ఫారం–7 ను చూపిస్తున్న ఎన్నికల నమోదు అధికారి సత్యం
సాక్షి ప్రతినిధి, కడప: ఎన్నికల కమిషన్‌ను అపహాస్యం చేసేవిధంగా తెలుగుదేశం నేతలు అనైతిక చర్యలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో లక్షల సంఖ్యలో వైఎస్సార్ సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించిన ప్రభుత్వం.. వైఎస్సార్ సీపీ ముఖ్యనేతల ఓట్లను కూడా గల్లంతు చేసేందుకు కంకణం కట్టుకున్నారు. ఈసారి ఏకంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓటునే తొలగించేందుకు కుట్ర పన్నారు. వైఎస్ జగన్ ఫొటోతో కూడిన ప్రొఫైల్‌ను అప్‌లోడ్ చేసి ఆన్‌లైన్ ద్వారా ఫారం–7 దాఖలు చేశారు. వైఎస్ జగన్ పేరు మీద ఈనెల 9న దరఖాస్తు దాఖలయ్యింది. అయితే ఈ విషయం ఇప్పటివరకు బహిర్గతం కాకుండా తహసీల్దారు, రిటర్నింగ్ అధికారి సత్యం జాగ్రత్త పడ్డారు.
మంగళవారం ఈ విషయం బయటకు రావడంతో రిటర్నింగ్ అధికారిని మీడియా సంప్ర దించగా.. ఆయన ఈ విషయాన్ని ధ్రువీకరించారు. అయితే దీన్ని ఎవరు? ఎక్కడ్నుంచి అప్‌లోడ్ చేశారన్న ప్రశ్నలకు జవాబివ్వలేదు. కాగా, ఈ విషయమై స్పష్టత కోసం జగన్‌మోహన్‌రెడ్డి సమీప బంధువు జనార్దనరెడ్డిని విచారించగా జగన్‌మోహన్‌రెడ్డి దరఖాస్తు చేయలేదని చెప్పారని రిటర్నింగ్ అధికారి చెప్పారు. దీంతో ఆయన వద్ద స్టేట్‌మెంట్ తీసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేశామని తెలిపారు. ఇదిలా ఉండగా ఇప్పటికే వైఎస్ జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్‌కుమార్ ఓటు తొలగించాలంటూ ఫారం–7 దాఖలైన సంగతి తెలిసిందే. తమ ఓట్ల గల్లంతుకు సంబంధించి దరఖాస్తు చేసిన నిందితులపై చర్యలు తీసుకోవాలని వారు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది.
వైఎస్ జగన్ పేరుతో పంపిన నకిలీ ఫారం–7 దరఖాస్తు
Comments
Please login to add a commentAdd a comment