ఈ ‘పరిషత్‌’ ఎన్నికల్లో చిటికెన వేలిపై ‘సిరా’ గుర్తు | Ink mark to Little Finger In MPTC And ZPTC election In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఈ ‘పరిషత్‌’ ఎన్నికల్లో చిటికెన వేలిపై ‘సిరా’ గుర్తు

Published Thu, Nov 11 2021 2:58 AM | Last Updated on Thu, Nov 11 2021 9:55 AM

Ink mark to Little Finger In MPTC And ZPTC election In Andhra Pradesh - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, అమరావతి: ఓటు హక్కు వినియోగించుకున్న ఓటరుకు సాధారణంగా ఎడమ చెయ్యి చూపుడు వేలిపై సిరా గుర్తు పెడుతుంటారు. కానీ.. ఈ నెల 16న జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటు వేసే ఓటరుకు ఎడమ చిటికెన వేలిపై సిరా గుర్తు వేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని బుధవారం నోటిఫికేషన్‌ జారీ చేశారు.  

చదవండి: 4 జెడ్పీటీసీలు ఏకగ్రీవమే

పలుచోట్ల 14న సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు.. 16న పలుచోట్ల ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఒకే గ్రామంలో సర్పంచ్, వార్డు సభ్యుడు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నిక జరిగే అవకాశం ఉండటంతో ఎన్నికల కమిషన్‌ ఈ నిర్ణయం తీసుకుంది. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో ఓటరుకు ఎడమ చెయ్యి చూపుడు వేలిపైనా.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటరు ఎడమ చెయ్యి చిటికెన వేలిపైన సిరా గుర్తు వేయాలని పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement