Removal of votes
-
వైఎస్ జగన్ ఓటు తొలగించేందుకు కుట్ర
సాక్షి ప్రతినిధి, కడప: ఎన్నికల కమిషన్‌ను అపహాస్యం చేసేవిధంగా తెలుగుదేశం నేతలు అనైతిక చర్యలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో లక్షల సంఖ్యలో వైఎస్సార్ సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించిన ప్రభుత్వం.. వైఎస్సార్ సీపీ ముఖ్యనేతల ఓట్లను కూడా గల్లంతు చేసేందుకు కంకణం కట్టుకున్నారు. ఈసారి ఏకంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓటునే తొలగించేందుకు కుట్ర పన్నారు. వైఎస్ జగన్ ఫొటోతో కూడిన ప్రొఫైల్‌ను అప్లోడ్ చేసి ఆన్లైన్ ద్వారా ఫారం–7 దాఖలు చేశారు. వైఎస్ జగన్ పేరు మీద ఈనెల 9న దరఖాస్తు దాఖలయ్యింది. అయితే ఈ విషయం ఇప్పటివరకు బహిర్గతం కాకుండా తహసీల్దారు, రిటర్నింగ్ అధికారి సత్యం జాగ్రత్త పడ్డారు. మంగళవారం ఈ విషయం బయటకు రావడంతో రిటర్నింగ్ అధికారిని మీడియా సంప్ర దించగా.. ఆయన ఈ విషయాన్ని ధ్రువీకరించారు. అయితే దీన్ని ఎవరు? ఎక్కడ్నుంచి అప్లోడ్ చేశారన్న ప్రశ్నలకు జవాబివ్వలేదు. కాగా, ఈ విషయమై స్పష్టత కోసం జగన్మోహన్రెడ్డి సమీప బంధువు జనార్దనరెడ్డిని విచారించగా జగన్మోహన్రెడ్డి దరఖాస్తు చేయలేదని చెప్పారని రిటర్నింగ్ అధికారి చెప్పారు. దీంతో ఆయన వద్ద స్టేట్మెంట్ తీసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేశామని తెలిపారు. ఇదిలా ఉండగా ఇప్పటికే వైఎస్ జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్‌కుమార్ ఓటు తొలగించాలంటూ ఫారం–7 దాఖలైన సంగతి తెలిసిందే. తమ ఓట్ల గల్లంతుకు సంబంధించి దరఖాస్తు చేసిన నిందితులపై చర్యలు తీసుకోవాలని వారు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. వైఎస్ జగన్ పేరుతో పంపిన నకిలీ ఫారం–7 దరఖాస్తు -
డేటా చౌర్యంపై దర్యాప్తు చేస్తున్నాం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో అక్రమంగా ఓట్ల తొలగింపు, డేటా చౌర్యంపై విచారణ జరిపేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘంతో సంబంధం లేకుండా ప్రత్యేక బృందాన్ని పంపినట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ ఆరోరా చెప్పారు. ఆదివారం ఢిల్లీలో ఎన్నికల షెడ్యూల్ విడుదల సందర్భంగా మీడియా ప్రశ్నించగా అరోరా పైవిధంగా బదులిచ్చారు. ‘‘రాష్ట్రాల నుంచి ఇలాంటి కొన్ని ఫిర్యాదులందాయి. ప్రతి కేసు విచారణకు ప్రత్యేక బృందాలను పంపాం. ఏపీ, తెలంగాణ నుంచి రెండు రకాల ఫిర్యాదులందాయి. ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడి నుంచి ఒకటి, ఇతర పార్టీల నుంచి ఫిర్యాదులందాయి. వీటిపై దర్యాప్తు జరిపి, పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని ఆదేశించాం. ఒకటి, రెండు చోట్ల రాష్ట్ర ఎన్నికల సంఘంతో సంబంధం లేకుండా ఎన్నికల నిర్వహణలో నిపుణులైనవారిని పంపి నివేదిక ఇవ్వాలని ఆదేశించాం’’ అని సునీల్ అరోరా తెలిపారు. -
ఓటర్ ఐడీకి మొబైల్ నంబర్‌కు లింక్
సాక్షి, అమరావతి: ఓటరుతో ప్రమేయం లేకుండా ఓట్లను తొలగించేస్తున్నారు... ఇప్పుడు రాష్ట్రాన్ని ఊపేస్తున్న, ఓటర్లను గందరగోళపరుస్తున్న అంశం ఇది. ఈ సమస్యకు ఎన్నికల సంఘం ఓ పరిష్కార మార్గం చూపిస్తోంది. మీ ఓటరు ఐడీని మీ మొబైల్ నంబర్‌తో అనుసంధానం చేసుకోవడం ద్వారా.. ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పుల గురించి తెలుసుకోవచ్చు. రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్సైట్లోకి వెళ్లి మీ మొబైల్ నంబర్‌ను ఒకసారి లింక్ చేస్తే మీ పేరిట ఫామ్–7తో సహా ఏమైనా మార్పులు చేర్పులకు దరఖాస్తులు వస్తే వెంటనే మీ మొబైల్‌కు హెచ్చరిక (అలర్ట్) సందేశం వస్తుంది. ఇందుకు మీరు చేయాల్సిందల్లా http://ceoaperms.ap.gov.in/AP&MobileNoRegistration/MobileNoRegistration.aspx అనే లింక్‌లోకి వెళ్లి మీ ఎలక్టొరల్ ఫోటో ఐడీ కార్డు నంబర్ (ఎపిక్ నంబర్)ను, ఫోన్ నంబర్‌ను ఎంటర్ చేస్తే ఆ నంబర్‌కు వన్‌టైమ్ పాస్ వర్డ్ (ఓటీపీ) వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే చాలు ఎపిక్ నంబర్‌తో మీ ఫోను అనుసంధానం అయినట్లే. మీ కుటుంబసభ్యుల ఓట్లన్నీ ఒకే నంబర్‌కు ఇలా లింక్ చేసుకోవచ్చు. ఇది కూడా దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
ఎన్నికల అక్రమాలకే డేటా చౌర్యం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో లక్షలాది ఓట్లను అక్రమంగా తొలగించడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఓటర్లకు తెలియకుండానే వారి ఓట్లను తొలగించాలని కోరుతూ ఫారం–7 దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించడం జాతీయస్థాయిలో ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ వ్యవహారంపై వివిధ వర్గాలకు చెందిన నిపుణులు స్పందిస్తున్నారు. రాజ్యాంగం పౌరులకు కల్పించిన వ్యక్తిగత గోప్యత హక్కును, ఓటు హక్కును రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తోందని వారు దుయ్యబడుతున్నారు. ప్రజలకు సంబంధించిన డేటా ప్రభుత్వం నుంచి ప్రైవేటు సంస్థలకు అనధికారికంగా వెళ్లడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని వారు స్పష్టం చేస్తున్నారు. ఎన్నికల్లో అక్రమాలకే డేటా చౌర్యానికి పాల్పడినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘం వెంటనే అప్రమత్తమై తగిన చర్యలు తీసుకోవాలని, ఓటర్ల జాబితాలో అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరిపి దోషులమీద ఐటీ, ఐపీసీ సెక్షన్ల కింద కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో లక్షలాది మంది ఓట్లను అక్రమంగా తొలగించడంపై వివిధ రంగాల నిపుణులు ‘సాక్షి’తో మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో అక్రమాలు, డేటా చౌర్యంపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఓట్ల తొలగింపు తీవ్రమైన నేరం ఓట్ల అక్రమ తొలగింపు తీవ్రమైన నేరం. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఓట్లను తొలగిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఓటర్లకు తెలియకుండా వారి ఓట్లను తొలగించాలంటూ ఫారం–7తో ఆన్లైన్లో దరఖాస్తులు చేయడమంటే పవిత్రమైన ఎన్నికల వ్యవస్థను అపహాస్యం చేయడమే. రాజ్యాంగ విరుద్ధమైన ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘం సత్వరం స్పందించాలి. ప్రత్యేక పరిశీలకులను నియమించి రాష్ట్రంలో ఇంటింటికి సర్వే నిర్వహించాలి. ఓటు హక్కును కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపైనే ఉంది. ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. – కేజే రావు, కేంద్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ ఐపీసీ, ఐటీ చట్టం కింద చర్యలు తీసుకోవాలి ప్రభుత్వ పథకాల సందర్భంగా సేకరించిన సమాచారాన్ని కొన్ని రాజకీయ పార్టీలు స్వలాభంకోసం ఉపయోగిస్తుండడం, ఓటర్ల జాబితాల నుంచి ఓట్లు తొలగిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. పెద్ద ఎత్తున ఓట్లను తొలగిస్తున్నారని నా దృష్టికి రాగానే దీనిపై దర్యాప్తు చేయమని ఎన్నికల సంఘానికి లేఖ రాశాను. ప్రభుత్వంపై నమ్మకంతో ఆధార్ కార్డు, ఇతర అవసరాలకోసం ప్రజలు తమ వ్యక్తిగత సమాచారాన్ని అందిస్తారు. అలాంటి సమాచారం ప్రైవేటు సంస్థలకు చేరకుండా గోప్యంగా ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది. కానీ ప్రజల వ్యక్తిగత సమాచారం ప్రైవేటు సంస్థలకు చేరిందన్న నివేదికలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రజల సమాచార దుర్వినియోగం సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకం. అందుకు బాధ్యులైనవారిపై ఐపీసీ, ఐటీ చట్టాల కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం కావాలంటే ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపి రాజకీయాలకతీతంగా చర్యలు తీసుకోవాలి. – ఈఏఎస్ శర్మ, కేంద్ర ఇంధన శాఖ రిటైర్డ్ కార్యదర్శి చంద్రబాబు ప్రభుత్వానిది దేశ ద్రోహం అక్రమంగా ఓట్లను తొలగించడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం ప్రజల ఓటుహక్కును కాలరాయడంతోపాటు దేశద్రోహానికి కూడా పాల్పడింది. ప్రజల వ్యక్తిగత సమాచారం ప్రైవేటు సంస్థలకు చేరడం వెనుక ప్రభుత్వ పెద్దల పాత్ర ఉంది. ఆధార్‌కార్డు, తదితర సమాచారం దేశ వ్యతిరేక, సంఘ విద్రోహ శక్తులకు చేరితే తీవ్ర దుష్పలితాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇందుకు సీఎం చంద్రబాబుతోపాటు యావత్ అధికార యంత్రాంగం బాధ్యత వహించాలి. సీఎం ఐటీ సలహాదారు జె.సత్యనారాయణ ఆధార్ ప్రాజెక్టులో కూడా ఉపాధ్యక్షుడుగా ఉన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆయన జోడు పదవుల్లో కొనసాగుతున్నారు. రాష్ట్ర ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ప్రైవేటు సంస్థలకు చేరిన వ్యవహారంలో సత్యనారాయణను వెంటనే తొలగించాలి. ప్రభుత్వ పాత్రపై కేంద్ర ఎన్నికల సంఘం దర్యాప్తు చేపట్టాలి. – అడుసుమిల్లి జయప్రకాశ్, మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి రాష్ట్రంలో ఓట్ల అక్రమ తొలగింపునకు చంద్రబాబు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ప్రజల ఆధార్‌కార్డ్, ఓట్లు, ఇతర వ్యక్తిగత వివరాలు ప్రైవేటు సంస్థలకు ఎలా చేరాయన్న దానిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలి. ఆ ప్రైవేటు సంస్థలు ఎందుకోసం ప్రజల వ్యక్తిగత వివరాలను తమ వద్ద ఉంచుకున్నాయన్నది కీలకం. ఏ రాజకీయ పార్టీకి ప్రయోజనం కలిగించేందుకు, ఎలాంటి ఎన్నికల అక్రమాలకు పాల్పడేందుకు ఈ డేటాను చౌర్యం చేశారన్నది నిగ్గు తేలాల్సి ఉంది. ఈ అక్రమాల వెనుక ఉన్న సూత్రధారులు, పాత్రధారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. – డా.గేయానంద్, మాజీ ఎమ్మెల్సీ, జనవిజ్ఞాన వేదిక -
ఓట్ల తొలగింపులో మోసం చేస్తే ఈసీ ఊరుకోదు : ద్వివేది
-
‘ఓట్ల తొలగింపునకు లక్షల దరఖాస్తులు వచ్చిన మాట వాస్తవం’
సాక్షి, అమరావతి : ఓట్ల తొలగింపుల్లో మోసం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. తమ అధికారులు తప్పు చేస్తే సస్పెండ్ చేసీ, ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని హెచ్చరించారు. మంగళవారం ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. వారం రోజుల క్రితం వరకు ఓట్ల తొలగింపు కోసం లక్షల దరఖాస్తులు వచ్చిన మాట వాస్తమని ద్వివేది చెప్పారు. ఇప్పుడు ఆ సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. ప్రతి దరఖాస్తును పరిశీలించిన తర్వాతే లొలగింపు ఉంటుందని స్పష్టం చేశారు. ఓట్ల తొలగింపులో మోసం చేస్తుంటే ఈసీ చూస్తూ ఊరుకోదని, కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. నిబంధనల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. ఓట్ల తొలగింపుపై రాష్ట్ర వ్యాప్తంగా 100పైగా కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. తెలంగాణలో వెలుగు చూసిన డేటా చోరీలో చాలా అంశాలు ఉన్నాయన్నారు. డేటా ఎక్కడి నుంచి వచ్చిందో ప్రజలు తెలియాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. డేటా చోరి సంగతి పోలీసులు, కోర్టులే తేల్చాలని చెప్పారు. ఎడిట్ చేయలేని ఓటర్ల జాబితాను మాత్రమే ఈసీ విడుదల చేసిందని తెలిపారు. -
3కోట్ల మంది డేటా ఎలా సేకరించారు?
సాక్షి, అమరావతి : డేటా చోరీ, ఓట్ల తొలగింపుపై ఎన్నికల కమిషన్ కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈమేరకు వైఎస్సార్సీపీ నేతలు కాసు మహేందర్ రెడ్డి, లావు కృష్ణ దేవరాయలుతో కలిసి ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదికి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డేటా ఎలా లీకయ్యిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వమే అక్రమంగా ప్రైవేట్ సంస్థలకు డేటా ఇచ్చిందని ఆరోపించారు. టీడీపీ సభ్యత్వం 60లక్షలకు మించి లేదు.. కానీ 3 కోట్ల మంది డేటా ఎలా సేకరించారని ప్రశ్నించారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వం అక్రమంగా సేకరించిన డేటానే అన్నారు. ఐటీ గ్రిడ్స్ సంస్థ సేకరించిన డేటా ద్వారా టీడీపీ నాయకులు తమ వ్యతిరేక ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గాల ఓట్లల్లో అక్రమాలు జరిగాయన్నారు. ప్రజల వ్యక్తిగత డేటాను ప్రైవేట్ సంస్థకు అప్పజెప్పిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. (‘ఐటీ గ్రిడ్స్’లో మరోసారి సోదాలు) -
ఇక ఫైబర్ గ్రిడ్ నుంచే ఓట్ల తొలగింపు వ్యూహం..?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఓట్ల అక్రమ తొలగింపునకు టీడీపీ ప్రభుత్వం మరింతగా బరితెగిస్తోంది. ఇప్పటికే ముఖ్యనేత సన్నిహితులకు చెందిన హైదరాబాద్‌లోని ఐటీ గ్రిడ్స్ సంస్థ ద్వారా భారీగా వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తెలంగాణ పోలీసుల దాడుల్లో ఈ బాగోతం ఆధారాలతోసహా బట్టబయలైనప్పటికీ ముఖ్యనేత మరో వ్యూహం అమలుచేయనున్నారు. ఈసారి ఏపీ కేంద్రంగానే వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించినట్లు సమాచారం. తన బినామీల గుప్పిట్లో ఉన్న ఫైబర్‌గ్రిడ్ కేంద్రంగా ఓట్ల తొలగింపుకు సిద్ధపడుతున్నారు. టెలికాం చట్టానికి విరుద్ధంగా ఫైబర్‌గ్రిడ్ కనెక్షన్లు భవిష్యత్ రాజకీయ అవసరాలు, ఎన్నికల అక్రమాలకు పాల్పడే ఉద్దేశంతోనే ముఖ్యనేత రాష్ట్ర ఫైబర్‌గ్రిడ్ లిమిటెడ్‌ను వ్యూహాత్మకంగా తన బినామీల గుప్పిట్లో పెట్టారు. సీఎం చంద్రబాబుకు సన్నిహితుడైన వేమూరి హరిప్రసాద్‌కు చెందిన సంస్థలకు ఫైబర్‌గ్రిడ్ కాంట్రాక్టులను కట్టబెట్టారు. పేరుకు కొందరు ఉన్నతాధికారులు ఉన్నప్పటికీ వ్యవహారాలన్నీ సీఎం సన్నిహితులకు చెందిన టెరాసాఫ్ట్ తదితర సంస్థలే నిర్వహిస్తున్నాయి. కాగా రాష్ట్రంలో ఫైబర్‌గ్రిడ్ కింద ఇంటర్నెట్, టీవీ, ఫోన్ కనెక్షన్లు ఇవ్వడంలో కేంద్ర టెలికాం నిబంధనలను ఉద్దేశపూర్వకంగానే విస్మరించారు. నిబంధనల ప్రకారం ప్రతి ఇంటర్నెట్ కనెక్షన్‌కు ఓ ప్రత్యేక ఇంటర్నెట్ ప్రొటోకాల్(ఐపీ) నంబర్ కేటాయించాలి. ఇంటర్నెట్ కనెక్షన్లను దుర్వినియోగం చేస్తే ఐపీ నంబర్ ఆధారంగానే దోషులను గుర్తించి సైబర్ చట్టాల కింద కేసులు నమోదు చేస్తారు. అందుకే దేశంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఇచ్చే ఇంటర్నెట్ కనెక్షన్లకు ఈ విధంగానే ప్రత్యేక ఐపీ నంబర్లు కేటాయిస్తారు. కానీ రాష్ట్రంలో ఫైబర్‌గ్రిడ్ కార్పొరేషన్‌కు మాత్రం ఈ నిబంధనలేదు. రాష్ట్రంలో ఇప్పటికే దాదాపు 12 లక్షల వరకు ఫైబర్‌నెట్ కనెక్షన్లు ఇచ్చారు. కానీ వాటికి ప్రత్యేక ఐపీ నంబర్లు కేటాయించలేదు. ఈ ఫైబర్‌గ్రిడ్ కనెక్షన్లలో ఎవరైనా టెలికాం, సైబర్ చట్టాలకు విరుద్ధంగా అక్రమాలకు పాల్పడితే అందుకు బాధ్యులు ఎవరో గుర్తించడం చాలా కష్టం. టీడీపీ ఎన్నారై విభాగం నేతృత్వంలో అక్రమాలు హైదరాబాద్ నుంచి ఓట్ల తొలగింపు వ్యూహం బెడిసికొట్టడంతో రాష్ట్రంలో ఎంపిక చేసిన కేంద్రాల నుంచి వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపు, ఇతర ఎన్నికల అక్రమాలు కొనసాగించమని ముఖ్యనేత ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈమేరకు ఫైబర్‌గ్రిడ్ లిమిటెడ్‌లోని ముఖ్యనేత సన్నిహితులు రంగంలోకి దిగారు. టీడీపీ ఎన్నారై విభాగం నేతృత్వంలో అక్రమాలకు దిగనున్నారు. ఇందులో కీలకంగా వ్యవహరిస్తున్న ఒక వ్యక్తి ఇటీవల విజయవాడలో ఓ సంస్థను ప్రారంభించారు. టీడీపీకి అనుకూలంగా ఎన్నికల ప్రచారం కోసమే ఆ సంస్థ పనిచేస్తుంది. ప్రస్తుతం ఆ సంస్థ ఫైబర్‌గ్రిడ్ కనెక్షన్లను ఉపయోగిస్తూ ఎన్నికల అక్రమాలకు తెరతీసింది. ప్రభుత్వం ప్రజాసాధికార సర్వే ద్వారా సేకరించిన ప్రజల సమాచారం మొత్తం ఆ సంస్థకు చేరవేశారు. ఓటర్ల వివరాలతో తుది జాబితా ప్రకటించేలోగానే వీలైనంతమంది వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకోసం భారీగా దరఖాస్తులు ఆన్లైన్లో అప్లోడ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అంతేగాక ఎన్నికల షెడ్యూల్ విడుదల అయినప్పటి నుంచి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆ పార్టీ ఇతర ముఖ్యనేతలు, పార్టీ వ్యవహారాలపై పెద్ద ఎత్తున సోషల్‌మీడియాలో దుష్ప్రచారం చేయాలన్నది టీడీపీ వ్యూహం. 2014 ఎన్నికల్లో కూడా ఆ ఎన్నారై మరికొందరితో కలసి ఇదే విధంగా వైఎస్ జగన్‌పై సోషల్ మీడియాలో దుష్ప్రచారానికి నేతృత్వం వహించారు. మన రాష్ట్రం నుంచే ఈ అక్రమాలకు పాల్పడితే కేసులు లేకుండా చూసుకోవచ్చని భావిస్తున్నారు. -
వైఎస్సార్సీపీ ఓట్లు తొలగించే కుట్ర!
సాక్షి, హైదరాబాద్ : తెలుగు ద్రోహుల పార్టీగా, తెలుగు ప్రజల సమాచార దొంగల పార్టీగా తెలుగుదేశం పార్టీ మారిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, శాసనసభా ప్రజాపద్దుల సంఘం (పీఏసీ) చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని 4.5 కోట్ల ప్రజల వ్యక్తిగత సమాచారం మొత్తాన్ని ప్రైవేటు కంపెనీలకు అప్పగించి, తద్వారా ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఓట్లను తొలగించడమే సీఎం చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. హైదరాబాద్‌లోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం వద్ద భద్రంగా ఉండాల్సిన ప్రజల వ్యక్తిగత సమాచారం ప్రైవేటు సంస్థల వద్దకు ఎలా వెళ్లిందో సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమాచారం పొందిన బ్లూఫ్రాగ్, ఐటీ గ్రిడ్స్ సంస్థలకు ప్రభుత్వంలోని పెద్దలతో సంబంధాలున్నాయని చెప్పారు. బ్లూఫ్రాగ్ సంస్థకు పంటల డేటా సేకరణ, సమాజ వికాసం, విద్యుత్ స్తంభాలకు జియో ట్యాగింగ్ వంటి కోట్లాది రూపాయలతో ముడిపడిన అనేక కాంట్రాక్టులను అప్పగించారని తెలిపారు. మరోవైపు.. సేవామిత్ర యాప్ ద్వారా ఐటీ గ్రిడ్స్ సంస్థ టీడీపీకి సేవలు అందిస్తోందన్నారు. ఈ రెండు సంస్థలకు చెందిన అశోక్, ఫణికుమార్‌లు అమరావతిలోని సీఎంవో లోనే ఉంటారని వివరించారు. వీటితోపాటు మరో మూడు కంపెనీల ప్రమేయం ఈ బాగోతంలో ఉన్నట్లు స్పష్టమవుతోందని బుగ్గన తెలిపారు. ఆధార్ డేటాను, ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా సమాచారాన్ని, ప్రభుత్వం చేయించిన ప్రజాసాధికార సర్వే సమాచారాన్ని ఇంటిగ్రేట్ చేసి టీడీపీకి చెందిన సేవామిత్ర యాప్‌లోకి ఎక్కించి తదుపరి ప్రతిపక్ష సానుభూతిపరుల ఓట్లను తొలగించేలా పన్నాగం పన్నారని ఆయన ఆరోపించారు. ‘సేవామిత్ర’లో సమస్త సమాచారం సేవామిత్ర యాప్ ఓపెన్ చేస్తే ప్రతీ ఓటరు కలర్ ఫొటోతో పాటు భార్యాపిల్లల పేర్లు, వయసు, వారి వ్యక్తిగత వివరాలతో కూడిన మొత్తం సమాచారం, బ్యాంకు ఖాతాలు, వారికి ప్రభుత్వం నుంచి అందిన లబ్ధి.. ఇలా చాలా సమాచారం దర్శనమిస్తోందని.. కలర్ ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితా కేవలం ఎన్నికల సంఘం వద్ద మాత్రమే ఉంటుందని.. అది ఐటీ గ్రిడ్స్ వద్ద, సేవామిత్ర యాప్‌లో ఎలా ఉందని బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రశ్నించారు. దీంతో పాటు వ్యక్తిగత సమాచారం గోప్యతను పాటించాలని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిన ఆధార్ డేటా కూడా ఈ కంపెనీలకు ఎలా చేరిందన్నారు. ఐటీ గ్రిడ్స్ సంస్థ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 2014లో మాత్రమే ఏర్పడిందన్నారు. ఆ తరువాతే ప్రజాసాధికార సర్వేను ప్రభుత్వం చేపట్టిందని, అనంతరం ఈ సంస్థల ద్వారా ఒక పథకం ప్రకారం కుట్రలు కొనసాగించినట్లు అర్థమవుతోందని ఆయన పేర్కొన్నారు. ఇంత బాగోతం నడిపిన సీఎం తన బండారం బయటపడడంతో ఇతరులపై విమర్శలు చేయడం విచిత్రంగా ఉందని.. తిరిగి దబాయించడం చంద్రబాబుకే చెల్లిందన్నారు. ఏడాదిన్నరగా ఓట్ల తొలగింపు.. ఇదిలా ఉంటే.. ఓట్ల తొలగింపు వ్యవహారం ఏడాదిన్నరగా జరుగుతోందని, దీనిపై తమ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి, లోకేశ్వరరెడ్డిలు పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. ఇవన్నీ బయటపడడంతో హడావుడిగా సేవామిత్ర యాప్‌లో కలర్ ఫొటోలతో కూడిన ఓటరు జాబితాలను, ప్రభుత్వ లబ్ధిదారుల సమాచారాన్ని తొలగించారన్నారు. ప్రజాసాధికార సర్వే డేటా మొత్తం అహ్మద్ బాబు బాధ్యుడిగా ఉన్న ఆర్టీజీఎస్ వద్ద ఉందని.. అలాగే, యూఐడీఏఐలో గౌరవాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించిన మాజీ ఐఎఎస్ అధికారి జె.సత్యనారాయణ ఏపీలో ప్రభుత్వ ఐటీ సలహాదారుగా ఉన్నారని బుగ్గన వెల్లడించారు. ఈయనకు గతంలో ప్రభుత్వం ఇంటిస్థలం కేటాయించినప్పటికీ మళ్లీ తాజాగా అమరావతిలో ఇచ్చారన్నారు. సత్యనారాయణను ఐటీ సలహాదారు బాధ్యతల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. స్టేట్ రెసిడెంట్స్ డేటా హబ్‌లో ఉండే సమాచారం అధారంగా ఓటర్ల జాబితాను టీడీపీ, వైఎస్సార్సీపీ, తటస్థ, స్థానికంగా లేని వారు.. ఇలా 4 విభాగాలుగా విభజించారని బుగ్గన చెప్పారు. ఈ డేటా ఆధారంగా వైఎస్సార్సీపీ వారిని గుర్తించి వారి ఓట్లు తొలగింపజేయడం, తటస్థ ఓటర్లను ప్రలోభ పెట్టడం, స్థానికంగా లేనివారి ఓట్లను తామే వేసుకోవడానికి పన్నాగం పన్నారన్నారు. ఎన్నికల సంఘం దగ్గర మాత్రమే ఉండాల్సిన ఈ సమాచారాన్ని కూడా వారికి తెలియకుండా దొంగిలించారని ఆయన ఆరోపించారు. గతంలో ఓటరు పేరు చేర్చాలన్నా, తొలగించాలన్నా టీచర్లు ఇతర రెగ్యులర్ సిబ్బంది ద్వారా చేయించే వారని, ప్రస్తుతం ఈ కార్యక్రమం చేస్తున్న బీఎల్ఓలు, అంగన్వాడీ కార్యకర్తలంతా కాంట్రాక్టు సిబ్బందే కావడంతో వారిపై టీడీపీ నేతలు ఒత్తిడి చేస్తూ అక్రమాలకు దిగుతున్నారన్నారు. అసలైన దోషులెవరో తేల్చాలి ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించారా? లేక ఆ కంపెనీయే అపహరించిందా.. దీని వెనుక ఎవరున్నారు? అసలు దోషులెవరు? అన్న అంశాలు తేలాలని.. దీనిపై ఎన్నికల సంఘం లోతుగా దర్యాప్తుచేసి నిందితులపై చర్యలు తీసుకోవాలని బుగ్గన డిమాండ్ చేశారు. ఆధార్ డేటా కూడా వీరికి ఎలా చేరిందో యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) విచారణ చేసి చర్యలు చేపట్టాలన్నారు. మరోవైపు.. బ్యాంకు ఖాతాలు, పేటీఎం వంటి యాప్‌లు, ఈమెయిళ్ల పాస్‌వర్డ్‌లను వెంటనే మార్చుకోవాలని ప్రజలకు బుగ్గన సూచించారు. ఈ డేటాను దుర్వినియోగం చేస్తే ప్రజలకు చాలా నష్టం జరిగే ప్రమాదముందని హెచ్చరించారు. -
సర్కార్ లక్ష్యం.. వైఎస్సార్సీపీ ఓట్ల తొలగింపే
సాక్షి, నెట్వర్క్: వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సీఎం చంద్రబాబు అన్ని రకాల అక్రమాలకు తెరలేపారు. ఈ ఐదేళ్లలో అభివృద్ధి, సంక్షేమాన్ని గాలికొదిలేసి అవినీతికి ఆలవాలంగా మారిన టీడీపీ సర్కార్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున డబ్బు ఎర చూపి ఓట్లు దండుకునే ప్రయత్నాలు సాగిస్తోంది. ఇంతటితో ఆగక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నవారి ఓట్లను తొలగించి లబ్ధి పొందే దిగజారుడు పనులకు దిగింది. కొంతకాలంగా అధికార పార్టీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా సర్వేల ద్వారా ప్రజాభిప్రాయాన్ని సేకరించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులయితే వారి ఓట్లను తొలగిస్తున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఓట్ల తొలగింపు కార్యక్రమాన్ని టీడీపీ వేగవంతం చేసింది. టెక్నాలజీని ఉపయోగించుకుని ఈ దురాగతానికి పాల్పడుతోంది. ఫామ్–7 ద్వారా పెద్ద ఎత్తున వైఎస్సార్సీపీ మద్దతుదార్ల ఓట్లు తొలగిస్తోంది. ఓటరు తన ఓటును తొలగించాలంటూ తానే ఫామ్–7 దరఖాస్తును ఇచ్చినట్లు బోగస్ సంతకాలతో దరఖాస్తులు నింపి ఎన్నికల అధికారులకు కుప్పలుతెప్పలుగా టీడీపీ నేతలు సమర్పించారు. పథకం ప్రకారమే.. ఓట్ల తొలగింపునకు కుట్ర పథకం ప్రకారం.. ఓట్లు తొలగించాలంటూ ఫామ్–7 దరఖాస్తులు ఇచ్చే బాధ్యతలను నియోజకవర్గాలవారీగా అధికార పార్టీ నేతలకు టీడీపీ అప్పగించింది. అధికార పార్టీ అక్రమంగా ఓట్ల తొలగింపు కోసం ఫామ్–7 దరఖాస్తులను ఇవ్వడాన్ని గుర్తించిన వైఎస్సార్సీపీ నేతలు అప్రమత్తమయ్యారు. కొద్దిరోజులుగా ఎన్నికల అధికారుల కార్యాలయాల వద్దే ఉండి వెరిఫికేషన్ కోసం పట్టుబట్టారు. కొన్ని దరఖాస్తులు వైఎస్సార్సీపీ నేతల పేరునే ఇచ్చి ఉండడాన్ని గమనించి అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీస్‌స్టేషన్‌లో కేసులు సైతం నమోదు చేయించారు. విచారణను వేగవంతం చేయాలని పట్టుబడుతున్నా అధికార పార్టీ నేతల ఒత్తిడితో అధికారులు, పోలీసులు స్పందిస్తున్న దాఖలాలు లేవు. చేస్తాం, చూస్తామంటూ దాటవేస్తున్నారు. పైగా ఇదేమిటని ప్రశ్నించిన వైఎస్సార్సీపీ నేతలపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు. సోమవారం ఒంగోలు తహశీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న వ్యవహారాన్ని పరిశీలించేందుకు వచ్చిన వైఎస్సార్సీపీ ఒంగోలు నగర అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు, ఆయన అనుచరులపై పోలీసులు దౌర్జన్యం చేశారు. అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఫామ్–7 దరఖాస్తుల అక్రమాలపై విచారణ సరిగా జరిగే పరిస్థితి కనిపించడం లేదు. కాగా, అధికార పార్టీ నేతలు వైఎస్సార్సీపీ ఓట్లను తొలగించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రకాశం జిల్లాలో ఓట్లు తొలగించాలని మొత్తం 53,450 దరఖాస్తులు అందినట్టు తెలుస్తోంది. నియోజకవర్గాలవారీగా.. దర్శిలో 2,500కు పైగా, అద్దంకిలో 5,640, చీరాలలో 11 వేలు, గిద్దలూరులో 2 వేలు, కందుకూరులో 10 వేలు, కొండెపిలో 2 వేలు, మార్కాపురంలో 7 వేలు, సంతనూతలపాడులో 4,423, ఒంగోలులో 3 వేలు, పర్చూరులో 5,201, కనిగిరిలో 686 దరఖాస్తులు అధికారులకు అందాయి. ఓట్లు తొలగించాలంటూ ఓటర్ల పేరిటే అక్రమ దరఖాస్తులు శ్రీకాకుళం జిల్లాలో ఓట్లు తొలగించాలని ఆన్లైన్లో ఫామ్–7 దాఖలు చేసిన వారిపై పోలీసులు కేసులకే పరిమితమవుతున్నారు. వైఎస్సార్సీపీ నేతల ఫిర్యాదులపై మౌనం పాటిస్తున్నారు. విజయనగరం జిల్లాలో ఇప్పటివరకు ఓట్ల తొలగింపు కోసం 28 వేల దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ఆన్లైన్లో వచ్చినవే 24 వేలు. తప్పుడు దరఖాస్తులపై జిల్లా వ్యాప్తంగా పది కేసులు నమోదయ్యాయి. నియోజకవర్గాలవారీగా పరిశీలిస్తే... కురుపాంలో 3,349, సాలూరులో 3,643, చీపురుపల్లిలో 7,296, గజపతినగరంలో 4,845, విజయనగరంలో 698, నెల్లిమర్లలో 3,800, బొబ్బిలిలో 8,734, పార్వతీపురంలో 422, ఎస్.కోటలో 7,534 దరఖాస్తులు ఓట్లు తొలగించాలని ఎన్నికల అధికారులకు అందాయి. విశాఖ జిల్లాలో ఈ ఏడాది జనవరి 23, 24 తేదీల్లో నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో కొత్త ఓటర్ల నమోదు కోసం 13,999 దరఖాస్తులు, తొలగింపుల కోసం 1955 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. అలాంటిది జనవరి 25 నుంచి మార్చి 1 వరకు జిల్లాలో కొత్త ఓట్ల నమోదు కోసం ఏకంగా 2,08,700 దరఖాస్తులందాయి. ఇక తొలగింపుల కోసం ఏకంగా 74,848 దరఖాస్తులందాయి. కేవలం వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపే లక్ష్యంగా టీడీపీ శ్రేణులు ఆన్లైన్లో ఫామ్–7 ద్వారా దరఖాస్తు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్సార్సీపీ బూత్ కన్వీనర్ల ప్రమేయం లేకుండా ఓట్ల తొలగింపునకు ఆన్లైన్లో నకిలీ అభ్యర్థనలు వెళ్తున్నాయి. గత వారం రోజులుగా ప్రతిచోటా ఈ వ్యవహారం బయటపడుతూనే ఉంది. జిల్లా వ్యాప్తంగా 90 వేల ఓట్లు తొలగించేందుకు అజ్ఞాత వ్యక్తుల ముసుగులో టీడీపీ నేతలు యత్నించారు. మీసేవ, ఇంటర్నెట్ కేంద్రాలను ఆధారంగా చేసుకుని వైఎస్సార్సీపీ బూత్ కన్వీనర్ల పేరుతో వైఎస్సార్సీపీ ఓట్లను తొలగించేందుకు కుట్ర చేశారు. వైఎస్సార్సీపీ నేతల ఫిర్యాదులతో అప్రమత్తమైన అధికారులు మీసేవా కేంద్రాలు, పలువురు వ్యక్తులపై పోలీసుస్టేషన్లలో ఫిర్యాదు చేసినప్పటికీ ఈ మొత్తం బాగోతం వెనక ఐటీ గ్రిడ్, బ్లూ ఫ్రాగ్ వంటి సంస్థలు ఉన్నాయన్నది తెలియగానే ఎప్పుడు ఎవరి ఓటు పోతుందోనన్న ఆందోళన రేకెత్తుతోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఫామ్–7 ద్వారా ఓట్లు తొలగించాలని 55,062 దరఖాస్తులు వచ్చాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల అధికారులు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో గుర్తింపు పొందిన పార్టీలకు రెండేసి సెట్లు చొప్పున ఓటర్ల జాబితాను గతంలో అందించారు. అప్పటి నుంచే అధికార పార్టీ తనకు దక్కని ఓట్లపై కన్నేసి తొలగింపు పర్వానికి తెరలేపింది. ఓటర్ల జాబితాలను పక్కనపెట్టుకుని అందులో అధికార పార్టీకి కచ్చితంగా ఓటు వేయరని భావించే వారిని లక్ష్యంగా చేసుకుంది. కృష్ణా జిల్లాలో వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపే లక్ష్యంగా అధికార టీడీపీ నేతలు కుట్రపన్నారు. అందులో భాగంగా ఓటర్ల పేరిటే తమ ఓట్లను తొలగించాలంటూ ఆన్లైన్లో 62 వేల నకిలీ దరఖాస్తులు సమర్పించారు. ఓట్ల తొలగింపు ప్రక్రియలో టీడీపీ కుట్ర వెలుగుచూడటంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ఫామ్–7 దరఖాస్తులు చేసిన అక్రమార్కులపై క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. జిల్లావ్యాప్తంగా వేలాది దరఖాస్తులు వస్తే కేవలం 15 మందిపై మాత్రమే కేసులు నమోదు చేశారు. అందులో మైలవరంలో 4, జగ్గయ్యపేటలో 3, మచిలీపట్నంలో 3, అవనిగడ్డలో 3, పెనమలూరులో 1, విజయవాడ తూర్పులో 1 కేసు నమోదు చేశారు. ఒక్క గుంటూరు జిల్లాలోనే 1,09,079 దరఖాస్తులు ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించడంపై గుంటూరు జిల్లా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క గుంటూరు జిల్లాలోనే ఫిబ్రవరి 28 నాటికి ఓటర్ల తొలగింపు కోసం 1,09,079 దరఖాస్తులు వచ్చాయి. కర్నూలు జిల్లాలో అనుమానాస్పద ఓటర్లు, డూప్లికేట్ ఓట్ల పేరుతో భారీగా వైఎస్సార్సీపీ మద్దతుదారులు, సానుభూతిపరుల ఓట్లను తొలగించారు. ఓటర్ల జాబితా సవరణలో భాగంగా ఓట్లు తొలగించాలని 35 వేలకు పైగా ఫామ్–7 దరఖాస్తులు వచ్చాయి. వీటితోపాటు అనుమానాస్పద ఓటర్లు, డూప్లికేట్ పేర్లతో 65 వేలకు పైగా ఓటర్లను తొలగించారు. ఇదంతా ఏపీ ఐటీ గ్రిడ్ సంస్థ చేసిందని స్పష్టమవుతోంది. ఫామ్–7 దరఖాస్తులను విచ్చలవిడిగా అప్లోడ్ చేయిస్తూ వైఎస్సార్సీపీ ఓట్లు, ఉద్యోగుల ఓట్లకు భారీగా కోత పెట్టడానికి టీడీపీ పథకాన్ని రచించింది. ఈ నెల 3 మధ్యాహ్నం నాటికి జిల్లాలో 65,478 ఓట్లను తొలగించాలని దరఖాస్తులు రావడం దీనికి నిదర్శనం. ఇందులో 90 శాతం దరఖాస్తులు ఆన్లైన్ ద్వారానే రావడం గమనార్హం. అత్యధికంగా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో 9,996 దరఖాస్తులు రాగా.. 4,959ను అధికారులు ఆమోదించారు. ఆదోని, పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాల్లోనూ దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై జిల్లాలో ఇప్పటివరకు 8 క్రిమినల్ కేసులను నమోదు చేశారు. వైఎస్సార్ జిల్లాలో ఓడిపోతామన్న భయం వెంటాడుతుండటంతో టీడీపీ.. వైఎస్సార్సీపీ ఓట్ల తొలగింపునకు దొంగ దరఖాస్తులను అందజేస్తోంది. జిల్లాలో చాపాడు మండలం కుచ్చుపాప గ్రామానికి చెందిన ఎం.లక్షుమ్మ కొద్దికాలం క్రితం మృతి చెందింది. గ్రామానికి చెందిన 19 ఓట్లు తొలగించాలని లక్షుమ్మ పేరుతో టీడీపీ నేతలు దరఖాస్తు చేయడం గమనార్హం. పులివెందులలో వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి ఓటును తొలగించాలని దరఖాస్తు చేసిన వైనం విస్మయం కలిగించింది. జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో సుమారు 40 వేల నుంచి 50 వేల ఓట్ల తొలగింపునకు టీడీపీ నేతలు పథక రచన చేశారు. చిత్తూరు జిల్లాలో ఫిబ్రవరి 28 వరకు ఓట్లు తొలగించడానికి ఆన్లైన్ ద్వారా 89,547 దరఖాస్తులు అందాయి. అందులో ఇప్పటివరకు 11,576 మందిని మాత్రమే అధికారులు విచారించారు. నియోజకవర్గాలవారీగా తంబళ్లపల్లెలో 8,308, పీలేరులో 5,345, మదనపల్లెలో 2,709, పుంగనూరులో 6,825, చంద్రగిరిలో 20,128, తిరుపతిలో 3,850, శ్రీకాళహస్తిలో 4,385, సత్యవేడులో 5,916, నగరిలో 3,686, జీడీ నెల్లూరులో 8025, చిత్తూరులో 4,600, పూతలపట్టులో 5,630, పలమనేరులో 6,857, కుప్పంలో 3,283 దరఖాస్తులు వచ్చాయి. అనంతపురం జిల్లాలో ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరుల ఓట్ల తొలగింపునకు టీడీపీ భారీ కుట్రకు తెరతీసింది. దీనికోసం సర్వే పేరిట జిల్లాలో కొన్ని బృందాలను రంగంలోకి దింపారు. ఇవి ఆన్లైన్లో ఫామ్–7 పేరుతో ఓట్ల తొలగింపునకు దరఖాస్తు చేశాయి. జిల్లావ్యాప్తంగా ఫామ్–7 కింద 79,819 దరఖాస్తులు వస్తే అందులో 22,202 దరఖాస్తుల పరిశీలనకు అధికారులు సిఫార్సు చేశారు. ఇంతలో ఈ కుట్రను పసిగట్టి వైఎస్సార్సీపీ నేతలు సాక్ష్యాలతో అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పూర్తిగా కుట్ర ఉందని తేలడం, ఎన్నికల కమిషన్‌ను కలిసేందుకు వైఎస్సార్సీపీ సిద్ధం కావడంతో సందిగ్ధంలో పడ్డారు. తక్కిన 57,617 దరఖాస్తులను విచారణకు పంపకుండా తాత్కాలికంగా నిలిపేశారు. గతేడాది జిల్లావ్యాప్తంగా 1,01,772 ఓట్లను అధికారులు తొలగించారు. ఇందులో అత్యధికంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో 60 వేల ఓట్లు ఉన్నాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పది నియోజకవర్గాల్లో ఓటర్లకు తెలియకుండానే వారి ఓట్లు తొలగింపునకు ఆన్లైన్లో దాదాపు 25 వేల దరఖాస్తులు సమర్పించినట్లు తెలిసింది. ఆత్మకూరు, గూడూరు, సూళ్లూరుపేట, కావలి నియోజకవర్గాల్లో అధికంగా అక్రమ దరఖాస్తులు నమోదు చేసినట్లు సమాచారం. ఏపీలో ఓటర్ల డేటా దుర్వినియోగం చేస్తున్న ఐటీ గ్రిడ్ సంస్థ నిర్వాహకుడు డాకవరం అశోక్ అల్లూరు వాసే కావడంతో జిల్లాలో కలకలం రేగింది. నా పేరుతో 29 దరఖాస్తులు వచ్చాయట నా పేరుతో 29 మంది ఓట్లను తొలగించాలని దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఇది ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు. కేవలం నా ఆధార్ కార్డు నంబర్ తెలుసుకున్న టీడీపీ నేతలు ఇలా నా పేరుతో దరఖాస్తులు నింపి గొడవలు సృష్టిస్తున్నారు. ఎన్నికల అధికారులు పూర్తిస్థాయిలో విచారించి కఠిన చర్యలు తీసుకోవాలి. – బి.వెంకటరామిరెడ్డి, హజరత్‌గూడెం, కంభం మండలం మా ఇంట్లో మూడు ఓట్లు తొలగించారు నేను గిద్దలూరులో నివాసం ఉంటున్నాను. నా ఓటుతోపాటు, నాభార్య, కోడలి ఓట్లను తొలగించారు. కొంత కాలంగా ‘సాక్షి’ పత్రిక చదువుతున్నాను. అందుకే మా ఓట్లను తొలగించారని చెబుతున్నారు. తిరిగి ఓటును చేర్పించుకునేందుకు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాను. – పగిడి వెంకటేశ్వర్లు, మాజీ సైనికుడు, గిద్దలూరు టీడీపీ నేతల ఆగడాలకు అంతు లేకుండా పోతోంది. అనంతపురం 45వ డివిజన్ మాజీ కార్పొరేటర్, వైఎస్సార్సీపీ నేత టీవీ చంద్రమోహన్‌రెడ్డి కుమారుడు టీవీ సాయి చరణ్ రెడ్డి ఓటును తొలగించాలని టీడీపీ నేతలు దరఖాస్తు చేశారు. దీనిపై చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
1.48లక్షల ఓట్లు తొలగింపు
-
ఓట్ల తొలగింపుపై విచారణ చేస్తే నీకెందుకు భయం?
సాక్షి, హైదరాబాద్: ఓట్ల తొలగింపుపై పోలీసులు విచారణ చేస్తే మీకెందుకు భయం పట్టుకుందని సీఎం చంద్రబాబును వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ప్రశ్నించారు. ఆదివారం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన తంబళ్లపల్లె నియోజకవర్గానికి చెందిన కురబలకోట మండలం జెడ్పీటీసీ ధనలక్ష్మి భర్త ఎం.రంగారెడ్డితో కలిసి లోటస్‌పాండ్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో గెలిచేందుకు టీడీపీ ఏ విధంగా ఓట్లు తొలగిస్తుందో ప్రజలందరికీ తెలిసిపోయిందన్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కుటుంబసభ్యుల ఓట్లనే తొలగించే ప్రయత్నం చేశారంటే.. ఇక సాధరణ ప్రజల పరిస్థితేంటో అర్థం చేసుకొవచ్చన్నారు. టీడీపీ కుట్రలకు వివేకానందరెడ్డి ఓటు తొలగింపే సాక్ష్యమన్నారు. సర్వేల పేరిట ఇళ్లకు వచ్చి ఓట్లు తొలగిస్తున్న టీడీపీ కుట్రను బయటపెట్టామన్నారు. దీంతో ఇప్పుడు కొత్త కుట్రకు తెరలేపారన్నారు. ఓట్ల తొలగింపు వ్యవహారాన్ని అంత సులభంగా వదలమని చెప్పారు. ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని.. ఈ విషయంలో ఎంత వరకైనా వెళ్తామని చెప్పారు. తప్పు చేయడం వల్లే చంద్రబాబు అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్సీపీకి చంద్రబాబు తనయుడు నారా లోకేశే పెద్ద ఆస్తి అని మిథున్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఆయనకు ఓటు విలువ తెలియదని.. ఓటింగ్ ద్వారా గెలిచింది కూడా లేదని ఎద్దేవా చేశారు. లోకేశ్ తెలివితక్కువ స్టేట్మెంట్ల వల్ల వైఎస్సార్సీపీకే ఎక్కువ మేలు జరుగుతుందన్నారు. కాగా, రంగారెడ్డి చేరికతో తంబళ్లపల్లె నియోజకవర్గంలో పార్టీకి బలం చేకూరిందని మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. వైఎస్ జగన్ కుటుంబానికి రంగారెడ్డి సన్నిహితుడని.. ఆయనకు ప్రజల్లో మంచి పేరుందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ప్రజలు బ్రహ్మరథం పట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈసారి వైఎస్ జగన్‌కు అవకాశమివ్వాలని రాష్ట్ర ప్రజలు కృతనిశ్చయానికి వచ్చారని చెప్పారు. ప్రజల ఆకాంక్షను అర్థం చేసుకున్న నాయకులంతా టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి వచ్చి చేరుతున్నారన్నారు. -
పక్కా స్కెచ్‌తోనే టీడీపీ దరఖాస్తులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెదబాబు డైరెక్షన్లో చినబాబు యాక్షన్‌తో లక్షలాది ఓట్ల తొలగింపునకు పాల్పడినట్లు స్పష్టమవుతోంది. ప్రతీ జిల్లాలో 90 శాతం అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుల ఓట్లను తొలగించేందుకు చినబాబు బృందం స్కెచ్ వేసింది. ఇప్పుడా పథకం వికటించడంతో వారు ఎదురుదాడికి దిగడమే కాకుండా వైఎస్ఆర్సీపీయే ఓట్ల తొలగింపునకు పాల్పడుతోందని ఆరోపిస్తోంది. ఇది దొంగే ‘దొంగా దొంగా’ అన్నట్లుగా ఉందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో గత ఏడాది నవంబరు నుంచి ఇప్పటివరకు ఓట్లు తొలగించాలంటూ సంబంధిత ఓటర్లతో సంబంధం లేకుండా వారి పేర్లతోనే చినబాబు బృందాలు ఆన్లైన్ ఫాం–7ను సమర్పించాయి. ఈ విధంగా ఆన్లైన్లో ఓట్ల తొలగింపునకు 8,73,500 దరఖాస్తులు వచ్చాయి. ఇంత పెద్దఎత్తున ఓట్ల తొలగింపునకు దరఖాస్తులు రావడంతో ఎన్నికల అధికారులకు సందేహం వచ్చింది. ఇది సహజంగా లేదని గుర్తించి క్షేత్రస్థాయి తనిఖీలకు ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో అసలు గుట్టురట్టయింది. నిర్ధారించుకున్న తర్వాతే.. ఓట్ల తొలగింపునకు వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించిన తర్వాతగానీ తొలగించరాదని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో ఇప్పటివరకు తనిఖీలు నిర్వహించి 1.48 లక్షల ఓట్లను తొలగించగా.. మరో 30 వేలకు పైగా దరఖాస్తుల్లో వాస్తవంలేదని అధికారులు తిరస్కరించారు. మరో 24 వేలకు పైగా వెరిఫికేషన్‌లో ఉన్నాయి. మిగిలిన 6.70 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు అన్నింటినీ క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసేవరకూ తొలగించబోమని అధికారులు స్పష్టంచేశారు. అయితే, ఎన్నికల నాటికి తనిఖీలు పూర్తిచేసి తొలగించడమా లేదా అన్నది చేయాలి. దరఖాస్తు తిరస్కరించినట్లయితే వారికి ఓటు హక్కు వస్తుంది. అలా కాకుండా పెండింగ్‌లో ఉంటే ఓటు హక్కు ఉండదనే సందేహాలు ఓటర్ల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘం తర్వగా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. కార్యాలయం నుంచే.. ఓట్ల తొలగింపు వ్యవహారం ఇటీవల గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలో బయటపడింది. సాక్షాత్తూ రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి కార్యాలయం నుంచి టీడీపీ కార్యకర్త పేరుతో ఆన్లైన్లో రొంపిచర్ల మండలానికి చెందిన కోటేశ్వరరావు అనే వ్యక్తి ఓటు తొలగించాలంటూ ఫాం–7 సమర్పించారు. దీనిపై అధికారులు.. మీ ఓటుఎందుకు తొలగించరాదో చెప్పాలంటూ కోటేశ్వరరావుకు నోటీసు జారీచేశారు. దీంతో కోటేశ్వరరావు తన ఓటును ఎందుకు తొలగిస్తారంటూ అధికారులను నిలదీశాడు. దీనిపై అధికారులు స్పందిస్తూ.. ఫలానా వ్యక్తి మీ ఓటు తొలగించాలంటూ ఫాం–7 సమర్పించారని కోటేశ్వరరావుకు చెప్పారు. దీనిపై కోటేశ్వరరావు సదరు టీడీపీ కార్యకర్త దగ్గరకు వెళ్లి ఆరా తీశాడు. అయితే, ఆ టీడీపీ కార్యకర్త తానెలాంటి దరఖాస్తు సమర్పించలేదని చెప్పాడు. చివరికి అతను సమర్పించలేదని లిఖితపూర్వకంగా రాసి ఇచ్చిన తరువాతే అధికారులు కోటేశ్వరరావు ఓటును తొలగించకుండా జాబితాలో ఉంచారు. -
ఓట్ల తొలగింపునకు భారీగా అక్రమ దరఖాస్తులు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో పెద్దఎత్తున ఓట్ల తొలగింపునకు అక్రమ దరఖాస్తులు వచ్చిన మాట వాస్తమేనని, ఈ విషయాన్ని ఎన్నికల సంఘం గుర్తించిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదీ వెల్లడించారు. ఓటర్లకు తెలియకుండా వారి పేర్లతోనే ఇతరులు ఫారం–7 సమర్పించారని, ఆన్లైన్ ద్వారా ఇటువంటి తప్పుడు, అక్రమ చర్యలకు పాల్పడిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టంచేశారు. ఆన్లైన్ ద్వారా ఓట్లు తొలగించాలంటూ అసలైన ఓట్లర్లతో సంబంధం లేకుండా ఇతరులు అక్రమంగా ఫారం–7 సమర్పించిన వారిని గుర్తించే చర్యలు సాగుతున్నాయని ఆదివారం ఒక ప్రకటనలో ఆయన తెలిపారు. మోసపూరిత చర్యలకు పాల్పడే వ్యక్తులు వేల సంఖ్యలో ఓట్లు తొలగింపునకు ఆన్లైన్లో ఫారం–7 సమర్పించినట్లు వారం రోజుల క్రితం గుర్తించామని ద్వివేదీ వివరించారు. అసలైన ఓటర్లకు తెలియకుండానే వారి పేర్లతో ఇతరులు ఫాం–7 సమర్పించారన్నారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు యంత్రాంగంతో పాటు జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసినట్లు ఆయన పేర్కొన్నారు. వారిపై విచారణ జరపవడంతో పాటు ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా కలెక్టర్లకు సూచించామని వివరించారు. ఈ విషయంలో ఓటర్లు కూడా సహకరించాల్సిందిగా కోరారు. తొమ్మిది జిల్లాల్లో ఎఫ్ఐఆర్లు కాగా, ఇప్పటివరకు 45 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ద్వివేదీ తెలిపారు. ఐపీసీ సెక్షన్లు 120బి, 419, 420, 465, 471లతోపాటు ఐటీ చట్టం సెక్షన్లు 66, 66డి,లతో పాటు ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్–31 కింద తొమ్మిది జిల్లాల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఆయన వివరించారు. శ్రీకాకుళం జిల్లాలో మూడు, తూర్పుగోదావరి జిల్లాలో 14, కృష్ణా జిల్లాలో మూడు, గుంటూరు జిల్లాలో ఒకటి, ప్రకాశం జిల్లాలో నాలుగు, చిత్తూరు జిల్లాలో మూడు, అనంతపురం జిల్లాల్లో ఒకటి, కర్నూలు జిల్లాలో 8, విశాఖలో 8 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. ఫాం–7 సమర్పించిన వారిలో తూర్పుగోదావరి జిల్లాల్లో మీ సే–వకు చెందిన ఆరుగురు సిబ్బంది హస్తం ఉందని.. జిల్లా కలెక్టర్ వారిపై చర్యలను తీసుకుంటున్నారని ద్వివేదీ పేర్కొన్నారు. ఐపీ చిరునామా కోసం సీ–డాక్‌కు లేఖ ఈ అక్రమ వ్యవహారాల్లో ఎవరెవరి భాగస్వామ్యం ఉందో మరింత లోతుగా పోలీసు దర్యాప్తు చేసేందుకు ఐపీ చిరునామా ఇవ్వాల్సిందిగా సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సీ–డాక్)కు లేఖ రాసినట్లు ద్వివేదీ తెలిపారు. బోగస్ దరఖాస్తుల ఆధారంగా ఎవ్వరి ఓట్లనూ తొలగించబోమని, సవివరమైన తనిఖీలు, విచారణ జరుపుతామని.. ఈ విషయంలో ఓటర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టంచేశారు. సీఈవో ఆమోదంతోనే ఓట్ల తొలగింపు జరుగుతుందన్నారు. -
ఏపీలోనే ఎక్కువ ఎన్నికల వ్యయం
సాక్షి, అమరావతి: దేశంలో అన్ని రాష్ట్రాలకంటే అత్యధిక ఎన్నికల వ్యయం ఆంధ్రప్రదేశ్‌లో జరుగనుందని కేంద్ర ఎన్నికల సంఘం అంచనా వేస్తోందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఏపీని ఎక్స్పెండిచర్ సెన్సిటివ్ స్టేట్(ధన వ్యయపరంగా సున్నితమైన రాష్ట్రం)గా ప్రకటించడమే కాకుండా అత్యధిక పరిశీలకులను రాష్ట్రానికి పంపుతున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా మద్యం, బహుమతుల పంపిణీతోపాటు పెయిడ్ ఆర్టికల్స్ అనేవి అత్యంత కీలకమైన అంశాలుగా గుర్తించారని, దీనిపై జిల్లా స్థాయిల్లో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ద్వివేది హెచ్చరించారు. సున్నితమైన రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నందున పెయిడ్ ఆర్టికల్స్‌ను గుర్తించడానికి మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ(ఎంసీఎంసీ) అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ఇందుకు జిల్లా స్థాయిలో పటిష్టమైన మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే ఏడు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటికీ ఇంతవరకు ఎంసీఎంసీ పూర్తిస్థాయిలో ఏర్పాటు కాకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం సచివాలయంలో 13 జిల్లాల ఎంసీఎంసీ నోడల్ ఆఫీసర్లు, వివిధ మీడియా ప్రతినిధులతో వర్క్‌షాప్ నిర్వహించారు. ఇందులో ద్వివేది మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో పెయిడ్ ఆర్టికల్స్, సోషల్ మీడియా అనేవి అత్యంత కీలకమైన అంశాలని, పార్టీలకతీతంగా వీటిని గుర్తించి అభ్యర్థుల వ్యయంలో చేర్చాల్సిన బాధ్యత ఎంసీఎంసీదేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఐదారుగురు సభ్యులతో ఎంసీఎంసీ కమిటీలను ఏర్పాటు చేశారని, వీరితో పరిశీలన చేయడం కష్టమని, వీరికి అదనంగా కనీసం 15–20 మంది సహాయకులను తీసుకుని జిల్లా స్థాయిలో పటిష్టమైన కంట్రోల్ రూములు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగానే కేంద్ర ఎన్నికల పరిశీలకులు వస్తారు కాబట్టి ఈలోగానే మొత్తం ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా కలెక్టర్లను ఆయన కోరారు. వీవీప్యాట్లతో ఎన్నికలు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎంలు)ను వినియోగించడం 30 ఏళ్లు దాటుతున్నా.. ఇప్పటికీ వాటి పనితీరుపైన కొందరు అపోహలు కల్పిస్తూనే ఉన్నారని, ప్రజల్లోనూ, పార్టీల్లోనూ ఉండే ఈ భయాందోళనలను తొలగించడానికి రాష్ట్రంలో తొలిసారిగా వీవీ ప్యాట్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ద్వివేది తెలిపారు. వీవీ ప్యాట్లలో ఓటరు ఏ అభ్యర్థికి, ఏ గుర్తుకు ఓటేశారో తెలుపుతూ ఏడు సెకన్లపాటు కనిపిస్తుందన్నారు. ఈవీఎంలను హ్యాకింగ్ చేయవచ్చనే ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు. తగ్గుతున్న అక్రమ ఓట్ల తొలగింపు దరఖాస్తులు.. రాష్ట్రంలో గంపగుత్తగా వస్తున్న ఓట్ల తొలగింపు దరఖాస్తులు గత రెండు రోజుల నుంచి తగ్గినట్లు ద్వివేది తెలిపారు. ఓటరు ప్రమేయం లేకుండా ఇలా అక్రమంగా ఫారం–7తో ఓట్లు తొలగించమంటూ దరఖాస్తు చేయడం క్రిమినల్ చర్య అని, దీనిపై ఇప్పటికే పలు జిల్లాల్లో కేసులు కూడా నమోదు చేసినట్లు చెప్పారు. రాజమండ్రి గ్రామీణ ప్రాంతంలో ఇలా 2,300 ఓట్లు తొలగింపునకు దరఖాస్తు వచ్చినట్లు తేలిందన్నారు. ఈ సమస్య కొన్ని ఎంపిక చేసిన నియోజకవర్గాలపైనే ఉందని, వాటిపై తాము ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు. ఇలా దరఖాస్తు చేసిన ఓటర్లను పూర్తిగా పరిశీలించిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటున్నామని, అందువల్ల ఓటర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. శుక్రవారం ఒక్కరోజే విశాఖలో 40,000, గుంటూరులో 50,000 దరఖాస్తులను పరిశీలించి నిర్ణయం తీసుకున్నామని, త్వరలోనే ఎన్ని అక్రమ ఓట్ల తొలగింపునకు, చేర్పించడానికి దరఖాస్తులు వచ్చాయో వివరాలను వెల్లడిస్తామని తెలిపారు. -
ఓట్ల తొలగింపు వెనుక అధికార పార్టీ నేతల హస్తం
-
ట్యాబ్‌లతో వస్తున్నారు.. ఓట్లు తొలగిస్తున్నారు
సాక్షి, అమరావతి: అధికార తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష వైఎస్సార్సీసీ సానుభూతిపరుల ఓట్లను తొలగించేందుకు పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, అందుకు పోలీసులు, బూత్‌లెవెల్ అధికారులు సహకరిస్తున్నారని చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆరోపించారు. ఒక్క చంద్రగిరి నియోజకవర్గంలోనే 22,500కుపైగా ఓట్లను తొలగించాలని, 22,000 దొంగ ఓట్లను చేర్పించేలా దరఖాస్తులు వచ్చాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. ఓట్ల తొలగింపుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి శుక్రవారం వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ గోపాలకృష్ణ ద్వివేదిని కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సర్వేల పేరుతో టీడీపీ వాళ్లు ట్యాబ్‌లు తీసుకుని పల్లెల్లోకి వస్తున్నారని, ఒక్కొక్కరు రోజుకు 30 మందిని సర్వే చేస్తున్నారని తెలిపారు. వైఎస్సార్సీపీకి ఓటు వేస్తామని చెప్పిన వారి ఓటర్ ఐడీ నెంబరు, ఆధార్ నెంబర్ తదితర వివరాలను గుంటూరులోని సెంట్రల్ ఆఫీసుకు పంపిస్తున్నారని పేర్కొన్నారు. తర్వాత ఆన్‌లైన్‌లోకి వెళ్లి నా ఓటు నేనే తొలగించుకున్నట్టు ప్రజల తరపున సెల్ఫ్ డిక్లరేషన్(అప్లికేషన్) పెట్టి, వారి ఓటు పోయేలా చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ సభ్యత్వం ఉన్న వారిని బూత్‌లెవెల్ అధికారులుగా కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ ఓట్లు తొలగించేలా ట్యాబ్‌లతో ఇంటింటికీ వస్తున్న వారిని పట్టుకుని పోలీసులకు అప్పగిస్తే తిరిగి తమపైనే తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని వివరించారు. ఇప్పటివరకు 16 మందిని ట్యాబ్‌లతో సహా పోలీసులకు అప్పగించినా ఎవరిపైనా చర్యలు తీసుకోలేదని వాపోయారు. ఓట్ల తొలగింపుపై ఫిర్యాదు చేసిన వారిని చిత్తూరు ఎస్పీ ఇంటికి పిలిచి మరీ కొడుతున్నారని ఆరోపించారు. చంద్రగిరి టీడీపీ నాయకుడు ఆ నియోజకవర్గంలోని 325 పోలింగ్ బూత్ ఇన్చార్జిలతో ఇటీవల టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ వాయిస్ రికార్డులను, ఆధారాలను ఎన్నికల సంఘానికి అందజేసినట్లు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తెలిపారు. వాటిని పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారి చెప్పారని వెల్లడించారు. చంద్రగిరి నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ ఇన్చార్జిలతో టెలికాన్ఫరెన్స్‌లో టీడీపీ నాయకుడు ఒకరు మాట్లాడిన మాటలివీ.. టీడీపీ నేత: మీరు గట్టిగా పనిచేసి తలో ఇరవై ఓట్లు తొలగించేలా చూడాలి. అలా ఓ పది వేల ఓట్లు తొలగిస్తారు. మనకు అనుకూలంగా 5 వేల ఓట్లు చేర్పించామనుకో దానికి మించినటువంటి ఫలితం మరొకటి ఉండదు. మన వాళ్లందరికీ ఈ విషయం చెప్పిండి. మీరు మరో రెండు రోజులు బూత్ దగ్గరే ఉండి అనుకూల ఓట్లు చేర్పించాలమ్మా. బూత్ లెవెల్ కార్యకర్త: అన్నా.. మనకు పడే ఓట్లకు సంబంధించి వారి ఆధార్ కార్డులు తమిళనాడులో ఉన్నాయి. ఇక్కడ అడ్రస్ లేకపోతే ఓట్లు ఎలా చేర్పించాలి? టీడీపీ నేత: ఓకేనమ్మా.. నువ్వు వారి వివరాలు తీసుకుని ఒకసారి రా. మనవాళ్లు ఆధార్ కార్డు అడ్రస్ చేంజ్ చేసేస్తారు. వారికి కొత్త ఓట్లు చేర్చేలా అప్లికేషన్ పెట్టొచ్చు. మనకు అనుకూలమైన ఓట్లు అడ్రస్ మార్చి చేర్పించొచ్చు. అదంతా చిటికెలో పని. టెలికాన్ఫరెన్స్ నిర్వాహకుడు: అన్నా.. సీఎంగారు టెలికాన్ఫరెన్స్ నిర్వహించే టైమ్ అయ్యింది. మీరు కట్ చేస్తే ఆయనకు లైన్ కలపాలి. టీడీపీ నేత: అదేంటి.. సార్ టెలికాన్ఫరెన్స్ ఉందని చెప్పలేదు. సరే అది అయ్యాక మళ్లీ మాట్లాడుతా. టెలికాన్ఫరెన్స్ నిర్వాహకుడు : అన్నా.. ఈ రోజు ఇంక కుదరదు. సీఎంగారి టెలికాన్ఫరెన్స్ ఎంత సమయం పడుతుందో తెలియదు. మీరు రేపే మాట్లాడుకోండి. -
ఢిల్లీ చేరుకున్న వైఎస్ జగన్
-
ఢిల్లీ చేరుకున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. రాష్ట్రంలో అప్రజాస్వామిక రీతిలో అధికార తెలుగుదేశం పార్టీ ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడుతుండడం, అధికార యంత్రాంగాన్ని, పోలీసు వ్యవస్థను దర్వినియోగం చేస్తున్న తీరుపై వైఎస్ జగన్ సోమవారం ఉదయం 11.30 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నారు. సర్వేల పేరుతో టీడీపీ వ్యతిరేక ఓటర్లను జాబితా నుంచి తొలిగిస్తుండడాన్ని కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈసీ) సునీల్ అరోరా దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరనున్నారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ప్రత్యేక హోదా కోసం ఎంపీ పదవికి రాజీనామా చేసిన పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. -
సీఈసీని కలిసేందుకు ఢిల్లీ బయల్దేరిన వైఎస్ జగన్
-
రేపు సీఈసీని కలవనున్న వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఓటర్ల జాబితా నుంచి అక్రమంగా ఓట్ల తొలగింపు, ఇతర అవకతవకలపై కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీకి బయల్దేరారు. పార్టీకి చెందిన మాజీ ఎంపీలు, ముఖ్య నేతలతో కలిసి ఆయన ఆదివారం సాయంత్రం ఢిల్లీకి పయనమయ్యారు. సోమవారం ఉదయం 11.30గంటలకు వైఎస్ జగన్ పార్టీ నేతలతో కలిసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ)ను కలుస్తారు. ఓటర్ల జాబితాలో పెద్దఎత్తున చోటుచేసుకున్న అవకతవకలు, అక్రమంగా పేర్ల తొలగింపు అంశాలతోపాటు రాష్ట్ర డీజీపీ వ్యవహారశైలిపైనా సీఈసీకి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. -
ప్రతిపక్షం ఓట్లపై వేటు!
సాక్షి ప్రతినిధి, విజయనగరం: వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా నెగ్గడమే లక్ష్యంగా ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ సానుభూతిపరుల ఓట్లను అధికార టీడీపీ అడ్డగోలుగా తొలగిస్తోంది. ఇందుకోసం అధికార బలాన్ని ప్రయోగిస్తోంది. టీడీపీ కుతంత్రాన్ని అడ్డుకున్న విజయనగరం జిల్లా వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అరెస్టు చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అలాగే రాష్ట్రంలో పలు జిల్లాల్లో యువకులు దొంగ సర్వే చేస్తుండగా వైఎస్సార్సీపీ నాయకులు అడ్డుకున్నారు. వారిని పోలీసులకు అప్పగించారు. జాతీయ ఓటర్ల దినోత్సవం రోజే ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం. అసలేం జరిగింది? విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కుమిలి గ్రామంలో గురువారం ఓటర్ల జాబితాలను చేతపట్టుకుని, ఇంటింటికీ తిరుగుతూ సర్వే చేస్తున్న ముగ్గురు వ్యక్తులను వైఎస్సార్సీపీ నాయకులు పట్టుకుని పోలీసులకు అప్పగిం చారు. వారిని పోలీసులు విచారించకుండా వదిలిపెట్టారు. దీనిపై పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తీవ్రంగా స్పందించారు. డీజీపీ, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధపడ్డారు. ఈ క్రమంలో సర్వే చేస్తూ పట్టుబడ్డ వ్యక్తుల నుంచి ట్యాబ్‌లను లాక్కున్నారంటూ ప్రైవేటు సంస్థ ఫిర్యాదు చేసిందని, ఆ ట్యాబ్‌లను తిరిగి ఇచ్చేయాలంటూ పోలీసులు అర్ధరాత్రి వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు వెళ్లారు. పూసపాటిరేగ మండల పార్టీ అధ్యక్షుడు పతివాడ అప్పలనాయుడు, నాయకులు పతివాడ అశ్వినీకుమార్, వెన్నె మహేష్, పతివాడ సన్యాసి నాయుడు, బుర్లే శ్రీనులను రెళ్లివలస గ్రామంలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత వారి స్వగృహాల్లో అరెస్ట్ చేసి, చీపురుపల్లి నియోజకవర్గం గుర్ల పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు. ఆ సమయంలో నేతలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. కుమిలి ఎంపీటీసీ సభ్యురాలు గాబు భాగ్యలక్ష్మిని బయటకు రావా లని, ట్యాబ్ ఇవ్వాలని అరుచుకుంటూ ఇంటి నుండి 100 అడుగుల దూరం తీసుకెళ్లారు. ఆమె ఎదురు తిరగడంతో వదిలేశారు. మహిళనని కూడా చూడకుండా కేవలం వైఎస్సార్సీపీ సానుభూతిపరురాలిననే కక్షతోనే పోలీసులు దౌర్జన్యం చేశారని కుమిలి మాజీ సర్పంచ్ గుజ్జు కృష్ణవేణి ఆవేదన వ్యక్తం చేశారు. కుమిలి గ్రామానికి చెందిన 8 మంది వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేసి, నెల్లిమర్ల స్టేషన్‌కు తరలించి కేసులు నమోదు చేశారు. సంబంధం లేని మజ్జి శ్రీనివాస్ అరెస్టు వైఎస్సార్సీపీ విజయనగరం జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు ఇంటివద్దకు శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు భారీగా చేరుకున్నారు. ట్యాబ్‌లు ఇవ్వకపోతే అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. తనవద్ద ట్యాబ్‌లు లేవని ఆయన చెబుతున్నా వినకుండా అరెస్ట్ చేసి, ఊరంతా తిప్పి చివరికి ఎస్.కోట నియోజకవర్గం జామి పోలీస్ స్టేషనుకు తరలించి నిర్బంధంలో ఉంచారు. పార్టీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామితోపాటు ముఖ్యనాయకులు స్టేషన్‌కు శుక్రవారం ఉదయానికే చేరుకుని శ్రీనివాసరావును విడుదల చేయాలని డీఎస్పీని కోరారు. వాంగ్మూలం తీసుకుని విడిచిపెడతామన్న డీఎస్పీ మధ్యాహ్నం 2 గంటల వరకూ ఆ పని చేయలేదు. అనంతరం డీఐజీ జి.పాలరాజు ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు నోటీసు ఇచ్చి విడుదల చేశారు. అరెస్టులపై వైఎస్సార్సీపీ ఆందోళన సర్వేల పేరిట గ్రామాల్లో తిరుగుతున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ నాయకులను అరెస్టు చేయడం పట్ల పార్టీ కార్యకర్తలు ఆగ్రహంతో రగిలిపోయారు. ఓట్ల తొలగింపుపై తమ పార్టీ నాయకులు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా ప్రైవేటు వ్యక్తులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అరెస్టులు చేయడం ఏమిటని మండిపడ్డారు. మజ్జి శ్రీనివాసరావును నిర్బంధంలో ఉంచిన జామి పోలీస్ స్టేషన్ వద్ద వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పూసపాటిరేగ మండలంలోని రెల్లివలస, కుమిలి గ్రామాలకు చెందిన నాయకులను అరెస్టు చేసి, నిర్బంధించిన గుర్ల, నెల్లిమర్ల పోలీస్స్టేషన్ల వద్ద ఆందోళన చేశారు. రాస్తారోకో చేశారు. జిల్లావ్యాప్తంగా 700 మందితో సర్వే పీపుల్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనే ప్రైవేటు సంస్థ విజయనగరం జిల్లాలో దాదాపు 700 మంది యువకులను నియమించుకుని సర్వే చేపడుతోంది. యువకులకు రోజుకు రూ.800 చొప్పున చెల్లిస్తూ వారి చేతికి ట్యాబ్‌లు ఇచ్చి గ్రామాల్లోకి పంపుతోంది. వీరిలో ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం, తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్(టిఎన్ఎస్ఎఫ్)కు చెందిన వారే ఉండడం గమనార్హం. వీరు తమకు ఇచ్చిన ట్యాబ్‌లలో ఉన్న ఓటర్ల జాబితా ఆధారంగా కొన్ని ఇళ్లకు వెళ్లి మాట్లాడుతున్నారు. ప్రభుత్వ పనితీరుపై ఓటర్ల అభిప్రాయాలను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అభిప్రాయం వ్యక్తం చేసిన వారి ఓట్లను తొలగిస్తున్నారని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. శుక్రవారం బొబ్బిలి, సాలూరు, చీపురుపల్లి, పార్వతీపురం మండలాల్లో సర్వేలు చేసేందుకు వచ్చిన యువకులను స్థానిక నాయకులు పట్టుకుని పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. సర్వే తప్పు కాదు: డీఐజీ ఓటర్ల జాబితాలను ట్యాబ్‌లో పొందుపరుచుకుని సర్వే నిర్వహించడం నేరం కాదని విశాఖ రేంజ్ డీఐజీ జి.పాలరాజు తెలిపారు. జిల్లాలో జరుగుతున్న పరిణామాలపై ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సర్వేపై అభ్యంతరాలుంటే ఫిర్యాదు చేయాలే తప్ప ట్యాబ్‌లు లాక్కొని దౌర్జన్యం చేయడం చట్టరీత్యా నేరమని, ఆ కేసులోనే వైఎస్సార్సీపీ నేతలను అరెస్ట్ చేశామని వివరించారు. రాష్ట్ర చరిత్రలో చీకటి రోజు వైఎస్సార్సీపీ ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉంది. అన్యాయంగా ఓట్లు తొలగిస్తున్నారని ఫిర్యాదు చేసిన వారిని అరెస్టు చేయడం దారుణం. రాష్ట్ర చరిత్రలో ఇదొక చీకటి రోజు. అమరావతి నుంచి ఆదేశాలిచ్చి అక్రమ అరెస్టులకు దిగుతున్నారు. ఎన్నికల సంఘం మాకు తప్పకుండా న్యాయం చేస్తుందని నమ్ముతున్నాం. – మజ్జి శ్రీనివాసరావు, విజయనగరం జిల్లా వైఎస్సార్సీపీ రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త ఓట్ల తొలగింపు ముమ్మాటికీ నిజమే వైఎస్సార్సీపీ నేతలను అరెస్టులు చేసిన తీరును చూస్తే ఓట్ల తొలగింపు అన్నది అనుమానం కాదు ముమ్మాటికీ నిజమేనని తేటతెల్లం అవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. సర్వేల పేరుతో వైఎస్సార్సీపీ సానుభూతిపరులు, నాయకుల ఇళ్లకు వచ్చి ఓట్ల తొలగింపుకు సిద్ధపడ్డారు. దొంగ సర్వేలు చేస్తున్న వారిని వదిలేసి, వైఎస్సార్సీపీ నాయకుల ఇళ్లల్లోకి చొరబడి అర్ధరాత్రి అరెస్టులకు తెగబడటం సిగ్గుచేటు – కోలగట్ల వీరభద్రస్వామి, ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల కన్వీనర్ -
1.09 కోట్ల ఓట్లలో 24 లక్షల ఓట్లు తొలగింపు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని 36 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఇంటింటికీ సర్వే జరిపి ఓటరు జాబితాల సవరణ జరుపుతున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అనూప్ సింగ్ తెలిపారు. 36 నియోజకవర్గాల పరిధిలో మొత్తం 1,09,44,968 ఓట్లు ఉండగా ఇంటింటికీ సర్వే జరిపి పలు కారణాలతో 24,20,244 (22.11శాతం) ఓట్లు తొలగించినట్లు వెల్లడించారు. మరో 29,93,777 (27.35 శాతం) ఓటర్లు వేరే చిరునామాలకు తమ ఓట్లను బదిలీ చేసుకున్నారని చెప్పారు. సర్వే తర్వాత 55,30,947 (50.53 శాతం) ఓట్లు ఎలాంటి మార్పులు లేకుండా ఉన్నాయన్నారు. కొత్తగా 5,82,138 (6.4 శాతం) నమోదు చేసుకున్నారని తేలినట్లు వివరించారు. ఇంటింటి సర్వే ముగిశాక మొత్తం 91,06,862 ఓట్లు మిగిలినట్లు చెప్పారు. ఓటరు జాబితా సవరణపై మంగళవారం సచివాలయంలో మాట్లాడుతూ.. ప్రత్యేకంగా రూపొం దించిన వెబ్ ఆధారిత అప్లికేషన్ ద్వారా ఓటరు జాబితాల సవరణ చేపట్టినట్లు తెలిపారు. సర్వే అనంతరం ముసాయిదా ఓటర్ల జాబితాను గత నెల 27న ప్రచురించినట్లు చెప్పారు. ఈ జాబితాను www.ceotelangana.nic.in వెబ్సైట్లో చూడొచ్చని సింగ్ చెప్పారు. దీనిపై అభ్యంతరాలు, కొత్త ఓట్ల నమోదు, తొలగింపులు, సవరణల కోసం ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. 2018 జనవరి 1 నాటికి 18 ఏళ్ల వయసు వచ్చే వారందరూ కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు అర్హులని పేర్కొన్నారు. 36 నియోజకవర్గాలకు సంబంధించిన తుది ఓటరు జాబితాను 2018 జనవరి 20న ప్రచురించనున్నట్లు తెలిపారు. సాధారణ సవరణ అనంతరం మిగిలిన నియోవకవర్గాలకు సంబంధించిన ముసాయిదా జాబితాను ఈ నెల 15న ప్రచురించనున్నట్లు వివరించారు. గతంలో ఏపీలోని 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా పైలట్ ప్రాజెక్టు కింద ఓటరు జాబితాల సవరణ నిర్వహించినట్లు గుర్తు చేశారు. సర్వే జరిగింది ఈ స్థానాల్లోనే.. ఆదిలాబాద్, కరీంగనర్, సంగారెడ్డి, పటాన్చెరు, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఉప్పల్, ఎల్బీనగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, ముషీరాబాద్, మలక్‌పేట, అంబర్‌పేట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సనత్‌నగర్, నాంపల్లి, కార్వాన్, గోషామహల్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పుర, బహదూర్‌పూర, సికింద్రాబాద్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మహబూబ్‌నగర్, నల్లగొండ, స్టేషన్ ఘన్పూర్, పరకాల, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట, ఖమ్మం, పాలేరు. -
'గ్రేటర్'లో ఈసీ బృందం పర్యటన
హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో ఓటర్ల తొలగింపు వివాదంపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి పెట్టింది. నేటి నుంచి మూడు రోజులపాటు ఎన్నికల కమిషన్ బృందం సభ్యులు పర్యటించనున్నారు. ఓట్ల తొలగింపు వివాదంపై ఈ బృందం ఆరా తీయనుంది. శనివారం నాడు అఖిలపక్ష బృందంతో ఎన్నికల కమిషన్ సభ్యులు భేటీ కానున్నారు. -
ఓట్ల తొలగింపుపై దర్యాప్తు చేయండి
సీఈసీకి మర్రి శశిధర్‌రెడ్డి విజ్ఞప్తి సాక్షి, న్యూఢిల్లీ: గ్రేటర్ పరిధిలో ఓటర్ల తొలగింపుపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక బృందాన్ని హైదరాబాద్‌కు పంపాలని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) నసీం జైదీకి జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ మాజీ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ తొలగించిన దాదాపు 6.3 లక్షల ఓట్ల విషయంలో అక్రమాలు జరిగాయ న్నారు. శుక్రవారం జైదీని కలసి ఓటర్ల తొలగింపులో అక్రమాలపై ఆధారాలు అందజేశారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్, జిల్లా ఎన్నికల అధికారి సోమేశ్‌కుమార్‌ను విధుల నుంచి తొలగించాలని కోరారు. అనంతరం మర్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు భన్వర్‌లాల్, సోమేశ్ నడుచుకుంటున్నారని ఆరోపించారు.