మరింత పెద్దగా ఓటు సిరా! | Indelible Ink Mark on Voter's Forefinger to be Bigger | Sakshi
Sakshi News home page

మరింత పెద్దగా ఓటు సిరా!

Published Thu, Jun 4 2015 1:06 AM | Last Updated on Sun, Sep 3 2017 3:10 AM

మరింత పెద్దగా ఓటు సిరా!

మరింత పెద్దగా ఓటు సిరా!

న్యూఢిల్లీ: ఎన్నికల్లో ఓటేసినట్టు రుజువేంటి? అని అడగ్గానే.. ఎడమచేతి చూపుడువేలుపై వేసిన సిరా గుర్తును చూపిస్తారు. అంతేకాదు.. ఎన్నికల్లో అవకతవకల నివారణకు, దొంగఓట్లకు తావులేకుండా చేసేందుకు ఓటర్ల వేలిపై వేసే ఈ సిరా గుర్తు ఎంతగానో ఉపయోగపడుతోంది. ఇప్పుడీ సిరా గుర్తును మరింత పెద్దదిగా కొట్టొచ్చినట్టు కనిపించేలా వేయనున్నారు. ఒకసారి వేస్తే కొన్ని నెలలపాటు చెరిగిపోకుండా ఉండే ఈ సిరా గుర్తును వేయడంలో ఎన్నికల అధికారులు సరిగ్గా శ్రద్ధ వహించట్లేదని వార్తలు రావడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఇందుకు సంబంధించి ఇటీవల ఆదేశాలిచ్చింది.

ప్రత్యేకంగా రూపొందించిన బ్రష్ ద్వారా ఓటర్ల ఎడమచేతి చూపుడువేలు గోరు పైభాగంలో బాగా పెద్దదిగా కనిపించేలా ఈ సిరా గుర్తు వేయాలని స్పష్టం చేసింది. బ్రష్‌ను ఉపయోగించడంవల్ల సిరా గుర్తు మరింత పెద్దదిగా ఉండడమేగాక.. కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.

ఇటీవలి ఎన్నికల్లో ఓటర్ల వేలిపై సిరా గుర్తు సరిగా వేయలేదని,  కొన్నిచోట్ల సిరాస్పష్టంగా కనిపించనందున కొందరు మళ్లీ ఓటు వేసేందుకు దీనిని చెరిపేస్తున్నటు ఫిర్యాదులు రావడంతో ఈ ఆదేశాలిచ్చినట్టు ఈసీ తెలిపింది.  ఈ సిరాను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మైసూరు పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ సరఫరా చేస్తోంది. ఇప్పుడు ఈ సిరాతోపాటు బ్రష్‌లనూ సరఫరా చేయాలని సంస్థను ఈసీ కోరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement