neelam sahani
-
‘ధర్మవరం’ వైస్ చైర్మన్ పదవులకు 14న ఎన్నిక
సాక్షి, అమరావతి: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మునిసిపాలిటీలోని రెండు వైస్ చైర్మన్ పదవులకు ఈ నెల 14వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని బుధవారం నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఆ రెండు స్థానాలకు ఎన్నికల ప్రక్రియ నిర్వహించేందుకు ప్రత్యేక అధికారిని నియమించాలని, కౌన్సిలర్లకు ఈ నెల 10లోగా నోటీసులు జారీ చేయాలని జిల్లా అధికారులకు సూచించారు. 14వ తేదీ ఉదయం 11 గంటలకు ఎన్నికల ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. -
22 స్థానిక సంస్థల ఎన్నికలు ఈవీఎంలతోనే
సాక్షి, అమరావతి: గతంలో ఎన్నికలు జరగని 22 నగరపాలక సంస్థలు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఈవీఎంల విధానంలో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కసరత్తు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 17 నగరపాలక సంస్థలు, 106 మునిసిపాలిటీలు, నగర పంచాయతీలున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వంలో కాకినాడ కార్పొ రేషన్ ఎన్నికలు జరిగాయి. వైఎస్సార్సీపీ అధికా రంలోకి వచ్చిన తరువాత గత ఏడాది మార్చిలో 12 నగరపాలక సంస్థలు, 75 పురపాలక సంఘాలకు, నవంబర్‌లో నెల్లూరు నగరపాలక సంస్థకు, 12 పుర పాలక సంఘాలు, నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించింది. ఈ రెండు విడతల్లోను బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు జరిగాయి. కోర్టు కేసుల కా రణంగా రాజమహేంద్రవరం (రాజమండ్రి), శ్రీకా కుళం, మంగళగిరి–తాడేపల్లి నగరపాలక సంస్థల్లో ను, ఆముదాలవలస, రాజాం (శ్రీకాకుళం జిల్లా), తణుకు, పాలకొల్లు, భీమవరం, తాడేపల్లిగూడెం, చింతలపూడి (పశ్చిమగోదావరి), వైఎస్సార్ తాడి గడప, గుడివాడ (కృష్ణా), బాపట్ల, పొన్నూరు, నర సరావుపేట (గుంటూరు), కందుకూరు, పొదిలి (ప్రకాశం), కావలి, గూడూరు, అల్లూరు (నెల్లూరు), బి.కొత్తకోట, శ్రీకాళహస్తి (చిత్తూరు జిల్లా) పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో ఎన్నికలు జరగలేదు. కోర్టు కేసులు కొలిక్కి వస్తే వీలైనంత త్వరగా వీటికి ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ సన్నాహాలు చేస్తోంది. ఉమ్మడి ఏపీలో ఈవీఎంల విధానంలోనే.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని వారం రోజుల కిందట తన కార్యాలయ అధికారులతో సమావేశం నిర్వహించి ఈవీఎంల విధానంలో ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై చర్చించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మునిసిపల్ ఎన్నికలు ఈవీఎంల విధానంలో నిర్వహించిన విషయాన్ని అధికారులు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. దాదాపు 8 వేల ఈవీఎంలు అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. 22 నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చినా నాలుగువేల బూత్‌లలోనే పోలింగ్ ఉంటుందని, ఇందుకు ఆ ఈవీఎంలు సరిపోతాయని వివరించారు. అసెంబ్లీ, లోకసభ ఎన్నికలను ఈవీఎంలతో పాటు వీవీప్యాట్లతో కలిపి ఉండే మిషన్లతో నిర్వహిస్తున్నారని, రాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్ద వీవీప్యాట్లు లేని పాత ఈవీఎంలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయా ఈవీఎంలకు వీవీప్యాట్లను అనుసంధానం చేసే అంశంపై ప్రభుత్వరంగ సంస్థ ఈసీఐఎల్‌ను సంప్రదించి తదుపరి చర్యలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. కోర్టు కేసులపైనా దృష్టి ఎన్నికలు జరగని 22 నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీలకు సంబంధించిన పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసులపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయ అధికారులు ఎప్పటికప్పుడు మునిసిపల్‌శాఖ అధికారులతో సంప్రదిస్తున్నారు. నెలరోజుల కిందట నీలం సాహ్ని మునిసిపల్‌శాఖ అకారులతో సమావేశమై ఆయా కేసుల పరిస్థితి గురించి తెలుసుకున్నారు. -
4న రెండో ఉపాధ్యక్ష పదవులకు ఎన్నిక
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా మండల పరిషత్ రెండో ఉపాధ్యక్ష పదవులకు ఈ నెల 4వ తేదీ మంగళవారం ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి మండలాల వారీగా ప్రత్యేక సమావేశాల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తరఫున ఎంపీడీఓలు ఇప్పటికే ఎంపీటీసీలకు సమాచారం ఇచ్చారు. ఈ ప్రక్రియ శుక్రవారం సాయంత్రానికే పూర్తయిందని కమిషన్ కార్యాలయ అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ కార్యక్రమాల పర్యవేక్షణలో స్థానిక ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం మరింత పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మండల పరిషత్‌లో రెండో ఉపాధ్యక్ష పదవిని ఏర్పాటుచేస్తూ ఇటీవలే అసెంబ్లీలో చట్ట సవరణ చేసిన విషయం తెలిసిందే. దీనికి ముందే గుంటూరు జిల్లా దుగ్గిరాల మినహా మిగిలిన 649 మండలాల్లో మండల పరిషత్ అధ్యక్ష, ఒక ఉపాధ్యక్ష పదవులతో పాటు కోఆప్టెడ్ సభ్యుని ఎన్నిక జరిగింది. ప్రభుత్వ చట్ట సవరణ నేపథ్యంలో ఈ 649 మండలాల్లో రెండో ఉపాధ్యక్ష పదవికి కూడా ఎన్నిక నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని డిసెంబరు 28న నోటిఫికేషన్ జారీచేశారు. దీంతో నాలుగో తేదీ ఉ.11 గంటలకు అన్నిచోట్లా మండల పరిషత్ ప్రతేక సమావేశాలు మొదలై, ఎంపీటీసీ సభ్యులు రెండో ఉపాధ్యక్షుడిని ఎన్నుకుంటారు. మరోవైపు.. విశాఖ జిల్లా మాకవరం ఎంపీపీ రాజీనామాతో ఆ స్థానానికి కూడా అదే రోజున ఎన్నిక నిర్వహిస్తారు. అలాగే, చిత్తూరు జిల్లా రామకుప్పం, గుర్రంకొండలో మండలాధ్యక్ష పదవులకు, కృష్ణాజిల్లా ఆగిరిపల్లిలో మొదటి ఉపాధ్యక్ష పదవికి ఎన్నిక జరుగుతుంది. రాజీనామా కారణంగా ఖాళీగా ఉన్న కర్నూలు జెడ్పీ చైర్మన్ ఎన్నిక కూడా మంగళవారం జరుగుతుంది. కోరం ఉంటేనే ఎన్నిక మండల పరిషత్ రెండో ఉపాధ్యక్ష ఎన్నికవిధివిధానాలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసింది. రెండో ఉపాధ్యక్ష ఎన్నిక నిమిత్తం జరిగే ప్రత్యేక సమావేశానికి కనీస కోరంగా మండల పరిషత్‌లో ఉండే మొత్తంలో ఎంపీటీసీ సభ్యుల సంఖ్యలో సగానికి పైగా సభ్యులు హాజరు తప్పనిసరని కమిషన్ స్పష్టంచేసింది. లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారి పరిధిలోని మండల పరిషత్ సమావేశాల్లో పాల్గొనవచ్చని, అయితే, వారికి ఎన్నికలో ఓటు హక్కు ఉండదని తెలిపింది. -
కుప్పం ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ఎస్ఈసీ ప్రెస్‌నోటు
-
కుప్పంలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది: ఎస్ఈసీ నీలం సాహ్ని
సాక్షి, విజయవాడ: కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణపై రాష్ట్ర ఎన్నికల అధికారి నీలం సాహ్ని స్పందించారు. ఈ మేరకు మంగళవారం పత్రిక ప్రకటన విడుదల చేశారు. వెబ్‌కాస్టింగ్, వీడియో గ్రఫీ, సీసీటీవీ కెమెరాల నిఘాలో పోలింగ్ జరిగిందని నీలం సాహ్ని పేర్కొన్నారు. కుప్పంలో పోలింగ్ బూత్ వెలుపల చిన్న చిన్న ఘటనలు మినహాయిస్తే పోలింగ్ ప్రశాంతంగా జరిగిందన్నారు. చిత్తూరు ఎస్పీ కుప్పంలో ఉండి, పరిస్థితిని శాంతిభద్రతలను స్వయంగా పర్యవేక్షించారని పేర్కొన్నారు. ఎన్నికల పరిశీలకులు ప్రతి బూత్‌కు వెళ్లి పోలింగ్ తీరును స్వయంగా పరిశీలించారని తెలిపారు. చదవండి: చంద్రబాబు స్థాయి దిగజారి మాట్లాడుతున్నారు: మంత్రి బొత్స సత్యనారాయణ పార్టీలు నియమించుకున్న ఏజెంట్లు అంతా పోలింగ్‌బూత్‌ల్లో ఉన్నారని ఎస్ఈసీ నీలం సాహ్ని పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని, రీ పోలింగ్ నిర్వహించమని ఎవరు కూడా కోరలేదని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘానికి వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు అధికారులకు పంపించినట్లు, వారు వెంటనే తగిన చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదికలు ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘానికి పంపించారని వెల్లడించారు. -
టీడీపీ అక్రమాలు.. ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, అమరావతి: టీడీపీ అక్రమాలపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. ఎస్ఈసీ నీలం సాహ్నికి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, నారాయణమూర్తి ఫిర్యాదు చేశారు. మున్సిపల్, జెడ్పీ ఉప ఎన్నికల్లో టీడీపీ కుట్రలకు తెరలేపిందని లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు రాజకీయ విలువలను దిగజారుస్తున్నారన్నారు. కుప్పంలో టీడీపీ నేతలు అమర్నాథ్రెడ్డి, పులివర్తి నాని దౌర్జనాలు చేస్తున్నారన్నారు. కుప్పం పర్యటనలో లోకేష్ న్యాయస్థానాల విలువలను దిగజార్చేలా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు ఓటర్లను భయపెడుతూ, ప్రలోభాలకు గురిచేస్తున్నారని లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. చదవండి: kuppam: ఓటర్లను నేరుగా ప్రలోభపెడుతున్న చంద్రబాబు ‘‘కుప్పం వెళ్లాలని చంద్రబాబు స్పెషల్ ఫ్లైట్ సిద్ధం చేసుకున్నారు. చంద్రబాబుకు కుప్పంలో ఓటు లేదు. ఎందుకు వెళ్తున్నారు. టీడీపీ అరాచకాలపై ఆధారాలతో సహా ఈసీకి ఫిర్యాదు చేశాం. కుప్పంలో చంద్రబాబు ఓటరు కాదు.. నారావారి పల్లెలో కూడా బాబుకు ఓటు లేదు. దొంగ ఓట్లు వేయించే కల్చర్ టీడీపీదే.. ప్రశాంతంగా ఉన్న ఏరియాలో అలజడి సృష్టించాలని టీడీపీ కుట్రలు చేస్తోందని’’ లేళ్ల అప్పిరెడ్డి దుయ్యబట్టారు. -
22న నెల్లూరు మేయర్ ఎన్నిక
సాక్షి, అమరావతి: నెల్లూరు నగర మేయర్‌తో పాటు ఇద్దరు డిప్యూటీ మేయర్ల ఎన్నిక ఈ నెల 22న నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఆదివారం నోటిఫికేషన్ జారీ చేశారు. సోమవారం ఎన్నికలు జరుగుతున్న ఆకివీడు (ప.గో), జగ్గయ్యపేట, కొండపల్లి (కృష్ణా), దాచేపల్లి, గురజాల (గుంటూరు), దర్శి (ప్రకాశం), బుచ్చిరెడ్డిపాలెం (నెల్లూరు), బేతంచెర్ల (కర్నూలు), కమలాపురం, రాజంపేట (వైఎస్సార్), పెనుకొండ (అనంతపురం), కుప్పం (చిత్తూరు) మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో చైర్మన్ల ఎన్నికను అదే రోజు నిర్వహిస్తారు. ఆయా మునిసిపాలిటీల్లో రెండేసి చొప్పున వైస్ చైర్మన్ పదవులకు ఆ రోజే ఎన్నికలు జరుపుతారు. ఆయా నగర, పట్టణ, నగర పంచాయతీల్లో డివిజన్, వార్డు స్థానాలకు సోమవారం ఉ.7 గంటల నుంచి సా.5 గంటల వరకు పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. బుధవారం ఓట్ల లెక్కింపు చేపడతారు. ఆయా చోట్ల పరోక్ష పద్ధతిలో మేయర్, డిప్యూటీ మేయర్, మునిసిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లను ఎన్నుకునేందుకు అక్కడ గెలిచిన అభ్యర్థులతో 22వ తేదీన ఉ.11 గంటలకు నగరపాలక సంస్థ, మునిసిపాలిటీ, నగర పంచాయతీల వారీగా ప్రత్యేక సమావేశాలు జరపాలని ఎస్ఈసీ ఆయా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఇందుకు ఆయా మునిసిపాలిటీల్లో గెలిచిన అభ్యర్థులకు మేయర్, చైర్మన్ల ఎన్నికకు సంబంధించిన సమాచారాన్ని 18వ తేదీలోగా వ్యక్తిగతంగా తెలియజేయాలని పేర్కొన్నారు. డిప్యూటీ, వైస్ చైర్మన్ల ఎన్నిక ఇలా.. మేయర్, చైర్మన్ ఎన్నిక పూర్తయిన తర్వాతనే డిప్యూటీ మేయర్, వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ ప్రారంభించాలని.. ఎక్కడైనా వివిధ కారణాలతో మేయర్, చైర్మన్ ఎన్నిక వాయిదా పడితే డిప్యూటీ మేయర్, వైస్ చైర్మన్ల ఎన్నికలు కూడా వాయిదా పడినట్టే అవుతుందని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. 22న జరగాల్సిన ఎన్నికలు వాయిదా పడినచోట 23వ తేదీన తిరిగి ఎన్నిక జరిపేందుకు ఆయా జిల్లా కలెక్టర్లు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. జెడ్పీ వైస్ చైర్మన్, ఎంపీపీ ఎన్నికలు సైతం.. ► విజయనగరం జెడ్పీలో ఇద్దరు వైస్ చైర్మన్లకు గాను ఒకరు ఇటీవల మృతి చెందడంతో ఆ పదవికి కూడా ఈ నెల 22వ తేదీన ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని వేరొక నోటిఫికేషన్ జారీ చేశారు. ► గతంలో ఎంపీపీ ఎన్నిక వాయిదా పడిన వాల్మీకిపురం, గుడిపల్లి (చిత్తూరు)తోపాటు తాజాగా ఎంపీటీసీ ఎన్నికలు జరిగిన ఎటపాక (తూ.గో) మండలంలో మండలాధ్యక్ష పదవులకు ఈ నెల 22వ తేదీన ఎన్నిక నిర్వహిస్తారు. ఆయా మండలాల్లో ఒక్కొక్క ఉపాధ్యక్ష , ఒక్కో కో–ఆప్టెడ్ సభ్యుని స్థానాలకు అదే రోజు ఎన్నికలు నిర్వహిస్తారు. గతంలో ప్రత్యేకంగా ఒక్క మండల ఉపాధ్యక్ష పదవి ఎన్నిక వాయిదా పడిన నరసరావుపేట (గుంటూరు), గాలివీడు, సిద్ధవటం (వైఎస్సార్)లలో 22నే ఉపాధ్యక్ష ఎన్నికలు నిర్వహిస్తారు. ► ఈ ఏడాది జనవరి–ఫిబ్రవరి నెలలో పంచాయతీ ఎన్నికలు జరిగినప్పుడు వార్డు సభ్యుల ఆధ్వర్యంలో పరోక్ష పద్ధతిన జరగాల్సిన ఉప సర్పంచ్ ఎన్నిక వాయిదా పడింది. అలా మిగిలిపోయిన 130 గ్రామ పంచాయతీల్లోనూ 22వ తేదీనే ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించాలని ఎస్ఈసీ జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులిచ్చారు. -
కుప్పంలో టీడీపీ అక్రమాలపై ఈసీకి ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ
-
కుప్పంలో టీడీపీ అక్రమాలపై ఈసీకి ఫిర్యాదు
సాక్షి, అమరావతి: కుప్పంలో టీడీపీ అక్రమాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్‌కి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిని కలిసిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, నవరత్నాలు వైస్ చైర్మన్ నారాయణమూర్తి వినతిపత్రం అందజేశారు. అనంతరం లేళ్ల అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 'ఈ ఎన్నికల్లో చంద్రబాబు పడుతున్న పాట్లు చూస్తే జాలి కలుగుతోంది. 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు ఈ ఎన్నికల్లో ఉనికిని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా 80శాతం ప్రజలు వైఎస్సార్సీపీకి పట్టం కడుతున్నారు. కుప్పంలో చంద్రబాబు ఓటుకి రూ. 5వేలు ఇస్తున్నారు. అనేక రకాలుగా ప్రలోభ పెట్టేలా మాట్లాడుతున్నారు. ఏ కేసులో అయినా 48 గంటల్లో స్టే తెచుకుంటామంటూ లోకేష్ న్యాయ స్థానాల్ని అవమానించేలా మాట్లాడుతున్నారు' అని లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. చదవండి: (తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త..) -
AP: పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ హవా
ఎన్నికల ఫలితాలు Live Updates: ► సాయంత్రం 5 గంటల వరకు వెలువడిన పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు పెద్ద సంఖ్యలో గెలుపొందారు. మరికొంత మంది గెలుపు బాటలో ఉన్నారు. తూర్పు గోదావరి జిల్లా: ► ఆలమూరు గ్రామ పంచాయతీ 8వ వార్డుకి జరిగిన ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థి ఎలుగు బంట్ల సత్యనారాయణ బూరయ్య 93 ఓట్లు మెజారిటీతో గెలుపు శ్రీకాకుళం జిల్లా: ►రేగిడి ఆమదాలవలస మండలం తోకల వలస పంచాయతీలో వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థి సివ్వాల సూర్యకుమారి గెలుపు. విజయనగరం జిల్లా: ► భోగాపురం మండలం లింగాల వలస సర్పంచ్ ఉప ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థి బుగత లలిత 42 ఓట్ల మెజార్టీతో విజయం. ► లక్కవరపుకోట మండలం రేగ పంచాయతీ 7 వ వార్డులో టీడీపీ బలపరిచిన అభ్యర్థి లెంక శ్రీను 45 ఓట్లు మెజారిటీతో గెలుపొందారు. ► నెల్లిమర్ల మండలం, ఏటి అగ్రహారం సర్పంచ్ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ సానుభూతి పరురాలు మీసాల సూర్యకాంత 44 ఓట్లు మెజారిటీ తో గెలుపొందారు. ప్రకాశం జిల్లా : ► కంభం మండలం కందులాపురం 6వార్డు అభ్యర్థి బండారు వరలక్ష్మి 63 ఓట్లతో విజయం. ► మద్దిపాడు 5 వార్డు అభ్యర్థి నూనె శ్రీనివాసులు వైఎస్సార్సీపీ మద్దతుతో 99 ఓట్లతో ఘన విజయం. ► కొత్తపట్నంలో 7వ వార్డులో వైసీపీ అభ్యర్ధి పూరిణి సరోజిని 95 ఓట్లుతో విజయం. ► తర్లుబాడు మండలం మీర్జాపేట గ్రామ 2 వ వార్డులో వైసీపీ అభ్యర్థి యోగిరవణమ్మ పై టీడీపీ అభ్యర్థి నాగజ్యోతి 30 ఓట్ల తేడతో విజయం. ► ఇంకోల్లుమండలంపూసపాడులో 5 వ వార్డులో టిడిపి అభ్యర్ది గోరంట్ల లక్ష్మీ తులసీ 101 ఓట్ల మోజార్టీ తో గెలుపు. ► కొండపి నియోజక వర్గం నిడమానూరు 12 వార్డు టీడీపీ అభ్యర్దీ కాకుమాను సుబ్బారావు 46 ఓట్లతో విజయం.. ► కందుకూరు మండలం నరిశెట్టి వారి పాలెం గ్రామపంచాయతీ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన ముప్పాళ్ళ శ్రీనివాసరావు విజయం గుంటూరు జిల్లా: ► అచ్చంపేట మండలం అంబడిపూడి సర్పంచ్ గా కొమ్మవరపు స్వరాజ్యలక్ష్మి 159 ఓట్లతో గెలుపు. ► సత్తెనపల్లి మండలం పాకాలపాడు సర్పంచ్ గా తిప్పి రెడ్డి సుజాత వెంకట రెడ్డి 427 ఓట్లతో గెలుపు. ► వినుకొండ మండలం శివపురం సర్పంచ్‌గా కమతం సుబ్బమ్మ 452 మెజార్టీతో గెలుపు (వైఎస్సార్సీపీ) ► బొల్లాపల్లి మండలం రేమిడిచర్ల సర్పంచ్ గా బ్రహ్మం నాయక్ 153 ఓట్లతో గెలుపు(వైఎస్సార్సీపీ) విశాఖ జిల్లా ► అమలాపురం గ్రామంలో ఐదో వార్డుకు జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ నుంచి మేడపురెడ్డి నూకల తల్లి గెలుపు. ► పెదబయలు మండలం గిన్నెలకోట పంచాయితీ ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ బలపరిచిన సాగేని చిన్నతల్లమ 155 ఓట్లు మెజారిటీతో గెలుపు. ► ముంచంగిపుట్టు మండలం జర్రెల పంచాయితీ సర్పంచ్ ఉపఎన్నికలో వైసీపీ బలపర్చిన మైకం భాగ్యవతి 55 ఓట్ల మెజార్టీతో గెలుపు. ► భీమిలి రేఖవానిపాలెం సర్పంచ్ అభ్యర్థిగా వైఎస్సార్సీపీకి చెందిన సమ్మిడి శ్రీనివాసరావు గెలుపు చిత్తూరు జిల్లా ► గంగవరం మండలం తాళ్లపల్లిలో సర్పంచ్ ఉప ఎన్నికలలో 97 ఓట్ల ఆధిక్యంతో వైసీపీ బలపరిచిన అభ్యర్థి శంకరమ్మ గెలుపు. కర్నూలు జిల్లా ► సిరివేళ్ళ గ్రామ పంచాయతీ లోని 18 వ వార్డు ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరుపున బి.పెదరాజు 253 ఓట్లతో గెలుపు. నంద్యాల మండలం భీమవరం గ్రామంలోని నాలగో వార్డు మెంబెర్ స్థానానికి జరిగిన ఎన్నికల్లో 12 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన టిడిపి మద్దత్తుదారుడు శాలి పెల జనార్దన్ రెడ్డి. ► కృష్ణగిరి మండలం లక్కసాగరం సర్పంచ్ గా మాదిగ వరలక్ష్మి 858 ఓట్ల మెజారిటీ తో గెలుపు. ►సి బెళగల్ మండలం,యనగండ్ల గ్రామ పంచాయతీ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దత్తు దారుడు ఇమ్మానియల్ 39 ఓట్లతో గెలుపు. ► కృష్ణగిరి మండలం లక్కసాగరం సర్పంచ్ గా టీడీపీ మద్దుతుదారు మాదిగ వరలక్ష్మి 858 ఓట్ల మెజారిటీతో గెలుపు. కృష్ణాజిల్లా ► కృష్ణా జిల్లాలో ముగిసిన పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ► సర్పంచ్ స్థానాలు వైసిపి -2 , టీడీపీ -2 గెలుపు ► వార్డు మెంబర్లు వైసిపి -8 ,టీడీపీ-1 , టిడిపి&జనసేన -2 గెలుపు సర్పంచ్ ఎన్నికల ఫలితాలు ► కలిదిండి (మం) కలిదిండి సర్పంచ్ గా వైఎస్సార్సీపీ అభ్యర్ధిని మసిముక్కు మారుతీ ప్రసన్న 249 ఓట్లతో గెలుపు ► ముదినేపల్లి (మం)ములకలపల్లి సర్పంచ్ గా వైఎస్సార్సీపీ అభ్యర్ధి నువ్వుల కోటేశ్వరరావు 57 ఓట్లతో గెలుపు ► నందివాడ (మం) పోలుకొండ సర్పంచ్ గా టీడీపీ అభ్యర్ధిని మానేపల్లి ఝాన్సీ కుమారి 27 ఓట్లతో గెలుపు ► ఘంటసాల (మం)మల్లంపల్లి సర్పంచ్ గా టీడీపీ అభ్యర్ధి బెల్లంకొండ అమలేశ్వరరావు 143 ఓట్లతో గెలుపు వార్డు ఎన్నికల ఫలితాలు ► తోట్లవల్లూరు (మం) రొయ్యూరులో 3వ వార్డు మెంబర్ గా వైఎస్సార్సీపీ అభ్యర్ధి లుక్కా నాగభూషణం 48 ఓట్ల మెజారిటీతో గెలుపు ► నూజివీడు (మం) బూరవంచ పంచాయతీ 3వ వార్డు మెంబర్ గా వైఎస్సార్సీపీ అభ్యర్ధి సయ్యద్ ఖిజర్ పాషా ఖాద్రి 28ఓట్లతో గెలుపు ► ఆగిరిపల్లి (మం) చినఆగిరిపల్లి పంచాయతీ 1వ వార్డు మెంబర్ గా వైఎస్సార్సీపీ అభ్యర్ధి చన్ను సావిత్రి 21 ఓట్ల విజయం ► కలిదిండి (మం) కోరుకొల్లు12వ వార్డు మెంబర్ గా వైఎస్సార్సీపీ అభ్యర్థి యాళ్ళ పద్మ 146 ఓట్ల మెజార్టీతో గెలుపు ► ఘంటసాల (మం) దాలిపర్రు 3వ వార్డు మెంబర్ గా వైఎస్సార్సీపీ అభ్యర్ధి దాసరి నాగరాజు 26 ఓట్ల మెజారిటీ తో విజయం ► చల్లపల్లి (మం) ఆముదార్లంకలో 2 వార్డు మెంబర్ గా వైఎస్సార్సీపీ అభ్యర్ధి నాగిడి శివ పార్వతి 23 ఓట్లతో విజయం ► పెడన (మం) నేలకొండపల్లి పంచాయితీ 6వ వార్డు మెంబర్ గా వైఎస్సార్సీపీ అభ్యర్ధి సమ్మెట నరేంద్ర కుమార్ 11 ఓట్ల మెజార్టీతో విజయం ► బంటుమిల్లి (మం) అర్తమూరు పంచాయతీ 8వ వార్డు మెంబర్ గా వైఎస్సార్సీపీ అభ్యర్ధి మాకాళ్ళు వాసుదేవరావు 54 ఓట్ల మెజార్టీతో విజయం ► కోడూరు (మం) విశ్వనాధపల్లి 1వ వార్డు మెంబర్ గా టీడీపీ, జనసేన బలపరిచిన కొండవీటి విజయలక్ష్మి 10 ఓట్లతో గెలుపు ► మోపిదేవి (మం) కోసూరువారిపాలెం 4 వార్డు మెంబర్ గా జనసేన, టీడీపీ బలపరచిన అభ్యర్థిని చందన పద్మజ 69 ఓట్లతో విజయం ► ఆగిరిపల్లి (మం) ఆగిరిపల్లి పంచాయతీ 4వ వార్డు మెంబర్ గా టీడీపీ అభ్యర్ధి మల్లవల్లి స్పందన15 ఓట్ల మెజారిటీతో విజయం నెల్లూరు జిల్లా ► మనుబోలు మండలం, వెంకన్నపాలెంలో 4వ వార్డు ఉపఎన్నికలలో వైఎస్సార్సీపీ బలపరిచిన వల్లూరు శకుంతలమ్మ నాలుగు ఓట్లతో విజయం. అనంతపురం జిల్లా ► సోమందేపల్లి మండలం గుడిపల్లి నాలుగో వార్డు ఉప ఎన్నికలలో వైఎస్సార్సీపీ అభ్యర్థి శంకరమ్మ విజయం. ► రాయదుర్గం మండలం 74 ఉడేగోళం గ్రామంలో 5వ వార్డ్ మెంబర్‌గా వైఎస్సార్సీపీ అభ్యర్థి రామలక్ష్మి 8 ఓట్లతో విజయం. ► శెట్టూరు మండలం కైరేవు గ్రామ సర్పంచ్‌గా వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థి లక్మిదేవి 198 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం. ► కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని శెట్టూరు మండలం కైరేవు సర్పంచ్‌గా వైఎస్సార్సీపీ మద్దతుదారు లక్ష్మిదేవి విజయం. ► రాయదుర్గం మండలం 74- ఉడేగోళం 5వ వార్డు ఎన్నికలో వైఎస్సార్ సీపీ మద్దతుదారు రామలక్ష్మి విజయం. ► సోమందేపల్లి మండలం గుడిపల్లి 4వ వార్డు ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి శంకరమ్మ విజయం. ► రొద్దం మండలం చిన్నమంతూరు సర్పంచ్ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారు సుబ్బమ్మ విజయం. ► పుట్లూరు మండలం కందికాపుల గ్రామ సర్పంచ్ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారుడు కురువ శివరామయ్య 157 ఓట్లతో ఘన విజయం. పశ్చిమ గోదావరి జిల్లా ► తాడేపల్లిగూడెం మండలం పుల్లయ్యగూడెం వైఎస్సార్సీపీ పార్టీ బలపరచిన సర్పంచ్ అభ్యర్థి చీకట్ల పుష్ప లక్ష్మీకుమారి 60ఓట్ల మెజార్టీతో గెలుపొందింది. ► ఉండి మండలం చినపుల్లేరు 5వవార్డు వైఎస్సార్సీపీ బలపరిచిన కందుల సుభాషిణి 30 ఓట్ల మెజారిటీతో విజయం కైవసం చేసుకుంది. ► పోలవరం మండలం గూటాల గ్రామపంచాయతీ ఒకటో వార్డు వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థి ఇందిరా ప్రియదర్శిని 60 ఓట్ల మెజారిటీతో గెలుపు. ► పెదవేగి మండలం రాయన్నపాలెం ఐదవ వార్డు వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్ధి అవిరినేని రమేష్ 23 ఓట్ల మెజార్టీతో గెలుపు. ► కొవ్వూరు మండలం కాపవరం తొమ్మిదో వార్డు వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థి గొతం మేరీ ఝాన్సీ బాయి ఆరు ఓట్ల మెజారిటీ తో గెలుపు. ►పెరవలి మండలం మల్లేశ్వరం గ్రామ పంచాయతీ 8 వార్దు ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థి కాపా సాంబశివరావు 67ఓట్ల మెజార్టీ తో విజయం. ► జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం వైస్సార్సీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని వామిశెట్టి 892ఓట్ల మెజారిటీతో పావని విజయం. ► పోడూరుమండలం కొమ్ముచిక్కాల గ్రామ పంచాయతీ 9 వార్డు ఉప ఎన్నికల్లో వైఎస్సార్సిపి బలపరిచిన అభ్యర్థి పాతపాటి కొండరాజు 61 ఓట్లు మెజార్టీతో విజయం. ► ఆచంట మండలం పెదమల్లం గ్రామం వైస్సార్సీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి దిరిశాల విజయలక్ష్మి 156 ఓట్ల తో మెజారిటీ గెలుపు. మధ్యాహ్నం రెండు గంటలకు పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ► గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ప్రశాంతంగా ముగిసింది. కాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం కానుంది. కృష్ణా జిల్లా జిల్లాలో పోలింగ్ పూర్తయ్యే సమయానికి 78.48 శాతం నమోదు.14027 మంది ఓటర్లకుగానూ 11,008 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలుకొండ (సర్పంచ్)74 శాతం కలిదిండి (సర్పంచ్) 76.79 శాతం ములకలపల్లి (సర్పంచ్) 88.59 శాతం మల్లంపల్లి (సర్పంచ్ ) 86.34 జిల్లాలోని మిగిలిపోయిన వార్డులకు జరిగిన జరిగిన ఎన్నికల్లో 80 శాతం పోలింగ్ నమోదైంది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం తాళ్లపల్లి లో ముగిసిన సర్పంచ్ ఎన్నికల పోలింగ్. 88 శాతం నమోదైన పోలింగ్. 1429 కు గాను 1261 ఓట్లు పోల్ అయినట్లు ప్రకటించిన అధికారులు. విశాఖపట్నం విశాఖ జిల్లా పంచాయతీ సర్పంచ్ ఉప ఎన్నికల్లో 72.5 శాతం పోలింగ్. ముంచంగిపుట్టు మండలం జర్రెల పంచాయితీ సర్పంచ్ ఉప ఎన్నిక ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. 69.83% శాతం పోలింగ్ నమోదు. తూర్పు గోదావరి పెద్దాపురం మండలం జి.రాగంపేట లో ముగిసిన వార్డు మెంబర్ ఉప ఎన్నికలు. 301 ఓట్లకు గాను 243 ఓట్లు పోల్ అయ్యాయి. పశ్చిమగోదావరి - ఆచంట మండలం పెదమల్లం గ్రామ సర్పంచ్ పోలింగ్ పర్సంటేజ్ 73.40% - జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం సర్పంచ్ పొలింగ్ 59.67 % - తాడేపల్లి గుడెం మండలం పుల్లాయి గుడెం సర్పంచ్ పోలింగ్ 86.81 % - పోడూరు మండలం కొమ్ముచిక్కాల తొమ్మిదవ వార్డు పోలింగ్ 81.20% - ఉండి మండలం చినపుల్లేరు ఐదవ వార్డు పోలింగ్ పర్సంటేజ్ 92.76% - పోలవరం మండలం గూటాల ఒకటో వార్డు కు ముగిసిన పోలింగ్. 85% పోలింగ్ నమోదు. - కొవ్వూరు మండలం కాపవరం 9 వార్డు కు ముగిసిన పోలింగ్. 91% పోలింగ్ నమోదు ► గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ప్రశాంతంగా ముగిసింది. మిగిలిపోయిన 36 సర్పంచ్‌లు, 68 వార్డులకు పోలింగ్ జరిగింది. మధ్యాహ్నం 2 తర్వాత కౌంటింగ్ జరపనున్నారు. అనంతరం ఫలితాలు ప్రకటించనున్నారు. ►అనంతపురం జిల్లాలో ప్రశాంతంగా పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. నాలుగు పంచాయతీలకు పోలింగ్ జరుగుతోంది. పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ ఫక్కీరప్ప ఎన్నికలను పర్యవేక్షిస్తున్నారు. ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే ఆర్కే ►గుంటూరు జిల్లాలో ప్రశాంతంగా పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. 5 సర్పంచ్ స్థానాలకు 9 వార్డు స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఓటు హక్కు వినియోగించుకోవడానికి భారీస్థాయిలో ఓటర్లు తరలివస్తున్నారు. పెదకాకానిలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తాన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ►రాష్ట్రంలో మిగిలిపోయిన పంచాయతీలకు పోలింగ్ కొనసాగుతోంది. ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటిగంట వరకు సాగనుంది. మొత్తం 69 పంచాయతీలకు గానూ 30 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. అదేవిధంగా 533 వార్డులకుగానూ 380 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. వివిధ జిల్లాలోని 36 సర్పంచ్ స్థానాలకు, వివిధ గ్రామాల్లోని 68 వార్డుల్లోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 350 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించి, మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఓట్ల లెక్కింపు చేపడతారు. సాక్షి, అమరావతి: నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు 12 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికల ప్రచార పర్వం శనివారం సాయంత్రం ఐదు గంటలతో ముగిసింది. డప్పుల చప్పుళ్లు, నినాదాల హోరు, కళాకారుల గొంతులు మూగబోయాయి. మైకులు బంద్అయ్యాయి. ఇక ఆదివారం (నేటి నుంచి) మొదలు వరుసగా మూడ్రోజులు రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ‘స్థానిక’ సంస్థల ఎన్నికల సందడి కొనసాగనుంది. మొత్తం 17.69 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఆదివారం వివిధ జిల్లాల్లోని 36 సర్పంచ్ స్థానాలతో పాటు వివిధ గ్రామాల్లోని 68 వార్డు స్థానాల్లో ఎన్నికలు జరుగుతుండగా.. సోమవారం నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు 12 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో పోలింగ్ జరగనుంది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సొంత నియోజకవర్గంలోని కుప్పం మున్సిపాలిటీ కూడా ఇప్పుడు ఎన్నికలు జరగుతున్న వాటిలో ఒకటి. ఇప్పుడు అందరి కళ్లూ దీనిపైనే కేంద్రీకృతమయ్యాయి. ఇవికాకుండా మరో ఆరు కార్పొరేషన్లు, నాలుగు మున్సిపాలిటీల్లో మొత్తం 14 డివిజన్లు, వార్డులకు కూడా సోమవారమే ఉప ఎన్నికలు జరగనున్నాయి. అలాగే, మంగళవారం 10 జెడ్పీటీసీ స్థానాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 123 ఎంపీటీసీ స్థానాల్లో పొలింగ్ కొనసాగనుంది. ఇక ఆదివారం జరిగే ఎన్నికల్లో మొత్తం 1,00,032 మంది.. మున్సిపల్ ఎన్నికల్లో 8,62,066 మంది.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో 8,07,637 మంది ఓటు హక్కు వినియోగించుకుంటారని రాష్ట్ర ఎన్నికల కమిషన్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. మూడ్రోజుల పాటు సాగే ఈ ఎన్నికలు బ్యాలెట్ విధానంలో ఉంటాయి. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికకు ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించి, మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఓట్ల లెక్కింపు చేపడతారు. మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు 17న.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల ఓట్ల లెక్కింపు 18న చేపడతారు. కోవిడ్ జాగ్రత్తలో అన్ని ఏర్పాట్లు : ఎస్ఈసీ స్థానిక ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పూర్తి పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఆ ప్రకటనలో తెలిపారు. ఎన్నికలు జరిగే అన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ముందస్తు ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు. దీనిపై చర్చించేందుకు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో పాటు ఆయా నగర కమిషనర్లతో ఆమె శనివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలింగ్ సందర్భంగా పూర్తిస్థాయిలో కరోనా నియంత్రణ జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను తెలుసుకుని సంతృప్తి వ్యక్తంచేశారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాల్లో పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వెబ్ కెమెరాలను ఏర్పాటుచేయడంతో పాటు వీడియోగ్రాఫర్లను కూడా నియమించామన్నారు. ఇక ఆదివారం మొత్తం 350 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరుగుతుండగా, శుక్రవారం రాత్రికే ఆయా పొలింగ్ కేంద్రాలకు పోలింగ్ సామాగ్రిని తరలించినట్లు నీలం సాహ్ని వివరించారు. -
ఈ ‘పరిషత్’ ఎన్నికల్లో చిటికెన వేలిపై ‘సిరా’ గుర్తు
సాక్షి, అమరావతి: ఓటు హక్కు వినియోగించుకున్న ఓటరుకు సాధారణంగా ఎడమ చెయ్యి చూపుడు వేలిపై సిరా గుర్తు పెడుతుంటారు. కానీ.. ఈ నెల 16న జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటు వేసే ఓటరుకు ఎడమ చిటికెన వేలిపై సిరా గుర్తు వేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని బుధవారం నోటిఫికేషన్ జారీ చేశారు. చదవండి: 4 జెడ్పీటీసీలు ఏకగ్రీవమే పలుచోట్ల 14న సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు.. 16న పలుచోట్ల ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఒకే గ్రామంలో సర్పంచ్, వార్డు సభ్యుడు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నిక జరిగే అవకాశం ఉండటంతో ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో ఓటరుకు ఎడమ చెయ్యి చూపుడు వేలిపైనా.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటరు ఎడమ చెయ్యి చిటికెన వేలిపైన సిరా గుర్తు వేయాలని పేర్కొంది. -
నీలం సాహ్ని నియామకం సరైందే
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని నియామకం సరైందేనని హైకోర్టు తేల్చిచెప్పింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని.. రాజ్యాంగానికే లోబడే గవర్నర్ ఆమెను నియమించారని పేర్కొంది. గవర్నర్ నిర్ణయాన్ని ఏ రకంగానూ తప్పుపట్టలేమని పేర్కొంది. నీలం సాహ్ని నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన కోవారెంటో పిటిషన్‌ను కొట్టేసింది. ప్రస్తుత ప్రభుత్వంలో నీలం సాహ్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా, ప్రధాన సలహాదారుగా పనిచేశారని, అందువల్ల ఎన్నికల కమిషనర్‌గా ఆమె స్వతంత్రంగా విధులు నిర్వర్తించలేరన్నది పిటిషనర్ ఆరోపణ మాత్రమేనని స్పష్టం చేసింది. నీలం సాహ్ని స్వతంత్రంగా వ్యవహరించలేరనేందుకు పిటిషనర్ ఎలాంటి ఆధారాలను కోర్టు ముందుంచలేదని ఆక్షేపించింది. ఆమె నియామకం విషయంలో ఏకపక్షత, దురుద్దేశాలు ఉన్నాయని నిరూపించడంలో పిటిషనర్ విఫలమయ్యారంది. ఎన్నికల కమిషనర్‌గా ఆమెను నియమించడం వల్ల పిటిషనర్ చట్టబద్ధ, రాజ్యాంగబద్ధ హక్కులకు ఎలాంటి విఘాతం కలగలేదని తెలిపింది. హక్కుల ఉల్లంఘన జరగనప్పుడు పిటిషనర్ ‘మాండమస్’ కోరలేరని న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ గురువారం తీర్పునిచ్చారు. ఎన్నికల కమిషనర్‌గా ఏ అధికారంతో కొనసాగుతున్నారో నీలం సాహ్నిని వివరణ కోరడంతోపాటు సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా జరిగిన ఆమె నియామకాన్ని రద్దు చేయాలని కోరుతూ విజయనగరం జిల్లాకు చెందిన న్యాయవాది మహేశ్వరరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆ నియామకం కూడా అలాగే జరిగింది.. ‘‘మెమోరాండం ఆఫ్ ప్రొసీజర్’ ప్రకారం జడ్జిల నియామకాలు జరుగుతాయి. దీని ప్రకారం.. సీఎం ఓ న్యాయవాది పేరును జడ్జి పోస్టుకు సిఫారసు చేయొచ్చు. అలా సిఫారసు చేసిన పేరును ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని కొలీజియం పరిగణనలోకి తీసుకోవచ్చు. ఇలా జడ్జి అయిన న్యాయవాది.. న్యాయమూర్తిగా స్వతంత్రంగా వ్యవహరించలేరని ఎవరైనా చెప్పగలరా? ఇదే తీరులో ప్రస్తుత కేసులో కూడా గవర్నర్ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకునే నీలం సాహ్నిని ఎన్నికల కమిషనర్‌గా నియమించారు. ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యే నాటికి ఆమె ప్రధాన సలహాదారు పోస్టులో లేరు. కాబట్టి ఆమె రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో ఉన్నారని చెప్పడానికి వీల్లేదు’ అని జస్టిస్ దేవానంద్ తన తీర్పులో పేర్కొన్నారు. -
ఏపీ: నేడు మండల పరిషత్ అధ్యక్షుల ఎన్నికలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మండల పరిషత్ అధ్యక్షుల (ఎంపీపీ) ఎన్నికలు శుక్రవారం జరగనున్నాయి. ఎంపీపీతో పాటు ప్రతి మండలానికి ఒకరు చొప్పున కో ఆప్టెడ్ సభ్యునితో పాటు మండల ఉపాధ్యక్ష పదవులకు కూడా ఎన్నికలు జరుగుతాయి. మండల పరిధిలో ఎంపీటీసీ సభ్యులుగా ఎన్నికైన వారు చేతులు ఎత్తే విధానంలో ఈ ఎన్నికలను నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించి అన్ని చోట్ల ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రత్యేక సమావేశాల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌తో పాటు జిల్లాలో పంచాయతీరాజ్ శాఖ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. నిర్ణీత కోరం ప్రకారం.. మండల పరిధిలో కొత్తగా ఎన్నికైన మొత్తం ఎంపీటీసీ సభ్యుల్లో కనీసం సగం మంది హాజరైతేనే ఎంపీపీ, ఉపాధ్యక్ష పదవితో పాటు కో ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10,047 ఎంపీటీసీ స్థానాల్లోని 9,583 స్థానాల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రత్యేక సమావేశాలు ప్రారంభమవుతాయి. ఏకగ్రీవంగా ఎన్నికైన వారితో సహా కొత్తగా ఎన్నికైన సభ్యులందరితో ఆ సమావేశంలోనే ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆ తర్వాత కో ఆప్టెడ్ సభ్యుని ఎన్నిక నిర్వహిస్తారు. సాయంత్రం 3 గంటలకు మరొకసారి సమావేశం నిర్వహించి, తొలుత ఎంపీపీ పదవికి ఆ తర్వాత ఉపాధ్యక్ష పదవికి ఎన్నిక జరుపుతారు. కాగా, ఉదయం 10 గంటల నుంచే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఏదైనా సమస్య వస్తే ఇలా.. ► ఏదైనా కారణం వల్ల కో ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక జరగని పక్షంలో ఆయా మండలాల్లో తదుపరి జరగాల్సిన ఎంపీపీ, ఉపాధ్యక్ష ఎన్నికలను వాయిదా వేస్తారు. ఒకవేళ కో ఆప్టెడ్ ఎన్నిక పూర్తయి, ఎంపీపీ ఎన్నికకు ఆటంకం ఏర్పడితే, సంబంధిత మండలంలో ఆ తర్వాత జరగాల్సిన ఉపాధ్యక్ష పదవికి ఎన్నిక వాయిదా పడుతుందని రాష్ట్ర కమిషన్ కార్యాలయ అధికారులు వెల్లడించారు. ► శుక్రవారం జరగాల్సిన ఎన్నిక వాయిదా పడిన మండలాల్లో శనివారం ఎన్నిక నిర్వహించుకోవచ్చని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలంసాహ్ని ఇప్పటికే అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. రెండో రోజు కూడా వివిధ కారణాలతో కోఆప్టెడ్ సభ్యుల ఎన్నిక వాయిదా పడినప్పటికీ, సరిపడా కోరం ఉంటే ఎంపీపీ.. ఉపాధ్యక్ష పదవులకు ఎన్నిక నిర్వహించవచ్చని గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
చేతులెత్తే విధానంలో.. ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ల ఎన్నిక
సాక్షి, అమరావతి: ఈ నెల 24, 25 తేదీల్లో జరగనున్న ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ల ఎన్నికలు.. సభ్యులు చేతులు ఎత్తే విధానంలో జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నీలం సాహ్ని సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, జెడ్పీ సీఈఓలకు లేఖ రాశారు. మండల, జిల్లా పరిషత్‌ల వారీగా ఆ రోజు జరిగే ప్రత్యేక సమావేశాల్లో ఉపాధ్యక్షులు, వైస్ చైర్మన్లు, కోఆప్టెడ్ సభ్యుల ఎన్నిక కూడా జరుగుతుంది. ఈ సందర్భంగా అనుసరించాల్సిన విధానాన్ని ఎస్ఈసీ ఆ లేఖలో వివరించారు. నిర్ణీత కోరం ప్రకారం.. మండల పరిధిలో కొత్తగా ఎన్నికైన ఎంపీటీసీ సభ్యులలో సగం మంది హాజరైతేనే ఎంపీపీ, ఉపాధ్యక్ష పదవితో పాటు కోఆప్టెడెడ్ సభ్యల ఎన్నిక నిర్వహించాలని ఆమె సూచించారు. అదే విధంగా.. జిల్లా పరిధిలో ఎన్నికైన జెడ్పీటీసీలలో సగం మంది హాజరైతే జెడ్పీ చైర్మన్, ఇద్దరు వైస్ చైర్మన్లు, ఇద్దరు కోఆప్టెడెడ్ సభ్యుల ఎన్నిక నిర్వహించాలన్నారు. ఈ ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ ఎన్నికల్లో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకే ఓటు హక్కు ఉంటుందని.. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు ఉండదని రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పష్టంచేసింది. అయితే, ఎన్నిక జరుగుతున్న సమయంలో వారు ఎక్స్ అఫీషియో సభ్యుని హోదాలో ఆ సమావేశాల్లో పాల్గొనవచ్చని తెలిపింది. ఎన్నిక జరిగే సమయంలో వారికి సమావేశ మందిరంలో ముందు వరుస సీట్లు కేటాయించాలని కమిషన్ ఆ లేఖలో పేర్కొంది. ఇక ఎంపీపీ ఎన్నిక పూర్తయితే ఆ మండలంలో ఉపాధ్యక్ష ఎన్నిక నిర్వహించుకోవాలని.. జెడ్పీ చైర్మన్ ఎన్నిక పూర్తయితే ఇద్దరు వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ కొనసాగించాలని కూడా తెలిపింది. ‘విప్’ అధికారం జనసేనకు లేదు ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ ఎన్నికల్లో తమ పార్టీ సభ్యులకు విప్ జారీచేసే అధికారం ఎస్ఈసీ వద్ద గుర్తింపు కలిగిన 18 రాజకీయ పార్టీలకు మాత్రమే ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ పేర్కొంటూ వాటి పేర్లను ప్రకటించింది. ఆ జాబితాలో అధికార వైఎస్సార్సీపీ, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ వంటి పార్టీలు ఉన్నాయి. అయితే, జనసేన పార్టీకి అందులో చోటు దక్కలేదు. గుర్తింపు కలిగిన రాజకీయ పార్టీగా జనసేనకు ఆ హోదా లేకపోవడంతో విప్ జారీచేసే అధికారం ఆ పార్టీకి దక్కలేదని కమిషన్ కార్యాలయ అధికారులు తెలిపారు. 24న ఎంపీటీసీల ప్రమాణ స్వీకారం ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు అన్ని మండల పరిషత్‌లలో ప్రత్యేక సమావేశం నిర్వహించి కొత్తగా ఎంపీటీసీ సభ్యులుగా ఎన్నికైన వారితో ప్రమాణస్వీకారం చేయించాలని నీలం సాహ్ని ఆదేశించారు. అలాగే, 25వ తేదీ మధ్యాహ్నం జిల్లా పరిషత్‌లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటుచేసి జెడ్పీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకారాన్ని నిర్వహించాలని ఆమె సూచించారు. -
25న జెడ్పీ చైర్మన్ల ఎన్నిక
సాక్షి, అమరావతి: పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తి కావడంతో పరోక్ష పద్ధతిలో జరిగే మండల పరిషత్ అధ్యక్ష(ఎంపీపీ), జిల్లా పరిషత్ (జెడ్పీ) చైర్మన్ పదవులకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదివారం నోటిఫికేషన్ జారీ చేసింది. 24న ఎంపీపీ, 25న జెడ్పీ చైర్మన్ల ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎస్ఈసీ నీలం సాహ్ని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఎంపీపీ ఎన్నిక జరిగే రోజే మండల కో ఆప్టెడ్ సభ్యుడు, మండల ఉపాధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతాయి. ఇక జెడ్పీ చైర్మన్ ఎన్నిక నిర్వహించే రోజే ప్రతి జిల్లాలో ఇద్దరు కో ఆప్టెడ్ సభ్యులు, ఇద్దరు వైస్ చైర్మన్ల ఎన్నిక జరుగనుంది. ప్రమాణ స్వీకారం ముగియగానే కో ఆప్టెడ్ ఎన్నిక మండల పరిషత్‌లలో 24వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రత్యేక సమావేశం నిర్వహించి కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అదే రోజు కో ఆప్టెడ్ సభ్యుడి ఎన్నిక జరుగుతుంది. ఎంపీపీ, ఉపాధ్యక్ష పదవుల కోసం సాయంత్రం విడిగా సమావేశం నిర్వహిస్తారు. జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్లకు విడిగా ఎన్నిక 25వతేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు అన్ని జిల్లా పరిషత్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించి కొత్తగా జెడ్పీటీసీ సభ్యులుగా ఎన్నికైన వారితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అదే సమావేశంలో ఇద్దరు కో ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక జరుగుతుంది. సాయంత్రం విడిగా సమావేశం నిర్వహించి జెడ్పీ చైర్మన్, ఇద్దరు వైస్ చైర్మన్ల ఎన్నిక చేపడతారు. వాయిదా పడ్డ చోట్ల మర్నాడు నిర్వహణ ఒకవేళ ఏదైనా కారణాలతో ఉదయం కో ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక జరగని పక్షంలో ఆయా మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లలో సాయంత్రం జరగాల్సిన ఎంపీపీ, ఉపాధ్యక్ష, జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికలను కూడా వాయిదా వేసి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయానికి సమాచారం ఇవ్వాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. మండల పరిషత్‌లో 24వ తేదీన కో ఆప్టెడ్ సభ్యుడితో పాటు ఎంపీపీ, ఉపాధ్యక్ష పదవుల ఎన్నిక వాయిదా పడిన పక్షంలో మరుసటి రోజు 25వ తేదీన నిర్వహించేందుకు రిటర్నింగ్ అధికారులు ఏర్పాట్లు చేసుకోవాలని నోటిఫికేషన్లో ఆదేశించారు. జిల్లా పరిషత్‌లలో 25వ తేదీన జరగాల్సిన ఎన్నిక వాయిదా పడిన పక్షంలో 26వ తేదీన ఎన్నికలు నిర్వహించేందుకు స్థానిక రిటర్నింగ్ అధికారి చర్యలు చేపట్టాలని సూచించారు. -
ఆ 23 మంది గెలిస్తే అక్కడ మళ్లీ ఎన్నికలే
సాక్షి, అమరావతి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ సుదీర్ఘకాలంపాటు జరిగినందువల్ల రాష్ట్రంలోని పలుచోట్ల ఓ విచిత్ర పరిస్థితి ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ఆదివారం జరగనున్న ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఓ 23 మంది అభ్యర్థులు గెలిచినా ఆ స్థానాల్లో మళ్లీ ఎన్నిక జరగడం అనివార్యం. ఎందుకంటే.. ఆయాచోట్ల వారు మరణించడమే కారణం. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ముగిసినా హైకోర్టు తీర్పు కారణంగా ఓట్ల లెక్కింపు ఐదున్నర నెలలపాటు నిలిచిపోయింది. ఈ కాలంలో పోలింగ్ జరిగిన పలు స్థానాల్లో పోటీచేసిన అభ్యర్థుల్లో 23 మంది మరణించినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయ అధికారులు నిర్ధారించారు. నేడు 'పరిషత్' ఫలితాలు ఎంపీటీసీ స్థానాల్లో పోటీచేసిన వారు 20 మంది మరణించగా.. జెడ్పీటీసీ స్థానాలలో పోటీచేసిన అభ్యర్థులు ముగ్గురు మరణించారు. దీంతో.. ఈ స్థానాల్లో మరణించిన అభ్యర్థులు గెలుపొందితే ఎలాంటి చర్యలు చేపట్టాలో తెలియజేయాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) కార్యాలయ వివరణ కోరుతూ ఆయా జిల్లాల అధికారులు లేఖ రాశారు. ఇందుకు కమిషన్ స్పందిస్తూ.. ఒకవేళ మృతిచెందిన అభ్యర్థులు విజయం సాధిస్తే ఆ ఫలితాన్ని వెల్లడించి, తిరిగి ఎన్నిక నిర్వహించాల్సిన స్థానాల జాబితాలో ఆ స్థానాలను చేర్చాలని అధికారులు స్పష్టంచేశారు. ఇక నామినేషన్ల ఘట్టానికి, పోలింగ్ ప్రక్రియ మధ్య కూడా ఏడాదిపాటు ఖాళీ ఏర్పడింది. ఈ సమయంలో మరణించిన వారి స్థానాల్లోనూ పోలింగ్‌ను నిలుపుదల చేశారు. -
AP MPTC, ZPTC Election Results: పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనం
లైవ్ అప్డేట్స్.. రాష్ట్రవ్యాప్తంగా 637 జెడ్పీటీసీ స్థానాల ఫలితాలు వెల్లడి కాగా వాటిలో 627 జెడ్పీటీసీ స్థానాలు వైఎస్సార్సీపీ సొంతం చేసుకుని తిరుగులేని ఆధిక్యతను ప్రదర్శించింది. ఇక ఎంపీటీసీ స్థానాల విషయానికి వస్తే ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల్లో వైఎస్సార్సీపీ ఏకంగా 8,075 ఎంపీటీసీ స్థానాలు గెలుచుకుని విజయ ఢంకా మోగించింది. ఇప్పటివరకు వెల్లడైన ఎంపీటీసీ స్థానాల ఫలితాలు ఇలా ఉన్నాయి. కృష్ణా: 648 ఎంపీటీసీ స్థానాల్లో 568 చోట్ల వైఎస్సార్సీపీ గెలుపు. ప్రకాశం: 784 ఎంపీటీ\సీ స్థానాల్లో 668 చోట్ల వైఎస్సార్సీపీ విజయకేతనం నెల్లూరు: 562 ఎంపీటీసీ స్థానాల్లో 400 వైఎస్సార్సీపీ 312 సొంతం చేసుకుని తిరుగులేని విజయం సొంతం చేసుకుంది. తూర్పు గోదావరి: 998 స్థానాల్లో 538 సొంతం చేసుకున్న వైఎస్సార్సీపీ. పశ్చిమ గోదావరి: 781 స్థానాల్లో 577 వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. విశాఖపట్టణం: 612 ఎంపీటీసీ స్థానాలకు వైఎస్సార్సీపీ 450 గెలుచుకుంది. విజయనగరం: 549 ఎంపీటీసీ స్థానాల్లో 433 వైఎస్సార్సీపీ కైవసం శ్రీకాకుళం: 668 ఎంపీటీసీ స్థానాల్లో 562 వైఎస్సార్సీపీ గెలుపు. వైఎస్సార్ కడప: 549 స్థానాల్లో 433 వైఎస్సార్సీపీ విజయం సాధించింది. అనంతపురం: 841 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్ సీపీ 763 సొంతం చేసుకుంది. చిత్తూరు: 886 ఎంపీటీసీ స్థానాల్లో 822 సొంత చేసుకుని వైఎస్సార్సీపీ తిరుగులేని ఆధిక్యత ప్రదర్శించింది. కర్నూలు: 807 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్సీపీ 718 గెలుపొందింది. రాష్ట్రవ్యాప్తంగా 412 జెడ్పీటీసీ స్థానాల ఫలితాలు వెల్లడి కాగా వాటిలో 404 జెడ్పీటీసీ స్థానాలు వైఎస్సార్సీపీ సొంతం చేసుకుని తిరుగులేని ఆధిక్యతను ప్రదర్శించింది. ఇక ఎంపీటీసీ స్థానాల విషయానికి వస్తే ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల్లో వైఎస్సార్సీపీ ఏకంగా 5,462 ఎంపీటీసీ స్థానాలు గెలుచుకుని విజయ ఢంకా మోగించింది. పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ పీఠం కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది. 48 స్థానాల్లో ఇప్పటికే 35 స్థానాల్లో విజయం సాధించింది. మరికొన్ని స్థానాల ఫలితాలు రావాల్సి ఉంది. ఎంపీటీసీ ఇప్పటివరకు 6,242 ఎంపీటీసీ స్థానాల ఫలితాలు వెలువడ్డాయి. వీటిలో అత్యధికంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 5,273 స్థానాలు కైవసం చేసుకుని విజయకేతనం ఎగురవేసింది. జెడ్పీటీసీ ఇక జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి 354 స్థానాల ఫలితాలు ప్రకటించారు. వీటిలో 348 జెడ్పీటీసీలను సొంతం చేసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్ని జిల్లాల జెడ్పీ పీఠాలను కైవసం చేసుకుంది. నాలుగు టీడీపీకి, రాగా ఒకటి సీపీఐ, స్వతంత్రుడు మరొకరు గెలిచారు. కోనసీమలోనూ వైఎస్సార్సీపీ జెండా రెపరెపలాడుతోంది. వెలువడుతున్న ఎన్నికల ఫలితాలన్నీ వైఎస్సార్సీపీ ఖాతాలోనే పడుతున్నాయి. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధిక జెడ్పీటీసీ స్థానాలను సొంతం చేసుకుంటోంది. విజయనగరం: నెల్లూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాల సరసన విజయనగరం చేరింది. విజయనగరంలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. ఉన్న 34 జెడ్పీటీసీ స్థానాల్లో ఆ పార్టీ విజయం సాధించింది. వైఎస్సార్ కడప జిల్లా: కడప జిల్లాలో 50 జెడ్పీటీసీ స్థానాలకు 46 వైఎస్సార్ సీపీ సొంతం చేసుకుంది. ప్రకాశం జిల్లా: ప్రకాశంలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. జిల్లాలోని 56 జెడ్పీటీసీ స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. చిత్తూరు జిల్లా: జెడ్పీ ఎన్నికలతో పాటు మండల పరిషత్ ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీ భారీ ఆధిక్యత ప్రదర్శించింది. చిత్తూరు జిల్లాలో 886 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్సీపీ 822 సొంతం చేసుకుని విజయదుంధుబి మోగించింది. కాగా టీడీపీ కేవలం 25 స్థానాల్లో గెలిచింది. ఈ విజయంతో వైఎస్సార్సీపీ 65 మండల పరిషత్‌లను సొంతం చేసుకుంది. నెల్లూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్. ఆయా జిల్లాల్లోని ఉన్న జెడ్పీటీసీ స్థానాలన్నింటిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది. కృష్ణా జిల్లా: 46 జెడ్పీటీసీ స్థానాల్లో 23 వైఎస్సార్సీపీ సొంతం. గుంటూరు: 54 జెడ్పీటీసీ స్థానాల్లో 27 వైఎస్సార్సీపీ విజయం ప్రకాశం: 56 స్థానాల్లో 56 సొంతం చేసుకున్న వైఎస్సార్సీపీ నెల్లూరు: జిల్లాలో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఉన్న 46 స్థానాలను వైఎస్సార్సీపీ సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది. విశాఖపట్టణం: 39 స్థానాల్లో 30 వైఎస్సార్సీపీ గెలుపు విజయనగరం: 34 జెడ్పీటీసీ స్థానాల్లో 25 వైఎస్సార్సీపీ విజయం సాధించింది. శ్రీకాకుళం: 38 జెడ్పీటీసీ స్థానాల్లో 20 వైఎస్సార్సీపీ కైవసం అనంతపురం: 63 స్థానాల్లో 35 సొంతం చేసుకున్న వైఎస్సార్సీపీ చిత్తూరు: 63 జెడ్పీటీసీ స్థానాల్లో 63 వైఎస్సార్సీపీ విజయం వైఎస్సార్ కడప: 50 స్థానాల్లో 44 గెలిచిన వైఎస్సార్సీపీ కర్నూలు: జెడ్పీటీసీ ఎన్నికల్లో ఉన్న 53లో 51 స్థానాలను వైఎస్సార్సీపీ సొంతం చేసుకుంది. తూర్పు గోదావరి: 61 జెడ్పీటీసీలకు 5 చోట్ల వైఎస్సార్సీపీ గెలిచింది. పశ్చిమ గోదావరి: 48 జెడ్పీటీసీ స్థానాల్లో 32 వైఎస్సార్సీపీ కైవసం. జిల్లా పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటివరకు 186 జెడ్పీటీసీ ఫలితాలు రాగా 184లో వైఎస్సార్సీపీ విజయం సాధించింది. జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయదుంధుబి. రాష్ట్రంలోని 13 జిల్లా పరిషత్‌లలో 11 జెడ్పీలు కైవసం చేసుకుంది. 144 జెడ్పీటీసీ స్థానాల్లో 142 వైఎస్సార్సీపీ సొంతం విజయనగరం జిల్లా: శృంగవరపుకోట నియోజకవర్గం లక్కవరపుపేట జెడ్పీటీసీ వైఎస్సార్సీపీ విజయం అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం: ముదిగుబ్బ జెడ్పీటీసీ వైఎస్సార్సీపీ విజయం గుంతకల్లు నియోజకవర్గం: గుత్తిలో జెడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం గుంతకల్లు నియోజకవర్గం: గుంతకల్లు జెడ్పీటీసీ వైఎస్సార్సీపీ విజయం కృష్ణాజిల్లా: పెడన నియోజకవర్గం కృత్తివెన్ను జెడ్పీటీసీ వైఎస్సార్సీపీ విజయం. పశ్చిమ గోదావరి: ఉంగుటూరు నియోజకవర్గం గణపవరం జెడ్పీటీసీ వైఎస్సార్సీపీ విజయం శ్రీకాకుళం: చీపురుపల్లి నియోజకవర్గం గుర్ల జెడ్పీటీసీ వైఎస్సార్సీపీ విజయం శ్రీకాకుళం: పాలకొండ నియోజకవర్గం వీరఘట్టం జెడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం ప్రకాశం: కందుకూరు గుడ్లూరు జెడ్పీటీసీ వైఎస్సార్సీపీ విజయం అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం బుక్కపట్నం జెడ్పీటీసీ వైఎస్సార్సీపీ గెలుపు ఆమడగూరు జెడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం ఓబులదేవచెరువు వైఎస్సార్సీపీ విజయం కొత్తచెరువు జెడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం నల్లమాడ జెడ్పీటీసీ వైఎస్సార్సీపీ విజయం బుక్కపట్నం వైఎస్సార్సీపీ సొంతం అనంతపురం: దర్శి నియోజకవర్గం కురిచేడు వైఎస్సార్సీపీ విజయం. చిత్తూరు: జీడీ నెల్లూరు నియోజకవర్గం ఎస్సార్ పురం జెడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం. 13,335 ఓట్ల మెజార్టీతో రమణ ప్రసాద్ రెడ్డి విజయం. వైఎస్సార్ కడప: రాజంపేట నియోజకవర్గం నందలూరు జెడ్పీటీసీ వైఎస్సార్సీపీ వశం. కర్నూలు: శ్రీశైలం నియోజకవర్గం మహానంది జెడ్పీటీసీ వైఎస్సార్సీపీ సొంతం. విశాఖపట్టణం: అనకాపల్లి నియోజకవర్గం అనకాపల్లి జెడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం. విశాఖపట్టణం: పాడేరు నియోజకవర్గం పాడేరు జెడ్పీటీసీ వైఎస్సార్సీపీ విజయం. ►అనంతపురం: పెనుగొండ నియోజకవర్గం పెనుగొండ జడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. 8,856 ఓట్ల మెజార్టీతో శ్రీరాములు గెలుపొందారు. పెనుగొండ నియోజకవర్గం సోమందేవపల్లి జడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. 4,348 ఓట్ల మెజార్టీతో డీసీ అశోక్ గెలుపు పొందారు. ►ఇప్పటివరకు 3129 ఎంపీటీసీ ఫలితాలు వైఎస్సార్సీపీ-2773, టీడీపీ-267, బీజేపీ-7 విశాఖపట్నం: యలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి జడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. 16,097 ఓట్ల మెజార్టీతో ధూళి నాగరాజు గెలుపొందారు. విశాఖ: అరకు నియెజకవర్గం పెదబయలు జడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. 500 ఓట్ల మెజార్టీతో బొంజుబాబు గెలుపొందారు. ప్రకాశం: యర్రగొండపాలెం నియోజకవర్గం యర్రగొండపాలెం జడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. 12,906 ఓట్ల మెజార్టీతో విజయభాస్కర్ గెలుపొందారు. చిత్తూరు జిల్లా: మదనపల్లి నియోజకవర్గం నిమ్మనపల్లి జడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. 5,464 ఓట్ల మెజార్టీతో ప్రమీలమ్మ గెలుపొందారు. మదనపల్లి నియోజకవర్గం రామ సముద్రం జడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. 9, 875 ఓట్ల మెజార్టీతో సీహెచ్ రామచంద్రారెడ్డి గెలుపొందారు. విజయనగరం: గజపతినగరం జడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. 17,971 ఓట్ల మెజార్టీతో గార తవుడు గెలుపొందారు. అనంతపురంలో రెచ్చిపోయిన టీడీపీ నేతలు అనంతపురం: జిల్లాలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. ఆత్మకూరు మండలం ముట్టాల ఎంపీటీసీ స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి విజయం సాధించారు. 65 ఓట్లతో వైఎస్సార్సీపీ అభ్యర్థి పుణ్యశ్రీ విజయం సాధించారు. దాంతో టీడీపీ నేతలు వాదనకు దిగారు. ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో వైఎస్సార్సీపీ విజయం పామర్రు మండలం నిమ్మకూరు ఎంపీటీసీ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. నిమ్మకూరును నారా లోకేష్ దత్తత తీసుకోగా, ఆయనను ప్రజలు విశ్వసించలేదు. చరిత్రలో తొలిసారి పామర్రు ఎంపీపీని వైఎస్సార్సీపీ దక్కించుకుంది. వైఎస్సార్సీపీ ప్రభంజనం చిత్తూరు: పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించింది. జీడీ నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్పురం జడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. 13,335 ఓట్ల మెజార్టీతో రమణ ప్రసాద్‌రెడ్డి గెలుపొందారు. జీడీ నెల్లూరు నియోజకవర్గం పాల సముద్రం జడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. 6,758 ఓట్ల మెజార్టీతో అన్బలగన్ గెలుపొందారు. చంద్రబాబుకు షాక్.. పరిషత్ ఎన్నికల్లో నారావారిపల్లిలో చంద్రబాబుకు షాక్ తగిలింది. నారావారిపల్లి ఎంపీటీసీ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి గంగాధరం పరాజయం పొందారు. 1,347 ఓట్ల మెజార్టీతో వైఎస్సార్సీపీ అభ్యర్థి రాజయ్య గెలుపొందారు. టీడీపీకి అభ్యర్థికి కేవలం 307 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ►ఇప్పటివరకు 1562 ఎంపీటీసీ ఫలితాలు వెలువడ్డాయి. వైఎస్సార్సీపీ 1399, టీడీపీ 120, బీజేపీ 7. ►వైఎస్సార్‌జిల్లా పరిషత్ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. 50కిగాను ఇప్పటివరకు 40 స్థానాలను వైఎస్సార్సీపీ గెలుచుకుంది. ప్రకాశం: త్రిపురాంతకం జడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. 10,930 ఓట్ల మెజార్టీతో మాకం జాన్‌పాల్ గెలుపొందారు. ప్రకాశం: కొనకనమిట్ల జడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం. 16,681 ఓట్ల మెజార్టీతో అక్కి దాసరి ఏడుకొండలు గెలుపు ప్రకాశం: గుడ్లూరు జడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం. 11,464 ఓట్ల మెజార్టీతో కొరిసిపాటి బాపిరెడ్డి గెలుపు ప్రకాశం: కురిచేడు జడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం. 5,930 ఓట్ల మెజార్టీతో వెంకట నాగిరెడ్డి గెలుపు ►పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ హవా కొనసాగుతోంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాల్లో ఫ్యాన్ దూసుకుపోతోంది. అనేక చోట్ల సింగిల్ డిజిట్‌కే టీడీపీ పరిమితమైంది. ►వైఎస్సార్ జిల్లా: నందలూరు జడ్పీటీసీ వైఎస్సార్ కైవసం చేసుకుంది. 20,849 ఓట్ల మెజార్టీతో గడికోట ఉషారాణి విజయం సాధించారు. ►కర్నూలు జిల్లాలో ఇప్పటివరకు 202 ఎంపీటీసీ ఫలితాలు.. మిగిలిన 282 ఎంపీటీసీ స్థానాలకు కొనసాగుతున్న కౌంటింగ్ వైఎస్సార్సీపీ-184, టీడీపీ-15 బీజేపీ-1, ఇతరులు-2 ►వైఎస్సార్ జిల్లాలో ఇప్పటివరకు 20 ఎంపీటీసీ ఫలితాలు దేవినేని ఉమా ఇలాకాలో వైఎస్సార్సీపీ హవా స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్సీపీ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. విజయవాడ: దేవినేని ఉమా ఇలాకాలో వైఎస్సార్సీపీ హవా ప్రదర్శించింది. గొల్లపూడిలో 10 ఎంపీటీసీలకు 10 వైఎస్సార్సీ కైవసం చేసుకుంది. ►వైఎస్సార్ జిల్లా: రాజుపాలెం మండలంలో వైఎస్సార్సీపీ క్లీన్‌స్వీప్. 9 ఎంపీటీసీ స్థానాలకు 9 వైఎస్సార్సీపీ కైవసం. ►విజయనగరం: మెరముడిదం మండలంలో వైఎస్సార్సీపీ క్లీన్‌స్వీప్. 16 ఎంపీటీసీలకు 16 వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. ►అనంతపురం: తాడిమర్రి మండలంలో వైఎస్సార్సీపీ క్లీన్‌స్వీప్. 9 ఎంపీటీసీ స్థానాలకు 9 వైఎస్సార్సీపీ కైవసం. ►చిత్తూరు: నిమ్మనపల్లి మండలంలో వైఎస్సార్సీపీ క్లీన్‌స్వీప్. 9 ఎంపీటీసీ స్థానాలకు 9 వైఎస్సార్సీపీ కైవసం ►ప్రకాశం: మర్రిపూడి మండలంలో వైఎస్సార్సీపీ క్లీన్‌స్వీప్. 11 ఎంపీటీసీ స్థానాలకు 11 వైఎస్సార్సీపీ కైవసం ►ప్రకాశం: మార్కాపురం జడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. 15,315 మెజార్టీతో వైఎస్సార్సీ అభ్యర్థి బాపన్నరెడ్డి విజయం సాధించారు. ►విశాఖపట్నం: 45 ఓట్ల మెజార్టీతో జీకే వీధి ఎంపీటీసీ(వైఎస్సార్సీపీ) గెలుపు ►ప్రకాశం: తుర్లుపాడు జడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. 10,335 ఓట్ల మెజార్టీతో వైఎస్సార్సీపీ అభ్యర్థి వెన్న ఇందిర గెలుపు పొందారు. ►ప్రకాశం: జిల్లాలో రెండు జడ్పీటీసీలు వైఎస్సార్సీపీ కైవసం ►చిత్తూరు: ఎస్ఆర్పురం జడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. 13,335 ఓట్ల మెజార్టీతో రమణ ప్రసాద్‌రెడ్డి గెలుపొందారు. ►కర్నూలు: మహానంది జడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం. 13,288 ఓట్ల మెజార్టీతో కేవీఆర్ మహేశ్వర్‌రెడ్డి గెలుపు పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ హవా చిత్తూరు: పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ హవా కొనసాగుతోంది. 1573 ఓట్ల మెజార్టీతో బుగ్గపట్నం ఎంపీటీసీ(వైఎస్సార్సీపీ) గెలుపు పొందారు. 1073 ఓట్ల మెజార్టీతో టీ.సదుం ఎంపీటీసీ(వైఎస్సార్సీపీ) గెలుపొందారు. ప్రశాంతంగా ఎన్నికల కౌంటింగ్ పరిషత్ ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా కొనసాగుతుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. రాత్రి లోపు పూర్తిస్థాయి ఫలితాలు ప్రకటిస్తామన్నారు. ఐదారు చోట్ల బ్యాలెట్ బాక్సుల్లో నీళ్లు చేరాయని తెలిపారు. బ్యాలెట్ బాక్సులు పూర్తిగా తెరిచాక స్పష్టత వస్తుందని ఆయన తెలిపారు. ►విజయనగరం: 44 ఓట్ల మెజార్టీతో గంజాయి భద్ర ఎంపీటీసీ(వైఎస్సార్సీపీ) గెలుపు ►అనంతపురం: 1331 ఓట్ల మెజార్టీతో వెన్న పూసపల్లి ఎంపీపీటీ(వైఎస్సార్సీపీ) గెలుపు ►కృష్ణా జిల్లా: 180 ఓట్ల మెజార్టీతో పాములంక ఎంపీటీసీ(వైఎస్సార్సీపీ) గెలుపు ►కృష్ణా: 585 ఓట్ల మెజార్టీతో ఆటపాక ఎంపీటీసీ(వైఎస్సార్సీపీ) గెలుపు ►విజయనగరం: 1629 ఓట్ల మెజార్టీతో ఉత్తరవల్లి ఎంపీటీసీ( వైఎస్సార్సీపీ) గెలుపు) ►ప్రకాశం: 1645 ఓట్ల మెజార్టీతో సంతమాగులూరుఏ-1 ఎంపీటీసీ(వైఎస్సార్సీపీ) గెలుపు ►ప్రకాశం: 434 ఓట్ల మెజార్టీతో ఊళ్లపాలెం ఎంపీటీసీ(వైఎస్సార్సీపీ) గెలుపు మాచర్ల నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ క్లీన్‌స్వీప్ గుంటూరు: మాచర్ల నియెజకవర్గంలో వైఎస్సార్సీపీ క్లీన్‌స్వీప్ చేసింది. ఐదు జీడ్పీటీసీ స్థానాలకు ఐదూ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. 71 ఎంపీటీసీ స్థానాలకు 71 వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. బాబు ఇలాకాలో ఫ్యాన్ గాలి.. చిత్తూరు జిల్లా: చంద్రబాబు ఇలాకాలో ఫ్యాన్ గాలి వీచింది. కుప్పం మండలం టీ సద్దుమూరు ఎంపీటీసీ స్థానం వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. టీడీపీ అభ్యర్థిపై వైఎస్సార్సీపీ అభ్యర్థి అశ్విని 1073 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. ►విజయనగరం: పరిషత్ ఎన్నికలల్లో వైఎస్సార్సీపీ హవా కొనసాగుతోంది. సీతానగరం మండలంలో 17 ఎంపీటీసీ స్థానాలకు ఆరు ఏకగ్రీవం కాగా, మిగిలిన 11 ఎంపీటీసీ స్థానాల్లో 5 చోట్ల వైఎస్సార్సీపీ విజయం సాధించింది. ►పశ్చిమగోదావరి: 613 ఓట్ల మెజార్టీతో శ్రీరామపురం ఎంపీటీసీ(వైఎస్సార్సీపీ) గెలుపు ►వైఎస్సార్ జిల్లా: 490 ఓట్ల మెజార్టీతో ఎస్.కొత్తపల్లి ఎంపీటీసీ(వైఎస్సార్సీపీ గెలుపు ►వైఎస్సార్ జిల్లా: 1682 ఓట్ల మెజార్టీతో పెద్దకారంపల్లి ఎంపీటీసీ (వైఎస్సార్సీపీ) గెలుపు ►వైఎస్సార్ జిల్లా: 490 ఓట్ల మెజార్టీతో ఎస్.కొత్తపల్లి ఎంపీటీసీ(వైఎస్సార్సీపీ గెలుపు ►వైఎస్సార్ జిల్లా: 1682 ఓట్ల మెజార్టీతో పెద్దకారంపలల్లి ఎంపీటీసీ (వైఎస్సార్సీపీ) గెలుపు ►కృష్ణా: 372 ఓట్ల మెజార్టీతో అక్కపాలెం ఎంపీటీసీ (వైఎస్సార్సీపీ) గెలుపు ►చిత్తూరు: 616 ఓట్ల మెజార్టీతో పాత వెంకటాపురం ఎంపీటీసీ(వైఎస్సార్సీపీ) గెలుపు ►వైఎస్సార్ జిల్లా: 883 ఓట్ల మెజార్టీతో ఊటుకురు-2 ఎంపీటీసీ(వైఎస్సార్సీపీ) గెలుపు ►అనంతపురం: 882 ఓట్ల మెజార్టీతో దంచర్ల ఎంపీటీసీ( వైఎస్సార్సీపీ) గెలుపు ►అనంతపురం: 729 ఓట్ల మెజార్టీతో అమ్మలదిన్నె ఎంపీటీసీ(వైఎస్సార్సీపీ) గెలుపు ►చిత్తూరు: 1573 ఓట్ల మెజార్టీతో బుగ్గపట్నం ఎంపీటీసీ(వైఎస్సార్సీపీ) గెలుపు ►అనంతపురం: రామగిరి జడ్పీటీసీ పోస్టల్ బ్యాలెట్లో వైఎస్సార్సీపీ ఆధిక్యం ►వైఎస్సార్ జిల్లా: జమ్మలమడుగు జడ్పీటీసీ పోస్టల్ బ్యాలెట్లో వైఎస్సార్సీపీ ఆధిక్యం ►వైఎస్సార్ జిల్లా: బంటుపల్లి జడ్పీటీసీ పోస్టల్ బ్యాలెట్లో వైఎస్సార్సీపీ ఆధిక్యం ►పశ్చిమగోదావరి: జీలుగుమిల్లి జడ్పీటీసీ పోస్టల్ బ్యాలెట్లో వైఎస్సార్సీపీ ఆధిక్యం ►కృష్ణా: పెడన జడ్పీటీసీ పోస్టల్‌బ్యాలెట్‌లో వైఎస్సార్సీపీ ఆధిక్యం ►పోస్టల్ బ్యాలెట్లో వైఎస్సార్సీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ►నెల్లూరు: 766 ఓట్ల మెజార్టీతో ఆమంచర్ల ఎంపీటీసీ(వైఎస్సార్సీపీ) గెలుపు ►పశ్చిమగోదావరి: వేలేరుపాడు జడ్పీటీసీ పోస్టల్ బ్యాలెట్లో వైఎస్సార్సీపీ ఆధిక్యం ►నెల్లూరు: కలిగిరి జడ్పీటీసీ పోస్టల్ బ్యాలెట్లో వైఎస్సార్సీపీ ఆధిక్యం వైఎస్సార్ జిల్లా: జమ్మలమడుగు జడ్పీటీసీ పోస్టల్ బ్యాలెట్లో వైఎస్సార్సీపీ ఆధిక్యం ►అనంతపురం: కనగాపల్లి జడ్పీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థి మారుతి ప్రసాద్ ఆధిక్యం ఉరవకొండ జడ్పీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థి పార్వతమ్మ ఆధిక్యం తనకల్లు జడ్పీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థి జక్కల జ్యోతి ఆధిక్యం పెద్దవడుగూరు జడ్పీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థి భాస్కర్‌రెడ్డి ముందంజ కంబదూరు జడ్పీటీసీ పోస్టల్ బ్యాలెట్లో వైఎస్సార్సీపీ ఆధిక్యం ►వైఎస్సార్ జిల్లా: కమలాపురం మండలం దేవరాజుపల్లి దేవరాజుపల్లి ఎంపీటీసీ (వైఎస్సార్సీపీ) గెలుపొందారు. 186 ఓట్ల మెజార్టీతో వైఎస్సార్సీపీ అభ్యర్థి చెన్నకేశవరెడ్డి విజయం సాధించారు. ►విజయనగరం: జిల్లా వ్యాప్తంగా పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 31 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. 31 జడ్పీటీసీ, 487 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్ జరుగుతోంది. కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి ఆన్లైన్ ద్వారా ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను జిల్లా కలెక్టర్ పర్యవేక్షిస్తున్నారు. ►పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం డివిజన్ పరిధిలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. పోస్టల్ బ్యాలెట్లో వైఎస్సార్సీపీ ఆధిక్యంలో ఉంది. ►ఆంధ్రప్రదేశ్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. 515 జడ్పీటీసీ, 7216 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్ జరుగుతోంది. ► 7,219 ఎంపీటీసీ.. 515 జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసిన వారి భవితవ్యం తేలబోతోంది. హైకోర్టు తీర్పు కారణంగా ఐదున్నర నెలలుగా ప్రజా తీర్పు స్ట్రాంగ్ రూంలకే పరిమితం అయిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 8వ తేదీన ఆయా స్థానాలకు జరిగిన పోలింగ్‌లో మొత్తం 1,29,55,980 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ►ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో పూర్తి స్థాయిలో కోవిడ్ నింబంధనలు పాటించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఇప్పటికే జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కౌంటింగ్ సిబ్బందితో పాటు అభ్యర్థుల తరుఫున హాజరయ్యే ఏజెంట్లు కరోనా వ్యాక్సినేషన్ వేయించుకొని ఉండాలనే ఆదేశాలు వెళ్లాయి. ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి మండలాల వారీగా ఒక్కో స్థానానికి ఒకటి చొప్పున 7,219 టేబుళ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 515 జెడ్పీటీసీ స్థానాల ఓట్ల లెక్కింపు కోసం వేరుగా 4,008 టేబుళ్లను సిద్ధం చేశారు. జిల్లాల వారీగా.. శ్రీకాకుళం: 37 జడ్పీటీసీ, 590 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్ విజయనగరం: 31 జడ్పీటీసీ, 487 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్ విశాఖపట్నం: 37 జడ్పీటీసీ, 612 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్ తూర్పు గోదావరి: 61 జడ్పీటీసీ, 996 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్ పశ్చిమ గోదావరి: 45 జడ్పీటీసీ, 781 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్ కృష్ణా: 41 జడ్పీటీసీ, 648 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్ గుంటూరు : 45 జడ్పీటీసీ, 571 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్ ప్రకాశం: 41 జడ్పీటీసీ, 368 ఎంపీటీసీ స్థానాలకుకౌంటింగ్ నెల్లూరు: 34 జడ్పీటీసీ, 362 ఎంపీటీసీ స్థానాలకుకౌంటింగ్ చిత్తూరు: 33 జడ్పీటీసీ, 419 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్ వైఎస్సార్: 12 జడ్పీటీసీ, 117 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్ కర్నూలు: 36 జడ్పీటీసీ, 484 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్ అనంతపురం: 62 జడ్పీటీసీ, 781 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్ సాక్షి, అమరావతి: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు ఎట్టకేలకు ఆదివారం వెల్లడి కాబోతున్నాయి. 7,219 ఎంపీటీసీ.. 515 జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసిన ఏడాదిన్నర తర్వాత నేడు వారి భవితవ్యం తేలబోతోంది. ఏప్రిల్ 8వ తేదీన ఆయా స్థానాలకు జరిగిన పోలింగ్‌లో మొత్తం 1,29,55,980 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. హైకోర్టు తీర్పు కారణంగా ఐదున్నర నెలలుగా ప్రజా తీర్పు స్ట్రాంగ్ రూంలకే పరిమితం అయిన విషయం తెలిసిందే. చదవండి: ఆ 23 మంది గెలిస్తే అక్కడ మళ్లీ ఎన్నికలే మూడు రోజుల క్రితమే హైకోర్టు డివిజన్ బెంచ్ ఓట్ల లెక్కింపునకు అనుమతించడంతో రాష్ట్ర వ్యాప్తంగా 206 కేంద్రాల్లోని 209 ప్రదేశాలలో ఓట్ల లెక్కింపు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఒక్కో కౌంటింగ్ కేంద్రంలో మండలాల వారీగా వేర్వేరుగా ఓట్ల లెక్కింపు కోసం వేర్వేరు హాళ్లను సిద్ధం చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు జిల్లాల్లో చేపట్టిన ఏర్పాట్లపై సమీక్షించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని శనివారం ఉదయం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులతో కలిసి ఓట్ల లెక్కింపు ప్రక్రియలో మొత్తం 44,155 మంది సిబ్బంది పని చేయనున్నారు. పూర్తి స్థాయిలో ఏర్పాట్లు ► ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో పూర్తి స్థాయిలో కోవిడ్ నింబంధనలు పాటించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఇప్పటికే జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కౌంటింగ్ సిబ్బందితో పాటు అభ్యర్థుల తరుఫున హాజరయ్యే ఏజెంట్లు కరోనా వ్యాక్సినేషన్ వేయించుకొని ఉండాలనే ఆదేశాలు వెళ్లాయి. ► ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి మండలాల వారీగా ఒక్కో స్థానానికి ఒకటి చొప్పున 7,219 టేబుళ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 515 జెడ్పీటీసీ స్థానాల ఓట్ల లెక్కింపు కోసం వేరుగా 4,008 టేబుళ్లను సిద్ధం చేశారు. చదవండి: 30 వరకు నైట్ కర్ఫ్యూ ఐదున్నర నెలల తర్వాత.. బ్యాలెట్ బాక్స్‌లు దాచి ఉంచిన స్ట్రాంగ్ రూంలను పోలింగ్ జరిగిన ఐదు నెలల తర్వాత తెరవనున్నారు. దీంతో మొదట బ్యాలెట్ బాక్స్‌లు శుభ్రం చేసుకోవడం వంటి కారణాలతో ఓట్ల లెక్కింపు ప్రక్రియ నీర్ణీత సమయం కంటే కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. దీనికితోడు బ్యాలెట్ పేపరు ద్వారా ఎన్నికలు కావడంతో లెక్కింపు ప్రక్రియ ఆలస్యమవుతుందని అధికారులు భావిస్తున్నారు. అయినప్పటికీ మధ్యాహ్నం రెండు గంటల సమయానికి దాదాపు అన్ని చోట్ల ఎంపీటీసీ ఎన్నికల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని.. జెడ్పీటీసీ ఫలితాలు మాత్రం రాత్రి వరకు సమయం పట్టే అవకాశం ఉందని అధికారుల వర్గాలు పేర్కొన్నాయి. అన్ని జాగ్రత్తల మధ్య కౌంటింగ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ సూచించిన మేరకు పూర్తి స్థాయిలో కోవిడ్ జాగ్రత్తలను పాటిస్తూ.. ఓట్ల లెక్కింపునకు తగిన రక్షణ ఏర్పాట్లు చేశాం. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేలా సిబ్బందికి శిక్షణ ఇచ్చాం. అభ్యర్థి, కౌంటింగ్ ఏజెంట్లు రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తయినట్లు ధృవీకరణ పత్రం చూపాలి. లేదా ర్యాపిడ్ యాంటి జెన్ టెస్ట్/ఆర్టీపీసీఆర్ టెస్ట్‌లో నెగటివ్ ఉంటేనే లెక్కింపు కేంద్రం లోపలికి అనుమతిస్తామని ఇప్పటికే తెలిపాం. రాష్ట్ర స్థాయిలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం. 13 జిల్లాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షించడానికి 13 మంది అధికారులను నియమించాం. – గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి -
MPTC, ZPTC Elections: కౌంట్‌డౌన్!
సాక్షి, అమరావతి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ నిర్వహణ ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ శుక్రవారం కలెక్టర్లు, జెడ్పీ సీఈవోలు, డీపీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్ తదితరులు పాల్గొంటారు. రాష్ట్రవ్యాప్తంగా 7,220 ఎంపీటీసీ స్థానాలకు, 515 జెడ్పీటీసీ స్థానాలకు ఈ ఏడాది ఏప్రిల్ 8వ తేదీనే ఎన్నికలు జరిగినప్పటికీ న్యాయ వివాదాలతో కౌంటింగ్ ప్రక్రియ వాయిదా పడింది. దాదాపు ఆరు నెలల అనంతరం గురువారం ఉదయం హైకోర్టు డివిజన్ బెంచ్ ఎన్నికల కౌంటింగ్ నిర్వహించేందుకు అనుమతించడంతో 19వ తేదీన కౌంటింగ్ జరపనున్నట్టు ఎన్నికల కమిషనర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. తేలనున్న అభ్యర్థుల భవితవ్యం వరుసగా చోటు చేసుకున్న వివిధ పరిణామాలతో పరిషత్ ఎన్నికల ప్రక్రియ సుదీర్ఘ కాలంగా కొనసాగుతోంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు మొదట 2020 మార్చి 7వ తేదీన నోటిఫికేషన్ జారీ అయింది. నోటిఫికేషన్ జారీ అయి ఇప్పటికి ఏడాదిన్నర దాటిపోయింది. ఆ నోటిఫికేషన్ ప్రకారం 2020 మార్చి 21వ తేదీన ఓటింగ్ ప్రక్రియ నిర్వహించి అదే ఏడాది మార్చి 24న కౌంటింగ్ పూర్తి చేయాలి. కానీ నామినేషన్ల దాఖలు, ఉపసంహరణ ప్రక్రియ ముగిసిపోయి అభ్యర్ధుల తుది జాబితా ఖరారైన తర్వాత అప్పటి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ కరోనా పేరుతో మార్చి 15వ తేదీన ఎన్నికల ప్రక్రియను వాయిదా వేశారు. తిరిగి ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి, మార్చిలో పంచాయతీ, మునిసిపల్ ఎన్నికలు నిర్వహించిన సమయంలో అవకాశం ఉన్నా ఉద్దేశపూర్వకంగానే పరిషత్ ఎన్నికలు జరపకుండా కాలయాపన చేశారనే విమర్శలున్నాయి. అనంతరం నిమ్మగడ్డ స్థానంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని బాధ్యతలు చేపట్టిన వెంటనే ఈ ఏడాది ఏప్రిల్ ఒకటవ తేదీన మధ్యలో ఆగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేసి 8వ తేదీన ఓటింగ్ ప్రక్రియను పూర్తి చేశారు. -
మిగిలిన మునిసి‘పోల్స్’కు కసరత్తు
సాక్షి, అమరావతి: నెల్లూరు, శ్రీకాకుళం నగరపాలక సంస్థలతో పాటు ఇంతకుముందు ఎన్నికలు ఆగిపోయిన 11 మునిసిపాలిటీలకు త్వరలో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ఇందుకు సంబంధించి రెండు రోజుల క్రితం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని మునిసిపల్ శాఖ అధికారులతో ప్రాథమిక సమావేశం నిర్వహించారు. మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ఎంఎం నాయక్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి కె.కన్నబాబు ఆ సమావేశంలో పాల్గొన్నారు. గత ఏడాది మార్చి నెలలో రాష్ట్రమంతటా మునిసిపల్ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేయగా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో పోలింగ్ నిర్వహించిన విషయం తెలిసిందే. అప్పట్లో 75 మునిసిపాలిటీలు, 12 నగరపాలక సంస్థలకు మాత్రమే ఎన్నికలు జరగ్గా.. వివిధ కారణాలతో 32 మునిసిపాలిటీలతో పాటు 4 నగరపాలక సంస్థలకు ఎన్నికలు నిలిచిపోయాయి. వాటిలో అకివీడు (పశ్చిమ గోదావరి), జగ్గయ్యపేట, కొండపల్లి (కృష్ణా), దాచేపల్లి, గురజాల (గుంటూరు), దర్శి (ప్రకాశం), బుచ్చిరెడ్డిపాలెం (నెల్లూరు), కుప్పం (చిత్తూరు), బేతంచర్ల (కర్నూలు), కమలాపురం (వైఎస్సార్), పెనుకొండ (అనంతపురం) మునిసిపాలిటీలతో పాటు నెల్లూరు, శ్రీకాకుళం నగరపాలక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు కోర్టు ఆటంకాలు ఏవీ లేవని మునిసిపల్ అధికారులు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఆయా మునిసిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు అధికారికంగా నివేదిక ఇవ్వాలని ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని మునిసిపల్ అధికారులకు సూచించినట్టు తెలిసింది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఓటర్ల జాబితాల తయారీ, వార్డులు, డివిజన్ల వారీగా రిజర్వేషన్ల ఖరారు వంటి అంశాలను నివేదికలో పేర్కొనాలని సూచించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులను అంచనా వేసుకుని, ఆయా మునిసిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తగిన కార్యాచరణను సిద్ధం చేసుకోనున్నట్టు కమిషన్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. గ్రామీణ ఎన్నికలకూ సన్నద్ధం గ్రామాల్లో నిలిచిపోయిన సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల గురించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఆరా తీశారు. శనివారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్, ఇతర అధికారులతో సాహ్ని భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు పోలింగ్ ముగిసినప్పటికీ.. కోర్టు ఆదేశాల మేరకు కౌంటింగ్ ప్రక్రియ నిలిచిపోయిన అంశం సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చింది. మరోవైపు అప్పట్లో గ్రామ పంచాయతీల విలీనం, వర్గీకరణ వంటి కారణాలతో ఎన్నికలు ఆగిపోయిన 259 చోట్ల సర్పంచ్, వాటి పరిధిలోని వార్డు పదవులకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని పంచాయతీరాజ్ అధికారులు వివరించారు. నామినేషన్లు దాఖలు కాకపోవడం వల్ల నిలిచిపోయిన వివిధ గ్రామ పంచాయతీల పరిధిలో దాదాపు 223 వార్డుల్లో కూడా ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని తెలియజేసినట్టు సమాచారం. దాదాపు 452 ఎంపీటీసీ స్థానాలు, 22 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉందని కూడా ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకొచ్చినట్టు తెలిసింది. ఇప్పటికే ఎన్నికలు జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో కౌంటింగ్ నిర్వహించే అంశంపై బుధవారం హైకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో.. మిగిలిన గ్రామీణ సంస్థల ఎన్నికలపై కోర్టు తీర్పు ఆధారంగా తదుపరి కార్యాచరణ చేపట్టాలని ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. -
ఏలూరు కార్పొరేషన్ వైఎస్సార్సీపీ కైవసం
లైవ్ అప్డేట్స్ వైఎస్సార్సీపీ ప్రభంజనం ►ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ ముగిసింది. ఏలూరు కార్పొరేషన్‌ను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. ఏలూరు మేయర్ పీఠం వైఎస్సార్సీపీ దక్కించుకుంది. 50 డివిజన్ల ఫలితాలు వెల్లడికాగా, 47 డివిజన్లలో వైఎస్సార్సీపీ గెలుపు సాధించింది. కేవలం 3 స్థానాలకే టీడీపీ పరిమితమైంది. ► 1వ డివిజన్ ఎ.రాధిక (వైఎస్సార్సీపీ) విజయం ►2వ డివిజన్ వైఎస్సార్సీపీ అభ్యర్ధి నరసింహారావు గెలుపు, 787 ఓట్ల మెజార్టీతో జె.నరసింహారావు విజయం. ► 3వ డివిజన్ బి.అఖిల (వైఎస్సార్సీపీ) విజయం ► 4వ డివిజన్ డింపుల్ (వైఎస్సార్సీపీ) విజయం, 744 ఓట్ల మెజార్టీతో డింపుల్ గెలుపు ► 5వ డివిజన్ జయకర్ (వైఎస్సార్సీపీ) విజయం, 865 ఓట్ల మెజార్టీతో జయకర్ విజయం ► 10వ డివిజన్ పైడి భీమేశ్వరరావు (వైఎస్సార్సీపీ) గెలుపు, 812 ఓట్ల మెజార్టీతో పైడి భీమేశ్వరరావు విజయం ► 11వ డివిజన్ కోయ జయగంగ (వైఎస్సార్సీపీ) గెలుపు, 377 ఓట్ల మెజార్టీతో కోయ జయగంగ విజయం ► 12వ డివిజన్ కర్రి శ్రీను (వైఎస్సార్సీపీ) గెలుపు, 468 ఓట్ల మెజార్టీతో కర్రి శ్రీను విజయం ► 17వ డివిజన్ టి.పద్మ (వైఎస్సార్సీపీ) విజయం, 755 ఓట్ల మెజార్టీతో టి.పద్మ గెలుపు ► 18వ డివిజన్ కేదారేశ్వరి (వెస్సార్సీపీ) విజయం, 1012 ఓట్ల మెజార్టీతో కేదారేశ్వరి గెలుపు ► 19వ డివిజన్ వై.నాగబాబు (వెస్సార్సీపీ) విజయం, 1012 ఓట్ల మెజార్టీతో వై.నాగబాబు విజయం ► 22వ డివిజన్ సుధీర్‌బాబు (వైఎస్సార్సీపీ) గెలుపు ► 23వ డివిజన్ కె.సాంబ (వైఎస్సార్సీపీ) విజయం, 1823 ఓట్ల మెజార్టీతో కె.సాంబ గెలుపు ► 24వ డివిజన్ మాధురి నిర్మల (వైఎస్సార్సీపీ) గెలుపు, 853 ఓట్ల మెజార్టీతో మాధురి నిర్మల విజయం ► 25వ డివిజన్ గుడుపూడి శ్రీను (వైఎస్సార్సీపీ) గెలుపు ►26వ డివిజన్ అద్దంకి హరిబాబు(వైఎస్సార్సీపీ) గెలుపు, 1,111 ఓట్ల మెజార్టీతో అద్దంకి హరిబాబు విజయం ► 31వ డివిజన్ లక్ష్మణ్ (వైఎస్సార్సీపీ) విజయం, 471 ఓట్ల మెజార్టీతో లక్ష్మణ్ గెలుపు ► 32వ డివిజన్ సునీత రత్నకుమారి (వైఎస్సార్సీపీ) గెలుపు ► 33వ డివిజన్ రామ్మోహన్రావు (వైఎస్సార్సీపీ) విజయం, 88 ఓట్ల మెజార్టీతో రామ్మోహన్రావు గెలుపు ►36వ డివిజన్ హేమ సుందర్ (వైఎస్సార్సీపీ) విజయం ►38వ డివిజన్ వైఎస్సార్సీపీ అభ్యర్ధి విజయం, 261 ఓట్ల మెజార్టీతో హేమా మాధురి గెలుపు ►39వ డివిజన్ వైఎస్సార్సీపీ అభ్యర్ధి విజయం, 799 ఓట్ల మెజార్టీతో కె.జ్యోతి విజయం ►40వ డివిజన్ టి.నాగలక్ష్మి (వైఎస్సార్సీపీ) గెలుపు, 758 ఓట్ల మెజార్టీతో టి.నాగలక్ష్మి విజయం ► 41వ డివిజన్ వైఎస్సార్సీపీ అభ్యర్ధి కల్యాణి విజయం, 547 ఓట్ల మెజార్టీతో కల్యాణి దేవి విజయం ► 42వ డివిజన్ వైఎస్సార్సీపీ అభ్యర్ధి విజయం, 79 ఓట్ల మెజార్టీతో ఎ.సత్యవతి విజయం ► 43వ డివిజన్ జె.రాజేశ్వరి (వైఎస్సార్సీపీ) గెలుపు ► 45వ డివిజన్ ముఖర్జీ (వైఎస్సార్సీపీ) గెలుపు, 1058 ఓట్ల మెజార్టీతో ముఖర్జీ విజయం ► 46వ డివిజన్ వైఎస్సార్సీపీ అభ్యర్ధి ప్యారీ బేగం విజయం, 1,232 ఓట్ల మెజార్టీతో ప్యారీ బేగం గెలుపు ► 48వ డివిజన్ స్వాతి శ్రీదేవి (వైఎస్సార్సీపీ) విజయం, 483 ఓట్ల మెజార్టీతో స్వాతి శ్రీదేవి గెలుపు ►50వ డివిజన్ షేక్ నూర్జహాన్ (వైఎస్సార్సీపీ) విజయం, 1495 ఓట్ల మెజార్టీతో షేక్ నూర్జహాన్ గెలుపు ► 26 డివిజన్లలో వైఎస్సార్సీపీ ముందంజ ► 50వ డివిజన్ వైఎస్సార్సీపీ అభ్యర్ధి షేక్ నూర్జహాన్ ఆధిక్యం ►ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ హవా ►20 డివిజన్లలో వైఎస్సార్సీపీ ముందంజ ►41వ డివిజన్లో వైఎస్సార్‌సీపీఅభ్యర్ధి కల్యాణి విజయం ► 8వ డివిజన్లో ఫైనల్ కౌంటింగ్ కొనసాగుతోంది. ► 2,10, 31, 33, 36, 39, 45, 46, 47 డివిజన్లలో ఫైనల్ కౌంటింగ్ కొనసాగుతోంది. ► ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ► 50 పోస్టల్ బ్యాలెట్లలో పోలైన ఓట్లు 15, ► వైఎస్సార్సీపీ- 11, చెల్లనవి- 2, నోటా-1, టీడీపీ-1 ► ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ► తొలుత 50 పోస్టల్ బ్యాలెట్ ఓట్లను కౌంటింగ్ సిబ్బంది లెక్కిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్లింపు అనంతరం డివిజన్ల వారీగా ఓట్ల లెక్కిస్తారు. ప్రతీ టేబుల్‌కి ప్రతీ రౌండ్లో1000 ఓట్ల లెక్కిస్తారు. ప్రతీ టేబుల్‌కి 25 ఓట్లని బండిల్‌గా కట్టి 40 బండిల్స్‌గా లెక్కిస్తారు. ఓట్ల లెక్కింపు స్వయంగా జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ పర్యవేక్షిస్తున్నారు. ► ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రారంభమైంది. సాక్షి, ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఏలూరు శివారులోని సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపునకు అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. 47 డివిజన్లకు 48 టేబుల్స్‌పై ఒకే రౌండ్లో ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 12 గంటలకల్లా పూర్తై తుది ఫలితాలు వెల్లడికాన్నాయి. నలుగురు సీనియర్ ఆఫీసర్లను నాలుగు కౌంటింగ్ హాళ్లకు సూపర్ వైజర్లుగా నియమించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద సీసీటీవీ కెమెరా, వీడియోగ్రఫీతో పర్యవేక్షించనున్నారు. కౌంటింగ్ సిబ్బంది అందరికీ కోవిడ్ టెస్టులు, మాస్క్, ఫేస్ షీల్డ్ లేనిదే కౌంటింగ్ హాలులోకి అనుమతి నిరాకరిస్తామని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని అధికారులు తెలిపారు. కాగా, ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి 50 డివిజన్లలో ఇప్పటికే మూడు డివిజన్లు వైఎస్సార్సీపీకి ఏకగ్రీవమైన సంగతి తెలిసిందే. మార్చిలో ఎన్నికలు ముగిసిన నాటి నుంచి ఫలితాల కోసం ఎంతో ఉత్కంఠగా వేచిచూస్తున్న అభ్యర్థుల గెలుపోటములు నేడు వెల్లడి కానున్నాయి. -
నేడు ‘ఏలూరు కార్పొరేషన్’ ఫలితాలు
ఏలూరు టౌన్: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడనున్నాయి. మార్చిలో ఎన్నికలు ముగిసిన నాటి నుంచి ఫలితాల కోసం ఎంతో ఉత్కంఠగా వేచిచూస్తున్న అభ్యర్థుల గెలుపోటములు వెల్లడి కానున్నాయి. ఏలూరు శివారులోని సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపునకు అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 12 గంటలకల్లా పూర్తవుతుందని అధికారులు తెలిపారు. ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే మూడు డివిజన్లు ఏకగ్రీవమైన సంగతి తెలిసిందే. మరో 47 డివిజన్లకు ఎన్నికలు నిర్వహించగా.. వీటికి ఆదివారం ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు. కరోనా నిబంధనల నేపథ్యంలో 47 టేబుళ్లపై ఏకకాలంలో రెండు రౌండ్లలో ఓట్లను లెక్కించేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. 47 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, మరో 254 మంది సిబ్బందితోపాటు, అదనంగా 200 మంది ఏలూరు కార్పొరేషన్ సిబ్బంది ఎన్నికల కౌంటింగ్ విధుల్లో పాల్గొంటారని నగర కమిషనర్ డి.చంద్రశేఖర్ చెప్పారు. కౌంటింగ్ కేంద్రంలోకి అభ్యర్థితోపాటు ఒక ఏజెంట్‌కు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. కాగా, ఓట్ల లెక్కింపు జరిగే సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని శనివారం సందర్శించారు. కౌంటింగ్ హాళ్లను, టేబుళ్ల అమరికను పరిశీలించారు. అనంతరం అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. ఓట్ల లెక్కింపునకు తీసుకున్న చర్యలను జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆమెకు వివరించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యేంత వరకు 144 సెక్షన్ విధించామని, మూడంచెల భద్రతను ఏర్పాటు చేశామని ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ తెలిపారు. మొత్తం 175 మంది పోలీసులను నియమించామన్నారు. -
నిష్ణాతులైన వారే నియామకం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి సలహాదారుల నియామకంలో ఎలాంటి నిబంధనలు లేవని, ఆయా రంగాల్లో నిష్ణాతులైన వారిని, పరిపాలన వ్యవహారాల్లో విశేష అనుభవం ఉన్న వారిని సలహాదారులుగా నియమించడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం హైకోర్టుకు నివేదించింది. సలహాదారులు నిర్వర్తించాల్సిన విధులను వారి నియామక జీవోల్లో ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంటుందని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ కోర్టుకు వివరించారు. వారి నియామకం తాత్కాలికమైనదని తెలిపారు. ఆ నియామకాలపై ఏ చట్టంలోనూ నిషేధం లేదని, ప్రభుత్వ అవసరాలను బట్టి వారి నియామకం ఉంటుందన్నారు. వీరి నియామకాన్ని ప్రజాధనం వృథా అనే కోణంలో చూడటానికి వీల్లేదని తెలిపారు. న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ స్పందిస్తూ.. సలహాదారులను నియమించే ముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్నారా? వారు మీడియాతో మాట్లాడవచ్చా అని ప్రశ్నించారు. గతంలో ఎవరూ మీడియాతో మాట్లాడలేదన్నారు. ఏజీ వాదనలు వినిపిస్తూ.. గతంలో సలహాదారులు మీడియాతో మాట్లాడారని తెలిపారు. సాహ్ని నియామకం సరైనదే.. పాలనా వ్యవహారాల్లో విశేష అనుభవం ఉండటం వల్ల ఐఏఎస్ అధికారులుగా పనిచేసిన వారిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ)గా నియమించడం సంప్రదాయంగా వస్తోందని శ్రీరామ్ కోర్టుకు వివరించారు. ఎస్ఈసీగా నీలం సాహ్ని నియామకం విషయంలో గవర్నర్‌కు ముఖ్యమంత్రి ఏ రకమైన సలహాలు ఇవ్వలేదని, సిఫారసు చేయలేదని తెలిపారు. ఒకవేళ సలహా ఇచ్చినా, సిఫారసు చేసినా దానికి గవర్నర్ కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదన్నారు. పరిపాలనలో సమర్థత కలిగిన వారి పేర్లను ముఖ్యమంత్రి గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారని, అంతిమంగా గవర్నర్ తన విచక్షణాధికారం మేరకే నీలం సాహ్నిని నియమించారని వివరించారు. ముఖ్యమంత్రి సలహాదారు పదవికి రాజీనామా చేసిన తర్వాతే ఆమె ఎస్ఈసీగా నియమితులయ్యారని చెప్పారు. ఆమె నియామకం విషయంలో నిబంధనల ఉల్లంఘన జరగలేదన్నారు. ఎస్ఈసీగా నీలం సాహ్ని నియామకం రద్దు చేయాలని కోరుతూ విజయనగరం జిల్లాకు చెందిన న్యాయవాది రేగు మహేశ్వరరావు హైకోర్టులో కో వారెంటో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పిటిషనర్ తరఫున న్యాయవాది బి.శశిభూషణ్‌రావు శుక్రవారం వాదనలు వినిపిస్తూ.. నీలం సాహ్ని ముఖ్యమంత్రి సలహాదారుగా వ్యవహరించారని, ఆమె పేరును గవర్నర్‌కు సీఎం సిఫారసు చేశారని తెలిపారు. ఈ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ, ఎస్ఈసీగా ముఖ్య కార్యదర్శి స్థాయి అధికారులే నియమితులు కావాలని నిబంధనలు చెబుతున్నప్పుడు, వారికి ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ఎస్ఈసీ నియామకం, పిటిషనర్ విచారణార్హత తదితరాలపై గవర్నర్ ముఖ్య కార్యదర్శి తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదనల నిమిత్తం హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. -
ఆ వ్యాజ్యానికి విచారణార్హత లేదు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ)గా నీలం సాహ్నిని నియమించడం వల్ల పిటిషనర్ వ్యక్తిగత హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లలేదని, అందువల్ల ఈ పిటిషన్‌కు విచారణార్హత లేదని గవర్నర్ ముఖ్య కార్యదర్శి తరఫు సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. సాహ్ని నియామకం వల్ల తనకు ఎలా వ్యక్తిగత నష్టం జరిగిందో, ఆమె నియామకం వల్ల ఏ రకంగా ప్రభావితం అయ్యారో ఎక్కడా చెప్పలేదని వివరిం చారు. వ్యక్తిగతంగా హక్కులు ప్రభావితం కానప్పుడు అది ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) అవుతుందని, పిల్‌ను ధర్మాసనమే విచారించాల్సి ఉం టుందన్నారు. అలాగే పిటిషనర్ కో–వారెంటో ఉత్తర్వులు కోరుతున్నారని, కో–వారెంటో పిటిషన్ దాఖలు చేసినప్పుడు దానిని ఎవరు విచారించాలన్న విషయాన్ని ప్రధాన న్యాయమూర్తి (సీజే) నిర్ణయిస్తారని తెలిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది బి.శశిభూషణ్‌రావు స్పందిస్తూ.. నీలం సాహ్ని నియామకం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ఉందని, అందువల్లే ఓ పౌరుడిగా సవాల్ చేశారని చెప్పారు. హెకోర్టు తదుపరి విచారణను ఈ నెల 23వ తేదీకి వాయిదా వేసింది.. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని నియామకాన్ని రద్దు చేయాలని కోరుతూ విజయనగరం జిల్లాకు చెందిన న్యాయవాది రేగు మహేశ్వరరావు హైకోర్టులో కో–వారెంటో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ సోమవారం మరోసారి విచారణ జరిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఏఎస్జీ) చింతల సుమన్ గత విచారణ సమయంలో న్యాయస్థానం ఆదేశాల మేరకు ప్రభుత్వ సలహాదారుల నియామక విధానం, వారి విధులు, బాధ్యతలు తదితరాలకు సంబంధించిన వివరాలతో అఫిడవిట్ దాఖలు చేశారు. -
సుప్రీంకోర్టు తీర్పును తప్పుగా అర్థం చేసుకున్నారు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నియామకం విషయంలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును తప్పుగా అర్థం చేసుకున్న పిటిషనర్, నీలంసాహ్ని నియామకంపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ప్రభుత్వ పదవిలో కొనసాగుతున్న వారిని ఎన్నికల కమిషనర్‌గా నియమించరాదని మాత్రమే సుప్రీంకోర్టు చెప్పిందని ప్రభుత్వం తరఫున పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యే నాటికి నీలంసాహ్ని ఎలాంటి ప్రభుత్వ పదవిలో లేరని, ప్రభుత్వ సలహాదారు పదవికి ఆమె రాజీనామా సమర్పించారని, ఆ తరువాతే గవర్నర్ ఆమెను ఎన్నికల కమిషనర్‌గా నియమించారని వివరించారు. ఎస్ఈసీ నియామకం రాజ్యాంగంలోని అధికరణ 243కే ప్రకారం గవర్నర్ విచక్షణాధికారం మేరకే జరిగిందన్నారు. కోర్టు ఆదేశాల మేరకు కౌంటర్ ఎన్నికల కమిషనర్‌గా ఏ అధికారంతో కొనసాగుతున్నారో నీలంసాహ్నిని వివరణ కోరడంతో పాటు సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా జరిగిన ఆమె నియామకాన్ని రద్దు చేయాలని కోరుతూ విజయనగరం జిల్లాకు చెందిన న్యాయవాది రేగు మహేశ్వరరావు హైకోర్టులో కో–వారెంటో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ విచారణ జరిపి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, గవర్నర్ ముఖ్య కార్యదర్శి, ఎన్నికల కమిషన్ కార్యదర్శి, ఎస్ఈసీ నీలం సాహ్నిని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున గోపాలకృష్ణ ద్వివేది కౌంటర్ దాఖలు చేశారు.ఓ న్యాయశాఖ కార్యదర్శికి ఎన్నికల కమిషనర్ బాధ్యతలను అప్పగించడాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టిందన్నారు. ప్రభుత్వాధికారులుగా కొనసాగుతున్న వారిని కాకుండా స్వతంత్రంగా ఉన్న వ్యక్తులను ఎన్నికల కమిషనర్‌గా నియమించాలని చెప్పిందన్నారు. పిటిషనర్ మాత్రం నీలంసాహ్ని నియామకాన్ని సుప్రీం తీర్పులోని విషయాలతో పోలుస్తూ ఈ పిటిషన్ వేశారని తెలిపారు. వీటిని పరిగణనలోకి తీసుకుని ఈ వ్యాజ్యాన్ని కొట్టేయాలని కోరారు. -
నీలం సాహ్ని నియామకం సరైనదే
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ)గా విశ్రాంత ఐఏఎస్ అధికారి నీలం సాహ్ని నియామకం సరైనదేనని గవర్నర్ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా మంగళవారం హైకోర్టుకు నివేదించారు. రాజ్యాంగంలోని అధికరణ 243కే కింద తనకున్న విచక్షణాధికారాల మేరకు గవర్నర్ ఆమెను నియమించారని తెలిపారు. ఎస్ఈసీ నియామకానికి గవర్నర్ పెద్ద ఎత్తున కసరత్తు చేశారని వివరించారు. 25 ఏళ్ల అనుభవం ఉండి, గత మూడేళ్ల కాలంలో పదవీ విరమణ చేసిన 11 మంది విశ్రాంత ఐఏఎస్ అధికారుల పేర్లను, వారి వార్షిక పనితీరు మదింపు నివేదికలను (ఏపీఏఆర్) తెప్పించుకుని పరిశీలించారని చెప్పారు. ఇందులో నీలం సాహ్నికి గత ఐదేళ్లుగా 10 గ్రేడింగ్ ఉందని, మిగిలిన ఏ అధికారికీ ఇంత గ్రేడింగ్ లేదన్నారు. అలాగే ఆమెపై ఎలాంటి కేసులు, ప్రొసీడింగ్స్ పెండింగ్‌లో లేవని తెలిపారు. పిటిషనర్ వాదనల్లో అర్థం లేదు.. నీలం సాహ్నిని ఎస్ఈసీగా నియమించే ముందు సుప్రీంకోర్టు తీర్పును సైతం గవర్నర్ పరిగణనలోకి తీసుకున్నారని మీనా కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేస్తేనే ఆమెను ఎస్ఈసీగా నియమించాలని గవర్నర్ షరతు విధించారని, దీంతో ఆమె ఆ పదవికి రాజీనామా చేశారన్నారు. రాజీనామాను ప్రభుత్వం ఆమోదించాకే ఆమెను ఎస్ఈసీగా నియమించారని వివరించారు. అందువల్ల ప్రభుత్వ సలహాదారును ఎస్ఈసీగా నియమించారంటూ పిటిషనర్ చేస్తున్న వాదనలో అర్థం లేదన్నారు. అధికరణ 243కే కింద గవర్నర్ కార్యనిర్వాహక నిర్ణయాధికారాన్ని ఉపయోగించి తీసుకునే నిర్ణయాలపై న్యాయ సమీక్షకున్న అవకాశం చాలా స్వల్పమని గుర్తు చేశారు. నిరాధార ఆరోపణలు, స్వీయ ప్రకటనల ఆధారంగా నీలం సాహ్ని నియామకాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేయడం ద్వారా పిటిషనర్ న్యాయప్రక్రియను దుర్వినియోగం చేశారని తెలిపారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ వ్యాజ్యాన్ని కొట్టేయాలని ఆయన కోర్టును కోరారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకే.. ఎన్నికల కమిషనర్‌గా ఏ అధికారంతో కొనసాగుతున్నారో నీలం సాహ్నిని వివరణ కోరడంతో పాటు సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా జరిగిన ఆమె నియామకాన్ని రద్దు చేయాలని కోరుతూ విజయనగరం జిల్లాకు చెందిన న్యాయవాది రేగు మహేశ్వరరావు హైకోర్టులో కోవారెంటో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు మీనా కౌంటర్ దాఖలు చేశారు. కోవారెంటో పిటిషన్ మంగళవారం విచారణకు రాగా ప్రభుత్వంతోపాటు ఇతరులు దాఖలు చేసిన కౌంటర్లకు సమాధానం ఇచ్చేందుకు పిటిషనర్ తరఫు న్యాయవాది బి.శశిభూషణ్‌రావు గడువు కోరడంతో న్యాయమూర్తి అందుకు అంగీకరిస్తూ విచారణను జూలై 8కి వాయిదా వేశారు. గవర్నర్ పరిగణనలోకి తీసుకున్న 11 మంది అధికారులతో పాటు సీఎంవో విశ్రాంత ఐఏఎస్‌లు శామ్యూల్, ఎల్.ప్రేమచంద్రారెడ్డి పేర్లను సూచించిందని మీనా పేర్కొన్నారు. అయితే సుప్రీంకోర్టు తీర్పును పరిగణనలోకి తీసుకుని నీలం సాహ్ని వైపు గవర్నర్ మొగ్గు చూపారన్నారు. ఆమె సీఎస్‌గా పనిచేశారని, ఆ పోస్టు ప్రభుత్వాలతో సంబంధం లేని తటస్థ పోస్టు అని తెలిపారు. -
నీలం సాహ్ని నియామకంపై వేసిన పిటిషన్ ఉపసంహరణ
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని నియామకాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పిటిషనర్ తన పిల్‌ను విత్‌డ్రా చేసుకున్నట్లు అతడి తరఫు న్యాయవాది గురువారం కోర్టుకు తెలిపాడు. ఈ క్రమంలో ఈ పిటిషన్ డిస్పోజ్ చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వారం రోజుల క్రితం నీలం సాహ్ని నియామకానికి సంబంధించిన జీవోను రద్దు చేయాలంటూ విజయవాడకు చెందిన గుర్రం రామకృష్ణ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. పూర్తి వివరాల్లేకుండా ఎందుకు పిల్ వేశారని ప్రశ్నించింది. పిల్ దాఖలు చేయడమంటే ఆషామాషీ అయిపోయిందని వ్యాఖ్యానించింది. వాయిదా కోసం న్యాయవాది పదే పదే అభ్యర్థించడంతో ధర్మాసనం అందుకు అంగీకరించింది. ఈ నేపథ్యంలో పిటిషన్‌దారు తన పిల్‌ను ఉపసంహరించుకున్నాడు. చదవండి: పిల్ వేయడమంటే ఆషామాషీ అయిపోయింది.. -
పిల్ వేయడమంటే ఆషామాషీ అయిపోయింది..
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని నియామకాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఆమె నియామకానికి సంబంధించిన జీవోను రద్దు చేయాలంటూ విజయవాడకు చెందిన గుర్రం రామకృష్ణ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిపై బుధవారం ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ అరూప్‌కుమార్‌గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ వ్యాజ్యంలో మరిన్ని అదనపు డాక్యుమెంట్లు దాఖలు చేసేందుకు పిటిషనర్ తరఫు న్యాయవాది సమయం కోరారు. దీనిపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. పూర్తి వివరాల్లేకుండా ఎందుకు పిల్ వేశారని ప్రశ్నించింది. పిల్ దాఖలు చేయడమంటే ఆషామాషీ అయిపోయిందని వ్యాఖ్యానించింది. వాయిదా కోసం న్యాయవాది పదే పదే అభ్యర్థించడంతో ధర్మాసనం అందుకు అంగీకరిస్తూ విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. -
పరిషత్ ఎన్నికల రోజున సెలవు ప్రకటించాలి: ఎస్ఈసీ
సాక్షి, అమరావతి: పరిషత్ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునేలా పోలింగ్ రోజున(ఏప్రిల్ 8) సెలవు ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నీలం సాహ్ని ప్రభుత్వాన్ని కోరారు. పోలింగ్ జరిగే ప్రాంతాల్లో కార్యాలయాలు, వ్యాపారాలు బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్ ప్రదేశాల్లో అన్ని నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలి కలెక్టర్లను ఆదేశించారు. ఎన్నికల విధుల నిర్వహణకు ప్రభుత్వ వాహనాలు వినియోగించుకునే వెసులుబాటు కల్పిస్తూ జీఓ జారీ చేశారు. వాహనాలు వినియోగానికి అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. పబ్లిక్ మీటింగ్‌ల నిర్వహణకు రాజకీయ పార్టీలు తప్పనిసరిగా పర్మిషన్ తీసుకోవాలని.. ఒకే ప్రదేశంలో, ఒకే సమయానికి మీటింగ్‌లు నిర్వహించాల్సి వన్తే ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికే అనుమతులిస్తామని స్పష్టం చేశారు. పోలింగ్ విధుల్లో ఉన్న ప్రభుత్వ సిబ్బంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ రాజకీయ పార్టీకి మద్దతుగా పనిచేయరాదని, అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల కమీషన్ ఆదేశాలను అధికారుల వద్దకు చేర్చే బాధ్యత జిల్లా కలెక్టర్లదేనని స్పష్టం చేశారు. పంచాయితీ ఎన్నికల్లో చూపుడు వేలుకు వేసిన ఇంక్ మార్క్ ఇంకా పోయి ఉండదు కాబట్టి పరిషత్ ఎన్నికల్లో ఎడమ చేతి చిటికెన వేలుకు ఇంక్ రాసేలా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. -
‘పరిషత్’ ఎన్నికలకు పక్కా ఏర్పాట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నితో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది శనివారం భేటీ అయ్యారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు జిల్లాల్లో పక్కా ఏర్పాట్లు చేసినట్టు ఆమెకు వివరించారు. ఎన్నికల ఏర్పాట్లపై చర్చించేందుకు ఆ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ కూడా ఎస్ఈసీతో వేరుగా భేటీ అయ్యారు. ఆ తరువాత ద్వివేది, గిరిజాశంకర్ తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో 13 జిల్లాల ఎన్నికల సూపర్వైజరీ అధికారులతో సమావేశమయ్యారు. సూపర్వైజరీ అధికారులు ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మేరకు జిల్లాల్లోని అధికారులను సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు తగిన చర్యలు చేపట్టాలని ద్వివేది ఆదేశించారు. -
ఏపీ: హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన ఎస్ఈసీ
సాక్షి, అమరావతి: హైకోర్టులో ఎస్ఈసీ అఫిడవిట్ దాఖలు చేశారు. నిబంధనల ప్రకారమే ఆంధ్రప్రదేశ్‌లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహిస్తున్నామని ఎస్ఈసీ నీలం సాహ్ని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఎన్నికలు జరుపుతున్నామన్నారు. గత ఏడాది కరోనా కారణంగా ఎన్నికలు నిలిచిపోయాయని.. నిలిచిపోయిన ఎన్నికలను యథావిధిగా కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. గత ఏడాది నోటిఫికేషన్ ప్రకారంగా ఎన్నికల నిర్ణయం తీసుకున్నామని వివరించారు. రిట్ అప్పీల్‌ను డిస్మిస్ చేసి ఎన్నికలు సజావుగా జరిగేలా ఆదేశాలివ్వాలని హైకోర్టును ఎస్ఈసీ కోరారు. చదవండి: ఆటంకాలు లేవని తేలాకే నోటిఫికేషన్ జెండా ఎత్తేసిన చంద్రబాబు -
ఆటంకాలు లేవని తేలాకే నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: మధ్యలో ఆగిపోయిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు నిబంధనల ప్రకారం ఎటువంటి ఆటంకాలు, అడ్డంకులు లేవని స్పష్టత వచ్చాకే ఎన్నికల కొనసాగింపునకు నోటిఫికేషన్ విడుదల చేసినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. తాను ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన వెంటనే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎక్కడ దాకా జరిగాయి, ఏవి ఎక్కడ ఆగిపోయాయన్న దానిపై సమీక్షించానని చెప్పారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, జిల్లా కలెక్టర్లు తదితరులతో ఎన్నికల సన్నద్ధతపై చర్చించాకే నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ‘రాష్ట్రంలో ఏడాది కిందట మధ్యలో ఆగిపోయిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఈ ఏడాది జనవరి 8వ తేదీనే తిరిగి మొదలైంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాయి. మునిసిపల్ ఎన్నికలు పూర్తయ్యాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు కూడా 2020 మార్చి 14వ తేదీకే నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయింది. కరోనా కారణంగా అప్పుట్లో ఎన్నికల వాయిదా పడ్డాయి. పోటీలో ఉండే అభ్యర్థుల జాబితాలు అప్పుడే ఖరారయ్యాయి. బ్యాలెట్ పేపర్ల ముద్రణ పూర్తయింది. ఏకగ్రీవంగా ఎన్నికైనవారికి రిటర్నింగ్ అధికారులు గెలుపు ధ్రువీకరణ పత్రాలు కూడా అందజేశారు. ఆ ఎన్నికలను కొనసాగించకుండా ఉండడానికి ఎటువంటి కారణాలు లేవు. అన్ని పరిశీలించాకే నిర్ణయం తీసుకున్నాం. ఈ నెల 8వ తేదీ ఎన్నికల పోలింగ్, 9న అవసరమైన చోట రీపోలింగ్ నిర్వహిస్తాం. 10వ తేదీన ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి ఉంటాయి..’ అని వివరించారు. ఎన్నికలు ఎక్కడ ఆగిపోయి ఉన్నాయో అక్కడ నుంచే మొదలు పెట్టినట్టు చెప్పారు. నోటిఫికేషన్ విడుదలతో పోటీలో ఉన్న అభ్యర్థులు శుక్రవారం నుంచే ప్రచారం కొనసాగించుకోవచ్చన్నారు. ఎన్నికల కోడ్ గురువారం రాత్రి నుంచే అమల్లోకి వచ్చిందని తెలిపారు. ఎన్నికల ప్రచారంలోను, పోలింగ్ సమయంలోను కరోనా జాగ్రత్తలు తీసుకునేలా కలెక్టర్లు, ఎస్పీలకు స్పష్టమైన ఆదేశాలిచ్చినట్లు చెప్పారు. ఏకగ్రీవాలపై ఇప్పటికే కోర్టు తీర్పిచ్చింది ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో ఏకగ్రీవాలపై ఇప్పటికే హైకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి ఎన్నికల నిర్వహణకు ఇబ్బందులు లేవని మీడియా ప్రతినిధులు అడిగిన ఒక ప్రశ్నకు నీలం సాహ్ని బదులిచ్చారు. ‘ఎన్నికలు ఇంకా ఆపడానికి నిబంధనల ప్రకారం ప్రత్యేకించి ఏ కారణాలు లేవు. ఎన్నికల నిర్వహణ ఇంకా ఆలస్యమయ్యే కొద్ది కరోనా వాక్సినేషన్ సమస్యలున్నాయి. ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉంది. అన్ని పరిస్థితులు పరిశీలించాక ఇప్పుడు ఎన్నికలు కొనసాగించడమే సముచితమం’ అని భావించినట్టు చెప్పారు. అందరి సహకారం అవసరం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిష్పక్షపాతంగా, స్వేచ్చగా, పూర్తి పారదర్శకంగా నిర్వహించడానికి ఓటర్లు, రాజకీయ పార్టీలు సహా అందరి సహకారం అవసరమని చెప్పారు. ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి వారినుంచి సలహాలు, సూచనలు తీసుకున్నట్టు తెలిపారు. స్థానిక ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఫిర్యాదుల సెల్ ఏర్పాటు చేసిందని, ఎలాంటి ఫిర్యాదులు, వినతులు వచ్చినా సత్వరమే పరిష్కరిస్తామని ఆమె చెప్పారు. -
ఎన్నికల పరిశీలకులతో ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్
సాక్షి, అమరావతి: ఎన్నికల పరిశీలకులతో ఎస్ఈసీ నీలంసాహ్ని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి జిల్లాకు ఇద్దరు పరిశీలకులను నియమించారు. ఎన్నికల వ్యయ పరిశీలకులుగా ఐఎఫ్ఎస్ అధికారి, నిర్వహణ పరిశీలకులుగా ఐఏఎస్ అధికారి బాధ్యతలు నిర్వహిస్తారు. ఎన్నికల కోడ్ నిర్వహణపై ఎస్ఈసీ నీలంసాహ్ని దిశానిర్దేశం చేశారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంతంగా జరిగేలా చూడాలన్నారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమన్వయం చేసుకోవాలని ఎన్నికల పరిశీలకులకు ఎస్ఈసీ నీలంసాహ్ని సూచించారు. రాజకీయ పార్టీలతో కూడా శుక్రవారం ఉదయం ఎస్ఈసీ నీలం సాహ్ని సమావేశం నిర్వహించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో పార్టీల సహకారంపై చర్చించారు. పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ నేతల అభిప్రాయాలను ఎస్ఈసీ తీసుకున్నారు. చదవండి: ఏపీ: రాజకీయ పార్టీలతో ఎస్ఈసీ సమావేశం పరువు కోల్పోయేకంటే ఇదే బెటర్.. -
ఏపీ: రాజకీయ పార్టీలతో ఎస్ఈసీ సమావేశం
సాక్షి, విజయవాడ: రాజకీయ పార్టీలతో ఎస్ఈసీ నీలం సాహ్ని శుక్రవారం సమావేశం నిర్వహించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో పార్టీల సహకారంపై చర్చించారు. పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ నేతల అభిప్రాయాలను ఎస్ఈసీ తీసుకున్నారు. ఎన్నికల నిబంధనలు, ప్రచార నిబంధనలపై పార్టీలకు సూచనలిచ్చారు. సమావేశానికి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్‌వలీ, సీపీఎం నేత వైవీరావు హాజరయ్యారు. సమావేశానికి టీడీపీ, బీజేపీ, జనసేన హాజరుకాలేదు. ఎన్నికలు ఆపేందుకు కారణాలు కనిపించలేదు: ఎస్ఈసీ సమావేశం అనంతరం ఎస్ఈసీ నీలం సాహ్ని మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల నిర్వహణపై నిన్న నోటిఫికేషన్ జారీ చేశామన్నారు. నేడు నిర్వహించిన సమావేశంలో పార్టీల నేతల అభిప్రాయాలు తెలుసుకున్నామన్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్ ఉన్నందున ఎన్నికలు త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం కోరిందని తెలిపారు. గతేడాది మార్చిలో నిలిచిపోయిన దగ్గర నుంచి ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ నెల 8న పోలింగ్, 9న రిజర్వ్‌డే, 10న కౌంటింగ్ నిర్వహిస్తామని ఎస్ఈసీ వెల్లడించారు. నిన్నటి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందన్నారు. ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే మధ్యలో ఉందని.. గతంలోనే అభ్యర్థుల జాబితా పూర్తైందని పేర్కొన్నారు. ఎన్నికలు ఆపేందుకు కారణాలు కనిపించలేదన్నారు. కోర్టుల నుంచి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయకూడదని ఎక్కడా అభ్యంతరాలు లేవని తెలిపారు. ఫిర్యాదుల స్వీకరణకు ఎస్ఈసీ కార్యాలయంలో ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల నిర్వహణకు సహకరించాలని పార్టీలను కోరామని ఎస్ఈసీ పేర్కొన్నారు. ఎన్నికలు ఆలస్యమైతే వ్యాక్సినేషన్‌పై ప్రభావం పడుతుందని ఎస్ఈసీ నీలం సాహ్ని తెలిపారు. బహిష్కరించాల్సిన అవసరం ఏమొచ్చింది: లేళ్ల అప్పిరెడ్డి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ, పరిషత్ ఎన్నికల నిర్వహణకు సహకరిస్తామని ఎస్ఈసీకి చెప్పామని తెలిపారు. టీడీపీ, బీజేపీ, జనసేన హాజరుకాకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రతిపక్షానికి కావాల్సిన వ్యక్తి పదవిలో లేనప్పుడు సమావేశానికి హాజరుకారా? అని ఆయన ప్రశ్నించారు. సమావేశాన్ని బహిష్కరించాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగబోతున్నాయి. తమకు ఎన్నికలు ముఖ్యం కాదు.. ప్రజలే ముఖ్యమని లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. ఎన్నికల నిర్వహణపై గిరిజాశంకర్ సమీక్ష ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజాశంకర్ సమీక్ష నిర్వహించారు. అన్ని జెడ్పీ సీఈఓలు, డీపీఓలు, జిల్లా ప్రత్యేక అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఎన్నికల నిర్వహణపై మార్గదర్శకాలను వివరించారు. చదవండి: ఆగిన చోట నుంచే ఆరంభం: ఎస్ఈసీ నీలం సాహ్ని పరువు కోల్పోయేకంటే ఇదే బెటర్.. -
నేడు అన్ని పార్టీ ల ప్రతినిధులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిసమావేశం
-
ఏపీ: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 8న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పోలింగ్ నిర్వహించనున్నారు. 10న ఫలితాలు ప్రకటించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అవసరమైనచోట్ల ఈనెల 9న రీపోలింగ్ నిర్వహించనున్నారు. గత ఏడాది మార్చి 14న ఎన్నికల ప్రక్రియ నిలిచిన చోట నుంచే ప్రక్రియ కొనసాగనుంది. 513 జెడ్పీటీసీ స్థానాలకు, 7230 ఎంపీటీసీ స్థానాలకు నేడు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. జెడ్పీటీసీ ఎన్నికల్లో 2,092 మంది అభ్యర్థులు, ఎంపీటీసీ ఎన్నికల్లో 19,002 మంది అభ్యర్థులు బరిలో నిలవనున్నారు. 126 జెడ్పీటీసీ స్థానాలు, 2371 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. చదవండి: పీఆర్సీపై ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు తెలుగు రాష్ట్రాల్లో కలకలం: ఎన్ఐఏ సోదాలు -
కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్
సాక్షి, అమరావతి: కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్ఈసీ నీలం సాహ్ని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కొనసాగింపుపై ఎస్ఈసీ కసరత్తు చేస్తున్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనీల్ కుమార్ సింఘాల్, వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్, అదనపు డీజీలు డాక్టర్ రవిశంకర్ అయ్యన్నార్, సంజయ్, ఎన్నికల కమిషన్ కార్యదర్శి కన్నబాబు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్‌గా గురువారం ఉదయం బాధ్యతలు స్వీకరించిన నీలం సాహ్ని.. అనంతరం గవర్నర్ బిశ్వభూషణ్‌ను కలిశారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియపై గవర్నర్‌తో చర్చించారు. ఎస్ఈసీ నీలం సాహ్నిని చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ కలిశారు. మిగిలిన ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీతో సీఎస్ చర్చలు జరిపారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్‌పై ఎస్ఈసీ, సీఎస్ చర్చించారు. ఎన్నికల ప్రక్రియను సత్వరం పూర్తిచేయాలని ఎస్ఈసీని సీఎస్ కోరారు. రేపు(శుక్రవారం) రాజకీయ పార్టీల నేతలతో ఎస్ఈసీ సమావేశం నిర్వహించనున్నారు. -
గవర్నర్ బిశ్వభూషణ్ ను కలిసిన ఎస్ఈ సి నీలం సాహ్ని
-
ఏపీ: గవర్నర్‌ను కలిసిన ఎస్ఈసీ నీలం సాహ్ని
సాక్షి, అమరావతి: గవర్నర్ బిశ్వభూషణ్‌ను ఎస్ఈసీ నీలం సాహ్ని గురువారం కలిశారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియపై గవర్నర్‌తో చర్చించారు. కాగా, ఎస్ఈసీ నీలం సాహ్నిని చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ కలిశారు. మిగిలిన ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీతో సీఎస్ చర్చలు జరిపారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్‌పై ఎస్ఈసీ, సీఎస్ చర్చించారు. ఎన్నికల ప్రక్రియను సత్వరం పూర్తిచేయాలని ఎస్ఈసీని సీఎస్ కోరారు. ఎన్నికలు పూర్తయితే వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాల్సి ఉందని సీఎస్ తెలిపారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ తేదీలపై చర్చించారు. సాయంత్రం ఎన్నికల ప్రక్రియపై ఎస్ఈసీ ప్రకటన చేసే అవకాశం ఉంది. గత ఏడాది జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తి అయ్యింది. కేవలం 6 రోజుల ఎన్నికల ప్రక్రియ మిగిలి ఉంది. వ్యాక్సినేషన్‌కు ఇబ్బంది కాకుండా ఎన్నికలు పూర్తిచేసే యోచనలో ప్రభుత్వం ఉంది. చదవండి: ఏపీ: ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్ని ఉద్యోగం పోయే చివరిరోజు శ్రీరంగనీతులా? -
ఏపీ: ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్ని
-
ఆగిన చోట నుంచే ఆరంభం: ఎస్ఈసీ నీలం సాహ్ని
సాక్షి, అమరావతి: ఏడాది క్రితం అర్థాంతరంగా ఆగిపోయిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ తేదీలు ఖరారయ్యాయి. కొత్తగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమితులైన నీలంసాహ్ని తాను బాధ్యతలు స్వీకరించిన తొలి రోజు గురువారం ఎన్నికల కొనసాగింపు నోటిఫికేషన్ విడుదల చేశారు. అప్పట్లో ఆగిన చోట నుంచే ఎన్నికల ప్రక్రియను మొదలుపెట్టి ఈ నెల 8వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య పోలింగ్ నిర్వహిస్తారు. అవసరమైన చోట 9వ తేదీన రీ పోలింగ్ జరిపి, పదవ తేదీన ఓట్ల లెక్కింపు చేపడతారు. కనీసం ఐదు రోజులు పూర్తిగా ప్రచారానికి అవకాశం ఉండేలా.. ఎన్నికల కొనసాగింపు ప్రకటనకు, పోలింగ్ తేదీకి మధ్య ఆరు రోజుల సమయం కేటాయించారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో తక్షణమే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినట్టు నీలం సాహ్ని ప్రకటించారు. 526 జెడ్పీటీసీ స్థానాలకు, 7,321 ఎంపీటీసీ స్థానాలకు.. ఏడాది క్రితం నామినేషన్ ఉపసంహరణ ప్రక్రియ ముగియగా.. ఏకగ్రీవమైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు మినహాయించి 526 జెడ్పీటీసీ స్థానాలు, 7,321 ఎంపీటీసీ స్థానాల్లో 8వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 10,047 ఎంపీటీసీ స్థానాలు ఉండగా కోర్టు కేసు కారణంగా కొన్ని చోట్ల ఎన్నికలు వాయిదా పడగా, 9,692 ఎంపీటీసీ స్థానాలకు మాత్రమే అప్పట్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. వాటిలో 2,371 ఏకగ్రీవం కాగా, మిగిలిన 7,321 చోట్ల ఇప్పుడు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేసింది. ఎంపీటీసీ స్థానాల్లో మొత్తం 19,000 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్ర వ్యాప్తంగా 660 జెడ్పీటీసీ స్థానాలకు గాను 652 చోట్ల ఎన్నికలు జరిపేందుకు అప్పట్లో నోటిఫికేషన్ జారీ అయింది. అందులో 126 జెడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం కాగా మిగిలిన 526 చోట్ల ఎన్నికలు జరగనున్నాయి. జడ్పీటీసీ స్థానాలలో మొత్తం 2092 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. చకచకా పరిణామాలు.. గురువారం ఉదయం 9.30 గంటలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలంసాహ్ని బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను మర్యాదపూర్వకంగాకలిశారు. కొద్దిసేపటికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయానికి వచ్చి కొత్త ఎస్ఈసీతో సమావేశమయ్యారు. ఎంపీటీసీ, జడ్పీటీసీఎన్నికలకు సంబంధించి మిగిలిపోయిన ఆరు రోజుల ప్రక్రియ పూర్తయితే గ్రామీణ ప్రాంతాల్లో కరొనా వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరాటంకంగా కొనసాగించే వీలుంటుందన్న అంశాన్ని ఆయన నీలం సాహ్నితో వివరించినట్టు తెలిసింది. పంచాయతీరాజ్, పోలీసు అధికారులతో సమావేశం.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై సీఎస్ నుంచి అందిన వినతి మేరకు కొత్త ఎస్ఈసీ నీలంసాహ్ని ఎన్నికల నిర్వహణ స్థితిగతులను తెలుసుకునేందుకు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజాశంకర్, శాంతిభద్రతల అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్తో గురువారం మధ్యాహ్నం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయ కార్యదర్శి కన్నబాబు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పంచాయతీరాజ్ కమిషనర్, పోలీసు అదనపు డీజీ లిద్దరూ ఎన్నికల నిర్వహణకు సన్నదద్దతను తెలియజేయడంతో క్షేత్రస్థాయిలో ఎన్నికల నిర్వహణ స్థితిగతులను తెలుసుకునేందుకు సాయంత్రం జిల్లా కలెక్టర్లు, ఎస్సీలు, జడ్పీ సీఈవోలు, డీపీవోలతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. ఎన్నికలకు సిద్దంగా ఉండాలని కలెక్టర్లకు ఆదేశాలు.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కొనసాగింపునకు పూర్తి సన్నద్దంగా ఉండాలంటూ వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో నీలం సాహ్ని స్పష్టం చేశారు. బ్యాలెట్ పేపరు ముద్రణ, బ్యాలెట్ బాక్సు్ల, సరిపడినన్ని ఓటర్ల జాబితాలు సిద్దం చేసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలను వేగంగా పూర్తి చేసుకోవాలని సూచించారు.వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ కూడా వీడియో కాన్ఫరెన్సో్ల పాల్గొని కరోనా జాగ్రత్తలపై జిల్లా కలెక్టర్లకు సూచనలు చేశారు. కాగా, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కొనసాగింపుపై సూచనలు తీసుకునేందుకు శుక్రవారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. 19 రాజకీయ పార్టీలకు ఇప్పటికే సమాచారం ఇచ్చినట్లు కమిషన్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. పార్టీ అభ్యర్ధులు చనిపోయిన చోట ఎన్నికలకు తాత్కాలిక బ్రేక్.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో గుర్తింపు కలిగిన రాజకీయ పార్టీల తరుఫున పోటీలో ఉండి, అభ్యర్ధులు చనిపోయిన చోట నిబంధనల ప్రకారం ఆయా పార్టీలు మరో అభ్యర్థిని నిలబెట్టేందుకు వీలుగా ఆ స్థానాల్లో ఎన్నికలు తాత్కాలికంగా మరికొంత కాలం వాయిదా వేయాలని నిర్ణయించారు. స్వతంత్ర అభ్యర్ధులుగా పోటీలో ఉన్న వారు మరణించిన చోట మాత్రం ఎన్నికలను యధావిధిగా కొనసాగిస్తారు. అయితే, చనిపోయిన అభ్యర్ధి పేరు బ్యాలెట్ నుంచి ™తొలగిస్తారు. ఏకగ్రీవమైన వారితో కలిసి ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీలో ఉన్న వారిలో 88 మంది, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీలో ఉన్న వారిలో 13 మరణించినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం గుర్తించింది. ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీలో ఉండి చనిపోయిన 88 మందిలో ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు చనిపోయారని, అక్కడ మాత్రమే ఎన్నికలు యధావిధిగాకొనసాగుతాయని అదికారులు తెలిపారు. జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీలో ఉండి చనిపోయిన13 మందిలో ఒక స్వతంత్ర అభ్యర్ధి ఉన్నారని, అక్కడ మాత్రం ఎన్నికలు జరుగుతాయని పేర్కొన్నారు. ఏకగ్రీవాలపైనా కలెక్టర్లకు స్సష్టత ఏడాది క్రితం నామినేషన్ ఉపసంహరణ రోజే 2371 ఎంపీటీసీ స్థానాలలో ఎన్నికలు ఏకగ్రీవం కాగా, 126 జడ్సీ స్థానాలు ఏకగ్రీవంగానే ముగిశాయి. ఈ విషయంలో ఇప్పటికే రాష్ట్ర హైకోర్టు స్పష్టత ఇవ్వడంతో పాటు ఎన్నికల నిబంధనలు ప్రకారం అలాంటి వారికి స్థానిక ఎన్నికల రిటర్నింగ్ అధికారులు గెలుపొందినటుŠుట ధృవీకరణ పత్రాలు అందజేశారు. ఏకగ్రీవంగా ఎన్నికైన వారు ఏడాది క్రిత్రమే ధృవీకరణ పత్రాలు అందుకున్నప్పటికీ కొత్తగా ఎన్నికైన సభ్యులతో సమానంగా పదవీ కాలం ఉంటుంది. ఈ మేరకు నీలంసాహ్ని గురువారం కలెక్టర్లు, అధికారులకు స్పష్టత ఇచ్చినట్టు తెలిసింది. స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలంసాహ్ని బాధ్యతలు చేపట్టిన సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం మీడియాకు ఒక వీడియో సందేశం విడుదల చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తాను పక్షపాతం లేకుండా పనిచేస్తానని, ఎన్నికలను స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహిస్తాననినీలం సాహ్ని పేర్కొన్నారు. చదవండి: ఉద్యోగం పోయే చివరిరోజు శ్రీరంగనీతులా? -
‘ఏమైనా’.. చేయలేం!: నిమ్మగడ్డ రమేష్
సాక్షి, అమరావతి: ఎన్నికల కమిషనర్‌కు విస్తృత అధికారాలుంటాయని, ఎన్నికల కమిషన్ ఏదైనా చేయగలదని అంతా భావిస్తుంటారని అయితే అది సాధ్యం కాదని ఎస్ఈసీగా బుధవారం పదవీ విరమణ చేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యాఖ్యానించారు. ‘ఎన్నికలు (మధ్యలో ఆగిపోయిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ) మళ్లీ మొదట్నుంచీ తేవాలన్నారు. అలాంటివి ఎలా చేయగలం?.. మేం చేయలేం.. ఎన్నికల చట్టమనేది పకడ్బందీగా ఉంటుంది. ఓ వ్యక్తి తనకు అనుకూలంగా లేకపోతే ఇష్టమొచ్చినట్టు ఏదైనా, ఏమైనా చేసేందుకు వ్యవస్థ వెసులుబాటు కల్పించదు’ అని పేర్కొన్నారు. పదవీ విరమణకు ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా తన పనితీరు పట్ల పూర్తి సంతృప్తి చెందినట్లు చెప్పారు. గ్రామ పంచాయతీ, మునిసిపల్ ఎన్నికల నిర్వహణపై సంతృప్తితో ఉన్నానన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా, రీ పోలింగ్ అవసరం లేకుండా ఎన్నికల ప్రక్రియ ముగియడం అరుదైన విషయమన్నారు. ఇదంతా ప్రభుత్వ పెద్దల తోడ్పాటు, సహకారం వల్లే సాధ్యపడిందన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, కలెక్టర్లతో పాటు ప్రభుత్వ ఉద్యోగులందరి సహకారం లభించిందన్నారు. ప్రజల మనోభావాలకు ప్రతిబింబాలు.. ఎన్నికల కమిషన్ చిన్న పరిమితిలో పనిచేసే వ్యవస్థ అని, ఇతర వ్యవస్థలు ఇంకా పెద్దవి, బలమైనవని నిమ్మగడ్డ పేర్కొన్నారు. గవర్నర్, శాసన వ్యవస్థలపై విధేయత, గౌరవం ఉండాలన్నారు. ప్రజల మనోభావాలను ప్రతిబింబించే చట్టసభల ద్వారా జరిగే నిర్ణయాల పట్ల నమ్మకం విశ్వాసం అవసరమన్నారు. ఎన్నికలను పారదర్శకంగా, విశ్వసనీయతతో నిర్వహించేందుకే తన అధికారాలను వినియోగించుకున్నానని, ఇతర వ్యవస్థల్లోకి చొరబడలేదని చెప్పారు. ఓటు హక్కుపై పౌరుడిగా పోరాడతా.. కొన్ని చిన్న అంశాలు వ్యవస్థల మధ్య అవాంతరాలు కలిగించాయని నిమ్మగడ్డ పేర్కొన్నారు. కొందరు వ్యక్తుల అనాలోచిత చర్యల వల్ల వ్యవస్థల మధ్య అగాధం ఏర్పడిందన్నారు. పంచాయతీ ఎన్నికల ముందు ఎన్నికల కమిషన్ సిబ్బంది అంతా మూకుమ్మడి సెలవులో వెళ్లాలని కొందరు వ్యక్తులు చెప్పడంలో ప్రభుత్వ పాత్ర ఏం ఉంటుందన్నారు. ఆ విషయం అసలు ప్రభుత్వానికి తెలిసి కూడా ఉండకపోవచ్చన్నారు. తన స్వగ్రామంలో ఓటు హక్కు అభ్యర్ధనను పెండింగ్‌లో ఉంచడంపై ఒక పౌరుడిగా న్యాయ పోరాటం చేస్తానని, హైకోర్టుకు వెళతానని చెప్పారు. ఎన్నికల సంస్కరణలపై నివేదిక ఎన్నికల సంస్కరణలకు సంబంధించి హైకోర్టు ఆదేశాల మేరకు ఓ నివేదిక తయారు చేసినట్టు నిమ్మగడ్డ తెలిపారు. నివేదిక ప్రతిని ఆయన మీడియాకు విడుదల చేశారు. గవర్నర్‌ను కలిసి నివేదిక అందజేయాలని భావించినా కోవిడ్ టీకా తీసుకొని వైద్య సహాయం పొందుతుండడంతో అపాయింట్మెంట్లేవీ లేవని ఆయన కార్యాలయం సమాచారమిచ్చిందన్నారు. నివేదికను రాజకీయ పార్టీలకు కూడా పంపి సలహాలు కోరినట్టు చెప్పారు. తదుపరి ఎస్ఈసీగా నీలం సాహ్ని నియామకాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎదుర్కొంటున్న సవాళ్లు, ఎలా ముందుకెళ్లాలనే అంశాలపై ఇప్పటికే ఆమెకు లేఖ రాసినట్లు చెప్పారు. -
సీఎం జగన్‌ను కలిసిన మాజీ సీఎస్ నీలం సాహ్ని
సాక్షి, తాడేపల్లి: క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇప్పటికే నీలం సాహ్నిని ఎస్ఈసీగా నియమించేందుకు ఆమె పేరును గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ఖరారు చేసిన సంగతి విదితమే. ఏప్రిల్ 1 నుంచి ఎస్ఈసీగా ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు. చదవండి: మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీకి మరో షాక్ కోవిడ్ సమస్యకు పరిష్కారం వ్యాక్సినేషనే: సీఎం జగన్ -
సీఎం ముఖ్య సలహాదారు పదవికి సాహ్ని రాజీనామా
సాక్షి, అమరావతి: సీఎం ముఖ్య సలహాదారు పదవికి నీలంసాహ్ని రాజీనామా చేశారు. రాజీనామాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ శనివారం ఆమోదించారు. ఆమెను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమించేందుకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఆ బాధ్యతలు చేపట్టేందుకు వీలుగా నీలం సాహ్ని సీఎం ముఖ్య సలహాదారు పదవికి రాజీనామా చేసినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. -
సమష్టి కృషితో ప్రగతిపథంలో..
సాక్షి, అమరావతి: దేశంలోనే ఉత్తమ అధికారులుగా ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న గుర్తింపును నిలబెట్టుకునేలా అధికార యంత్రాంగం తోడ్పాటు అందించాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత పురోగమించేలా కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నూతన బాధ్యతలు స్వీకరించిన ఆదిత్యనాథ్ దాస్ కోరారు. గురువారం సచివాలయం మొదటి బ్లాకులోని కార్యాలయంలో నీలం సాహ్ని నుంచి సీఎస్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. అంతర్ రాష్ట్ర బదిలీలకు సంబంధించిన దస్త్రంపై ఆదిత్యనాథ్‌దాస్ తొలి సంతకం చేశారు. గవర్నర్‌తో పాటు సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అవకాశం కల్పించిన సీఎం జగన్‌కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ప్రగతి పథంలో ముందుకు తీసుకువెళ్లడంతోపాటు పోలవరం ప్రాజెక్టు సకాలంలో పూర్తయ్యేలా కృషి చేస్తానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సాహ్ని మెరుగైన సేవలు అందించారని ఆదిత్యనాథ్‌దాస్ పేర్కొన్నారు. సాహ్ని పదవీ విరమణ సందర్భంగా నిర్వహించిన వీడ్కోలు సభలో ఆయన మాట్లాడారు. ఆమె ఏ పదవిలో ఉన్నా ఎంతో నిబద్ధతతో పని చేశారన్నారు. అనంతరం సాహ్నిని ఆదిత్యనాథ్‌దాస్ సత్కరించారు. గవర్నర్‌తో సమావేశమైన నూతన సీఎస్ ఆదిత్యనాథ్.. ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన రాష్ట్రం.. టెక్కలిలో 36 ఏళ్ల క్రితం సబ్ కలెక్టర్‌గా సర్వీసులో చేరిన తాను వివిధ హోదాల్లో పనిచేసి సీఎస్‌గా పదవీ విరమణ చేయడం సంతృప్తి కలిగిస్తోందని నీలం సాహ్ని చెప్పారు. ముఖ్యంగా అద్భుతమైన ఏపీలో పని చేయడం సంతోషంగా ఉందన్నారు. సీఎం జగన్ అందించిన సహాయ సహకారాలకు సర్వదా కృతజ్ఞురాలినని పేర్కొన్నారు. కరోనా కట్టడిలో సీఎం ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించడంలో తనకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఆదిత్యనాథ్‌కు అధికారులు ప్రవీణ్ ప్రకాశ్, శశిభూషణ్, కృష్ణబాబు, రావత్, ఉదయలక్ష్మి, టి.విజయకుమార్‌రెడ్డి, ముఖేష్‌కుమార్ మీనా, ప్రవీణ్‌కుమార్, విజయకృష్ణన్ శుభాకాంక్షలు తెలిపారు. -
సీఎం జగన్‌ను కలిసిన ఆదిత్యనాధ్ దాస్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టనున్న ఆదిత్యనాథ్ దాస్ బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. సీఎం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన ఆయన ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఆదిత్యనాథ్ దాస్‌తో పాటు డీజీపీ గౌతం సవాంగ్ కూడా ఉన్నారు. కాగా ప్రస్తుత సీఎస్ నీలం సాహ్ని ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారు. అదే రోజు నూతన సీఎస్‌గా ఆదిత్యనాథ్ దాస్ బాధ్యతలు స్వీకరిస్తారు. (నూతన సీఎస్‌గా ఆదిత్యనాథ్ దాస్) -
నూతన సీఎస్‌గా ఆదిత్యనాథ్ దాస్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర కేడర్‌కు చెందిన 1987 ఐఏఎస్ బ్యాచ్ అధికారి ఆదిత్యనాథ్ దాస్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు సాధారణ పరిపాలన (రాజకీయ) శాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సీఎస్ నీలం సాహ్ని ఈ నెల 31వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం ఆదిత్యనాథ్ దాస్ నూతన సీఎస్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు. సాగునీటి శాఖలో సుదీర్ఘ అనుభవం.. ఆదిత్యనాథ్ దాస్ సుదీర్ఘకాలం సాగునీటి శాఖ కార్యదర్శిగా, ముఖ్య కార్యదర్శిగా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రంలో 1999 – 2001 వరకు వరంగల్ జిల్లా కలెక్టర్‌గా ఉన్నారు. 2006 నుంచి 2007 వరకు మున్సిపల్, పట్టణాభివృద్ధి డైరెక్టర్‌గా పనిచేశారు. రాష్ట్ర విభజన అనంతరం 2016 వరకు సాగునీటి శాఖ బాధ్యతలు నిర్వహించారు. అనంతరం విద్యాశాఖ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం జలవనరుల శాఖ ప్రత్యేక సీఎస్‌గా ఉన్నారు. కేంద్ర సర్వీసులో కూడా ఆయన పలు బాధ్యతలు నిర్వర్తించారు. సీఎం ముఖ్య సలహాదారుగా నీలం సాహ్ని ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్న సీఎస్ నీలం సాహ్ని ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారుగా నియమితులు కానున్నారు. ఈ మేరకు సాధారణ పరిపాలన (రాజకీయ) శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఉత్తర్వులు జారీ చేశారు. క్యాబినెట్ ర్యాంకు హోదాలో కేంద్ర, రాష్ట్ర సంబంధాలు, రాష్ట్ర పునర్విభజన అంశాలు, పరిపాలన సంస్కరణలు, గ్రామ, వార్డు సచివాలయాలు, జిల్లాల పునర్విభజన, ల్యాండ్ సర్వే టైట్లింగ్ చట్టం, కోవిడ్ 19, ఆరోగ్యం తదితర బాధ్యతలను ఆమె నిర్వహించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జలవనరుల శాఖకు శ్యామలరావు మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా ఉన్న జె.శ్యామలరావు జలవనరుల శాఖ కార్యదర్శిగా బదిలీ అయ్యారు. ఆదిత్యనాథ్ దాస్ సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించే వరకు శ్యామలరావు జలవనరుల శాఖ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ హోదాలో కొనసాగుతారు. పోస్టింగ్ కోసం నిరీక్షిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి వై.శ్రీలక్ష్మి మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్న కె.సునీత సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా బదిలీ అయ్యారు. ప్రస్తుతం సాంఘిక సంక్షేమ శాఖ అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న బి.రాజశేఖర్‌ను ఆ బాధ్యతల నుంచి రిలీవ్ చేశారు. రాష్ట్ర ఎస్సీ సహకార ఆర్థిక కార్పొరేషన్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలను కె.సునీతకు అప్పగించారు. ఈ మేరకు సీఎస్ నీలం సాహ్ని ఉత్తర్వులిచ్చారు. -
ఏపీ కొత్త సీఎస్‌గా ఆదిత్యానాథ్ దాస్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్ దాస్ నియమితులయ్యారు. ఈనెల 31న సీఎస్‌గా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీ కాలం ఈనెల 31తో ముగియనున్న నేపథ్యంలో ఆమె స్థానంలో ఆదిత్యానాథ్ దాస్‌కు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. పదవీకాలం పూర్తి అనంతరం ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ అడ్వైజర్‌గా నీలం సాహ్ని విధులు నిర్వర్తించనున్నారు. ప్రధాన కార్యదర్శితో పాటు మరికొన్ని స్థానాల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ జలవనరులశాఖ కార్యదర్శిగా శ్యామలరావు, పురపాలకశాఖ కార్యదర్శిగా వై.శ్రీలక్ష్మి, సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శిగా కె.సునీతను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం ముఖ్యమంత్రి కార్యాలయం ఉత్తర్వలు జారీచేసింది. ఆదిత్యనాథ్ దాస్ బయోడేటా.. 1961లో బిహార్‌లో జన్మించిన ఆదిత్యనాథ్ దాస్ 1987 బ్యాచ్‌కు చెందిన ఏపీ క్యాడర్ ఐఏఎస్ అధికారి 1988లో ఏపీ ప్రభుత్వంలో కెరీర్ ప్రారంభించిన ఆదిత్యనాథ్ 1988లో విజయనగరం జిల్లా అసిస్టెంట్ కలెక్టర్‌గా విధులు నంద్యాల, విజయవాడలో సహాయ కలెక్టర్‌గా పనిచేసిన ఆదిత్యనాథ్ దాస్ 1996 నాటికి కృష్ణా జిల్లా జేసీగా పనిచేసిన ఆదిత్యనాథ్ దాస్ 1999లో వరంగల్ కలెక్టర్‌గా నియమించిన ప్రభుత్వం 2001లో ఢిల్లీలోని ఏపీ భవన్ అదనపు కమిషనర్‌గా బాధ్యతలు 2006 వరకు ఢిల్లీ పనిచేసిన ఆదిత్యనాథ్ దాస్ ఢిల్లీలో పనిచేసి తిరిగి ఏపీలో పురపాలకశాఖ కమిషనర్&డైరెక్టర్‌గా బాధ్యతలు 2007లో యూపీ ఎన్నికల పరిశీలకుడిగా వెళ్లిన ఆదిత్యనాథ్ దాస్ తర్వాత ఐ అండ్ క్యాడ్ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన ఆదిత్యనాథ్ దాస్ 2015లో వైఎస్ఆర్ నేతృత్వంలో ఏర్పాటైన ప్రభుత్వంలో నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శిగా నియామకం అదే ఏడాది పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా చేసిన ఆదిత్యనాథ్ దాస్ 2018 నాటికి ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు చంద్రబాబు ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన ఆదిత్యనాథ్ దాస్ వైఎస్ గన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జలవనరులశాఖలో బాధ్యతలు ప్రస్తుతం పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖలకు అదనపు ముఖ్య కార్యదర్శిగా కొనసాగుతున్న ఆదిత్యనాథ్ దాస్ ప్రస్తుతం అదే హోదాలో ఉండగా నీలం సాహ్ని పదవీ విరమణ నేపథ్యంలో త్వరలోనే సీఎస్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు -
పండగలా జననేత జన్మదినోత్సవం..
-
క్యాంపు ఆఫీస్‌లో ఘనంగా సీఎం వైఎస్ జగన్ పుట్టిన రోజు వేడుక
-
సీఎం జగన్ బర్త్ డే: కేట్ కట్ చేయించిన సీఎస్, డీజీపీ
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు సందర్బంగా సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి తదితరులు సీఎం నివాసంలో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి మంత్రులు ధర్మాన కృష్ణదాస్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, ఆదిమూలపు సురేష్, తానేటి వనిత, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, తూర్పు ఇంచార్జ్ దేవినేని అవినాష్ తదితరులు హాజరయ్యారు. అంతకు ముందు పుట్టినరోజు సందర్భంగా టీటీడీ వేదపండితులు ముఖ్యమంత్రి జగన్‌కి ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. (చదవండి: సీఎం వైఎస్ జగన్‌కు శుభాకాంక్షల వెల్లువ) తాడేపల్లి వైస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఉమ్మారెడ్డి వేకటేశ్వర్లు, పార్టీ నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. జననేత పుట్టిన రోజును స్వచ్చందంగా ఎక్కడికక్కడ ప్రజలు, కార్యకర్తలు పండుగలా చేసుకుంటున్నారు. ప్రజలను దగ్గరకు తీసుకున్న నాయకుడు ఇప్పుడు వారికి ధీమా ఇస్తూ పరిపాలిస్తున్నాడు. అందుకే ఈ పుట్టిన రోజు ప్రతి ఇంట్లో జరుగుతోంది. ప్రజల ఆకాంక్షలు లోతుగా అధ్యయనం చేసిన నాయకుడు కనుకే ఈ రోజు ఈ సుపరిపాలనలో భాగంగా ఏడాదిన్నరలోనే అనేక మార్పులు చేపడుతూ ప్రజలకు సంక్షేమం అందిస్తున్నారు. ఏ సమస్య లేకుండా 60 వేల కోట్ల నిధులు ప్రజల అకౌంట్‌కి చేరాయి. పారదర్శకత, అవినీతి నిర్మూలనపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారు’ అని తెలిపారు. (చదవండి: ప్రజల అజెండాయే.. సీఎం జగన్ అజెండా..) ‘కోవిడ్ సమయంలో అన్ని రాష్ట్రాలు ఆర్థికంగా ఇబ్బంది పడితే మన రాష్ట్రం త్వరగా కొలుకుంది. ఇది చూసి అధికారులు, నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 3000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ చేపట్టిన ఘనత వైఎస్ జగన్‌ది. ఈ రోజు ఒక యువ నాయకుడు పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. గతంలో పవర్ కేంద్రీకృతం అయితే ఈ నాయకుడు వికేంద్రీకరణ చేసి ప్రజలకు పవర్ ఇచ్చారు. కోవిడ్ నేపథ్యంలో బ్లడ్ నిల్వలు తక్కువగా ఉన్నాయి.. అందుకే మేము ఈ రక్తదానం కార్యక్రమం చేపట్టాము. ప్రజలకు సేవ చేయండి అని మా నాయకుడు ఇచ్చిన పిలుపే ఈ సేవా కార్యక్రమాలకు నాంది. ఆయన వందేళ్ల పాటు ప్రజలకు సేవ చేస్తూ.. ఆరోగ్యాంగా ఉండాలి’ అని కోరుకున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సీఎస్ నీలం సాహ్నికి సత్కారం..
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నీలం సాహ్ని ఈనెల అఖరికి తన పదవికి విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో సీఎస్ సాహ్నిని శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఘనంగా సత్కరించారు. కేబినెట్ సమావేశంలో సీఎం జగన్‌తోపాటు మంత్రి మండలి సభ్యులు ఆమెను సత్కరించారు. కాగా 2019 నవంబర్ 14న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సాహ్ని పదవి బాధ్యతలు చేపట్టారు. విభజన తర్వాత ఏపీ తొలి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆమె నియమితులయ్యారు. సాహ్ని 2018 నుంచి ఇప్పటివరకూ కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత శాఖ కార్యదర్శిగా వ్యవహరించారు. ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ 1984వ ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన నీలం సాహ్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో.. మచిలీపట్నంలో అసిస్టెంట్ కలెక్టర్‌గా పని చేశారు. టెక్కలి సబ్ కలెక్టర్‌గా, నల్గొండ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పని చేశారు. మున్సిపల్ పరిపాలన విభాగం డిప్యూటీ సెక్రటరీగా, స్త్రీ శిశు సంక్షేమశాఖ పీడీగా బాధ్యతలు నిర్వర్తించారు. నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లోనూ పని చేసిన సాహ్ని.. నల్గొండ జిల్లా కలెక్టర్‌గా, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌గా విధులు చేపట్టారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శిగా పని చేశాక.. ఎపీఐడీసీ కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీగా ఉమ్మడి రాష్ట్రంలో పని చేశారు. అనంతరం స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. 2018 నుంచి ఇటీవలి వరకు కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత కార్యదర్శిగా పనిచేశారు. చదవండి: జస్టిస్ రాకేష్ కుమార్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు -
పనిదినాల్లోనే పండుగలు
సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది (2021) పండుగల సెలవులు (సాధారణ సెలవులు) ఎక్కువగా ఆదివారం రాకపోవడంతో ఉద్యోగులకు సంతోషం కలిగిస్తోంది. అయితే, ఐచ్ఛిక సెలవులు మాత్రం నాలుగు ఆదివారాలు వచ్చాయి. సాధారణ సెలవుల్లో స్వాతంత్య్ర దినోత్సవం ఆగస్టు 15వ తేదీ మాత్రమే ఆదివారం వచ్చింది. మిగతా సెలవులన్నీ ఇతర వారాల్లోనే వచ్చాయి. వచ్చే ఏడాది సాధారణ సెలవులను, ఐచ్ఛిక సెలవులను నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ఎన్నికలకు సహకరించండి
సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వపరంగా సహకరించడంతో పాటు అవసరమైన నిధులను కేటాయించాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ సోమవారం మరోసారి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి లేఖ రాశారు. రెండు నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదు చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు వెలువరించిన తీర్పును ప్రస్తావిస్తూ.. కోర్టు తీర్పునకు అనుగుణంగా ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వపరంగా సహకరించాలని ఆ లేఖలో సూచించారు. ఎన్నికల నిర్వహణకు ఎంత ఖర్చవుతుందనేది పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ ద్వారా ప్రభుత్వమే అంచనా వేయించి, ఆ మొత్తాన్ని కేటాయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. క్షేత్ర స్థాయిలో ఎన్నికల ప్రక్రియను సజావుగా పూర్తి చేసేందుకు అన్ని జిల్లాలో తగిన ఏర్పాట్లు చేపట్టేలా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయాలని కూడా పేర్కొన్నారు. సీఎస్‌కు రాసిన లేఖతో కోర్టు తీర్పు కాపీని కూడా జత చేసినట్టు తెలిసింది. కొత్త ఓటర్ల జాబితా సిద్ధం చేయాలి కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించిన ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం గ్రామ పంచాయతీల వారీగా కొత్త ఓటర్ల జాబితాలు సిద్ధం చేయాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ అధికారులకు ‘డైరెక్షన్’ పేరుతో ఆదేశాలు జారీ చేశారు. వచ్చే ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రతిపాదించామని, దీనికి వీలుగా డిసెంబర్ 21 తేదీ నాటికి గ్రామ పంచాయతీల వారీగా కొత్త ఓటర్ల జాబితా మాస్టర్ కాపీలను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. గతంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయని కారణంగా ఆ ఎన్నికలకు కొత్త ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని సూచించారు. -
ఎన్నికలతో వైరస్ చెలరేగే ప్రమాదం : నీలం సాహ్ని
సాక్షి, అమరావతి: కరోనా మహమ్మారి కారణంగా రాష్ట్రంలో ఇప్పటికే 6,890 మంది ప్రజలు ప్రాణాలు పోగొట్టుకున్నారని, ఇప్పుడు ఎన్నికలు నిర్వహించి వైరస్ మరింత వ్యాప్తి చెందే పరిస్థితికి అవకాశం ఇవ్వడం ఏమాత్రం మంచిది కాదంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు ప్రత్యుత్తరమిచ్చారు. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలను నిర్వహించ తలపెట్టిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అందుకు సంబంధించి జిల్లాల కలెక్టర్లు, జడ్పీ సీఈవోలు, జిల్లా పంచాయతీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహణకు ఏర్పాటు చేయాలంటూ మంగళవారం సీఎస్‌కు లేఖ రాశారు. దీనిపై స్పందించిన సీఎస్ నీలం సాహ్ని అదే రోజు ప్రత్యుత్తరమిస్తూ కరోనా రెండో దశ వ్యాప్తితో ఢిల్లీలో ఆందోళన నెలకొన్న పరిస్థితులతో పాటు చలి కాలంలో వైరస్ వ్యాప్తి చెందకుండా రాష్ట్రాలు వాటి పరిధిలో పట్టిష్ట చర్యలు చేపట్టాలని కేంద్రం సూచించడాన్ని ప్రస్తావిస్తూ, ఇలాంటి తరుణంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్నికల నిర్వహణకు సిద్ధం కావడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరగడాన్ని ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణకు కారణంగా ఎస్ఈసీ చూపడంపై స్పందిస్తూ.. కరోనా నియంత్రణకు రాష్ట్రాలు వేర్వేరు ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాయని, అన్ని రాష్ట్రాలలోనూ కరోనా పరిస్థితులు ఒకే విధంగా లేవని సీఎస్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా నియంత్రణలో కేంద్రం సూచనలు, సలహాలు మేరకు పని చేస్తున్నట్టు సీఎస్ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు అనువైన పరిస్థితులు నెలకొన్న వెంటనే ఆగిపోయిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు అన్ని విధాల సహకరించేందుకు సన్నద్ధంగా ఉంటామన్నారు. ఈమేరకు సీఎస్‌కు రాసిన లేఖను బుధవారం ఆమె విడుదల చేశారు. విరమించుకోండి... యాక్టివ్ కరోనా కేసులు గ్రామీణ ప్రాంతాల్లోనే ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయని, అధికార యంత్రాంగమంతా నియంత్రణ చర్యల్లో నిమగ్నమైందని సీఎస్ లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం నెలకొన్న కరోనా పరిస్థితుల్లో ప్రత్యేకంగా ఫలానా సమయంలో ఎన్నికలు నిర్వహించాలని ముందే స్పష్టమైన నిర్ణయానికి రావడం సముచితం కాదని సీఎస్ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని, ఎన్నికల నిర్వహణకు సంబంధించి సమీక్షలు లాంటివి ప్రస్తుత పరిస్థితుల్లో అవసరం లేదని సూచించారు. పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు పూర్తి సన్నద్ధంగా ఉంటుందన్నారు. కలెక్టర్లతో నిర్వహించ తలపెట్టిన వీడియో కాన్పరెన్స్ సమావేశం అవసరమని భావించడం లేదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు రాసిన లేఖలో సీఎస్ పేర్కొన్నారు. -
ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డకు సీఎస్ నీలంసాహ్ని లేఖ
-
ఈ పరిస్థితుల్లో ఎన్నికలు ప్రజాహితం కాదు: ఏపీ సీఎస్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా నీలంసాహ్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌కు లేఖ రాశారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్రంలో పరిస్థితులు సరిగా లేవని లేఖలో స్పష్టం చేశారు. అధికార యంత్రాంగమంతా కరోనా విధుల్లో ఉన్నారని, ఎన్నికల నిర్వహణపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాల్సిన అవసరం ఇప్పుడు లేదని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. అదీకాక గ్రామీణ ప్రాంతాలకు కూడా కరోనా విస్తరించిందనని, ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహిస్తామనడం ప్రజాహితం కాదని పేర్కొన్నారు. కరోనాను ఎదుర్కోవడంలో ఒక్కో రాష్ట్రం ఒక్కో వ్యూహాన్ని అమలు చేస్తోందని, ఒక రాష్ట్రాన్ని, మరో రాష్ట్రంతో పోల్చడం తగదన్నారు. చదవండి: రైతుల శ్రమ తెలిసిన ప్రభుత్వం ఇది.. రాష్ట్రంలో ఇప్పటికే 6,890 మంది కరోనాతో మరణించారని, రాబోయే రోజుల్లో కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉంటుందని కేంద్రం కూడా తెలిపిందని ఆమె గుర్తుచేశారు. ఎన్నికల నిర్వహణపై ఎన్నికల కమిషన్ తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు సమాయత్తం అయ్యాక ఆ చర్యలకు శ్రీకారం చుట్టడం మేలుని పేర్కొన్నారు. ఈ అంశాలన్నింటిని ఎన్నికల కమిషన్ సానుకూలంగా పరిగణిస్తుందని భావిస్తున్నానని నీలంసాహ్ని లేఖలో ప్రస్తావించారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు వచ్చే ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించిందంటూ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ మంగళవారం ప్రొసీడింగ్స్ పేరుతో ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. చదవండి: కరోనా కిట్లు దిగొచ్చాయ్ -
ఆస్తి, ప్రాణ నష్టాన్ని తగ్గించాం: నీలం సాహ్ని
-
సీఎస్‌తో కేంద్ర బృందం భేటీ.. వరద నష్టంపై సమీక్ష
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇటీవల భారీ వర్షాల కారణంగా సంభవించిన నష్టాలపై సమీక్షించేందుకు గాను రెండు రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర బృందం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నితో సమావేశమయ్యింది. వివిధ శాఖల వారీగా అధికారులు జరిగిన నష్టంపై కేంద్ర బృందానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. భారీ వరదల కారణంగా రాష్ట్రంలో 6,368 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని అధికారులు కేంద్ర బృందానికి నివేదిక ఇచ్చారు. ఈ సందర్భంగా నీలం సాహ్ని మాట్లాడుతూ.. ‘2లక్షల 12వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. 24వేల 515 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బ తిన్నాయి. రాష్ట్రంలో 5వేల 583 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయి. తాత్కాలిక పునరుద్ధరణ చర్యలకు గాను తక్షణమే 840 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. శాశ్వత పునరుద్ధరణ చర్యలకు రూ.4,439 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. తడిసిన, రంగు మారిన ధాన్యం కొనుగోలుకు కేంద్రం సడలింపులు ఇవ్వాలి. దెబ్బతిన్న వేరుశెనగ పంటకు కూడా నిబంధనలు సడలించాలి. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ఉపశమనం కల్పించాం. ప్రభుత్వం తక్షణ చర్యలతో ఆస్తి, ప్రాణ నష్టాన్ని తగ్గించాం’ అని తెలిపారు. (చదవండి: సంక్షోభం నుంచి సంక్షేమంలోకి..) వరద నష్టం ఫోటో ఎగ్జిబిషన్ సందర్శన సాక్షి,విజయవాడ: నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలోవరద నష్టంపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ని సౌరవ్ రే నేతృత్వంలోని కేంద్ర బృందం సందర్శించింది. జిల్లాలో సంభవించిన నష్టంపై కలెక్టర్ ఇంతియాజ్ కేంద్ర బృందానికి వివరించారు. వరదనష్టంపై కలెక్టర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ప్రాధమికంగా అగ్రికల్చర్లో 17000 హెక్టార్లు, హార్టీ కల్చర్‌లో 8,000 హెక్టార్ల పంటనష్టం జరిగిందని తెలిపారు. దెబ్బతిన్న ఆర్ అండ్ బీ, పంచాయితీ రాజ్ రోడ్ల అంచనాలను కూడా వివరించారు. జిల్లాలోని మూడు మండలాల్లో కేంద్రకమిటీ పంట నష్టాన్ని పరిశీలించనుందని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. -
గుంటూరు జిల్లాలో కేంద్ర బృందం పర్యటన
గుంటూరు : జిల్లాలో భారీ వర్షాలు, వరదల కారణంగా ముంపునకు గురైన ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించింది. సౌరవ్ రాయ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యులతో కూడిన ఇంటర్ మినిస్టీరియల్ కేంద్ర బృందం సభ్యులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సహా వివిధ శాఖల అధికారులతో సచివాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వరదల కారణంగా సంభవించిన నష్టాన్ని వివిధ శాఖ వారీగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సీఎస్ నీలం సాహ్ని కేంద్ర బృందానికి వివరించారు. 2లక్షల 12వేల హెక్టార్లలో ధాన్యం పంటలు, 24 వేల 515 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని సీఎస్ నీలం సాహ్ని కేంద్ర బృందానికి తెలిపారు. (సోమశిల చివరి ఆయకట్టు రైతుల కల సాకారం) భారీ వర్షాలకు రాష్ట్రంలో 5 వేల 583 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయని, వీటి ద్వారా రూ.6,368 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు నివేదిక అందజేశారు. తాత్కాలిక పునరుద్ధరణ చర్యలకు రూ.840 కోట్లు, శాశ్వత పునరుద్ధరణ చర్యలకు రూ.4,439 కోట్లు అందించాలని సీఎస్ నీలం సాహ్ని కోరారు. పంటల కొనుగోలుకు కేంద్రం సడలింపులు ఇవ్వాలని కోరారు. తడిసిన, రంగుమారిన ధాన్యం కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఏక్యూ ( ఫెయిర్ ఏవరేజ్ క్వాలిటీ ) నిబంధనలు సవరించేలా సిఫార్స్ చేయాలని విఙ్ఞప్తి చేశారు. దెబ్బతిన్న వేరుశెనగ పంటకు కూడా నిబంధనలు సడలించాలని కోరారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ఉపశమనం కల్పించామని సీఎస్ కేంద్ర బృందం సభ్యులకు వివరించారు. ప్రభుత్వం తక్షణ చర్యలతో ఆస్తి, ప్రాణ నష్టాన్ని తగ్గించామని తెలిపారు. (ఏపీ ప్రభుత్వ నిర్ణయం.. తొలి టీకా వారియర్స్‌కే..! ) -
ఇప్పట్లో ఎన్నికలు కష్టం
సాక్షి, అమరావతి: కరోనా నియంత్రణకు దేశంలోనే అత్యుత్తమ స్థాయిలో అన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ పరిస్థితి ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదని, ఈ సమయంలో ఎన్నికల నిర్వహణకు అనువైన వాతావరణం లేదని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు స్పష్టం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసిన సమయంలో మార్చిలో రాష్ట్రంలో కరోనా కేసులు కేవలం 26 మాత్రమే ఉండగా తాజాగా 26,622 యాక్టివ్ కేసులున్నాయని మొత్తం 8,14,774 కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనమని పేర్కొంది. ప్రభుత్వం వైరస్ నియంత్రణకు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నా రోజుకు సగటున 20 వరకు మరణాలు నమోదవుతున్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్నికల నిర్వహణకు అనువైన వాతావరణం లేదని పేర్కొంటూ సీఎస్ నీలం సాహ్ని బుధవారం సాయంత్రం ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను ఆయన కార్యాలయంలో కలసి నివేదిక ఇచ్చారు. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో కరోనా బారిన పడ్డారని, విధి నిర్వహణలో ఉన్న 11 వేల మందికి పైగా పోలీస్‌లకు కోవిడ్ సోకిందని సీఎస్ నివేదికలో పొందుపరిచినట్లు సమాచారం. కోవిడ్ తీవ్రతను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, ఎన్నికల నిర్వహణకు అనుకూల పరిస్థితులు ఏర్పడగానే ఎన్నికల కమిషన్‌కు తెలియచేస్తామని పేర్కొన్నట్లు తెలిసింది. వైరస్ తీవ్రత అధికంగా ఉన్నందున ఈ సమయంలో ఎన్నికల నిర్వహణ సరికాదని తాజాగా నిమ్మగడ్డ నిర్వహించిన సమావేశంలో దాదాపు అన్ని పార్టీలు కూడా ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. అసలు ఎన్నికలు ఎలా నిర్వహిస్తారో ముందు ఎస్ఈసీ తేల్చి చెప్పాకే తమ అభిప్రాయాన్ని తెలియచేస్తామని పార్టీలు పేర్కొన్నాయి. టీడీపీ మినహా ఎవరూ ఈ సమయంలో ఎన్నికలకు మొగ్గు చూపలేదు. ఉనికిలో లేని పార్టీలతో... గుర్తింపు పొందిన పార్టీలంటూ రాష్ట్రంలో ఏమాత్రం ఉనికిలో లేని రాజకీయ పక్షాలను పిలిచి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ సమావేశాలను నిర్వహించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. భేటీకి ఆహ్వానించిన 19 పార్టీల్లో 10 పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికల పోటీలో కూడా లేకపోవడం గమనార్హం. ఒక్కో పార్టీ ప్రతినిధితో విడివిడిగా ఏకాంతంగా సమావేశాన్ని నిర్వహించిన ఎస్ఈసీ వేల సంఖ్యలో ప్రజలు గుమిగూడేందుకు అవకాశం ఉన్న స్థానిక ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావడం విస్మయం కలిగిస్తోంది. మరోవైపు నవంబర్‌లో కరోనా రెండో దశ వ్యాప్తి మొదలు కానుందనే భయాందోళనలున్నాయి. ఈ సమయంలో తక్షణమే ఎన్నికలంటూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడేలా నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతా ఏకపక్షమే.. సంప్రదాయం ప్రకారం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వంతో చర్చించి సంప్రదింపుల అనంతరం ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోవాల్సిన ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ మొక్కుబడి తంతుగా పార్టీలతో ఈ సమావేశాన్ని నిర్వహించింది. ప్రభుత్వం అభిప్రాయాన్ని తీసుకున్నాక అవసరమైన పక్షంలో అఖిలపక్ష భేటీ నిర్వహించాల్సి ఉండగా నిమ్మగడ్డ అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. అంతకుముందు స్థానిక ఎన్నికలను అర్థాంతరంగా వాయిదా వేసే సమయంలో కూడా నిమ్మగడ్డ ప్రభుత్వాన్ని సంప్రదించకపోవడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈసారి కూడా ఆయన అదే ధోరణిలో వ్యవహరించారు. చదవండి: అది చంద్రబాబు.. నిమ్మగడ్డ జాయింట్ కమిషన్ -
‘ఏపీలో కరోనా డెత్ రేట్ బాగా తగ్గింది’
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులను తగ్గించటంలో విజయం సాధించామని, కరోనాతో మృత్యువాత పడేవారి సంఖ్య బాగా తగ్గిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని వెల్లడించారు. బుధవారం కరోనా కట్టడి అవగాహన కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ నెల 31 వరకు కరోనా అవగాహన కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో సీఎస్ నీలం సాహ్ని విజయవాడలో భారీ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అన్‌లాక్ తర్వాత వ్యవస్థలన్నీ పునరుద్ధరించామన్నారు. ప్రజలు జాగ్రత్తలు పాటించి కరోనా పెరగకుండా సహకరించాలని కోరారు. ( ‘వైఎస్సార్ బీమా పథకం’ ప్రారంభం ) కాగా, కోవిడ్ నేపథ్యంలో వచ్చే పది రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాల అధికార యంత్రాంగాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. కోవిడ్ వస్తే ఏం చేయాలన్న దానిపై ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించాలని..104 నంబర్‌కు ఫోన్ చేయడం, తప్పనిసరిగా మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు తరుచూ శుభ్రంగా కడుక్కోవడం వంటి వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని ఆయన సూచించారు. -
ఏపీలో భారీగా డిప్యూటీ కలెక్టర్ల బదిలీ
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో 26 మంది డిప్యూటీ కలెక్టర్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో పేర్కొన్న బదిలీలు, నియామకాలకు సంబంధించిన ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు.(చదవండి: వచ్చేనెల 20 నుంచి డిసెంబర్ 1 వరకు పుష్కరాలు) బదిలీలు- డిప్యూటీ కలెక్టర్ల పేర్లు 1. వి. సుబ్బారావు 2. డి. కోదండరామిరెడ్డి 3. వీకే సీనా నాయక్ 4. ఎన్వీవీ సత్యనారాయణ 5. టి. భాస్కర్ నాయుడు 6. ఎ. లక్ష్మీ కుమారి 7. ఏబీవీఎస్బీ శ్రీనివాస్ 8. ఎం.డి. ఝాన్సీరాణి 9. సి. చంద్రశేఖర్ రెడ్డి 10.ఎం. వెంకట సుధాకర్ 11. పి. భవానీ 12. జె. శివ శ్రీనివాసు 13. ఎస్. సరళా వందనం 14. కె. రాములు నాయక్ 15. కె. అడ్డయ్య 16. కిరణ్ కుమార్ 17. ఎం. శ్రీనివాసులు 18.ఎ. చంద్ర మోహన్ 19. బి. శ్రీనివాసరావు 20. ఆర్. ప్రభాకర్‌రావు 21. డి. పెద్దిరాజు 22. డి. వెంకటేశ్వరరావు 23. జి. శ్రీనివాసులు 24. హెచ్. సుబ్బరాజు 25. వైవీ సత్య భాస్కర్ 26. శ్రీకాంత్ ప్రభాకర్ -
చిన్నారులందరికీ సురక్షిత నీరు అందేలా చూడాలి
సాక్షి, అమరావతి: ప్రతి చిన్నారికి సురక్షితమైన మంచినీరు అందేలా చూడాలని రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఉన్నతాధికారులను ఆదేశించారు. జల్ జీవన్ మిషన్ వంద రోజుల కార్యక్రమంలో భాగంగా గవర్నర్ సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, వివిధ విభాగాల కార్యదర్శులతో ఆన్లైన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. జల్ జీవన్ మిషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కాలపరిమితితో కూడిన ప్రచారాన్ని రూపొందించాలని సూచించారు. గ్రామ పంచాయతీలు, జల, పారిశుద్ధ్య కమిటీలు, స్వచ్ఛంద సంస్థలు, స్వయం సహాయక బృందాల సహకారంతో అన్ని పాఠశాలలు, అంగన్వాడీలలో ‘100 రోజుల కార్యక్రమం’ అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. పథకం అమలు కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి సీఎస్ నీలం సాహ్ని గవర్నర్‌కు వివరించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అనురాధ తదితరులు తమ శాఖల పరిధిలో 100 రోజుల కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసే కార్యాచరణ ప్రణాళికలను తెలియజేశా రు. అంతకుముందు గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా జల్ జీవన్ మిషన్ వంద రోజుల కార్యక్రమం లక్ష్యాలను వివరించారు. -
టీటీడీ ఈవోగా కేఎస్ జవహర్ రెడ్డి
సాక్షి, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా కేఎస్ జవహర్ రెడ్డిని నియమిస్తూ బుధవారం రాత్రి ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జీవో జారీ చేశారు. జవహర్‌రెడ్డి ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కొద్ది రోజుల కిందటే టీటీడీ ఈవోగా పనిచేస్తున్న అనిల్‌కుమార్ సింఘాల్‌ను వైద్య ఆరోగ్య శాఖకు బదిలీ చేసిన సంగతి తెలిసిందే. (బాలాజీ రిజర్వాయర్ నిర్మాణానికి సహకారం) 9న శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల భక్తుల సౌకర్యార్థం ఈ నెల 15 నుంచి 24 వరకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 9న ఉదయం 11 గంట లకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్లైన్లో ముందస్తుగా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. -
ఆర్థిక నేరాలకు పాల్పడే సంస్థలపై కఠిన చర్యలు
సాక్షి, అమరావతి: ఆర్థిక నేరాలకు పాల్పడే సంస్థలపై నమోదైన కేసుల దర్యాప్తు సత్వరమే పూర్తి చేసి బాధితులకు న్యాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదేశించారు. 19వ స్టేట్ లెవల్ కో– ఆర్డినేషన్ కమిటీ వర్చువల్ సమావేశం సీఎస్ అధ్యక్షతన సచివాలయంలోని మొదటి బ్లాక్ లో వారి కార్యాలయంలో గురువారం జరిగింది. తొలుత ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ మాట్లాడుతూ, 19వ స్టేట్ లెవల్ కో– ఆర్డినేషన్ కమిటీ ఉద్దేశాన్ని వివరించారు. అనంతరం సీఎస్ నీలం సాహ్ని మాట్లాడుతూ, ఈ ఏడాది జనవరి 29న జరిగిన 18వ స్టేట్ లెవల్ కో– ఆర్డినేషన్ కమిటీలో తీసుకున్న నిర్ణయాల ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. ఆర్థిక నేరాలకు పాల్పడిన పలు సంస్థలపై నమోదైన కేసుల వివరాలు ఏయే దశల్లో ఉన్నాయో ఆరా తీశారు. ప్రజల కష్టాన్ని దోచుకునే సంస్థలపై కఠినంగా వ్యవహరించాలని, బాధితులకు తక్షణమే పరిష్కారం చూపాలని ఆదేశించారు. ►మోసాలకు పాల్పడక ముందే, చిట్ ఫండ్, ఫైనాన్స్ సంస్థలు ఆర్బీఐ నిబంధనలకు లోబడి ఉన్నాయా? సంస్థల కార్యకలాపాల నిర్వహణకు అనుమతులు ఉన్నాయా....లేదా? అనే విషయాలు గుర్తించాలన్నారు. ►అగ్రిగోల్డ్, అక్షయ్ గోల్డ్, అభయ్ గోల్డ్, హీరా గ్రూప్, సహారా సహా పలు సంస్థలపై వివిధ కోర్టుల్లో ఉన్న కేసుల వివరాలను సీఎస్ కు సీఐడీ, పోలీస్ అధికారులు వివరించారు. ►ఎక్కువ కేసులు విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు వంటి నగరాల్లో నమోదవుతున్నట్లు సీఎస్ దృష్టికి అధికారులు తీసుకొచ్చారు. ►ఎక్కువ వడ్డీల పేరుతో ప్రజల కష్టాన్ని దోచుకుంటున్న ఆర్థిక సంస్థలపై నమోదైన కేసుల దర్యాప్తు సత్వరమే పూర్తి చేసి, బాధితులకు న్యాయమందించాలని సీఎస్ ఆదేశించారు. ►సమావేశంలో ఆర్థిక శాఖ కార్యదర్శి సునీత, ఆర్బీఐ ఏపీ, తెలంగాణ రీజనల్ డైరెక్టర్ సుబ్రతా దాస్, సీఐడీ, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
ఏపీలో కొత్త జిల్లాల ప్రక్రియ ప్రారంభం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రణాళికాబద్ధంగా కొత్త జిల్లాల ఏర్పాటు దిశగా అధికారిక ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 25 – 26కు పెంచాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. జిల్లాల పునర్విభజన ప్రక్రియను శాస్త్రీయంగా నిర్వహించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన రాష్ట్ర స్థాయి కమిటీ (ఎస్ఎల్సీ), వివిధ అంశాలపై అధ్యయనం కోసం నాలుగు సబ్ కమిటీలు ఏర్పాటు కానున్నాయి. వీటికి సహకరించేందుకు కలెక్టర్ అధ్యక్షతన జిల్లా కమిటీలను నియమించాలని ఉత్తర్వులు జారీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని శనివారం జీవో జారీ చేశారు. ఎస్ఎల్సీ బాధ్యతలివీ.. ► ఎస్ఎల్సీ కోసం ఆంధ్రప్రదేశ్ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ సిస్టమ్స్ అండ్ సర్వీసెస్ (ఏపీసీఎఫ్ఎస్ఎస్)లో సచివాలయం ఏర్పాటు కానుంది. ► సబ్ కమిటీల నుంచి ఎస్ఎల్సీ సమాచారం õసేకరించి జిల్లా పునర్వ్యవస్థీకరణ పోర్టల్‌లో అప్లోడ్ చేయాలి. జీఐఎస్ మ్యాపులు లాంటివి సమకూర్చాలి. జిల్లా పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ జరిగిన ప్రాంతాల్లో అనుసరించిన విధానాలను అధ్యయనం చేసి డేటా తెప్పించుకోవాలి. ► నిపుణులు, ఏజెన్సీలు, కన్సల్టెంట్ల సేవలను వినియోగించుకోవచ్చు. ఎస్ఎల్సీ సచివాలయం ప్రాథమికంగా ఆరు నెలలు కొనసాగుతుంది. తర్వాత అవసరాన్ని బట్టి నిర్ణయిస్తారు. నాలుగు సబ్ కమిటీల విధులివీ.. ► జిల్లాల సరిహద్దులు, న్యాయ పరమైన అంశాల అధ్యయన బాధ్యతలను మొదటి ఉప సంఘం పర్యవేక్షిస్తుంది. ► ప్రస్తుత పరిస్థితి/ సిబ్బంది పునర్విభజన అధ్యయన బాధ్యతలను రెండో సబ్ కమిటీ నిర్వర్తిస్తుంది. ► ఆస్తులు, మౌలిక సదుపాయాల అధ్యయన బాధ్యతలను మూడో సబ్ కమిటీ నిర్వహిస్తుంది. ► ఐటీ/ సాంకేతిక అంశాల అధ్యయన బాధ్యతలను నాలుగో సబ్ కమిటీ చేపడుతుంది. జిల్లా కమిటీల్లో ఉండేది వీరే.. ► కలెక్టరు అధ్యక్షతన పనిచేసే డీఎల్‌సీకి జాయింట్ కలెక్టర్ (జేసీ, రైతు భరోసా, రెవెన్యూ) సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు. ఎస్పీ, జిల్లా విద్యా శాఖాధికారి, వైద్య ఆరోగ్య శాఖాధికారి, జిల్లా పరిషత్ సీఈవో, ముఖ్య ప్రణాళికాధికారి, ట్రెజరీ ఆఫీసర్, కలెక్టరు ప్రతిపాదించిన అధికారి ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ► అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు/ ముఖ్య కార్యదర్శులు/కార్యదర్శులు/ విభాగాధిపతులు ఎస్ఎల్సీ సమావేశాలకు హాజరై సమాచారాన్ని సకాలంలో అందించాలని సీఎస్‌ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
జిల్లాల పునర్వ్యవస్థీకరణకు అధ్యయన కమిటీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా చేసేందుకు తన అధ్యక్షతన ఐదుగురు అధికారులతో అధ్యయన కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) నీలం సాహ్ని శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీలో భూపరిపాలన శాఖ ప్రధాన కమిషనర్, సాధారణ పరిపాలన (సర్వీసెస్) శాఖ కార్యదర్శి, ప్రణాళిక శాఖ కార్యదర్శి, సీఎం కార్యాలయ అధికారి సభ్యులుగా, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కన్వీనర్‌గా ఉంటారు. ఈ కమిటీ నివేదికను మూడు నెలల్లోగా ప్రభుత్వానికి సమర్పించాలి. కమిటీకి అవసరమైన సమాచారాన్ని అన్ని శాఖలు, ప్రభుత్వ విభాగాలు ఇవ్వాల్సిందిగా ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. అధ్యయన కమిటీకి ప్రభుత్వం నిర్దేశించిన పంచ సూత్రాలు.. ► ప్రస్తుతం ఉన్న మౌలిక వసతులు, మానవ వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడం. ► పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా ఇప్పటికే రాష్ట్ర, జిల్లా, రెవెన్యూ డివిజన్ స్థాయిల్లో నిర్దిష్ట బాధ్యతలున్నాయి. పునర్వ్యవస్థీకరణలో వీటిని పరిగణనలోకి తీసుకోవాలి. ► ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలుండాలి. ► వీలైనంత తక్కువ వ్యయంతో జిల్లాలను పునర్వ్యవస్థీకరించాలి. ►ఈ మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకుని భౌగోళిక సరిహద్దులు, పరిపాలన కేంద్రాలను సూచిస్తూ 25 జిల్లాల ఏర్పాటుకు కమిటీ సిఫార్సులు చేయాలి. దీనికోసమే కొత్త జిల్లాల ఏర్పాటు.. ► ప్రభుత్వ సేవలను, పాలనను ప్రజల గడప ముందుకే తీసుకువెళ్లడం ద్వారా వారిలో సంతృప్త స్థాయిని పెంచాలనేది ప్రభుత్వ లక్ష్యం. ► ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తోంది. ► ఇప్పుడు గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోని ప్రజలకు జిల్లా అధికార యంత్రాంగాన్ని మరింత చేరువ చేయడమే లక్ష్యంగా జిల్లాల ఏర్పాటుకు నిర్ణయించింది. -
ఏపీలో కొత్త జిల్లాలు: అధ్యయన కమిటీ ఏర్పాటు
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుకు మరో అడుగుపడింది. నూతన జిల్లాల ఏర్పాటుపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటైంది. ఈమేరకు అధ్యయన కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇటీవల కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ కమిటీని ఏర్పాటు చేస్తూ సీఎస్ ఉత్తర్వులు ఇచ్చారు. సీఎస్ నీలం సాహ్ని ఈ కమిటీకి అధ్యక్షత వహిస్తారు. 25 జిల్లాల ఏర్పాటుపై కమిటీ అధ్యయనం చేస్తుంది. ఆరుశాఖల అధికారులు సీసీఎల్ఏ కమిషనర్, జీఏడీ సర్వీసెస్ కార్యదర్శి.. ప్రణాళికా శాఖ కార్యదర్శి, సీఎంవో అధికారి, కమిటీ కన్వీనర్‌గా ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. మూడు నెలల్లోపు నివేదిక ఇవ్వాలని కమిటీకి గడువు విధించారు. (దురుసు ప్రవర్తన, జేసీ ప్రభాకర్‌రెడ్డి అరెస్ట్) -
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు పటిష్ట ఏర్పాట్లు
సాక్షి, అమరావతి : ఈనెల(ఆగష్టు) 15న రాష్ట్ర స్థాయిలో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్న భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను కరోనా నిబంధనలను పాటిస్తూ ఘనంగా నిర్వహించేందుకు వీలుగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని వివిధ శాఖల అధికారులను ఆదేశించారు.రానున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై గురువారం విజయవాడలోని సీఎస్ క్యాంపు కార్యాలయం నుంచి ఆమె సంబంధిత శాఖల అధికారులతో జూమ్ యాప్ ద్వారా వీడియో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ కోవిడ్ నిబంధనలను పాటిస్తూ రానున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. (చదవండి : కొత్త వర్సిటీల ఏర్పాటుకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్) ముఖ్యంగా కరోనా నేపథ్యంలో దాని నివారణకు వైద్య ఆరోగ్య రంగంలో ప్రభుత్వం తీసుకున్నవిప్లవాత్మక చర్యలను ఈవేడుకల ద్వారా ప్రజలందరికీ తెలిసే విధంగా ప్రత్యేక దృష్టిపెట్టి ఈవేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సీఎస్ నీలం సాహ్ని ఆయా శాఖల అధికారులకు స్పష్టం చేశారు. (చదవండి : స్థానిక సంస్థల పాలనపై కీలక నిర్ణయం) ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు కార్యక్రమాలపై ప్రజల్లో మరింత అవగాహనను పెంపొందించేందుకు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సంబంధిత శాఖల ద్వారా చేపట్టిన పధకాలపై ప్రత్యేక శకటాలు ఏర్పాటు చేయాలని సీఎస్ నీలం సాహ్ని అధికారులను ఆదేశించారు. దీనిపై సాధారణ పరిపాలన,వైద్య ఆరోగ్యం,సమాచారశాఖ, కృష్ణా జిల్లా కలక్టర్, పోలీస్ కమీషనర్లు కూర్చిని చర్చించుకుని ఒక ప్రణాళికతో వస్తే వాటిని పరిశీలించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమోదంతో ఈవేడుకలను ఘనంగా నిరవహించేందుకు చర్యలు తీసుకుందామని సీఎస్ నీలం సాహ్నిచెప్పారు. ఈ జూమ్ వీడియో సమావేశంలో వైద్య, ఆరోగ్యశాఖ కమీషనర్ కె భాస్కర్, విజయవాడ పోలీస్ కమీషనర్ బి.శ్రీనివాస్,సీపీడీసీఎల్ సీఎండీ ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
సీఎం జగన్ అధ్యక్షతన బ్యాంకర్ల కమిటీ భేటీ
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ 211వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) సమావేశం బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, సీఎస్ నీలం సాహ్ని, ఎస్ఎల్బీసీ కన్వీనర్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫీల్డ్ జనరల్ మేనేజర్ వి.బ్రహ్మానందరెడ్డి, నాబార్డ్ సీజీఎం సుధీర్‌కుమార్.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా యూనియన్ బ్యాంక్ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దినేశ్‌కుమార్ గార్డ్, ఆర్బీఐ రీజినల్ డైరెక్టర్ సుబ్రతాదాస్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. '2020–21 సంవత్సరంలో రుణాల లక్ష్యం 2,51,600 కోట్లు. ఇది గత ఏడాదితో పోలిస్తే 9.78 శాతం అధికం. వ్యవసాయరంగానికి రూ.1,28,660 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇది గత ఏడాదితో పోలిస్తే 11.9శాతం అధికం. 2019–20 రుణప్రణాళికలో 99.42 శాతం లక్ష్యాన్ని చేరుకుంది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈలు)కు రూ.39,600 కోట్ల రుణాలు ఇవ్వాలని భావిస్తున్నాం. గత ఏడాదితో పోలిస్తే 10 శాతం అధికం. విద్యా రుణాల కింద రూ.1,900 కోట్లు, ఇళ్ల రుణాల కింద రూ.9,710 కోట్లు, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద రూ.410 కోట్లు ఇవ్వాలని లక్ష్యం. పునరుత్పాదక ఇంధన (రెన్యువబుల్ ఎనర్జీ) రంగానికికి రూ.454 కోట్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. వ్యవసాయ రంగంలో యాంత్రికీకరణకు రూ.3,400 కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మొత్తం మీద ప్రాధాన్యతా రంగానికి రూ.1,87,550 కోట్లు ఇవ్వాలని భావిస్తుండగా.. ఇది గత ఏడాదితో పోలిస్తే 10.88 శాతం అధికం. ప్రాధాన్యేతర రంగానికి రూ.64,050 కోట్లు రుణాలుగా ఇవ్వాలని లక్ష్యం. గత ఏడాదితో పోలిస్తే ఇది 6.75 శాతం అధికం' అని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. సమావేశంలోని మఖ్యంశాలు.. ►రైతులకు సున్నా వడ్డీ సకాలంలోనే ఇవ్వాలన్న కృత నిశ్చయంతో ప్రభుత్వం ఉంది. ఖరీఫ్ రుణాలకు సంబంధించి సున్నా వడ్డీ డబ్బును రబీ నాటికి చెల్లిస్తామని, రబీ రుణాలకు సంబంధించి సున్నా వడ్డీ డబ్బును ఖరీఫ్ నాటికి చెల్లిస్తామని, దీనికి సంబంధిచిన వివరాలు సకాలంలో ప్రభుత్వానికి సమర్పించాలని ప్రభుత్వ అధికారులు బ్యాంకర్లను కోరారు. ►అలాగే గ్రామాల్లో గోదాములు, గ్రేడింగ్, సార్టింగ్ తదితర ఫుడ్ ప్రాసెసింగ్ కోసం ఒక ప్రత్యేక ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని, దీని కోసం తగిన సహాయం అందించాలని కోరారు. ►ప్రతి ఆర్బీకేలో ఈ సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నామని సీఎం వెల్లడించారు. ప్రతి మండలానికీ కోల్డ్ స్టోరేజీ, కోల్డ్ రూమ్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ►ఆర్బీకేల ద్వారా రైతు ఉత్పత్తుల సమాచారాన్ని సెంట్రల్ సర్వర్‌కు అనుసంధానం చేసి వారి మార్కెటింగ్‌కు సహకారం అందిస్తామని సీఎం చెప్పారు. ► రాష్ట్రంలో చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టులకూ తగిన సహకారం అందించాలని ఆర్థికశాఖ అధికారులు బ్యాంకర్లను కోరారు. గోదావరిలో వరద జలాలను వినియోగించుకోవడానికి బృహత్ ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని, దీనికి తగిన విధంగా తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశారు. ► కౌలు రైతుల రుణాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని బ్యాంకర్లను కోరారు. -
పరిశ్రమలతో పాటు భద్రత ముఖ్యం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఎఫ్ఆర్బీఎం పరిమితిని పెంచాలంటూ రాష్ట్రాలు కోరిన నేపథ్యంలో, దీనికోసం కేంద్రం నిర్దేశించిన మార్గదర్శకాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. నిర్మాణాత్మక సంస్కరణల్లో భాగంగా, ఒన్ నేషన్–ఒన్ రేషన్ కార్డు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, మున్సిపాల్టీలు– కార్పొరేషన్ల స్వయం సమృద్ధి, విద్యుత్‌రంగం.. ఈ నాలుగు అంశాల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు చెప్పిన సంస్కరణలను అధికారులు సీఎంకు వివరించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో సీఎస్ నీలం సాహ్ని సహా ఆర్థిక, విద్యుత్, పౌరసరఫరాలు, కార్మిక, పరిశ్రమల శాఖకు చెందిన సీనియర్ అధికారులు పాల్గొన్నారు. 1. దేశంలో ఎక్కడైనా సరే రేషన్ పొందేలా కేంద్రం ఒన్ నేషన్-ఒన్ రేషన్ కార్డు విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించిన నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తిచేయాల్సిన కార్యక్రమాలను సమావేశంలో చర్చించారు. రాష్ట్రంలో ఇప్పటికే పోర్టబిలిటీ సదుపాయం ఉందని, రేషన్ పంపిణీలో పారదర్శకతకోసం బయోమెట్రిక్ విధానాన్ని అనుసరిస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. ఈ విధానంలో రాష్ట్రం ముందు ఉందన్నారు. బియ్యం కార్డులు, వాటి లబ్ధిదారులతో ఆధార్ సీడింగ్ ప్రక్రియ దాదాపుగా పూర్తికావొచ్చిందన్నారు. నవశకం ద్వారా తీసుకున్న దరఖాస్తులు, వాటిలో అర్హులుగా గుర్తించిన వారితో కలుపుకొని దాదాపు 1.39 కోట్ల మందికి బియ్యం కార్డులు ఉన్నాయని స్పష్టంచేశారు. (కోవిడ్ సంక్షోభమున్నా అవకాశాలను సృష్టిస్తాం) 2. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం కేంద్రం చెప్పిన సంస్కరణల విషయంలో ఇప్పటికే ప్రభుత్వం ముందంజలో ఉందని అధికారులు వివరించారు. రెడ్‌టేపిజానికి దూరంగా సింగిల్ విండో విధానాలు అనుసరిస్తూ, అనుమతుల విషయంలో అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తున్నామన్నారు. అలాగే రెన్యువల్స్ విషయంలో కూడా పారిశ్రామిక వర్గాలకు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం అండగా నిలుస్తోందని చెప్పుకొచ్చారు. 3. పరిశ్రమలు ఎంత ముఖ్యమో, వాటి భద్రతకూడా ముఖ్యమని, వాటి నుంచి వచ్చే కాలుష్యం వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడటం కూడా అంతే ముఖ్యమని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. పరిశ్రమల్లో కాలుష్యం, భద్రతకు సంబంధించిన అంశాలపై ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని ఆదేశించారు. విశాఖపట్నంలో గ్యాస్ దుర్ఘటనను దృష్టిలో ఉంచుకుని సరైన యంత్రాంగాన్ని రూపొందించుకోవాలన్నారు. పరిశ్రమల్లో కాలుష్యంపైనగాని, భద్రతపైన గాని ఫిర్యాదు లేదా సమాచారం రాగానే స్పందించేలా ఈ యంత్రాంగం ఉండాలని స్పష్టంచేశారు. కాలుష్య తనిఖీలతోపాటు కాలుష్య నియంత్రణ మండలిని బలోపేతం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. (మార్కెటింగ్ కేంద్రాలుగా ఆర్బీకేలు..) 4. అలాగే కార్మిక సంస్కరణలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలకు నిర్దేశించిన సంస్కరణలపైనా సమావేశంలో చర్చ జరిగింది. కోవిడ్ లాంటి విపత్తు నుంచి తిరిగి పారిశ్రామిక రంగాన్ని పట్టాలపైకి తీసుకొచ్చి వేగంగా నడిపించడానికి, మరిన్ని ఉద్యోగాల కల్పనకోసం ఈ సంస్కరణలు తీసుకురావాలంటూ కేంద్రం చెప్తోందని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఈ ప్రయత్నంలో కార్మికుల ప్రయోజనాలకు భంగం కలగకూడదని సీఎం స్పష్టంచేశారు. వారి పనికి తగ్గ వేతనం లభించేలా చూడాలన్నారు. 5. మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల స్వయం సమృద్ధికోసం సంస్కరణలు తీసుకురావాలంటూ కేంద్ర ప్రభుత్వం చెప్పిన మీదట సమావేశంలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. పట్టణ ప్రాంతాల్లో మెరుగైన సేవలు ఉండాలని స్పష్టంచేశారు. పరిశుభ్రమైన తాగునీరు, పారిశుద్ధ్యం.. తదితర అంశాల్లో నాణ్యమైన సేవలు అందాలన్నారు. ప్రజలకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందనప్పుడు– వీటికి ఫీజులు అడగడం సరికాదన్నారు. నాణ్యమైన సేవలు అందించడమన్నది పరిపాలనలో ఒక ప్రమాణంగా ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. సేవలు నాణ్యంగా ఉన్నాయా? లేదా? అనే విషయాన్ని నిర్ధారించడానికి ఒక యంత్రాంగం ఉండాలన్నారు. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. (కరోనా పరీక్షలపై ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు) 6. విద్యుత్‌రంగం సంస్కరణల్లో భాగంగా విద్యుత్ సరఫరా, సాంకేతిక నష్టాలను తగ్గించాలని, అలాగే ఏసీఎస్ – ఏఆర్ఆర్ మధ్య ఉన్న తేడాను తగ్గించాలన్న కేంద్రం సూచనలపైనా సమావేశంలో చర్చ జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చాక విద్యుత్‌రంగంలో తీసుకున్న చర్యలపై సమావేశంలో ప్రస్తావించారు. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే.. కరెంటు సరఫరా నష్టాలు రాష్ట్రంలో చాలా తక్కువని అధికారులు వివరించారు. డిస్కంలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను చెల్లించుకుంటూ వాటిని కష్టాలనుంచి బయటకు పడేసే ప్రయత్నాలు చేస్తున్న విషయాన్ని సీఎం ప్రస్తావించారు. అంతేకాక ఉచిత విద్యుత్ రూపంలో ప్రభుత్వంపైన భారాన్ని తగ్గించుకునేందుకు, పగటిపూటే 9 గంటల కరెంటు ఇచ్చేందుకు దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా 10వేల మెగావాట్ల సోలార్ కరెంటు ప్రాజెక్టును తీసుకొస్తున్నామన్నారు. దీనివల్ల తక్కువ ధరకే ప్రభుత్వానికి విద్యుత్ వస్తుందని, దీన్ని రైతులకు అందిస్తుందని పేర్కొన్నారు. అంతేకాక పగటిపూట 9 గంటల కరెంటు ఇవ్వడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఫీడర్లను అప్‌గ్రేడ్ చేస్తున్నామని ఇప్పటికే దీనికి సంబంధించి 82శాతానికి పైగా పనులు పూర్తయ్యాయయని, మిగిలిన పనులు కూడా పూర్తయితే రబీ నుంచి నూటికి నూరు శాతం సంపూర్ణంగా రైతులకు నాణ్యమైన విద్యుత్ లభిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. విద్యుత్‌సంస్కరణల విషయంలో మనం చాలా అడుగులు ముందుకేస్తున్నామని అధికారులు తెలిపారు. కేంద్రం పంపిన సంస్కరణల మార్గదర్శకాలను పూర్తిగా పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. -
ఆ రెండు శాఖలూ సీఎం వద్దే
సాక్షి, అమరావతి: రాజ్యసభకు ఎన్నికైన నేపథ్యంలో రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి పదవికి పిల్లి సుభాష్ చంద్రబోస్, అలాగే పశు సంవర్థక, మత్స్య శాఖ మంత్రి పదవికి మోపిదేవి వెంకట రమణారావు రాజీనామాలు చేయడంతో ఆ రెండు శాఖలు సీఎం పరిధిలోకి వెళ్లినట్లు సీఎస్ నీలం సాహ్ని మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే మంత్రులిద్దరి రాజీనామాలకు గవర్నర్ ఆమోదముద్ర వేయడంతో వాటిని నోటిఫై చేస్తూ మరో ఉత్తర్వులు ఇచ్చారు. -
రూ.10,974 కోట్లతో గ్రామాల్లో జలజీవన్
సాక్షి, అమరావతి: జల జీవన్ మిషన్ కింద రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో మంచినీటి పైపులైన్లు వేసి.. ఇంటింటికీ కుళాయి కనెక్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. ఇందుకు వచ్చే నాలుగేళ్లలో రూ.10,974 కోట్లను వెచ్చించేందుకు గ్రామీణ మంచినీటి సరఫరా (ఆర్డబ్ల్యూఎస్) అధికారులు అంచనాలు సిద్ధం చేశారు. దేశమంతటా గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని ఇళ్లకు 2024 నాటికల్లా మంచినీటి కుళాయిలు అమర్చి.. ప్రతి రోజూ ఒక్కొక్క వ్యక్తికి 55 లీటర్ల చొప్పున నీటి సరఫరా చేయాలన్న లక్ష్యంతో జల జీవన్ మిషన్ అమలు చేయాలని నిర్ణయించింది. ఇందుకయ్యే ఖర్చును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమంగా భరించాల్సి ఉంటుంది. అపెక్స్ కమిటీ తొలి భేటీ ► రాష్ట్రంలో జల జీవన్ మిషన్ అమలుకు ఉద్దేశించిన అపెక్స్ కమిటీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆధ్యక్షతన సోమవారం తొలిసారి సమావేశమైంది. ► పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్, ఆర్థిక, ప్రణాళిక, విద్య, వైద్య శాఖ అధికారులు ఈ భేటీకి హాజరయ్యారు. ► ఆర్డబ్ల్యూఎస్ వద్ద ఉన్న వివరాల ప్రకారం రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతంలో 95,66,332 ఇళ్లు ఉండగా.. వీటిలో 31,93,400 ఇళ్లకు మాత్రమే ఇప్పటివరకు మంచినీటి కుళాయిలు ఉన్నాయి. ► మిగిలిన 63,72,932 ఇళ్లకు వచ్చే నాలుగేళ్లలో జల జీవన్ మిషన్ పథకం ద్వారా కుళాయి సౌకర్యం కల్పిస్తారు. ► కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకానికి కేటాయించిన నిధులు ఆర్డబ్ల్యూఎస్ శాఖ వద్ద ఇప్పటికే రూ.976 కోట్లు అందుబాటులో ఉన్నాయి. ► వీటికి తోడు 2020–21 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా మరో రూ.1,581 కోట్లు దీనికి కేటాయించాయి. ► 2021–24 సంవత్సరాల మధ్య మిగిలిన మూడేళ్ల కాలంలో ఈ పథకానికి రూ.8,417 కోట్ల కేటాయింపులు జరుగుతాయని అధికారులు అంచనా వేశారు. మొత్తం రూ.10,974 కోట్ల ఈ పథకానికి ఖర్చు చేయాల్సి ఉంది. -
కోవిడ్ టెస్టులు మరింత పెంచండి
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ ప్రభావం అధికంగా ఉన్న జిల్లాల్లో పరీక్షలు పెంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జిల్లా కలెక్టర్లకు స్పష్టం చేశారు. జ్వరం, దగ్గు వంటి లక్షణాలతో ఇబ్బందిపడే వారందరికీ కరోనా పరీక్షలు చేయడంతో పాటు కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో రోజుకు 3వేల వరకూ టెస్ట్‌లు చేయాలని ఆదేశించారు. కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై శుక్రవారం విజయవాడ సీఎస్ క్యాంపు కార్యాలయం నుంచి ఆమె జిల్లాల కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ చేసిన సూచనలు.. ► వైరస్ నియంత్రణకు మరిన్ని చర్యలు తీసుకోవాలి. ► గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉన్న ప్రాథమిక, సెకండరీ సర్వైలైన్స్ బృందాల ద్వారా కరోనా టెస్ట్‌లపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి. ► మరణాలు సంభవిస్తున్న ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి పెట్టాలి. ► వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా. కేఎస్ జవహర్‌రెడ్డి మాట్లాడుతూ ఎక్కువ సంఖ్యలో టెస్టులు నిర్వహించేలా చూడాలని చెప్పారు. ► కరోనా నియంత్రణకు చేపట్టిన చర్యలను వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కె.భాస్కర్ వివరించారు. -
ఏపీలో మరిన్ని సడలింపులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఈ నెల 8 నుంచి మరిన్ని లాక్డౌన్ ఆంక్షలను సడలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి ఈ ఉత్తర్వులిచ్చింది. దీని ప్రకారం ప్రార్థన మందిరాలు, హోటల్స్, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ తిరిగి తెరుచుకుంటాయి. ఈ నేపథ్యంలో నిబంధనలు పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలు ఇవే ► ప్రార్థన మందిరాల్లోకి వచ్చేందుకు, వెళ్లేందుకు వేర్వేరు మార్గాలు ఉండాలి. ► ప్రవేశ మార్గంలో శానిటైజర్, థర్మల్ స్క్రీనింగ్, మాస్క్ తప్పనిసరి. ► ప్రార్థన మందిరాల్లో భక్తులను దశల వారీగా పంపించాలి. క్యూలైన్లలో 6 అడుగుల భౌతిక దూరం పాటించాలి. ► భక్తి గీతాలను ఆలపించడానికి వీలులేదు. తీర్ధ ప్రసాదాలు ఇవ్వడం, పవిత్ర జలం చల్లడం చేయకూడదు. విగ్రహాలు, పవిత్ర గ్రంథాలను తాకకుండా చూడాలి. ► హోటల్స్ సిబ్బంది గ్లోవ్స్, మాస్కులు తప్పనిసరిగా ధరించాలి. సీట్లు కూడా దూరంగా ఉండే విధంగా ఏర్పాటు చేయాలి ► మాల్స్‌లోనూ భౌతిక దూరం జాగ్రత్తలు తీసుకోవాలి -
'కరోనా మరణాలు జరగకుండా ప్రత్యేక దృష్టి పెట్టండి'
సాక్షి, అమరావతి : కరోనా వైరస్ సోకిన వారికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించడం ద్వారా మరణాల సంఖ్యను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై శుక్రవారం విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, జేసీలు, పీహెచ్సీ వైద్య అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నీలం సాహ్ని మాట్లాడుతూ.. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 60 సంవత్సరాల నిండిన వారు, డయాబెటిస్, హైపర్ టెన్షన్ వంటి దీర్ఘకాలిక లక్షణాలు ఉన్న వారిని, జ్వరం,దగ్గుతో బాధపడుతున్న వారిని గుర్తించి వారికి టెస్టులు నిర్వహించాలని చెప్పారు. వారి పరిధిలోని ప్రైమరీ ఆరోగ్య బృందం పై పూర్తి నియంత్రణ కలిగి ఉండాలని స్పష్టం చేశారు. (తెలంగాణలో కొత్తగా 143 కరోనా కేసులు) 6వ విడత ఇంటింటి సర్వే కార్యక్రమం సక్రమంగా జరిగేలా చూడాలన్నారు. ప్రతి మెడికల్ అధికారి వారి ఆరోగ్య కేంద్రం పరిధిలో జరిగే శాంపిల్స్ సేకరణ, కొవిడ్ పరీక్షలు జరిగే ప్రాంతాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. అంతేగాక కరోనా లక్షణాలు కలిగిన వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి టెస్టులకు చేయించుకునేలా ప్రోత్సహించాలని చెప్పారు. అంతేగాక టెలిమెడిసిన్, ఆరోగ్య సేతు యాప్,104 కాల్ సెంటర్ ద్వారా కూడా ప్రోత్సహించడం వంటి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇతర ప్రాంతాల నుండి విమానాలు, రైళ్ళు,బస్సులు ద్వారా వచ్చిన వారి వివరాలు పిహెచ్సి డాక్టర్ వద్ద ఉంచుకుని ఆలాంటి వారి ఆరోగ్యం పట్ల నిరంతరం పర్యవేక్షణ ఉంచాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ బయిటకు వెళ్ళి నపుడు భౌతిక దూరాన్ని పాటించడంతో పాటు విధిగా మాస్క్ ధరించే విధంగా ప్రతి ఒక్కరిలో అవగాహన కలిగించేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.అలాగే కరోనా లక్షణాలున్న వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి టెస్టులకు చేయించుకునేలా అవగాహన కలిగించడంతో పాటు సమాజంలో కరోనా పట్ల స్టిగ్మా లేకుండా చూడాలని నీలం సాహ్ని పేర్కొన్నారు. ఆరోగ్య సేతు యాప్ ను స్మార్ట్ ఫోన్ వినియోగించే వారందరూ విధిగా వినియోగించేలా చూడాలని సిఎస్ స్పష్టం చేశారు. గత మూడు మాసాలకు పైగా కొవిడ్ నియంత్రణకు విశేష కృషి చేస్తున్నందుకు కలెక్టర్లు సహా సంబంధిత అధికారులను ఆమె ప్రత్యేకంగా కొనియాడారు. వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్ రెడ్డి మాట్లాడుతూ.. బయటి ప్రాంతాల నుండి వచ్చిన వారు విధిగా హోం క్వారంటైన్లో ఉండాలన్నారు. గ్రామ స్థాయి బృందాలు మరింత చురుగ్గా పనిచేసేలా చూడాలని, హైరిస్క్ వ్యక్తులపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. కొవిడ్ మరణాల సంఖ్యను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడైనా పాజిటివ్ లక్షణాలున్న,హైరిస్క్ కేసులు ఉంటే వెంటనే ఆసుపత్రుల్లో చేర్పించి మెరుగైన వైద్యం అందించాలని చెప్పారు.ఇకపై ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలన్నీ శాంపిల్స్ సేకరణ పాయింట్లుగా ఉండాలని ఆయన తెలిపారు. అదే విధంగా ప్రజలను స్వచ్ఛందంగా ముందుకు వచ్చి టెస్టులు చేయించుకునేలా ప్రోత్సహించాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం, ఆరోగ్య సేతు యాప్ ను వినియోగించేలా చూడాలని స్పష్టం చేశారు. ఈ వీడియో సమావేశంలో వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కె.భాస్కర్, సీఆర్డీఏ అదనపు కమీషనర్ విజయ కృష్ణన్ తదితరులు పాల్గొన్నారు. -
సీఎస్ నీలం సాహ్ని పదవీ కాలం పొడిగింపు
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సాహ్ని మరో మూడు నెలలు కొనసాగనున్నారు. సీఎస్ పదవీకాలం పొడిగించాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను కేంద్రం ఆమోదించింది. కరోనా నేపథ్యంలో సీఎస్ విధులు కీలకమైనందున పదవీ కాలం పొడిగించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కోరిన విషయం తెలిసిందే. ఈ ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకూ నీలం సాహ్ని పదవీ కాలాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటివరకూ సీఎస్ సర్వీస్‌లో కొనసాగనున్నారు. (పటిష్టంగా కేంద్ర ప్యాకేజీ అమలు) -
ఈ నెల 11న ఏపీ కేబినెట్ సమావేశం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన ఈ నెల 11వ తేదీ ఉదయం 11 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కేబినేట్ సమావేశంలో చర్చించే అంశాలపై నివేదికలు పంపాలని అన్ని శాఖల అధికారులను సీఎస్ ఆదేశించారు. చదవండి: రోల్‌మోడల్‌గా ఏపీ -
రేపటి నుంచి ఉద్యోగుల హాజరు తప్పనిసరి
సాక్షి, అమరావతి: సచివాలయంతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులంతా గురువారం నుంచి తప్పనిసరిగా విధులకు హాజరు కావాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. కంటైన్మెంట్ ప్రాంతాల్లో ఉన్న వారికి, గర్భవతులు, ఎక్కువ వయస్సుగల వారు, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారికి మాత్రం పరిస్థితుల ఆధారంగా ఇంటి నుంచి పనిచేసేందుకు అనుమతించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వుల్లోని ప్రధాన అంశాలు.... ► రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలన్నీ గురువారం నుంచి పూర్తి స్థాయిలో పనిచేస్తాయి. నూటికి నూరు శాతం ఉద్యోగులు విధులకు హాజరు కావాలి. ► కార్యాలయాల ప్రాంగణంలోకి ప్రవేశించే ద్వారం వద్ద థర్మల్ స్క్రీనింగ్ చేసి, చేతులను శానిటైజ్ చేసిన తరువాత పంపిస్తారు. ► అన్ని కార్యాలయాల్లో ప్రతి రోజు శానిటైజ్ చేయాలి. ► ప్రతీ ఉద్యోగి విధిగా మాస్క్ ధరించి విధులకు హాజరు కావాలి. ► కార్యాలయాల్లో ఆరు అడుగుల భౌతిక దూరం పాటించాలి. రెండు గంటలకోసారి సబ్బు, శానిటైజర్‌తో చేతులను శుభ్రం చేసుకోవాలి. ► కార్యాలయాల్లో పాన్, గుట్కా, పొగాకు వినియోగం నిషేధం. ఎవ్వరైనా ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటారు. ► ఫైల్స్, తపాల్స్ ఈ–ఆఫీస్ ద్వారానే ప్రాసెస్ చేయాలి. ఉత్తర ప్రత్యుత్తరాలను అధికారిక ఈ–మెయిల్స్ ద్వారానే చేయాలి. ► భౌతిక సమావేశాలు తగ్గించి టెలి, వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే సమావేశాలను నిర్వహించాలి. ► ఉద్యోగులు విధుల్లో ఉండగా జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే హోం క్వారంటైన్లో ఉండాలి. సంబంధిత అధికారులు సెలవును మంజూరు చేస్తారు. ► కార్యాలయాల్లోకి సందర్శకులను అనుమతించరు. స్పందన, తపాల్ సెక్షన్, రిసెప్షన్స్‌లో మాత్రమే సమస్యలపై విజ్ఞాపనలు చేయాలి. ► కరోనా నియంత్రణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు జారీ చేసే ఆదేశాలను ఉద్యోగులందరూ తప్పనిసరిగా పాటించాలి. ► ఈ ఆదేశాలకు అనుగుణంగా జిల్లా కలెక్టర్లు, అన్ని ప్రభుత్వ కార్యాలయాల అధిపతులు చర్యలు తీసుకుని అమలు చేయాలి. -
పటిష్టంగా కేంద్ర ప్యాకేజీ అమలు
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ పథకం కింద ప్రకటించిన ప్యాకేజీని పటిష్టంగా అమలుచేయడం ద్వారా సమాజంలోని పేదలు సహా ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని చెప్పారు. కోవిడ్–19 నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ అమలుపై రాష్ట్రస్థాయి కమిటీ ప్రాథమిక సమావేశం సోమవారం జరిగింది. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న నవరత్నాలు కార్యక్రమానికి ప్రాధాన్యత ఇస్తూనే కేంద్ర ప్రభుత్వ ప్యాకేజీ అమలుకూ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఆ దిశగా సంబంధిత శాఖలు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధంచేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేంద్రం ప్రకటించిన ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీతో ఏయే శాఖకు ఎంతమేరకు నిధులు సమకూరుతాయో అంచనా వేసి ఆ ప్రకారం వివిధ పథకాల ద్వారా ప్రజలందరికీ లబ్ధిచేకూర్చేందుకు చర్యలు చేపట్టాలని సీఎస్ నీలం సాహ్ని ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, ప్రత్యేక కార్యదర్శి కె. సత్యనారాయణ, ఎస్ఎల్బీసీ కన్వీనర్ నాంచారయ్య తదితరులు పాల్గొన్నారు. కరోనాపై విస్తృత అవగాహన కల్పించాలి కరోనాపై విస్తృత ప్రచారం కల్పించి ప్రజల్లో ఉన్న భయాందోళనలను పోగొట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలంసాహ్ని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం సీఎస్ విజయవాడ క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వైరస్ వ్యాప్తి చెందకుండా భౌతిక దూరం పాటించడం, మాస్క్ ధరించడం వంటి తప్పనిసరిగా పాటించాల్సిన 10 అంశాల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టి ప్రజలకు అవగాహన కలిగించాలని ఆదేశించారు.