, వీరిలో అత్యధికులు వివిధ రాజకీయ పార్టీల తరుఫున పోటీలో ఉన్న వారే కావడం గమనార్హం. ఐదుగురు మాత్రమే స్వతంత్ర అభ్యర్థులు. ఏకగ్రీవంగా నెగ్గిన జెడ్పీటీసీ సభ్యుడొకరు.. రాష్ట్ర వ్యాప్తంగా 660 జెడ్పీటీసీ స్థానాలకు గాను అప్పట్లో 8 చోట్ల ఎన్నికలు వాయిదా పడగా, మిగిలిన 652 చోట్ల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేశారు. అందులో 126 జెడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఇందులో కర్నూలు జిల్లాలో ఏకగ్రీవంగా గెలిచిన వైఎస్సార్సీపీ అభ్యర్థి ఒకరు మృతి చెందారు. ఏకగ్రీవంగా ముగిసినవి పోను 526 స్థానాల్లో ఎన్నికలు జరుగుతుండగా, 2,092 మంది పోటీలో ఉన్నారు. వీరిలో చనిపోయిన 12 మందిలో (ఏకగ్రీవమై చనిపోయిన వ్యక్తి కాకుండా) 11 మంది వివిధ రాజకీయ పార్టీల తరుఫున పోటీలో ఉన్న వారు. ఆ స్థానాల్లో మళ్లీ నామినేషన్‌కు వీలు! అభ్యర్థులు చనిపోయిన చోట తిరిగి ఎన్నికల నిర్వహణ ప్రక్రియ ప్రారంభించేందుకు ఎస్ఈసీ అవకాశం ఇచ్చే వీలుందని అధికార వర్గాలు వెల్లడించాయి. రాజకీయ పార్టీలకు మాత్రమే ఆయా చోట్ల కొత్త అభ్యర్థులను బరిలో నిలిపేందుకు అవకాశం కల్పిస్తుందని చెబుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ సంప్రదాయం అమలు చేసిందని వారు గుర్తు చేస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థులు చనిపోయిన చోట మాత్రం ఈ అవకాశం ఉండని చెబుతున్నారు. అయితే ఏకగ్రీవంగా ఎన్నికైన వారు చనిపోతే ఎలా వ్యవహరించాలన్న దానిపై తగిన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఎస్ఈసీ వర్గాలు తెలిపాయి. -
మీ అధికారాలకు పరిమితులు లేవా?
సాక్షి, అమరావతి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై హైకోర్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను శనివారం గట్టిగా నిలదీసింది. ఒక 2 నెలల తర్వాత ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామంటే ఎలా? అని ఆయనను ప్రశ్నించింది. కోర్టులు అధికార రహితమని భావిస్తున్నారా? అని నిలదీసింది. ఎన్నికల కమిషనర్ తనకున్న విచక్షణాధికారాలను ఎలా ఉపయోగించాలో అలానే ఉపయోగించాలని స్పష్టం చేసింది. వాటికి పరిమితులు లేవని అనుకుంటున్నారా? అని ప్రశ్నించింది. ఆ విచక్షణాధికారాలు న్యాయ సమీక్షకు లోబడి ఉండవా? అంటూ నిలదీసింది. ఈ మేరకు ఎన్నికల నిర్వహణపై మధ్యంతర ఉత్తర్వుల జారీ విషయంలో నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు ప్రకటించారు. పంచాయతీ, పురపాలక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అఖండ విజయం సాధించడంతో టీడీపీ ప్రయోజనాలను కాపాడేందుకే నిమ్మగడ్డ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించడం లేదని గుంటూరు జిల్లా పాలపాడుకు చెందిన మెట్టు రామిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ మరోసారి న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు ముందుకు విచారణకొచ్చింది. నిమ్మగడ్డ కోర్టుకు బాధ్యత వహించాల్సిందే.. ముందుగా నిమ్మగడ్డ తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీకుమార్ వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల కమిషనర్ ప్రతి నిర్ణయాన్ని న్యాయస్థానం ప్రశ్నించజాలదని, పరీక్షించజాలదని తెలిపారు. పరీక్షించడమంటే ఎన్నికల కమిషన్ స్వతంత్రతలో జోక్యం చేసుకోవడమేనన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. వీటిని ఎప్పుడు నిర్వహించాలో నిర్ణయించే అధికారం కమిషన్‌కు ఉందన్నారు. నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాల్ చేయడానికి వీల్లేదన్నారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వీఆర్ఎన్ ప్రశాంత్ వాదనలు వినిపిస్తూ.. ఏ దశలో అయితే పరిషత్ ఎన్నికలు నిలిచిపోయాయో అక్కడి నుంచే నిర్వహించాల్సిన బాధ్యత కమిషన్‌పై ఉందన్నారు. గ్రామ పంచాయతీ, పురపాలక ఎన్నికలు పూర్తి కాగానే పరిషత్ ఎన్నికలను కూడా నిర్వహిస్తామని నిమ్మగడ్డ తెలిపారని వివరించారు. ఆయన కోర్టుకు బాధ్యత వహించాల్సిందేనని తెలిపారు. మరో 11 రోజులు మాత్రమే నిమ్మగడ్డ పదవిలో ఉంటారని, పరిషత్ ఎన్నికల పూర్తికి 6 రోజులు సరిపోతాయని, ఇప్పుడు ఆయన సెలవుపై వెళుతూ తనను ఏ రకంగానూ ప్రశ్నించకూడదనడం ఆయన తీరుకు నిదర్శనమన్నారు. ఎన్నికలు నిర్వహించేలా కమిషనర్‌ను ఆదేశించాలని కోరారు. న్యాయ సమీక్షకు ఎన్నికల కమిషనర్ అతీతుడేమీ కాదు.. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి మరో రాజ్యాంగ వ్యవస్థ పట్ల బాధ్యతారాహిత్యంతో, నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించడానికి వీల్లేదన్నారు. కేంద్ర హోంశాఖకు నిమ్మగడ్డ రాసిన లేఖ ఓ రాజకీయ పార్టీ కార్యాలయంలో తయారైందని, దీనిపై విచారణ కూడా జరుగుతోందన్నారు. కోర్టు ప్రశ్నించడం తన స్వతంత్రతలో జోక్యం చేసుకోవడమేనని ఆయన చెప్పడం సరికాదన్నారు. ఎన్నికల కమిషనర్ న్యాయ సమీక్షకు అతీతుడు కారని తెలిపారు. అతీతుడిని అని చెప్పడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. అందరి వాదనలు విన్న కోర్టు తన నిర్ణయాన్ని వాయిదా వేసింది. -
పరిషత్ ఎన్నికల నిర్వహణకు ఆదేశాలివ్వండి
సాక్షి, అమరావతి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పంచాయతీ, పురపాలక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అఖండ విజయం సాధించడంతో, టీడీపీ ప్రయోజనాలను కాపాడేందుకు, ఆ పార్టీని ఇబ్బందుల నుంచి తప్పించేందుకు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించడం లేదంటూ గుంటూరు జిల్లా పాలపాడుకు చెందిన మెట్టు రామిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు నిర్వహించకపోవడం రాజ్యాంగ, చట్ట విరుద్ధంగా ప్రకటించాలని, ఏ దశలో ఎన్నికలు ఆగిపోయాయో అక్కడి నుంచి కొనసాగించేలా ఆదేశాలివ్వాలని కోర్టును కోరారు. ఇందులో ఎన్నికల కమిషన్ కార్యదర్శి, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు గురువారం విచారణ జరిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వీఆర్ఎన్ ప్రశాంత్ వాదనలు వినిపిస్తూ.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ నిమిత్తం ఎన్నికల కమిషన్ గత ఏడాది మార్చి 15న నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. దీని ప్రకారం చాలాచోట్ల ఏకగ్రీవాలు కూడా జరిగాయని వివరించారు. కరోనా నేపథ్యంలో ఎన్నికలు వాయిదా పడ్డాయని, కరోనా తగ్గుముఖం పట్టడంతో ఇటీవల తిరిగి ఎన్నికల ప్రక్రియను ప్రారంభించి పంచాయతీ, పురపాలక ఎన్నికలను పూర్తి చేశారని వివరించారు. కేవలం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు మాత్రమే మిగిలి ఉండగా.. ఎన్నికల కమిషనర్ నిర్వహించడం లేదన్నారు. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారని తెలిపారు. అయితే ఎన్నికలు పెట్టకుండా ఎస్ఈసీ ఈ నెల 19 నుంచి 22 వరకు వ్యక్తిగత సెలవుపై వెళుతున్నారని, ఇది రాజ్యాంగ బాధ్యతలను నిర్వర్తించకపోవడమే అవుతుందని వివరించారు. ఎన్నికల ప్రక్రియ మొదలు పెట్టాక దానిని తార్కిక ముగింపునకు తీసుకురావాల్సిన బాధ్యత కమిషనర్‌పై ఉందని వివరించారు. ఎన్నికల కమిషనర్‌గా విధులు నిర్వహించడం కంటే టీడీపీ ప్రయోజనాలను కాపాడేందుకే నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ఎక్కువ ప్రాధాన్యతనిÜ్తున్నారని వివరించారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ, కరోనా సెకండ్ వేవ్ వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. ఈ లోపు ఎన్నికలు పూర్తి చేస్తే, కరోనా వ్యాక్సిన్ కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో చేపట్టే అవకాశం ఉంటుందన్నారు. ఎన్నికల నిర్వహణకు సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలు ఉన్నాయని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. నిలిచిపోయిన ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేందుకు కేవలం 6 రోజులు సరిపోతాయని తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి దీనిపై ఎన్నికల కమిషన్ వివరణ కోరింది. ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీ కుమార్ స్పందిస్తూ.. పూర్తి వివరాల సమర్పణకు గడువు కావాలని కోరారు. ఇందుకు న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు అంగీకరిస్తూ విచారణను ఈ నెల 20కి వాయిదా వేశారు. -
నగరపాలక సంస్థలకు ఇద్దరు డిప్యూటీ మేయర్లు
సాక్షి, అమరావతి: నగరపాలక సంస్థలకు ఇద్దరు డిప్యూటీ మేయర్లు, పురపాలక సంఘాలకు ఇద్దరు వైస్ చైర్మన్లను ఎన్నుకునేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత మేలు చేయాలన్న సంకల్పంతో సీఎం వైఎస్ జగన్ ఈ ఆలోచన చేశారన్నారు. ఇందుకోసం ఒకటి రెండు రోజుల్లో మునిసిపల్, నగర పాలక సంస్థల చట్టానికి సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ తీసుకురాబోతున్నట్టు పెద్దిరెడ్డి చెప్పారు. మంగళవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఈ నెల 18న చైర్మన్లు, మేయర్లు, వైస్ చైర్మన్లు.. డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరుగుతుందన్నారు. ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం పొందిన తర్వాత సప్లిమెంటరీ నోటిఫికేషన్ ద్వారా రెండో వైస్ చైర్మన్, డెప్యూటీ మేయర్ల ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. చైర్మన్లు, మేయర్ల పదవులను రెండున్నరేళ్ల పాటు పంపకాలు చేయబోతున్నారంటూ వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. అలాంటి ఆలోచనేది ప్రభుత్వానికి లేదన్నారు. మునిసిపాలిటీ, నగరపాలక సంస్థల్లో చైర్మన్, మేయర్ బాధ్యతలను ప్రతిరోజు కొంత సమయం ఇద్దరేసి చొప్పున ఉండే వైస్ చైర్మన్లు, డిప్యూటీ మేయర్లు నిర్వర్తించేలా ఏర్పాట్లు చేయబోతున్నట్టు చెప్పారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఎస్ఈసీ పూర్తి చేయాలి కేవలం ఆరు రోజుల ప్రక్రియ మాత్రమే మిగిలి ఉన్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను ఏకగ్రీవాలను రద్దు చేసి మళ్లీ మొదటి నుంచి నిర్వహించాలన్న ఎస్ఈసీ ప్రయత్నాలకు హైకోర్టు చెక్ పెట్టిందన్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియను కూడా ఆయన హయాంలోనే పూర్తి చేయాలని ప్రభుత్వం తరఫున ఎస్ఈసీ నిమ్మగడ్డను కోరుతున్నామన్నారు. ఈ ఎన్నికలు కూడా పూర్తి చేసి ఆయన పదవీ విరమణ చేస్తే బాగుంటుందన్నారు. సాధ్యమైనంత త్వరగా మిగిలిన ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తే యుద్ధప్రాతిపదికన వ్యాక్సినేషన్‌తో పాటు అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభుత్వం దృష్టి పెడుతుందన్నారు. ప్రజల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు లభించిందనే విషయం పంచాయతీ, మున్సిపల్, కార్పొరేషన్ ఫలితాలు అద్దం పడుతున్నాయన్నారు. తిరుపతి ఉప ఎన్నికలో భారీ మెజార్టీతో గెలుస్తాం తిరుపతి లోక్‌సభ స్థానానికి ఏప్రిల్ 17న జరిగే ఉపఎన్నికలో భారీ మెజార్టీతో ఆ స్థానం తిరిగికైవసం చేసుకుంటామని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు. ఏకగ్రీవాలైన పంచాయతీలకు ప్రభుత్వం ప్రకటించిన పారితోషికాలను త్వరలోనే ఆయా పంచాయతీలకు విడుదల చేస్తామన్నారు. చంద్రబాబుపై తమకు ఎలాంటి కక్ష సాధింపు చర్యలు లేవని మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. సీఐడీలో పెండింగ్‌లో ఉన్న కేసులు విచారణలో భాగంగా నోటీసులు ఇచ్చారే తప్ప అందులో కక్ష సాధింపు చర్యలేముంటాయని ప్రశ్నించారు. ఇది పూర్తిగా డిపార్టుమెంటల్ ఎంక్వైరీ మాత్రమేనన్నారు. ఇందులో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. సీఆర్డీఎ పరిధిలో చట్టవిరుద్దంగా అమ్మకాలు, అమరావతి ల్యాండ్ పూలింగ్‌లో బీనామీ లావాదేవీలు జరిగాయని వారే ఒప్పుకున్నారని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబును జైల్లో పెట్టించాలని ప్రభుత్వం చూస్తోందనడంలో వాస్తవం లేదన్నారు. -
ఒకే అభ్యర్థి బరిలో ఉన్నా ‘ఏకగ్రీవం’ వద్దు
సాక్షి, అమరావతి: స్థానిక ఎన్నికలతోపాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఒకే అభ్యర్థి బరిలో ఉన్నచోట ఆ వ్యక్తి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించకుండా, నోటా కింద ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఒకే అభ్యర్థి బరిలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తూ ఫారం 10 జారీచేయాలని చెబుతున్న ఏపీ పంచాయతీ ఎన్నికల నిర్వహణ నిబంధనల్లో రూల్ 16 అమలును, ఏకగ్రీవాలకు ప్రోత్సాహకాలు ప్రకటిస్తూ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో 34 అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ చిత్తూరు పీపుల్స్ యాక్షన్ కమిటీ (సీపీఏసీ) అధ్యక్షుడు ఎ.రాంబాబు, మరొకరు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సోమవారం ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది అన్వేష వాదనలు విన్న ధర్మాసనం, ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 16కి వాయిదా వేసింది. -
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నిమ్మగడ్డ 'వెనకడుగు'
సాక్షి, అమరావతి: ఎన్ని అవాంతరాలు ఎదురైనా పంచాయతీ, మునిసిపల్ ఎన్నికలు జరిపి తీరాల్సిందేనని పట్టు బట్టిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తాజా పరిస్థితుల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు వెనుకడుగు వేస్తున్నారని రాజకీయ పార్టీలు, అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది. మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించేందుకు అనువైన పరిస్థితులు, అవకాశాలు ఉన్నా.. కావాలనే దాట వేస్తున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల కోసం కమిషన్ కార్యాలయంలో డిప్యుటేషన్‌పై నియమించిన అదనపు సిబ్బందిని నిమ్మగడ్డ వారి మాతృశాఖలకు తిరిగి పంపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన తీరు చూస్తుంటే ‘పరిషత్’ ఎన్ని కలు నిర్వహించేందుకు ఆసక్తి చూపడం లేదనే విషయం స్పష్ట మవుతోందని అధికారులు పేర్కొంటున్నారు. ఎన్నికల కమిషన్ కార్యాలయానికి డిప్యుటేషన్‌పై వచ్చిన నలుగురు ఏఎస్వో స్థాయి అధికారులను మునిసిపల్ ఎన్నికల కౌంటింగ్ ముగిసిన వెంటనే మాతృశాఖలకు తిరిగి వెనక్కి వెళ్లేందుకు నిమ్మగడ్డ అనుమతి ఇచ్చారు. సోమవారం మరో నలుగుర్ని వారి పాత విధులకు పంపేందుకు నిమ్మగడ్డ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెలాఖరుకు నిమ్మగడ్డ పదవీ కాలం ముగియనుంది. ఈలోగా ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నా అందుకు ఆయన సుముఖంగా లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. న్యాయపరమైన చిక్కులు లేకున్నా.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు న్యాయపరమైన చిక్కులు, ఇతర సమస్యలు ఏమీలేవు. ఒక ట్రెండు పార్టీలు మాత్రమే పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ రద్దుచేసి, ఎన్నికల ప్రక్రియను మొదటినుంచీ చేపట్టాలని కోరుతూ హైకోర్టుకు వెళ్లాయి. ఆగిపోయిన ఎన్నికలను రద్దుచేయాలనిగానీ, తాత్కాలికంగా నిలిపివేయాలని గానీ కోర్టు తీర్పులు కూడా ఏమీ లేవు. ‘పరిషత్’ నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ గతంలోనే ముగిసిన దృష్ట్యా ఆ ఎన్నికల పోలింగ్ నిర్వహించేందుకు వారం రోజులకు మించి అవసరం ఉండదని అధికారులు చెబుతున్నారు. టీడీపీకి నష్టమని భావించి.. ‘పరిషత్’ ఎన్నికలు నిర్వహించేందుకు పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ నిమ్మగడ్డ వాటి జోలికి వెళ్లకపోవడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయనే అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ, మునిసిపల్ ఎన్నికల ఫలితాలు పూర్తిగా అధికార వైఎస్సార్సీపీకి అనుకూలంగా వెలువడ్డాయి. ఇంతకుముందు తెలుగుదేశం పార్టీకి రాజకీయ లబ్ధి చేకూర్చేందుకు నిర్ణయించుకున్న నిమ్మగడ్డ ప్రభుత్వం వారిస్తున్నా ఎన్నికల నిర్వహణకు సిద్ధçమయ్యారని అప్పట్లో పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. కనీసం కరోనా వ్యాక్సినేషన్ పూర్తయ్యే వరకు స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా అన్ని ఉద్యోగ సంఘాల నాయకులు ఎంత ఒత్తిడి తెచ్చినా.. ఎన్నికలు జరపాల్సిందేనని పట్టుబట్టి ఆ ఎన్నికలకు నిమ్మగడ్డ పూనుకున్నారు. చివరకు ఎన్నికల ఫలితాలు టీడీపీకి రాజకీయంగా ప్రయోజనం కల్పించకపోగా.. తీవ్ర నష్టం చేకూర్చాయి. ఈ నేపథ్యంలోనే కనీసం తాను కమిషనర్‌గా ఉన్నంత వరకైనా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరపకూడదని నిమ్మగడ్డ నిర్ణయించుకుని ఉంటారని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. -
ఏకగ్రీవాలను రద్దు చేసే అధికారం కోర్టుకు కూడా లేదు
సాక్షి, కృష్ణా: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలతో మొదలైన ఏకగ్రీవాల పరంపర జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ కొనసాగేలా ఉంది. కోవిడ్ కారణంగా 2020 మార్చి 15న వాయిదా పడ్డ ఎన్నికల ప్రక్రియను కొనసాగించాలని ఎన్నికల కమిషన్ ఆలోచిస్తుంది. ఈ క్రమంలో గతంలో నోటిఫికేషన్ జారీ చేసిన సమయంలో పలు జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. త్వరలోనే ఎస్ఈసీ ఈ ఎన్నికలు నిర్వహించాaని భావిస్తుండగా.. గతంలోని ఏకగ్రీవాలను రద్దు చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వివాదంపై హైకోర్టు న్యాయవాది జనార్ధన్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఎన్నికల్లో ఏకగ్రీవాలకు ఫారం 10లో.. ఎన్నికల్లో గెలిచినవారికి ఫారం 23లో ధ్రువీకరణ ఇస్తారు. ఏకగ్రీవమైనా.. ఎన్నికల్లో గెలిచినా.. ఒకసారి ధృవీకరణ పత్రం ఇచ్చాక రద్దు చేసే అధికారం ఎవరికీ లేదు. ఎస్ఈసీ, కోర్టులకు కూడా దీన్ని రద్దు చేసే అధికారం లేదు. కేవలం ఓడిపోయిన వ్యక్తి మాత్రమే ఆర్టికల్ 329 ప్రకారం జిల్లా కోర్టులో ఎలక్షన్ పిటిషన్ వేసుకోవాలి. విచారణ తర్వాతే కోర్టు తీర్పు ఇస్తుంది’’ అని తెలిపారు. -
ఆ ఎన్నికల ప్రక్రియ కొనసాగింపుపై ఆలోచన: నిమ్మగడ్డ
సాక్షి, అమరావతి: వాయిదా వేసిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియను కొనసాగించాలని ఎన్నికల కమిషన్ ఆలోచిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. కోవిడ్ కారణంగా 2020 మార్చి 15న ఎన్నికలు వాయిదా çపడ్డాయి కాబట్టి.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నిలను మళ్లీ మొదటి నుంచి ప్రారంభించాలని కొన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల కమిషన్‌ను కోరాయన్నారు. ఈ విషయంలో ఎన్నికల కమిషన్ న్యాయ సలహా తీసుకుని, ఎన్నిలను సక్రమంగా నిర్వహించేందుకు సంసిద్ధమవుతోందని తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ►మున్సిపల్ ఎన్నికల నామినేషన్లకు సంబంధించి తమతో బలవంతంగా నామినేషన్లు ఉపసంహరింపజేశారని ఎవరైనా ఫిర్యాదు చేస్తే, వాటిపై విచారించి మాకు నివేదించమని కలెక్టర్లను ఇప్పటికే ఆదేశించాము. ►జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియలో కూడా బలవంతంగా నామినేషన్లను ఉపసంహరింప చేశారని ఫిర్యాదులు వస్తే పరిశీలించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించాం. అటువంటి ఉదంతాలు ఉన్నట్లు నిర్ధారణ అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 243–కె ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ తన విచక్షణాధికారాలను ఉపయోగిస్తుంది. ►రిటర్నింగ్ అధికారులకు, పోలీసులకు చేసిన ఫిర్యాదులు, ఆయా ఘటనలకు సంబంధించి వచ్చిన వార్తల వివరాలను ఆధారాలుగా జోడించి ఫిర్యాదు చేయవచ్చు. ఎవరైనా స్థానికంగా ఫిర్యాదు చేసే అవకాశం లేకపోతే నేరుగా ఎన్నికల కమిషన్‌ను సంప్రదించి ఫిర్యాదు చేయొచ్చు. ►బలవంతంగా నామినేషన్‌ను ఉప సంహరింప జేశారని నిర్ధారణ అయితే, ఆ అభ్యర్థుల నామినేషన్లను పునరుద్ధరించే అధికారాన్ని జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్లకు ఇచ్చాము. ఇలాంటి ఫిర్యాదులేవైనా ఉంటే.. విచారించి మొత్తం ప్రక్రియను ఈ నెల 20లోపు పూర్తి చేసి కమిషన్‌కు నివేదిక ఇవ్వాలని ఆదేశించాం. ►ఏజెన్సీ ప్రాంతాల్లో సుమారు 350 పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఎన్నికల బహిష్కరణ పిలుపును తిరస్కరించి, గిరిజన ఓటర్లు పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొనడం సంతోషం. మూడో విడత పోలింగ్‌లో కూడా గ్రామీణ ప్రాంత ఓటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొనడం.. ప్రజాస్వామ్యంపై వారికి ఉన్న విశ్వాసాన్ని ఇనుమడింప జేసింది. -
126 జెడ్పీటీసీ, 2,406 ఎంపీటీసీలు ఏకగ్రీవం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 126 జెడ్పీటీసీ, 2,406 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయని రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారికంగా వెల్లడించింది. ఇక 526 జెడ్పీటీసీ స్థానాలు, 7,287 ఎంపీటీసీ స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరగాల్సి ఉందని పేర్కొంది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఏకగ్రీవాలు పోను ఇక ఎన్నికలు జరగాల్సిన స్థానాలపై ఆదివారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పష్టత ఇచ్చింది. -
15లోగా ఓటరుగా చేరితే.. సర్పంచి ఎన్నికల్లో ఓటు హక్కు
సాక్షి, అమరావతి: ఈ నెల 15వ తేదీలోగా ఓటరుగా పేరు నమోదు చేసుకున్న అందరికీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కల్పిస్తోంది. అదే రోజు పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉన్న దృష్ట్యా ఆ రోజు అర్ధరాత్రిలోగా కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పేర్లు నమోదైన వారందరికీ సర్పంచి ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించనున్నట్లు ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు. అయితే.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 7నే వెలువడిన దృష్ట్యా.. ఆ ఎన్నికలకు మాత్రం 7వ తేదీ అర్ధరాత్రి వరకు ఓటర్లుగా నమోదైన వారికి మాత్రమే ఓటు హక్కు ఉంటుందన్నారు. అలాగే, మున్సిపల్ ఎన్నికల్లోనూ 9వ తేదీ వరకు ఓటరుగా నమోదైన వారికి ఓటు హక్కు అవకాశం ఉంటుంది. అనుబంధ ఓటర్ల జాబితాల తయారీ ఇక ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా వివరాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచనల మేరకు ఎక్కడికక్కడ గ్రామాల వారీగా 2019 డిసెంబరు 22న గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించారు. అయితే, ఆ తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఓటర్ల నమోదుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి కొత్త ఓటర్ల జాబితాలను ప్రకటించింది. ఈ నేపథ్యంలో.. 2019 డిసెంబరు 22 తర్వాత కొత్తగా నమోదైన వారి వివరాలతో పాటు ఈ నెల 7వ తేదీ నాటికి ఓటరుగా నమోదైన వారి పేర్లను కూడా కలిపి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ అనుబంధ ఓటర్ల జాబితాలను తయారుచేస్తోంది. వీరందరికీ ఓటు హక్కు కల్పిస్తారు. మున్సిపల్, పంచాయతీ ఎన్నికలకు కూడా వేర్వేరుగా అనుబంధ జాబితాలను తయారుచేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. పోలింగ్‌కు లక్షన్నరకు పైగా బ్యాలెట్ బాక్స్‌లు.. ఇదిలా ఉంటే.. ఎంపీటీసీ–జెడ్పీటీసీ, పంచాయతీ ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికలను కూడా బ్యాలెట్ విధానంలో నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించిన నేపథ్యంలో.. పెద్ద సంఖ్యలో బ్యాలెట్ బాక్స్‌లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. స్వల్ప వ్యవధిలో మూడు రకాల స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నందున బ్యాలెట్ బాక్స్‌ల కొరత తలెత్తకుండా ఉండేందుకు పొరుగు రాష్ట్రాల నుంచి అధికారులు వాటిని తెప్పిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం వద్ద ప్రస్తుతం 1,05,732 బ్యాలెట్ బాక్సులు ఉండగా.. దాదాపు 60 వేల బాక్సులిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అంగీకరించినట్లు అధికారులు చెప్పారు. అలాగే, దాదాపు 20 వేల బాక్సులిచ్చేందుకు తమిళనాడు, కేరళ రాష్ట్రాలు ముందుకొచ్చాయన్నారు. మరోవైపు.. ఎంపీటీసీ–జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు రెండింటికీ లక్షకు పైగా.. సర్పంచి ఎన్నికలకు లక్షన్నర దాకా బ్యాలెట్ బాక్సుల అవసరం ఉంటుందని అధికారులు లెక్కగట్టారు. దీంతో బ్యాలెట్ బాక్సుల పరంగా ఎటువంటి ఇబ్బందీ ఉండదని అధికారులు భావిస్తున్నారు. -
8 జెడ్పీటీసీ, 345 ఎంపీటీసీల్లో ఎన్నికలకు బ్రేక్
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా 8 జెడ్పీటీసీ, 345 ఎంపీటీసీ స్థానాల్లో ‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 7వ తేదీన రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్‌ను విడుదల చేసినప్పటికీ.. నియమ నిబంధనలకు లోబడి జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌ల వారీగా ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ఎక్కడికక్కడ సోమవారం వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీచేశారు. రిటర్నింగ్ అధికారులు నోటిఫికేషన్ జారీచేసిన సమయం నుంచి ఆ పరిధిలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ 7వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసినప్పుడే.. జిల్లాలో ఏవైనా జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల ఎన్నికల నిర్వహణకు కోర్టు కేసులు, ఇతర పాలనాపరమైన ఆటంకాలు ఉన్నప్పుడు అలాంటి చోట తాత్కాలికంగా ఎన్నికను నిలిపివేసే అధికారం ఆయా జిల్లాల కలెక్టర్లకు కల్పించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ల ఆదేశాలకు అనుగుణంగా స్థానిక రిటర్నింగ్ అధికారులు సోమవారం రాష్ట్రంలో 660 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా, 652 స్థానాలలో మాత్రమే ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్లు జారీచేశారు. అలాగే, 10,047 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, 9,702 ఎంపీటీసీ స్థానాలకు మాత్రమే ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. - తూర్పు గోదావరి జిల్లాలో ఒకటి, కృష్ణా జిల్లాలో 3, గుంటూరు జిల్లాలో మూడు, ప్రకాశం జిల్లాలో ఒకటి చొప్పున జెడ్పీటీసీ స్థానాల్లో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. - ఎంపీటీసీ స్థానాల విషయానికొస్తే.. ఎక్కువగా తూర్పు గోదావరి జిల్లాలో 98, కృష్ణాలో 89, గుంటూరులో 57. ప్రకాశంలో 42, చిత్తూరులో 22 స్థానాల్లో ఎన్నికలు నిలిచిపోయాయి. అనంతపురం, విజయనగరం జిల్లాల్లో మాత్రమే అన్నిచోట్లా ఎన్నికలు జరుగుతున్నాయి. -
ఎన్నికల పరిశీలకులుగా ఐఏఎస్‌ల నియామకం
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థలకు ఎన్నికల పరిశీలకులుగా 13 జిల్లాలకు సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమించింది. వీరితో పాటు మరో నలుగురు ఉన్నతాధికారులను రిజర్వ్‌లో ఉంచారు. జిల్లాల వారీగా వారి వివరాలు.. (నేటి నుంచి జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల స్వీకరణ) ► కె. ఆర్.బి. హెచ్. ఎన్. చక్రవర్తి - కర్నూలు జిల్లా ►ఎం. పద్మ - కృష్ణ జిల్లా ► పి.ఉషా కుమారి - తూర్పు గోదావరి జిల్లా ►పి.ఎ. శోభా - విజయనగరం జిల్లా ►కె. హర్షవర్ధన్ - అనంతపురం జిల్లా ►టి. బాబు రావు నాయుడు - చిత్తూరు జిల్లా ►ఎం. రామారావు - శ్రీకాకుళం జిల్లా ►కె. శారదా దేవి - ప్రకాశం జిల్లా ►ప్రవీణ్ కుమార్ - విశాఖపట్నం జిల్లా ►బి. రామారావు -ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ►పి. రంజిత్ బాషా - వైయస్ఆర్ కడప జిల్లా కాంతిలాల్ దండే - గుంటూరు జిల్లా ►హిమాన్షు శుక్లా - పశ్చిమ గోదావరి జిల్లా వీరికి అదనంగా నలుగురు సీనియర్ ఉన్నతాధికారులను సిహెచ్. శ్రీధర్, శ్రీమతి. జి. రేఖ రాణి, శ్రీమతి టి.కె.రామమణి, ఎన్.ప్రభాకర్రెడ్డిలను రిజర్వులో ఉంచారు. (ముగ్గురు పిల్లలున్నా పోటీకి అర్హులే!) -
నేటి నుంచి జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల స్వీకరణ
సాక్షి, అమరావతి: నేటి నుంచి ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్లను స్వీకరించనున్నారు. 660 జడ్పీటీసీ, 9,984 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. జడ్పీటీసీ స్థానాలకు జడ్పీ కార్యాలయాల్లో, ఎంపీటీసీ స్థానాలకు ఎంపీడీవో కార్యాలయాల్లో నామినేషన్లు స్వీకరించనున్నారు. నేటి నుంచి 11 వరకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం జరుగుతుంది. ఈ నెల 12న ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్లు పరిశీలన.. 13న నామినేషన్లపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. 14న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. అనంతరం అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. 21న ఎన్నికల పోలింగ్, 24న కౌంటింగ్ జరగనుంది. 30న జడ్పీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్, కోఆప్షన్ సభ్యుల ఎన్నిక.. 30న ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక నిర్వహిస్తారు. (విలువలు ప్రతిబింబించేలా ‘స్థానిక ఎన్నికలు’) ఎంపీడీవో, జడ్పీ కార్యాలయాల వద్ద సందడి.. స్థానిక సంస్థల ఎన్నికల నగరా మోగడంతో గ్రామాల్లో ఎన్నికల కోలాహలం మొదలైంది. అధికార పార్టీ టిక్కెట్ల కోసం ఆశావహులు క్యూ కడుతున్నారు. గెలుపు గుర్రాల వేటలో ఎమ్మెల్యేలు నిమగ్నమయ్యారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో ఎంపీడీవో, జడ్పీ కార్యాలయాల వద్ద సందడి నెలకొంది. అన్ని స్థానాలను కైవసం చేసుకునేందుకు నేతలు వ్యూహరచన చేస్తున్నారు. (‘పుర’ పదవుల్లో మహిళలకే పెద్దపీట) -
ముగ్గురు పిల్లలున్నా పోటీకి అర్హులే!
సాక్షి, అమరావతి: ముగ్గురు పిల్లలు ఉన్నా స్థానిక ఎన్నికల్లో పోటీకి అర్హులేనని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్‌కుమార్ స్పష్టం చేశారు. అయితే.. 1994, మే 30కి ముందు మాత్రమే ముగ్గురు పిల్లలు పుట్టి ఉండాలన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి సోమవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. 11వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఎంపీటీసీ పదవులకు ఆయా మండల పరిషత్ కార్యాలయాల్లో, జెడ్పీటీసీ పదవులకు జెడ్పీ సీఈవో కార్యాలయాల్లో నామినేషన్లు సమర్పించాలి. ఈ నేపథ్యంలో పోటీకి ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు అనే అంశాల్లో ఎన్నికల కమిషన్ స్పష్టతనిచ్చింది. దీని ప్రకారం.. - ఎంపీటీసీ, జెడ్పీటీసీగా పోటీ చేసేవారికి నామినేషన్ల పరిశీలన జరిగే తేదీ నాటికి కనీసం 21 ఏళ్లకు తక్కువ కాకుండా ఉండాలి. ఎంపీటీసీగా పోటీ చేసేవారు ఆ మండల పరిధిలోని ఏదో ఒక ఎంపీటీసీ పరిధిలో.. జెడ్పీటీసీగా పోటీ చేసే వారికి ఆ జిల్లా పరిధిలోని ఏదో ఒక జెడ్పీటీసీ పరిధిలో ఓటు ఉండాలి. పోటీ చేసే అభ్యర్థిని ప్రతిపాదించే వారు కూడా అభ్యర్థి పోటీ చేసే ఎంపీటీసీ, జెడ్పీటీసీ పరిధిలో ఓటరై ఉండాలి. - 1994, మే 30కి ముందు ముగ్గురు పిల్లలు ఉన్నవారు ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులే. ఆ తేదీ నాటికి ముగ్గురు పిల్లలు ఉండి, 1995, మే తర్వాత మరొక సంతానం ఉంటే పోటీకి అనర్హులవుతారు. - 1995, మే 29 తర్వాత ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మందికి జన్మనిచ్చిన తల్లిదండ్రులు పోటీకి అనర్హులు. అయితే, మొదట ఒకరు పుట్టి, రెండో సంతానంగా కవలలు పుడితే మాత్రం వారు పోటీకి అర్హులవుతారు. - 1995, మే 29 తర్వాత ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు పుట్టి, మొత్తం సంతానం ముగ్గురు దాటని వారు కూడా పోటీకి అర్హులే. - ముగ్గురు పిల్లలు కలిగి ఉండి, ఒకరిని ఇతరులకు దత్తత ఇస్తే అనర్హులే అవుతారు. - ఇప్పటికే ఇద్దరు పిల్లలు కలిగి ఉండి నామినేషన్ల పరిశీలన తేదీ నాటికి గర్భవతిగా ఉన్నా అలాంటి వారు కూడా పోటీకి అర్హులే. - రేషన్ షాపు డీలరుగా పనిచేసే వారు పోటీకి అర్హులే. అంగన్వాడీ కార్యకర్తలు పోటీకి అనర్హులు. - దేవదాయ శాఖ పరిధిలో ఆలయాల ట్రస్టు బోర్డు చైర్మన్ లేదంటే సభ్యులుగా ఉన్న వారు పోటీకి అనర్హులు. - ఎంపీటీసీ, జెడ్పీటీసీలుగా పోటీచేసేవారు ఆ పరిధిలో ఓటు కలిగి ఉండి, ఏదైనా పట్టణ ప్రాంతంలో మరొక ఓటు కలిగి ఉన్నా అర్హులే. ఇలాంటి వారిని అనర్హులుగా పేర్కొనడానికి చట్టంలో ప్రత్యేకంగా ఏ నిబంధన లేని కారణంగా వారిని అర్హులగానే పరిగణిస్తారు. -
పల్లెల్లో వేడెక్కుతున్న రాజకీయం
సాక్షి, కారంచేడు (ప్రకాశం): ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సమరం ఎంతో రసవత్తరంగా ముగిసింది. ఆ వేడి చల్లారక ముందే స్థానిక సంస్థల ఎన్నికలు గ్రామాల్లో ఆసక్తి కరంగా మారాయి. అధికారం చేపట్టిన కొద్ది రోజుల్లోనే అందరితో బెస్టు సీఎం అనిపించుకుంటున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనకు స్థానిక ఎన్నికల్లో ప్రజలు పట్టం కడతారని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యులకు ఎవరిని పోటీ చేయించాలనే కసరత్తును ఆయా పార్టీలు ప్రారంభించాయి. దీంతో గ్రామాల్లో రసవత్తర రాజకీయ చర్చలు జరుగుతున్నాయి. మండలాల్లో జెడ్పీ, మండల పరిషత్ పాలకవర్గాల పదవీకాలం జూలై మొదటి వారంతో ముగుస్తుంది. ఎన్నికల సంఘం జెడ్పీ, మండల పరిషత్ ఎన్నికలకు సిద్ధం కావాలంటూ అధికారులను ఆదేశించింది. ఇదిలా ఉంటే సర్పంచ్‌లకు సంబంధించి వార్డుల వారీగా అధికారులు ఓటర్ల జాబితాను ఇటీవల ప్రచురించారు.ఈ నెల 20వ తేదీ పోలింగ్ కేంద్రాల జాబితాను సైతం వెల్లడించారు. దీంతో సర్పంచ్ ఎన్నికలు ముందు జరుగుతాయా జెడ్పీ, మండల పరిషత్ ఎన్నికలు జరుగుతాయా అనే అనుమానం నాయకులను, అధికారులను వేధిస్తోంది. ఏది ఏమైనా గ్రామస్థాయిలో మాత్రం ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. రిజర్వేషన్లపై ఉత్కంఠ స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కీలకంగా మారనున్నాయి. కారంచేడు మండలంలో 14 పంచాయతీలున్నాయి. మొత్తం 138 వార్డులు ఉన్నాయి. పోలింగ్ బూత్‌లు 138 ఉన్నాయి. వీరిలో ఎస్టీ ఓటర్లు 1268, ఎస్సీ ఓటర్లు 7771, బీసీ ఓటర్లు 8782, ఓసీ ఓటర్ల 15,111 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 32,932 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 15998 మంది కాగా, మహిళా ఓటర్లు 16,934 మంది ఉన్నారు. రిజర్వేషన్లు ఖారారైతే ఎన్నికల ప్రకటన వెలువడే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు. మహిళా రిజర్వేషన్లు ఖారారైతే ఎవరిని పోటీలో ఉంచాలి అనే విషయంపై గ్రామాల్లో ఇప్పటికే లెక్కలు కడుతున్నారు. -
వెంటాడుతున్న ముగ్గురు పిల్లల గండం
సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. నూతన ప్రభుత్వం ఏర్పాటైంది. ఇక ఇప్పుడు స్థానిక సమరానికి గంటలు మోగుతున్నాయి. పంచాయతీ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల్లో పోటీచేయాలనుకుంటున్న ఔత్సాహికులను ముగ్గురు పిల్లల గండం వెంటాడుతోంది. సాక్షి, బాపట్ల: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న నాయకుల ఆశలను ముగ్గురు పిల్లల గండం వెంటాడుతూనే ఉంది. స్థానిక సంస్థల్లో మూడంచెల వ్యవస్థలైన సర్పంచ్‌లు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లతోపాటు మున్సిపాలిటీల్లో పోటీచేసే అభ్యర్థులకు ముగ్గురు పిల్లల ఆటంకం అడ్డుగా మారిందనే ఆందోళన కొన్నేళ్లుగా పోటీ చేయాలనుకుంటున్న నాయకులకు ఇబ్బందిగా మారింది. 1995 మే 29వ తేదీ తరువాత నుంచి ముగ్గురు పిల్లలు ఉంటే స్థానిక సంస్థలకు పోటీ చేసేందుకు అనర్హులు. అదే 1995 మే 29కి ముందు ముగ్గురు పిల్లలు కాదు గదా ఎంత మంది ఉన్నా పట్టింపు లేదు. అందుకే స్థానిక సంస్థల్లో పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులకు 1995 మే డెడ్‌లైన్‌గా మారిందనే ఆవేదన పోటీల్లో ఉండే ఔత్సాహికుల్లో వ్యక్తమవుతోంది. ఒకవేళ పోటీ చేయాలనుకున్నవారికి డెడ్‌లైన్ తర్వాత ముగ్గురు పిల్లలు ఉన్నా వారిలో ఒకరు అనుకోకుండా చనిపోతే మళ్లీ వారు పోటీకి అర్హులే. ఇద్దరు పిల్లలు ఉండి పోటీ చేసే సమయానికి భార్య గర్భిణిగా ఉన్నా భర్త అయినా, భార్య అయినా పోటీ చేయవచ్చు. స్థానిక సంస్థలపై మక్కువ తీరక కొంతమంది అత్యుత్సాహం చూపించి తమ ముగ్గురు పిల్లల్లో ఒకరిని బంధువులకు దత్తత ఇచ్చినట్లుగా చూపి తమకు ఇద్దరు పిల్లలే అని చెప్పుకుంటారు. కానీ దత్తత ఇచ్చినా దత్తత బిడ్డను కూడా మూడో బిడ్డగానే పరిగణించి పోటీకి అనర్హులుగానే అధికారులు పరిగణిస్తారు. మరికొంతమంది తమకు పుట్టిన ముగ్గురు పిల్లల్లో తెలివిగా ఒక బిడ్డను వేరే బంధువుల ఇంటి పేరుతో పేరు మార్చి వేరే వారి లెక్కలో పెంచుతారు. అప్పుడు అలా ఇంటి పేరు మార్చిన తరువాత ఆధార్‌కార్డు, రేషన్‌కార్డులో తమ మూడో బిడ్డను వేరే ఇంటి పేరుతో చూపించి పోటీ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి వివాదాస్పద సంఘటనలు కోర్టుకు వెళ్లి తేల్చుకునేసరికి అడ్డదారిలో తమ బిడ్డ ఇంటి పేరు మార్చి గెలిచిన వ్యక్తి పదవీ కాలం కూడా పూర్తి కావస్తుందనే నమ్మకంతో బరితెగించి ఇలా చేస్తుంటారనే విమర్శలు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పటికే సర్పంచ్ల పదవీకాలం పూర్తయి దాదాపు ఆరునెలలు పైనే అవుతోంది. మరో నెల రోజుల్లో మండల పరిషత్, జెడ్పీటీసీలు, ఎంపీటీలు, మున్సిపాల్టీ అభ్యర్థుల పదవీకాలం కూడా పూర్తికావస్తోంది. గుంటూరు జిల్లాలో 57 మండలాల్లోని పంచాయతీలు, మున్సిపాల్టీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల ఎన్నికల గడువు సమీపించటంతో ప్రస్తుతం ఆసక్తికరమైన విషయాలపై చర్చలు సాగుతున్నాయి. ఇప్పటికే జిల్లాలో ముగ్గురు పిల్లల గండం స్థానిక సంస్థల్లో పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థుల్లో మళ్లీ చర్చకు తావిస్తోంది. స్వగ్రామంలో ఓటు ఉంటేనే పోటీకి అర్హులు ముగ్గురు పిల్లల గండాలను అధిగమించి ఆసక్తి కలిగిన అభ్యర్థులెవరైనా పోటీ చేయాలంటే తప్పనిసరిగా వారు పోటీ చేసే పంచా యతీలో ఓటరుగా వారి పేరు నమోదై ఉం డాలి. పోటీ చేయడంతోపాటు పోటీ చేసి న వారిని ప్రతిపాదించాలన్నా కూడా ప్రతిపాదించేవారికిఓటు హక్కు అదే గ్రామ పంచాయతీలో ఉండాలి. రేషన్ డీలర్లు పోటీకి అర్హులే... కొన్ని గ్రామాల్లో రేషన్ షాపుల డీలర్లుగా ఉన్న వారు ఎలా పోటీ చేస్తారంటూ గత స్థానిక సంస్థల ఎన్నికల్లో అలజడి రేగింది. ముగ్గురు పిల్లల జీవో ప్రకారం రేషన్‌షాపుల డీలర్లు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. అంగన్వాడీ సిబ్బంది, నీటి వినియోగదారుల సంఘాల సభ్యులు పోటీ చేసేందుకు అనర్హులుగా చట్టం చెబుతోంది. స్వచ్ఛంద సంస్థలు, మత సంస్థల చైర్మన్లు, మతిస్థిమితం లేని వ్యక్తులు పోటీకి అనర్హులు. క్రిమినల్ కేసుల్లో ఇరుక్కుంటే వారిపై విధించిన శిక్షాకాలం ఐదేళ్లలోపు వారు పోటీ చేసేందుకు అనర్హులు.కోర్టు విధించిన శిక్షలపై స్టే, బెయిల్ తెచ్చుకున్నా పోటీకి అనర్హులే. ఉద్యోగులు పోటీ చేయాలంటే తమ ఉద్యోగాలకు రాజీనామా చేసిన తరువాత...దాన్ని ఆమోదించిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉంది. -
చివరి మీటింగ్
ఆదిలాబాద్‌అర్బన్: అరవై సంవత్సరాల చరిత్ర ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిషత్ సమావేశాలు జరగడం ఇదే చివరి సారి. ఇక నుంచి ఏ జిల్లాలో ఆ జిల్లా పరిషత్ సమావేశాలు జరగనున్నాయి. పునర్విభజనలో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ నాలుగు జిల్లాలుగా ఏర్పడి ఆయా జిల్లాలోనే పరిషత్ ఎన్నికలు జరిగాయి. నూతనంగా ఎన్నికైన కొత్త సభ్యులు వారి వారి జిల్లాలో జరిగే జెడ్పీ సమావేశాలకు, సభలకు హాజరవుతుంటారు. దీంతో ఉమ్మడి జెడ్పీ సభ్యుల కలయికకు ఇవే చివరి సమావేశాలు అనడంలో సందేహం లేదు. అయితే శుక్రవారం ఉదయం 10:30 గంటలకు జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు జరగనున్నాయి. శనివారం ఉదయం 10:30 గంటలకు – జెడ్పీ సర్వసభ్య సమావేశం జరగనుంది. స్థాయీ సంఘ సమావేశాలకు తక్కువ మోతాదులో సభ్యులు హాజరైనా.. తెల్లారే ఉమ్మడి జెడ్పీ చివరి సర్వసభ్య సమావేశం ఉండడంతో నాలుగు జిల్లాల సభ్యులు, మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎంపీపీలు, అధికారులు హాజరయ్యే ఆస్కారం ఉంది. అయితే చివరి సమావేశంలో పదవీకాలం జూలై 4తో ఐదేళ్లు పూర్తి చేసుకోనున్న సభ్యులకు సన్మానాలు, సత్కరాలు ఉంటాయని జెడ్పీ సీఈవో కె.నరేందర్ తెలిపారు. ఎమ్మెల్యేలకు మొదటివి.. సభ్యులకు చివరివి.. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలు తీరు తెలుసుకునే ఆయా ప్రభుత్వ శాఖలు సాధించిన ప్రగతిపై ప్రజాప్రతినిధులు, అధికారులు జెడ్పీ స్థాయీ సంఘ, సర్వసభ్య సమావేశాల్లో చర్చిస్తుంటారు. అయితే ఈ రెండు రోజుల్లో జరిగే సమావేశాల్లో విచిత్ర పరిణామం ఎదురుకానుంది. అదేటంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలుపొందిన వారికి ఈ సమావేశాలు మొదటివి కాగా, జూలైలో పదవీకాలం పూర్తి చేసుకోమనున్న జెడ్పీ సభ్యులకు మాత్రం ఇవే చివరి సమావేశాలు కానున్నాయి. మరీ ముఖ్యంగా జెడ్పీకి కొత్త పాలకవర్గం (చైర్మన్‌తో సహా సభ్యులు) ఎన్నికైన పాత పాలకవర్గం సమావేశాలు నిర్వహించడం కూడా విశేషమే. ఇదిలా ఉండగా, ఈ ఏడాదిలో వరుసగా వచ్చిన ఎన్నికల దృష్ట్యా సభ్యులు రాకపోవడంతో సమావేశాలు రెండు సార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ సారి కూడా స్థాయీ సంఘాలు కొనసాగుతాయా? లేదా అన్న సందేహం లేకపోలేదు. ఇక తెల్లావారే సర్వసభ్య సమావేశం ఉండడంతో సభ్యులతోపాటు మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎంపీపీలు హాజరయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. సమావేశాలకు అందరు హాజరైతే గత ఆరు నెలలుగా చర్చించాల్సిన ప్రగతి అంశాలపైనే ప్రధానంగా చర్చ జరగనుంది. అయితే సమావేశాలకు సభ్యులు రావడం పెద్ద సమస్యగా మారితే ఇప్పుడు నిర్వహించే సమావేశం చివరిది కావడంతో ఆ సమస్య ఉండదని సభ్యులతోపాటు అధికారులు భావిస్తున్నారు. ప్రాధాన్యత అంశాలపై చర్చ.. జెడ్పీ స్థాయీ సంఘాలు, సర్వసభ్య సమావేశాలు సాఫీగా కొనసాగితే ప్రాధాన్యత అంశాలపై చర్చ జరగనుంది. ప్రధానంగా వ్యవసాయం, పాఠశాలల పునఃప్రారంభం, హరితహారం కార్యక్రమం, వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులకు వైద్య సదుపాయాలు, ఆస్పత్రుల తీరు, సంక్షేమ పథకాలైన పింఛన్ల పెంపు, రేషన్ కార్డులు, రైతుబంధు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, తదితర అంశాలపై చర్చించే అవకాశాలు కన్పిస్తున్నాయి. అయితే పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. తరగతుల నిర్వహణ, పాఠశాలల్లో కనీస సౌకర్యాలు, బడిబయట పిల్లలను బడికి తీసుకురావడం, బాల కార్మిక నిర్మూలన, ఉపాధ్యాయులు, ఎంఈవోల కొరత, విద్యావాలంటీర్ల కొనసాగింపు తదితర అంశాలపై చర్చకు రావచ్చు. ఈ సారి పదో తరగతి ఫలితాల్లో జిల్లా మంచి పేరును సాధించింది. దీంతో వచ్చే ఏడాది మరింత మెరుగుపర్చుకునేందుకు అధికారులు తీసుకుంటున్న చర్యలు, అదనపు తరగతి గదుల నిర్మాణాలు, మరుగుదొడ్లు, తాగునీరు, విద్యార్థులకు కనీస అవసరాలపై చర్చించే ఆస్కారం ఉంది. వసతిగృహాల్లోని విద్యార్థులకు నాణ్యమైన భోజనం, మెనూ పాటించడం, హాస్టళ్లలో సౌకర్యాలు, గురుకుల పాఠశాలలు, కళాశాలల పనితీరు, కస్తూర్బాగాంధీ విద్యాలయాలు, అంగన్వాడీ కేంద్రాల పనితీరు తదితర అంశాలు చర్చకు రావచ్చు. ఇక ఖరీఫ్ (వానాకాలం) ప్రారంభం ఇప్పటికే వారం గడిచిపోయింది. సుమారు 40 నుంచి 50 శాతం మంది పొలాల్లో విత్తనాలు నాటారు. ఇంకా కొంత మంది రైతులు వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నెల 15 తర్వాత కురిసే వర్షాలపై రైతులు ఆశలు పెట్టుకున్నారు. జిల్లా రైతులకు సరిపడా ఎరువులను అందుబాటులో ఉంచడం, పంటలపై మందు పిచికారీ, ఏఏ రకాల ఎరువులు వాడాలనే దానిపై రైతులకు అవగాహన తదితర అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ సమయంలో రైతులకు ప్రభుత్వం అందజేసే పెట్టుబడి సాయం (రైతుబంధు), బ్యాంకుల ద్వారా అందజేసే పంట రుణాలు, తదితర అంశాలు చర్చకు రావచ్చు. జిల్లాలో ఇప్పటికే సుమారు 40 శాతం మందికి రైతుబంధు రాగా, మిగతా 60 శాతం మందికి రైతుబంధు రావాలంటే మరో పక్షం రోజుల వరకు పడుతుంది. ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీ తదితర అంశాలు చర్చించవచ్చు. ఈ అంశాలతోపాటు త్వరలో చేపట్టే హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కల పెంపకం, నర్సరీల్లో ఉన్న మొక్కలు, ఈ ఏడాది లక్ష్యానికి అనుగుణంగా మొక్కల పెంపకం తదితర అంశాలు చర్చకు రావచ్చు. రానున్న వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పీహెచ్సీ, సీహెచ్‌సీల పనితీరుతోపాటు జిల్లా ఆసుపత్రులు తీరుపై చర్చించనున్నారు. అయితే ఆసుపత్రుల్లో సరిపడా డాక్టర్లు, సౌకర్యాలు, మందులు, ఇతరాత్ర అంశాలు చర్చించనున్నారు. వీటితో పాటు ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ అయినా 57 ఏళ్లు నిండిన వారికి పింఛన్‌కు సంబంధిత మార్గదర్శకాలు, విధివిధానాలు, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, దళిత బస్తీ పథకం కింద భూ పంపిణీ, భూములు అమ్మిన వారికి డబ్బు చెల్లింపులు, ఈ ఏడాదిలో చాలా మంది పెళ్లిళ్లు చేసుకొని కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ చెక్కుల పంపిణీ, తదితర అంశాలు చర్చించే అవకాశాలు ఉన్నాయి. -
కొలిక్కిరాలే !
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ప్రాదేశిక ఎన్నికలు పూర్తయ్యాయి. జెడ్పీ చైర్పర్సన్లు.. చైర్మన్లు.. వైస్ చైర్మన్లు.. జెడ్పీటీసీలు.. ఎంపీటీసీలు ఎవరో తేలిపోయారు. వచ్చే నెల ఐదో తేదీన మహబూబ్‌నగర్‌తో పాటు నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లా పరిషత్‌లు కొలువుదీరనున్నాయి. అదే రోజు నుంచి ఆయా పరిషత్‌లలో పాలన ప్రారంభం కానుంది. కానీ.. కొత్తగా కొలువుదీరిన జిల్లాల్లో పరిషత్ కార్యాలయాల ఎంపిక ప్రక్రియ ఇంకా కొలిక్కిరాలేదు. కనీసం కొత్త పరిషత్ కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగుల కేటాయింపు జరగలేదు. మిగిలిన పక్షం రోజుల్లో జెడ్పీ భవనాల ఖరారు.. ఉద్యోగుల నియామకాలు అధికారులకు సవాలుగా మారింది. మరోవైపు ఉద్యోగుల నియామకాలు, భవనాల ఎంపికకు సంబంధించి ఈనెల 15న పంచాయతీరాజ్ కమిషనర్‌తో జెడ్పీ సీఈఓలతో జరగాల్సిన సమావేశం రద్దు కావడంతో అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సమావేశం తర్వాతే భవనాల ఖరారు, ఉద్యోగుల కేటాయింపుపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని జెడ్పీ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో అరకొర సదుపాయాల మధ్య కొత్త పాలక వర్గాలు కొలువుదీరుతాయనే భావన ప్రజాప్రతినిధుల్లో వ్యక్తమవుతోంది. అలాగే జిల్లా పరిషత్ చైర్పర్సన్లు, చైర్మన్లు, సీఈఓలకు ప్రభుత్వం కొత్త వాహనాలు కేటాయించింది. ఈ వాహనాలు ఈ నెలాఖరులోగా ఆయా జిల్లాలకు చేరుకుంటాయని సమాచారం. ∙కొత్త జిల్లాల ఏర్పాటుకు ముందు ఉమ్మడి జిల్లాలో 64 మండలాలు ఉన్నాయి. జిల్లాల పునర్విభజన తర్వాత కొత్తగా చారగొండ, పదర, మూసాపేట, రాజాపూర్, మదనాపురం, చిన్నంబావి, మరికల్, మహబూబ్‌నగర్ రూరల్, కృష్ణ, ఊర్కొకొండ, పెంట్లవెల్లి, రాజోలి, ఉండవెల్లి, కేటీ దొడ్డి, రేవల్లి, శ్రీరంగాపురం, అమరచింత మొత్తం 17 మండలాలు ఏర్పాటయ్యాయి. దీంతో మండలాల సంఖ్య 81కు చేరింది. అదే సమయంలో పది మండలాలు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో కలిశాయి. దీంతో ఉమ్మడి పాలమూరు 71 మండలాలకు పరిమితమైంది. పరిపాలనా సౌలభ్యం కోసం సీఎం కేసీఆర్ ఉమ్మడి జిల్లాలో కొత్తగా నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలు ఏర్పాటు చేశారు. 15 మండలాలతో మహబూబ్‌నగర్ జిల్లా ఏర్పాటు కాగా 11 మండలాలతో నారాయణపేట, 20 మండలాలతో నాగర్‌కర్నూల్, 12 మండలాలతో జోగులాంబ గద్వాల, 14 మండలాలతో వనపర్తి జిల్లా ఏర్పాటైంది. తాజాగా గత నెలలో మూడు విడతల్లో ప్రాదేశిక ఎన్నికలు జరిగి.. ఫలితాలు కూడా వెలువడ్డాయి. వచ్చే నెల నాలుగో తేదీన ప్రస్తుత పాలకవర్గం గడువు ముగియనుంది. మరుసటి రోజే ఎన్నికయిన కొత్త పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేయనుంది. గడువులోగా గగనమే...! కొత్తగా కొలువుదీరిన జిల్లా పరిషత్ కార్యాలయాల్లో ఇంతవరకు ఎలాంటి ఏర్పాట్లు జరగలేదు. కనీసం భవనాలు సైతం ఖరారు కాలేదు. పాత మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్ కార్యాలయాన్ని మినహాయిస్తే మిగిలిన జిల్లాల్లో పరిషత్ కార్యాలయాల భవనాలు ప్రతిపాదనల దశలోనే ఉన్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లాకేంద్రంలో భవనాలు లేకపోవడంతో బిజినేపల్లిలో నూతనంగా నిర్మించిన మండల పరిషత్ కార్యాలయ భవనాన్ని జెడ్పీకి కేటాయించాలని అధికారులు ప్రతిపాదనలు పంపారు. అటు వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాకేంద్రాల్లో నూతనంగా నిర్మించిన మండల పరిషత్ భవనాలు, నారాయణపేటలోని పశుసంవర్ధక శాఖ కార్యాలయం జిల్లా పరిషత్ కార్యాలయాలకు అనుకూలంగా ఉన్నాయని అధికారులు ప్రభుత్వాన్ని నివేదించారు. ప్రభుత్వం నుంచి ఆమోదం లభించిన తర్వాత భవనాలు ఖరారయ్యే అవకాశాలున్నాయి. ఐదు జిల్లా పరిషత్‌లు.. 60 మంది ఉద్యోగులు కొత్తగా కొలువుదీరనున్న జెడ్పీ కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగుల విభజన, కేటాయింపుల విషయంలోనూ ఇంకా స్పష్టత రాలేదు. దీంతో కొత్తగా కొలువుదీరనున్న జెడ్పీ కార్యాలయాల్లో ఉద్యోగుల కేటాయింపు ఏ ప్రాతిపదికన జరుగుతుందో అనే ఉత్కంఠ ఆయా ఉద్యోగుల్లో నెలకొంది. అయితే ప్రస్తుతం ఉమ్మడి జిల్లా పరిషత్ కార్యాలయంలో పని చేస్తోన్న ఉద్యోగులను కొత్తగా ఏర్పాటు కానున్న జెడ్పీలకు సమానంగా విభజించాలని ప్రాథమికంగా> నిర్ణయించారు. ప్రస్తుతం జిల్లాలో ఐదుగురు డీప్యూటీ సీఈఓలున్నారు. వీరందరికీ కొత్త జిల్లా పరిషత్‌లకు ఇన్చార్జ్ సీఈఓలుగా బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం జెడ్పీలో మొత్తం 60మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో ఏడుగురు సూపరింటెండెంట్లు ఉండగా మహబూబ్‌నగర్ జెడ్పీకి ముగ్గురిని, మిగిలిన నాలుగు జెడ్పీ కార్యాలయాలకు ఒక్కొక్కరి చొప్పున నియమించాలని నిర్ణయించారు. 13మంది సీనియర్ అసిస్టెంట్లు ఉండగా నాగర్‌కర్నూల్‌కు నలుగురు, మహబూబ్‌నగర్‌కు ముగ్గురు, మిగిలిన మూడు జెడ్పీలకు ఇద్దరి చొప్పున కేటాయించనున్నారు. 21 మంది జూనియర్ అసిస్టెంట్లలో మహబూబ్‌నగర్‌కు తొమ్మిది మంది, మిగిలిన నాలుగు జెడ్పీలకు ముగ్గురి చొప్పున, ఉన్న ఐదుగురి టైపిస్ట్‌లలో ఒక్కొక్కరికి ఒక్కో జెడ్పీకి, 14 మంది అటెండర్లలో మహబూబ్‌నగర్ జెడ్పీ కార్యాలయానికి పది మంది, మిగిలిన నాలుగు జెడ్పీలకు ఒక్కొక్కరి చొప్పున కేటాయించాలని అధికారులు ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందజేశారు. అయితే.. ప్రభుత్వ ఆదేశాలు, మార్గదర్శకాల మేరకే ఉద్యోగుల విభజన జరగనుంది. అలాగే.. ప్రస్తుతం ఉమ్మడి జెడ్పీ కార్యాలయంలో అటెండర్ మొదలు డిప్యూటీ సీఈఓలుగా పని చేస్తోన్న అందరికీ పదోన్నతులు వచ్చే అవకాశాలుండడంతో ఆయా వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. -
ఓటుకు నోట్లు ; ఇదేమి ఆదర్శంరా నాయనా..!
-
ఓటుకు నోట్లు ; ఇదేం ఆదర్శంరా బాబూ..!
సాక్షి, మంచిర్యాల : స్థానిక సంస్థల సంరంభం శనివారంతో ముగిసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లా పరిషత్‌లను గెలుచుకొని టీఆర్ఎస్ కొత్త చరిత్ర సృష్టించింది. శనివారం 32 జిల్లాల్లో జెడ్పీపీ పదవులకు జరిగిన ఎన్నికల్లో 32 జెడ్పీ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, కో ఆప్షన్ పదవులన్నింటినీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. మండల ప్రజా పరిషత్ (ఎంపీపీ) అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లోనూ అధికార టీఆర్ఎస్ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. 436 మండల పీఠాలను గెలుచుకుని సత్తా చాటింది. ఇక మంచిర్యాల జిల్లా, జన్నారం మండలం లింగయ్య పల్లెలో ఓ వినూత్న ఘటన చోటుచేసుకుంది. కాంగ్రెస్ తరపున ఎంపీటీసీ అభ్యర్ధిగా బరిలో నిలిచిన మాదాడి హన్మంతరావు అనే వ్యక్తి ఓటమిపాలయ్యారు. దీంతో ఎన్నికల్లో పంపిణీ చేసిన డబ్బులు తిరిగి ఇవ్వాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చాలామంది తాము తీసుకున్న డబ్బుల్ని తిరిగిచ్చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఓటుకు నోట్లు పంచిన ఓ వ్యక్తి తిరిగి చెల్లించమనడం.. ఇదే మా ఆదర్శం అంటూ ప్రజలు స్పందించడం భలే యావ్వారం అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. -
అదే హవా !
సాక్షి ప్రతినిధి, వరంగల్: మండల పరిషత్ అ«ధ్యక్షుల ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) హవా కొనసాగింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 71 మండలాలు ఉండగా.. రిజర్వేషన్ల వివాదం కారణంగా ములుగు జిల్లా మంగపేట మండలంలో ఎంపీటీసీ ఎన్నికలు జరగలేదు. ఇక 70 మండలాల్లో ఎంపీటీసీ ఎన్నికలు జరగ్గా.. శుక్రవారం మూడు మండలాలు మినహా మిగతా చోట్ల మండల పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కోఆప్షన్ సభ్యులను ఎన్నుకున్నారు. ఇందులో 57 మండల పరిషత్‌లపై టీఆర్ఎస్ గులాబీ జెండా ఎగురవేసింది. కాంగ్రెస్‌కు తొమ్మిది ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది ఎంపీపీ పీఠాలు కాంగ్రెస్‌కు దక్కగా, ఒకచోట ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్(ఏఐఎఫ్బీ) పార్టీ అభ్యర్థి ఎన్నికయ్యారు. ఇక పలిమెల మండలంలో ఇద్దరు ఎంపీటీసీలే ఉన్న కారణంగా అక్కడ ఎన్నిక జరపలేదు. కాగా, మహదేవపూర్‌లో మెజార్టీ ఎంపీటీసీలు గైర్హాజరు కావడంతో ఎన్నిక వాయిదా వేశారు. అలాగే ఎంపీపీల ఎన్నికకు ముందు కోఆప్షన్ సభ్యులను ఎన్నుకున్నారు. అయితే, తరిగొప్పుల మండలం కోఆప్షన్ పదవికి ఎవరూ నామినేషన్ వేయకపోవడంతో అక్కడా ఎంపీపీ ఎన్నిక వాయిదా వేశారు. వరంగల్ అర్బన్, రూరల్‌లో క్లీన్ స్వీప్ మండల పరిషత్ అధ్యక్షుల ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ములుగు రెండు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మూడు కలిపి ఐదు ఎంపీపీ స్థానాలను కైవసం చేసుకుంది. ఇక మహబూబాబాద్ జిల్లాలో రెండు, జనగామ, వరంగల్ రూరల్ జిల్లాల్లో ఒక్కో స్థానాన్ని కాంగ్రెస్ ఖాతాలో వేసుకుంది. ఇక వరంగల్ అర్బన్ జిల్లాల్లో మాత్రం టీఆర్ఎస్ మొత్తం స్థానాలను గెలుచుకుని క్లీన్‌స్వీప్ చేసింది. ఈ జిల్లాలో మొత్తం ఏడు మండల పరిషత్‌లకు ఎన్నికలు జరగ్గా.. ఏడు చోట్లా టీఆర్ఎస్ అభ్యర్థులే ఎంపీపీలుగా ఎన్నికయ్యారు. వరంగల్ రూరల్ జిల్లాలో మొత్తం 16 మండలాలకు గాను 15 మండలాల్లో గులాబీ జెండా ఎగరగా.. గీసుకొండ ఎంపీపీగా కాంగ్రెస్ ఎంపీటీసీ ఎన్నికయ్యారు. జనగామ జిల్లాలో 12 ఎంపీపీలకు 10 చోట్ల టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించగా, తరిగొప్పుల ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది. రఘునాథపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి మేకల వీరలక్ష్మి ఎంపీపీగా ఎన్నికయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మొత్తం 11 ఎంపీపీలకు చిట్యాల, రేగొండ, టేకుమట్ల, భూపాలపల్లి, మొగుళ్లపల్లిల్లో టీఆర్ఎస్, మహాముత్తారం, కాటారం, మల్హర్‌లో కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఘనపురంలో ఏఐఎఫ్బీ అభ్యర్థి విజయం సాధించారు. ఈ జిల్లాలోని పలిమెల ఎంపీపీ ఎన్నిక రద్దు కాగా, మహదేవపూర్ ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది. ములుగు జిల్లాలో ఎనిమిది మండల పరిషత్‌లకు ఆరు టీఆర్ఎస్ గెలుచుకోగా, కన్నాయగూడెం, వెంకటాపురం(కె)ల్లో కాంగ్రెస్ ఎంపీటీసీలు ఎంపీపీలు ఎన్నికయ్యారు. అలాగే, మహబూబాబాద్ జిల్లాలో 16 స్థానాలకు 14 టీఆర్ఎస్, 2 కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. -
మండల పరిషత్‌లపై గులాబీ జెండా
సాక్షి, రంగారెడ్డి జిల్లా: మండల పరిషత్‌లపై గులాబీ జెండా రెపరెపలాడింది. జిల్లాలో అత్యధిక ఎంపీపీ స్థానాలు టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. టీఆర్ఎస్ పార్టీకి చెందిన 13 మంది ఎంపీటీసీలు మండల పరిషత్ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌కు అబ్దుల్లాపూర్‌మెట్, కడ్తాల్, మంచాల ఎంపీపీలు దక్కగా.. బీజేపీ కందుకూరు, యాచారం స్థానాలను గెలుచుకుంది. ఒక స్థానాన్ని ఆల్ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ (ఏఐఎఫ్బీ) ఎగురేసుకుపోయింది. కోరం లేకపోవడంతో మరో రెండు చోట్ల ఎన్నిక వాయిదా పడింది. కాగా, ఎంపీపీ ఎన్నిక సందర్భంగా పలు చోట్ల నాటకీయ పరిణామాలు చేటుచేసుకున్నాయి. టీఆర్ఎస్ ఎంపీటీసీలు.. కాంగ్రెస్‌కు, కాంగ్రెస్ వాళ్లు టీఆర్ఎస్కు ఓట్లేశారు. ఇంకొన్ని చోట్ల గురువారం రాత్రి వరకు శిబిరాల్లో ఉన్న ఎంపీటీసీలు.. తీరా ఎన్నికకు గైర్హాజరయ్యారు. మరికొందరు ఒక పార్టీ తరఫున ఎంపీటీసీగా గెలిచి.. ఎంపీపీగా ఎన్నికకాగానే గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారు. కారు స్పీడు 11 నుంచి 13కు.. టీఆర్ఎస్ పార్టీ 20 ఎంపీపీ స్థానాల్లో పాగా వేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పటికీ సాధ్యపడలేదు. కాంగ్రెస్, బీజేపీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో టీఆర్ఎస్ స్థానాలు తగ్గాయి. ఒకటి రెండు మండలాల్లో టీఆర్ఎస్కు బలం ఉన్నప్పటికీ స్థానాలను దక్కించుకోవడంలో విఫలమైంది. ఆ అవకాశాన్ని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సద్వినియోగం చేసుకున్నాయి. అధికారికంగా టీఆర్ఎస్ 11 ఎంపీపీ స్థానాలను మాత్రమే గెలుచుకుంది. అయితే, కొత్తూరు ఎంపీపీగా గెలిచిన కాంగ్రెస్ ఎంపీటీసీ పిన్నింటి మధుసూదన్‌రెడ్డి.. అప్పటికప్పుడే కారెక్కారు. కొందుర్గు ఎంపీపీగా> విజయం సాధించిన స్వతంత్ర ఎంపీటీసీ పోతురాజు జంగయ్యకు టీఆర్ఎస్ బీ–ఫారం అందజేసింది. ఇలా వీరిద్దరు అనూహ్యంగా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో అధికార పార్టీ ఎంపీపీల సంఖ్య 13కు చేరుకుంది. ఇక కోరం లేకపోవడంతో ఆమనగల్లు, మాడ్గుల ఎన్నికలను ప్రిసైడింగ్ అధికారులు వాయిదా వేశారు. ఈ రెండు మండలాల్లో టీఆర్ఎస్కు స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ ఎంపీపీ అభ్యర్థిపై సభ్యుల్లో ఏకాభిప్రాయం కుదరలేదు. నేనంటే.. నేను అని ఎంపీటీసీలు పోటీపడటంతో ఎన్నిక ప్రక్రియను అధికారులు నిలిపివేశారు. దీంతో ఎంపీటీసీలు ఎన్నికకు దూరంగా ఉండటంతో కనీసం కోఆప్షన్ సభ్యుల ఎన్నిక కూడా జరగలేదు. ఎన్నికల సంఘం త్వరలో సూచించే తేదీన ఈ రెండు మండలాల్లో ఎన్నికలు జరుగుతాయని ప్రిసైడింగ్ అధికారులు పేర్కొన్నారు. ఉపాధ్యక్షుల్లో టీఆర్ఎస్కు తగ్గిన బలం.. మండల పరిషత్ ఉపాధ్యక్షుల ఎన్నికకు వచ్చేసరికి టీఆర్ఎస్ బలం తగ్గింది. ఆ పార్టీ ఎంపీటీసీలు 7 మండలాల్లో మాత్రమే వైస్ ప్రసిడెంట్లుగా ఎన్నికయారు. అనూహ్యంగా స్వతంత్రులు ఏడు స్థానాల్లో పాగా వేశారు. ఇక కాంగ్రెస్ మూడు స్థానాలతో సరిపెట్టుకోగా.. బీజేపీకి ఒక్కటి కూడా దక్కలేదు. ఏఐఎఫ్బీ పార్టీ తరఫున ఒకరు వైస్ ఎంపీపీ పదవిని దక్కించుకున్నారు. కోరం లేకపోవడం, అభ్యర్థులపై ఎంపీటీసీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఆమనగల్లు, మాడ్గుల, నందిగామ, శంషాబాద్ మండలాల్లో ఉపాధ్యక్షుల ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఆమనగల్లు, మాడ్గులలో తప్ప మిగిలిన 19 మండలాల్లోకోఆప్షన్ సభ్యుల ఎన్నిక పూర్తయింది. -
జెడ్పీ చైర్‌పర్సన్‌గా గండ్ర జ్యోతి!
సాక్షి, వరంగల్ రూరల్: రూరల్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవి గండ్ర జ్యోతికి దక్కనుంది. జిల్లాలో 16 జెడ్పీటీసీలకు మూడు దశల్లో మే 6, 10, 14 తేదీల్లో ఎన్నికలు జరిగాయి. ఈ నెల 4న ఎన్నికల ఫలితాలను ప్రకటించారు. 16 జెడ్పీటీసీలకు 16 జెడ్పీటీసీలను టీఆర్ఎస్ గెలుపొంది క్లీన్ స్వీప్ చేసింది. గెలుపొందిన జెడ్పీటీసీలను వెంటనే టీఆర్ఎస్ పార్టీ నాయకులు క్యాంపునకు తీసుకవెళ్లారు. శనివారం ఉదయం 9గంటలకు వరంగల్ రూరల్ కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జెడ్పీచైర్‌పర్సన్ ఎన్నిక జరగనుంది. ఇప్పటికే జిల్లా యంత్రాంగం ఎన్నికకు అన్ని ఏర్పాట్లు చేసింది. చైర్‌పర్సన్‌తో పాటు వైఎస్ చైర్మన్, కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక జరుగుతుంది. జ్యోతికే చాన్స్ శాయంపేట జెడ్పీటీసీ సభ్యురాలుగా గండ్ర జ్యోతి ఎన్నికయ్యారు. ఇటీవల కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో గండ్ర జ్యోతి చేరారు. ఇటీవల టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి కలిశారు. గండ్ర జ్యోతికి జెడ్పీచైర్‌పర్సన్‌గా అవకాశం కల్పిస్తామని కేటీఆర్ హమీ ఇచ్చినట్లు తెలిసింది. దీంతో వెంటనే టీఆర్ఎస్లో చేరి ఆ పార్టీ తరఫున జెడ్పీటీసీ సభ్యురాలుగా నామినేషన్ వేసింది. 10వేల మెజార్టీతో శాయంపేట జెడ్పీటీసీగా గెలుపొందారు. దీంతో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా గండ్ర జ్యోతికి చాన్స్ దక్కనుంది. జ్యోతి టీఆర్ఎస్లో చేరకుముందు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు అందరు ఏకాభిప్రాయంతో నర్సంపేట నియోజకవర్గానికి జెడ్పీచైర్‌పర్సన్‌గా అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. జ్యోతి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో సీన్ రివర్స్ అయింది. జెడ్పీ చైర్పర్సన్ ఎన్నికకు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డికి ఇన్చార్జి బాధ్యతలను పార్టీ అధిష్టానం అప్పగించింది. -
‘గులాబీ’కే పీఠాలు
సాక్షిప్రతినిధి, ఖమ్మం: కారు జోరుమీదుంది. పరిషత్ ఎన్నికల్లోనూ విజయకేతనం ఎగురవేసింది. 20 మండల పరిషత్‌లకుగాను.. 17 మండలాధీశుల పదవులను కైవసం చేసుకుంది. సంఖ్యాపరంగా టీఆర్ఎస్కే బలం ఉన్నా.. ఎంపీపీ పదవిపై నెలకొన్న పోటీ వల్ల ఎంపీటీసీ సభ్యులు మండల పరిషత్ సమావేశానికి హాజరుకాకపోవడంతో కూసుమంచి ఎంపీపీ ఎన్నిక కోరం లేక వాయిదాపడింది. దాదాపు జిల్లా చరిత్రలోనే మొదటిసారిగా మండల పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఖాతా తెరవలేకపోయింది. 2014 ఎన్నికల్లో అనేక ఎంపీపీ పదవులను గెలుచుకున్న కాంగ్రెస్ ఈసారి ఒక్క ఎంపీపీ పదవిని సైతం చేజిక్కించుకోలేదు. అయితే బోనకల్, ఏన్కూరులో ఆ పార్టీ బలపరిచిన సీపీఎం, టీడీపీ అభ్యర్థులు ఎంపీపీలుగా ఎన్నికయ్యారు. టీఆర్ఎస్ మాత్రం మెజార్టీ మండలాల్లో అప్రతిహతంగా తన విజయాన్ని కొనసాగించింది. కూసుమంచిలో ఎంపీపీ పదవిని టీఆర్ఎస్కు చెందిన బాలాజీనాయక్‌కు ఇవ్వాలని కోరుతూ ఆయన మద్దతుదారులు కూసుమంచిలోని ఎమ్మెల్యే కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ పదవికి శ్రీనునాయక్, బాలాజీనాయక్ పోటీ పడుతుండడంతో ఇద్దరూ ఒక అవగాహనకు వచ్చి.. ఎన్నికకు మార్గం సుగమం చేయాలని వారికి ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి సూచించారు. దీంతో పదవీ కాలాన్ని చెరి సగం పంచుకోవాలని భావించినా.. ముందు ఎవరు పదవి చేపట్టాలనే అంశంపై సందిగ్ధత నెలకొనడంతో ఎంపీటీసీ సభ్యులు మండల పరిషత్ సమావేశానికి సకాలంలో చేరుకోలేదు. దీంతో ఎన్నికను శనివారానికి వాయిదా వేశారు. ఇక చింతకాని మండలంలో ఎంపీపీ ఎన్నిక రసవత్తరంగా మారింది. ఈ మండలంలో టీఆర్ఎస్, సీపీఎంలు మిత్రపక్షం గా వ్యవహరించి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేశాయి. జెడ్పీటీసీ టీఆర్ఎస్కు, ఎంపీపీ సీపీఎంకు ఇచ్చే విధంగా ఒప్పందం కుదిరింది. జెడ్పీటీసీని టీఆర్ఎస్ గెలుచుకుంది. ఎంపీపీ పదవిని టీఆర్ఎస్ మద్దతుతో సీపీఎం గెలుచుకునే అవకాశం ఉంది. అయితే టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన ఎంపీటీసీ పూర్ణయ్య పార్టీ విప్‌ను ధిక్కరించి ఎంపీపీ పదవికి నామినేషన్ వేయడంతో ఆయనకు కాంగ్రెస్, సీపీఐలకు చెందిన ఎంపీటీసీలు మద్దతు ప్రకటించారు. దీంతో అనూహ్య రీతిలో పూర్ణయ్య ఎంపీపీగా విజయం సాధించారు. అయితే పూర్ణయ్య పార్టీ విప్‌ను ధిక్కరించారంటూ పార్టీ మండల నాయకులు ఎంపీడీఓకు ఫిర్యాదు చేశారు. ఇక కారేపల్లి ఎంపీపీ పదవి కోసం టీఆర్ఎస్లో తీవ్ర పోటీ నెలకొంది. ఈ పదవి కోసం ముగ్గురు ఎంపీటీసీలు పోటీ పడ్డారు. టీఆర్ఎస్ ఎంపీటీసీ సభ్యురాలు మాలోతు శకుంతల, భాగ్యనగర్‌తండా నుంచి ఎంపీటీసీగా గెలుపొందిన ఈశ్వరీనందరాజ్తోపాటు గుంపెళ్లగూడెం ఎంపీటీసీ ధరావత్ అచ్చమ్మ ఎంపీపీ పదవి కోసం పోటీ పడ్డారు. అయితే టీఆర్ఎస్ పార్టీ నుంచి శకుంతలను ఎంపిక చేసినట్లు మిగిలిన ఇద్దరికి నాయకులు నచ్చజెప్పడంతో ఎన్నిక ప్రక్రియ సజావుగా సాగింది. ప్రశాంతంగా ఉపాధ్యక్ష, కోఆప్షన్ సభ్యుల ఎన్నిక.. ఇక జిల్లాలో ఉపాధ్యక్ష, కోఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రశాంతంగా జరిగింది. బోనకల్, ఏన్కూరులలో మండల పరిషత్ ఉపాధ్యక్ష పదవిని కాంగ్రెస్ కైవసం చేసుకోగా.. ముదిగొండ ఉపాధ్యక్ష పదవిని సీపీఎం దక్కించుకుంది. వైరా ఉపాధ్యక్షురాలిగా ఎంపీటీసీగా టీఆర్ఎస్ రెబల్‌గా పోటీ చేసిన లక్ష్మీనరసమ్మ విజయం సాధించింది. మండల పరిషత్ ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం కోఆప్షన్ సభ్యుల ఎన్నిక నిర్వహించిన అధికారులు మధ్యాహ్నం మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నికలు నిర్వహించారు. కాంగ్రెస్ కైవసం చేసుకున్న జెడ్పీటీసీలైన తిరుమలాయపాలెం, కామేపల్లిలో సైతం టీఆర్ఎస్ అభ్యర్థులే ఎంపీపీలుగా గెలుపొందారు. బోనకల్లో మాత్రం కాంగ్రెస్, సీపీఎం కూటమికి ఎంపీపీ పదవి దక్కింది. ఇక కారేపల్లి మండల పరిషత్ ఉపాధ్యక్ష పదవిని టీఆర్ఎస్ తరఫున ఇమ్మడి రమాదేవికి ఇచ్చేందుకు నిర్ణయించగా.. అప్పటికే ఏకాభిప్రాయానికి వచ్చిన 8 మంది ఎంపీటీసీలు రావూరి శ్రీనివాసరావుకే వైస్ ఎంపీపీ పదవి ఇవ్వాలని పట్టుబట్టారు. ఈ క్రమంలో కారేపల్లికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు, స్థానిక వార్డు సభ్యుడు గంగరబోయిన సత్యం పెట్రోల్ బాటిల్‌ను తీసుకొచ్చి.. రావూరికి వైస్ ఎంపీపీ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని పెట్రోల్ మీద పోసుకోబోగా.. కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఎంపీటీసీ సభ్యుల నిర్ణయం మేరకు రావూరి శ్రీనివాసరావుకు వైస్ ఎంపీపీ పదవిని కేటాయించారు. -
విలీనంతో వీక్!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఒకప్పుడు జిల్లాను శాసించిన కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ప్రాతినిధ్యం కరువైంది. కాంగ్రెస్‌కు ఆశాకిరణాలుగా భావించిన ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, పైలెట్ రోహిత్‌రెడ్డిలు పార్టీని వీడి కారెక్కడం హాట్ టాపిక్‌గా మారింది. సీఎల్పీని అధికార టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేయాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి గురువారం వినతిపత్రం అందజేశారు. వినతిపత్రం సమర్పించిన వారి జాబితాలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఉండటం చర్చనీయాంశమైంది. వీరి విజ్ఞప్తిని స్పీకర్ ఆమోదించారు. ఇకపై వీరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా కొనసాగుతారు. మొన్నటి శాసనసభ ఎన్నికల తర్వాత మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్కు దగ్గరయ్యారు. సీఎం కేసీఆర్‌తో సైతం ఆమె భేటీ అయ్యారు. అయితే తన కుమారుడి రాజకీయ భవిష్యత్‌తో పాటు తనకు మంత్రి పదవి ఇస్తారన్న హామీ మేరకు ఆమె టీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధపడినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కొన్ని రోజులకే ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా ఆమెను అనుసరించారు. ఆ వెంటనే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో భేటీ కావడంతో ఆయన పార్టీ మారడంపై స్పష్టత వచ్చింది. హస్తం గుర్తుపై ఎమ్మెల్యేలుగా గెలిచిన వీరిద్దరూ అప్పటి నుంచి కాంగ్రెస్‌కు దూరంగా ఉంటూ వచ్చారు. టీఆర్ఎస్ నాయకులతో సత్సంబంధాలు కొనసాగించడంతోపాటు లోక్‌సభ, ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయానికి కృషిచేశారు. మరోపక్క ఏడాది కిందట టీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురై కాంగ్రెస్ గూటికి చేరిన వికారాబాద్ డీసీసీ అధ్యక్షులు, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి కూడా తిరిగి సొంత గూటికి చేరారు. అనూహ్యంగా సీఎల్పీని విలీనం చేయాలని విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యేల్లో ఈయన ఒకరు కావడం రాజకీయంగా పెనుదుమారం రేపింది. కాగా, సాంకేతికంగా ఈ ముగ్గురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే. అయితే సీఎల్పీ విలీనానికి స్పీకర్ ఆమోదం తెలపడంతో అధికారికంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా పరిగణిస్తారు. ఆత్మస్థైర్యం నింపితేనే.. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ జిల్లాలో కష్టాల్లో చిక్కుకుంది. మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో చాలా మంది కాంగ్రెస్ నాయకులు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ జాబితాలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు సైతం ఉన్నారు. ఆ తర్వాత తమ నియోజకవర్గాల అభివృద్ధి పేరిట ఎమ్మెల్యేలు సైతం కారెక్కారు. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బలహీన పడింది. అయినా పంచాయతీ ఎన్నికల్లో చెప్పుకోదగ్గ రీతిలో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు సర్పంచ్‌లుగా నెగ్గారు. ఆ తర్వాత చేవెళ్ల లోక్‌సభ స్థానం చేజారినప్పటికీ అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే అధిక సంఖ్యలో ఓట్లు రాబట్టింది. తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లోనూ కాంగ్రెస్ ఉనికి చాటుకుంది. 257 ఎంపీటీసీల్లో 73 స్థానాలను, 21 జెడ్పీటీసీలకుగాను.. నాలుగింటిని హస్తగతం చేసుకుంది. ఈ ఫలితాలను విశ్లేషిస్తే నాయకులు, ఎమ్మెల్యేలు పార్టీలు మారినా ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు చెక్కుచెదరలేదని తెలుస్తోంది. అయితే, టీఆర్ఎస్లో సీఎల్పీ విలీనం, జిల్లాకు చెందిన ముగ్గురు కీలక నేతలు అధికారికంగా కారెక్కడంతో పార్టీ బలహీనపడినట్టే. ఈ పరిణామంతో పార్టీ శ్రేణులు అంతర్మథనంలో పడ్డారు. -
మండల పరిషత్ బాద్‌షాలెవరో
సాక్షి, రంగారెడ్డి జిల్లా: స్థానిక సంస్థల్లో కీలకమైన మండల పరిషత్ అధ్యక్షుల ఎన్నిక శుక్రవారం జరగనుంది. వీలైనన్ని ఎక్కువ ఎంపీపీ పదవులను సొంతంచేసుకోవాలన్న లక్ష్యంతో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు క్యాంప్‌లు జోరుగా నిర్వహిస్తున్నాయి. క్యాంపుల్లో ఉన్న ఎంపీటీసీ సభ్యులను శుక్రవారం నేరుగా ఎన్నిక నిర్వహించే మండల పరిషత్ కార్యాలయాలకు తరలించేందుకు ఆయా పార్టీలు ఏర్పాట్లు చేసుకున్నాయి. కొన్ని మండలాల్లో ఎంపీపీ స్థానాలను దక్కించుకునేందుకు అవసరమైన సంఖ్యాబలం ఇరుపార్టీలకు ఉన్నా.. ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వొద్దని ముందు జాగ్రత్తగా ఎంపీటీసీలను ఒక చోటుకు చేర్చారు. ఇంకొన్ని మండలాల్లో సంఖ్యాబలం లేకున్నా ఎంపీపీ పీఠాలను సొంతం చేసుకునేందుకూ టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు క్యాంప్ నిర్వహించాయి. కొన్నిచోట్ల కీలకంగా మారిన చిన్నాచితక పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులతో ఆయా పార్టీలు బేరసారాలు జరుపుతున్నాయి. జిల్లాలో 21 మండలాల్లో 9 ఎంపీపీ స్థానాలు దక్కించుకునేందుకు టీఆర్ఎస్ పార్టీకి సంఖ్యాబలం ఉంది. ఇక.. మ్యాజిక్ ఫిగర్‌కు చేరువలో ఉన్న మండలాలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీరియస్‌గా దృష్టి కేంద్రీకరించారు. ఆ స్థానాలను చేజిక్కించుకునేందుకు ఆపరేషన్ ఆకర్‡్ష మొదలుపెట్టారు. కాంగ్రెస్ పార్టీ కూడా 10 ఎంపీపీ స్థానాలపై గురిపెట్టింది. ఇప్పటివరకు అబ్దుల్లాపూర్‌మెట్ మాత్రమే ఆ పార్టీ చేతిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిపోను చేవెళ్ల, మంచాల, కొందుర్గు, చౌదరిగూడ, కొత్తూరు, మాడ్గుల, కడ్తాల్, యాచారం, ఫరూఖ్‌నగర్ ఎంపీపీ స్థానాలను దక్కించుకోవాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇక్కడ అధికార పార్టీ ఎంపీటీసీలకు కూడా గాలం వేసినట్లు తెలుస్తోంది. తమకు మద్దతు ఇస్తే ఎంపీపీ పదవి సైతం కట్టబెడతామన్న ఆఫర్ కూడా ఇచ్చినట్లు సమాచారం. ఇక బీజేపీ.. మహేశ్వరం, కందుకూరు ఎంపీపీ స్థానాలను కైవసం చేసుకోవాలని పావులు కదుపుతోంది. టీఆర్ఎస్ ఎంపీటీసీలను, స్వతంత్రులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. కోఆప్షన్ సభ్యులకు పోటాపోటీ.. ప్రతి మండలానికి ఒకరి చొప్పున కోఆప్షన్ సభ్యునిడిని ఎన్నుకుంటారు. ఈ పదవులకు తీవ్ర పోటీ నెలకొంది. ఎంపీటీసీలతోపాటు సమానంగా వీరికి గౌరవం లభిస్తుండటం, గౌరవ వేతనం అందుతుండడం.. సర్వసభ్య సమావేశాల్లో సైతం చర్చల్లో పాల్గొనే అవకాశం ఉండటం తదితర సానుకూలతల నేపథ్యంలో ఈ పదవులను కోరుకుంటున్నారు. వీరికి ఓటు హక్కుమాత్రం ఉండదు. స్థానిక మండలంలో ఓటరుగా నమోదై ఉంటే ఈ పదవికి అర్హులు. ఈ క్రమంలో కోఆప్షన్ పదవుల కోసం పార్టీ పెద్దల ఆశీస్సుల కోసం ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. జిల్లాపరిషత్‌లో కోఆప్షన్ సభ్యులు ఇద్దరు ఉంటారు. అన్నింటికీ కోరం తప్పనిసరి కోఆప్షన్ సభ్యుని ఎన్నికతోపాటు ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలకు కోరం తప్పనిసరి. మండల పరిధిలోని మొత్తం ఎంపీటీసీల్లో కనీసం 50 శాతం సభ్యులు ఉంటేనే ఎన్నిక నిర్వహిస్తారు. తగిన కోరం లేకుంటే ఎన్నికను మరుసటి రోజుకు ప్రిసైడింగ్ అధికారి వాయిదా వేస్తారు. ఆ తర్వాత రోజు కూడా కోరం లేకపోతే ఎన్నికల సంఘం ఓ తేదీని సూచిస్తుంది. ఆ రోజున కోరం లేకున్నా ఎంపీపీ, వైస్ ఎంపీపీని ఎన్నుకుంటారు. ఆ మూడు చోట్ల తాత్కాలిక భవనాల్లో.. మూడు మండలాల్లో ఎంపీపీల ఎన్నిక నిర్వహించేందుకు తాత్కాలిక భవనాలను సిద్ధం చేశారు. కొత్తగా మండలాలుగా ఏర్పడిన నందిగామ, కడ్తాల్, చౌదరిగూడలో మండల పరిషత్ భవనాలు లేవు. ఈ నేపథ్యంలో ఎంపీపీల ఎన్నికకు అందుబాటులో ఉన్న భవనాలను తాత్కాలికంగా వినియోగించుకుంటున్నారు. నందిగామలో జిల్లా పరిషత్ హైస్కూల్లో, కడ్తాల్, చౌదరిగూడ మండలాల్లో స్థానిక గ్రామ పంచాయతీ భవనాల్లో ఎన్నిక జరుగుతుంది. రేపు జిల్లాపరిషత్ ఎన్నిక ఇక జెడ్పీ చైర్పర్సన్, వైస్ చైర్మన్, ఇద్దరు కోఆప్షన్ సభ్యుల ఎన్నిక కూడా.. ఎంపీపీల ఎన్నిక తరహాలోనే జరుగుతుంది. లక్డీకపూల్‌లోని జెడ్పీ సమావేశ మందిరంలో శనివారం ఈ ఎన్నిక నిర్వహిస్తారు. ఈ ఎన్నికకు ప్రిసైడింగ్ అధికారిగా కలెక్టర్ వ్యవహరిస్తారు. -
వీడనున్న పీటముడి!
సాక్షి ప్రతినిధి, వరంగల్: జిల్లా పరిషత్ చైర్మన్లు, మండల పరిషత్ అధ్యక్ష పదవులు ఎవరికి దక్కనున్నాయనే అంశంపై నెలకొన్న సస్పెన్స్ శుక్రవారం ఉదయానికి వీడిపోనుంది. ఉమ్మడి వరంగల్‌లోని ఆరు జిల్లా పరిషత్ చైర్మన్లు గెలుచుకునేంత స్థాయిలో స్పష్టమైన మెజార్టీ టీఆర్ఎస్కు లభించింది. దీంతో పాటు 70కి 70 ఎంపీపీ స్థానాలను కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో ఆ పార్టీ అధిష్టానం పావులు కదుపుతోంది. ఇందులో 62 ఎంపీపీ స్థానాలకు గాను సరిపడా సంఖ్యాబలం ఉన్నప్పటికీ మిగతా ఎనిమిది స్థానాలను కూడా దక్కించుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఇందుకోసం స్వతంత్రులు, ఇతర పార్టీల నుంచి గెలిచిన వారితో మంతనాలు జరుపుతున్నారు. కాగా, ఉమ్మడి జిల్లాలోని 70 మంది జెడ్పీటీసీల్లో 62 మందిని, 781 ఎంపీటీసీ సభ్యుల్లో 541కి పైగా సభ్యులను క్యాంపులకు తరలించారు. నేడు ఎంపీపీల ఎన్నిక ఎంపీపీల ఎన్నిక శుక్రవారం జరగనుండగా ఉదయం 10 గంటల నుంచి ప్రక్రియ మొదలవుతుంది. అధికారికంగా సాయంత్రం 4 గంటలకు ఎంపీపీని ప్రకటించనున్నారు. ఇక శనివారం జిల్లా పరిషత్ చైర్మన్ల ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు నేతృత్వంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో సమాలోచన చేసిన అనంతరం చైర్మన్లు, అధ్యక్షులపై ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. చైర్మన్లు, అధ్యక్షుల పేర్లను సీల్డ్ కవర్లో ఎన్నికలకు కొద్ది గంటల ముందు జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులకు ఇన్‌చార్జ్‌లకు చేరవేస్తే.. ఆ మేరకు చైర్మన్లు, అధ్యక్షులను ఎన్నుకుంటారు. విడుదలైన నోటిఫికేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆరు జిల్లా పరిషత్ చైర్మన్లు, 70 మండల పరిషత్ అధ్యక్ష పదవుల ఎన్నికలు శుక్రవారం, శనివారం న్నికలు జరగనున్నాయి. మండల పరిషత్ అధ్యక్ష పదవి ఎన్నికకు గురువారం నోటిఫికేషన్ విడుదల కాగా, జెడ్పీ చైర్మన్ ఎన్నికలకు రేపు ప్రకటన విడుదల చేయనున్నారు. ఈ ఎన్నికలకు కొన్ని గంటల ముందే చైర్మన్లు, అధ్యక్షులెవరనే అంశంపై స్పష్టత రానుంది. మూడు ఓకే... ములుగు జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా కుసుమ జగదీష్ పేరును మొదటల్లోనే ప్రకటించగా, ఇటీవల కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన గండ్ర వెంకటరమణారెడ్డి భార్య గండ్ర జ్యోతికి వరంగల్ రూరల్ జెడ్పీ చైర్మన్ ఇచ్చేందుకు ఒప్పందం జరిగినట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆమె శాయంపేట జెడ్పీటీసీ బరిలోకి దిగి విజయం సాధించారు. వరంగల్ అర్బన్‌కు సంబంధించి ఎల్కతుర్తి నుంచి జెడ్పీటీసీగా గెలుపొందిన భీమదేవరపల్లికి చెందిన డాక్టర్ సుధీర్‌కుమార్ పేరు ఖాయం చేసినట్లు చెబుతున్నారు. ఈ మూడు మినహాయిస్తే మహబూబాబాద్, జనగామ, భూపాలపల్లి జయశంకర్ జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థులపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఎస్సీ మహిళకు కేటాయించిన భూపాలపల్లి జయశంకర్ జెడ్పీ చైర్మన్ పీఠం కోసం జక్కు శ్రీహర్షిణి(కాటారం జెడ్పీటీసీ) పేరు ఖరారైనట్లు గురువారం ప్రచారం మొదలైంది. జనగామ జెడ్పీ చైర్మన్ కోసం జనగామ, చిల్పూరు, లింగాల గణపురం, తరిగొప్పుల నుంచి జెడ్పీటీసీలుగా గెలిచిన నిమ్మతి దీపికారెడ్డి, పాగాల సంపత్ రెడ్డి, గుడి వంశీధర్‌రెడ్డి, ముద్దసాని పద్మజారెడ్డి జెడ్పీ చైర్మన్ కోసం పదవి పోటీపోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మహబూబాబాద్ జెడ్పీ చైర్మన్ కోసం మొదటి నుంచి ఎమ్మెల్యే రెడ్యా నాయక్ కోడలు నిత్య రవిచంద్ర పేరు వినిపించినా ఆమె పోటీకే దిగలేదు. ప్రస్తుతం గూడూరు, బయ్యారం, నర్సింహులపేట నుంచి జెడ్పీటీసీలుగా గెలిచిన గుగులోతు సుచిత్ర, అంగోతు బిందు, భూక్యా సంగీత నడుమ పోటీ ఉన్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఆరుగురు జెడ్పీ చైర్మన్లతోపాటు మండల పరిషత్ అధ్యక్షులెవరనేది ఎన్నికకు కొద్దిగంటల ముందు మాత్రమే వెల్లడి కానుంది. క్యాంపుల్లో ఇన్‌చార్జ్‌ల చర్చలు ఆరు జెడ్పీ పీఠాలు, మొత్తానికి మొత్తం మండల పరిషత్‌లను కైవసం చేసుకోవాలనే వ్యూహంతో ఫలితాలు వెలువడిన రోజునే జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులను అధికార టీఆర్ఎస్ పార్టీ క్యాంపులకు తరలించింది. హైదరాబాద్‌తో పాటు చుట్టూ ఉన్న రిసార్ట్‌లతో పాటు యాదగిరిగుట్ట, పాపికొండలు తదతర ప్రాంతాల్లో ఈ క్యాంపులు కొనసాగుతున్నాయి. జెడ్పీ చైర్మన్, మండల పరిషత్ అధ్యక్షుల ఎన్నికపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమై చర్చించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలుపొందిన పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డిని బుధవారం తీసుకెళ్లిన మంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యేలు కేటీఆర్, కేసీఆర్‌ను కలిసిన అనంతరం ఈ అంశంపై కూడా చర్చించినట్లు తెలిసింది. అంతే కాకుండా వైస్ చైర్మన్లు, కో–ఆప్షన్ సభ్యుల ఎన్నికపై కూడా మంతనాలు జరిపినట్లు సమాచారం. ఇదే సమయంలో అన్నీ జెడ్పీ చైర్మన్ల ఎంపిక ప్రక్రియను సమన్వయం చేసేందుకు ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరిస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎంపీ బండా ప్రకాష్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, పెద్ది సుదర్శన్‌రెడ్డిలు క్యాంపుల్లో ఉన్న జెడ్పీటీసీ, ఎంపీటీసీలతో చర్చలు జరిపి ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. దీనికి తోడు ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతల అభిప్రాయాలు, అధినేత కేసీఆర్ సూచన మేరకు శుక్రవారం ఉదయమే ఎంపీపీలు, వైస్ ఎంపీపీ, కో–ఆప్షన్ సభ్యుల పేర్లు, శనివారం ఉదయం జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్, కో–ఆప్షన్ సభ్యుల పేర్లను సీల్డ్ కవర్ల ద్వారా వెల్లడించేందుకు సన్నాహాలు చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం. -
రసవత్తరం మండల రాజకీయం..
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలో మొత్తం 27 మండల పరిషత్‌లు ఉండ గా 19 మండల పరిషత్ అధ్యక్ష స్థానాలను దక్కించుకునేందుకు స్పష్టమైన మెజారిటీ పరిషత్ ఎన్నికల్లో గులాబీ పార్టీకి దక్కింది. మిగిలిన ఎనిమిదింటిలో ఒక్క చందూరు ఎంపీపీ కాంగ్రెస్‌కు దక్కే మెజారిటీ ఉంది. ఏడు చోట్ల టీఆర్ఎస్ పార్టీకి స్వతంత్రులు గానీ, కాంగ్రెస్, బీజేపీలకు చెందిన ఒకరిద్దరు సభ్యుల మద్దతు అవసరం ఏర్పడింది. దీంతో ఆయా మండలాల్లో స్వతంత్ర ఎంపీటీసీలు, ఇతర పార్టీల సభ్యుల మద్దతును ఇప్పటికే కూడగట్టిన గులాబీ నేతలు దాదాపు అన్ని మండలాల అధ్యక్ష పదవులను దక్కించుకునేందుకు పావులు కదిపారు. ఈ మేరకు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యే లు బాధ్యతలు తీసుకున్నారు. తమ పార్టీ ఎంపీటీసీలతో పాటు, ఇతర ఎంపీటీసీలను కూడా క్యాంపునకు తరలించారు. శుక్రవారం ఎంపీటీసీ సభ్యులను నేరుగా మండల పరిషత్ సమావేశాలకు తరలించనున్నారు. చందూరు కోసం.. జిల్లాలోనే అతి చిన్న మండలమైన చందూరు ఎంపీపీ స్థానం ఎస్టీకి రిజర్వు అయింది. ఈ మండలంలో మూడు ఎంపీటీసీ స్థానాలున్నాయి. ఇందులో ఒకటి టీఆర్ఎస్కు రాగా, మిగిలిన రెండింటిలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఒక్క ఎంపీటీసీ మద్దతుంటే చాలు ఎంపీపీ అయిపోవచ్చు. ఇక్కడ కాంగ్రెస్‌కు ఇద్దరు సభ్యులుండటంతో ఎంపీపీ స్థానం కాంగ్రెస్ కైవసం అవుతోంది. దీన్ని కూడా టీఆర్ఎస్ ఖాతాలో వేసుకునేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు చేశారు. దీన్ని ఎలాగైనా కాపాడుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ ఎంపీటీసీలిద్దరు పీసీసీ చీఫ్ ఉత్తంకుమార్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డిలను కలిశారు. మొత్తం మీద ఈ ఎంపీపీ స్థానం కాంగ్రెస్‌కు దక్కుతుందా., టీఆర్ఎస్ ఖాతాలోకి వెళుతుందా అనే అంశంపై నేడు స్పష్టత రానుంది. రెంజల్, నవీపేట్లో ఆసక్తికరం రెంజల్, నవీపేట్ ఎంపీపీ స్థానాల ఎన్నిక ఆసక్తికరంగా మారింది. ఈ రెండు మండలాల్లో కాంగ్రెస్, బీజేపీలు పరస్పరం మద్దతు ఇచ్చుకోవడం ద్వారా రెండు చోట్ల ఎంపీపీ పదవులను కైవసం చేసుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. 16 ఎంపీటీసీ స్థానాలున్న నవీపేట్లో కాంగ్రెస్‌కు ఐదు దక్కాయి, ఇక్కడ మూడు ఎంపీటీసీ స్థానాలను గెలుచుకున్న బీజేపీ, ఒక స్వతంత్ర ఎంపీటీసీ మద్దతుతో ఈ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకునేందుకు ప్రయత్నం జరుగుతోంది. ఇందుకు గాను రెంజల్లో కాంగ్రెస్ ఎంపీటీసీలు బీజేపీకి మద్దతు ఇవ్వాలనే అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద ఈ రెండు మండలాలు టీఆర్ఎస్కు దక్కకుండా కాంగ్రెస్, బీజేపీలు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ఏడు స్థానాల్లో .. మిగిలిన ఏడు మండల పరిషత్‌లను కైవసం చేసుకునేందుకు టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. ఏడింటిలోనూ టీఆర్ఎస్ ఎంపీటీసీలే గెలిచినప్పటికీ.. ఒకరిద్దరు ఎంపీటీసీల మద్దతు తప్పనిసరిగా మారింది. దీంతో స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగి గెలిచిన టీఆర్ఎస్ రెబల్ ఎంపీటీసీలను, కాంగ్రెస్, బీజేపీలకు చెందిన ఒకరిద్దరు ఎంపీటీసీలను క్యాంపునకు తరలించిన టీఆర్ఎస్ ఈ ఏడింటిని కూడా దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. మెండోరా ఎంపీపీ స్థానం ఎస్సీ మహిళకు రి జర్వు అయింది. ఇక్కడ ఒకే ఒక్క ఎస్సీ మహి ళ టీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీగా విజయం సాదించారు.దీంతోఈ ఎంపీపీ స్థానంటీఆర్ఎస్కే దక్కుతుంది. కాంగ్రెస్, బీజేపీ సభ్యుల మద్దతుతో గానీ, ఆ రెండు పార్టీల సభ్యులు ఓటింగ్‌లో గైర్హాజరుకావడంద్వారాగానీ ఈ ఎంపీపీ స్థానాన్ని టీఆర్ఎస్ దక్కించుకోనుంది. మోర్తాడ్ ఎంపీపీ స్థానాన్ని దక్కించుకునేందుకు టీఆర్ఎస్కు మరో ఎంపీటీసీ సభ్యుని మద్దతు అవసరం కాగా, స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన టీఆర్ఎస్ రెబల్ ఎంపీటీసీ మద్దతు కూడగట్టినట్లు సమాచారం. టీఆర్ఎస్ పార్టీకి ఆర్మూర్‌లో ఒక ఎంపీటీసీ, నందిపేట్‌లో ఇద్దరు ఎంపీటీసీల మద్దతు అవసరం ఉంటుంది. స్వతంత్ర ఎంపీటీసీలను టీఆర్ఎస్ క్యాంపునకు తరలించిన ఆ పార్టీ నేతలు ఈ రెండు ఎంపీపీ స్థానాలను కైవసం చేసుకోనున్నారు. ఎడపల్లిలో ఐదు స్థానాలను దక్కించుకున్న టీఆర్ఎస్, మరో ఇద్దరు స్వతంత్ర, కాంగ్రెస్ ఎంపీటీసీల మద్దతుతో ఈ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. -
నేడే ఎంపీపీల ఎన్నిక
సాక్షిప్రతినిధి, నల్లగొండ : మండల అధ్యక్షుల ఎన్నికకు అన్ని ఏర్పాట్లు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 31 మండలాల్లో మండల అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నిక శుక్రవారం ఆయా మండలాల్లో జరగనుంది. ఇప్పటికే మండల ప్రాదేశిక నియోజకవర్గాల (ఎంపీటీసీ)కు జరిగిన ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను అధికార టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. 31 మండలాల్లో 349 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగగా, టీఆర్ఎస్ అత్యధికంగా 191 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ 134 స్థానాలకు పరిమితమైంది. అయితే, మండల అధ్యక్ష పదవుల విషయానికి వస్తే.. టీఆర్ఎస్ ఖాతాల్లో 18 మండలాలు చేరనున్నాయి. మరో ఆరు మండలాల్లో కాంగ్రెస్ మండల అధ్యక్షులు కొలువు దీరనున్నారు. ఇంకో ఏడు మండలాల్లో మాత్రం ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాలేదు. దీంతో ఈ మండలాల్లో స్వతంత్రులు, ఇతర పార్టీలకు చెందిన ఎంపీటీసీ సభ్యుల పాత్ర కీలకం కానుంది. జిల్లాలో 31 మండలాల్లో ఎంపీపీ పదవుల కోసం ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నిక ల్లో గెలిచిన మొత్తం సభ్యుల్లో పార్టీలు నిర్ణయించిన 62మంది మండల అధ్యక్షులు, ఉపాధ్యక్షులుగా శుక్రవారం ఎన్నిక కానున్నారు. దీనికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. క్యాంపుల్లో ఉన్న వారంతా ఉదయం 10 గంటల వరకు నేరుగా ఎంపీడీఓ కార్యాలయాలకు చేరుకుంటారు. సభ్యులు చేతులు ఎత్తే పద్ధతి ద్వారా ఎంపీపీని ఎన్నుకోనున్నారు. ముందుగా కో–ఆప్షన్ సభ్యుల ఎన్నిక జరుగుతుంది. ఆ తర్వాత ఎంపీపీ, వైస్ ఎంపీపీల ఎన్నిక జరుగుతుంది. ఎన్నిక జరిగే కార్యాలయాలకు వంద మీటర్ల దూరం వరకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేíశారు. ఇక, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్కో మండలంలో ఒక్కో విధంగా అటు అధికార టీఆర్ఎస్, ఇటు ప్రతిపక్ష కాంగ్రెస్ ఆయా పార్టీలతో పొత్తులకు వెళ్లాయి. అయితే.. టీఆర్ఎస్ ఏ పార్టీ సహకారం లేకుండానే ఏకంగా 18 మండలాల్లో అధ్యక్ష పీఠాలను కైవసం చేసుకునే మెజారిటీని సాధించింది. ఆరు మండలాల్లో కాంగ్రెస్‌కు ఇదే స్థితి ఉంది. మిగిలిన ఏడు మండలాలకు సంబంధించి టీఆర్ఎస్ ఖాతాలో చేరే మండలాలే ఎక్కువగా ఉంటాయని ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. ఆ.. ఏడు చోట్ల ఉత్కంఠ! ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాని పెద్దవూర, వేములపల్లి, తిప్పర్తి, చండూరు, చిట్యాల , నకిరేకల్, కేతేపల్లి మండలాల్లో ఏ పార్టీకి చెందిన వారు అధ్యక్షులు అవుతారో..? విధిలేని పరిస్థితిలో మద్దతు తెలిపే వారే ఏకంగా పదవిని దక్కించుకుంటారో అన్న చర్చ జరుగుతోంది. వేములపల్లి మండలంలో 7 ఎంపీటీసీ స్థానాలను ఉన్నాయి. ఇక్కడ ఎంపీపీ పదవిని దక్కించుకోవాలంటే నాలుగు ఎంపీటీసీ సభ్యుల బలం ఉండాలి. కానీ, టీఆర్ఎస్ తరఫున ముగ్గురు సభ్యులు మాత్రమే విజయం సాధించారు. కాంగ్రెస్ నుంచి ఇద్దరు, సీపీఎం నుంచి ఒకరు విజయం సాధించారు. మరో స్వతంత్ర అభ్యర్ధి గెలిచారు. టీఆర్ఎస్ అధ్యక్ష స్థానాన్ని దక్కించుకోవాలంటే ఇండిపెండెంట్ ఒక్కరు మద్దతిస్తే చాలు. అదే కాంగ్రెస్ కైతే.. సీపీఎంతో పాటు, ఇండిపెండెంట్.. అంటే ఇద్దరి మద్దతు అవసరం ఉంది. పెద్దవూర మండలంలో 11 ఎంపీటీసీ స్థానాలున్నాయి. ఇక్కడ టీఆర్ఎస్, కాంగ్రెస్‌లు సమానంగా చెరో 5 స్థానాల్లో గెలిచాయి. మరో స్థానంలో ఇండిపెండెంట్ గెలిచారు. ఇప్పుడు ఈ రెండు పార్టీల్లో ఎవరు అధ్యక్షుడు కావాలన్నా, ఆ ఇండిపెండెంట్ మద్దతు తప్పని సరి. తిప్పర్తి మండంలోనూ ఇదే సీన్. ఇక్కడ 9 ఎంపీటీసీ స్థానాలుంటే టీఆర్ఎస్, కాంగ్రెస్‌లు సమానంగా చెరో 4 చోట్ల గెలిచాయి. ఒక ఇండిపెండెంట్ విజయం సాధించారు. ఆ ఇండిపెండెంట్ మద్దతు ఎవరికి దక్కింతే ఆ పార్టీకి మండల అధ్యక్ష పదవి వరించే అవకాశం ఉంది. చండూరు మండలంలో 11 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, ఆరు స్థానాలు గెలిచిన పార్టీకి మండల అధ్యక్ష పదవి దక్కుతుంది. కానీ, కాంగ్రెస్ 5 స్థానాలను గెలుచుకున్నా.. మరో సభ్యుడి కొరత ఏర్పడింది. ఇక్కడ టీఆర్ఎస్ 4 ఎంపీటీసీ స్థానాలను గెలచుకుంది. కాగా, సీపీఐ, బీజేపీలు చెరో స్థానంలో గెలిచాయి. ఈ రెండు పార్టీల్లో ఒకరు మద్దతిస్తే కాంగ్రెస్‌కు మండల అధ్యక్ష పదవి దక్కుతుంది. అదే టీఆర్ఎస్కు అవకాశం రావాలంటే.. సీపీఐ, బీజేపీ రెండూ మద్దతివ్వాల్సి ఉంటుంది. నకిరేకల్ నియోజకవర్గంలోనే అత్యధికంగా మూడు మండలాల్లో ఈ పరిస్థితి నెలకొంది. చిట్యాల మండలంలో 12 ఎంపీటీసీ స్థానాలకు గాను.. ఏడు స్థానాలు వచ్చిన పార్టీకి మండలం దక్కేది. కానీ, టీఆర్ఎస్ 6 స్థానాల దగ్గరే నిలిచిపోయింది. మరొక్క సభ్యుడి మద్ధతు లభిస్తే చాలు. కాగా, ఈ మండలంలో కాంగ్రెస్ కేవలం 2 స్థానాలు గెలుచుకుంది. సీపీఎం ఒక చోట గెలిచింది. మరో ముగ్గురు స్వతంత్రులు గెలిచారు. కాంగ్రెస్, సీపీఎం, స్వంతంత్రులు ముగ్గురు కలిసినా అవకాశ దక్కే చాన్సులేదు. దీంతో ఒక సభ్యుడిని తమ వైపు తిప్పుకోగలితే చిట్యాల టీఆర్ఎస్ సొంతం అవుతుంది. గెలిచిన ముగ్గురు స్వతంత్రుల్లో టీఆర్ఎస్ రెబల్స్ ఉన్నారని, వారి మద్ధతు తమ పార్టీకే ఉంటుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నకిరేకల్‌లో 9 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. ఏ పార్టీకైనా ఐదు స్థానాలు గెలిస్తే మండల అధ్యక్ష పదవి దక్కుతుంది. కానీ, టీఆర్ఎస్ 4 స్థానాల దగ్గరే నిలిచిపోయింది. 3చోట్ల కాంగ్రెస్ గెలిస్తే.. స్వతంత్రులు మరో ముగ్గురు గెలిచారు. ఇప్పుడు వారే కీలకంగా మారారు. వీరిలో కూడా టీఆర్ఎస్ రెబల్స్ ఉన్నారని చెబుతున్నందున.. ఇక్కడా టీఆర్ఎస్కే అవకాశం ఉందంటున్నారు. కేతేపల్లి మండలంలో 11 స్థానాలకు గాను ఆరు సీట్లు గెలుచుకుంటే.. ఎంపీపీ పదవి దక్కుతుంది. కానీ, టీఆర్ఎస్కు కేవలం ఐదుగురు సభ్యులు మాత్రమే ఉన్నారు. కాంగ్రెస్ నాలుగు చోట్ల , మరో ఇద్దరు స్వతంత్రులు గెలిచారు. టీఆర్ఎస్కు ఒక్కరు మద్ధతిస్తే సరిపోతుంది. ఇక్కడ కాంగ్రెస్‌కు అవకాశం దక్కాలంటే ఇండిపెండెంట్లు ఇద్దరూ మద్దతివ్వాలి. మొత్తంగా ఈ ఏడు చోట్లా ఒక్క చండూరు మినహా మిగిలిన ఆరు చోట్ల అధికార పార్టీకే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. -
గులాబీ మండలాధీశులు గులాబీ మండలాధీశులు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: అప్రతిహత విజయంతో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో గులాబీ జెండాలను ఎగరేసిన టీఆర్ఎస్ కీలకమైన మండల ప్రజాపరిషత్ పీఠాలను తన వశం చేసుకోబోతుంది. ఉమ్మడి జిల్లాలోని 58 మండలాల్లో కేవలం మూడు చోట్ల మినహా 55 చోట్ల టీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎంపీటీసీలే మండలాధీశులుగా బాధ్యతలు చేబట్టబోతున్నారు. ఇప్పటికే క్యాంపుల్లో ఉన్న ఆయా మండలాల నుంచి గెలిచిన టీఆర్ఎస్ ఎంపీటీసీలు, వారికి మద్దతు ఇస్తున్న ఇతర పార్టీల విజేతలు శుక్రవారం నేరుగా మండల కార్యాలయాలకు చేరుకుని బాధ్యతలు స్వీకరించబోతున్నారు. కొత్త మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నికకు సంబంధించి అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. గెలిచిన ఎంపీటీసీలు చేజారిపోకుండా ఎమ్మెల్యేల సహకారంతో చైర్మన్ అభ్యర్థులు క్యాంపుల కోసం ఇప్పటికే హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో మకాం వేశారు. చేతులెత్తేసిన కాంగ్రెస్, బీజేపీ టీఆర్ఎస్ కన్నా ఒకటి రెండు చోట్ల ఎక్కువ సంఖ్యలో సీట్లు గెలిచిన మండలాలను సైతం కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకోలేక చేతులెత్తేసింది. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి, రామడుగు మండలాల్లో టీఆర్ఎస్ కన్నా ఎక్కువ మెజారిటీ ఉన్నప్పటికీ క్యాంపు రాజకీయాలు నడిపే సాహసం చేయలేక చేతులెత్తేసింది. ఈ లోపు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు వైరిపక్షంలోని సభ్యులను తమ క్యాంపుల్లోకి తీసుకెళ్లారు. చొప్పదండిలో నాలుగు ఎంపీటీసీలు గెలుచుకున్న బీజేపీ సైతం తమకు మద్దతు పలికిన ఇండిపెండెంట్లు, కాంగ్రెస్ సభ్యులను కాపాడుకోలేక పోయింది. బీజేపీ నాయకులు కాళేశ్వరంలో క్యాంపు నడిపినా టీఆర్ఎస్ వాళ్లు క్యాంపు నుంచే తమకు అవసరమైన సభ్యులను తీసుకెళ్లారు. ఇక్కడ రెండు సీట్లు మాత్రమే గెలిచిన టీఆర్ఎస్ ఎంపీపీ పదవిని దక్కించుకోబోతుంది. దీంతో కరీంనగర్ జిల్లాలో 15 ఎంపీపీలకు మొత్తంగా టీఆర్ఎస్ వశమైనట్టే. పెద్దపల్లిలో చక్రం తిప్పిన ‘దాసరి’ పెద్దపల్లి జిల్లాలో సైతం టీఆర్ఎస్ రాజకీయం ముందు కాంగ్రెస్, బీజేపీ నిలబడలేకపోయాయి. పెద్దపల్లి, జూలపల్లి, రామగిరిలో ప్రతిపక్ష పార్టీలకు అవకాశం ఉన్నప్పటికీ ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి రాజకీయంతో ఈ మూడు మండలాలు కూడా టీఆర్ఎస్కే అనుకూలమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికే పెద్దపల్లి, జూలపల్లి మండలాల్లో ఇతర పార్టీలు, ఇండిపెండెంట్లుగా గెలిచిన వారిని తమ వైపు తిప్పుకున్న ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి రామగిరి మండలంలో కూడా సగం సగంగా ఉన్న కాంగ్రెస్ బలాన్ని తగ్గించేందుకు వ్యూహాన్ని అమలు చేసినట్లు సమాచారం. ఇక్కడ టీఆర్ఎస్, కాంగ్రెస్ ఆరేసి సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ నుంచి ఒకరిద్దరిని తమ వైపు తిప్పుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. కాంగ్రెస్ ఖాతాలోకి వేములవాడ రూరల్, బీర్పూరు, జగిత్యాల అర్బన్.. జగిత్యాల జిల్లాలో రెండు సీట్లు కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లనున్నాయి. జిల్లాలో 18 మండలాలకుగాను 16 చోట్ల టీఆర్ఎస్కు స్పష్టమైన మెజారిటీ ఉండగా, బీర్పూరులో కాంగ్రెస్ జెడ్పీటీసీ స్థానంతోపాటు మెజారిటీ మండలాలను గెలుచుకుంది. జగిత్యాల అర్బన్‌లో సైతం కాంగ్రెస్‌కే మెజారిటీ వచ్చింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఈ రెండు చోట్ల ఖాతా తెరవనుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ రూరల్ సైతం కాంగ్రెస్ ఖాతాలోనే పడనుంది. ఇక్కడ పార్టీ నేత ఆది శ్రీనివాస్ పావులు కదిపి గెలిచిన కాంగ్రెస్ సభ్యులతోపాటు మద్ధతుదారులను క్యాంపుకు పంపించారు. దీంతో వేములవాడ రూరల్ కాంగ్రెస్ వశం కావడం ఖాయమైనట్లే. -
అధ్యక్షులెవరో?
ఆదిలాబాద్‌అర్బన్: మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ), మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షులు (వైస్‌ఎంపీపీ) పదవులకు శుక్రవారం ఎన్నిక జరగనుంది. మొదటగా కోఆప్షన్ సభ్యులను, తర్వాత అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఉదయం 9 నుంచి 10 గంటల సమయంలో కోఆప్షన్ సభ్యుల నామినేషన్లు స్వీకరణ, అనంతరం వాటి పరిశీలన జరుగుతుంది. పోటీలో నిల్చున్న అభ్యర్థులను ప్రకటించి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇస్తారు. తర్వాత ప్రత్యేక సమావేశం నిర్వహించి కోఆప్షన్ సభ్యులను ఎన్నిక చేపట్టి గెలుపొందిన వారిని ప్రకటిస్తారు. ఒకవేళ ఒక అభ్యర్థే పోటీపడితే వారినే ఎన్నికైనట్లుగా ప్రకటిస్తారు. అనంతరం ఎంపీపీ ఎన్నిక జరుగుతుంది. కో–ఆప్షన్ సభ్యుల ఎన్నిక పూర్తికాకపోతే ఎంపీపీ అధ్యక్ష ఎన్నిక నిర్వహణకు అవకాశం ఉండదు. ఎంపీపీ పదవుల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో ఆయా పదవులకు సంబంధించి రిజర్వేషన్లను పొందుపర్చిన విషయం తెలిసిందే. అయితే ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులకున్న నియమ నిబంధనలు కోఆప్షన్ సభ్యులకు కూడా వర్తించనున్నాయి. మండలంలో ఒకరిని, జెడ్పీలో ఇద్దరి చొప్పున మైనార్టీ వర్గాలకు చెందిన వారిని కోఆప్షన్ సభ్యులుగా ఎన్నుకోనున్న విషయం తెలిసిందే. రేపు జెడ్పీ చైర్పర్సన్ ఎన్నిక.. జిల్లా పరిషత్ చైర్పర్సన్, వైస్‌చైర్మన్, కోఆప్షన్ సభ్యుల ఎన్నికకు సంబంధించి శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసి శనివారం ఎన్నిక చేపట్టనున్నారు. ముందుగా ఉదయం 10 గంటల వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించి మధ్యాహ్నం వరకు పరిశీలిస్తారు. తద్వారా నామినేషన్ల ఉపసంహరణ చేపట్టి ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశం ఎన్నికైన వారిలో సగం మంది సభ్యుల కోరం ఉంటేనే ఎన్నిక నిర్వహించిన కోఆప్షన్ సభ్యులను ఎన్నుకుంటారు. సాయంత్రం 3 గంటల సమయంలో జిల్లా పరిషత్ అద్యక్ష పదవి ఎన్నికకు సంబంధించి సమావేశం నిర్వహించి గెలుపొందిన వారిని ప్రకటిస్తారు. చైర్పర్సన్, వైస్‌చైర్మన్, కోఆప్షన్ సభ్యుల ఎన్నిక చేపట్టేందుకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరిస్తారు. ముందుగా నూతనంగా ఎన్నికైన సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి జెడ్పీలో ఇద్దరు కోఆప్షన్ సభ్యులను ఎన్నుకుంటారు. అనంతరం చైర్పర్సన్, వైస్‌చైర్మన్ ఎన్నికలు జరుపుతారు. ఇందుకు అటు మండల పరిషత్ కార్యాలయాల్లో, ఇటు జిల్లా పరిషత్ కార్యాలయంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, మండలాధ్యక్షుడితోపాటు ఉపాధ్యక్షుల ఎన్నికల ప్రక్రియ ఒక్క రోజు, జెడ్పీచైర్‌పర్సన్, వైస్చైర్మన్ల ఎన్నికలు ఒక్కో రోజులోనే పూర్తి కానున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలతో మొదలుకొని ఫలితం ప్రకటించేంత వరకు ప్రాసెస్ ప్రకారం ఒకేరోజులో ప్రక్రియ చేపడుతారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరించిన ఆర్వోలే మండల అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నికలకు ప్రిసైడింగ్ అధికారులుగా వ్యవహరిస్తారు. ఈ మేరకు ఆయా అధ్యక్షుల ఎన్నికకు సంబంధించిన ఎస్ఈసీ ఇది వరకే షెడ్యూల్ కూడా జారీ చేసింది. కోఆప్షన్ సభ్యుల నియమ నిబంధనలు మైనార్టీ వర్గానికి చెందిన వారై ఉండాలి. ఎంపీపీ పరిధిలో అయితే మండలంలో, జిల్లా పరిషత్‌లో అయితే జిల్లాలో ఎక్కడో ఒక చోట ఓటు హక్కు కలిగి ఉండాలి. కోఆప్షన్ సభ్యుడిగా పోటీ చేసే వ్యక్తి స్థానిక ఓటరై ఉండాలి. వయసు 21 ఏళ్లకు తక్కువగా ఉండొద్దు ఎంపీపీ, జెడ్పీ కోఆప్షన్ సభ్యులుగా ఎన్నికయ్యే వారికి ఇద్దరు పిల్లల నిబంధనను వర్తింపజేస్తున్నారు. ఎంపీపీ, జెడ్పీ ఎన్నిక కోసం నిర్వహించే ప్రత్యేక సమావేశానికి వారిని ఆహ్వానిస్తారు. ఇద్దరు అభ్యర్థులకు సమాన ఓట్లు వస్తే డ్రా పద్ధతి ద్వారా నిర్ణయాన్ని ప్రకటిస్తారు. పరిషత్ కార్యాలయాల వద్ద 144 సెక్షన్.. శుక్ర, శనివారాల్లో మండల అధ్యక్ష, ఉపాధ్యక్షుల, జెడ్పీ చైర్పర్సన్, వైస్ చైర్మన్, కోఆప్షన్ సభ్యుల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని మండల పరిషత్ కార్యాలయాలతోపాటు జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. కార్యాలయాల నుంచి వంద మీటర్లలోపు ఈ సెక్షన్ అమలులో ఉంటుంది. పరిషత్ కార్యాలయాలకు వెళ్లేందుకు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులకు, సభ్యులకు, ఇతరులకు పాస్‌లు జారీ చేస్తారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయనున్నారు. -
పరిషత్ పీఠంపై టీఆర్ఎస్
ఉమ్మడి పాలమూరులో టీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా మారింది. గ్రామపంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు ఏ ఎన్నికలు జరిగినా పూర్తి ఆధిక్యత సాధిస్తోంది. వరుస విజయాలతో ప్రత్యర్థులకు అందనంత వేగంతో ‘కారు’ పార్టీ దూసుకుపోతోంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల తరహాలోనే పరిషత్ ఎన్నికల్లో సత్తా చాటింది. మెజార్టీ ఎంపీపీ స్థానాలతో పాటు జెడ్పీ పీఠాలను క్లీన్‌స్వీప్ చేసే దిశగా అడుగులు వేస్తోంది. సాక్షి, నాగర్‌కర్నూల్: జరిగిన ప్రతి ఎన్నికల్లో వరుస విజయాలను నమోదు చేసుకుంటూ టీఆర్ఎస్ బలాన్ని మరింత పెంచుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 13అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందిన ఆ పార్టీ, సర్పంచ్ ఎన్నికల్లోనూ మెజార్టీ గ్రామ పంచాయతీలను కైవసం చేసుకుంది. అనంతరం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రెండు పార్లమెంట్ స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లోనూ పూర్తి స్థాయి మెజార్టీ సాధించింది. ఉమ్మడి జిల్లాలో మహబూబ్‌నగర్, నారాయణపేట, నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల జెడ్పీపీఠాలపై గులాబీ జెండా ఎగరవేయనుంది. ప్రాదేశిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. పరిషత్ ఎన్నికల ఫలితాలు వెలువడడంతో జెడ్పీచైర్మన్, వైస్ చైర్మన్, ఎంపీపీ ఎన్నికలపై కసరత్తు చేస్తున్నారు. మెజార్టీ సాధించిన టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే జెడ్పీ చైర్మన్ల ఎంపికపై ఒక స్పష్టమైన వైఖరితో ఉన్నారు. శుక్రవారం ఎంపీపీ, శనివారం జెడ్పీ చైర్మన్ల ఎన్నికలు జరగనున్నాయి. అందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రస్తుతం ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు ప్రత్యేక శిబిరాల్లో ఉన్నారు. శుక్రవారం జరగనున్న ఎంపీపీ ఎన్నికకు నేరుగా ఎంపీటీసీలు రానున్నారు. ‘పేట’ జెడ్పీ పీఠం ఎవరికో..? ప్రాదేశిక ఎన్నికల్లో గులాబీ పార్టీ ప్రభవంజనం సృష్టించింది. ఒక్కడా కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పెద్దగా పోటీ ఇవ్వలేకపోయాయి. మహబూబ్‌నగర్, నారాయణపేట, నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల ఐదు జిల్లాల్లోనూ మెజార్టీ జెడ్పీటీసీ స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మొత్తం 71 జడ్పీటీసీ స్థానాలకు 65 స్థానాల్లో అధికార పార్టీ విజయం సాధించింది. కాంగ్రెస్ 5, బీజేపీ ఒక్క స్థానంతో సరిపెట్టుకున్నాయి. అన్ని జిల్లాల్లోనూ సంపూర్ణ మెజార్టీ రావడంతో జెడ్పీ చైర్మన్ల పీఠాలను సైతం సొంతం చేసుకోనుంది. మహబూబ్‌నగర్ జెడ్పీ చైర్మన్‌గా స్వర్ణసుధాకర్‌రెడ్డి(భూత్పూర్), నాగర్‌కర్నూల్ జెడ్పీ చైర్మన్‌గా పోతుగంటి భరత్(కల్వకుర్తి), వనపర్తి జెడ్పీ చైర్మన్‌గా లోక్‌నాథ్‌రెడ్డి(వనపర్తి), గద్వాల జెడ్పీ చైర్మన్‌గా సరిత(మానవపాడు)పేర్లు దాదాపు పార్టీ అధిష్టానం ఖరారు చేసినట్లు సమాచారం. నారాయణపేట జిల్లా నుంచి అంజనమ్మ (కృష్ణా), అశోక్‌కుమార్ (ఊట్కూర్), వనజ (మక్తల్), అంజలి (నారాయణపేట) జెడ్పీ పీఠం ఆశించగా చర్చల తర్వాత ఇద్దరు తప్పుకున్నారు. ప్రస్తుతం అశోక్‌కుమార్, వనజలో ఎవరో ఒకరిని ఫైనల్ చేసే అవకాశం ఉంది. నాగర్కర్నూల్కి సంబంధించి ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, గద్వాల, వనపర్తికి సంబంధించి మంత్రి నిరంజన్‌రెడ్డి, నారాయణపేట, మహబూబ్‌నగర్‌కు శ్రీనివాస్‌గౌడ్‌లకు జెడ్పీ చైర్మన్ ఎంపిక చేసే బాధ్యతను అధిష్టానం అప్పగించింది. గెలిచిన సభ్యులు శిబిరాల్లో ఉండగా, ఆయా పార్టీల అధినేతలు వ్యూహ రచనల్లో మునిగిపోయారు. మెజార్టీ ఎంపీపీ స్థానాలు కారు ఖాతాలోకే.. ఉమ్మడి జిల్లాలోని 790 ఎంపీటీసీ స్థానాలకు 524 స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. కాంగ్రెస్ కేవలం 148 స్థానాలకే పరిమితం కాగా బీజేపీ 46 ఎంపీటీసీ స్థానాల్లో విజయం సాధించింది. 90 శాతం పైగా ఎంపీపీ స్థానాలకు టీఆర్ఎస్కు స్పష్టమైన ఆధిక్యం ఉంది. ఎంపీపీ స్థానాలు కూడా అన్ని జిల్లాల్లో ఒకటి రెండు మినహా క్లీన్‌స్వీప్ చేసింది. అయితే మెజార్టీ లేని మండలాల్లోనూ ఎలాగైనా ఎంపీపీ స్థానాలు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లగా, బిజినేపల్లి, లింగాల, వెల్దండ, ఉప్పునుంతల, కోడేరు మండలాల్లో ఇరుపార్టీలకు పూర్తిస్థాయి మెజార్టీ రాకపోవడంతో ఎలాగైనా దక్కించుకోవాలనే కసరత్తు చేశారు. ఈ మండలాలు ఎవరి ఖాతాలోకి వెళుతాయో శుక్రవారం తేలనుంది. మహబూబ్‌నగర్ జిల్లాలోనూ మిడ్జిల్, చిన్నచింతకుంట మండలాల్లో మాత్రమే మెజార్టీ సాధించలేదు. నారాయణపేట జిల్లాలోనూ ధన్వాడ, మక్తల్ మినహా అన్ని మండలాల్లో టీఆర్ఎస్ మెజార్టీ సొంతం చేసుకుంది. కొల్లాపూర్ నియోజకవర్గంలో రెబల్, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఒకటి చేసేందుకు నేతలు ఇప్పటికే చర్చలు జరిపారు. మెజార్టీ ఎవ్వరిదనేది తేలాల్సి ఉంది. గద్వాలలో మానవపాడు, ఉండవెల్లి తప్పా అన్నింటా పూర్తి మెజార్టీ వచ్చింది. వనపర్తి జిల్లాలో 12 మండలాల్లో టీఆర్ఎస్కు మెజార్టీ రాగా, రేవల్లిలో కాంగ్రెస్ ఆధిక్యం ప్రదర్శించింది. వీపనగండ్లలో జూపల్లి వర్గం ఇండిపెండెంట్లుగా పోటీ చేసి ఎక్కువ స్థానాలు సాధించారు. నేడు ఎంపీపీ ఎన్నిక మండల పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కో ఆప్షన్ సభ్యుల ఎన్నికల కోసం శుక్రవారం ఉదయం 10గంటలకు నామినేషన్లు స్వీకరిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు పరిశీలించి పోటీలో ఉన్న వారి పేర్లను ప్రకటిస్తారు. ఒంటిగంట వరకు ఉపసంహరణకు గడువు ఇస్తారు. మొదట కో ఆప్షన్ సభ్యులను ఎన్నుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 3గంటలకు మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నిక ఉంటుంది. అందుకు అన్ని మండల పరిషత్ కార్యాలయాల్లో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. విప్ ధిక్కరిస్తే వేటే ఎంపీటీసీ సభ్యులు విప్‌ను దిక్కరిస్తే పార్టీ సభ్యత్వం కోల్పోనున్నారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకునే అధికారాన్ని ప్రిసైడింగ్ అధికారికి రాష్ట్ర ఎన్నికల సంఘం కల్పించింది. తమ సభ్యుడు విప్ ధిక్కరించారంటూ ఆ పార్టీ విప్ నుంచి రాత పూర్వకంగా మూడు రోజుల్లో నివేదిక అందించాల్సి ఉంటుంది. సభ్యత్వాన్ని ఎందుకు రద్దు చేయరాదో తెలపాలంటూ ప్రిసైడింగ్ అధికారి సంబంధిత సభ్యుడికి నోటీసు జారీ చేస్తారు. దీనికి వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలి. ఆ తర్వాత విప్ ధిక్కారణ జరిగిందా లేదా అన్నదానిపై ప్రిసైడింగ్ అధికారి రెండు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తారు. అయితే గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు ఎన్నిక జరిగే రోజు మధ్యాహ్నం 11గంటలలోగా విప్ ధిక్కరించిన అభ్యర్థుల పేర్లను ఆర్డీఓకు సమర్పించాల్సి ఉంటుంది. అలాగే ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నిక కోసం నిర్వహించే సమావేశాలకు కనీసం సగం మంది సభ్యులు హాజరు కావాల్సి ఉంటుంది. అప్పుడే కోరం ఉన్నట్లు పరిగణించి ప్రక్రియను చేపడతారు. నిర్ణీత సమయానికల్లా కోరం మేరకు సభ్యులు రాకపోతే మరుసటి రోజుకు వాయిదా వేస్తారు. -
భగ్గుమన్న రాజకీయ కక్షలు
మహబూబ్‌నగర్ క్రైం: ప్రశాంతంగా ఉండే పాలమూరులో రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి.. స్థానిక ఎన్నికలు అంటేనే ప్రధానంగా వర్గపోరు.. గ్రామాల్లో రెండు వర్గాలకు మధ్య పాతకక్షలను మనసులో పెట్టుకొని ఇలాంటి ఎన్నికల సమయాల్లో దాడులకు పాల్పడుతుంటారు. పల్లెలో ఎప్పుడూ కూడా ఎన్నికలు వ్యక్తిగతంగా.. కుటుంబాల మధ్య నడుస్తుంటాయి. ఈ క్రమంలో ఏళ్ల నుంచి పడని కుటుంబాలు ఉంటే ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటారు. ఇందులో ప్రాణాలు సైతం కోల్పోతుంటారు. జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు మంగళవారం ప్రకటించిన తర్వాత పలు గ్రామాల్లో విజేతలు ర్యాలీలు చేపడుతున్న క్రమంలో ఇరువర్గాల మధ్య దాడులు జరగడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ర్యాలీల్లో రాజుకున్న నిప్పు దేవరకద్ర మండలం డోకూర్లో బీజేపీ ఎంపీటీసీ అభ్యర్థి గెలిచిన ఆనందంలో ర్యాలీ చేస్తున్న క్రమంలో మరో పార్టీకి చెందిన కార్యకర్తలు బీజేపీ కార్యకర్త ప్రేమ్‌కుమార్‌ను కత్తులతో దాడి చేయడంతో మృతి చెందాడు. అలాగే మహబూబ్‌నగర్ మండలంలోని రామచంద్రపూర్‌లో ఎంపీటీసీగా స్వతంత్ర అభ్యర్థి గెలుపొందిన సందర్భంగా ర్యాలీ చేపట్టారు. ఈ సమయంలో ఓ కిరాణదుకాణం దగ్గర ఉన్న అశోక్‌చారి అనే యువకుడిపై కట్టెలు, రాళ్లతో దాడి చేయగా తీవ్ర గాయాలయ్యాయి. ఆ సంఘర్షణలో అనసూయ అనే మహిళపై కూడా దాడి చేయడంతో మృతిచెందిందని కుటుంబ సభ్యులు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే మద్దూరు మండలం రెనివట్ల ఎంపీటీసీ కారుపై దాడి చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలతో ఉమ్మడి పాలమూరు జిల్లా ఉలిక్కిపడింది. ఇటు పోలీసులతోపాటు అటు రాజకీయ నేతలను కలవరపెట్టింది. పోలీసులు దృష్టి పెట్టాలి భూ వివాదాలు, అదనపు కట్నం, ప్రేమ వివాహాల విషయం చాలా వరకు ముందే గ్రామ పోలీస్ అధికారులు, ఫిర్యాదుల రూపంలో పోలీసులకు తెలుస్తూనే ఉన్నాయి. కానీ చిన్న విషయాలుగా భావిస్తూ పోలీసులు వాటిని నిర్లక్ష్యం చేస్తున్నారు. బాధితులు, రక్షణ లేదనుకునే వారు పోలీసులను ఆశ్రయించినప్పు డు మీరే పరిష్కరించుకోవాలని సూచిస్తూ వదిలేస్తున్నారు. బెదిరింపులకు గురిచేస్తున్న వారిని ఠాణాకు పిలిపించి హె చ్చరించడం.. వారి కదలికలపై నిఘా వేసి ఉంచి తే పరిస్థితి చేయిదాటేది కాదు. గతంలో కేసులు నమోదైన వారు, రౌడీషీటర్లపై నిఘా ఉంచినట్లే గ్రామాల్లో విచ్చలవిడిగా వ్యవహరించే వారు, ఆరోపణలున్న వ్యక్తులపైనా దృష్టిపెడితే ఈ హత్యకాండలకు అడ్డుకట్ట వేసే వీలుంటుంది. పథకం ప్రకారమే.. ఇటీవల చోటుచేసుకున్న హత్యల్లో క్షణికావేశంలో చోటుచేసుకున్నవి తక్కువే. పక్కా హత్యలు చేసినవే ఎక్కువ. సాధారణంగా ఎదుటి వారిని భయబ్రాంతులకు గురి చేసేందుకు మూకుమ్మడిగా దాడులు చేస్తుంటారు. ఈ క్రమంలో ప్రాణాలు పోతాయి. కానీ ఇటీవల హత్యలు చేసిన వారు కిరాయి హంతకుల్లా ప్రణాళిక ప్రకారం దాడులు చేసి క్రూరమైన రీతిలో ప్రాణాలు తీశారు. బాధిత కుటుంబాలకు బెదిరింపులు మరోదిక్కు హత్యలు చోటుచేసుకున్న తర్వాత హంతకులు చెలరేగిపోతున్నారు. బాధిత కుటుంబ సభ్యలను బెదిరించి రాజీ చేసుకుంటున్నారు. స్థానికంగా పైరవీలకు పాల్పడుతున్న నాయకులు, కొందరు దళారులు పోయిన వ్యక్తి ఎలాగూ పోయాడు.. వారు ఇచ్చేది తీసుకొని రాజీ చేసుకోండి.. లేకుంటే మీకే ప్రమాదం అంటూ బాధిత కుటుంబాలను రాజీకి ఒప్పిస్తున్నారు. పోలీ సులు హత్య కేసులు త్వరగా ఛేదించి.. బాధి త కుటుంబాలకు అండగా నిలిచి నిందితులకు శిక్షలు పడేలా చేస్తే మరోసారి ఇలాంటి ఘటనలు చోటుచేసుకుండా చూడవచ్చు. పంతం నెగ్గడమే ముఖ్యం.. భూ వివాదాలు, కుటుంబ తగాదాలు, ఆస్తుల పంపకం, లావాదేవీల్లో తేడాలు కూర్చొని మా ట్లాడుకొని పరిష్కరించే వీలున్నవే కానీ ఆ దిశ గా చేస్తున్న వారు తక్కువవుతున్నారు. వివాదా లు పరిష్కరించేందుకు పోలీస్ స్టేషన్లు, న్యాయస్థానాలు ఉన్నా వాటిని పట్టించుకోవడం లేదు. ప్రతీసారి చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటూ ఘర్ష ణలకు దిగుతున్నారు. ఈ క్రమంలో మధ్యవర్తులుగా ఉన్న వారు, నమ్మి చర్చలకు కూర్చున్న వారు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ఏడాదిలో చోటుచేసుకున్న హత్యలే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. హత్యలు చేస్తే చట్టానికి చిక్కుతామని తెలిసినా.. కఠిన శిక్షలు పడతాయనే అవగాహన ఉన్నా వారిలోనూ భయం కనిపించడం లేదు. తమ మాట నెగ్గాలనే మొండితనం, చట్టాలపై ఉన్న చిన్నచూపు ఇందుకు కారణం. జిల్లాలో అసెంబ్లీ, పంచాయతీ, లోక్‌సభ ఎన్నికలను పోలీసులు చాలా ప్రశాంతంగా నిర్వహించారు. అదే తరహాలో స్థానిక ఎన్నికలు పూర్తి చేయాలని అవసరం ప్రణాళికలు వేసుకొని విజయవంతంగా ముగించారు. కానీ, ఓట్ల లెక్కింపు తర్వాత గ్రామాల్లో జరిగే ర్యాలీలపై ప్రత్యేక దృష్టి.. అవసరమైన నిఘా ఏర్పాటు చేయకపోవడంతో హత్యలు, దాడులకు దారితీసింది. ఈ క్రమంలోనే డోకూర్, రామచంద్రపూర్ గ్రామాల్లో జరిగిన ఘటనలు ఒక్కసారిగా పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారిపోయింది. -
‘కుర్చీ’ కమల్‌కే..!
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్‌గా లింగాల కమల్రాజుకు అవకాశం ఇవ్వాలని టీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. అధికారికంగా ఆయన పేరును శుక్రవారం ప్రకటించే అవకాశం ఉంది. ఈనెల 8వ తేదీన జెడ్పీ చైర్మన్ పదవికి ఎన్నిక ఉండడంతో పార్టీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. జిల్లాలో మెజార్టీ స్థానాలను గెలుచుకున్న టీఆర్ఎస్కు జిల్లా పరిషత్ చైర్మన్ పదవి సునాయాసంగా లభించే అవకాశం ఏర్పడింది. మొత్తం 20 జెడ్పీటీసీలకుగాను.. 17 జెడ్పీటీసీలను ఆ పార్టీ గెలుపొందింది. దీంతో జెడ్పీ చైర్మన్‌గా ఎవరిని నియమించాలనే అంశంపై టీఆర్ఎస్ అధినేత జిల్లా నేతలతో చర్చించి.. కమల్‌రాజు పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇక జిల్లాస్థాయిలో చైర్మన్ తర్వాత అత్యంత ప్రాధాన్యం కలిగిన వైస్ చైర్మన్ పదవిపై మాత్రం నెలకొన్న పీటముడి ఇంకా వీడలేదు. వివిధ సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని వైస్ చైర్మన్ పదవికి అభ్యర్థిని ఖరారు చేయాలని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పలు సామాజిక వర్గాల నుంచి టీఆర్ఎస్ తరఫున జెడ్పీటీసీలుగా ఎన్నికైన వారిలో అనేక మంది ఈ పదవిని ఆశిస్తుండడంతో పేరును ఖరారు చేయడానికి పార్టీ పలు కోణాల్లో కసరత్తు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వైస్ చైర్మన్ పదవితోపాటు రెండు కోఆప్షన్ సభ్యుల పదవులకు సైతం అదేరోజు ఎన్నిక జరుగుతుండడంతో ఆ పేర్లను సైతం ఖరారు చేయాల్సి ఉంది. ‘వైస్’పై ఆలోచన.. జెడ్పీ చైర్మన్ పదవి ఎస్సీ జనరల్ కావడంతో.. వైస్ చైర్మన్ పదవిని మహిళలకు కేటాయించే అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పదవి తెలంగాణ ఉద్యమ నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి గెలిచిన జెడ్పీటీసీల్లో ఒకరిని వరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పాలేరు నియోజకవర్గ పరిధిలోని నేలకొండపల్లి జెడ్పీటీసీగా గెలుపొంది.. ఉద్యమ నేపథ్యం కలిగి.. బీసీ వర్గానికి చెందిన ధనలక్ష్మి అభ్యర్థిత్వం వైపు పార్టీ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో వైస్ చైర్మన్ పదవిని బీసీలకు కేటాయించడంతోపాటు మహిళను ఎంపిక చేసినట్లు అవుతుందనే దానిపై పార్టీ యోచిస్తున్నట్లు సమాచారం. అలాగే పెనుబల్లి జెడ్పీటీసీ, బీసీ వర్గానికి చెందిన చక్కిలాల మోహన్‌రావు పేరును సైతం పార్టీ పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక జెడ్పీ చైర్మన్ పదవికి మధిర నియోజకవర్గం నుంచి గెలుపొందిన మధిర జెడ్పీటీసీ లింగాల కమల్‌రాజును ఎంపిక చేయాలని నిర్ణయించిన అధిష్టానం.. వైస్ చైర్మన్ పదవికి ధనలక్ష్మి పేరు పరిశీలనలో ఉండడంతో ఇక రెండు కోఆప్షన్ పదవుల్లో సత్తుపల్లి, వైరా నియోజకవర్గాలకు చెందిన పార్టీ నేతలకు అవకాశం ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైస్ చైర్మన్ పదవి కోసం అనేక మంది జెడ్పీటీసీలు గట్టిగా పట్టుపట్టడమే కాకుండా.. తమ అభీష్టాన్ని నెరవేర్చుకోవడం కోసం ముఖ్య నేతల ద్వారా అధిష్టానాన్ని ఒప్పించే పనిలో నిమగ్నమైనట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటివరకు ఖమ్మం జిల్లా పరిషత్‌లో అంతర్భాగంగా ఉండి.. కొత్త జిల్లా పరి షత్గా ఏర్పడిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పదవి ఎవరిని వరిస్తుందనే అంశం సామాజిక సమీకరణాల ఆధారంగా ఖమ్మం జెడ్పీ వైస్ చైర్మన్ పదవి ఖరారు వ్యవహారంతో ముడిపడి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక జిల్లాలోని 20 మండల ప్రజా పరిషత్‌లకు అధ్యక్ష, ఉపాధ్యక్ష, కోఆప్షన్ సభ్యుల కోసం ఈనెల 7వ తేదీన అధికారులు ఆయా మండల కార్యాలయాల్లో ఎన్నికను నిర్వహించనున్నారు. మెజార్టీ స్థానాలు టీఆర్ఎస్ కైవసం చేసుకునే అవకాశం ఉన్నా.. కొన్నిచోట్ల ఎంపీపీ పదవులు ఎవరిని వరించాలన్నా స్వతంత్ర అభ్యర్థులదే కీలక నిర్ణయంగా మారే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ జిల్లా లోని వివిధ మండలాల్లో తమకు గల బలాబలాల ఆధారంగా ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కోఆప్షన్ సభ్యులను గెలుచుకునేందుకు అవసరమైన వ్యూహాలను రూపొందించింది.