Ink mark
-
Inedible Ink: తొమ్మిదేళ్లయినా చెరగని సిరా గుర్తు!
ఓటేసినప్పుడు వేలిపై పెట్టే ఇంకు గుర్తు ఎన్ని రోజులుంటుంది? వారం. నెల. మహా అయితే రెండు మూడు నెలలు. కానీ కేరళకు చెందిన ఉష అనే ఓటరును మాత్రం తొమ్మిదేళ్లయినా సిరా గుర్తు వదలడం లేదు. ఆమెకు ఇదో పెద్ద తలనొప్పిగా కూడా మారింది! షోరన్పూర్లోని గురువాయూరప్పన్ నగర్లో ఉండే 62 ఏళ్ల ఉష 2016లో ఓటేసింది. ఆ సందర్భంగా వేలిపై వేసిన ఇంకు గుర్తు 9 ఏళ్లయినా మాసిపోలేదు. అనేక రకాల సబ్బులు, ద్రావణాలతో కడిగినా లాభం లేకపోయింది. ఆ తర్వాతి స్థానిక ఎన్నికల్లో ఓటేయడానికి వెళ్తే వేలిపై గుర్తు చూసి ‘నువ్విప్పటికే ఓటేశావు పొ’మ్మన్నారట ఎన్నికల అధికారులు! పోలింగ్ బూత్‌లోని ఏజెంట్లు అసలు విషయం చెప్పడంతో చివరికి ఓటేయడానికి అనుమతించారు. పోలింగ్ బూత్‌ల్లో ఎందుకీ గోల అని 2019 లోక్‌సభ, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఉష ఓటే వేయలేదు! ఈసారీ అదే సమస్య ఎదురవుతుందేమోనని భయపడుతున్నారు.ప్రచారానికి వచ్చిన ఓ నాయకునికి విషయం చెప్పడంతో ఆయన ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సమస్యను పరిష్కరిస్తామని వాళ్లు హామీ ఇచ్చారట. ఎన్నికల సిరా గుర్తు ఇంతకాలం పాటు చెరగకుండా ఉన్న ఘటనలు ఎక్కడా లేవని వారు విస్తుపోతున్నారు! అయితే ఇలా జరిగేందుకు అవకాశం ఉందని చర్మవ్యాధి నిపుణులు అంటున్నారు. ‘‘సిరా చుక్క గోళ్ల కింద చేరితే మచ్చ అలాగే ఉండే చాన్సుంది. సమగ్ర వైద్య పరీక్షలు చేస్తే కారణం తెలుస్తుంది’’ అని చెబుతున్నారు. -
ఓటు వేసిన వెంటనే చూపుడు వేలిపై సిరాచుక్క ఎందుకు వేస్తారు?
ఎన్నికల్లో చాలా ప్రధానమైన అంశం సిరాచుక్క. మనం ఓటేశామని చెప్పడానికి సిరాచుక్క ఓ గుర్తుగా మాత్రమే కాదు, దొంగ ఓట్లను చెక్ పెట్టే ఆయుధంలానూ పనిచేస్తుంది. నకిలీ ఓట్లకు అడ్డుకట్ట వేయడంతో పాటు ఒకసారి ఓటు వేసిన వారిని గుర్తు పట్టేందుకు భారత ఎన్నికల సంఘం ఈ విధానాన్ని దశాబ్ధాలుగా అమలు చేస్తోంది. ఇంతకీ ఈ సిరా ఎక్కడ తయారవుతుంది? దీని వెనకున్న చరిత్ర ఏంటో ఓసారి తెలుసుకుందాం. తెలంగాణలో ఓట్ల పండగకి సర్వం సిద్ధమైంది. రేపే(నవంబర్30) తెలంగాణలో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఓటు హక్కును వినియోగించుకోవడానికి ప్రజలు సిద్ధమయ్యారు. ఓటు వేశాక చూపుడు వేలిపై ఇంక్ మార్క్ వేస్తారన్న విషయం తెలిసిందే. ఓటు హక్కును వినియోగించుకున్నట్టుగా గుర్తుగా ఇండెలబుల్ ఇంక్‌ను ఉపయోగిస్తారు. ఈ సిరా వెనుక పెద్ద చరిత్రే ఉంది. మొదటిసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ చాలా సమస్యలు ఎదుర్కొంది. ఓటు వేసినవాళ్లు మళ్లీ ఓటు వేసేందుకు వస్తుండటంతో ఎలా అడ్డుకోవాలో అర్థం కాలేదట. అప్పుడే కొన్నిరోజుల వరకు చెరిగిపోని సిరాతో గుర్తు వేయాలన్న ఆలోచన వచ్చింది. అదే “బ్లూ ఇంక్” పద్ధతి. భారతదేశంలో 1962లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మొదటిసారిగా బ్లూ ఇంక్ వాడటం మొదలుపెట్టారు. R&D ఆర్గనైజేషన్ ఈ ఇంక్‌ను తయారు చేసేది. ఆ తర్వాత దీనిని మైసూర్‌కు చెందిన పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్‌కు బదిలీ చేసింది. అప్పట్నుంచి భారత్‌లో జరిగే అన్ని ఎన్నికలకు ఇక్కడి నుంచే ఇంక్‌ను తయారు చేస్తున్నారు. ఈ కంపెనీ మన దేశంలోనే కాకుండా ఇతర దేశాలకు కూడా ఇంక్‌ను సరఫరా చేస్తుంది. కెనడా, కాంబోడియా, మాల్దీవులు, నేపాల్, నైజీరియా, దక్షిణాఫ్రికా, టర్కీ సహా కొన్ని దేశాల ఎన్నికల అవసరాలకు ఇక్కడి నుంచే ఇంక్ సరఫరా అవుతుండటం గమనార్హం. ఇటీవలి కాలంలో ఇంకుతో సులువుగా ఉపయోగించడానికి మార్కర్‌పెన్నులను కూడా తయారీ చేస్తుంది ఈ సంస్థ. ఇతర దేశాల్లో వీటిని వాడుతున్నారు.కానీ మనదేశంలో మాత్రం ఇంకా ఇంకును మాత్రమే ఉపయోగిస్తున్నారు.ఈ ఇంక్ వేలిపై వేయగానే కొన్ని గంటల్లోనే పోదు. ఒకప్పుడు అయితే కొన్ని నెలల పాటు ఉండేది. ఇప్పుడు కొన్ని రోజులు, కొన్ని వారాల పాటు ఆ మార్క్ అలాగే ఉంటుంది. ఎన్నికల సమయంలో రాష్ట్రాలకు ఇంక్ సరఫరా చేసేముందు ఆ ఇంక్‌ను పలుమార్లు టెస్ట్ చేస్తారు. ఇండెలబుల్ ఇంక్‌లో సుమారు 15 నుంచి 18 శాతం సిల్వర్ నైట్రేట్ తో పాటు కొన్నిరసాయనాలను ఉపయోగిస్తారు. దీంతో ఈ సిరా కొన్ని రోజుల వరకు చెరిగిపోకుండా ఉంటుంది. ఇది 5, 7,5, 20, 50 మిల్లీలీటర్ల బాటిళ్లలో దొరుకుతుంది. 5 ఎంఎల్ బాటిల్ 300 మంది ఓటర్లకు సరిపోతుంది.ఒక బాటిల్ ఇంక్ ధర సుమారు రూ. 127 ఉంటుంది. ఒక సీసాలో సుమారు 10 ml సిరా ఉంటుంది. దొంగఓట్లు నమోదు కాకుండా ఉండేందుకు గాను ఈ సిరాను చూపుడు వేలికి వేస్తారు. ఒకవేళ వేలికి గాయమైనా, చూపుడు వేలు లేకపోయినా మరో వేలికి వేస్తారు. ఇక ఇంకు తయారీ అత్యంత రహస్యంగా సాగుతుంది. దీని తయారీలో ఉపయోగించే రసాయన ఫార్ములాను నేషనల్ ఫిజికల్ లాబోరేటరీ ఆప్ ఇండియా అత్యంత రహస్యంగా రూపొందిస్తుంది. ఇతరులకు ఇందులో ఏం వాడారన్నది తెలియదు. -
ఈ ‘పరిషత్’ ఎన్నికల్లో చిటికెన వేలిపై ‘సిరా’ గుర్తు
సాక్షి, అమరావతి: ఓటు హక్కు వినియోగించుకున్న ఓటరుకు సాధారణంగా ఎడమ చెయ్యి చూపుడు వేలిపై సిరా గుర్తు పెడుతుంటారు. కానీ.. ఈ నెల 16న జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటు వేసే ఓటరుకు ఎడమ చిటికెన వేలిపై సిరా గుర్తు వేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని బుధవారం నోటిఫికేషన్ జారీ చేశారు. చదవండి: 4 జెడ్పీటీసీలు ఏకగ్రీవమే పలుచోట్ల 14న సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు.. 16న పలుచోట్ల ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఒకే గ్రామంలో సర్పంచ్, వార్డు సభ్యుడు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నిక జరిగే అవకాశం ఉండటంతో ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో ఓటరుకు ఎడమ చెయ్యి చూపుడు వేలిపైనా.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటరు ఎడమ చెయ్యి చిటికెన వేలిపైన సిరా గుర్తు వేయాలని పేర్కొంది. -
మందు కొంటే ‘మార్క్’ పడాల్సిందే!
హోషంగాబాద్: మందుబాబులను గుర్తించేందుకు మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్ జిల్లా అధికార యంత్రాంగం వినూత్న విధానాన్ని అవలంభిస్తోంది. మద్యం కొనేవారి చేతి వేలిపై ఇంకు చుక్క పెడుతున్నారు. జిల్లా ఎక్సైజ్ అధికారి అభిషేక్ తివారి ఆదేశాల మేరకు ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. ‘మద్యం కొనుగోలు చేయడానికి వచ్చేవారి చూపుడు వేలిపై ఇంకు చుక్క పెడుతున్నాం. సమీప భవిష్యత్తులో వారి వివరాలు కావాలంటే వెంటనే వారిని గుర్తించేందుకు ఇది దోహదపడుతుంది. దీంతో పాటుగా మందుబాబుల పేర్లు, చిరునామా, మొబైల్ ఫోన్ నంబర్లు మద్యం కాణంలోని రిజిస్టర్లో నమోదు చేయాలని ఆదేశించామ’ని తివారి తెలిపారు. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో 50 మద్యం దుకాణాలు తెరిచారని, షాపుల వద్ద పెద్దగా రద్దీ లేదని చెప్పారు. కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్డౌన్ మే 17 వరకు పొడిగించడంతో మద్యం దుకాణాలను తెరిచేందుకు కేంద్ర హోంశాఖ అనుమతించిన సంగతి తెలిసిందే. కేంద్ర వైద్యారోగ్య శాఖ తాజా గణాంకాల ప్రకారం మధ్యప్రదేశ్‌లో ఇప్పటివరకు 3,138 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 185 మంది చనిపోయారు. 1,099 మంది కరోనా నుంచి కోలుకున్నారు. (31 మంది పోలీసులకు కరోనా పాజిటివ్) -
ఎన్నికల ఇంకు గురించి తెలుసా..?
సాక్షి, కోదాడ : ఎన్నికల సమయంలో దొంగ ఓట్లను నివారించడానికి, ఒకరు ఒకటి కంటే ఎక్కువ ఓట్లు వేయకుండా ఉండడానికి ఎన్నికల సంఘం ప్రతి ఓటరు ఎడమ చేతి చూపుడు వేలిపై ఇంకు గుర్తును వేస్తుంది. ఇది దాదాపు నెల రోజుల వరకు చెరిగిపోకుండా ఉంటుంది. ఈ ఇంకుకు పెద్ద చరిత్రనే ఉంది. దేశంలో జరిగిన 3వ సాధారణ ఎన్నికల నుంచి దీన్ని ఉపయోగిస్తున్నారు. దేశం మొత్తానికి అవసరమైన ఈ ఇంకును ఒక్క కంపెనీ మాత్రమే తయారు చేస్తుంది. 1937 సంవత్సరంలో కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ పట్టణంలో ఈ ఇంకు తయారీ పరిశ్రమను ‘‘ మైసూర్ ల్యాక్ అండ్ పెయింట్స్ ’’ పేరుతో స్థాపించారు. మహా రాజ నల్వాడీ కృష్ణరాజ వడయార్ దీని వ్యవస్థాపకుడు. తర్వాత దీన్ని మైసూర్ పెయింట్స్ వార్నిష్‌గా పేరు మార్చారు. ప్రస్తుతం ఈ కంపెనీ కర్ణాటక ప్రభుత్వ ఆధీనంలో నడుస్తుంది. 1962 నుంచి ఎన్నికల సంఘం తమకు అవసరమయ్యే ఇంకును ఈ పరిశ్రమ నుంచి మాత్రమే కొనుగోలు చేస్తుంది. ఇది 5, 7, 5, 20, 50 మిల్లీలీటర్ల బాటిళ్లలో దొరుకుతుంది. 5 ఎంఎల్ బాటిల్ 300 మంది ఓటర్లకు సరిపోతుంది. ఈ పరిశ్రమ ఈ ఇంకును ఇతర దేశాలకు కూడా సరఫరా చేస్తుంది. మారుతున్న కాలంతో పాటు ఈ పరిశ్రమ కూడా ఆధునికీకరణ చెందింది. ఈ ఇంకుతో సులువుగా ఉపయోగించడానికి మార్కర్ పెన్నులను కూడా తయారీ చేస్తుంది. ఇతర దేశాలలో వీటిని వాడుతున్నారు. కానీ మనదేశంలో మాత్రం ఇంకా ఇంకును మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఈ ఇంకు తయారీ అత్యంత రహస్యంగా సాగుతుంది. దీని తయారీలో ఉపయోగించే రసాయన ఫార్ములాను నేషనల్ ఫిజికల్ లాబోరేటరీ ఆఫ్ ఇండియా అత్యంత రహస్యంగా రూపొం ది స్తుంది. ఇతరులకు దీని తయా రీ తెలియనీయరు. -
ఎన్నికల ఇంకు.. కథా.. కమీషు..
సాక్షి, కొదాడ : ఎన్నికల సమయంలో దొంగ ఓట్లను నివారించడానికి, ఒకరు ఒకటి కంటే ఎక్కువ ఓట్లు వేయకుండా ఉండడానికి ఎన్నికల సంఘం ప్రతి ఓటరు ఎడమ చేతి చూపుడు వేలిపై ఇంకు గుర్తును వేస్తారు. ఇది దాదాపు నెల రోజుల వరకు చెరిగిపోకుండా ఉంటుంది. మరీ ఈ ఇంకుకు పెద్ద చరిత్రే ఉంది. దేశంలో జరిగిన 3వ సాధారణ ఎన్నికల నుంచి దీన్ని ఉపయోగిస్తున్నారు. దేశం మొత్తానికి అవసరమైన ఈ ఇంకును ఒక కంపెనీ మాత్రమే తయారు చేస్తుంది. 1937 సంవత్సరంలో కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ పట్టణంలో ఈ ఇంకు తయ్యారీ పరిశ్రమను ‘‘ మైసూర్ ల్యాక్ అండ్ పెయింట్స్ ’’ పేరుతో స్థాపించారు. మహరాజ నల్వాడీ కష్ణరాజ వడయార్ దీని వ్యవస్థాపకులు.తరువాత దీన్ని మైసూర్ పెయింట్స్ వార్నిష్‌గా పేరు మార్చారు. ప్రస్తుతం ఈ కంపెనీ కర్ణాటక ప్రభుత్వ అధీనంలో నడుస్తోంది. 1962 నుంచి ఎన్నికల సంఘం తమకు అవసరమయ్యే ఇంకును ఈ పరిశ్రమ నుంచి మాత్రమే కొనుగోలు చేస్తుంది. ఇది 5, 7,5, 20, 50 మిల్లీలీటర్ల బాటిళ్లలో దొరుకుతుంది. 5 ఎంఎల్ బాటిల్ 300 మంది ఓటర్లకు సరిపోతుంది. ఈ పరిశ్రమ ఈ ఇంకును ఇతర దేశాలకు కూడా సరఫరా చేస్తుంది. మారుతున్న కాలంతో పాటు ఈ పరిశ్రమ కూడా ఆధునికీకరణ చెందింది. ఈ ఇంకుతో సులువుగా ఉపయోగించడానికి మార్కర్‌పెన్నులను కూడ తయారీ చేస్తుంది. ఇతర దేశాల్లో వీటిని వాడుతున్నారు. కానీ మనదేశంలో మాత్రం ఇంకా ఇంకును మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఈ ఇంకు తయారీ అత్యంత రహస్యంగా సాగుతుంది. దీని తయారీలో ఉపయోగించే రసాయన ఫార్ములాను నేషనల్ ఫిజికల్ లాబోరేటరీ ఆప్ ఇండియా అత్యంత రహస్యంగా రూపొందిస్తుంది. ఇతరులకు దీని తయారీ గురించి తెలియనీయరు. -
సిరాచుక్కకు... ఓటుకు ఉన్న సంబంధం
సాక్షి, మహబూబాబాద్ : ఓటు వేశారా అంటే నోటితో సమాధానం చెప్పనక్కర్లేదు... సిరా గుర్తు ఉన్న వేలుని చూపిస్తే చాలు... సిరాచుక్కకు... ఓటుకు ఉన్న సంబంధం అలాంటిది. ఓటు వేసిన బాధ్యత కలిగిన పౌరునిగా మనల్ని సమాజంలో నిలబెట్టే ఆ సిరా ఎక్కడ తయారవుతుందో తెలుసా...? కర్ణాటకలోని మైసూర్లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని రంగులు వార్నిష్ పరిశ్రమ దీన్ని ఉత్పత్తి చేస్తుంది. మన దేశంలోని అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలకు ఇక్కడి నుంచే సిరా సరఫరా అవుతుంది. దీన్ని 29 దేశాలకు సరఫరా చేస్తున్నారు. ఇతర వస్తువుల మాదిరిగా సిరాకు ఖరీదు కూడా పెరిగిపోయింది. గత ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత ధర రెట్టింపు అయింది. పది మిల్లీలీటర్ల సిరా సీసా ధర రూ.64 ఉండగా దాని ధర రూ. 145 వరకు చేరుకుంది. ముడి సరుకుల ధర పెరగడమే దీనికి కారణమని తెలుస్తుంది. 2014 ఎన్నికలతో పోలిస్తే ఓటర్ల సంఖ్య పెరిగింది.1962 సార్వత్రిక ఎన్నికల నుంచి మైసూర్ పెయింట్స్ వార్నిష్ కర్మాగారం ఉత్పత్తి చేస్తున్న చెరిగిపోని సిరానే వినియోగిస్తున్నారు. ఈసారి కూడా అక్కడ నుంచే సిరాను సరఫరా చేయనున్నట్లు సమాచారం.1937లో అప్పటి మైసూర్ మహారాజు నాల్మడి కృష్ణరాజు వడియార్ ఈ సిరా తయారీ కర్మాగారాన్ని స్థాపించారు. అప్పటి దీని పేరు మైసూర్ లాక్ అండ్ పెయింట్స్ వర్క్స్.1989లో దాని పేరును మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ సంస్థగా మార్చారు. స్వాతంత్య్రానికి ముందు వరకు మైసూర్ రాజుల స్వాధీనంలో ఉండేది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ పరమైంది.తొలుత సీళ్లు వేసేందుకు కావాల్సిన లక్క తయారీకి ఈ పరిశ్రమను స్థాపించారు. చెట్ల నుంచి వచ్చే జిగురు తెచ్చి దానికి ఇతర అటవీ ఉత్పత్తులను కలిపి లక్కగా మార్చి రాజముద్రను వేసేందుకు ఉపయోగించేవారు. జిగురు సరఫరా తగ్గిపోవడంతో లక్కకు బదులుగా చెట్ల పసరు ఆధారంగా పెయింట్ల తయారీని ప్రారంభించారు. 1962లో ఒక ఓటరు పలుమార్లు వేయకుండా నివారించేందుకు చెరిగిపోని సిరాను ఉత్పత్తిచేయాలని కేంద్రం నిర్ణయించింది. నేషనల్ ఫిజికల్ లాబోరేటరీస్ ఫార్ములాతో సిరా ఉత్పత్తి బాధ్యతను ఆ కర్మాగారానికి అప్పగించారు. దక్షిణాఫ్రికా, నైజీరియా, నేపాల్, కెనడా, కాంబోడియా లాంటి ఇతర దేశాల్లోనూ ఈ సిరానే వినియోగిస్తున్నారు. ఈ సిరా ఎందుకు చెరగదంటే...మొదట్లో ఓటు వేసిన వ్యక్తికి ఎడమ చేతి వేలిపై సిరా చుక్కను పెట్టేవారు. 2006 ఫిబ్రవరి నుంచి ఓటర్ల ఎడమ చేతి వేలి గోరుపై సిరాను గీతగా పెడుతున్నారు.సిరాలో 7–25శాతం సిల్వర్ నైట్రేట్ ఉన్నందున వెంటనే చెరిగిపోదు.ఈ సిరా నేరేడు పండు రంగులో ఉంటుంది. -
చెరగని సిరా.. చెదరని ‘ముద్ర’
సాక్షి, హైదరాబాద్: మీ వేలికి ఉన్న సిరాచుక్క దేశ ప్రగతికి దిక్సూచి అన్నట్టుగా... ప్రజాస్వామ్య దేశాల్లో ఎన్నికల సమయంలో కీలకభూమిక పోషించడమే కాదు.. అందరికీ సుపరిచితమైన సిరా చుక్క తయారీకి గ్రేటర్ హైదరాబాద్ చిరునామాగా నిలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు వంద దేశాలతోపాటు మన దేశంలోని 29 రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలకు రాష్ట్ర రాజధాని నగరం నుంచే సిరా చుక్క ఎగుమతి చేస్తుండటం విశేషం. నగరం కేంద్రంగా మూడు దశాబ్దాలకుపైగా ఈ మహాక్రతువును నిర్విఘ్నంగా నిర్వహిస్తున్న సంస్థ రాయుడు లేబొరేటరీస్ కావడం విశేషం. వేలిపై సిరా చుక్క.. ఓటుకు చిహ్నం.. మనం ఓటేశామని చెప్పడానికి గుర్తు మాత్రమే కాదు.. దొంగ ఓట్లను నిరోధించే ఆయుధం కూడా సిరా చుక్కే. అందుకే, మన దేశంతోపాటు చాలా దేశాలు ఎన్నికలవేళ ఓటేసిన అభ్యర్థికి సిరా చుక్క పెట్టడం తప్పనిసరి చేశాయి. భారత ఎన్నికల సంఘంలోని నిబంధన 37(1) ప్రకారం ఓటు వేసిన వ్యక్తి ఎడమ చేయి చూపుడు వేలుపై సిరా గుర్తును పరిశీలించాల్సిన బాధ్యత పోలింగ్ అధికారిపై ఉంటుంది. ఒకవేళ ఓటరుకు ఎడమ చేయి చూపుడు వేలు లేనట్లయితే వేరే ఏ వేలుకైనా సిరా చుక్క పెట్టాలి. 100 దేశాలకు హైదరాబాద్ నుంచే ఎగుమతి... భారత్‌లో ప్రధానంగా రెండు సంస్థలు మాత్రమే ఎన్నికల సిరాను తయారు చేస్తున్నాయి. కర్ణాటకలోని మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్(ఎంపీవీఎల్) ఒకటికాగా.. హైదరాబాద్ ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏరియాలోని రాయుడు లేబొరేటరీస్ మరొకటి కావడం విశేషం. భారత ఎన్నికల సంఘం మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్‌తోపాటు రాయుడు లెబొరేటరీస్ తయారు చేస్తున్న సిరాను ఎక్కువగా వినియోగిస్తోంది. ’ఎన్నికల కోసం దాదాపు 100 దేశాలకు చెరగని సిరా(ఇండెలిబుల్ ఇంక్)ను సరఫరా చేస్తున్నాం. ఇండియా, శ్రీలంకతోపాటు దక్షిణాఫ్రికా, లిస్బెన్, మడగాస్కర్, నైజీరియా, మాలే, ఒమన్, మాల్దీవులు, మొజాంబిక్, రువాండా, జాంబియా, ఇథియోపియా, ఈస్టర్ తిమోర్ తదితర దేశాలు మా వినియోగదారులుగా ఉన్నాయి’ అని రాయుడు లేబొరేటరీస్ సీఈవో శశాంక్ రాయుడు ‘సాక్షి’కి తెలిపారు. భారత్‌లోని చాలా రాష్ట్రాల్లో జరిగే మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో తమ సిరానే ఉపయోగిస్తున్నారని చెప్పారు. 37 ఏళ్లుగా రాయుడు ల్యాబ్స్ ఇండెలిబుల్ ఇంక్‌ను తయారు చేస్తోందన్నారు. మొదట్లో సిరాను చిన్న(5 మి.లీ) బాటిల్స్‌లో నింపి సరఫరా చేసేవాళ్లమని, 2004 తర్వాత ఇంక్ మార్కర్లను తీసుకొచ్చామన్నారు. ఒక మార్కర్ లేదా ఒక ఇంకు సీసా 500 మంది ఓటర్ల వేళ్లకు సరిపోతుందని పేర్కొన్నారు. ఈ సాంకేతికతను తొలుత ప్రవేశపెట్టింది తమ రాయుడు లేబొరేటరీనేనని ఆయన వివరించారు. పల్స్ పోలియో కార్యక్రమంలోనూ.. పల్స్ పోలియో కార్యక్రమంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్లు గుర్తించేందుకు వారి వేలుపై సిరా చుక్క పెడుతుంటారు. డబ్ల్యూహెచ్‌వో కూడా ఇండెలిబుల్ ఇంక్ కోసం రాయుడు లేబొరేటరీస్ సంస్థతో దీర్ఘకాలిక ఒప్పం దం చేసుకుంది. ఏ దేశంలో పల్స్ పోలియో కార్యక్రమం జరిగినా అక్కడ ఈ సిరానే ఉపయోగిస్తుండటం విశేషం. ఇక యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం గుర్తింపు, యూనిసెఫ్‌తోపాటు, ఐఎస్వో 9001:2015, ఐఎస్వో 14001:2015, డబ్లు్యహెచ్‌వో–జీఎంపీ తదితర ధ్రువీకరణలను రాయుడు సంస్థ సాధించింది. అభివృద్ధి చెందిన జర్మ నీ తదితర దేశాలకు అల్ట్రా వయొలెట్ ఇంక్‌ను కూడా ఈ సంస్థ సరఫరా చేస్తోంది. అల్ట్రా వయొలెట్ సిరా అంటే.. ఈ సిరాచుక్క వేలిపై పెడితే కనిపించదు. కానీ ఓటరు వేలును అతినీలలోహిత కాంతి కింద పెట్టినప్పుడు దర్శనమిస్తుంది. అప్పుడు బోగస్ ఓటరును పసిగట్టే వీలుంటుంది. ఈ సిరా చుక్క ఈజీగా చెరిగిపోదు.. ఎన్నికల్లో వాడే సిరాను సెమి పర్మనెంట్ ఇంక్గా చెప్పొచ్చు. అంటే కొద్ది రోజులపాటు చెదిరిపోకుండా ఉండే సిరా అన్నమాట. ఈ సిరాలో కొన్ని రకాల రసాయనాలతోపాటు 10 నుంచి 18 శాతం వరకు సిల్వర్ నైట్రేట్ ఉంటుంది. ఇది వెలుతురు పడగానే గట్టిగా మారుతుంది. వేలుపై పెట్టిన తర్వాత మూడు నుంచి ఏడు రోజులపాటు చెదిరిపోకుండా ఉంటుందని శశాంక్ తెలిపారు. నాణ్యత, మన్నిక మా చిరునామా నాణ్యత, మన్నికతో కూడిన ఉత్పత్తులను తయారు చేయడమే మా లేబొరేటరీ ధ్యేయం. మూడున్నర దశాబ్దాల క్రితం కృష్ణా–గోదావరి ప్రింటింగ్ ఇంక్ పేరుతో మా సంస్థను స్థాపించాం. 1995లో సంస్థ పేరును రాయుడు లేబొరేటరీస్గా మార్చాం. ఎన్నికల సిరాతోపాటు అత్యాధునిక పద్ధతులను ఉపయోగించి సర్జికల్ మార్కర్లు, వాటర్ ఎరేజర్లు, ఇతర ఇంక్‌లను తయారు చేస్తున్నాం. మా ల్యాబ్‌లో ప్రస్తుతం 20 మంది పనిచేస్తున్నారు. ఏటా రూ.20 కోట్ల టర్నోవర్ సాధిస్తున్నాం. –శశాంక్ వి.రాయుడు, సీఈవో, రాయుడు లేబొరేటరీస్ -
నగదు మార్చుకోగానే ఇంక్ మార్క్!
-
నగదు మార్చుకోగానే ఇంక్ మార్క్!
ఢిల్లీ: పెద్దనోట్ల రద్దు వల్ల కొంతమంది వ్యక్తులు బ్యాంకులకు వెళ్లి పదే పదే డబ్బులు మారుస్తున్నారని కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి శక్తికాంత్ దాస్ తెలిపారు. కొందరు వ్యక్తులు ఈ విధంగా పదే పదే బ్యాంకులకు రావడంతో ఇతరులకు అవకాశం లేకుండా చేస్తున్నారని.. దీన్ని నిరోధించడంలో భాగంగా ఇంక్ మార్క్ వేయనున్నట్లు ఆయన మీడియాకు వెల్లడించారు. కొందరు వ్యక్తులు పదే పదే రావడం వల్లే బ్యాంకుల వద్ద రద్దీ బాగా పెరిగిందని, నల్లధనం ఉన్న వ్యక్తులు పెద్ద సంఖ్యలో వ్యక్తులను బ్యాంకులకు పంపిస్తున్నారని శక్తికాంత్ దాస్ చెప్పారు. జన్‌ధన్ అకౌంట్లలో రూ.50 వేలు వరకు మాత్రమే డిపాజిట్ చేయవచ్చు అన్నారు. 'నకిలీ నోట్ల నివారణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటుచేశాం. బ్యాంకుల్లో, పోస్టాఫీసుల్లో నగదు పంపిణీ పెంచాం. కొన్ని సంస్థలు సమ్మెలోకి వెళ్తున్నాయంటూ వచ్చిన వదంతులను నమ్మవద్దు. జన్‌ధన్ యోజన అకౌంట్లపై దృష్టి పెడుతున్నాం' అని ఆర్థికశాఖ కార్యదర్శి పేర్కొన్నారు.ప్రాథమిక అవసరాలకు తమ వద్ద ఉన్న పాత కరెన్సీని మార్చుకునేందుకు బ్యాంకులకు తరలివస్తున్న జనాలకు ఇక్కట్లు తప్పడం లేదు. బ్యాంకుల వద్ద పెద్ద సంఖ్యలో జనాలు ఉండటంతో సమయం వృథా అవుతుందని వాపోతున్నారు. బ్యాంకుల్లో రోజుకు రూ.4000 నుంచి రూ.4500 కు పాతకరెన్సీని మార్చుకునే వెసలుబాటు ఉంది. -
సిరా చుక్క పెట్టుకోండి.. చిల్లర తీసుకోండి!
హైదరాబాద్: ‘ధనమొస్తే దాచుకోవాలి రోగం వస్తే చెప్పుకోవాలి’ అంటారు. అయితే ఇప్పుడు జనమందరూ తమదగ్గరున్న డబ్బుతో బ్యాంకులు, పోస్టాఫీసులకు పరుగులు పెడుతున్నారు. పెద్ద నోట్లు తీసుకుని, చిన్న నోట్లు ఇవ్వాలని అధికారులకు మొర పెట్టుకుంటున్నారు. ‘పాత పెద్ద నోట్లు వద్దు.. కొత్త నోట్లు ముద్దు’ అంటున్నారు. రూ. 500, రూ. వెయ్యి నోట్లను కేంద్రం రద్దు చేయడంతో పెద్ద నోట్లను మార్చుకునేందుకు జనం బ్యాంకులు, పోస్టాఫీసుల ముందు గురువారం బారులు తీరారు. తండోపతండాలు తరలివస్తున్న ప్రజలకు కొత్త, చిన్న నోట్లు ఇచ్చేందుకు బ్యాంకు సిబ్బందికి తలప్రాణం తోకకువస్తోంది. దీంతో ప్రత్యేక చర్యలు చేపడుతున్నాయి. ** హైదరాబాద్ ఆర్ బీఐ కార్యాలయంలో నోట్ల కోసం జనం బారులు తీరారు. నోట్లు మార్చుకున్నవారికి చేతి వేలిపై బ్యాంకు సిబ్బంది సిరా గుర్తు వేస్తున్నారు. ** హైదరాబాద్ బంజారాహిల్స్ పోస్టాఫీసులో కొత్త నోట్లు రాలేదని అధికారులు తెలపడంతో జనం నిరాశతో వెనుదిరుగుతున్నారు. ** విశాఖపట్నం జోన్ లోని 78 బ్యాంకు బ్రాంచీల్లో నోట్ల మార్పిడి జరుగుతోంది. బ్యాంకుల ముందు వరుసలో నిలబడిన వారికి ప్రత్యేక కూపన్లు ఇస్తున్నారు. ఏజెన్సీలో కరెంట్ లేకపోవడంతో ఇన్వర్టర్లపైనే బ్యాంకు లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ** గుంటూరు జిల్లాలోని బ్యాంకులకు కొత్త రూ. 500 కోట్లు ఇంకా చేరలేదు. దీంతో పాత నోట్లకు బదులు రూ.100, రూ. 2000 నోట్లు ఇస్తున్నారు. ** విజయవాడలో అన్ని బ్యాంకుల్లో జనం బారులు తీరారు. దుర్గగుడిలో సైతం రద్దు చేసిన నోట్లు వేయవద్దని భక్తులను సిబ్బంది కోరుతున్నారు. ** పెద్ద నోట్ల మార్పిడి చేయకుండా డిపాజిట్లు మాత్రమే సేకరిస్తున్నారని కర్నూలు ప్రధాన పోస్టాఫీసు వద్ద జనం ఆగ్రహం వ్యక్తం చేశారు. ** హైదరాబాద్ ఫారెన్ ఎక్స్ఛేంజీలో విదేశీ నగదు మారకం పూర్తిగా నిలిపివేశారు. తమకు వెసులుబాటు కల్పించాలని ఫారెన్ ఎక్స్ఛేంజీ ప్రతినిధులు కోరుతున్నారు. ** కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఎస్ బీహెచ్ ముందు వరుసలో నిలబడిన గంగారాం అనే విద్యార్థి స్పృహ తప్పి పడిపోవడంతో కలకలం రేగింది. కొసమెరుపు: మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో కొన్ని బ్యాంకుల ముందు, ప్రత్యేక కార్యక్రమాలు... శుభకార్యాలకు వేసినట్టుగా టెంట్లు వేశారు. -
మరింత పెద్దగా ఓటు సిరా!
న్యూఢిల్లీ: ఎన్నికల్లో ఓటేసినట్టు రుజువేంటి? అని అడగ్గానే.. ఎడమచేతి చూపుడువేలుపై వేసిన సిరా గుర్తును చూపిస్తారు. అంతేకాదు.. ఎన్నికల్లో అవకతవకల నివారణకు, దొంగఓట్లకు తావులేకుండా చేసేందుకు ఓటర్ల వేలిపై వేసే ఈ సిరా గుర్తు ఎంతగానో ఉపయోగపడుతోంది. ఇప్పుడీ సిరా గుర్తును మరింత పెద్దదిగా కొట్టొచ్చినట్టు కనిపించేలా వేయనున్నారు. ఒకసారి వేస్తే కొన్ని నెలలపాటు చెరిగిపోకుండా ఉండే ఈ సిరా గుర్తును వేయడంలో ఎన్నికల అధికారులు సరిగ్గా శ్రద్ధ వహించట్లేదని వార్తలు రావడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఇందుకు సంబంధించి ఇటీవల ఆదేశాలిచ్చింది. ప్రత్యేకంగా రూపొందించిన బ్రష్ ద్వారా ఓటర్ల ఎడమచేతి చూపుడువేలు గోరు పైభాగంలో బాగా పెద్దదిగా కనిపించేలా ఈ సిరా గుర్తు వేయాలని స్పష్టం చేసింది. బ్రష్‌ను ఉపయోగించడంవల్ల సిరా గుర్తు మరింత పెద్దదిగా ఉండడమేగాక.. కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఇటీవలి ఎన్నికల్లో ఓటర్ల వేలిపై సిరా గుర్తు సరిగా వేయలేదని, కొన్నిచోట్ల సిరాస్పష్టంగా కనిపించనందున కొందరు మళ్లీ ఓటు వేసేందుకు దీనిని చెరిపేస్తున్నటు ఫిర్యాదులు రావడంతో ఈ ఆదేశాలిచ్చినట్టు ఈసీ తెలిపింది. ఈ సిరాను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మైసూరు పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ సరఫరా చేస్తోంది. ఇప్పుడు ఈ సిరాతోపాటు బ్రష్లనూ సరఫరా చేయాలని సంస్థను ఈసీ కోరింది. -
ఇంకు పడుద్ది!
పక్కాగా సమగ్ర సర్వేకు ప్రభుత్వం ఎత్తుగడ డూప్లికేషన్‌కు కళ్లెం వేసేందుకు ఆలోచన పలుచోట్ల నమోదుకాకుండా వేళ్లకు సిరా తహసీల్దార్లకు ఎస్ఎంఎస్ సందేశాలు రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ‘సమగ్ర కుటుం బ సర్వే’ను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రభుత్వం కొత్త ఎత్తుగడ వేసింది. ఒకే వ్యక్తి పలు కుటుంబాల్లో నమోదుకాకుండా నియంత్రించడానికి వేలుపై సిరా గుర్తు పెట్టాలని నిర్ణయించింది. సాధారణంగా ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నప్పుడు మాత్రమే చూపుడు వేలుపై సిరా చుక్క పెడతారు. తాజాగా రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఇంటింటి సర్వేలో అవకతవకలు జరగకుండా అరికట్టవచ్చని భావిస్తోంది. జిల్లావ్యాప్తంగా 8 లక్షల కుటుంబాలుండగా, వీటిలో అత్యధికం జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయి. ఈ కుటుంబాల్లో చాలామంది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి నగరంలో స్థిరపడ్డవారే. 19వ తేదీ ఒకేరోజు జరిగే సర్వేలో వీరిలో చాలామంది అటు ఇటు పేర్లను నమోదు చేసుకునే అవకాశముందని సందేహించిన రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. డూప్లికేషన్‌కు అడ్డుకట్ట వేసేందుకు సమాచారం సేకరించిన పౌరుల వేళ్లకు ఇంకు గుర్తును నమోదు చేయాలని తాజాగా నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం సంక్షిప్త సందేశాల (ఎస్ఎంఎస్) ద్వారా తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేసింది. కలెక్టరేట్ నుంచి తక్షణమే సిరా సీసాలను తీసుకెళ్లాలని సూచించింది. కాగా ఈ సర్వేను మరుసటి రోజుకు కూడా పొడిగించే అవకాశం లేకపోలేదని తాజా సంకేతాలను బట్టి తెలుస్తోంది. ఒకే రోజు రాష్ట్రవ్యాప్తంగా సర్వే నిర్వహించడం ఇదే తొలిసారి కావడంతో ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. అత్యవసర పనుల మీద బయటకు వెళ్లిన వారి పేర్లను నమోదు చేసుకునేందుకు ఈ అవకాశం కల్పించాలని యోచిస్తున్నట్లు సమాచారం. -
ఇంకు మార్కు.. చూపుడు వేలిపై
విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : త్వరలో నిర్వహించనున్న మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఓటువేసే వారికి ఎడమచేతి చూపుడు వేలిపై ఇంకు మార్కు వేయాలని రాష్ట ఎన్నికల అధికారి పి.రమాకాంతరెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన జిల్లా ఎన్నికల అధికారులు, పోలీసు అధికారులతో హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణపై పలు సూచనలు ఇచ్చారు. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యాత్మక, అత్యంత సమాస్యాత్మక ప్రాంతాలను గుర్తించేందుకు పోలీసు ఉన్నతాధికారులతో ఎన్నికల నిర్వహణ అధికారులు సమావేశాలు నిర్వహించాలని సూచించారు. శాంతిభద్రతల పర్యవేక్షణకు భారీ బందోబస్తు నిర్వహించాలన్నారు. మద్యం అమ్మకాలపై దృష్టి సారించి, అధిక మద్యం అమ్మకాలపై నిఘా ఏర్పాటు చేయాలని చెప్పారు. పోలింగ్‌కు సర్వం సిద్ధం : కలెక్టర్ జిల్లాలో పోలింగ్‌కు సర్వం సిద్ధం చేశామని జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు రమాకాంతరెడ్డికి వివరించారు. మున్సిపల్, జెడ్పీపీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో 49 మండలాల పరిధిలో 2,667 పోలింగ్ కే ంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 4,347 పెద్ద, 2,217 చిన్న బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేసినట్లు చెప్పారు. ఇవిగాక తమిళనాడు నుంచి మరో 700 బ్యాలెట్ బాక్సులు వచ్చాయన్నారు. విజయవాడ నగర పోలీసు కమిషనర్ బి.శ్రీనివాసులు మాట్లాడుతూ నగర పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు గట్టి భద్రతా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో చీఫ్ సెక్రటరీ ఏకే మహంతి, సీనియర్ ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్, రాష్ట్ర లా అండ్ ఆర్డర్ అధికారి కౌముది పాల్గొన్నారు. -
దేశ ఎన్నికలపై మైసూరు సిరా
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ఎన్నికల్లో ఓటు వేయడానికి ముందు ఓటర్ల ఎడమ చేయి చూపుడు వేలుకు సిరా గుర్తు పెట్టడం ఆనవాయితీ. దొంగ ఓట్లను నివారించడానికి ఇదో ప్రయత్నం. అలాంటి ఈ సిరాకు గొప్ప చరిత్రే ఉంది. ఒకసారి ఈ సిరా గుర్తు పెడితే కనీసం 30 రోజులైనా దాని ఆనవాళ్లు చెక్కు చెదరకుండా ఉంటాయి. ఈ విశిష్టమైన సిరాను మైసూరులో తయారు చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ మైసూరు పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ (ఎంపీవీఎల్)కు ఈ అరుదైన ఘనత దక్కుతోంది. విదేశాలకు కూడా ఈ సిరా సరఫరా అవుతుంది. మన దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయడం ప్రభుత్వానికే కాకుండా కమిషన్‌కు పెద్ద సవాలు. దీనిని విజయవంతంగా పూర్తి చేయడంలో భాగంగా బోగస్ ఓటింగ్‌ను నివారించడానికి ఈ సిరా వినియోగాన్ని చేపట్టారు. రసాయనాలు లేదా సబ్బులు, నూనెలతో ఈ గుర్తును చెరిపి వేయడం ఏ మాత్రం సాధ్యం కాదు. భారత ఎన్నికల సంఘం, నేషనల్ ఫిజికల్ లేబొరేటరీ, నేషనల్ రీసెర్చ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ల సహకారంతో ఈ సిరా ఉత్పత్తి, సరఫరాలో ఎంపీవీఎల్ ప్రత్యేకతను సాధించింది. ఇలాంటి సిరా తయారీకి ప్రత్యేక లెసైన్స్‌ను కేవలం ఎంపీవీఎల్ 1962లో పొందింది. మైసూరు రాజుల కాలంలో... మైసూరు మహారాజు దివంగత నాల్వడి కృష్ణరాజ ఒడయార్ హయాంలో 1937లో మైసూరు లాక్ అండ్ పెయింట్ వర్క్స్ పేరిట ఈ కంపెనీ ఏర్పాటైంది. 1989లో ఎంపీవీఎల్గా పేరు మారింది. 1962లో ఎన్నికల కమిషన్ సిరా సరఫరా కోసం ఈ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. 1976 నుంచి మరో 28 దేశాలకు కూడా ఇక్కడి నుంచి సిరా సరఫరా అవుతోంది. విశేషాలు 2009 సార్వత్రిక ఎన్నికలకు పది మి.లీ. పరిమాణం కలిగిన సుమారు 20 లక్షల సీసాలను ఎంపీవీఎల్ సరఫరా చేసింది. ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే 2.88 లక్షల సీసాలు ఖర్చయ్యాయి. 2006 ఫిబ్రవరి ఒకటో తేది నుంచి ఓటరుకు ఎడమ చేతి చూపుడు వేలుపై గోరు పైభాగం నుంచి కింది వరకు గీత గీసే వారు. అంతకు ముందు గోరుపైన ఉండే చర్మం పై గుర్తు పెట్టే వారు. వేలిపై పెట్టే సిరాలో సిల్వర్ నైట్రేట్ ఉంటుంది. తద్వారా సూర్య కిరణాలు తగలగానే చర్మంపై స్పష్టమైన గుర్తు ఏర్పడుతుంది. దరిమిలా దీనిని చెరిపి వేయడం సాధ్యం కాదు. బయట చర్మం కణాలను మార్పు చేస్తే తప్ప దీనిని చెరిపి వేయలేం. సాధారణంగా ఈ సిరా ఊదా రంగులో ఉంటుంది. సురినాం దేశంలో 2005లో జరిగిన ఎన్నికల్లో నారింజ రంగులో వాడారు.