Gopalakrishna Dwivedi
-
వర్షం తక్కువున్న జిల్లాల్లో ప్రత్యామ్నాయ పంటలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో లోటు వర్షపాతం ఉన్న జిల్లాల్లో ప్రత్యామ్నాయ పంటలు వేసేందుకు కంటింజెన్సీ ప్రణాళికను సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డా. కేఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో వర్షాలు, వ్యవసాయం, పశువుల గ్రాసం తదితర అంశాలపై ఆయన శనివారం వ్యవసాయ, పశు సంవర్థక, మత్స్య, ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖల అధికారులతో సమీక్షించారు. ఆరు జిల్లాల్లోని 130 మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదైందని, ఈ జిల్లాల్లో ఆగస్టులో కూడా వర్షాలు తక్కువ ఉంటే ప్రత్యామ్నాయ పంటల విత్తనాలు సిద్ధం చేయాలని సీఎస్ ఆదేశించారు. అధిక వర్షాల కారణంగా వరి నారు దెబ్బతిన్న రైతులకు స్వల్పకాలంలో దిగుబడినిచ్చే విత్తనాలు సరఫరా చేయాలని చెప్పారు. రాష్ట్రంలో వర్షాలు, వ్యవసాయంపై వ్యవసాయ, పశు సంవర్థక, మత్స్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో ఖరీఫ్ లో మొత్తం 34.39 లక్షల హెక్టార్లు సాధారణ విస్తీర్ణం కాగా ఇప్పటివరకు 9.22 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు వేశారని తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో సాధారణంకంటే 20 నుండి 50 శాతం అధిక వర్షపాతం నమోదైనట్లు చెప్పారు. కృష్ణా జిల్లాలో 60 శాతం పైగా అధిక వర్షపాతం నమోదైందని చెప్పారు. అంబేడ్కర్ కోనసీమ,పశ్చిమ గోదావరి, నెల్లూరు, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో 20 నుండి 59 మిల్లీ మీటర్ల తక్కువ వర్షపాతం నమోదైందన్నారు. వర్షపాతం తక్కువున్న జిల్లాల్లో ప్రత్యామ్నాయ పంటల కోసం సుమారు 10 వేల క్వింటాళ్ల మినుము, పెసర, కంది, ఉలవ, జొన్న, పొద్దుతిరుగుడు, వేరుశనగ తదితర విత్తనాలను ఏపీ సీడ్స్ వద్ద సిద్ధంగా ఉంచామని చెప్పారు. అధిక వర్షాలతో వరి నారు మడులు దెబ్బతిన్న రైతులకు స్వల్ప కాలంలో పంట దిగుబడినిచ్చే ఎంటీయూ 1010, 1121,1153, బీపీటీ 5204, ఎన్‌ఎల్‌ఆర్ 34449 వరి విత్తనాలను సుమారు 30 వేల క్వింటాళ్లు సిద్ధం చేసినట్టు తెలిపారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ సీహెచ్ హరికిరణ్, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ డా. బి.ఆర్.అంబేద్కర్, పశు సంవర్థక శాఖ సంచాలకులు అమరేంద్ర కుమార్, ఏపీ సీడ్స్ ఎండీ శేఖర్ బాబు, మత్స్య శాఖ అదనపు సంచాలకులు డా. అంజలి, ఉద్యాన శాఖ అదనపు సంచాలకులు బాలాజీ నాయక్, వెంకటేశ్వర్లు తదితర అధికారులుపాల్గొన్నారు. -
మార్కెట్లోకి కొత్త విత్తనాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని రైతులకు కొత్త వంగడాలు అందుబాటులోకి వచ్చాయి. వరిలో 4, మినుములో 2, వేరుశనగ, పెసర, పొగాకులలో ఒక్కొక్కటి చొప్పున మొత్తం 9 వంగడాలను బుధవారం వ్యవసాయ శాఖ స్పెషల్ కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది మార్కెట్లోకి విడుదల చేశారు. వీటిని ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న నెల్లూరు, బాపట్ల, తిరుపతి, మారుటేరు, నంద్యాల, గుంటూరు లాం పరిశోధనా కేంద్రాల శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. వీటి ప్రత్యేకతలను ఆర్బీకేల్లో ప్రదర్శించడంతో పాటు వీటి వినియోగాన్ని పెంచేలా రైతులను ప్రోత్సహించేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ సి.హరికిరణ్, వీసీ విష్ణువర్థన్‌రెడ్డి, ఏపీ సీడ్స్ ఎండీ డాక్టర్ గెడ్డం శేఖర్‌బాబు, వర్సిటీ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ ఎల్.ప్రశాంతి, డైరెక్టర్ ఆఫ్ సీడ్స్ ఎ.సుబ్బరావిురెడ్డి తదితరులు పాల్గొన్నారు. వేరుశనగలో.. టీసీజీఎస్ 1522: ఈ వంగడం కదిరి–6కు ప్రత్యామ్నాయం. తిరుపతి 4 ఎక్స్, కదిరి 9 రకాల నుంచి అభివృద్ధి చేశారు. పంటకాలం ఖరీఫ్‌లో 100 నుంచి 103 రోజులు, రబీలో 103 నుంచి 106 రోజులు. దిగుబడి హెక్టార్‌కు ఖరీఫ్‌లో 3.328 టన్నులు, రబీలో 4.031 టన్నులు. ఆకుమచ్చ, తుప్పు తెగులును కొంత మేర తట్టుకుంటుంది. కాయ నుంచి పప్పు దిగుబడి 75–76 శాతం, నూనె 48.5 శాతం, 100 గింజల బరువు 45–47 గ్రాములు, గింజలు లేతగులాబీ రంగులో ఉంటాయి. కాయలన్నీ ఒకేసారి పక్వానికి వస్తాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఖరీఫ్, రబీ సీజన్లకు అనుకూలం. పొగాకులో.. ఏబీడీ 132(నంద్యాల పొగాకు–2): ఈ వంగడం నంద్యాల పొగాకు–1కు ప్రత్యామ్నాయం. లైన్ 3–58–38, ఎక్స్ లైన్ (190–27–5–7–32), ఎక్స్ (303–3–38–13–11–40) రకాల నుంచి అభివృద్ధి చేశారు. ఇది తక్కువ హాని కారకాలను కలిగి ఉంటుంది. కిలో ఆకు ధర రూ.85 నుంచి రూ.90 పలుకుతుంది. ఒరోబాంకీని మధ్యస్థంగా తట్టుకోవడమేకాదు.. ఆకు కోత వరకు పచ్చగా ఉండి.. అధిక వర్షపాత పరిస్థితులను తట్టుకుంటుంది. నంద్యాల, కర్నూలు జిల్లాల్లో బీడీ పొగాకు సాగు చేసే అన్ని ప్రాంతాల్లో ఖరీఫ్‌లో సాగుకు అనుకూలం. పెసరలో.. ఎల్జీజీ 630: ఈ వంగడం ఎల్జీజీ 460, ఐపీఎం 2–14, టీఎం 96–2 రకాలకు ప్రత్యామ్నాయం. ఎల్జీజీ 460 ఎక్స్ పీ 109 రకాల నుంచి అభివృద్ధి చేశారు. పంట కాలం 65 నుంచి 70 రోజులు. దిగుబడి హెక్టార్‌కు 1.60 నుంచి 1.80 టన్నులు. పల్లాకు తెగులను పూర్తిగా తట్టుకునే రకం. ఒకేసారి కోత కోయటానికి అనువైనది. గింజలు మధ్యస్థ లావుకలిగి మెరుస్తుంటాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఖరీఫ్, రబీ సీజన్లకు అనుకూలం. మినుములో.. టీబీజీ 129: ఈ వంగడం ఎల్బీజీ 752కు ప్రత్యామ్నాయం. దీనిని పీయూ 31 ఎక్స్ ఎల్బీజీ 752 నుంచి అభివృద్ధి చేశారు. పంటకాలం 85 నుంచి 90 రోజులు. దిగుబడి హెక్టార్‌కు 1.60 నుంచి 1.80 టన్నులు. పల్లాకు తెగులును తట్టుకుంటుంది. గింజలు లావుగా ఉండి మెరుస్తుంటాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఖరీఫ్, రబీ సీజన్లకు అనుకూలం. ఎల్బీజీ 904: ఈ వంగడం ఎల్బీజీ 752, 787, పీయూ 31, టీబీజీ 104, జీబీజీ 1 రకాలకు ప్రత్యామ్నాయం. ఎల్బీజీ 645 ఎక్స్ టీయూ 94–2 రకాల నుంచి అభివృద్ధి చేశారు. పంట కాలం 85 నుంచి 90 రోజులు. దిగుబడి హెక్టార్‌కు 2.20 నుంచి 2.50 టన్నులు. పల్లాకు తెగులుతో పాటు కొంత మేర తలమాడుతట్టుకునే రకం. గింజలు మధ్యస్థ లావుకలిగి మెరుస్తుంటాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఖరీఫ్, రబీ సీజన్లకు అనుకూలం. నూతన వంగడాలు.. వాటి ప్రత్యేకతలు బీపీటీ 2841: ఈ వంగడం బర్మా బ్లాక్, కాలాబట్టి సాంప్రదాయ బ్లాక్ రైస్‌కు ప్రత్యామ్నాయం. ఎంటీయూ–7029, ఐఆర్జీసీ 18195, ఎంటీయూ–1081 రకాల నుంచి అభివృద్ధి చేశారు. పంటకాలం 130 నుంచి 135 రోజులు. దిగుబడి హెక్టార్‌కు 5.50 నుంచి 6 టన్నులు. అగ్గితెగులు, మెడవిరుపుతో పాటు దోమపోటును కొంతమేర తట్టుకుంటుంది. గింజలు పగిలిపోవడం తక్కువ. ముడి బియ్యానికి అనుకూలం. మధ్యస్థ సన్న గింజ రకం. కాండం దృఢంగా ఉండి చేనుపై వాలిపోదు. ఏపీలోని అన్ని ప్రాంతాల్లో ఖరీఫ్ సాగుకు అనుకూలం. బీపీటీ 2846: ఈ వంగడం బీపీటీ 5204కు ప్రత్యామ్నాయం. ఎంటీయూ–1061, ఐఆర్ 78585–64–2–4–3–1 రకాల నుంచి అభివృద్ధి చేశారు. పంటకాలం 140 నుంచి 150 రోజులు. దిగుబడి హెక్టార్‌కు 6.50 నుంచి 7 టన్నులు. అగ్గితెగులు, మెడవిరుపు, దోమపోటు, ఎండాకు తెగులును కొంతమేర తట్టుకుంటుంది. కాండం దృఢంగా ఉండి చేనుపై వాలిపోదు. మధ్యస్థ సన్న గింజ రకం. నిండు గింజల శాతం ఎక్కువ. ఏపీలో కృష్ణా, సదరన్ జోన్లలో ఖరీఫ్ సాగుకు అనుకూలం. ఎన్‌ఎల్‌ఆర్ 3238: బయో ఫోర్టిఫైడ్ స్వల్పకాలిక వరి రకమిది. బీపీటీ–5204, ఎంటీయూ 1010 రకాల నుంచి అభివృద్ధి చేశారు. పంటకాలం 120 నుంచి 125 రోజులు. దిగుబడి హెక్టార్‌కు 6.50 నుంచి 7 టన్నులు. ఇది కూడా చేనుపై వాలిపోదు. పాలిష్ చేసిన బియ్యంలో జింక్ మోతాదు 27–72 పీపీఎంగా ఉంటుంది. బియ్యం పారదర్శకంగా ఉండి నాణ్యతతో ఉంటాయి. అగ్గితెగులు, మెడవిరుపులను కొంత మేర తట్టుకుంటుంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఖరీఫ్, రబీ సీజన్లలో సాగుకు అనుకూలం. ఎంటీయూ 1271: ఈ వంగడం బీపీటీ 5204కు ప్రత్యామ్నాయం. ఎంటీయూ–1075, 1081 రకాల నుంచి అభివృద్ధి చేశారు. పంటకాలం 140 రోజులు. దిగుబడి హెక్టార్‌కు 6.50 నుంచి 7 టన్నులు. దోమ, ఎండాకు తెగులును కొంత మేర తట్టుకుంటుంది. మధ్యస్థ సన్న గింజ రకం. ఇది కూడా చేనుపై వాలిపోదు. నిండు గింజల శాతం ఎక్కువ. సాగునీటి వసతులున్న లోతట్టు, అప్ల్యాండ్స్లో ఖరీఫ్ సాగుకు అనుకూలం. -
ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికపై దృష్టి పెట్టండి
సాక్షి, అమరావతి: ఖరీఫ్ సీజన్లో వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొనేందుకు అవసరమైన కార్యాచరణ సిద్ధం చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యవసాయ అధికారులతో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. జూలై 15, జూలై 31, ఆగస్ట్ 15 నాటికి సరైన వర్షాలు పడకపోతే ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను సిద్ధం చేసుకోవాలన్నారు. పంటలు, పంట రకాల మార్పుపై దృష్టి సారించాలన్నారు. ఉత్తరకోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాలకు వేర్వేరుగా పంటల కాలంలో అవసరమయ్యే వివిధ పంటల సరళి, అవసరమైన ఉత్పాదకలపై దృష్టి సారించాలన్నారు. వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ హరికిరణ్ మాట్లాడుతూ.. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికకు అనుగుణంగా జూలై 15 నాటికి వర్షాలు పడకపోతే.. 40 వేల క్వింటాళ్లు, జూలై 31 నాటికి వర్షాలు పడకపోతే 71 వేల క్వింటాళ్లు, ఆగష్టు 15 నాటికి వర్షాలు పడకపోతే లక్ష క్వింటాళ్ల విత్తనాలను 80 శాతం రాయితీపై పంపిణీ చేసేలా చర్యలు చేపడతామన్నారు. ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ గెడ్డం శేఖర్‌బాబు మాట్లాడుతూ.. ప్రత్యామ్నాయ పంటలకు అవసరమైన విత్తనాల పంపిణీకి కార్పొరేషన్ సిద్ధంగా ఉందన్నారు. అవసరమైతే నేషనల్ సీడ్స్, తెలంగాణ సీడ్స్, కర్ణాటక సీడ్స్ కార్పొరేషన్ల నుంచి విత్తనాలు సమీకరించి ఆర్బీకేల ద్వారా రైతులకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. -
రూ.1,654 కోట్లకు కేంద్రానికి ప్రతిపాదనలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా వ్యవసాయ, అనుబంధ రంగాల్లో వివిధ కార్యక్రమాల అమలుకు రాష్ట్రీయ కృషి వికాస యోజన (ఆర్కేవీవై), క్రిషోన్నతి పథకాల కింద 2023–24 సంవత్సరానికి రూ.1,654 కోట్లు కేటాయించాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపిస్తున్నట్టు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టే పథకాలకు నిధుల కేటాయింపుౖపై శుక్రవారం సచివాలయంలో జరిగిన సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. రాష్ట్రంలో వివిధ పంటల సాగు విస్తీర్ణం, ఉత్పత్తి పెంచడంతో పాటు వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు ఆర్కేవీవై, క్రిషోన్నతి యోజన కింద నిధుల కోసం కేంద్రం ప్రతిపాదనలు కోరిందని ఈ సందర్భంగా చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో నిధులు సమకూరుçస్తూ ఏటా ఈ పథకాలు అమలు చేస్తున్నాయన్నారు. ఆర్కేవీవై కింద ఈ ఏడాది రూ. 1,148 కోట్లకు కార్యాచరణ రూపొందించామని చెప్పారు. ఈ నిధులతో కిసాన్ డ్రోన్ టెక్నాలజీ ప్రోత్సాహం, భూసార పరిరక్షణ, సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు బిందు సేద్యానికి ప్రోత్సాహకాలు ఇవ్వడం, పొగాకుకు బదులుగా అపరాలు, నూనె గింజలసాగు పెంచడం వంటి కార్యక్రమాలు అమలు చేస్తామని తెలిపారు. అదేవిధంగా క్రిషోన్నతి యోజన కింద ఈ ఏడాది 506 కోట్ల రూపాయాలతో కార్యాచరణ రూపొందించామని చెప్పారు. వీటితోపాటు జాతీయ ఆహార భద్రత పథకం కింద 70 కోట్ల రూపాయలుర, జాతీయ నూనె గింజల పథకం కింద 29.50 కోట్ల రూపాయలు, రైతులకు నాణ్యమైన, ధ్రువీకరించిన విత్తనాలు అందించేందుకు 19 కోట్ల రూపాయలు, వ్యవసాయ విస్తరణ, శిక్షణకు రూ.36 కోట్లు, సమగ్ర ఉద్యాన అభివృద్ధి పథకం కింద రూ.200 కోట్లు మంజూరు చేయాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతున్నట్టు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది చెప్పారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్‌తో పాటు వ్యవసాయ, ఉద్యాన శాఖాధికారులు తదితరులు పాల్గొన్నారు. -
వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శిగా గోపాలకృష్ణ ద్వివేది
సాక్షి, అమరావతి: వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణ ద్వివేది నియమితులయ్యారు. వ్యవసాయంతో పాటు సహకార, పశుసంవర్ధకం, డెయిరీ డెవలప్మెంట్, మత్స్యశాఖల ముఖ్య కార్యదర్శి బాధ్యతలతో పాటు రైతుభరోసా కేంద్రాల ప్రత్యేక కమిషనర్ బాధ్యతలు ఆయనకు అప్పగించారు. వీటితోపాటు మైనింగ్‌శాఖ ముఖ్య కార్యదర్శిగాను ఆయన కొనసాగనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్‌రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటివరకు వ్యవసాయ అనుబంధశాఖల ముఖ్య కార్యదర్శిగా ఉన్న వై.మధుసూదన్‌రెడ్డిని రిలీవ్ చేశారు. మరోవైపు ద్వివేది స్థానంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా.. సెలవుపై వెళ్లి తిరిగి వచ్చిన బుడితి రాజశేఖర్‌ను నియమించారు. -
ఏపీఎండీసీ పునర్వ్యవస్థీకరణ
సాక్షి, అమరావతి: ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్)ను మరింత బలోపేతం చేసేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (అస్కీ) సహకారంతో ఈ సంస్థను పునర్వ్యవస్థీకరించనున్నారు. ఇందుకోసం అస్కీతో ఏపీఎండీసీ ఒప్పందం చేసుకుంది. సోమవారం గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఏపీఎండీసీ వీసీ అండ్ ఎండీ వీజీ వెంకటరెడ్డి, సలహాదారు డీఎల్ఆర్ ప్రసాద్ హైదరాబాద్‌లోని అస్కీ కార్యాలయంలో ఆ సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. అనంతరం పునర్వ్యవస్థీకరణ ఒప్పందంపై ఏపీఎండీసీ తరఫున వీజీ వెంకటరెడ్డి, అస్కీ నుంచి రిజిస్ట్రార్ ఓపీ సింగ్, ప్రొఫెసర్ హర్ష శర్మ సంతకాలు చేశారు. ఏపీఎండీసీ నిర్వహణ సామర్థ్యం, ఉద్యోగుల నైపుణ్యాలను మరింత పెంచాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచనల ప్రకారం ఈ ఒప్పందం జరిగిందని వెంకటరెడ్డి తెలిపారు. ఒప్పందంలో భాగంగా అస్కీ ఏపీఎండీసీ పనితీరును అధ్యయనం చేసి 3 నెలల్లో ఒక నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలి. కార్పొరేట్ సంస్థలకు దీటుగా వార్షిక లక్ష్యాల సాధన, అధికారులు, ఉద్యోగుల పనితీరు, కెరీర్ ప్రోగ్రెషన్ ప్రణాళికను అమలు చేయడంపై విధి విధానాలను రూపొందించాల్సి ఉంటుంది. ఈ నివేదికకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. సీఎం జగన్ నిర్ణయాలతో ఇప్పటికే బలమైన సంస్థగా ఏపీఎండీసీ సీఎం వైఎస్ జగన్ ముందుచూపుతో తీసుకున్న నిర్ణయాలతో ఏపీఎండీసీ ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ వేదికలపై బలమైన సంస్థగా ఎదిగింది. పారదర్శక విధానాలు అవలంబిస్తూ, జాతీయ స్థాయిలో కోల్ ఇండియా, సింగరేణి వంటి సంస్థలతో పోటీ పడి వాణిజ్య సరళిలో బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించిన ప్రభుత్వ రంగ సంస్థగా అరుదైన గుర్తింపును అందుకుంది. బెరైటీస్ ఉత్పత్తి, విక్రయాల్లో మిడిల్ ఈస్ట్ దేశాల్లోనే అతిపెద్ద ఎగుమతిదారుగా అవతరించింది. గ్రానైట్, బాల్ క్లే, కాల్సైట్, సిలికాశాండ్ వంటి ఖనిజాల ఉత్పత్తిలోనూ మెరుగైన ఫలితాలు సాధిస్తోంది. మధ్యప్రదేశ్‌లోని సుల్యారీలో బొగ్గు గనులను నిర్వహిస్తోంది. త్వరలో జార్ఖండ్‌లోని బ్రహ్మదియాలో కోకింగ్ కోల్ ఉత్పత్తికి సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో సంస్థ పురోగతిని శాస్త్రీయంగా మదింపు చేసి, అధికారులు, ఉద్యోగుల వృత్తి నైపుణ్యాలు, మార్కెటింగ్ వ్యూహాలు, జాతీయ – అంతర్జాతీయ దృక్పథం, మార్కెటింగ్ ఎత్తుగడలను సరైన విధానంలో అనుసరించేందుకు అస్కీ సహకారం తీసుకోనుంది. ఏపీఎండీసీ పునర్వ్యవస్థీకరణతో సంస్థ రూపురేఖలు మారతాయని, సంస్థాగత సామర్థ్యం గణనీయంగా మెరుగుపడుతుందని వీసీ, ఎండీ వెంకటరెడ్డి తెలిపారు. -
కడప స్టీల్‌కు ఇనుప గనుల కేటాయింపు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలం సమీపంలో ఏర్పాటు చేస్తున్న వైఎస్సార్ స్టీల్ కార్పొరేషన్‌కు అవసరమైన ముడి ఇనుమును ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎండీసీ) సరఫరా చేయనుంది. ఇందుకోసం అనంతపురం జిల్లా డి.హిరేహాల్ మండలంలోని సిద్ధాపురం తండా, అంతరాగంగమ్మ కొండ ప్రాంతాల్లోని 25 హెక్టార్లను ఏపీఎండీసీకి కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ గని నుంచి తవ్విన ముడి ఇనుమును కడప స్టీల్ ఫ్యాక్టరీకి సరఫరా చేయడానికి కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపినట్లు రాష్ట్ర గనుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది పేర్కొన్నారు. ఈ గనులకు సంబంధించిన సరిహద్దులను సూచిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశామని తెలిపారు. వైఎస్సార్ స్టీల్ కార్పొరేషన్‌కు అవసరమైన ముడి ఇనుమును సరఫరా చేసేందుకు మరో రెండు గనులను కేటాయించడానికి చర్యలు తీసుకుంటున్నామని, కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే కేటాయింపు ప్రక్రియ పూర్తి చేస్తామని వివరించారు. వెనుకబడిన రాయలసీమ జిల్లాలో ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో జమ్మలమడుగు మండలంలో ఏటా 3 లక్షల టన్నుల ఉక్కును ఉత్పత్తి చేసే యూనిట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రత్యక్షంగా, పరోక్షంగా 25,000 మందికి ఉపాధి కల్పించే ఈ స్టీల్ ప్లాంట్‌కు 2019, డిసెంబర్ 23న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారని, ఆ తర్వాత కరోనా రావడంతో పనులు అనుకున్నంత వేగంగా జరగలేదని, ఇప్పుడు కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో నిర్మాణ పనులు వేగవంతం చేస్తామని పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ తెలిపారు. -
పింఛన్‌దారులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్
సాక్షి, అమరావతి: పింఛన్ లబ్ధిదారు సొంత రాష్ట్ర పరిధిలో తన పింఛన్‌ను ఓ చోట నుంచి మరొక చోటకి మార్చుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఇందులో భాగంగా లబ్ధిదారులు తమ నివాసాన్ని ఒక చోట నుంచి మరొక చోటకి మారే సమయంలో ఆ వివరాలతో సంబంధిత గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులిచ్చారు. అలాగే, నిబంధనల ప్రకారం అర్హత లేని వారికి కూడా కొత్తగా పింఛన్లు మంజూరు చేసే అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోనుంది. అనర్హులకు పింఛన్ మంజూరు చేస్తే ఆ సొమ్మును మంజూరు చేసిన వారి నుంచి రికవరీ చేయనుంది. పింఛన్ల సొమ్మును దుర్వినియోగ పరచడం.. పంపిణీ చేయకుండా మిగిలిపోయిన సొమ్మును తిరిగి ప్రభుత్వ ఖాతాలో జమ చేయకుండా ఉండే సిబ్బందిపైనా తగిన చర్యలు తీసుకోనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
గనుల శాఖకు ఘన పురస్కారం
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: రాష్ట్ర గనుల శాఖ అనుసరిస్తున్న పారదర్శక విధానాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. ప్రధాన ఖనిజాల అన్వేషణ, వేలం, మైనింగ్ కార్యకలాపాల పర్యవేక్షణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గనులశాఖ పాటిస్తున్న అత్యుత్తమ విధానాలను ప్రశంసిస్తూ కేంద్ర బొగ్గు, గనుల శాఖ ఈ పురస్కారాన్ని ప్రకటించింది. రానున్న రెండేళ్లకుగానూ రాష్ట్రీయ ఖనిజ వికాస్ పురస్కారం కింద రూ.2.40 కోట్లు ప్రోత్సాహకంగా ప్రకటించింది. ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా మంగళవారం ఢిల్లీలోని డాక్టర్ అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో మైన్స్ అండ్ మినరల్స్‌పై జరిగిన సదస్సులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా మైనింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, గనులు శాఖ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి అవార్డు అందుకున్నారు. రెండేళ్లుగా పారదర్శకంగా లీజులు.. దేశంలో ప్రధాన ఖనిజాల మైనింగ్‌పై ఉత్తమ విధానాలను అనుసరిస్తున్న రాష్ట్రాలకు కేంద్ర గనుల శాఖ ఏటా అవార్డులను ప్రదానం చేస్తోంది. రాష్ట్రీయ ఖనిజ వికాస్ పురస్కారం కింద ప్రోత్సాహకాలు అందిస్తోంది. గత రెండేళ్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పది రకాల ప్రధాన ఖనిజాలకు సంబంధించి అన్వేషణ, వేలం, మైనింగ్ కార్యక్రమాల పర్యవేక్షణలో పారదర్శకంగా వ్యవహరిస్తూ అత్యంత వేగంగా లీజులు జారీ చేస్తోంది. వేగంగా మైనింగ్ కార్యక్రమాలను చేపట్టేలా అత్యుత్తమ విధానాలను అనుసరిస్తోంది. దీనికి గుర్తింపుగా కేంద్రం అవార్డులను ప్రకటించింది. మైనింగ్ బ్లాకుల నిర్వహణను సమర్థంగా చేపట్టినందుకు అభినందిస్తూ 2022–23లో బాక్సైట్, ఐరన్ ఓర్ ఐదు కొత్త మినరల్స్ బ్లాక్‌లకు సంబంధించి జియోలాజికల్ నివేదికలను రాష్ట్రానికి కేంద్రం అందజేసింది. సీఎం తెచ్చిన సంస్కరణల ఫలితం.. మైనింగ్ రంగంలో రాష్ట్రానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం ఆనందదాయకమని గోపాలకృష్ణ ద్వివేది పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనల మేరకు మైనింగ్ రంగంలో సృజనాత్మక పనులతోపాటు పలు సంస్కరణలు తెచ్చినట్లు వెల్లడించారు. కొత్త మినరల్ బ్లాకులకు సంబంధించి త్వరలోనే ఖనిజ అన్వేషణ, వేలం, మైనింగ్ ఆపరేషన్ ప్రక్రియలను పూర్తి చేస్తామని వీజీ వెంకటరెడ్డి తెలిపారు. మైనింగ్ రంగంలో సీఎం జగన్ తెచ్చిన సంస్కరణలు, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మార్గదర్శకత్వంతో జాతీయ స్థాయి గుర్తింపు సాధించామన్నారు. భారతి సిమెంట్స్‌కు ఫైవ్ స్టార్ రేటింగ్ నేషనల్ కాంక్లేవ్‌లో భారతి సిమెంట్స్‌కు కేంద్ర గనుల శాఖ ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వడం పట్ల సంస్థ యాజమాన్యాన్ని ద్వివేది, వెంకటరెడ్డి అభినందించారు. వరుసగా మూడేళ్లు సస్టెయినబుల్ మేనేజ్మెంట్ విధానాలను అవలంబించిన భారతి సిమెంట్స్‌కు ఈ గౌరవం దక్కడం అభినందనీయమన్నారు. -
పండుగలా.. పెంచిన పింఛన్ల పంపిణీ
సాక్షి, అమరావతి: అవ్వాతాతలతో పాటు వితంతువులు, చేనేత, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు తదితరులకు రూ. 2,250 చొప్పున ఇస్తున్న పింఛనును రూ. 2,500కు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. జనవరిలోనే పెరిగిన డబ్బులను లబ్ధిదారులకు చెల్లించనున్నట్టు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా, పింఛన్ పెంపు నేపథ్యంలో జనవరి 1 నుంచి 5వ తేదీ వరకు జరిగే పంపిణీని పండుగ వాతావరణంలో నిర్వహించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు గోపాలకృష్ణ ద్వివేది మరో ఉత్తర్వులో ఆదేశాలు జారీ చేశారు. ఐదు రోజుల పాటు నిర్వహించాల్సిన కార్యక్రమాలను ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ► జనవరి 1న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. ప్రభుత్వం రూపొందించిన పోస్టర్లను విడుదల చేయనున్నారు. స్థానికంగా కొందరు లబ్ధిదారులకు పెరిగిన పింఛను డబ్బులను రూ. 2,500ల చొప్పున పంపిణీ చేస్తారు. ► తొలి రోజు అన్ని జిల్లాల్లోనూ జిల్లా ఇన్చార్జి మంత్రులు, స్థానిక జిల్లా మంత్రుల ఆధ్వర్యంలో పింఛన్ల పెంపు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. జిల్లా స్థాయిలో జరిగే ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గుంటూరు జిల్లాలో పాల్గొనే ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ, రైతు భరోసా కేంద్రాల వద్ద కూడా ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే లబ్ధిదారులు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించేలా జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. ► ఒకటో తేదీ నుంచి 5వ తేదీ మధ్య జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యే, ఇతర ప్రజా ప్రతినిధులందరూ స్వయంగా పాల్గొంటారు. కోవిడ్ నియంత్రణ చర్యలు చేపడుతూనే ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు కొంతమంది లబ్ధిదారులతో ముఖాముఖీగా సమావేశమై, లబ్ధిదారులకు ముఖ్యమంత్రి స్వయంగా రాసిన లేఖలను వారికి పంచిపెడతారు. ► పింఛన్ల పెంపునకు సంబంధించి పోస్టర్లను అన్ని మండల, తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్ కార్యాలయాలతో పాటు గ్రామ వార్డు సచివాలయాల్లో అందరికీ తెలిసేలా ప్రదర్శిస్తారు. ఎంపీడీవోలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లతో పాటు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది అందరూ పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒకటో తేదీ మధ్యాహ్నం నుంచి వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛను డబ్బుల పంపిణీ చేస్తారు. 1,41,562 మందికి కొత్తగా పింఛన్లు.. రాష్ట్ర వ్యాప్తంగా 1,41,562 మందికి ప్రభుత్వం జనవరి నెల నుంచి కొత్తగా పింఛన్లు మంజూరు చేసినట్టు గోపాలకృష్ణ ద్వివేది తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కొత్తగా మంజూరైన లబ్ధిదారులకు కూడా ఒకటో తేదీ నుంచి డబ్బులు పంపిణీ చేయనున్నట్టు పేర్కొన్నారు. -
అత్యంత పారదర్శకంగా ఇసుక ఆపరేషన్స్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇసుక ఆపరేషన్స్ అత్యంత పారదర్శకతతో నిర్వహిస్తున్నామని గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆ శాఖ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి తెలిపారు. వినియోగదారులకు అందుబాటు ధరలో ఇసుక విక్రయానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని, దాని ప్రకారమే విక్రయాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. మంగళవారం విజయవాడలో మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. అవగాహన లేకుండా కొన్ని మీడియాల్లో ఇసుక తవ్వకాలు, విక్రయంపై అసత్య కథనాలను ప్రచురిస్తున్నారని అన్నారు. జేపీ సంస్థదే బాధ్యత: ద్వివేది ‘ఇసుక ఆపరేషన్స్‌ను పారదర్శకంగా నిర్వహించా లనే ఉద్దేశంతో ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎంఎస్టీసీ ద్వారా టెండర్ల ప్రక్రియను నిర్వహించింది. ఎంఎస్టీసీ నిర్వహించిన టెండర్ల లో జేపీ పవర్ వెంచర్స్ సంస్థను ఎంపిక చేశాం. ఆ సంస్థతో ఒప్పందం చేసుకుని ప్రభుత్వం నిర్ణయిం చిన రేటుకు ఇసుక విక్రయాలు జరుపుతున్నాం. రెండేళ్ల కాలానికి ఇసుక ఆపరేషన్స్ కాంట్రాక్ట్‌ను జేపీ సంస్థకు ఇచ్చాం. ఇతర రాష్ట్రాల్లో ఏపీఎండీసీ గనులను నిర్వహిస్తోంది. అక్కడ ఆపరేషన్స్ కోసం సబ్ కాంట్రాక్ట్‌లకు కొన్ని పనులు అప్పగించాం. ఇసుక టెండర్ల నిబంధనల్లో కూడా లీజు అనుమ తులు పొందిన సంస్థ సబ్ కాంట్రాక్ట్ కింద కొన్ని పనులు ఇతరులకు ఇవ్వవచ్చు. అయితే మొత్తం ఇసుక ఆపరేషన్స్‌కు జేపీ సంస్థ మాత్రమే బాధ్యత వహిస్తుంది. ఎక్కడైనా నిబంధనలకు విరుద్ధంగా జరిగితే జేపీ సంస్థపైనే చర్యలు తీసుకుంటాం. రాష్ట్రంలోని అన్ని రీచ్‌లను జేపీ సంస్థ నిర్వహిస్తు న్నందున వారు సబ్ కాంట్రాక్ట్ కింద ఇతరుల సేవలను తీసుకోవచ్చు. ఇందులో ఎటువంటి నిబం ధనల ఉల్లంఘనా లేదు. కొత్తగా ఏర్పాటైన సంస్థకు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారని, ఇది నిబంధనలకు విరుద్ధమంటూ చేస్తున్న ఆరోపణలు అవాస్తవం. ఇసుకను తీసుకువచ్చే బాటకు కొందరు స్థానికులు డబ్బు వసూలు చేస్తున్నారంటూ వస్తున్న ఆరోప ణల నేపథ్యంలో దానిపై ఎవరైనా సరే పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. ఇటువంటివి అటు జేపీ సంస్థ దృష్టికి వచ్చినా, లేదా మా దృష్టికి వచ్చినా పోలీసులకు ఫిర్యాదు చేసి, చర్యలు తీసుకోవాలని కోరతాం. వినియోగదారులకు సరైన రేటుకు, నిర్దిష్టమైన నాణ్యతతో కూడిన ఇసుక అందుతుందా లేదా అనేదానిపైనే మేం దృష్టి సారిస్తున్నాం. జేపీ సంస్థ ఇప్పటి వరకు ఆఫ్‌లైన్ బుకింగ్‌లు చేస్తోంది. ఆన్లైన్ ద్వారా కూడా చేయాలని çసూచించాం. ప్ర జలకు ఇబ్బంది లేకుండా మంచి సాఫ్ట్వేర్ ద్వారా ఆన్లైన్ బుకింగ్ చేయడానికి ఆ సంస్థ రూపొం దించిన ఫోన్ యాప్‌ను కూడా పరిశీలిస్తున్నాం. గతంలో ఆన్లైన్ విధానంలోని లోపాలవల్ల విని యోగదారులు ఇబ్బందులు పడ్డారు. అటువంటి పరిస్థితి తలెత్తకుండా సాఫ్ట్వేర్ ఉండేలా చూస్తాం. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుని, అమలు చేసేందుకు ప్రయత్నిస్తాం. గతంలో పట్టా భూము ల్లో ఇసుక తవ్వకాలు చేయడం వల్ల నాణ్యత లేదనే ఫిర్యాదులు చాలా వచ్చాయి. వాటికి అనుమతులు రద్దు చేశాం. ప్రస్తుతం వందకు పైగా ఇసుక రీచ్‌లు నడుస్తున్నాయి. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వరదల వల్ల కొన్ని రీచ్‌ల ప్రారంభంలో జాప్యం జరిగింది. త్వరలోనే దాదాపు 150 రీచ్‌లు ప్రారంభమవుతాయి’ అని ద్వివేది చెప్పారు. అవాస్తవాలు ప్రచురించారు: వెంకటరెడ్డి ‘ఇసుక విక్రయాలపై అవగాహన లేకుండా ఒక మీడియా సంస్థ అవాస్తవాలను ప్రచురించింది. గతంలో ఉచిత ఇసుక పాలసీ అమలులో ఉన్న సమయంలో వినియోగదారులకు ఉచితంగా ఇసుక లభించలేదు. ఇసుక మాఫియా ఇష్టారాజ్యంగా వ్యవహరించింది. ఇసుక ఇతర రాష్ట్రాలకు తరలివెళ్లింది. దీనిని నియంత్రించడానికే ఈ ప్రభుత్వం సుస్థిర ఇసుక విధానాన్ని తీసుకువచ్చింది. ఏపీఎండీసీ ద్వారా ఇసుక ఆపరేషన్స్ చేశాం. కొత్త ఇసుక విధానంలోని లోటుపాట్లను పరిష్కరించేందుకు మెరుగైన విధానం కోసం సీఎం జగన్ మంత్రుల కమిటీని వేసి ఇసుక విధానంలో మార్పులు తీసుకువచ్చారు. జేపీ సంస్థ ఎక్కడా సబ్ లీజులు ఇవ్వలేదు. నిబంధనల ప్రకారమే సబ్ కాంట్రాక్ట్ ఇచ్చే అవకాశం ఉంది. దానినే జేపీ సంస్థ అనుసరిస్తోంది. కొత్తగా పుట్టిన సంస్థకు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారని, ఇది నిబంధనలకు విరుద్ధమని అంటూ ఒక మీడియాలో వచ్చిన కథనంలో వాస్తవం లేదు. జేపీ సంస్థ నగదుతో పాటు యూపీఐ. బ్యాంకు ఖాతాల ద్వారా సొమ్ము జమ చేసిన వినియోగదారులకు కూడా ఇసుకను విక్రయిస్తోంది. అందుకోసం 26 బ్యాంకు ఖాతాలను జేపీ సంస్థ ఆపరేట్ చేస్తోంది. ఆ బ్యాంకు ఖాతాల్లో వినియోగదారులు సొమ్ము డిపాజిట్ చేసి ఇసుకను తీసుకోవచ్చు. బాట చార్జీల పేరుతో స్థానిక నేతలు ఎక్కడ డబ్బు వసూలు చేస్తున్నారో స్పష్టంగా చెప్పకుండా కథనాలు రాస్తున్నారు. దానిపై పోలీసులకు ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు. ప్రతివారం నియోజకవర్గాల వారీగా ఇసుక రేట్లపై ప్రకటనలు జారీ చేస్తున్నాం. అంతకంటే ఎక్కువ రేటును ఎవరైనా డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. వినియోగదారుల డిమాండ్‌కు అనుగుణంగా స్టాక్ పాయింట్లలో ఇసుక సిద్ధంగా ఉంది. ప్రతి రీచ్‌లోనూ మైనింగ్ ప్లాన్ తయారు చేస్తాం. దానికి పర్యావరణ అనుమతులు తీసుకుంటాం. దానికి అనుగుణంగానే సరిహద్దులు గుర్తించి జియో కోఆర్డినేట్స్ ప్రకారం లీజుదారులకు మైనింగ్ ప్రాంతాన్ని అప్పగిస్తాం. ఈ ప్రాంతం మినహా మరెక్కడైనా ఇసుక ఆపరేషన్స్ చేస్తే చర్యలు తీసుకుంటాం. ఏడాదికి రెండు కోట్ల టన్నుల వరకు ఇసుక తవ్వాలని జేపీ సంస్థకు నిర్దేశించాం. ప్రతి నెలా ఇసుక తవ్వకాలు, రవాణా, అమ్మకాల వివరాలను తీసుకుంటున్నాం. దీనిని గనులశాఖ ఏడీ, డీడీ స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం జేపీ సంస్థ మాన్యువల్‌గానే బిల్లులు ఇస్తోంది. ఆన్లైన్ కావాలని వినియోగదారులు కొందరు కోరుతున్నారు. దీనిని కూడా పరిశీలిస్తున్నాం. అధికారుల నుంచి నిర్దిష్టమైన అంశాలపై వివరణ కోరకుండానే మీడియాలో కథనాలను ప్రచు రించడం తగదు’ అని వెంకటరెడ్డి చెప్పారు. -
గనుల వేలానికి హైపవర్ కమిటీ ఆమోదం
సాక్షి, అమరావతి: బంగారం, వజ్రాలు సహా 22 అత్యంత విలువైన గనుల వేలానికి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ ఆమోదం తెలిపింది. వెలగపూడి సచివాలయంలో బుధవారం మైనింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది నేతృత్వంలో జరిగిన హైపవర్ కమిటీ సమావేశంలో వేలానికి ఆమోదముద్ర వేశారు. సమావేశంలో మైనింగ్ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి పాల్గొనగా, ఇండియన్ బ్యూరో ఆఫ్ మైనింగ్ రీజినల్ కంట్రోలర్ శైలేంద్రకుమార్, జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సదరన్ రీజియన్ డైరెక్టర్ ప్రసూన్ఘోష్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. జీఎస్ఐ ప్రతిపాదించిన 9, రాష్ట్ర మైనింగ్ శాఖ ధ్రువీకరించిన 13 గనుల వేలానికి సంబంధించిన విధివిధానాలను కమిటీలో ఖరారు చేశారు. ప్రీమియం, రిజర్వు ధరలు, వేలం నిర్వహణపై మార్గదర్శకాలు నిర్దేశించారు. వీటి ప్రకారం 22 గనులకు వేలం నిర్వహించాలని మైనింగ్ శాఖకు స్పష్టం చేసింది. 21 గనులకు కాంపోజిట్ లీజులు, ఒక గనికి సాధారణ లీజు ఇచ్చేందుకు అంగీకరించింది. కమిటీ సూచించిన మార్గదర్శకాల ప్రకారం వెంటనే టెండర్ల ప్రక్రియ ప్రారంభిస్తామని మైనింగ్ డైరెక్టర్ వెంకటరెడ్డి తెలిపారు. -
1,284 పాఠశాలల్లో ఇతర నిర్మాణాలను ఆపేశాం
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా 1,284 పాఠశాలల్లో రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాలు, ఆరోగ్య కేంద్రాలను నిర్మిస్తున్నట్లు గుర్తించామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ఆ నిర్మాణాలన్నింటినీ నిలుపుదల చేయించి ఈ ఏడాది సెప్టెంబర్ చివరి కల్లా వాటిని ఖాళీ చేయించామని వివరించింది. పాఠశాలల్లో విద్యకు సంబంధం లేని కార్యకలాపాలను చేపట్టడం లేదంది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది హైకోర్టు ముందు ఓ మెమో దాఖలు చేశారు. ఇందులో జిల్లాల వారీగా ఆయా పాఠశాలల్లో చేపట్టిన నిర్మాణాలను, తరువాత వాటిని ఖాళీ చేయించిన వివరాలను పొందుపరిచారు. ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణాల్లో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు తదితర నిర్మాణాలు చేపట్టకుండా చర్యలు తీసుకోవాలంటూ 2020లో హైకోర్టు అధికారులను ఆదేశించింది. అయితే తమ ఆదేశాలను అధికారులు అమలు చేయకపోవడంతో హైకోర్టు ఈ వ్యవహారంపై సుమోటోగా కోర్టు ధిక్కార చర్యలకు ఉపక్రమించింది. గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్, పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్, అప్పటి కమిషనర్ చిన వీరభద్రుడు, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, అప్పటి, ప్రస్తుత డైరెక్టర్లు విజయకుమార్, ఎంఎం నాయక్‌లపై ధిక్కార చర్యలు చేపట్టింది. ఈ ధిక్కార పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ విచారణ జరిపారు. ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణాల్లో చేపట్టిన ఇతర నిర్మాణాలను తొలగించాలంటూ గతంలో ఇచ్చిన ఆదేశాల అమలు ఎంత వరకు వచ్చిందో తెలియచేస్తూ సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. దీంతో ద్వివేది నిర్మాణాల వివరాలను మెమో రూపంలో కోర్టు ముందుంచారు. ఈ నేపథ్యంలో న్యాయమూర్తి తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేశారు. -
ఫోర్జరీ పత్రాలతో ఆరోపణలా!?
సాక్షి, అమరావతి: సీఎంఓ సిఫారసుల మేరకు సుధాకర్ ఇన్ఫ్రా అనే సంస్థకు గోదావరి నదిలో ఇసుక డ్రెడ్జింగ్‌కు అనుమతిచ్చినట్లు టీడీపీ అధికార ప్రతినిధి చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవం, సత్యదూరమని రాష్ట్ర గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. రాష్ట్రంలో ఇసుక తవ్వకాల కాంట్రాక్టును జేపీ పవర్ వెంచర్స్ సంస్థకు టెండర్ల ద్వారా నిబంధనల ప్రకారం ఇచ్చామని సోమవారం ఒక ప్రకటనలో ఆయన తెలిపారు. ఆ సంస్థకు మాత్రమే ఓపెన్ రీచ్‌లలో ఇసుక తవ్వకాలకు అనుమతి ఉందన్నారు. సుధాకర్ ఇన్ఫ్రా సంస్థకు అనుమతిస్తూ తన కార్యాలయం ఎటువంటి లేఖ ఇవ్వలేదని ఆయన స్పష్టంచేశారు. ఆ సంస్థకు గోదావరి నదిలో ఇసుక డ్రెడ్జింగ్‌కు అనుమతివ్వాలని సీఎంఓ నుంచి కూడా ఎటువంటి మౌఖిక లేదా లిఖితపూర్వక సిఫారసు రాలేదన్నారు. కాంట్రాక్టు ఇచ్చినందుకు ధన్యవాదాలు చెబుతూ తనకు ఆ సంస్థ రాసినట్లు చెబుతున్న లేఖకు.. తన కార్యాలయానికి సంబంధంలేదన్నారు. ఇవ్వని కాంట్రాక్టుకు ధన్యవాదాలు ఎలా చెబుతారని ద్వివేది ప్రశ్నించారు. సుధాకర్ ఇన్ఫ్రాపై జూన్ 4న కేసు జేపీ సంస్థ నుంచి తాము సబ్ కాంట్రాక్టు పొందామని సుధాకర్ ఇన్ఫ్రా కొందరిని మోసం చేసినట్లు ఈ సంవత్సరం జూన్ 4న విజయవాడ భవానీపురం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైనట్లు ఆయన తెలిపారు. తమకు గనుల శాఖ అనుమతి ఉందంటూ ఆ సంస్థ చూపించిన డాక్యుమెంట్లు తమ కార్యాలయం నుంచి జారీచేసినవి కావన్నారు. ఈ విషయాన్ని తాను అదే రోజు ఆ కేసు దర్యాప్తు చేస్తున్న విజయవాడ పశ్చిమ ఏసీపీకి లిఖితపూర్వకంగా తెలిపానని గోపాలకృష్ణ ద్వివేది గుర్తుచేశారు. దీనిపై పోలీసు దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ఇప్పుడు అవే ఫోర్జరీ పత్రాలను మరోసారి చూపించి టీడీపీ అధికార ప్రతినిధి ఆరోపణలు చేయడం సరికాదన్నారు. వాటిని సృష్టించి మోసం చేసిన వ్యక్తులు అరెస్టయ్యారని తెలిపారు. గతంలో పోలీసు కేసు నమోదై అరెస్టులు కూడా జరిగిన వ్యవహారానికి సంబంధించిన ఫోర్జరీ పత్రాలను చూపించి ఇప్పుడు జరిగినట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. జూన్‌లోనే ఫోర్జరీకి పాల్పడిన వారిపై కేసు నమోదవడం, అరెస్టులు జరిగిన విషయాన్ని టీడీపీ నాయకుడు ఎందుకు ప్రస్తావించలేదో ప్రజలు గమనించాలని కోరారు. అన్ని మీడియాల్లో వచ్చిన నిజాలను దాచిపెట్టి మళ్లీ కొత్త అంశంగా ప్రభుత్వంపై బురదజల్లాలని ప్రయత్నించడం ఏమిటన్నారు. సుధాకర్ ఇన్ఫ్రాకు చెందిన వ్యక్తులపై కాకినాడ టుటౌన్ పోలీస్స్టేషన్లోనూ 420 కేసు నమోదైందని తెలిపారు. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేవిధంగా, గనుల శాఖలో నిబద్ధతతో పనిచేస్తున్న అధికారుల మానసికస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఆరోపణలు చేశారన్నారు. దీనిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ద్వివేది హెచ్చరించారు. -
ఇసుక మైనింగ్‌పై టీడీపీ అసత్య ఆరోపణలు: గోపాలకృష్ణ ద్వివేది
సాక్షి, అవరావతి: ఇసుక మైనింగ్‌పై టీడీపీ అసత్య ఆరోపణలను గనులశాఖ ఖండించింది. నిబంధనల ప్రకారమే ఇసుక మైనింగ్‌కు అనుమతులు ఇచ్చామని ఆంధ్రప్రదేశ్ మైన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. '' జేపీ పవర్ వెంచర్స్‌కు మాత్రమే ఓపెన్ రీచ్‌ల్లో ఇసుక మైనింగ్‌కు అనుమతి ఇచ్చాం. టీడీపీ నాయకులు ఫోర్జరీ డాక్యుమెంట్లను విడుదల చేశారు. మైన్స్ అండ్ జియాలజీ ప్రిన్సిపల్ సెక్రటరీ గోదావరిలో ఇసుక డ్రెడ్జింగ్‌కు అనుమతి ఇచ్చిందన్నది అవాస్తవం. సుధాకర ఇన్ఫ్రాకు ఇసుక డ్రెడ్జింగ్ అనుమతి ఇవ్వాలంటూ సీఎంవో నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. సుధాకర ఇన్ఫ్రా పేరుతో మోసానికి పాల్పడిన వ్యక్తులను అరెస్ట్ చేశారు. అని తెలిపారు. చదవండి: విశాఖకు చంద్రబాబు అనుకూలమా?.. కాదా?: మంత్రి అవంతి -
ఆండ్రూ మినరల్స్ తవ్వకాలపై సమగ్ర దర్యాప్తు
సాక్షి, అమరావతి: తూర్పు గోదావరి జిల్లా లింగంపర్తి రిజర్వు ఫారెస్ట్‌లో ఆండ్రూ మినరల్స్ జరిపిన లేటరైట్ తవ్వకాల్లో భారీగా అక్రమాలు జరిగినట్లు గనుల శాఖ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి తెలిపారు. తవ్విన లేటరైట్ ఖనిజాన్ని ప్రాసెస్ చేసి బాక్సైట్‌గా మార్చి విక్రయించినట్లు అనుమానాలు ఉన్నాయన్నారు. గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదితో కలిసి బుధవారం ఆయన విజయవాడలో విలేకరుల సమావేశంలో వివరాలు చెప్పారు. తమ శాఖలోని 5 విజిలెన్స్ బృందాలు ప్రాథమికంగా జరిపిన దర్యాప్తులో అక్రమాలు బయటపడినట్లు చెప్పారు. దీంతో సమగ్ర దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వానికి రావాల్సిన మైనింగ్ ఆదాయానికి గండి పడేలా వ్యవహరించినట్లు తేలిందన్నారు. వారు చెప్పిన వివరాలు వారి మాటల్లోనే.. ఆండ్రూ మినరల్స్‌కు 2013లో రిజర్వు ఫారెస్టులో గిరిజనాపురం, లింగంపర్తి పరిధిలో ఆండ్రు శ్రీనివాస్ ఇతరుల పేరు మీద ఎనిమిది లేటరైట్ లీజులు మంజూరయ్యాయి. అక్కడ తవ్విన ఖనిజం కోసం తూర్పుగోదావరి జిల్లా రావికంపాడు/బెండపూడి, అర్లధర/ప్రత్తిపాడులో స్టాక్ యార్డ్లు నిర్వహిస్తున్నారు. అక్కడ ఖనిజాన్ని ప్రాసెస్ చేసి అల్యూమినియం, సిమెంట్ కంపెనీలకు సరఫరా చేస్తున్నారు. రికార్డుల్లో చూపిన దానికన్నా అదనంగా 2 లక్షల మెట్రిక్ టన్నుల ఖనిజాన్ని యార్డులలో నిల్వ చేసినట్లు తనిఖీ బృందాలు నిర్ధారించాయి. ఈ ఖనిజాన్ని ఒడిశాలోని కలహండి జిల్లా లింజిఘడ్లోని వేదాంత లిమిటెడ్, సెసా స్టెరిలైట్ లిమిటెడ్ కంపెనీలకు అలూమినియస్ (మెటలర్జికల్ గ్రేడ్)ను ఆండ్రూ మినరల్స్ సరఫరా చేసింది. ఫెర్రూజినియస్ (నాన్ మెటలర్జికల్ గ్రేడ్) లేటరైట్‌ను కూడా కొన్ని సిమెంట్ కంపెనీలకు సరఫరా చేసింది. 30:70 నిష్పత్తిలో మెటలర్జికల్, నాన్ మెటలర్జికల్ గ్రేడ్ లేటరైట్‌ను సరఫరా చేశారు. స్టాక్ యార్డుల్లో గుర్తించిన 2 లక్షల మెట్రిక్ టన్నుల లేటరైట్‌లో 60 వేల టన్నులు మెటలార్జికల్ గ్రేడ్, మిగతాది నాన్ మెటలార్జికల్ గ్రేడ్ ఉంది. నిబంధనల ప్రకారం దీనికి రూ.12.32 కోట్లు చెల్లించాలి. వేదాంతకు 32.75 లక్షల మెట్రిక్ టన్నుల ఎగుమతి వేదంత లిమిటెడ్ (ఒడిశా)కు 2014–15 నుంచి 2018–19 జనవరి వరకు ఆండ్రూ మినరల్స్ 32,75,815 మెట్రిక్ టన్నుల లేటరైట్‌ను సరఫరా చేసింది. ఆ కంపెనీ స్టీల్, అల్యూమినియంను ఉత్పత్తి చేస్తుంది. ఇందుకు బాక్సైట్ ఖనిజాన్ని వినియోగిస్తారు తప్ప లేటరైట్‌ను కాదు. లేటరైట్ పేరుతో బాక్సైట్ ఖనిజాన్ని ఆండ్రూ మినరల్స్ సరఫరా చేసిందనే అనుమానాలు కలుగుతున్నాయి. చైనాకు 4,65,342 మెట్రిక్ టన్నుల ఖనిజాన్ని ఎగుమతి చేశారు. చైనాకు ఎగుమతి చేసింది లేటరైటా లేక ఆ పేరుతో బాక్సైట్‌ను పంపిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం. లేటరైట్, బాక్సైట్ మధ్య చాలా స్వల్ప తేడా ఉంటుంది. సిలికా కంటెంట్ 38%లోపు ఉంటే లేటరైట్, అంతకంటే ఎక్కువ ఉంటే బాక్సైట్‌గా నిర్ధారిస్తారు. ప్రాథమిక తనిఖీల్లోనే ఆండ్రూ మినరల్స్ గ్రూప్ మైనింగ్ అక్రమాలకు పాల్పడినట్లు నిర్థారణ అయింది. అందుకే ఆ సంస్థ మైనింగ్ కార్యక్రమాలన్నింటిపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నాం. ఈటీఎస్ లేదా డీజీపీఎస్తోపాటు డ్రోన్లతో సర్వే చేయిస్తాం. తద్వారా ఆ కంపెనీకి నిర్దేశించిన ప్రాంతంలోనే మైనింగ్ చేశారా లేక సరిహద్దులను అతిక్రమించి మైనింగ్ చేశారా అన్నది తేలుస్తాం. మైనింగ్ ప్రదేశంలో భద్రత, రక్షణ నిబంధనలు, పేలుడు పదార్థాల లైసెన్స్‌లను పరిశీలిస్తాం. అన్ని క్లియరెన్స్‌లు ఉన్నాయా, పర్యావరణ విభాగం అనుమతించిన మైనింగ్ ప్రణాళిక ప్రకారమే పనులు చేస్తున్నారా, అన్ని అకౌంట్లను నిబంధనల ప్రకారం నిర్వహిస్తున్నారా? వంటి విషయాలను కూడా పరిశీలిస్తామని తెలిపారు. ఇసుక కొరత లేదు రాష్ట్రంలో ఇసుక కొరత లేదని ద్వివేది చెప్పారు. ప్రస్తుతం స్టాక్ యార్డుల్లో 60 లక్షల టన్నుల ఇసుక ఉందన్నారు. డిపోల వారీగా రవాణా చార్జీల్లో స్వల్ప మార్పులు చేస్తామని, ఆ వివరాలను త్వరలో గ్రామ, వార్డు సచివాలయాల్లో పెడతామని తెలిపారు. డీజిల్ రేటు పెరిగితే స్వల్పంగా రేటు పెరుగుతుందని, తగ్గితే రేటు తగ్గుతుందన్నారు. 30›% స్టాక్ యార్డుల్లోనే రేటు స్వల్పంగా పెరుగుతుందన్నారు. -
ఏపీ: బాక్సైట్ తవ్వకాలు ఈ ప్రభుత్వంలో జరగలేదు
సాక్షి, విజయవాడ: 2 లక్షల టన్నుల లేటరైట్ అక్రమంగా తవ్వకాలు జరిగాయని గుర్తించినట్లు గోపాలకృష్ణ ద్వివేది, డీఎంజీ వెంకటరెడ్డి తెలిపారు. ఈ ప్రభుత్వ హయాంలో బాక్సైట్ తవ్వకాలు జరగలేదని స్పష్టం చేశారు. అయితే తూర్పుగోదావరి, విశాఖపట్నంలో శాఖాపరంగా విచారణ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. అక్రమ తవ్వకాలపై ఆరోపణలు రావడంతో వారు బుధవారం వివరాలు సేకరించారు. ఆండ్రస్ మినరల్‌కి 8 లీజులు 2013లో వాళ్లకి మంజూరయ్యాయని, వాటిపై తమకు ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. వీటిపై తాము పెనాల్టీ కూడా వేసినట్లు పేర్కొన్నారు. భద్రతా చర్యలు, ఇతర ప్రమాణాలను తనిఖీ చేశామని చెప్పారు. వేదాంతకి 34 లక్షల టన్నుల సరఫరా చేశారు, 4.5 లక్షల టన్నుల చైనాకు సరఫరా చేశారు అని వెల్లడించారు. వీటిపై విచారణ చేస్తున్నట్లు ద్వివేది తెలిపారు. లేటరైట్ తవ్వరా.. బాక్సైట్ తవ్వరా అని విచారిస్తున్నట్లు స్పష్టం చేశారు. అల్యూమినియం కంపెనీకి సరఫరా చేయడం వలన ప్రాథమికంగా నిర్ధారిస్తున్నామని పేర్కొన్నారు. 2013 నుంచి 2019 జనవరి వరకు ఈ తవ్వకాలు జరిగాయని చెప్పారు. ఈ ప్రభుత్వ హయాంలో ఎక్కడా బాక్సైట్ తవ్వకాలు జరగలేదు అని స్పష్టం చేశారు. ఇప్పుడు లేటరైట్‌ని సిమెంట్ కంపెనీలకు సరఫరా చేస్తున్నారు.. అందుకే లేటరైట్ అని నిర్ధారిస్తున్నాట్లు వివరించారు. గతంలో జరిగిన ఈ వ్యవహారంపై విచారణ చేపడుతున్నట్లు తెలిపారు. దీనిలో గతంలో పనిచేసిన అధికారుల పాత్ర కూడా ఉందని, వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు. చదవండి: ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చావు కేటీఆర్?: ఎమ్మెల్యే సీతక్క చదవండి: కొత్త మొక్క కనుగొన్న శాస్త్రవేత్తలు: పేరేంటంటే ‘జలకన్య’ -
‘ఆ ఇద్దరిపై చర్యలు తీసుకోండి’
సాక్షి, అమరావతి: కోర్టు ధిక్కార వ్యాజ్యాల్లో హైకోర్టు ప్రామాణిక రూపంలో జారీచేసే ఫాం–1 నోటీసులో అదనపు వాక్యాలు చేరుస్తూ ఇద్దరు హైకోర్టు అధికారులు వ్యవహరించిన తీరుపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం మండిపడింది. ప్రామాణిక రూపానికి అదనపు వాక్యాలు చేర్చడం న్యాయస్థాన రాజ్యాంగ విధుల్లో జోక్యం చేసుకోవడమే అవుతుందని స్పష్టంచేసింది. ఇందుకు బాధ్యులైన ఆ ఇద్దరు అధికారులపై సుమోటో కింద కోర్టు ధిక్కార చర్యలు చేపట్టాలని రిజిస్ట్రార్ జనరల్‌ను ఆదేశించింది. పరిపాలనాపరంగా వారిపై తగిన చర్యలు తీసుకునేందుకు వీలుగా ఈ వ్యవహారాన్ని ప్రధాన న్యాయమూర్తి ముందుంచాలని రిజిస్ట్రార్ జనరల్‌కు స్పష్టంచేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. సర్వీసు క్రమబద్ధీకరణకు పిటిషన్.. తన నియామకం జరిగిన నాటి నుంచి బిల్ కలెక్టర్‌గా తన సర్వీసును క్రమబద్ధీకరించేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన ఎస్. భైరవమూర్తి 2019లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. భైరవమూర్తి సర్వీసును క్రమబద్ధీకరించాలంటూ పంచాయతీరాజ్ శాఖను ఆదేశించింది. ఈ ఆదేశాలను అధికారులు అమలుచేయకపోవడంతో వారిపై భైరవమూర్తి 2020లో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ, కమిషనర్ గిరిజా శంకర్, జిల్లా కలెక్టర్ మురళీధర్‌రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) ఎస్వీ నాగేశ్వర నాయక్‌లను ప్రతివాదులుగా చేర్చారు. చివరకు 2021 మే 31న అధికారులు కోర్టు ఆదేశాలను పూర్తిస్థాయిలో అమలుచేశారు. కోర్టు ఆదేశాల అమలులో జాప్యానికి డీపీఓ, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ కారణమని న్యాయస్థానం తేల్చింది. కానీ, ఇందులో జిల్లా కలెక్టర్ మురళీధర్‌రెడ్డికి ఎలాంటి సంబంధం లేదంటూ అతని పేరు తొలగించింది. అనంతరం డీపీవో, ద్వివేదీలు కోర్టు ఆదేశాల అమల్లో జాప్యానికి క్షమాపణ కోరి భవిష్యత్తులో జాగ్రత్తగా ఉంటామన్నారు. దీంతో హైకోర్టు వారిపై కోర్టు ధిక్కార కేసును మూసివేసింది. ఆ ఇద్దరు అధికారులు బాధ్యులు ప్రామాణిక రూపంలో ఉండే ఫాం–1 నోటీసులో అదనపు వాక్యాలు చేర్చడాన్ని న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ తీవ్రంగా పరిగణించారు. దీనిపై విచారణ జరిపి బాధ్యులెవరో గుర్తించాలని రిజిస్ట్రార్(జ్యుడీషియల్)ను ఆదేశించారు. విచారణ జరిపిన రిజిస్ట్రార్.. ఇందుకు ఇద్దరు అధికారులను బాధ్యులుగా తేల్చారు. వారిపై పాలనాపరమైన చర్యల నిమిత్తం ఈ వ్యవహారాన్ని ప్రధాన న్యాయమూర్తి ముందుంచాలని రిజిస్ట్రార్ జనరల్‌ను జస్టిస్ దేవానంద్ ఆదేశించారు. -
బాక్సైట్ కాదు.. లేటరైట్
‘‘ఆ ప్రాంతంలో ఉన్నది బాక్సైట్ కాదు లేటరైట్’’ అని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 2010లో స్పష్టం చేసింది. అయినా అక్కడ బాక్సైట్ తవ్వకాలు జరుగుతున్నాయంటూ ప్రచారం. ‘‘ఈ ప్రభుత్వం కొత్తగా ఎవరికీ లేటరైట్ మైనింగ్ లీజులు ఇవ్వలేదు. నాతవరం మండలంలోని భమిడిక గ్రామంలో ఒక్కచోట మాత్రం టీడీపీ ప్రభుత్వహయాంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకే మైనింగ్ జరుగుతోంది.’’ అంటూ గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది ఇప్పటికే రెండుసార్లు మీడియాకు ఆధారాలతో సహా వివరించారు. అయినా ఈ ప్రభుత్వం లీజులిచ్చేస్తోంది అంటూ విమర్శలు... ఒక అబద్దాన్ని పదేపదే చెబితే నిజమైపోతుందనుకుంటూ ప్రతిపక్షం, ఒక వర్గం మీడియా చేస్తున్న గోబెల్స్ ప్రచారం చూసి జనం విస్తుపోతున్నారు. ఈ నేపథ్యంలో గోపాలకృష్ణ ద్వివేది శనివారం మరోమారు మీడియాకు వివరించి ఆధారాలన్నిటినీ చూపించారు. సాక్షి, అమరావతి: విశాఖపట్నం జిల్లా నాతవరం మండలం భమిడిక భూముల్లో లేటరైట్ ఖనిజం ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) 2010 లోనే స్పష్టం చేసిందని గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. అక్కడ బాక్సైట్ తవ్వకాలు జరుపుతున్నట్లు చేస్తున్న ఆరోపణలు అర్థరహితమన్నారు. విజయవాడలోని ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ప్రధాన కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రెండేళ్లుగా గనుల అక్రమ తవ్వకాలు, రవాణాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందన్నారు. జియోలాజికల్ సర్వే ఆధారంగా గనుల లీజులు ఇస్తారని, ఏ ఖనిజం ఎంత పరిమాణంలో ఉందనే అంశాన్ని సర్వే సంస్థ నిర్ధారిస్తుందని తెలిపారు. విశాఖ జిల్లా నాతవరం మండలం సరుగుడు పంచాయతీ పరిధిలోని భమిడికలో సర్వే చేయని కొండ పోరంబోకు 121 హెక్టార్లలో లేటరైట్ ఉన్నట్లు జీఎస్ఐ 2010లో నివేదిక ఇచ్చిందని తెలిపారు. సరుగుడు పంచాయతీలోని సుందరకోట, అసనగిరి లీజుల్లోను కేవలం లేటరైట్ మాత్రమే ఉందని జీఎస్ఐ తేల్చిందని తెలిపారు. 2004లో ఈ ప్రాంతానికి సమీపంలోని మరో రెండు లీజుల విషయంలో ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ (ఐబీఎం) కూడా అక్కడ కేవలం లేటరైట్ మాత్రమే ఉందని రిపోర్టు ఇచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం లీజులున్న ప్రాంతంలో లేటరైట్ మాత్రమే ఉందని, బాక్సైట్ లేదని జీఎస్ఐ, ఐబిఎం డాక్యుమెంట్ల ద్వారా స్పష్టమవుతోందన్నారు. ఆరు వారాల్లో తీర్పు అమలు చేయాలన్నారు భమిడిక లీజుకు అప్పటి ప్రభుత్వం లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్ఓఐ) 2010 అక్టోబరు 12న ఇచ్చిందని తెలిపారు. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ 2014 నవంబరు 17న అక్కడ తవ్వకాలు జరిపేందుకు ఆనుమతులు ఇచ్చిందన్నారు. 2014 డిసెంబర్ 4న ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ) మైనింగ్‌కు అవసరమైన సరంజామా పెట్టుకోవడానికి అనుమతి ఇచ్చిందన్నారు. జీఎస్ఐ, ఐబీఎం, పర్యావరణ మంత్రిత్వ శాఖ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అక్కడ బాక్సైట్ ఉన్నట్లు చెప్పలేదన్నారు. ఆలాంటప్పుడు ఇక్కడ బాక్సైట్ తవ్వకాలు జరుగుతున్నట్లు, బాక్సైట్ ఎత్తుకెళుతున్నట్లు ఎలా చెబుతారని ప్రశ్నించారు. విశాఖ జిల్లాలో ఆ ప్రాంతంలో ఆరు లీజులుండగా, అందులో ఈ ఒక్క లీజుకు మాత్రమే.. అది కూడా 2018 ఆగస్టు 18న హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం వల్ల అనుమతి ఇచ్చామని తెలిపారు. లీజుదారుడు పర్యావరణ, కాలుష్య నియంత్రణ అనుమతులు అన్నీ తీసుకున్న తర్వాత హైకోర్టు మార్గదర్శకాల ప్రకారం 2021 ఫిబ్రవరి 5న లీజు ఇచ్చామన్నారు. ఆరు వారాల్లోగా హైకోర్టు ఉత్తర్వులు అమలు చేయాలని అప్పట్లో ఆదేశాలు జారీ అయ్యాయని తెలిపారు. ఐదు లీజుల్లో తవ్వకాలు బంద్ ఆరు లీజుల్లో ఒకదాని కాల పరిమితి ముగియగా, అక్రమ తవ్వకాలు చేస్తున్నారనే ఫిర్యాదులతో నోటీసులు జారీ చేసి రెండింటిని మూసి వేయించినట్లు తెలిపారు. శింగం భవాని, లోవరాజు పేరు మీద ఉన్న ఈ రెండు లీజుల్లో 2.3 లక్షల టన్నుల లేటరైట్‌ను అక్రమంగా తవ్వినట్లు తనిఖీల్లో బయపడిందని తెలిపారు. వారికి సుమారు రూ.19 కోట్లు జరిమానా విధించి తవ్వకాలు నిలిపి వేయించామన్నారు. మిగిలిన మరో రెండు లీజులకు సరైన రోడ్డు సౌకర్యం లేక తవ్వకాలు జరగడం లేదన్నారు. మొత్తం 6 లీజులకు 5 చోట్ల తవ్వకాలు జరగడం లేదని తెలిపారు. విశాఖలో బాక్సైట్ తవ్వకాలు జరపాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఏ కోశానా లేదని స్పష్టం చేశారు. అయోమయం ఉండకూడదనే అన్ని ఆధారాలు చూపిస్తున్నామని తెలిపారు. ఆరు వారాల్లోగా లీజు కేటాయించాలని ఆదేశిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీ -
ఏపీలో ఎక్కడా అక్రమ మైనింగ్ జరగడం లేదు: ద్వివేది
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడా అక్రమ మైనింగ్ జరగడంలేదని గనుల శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. లేటరైట్‌కు సంబంధించి 5వేల టన్నులకు మాత్రమే అనుమతి ఉందన్నారు. 2018లో ఇచ్చిన కోర్టు ఉత్తర్వుల మేరకు 2021లో అనుమతిచ్చామని వెల్లడించారు. కావాలనే కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైకోర్టు తీర్పును అనుసరించి ఒక్కచోటే మైనింగ్ జరుగుతోందన్నారు. నిబంధనలు పాటించని లీజుదారులకు జరిమానా విధించామని తెలిపారు. విశాఖపట్నంలో బాక్సయిట్ మైనింగ్ చేసే ఆలోచనే లేదన్నారు. -
ఉపాధిలో నంబర్ వన్ ఏపీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం అమలు తీరును కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్–జూన్ నెలల మధ్య దేశవ్యాప్తంగా పథకం అమలు తీరుపై కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ నాగేంద్రనాథ్ సిన్హా బుధవారం అన్ని రాష్ట్రాల గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో వర్చువల్ విధానంలో సమీక్ష నిర్వహించారు. విజయవాడ నుంచి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్, ఉపాధి హామీ పథకం డైరెక్టర్ చినతాతయ్య తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకం అమలులో నాలుగు సూచీలలో దేశంలో మన రాష్ట్రమే మొదటి స్థానంలో నిలవగా.. మిగిలిన ఇతర సూచీలలోనూ రాష్ట్రం మొదటి ఐదు స్థానాల్లో నిలిచింది. దీంతో కేంద్ర కార్యదర్శి నాగేంద్రనాథ్ సిన్హా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. మూడు నెలల్లో దేశంలోనే అత్యధికంగా 17.29 కోట్ల పని దినాల పాటు పేదలకు పనులు కల్పించడం.. పనులు పారదర్శకంగా జరిగాయా లేదా అన్న దానిపై సోషల్ ఆడిట్ నిర్వహించడంలో మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రం ఎంతో ముందు ఉందని అధికారులు వెల్లడించారు. పని చేపట్టే ప్రాంతాలను అన్లైన్ జియో ట్యాగింగ్‌లో గుర్తించే జీఐఎస్ ప్రణాళికల రూపకల్పనలోను, సీఎఫ్‌పీ సూచీలోను రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. చేపట్టిన పనులలో 96 శాతం పూర్తి చేస్తుండటంపై కేంద్ర కార్యదర్శి రాష్ట్రాన్ని అభినందించారు. ‘వ్యవసాయ’ పనులే 70 శాతం రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల్లోనే 70 శాతం పనులు చేపడుతుండటంపై కేంద్రం అభినందించింది. పథకం అమలుకు దేశం మొత్తం మీద ఖర్చు చేస్తున్న వ్యయంలో 60 శాతం ఈ రంగంలో పనులు వెచ్చిస్తుండగా.. రాష్ట్రంలో 70 శాతం ఖర్చు పెట్టింది. -
రాష్ట్రంలో బాక్సైట్ తవ్వకాలు జరగడం లేదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎక్కడా బాక్సైట్ తవ్వకాలు జరగడం లేదని గనుల శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. అయినా విశాఖ జిల్లాలో బాక్సైట్ తవ్వకాలు జరుగుతున్నాయని ఓ పత్రిక తప్పుడు కథనం రాసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలోని ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అలాగే లేటరైట్ మైనింగ్‌లో రూ.15 వేల కోట్ల దోపిడీ జరిగిందని ఆ పత్రికలో వచ్చిన కథనం పూర్తిగా అవాస్తవమన్నారు. ప్రభుత్వ ప్రతిష్టను, గనుల శాఖ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు కుట్రపూరితంగా తప్పుడు కథనాలను ప్రచురించారని మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వంపై బురదజల్లేలా కథనాలు ప్రచురించిన ఆ పత్రికపై కోర్టులో పరువునష్టం కేసు దాఖలు చేస్తున్నామని తెలిపారు. మొత్తం తవ్వకాల విలువే అంత లేదు గత ప్రభుత్వంలో విశాఖ జిల్లాలో లేటరైట్ మైనింగ్ కోసం ఆరు లీజులిచ్చారని ద్వివేది తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలతోనే ఒక మైనింగ్ మాత్రమే లీజుకు అనుమతి ఇచ్చిందన్నారు. ఆ లీజుదారు ఇప్పటి వరకు కేవలం 5 వేల టన్నుల లేటరైట్ తవ్వారని తెలిపారు. 5 వేల టన్నుల తవ్వకాల్లో రూ.15 వేల కోట్ల అక్రమాలు ఎలా జరుగుతాయని ప్రశ్నించారు. మొత్తం తవ్వకాల విలువే అంత లేనప్పుడు, అన్ని వేల కోట్ల అక్రమాలు ఎలా జరుగుతాయన్నారు. రాష్ట్రంలో అటవీ వనరులను కాపాడటం, పర్యావరణ పరిరక్షణకు సీఎం వైఎస్ జగన్ అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో అటవీ ప్రాంతాన్ని పరిరక్షించుకోవడానికి మైనింగ్ లీజుల విషయంలో ప్రభుత్వం పర్యావరణానికే తొలి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రాష్ట్రంలో ఎక్కడా అనుతివ్వలేదు విశాఖ జిల్లాలో ప్రభుత్వ అనుమతితో జరుగుతున్న లేటరైట్ తవ్వకాలను బాక్సైట్ తవ్వకాలుగా చిత్రీకరిస్తూ తప్పుడు కథనాలు ప్రచురించడాన్ని ఖండిస్తున్నామని భూగర్భ గనుల శాఖ సంచాలకులు (డీఎంజీ) వి.జి.వెంకటరెడ్డి తెలిపారు. లేటరైట్, బాక్సైట్ ఖనిజాలు వేరువేరుగా ఉంటాయని, రాష్ట్రంలో ఎక్కడా బాక్సైట్ ఖనిజాల మైనింగ్‌కు అనుమతి ఇవ్వలేదన్నారు. ప్రస్తుతం మైనింగ్ జరుగుతున్న ప్రదేశంలో లభించే ఖనిజం లేటరైట్ అని 2010లోనే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ఇచ్చిందని వెల్లడించారు. విశాఖ జిల్లాలోని నర్సీపట్నం ప్రాంతంలో 1981–82లో జరిగిన పరిశోధనల్లో ఇక్కడ లభించే ఖనిజం లేటరైట్‌గా నిర్ధారించారని తెలిపారు. కేవలం ఒక లీజు ద్వారా జరుగుతున్న లేటరైట్ మైనింగ్‌లో ఇప్పటి వరకు 5 వేల టన్నుల లేటరైట్‌ను వెలికితీశారన్నారు. అయ్యన్న అక్రమాలకు ఆధారాలు గత ప్రభుత్వంలో లేటరైట్ మైనింగ్‌లో అప్పటి మంత్రి అయ్యన్నపాత్రుడు, ఆయన అనుయాయులు అనేక అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారణ జరిగిందని వెంకటరెడ్డి తెలిపారు. ఆ అక్రమాలపై వచ్చిన ఫిర్యాదుల మేరకు మైనింగ్ అధికారులు విచారణ జరిపారని, అప్పటి అక్రమ మైనింగ్‌లపై భారీ జరిమానాలు కూడా విధించామని చెప్పారు. ఇసుక కొరత లేదు జగనన్న కాలనీలకు ఇసుక కొరత లేదని గోపాలకృష్ణ ద్వివేది, వెంకటరెడ్డి తెలిపారు. జేపీ పవర్ వెంచర్స్ సంస్థ ఇసుక తవ్వకాలు, విక్రయాలు జరుపుతోందని, రాష్ట్ర వ్యాప్తంగా 200 రీచ్‌ల్లో తవ్వకాలు జరుగుతున్నాయన్నారు. రోజుకు దాదాపు 2 లక్షల టన్నుల వరకు ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని చెప్పారు. వర్షాకాలం కోసం ఇప్పటికే 50 లక్షల టన్నుల ఇసుకను నిల్వ చేశామన్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి ఇరిగేషన్ శాఖ క్లియరెన్స్‌తో పూడికగా ఉన్న ఇసుక నిల్వలను ట్రెడ్జింగ్ చేసి సామాన్యులకు అందుబాటులోకి తెస్తామన్నారు. జగనన్న కాలనీల్లో ఇసుక కోసం రీచ్‌లకు 40 కిలోమీటర్ల లోపు ఉన్న వారు ఉచితంగా ఇసుకను తెచ్చుకునేందుకు కూపన్లను ఇస్తున్నామన్నారు. అంతకంటే ఎక్కువ దూరంలో ఉన్న వారికి ప్రభుత్వమే కాలనీల వద్దకు ఇసుక రవాణా చేస్తోందని తెలిపారు. బోట్స్ మెన్ సొసైటీలకు గతంలో ఇసుక తవ్వకాలకు అనుమతి ఉండేదని, ప్రస్తుతం కూడా అలా అనుమతులు కావాలని వారు కోరుతున్న మాట వాస్తవమేనన్నారు. దీనిని కూడా పరిశీలిస్తున్నామన్నారు. -
తప్పుడు వార్తలు రాసేవారిపై పరువు నష్టం దావా వేస్తాం
-
తప్పుడు వార్తలు రాసేవారిపై పరువు నష్టం దావా వేస్తాం
సాక్షి, అమరావతి : విశాఖ జిల్లాలో బాక్సైట్ మైనింగ్‌కు ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదని పంచాయతీరాజ్‌శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. 2010 నుంచి 2014 వరకు లేటరైట్‌కు ఆరు లీజులిచ్చారని, కొన్ని మీడియా సంస్థలు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ 5 మెట్రిక్ టన్నుల మైనింగ్ చేస్తే రూ.15వేల కోట్ల స్కామ్ ఎలా జరుగుతుంది?. తప్పుడు వార్తలు రాస్తూ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు. తప్పుడు వార్తలు రాసేవారిపై పరువు నష్టం దావా వేస్తాం. జగనన్న కాలనీలకు ఎక్కడా ఇసుక కొరత లేదు. రోజూ 2లక్షల టన్నుల ఇసుక ఉత్పత్తి చేస్తున్నాం. 40 కి.మీ.లోపల ఉన్నవారు ఉచితంగా ఇసుక తీసుకెళ్లొచ్చు’’ అని అన్నారు. -
అన్ని ఇసుక రీచ్‌లలో తవ్వకాలు ప్రారంభించండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జేపీ పవర్ వెంచర్స్‌కు స్వాధీనం చేసిన అన్ని ఇసుక రీచ్‌లలో తవ్వకాలు, విక్రయాలు వెంటనే ప్రారంభం కావాలని గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. తాడేపల్లిలోని సీఎం కార్యాలయం నుంచి ఇసుక ఆపరేషన్స్‌పై గనుల శాఖ సంచాలకులు వీజీ వెంకటరెడ్డితో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులతో మాట్లాడారు. ఏపీఎండీసీ ఆధ్వర్యంలో నడుస్తున్న అన్ని ఇసుక రీచ్‌లను గత నెల 14వ తేదీన జేపీ పవర్ వెంచర్స్‌కు స్వాధీనం చేసినట్టు తెలిపారు. గత నెల 17 నుంచి ఆ సంస్థ ద్వారా ఇసుక తవ్వకాలు, విక్రయాలు, నిల్వ, రవాణా ప్రారంభమయ్యాయన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 384 రీచ్‌లు జేపీ గ్రూపునకు అప్పగించగా, వాటిల్లో 136 రీచ్‌లలోనే ఇసుక ఆపరేషన్లు జరుగుతుండటంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తక్షణం మిగిలిన అన్ని రీచ్‌ల్లోనూ ఇసుక ఆపరేషన్స్ ప్రారంభం కావాలని, ఇందుకోసం జాయింట్ కలెక్టర్(రెవెన్యూ)లు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. ఆయా జిల్లాల పరిధిలోని రీచ్‌లలో జరుగుతున్న ఇసుక ఆపరేషన్స్‌పై కాంట్రాక్ట్ ఏజెన్సీ, శాండ్, మైనింగ్ అధికారులు రోజువారీ నివేదికలను జేసీలకు పంపాలని సూచించారు. వినియోగదారులకు సులభంగా ఇసుక లభ్యమయ్యేలా ఇసుక డిపోల ఏర్పాటును పరిశీలించాలని జేసీలను ఆదేశించారు. ప్రతి రీచ్ వద్ద కచ్చితంగా టన్ను ఇసుక రూ.475కు విక్రయించేలా చూడాలన్నారు. వర్షాకాలం నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అంచనాలకు అనుగుణంగా ఇసుక నిల్వలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. -
‘పరిషత్’ ఎన్నికలకు పక్కా ఏర్పాట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నితో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది శనివారం భేటీ అయ్యారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు జిల్లాల్లో పక్కా ఏర్పాట్లు చేసినట్టు ఆమెకు వివరించారు. ఎన్నికల ఏర్పాట్లపై చర్చించేందుకు ఆ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ కూడా ఎస్ఈసీతో వేరుగా భేటీ అయ్యారు. ఆ తరువాత ద్వివేది, గిరిజాశంకర్ తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో 13 జిల్లాల ఎన్నికల సూపర్వైజరీ అధికారులతో సమావేశమయ్యారు. సూపర్వైజరీ అధికారులు ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మేరకు జిల్లాల్లోని అధికారులను సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు తగిన చర్యలు చేపట్టాలని ద్వివేది ఆదేశించారు. -
Andhra Pradesh: ఎండిన నదులకు ఎనర్జీ
సాక్షి, అమరావతి: ఒకప్పుడు గలగలపారే నీటితో కళకళలాడిన ఎన్నో నదులు ఇప్పుడు వివిధ కారణాలతో ఏడాది పొడవునా ఎడారిని తలపిస్తున్నాయి. చెలమల్లోనూ చుక్కనీటి జాడ కూడా కనిపించని దుస్థితి. ఇలా ఎండిన నదులకు పునరుజ్జీవం తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. తమిళనాడులోని నాగా నది విషయంలో వచ్చిన సత్ఫలితాల స్ఫూర్తితో ఏపీ సర్కారు కూడా ఈ వినూత్న కార్యక్రమానికి సమాయత్తమైంది. ఇందుకోసం ముందుగా నాలుగు సీమ జిల్లాలతోపాటు ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కో నదిని గుర్తించింది. శ్రీకాకుళం జిల్లాలోని చంపావతి, ప్రకాశంలో గుండ్లకమ్మ, అనంతపురంలో పెన్నా, కర్నూలులో హంద్రీ, వైఎస్సార్ జిల్లాలో పాపాగ్ని, చిత్తూరు జిల్లాలో స్వర్ణముఖి నదిని ఈ కార్యక్రమం కింద ఎంపిక చేశారు. ఉపాధి హామీ పథకం నిధులతో ఈ నదుల పునరుజ్జీవం కార్యక్రమాన్ని సర్కారు చేపట్టనుంది. పునరుజ్జీవానికి ఏమి చేస్తారంటే.. నదీ గర్భంలోనూ, నదికి ఇరువైపులా ఉండే ప్రాంతంలో కురిసే వర్షపు నీరు సముద్రంలో కలవకుండా వాటర్‌షెడ్ తరహాలో ప్రభుత్వం కట్టడాలు నిర్మిస్తుంది. నదీ గర్భంలోని ఇసుక పొరల కింద నుంచి పారే నీటిని ఎక్కడికక్కడే ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి నది పొడవునా పలుచోట్ల చిన్నచిన్న సబ్‌సర్ఫేస్ డ్యామ్‌లు (నది పొరల కింద కట్టేవి) నిర్మిస్తారు. అంటే.. నదీ గర్భంలో గట్టి నేల వచ్చేదాక తవ్వుతారు. అక్కడ బంకమట్టితో కట్ట కడతారు. తర్వాత ఇసుకతో కప్పేస్తారు. దీనివల్ల ఇసుక పొరల్లోంచి ముందుకు పారే నీటికి అడ్డుకట్ట పడుతుంది. నీటి వాలు, నది లోతును బట్టి వీటిని ఎంతెంత దూరంలో నిర్మించాలనేది నిర్ణయిస్తారు. ► అలాగే, నది పుట్టక ప్రాంతం నుంచి.. దాని పరీవాహక ప్రాంతం మొత్తంలో సబ్‌సర్ఫేస్ డ్యామ్‌లు, పర్కులేషన్ ట్యాంకులను (ఊట చెరువుల మాదిరి) నిర్మించి ఆ చుట్టుపక్కల వాగుల ద్వారా వర్షపు నీటిని నదిలోకి మళ్లిస్తారు. ► ఒక్కో నది వద్ద సుమారు 200 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ తరహా పనులు చేపట్టే అవకాశముంది. ► ఇలా ఒక్కో నది వద్ద మూడేళ్ల పాటు ఈ తరహా కార్యక్రమాలు చేపడతారు. ఈ కాలంలో ఒక్కో దానికి రూ.50–70 కోట్లు ఖర్చుపెట్టే అవకాశముందని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వెల్లడించారు. మే నుంచి పనులు ప్రారంభం ఇదిలా ఉంటే.. ఈ ఆరు నదుల వద్ద ఏయే పనులు చేపట్టాలన్న దానిపై ‘వ్యక్తి వికాస కేంద్ర ఇండియా’ సంస్థ నిపుణులు, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ సిబ్బంది కలిసి ఏప్రిల్ నెల మొత్తం క్షేత్రస్థాయిలో పర్యటించి చేపట్టాల్సిన పనులను గుర్తిస్తారు. ఆ తర్వాత మే నుంచే పనుల ప్రారంభించి, వర్షాకాలానికి ముందే కొన్ని ముఖ్యమైన పనులను ఆయా ప్రాంతాల్లో పూర్తిచేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి వివరించారు. పాత మ్యాప్‌ల ఆధారంగా చర్యలు నదుల పునరుజ్జీవం కార్యక్రమంలో భాగంగా ఎండిపోయిన నదుల్లో నీటిని చేర్చడానికి అవకాశం ఉన్న వాగులు, వంకలన్నింటిని అభివృద్ధి చేస్తాం. నదీ పరివాహక ప్రాంతానికి సంబంధించి పాత మ్యాప్‌లను ఆధారంగా చేసుకుని పనులు గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఈ కార్యక్రమం నిమిత్తం కొన్ని ప్రముఖ సంస్థల నుంచి సాంకేతిక సహాయం తీసుకుంటున్నాం. జలశక్తి అభియాన్ కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం పెద్దఎత్తున ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో వారి తోడ్పాటు కూడా ఈ కార్యక్రమానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమం ద్వారా పనులు చేపడుతున్న నదుల పరీవాహక ప్రాంతాల్లో భూగర్భ జలమట్టాలు బాగా పెరిగడం ద్వారా అక్కడ అనేక సమస్యలకు పరిష్కారం దొరికే అవకాశం ఉంది. – గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి నాగా నది అనుభవంతో.. తమిళనాడులో ఎండిపోయిన నాగా నది పునరుజ్జీవనానికి ప్రముఖ ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ (ఆర్ట్ ఆఫ్ లివింగ్)కు చెందిన ‘వ్యక్తి వికాస కేంద్ర ఇండియా’ సంస్థ చేసిన కృషి సత్ఫలితాలివ్వడంతో ఆ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మరిన్ని మెరుగైన ఫలితాల సాధనకు మన రాష్ట్రంలోనూ ఈ పథకానికి రూపకల్పన చేశారు. ఈ ప్రక్రియతో అక్కడ సాగు విస్తీర్ణం, నది వెంబడి పచ్చదనం కూడా పెరిగింది. కర్ణాటకలో కూడా మరో నదికి పనిచేసిన అనుభవం ఈ సంస్థకు ఉండడంతో గ్రామీణాభివృద్ధి శాఖాధికారులు రెండ్రోజుల క్రితం దీనితో ఎంఓయూ కుదుర్చుకున్నారు. నది పునరుజ్జీవం కోసం నదీ గర్భంలోనూ, నదీ పరీవాహకంలో ఎక్కడ ఏ పనులు చేపట్టాలన్నా.. పనుల గుర్తింపు, వాటి పర్యవేక్షణలో ఆ సంస్థ ప్రతినిధుల గ్రామీణాభివృద్ధి శాఖ సిబ్బందికి తోడ్పాటు అందిస్తారు. -
‘స్వచ్ఛ’ గ్రామం.. జగనన్న సంకల్పం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని గ్రామాలన్నింటినీ పరిశుభ్రంగా ఉంచాలని, వాటిని ‘స్వచ్ఛ’ గ్రామాలుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా పట్టణ ప్రాంతాల్లో మాదిరి గ్రామాల్లోనూ ప్రతిరోజూ ఇంటింటి నుంచి చెత్తను సేకరించడం, ప్రతిరోజూ రోడ్లను ఊడ్చే కార్యక్రమాలను చేపట్టనుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజైన జూలై 8వ తేదీ నుంచి ‘జగనన్న స్వచ్ఛ సంకల్పం’ పేరుతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. గ్రామాల్లోని వీధుల్లో చెత్తకుప్పలు ఉండరాదు.. ఇళ్ల మధ్య నీటిగుంతలు కనిపించకూడదు.. రోడ్లపై చెత్త, మురుగునీరు ఎక్కడా నిల్వ ఉండరాదు.. వీధులన్నీ పరిశుభ్రంగా ఉండాలి.. అనే సంకల్పంతో ఈ కార్యక్రమం చేపడుతోంది. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో 100 రోజులపాటు ఈ బృహత్తర కార్యక్రమం కొనసాగుతుంది. ఆయా అంశాలపై గ్రామాల్లోని ప్రజల్లో అవగాహన కల్పించనుంది. అయితే గ్రామాల పరిశుభ్రతకు ఎన్ని కోట్ల నిధులు వెచ్చించినా ప్రజల భాగస్వామ్యం లేనిదే అనుకున్న లక్ష్యాలను సాధించడం కష్టమనే భావనతో పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు ఈ భారీ కార్యక్రమంలో ప్రణాళికాబద్ధంగా ప్రజలను పూర్తిగా భాగస్వాములను చేస్తూ అమలు చేసేందుకు ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేశారు. కార్యక్రమం అమలు ఇలా.. ► వీధుల్లో చెత్తకుప్పలు లేని.. చెత్తకుండీలు సైతం అవసరం లేని.. ఇళ్లమధ్య నీటి గుంతలకు తావులేని.. పూర్తి పరిశుభ్రమైన గ్రామంగా ఉండడానికి ప్రతిరోజూ ఎలాంటి పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలో, వాటన్నింటినీ రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో జూలై 8వ తేదీ నుంచి వంద రోజులపాటు పంచాయతీరాజ్ శాఖ అధికారులే అమలు చేసి చూపిస్తారు. ఈ వంద రోజుల కార్యక్రమానికయ్యే ఖర్చును పంచాయతీరాజ్ శాఖ నిధుల నుంచే వ్యయం చేస్తారు. ► వందరోజుల సమయంలోనే గ్రామం పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల కుటుంబ ఆరోగ్య విషయాల్లో కనిపించే ప్రయోజనాలపై గ్రామస్తులకు అవగాహన పెంచే ప్రచార కార్యక్రమాలను కొనసాగిస్తారు. ► గ్రామాల్లో విచ్చలవిడిగా ప్లాస్టిక్ వినియోగం జరుగుతుండడం వల్ల జరిగే అనర్థాలపైనా ప్రజలలో అవగాహన కల్పిస్తారు. ► వంద రోజులపాటు రాష్ట్రంలోని గ్రామాలన్నింటినీ పూర్తి పరిశుభ్రంగా ఉంచడాన్ని చూపించి.. ఆ తర్వాత తమ ఊరిని పరిశుభ్రంగా ఉంచుకునే బాధ్యతను గ్రామ పంచాయతీకి, స్థానిక ప్రజలకు అప్పగిస్తారు. ఇందుకు గ్రామ పంచాయతీలో ఉన్న నిధులు సరిపోనిపక్షంలో ప్రజల భాగస్వామ్యం అవసరాన్ని అధికారులు ప్రత్యేక ప్రచార కార్యక్రమాల ద్వారా తెలియచెబుతారు. చెత్తను ఇష్టానుసారం రోడ్లపైన వేయడం, మురుగునీటిని రోడ్లపైకి మళ్లించడం వంటి అపరిశుభ్ర కార్యక్రమాలకు పాల్పడేవారిపై అవసరమైతే పెనాల్టీలు వసూలు చేసుకునే అధికారాలను గ్రామపంచాయతీలకు అప్పగిస్తారు. ఏప్రిల్ 7 నుంచి సన్నాహక కార్యక్రమాలు ప్రపంచ ఆరోగ్య దినోత్సవమైన ఏప్రిల్ 7వ తేదీ నుంచే సన్నాహక కార్యక్రమాలను పంచాయతీరాజ్ శాఖ మొదలుపెట్టనుంది. గ్రామాలు పరిశుభ్రంగా ఉంచడానికి అవసరమైన అన్నిరకాల ఆధునిక పనిముట్లను ఈ సందర్భంగా గుర్తించి ఆయా గ్రామ పంచాయతీలకు అందజేస్తుంది. గ్రామంలో ఎవరూ చెత్తను రోడ్డుపై పడవేయకుండా ఇంటింటి నుంచి చెత్త సేకరణకు ట్రైసైకిళ్లు, మురుగు కాల్వలు శుభ్రం చేసేందుకు హై ప్రెజర్ టాయిలెట్ క్లీనర్లు, ఫాగింగ్ మిషన్లను అన్ని గ్రామ పంచాయతీల వద్ద అందుబాటులో ఉంచనుంది. ఇప్పటికే గ్రామ పంచాయతీల వద్ద అందుబాటులో ఉన్న పరికరాలకు అదనంగా కావాల్సినచోట మరికొన్నింటిని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నిధుల ద్వారా కొనుగోలు చేస్తారు. సేకరించిన చెత్తను ప్రాసెస్ చేయడానికి గ్రామాల్లో అవసరమైన చోట్ల షెడ్లను ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా నిర్మిస్తారు. అధికారులతో ద్వివేది వీడియో కాన్ఫరెన్స్ ‘జగనన్న స్వచ్ఛ సంకల్పం’ పేరుతో గ్రామాల పరిశుభ్రతకు రాష్ట్ర ప్రభుత్వం జూలై 8 నుంచి మొదలుపెట్టే వంద రోజుల భారీ ప్రచార కార్యక్రమం అమలుపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది శుక్రవారం అన్ని జిల్లాల జెడ్పీ సీఈవోలు, డీపీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామాల పరిశుభ్రత విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో ఉన్నారని ఆయన చెబుతూ.. సొంత ఊరిని పరిశుభ్రంగా ఉంచుకోవడంలో ప్రజలను భాగస్వాములను చేసేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ సంపత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. (చదవండి: పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్.. 100 రోజుల ప్రచారం) -
ఇసుక టెండర్ల ప్రక్రియ అత్యంత పారదర్శకం
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వ సంస్థ.. ఎంఎస్టీసీ ద్వారా అత్యంత పారదర్శకంగా, పటిష్ట నిబంధనలతో టెండర్లు నిర్వహించి ఇసుక తవ్వకాలు, నిల్వ, విక్రయాలను ప్రైవేటు సంస్థకు అప్పగించామని రాష్ట్ర గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది చెప్పారు. ఎటువంటి లొసుగులు లేకుండా ఉండాలనే టెండర్ల ప్రక్రియలో అపార అనుభవం ఉన్న ఎంఎస్‌టీసీకి ఆ బాధ్యత అప్పగించామని, ఆ సంస్థ కొన్ని వందల టెండర్ల ప్రక్రియ నిర్వహించిందని తెలిపారు. అయినా కొంతమంది ఆరోపణలు చేస్తుండటం బాధాకరమన్నారు. రూ.950 కోట్ల ఇసుక కాంట్రాక్టులో రూ.2 వేల కోట్ల ఆదాయం వస్తుందనడం సరికాదన్నారు. ఈ మేరకు సచివాలయంలో సోమవారం ద్వివేది మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. 7 కేంద్ర ప్రభుత్వ సంస్థలతో సంప్రదింపులు జరిపాం.. ఇసుక తవ్వకాలు, నిల్వ, విక్రయాలు నిర్వహించే సంస్థలను ఎంపిక చేయడానికి ఏడు సంస్థలతో సంప్రదింపులు జరిపి ఎంఎస్టీసీతో భూగర్భ గనుల శాఖ ఎంవోయూ కుదుర్చుకుంది. దరఖాస్తు చేసుకున్న కంపెనీల సాంకేతిక సమర్థతలను పరిశీలించాక ఎంఎస్టీసీ ఆర్థిక బిడ్లను ఆహ్వానించింది. పోటీలో ఎక్కువమంది పాల్గొనేందుకు వీలుగా టెండర్ల స్వీకరణకు గడువు తేదీని పెంచింది. దీనిపై అన్ని ప్రముఖ దినపత్రికల్లో విస్తృతంగా ప్రకటనలు కూడా ఇచ్చింది. బిడ్ల దాఖలులో భయాలు, సందేహాలు లేకుండా ఉండేందుకు ఆన్లైన్ పద్ధతిలో టెండర్లు స్వీకరించింది. అత్యంత పారదర్శకంగా జయ్‌ప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్‌ను ఎంపిక చేసింది. ఎప్పుడూ లేని విధంగా కాంట్రాక్ట్ సంస్థ నుంచి రూ.120 కోట్ల బ్యాంకు గ్యారెంటీని కూడా స్వీకరించాం. ఈ సంస్థ ప్రతి 15 రోజులకు ఒకసారి, ముందుగానే తర్వాత 15 రోజులకు డబ్బును ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. గతేడాది ఇసుక తవ్వకాలు సుమారు 1.6 కోట్ల మెట్రిక్ టన్నులు కాగా తాజాగా ఏడాదికి 2 కోట్ల మెట్రిక్ టన్నుల ఇసుక తవ్వకాలు, సరఫరాను కనీస లక్ష్యంగా నిర్దేశించాం. దీనివల్ల కొరత లేకుండా ఇసుక అందుబాటులో ఉంటుంది. ఆన్లైన్ ద్వారా ఇసుకను బుక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. సర్వర్లు మొరాయించడం, నెట్వర్క్ సమస్యలు, కృత్రిమ కొరతను సృష్టించడం, మధ్యవర్తుల ప్రమేయం వంటి అక్రమాలకు చెక్ పడుతుంది. మెట్రిక్ టన్నుకు రూ.475 చెల్లిస్తే చాలు తాజా ఇసుక విధానం ప్రకారం.. మెట్రిక్ టన్నుకు రూ.475 చెల్లిస్తే చాలు.. ఎంత కావాలంటే అంత ఇసుకను తీసుకెళ్లొచ్చు. 175 నియోజకవర్గాలవారీగా రవాణా ఖర్చులతో కలిపి ప్రభుత్వం ధరలు ప్రకటిస్తుంది. ఈ ధరల కంటే అధిక ధరకు ఎవరైనా విక్రయిస్తే 14500కు ఫిర్యాదు చేయొచ్చు. ఇప్పటికే ఇసుక అక్రమాలను నివారించడానికి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఉంది. ఇసుక రీచ్ వద్ద మెట్రిక్ టన్నుకు రూ.475 చెల్లించగానే అందులో రూ.375 నేరుగా ప్రభుత్వ ఖజానాకు చేరుతుంది. మిగిలిన రూ.100 నిర్వహణా ఖర్చులు కింద కాంట్రాక్టర్‌కు వెళతాయి. టన్నుకు రూ.475 చొప్పున మొత్తం 2 కోట్ల మెట్రిక్ టన్నుల ఇసుక విలువ రూ.950 కోట్లు. ఇందులో కాంట్రాక్టు సంస్థ ప్రభుత్వానికి చెల్లించాల్సింది రూ.765 కోట్లు కాగా, మిగిలిన సొమ్ము యంత్రాలు, పరికరాలు, పంపిణీ, నిర్వహణా ఖర్చుల కింద కాంట్రాక్టు సంస్థకు వెళ్తుంది. ప్రజలకు మేలు చేయడానికే కొత్త ఇసుక విధానం నదుల పక్కనే ఉన్న గ్రామాల్లోనివారు సొంత అవసరాల కోసం ఎడ్ల బళ్ల ద్వారా ఉచితంగా ఇసుకను తెచ్చుకోవచ్చు. బలహీన వర్గాల ఇళ్ల నిర్మాణాలకు, ఆర్ అండ్ ఆర్ కాలనీలకు రాయితీపై సరఫరా ఉంటుంది. గతంలో మాదిరిగా ఉచితమని చెప్పి రూ.వందల కోట్లు దోపిడీ చేసే అవకాశం లేకుండా ప్రజలకు మేలు చేయడానికే కొత్త ఇసుక విధానానికి రూపకల్పన చేశాం. కాంట్రాక్టు పొందిన సంస్థ నిబంధనల విషయంలో విఫలమైతే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. -
ప్రారంభమైన మూడో దశ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
మధ్యాహ్నం 4.00 మూడో విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. 2,639 సర్పంచ్, 19,553 వార్డులలో ఓట్ల లెక్కింపు మొదలైంది. మధ్యాహ్నం 3.30 మూడవ విడత పంచాయితీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఎన్నికలు ముగిసే సమయానికి శ్రీకాకుళం 75.70, విజయనగరం 84.6, వెస్ట్ గోదావరి 79.31, కృష్ణా 79.60, గుంటూరు 81.9, ప్రకాశం 79.31, నెల్లూరు 79.63, చిత్తూరు 77.31, కడప 68.42, కర్నూలు 79.90, అనంతపురం 78.32 శాతం పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం 3:00 మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన జమిగూడ, బొంగరం, లింగేటి తదితర పంచాయతీల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం అయ్యింది. మధ్యాహ్నం 2:30 పంచాయతీ ఎన్నికల్లో అపశ్రుతి పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ముంచంగిపుట్టు మండలం వుబ్బంగి నుంచి లక్ష్మీపురం వెళ్తున్న జీపు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 14 మంది ఓటర్లకు గాయాలు అయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఐదుగురిని చికిత్స నిమిత్తం పాడేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. అరకులో ఓటు హక్కు వినియోగించుకున్న ఎంపీ మాధవి కొయ్యూరు మండలం శరభన్నపాలెంలో అరకు ఎంపీ మాధవి, ఎమ్మెల్యే ఫాల్గుణ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 2:00 రాష్ట్రంలో మూడో దశ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఏజెన్సీ ప్రాంతాల్లో మధ్యాహ్నం 1:30 గంటలకే పోలింగ్ ముగిసింది. పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలైన కుక్కునూరు, వేలేరుపాడు, జీలుగుమిల్లి, బుట్టాయగూడెం, పరిధిలో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. మధ్యాహ్నం. 1.30 రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల మూడో దశ పోలింగ్ సజావుగా కొనసాగుతోంది. పలు గ్రామాల్లో ఓటర్లు క్యూ లైన్లలో బారులు తీరారు. మధ్యాహ్నం. 1.00 మధ్యాహ్నం 12.30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా మూడో విడత పంచాయితీ ఎన్నికల పోలింగ్ 66.48 శాతంగా నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. జిల్లాల వారిగా పోలింగ్ శాతాలు ఇలా ఉన్నాయి. ► శ్రీకాకుళం- 64.14 శాతం ►విజయనగరం- 78.5శాతం ►విశాఖపట్నం- 63.23శాతం ►తూర్పు గోదావరి- 67.14శాతం ►పశ్చిమ గోదావరి- 53.51శాతం ►కృష్ణా- 65.88 శాతం ►గుంటూరు- 71.67 శాతం ►ప్రకాశం- 69.95శాతం ►నెల్లూరు- 69.82 శాతం ►చిత్తూరు- 64.82 శాతం ►కడప- 57.34 శాతం ►ర్నూలు- 71 .96 శాతం ►అనంతపురం- 70.23 శాతం మధ్యాహ్నం 12.30 విశాఖపట్నం: జిల్లాలోని పలు గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల మూడో దశ పోలింగ్ కొనసాగుతోంది. పాడేరు ప్రభుత్వ జూనియర్ కాలేజి పోలింగ్ కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి పరిశీలించారు. మధ్యాహ్నం 12.00 ►అనంతపురం డివిజన్లోని 19మండలాల్లో మూడవ విడత గ్రామ పంచాయితీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11.30 గంటల వరకు 61.25 శాతం పోలింగ్ నమోదైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. ►తూర్పుగోదావరి: రంపచోడవరం నియోజకవర్గం మారేడుమిల్లి మండలం పుల్లంగి, బొడ్లంక పంచాయతీ గ్రామాల్లో పోలింగ్ సరళిని జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి పరిశీలించారు. ఉదయం. 11.30 పంచాయతీ ఎన్నికల మూడో దశ పోలింగ్ సజావుగా కొనసాగుతోంది. ఓటు వేయడానికి పలు గ్రామాల్లో ఓటర్లు క్యూలైన్లలో బారులు తీరారు. ఉదయం 11.00 ఏపీలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు అధిక సంఖ్యలో పోలింగ్‌లో పాల్గొంటున్నారు. ఉదయం 10:30 వరకు 40.29 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. జిల్లాల వారిగా నమోదైన పోలింగ్ శాతాలు ఇలా ఉన్నాయి. ►శ్రీకాకుళం- 42.65 శాతం ►విజయనగరం- 50.7 శాతం ►విశాఖపట్నం- 43.35 శాతం ►తూర్పు గోదావరి- 33.52 శాతం ►పశ్చిమ గోదావరి- 32 శాతం ►కృష్ణా- 38.35 శాతం ►గుంటూరు 45.90 శాతం ►ప్రకాశం 35.90 శాతం ►నెల్లూరు 42.16 శాతం ►చిత్తూరు 30.59 శాతం ►వైఎస్ఆర్ కడప 31.73 శాతం ►కర్నూలు 48.72 శాతం0 ►అనంతపురం 48.15 శాతం ఆముదాలవలస మండలం తొగరాం గ్రామంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఓటు హక్కు వినియోగించుకున్నారు ఉదయం. 10.30 ►గుంటూరు: గురజాల మండలం మాడుగులలో పోలింగ్‌ను అధికారులు నిలిపివేశారు. అభ్యర్థుల గుర్తులు తారుమారు కావటంతో 12, 13 వార్డుల్లో పోలింగ్ నిలిపివేసినట్లు వెల్లడించారు. ఈనెల 21న రెండు వార్డులకూ ఎలక్షన్ నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. ►అనంతపురం: ఆత్మకూరు మండలంలోని పలు గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల మూడో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మండలంలోని తోపుదుర్తి గ్రామంలో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ►పోలింగ్ కేంద్రాల వద్ద మానవతా దృక్పథంతో వ్యవహరించేలా ఆదేశాలు ఇచ్చామని జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు తెలిపారు. వృద్ధులు, వికలాంగులకు దగ్గరుండి సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. మూడో విడతలో 168 కేంద్రాలను సున్నితమైన ప్రాంతాలుగా గుర్తించామని, పోలింగ్ తర్వాత ఎవరైనా కక్ష సాధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు ఉదయం 10.00 ►విశాఖపట్నం: పంచాయతీ ఎన్నికల మూడో దశ పోలింగ్‌లో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వెన్నలపాలంలో అరకు వైస్సార్సీపీ ఎంపీ గొట్టేటి మాధవి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ►అనంతపురం: ఉరవకొండ మండలం రాకెట్లలో వైస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదే విధంగా జిల్లాలో ఉదయం 9.30 గంటల వరకు 32.21 శాతం పోలింగ్నమోదైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. ఉదయం. 9.30 పంచాయతీ ఎన్నికల మూడో దశ పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 8:30 గంటల వరకు జిల్లాల వారిగా పోలింగ్ శాతాలు ఇలా ఉన్నాయి. ►శ్రీకాకుళం- 12.87 శాతం ►విజయనగరం- 15.3 శాతం ►విశాఖపట్నం- 13.75 శాతం ►తూర్పు గోదావరి- 12.6 శాతం ►పశ్చిమ గోదావరి- 11.72 శాతం ►కృష్ణా - 8.14 శాతం ►గుంటూరు 18.83 శాతం ►ప్రకాశం 8.04 శాతం ►నెల్లూరు 9.1 శాతం ►చిత్తూరు 9.34 శాతం ►వైఎస్ఆర్ కడప 7.5 శాతం ►కర్నూలు 15.39 శాతం ►అనంతపురం 9.9 శాతం ఉదయం. 9.00 ►రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మూడవ విడత పంచాయితీ ఎన్నికల పోల్ శాతం 8.30 గంటల వరకు 11.74 శాతంగా నమోదైనట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. ►రాష్ట్రంలోని పలు పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు పెద్ద ఎత్తున క్యూలైన్లలో ఉన్నారు. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కర్నూలు జిల్లాలోని పాత ముచ్చుమర్రి, కొత్త ముచ్చుమర్రి గ్రామంలో 50 ఏళ్ల తర్వాత పోలింగ్ బూత్‌లకు వెళ్లి గ్రామ ప్రజలు ఓటు వేశారు. ఇన్ని సంవత్సరాలు తర్వాత ఓటు వేయడం పట్ల గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం. 8.30 ►వైఎస్సార్ కడపలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 8.30 గంటల వరకు జిల్లాలో 7.57 పోలింగ్ శాతం నమోదనట్లు అధికారులు పేర్కొన్నారు. ►విజయనగరం జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌లో అధిక సంఖ్యలో ఓటర్లు పాల్గొంటున్నారు. ఉదయం 7.30 గంటల వరకు 8.7 పోలింగ్ శాతం నమోదైనట్లు జిల్లా కలెక్టర్ డా. ఎం. హరి జవహర్ లాల్ తెలిపారు. పోలింగ్ ప్రక్రియను ఆయన కంట్రోల్ రూమ్ నుంచి ఆరా తీస్తున్నారు. ఉదయం.8.00 రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో పంచాయతీ ఎన్నికల మూడో దశ పోలింగ్ ప్రశాంతగా సాగుతోంది. మచిలీపట్నం నియజకవర్గంలోని పలు పోలింగ్ కేంద్రాల్లో ఆర్డీవో ఖాజావలి పోలింగ్ పక్రియను పరిశీలిస్తున్నారు. అదే విధంగా అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని సమస్యాత్మకమైన పోలింగ్ బూతులను జిల్లా ఎస్పీ సత్య యేసుబాబు పరిశీలిస్తున్నారు. ఉదయం. 7.30 పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటర్లు అధిక సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. అదే విధంగా 3,127 పోలింగ్ కేంద్రాలను అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా అధికారులు గుర్తించారు. మరో 4,118 కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. ఈ 7,245 కేంద్రాలలో పోలింగ్ ప్రక్రియను ఎన్నికల అధికారులు వెబ్ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. ఉదయం. 7.02 పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటు వేసేసి తమ పనులు చేసుకునేందుకు ఉదయాన్నే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు కరోనా నిబంధనలు పాటిస్తూ ఓటు వేయడానికి క్యూలైన్లలో వేచి ఉన్నారు. ఉదయం 6.30 ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల మూడో విడత పోలింగ్ బుధవారం ఉదయం ఆరున్నర గంటలకు ప్రారంభమైంది. ఓట్లు వేసేందుకు ఓటర్లు తరలివస్తున్నారు. కరోనా నేపథ్యంలో పూర్తి జాగ్రత్తలు తీసుకుని పోలింగ్ నిర్వహిస్తున్నారు. మాస్క్‌లు ధరిచేస్తే పోలింగ్ కేంద్రంలోకి ఓటర్లను అనుమతిస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 1.30 గంటల వరకు, మిగిలిన ప్రాంతాల్లో మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఉదయం. 6.25 సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 160 మండలాల పరిధిలోని 26,851 పోలింగ్ కేంద్రాలలో మూడో విడత పోలింగ్ ఉదయం 6.30 గంటలకు మొదలు కానుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 1.30 గంటల వరకు, మిగిలిన ప్రాంతాల్లో మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఆయా గ్రామ పంచాయతీల్లో పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే అర గంట వ్యవధిలోనే ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపడతారు. 7,757 మంది పోటీ: 2,639 సర్పంచ్ పదవులకు మరి కాసేపట్లో ఎన్నిక ప్రారంభం కానుంది. ఈ స్థానాలకు 7,757 మంది పోటీలో ఉన్నారు. ఆయా గ్రామ పంచాయతీల పరిధిలో 19,553 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరగనుండగా 43,612 మంది పోటీలో ఉన్నారు. సాక్షి, అమరావతి: మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ బుధవారం జరగనుంది. పోటీలో ఉన్న 51,369 మంది అభ్యర్థుల భవితవ్యం అదేరోజు తేలిపోనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 160 మండలాల పరిధిలోని 26,851 పోలింగ్ కేంద్రాలలో ఉదయం 6.30 గంటలకు పోలింగ్ మొదలు కానుండగా, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 1.30 గంటల వరకు, మిగిలిన ప్రాంతాల్లో మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఆయా గ్రామ పంచాయతీల్లో పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే అర గంట వ్యవధిలోనే ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపడతారు. మూడో విడతలో 3,221 గ్రామ పంచాయతీలలో ఎన్నికలు జరిపేందుకు నోటిఫికేషన్ జారీ కాగా, అందులో 579 సర్పంచ్ పదవులకు ఎన్నిక ఏకగ్రీవంగా ముగిసింది. ఇక విశాఖ జిల్లా పెదబయలు మండలం గిన్నెలకోట, పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం ఎల్ఎన్డీ పేట, ప్రకాశం జిల్లా కందుకూరు మండలం నర్రిశెట్టివారి పాలెం గ్రామ పంచాయతీల్లో ఒక్కరు కూడా నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో ఆ మూడు చోట్ల ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో మిగిలిన 2,639 సర్పంచ్ పదవులకు బుధవారం ఎన్నిక జరగనుంది. ఈ స్థానాలకు 7,757 మంది పోటీలో ఉన్నారు. ఆయా గ్రామ పంచాయతీల పరిధిలో 19,553 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరగనుండగా 43,612 మంది పోటీలో ఉన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 1,977 పోలింగ్ కేంద్రాలు మూడో విడతలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని 1,977 పోలింగ్ కేంద్రాలలో ఎన్నికలు జరగనున్నట్టు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. 3,127 పోలింగ్ కేంద్రాలను అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా అధికారులు గుర్తించారు. అదేవిధంగా మరో 4,118 కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. ఆ 7,245 కేంద్రాలలో పోలింగ్ ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల కమిషన్, పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు వెబ్ కెమెరాల ద్వారా పర్యవేక్షించనున్నారు. పోలింగ్ ప్రక్రియలో 76,019 మంది సిబ్బంది పాల్గొంటుండగా, 4,780 మంది పోలింగ్ పర్యవేక్షణ విధులలో పాల్గొననున్నారు. కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన ఓటర్లను పోలింగ్ ప్రక్రియ ముగిసే చివరి గంటలో ఓటింగ్‌కు అనుమతించనున్నట్టు ద్వివేది తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియలో 63,270 మంది పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే ఆయా గ్రామ పంచాయతీల పరిధిలోనే కేవలం అరగంట వ్యవధిలోనే ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపడతారు. మొదట ఆ గ్రామ పంచాయతీ పరిధిలో ఎన్నికలు జరిగిన వార్డుల ఓట్ల లెక్కింపును చేపట్టి, ఆ తర్వాత సర్పంచ్ పదవి ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. ఈ ప్రక్రియలో 63,270 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. -
ఆ జిల్లాల ఏకగ్రీవాలపై ఎస్ఈసీదే తుది నిర్ణయం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేపు( మంగళవారం) తొలి దశ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. మొత్తం 12 జిల్లాల్లో.. 2,724 గ్రామ పంచాయతీల్లో.. 29,732 పోలింగ్ కేంద్రాలలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 525 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయని తెలిపారు. అన్నిచోట్లా కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటున్నామని, మాస్కులు, గ్లోజులు, శానిటైజర్లు పంపిణీ చేశామని తెలిపారు. ( పర్యటన రద్దు.. హైదరాబాద్‌కు నిమ్మగడ్డ ) జోనల్ అధికారులు, మైక్రో అబ్జర్వర్లు సిద్ధంగా ఉన్నారని, కమాండ్ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామని చెప్పారు. 3 సైజులలో బ్యాలెట్ బాక్సులను ఎన్నికలకు సిద్ధం చేశామని వెల్లడించారు. ఈ సారి పంచాయతీ ఎన్నికల్లో నోటా గుర్తు కూడా ఉందని, నోటాకి పడిన ఓట్ల లెక్కింపు జరగదని పేర్కొన్నారు. గుంటూరు, చిత్తూరు జిల్లాల్లోని ఏకగ్రీవాలపై ఎస్ఈసీ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. -
ఈసీ సెన్సూర్ ఆర్డర్‌ని తిప్పి పంపిన ప్రభుత్వం
సాక్షి, విజయవాడ : ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సెన్సూర్ ఆర్డర్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిప్పి పంపింది. పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్‌లపై ఎన్నికల కమిషనర్ సెన్సూర్ ఆర్డర్‌కు బుధవారం ఆదేశాలు జారీ చేయగా ఎస్ఈసీకి ఆ అధికారం లేదని ప్రభుత్వం తిప్పి పంపింది. అధికారుల వివరణ లేకుండా ప్రొసీడింగ్స్‌ను జారీ చేయలేరన్న ప్రభుత్వం ఐఏఎస్ అధికారుల సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా చర్యలు తీసుకునే అధికారం లేదని తెలిపింది. అసలు అధికారుల వివరణ కూడా పెనాల్టీ ఎలా సిఫార్సు చేస్తారని ప్రశ్నించింది. ఇద్దరు సీనియర్ అధికారులపై చర్యలు తీసుకోవడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. చదవండి: ఆ ఇద్దరి బదిలీకి ఎస్ఈసీ ‘నో’ కాగా పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్లను బదిలీ చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అడ్డు చెప్పిన విషయం తెలిసిందే. కీలకంగా వ్యవహరించాల్సిన ఈ ఇద్దరినీ ఎన్నికల ప్రక్రియ మధ్యలో బదిలీ చేయడంవల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని ఆయన మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌కు లేఖ రాశారు. వారి బదిలీ ప్రతిపాదనను తిరస్కరించిన నిమ్మగడ్డ.. ఆ ఇద్దరిపై ‘సెన్సూర్’ పేరిట క్రమశిక్షణ చర్యలు తీసుకుంటూ మంగళవారం వేరుగా ఆదేశాలు జారీచేశారు. గ్రామ పంచాయతీల వారీగా ఓటర్ల జాబితా తయారీలో వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, విధి నిర్వహణలో వారు విఫలమైనట్లుగా వారి సర్వీసు రికార్డులో నమోదు చేయాలన్నారు. సెన్సూర్ కింద క్రమశిక్షణ చర్యలంటే ఒక ఏడాదిపాటు పదోన్నతులకు అవకాశం ఉండదని అర్ధం చేసుకోవాలని అధికార వర్గాలు చెప్పాయి. -
ఆ ఇద్దరి బదిలీకి ఎస్ఈసీ ‘నో’
సాక్షి, అమరావతి: పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్లను బదిలీ చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్ అడ్డు చెప్పారు. కీలకంగా వ్యవహరించాల్సిన ఈ ఇద్దరినీ ఎన్నికల ప్రక్రియ మధ్యలో బదిలీ చేయడంవల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని ఆయన మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌కు లేఖ రాశారు. వారి బదిలీ ప్రతిపాదనను తిరస్కరించిన నిమ్మగడ్డ.. ఆ ఇద్దరిపై ‘సెన్సూర్’ పేరిట క్రమశిక్షణ చర్యలు తీసుకుంటూ మంగళవారం వేరుగా ఆదేశాలు జారీచేశారు. గ్రామ పంచాయతీల వారీగా ఓటర్ల జాబితా తయారీలో వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారని పేర్కొన్నారు. అంతేకాక.. విధి నిర్వహణలో వారు విఫలమైనట్లుగా వారి సర్వీసు రికార్డులో నమోదు చేయాలన్నారు. సెన్సూర్ కింద క్రమశిక్షణ చర్యలంటే ఒక ఏడాదిపాటు పదోన్నతులకు అవకాశం ఉండదని అర్ధం చేసుకోవాలని అధికార వర్గాలు చెప్పాయి. ప్యానెల్ పేర్లు తిరస్కరణ: మరోవైపు.. ఎన్నికల కమిషనర్ కోరిన మేరకు గుంటూరు, చిత్తూరు జిల్లా కలెక్టర్లుగా కొత్త వారిని నియమించేందుకు వీలుగా ముగ్గురేసి అధికారులను ప్రతిపాదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్యానల్‌ను కూడా నిమ్మగడ్డ తిరస్కరించారు. ఈ విషయాన్ని సీఎస్‌కు రాసిన లేఖలో ఆయన తెలిపారు. విజిలెన్స్ కేసుల్లేని వారి పేర్లనే సూచించాలన్నారు. అప్పటివరకు వారి బాధ్యతలను ఆయా జిల్లాల జాయింట్ కలెక్టర్–1కు అప్పగించాలని నిమ్మగడ్డ ఆ లేఖలో పేర్కొన్నారు. ఆ ఇద్దరు కలెక్టర్లు జీఏడీకి..: గుంటూరు కలెక్టరు శామ్యూల్ ఆనంద్, చిత్తూరు జిల్లా కలెక్టరు నారాయణ్ భరత్‌గుప్తాలతో పాటు తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్‌రెడ్డిలను జీఏడీకి సరెండర్ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ మంగళవారం మూడు వేర్వేరు ఉత్తర్వులు జారీచేశారు. తదుపరి ఉత్తర్వులు జారీచేసే వరకు.. గుంటూరు జిల్లా జేసీ దినేష్‌కుమార్‌ను గుంటూరు జిల్లా కలెక్టరుగానూ, చిత్తూరు జిల్లా జేసీ మార్కండేయులను చిత్తూరు జిల్లా కలెక్టర్‌గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతల్లో నియమిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. చిత్తూరు ఎస్పీ సెంథిల్‌కుమార్‌కు తిరుపతి అర్బన్ ఎస్పీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. -
స్థానిక ఎన్నికలు: హైకోర్టును ఆశ్రయించిన సర్కార్
సాక్షి, అమరావతి: గ్రామ పంచాయతీ ఎన్నికల విషయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఏకపక్ష నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తలుపు తట్టింది. గ్రామ పంచాయతీలకు ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఈ నెల 8న జారీ చేసిన షెడ్యూల్‌ను సవాలు చేస్తూ శనివారం పిటిషన్ దాఖలు చేసింది. ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేస్తూ కమిషన్ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌తో పాటు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, బదిలీల నిలిపివేత తదితర చర్యలన్నింటినీ రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించి, రద్దు చేయాలని కోరుతూ పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఈ పిటిషన్ దాఖలు చేశారు. ప్రొసీడింగ్స్‌తో సహా తదుపరి చర్యల అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఈ వ్యాజ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శులతో పాటు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌ను వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చారు. ఎన్నికల తేదీని ప్రకటించే ముందు రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పనిసరిగా సంప్రదించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందని, హైకోర్టు సైతం రాష్ట్ర ప్రభుత్వం తన అభ్యంతరాలు, ఆందోళనలన్నింటినీ లిఖిత పూర్వకంగా ఎన్నికల కమిషన్ ముందుంచాలని ఆదేశించిందని ద్వివేదీ తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ ఆదేశాల మేరకు తాము తమ అభ్యంతరాలన్నింటినీ ఆధారసహితంగా ఎన్నికల కమిషనర్ ముందు ఉంచామని వివరించారు. ఎన్నికల కమిషన్‌తో సంప్రదింపులు జరపాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు సంబంధించిన కాపీ అందుబాటులోకి రాక ముందే, సంప్రదింపులకు రావాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పంచాయతీ రాజ్ కమిషనర్లకు నిమ్మగడ్డ రమేశ్ లేఖలు రాశారని తెలిపారు. ఈ వ్యాజ్యంపై సోమవారం హైకోర్టు విచారణ జరపనుంది. పిటిషన్‌లోని వివరాలు ఇంకా ఇలా ఉన్నాయి. సంప్రదింపుల వెనుక చిత్తశుద్ధి లేదు.. – రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా, ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా ఎన్నికల విషయంలో నిమ్మగడ్డ రమేశ్ ఓ నిర్ణయానికి వచ్చేశారు. ఈ నెల 8న సంప్రదింపులకు రావాలని అధికారులను ఆదేశించారు. – హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ముగ్గురు అధికారుల బృందం 8న సాయంత్రం ఎన్నికల కమిషనర్‌ను కలిసింది. మా బృందం కలిసి వచ్చిన కొద్ది గంటలకే ఎన్నికల కమిషనర్ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. – ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వేగాన్ని చూస్తే, సంప్రదింపుల ప్రక్రియ కేవలం ఓ ఫార్స్ అన్న సంగతి ఇట్టే అర్థమవుతోంది. సంప్రదింపుల విషయంలో కోర్టు ముందు అంగీకరించిన దానికి భిన్నంగా ఎన్నికల కమిషనర్ వ్యవహరించారు. నాలుగు దశల్లో ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్‌ను విడుదల చేశారు. దీనిని బట్టి షెడ్యూల్‌ను ముందుగానే సిద్ధం చేసుకున్నారని స్పష్టమవుతోంది. – తన పదవీ విరమణ తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోందని నిమ్మగడ్డ రమేశ్ స్వయంగా చేసిన ప్రకటనే, ఈ మొత్తం విషయాన్ని చెబుతోంది. ఆ ప్రకటనే ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసేలా చేసింది. – రాష్ట్ర ప్రభుత్వం తన అభిప్రాయాలను చెప్పడానికి ముందే ఎన్నికల షెడ్యూల్ తయారు చేశారు. కోర్టు ఆదేశాలను అమలు చేయడానికి మాత్రమే ప్రభుత్వాధికారులతో సంప్రదింపులు జరిపారే తప్ప, చిత్తశుద్ధితో జరపలేదు. సంప్రదింపుల ప్రక్రియను, కోర్టు ఆదేశాలను ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ అపహాస్యం చేశారు. కోవిడ్ వ్యాక్సినేషన్ ఎంతో ముఖ్యమని చెప్పినా వినలేదు – ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదనేందుకు ప్రభుత్వం చెప్పిన కారణాలు, క్షేత్ర స్థాయి పరిస్థితులను వివరిస్తూ అందజేసిన ఆధారాలను నిమ్మగడ్డ పరిగణనలోకి తీసుకోలేదు. ఏకపక్షంగా షెడ్యూల్ విడుదల చేశారు. – కోవిడ్ వ్యాక్సిన్ విషయంలో రాష్ట్రాలను సన్నద్ధం చేసేందుకు కేంద్ర హోం శాఖ, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలు రాష్ట్ర ప్రభుత్వాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నాయి. సాధారణ ఎన్నికలను ఎలా నిర్వహిస్తారో అలా కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం చెబుతూ వస్తోంది. – ప్రభుత్వ యంత్రాంగం మొత్తాన్ని ఈ కార్యక్రమంలో నిమగ్నం చేయాలని కోరుతోంది. ఈ నెల 11న ప్రధాన మంత్రి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కోవిడ్ వ్యాక్సిన్ సన్నద్దత, విధి విధానాలు తదితరాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు. – ఈ విషయాన్ని కూడా ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకెళ్లాం. ప్రధాన మంత్రి ప్రకటన తర్వాత నిర్ణయం తీసుకోవాలని కూడా కోరాం. ఇప్పటికే వ్యాక్సినేషన్ మార్గదర్శకాలను జారీ చేసిన విషయాన్ని కూడా కమిషనర్‌కు వివరించాం. పోలీసులతో సహా మొత్తం అధికార యంత్రాంగం కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గొనడం ఎంత ముఖ్యమో తెలియజేశాం. దురుద్దేశంతోనే ఈ నిర్ణయం – వీటన్నింటినీ బేఖాతరు చేస్తూ ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్ దురుద్దేశంతో ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. దీని వెనుక నిమ్మగడ్డకు కుటిల ఉద్దేశాలున్నాయి. ఎన్నికలను వాయిదా వేయాలన్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం క్షేత్ర స్థాయి పరిస్థితులను, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకుంది. – దీనికి, రాజకీయ పార్టీలకు ఎలాంటి సంబంధం లేదు. ప్రభుత్వ నిర్ణయాల్లో పార్టీ నేతల జోక్యం ఉండదు. ఇదే విషయాన్ని ఎన్నికల కమిషనర్‌కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చాలా స్పష్టంగా చెప్పారు. – నిమ్మగడ్డ రమేశ్ తన నోటిఫికేషన్లో బీహార్, కేరళ, అమెరికాలను ఉదాహరణగా పేర్కొన్నారు. ఆ ప్రాంతాల్లో ఎన్నికల తర్వాత కోవిడ్ కేసులు భారీగా పెరిగాయి. కేరళలో ఎన్నికలను నోటిఫై చేసిన నవంబర్ నాటికి 4.50 లక్షల కేసులు ఉంటే, మూడో దశ ఎన్నికల నాటికి ఆ సంఖ్య 6.50 లక్షలకు చేరింది. – ఈ రోజుకు (శనివారం) కేరళలో కోవిడ్ కేసులు 8.01 లక్షలు. అమెరికా విషయానికొస్తే, అమెరికా అధ్యక్ష్య ఎన్నికలు జరిగే నాటికి అక్కడ కోవిడ్ కేసులు 97.53 లక్షలు. ఇప్పుడు ఆ సంఖ్య 2.21 కోట్లకు చేరింది. – ఇదే రీతిలో రాజస్తాన్, బీహార్లలో కూడా ఎన్నికల తరువాత కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇక్కడ ఎన్నికలు నిర్వహించే నాటికి కోవిడ్ వ్యాక్సినేషన్‌కు సంబంధించి ఎలాంటి ప్రణాళికలు సిద్ధం కాలేదు. మార్గదర్శకాలు కూడా జారీ కాలేదు. నిమ్మగడ్డ ఇష్టాయిష్టాలకు ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టలేం – రాష్ట్ర ప్రభుత్వం ఎన్నడూ కూడా ప్రజాస్వామ్యయుతంగా నిర్వహించే ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోదు. ఎన్నికల ప్రక్రియపై రాష్ట్రానికి ఆపార గౌరవం ఉంది. ప్రజల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. – ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్ ఇష్టానుసారం తీసుకునే నిర్ణయాలకు ప్రజల ఆరోగ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పణంగా పెట్టలేదు. పౌరుల, ప్రభుత్వాధికారుల ఆరోగ్యాన్ని, ప్రాణాలను కాపాడాల్సిన రాజ్యాంగపరమైన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. – దేశం మొత్తం ఇప్పుడు జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం పరిధిలో ఉంది. ఇలాంటి సమయంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు చేయడం సరికాదు. దీనిపై మా అభ్యంతరాలను పట్టించుకోలేదు. – నిమ్మగడ్డ రమేశ్ ప్రభుత్వ వ్యతిరేక భావనతో ఉన్నారు. ఎన్నికల షెడ్యూల్ జారీ వెనుక సదుద్దేశాలు, హేతుబద్ధత ఎంత మాత్రం లేదు. కోవిడ్ వ్యాక్సినేషన్ దృష్ట్యా ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేయలేదన్న విషయాన్ని నిమ్మగడ్డ రమేశ్ ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్నారు. ప్రజల ఆరోగ్యం ముడిపడి ఉన్న ఈ వ్యవహారంలో న్యాయస్థానం జోక్యం చేసుకోవాలి. -
ప్రజారోగ్యాన్ని పణంగా పెడుతున్నారు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమే‹Ùకుమార్ నిర్ణయం ప్రజల ప్రాణాలను పణంగా పెట్టేలా ఉందని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం.. వారి ప్రాణాలు కాపాడడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ గురించి ఏమాత్రం ఆలోచించకుండా, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ ముందుగా నిర్ణయించుకున్న వ్యూహం ప్రకారం, మొండిగా స్థానిక సంస్థల ఎన్నికలను ఫిబ్రవరిలోనే జరుపుతామంటున్నారని తెలిపారు. ఈ మేరకు ద్వివేది శుక్రవారం రాత్రి మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనలో ఆయన ఏం పేర్కొన్నారంటే.. సీఎస్ సూచనలను పట్టించుకోలేదు ‘రాష్ట్ర ప్రజల ప్రాణ రక్షణ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం. అధికారులు, సిబ్బంది మొత్తం కోవిడ్ వ్యాక్సినేషన్ సన్నాహక కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. ఈ నెల 9న కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి కూడా వ్యాక్సినేషన్‌పై అన్ని రాష్ట్రాలకూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సూచనలు ఇవ్వబోతున్నారు. ఈ నెల 11న ప్రధాని మోదీ స్వయంగా రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఈ వివరాలన్నీ ఎస్ఈసీ దృష్టికి తీసుకొచ్చి 13 తర్వాత ఎన్నికలపై సంప్రదింపుల ప్రక్రియ చేపడదామని కోరినప్పటికీ పట్టించుకోలేదు’. అధికార దురహంకారంతో వ్యవహరించారు.. ‘గత ఏడాది మార్చి 15 నాటికి రాష్ట్రంలో ఒకేఒక్క కోవిడ్ కేసు నమోదు అయినప్పుడు, రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎన్నికల కమిషనర్ ఏకపక్షంగా స్థానిక ఎన్నికలను వాయిదా వేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేయగా, రాష్ట్ర ప్రభుత్వాన్ని కచ్చితంగా సంప్రదించిన తరువాతే ఎన్నికల కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించాలని న్యాయస్థానం ఆదేశించింది. కానీ, రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తి దృష్ట్యా ప్రస్తుతం ఎన్నికలు జరిపేందుకు అనువైన పరిస్థితుల్లేవని, అనుకూల పరిస్థితులు ఏర్పడిన వెంటనే తెలియజేయగలమని, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి 2020 అక్టోబరు 28న లిఖిత పూర్వకంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు తెలియజేశారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా, ఏకపక్షంగా ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు శుక్రవారం షెడ్యూలు ప్రకటించారు. ఎలక్షన్ కమిషనర్ వాస్తవాలను విస్మరించడమే కాకుండా, తాను ముందుగానే నిర్ణయించుకున్న విధంగా ఉద్దేశపూర్వక చర్యలకు పాల్పడుతున్నారు. ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టి అధికార దురహంకారంతో వ్యవహరిస్తున్నారు’. హైకోర్టు ఉత్తర్వులూ బేఖాతరు ‘కోవిడ్ వ్యాక్సినేషన్‌పై కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగాలేదని.. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పూర్తిగా నిమగ్నమై ఉంటుందని ప్రభుత్వం హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వ అభిప్రాయాలను లిఖితపూర్వకంగా ఎస్ఈసీకి మూడ్రోజుల్లోపు అందజేయాల్సిందిగా న్యాయమూర్తి ఆదేశించారు. ఈ ఉత్తర్వుల కాపీ ఈ నెల 5న ప్రభుత్వానికి అందగా.. 7న తన అభిప్రాయాలను రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఈసీకి తెలియజేసింది. కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం 13న ప్రారంభిస్తున్న నేపథ్యంలో.. జనవరి 13 తరువాత సంప్రదింపులకు సమయం కేటాయించాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కోరాం. కానీ, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ 8వ తేదీనే సంప్రదింపులకు హాజరుకావాలని, లేదా తదుపరి నిర్ణయం తీసుకుంటామని తెలియజేయటం ఏకపక్ష నిర్ణయమే. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, తాను శుక్రవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కలిసి రాష్ట్రంలోని కోవిడ్ పరిస్థితులను.. వ్యాక్సినేషన్ ఆవశ్యకతను వివరించాం. కనీసం మొదటి దశ వాక్సినేషన్ కార్యక్రమం పూర్తయ్యే వరకు ఎన్నికలను వాయిదా వేయాల్సిందిగా కోరినా పట్టించుకోలేదు’.. అని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఆ ప్రకటనలో వివరించారు. -
‘ఇసుక’ బాధ్యత ఎంఎస్‌టీసీకి..
సాక్షి, అమరావతి: ఇసుక సరఫరాలో పారదర్శకతను మరింతగా పెంచేందుకు.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇసుక సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శాస్త్రీయమైన విధానంలో ఇసుక సరఫరా చేసేందుకు సంస్థల ఎంపిక బాధ్యతను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ మెటల్ స్క్రాప్ ట్రేడింగ్ కార్పొరేషన్ (ఎంఎస్టీసీ)కి అప్పగించింది. ఈ మేరకు రాష్ట్ర గనులు, పంచాయతీరాజ్ శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో గనుల శాఖ, ఎంఎస్టీసీ సోమవారం అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. ఎంఎస్టీసీ డిప్యూటీ జనరల్ మేనేజర్ గణేష్ ఎన్ జయకుమార్, గనుల శాఖ సంచాలకుడు వెంకటరెడ్డి ఎంవోయూపై సంతకాలు చేశారు. గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎం.హరినారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మూడు ప్యాకేజీలుగా విభజన ఇసుక సరఫరాకు సంస్థల ఎంపిక కోసం రాష్ట్రంలోని 13 జిల్లాలను 3 ప్యాకేజీలుగా విభజించి వేర్వేరుగా టెండర్లు నిర్వహిస్తారు. మొదటి ప్యాకేజీలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి జిల్లాలు ఉంటాయి. రెండో ప్యాకేజీలో పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలు.. మూడో ప్యాకేజీలో నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ జిల్లాలు ఉంటాయి. వాటి పరిధిలో ఇసుక తవ్వకం, రీచ్‌లు/స్టాక్ యార్డుల నిర్వహణ, సరఫరా బాధ్యతలు నిర్వర్తించేందుకు ఆసక్తి గల సంస్థల నుంచి ఎంఎస్టీసీ బిడ్లు ఆహ్వానిస్తుంది. సాంకేతిక బిడ్లలో అర్హత సాధించిన సంస్థల నుంచి ఫైనాన్షియల్ బిడ్లు స్వీకరిస్తుంది. ఇలా 2 రకాల బిడ్ల ద్వారా 3 ప్రాంతాలకూ ఇసుక సరఫరా సంస్థలను ఎంపిక చేయాల్సిన బాధ్యత ఎంఎస్‌టీసీపై ఉంటుంది. మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ శాస్త్రీయంగా, పారదర్శకంగా, జవాబుదారీతనంతో ఇసుక సరఫరాకు ఈ ఒప్పందం దోహదపడుతుందని, దీని వల్ల ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని పేర్కొన్నారు.రాష్ట్రంలోని ఆలయాలపై వరుస దాడులు, విగ్రహాల ధ్వంసం ఘటనలపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. దీని వెనుక కచ్చితంగా టీడీపీ వాళ్లే ఉన్నారన్నారు. మెరుగైన విధానం తీసుకొచ్చేందుకే.. 2019 ఇసుక పాలసీని మరింత మెరుగ్గా తీర్చిదిద్దాలని నిర్ణయించిన సీఎం వైఎస్ జగన్Ð దీనిపై మంత్రుల కమిటీ నియమించారు. కమిటీ పలుమార్లు చర్చించి ఆన్లైన్ విధానాన్ని రద్దు చేసి ఆఫ్‌లైన్ ద్వారా ఇసుక సరఫరా చేయాలని సూచించింది. రాష్ట్రాన్ని మూడు ప్రాంతాలుగా విభజించి నిర్వహణ బాధ్యతను పెద్ద సంస్థలకు అప్పగించాలంటూ పలు సిఫార్సులతో నివేదిక సమర్పించింది. దీనిపై ప్రజల నుంచి సూచనలు, సలహాలు కూడా స్వీకరించారు. శాస్త్రీయ అధ్యయనం తర్వాత రూపొందించిన ఇసుక పాలసీకి సవరణలను మంత్రివర్గం ఆమోదించిన విషయం విదితమే. ఇందులో భాగంగానే శాస్త్రీయంగా, పారదర్శకత, జవాబుదారీతనంతో ప్రజలకు ఇసుక అందించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఎంఎస్టీసీతో ఒప్పందం కుదుర్చుకుంది. టెండర్లలో ఎవరైనా పాల్గొనవచ్చు ఆసక్తి ఉన్న ఏ సంస్థ అయినా తమ సంస్థను సంప్రదించి టెండర్లలో పాల్గొనవచ్చని ఎంఎస్టీసీ డిప్యూటీ జనరల్ మేనేజరు గణేష్ ఎన్ జయకుమార్ సూచించారు. తమ సంస్థ రాజస్తాన్, ఉత్తర ప్రదేశ్‌లో ఇసుక నిర్వహణకు సంస్థలను ఎంపిక చేసిందని ఆయన వివరించారు. – గణేష్ ఎన్ జయకుమార్, డిప్యూటీ జనరల్ మేనేజర్, ఎంఎస్టీసీ -
ఆపద రోజే రూ. 10 వేల తక్షణ సాయం
సాక్షి, అమరావతి: ఇంటిని పోషించే పెద్ద చనిపోవడం వంటి కారణాలతో ఆ కుటుంబం ఆనాధగా మారకూడదన్న ఉద్దేశంతో వైఎస్సార్ బీమా పథకానికి శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆపద సమయంలో అదే రోజు లబ్ధిదారుని కుటుంబానికి రూ.10 వేలు తక్షణ సాయం అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు వైఎస్సార్ బీమా పథకం అమలుకు సంబంధించిన విధివిధానాలతో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీ చేశారు. అర్హత ఉన్న వారు ఈ పథకంలో ఎప్పుడైనా తమ పేర్లను సచివాలయాల్లో నమోదు చేసుకోవచ్చని ఉత్తర్వులో పేర్కొన్నారు. లబ్ధిదారుని పరిధికి సంబంధించిన వలంటీర్ ఆ కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లి ఈ పథకం కోసం రూపొందించిన మొబైల్ యాప్‌లో వివరాలు నమోదు చేసుకుంటారు. పరిశీలన పూర్తికాగానే సచివాలయాల్లో పనిచేసే డిజిటల్ అసిస్టెంట్, సంబంధిత వలంటీర్.. ఇద్దరు కలిసి వెళ్లి ఆ కుటుంబానికి తక్షణ ఖర్చుల నిమిత్తం నామినీకి రూ.10 వేలు చెల్లిస్తారు. ప్రతి సచివాలయంలో రూ.20 వేలు డిపాజిట్ ► వలంటీర్ అందుబాటులో లేని ప్రాంతాల్లో వైఎస్సార్ బీమా కాల్ సెంటర్ ద్వారా సచివాలయాల్లో పనిచేసే డిజిటల్ అసిస్టెంట్లకు సమాచారం తెలియజేసి ఈ సేవలు అందజేస్తారు. ఇందుకు వీలుగా ప్రతి గ్రామ సచివాలయంలో ప్రత్యేకంగా ఈ పథకం కోసం రూ.20 వేల చొప్పున డిపాజిట్ చేస్తారు. ► సాధారణ మరణం అయితే ఆ కుటుంబానికి 15 రోజుల వ్యవధిలో, ప్రమాదవశాత్తు మరణం అయితే 21 రోజుల వ్యవధిలో లబ్ధిదారుని నామినీకి ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా మిగతా డబ్బులు అందజేసే ప్రక్రియకు సంబంధించి వలంటీర్ తోడ్పాటు అందిస్తారు. ► ప్రమాదం జరిగి లబ్ధిదారుడు తీవ్రంగా గాయపడిన పరిస్థితులలో ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా లబ్ధిదారునికి అందాల్సిన సాయం 55 రోజుల్లో క్లెయిమ్ రూపంలో అందించడానికి వలంటీర్, సచివాలయ సిబ్బంది తోడ్పడతారు. ► జిల్లా కేంద్రాల్లో ఉండే వైఎస్సార్ బీమా కాల్ సెంటర్లు ఆ జిల్లా పరిధిలో క్లెయిమ్‌ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను పర్యవేక్షిస్తాయి. నిరంతర పర్యవేక్షణకు రాష్ట్ర స్థాయిలో పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి చైర్మన్‌గా, సెర్ప్ సీఈవో కన్వీనర్‌గా, పది శాఖల ఉన్నతాధికారులు, ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. ప్రతినెలా ఈ కమిటీ సమావేశమై క్లెయిమ్‌ల పరిస్థితిని సమీక్షిస్తుంది. జిల్లా స్థాయిలోనూ ఏర్పాటు చేసిన కమిటీలు ప్రతి నెల 5వ తేదీలోపే ఆ జిల్లాకు సంబంధించిన క్లెయిమ్‌ల పరిస్థితిని సమీక్షించాల్సి ఉంటుంది. -
ఎక్కడనుంచైనా ఇసుక తెచ్చుకోవచ్చు
సాక్షి, అమరావతి : ప్రజలు తమకు నచ్చిన రీచ్‌కు వెళ్లి నాణ్యతను స్వయంగా పరిశీలించి, అక్కడికక్కడే డబ్బు చెల్లించి, కావాల్సిన చోటుకు ఇసుక తీసుకెళ్లవచ్చు. నెట్ పని చేయడం లేదనే తిప్పలు ఉండవు. బుక్ చేసుకోవడం కోసం యాప్ పని చేయడం లేదంటూ నెట్ సెంటర్ల వద్దకు పరుగులు తీయాల్సిన శ్రమ ఏమాత్రం అక్కర లేదు. ఆన్లైన్ మోసాలకు ఆస్కారమే ఉండదు. సిఫార్సుల ఊసుండదు. ఈ మేరకు మంత్రివర్గం ఆమోదంతో ప్రభుత్వం ఇసుక పాలసీ–2019ని మరింత మెరుగు పరిచింది. ఇందుకు సంబంధించి భూగర్భ గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది గురువారం జీఓ జారీ చేశారు. (నేడు గవర్నర్‌తో సీఎం వైఎస్ జగన్ భేటీ) సవరించిన ఇసుక పాలసీలో ముఖ్యాంశాలు ►ఇసుక తవ్వకం, నిల్వ, విక్రయం బాధ్యతలను నామినేషన్ పద్ధతిలో కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం అప్పగిస్తుంది. నిర్ణయించిన మొత్తాన్ని ఆయా సంస్థలు ప్రభుత్వానికి చెల్లించాలి. సీనరేజి, ఇతర పన్నులు దీనికి అదనం. ►కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు ముందుకు రాని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం కనీస టెండరు ధర ఖరారు చేసి అనుభవం, సాంకేతిక నైపుణ్యం, ఆర్థిక పరిపుష్టి ఉన్న సంస్థలను టెక్నికల్, కమర్షియల్ బిడ్ల ద్వారా ఎంపిక చేస్తుంది. మొత్తం రీచ్‌లు మూడు ప్యాకేజీలుగా వర్గీకరణ ►శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలను మొదటి ప్యాకేజీ కింద.. పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలు రెండవ ప్యాకేజీగా.. నెల్లూరు, అనంతపురం, కృష్ణా, కర్నూలు, వైఎస్సార్ కడప జిల్లాలను మూడో ప్యాకేజి కింద చేరుస్తారు. ►1– 3 ఆర్డర్ స్ట్రీమ్స్‌తోపాటు ఆపై స్థాయి స్ట్రీమ్స్ (నదులు, వాగులు)ను నిర్వహణ సంస్థ(ల)కే అప్పగించి ఇసుక తవ్వకం, నిల్వ, విక్రయాలు సాగించేందుకు వీలుగా ఏపీ వాల్టా, ఏపీ మైనర్ మినరల్ కన్సెషన్ రూల్స్‌ను సవరిస్తారు. ► ఆ సంస్థలు ప్రత్యేక నోటిఫైడ్ రీచ్‌లలో డీసిల్టేషన్ ద్వారా ఇసుక సేకరణకు బోట్స్‌మెన్ సొసైటీలకు ఉపాధి కల్పించే విషయాన్ని పరిశీలించవచ్చు. నాణ్యతను దృష్టిలో పెట్టుకుని, పట్టా భూముల్లో తవ్వకాలు నిలిపివేస్తారు. ఇసుక లభ్యత పెంచడానికి ప్రకాశం, ధవళేశ్వరం బ్యారేజీల్లో డ్రెడ్జింగ్ చేస్తారు. భూగర్భ గనులు, జల వనరుల శాఖల సహకారంతో దీన్ని చేపడతారు. ఎవరికి ఎంత ఇసుక కావాలన్నా బుక్ చేసుకుని తీసుకెళ్లవచ్చు. దీనిపై పరిమితులు ఉండవు. స్టాక్ యార్డుల్లో, రాష్ట్రంలోని నిర్ధారిత నగరాల్లో ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ఇసుక సరఫరా జరుగుతుంది. ఆన్లైన్ విధానం ఉండదు ►ఆఫ్‌లైన్ విధానంలోనే డబ్బు చెల్లించి ఇసుకను తీసుకెళ్లొచ్చు. ఆన్లైన్ విధానం ఉండదు. స్టాక్ యార్డులు/ రీచ్‌ల నుంచి ఇసుక తీసుకెళ్లడానికి వినియోగదారులే రవాణా ఏర్పాట్లు చేసుకోవాలి. ఆయా సంస్థలు ప్రతి స్టాక్ యార్డు/ రీచ్‌లలో 20 వాహనాలను అందుబాటులో ఉంచాలి. ఈ సంస్థలు నిర్ణీత పూచీకత్తు మొత్తం (పెర్ఫార్మెన్స్ సెక్యూరిటీ డిపాజిట్ –పీఎస్డీ) చెల్లించాలి. పేదల గృహ నిర్మాణాలకు ఉచితమే ప్రజలు సొంత అవసరాలకు ఇసుకను ఎడ్లబండ్లపై ఉచితంగా తీసుకెళ్లవచ్చు. రీచ్‌లకు సమీపంలోని గ్రామాల వారికి, బలహీన వర్గాలకు ప్రభుత్వ గృహ నిర్మాణ పనులకు, సహాయ–పునరావాస కార్యక్రమం కింద నిర్మించే ఇళ్లకు కూపన్ల జారీ ద్వారా ఇసుకను ఉచితంగా ఇస్తారు. అన్ని దశల్లో పారదర్శకత ఉంటుంది. అక్రమ తవ్వకాలు, నిల్వ, రవాణాను నియంత్రించేందుకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోకు దాడులు చేసి, కేసులు నమోదు చేసే అధికారముంటుంది. మెరుగైన ఇసుక విధానం అమలుకు భూగర్భ గనుల శాఖ సంచాలకులు, ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్, ఎండీ అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం పేర్కొంది. -
గ్రామ పంచాయతీలకు రూ.1,168 కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రూ.1,168.28 కోట్లను విడుదల చేస్తూ పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది బుధవారం ఉత్తర్వులిచ్చారు. 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెండో విడత రాష్ట్రానికి విడుదల చేయాల్సిన నిధులను కేంద్రం ఆ ఆర్థిక ఏడాది విడుదల చేయలేదు. ఆ నిధులను ఇప్పుడు కేంద్రం రాష్ట్రానికి విడుదల చేయడంతో వాటిని ఆయా గ్రామ పంచాయతీలకు విడుదల చేస్తూ ఉత్తర్వులిచ్చారు. -
ఉచిత బోరుకు ప్రతి రైతు అర్హుడే
సాక్షి, అమరావతి: ఉచిత బోరు పథకానికి విస్తీర్ణంతో సంబంధం లేకుండా వ్యవసాయ భూమి ఉన్న ప్రతి ఒక్క రైతు అర్హుడే అని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు వైఎస్సార్ జలకళ పథకం విధివిధానాలను సవరిస్తూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది జులై 3వ తేదీ పథకం విధివిధానాలపై జారీ చేసిన ఉత్తర్వుల్లో ఐదు ఎకరాల లోపు వ్యవసాయ భూమి ఉన్న రైతులనే అర్హులుగా పేర్కొన్నారు. తాజా నిబంధనల ప్రకారం ఇప్పటి దాకా బోరు వసతి లేని, ఫెయిల్ అయిన బోర్ ఉన్న రైతులంతా అర్హులేనని పేర్కొన్నారు. ► గతంలో ఉచిత బోరు తవ్వకానికి రైతుకు కనీసం 2.5 ఎకరాల భూమి ఉండాలని, ఒక రైతుకు కనీసం 2.5 ఎకరాల భూమి లేకపోతే, గరిష్టంగా 5 ఎకరాల వరకు ఉన్న రైతులు గ్రూపుగా ఏర్పడాలన్న నిబంధనను తాజా విధివిధానాలలో సవరించారు. ► బోరు తవ్వకానికి ప్రత్యేకంగా ఎటువంటి విస్తీర్ణం పరిధిని పేర్కొనలేదు. అంటే రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉన్న రైతు మిగిలిన వారితో సంబంధం లేకుండా తన భూమిలో ఉచిత బోరు తవ్వకానికి అర్హుడేనని అధికారులు వెల్లడించారు. ► భూగర్భ జల మట్టం ప్రమాదకర స్థాయిలో ఉన్న రాష్ట్రంలోని 1094 రెవిన్యూ గ్రామాల పరిధిలో ఈ పథకం అమలు కాదని పేర్కొన్నారు. అయితే భూగర్భ జల మట్టాన్నిబట్టి ఈ గ్రామాల సంఖ్యలో మార్పులు ఉంటాయన్నారు. సన్న, చిన్నకారు రైతులకు పంపుసెట్, పైపులు, వైర్ ఉచితం ► సన్న, చిన్నకారు రైతులకు (ఐదు ఎకరాలలోపు భూమి ఉండే వారు) ఉచిత బోరుతో పాటు మోటార్ (పంపుసెట్) కూడా ఉచితంగా అందజేస్తారు. ఈ మేరకు సీఎం ప్రకటనకు అనుగుణంగా తాజాగా మరో ఉత్తర్వు జారీ చేశారు. ► పైపులు, విద్యుత్ వైరు, ప్యానల్ బోర్డు వంటి అనుబంధ పరికరాలను కూడా ఉచితంగా అందించనున్నట్టు పేర్కొన్నారు. ► హైడ్రో–జియోలాజికల్, జియోఫిజికల్ సర్వేలు నిర్వహించాకే బోరు బావి తవ్వకం ప్రారంభిస్తారు. అర్హత కలిగిన రైతులు ఫొటో, పట్టాదార్ పాస్ బుక్, ఆధార్ కార్డు కాపీతో గ్రామ సచివాలయంలో లేదా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ► డ్రిల్లింగ్ అనంతరం గంటకు కనీసం 4,500 లీటర్లు తోడడానికి అవకాశం ఉన్న దానినే విజయవంతమైన బోరు బావిగా పరిగణిస్తారు. అనంతరం జియో ట్యాగింగ్‌తో కూడిన డిజిటల్ ఫొటోలతో రికార్డు చేస్తారు. పారదర్శకత కోసం సోషల్ ఆడిట్ నిర్వహిస్తారు. -
11.42 లక్షల కొత్త పింఛన్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో 90,167 మంది అవ్వా తాతలకు ఆగస్టు నెలకు సంబంధించి ప్రభుత్వం కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది. ఇందులో 89,324 మంది రెగ్యులర్ పింఛన్లు, 843 మంది హెల్త్ పింఛన్లు అందుకోనున్నారు. సంతృప్త స్థాయిలో అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు నెలాఖరు వరకు 8 నెలల వ్యవధిలో 11,42,877 మందికి కొత్తగా పింఛన్లు మంజూరు కావడం గమనార్హం. వీటితో కలిపి మొత్తంగా రాష్ట్రంలో రికార్డు స్థాయిలో మంగళవారం 61.68 లక్షల మందికి పింఛన్ల పంపిణీ జరగనుంది. వలంటీర్లు లబ్ధిదారుల ఇంటికే వెళ్లి పింఛన్ సొమ్ము అందించనున్నారు. ఇందుకోసం రూ.1,496.07 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శుల బ్యాంకు ఖాతాలకు నిధులను విడుదల చేసింది. ఐదు నెలల తరువాత పాత విధానంలో పంపిణీ.. ► ఈసారి జియో ట్యాగింగ్ విధానంలో కాకుండా పాత పద్ధతి ప్రకారమే బయోమెట్రిక్ ద్వారా పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. కొత్త పింఛన్లు భారీగా మంజూరు కావడం, పాత బకాయిలు పెద్ద ఎత్తున చెల్లిస్తున్న నేపథ్యంలో పంపిణీలో పారదర్శకంగా వ్యవహరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ► కరోనా, లాక్డౌన్ కారణంగా సొంత ఊరికి దూరంగా వేర్వేరు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన 1,87,442 మందికి కూడా ఈ నెల పింఛన్లను బకాయిలతో కలిపి అందచేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారని సెర్ప్ సీఈవో రాజాబాబు తెలిపారు. 2,375 మంది ఆరు నెలల పింఛన్ డబ్బులు అందుకోనున్నారు. 5,497 మందికి ఐదు నెలల డబ్బులు, 1,286 మందికి నాలుగు నెలల పింఛన్ చెల్లిస్తారు. 2,399 మందికి మూడు నెలలు, 15,748 మందికి రెండు నెలలు, 1,60,137 మందికి ఒక నెల పింఛను బకాయిలు కలిపి అందించనున్నారు. ► తాము ప్రస్తుతం ఉంటున్న చోట పింఛన్ అందచేయాలని కోరుతూ 13,969 మంది డీఆర్డీఏ అధికారులకు దరఖాస్తు చేసుకోవడంతో ఆ మేరకు ఏర్పాట్లు చేశారు. సీఎం విప్లవాత్మక నిర్ణయాలతో సంతృప్త స్థాయిలో పింఛన్లు పరిపాలనలో సీఎం వైఎస్ జగన్ తెచ్చిన విప్లవాత్మక మార్పులతో రాష్ట్రంలో సంతృప్త స్థాయిలో పింఛన్లు అందించగలుగుతున్నాం. దరఖాస్తు చేసుకున్న పది రోజుల్లోనే అర్హులకు పింఛను మంజూరు కార్డు అందజేస్తున్నాం. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. ప్రతి నెలా ఒకటో తేదీనే యజ్ఞంలా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి -
సచివాలయాల పోస్టుల రాత పరీక్షలకు ఏర్పాట్లు
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించి రాతపరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. జూలై చివరి వారంలో పరీక్షలు ప్రారంభించడానికి కసరత్తు ప్రారంభమైంది. 19 రకాల పోస్టులకు సంబంధించి గ్రామ సచివాలయాల్లో 14,062, వార్డు సచివాలయాల్లో 2,146 పోస్టుల భర్తీకి ఈ ఏడాది జనవరిలో పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి శాఖలు వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేసిన విషయం విదితమే. ఫిబ్రవరి ఏడో తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించగా, మొత్తం 11.06 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఆయా పోస్టుల భర్తీకి 14 రకాల పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ► రాత పరీక్షల నిర్వహణపై పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్ ఆధ్వర్వంలో ఇటీవల ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ► కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలు కూడా జూలైలోనే జరగనున్నాయి. ఈ సమాచారంతో సచివాలయ పరీక్షలకు హాజరయ్యే వారికి ఇతర పరీక్షల షెడ్యూళ్లతో ఇబ్బంది కలగకుండా తుది తేదీలను ప్రకటించాలని నిర్ణయించారు. ► 14 రకాల పరీక్షలను జూలై చివరిలో ప్రారంభించి 8 రోజులలో పూర్తి చేయాలని భావిస్తున్నారు. ► పంచాయతీ కార్యదర్శి గ్రేడ్–5, మహిళా పోలీసు, వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ పోస్టులకు కలిపి కేటగిరి –1లో నిర్వహించే పరీక్షకు 4,56,997 మంది దరఖాస్తు చేసుకున్నారు. రాత పరీక్షలు ప్రారంభించే తొలిరోజునే ఈ పరీక్షను నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నారు. -
ఏపీ: ఇసుక విక్రయాలు మరింత పారదర్శకం..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వినియోగదారులకు ఇసుకను సులభంగా అందించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర భూగర్భగనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేదీ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఈనెల 5న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం నూతన ఇసుక పాలసీని ప్రకటించిన తరువాత ఎపిఎండిసి ద్వారా పారదర్శకతతో ఇసుక విక్రయాలను నిర్వహిస్తున్నామని అన్నారు. (ఎడ్ల బండ్లకు ఇసుక ఉచితం) ఇసుక డోర్ డెలివరీ చేస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలోనే ఆన్ లైన్ విధానంలో ఇసుకను వినియోగదారులకు డోర్ డెలివరీ చేస్తున్న ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌కు గుర్తింపు వుందన్నారు. కొత్త విధానం ద్వారా వినియోగదారులకు ఇసుకను అందిస్తున్న క్రమంలో ఎదురవుతున్న సమస్యలను కూడా గుర్తించి, ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. అదే క్రమంలో ఇసుక మాఫియాను పూర్తిస్థాయిలో కట్టడి చేసేందుకు రీచ్ లు, స్టాక్ పాయింట్లు, చెక్ పోస్ట్ లలో సీసీ కెమేరాలు ఏర్పాటు చేయడం, గనుల శాఖ, రెవెన్యూ, రవాణా శాఖల ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టడం, ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో (ఎస్ఇబి) ద్వారా తనిఖీలు చేయడం ద్వారా అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఇసుక అక్రమ రవాణా చేసిన వారికి రెండేళ్ళ జైలుశిక్ష, రెండు లక్షల రూపాయల వరకు జరిమానా విధించేలా ప్రభుత్వం చట్టాన్ని చేసిందని పేర్కొన్నారు. (రీచ్‌లలో అక్రమాలు లేకుండా చూడాలి: సీఎం జగన్) ఇకపై సచివాలయాల ద్వారా కూడా ఇసుక బుకింగ్ ఇప్పటి వరకు ఇసుక కావాల్సిన వారు ఆన్ లైన్ లో బుక్ చేసుకునే వారని గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. అయితే హై స్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం వున్న వారికే ముందుగా ఇసుక లభిస్తుండటంతో, పోర్టల్ ప్రారంభించిన కొద్దిసేపటికే బుక్ అవుతోందన్నారు. దీంతో మిగిలిన వినియోగదారులకు ఇసుక బుకింగ్ లో ఇబ్బందులు ఎదురవుతున్నాయనే విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందని చెప్పారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఇకపై గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా కూడా ఇసుక బుకింగ్ లు నిర్వహించేందుకు ఈ నెల 5న జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేశారని వెల్లడించారు. అధికారిక ఉత్తర్వులు వెలువడగానే సచివాలయాల ద్వారా కూడా ఇసుక బుకింగ్ చేసుకునే అవకాశం వుంటుందని వెల్లడించారు. వినియోగదారులు సచివాలయం ద్వారా ఇసుక బుకింగ్ చేసుకున్నట్లయితే స్థానికంగా వున్న సచివాలయ వ్యవస్థ ద్వారా నిజమైన అవసరానికే సదరు బుకింగ్ జరుగుతోందో లేదో క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు, నిర్ధారించుకునేందుకు అవకాశం వుంటుందని పేర్కొన్నారు. దీనివల్ల అవసరం లేని వారు కూడా ఇసుకను బుక్ చేసి, బ్లాక్ మార్కెట్ లో అమ్ముకునే అవకాశం వుండదని స్పష్టం చేశారు. స్థానికులకు ఎడ్లబండ్ల ద్వారా ఉచిత ఇసుకకు అనుమతి రాష్ట్రంలో వాగులు, వంకలతో పాటు చిన్న నీటిపాయల నుంచి ఇసుకను ఎడ్లబండ్ల ద్వారా ఉచితంగా స్థానికులు వాడుకునేందుకు వీలుగా సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారని గోపాలకృష్ణ ద్వివేదీ తెలిపారు. గతంలో వాగులు, వంకలకు చెందిన 1 నుంచి 3వ ఆర్డర్ స్ట్రీమ్ ల నుంచి మాత్రమే ఎడ్లబండ్ల ద్వారా ఉచిత ఇసుక తీసుకునే వీలుండేదన్నారు. తాజాగా ఇసుక పాలసీపై ముఖ్యమంత్రి నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో నదులు, జలవనరులకు సమీపంలోని గ్రామాల్లోని ప్రజలు తమ అవసరాల కోసం ఎడ్లబండ్ల ద్వారా తీసుకునే ఉచిత ఇసుక పరిధిని 4, 5 ఆ పై ఆర్డర్ స్ట్రీమ్ ల వరకు కూడా పెంచాలని ఆదేశించినట్లు తెలిపారు. ఇందుకోసం పంచాయతీ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకుంటే సరిపోతుందని చెప్పారు. గుర్తించిన వాటర్ స్ట్రీమ్ ల నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలోని గ్రామాల ప్రజలు ఉచితంగా ఇసుకను ఎడ్లబండ్ల ద్వారా పొందే అవకాశం కల్పించినట్లు తెలిపారు. దీనివల్ల జలవనరుల సమీపంలోని ప్రాంత ప్రజలకు మేలు జరుగుతుందని, ఇసుక బుకింగ్ లపై ఒత్తిడి తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు. ఇసుక తవ్వకాలు మరింత వేగవంతం.. లాక్ డౌన్ తరువాత నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక తవ్వకాలను మరింత వేగవంతం చేశామని తెలిపారు. దీనిలో భాగంగా ప్రస్తుతం రోజుకు సగటున 1.25 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని, దీనిని అతి త్వరలోనే రోజుకు మూడు లక్షల మెట్రిక్ టన్నులకు పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. ఈ నెల ఆరో తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,61,53,197 మెట్రిక్ టన్నుల ఇసుకను తవ్వితీశామని, దానిలో డోర్ డెలివరీ ద్వారా 33,28,553 ఎంటిలు, ఇతర వినియోగదారులకు 53,57,003 ఎంటిలు అందించామని తెలిపారు. ఇక ఉపాధి హామీ పనుల కోసం 7,51,189 ఎంటిలు, నాడు-నేడు పనులకు 3,29,814 ఎంటిలు, బల్క్ బుకింగ్ లకు 21,47,386 మెట్రిక్ టన్నుల ఇసుకను రవాణా చేశామని తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రానున్న వర్షాకాలం అవసరాల కోసం మొత్తం డెబ్బై లక్షల టన్నుల ఇసుకను నిల్వ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈనెల ఒకటో తేదీ నుంచి ఆరో తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా సాధారణ వినియోగదారులు 48,99,916 టన్నులను బుక్ చేసుకోగా, వారికి 46,20,217 టన్నులను రవాణా చేశామని తెలిపారు. కేవలం 5.7శాతం మాత్రమే వారికి పెండింగ్ వుందని తెలిపారు. అలాగే 16,70,678 టన్నుల బుల్క్ బుకింగ్ కి గానూ 14,25,797 టన్నులు రవాణా చేశామని, ఇంకా పెండింగ్ లో కేవలం 2,44,540 టన్నులు మాత్రమే వుందని వివరించారు. ఓపెన్ రీచ్ లలో కూలీలతోనే ఇసుక తవ్వకాలు పర్యావరణ నిబంధనల ప్రకారం నాణ్యమైన ఇసుక అందించే నదుల్లోని ఓపెన్ రీచ్ లలో కూలీలతోనే ఇసుక తవ్వకాలు జరుపుతున్నామని అన్నారు. ఇక్కడ యంత్రాలను, ఇసుకను బయటకు పంపేందుకు లారీలు, టిప్పర్లను ఉపయోగించేందుకు నిబంధనలు అంగీకరించని నేపథ్యంలో కూలీలతో తవ్వకాలు చేసి, ట్రాక్టర్ ల ద్వారానే తవ్విన ఇసుకను స్టాక్ పాయింట్ లకు పంపుతున్నామని తెలిపారు. అయితే కోవిడ్-19 కి ముందు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలు ఇసుక తవ్వకాల్లో ఎక్కువశాతం పనిచేశారని, లాక్ డౌన్ కారణంగా పనులు నిలిపివేయడంతో కూలీల్లో అధికశాతం తమ స్వరాష్ట్రాలకు వెళ్లిపోయారని తెలిపారు. దీనితో ప్రస్తుతం స్థానికంగా వున్న కూలీలతోనే ఇసుక తవ్వకాలు జరుపుతున్నామని అన్నారు. దీనివల్ల కూడా ఓపెన్ రీచ్ ల నుంచి వచ్చే ఇసుక నిల్వలు కొంత మందగించాయని అన్నారు. జిల్లాల్లోని కలెక్టర్ల ద్వారా తిరిగి ఇసుక తవ్వకాల్లో నైపూణ్యం వున్న వలస కూలీలను రప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఓపెన్ రీచ్ లలో కూడా ఇసుక తవ్వకాలను పెంచాలని అధికారులకు లక్ష్యాలను నిర్ధేశించినట్లు ఆయన వెల్లడించారు. జిల్లా జాయింట్ కలెక్టర్లు, మైనింగ్, ఎపిఎండిసి, రెవెన్యూ అధికారుల సమన్వయంతో ఎక్కువ ఇసుకను తవ్వేందుకు, రీచ్ లలో ఆపరేషన్లు సక్రమంగా జరిపేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రత్యేక బృందాలతో ఇసుక పై పూర్తి పర్యవేక్షణ ఇసుక ఆపరేషన్లపై జిల్లా స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. జిల్లాలో టెక్నికల్ టీంల ఆధ్వర్యంలో రీచ్ లు, పట్టాభూముల్లో జరుగుతున్న ఇసుక తవ్వకాలను పర్యవేక్షిస్తున్నామని అన్నారు. పట్టాభూముల్లో ఇసుక నాణ్యతను టెక్నికల్ టీం పరిశీలించిన తరువాతే వాటికి అనుమతి ఇస్తున్నామని తెలిపారు. అలాగే ఇకపై బల్క్ బుకింగ్ లను జిల్లా జాయింట్ కలెక్టర్ ల పర్యవేక్షణలోనే అనుమతించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. -
గతంలో పెన్షన్ పొందలేనివారికి ‘మే’ అందిస్తాం
సాక్షి, అమరాతి : లాక్డౌన్ కారణంగా మార్చి, ఏప్రిల్ నెలలో పెన్షన్ పొందలేని వారికి మే నెలలో పెన్షన్ డబ్బులు అందజేస్తామని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది వెల్లడించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గత రెండు నెలల్లో పెన్షన్ డబ్బులు తీసుకోని వారికి ఈ నెలలో మొత్తం చెల్లిస్తామని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న పెన్షన్ దారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అందరికి పింఛన్ డబ్బులు అందేలా జాగ్రత్తలు తీసుకున్నామని పేర్కొన్నారు. (చదవండి : రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీ) కాగా, కరోనా వైరస్ సృష్టిస్తున్న ఆలజడిలోనూ ఏపీ ప్రభుత్వం పట్టుదలతో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లింది. ప్రతినెలా ఒకటో తేదీనే వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, గుర్తించిన వ్యాధులతో బాధపడుతున్న వారికి పెన్షన్ సొమ్మును వారి చేతికే అందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలను ప్రభుత్వ యంత్రాంగం, వాలంటీర్ల వ్యవస్థ ఉద్యమ స్పూర్తితో నెరవేర్చింది. శుక్రవారం ఉదయం నుంచే వాలంటీర్లు తమకు కేటాయించిన యాబై ఇళ్ళ పరిధిలోని ‘వైఎస్సార్ పెన్షన్ కానుక’ లబ్ధిదారుల వద్దకు వెళ్ళి వారికి స్వయంగా పెన్షన్ సొమ్మును అందించారు. -
ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న లబ్ధిదారులకు వచ్చే నెలలో పింఛన్
సాక్షి, అమరావతి: లాక్డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయి ఏప్రిల్ 1, 2, 3 తేదీల్లో పింఛన్ తీసుకోలేకపోయిన వారికి వచ్చే నెలలో రెండు నెలల పింఛన్ ఒకేసారి తీసుకునే అవకాశం కల్పించినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టత ఇచ్చారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ట్విట్టర్లో స్పందించారు. ఈ నెలలో పింఛన్ తీసుకోలేకపోయిన వారు ఆందోళన చెందాల్సిన పనిలేదని, అలాంటి వారికి మే నెలలో రెండు నెలల పింఛన్ కలిపి ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారని పేర్కొన్నారు. -
‘సుప్రీం’ తీర్పునకు లోబడే ‘స్థానిక’ రిజర్వేషన్లు
సాక్షి, అమరావతి: వెనుకబడిన తరగతులకు (బీసీ) తగిన రిజర్వేషన్లు కల్పించేందుకు వీలుగా చట్టాలు తీసుకువచ్చే అధికారం తమకు ఉందని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. అందుకు అనుగుణంగానే బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 1995లో పంచాయతీరాజ్ చట్టానికి సవరణలు జరిగాయని తెలిపింది. ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ఆధారంగా.. వారి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించామని, కానీ బీసీలకు మాత్రం 1995 చట్ట సవరణను అనుసరించి 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చామని వివరించింది. 1995లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించినప్పుడు, 1991 జనాభా లెక్కల ప్రకారం బీసీ జనాభా ఆంధ్రప్రదేశ్‌లో 39 శాతం మేర ఉందని తెలిపింది. రాష్ట్ర విభజన తరువాత ఇటీవల పంచాయతీరాజ్, గ్రామీణాభివద్ధి శాఖ నిర్వహించిన సర్వేలో బీసీ ఓటర్లు 48.13 శాతంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం వివరించింది. అందువల్ల బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడం ఏ మాత్రం తప్పుకాదని.. పైగా వారి జనాభా కన్నా తక్కువ రిజర్వేషన్లే కల్పించామని స్పష్టంచేసింది. పైపెచ్చు కృష్ణమూర్తి కేసులో అధికరణ 243డి(6)కి భాష్యం చెబుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగానే స్థానిక సంస్థల్లో 59.85 శాతం రిజర్వేషన్లు ఉన్నాయని సర్కారు వివరించింది. అలాగే, నిర్ణీత కాల వ్యవధిలోపు పంచాయతీ, మునిసిపాలిటీల ఎన్నికలను పూర్తిచేయడం ప్రభుత్వాల రాజ్యాంగ విధి అని సుప్రీంకోర్టు గతంలోనే చెప్పిన విషయాన్ని గుర్తుచేసింది. స్థానిక సంస్థల్లో 59.85 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో ఇటీవల పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ప్రభుత్వ ఉత్తర్వుల్లో జోక్యానికి నిరాకరించిన హైకోర్టు.. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని, రిజర్వేషన్లు 50 శాతం దాటడంపై కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ ఆదేశాల మేరకు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది కౌంటర్ దాఖలు చేశారు. ఎన్నికలు పెట్టకపోతే కేంద్రం నిధులివ్వదు.. ‘పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులన్నీ వృథా అవుతాయి. 2018–19, 2019–20 సంవత్సరాలకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ రూ.4,065.79 కోట్లు కేటాయించింది. ఇందులో మొదటి వాయిదా కింద రూ.858.99 కోట్లు విడుదలయ్యాయి. పంచాయతీలకు ఎన్నికలు జరగకపోవడంవల్ల రెండో వాయిదా విడుదల చేయలేదు. ఈ ఏడాది మార్చి చివరి నాటికి ఎన్నికలు నిర్వహించకుంటే అవి రావు. దీంతో పంచాయతీలు తీవ్రంగా నష్టపోతాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ప్రజా ప్రయోజన వ్యాజ్యాలన్నింటినీ కొట్టేయండి.’ అని ద్వివేది తన కౌంటర్లో కోరారు. రిజర్వేషన్లలో వ్యత్యాసం ఉంది ‘పంచాయతీ ఎన్నికల్లో ఎస్సీలకు 19.08 శాతం, ఎస్టీలకు 6.77, బీసీలకు 34 శాతం మొత్తం కలిపి 59.85 శాతం రిజర్వేషన్లు కల్పించాం. అణగారిన వర్గాల ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత, స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికి తగిన ప్రాతినిధ్యం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. 50 శాతం రిజర్వేషన్లు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో దాటొచ్చునని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. విధాన నిర్ణాయక వ్యవస్థల్లో బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని నిర్ణయించడంవల్లే రిజర్వేషన్లు 50 శాతం దాటుతున్నాయి. గత పాతికేళ్లుగా రిజర్వేషన్లు 50 శాతం దాటుతూనే ఉన్నాయి. విద్యా, ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదన్న తీర్పును రాజకీయాలకు వర్తింపచేయడానికి వీల్లేదు. రెండింటికీ చాలా వ్యత్యాసం ఉంది.’ అని ద్వివేది తన కౌంటర్లో వివరించారు. అంత జనాభా ఉన్నా.. చట్ట ప్రకారమే నడుచుకున్నాం అలాగే, ‘ఎక్కువ ఓటర్లు ఉన్న వర్గాలకు వాస్తవ అధికారాన్ని నిరాకరిస్తే, అది నిజమైన ప్రజాస్వామ్యం కాదని కూడా ‘సుప్రీం’ తెలిపింది. దీని ప్రకారం జనాభాలో వారి దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలి. అందుకనుగుణంగానే బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 1995లో చట్ట సవరణ జరిగింది. ఎస్సీ, ఎస్టీలకు వారి వారి జనాభా ప్రకారం ప్రాతినిధ్యం కల్పిస్తున్నప్పటికీ, బీసీలకు మాత్రం జరగడంలేదు. తాజాగా బీసీల జనాభాను తేల్చకుండా వారి రిజర్వేషన్లు తేల్చడం సరికాదని కృష్ణమూర్తి కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. కానీ, మేం బీసీల లెక్కలు తేల్చాం. ఆ ఓటర్లు 48.13 శాతం ఉన్నప్పటికీ, చట్ట నిబంధనలకు లోబడి వారికి 34 శాతం రిజర్వేషన్లు మాత్రమే ఇచ్చాం’ అని గోపాలకృష్ణ ద్వివేది తన కౌంటర్లో పేర్కొన్నారు. -
ద్వివేదికి జాతీయ స్థాయి పురస్కారం
సాక్షి, ఢిల్లీ: రాష్ట్రానికి చెందిన మాజీ ఎన్నికల ప్రధానాధికారి, సీనియర్ ఐఎఎస్ అధికారి గోపాలకృష్ణ ద్వివేదికి జాతీయస్థాయి పురస్కారం లభించింది. రాష్ట్రంలో గత ఏడాది జరిగిన ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించినందుకు గానూ ఉత్తమ ఎన్నికల నిర్వహణ కేటగిరిలో ఆయన ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ మేరకు న్యూఢిల్లీలోని జొరావర్ ఆడిటోరియంలో శనివారం జరిగిన జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదిగా ఉత్తమ ఎలక్షన్ సిఈవో అవార్డును అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా... స్వేచ్ఛాయుతంగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఎన్నికల యంత్రాంగాన్ని గోపాలకృష్ణ ద్వివేది నడిపించారు. ప్రజాస్వామికంగా ఎన్నికల కమిషన్ నిబంధనలను పకడ్భందీగా అమలు చేయడం ద్వారా ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. ఎన్నికల ప్రధాన అధికారిగా గోపాలకృష్ణ ద్వివేది తీసుకున్న నిర్ణయాలు, అయన అనుసరించిన విధానాలకు గానూ జాతీయస్థాయిలో ఈ పురస్కారం లభించింది. ప్రస్తుతం గోపాలకృష్ణ ద్వివేది రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా ఈ పురస్కారాన్ని అందుకున్న గోపాలకృష్ణ ద్వివేదికి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అభినందనలు తెలిపారు. -
ఏపీకి బెస్ట్ స్టేట్ అవార్డు..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండు అవార్డులు వరించాయి. 2019 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం గురువారం అవార్డులను ప్రకటించింది. ఇందులో ఏపీకి రెండు అవార్డులు దక్కాయి. సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో ఏపీ బెస్ట్ స్టేట్ అవార్డును కైవసం చేసుకుంది. ఇక ఈ ఎన్నికల్లో ఎలాంటి అక్రమాలు, అవకతవకలు, అల్లర్లు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా నిర్వహించినందుకు గానూ ఎన్నికల సంఘం ప్రధాన అధికారి గోపాలకృష్ణ బెస్ట్ సీఈవో అవార్డు సొంతం చేసుకున్నారు. శనివారం ఢిల్లీలో అవార్డుల ప్రదాన కార్యక్రమం జరగనుంది. ఈ అవార్డులను స్వీకరించడానికిగానూ గోపాలకృష్ణ ద్వివేది గురువారం సాయంత్రం ఢిల్లీకి బయలు దేరారు. ద్వివేదీకి నాగిరెడ్డి అభినందనలు ప్రస్తుతం పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రెటరీగా పనిచేస్తున్న గోపాలకృష్ణ ద్వివేదీని రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి అభినందించారు. చంద్రబాబు బెదిరింపులకు భయపడకుండా నిజాయితీగా పనిచేసిన వ్యక్తి ద్వివేది అని నాగిరెడ్డి అన్నారు. ద్వివేదీపై అనవసర ఆరోపణలు చేసిన చంద్రబాబు ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకొంటాడని ప్రశ్నించారు. చంద్రబాబు వ్యవహారశైలిలో ఏమాత్రం మార్పురాలేదని, శాసనమండలి చైర్మన్‌పై కూడా వత్తిడి తెచ్చి అభివృద్ధి బిల్లుకు ఆటంకం సృష్టించారని మండిపడ్డారు. ఒత్తిడులకు తలొగ్గకుండా నిజాయితీగా పనిచేసే అధికారులకు ఎప్పుడైనా గుర్తింపు ఉంటుందనడానికి ద్వివేదీ ఒక నిదర్శనమన్నారు. -
బీసీలకు 4.. ఎస్సీలకు 2
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మండల, జిల్లాపరిషత్ ఎన్నికలకు సంబంధించి జిల్లాపరిషత్ చైర్మన్ పదవుల రిజర్వేషన్లను పంచాయతీ రాజ్ శాఖ శుక్రవారం ఖరారు చేసింది. ఈ మేరకు 13 జిల్లాల జెడ్పీ చైర్మన్ పదవుల రిజర్వేషన్ల వివరాలతో పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ ప్రకారం.. నాలుగు జిల్లా పరిషత్ (జెడ్పీ) చైర్మన్ పదవులు బీసీలకు, రెండు ఎస్సీలకు, ఒకటి ఎస్టీలకు రిజర్వు అయ్యాయి. మిగిలిన 6జెడ్పీ చైర్మన్ పదవులను జనరల్(అన్‌రిజర్వ్)కు కేటాయించారు. కాగా మొత్తం 13 జిల్లా పరిషత్‌లకుగాను ఆయా కేటగిరీల వారీగా 6 మహిళలకు రిజర్వు అయ్యాయి. 73వ రాజ్యాంగ సవరణ తర్వాత 1994లో ఏపీ పంచాయతీరాజ్ చట్టం అమల్లోకి రాగా, అందులో పేర్కొన్న నిబంధనల మేరకు ఇప్పటి వరకు నాలుగు విడతలపాటు ‘స్థానిక’ ఎన్నికలు జరిగాయి. ఈ 4 విడతల ఎన్నికల్లోనూ నిబంధనల ప్రకారం రొటేషన్ పద్ధతిన జెడ్పీ చైర్మన్ పదవుల రిజర్వేషన్లను పంచాయతీరాజ్ శాఖ ఖరారు చేస్తూ వస్తోంది. అదే రొటేషన్ క్రమంలో ప్రస్తుతం ఐదో విడత ఎన్నికలకోసం ఆయా కేటగిరీల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేశారు. ఇప్పటికే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ పదవుల రిజర్వేషన్లకు సంబంధించి జిల్లాలవారీగా ఆయా జిల్లాల కలెక్టర్లు గురువారం గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేయడం తెలిసిందే. సర్పంచ్ రిజర్వేషన్ల ఖరారుపై వీడియో కాన్ఫరెన్స్ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గ్రామ సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లను సైతం ఖరారు చేసే కసరత్తు ప్రారంభమైంది. ఇందులో భాగంగా జిల్లా, మండల అధికారులకు సూచనలు చేసేందుకు పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజాశంకర్‌తో కలసి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల్లో ఎక్కడికక్కడ ఆయా జిల్లాల జెడ్పీ చైర్మన్లు, డీపీవోలు, ఆర్డీవోలు, ఎంపీడీవోలు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13,057 గ్రామ పంచాయతీలకు సర్పంచ్ పదవులతోపాటు వాటి పరిధిలో ఉండే 1,33,726 వార్డు సభ్యుల పదవుల రిజర్వేషన్లు ఖరారు చేసే ప్రక్రియను శని, ఆదివారాల్లోగా పూర్తి చేసి నోటిఫికేషన్ జారీ చేయాలని ఈ సందర్భంగా అధికారులను గోపాలకృష్ణ ద్వివేది ఆదేశించారు. -
పంచాయతీ ఎన్నికల్లో.. బీసీలకు 34% రిజర్వేషన్లు
సాక్షి, అమరావతి: రానున్న పంచాయతీ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 59.85 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీచేశారు. 2011 జనగణన వివరాల ప్రకారం ఎస్సీలకు 19.08 శాతం, ఎస్టీలకు 6.77 శాతం రిజర్వేషన్లు కల్పించి, బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు రెండ్రోజుల క్రితం జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్ణయించిందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు పంచాయతీరాజ్ కమిషనర్ ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జిల్లాలు, మండలాలు, గ్రామాలు, వార్డుల వారీగా రిజర్వేషన్ ఖరారుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. రిజర్వు స్థానాలు గుర్తించేది ఇలాగే.. ►రిజర్వేషన్ల ఖరారులో ఎస్సీ, ఎస్టీలకు 2011 నాటి జనాభా లెక్కల ప్రకారం నిర్ణయిస్తారు. బీసీ రిజర్వేషన్లను ప్రస్తుతం ఆ కేటగిరికి చెందిన ఓటర్ల వివరాల ప్రకారం కేటాయింపులు జరుగుతాయని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయ అధికారులు అంటున్నారు. ►జడ్పీ చైర్మన్, ఎంపీపీ, గ్రామ పంచాయతీ రిజర్వేషన్లు రాష్ట్రం యూనిట్‌గా.. జడ్పీటీసీ రిజర్వేషన్లు జిల్లా యూనిట్‌గాను.. ఎంపీటీసీ రిజర్వేషన్లు మండల యూనిట్‌గానూ.. వార్డు సభ్యుల రిజర్వేషన్లు గ్రామ పంచాయతీ యూనిట్‌గా తీసుకుంటారు. యూనిట్‌గా అంటే ఆ ప్రాంత పరిధిలో 2011 నాటి జనాభా లెక్కలు లేదా ఓటర్ల వివరాల మేరకు జరుగుతుంది. ►మండల పరిషత్ అధ్యక్ష పదవులకు అయితే.. రాష్ట్రంలో 660 మండల పరిషత్‌లు ఉండగా, ఏ జిల్లాకు ఎన్ని మండలాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ కేటగిరీల కింద కేటాయించాలన్నది పంచాయతీరాజ్ కమిషనర్ నిర్ణయించి, ఆయా జిల్లా కలెక్టర్లకు తెలియజేస్తారు. కలెక్టరు ఆ జిల్లాలో ఏ మండలం ఏ కేటగిరికి రిజర్వు చేసేది నిర్ణయిస్తారు. ►జడ్పీటీసీ పదవులకు అయితే.. ఆ జిల్లాలో ఉండే మొత్తం పదవులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన (ఎస్సీలకు 19.08 శాతం, ఎస్టీలకు 6,77 శాతం, బీసీలకు 34 శాతం, మిగిలినవి జనరల్ కేటగిరి) మేరకు జిల్లా కలెక్టరే రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. ►ఎంపీటీసీ పదవులకు అయితే.. జిల్లాలో ఉండే మొత్తం పదవులను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన మేరకు జిల్లా కలెక్టరు ఆ జిల్లాలో ఏ కేటగిరికి ఎన్ని పదువుల కేటాయించాలన్నది నిర్ణయిస్తే.. ఆర్డీవో స్థాయి అధికారి తమ పరిధిలో ఉన్న స్థానాలను ఏ కేటగిరికి ఎన్ని కేటాయించాలన్నది నిర్ణయిస్తారు. ►ఇక సర్పంచి పదవులను జిల్లాల వారీగా ఎన్ని కేటాయించాలన్నది పంచాయతీరాజ్ కమిషనర్, ఆయా జిల్లాల కలెక్టర్లు నిర్ణయిస్తారు. ఆర్డీవో స్థాయి అధికారి తమ పరిధిలో ఏఏ పంచాయతీలను ఏఏ కేటగిరికి కేటాయించేది నిర్ణయిస్తారు. ►చివరిగా.. వార్డు సభ్యుల రిజర్వేషన్లను గ్రామాల వారీగా ఏ కేటగిరికి ఎన్ని కేటాయించేది ఆర్డీవో అధికారి నిర్ణయిస్తే.. వార్డుల వారీగా ఏ వార్డును ఏ కేటగిరికి కేటాయించేది ఎంపీడీవో నిర్ణయిస్తారు. -
‘ప్రతి నియోజకవర్గానికి రూ.10 కోట్లు ఇవ్వాలి’
సాక్షి, అమరావతి : ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై అధికారులు వెంటనే స్పందించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. తాడేపల్లిలో పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి జిల్లా నీటి యాజమాన్య సంస్థ(డ్వామా) పీడీల సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్‌తోపాటు13 జిల్లాల డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పనుల గురించి చర్చించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఉన్నత లక్ష్యాలను సాధించాలని, గతేడాది కంటే కనీసం 20 శాతం అధికంగా పనిచేయాలని సూచించారు. ప్రగతిపై ప్రతి నెల ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ల ఆధ్వర్యంలో సమీక్షలు నిర్వహించాలని, ప్రతి నియోజకవర్గానికి రూ.10 కోట్లు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం(నరేగ) కింద ఇవ్వాలని కలెక్టర్లకు మంత్రి పెద్దిరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. డ్రైనేజీ, మురుగునీటి శుద్ది వంటి కార్యక్రమాలు చేపట్టి, ప్రాధాన్యత క్రమంలో గ్రామస్థాయిలో ప్రతిపాదిత పనులు చేయాలని ఆయన పేర్కొన్నారు. గ్రామ సచివాలయాలు, అసంపూర్తిగా ఉన్న అంగన్వాడీలు, స్కూళ్లలో వసతులపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పినట్లు ''నాడు-నేడు'' అనే విధంగా స్కూళ్లను ఆధునీకరించాలని అన్నారు. 40 వేలకు పైగా వున్న పాఠశాలలకు ప్రహారీ, మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలని అంతర్గత రహదారులు, హార్టీకల్చర్, మత్య్స పెంపకం వంటివి ప్రోత్సహించాలని సూచించారు. 11వేలకు పైగా వున్న గ్రామ సచివాలయాలకు ఉపాధి హామీని వర్తింపజేయాలని... అవసరైన చోట్ల కొత్త భవనాలు నిర్మించాలని.. ప్రస్తుతం ఉన్న వాటికి అదనపు గదుల నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు. కేంద్రం నుంచి నిధులు మరింత రావాలంటే, నరేగ పురోగతిలో ముందుండాలని మంత్రి సూచించారు. అదే విధంగా ఫీల్డ్ అసిస్టెంట్లపై ఫిర్యాదులు వస్తే వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని.. అలాగే మొక్కల సంరక్షణ, ప్లాంటేషన్లపై దృష్టి సారించాలని, ట్రీగార్డుల కోసం అన్ని జిల్లాల నుంచి కొటేషన్లు తెప్పించుకుని తక్కువ రేటును నిర్ణయించాలని అన్నారు. చిత్తూరు జిల్లాలో కూలీలు వలసలు వెళ్లకుండా చూడాలని ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరి సేవ పథకం కింద గ్రామ సచివాలయాలు నిర్మించాలని, వెంటనే వాటికి టెండర్లు పిలవాలని సూచించారు. 'ఉద్దానం' వంటి ప్రాంతంలో వెంటనే నరేగ కింద ప్లాంటేషన్ చేపట్టాలని, ప్రభుత్వం అందించే పక్కా గృహాలకు 90 రోజుల ఉపాధి పని దినాలను సద్వినియోగం చేయాలని పేర్కొన్నారు. నరేగ కింద ఎంపీలు ప్రతిపాదించే పనులకు ఎంపీ నిధులు కూడా తీసుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. -
సీఎం జగన్ ఇచ్చిన స్వేచ్ఛతోనే అది సాధ్యమైంది
సాక్షి, అమరావతి : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామక పరీక్షలు ఎలాంటి వివాదాలు లేకుండా ప్రశాంతంగా ముగిశాయని ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజేయ కల్లం అన్నారు. ఆరు రోజుల పాటు సాగిన ఈ పరీక్షలకు మొత్తం 89.83 శాతం మంది అభ్యర్థులు హాజరైనట్లు వెల్లడించారు. నిరుద్యోగ సమస్యను తగ్గించడంతో పాటు సంక్షేమ పథకాలను పారదర్శకంగా అర్హులైన పేదలకు అందించాలని, ప్రభుత్వ సేవల్లో జాప్యం జరగరాదనే సదుద్దేశంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇందులో పనిచేసేందుకు అవసరమైన ఉద్యోగుల నియామకానికి ఈ నెల ఒకటో తేదీ నుంచి 8వ తేదీ వరకు (2, 5 తేదీల్లో ప్రభుత్వ సెలవులు) ఆరు రోజుల పాటు పరీక్షలు నిర్వహించారు. (చదవండి : సచివాలయ పరీక్షల నిర్వహణపై సర్వత్రా ప్రశంసలు) పరీక్షలు ప్రశాంతంగా ముగిసిన సందర్భంగా అజేయకల్లం సోమవారం మీడియాతో మాట్లాడారు. ఏపీలో పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీ చేపట్టామన్నారు. ఎలాంటి వివాదాలకు తావులేకుండా ఒకే సారి లక్షా 34వేల ఉద్యోగాలు భర్తీ చేయడం రికార్డ్ అన్నారు. గత 20 ఏళ్లలో ఏడాదికి 1000 ఉద్యోగాలు కూడా భర్తీ చేసిన దాఖలాలు లేవన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన స్వేచ్ఛ.. రాజకీయ జోక్యం లేకుండా చర్యలు తీసుకోవడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. రాజకీయ జోక్యం లేకుంటే అధికారుల పనితీరు అద్భుతంగా ఉంటుందనడానికి ఈ ఉద్యోగ నియామక ప్రక్రియే నిదర్శనమన్నారు. 20లోగా ఫలితాలు : గిరిజా శంకర్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామక పరీక్షలు మొత్తంగా 89.83శాతం అభ్యర్థులు హాజరయ్యారని పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ వెల్లడించారు. పరీక్షలకు ఎటువంటి ఇబ్బది లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. సచివాలయ ఉద్యోగ పరీక్షలకు 21.69లక్షల దరఖాస్తులు వచ్చాయని, మొత్తంగా 19.49 లక్షల మంది పరీక్షలకు హాజరయ్యారన్నారు. అభ్యర్థుల రవాణ సౌకర్యం కోసం 6వేల బస్సులను ఉపయోగించామన్నారు. జవాబు పత్రాలను స్ట్రాంగ్‌రూంలలో భద్రపరిచామని, జిల్లా కేంద్రాలలో ఓఎమ్మార్ షీట్ల స్కానింగ్ చేపడతామన్నారు. ఈ నెల 20 లోపు ఫలితాలను వెల్లడిస్తామని గిరిజా శంకర్ పేర్కొన్నారు. అందరి సహకారంతోనే ఇంత పెద్ద టాస్క్ పూర్తి చేశాం : విజయ్‌కుమార్ అందరి సహకారం వల్లే సచివాల పరీక్షలను ప్రశాంతంగా ముగిశాయని మున్సిపల్ శాఖ కమిషనర్ విజయ్‌కుమార్ అన్నారు. తమపై నమ్మకంలో ప్రభుత్వం అప్పజెప్పిన పనిని సమర్ధవంతంగా నిర్వహించామన్నారు. పరీక్షల నిర్వహణ విషయంలో ఎలాంటి ఫిర్యాదులు రాలేదన్నారు. 25శాతం టఫ్ ప్రశ్నలు ఉన్నాయి : ద్వివేది ఏపీపీఎస్సీ ప్రమాణాలను పాటించి సచివాల ఉద్యోగాల పరీక్షలను నిర్వహించామని పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. ప్రశ్నాపత్రం 25శాతం టఫ్‌గా ఉందన్నారు. అత్యంత వేగంగా ప్రశ్నాపత్రాల స్కానింగ్ చేపట్టామని, ఈనెల 20లోపు ఫలితాలు వెల్లడిస్తామని చెప్పారు. జిల్లాలవారిగా మెరిట్ లిస్ట్ ప్రకటిస్తామని తెలిపారు. సచివాలయాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని, 1500 చోట్ల సచివాలయ భవనాలను నిర్మిస్తామని ద్వివేది పేర్కొన్నారు. -
సచివాలయ పరీక్షల నిర్వహణపై సర్వత్రా ప్రశంసలు
సాక్షి, అమరావతి : ప్రతిపక్షాల ప్రచారం నమ్మి ‘సచివాలయ’ ఉద్యోగాలంటే ఏవేవో అనుమానాలు వ్యక్తం చేసిన అభ్యర్థులు సైతం రాత పరీక్షల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధిని చూసి శభాష్ అంటున్నారు. ఒక రాష్ట్రంలో 1,34,524 ఉద్యోగాలకు ఏకంగా 19,49,218 మంది హాజరవ్వడం, ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా పరీక్షలు నిర్వహించడం రాష్ట్రంలోనే కాదు దేశ చరిత్రలోనే రికార్డు అని అధికారులు, ప్రజలు చర్చించుకుంటున్నారు. ఆదివారంతో ఉద్యోగాల రాత పరీక్షలు విజయవంతంగా ముగిశాయి. ఈ నెల 1వ తేదీ నుంచి 8వ తేదీ మధ్య ఆరు రోజుల పాటు జరిగిన పరీక్షలకు ఏకంగా 90 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. ప్రశ్నాపత్రం రూపకల్పన, పరీక్షల నిర్వహణ, ఏర్పాట్లు సివిల్స్ రాతపరీక్షలు నిర్వహించే యూపీఎస్సీ స్థాయిలో ఉన్నాయని అటు పరీక్ష రాసిన అభ్యర్థులు, ఇటు మేధావులు ప్రశంసలు కురిపిస్తున్నారు. లక్షన్నర ప్రభుత్వ ఉద్యోగాలంటే ఎగతాళి చేశారు.. రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశంలోని మరే రాష్ట్ర చరిత్రలో లేని విధంగా ఒకే విడత 1,34,524 ఉద్యోగాలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం జూలై నెలలో నోటిఫికేషన్లు జారీ చేసింది. పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలు కలిపి 1,26,728 ఉద్యోగాలకు, విద్యుత్ సంస్థలు మరో 7,796 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. స్వాతంత్య్రం వచ్చాక గత 72 ఏళ్లలో జరిగిన నియామకాల ద్వారా రాష్ట్రంలో ఇప్పుడున్న మొత్తం ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య 4.61 లక్షలుగా ఉంది. ఆ సంఖ్యలో దాదాపు మూడో వంతు ప్రభుత్వ ఉద్యోగాలను ఒకే విడతలో భర్తీ చేసేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున వైఎస్ జగన్ లక్షన్నర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై ప్రకటన చేస్తే.. అవన్నీ వాళ్ల పార్టీ కార్యకర్తలకే ఇచ్చుకుంటారులే అంటూ ప్రతిపక్ష నాయకులు విమర్శించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేసేందుకు 1,26,728 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేస్తే 21,69,589 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రతిపక్షాలు చేసే ప్రచారం నమ్మి దరఖాస్తు చేసుకున్న వారిలో కొందరు ఈ ఉద్యోగాలు మెరిట్ ఆధారంగా జరగుతాయా లేదా అని అనుమానం వ్యక్తం చేశారు. అలా అనుమానం వ్యక్తం చేసిన వారు సైతం రాత పరీక్షలు ముగిశాక ప్రభుత్వ చిత్తశుద్ధిని కొనియాడుతున్నారు. అతి తక్కువ సమయంలో నిర్వహణ రాష్ట్రంలో ఇదివరకు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడ్డాక భర్తీ ప్రక్రియ పూర్తవ్వడానికి ఏడాదో, రెండేళ్లో, కొన్ని సార్లు మూడు నాలుగేళ్లు పట్టిన ఉదంతాలున్నాయి. కానీ ‘సచివాలయ’ ఉద్యోగ నియామకాల ప్రక్రియ అంతా రెండున్నర నెలల్లోనే ముగియనుంది. 1,26,728 ఉద్యోగాలకు జూలై 26న నోటిఫికేషన్ విడుదల అయింది. సెప్టెంబర్ 8వ తేదీ నాటికి అన్ని ఉద్యోగాలకు రాత పరీక్షలు మగిశాయి. జవాబు పత్రాల స్కానింగ్ ప్రక్రియ కూడా ఇప్పటికే చాలా వరకు పూర్తయినట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అక్టోబర్ 2వ తేదీ నాటికి నోటిఫికేషన్లో పేర్కొన్న మేరకు ఉద్యోగ నియామకాల పత్రాలు అందజేసి, వారు విధుల్లో కూడా చేరిపోతారని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేవలం 125 రోజుల్లో.. నోటిఫికేషన్ జారీ చేశాక కేవలం 65 – 70 రోజుల్లో ఉద్యోగ నియామక ప్రక్రియ మొత్తం పూర్తి చేయాలని అధికారులు కంకణం కట్టుకొని పని చేస్తున్నారు. యూపీఎస్సీ పరీక్షల స్థాయిలో ఏర్పాట్లు ఉద్యోగ నియామక ప్రక్రియలో కీలకమైన రాత పరీక్షల నిర్వహణ కూడా జాతీయ స్థాయి పోటీ పరీక్షలను నిర్వహించే యూపీఎస్సీ స్థాయికి ఏ మాత్రం తక్కువగా లేదని పరీక్ష రాసిన అభ్యర్థులు చెబుతున్నారు. ఒకేసారి దరఖాస్తు చేసుకున్న 21.69 లక్షల మంది అభ్యర్థులకు సాధ్యమైనంత మేర అతి తక్కువ దూరంలో పరీక్షా కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ నెల 1వ తేదీ ఉదయం జరిగిన రాత పరీక్షకు ఒక్కదానికే 12.54 లక్షల మంది దరఖాస్తు చేసుకోవడంతో రాష్ట్రంలోని మారు మూల మండల కేంద్రాల్లో సైతం కేంద్రాలను ఏర్పాటు చేసింది. 4,465 కేంద్రాల్లో పరీక్షలు జరపడంతో ఆ పరీక్షకు ఏకంగా 92.77 శాతం మంది హాజరయ్యారు. పరీక్షా కేంద్రంలో ప్రతి 24 మంది అభ్యర్థులకు ఒక గది కేటాయించారు. సమగ్ర పర్యవేక్షణకు ఒక పరీక్షా కేంద్రంలో పది గదులు మించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పరీక్షా కేంద్రంలో అభ్యర్థులు మంచి నీటి పేరుతో తమ సీటు నుంచి కదలకుండా కూర్చున్న చోటుకే అందజేసేలా ముందుస్తు ఏర్పాటు చేశారు. మెటీరియల్ తరలింపులో పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పరీక్షా కేంద్రాలకు వెళ్లే అభ్యర్థులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకండా పట్టణాల్లో ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పరీక్షా కేంద్రాల పరిధిలో వంద మీటర్ల పరిసర ప్రాంతాల్లో జిరాక్స్ సెంటర్లు ముందస్తుగా మూసి వేశారు. ఏర్పాట్ల విషయంలో ప్రతి చోటా యూపీఎస్సీ ప్రమాణాలను పాటించినట్టు అభ్యర్థులు చెబుతున్నారు. పొరపాట్లకు తావేలేదు ప్రశ్నాపత్రాలు లీకు చేస్తారని ప్రతిపక్షాలకు అనుకూలంగా ఉండే వారు కొందరు సోషల్ మీడియాలో పనిగట్టుకొని ప్రచారం చేశారు. ఆరు రోజుల పాటు 5,314 పరీక్షా కేంద్రాల్లో.. తొలిరోజు మూరుమూల మండల కేంద్రాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినా ప్రశ్నాపత్రాల భద్రత విషయంలో ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. మూరు మూల ప్రాంతంలో ఉండే పరీక్షా కేంద్రానికి చేరాల్సిన ప్రశ్నాపత్రాలను ఒక్క రోజు ముందు దానికి దగ్గరలోని పోలీసుస్టేషన్‌కు తరలించారు. అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి రాష్ట్ర స్థాయి కమాండ్ కంట్రోల్ రూం నుంచి వాటిని పర్యవేక్షించారు. ప్రభుత్వం ముందస్తుగా తీసుకున్న జాగత్రలతో ఆరు రోజుల పాటు ఎక్కడా చిన్న పొరపాటు చోటు చేసుకోలేదు. ఉద్యోగ నియామక పరీక్షల నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థ ఉన్న ఏపీపీఎస్సీ ద్వారా జరిగే పరీక్షలో ప్రశ్నాపత్రాల్లో పెద్ద ఎత్తున తప్పులు దొర్లడం అనేది పోటీ పరీక్ష రాసే అనుభవం ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు. ఏపీపీఎస్సీ ద్వారా కాకుండా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రభుత్వమే పరీక్షలు నిర్వహించినప్పటికీ, ప్రశ్నాపత్రాల రూపకల్పన సైతం అభ్యర్థులను మెప్పించింది. ప్రశ్నపత్రాలలో నామమాత్రపు పొరపాట్లు కూడా జరగలేదని అభ్యర్థులు చెబుతున్నారు. పరీక్ష జరిగిన రోజు ప్రాథమిక ‘కీ’ని అధికారికంగా విడుదల చేశారు. నాలుగు రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం తుది ‘కీ’ విడుదల చేశారు. ఇంత పకడ్బందీ ప్రణాళిక ఇటీవల కాలంలో ఏ పోటీ పరీక్షలలోనూ చూడలేదని అభ్యర్థులు వ్యాఖ్యానించారు. ఇంటర్వ్యూ రద్దుతో దళారులకూ చెక్ పకడ్బందీ పరీక్ష నిర్వహణే కాదు.. పారదర్శకంగా ఈ ప్రక్రియ ఉండాలని అధికారులు అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఉద్యోగ నియామక ప్రక్రియలో దళారుల వ్యవస్థకు ఆస్కారం లేకుండా ఉండేందుకు ఇంటర్వ్యూ అన్నది లేకుండా ఉండాలని, కేవలం రాత పరీక్షల్లో అభ్యర్థులకు వచ్చే మార్కుల ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. పారదర్శకతగా పరీక్షలు నిర్వహిస్తూనే.. పోటీ పడుతున్న అభ్యర్థులు దళారులను నమ్మవద్దని ప్రభుత్వం విస్త్ర్తతంగా ప్రచారం చేసింది. ప్రభుత్వానికి అందిన ఫిర్యాదుల మేరకు కొన్ని జిల్లాల్లో దళారులపై కేసులు నమోదు చేయడం గమనార్హం. అధికారుల పాత్ర కీలకం.. రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల ప్రత్యేక వ్యవస్థ ఉన్న ఏపీపీఎస్సీనే ఒకే విడతలో 1,26,728 ఉద్యోగాలను నిర్ణీత సమయంలో ఎప్పుడూ భర్తీ చేయలేదు. ఈ పరిస్థితుల్లో జిల్లా సెలక్షన్ కమిటీల ద్వారా ఉద్యోగ భర్తీ ప్రక్రియను చేపట్టారు. ఈ పోస్టుల భర్తీని చాలా పారదర్శకంగా, ప్రతిభ ఆధారంగా భర్తీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గట్టి పట్టుదలతో ఎప్పటికప్పుడు మంత్రులకు, సంబంధిత అధికారులకు సూచనలతో పాటు ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం, సీఎంవో కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్, పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్, మున్సిపల్ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు, మున్సిపల్ కమిషనర్ విజయకుమార్‌లు ఒక జట్టుగా ఏర్పడి సంబంధిత అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుంటూ ఈ నియామక ప్రక్రియలో కీలకమై పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించారు. పరీక్షల రాష్ట్ర కమిటీ కన్వీనర్‌గా గిరిజా శంకర్ ప్రతి అంశం దగ్గర ఉండి పర్యవేక్షించారు. దీంతో పాటు జిల్లా కలెక్టరు, ఎస్పీలు, జిల్లా అధికార యంత్రాంగం, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మున్సిపల్ శాఖ సిబ్బంది పరీక్షల నిర్వహణలో చిత్తశుద్ధితో పని చేశారు. చరిత్రాత్మకం మొత్తం 19 రకాల ఉద్యోగాలకు 21.69 లక్షల మంది పరీక్షలు రాశారు. తప్పన్నదానికి తావులేకుండా పరీక్షలు నిర్వహించాం. ఇదొ చరిత్రాత్మక ఘటన. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఈ స్థాయి నియామకాలు, ఇన్ని లక్షల మందికి పకడ్బందీగా పరీక్షలు నిర్వహించడం జరగలేదు. పక్కా ప్రణాళికతో సమర్థవంతంగా పరీక్షలు నిర్వహించిన పంచాయతీరాజ్ కమిషనర్, రాష్ట్ర స్థాయి సిబ్బంది, జిల్లా కలెక్టర్లు, సిబ్బందికి అభినందనలు. – గోపాలకృష్ణ ద్వివేది, పరీక్ష నిర్వహణ కమిటీ చైర్మన్, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి. అందరికీ అభినందనలు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ ఉద్యోగ నియామకాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆ మేరకు ఆయన అధికారులందరినీ అప్రమత్తం చేశారు. సీఎం ఆదేశాలకు అనుగుణంగా అందరం పనిచేశాం. ప్రభుత్వం నుంచి వచ్చిన సూచనల మేరకు జిల్లాల్లో పరీక్షల నిర్వహణను విజయవంతం చేసిన జిల్లా కలెక్టర్లు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్ర, జిల్లా స్థాయి సిబ్బందికి అభినందనలు. – గిరిజా శంకర్, పంచాయతీరాజ్ కమిషనర్, రాష్ట్ర స్థాయి పరీక్షల కమిటీ కన్వీనర్ సీఎం అరుదైన అవకాశం ఇచ్చారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికార యంత్రాంగానికి అరుదైన అవకాశం ఇచ్చారు. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పారదర్శకంగా, ప్రశాంతంగా పరీక్షలు నిర్వహించి ప్రభుత్వం çపట్ల తమ చిత్తశుద్ధిని ప్రదర్శించింది. జిల్లా కలెక్టర్లు, అధికారులు పరీక్షల నిర్వహణకు రేయింబవళ్లు పనిచేశారు. గతంలో ఎప్పుడూ ఇంత పెద్ద సంఖ్యలో పరీక్షలు నిర్వహించిన దాఖలాలు లేవు. చిన్నపాటి విమర్శలకు తావులేకుండా పరీక్షలు నిర్వహించేందుకు సహకరించిన అన్ని వర్గాల వారికి కృతజ్ఞతలు. – విజయకుమార్, మున్సిపల్ శాఖ కమిషనర్, డైరెక్టర్ -
పంచాయతీలకే అధికారాలు..
సాక్షి, అమరావతి: గ్రామ పంచాయతీలను ‘స్థానిక ప్రభుత్వాలు’గా తీర్చిదిద్దే దిశగా సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీలకు బదలాయించబడిన 29 రకాల అధికారాలను సదరు పంచాయతీలే సమర్థవంతంగా నిర్వహించేలా గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రవేశపెడుతూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 2వ తేదీ నుంచి ఏర్పాటయ్యే గ్రామ సచివాలయాల్లో పనిచేసేందుకు.. ప్రస్తుతం పంచాయతీ స్థాయిలో పనిచేస్తున్న వారు కాకుండా కొత్తగా 91,652 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గ్రామ సచివాలయాల ఏర్పాటు, సచివాలయాల నిర్వహణకు సంబంధించి విధి విధానాలను కూడా ఆ ఉత్తర్వుల్లో వివరించారు. ప్రతి పంచాయతీ ఇక స్వతంత్ర ప్రతిపత్తి గల ప్రభుత్వమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరహాలోనే గ్రామ పంచాయతీల్లోనూ స్వతంత్ర ప్రతిపత్తి గల ప్రభుత్వం ఏర్పాటు కావాలనే లక్ష్యంతో 1994లో పార్లమెంట్లో 73వ రాజ్యాంగ సవరణ చేశారు. దీనికి అనుగుణంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉండే 13 శాఖలకు చెందిన 29 అధికారాలను గ్రామ పంచాయతీలతో కూడిన స్థానిక ప్రభుత్వాలకు బదలాయిస్తూ 2007, 2008 సంవత్సరాల్లో పలు ఉత్తర్వులు జారీ చేశారు. ఆ అధికారాలు నిర్వహించడానికి గ్రామ పంచాయతీల్లో తగిన సిబ్బంది నియామకానికి ఇప్పటివరకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టలేదు. నూతన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పంచాయతీలకు బదలాయించిన అధికారాలను స్థానికంగానే నిర్వహించుకునేలా పటిష్ట వ్యవస్థను నిర్మించేందుకు నిర్ణయించారు. దీంతోపాటు నవరత్నాల పథకాలు అట్టడుగు స్థాయిలో అర్హులందరికీ సమర్థవంతంగా అందజేసే లక్ష్యంతో గ్రామ సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నూతనంగా వ్యవస్థలో గ్రామ పంచాయతీ కార్యాలయాలను గ్రామ సచివాలయాలుగా మారుస్తారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించే గ్రామ వలంటీర్లు గ్రామ సచివాలయాల పరిధిలోకి వస్తారని ఉత్తర్వుల్లో వెల్లడించారు. సచివాలయ కన్వీనర్ పంచాయతీ కార్యదర్శి గ్రామ సచివాలయాలలో పనిచేసే ఉద్యోగులందరికీ గ్రామ కార్యదర్శి కన్వీనర్‌గా వ్యవహరిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జనాభా సంఖ్య ఆధారంగా కొన్నిచోట్ల రెండు లేక అంతకంటే ఎక్కువ గ్రామ పంచాయతీలకు ఒక గ్రామ సచివాలయం యూనిట్‌గా గ్రామ కార్యదర్శి, అతనికి అనుబంధ సిబ్బంది పనిచేస్తారని ఉత్తర్వులో పేర్కొన్నారు. కొన్ని పెద్ద గ్రామ పంచాయతీల్లో రెండు కంటే ఎక్కువ గ్రామ సచివాలయాలు ఏర్పాటవుతాయని, వాటిలోనూ పూర్తిస్థాయి సిబ్బంది పనిచేస్తారని పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్రంలో గల 13,065 గ్రామ పంచాయతీలను 11,114 గ్రామ సచివాలయాలుగా వర్గీకరిస్తున్నట్టు పేర్కొన్నారు. 2 వేల నుంచి 4 వేల మధ్య జనాభా ఉండే గ్రామ పంచాయతీల్లో ఒక గ్రామ సచివాలయం ఏర్పాటు చేస్తారు. 2 వేల లోపు జనాభా ఉన్నచోట వీలును బట్టి రెండు మూడు పంచాయతీలకు కలిపి ఒకే గ్రామ సచివాలయ యూనిట్ సిబ్బంది పనిచేస్తారని పేర్కొన్నారు. 4వేలకు పైబడి జనాభా ఉన్న ఒకే గ్రామ పంచాయతీలో రెండు లేదా అంతకంటే ఎక్కువ సచివాలయాలు ఏర్పాటు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో వివరించారు. గిరిజన ప్రాంతాల్లో 2వేల కంటే తక్కువ జనాభా ఉన్నచోట ఒక గ్రామ సచివాలయం ఏర్పాటుకు వీలు కల్పించారు. గ్రామ సచివాలయాల్లో పనిచేసే సిబ్బందితోపాటు ఆ గ్రామ సచివాలయం పరిధిలో పనిచేసే వలంటీర్లకు కన్వీనర్‌గా వ్యవహరించే గ్రామ కార్యదర్శి చేతుల మీదుగానే జీతాల చెల్లింపులు జరుగుతాయని పేర్కొన్నారు. కార్యదర్శి సహా గ్రామ సచివాలయాల్లో పనిచేసే సిబ్బందికి సెలవు మంజూరు చేసే అధికారాన్ని సర్పంచ్‌కు అప్పగించారు. గ్రామ సచివాలయ సిబ్బంది వివిధ లైన్ డిపార్ట్‌మెంట్స్‌తో కలిపి గ్రామాభివృద్ధి ప్రణాళికలు (జీపీడీపీ) రచించి అమలు చేస్తారు. రెండేళ్ల పాటు రూ.15 వేలు జీతం.. తర్వాత రెగ్యులరైజేషన్ గ్రామ సచివాలయాల్లో పని చేయడానికి ప్రభుత్వం కొత్తగా నియమించే ఉద్యోగులకు మొదటి రెండేళ్ల పాటు ప్రొబెషనరీ పీరియడ్‌గా భావించి, ఆ కాలంలో నెలకు రూ.15 వేల చొప్పున స్టైఫండ్ రూపంలో వేతనంగా చెల్లిస్తారు. రెండేళ్ల తర్వాత వివిధ శాఖల నిబంధనల మేరకు వారిని రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గ్రామ సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగుల పనితీరును సమీక్షించడానికి మండల, జిల్లా స్థాయి అధికారుల ద్వారా ఎప్పటికప్పుడు నివేదికలను ప్రభుత్వం తెప్పించుకుంటుంది. ఇందుకోసం ఆన్లైన్ ద్వారా పర్యవేక్షణకు ప్రత్యేక మాడ్యూల్‌ను తయారు చేయనున్నట్టు పేర్కొన్నారు. -
డ్వాక్రా మహిళలకు త్వరలో సీఎం జగన్ లేఖలు
సాక్షి, అమరావతి: ‘వైఎస్సార్ ఆసరా’ పథకం ద్వారా డ్వాక్రా మహిళలకు నాలుగు విడతల్లో ఎవరెవరికి ఎంత మొత్తం వారి చేతికే నేరుగా అందజేస్తారనే వివరాలను తెలియజేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి త్వరలో వారికే నేరుగా లేఖలు రాయాలని నిర్ణయించారు. ఎన్నికల నాటికి డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు ఉన్న పొదుపు సంఘాల రుణాల మొత్తం నాలుగు దఫాలుగా నేరుగా వారి చేతికే అందజేస్తామని ఎన్నికల ముందు వైఎస్ జగన్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన రెండో ఏడాది నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తామని కూడా ఎన్నికలకు ముందే ఆయన స్పష్టంగా ప్రకటించారు. రాష్ట్ర బ్యాంకర్ల సంఘం గణాంకాల ప్రకారం.. ఎన్నికల నాటికి రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పొదుపు సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళల పేరిట రూ.27,147 కోట్ల అప్పులు ఉన్నట్టు తేల్చారు. వైఎస్ జగన్ ఎన్నికలకు ముందే హామీ ఇచ్చిన మేరకు రెండో ఏడాది నుంచి ఈ పథకం అమలు చేసేలోగా.. వడ్డీ భారం మహిళలపై ఏమాత్రం పడకుండా ఉండాలన్న ఉద్దేశంతో మొత్తం రుణంపై పథకం అమలు చేసే నాటికి రూ.2,472 కోట్లు వడ్డీ అవుతుందని అంచనా వేసి, ఆ డబ్బులను ప్రభుత్వం మొదటి ఏడాదే బ్యాంకులకు చెల్లించాలని కూడా నిర్ణయించారు. రెండో ఏడాది నుంచి రూ.27,147 కోట్ల మొత్తాన్ని సంఘాల వారీగా అప్పును బట్టి నాలుగు విడతల్లో చెల్లిస్తారు. అప్పుల వివరాలన్నీ పారదర్శకం డ్వాక్రా పొదుపు సంఘాలకు జీరో వడ్డీ, వైఎస్సార్ ఆసరా పథకాల అమలు కార్యాచరణపై చర్చించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం సెర్ప్, మెప్మా అధికారులతో సచివాలయంలో సమీక్షించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలారావు, సెర్ప్ సీఈవో రాజాబాబు తదితరులు సమీక్షలో పాల్గొన్నారు. ఈ పథకం అమలులో ఎవరికీ ఏ అనుమానాలు తలెత్తకుండా పూర్తి పారదర్శకంగా ఉండడానికి సంఘాల వారీగా అప్పుల వివరాలు ప్రజలందరికీ తెలిసేలా వెంటనే ఆన్లైన్లో నమోదు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఆగస్టు 15 నాటికి గ్రామ, వార్డు వలంటీర్ల నియామకాలు పూర్తి కాగానే.. వారి ద్వారా డ్వాక్రా సంఘాలకు సీఎం రాసిన లేఖతో పాటు ఆ సంఘం పేరిట ఉన్న అప్పు ధృవీకరణ పత్రాన్ని అందజేస్తారు. మొత్తం రుణంపై మొదటి ఏడాదికయ్యే వడ్డీ మొత్తం ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లించి, రశీదులను సైతం వలంటీర్ల ద్వారా అందజేయాలని కూడా సీఎం ఆదేశించారు. ప్రస్తుతం సంఘాల వారీగా ఏ సంఘం పేరిట ఏ బ్యాంకులో ఎంత రుణం ఉందన్న వివరాలను సెర్ప్, మెప్మా అధికారులు సేకరిస్తున్నారు. సంఘం పేరిట ఉండే అప్పు మొత్తాన్ని నిర్ధారిస్తూ మొదట సంబంధిత బ్యాంకు అధికారి నుంచి ఒక ధృవీకరణ పత్రాన్ని తీసుకుంటున్నారు. అప్పు మొత్తంలో ఎటువంటి తప్పు ఒప్పులకు తావు లేకుండా ఉండేందుకు సెర్ప్, మెప్మా అధికారులు సంబంధిత సంఘాన్ని సమావేశ పరిచి బ్యాంకు నుంచి తీసుకున్న ధృవీకరణ పత్రంలో పేర్కొన్న మొత్తాన్ని నిర్ధారించుకుని, ఆ సంఘం సభ్యుల నుంచి సంతకాలు కూడా తీసుకుంటున్నారు. ఇక క్రమం తప్పకుండా జీరో వడ్డీ డబ్బులు మహిళలు పొదుపు సంఘాల పేరిట తీసుకునే రుణాలపై ఇక నుంచి అపరాధ వడ్డీ భారమన్న ప్రసక్తే లేకుండా కార్యాచరణ సిద్ధం చేయాలని కూడా సీఎం సమీక్ష సమావేశంలో అధికారులను ఆదేశించారు. డ్వాక్రా సంఘాలు బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులకయ్యే వడ్డీ డబ్బులను జీరో వడ్డీ పథకం ద్వారా గత టీడీపీ ప్రభుత్వం సకాలంలో బ్యాంకులకు చెల్లించని కారణంగానే మహిళలకు మోయలేనంత భారంగా మారాయని సమీక్షలో సీఎం వ్యాఖ్యానించారు. ఇక నుంచి జీరో వడ్డీ డబ్బులను క్రమం తప్పుకుండా బ్యాంకులకు చెల్లించే ప్రక్రియ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దీనిపై ఆర్థిక శాఖ అధికారులతోనూ సమన్వయం చేసుకోవాలని సూచించారు. జీరో వడ్డీ పథకంలో ఎప్పటికప్పుడు ప్రభుత్వం వడ్డీ డబ్బులను బ్యాంకులకు చెల్లిస్తుందన్న వివరాలు సంబంధిత సంఘంలోని మహిళలకు తెలిసేలా బ్యాంకు రశీదులను వలంటీర్ల ద్వారా అందజేయాలని చెప్పారు. -
ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది బదిలీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కె.విజయానంద్ నూతన సీఈవోగా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. విజయానంద్ ప్రస్తుతం ఏపీ జెన్కో సీఎండీగా ఉన్నారు. కాగా ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఈవో ఆర్పీ సిసోడియా ఆకస్మికంగా బదిలీ చేసి ఆ స్థానంలో గోపాలకృష్ణ ద్వివేదిని కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన విషయం తెలిసిందే. -
వైఎస్ జగన్‌ను కలిసిన ఎన్నికల అధికారి ద్వివేది
-
శ్రీవారిని దర్శించుకున్న ద్వివేది
-
గవర్నర్‌ను కలిసిన ఏపీ సీఈవో ద్వివేది
-
గవర్నర్‌ను కలిసిన సీఈవో ద్వివేది
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు ఆదివారం గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదితోపాటు అడిషనల్ సీఈఓలు వివేక్ యాదవ్, సుజాత శర్మలు గవర్నర్‌ను కలిసిన వారిలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేల జాబితాతో కూడిన గెజిట్ నోటిఫికేషన్‌ను ఈ సందర్భంగా వారు గవర్నర్‌కు అందజేశారు. భేటీ అనంతరం ద్వివేది మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికైన 175 మంది జాబితాను గవర్నర్‌కు అందజేసామన్నారు. ఎన్నికల ప్రక్రియలో చివరి అంకంలో భాగంగా ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్‌కు అంజేసినట్టు పేర్కొన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడంపై గవర్నర్ కితాబు ఇచ్చినట్టు తెలిపారు. -
ఆదివారం గవర్నర్‌తో ద్వివేది భేటి
సాక్షి,అమరావతి : రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌తో ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానఅధికారి గోపాలకృష్ణ ద్వివేది ఆదివారం ఉదయం 11.30 గంటలకు భేటికానున్నారు. గెలిచిన ఎమ్మెల్యేల జాబితాతో కూడిన గెజిట్ నోటిఫికేషన్‌ను ఆయన గవర్నర్‌కు అందజేయనున్నారు. ద్వివేదితో పాటు అడిషనల్ సీఈవోలు వివేక్ యాదవ్, సుజాత శర్మలు కూడా గవర్నర్‌తో సమావేశం కానున్నారు. గెలుపొందిన సభ్యులు జాబితాను గవర్నర్ అమోదించిన తర్వాత శాసనసభ్యుల వివరాలతో రాజపత్రాన్ని ప్రచురించనున్నారు. ఆ తర్వాత కొత్త ప్రభుత్వ ఏర్పాటులో అధికారిక లాంఛనాలు పూర్తయ్యాక సీఎం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్ధుల వివరాలతో రాజపత్రాన్ని ప్రచురించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే అన్ని నియోజక వర్గాల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలకు సంబంధిత ఆర్వోలు ధృవీకరణ పత్రాలను అందచేశారు. శనివారం ఉదయం తాడేపల్లిలోని వైసీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. గెలిచిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు శాసనసభా పక్ష నేతగా ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకోనున్నారు. అనంతరం జగన్ గవర్నర్‌తో భేటీ అవుతారు. శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశమివ్వాలని గవర్నర్‌ను జగన్ కోరుతారు. మరోవైపు రాష్ట్రంలో అత్యధిక స్థానాలున్న పార్టీగా వైఎస్సార్సీపీ అవరతరించడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా జగన్‌ను గవర్నర్ కోరవచ్చు. ఎన్నికల సంఘం నుంచి ఎన్నికైన శాసనసభ్యుల వివరాలను గెజిట్‌లో ముద్రించేందుకు గవర్నర్ అనుమతించిన వెంటనే ఆ జాబితాతో గెజిట్ రూపొందుతుంది. ఈ అధికారిక లాంఛనాలు పూర్తైన వెంటనే కొత్త ప్రభుత్వం కొలువుదీరుతుంది. -
‘ఫలితాలు కరెక్టుగా ఇవ్వడమే మా లక్ష్యం’
సాక్షి, అమరావతి : ఈనెల 23న ఎన్నికల ఫలితాల వెల్లడి నేపథ్యంలో కౌంటింగ్ రోజు ఎలాంటి పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. మంగళవారం ఆయన మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..ప్రశాంతంగా కౌంటింగ్ జరిపేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని విఙ్ఞప్తి చేశారు. కౌంటింగ్ ప్రక్రియ గురించి వివరిస్తూ..‘ఈవీఎంలకు మూడు సీళ్లు ఉంటాయి. ఏజెంట్ల సమక్షంలోనే సీల్ ఓపెన్ చేస్తాం. అనుమానాలకు అవకాశం లేదు. కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహిస్తాం. కౌంటింగ్ కేంద్రంలో అవకతకలకు పాల్పడినా, గొడవలు సృష్టించినా ఎవరినీ ఉపేక్షించము’ అని హెచ్చరించారు. ‘ఫలితాలు తొందరగా ఇవ్వడం కాదు, కరెక్టుగా ఇవ్వడమే మా ముందున్న లక్ష్యం. మధ్యాహ్నం రెండు కల్లా ఈవీఎంల కౌంటింగ్ పూర్తవుతుంది. టేబుళ్లు, ఓట్లను బట్టి ముందు ఫలితం వెలువడుతుంది’ అని ద్వివేది పేర్కొన్నారు. -
‘కౌంటింగ్ తర్వాత కూడా రీపోలింగ్ అవకాశాలు’
సాక్షి, అమరావతి : దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. మంగళవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. తప్పనిసరి పరిస్థితుల్లో కౌంటింగ్ పూర్తైన తర్వాత కూడా రీపోలింగ్ నిర్వహించే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈవీఎంలు మొరాయించి, వీవీప్యాట్ లెక్కలో తేడా వచ్చినా, మిగతా లెక్కింపులో పార్టీల మధ్య ఓట్ల వ్యత్యాసం అతి తక్కువగా ఉంటే రీపోలింగ్‌కు ఆదేశించే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. ఇక మే 27 అర్ధరాత్రి వరకు ఎన్నికల నియమావళి అమల్లో ఉంటుందని, ఫలితాల వెల్లడిలో ఆర్వోలదే తుది నిర్ణయమని పేర్కొన్నారు. -
కౌంటింగ్ నుంచి ఆ వీవీప్యాట్లను తొలగిస్తాం
సాక్షి, అమరావతి: మాక్ పోలింగ్‌లో నమోదైన స్లిప్పులను తొలగించని వీవీప్యాట్లను ఓట్ల లెక్కింపునకు (లాటరీ ద్వారా ఎంపిక చేసినవి) తీసుకోబోమని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. వీవీప్యాట్ల లెక్కింపులో అనవసర సందేహాలు తలెత్తకుండా ఉండటానికి ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఎన్నికల సమయంలో మాక్ పోలింగ్‌లో 50 ఓట్లు నమోదైన తర్వాత వాటిని తొలగించి సీఆర్సీ చేసి పోలింగ్ ప్రారంభించాల్సి ఉండగా కొన్ని చోట్ల వాటిని తొలగించకుండా పోలింగ్ కొనసాగించారని, దీనివల్ల ఈవీఎం, వీవీప్యాట్ ఓట్లకు తేడా వస్తుందని చెప్పారు. ఇలాంటి వీవీప్యాట్లను లెక్కింపు నుంచి మినహాయించాలని నిర్ణయించామని పేర్కొన్నారు. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్లు తెలిపారు. శనివారం సచివాలయంలో కలిసిన విలేకరులతో మాట్లాడుతూ చంద్రగిరి రీపోలింగ్‌పై పిటీషన్ దాఖలు కావడంతో వీడియో దృశ్యాలను కోర్టుకు అందచేశామని, సోషల్ మీడియాలో వస్తున్న దృశ్యాలు చంద్రగిరివి కావని ఆయన స్పష్టం చేశారు. మే 23లోపు ఎప్పుడైనా రీ–పోలింగ్ చేయవచ్చని, పూర్తి ఆధారాలు పరిశీలించిన తర్వాతనే ఏడు చోట్ల రీ–పోలింగ్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. రీపోలింగ్‌పై తనకు వచ్చిన ఫిర్యాదు పరిశీలించాలంటూ సీఎస్ లేఖ రాయడం ఎలా తçప్పవుతుందని ప్రశ్నించారు. పోస్టల్ బ్యాలెట్ జారీలో ఒక్కచోటే తప్పు పోస్టల్ బ్యాలెట్ల జారీలో భారీగా అవకతవకలు జరిగాయన్న ఆరోపణలను ద్వివేది కొట్టిపారేశారు. అనంతపురం జిల్లా మడకశిరలో ఒక్కచోట మాత్రమే ఒక ఉద్యోగికి రెండు ఓట్లు జారీ అయ్యాయని, ఇలా జారీ చేసిన ఓటులో ఒకటి వెనక్కి తీసుకున్నట్లు తెలిపారు. పోస్టల్ బ్యాలెట్లపై ఫిర్యాదులు రావడంతో అన్ని జిల్లాల నుంచి సమాచారం తెప్పించుకొని పరిశీలించామన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించిన తర్వాతనే ఆర్వోలు ఫలితాలను ప్రకటించాల్సి ఉంటుందన్నారు. కౌంటింగ్‌లో 200 మంది ఆర్వోలు, 200 మంది కేంద్ర పరిశీలకులు పాల్గొంటున్నట్లు తెలిపారు. -
ఆ వీడియోలు చంద్రగిరివి కాదు
సాక్షి, అమరావతి : సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వీడియో ఫుటేజీలు చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గానివి కాదని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. రీపోలింగ్‌పై దాఖలైన పిటిషన్ విషయమై కోర్టులో ఎన్నికల సంఘం (ఈసీ) కౌంటర్ దాఖలు చేసిందని, కౌంటర్‌తోపాటు వీడియో ఫుటేజీలు అందించామని ఆయన శనివారం వెల్లడించారు. చంద్రగిరి నియోజకవర్గంలో రీపోలింగ్ జరిగే ఏడుచోట్ల వీడియో ఆధారాలు లభించాయని, అందువల్లే ఎన్నికల సంఘం ఈ మేరకు చర్యలు తీసుకుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో 23వతేదీలోపు ఎప్పుడైనా రీపోలింగ్ చేయొచ్చన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రీపోలింగ్ సంబంధించిన లేఖను ఈసీకి పంపడంలో తప్పేమీ లేదని తెలిపారు. వీవీప్యాట్లలో మాక్ పోలింగ్ స్లిప్పులు తొలగించకుండా ఉంటే.. వాటిని లాటరీ నుంచి మినహాయిస్తామని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ల జారీలో ఎక్కడా అవకతవకలు జరగలేదన్నారు. మడకశిరలో రెండు ఓట్లు జారీ చేస్తే ఒక ఓటును వెనక్కి తీసుకున్నారని తెలిపారు. ఆకాశ రామన్న ఫిర్యాదులపై స్పందించొద్దని ఈసీ మార్గదర్శకాల్లో ఉందని, ఎవరైనా నేరుగా, లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే స్పందించాలని ఉందని తెలిపారు. కౌంటింగ్ రోజున ఫలితాలు వెల్లడించాల్సిన బాధ్యత ఆర్వో, అబ్జర్వర్లదేనని, సీఈసీ అనుమతించిన తర్వాతే ఆర్వోలు ఫలితాలను ప్రకటించాలని చెప్పారు. కౌంటింగ్‌కు సంబంధించిన నిర్ణయాధికారాలు ఆర్వో, అబ్జర్వర్లదేనని, రాష్ట్రంలో 200 మంది ఆర్వోలు, 200మంది అబ్జర్వర్లు కౌంటింగ్ విధుల్లో ఉంటారని తెలిపారు. రీపోలింగ్‌కు సంబంధించి అన్నిఏర్పాట్లు పూర్తి చేశామని, ఏడు చోట్ల 1800 మంది పోలీసులతో భద్రత ఏర్పాటుచేశామని, స్వేచ్ఛాయుత వాతావరణంలో రీపోలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. ఎండల దృష్ట్యా రీపోలింగ్‌కు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని చిత్తూరు జిల్లా కలెక్టర్‌ను ఆదేశించినట్టు చెప్పారు. -
3.05 లక్షల మందికి పోస్టల్ బ్యాలెట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాలకు 3,05,040 మందికి, 25 పార్లమెంటు స్థానాలకు 3,01,003 మందికి పోస్టల్ బ్యాలెట్లు విడుదల చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది ప్రకటించారు. అసెంబ్లీ స్థానాలకు 3,18,530 మంది, పార్లమెంటు స్థానాలకు 3,17,291 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. సరైన పత్రాలు సమర్పించని వారికి పోస్టల్ బ్యాలెట్లు మంజూరు చేయలేదని, ఎన్నికల విధుల్లో పాల్గొన్న వారిలో కొంతమంది అసలు దరఖాస్తే చేసుకోలేదని వివరించారు. గురువారం సచివాలయంలో కలిసిన విలేకరులతో ద్వివేది మాట్లాడుతూ.. రాష్ట్రంలో 60,250 మంది సర్వీసు ఓటర్లు ఉండగా అందులో సుమారు 58 వేల మందికి ఆన్లైన్లో బ్యాలెట్‌ను విడుదల చేసినట్లు తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ల అవకతవకలపై మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండటంతో మంజూరు చేసిన బ్యాలెట్ల వివరాలను ఆయన వెల్లడించారు. అలాగే ఈవీఎంలు, వీవీప్యాట్ల కౌంటింగ్‌పై ఆర్వో, ఏఆర్వోలకు మే 17న విజయవాడలో ఉదయం పది గంటల నుంచి మధ్నాహ్నం రెండు గంటల వరకు శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి నిఖిల్ కుమార్ (డైరెక్టర్), మధుసూదన్ గుప్తా (యూఎస్)లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. లెక్కింపులో పాల్గొనే ఉద్యోగులను జిల్లా యూనిట్‌గా మూడుసార్లు ర్యాండమైజేషన్ విధానంలో ఎంపిక చేస్తామన్నారు. లెక్కింపునకు వారం రోజుల ముందు మొదట విడత ర్యాండమైజేషన్, 24 గంటల ముందు నియోజకవర్గ పరిశీలకుల సమక్షంలో రెండో విడత పూర్తి చేస్తామని వివరించారు. కౌంటింగ్ రోజు ఒక గంట ముందు సిబ్బందికి ఏ టేబుల్ కేటాయించామన్నది తెలియజేస్తామన్నారు. ఉదయం 8.30 తర్వాత కేవలం కేంద్ర ఎన్నికల పరిశీలకులు తప్ప ఆర్వోలతో సహా ఎవ్వరి సెల్ఫోన్లను అనుమతించేది లేదని స్పష్టం చేశారు. -
పోస్టల్ బ్యాలెట్ అవకతవకలను సరిదిద్దండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్ల జారీలో అవకతవకలను తక్షణం సరిదిద్దాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని వైఎస్సార్సీపీ కోరింది. కొన్నిచోట్ల అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న ఉద్యోగులకు రెండేసి పోస్టల్ బ్యాలెట్లను ఇచ్చారని తెలిపింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్, మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి బుధవారం సచివాలయంలో ద్వివేదిని కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. కొన్నిచోట్ల ఉద్దేశపూర్వకంగా పోస్టల్ బ్యాలెట్లు ఇవ్వకపోతే మరికొన్నిచోట్ల ఒకటి కంటే ఎక్కువ పోస్టల్ బ్యాలెట్లు ఇచ్చారని, ఇలాంటి అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో 108 మందికి రెండేసి పోస్టల్ బ్యాలెట్లు ఇచ్చారంటూ తిప్పేస్వామి ఆధారాలను సమర్పించారు. దీనిపై రిటర్నింగ్ అధికారిని అడిగితే సమాధానం చెప్పలేదని, తక్షణం బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన ద్వివేది ఈ అంశంపై నివేదిక పంపాలంటూ అనంతపురం జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. పోస్టల్ బ్యాలెట్ ఇవ్వాల్సిందే: ఉద్యోగుల సమాఖ్య ఎన్నికల విధుల్లో పాల్గొన్న ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఓటు హక్కు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ వెంకట రామిరెడ్డి డిమాండ్ చేశారు. చివరి క్షణంలో ఎన్నికల బాధ్యతలు చేపట్టిన 40 వేల మందికి పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. బుధవారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రతి ఓటు ఎంతో కీలకమైనదని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల సంఘం తక్షణం స్పందించాలన్నారు. దీనిపై అవసరమైతే సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామన్నారు. -
కౌంటింగ్ ప్రక్రియపై శిక్షణా కార్యక్రమం
సాక్షి, అమరావతి : ఎన్నికల కౌంటింగ్‌కు శిక్షణ తప్పనిసరని ఆర్వోలు, ఏఆర్వోలు నియోజకవర్గస్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది ఆదేశించారు. ఈ నెల 23న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నిర్వహణపై ఈసీ కసరత్తు మొదలు పెట్టింది. నిన్నటితో పోలింగ్ ప్రక్రియ ముగియటంతో పదమూడు జిల్లాల్లోని ప్రధాన కౌంటింగ్ సిబ్బందికి సచివాలయంలో శిక్షణా కార్యక్రమాన్ని సీఈఓ గోపాలక్రిష్ణ ద్వివేదీ ప్రారంభించారు .కౌంటింగ్ ప్రక్రియ కు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కౌంటింగ్ సిబ్బందికి 24గంటల ముందు మాత్రమే నియోజకవర్గాలను కేటాయించాలని సూచించారు. కౌంటింగ్ ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని తెలిపారు. ప్రతి రౌండ్లో ఏజెంట్లకు చూపించి సంతకాలు తీసుకోవాలన్నారు. పరిశీలకులు తప్ప కౌంటింగ్ కేంద్రంలోకి ఫోన్లు అనుమతించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. స్ట్రాంగ్ రూమ్‌ల భద్రతపై వస్తున్న ఫిర్యాదులు 99శాతం నిజం కాదన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమలో కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఆర్వోలు, ఏఆర్వోలు పాల్గొన్నారు. -
ఆ రోజు మద్యం అమ్మకాలు బంద్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ఐదు చోట్ల జరిగిన రీపోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. ఎండలు తీవ్రంగా ఉన్నా.. పోలింగ్ కేంద్రాలను కలెక్టర్లు బాగా ఏర్పాటు చేశారని అభినందించారు. రేపటి నుంచి (మంగళవారం) కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభిస్తున్నామని చెప్పారు. మంగళవారం కౌంటింగ్ సిబ్బందికి అవగాహన ట్రైనింగ్ ఏర్పాటు చేశామన్నారు. ఒక్కో అసెంబ్లీ ఓట్ల లెక్కింపుకి 180 మంది చొప్పున మెత్తం కౌంటింగ్‌కు 25 వేల మంది సిబ్బందిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. కౌంటింగ్ రోజే (మే 23) ఏ ఉద్యోగి ఎక్కడ ఉంటారో తెలుస్తుందన్నారు. మే 23న మద్యం అమ్మకాలు బంద్ చేయాలని ఆదేశించారు. మే 10న జరిగే మంత్రి వర్గ సమావేశంపై ఈసీ నియమాలు ఎలా ఉన్నాయో దాని ప్రకారమే అధికారులు నడుచుకోవాలని సూచించారు. ఏమైనా అనుమానాలు ఉంటే సీఎస్ ఆధ్యర్యంలోని కమిటీ పరిశీలించి సీఈవోకి పంపితే.. దానిని కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి కోసం పంపుతానని తెలిపారు. గ్రూప్ 2 ప్రిలిమినరి పరీక్షలో ప్రభుత్వ పథకాల గురించి అడిగిన ప్రశ్నలపై ఫిర్యాదు అందిందని, దానిపై నివేదిక కోరామని ద్వివేది పేర్కొన్నారు. -
నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
సాక్షి, అమరావతి : ఎన్నికల సిబ్బంది రీ పోలింగ్‌లో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా కఠినంగా వ్యవహరిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. రీ పోలింగ్ జరగనున్న పోలింగ్ బూత్‌ల వద్ద మూడంచెల పోలీస్ భద్రత ఏర్పాటు చేశామని, ఓటర్లు నిర్భయంగా, స్వేచ్ఛగా ఓటుహక్కుని వినియోగించుకోవాలని. సీసీ కెమెరాల ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తామని చెప్పారు. ఉదయం 5.30 గంటలకే మాక్ పోలింగ్ నిర్వహించేలా స్పష్టమైన ఆదేశాలను జారిచేశామన్నారు. రాజకీయ పార్టీల పోలింగ్ కేంద్రం ఏజెంట్లు నిర్ణీత సమయానికి పోలింగ్ కేంద్రాలకు చేరుకుని సహకారాన్ని అందించాలని కోరారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా రీ పోలింగుకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. సెంట్రల్ పరిశీలకులు, ప్రత్యేక ఎన్నికల పరిశీలకులు ఇప్పటికే చేరుకోవడం జరిగిందన్నారు. ఆర్వో, ఏఆర్వో, పోలింగ్ కేంద్రాల సిబ్బందికి రీ పోలింగ్ పకడ్బందీగా నిర్వహించేలా సూచనలు జారీ చేశామన్నారు. పోలింగ్ సిబ్బంది ఇప్పటికే రీ పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారని తెలిపారు. రీ పోలింగ్ కేంద్రాల వద్ద బెల్ ఇంజినీర్లను సిద్ధంగా ఉంచుతామన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు ఈవీఎంలు, వీవీ ప్యాట్లు కూడా సిద్ధం చేశామన్నారు. ఎండ తీవ్రత దృష్టా్య పోలింగ్ బూత్‌ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. -
5 కేంద్రాల్లో రీ పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సోమవారం రీ పోలింగ్ జరగనున్న ఐదు కేంద్రాల పరిధిలో శనివారం సాయంత్రం 6 గంటలతో ప్రచారం ముగిసిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. రీ పోలింగ్‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని, బూత్‌ల వద్ద రిటర్నింగ్ అధికారి, డిప్యూటీ సూపరింటెండెంట్ పోలీసు అధికారులతో పాటు కేంద్ర పరిశీలకులు ఉంటారన్నారు. శనివారం సచివాలయంలో కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ప్రతీ పోలింగ్ కేంద్రం వద్ద 50 మంది భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుందని, 6 గంటల లోపు క్యూలైన్లో ఉన్న ప్రతీ ఒక్కరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పిస్తామన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నల్లచెరువులోని బూత్ నంబర్ 244, నరసరావుపేట నియోజకవర్గం కేసానుపల్లి గ్రామం 94వ బూత్, ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని కలనూతలలోని 247వ బూత్, నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ పరిధిలోని బూత్ నంబర్ 41, సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలోని 197వ బూత్‌లో రీ–పోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. మే 23న కౌంటింగ్‌కు అన్ని ఎర్పాట్లు పూర్తి చేశారు. నిరుద్యోగ భృతి పెంపునకు అనుమతి నిరాకరణ రాష్ట్రంలో రీ పోలింగ్ ముగిసే వరకు నిరుద్యోగ భృతి పెంపునకు అనుమతి నిరాకరిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం శనివారం నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. -
‘అనంతపురం లోక్‌సభ ఫలితాలు ప్రకటించవద్దు’
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదికి సీపీఐ నేత రామకృష్ణ శనివారం లేఖ రాశారు. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆయన తన లేఖలో విజ్ఞప్తి చేశారు. అనంతపురం లోక్‌సభ స్థానానికి తన కుమారుడు పవన్ పోటీ చేస్తే.. రూ.50 కోట్లు ఖర్చయింది, ఒక్కో ఓటుకు రూ.2వేలు ఇచ్చామన్న జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలపై ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదని, ఈసీ, అనంతపురం, గుంటూరు జిల్లా కలెక్టర్లు ఇప్పటివరకూ ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ద్వివేది దృష్టికి తెచ్చారు. అనంతపురం లోక్‌సభ స్థానం ఎన్నికల ఫలితాలను ప్రకటించరాదని, జేసీ నుంచి సాక్షులకు భద్రత కల్పించాలని రామకృష్ణ తన లేఖలో కోరారు. చదవండి: ఓటుకు రూ. రెండు వేలు ఇచ్చాం : జేసీ కాగా ఎన్నికల్లో గెలవడానికి కోట్లాది రూపాయలు ఖర్చుచేశామని జేసీ బహిరంగంగానే వ్యాఖ్యానించడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సీపీఐ పార్టీలు ఆయనపై ఈసీకి ఫిర్యాదు చేశాయి. ఈసీ ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన అనంతపురం జిల్లా తాడిపత్రి రిటర్నింగ్ అధికారి.. జేసీ దివాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తాయని నిర్ధారించిన విషయం విదితమే. -
‘ఎన్నికల సంఘంలో టీడీపీ కోవర్టులు’
-
‘ఎన్నికల సంఘంలో టీడీపీ కోవర్టులు’
సాక్షి, అమరావతి: ఎన్నికల సంఘంలోని సోషల్ మీడియా వింగ్‌లో టీడీపీ కోవర్టులు ఉన్నారని వైఎస్సార్సీపీ నేత ఎంవీఎస్ నాగిరెడ్డి సీఈఓ గోపాలకిృష్ణ ద్వివేదికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా, టీడీపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఈసీలో కొంత మంది పనిచేస్తున్నారని అన్నారు . ఈమేరకు శుక్రవారం ఆయన ద్వివేదిని కలిసి వినతిపత్రం అందించారు. ఈసీ సోషల్ మీడియా వింగ్ పేరుతో టీడీపీకి అనుకూలంగా పనిచేసే వారిని చంద్రబాబు నాయుడు పథకం ప్రకారం నియమించుకున్నారని నాగిరెడ్డి ఆరోపించారు. పోస్టల్ బ్యాలెట్ల కోసం ప్రలోభాలకు పాల్పడుతున్న టీడీపీ అభ్యర్థి సబ్బంహరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ప్రలోభాలతో సబ్బంహరి పోస్టల్ బ్యాలెట్స్‌ను రాబట్టే ప్రయత్నం చేస్తున్నారని, ప్రలోభాల ఆడియో టేపులను ఈసీకి అందచేశామని నాగిరెడ్డి తెలిపారు. టీడీపీకి తొత్తులుగా వ్యవహిస్తూ.. ఆబ్జెక్ట్ ఏజెన్సీ ఓటర్లని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిందని, ఇంటలిజెన్స్ అండతోనే అది ఈసీలోకి ప్రవేశించిందని ఆరోపించారు. కౌంటింగ్ రోజు కేంద్రాల వద్ద భద్రత పెంచాలని కోరుతూ వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాసిన లేఖను సీఈఓకు అందచేశామని అన్నారు. -
‘లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల చేయొద్దన్నాం’
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదల చేయవద్దని ఆదేశాలు జారీచేసినట్లు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గోపాలక్రిష్ణ ద్వివేదీ తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా కడపలో రెండు థియేటర్లలో సినిమా ప్రదర్శించారని, ఆ థియేటర్ల లైసెన్సులు రద్దు చేయాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సినిమా ప్రదర్శన అడ్డుకోలేకపోయిన కడప జిల్లా జాయింట్ కలెక్టర్‌పై చర్యలకు కేంద్ర సీఈసీకి సిఫార్స్ చేశామని చెప్పారు. రీ పోలింగ్‌పై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించామన్నారు. ఐదు పోలింగ్ బూత్‌ల వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. అదనపు ఈవీఎంలు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. శ్రీకాకుళంలో వర్షాల వల్ల స్ట్రాంగ్ రూమ్‌లకు ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకున్నామని, తుఫాన్ కారణంగా నాలుగు జిల్లాలకు ఎన్నికల కోడ్ నుంచి సీఈసీ మినహాయింపు ఇచ్చిందని పేర్కొన్నారు. కౌంటింగ్ ప్రక్రియ కోసం ఈ నెల 7న సిబ్బందికి ట్రైనింగ్ ఇస్తున్నామని వెల్లడించారు. -
రీ-పోలింగ్‌పై సీఈవో ద్వివేదీ వీడియో కాన్ఫరెన్స్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రీ పోలింగ్ జరిగే జిల్లాల అధికారులతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సోమవారం జరగనున్న రీ పోలింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లుపై చర్చించారు. ఈ కాన్ఫ్‌రెన్స్‌లో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లాలో రెండు, ప్రకాశంలో ఒకటి, నెల్లూరు జిల్లాలో రెండుచోట్ల ఈ నెల 6న రీ పోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిన విషయం తెలిసిందే. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ జరగనుంది. ఆంధ్రప్రదేశ్‌లో రీ పోలింగ్ జరిగే బూత్‌ల వివరాలు: గుంటూరు జిల్లా నరసరావుపేట అసెంబ్లీ పరిధి కేసానుపల్లి గ్రామంలో 94వ కేంద్రం గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నల్లచెరువు 244వ కేంద్రం నెల్లూరు జిల్లా కొవ్వూరు అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఇసుకపల్లిపాలెంలోని బూత్ నంబర్ 41 సూళ్లూరుపేట సెగ్మెంట్ పరిధిలో అటకానితిప్ప బూత్ నంబర్ 197లో కేవలం పార్లమెంట్ స్థానానికి మాత్రమే ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పరిధిలో కలనూతలలోని 247వ బూత్ -
రీ పోలింగ్ బూత్‌లు సమస్యాత్మకమే
సాక్షి, అమరావతి : ఈ నెల 6న రాష్ట్రంలో ఐదు చోట్ల రీ పోలింగ్ జరగనుందని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గోపాలక్రిష్ణ ద్వివేది తెలిపారు. గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఐదు చోట్ల 6వ తేదీ ఉదయం 7 గంటలనుంచి సాయంత్రం 6 వరకు రీ పోలింగ్ జరగనుందని వెల్లడించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నరసరావు పేట అసెంబ్లీ పరిధిలోని కేసనాపల్లి 94వ పోలింగ్ కేంద్రంలో, గుంటూరు పశ్చిమంలోని నల్లచెరువు 244వ పోలింగ్ కేంద్రంలో, నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలోని పల్లెపాలెంలోని ఇసుకపల్లి పాలెం 41వ పోలింగ్ కేంద్రంలో, సూళ్లురు పేట నియోజకవర్గం అటానితిప్ప 197వ పోలింగ్ కేంద్రంలో , ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పరిధిలోని కలనుతల 247వ పోలింగ్ కేంద్రంలో రీ పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. రీ పోలింగ్ బూత్‌లను సమస్యాత్మకంగానే పరిగణిస్తామన్నారు. బూత్‌ల వద్ద ప్రత్యేక భద్రత ఏర్పాటు చేస్తామని, అదనపు ఈవీఎంలు, వీవీ ప్యాట్లను పోలింగ్ కేంద్రాల వద్ద ఉంచుతామని అన్నారు. ప్రతి రీ పోలింగ్ కేంద్రం వద్ద ఇంజనీర్లు అందుబాటులో ఉంటారని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తామని తెలిపారు. -
‘వైఎస్సార్ సీపీ నేతలను ఇబ్బంది పెడుతున్నారు’
సాక్షి, అమరావతి : గుంతకల్లు డీఎస్పీ.. తెలుగుదేశం పార్టీ పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని, వైఎస్సార్ సీపీ నేతలను ఇబ్బందిపెడుతున్నారని వైఎస్సార్ సీపీ నేత గౌతంరెడ్డి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి గోపాలక్రిష్ణ ద్వివేదీకి ఫిర్యాదు చేశారు. బుధవారం సీఈఓ ద్వివేదీని కలిసిన ఆయన ఏకపక్షంగా వ్యవహరిస్తున్న అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. కౌంటింగ్ రోజు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, భద్రత పెంచాలని కోరారు. ఆర్వో, పీఓలతోపాటు డీఎస్పీని ఎన్నికల విధులనుంచి తొలగించి కౌంటింగ్ నిస్పక్షపాతంగా జరిగేలా చూడాలన్నారు. -
‘ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదనలు రాలేదు’
సాక్షి, అమరావతి: ఫొని తుపాన్ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రతిపాదన రాలేదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ వెసులుబాటు కావాలంటే కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపాల్సి ఉంటుందని తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం నుంచి ఏ ప్రతిపాదనలు వచ్చినా సీఈసీ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. కోడ్ వెసులుబాటు వంటి కీలక నిర్ణయాలు తీసుకునే అధికారం సీఈసీకే ఉంటుందని పేర్కొన్నారు. సీఈసీ ఇచ్చే ఆదేశాలను తాము అమలు చేస్తామని అన్నారు. తుపాన్ వల్ల స్ట్రాంగ్ రూమ్‌ల్లోని ఈవీఎంలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపారు. జిల్లా కలెక్టర్లు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారని వెల్లడించారు. తుపాన్ ప్రభావిత శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ఈవీఎంల విషయంలో అప్రమత్తంగా ఉండమని కలెక్టర్లను ఆదేశించినట్టు చెప్పారు. -
కౌంటింగ్‌పై మే 7న రాష్ట్రస్థాయి శిక్షణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎన్నికల కౌంటింగ్‌పై ఉన్నతాధికారులకు అవగాహన కల్పించేందుకు మే 7న రాష్ట్రస్థాయి శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. సోమవారం సచివాలయంలో కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ప్రతి నియోజకవర్గానికి చెందిన ఆర్వోలు, ఈఆర్వోలు ఈ సమావేశానికి హాజరుకానున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో తొలిసారిగా వీవీప్యాట్లను వినియోగించడంతో ఓట్ల లెక్కింపులో అనుసరించాల్సిన నిబంధనలపై ఈ సమావేశంలో అవగాహన కల్పించనున్నట్లు వివరించారు. నియోజకవర్గానికి 5 వీవీప్యాట్లను ఆర్వో, పరిశీలకుల సమక్షంలో లెక్కించాల్సి ఉండటంతో అసెంబ్లీ ఫలితాలకు ఆరు గంటలకు పైగా సమయం పడుతుందన్నారు. మొత్తం రాష్ట్రంలో 1,750 వీవీప్యాట్లలో పోలైన స్లిప్పులను లెక్కించాల్సి ఉంటుందని తెలిపారు. ఈవీఎంలో పోలైన ఓట్లు, వీవీప్యాట్లలోని స్లిప్పులతో సరిపోయిన తర్వాతనే ఫలితాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు. ఒకవేళ ఈవీఎంలు మొరాయిస్తే వాటిని పక్కన పెట్టి మిగిలిన వాటిని లెక్కిస్తామన్నారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత మొరాయించిన ఈవీఎంలపై ఆర్వో నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ఒకవేళ అభ్యర్థి మెజార్టీ కంటే మొరాయించిన ఈవీఎంలో నమోదైన ఓట్లు తక్కువ ఉంటే ఏజెంట్ల నిర్ణయం ప్రకారం ఆర్వో నడుచుకుంటారని తెలిపారు. మెజార్టీ కంటే మొరాయించిన ఈవీఎంలో నమోదైన ఓట్లు ఎక్కువ ఉంటే ఆ ఈవీఎంకు చెందిన బూత్‌లో రీ పోలింగ్ నిర్వహించే పరిస్థితులు ఏర్పడతాయన్నారు. రాష్ట్రంలో 3.50 లక్షల మందికి పోస్టల్ బ్యాలెట్లు ఇచ్చామని, ఇందులో 90 శాతంపైగా ఓట్లు నమోదైతే ఒక శాతం పోలింగ్ పెరుగుతుందని వివరించారు. దీంతో పోటాపోటీగా జరిగే నియోజకవర్గాల్లో ఈ ఓట్లు ప్రభావం చూపించే అవకాశం ఉందన్నారు. -
‘ఎన్నికల ఫలితాలు వెల్లడి ఆలస్యమయ్యే అవకాశం’
సాక్షి, అమరావతి: వీవీప్యాట్ల లెక్కింపుతో సార్వత్రిక ఎన్నికల ఫలితాల వెల్లడి ఆలస్యమయ్యే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈవీఎంల లెక్కింపు పూర్తయ్యాక వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు జరుగుతుంది. అభ్యర్థుల, ఏజెంట్ల సమక్షంలో అధికారులు వీవీప్యాట్ల ర్యాండమైజేషన్ చేస్తారు. ఒక్కో శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఐదు పోలింగ్ బూత్‌ల్లో వీవీప్యాట్లలోని స్లిప్పులను లెక్కిస్తారు. ఈ పద్దతిన రాష్ట్రవ్యాప్తంగా 1750 వీవీప్యాట్లలో పోలైన స్లిపుల్ని లెక్కించాలి. ఒక్కో వీవీప్యాట్‌లో వెయ్యి ఓట్లు పోలయ్యే అవకాశం ఉంది. ఒక వీవీప్యాట్‌లోని స్లిప్పుల లెక్కింపునకు సగటున గంట, గంటన్నర సమయం పడుతుంది. ఈ స్లిప్పులు లెక్కించే అధికారం ఆర్వో, అబ్జర్వర్లకు మాత్రమే ఉంది. దీంతో ఒక్కో అసెంబ్లీ పరిధిలో ఫలితాల వెల్లడికి సగటున ఐదారు గంటలకు పైగా సమయం పడుతుంది. ఈవీఎంలలో పోలైన ఓట్లతో వీవీప్యాట్ స్లిప్పులు సరిపోయిన తరువాతే ఫలితాలు వెల్లడిస్తాం. మొదట అసెంబ్లీ, తర్వాత లోక్‌సభ ఫలితాలు వెలువడుతాయ’ని తెలిపారు. -
సమీక్షలు చేస్తా.. అడ్డుకోవద్దు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రిగా సమీక్షలు చేసే హక్కు తనకు ఉందని, దాన్ని కాదనే హక్కు ఎన్నికల సంఘానికి లేదని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తాను చేసే సమీక్షలను అడ్డుకోవద్దంటూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదికి సూచించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ మేరకు చంద్రబాబు శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్‌కు తొమ్మిది పేజీల లేఖ రాశారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ద్వివేది తీరును ఆ లేఖలో తప్పుపట్టారు. ముఖ్యమంత్రి సమీక్షలు నిర్వహించరాదంటూ ద్వివేది చేసిన వ్యాఖ్యలు ఆయన పరిధికి మించి ఉన్నాయని చంద్రబాబు విమర్శించారు. పోలవరం ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించకపోతే పనుల వ్యయం పెరిగిపోతోందని, ఇందుకు కేంద్ర ఎన్నికల సంఘం కారణం అవుతుందని చంద్రబాబు ఆ లేఖలో పేర్కొన్నారు. అలాగే రాజధానిలో జరుగుతున్న పనులను సమీక్షించాలని, లేకపోతే పలు ప్రాజెక్టుల వ్యయం పెరిగిపోతుందని వెల్లడించారు. నన్ను నిలువరించడం వివక్ష కాదా? ‘ప్రజలతో ఎన్నికైన ప్రభుత్వం నిర్వహించాల్సిన విధులను అడ్డుకోవడం కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు ఎవరికీ సాధ్యం కాదు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం సమీక్షలు నిర్వహిస్తోంది. సెక్యూరిటీ అంశాలపై కేంద్ర కేబినెట్ సమీక్షిస్తోంది. తెలంగాణ సీఎం పలు సమీక్షలు నిర్వహిస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ సమీక్షలు నిర్వహిస్తున్నారు. కానీ, సమీక్షలు నిర్వహించరాదంటూ నన్ను మాత్రమే నిలువరించడం వివక్ష కాదా? రాష్ట్రంలో ఎన్నికలు పూర్తయినందున సాధారణ పరిపాలనను కొనసాగించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా నాపై ఉంది. ఇంటెలిజెన్స్ చీఫ్‌ను సీఎంకు రిపోర్ట్ చేయవద్దని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ద్వివేది అడ్డుకున్నారు, ఆయనకు ఆ హక్కు ఎక్కడిది? ఇంటెలిజెన్స్ చీఫ్ ముఖ్యమంత్రి కిందే పనిచేస్తారు. మంచినీటి సరఫరాతో పాటు విపత్తులకు సంబంధించిన అంశాలపైనా సమీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఎన్నికలు పూర్తయినందున సమీక్షలు ఆపేందుకు, అధికారులు బ్రీఫింగ్ ఇవ్వకుండా ఆంక్షలు విధించేందుకు ఎన్నికల సంఘానికి అధికారం లేదు. రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది కలగకుండా, రాష్ట్రాభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపకుండా ప్రజాస్వామ్య పాలన కొనసాగేలా సీఎం సమీక్షలకు అవరోధాలు, అంతరాయం కలిగించవద్దని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి, సంబంధిత ఇతర అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలి’ అని చంద్రబాబు తన లేఖలో విజ్ఞప్తి చేశారు. -
రీపోలింగ్‌కు ఇంకా అనుమతి రాలేదు : ద్వివేది
సాక్షి, అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా ఐదు పోలింగ్ బూతుల్లో నిర్వహించాల్సిన రీపోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం రావాల్సి ఉందని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది పేర్కొన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చిన తర్వాతే రీపోలింగ్ నిర్వహిస్తామన్నారు. ఒకే పేరుపై రెండు పోస్టల్ బ్యాలెట్లు ఇచ్చే అవకాశం లేదని, అలా ఇచ్చినట్లు ఆధారాలు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కౌంటింగ్‌కు గంట ముందు కూడా పోస్టల్ బ్యాలెట్ ఇవ్వొచ్చునని స్పష్టం చేశారు. వెంకటగిరి ఎమ్మెల్యే ఫీల్డ్ అసిస్టెంట్‌ను బెదిరించినట్లు ఫిర్యాదు వచ్చిందని, దీనిపై విచారణ జరపాలని నెల్లూరు కలెక్టర్‌ను ఆదేశించానన్నారు. ఎన్నికల కౌంటింగ్ కోసం 21వేల మంది వరకూ సిబ్బంది అవసరమని చెప్పారు. ఆఖరి నిమిషం వరకూ ఎవరూ ఎక్కడ లెక్కింపు ప్రక్రియలో పాల్గొంటారో తెలియకుండా జాగ్రత్త పడుతున్నామని తెలిపారు. రెండు సార్లు సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహిస్తామన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ పరిధిలో ఐదేసి పోలింగ్ కేంద్రాల్లో వీవీప్యాట్ల లెక్కింపు ఉంటుందన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల కౌంటింగ్‌కు 15 టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేశామన్నారు. ఒక్కో టేబుల్‌కు కౌంటింగ్ అసిస్టెంట్, ఒక మైక్రో అబ్జర్వర్‌ను నియమిస్తున్నామని చెప్పారు. -
ఓట్ల లెక్కింపునకు పటిష్టమైన ఏర్పాట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వచ్చే నెల 23వ తేదీన నిర్వహించనున్న ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఆయా కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం అమరావతిలోని సచివాలయం నుంచి కౌంటింగ్ ఏర్పాట్లు, తాగునీరు తదితర అంశాలపై ఆయన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేది, డీజీపీ ఠాకూర్‌తో కలిసి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. ఇటీవల నిర్వహించిన ఎన్నికల్లో సిబ్బందికి సరైన శిక్షణ ఇవ్వక పోవడం వల్ల అక్కడక్కడ ఈవీఎంలు సరిగా పని చేయలేదని ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. కౌంటింగ్ నిర్వహణలో అలాంటి ఫిర్యాదులకు ఎంతమాత్రం ఆస్కారం ఇవ్వొద్దని కలెక్టర్లకు సూచించారు. ఓట్ల లెక్కింపునకు నెల రోజులు సమయం ఉన్నందున ఏర్పాట్లపై కలెక్టర్లు స్వయంగా పరిశీలించి అవపసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల కమిషన్ మార్గ దర్శకాలకు అనుగుణంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు, కౌంటింగ్ టేబుళ్లు, సీటింగ్ సక్రమంగా ఉండేలా చూడాలన్నారు. ముఖ్యంగా కౌంటింగ్ సిబ్బందికి పూర్తి స్థాయిలో మెరుగైన శిక్షణ ఇచ్చే విషయంలో ఏమాత్రం రాజీ పడొద్దని చెప్పారు. కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లే రహదారులపై, కౌంటింగ్ రోజున, ఆ తర్వాత అల్లర్లు జరగకుండా గట్టి బందోబస్తు కల్పించాలని ఎస్పీలను ఆదేశించారు. రాజకీయ పలుకుబడిని అడ్డం పెట్టుకుని ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే ఉపేక్షించవద్దని, పార్టీలకతీతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు తమకున్న విస్తృత అధికారాలను ఉపయోగించుకోవచ్చని చెప్పారు. మంచి నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోండి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నప్పటికీ రాష్ట్రంలో తాగు నీరు, పశుగ్రాసం వంటి వాటికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా కలెక్టర్లు వెంటనే స్పందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదేశించారు. నిధుల సమస్యలుంటే ఆర్థిక శాఖ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరించాలని చెప్పారు. నీటి ఎద్దడి నుంచి ఉద్యాన పంటలను కాపాడటానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. తాగునీటి సమస్యపై రాష్ట్ర స్థాయిలో ఇప్పటికే తాను ఉన్నతాధికారులతో సమీక్షించానని, జిల్లా స్థాయిలో కూడా సమీక్షలు నిర్వహించి ఎక్కడా ఇబ్బంది రాకుండా చూడాలన్నారు. జిల్లా స్థాయిలో జెడ్పీ సీఈఓ, పంచాయతీ, గ్రామీణ నీటి సరఫరా, మున్సిపల్ కమిషనర్లు, ఇంజనీర్లు రోజువారీ పరిస్థితిని సమీక్షించి తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద నిరంతర నిఘా : ద్వివేది జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు సమన్వయంతో పని చేసి ఎన్నికలను సజావుగా నిర్వహించారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేది కొనియాడారు. ఎన్నికల్లో 65 శాతం పైగా దివ్యాంగులు వారి ఓటు హక్కును వినియోగించుకోవడం, మారుమూల గిరిజన ప్రాంతాలు, మావోయిస్టు ప్రాంతాల్లో సైతం పోలింగ్ శాతం పెరగడం ఇందుకు నిదర్శనమన్నారు. స్ట్రాంగ్ రూమ్‌లను రోజూ ఎవరెవరు సందర్శిస్తున్నారనేది ఎప్పటికప్పుడు చిత్రీకరిస్తూ నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందని చెప్పారు. వినియోగించని, రిజర్వుడు ఈవీఎంలను కూడా సక్రమంగా భద్ర పరిచామన్నారు. స్ట్రాంగ్ రూమ్‌లకు సంబంధించి ఫిర్యాదులు స్వీకరించేందుకు వీలుగా రాష్ట్ర, జిల్లా ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారుల ఫోన్ నంబర్లను అక్కడ ప్రదర్శించామని చెప్పారు. మే మొదటి వారంలో కౌంటింగ్ నిర్వహణకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో శిక్షణ ఇస్తామని చెప్పారు. సిబ్బందికి మూడు దశల్లో శిక్షణ ఉంటుందన్నారు. ప్రతి కౌంటింగ్ కేంద్రం పరిధిలో మీడియా కేంద్రం ఉండేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. కౌంటింగ్‌లో పాల్గొనే ఏజెంట్లకు ఫొటో గుర్తింపు కార్డులు జారీ చేయాలని, లోపలికి మొబైల్ ఫోన్ల అనుమతి లేనుందున వాటిని బయట భద్రపర్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో హోం శాఖ ముఖ్య కార్యదర్శి ఏ.ఆర్. అనురాధ, శాంతి భద్రతల అదనపు డీజి రవిశంకర్, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి ఎన్.శ్రీకాంత్, అదనపు సీఈవో సుజాతా శర్మ, సంయుక్త సీఈవో డి.మార్కండేయులు తదితరులు పాల్గొన్నారు. అల్లర్లు తలెత్తకుండా చర్యలు : ఠాకూర్ తక్కువ పోలీస్ ఫోర్సు ఉన్నప్పటికీ 2014 ఎన్నికలతో పోలిస్తే స్వల్ప ఘటనలు మినహా ప్రస్తుత ఎన్నికలను సజావుగా నిర్వహించారని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ ఆర్.పి.ఠాకూర్ అభినందించారు. పోలింగ్ అనంతరం ఘటనలకు బాధ్యులైన వారిని చాలా వరకు అరెస్టు చేశామని చెప్పారు. కౌంటింగ్ అనంతరం కూడా అలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉన్నందున తగిన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఎస్పీలను ఆదేశించారు. రీపోలింగ్ జరగనున్న కేంద్రాల్లో పటిష్ట భద్రత కల్పిస్తామన్నారు. స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. -
ఏపీలో ఐదు కేంద్రాల్లో రీపోలింగ్..!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదికలు పంపారు. నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో రెండేసి చొప్పున.. ప్రకాశం జిల్లాలో ఒక చోట రీపోలింగ్‌కు స్థానిక కలెక్టర్లు ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేదికి నివేదికలు పంపారు. ఆయన వాటిని పరిశీలించిన అనంతరం ఐదు చోట్ల రీపోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫార్సు చేశారు. జిల్లా కలెక్టర్ల నివేదిక మేరకు ఈవీఎంల్లో లోపాలు తలెత్తిన ఐదు కేంద్రాలను గుర్తించిన.. సీఈసీకి పంపారు. నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని 94వ పోలింగ్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని నల్లచెరువులో ఉన్న 244వ పోలింగ్ కేంద్రం, నెల్లూరు అసెంబ్లీ పరిధిలోని ఇసుకపల్లిలో గల 41వ పోలింగ్ కేంద్రం, సూళ్లురుపేట నియోజకవర్గంలోని అటకానితిప్పలోని 197వ కేంద్రం, ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలోని 247వ పోలింగ్ కేంద్రాలలో రీపోలింగ్ నిర్వహించాలని సీఈసీకి సిఫారసు చేశారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం తుది నిర్ణయం వెలువరించాల్సి ఉంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 12మంది అధికారులపై చర్యలు తీసుకోవాలని ద్వివేది ఈసీని కోరారు. జిల్లా కలెక్టర్ల నుంచి పూర్తి నివేదికలు వస్తే మరికొంతమందిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. కాగా ఈనెల 11న రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలు మొరాయించిన కారణంగా రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్లు వినిపిస్తోన్న నేపథ్యంలో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. -
టీడీపీపై హర్షకుమార్ సంచలన ఆరోపణలు
సాక్షి, అమరావతి: తనను చంపేందుకు కుట్ర జరిగిందని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ సంచలన ఆరోపణలు చేశారు. బుధవారం ఆయన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలిశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఐదేళ్లుగా ప్రజా సమస్యలపై పోరాటం చేసిన తనను తెలుగు దేశం పార్టీ ఎన్నో ఇబ్బందులకు గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం కోసం ఇటీవల టీడీపీలో చేరినట్టు వెల్లడించారు. అమలాపురం ఎంపీ సీటు ఇస్తామని చెప్పి మొండిచేయి చూపడంతో టీడీపీ నుంచి బయటకు వచ్చానని తెలిపారు. తన కారు చక్రాల బోల్టులు తొలగించి తనను హత్య చేసేందుకు ప్రయత్నం జరిగిందని ఆరోపించారు. డీజీపీకి ఫిర్యాదు చేసినా విచారణ మాత్రం జరగడం లేదని వాపోయారు. పూర్తి స్థాయి దర్యాప్తు జరిగేలా చూడాలని ద్వివేదిని కోరానని చెప్పారు. ఇంటర్మీడియట్ కాలేజీల్లో అడ్డగోలుగా దోపిడీ చేస్తున్నారని హర్షకుమార్ మండిపడ్డారు. ఇంటర్ విద్యలో కార్పొరేట్ అనే పదం ఎక్కడా లేదని, కాలేజీల్లో ఎక్కడా నిబంధనలు పాటించడం లేదని ఆరోపించారు. ఇంటర్ ఫీజులపై న్యాయపోరాటం చేస్తున్నానని, హైకోర్టులో విచారణ జరుగుతోందన్నారు. ప్రభుత్వం నిర్దారించిన ఫీజు కేవలం రూ.2,800 మాత్రమేనని, ప్రోత్సాహకం పేరుతో ప్రభుత్వం 35 వేల ఫీజు కొంతమందికి ఎలా చెల్లిస్తుందని ఆయన ప్రశ్నించారు. ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాగా, ఇంటర్ కళాశాలల్లో ఫీజుల నియంత్రణపై హర్షకుమార్ దాఖలు చేసిన పిల్‌పై విచారణను ఈనెల 28కి హైకోర్టు వాయిదా వేసింది. -
అధికారులపై వేటు
-
ఆరోజు.. మీతో బాబు ఏమన్నారు?
‘పోలింగ్ రోజు సీఎం చంద్రబాబునాయుడు మీ కార్యాలయానికి వచ్చి మిమ్మల్ని ఉద్దేశించి ఏమన్నారు? ఎన్నికల సంఘాన్ని ఉద్దేశించి ఏం మాట్లాడారు...? అవన్నీ మాకు వివరంగా నివేదిక రూపంలో అందచేయండి..’ – రాష్ట్ర ఎన్నికల సంఘానికి సీఈసీ ఆదేశం సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: ఎన్నికల రోజు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయానికి వచ్చిన సీఎం చంద్రబాబు అక్కడ మాట్లాడిన ప్రతి మాటను తర్జుమా చేసి అందుకు సంబంధించిన వీడియో, వాయిస్ రికార్డులను తమకు పంపాలని ఈసీ ఆదేశించడం ఉన్నతస్థాయిలో చర్చకు దారి తీసింది. పోలింగ్ సమయంలో సీఎం రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్లడంతో పాటు అక్కడ నిరసన వ్యక్తం చేయడాన్ని సీఈసీ తీవ్రంగా పరిగణించడంపై టీడీపీ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ద్వివేది కార్యాలయంలో బాబు నిరసన.. ఎన్నికల విధుల నుంచి పునేఠ, ఏబీ వెంకటేశ్వరరావు, కడప, శ్రీకాకుళం, ప్రకాశం ఎస్పీలను సీఈసీ దూరం పెట్టడంతో చంద్రబాబులో అసహనం తీవ్రస్థాయికి చేరింది. ఎన్నికల సంఘంపై తీవ్ర విమర్శలు, పలు ఆరోపణలు చేయడంతోపాటు పోలింగ్ జరిగిన ఏప్రిల్ 11వతేదీన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది కార్యాలయానికి వెళ్లి ఘాటైన వాఖ్యలుచేసి నిరసన కూడా తెలిపారు. ఈ సందర్భంగా అక్కడి దృశ్యాలను వీడియో రికార్డింగ్ చేయవద్దని చంద్రబాబు ఆదేశించారు. ఆ రోజు ఏం జరిగిందనే సమాచారాన్ని ద్వివేది తక్షణం పంపినప్పటికీ ఆధారసహితంగా అన్ని వివరాలు జోడించి పంపాలని ఈసీ కోరింది. టీడీపీ ఫిర్యాదులు, వాటి వాస్తవ స్థితిని కూడా తెలియజేయాలని సూచించింది. ఈ నేపథ్యంలో పోలింగ్ రోజు సీఎం చంద్రబాబు, ఆయన కుటుంబసభ్యులు ఓటుహక్కు ఉదయమే వినియోగించుకున్నా సాయంత్రం వరకు ఎలాంటి ఫిర్యాదులు చేయలేదని రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈసీ దృష్టికి తీసుకెళ్లింది. పోలింగ్ కేంద్రానికి సకాలంలో చేరుకున్న ప్రతి ఓటరుకు అవకాశం కల్పించామని తెలిపింది. పోలింగ్ రోజు ఓటర్లను ప్రభావితం చేసేలా సీఎం వ్యాఖ్యలు ఈవీఎంల పనితీరుపై అనుమానాలతో పాటు సీఈసీ శైలిపై దేశవ్యాప్తంగా చర్చించాలని చంద్రబాబు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కేంద్రం ఎన్నికల సంఘం కూడా అదే స్థాయిలో స్పందించినట్లు తాజా పరిణామాలు తెలియజేస్తున్నాయి. పోలింగ్ జరుగుతున్న రోజు ఓటర్లను ప్రభావితం చేసేలా అభివృద్ధిని చూసి ఓటెయ్యాలన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలను కూడా ఎన్నికల సంఘం పరిశీలిస్తోంది. ఎన్నికల విధులకు ఆటంకం కలిగించేలా వ్యవహరించడంతో పాటు అభివృద్ధిని చూసి ఓటెయ్యాలని పిలుపునివ్వడంపై ప్రజా ప్రాతినిథ్య చట్టం ప్రకారం పరిశీలించి చర్యలు తీసుకునే అవకాశాలు లేకపోలేదని ఓ సీనియర్ అధికారి అభిప్రాయపడ్డారు. ఇక్కడ 696.... అక్కడ 334 రాష్ట్రంలో 696 ఈవీఎంలు పనిచేయడం లేదని ద్వివేదికి ఫిర్యాదుచేసిన టీడీపీ ఈసీకి ఆ సంఖ్యను 334గా పేర్కొంది. అన్నిటినీ సరిచేశామని, కొన్నిచోట్ల మాత్రం కొంత ఆలస్యం జరిగిందని రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొనట్లు తెలిసింది. పోలింగ్ ఏజెంట్లు సమయానికి రాకపోవడం, మాక్ పోలింగ్‌లో జాప్యం జరగడం, తొలిసారి వీవీ ప్యాట్ల వినియోగం వల్ల స్వల్ప సమస్యలు తలెత్తినా వెంటనే అన్నీ సర్దుకున్నాయని వివరించింది. ఎన్నికలకు ప్రభుత్వ సిబ్బందిని కాకుండా ప్రైవేట్ వ్యక్తులను ఎంపిక చేయడాన్ని ఈసీ తప్పుబట్టింది. -
అధికారులపై వేటుకు రంగం సిద్ధం
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి, పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై వేటుకు రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు సీఈసీకి నివేదిక వెళ్లింది. నేడోరేపో ఆదేశాలు కూడా వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికల అనంతరం జరిగిన సంఘటనలకు కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫార్సు చేసింది. పోలింగ్ తర్వాత తలెత్తిన నాలుగు వివాదాలపై నెల్లూరు, కృష్ణా, విశాఖ జిల్లాల కలెక్టర్ల నుంచి నివేదికలు తెప్పించుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. మంగళవారం సచివాలయంలో తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడారు. ఈ వివాదాలు తలెత్తడానికి బాధ్యులైన ఆర్వో, ఏఆర్వోలపై చర్యలు తీసుకోవాల్సిందిగా సిఫార్సు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక ఇచ్చినట్లు తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం మేరకు ఆ అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. అక్కడి ఈవీఎంలను తరలించకూడదు ఎన్నికల విధుల్లో అలసత్వం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ముఖ్యంగా ఈవీఎంల భద్రత విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. ఎట్టి పరిస్థితుల్లో స్ట్రాంగ్ రూముల్లో ఉన్న ఈవీఎంలను కదిలించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఒకవేళ వినియోగించని ఈవీఎంలను తరలించాల్సి వస్తే ముందస్తు అనుమతితో అందరి సమక్షంలో తరలించాల్సిందిగా అధికారులకు ఆదేశాలను జారీ చేశామన్నారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద భద్రత పెంచాలని అన్ని రాజకీయ పార్టీలు కోరుతున్నాయని, భద్రత పెంపు సాధ్యాసాధ్యాలపై డీజీపి నుంచి వివరణ తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆర్వో, ఏఆర్వోలపై కేసు నమోదు.... నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వీవీప్యాట్ స్లిప్‌ల ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని ఇప్పటికే ఆర్వో చిన రాముడు, ఏఆర్వో విద్యాసాగర్‌లపై ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు తెలిపారు. ఈవీఎంలను పరిశీలించిన తర్వాత వీవీప్యాట్‌లో వచ్చిన స్లిప్‌లను ఎన్వలప్ కవర్లలో భద్రపర్చాలని, కానీ రెండు కవర్లలోని స్లిప్పులను ఉద్దేశ్య పూర్వకంగా బయటపాడేసినట్లు తెలుస్తోందన్నారు. ఈ వివాదాలకు సంబంధించి మీడియా వద్ద వాస్తవ వివరాలు ఉంటే ఆ సంస్థలు కూడా నేరుగా వచ్చి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. 5 చోట్ల రీపోలింగ్‌కు సిఫార్సు జిల్లా కలెక్టర్ల నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా రాష్ట్రంలో ఐదు చోట్ల రీ–పోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫార్సు చేసినట్లు దివ్వేది తెలిపారు. నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో రెండేసి బూత్‌లు, ప్రకాశం జిల్లాలో ఒక బూత్‌కు సంబంధించి రీ–పోలింగ్‌కు సిఫార్సు చేసినట్లు తెలిపారు. ఎన్నికల కౌంటింగ్‌కు చాలా సమయం ఉండటంతో రీ–పోలింగ్‌పై వెంటనే నిర్ణయం తీసుకోలేదని, ఏ క్షణమైనా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రీ–పోలింగ్‌కు సంబంధించి ఆదేశాలు జారీ అయ్యే అవకాశాలున్నాయన్నారు. వీవీప్యాట్ స్లిప్పులు దగ్ధం చేశారు: ఆత్మకూరు డీఎస్పీ ఆత్మకూరు: నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలోని 134వ పోలింగ్ బూత్‌లోని కొన్ని వీవీ ప్యాట్ స్లిప్పులు బహిర్గతం కావడంతో పాటు కొన్ని మాయమయ్యాయని ఆరోపణలు వచ్చాయని స్థానిక డీఎస్పీ వెంకటాద్రి తెలిపారు. ఆత్మకూరు మండలంలోని దేపూరు గ్రామంలోని పోలింగ్ స్టేషన్‌కు సంబంధించి వీవీప్యాట్ స్లిప్పులు కొన్నింటిని దగ్ధం చేశారని, స్లిప్‌లు భద్రపరిచే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిచిన ఆర్.ఓ, ఏఆర్ఓ, సిబ్బందిపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ వివరించారు. పూర్తిస్థాయి విచారణకు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశామన్నారు. నూజివీడు ఏఆర్వోకు షోకాజ్ నోటీసు చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా యూనివర్సిటీ భవనంలో భద్రపరిచిన నూజివీడు నియోజకవర్గ రిజర్వు ఈవీఎంల తరలింపుపై అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిగా పనిచేస్తున్న నూజివీడు తహసీల్దార్ తేజేశ్వరరావుకు ఎన్నికల అధికారులు హడావుడిగా షోకాజ్ నోటీసు జారీ చేశారు. అయితే నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి అయిన సబ్ కలెక్టర్ ఈవీఎంల తరలింపుపై తనకు ఆదేశాలు ఇచ్చారని, తదనంతరం రాజకీయ పార్టీల నాయకులకు ఫోన్ ద్వారా సమాచారం కూడా ఇచ్చినట్లు ఎఆర్వో చెబుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో షోకాజ్ నోటీసు తీసుకునేందుకు తహసీల్దార్ అందుబాటులో లేకపోవటంతో ఆయన నివాసానికి అంటించినట్లు సమాచారం. స్ట్రాంగ్ రూంలలో ఉన్న ఈవీఎంలను కదలించకూడదని ఎన్నికల కమిషన్ నుంచి స్పష్టమైన ఆదేశాలున్నా వీటికి ఎందుకు తరలించారనే దానిపై పైఅధికారులు విస్తృత విచారణ చేపట్టారు. -
‘పోలింగ్’ అవకతవకలు: ఆ అధికారులపై వేటు
-
‘పోలింగ్’ అవకతవకలు: ఆ అధికారులపై వేటు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో జరిగిన లోక్‌సభ, అసెంబ్లీ పోలింగ్ సందర్భంగా ఎన్నికల విధులను సక్రమంగా నిర్వర్తించడంలో విఫలమైన అధికారులపై విచారణ కొనసాగుతోంది. నెల్లూరు, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో జరిగిన నాలుగు ఘటనల్లో అవకతవకలపై సంబంధిత ఎన్నికల సిబ్బందిపై వేటుకు రంగం సిద్ధమైంది. ఈ ఘటనలపై మూడు జిల్లాల కలెక్టర్ల నుంచి ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది ఇప్పటికే నివేదికలు తెప్పించుకున్నారు. పోలింగ్ తర్వాత తలెత్తిన వివాదాల్లో రిటర్నింగ్ అధికారులు (ఆర్వో), అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల (ఏఆర్వోల)పై చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘానికి ద్వివేది సిఫారసు చేశారు. ఈవీఎంల భద్రత విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠినంగా వ్యవహరిస్తామని ద్వివేది తాజాగా మంగళవారం హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా స్ట్రాంగ్ రూములకు తరలించిన పోలింగ్ నాటి ఈవీఎంలను కదిలించొద్దని, రిజర్వ్ ఈవీఎంలను తరలించాల్సి వస్తే ముందస్తు అనుమతితో, అందరి సమక్షంలోనే తరలించాలని ఆయన తేల్చి చెప్పారు. రాజకీయ పార్టీలు స్ట్రాంగ్ రూముల వద్ద భద్రత పెంచాలని కోరాయని, భద్రత పెంపు సాధ్యాసాధ్యాలపై డీజీపీని వివరణ కోరామని తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వీవీ ప్యాట్ స్లిప్పులు దొరికిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, ఘటనకు బాధ్యులెవరో విచారణలో తేలుతుందని తెలిపారు. ఈ వ్యవహారంలో వాస్తవంగా ఏం జరిగిందో మీడియా కూడా పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చన్నారు. -
ఆత్మకూరు వీవీ ప్యాట్ స్లిప్‌లపై సీఈ ఆగ్రహం
-
ద్వివేది ఆగ్రహం
సాక్షి, అమరావతి: నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వీవీప్యాట్ స్లిప్పులు దొరికిన వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పందించారు. ఆ స్లిప్పులు పోలింగ్ నాటివి కాదని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా కృష్ణా జిల్లా నూజివీడులో వాడని ఈవీఎంల తరలించిన వ్యవహారంపై స్పందించిన ద్వివేది.. ఈ రెండు వ్యవహారాల్లోనూ అధికారులపై తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, ఆత్మకూరు ప్రభుత్వ పాఠశాలను ఈవీఎంల కమిషనింగ్ సెంటర్‌గా మాత్రమే వినియోగించామని, ఆత్మకూరు ఆర్డీవో ఆధీనంలో ఉన్న ఈ కమిషనింగ్ సెంటర్లో బ్యాలెట్ పత్రాలు పెట్టిన తర్వాత చెక్ చేశారని, పోలింగ్‌కు ముందే ఒక్కో నియోజకవర్గానికి కేటాయించిన ఈవీఎంలలో వెయ్యి ఓట్లను బెల్ ఇంజినీర్లు పోల్ చేశారని, ఈవీఎంలు సక్రమంగా పనిచేస్తున్నాయని నిర్ధారించుకున్న తర్వాత వాటిని పోలింగ్ కేంద్రాలకు తరలించారని తెలిపారు. ఎవరో ఉద్యోగి ఉద్దేశపూర్వకంగా ఈవీఎంలు కమిషనింగ్ చేసిన సమయంలో వచ్చిన వీవీప్యాట్ స్లిప్పులను బయట పారేశారని, వీవీ ప్యాట్ స్లిప్పుల విషయంలో ఆత్మకూరు ఎన్నికల ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులైన ఉద్యోగులపై క్రిమినల్ కేసు పెట్టి తక్షణం అరెస్ట్ చేయాలని జిల్లా కలెక్టర్‌ను సీఈఓ ద్వివేది ఆదేశించారు. ప్రతి నియోజకవర్గం పరిధిలో జరిగే తప్పులకు రిటర్నింగ్ అధికారులే బాధ్యులవుతారని హెచ్చరించారు. ఆ ఈవీఎంల తరలింపుపైనా ఆగ్రహం.. స్ట్రాంగ్ రూమ్ నుంచి వాడని ఈవీఎంలను తరలించడంపై సీఈఓ ద్వివేది ఆగ్రహం వ్యక్తం చేశారు. నూజివీడు సబ్ కలెక్టర్, కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ (జేసీ) వెంటనే ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని కోరారు. దీంతో దాదాపు గంటన్నరపాటు ఈవీఎంల తరలింపుపై నుజువీడు సబ్ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, కృష్ణా జిల్లా జేసీ మిషా సింగ్ వివరణ ఇచ్చారు. వినియోగించని, రిజర్వ్ చేసిన ఈవీఎంలను మాత్రమే తరలించామని వారు తెలిపారు. పోలింగ్ కేంద్రాలనుంచి ఈవీఎంలు రాకముందే.. వినియోగించని ఈవీఎంలను ఎందుకు తరలించలేదని ద్వివేది నిలదీశారు. ఈ విషయంలో అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. పొరపాట్లు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. -
భద్రత కల్పించాలని కోరిన మేరుగ నాగర్జున
సాక్షి, అమరావతి: వేమూరు నియోజకవర్గంలో టీడీపీ అరాచకాలు, బెదిరింపులు రోజురోజుకు పెరిగిపోతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగ నాగార్జున తెలిపారు. సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలిసిని నాగార్జున.. వేమూరు నియోజకవర్గంలో పోలింగ్ రోజున టీడీపీ నేతలు సాగించిన దాడులపై ఫిర్యాదు చేశారు. వేమూరు నియోజకవర్గంలోని బూతుమల్లి గ్రామంలో తనపై జరగిన దాడి, కార్ల ధ్వంసంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ద్వివేదిని కోరారు. ఈ భేటీ అనంతరం నాగార్జున మీడియాతో మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ ముఖ్యనేతలకు ప్రాణహాని ఉందని అనుమానం వ్యక్తం చేశారు. 2+2 భద్రత కల్పించాల్సిందిగా పోలీసులను ఆదేశించాలని ద్వివేదిని కోరినట్టు వెల్లడించారు. రావికంపాడు గ్రామంలో మంత్రి నక్కా ఆనందబాబు, పోలీసులు కలిసి మహిళలపై దాడి చేసి గాయపరిచారని ఆయన తెలిపారు. వైఎస్సార్సీసీ కార్యకర్త ప్రేమచంద్‌ను విచక్షణారహితంగా కొట్టి గాయపరిచారని పేర్కొన్నారు. కొల్లూరు గ్రామానికి చెందిన ఎస్టీ మహిళ చర్లంచర్ల కనకదుర్గ ఇంటిపై దాడి చేసి కులం పేరుతో దూషించిన మురళీకృష్ణపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. భట్టిప్రోలు మండలం పెసర్లంక గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నేత సురేశ్‌పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. -
సాక్ష్యాలతో సహా స్పష్టత ఇచ్చిన ద్వివేది..
సాక్షి, అమరావతి : రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది ఓటు వేయలేదంటూ టీడీపీ నేతలతో పాటు, ఎల్లో మీడియా దుష్ప్రచారంపై ఈసీ అధికారులు ఘాటుగా సమాధానమిచ్చారు. సీఈఓ ఓటు వేయడాన్ని సాక్ష్యాలతో సహా స్పష్టత ఇచ్చారు. ఈ మేరకు ద్వివేది ఓటు వేసిన వీడియోను ఈసీ అధికారులు శనివారం విడుదల చేశారు. 11వ తేదీ సాయంత్రం 4 గంటలకు ద్వివేది ఓటు వేసిన విషయం తెలిసిందే. అయితే ఈవీఎంలో సాంకేతిక లోపం కారణంగా ఆయన ఓటు వేయలేకపోయారంటూ ఎల్లో మీడియా ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. -
80 శాతం పోలింగ్ నమోదయ్యే అవకాశం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో 80 శాతం పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదీ తెలిపారు. కాసేపటి క్రితం ద్వివేదీ మీడియాతో మాట్లాడుతూ.. ‘సాయంత్రం 5 గంటల వరకు ఏపీలో 65.96 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు క్యూ లైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం ఉండటంతో.. ఇంకా కొన్ని బూత్‌లలో పోలింగ్ కొనసాగుతుంది. అందువల్ల 80 శాతం పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉంది. పోలింగ్ శాతం లెక్కించడానికి మరి కాస్త సమయం పడుతుంది. స్వల్ప ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 25 ఘర్షణలు చోటుచేసుక్నుట్టు పోలీసు శాఖ తెలిపింది. ఆరు చోట్ల ఈవీఎంలు ధ్వంసం చేశారు. ఆ ఘటనల్లో ఇద్దర మరణించగా, కొందరు గాయపడ్డారు. కొన్ని చోట్ల రాజకీయ పార్టీల నుంచి రీపోలింగ్‌కు ఫిర్యాదులు వచ్చాయి. రీపోలింగ్ గురించి కేంద్ర ఎన్నికల సంఘంతో చర్చించాను. కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకుల స్క్రూటీని అనంతరం రీపోలింగ్‌పై నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఫారం 17(ఏ) పరిశీలించి రీ పోలింగ్ చేయాలా వద్దా అన్నది వారు నిర్ణయిస్తారు. చిత్తూరు జిల్లా పూతలపట్టులో మూడు గంటలకే పోలింగ్ ఆగిపోయింద’ని పేర్కొన్నారు. -
నేను చూస్తా ఎలక్షన్ కమిషన్ ఏంటో
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదీని బెదిరిస్తూ.. తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. తోకపత్రిక రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలకు వంతపాడి ప్రభుత్వ ఉద్యోగులను నీచాతి నీచంగా అవమానించిన చంద్రబాబు.. పోలింగ్‌కు ముందురోజు, ఎన్నికల నియమావళి అమల్లో ఉండగా శివాలెత్తిపోతూ ఎన్నికల ప్రధాన అధికారిపై బెదిరింపులకు దిగడంతో అధికార వర్గాలు విస్తుపోతున్నాయి. బుధవారం సచివాలయంలోని ఎన్నికల కమిషన్ కార్యాలయానికి వచ్చిన చంద్రబాబు ఆయన కార్యాలయంలోనే ద్వివేదిపై చిందులు తొక్కి ఇష్టానుసారం మాట్లాడారు. ఎన్నికల సంఘం ఎవరి పక్షాన పనిచేయట్లేదని ద్వివేది వివరణ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నా వినకుండా ఎన్నికల సంఘాన్ని మూసేయాలని చెప్పడం రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు చేతులు చూపిఊ్త ఇష్టానుసారం మాట్లాడుతున్న సమయంలో సీఈఓ జోక్యం చేసుకుని ‘మీరంటే మాకు గౌరవం ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం సూచనలు మాత్రమే మేము అమలు చేస్తున్నాము..’ అని చెప్పగా.. మీది పోస్ట్ ఆఫీస్ కాదు.. కేంద్రం ఎన్నికల సంఘం చెప్పినట్లు ఎలా చేస్తారని రెచ్చిపోయి మాట్లాడడంతో అక్కడున్న మిగతా అధికారులు నివ్వెరపోయారు. తాము ఒకరి తరఫున పనిచేయాల్సిందిగా ఎన్నికల సంఘం ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని, ఎన్నికల నిర్వహణలో తాము నిష్పాక్షికంగా పనిచేస్తున్నామని, తమపై ఎవరి ఒత్తిడి లేదని ద్వివేది చెబుతున్నా చంద్రబాబు వినలేదు. ప్రతిపక్ష నాయకుడు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పినట్లు పనిచేస్తారా అంటూ ఇష్టానుసారం బెదిరింపులకు దిగారు. ఎన్నికల సంఘాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాల్సి ఉందన్నారు. ఎన్నికలను అడ్డు పెట్టుకుని రాష్ట్ర రాజకీయాల్లో జోక్యం చేసుకుంటారా అని మండిపడ్డారు. ఢిల్లీలో కూర్చున్న వాళ్లు చెప్పినట్లు చేస్తామంటే తాము చూస్తూ ఊరుకోమని, సీఎస్, డీజీ, ముగ్గురు ఎస్పీలను ఎలా బదిలీ చేస్తారని ప్రశ్నించి తాను ఎవరినీ ఊరికే వదలనని, అందరి సంగతి చూస్తానని హెచ్చరించారు. వినతిపత్రం ఇచ్చే పేరుతో వచ్చిన చంద్రబాబు ఇలా అడ్డగోలుగా మాట్లాడడంతో సీఈఓ సహా ఎన్నికల సంఘం అధికారులంతా నివ్వెరపోయారు. ఐదు నిమిషాల ధర్నా డ్రామా అనంతరం బయటకు వచ్చి ఎన్నికల నియమావళికి విరుద్ధంగా మీడియా సమావేశం నిర్వహించారు. మొట్ట మొదటిసారి ఒక ముఖ్యమంత్రి సీఈఓకు ఫిర్యాదు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పిన ఆయన అది నియమావళికి విరుద్ధమని తెలిసి చివర్లో పార్టీ అధ్యక్షుడిగా తాను మాట్లాడుతున్నానని చెప్పడం విశేషం. కొద్దిసేపటికే వెళ్లిపోయేందుకు కారెక్కుతుండగా కొందరు అనుకూల మీడియా ప్రతినిధులు.. కాసేపు ఇక్కడ కూర్చోవాలని, ఫొటోలు తీసుకుంటామని చంద్రబాబుకు సూచించారు. దీంతో ఆయన వెనక్కి వచ్చి సీఈఓ కార్యాలయం బయట మెట్లపై టీడీపీ నేతలతో కలసి ఐదు నిమిషాలు కూర్చున్నారు. దీన్నే ఎల్లో మీడియా చంద్రబాబు సీఈఓ కార్యాలయం ఎదుట ధర్నా చేశారంటూ కొద్దిసేపు హడావుడి చేసింది. ఎన్నికల నియమావళి అమల్లో ఉండగా నలుగురు ఒకేచోట గుమిగూడి ఉండకూడదనే నిబంధనను ఎన్నికల సంఘం కార్యాలయం ఎదుటే చంద్రబాబు పరివారం తుంగలో తొక్కడం గమనార్హం. చంద్రబాబు సీఈఓను ఏమన్నారంటే.. – ఎవరు వెరిఫైంగ్ అథారిటీ అండీ. మీరు చూడాలి. లేదంటే వాళ్లు (ఎలక్షన్ కమిషన్) చూడాలి. – ఇక మీ ఆఫీస్ ఎందుకు? క్లోజ్ చేసేయండి. ఎలక్షన్ కమిషన్ ఎవరు?. నేను అడుగుతున్నా. – సరిగా కండక్ట్ చేయలేకపోతే. ఏకపక్షంగా చేయండి. మిషన్లు పెట్టుకుని రిగ్గింగ్ చేసుకుంటారు. అయిపోతుంది దేశంలో ఎలక్షన్స్. మేం అందరం ఇంట్లో పడుకుంటాం. – మేం అడిగేది ఏంటి? మీరు ఇండిపెండెంట్ ఆథారిటీ అవునా.. కాదా?. – ఢిల్లీ చెప్పినట్లు యాజ్ టీజ్‌గా మీరు ఎందుకు ఫాలో కావాలి? మీకు ఆత్మసాక్షి ఉందిగా. మీది పోస్ట్ ఆఫీస్ కాదు. మీకు అధికారాలు ఉన్నాయి. లేకపోతే రద్దు చేసేయమనండి. అందరినీ తీసేయమనండి. ఓ క్లర్కును పెట్టుకుని చేసేయమనండి. – మేం చూస్తాం. రేపు ఎలక్షన్ కమిషన్ ఏంటో. అంత ఈజీగా నేను వదిలిపెట్టను. -
‘చంద్రబాబుపై కేసు నమోదు చేయాలి’
సాక్షి, అమరావతి: ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై కేసు నమోదు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కోరారు. బుధవారం సాయంత్రం వైఎస్సార్సీపీ నాయకులు బాలశౌరి, నాగిరెడ్డి, గౌతమ్‌రెడ్డిలు ద్వివేదికి పలు అంశాలపై ఫిర్యాదు చేశారు. రాప్తాడు, జమ్మలమడుగు నియోజకవర్గాల్లో టీడీపీ అరాచకాలకు పాల్పడే అవకాశం ఉందని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ రెండు నియోజకవర్గాల్లో ప్రత్యేక భద్రతా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు ఎన్నికల అధికారి ఎదుట ఆందోళన చేయడం ఓ పెద్ద డ్రామా అని బాలశౌరీ తెలిపారు. ప్రజల దృష్టిని మరల్చేందుకే చంద్రబాబు ఈసీని కలిసి అనవసర రాద్ధాంతం చేశారని విమర్శించారు. చంద్రబాబు నియమించుకున్న అధికారులపై ఆరోపణలు రుజువై బదిలీవేటు పడితే ఈసీని నిందించటం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. చంద్రబాబు తీరు దొంగే దొంగ అన్న చందంగా ఉందని ఆరోపించారు. చంద్రబాబుకు ప్రజాస్వామ్యమన్నా, ఎన్నికల సంఘమన్నా లెక్కలేదని అన్నారు. ఏపీలో గురువారం జరిగే ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసే చంద్రబాబు డ్రామాలకు తెరలేపారని ఎద్దేవా చేశారు. -
5.30కి మాక్ పోలింగ్
సాక్షి, అమరావతి: ఎన్నికల రోజైన ఏప్రిల్ 11న గురువారం ఉదయం 5.30కే మాక్ పోలింగ్ ప్రారంభమవుతుందని, ఆ సమయానికే పోలింగ్ ఏజెంట్లు చేరుకోవాలని రాజకీయ పార్టీలకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది సూచించారు. మంగళవారం సాయంత్రం ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. 11న ఉదయం ఏడు గంటలకు పోలింగ్ మొదలవుతుందని, దానికి ముందే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు సరిగా పనిచేస్తున్నాయా లేదా అన్న విషయాన్ని పరిశీలించడానికి ఏజెంట్ల సమక్షంలో 50 ఓట్ల వరకు మాక్ ఓటింగ్ నిర్వహిస్తామని, ఆ తర్వాత వారి సమక్షంలోనే డిలీట్ చేసి 7 గంటలకు పోలింగ్‌కు ప్రారంభిస్తామని చెప్పారు. 5.30 తర్వాత పావుగుంట వరకు మాత్రమే చూస్తామని, ఆ తర్వాత ఏజెంట్లు ఉన్నా లేకపోయినా మాక్ పోలింగ్‌ను నిర్వహిస్తారని స్పష్టం చేశారు. రెండు రోజులు బల్క్ ఎస్ఎంఎస్లను నిషేధిస్తున్నట్లు చెప్పారు. 9 వేల సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు 2,118 మంది, 25 పార్లమెంటు స్థానాలకు 319 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం 3.93 కోట్ల మంది ఓటర్లు ఉండగా వీరి కోసం మొత్తం 45,920 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 9 వేల సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించి ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఓటు వినియోగంపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయడంతో 85 శాతానికి పైగా పోలింగ్ జరిగే అవకాశముందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. పోలింగ్ కేంద్రాల్లో సెల్ఫోన్లు నిషేధం.. పోలింగ్ కేంద్రాల్లోకి ఎట్టి పరిస్థితుల్లో సెల్ఫోన్లు, కెమెరాలు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించేది లేదని ద్వివేది స్పష్టం చేశారు. స్విచ్ ఆఫ్ చేసిన ఫోన్లను కూడా లోపలికి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ఎవరైనా ఓటు వేసినట్లు ఫోటోలు తీస్తే శిక్ష తప్పదని హెచ్చరించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి సోమవారం వరకు రూ.196.3 కోట్ల విలువైన వస్తువులను సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ మొత్తం రూ.200 కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నామన్నారు. పట్టుకున్న మొత్తం పరంగా దేశంలో ఏపీ మూడవ స్థానంలో ఉందని చెప్పారు. నగదు, మద్యం పట్టివేతలో ఏపీనే మొదటి స్థానంలో ఉందని వివరించారు. సోమవారం నాటికి రూ.118.89 కోట్ల నగదు, రూ.24.15 కోట్ల విలువైన మద్యం పట్టుబడినట్లు వెల్లడించారు. -
ప్రలోభాలకు దిగితే కఠిన చర్యలు: ద్వివేది
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ప్రచారం ముగిసిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఒకటి రెండు చోట్ల పోలీసులు ప్రచారాన్ని ఆపారని అన్నారు. ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నియోజకవర్గానికి సంబంధం లేని వ్యక్తులు ఆ ప్రాంతంలో ఉండరాదని.. బయట వ్యక్తులు వాళ్ల ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేశామని.. నగదు, మద్యం, కానుకల స్వాధీనంలో ఏపీ రెండో స్థానంలో ఉందన్నారు. రాజకీయ పార్టీలు ఈ రెండు రోజులు సహకరించాలని కోరారు. ప్రలోభాలకు దిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలింగ్ కేంద్రాలకు ఎలక్ట్రానిక్ పరికారాలు నిషేధం కావున.. సెల్ఫోన్లు తీసుకుని రావద్దని విజ్ఞప్తి చేశారు. ‘ఓటుకి డబ్బులు తీసుకున్నవారు కూడా శిక్షార్హులే. తమకు వస్తున్న ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు స్పందిస్తున్నాం. సీ విజిల్ యాప్ ద్వారా 5679 ఫిర్యాదులు అందాయి. అందులో నిజమైన వాటిపై విచారణ జరిపాం. చాలా మట్టుకు తప్పుడు ఫిర్యాదులు వచ్చాయి. బుధవారం సాయంత్రానికల్లా ఈవీఎంలు, వీవీ ప్యాట్లతో సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరకుంటారు. గురువారం ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమౌతోంది. వికలాంగులకు, అంధులకు ఓటు హక్కు వినియోగానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. రాష్ట్రంలో 81,000 మంది వికలాంగ ఓటర్లు ఉన్నారు. ఈ సారి మై ఓట్ క్యూ యాప్ ప్రారంభించాం. ఈ యాప్ ద్వారా పోలింగ్ కేంద్రం వద్ద క్యూ ఉందా లేదా తెలుసుకోవచ్చు. ఇప్పటికే 21,000 మంది ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు.. దానిని పోలింగ్ తేదీ నాటి లక్షల మంది డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. ఓటరు కార్డు లేని వారు పదకొండు రకాల గుర్తింపు కార్డులో ఏదో ఒకటి తెచ్చుకోవచ్చు. రెండోసారి ఓటు వేస్తూ పట్టుబడితే మూడేళ్ల జైలు శిక్ష తప్పద’ని ద్వివేదీ పేర్కొన్నారు. -
మీ ఓటెంతో రహస్యం
సాక్షి, అమరావతి: ఈ ఎన్నికల నుంచి ప్రవేశపెట్టిన వీవీప్యాట్లతో ఎవరికి ఓటు వేశారో తెలిసిపోతుందంటూ జరుగుతున్న ప్రచారాన్ని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది ఖండించారు. పోలింగ్ బూత్‌లో వేసిన ఓటు మరో వ్యక్తికి తెలిసే అవకాశమే ఉండదని, అటువంటి అపోహలను నమ్మవద్దన్నారు. ఓటు వేసిన వారికి మాత్రమే వీవీప్యాట్‌లో ఎవరికి ఓటు వేశారన్నది ఏడు సెకన్లపాటు కనిపిస్తుందని, ఆ తర్వాత దీన్ని ఇక ఎవ్వరూ చూసే అవకాశం ఉండదని స్పష్టం చేశారు. ఏప్రిల్ 11 ఎన్నికల ఏర్పాట్లను సోమవారం సాయంత్రం ద్వివేది ‘సాక్షి’తో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీరు ఎవరికి వోటు వేశారో మాకు తెలుస్తుందంటూ ఎవరైనా ఓటర్లను బెదిరిస్తుంటే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందిగా సూచించారు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగిసిన తర్వాత ఎన్నికలయ్యేంత వరకు నియోజకవర్గాల్లో స్థానికేతరులు ఉండటానికి వీల్లేదన్నారు. ప్రచారం తర్వాత ప్రలోభాలు భారీగా పెరిగే అవకాశాలు ఉండటంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా వ్యయ పరిశీలకులు ఈ అంశంపై చాలా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో రూ.110 కోట్ల నగదు, రూ.23 కోట్ల విలువైన మద్యం, 100 కేజీల బంగారం, 325 కేజీల వెండిని పట్టుకున్నట్లు తెలిపారు. ఒక సహాయకుడు ఒక్కరికే.. దివ్యాంగ ఓటరుకు సహాయకులుగా వచ్చినవారి విషయంలో ఎన్నికల నిబంధనలు చాలా స్పష్టంగా ఉన్నాయని, పోలింగ్ సిబ్బంది వీటిని తూ.చ తప్పకుండా పాటించాలన్నారు. ఒక సహాయకుడు ఒకరికి మాత్రమే సహాయంగా పోలింగ్ కేంద్రంలోకి రావడానికి అనుమతిస్తారని, ఇలా వచ్చిన సహాయకుడి కుడి చేతి వేలుకు ఇంకు మార్కు వేయాల్సి ఉంటుందని, దీనివల్ల అతను మరొకరికి సహాయకుడిగా రావడానికి వీలుండదన్నారు. దివ్యాంగులకు ఓట్ వేసేందుకు వీల్ చైర్లతో పాటు అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అదే విధంగా పోలింగ్ కేంద్రాల్లోకి కెమెరాలు, సెల్ఫోన్లు తీసుకెళ్లడానికి వీల్లేదన్నారు. ఓటరు ఓటు వేయడానికి వచ్చేసరికి అతని ఓటును వేరేవాళ్లు వేసి ఉంటే టెండర్ ఓటు ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని, దీనికి సంబంధించిన పత్రాలు ప్రిసైడింగ్ ఆఫీసర్ వద్ద ఉంటాయన్నారు. కానీ ఈ ఓటును ఓట్ల లెక్కింపులో పరిగణనలోకి తీసుకోరని ఆయన స్పష్టం చేశారు. బలగాలు రాకపోయినా... ఎన్నికల నిర్వహణకు అడిగిన పోలీసు సిబ్బంది కంటే 15,000 మంది తక్కువగా వచ్చారన్నారు. అదనపు బలగాలు రాకపోయినా ఉన్న సిబ్బందితోనే పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో సాయుధ బలగాలు వినియోగించి, సున్నిత ప్రాంతాల్లో వెబ్‌కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్స్‌తో, వీడియోగ్రఫీ ద్వారా ఎన్నికలు నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. 11వ తేదీ ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు తమకు అత్యంత కీలకమైన సమయమని, ఈ సమయంలో పార్టీల ఏజెంట్ల సమక్షంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలతో 50 ఓట్లు మాక్ పోలింగ్ నిర్వహించి వాటిని డిలీట్ చేయడం జరుగుతుందన్నారు. ఇటువంటి సమయంలో ఓటింగ్ యంత్రాల్లో ఏమైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే సరిదిద్దడానికి నియోజకవర్గానికి ముగ్గురు భెల్ సిబ్బంది సిద్ధంగా ఉన్నారన్నారు. అలాగే ప్రతీ నియోజకవర్గంలో 20 శాతం అదనపు ఓటింగ్ యంత్రాలు, 25 వీవీప్యాట్లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. పోలింగ్ సిబ్బందిని తరలించడానికి 7,600 బస్సులు సిద్ధం చేశామని, 10వ తేదీ మధ్యాహ్నం నుంచే సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు తరలిస్తామన్నారు. -
ఆ విషయంలో ఏపీ రెండో స్థానం : ద్వివేది
సాక్షి, అమరావతి : దేశంలో ఎన్నికల వేడి రగులుతుండగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ హీట్ తారాస్థాయికి చేరుకుంది. ఏప్రిల్ 11న రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేది మీడియాతో మాట్లాడుతూ.. ఎల్లుండి (ఏప్రిల్ 9) సాయంత్రం ఆరుగంటలకు ఎన్నికల ప్రచారం ముగుస్తుందని తెలిపారు. దేశంలో భారీగా నగదు పట్టుబడిన రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో ఉందని పేర్కొన్నారు. ఇప్పటివరకూ ఏపీలో 105 కోట్ల నగదు, వంద కేజీల బంగారం, 22 కోట్ల విలువైన లిక్కర్ పట్టుబడిందని తెలిపారు. గత ఎన్నికలతో పోలిస్తే.. ఈసారి వంద కంపెనీల బలగాలు తక్కువగా వచ్చాయన్నారు. సమస్యాత్మక ప్రాంతంలో కెమెరాలు, వీడియోగ్రఫీ ద్వారా నిఘా పెడుతున్నామన్నారు. అరకు, పాడేరు వంటి నియోజకవర్గాలు, రిమోట్ ప్రాంతాల్లోని 14 పోలింగ్ స్టేషన్లను పట్టణ ప్రాంతాలకు మార్చామని అన్నారు. -
ఈసీ ఆగ్రహం.. సీఐపై బదిలీ వేటు
సాక్షి, అమరావతి: చిత్తూరు జిల్లా మదనపల్లి టూ టౌన్ సీఐ సురేశ్ కుమార్‌పై బదిలీ వేటు పడింది. టీడీపీ ప్రచార సభలో కోడ్ ఉల్లంఘనకు సంబంధించి రాజంపేట పార్లమెంట్ అబ్జార్వర్ నవీన్ కుమార్ చెప్పిన కూడా సురేశ్ కేసు నమోదు చేయలేదు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్న సురేశ్ తీరుపై నవీన్ ఆంధ్ర ప్రదేశ్ సీఈఓ గోపాలకృష్ణ ద్వివేదీకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ద్వివేదీ సురేశ్‌ను ఎన్నికల విధుల నుంచి తొలగించారు. సురేశ్ స్థానంలో కొత్తవారిని నియమించేందుకు మూడు పేర్లను సూచించాలని డీఐజీని ద్వివేదీ ఆదేశించారు. ఆదివారం ఉదయం 11 గంటల్లోపు కొత్త సీఐని నియమిస్తామని ద్వివేదీ తెలిపారు. మరోపైపు టీడీపీకి ఓటేయమని ఒత్తిడి తెస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సెర్ప్ సీఈఓ కృష్ణమోహన్‌పై ఎన్నికల సంఘం దృష్టి పెట్టింది. కృష్ణమోహన్‌పై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ద్వివేదీ ఏపీ ప్రభుత్వాని కోరారు. అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించకపోయినా, ప్రజలను ఇబ్బంది పెట్టిన చర్యలు తీసుకుంటామని ద్వివేదీ హెచ్చరించారు. ఎన్నికల సంఘం హెచ్చరికలతో ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసుల్లో ఆందోళన నెలకొంది. -
గోపాలకిృష్ణ ద్వివేదీని కలిసిన నాగిరెడ్డి
-
పథకాలు అందాలంటే ఆ పార్టీకే ఓటేయ్యాలంట..!
సాక్షి, అమరావతి: ఎన్నికల సంఘం ఆదేశాలను ధిక్కరించి ఎన్నికల ప్రక్రియనే చంద్రబాబు నాయుడు సవాలు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనేత ఎంవీఎస్ నాగిరెడ్డి ఆరోపించారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుపై ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకిృష్ణ ద్వివేదీకి శనివారం ఆయన ఫిర్యాదు చేశారు. బాధ్యతాయుత పదవిలో ఉండి ఎన్నికల తాయిలాలపై చంద్రబాబు బహిరంగ సభలో ప్రసంగించినట్లు సీఈఓ దృష్టికి తీసుకెళ్లారు. రాజ్యాంగం ప్రకారం, రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తానని ప్రమాణం చేసి.. ఎన్నికల వేళ నియంతలా వ్యవహరిస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజాస్వామ్యమన్నా, ఎన్నికల సంఘమన్నా చంద్రబాబుకి లెక్కలేదని, పథకాల పేరుతో ఆయన తరఫున డబ్బులు పంచుతానని ప్రకటించడం బరితెగింపుకు నిదర్శనమన్నారు. చంద్రబాబు నిజస్వరూపం విశాఖ సభలో బయటపడిందని అన్నారు. ప్రభుత్వ ధనాన్ని పార్టీ ధనంగా వాడుకొంటున్నారని, ఆయనది రాచరిక పాలన అని ఆరోపించారు. ప్రభుత్వ పథకాలను అందాలంటే టీడీపీకి ఓటు వేయ్యాలని లబ్ధిదారులపై ఒత్తిడి తెస్తున్నారని అన్నారు. ఎన్నికల సంఘం ధర్మబద్ధంగా వ్యవహరించి ఎన్నికలను సజావుగా జరిపించాలని ఆయన కోరారు. -
పోలింగ్ 11 గంటలు
సాక్షి, అమరావతి: ఎక్కువమంది ఓటర్లు పోలింగ్‌లో పాల్గొనేలా కేంద్ర ఎన్నికల కమిషన్ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా పోలింగ్ సమయాన్ని పెంచింది. ఈ నెల 11న రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాలకు, 175 అసెంబ్లీ స్థానాలకు జరగనున్న పోలింగ్ ఏకంగా 11 గంటల పాటు కొనసాగుతుంది. సాధారణంగా ఉదయం 7 గంటల నుంచి సా. 5 గంటల వరకే పోలింగ్ నిర్వహిస్తారు. వేసవిలో ఎండ తీవ్రత అధికంగా ఉన్నందున ఓటర్లు సాయంత్రం పూట ఓటింగ్‌కు వచ్చేందుకు అసక్తి చూపిస్తారనే ఉద్దేశంతో ఈ సారి సా. 6 వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు మార్చి 18న కేంద్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఎన్నికల నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. ఏజెన్సీ ప్రాంతమైన ఆరకు లోక్‌సభ పరిధిలోని అరకు వ్యాలీ, పాడేరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ నిర్వహిస్తారు. గిరిజన ప్రాంతాల నుంచి ఈవీఎంలు సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి సమయం పట్టనుండటంతో ఎన్నికల కమిషన్ ఇక్కడ పోలింగ్ సమయాన్ని గంట తగ్గించింది. ఇక మిగతా 24 లోక్‌సభ నియోజకవర్గాలతో పాటు వాటి పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. అరకు లోక్‌సభ స్థానం పరిధిలోని పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. 477 అదనపు పోలింగ్ కేంద్రాలు: పెరిగిన ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా రాష్ట్రంలో 477 అదనపు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 45, 920 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, కొత్తగా 25 లక్షల ఓటర్లు పెరగడంతో ఈ అదనపు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్ల తెలిపారు. ఆదివారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కృష్ణా జిల్లాలో అత్యధికంగా 121 పోలింగ్ కేంద్రాలు పెరగ్గా, విజయనగరం జిల్లాలో ఒక్క పోలింగ్ కేంద్రం కూడా పెరగలేదన్నారు. ఏప్రిల్ 7 వరకు ఓటరు కార్డులు పంపిణీ చేస్తామన్నారు. ఇప్పటికే బ్యాలెట్ పేపర్ల ముద్రణ 70 శాతం పూర్తయిందని, బ్యాలెట్ పేపర్లను ఆయా నియోజకవర్గాలకు పంపిస్తున్నట్లు తెలిపారు. హైకోర్టు న్యాయమూర్తులతో సమావేశం: ఈవీఎంలు, వీవీప్యాట్ల పనితీరును సోమవారం సాయంత్రం 4 గంటలకు హైకోర్టు న్యాయమూర్తులకు వివరించనున్నట్లు ద్వివేది తెలిపారు. ఇందుకోసం కేంద్ర ఈవీఎంల సాంకేతిక నిపుణుల కమిటీ సభ్యుడు డి.టి.సహాని వస్తున్నట్లు తెలిపారు. -
ఏపీలో పోలింగ్ ప్రక్రియకు ఈసీ కసరత్తు
-
రాష్ట్ర ఎన్నికలపై కేంద్రం ప్రత్యేక దృష్టి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించిందని, అందుకనే తొలిసారిగా రాష్ట్రస్థాయిలో పోలీసు, వ్యయ పరిశీలకులను ఏర్పాటు చేసిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ దివ్వేది తెలిపారు. రాష్ట్రస్థాయి పోలీసు పరిశీలకులుగా నియమించిన కేకే శర్మ శనివారం విజయవాడ చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొని ఉన్న శాంతి భద్రతల పరిస్థితి, కావాల్సిన పోలీసు బలగాల వివరాలతో కూడిన ప్రత్యేక నివేదికను కేకే శర్శకు దివ్వేది అందజేశారు. శనివారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఒకటి రెండు రోజుల్లో ఎన్నికల వ్యయ పరిశీలకుల నియామకం జరగనుందని తెలిపారు. ఇప్పటికే నియోజకవర్గాలకు వారిగా సాధారణ, వ్యయ, పోలీసు పరిశీలకులను పంపించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీకి 2,395, పార్లమెంటుకు 344 మంది పోటీ రాష్ట్రంలో 175 మంది అసెంబ్లీ స్థానాలకు 2,395 మంది, 25 పార్లమెంటుకు 344 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు దివ్వేది తెలిపారు. రాజకీయ పార్టీలతో సమావేశమైన దివ్వేది తుది ఓటర్ల జాబితాను రాజకీయల పార్టీలకు అందజేశారు. అదే విధంగా ప్రతి జిల్లా కలెక్టర్లు రాజకీయ పార్టీలకు ఓటర్ల జాబితాను అందజేస్తారని తెలిపారు. రాష్ట్రానికి కేటాయించిన పరిశీలకులు పేర్లు, ఫోను నంబర్లను రాజకీయ పార్టీలకు అందజేస్తామని, ఏదైనా సమస్య ఉంటే వారిని సంప్రదించవచ్చని తెలిపారు. వేసిన ఓటు చూసుకోవచ్చు రాష్ట్రంలో తొలిసారిగా వీవీప్యాట్లను వినియోగిస్తున్నామని, వీటి ద్వారా ఓటరు వేసిన ఓటును ఒకసారి చూసుకునే వెసులుబాటు కలుగుతుందన్నారు. ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయిల్ (వీవీప్యాట్)లో వేసిన ఓటు ఏడు సెకన్లు కనిపించి బాక్స్‌లో పడుతుందన్నారు. ఒక గుర్తుకు ఓటు వేస్తే వేరే గుర్తుకు ఓటు పడుతోందన్న అపోహలను తొలగించడానికి 2017జూన్ నుంచి జరుగుతున్న ఎన్నికల్లో వీవీప్యాట్లను వినియోగిస్తున్నామని, రాష్ట్రంలో తొలిసారిగా వీటిని ఉపయోగిస్తున్నామని తెలిపారు. అసెంబ్లీ నియోకవర్గంలో లాటరీ విధానంలో ఒక వీవీప్యాట్‌ను ఎంపిక చేసి, ఇందులో స్లిప్‌లను లెక్కించి ఈవీంఎలో పోలైన ఓట్లతో సరిపోల్చి చూడటం జరుగుతుందన్నారు. వీవీప్యాట్ స్లిప్ ఎండలో ఎండినా, వానలో తడిసినా పాడవదని, ఐదేళ్ల పాటు ఈ స్లిప్ చెరిగిపోకుండా ఉంటుందన్నారు. 1400 ఓటర్లకు ఒక వీవీప్యాట్‌ను వినియోగిస్తామని, ఓటర్లు 1400 మించి ఉంటే మరో పోలింగ్ బూత్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ద్వివేది తెలిపారు. ఆరు నెలల నుంచి వీవీప్యాట్లు, ఎలక్ట్రానికి ఓటింగ్ యంత్రాలపై అధికారులకు శిక్షణ ఇస్తున్నట్లు జాయింట్ సీఈవో మార్కేండేయులు తెలిపారు. ఈ విధానంలో ఈవీఎంల మిషన్లను ట్యాపరింగ్ చేసే అవకాశమే లేదని, స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పటిష్టమైన రెండంచెల భద్రతను ఏర్పాటు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. -
ఈవీఎంలు, వీవీప్యాట్లపై అవగాహన కార్యక్రమం
-
ఈవీఎంలు, వీవీప్యాట్లపై అవగాహన కార్యక్రమం
సాక్షి, అమరావతి : రాబోయే ఎన్నికలకు ఈసీ సిద్దమవుతుండగా.. ఈవీఎంలు, వీవీప్యాట్లపై సచివాలయంలో ఏపీ ఎన్నికల కమీషన్ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. సీఈఓ గోపాల కృష్ణ ద్వివేది మాట్లాడుతూ.. ఈవీఎంలపై అనుమానాలు పెట్టుకోవద్దని ప్రజలకు సూచించాడు. ఈసారి కొత్తగా వీవీప్యాట్లు అందుబాటులోకి వచ్చాయని, ఓటు వేశాక సరిగా పడిందో లేదో వీవీప్యాట్ స్లిప్‌లో చూసి తెలుసుకోవచ్చని తెలిపారు. ఏడు సెకండ్ల పాటు వీవీప్యాట్‌లో స్లిప్ కనిపిస్తుందని.. ఒక్కో నియోజకవర్గంలో లాటరీ ద్వారా ఎంపిక చేసిన ఒక్క వీవీప్యాట్ స్లిప్పులను మాత్రమే లెక్కిస్తామన్నారు. ఈసారి బ్యాలెట్ యూనిట్‌పై సీరియల్ నెంబర్, అభ్యర్థి పేరు, ఫోటో, గుర్తులు ఉంటాయని, 15 కంటే ఎక్కువ అభ్యర్థులు ఉంటే.. ఎక్కువ బ్యాలెట్ యూనిట్లు ఉపయోగిస్తామని తెలిపారు. రాజకీయ పార్టీలతో సమావేశమైన ద్వివేది ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఏపీ ఎన్నికల కమీషనర్ గోపాలకృష్ణ ద్వివేది రాజకీయ పార్టీలతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి వైఎస్సార్సీపీ, టీడీపీ, సీపీఎమ్, సీపీఐ, బీజేపీ నేతలు హాజరయ్యారు. ఈ నెల ప్రకటించిన ఓటర్ల జాబితాను రాజకీయ పార్టీలకు సీఈవో అందజేశారు. తనకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసినా స్పందిస్తానని ద్వివేది తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే సమాచారం సగానికిపైగా బోగసేనని అన్నారు. ఏపిలో మూడు కోట్ల 93లక్షల 45వేల 717 మంది ఓటర్లు ఉండగా.. కొత్తగా 25లక్షల 20వేల 924 మంది ఓటర్లుగా నమోదయ్యారని తెలిపారు. అన్ని జిల్లాల్లో కలెక్టర్లు రాజకీయ పార్టీలకు ఓటర్ల జాబితా అందిస్తారని అన్నారు. 175 అసెంబ్లీ స్థానాలకు 2395మంది, 25 పార్లమెంట్ స్థానాలకు 344మంది అభ్యర్థులు బరిలోకి దిగుతున్నారని పేర్కొన్నారు. 15మంది కంటే ఎక్కువ అభ్యర్థులు బరిలో ఉంటే అక్కడ అదనంగా మరో ఈవీఎమ్ వాడతామన్నారు. ఏపికి 200మంది అబ్జర్వర్లను కేంద్ర ఎన్నికల సంఘం పంపిందన్నారు. 75మంది జనరల్ అబ్జర్వర్లు కాగా.. 13మంది పోలీస్ అబ్జర్వర్లని, మిగిలిన వారంతా వ్యయ పరిశీలకులని పేర్కొన్నారు. ఒక్కొక్క పోలీస్ పరిశీలకుడు రెండు పార్లమెంట్ నియోజకవర్గాలకు ఉంటారని, జనరల్ అబ్జర్వర్ ఒక పార్లమెంట్ మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉంటారని.. వారి నెంబర్లు అందరికీ ఇస్తామని, ఏ సమస్య ఉన్నా వెంటనే సంప్రదించవచ్చని తెలిపారు. -
బదిలీ పనిష్మెంట్ కాదు
సాక్షి, అమరావతి: సర్వీసు నిబంధనల ప్రకారం బదిలీలు, సస్పెన్షన్లు పనిష్మెంట్ కాదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ప్రతి ఉద్యోగి సర్వీసులో చేసే బదిలీలకు ఎటువంటి కారణాలు తెలపరని, కేవలం పనిష్మెంట్ విధించేటప్పుడు మాత్రమే వారి నుంచి వివరణ కోరతారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ దివ్వేది తెలిపారు. రాష్ట్రంలో ముగ్గురు ఐపీఎస్‌ల బదిలీలపై వివాదం నెలకొన్న తరుణంలో దివ్వేది వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. గురువారం సచివాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముగ్గురు ఐపీఎస్‌ల బదిలీలకు ఎటువంటి కారణాలు వివరించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు చేసే ఆరోపణలను పరిగణనలోకి తీసుకుంటే విచారణ జరిగేదన్నారు. జీతం ఆపేయడం, ఇంక్రిమెంట్ కోత కోయడం, హోదా స్థాయిని తగ్గించడం వంటివి శిక్షల కిందకు వస్తాయి కానీ, ప్రభుత్వ సర్వీసుల్లో బదిలీలు అన్నవి అత్యంత సాధారణ అంశమని వివరించారు. బదిలీ చేస్తే గౌరవానికి ఎలా భంగం కలుగుతుందో తనకైతే అర్థం కావటం లేదన్నారు. రాష్ట్రంలో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడానికి అదనపు పోలీసు బలగాలు అవసరమవుతాయని దివ్వేది తెలిపారు. బెయిల్ రద్దు అనే అంశం ఎన్నికల సంఘం పరిధిలోకి రాదని, ఇందుకోసం కోర్టులను ఆశ్రయించాలని ద్వివేది స్పష్టం చేశారు. బుధవారం తెలుగుదేశం నేతలు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరిన సంగతి తెలిసిందే. -
టీడీపీకి సీఈఓ చురక..
సాక్షి, అమరావతి : ఎస్పీల బదిలీకి ఎలాంటి కారణాలు అవసరం లేదని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి గోపాల కృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. గురువారం ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది.. ఎంతమంది బరిలో ఉన్నారనే దానిపై సమాచారం సేకరిస్తున్నామని తెలిపారు. సాధారణ రోజుల్లో జరిగే బదిలీలకు ఎలాంటి కారణాలు చెప్పరని పేర్కొన్నారు. ఉద్యోగులకు బదిలీలు, సస్పెన్షన్లు శిక్ష కాదన్నారు. ఆరోపణలు పరిగణనలోకి తీసుకుంటే విచారణ జరిగేది.. బదిలీ చేసింది సీఈసీ అయితే తనకు లేఖ రాయడం వల్ల ప్రయోజనమేంటని ఆయన ప్రశ్నించారు. అంతేకాక సిట్ అధికారులు అడిగిన అన్నింటికి వివరణ ఇచ్చాం అని గోపాల కృష్ణ తెలిపారు. ఎన్నికల గుర్తులు మార్చడం అనేది ఇప్పుడు వీలు కాదన్నారు. కేఏ పాల్‌కు భద్రత పెంచమని పోలీసులకు సూచించామని తెలిపారు. జగన్ బెయిల్ రద్దు తమ పరిధిలోఉండదని.. కోర్టును ఆశ్రయించాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మందిపై బైండ్ఓవర్ కేసులు పెట్టినట్లు చెప్పుకొచ్చారు. -
ఏపీ సీఈవో ద్వివేది కీలక వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి : ఎన్నికల సంఘం పరిధిలోకి ఇంటెలిజెన్స్ విభాగాన్ని తీసుసురాకపోవడం సరైనది కాదని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేది అన్నారు. ఇంటెలిజెన్స్ విభాగంతో సంబంధంలేని పోలీసు విధులు ఉంటాయా అని ప్రశ్నించారు. బుధవారం ఆయన మీడియాతో చిట్‌చాట్ చేస్తూ కీలక అంశాలు చర్చించారు. పోలీసు కదలికలు, ఎన్నికల సిబ్బంది తరలింపు, శాంతి భద్రదల నియంత్రణ కచ్చితంగా ఇంటెలిజెన్స్‌తోనే ముడిపడి ఉంటుందని పునరుద్ఘాటించారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్యతో ఇంటెలిజెన్స్ విభాగానికి సంబందం ఉండదా అని ప్రశ్నించారు. ఎన్నికల నిర్వహణలో మొత్తం పోలీసులు వ్యవస్థ ఉండి.. ఇంటెలిజెన్స్‌కు ఎన్నికల సంబంధం లేదంటే ఎలా అని నిలదీశారు. రాష్ట్రంలో జరగుతున్న సంఘటనలను నిశితంగా పరిశీలిస్తున్నామని, ప్రతి అంశంపై కేంద్ర ఎన్నికల సంఘానికి సమాచారం అందిస్తున్నామని తెలిపారు. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సహా ముగ్గురు పోలీసు ఉన్నతాధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేయడంతో ఆత్మరక్షణలో పడిన చంద్రబాబు సర్కారు బుధవారం వివాదాస్పద నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈసీ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఏపీ ప్రభుత్వం వివాదాస్పద జీవో జారీచేసింది. సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా రాష్ట్రంలో డీజీపీ సహా ఎన్నికలతో సంబంధం ఉన్న పోలీస్ యంత్రాంగాన్ని సీఈసీ పరిధిలోకి తెస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఇంటెలిజెన్స్ డీజీపై వేటు సీఈసీ ఆదేశాలతో వెంకటేశ్వరరావుతో పాటు వైఎస్సార్, శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలు రాహుల్‌దేవ్ శర్మ, వెంకటరత్నంలను రిలీవ్ చేస్తూ మంగళవారం రాత్రి జీవో 716 విడుదల చేసింది. తెల్లారేసరికి ప్లేటు మార్చిన టీడీపీ ప్రభుత్వం.. ఇంటెలిజెన్స్ చీఫ్ ఎన్నికల కమిషన్ పరిధిలోకి రారని మెలిక పెట్టింది. నిన్నటి జీవోను రద్దు చేస్తూ నేడు వివాదాస్పద జీవో 720 జారీ చేసింది. ఇవాళ్టి జీవోలో వెంకటేశ్వరరావు పేరును తప్పించింది. ఆయనను రిలీవ్ చేయడం లేదని.. వైఎస్సార్, శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలను మాత్రమే రిలీవ్ చేస్తున్నట్టు అందులో పేర్కొంది. -
డబ్బు, మద్యం వరద
సాక్షి, అమరావతి/న్యూఢిల్లీ: ఎన్నికల వేళ రాష్ట్రంలో మద్యం, నగదు వరదలా పారుతోంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ ఎన్నికల్లో గెలిచేందుకోసం ఎంతమొత్తమైనా ఖర్చు చేయడానికి రాష్ట్రంలోని అభ్యర్థులు వెనుకాడట్లేదు. ఈ నేపథ్యంలో దేశంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన మార్చి 10 నుంచి మార్చి 25 వరకు రూ.539.99 కోట్లు విలువ చేసే నగదు, మద్యం, బంగారం, వెండి తదితర వస్తువులను పట్టుకుంటే.. కేవలం ఒక్క మన రాష్ట్రంలోనే రూ.103.4 కోట్లు విలువైన నగదు, మద్యం, ఇతర వస్తువులు పట్టుబడ్డాయి. ఈ విషయంలో రూ.107.24 కోట్లతో తమిళనాడు మొదటిస్థానంలో, రూ.104.53 కోట్లతో ఉత్తరప్రదేశ్ రెండవ స్థానంలో నిలవగా.. ఏపీ మూడో స్థానంలో నిలిచింది. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పటివరకు రూ.8.21 కోట్ల విలువైన నగదు, మద్యం, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకోగా అంతకు పదమూడు రెట్లకుపైగా ఏపీలో పట్టుపడడం గమనార్హం. ఎన్నికల సంఘం విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలోని అధికారులు చక్కగా పనిచేసినందువల్లనే భారీ మొత్తాల్ని స్వాధీనం చేసుకోగలిగినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది పేర్కొన్నారు. ఎక్కడ చూసినా కట్టలే కట్టలు.. ఇదిలా ఉంటే.. పెద్ద ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్న రాష్ట్రాల్లో ఏపీ మొదటిస్థానంలో ఉంది. గత 15 రోజుల్లో దేశవ్యాప్తంగా రూ.143.కోట్లు స్వాధీనం చేసుకుంటే ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే అందులో 30 శాతం అంటే.. 55 కోట్ల నగదును పట్టుకున్నారు. రూ.36.6 కోట్లతో తమిళనాడు రెండో స్థానంలో నిలిచింది. మిగిలిన రాష్ట్రాల్లో ఇంత పెద్ద మొత్తంలో నగదు పట్టుబడలేదు. అయితే ఉత్తరప్రదేశ్, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో భారీగా మద్యం పట్టుపడింది. దేశవ్యాప్తంగా రూ.90 కోట్ల విలువ చేసే మద్యం పట్టుబడింది. ఇందులో రూ.12 కోట్ల విలువైన మద్యం ఏపీలో దొరికింది. ఇక ఉత్తరప్రదేశ్‌లో రూ.22.55 కోట్లు, కర్ణాటకలో రూ.19.88 కోట్ల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మత్తు పదార్థాలకు సంబంధించి పంజాబ్‌లో రూ.84.3 కోట్ల విలువైన డ్రగ్స్‌ను పట్టుకోగా.. ఆంధ్రప్రదేశ్‌లో రూ.40 లక్షల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా రూ.162 కోట్ల విలువైన బంగారం, వెండి నగలు పట్టుకోగా.. ఒక్క ఏపీలోనే రూ.30 కోట్ల విలువైన నగలు పట్టుకున్నారు. రూ.6 కోట్ల విలువైన ఇతర వస్తువులను కూడా ఏపీలో స్వాధీనం చేసుకున్నారు. యూపీలో రూ.59.04 కోట్ల విలువైన బంగారం, వెండి వంటి విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు తెలంగాణలో ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న వాటి విలువ రూ.8.21 కోట్లు కాగా.. అందులో రూ.5.26 కోట్ల మేర నగదు, రూ.39 లక్షల మద్యం, రూ. 2.38 కోట్ల విలువ గల డ్రగ్స్, రూ.16 లక్షల విలువైన నగలు ఉన్నాయి. అధికారపార్టీపైనే ఆరోపణలు రాష్ట్రంలో విచ్చలవిడిగా నగదు పంపిణీలో అధికార టీడీపీపై పెద్దఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఎన్నికల్లో గెలవడానికి అధికారపార్టీ అన్ని అడ్డదారులను వెతుకుతోందని, పెద్దఎత్తున పట్టుబడుతున్న నగదు, మద్యం, చీరలు, సైకిళ్లు, క్రీడా వస్తువులే ఇందుకు నిదర్శనమని అంటున్నారు. నగదు పంపిణీకోసం జిల్లా సహకార బ్యాంకులు, ఆప్కాబ్లను వినియోగించుకుంటోందని, నోటిఫికేషన్ జారీ అయినప్పటి నుంచి ఈ బ్యాంకుల్లో జరుగుతున్న భారీ లావాదేవీల్ని పరిశీలిస్తే నిజాలు బయటికొస్తాయని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలోని 9 డీసీసీబీలు, ఆప్కాబ్‌ల మేనేజింగ్ కమిటీల కాలపరిమితి తీరిపోయినా మరో 6 నెలలపాటు పొడిగిస్తూ గత నెల 12న రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఎన్నికల్లో నగదు పంపిణీకోసమే వీటి కాలపరిమితి పొడిగించారంటూ బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేయడం గమనార్హం. ఇప్పటివరకు అధికారికంగా పట్టుకున్నదే రూ.103 కోట్లు ఉంటే.. దీనికి మూడు, నాలుగింతలు ఈపాటికే పంపిణీ అయి ఉంటుందని విపక్షాలు అభిప్రాయపడుతున్నాయి. పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది సహకారంతో పకడ్బందీగా నగదు, మద్యం పంపిణీ చేయడానికి తమకు అనుకూలురైన అధికారుల్ని ఎన్నికల ముందు అధికారపార్టీ నియమించుకుందని అవి ఆరోపిస్తున్నాయి. -
ఇంటెలిజెన్స్ డీజీపై వేటు
సాక్షి, అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీలో అధికార టీడీపీ సేవలో తరిస్తూ, విధి నిర్వహణలో అడ్డగోలుగా వ్యవహరిస్తున్న పోలీసు ఉన్నతాధికారులపై చర్యలు చేపట్టింది. ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై వేటు వేసింది. ఆయనతోపాటు వైఎస్సార్, శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలు రాహుల్‌దేవ్ శర్మ, వెంకటరత్నంలను కూడా బదిలీ చేసింది. సీఎం చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసమే రాష్ట్రంలో పలువురు పోలీసు అధికారులు పనిచేస్తున్నారంటూ ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పలుమార్లు చేసిన ఫిర్యాదులపై ఎన్నికల సంఘం స్పందించింది. తాజాగా సోమవారం వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి, పార్టీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘం ఫుల్‌బెంచ్‌కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదీ మంగళవారం రాత్రి మీడియాకు తెలియజేశారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేయడం, నిబంధనలకు విరుద్ధంగా పరికరాలను దుర్వినియోగం చేయడం వంటి అభియోగాల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. వేటు పడిన ఈ ముగ్గురు అధికారులు రాష్ట్రంలో 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికల విధులకు దూరంగా ఉండాలని ఆదేశించింది. పోలీస్ హెడ్‌క్వార్టర్‌కు రిపోర్టు చేయాలని ముగ్గురు అధికారులకు స్పష్టం చేసింది. సర్వం టీడీపీ సేవలోనే... ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఏబీ వెంకటేశ్వరరావు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి చంద్రబాబు స్వప్రయోజనాల కోసమే పని చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. తెలంగాణలో ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోవడంతో అప్పటి ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీగా ఉన్న ఏఆర్ అనూరాధను అకస్మాత్తుగా విధుల నుంచి తప్పించారు. ఆమెను హోంశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శిగా బదిలీ చేసి, విజయవాడ పోలీసు కమిషనర్‌గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావును ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నియమించారు. అప్పటి నుంచి ఆయన తన విధులను పక్కనపెట్టి, చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసమే పని చేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. నక్సలైట్లు, తీవ్రవాదులు, సంఘ విద్రోహశక్తుల కదలికలను కనిపెట్టడానికి ఉపయోగించాల్సిన సాంకేతిక పరికరాలను ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాపింగ్ చేయడానికి వాడుకుంటున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను టీడీపీలోకి తీసుకొచ్చేలా పార్టీ ఫిరాయింపులకు ఆయన బేరసారాలు జరిపారనే ఆరోపణలు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇంటెలిజెన్స్ విభాగంలో ప్రత్యేక నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకుని, టీడీపీ కోసం సేవలు అందించేలా చేశారనే విమర్శలు ఉన్నాయి. పదవీ విరమణ చేసిన యోగానంద్, మాధవరావు వంటి అధికారులను ఇంటెలిజెన్స్ ఓఎస్డీలుగా నియమించుకుని, కుల సమీకరణలకు తెరలేపారంటూ విమర్శలు వచ్చాయి. పలు కీలక అంశాల్లో ఇంటెలిజెన్స్ చీఫ్ వ్యవహారశైలి చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఏబీ వెంకటేశ్వరరావుపై ఎన్నికల సంఘం వేటు వేయడం గమనార్హం. వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో వైఫల్యం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో విఫలమైన వైఎస్సార్ జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మపై కూడా ఎన్నికల కమిషన్ వేటు వేసింది. వైఎస్సార్సీపీలో కీలకంగా వ్యవహరిస్తున్న వివేకానందరెడ్డి ఎన్నికల ముందు దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసులో రాజకీయ కుట్ర కోణం జోలికి పోకుండా పోలీసులు దర్యాప్తును తప్పుదోవ పట్టించారు. ప్రభుత్వ పెద్దలు, ఇంటెలిజెన్స్ చీఫ్ జోక్యం కారణంగా వైఎస్సార్సీపీపై, వైఎస్ కుటుంబ సభ్యులపై నెపం నెట్టే ప్రయత్నాలు జరిగాయి. పోలీసులు ఇదే దిశగా దర్యాప్తు చేపట్టి, అసలు కుట్ర కోణాన్ని వదిలేయడం పట్ల ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఎస్పీ రాహుల్‌దేవ్ వర్మపై వేటు వేసిన ఎన్నికల కమిషన్ ఆయనను పోలీస్ ప్రధాన కార్యాలయానికి సరెండర్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. రూ.5 కోట్లు వదిలేసినందుకే.. శ్రీకాకుళం జిల్లా ఎస్పీ వెంకటరత్నం అధికార టీడీపీకి కొమ్ము కాస్తున్నారనే ఫిర్యాదులతో ఎన్నికల కమిషన్ ఆయనపై వేటేసింది. కొద్ది రోజుల క్రితం శ్రీకాకుళం జిల్లాలోని టీడీపీ అభ్యర్థి కొండ్రు మురళి వాహనంలో తీసుకెళ్తున్న రూ.5 కోట్లను తనిఖీల సందర్భంగా అధికారులు పట్టుకున్నారు. ఇంటెలిజెన్స్ డీజీ ఆదేశాలతో ఆ డబ్బును వదిలేశారనే ఫిర్యాదుతో ఎస్పీ వెంకటరత్నంపై ఎన్నికల కమిషన్ వేటు వేసినట్లు సమాచారం. నాన్‌కేడర్ ఎస్పీగా పదోన్నతి పొందిన వెంకటరత్నంను ఇటీవలే శ్రీకాకుళం ఎస్పీగా నియమించారు. డీజీపీ అత్యవసర సమావేశం రాష్ట్రంలో ముగ్గురు పోలీసు అధికారులపై కేంద్ర ఎన్నికల కమిషన్ వేటు వేసిన నేపథ్యంలో డీజీపీ ఆర్పీ ఠాకూర్ మంగళవారం రాత్రి అత్యవసర సమావేశం నిర్వహించినట్టు తెలిసింది. ఆ ముగ్గురు అధికారుల స్థానాల్లో ఎవరిని నియమించాలనే దానిపై తర్జనభర్జన సాగినట్టు సమాచారం. -
ఏపీ తుది ఓటర్ల సంఖ్య 3,93,45,717
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తుది ఓటర్ల సంఖ్య 3,93,45,717 అని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఏప్రిల్ 11న 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలకు జరిగే ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు ఉన్న ఓటర్ల జాబితాను సోమవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది ప్రకటించారు. ఈ నెల 11న ఓటర్ల జాబితా ప్రకటించామని, ఆ తర్వాత ఇప్పటి వరకు కొత్తగా 24,12,626 మంది ఓటర్లు చేరారని, అదే సమయంలో 1,41,823 ఓటర్లను తొలగించినట్లు ఆయన ప్రకటించారు. తుది జాబితా అనంతరం పురుషుల కన్నా మహిళా ఓటర్లు 4,17,082 మంది అధికంగా ఉన్నారు. రాష్ట్రంలో పురుష ఓటర్లు 1,94,62,339 మంది కాగా మహిళా ఓటర్లు 1,98,79,421 ఉన్నారు. ట్రాంజెండర్స్ 3,957 మంది ఉన్నారు. -
ముగిసిన నామినేషన్ల దాఖలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మొత్తం 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన నామినేషన్ల దాఖలు ప్రక్రియ సోమవారంతో ముగిసిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఏ నియోజకవర్గంలో ఎన్ని నామినేషన్లు దాఖలయ్యాయనే పూర్తి వివరాలు మంగళవారం తెలియజేస్తామని ఆయన మీడియాకు వివరించారు. శుక్రవారం నాటికి అసెంబ్లీకి 1,419, లోక్‌సభకు 199 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల పరిశీలన మంగళవారం నుంచి ప్రారంభమవుతుందని, ఎన్నికల ప్రత్యేక పరిశీలకుల పర్యవేక్షణలో ఇది జరుగుతుందని, ఈ మొత్తం ప్రక్రియను వీడియో రికార్డింగ్ కూడా చేయనున్నట్లు ద్వివేదీ తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు మార్చి 28గా తెలిపారు. గత శుక్రవారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం జరగనుందని చెప్పారు. 788 మందిపై ఎఫ్ఐఆర్లు కాగా, ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన వారిపై ఇప్పటివరకు 788 కేసులు నమోదు చేసినట్లు దివ్వేది తెలిపారు. అలాగే, ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రూ.55 కోట్ల నగదు, 91 కేజీల బంగారం, 231 కేజీల వెండి, 60 డైమండ్లు, 125 వాహనాలు, రూ.12 కోట్ల విలువైన 2.5 లక్షల లీటర్ల మద్యం, 1,000 కేజీల గంజాయి ఇతర వస్తువులను సీజ్ చేసినట్లు తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న పోస్టింగులపై ఇప్పటివరకు 367 నోటీసులు జారీచేసినట్లు తెలిపారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు సంబంధించి నిర్మాత వచ్చి వివరణ ఇచ్చి వెళ్లారని, దీనిపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఎన్నికల సంఘం న్యాయ విభాగంతో చర్చించి ఈ సినిమాపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. -
లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలపై తొలగని ఉత్కంఠ
సాక్షి, అమరావతి : రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై వచ్చిన ఫిర్యాదులను ఎన్నికల సంఘం పరిశీలిస్తోంది. సినిమా విషయంలో ఎన్నికల సంఘం నిబంధనల మేరకు వ్యవహరిస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది వెల్లడించారు.పరిశీలన తర్వాత తుది నిర్ణయం వెలువరిస్తామని ఆయన స్పష్టం చేశారు. మార్చి 25న ఓటర్ల తుది జాబితా ఈనెల 25న ఓటర్ల తుది జాబితా విడుదల చేస్తామని గోపాలకృష్ణ ద్వివేది పేర్కొన్నారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు చోటుచేసుకోకుండా చూశామని, కొత్త ఓట్ల చేర్పుపై దుష్ప్రచారం చేయవద్దని కోరారు.రాష్ట్రంలో ఎవరి ఓటు తొలగించలేదని, దరఖాస్తు చేసిన వారిలో అర్హులైన వారందరికి ఓటు హక్కు కల్పించామని చెప్పారు. కాగా, రాష్ట్రానికి 75మంది ఎన్నికల పరిశీలకులను నియమించామని, ప్రతి రెండు లోక్‌సభ నియోజక వర్గాలకు ఓ పోలీస్ పరిశీలకుడు., ఓ సాధారణ పరిశీలకుడు,ప్రతి మూడు అసెంబ్లీ నియోజక వర్గాలకు ఓ సాధారణ పరిశీలకులు పర్యవేక్షిస్తారని చెప్పారు.రాజకీయ పార్టీలు, ప్రజలు పరిశీలకులకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చన్నారు. -
సోషల్ మీడియా పోస్టింగ్‌లపై ఈసీ సీరియస్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సోషల్ మీడియాలో విద్వేషాలు రెచ్చగొట్టేలా చేసిన ప్రకటనలపై అన్ని రాజకీయ పార్టీలకూ నోటీసులు జారీ చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాల కృష్ణ ద్వివేది తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈసీ జారీ చేసిన నోటీసులపై వారి వద్ద నుంచి వచ్చిన సమాధానాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. కుల మతాలపై విద్వేషపూరితమైన ప్రకటనలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఐపీసీ సెక్షన్ 153 ఏ, ప్రజాప్రతినిధ్య చట్టం సెక్షన్ 125 ప్రకారం కేసులు నమోదు చేస్తామన్నారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల అభ్యర్ధులు ఇచ్చే ఫాం బీపై అభ్యర్ధులు ఏ పెన్నుతో సంతకం చేసినా అభ్యంతరం లేదని చెప్పారు. రిటర్నింగ్ అధికారులకు ఈ విషయంలో కొంత గందరగోళముందని అన్నారు. నామినేషన్లను ఆమోదించటంలో రిటర్నింగ్ అధికారే కీలకం అని తెలిపారు. కానీ రిటర్నింగ్ అధికారి వద్ద తప్పుదొర్లితే నేరుగా హైకోర్టును ఆశ్రయించాల్సిందేనని చెప్పారు. ఎన్నికల నేపథ్యంలో సర్వేలు, వాటి విశ్లేషణల వెల్లడి ఎన్నికల పరంగా తప్పుకాదు. సోషల్ మీడియాలో నకిలీ పోస్టింగులు పెట్టి తప్పుదారి పట్టించేలా వ్యవహరిస్తే ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. సీ.విజిల్ యాప్ ద్వారా వస్తున్న ఫిర్యాదులు 50 శాతం మేర నకిలీవేనన్నారు. జనవరి 11 తుది ఎన్నికల జాబితా నుంచి ఈ రోజు వరకూ 23 లక్షల ఓట్లు పెరిగాయని అన్నారు. ఉత్తర ప్రదేశ్ తరహా ప్రయోగం ఇక్కడి రాజకీయ పరిస్థితుల కారణంగా ఫలితాలు ఇవ్వవని బావిస్తున్నామన్నారు. పోలింగ్ సమయంలో సాంకేతికంగా ఈవీఎంలకు వచ్చే ఇబ్బందులను పరిష్కరించేందుకు 600 మంది నిపుణులు ప్రతీ నియోజకవర్గంలోనూ ఓ సాంకేతిక నిపుణుడిని అందుబాటులో ఉంచుతామని గోపాల కృష్ణ ద్వివేది తెలిపారు. -
ఏపీ ప్రధాన ఎన్నికల అధికారిని కలిసిన సునీత
-
ఏపీ సీఈవోకు సునీతా రెడ్డి ఫిర్యాదు
సాక్షి, అమరావతి : దివంగత నేత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీతా రెడ్డి గురువారం ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ద్వివేదిని కలిశారు. సీఈవో గోపాలకృష్ణ ద్వివేదిని సచివాలయంలో కలిసిన ఆమె...తన తండ్రి హత్యకేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని ఫిర్యాదు చేశారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కేసు దర్యాప్తును ప్రభావితం చేసేలా వ్యాఖ్యానించారని సునీతా రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎం వ్యాఖ్యలు కేసు దర్యాప్తు చేస్తున్న విచారణ అధికారులను ప్రభావితం చేసేలా ఉన్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. తన తండ్రి హత్యకేసును నిష్పక్షపాతంగా విచారణ చేసి అసలు దోషులకు శిక్షపడేలా చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య తర్వాత కేసును పక్కదారి పట్టించేలా టీడీపీ నేతల స్టేట్మెంట్లు ఉన్న పేపర్ కటింగ్స్‌ను సునీతారెడ్డి ...సీఈవోకు అందచేశారు. సునీతారెడ్డి తన భర్త రాజశేఖరరెడ్డితో కలిసి ఏపీ సచివాలయానికి వచ్చారు. చదవండి...(పుట్టెడు దుఃఖంలో ఉన్న మాపై తప్పుడు వార్తలా?) అనంతరం సునీతారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘సిట్’పై ప్రభావం చూపేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు ఉన్నాయి. దర్యాప్తు సంస్థపై సీఎం ఒత్తిడి ఉంటే కేసు తప్పుదారి పట్టే అవకాశం ఉంది. దర్యాప్తు సజావుగా జరిగేలా చర్యలు చేపట్టాలని, నిన్న మీడియాతో తాను ఏం మాట్లాడానో అవే విషయాలు ఎన్నికల ప్రధాన అధికారి దృష్టికి తీసుకు వెళ్లాను. ఈ ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల కమిషన్‌కు నివేదిక ఇస్తామని సీఈవో తెలిపారు.’ అని పేర్కొన్నారు. -
పోలీసులా.. లేక టీడీపీ కార్యకర్తలా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత చిన్నపరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బుధవారం ఆయన ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలిసి పోలీసుల తీరుపై ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో పోలీసులు క్రమశిక్షణ తప్పుతున్నారని అన్నారు. ఏపీ పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా ప్రవర్తిస్తూ సీ విజల్ యాప్ ఫిర్యాదులకు అడ్డుతగులుతున్నారని మండిపడ్డారు. పోలీసులు డబ్బులు, మందు, పాంప్లెట్స్ ఉన్న కారుని పట్టుకున్నారని జనం గుమిగూడారు. అక్కడికి తాము వెళ్లి చూడగా కారు నెంబర్ TN 20 BY 9279 లో టీడీపీ అధినేత చంద్రబాబు బొమ్మ ఉన్న అట్టపెట్టి ఉంది. పోలీసులు ఎవరిని దగ్గరకు రానీయకుండా పంపించేశారని తెలిపారు. ఎలక్షన్ కమిషన్ సామాన్యుడికి అవకాశమిచ్చిన సీ విజిల్ ద్వారా ఫిర్యాదు చేయడానికి తాము వీడియో తీయడానికి ప్రయత్నించగా వీడియో తీయకుండా పోలీసులు అడ్డుకొన్నారని తెలిపారు. పోలీసులు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ.. ఏదో మిస్ యూజ్ చేయబోతున్నారని అని తాము సీ విజిల్ లో ఫిర్యాదుకు ప్రయత్నించామని, వారు తమపై ఐపీసీ 353 ప్రకారం కేసు పెట్టి ఇంటికి రాకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చిన్నపరెడ్డి ఆరోపించారు. -
నియమావళి ఉల్లంఘించే అధికారులపై వేటు
సాక్షి, అమరావతి: ఎవరైనా అధికారులు ఎన్నికల నియమావళిని అతిక్రమిస్తే ఉద్యోగాల నుంచి తొలగించడమే కాకుండా చట్టపరంగా కేసు నమోదు చేస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది హెచ్చరించారు. ఎన్నికల నియమావళి పార్టీలకు మాత్రమే కాదని, ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ అధికారులందరికీ వర్తిస్తుందని స్పష్టం చేశారు. సచివాలయంలోని పబ్లిసిటీ సెల్లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రంలో శాంతి భద్రతలు సరిగా లేకపోతే ఎన్నికలు ప్రశాంతంగా జరపలేమని, ఇందుకు రాజకీయ పార్టీలన్నీ సహకరించాలని కోరారు. ఎన్నికల్లో స్వేచ్ఛగా, నిర్భయంగా ప్రజలు ఓటు హక్కు వినియోగించేలా అన్ని పార్టీలూ సహకరించాలని కోరారు. పోటీ చేసే అభ్యర్థుల సోషల్ మీడియా ఖాతాలపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి రాష్ట్రంలో మీడియా సర్టిఫికేషన్, మానిటరింగ్ కమిటీ (ఎంసీసీ)పనిచేస్తోందన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాల్లో ప్రకటనలు, పెయిడ్ ఆర్టికల్స్‌పై నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. సోషల్ మీడియాకు సంబంధించి వివిధ రాజకీయ పార్టీలకు ఇప్పటికే 89 నోటీసులు జారీ చేశామన్నారు. ఇందులో భాగంగానే టీడీపీకి 48, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 30, జనసేన పార్టీకి 11 నోటీసులు ఇచ్చామని చెప్పారు. నోటీసులు ఇచ్చినంత మాత్రాన పార్టీలు తప్పు చేసినట్లు కాదని, వారిచ్చే సమాధానాలకు సంతృప్తి కలిగితే ఆ పార్టీలపై ఎటువంటి చర్యలూ ఉండవన్నారు. వారిచ్చే సమాధానం సంతృప్తి కలిగించకపోతే, అభ్యర్థులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. నామినేషన్ల పర్వం ముగిసిన నాటి నుంచి అభ్యర్థుల వారీగా సోషల్ మీడియా ఖాతాలను పర్యవేక్షిస్తామన్నారు. అభ్యర్థుల సోషల్ మీడియా ఖాతాల్లో వచ్చే కథనాలు, ప్రకటనలపై ముందుగా నోటీసులిస్తామన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా, ఓటర్ల ప్రలోభాలకు గురిచేసేలా పోస్టింగ్‌లు పెట్టిన వారిని ముందుగా హెచ్చరిస్తామన్నారు. అయినప్పటికీ మార్పు రాకపోతే జరిమానా విధించడం లేదా 3 ఏళ్ల జైలు శిక్ష విధిస్తామని, అవసరమైతే ఈ రెండింటినీ కూడా అమలు చేస్తామని ద్వివేది హెచ్చరించారు. రాష్ట్రంలో 3,635 ‘సీ విజిల్స్’ బృందాలు.. రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో 3,635 సీ విజిల్స్ బృందాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. సీ విజిల్స్ ద్వారా ఇప్పటి వరకు 1,304 ఫిర్యాదులు నమోదయ్యాయన్నారు. ముఖ్యంగా పోస్టర్లు, బ్యానర్లు, గిఫ్టులు, డబ్బు, మద్యం పంపిణీ, మత, కులపరమైన ప్రచారాలు, ప్రచార సభలకు జనాల తరలింపు, లౌడ్ స్పీకర్ల వాడకం, వంటి వాటిపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నట్లు తెలిపారు. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌కు సంబంధించి అధికారులకు ఇప్పటికే శిక్షణ ఇచ్చామన్నారు. పూర్తి స్థాయిలో పర్యవేక్షణకు రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ఎంసీసీ కమిటీలు ఏర్పాటు చేశామని ద్వివేది చెప్పారు. తనిఖీల్లో భారీగా నగదు సీజ్.. రాష్ట్రంలో పలు చోట్ల చేపట్టిన సోదాల్లో భారీగా నగదు, మద్యాన్ని పట్టుకున్నట్లు దివ్వేది తెలిపారు. పోలీస్, కమర్షియల్ టాక్స్, ఇన్కమ్ టాక్స్, ఎక్సైజ్, తదితర శాఖల అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారన్నారు. పోలీసుల ఆధ్వర్యంలోని ఫ్లయింగ్ స్క్వాడ్లు రూ. 2,39,89,135 సీజ్ చేసి 8.26 కిలోల బంగారం, 22 కిలోల వెండి, 1,043 మద్యం బాటిళ్లు, రెండు వాహనాలు, 33 కేజీల గంజాయి, 324 చీరలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. పోలీస్ స్టాటిక్ సర్వేలెన్స్ టీంల ద్వారా రూ.7,51,30,981, 128.16 కేజీల బంగారం, 18.46 కేజీల వెండి స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇన్ కమ్ ట్యాక్స్ అధికారుల ద్వారా రూ.2,69,35,920 పట్టుకున్నట్లు తెలిపారు. ఎక్సైజ్ అధికారులు రూ.7.35 కోట్ల విలువ చేసే 2 లక్షల లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారన్నారు. ఏప్రిల్ 5వ తేదీ లోగా కొత్త ఓటర్లకు గుర్తింపు కార్డులు.. కొత్త ఓటర్లకు ఏప్రిల్ 5వ తేదీలోగా గుర్తింపు కార్డులు ఉచితంగా ఇస్తామని ద్వివేది చెప్పారు. ఈ నెల 15వ తేదీ నాటికి రాష్ట్రంలో కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమం ముగిసిందన్నారు. జనవరి 11వ తేదీ నుంచి 15 లక్షల మంది ఓటర్లు నమోదయ్యారని తెలిపారు. కొత్తగా మరో 10 లక్షలు పెరిగే అవకాశం ఉందన్నారు. ఓటర్ల నమోదు కోసం వచ్చిన ఫారం–6 ద్వారా వచ్చిన 10,62,441 దరఖాస్తులు ఇంకా పరిశీలించాల్సి ఉందని తెలిపారు. వాటిని కూడా ఈ నెల 25వ తేదీలోగా పరిశీలన పూర్తి చేస్తామని చెప్పారు. 1.55 లక్షల ఓట్ల తొలగింపు.. రాష్ట్రంలో 1,55,099 డెత్, డూప్లికేట్ ఓటర్లు ఉన్నట్లు గుర్తించి వాటిని జాబితా నుంచి తొలగించామని ద్వివేది వెల్లడించారు. మార్చి 10వ తేదీ తరువాత ఓటర్ల లిస్టులో పేర్ల తొలగింపు నిలిపేశామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3.84 కోట్ల ఓటర్లున్నారని, ఆ సంఖ్య 3.95 కోట్లకు చేరే అవకాశం ఉందని చెప్పారు. ఈ నెల 23,24 తేదీలు సెలవు రోజులైనందున ఆ తేదీల్లో మాత్రమే నామినేషన్ల స్వీకరణ ఉండదని, ఈ నెల 21వ తేదీన నామినేషన్లు స్వీకరిస్తామని ద్వివేది తెలిపారు. అడిషనల్ సీఈవోలు వివేక్ యాదవ్, సుజాత శర్మ, రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ జాయింట్ డైరెక్టర్ పి.కిరణ్‌కుమార్ పాల్గొన్నారు. -
నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
-
నేటి నుంచి నామినేషన్ల పర్వం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్ల స్వీకార పర్వం ప్రారంభమవుతుంది. ఇందుకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం నోటిఫికేషన్‌ను జారీ చేయనుంది. నోటిఫికేషన్ జారీ చేసిన రోజు నుంచే అంటే సోమవారం నుంచే నామినేషన్లు స్వీకరించే ప్రక్రియ మొదలవుతుంది. ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. కాగా, నామినేషన్లను ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయా నియోజక వర్గాల రిటర్నింగ్ అధికారులు స్వీకరిస్తారు. సెలవు రోజుల్లో నామినేషన్ల స్వీకరణ ఉండదని ఈసీ స్పష్టం చేసింది. 26వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఈ నెల 28. పోలింగ్ ఏప్రిల్ 11వ తేదీన జరుగుతుంది. నామినేషన్ల దాఖలు సందర్భంగా అభ్యర్థులు ఆ పత్రాలను జాగ్రత్తగా నింపాల్సి ఉంటుంది. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు అన్ని వివరాల్ని నామినేషన్ పత్రంలో పేర్కొనాలి. అలాగే ఎన్నికల అఫిడవిట్ కూడా చాలా కీలకం కానుంది. ఎన్నికల అఫిడవిట్లో అభ్యర్థులపై గల అన్ని రకాల కేసులతోపాటు ఆస్తుల వివరాలను పేర్కొనాలి. ఇందులో ఎటువంటి పొరపాట్లు దొర్లినా నామినేషన్లు తిరస్కరణకు గురవుతాయి. ఎన్నికల వ్యయం లెక్కింపు ప్రారంభం.. నామినేషన్ల దాఖలు తేదీ నుంచే అభ్యర్థుల ఎన్నికల వ్యయం లెక్కింపు ప్రారంభమవుతుంది. ఇందుకుగాను అభ్యర్థులు ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాను తెరవాల్సి ఉంది. ఆ బ్యాంకు ఖాతా నుంచే విరాళాల స్వీకరణ, ఎన్నికల వ్యయం చేయాల్సి ఉంటుంది. రూ.పదివేలలోపు మాత్రమే నగదు స్వీకరణ, నగదు వ్యయాన్ని అనుమతిస్తారు. రూ.పదివేలు దాటి విరాళాల స్వీకరణ చెక్కుల రూపంలో లేదా ఆన్లైన్లోనే చేయాలి. అలాగే రూ.పదివేలకుపైబడి ఎన్నికల వ్యయం చేయాలంటే చెక్కు రూపంలో లేదా ఆన్లైన్లోనే చేయాలి. అభ్యర్థుల విరాళాల స్వీకరణ, ఎన్నికల వ్యయానికి సంబంధించి ప్రతీ అభ్యర్థి తెలుపు, గులాబీ, పసుపు పేపర్లతో కూడిన మూడు రిజిస్టర్లను నిర్వహించాలి. వీటిని ఎన్నికల వ్యయ పరిశీలకులు తనిఖీలు చేస్తూ ఉంటారు. ఎన్నికల నిర్వహణకు 3 లక్షలమంది సిబ్బంది.. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకోసం మొత్తం 45,920 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. అలాగే ఎన్నికల నిర్వహణకు మూడు లక్షల మంది సిబ్బందిని వినియోగిస్తోంది. అదే సమయంలో భద్రతా చర్యలకోసం 350 ప్లటూన్ల కేంద్ర సాయుధ బలగాలను మోహరించనుంది. ఇదిలా ఉంటే.. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన రోజు నాటికి రాష్ట్రంలో 3.82 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. అయితే ఓటర్ల సంఖ్య ఇంకా పెరగనుంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి ఈ నెల 15వ తేదీ వరకు కొత్తగా ఓటర్ల నమోదుకు దరఖాస్తులను స్వీకరించారు. వీరిలో అర్హులందరినీ ఈ నెల 26వ తేదీలోగా ఓటర్ల జాబితాలోకి తీసుకొస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. మంచి ముహూర్తాల కోసం అన్వేషణ.. ఇదిలా ఉండగా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతున్న నేపథ్యంలో బరిలోకి దిగుతున్న ఆయా పార్టీల అభ్యర్థులు మంచి ముహూర్తాల కోసం అన్వేషిస్తున్నారు. సోమవారం 18వ తేదీ ద్వాదశి, 22వ తేదీ విదియ, 23వ తేదీ తదియ, 25వ తేదీ పంచమి మంచి రోజులుగా భావిస్తూ ఈ తేదీల్లో నామినేషన్లు వేయడానికి అత్యధికులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి: ద్వివేది రాష్ట్రంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యతో పాటు రాయలసీమలో జరిగిన పలు సంఘటనలను దృష్టిలో పెట్టుకుని ఈ మేరకు నిర్ణయించినట్లు చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, డీజీపీలు ప్రతిరోజు పంపుతున్న నివేదికలను ఎప్పటికప్పుడు కేంద్ర ఎన్నికల సంఘానికి పంపుతున్నట్లు ఆయన తెలిపారు. ఇకపై రాష్ట్రంలో ఎలాంటి చిన్న ఘటన కూడా జరగకుండా పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటుందని, శాంతిభద్రతలపై రాజీపడొద్దంటూ రాష్ట్ర పోలీస్ శాఖను ఆదేశించినట్లు ద్వివేదీ తెలిపారు. ఇప్పటికే కేంద్రం నుండి 90 కంపెనీల పారామిలటరీ బలగాలు రాష్ట్రానికి వచ్చాయన్నారు. సాధారణ ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థులు.. రాజకీయ పార్టీలు చేసే ఖర్చులను పరిశీలించడానికి కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన 102 మంది వ్యయ పరిశీలకులు మార్చి 18 సోమవారం రాష్ట్రానికి వస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలంటూ ద్వివేది కోరారు. 18 నుంచి సీ–విజిల్ యాప్ అందుబాటులోకి.. ఇదిలా ఉంటే.. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకురావడానికి రూపొందించిన సీ–విజిల్ యాప్ సోమవారం నుంచి అందుబాటులోకి వస్తుందని అదనపు ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. ఈ సంఘటనలను ఫొటోలు, వీడియోలు తీసి ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. అనుమతుల్లేని ప్రచారానికి సంబంధించి పోస్టర్ల తొలగింపు తదితర అంశాలను సంబంధిత వ్యక్తులకు తెలియజేయాలని, వారు స్పందించకపోతే ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల ఆధ్వర్యంలో వాటిని తొలగించి అపరాధ రుసుమును వసూలు చేస్తామన్నారు. ఎటువంటి ఫిర్యాదు వచ్చినా పరిశీలన అనంతరమే చర్యలను తీసుకుంటామన్నారు. ఫిర్యాదు అందిన 100 నిమిషాల్లోపే స్పందించి, క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టాల్సి వుంటుందన్నారు. -
‘లక్ష్మీస్ ఎన్టీఆర్‌పై ఫిర్యాదులు.. చర్యలు తీసుకుంటాం’
సాక్షి, అమరావతి : ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 18నుంచి 25 వరకు కొనసాగుతుందని ఎన్నికల ప్రధానాధికారి గోపాలక్రిష్ణ ద్వివేది వెల్లడించారు. ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య అనంతరం శాంతి భద్రతలపై దృష్టిసారించామన్నారు. రాయలసీమలో పలు సంఘటనలు జరిగాయని తెలిపారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, డీజీపీలు ప్రతిరోజు శాంతి భద్రతలపై నివేదికలు పంపుతున్నారని వెల్లడించారు. రెండుమూడు జిల్లాల్లో చోటుచేసుకుంటున్న సంఘటనలపై అధికారులను అప్రమత్తం చేశామన్నారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై ఫిర్యాదులు వచ్చాయని, పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎన్నికల విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్‌పై శిక్షణ ఇచ్చి..బ్యాలెట్ పేపర్లు అందజేస్తామన్నారు. -
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదల ఆపాలి
సాక్షి, అమరావతి : ఎన్టీఆర్ జీవితంలోని కీలక సంఘటనల ఆధారంగా సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాని నిలిపివేయాలని కోరుతూ టీడీపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, సాధినేని యామిని, గౌతు శిరిషా, సతీష్‌లు ప్రధాన ఎన్నికల అధికారి గోపాల కృష్ణ ద్వివేదికి కలిసి సినిమా విడుదలను ఆపాలని కోరారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. ఈ సినిమాలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాత్రను నెగెటివ్‌గా చూపించారన్నారు. (‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పై ఈసీకి ఫిర్యాదు) ఎన్నికల వేళ ఓటర్లపై ఈ సినిమా ప్రభావం చూపుతుందని అభ్యంతరం తెలిపారు. చంద్రబాబు ప్రతిష్టతను దిగజార్చేలా సినిమా ట్రైలర్ ఉందన్నారు. ఎన్నికలల్లో చంద్రబాబును దెబ్బతీసేలా ఉన్న ఈ సినిమా విడుదలను ఆపాలని డిమాండ్ చేశారు. రామ్‌గోపాల్ వర్మ విడుదల చేసిన ట్రైలర్ వీడియోని సీఈఓకి ఇచ్చామని, ఆయన పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని చెప్పారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే ఎన్నో వివాదాలు కేంద్ర బిందువైంది. వర్మ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుకున్న సమయానికి వెనక్కి తగ్గేది లేదంటూ మార్చి 22న విడుదల అని ప్రకటించేశాడు. తాజాగా టీడీపీ నేతలు చేసిన ఫిర్యాదుపై ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. చదవండి : టీడీపీ ఫిర్యాదుపై స్పందించిన లక్ష్మీ పార్వతి -
నాలుగు రోజుల్లో రూ.30.76కోట్లు స్వాధీనం
సాక్షి, అమరావతి/నెట్వర్క్: ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాలుగు రోజుల్లోనే రాష్ట్రంలో 30,76,50,984 నగదు, 17.940 కేజీల బంగారాన్ని తనిఖీ బృందాలు స్వాధీనం చేసుకున్నాయి. అనుమానం వస్తే పది వేల రూపాయలను కూడా స్వాధీనం చేసుకుంటామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదీ బుధవారం ప్రకటించారు. ఎన్నికల నియమావళిని కఠినంగా అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల నియమావళిని అమలు చేయడానికి 6,600 ఫ్లైయింగ్ స్క్వాడ్స్, 6,160 స్టాటిక్ సర్వలెన్స్ బృందాలు, వీడియో సర్వలెన్స్ బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సరిహద్దుల్లో 31 ఎక్సైజ్ చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామని, అలాగే 46 తాత్కాలిక చెక్ పోస్టులను ఏర్పాటు చేశామని, 18 సరిహద్దు మొబైల్ పార్టీ చెక్‌పోస్టులను , 161 మొబైల్ బృందాలను ఏర్పాటు చేశామని ఆయన వివరించారు. రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశామని, సోషల్ మీడియా వెబ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాను పర్యవేక్షిస్తున్నామని ఆయన తెలిపారు. పెదకాకాని వద్ద రూ.67 లక్షలు.. ఎన్నికల నియమావళి నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా బుధవారం చేసిన వాహనాల తనిఖీల్లో నోట్ల కట్టలతో పాటు బంగారం, వెండి అభరణాలు సైతం పట్టుబడ్డాయి. గుంటూరు జిల్లా పెదకాకాని వద్ద పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో రూ.67 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ మొగల్రాజపురం నుంచి ఏటీఎం సెంటర్లలో నగదు నింపేందుకు గుంటూరు వెళుతున్న వాహనాన్ని తనిఖీ చేశారు. అందులో ఉన్న రూ.63 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నంబూరు నుంచి వింతా శ్రీనివాసరెడ్డి స్కూటీలో రూ.3 లక్షలు పట్టుకున్నారు. గుంటూరు జిల్లా తాడికొండలో తనిఖీలు చేస్తుండగా పట్టుబడిన నగదు విశాఖలో రూ.18.51లక్షలు.. సరైన పత్రాలు లేని రూ.18.51లక్షలను విశాఖ ఎయిర్పోర్ట్ పోలీసులు స్థానిక ఆర్అండ్బీ జంక్షన్ ఉడా లేఅవుట్ జంక్షన్ వద్ద పట్టుకున్నారు. ద్వారాకానగర్ నుంచి మర్రిపాలెం ఉడా లేఅవుట్‌కు వెళుతున్న విజయభాస్కర్ అనే వ్యక్తి ఏపీ31 సీఎమ్ 8559 నంబర్ గల సిఫ్ట్ డిజైర్ కారులో రూ18.51లక్షలు చిన్నబ్యాగులో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. తాను ఎస్బీసీ సినిమా సంస్థలో మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నానని, తమ సంస్థకు మూడు జిల్లాల్లో 12 సినిమా హాళ్లు ఉన్నాయని విజయభాస్కర్ చెబుతున్నారు. తాడికొండలో రూ.9 లక్షలు.. గుంటూరు జిల్లా తాడికొండలో హైదరాబాద్ యల్లారెడ్డిగూడకు చెందిన కళ్యాణ్ అనే వ్యక్తి కారు నుంచి రూ.9 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదుకు సంబంధించిన డాక్యుమెంట్లను చూపించడంతో వదిలేశారు. రేపల్లె మండలంలో.. రేపల్లె మండలంలోని శిరిపూడి గ్రామంలో శ్రీకాంత్ అనే వ్యక్తి వద్ద నుంచి రూ.3.08 లక్షలు స్వాధీనం చేసుకుని ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులకు అప్పగించారు. ఆధారాలు సమర్పించడంతో నగదును తిరిగి ఇచ్చేశారు. 3.563 కేజీల బంగారం సీజ్.. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండల పరిధిలోని బోయపాలెం వద్ద మంగళవారం అర్ధరాత్రి రెండు ప్రైవేట్ జ్యూయలరీ సంస్థలకు చెందిన 3.563 కేజీల బంగారాన్ని ముగ్గురు వ్యక్తులు ఓ వాహనంలో తిరుపతి నుంచి విజయవాడకు తరలిస్తున్నారు. వారి వద్ద ఉన్న పత్రాలు అనుమానాస్పదంగా ఉండడంతో బంగారాన్ని సీజ్ చేశారు. బిల్లుల్లేని బంగారం.. గుంటూరు జిల్లా తెనాలి మారీసుపేటకు చెందిన బెజవాడ హరి బిల్లులు లేకుండా తీసుకొస్తున్న 800 గ్రాముల బంగారాన్ని పోలీసులు స్వాధీన పర్చుకున్నారు. ప్రస్తుతం నిందితుడు తెనాలి వన్‌టౌన్ పోలీసుల అదుపులో ఉన్నాడు. 22 కిలోల వెండి.. అనంతపురం జిల్లా మడకశిర మండలంలోని యూ.రంగాపురం చెక్‌పోస్ట్ వద్ద బెంగళూరు నుంచి పావగడ వెళ్తున్న ఓ కారును తనిఖీ చేసి 22 కిలోల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.7.47 లక్షలపైనే ఉంటుందని పోలీసులు తెలిపారు. -
ఎన్నికల తాయిలాలపై నిఘా పెంచండి
సాక్షి, అమరావతి: ‘‘గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో మద్యం సరఫరా, నగదు పంపిణీ, బహుమతుల రూపంలో వివిధ వస్తువులను ఇవ్వడం ద్వారా ఓటర్లను ప్రభావితం చేసే అవకాశమున్నట్టు గుర్తించాం. వీటిని నియంత్రించే విధంగా పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయండి’’ అని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో రాష్ట్ర స్థాయి నోడల్ అధికారులతో ఎన్నికల నిఘాపై ద్వివేది సమీక్ష నిర్వహించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు లేకుండా సజావుగా ఎన్నికలు నిర్వహించేలా అన్ని శాఖలు సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు. మద్యం, నగదుకు సంబంధించి అత్యంత ప్రభావితం చేసే రాష్ట్రాల్లో ఒకటిగా ఏపీని కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించిందన్నారు. ఈ నేపథ్యంలో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తూ రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రభావితం చేసే ప్రతీ విషయాన్నీ తీవ్రంగా పరిగణించాలన్నారు. వివిధ శాఖలు దాడులు చేపట్టే సమయంలో పోలీసుల సహకారాన్ని తీసుకోవాలని సూచించారు. మద్యం కొనుగోళ్లు, అమ్మకాలతోపాటు భారీస్థాయిలో లావాదేవీలు నిర్వహిస్తున్నవారిపై నిఘా పెట్టాలన్నారు. వీటికి అడ్డుకట్ట వేయడానికి ఈ సీజన్లో గడిచిన ఐదేళ్లలో సాధారణంగా జరిగే కొనుగోళ్లు, అమ్మకాలపై నివేదికలను రూపొందించుకుని వీటి ఆధారంగా నిఘా పెంచాలని సూచించారు. అనుమానాస్పద కదలికలుంటే డేగ కన్ను వేయాలని కోరారు. సమావేశంలో అదనపు సీఈవో వివేక్ యాదవ్, జాయింట్ సీఈవో డి.మార్కండేయులు, అదనపు డీజీ ఐ.రవిశంకర్, రాష్ట్ర పోలీసు అధికారులు కె.వి.వి.గోపాలరావు, సీహెచ్ శ్రీకాంత్, ఎన్.ఎస్.జె.లక్ష్మీ, రాష్ట్ర ఎక్సైజ్ అధికారి కె.ఎల్.భాస్కర్, కమర్షియల్ ట్యాక్స్ అధికారి మధుబాబు, రవాణా శాఖ అధికారి ఎమ్.పురేంద్ర, ఎయిర్ పోర్ట్ అథారిటీ అధికారి ఎమ్.లక్ష్మీకాంతరెడ్డి, ఐటీ శాఖ అధికారి కృష్ణంనాయుడు తదితరులు పాల్గొన్నారు. నలుగురితో మీడియా కమిటీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ వివిధ పత్రికలు, మాధ్యమాలు, సోషల్ మీడియాలో వచ్చే వార్తల పరిశీలనకోసం నలుగురు సభ్యులతో రాష్ట్ర స్థాయి మీడియా సర్టిఫికేషన్, పర్యవేక్షణ కమిటీని రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. కమిటీకి చైర్మన్¬గా అదనపు సీఈవో వివేక్‌యాదవ్, సభ్యులుగా జాయింట్ సీఈవో డి. మార్కండేయులు, దూరదర్శన్ డైరెక్టర్ డి.సురేష్‌కుమార్, సమాచార శాఖ జాయింట్ డైరెక్టర్ పి.కిరణ్‌కుమార్¬లను నియమించారు. సహాయకులుగా కందుల రమేష్, విజయకుమార్‌లు వ్యవహరిస్తారు. వీరిద్దరూ వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలను పరిశీలించి కమిటీకి నివేదిస్తారు. రాష్ట్ర స్థాయిలో చేపట్టే కార్యక్రమాల అనుమతులకోసం రాష్ట్ర స్థాయి ఎంసీఎంసీ కమిటీకి రాజకీయ పార్టీలు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ద్వివేది ఈ సందర్భంగా తెలిపారు. సాధారణంగా జిల్లా స్థాయి కమిటీ ఆధ్వర్యంలో అనుమతులను జారీచేస్తుందని, జిల్లాస్థాయి పరిధిలోకి రానివి రాష్ట్ర స్థాయి కమిటీ పరిశీలిస్తుందని చెప్పారు. ప్రచార అనుమతులకోసం న్యూ సువిధ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. -
ఓటు ఉందో లేదో చూసుకోండి
-
ఓటు నమోదుకు ఇక ఐదు రోజులే సమయం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజలందరూ ఓటర్ల జాబితాలో తమ పేరు ఉందో లేదో చూసుకోవాలని, ఒకవేళ పేరు లేనట్లయితే ఈ నెల 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది విజ్ఞప్తి చేశారు. ఓటరుగా చేరేందుకు ఇక కేవలం ఐదు రోజులు మాత్రమే వ్యవధి ఉందని, ఆలోగా జాబితాలో పేరు లేనివారు దరఖాస్తు చేసుకుంటే.. వారందరికీ ఓటు హక్కు కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని, 15వ తేదీ తరువాత ఓటు లేదంటే ఏమి చేయలేమని చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించిన అనంతరం ద్వివేది ఆదివారం రాత్రి సచివాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. నామినేషన్ల చివరి తేదీ వరకు ఓటర్లుగా చేరడానికి సమయం ఉందని, అయితే దరఖాస్తుల వెరిఫికేషన్‌కు పది రోజుల సమయం పడుతుందని, అందువల్లే ఈ నెల 15లోగా పేరుందో లేదో చూసుకుని దరఖాస్తు చేసుకోమని కోరుతున్నట్లు ద్వివేది వివరించారు. ఓటరుగా దరఖాస్తు చేసుకున్నవారికి ఏడు రోజుల నోటీసు సమయం పడుతుందని, ఆ తర్వాత మూడు రోజులు వెరిఫికేషన్‌కు సమయం పడుతుందన్నారు. ఇప్పుడు ఓటర్లను తొలగించడం సాధ్యం కాదని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఫారం–7లకు సంబంధించి ఇప్పటివరకు 9,27,542 దరఖాస్తులు రాగా వాటిలో 7,24,940 తనిఖీ చేశామని, అందులో 5,25,957 దరఖాస్తులను తిరస్కరించామని వివరించారు. ఇంకా 1.57 లక్షల ఫారం–7 దరఖాస్తుల్ని పరిశీలన చేయాల్సి ఉందన్నారు. వీటిని వెరిఫై చేశాక కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి తీసుకున్నాక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో జనవరి 11వ తేదీ నాటికి 3.69 కోట్ల మంది ఓటర్లుండగా ఇప్పుడు 3.82 కోట్లకు చేరినట్లు వివరించారు. అన్ని ఏర్పాట్లు పూర్తి.. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని, అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ద్వివేది చెప్పారు. మొత్తం 45,920 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, ఇందులో 9,345 పోలింగ్ కేంద్రాల్ని సమస్యాత్మకంగా గుర్తించామని, అక్కడ కేంద్ర బలగాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. 200 నుంచి 300 వరకు పోలింగ్ కేంద్రాలు పెరిగే వీలుందని, కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఇందుకు సంబంధించిన సమాచారం రావాల్సి ఉందని పేర్కొన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ చేస్తామన్నారు. పోలింగ్ కేంద్రాల్లో మంచినీటి వసతితోపాటు టెంట్లు, కుర్చీలు ఏర్పాటు చేస్తామన్నారు. దివ్యాంగులకు ప్రత్యేక వాహనాలు, ర్యాంపులు ఏర్పాటు చేస్తామన్నారు. ఓటరు స్లిప్‌లు ఇస్తామని చెప్పారు. అయితే ఓటర్ స్లిప్‌లను గుర్తింపు కార్డులుగా పరిగణించరని, ఈసీ పేర్కొన్న ప్రత్యామ్నాయ 11 గుర్తింపు కార్డుల్లో ఏదో ఒక కార్డును చూపించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఓటర్ల నమోదుకోసం వచ్చిన 2,64,712 పెండింగ్ దరఖాస్తులున్నాయని, వాటిన్నింటినీ వెరిఫై చేసి క్లియర్ చేస్తామని చెప్పారు. ఎన్నికల నిర్వహణకు నాలుగు హెలికాప్టర్లను వినియోగిస్తున్నామని, కొన్ని స్పీడు బోట్లను కూడా వినియోగిస్తున్నామని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరుగుతుంటే సామాన్యులెవరైనా సరే సీ–విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రతి శాఖ ఓ టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. నగదు లావాదేవీలపై సునిశిత దృష్టి: అయ్యన్నార్ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలో నగదు లావాదేవీలపై సునిశిత దృష్టి సారిస్తున్నట్లు శాంతిభద్రతల అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్ తెలిపారు. పది లక్షలలోపు నగదు లావాదేవీలపై పోలీసులు విచారణ చేస్తారని, అంతకుమించిన లావాదేవీలను ఆదాయపు పన్ను శాఖకు అప్పగిస్తామని చెప్పారు. సామాన్యులెవరైనా నగదును తీసుకెళుతున్నప్పుడు సంబంధిత ధ్రువపత్రాలుంటే, అలాంటి వాటికి ఎలాంటి అభ్యంతరాలు ఉండవన్నారు. ఎక్సైజ్, రవాణా, ఆదాయపు పన్ను, కస్టమ్స్ అధికారులతో కూడిన బృందాలను జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రతి బృందంలో ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ స్థాయిలో ఓ అధికారిని నియమిస్తున్నామన్నారు. ఈ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ అక్కడికక్కడే విచారణ జరిపి శిక్షలు ఖరారు చేస్తారని తెలిపారు. ఫారం–7 దరఖాస్తులపై 446 కేసులు నమోదు చేశామని, వాటిని సిట్‌కు బదలాయించామని చెప్పారు. ఐపీ అడ్రస్లకోసం సి–డాక్‌కు లేఖ రాశామన్నారు. -
అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్
సాక్షి, అమరావతి: పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఆదివారం నుంచి అమల్లోకి వచ్చింది. సీఎం, మంత్రుల ఫొటోలు, ప్రభుత్వ ప్రకటనలతో కూడిన హోర్డింగ్స్ తొలగించాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వెబ్సైట్లలో పథకాల వివరాలతోపాటు ఆ వెబ్సైట్లలో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రుల ఫొటోలను తొలగించాలని నిర్దేశించింది. ప్రభుత్వ సొమ్ముతో ప్రచార ప్రకటనల జారీపై నిషేధం ఉంటుంది. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వరంగ సంస్థలకు చెందిన భవనాలపై ఎటువంటి రాజకీయ పోస్టర్లు అంటించరాదంది. ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని గట్టిగా అమలు చేయాలని, ఈ విషయంలో అలసత్వం, నిర్లక్ష్యంగా, పక్షపాతంతో వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈసీ హెచ్చరించింది. ఎన్నికల నియమావళిని సీఎం, మంత్రులు, అధికారులు ఎవ్వరు ఉల్లంఘించినా తీవ్రంగా పరిగణిస్తామని స్పష్టం చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో ఏం చేయవచ్చు.. ఏం చేయకూడదో వివరాలిలా ఉన్నాయి.. కొత్త పథకాలు, కార్యక్రమాలు చేపట్టరాదు.. ప్రభుత్వాలు ఎటువంటి కొత్త పథకాలను, కార్యక్రమాలను చేపట్టరాదు. ఇప్పటికే ప్రకటించిన పథకాలకు ఇప్పుడు లబ్ధిదారులను ఎంపిక చేయరాదు. వర్క్ ఆర్డర్ఇచ్చినా పనులు ప్రారంభించకపోతే ఇప్పుడు ఆ పనులను చేపట్టరాదు. ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు ఆ పనులు చేపట్టరాదు. బడ్జెట్లో పేర్కొన్నప్పటికీ లేదా బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నప్పటికీ వాటిని ప్రారంభించకపోతే.. అటువంటి వాటిని ఇప్పుడు ప్రారంభించడానికి, అమలు చేయడానికి వీలులేదు. కొత్త ఇళ్ల మంజూరు, లబ్ధిదారుల ఎంపికను ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు చేయరాదు. ఉపాధి హామీ కింద రిజిష్టర్ అయిన కూలీలకు పనులను మాత్రం కొనసాగించవచ్చు. వ్యక్తులకుగానీ, సంస్థలకు గానీ ఎటువంటి భూ కేటాయింపులు చేయరాదు. కేంద్ర గ్రామీణ పథకాలతోపాటు రాష్ట్ర పథకాలకు చెందిన ప్రాజెక్టులకు నిధుల విడుదల విషయంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళికి అనుగుణంగా ఆర్బీఐ పర్యవేక్షణ చేయనుంది. సీఎం, మంత్రులు అధికారిక సమీక్షలు జరపరాదు.. ముఖ్యమంత్రి, మంత్రులు ఎన్నికల సంబంధిత అధికారులతో సమావేశాలు నిర్వహించరాదు. ఎటువంటి అధికారిక సమీక్షలు నిర్వహించరాదు. సీఎం, మంత్రుల జిల్లాల పర్యటనలో అధికారులు హాజరు కాకూడదు. అలాగే సీఎం, మంత్రులు అధికారిక వాహనాలను, అతిథిగృహాలను, హెలికాప్టర్లను వినియోగించరాదు. అధికారంలో ఉన్న పార్టీ పబ్లిక్ ప్రాంతాలను, హెలిపాడ్లను వినియోగిస్తే ఇతర పార్టీలకూ వాటిని వినియోగించుకునేందుకు అనుమతివ్వాలి. ముఖ్యమంత్రి, మంత్రులు విచక్షణాధికారిక నిధి నుంచి ఎటువంటి నిధులను మంజూరు చేయరాదు. రహదారుల నిర్మాణం చేపట్టడంగానీ, ఏదైనా ప్రాజెక్టు చేపడతామనిగానీ మంత్రులెవ్వరూ హామీలు ఇవ్వరాదు. ఎటువంటి కొత్త పనులను చేపట్టరాదు. టెండర్లను ఖరారు చేయరాదు. ఎటువంటి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలను అధికారపార్టీ నిర్వహించరాదు. సంక్షేమ పథకాలకు కొత్తగా నిధులను విడుదల చేయరాదు. ఈ పథకాలపై మంత్రులు సమీక్షలు నిర్వహించరాదు. ఎంపీ, రాజ్యసభ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నిధుల నుంచి ఎటువంటి పనులను మంజూరు చేయరాదు. ఇలా చేయడానికి ముందు ఎన్నికల సంఘం ముందస్తు అనుమతి తీసుకోవాలి. ప్రకృతి వైపరీత్యాల సమయంలో అమలు చేయాల్సిన కార్యక్రమాలకు ఈసీ అనుమతి తీసుకుని అమలు చేయవచ్చు. బదిలీలపై పూర్తిగా నిషేధం.. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ఉద్యోగులు, అధికారుల బదిలీపై పూర్తిగా నిషేధం ఉంటుంది. జిల్లా ఎన్నికల అధికారి, రిటర్నింగ్ అధికారి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, ఇతర రెవెన్యూ అధికారుల బదిలీలపై నిషేధం కొనసాగుతుంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలీసు అధికారులైన ఐజీ, డీఐజీ, సీనియర్ సూపరింటెండెంట్స్ ఆఫ్ పోలీసు, సూపరింటెండెంట్స్ ఆఫ్ పోలీసు, సబ్ డివిజనల్ పోలీసు ఆఫీసర్లైన డిప్యూటీ సూపరింటెండెంట్స్, ఇతర పోలీసు అధికారుల బదిలీపై నిషేధం ఉంటుంది. అలాగే ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ఇతర అధికారులు, ఉద్యోగుల బదిలీపై నిషేధం కొనసాగుతుంది. ప్రభుత్వ అపాయింట్మెంట్స్, పదోన్నతులు ఇవ్వరాదు. ప్రభుత్వరంగ సంస్థల్లోనూ వీటిపై నిషేధం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాహనాలు, ప్రభుత్వరంగ సంస్థలు, స్థానిక సంస్థలు, మార్కెటింగ్, సహకార అటానమస్ జిల్లా కౌన్సిలింగ్ వాహనాల వినియోగంపై నిషేధం ఉంటుంది. ప్రార్థనా ప్రదేశాల్లో ప్రచారం నిర్వహించరాదు.. దేవాలయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారాలు తదితర ప్రార్థనా ప్రదేశాల్లో ఎటువంటి ఎన్నికల ప్రచారం నిర్వహించరాదు. ప్రసంగాలు కూడా చేయరాదు. ప్రైవేట్ వ్యక్తులకు చెందిన స్థలాల్లో వారి అనుమతి లేకుండా ఎన్నికల ప్రచారానికి సంబంధించి బ్యానర్లను, పోస్టర్లను వేయరాదు. ఒక పార్టీ సమావేశం జరిగే చోట నుంచి ఇంకొక పార్టీకి చెందిన ర్యాలీలు, నినాదాలను అనుమతించరు. ఒక పార్టీకి చెందిన పోస్టర్‌ను మరొక పార్టీ తొలగించరాదు. ఎన్నికల ప్రచార సమావేశాలకు స్థానిక సంబంధిత అధికారుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి. రాత్రి పది గంటల తరువాత ఎటువంటి ప్రచార సభలకు అనుమతించరు. కులం, మతం, ప్రాంతాల మధ్య రెచ్చగొట్టే ప్రసంగాలను చేయరాదు.ఈ ఎన్నికల్లో సోషల్ మీడియా, ట్విట్టర్, ఫేస్బుక్ ద్వారా ప్రచారాల వ్యయాన్ని కూడా ఎన్నికల వ్యయంలోకి పరిగణనలోకి తీసుకుంటారు. ఎన్నికల కోడ్ కఠినంగా అమలు: ద్వివేది రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ను కఠినంగా అమలు చేస్తామని, ఇందులో రాజీ లేదని, ఈ మేరకు కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన అనంతరం ఆయన సచివాలయంలో ఆదివారం రాత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రప్రభుత్వం పసుపు–కుంకుమ కింద పోస్ట్ డేటెడ్ చెక్‌లు ఇవ్వడంపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లామని, అలాగే రుణమాఫీకి ఇప్పుడు జీవో జారీ చేయడాన్ని కూడా సంఘం దృష్టికి తీసుకువెళ్తామని, వారు ఎలా చెబితే అలా చేస్తామని ఆయన తెలిపారు. రాజకీయ పార్టీలతోపాటు అధికారులకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి వర్తిస్తుందన్నారు. అందరూ నియమావళిని పాటించాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని ఆయన పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ కేంద్ర ఎన్నికల సంఘానికి చేసిన ఫిర్యాదుపై నివేదిక కోరగా.. పంపించానని, సంఘం ఏం చెబితే ఆ విధంగా చేస్తామని తెలిపారు. ఆన్లైన్ నగదు బదిలీతోపాటు నగదు తరలింపుపై నిఘా కోసం జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రత్యేకంగా ఆదాయపు పన్ను శాఖ, వాణిజ్య పన్నులు, పోలీసులతోపాటు నోడల్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేశామని చెప్పారు. -
ఎన్నికలకు సర్వసన్నద్ధంగా ఉండండి
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల నిర్వహణ కోసం సర్వసన్నద్ధం కావాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదీ జిల్లాల యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈవీఎంలు, వీవీప్యాట్లు తదితర యంత్ర పరికరాలను సన్నద్ధం చేసుకోవాలని, సాంకేతిక అంశాలపై కూడా ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలన్నారు. శనివారం సచివాలయం నుంచి 13 జిల్లాల అధికారులతో ఈవీఎం, వీవీప్యాట్, న్యూ సువిధా, 1950 కాల్ సెంటర్ అంశాలపై అదనపు సీఈవోలు సుజాతా శర్మ, వివేక్ యాదవ్‌లతో కలిసి ద్వివేదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతికపరమైన అంశాలపై జిల్లా యంత్రాంగం స్పందించి ఈ రోజే నివేదికను సమర్పించాలన్నారు. ఎఫ్‌ఎల్‌సిపై నివేదికను సత్వరమే అందజేయాలన్నారు. డిఫెక్టివ్ పరికరాలను ఫ్యాక్టరీకి తిప్పి పంపేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. వాటి స్థానంలో ప్రత్యామ్నాయ పరికరాలు కేటాయిస్తారని తెలిపారు. 1950 కి సంబంధించి జిల్లా స్థాయిలో నిర్వహించే డిస్ట్రిక్ కాల్ సెంటర్లకు ఇక నుంచి జిల్లా రెవెన్యూ అధికారులు నోడల్ అధికారిగా వ్యవహరించాలని ఆదేశించారు.1950 జిల్లా కాల్ సెంటర్లు శనివారం, ఆదివారం కూడా పనిచేయాల్సి ఉందన్నారు. ఇప్పటికే ఒక్కో షిఫ్టులో ఇద్దరు పనిచేస్తున్నారని, మరో ముగ్గురిని తీసుకుని ఐదుగురితో పనిచేసేలా ఏర్పాటు చేయాలని ద్వివేదీ ఆదేశించారు. 1950 కి వచ్చే ప్రతి కాల్కి స్పందన ఉండాలని, ప్రజలు అడిగిన ప్రశ్నలపై నిర్ణీత కాలవ్యవధిలో జిల్లా యంత్రాంగం పరిష్కరించాలని ఆయన సూచించారు. అదనపు సీఈవో వివేక్ యాదవ్ మాట్లాడుతూ ఎన్నికల నిరంతర పర్యవేక్షణలో భాగంగా న్యూ సువిధ అప్లికేషన్‌ను రూపొందించినట్లు చెప్పారు. నామినేషన్ వివరాలతో పాటు మీడియా మానిటరింగ్ సర్టిఫికెట్, రెవెన్యూ, పోలీసు, ఫైర్ తదితర శాఖలకు చెందిన ప్రతి ఒక్క అనుమతులను ఆన్లైన్లో ఇచ్చే వెసులుబాటు కల్పించి మరింత సులభతరం చేసినట్లు తెలిపారు. ఎన్నికల్లో భాగంగా ప్రతి అనుమతిని న్యూ సువిధా ద్వారా ఇవ్వాలని ఆయన సూచించారు. ఆయా అనుమతుల కోసం 48 గంటలు ముందుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. న్యూ సువిధా యాప్ నిర్వహణ కోసం జిల్లా స్థాయిలో గ్రూప్–1 అధికారిని నియమించాలన్నారు. ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్ధులు న్యూ సువిధా మొబైల్ యాప్ ద్వారా అనుమతులకు దరఖాస్తులు చేసుకునే సౌకర్యం అందుబాటులో ఉంటుందని తెలిపారు. దరఖాస్తు స్టేటస్‌ను మొబైల్లో తెలుసుకోవచ్చునని ఆయన చెప్పారు. -
ఫారం–7 ఇవ్వడం తప్పుకాదు
సాక్షి, అమరావతి: రెండేసి చోట్ల ఓట్లు ఉన్నట్టు, దొంగ ఓట్లు ఉన్నట్టు తెలుసుకుని వాటిని తొలగించాలని కోరుతూ ఫారం–7 ఇవ్వడం తప్పు కాదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. వెరిఫికేషన్ కోసం వాటిని ఇస్తారని ఆయన తెలిపారు. ఫారం–7 ఇచ్చినంత మాత్రాన ఓట్లు తొలగించబోమన్నారు. ఫారం–7 కింద ఇచ్చిన దరఖాస్తులపై విచారణ జరిపిన తరువాత మాత్రమే.. వాస్తవమైతేనే ఆ ఓట్లను తొలగిస్తామని స్పష్టం చేశారు. గురువారం సచివాలయంలో తనను కలసిన విలేకరులతో ఆయన మాట్లాడారు. ఫారం–7 ఇవ్వడం నేరమంటూ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేదని ద్వివేది మాటలను బట్టి స్పష్టమవుతోంది. ఫారం–7 అనేది ఓటరుకు తెలియకుండా ఆ ఓటరు పేరు మీదనే ఇంకొక వ్యక్తి ఇవ్వడాన్ని మాత్రమే ద్వివేది తప్పుపట్టారు. ఇలాంటి తప్పుడు ఫిర్యాదులపై కేసులు నమోదు చేశామని, దీంతో దరఖాస్తులు తగ్గిపోయాయని తెలిపారు. ఫారం–7 దరఖాస్తులు ఎన్ని వచ్చినా నష్టం లేదన్నారు. ఇప్పటి వరకు పదివేల ఓట్లు మాత్రమే తొలగించామని తెలిపారు. ఫారం–7 దరఖాస్తుల్లో 40 వేల ఓట్లను తొలగించేందుకు మాత్రమే అనుమతించామని చెప్పారు. ఫారం–7 దరఖాస్తును ఆన్లైన్లో చేస్తే ఓటు తొలగించినట్లు కాదన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జనాభా కంటే ఓటరు నిష్పత్తి తక్కువగా ఉందన్నారు. 18 ఏళ్లు నిండిన యువతలో ఎక్కువ మందికి ఓటుహక్కు లేదని గుర్తించామని, వారందరూ ఓటర్లుగా నమోదు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం నిష్పాక్షికంగా పనిచేస్తుందని, ఎలాంటి అనుమానాలు అవసరం లేదని ద్వివేది స్పష్టం చేశారు. 45 వేల మంది సిబ్బందితో దరఖాస్తుల పరిశీలన.. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఫారం–7 దరఖాస్తులు వచ్చాయి. డేటా చోరీ కేసు బయటకు వచ్చిన తరువాత ఫారం–7 దరఖాస్తులు తగ్గుముఖం పట్టాయి. మొత్తం 8.76 లక్షల ఫారం–7 దరఖాస్తులు వచ్చాయి. వీటిని 45 వేల మంది సిబ్బందితో నిరంతరంగా పరిశీలన చేయిస్తున్నారు. ఇప్పటివరకు 1,61,005 దరఖాస్తులను పరిశీలన చేయగా అందులో 5,309 మాత్రమే అసలైన దరఖాస్తులుగా నిర్ధారించారు. 1,55,696 దరఖాస్తులను నకిలీవిగా గుర్తించి తిరస్కరించారు. దరఖాస్తుల పరిశీలనను మరో నాలుగైదు రోజుల్లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం పూర్తి చేయనుంది. కాగా, ఈ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ద్వివేది కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. -
ఓట్ల తొలగింపులో మోసం చేస్తే ఈసీ ఊరుకోదు : ద్వివేది
-
‘ఓట్ల తొలగింపునకు లక్షల దరఖాస్తులు వచ్చిన మాట వాస్తవం’
సాక్షి, అమరావతి : ఓట్ల తొలగింపుల్లో మోసం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. తమ అధికారులు తప్పు చేస్తే సస్పెండ్ చేసీ, ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని హెచ్చరించారు. మంగళవారం ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. వారం రోజుల క్రితం వరకు ఓట్ల తొలగింపు కోసం లక్షల దరఖాస్తులు వచ్చిన మాట వాస్తమని ద్వివేది చెప్పారు. ఇప్పుడు ఆ సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. ప్రతి దరఖాస్తును పరిశీలించిన తర్వాతే లొలగింపు ఉంటుందని స్పష్టం చేశారు. ఓట్ల తొలగింపులో మోసం చేస్తుంటే ఈసీ చూస్తూ ఊరుకోదని, కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. నిబంధనల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. ఓట్ల తొలగింపుపై రాష్ట్ర వ్యాప్తంగా 100పైగా కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. తెలంగాణలో వెలుగు చూసిన డేటా చోరీలో చాలా అంశాలు ఉన్నాయన్నారు. డేటా ఎక్కడి నుంచి వచ్చిందో ప్రజలు తెలియాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. డేటా చోరి సంగతి పోలీసులు, కోర్టులే తేల్చాలని చెప్పారు. ఎడిట్ చేయలేని ఓటర్ల జాబితాను మాత్రమే ఈసీ విడుదల చేసిందని తెలిపారు. -
ఓట్ల తొలగింపునకు భారీగా అక్రమ దరఖాస్తులు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో పెద్దఎత్తున ఓట్ల తొలగింపునకు అక్రమ దరఖాస్తులు వచ్చిన మాట వాస్తమేనని, ఈ విషయాన్ని ఎన్నికల సంఘం గుర్తించిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదీ వెల్లడించారు. ఓటర్లకు తెలియకుండా వారి పేర్లతోనే ఇతరులు ఫారం–7 సమర్పించారని, ఆన్లైన్ ద్వారా ఇటువంటి తప్పుడు, అక్రమ చర్యలకు పాల్పడిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టంచేశారు. ఆన్లైన్ ద్వారా ఓట్లు తొలగించాలంటూ అసలైన ఓట్లర్లతో సంబంధం లేకుండా ఇతరులు అక్రమంగా ఫారం–7 సమర్పించిన వారిని గుర్తించే చర్యలు సాగుతున్నాయని ఆదివారం ఒక ప్రకటనలో ఆయన తెలిపారు. మోసపూరిత చర్యలకు పాల్పడే వ్యక్తులు వేల సంఖ్యలో ఓట్లు తొలగింపునకు ఆన్లైన్లో ఫారం–7 సమర్పించినట్లు వారం రోజుల క్రితం గుర్తించామని ద్వివేదీ వివరించారు. అసలైన ఓటర్లకు తెలియకుండానే వారి పేర్లతో ఇతరులు ఫాం–7 సమర్పించారన్నారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు యంత్రాంగంతో పాటు జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసినట్లు ఆయన పేర్కొన్నారు. వారిపై విచారణ జరపవడంతో పాటు ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా కలెక్టర్లకు సూచించామని వివరించారు. ఈ విషయంలో ఓటర్లు కూడా సహకరించాల్సిందిగా కోరారు. తొమ్మిది జిల్లాల్లో ఎఫ్ఐఆర్లు కాగా, ఇప్పటివరకు 45 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ద్వివేదీ తెలిపారు. ఐపీసీ సెక్షన్లు 120బి, 419, 420, 465, 471లతోపాటు ఐటీ చట్టం సెక్షన్లు 66, 66డి,లతో పాటు ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్–31 కింద తొమ్మిది జిల్లాల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఆయన వివరించారు. శ్రీకాకుళం జిల్లాలో మూడు, తూర్పుగోదావరి జిల్లాలో 14, కృష్ణా జిల్లాలో మూడు, గుంటూరు జిల్లాలో ఒకటి, ప్రకాశం జిల్లాలో నాలుగు, చిత్తూరు జిల్లాలో మూడు, అనంతపురం జిల్లాల్లో ఒకటి, కర్నూలు జిల్లాలో 8, విశాఖలో 8 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. ఫాం–7 సమర్పించిన వారిలో తూర్పుగోదావరి జిల్లాల్లో మీ సే–వకు చెందిన ఆరుగురు సిబ్బంది హస్తం ఉందని.. జిల్లా కలెక్టర్ వారిపై చర్యలను తీసుకుంటున్నారని ద్వివేదీ పేర్కొన్నారు. ఐపీ చిరునామా కోసం సీ–డాక్‌కు లేఖ ఈ అక్రమ వ్యవహారాల్లో ఎవరెవరి భాగస్వామ్యం ఉందో మరింత లోతుగా పోలీసు దర్యాప్తు చేసేందుకు ఐపీ చిరునామా ఇవ్వాల్సిందిగా సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సీ–డాక్)కు లేఖ రాసినట్లు ద్వివేదీ తెలిపారు. బోగస్ దరఖాస్తుల ఆధారంగా ఎవ్వరి ఓట్లనూ తొలగించబోమని, సవివరమైన తనిఖీలు, విచారణ జరుపుతామని.. ఈ విషయంలో ఓటర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టంచేశారు. సీఈవో ఆమోదంతోనే ఓట్ల తొలగింపు జరుగుతుందన్నారు. -
ఏపీలోనే ఎక్కువ ఎన్నికల వ్యయం
సాక్షి, అమరావతి: దేశంలో అన్ని రాష్ట్రాలకంటే అత్యధిక ఎన్నికల వ్యయం ఆంధ్రప్రదేశ్‌లో జరుగనుందని కేంద్ర ఎన్నికల సంఘం అంచనా వేస్తోందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఏపీని ఎక్స్పెండిచర్ సెన్సిటివ్ స్టేట్(ధన వ్యయపరంగా సున్నితమైన రాష్ట్రం)గా ప్రకటించడమే కాకుండా అత్యధిక పరిశీలకులను రాష్ట్రానికి పంపుతున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా మద్యం, బహుమతుల పంపిణీతోపాటు పెయిడ్ ఆర్టికల్స్ అనేవి అత్యంత కీలకమైన అంశాలుగా గుర్తించారని, దీనిపై జిల్లా స్థాయిల్లో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ద్వివేది హెచ్చరించారు. సున్నితమైన రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నందున పెయిడ్ ఆర్టికల్స్‌ను గుర్తించడానికి మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ(ఎంసీఎంసీ) అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ఇందుకు జిల్లా స్థాయిలో పటిష్టమైన మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే ఏడు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటికీ ఇంతవరకు ఎంసీఎంసీ పూర్తిస్థాయిలో ఏర్పాటు కాకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం సచివాలయంలో 13 జిల్లాల ఎంసీఎంసీ నోడల్ ఆఫీసర్లు, వివిధ మీడియా ప్రతినిధులతో వర్క్‌షాప్ నిర్వహించారు. ఇందులో ద్వివేది మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో పెయిడ్ ఆర్టికల్స్, సోషల్ మీడియా అనేవి అత్యంత కీలకమైన అంశాలని, పార్టీలకతీతంగా వీటిని గుర్తించి అభ్యర్థుల వ్యయంలో చేర్చాల్సిన బాధ్యత ఎంసీఎంసీదేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఐదారుగురు సభ్యులతో ఎంసీఎంసీ కమిటీలను ఏర్పాటు చేశారని, వీరితో పరిశీలన చేయడం కష్టమని, వీరికి అదనంగా కనీసం 15–20 మంది సహాయకులను తీసుకుని జిల్లా స్థాయిలో పటిష్టమైన కంట్రోల్ రూములు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగానే కేంద్ర ఎన్నికల పరిశీలకులు వస్తారు కాబట్టి ఈలోగానే మొత్తం ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా కలెక్టర్లను ఆయన కోరారు. వీవీప్యాట్లతో ఎన్నికలు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎంలు)ను వినియోగించడం 30 ఏళ్లు దాటుతున్నా.. ఇప్పటికీ వాటి పనితీరుపైన కొందరు అపోహలు కల్పిస్తూనే ఉన్నారని, ప్రజల్లోనూ, పార్టీల్లోనూ ఉండే ఈ భయాందోళనలను తొలగించడానికి రాష్ట్రంలో తొలిసారిగా వీవీ ప్యాట్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ద్వివేది తెలిపారు. వీవీ ప్యాట్లలో ఓటరు ఏ అభ్యర్థికి, ఏ గుర్తుకు ఓటేశారో తెలుపుతూ ఏడు సెకన్లపాటు కనిపిస్తుందన్నారు. ఈవీఎంలను హ్యాకింగ్ చేయవచ్చనే ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు. తగ్గుతున్న అక్రమ ఓట్ల తొలగింపు దరఖాస్తులు.. రాష్ట్రంలో గంపగుత్తగా వస్తున్న ఓట్ల తొలగింపు దరఖాస్తులు గత రెండు రోజుల నుంచి తగ్గినట్లు ద్వివేది తెలిపారు. ఓటరు ప్రమేయం లేకుండా ఇలా అక్రమంగా ఫారం–7తో ఓట్లు తొలగించమంటూ దరఖాస్తు చేయడం క్రిమినల్ చర్య అని, దీనిపై ఇప్పటికే పలు జిల్లాల్లో కేసులు కూడా నమోదు చేసినట్లు చెప్పారు. రాజమండ్రి గ్రామీణ ప్రాంతంలో ఇలా 2,300 ఓట్లు తొలగింపునకు దరఖాస్తు వచ్చినట్లు తేలిందన్నారు. ఈ సమస్య కొన్ని ఎంపిక చేసిన నియోజకవర్గాలపైనే ఉందని, వాటిపై తాము ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు. ఇలా దరఖాస్తు చేసిన ఓటర్లను పూర్తిగా పరిశీలించిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటున్నామని, అందువల్ల ఓటర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. శుక్రవారం ఒక్కరోజే విశాఖలో 40,000, గుంటూరులో 50,000 దరఖాస్తులను పరిశీలించి నిర్ణయం తీసుకున్నామని, త్వరలోనే ఎన్ని అక్రమ ఓట్ల తొలగింపునకు, చేర్పించడానికి దరఖాస్తులు వచ్చాయో వివరాలను వెల్లడిస్తామని తెలిపారు. -
‘చిత్తూరు ఎస్పీ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు’
-
‘చిత్తూరు ఎస్పీ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు’
సాక్షి, అమరావతి : ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్రమ నిర్బంధం, చిత్తూరు జిల్లాలో ఓట్ల తొలగింపు సర్వేలపై ఎన్నికల సంఘానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. వైఎస్సార్ సీపీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కంబాల జోగులు, రక్షణనిధి, అంబటి రాంబాబు, కాసు మహేష్ రెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్... సోమవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలిశారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లాలో వైఎస్సార్ సీపీ నేతల అక్రమ నిర్బంధం, ఓట్ల తొలగింపు అంశాలను సీఈవో దృష్టికి తీసుకు వెళ్లారు. అనంతరం వైఎస్సార్ సీపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ..‘చిత్తూరులో జరిగిన పరిణామాలపై ఫిర్యాదు చేశాం. మా టాబ్‌లతో వచ్చి సర్వేలు చేయడాన్ని ఎమ్మెల్యే చెవిరెడ్డి అడ్డుకున్నారు. చిత్తూరు జిల్లా ఎస్పీ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఎస్పీ మీద చర్యలు తీసుకోవాలని కోరాం. పోలీసుల సహకారంతో సర్వేలు చేస్తున్నారు. ఎమ్మెల్యేను రాత్రంతా బస్సులో తిప్పి ఉదయం సత్యవేడులో వదిలారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది. అధికార యంత్రాంగం మొత్తం ప్రభుత్వ చెప్పుచేతల్లో నడుస్తోంది. అధికారం కోసం ముఖ్యమంత్రి పోలీసుల్ని ఉపయోగించుకుంటున్నారు. ఎన్నికల అధికారులు కూడా నామమాత్రపు చర్యలు తీసుకుంటున్నారు. సీనియర్ ఎమ్మెల్యే నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ అనుకూల ఓట్లను తొలగిస్తున్నారు. టాబ్‌లతో సమాచారం భద్రపరిచేవాళ్లను వదిలి, ఫిర్యాదు చేసినవాళ్లను అరెస్ట్ చేశారు. పోలీసులు అహంకారంతో సాక్షాత్తూ ఓ ఎమ్మెల్యేను తమిళనాడు తీసుకెళ్లి హింసించారు. చెవిరెడ్డి ఏంతప్పు చేసారని కేసు పెట్టారు. చిత్తూరు ఎకస్పీ మీద చర్యలు తీసుకోవాలి. ఓట్ల తొలగింపు ద్వారా గెలవాలని ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల సంఘం తీసుకోవాల్సిన మేరకు చర్యలు తీసుకోవడం లేదు’ అని అన్నారు.