ఓట్ల తొలగింపుల్లో మోసం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. తమ అధికారులు తప్పు చేస్తే సస్పెండ్ చేసీ, ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తామని హెచ్చరించారు. మంగళవారం ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. వారం రోజుల క్రితం వరకు ఓట్ల తొలగింపు కోసం లక్షల దరఖాస్తులు వచ్చిన మాట వాస్తమని ద్వివేది చెప్పారు. ఇప్పుడు ఆ సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు.