
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నితో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది శనివారం భేటీ అయ్యారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు జిల్లాల్లో పక్కా ఏర్పాట్లు చేసినట్టు ఆమెకు వివరించారు. ఎన్నికల ఏర్పాట్లపై చర్చించేందుకు ఆ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ కూడా ఎస్‌ఈసీతో వేరుగా భేటీ అయ్యారు.
ఆ తరువాత ద్వివేది, గిరిజాశంకర్ తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో 13 జిల్లాల ఎన్నికల సూపర్‌వైజరీ అధికారులతో సమావేశమయ్యారు. సూపర్‌వైజరీ అధికారులు ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మేరకు జిల్లాల్లోని అధికారులను సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు తగిన చర్యలు చేపట్టాలని ద్వివేది ఆదేశించారు.