Elections 2019
-
ఇది కదా జగన్ అంటే.. ఆ రికార్డ్ ఆయనకే సొంతమవుతుంది.!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మే 30న తన పదవీకాలం ఐదేళ్లు సంపూర్ణంగా పూర్తి చేసుకున్నందుకు ముందుగా అభినందనలు, శుభాకాంక్షలు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఇలాగే ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా 2014లో ఎన్నికయ్యాక ఐదేళ్లు పాలన చేసినట్లే అయినా, సాంకేతికంగా చూస్తే ఆయన ఎనిమిది రోజులు ముందుగానే పదవి కోల్పోయారు. ఎందుకంటే చంద్రబాబు 2014 జూన్ 8న పదవీ చేపట్టగా, ఎన్నికల్లో ఓడిపోయి 2019 మే 30 కంటే ముందే సీఎం పదవిని వదలిపెట్టవలసి వచ్చింది. కానీ వైస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డిలకు ఆ ఇబ్బంది రాలేదు. చంద్రబాబునాయుడు 1995లో తన మామ ఎన్టీఆర్‌ను కూలదోసి సీఎంగా అధికారం చేపట్టారు. 1999 అక్టోబర్ లో రెండోసారి అధికారంలోకి వచ్చినా, 2003లో అసెంబ్లీని రద్దు చేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో ఓటమి కారణంగా 2004 మే నెలలోనే పదవిని కోల్పోయారు. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మిగిలిన సీఎంల కన్నా విభిన్నమైన రాజకీయవేత్త అని చెప్పాలి. వైఎస్సార్సీపీను స్థాపించడం, ఆ తర్వాత ఆయన అనేక కష్ట, నష్టాలు ఎదుర్కోవడం అంతా ప్రజలు గమనించారు. అక్రమ కేసులలో ఆయన జైలులో ఉన్నప్పుడు, ఆయన కోసం రాజీనామా చేసిన వారి నియోజకవర్గాలలో జరిగిన ఉప ఎన్నికలలో వైఎస్సార్సీపీ సంచలనాత్మకమైన రీతిలో గెలుపొందడం కూడా విశేషమే.2014 సాధారణ ఎన్నికలలో YSRCP అధికారంలోకి రాలేకపోయినా, గౌరవనీయ సంఖ్యలో విజయాలు సాధించింది. విపక్షంలో ఉన్నప్పుడు 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేసినా, వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో పోరాట పటిమ తగ్గలేదు. తదుపరి సైతం అనేక పోరాటాలు చేయవలసి రావడం వంటి ఘట్టాల నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019లో చరిత్రాత్మకమైన రీతిలో విజయం సాధించారు. ఉమ్మడి రాష్ట్రంలో సైతం ఎవరికి సాధ్యం కానీ రీతిలో దాదాపు 50 శాతం ఓట్లు సాధించి 151 సీట్లతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగలగడం ఒక రికార్డు. ఉమ్మడి ఏపీలో NTR, KCR, YS జగన్మోహన్ రెడ్డిలే సొంత పార్టీ పెట్టుకుని అధికారంలోకి రాగలిగారు. తెలుగు రాష్ట్రాలలో తండ్రులు ముఖ్యమంత్రులు అయ్యాక, వారి కుమారులు పలువురు రాజకీయాలలోకి వచ్చి మంత్రులు కాగలిగారు తప్ప, ముఖ్యమంత్రి అయింది మాత్రం YS జగన్మోహన్ రెడ్డి ఒక్కరే.వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అడుగుజాడల్లో 2009 లోనే ఎంపీగా గెలుపొందిన మాట నిజమే. కానీ వైఎస్ రాజశేఖరరెడ్డి అనూహ్య మరణం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు ఒకరకంగా చెప్పాలంటే గందరగోళంలో పడింది. మెజార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చినా, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాందీ మాత్రం అప్రజాస్వామికంగా వ్యవహరించి అవకాశం ఇవ్వలేదు. అదే ఆయనకు ఛాలెంజ్‌గా మారింది. సొంతంగా పార్టీ పెట్టుకున్నారు, తనదైనా పంథాలో ముందుకు సాగారు, గెలిచినా, ఓడినా సొంత రాజకీయం సాగించారు. సోనియాగాంధీ చేతిలో కేంద్ర ప్రభుత్వం ఉన్నందున కేసులు పెడుతుందన్న భయంతో వైఎస్ సన్నిహితులు సైతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట నడవడానికి భయపడినా, తాను మాత్రం తిరుగుబాటు వీరుడుగానే జనంలోకి వెళ్లి వారి హృదయాలను గెలుచుకున్నారు.మామ ఎన్టీఆర్‌నే కుట్ర పూరితంగా సీఎం పదవిని లాగిపడేసిన వ్యక్తి చంద్రబాబు. ఎప్పుడు ఎవరితో అవసరమైతే వారితో పొత్తు పెట్టుకోగల వ్యక్తి, ఆచరణ సాద్యం కానీ హామీలు ఇచ్చే వ్యక్తిగా పేరొందిన చంద్రబాబు వంటి నేతను ఢీకొట్టడం అంటే తేలిక కాదని చాలామంది భావిస్తారు. కుట్ర రాజకీయాలలో ఘనాపాటిగా పేరొందిన చంద్రబాబును ఓడించడం ద్వారా రాజకీయాలలో విశ్వసనీయతకు ప్రాధాన్యం ఉందని మొదటిసారిగా రుజువు చేసిన నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు తెచ్చుకున్నారు. అనైతిక రాజకీయాల జోలికి వెళ్లకుండా, ప్రజలకు తాను ఏమి చెప్పానో, అవి చేయాల్సిందే అనే పట్టుదలతో కృషి చేసిన ముఖ్యమంత్రిగా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుర్తింపు పొందారు.చంద్రబాబు 2014 లో తాను ఇచ్చిన మానిఫెస్టోని మాయం చేస్తే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019లో తాను ప్రకటించిన మానిఫెస్టోని మంత్రులు, ఐఎఎస్ అధికారులకు ఇచ్చి అమలు చేయాల్సిందేనని చెప్పి కొత్త సంస్కృతికి నాంది పలికారు. గతంలో ఏ ముఖ్యమంత్రి ఇంత సాహసోపేతంగా సంక్షేమ పథకాలు చేయలేదని చెప్పాలి. అంతేకాదు... తన టరమ్ పూర్తి అవుతున్న తరుణంలో మానిఫెస్టో కాపీలతో పాటు, ఏ కుటుంబానికి ఎంత మేలు చేసింది వివరిస్తూ ప్రతి ఇంటికి అభివృద్ది నివేదికలను తన ఎమ్మెల్యేల ద్వారా అందించి కొత్త ట్రెండ్ సృష్టించిన నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పాలి. మనిషిని చూస్తే ఈయన నిజంగానే ఇన్ని చేశారా అనిపిస్తుంది. ఇంతమంది ఆయనపై కక్ష కడితే వారందరిని ఒంటి చేత్తో ఎదుర్కున్నారా? అనే భావన వస్తుంది. బక్కపలచగా ఉండి, సింపుల్ డ్రెస్‌లో కనిపించే ఈయన ఏపీలో ఇన్ని వ్యవస్థల్లో సమూల మార్పులు తీసుకొచ్చి ప్రజల ముందుకు పరిపాలనను తెచ్చి రాష్ట్రాన్ని సరికొత్తగా మార్చగలరని ఎవరూ ఊహించి ఉండకపోవచ్చు.ప్రభుత్వంలోని దాదాపు అన్నీ రంగాలలో తనదైన మార్కును వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూపించగలిగారు. పేదలు vs పెత్తందార్లు అనే నినాదాన్ని చేపట్టినప్పటికీ, రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వ్యవస్థలను ఆయన తెచ్చారంటే అతిశయోక్తి కాదు. కరోనా సంక్షోభ సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న చొరవ, వ్యాధి పాలిట పడిన వారికి అందించిన వైద్యసేవలు మొదలైనవి ప్రశంసనార్హం. ఆ టైమ్‌లో సైతం స్కీములను అమలు చేసి ఆదుకున్న నేతగా ప్రజల గుండెల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిరస్థాయిగా నిలిచిపోయారంటే ఆశ్చర్యం కాదు. ఓ రకంగా ఆంధ్రప్రదేశ్‌లో ఆయన రోల్ మోడల్ ప్రభుత్వాన్ని నడిపారు. దేశంలోనే ఎవరూ చేయని సరికొత్త ప్రయోగాలు చేశారని చెప్పాలి. అందులో అనేకం కీలకంగా ఉన్నాయి.వలంటీర్ల వ్యవస్థను పెడతానని ఎన్నికల మానిఫెస్టోలో చెప్పినప్పుడు ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు. ప్రభుత్వంలోకి రాగానే వలంటీర్లను పెడుతుంటే వీరంతా ఏమి చేస్తారో అనే అభిప్రాయం ఉండేది. రెండున్నర లక్షల మంది స్వచ్చంద సైన్యాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తయారు చేశారన్న సంగతి ఆ తర్వాత కానీ జనానికి అర్దం కాలేదు. వలంటీర్లు ఇళ్లకు వచ్చి కుశల సమాచారం అడగడం కాదు.. వారి పరిపాలనకు సంబంధించిన అవసరాలను తీర్చే వ్యవస్థగా మారారు. ప్రభుత్వం చుట్టూ తిరగడం కాదు. ప్రభుత్వమే ప్రతి ఒక్కరి గడప వద్దకు వెళ్లి సేవలందించడం అని పరిపాలనకు కొత్త నిర్వచనం ఇచ్చి అమలు చేయడం అతి పెద్ద విజయం అనిపిస్తుంది. గ్రామ, వార్డు సచివాలయాలలో ప్రజలకు అవసరమైన పనులన్ని జరిగిపోవడం కొత్త అనుభూతి. ఒకప్పుడు ఏ సర్టిఫికెట్టు కావాలన్నా, వేరే ఏ పని ఉన్నా, మండల ఆఫీస్‌ల చుట్టూనో, ఆ పైన ఉండే అదికారుల చుట్టూనో తిరిగే పరిస్థితిని తప్పించి తమ ఇళ్లకే అవన్ని చేరే ఏర్పాటు చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిజంగా అభినందనీయుడు.ఈ సచివాలయాల కోసం ఏకంగా లక్షన్నర ఉద్యోగాలను ఒకే ఏడాదిలో ప్రభుత్వ పరంగా ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రైతులు ఒకప్పుడు ఎరువులు, విత్తనాల కోసం తమ చెప్పులను ఆయా షాపుల వద్ద, ప్రభుత్వ గౌడౌన్ల వద్ద క్యూలో పెట్టవలసి వచ్చేది. ఇప్పటికి తెలంగాణలో అదే పరిస్థితి కొనసాగుతోంది. ఆదిలాబాద్‌లో జరిగిన రైతుల ఆందోళన ఇందుకు ఉదాహరణ. ఏపీలో ఆ ఇబ్బంది లేకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేయగలిగారు. రైతులు తమ గ్రామంలోనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలనుంచి అన్నీ సేవలు పొందగలుగుతున్నారు. అందువల్లే ఈ ఐదేళ్లలో ఎక్కడా ఒక్క రైతు ఆందోళన చూడలేదు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక హామీలు అమలు చేస్తామని చెబుతూ అంతా వచ్చి దరఖాస్తు చేసుకోమన్నారు. అప్పుడు బారీ క్యూలు తెలంగాణ వ్యాప్తంగా కనిపించాయి. అదే ఏపీలో ఆ అవసరమే లేదు. వలంటీర్లే ఇళ్లకు వెళ్లి అర్హత ఉంటే వారే నమోదు చేసుకుని స్కీమ్ అమలు చేశారు. ఇది ఉదాహరణ మాత్రమే.ఏపీలో ప్రభుత్వ స్కూళ్లలో జరిగిన మార్పులు ఒక విప్లవం అని చెప్పాలి. స్కూళ్లు బాగు చేయడం మొదలు, ఆంగ్ల మీడియం, వారికి మంచి ఆహారం, డ్రెస్, పుస్తకాలు మొదలైనవి స్కూల్ తెరిచిన మొదటి రోజుల్లోనే ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు. గతంలో ఇలా జరిగిన సందర్భాలు దాదాపు లేవని చెప్పాలి. ఆంగ్ల మీడియం, ఐబీ సిలబస్, టోఫెల్ మొదలైన వినూత్న మార్పులు జరిగింది ఏపీలో మాత్రమే. వైద్య రంగంలోకూడా గణనీయమైన మార్పులు తెచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రులను మార్చారు. ప్రజల వద్దకే డాక్టర్లను పంపించే విధానం తెచ్చారు. ఊళ్లలో ఆరోగ్య శిబిరాలు పెట్టారు. ఆరోగ్యశ్రీలో వ్యాధుల సంఖ్య పెంచారు. తను చెప్పిన సంక్షేమ స్కీములను యధాతధంగా అర్హులైన వారందరికి అమలు చేసి చూపించారు. ప్రాంతం చూడలేదు. కులం చూడలేదు. మతం చూడలేదు. పార్టీ చూడలేదు. ఇది చాలామందికి నమ్మశక్యం కానీ విషయమే.అంతకుముందు టీడీపీ పాలనలో జన్మభూమి కమిటీల అవినీతి తతంగాలు చూసినవారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకు వచ్చిన ఈ మార్పు ఆశ్చర్యాలను కలిగించింది. అమ్మ ఒడి, చేయూత, కాపు నేస్తం, రైతు భరోసా, చేనేత నేస్తం.. ఇలా ఒకటేమిటి సుమారు ముప్పైకి పైగా స్కీములను ఒక్క రూపాయి అవినీతి లేకుండా లబ్దిదారుల ఖాతాలలోకి వెళ్లేలా డిబిటి పద్దతి అమలు చేసిన ఘనత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే. పేదలకు 31లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వడం ఒక సంచలనం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. విపక్ష టీడీపీ తొలుత వీటన్నిటిని విమర్శించినా, తదుపరి తామూ అమలు చేస్తామని చెప్పడమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజన్‌ను తెలియచేస్తుంది. అభివృద్ది వైపు చూస్తే స్కూళ్లు, ఆస్పత్రులు బాగు చేయడం అన్నిటికన్నా పెద్ద ప్రగతి అని వేరే చెప్పనవసరం లేదు. తీర ప్రాంతంలో నాలుగు పోర్టులు, పది ఫిషింగ్ హార్బర్లు, ఫిషరీస్ యూనివర్శిటీ, ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రి, 700 కోట్లతో 800 గ్రామాలకు నీటి స్కీము, పదిహేడు మెడికల్ కాలేజీలు, పలు కొత్త పరిశ్రమలు, పార్మాహభ్, రెండున్నర లక్షల కోట్ల విలువైన పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్లు, నలభై వేల కోట్ల విలువైన సోలార్ పానెల్ పరిశ్రమ.. బద్వేలు వద్ద సెంచరీ ప్లైవుడ్, కొప్పర్తి ఎలక్ట్రానిక్ పారిశ్రామికవాడ.. ఇలా అనేకం టేక్ ఆఫ్ అయ్యాయి. విశాఖ నగరాన్ని ఒక సూపర్ సిటీగా తీర్చిదిద్దే ప్రక్రియ చేపట్టారు. ఆదాని డేటా సెంటర్, ఇన్ ఫోసిస్ తదితర కంపెనీలు రావడం.. ఇలా ఒకటేమిటి వివిధ రంగాలలో తనకంటూ ఒక ప్రత్యేకతను తెచ్చుకునేలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేసింది. ఇదేదో పొగడడానికి చెప్పడం లేదు. అలా అని విమర్శలు లేవని కాదు. ఏ ప్రభుత్వంలో అయినా కొన్ని లోటుపాట్లు ఉంటాయి. ఒక్క మద్య నిషేధం హామీని అమలు చేయలేకపోయామని పార్టీనే అధికారికంగా చెప్పింది.శాంతి భద్రతలు ఐదేళ్లుగా పూర్తి అదుపులో ఉన్నా, ప్రతిపక్షం, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా దారుణమైన అబద్దాలు ప్రచారం చేశాయి. వీటిని ఎదుర్కోవడం వైఎస్ జగన్మోహన్ రెడ్డికు పెద్ద సవాల్ అయింది. ఒకేసారి వివిధ రంగాలలో సంస్కరణలు చేపట్టడం, ఆయా వర్గాలలోని పెత్తందార్లకు ఆగ్రహం తెప్పించింది. ఉదాహరణకు ప్రభుత్వ స్కూళ్లు బాగు చేయడం కార్పొరేట్ విద్యా సంస్థల యజమానులకు నచ్చలేదు. ప్రభుత్వ సేవలన్ని ప్రజల ఇళ్ల వద్దకు చేర్చడం, తద్వారా తమ ప్రాధాన్యత తగ్గిందన్న భావన, ముడుపులు దక్కకుండా పోతున్నాయన్న ఆక్రోశం అందరిలో కాకపోయినా కొంతమంది ఉద్యోగులలో ఏర్పడిందని అంటారు. ప్రభుత్వ స్కూళ్లు బాగు చేసి టైమ్‌కు టీచర్లను రావాలని చెబితే వారిలో కొందరికి కోపం వచ్చిందని చెబుతారు. ఏపీలో సినిమా షూటింగ్‌లు చేయాలని, ఇతరత్రా పేదలకు ధరలు అందుబాటులో ఉంచాలని, దానిని బట్టి టిక్కెట్ల రేట్లు నిర్ధారిస్తామని చెప్పడం బడా సినిమా పెట్టుబడిదారులకు నచ్చలేదు.ఆస్పత్రులను బాగు చేసి, డాక్టర్లను పేదల ఇళ్లకు పంపడం కొన్ని ప్రైవేటు ఆస్పత్రులకు అంతగా ఇష్టం ఉండదు. భూముల రీసర్వే, ఈ స్టాంప్ విధానం, లాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా భూ వివాదాలు తగ్గించడం, బడా భూస్వాములు, రియల్ ఎస్టేట్ దందాలు చేసేవారికి అసంతృప్తి కలిగించింది. అందుకే లాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు, పవన్ కళ్యాణ్, రామోజీరావు, రాధాకృష్ణ వంటివారు పచ్చి అబద్దాలను ప్రచారం చేశారు. ఆయా వ్యవస్థలను చంద్రబాబు బాగా ప్రభావితం చేస్తూ ప్రభుత్వాన్ని బాగా ఇబ్బంది పెట్టారు. అందులో న్యాయ వ్యవస్థ ద్వారా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికు బాగా తలనొప్పి తెప్పించారని చెప్పవచ్చు. మూడు రాజధానుల వ్యవహారం ఒక కొలిక్కి రానీవ్వకుండా విపక్షం వ్యవస్థల ద్వారా అడ్డుపడింది.ఇన్ని జరిగినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడా వెనక్కి తగ్గలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ పెత్తందార్ల ప్రతినిధిగా ఉండడానికి ఇష్టపడలేదు. పాదయాత్రలో సామాన్యుల కష్టాలు ఎలా తెలుసుకున్నారో, ఆ విధంగానే పేదల ప్రతినిధిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగించారు. అదే శ్రీరామరక్ష అవుతుందని ఆయన నమ్మారు. అందుకే ధైర్యంగా తను మంచి చేసి ఉంటేనే ఓటు వేయండని ప్రజలకు పిలుపు ఇవ్వగలిగారు. ఇలా చేసిన ముఖ్యమంత్రి దేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరే. ఎంత ఆత్మ విశ్వాసం లేకుంటే ఆయన ఆ మాట చెప్పగలుగుతారు! అదే ఆత్మ స్థైర్యంతో, ప్రత్యర్ధులు ఎంతగా వేధించినా తొణకకుండా, బెణకకుండా ఐదేళ్లు పూర్తి చేసుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సగర్వంగా ప్రజల ముందు నిలబడ్డారు. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు విజయానికి సంకేతంగా కనిపిస్తుంది.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
మొదటి దశలో 102 సీట్లు... 2019లో ఎవరు గెలిచారు?
2024 లోక్‌సభ ఎన్నికలకు మొదటి దశ ఓటింగ్ రేపు అంటే శుక్రవారం (ఏప్రిల్ 19) జరగనుంది. దీనికి సంబంధించిన ఎన్నికల ప్రచారం బుధవారం (ఏప్రిల్ 17)తో ముగిసింది. మొదటి దశలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని మొత్తం 102 లోక్‌సభ స్థానాలకు ఓటింగ్ జరగనుంది. ఓటర్లు ఈవీఎం యంత్రాలలో అభ్యర్థుల భవితవ్యాన్ని నిక్షిప్తం చేయనున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెల్లడికానున్నాయి. ఏప్రిల్ 19 న జరగనున్న లోక్‌సభ ఎన్నికల మొదటి దశ ఎన్నికల బరిలోకి దిగిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ), ఎన్డిఏ అభ్యర్థులకు ప్రధాని నరేంద్ర మోదీ లేఖలు రాశారు. మొదటి దశ ఓటింగ్‌కు ముందు ప్రధాని ఎన్డీఏ అభ్యర్థులను వ్యక్తిగతంగా సంప్రదించారు. లోక్‌సభ మొదటి దశ పోలింగ్‌లో తమిళనాడులోని మొత్తం 39 స్థానాలు, ఉత్తరాఖండ్‌లోని ఐదు, అరుణాచల్‌ప్రదేశ్‌లోని రెండు, మేఘాలయలో రెండు, అండమాన్ నికోబార్‌లో ఒకటి, మిజోరంలో ఒకటి, పుదుచ్చేరిలో ఒకటి, సిక్కింలోని ఒక స్థానానికి మొదటి దశలో ఎన్నికలు జరగనున్నాయి. తాజాగా లక్షద్వీప్‌లోని ఒక సీటు జత చేరింది. వీటితో పాటు రాజస్థాన్‌లో 12, ఉత్తరప్రదేశ్‌లో ఎనిమిది, మధ్యప్రదేశ్‌లో ఆరు, అసోం, మహారాష్ట్రల్లో ఐదు, బీహార్‌లో నాలుగు, పశ్చిమ బెంగాల్లో మూడు, మణిపూర్‌లో మూడు, జమ్మూకశ్మీర్, ఛత్తీస్‌గఢ్, త్రిపురలో ఒక సీటుకు ఎన్నికలు జరగనున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఈ 102 స్థానాల్లో యూపీఏ 45, ఎన్డీఏ 41 స్థానాలు గెలుచుకున్నాయి. నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ 65 స్థానాల్లో, బీజేపీ 60 స్థానాల్లో పోటీ చేయగా, డీఎంకే 24 స్థానాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. రేపు జరగనున్న మొదటి దశ ఎన్నికల్లో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, కిరణ్ రిజిజు, సర్బానంద సోనోవాల్, అర్జున్ రామ్ మేఘ్వాల్, జితేంద్ర సింగ్, బిప్లబ్ దేబ్, నబమ్ టుకీ, సంజీవ్ బల్యాన్, ఎ రాజా, ఎల్ మురుగన్, కార్తీ చిదంబరం, టి దేవనాథ్ తదితరులు పోటీలో ఉన్నారు. -
కోర్టు తీర్పుపై స్పందించిన శ్రీనివాస్ గౌడ్.. వారి వల్లే అంటూ..
సాక్షి, మహబూబ్‌నగర్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదంటూ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు పిటిషనర్ వేసిన పిటిషన్ కొట్టివేస్తున్నట్టు న్యాయస్థానం తీర్పును వెల్లడించింది. కాగా, కోర్టు తీర్పుపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. ఈరోజు ధర్మం గెలిచింది. గతంలో మంత్రులుగా చెలామని అయ్యి ఈ రాష్ట్రానికి ఏమీ చేయని వాళ్లు పనిచేసే వాళ్లను ఇబ్బంది పెట్టాలనే కుట్రతోనే ఇలాంటి కేసులు వేశారు. బీసీలతోనే బీసీ నాయకత్వాన్ని బలహీన పరుచాలనే దుర్బుద్ధితో ఉమ్మడి జిల్లాకు చెందిన ఆ ఇద్దరు నన్ను ఇబ్బందుల పాలు చేయాలనే తలంపుతో ఈ చర్యలకు తెరలేపారు. గతంలో ఈ వ్యక్తుల వల్లే జిల్లా సర్వనాశనం అయ్యింది. ఈరోజు కుల, మతాలకు అతీతంగా అందరికీ అండగా నిలుస్తూ అభివృద్ధిలో జిల్లాను నడుపుతుంటే చూసి జీర్ణించుకోలేకపోతున్నారు. తప్పుడు ఆరోపణలు చేసిన వాళ్లకు పుట్టగతులు లేకుండా పోతాయని వాళ్ళ బంధువులే మాతో ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పరుచాలన్నదే మా అభిమతం. ఇప్పటికైనా మారండి, ప్రజా క్షేత్రంలోకి రండి అంతే కానీ కేసులు వేసి పైశాచిక ఆనందం పొందడం మానుకోండి. ప్రజలే నాకు దేవుళ్లు, ప్రజా సమస్యల పరిష్కారమే నా ఎజెండా. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఆయన ఆశీస్సులతో జిల్లాను మరింత ముందుకు తీసుకెళ్లడానికి శాయశక్తుల కృషి చేస్తాం. నాకు అండగా నిలుస్తున్న ప్రతీ ఒక్కరికీ పేరుపేరున కృతజ్ఞతలు అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: హైకోర్టులో మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు బిగ్ రిలీఫ్.. -
హైకోర్టులో మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు బిగ్ రిలీఫ్..
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదంటూ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు పిటిషనర్ వేసిన పిటిషన్ కొట్టివేస్తున్నట్టు న్యాయస్థానం తీర్పును వెల్లడించింది. వివరాల ప్రకారం.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదంటూ మహబూబ్‌నగర్‌కు చెందిన రాఘవేంద్రరాజు అనే వ్యక్తి 2019లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిని కొట్టివేస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. అయితే, 2018లో శ్రీనివాస్ గౌడ్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తులు, అప్పుల గురించి తప్పుడు సమాచారం అందించారని రాఘవేంద్రరాజు పిటిషన్ వేశారు. ఎన్నికల అఫిడవిట్‌ను ఒకసారి రిటర్నింగ్ అధికారికి సమర్పించి.. మళ్లీ వెనక్కి తీసుకుని సవరించి అందజేశారని అందులో పేర్కొన్నారు. ఇది చట్టవిరుద్ధమని, ఆయన ఎన్నికను రద్దు చేయాలని కోరారు. దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. తీర్పులను నేటికి వాయిదా వేసింది. దీంతో నేడు తీర్పును వెలువరించింది. ఇక, తెలంగాణ హైకోర్టు తీర్పుతో మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు పెద్ద ఊరట లభించింది. మంత్రికి అనుకూలంగా తీర్పు రావడంతో ఆయన మద్దతుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నిన్న(సోమవారం) ఎలక్షన్ షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. నవంబర్ 30వ తేదీన ఎన్నికలకు కౌంటిగ్ జరగనుంది. డిసెంబర్ 3వ తేదీన ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఇది కూడా చదవండి: ఎన్నికల తేదీలు వచ్చాయో లేదో.. ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల సర్వేల లొల్లి -
టీడీపీ దొంగ ఓట్ల అక్రమాలు
-
నీతాకే మన ఓటు
నీతా శోధ.. పద్దెనిమిదేళ్ల క్రితం పాకిస్తాన్ నుంచి ఇండియాకు వలస వచ్చింది. పాకిస్తాన్ నుంచి ఎందుకు వచ్చిందో ఇండియాలో ఆమెను ఎవరూ అడగలేదు. ఆనాటి నుంచీ ఆమె ఇండియాలో పౌరసత్వం లేకుండానే ఉంది. పౌరసత్వం ఉందా లేదా అని ఎవరూ ఆమెను అడగలేదు. పౌరసత్వం ఎవరు ఇస్తారో, ఎలా ఇస్తారో, ఎందుకు తీసుకోవాలో తెలియక కావచ్చు.. ఆమె కూడా పౌరసత్వం గురించి ఆలోచించలేదు. పాకిస్తాన్ నుంచి వచ్చి, రాజస్థాన్‌లో ఉండిపోయింది. నాలుగు నెలల క్రితం (ఈ పౌరసత్వ గొడవ మొదలు కాకముందు) స్థానిక అధికారులు తమ పని తాము చేసుకుపోతున్న క్రమంలో.. ఏనాడో వలస వచ్చిన నీతా శోధాకు భారత పౌరసత్వం (బర్త్ సర్టిఫికెట్) వచ్చింది. ఆ అర్హతతో ఇప్పుడామె రాజస్థాన్‌లోని నట్వారా పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు! గెలిస్తే దేనికోసం కృషి చేస్తారు అనే ప్రశ్నకు.. ఆమె చెప్పిన సమాధానం.. గ్రామంలో అంతా చక్కగా చదువుకోవాలి. స్త్రీలకు ఏదైనా సంపాదన ఉండాలి. మొదట ఈ రెండిటి కోసం పని చేస్తాను.. అని. భారతదేశంలోని గ్రామాలకు ఇప్పుడు కావలసినవి కూడా ఇవే. -
ఎన్నికలు.. ఆందోళనలు
2019 రాజకీయంగా, సామాజికంగా జరిగిన మార్పులు మామూలువి కావు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పేరున్న భారతదేశంలో ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో సార్వత్రిక ఎన్నికల క్రతువు ముగిసింది. 543 లోక్‌సభ స్థానాలతో పాటు కొన్ని అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరగ్గా భారతీయ జనతా పార్టీ 303 లోక్‌సభ స్థానాలతో కేంద్రంలో అధికారాన్ని కైవసం చేసుకుంది. ఒక రాజకీయ పార్టీ సొంతంగా పూర్తిస్థాయి మెజారిటీ సాధించడం 30 ఏళ్ల తరువాత ఇదే తొలిసారి కూడా. ఆర్థికంగా వెనుకబడ్డ వారికి రిజర్వేషన్లు.. విద్యా, ఉపాధి రంగాల్లో ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రవర్ణాల వారికి పదిశాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం రాజ్యాంగాన్ని 124వ సారి మార్చారు కూడా. ఏడాదికి రూ.8 లక్షల కంటే తక్కువ ఆదాయం కలిగి ఉండి... ప్రభుత్వమిచ్చే ఇతర రిజర్వేషన్లు (ఎక్స్ సర్వీస్ మెన్, వికలాంగులు తదితరాలు) ఉపయోగించుకోని అగ్రవర్ణాల వారికి ఈడబ్ల్యూఎస్ కోటా వర్తిస్తుంది. ఏడాది మొదట్లో, లోక్‌సభ ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఈ నిర్ణయం తీసుకోవడం ఎన్డీయేపై కొన్ని విమర్శలు వచ్చేందుకూ కారణమైంది. పౌరసత్వ చట్ట సవరణ.... దేశాద్యంతం ఆందోళనలకు, హింసాత్మక ఘటనలకు తావిచ్చిన చట్ట సవరణ ఇది. 1955 నాటి చట్టం ప్రకారం భారతీయ పౌరులయ్యేందుకు ఉన్న ఐదు అవకాశాల్లో కొన్ని సవరణలు చేయడం మొత్తం వివాదానికి కారణమైంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్లకు చెందిన హిందు, సిక్కు, పార్శీ, క్రైస్తవ, జైన, బౌద్ధ మతాల వారు ఆయా దేశాల్లో మతపరమైన హింస ఎదుర్కొంటే వారికి భారతీయ పౌరసత్వం కల్పించేందుకు ఈ సవరణ వెసులుబాటు కల్పించింది. ఈ జాబితాలో ముస్లింల ప్రస్తావన లేకపోవడం, ఇతర ప్రాంతాలు, దేశాల నుంచి వచ్చే ముస్లిమేతరుల పరిస్థితీ అగమ్యగోచరంగా మారడంతో పెద్ద ఎత్తున ఆందోళనలు రేగాయి. ఈ ఆందోళనపూరిత వాతావరణం కొనసాగుతుండగానే కేంద్రం జాతీయ జనాభా పట్టిక తయారీకి ఏర్పాట్లు చేయడంతో పరిస్థితి ఇంకా సద్దుమణగలేదు. కాంగ్రెస్‌లో నేతల కరవు సార్వత్రిక ఎన్నికల తరువాత రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడంతో ఆ పార్టీలో కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. గాంధీ కుటుంబానికి చెందని వారినెవరినైనా పార్టీ అధ్యక్షుడిగా నియమించుకోవాలని రాహుల్ స్వయంగా విజ్ఞప్తి చేసినప్పటికీ కొన్ని నెలల పాటు అధ్యక్ష ఎన్నికపై తర్జనభర్జనలు కొనసాగాయి. చివరకు సోనియాగాంధీ మరోసారి అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. రాహుల్ గాంధీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న సమయంలోనే ఉత్తరప్రదేశ్‌లోని ఒక ప్రాంతానికి ఇన్చార్జ్గా ప్రియాంక గాంధీ నియమితులవడం, అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగానూ ఆమెకు పదవి దక్కడం ఆ పార్టీలో జరిగిన ముఖ్యపరిణామాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. కేంద్రపాలిత ప్రాంతాలుగా జమ్మూ కశ్మీర్, లద్దాఖ్... జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుతోపాటు జమ్మూ కశ్మీర్ నుంచి లద్దాఖ్‌ను వేరు చేసి కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించడం ఈ ఏడాది జరిగిన అత్యంత కీలకమైన రాజకీయ ఘట్టాల్లో ఒకటి. దశాబ్దాలుగా దేశంలో ఒకరకమైన అసంతృప్తికి కారణమైన ఆర్టికల్ 370ని ఈ ఏడాది ఆగస్టు 5న రద్దు చేశారు. ఆ తరువాత అక్కడ పెద్ద ఎత్తున ఆంక్షలు విధించడం, 145 రోజుల వరకూ ఇంటర్నెట్పై నిషేధం విధించటం వంటి అంశాలు ప్రపంచదేశాలు దృష్టి పెట్టేలా చేశాయి. పుల్వామా దాడులు... పాకిస్తాన్ ప్రేరిపిత ఉగ్రవాద చర్యలకు తాజా తార్కాణంగా చెప్పుకునే పుల్వామా దాడులు ఈ ఏడాది దాయాది దేశాలు మరోసారి కత్తులు నూరేందుకు కారణమయ్యాయి. ఫిబ్రవరి 14న జమ్మూ కశ్మీర్లో ఓ మిలటరీ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడి చేయగా అందులో సుమారు 40 మంది భారతీయ సైనికులు మరణించారు. ఈ ఘటనకు ప్రతీకారంగా అదే నెల 26న భారత సైన్యం పాకిస్తాన్ లోపలికి చొరబడి బాలాకోట్ వద్ద ఉగ్రవాద స్థావరాలపై బాంబులు వేసింది. ఈ క్రమంలో భారతీయ యుద్ధ విమాన పైలెట్ అభినందన్ వర్ధమాన్ పాకిస్తాన్ చేతికి చిక్కాడు. అంతర్జాతీయ ఒత్తిడికి తలొగ్గిన పాకిస్తాన్ కొన్ని రోజుల వ్యవధిలోనే అభినందన్‌ను సగౌరవంగా భారత్‌కు అప్పగించింది. -
పుర పోరు.. పారాహుషారు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో మళ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. పురపాలక ఎన్నికలకు త్వరలోనే నగారా మోగుతుందన్న ఊహాగానాల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో కదలిక షురూ అయింది. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశిస్తున్న పట్టణ స్థాయి ఔత్సాహికులు గతంలోనే రంగంలోకి దిగినా.. తాజా పరిణామాల నేపథ్యంలో తమ కసరత్తును ముమ్మరం చేశారు. హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేలతో కొంత వెనక్కు తగ్గినా.. ఇటీవల ధర్మాసనం ఎన్నికల నిర్వహణకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం, ఇందుకు అనుగుణంగా పురపాలక శాఖ, ఎన్నికల కమిషన్లు ఏర్పాట్లు చేసుకుంటుండడంతో వారంతా వార్డుల బాట పట్టారు. రాష్ట్రంలో మొత్తం 129 మున్సిపాలిటీలకు ఎన్నికలకు జరగాల్సి ఉండగా.. 77 మున్సిపాలిటీల విషయంలో సింగిల్ బెంచ్ స్టే ఇచ్చింది. అయితే, వీటిపై సానుకూల తీర్పు వెలువడి, త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందనే అంచనాలతో ఆశావహులు తమ పని తాము చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. రిజర్వేషన్లు, స్టేలపైనే ఉత్కంఠ.. ఓటర్ల జాబితాలో అవకతవకలు, కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం వార్డుల పునర్విభజన అంశాల్లో గతంలో స్టేలు వచ్చిన మున్సిపాలిటీలపై సోమవారం హైకోర్టు విచారించనుంది. విచారించాల్సిన కేసుల జాబితాలో దీనిని కూడా చేర్చినా.. సోమవారం విచారణకు వస్తుందా.. లేదా మళ్లీ వాయిదా పడుతుందా.. ఒకవేళ విచారణ జరిగితే ఏం తీర్పు వస్తుంది అనే లెక్కల్లో స్థానిక రాజకీయ యంత్రాంగం నిమగ్నమైంది. దీనికి తోడు కోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇస్తే రిజర్వేషన్లు రెండు, మూడు రోజుల్లోనే ప్రకటిస్తారనే ప్రచారం నేపథ్యంలో ఏ వార్డు ఎవరికి రిజర్వ్ అవుతుందన్న దానిపైనా రాజకీయ నాయకుల్లో ఉత్కంఠ కనిపిస్తోంది. ముఖ్యంగా కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలపై ఈ రిజర్వేషన్ల అంచనాలు ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. పాత మున్సిపాలిటీల విషయానికి వస్తే గతంలో ఎప్పుడు ఏ వర్గానికి రిజర్వ్ అయింది? ఈసారి ఎవరికి అవకాశం ఉందన్న దానిపై మాజీ కౌన్సిలర్లు, కొత్తగా కౌన్సిలర్లు కావాలనుకుంటున్న వారు లెక్కలు వేసుకుంటున్నారు. తమ వర్గానికే రిజర్వ్ అవుతుందా లేదా తమ వర్గానికి చెందిన మహిళకు రిజర్వ్ అవుతుందా.. అలా అయితే తాను కాకుండా తన భార్య లేదా ఇతర కుటుంబ సభ్యులను రంగంలోకి దింపాలా అనే తర్జనభర్జనలు పడుతున్నారు. ఒకవేళ తాము ఆశించిన వార్డులో రిజర్వేషన్ రాకపోతే తమకు అనుకూల రిజర్వేషన్ వచ్చే వార్డులు ఏమున్నాయి.. అక్కడ పోటీ చేయాలా వద్దా అనే అంశాలపై కూడా నేతలు చర్చోపచర్చలు జరుపుతున్నారు. అప్పుడే వార్డుల బాట కోర్టు తీర్పులు, రిజర్వేషన్లు ఎలా ఉన్నా స్థానిక ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు ఔత్సాహికులు అప్పుడే వార్డుల బాట పట్టారు. తమకు అందుబాటులో ఉన్న ఓటరు జాబితాలను తీసుకుని పార్టీ పరంగా, వ్యక్తిగతంగా తమకు అనుకూలంగా ఉన్న ఓట్ల లెక్కలు వేసుకుంటున్నారు. ఫలానా వార్డులో ఏ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉన్నారు? గతంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? వార్డుల పునరి్వభజన జరిగిన తర్వాతి పరిస్థితేంటి? తమకు కలిసి వచ్చే అంశాలేంటి? ఇతర పారీ్టల నుంచి టికెట్లు ఆశిస్తున్నావారెవరు? ఎవరికి టికెట్ దక్కే అవకాశం ఉందన్న దానిపై సన్నిహితులతో చర్చలు జరుపుతున్నారు. ఇక, ఇతర స్థానిక సంస్థలతో పోలిస్తే నిధులకు ఇబ్బంది లేని నగర, పట్టణ స్థానిక సంస్థల్లో పోటీ చేసేందుకు చాలా మంది ముందుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక ప్రధాన రాజకీయ పక్షాలకు తలనొప్పి కలిగించబోతోందని అంటున్నారు. ప్రసన్నం చేసుకుందాం.. పద ఈసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇప్పటికే కౌన్సిలర్లు, కార్పొరేటర్లుగా పనిచేసిన వారిలో 80 శాతం మంది మళ్లీ సిద్ధపడుతున్నట్టు సమాచారం. వీరికి తోడు కొత్తగా పోటీ చేయాలనుకుంటున్న వారి జాబితా కూడా పెద్దగానే ఉండడంతో ఒక్కో వార్డులో వివిధ పారీ్టల నుంచి ఇద్దరు నుంచి 8 మంది వరకు అభ్యర్థులు పోటీ పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు ఎక్కువ మంది పోటీ పడుతున్నారు. అలాంటివారంతా రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు పార్టీ అగ్రనాయకత్వం వద్ద తమ అభ్యరి్థత్వం కోసం అప్పుడే పైరవీలు కూడా మొదలుపెట్టారు. స్థానికంగా అందుబాటులో ఉన్న నాయకత్వం వద్దకు వెళ్లి తమకు ఈసారి టికెట్ ఇప్పించాలంటూ ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రతిపక్ష పారీ్టలైన కాంగ్రెస్, బీజేపీల నుంచి కూడా టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే కనిపిస్తోంది. వీరితో పాటు స్వతంత్రులు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారు. వీరంతా నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందా అని ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఈసారి పురపోరు రసవత్తరంగా సాగబోతోందని స్థానిక రాజకీయ పరిస్థితులు చెబుతున్నాయి. తప్పులు సవరిస్తే బాగుంటుంది మున్సిపాలిటీ ఎన్నికల కోసం అందరం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. గతంలో స్టేలు వచ్చిన మున్సిపాలిటీల్లో జరిగిన తప్పులు సవరించాల్సి ఉంది. అలాగే వార్డులను ఎల్ ఆకారంలో, జెడ్ ఆకారంలో నిర్ధారించారు. దీంతో కొంత గందరగోళం ఏర్పడింది. అంతా సర్దుబాటు అయితే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని చాలా మంది ఎదురుచూస్తున్నారు. స్టేలు వచి్చన మున్సిపాలిటీలపైప్రభుత్వం సరైన రీతిలో కౌంటర్ వేయాలి. – బుర్రి శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ మాజీ వైస్‌చైర్మన్, నల్లగొండ -
మోగిన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల నగారా
-
‘సరిహద్దు’లో ఎన్నికలు
సాక్షి, కెరమెరి(ఆదిలాబాద్) : రెండు రాష్ట్రాలు.. ఇటు తెలంగాణ, అటు మహారాష్ట్ర.. ఈ రెండు ప్రభుత్వాలు కుమురంభీం జిల్లా కెరమెరి మండలంలోని సరిహద్దున ఉన్న వివాదాస్పద 14 గ్రామాలను ఏళ్లతరబడి పాలిస్తున్నాయి. కాని ఆ గ్రామాల్లో కనీసం తాగునీటి సమస్యను కూడా తీర్చని పరిస్థితి. ప్రతీ గ్రామాన్ని కదిలించిని క‘న్నీటి’ గాథలే దర్శనమిస్తున్నాయి. ఈ నెల 21న మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా రాజూర నియోజకవర్గానికి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మండలానికి చెందిన 2800 మంది ఓటర్లు తమ ఓటును సద్వినియోగం చేసుకోనున్నారు. పుడ్యాన్ మొహదా, వనీ, నోకేవాడ, పరందోలి, కుంభేఝరి, భొలాపటార్ గ్రామాల్లో పోలింగ్ బూత్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సరిహద్దు గ్రామాలు.. పరందోళి, అంతాపూర్, భోలాపటార్, ముకదంగూడ గ్రామ పంచాÄ ¶æుతీల్లోని పరంధోళి, కోటా, పరందోళి తాండ, ముకద్దంగూడ, మహరాజ్‌గూడ, లేండిజాల, అంతాపూర్, ఇంద్రానగర్, పద్మావతి, ఎసాపూర్, నారాయనగూడ, భోలాపటార్, లేం డిగూడ, గౌరి ఉన్నాయి. ఐదు గ్రామపంచాయతీల్లో 14 వివాదాస్పద సరిహద్దు గ్రామాలు మహారాష్ట్రలోని ఐదు గ్రామ పంచాయతీల్లో ఉన్నాయి. అందులో పరంధోళిలో గ్రామ పంచాయతీలో ముకదంగూడ, కొటా, పరందోళి, లేండిజాల గ్రామాలు ఉండగా.. పుడ్యాన్ మొహదాలో శంకర్‌లొద్ది, ఇంద్రానగర్, అంతాపూర్, పద్మావతీ, నోకేవాడలో మహారాజ్‌గూడ, కుంభేఝరిలో నారాయణగూడ, ఎసాపూర్, భోలాపటార్, లేండిగూడ, చిక్లి గ్రామ పంచాయతీల్లో గౌరి గ్రామాలు ఉన్నాయి. సాగుపట్టాలే ప్రధాన సమస్య! ఏళ్లుగా ఆయా గ్రామాల ప్రజలకు ప్రధాన సమస్య సాగుభూములకు పట్టాలివ్వడం. ఆయా గ్రామాల్లో వేల ఎకరాల్లో సాగు భూమి ఉన్నప్పటికీ 80 శాతం రైతులకు పట్టాలు లేవు. ఇటు తెలంగాణ ప్రభుత్వం, అటు మహారాష్ట్ర ప్రభుత్వం పట్టాలివ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రతిసారి ప్రచారం కోసం వచ్చిన అభ్యర్థులను గెలిపిస్తే పట్టాలిప్పిస్తామని హామీ ఇవ్వడం పరిపాటిగా మారింది. రెండు ప్రభుత్వాలున్నా.. అభివృద్ధి శూన్యమే రెండు ప్రభుత్వాలున్నా ఎలాంటి అభివృద్ధి మాత్రం కానరావడం లేదు. రెండు రాజ్యాలకు చెందిన ఇద్దరు సర్పంచ్‌లు, ఇద్దరు ఎంపీటీసీలు ఆ గ్రామాల్లో ఉన్నా ప్రతి ఒక్కరికీ రెండేసి రేషన్‌కార్డులు, రెండేసి ఓటరు కార్డులున్నాయి. రెండు పాఠశాలలు, రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, రెండు అంగన్వాడీ కేంద్రాలు, ఇరువైపులా ప్రభు త్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న అవి వీరి దరిచేరడం లేదు. ముగిసిన ప్రచారం.. వారం రోజులుగా హోరాహోరిగా సాగిన ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రంతో 5గంటలతో ముగిసింది. ప్రధాన పార్టీలకు చెందిన నాయకులు తప్ప స్వతంత్ర అభ్యర్థులు పెద్దగా ప్రచారం నిర్వహించలేదు. పోటీ మాత్రం సేత్కారి సంఘటన అభ్యర్థి వామన్‌రావు చటప్, బీజేపీ అభ్యర్థి సుభాష్‌రావు ధోటే మధ్యలోనే ఉంటుందని చెబుతున్నారు. సరిహద్దు గ్రామాలు 14 పోలింగు కేంద్రాలు 06 ఓటర్లు 2803 పోలింగ్ తేదీ ఈ నెల 21 సమయం ఉ: 7:30 గం నుంచి సా: 5:00 గం వరకు పోటీ చేసే అభ్యర్థులు :12 మంద పని చేసే వారికే పనిచేసే వారికే ఓటు వేస్తాం. ఇప్పటికీ చాలా నష్టపోయి ఉన్నాం. ఎవ్వరూ వచ్చినా సమస్యలు తీర్చుతామంటున్నారు. కానీ తరువాత మర్చిపోతున్నారు. గ్రామ పంచాయతీల్లో నిధులు చాలా తక్కువగా ఉంటాయి. – కాంబ్డె లక్ష్మణ్, సర్పంచ్ పరంధోళి (మహారాష్ట్ర) పట్టాలివ్వాలి మేము గడిచిన 40 సంవత్సరాల నుంచి భూములను సాగుచేస్తున్నప్పటికీ నేటికీ సాగుభూములకు పట్టాలులేవు. ఇరు ప్రభుత్వాలు కూడా పట్టాలు ఇవ్వక పోవడంతో సంక్షేమ పథకాలు అందడం లేదు. -
‘ఎన్నికలొస్తే సర్జికల్ స్ట్రైకులొస్తాయ్’
న్యూఢిల్లీ: దేశంలో ఎన్నికలొచ్చినప్పుడే.. సరిహద్దుల్లో సర్జికల్ స్ట్రైకులొస్తున్నాయని.. వాస్తవ సమస్యలను మరుగుపరిచేందుకే బీజేపీ సైనికులను అడ్డుపెట్టుకుని ఆటలాడుతోందని కాంగ్రెస్ నేత అఖిలేశ్ ప్రసాద్ సింగ్ వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్, హరియాణా ఎన్నికలకు ఒక్కరోజు ముందే ఈ దాడులు బయటకు రావడం వెనుక మతలబేంటని ఆయన ప్రశ్నించారు. పెద్ద ఎన్నికలు వచ్చినప్పుడల్లా సర్జికల్ స్ట్రైక్స్ కనిపించడం మోదీ ప్రభుత్వంలో సర్వసాధారణమైందని ఎద్దేవా చేశారు. అయితే కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ సింఘ్వి మాత్రం భారత సైనికుల ధైర్యసాహసాలను మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు. సైనికుల ధైర్యాన్ని చూసి గర్విస్తున్నామని పేర్కొన్నారు. -
మహారాష్ట,హరియాణాలో ఎన్నికల ప్రచారానికి తెర
-
కాంగ్రెస్ దేశభక్తులను అవమానించింది
-
హరియాణాలో డేరా రాజకీయం
హరియాణా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో అన్ని ప్రధాన పార్టీలు ఆధ్యాత్మిక బాట పట్టాయి. డేరాలు, బాబాల చుట్టూ తిరుగుతూ మద్దతు కోసం పోటీ పడుతున్నాయి. హరియాణాలో ఆధ్మాత్మిక సంస్థల ప్రభావం ఓటర్లపై విపరీతంగా ఉంటుంది. తమ ఆ«ధ్యాత్మిక గురువులు ఏ పార్టీకి ఓటు వెయ్యమని చెబితే వారికే గుడ్డిగా ఓటు వేసే అనుచరగణం అధిక సంఖ్యలోనే ఉంది. అందుకే రాజకీయాలన్నీ డేరాల చుట్టూ తిరుగుతున్నాయి. డేరా సచ్చా సౌదా గురువు: గుర్మీత్ రామ్ రహీమ్ అత్యాచారం, హత్య కేసులో దోషిగా తేలి జైల్లో ఊచలు లెక్కపెడుతున్న గుర్మీత్ రామ్ రహీమ్ ఈ సారి ఏ పార్టీకి మద్దతివ్వాలో ఇంకా నిర్ణయించుకోలేదు. ఈ డేరాలో 15 మంది సభ్యులతో కూడిన ఒక రాజకీయ వ్యవహారాల కమిటీ రాష్ట్రవ్యాప్తంగా సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆ సమావేశాల్లో వచ్చే ఫలితాలకనుగుణంగా ఏ పార్టీకి మద్దతివ్వాలో నిర్ణయిస్తామని కమిటీ సభ్యుడు జోగిందర్ సింగ్ చెప్పారు. డేరా సచ్చా సౌదా ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో నియోజకవర్గాల్లో ఉంది. సత్లోక్ ఆశ్రమ్స్ గురువు: రామ్‌పాల్ ఈ డేరా గురు రామ్‌పాల్ కూడా 2014 నవంబర్ నుంచే జైల్లో ఉన్నారు. అక్కడి నుంచే ఆయన రాజకీయాలను శాసిస్తున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో రామ్‌పాల్ కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచారు. కానీ ఈ సారి ఏ పార్టీకి మద్దతివ్వాలో అన్న మీమాంసలో ఉన్నారు. ‘‘లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల అంశాల్లో చాలా తేడా ఉంది. అక్టోబర్ 15న సర్వసభ్య సమావేశంలో చర్చించి ఏ పార్టీకి మద్దతునివ్వాలో తేల్చుకుంటాం‘‘అని గురు రామ్‌పాల్ డేరా మీడియా ఇన్చార్జ్ చాంద్ రథి వెల్లడించారు. రోహ్తక్ చుట్టుపక్కలున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో గురు రామ్‌పాల్ డేరా ప్రభావం ఎక్కువగా ఉంది. డేరా బాబా శ్రీ బాలక్ పురి గురువు: కరణ్ పురి ఈ సారి ఎన్నికల్లో కరణ్ పురి డేరా ఎన్నికలకు దూరంగా ఉండా లని నిర్ణయించుకుంది. హరియాణా లో నివసిస్తున్నా పంజాబీల్లో అధిక ప్రభావం కలిగిన ఈ డేరా తమ అనుచరులకు ఎలాంటి పిలుపు ఇవ్వడం లేదు. అయితే ఈ డేరాను బీజేపీ నాయకులు అత్యధికంగా సందర్శిస్తున్నారు. డేరా గౌకరణ్ ధామ్ గురువు: కపిల్ పురి కాంగ్రెస్‌కు కపిల్పురి మద్దతుదారు. కాంగ్రెస్ నేత భూపీందర్ హూడాకు అనుకూలం. ఈ సారి ఎన్నికల్లో జోక్యం చేసుకోమని చెబుతున్నప్పటికీ బీజేపీకి మద్దతు ఇవ్వాలంటూ గౌకరణ్ ధామ్ డేరా తమ అనుచరగణానికి సంకేతాలు పంపుతోంది. -
జమ్మూకశ్మీర్ లో ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం
-
గులాబీ జెండా ఎగరాలి
కంటోన్మెంట్: త్వరలో జరగనున్న బోర్డు ఎన్నికల్లో అన్ని వార్డుల్లోనూ టీఆర్ఎస్ జెండా ఎగరవేయాలని, ఈ మేరకు కృషి చేయాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్థానిక నేతలకు దిశానిర్దేశం చేశారు. బుధవారం తెలంగాణ భవన్లో కేటీఆర్ కంటోన్మెంట్ నేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. స్థానిక ఎమ్మెల్యే సాయన్న, సీనియర్ నేత మర్రి రాజశేఖరరెడ్డి నేతృత్వంలో బోర్డు ఉపాధ్యక్షుడు రామకృష్ణ, టీఎస్టీఎస్ చైర్మన్ బోర్డు సభ్యులు కేశవరెడ్డి, పాండుయాదవ్, లోకనాథం, బోర్డు మాజీ సభ్యులు వెంకట్రావు, ప్రభాకర్, జీహెచ్ఎంసీ కో– ఆప్షన్ సభ్యుడు నర్సింహ ముది రాజ్, కార్పొరేటర్ లాస్య నందిత, మోండా డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఆకుల హరి కృష్ణ, పార్టీ సీనియర్ నేతలు టీఎన్ శ్రీనివాస్, పిట్ల నాగేశ్‌లు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ నాలుగు నెలల్లో జరగనున్న బోర్డు ఎన్నికలకు నేతలు సర్వసన్నద్ధం కావాలని సూచించారు. ముఖ్యంగా పార్టీ నేతల మధ్య ఉన్న విభేదాల ను పక్కనపెట్టి ఐకమత్యంతో ముందుకెళ్లాలన్నారు. బహిరంగ వేదికల్లో బోర్డు సభ్యులు పరస్పరం ఆరోపణలు చేసుకోవడం మానుకోవాలని సూచించారు. గత బోర్డు ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలవగా, ఎన్నికల అనంతరం మిగతా నలుగురు సైతం పార్టీలోనే చేరారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఎన్నికల్లో అన్ని వార్డుల్లోనూ టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులే గెలిచేలా తగి న వ్యూహాలు రూపొందించాలని సాయన్నకు సూచించారు. ఈ మేరకు గురువారం స్థానిక టీఆర్ఎస్ నేతలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. పార్టీ గుర్తులతో ఎన్నికలకే మొగ్గు! బోర్డు ఎన్నికల్లో ఈసారి పార్టీ గుర్తులతోనే ఎన్నికలు జరిగేలా చూడాలని కొందరు నేతలు ప్రస్తావించగా, ఈ మేరకు తమ వంతు ప్రయత్నాలు చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చినట్లు తెలిసింది. వచ్చే నెల 13న ఢిల్లీలో ఎన్నికల సంఘం కార్యాలయంలో జరగనున్న సమావేశంలో బోర్డు ఎన్నికల అంశంపై కూడా చర్చిస్తామని పేర్కొన్నారు. బోర్డు ఎన్నికల్లో పార్టీ గుర్తులతో ఎన్నికలు నిర్వహించాలన్న డిమాండ్‌కు బీజేపీ కూడా సానుకూలంగా వ్యవహరించే అవకాశముందని స్థానిక టీఆర్ఎస్ నేతలు కేటీఆర్‌తో అన్నారు. బోర్డు అధికారుల అలసత్వంతోనే.. కంటోన్మెంట్ పరిధిలోని సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ, బోర్డు అధికారుల అలసత్వం వల్లే ఆయా సమస్యలు పెండింగ్‌లో పడుతున్నాయని కేటీఆర్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కంటోన్మెంట్ జనలర్ ఆస్పత్రిని పూర్తిస్థాయిలో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మూడేళ్లుగా చెబుతున్నప్పటకీ బోర్డు అధికారులు తమ సంసిద్ధతను రాతపూర్వకంగా అందజేయడం లేదన్నారు. ఇక రూ.40 కోట్లు దాటిన టీపీటీ బకాయిల్లో కనీసం సగం తక్షణం విడుదలయ్యేలా చూడాలని బోర్డు సభ్యులు కోరారు. వెంటనే సంబంధిత అధికారుల ద్వారా సమాచారం తెలుసుకున్న కేటీఆర్ ఇటీవలే రూ.8 కోట్లు విడుదలయ్యాయని, త్వరలో మరో రూ.12 కోట్లు విడుదలవుతాయిన చెప్పారు. రామన్నకుంట సమస్య పరిష్కారంలోనూ రాష్ట్ర ప్రభుత్వం ఎల్లవేళలా సిద్ధంగా ఉందన్నారు. బోర్డు సభ్యులు ప్రత్యేక చొరవతో ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వ అధికారులను సంప్రదిస్తూ పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు. -
ఆ రూ.1.92 కోట్లు నావే: మాగంటి బాబు
సాక్షి, అమరావతి బ్యూరో: సార్వత్రిక ఎన్నికల సమయంలో పోలీసులకు పట్టుబడిన రూ.1.92 కోట్లు తనదేనని మాజీ ఎంపీ మాగంటి బాబు క్లెయిమ్ చేసుకున్నారు. అది చేపలు అమ్మగా వచ్చిన ఆదాయమని.. ఆ మొత్తాన్ని రిలీజ్ చేసి తనకు ఇప్పించాలని కోరుతూ విజయవాడ పోలీస్ కమిషనర్‌కు మాగంటి విజ్ఞప్తి చేశారు. వివరాల్లోకి వెళితే.. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా.. ఏప్రిల్ 10వ తేదీన సిమెంట్ లోడు లారీలో తరలిస్తున్న రూ.1,92,90,500 నగదును విజయవాడ పటమట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జగ్గయ్యపేట నుంచి ఏలూరు వెళ్తున్న లారీని కామినేని ఆస్పత్రి సమీపంలో చెక్‌పోస్టు వద్ద తనిఖీ చేశారు. అందులో సిమెంట్ బస్తాల మధ్య రెండు బాక్స్‌లు ఉండటాన్ని గమనించి వాటిని తెరిచి చూడగా.. భారీ నగదు కనిపించింది. ఈ సమయంలో అదే లారీలో ప్రయాణిస్తున్న మాగంటి అనుచరుడు పరారయ్యాడు. డ్రైవర్ కోగంటి సతీష్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా తనకేమీ తెలియదని.. ఆ డబ్బును ఏలూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి కోసం తీసుకెళ్తున్నట్టు తనతోపాటు లారీలో వచి్చన యువకుడు చెప్పాడని డ్రైవర్ వాంగ్మూలం ఇచ్చాడు. ఎలాంటి ఆధారాలు, పత్రాలు లేకుండా తరలిస్తున్న ఆ మొత్తాన్ని అప్పట్లో విజయవాడ నగర పోలీసులు సీజ్ చేసి ఆదాయ పన్ను శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. రెండు రోజుల క్రితం నగర పోలీస్ కమిషనర్‌ను కలిసిన మాగంటి బాబు ఆ సొమ్ము మొత్తం తనదేనని, చేపల్ని విక్రయించగా సమకూరిందని తెలిపారు. ఇందుకు సంబంధించిన లావాదేవీ పత్రాలను ఆదాయ పన్ను శాఖ అధికారులకు చూపగా రూ.64 లక్షల పన్ను విధించారని వివరించారు. పన్ను చెల్లించిన దృష్ట్యా సీజ్ చేసిన డబ్బును తనకు ఇప్పించాలని కోరారు. మాగంటి బాబు చెబుతున్నట్టుగా ఆ డబ్బు సక్రమంగా సంపాదించిందే అయితే రూ.64 లక్షలను ఆదాయ పన్ను, అపరాధ రుసుంగా ఎందుకు చెల్లించాల్సి వచి్చందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చేపల విక్రయం ద్వారానే అంత ఆదాయం వచి్చనా.. పన్నులేవీ చెల్లించకుండా రహస్యంగా ఎందుకు తరలించాల్సి వచి్చందనే ప్రశ్నలూ వినిపిస్తున్నాయి. పోలీసులు కనబడగానే మాగంటి అనుచరుడు పరారవటం కూడా అనుమానాలకు తావిస్తోంది. -
కన్నారంపై కమలం కన్ను
సాక్షి, కరీంనగర్ : పార్లమెంటు ఎన్నికల్లో సాధించిన అనూహ్య విజయాలతో పట్టణాల్లో పాగా వేయాలని కమలనాథులు ఉవ్విళ్లూరుతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్లో బీజేపీ భారీ మెజారిటీ సాధించడానికి కారణమైన అసెంబ్లీ సెగ్మెంట్లలోని పురపాలికలను తొలుత బీజేపీ నేతలు టార్గెట్ చేసుకున్నారు. పట్టణాల్లో బీజేపీకి అంతో ఇంతో బలం ఉండడం, తాజాగా పార్లమెంటు ఎన్నికల్లో ‘పువ్వు’ గుర్తు జనాల్లోకి వెళ్లడంతో పురపాలక సంఘాలను కైవసం చేసుకోవాలని ఆ పార్టీ పట్టుదలతో ఉంది. దీనికి తోడు కరీంనగర్ నుంచి విజయం సాధించిన ఎంపీ బండి సంజయ్‌కుమార్ కరీంనగర్ కార్పొరేషన్‌తోపాటు పార్లమెంటు పరిధిలోని మెజారిటీ మునిసిపాలిటీల్లో కాషాయజెండా ఎగురవేయించాలనే పట్టుదలతో ఉన్నారు. ఇందుకోసం తొలుత కరీంనగర్ కార్పొరేషన్‌ను టార్గెట్‌గా చేసుకున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో భారీ మెజారిటీ ఇచ్చిన చొప్పదండి, కొత్తపల్లి, వేములవాడ మునిసిపాలిటీల్లో సానుకూల ఫలితాలు పొందే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ మునిసిపాలిటీల్లోని వార్డుల్లో గెలిచే స్థాయి నాయకులు ఎంత మేరకు ఉన్నారనేది ఇప్పుడు పార్టీ నేతలను తొలుస్తున్న ప్రశ్న. హుజూరాబాద్ నియోజకవర్గంలోని హుజూరాబాద్, జమ్మికుంటతోపాటు కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లపై బీజేపీకి పెద్దగా ఆశలు లేకపోయినా, ఇక్కడ కూడా అభ్యర్థులను నిలిపి బలం పెంచుకునే ఆలోచనతో ఉన్నారు. కరీంనగర్ బల్దియాపై కాషాయమే లక్ష్యంగా.. మైనారిటీ వర్గాల ప్రభావం అధికంగా ఉన్న కరీంనగర్ మునిసిపల్ కార్పొరేషన్లో డివిజన్ల సంఖ్య 50 నుంచి 60కి పెరిగింది. కొత్తగా కలిసిన 8 గ్రామాలతో పది వార్డులు పెరిగాయి. అదే సమయంలో మైనారిటీ వర్గాల ప్రభావం ఉన్న డివిజన్ల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎంపీ బండి సంజయ్ మెజారిటీ ఓటు బ్యాంకును లక్ష్యంగా చేసుకుని ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఆలోచనతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మిత్రపక్షాలుగా ఉన్న టీఆర్ఎస్, ఎంఐఎంలకు ఓటు వేయడం వల్ల కరీంనగర్ ఇమేజ్ దెబ్బతింటుందని ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఇదే అంశాన్ని విభిన్న రీతుల్లో ప్రచారం చేసి ధర్మం పేరుతో ‘హిందుత్వ’ ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఈసారి కూడా ఇదే అంశాన్ని జనాల్లోకి బలంగా తీసుకెళ్లాలని నిర్ణయించారు. స్మార్ట్‌సిటీ ప్రచార అస్త్రంగా... కరీంనగర్‌ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే స్మార్ట్‌సిటీగా ప్రకటించిందని, నిధులను సక్రమంగా వెచ్చించడంలో ఇప్పటివరకు బల్దియాను ఏలిన టీఆర్ఎస్ విఫలమైందనే ప్రచారానికి బీజేపీ తెరలేపింది. కార్పొరేషన్లో బీజేపీ అధికారంలో ఉంటే మరిన్ని నిధులు తీసుకురావడంతోపాటు నగరాన్ని అభివృద్ధి చేస్తామని సంజయ్ తన ప్రసంగాల్లో చెబుతున్నారు. ఒక రకంగా రేపటి ఎన్నికల్లో ఇదే ప్రధాన ప్రచారాస్త్రంగా మారనుందన్న మాట. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి ఎంపీ వినోద్‌కుమార్ వల్లనే కరీంనగర్‌ను స్మార్ట్‌సిటీ జాబితాలో చేర్చినట్లు టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఎమ్మెల్యే కమలాకర్ ఓ అడుగు ముందుకేసి ‘పేరుకే స్మార్ట్‌సిటీ తప్ప రూపాయి రావడం లేదు. బీజేపీ నేతలకు చిత్తశుద్ధి లేదు’ అని బాహాటంగానే విమర్శిస్తున్నారు. పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా టీఆర్ఎస్ను టార్గెట్ చేయాలని వ్యూహాత్మకంగా బీజేపీ నేతలు ముందుకు సాగుతున్నారు. పట్టణాల్లో బీజేపీకి గెలిచే కేడర్ ఎక్కడ..? కరీంనగర్లో సంజయ్ ఇమేజ్‌కు తోడు మోదీ హవాతో పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఆ ప్రభావం కొంత మేర పట్టణాల్లో ఇప్పటికి ఉన్నప్పటికీ, బీజేపీ అభ్యర్థులను గెలిపించే స్థాయిలో పనిచేస్తుందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కరీంనగర్లో గత మునిసిపల్ ఎన్నికల్లో సంజయ్‌తోపాటు విజయ మాత్రమే బీజేపీ నుంచి కార్పొరేటర్లుగా గెలుపొందారు. ఇప్పుడు కరీంనగర్ మునిసిపాలిటీని కైవసం చేసుకోవాలంటే కనీసం 31 మంది కార్పొరేటర్లు గెలవాలి. కరీంనగర్లో కొంత మేర సంజయ్ ఎఫెక్ట్ ఇప్పటికీ ఉన్నా, మిగతా మునిసిపాలిటీల్లో పరిస్థితి అంత ఈజీగా లేదని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. హుజూరాబాద్, జమ్మికుంట మునిసిపాలిటీల్లో మంత్రి ఈటల ప్రభావం ఎక్కువగా ఉంది. సిరిసిల్ల మునిసిపాలిటీలో ఎమ్మెల్యే, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రామన్న చేసిన అభివృద్ధి పనులే అడుగడుగునా కనిపిస్తున్నాయి. చొప్పదండి, కొత్తపల్లి కొత్త మునిసిపాలిటీలే. వేములవాడ మునిసిపాలిటీలో మాత్రం ఈసారి బీజేపీ బలం పుంజుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నేడు సభ్యత్వంతోపాటే ఎన్నికల సందడి బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా శనివారం హైదరాబాద్‌లో ప్రారంభించారు. కరీంనగర్లో ఆదివారం సభ్యత్వ నమోదుకు ఎంపీ సంజయ్‌కుమార్, జిల్లా పార్టీ అధ్యక్షుడు సత్యనారాయణ ముహూర్తం నిర్ణయించారు. మహబూబ్‌నగర్ మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. అనంతరం సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో బల్దియా ఎన్నికల్లో బీజేపీ అనుసరించాల్సిన వ్యూహాన్ని పార్టీ యంత్రాంగానికి వివరించనున్నారు. -
వేలూరు లోక్‌సభకు ఎన్నికల షెడ్యూల్ విడుదల
చెన్నై : వేలూరు లోక్‌సభ స్థానానికి ఎన్నికల షెడ్యూల్ విడుదలయింది. అక్కడ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్ ప్రకటించింది. వేలూరులో ఆగస్టు 5వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నట్టు, 9వ తేదీన ఫలితాలు వెల్లడించనున్నట్టు ఈసీ పేర్కొంది. దేశవ్యాప్తంగా ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరగగా, వేలూరులో నియోజకవర్గంలో మాత్రం ఈసీ ఎన్నికను నిలిపివేసింది. ఎన్నికల సమయంలో వేలూరు లోక్‌సభ పరిధిలో భారీగా నగదు పట్టుబడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుంది. అయితే ఈ స్థానంలో డీఎంకే కూటమి తరఫున కదిర్ ఆనంద్, అన్నాడీఎంకే కూటమి అభ్యర్థిగా ఏసీ షణ్ముగంగత బరిలో నిలిచారు. కాగా, సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడులో డీఎంకే కూటమి ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. -
ఇక పురపోరు
సాక్షి, నాగర్‌కర్నూల్: జిల్లాలో అసెంబ్లీ, సర్పంచ్, ఎంపీ, పరిషత్ ఎన్నికలు విజయవంతంగా పూర్తి చేసిన యంత్రాంగం త్వరలో మున్సిపల్ ఎన్నికలకు కూడా రంగం సిద్ధం చేసుకుంటుంది. మంగళవారం జరిగిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో పురపాలిక ఎన్నికల ప్రస్తావన వచ్చింది. దీంతో వచ్చే నెలలోనే ఎన్నికలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. మున్సిపాలిటీల పాలకవర్గాల పదవీకాలం జూలై 3వ తేదీతో ముగియనున్నాయి. గతంలో విలీన గ్రామాలపై కొంత వివాదం నెలకొన్నా హైకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో సమస్య పరిష్కారం కావడంతో పురపాలిక ఎన్నికలు నిర్వహించేందుకు ప్రస్తుతం ఎలాంటి అడ్డంకులు లేవు. జిల్లాలో నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, కల్వకుర్తి, అచ్చంపేట మున్సిపాలిటీలు ఉన్నా.. అచ్చంపేటలో మార్చి 2016లోనే ఎన్నికలు జరగడంతో అక్కడి పాలకవర్గానికి ఇంకా రెండేళ్ల గడువు ఉండడంతో మిగిలిన మూడు మున్సిపాలిటీలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. జిల్లాలో మున్సిపాలిటీల్లో 13 పంచాయతీలను విలీనం చేయడంతో.. కొన్ని గ్రామాలు విలీనాన్ని వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళ్లడంతో వార్డుల విభజన ప్రక్రియను పూర్తి చేయడంలో ఆలస్యమైంది. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయితే వచ్చే నెలలోనే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. వార్డుల పునర్విభజనపై ఉత్కంఠ మున్సిపాలిటీల ఎన్నికల నిర్వహణకు ముందు వార్డుల పునర్విభజన కీలకం కానుంది. అయితే వచ్చే నెలలోనే ఎన్నికలు ఉన్నట్లు ప్రకటిస్తుండటంతో అంత తక్కువ సమయంలో వార్డుల విభజన రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తవుతుందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఉన్నతాధికారుల నుంచి వచ్చిన మార్గదర్శకాల ఆధారంగానే అధికారులు వార్డుల విభజన చేపట్టే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో వార్డుల విభజన సరిగ్గా లేకపోవడంతో కొన్ని వార్డులలో ఓటర్ల సంఖ్య హెచ్చు తగ్గులయ్యాయి. కొన్ని వార్డుల్లో 800 ఓటర్లు ఉంటే కొన్ని వార్డుల్లో 1,600 వరకు ఓటర్లు ఉన్నారు. అయితే వార్డుల విభజన పూర్తి అయినా వార్డుల పెంపుపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం జిల్లాలో ప్రతి మున్సిపాలిటీలో 20 వార్డులు ఉన్నాయి. గతంలో నగరపంచాయతీలు ఉన్నప్పుడు ఎన్ని వార్డులు ఉన్నాయో మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్ అయిన తరువాత కూడా 20వార్డులనే కొనసాగిస్తారా లేదా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. నాగర్‌కర్నూల్‌లో ఎండబెట్ల, నాగనూలు, దేశిటిక్యాల, ఉయ్యాలవాడ, కొల్లాపూర్ పరిధిలో చుక్కాయిపల్లి, చౌటబెట్ల, తాళ్ల నర్సింగాపురం, నర్సింగరావుపల్లి, కల్వకుర్తి పరిధిలో సంజాపూర్, తిమ్మరాసిపల్లి, కొట్రతండా గ్రామాలు మున్సిపాలిటీల్లో విలీనం చేశారు. అయితే విస్తీర్ణం పెరగడంతో వార్డుల సంఖ్య కూడా పెంచాలని కొందరు ఆశావహులు అభిప్రాయపడుతున్నారు. తొలగిన అడ్డంకులు నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీలో విలీన గ్రామాల్లో ఒకటైన ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన వారు మున్సిపాలిటీల్లో విలీనాన్ని వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళ్లడంతో వార్డుల విభజన ప్రక్రియను పూర్తి చేయలేదు. కొల్లాపూర్ నగరపంచాయతీగా అవతరించి ఏడేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎన్నికలు జరగలేదు. నర్సింగారావుపల్లి గ్రామస్తులు కోర్టులో కేసు వేయడంతో అక్కడ కూడా ఎన్నికల నిర్వహణకు అడ్డంకిగా మారింది. అయితే హైకోర్టులో అనుకూలంగా తీర్పు రావడంతో ఆ ప్రక్రియకు కూడా అడ్డంకులు తొలగిపోయాయి. మూడు మున్సిపాలిటీలలో బీసీ గణన కూడా పూర్తయింది. మూడు మున్సిపాలిటీలలో కలిపి ప్రస్తుతం ఉన్న జాబితా ప్రకారం 43,684మంది బీసీ ఓటర్లు, 9,182మంది ఎస్సీ ఓటర్లు, 1912 మంది ఎస్టీ ఓటర్లు, 11,026 మంది ఇతర ఓటర్లు మొత్తం 65,802 మంది ఓటర్లు ఉన్నారు. నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ లెక్కల ప్రకారం ఓటర్లు 27,021 ఉండగా ఇందులో బీసీలు 18,007, ఎస్సీలు 3,885, ఎస్టీలు 238, ఇతరులు 4,891 ఉన్నారు. కల్వకుర్తిలో మొత్తం 19,918 మంది ఓటర్లు ఉండగా బీసీలు 11,998, ఎస్సీలు 2,167, ఎస్టీలు 1422, ఇతరులు 4331 మంది ఓటర్లు ఉన్నారు. కొల్లాపూర్ మున్సిపాలిటీలో మొత్తం 18418 మంది ఓటర్లు ఉండగా బీసీలు 13,492, ఎస్సీలు 3,130, ఎస్టీలు 252, ఇతరులు 1,544 మంది ఉన్నారు. అయితే గతంలో జరిగిన బీసీ ఓటర్ల గణన ప్రకారం రిజర్వేషన్లు ఖరారు చేస్తారా లేక కొత్త చట్టంతో ఏవైన మార్పులు చేర్పులు జరుగుతాయా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఇక మున్సిపల్ ఎన్నికలు ప్రత్యక్ష పద్ధతిలోనా, పరోక్ష పద్ధతిలో నిర్వహిస్తారా అనే అంశం తేలాల్సి ఉంది. ప్రత్యక్ష పద్ధతిలో అయితే బడానేతలంతా రిజర్వేషన్ అనుకూలిస్తే పోటీలో ఉండే అవకాశం ఉంది. ఆశావహుల ఎదురుచూపు మున్సిపల్ ఎన్నికల విధివిధానాలు ఖరారు ఎప్పుడవుతుందోనని ఆశావహులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఉన్న కౌన్సిలర్లు తమకు మరోసారి రిజర్వేషన్ అనుకూలిస్తే పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నారు. మరోవైపు పార్టీలు సైతం చైర్మన్‌కు సంబంధించి ఏ రిజర్వేషన్ వస్తుంది, ఎవరిని పోటీలో ఉంచాలనే అంశంపై కసరత్తులు ప్రారంభిస్తున్నారు. ఆశావహులు తమ వార్డులలో జనాన్ని మచ్చిక చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. వార్డుల్లో పర్యటిస్తూ ప్రజలకు అవసరమైన పనులు చేసి పెడుతూ మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. తమ పార్టీలకు చెందిన నేతలతో ఇప్పటికే తాను అభ్యర్థిగా పోటీలో ఉంటాననే సంకేతాలు అందిస్తున్నారు. వచ్చే నెలలోనే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉండటంతో పట్టణాల్లో రాజకీయాలు క్రమంగా ఊపందుకుంటున్నాయి. ఇదివరకే మున్సిపాలిల్లో బీసీ ఓటర్ల గణన పూర్తయింది. దీంతో చైర్మన్, వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఖరారు చేయడమే మిగిలింది. సిద్ధంగా ఉన్నాం ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఎన్నికల నిర్వహణపై చర్యలు తీసుకుంటాం. ఇప్పటి వరకు మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు అందలేదు. ఒకవేళ ఏవైనా ఆదేశాలు వస్తే ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. – జయంత్‌కుమార్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్, నాగర్‌కర్నూల్ -
రాజీనామా యోచనలో సురవరం!
న్యూఢిల్లీ : సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేయనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. జూతై 19, 20 తేదీల్లో ఢిల్లీలో జరిగే సీపీఐ జాతీయ మండలి సమావేశాల్లో ఆయన రాజీనామా సమర్పిస్తారని వెల్లడించాయి. ఈ విషయమై ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు మాట్లాడుతూ...‘సార్వత్రిక ఎన్నికల్లో సీపీఐ కేవలం రెండు లోక్‌సభ స్థానాలకు పరిమితం కావడంతో పార్టీ ఓటమికి నైతిక బాద్యత వహిస్తూ సుధాకర్‌రెడ్డి రాజీనామా చేయాలని నిర్ణయించారు. పార్టీ కోసం పనిచేసేందుకు తన ఆరోగ్యం సహకరించడం లేదని, ప్రధాన కార్యదర్శి బాధ్యతల నుంచి తప్పుకోవాలని ఆయన అనుకుంటున్నట్లు’ చెప్పారు. -
ఎన్నికలలో ఖాకీల పైసా వసూల్
సాక్షి, కర్నూలు: ఎన్నికలు ఓటర్లకే కాదు..పోలీసులకూ పండుగగా మారాయా? సహకారం పేరిట భారీగా వివిధ పార్టీల నేతల వద్ద మామూళ్లు తీసుకున్నారా? ఏకంగా ఒక నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నుంచి కోటి రూపాయలకుపైగా వసూలు చేశారా? అనే విచిత్ర ప్రశ్నలకు అంతే చిత్రంగా అవుననే సమాధానాలే వస్తున్నాయి. ఎన్నికల సమయంలో స్టేషన్ల వారీగా పోలీసులు ఎంత మొత్తాన్ని వివిధ పార్టీల నుంచి తీసుకున్నారంటూ సేకరించిన వివరాల్లో ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చినట్టు సమాచారం. జిల్లావ్యాప్తంగా పలు పోలీసు స్టేషన్లలో పనిచేస్తున్న డీఎస్పీ, సీఐ, ఎస్ఐలు మొదలుకుని కానిస్టేబుళ్ల వరకూ వివిధ పార్టీ నేతల నుంచి భారీగా మామూళ్లు వసూలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ వివరాలను పోలీసు ఉన్నతాధికారులు సేకరించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఒక్కో స్టేషన్లో ఒక్కో కథ బయటకు వచ్చినట్టు సమాచారం. అయితే, బనగానపల్లె నియోజకవర్గంలో మాత్రం ఏకంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నుంచి కోటి రూపాయల మేర తీసుకున్నట్టు తేలడంతో ఉన్నతాధికారులే నోరెళ్లబెట్టినట్టు తెలుస్తోంది. ఈ నియోజకవర్గంలోని ప్రతీ స్టేషన్‌లోని పోలీసు సిబ్బందికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి నుంచి భారీగా నగదు ముట్టినట్టు విచారణలో తేలింది. అంతేకాకుండా ఎన్నికల సందర్భంగా కూడా ఇందుకు అనుగుణంగా సదరు అభ్యర్థికి సహకరించారు. వీరంతా ఎన్నికల ఫలితాల తర్వాత బాధపడినట్టు కూడా సమాచారం. ఇక జిల్లాల్లో కొన్ని మినహా మెజార్టీ స్టేషన్లలో ఈ మేరకు వసూళ్ల పర్వం నడిచినట్టు తేలింది. ఈ నివేదికను ఉన్నతాధికారులకు జిల్లా పోలీసు యంత్రాంగం రహస్యంగా అంజేసింది. ఇందుకు అనుగుణంగా సదరు అధికారులపై చర్యలుండే అవకాశం ఉందని కూడా పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. అక్కడే అత్యధికం...! వాస్తవానికి ఎన్నికలు అంటేనే కోట్ల రూపాయలు డబ్బు వరదలా పారే పరిస్థితి నడుస్తోంది. అందులోనూ అప్పట్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలు అడ్డంగా దోచుకున్న కోట్ల డబ్బును ఖర్చు చేసి అధికారంలోకి వచ్చేందుకు శతవిధాలా ప్రయత్నించారు. ఇందులో భాగంగా ఓటర్లతో పాటు పోలీసులకు కూడా భారీగా డబ్బును వెదజల్లారు. ఈ నేపథ్యంలో జిల్లాలో పోలీసులు ఎంత మేర వసూలు చేశారన్న అంశంపై ఉన్నతాధికారులు ఆరా తీశారు. ఏయే డీఎస్సీ, సీఐ, ఎస్ఐలు ఎంత మేర వసూలు చేశారన్న అంశంపై ఇంటలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ అధికారుల ద్వారా పోలీసు ఉన్నతాధికారులు ఆరా తీశారు. ఇందులో ఆశ్చర్యకరంగా బనగానపల్లె నియోజకవర్గంలోని పోలీసు అధికారులు ఏకంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి నుంచి ఏకంగా రూ.కోటి మేర మామూళ్లు తీసుకున్నట్టు తేలింది. ఇందుకు అనుగుణంగా ఎన్నికల్లో కూడా విధులు సక్రమంగా నిర్వర్తించలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో ముగ్గురు డీఎస్పీలు మినహా మిగిలిన వారందరూ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేయడంతో పాటు తమ విధులను నిర్లక్ష్యం చేశారన్న నివేదికలు కూడా పోలీసు ఉన్నతాధికారులు చేరాయి. మొత్తం మీద ఎన్నికల ఫలితాల కంటే ఇప్పుడు ఈ వసూళ్ల ఫలితాలే పోలీసుశాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయనడంలో అతిశయోక్తి లేదు. -
పెద్దపల్లిలో.. ఇక పురపోరు
సాక్షి, పెద్దపల్లి: అసెంబ్లీతో మొదలైన ఓట్ల జాతర ఆరు నెలలుగా కొనసాగుతునే ఉంది. సర్పంచ్ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీపీటీసీ పోలింగ్, కౌంటింగ్ సైతం ముగిసింది. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఇతర పార్టీలు తమ ఉనికి చాటుకునేందుకు ఎన్నికల్లో పోటీకి దిగాయి. ప్రాదేశిక ఫలితాల్లో కారు హవా కనిపించింది. జిల్లాలోని మూడు అసెంబ్లీ స్థానాల్లో రెండు టీఆర్ఎస్ ఖాతాలోనే ఉన్నాయి. మంథని మాత్రం కాంగ్రెస్ ఖాతాలో కొనసాగుతుంది. ఆ తర్వాత జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ పోటాపోటీగా సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకున్నారు. ఇకమిగిలిన మున్సిపాలిటీ గురించి రాజకీయ సమీకరణలకు అధికారపార్టీతో పాటు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తెరతీశాయి. నాలుగు మున్సిపాలిటీలు జిల్లాలోని రామగుండం మున్సిపల్కార్పొరేషన్తోపాటు పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీలు ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ బలం పుంజుకోవడంతో పట్టణాలు, నగరాల్లోపాగా వేసేందుకు ఆ పార్టీ శ్రేణులు ఉత్సాహం చూపుతున్నాయి. మున్సిపల్ ఎన్నికలపై ప్రభుత్వం తమ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించకపోయిననా ఎన్నికల కోసం ఆయా పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. పట్టణాల పైనే ఎక్కువ దృష్టిసారిస్తున్నారు. జిల్లాలోని మున్సిపాలిటీల్లో నిన్నటి రాజకీయ బలాబలాలు పరిశీలిస్తే రామగుండంలో ప్రస్తుతం టీఆర్ఎస్ మేయర్ రాజమణి కొనసాగుతున్నారు. పెద్దపల్లిలో టీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ ఎల్.రాజయ్య ఉన్నారు. మంథనిలో నిన్నటివరకు పుట్టమధు భార్య పుట్ట శైలజ మేజర్ పంచాయతీ సర్పంచ్‌గా పనిచేశారు. మున్సిపాలిటీ ఏర్పాటుతో మంథనిలో ఎన్నికలు నిలిచిపోయాయి. సుల్తానాబాద్‌లో మాత్రం కాంగ్రెస్ నాయకులు అంతటి అన్నయ్యగౌడ్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్‌గా పనిచేశారు. ఆయన కాలంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీగా ఏర్పడింది. ప్రస్తుతం జిల్లాలో నాలుగుచోట్ల మున్సిపల్ ఎన్నికలు జరుగనుండడంతో రాజకీయ పార్టీలు మున్సిపల్ ఎన్నికలపై దృష్టి కేంద్రీకరించారు. ప్రభుత్వం నుంచి ఏ క్షణమైనా మున్సిపల్ ఎన్నికల కోసం నోటిఫికేషన్ విడుదల కావచ్చని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే అభ్యర్థుల ఖరారుపై అన్ని రాజకీయ పార్టీలు ఒక్కొ స్థానంలో ఇద్దరు, ముగ్గురు చొప్పున నాయకుల పేర్లను పరిశీలనకు తీసుకుని వారికి సంబంధించిన వ్యక్తిగత, ఆర్థిక బలాలపై లెక్కలు కడుతున్నారు. వార్డుల విభజనకు కసరత్తు మున్సిపల్‌వార్డుల విభజన, రిజర్వేషన్లకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు అందడమే తరువాయిగా రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు మున్సిపల్ అధికారులు ఎదురు చూస్తున్నారు. పెద్దపల్లి నగరపంచాయతీ నుంచి పూర్తిస్థాయి మున్సిపాలిటీగా ఏడాది క్రితమే అవతరించింది. 29,604 ఓటర్లు, 41,171 జనాభా కలిగిన పెద్దపల్లిలో రంగంపల్లి, బందంపల్లి, చందపల్లి గ్రామాలను ఏడాదిక్రితం ప్రభుత్వం విలీనం చేసింది. దీంతో వార్డుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. రామగుండం కార్పొరేషన్లో సైతం సమీప గ్రామాలను విలీనం చేశారు. ఇక్కడ కూడా డివిజన్ల సంఖ్య పెరుగనుంది. కొత్త చట్టంపై సందిగ్ధం మున్సిపాలిటీల గడువు జూన్ మొదటివారంతో ముగుస్తుంది. ఇప్పటికే జిల్లాలో మంథని, సుల్తానాబాద్ స్పెషల్ ఆఫీసర్లపాలనలో ఉన్నాయి. ఇక పెద్దపల్లి, రామగుండంలో జూన్మొదటివారంతో మున్సిపాలిటీ పదవీకాలం ముగుస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీ చట్టాన్ని మార్చేందుకు ప్రభుత్వం యోచిస్తుంది. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక విధానం ప్రత్యక్షమా.. పరోక్షమా.. మున్సిపల్ చట్టాల్లో చేయాల్సిన మార్పులపై తర్జనబర్జన పడుతున్నారు. దీంతో గడువులోగా ఎన్నికలు జరుగకపోవచ్చని అంటున్నారు. మున్సిపల్ గడువు ముగిసి స్పెషల్ ఆఫీసర్ల చేతిలో మరో మూడు, నాలుగు నెలలు పాలన ఉండవచ్చని అప్పటిలోగా కొత్త చట్టాన్ని రూపొందించి దాని ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు 20.. విభజనతో 34.. పెద్దపల్లిలోని మున్సిపాలిటీలో రోడ్లను, వీధులను బట్టి వార్డులను నిర్ణయించారు. కొన్ని వార్డుల్లో 1300 ఓటర్లు, కొన్ని వార్డులో 1800 ఓటర్లు ఉన్నారు. అయితే ఈసారి అన్ని వార్డులకు సమాన ఓటర్లు సూత్రంగా వార్డులను నిర్ణయించనున్నారు. ప్రస్తుతం ప్రతీ పోలింగ్ స్టేషన్‌కు 1200ల నుంచి 800 ఓటర్లకు తగ్గించి వార్డులను ఏర్పాటు చేసేందుకు యోచిస్తున్నట్లు సమాచారం. పెద్దపల్లిలో ప్రస్తుతం 20 వార్డులు ఉండగా పెరిగిన ఓటర్లు.. పునర్విభజనతో సంఖ్య 34కు పెరిగే అవకాశం ఉంది. రామగుండం కార్పొరేషన్లో ప్రస్తుతం ఉన్న 50 డివిజన్లనే కొనసాగించడానికి అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. అంతకు మించి డివిజన్‌ను పెంచే అవకాశం లేదంటున్నారు. సుల్తానాబాద్, మంథనిలో ప్రస్తుతం ఉన్న వార్డులను కొనసాగించనున్నారు. -
కోడ్ ముగిసింది!
ఆదిలాబాద్‌అర్బన్: జిల్లాలో పది నెలలుగా అమలులో ఉన్న ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్) శనివారంతో ముగిసింది. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్ కుమార్ సర్క్యూలర్ ద్వారా జిల్లా అధికారులకు సమాచారం అందించారు. గతేడాది డిసెంబర్లో అసెంబ్లీ, జనవరిలో పంచాయతీ, మార్చిలో ఎమ్మెల్సీ, ఏప్రిల్‌లో లోక్‌సభ, మే నెలలో పరిషత్ ఎన్నికలు జరిగాయి. వరుస ఎన్నికలు ఉండడంతో కోడ్ అమల్లో ఉంది. అన్నీ రాష్ట్రాల్లో లోక్‌సభ ఫలితాల తర్వాత కోడ్‌ను ఎత్తివేయగా, మన రాష్ట్రంలో పరిషత్ ఫలితాలు లోక్‌సభ ఫలితాల అనంతరం వెలువడడంతో కోడ్ కొనసాగుతూ వచ్చింది. తాజాగా ఫలితాలు వెలువడి ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ల ఎన్నిక కూడా జరిగింది. దీంతో కోడ్‌ను ఎత్తివేస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే ఈసారి వరుస ఎన్నికలు రావడంతో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల అమలు, వాటికి సంబంధించిన నిధుల విడుదల వెనుకబడిపోయింది. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనులు, పథకాలతో ప్రజలకు చేకూర్చే లబ్ధి గత ఎనిమిది నెలలుగా ఆగిపోయిందని చెప్పవచ్చు. 2018 సెప్టెంబర్ 6న సీఎం కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేసిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 28న రాష్ట్రంలో పాక్షికంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. సుమారు 251 రోజులు జిల్లాలో కోడ్ అమల్లో కొనసాగింది. ప్రస్తుతం కోడ్ ముగియడంతో జిల్లాలో పనులకు, నిధుల విడుదలకు లైన్‌క్లియరైంది. రెండేళ్లుగా అందని రుణాలు... గత కొన్ని రోజులుగా ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో ప్రభుత్వం ఎలాంటి విధాన ప్రకటనలు చేయడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి వీలు లేకుండా పోయింది. శనివారం జెడ్పీ చైర్మన్ల ఎన్నికలు జరగడంతో జిల్లాలో కోడ్ పరిసమాప్తమైంది. కోడ్ అమలులో ఉండడంతో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన వ్యక్తిగత రుణాలు, గ్రూపుల వారీ రుణాల విడుదల రెండేళ్లుగా అందడం లేదు. 2017–18 సంవత్సరంలో దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారులకు రెండేళ్లు దాటిన ఇంత వరకు చెక్కులు గానీ, డబ్బులు గానీ చేతికి అందడం లేదు. ప్రభుత్వఉద్యోగం రాకపోయిన కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి పొందవచ్చనే ఆశతో 2017–18 సంవత్సరంలో బీసీ కార్పొరేషన్ ద్వారా సాయం పొందేందుకు దాదాపు పదివేల మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో ఇంత వరకు సగం మందికి రుణాలు అందలేదు. ఇప్పుడు కోడ్ ముగియడంతో లబ్ధిదారులు ఊపిరిపీల్చుకుంటున్నారు. నిలిచిన నిధులు.. పనులు.. 2018–19 ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ నుంచి మార్చి వరకు ఆరు నెలలుగా ఎలాంటి ప్రభుత్వ కార్యక్రమాలు కానీ, పనులు గానీ ప్రారంభించకపోగా, 2019–20 ఆర్థిక యేడాదిలోనూ ఏప్రిల్, మే నెలల్లో ఎలాంటివి చేపట్టేందుకు ఆస్కారం లేకుండా పోయింది. అంటే సుమారు ఎనిమిది నెలలుగా వివిధ ప్రభుత్వ శాఖలకు నిధులు విడుదల నిలిచిపోగా, ఆయా పనులు సైతం ఆగిపోయాయి. ప్రధానంగా వ్యవసాయ శాఖ ద్వారా అందజేసే రైతుబంధు (పెట్టుబడి సాయం) జిల్లాలో ఇంకా రైతులకు అందలేదు. ఖరీఫ్ (వానాకాలం) సీజన్‌కు ముందు రైతుల చేతికి అందించాల్సి ఉండగా, ఖరీఫ్ సీజన్ ప్రారంభమై వారం రోజులు గడుస్తున్న ఇంత వరకు పెట్టుబడి సాయం చేతికి అందలేదు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో నిధుల విడుదలలో జాప్యం జరిగిందని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పుడు కోడ్ తొలగిపోవడంతో రైతులకు పెట్టుబడి సాయం అందే అవకాశాలు కన్పిస్తున్నాయి. గత ఎనిమిది నెలలుగా కళ్యాణలక్ష్మి పథకానికి వేల సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు. ఈ పథకాలకు ఎన్నికల కోడ్‌తో ఏలాంటి సంబంధం లేకపోయినా.. కోడ్ అమలులో నేపధ్యంలో పథకాలకు నిధుల విడుదల సమస్యగా మారింది. గత పక్షం రోజుల కిందట నిధులు విడుదలైన అధికారులు ఎన్నికల పనుల్లో బీజీగా ఉండడంతో లబ్ధిదారుల చేతికి అందలేదు. దీంతో పథకం అమలు మందగించిందని చెప్పొచ్చు. -
ఎన్నికల ఖర్చు అక్షరాలా 60వేల కోట్లు
-
ఆ పదవిపై ఆశలేదు : కోమటిరెడ్డి
సాక్షి, భువనగిరి : పీసీసీ పదవిపై తనకు ఆశలేదని, ఆ పదవిపై ఉత్సాహం ఎవరికైనా ఉంటే వారికే ఇవ్వమని చెపుతానని కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. పీసీసీ కంటే ముఖ్యమైన ఎంపీ పదవిని భువనగిరి ప్రజలు తనకు ఇచ్చారని, వారికి సేవ చేస్తానని పేర్కొన్నారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకోసం పోరాడినట్లుగా ప్రజలకోసం పోరాడుతానని చెప్పారు. ఎన్నికల్లో గెలుపొందిన ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు శుభాకాంక్షలు తెలిపారు. అధికారం అండతో కాంగ్రెస్ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తే చూస్తూ ఉరుకొమని హెచ్చరించారు. -
‘పట్నం’కే పట్టం
గతేడాది డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో పట్నం మహేందర్‌రెడ్డి ఓటమిపాలైన విషయం తెలిసిందే. తాండూరు సెగ్మెంట్ నుంచి పోటీచేసిన ఆయన.. కాంగ్రెస్ అభ్యర్థి పైలెట్ రోహిత్‌రెడ్డి చేతిలో పరాజయం పొందారు. ఇదే సమయంలో మహేందర్‌రెడ్డి సోదరుడు పట్నం నరేందర్‌రెడ్డి కొడంగల్ నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా నెగ్గారు. ఈ నే పథ్యంలో అప్పటికే ఎమ్మెల్సీగా కొనసాగుతున్న నరేందర్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. దీంతో స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఉపఎ న్నిక అనివార్యమైంది. ఈ స్థానం నుంచి పోటీచేసిన మహేందర్‌రెడ్డిని విజయం వరించడం విశేషం. సాక్షి, రంగారెడ్డి జిల్లా: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఆ పార్టీ అభ్యర్థి పట్నం మహేందర్‌రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డిపై 244 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. పోలైన 797 ఓట్లలో మహేందర్‌రెడ్డికి 510 ఓట్లు దక్కగా.. ప్రతాప్‌రెడ్డికి 266 ఓట్లు లభించాయి. ఓట్ల లెక్కింపు రాజేంద్రనగర్‌లోని వెటర్నరీ కళాశాలలో సోమవారం జరిగింది. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభమైన గంటన్నరలోనే దాదాపుగా మహేందర్‌రెడ్డి గెలుపు ఖాయమైంది. అభ్యర్థి వారీగా బ్యాలెట్ పేపర్లు బిండల్‌గా కడుతున్న సమయంలోనే కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి సంకేతాలు కనిపించాయి. ఉదయం 11 గంటలకు మహేం దర్‌రెడ్డి విజయాన్ని యంత్రాంగం అధికారికంగా ప్రకటించింది. తొలిప్రాధాన్యత ఓటుతోనే ఆయనకు విజయం దక్కింది. దాదాపు సగం ఓట్ల తేడాతో గెలుపొందడంతో గులాబీ శిబిరంలో ఆనందోత్సాహాలు మిన్నంటాయి. సిట్టింగ్ స్థానాన్ని టీఆర్ఎస్ తిరిగి కైవసం చేసుకోవడం విశేషం. క్రాస్ ఓటింగ్ ఆరు వందలకుపైగా ఓట్లు లభిస్తాయని టీఆర్ఎస్ మొదటి నుంచి ధీమాతో ఉంది. ఈ పార్టీ నిర్వహించిన శిబిరాల్లో 630 మంది సభ్యులకు ఆతిథ్యం కల్పించినట్లు సమాచారం. ఈ ఓట్లన్నీ తమకు దక్కుతాయని ఆశించారు. కానీ, పరిస్థితి కొంత మారింది. టీఆర్ఎస్ శిబిరంలోని కొందరు సభ్యులు కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేసినట్లు తెలుస్తోంది. ఇలా వందకుపైగా ఓట్లు చేజారినట్లు టీఆర్ఎస్ నేతలు చర్చించుకుంటున్నారు. ఇవి కూడా తమ ఖాతాల్లోకి వస్తే భారీ విజయం దక్కేదని భావిస్తున్నారు. మేడ్చల్ ప్రాంతంలోని సభ్యులు ప్రత్యర్థి శిబిరానికి ఆకర్షితులైనట్లు చర్చ జరుగుతోంది. ఒకరిద్దరు మినహా జీహెచ్ఎంసీ పరిధిలోని కార్పొరేటర్లు అంతా టీఆర్ఎస్కే ఓటేసినట్లు సమాచారం. మున్సిపాలిటీల్లోని కౌన్సిలర్లలో ఎక్కువ మంది అధికార పార్టీకే ఓటేశారు. గ్రామీణ ప్రాంతంలోని ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కాంగ్రెస్ వైపు మొగ్గుచూపినట్లు సమాచారం. ‘స్థానికత’ను సానుకూలంగా మలుచుకున్న టీఆర్ఎస్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నేతలు ఉన్నా స్థానికేతరుడికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామాన్ని అధికార టీఆర్ఎస్ పార్టీ సానుకూంగా మలుచుకోవడంలో విజయవంతమైంది. జిల్లా నేతను కాదని స్థానికేతరునికి ఓటు ఎలా వేస్తారని సభ్యులు ఆలోచించేలా టీఆర్ఎస్ చేసిన ప్రయత్నం సత్ఫలితాన్నిచ్చింది. ‘సీనియర్ నేతగా ఎప్పుడి నుంచో మీకు అందుబాటులో ఉన్నాను.. నన్ను కాదని ఎలా పోతారు’ అని శిబిరాల్లో ఉన్న సభ్యులను మహేందర్‌రెడ్డి అడిగినట్లు తెలిసింది. స్థానిక అభ్యర్థిని బరిలోకి దించితే టీఆర్ఎస్కు గట్టి పోటీ ఇచ్చేవాళ్లమని కొందరు కాంగ్రెస్ నేతలు అంటున్నారు. -
స్వయంకృత పరాభవం
2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఎన్నికలకు ముందు వచ్చిన సర్వేలు ఎన్నికల వెంటనే వచ్చిన ఎగ్జిట్ పోల్స్ చాలా వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు పేర్కొన్నప్పటికీ చాలామంది ఇంత అనూహ్యమైన విజయం వైఎస్సార్సీపీకి, తెలుగుదేశానికి పరాజయం ఊహించలేదు. హైదరాబాద్‌లో ఉన్న ఒక సంస్థ ఎన్నికలకు ముందు నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ ఎన్నికలలో బాబు గారు ఊహించలేనంత పరాజయాన్ని చవిచూడబోతున్నారు అని నిర్ధారించింది. ఆ సంస్థ అధిపతి ఎన్నికల ముందే నాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి 30 సీట్లకు మించి రాకపోవచ్చని, బాబు గారు ఊహించనంత పరాజ యాన్ని చవిచూడబోతున్నాడు అని చెప్పారు. ఎన్నికల ఫలితాలు ఆయన అంచనాలకు దరిదాపులలో వచ్చాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 151 స్థానాలు, తెలుగుదేశానికి 23 స్థానాలు, జనసేనకు ఒక స్థానం వచ్చాయి. జనసేన పార్టీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చడం వల్ల తెలుగుదేశానికి 23 స్థానాలు వచ్చాయి కానీ అదే జరగకుండా ఉంటే పది స్థానాలు మించి ఉండేవి కావు. ఈ స్థాయిలో తెలుగుదేశం పార్టీ ఓడి పోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ప్రథమ కారణం గత ఐదు సంవత్సరాల్లోని ప్రభుత్వ అవినీతి పాలన. బాబు గారు 2009, 2014 ఎన్నికలను అధికారంలో లేకుండా ఎదుర్కొన్నారు. ఆ సమయంలో ఎన్నికల ఖర్చులకు తీవ్రమైన సమస్యలు ఉత్పన్నం కావడం సహజం. 2014లో అధికారానికి వచ్చినప్పటినుంచి పాలన 2019 ఎన్నికలను ధనబలంతో ఎలా గెలవాలనే ఆలోచనతోనే సాగింది. దీనితో అవినీతి విశృంఖలంగా అయింది. ఏదో ఒక స్థాయిలో కాక వివిధ స్థాయిల్లో అవినీతి పెరిగిపోయింది. ఇసుక నుంచి మట్టి దాకా కాదేది అవినీతికి అనర్హం అన్న స్థాయిలో పరిపాలన నడిచింది. ఇదే ఈనాటి తెలుగుదేశం పార్టీ ఓటమికి ప్రధాన కారణంగా నేను భావిస్తున్నాను. మొదటినుంచీ బాబు గారికి పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని కమ్యూనిస్టుల సంస్థాగత విధానం అంటే చాలా అభిమానం. కార్యకర్తల సహాయంతో వారు రాష్ట్రాన్ని అప్రతిహతంగా 30 సంవత్సరాలు పాలించారు అనేది ఆయన మనసులో బాగా నాటుకున్నది. అదే విధమైన క్యాడర్‌ను తెలుగుదేశం పార్టీలో అభివృద్ధి చేయాలనేది ఆయన ఆకాంక్ష. ఆయన మరిచిన ఒక ముఖ్య విషయం ఏందంటే మౌలిక సిద్ధాంతాలు లేని ఏ కేడర్ అయినా లాభం కన్నా నష్టాన్ని కలిగిస్తుంది. ఈ కార్యకర్తలను భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతో జన్మభూమి కమిటీలు ప్రవేశపెట్టడం జరిగింది. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపిక ఈ కమిటీల చేతుల్లో పెట్టారు. క్షేత్రస్థాయిలో ఈ కమిటీలు చేసిన నష్టం ఇంతా అంతా కాదు. అర్హత లేని వాళ్లకు లబ్ధి కల్పించడం ద్వారా ప్రజలలో ప్రభుత్వ వ్యతిరేకతను పెంపొందించటంలో ఈ కమిటీలు ప్రధాన పాత్ర వహించాయి. బాబుగారి గత ఐదు సంవత్సరాల పాలనలో ఒక వర్గానికి పెద్దపీట వేశారనేది సొంత పార్టీలోనే ఒక ప్రధాన చర్చకు దారితీసింది. ఇక సాధారణ ప్రజల విషయంలో చెప్పనవసరం లేదు. ఈ ప్రభుత్వం ప్రజల వలన ప్రజల చేత కొందరి కొరకు అన్న ధోరణిలో పాలన సాగించింది. ఈ సంకుచిత ఎజెండా ప్రజలకు నచ్చలేదు. పైపెచ్చు ఈ వర్గంలో కొందరు ప్రదర్శించిన అహంభావ ధోరణులు తీవ్ర ప్రజా వ్యతి రేకతకు కారణాలయ్యాయి. 2004 ఓటమికి ప్రధాన కారణం బాబు గారి దృష్టిలో ఉద్యోగులలో తీవ్ర వ్యతిరేకత. దీనిని రూపుమాపటం కోసం 2014 నుంచి ప్రయత్నం ప్రారంభించారు. కానీ ఆయన ఎన్నుకున్న విధానం లోపభూయిష్టం. ఉద్యోగ సంఘాల నేతలను వశపరచుకోవడం ద్వారా ఉద్యోగస్తులను తన వైపు తిప్పుకోవచ్చని భావించారు. సంఘ నేతలు స్థాయికి మించిన ప్రాధాన్యాన్ని ప్రభుత్వంలో పొంది తమ సొంత ఎజెండాను ముందుకు తీసుకొనిపోయినారు కానీ వారి వల్ల ఉద్యోగస్తులు ఏవిధంగానూ ప్రభావితం కాలేదు. కేవలం అభివృద్ధిని ఒక ప్రాంతాల్లో కేంద్రీకరించడం ద్వారా ఇతర ప్రాంతాలలో వ్యతిరేక భావం ప్రబలింది. రాయలసీమ మొత్తానికి రెండే రెండు సీట్లు బాబు గారికి, బాలకృష్ణ గారికి రావటమే ఇందుకు నిదర్శనం. క్షేత్రస్థాయిలో పనులకు.. చేసిన ప్రచారానికి ఎక్కడా పొంతన లేదు. దీని ప్రభావం కూడా ఎన్నికల సమయంలో ఉన్నది. విభజన అంశాలను ప్రధాన ఎజెండాగా చేసి కేంద్ర ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టి మోదీ గారిని, జగన్ గారిని రాష్ట్ర వ్యతిరేకులుగా చూపెట్టడానికి బాబు గారు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. అన్నిటికీ మించి తాను ప్రత్యేకంగా ఏరికోరి ఏర్పాటు చేసుకున్న ముఖ్యమంత్రి కార్యాలయం పరిపాలన అంశాలలో ఆయనకు మద్దతుగా ఉన్నప్పుడు పార్టీ వ్యవహారాలలో అదే విధంగా ఏర్పాటు చేసు కున్న పార్టీ కార్యదర్శి, ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కమిటీ చైర్మన్ సహాయం చేయటానికి ఉన్నప్పుడు ఆయనకు ప్రత్యేకంగా ఓటమి చెందటానికి అంతగా బయట శత్రువుల అవసరం లేకపోవచ్చు. ఐవైఆర్ కృష్ణారావు వ్యాసకర్త ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఈ–మెయిల్ : iyrk45@gmail.com -
ఒడిశా, అరుణాచల్ సీఎంల ప్రమాణం
భువనేశ్వర్/ఈటానగర్: ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌ల్లో నూతన ప్రభుత్వాలు కొలువుదీరాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బిజు జనతా దళ్ (బీజేడీ) అధినేత నవీన్ పట్నాయక్ ఒడిశా సీఎంగా వరుసగా ఐదోసారి ప్రమాణం చేశారు. భువనేశ్వర్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో గవర్నర్ గణేశీలాల్ ఆయన చేత ప్రమాణం చేయించారు. అలాగే ఆయనతో పాటు 20 మంది నూతనంగా ఎన్నికైన బీజేడీ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణంచేశారు.147 అసెంబ్లీ స్థానాలున్న ఒడిశాలో బీజేడీ 112 స్థానాల్లో గెలుపొందింది. ఒడిశాలో 2000 సంవత్సరం నుంచి బీజేడీ అధికారంలో కొనసాగుతోంది. నవీన్ వరుసగా 2000, 2004, 2009, 2014ల్లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ‘పట్నాయక్‌కు అభినందనలు. ఒడిశా అభివృద్ధికి కేంద్రం నుంచి మా వంతు పూర్తి సహకారం ఉంటుంది’అని మోదీ ట్వీట్ చేశారు. అరుణాచల్ సీఎంగా పెమా ఖండూ బీజేపీ సీనియర్ నేత పెమా ఖండూ అరుణాచల్ ప్రదేశ్ పదో సీఎంగా బుధవారం ప్రమాణం చేశారు. ఈటానగర్‌లో ఆ రాష్ట్ర గవర్నర్ మిశ్రా ఆయన చేత ప్రమాణం చేయించారు. డిప్యూటీ సీఎం చౌనా మేతో సహా 11 మంది కేబినెట్ మంత్రులు పెమా ఖండూతో పాటు ప్రమాణం స్వీకారం చేశారు. అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, మణిపూర్ సీఎంలు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పెమా ఖండూ మాట్లాడుతూ.. ‘ఇది రాష్ట్రంలో చారిత్రాత్మక రోజు. మా ప్రభుత్వం అవినీతి రహితంగా పనిచేస్తుంది’ అని అన్నారు. 60 అసెంబ్లీ స్థానాలున్న అరుణాచల్‌లో బీజేపీ 41 స్థానాల్లో గెలుపొందింది. -
నాయకుల వల్లే టీడీపీ ఓటమి
నగరంపాలెం (గుంటూరు)/ సాక్షి, అమరావతి: తెలుగుదేశం ఓటమికి కారణం ఆ పార్టీ నాయకులేనని ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సమక్షంలో కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం అనంతరం ఎన్టీఆర్ జయంతి వేడుకల సందర్భంగా తొలిసారిగా మంగళవారం గుంటూరులోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో చంద్రబాబు తన సతీమణి నారా భువనేశ్వరితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభలో మాట్లాడిన పలువురు కార్యకర్తలు ఓటమికి కారణం రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి నాయకులేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఈవీఎంలే మోసం చేశాయన్న నాయకులు అయితే సభలో మాట్లాడిన నాయకులు మాత్రం ఈవీఎంల వల్లే పార్టీ ఓడిపోయిందని ఆరోపించారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మాట్లాడుతూ టీడీపీ ఓటమి అసహజమైనదని, ఎన్నికల్లో ఏదో జరిగిందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ సాంకేతికంగా మరోసారి నష్టం జరగకుండా దేశవ్యాప్తంగా ఎన్నికల సరళిలో మార్పు కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ.. ఓటమికి గల కారణాలపై సమీక్షించుకొని ముందుకు సాగుదామని కార్యకర్తలకు సూచించారు. నూతన ప్రభుత్వం కొలువుదీరి ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు కొంత అవకాశం ఇద్దామన్నారు. కాగా, గతంలో ఎన్నడూ టీడీపీ కార్యక్రమాల్లో కనిపించని భువనేశ్వరి ఈ సమావేశంలో పాల్గొని చివరివరకూ చంద్రబాబు పక్కనే కూర్చొని ఉండడం చర్చనీయాంశమైంది. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు, ఎంపీ గల్లా జయదేవ్, ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్, నేతలు యనమల రామకృష్ణుడు, డొక్కా మాణిక్యవరప్రసాద్, కాల్వ శ్రీనివాసరావు, నక్కా ఆనంద్‌బాబు, గల్లా అరుణకుమారి, యరపతినేని శ్రీనివాసరావు, దివ్యవాణి, సాదినేని యామిని తదితరులు పాల్గొన్నారు. 2024లో మంగళగిరి నుంచే పోటీ చేస్తా: లోకేష్ మంగళగిరి: ఓటమితో సంబంధం లేకుండా తెలుగుదేశంలో లోకేష్‌కి పార్టీ నాయకత్వాన్ని కట్టబెట్టేందుకు రంగం సిద్దమైంది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన ఎన్టీఆర్ జయంతి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హజరైన లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత తనదేనని చెప్పుకొచ్చారు. 2024లో మంగళగిరి నుంచి పోటీ చేసి విజయం సాధిస్తానని, ఎమ్మెల్సీగా ఉండి మంగళగిరి నియోజకవర్గంలో అందరికీ అండగా ఉంటానని చెప్పారు. ప్రభుత్వం చెయ్యకపోతే పార్టీ చెయ్యాలి ఎన్టీఆర్ జయంతినాడు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌ను అలంకరించకపోవడంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. గత ఏడాది తెలంగాణ ప్రభుత్వమే అలంకరణ ఏర్పాట్లు చేసిందని, ఈ ఏడాది కూడా చేస్తుందని ఆశించామని, దీనిపై తెలంగాణ టీడీపీ లేఖకూడా ఇచ్చిందని అన్నారు. దీనిపై చంద్రబాబు తెలంగాణ పార్టీ నేతలకు ఫోన్ చేసి ఇటువంటివి మళ్లీ పునరావృతం కారాదని సూచించారు. ప్రభుత్వానికి ముందుగా తెలియజేయాలని, వాళ్లు చేయకపోతే పార్టీ ద్వారా చేయాలని, లేదా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా శుభ్రం చేయాలని సూచించారు. ఇటువంటి విషయాల్లో ఎప్పుడూ సమాచార లోపం ఉండకూడదన్నారు. -
పార్లమెంటులో ఫస్టు క్లాసు లీడర్స్
కొన్ని అద్భుతాలు అంతే. హడావుడి లేకుండా, హంగామా చేయకుండాచరిత్రలో చెరగని ముద్ర వేస్తాయి. తాజాగా దేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలసమరాంగణంలో రెండు అద్భుతాలు జరిగాయి. గిరిజన తెగకు చెందిన ఇద్దరుయువతులు సరికొత్త చరిత్ర లిఖించారు. దేశం యావత్తు తమవైపుచూసేలా చేశారు. ఒకరు చంద్రాణి ముర్ము. ఇంకొకరు గొడ్డేటి మాధవి. కియోంజహర్‌లోని తికర్‌గుమురా గ్రామానికి చెందిన చంద్రాణి ముర్ము.. బ్యాంకులో ప్రొబేషనరీ ఆఫీసర్ లేదా ఒడిశాలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగం దొరక్కపోతే ప్రైవేటు కంపెనీలో మెకానికల్ ఇంజనీర్ ఉద్యోగం సంపాదించాలనుకున్నారు. అయితే ఊహించని విధంగా ఆమె జీవితం మలుపు తిరిగింది. జాబ్ వస్తే చాలనుకున్న ఆమె పాతికేళ్ల ప్రాయంలోనే ఏకంగా లోక్‌సభ ఎంపీగా ఎన్నికై అందరి దృష్టినీ ఆకర్షించారు. ‘‘ఇంజినీరింగ్ పూర్తయిన తర్వాత ఉద్యోగం కోసం వెతుకుతున్నాను. ఎవరూ ఊహించని విధంగా ఎన్నికల్లో నామినేషన్ వేయాల్సివచ్చింది. రాజకీయాల్లోకి వస్తానని, ఎంపీ అవుతానని కలలో కూడా అనుకోలేదు’’ అని చంద్రాణి ఉద్వేగంగా చెప్పారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో కియోంజహర్ నియోజకవర్గం(ఎస్టీ) నుంచి బిజూ జనతాదళ్ (బీజేడీ) తరపున పోటీ చేసిన చంద్రాణి బీజేపీ నాయకుడు అనంత నాయక్‌ను 66,203 ఓట్ల ఆధిక్యంతో ఓడించి ఔరా అనిపించారు. 25 ఏళ్ల 11 నెలల 8 రోజుల ప్రాయంలో (ఎన్నికలు ఫలితాలు వెలువడిన మే 23 నాటికి) ఎంపీగా ఎన్నికై సరికొత్త రికార్డు లిఖించారు. జూన్ 16న 26వ పడిలోకి అడుగు పెట్టడానికి ముందే లోక్‌సభ ఎంపీగా ఆమె ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటివరకు ఈ రికార్డు హరియాణా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా మనవడు దుష్యంత్ చౌహన్ పేరిట ఉంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో 26 ఏళ్ల 13 రోజుల వయస్సులో హిస్సార్ నియోజకవర్గం నుంచి ఎన్నికై అతిపిన్న వయస్కుడిగా దుష్యంత్ ఘనత సాధించారు. తాజా విజయంతో ఈ రికార్డును చంద్రాణి అధిగమించారు. సీఎం ఎంపిక చేసిన అమ్మాయి మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని భావించిన ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్.. ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఉండి, ప్రజా జీవితంలోకి రావడానికి సిద్ధంగా ఉన్నవారి గురించి వెతుకుతుండగా చంద్రాణి ఆయన దృష్టిలో పడ్డారు. మరో ఆలోచన లేకుండా ఆమెను అభ్యర్థిగా ప్రకటించారు. అప్పటికి ఆమె ఇంజినీరింగ్ పూర్తి చేసి కేవలం రెండేళ్లు మాత్రమే అయింది. 1993, జూన్ 16న జన్మించిన చంద్రాణి.. కియోంజహర్‌లోని ఎన్ఎస్ పోలీస్ హైస్కూల్లో పాఠశాల విద్య, భువనేశ్వర్‌లోని నాయుడు క్లాసెస్ విద్యా సంస్థ నుంచి ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. శిక్షా ’ఓ’ అనుసాధన్ యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్ పట్టా సాధించారు. చంద్రాణి తండ్రి సంజీవ్ ముర్ము ప్రభుత్వ ఉద్యోగి కాగా, తల్లి ఊర్వశి సోరేన్ గృహిణి.ఎన్నికల సమరాంగణంలోకి అడుగుపెట్టిన వెంటనే చంద్రాణికి వ్యతిరేకంగా ప్రత్యర్థుల విష ప్రచారం మొదలైంది. ఆమె ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అపఖ్యాతి పాల్జేసేందుకు కుట్రలు చేయడంతో ఒక దశలో ఆమె చాలా బాధపడ్డారు. ఎన్ని కుతంత్రాలు పన్నినా విజయం సాధించడంతో చివరకు న్యాయం గెలిచిందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు.గొడ్డేటి మాధవి.. తెలుగు గడ్డపై తిరుగులేని విజయం సాధించి సమకాలిన రాజకీయ చరిత్రలో కొత్త పేజీని లిఖించారు. తెలుగు రాష్ట్రాల నుంచి లోక్‌సభకు ఎన్నికైన అతిపిన్న వయస్కురాలిగా గిరి పుత్రిక మాధవి ఖ్యాతి దక్కించుకున్నారు. నేర్చుకుని నిరూపించుకుంటా... ‘‘ఇక రాజకీయాల్లో కొనసాగాలని నిర్ణయించుకున్నాను. వయసుతో సంబంధం లేకుండా పార్లమెంట్ నా గళం బలంగా విన్పిపించడానికి ప్రయత్నిస్తాను. సీనియర్ల నుంచి పాఠాలు నేర్చుకుని లోక్‌సభ సభ్యురాలిగా నన్ను నేను నిరూపించుకుంటాను. నామినేషన్ వేయడానికి కొద్ది రోజుల ముందే నన్ను ఎంపిక చేయడంతో నియోజకవర్గం మొత్తం తిరగలేకపోయాను. నిజం చెప్పాలంటే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల నాకు పూర్తి అవగాహన లేదు. ప్రజలకు ఎక్కువ సమయం కేటాయించి నా నియోజకవర్గం గురించి తెలుసుకోవడమే ఇప్పుడు నా ముందున్న కర్తవ్యం.’’ – చంద్రాణి, ఒడిశా ఎంపీ మురిసిన తెలుగు గడ్డ గొడ్డేటి మాధవి.. తెలుగు గడ్డపై తిరుగులేని విజయం సాధించి సమకాలిన రాజకీయ చరిత్రలో కొత్త పేజీని లిఖించారు. తెలుగు రాష్ట్రాల నుంచి లోక్‌సభకు ఎన్నికైన అతిపిన్న వయస్కురాలిగా గిరి పుత్రిక మాధవి ఖ్యాతి దక్కించుకున్నారు. అరకు పార్లమెంట్ స్థానం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి దిగి రాజకీయ ఉద్ధండుడైన వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్‌ను 2.25 లక్షల భారీ మెజార్టీతో మట్టికరిపించారు. పోరాటాలే అనుభవాలుగా.. తండ్రి ఆశయాల కోసం రాజకీయాల వైపు అడుగులు వేసి తిరుగులేని విజయాన్ని అందుకున్నారు. ప్రత్యర్థి అనుభవమంత వయసు లేకపోయినా 26 ఏళ్ల ప్రాయంలోనే ఎంపీగా ఎన్నికై తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త రికార్డు నెలకొల్పారు. విశాఖ జిల్లా కొయ్యూరు మండలం శరభన్నపాలెం మాధవి స్వగ్రామం. తల్లి చెల్లయమ్మ ఎస్జీటీగా పనిచేస్తూ కొయ్యూరు మండలంలోనే నివాసం ఉంటున్నారు. మాధవి తండ్రి గొడ్డేటి దేముడు కమ్యూనిస్టు నాయకుడు, చింతపల్లి మాజీ ఎమ్మెల్యే. రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసినా ఆస్తులు కూడబెట్టుకోని నిజాయితీపరుడు. 1992, జూన్ 18న మాధవి జన్మించారు. ఆమెకు ఇద్దరు సోదరులు. బీఎస్సీ బీపీడీ అయ్యాక ఆమె గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పీడీగా పనిచేశారు. 2018 అక్టోబర్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేశారు. మలుపు తిప్పిన ఘటన మాధవి తాటిపర్తి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నప్పుడు ఓ విద్యార్థిని అస్వస్థతకు గురైతే పాడేరులోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఎంత ప్రాధేయపడినా ఉదయం నుంచి సాయంత్రం వరకు వైద్యులు ఆ చిన్నారికి వైద్యం అందించలేదు. ఐటీడీఏకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. పదవిలో ఉంటే తప్ప సమస్యలు పరిష్కారం కావని అర్థం కావడంతో రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు. మాధవి పోరాట పటిమను గుర్తించిన వైఎస్ జగన్ ఆమెకు అరకు లోక్‌సభ టికెట్ ఇచ్చి ప్రోత్సహించారు. ఆయన నమ్మకాన్ని నిలబెడుతూ రికార్డు విజయం సాధించారు. - పోడూరి నాగ శ్రీనివాసరావు సాక్షి వెబ్ డెస్క్ -
24ఏళ్ల తరువాత మారిన సీఎం
గాంగ్టక్: సిక్కింలో 24 సంవత్సరాల తరువాత కొత్త ముఖ్యమంత్రి వచ్చారు. సిక్కిం క్రాంతికారి మోర్చా (ఎస్కేఎం) అధ్యక్షుడు, పీఎస్ గోలె పేరుతో ప్రజలకు చిరపరిచితులైన ప్రేమ్‌సింగ్ తమాంగ్(51) సోమవారం సిక్కిం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. పల్జోర్ మైదానంలో గోలెతో పాటు మరో 11 మంది శాసనసభ్యులచేత కూడా గవర్నర్ గంగా ప్రసాద్ ప్రమాణం చేయించారు. గోలె ప్రస్తుత శాసనసభలో సభ్యుడు కారు.. ఈ ఎన్నికల్లో కనీసం పోటీ చేయలేదు. అయినప్పటికీ శనివారం శాసనసభా నేతగా ఎన్నికయ్యారు. 2013లో ఎస్కేఎం పార్టీని స్థాపించారు. 32 స్థానాలున్న సిక్కిం అసెంబ్లీలో 17 స్థానాలు గెలవడం ద్వారా 24 ఏళ్ల తరువాత చామ్లింగ్ ప్రభుత్వాన్ని మార్చగలిగింది. ఎస్డీఎఫ్ 15 సీట్లు సాధించింది. -
ఎన్నికల లెక్కలపై కెమిస్ట్రీ గెలుపు
వారణాసి/ న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఏకపక్ష విజయం కట్టబెట్టేలా ఎన్నికల గణితం (అర్థమెటిక్)పై కెమిస్ట్రీ గెలుపు సాధించిందని ప్రధాని మోదీ అన్నారు. ‘ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే గణాంకాలన్నిటినీ మించిన కెమిస్ట్రీ (రసాయన శాస్త్రం) ఒకటి ఉందనే విషయం అర్ధమవుతుంది. ఈసారి ఎన్నికల్లో ఆ కెమిస్ట్రీయే గణాంకాలపై విజయం సాధించింది’ అని మోదీ వివరించారు. ‘నేను దేశానికి ప్రధానమంత్రిని. కానీ మీకు ఎంపీని. మీ సేవకుడిని’ అని ప్రధాని అన్నారు. పార్టీ కార్యకర్తలు ఎన్నికల పరీక్షను డిస్టింక్షన్‌తో ఉత్తీర్ణులయ్యారన్నారు. వరసగా రెండో సారి తనను గెలిపించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలియ జేసేందుకు సోమవారం ఆయన వారణాసి సందర్శించారు. కాశీ విశ్వనాథుని ఆలయంలో పూజలుచేశారు. బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. అంతకుముందు రోడ్ షోను తలపిస్తూ నగరంలోని పలు వీధుల గుండా భారీ బందోబస్తు మధ్య ఆయన వాహనశ్రేణి ముందుకుసాగింది. ఈ సందర్భంగా ప్రజలు రోడ్లపై బారులు తీరి నిలబడ్డారు. దాబాలపై నుంచి గులాబీ రేకులు విసిరారు. అదో దురభిప్రాయం కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. బీజేపీ హిందీ రాష్ట్రాలకు పరిమితమైన పార్టీ అనేది ఒక దురభిప్రాయంగా మోదీ కొట్టిపారేశారు. లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా పార్టీ సాధించిన విజయాలే అందుకు నిదర్శనమన్నారు. రాజకీయ పండితులు బీజేపీని ఇప్పటికీ హిందీ రాష్ట్రాలకు పరిమితమైన పార్టీగా పరిగణించడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వారి ఆలోచనా విధానం, తార్కికత 20వ శతాబ్దానిదనే విషయం వారికి తెలియదన్నారు. బీజేపీ ఓట్ల శాతం పెరగని ప్రాంతమే దేశంలో లేదన్నారు. ‘అసోంలో మన ప్రభుత్వం ఉంది. లడఖ్‌లో గెలుస్తున్నాం. అయినా రాజకీయ పండితులు మనవి హిందీ ప్రాంత రాజకీయాలంటారు. ఈ విధంగా ఒక తప్పుడు అభిప్రాయాన్ని సృష్టించారు’ అని మోదీ చెప్పారు. అబద్ధాలు, తప్పుడు తార్కికతతో ఈ తప్పుడు అభిప్రాయాన్ని సృష్టించారన్నారు. ‘ఇలాంటి తప్పుడు అవగాహన కారణంగానే ప్రజలు మనతో ఉండేందుకు ఇష్టపడరు. కానీ పారదర్శకత, కఠోర శ్రమతో అలాంటి తప్పుడు, చెడు అవగాహన కల్పించేవారిని ఓడించవచ్చు’ అని అన్నారు. రాజకీయ అస్పృశ్యత పెరుగుతోంది.. బీజేపీ రాజకీయ అస్పృశ్యత, రాజకీయ హింస వంటి ముప్పులను ఎలా ఎదుర్కొందో మోదీ చెప్పారు. ‘కేరళ, కశ్మీర్, బెంగాల్ లేదా త్రిపురలకు సంబంధించిన కేసులు చూడండి. త్రిపురలో కార్యకర్తలను ఉరి తీశారు. బెంగాల్లో హత్యలు కొనసాగుతున్నాయి. కేరళలో కూడా. నాకు తెలిసి దేశంలో ఒకేఒక్క రాజకీయ పార్టీ హత్యలకు గురయ్యింది. హింసను చట్టబద్ధం చేశారు. ఇది మన ముందున్న ఒక ప్రమాదం’ అని చెప్పారు. ‘ అంబేడ్కర్, గాంధీజీ అస్పృశ్యతను రూపుమాపారు. కానీ దురదృష్టవశాత్తూ రాజకీయ అస్పృశ్యత పెరుగుతోంది. బీజేపీ కార్యకర్తలు హత్యకు గురవుతున్నారు’ అని అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో బీజేపీ నేత హత్య, బెంగాల్లో కార్యకర్త కాల్చివేతలను ప్రస్తావిస్తూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి విద్వేషపూరిత వాతావరణంలో కూడా బీజేపీ.. ‘అందిరితో, అందరి వికాసం కోసం..’ అనే నినాదానికే కట్టుబడి ఉందని చెప్పారు. మిగతా పార్టీల్లాగా బీజేపీ ప్రజాస్వామ్యాన్ని భ్రష్టుపట్టించిన ఓటు బ్యాంకు రాజకీయాలకు తలొగ్గదని చెప్పారు. తనకు వ్యతిరేకంగా పోరాడిన తన ప్రత్యర్థులకు కూడా తాను రుణపడి ఉంటానన్నారు. ప్రజాస్వామ్యంలో విపక్షం ప్రాధాన్యతను ప్రధాని నొక్కిచెప్పారు. ఇతరులు అధికారంలోకి వస్తే ప్రతిపక్ష ఛాయలే ఉండవన్నారు. ‘కానీ త్రిపురలో చూడండి. ఇప్పుడు మనం అధికారంలో ఉన్నాం. అదే సమయంలో మంచి విపక్షం ఉంది. ఇదీ ప్రజాస్వామ్య స్ఫూర్తి’ అని అన్నారు. ప్రభుత్వానికి, పార్టీకీ మధ్య ఉండాల్సిన సమన్వయాన్ని కూడా ఆయన వివరించారు. ప్రభుత్వం విధానాలు రూపొందిస్తే, పార్టీ వ్యూహాలకు రూపకల్పన చేస్తుందన్నారు. ప్రభుత్వం, పార్టీ వ్యవస్థల మధ్య ఉండే సమన్వయం ఒక గొప్ప శక్తిలాంటిదని, బీజేపీ ఈ విషయం తెలుసుకుందని మోదీ అన్నారు. శ్రమ, శ్రామికులు అద్భుతాలు సృష్టిస్తాయన్నారు. తన గెలుపునకు ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించిన కిందిస్థాయి కార్యకర్తలే కారణమన్నారు. కార్యకర్తల కఠోరశ్రమకు, అంకిత భావానికి మోదీ కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు అమిత్ షా మాట్లాడుతూ.. మోదీ అభివృద్ధి అంటే ఏమిటో కొద్దిగానే చూపించారని, వచ్చే ఐదేళ్లలో కాశీ అత్యద్భుతమైన నగరంగా మారుతుందని చెప్పారు. నెహ్రూకి నివాళి భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ దేశానికి చేసిన సేవలను మోదీ కొనియాడారు. నెహ్రూ 55వ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తూ ప్రధాని ట్వీట్ చేశారు. ‘పండిట్ జవహర్లాల్ నెహ్రూజీకి నివాళులు. జాతి నిర్మాణానికి, దేశానికి ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాం..’ అని పేర్కొన్నారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, పలువురు బీజేపీ నేతలు నెహ్రూకి నివాళులర్పిస్తూ ట్వీట్ చేశారు. -
‘ఎన్నికలు విజయవంతంగా నిర్వహించాం’
సాక్షి, తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది సోమవారం తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం శ్రీవారి దర్శనార్థం తిరుమల వెళ్లిన ఆయనకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాల అనంతరం ద్వివేది మాట్లాడుతూ.. ఏపీలో ఎన్నికలు విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. రికార్డు స్థాయిలో మహిళలు, వికలాంగులు, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదు అయ్యాయని వెల్లడించారు. దేశ వ్యాప్తంగా పోలింగ్‌లో ఏపీ రెండో స్థానాంలో నిలిచిందని ప్రకటించారు. కాగా ఏపీ ఎన్నికల సందర్భంగా ఈవీఎంలు పెద్ద ఎత్తున మొరాయించాయని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. దీనిపై ద్వివేది స్పందిస్తూ.. అదంతా తప్పుడు ప్రచారం అన్నారు. కేవలం రెండు శాతానికి మించి ఈవీఎంలు మొరాయించలేదని.. వీలైనంత త్వరలోనే వాటిని కూడా మరమత్తులు చేయించామని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రశాంతంగా జరిగే సహరించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
తల్లి ఆశీర్వాదం తీసుకున్న ప్రధాని మోదీ
-
మోదీ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు
-
ఎన్నికల కోడ్‌ను ఎత్తివేసిన ఈసీ
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల సందర్భంగా మార్చి 10న విధించిన ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఎత్తివేస్తున్నట్లు ఎన్నికల కమిషన్ (ఈసీ) ఆదివారం ప్రకటించింది. ఈమేరకు కేబినెట్ కార్యదర్శి, అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు ఎన్నికల కోడ్ ఎత్తివేత వెంటనే అమల్లోకి వస్తుందని ఈసీ సమాచారం అందించింది. అధికారంలో ఉన్న పార్టీ తన రాజకీయ ప్రయోజనాల కోసం అధికారిక యంత్రాంగాన్ని ఉపయోగించుకోకుండా ఉండేందుకు ఎన్నికల కోడ్‌ను విధిస్తారు. అలాగే ఓటర్లను భయపెట్టి లేదా మతం, లంచం ఆశ చూపి ఓట్లు అడిగే రాజకీయ నాయకులను గుర్తించడానికి ఈసీ ఈ కోడ్‌ను ఉపయోగిస్తుంది. -
ఐదోసారి సీఎంగా నవీన్
భువనేశ్వర్: ఒడిశా శాసనసభ ఎన్నికల్లో వరుసగా ఐదోసారి విజయఢంకా మోగించిన బిజు జనతా దళ్ అధినేత నవీన్ పట్నాయక్ మే 29వ తేదీన నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భువనేశ్వర్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఆయన వరుసగా ఐదోసారి ఒడిశా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించనున్నారు. అంతకుముందు బీజేడీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం సుమారు 45 నిమిషాలు జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా నవీన్ పట్నాయక్‌ను తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. అనంతరం రాష్ట్ర గవర్నర్ గణేషి లాల్‌ను కలసిన నవీన్ పట్నాయక్.. ఎమ్మెల్యేలు తనను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్న తీర్మాన ప్రతిని ఆయనకు అందజేశారు. అనంతరం ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ గణేషి లాల్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా నవీన్ పట్నాయక్‌ను ఆహ్వానించారు. ఇటీవల జరిగిన రాష్ట్ర శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో బీజేడీ ఘన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన 146 శాసనసభ స్థానాలకు గాను 112 సీట్లలో బీజేడీ విజయం సాధించింది. బీజేపీ 23 సీట్లతో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. ఇక కాంగ్రెస్ 9 సీట్లకే పరిమితమైంది. పాట్కూరా శాసనసభ స్థానంలో అభ్యర్థి మరణం, ఫోణి తుపాను కారణంగా ఎన్నికలు వాయిదా పడ్డాయి. దేశంలో మోదీ గాలి వీస్తున్పప్పటికీ రాష్ట్రంలో మాత్రం 23 సీట్లకే బీజేపీ పరిమితమైంది. అయితే గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే బీజేపీ అదనంగా 13 స్థానాల్ని గెలుచుకొని ప్రతిపక్ష స్థానాన్ని అందుకుంది. నిరాడంబర వ్యక్తిత్వం నిరాడంబర జీవనశైలి, సాదాసీదా ఆహార్యం, సాత్వికాహారం రాజీలేని పనితీరు ఒడిశాలో వరుసగా అయిదు పర్యాయాలు అధికారాన్ని నిలుపుకున్న నవీన్ పట్నాయక్ వ్యవహార శైలి. రాష్ట్రానికి చాలాకాలం దూరంగా ఉండటంతో మాతృభాష ఒడియాపై పట్టులేకున్నా కష్టించి పని చేయడంపై మమకారమే ఆయనను ప్రజలకు చేరువ చేసింది. ఐదేళ్లు పాటు పాలించిన నేతలు తీవ్ర ప్రజావ్యతిరేకతను ఎదుర్కొం టున్న ప్రస్తుత రాజకీయాల్లో సుమారు 19 ఏళ్ల పాటు అధికారాన్ని నిలుపుకుని.. మరోసారి సీఎంగా గెలిచిన ఘనత ఆయన సొంతం. ఈ నేపథ్యంలో నవీన్ పట్నాయక్ జీవితంలోని ముఖ్య ఘట్టాలు.. జననం.. విద్యాభ్యాసం.. ఒడిశా దివంగత ముఖ్యమంత్రి, జనతా దళ్ నేత బిజు పట్నాయక్, గ్యాన్ పట్నాయక్ దంపతుల కుమారుడైన నవీన్ పట్నాయక్ ఒడిశాలోని కటక్ ప్రాంతంలో అక్టోబర్ 16, 1946లో జన్మించారు. డెహ్రాడూన్‌లోని వెల్హం బాలుర పాఠశాల, డూన్ పాఠశాలల్లో ఆయన ప్రాథమిక విద్య నభ్యసించారు. అనంతరం ఢిల్లీ విశ్వవిద్యాల యానికి చెందిన సెయింట్ స్టీఫెన్ కాలేజీ నుంచి డిగ్రీ పట్టా పొందారు. పాఠశాల స్థాయి నుంచే ఆయన చరిత్ర, ఆయిల్ పెయింటింగ్, అథ్లెటిక్స్‌పై మక్కువ పెంచుకున్నారు. డూన్ స్కూల్లో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీకి నవీన్ మూడేళ్ల జూనియర్. ఒడిశా రాష్ట్రానికి, రాజకీయాలకు దూరంగా ఉన్న నవీన్ .. తండ్రి మరణంతో అమెరికా నుంచి తిరిగివచ్చి 1996లో రాజకీయ ఆరంగేట్రం చేశారు. -
ప్రపంచ శక్తిగా భారత్
అహ్మదాబాద్: భారత్ ప్రపంచశక్తుల్లో ఒకటిగా నిలిచేందుకు రాబోయే ఐదేళ్లు అత్యంత కీలకమైనవని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం అనంతరం ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా అహ్మదాబాద్‌లోని జేపీ చౌక్ దగ్గర నిర్వహించిన ఓ సన్మాన కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ.. ‘భారత చరిత్రలో 1942–47 మధ్యకాలానికి ఎంత ప్రాముఖ్యత ఉందో భారత్‌ను ప్రపంచశక్తిగా నిలబెట్టేందుకు రాబోయే ఐదేళ్లు అంతే ముఖ్యమైనవి.’ అని తెలిపారు. అదృష్టవశాత్తు ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించారు. అయినా, వినమ్రంగా ఉండాలని హితబోధ చేశారు. నన్ను వేళాకోళం చేశారు.. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రాజకీయ పండితులనే ఆశ్చర్యంలో ముంచెత్తాయని మోదీ అన్నారు. ‘ఆరో విడత ఎన్నికల చ్రారంలో భాగంగా ఎన్డీయేకు 300కుపైగా లోక్‌సభ సీట్లు వస్తాయని నేను చెప్పగానే చాలామంది వేళాకోళం చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు పోటీచేయడం లేదు.. ప్రజలే పోటీ చేస్తున్నారు అని నేను చెప్పాను. బీజేపీని మరోసారి అఖండ మెజారిటీతో ఆశీర్వదించిన గుజరాత్ ప్రజలకు కృతజ్ఞతలు’ అని మోదీ వెల్లడించారు. గుజరాత్ పర్యటనలో భాగంగా తన తల్లి హీరాబెన్‌ను కలుసుకుని ఆశీస్సులు తీసుకున్నట్లు పేర్కొన్నారు. సూరత్ అగ్నిప్రమాదంలో 22 మంది విద్యార్థులు చనిపోవడంపై మోదీ విచారం వ్యక్తం చేశారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి రథయాత్రలకూ ఇబ్బంది పడ్డారు: అమిత్ షా గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన మోదీ, రాష్ట్రంలో గూండాయిజాన్ని, అవినీతిని అంతమొందించారని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తెలిపారు. ‘ప్రజలు నరేంద్ర భాయ్‌ను అమితంగా అభిమానించడానికి ఓ కారణం ఉంది. ఆయన చాలాగ్రామాల్లో పర్యటించారు. చాలామంది పార్టీ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు. గుజరాత్‌ను బీజేపీకి కంచుకోటగా తీర్చిదిద్దారు’ అని షా ప్రశంసించారు. -
మోదీ కేబినెట్‌పై మిత్రపక్షాల కన్ను
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భారీ మెజారిటీతో అధికారంలోకి రావడంతో మంత్రివర్గ కూర్పుపై అన్నివర్గాల్లో ఆసక్తి నెలకొంది. మోదీ కేబినెట్లో చోటు కోసం బిహార్ సీఎం నితీశ్‌కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ యునైటెడ్(జేడీయూ), అన్నాడీఎంకే పార్టీలు గంపెడాశలు పెట్టుకున్నాయి. బిహార్‌లో బీజేపీతో పొత్తుకు ప్రతిఫలంగా మోదీ మంత్రివర్గంలో జేడీయూకు 1–2 మంత్రి పదవులు దక్కే అవకాశముందని తెలుస్తోంది. మే 30న ప్రధాని మోదీతో కలిసి వీరు ప్రమాణస్వీకారం చేస్తారని సమాచారం. దీంతో పాటు పశ్చిమబెంగాల్లో ఈసారి 18 లోక్‌సభ సీట్లు దక్కించుకున్న నేపథ్యంలో ఆ రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలను కేబినెట్లోకి తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. తమిళనాడులో పట్టుకోసం బీజేపీ కొన్నేళ్లుగా ప్రయత్నిస్తోంది. తాజా ఎన్నికల్లో ఒకే సీటు దక్కించుకున్న అన్నాడీఎంకేకు కూడా కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కవచ్చని తెలుస్తోంది. దీనివల్ల తమిళనాడులో బీజేపీ క్షేత్రస్థాయిలో బలపడుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఈ ఎన్నికల్లో 6 స్థానాలు దక్కించుకున్న ఎల్జేపీ అధినేత రామ్‌విలాస్ పాశ్వాన్‌తో పాటు బీజేపీ నేతలు రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కారీ, నిర్మలా సీతారామన్, రవిశంకర్ ప్రసాద్, పీయూష్ గోయల్, నరేంద్రసింగ్ తోమర్, ప్రకాశ్ జవదేకర్లు మరోసారి మంత్రి పదవులు దక్కించుకోనున్నట్లు సమాచారం. గాంధీనగర్ నుంచి భారీ మెజారిటీతో గెలుపొందిన బీజేపీ చీఫ్ అమిత్ షాకు కీలక మంత్రి బాధ్యతలు అప్పగిస్తారని వార్తలు వచ్చాయి. అయితే దీనిపై స్పందించేందుకు షా నిరాకరించారు. 2014 ఎన్నికల్లో తెలంగాణలో ఒక సీటుతో సరిపుచ్చుకున్న బీజేపీ, ఈసారి ఏకంగా నాలుగు సీట్లు దక్కించుకోవడంతో రాష్ట్రంలో పార్టీ విస్తరణకు బీజేపీ ప్రాధాన్యత ఇస్తోందనీ, కాబట్టి తెలంగాణ నుంచి కేబినెట్లో ఒకరికి చోటు దక్కే అవకాశముందంటున్నారు. -
మే 30, రాత్రి 7 గంటలు
న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ రెండోసారి ప్రమాణస్వీకారం చేసేందుకు ముహూర్తం ఖరారైంది. మే 30న రాత్రి 7 గంటలకు మోదీ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని రాష్ట్రపతి కార్యాలయం తెలిపింది. మోదీతో పాటు కొందరు మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేస్తారని వెల్లడించింది. రాష్ట్రపతి భవన్లో జరిగే ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మోదీ చేత ప్రమాణం చేయిస్తారని పేర్కొంది. ఎన్డీయే కూటమి మోదీని తమ నాయకుడిగా శనివారం ఎన్నుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన లేఖను బీజేపీ చీఫ్ అమిత్ షాతో పాటు ప్రకాశ్‌సింగ్ బాదల్, ఉద్ధవ్ ఠాక్రే, సుష్మా స్వరాజ్, నితిన్ గడ్కారీ, నితీశ్‌కుమార్ తదితరులు రాష్ట్రపతికి అందచేశారు. దీంతో ఎన్డీయేకు లోక్‌సభలో స్పష్టమైన మెజారిటీ ఉన్న నేపథ్యంలో రాష్ట్రపతి కోవింద్ తన రాజ్యాంగాధికారాలను ఉపయోగించి మోదీని ప్రధానిగా నియమించారు. మంత్రివర్గంలో చేరే సభ్యుల పేర్లు, ప్రమాణస్వీకార కార్యక్రమం తేదీ, సమయం పై మోదీ అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు. తొలి ఐదేళ్ల పదవీకాలం పూర్తిచేసుకుని మరోసారి ప్రధానిగా ఎన్నికైన తొలి బీజేపీ నేతగా మోదీ చరిత్ర సృష్టించారు. మోదీకి ముందు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీలు మాత్రమే ఈ ఘనత సాధించారు. ఈ కార్యక్రమానికి విదేశీ నేతలు హాజరుకావడంపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. మరోవైపు సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన మోదీకి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆదివారం ఫోన్ చేశారు. ఇరుదేశాల్లోని ప్రజల అభివృద్ధి కోసం కలసికట్టుగా పనిచేద్దామని కోరారు. దక్షిణాసియాలో శాంతి, సుస్థిరత, శ్రేయస్సు కోసం తాము కట్టుబడి ఉన్నట్లు పునరుద్ఘాటించారు. ఇందుకోసం మోదీతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. 17వ లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 542 స్థానాలకు ఎన్డీయే 353 చోట్ల విజయదుందుభి మోగించింది. బీజేపీకి 303 సీట్లు దక్కాయి. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి మాల్దీవుల్లో తొలి పర్యటన.. ప్రమాణస్వీకారం చేసిన అనంతరం మోదీ తన తొలి పర్యటనను మాల్దీవుల్లో చేపట్టే అవకాశముందని దౌత్య వర్గాలు తెలిపాయి. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక మోదీ తొలిసారి భూటాన్‌ను సందర్శించారు. జూన్ నెలలో మొదటి లేదా రెండో వారంలో మోదీ మాల్దీవుల్లో పర్యటిస్తారని దౌత్యవర్గాలు చెప్పాయి. మోదీ పర్యటన జూన్ 7–8 తేదీల మధ్య ఉంటుందని సమాచారం. వెంకయ్య ఇంటికి మోదీ కేంద్రంలో మరోసారి అధికారం చేపట్టబోతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడితో భేటీ అయ్యారు. ఆదివారం ఉదయాన్నే మోదీ వెంకయ్య ఇంటికి వెళ్లగా, ఆయన ప్రధానిని సాదరంగా ఆహ్వానించారు. మోదీ మర్యాదపూర్వకంగానే వెంకయ్యను కలిసినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో ముఖ్యంగా దేశాభివృద్ధిని వేగవంతం చేయడం, పార్లమెంటరీ వ్యవస్థలను పటిష్టం చేయడంపై ప్రధానితో చర్చించినట్లు వెంకయ్య నాయుడు ట్వీట్ చేశారు. -
‘కోడ్’ ముగిసినా ఎక్కడి అధికారులు అక్కడే
సాక్షి, అమరావతి : ఎన్నికల నిబంధనావళి అమల్లో భాగంగా సార్వత్రిక ఎన్నికల నిర్వహణ కోసం ఇతర జిల్లాలకు బదిలీపై వెళ్లిన అధికారులు ‘కోడ్’తో నిమిత్తం లేకుండా తదుపరి ఆదేశాలు జారీ అయ్యే వరకూ ప్రస్తుతం ఉన్న స్థానాల్లోనే పనిచేయాల్సి ఉంటుంది. ఎన్నికలు ముగిసినందున వారిని పాత జిల్లాలకు పంపించాలా? లేక ప్రస్తుత స్థానాల్లోనే కొనసాగించాలా? అనేది కీలకమైన అంశమైనందున ఆపద్ధర్మ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అధికారులను ప్రస్తుతం పనిచేస్తున్న జిల్లాల్లోనే కొనసాగించాలా? లేక ఎన్నికల ముందు వరకూ పనిచేసిన జిల్లాలకు తిరిగి బదిలీ చేయాలా? అనే అంశంపై స్పష్టమైన విధివిధానాల్లేవు. అందువల్ల కొత్త ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే దానిని అమలుచేస్తామని అధికార యంత్రాంగం చెబుతోంది. అయితే, ఎన్నికలు ముగిసినందున ఎన్నికల ముందు పనిచేసిన స్థానాలకే అధికారులను తిరిగి బదిలీ చేయాలని రెవెన్యూ ఉద్యోగుల సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. కానీ, ఇలాంటి నిబంధనేమీ లేదని రెవెన్యూ శాఖ స్పష్టం చేసింది. కొత్త ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఆయన ఎలా చెబితే అలా చేయాలని రెవెన్యూ శాఖ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ఫైలును సీఎం పరిశీలన కోసం పంపింది. ఎందుకిలా? రాష్ట్రంలో విధానసభ, దేశవ్యాప్తంగా లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్.. మోడల్ కోడ్ (నిబంధనావళి) ప్రకారం రెవెన్యూ శాఖలో 530 మందికి పైగా తహసీల్దార్లను ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు బదిలీ చేశారు. ఇదే నిబంధనావళి ప్రకారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఇతర శాఖల్లో ఇదే కేడర్‌లో పనిచేస్తున్న మరికొందరిని కూడా వేరే జిల్లాలకు బదిలీ చేశారు. ఎన్నికల కమిషన్ విధుల్లో భాగస్వాములను చేసే వారిని సొంత జిల్లాల నుంచి వేరే జిల్లాలకు బదిలీ చేయాలని నిబంధన ఉంది. అలాగే, మూడేళ్లుపైగా ఒకేచోట ఉన్న వారిని కూడా బదిలీ చేయాలని ఉంది. దీంతో ఎన్నికల విధులతో సంబంధం ఉన్న ఆయా శాఖల అధికారులను బదిలీ చేశారు. కొందరు రెవెన్యూ డివిజనల్ అధికారులు సైతం ఇలాగే బదిలీ అయ్యారు. ఈ బదిలీలన్నీ మార్చి 10న వచ్చిన ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందే జరిగాయి. ఈ నేపథ్యంలో.. ‘ఈనెల 30న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొత్త ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్షించిన అనంతరమే బదిలీ అయిన వారిని పూర్వ స్థానాలకు పంపించాలా? ప్రస్తుత స్థానాల్లోనే కొనసాగించాలా? అనే దానిపై నిర్ణయం తీసుకుంటాం. అందుకోసం ఫైలు ఇప్పటికే పంపించాం’.. అని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ మన్మోహన్సింగ్ ‘సాక్షి’కి తెలిపారు. ఇతర విభాగాల వారి విషయంలోనూ ఇదే విధానం అమలవుతుందని సీనియర్ ఐఏఎస్ అధికారి చెప్పారు. సాధారణ పరిపాలన వేగవంతం ఇదిలా ఉంటే.. ఎన్నికల కోడ్ ముగిసినందున అధికార యంత్రాంగం ఇక పూర్తిగా ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. గత మూడు నెలలుగా ఎన్నికల పనులు, తర్వాత ‘కోడ్’ అంటూ క్షేత్రస్థాయి అధికారులు ప్రజల వినతులు, సమస్యల గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో రెవెన్యూ కార్యాలయాల్లో రోజువారీ సాగాల్సిన పనులన్నీ స్తంభించాయి. ‘వాస్తవంగా పట్టాదారు పాసుపుస్తకాల జారీ, రెవెన్యూ రికార్డుల మార్పులు చేర్పులు, సవరణలు (మ్యుటేషన్), భూముల కొలతలు, వ్యవసాయ ఆధార ధ్రువీకరణ పత్రాల జారీ, కుల ధ్రువీకరణ పత్రాల జారీ, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీ తదితర సాధారణ కార్యకలాపాలు నిత్యం చేయాల్సిందే. ఇవి ఎన్నికల కోడ్ పరిధిలోకి రావు. అయితే, అధికారులు పని భారాన్ని సాకుగా చూపుతూ ఈ పనులను నిలిపేశారు. ఇప్పుడు ఎన్నికల క్రతువు ముగిసినందున అధికారులు ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. ఈ మేరకు ఇప్పటికే ఆదేశాలు జారీచేశాం’.. అని ఒక ఉన్నతాధికారి వివరించారు. ముగిసిన ఎన్నికల కోడ్ దేశవ్యాప్తంగా లోక్‌సభ, రాష్ట్రంలో శాసనసభ సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్)ని కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ) ఎత్తివేసింది. ఎన్నికల షెడ్యూలు ప్రకటనతో మార్చి 10 నుంచి అమల్లోకి వచ్చిన ఈ ‘కోడ్’.. ఎన్నికల ప్రక్రియ ముగియడంతో దాని కాల పరిమితి ముగిసిందని కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీఐ) కార్యదర్శి అజయ్‌కుమార్ తెలిపారు. ‘దేశవ్యాప్తంగా లోక్‌సభ, కొన్ని రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు ముగిసి ఫలితాలు వెల్లడి కావడంతో మోడల్ కోడ్‌ను ఎత్తివేస్తున్నాం. ఇది తక్షణమే అమల్లోకి వస్తుంది. ఈ మేరకు సంబంధిత అధికార యంత్రాంగం మొత్తానికి తెలియజేయండి’.. అని అజయ్ కుమార్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులకు ఆదివారం కేంద్ర ఎన్నికల కమిషన్ సర్క్యులర్ జారీచేసింది. -
టార్గెట్ @ 125
లోక్‌సభ ఎన్నికల్లో కనీవినీ ఎరుగని విజయాన్ని సొంతం చేసుకున్న బీజేపీ తన తదుపరి గురి రాజ్యసభపై పెట్టింది. పెద్దల సభలో మెజార్టీ సాధించడమే ఇప్పుడు బీజేపీ, దాని మిత్రపక్షాల ముందున్న లక్ష్యం. గత కొద్ది కాలంలో ఎన్డీయే ప్రతిపాదించిన కీలక బిల్లులు పెద్దల సభలో ఆమోదం పొందకుండా ఆగిపోయాయి. ట్రిపుల్ తలాక్, మోటార్ వాహన చట్టం, పౌర చట్టాలకు సవరణ బిల్లులు ఎన్డీయేకి తగినంత బలం లేని కారణంగా పెద్దల సభలో ఆమోదం పొందలేకపోయాయి. ఇటీవల కాలంలో అదే ఎన్డీయేకి అడ్డంకిగా మారింది. దానిని అధిగమించడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ప్రస్తుతం 101 ఎంపీల బలం గత ఏడాది పార్లమెంటు చరిత్రలోనే తొలిసారిగా కాంగ్రెస్ పార్టీని మించి రాజ్యసభలో బీజేపీ బలం పెంచుకుంది. 245 సీట్లు ఉన్న సభలో ఎన్డీయే ఎంపీల సంఖ్య 101కి చేరుకుంది. ముగ్గురు నామినేటెడ్ సభ్యులు స్వప్న దాస్‌గుప్తా, మేరీకోమ్, నరేంద్ర యాదవ్‌ల మద్దతు కూడా బీజేపీకే ఉంది. మరో ముగ్గురు స్వతంత్ర ఎంపీల మద్దతుతో కలిపి ఎన్డీయే బలం 107కి చేరుకుంది. ఆరేళ్ల పదవీకాలం కలిగిన రాజ్యసభ సభ్యులందరి ఎన్నికలు ఒకేసారి జరగవు. విడతల వారీగా సభ్యులు పదవీ విరమణ చేసినప్పుడల్లా కొత్త సభ్యుల ఎన్నిక జరుగుతుంది. రాష్ట్రాల ఎమ్మెల్యేలు వీరిని ఎన్నుకుంటారు. అందుకే రాజ్యసభలో బలం పెరగాలంటే ముందుగా వివిధ రాష్ట్రాల్లో బీజేపీ పట్టు బిగించాలి. దేశవ్యాప్తంగా ఎన్డీయేకి ఎక్కువ ఎమ్మెల్యేలు ఉంటేనే రాజ్యసభకు ఎక్కువ మంది ఎంపీలను పంపగలదు. విపక్షాల ప్రమేయం లేకుండా పెద్దల సభలో బిల్లులు పాస్ కావాలంటే ఎన్డీయేకి 123 మంది ఎంపీలు కావాలి. 2020 నవంబర్ నాటికి ఎన్డీయే ప్రభుత్వానికి మరో 19 సీట్లు అదనంగా వచ్చి 125కి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, బిహార్, తమిళనాడు, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల సహకారంతో బీజేపీ మేజిక్ ఫిగర్ దాటుతుంది. పదిహేనేళ్ల తర్వాత కేంద్రంలో అధికార పార్టీ రాజ్యసభలో కూడా మెజార్టీ సాధించిన పార్టీగా బీజేపీ రికార్డు సృష్టించనుంది. వాటిలో అత్యధిక సీట్లు యూపీ నుంచే వస్తాయి. తమిళనాడులో ఏఐఏడీఎంకే మిత్రపక్షం కావడంతో మరో ఆరు సీట్లు వస్తాయి. అసోం నుంచి మూడు, రాజస్తాన్ నుంచి రెండు, ఒడిశా నుంచి ఒకటి సభ్యులతో ఎన్డీయే బలం వచ్చే ఏడాదికి పెరగనుంది. రాష్ట్రాల ఎన్నికల్లో గెలుపు ముఖ్యం ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర, హరియాణా, జార్ఖండ్ అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆ రాష్ట్రాల్లో బీజేపీ భారీ విజయాలు నమోదు చేయగలిగితే రాజ్యసభలో బలం కూడా పెరుగుతుంది. ఇప్పట్నుంచి నవంబర్ 20 మధ్య కాలంలో కొత్తగా పెద్దల సభకు 75 మంది సభ్యులు వెళతారు. ఎన్డీయే తన మార్కు పరిపాలన చూపించాలన్నా, కొత్త సంస్కరణలకు తెరతీయాలన్నా రాజ్యసభలో మెజార్టీ కూడా అత్యంత అవసరం. -
మమతకు అసెంబ్లీ గండం
పశ్చిమ బెంగాల్ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు దీదీ కోటలో బీజేపీ బలం పుంజుకోవడమే కాక క్షేత్ర స్థాయిలో వేళ్లూనుకుంటోందని, ఓట్ల శాతాన్ని గణనీయంగా పెంచుకుంటోందని వెల్లడిస్తున్నాయి. తాజా ఫలితాలను విశ్లేషిస్తే 18 ఎంపీ సీట్లు గెలుచుకున్న బీజేపీ రాష్ట్రంలో 121 అసెంబ్లీ సెగ్మెంట్లలో మెజారిటీ సాధించిందని తేలింది. 22 సీట్లు దక్కించుకున్న తృణమూల్ 164 అసెంబ్లీ సెగ్మెంట్లలో ముందంజలో ఉంది. రాష్ట్రంలో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలున్నాయి. దీన్ని బట్టి 2021లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అగ్ని పరీక్షేనని, రాజకీయ పండితులు స్పష్టం చేస్తున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర భవిష్యత్ రాజకీయ చిత్రాన్ని పూర్తిగా మార్చివేస్తాయని వారు అంచనా వేస్తున్నారు. 2014 ఎన్నికల్లో 39.7 శాతం ఓట్లు సాధించిన తృణమూల్ 34 సీట్లు గెలిచింది. ఈ సారి ఓట్ల శాతం 43.3కు పెరిగినా సీట్లు తగ్గడం గమనార్హం. అలాగే, గత ఎన్నికల్లో17 శాతం ఓట్లతో 2 స్థానాలు దక్కించుకున్న బీజేపీ ఈ సారి 40.2శాతం ఓట్లతో 18 సీట్లు గెలుచుకుంది. తృణమూల్ ఎమ్మెల్యేలు ఉన్న చాలా అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీ మెజారిటీ సాధించడంతో ఓట్లతో పాటు సీట్లు కూడా పెరిగాయి. రాజధాని ,చుట్టుపక్కల ఉన్న ఐదు లోక్‌సభ నియోజకవర్గాల్లో( కోల్‌కతా సౌత్, నార్త్, జాదవ్‌పూర్, బరసాత్, డమ్‌డమ్) తృణమూల్ ఎంపీలే ఉన్నారు. వీటి పరిధిలో 35 శాసన సభ స్థానాలున్నాయి. తాజా ఎన్నికల్లో వీటిలో ఐదు చోట్ల బీజేపీ అభ్యర్ధులు పై చేయి సాధించారు. రాష్ట్ర మంత్రులు సోవన్‌దేవ్ ఛటోపాధ్యాయ,సుజిత్‌బోస్, జ్యోతిప్రియలు తమ సొంత నియోజకవర్గాల్లోనే తృణమూల్‌కు మెజారిటీ తీసుకురాలేక పోయారు. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు మమత 2020లో స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొనాల్సి ఉంది. చాలా చోట్ల ఇప్పటికే బీజేపీ ముందంజలో ఉందని పలువురు తృణమూల్ నాయకులు లోపాయికారీగా అంగీకరిస్తున్నారు.దాంతో బూత్ స్థాయి నుంచి ప్రక్షాళనకు పార్టీ నాయకత్వం శ్రీకారం చుడుతోంది.నియోజకవర్గాల పరిస్థితి ఇలా ఉంటే జిల్లాల పరిస్థితి మరింత దారుణంగా ఉంది.డజనుకు పైగా సీనియర్ మంత్రులు ప్రాతినిధ్యం వహించే స్థానాల్లో తృణమూల్ బాగా వెనకబడి ఉందని తాజా ఫలితాలను బట్టి తెలుస్తోంది. ఇక్కడ తృణమూల్ ఓటు బ్యాంకు ముక్కలయ్యే పరిస్థితి ఏర్పడింది. ప్రత్యర్థి పార్టీ ఒకవైపు బలపడుతోంటే, అంతర్గత కలహాలు, నేతల విభేదాలు తృణమూల్‌కు భారీగా నష్టం కలిగిస్తున్నాయి. కొందరు బహిరంగంగానే మమతపై ధ్వజమెత్తుతోంటే, మరికొందరు లోపాయికారీగా ప్రత్యర్థులకు సహకరించడం ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనబడిందని పార్టీ నేతలు చెబుతున్నారు. -
ఒక్కసారిగా మా తండ్రిని తల్చుకున్నాను: వైఎస్ జగన్
‘‘ఆంధ్రప్రదేశ్‌ను అవినీతి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నదే నా లక్ష్యం. ప్రతి కాంట్రాక్టునూ పారదర్శకంగా పరిశీలిస్తాం. అవినీతి ఉందని తెలిస్తే తిరిగి టెండర్లు పిలుస్తాం. కాంట్రాక్టర్లతో ఎలాంటి లాలూచీ ఉండదు. వాళ్లు తప్పు చేస్తే టెండర్లు రద్దు చేసి, మళ్ళీ టెండర్లు పిలుస్తాం. ఎక్కువ మంది టెండర్లలో పాల్గొనేలా ప్రక్రియను మారుస్తాం. అతి తక్కువ కోట్ చేసేవాళ్లకే టెండర్లు ఇస్తాం. చంద్రబాబు హయాంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతి కాంట్రాక్టునూ రద్దు చేస్తాం. తిరిగి టెండర్లు పిలుస్తాం’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మరో మూడు రోజుల్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ‘ఇండియా టుడే’ ప్రతినిధి రాజ్‌దీప్ సర్దేశాయ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు కీలక అంశాలపై స్పందించారు. పగ తీర్చుకోవాలన్నది తన అభిమతం కాదని చెప్పారు. తనను కేసులతో వేధించిన వారిని దేవుడే శిక్షిస్తాడని పేర్కొన్నారు. ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు... రాజ్‌దీప్ సర్దేశాయ్: లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఇంత భారీ విజయం సాధ్యమవుతుందని మీరు ఊహించారా? జగన్మోహన్రెడ్డి: ఇది ప్రజలు ఇచ్చిన గొప్ప విజయం. ఇదంతా దేవుడి దయ, ప్రజల ఆశీస్సుల వల్లే సాధ్యమైంది. నేను 14 నెలల పాటు 3,648 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసినప్పుడే కిందిస్థాయి నుంచి ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉందని గ్రహించాను. మా పార్టీ అఖండ విజయం సాధించబోతోందని అవగతమైంది. ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే నేను చేసిన తొలి ప్రకటన మీకు గుర్తుండే ఉంటుంది. వైఎస్సార్సీపీ అఖండ విజయం సాధించబోతోందని చెప్పాను. సర్దేశాయ్: మీ పార్టీని చీల్చుతూ 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు తమ పార్టీలోకి తీసుకున్నారు. మీ పార్టీని లేకుండా చేయాలనుకున్నారు. అసలు మీ విజయంలో మలుపు తిప్పిన అంశం ఏమిటి? జగన్: నా పాదయాత్రనే ఈ విజయంలో ప్రధాన పాత్ర వహించింది. మా పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను చంద్రబాబు తీసుకున్నారు. ఎదుటి పార్టీ ఎమ్మెల్యేలను రూ 20–30 కోట్లిచ్చి, ప్రలోభాలకు గురిచేసి తీసుకోవడమే కాకుండా వారిలో కొందరికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. అది చట్ట విరుద్ధం కానట్లుగా వ్యవహరించారు. పార్టీ ఫిరాయించిన వారిని అనర్హులుగా కూడా చేయలేదు. వారి చేత రాజీనామాలు కూడా చేయించలేదు. స్పీకర్ వ్యవస్థను దుర్వినియోగం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఎంత అన్యాయంగా వ్యవహరిస్తోందో ప్రజలు తెలుసుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో అవినీతి తారస్థాయికి చేరుకుంది. 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ అబద్ధాలేనని రుజువయ్యాయి. సర్దేశాయ్: మీరేమో చంద్రబాబు అవినీతి, దుశ్చర్యల వల్ల ఆగ్రహంతో ఓట్లేశారని అంటున్నారు. మరి ఇందులో జగన్‌కు సానుకూల ఓటు లేదా? ఇంతకీ ఈ ఓటు చంద్రబాబు ప్రభుత్వ వ్యతిరేక ఓటా? లేక జగన్ అనుకూల ఓటా? జగన్: ఇందులో రెండూ కలిసి ఉన్నాయి. ఎన్నికలప్పుడు ప్రజలు రెండు అంశాలు చూస్తారు. ప్రభుత్వంలో ఉన్న వారిపై వ్యతిరేకతతో పాటు తమ ఆశలను నెరవేర్చే నాయకుడు ఎవరని కూడా చూస్తారు. ఈ రెండు అంశాలు కలిసినప్పుడే సహజంగా అది అఖండ విజయం అవుతుంది. ఉన్న నాయకుడిని వద్దనుకున్నప్పుడు, మరో నాయకుడిని కావాలనుకున్నప్పుడే ప్రజలు అఖండ విజయాన్ని అందిస్తారు. సర్దేశాయ్: ఏపీలో ఎన్నికలు మీకు, చంద్రబాబుకు మధ్య హోరాహోరీగా జరిగాయి కదా. ఎన్నికల ప్రచారంలో ఆయన మిమ్మల్ని టార్గెట్ చేశారు. మీరు ఆయన్ను తీవ్రస్థాయిలో విమర్శించారు కదా. చివరకు వచ్చేటప్పటికి మీ ఇద్దరిలో ఒకరిని ఎన్నుకునే పరిస్థితిని కల్పించారు కదా! జగన్ : మౌలికంగా ఇది ప్రాంతీయ పార్టీల సమరం. జాతీయ పార్టీలకు ఇక్కడ ఆ అవకాశం లేకుండా పోయింది. అలాంటప్పుడు నాకు, చంద్రబాబుకూ మధ్యనే పోరాటం జరుగుతుంది కదా! సర్దేశాయ్: రాష్ట్రాన్ని 12 నెలల్లో మారుస్తానని చెప్పారు? మీరు అనేక హామీలు ఇచ్చారు. అసలు మీ ఎజెండా ఏంటి? మోడల్ స్టేట్ అంటే ఏంటి? జగన్: ఏపీని అవినీతి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నదే నా లక్ష్యం. ప్రజలు మెచ్చుకునే పారదర్శక పాలన అందిస్తా. ఏం చేస్తామో, ఎలా చేస్తామో చెబుతాం. ఒక్క ఏడాదిలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ మారుస్తా. పూర్తిగా ప్రక్షాళన చేస్తా. అప్పుడు మీరే వెల్డన్ అంటారు. ప్రతీ కాంట్రాక్టును పారదర్శకంగా పరిశీలిస్తాం. అవినీతి ఉందని తెలిస్తే తిరిగి టెండర్లు పిలుస్తాం. కాంట్రాక్టర్లతో ఎలాంటి లాలూచీ ఉండదు. వాళ్లు తప్పు చేస్తే టెండర్లు రద్దు చేసి, మళ్ళీ టెండర్లు పిలుస్తాం. ఎక్కువ మంది టెండర్లలో పాల్గొనేలా ప్రక్రియను మారుస్తాం. అతి తక్కువ కోట్ చేసేవాళ్లకే టెండర్లు ఇస్తాం. రివర్స్ టెండరింగ్ విధానానికి ప్రాధాన్యం ఇస్తాం. చంద్రబాబు హయాంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతి కాంట్రాక్టునూ రద్దు చేస్తాం. సర్దేశాయ్: వచ్చే ఏడాదిలో కాంట్రాక్టర్ల వ్యవస్థలో మార్పు తెస్తారా? జగన్: అవును. పెద్ద మార్పు ఉంటుంది. ఉదాహరణకు పవర్ టారిఫ్‌నే తీసుకోండి. సంప్రదాయేతర ఇంధన వనరులను పరిశీలిద్దాం. సౌర విద్యుత్ గ్లోబల్ టెండర్ల ద్వారా అయితే యూనిట్ రూ.2.65కే లభిస్తోంది. పవన విద్యుత్ విషయంలో నరేంద్ర మోదీ అనుసరించిన పారదర్శక విధానం అభినందనీయం. దీనివల్ల యూనిట్ రూ.3కే లభిస్తోంది. కానీ, మన రాష్ట్రంలో విద్యుత్ ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. పవన విద్యుత్ యూనిట్ రూ.4.84 ఉంది. పీక్ అవర్స్‌లో ఏకంగా రూ.6 పెట్టి కొనడానికి ఒప్పందాలు చేసుకున్నారు. రాష్ట్రంలో సిస్టమ్ ఏమిటంటే, నువ్వో రూపాయి తీసుకో. నాకో రూపాయి అనే విధానం కొనసాగుతోంది. చంద్రబాబు ఆయనకు కావాల్సింది తీసుకుని ఇలాంటివి ప్రోత్సహించాడు. మేము ఈ వ్యవస్థను మారుస్తాం. గ్లోబల్ స్థాయిలోకి వెళ్లి ఇప్పుడున్న ధరలు తగ్గిస్తాం. ఇదొక్కటే కాకుండా జ్యుడీషియల్ కమిటీ వేస్తాం. న్యాయబద్ధంగా వ్యవహరిస్తాం. రాష్ట్రంలో ఒక వర్గం మీడియా చంద్రబాబుకు అనుకూలంగా మారింది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లాంటి వాటికి చంద్రబాబు ఎంత చెబితే అంత. వాళ్లు వేరే పక్షాన్ని మట్టిలో కలపాలని కంకణం కట్టుకున్నారు. రాష్ట్రంలో సిస్టమ్‌ను పూర్తిగా మార్చాలని చూస్తున్నాం. జ్యుడీషియల్ కమిటీని వేసి, సిట్టింగ్ జడ్జిని పెడతాం. జరిగే ప్రతి టెండర్‌ను ఆయన ముందుంచుతాం. ఆయన ఏ విధమైన మార్పులు సూచిస్తే దాన్ని అనుసరిస్తాం. వాళ్ల నిర్ణయానికి అడ్డురాము. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వంటి ఏ మీడియా అడిగినా ఫైళ్లు చూపిస్తాం. అసత్య ప్రచారం చేసే మీడియాపై పరువు నష్టం కేసులు వేసేందుకు కూడా వెనుకాడం. సర్దేశాయ్: మీకు కూడా సొంత మీడియా ఉంది కదా? ఇది మీడియా పోరాటం కాదా? జగన్: ఉద్దేశపూర్వకంగా ప్రతిష్ట దిగజారిస్తే వాస్తవాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది కదా! ఇది అమలు జరిగితే దేశానికే మంచి సంకేతాలు వెళ్తాయి. గుడ్ గవర్నెన్స్ అంటే ఇదీ అని అందరికీ తెలుస్తుంది. ముఖ్యమంత్రిగా ఉండి అవినీతిపరుడని పేరు తెచ్చుకోకూడదు. కానీ, రాష్ట్రంలో ఒక వర్గం మీడియా వాస్తవాలు కాకుండా అవాస్తవాలను ప్రచారం చేస్తోంది. సర్దేశాయ్: రాష్ట్రం ఇమేజ్, మీ ఇమేజ్ మీ టార్గెట్. మోడల్ స్టేట్‌గా మార్చడం మీ ప్రధాన ఆశయం.. అంతేనా? ఏడాది తర్వాత మళ్లీ మీ రాష్ట్రం గురించి మాట్లాడుకుందాం. మీకు బలమైన ఎజెండా ఉంది. మోదీ ప్రభుత్వంతో కలిసి పని చేస్తారా? ఆయన సహకారం కోరుకుంటున్నారా? కేంద్రంతో మంచిగా ఉండాలనుకుంటున్నారా? జగన్: మోదీని కలిసిన ప్రతీసారి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని కోరుతాను. ఆయన ప్రధానమంత్రి. ఆయన ఆశీస్సులు అవసరం. మోదీ నుంచి మనకు నిధులు రావాల్సి ఉంది. ముఖ్యమంత్రిగా నేను చెయ్యాల్సింది నేను చేస్తా. సర్దేశాయ్: గతం వదిలేద్దాం. ఇప్పుడు మీరు సాధించిన ఘన విజయం తరువాత వెంటనే మీకేమనిపించింది? జగన్: అఖండ విజయం సాధించిన క్షణంలో ఒక్కసారిగా మా తండ్రిని తల్చుకున్నాను. అవి నిజంగా భావోద్వేగమైన క్షణాలు. సర్దేశాయ్: ప్రజల్లో మీ బలం ఏమిటో అంచనా వేసుకోవడానికి ఓదార్పు యాత్ర తలపెట్టారనేది కాంగ్రెస్ పార్టీ భావన. పదేళ్ల తరువాత ఈ ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు మీరు సొంతంగా గెలిచి ఏపీకి ముఖ్యమంత్రి కాబోతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ నేతలు తమ తప్పు తెలుసుకుని మిమ్మల్ని మళ్లీ ఆ పార్టీలోకి ఆహ్వానిస్తే మీరు వెళ్లే విషయం పరిశీలిస్తారా? లేక ఇక ఎప్పటికీ ఆ అధ్యాయం ముగిసినట్లేనా? జగన్: (ఆవేదనగా) కాంగ్రెస్ పార్టీ నా విషయంలో ఏం చేసిందో నాకు తెలుసు. పగ తీర్చుకోవాలన్నది నా అభిమతం కాదు. వారిని దేవుడే చూసుకోవాలి. నేను రోజూ బైబిల్ చదువుతాను. నేను దేవుడిని ప్రార్థిస్తాను. దేవుడే వారికి శిక్ష వేస్తాడు. సర్దేశాయ్: అంటే ఆ అధ్యాయం ముగిసినట్లేనా? జగన్: నాకు సంబంధించినంత వరకూ నాపై చేసిన దానికి ఎప్పుడో క్షమించేశాను. ఎందుకంటే క్షమిస్తే శాంతి వస్తుంది. ప్రస్తుతం నా దృష్టి అంతా నా రాష్ట్రంపైనా, నా ప్రజలపైనా మాత్రమే ఉంది. నా వ్యక్తిగత అంశాలు దేనికీ అడ్డు కారాదు. ఇవాళ నా ఆలోచన అంతా నా ప్రజల గురించే. నేను ఆలోచించాల్సిందల్లా నా రాష్ట్రానికి ఎలా మంచి జరుగుతుందనే. నేనిప్పుడు ఏపీ ప్రజల తరపున ప్రాతినిథ్యం వహిస్తున్నాను. వారికి నేను బాధ్యుడిగా ఉన్నాను. నాపై వారు పెట్టుకున్న నమ్మకం గురించి ఆలోచించకుండా వ్యక్తిగత విషయాలను తీసుకురావడం మంచిది కాదు. సర్దేశాయ్: ఒకవేళ ఇవాళ సోనియాగాంధీ కనుక మీ వద్దకు వచ్చి... ‘జగన్ కమాన్.. మళ్లీ మన ఇంటికి వచ్చేయ్. మీ తండ్రి మా కాంగ్రెస్ వారే’ అని ఆహ్వానిస్తే స్పందిస్తారా? లేక ఆ అధ్యాయం ముగిసినట్లేనా? జగన్: మీరే చెప్పారు కాంగ్రెస్‌కు అత్యల్పంగా ఓట్లు వచ్చాయని. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది? వారితో నాకు అవసరం ఏమిటి? సర్దేశాయ్: మీకు వాళ్ల అవసరం లేదు. కానీ, వాళ్లకు మీ అవసరం ఉంది. జగన్: వాళ్లకు నా అవసరం ఉందంటే అది వారి సమస్య. -
2019 సార్వత్రిక ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్
-
మమతా బెనర్జీ రాజీనామా..!
కోల్‌కతా: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పశ్చిమబెంగాల్లో బీజేపీ అనూహ్య ఫలితాలు సాధించడంతో ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ ఇరుకునపడ్డారు. ఈ నేపథ్యంలో కోల్‌కతాలో శనివారం పార్టీ ముఖ్యనేతలతో సమావేశమైన మమతా పార్టీ వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా సమర్పించారు. అయితే టీఎంసీ మమతా బెనర్జీ రాజీనామాను తిరస్కరించింది. ఈ సమావేశం అనంతరం మమత మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ఈవీఎంలను తారుమారు చేసిందనీ, ఈ ఫలితాల వెనుక విదేశీ శక్తుల హస్తముందని ఆరోపించారు. అందుకే రాజీనామా చేశా.. ‘లోక్‌సభ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో పాలనను ఈసీ 5 నెలల పాటు ఆధీనంలోకి తీసుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో నేను సీఎంగా ఎలా ఉండగలను? అందుకే ముఖ్యమంత్రిగా తప్పుకుంటానని చెప్పాను. కానీ పార్టీ నా రాజీనామాను తిరస్కరించింది. ఈ సీఎం కుర్చీ నాకవసరం లేదు. ఆ కుర్చీకే నా అవసరం ఉంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీనీ నెరవేర్చాం. ఇప్పటివరకూ ప్రజల కోసం పనిచేశా. ఇప్పుడు పార్టీని పటిష్టం చేయడంపై కూడా దృష్టి సారిస్తా. లోక్‌సభ సీట్లలో బీజేపీ అభ్యర్థులకు లక్ష మెజారిటీ దాటేలా వాటిని రీప్రోగ్రామింగ్ చేశారు. దీనివెనుక విదేశీ శక్తులు కూడా ఉండొచ్చు. బీఎస్ఎఫ్ బలగాలు ప్రజలపై ఒత్తిడి తెచ్చి బీజేపీకి ఓట్లేసేలా చేశాయి’ అని మమత ఆరోపించారు. -
కాంగ్రెస్ చీఫ్‌గా ఉండలేను
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో కాంగ్రెస్‌లో కీలక పరిణామాలు సంభవించాయి. శనివారం జరిగిన కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలి(సీడబ్ల్యూసీ) భేటీలో పార్టీ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవి నుంచి వైదొలగాలనుకుంటున్నట్లు రాహుల్ గాంధీ ప్రకటించారు. అయితే, ఆయన నిర్ణయాన్ని ముక్తకంఠంతో సమావేశం తిరస్కరించింది. అయితే, రాహుల్ తన రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే సూచనలు కనిపించడం లేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో గాంధీ కుటుంబం నుంచి కాకుండా వేరొకరికి పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయి. ఇందుకు సరైన నేతల్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఒకరని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. నాలుగు గంటలపాటు భేటీ దాదాపు నాలుగు గంటలపాటు జరిగిన సీడబ్ల్యూసీ భేటీలో యూపీఏ చైర్ పర్సన్ సోనియా, మాజీ ప్రధాని మన్మోహన్, పార్టీ ప్రధాన కార్యదర్శులు ప్రియాంక గాంధీ, జ్యోతిరాదిత్య సింథియా, పంజాబ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సీఎంలు అమరీందర్ సింగ్, అశోక్ గహ్లోత్, భూపేశ్ బఘేల్‌తోపాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి, పార్టీ సీనియర్ నేతలు చిదంబరం, ఆంటోనీ, అహ్మద్ పటేల్, ఆజాద్, షీలా దీక్షిత్, ఖర్గే తదితర 50 మంది నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో పార్టీ వైఫల్యానికి కారణాలు, ప్రజలను మెప్పించడంలో వైఫల్యానికి దారి తీసిన పరిస్థితులను చర్చించారు. ఆయనే కొనసాగాలన్న సీడబ్ల్యూసీ ‘రాహుల్ నిర్ణయాన్ని సమావేశం ముక్తకంఠంతో తిరస్కరించింది. ఇలాంటి క్లిష్ట సమయంలో పార్టీకి నాయకత్వం, మార్గదర్శకత్వం వహించాలని ఆయన్ను కోరింది’అని సమావేశం అనంతరం మీడియాతో కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా తెలిపారు. ‘పార్టీని అన్ని స్థాయిల్లోనూ పార్టీ బలోపేతం, పునర్నిర్మాణం చేపట్టాలని, దేశంలోని యువత, రైతులు, బడుగు, బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల పక్షాన పనిచేసేందుకు పార్టీకి నేతృత్వం వహించాలని సీడబ్ల్యూసీ కోరింది. పార్టీకి ఓట్లేసిన 12.13 కోట్ల మంది ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది’అని ఆయన తెలిపారు. రాహుల్‌ను అధ్యక్షుడిగా కొనసాగాలన్న సీనియర్ నేత చిదంబరం సమావేశంలో కొంత ఉద్విగ్నానికి లోనయ్యారు. బాధ్యతల నుంచి వైదొలగాలన్న రాహుల్ నిర్ణయం నేపథ్యంలో పార్టీ మద్దతుదారులు, ముఖ్యంగా దక్షిణాదికి చెందిన వారు తీవ్రమైన చర్యలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. పార్టీ వైఫల్యానికి కారణాలను వివరిస్తూ సమావేశంలో ప్రియాంక, మన్మోహన్ మాట్లాడారు. తన ప్రభుత్వం మనుగడ ప్రమాదంలో పడిన నేపథ్యంలో దిద్దుబాటు చర్యలు చేపట్టేందుకు మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ ఈ సమావేశానికి హాజరుకాలేదని సమాచారం. 2014 ఎన్నికలతో పోల్చుకుంటే గెలుచుకున్న ఎంపీ సీట్ల సంఖ్య 44 నుంచి 52కు పెరిగినప్పటికీ 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కాంగ్రెస్ ఖాతా తెరవలేకపోయింది. పార్టీ పరాజయానికి తమదే బాధ్యతంటూ యూపీ, ఒడిశా కాంగ్రెస్ అధ్యక్షులు రాజ్ బబ్బర్, నిరంజన్ పట్నాయక్ ఇప్పటికే రాజీనామాలు సమర్పించగా మరికొందరూ అదే బాటలో ఉన్నట్లు చెబుతున్నారు. పార్టీ చీఫ్‌గా ప్రియాంక వద్దు ఈ సమావేశంలో ప్రసంగించిన రాహుల్.. ‘ప్రభుత్వానికి వ్యతిరేకంగా మన పోరాటం కొనసాగుతుంది. క్రమశిక్షణ గల కాంగ్రెస్ పార్టీ సైనికుడిగా నా పోరాటాన్ని కొనసాగిస్తా. కానీ, పార్టీ అధ్యక్షుడిగా నేను కొనసాగాలనుకోవడం లేదు’ అని పేర్కొన్నారు. తన స్థానంలో మరొకరిని ఎన్నుకోవాలని కోరారు. ప్రియాంకకు ఆ బాధ్యతలు అప్పగించాలని కొందరు ప్రతిపాదించగా ‘నా సోదరిని ఈ విషయంలోకి లాగకండి’ అంటూ రాహుల్ వ్యతిరేకించారు. కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా గాంధీ కుటుంబానికి చెందిన వారే ఉండాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. కంచుకోట వంటి అమేథీ నుంచి ఓటమి చవిచూడటంతో రాహుల్ రాజీనామా చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లు భావిస్తున్నారు. దీంతో తల్లి సోనియా, చెల్లి ప్రియాంక ఎంతగా నచ్చజెప్పినా వెనక్కి తగ్గేందుకు ఆయన అంగీకరించలేదు. సీడబ్ల్యూసీ భేటీ అనంతరం మీడియా భేటీలో పాల్గొనకుండానే రాహుల్ వెళ్లిపోయారు. దీంతో వైదొలిగే యోచనలోనే రాహుల్ ఉన్నట్లు భావిస్తున్నామని నేతలు అంటున్నారు. -
జాతీయ ఆశయాలు.. ప్రాంతీయ ఆశలు
న్యూఢిల్లీ: నవ భారత నిర్మాణానికి నూతన శక్తితో తమ ప్రభుత్వం నూతన ప్రయాణాన్ని ప్రారంభిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. కుల, విశ్వాసపరమైన మరే ఇతర వివక్షకు తావులేకుండా పనిచేయాల్సిందిగా కొత్తగా ఎన్నికైన ఎంపీలను ఆయన కోరారు. ‘జాతీయ ఆశయాలు .. ప్రాంతీయ ఆశలు (నేషనల్ యాంబిషన్స్, రీజనల్ ఆస్పిరేషన్స్– నారా)’ ఎన్డీయే కూటమికి తానిచ్చే నినాదంగా మోదీ చెప్పారు. ఎన్డీయే ఈ రెండు మార్గాల్లో ముందుకు వెళుతోందని, అభివృద్ధిని వేగవంతం చేసేందుకు ఈ రెండిటి కలయిక అవసరమని పేర్కొన్నారు. ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ నేతగా మోదీ శనివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో సమావేశమైన ఆయా పార్టీలకు చెందిన ఎంపీలు మోదీని తమ నేతగా ఎన్నుకున్నారు. ప్రకాశ్‌సింగ్ బాదల్ (అకాలీదళ్) మోదీ పేరును ప్రతిపాదిస్తూ తీర్మానం ప్రవేశపెట్టగా..నితీశ్ కుమార్ (జేడీయూ), ఉద్ధవ్ థాకరే (శివసేన) తదితర నేతలు బలపరిచారు. మోదీ 353 మంది ఎంపీల పార్లమెంటరీ పార్టీ నేతగా ఏకగ్రీవంగా ఎంపికైనట్లు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఎంపీల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. అంతకుముందు బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేతగా మోదీని ఆ పార్టీ ఎంపీలు ఎన్నుకున్నారు. మోదీ పేరును షా ప్రతిపాదించగా పార్టీ మాజీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కారీలు మద్దతు పలికారు. బీజేపీ సీనియర్ నేతలు ఎల్కే అద్వాణి, మురళీ మనోహర్ జోషి తదితరులు వేదికపై ఆసీనులయ్యారు. ఎన్డీయే నేతగా ఎన్నికైన తర్వాత శనివారం రాత్రి మోదీ రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. దీంతో మోదీని ప్రధానిగా కోవింద్ నియమించారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించారు. అంతకుముందు ఎన్డీయే నేతలు రాష్ట్రపతిని కలిసి తమ ఎంపీల జాబితాను అందజేశారు. కేబినెట్ కూర్పుపై మీడియా కథనాలు నమ్మొద్దు ఎన్డీయే పక్ష నేతగా ఎన్నికైన సందర్భంగా మోదీ 75 నిమిషాలకు పైగా ప్రసంగించారు. ఎన్నికల్లో మైనారిటీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారంటూ పరోక్షంగా ప్రతిపక్ష పార్టీలను విమర్శించారు. వారు ఎప్పుడూ భయంతో బతికేలా చేశారన్నారు. వారి విశ్వాసాన్ని కూడా పొందాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. 1857 నాటి స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తిని ఆయన గుర్తుచేశారు. ఆనాడు స్వాతంత్య్రం కోసం అన్ని మతాలూ చేతులు కలిపాయన్నారు. సుపరిపాలన కోసం ఇప్పుడు మళ్లీ అలాంటి ఉద్యమం ప్రారంభించాల్సి ఉందని మోదీ చెప్పారు. తమపై విశ్వాసం ఉంచిన వారితో పాటు, ఎవరి విశ్వాసం చూరగొనాల్సి ఉందో వారితో కూడా తాము ఉంటామన్నారు. ఈ సందర్భంగా మోదీ కొత్త ఎంపీలకు పలు సూచనలు కూడా చేశారు. వీఐపీ సంస్కృతిని విడనాడటంతో పాటు ప్రచారం కోసం మీడియాకు ప్రకటనలివ్వద్దని చెప్పారు. కొత్త మంత్రివర్గ కూర్పుపై మీడియాలో వచ్చే కథనాలను నమ్మవద్దన్నారు. అవన్నీ గందరగోళం సృష్టించడమే లక్ష్యంగా,, కొన్ని సందర్భాల్లో దురుద్దేశపూరితంగా ఉంటాయని అన్నారు. ఎన్డీయే ఎంపీలందరి వివరాలను తానింకా పరిశీలించాల్సి ఉందని చెప్పారు. నియమ, నిబంధనలను అనుసరించి బాధ్యతలు అప్పగించడం జరుగుతుందని అన్నారు. ప్రజలను ఏకం చేసిన ఎన్నికలు ఎన్నికలు ఎప్పుడూ విభజించడంతో పాటు అంతరాన్ని సృష్టిస్తాయని, కానీ 2019 ఎన్నికలు ప్రజలను, సమాజాన్ని ఏకం చేశాయని చెప్పారు. ఈసారి ప్రభుత్వ అనుకూల వాతావరణం ఉండటం గమనార్హమని, దాని ఫలితంగానే సానుకూల తీర్పు వెలువడిందని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సేవ చేయడానికి మించిన మంచి మార్గం మరొకటి లేదన్నారు. 2014–19 మధ్య పేదల కోసం ప్రభుత్వాన్ని నడిపామని, ఆ పేదలే ఇప్పుడు ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని తాను చెప్పగలనని మోదీ అన్నారు. ఇప్పుడు లభించిన భారీ విజయం అంతే పెద్ద బాధ్యతను మనపై ఉంచిందని చెప్పారు. దేశాభివృద్ధికి ఎన్డీయే ఎంపీలందరూ కలసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. పాల్గొన్న తెలంగాణ బీజేపీ ఎంపీలు లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన నలుగురు తెలంగాణ బీజేపీ ఎంపీలు శనివారం ఢిల్లీలో జరిగిన ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ, ఎన్డీయే పక్ష సమావేశంలో పాల్గొన్నారు. సికింద్రాబాద్ ఎంపీ కిషన్‌రెడ్డి, అదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌లు హాజరయ్యారు. ఎన్డీయే భారీ మెజారిటీతో తిరిగి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో తన తల్లి హీరాబా మోదీ ఆశీస్సులు తీసుకునేందుకు ప్రధాని ఆదివారం గుజరాత్ వెళ్లనున్నారు. వీఐపీ సంస్కృతిని దేశం అసహ్యించుకుంటుంది. విమానాశ్రయంలో సెక్యూరిటీ చెక్ కోసం మీరెందుకు క్యూలో నిలబడలేరు? అందులో తప్పేం లేదు. ‘రెడ్ లైట్’ (ఎర్ర బుగ్గ) సంస్కృతికి మోదీ స్వస్తి చెప్పారని ప్రజలు చెప్పుకుంటారు. మనోహర్ పరీకర్ ఏం చేసేవారో మీరు చూశారు. ఆయన్ను అనుసరించండి. ఎలాంటి వలలోనూ పడకండి. ప్రభుత్వ వ్యతిరేకత హానిచేస్తుంది. కానీ మనం చేసిన పని ప్రభుత్వ అనుకూల గాలి సృష్టించింది. ఫలితంగా సానుకూల ఓటును మనం చూడగలిగాం. 16వ లోక్‌సభ రద్దు కేంద్ర మంత్రివర్గం సిఫారసు నేపథ్యంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ 16వ లోక్ససభను రద్దు చేసినట్లు రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రుల రాజీనామాలను రాష్ట్రపతి శుక్రవారం ఆమోదించిన విషయం విదితమే. మోదీ మే 30న నూతన ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. కాగా ప్రమాణ స్వీకార తేదీ, సమయాన్ని, కొత్త మంత్రులుగా నియమించే వారి పేర్లను అందజేయాల్సిందిగా ప్రధానిని రాష్ట్రపతి కోవింద్ కోరినట్లు రాష్ట్రపతి భవన్ తెలిపింది. మోదీ 30న ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశముందని బీజేపీ శ్రేణులు తెలిపాయి. రాష్ట్రపతిభవన్‌లో మోదీకి ప్రధానిగా నియామక పత్రం ఇస్తున్న రాష్ట్రపతి కోవింద్ శనివారం ఢిల్లీలో పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఎన్డీఏ పార్లమెంటరీ బోర్డు సమావేశానికి హాజరైన ఎన్డీఏ ఎంపీలు, కూటమి నేతలు పార్లమెంటు ప్రాంగణంలో తెలంగాణ బీజేపీ ఎంపీలు బండి సంజయ్ కుమార్, కిషన్ రెడ్డి, సోయం బాపూరావు పార్లమెంటు లోపలికి వస్తూ ఎంపీ సన్నీడియోల్ విజయసంకేతం, పార్లమెంటు ద్వారం వద్ద మోకరిల్లాక నమస్కరిస్తున్న ఎంపీ హన్స్‌రాజ్ హన్స్ -
‘ముఖాముఖి’లో గల్లంతైన కాంగ్రెస్
కాంగ్రెస్‌తో ముఖాముఖి పోరులో బీజేపీదే పైచేయి అని ఇటీవలి సార్వత్రిక ఎన్నికలు మరోసారి నిరూపించాయి. యూపీలోని అమేథీలో స్వయంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీయే బీజేపీ చేతిలో ఓడిపోవడం ఇందుకు నిదర్శనం. ఈ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా 186 నియోజకవర్గాల్లో బీజేపీతో ముఖాముఖి తలపడిన వందేళ్ల చరిత్ర గల కాంగ్రెస్ కేవలం పదిహేను చోట్ల మాత్రమే గెలుపు సాధించింది. 2014 ఎన్నికల్లో ముఖాముఖి పోరులో 24 సీట్లు దక్కించుకున్న కాంగ్రెస్ స్కోరు ఈసారి పదిహేనుకు పడిపోయింది. అలాగే, 20 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉనికిలో లేకుండా పోయింది. బీజేపీ 50శాతానికి పైగా ఓట్లు పొందిన రాష్ట్రాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ.. మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లలో ఐదు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గద్దెదించి కాంగ్రెస్అధికార పగ్గాలు చేపట్టింది. అయితే, అదే ఊపును లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ కొనసాగించలేకపోయింది. ఈ మూడు రాష్ట్రాల్లో కలిపి కాంగ్రెస్ కేవలం రెండు స్థానాలనే గెలుచుకుంది. ముఖాముఖి పోరు జరిగిన రాజస్తాన్‌లో మొత్తం 25 సీట్లనూ కమలదళం గెలుచుకుంది. మధ్యప్రదేశ్‌లో మొత్తం 29 స్థానాల్లోనూ ముఖాముఖి పోరు జరగ్గా కాంగ్రెస్ కేవలం ఒక్క సీటు(చింద్వారా)ను మాత్రమే కైవసం చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల్లో ఇలా చతికిల పడుతుందని ఎవరూ ఊహించలేదు. గుజరాత్‌లోని మొత్తం 26 నియోజకవర్గాల్లో, మహారాష్ట్రలో 16 చోట్ల హోరాహోరీ పోరులో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా దక్కలేదు. కర్ణాటకలోని 28 స్థానాల్లో 21 చోట్ల బీజేపీతో పోటీపడగా కాంగ్రెస్‌కు ఒక్క సీటు దక్కింది. కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో రాయ్‌బరేలీ, అమేథీల్లో కాంగ్రెస్, కమలదళంతో ముఖాముఖి తలపడింది. రాయ్‌బరేలీలో సోనియా గాంధీ గెలిస్తే, అమేథీని కమలం తన ఖాతాలో వేసుకుంది. రాజధాని ఢిల్లీలో 5 చోట్ల ఈ రెండు పార్టీలు ఢీకొనగా అన్ని సీట్లూ బీజేపీకే వచ్చాయి. పశ్చిమ బెంగాల్లో మాత్రం ముఖాముఖిలో కాంగ్రెస్‌దే పైచేయి అయింది. ఇక్కడ రెండు సీట్లు గెలుచుకుంది. ముఖాముఖి పోరులో కాంగ్రెస్ విజయం సాధించింది. అలాగే, కేరళ, తమిళనాడుల్లో కూడా ముఖాముఖి పోరులో బీజేపీ నెగ్గుకు రాలేకపోయింది. -
80% మోదీ మ్యాజిక్
ఎన్నికల్లో రాజకీయ పార్టీ ల అధినేతల ర్యాలీలు, సభల నిర్వహణకు నియోజకవర్గాలను ఎంపిక చేయడం అంత ఆషామాషీ వ్యవహారమేమీ కాదు. ఒక ప్రాంతంలో సభని నిర్వహిస్తే, దానికి జన సమీకరణే కాదు, ఆ తర్వాత ఓట్లు రాబట్టుకోగలగాలి. ఎన్నికల ర్యాలీల ఎంపికలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యూహాలకు తిరుగేలేదు. ఉన్న కాస్త సమయంలోనే ఆయన పక్కాగా, ప్రణాళికా బద్ధంగా దేశవ్యాప్తంగా 142 నియోజకవర్గాల్లో పర్యటించి ప్రజలనుద్దేశించి మాట్లాడారు. వాటిలో ఏకంగా 114 స్థానాల్లో కాషాయ జెండా రెపరెపలాడింది. అంటే సక్సెస్ రేటు 80శాతంగా ఉంది. మోదీ తన ప్రచార సభల్లో మూడోవంతు ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్‌ల్లో నిర్వహించి అనూహ్య విజయాలు సొంతం చేసుకున్నారు. గతేడాది జరిగిన మూడు హిందీ రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ 27 నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహిస్తే బీజేపీ 13 స్థానాల్లో మాత్రమే నెగ్గింది. అంటే గెలుపు రేటు 48శాతంగా ఉంది. ఏడాది తిరిగే సరికల్లా లోక్‌సభ ఎన్నికల్లో మోదీ సక్సెస్ రేటు రెట్టింపైంది. హిందీ రాష్ట్రాలైన, మధ్యప్రదేశ్, రాజస్తాన్, బిహా ర్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌ల్లో మోదీ 60 ర్యాలీలు నిర్వహిస్తే మొత్తంగా క్లీన్‌స్వీప్ చేసింది. యూపీలో 30 లోక్‌సభ నియోజకవర్గాల్లో మోదీ ర్యాలీల్లో పాల్గొంటే 23 సీట్లలో బీజేపీ నెగ్గింది. ఇక కేరళ, తమిళనాడుల్లో మోదీ అయిదు ర్యాలీల్లో పాల్గొంటే ఎన్డీయే కూటమి కి ఒక్క సీటు మాత్రమే వచ్చింది. రాహుల్‌పై మళ్లీ అదే ముద్ర! కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై కొన్నాళ్ల కిందటి వరకు ఐరన్ లెగ్ ముద్ర ఉండేది. ఆయన ఎవరికి ప్రచారం చేస్తే వారు ఓడిపోతారన్న భావన అందరిలోనూ నెలకొంది. గతేడాది హిందీ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల విజయంతో రాహుల్ తనపై ఉన్న పప్పూ ముద్రను తొలగించుకున్నారని ఆయన అభిమానులు ఆనందించారు. కానీ ఇంతలోనే అది కాస్తా తారుమారైంది. రాహుల్ 115 నియోజకవర్గాల్లో పర్యటిస్తే యూపీఏ 96 సీట్లలో ఓడిపోయింది. ఆయన గెలుపు 17శాతం దగ్గరే నిలిచిపోయింది. తుస్సుమన్న బ్రహ్మాస్త్రం ఇక కాంగ్రెస్ పార్టీ తన అమ్ముల పొదిలోంచి ఎన్నికలకు మూడు నెలల ముందు తీసిన బ్రహ్మాస్త్రం తుస్సుమంది. సమయం తక్కువగా ఉన్నప్పటికీ 38 నియోజక వర్గాల్లో ప్రియాంక గాంధీ పర్యటించారు. 44 ర్యాలీల్లో పాల్గొన్నారు. 26 ర్యాలీలు యూపీలో నిర్వహిస్తే, మిగిలినవి మధ్యప్రదేశ్, ఢిల్లీ, జార్ఖండ్, హరియాణాల్లో పార్టీ అభ్యర్థులు నిర్వహించిన సభల్లో పాల్గొన్నారు. కానీ అన్న రాహుల్ పాటి సక్సెస్‌ను కూడా ఆమె సాధించలేకపోయారు. ప్రియాంక ప్రచారం చేసిన స్థానాల్లో రెండంటే రెండు అదీ అమ్మ, అన్న మాత్రమే గెలిచారు. రాయ్‌బరేలి, వయనాడ్‌ల్లో సోనియా, రాహుల్ మినహా మరెవరూ గెలవలేకపోయారు. వాస్తవానికి ప్రియాంక ప్రచారం పార్టీకి కొత్తగా ఒనగూర్చే ప్రయోజనం ఏమీ లేదని తలపండిన రాజకీయ విశ్లేషకులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. -
కలిసుంటే మరో 10 సీట్లు
సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ దారుణంగా దెబ్బతింటుందన్న ఊహాగానాలన్నీ తలకిందులయ్యాయి. మహా కూటమి(మహాగఠ్ బంధన్)ను ఎదుర్కోవడం కమలనాథులకు కష్టమన్న రాజకీయ పండితుల జోస్యాలు కూడా వమ్మయ్యాయి. రాష్ట్రంలోని 80 సీట్లలో బీజేపీ కూటమి 64 సీట్లు గెలిస్తే, బీఎస్పీ–ఎస్పీ–ఆర్ఎల్డీల మహా కూటమి 15 స్థానాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది. కాంగ్రెస్‌కు ఒక్క సీటే వచ్చింది. అయితే, మహా కూటమిలో కాంగ్రెస్ కూడా ఉండి ఉంటే కూటమి పరిస్థితి మరీ ఇంత దయనీయంగా ఉండేది కాదని, కనీసం మరో పది సీట్లయినా వచ్చేవని రాజకీయ విశ్లేషకులు లెక్కలేస్తున్నారు. ఈ ఎన్నికల్లో మహాకూటమి, కాంగ్రెస్‌కు కలిపి 45.20 శాతం ఓట్లు వస్తే, బీజేపీకి 49.56 శాతం ఓట్లు వచ్చాయి. కొన్ని నియోజకవర్గాల్లో విజేతకు వచ్చిన మెజారిటీ కంటే కాంగ్రెస్ లేదా కూటమి అభ్యర్థికి వచ్చిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. కూటమిలో కాంగ్రెస్ ఉంటే ఫలితం మరోలా.. మహా కూటమిలో కాంగ్రెస్ చేరి ఉంటే అలాంటి చోట్ల కచ్చితంగా కూటమి అభ్యర్థే గెలిచేవారని విశ్లేషకులు వివరిస్తున్నారు. ఈ పది చోట్ల కాంగ్రెస్ అభ్యర్థి గెలుచుకున్న బీజేపీ యేతర ఓట్లు పొత్తులో ఉంటే కూటమికి పడేవని వారంటున్నారు. ఉదాహరణకు బదౌన్‌లో బీజేపీ అభ్యర్థి సంఘమిత్ర మౌర్య 18,454 ఓట్ల ఆధిక్యతతో ఎస్పీ అభ్యర్థి ధర్మేంద్ర యాదవ్‌పై గెలిచారు. ఇక్కడ కాంగ్రెస్‌కు 51,947 ఓట్లు వచ్చాయి. ఒకవేళ కాంగ్రెస్ కూటమిలో ఉండి ఉంటే ఈ ఓట్లు ధర్మేంద్రకు పడేవి. దాంతో ఆయన గెలుపు సాధ్యమయ్యేది. అలాగే, బందాలో ఎస్పీ అభ్యర్థి శ్యామ్ చరణ్ 58,553 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థికి 75,438 ఓట్లు వచ్చాయి. ఇవి కలిస్తే శ్యామ్ సునాయాసంగా గెలిచేవారు. బారాబంకిలో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి రామ్ సాగర్ బీజేపీ చేతిలో 1,10,140 ఓట్ల తేడాతో ఓడిపోయారు ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి తనూజ్ పునియాకు 1,59,611 ఓట్లు వచ్చాయి. కూటమిలో కాంగ్రెస్ చేరితే ఈ ఓట్లన్నీ కూటమికి పడి ఆ అభ్యర్థి గెలిచేవారు. ఇక ధరౌహ్రాలో బీఎస్పీ అభ్యర్థి ఇలియాస్ సిద్ధిఖి 1,60,601 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అక్కడ కాంగ్రెస్‌కు 1,62,856 ఓట్లు వచ్చాయి. ఇక్కడ కాంగ్రెస్, కూటమిల్లో ఏవరో ఒకరే నిలబడి ఉంటే కచ్చితంగా వాళ్లే గెలిచేవారు. మచిలీషహర్‌లో బీఎస్పీ అభ్యర్థి రామ్ కేవలం 181 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక్కడ కాంగ్రెస్ మద్దతిచ్చిన జన్ అధికార్‌పార్టీ అభ్యర్థికి 7వేల ఓట్లు వచ్చాయి. ఆ ఓట్లు కూటమికి వస్తే బీఎస్పీ అభ్యర్థే కచ్చితంగా గెలిచేవారు. మీరట్‌లో కూడా బీజేపీ మెజారిటీ(2,379) కంటే కాంగ్రెస్‌కు ఎక్కువ ఓట్లు వచ్చాయి. బస్తి, సంత్ కబీర్ నగర్, సుల్తాన్పూర్ వంటి పది నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. మహాకూటమితో కాంగ్రెస్ కలిస్తే ఈ సీట్లతో పాటు మరి కొన్ని సీట్లు కచ్చితంగా కూటమి ఖాతాలో పడేవని పరిశీలకులు చెబుతున్నారు. కాగా, కాంగ్రెస్ కూటమిలో చేరకపోవడం వల్ల బీఎస్పీ లాభపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. షహరన్‌పూర్‌లో బీఎస్పీ అభ్యర్థి గెలిచారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఇమ్రాన్ మసూద్‌కు రెండు లక్షల ఓట్లు వచ్చాయి. ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ ఓట్లను చీల్చిందని, దాంతో బీఎస్పీ లాభపడిందనేది పరిశీలకుల మాట. -
రాష్ట్రపతికి నూతన ఎంపీల జాబితా సమర్పించిన ఈసీ
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన ంపీల జాబితాను ఎన్నికల కమిషన్ (ఈసీ) రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు అందజేసింది. 17వ లోక్‌సభ ఏర్పాటు ప్రక్రియలో భాగంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ సునిల్ ఆరోరా, ఇద్దరు కమిషనర్లు అశోక్ లావాసా, సుశీల్ చంద్రలు.. శనివారం కోవింద్‌ను రాష్ట్రపతి భవన్లో కలిశారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం కొత్త లోక్‌సభ ఏర్పాటుకు ఫలితాల్లో వెల్లడైన ఎంపీల పేర్లను రాష్ట్రపతికి అందజేశారు. ఇది లోక్‌సభ ఏర్పాటుకు సంబంధించి ప్రక్రియను ప్రారంభించడానికి రాష్ట్రపతికి ఉపయోగపడనుంది. ఈ సందర్భంగా ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా నిర్వహించినందుకు ఎన్నికల ప్రధానాధికారి, ఇతర కమిషనర్లను రాష్ట్రపతి కోవింద్ అభినందించారు. -
ఆస్తి రూ.1,107 కోట్లు.. దక్కింది1,558 ఓట్లు
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన వారిలో అత్యంత ధనవంతుడైన రమేశ్‌కుమార్ శర్మ డిపాజిట్ గల్లంతైంది. ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తిని రూ.1,107 కోట్లుగా పేర్కొన్న రమేశ్‌కుమార్, బిహార్‌లోని పాటలీపుత్ర లోక్‌సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేశారు. ఆయనకు కేవలం 1,558 ఓట్లు మాత్రమే రావడంతో డి´జిట్‌ను కోల్పోయారు. మొత్తం పోలైన ఓట్లలో ఆయనకు వచ్చినవి 0.14 శాతం ఓట్లు మాత్రమే. ఈ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రామ్‌క్రిపాల్ యాదవ్ గెలుపొందారు. రామ్క్రిపాల్కు 5 లక్షల ఓట్లు(47.28 శాతం) రాగా, లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మిసా భారతి 4.7 లక్షల ఓట్లతో (43.63 శాతం) రెండో స్థానంలో నిలిచారు. లోక్‌సభలో పోటీపడిన టాప్ 5 ధనవంతుల్లో రమేశ్‌కుమార్ మినహా మిగతా నలుగురు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే. వారిలో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి రూ.895 కోట్ల ఆస్తితో రెండో స్థానంలో, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ కుమారుడు నకుల్‌నాథ్ రూ.660 కోట్ల ఆస్తితో మూడో స్థానంలో, వసంతకుమార్ రూ.417 కోట్ల ఆస్తితో నాలుగో స్థానంలో, జ్యోతిరాదిత్య సింధియా రూ.374 కోట్ల ఆస్తితో ఐదో స్థానంలో ఉన్నారు. చేవెళ్ల నియోజకవర్గంలో బరిలో నిలిచిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి రంజిత్‌రెడ్డి చేతిలో 14,317 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. మధ్యప్రదేశ్ లోని చిన్‌ద్వారా నియోజకవర్గంలో పోటీచేసి న నకుల్ నాథ్ 35 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. తమిళనాడులోని కన్యాకుమా రి నియోజకవర్గంలో వసంతకుమార్ 3 లక్షల ఓట్ల మెజారిటీలో విజయం సాధించారు. మధ్యప్రదేశ్‌లోని గుణ నియోజకవర్గంలో పోటీచేసిన జ్యోతిరాదిత్య సింధియా బీజేపీ అభ్యర్థి క్రిష్ణపాల్ సింగ్ చేతిలో లక్ష ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. -
లోక్‌సభలో తొలి అడుగులు
ప్రపంచంలోనే భారీ ఎన్నికలుగా నమోదైన 2019 లోక్‌సభ ఎన్నికల్లో అనేక రికార్డులు నమోదయ్యాయి. రాజకీయ ఉద్దండులైన ఎంతోమంది సీనియర్లను ఈ ఎన్నికల్లో మట్టికరిపించి ఓ సరికొత్త తరం పార్లమెంట్లో అడుగు పెట్టింది. ఈసారి ఏకంగా 300 మంది కొత్తవారు చట్టసభకు ఎన్నికవ్వడం ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఓ ప్రత్యేకత. అందులో తొలిసారి లోక్‌సభకు ఎన్నికైన వారిలో బీజేపీ రాజకీయ వ్యూహకర్తగా పేరొందిన అమిత్ షా మొదలుకుని క్రికెటర్ గౌతమ్ గంభీర్, తేజస్వీ సూర్య, జర్నలిస్టు ఇంతియాజ్, దళిత ప్రతినిధి రమ్యా హరిదాస్తోపాటుగా గాయకులు, సినీరంగ ప్రముఖులు వంటి వారెందరో ఉన్నారు. అమిత్ షా (బీజేపీ– గుజరాత్) బీజేపీ అధ్యక్షుడు, నేషనల్ డెమొక్రటిక్ అలయెన్స్ (ఎన్డీయే) చైర్పర్సన్, అమిత్‌షా లోక్‌సభలోకి తొలిసారిగా అడుగుపెడుతున్నారు. చిన్నప్పటి నుంచీ ఆరెస్సెస్‌లో చురుకైన కార్యకర్తగా ఉన్న అమిత్‌షా గుజరాతీ వ్యాపారవేత్త కుమారుడు. 1986లో బీజేపీలో చేరి 33 ఏళ్ళ వయస్సులో 1997లో తొలిసారిగా గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. రెండు దశాబ్దాల పాటు ఎమ్మెల్యేగా, హోంమంత్రిగా పనిచేసిన అనుభవం ఆయన్ను గత ఐదేళ్ళుగా భారత రాజకీయాల్లో ప్రముఖ పాత్రపోషించేలా చేసింది. 1990 నుంచి ప్రధాని మోదీ తలలో నాలుకలా ఉంటూ, గుజరాత్‌లోనూ, దేశవ్యాప్తంగానూ బీజేపీని బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషించారు. జోతిమణి (కాంగ్రెస్– తమిళనాడు) తమిళనాడులో కాంగ్రెస్ తరఫున ఎన్నికైన ఏకైక మహిళా అభ్యర్థి జోతిమణి. కరూర్ లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికై తొలిసారి లోక్‌సభలో అడుగుపెడుతున్నారు. 22 ఏళ్ళకే రాజకీయాల్లోకి వచ్చిన జోతిమణి, మాజీ డిప్యూటీ స్పీకర్, నాలుగుసార్లు ఎంపీ అయిన ఎం.తంబిదురైని 4 లక్షలకుపైగా ఓట్ల తేడాతో ఓడించారు. ఇంతియాజ్ జలీల్ (ఎంఐఎం–ఔరంగాబాద్) ఎంఐఎం నుంచి లోక్‌సభలోకి ప్రవేశిస్తున్న పాత్రికేయుడు ఇంతియాజ్‌కి లోక్‌సభ సభ్యుడిగా ఇది తొలి అనుభవం. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌నుంచి తొలుత ఈయన అభ్యర్థిత్వం తిరస్కరణకు గురైనా ప్రకాష్ అంబేడ్కర్ వంచిత్ బహుజన్ అఘాదీ పొత్తులో అదృష్టవశాత్తూ ఇంతియాజ్‌కి ఈ సీటు దక్కింది. శివసేన సీనియర్ నాయకుడు చంద్రకాంత్ ఖయిరేని అతితక్కువ ఓట్ల మెజారిటీతో ఓడించారు. పదిహేనేళ్ళ అనంతరం మహారాష్ట్ర నుంచి ఓ ముస్లిం లోక్‌సభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మిమీ చక్రవర్తి (తృణమూల్– పశ్చిమబెంగాల్) చిత్రపరిశ్రమనుంచి వచ్చి ఈ ఎన్నికల్లో రాణించిన వారిలో పశ్చిమబెంగాల్‌కి చెందిన మిమీ చక్రవర్తి, పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ నుంచి పోటీ చేసిన సన్నీడియోల్ ప్రముఖులు. ప్రముఖ సినీతార మిమీ చక్రవర్తి పశ్చిమబెంగాల్లోని జాదవ్‌పూర్ నుంచి లోక్‌సభకు తొలిసారిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి అనుపమ్ హజ్రాని దాదాపు మూడు లక్షల ఓట్ల మెజారిటీతో ఓడించి ఘన విజయం సాధించారు మిమీ చక్రవర్తి. బీజేపీ అభ్యర్థిగా గురుదాస్పూర్నుంచి పోటీ చేసిన సన్నీడియోల్ కాంగ్రెస్ అభ్యర్థి సునీల్ జాఖడ్‌పై 82,459 ఓట్ల మెజారిటీతో గెలుపొంది తొలిసారిగా లోక్‌సభలోకి అడుగిడుతున్నారు. గౌతమ్ గంభీర్ (బీజేపీ–తూర్పు ఢిల్లీ) రాజకీయవేత్తగా మారిన సుపరిచిత క్రికెట్ క్రీడాకారుడు గౌతమ్ గంభీర్ కూడా తొలిసారి లోక్‌సభలో అడుగుపెడుతున్నారు. తూర్పు ఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన గౌతమ్ గంభీర్ ఆప్ అభ్యర్థి అతిషీ మర్లేనాపై గెలుపొందారు. హన్స్‌రాజ్ హన్స్ (బీజేపీ– నార్త్‌వెస్ట్ ఢిల్లీ ) నార్త్‌వెస్ట్ ఢిల్లీనుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందిన ప్రముఖ పంజాబీ సూఫీ గాయకుడు హన్స్‌రాజ్ హన్స్ కూడా మొదటిసారిగా లోక్‌సభలో అడుగుపెడుతున్నారు. మాజీ ఎంపీ ఉదిత్‌రాజ్ స్థానంలో చివరి క్షణంలో హన్స్‌రాజ్ హన్స్‌ని బీజేపీ అభ్యర్థిగా ఎంపిక చేసింది. తొలినుంచి రాజకీయాల్లో ఆసక్తి కలిగిన హన్స్‌రాజ్‌హన్స్ పంజాబ్‌లోని జలంధర్ నుంచి శిరోమణి అకాలీదళ్ పార్టీతరఫున 2009 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. 2014లో ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. 2016లో బీజేపీలో చేరారు. ప్రజ్ఞాఠాకూర్ (బీజేపీ–భోపాల్) మాలెగావ్ బాంబు పేలుళ్ళ కేసులో నిందితురాలు, సొంతపార్టీ బీజేపీలోనూ, బయటా విమర్శలనెదుర్కొంటున్న ప్రజ్ఞాఠాకూర్ సైతం తొలిసారిగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. భోపాల్ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసిన ప్రజ్ఞాఠాకూర్ కాంగ్రెస్ దిగ్గజం దిగ్విజయ్‌సింగ్‌ను మట్టికరిపించారు. రవిశంకర్ ప్రసాద్ (బీజేపీ–బిహార్) బిహార్‌లోని పాట్నా సాహిబ్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన రవిశంకర్ ప్రసాద్ సమీప ప్రత్యర్థి, బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హాను 2.84 లక్షల ఓట్ల మెజార్టీతో ఓడించి తొలిసారి లోక్‌సభలో అడుగుపెట్టబోతున్నారు. స్మృతీ ఇరానీ (బీజేపీ–అమేథీ) గాంధీ కుటుంబాన్ని చిరకాలంగా ఆదరిస్తోన్న యూపీలోని అమేథీ నియోజకర్గం నుంచి బీజేపీ తరఫున పోటీచేసిన మాజీ మంత్రి స్మృతీ ఇరానీ ఏకంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై 55,120 ఓట్ల మెజార్టీతో గెలుపొంది తొలిసారి లోక్‌సభలో అడుగుపెడుతున్నారు. రమ్యా హరిదాస్ (కాంగ్రెస్– కేరళ) కేరళలోని అలత్తూర్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున రమ్యాహరిదాస్ పోటీచేసి గెలుపొందారు. ఈ స్థానానికి ఓ దళిత మహిళ రమ్యాహరిదాస్ పేరు వినిపించగానే అంతా ముక్కున వేలేసుకున్నారు. హేమాహేమీలను వదిలేసి రాజకీయ అక్షరాభ్యాసం చేస్తోన్న పంచాయతీ స్థాయి నాయకురాలు రమ్యని ఎంచుకోవడం కాంగ్రెస్ సీనియర్లకు ససేమిరా మింగుడుపడలేదు. ఎన్ని విమర్శలెదురైనా, ఎంతమంది అగౌరవ పరిచినా మొక్కవోని దీక్షతో పోరాడి ఈ ఎన్నికల్లో గెలుపొందారు. రెండుసార్లు ఎంపీగా ఉన్న సీపీఎం నాయకుడు పీకే బిజూని ఓడించి తొలిసారి లోక్‌సభలోకి అడుపెడుతున్నారు రమ్యాహరిదాస్. మహువా మోయిత్రా (తృణమూల్ – పశ్చిమ బెంగాల్) పశ్చిమబెంగాల్లో బీజేపీ «సునామీకి తట్టుకొని నిలబడిన తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి మహువా మోయిత్రా తొలిసారిగా లోక్‌సభలోకి ప్రవేశించబోతున్నారు. కోల్‌కతాలో పుట్టిపెరిగి, అమెరికాలో చదువుకున్న మోయిత్రా 2008లో కాంగ్రెస్‌లో చేరి, ఆ తర్వాత తృణమూల్‌కి మారారు. 2016లో నదియా జిల్లాలోని కరీంపూర్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈసారి అదే జిల్లాలోని కృష్ణానగర్ లోక్‌సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి ఫుట్‌బాల్ క్రీడాకారుడు కల్యాణ్ చౌబేపై 65,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తేజస్వీ సూర్య (బీజేపీ– కర్ణాటక) దక్షిణ బెంగళూరు నుంచి బీజేపీ అభ్యర్థిగా ఎన్నికైన తేజస్వీ సూర్య అత్యంత పిన్నవయస్కుడైన ఎంపీగా తొలిసారి లోక్‌సభలోకి అడుగుపెట్టబోతున్నారు. న్యాయవాద వృత్తిలో ఉన్న తేజస్వీ సూర్య ఏబీవీపీ నాయకుడిగా, ఆరెస్సెస్‌లో క్రియాశీలక కార్యకర్తగా ఉంటూ బీజేపీ యువమోర్చా నాయకుడిగా ఎదిగారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ‘‘మీరు మోదీతో ఉంటే దేశం పక్షాన ఉన్నట్టు, లేదంటే దేశానికి వ్యతిరేకంగా ఉన్నట్టు’’అంటూ తేజస్వీ చేసిన వీడియో వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. -
దేశంలో అత్యధిక పోలింగ్ ఏపీలోనే
సాక్షి, అమరావతి: ఇంతవరకు ఏ ఎన్నికల్లోనూ నమోదుకాని విధంగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ నమోదు కావడం గర్వంగా ఉందంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది శనివారం ట్వీట్ చేశారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో 80.31 శాతం పోలింగ్ నమోదయ్యిందన్నారు. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా కేవలం 67.47 శాతం పోలింగ్ నమోదు కావడం గమనార్హం. ఏప్రిల్ 11న జరిగిన ఎన్నికల్లో 79.64 శాతం ఓట్లు నమోదు కాగా పోస్టల్ బ్యాలెట్లు, సర్వీసు ఓట్లు పరిగణనలోకి తీసుకున్న తర్వాత మొత్తం పోలింగ్ 80.31 శాతానికి చేరింది. 2014లో నమోదైన 78.41 శాతంతో పోలిస్తే ఈ ఏడాది 1.9 శాతం అదనంగా ఓటింగ్ నమోదయింది. అదే విధంగా దేశ సగటుతో పోలిస్తే రాష్ట్రంలో ఏకంగా 12.84 శాతం అదనంగా ఓట్లు పోలయ్యాయి. పెద్ద రాష్ట్రాల్లో ఈ స్థాయి ఓటింగ్ మన రాష్ట్రంలో మాత్రమే నమోదైనట్లు ఎన్నికల సంఘం గణాంకాలు చెబుతున్నాయి. చిన్న రాష్ట్రాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే 81.79 శాతం ఓటింగ్‌తో అస్సాం మొదటిస్థానంలో నిలిచింది. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా మహిళలు, దివ్యాంగులు, పోస్టల్ బ్యాలెట్, సర్వీసు ఓట్లుపెద్దఎత్తున నమోదైనట్లు ద్వివేది తన ట్వీట్లో పేర్కొన్నారు. అదేవిధంగా ఈవీఎంలో నమోదైన ఓట్లకు వీవీప్యాట్ స్లిప్పులకు ఎక్కడా తేడా వచ్చినట్టు ఫిర్యాదు నమోదు కాలేదని ద్వివేది స్పష్టం చేశారు. -
ఎందుకిలా..?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర సమితికి సెంటిమెంట్ కరీంనగర్. పార్టీ ఆవిర్భావం తరువాత కేసీఆర్ 2001లో తొలి సింహగర్జన సభ నిర్వహించింది ఇక్కడే. మొన్నటి లోక్‌సభ ఎన్నికలకు ముందు కార్యనిర్వాహక అధ్యక్షుడి హోదాలో కేటీఆర్ సన్నాహక సభ నిర్వహించి జోష్ పెంచింది ఇక్కడి నుంచే. చివరికి ఎన్నికల షెడ్యూల్ విడుతలైన తరువాత తొలి బహిరంగసభను కూడా కరీంనగర్ నుంచే మొదలు పెట్టి ఈ జిల్లాపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. అయితే లోక్‌సభ ఎన్నికల ఫలితాల తరువాత ఈ కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్కు షాకిచ్చింది. కరీంనగర్ లోక్‌సభ స్థానంలోని ఏడు నియోజకవర్గాల్లో నాలుగింట బీజేపీకి ఘననీయమైన ఓట్లు పోల్ కావడాన్ని ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. అలాగే నిజామాబాద్‌లో సిట్టింగ్ ఎంపీ కవిత ఓటమిలో పూర్వ కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల సెగ్మెంట్ల భాగస్వామ్యం కూడా ఎక్కువే. పెద్దపల్లి లోక్‌సభ పరిధిలో సైతం మంథని, రామగుండంలలో టీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ మెరుగైన ఓట్లు సాధించింది. మొత్తంగా చూస్తే పూర్వ కరీంనగర్ జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో హుజూరాబాద్, హుస్నాబాద్, సిరిసిల్ల, ధర్మపురి, పెద్దపల్లిలో మాత్రమే టీఆర్ఎస్కు ఊరట లభించింది. మిగతా 8 నియోజకవర్గాల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు టీఆర్ఎస్ కన్నా ఎక్కువ ఓట్లు రావడం పార్టీ నేతలకు మింగుడు పడడం లేదు. కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఏకంగా 52వేల మెజారిటీ గత అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన బండి సంజయ్ టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌పై 14వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈసారి ఇదే నియోజకవర్గంలో బీజేపీకి ఏకంగా 52,181 ఓట్ల మెజారిటీ లభించడం గమనార్హం. మైనారిటీ వర్గాలు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో మెజారిటీ వర్గంలో 70 శాతం ఓట్లు బీజేపీకే పోలయినట్లు అంచనా వేస్తున్నారు. మిగతా స్థానాల్లోనూ... ఇక చొప్పదండి, మానకొండూరులలో టీఆర్ఎస్ అభ్యర్థులు రవిశంకర్, రసమయి బాలకిషన్‌లు అనూహ్యంగా భారీ మెజారిటీతో విజయం సాధించారు. రవిశంకర్‌కు అసెంబ్లీ ఎన్నికల్లో 91వేల ఓట్లు పోల్ కాగా, ఈసారి ఇక్కడ టీఆర్ఎస్కు వచ్చిన ఓట్లు కేవలం 41,396 అంటే దాదాపు 50వేల ఓట్లు మైనస్. బండి సంజయ్‌కు ఈ నియోజకవర్గం నుంచి ఎవరూ ఊహించని విధంగా 97,441 ఓట్లు సాధించారు. మానకొండూరులో గత ఎన్నికల్లో రసమయికి 89వేల ఓట్లు రాగా, ఈసారి 41వేల ఓట్లకు టీఆర్ఎస్ పరిమితమైంది. ఆ ఎన్నికల్లో 4356 ఓట్లు మాత్రమే వచ్చిన బీజేపీకి 73వేల ఓట్లు పోలవడం గమనార్హం. వేములవాడలోనూ గత ఎన్నికల్లో టీఆర్ఎస్కు 28వేల మెజారిటీ కట్టబెట్టిన ఓటర్లు ఈసారి బీజేపీ 25వేల ఓట్ల ఆధిక్యతనిచ్చారు. కరీంనగర్ పార్లమెంటులో కరీంనగర్ మినహా మిగతా ఆరు అసెంబ్లీల్లో గత ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్ రాకపోగా, ఈసారి భారీగా ఓట్లు పోలవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. నిజామాబాద్, పెద్దపల్లి లోక్‌సభ పరిధిల్లో సైతం... నిజామాబాద్‌లో సిట్టింగ్ ఎంపీ కవిత ఓటమికి ఆ జిల్లాలోని నియోజకవర్గాలతోపాటు కరీంనగర్‌లోని జగిత్యాల, కోరుట్ల సెగ్మెంట్లు కూడా ప్రధాన కారణమయ్యాయి. ఈ రెండు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ కన్నా బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌కు భారీగా మెజారిటీ లభించింది. జగిత్యాలలో 7,300, కోరుట్ల నుంచి 20వేల మెజారిటీ బీజేపీకి లభించడం గమనార్హం. నిజామాబాద్‌లో కవిత ఓటమిలో ఈ రెండు నియోజకవర్గాలు కూడా కీలక పాత్ర పోషించాయి. ఇక పెద్దపల్లిలో టీఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలిచినప్పటికీ, మంథని, రామగుండంలలో టీఆర్‌ఎస్‌కన్నా కాంగ్రెస్‌కే ఓట్లు అధికంగా పోలయ్యాయి. మంథనిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు ప్రాతినిధ్యం వహిస్తుండగా, రామగుండంలో టీఆర్ఎస్ నేతల వర్గపోరుతో కాంగ్రెస్‌కు 2వేల స్వల్ప ఆధిక్యత లభించింది. కొంప ముంచిన అతివిశ్వాసం అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేసిన టీఆర్ఎస్ మూడు నెలల తరువాత జరిగే లోక్‌సభ ఎన్నికల్లో కూడా ప్రతిపక్షాలను తుడిచేస్తుందని ఆ పార్టీ నేతలు నమ్మారు. కరీంనగర్లో ఏడుగురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ, వారి మధ్య సరైన సయోధ్య కరువైంది. సిట్టింగ్ ఎంపీ వినోద్‌కుమార్‌తోపాటు మంత్రి ఈటల రాజేందర్ గెలుపుపై పూర్తి ధీమాతో వ్యవహరించారు. కరీంనగర్‌తోపాటు ఒకటి రెండు పట్టణాల్లో బీజేపీకి ఓటింగ్ పెరిగినా, గ్రామీణ ఓటర్లు టీఆర్ఎస్ వైపే ఉంటారని కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ప్రతిష్టాత్మకమైన కరీంనగర్ కోల్పోవడానికి కారణమైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అలాగే బహిరంగసభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ అభ్యర్థి ప్రధాన ప్రచారాస్త్రంగా మార్చుకోగా, దాన్ని కౌంటర్ చేయడంలో టీఆర్ఎస్ నేతలు విఫలమయ్యారు. రైతుబంధు, పెన్షన్లు, ఇతర సంక్షేమ పథకాలే తిరిగి ఓట్లు తెచ్చిపెడతాయని భావించిన ఎమ్మెల్యేలకు గట్టి దెబ్బ తగిలినట్లయింది. కాగా హుజూరాబాద్‌లో కాంగ్రెస్ కన్నా 30వేల మెజారిటీ సాధించిన మంత్రి ఈటల రాజేందర్ బీజేపీని మూడోస్థానానికి పరిమితం చేయడం గమనార్హం. టీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి పోలుకాకుండా ఆయన పకడ్బందీగా వ్యవహరించారు. హుస్నాబాద్‌లో సైతం 23వేల మెజారిటీ టీఆర్ఎస్ సాధించింది. త్వరలో మేథోమథనం లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై టీఆర్ఎస్ అధిష్టానం త్వరలో పోస్టుమార్టం చేయనుంది. హైదరాబాద్‌లో పార్లమెంటరీ సమావేశం తరువాత వచ్చిన ఫీడ్‌బ్యాక్‌కు అనుగుణంగా ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో అనుసరించాల్సిన వ్యూహాలను ఖరారు చేస్తారు. కరీంనగర్లో ఓటమికి హిందుత్వ నినాదం, మోదీ ఎఫెక్ట్ బాగా పనిచేసిందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన ఆ పార్టీ నాయకత్వం క్షేత్రస్థాయిలో మేథోమథనం జరపనున్నట్లు సమాచారం. గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ బీజేపీకి పెరగడానికి గల కారణాలపై విశ్లేషణ చేయనున్నారు. -
ఓడిన చోటే గెలిచారు!
సాక్షి, ఆదిలాబాద్: ‘ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోవాలి’ అనేది పెద్దల మాట. ఈ విషయంలో తాజాగా ఆదిలాబాద్, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులుగా గెలిచిన సోయం బాపురావు, బొర్లకుంట వెంకటేశ్ నేతకు ఈ నానుడి సరితూగుతుంది. గత డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో సోయం బోథ్ నియోజకవర్గం, బొర్లకుంట చెన్నూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. రాజకీయాల్లో ఒక్క అవకాశం చేజారితే మరో అవకాశం కోసం వెంపర్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ఈ ఇరువురికి డిసెంబర్ పోయిన వెంటనే ఏప్రిల్ కలిసి వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల బరిలో దిగిన ఇరువురు గెలుపొందారు. పార్టీ మారి.. శాసనసభ ఎన్నికల్లో సోయం బాపురావు బోథ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. అంతకు ముందు ఆయన టీడీపీలో కొనసాగుతుండగా, రేవంత్‌రెడ్డితో కలిసి కాంగ్రెస్‌లో చేరారు. ఇక బొర్లకుంట వెంకటేశ్ నేత కాంగ్రెస్‌లో చేరి చెన్నూర్ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఈ ఇరువురు అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచే పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికలు వీరిద్దరికి కలిసిరాక ఓడిపోయారు. ఈ పరిస్థితిలో కొద్ది నెలలు గడిచిపోయాయి. లోక్‌సభ ఎన్నికలు వచ్చాయి. ఆదిలాబాద్ పార్లమెంట్ టికెట్‌ను సోయం ఆశించారు. అయి తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాథోడ్ రమేశ్‌ను ప్రకటించింది. దీంతో నామినేషన్ల ఘట్టం మొదలైన తర్వాత సోయం బాపురావు కాంగ్రెస్ పార్టీని వీడి హైదరాబాద్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ సమక్షంలో కమలం గూటికి చేరారు. ఆ పార్టీ నుంచి ఆదిలాబాద్ పార్లమెంట్ టికెట్ సాధించారు. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పెద్దపల్లి అభ్యర్థిగా ఎ.చంద్రశేఖర్‌ను ముందుగా ప్రకటించింది. ఇక టీఆర్ఎస్ నుంచి జి.వివేకానంద పేరు వినిపించినా అనూహ్యంగా నామినేషన్ల చివరి రోజు బొర్లకుంట వెంకటేశ్ నేత కాంగ్రెస్ నుంచి అధికార టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు. వెంటనే పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ కూడా ఇచ్చారు. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని బోథ్ నియోజకవర్గం, పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని చెన్నూర్ నియోజకవర్గాలు ఉండగా, ఈ ఇరువురు నేతలకు డిసెంబర్లో మూసుకుపోయిన విజయం ఏప్రిల్‌లో మళ్లీ అదృష్టం తట్టింది. పార్టీ మారి లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచి విజయం దక్కించుకున్నారు. సారుప్యత.. ఈ ఇద్దరు ఎంపీలకు సారుప్యత ఉంది. ఇరువురు డిసెంబర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు. కాగా సోయం బాపురావు 2004లో బోథ్ నుంచి టీఆర్ఎస్ టికెట్‌కు సంబంధించి అప్పట్లో కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఐటీడీఏలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఆయన పదవి విరమణ తీసుకొని ఆ ఎన్నికల్లో బరిలో నిలిచారు. బోథ్ ఎమ్మెల్యేగా అప్పట్లో గెలుపొందారు. అయితే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2008లో ఆయన తొమ్మిది మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి కాంగ్రెస్‌లో చేరారు. అయితే 2009 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ నుంచి బోథ్ టికెట్ ఆశించినా దక్కకపోవడంతో నిరాశ చెందారు. 2014లో మరోసారి బోథ్ నుంచే కాంగ్రెస్ టికెట్ ఆశించినా రాకపోవడంతో టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక బొర్లకుంట వెంకటేశ్ నేత రవాణా శాఖలో పనిచేస్తూ పదవి విరమణ తీసుకొని డిసెంబర్లో చెన్నూర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే ఓటమి పాలయ్యారు. 2019 ఏప్రిల్‌లో సోయం బీజేపీ నుంచి, బొర్లకుంట టీఆర్ఎస్ నుంచి ఎంపీ అభ్యర్థులుగా బరిలో నిలిచి గెలుపొందారు. గతం కంటే ఎక్కువే.. ఈ ఇరువురు లోక్‌సభ బరిలో నిలవగా, డిసెంబర్లో ఆయా నియోజకవర్గాల్లో అప్పుడు వచ్చిన ఓట్ల కంటే ఇప్పుడు అధికంగా రావడం గమనార్హం. సోయం బాపురావుకు బోథ్ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో 54,639 ఓట్లు రాగా, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో 61,003 ఓట్లు వచ్చాయి. విచిత్రమేమిటంటే సోయం బాపురావు అసెంబ్లీ ఎన్నికల్లో 6వేల ఓట్ల తేడాతోనే ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం వచ్చిన ఓట్లను పరిగణలోకి తీసుకున్నా ఆయనకు అప్పట్లోనే విజయం దక్కే పరిస్థితి ఉండేది. ఇక వెంకటేశ్ నేతకు చెన్నూర్ అసెంబ్లీ ఎన్నికల్లో 43,848 ఓట్లు వచ్చాయి. పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో ఆయనకు చెన్నూర్ నియోజకవర్గంలో 67,219 ఓట్లు రావడం గమనార్హం. -
ఆంధ్రప్రదేశ్‌కు ఇక శుభదినాలే
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శుభదినాలు మొదలయ్యాయని ప్రముఖ సినీ రచయిత, నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళి అన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా గెలుపొందాలని, గెలిస్తే బట్టలు పెడతానని దేవుళ్లకు మొక్కుకున్నానని చెప్పారు. ఆయన శుక్రవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. జీవితంలో అన్ని కోరికలు తీరిపోయాయని చెప్పారు. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నది తన చివరి కోరిక అని, అది కూడా నెరవేరిందని పేర్కొన్నారు. తానెంత సంతోషంగా ఉన్నానో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అంతే సంతోషంగా ఉన్నారని చెప్పారు. జగన్ గొప్ప ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోవాలని, మంచిపేరు తెచ్చుకోవాలని పోసాని ఆకాంక్షించారు. కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండి ఏపీ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక అన్ని మీడియాలు తనకు సహకరించాయన్నారు. జగన్మోహన్రెడ్డి, చంద్రబాబు గురించి తాను ఎంత గట్టిగా మాట్లాడానో అంతే స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాయని ప్రశంసించారు. పోసాని ఇంకా ఏం మాట్లాడారంటే... ‘‘ఎన్నికల్లో ప్రజల తీర్పును చూసి చంద్రబాబులో మార్పు వచ్చినట్లుంది. అందుకే జగన్మోహన్రెడ్డికి, ప్రధాని మోదీకి అభినందనలు తెలిపారు. నిన్నటి వరకు జగన్‌ను వాడు వీడు, రౌడీ, గూండా, ఫ్యాక్షనిస్టు అని సంబోధించిన చంద్రబాబు నేడు మనసు మారిపోయి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేశారు. చంద్రబాబు గతంలో జగన్‌పై తప్పుడు కేసులు పెట్టించారు. వ్యవస్థలను మేనేజ్ చేసి, మీడియాను అడ్డం పెట్టుకొని జైలుకు పంపించారు. జగన్ అవినీతిపరుడు కాదని ప్రజలు గ్రహించారు. ఆయనను కుట్రపూరితంగా, అన్యాయంగా జైలుకు పంపించారని గుర్తించారు. జగన్‌పై అడ్డదారిలో పెట్టించిన కేసులను వెనక్కి తీసుకోవాలని చంద్రబాబును కోరుతున్నా. లోకేశ్‌కు ఓటేయడం న్యాయమా? ఎన్నికల తేదీ కూడా తెలియని వ్యక్తి నారా లోకేశ్‌ను ప్రజలు ఎలా గెలిపిస్తారు? ముఖ్యమంత్రుల కుమారులు ఎన్నికల్లో గెలవాలని ఎక్కడా లేదు. ముఖ్యమంత్రులు కూడా మట్టి కరిచారు. మంగళగిరిలో ఆళ్ల రామకృష్ణారెడ్డి తండ్రి గతంలో సర్పంచిగా పనిచేసి ప్రజలకు మంచి సేవలు అందించారు. ఆయన తల్లి కూడా సర్పంచిగా పనిచేసి నిరంతరం ప్రజల కష్టాలు తీర్చేవారు. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన రామకృష్ణారెడ్డికి ప్రజలు ఓట్లు వేయడం న్యాయమా లేక ఎన్నికల తేదీ తెలియని నారా లోకేశ్‌కు వేయడం న్యాయమా? పవన్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్పారు పవన్ కల్యాణ్ కొత్త పార్టీ స్థాపిస్తూనే చంద్రబాబు నాయుడు సీనియర్ అని ఆయనకే మద్దతు తెలిపితే పార్టీ ఇమేజ్‌ని ఏవిధంగా పెంచుతాడు? అధికారంలో ఉన్న నాయకులను పక్కనపెట్టి జగన్మోహన్రెడ్డిని తిట్టడం పవన్‌కు మాత్రమే సాధ్యపడింది. అందుకే పవన్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. పవన్‌ను ఒక సోదరుడిగా భావించి చెపుతున్నా.. కొడతాను, తంతాను అన్న పదాలను ఇకనైనా నీ డిక్షనరీలోంచి తీసెయ్. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మూడో ఫ్రంట్ అంటూ పొరపాటు చేశారు’’ అని పోసాని కృష్ణమురళి అభిప్రాయపడ్డారు. -
నేలకొరిగిన హేమాహేమీలు..
‘ఈసారి ప్రధానిగా మోదీ కాకుంటే మరెవరు?’.. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా సామాన్య ప్రజల్లో వినిపించిన ఈ ప్రశ్నకు ప్రతిపక్షాల నుంచి సరైన సమాధానమే లభించలేదు. మహాకూటమిగా పోటీచేసి మోదీ నేతృత్వంలోని బీజేపీని నిలువరించాలనీ, ఆ తర్వాత ప్రధాని అభ్యర్థిని ఎంపిక చేసుకోవాలన్న కాంగ్రెస్ వ్యూహం ఫలించలేదు. చాలాచోట్ల బీజేపీ నేతలకు గట్టి పోటీ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీకి సరైన అభ్యర్థులే దొరకలేదు. దీనికితోడు ఢిల్లీ, యూపీ వంటి రాష్ట్రాల్లో సయోధ్య విషయంలో విపక్షాలు వెనక్కి తగ్గకపోవడం, పలుచోట్ల త్రిముఖ పోరు ఏర్పడ టంతో ఎన్డీయే కనీవిని ఎరుగని రీతిలో ఏకంగా 352 స్థానాల్లో విజయదుందుభి మోగించింది. పనిచేయని ‘చౌకీదార్’ నినాదం.. సార్వత్రిక ఎన్నికలకు ముందు నుంచే రఫేల్ ఒప్పందంలో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ బహిరంగ సభలు, ర్యాలీల్లో ఆరోపించడం ప్రారంభించారు. ఈ సందర్భంగా చౌకీదార్ చోర్ హై(కాపలాదారు దొంగగా మారాడు) అని మోదీ లక్ష్యంగా విమర్శలు గుప్పించేవారు. ఎన్నికల ప్రచారంలో ఈ నినాదాన్ని పదేపదే ప్రస్తావించినప్పటికీ ప్రజలు పెద్దగా పట్టించుకోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. దీనివల్లే బీసీలు, ఎస్సీ, ఎస్టీల జనాభా గణనీయంగా ఉన్న చాలాప్రాంతాల్లో బీజేపీ ఘనవిజయం సాధించిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సెల్ఫ్ గోల్స్.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఓటమికి పలు కారణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా యూపీలోని అమేథీ, కేరళలోని వయనాడ్ నుంచి ఈసారి రాహుల్ పోటీచేశారు. ఒకవేళ రెండుచోట్ల రాహుల్ విజయం సాధిస్తే ఆయన వయనాడ్‌ను ఎంచుకుంటారని అమేథీలో బీజేపీ శ్రేణులు విస్తృతంగా ప్రచారం చేశాయి. దీన్ని తిప్పికొట్టడంలో కాంగ్రెస్ విఫలమైంది. అదే సమయంలో మోదీపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక బరిలోకి దిగుతారని కవ్వించి, చివరికి అజయ్‌రాయ్‌ను అభ్యర్థిగా నిలపడం కూడా పార్టీకి కలిసిరాలేదు. దీనికితోడు ఢిల్లీలో ఆప్, యూపీలో ఎస్పీ–బీఎస్పీ, పశ్చిమబెంగాల్లో టీఎంసీ పార్టీలతో సీట్ల సర్దుబాటు విషయంలో కాంగ్రెస్ వ్యవహారశైలి ఆ పార్టీ పాలిట శరాఘాతంగా మారింది. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోగా, బెంగాల్లో 2 సీట్లకు పరిమితమైంది. యూపీలోని రాయ్‌బరేలీ నుంచి విజయం సాధించిన సోనియాగాంధీ పార్టీ పరువును నిలిపారు. నేలకొరిగిన హేమాహేమీలు.. సార్వత్రిక ఎన్నికల వేళ ప్రధాని మోదీ సునామీకి పలువురు కాంగ్రెస్ పార్టీ దిగ్గజ నేతలకు ఓటమి ఎదురైంది. మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియా, మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్, మహారాష్ట్రలో అశోక్ చవాన్, మిలింద్దేవ్రా, సుశీల్‌కుమార్ షిండే, కర్ణాటకలో మల్లికార్జున ఖర్గే, వీరప్పమొయిలీ, ఢిల్లీలో షీలా దీక్షిత్ వంటి హేమాహేమీలు పరాజయం పాలయ్యారు. మోదీని సాగనంపుతామని బీరాలు పలికిన మమతా బెనర్జీకి పశ్చిమబెంగాల్లో షాక్ తగిలింది. 2014లో 36 సీట్లను దక్కించుకున్న మమత.. ఈసారి 22 లోక్‌సభ స్థానాలకు పరిమితమయ్యారు. ఇద్దరు ఎంపీలున్న బీజేపీ ఏకంగా 18 చోట్ల విజయం సాధించింది. ఇక యూపీలో ఎస్పీ–బీఎస్పీ కూటమి బీజేపీని నిలువరించలేకపోయింది. తెలుగుదేశం పార్టీ ఏపీలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. నెహ్రూ బాటలో నడిస్తేనే.. స్వాతంత్య్ర ఉద్యమాన్ని ముందుండి నడిపించి, దివంగత జవహర్లాల్ నెహ్రూ సారథ్యంలో ఏకఛత్రాధిపత్యంగా పాలించిన కాంగ్రెస్ ఉనికి కోసం పోరాడుతోంది. వాస్తవానికి 1975లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని ప్రకటించడంతో కాంగ్రెస్ బలహీనపడటం మొదలుపెట్టింది. 2004లో అనూహ్యంగా పుంజుకున్న కాంగ్రెస్, 2009లో మరోసారి అధికారాన్ని చేపట్టింది. అయితే అధికారంలోకి వచ్చాక భజనపరులు చుట్టూ చేరారు. పార్టీని సైద్ధాంతికంగా బలపర్చడం పక్కనపెట్టి తదుపరి ప్రధాని రాహుల్ గాంధీయేనని కాంగ్రెస్ శ్రేణులు ప్రచారం చేయడం మొదలుపెట్టాయి. దీంతో ప్రజా వ్యతిరేకత తీవ్రమై 2014లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ఓటమిని చవిచూసింది. ఇప్పటికైనా పార్టీలో భజనపరులను పక్కనపెట్టి, సైద్ధాంతికంగా నెహ్రూ బాటలో నడిస్తేనే కాంగ్రెస్ పార్టీకి మనుగడ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ప్రతిపక్ష హోదా మళ్లీ పాయే.. 130 ఏళ్ల చరిత్ర.. ఎందరో ప్రధానమంత్రులను అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీ సొంతం. కానీ, కాలం కలిసిరాకపోతే ఏమవుతుందో పదేళ్లుగా ప్రత్యక్షంగా అనుభవిస్తోంది ఆ పార్టీ. 2014 ఎన్నికల్లో మోదీ హవాలో చచ్చీచెడీ 44 స్థానాలు మాత్రమే దక్కించుకున్న కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదన్నది తెలిసిందే. సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గేను కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నుకున్నా... ఆయనకు ప్రతిపక్ష నేత హోదా మాత్రం దక్కలేదు. అయితే ప్రతిపక్షాల్లో అతిపెద్ద పార్టీ కాంగ్రెస్ మాత్రమే కావడంతో ఖర్గే లోక్‌సభ, సీబీఐ డైరెక్టర్, సుప్రీంకోర్టు జడ్జీల నియామకాలకు సంబంధించిన సమావేశాల్లో పాల్గొన్నారు. ఐదేళ్లలో సత్తువ కూడగట్టుకుని ఈ హోదాకు కావాల్సిన పదింట ఒకవంతు స్థాయి సీట్లయినా గెలుస్తుందని చాలామంది ఆశించారు. అయితే, తాజా ఎన్నికల్లో 50 సీట్లకు అటూఇటుగా పరిమితం కావడంతో కాంగ్రెస్‌కు ఈసారీ ప్రతిపక్ష హోదా దక్కే అవకాశాలు లేకుండాపోయాయి. -
‘దేశం’లో అసమ్మతి!
నిరంకుశ నిర్ణయాలు, అవినీతి వ్యవహారాలు, చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో పరాభవం భారంతో టీడీపీ అధినాయకత్వం పట్ల అసమ్మతి జ్వాలలు రాజుకుంటున్నాయి.కౌంటింగ్‌కు కొద్ది రోజుల ముందు వరకు కూడా నియోజకవర్గాల వారీగా పార్టీ సమీక్షల పేరుతో హడావుడి చేసిన చంద్రబాబు అసమ్మతి భయంతోనే ఇప్పుడు ఆ అంశాన్ని పట్టించుకోవడం లేదని పేర్కొంటున్నారు.‘రా... కదలిరా...’ అంటూ దివంగత ఎన్టీఆర్ ఇచ్చిన పిలుపుతో స్పందించి టీడీపీకి మద్దతిచ్చిన వర్గాలు ఒక్కో ఎన్నికలో ఆ పార్టీకి దూరమవుతూ వచ్చాయి. సొంతమామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు సారథ్యంలో టీడీపీ దయనీయ స్థితికి చేరుకుంటోంది.రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యపార్టీకీ ఎదురుకాని విధంగా తాజా ఎన్నికల్లో ఘోరంగా పరాజయం పాలవడానికి చంద్రబాబు వైఖరే కారణమని పార్టీ సీనియర్ నేతలు, శ్రేణులు మండిపడుతున్నాయి. – సాక్షి, అమరావతి బీజేపీ హవాలో రెండుసార్లు గట్టెక్కిన బాబు టీడీపీ ఆవిర్భావం తరువాత 1983 నుంచి 2014 వరకు అసెంబ్లీకి ఎనిమిదిసార్లు ఎన్నికలు జరగగా ఐదుసార్లు గెలిచి అధికారంలోకి వచ్చింది. ఎన్టీఆర్ నాయకత్వంలో మూడుసార్లు గెలిచింది. కాంగ్రెస్ పార్టీ మూడుసార్లు విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఎన్టీఆర్ హయాంలో టీడీపీతో పొత్తు పెట్టుకున్న ఇతర పార్టీలు కూడా లబ్ధి పొందాయి. 1994 ఎన్నికల్లో టీడీపీ చరిత్రలో అత్యధిక స్థానాలు గెల్చుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు అడ్డదారిలో ప్రభుత్వాన్ని, పార్టీని సొంతం చేసుకున్నారు. ఎన్టీఆర్ సిద్ధాంతాలకు బాబు తిలోదకాలిచ్చారు. సంపూర్ణ మద్యపాన నిషేధం, రూ.2కే కిలో బియ్యం, రూ.50కే హార్స్పవర్ విద్యుత్తు లాంటి పథకాలకు చంద్రబాబు స్వస్తి పలికి ప్రజలపై పెనుభారం మోపారు. టీడీపీని ధనవంతులు, కాంట్రాక్టర్లకు మేలు చేసే పార్టీగా మార్చేశారు. ఈ ధోరణితో ఒకప్పుడు పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన వర్గాలన్నీ క్రమేపీ దూరమయ్యాయి. చంద్రబాబు నాయకత్వంలో 2019 వరకు ఐదుసార్లు అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొన్న టీడీపీ 1999, 2014లో మాత్రమే విజయం సాధించింది. గెలిచిన రెండుసార్లు కూడా బీజేపీ హవాలో టీడీపీ గట్టెక్కడం గమనార్హం. అయితే గతంలో ఓట్ల శాతం, సీట్లతో పోలిస్తే చాలా తగ్గాయి. చంద్రబాబు సొంతంగా పార్టీని ఏనాడూ విజయపథంలో నడిపించలేకపోయారు. ఎన్టీఆర్ హయాంలో అత్యధికంగా 216 అసెంబ్లీ సీట్లు, 46.21 శాతం ఓట్లు సాధించిన టీడీపీ చంద్రబాబు నాయకత్వంలో 23 సీట్ల స్థాయికి దిగజారిపోవడం, ఓట్ల శాతం క్షీణించడం పార్టీ పరిస్థితి దయనీయంగా మారిందనేందుకు నిదర్శనం. వ్యతిరేకించిన కాంగ్రెస్‌తోనే చేతులు కలిపి.... కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా ఎన్టీఆర్ టీడీపీని స్థాపించగా చంద్రబాబు కుమ్మక్కు రాజకీయాలు చేస్తూ అదే పార్టీతో పొత్తులు కుదుర్చుకోవడం సొంత శ్రేణులనే నివ్వెరపరిచింది. చంద్రబాబు కాంగ్రెస్‌తో కుమ్మక్కై వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై తప్పుడు కేసులు బనాయించి జైలు పాలు చేయించారు. తాను గెలిచే పరిస్థితి లేకపోవడంతో కాంగ్రెస్‌తో చేతులు కలిపి ఉమ్మడి రాష్ట్రాన్ని చీల్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తులు కుదుర్చుకున్న చంద్రబాబుకు ప్రజలు గట్టి గుణపాఠం చెప్పారు. ఈ పరిణామంతో ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో తెరవెనుక ఒప్పందాలు చేసుకున్నారు. జాతీయ స్థాయిలో ఆ పార్టీతో అంటకాగారు. ఈ పరిణామాలు సొంత శ్రేణుల్లోనే కాకుండా ప్రజల్లోనూ వ్యతిరేకతను పెంచాయి. ఫలితంగా ఎన్నడూ లేని రీతిలో పరాజయాన్ని చవిచూసింది. 10 శాతానికిపైగా ఓట్ల వ్యత్యాసంతో వైఎస్సార్సీపీ విజయభేరీ.. 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి, టీడీపీకి మధ్య ఓట్ల వ్యత్యాసం కేవలం 1.96 శాతం మాత్రమే కావడం గమనార్హం. అతి తక్కువ ఓట్ల ఆధిక్యంతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కారు ఐదేళ్లుగా చేసిన అరాచకాలు, అక్రమాలను భరించలేక రాష్ట్ర ప్రజలు తాజా ఎన్నికల్లో గట్టి గుణపాఠం నేర్పారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి 151 అసెంబ్లీ సీట్లు రాగా టీడీపీ 23 సీట్లు, జనసేన 1 స్థానానికి పరిమితమయ్యాయి. వైఎస్సార్ సీపీకి, టీడీపీకి మధ్య ఓట్ల వ్యత్యాసం ఏకంగా 10.7 శాతం ఉండడం గమనార్హం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 1,56,86,511 ఓట్లు (49.95 శాతం) రాగా, టీడీపీకి 1,23,03,620 ఓట్లు (39.18 శాతం) వచ్చాయి. దళితులపై దారుణమైన వ్యాఖ్యలు.. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను టీడీపీ గాలికి వదిలేయడంతో రైతులు, డ్వాక్రా మహిళలు, నిరుద్యోగులు, విద్యార్ధుల్లో ఆ పార్టీపై వ్యతిరేకత పెరిగింది. సంక్షేమ పథకాల్లో కోత పెట్టడమే కాకుండా ఎస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారంటూ చంద్రబాబు దారుణంగా అవమానించే వ్యాఖ్యలు చేయడంతో ఆ వర్గాలు టీడీపీకి దూరమయ్యాయి. విజయవాడ సహా పలుచోట్ల ప్రార్థనా మందిరాలను కూల్చడం, పుష్కరాలను ప్రచారం కోసం వాడుకుని అమాయకుల మృత్యువాతకు కారణం కావడంతో ప్రజలు ఓటు ద్వారా తమ తీర్పును వెల్లడించారు. చంద్రబాబు ఒంటెత్తు పోకడల వల్లే ఈ పరిస్థితి ఉత్పన్నమైందని పార్టీలో సీనియర్ నేతలతో పాటు క్యాడర్ పేర్కొంటోంది. కాంగ్రెస్‌తో పొత్తును ప్రజలు సహించరని, తరిమి కొడతారని చింతకాయల అయ్యన్నపాత్రుడు లాంటి వారు బహిరంగంగానే చెప్పారు. పార్టీకి ఎలాంటి సేవలు చేయని నారాయణ, సుజనాచౌదరి లాంటి వారికి ప్రాధాన్యం కల్పించడం, కుటుంబరావు లాంటి షేర్ బ్రోకర్లకు ప్రభుత్వంలో చోటు కల్పించడం, గ్రామాల్లో జన్మభూమి కమిటీల అరాచకాలు తదితర అంశాలను జీర్ణించుకోలేని పార్టీ శ్రేణులు ఈసారి ఎన్నికల్లో టీడీపీకి దూరమయ్యాయి. తిరుగుబాటు భయం! ఈ ఎన్నికల్లో దాదాపుగా మంత్రులంతా పరాజయం పాలవడం, ముఖ్యమంత్రి తనయుడు ఘోరంగా ఓడిపోవడం, నాలుగు జిల్లాల్లో ఒక్క సీటు కూడా గెల్చుకోలేకపోవడం లాంటి పరిణామాలతో టీడీపీలో అసమ్మతి స్వరాలు ఊపందుకుంటున్నాయి. కౌంటింగ్‌కు ముందు చంద్రబాబు పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సమీక్షలను ప్రారంభించినా కార్యకర్తలు, నేతల నుంచి నిరసనలు వ్యక్తం కావడంతో అర్ధాంతరంగా నిలిపివేశారు. ఇప్పుడు ఎన్నికల ఫలితాల అనంతరం సమీక్షలు నిర్వహించడానికి కూడా ఆయన ధైర్యం చేయడం లేదు. పార్టీలో తన పట్ల అసమ్మతి తీవ్రంగా ఉండడంతో ఈ తరుణంలో సమీక్షలు నిర్వహిస్తే తిరుగుబాటు తప్పదనే ఆందోళన ఆయనలో వ్యక్తమవుతోంది. ఏటా మే 27, 28, 29 తేదీల్లో టీడీపీ మహానాడు నిర్వహించడం ఆనవాయితీ. ఓటమి తప్పదని ముందే గ్రహించిన చంద్రబాబు ఈసారి మహానాడు నిర్వహించడం లేదని ఇప్పటికే ప్రకటించడం తెలిసిందే. -
ఐదు నెలల్లో మారిన హస్తవాసి
న్యూఢిల్లీ: సరిగ్గా ఐదు నెలల క్రితం మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. ఈ మూడు రాష్ట్రాల్లో పాతుకుపోయిన బీజేపీని మట్టి కరిపించింది. దీంతో కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం సాధిస్తుందని ఆ పార్టీ శ్రేణులతో పాటు రాజకీయ విశ్లేషకులు సైతం భావించారు. అయితే కేవలం 5 నెలల కాలంలోనే ఈ అంచనాలు తారుమారయ్యాయి. తాజాగా లోక్‌సభ ఎన్నికల్లో ఈ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు ఘోర పరాజయం ఎదురైంది. ఈ మూడు రాష్ట్రాల్లో మొత్తం 65 లోక్‌సభ స్థానాలుంటే బీజేపీ ఏకంగా 61 సీట్లను కైవసం చేసుకుని మళ్లీ పుంజుకుంది. మధ్యప్రదేశ్‌లోని 29 స్థానాల్లో 28 చోట్ల, రాజస్తాన్‌లోని 25 స్థానాల్లో 25 చోట్ల, ఛత్తీస్‌గఢ్‌లోని 11 సీట్లలో 9 చోట్ల విజయదుందుభి మోగించింది. రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో యువనాయకత్వానికి బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ భావించారు. అయితే యూపీఏ చైర్పర్సన్ రాహుల్ ప్రయత్నాలను అడ్డుకున్నారు. సార్వత్రిక ఎన్నికల వేళ పోల్ మేనేజ్మెంట్కు సీనియర్ల అనుభవం అవసరమనీ, వారిని కాదని ఇతరులను నియమిస్తే సహాయనిరాకరణ ఎదురుకావొచ్చని సూచించారు. అందులో భాగంగానే రాజస్తాన్ సీఎంగా అశోక్ గెహ్లోత్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా కమల్‌నాథ్‌ను నియమించారు. ఎన్ని వ్యూహాలు రచించినా మోదీ హవా ముందు కాంగ్రెస్ సీనియర్ల ప్రణాళికలు బెడిసికొట్టాయి. మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ కుమారుడు నకుల్‌నాథ్ పోటీచేసిన ఛింద్వారాతో పాటు, ఛత్తీస్‌గఢ్‌లో బస్తర్, కొబ్రా స్థానాలను మాత్రమే కాంగ్రెస్ గెలుచుకుంది. మధ్యప్రదేశ్‌లోని గుణా నుంచి పోటీచేసిన కాంగ్రెస్ పార్టీ నేత జ్యోతిరాదిత్య సింధియా ఓటమి చవిచూశారు. రాజస్తాన్‌లో కుల సమీకరణాలను పరిగణనలోకి తీసుకున్న బీజేపీ, రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీతో పొత్తు పెట్టుకుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ 24, ఆర్ఎల్టీపీ ఒక సీటు గెలుచుకున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. సిట్టింగ్ ఎంపీలు కాకుండా కొత్త వారిని రంగంలోకి దించింది. ఈ నేపథ్యంలో ప్రజా వ్యతిరేకత పెద్దగా ప్రభావం చూపకపోవడంతో 11 స్థానాల్లో 9 సీట్లను ఖాతాలో వేసుకోగలింది. -
టీడీపీలో నిశ్శబ్దం
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో ఘోర పరాజయం పాలవడంతో టీడీపీలో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. ఓటమి భారాన్ని దిగమింగుకోలేక, ఎలా ముందుకెళ్లాలో తెలియక పార్టీ తీవ్ర ఆందోళనలో మునిగిపోయింది. ఊహకు అందని రీతిలో ఎదురైన ఓటమిని జీర్ణించుకోలేని పలువురు పార్టీ నేతలు ఇంకా షాక్ నుంచి కోలుకోలేదు. ఫలితాల గురించి మాట్లాడేందుకు సైతం ఎవరూ ఇష్టపడడంలేదు. ఈవీఎంలను మేనేజ్ చేశారంటూ కొందరు నేతలు ఓటమికి సాకులను అన్వేషిస్తున్నారు. ఇంత అవమానకర ఓటమికి కారణాలేమిటనే దానిపై ఓడిన మంత్రులు, అభ్యర్థులు, ముఖ్యులు తీవ్రంగా మథన పడుతున్నారు. టీడీపీ పట్ల ప్రజల్లో ఈ స్థాయిలో వ్యతిరేకత ఉందని గ్రహించలేదంటూ అంతర్గతంగా వాపోతున్నారు. క్యాడర్ డీలా.. ప్రధానంగా జన్మభూమి కమిటీల వల్ల తీవ్ర నష్టం జరిగిందనే వాదనపై టీడీపీ నాయకులు విశ్లేషించుకుంటున్నారు. ఎక్కువ మంది మాత్రం వైఎస్ జగన్‌కు ఒక్క చాన్స్ ఇవ్వాలనే భావన రాష్ట్ర మంతటా బలంగా నెలకొనడం వల్లే ఇలాంటి ఫలితాలు వచ్చాయని చర్చించుకుంటున్నారు. ఏ చిన్న సంఘటన జరిగినా మీడియా ముందుకు వచ్చే నాయకులు ఈసారి టీవీ చర్చలకు సైతం సుముఖత వ్యక్తం చేయడం లేదు. మొన్నటివరకూ గెలుస్తామంటూ తొడలు కొట్టి నోరు పారేసుకున్న నేతలు ఏం మాట్లాడాలో తెలియక సతమతమవుతున్నారు. పార్టీ క్యాడర్లో అయితే తీవ్ర నిరుత్సాహం కనిపిస్తోంది. కళావిహీనంగా బాబు ఉండవల్లి నివాసం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం ప్రస్తుతం కళావిహీనంగా మారింది. శుక్రవారం ఎలాంటి హడావిడి కనిపించలేదు. గెలిచిన కొద్దిమంది ఎమ్మెల్యేలు కూడా ఆయన్ను కలిసేందుకు రాకపోవడం గమనార్హం. నిత్యం చంద్రబాబు వెంట ఉండే కొద్దిమంది మినహా మిగిలిన ముఖ్యులెవరూ ఆ దరిదాపుల్లో కానరావడం లేదు. బాబు కోటరీలోని కొందరు పరస్పరం నిందించుకుంటున్నట్లు సమాచారం. హిందుపురం నుంచి మరోసారి ఎమ్మెల్యేగా గెలిచిన నందమూరి బాలకృష్ణ ఒక్కరే శుక్రవారం చంద్రబాబును కలిసి వెళ్లారు. చంద్రబాబు నివాసం ఉన్న దారి గుండా రైతులను వారి పంటపొలాలకు వెళ్లనివ్వకుండా గురువారం అడ్డుకున్న పోలీసులు శుక్రవారం ఎవరినీ అడ్డుకోలేదు. పార్టీ శాసనసభాపక్ష నేత ఎన్నికపై మౌనం ప్రజా తీర్పు వెలువడిన అనంతరం టీడీపీలో శాసన సభాపక్ష సమావేశం గురించి కనీసం చర్చ కూడా జరగడం లేదంటే ఆ పార్టీ నాయకులు ఎంత నైరాశ్యంలో ఉన్నారో బోధపడుతోంది. ఎన్నికల ఫలితం ఎలా ఉన్నా గెలిచిన ఎమ్మెల్యేలను సమావేశపరచడం, శాసన సభాపక్ష నేతను ఎన్నుకోవడం ఏ పార్టీలోనైనా సాధారణంగా జరుగుతుంది. అయితే టీడీపీ శాసన సభాపక్ష సమావేశాన్ని ఎప్పుడు నిర్వహిస్తారనే అంశంపై ఎవరూ పెదవి విప్పకపోవడం గమనార్హం. చంద్రబాబు దీనిపై ఇంకా ఏమీ మాట్లాడకపోవడంతో పార్టీ నేతల్లో అయోమయం నెలకొంది. -
ఆంధ్రావనిలో జగన్నినాదం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దాదాపు సగం (49.95 శాతం) ఓట్లు ‘ఫ్యాన్’ ఖాతాలో పడ్డాయి. ప్రత్యక్షంగా ఏ రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకోకపోయినా, చీకటి ఒప్పందాలతో పోటీ చేసిన టీడీపీ 39.18 శాతం ఓట్లకు పరిమితమైంది. అంటే.. టీడీపీతో పోల్చితే 10.77 శాతం అధికంగా ఓట్లు సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 85 శాతానికిపైగా అంటే 151 శాసనసభ స్థానాలను.. 90 శాతానికిపైగా అంటే 22 లోక్‌సభ స్థానాలను దక్కించుకుని చరిత్ర సృష్టించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1962 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఏ ఎన్నికల్లోనూ.. సింగిల్(ఒక్కటి)గా పోటీ చేసిన ఏ పార్టీ ఇంతటి భారీ స్థాయిలో విజయం సాధించిన దాఖలాలు లేవు. 1994 ఎన్నికల్లో వామపక్షాలతో జట్టుకట్టి టీడీపీ ఇదే తరహాలో ఓట్లు సాధించినా, అది ప్రస్తుతం వైఎస్సార్సీపీ సాధించిన విజయానికి సాటి రాదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 2004లో కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు, టీఆర్ఎస్ పొత్తులతో బరిలోకి దిగినా ఈ స్థాయి విజయాన్ని సాధించలేకపోయాయని గుర్తు చేస్తున్నారు. ఎలాంటి పొత్తులు లేకుండా ఈ ఎన్నికల్లో పోటీచేసిన వైఎస్సార్సీపీ ఆఖండ విజయం సాధించి రికార్డు సృష్టించింది. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపును గురువారం పూర్తి చేశారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 1,56,86,511 ఓట్లను దక్కించుకుంది. 2014 ఎన్నికల్లో 1,29,31,730 ఓట్లు ఆ పార్టీకి వచ్చాయి. గత ఎన్నికలతో పోల్చితే ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 27,54,581 ఓట్లను అదనంగా సాధించింది. బీజేపీతో జట్టు కట్టిన టీడీపీ గత ఎన్నికల్లో 1,34,95,305 ఓట్లు దక్కించుకోగా.. ఈ ఎన్నికల్లో 1,20,03,620 (39.18) శాతం ఓట్లకు పరిమితమైంది. గత ఎన్నికలతో పోల్చితే ఈ ఎన్నికల్లో టీడీపీ 14,91,685 ఓట్లను కోల్పోయింది. అన్నింటా ఏకపక్షమే ఈ ఎన్నికల్లో్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సింగిల్‌గా పోటీ చేసింది. టీడీపీ ప్రత్యక్షంగా పొత్తులు పెట్టుకోకున్నా, పరోక్షంగా రాజకీయ పార్టీలతో అవగాహన కుదుర్చుకుని పోటీ చేసింది. అయినా సరే.. అన్ని ప్రాంతాల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా విజయం సాధించింది. రాయలసీమలో 52 శాసనసభ స్థానాలకుగాను 49 స్థానాల్లో వైఎస్సార్సీసీ అభ్యర్థులు గెలిచారు. టీడీపీ కేవలం మూడు స్థానాలకే పరిమితమైంది. ఉత్తరాంధ్రలో 34 శాసనసభ స్థానాలకుగాను వైఎస్సార్సీపీ అభ్యర్థులు 28 స్థానాల్లో ఘన విజయం సాధిస్తే, టీడీపీ అభ్యర్థులు ఆరు స్థానాల్లో అత్తెసరు మెజార్టీతో గెలిచారు. కోస్తాలో 89 శాసనసభ స్థానాలకుగాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 74 స్థానాల్లో ఘన విజయం సాధిస్తే.. టీడీపీ అభ్యర్థులు 14 స్థానాల్లో గెలిచారు. జనసేన కేవలం ఒక స్థానానికే పరిమితమైంది. రాయలసీమలో ఎనిమిది లోక్‌సభ స్థానాల్లోనూ వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఇక ఉత్తరాంధ్రలో ఐదు లోక్‌సభ స్థానాల్లో నాలుగింటిలో వైఎస్సార్సీపీ అఖండ విజయం సాధిస్తే.. శ్రీకాకుళం లోక్‌సభ స్థానంలో పోస్టల్ బ్యాలెట్ల విషయంలో సాంకేతిక సమస్యల వల్ల టీడీపీ అభ్యర్థి అత్తెసరు మెజార్టీతో విజయం సాధించారు. కోస్తాలో 12 లోక్‌సభ స్థానాలకుగాను పదింటిని వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంటే, టీడీపీ రెండు స్థానాలకే పరిమితమైంది. ఇందులో గుంటూరు లోక్‌సభ పోస్టల్ బ్యాలెట్ల విషయంలో సాంకేతిక సమస్యల వల్ల ఐదు వేల ఓట్ల వ్యత్యాసంతో, విజయవాడ లోక్‌సభ స్థానంలో ఎనిమిది వేల ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థులు గట్టెక్కారు. అంటే.. కేవలం పది వేల లోపు ఓట్ల తేడాతో వైఎస్సార్సీపీ మూడు లోక్‌సభ స్థానాలను కోల్పోయినట్లు వెల్లడవుతోంది. వైఎస్సార్సీపీ ప్రభంజనంతో కూలిన కోటలు వైఎస్సార్సీపీ దెబ్బకు టీడీపీ కంచు కోటలు కుప్పకూలాయి. కర్నూలు, వైఎస్సార్, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లోని శాసనభ, ఎంపీ స్థానాలను వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. మిగతా 9 జిల్లాల్లో సింహభాగం శాసనసభ, లోక్‌సభ స్థానాలను దక్కించుకుంది. వైఎస్ జగన్ ప్రభంజనంలో ముగ్గురు మినహా బాబు మంత్రివర్గంలోని సభ్యులందరూ ఓడిపోయారు. లోకేష్ మంగళగిరిలో ఘోరంగా ఓటమి పాలయ్యారు. బొబ్బిలి, విజయనగరం, కురపాం రాజ వంశీకుల కోటలు కొట్టుకుపోయాయి. కోట్ల, జేసీ వంటి రాజకీయ కుటుంబాలు వైఎస్సార్సీపీ ప్రభంజనం ముందు నిలబడలేకపోయాయి. -
వికటించిన గట్బంధన్
లక్నో: సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో బీజేపీని నిలువరించాలనుకున్న ప్రతిపక్షాలకు మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 80 స్థానాలకు గానూ 71 సీట్లు గెలుచుకున్న బీజేపీ ఈసారి మిత్రపక్షాలతో కలిసి 64 స్థానాల్లో విజయదుందుభి మోగించింది. బీజేపీకి చెక్ పెట్టేందుకు సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ), రాష్ట్రీయ లోక్‌దళ్(ఆర్ఎల్డీ) పార్టీలు కలిసి ఏర్పాటుచేసిన మహాకూటమి(గట్బంధన్) కనీసం పోటీ ఇవ్వలేక చతికిలపడింది. ఈ కూటమి వేర్వేరుగా పోటీచేయడంతో కమలనాధుల విజయం సులువైందని విశ్లేషకులు చెబుతున్నారు. సోనియా ప్రయత్నాలకు చెక్.. యూపీలో బీజేపీ విజయావకాశాలను దెబ్బతీయడం ద్వారా ప్రధాని మోదీని నిలువరించాలని యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ భావించారు. ఇందుకు అనుగుణంగానే మహాకూటమిలో చేరేందుకు ముందుకొచ్చారు. యూపీలో తమకు కేవలం 15 లోక్‌సభ స్థానాలు ఇస్తే చాలన్నారు. అయితే బీఎస్పీ అధినేత్రి మాయావతి కాంగ్రెస్ పార్టీతో కలిస్తే విజయావకాశాలు దెబ్బతింటాయన్న అనుమానంతో ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. # కంచుకోట అమేథీలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ ఓటమి చవిచూడగా, సోనియా రాయ్‌బరేలీలో గెలిచి పరువు కాపాడుకున్నారు. ఈ ఎన్నికల్లో మహాకూటమిలో లాభపడ్డది ఎవరైనా ఉన్నారంటే అది బీఎస్పీ చీఫ్ మాయావతియే. ఈ లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీ–ఎస్పీ–ఆర్ఎల్డీ కూటమికి మొత్తం 15 సీట్లురాగా, వీటిలో బీఎస్పీనే 10 స్థానాలను గెలుచుకుంది. ఎస్పీకి 5 లోక్‌సభ సీట్లు దక్కగా, మరో మిత్రపక్షం ఆర్ఎల్డీ ఖాతానే తెరవలేదు. సమాజ్‌వాదీ పార్టీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బే తగలింది. -
మహిళా ఎంపీలు 78 మంది
సాక్షి, న్యూఢిల్లీ: తాజాగా జరిగిన 17వ లోక్‌సభ ఎన్నికల్లో మహిళా ఎంపీల సంఖ్య 78గా ఉంది. అంటే మొత్తం లోక్‌సభ ఎంపీల్లో మహిళల సంఖ్య దాదాపు 14 శాతం. 16వ లోక్‌సభలో మహిళా ఎంపీల సంఖ్య 62 మాత్రమే కాగా, ప్రస్తుతం అది 78కి పెరిగింది. అయినప్పటికీ ఇతర దేశాలతో పోలిస్తే ఇది అతి స్వల్పం. రువాండా చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం ఏకంగా 61 శాతం ఉండగా, దక్షిణాఫ్రికాలో చట్టసభల్లో 43 శాతం మంది, యూకేలో పార్లమెంటులోనూ 32 శాతం మంది మహిళలు ఉన్నారు. అమెరికాలో 24 శాతం, బంగ్లాదేశ్‌లో 21 శాతం మంది మహిళా ప్రజా ప్రతినిధులు ఉన్నారు. కొత్త ంపీలపై పీఆర్ఎస్ ఇండియా సంస్థ ఒక విశ్లేషణను విడుదల చేసింది. ఆ వివరాలు.. 300 మంది తొలిసారి ఎన్నికైన వారే తొలిసారిగా లోక్‌సభకు ఎన్నికైన వారు కొత్త సభలో 300 మంది ఉన్నారు. 16వ లోక్‌సభలో ఈ సంఖ్య 314. 16వ లోక్‌సభలో సభ్యులుగా ఉండి, మళ్లీ 17వ లోక్‌సభకు కూడా ఎన్నికైన వారి సంఖ్య 197 కాగా, మరో 45 మంది 16వ లోక్‌సభలో కాకుండా, అంతకు ముందు సభల్లో సభ్యులుగా ఉన్నవారే. -
కమలం @ 303
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ ఏకంగా 303 సీట్లు తన ఖాతాలో వేసుకుంది. కాగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మొత్తం 352 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ 52 స్థానాలకు పరిమితం కాగా.. రెండు సీట్ల తేడాతో ప్రతిపక్ష హోదాకు దూరమయ్యింది. అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన సీట్ల కంటే (44) ఈసారి ఎక్కువ సీట్లు రావడం గమనార్హం. యూపీఏ కూటమికి 91 సీట్లు దక్కగా ఇతరులు 99 స్థానాల్లో విజయం సాధించారు. పార్టీలవారీగా చూస్తే ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ తర్వాతి స్థానంలో నిలిచాయి. డీఎంకే 23, వైఎస్సార్సీపీ, తృణమూల్ కాంగ్రెస్‌లు 22 చొప్పున, శివసేన 18, జేడీయూ 16 సీట్లలో విజయం సాధించాయి. ఇతర ప్రాంతీయ పార్టీలు.. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో ఎలాంటి ప్రభావాన్నీ చూపించలేకపోయాయి. యూపీలో బీజేపీ దాని మిత్రపక్షం మొత్తం 80కి గాను 64 సీట్లలో గెలుపొందగా ఎస్పీ, బీఎస్పీల కూటమి దాదాపుగా చతికిలబడిపోయింది. ఎస్పీకి 5, బీఎస్పీకి 10 సీట్లు మాత్ర మే దక్కాయి. ఇక సీపీఎం 3, సీపీఐ 2 స్థానాల్లో గెలుపొందాయి. 2014లో ఈ పార్టీలు 10 సీట్లు దక్కించుకున్నాయి. కమలదళం జోరు ఇతర రాష్ట్రాల్లో ప్రభావాన్ని పెంచుకున్న బీజేపీ హిందీ రాష్ట్రాల్లో ప్రభంజనం సృష్టించింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌లలో మొత్తం 65 సీట్లకు గాను ఏకంగా 61 సీట్లలో విజయదుందుభి మోగించింది. ఆరు నెలల క్రితం ఈ రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం గమనార్హం. దక్షిణాది రాష్ట్రం కర్ణాటకలో 28 లోక్‌సభా స్థానాలకు గాను 25 సీట్లలో బీజేపీ గెలుపొందింది. బీజేపీ ప్రభంజనంలో తుముకూరు నుంచి పోటీ చేసిన మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత దేవెగౌడ కూడా ఓటమి చవిచూశారు. ఒడిశాలో గత ఎన్నికల్లో ఒక్క సీటుకు పరిమితమైన బీజేపీ ఈసారి 8 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ ఖాళీ ఆంధ్రప్రదేశ్, గుజరాత్, రాజస్తాన్, ఢిల్లీ, హరియాణ వంటి 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. అరుణాచల్‌ప్రదేశ్, దాదర్ అండ్ నాగర్‌హవేలీ, డామన్ అండ్ డయు, హిమాచల్‌ప్రదేశ్, జమ్మూక శ్మీర్, లక్షద్వీప్, మణిపూర్, మిజోరం, నాగాల్యాండ్, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్‌ల్లో ఆ పార్టీ ఖాతా కూడా తెరవలేకపోయింది. ఈ రాష్ట్రాల్లో బీజేపీకి 50 శాతానికి పైగా ఓట్లు వచ్చినట్లు ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా గురువారం చెప్పారు. బెంగాల్లో కమల వికాసం 18 లోక్‌సభ స్థానాలను గెలుచుకున్న బీజేపీ పశ్చిమబెంగాల్లో పాగా వేయాలన్న ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షాల ప్రయత్నాలు ఫలించాయి. సై అంటే సై అంటూ సాగిన ఈ ఎన్నికల్లో బీజేపీ తొలి సారి సత్తా చాటింది. మొత్తం 42 స్థానాలకు గానూ 18 చోట్ల ఘనవిజయం సాధించింది. మరో 22 చోట్ల రెండోస్థానంలో నిలిచి అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)కు గుబులు పుట్టించింది. మరోవైపు టీఎంసీ 22 స్థానాలతో తొలిస్థానంలో నిలిచింది. కాగా, రాష్ట్రాన్ని ఏకచత్రాధిపత్యంగా 34 ఏళ్ల పాటు పాలించిన వామపక్షాలు ఈసారి ఖాతా కూడా తెరవలేకపోయాయి. ఈ లోక్‌సభ ఎన్నికల్లో టీఎంసీకి 43.3 శాతం ఓట్లు పోల్‌కాగా, బీజేపీకి 40.25 శాతం ఓట్లు వచ్చాయి. క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టం చేయడంపై దృష్టిసారించిన బీజేపీ ఉత్తరబెంగాల్లోని జంగల్ మహల్ ప్రాంతంలో క్లీన్‌స్వీప్ చేసింది. జాఘ్రామ్, మేదినిపురి, పురూలియా, బంకూరా, బిష్ణుపూర్ సీట్లను గెలుచుకుంది. అయితే దక్షిణబెంగాల్‌లో మమత పట్టును నిలుపుకున్నారు. -
రాజీనామా చేస్తా.. వద్దు వద్దు..!
బెంగళూరు: ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి నాయకత్వంపై తమకు విశ్వాసం, నమ్మకం ఉన్నాయని కర్ణాటక కేబినెట్ స్పష్టం చేసింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో కూటమి అభ్యర్థులు ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో శుక్రవారం మంత్రివర్గం సమావేశమై సంకీర్ణ ప్రభుత్వానికి ఢోకా లేదని తెలిపింది. ‘కుమారస్వామి నాయకత్వంపై మేం విశ్వాసం, నమ్మకం వ్యక్తం చేశాం. ప్రభుత్వ మనుగడకు ఎటువంటి ప్రమాదం లేదు’ అని శుక్రవారం కేబినెట్ భేటీ అనంతరం డిప్యూటీ సీఎం పరమేశ్వర మీడియాకు తెలిపారు. ప్రభుత్వానికి ఎటువంటి ఢోకా లేదని, తమ ఎమ్మెల్యేలంతా తమతోనే ఉన్నారని అంటూ ఆయన ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను సాగనీయబోమని పరమేశ్వర ప్రకటించారు. మీడియాను బహిష్కరిస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన సీఎం కుమారస్వామి పరమేశ్వరతోపాటు మీడియా సమావేశంలో పాల్గొన్నప్పటికీ మౌనంగా కూర్చుని ఉన్నారు. ఓటమికి కారణం జేడీఎస్‌తో పొత్తేనంటూ కాంగ్రెస్ నేతల నుంచి విమర్శలు రావడంతో రాజీనామాకు సిద్ధమంటూ సీఎం కుమారస్వామి గురువారం ప్రకటించారు. అయితే, కాంగ్రెస్ నేతలు ఆయనకు సర్దిచెప్పడంతో వెనక్కి తగ్గారని సమాచారం. గురువారం వెలువడిన ఫలితాల్లో రాష్ట్రంలోని 28 లోక్‌సభ స్థానాలకు గాను కాంగ్రెస్ 1, జేడీఎస్ 1 స్థానం మాత్రమే దక్కించుకోగా 25 చోట్ల బీజేపీ విజయకేతనం ఎగురవేసిన విషయం తెలిసిందే. ఎంపీ సీటును దేవెగౌడకు త్యాగం చేస్తా ఎంపీ, మనవడు ప్రజ్వల్ ప్రకటన సాక్షి బెంగళూరు: తుమకూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసిన మాజీ ప్రధాని, జేడీఎస్ అధ్యక్షుడు దేవెగౌడ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేవెగౌడ మనవడు, హసన్ ఎంపీ ప్రజ్వల్ సంచలన ప్రకటన చేశారు. హసన్ లోక్‌సభ స్థానాన్ని తాతయ్య దేవెగౌడ కోసం వదులుకునేందుకు సిద్ధమని ప్రకటించారు.ఈ విషయమై ఇంకా తాతయ్యతో చర్చించలేదు. కానీ హసన్ నుంచి పోటీచేసే విషయమై ఆయన్ను ఒప్పిస్తా’ అని బెంగళూరులో మీడియాతో అన్నారు. -
రాజీనామాల పర్వం
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక సంఘం (సీడబ్ల్యూసీ) భేటీ శనివారం ఉదయం 11 గంటలకు జరగనుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఓటమికి బాధ్యత వహిస్తూ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా సీడబ్ల్యూసీలో రాజీనామా సమర్పించే అవకాశం ఉందని సమాచారం. లోక్‌సభ ఎన్నికల్లో కేవలం 52 సీట్లతో పార్టీ ఘోర పరాజయం చెందడంపై ఈ సమావేశంలో నేతలు చర్చించనున్నారు. పార్టీ ఓటమికి కారణాలపై సమీక్ష జరపనున్నారు. సంస్థాగత లోపాలు, ప్రచార వ్యూహం విఫలం కావడంతో పాటు రాష్ట్ర కమిటీల అంతర్గత కుమ్ములాటలపై కూడా చర్చించే అవకాశం ఉంది. బీజేపీ ముందెన్నడూ లేనంత బలమైన పార్టీగా అవతరించిన నేపథ్యంలో.. కాంగ్రెస్‌ను సంస్కరించడానికి, పునరుజ్జీవింప చేయడానికి తీసుకోవాల్సిన చర్యలను సూచించేందుకు ఒక అంతర్గత కమిటీని నియమించే అవకాశంపై కూడా చర్చించవచ్చని తెలుస్తోంది. ఆరు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌లతో పాటు బిహార్ తదితర రాష్ట్రాల్లో పార్టీ దెబ్బతినడానికి కారణాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్,తో పాటు ఏకే ఆంటోని, అశోక్ గెహ్లోత్, కేసీ వేణుగోపాల్, గులాంనబీ ఆజాద్ తదితర అగ్రనేతలు భేటీలో పాల్గొనే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ చేతిలో కాంగ్రెస్ వరుసగా రెండోసారి పరాజయాన్ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. అదే బాటలో యూపీ, ఒడిశా చీఫ్‌లు మరోవైపు సీడబ్ల్యూసీకి ముందే పలువురు నేతలు పార్టీ పదవులకు రాజీనామాలు సమర్పిస్తున్నారు. ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల అధ్యక్షులు రాజ్‌బబ్బర్, నిరంజన్ పట్నాయక్‌లు ఇప్పటికే తమ పదవులకు రాజీనామాలు ప్రకటించారు. ఈ మేరకు లేఖలను పార్టీ అధినేత రాహుల్‌కు పంపించారు. పార్టీ ఇంతలా నష్టపోవడానికి, ప్రజలకు చేరువ కాలేకపోవడానికి కారణాలు ఏమిటనే దానిపై నేతలు ఇప్పటికే అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. 80 ఎంపీ స్థానాలున్న యూపీలో సోనియాగాంధీ సీటు రాయబరేలీలో మాత్రమే కాంగ్రెస్ గెలుపొందింది. కీలక అమేథీ నియోజకవర్గంలో రాహుల్ గాంధీ సైతం బీజేపీ నేత స్మృతీ ఇరానీ చేతిలో ఓటమి పాలయ్యారు. ఫతేపూర్ సిక్రీ నుంచి పోటీ చేసిన బబ్బర్ బీజేపీకి చెందిన రాజ్‌కుమర్ చహర్ చేతిలో దాదాపు 5 లక్షల ఓట్ల భారీ తేడాతో ఓటమి చవిచూశారు. ఎన్నికల ఫలితాలు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్‌ను తీవ్రంగా నిరాశపరిచాయి. నా బాధ్యతలు నేను సరైన విధంగా నిర్వర్తించనందుకు నాకు నేనే దోషిగా భావిస్తున్నానంటూ బబ్బర్ హిందీలో ట్వీట్ చేశారు. కాగా రాష్ట్రంలో పార్టీ ఓటమికి నైతికి బాధ్యత వహిస్తూ తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడికి పంపినట్లు ఒడిశా పీసీసీ అధ్యక్షుడు నిరంజన్ పట్నాయక్ తెలిపారు. ఒడిశాలో కాంగ్రెస్ ఒక లోక్‌సభ స్థానంలో, తొమ్మిది అసెంబ్లీ సీట్లలో మాత్రమే గెలుపొందింది. -
మంత్రివర్గంలోకి అమిత్ షా..!
న్యూఢిల్లీ: కేంద్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు దిశగా రంగం సిద్ధమయ్యింది. శుక్రవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ 16వ లోక్‌సభ రద్దుకు సిఫారసు చేసింది. సమావేశం ముగిసిన తర్వాత ప్రధాని మోదీ, మిగతా కేంద్రమంత్రులు రా6ష్టపతిని కలసి రాజీనామాలు సమర్పించారు. కేంద్ర మంత్రివర్గం రాజీనామాలు సమర్పించే సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి వారిని విందుకు ఆహ్వానించారు. వారి రాజీనామాలను ఆమోదించిన రాష్ట్రపతి కొత్త ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించే వరకు కొనసాగాల్సిందిగా ప్రధానిని కోరినట్లు రాష్ట్రపతిభవన్ తెలిపింది. అంతకుముందు ప్రధాని గైర్హాజరీలో మోదీ నాయకత్వాన్ని, గత ఐదేళ్లలో ప్రభుత్వం చేసిన కృషిని ప్రశంసిస్తూ కేంద్ర మంత్రులు ఒక తీర్మానం ఆమోదించారు. కాగా కొత్త మంత్రివర్గ పదవీ ప్రమాణ స్వీకారోత్సవం ఈ నెల 30న జరిగే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. జూన్ 3వ తేదీలోగా 17వ లోక్‌సభ కొలువుదీరాల్సి ఉంది. ఒకటీరెండు రోజుల్లో ముగ్గురు ఎన్నికల కమిషనర్లు రాష్ట్రపతిని కలసి కొత్తగా ఎన్నికైన సభ్యుల జాబితాను అందజేయడంతో కొత్త సభ ఏర్పాటు ప్రక్రియ మొదలవుతుంది. నేడు ఎన్డీయే సమావేశం మోదీని తమ నేతగా ఎన్నుకునేందుకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ఎంపీలు శనివారం సమావేశం కానున్నారు. కూటమి ప్రధాని అభ్యర్థిగా మోదీ ముందే ఖరారైన నేపథ్యంలో లాంఛనపూర్వకంగా ఈ భేటీ జరగనుంది. పార్లమెంటు సెంట్రల్ హాల్లో సాయంత్రం 5 గంటలకు ఈ సమావేశం జరగనుంది. అంతకుముందు పార్లమెంట్ హౌస్‌లో బీజేపీ ఎంపీలు సమావేశమవుతారు. ఎంపీలు తనను నేతగా ఎన్నుకున్న తర్వాత మోదీ వారినుద్దేశించి ప్రసంగిస్తారని సమాచారం. ఇలావుండగా ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు మే 28న మోదీ తన నియోజకవర్గం వారణాసిని సందర్శించే అవకాశం ఉందని పార్టీవర్గాలు వెల్లడించాయి. శుక్రవారం వారణాసి నుంచి వచ్చిన బీజేపీ కార్యకర్తలు మోదీని కలసి ఆయన ఎన్నికకు సంబంధించిన అధికారిక సర్టిఫికెట్‌ను అందజేశారు. సౌత్ బ్లాక్‌లో పీఎంఓ అధికారులతో ప్రధాని సమావేశమయ్యారు. ఈసారి మంత్రివర్గంలో అమిత్ షా లోక్‌సభ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి రెండోసారి అధికార పీఠాన్ని అధిరోహించేందుకు బీజేపీ సిద్ధమైన నేపథ్యంలో అందరి దృష్టీ కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై పడింది. ఈసారి మోదీ మంత్రివర్గంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సమా పలు కొత్త ముఖాలు కనబడే అవకాశం ఉందని తెలుస్తోంది. అమిత్ షాను మంత్రివర్గంలోకి తీసుకునే పక్షంలో ఆయనకు హోం, ఆర్థిక, విదేశీ వ్యవహారాలు, రక్షణ.. ఈ నాలుగు కీలక శాఖల్లో ఏదో ఒకటి అప్పగించవచ్చని తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌లు ఆరోగ్య సమస్యలతో బాధపడుతుండటంతో వీరు కొత్త మంత్రివర్గం లో ఉంటారా? లేదా? అన్న అనుమానాలు న్నాయి. రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక శాఖతో కేబినెట్లో కొనసాగే అవకాశం కన్పిస్తోంది. అమేథీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌పై సంచలన విజయం సాధించిన స్మృతీ ఇరానీకి పార్టీ ముఖ్యమైన బాధ్యతనే అప్పగించవచ్చు. వీరితో పాటు సీనియర్ మంత్రులు రాజ్‌నాథ్æ, నితిన్ గడ్కారీ, రవిశంకర్, గోయెల్, ప్రకాశ్ జవదేకర్లు కూడా కొనసాగవచ్చని తెలుస్తోంది. మిత్రపక్షాల్లో శివసేన (18), జేడీ(యూ) (16)లు మంచి ఫలితాలు సాధించిన నేపథ్యంలో వారికి కూడా చోటు దొరకవచ్చు. ఇక పశ్చిమ బెంగాల్, ఒడిశా, తెలంగాణల నుంచి కొత్త ముఖాలకు అవకాశం ఇచ్చే సూచనలున్నాయని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. సూర్యాస్తమయం అయినా వెలుగు కొనసాగుతుంది ప్రస్తుత ప్రభుత్వ పదవీకాలంపై సూర్యాస్తమయం అయినా ప్రజల జీవితాలను కాంతివంతం చేసేందుకు దాని వెలుగు ఇంకా కొనసాగుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ‘ఓ కొత్త ఉదయం ఎదురుచూస్తోంది...’ అంటూ శుక్రవారం ఒక ట్వీట్లో మోదీ పేర్కొన్నారు. మనమందరం కలలుగన్న నవ భారత సృష్టికి, 130 కోట్ల మంది ప్రజల కలలు నెరవేర్చేందుకు తన ప్రభుత్వం మరింత కృత నిశ్చయంతో ఉందని ఆయన తెలిపారు. అడ్వాణీ, జోషీలతో మోదీ–షా భేటీ సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా శుక్రవారం ఆ పార్టీ సీనియర్ నేతలు ఎల్కే అడ్వాణీ, మురళీమనోహర్ జోషీలను కలుసుకున్నారు. అమిత్ షాతో కలిసి తొలుత అడ్వాణీ ఇంటికెళ్లిన మోదీ, ఆయనకు పాదాభివందనం చేశారు. అనంతరం సార్వత్రిక ఎన్నికల ఫలితాల సరళిపై కొద్దిసేపు చర్చించారు. సమావేశం అనంతరం మోదీ స్పందిస్తూ..‘ఈరోజు బీజేపీ విజయం సాధించిందంటే అడ్వాణీలాంటి గొప్ప వ్యక్తులు దశాబ్దాలపాటు కష్టపడి పార్టీని నిర్మించడమే కారణం. వీరంతా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి సరికొత్తగా తీసుకెళ్లారు’ అని ట్వీట్ చేశారు. అనంతరం మోదీ, షా ద్వయం మురళీ మనోహర్ జోషి ఇంటికెళ్లారు. వీరిద్దరికి సాదరస్వాగతం పలికిన జోషి, మోదీకి శాలువాను బహూకరించారు. ఈ సందర్భంగా జోషికి పాదాభివందనం చేసిన మోదీ, తనవెంట తెచ్చిన స్వీట్స్‌ను అందించారు. దీంతో జోషి ధన్యవాదాలు తెలిపారు. ‘డా.మురళీమనోహర్ జోషి గొప్ప విద్యావేత్త. భారత విద్యావ్యవస్థను మెరుగుపర్చడంలో ఆయన పాత్ర చాలా కీలకమైంది. నాతో పాటు చాలామంది కార్యకర్తలకు మార్గదర్శిగా వ్యవహరించిన జోషి, బీజేపీని బలోపేతం చేసేందుకు నిరంతరం కృషి చేశారు’ అని మోదీ ప్రశంసించారు. ఈ సమావేశం అనంతరం జోషి మీడియాతో మాట్లాడుతూ.. మోదీ, అమిత్ షాలు బీజేపీకి బ్రహ్మాండమైన విజయాన్ని అందించారని కితాబిచ్చారు. ఎన్నికల్లో విజయం అనంతరం తనకు శుభాకాంక్షలు చెప్పిన అమెరికా ఉపాధ్యక్షుడు పాంపియో, రష్యా అధ్యక్షుడు పుతిన్, కెనడా ప్రధాని ట్రూడో, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, సౌదీ రాజు బిన్సల్మాన్లకు కృతజ్ఞతలు తెలిపారు. బాలీవుడ్ నటీనటులు శిల్పాశెట్టి, మాధవన్, సంగీత దర్శకుడు రెహమాన్, సరోద్ విద్వాంసుడు అమ్జాద్ ఆలీఖాన్, బాక్సర్ మేరీకోమ్లకు ధన్యవాదాలు చెప్పారు. సీనియర్ నేత ఎల్కే అద్వానీ పాదాలకు నమస్కరిస్తున్న ప్రధాని మోదీ -
‘నోటా’కు ఆదరణ!
ఈవీఎంలలో నిక్షిప్తమైన ప్రజాతీర్పు వెల్లడై విజేతలెవరో, కానివారెవరో నిర్ధారణయింది. ఇవి మాత్రమేకాదు... తరచి చూస్తే వాటిల్లో ఇతరేతర ఆసక్తికర అంశాలు కూడా అనేకం ఉంటాయి. అందులో వెల్లువెత్తిన ఆకాంక్షలతోపాటు ఆగ్రహం, ఆవేదన, నిరసన, తిరస్కారం వంటివి కూడా కనిపిస్తాయి. ఈవీఎంలపై పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లతోపాటు చివరిలో ‘పైన పేర్కొన్న ఎవరూ సమ్మతం కాదు’(నన్ ఆఫ్ ద అబౌ–నోటా) అని చెప్పడానికి అదనంగా బటన్ ఏర్పాటు చేయాలని 2013లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈసారి ఎన్నికల్లో ఆ ‘నోటా’కు భారీయెత్తున 64 లక్షల ఓట్లు పోలయ్యాయని వచ్చిన కథనం గమనించదగ్గది. ‘నోటా’ గురించి సుప్రీంకోర్టులో పౌరహక్కుల ప్రజాసంఘం(పీయూసీఎల్) ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసినప్పుడు అప్పటి యూపీఏ ప్రభుత్వం చేసిన వాదన గుర్తు తెచ్చుకోవాలి. ఓటు హక్కు అనేది పౌరులకు ప్రాథమిక హక్కు కాదని, అది చట్టపరమైన హక్కు మాత్రమేనని వాదించింది. కానీ సుప్రీంకోర్టు ఆ వాదనను తోసి పుచ్చింది. ఎన్నికల్లో ఓటేయడం అనేది రాజ్యాంగంలోని 19(1)(ఎ) అధికరణ హామీ ఇస్తున్న భావ ప్రకటనా స్వేచ్ఛలోనూ, 21వ అధికరణ హామీ ఇస్తున్న జీవించే హక్కులోనూ, వ్యక్తిగత స్వేచ్ఛ లోనూ భాగమని తెలియజేసింది. అయితే ‘నోటా’కు అభ్యర్థులకు మించి ఓట్లు పడితే ఏం చేయా లన్న అంశంపై సర్వోన్నత న్యాయస్థానం చెప్పలేదు. చెప్పి ఉంటే జనాగ్రహం ‘నోటా’లో వెల్లువెత్తి పదే పదే ఎన్నికలు పెట్టే దుస్థితి ఏర్పడేది. ప్రజలెదుర్కొంటున్న పలు రకాల ఇబ్బందులు, వారికుండే సమస్యలు ఎన్నికల ప్రచార ఘట్టంలో ప్రస్తావనకొస్తే పాలకులకు తమ లోటుపాట్లు తెలిసివస్తాయి. కొత్తగా ప్రభుత్వంలో కొచ్చేవారికి వాటిపై దృష్టి పెట్టాలన్న ఆలోచన కలుగుతుంది. మౌలిక సదుపాయాలు కొరవడటం, అధిక ధరలు, ఉపాధి లేమి, వ్యవసాయ సంక్షోభం తదితర అంశాలు ప్రస్తావనకు రావడం లేదు. ప్రజల అవగాహనకు అందని రీతిలో ప్రత్యర్థులపై ఇష్టానుసారం నిందారోపణలు చేయడం, దూషించడం ముదిరిపోయింది. తాజా సార్వత్రిక ఎన్నికలను అధ్యయనం చేసిన ప్రజాతంత్ర సంస్కరణల సంఘం(ఏడీఆర్) దేశంలోని ప్రజాస్వామ్య ప్రక్రియపై పౌరుల్లో ఒకవిధమైన నైరాశ్య భావన ఏర్పడుతున్నదని, అందువల్లే ఎన్నికల సమయంలో ఉండే ఉద్వేగమూ, ఉత్సాహమూ ఈసారి కొడిగట్టిన సూచనలు కనబడ్డాయని తెలిపింది. ఓటర్లలో 46.8 శాతంమంది మెరుగైన ఉపాధి అవకాశాలకు ప్రాధాన్యమిస్తే, ఆ తర్వాత వైద్యం, మంచినీటి సదుపాయం గురించి మాట్లా డారని... వీటిని ప్రధాన పార్టీలేవీ ప్రస్తావించకపోవడాన్ని ఎత్తిచూపారని వివరించింది. తాజా సార్వత్రిక ఎన్నికల్లో ఓటేసినవారి శాతం గతంతో పోలిస్తే స్వల్పంగానైనా పెరిగింది. 2014లో అది 66.4 శాతం ఉంటే... ఈసారి అది 66.6 శాతానికి చేరుకుంది. కానీ ఎన్నికల సమయంలో ఒకరిని మించి ఒకరు ప్రసంగాలు చేయడం... ఆ తర్వాత తమ గోడు పట్టించుకోకపోవడం మామూలేనన్న అభిప్రాయం ఎక్కువమందిలో ఏర్పడుతోంది. తెలుగుదేశం పార్టీ 2014 మేనిఫెస్టోలో 600కు పైగా హామీలిచ్చింది. కానీ వాటిల్లో వేళ్లపైన లెక్కించదగ్గ సంఖ్యలోనైనా వాగ్దానాలను అమలు చేయలేక పోయింది. అయిదేళ్లు గడిచి మళ్లీ ఎన్నికలొచ్చేసరికి వీటన్నిటిపైనా జనం ఎక్కడ నిలదీస్తారోనన్న భయంతో పార్టీ వెబ్సైట్ నుంచి ఆ మేనిఫెస్టోనే గల్లంతు చేసింది. పూర్తి స్థాయిలో రుణ మాఫీ చేస్తామని చెప్పి ఇప్పుడు పాక్షిక మాఫీ గురించి మాత్రమే మాట్లాడుతున్నారేమని చంద్రబాబు నాయుడును ప్రశ్నిస్తే అప్పట్లో ఆయన ఆగ్రహంతో ఊగిపోయారు. నేనెప్పుడు చెప్పానంటూ దబా యించారు. ఇలా అవసరాన్నిబట్టి మాట మార్చడం, ఇష్టానుసారం పాలించడం, ఎన్నికలు ముంచు కొస్తున్నాయనేసరికి ఏదో ఒకటి చేసినట్టు కనబడాలని ఆదరా బాదరాగా ఏదో పథకం పేరిట వివిధ వర్గాలకు డబ్బు వెదజల్లడం ఆంధ్రప్రదేశ్‌లో బాహాటంగా చేశారు. ఇలాంటి పనులు సహజంగానే నాయకులపై అపనమ్మకాన్ని పెంచుతాయి. ఆగ్రహం తెప్పిస్తాయి. ప్రత్యామ్నాయం ఉన్నచోట ఇలాంటి నేతలకు జనం గట్టిగానే బుద్ధి చెబుతారు. ఆ పరిస్థితి లేదనుకున్నప్పుడు ఓటేయడంపైనే అనాసక్తి ఏర్పడుతుంది. కొందరు ‘నోటా’కు వేసి తమ నిరసన తెలియజెప్పాలనుకుంటారు. బిహార్‌లో ఈసారి 8 లక్షలమంది ‘నోటా’కు ఓటేశారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆ రాష్ట్రంలోనే ‘నోటా’కు అధికంగా ఓట్లు పడ్డాయి. అక్కడున్న 40 స్థానాల్లో జేడీ(యూ)–బీజేపీ కూటమికి 33 స్థానాలు జనం కట్టబెట్టినా వారిలో చెప్పుకోదగ్గ స్థాయిలో అసంతృప్తి ఉన్నదని ఈ పరిణామం చెబుతోంది. ఆరు నెలలక్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని కాదని కాంగ్రెస్‌కు పట్టంగట్టిన రాజస్తాన్ ఓటర్లు ఈ సార్వత్రిక ఎన్నికల్లో తిరిగి బీజేపీవైపు మొగ్గు చూపారు. ఆ రాష్ట్రంలోని 25 స్థానాలనూ ఆ పార్టీ చేజిక్కించుకుంది. కానీ అక్కడ ‘నోటా’కు పడిన ఓట్లు 3.27 లక్షలు! ఈ రెండు రాష్ట్రాల్లోనూ సీపీఐ, సీపీఎం, బీఎస్పీ వంటి పార్టీల కంటే ‘నోటా’కే అధికంగా ఓట్లు పడ్డాయని గణాంకాలు చెబుతున్నాయి. ఇదే స్థితి పంజాబ్, హర్యానావంటిచోట్ల ఉంది. నేతల బూటకపు వాగ్దానాలు మాత్రమే కాదు... ఓటర్ల జాబితా రూపొందించడం దగ్గర నుంచి అడుగడుగునా అవక తవకలు తప్పడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం నేతలు టెక్నాలజీ సాయంతో తమ పార్టీకి వ్యతిరేకులనుకున్నవారి ఓట్లు తొలగించడం, నకిలీ ఓటర్లతో జాబితాలు నింపడం వంటి అక్ర మాలకు పాల్పడ్డారని ఇటీవలికాలంలో బయటపడింది. ఓటర్ల జాబితా రూపకల్పనలో అవకతవక లకు పాల్పడినా, వాటిని తారుమారు చేయడానికి ప్రయత్నించినా కఠినంగా శిక్షించేలా...ఎన్నికల సమయంలో చేసే వాగ్దానాలను ఉల్లంఘించిన∙పార్టీలను అభిశంసించేలా చర్యలు తీసుకుంటే కొంతవరకైనా ఎన్నికల ప్రక్రియ గాడిన పడుతుంది. అలాగే నేతల వదరుబోతు ప్రసంగాలపై కఠి నంగా వ్యవహరించడం అవసరం. ఇవన్నీ అమలైనప్పుడే ఎన్నికలంటే ప్రజల్లో కలిగే ఏవగింపును, నిరాసక్తతతను నివారించడం సాధ్యమవుతుంది. -
‘వైఎస్ జగన్ సీఎం కావడం సంతోషంగా ఉంది’
సాక్షి, నల్గొండ : తాను ఎంపీగా గెలవడం, వైఎస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రి కావడం తనకెంతో సంతోషంగా ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ప్రజల కోసం దివంగత నేత వైఎస్సార్ ఒక్కడుగు వేస్తే.. వైఎస్ జగన్ రెండడుగులు వేస్తారని పేర్కొన్నారు. పదేళ్ల పాటు ఎంతో శ్రమించి ప్రజాభిమానాన్ని గెలుచుకున్నారని ప్రశంసించారు. తన విజయం గురించి మాట్లాడుతూ.. నీతిగా పని చేశాను కాబట్టే ప్రజలు తనను గెలిపించారని తెలిపారు. ఒక ఎంపీగా విభజన చట్టంలో ఇచ్చిన హామీల కోసం సభలో కొట్లాడతానని పేర్కొన్నారు. పరిపాలనను గాలికొదిలేసి దోపిడీ చేస్తున్న టీఆర్ఎస్, కేసీఆర్‌కు ప్రజలు తగిన బుద్ధి చెప్పారని ఘాటుగా విమర్శించారు. కాగా గురువారం వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో భువనగిరి లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌పై కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గెలుపొందారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ నుంచి పోటీ చేసిన కోమటిరెడ్డి భారీ ఓటమిని చవిచూశారు. అయినప్పటికి కాంగ్రెస్ అధిష్టానం కోమటిరెడ్డిపై నమ్మకంతో ఆయనకు భువనగిరి లోక్‌సభ టికెట్ ఇచ్చింది. అధిష్టానం నమ్మకాన్ని నిజం చేస్తూ కోమటిరెడ్డి విజయం సాధించారు. కోమటిరెడ్డి పుట్టినరోజు నాడే ఆయన ఎంపీగా గెలుపు అందుకోవడంతో అభిమానుల ఆనందం రెట్టింపు అయ్యింది. -
ఇక రాజన్న రాజ్యం
-
ప్రాణం తీసిన బెట్టింగ్
-
టీడీపీ ఐదేళ్లపాలనలో అంతా అవినీతి
-
వైఎస్ జగన్‌కు బిజెపీ తరపున అభినందనలు
-
కాంగ్రెస్‌కు 'రాహు'కాలం
సాక్షి,బెంగళూరు: కాంగ్రెస్ పార్టీకి లోక్‌సభ ఎన్నికల్లో మామూలు షాక్ తగలలేదు. కేవలం ఒక్కటంటే ఒక్క ఎంపీ స్థానానికే పరిమితమై అందరినీ ఆశ్చర్యపరిచింది. కర్ణాటక చరిత్రలో ఇంత తక్కువ స్థాయి లో స్థానాలు దక్కించుకున్న సంఘటన మరొకటి లేదు. రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా ఇంతటి హీన స్థితిలో ఓటమి పాలవడంపై కార్యకర్తలు ఆగ్రహావేశాలకులోనవుతున్నారు. 2009లో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడే ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఆరు స్థానాలు గెలుచుకోగలిగింది. కానీ ఈసారి ఆ భాగ్యం కూడా దక్కలేదు. దీంతో కేపీసీసీ ప్రధాన కార్యాలయం వెలవెలబోయింది. 20 సీట్లపై కన్ను? జేడీఎస్‌తో కలిసి పోటీ చేసినా కాంగ్రెస్‌కు పరాభవం తప్పలేదు. 2004లో 8 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ ఈ సారి కేవలం ఒక్క స్థానానికే పరిమితమైంది. జేడీఎస్‌తో కలసి 18–20 సీట్లు గెలవాలని వేసుకున్న ప్రణాళికలన్నీ ప్లాఫ్ అయ్యాయి. 120 ఏళ్ల కాంగ్రెస్ చరిత్రలో కేవలం ఒకే స్థానంలో గెలవడం ఇప్పటివరకు జరగలేదు. జేడీఎస్‌తో మైత్రి వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా జరిగింది. సిద్ధరామయ్య, దినేశా.. ఎవరిది బాధ్యత? ఈ కాంగ్రెస్ ఘోర ఓటమికి కారణం ఎవరనే ప్రశ్న లు నేతలు, కార్యకర్తలు లేవనెత్తుతున్నారు. కాంగ్రెస్ ఓటమికి మాజీ సీఎం సిద్ధరామయ్య లేదా కేపీసీసీ అద్యక్షుడు దినేశ్ గుండూరావుల్లో ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. సిద్ధరామయ్య కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక దగ్గరి నుంచి జేడీఎస్ పార్టీకి ఏ స్థానాలు అప్పగించాలనే విషయం దాకా అన్ని ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారని కార్యకర్తలు ఆరోపించారు. మైసూరుతో పాటు చాలా స్థానాల్లో తన సన్నిహితులకు టికెట్ రావడంలో కీలకపాత్ర పోషించిన సిద్దరామయ్య ప్రస్తుత వారి ఓటమికి బాధ్యత వహిస్తారా అనే ప్రశ్నలూ వినిపిస్తున్నాయి. ఇక సిద్ధరామయ్య తాన అంటే తందానా అంటూ దినేశ్ గుండూరావు వ్యవహారించారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ గెలవగలిగే కొన్ని చోట్ల జేడీఎస్‌కు అప్పగించడంపై బహిరంగంగానే వ్యతిరేకత వ్యక్తమయింది. నరేంద్రమోదీ దూకుడును అడ్డుకోవడానికి అధినేత రాహుల్ గాంధీ సైతం ప్రచారం చేసినప్పటికీ ఏమాత్రం ప్రభావం చూపించలేదు. కాంగ్రెస్ అధిష్టానం సూచనలతో జేడీఎస్‌తో స్నేహం చేసి పూర్తిగా విఫలం చెందారు. అంతర్గత లుకలుకలతో కాంగ్రెస్ అధినేతలు విఫలమయ్యారు. జేడీఎస్, కాంగ్రెస్ నేతలు పరస్పరం వ్యతిరేకంగా పనిచేయడం నష్టం కలిగించింది. -
సార్వత్రిక ఫలితాల్లో బీజేపీ ప్రభంజనం
-
వైఎస్ జగన్‌కు ప్రణబ్ ముఖర్జీ అభినందనలు
-
పార్టీ ఫిరాయింపుదారులకు గట్టి షాక్
-
కమలానిదే కర్ణాటక
యావత్ భారతం హర హర మోదీ నినాదంతో ఊగిపోతే దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక, కొంతవరకు తెలంగాణలో మినహా ఇంకెక్కడా మోదీ మ్యాజిక్ కనిపించలేదు. దక్షిణ కోటలో పాగా వేయడానికి కోటగుమ్మంగా భావించే కన్నడనాట మాత్రం కాషాయ జెండా రెపరెపలాడింది. ఏడాది కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటలేకపోయిన బీజేపీ... సంవత్సరం తిరిగేసరికల్లా పడిలేచిన కడలితరంగంలా ఉవ్వెత్తున ఎగసింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో మాత్రం ఖాతా తెరవలేకపోయింది. ఏపీలో అతడే ఒక సైన్యంలా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్‌రెడ్డి దూసుకుపోతే తెలంగాణలో కారు జోరుకి కమలదళం కొంత వరకూ బ్రేకులు వేసింది. ఎవరి అంచనాలకూ అందని విధంగా బీజేపీ నాలుగు సీట్లను కొల్లగొట్టడంతో దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక తర్వాత బీజేపీ క్షేత్రస్థాయిలో చొచ్చుకుపోవడానికి తెలంగాణలో అనుకూల పరిస్థితులు ఉన్నాయనే అభిప్రాయాలను ఆ పార్టీ నేతలు వ్యక్తంచేస్తున్నారు. ఇక తమిళనాడులో డీఎంకే , కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ తమ సత్తాని చాటి రాష్ట్రాలను క్లీన్‌స్వీప్ చేశాయి. అండమాన్ నికోబర్లో కాంగ్రెస్ అభ్యర్థి కులదీప్ శర్మ, సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి విశాల్ జాలీపై ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కుమారస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్–జేడీ(ఎస్) అధికారంలోకి వచ్చి ఏడాదయింది. ఇంతలోనే ఫలితాలు తారుమారయ్యాయి. గత మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించిన పార్టీగా అవతరించినప్పటికీ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో విఫలమైంది. కానీ ఏడాదిలోనే ఆ పార్టీ తిరిగి రాష్ట్రంపై పట్టు బిగించింది. రాష్ట్రాన్ని క్లీన్ స్వీప్ చేసింది. కాంగ్రెస్, జేడీ(ఎస్) దిగ్గజ నేతలు కమలం ధాటికి కుదేలయ్యారు. కాంగ్రెస్–జేడీ(ఎస్) కూటమిలో లుకలుకలు ఒక్కొక్కటీ బయటపడి కుమారస్వామి తన పరిస్థితి గరళం మింగిన శివుడిలా మారిందంటూ కన్నీరు పెట్టుకోవడం చర్చనీయాంశమయింది. కూటమి ఎమ్మెల్యేలపై బీజేపీ ఆపరేషన్ కమలను ప్రయోగిస్తుందన్న ప్రచారంతో కాంగ్రెస్–జేడీ(ఎస్) కూటమి బలహీనపడసాగింది. వారి బలహీనతే బీజేపీకి బలంగా మారింది. 22 ఎంపీ స్థానాలను గెలిస్తే, కర్ణాటకలో రాష్ట్ర ప్రభుత్వమే మారిపోతుందని ఇటీవల బీజేపీ నేత బీఎస్ యడ్యూరప్ప చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఇప్పుడు బీజేపీ భారీ విజయంతో కాంగ్రెస్–జేడీ(ఎస్) సర్కార్ గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. కమలం ధాటికి కాంగ్రెస్, జేడీ (ఎస్) దిగ్గజ నేతలు ఓటమి పాలయ్యారు. తుమకూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మాజీ ప్రధానమంత్రి, జేడీ(ఎస్) వ్యవస్థాపక అ«ధ్యక్షుడు హెచ్డీ దేవెగౌడ ఓటమి పాలయ్యారు. బీజేపీ అ«భ్యర్థి బసవరాజ్ చేతిలో ఓడిపోయారు. ఇప్పటివరకు దేవెగౌడ ప్రాతినిధ్యం వహించిన హసన్ నుంచి ఆయన మనవడు ప్రజ్వల రేవణ్ణ మాత్రమే విజయం సాధించారు. కేంద్ర మాజీ మంత్రి, కాం గ్రెస్ అభ్యర్థి వీరప్పమొయిలీ చిక్‌బళ్లాపూర్ నుంచి బీజేపీ అభ్యర్థి బచ్చే గౌడ చేతిలో ఓడిపోతే, మరో కేంద్ర మాజీ మంత్రి మల్లిఖార్జున్ ఖర్గే గుల్బర్గా నియోజకవర్గం నుంచి పోటీకి దిగి బీజేపీ అభ్యర్థి ఉమేశ్ యాదవ్ చేతిలో ఓటమిపాలయ్యారు. ప్రకాశించని రాజ్.. సుమలత రికార్డు బీజేపీ పాలనను ఎండగొడుతూ నటుడు ప్రకాశ్ రాజ్ జస్ట్ ఆస్కింగ్ అంటూ చేసిన ప్రచారం ఆశించిన ఫలితాన్నివ్వలేదు. బెంగళూరు సెంట్రల్‌నుంచి పోటీ చేసిన ప్రకాశ్ రాజ్ దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ప్రముఖ నటి, దివంగత నటుడు అంబరీష్ సతీమణి సుమలత స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించి రికార్డు సృష్టించారు. మండ్య నుంచి కాంగ్రెస్ టికెట్ సుమలత ఆశించినప్పటికీ పొత్తులో భాగంగా ఆ సీటు జేడీ(ఎస్)కి వెళ్లిపోయింది. అక్కడి నుంచి సీఎం కుమారస్వామి కుమారుడు, నటుడు నిఖిల్ గౌడను దింపారు. దీంతో సుమలత స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. బీజేపీ ఇక్కడ అభ్యర్థిని నిలబెట్టకుండా సుమలతకు మద్దతు పలికింది. చివరికి సెంటిమెంటే గెలిచింది. కర్ణాటకలో 52 ఏళ్ల తర్వాత ఒక మహిళా అభ్యర్థి పార్లమెంటులోకి అడుగుపెడుతోంది. తమిళనాడులో స్టాలిన్ సత్తా తమిళనాడులో మొత్తం 39 నియోజకవర్గాలకు గాను 38 నియోజకవర్గాల్లోనే ఎన్నికలు జరిగాయి. వేలూరు లోక్‌సభ నియోజకవర్గంలో «నోట్ల కట్టలు భారీగా పట్టుబడడంతో కేంద్ర ఎన్నికల కమిషన్ పోలింగ్‌ను వాయిదా వేసింది. ద్రవిడ రాజకీయాల్లో చరిత్ర సృష్టించి ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసిన ఇద్దరు అగ్ర నేతలు కరుణానిధి, జయలలిత లేకుండా జరిగిన తొలి ఎన్నికలివి. మొదట్నుంచి ఉత్తరాది ప్రభావాన్ని అంగీకరించకుండా జాతీయ పార్టీలను దూరంగా ఉంచే తమిళ తంబీలు ఈసారి కూడా అదే బాటలో నడిచారు. కరుణానిధి వారసుడు స్టాలిన్‌కే పట్టం కట్టారు. సంక్షోభంలో కూరుకుపోయిన తమిళ రైతులు ఢిల్లీ వీధుల్లో రోజుల తరబడి ఆందోళనలు చేసినా ఎన్డీయే సర్కార్ కరుణించకపోవడం, నోట్ల రద్దు, జీఎస్టీ ప్రభావం, కరువు కోరల్లో చిక్కుకున్న పలు ప్రాంతాలు వంటివి కేంద్రంతో పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న అన్నాడీఎంకేపైనా ప్రజల్లో వ్యతిరేకతను పెంచాయి. ఈ వ్యతిరేకత డీఎంకే–కాంగ్రెస్ కూటమి విజయానికి బాటలు వేసింది. గత ఎన్నికల్లో ఒక్క కన్యాకుమారిలో మాత్రం గెలిచిన బీజేపీ... ఈసారి ఒక్కస్థానంలోనూ నెగ్గలేక చతికిలపడింది. తండ్రి ఉన్నన్నాళ్లూ ఆయన నీడలా ఉన్న స్టాలిన్ ఈ ఎన్నికల్లో కరుణానిధికి అసలు సిసలు వారసుడిగా ఎదిగి తన సత్తా చాటారు. గత లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా సాధించలేకపోయిన డీఎంకేను ఈ సారి ఎన్నికల్లో పరుగులు పెట్టించారు. తమిళనాడులో డీఎంకే జయకేతనం తమిళనాడులో డీఎంకే జయకేతనం ఎగరవేసింది. లోక్‌సభ, ఉప ఎన్నికల్లోనూ డీఎంకే తన ఆధిక్యాన్ని చాటు కుని అన్నాడీఎంకేను కంగుతినిపిం చింది. తమిళనాడులోని 39 లోక్‌సభ స్థానాలకు 38 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. వేలూరు లోక్‌సభ స్థానంలో ఈసీ ఎన్నికలను రద్దు చేసింది. మొత్తం 38 లోక్‌సభ స్థానాల్లో 37 సీట్లు, 22 ఉప ఎన్నికల్లో 13 స్థానాలను డీఎంకే సొంతం చేసుకుంది. అన్నాడీఎంకే 2 లోక్‌సభ స్థానాల్లో, 9 ఉప ఎన్నికల స్థానాల్లో స్వల్ప మెజార్టీతో ముందంజలో ఉంది. అమ్మలేని లోటు జయలలిత మృతి తర్వాత అన్నాడీఎంకేకి అమ్మలేని లోటు స్పష్టంగా తెలిసింది. జయలలిత మేనల్లుడు దినకరన్ పార్టీని చీల్చడం, అక్రమాస్తుల కేసులో జయలలిత నెచ్చెలి శశికళ జైలుకి వెళ్లడం, పన్నీరు సెల్వం, పళనిస్వామి వర్గాలు విభేదించి మళ్లీ చేతులు కలపడం, జయలలితకు తగిన వారసులెవరూ లేకపోవడం వంటి పరిణామాలు పార్టీలో అంతర్గత సంక్షోభానికి దారితీశాయి. గత ఎన్నికల్లో జయలలిత ఆధ్వర్యంలో అన్నాడీఎంకే ఒంటరిగా బరిలో దిగి 39 స్థానాలకు గాను 37 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. జయలలిత ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాల ముందు ప్రధాని నరేంద్ర మోదీ హవా పనిచేయలేదు. ఈసారి ఏఐఏడీఎంకే, బీజేపీ, పీఎంకే, డీఎండీకే చేతులు కలిపి మెగా కూటమిని ఏర్పాటు చేసినా ఫలితం లేకుండా పోయింది. జయలలిత మృతి చెందాక రాష్ట్రంలో తీవ్ర అనిశ్చితి నెలకొంది. ఎన్నో ప్రజాందోళనలు చెలరేగాయి. రైతు సంక్షోభం, నీట్ పరీక్షలు, స్టెరిలైట్ ఫ్యాక్టరీని తొలగించాలన్న ఆందోళనలు, 8 రహదారుల సలేం హైవే, అమ్మాయిల అశ్లీల వీడియోల పొల్లాచి సెక్స్ స్కాండల్‌లో అన్నాడీఎంకే పార్టీ నేతలు, కార్యకర్తల పాత్రపై ఆరోపణలు వంటివన్నీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీపై తీవ్ర వ్యతిరేక ప్రభావాన్నే చూపించాయి. డీఎంకే పార్టీతో జత కట్టిన కాంగ్రెస్ పార్టీకి ఈ విజయం కాస్త ఊపిరినిచ్చిందనే చెప్పాలి. శివగంగ నియోజకవర్గం నుంచి కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం, తూతుకూడి నుంచి స్టాలిన్ సోదరి కనిమొళి విజయం సాధించారు. కేరళలో కాంగ్రెస్ కూటమి క్లీన్ స్వీప్ వామపక్షాల పట్టున్న ఏకైక రాష్ట్రం కేరళలో శబరిమల ఆలయ వివాదమే ఈ సారి ఎన్నికల్ని నడిపించింది. శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశానికి సుప్రీం కోర్టు అనుమతినివ్వడంతో జరిగిన రగడ అ«ధికార లెఫ్ట్ పార్టీని ఆత్మరక్షణలో పడేసింది. ఈ సారి ఎన్నికల్లో దాని ప్రభావం గట్టిగానే కనిపించింది. అదే సమయంలో బీజేపీ కూడా ఈ ఆలయ వివాదంతో ఏ మాత్రం లాభపడలేదు. కేరళలో ఖాతా తెరవాలన్న ఆ పార్టీ ఆశలపై కాంగ్రెస్ నీళ్లు పోసింది. శబరిమలలోకి మహిళల ప్రవేశాన్ని అడ్డుకొని, ఆలయ సంప్రదాయాలను కాపాడతామంటూ బీజేపీతో పాటు కాంగ్రెస్ శ్రేణులూ పోరాటానికి దిగాయి. అది కాంగ్రెస్‌కే లాభం చేకూర్చింది. అంతేకాక అమేథీలో గెలుపు అవకాశాలపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి మొదట్నుంచి అనుమానాలు ఉండడంతో కేరళలో వయనాడ్ నుంచి కూడా బరిలోకి దిగారు. సీపీఐ అభ్యర్థి ఆర్పీ సునీర్‌పై 4 లక్షల 30వేల పై చిలుకు మెజార్టీతో రాహుల్ నెగ్గారు. ఇక్కడ రాహుల్ పోటీ చేసిన ప్రభావం యూడీఎఫ్ అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవడానికి దోహదపడింది. యూడీఎఫ్ ఈ ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేయడం సీపీఎం నేతృత్వంలో లెఫ్ట్ ఫ్రంట్ ఓటమి పినరయి విజయన్ సర్కార్‌కు నష్టం కలిగించే అవకాశాలే కనిపిస్తున్నాయి. ‘జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌నే కేరళ ప్రజలు ఎంచుకున్నట్టుగా కనిపిస్తోంది. అదే యూడీఎఫ్‌కి కలిసొచ్చింది‘ అని కేరళ ఎన్నికల పరిశీలకుడు డా. సాజద్ ఇబ్రహీం అభిప్రాయపడ్డారు. తిరువనంతపురంలో కాంగ్రెస్ నేత శశిథరూర్ విజయం సాధిస్తే, భారతీయ జనతాపార్టీ అభ్యర్థి, కేరళ బీజేపీ మాజీ చీఫ్ కె.రాజశేఖరన్ రెండోస్థానంలో నిలిచారు. మిగిలిన అన్ని స్థానాల్లో బీజేపీ మూడో స్థానానికి మాత్రమే పరిమితమైంది. ఇక పుదుచ్చేరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వైద్యలింగం, ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి నారాయణస్వామి కేశవన్‌ను ఓడించింది. లక్షదీవులు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అభ్యర్థి మహమ్మద్ ఫైజల్ ఘన విజయం సాధించారు. -
గెలుపు సూత్రం ఇదే..
ఇచ్చిన మాటకు ఆరునూరైనా కట్టుబాటు...చెక్కుచెదరని ధైర్యంతో ముందడుగు...ఆపదొస్తే అందరికీ నేనున్నాననే ఓదార్పు...అవసరమైతే కొండనైనా ఢీ కొట్టే తెగింపు...జన యాత్రలతో మమేకమయ్యే ఓర్పు... ఉక్కు సంకల్పంతో పోరాడే నేర్పు...భవితకు భరోసా ఇచ్చే చల్లని చూపు...‘అన్నా’ అంటూ అక్కున చేర్చుకునే పిలుపు...నైతిక విలువలే ప్రధానమనే తీర్పు...సడలని దీక్షకు అతడే ఓ గుర్తింపు... సాక్షి, అమరావతి: మాట తప్పని, మడçమ తిప్పని రాజకీయ వారసత్వానికి లభించిన తిరుగులేని అఖండ విజయమిది. పాదయాత్రికుడి కష్టం ఫలించిన తరుణమిది. ఐదేళ్లు ఆంధ్రప్రదేశ్‌ను పట్టి పీడించిన దుర్మార్గ పాలనకు చరమ గీతం పాడి, విశ్వసనీయతకు ప్రజలు పట్టం గట్టిన రోజు ఇది. తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కనీవినీ ఎరుగని రీతిలో తెలుగు ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలనే ఆలంబనగా చేసుకుని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రూపొందించిన నవరత్నాలపై ప్రజలకు కుదిరిన నమ్మకమిది. దృఢ వ్యక్తిత్వం, చెక్కుచెదరని ఆత్మవిశ్వాసాలనే ఆయుధంగా చేసుకుని ప్రత్యర్థుల కుట్రలను తుత్తునియలు చేస్తూ ఒంటి చేత్తో తన పార్టీకి అఖండ విజయాన్ని సాధించి పెట్టారు. 2014 ఎన్నికల ఓటమిని ఓ అనుభవంగా తీసుకున్న జగన్, తొలుత తన బలాబలాలేమిటో కచ్చితంగా అంచనా వేసుకోవడంతోపాటు పార్టీలో ఉన్న లోటుపాట్లపై క్షుణ్నంగా అధ్యయనం చేశారు. పార్టీ శ్రేణులను ప్రజలతో మమేకమయ్యే విధంగా ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించారు. చంద్రబాబు సర్కార్ మోసంతో నిరాశకు లోనైన రైతులు, మహిళలు, నిరుద్యోగులకు అండగా నిలబడ్డారు. ఎన్నో దీక్షలు, ఆందోళనలు ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. అధికార పక్షం శాసనసభలో స్పీకర్‌ను అడ్డుపెట్టుకుని గొంతు నొక్కే యత్నం చేసినా చలించకుండా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వచ్చారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదనే స్థాయికి పార్టీని ప్రజలకు చేరువ చేశారు. ప్రజాసంకల్పంతో ప్రజల హృదయాల్లోకి.. ప్రజా సమస్యలను తెలుసుకుని వారికి భరోసా ఇవ్వడానికి వైఎస్ జగన్ చేసిన ప్రజాసంకల్ప యాత్ర వారి హృదయాల్లోకి చొచ్చుకుపోయింది. 341 రోజుల పాటు 13 జిల్లాల్లో 3,648 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేయడం దేశ చరిత్రలో ఒక రికార్డుగా నిలిచింది. ఈ యాత్రలో మహిళలు, వృద్ధులు, యువకులు ఇలా అన్ని వయసుల వారు, వర్గాల వారు జగన్‌ను తమ ఆత్మీయుడిగా అక్కున చేర్చుకున్నారు. పాదయాత్ర ద్వారా జనాదరణ పొందడాన్ని జీర్ణించుకోలేని శక్తుల కుట్ర ఫలితంగా జగన్‌పై విశాఖపట్నం విమానాశ్రయంలో హత్యాయత్నం జరిగింది. దీన్ని అధికార పక్షం గేలి చేస్తూ మాట్లాడినప్పటికీ.. జగన్ సంయమనం, హుందాతనం ఆకట్టుకున్నాయి. నవరత్నాలతో నమ్మకం: అన్ని వర్గాల లబ్ధికి జగన్ ప్రకటించిన నవరత్నాలు ప్రజల్లోకి బాగా వెళ్లాయి. పార్టీని ప్రజలకు చేరువ చేసేలా ‘గడప గడపకూ వైఎస్సార్’, ‘రావాలి జగన్ – కావాలి జగన్’, ‘వైఎస్సార్ కుటుంబం’ వంటి కార్యక్రమాలను చేపట్టారు. 175 నియోజకవర్గాల్లో ప్రతి బూత్లోనూ పార్టీ జెండా పట్టుకుని ఓట్లేయించే కార్యకర్తలను పార్టీకి సమకూర్చుకోగలిగారు. శాసనసభ, లోక్‌సభ అభ్యర్థుల ఎంపికలో జగన్ ఎక్కడా రాజీ పడలేదు. ఇడుపులపాయలో 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలకు పార్టీ అభ్యర్థులను ఒకే రోజు ప్రకటించి సంచలనం సృష్టించారు. ప్రత్యేక హోదాపై రాజీలేని పోరు: ప్రత్యేక హోదా కోసం పట్టుబట్టని టీడీపీ వైఖరిని తీవ్రంగా నిరసిస్తూ జగన్ పోరాటానికి నడుం కట్టారు. కేంద్రంలో ఎన్డీయే మిత్రపక్షంగా, భాగస్వామిగా ఉన్న టీడీపీ ప్రత్యేక హోదా ఊసు ఎత్తకపోవడం ఆ పార్టీ ప్రతిష్టను ప్రజల్లో మసకబార్చింది. జగన్ ప్రత్యేక హోదా అవసరం ఎంతగా ఉందో తెలియజెబుతూ యువభేరీ సదస్సులు నిర్వహించారు. గుంటూరులో నిరవధిక నిరాహార దీక్ష చేశారు. ఫలించిన బీసీ డిక్లరేషన్ బీసీల అభ్యున్నతికి ప్రత్యేక అధ్యయన కమిటీని ఏర్పాటు చేసి వారు చేసిన సూచనలకు అనుగుణంగా ఫిబ్రవరి 17న ఏలూరు బీసీ గర్జనలో జగన్ చేసిన బీసీ డిక్లరేషన్ వెనుకబడిన వర్గాలపై ఒక మంత్రంగా పనిచేసింది. ప్రభుత్వ పరిధిలోని నామినేటెడ్ పదవులన్నింటిలోనూ, కాంట్రాక్టుల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 శాతం కేటాయిస్తానని ప్రకటించారు. అంతేకాకుండా 41 మంది బీసీ అభ్యర్థులకు అసెంబ్లీ సీట్లు, ఏడుగురికి ఎంపీ సీట్లను కేటాయించారు. వీటన్నింటికీ తోడు ‘నిన్ను నమ్మం బాబూ’.. ‘బైబై బాబూ’.. ‘రావాలి జగన్– కావాలి జగన్’ నినాదాలు ప్రజల్లో బాగా ప్రాచుర్యం పొందాయి. ఒక నాయకుడు పట్టుదలతో పోరాడితే దక్కేది ఘన విజయమేనని నిరూపించారు. -
జనం నమ్మని జనసేన
సాక్షి, అమరావతి: సినీ నటుడు పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీని ఓటర్లు మట్టి కరిపించారు. ప్రతిపక్ష పార్టీకి దక్కాల్సిన ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడం ద్వారా తిరిగి టీడీపీ గెలుపు కోసమే ఆ పార్టీ పోటీ చేస్తోందని విశ్వసించిన ఓటర్లు ఆ పార్టీని పూర్తిగా తిర్కసరించారు. భీమవరం (పశ్చిమగోదావరి), గాజువాక (విశాఖపట్నం)ల నుంచి పోటీ చేసిన పవన్ రెండుచోట్లా ఓడారు. మొత్తం 136 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తే కేవలం ఒక్క రాజోలు నియోజకవర్గంలో మాత్రమే అత్తెసరు మెజార్టీతో గట్టెక్కింది. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ కేవలం ఏడు శాతం లోపు ఓట్లు మాత్రమే దక్కించుకుంది. టీడీపీతో కుమ్మక్కు రాజకీయాల వల్లే.. 2014 ఎన్నికల ముందే జనసేన పార్టీని ఏర్పాటు చేసినా ఆ ఎన్నికల్లో పోటీ చేయకుండా బీజేపీ, టీడీపీ కూటమికి మద్దతిచ్చింది. ఆ తర్వాత కూడా పవన్ దాదాపు నాలుగేళ్ల పాటు టీడీపీకే ప్రతి సందర్భంలో మద్దతిస్తూ వచ్చారు. ప్రశ్నించడానికే జనసేన స్థాపించానంటూ వల్లె వేస్తూ వచ్చిన పవన్.. చంద్రబాబు ప్యాకేజీలకు ‘ఖర్చ’వుతూ వచ్చారు. తిరిగి ఈ ఎన్నికలకు ఏడాది ముందు నుంచి చంద్రబాబును విభేదిస్తూ తన రాజకీయాలను కొనసాగించారు. అయితే, ఈ కాలంలో టీడీపీపై అప్పడప్పుడూ విమర్శలు చేసినా.. రహస్య మిత్రులుగా కొనసాగుతూ వచ్చారన్న విమర్శలున్నాయి. సీఎం తనయుడు లోకేష్ పోటీ చేసే మంగళగిరిలో కనీసం జనసేన అభ్యర్థిని నిలబెట్టకుండా సీపీఎంనే పవన్ పోటీలో ఉంచారు. సీఎం చంద్రబాబు సైతం పవన్ కల్యాణ్ పోటీ చేసిన రెండు స్థానాల్లో ప్రచారానికి దూరంగా ఉన్నారు. అధికారంలో ఉన్న చంద్రబాబును వదిలేసి ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్రెడ్డిని టార్గెట్ చేయడం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. పవన్ వ్యవహారశైలిని నిశితంగా పరిశీలించిన ఓటర్లు.. కర్రుకాల్చి వాత పెట్టారు. పవన్‌తోపాటు నర్సాపురం పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన సోదరుడు కొణిదెల నాగబాబును సైతం చిత్తుగా ఓడించారు. అక్కడ వైఎస్సార్సీపీ ప్రభంజనంలో నాగబాబు మూడో స్థానానికి దిగజారారు. -
అక్కచెల్లెమ్మల ఆత్మీయత జగన్‌కే..
సాక్షి, అమరావతి: అమ్మ దీవించింది. అవ్వా తాతలు ఆశీర్వదించారు. అక్కచెల్లెమ్మలు ఆత్మీయత పంచారు.. అన్నా తమ్ముళ్లు అండగా నిలిచారు. అఖిలాంధ్ర ఓటర్లు జననేతకు బ్రహ్మరథం పట్టారు. వయో భేదం లేకుండా వైఎస్ జగన్ విజయాన్నే కోరుకున్నారు. కులమతాలు, ప్రాంతాలతో ప్రమేయం లేకుండానే జగన్ వైపే జనం నిలిచారు. వెన్నుపోటు రాజకీయం బతుకు భరోసా లేకుండా చేస్తుందనే కసితో జనం ఓటేశారు. విపక్ష నేతగా ప్రజల కోసం పోరాడిన జగన్‌ను గెలిపించుకోవడం బాధ్యతగా భావించారు. భావితరాల కోసం ఆయననే గెలిపించాలన్న ఆకాంక్ష వెలిబుచ్చారు. ఇప్పుడు గెలిచింది ప్రజలు.. వారి విశ్వాసం. నమ్మకం. అవధులు లేని ఆనందం ‘నా అన్నే సీఎం అయ్యాడు’ అని ప్రతీ చెల్లీ భావిస్తోంది. ‘నా తమ్ముడే సీఎం అయ్యాడు’ అని ప్రతీ అక్కా ఆనందపడుతోంది. ‘మనవడొచ్చాడు’ అంటూ అవ్వాతాతల్లో ఆనందం కన్పిస్తోంది. ‘గెలిచామన్నా’ అనేది తమ్ముళ్ల సంతోషం. ఇక రైతే రాజని కర్షకులు.. కష్టానికి ఫలితమొచ్చిందని కార్మికులు భావిస్తున్నారు. చావు బతుకుల్లో పోరాడుతున్న రోగులకు జగన్ గెలుపు ధైర్యాన్నిస్తుంది. ఆరోగ్యశ్రీ ఆయువు పోస్తుందనే ధీమా తెచ్చింది. రాష్ట్రానికి హోదా దక్కుతుందన్న ధీమా ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. జిమ్మిక్కులు లెక్కచేయని అక్కచెల్లెమ్మలు.. తాయిలాలు ఇస్తే ఎన్నికల్లో మహిళలు ఓట్లు వేయరనే విషయం ఈ ఎన్నికల ఫలితాలే రుజువు చేశాయి. డ్వాక్రా రుణ మాఫీ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేసిన చంద్రబాబును ఏ అక్కాచెల్లీ నమ్మలేదు. జగన్‌కు ఒక్క అవకాశం ఇచ్చి తీరాలని తీర్మానించుకున్నారు. ‘ఈ తాయిలం మాకెందుకు... జగన్ గెలిస్తే ఇంతకన్నా ఎన్నో రెట్లు మేలు జరుగుతుంది’ అని చెప్పి మరీ అక్కాచెల్లెమ్మలు ఓట్లేశారు. అవ్వాతాతలదీ అదే దారి. పాదయాత్రలో కష్టాలు చెప్పినప్పుడు జగన్ కరిగిపోయాడు. అధికారంలోకొస్తూనే అందరికీ పింఛన్ ఇస్తానన్నాడు. ఇచ్చే పింఛన్ పెంచుతానన్నాడు. చంద్రబాబు హడావుడిగా పింఛన్ పెంచేశారు. జగన్ మాటతోనే ఇంత కదలిక వస్తే.. ఆయనే సీఎం అయితే.. ఆ నమ్మకమే అవ్వాతాతలు జగన్‌కు ఓటేసేలా చేసింది. అదిగో మన నేత.... ‘అదిగో ఆయనే. మన ఇంటికొచ్చింది ఆయనే. మనతో కలిసి నడిచిందీ ఆయనే’ ఆనందం మేళవించిన అనుభూతిలో జనహృదయ స్పందన ఇది. నిన్నటిదాకా తమ ముందే తిరిగిన నేత రాష్ట్రాధినేత అవ్వడంతో ప్రజలు మురిసిపోతున్నారు. పాదయాత్రలో జగన్‌తో సెల్ఫీ దిగని వ్యక్తి లేరు. హారతులు పట్టని పల్లె లేదు. ఆదరించని ఊరు లేదు. మండువేసవిలోనూ, జోరువానలోనూ జననేతతో అడుగులో అడుగులేశారు. ఎముకలు కొరికే చలిలోనూ తమ నేత కోసం పడిగాపులుగాశారు. ప్రజల కష్టాలను విన్నారు. వారికి భరోసా ఇచ్చారు. పాదయాత్రలో ప్రతీ అడుగూ జన ప్రభంజనమే. తమ కష్టసుఖాల్లో పాలుపంచుకున్న వ్యక్తి.. తమవాడే అన్న నమ్మకం కలిగించిన వ్యక్తి ముఖ్యమంత్రి పీఠమెక్కాడనే గర్వం జనంలో స్పష్టంగా కన్పిస్తోంది. రాక్షస సంహారమే... వైఎస్సార్సీపీ అఖండ విజయాన్ని ప్రజలు నరకాసుర సంహారమే అంటున్నారు. కష్టాలను అనుభవించిన వాళ్లు, కసితో ఓటేసిన వారి అభిప్రాయమది. ఐదేళ్లుగా గిట్టుబాటు ధర లేని రైతు గుండె మంట నుంచీ వచ్చే మాటిది. రుణమాఫీ ద్వారా మోసపోయిన రైతుల, దగాపడ్డ అక్కచెల్లెమ్మల ఆవేదనిది. ఫీజు రీయింబర్స్మెంట్ రాక విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆక్రందనల ఫలితమిది. జన్మభూమి కమిటీల దోపిడీ మూకలపై జనం తిరుగుబాటిది. అధికార అహంకారంపై ప్రభుత్వ ఉద్యోగుల కన్నెర్ర ఫలితం ఇది. సహజ వనరులను దోచుకుని, నల్లధనంతో విపక్ష ఎమ్మెల్యేలను సంతలో çపశువుల్లా కొన్న అప్రజాస్వామిక విధానాలకు చెప్పిన గుణపాఠమిదని ప్రజలు భావిస్తున్నారు. వైఎస్సార్సీపీకి మహిళల బ్రహ్మరథం తమను గెలిపిస్తుందని చంద్రబాబు కోటి ఆశలు పెట్టుకున్న పసుపు– కుంకుమ పథకం టీడీపీని చావు దెబ్బే తీసింది. ఐదేళ్లుగా అనేక రకాలుగా మోసం చేసినా రాష్ట్రంలో 95 లక్షల మంది దాకా ఉన్న డ్వాక్రా మహిళలకు ఎన్నికల ముందు ఏదో ఒక తాయిలం ఇస్తే వాళ్ల ఓట్లన్నీ తమకే పడతాయని భ్రమల్లో ఉన్న టీడీపీ అధినేతకు ఫలితాలు షాక్ ఇచ్చాయి. వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాలు మహిళలను విశేషంగా ఆకట్టుకోవడంతో వైఎస్సార్సీపీకి వారంతా బ్రహ్మరథం పట్టారు. రాష్ట్రంలో మొత్తం 3,93,45,717 మంది ఓటర్లుండగా.. ఏప్రిల్ 11న జరిగిన ఎన్నికల్లో 3,13,33,631 మంది ఓటు వేశారు. మొత్తం ఓటర్లలో 1,98,79,421 మంది మహిళా ఓటర్లే. కాగా 1,57,87,759 ఓట్లు పోలయ్యాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పోలిస్తే శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో మహిళలు అత్యధికంగా ఓట్లు వేసినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఆ జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలుండగా.. మొత్తం సీట్లను వైఎస్సార్సీపీ గెలుచుకుంది. మాఫీ పేరుతో మాయ మొత్తం 1.98 కోట్ల మంది మహిళా ఓటర్లలో దాదాపు కోటి మంది డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. 2014 ఎన్నికల వాగ్దానంలో భాగంగా తాను అధికారంలోకి వస్తే డ్వాక్రా సంఘాల రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే ఐదేళ్లలో ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదు. జీరో వడ్డీ పథకానికి నిధులు మంజూరు చేయలేదు. ఎన్నికలకు నెల రోజుల ముందు పసుపు–కుంకుమ పేరుతో ఎన్నికల తాయిలం ప్రకటించారు. సరిగ్గా పోలింగ్‌కు రెండురోజుల ముందు నుంచి ప్రభుత్వ ఖజానా నుంచి డ్వాక్రా మహిళలకు డబ్బులిచ్చారు. దీంతో మహిళల ఓట్లన్నీ గంపగుత్తగా తెలుగుదేశం పార్టీకే పడ్డాయని, గెలుపు తమదేనని చంద్రబాబు, టీడీపీ నేతలు ప్రచారం చేశారు. తీరా టీడీపీకి మహిళలు దిమ్మ తిరిగిపోయే ఫలితాన్నివ్వడంతో డీలాపడిపోయారు. -
గల్లంతైన బాబు కేబినెట్!
సాక్షి, అమరావతి: ఎన్నికల ఫలితాల్లో చంద్రబాబు మంత్రివర్గం దాదాపు గల్లంతైంది. 24 మంది మంత్రుల్లో 22 మంది పోటీచేయగా 19 మంది ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ప్రజల గురించి పట్టించుకోకుండా ఐదేళ్లు ఇష్టారాజ్యంగా అవినీతి వ్యవహారాల్లో మునిగితేలిన మంత్రులపై ఆయా నియోజకవర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. శాఖలపై ఏమాత్రం పట్టులేకుండా, కమీషన్ల కోసం కక్కుర్తి పడుతూ, ప్రతిరోజూ ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డిని తిట్టడమే పనిగా పెట్టుకున్న మంత్రులందరినీ ప్రజలు ఇంటిదారి పట్టించారు. చంద్రబాబు వీరవిధేయుడిగా ఆయన మంత్రివర్గంలో కీలకమైన జలవనరుల శాఖ నిర్వహిస్తున్న దేవినేని ఉమామహేశ్వరరావు మైలవరంలో ఓటమిపాలయ్యారు. తమ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని, జగన్ అధికారంలోకి రావడం కలేనని డబ్బా కొట్టుకున్నా మైలవరం ప్రజలు మాత్రం ప్రజాప్రతినిధిగా పనికిరారని తేల్చి ఇంటికి పంపారు. దీంతో ఉమా నోటికి తాళం పడింది. తమ కుటుంబానికి చిరకాల ప్రత్యర్థిగా ఉన్న వసంత కృష్ణప్రసాద్.. దేవినేని ఉమను ఓడించారు. కొల్లు, ప్రత్తిపాటి, సోమిరెడ్డి, నక్కా, ఆది సైతం.. మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర.. గుంటూరు జిల్లాకు చెందిన నక్కా ఆనంద్‌బాబుకు వేమూరులో పరాభవం ఎదురైంది. చంద్రబాబు కేబినెట్లో వ్యవ సాయ శాఖ మంత్రులుగా పనిచేసిన ఇద్దరూ ఓటమి పాలయ్యారు. రాష్ట్ర విభజన అనంతరం తొలిసారి వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన ప్రత్తిపాటి పుల్లారావు, ఆ తర్వాత ఆ శాఖను చేపట్టిన సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పరాజయం పొందారు. పుల్లారావు గుంటూరు జిల్లా చిలకలూరిపేట నుంచి పోటీచేసి వైఎస్సార్సీపీ అభ్యర్థి విడదల రజనీ చేతిలో ఓడి పోయారు. సోమిరెడ్డి నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి కాకాణి గోవర్ధన్‌రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. అలాగే, వ్యవసాయంలో అంతర్భాగంగా ఉన్న పశుసంవర్థక శాఖకు మంత్రిగా పనిచేసిన ఆదినారాయణరెడ్డి కూడా కడప లోక్‌సభ నుంచి వైఎస్ అవినాష్‌రెడ్డి చేతిలో ఘోర పరాజయం పొందారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ‘కళా’ కూడా.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, సీనియర్ మంత్రి కళా వెంకట్రావు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో ఓడిపోయారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ఉన్న ఆయన ఓడిపోవడం టీడీపీ పతనావస్థను తెలుపుతోంది. - ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నా రకరకాల సమీకరణలతో గెలిచేందుకు విశ్వప్రయత్నాలు చేసిన పితాని సత్యనారాయణ, చెరకువాడ రంగనాథ రాజు చేతిలో ఓటమి చవిచూశారు. - గత ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నుంచి గెలిచి మంత్రి అయిన కేఎస్ జవహర్‌పై అక్కడి కేడర్ తిరుగుబాటు చేయడంతో చంద్రబాబు ఆయనకు కృష్ణా జిల్లా తిరువూరు సీటిచ్చినా ప్రయోజనం లేకుండాపోయింది. తిరువూరులో వైఎస్సార్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే రక్షణనిధి చేతిలో జవహర్ ఓడిపోయారు. - చంద్రబాబు కేబినెట్లో సీనియర్ మంత్రిగా ఉన్న చింతకాయల అయ్యన్నపాత్రుడు కూడా విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఘోరంగా ఓడిపోయారు. - ఇటీవల వరకూ మంత్రిగా ఉన్న అదే జిల్లాకు చెందిన కిడారి శ్రావణ్‌కుమార్ అరకులో పరాజ యం పాలయ్యారు. వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన కిడారి సర్వేశ్వరరావును మావోయిస్టులు హతమార్చడంతో ఆయన కొడుకు శ్రావణ్‌కు చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చి సానుభూతి కార్డు ప్రయోగించినా ప్రజలు మాత్రం తిరస్కరించారు. - వైఎస్సార్సీపీ తరఫున గెలిచి టీడీపీలోకి ఫిరా యించి మంత్రి పదవులు పొందిన సుజయకృష్ణ రంగారావు, అమర్నాథ్రెడ్డి, భూమా అఖిలప్రియ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. పార్టీ ఫిరాయించి మంత్రి పదవి పొందిన ఆదినారాయణరెడ్డి కడప ఎంపీగా పోటీచేసి ఘోరంగా ఓడిపోయారు. - మంత్రిగా ఉండి ఒంగోలు ఎంపీగా బరిలోకి దిగిన శిద్ధా రాఘవరావుకూ ఓటమి తప్పలేదు. - చంద్రబాబు సన్నిహితుడిగా.. ఆయన మంత్రివర్గంలో కీలకంగా ఉండి, రాజధాని వ్యవహారాలను పర్యవేక్షించి తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న మరో మంత్రి నారాయణ నెల్లూరు సిటీలో వైఎస్సార్సీపీ అభ్యర్థి అనిల్‌కుమార్ యాదవ్ చేతిలో ఓడిపోయారు. - ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తన కుమారుడు శ్యాంబాబును పత్తికొండలో పోటీ చేయించినా గెలిపించుకోలేక చతికిలపడ్డారు. ఆయన సోదరుడు కేఈ ప్రతాప్ కూడా డోన్‌లో బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. - అనంతపురం జిల్లా రాప్తాడులో మంత్రి పరిటాల సునీత తన కొడుకు శ్రీరామ్‌ను గెలిపించలేక చేతులెత్తేశారు. - సమాచార శాఖ మంత్రిగా ఉన్న కాల్వ శ్రీనివాసరావుకూ రాయదుర్గంలో పరాభవం ఎదురైంది. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో అచ్చెన్నాయుడు, విశాఖ నార్త్‌లో గంటా శ్రీనివాసరావు, తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో ఉపముఖ్యమంత్రి చినరాజప్ప మాత్రమే అతికష్టంపై గెలిచారు. మిగిలిన మంత్రులంతా ఓడిపోవడంతో రాష్ట్ర చరిత్రలో చంద్రబాబు కేబినెట్ అత్యంత ప్రజావ్యతిరేకమైనదిగా స్పష్టమైంది. మంగళగిరిలో బోర్లాపడ్డ లోకేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు లోకేశ్‌కు కూడా గుంటూరు జిల్లా మంగళగిరిలో పరాభవం తప్పలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఆయన ఓడిపోవడం ఈ ఎన్నికల్లో హాట్ టాపిక్‌గా మారింది. రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్న ఈ స్థానంలో గెలుపొందేందుకు లోకేశ్ వందల కోట్లు మంచినీళ్ల ప్రాయంలా ఖర్చుచేశారు. అయినా ప్రజలను ఆకర్షించలేకపోవడం, తరచూ తప్పులు మాట్లాడుతుండడంతో ప్రజల్లో బాగా చులకనైపోయారు. అయినా, చంద్రబాబు తన తనయుణ్ణి గెలిపించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేసినా సఫలీకృతం కాలేకపోయారు. నిజానికి ఎమ్మెల్యేగా పోటీచేసే పలువురిని ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయించిన చంద్రబాబు లోకేశ్‌ను మాత్రం రాజీనామా చేయించలేదు. ఒకవేళ ఎమ్మెల్యేగా ఓడిపోయినా దొడ్డిదారిన వచ్చిన ఎమ్మెల్సీ పదవితో కాలక్షేపం చేసే ఉద్దేశంతో లోకేశ్ ఆ పదవిని అంటిపెట్టుకునే ఉన్నారు. ఏమాత్రం సమర్థత లేకపోయినా ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేయడం, ఏకంగా కీలకమైన మూడు శాఖలు కేటాయించడంపై తీవ్ర విమర్శలు వచ్చినా చంద్రబాబు లెక్కచేయలేదు. కొడుకును పార్టీపైనా, ప్రజలపైనా రుద్దేందుకు ప్రయత్నించినా ప్రజాక్షేత్రంలో మాత్రం విఫలంకాక తప్పలేదు. -
ఫ్యాన్ విజయ దుందుభి
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: ప్రాంతాలకు అతీతంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మ రథం పట్టారు. ఇటు ఒడిశా సరిహద్దులోని శ్రీకాకుళం మొదలు అటు కర్ణాటక సరిహద్దులోని అనంతపురం వరకూ వైఎస్సార్సీపీ అత్యధిక స్థానాల్లో విజయ ఢంకా మోగించింది. ఫ్యాన్ గాలికి సైకిల్ కకావికల మైంది. టీడీపీ కంచుకోటలకు బీటలు పారాయి. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నుంచి గెలిచి, టీడీపీ లోకి ఫిరాయించిన 23 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పుడు గొట్టిపాటి రవికుమార్ ఒక్కరే గెలిచారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో 67 స్థానాల్లో గెలిచిన వైఎస్సార్ సీపీ ఈ ఎన్నికల్లో 151 స్థానాల్లో విజయదుందుభి మోగించింది. టీడీపీ 20 స్థానాలతోనే సరిపెట్టు కుంది. గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ 102 స్థానాల్లోనూ, బీజేపీ నాలుగు చోట్ల గెలు పొందగా మరో ఇద్దరు ఇండిపెండెంట్లు విజయం సాధించారు. ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ 23 స్థానాల్లో మాత్రమే గెలిచింది. తూర్పు గోదావరి జిల్లా రాజో లులో మాత్రమే జనసేన నెగ్గింది. పవన్ కల్యాణ్ సోదరుడు, సినీనటుడు నాగబాబు నర్సాపురం లోక్ సభ స్థానంలో ఓటమి పాలయ్యారు. విశాఖ జిల్లా గాజువాక, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి పోటీ చేసిన పవన్ కల్యాణ్ ఆ రెండుచోట్లా ఘోర పరాజయం పొందడం గమనార్హం. ఈ ఎన్నికల్లో పలు జిల్లాల్లో టీడీపీ ఖాతా తెరవలేకపోయింది. అన్ని స్థానాల్లో ఫ్యాన్ క్లీన్‌స్వీప్ చేసింది. 2014 ఎన్నిక లతో పోల్చితే ఈ ఎన్నికల్లో అన్ని జిల్లాల్లోనూ వైస్సార్సీపీ పూర్తి ఆధిక్యత కనబర్చింది. వైఎస్సార్, విజయనగరం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో అన్ని అసెంబ్లీ స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. కుప్పంలో తగ్గిన చంద్రబాబు మెజారిటీ గత ఎన్నికల్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఇచ్చిన హామీలను నమ్మి ఉభయ గోదావరి జిల్లాల్లో 34 స్థానాలకు గాను 29 స్థానాలను టీడీపీకి కట్టబెట్టారు. పశ్చిమలో ఆ పార్టీ మొత్తం 15 స్థానాలనూ నెగ్గింది. బాబు సాధ్యం కాని హామీలిచ్చి మోసం చేశారని భావించినవారు... ఉప్పెనలా స్పందించి టీడీపీ పునాదులను పెకలించారు. ఈసారి టీడీపీని ఆరు స్థానాలకే పరిమితం చేశారు. బీసీ రిజర్వేషన్‌పై మోసం చేసినందుకు కాపులు చంద్రబాబుకు గట్టి గానే బుద్ధి చెప్పారు. ఇదే సామాజిక వర్గంపై గంపె డాశలు పెట్టుకున్న జనసేనకు చుక్కలు చూపించారు. పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భీమవరంలో పోటీ చేసి బొక్కబోర్లా పడ్డారు. నవరత్నాలు, మహా నేత వైఎస్‌లా మాటపై నిలబడతారనే నమ్మకంతో జగన్ వైపే మొగ్గు చూపారు. సంప్రదాయంగా టీడీపీకి వెన్నుదన్నుగా నిలిచే బీసీలలో బలమైన శెట్టిబలిజ, గౌడ సామాజిక వర్గాలు జగన్ ప్రకటించిన ఏలూరు బీసీ డిక్లరేషన్‌తో వైఎస్సార్సీపీ వైపు ఆకర్షితుల య్యారు. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఒక్క సీటు కూడా గెలవని పశ్చిమ గోదావరి జిల్లాలో ఈసారి 13 సీట్లలో విజయ ఢంకా మోగించింది. పశ్చిమ గోదా వరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభా కర్ అసెంబ్లీ చిత్తుగా ఓడిపోయారు. చింతమనేనిపై 17,459 ఓట్ల తేడాతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొఠారు అబ్బయ్య చౌదరి విజయం సాధించారు. రాష్ట్ర మంత్రి పితాని సత్యనారాయణపై ఆచం టలో చెరుకువాడ శ్రీరంగనాథరాజు 12,231 ఓట్ల తేడాతో గెలుపొందారు. భీమవరంలో జనసేన అధ్య క్షుడు పవన్‌కల్యాణ్‌పై గ్రంధి శ్రీనివాస్ 7,790 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. ఏలూరు పార్ల మెంట్ సభ్యునిగా కోటగిరి శ్రీధర్, నర్సాపురం నుంచి కనుమూరి రఘురామకృష్ణంరాజు గెలుపొం దారు. గత ఎన్నికల్లో 3 సీట్లు మాత్రమే పొందిన విజయనగరం జిల్లాలో ఇప్పుడు ఫ్యాన్ మొత్తం 9 సీట్లను కైవసం చేసుకుంది. రాయలసీమలోని నాలు గు జిల్లాల్లో 52 అసెంబ్లీ స్థానాలకు గాను కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, హిందూపురంలో నంద మూరి బాలకృష్ణ, ఉరవకొండలో పయ్యావుల కేశవ్ మాత్రమే టీడీపీ నుంచి గెలిచారు. మిగిలిన 49 స్థానా ల్లో వైఎస్సార్సీపీ నెగ్గింది. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో 34 స్థానాలకు గాను వైఎస్సార్సీపీ 28 స్థానా లను గెలుచుకుంది. గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి మొదటిసారి పోటీ చేసిన మంత్రి నారా లోకేశ్ ఓటమి పాలయ్యారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి కళా వెంకట్రావుతోపాటు అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కూడా పరాజయం చవిచూశారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందుల నుంచి 2014 ఎన్నికల్లో 75,243 వేల మెజార్టీతో గెలుపొందగా, ఇప్పుడు 90 వేల పైచిలుకు ఆధిక్యంతో ఘనవిజయం సాధించారు. ఆయన మెజారిటీ 15 వేలు పెరిగింది. కుప్పం నుంచి చంద్రబాబు మెజార్టీ గత ఎన్నికలతో పోల్చితే ఇప్పుడు 17 వేలకు పైగా తగ్గడం గమనార్హం. చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో టీడీపీ కేవలం కుప్పం స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ జిల్లాలోని పుంగనూరు నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 43,555 ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించారు. ఎన్ని కుటుంబాలు ఏకమైనా.. కర్నూలు జిల్లాలో సుదీర్ఘ రాజకీయ ప్రాధాన్యం గల పెద్ద కుటుంబాలు ఏకమై టీడీపీ తరఫున పోటీ చేసినా ప్రజలు ఆదరించలేదు. దశాబ్దాలుగా బద్ధ శత్రువుల్లా వేర్వేరు పార్టీల్లో కొనసాగిన కోట్ల, కేఈ కుటుంబాలు గెలవాలనే స్వార్థమే లక్ష్యంగా ఎన్నికల ముందు కలిసిపోయాయి. కాంగ్రెస్సే నా శ్వాస అని చెబుతూ వచ్చి రాజకీయ ప్రత్యర్థి కేఈతో రాజీపడి, టీడీపీలో చేరి, కర్నూలు నుంచి లోక్‌సభకు పోటీ చేసిన కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, ఆలూరు నుంచి బరి లోకి దిగిన ఆయన సతీమణి కోట్ల సుజాతమ్మను ప్రజలు ఓడించారు. అలాగే పత్తిపాడు నుంచి కేఈ తనయుడు శ్యామ్‌కుమార్, డోన్ నుంచి కేఈ ప్రతాప్ (కేఈ కృష్ణమూర్తి సోదరుడు) ఇద్దరినీ ప్రజలు తిరస్క రించారు. పత్తికొండ నుంచి శ్రీదేవి చేతిలో శ్యామ్ కుమార్, డోన్‌లో బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి చేతిలో కేఈ ప్రతాప్ ఓటమి చవిచూశారు. ఇదే జిల్లాలో వైఎస్సార్సీపీ తరఫున విజయం సాధించి.. మంత్రి పదవి కోసం టీడీపీలోకి ఫిరాయించిన అఖిలప్రియ తోపాటు ఆమె సోదరుడినీ ప్రజలు ఓడించారు. స్వార్థపు కలయికలను తిరస్కరించిన జనం వైఎస్సార్ జిల్లాలో దశాబ్దాలుగా రాజకీయ ప్రత్య ర్థులుగా కొనసాగిన రామసుబ్బారెడ్డి, ఆదినారా యణరెడ్డి రాజకీయ స్వార్థంతో కలిసిపోయి పోటీ చేయడాన్ని ప్రజలు తిరస్కరించారు. ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డి కుటుంబాలు రాజకీయ వైరాన్ని పక్కనపెట్టి కలిసిపోయిన విషయం విదితమే. ఆదినారాయణరెడ్డి కడప లోక్‌సభ స్థానం నుంచి, రామసుబ్బారెడ్డి జమ్మలమడుగు అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి జమ్మలమడుగు నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ సుధీర్‌రెడ్డి చేతిలో 51వేల పైగా ఓట్ల తేడాతో ఘోర పరాజయం పాలయ్యారు. సిక్కోలు గడ్డపై విజయ పతాక టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి కిమిడి కళా వెంకట్రావు, ప్రభుత్వ విప్ కూన రవికుమార్‌లను శ్రీకాకుళం ప్రజలు ఇంటికి పంపించారు. మరో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్వల్ప మెజార్టీతో ఓటమి తప్పించుకున్నారు. మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళంలో 4,409 ఓట్లతో టీడీపీ అభ్యర్థి గుండ లక్ష్మీదేవిపై, తమ్మినేని సీతారాం ప్రభుత్వ విప్ కూన రవికుమార్‌పై ఆమదాలవల సలో 13,856 ఓట్లతో ఘన విజయం సాధించారు. నరసన్నపేటలో మాజీ ఎమ్మెల్యే ధర్మా న కృష్ణదాస్ 19,129 ఓట్లతో టీడీపీ అభ్యర్థి బగ్గు రమణమూర్తిపై గెలుపొందారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు కంబాల జోగు లు, విశ్వాసరాయి కళావతి మరోసారి అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. టెక్కలిలో నుంచి మరోసారి బరిలోకి దిగిన మంత్రి కింజరాపు అచ్చె న్నాయుడి పరిస్థితి చివరివరకూ గెలుపు ఓటములతో దోబూచు లాడింది. వైఎస్సార్ సీపీ అభ్యర్థి పేరాడ తిలక్ ఆయనకు ముచ్చెమటలు పట్టించారు. చివరకు అచ్చెన్న 8,851 ఓట్లతో గట్టెక్కారు. విశాఖ జిల్లాలో విజయనాదం టీడీపీకి పెట్టని కోటగా భావించే విశాఖ జిల్లాలో వైఎస్సార్సీపీ తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది. మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 11 చోట్ల వైఎస్సార్సీపీ విజయబావుటా ఎగురవేయగా, 3 పార్లమెంటు స్థానాల్లోనూ ఆ పార్టీ అభ్యర్థులే విజయఢంకా మోగించారు. సీనియర్ మంత్రి చింత కాయల అయ్యన్నపాత్రుడు ఓటమి పాలవ్వగా, గాజువాక నుంచి పోటీ చేసిన జనసేన అధినేత పవన్‌కల్యాణ్, విశాఖ ఎంపీ స్థానానికి పోటీ చేసిన సీబీఐ మాజీ జేడీ వి.వి.లక్ష్మీనారాయణ దారుణ పరాజయాన్ని మూటకట్టుకున్నారు. అరకు లోక్‌సభ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కేంద్ర మాజీ మంత్రి, ఐదు పర్యాయాలు ఎంపీగా చేసిన కిషోర్ చంద్రదేవ్రాజుపై సాధారణ టీచర్‌గా పనిచేసిన వైఎస్సార్సీపీ అభ్యర్ధి గొట్టేటి మాధవి రికార్డు స్థాయి విజయాన్ని నమోదు చేశారు. గాజువాకలో వైఎస్సార్సీపీ అభ్యర్ధి తిప్పల నాగిరెడ్డి జనసేన అభ్యర్థి పవన్‌కల్యాణ్‌పై 16,774 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. కృష్ణా జిల్లాలో వైఎస్సార్సీపీ హవా ఆవిర్భావం నుంచి టీడీపీ పట్టుగొమ్మగా ఉన్న కృష్ణా జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారు. 16 అసెంబ్లీ స్థానాలకు గాను 14 చోట్ల వైఎస్సార్సీపీకి బ్రహ్మరథం పట్టారు. మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర ఓటమి పాల య్యారు. ఆయనపై 5,852 ఓట్ల మెజార్టీతో వైఎస్సార్సీపీ అభ్యర్థి పేర్ని నాని ఘనవిజయం సాధించారు. మైలవరంలో మరో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఓడిపోయారు. టీడీపీ కంచుకోటలకు బీటలు జన ప్రభంజనంలో పచ్చపార్టీ కంచుకోటలకు బీటలు వారాయి. గుంటూరు జిల్లాలో 17 అసెంబ్లీ, 3 పార్లమెంట్ సీట్లకు గాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 15 అసెంబ్లీ, 2 పార్లమెంటు సీట్లను కైవసం చేసుకుంది. టీడీపీకి 2 అసెంబ్లీ స్థానాలు, ఒక పార్లమెంట్ స్థానం మాత్రమే దక్కింది. మంత్రులు నక్కా ఆనందబాబు, ప్రత్తిపాటి పుల్లారావు, నారా లోకేష్, మాజీ మంత్రి ఆలపాటి రాజా, స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు, జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు, సీనియర్ ఎమ్మెల్యేలు యరపతినేని శ్రీనివాసరావు, ధూళిపాళ్ల నరేంద్ర వైఎస్సార్సీపీ అభ్యర్థుల చేతుల్లో ఓటమి పాలయ్యారు. మంగళగిరి శాసనసభ స్థానానికి బరిలో నిలిచిన మంత్రి నారా లోకేశ్ వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్కే) చేతుల్లో ఓటమి పాలవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విజయనగరంలో చరిత్ర సృష్టించిన ఫ్యాన్ విజయనగరం జిల్లాలో వైఎస్సాఆర్ కాంగ్రెస్‌పార్టీ పూర్తి ఆధిపత్యాన్ని సాధించి చరిత్ర సృష్టించింది. జిల్లాలోని మొత్తం లోక్‌సభ, అసెంబ్లీ సీట్లులో గెలుపొందింది. ఫ్యాన్ సునామీలో తెలుగుదేశం పార్టీ నాయకులు కొట్టుకుపోయారు. విజయనగరం జిల్లాలో మొత్తం విజయనగరం లోక్‌సభ, తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటితోపాటు అరుకు, విశాఖపట్నం లోక్‌సభ స్థానాలు పరిధి కూడా నాలుగు నియోజకవర్గాల్లో విస్తరించి ఉంది. అన్ని సీట్లలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. విజయనగరం పార్లమెంటు నియోజకవర్గంలో వైఎస్సాఆర్ కాంగ్రెస్‌పార్టీ అభ్యర్ధి బెల్లాన చంద్రశేఖర్ భారీ మోజార్టీతో విజయం సాధించారు. ఈయనపై పోటీ చేసిన తెలుగుదేశంపార్టీ అభ్యర్ధి, కేంద్రమాజీ మంత్రి పూసపాటి ఆశోక్‌గజపతిరాజు ఓటమి పాలయ్యారు. -
మోదీ మంత్ర
భారతావని కమలవనమయ్యింది. చౌకీదార్ ప్రభంజనం సృష్టించాడు. చౌకీదార్ చోర్ హై అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు విసిరిన సవాళ్లు ఈ సునామీలో కొట్టుకుపోయాయి. జీఎస్టీ, నోట్ల రద్దు వంటి అంశాలేవీ పని చేయలేదు. మోదీ మంత్రానికి ఓటర్లు ముగ్ఢులైపోయారు. ఎన్డీయేకి తిరుగులేని మెజారిటీ కట్టబెట్టారు. ప్రధానిగా ఎన్నికల బాధ్యత అంతా తన భుజస్కంధాలపైనే వేసుకుని నడిపించి, కేవలం తన వ్యక్తిగత చరిష్మాతో ఎన్డీయేని మరోసారి విజయపథంలో నడిపిన నరేంద్ర మోదీ.. ఇందిరాగాంధీ తర్వాత మళ్లీ అలాంటి ఘనతను సాధించారు. పార్టీకి మరో ఐదేళ్ల అధికారాన్ని కానుకగా ఇచ్చారు. పైకి కన్పించని, నిశ్శబ్ద తరంగంలా వీచిన మోదీ గాలి హిందీ రాష్ట్రాలతో పాటు తూర్పు, పశ్చిమ, దక్షిణాది రాష్ట్రాలనూ కుదిపేసింది. నోట్ల రద్దు, జీఎస్టీ దెబ్బలనుంచి పుంజుకుని.. 2016 నవంబర్‌లో మోదీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించారు. 130 కోట్ల మంది భారతీయుల్లో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. రూ.1,000, రూ.500 నోట్లను మార్పిడి చేసుకునేందుకు జనం పరుగులు పెట్టారు. ఆర్థిక వ్యవస్థపై పెద్ద దెబ్బే పడింది. వేరే నాయకులెవరైనా ఇలాంటి నిర్ణయం తీసుకుంటే రాజకీయంగా ఆత్మహత్యా సదృశ్యమే అవుతుంది. వస్తు సేవల పన్ను (జీఎస్టీ) కూడా దేశవ్యాప్తంగా గందరగోళం సృష్టించింది. ఈ నిర్ణయానికి కూడా తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. కానీ మోదీ వీటన్నిటినీ సమర్ధంగా ఎదుర్కొన్నారు. తర్వాత అగ్రవర్ణ పేదలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, రైతులకు ఆదాయ కల్పన, భారీ ఆరోగ్య బీమా పథకం, ఉచిత గ్యాస్ కనెక్షన్లు, స్వచ్ఛ భారత్ వంటి పథకాలు, హామీలు తిరిగి మోదీ పుంజుకునేలా చేశాయి. అవినీతిని అరికట్టే క్రమంలో దేశానికి తాను కాపలాదారు (చౌకీదార్)నని కూడా మోదీ చెప్పుకున్నారు. రాహుల్ వైఫల్యం ఇటీవల మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి కాంగ్రెస్‌లో కొత్త ఆశలు నింపింది. ఈ నేపథ్యంలో మోదీ లక్ష్యంగా చౌకీదార్ చోర్ హై (కాపలాదారే దొంగ) అనే నినాదాన్ని, రఫేల్ కుంభకోణాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రయత్నించారు. పదే పదే ఇవే అంశాలను వల్లెవేశారు. రఫేల్ కేసులో సుప్రీం క్లీన్చిట్ ఇచ్చినా తీర్పును ‘చౌకీదార్ చోర్ హై’ నినాదానికి తప్పుగా ఆపాదించి చివరకు సర్వోన్నత న్యాయస్థానానికి క్షమాపణ చెప్పారు. ఈ నినాదాలు కరుడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్తలను తప్ప మిగతావారిని ఆకర్షించలేక పోయాయి. మరోవైపు రాహుల్ పేదలకు ఆర్థికసాయం అందించే ‘న్యాయ్’ పథకాన్ని ఆలస్యంగా ఎన్నికల ముందు ప్రచారంలోకి తెచ్చారు. దీనివల్ల దాదాపు సగం మంది ఓటర్లకు, ఎవరైతే ఆ పథకం వల్ల లబ్ధి పొందుతారో వారికే దాని గురించి తెలియకుండా పోయింది. ఇదే సమయంలో యూపీఏ అధికారంలోకి వస్తే ప్రధాని ఎవరు అనే ప్రశ్నకు కూడా కాంగ్రెస్ వద్ద స్పష్టమైన సమాధానం లేకుండా పోయింది. అదే సమయంలో పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తామూ ప్రధాని రేసులో ఉన్నట్లు సంకేతాలిచ్చారు. రాహుల్‌ను ప్రధాని అభ్యర్థిగా స్పష్టంగా ప్రకటించలేని కాంగ్రెస్ నిస్సహాయత బీజేపీకి కలిసొచ్చింది. మా వైపు మోదీ.. మీ వైపు ఎవరు అనే ప్రశ్నను లేవనెత్తడంతో పాటు ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కూడా బీజేపీ విజయం సాధించింది. అలాగే పొత్తుల విషయంలో కూడా మోదీ పరిణతితో వ్యవహరించారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బిహార్‌లో నితీశ్‌కుమార్‌తో పొత్తు పెట్టుకోవడం ఇందుకు ఒక ఉదాహరణ. ఈ కోణంలో చూస్తే కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీతో పొత్తు కుదుర్చుకోవడంలో కాంగ్రెస్ విఫలమయ్యింది. అలాగే బీజేపీతో ముఖాముఖి పోరు జరిగే మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్తాన్, మధ్యప్రదేశ్‌లో ప్రియాంకా గాంధీ ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉన్నా కాంగ్రెస్ ఆమెను ఒక అతిథి నటి మాదిరిగానే పరిగణించింది తప్ప పూర్తిస్థాయిలో ఉపయోగించుకోలేదు. కేవలం ఉత్తరప్రదేశ్‌లో పట్టు సాధిస్తే చాలన్నట్టుగా వ్యవహరించి దెబ్బతింది. ఉత్తరప్రదేశ్‌లో మహాకూటమి వైఫల్యం కూడా బీజేపీకి లబ్ధి చేకూరేలా చేసింది. రెండుసార్లు ఘన విజయం.. 1984లో లోక్‌సభలో కేవలం రెండు సీట్లు కలిగిన బీజేపీ 2 సార్వత్రిక ఎన్నిక ల్లో ఘన విజయం సాధించడం ద్వా రా భారత రాజకీయాల్లో కాంగ్రెస్ ను తప్పించి సెంటర్ స్టేజిని ఆక్రమించింది. అటల్ బిహారీ వాజ్‌పేయి నాయకత్వంలో 1996లో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. అప్పడు 13 రోజులపాటు మొద టిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ఆ తర్వాత 1998లో 13 నెలల పాలన తర్వాత లోక్‌సభలో ఒక్క ఓటు తేడాతో ప్రభుత్వాన్ని కోల్పోయింది. కానీ వాజ్‌పేయి నాయకత్వం.. పార్టీపై ఉన్న అస్పృశ్యత ముద్ర పోయి కొత్త కూటముల ఏర్పాటుకు దోహదపడింది. అది ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వ ఏర్పా టుకు దారితీసింది. 2014లో బీజేపీ 282 సీట్లు గెలుచుకుంది. అమిత్ షా బీజేపీ పగ్గాలు చేపట్టిన తర్వాత మోదీ–షా 18 రాష్ట్రాల్లో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చారు. ఈ ఎన్నికల్లో సైతం 300 పైచిలుకు స్థానాల్లో విజయం సాధించి దేశంలోనే బలమైన రాజకీయపార్టీగా బీజేపీ అవతరించేలా కృషి చేసింది. దేశభద్రత ప్రధాన అస్త్రంగా.. ఓట్ల లెక్కింపు జరుగుతూ ఎన్డీయే భారీ విజయం దిశగా దూసుకుపోతుంటే ఈ అంశాలతో పాటు మోదీ తన ప్రధానాస్త్రంగా చేసుకున్న దేశ భద్రత, జాతీయవాదం దేశవ్యాప్తంగా ఓటర్లను ఏవిధంగా ఆయనవైపు తిప్పాయో స్పష్టమైంది. కొన్ని కీలక రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో విపక్ష కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉంది. భారత్ ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొంటోందని పలు సూచీలు వెల్లడించాయి. జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో ఆత్మాహుతి బాంబర్ దాడిలో 40 మంది సైనికులు ప్రా ణాలు కోల్పోవడం, పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లోని ఉగ్రశిక్షణ శిబిరంపై ఐఏఎఫ్ బాంబుల వర్షం (సర్జికల్ స్ట్రైక్స్) కురిపించిన తర్వాత జాతీయవాదం, దేశ భద్రతను, దేశభక్తిని మోదీ ఎన్నికల అస్త్రాలుగా చేసుకున్నారు. పాక్‌కు గుణపాఠం చెప్పాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. కమలం గుర్తుపై మీరు వేసే ప్రతి ఓటూ ఉగ్రవాదుల శిబిరాలపై వెయ్యి కిలోల బాంబులు వేయడంతో సమానమని చెప్పారు. రాహుల్ పేదలకు ఆర్థికసాయం అందించే ‘న్యాయ్’ పథకాన్ని ఆలస్యంగా ఎన్నికల ముందు ప్రచారంలోకి తెచ్చారు. దీనివల్ల దాదాపు సగం మంది ఓటర్లకు, ఎవరైతే ఆ పథకం వల్ల లబ్ధి పొందుతారో వారికే దాని గురించి తెలియకుండా పోయింది. -
కడప గడపలో రికార్డుల మోత
సాక్షి ప్రతినిధి కడప: సార్వత్రిక ఎన్నికల్లో కడప గడపలో రికార్డుల మోత మోగింది. రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ సాధించిన ఘనతను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సొంతం చేసుకున్నారు. రాష్ట్ర ప్రజల అభిమానానికి తగ్గట్లుగా ఆయనకు అత్యధిక మెజార్టీ దక్కింది. వైఎస్ జగన్‌కు 90,110 ఓట్లు ఆధిక్యతను పులివెందుల ప్రజలు కట్టబెట్టారు. రాష్ట్రంలో ఎమ్మెల్యే స్థానాల్లో జగన్‌దే అత్యధిక మెజార్టీ. వైఎస్సార్ జిల్లాలో కడప, జమ్మలమడుగు నియోజకవర్గాల వైఎస్సార్సీపీ అభ్యర్థులు అంజాద్‌బాషా, డాక్టర్ సుధీర్‌రెడ్డి 52వేలు పైగా మెజార్టీని దక్కించుకొని మరో రికార్డు సాధించారు. అన్నకు తగ్గ తమ్ముడిగా కడప ఎంపీ స్థానంలో వైఎస్ అవినాష్‌రెడ్డి 3.54 లక్షల ఓట్ల ఆధిక్యతను సొంతం చేసుకున్నారు. ఆల్‌టైం రికార్డు వైఎస్ కుటుంబం సొంతం పులివెందుల నియోజకవర్గంలో ఆల్‌టైం రికార్డు వైఎస్ కుటుంబం సొంతమని మరోమారు నిరూపితమైంది. దివంగత వైఎస్ఆర్ పులివెందుల అభ్యర్థిగా 1985లో 30వేలు పైచిలుకు మెజార్టీ సాధించి అప్పట్లో అబ్బరపర్చారు. ఆ తర్వాత 1989లో వైఎస్ వివేకానందరెడ్డి తొలిసారి ఎమ్మెల్యేగా పోటీచేసి 47,746 ఓట్లు మెజార్టీ సొంతం చేసుకొని తన అన్న రికార్డును మించిపోయారు. 1991 ఉప ఎన్నికల్లో పోటీచేసిన డాక్టర్ వైఎస్ పురుషోత్తమరెడ్డి 97,448 ఓట్లు మెజార్టీ సాధించారు. 2009లో ముఖ్యమంత్రి హోదాలో పోటీచేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి 68,681 ఓట్లు మెజార్టీ కైవసం చేసుకున్నారు. కాగా వైఎస్సార్ సీఎంగా రెండోసారి ప్రమాణశ్వీకారం చేసిన అనతికాలంలోనే దివంగతులు కావడంతో.. ఆ తర్వాత ఉప ఎన్నికలల్లో వైఎస్ విజయమ్మ ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు. వైఎస్సార్సీపీ అభ్యర్థిగా 2011లో పోటీచేసిన వైఎస్ విజయమ్మ తన భర్త వైఎస్సార్ సాధించిన మెజార్టీ కంటే ఎక్కువగా.. 81,333 ఓట్ల మెజార్టీ సొంతం చేసుకున్నారు. తాజాగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందుల ప్రజానీకం మనస్సులను చూరగొని రికార్డు స్థాయిలో 90,110 ఓట్లు మెజార్టీ దక్కించుకున్నారు. త్యాగానికి ప్రతిఫలం రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఎంపీ పదవికి వైఎస్ అవినాష్‌రెడ్డి రాజీనామా చేశారు. తాజా ఎన్నికల్లో 3.54 లక్షలు ఓట్లు మెజార్టీ సాధించారు. భారతదేశంలో అత్యధిక మెజార్టీ సాధించిన నేతల సరసన వైఎస్ అవినాష్‌రెడ్డిని కడప ప్రజలు నిలిపారు. అదేరీతిలో రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డికి 2.64లక్షల మెజార్టీ కట్టబెట్టారు. పదవీత్యాగానికి ప్రతిఫలంగా వైఎస్సార్ జిల్లా ప్రజలు గతంలో లభించిన మెజార్టీ కంటే అత్యధికంగా అప్పగించడం విశేషం. కాగా రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ సాధించిన వారి సరసన కడప ఎమ్మెల్యేగా అంజాద్‌భాషా, జమ్మలమడుగు ఎమ్మెల్యేగా డాక్టర్ సుధీర్‌రెడ్డి నిలుస్తున్నారు. కడపలో 52,539 ఓట్లు మెజార్టీ సాధించగా, జమ్మలమడుగులో 52,035 ఓట్లు మెజార్టీ స్వంతమైంది. ఇప్పటివరకూ కడపలో 10కి 10సీట్లు సాధించిన చరిత్రలేదు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆ రికార్డు కూడా సొంతమైంది. వెరశి కడప గడపలో రికార్డుల మోత మోగింది. -
బాబు మోసానికి ప్రతీకారం
సాక్షి, అమరావతి: కుప్పలు తెప్పలుగా హామీలు ఇచ్చి 2014 ఎన్నికల్లో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చాక హామీలను తుంగలో తొక్కిన చంద్రబాబునాయుడికి రాష్ట్ర ప్రజలు గట్టి గుణపాఠం నేర్పారు. ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ పరాజయానికి ముఖ్యకారణాల్లో చంద్రబాబు ఇచ్చిన తప్పుడు హామీలు, మాయమాటలేననడంలో అతిశయోక్తి లేదు. ప్రజలను తక్కువ అంచనా వేస్తూ తాను ఎన్ని మాయలుచేసినా వారికి గుర్తుండదని, ఎన్నికల ముందు కొన్ని తాయిలాలు పంచి మళ్లీ అధికారంలోకి రావాలనుకున్న చంద్రబాబుకు ప్రజలు మర్చిపోలేని షాక్ ఇచ్చారు. గత ఐదేళ్లలో చంద్రబాబు చేసిన మోసాలకు, వేధింపులకు తాజా ఎన్నికల్లో ప్రజలు ప్రతీకారం తీర్చుకున్నారు. తమ బాధలు వింటూ, తమకు అండగా ఉండి చివరి వరకు వెన్నంటి నడిచిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయం చేకూర్చారు. చంద్రబాబు చరిత్ర మొత్తం మాయలు, మోసాలేనన్నది జగమెరిగిన సత్యం. వీటికి ప్రతీకారంగానే ప్రజలు ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు సరైన సమాధానం ఇచ్చారు. ఇంతటి దారుణమైన పరాజయం ఆపార్టీ చరిత్రలోనే కాదు రాష్ట్ర చరిత్రలోనూ ఇంతకు ముందెన్నడూ లేదు. 600లకుపైగా హామీలు ఇచ్చి.. 2014 ఎన్నికల్లో 600లకు పైగా హామీలిచ్చి ప్రజలను మభ్యపెట్టి చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. ఎన్నికల అనంతరం వాటిని విస్మరించారు. రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, ఉద్యోగులు, చిరుద్యోగులు, కార్మికులు, వివిధ వృత్తి కార్మికులు, కులాల వారీగా పలు హామీలను తమ మేనిఫెస్టోలో పొందుపరిచారు. అధికారంలోకి రాగానే వ్యవసాయ రుణాలను పూర్తిగా మాఫీచేస్తామని, డ్వాక్రా, చేనేత రుణాలన్నిటినీ రద్దుచేస్తామని, రైతులు కుదువ పెట్టిన బంగారాన్ని తిరిగి వారి ఇంటికి చేరుస్తామని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నిటినీ (1.42 లక్షలు) భర్తీచేస్తామని, ఇంటికో ఉద్యోగం కల్పిస్తామని, నెలకు రూ. 2 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని, ఏటా టీచర్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని, మద్యం బెల్టు షాపులను పూర్తిగా తొలగిస్తామని, రైతులకు 9 గంటల నిరాటంక ఉచిత విద్యుత్తు ఇస్తామని, పేదలందరికీ ఇళ్లు, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, రూ. 2కే 20 లీటర్ల మినరల్ వాటర్ అందిస్తామనే లాంటి హామీలు ఇచ్చారు. ఐదేళ్లు అధికారంలో ఉన్నా ఏ ఒక్కదాన్నీ పూర్తిగా అమలు చేసిన పాపాన పోలేదు. తొలిసంతకం అంటూ ప్రకటించిన వ్యవసాయ రుణాల మాఫీ, డ్వాక్రా, చేనేత రుణాల మాఫీ, బెల్టు షాపుల రద్దు హామీలకు అధికారంలోకి వచ్చిన తొలిరోజునే చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. అరకొరగా చేసిన రైతు రుణమాఫీ మొత్తం బ్యాంకు వడ్డీలకూ సరిపోలేదు. దీంతో రైతులు అప్పుల ఊబిలో మునిగిపోయారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా చంద్రబాబు సర్కార్ పట్టించుకోలేదు. మరోపక్క అక్కచెల్లెమ్మలకు, చేనేత కార్మికులకు ఇచ్చిన హామీలను కూడా చంద్రబాబు తుంగలో తొక్కారు. బెల్టుషాపులను పెంచేసి మద్యాన్ని ఏరులై పారించారు. రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో అధికారం లేదని రిజర్వేషన్లపై పలు కులాలకు హామీ ఇచ్చి చంద్రబాబు వారందరినీ మోసం చేశారు. ఇప్పుడు ఎన్నికల ముందు చంద్రబాబు కల్లబొల్లి మాటలు చెప్పినా ప్రజలు విశ్వసించలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రకటించిన నవరత్నాలను కాపీ చేసి వృద్ధాప్య పింఛన్లను రూ. 2 వేలకు పెంచుతున్నట్లు, ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితిని రెట్టింపు చేస్తామని ప్రకటించారు. బాబు మోసాలను మరిచిపోలేని ప్రజలు గతంలో ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని, తెలుగుదేశం పార్టీని చేజిక్కించుకోవడమే కాకుండా ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలకూ చంద్రబాబు తూట్లు పొడిచారని ప్రజలు గుర్తుచేసుకుంటూనే ఉన్నారు. 1994 ఎన్నికల సమయంలో ఎన్టీఆర్ అధికారంలోకి రాగానే రూ. 2కే కిలో బియ్యం, సంపూర్ణ మద్యపాన నిషేధం వంటి పథకాలను అమల్లోకి తెచ్చారు. వ్యవసాయ విద్యుత్తులో కూడా హార్స్‌పవర్‌కు రూ. 50 వసూలు వంటి నిర్ణయాలు అమలు చేశారు. అయితే చంద్రబాబు 1995లో ఆయనకు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని చేజిక్కించుకున్న వెంటనే రూ.2కే కిలో బియ్యం ధరను అమాంతం రూ. 5.25కి పెంచేశారు. ఎన్టీఆర్ తీసుకొచ్చిన జనతా వస్త్రాల స్కీమునూ చంద్రబాబు ఎత్తేశారు. ఇక సంపూర్ణ మద్యపాన నిషేధానికి నిలువునా తూట్లు పొడిచి దానికీ మంగళం పాడేశారు. పింఛన్లను గ్రామానికి కోటాను నిర్ణయించి ఆమేరకు మాత్రమే ఇచ్చారు. ఎవరైనా కొత్తగా పింఛన్ కావాలని దరఖాస్తు పెట్టుకొంటే జాబితాలోని వారిలో ఎవరో ఒకరు చనిపోతేనే కానీ కొత్తవారికి పింఛన్ మంజూరు అయ్యేది కాదు. 2014లో అధికారం చేపట్టాక కూడా ఆయన తీరులో మార్పు రాలేదు. -
ఎగ్జిట్ పోల్‌నిజమెంత?
లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ప్రధాన ఎగ్జిట్ పోల్స్ చాలావరకు ఎన్డీయే విజయాన్ని, నరేంద్ర మోదీ మరోసారి ప్రధానిగా బాధ్యతలు చేపడతారనే అంచనా వేశాయి. ఇప్పుడు ఫలితాలు దాదాపుగా వెల్లడి అయ్యాయి. దీంతో ఎవరి ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు నిజమయ్యాయి, ఎంత ఖచ్చితత్వంతో వాస్తవ రూపం దాల్చాయని పరిశీలించేందుకు అవకాశం ఏర్పడింది. 2019 ఎన్నికల్లో ఆధిక్యాలను పరిశీలిస్తే.. ఎన్డీయే 347, యూపీఏ 90, ఇతరులు 105 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. దీనిని బట్టి చూస్తే ఇండియా టుడే–మై ఆక్సిస్, చాణక్య–న్యూస్24 అంచనాలు చాలావరకు వాస్తవ ఫలితాలకు దగ్గరగా ఉన్నాయి. ఎన్డీయేకి 339 నుంచి 365 సీట్లు వచ్చే అవకాశం ఉందని, అలాగే యూపీఏకి 77–108, ఇతరులకు 69–95 సీట్లు వచ్చే అవకాశం ఉందని ఇండియా టుడే పేర్కొంది. కానీ చాణక్య సరిగ్గా అంచనా వేసింది. ఎన్డీయేకి 350, యూపీఏకి 95, ఇతరులకు 97 వస్తాయని స్పష్టమైన అంకెలు ఇచ్చింది. ఒకవేళ ఆధిక్యతలే కనుక య«థాతథంగా ఫలితాలుగా మారినట్టయితే చాణక్యకి, ఎన్డీయే సంఖ్య (350)కి మధ్య కేవలం మూడు సీట్ల తేడాయే ఉంటుంది. అలాగే యూపీఏ సంఖ్య (95)కు 5, ఇతరుల సంఖ్య (97)కు 8 సీట్ల తేడా మాత్రమే ఉంటుంది. అయితే ఎన్డీయే, యూపీఏ ట్యాలీలు రెండూ కూడా ఇండియా టుడే అంచనా వేసిన సీట్ల పరిధిలోనే ఉండటం గమనార్హం. గత ఎన్నికలను పరిశీలిస్తే.. ► 2004లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ పూర్తిగా తల్లకిందులయ్యాయి. వాజ్‌పేయి నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని అంచనా వేస్తే కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ విజయం సాధించింది. ► 2009లో అన్ని ఎగ్జిట్ పోల్స్ ఎన్డీయేపై యూపీఏకి స్వల్ప మెజారిటీ వస్తుందని అంచనా వేశాయి. కానీ ఆయా సంస్థల అంచనాలు మరోసారి తప్పయ్యాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ 100కు పైగా సీట్ల మెజారిటీ సాధించింది. ► 2014లో అన్ని ఎగ్జిట్ పోల్స్ ఎన్డీయే విజయాన్ని ఊహించాయి. అయితే టుడేస్ చాణక్య మినహా ఏదీ కూడా నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ సొంతంగా స్పష్టమైన మెజారిటీతో అధికారం చేపడుతుందని చెప్పలేకపోయాయి. అసలు ఫలితాలు వచ్చేశాయి.. మరి వివిధ చానళ్లలో ప్రసారమైన ఎగ్జిట్ పోల్స్‌లో ఏది నిజమయ్యాయి? ఏది తప్పాయి? జనం మూడ్‌ను అవి పసికట్టగలిగాయా. -
ముసుగు పొత్తులకు ఓటరు చక్కటి సమాధానం
సాక్షి, అమరావతి: చంద్రబాబునాయుడు లోపాయికారీ పొత్తుల కుట్ర రాజకీయాలకు రాష్ట్ర ఓటర్లు చావుదెబ్బ కొట్టారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడం ద్వారా ప్రజల్ని వంచించాలన్న టీడీపీ ఎత్తులను చిత్తుచేశారు. లోపాయికారీ పొత్తులో ప్రధాన సూత్రధారి టీడీపీని తుడిచిపెట్టేశారు. ఈ రాజకీయ కుట్రలో చంద్రబాబు పార్టనర్ పవన్ కల్యాణ్‌కు ఘోర పరాజయాన్ని రుచి చూపించారు. లోపాయికారీ కుట్రలో మైనర్ పార్టనర్లు అయిన సీపీఎం, సీపీఐ, బీఎస్పీలను ప్రజలు నిర్ద్వందంగా తిరస్కరించారు. నిజాయితీ రాజకీయాలకే తాము పట్టం కడతామంటూ జగన్‌కు జైకొట్టారు. లోపాయికారీ పొత్తుల కుట్ర ప్రతి ఎన్నికకు కొత్త పొత్తులతో ప్రజలను ఏమార్చే చంద్రబాబు.. 2019 ఎన్నికల్లో కొత్త రాజకీయ కుట్రకు తెరలేపారు. టీడీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకు లోపాయికారీ పన్నాగాన్ని రచించారు. అందులో భాగంగానే 2018లో పవన్ కల్యాణ్ టీడీపీ నుంచి వేరుపడ్డారు. అడపదడపా జిల్లాల్లో పర్యటిస్తూ హడావుడి చేశారు. కేవలం జనసేనతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చడం సాధ్యంకాదని చంద్రబాబు కొత్త పార్టీలను ఆ పొత్తుల చట్రంలోకి తీసుకువచ్చారు. సీపీఎం, సీపీఐలతోపాటు బీఎస్పీతో కూడా జనసేన పొత్తు పెట్టుకునేట్లుగా చంద్రబాబు కథ నడిపించారు. ఇక ఆ నాలుగు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటును కూడా చంద్రబాబు కన్నుసన్నల్లోనే సాగింది. చంద్రబాబుకు రాజకీయ ప్రయోజనం కలిగించేలా సీపీఎం, సీపీఐలకు చెరో ఏడు నియోజకవర్గాలు జనసేన కేటాయించింది. 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలిచిన సీట్లనే అత్యధికంగా వామపక్షాలకు కేటాయించారు. ఆ నియోజకవర్గాల్లో జనసేన పోటీచేస్తే.. టీడీపీ ఓట్లే చీలి టీడీపీ మరింత బలహీనపడుతుంది. అందుకే ఆ నియోజకవర్గాల్లో టీడీపీకి లోపాయికారీగా సహకరించేందుకే జనసేన పోటీచేయలేదు. మంత్రి లోకేశ్ పోటీచేసిన మంగళగిరి నియోజకవర్గంలో జనసేన పోటీచేయకపోవడం ఇందులో భాగమే. ఆ నియోజకవర్గంలో కాస్త పట్టున్న సీపీఎంకు కాకుండా సీపీఐకు ఆ స్థానాన్ని కేటాయించడంతో ఆ పార్టీల కుట్ర బట్టబయలైంది. ఇక బీఎస్పీకి కూడా వైఎస్సార్సీపీ బలంగా ఉన్న నియోజకవర్గాలనే కేటాయించారు. మరోవైపు.. ఢిల్లీలో రాహుల్‌గాంధీతో జట్టుకట్టిన చంద్రబాబుకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లోపాయికారీగా సహకరించింది. వైఎస్సార్సీపీ ఓట్లను కొంతమేరైనా సరే చీల్చడమే లక్ష్యంగా పనిచేసింది. ప్రచారంలోనూ కుట్రలే కుట్రలు కాగా, ఎన్నికల ప్రచారంలో కూడా జనసేన, వామపక్షాలు, బీఎస్పీలతో చంద్రబాబు లోపాయికారీ కుట్రలను కొనసాగించారు. చంద్రబాబు, మంత్రి లోకేష్ పోటీచేసిన మంగళగిరి నియోజకవర్గంలో పవన్ ప్రచారం చేయలేదు. అలాగే, పవన్ స్వయంగా పోటీచేసిన గాజువాక, భీమవరం నియోజకవర్గాల్లో చంద్రబాబు కూడా టీడీపీ తరఫున ప్రచారం నిర్వహించనే లేదు. పవన్ కల్యాణ్ కూడా తన ప్రచారంలో చంద్రబాబునుగానీ టీడీపీ ప్రభుత్వాన్నిగానీ పెద్దగా విమర్శించకుండా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పైనే ఆరోపణలు గుప్పించారు. జనసేనకూ దారుణ పరాభవం ఇక 136 నియోజకవర్గాల్లో పోటీచేసిన జనసేనను కూడా ఓటర్లు నిర్ద్వందంగా తిరస్కరించారు. ఆ పార్టీ కేవలం ఒక్క స్థానంలోనే గెలుపొందింది. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తాను పోటీచేసిన రెండు నియోజకవర్గాలు భీమవరం, గాజువాకలలో ఓడిపోయి తీవ్ర అవమానాన్ని మూటగట్టుకున్నారు. ఓ పార్టీ అధినేత రెండుస్థానాల్లో పోటీచేసి రెండింటిలోనూ ఓడిపోవడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి. 2009లో తిరుపతి, పాలకొల్లు నియోజకవర్గాల్లో పోటీచేసిన ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి.. తిరుపతిలో గెలిచి పాలకొల్లులో ఓడిపోయారు. 1989లో టీడీపీ అధ్యక్షుడు ఎన్టీ రామారావు హిందూపూర్, వనపర్తి (తెలంగాణాలోని మహబూబ్‌నగర్ జిల్లా)లలో పోటీచేయగా.. హిందూపూర్‌లో గెలిచి వనపర్తిలో ఓడిపోయారు. కానీ, ఈసారి పవన్ కల్యాణ్ రెండు నియోజకవర్గాల్లోనూ ఓడిపోవడం గమనార్హం. వామపక్షాలకూ ఘోర ఓటమి ఇక సీపీఎం, సీపీఐ చెరో ఏడు నియోజకవర్గాల్లో పోటీచేయగా అన్నింటిలోనూ ఘోరంగా ఓడిపోయాయి. సీపీఎం పోటీచేసిన ఏడు నియోజకవర్గాల్లో కురుపాం, అరకు, రంపచోడవరం, విజయవాడ సెంట్రల్, సంతనూతలపాడు, కర్నూలు స్థానాల్లో వైఎస్సార్సీపీని ప్రజలు గెలిపించారు. పొత్తుల్లో భాగంగా సీపీఎం పోటీచేసిన కర్నూలు, నెల్లూరు ఎంపీ స్థానాల్లోనూ వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది. సీపీఐ పోటీచేసిన ఏడు నియోజకవర్గాల్లో ఆరు స్థానాల్లో వైఎస్సార్సీపీని ఓటర్లు విజయ తీరానికి నడిపించారు. ఆ పార్టీ పోటీచేసిన కడప, అనంతపురం నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీనే విజయదుందుభి మోగించింది. అలాగే, వైఎస్సార్సీపీకి బలమైన మద్దతుదారులుగా ఉన్న దళితుల ఓట్లను చీల్చడమే లక్ష్యంగా చంద్రబాబు ప్రయోగించిన బీఎస్పీ కార్డును సైతం ప్రజలు నిర్ద్వందంగా తిరస్కరించారు. ఆ పార్టీ పోటీచేసిన 32 నియోజకవర్గాలతోపాటు తిరుపతి, చిత్తూరు, బాపట్ల ఎంపీ స్థానాల్లో డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది. బాబు ఎత్తులు చిత్తుచిత్తు చంద్రబాబు లోపాయికారీ కుట్రను ఓటర్లు చిత్తుచిత్తు చేశారు. టీడీపీకి దారుణ పరాజయాన్ని కానుకగా ఇచ్చారు. జనసేన సినిమా రైట్స్‌ను టీడీపీకి అమ్మిన పవన్ కల్యాణ్‌కు ప్రజలు గుణపాఠం చెప్పారు. ఆ పార్టీతో పొత్తుపెట్టుకున్న వామపక్షాలు, బీఎస్పీలను డిపాజిట్లు దక్కకుండా ఓడించారు. లోపాయికారీ రాజకీయ కుట్రలో ప్రధాన భాగస్వామి అయినా టీడీపీకి చావు దెబ్బకొట్టారు. టీడీపీ పోటీచేసిన 175 నియోజకవర్గాల్లో 150 స్థానాల్లో చిత్తయ్యింది. కేవలం 25 స్థానాలలోపే కట్టడి చేశారు. 1982లో టీడీపీ ఆవిర్భవించిన తరువాత ఆ పార్టీ ఇంతటి ఘోర పరాజయాన్ని చవిచూడటం ఇదే తొలిసారి. చంద్రబాబు మంత్రివర్గంలోని 24మంది మంత్రుల్లో ఏకంగా 22మంది ఓడిపోవడం ప్రజాగ్రహానికి నిదర్శనంగా నిలుస్తోంది. వారిలో చంద్రబాబు కుమారుడు లోకేశ్ కూడా ఉండటం గమనార్హం. -
ప్రజలకు రుణపడి ఉంటాను
సాక్షి, హైదరాబాద్: ప్రజల అవసరాలు, రాష్ట్ర విభజన హక్కులపై పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుకను అవుతానని మల్కాజిగిరి ఎంపీగా గెలుపొందిన ఎనుగుల రేవంత్‌రెడ్డి అన్నారు. తనను ఆశీర్వదించిన మల్కాజిగిరి ప్రజలకు రుణపడి ఉంటానని తెలిపారు. మల్కాజిగిరి నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడించారు. తెలంగాణ కేసీఆర్ రాజ్యం అనుకుంటున్నారని, తండ్రీ కొడుకుల అహంకారం అణచేందుకే ప్రజలు ఈ ఫలితాలు ఇచ్చారన్నారు. కేసీఆర్ అధికారాన్ని ఆస్తులు పెంచుకునేందుకు వాడుకుంటున్నారని ఆరోపించారు. ఈ గెలుపులో తన ప్రమేయం కంటే తెలంగాణ సాధించుకున్న విద్యార్థుల పాత్ర ఎక్కువగా ఉందని తెలిపారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఉక్కు కర్మాగారం, ట్రైబల్ వర్సిటీలను సాధించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆంగ్లో ఇండియన్లకు అసెంబ్లీ, పార్లమెంట్లో ఉన్న రిజర్వేషన్లు రద్దు చేసే వరకు పోరాడతానని చెప్పారు. మల్కాజిగిరిని మరో నోయిడాగా అభివృద్ధి చేస్తానని అన్నారు. కంటోన్మెంట్ బోర్డు ఎత్తేసి, గ్రేటర్ పరిధిలోకి తెచ్చేందుకు కృషి చేస్తానన్నారు. మిలటరీ అధీనంలోని రోడ్లపై ప్రజలకు స్వేచ్ఛ ఉండేలా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని చెప్పారు. -
బీజేపీ చేతికి ఉత్తరం
పదిహేడో లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరాదిని బీజేపీ ఊపేసింది. అనేక అంచనాలకు, సర్వేల ఫలితాలను మించి అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. 2014 పార్లమెంటు ఎన్నికల్లో మాదిరే ప్రధాని నరేంద్ర మోదీ సృష్టించిన ప్రభంజనం కాషాయ పక్షానికి ఊహించని విజయాలను అందించింది. ఆరు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆధికారం కోల్పోయిన మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో అంతలోనే దాదాపు మొత్తం లోక్‌సభ స్థానాలు కైవసం చేసుకుంది. దేశంలోనే అత్యధిక సీట్లున్న ఉత్తర్‌ప్రదేశ్‌లో బీఎస్పీ– ఎస్పీ మహా కూటమిగా ఏర్పడి విసిరిన సవాలును తేలిగ్గా తిప్పికొట్టేసింది. యూపీలోని మొత్తం 80 సీట్లలో 60 సీట్ల వరకూ నిలబెట్టుకుంది. ఈ మహాకూటమి నుంచి ఎదురయ్యే పోటీ వల్ల బీజేపీ 40 సీట్లు గెలిస్తే గొప్పేనన్న అంచనాలు తప్పని కమలదళం రుజువు చేసింది. మారిన రాజకీయ పరిస్థితుల్లో కూడా జమ్మూకశ్మీర్‌లో కిందటిసారి గెలిచిన 3 సీట్లను బీజేపీ నిలబెట్టుకుంది. చిన్న రాష్ట్రాలైన హరియాణా, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్‌లోని మొత్తం సీట్లను మోదీ ప్రభంజనంతో బీజేపీ కైవసం చేసుకుంది. డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన ఛత్తీస్‌గఢ్‌లో దాదాపు 90% సీట్లు సొంతం చేసుకుంది. మొత్తంమీద బీజేపీ బలం లోక్‌సభలో 300 సీట్లు దాటడానికి ఉత్తరాది రాష్ట్రాలు తమ వంతు తోడ్పాటునిచ్చాయి. యూపీలో 11 సీట్లు కోల్పోయిన ఎన్డీఏ ఉత్తర్‌ప్రదేశ్‌లోని 80 సీట్లలో బీజేపీ 62 స్థానాలు గెలుచుకోగా మిత్రపక్షం అప్నాదళ్ (ఎస్) రెండు సీట్లు గెలుచుకుంది. దీంతో ఎన్డీఏ స్కోరు ఇక్కడ 64 సీట్లకు చేరుకుంది. 2014 ఎన్నికల్లో ఎన్డీఏ 73 సీట్లు కైవసం చేసుకోవటం గమనార్హం. 2007– 2017 మధ్య పదేళ్లు యూపీలో అధికారంలో ఉన్న బీఎస్పీ, ఎస్పీలు ఈసారి ఆరెల్డీతో కలిసి మహాకూటమి పేరుతో పోటీచేసి 15 సీట్లు గెలుచుకోవడంతో ఇక్కడ బీజేపీ బలం ఈసారి కాస్త తగ్గింది. వేర్వేరు సామాజికవర్గాల మద్దతు ఉన్న ఈ రెండు పార్టీలు లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోరాడడంతో తమ ఉనికిని కాపాడుకోగలిగాయి. మాజీ సీఎం మాయావతి నాయకత్వంలోని బీఎస్పీ 10, మరో మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని ఎస్పీ ఐదు సీట్లు మాత్రమే గెలుచుకోగలిగాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అమేథీలో గతంలో మూడుసార్లు గెలిచి ఈ ఎన్నికల్లో ఓడిపోవడం సంచలనం. రాయ్‌బరేలీలో యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ విజయంతో యూపీలో కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం దక్కింది. ఓటేసింది యోగిని చూసి కాదు: 2017 యూపీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం తర్వాత అనూహ్యంగా సీఎం అయిన యోగీ ఆదిత్యనాథ్ పాలన బాగోకున్నా ప్రధాని సాధించిన విజయాలకు మెచ్చి బీజేపీకి ఓటేస్తున్నామని ఎన్నికల ముందు సర్వేల్లో ప్రజలు చెప్పారు. అలాగే దాదాపు 10 శాతం జనాభా ఉన్న బీజేపీ పునాది వర్గం బ్రాహ్మణులు యోగి పాలనపై అసంతృప్తి ఉన్నా ఈసారికి మోదీ కోసమే బీజేపీని సమర్థిస్తున్నామన్నారు. ఓ సీటు పెరిగింది మధ్యప్రదేశ్‌లో కాషాయం స్వీప్ 29 సీట్లున్న బీజేపీ కంచుకోట మధ్యప్రదేశ్‌లో... కాషాయపక్షం ఈసారి 29 స్థానాలకుగాను 28 స్థానాలు కైవసం చేసుకుంది. కిందటిసారి ఎన్నికలతో పోల్చితే ఒక సీటు పెరిగింది. 1993– 2018 మధ్య రాష్ట్రాన్ని పదిహేడు సంవత్సరాలు పాలించాక బీజేపీ 2018 డిసెంబర్ ఎన్నికల్లో ఓడిపోయింది. కాంగ్రెస్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ సారథ్యంలోని సర్కారు ఐదు నెలల పాలన తర్వాత జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఇంతటి భారీ విజయం సొంతం చేసుకుంటుందని రాజకీయ పండితులెవరూ ఊహించలేకపోయారు. రైతు రుణమాఫీ హామీని కాంగ్రెస్ సర్కారు సక్రమంగా అమలు చేయకపోవడం, ప్రధాని మోదీ జనాకర్షణ శక్తి బీజేపీ విజయానికి కారణమైంది. 2014లో కాంగ్రెస్ గెలిచిన సీట్లలో ఒకటైన గుణాలో గ్వాలియర్ మాజీ సంస్థానాధీశుల కుటుంబసభ్యుడైన జ్యోతిరాదిత్య సింధియా తొలిసారి ఓడిపోవడం గమనార్హం. మాజీ సీఎం దిగ్విజయ్‌సింగ్ భోపాల్ నుంచి పోటీచేసి ‘హిందుత్వ’ ప్రతినిధి సాధ్వీ ప్రగ్యాసింగ్ ఠాకూర్ చేతిలో ఓడిపోయారు. ప్రగ్యకు టికెట్ ఇవ్వడం, ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వల్ల బీజేపీకి నష్టం జరగకపోగా మేలే జరిగిందని ఫలితాలు నిరూపించాయి. హిందుత్వ కాషాయ రాజకీయాలకు పునాది అయిన మధ్యప్రదేశ్ మోదీ మళ్లీ ప్రధాని కావడానికి తన వంతు సాయమందించింది. పంజాబ్‌లో కాంగ్రెస్ నిలదొక్కుకుంది పంజాబ్‌లోని 13 లోక్‌సభ సీట్లలో పాలకపక్షమైన కాంగ్రెస్ 8 సీట్లు కైవసం చేసుకొని ఆధిక్యం నిలబెట్టుకుంది. రెండేళ్ల క్రితం పంజాబ్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సీఎంగా రాజకీయ అనుభవం ఉన్న కెప్టెన్ అమరీందర్‌సింగ్ నాయకత్వంలో కాంగ్రెస్ పనితీరుతోపాటు అకాలీదళ్–బీజేపీ కూటమిని చాకచక్యంగా ఎదుర్కొంది. 2017 ఎన్నికలకు ముందు పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన ఈ కూటమికి ఉన్న చెడ్డపేరు కూడా కాంగ్రెస్ విజయానికి తోడ్పడింది. కిందటిసారి 4 సీట్లు గెలుచుకున్న ‘ఆప్’.. ఈసారి ఒక సీటే గెలుచుకోగా అకాలీదళ్, బీజేపీలు చెరో రెండు సీట్లు సాధించాయి. పాక్ సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్‌లో బీజేపీ జాతీయవాదం పనిచేయలేదు. హరియాణాలో క్లీన్‌స్వీప్ కిందటి సారి బీజేపీకి ఏడు సీట్లు అందించిన హరియాణాలోని మొత్తం పది లోక్‌సభ సీట్లనూ కాషాయపక్షం కైవసం చేసుకుంది. బీజేపీ తొలి సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ పాలనలో ఉన్న ఈ రాష్ట్రంలో జాట్ల ఆధిపత్యం ఎక్కువ. పంజాబీ ఖత్రీ అయిన ఖట్టర్‌కు ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టిన బీజేపీ ఈసారి లోక్‌సభ టికెట్ల కేటాయింపులో కులాలవారీ పద్ధతికి స్వస్తి చెప్పింది. కొత్త ప్రయోగాలతో ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. కొన్ని దశాబ్దాలపాటు బన్సీలాల్, దేవీలాల్, భజన్‌లాల్ కుటుంబాల ఆధిపత్యంలో మగ్గిన హరియాణాలో బీజేపీ పది లోక్‌సభ సీట్లు దక్కించుకోవడం అసాధారణ విజయంగా భావించవచ్చు. మాజీ సీఎం భూపిందర్‌సింగ్ హూడా, ఆయన కొడుకు దీపేందర్ ఓడిపోయారు. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌కు బీజేపీ ‘షాక్’ కిందటి డిసెంబర్లో జరిగిన ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో పదిహేనేళ్ల పాలన తర్వాత ఘోర పరాజయం పాలైన బీజేపీ ఆరు నెలలు తిరగకుండానే మొత్తం 11 సీట్లలో 9 కైవసం చేసుకోవడం ద్వారా కాంగ్రెస్‌కు గట్టి షాక్ ఇచ్చింది. మిగిలిన రెండు సీట్లను దక్కించుకున్న కాంగ్రెస్ పరువు కాపాడుకుంది. ఎగ్జిట్ పోల్స్‌లో సైతం బీజేపీ అత్యధిక సీట్లు కైవసం చేసుకోబోతోందని తేలింది. ఛత్తీస్‌గఢ్ గ్రామీణ ప్రాంతాల్లో జాతీయవాదం, హిందుత్వ ప్రభావం లేని కారణంగా బీజేపీకి మూడు నాలుగు సీట్లొస్తే గొప్పేనన్న రాజకీయ పండితుల అంచనాలు తలకిందులయ్యాయి. కశ్మీర్.. నిలబడిన బీజేపీ బలం జమ్మూ కశ్మీర్లో 2014 ఎన్నికల్లో జమ్మూ,, లద్దాఖ్‌లోని మూడు సీట్లు మొదటిసారి గెలిచిన బీజేపీ ఈసారి ఈ స్థానాలు నిలబెట్టుకుంది. కిందటిసారి మిగిలిన మూడు సీట్లు సాధించిన జేకే పీడీపీ ఈసారి కశ్మీర్ లోయలోని ఆ సీట్లను కోల్పోయింది. ఈ స్థానాలను ఫరూఖ్ అబ్దుల్లా కుటుంబం ఆధిపత్యంలోని నేషనల్ కాన్ఫరెన్స్ కైవసం చేసుకుంది. పీడీపీ నాయకురాలు, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ కిందటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీతో కలిసి సంకీర్ణ సర్కారు కొన్నాళ్లు నడిపింది. చివరికి బీజేపీ వైదొలగడంతో ఆమె ప్రభుత్వం కూలిపోయింది. ఈ నేపథ్యంలో పీడీపీకి జనాదరణ తగ్గి నేషనల్ కాన్ఫరెన్స్ మళ్లీ పుంజుకోగలిగింది. ఉత్తరాఖండ్‌లో మళ్లీ ఐదూ బీజేపీకే హిమాలయ రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌లో రెండేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన బీజేపీ మళ్లీ మొత్తం ఐదు లోక్‌సభ సీట్లను కైవసం చేసుకుని రికార్డు సృష్టించింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించాక త్రివేంద్రసింగ్ రావత్ సీఎం అయ్యారు. కాంగ్రెస్, బీజేపీ ప్రతి ఐదేళ్లకూ ఒకదాని తర్వాత ఒకటి అధికారంలోకి వచ్చే ఉత్తరాఖండ్‌లో ఈసారి హిందుత్వ, జాతీయవాదం ప్రభావం పనిచేసిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. చండీగఢ్‌లో కిరణ్ ఖేర్ రెండో విజయం కిందటి ఎన్నికల్లో కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్ నుంచి బీజేపీ టికెట్‌పై గెలిచిన సినీ నటి కిరణ్ ఖేర్ రెండోసారి గెలిచారు. స్థానిక బీజేపీ కార్యకర్తలు వ్యతిరేకించినా ఆమె టికెట్ సాధించి మరీ విజయం సాధించారు. హిమాచల్.. పాత ఫలితాలే పునరావృతం.. బీజేపీకి బలమైన పునాదులున్న మరో హిమాలయ రాష్ట్రం హిమాచల్‌ప్రదేశ్‌లో కూడా కాషాయపక్షం వరుసగా రెండోసారి మొత్తం నాలుగు లోక్‌సభ సీట్లనూ కైవసం చేసుకుంది. 2017 డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచాక జైరాం ఠాకూర్ సీఎం అయ్యారు. కేంద్ర మాజీ మంత్రి సుఖ్రాం బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన నేపథ్యంలో కాంగ్రెస్‌కు రెండు సీట్లయినా వస్తాయన్న అంచనా తప్పయింది. ఢిల్లీలో బీజేపీకి మళ్లీ ఏడు జాతీయ రాజధాని ప్రాంతమైన ఢిల్లీలోని ఏడు సీట్లనూ బీజేపీ వరుసగా రెండోసారి కైవసం చేసుకుంది. 2014 మోదీ ప్రభంజనంలో బీజేపీ ఏడు సీట్లు గెలుచుకుంది. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన బీజేపీ ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో గెలిచింది. ఈసారి ఆప్, కాంగ్రెస్ మొదట పొత్తుకు ప్రయత్నించి విఫలంకావడం బీజేపీ విజయానికి ఒక కారణం. -
ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయను
పెద్దపల్లి: ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌నేత స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఆయన మాట్లాడారు. ఉద్యోగాన్ని వదిలి ప్రజాసేవ చేసేందుకు వచ్చానని చెప్పారు. ఆదరించి గెలిపించిన సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తక్కువ సమయంలోనే తనను కలుపుకొని గెలిపించడానికి కృషి చేసిన టీఆర్ఎస్ నాయకులకు, నియోజకవర్గ ఓటర్లకు సేవకుడిగా ఉంటానని వెల్లడించారు. -
ఆ నోటా ఈ నోటా
ఈవీఎంలో ఒక ఆప్షన్ ఉంటుంది. అదే నోటా... పైన తెలిపిన ఎవ్వరికీ నేను ఓటు వేయడం లేదు (నన్–ఆఫ్–ది ఎబవ్) అని తేల్చి చెప్పడమే ఈ నోటా అర్థం. 2014లో నోటా ఓట్ శాతం ఎంత ఉందో... 2019లోనూ ఆ శాతం దాదాపు అదే విధంగా ఉండడం ఇక్కడ గమనార్హం. ఎన్నికల సంఘం వెబ్సైట్ అందించిన గణాంకాల ప్రకారం... సంబంధిత అంశాన్ని క్లుప్తంగా చూస్తే... ► 2019లో పోలైన మొత్తం ఓట్లలో నోటా శాతం 1.04% . 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఈ శాతం 1.08% . లోక్‌సభ ఎన్నికల చరిత్రలోనే 2019లో అత్యధిక ఓట్లశాతం నమోదయిన సంగతి తెలిసిందే. ► ఈ నోటారాష్ట్రాల వారీగా చూస్తే, నోటా శాతాల్లో తీవ్ర వ్యత్యాసం ఉండడం మరో విశేషం. అస్సాం, బిహార్లలో అత్యధికంగా 2.08% నోటా ఓటు నమోదయ్యింది. సిక్కింలో ఈ శాతం 0.65 శాతంగా ఉంది. ► ఈ నోటాపీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాకు సంబంధించి ఒక కేసులో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 2013లో ఇచ్చిన ఒక తీర్పు నేపథ్యంలో దేశంలో నోటా విధానం ఆరంభమైంది. ► ఈ నోటాఛత్తీస్గఢ్, మిజోరం, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఢిల్లీ 2013 అసెంబ్లీ ఎన్నికల్లో నోటా వినియోగం ప్రారంభమైంది. అప్పట్లో ఆయా రాష్ట్రాల్లో నోటా ఓటు 1.85 శాతంగా ఉంది. -
ఎన్డీయేది అద్భుత విజయం: జైట్లీ
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే అద్భుత విజయం సాధించిందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం వ్యాఖ్యానించారు. వారసత్వపాలన, రాచరిక పాలన, కులాల ఆధారిత రాజకీయాలను ప్రజలు ఈ ఎన్నికల్లో తిరస్కరించారని అన్నారు. పూర్తి మెజారిటీతో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారం చేపడుతుందని ఆయన చెప్పారు. అసత్య ప్రచారాలతో ప్రభుత్వంపై విపక్షాలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని, ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడైనట్టుగానే ఫలితాలు సాధించామని తెలిపారు. ‘అద్భుత విజయాన్ని అందించిన సందర్భంగా ప్రధాని మోదీకి, ఎన్డీ యే, బీజేపీ కార్యకర్తలకు అభినందనలు తెలుపుతున్నాను’అని ఆయన చెప్పారు. ఈవీఎంలను అనుమానించడం, వీవీ పాట్ల లెక్కింపునకు డిమాండ్ ద్వారా ప్రజాస్వామ్యాన్ని చులకన చేసేందుకు యత్నించిన విపక్షాలను దుయ్యబట్టారు. విజయానికి తోడ్పాటునందించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. -
28 మంది మహిళా ఎంపీలు మళ్లీ..
న్యూఢిల్లీ: 41 మంది సిట్టింగ్ మహిళా ఎంపీల్లో 28 మంది మహిళా ఎంపీలు ముందంజలో ఉన్నారు. సోనియా గాంధీ, హేమ మాలిని, కిరణ్ ఖేర్ వం టి సిట్టింగ్ ఎంపీలు ఈ ఎన్నికల్లో తమ స్థానాన్ని పదిల పరచుకోడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే స్మృతీ ఇరానీ, ప్రజ్ఞా ఠాకూర్ భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతున్నారు. రాయ్ బరేలి నుంచి కాంగ్రె స్ ఎంపీ సోనియా గాంధీ, పిలిభిత్ నుంచి బీజేపీ సిట్టింగ్ ఎంపీ మేనకా గాంధీ, మధుర బీజేపీ ఎంపీ మాలిని, చంఢీగఢ్ బీజేపీ అభ్యర్థి ఖేర్, కనౌజ్ ఎస్పీ ఎంపీ డింపుల్ యాదవ్, న్యూఢిల్లీ ఎంపీ మీనాక్షి లేఖి వంటి ప్రముఖులు ముందంజ లో ఉన్నారు. కాగా, అసన్సోల్ నుంచి బంకుర టీఎమ్సీ ఎంపీ మున్ మున్ సేన్, కాంగ్రెస్ సిల్చర్ ఎంపీ సుస్మితా దేవ్, సుపాల్ కాంగ్రెస్ ఎంపీ రంజీత్ రంజన్, బర్ధమాన్–దుర్గాపూర్ టీఎంసీ అభ్యర్థి మమ్తాజ్ సంఘమిత్ర, హూగ్లీ టీఎంసీ ఎంపీ అభ్యర్థి రత్న డే, లాల్గంజ్ ఎంపీ నీలం సోన్కార్ వెనుకంజలో ఉన్నారు. బీజేపీ నుంచి లీడింగ్‌లో ఉన్న మహిళా సిట్టింగ్ ఎంపీలు 16 మంది కాగా, కాంగ్రెస్ నుంచి కేవలం సోనియా గాంధీ మాత్రమే లీడ్‌లో ఉన్నారు. కాంగ్రెస్‌కు కంచుకోటలా భావించే అమేథీలో స్మృతి భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతూ రాహుల్ గాంధీపై చారిత్రక విజయాన్ని నమోదు చేయనున్నారు. కాగా భోపాల్ వివాదాస్పద బీజేపీ అభ్యర్థి ప్రజ్ఞా తన ప్రత్యర్థి కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌పై ముందంజలో ఉన్నారు. అలాగే తూత్తుకూడి డీఎంకే అభ్యర్థి కనిమొళి కరుణానిధి, ఉత్తర ప్రదేశ్‌లోని అలహాబాద్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి రీటా బహుగుణ గెలుపుబాటలో ఉన్నారు. టీఎంసీ తరపున పోటీ పడుతున్న బెంగాళీ నటి లాకెట్ చటర్జీ హూగ్లీ నియోజకవర్గంలో ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ 54 మహిళా అభ్యర్థులను బరిలోకి దింపగా, బీజేపీ తరపున 53 మంది మహిళలు పోటీపడ్డారు. యూపీ నుంచి అత్యధికంగా 104 మంది అభ్యర్థులు పోటీ చేశారు. -
అందరూ ఒక్కటైనా..!
సాక్షి, అమరావతి: ప్రజాస్వామ్య సౌధానికి శాసన నిర్మాణ వ్యవస్థ.. కార్యనిర్వాహక వ్యవస్థ.. న్యాయ వ్యవస్థ మూడు స్తంభాలైతే.. మీడియాను నాలుగో స్తంభంగా అభివర్ణిస్తారు. ప్రభుత్వ అరాచకాలు, అవినీతి, అక్రమాలపై జనం పక్షాన అక్షరయుద్ధం చేయాల్సిన గురుతర బాధ్యత మీడియాపై ఉంటుంది. ప్రజాసమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేయాల్సిన ఆవశ్యకత మీడియాపై ఉంది. కానీ.. రాష్ట్రంలో పరిస్థితి అందుకు పూర్తి విరుద్ధం. ఎల్లో మీడియా ఆ బాధ్యతను విస్మరించి ప్రజల తరఫున పోరాడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అడ్డగోలుగా విషం కక్కింది. విలువలకు వలువలు వదిలేసి.. ప్రభుత్వ ఖజానానూ ఇష్టారాజ్యంగా దోచేస్తూ.. సీఎం చంద్రబాబు నిర్మించిన అవినీతి సామ్రాజ్యానికి అడుగడుగునా వెన్నుదన్నుగా నిలిచింది. ఇలా చంద్రబాబుతో కలిసి ఎల్లో మీడియా పన్నిన ‘కుట్ర’లన్నింటినీ వైఎస్ జగన్మోహన్రెడ్డి సమర్థవంతంగా తిప్పికొట్టారు. ఎల్లో మీడియా విషం చిమ్ముతున్నా లెక్క చేయకుండా ప్రజా సమస్యల పరిష్కారం కోసం.. ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై అలుపెరగకుండా పోరాటంచేసి ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. ఇదే ఈ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రికార్డు స్థాయి విజయాన్ని కట్టబెట్టింది. టీడీపీ చరిత్రలో ఘోరమైన ఓటమి టీడీపీ ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటివరకూ జరిగిన ఎన్నికల్లో ఏ ఎన్నికల్లోనూ లేని రీతిలో ఈ ఎన్నికల్లో ఘోరమైన పరాజయాన్ని ఇప్పుడు చవిచూసింది. 2014 ఎన్నికల్లో 600లకు పైగా హామీలిచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. కానీ.. అధికారం చేపట్టాక ఇచ్చిన హామీల్లో ఒక్కటంటే ఒక్క హామీని సంపూర్ణంగా అమలు చేయలేదు. వందిమాగధులు, బినామీలతో కలిసి ప్రభుత్వ ఖజానా, సహజ వనరులను చంద్రబాబు యథేచ్ఛగా లూటీ చేశారు. చంద్రబాబు ప్రభుత్వ అరాచకాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శాసనసభలోను, ప్రజాక్షేత్రంలోనూ ఎప్పటికప్పుడు పోరాటం చేస్తూ వచ్చారు. ప్రభుత్వ అరాచాకాలపై పోరాటం చేయాల్సిన మీడియా తన ధర్మాన్ని విస్మరించి.. ప్రతిపక్ష నేతగా బాధ్యతతో వ్యవహరిస్తున్న జగన్మోహన్రెడ్డిపై విషం చిమ్మింది. అదే సమయంలో సీఎం చంద్రబాబుకు దన్నుగా నిలిచాయి. గోదావరి పుష్కరాల్లో తన ప్రచార పిచ్చికి 29 మందిని చంద్రబాబు పొట్టన పెట్టుకున్నా ఎల్లో మీడియా స్పందించలేదు. ఇసుక మాఫియా ఆగడాలకు చిత్తూరు జిల్లా ఏర్పేడులో 14 మంది అసువులు బాసినా నోరు మెదపలేదు. రాజధానిలో కాల్‌మనీ సెక్స్ రాకెట్లో పచ్చ కాలకేయులు మహిళల మానప్రాణాలతో చెలగాటమాడినా ఎల్లో మీడియాకు పట్టలేదు. రాజధానిలో ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా రైతుల నుంచి 25 వేల ఎకరాల భూములను అత్తెసరు ధరలకే కాజేసి రూ.లక్ష కోట్లకు పైగా దోచుకున్న చంద్రబాబు అండ్ కో ఆగడాలు ఎల్లో మీడియాకు కన్పించలేదు. సాగునీటి ప్రాజెక్టుల్లో.. రాష్ట్రానికి చుక్కానిగా నిలవాల్సిన పోలవరం ప్రాజెక్టులో రూ.40 వేల కోట్లు దోచేసినా మీడియాకు పట్టలేదు. దోచేసిన సొమ్ముతో విపక్షానికి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా చంద్రబాబు కొనుగోలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని పరిహసించినా.. తెలంగాణలో ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తూ ఆడియో వీడియో టేపుల్లో పట్టుబడినా పచ్చ మీడియా పట్టించుకున్న పాపాన పోలేదు. పైగా.. ప్రజాసమస్యల పరిష్కారం. సర్కార్ దోపిడీపై పోరాటం చేస్తూ నిత్యం ప్రజల్లో ఉంటూ వచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డిపై చంద్రబాబు కనుసైగల మేరకు అవాస్తవాలు, అభూత కల్పనలతో ఎల్లో మీడియా అసత్య కథనాలను వార్చుతూ వచ్చింది. అంతేకాదు.. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా.. ‘ప్రజాసంకల్ప యాత్ర’ పేరుతో మండుటెండను కూడా లెక్క చేయకుండా 3,648 కి.మీల మేర చేసిన సుదీర్ఘ పాదయాత్రను కూడా చిన్నదిగా చూపించేందుకు కుయుక్తులు పన్నింది. చివరకు ఎన్నికల సమయంలో ప్రత్యర్థులను మట్టుబెట్టి భయభ్రాంతులకు గురిచేసి విజయం సాధించాలనే ధ్యేయంతో వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డిని ప్రభుత్వ పెద్దలే హత్య చేయించారు. హత్య చేసిన కిరాతకులను వదిలిపెట్టి.. ఆ హత్యను వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబ సభ్యులపైకి నెట్టేందుకు చంద్రబాబు చేసిన కుట్రలకు ఎల్లో మీడియా పదును పెట్టి ఓటర్లను ప్రభావితం చేసే యత్నం చేసింది. ఎల్లో మీడియా అంతా ఒక్కతాటిపైకి వచ్చి చేసిన విష ప్రచారాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాక్షేత్రంలో సమర్థవంతంగా తిప్పికొట్టారు. చంద్రబాబు, టీడీపీ నేతల దురాగతాలను వివరిస్తూ.. వాటికి ఎల్లో మీడియా కొమ్ముకాస్తున్న తీరును విడమర్చి చెబుతూ ప్రజలకు వాస్తవాలను వివరించారు. నిజాలను తెలుసుకున్న ప్రజలు ప్రజానేత ఎవరో ఎంచుకున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంట నడిచారు. దాంతో ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కనీవినీ ఎరుగని రీతిలో.. రికార్డు స్థాయిలో విజయదుంధుబి మోగించింది. -
ఈసారి రికార్డు 6.89 లక్షలు
న్యూఢిల్లీ: రెండుసార్లు ఎంపీగా ఉన్న బీజేపీకి చెందిన సీఆర్ పాటిల్ గురువారం వెలువడిన లోక్‌సభ ఫలితాల్లో రికార్డు మెజారిటీకి చేరువగా వచ్చారు. గుజరాత్‌లోని నవ్సారీ లోక్‌సభ స్థానంనుంచి ఆయన 6.89 లక్షల మెజారిటీ సాధించారు. 2019 ఎన్నికల్లో ఇదే అత్యధిక మెజారిటీ. 2014లో బీజేపీ సీనియర్ నేత దివంగత గోపినాథ్ ముండే మరణంతో ఖాళీ అయిన బీడ్ స్థానంనుంచి ప్రీతమ్‌ముండే 6.96 లక్షల మెజారిటీ సాధించారు. ఇప్పటివరకు ఇదే అత్యధిక రికార్డు మెజారిటీగా ఉంది. సీఆర్‌పాటిల్‌తో పాటు బీజేపీ నుంచి ఆరు లక్షల మెజారిటీ క్లబ్లో సంజయ్ భాటియా, క్రిష్ణపాల్, సుభాష్‌చంద్ర బెహరియా కూడా ఉన్నారు. మరో డజనుపైగా ఎంపీలు ఐదులక్షలకు మించి మెజారిటీ సాధించారు. వారణాసి నుంచి పోటీ చేసిన ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తన సమీప ప్రత్యర్థి, సమాజ్‌వాది పార్టీకి చెందిన షాలినీ యాదవ్‌పై 4.79 లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2014లో ఆయన అరవింద్ కేజ్రీవాల్‌పై 3.71 లక్షల మెజారిటీ సాధించారు. ఇక భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా గుజరాత్‌లోని గాంధీనగర్ నుంచి పోటీచేసి 5.57 లక్షల మెజారిటీ సాధించారు. గతంలో ఇదే స్థానంలో పార్టీ సీనియర్ నేత అద్వానీ 4.83 లక్షల ఓట్లు సాధించారు. ఇక హర్యానాలోని కర్నాల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా విజయం సాధించిన సంజయ్‌భాటియా 6.56 లక్షల ఓట్లు సాధించారు. అదే పార్టీకి చెందిన ఫరీదాబాద్ అభ్యర్థి క్రిష్ణపాల్ 6.38 లక్షల ఓట్లు సాధించడం విశేషం. అత్యల్ప ‘రికార్డులు’ఇవే 181 ఓట్ల తేడాతో గెలిచిన బీజేపీ అభ్యర్థి ఉత్తరప్రదేశ్‌లోని మచ్లీషహర్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి భోలేనాథ్ తన ప్రత్యర్థి, బీఎస్పీకి చెందిన త్రిభువన్‌రామ్‌పై 181 ఓట్ల స్వల్ప తేడాతో విజయం సాధించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఇదే అత్యల్ప మెజారిటీ. ఇక లక్షద్వీప్ నుంచి నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహ్మద్ ఫైజల్ తన ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి హమీదుల్లా సయీద్‌పై 823 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అండమాన్ నికోబాల్ స్థానం నుంచి విజయం సాధించిన కాంగ్రెస్‌కు చెందిన కుల్దీప్‌రాయ్‌శర్మ, తన ప్రత్యర్థి, బీజేపీ చెందిన విశాల్ జోషిపై 1,407 ఓట్లతో విజయం సాధించారు. బిహార్‌లోని జనహాబాద్ స్థానం నుంచి జేడీ (యూ) నుంచి విజయం సాధించిన చండేశ్వర్ ప్రసాద్, ఆర్జే డీ నుంచి పోటీ చేసిన సురేంద్ర ప్రసాద్ యాదవ్‌పై 1,075 ఓట్ల స్వల్ప తేడాతో విజయం సాధించారు. -
ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు
సాక్షి, హైదరాబాద్: ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఈ విషయంలో గతేడాది జరిగిన ముందస్తు అసెంబ్లీ, తాజాగా ముగిసిన పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ పోలీసులు అనుసరించిన వ్యూహాలు ఫలించాయి. వాస్తవానికి ఈ విషయంలో తెలంగాణ పోలీసులు చాలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించారు. పార్లమెంటు కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఏప్రిల్ 11న తెలంగాణలోని 17 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యే వరకు పోలీసులు పకడ్బందీ ప్రణాళికతో వ్యవహరించారు. పార్లమెంటు ఎన్నికలకు రాష్ట్ర పోలీసులు మొత్తం 54 వేల మందికి తోడుగా కేంద్ర బలగాలు, అటవీ, విద్యుత్తు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన పోలీసులంతా కలిపి దాదాపు 80 వేల మందికిపైగా పోలీసులు విధుల్లో పాల్గొన్నారు. వామపక్ష తీవ్రవాదం అధికంగా ఉన్న మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాల్పల్లి, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. కూంబింగ్ పార్టీలు నిత్యం అప్రమత్తంగా ఉండటంతో సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌ల నుంచి మావోయిస్టులు తెలంగాణలోకి ప్రవేశించకుండా పొలిమేరలను కట్టుదిట్టంగా పహారా కాశారు. పోలింగ్ ముందు ఛత్తీస్‌గఢ్‌లో ఎమ్మెల్యే కాన్వాయ్ పేల్చివేత, పోలింగ్ తరువాత మహారాష్ట్రలో పోలీసుల కాన్వాయ్‌పై మెరుపు దాడితో మావోయిస్టులు హింసకు దిగి ప్రశాంతతను చెదరగొట్టారు. కానీ, తెలంగాణలో మావోయిస్టులకు అలాంటి అవకాశాలు ఏమాత్రం ఇవ్వలేదు. ఇక తెలంగాణలో మొత్తం 2,600 సంక్లిష్ట ప్రాంతాలు, 5749 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ముందుగానే గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో ఎలాంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించి సఫలమయ్యారు. 40 రోజులపాటు సుదీర్ఘ పహారా.. ఏప్రిల్ 11న పోలింగ్ జరగ్గా, మే 23 ఓట్ల లెక్కింపు చేపట్టారు. తెలంగాణ వ్యాప్తంగా 34,603 పోలింగ్ స్టేషన్లలో 18,526 పోలింగ్ స్థానాల్లో ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరపడంలో పోలీసులు సఫలమయ్యారు. ఒక్క చోట కూడా రీపోలింగ్ జరపాల్సిన అవసరం రాకపోవడం పోలీసుల పనితీరుకు నిదర్శనం. ఎన్నికల అనంతరం ఎన్నికల నిబంధనల ప్రకారం.. 37 ప్రాంతాల్లో 123 స్ట్రాంగ్‌రూమ్‌లకు ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను కేంద్ర బలగాల పహారా మధ్య తరలించారు. వీటికి 42 రోజులుగా సివిల్, ఏఆర్, ఎస్పీఎఫ్, కేంద్ర బలగాలతో మూడంచెల భద్రతను కల్పించారు. పోలింగ్ స్టేషన్ల వద్ద 144 సెక్షన్లతో లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేలా ఏకంగా 10,000 మంది స్థానిక పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. విరామం ఎరగకుండా.. ఏడాదిలోపు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు నిర్వహించడం సవాలే అయినా.. సమస్యల్లేకుండా ఎలాంటి విశ్రాంతి, సెలవులు తీసుకోకుండా తెలంగాణ పోలీసులు నిర్విరామంగా, సమర్థంగా విధులు నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల తరువాతే సర్పంచి ఎన్నికలు, తరువాత పార్లమెంటు, అనంతరం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కూడా పూర్తిచేశారు. -
వైఎస్ జగన్ రికార్డు మెజారిటీ
సాక్షి, అమరావతి: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఎంపీ, ఎమ్మెల్యే పదవులకు వైఎస్ జగన్, ఆయన మాతృమూర్తి విజయమ్మ రాజీమాలు చేశారు. ప్రజలే అంతిమ న్యాయనిర్ణేతలంటూ వారి తీర్పునే కోరారు. 2011 ఉప ఎన్నికల్లో కడప లోక్‌సభ నియోజకవర్గంనుంచి బరిలోకి దిగి సవాల్ విసిరారు. కాంగ్రెస్, టీడీపీలు తమ తరపున సీనియర్లు డీఎల్ రవీంద్రారెడ్డి, ఎంవి మైసూరారెడ్డిలను బరిలోకి దింపాయి. అయితే అక్కడి ప్రజలు వైఎస్ జగన్మోహన్రెడ్డికి 5,45,672 మెజారిటీ ఇచ్చారు. భారత పార్లమెంటు ఎన్నికల చరిత్రలో అప్పటి వరకు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మూడో అత్యధిక మెజారిటీ రికార్డును వైఎస్ జగన్ సొంతం చేసుకున్నారు. (2004 ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లోని ఆరాంబాగ్ నియోజకవర్గంనుంచి సీపీఎం అభ్యర్థి అనిల్ బసు 5,92,502 ఓట్ల మెజారిటీతో నెగ్గి అప్పటి వరకు జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో ఉన్నారు. 1991 ఉప ఎన్నికల్లో అప్పటికే ప్రధాని పదవిలో ఉన్న పీవీ నరసింహారావు కాంగ్రెస్‌నుంచి పోటీచేసి 5,80,035 మెజారిటీ సాధించారు. అయితే ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని నిలబెట్టలేదు. చిన్నాచితకా పార్టీలు నామమాత్రపు పోటీ ఇచ్చాయి.) అనంతరం 2014 జనరల్ ఎన్నికల్లో గుజరాత్‌లోని వదోదర లోక్‌సభ స్థానం నుంచి అప్పటి గుజరాత్ సీఎం, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ 5,70,128 ఓట్ల మెజారిటీలో గెలుపొందారు. 2014లో మహరాష్ట్రలోని బీడ్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ప్రీతమ్ ముండే 6,92,245 ఓట్ల మెజారిటీ సాధించి ఆమె లోక్ సభ ఎన్నికల చరిత్రలో మొదటి స్థానాన్ని పొందారు. మిగిలిన వారంతా ప్రధాన పార్టీలనుంచి పోటీ చేయగా వైఎస్ జగన్మోహన్రెడ్డి సొంతంగా పార్టీ స్థాపించి ఎన్నికల బరిలో దిగి అనూహ్య విజయాన్ని సాధించారు. అసెంబ్లీ ఎన్నికల్లో తొలిహిట్... - 2014 జనరల్ ఎన్నికల్లో పులివెందులనుంచి తొలిసారి అసెంబ్లీ బరిలోకి దిగిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి మొదటి హిట్టే దిమ్మతిరిగేలా కొట్టారు. 75,243 ఓట్ల మెజారిటీ సాధించారు. ఇది కూడా సీమాంధ్రలో రికార్డే. విజయమ్మ తరువాత ఇంత మెజారిటీ ఎవరూ సాధించలేదు. అయితే ప్రస్తుత ఎన్నికల ఫలితాలలో ప్రతిపక్షనేతగా పులివెందులనుంచే బరిలోకి దిగి 90, 110 ఓట్ల మెజారిటీ సాధించారు. - 2011 ఉప ఎన్నికల్లో పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంనుంచి వైఎస్ విజయమ్మ 81,373 ఓట్ల మెజారిటీని సొంతం చేసుకున్నారు. ఆ మెజారిటీని ఆ తరువాత ఏపీలో ఎవ్వరూ దాటలేకపోయారు. చంద్రబాబుకూ తప్పని ఓటమి... 1978నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తున్న నారా చంద్రబాబు నాయుడు 1983 ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. 1978లో చంద్రగిరి స్థానంనుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా జనతా పార్టీ అభ్యర్థిపై నెగ్గిన ఆయన 1983లో టీడీపీ చేతిలో 17,429 ఓట్ల తేడాతో ఓడిపోయారు. దాంతో ఆయన టీడీపీలో చేరి, తనకు ఓటమిని చవిచూపిన తన సొంత గ్రామం ఉన్న చంద్రగిరి నియోజకవర్గంనుంచి కుప్పంకు మారారు. అప్పటినుంచి జరిగిన ఎన్నికల్లో గెలుపొందుతున్నారు. 1978లో చంద్రగిరిలో 2,494 ఓట్ల స్వల్ప మెజారిటీతో నెగ్గిన ఆయన 1999లో కుప్పంనుంచి తన ఎన్నికల కెరీర్లో అత్యధికంగా 65,678 ఓట్ల మెజారిటీ సాధించారు. ఎన్టీయార్ అరుదైన ముద్ర.. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు ఎన్నికల కురుక్షేత్రంలో ప్రయోగాలకు తెరతీశారు. మొదటిసారి 1983లో గుడివాడ, తిరుపతి; 1985లో గుడివాడ, హిందూపూర్, నల్లగొండ; 1989లో హిందూపూర్, కల్వకుర్తి; 1994లో హిందూపూర్, టెక్కలి నుంచి పోటీ చేశారు. కల్వకుర్తిలో ఓటమిచెందిన ఆయన మిగిలిన అన్ని స్థానాల్లోనూ గెలిచారు. ఆయన నెగ్గిన అన్నిచోట్లతో పోలిస్తే 1994లో హిందూపూర్‌లో అత్యధికంగా 60,050 ఓట్లు, అత్యల్పంగా 1985లో గుడివాడనుంచి 7,597 ఓట్ల మెజారిటీ సాధించారు. -
పశ్చిమాన హస్తమయం
కొద్ది నెలల కిందట జరిగిన ఎన్నికల్లో బీజేపీకి చావు తప్పి కన్ను లొట్టపోయినట్లయింది. అయితేనేం!! ఈ లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ఓటర్లు మళ్లీ మోదీ–షా ద్వయానికి పట్టం గట్టారు. ఫలితంగా కమలం మరింత వికసించింది. రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్ని బీజేపీ ఏకంగా క్లీన్‌స్వీప్ చేసి కాంగ్రెస్‌ను జీరో చేసింది. గోవాలో మాత్రం బీజేపీ, కాంగ్రెస్‌లు చెరో స్థానాన్ని గెలుచుకున్నాయి. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబై రాజధానిగా ఉన్న మహారాష్ట్రలో బీజేపీ తన ఆధిపత్యాన్ని పూర్తిస్థాయిలో కనబరిచింది. మహారాష్ట్రలోని 48 స్థానాలకుగాను బీజేపీ – శివసేన కూటమి 41 స్థానాలను గెలుచుకునే పరిస్థితిలో ఉంది. బీజేపీ సొంతంగా 23 స్థానాల్లో, శివసేన 18 స్థానాల్లో విజయబావుటా ఎగురవేశాయి. కాంగ్రెస్ కూటమి 7 స్థానాల్లోను, ఇతరులు ఒక స్థానంలో విజయం సాధించారు. ఇక్కడ నాలుగు దశల్లో ఎన్నికలు జరిగాయి. భారతీయ జనతా పార్టీ శివసేనతో జట్టుకట్టి బరిలో దిగగా.. కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లు పోటీగా నిలిచాయి. గత ఎన్నికల సమయంలో బీజేపీ శివసేనలు కలిసికట్టుగా పోటీ చేసి ఘన విజయం సాధించినప్పటికీ ఆ తరువాతి కాలంలో ఇరు పార్టీలూ చెరోదారి పట్టాయి. నాలుగేళ్లపాటు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకున్నా ఎన్నికల సమయానికి మాత్రం రెండు పార్టీలూ మళ్లీ జట్టు కట్టేశాయి. వ్యవసాయ సంక్షోభం తీవ్రస్థాయిలో కనిపించిన మహారాష్ట్రలో బీజేపీ –శివసేన గెలుపు అంత సులభం కాబోదన్న అంచనాలు ముందుగా వెలువడినప్పటికీ ఫలితాల సమయానికి పరిస్థితులన్నీ తారుమారయ్యాయి. మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే శివసేనపై నేరుగా విమర్శలు గుప్పించడం, ప్రజల్లో ఆయన సభలకు మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో శివసేన బలహీన పడుతుందని అంచనా వేశారు. అయితే సీట్ల కేటాయింపులో కాంగ్రెస్, ఎన్సీపీల్లో గందరగోళం నెలకొనడం... శరద్‌పవార్ పోటీ చేయకపోయినా ఆయన మనుమల వరసైన వారు ఇద్దరు బరిలో ఉండటం తదితర కారణాల వల్ల ఎన్సీపీని ప్రజలు పెద్దగా ఆదరించలేదన్న అంచనాలున్నాయి. ముంబైలోని గుజరాతీ, మరాఠీ మధ్య తరగతి వర్గం గట్టి మద్దతునివ్వడంతో బీజేపీ– శివసేన కూటమి అత్యధిక స్థానాల్లో విజయం సాధించగలిగింది. కాంగ్రెస్– ఎన్సీపీలకు ముస్లిం మైనార్టీల మద్దతు కూడా ఆశించినంత స్థాయిలో లేకపోవడంతో స్వల్ప స్థానాలతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఊర్మిళ మటోండ్కర్ వంటి సినీనటిని ముంబై నార్త్ ఓటర్లు ఆదరించలేదు. మహారాష్ట్ర ఎన్నికల మొత్తానికి అత్యంత ఆసక్తికరమైన పరిణామం ఔరంగాబాద్‌లో నమోదైంది. చతుర్ముఖ పోటీ కారణంగా ఓట్లు చీలిపోవడంతో ఆలిండియా ఇత్తేహదుల్ ముస్లమీన్ అభ్యర్థి ముందజలో నిలిచారు. గుజరాత్లో కమలం క్లీన్‌స్వీప్ ప్రధాని నరేంద్రమోడీ సొంత రాష్ట్రం గుజరాత్లో భాజపా క్లీన్ స్వీప్ చేసి గత ఎన్నికల ఫలితాలను పునరావృతం చేసింది. పార్టీ అధ్యక్షుడు అమిత్ షా గాంధీనగర్ స్థానంలో రెండు లక్షలకుపైగా ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. ఒక్క అమ్రేలీ స్థానంలోనే ప్రతిపక్ష నేత పరేశ్ ధనాని బీజేపీ అభ్యర్థి నరన్ కచ్చాడియాకు గట్టిపోటీ ఇచ్చారు. ఇద్దరి మధ్య అంతరం అతిస్వల్పంగా ఉండటం గమనార్హం. గుజరాత్‌లోని మొత్తం 26 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 23న పోలింగ జరిగింది. రికార్డు స్థాయిలో 64.11 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. బీజేపీ, కాంగ్రెస్ మధ్య ముఖాముఖి పోటీ జరిగింది. 2014 ఎన్నికల్లో బీజేపీ గుజరాత్‌లోని అన్ని లోక్‌సభ స్థానాలను గెలుచుకున్న విషయం తెలిసిందే. రెండేళ్ల క్రితం 182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 81 స్థానాలు సాధించడం.. బీజేపీ 99 స్థానాలతో అతికష్టమ్మీద అధికారం చేపట్టడం లోక్‌సభ ఎన్నికలపై ఆ ప్రభావం పడుతుందని అంతా అంచనా వేశారు. అయితే పార్టీ అధ్యక్షుడు అమిత్ షాను స్వయంగా గాంధీనగర్‌లో పోటీకి దింపడం ద్వారా బీజేపీ కార్యకర్తల్లో నూతనోత్తేజాన్ని నింపింది. లోక్‌సభకు పోటీ చేయడం అమిత్ షాకు ఇదే తొలిసారి. సౌరాష్ట్ర ప్రాంతంలోని రాజ్‌కోట్‌లో వ్యవసాయ సంక్షోభం సమస్య బీజేపీని కొంత కలవర పెట్టినా దాన్ని కూడా అధిగమించగలిగింది. జీఎస్టీ అమల్లోని లోపాలు గుజరాత్ వ్యాపారులను దెబ్బతీశాయని.. ఫలితంగా వారూ బీజేపీకి దూరం కావచ్చునని భావించారు. అయితే ఈ అంచనాలన్నింటినీ తారుమారు చేస్తూ.. బీజేపీ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఘన విజయం సాధించింది. పాటీదార్ ఉద్యమంతో వెలుగులోకి వచ్చిన హార్ధిక్ పటేల్ కాంగ్రెస్‌లో చేరి పోటీకి సిద్ధమైనప్పటికీ కోర్టు జోక్యంతో పోటీ చేయలేకపోయారు. మరోవైపు ఓబీసీ వర్గానికి చెందిన అల్పేశ్ ఠాకూర్ కాంగ్రెస్‌ను వీడిపోవడం ఆ పార్టీని బలహీన పరిచిందని చెప్పవచ్చు. గోవాలో సగం.. సగం.. పశ్చిమ కనుమల్లోని అతిచిన్న రాష్ట్రం గోవాలోని రెండు లోక్‌సభ స్థానాల్లో బీజేకి మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. నార్త్ గోవా నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి శ్రీపాద్ యశోనాయక్ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌కు చెందిన గిరీశ్ రాయ ఛోడాంకర్పై భారీ మెజార్టీతో గెలవగా... దక్షిణ గోవాలో మాత్రం కాంగ్రెస్‌కు చెందిన కోస్మే ఫ్రాన్సిస్కో కైటానో సర్డిన్హా బీజేపీ అభ్యర్థి నరేంద్ర సావల్కర్పై స్వల్ప ఆధిక్యంలో విజయం సాధించారు. ఏప్రిల్ 23న పోలింగ్ జరిగింది. బీజేపీ, కాంగ్రెస్‌లతోపాటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇక్కడ బరిలో ఉంది. మొత్తం 71 శాతం ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ నార్త్, సౌత్ గోవా రెండింటినీ గెలుచుకోగా.. ఈ సారి ఫలితం కాస్త తారుమారయింది. కేంద్రపాలిత ప్రాంతమైన దామన్ అండ్ డయ్యూ,లో బీజేపీ అభ్యర్థి లాలూభాయ్ బాబూభాయ్ ఘన విజయం సాధించగా.. దాద్రా అండ్ నగర్ హవేలీలో స్వతంత్ర అభ్యర్థి దేల్కర్ మోహన్ భాయ్ సాంజీ భాయ్ గెలుపొందారు. రాజకోటను గెలిచిందెవరు? ఎన్నికల జరిగిన ప్రతిసారి అధికార పార్టీని ఓడించడం రాజస్థాన్ ప్రత్యేకత. ఈ సారి మాత్రం పరిస్థితి భిన్నంగా మారింది. గత ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టిన ఈ రాష్ట్రంలో ఈ సారి కూడా కమలం పార్టీ పూర్తిస్థాయిలో ఆధిక్యం సాధించింది. మొత్తం 25 స్థానాలకు గాను 24 స్థానాలను గెలుచుకుంది. ఒక్క స్థానంలో రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ విజయం సాధించింది. గత ఏడాది డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలో ఉన్న బీజేపీని కాదని కాంగ్రెస్‌కు పట్టం కట్టిన రాజస్థాన్ ఓటర్లు లోక్‌సభ ఎన్నికల్లోనూ అదేతీరును కనబరుస్తారని చాలామంది అంచనా వేశారు. అయితే బీజేపీ ముఖ్యమంత్రి వసుంధర రాజేపై ఉన్న అసంతృప్తిని అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటు ద్వారా వ్యక్తం చేసిన ఓటరు లోక్‌సభకు వచ్చేసరి మరోసారి మోదీకి జై కొట్టినట్టు కనిపిస్తోంది. ప్రస్తుత ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ కుమారుడు వైభవ్ గెహ్లోట్ జోధ్‌పూర్ నుంచి బరిలోకి దిగగా.. ఆ స్థానంలో బీజేపీ అభ్యర్థి గజేంద్ర సింగ్ షెఖావత్ చేతిలో ఓటమిపాలయ్యారు. బీజేపీ అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో లక్షకుపైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించడం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన రాజస్థాన్‌లో ఏప్రిల్ 29, మే 6న రెండు దశల్లో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరిగింది. రాష్ట్రంలోని మొత్తం 25 లోక్‌సభ స్థానాలకు జరిగిన పోటీలో బీజేపీ, కాంగ్రెస్‌లు ముఖాముఖి తలపడ్డాయి. రెండు దశల ఓటింగ్ శాతం 66.07గా నమోదైంది. 2014 ఎన్నికల్లో రాజస్థాన్‌లోని మొత్తం 25 లోక్‌సభ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. -
మాటిస్తున్నా.. మంచి పాలన అందిస్తా
సాక్షి, అమరావతి: ‘‘జగన్ మంచి ముఖ్యమంత్రి అని ఆరు నెలల నుంచి సంవత్సరం లోపే మీ అందరితో అనిపించుకుంటానని మాట ఇస్తున్నా. ఆ దిశగానే నా ప్రతి అడుగూ వేస్తా’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కాబోయే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్ఘాటించారు. ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అఖండ విజయం సాధించిన తరువాత గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా పాయింట్లో జగన్ మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారంటే... రాష్ట్ర చరిత్రలో నూతన అధ్యాయం ‘‘గవర్నెన్స్ (పరిపాలన) అంటే ఏమిటి? గొప్ప గవర్నెన్స్ అంటే ఎలా ఉంటుంది? అన్నది ఇవాళ చెబుతున్నా. ఆరు నెలల నుంచి సంవత్సరం లోపే.. జగన్ మంచి ముఖ్యమంత్రి అని మీ అందరితో అనిపించుకునేటట్టుగా నా ప్రతి అడుగు వేస్తానని మాట ఇస్తున్నా. అదే విధంగా నవరత్నాలతో ప్రజలందరికీ మేలు చేసేలా పాలన అందిస్తా. ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో.. బహుశా ఇంత గొప్ప విజయం ఎప్పుడూ కూడా నమోదు కాలేదేమో. నాకు తెలిసి 25కు 25 ఎంపీ స్థానాలు మొత్తంగా రావడం.. 175 నియోజకవర్గాలకు గాను 153కు పైగా నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ నెగ్గడం బహుశా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇదొక నూతన అధ్యాయం. విశ్వసనీయతకు ఓటు వేశారు ఇవాళ నేను ఇక్కడ మీ అందరి ఎదుట నిల్చుని మాట్లాడగలగడం నిజంగా ఒక అదృష్టం. అది కేవలం దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనల వల్లనే సాధ్యమైందని గర్వంగా చెబుతున్నా. ఈ విజయం నాపై ఉన్న బాధ్యతను, విశ్వాసాన్ని మరింత పెంచుతోంది. ఈ ఎన్నికల్లో ప్రజలు నాకు ఓట్లు వేశారంటే... అది విశ్వసనీయతకు ఓటు వేయడమే. ఆ విశ్వసనీయత లేని రాజకీయ నాయకుల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రజలు ఇప్పుడు తమ ఓటు ద్వారా తెలియజేశారు. ఐదు కోట్ల మంది ప్రజానీకంలో దేవుడు ఒక్కరికే ముఖ్యమంత్రి స్థానంలో కూర్చునే అవకాశం ఇస్తాడు. ఇప్పుడు ఆ అవకాశం దేవుడి దయతో, ప్రజలందరి చల్లని దీవెనలతో నాకు వచ్చింది. నాపై విశ్వాసం ఉంచినందుకు రాష్ట్రంలో ఉన్న ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి.. అందరికీ పేరుపేరునా హృదయపూర్వకంగా రెండు చేతులు జోడించి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నవరత్నాలను తీసుకొస్తున్నాం మొదటి సంతకం ఏ ఫైల్‌పై పెట్టబోతున్నారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా జగన్ స్పందిస్తూ... ‘‘మొదటి సంతకం కాదు. నవరత్నాల అమలు అన్నది నేను గట్టిగా నమ్ముతున్నా. సుదీర్ఘమైన నా పాదయాత్రలో ప్రజలు పడుతున్న కష్టాలు చూశా, వారి బాధలు విన్నా. నేను చూశాను, నేను విన్నాను, నేను ఉన్నాను అని ప్రజలందరికీ చెబుతున్నా. ఒక సంతకం కాదు. నవరత్నాలను తీసుకొచ్చే పాలనను ఇవ్వబోతున్నామని కచ్చితంగా చెబుతున్నా’’ అని ప్రకటించారు. ప్రమాణ స్వీకారం ఈ నెల 30వ తేదీన విజయవాడలో జరుగుతుందని చెప్పారు. -
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ గెలుపు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ లోక్‌సభ స్థానాన్ని కాంగ్రెస్ తిరిగి నిలబెట్టుకుంది. ఈ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విజయం సాధించారు. ఆయన టీఆర్ఎస్ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డిపై 25,682 ఓట్ల మెజారిటీని సాధించారు. గత ఏడాది డిసెంబరులో జరిగిన శాసనసభ ఎన్నికల్లో హుజూర్నగర్ నుంచి పోటీ చేసిన ఉత్తమ్ అయిదో సారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఆయన లోక్‌సభ ఎన్నికల్లో నల్లగొండ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఈ ఎన్నికల్లో ఆయనకు 5,26,028 ఓట్లు పోలయ్యాయి. కాగా, ఆయన ప్రత్యర్థి వేమిరెడ్డి(టీఆర్ఎస్)కి 5,00,346 ఓట్లు వచ్చాయి. నల్లగొండ లోక్‌సభ స్థానాన్ని సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ గెలుచుకుంటూ వస్తోంది. గత ఎన్నికల్లో (2014) ఈ స్థానం నుంచి గుత్తా సుఖేందర్‌రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా 1.92 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్ గూటికి చేరారు. దీంతో ఈ స్థానం నుంచి పోటీ చేయడానికి ఒక దశలో కాంగ్రెస్‌లో అభ్యర్థుల కొరత కనిపించింది. ఏఐసీసీ ఆదేశాలతో ఉత్తమ్ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. సూర్యాపేట, నల్లగొండ అసెంబ్లీ సెగ్మెంట్లు మినహా కోదాడ, హుజూర్నగర్, మిర్యాలగూడ, నాగార్జునసాగర్, దేవరకొండ సెగ్మెంట్లలో టీఆర్ఎస్ కన్నా ఎక్కువ ఓట్లు సాధించి గెలుపు తీరాలను చేరుకున్నారు. ఉత్తమ్.. ఆరోసారి! టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వరుసగా ఆరోసారి ఎన్నికల్లో విజయం సాధించారు. మిలటరీ నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించిన ఉత్తమ్ మొదటిసారి 1994లో కోదాడ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అయితే, 1999లో అదేస్థానం నుంచి ఆయన గెలుపొంది ఇక వెనుదిరిగి చూడలేదు. 2004లో జరిగిన ఎన్నికల్లోనూ కోదాడ నుంచి ఆయన విజయం సాధించారు. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఏర్పడ్డ హుజూర్నగర్ అసెంబ్లీ స్థానం నుంచి 2009, 2014, 2018 ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. తాజాగా ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ నల్లగొండ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించడం విశేషం. మొత్తం మీద వరుసగా ఆరుసార్లు ఎన్నికల్లో గెలుపొందిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ రాష్ట్ర రాజకీయాల్లో తనదైన గుర్తింపును సాధించారు. టీఆర్ఎస్ను అసహ్యించుకుంటున్నారు ‘తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీని అసహ్యించుకుంటున్నారు. అందుకు నిదర్శనం రాష్ట్రంలో లోక్‌సభ ఫలితాలే’ అని నల్లగొండ లోక్‌సభ స్థానం విజేత, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. గురువారం లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం మాట్లాడుతూ.. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్‌లో అహంభావ ధోరణి పెరిగిందని, దాన్ని తెలంగాణ ప్రజలు సహించకనే ఎన్నికల్లో బుద్ధి చెప్పారన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను చూస్తే ప్రజల్లో టీఆర్ఎస్పై ఎంత వ్యతిరేకత ఉందో స్పష్టమవుతోందన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్‌తో పాటు వేరే పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందన్నారు. -
బీజేపీ అస్త్రం. ‘ఆయేగాతో మోదీ హీ’
ఆయేగాతో మోదీ హీ(ఈసారి వచ్చేది కూడా మోదీనే).. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో బీజేపీ శ్రేణులు విస్తృతంగా వాడిన నినాదమిది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో అచ్ఛేదిన్ ఆనేవాలే హై(మంచి రోజులు వస్తాయి) అనే నినాదంతో బీజేపీ ఘనవిజయం సాధించింది. అదే తరహాలో ఈసారి మైభీ చౌకీదార్(నేను కూడా కాపలాదారుడినే) అనే నినాదంతో ముందుకెళ్లాలని నిర్ణయించింది. కానీ దానికంటే ‘ఆయేగాతో మోదీ హీ’నినాదం చాలా పాపులర్ అయిపోయింది. ప్రతిపక్షాలకు ప్రధాని అభ్యర్థి లేని విషయాన్ని ఈ నినాదం ద్వారా బీజేపీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లిందని రాజకీయ విశ్లేషకుడు ఒకరు తెలిపారు. అదే సమయంలో మోదీకి ప్రత్యామ్నాయం ఎవరూ లేరనీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ మోదీకి దీటైన ప్రత్యర్థి కారన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిందన్నారు. ఓవైపు మోదీ, మరోవైపు మాయావతి, రాహుల్ గాంధీ, అఖిలేశ్ ఉండటంతో జాతి ప్రయోజనాల దృష్ట్యా ప్రజలు మోదీకే జైకొట్టారని అభిప్రాయపడ్డారు. -
బీజేపీకి హామీల సవాళ్లు!
న్యూఢిల్లీ: వరుసగా రెండోసారి కేంద్రంలో విజయదుందుభి మోగించిన బీజేపీకి ఎన్నికల హామీల అమలు సవాల్‌గా మారనుంది. వాగ్దానాల అమలుకు రూ. లక్షలాది కోట్ల నిధులను సమీకరించాల్సి ఉండటమే అందుకు కారణం. బీజేపీ సంకల్ప పత్ర పేరిట విడుదల చేసిన మేనిఫెస్టోలో భారీగా హామీలు గుప్పించింది. ముఖ్యంగా 2025 నాటికి దేశ ఆర్థిక రంగాన్ని 5 లక్షల కోట్ల డాలర్లకు, 2032 నాటికి 10 లక్షల కోట్ల డాలర్లకు చేరుస్తామని, వ్యవసాయ రంగంలో రూ. 25 లక్షల కోట్ల పెట్టుబడులు పెడతామని, రూ. లక్ష వరకు వడ్డీలేని సాగు రుణాలు ఇస్తామని హామీ ఇచ్చింది. 60 వేల కి.మీ. జాతీయ రహదారులను నిర్మిస్తామని, 100 కొత్త ఎయిర్‌పోర్టుల కార్యకలాపాల ప్రారంభం, 400 రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, పన్నుల తగ్గింపు, మౌలిక వసతుల రంగంలో 2024 నాటికి రూ. 100 లక్షల కోట్ల పెట్టుబడులు పెడతామని పేర్కొంది. దేశానికి స్వాతంత్య్రం లభించి వందేళ్లు పూర్తయ్యే 2047కి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుతామని మేనిఫెస్టో విడుదల సందర్భంగా మోదీ హామీ ఇచ్చారు. 2018–19 సంవత్సరానికి దేశ ఆర్థిక వృద్ధి రేటు ఐదేళ్ల కనిష్టానికి 7 శాతంగా నమోదవడం ప్రతికూలంశంగా పరిణమించనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల హామీల అమలుకు కమలదళం ఎలాంటి వ్యూహాలను అమలు చేస్తుందో వేచి చూడాల్సి ఉంది. -
ఇండియన్ ఈవీఎంల ట్యాంపరింగ్ కష్టం
వాషింగ్టన్: భారత్‌లో ఉపయోగిస్తున్న ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం చాలా కష్టమని ప్రముఖ అమెరికన్ నిపుణుడు గెల్బ్ పేర్కొన్నారు. ఈ ఈవీఎంలు ఆఫ్‌లైన్‌లో పనిచేయడం వల్ల స్వతంత్ర యూనిట్లుగా ఉంటాయని తెలిపారు. ‘భారత్‌లో వాడుతున్న ఈవీఎంలలో ఉపయోగించిన సాంకేతికత నమ్మదగినదని నేను చేసిన అధ్యయనంలో స్పష్టమైంది. ఏ టెక్నాలజీ నిర్దిష్టమైనది కాదు. కానీ భారత్‌లో వాడుతున్న ఈవీఎంలు ఆఫ్‌లైన్‌లో పనిచేస్తున్నాయి. అందుకే వాటిని నేరుగా మాత్రమే ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉంది. మరో విధంగా చేయలేం’అని పేర్కొన్నారు. ఇండియాలో ఉపయోగిస్తున్న ఈవీఎంలను మాస్ ట్యాంపరింగ్ చేయడం కష్టమని తాను చేసిన పరిశోధనల్లో తేలిందని గెల్బ్ పేర్కొన్నారు. ఇది కేవలం ఒక స్వతంత్ర ఎలక్ట్రానిక్ పరికరమని, ఇతర దేశాల్లో ఓటు వేసే విధానాలకు ఇది భిన్నంగా ఉంటుందని గెల్బ్ అన్నా రు. ఈవీఎంలను పరిశీలించకుండా, ఒక సమన్వయ ప్రాతిపదిక లేకుండా ట్యాంపరింగ్ చేయడం కష్టమన్నారు. అంతేకాకుండా వీవీప్యాట్ల వల్ల ఎన్నికల్లో విశ్వసనీయత, వాస్తవికత ఉంటుందన్నారు. -
ఏపీలో కాంగ్రెస్‌కు 1శాతమే ఓట్లు
న్యూఢిల్లీ: రాష్ట్రాల వారీగా చూస్తే, కాంగ్రెస్ పార్టీకి తాజా ఎన్నికల్లో ఓట్ల శాతం ఘోరంగా తగ్గింది. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు ఒక్క శాతం మేర మాత్రమే ఓట్లు పోలయ్యాయి. సిక్కిమ్‌లో కూడా ఈ పార్టీకి ఈ స్థాయిలోనే ఓట్లు వచ్చాయి. ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో 6 శాతం ఓట్లు రాగా, ఒక్క పాండిచ్చేరిలో మాత్రమే 57 శాతం ఓట్లు, అధికారంలో ఉన్న పంజాబ్ రాష్ట్రంలో 40 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. అంతే కాకుండా రాజకీయంగా కీలకమైన ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బిహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విపక్షాలకు ఒక్క అంకె శాతంలోనే ఓట్లు పోలయ్యాయని ఎలక్షన్ కమిషన్ గణాంకాలు వెల్లడించాయి. ► రాష్ట్రాల వారీగా చూస్తే, కాంగ్రెస్ పార్టీకి తాజా ఎన్నికల్లో ఓట్ల శాతం ఘోరంగా తగ్గింది. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు ఒక్క శాతం మేర మాత్రమే ఓట్లు పోలయ్యాయి. సిక్కిమ్‌లో కూడా ఈ పార్టీకి ఈ స్థాయిలోనే ఓట్లు వచ్చాయి. ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో 6 శాతం ఓట్లు రాగా, ఒక్క పాండిచ్చేరిలో మాత్రమే 57 శాతం ఓట్లు, అధికారంలో ఉన్న పంజాబ్ రాష్ట్రంలో 40 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. మరోవైపు తెలంగాణలో బీజేపీకి 20 శాతం ఓట్లు రాగా, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం 0.9 శాతం ఓట్లు పోలయ్యాయి. ► తొలి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 45 శాతం ఓట్లు వచ్చాయి. 1971 ఎన్నికల వరకూ 40 శాతం ఓట్లు పోలవుతూనే ఉన్నాయి. 1977 ఎన్నికల్లో 34.5 శాతానికి తగ్గిన కాంగ్రెస్ ఓట్లు 1980లో 42.7 శాతానికి, 1984/85 ఎన్నికల్లో 48.1 శాతానికి పెరిగాయి. అప్పటి నుంచి కాంగ్రెస్ ఓట్ల శాతం తగ్గుతూ వస్తోంది. 1989లో 39.5 శాతానికి తగ్గిన కాంగ్రెస్ ఓట్లు 1996–2009 మధ్య 20 శాతం లోపు పడిపోయాయి. 2014లో అంతకంటే తక్కువ ఓట్లు వచ్చాయి. 13 రాష్ట్రాల్లో బీజేపీకి 50 శాతానికి మించి ఓట్లు న్యూఢిల్లీ: సీట్లు కొల్లగొట్టటంలోనే కాకుండా ఓట్ల శాతంలోనూ బీజేపీ హవా కొనసాగింది. మొత్తం 13 రాష్ట్రాల్లో 50 శాతానికి మించి ఓట్లు బీజేపీకి వచ్చాయి. ► ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీకి రమారమి 50 శాతం ఓట్లు రాగా, హర్యానా, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌ఘర్, ఉత్తరఖండ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, గోవా, కర్నాటక, ఢిల్లీ, చంఢీగర్, అరుణాచల్ ప్రదేశ్‌ల్లో 50 శాతానికి మించి ఓట్లు పోలయ్యాయి. పశ్చిమ బెంగాల్లో దాదాపు 40 శాతం ఓట్లు సాధించిన ఈ పార్టీ జమ్మూ, కశ్మీర్ రాష్ట్రంలో 46 శాతం ఓట్లను సాధించింది. ► మిత్రపక్షాలతో కలిసి పోటీ చేసిన వివిధ రాష్ట్రాల్లో కూడా బీజేపీకి ఓట్ల శాతం పెరిగింది. పంజాబ్‌లో 10 శాతం, మహారాష్ట్రలో 27 శాతం, అస్సాంలో 35 శాతం, బీహార్‌లో 24 శాతం ఓట్లు రాగా తమిళనాడులో 3.34 శాతం ఓట్లే పోలయ్యాయి. ► ఇక కేరళలో 3 శాతం, ఓడిశాలో 38 శాతం చొప్పున ఓట్లను ఈ పార్టీ సాధించింది. ► 1984లో బీజేపీకి రెండు లోక్‌సభ సీట్లు వచ్చాయి. అప్పుడు ఆ పార్టీ ఓట్ల శాతం 7.74 శాతంగా ఉంది.1998 వరకూ ఆ పార్టీ ఓట్ల శాతం 25.29 శాతానికి పెరిగింది. ఆ తర్వాత 2009 వరకూ జరిగిన వరుస మూడు ఎన్నికల్లో ఆ పార్టీ ఓట్ల శాతం 19.5 శాతానికి తగ్గింది. 2014లో 31.34 శాతానికి ఎగసింది. తాజా ఎన్నికల్లో ఓట్ల శాతం 50 శాతానికి చేరువ అయింది. -
రూ.1000 కోట్లు హుష్ కాకి!
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో భారీ ఓటమిని మూటకట్టుకుని ఓ వైపు.. రూ.కోట్లు సొమ్ము పోగొట్టుకుని మరోవైపు టీడీపీ శ్రేణులు గొల్లుమంటున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన ముందు నుంచే బెట్టింగ్ రాయుళ్లు గెలుపోటములపై భారీ పందేలకు దిగారు. రానురాను వారిలో టీడీపీ ప్రభుత్వ ఏర్పాటుపై నమ్మకం సన్నగిల్లడంతో ఎన్నికల తేదీ నాటికి టీడీపీ గెలుపుపై సొంత పార్టీ శ్రేణులే వెనక్కు తగ్గారు. మళ్లీ టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనే అంశం మినహాయించి నియోజకవర్గాల వారీగా టీడీపీ, వైఎస్సార్ సీపీ గెలుపోటములపై బెట్టింగులకు పరిమితమయ్యారు. పోలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత చంద్రబాబు సొంత గూటి చిలుక లగడపాటి లీకులిచ్చి, ఆ తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించడంతో మళ్లీ టీడీపీ శ్రేణులు బెట్టింగులకు దిగారు. రూపాయికి రూపాయిన్నర ఇస్తామని కొన్ని నియోజకవర్గాల్లో బెట్టింగ్ మాఫియా రంగంలోకి దిగింది. దీంతో గడిచిన పది రోజుల్లోనే రూ.700 కోట్ల వరకు చేతులు మారినట్లు అంచనా. మొత్తం రూ.వెయ్యి కోట్లు వరకు ఈ సార్వత్రిక ఎన్నికల్లో బెట్టింగులకు పాల్పడినట్లు సమాచారం. ఫలితాలు ఏకపక్షంగా ఉండటంతో 80 శాతం డబ్బు టీడీపీ శ్రేణులు, 20 శాతం జనసేన పోగొట్టుకున్నాయి. బెట్టింగులను ప్రోత్సహించింది చంద్రబాబే.. టీడీపీ గెలుపు అవకాశాలపై వీసమెత్తయినా సందేహించవద్దని చంద్రబాబు పార్టీ శ్రేణులకు ఉద్బోధించారు. టీడీపీయే గెలుస్తుందని బుకీలు భారీగా బెట్టింగులు పెడుతున్నారని స్వయానా చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌లో పేర్కొనడంతో ఆ పార్టీ శ్రేణులు బెట్టింగుల వైపు మళ్లారు. తెలుగువారున్న అన్ని రాష్ట్రాల్లోనూ, ఇతర దేశాల్లో ఉన్న వారిని టీడీపీ నేతలు రెచ్చగొట్టి మరీ బెట్టింగుల వైపు మళ్లించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాదని బెట్టింగులకు దిగారు. ఇదే సమయంలో ప్రభుత్వ ఖజానా నుంచి లగడపాటి బినామీ సంస్థకు దోచిపెట్టిన సొమ్ముతో ఎగ్జిట్ పోల్స్ చేయించారు. పోలింగ్ ప్రక్రియ ముగియడానికి ఒక రోజు ముందు లీకులు.. ప్రక్రియ ముగిశాక టీడీపీ ఘన విజయం సాధించబోతుందని లగడపాటితో చిలుక పలుకులు పలికించారు. వీటిని నమ్మిన టీడీపీ ఎమ్మెల్యేలు, కాంట్రాక్టర్లు, టీడీపీ సానుభూతిపరులైన బడా పారిశ్రామికవేత్తలు, నేతలు భారీ బెట్టింగులు కాశారు. మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు లోకేష్ బరిలోకి దిగారు. వైఎస్సార్ సీపీ తరఫున ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) పోటీ పడటంతో ఈ నియోజకవర్గ రాజకీయం రసకందాయంగా మారింది. లోకేష్ గెలుపుపైనా బెట్టింగ్ రాయుళ్లు భారీగా పందేలకు దిగారు. ముఖ్యంగా టీడీపీ నేతలు లోకేష్ గెలుపుపై గట్టి ధీమా ప్రదర్శించి రూ.వందల కోట్లు పోగొట్టుకున్నారు. ఫలితాలు ఏకపక్షంగా వైఎస్సార్సీపీకి రావడంతో టీడీపీ ఓడిపోవడం, జనసేన ఘోర పరాజయం పాలవ్వడంతో ఆ పార్టీ శ్రేణులు నైరాశ్యంలోకి వెళ్లాయి. చంద్రబాబు, లగడపాటి మాటలు నమ్మి బెట్టింగులు కాసి భారీగా డబ్బు పోగొట్టుకుని నెత్తీ నోరు బాదుకుంటున్నాయి. -
ప్రతీకారం తీర్చుకున్న ‘బ్రదర్స్’
సాక్షి, హైదరాబాద్ : భువనగిరి పార్లమెంట్ ఎన్నికల్లో విజయంతో కోమటిరెడ్డి బ్రదర్స్ మళ్లీ సత్తా చాటారు. గత ఎన్నికల్లో తన తమ్ముడిని ఓడించిన టీఆర్ఎస్ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌ను ఈసారి అన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఓడించి ప్రతీకారం తీర్చుకున్నారు. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని బూర నర్సయ్యగౌడ్ 30,494 ఓట్లతో ఓడించారు. రాజగోపాల్ మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలవగా, వెంకట్‌రెడ్డి నల్లగొండ నియోజకవర్గం నుంచి కంచర్ల భూపాల్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ అధిష్టానం భువనగిరి నుంచి వెంకట్‌రెడ్డిని పోటీలో నిలిపింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో వెంకట్‌రెడ్డికి 5,31,014 ఓట్లు రాగా, సిట్టింగ్ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌కు 5,26,751 ఓట్లు వచ్చాయి. 4,263 ఓట్ల ఆధిక్యతతో వెంకట్‌రెడ్డి విజయం సాధించారు. దీంతో కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. ఎమ్మెల్యే, ఎంపీలుగా ... కోమటిరెడ్డి బ్రదర్స్ మరో రికార్డు సృష్టించారు. ఇద్దరికీ దేశ, రాష్ట్ర స్థాయిల్లో పనిచేసే అరుదైన అవకాశం లభించింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి 1999 నుంచి వరుసగా 2014 వరకు 4 సార్లు నల్లగొండ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. దివంగత వైఎస్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. 2018 ఎన్నికల్లో ఓటమి పాలుకాగా, ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మునుగోడు అసెంబ్లీ నుంచి విజయం సాధిం చారు. 2009 ఎన్నికల్లో భువనగిరి పార్లమెంటు స్థానం నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గెలుపొందగా, ఇప్పుడు అదే స్థానం నుంచి ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజయం సాధించారు. -
లోక్‌సభ స్థానాల్లోనూ బాబుకు ఘోర పరాభవం
సాక్షి, అమరావతి : లోక్‌సభ స్థానాల్లో కూడా తెలుగుదేశం పార్టీకి ఘోరమైన ఓటమి తప్పలేదు. గతంలో ఎన్నడూ లేని రీతిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించి కొత్త చరిత్రను సృష్టించింది. రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 22 స్థానాల్లో విజయదుందుభి మోగించింది. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అరకు, రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, ఏలూరు, నరసాపురం, మచిలీపట్నం, బాపట్ల, నరసరావుపేట, ఒంగోలు, నెల్లూరు, కడప, రాజంపేట, తిరుపతి, చిత్తూరు కర్నూలు, నంద్యాల, అనంతపురం, హిందూపురం లోక్‌సభ స్థానాలు వైఎస్సార్ కాంగ్రెస్ కైవసమయ్యాయి. ఇక విజయవాడ, గుంటూరు, శ్రీకాకుళంలో అర్ధరాత్రి వరకూ ఫలితం తేలలేదు. ఈ నియోజకవర్గాల్లో కౌంటింగ్ పూర్తయిన అనంతరం అధికారికంగా ఫలితాలు వెలువడనున్నాయి. ఈ మూడుచోట్లా వైఎస్సార్సీపీ, టీడీపీ మధ్య విజయం దోబూచులాడుతోంది. చంద్రబాబుకు గట్టి షాక్ కాగా, ఇప్పటివరకు జాతీయస్థాయిలో తానే సీనియర్ నేతనని, ప్రధాని మోదీ కూడా తనకన్నా జూనియర్ అని, కేంద్రంలో చక్రం తిప్పుతానని ప్రగల్భాలు పలుకుతూ వచ్చిన చంద్రబాబుకు తాజా లోక్‌సభ ఫలితాలు గట్టి షాక్ ఇచ్చాయి. కొన్ని స్థానాలైనా వస్తే కేంద్రంలో ఎన్డీయేతర పార్టీలతో కలిసో, అదీ కుదరకపోతే వెనుక ద్వారాల ద్వారా బీజేపీ పంచనో చేరుదామనుకున్న చంద్రబాబుకు ఈ ఫలితాలు మింగుడుపడడంలేదు. గత ఎన్నికల్లో ఏపీలో తెలుగుదేశం పార్టీకి 15, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది లోక్‌సభ స్థానాలు వచ్చాయి. అయితే, ఎన్నికలు ముగిసిన పిదప చంద్రబాబునాయుడు రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కి వైఎస్సార్సీపీ తరఫున గెలిచిన ఎంపీలు కొత్తపల్లి గీత, ఎస్పీవై రెడ్డి, బుట్టా రేణుకలను చంద్రబాబు తనవైపు తిప్పుకున్నారు. ఎన్నికల ముందు బుట్టా రేణుక తిరిగి వైసీపీలోకి వచ్చేశారు. ఆ ఎన్నికల్లో బీజేపీ పొత్తుతో పోటీచేసిన చంద్రబాబునాయుడు.. కేంద్ర కేబినెట్లో రెండు మంత్రి పదవుల్లో తన ఎంపీలను కూర్చోబెట్టారు. ఇన్ని చేసినా రాష్ట్రానికి ఒక్క మంచిపనినీ సాధించలేదు. కేవలం తన సొంత పనులను చక్కబెట్టుకోవడానికి, కేంద్రంలో పైరవీలకు, కమీషన్లకు మాత్రమే చంద్రబాబు పరిమితమయ్యారు. రాష్ట్రానికి అతి కీలకమైన ప్రత్యేక హోదాను కేంద్రం వద్ద తాకట్టు పెట్టి ప్రత్యేక ప్యాకేజీ ద్వారా కమీషన్లు దండుకోవాలనుకున్నారు. ప్రస్తుత ఎన్నికల ఫలితాలతో చంద్రబాబు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. అసెంబ్లీలో గెలవలేకపోయినా కనీసం ఎంపీ స్థానాలు కొన్నైనా వచ్చి ఉంటే కేంద్రంలో ఏదో ఒక జాతీయ పార్టీతో అంటకాగవచ్చని భావించారు. అధికారంలో ఉన్న సమయంలో తన అవినీతి అక్రమాలపై విచారణలు జరగకుండా బయటపడవచ్చని అనుకున్నారు. కానీ, ప్రస్తుత ఫలితాలను చూసి చంద్రబాబుకు మైండ్ బ్లాక్ అయినంత పని అయ్యిందని సొంత పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. బాబుకు స్పందించని జాతీయ పార్టీలు కాగా, ఇప్పటివరకు ఏదో ఒక వంకతో జాతీయస్థాయిలో విపక్ష పార్టీలను ఏకం చేస్తున్నానని హడావుడి చేసిన చంద్రబాబుకు ఈ ఫలితాలు దిమ్మదిరిగేలా చేశాయి. నిన్నటివరకు ఈవీఎంలపై పోరాటం అంటూ ఢిల్లీ వీధుల్లో, వివిధ రాష్ట్రాల రాజధానుల్లో తిరిగిన చంద్రబాబుకు ఈ ఫలితాలు బ్రేకులు వేశాయి. కౌంటింగ్‌కు ముందు జాతీయస్థాయిలో విపక్షాల సమావేశం అంటూ చంద్రబాబు హడావుడి చేయబోయినా ఎగ్జిట్‌పోల్స్ చూసి జాతీయ పార్టీలు చంద్రబాబుకు స్పందించడం మానేశాయి. పైగా.. సమావేశం లేదంటూ డీఎంకే తదితర పార్టీలు స్పష్టమైన ప్రకటనలూ చేశాయి. ఈ నేపథ్యంలో.. జాతీయస్థాయిలో బీజేపీకి స్పష్టమైన మెజార్టీ రావడమే కాకుండా ఎన్డీయే కూటమిలోని ఇతర పార్టీలు కూడా ఆశించిన స్థానాలను పొందాయి. ఈ పరిణామం చంద్రబాబును మరింత కుంగదీస్తోంది. తనకు సీట్లు రాకపోవడం ఒక విషాద పరిణామం కాగా.. మోదీ నాయకత్వంలో బీజేపీకి అత్యధిక సీట్లు రావడంతో బాబుకు ఎటూ పాలుపోవడం లేదు. బీజేపీ అధికారంలోకి వచ్చినా మోదీ ప్రధాని కాడంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్రంలో మోదీ అధికార పగ్గాలు చేపడితే తనపై ఉన్న అవినీతి, అక్రమాలపై విచారణ జరుగుతుందన్న ఆందోళన చంద్రబాబులో స్పష్టంగా కనిపిస్తోంది. -
ప్రగతి లేని కూటమి
జాతీయ ప్రజాస్వామిక కూటమికి (ఎన్డీఏ)కు గట్టి పోటీ ఇస్తుందనుకున్న ఉమ్మడి ప్రగతిశీల కూటమి(యూపీఏ) కనీసం యుద్ధం కూడా సరిగా చేయకుండా మరోమారు చతికిలపడింది. ప్రతిపక్షమంటే ప్రభుత్వం చేసే ప్రతిపనీ విమర్శించేది కాదని ప్రజలు గుణపాఠం చెప్పారు. ప్రతిపక్షమంటే ప్రజలు చెప్పేది వినే పక్షం కావాలి కానీ, సొంత సోది ప్రజలకు చెప్పే పక్షం కాకూడదని తేల్చి చెప్పారు. 2014తో పోలిస్తే యూపీఏ అత్యంత స్వల్పంగా మెరుగుపడినట్లున్నా, ఎన్డీఏ సాధించిన మెజార్టీతో పోలిస్తే తేలిపోయింది. కూటమిలో ప్రధాన పక్షం కాంగ్రెస్ కనీసం 60 సీట్లను కూడా గెలుచుకోలేకపోవడం, కాంగ్రెస్ అధ్యక్షుడు అమేథీ నుంచి ఓటమి పాలవడం, కూటమిలోని ప్రధాన పక్షాలు ఆశించిన ఫలితాలు సాధించకపోవడం (డీఎంఏకే మినహా).. యూపీఏ భవితవ్యంపై నీలినీడలు కమ్మేలా చేస్తున్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ మిత్రపక్షాల్లో ఒక్క డీఎంకే తప్ప మిగిలిన ఏ పార్టీ కనీసం చెప్పుకోదగ్గ ఫలితాలను సాధించలేదు. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే మాత్రం తమిళనాడులో 37 సీట్లలో విజయం సాధించింది. కొండంత ‘రాగా’లు తీసి.. యూపీఏకి వెన్నెముక కాంగ్రెస్ పార్టీ. 2014లో చతికిలపడిన కాంగ్రెస్‌కి రాహుల్ గాంధీ(రాగా)పగ్గాలు చేపట్టడంతో ఉత్సాహం వచ్చింది. గతంతో పోలిస్తే రాహుల్‌లో మార్పు వచ్చింది.. ప్రసంగాల్లో పరిణితి వచ్చింది.. దేశానికి భవిష్యత్ నేతగా ఎదిగాడు.. మోదీని మించిపోయాడు.. అని కాంగ్రెస్ వాదులు మురిసిపోవడంలో మునిగిపోయారు. ఇందుకు తగ్గట్లే ఇటీవల మూడు శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ మంచి ఫలితాలు సాధించింది. దీంతో రాహుల్‌పై కాంగ్రెస్‌కు మరింత ధీమా పెరిగింది. కానీ లోక్‌సభ ఎన్నికలకు వచ్చేసరికి ఫలితాలు మాత్రం తేడాకొట్టాయి. రాహుల్‌ను చూసి కాంగ్రెస్ శ్రేణులు మురిసినట్లు ప్రజలు మక్కువ చూపలేదని, ఆయనలో ఇంకా సమర్థత పొడ ప్రజలకు కనిపించలేదని, దేశ్‌కీ నేతగా ఎదగాలంటే మరింత శ్రమించాలని ప్రజలు తీర్పునిచ్చారు. వారసత్వం సరిపోదని, నాయకుడంటే ప్రజలకు తనపై విశ్వాసం కలిగించాలని రాహుల్‌కు అర్ధమయ్యేలా చెప్పారు. కూటమికి నేతృత్వం వహిస్తున్నారన్న మాటేకానీ ఆయన్ను ప్రధానిగా కూటమిలోని పక్షాలే కొన్ని ఒప్పుకోలేదు. కూటమిలోనే ఏకాభిప్రాయం సాధించలేని వ్యక్తిగా ప్రజల్లో రాహుల్‌పై ముద్ర పడింది. దీనికితోడు ఇన్నాళ్లూ రాజకీయాలకు దూరంగా ఉన్న ప్రియాంకను అకస్మాత్తుగా తెరపైకి తీసుకురావడం రాగాకు, కాంగ్రెస్‌కు నష్టమే కలిగించింది. రాహుల్‌కు సత్తా లేకపోవడంతోనే ఆమెను రంగంలోకి దించారని ప్రజలకు అనిపించింది. పొత్తులు.. చిత్తు కూటమిగా 2 మార్లు అధికారంలో ఉన్న యూపీఏ ఈ సారి బలహీనపడింది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌తో పొత్తుకు ఎస్పీ, బీఎస్పీ నిరాకరించడం తీవ్ర ప్రభావం చూపింది. బీజేపీ వ్యతిరేక ఓటు చీలిపోకుండా చూడాల్సిన కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీలను ఏకం చేయలేకపోయింది. ఆర్జేడీ, డీఎంకే, జేడీఎస్, ఎన్సీపీ, ఎండీఎంకే, నేషనల్ కాన్ఫరెన్స్‌లు తోడుగా ఉన్నా పెద్దగా ప్రయోజనం కనిపించలేదు. కీలకమైన బెంగాల్, యూపీల్లో పొత్తు లేకపోవడం, దక్షిణాదిన కేరళ మినహా మిగిలిన చోట్ల కాంగ్రెస్ ప్రాభవం బాగా క్షీణించడం యూపీఏపై ప్రభావం చూపాయి. రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వానికి అంగీకరించని మాయావతి, మమతా బెనర్జీ ఏకంగా ప్రధాని పీఠంపై కూర్చోవాలని కలలుగన్నారు. వీరిద్దరి ఆశ అంతిమంగా కాంగ్రెస్‌ని దెబ్బతీసింది. ప్రతిపక్షాలను ఏకతాటిపై నడిపించేందుకు రాహుల్ నాయకత్వ చరిష్మా సరిపోలేదు. చివరి నిమిషం వరకు ఢిల్లీలో చర్చలు జరిపినా ఆప్‌తో పొత్తు కుదరలేదు. తెలంగాణలో టీడీపీతో ఉన్న పొత్తు ఏపీలో కనిపించలేదు. కర్నాటకలో సంకీర్ణ ప్రభుత్వం ఉన్నా అనుక్షణం జేడీఎస్‌తో కీచులా టలే. మరోపక్క ఎన్డీఏ కొందరు మిత్రులను కోల్పోయినా సొంతంగా పలుచోట్ల బలం పెంచుకుంది. కానీ కాంగ్రెస్ మాత్రం పొత్తు ధర్మాన్ని సరిగా నిర్వర్తించలేకపోయింది. రాజీనామా చేస్తారా? రాహుల్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టాక ఆయన నేతృత్వంలో కాంగ్రెస్ ఎదుర్కొన్న తొలి పూర్తిస్థాయి ఎన్నికలు ఇవి. కొందరు రాహుల్‌ను ‘పప్పు’ అంటూ తిరస్కరించారు. మరికొందరేమో యువరాజులాంటి వాడని తిరస్కరించారు. ఏదేమైనా ఈఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ఓటమికి పూర్తిస్థాయి బాధ్యత తనదేనని రాహుల్ ప్రకటించారు. ప్రధాని మోదీకి శుభాకాంక్షలు కూడా చెప్పారు. ‘ఓటమికి బాధ్యత మీదేనని ఒప్పుకున్నారు కాబట్టి అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటారా?’ అన్న ప్రశ్నకు మాత్రం ఆయన సూటిగా సమాధానం ఇవ్వలేదు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఈ అంశాన్ని పరిశీలిస్తారంటూ వెళ్లిపోయారు. మరి పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ రాజీనామా చేస్తారో లేదో చూడాల్సి ఉంది. పనిచేయని ప్రియాంక ‘మేజిక్’ న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో తాము తురుపు ముక్కగా భావించి బరిలోకి దించిన ప్రియాంకా గాంధీ వాద్రా ఓటర్లను ఆకర్షిస్తారనే కాంగ్రెస్ భావించింది. అయితే ఈ విషయంలో ఆమె పెద్దగా విజయం సాధించలేకపోయారనే చెప్పవచ్చు. 47 ఏళ్ల ప్రియాంకా ఏఐసీసీ ఉత్తరప్రదేశ్ (తూర్పు) జనరల్ సెక్రటరీ ఇన్చార్జ్గా నియమితులయ్యారు. ఆమె ఈ ఎన్నికల ప్రచారంలో సామాన్యుల దగ్గరకు అరమరికలు లేకుండా నడచివెళ్లడం, వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం, మోదీ అనుకూల నినాదాలు చేస్తున్న వారి వద్దకు స్వయంగా నడచివెళ్లి వారితో కరచాలనం చేయడం, పాములను సైతం పట్టుకోవడం వంటి ఎన్నో ఆకర్షణీయమైన చర్యలకు శ్రీకారం చుట్టారు. ప్రధాని మోదీ విధానాల్లో లొసుగులను వివరించడమూ చేశారు. మరోవైపు తన అన్న రాహుల్‌కే ప్రచారంలో అధిక ప్రాధాన్యత ఇస్తూ, తాను మద్దతుదారు మాత్రమేనన్న సంకేతాలు ఇచ్చారు. అయితే ఆమె చర్యలు ఓట్లరూపంలోకి మారలేదు. కాంగ్రెస్ అభ్యర్థులు ప్రధాన ప్రత్యర్థులుగా పోటీ ఇవ్వలేకపోయారు. ప్రియాంక తన ఎన్నికల ప్రచారంలో వాస్తవ పరిస్థితి అనుగుణంగానే మసలుకున్నారు. తన వద్ద ఇంద్రజాలం ఏదీ లేదని, పార్టీని పటిష్టం చేయాల్సింది కార్యకర్తలేనని తరచూ పేర్కొన్నారు. -
గెలిచారు.. నిలిచారు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ కీలక నేతల పరువు నిలబడింది. లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసిన ముఖ్య నాయకుల్లో ముగ్గురు విజయం సాధించడంతో పార్టీ ఊపిరి పీల్చుకుంది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఫైర్‌బ్రాండ్ రేవంత్‌రెడ్డి తాము పోటీ చేసిన స్థానాల నుంచి గెలుపొందడం పట్ల పార్టీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది. కీలక నేతలు బరిలో ఉండటం, టీఆర్ఎస్ స్వీప్ చేస్తుందన్న అంచనాలు రావడంతో ఏం జరుగుతుందోననే ఆందోళన నెలకొన్నా ముఖ్య నేతలు ముగ్గురూ విజయం సాధించడం కొంత ఊరటనిచ్చింది. కొంచెం కష్టపడి ఉంటే... ఈ ముగ్గురికి తోడు మరో ఇద్దరు కూడా గెలుపు అంచుల వరకు వచ్చి ఓటమి పాలయ్యాయి. చేవెళ్ల నుంచి పోటీ చేసిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, జహీరాబాద్ అభ్యర్థి కల్వకుంట్ల మదన్మోహన్రావు అధికార పార్టీకి ఓ రకంగా చుక్కలు చూపించారు. టీఆర్ఎస్ కంచుకోట జహీరాబాద్‌లో నరాలు తెగే ఉత్కంఠ నడుమ టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. చేవెళ్లలో కూడా దాదాపు అదే పరిస్థితి నెలకొంది. చాలా స్వల్ప తేడాతో ఈ ఇద్దరు ఓటమి పాలు కావడంతో కొంచెం కష్టపడి ఉంటే ఈ స్థానాలు కూడా దక్కేవనే ఆవేదన గాంధీభవన్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మిగిలిన వారంతా ఫెయిల్... అలాగే కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నేతలుగా గుర్తింపు పొందిన కేంద్ర మాజీ మంత్రులు రేణుకాచౌదరి, బలరాం నాయక్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ అధికార ప్రతినిధి మధుయాష్కీగౌడ్ లాంటి నేతలంతా పరాజయం పాలయ్యారు. నిజామాబాద్‌లో అయితే మధుయాష్కీకి వచ్చిన ఓట్లు పార్టీ నేతలను విస్మయపరిచాయి. ఆయనకు కేవలం 7 శాతంతో 65వేలకు పైగా మాత్రమే ఓట్లు పోలయ్యాయి. కరీంనగర్ నుంచి పోటీ చేసిన పొన్నం ప్రభాకర్‌కు 1.80 లక్షల ఓట్లు రాగా, రేణుకాచౌదరికి దాదాపు 4 లక్షలు, బలరాం నాయక్‌కు 3.15 లక్షల ఓట్లు వచ్చాయి. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన ముగ్గురు కీలక నేతలు విజయం సాధించడం, మిగిలిన నేతలు కూడా చెప్పుకోదగిన స్థాయిలో ఓట్లు రావడం కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. -
రాహుల్ వచ్చినా.. ఒక్కచోటే గెలుపు
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పరువు నిలుపుకునే స్థాయిలో సీట్లు సాధించుకున్నా.. పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రచారం చేసిన స్థానాల్లో ఒకటి మినహా మిగతాచోట్ల ఓటమి పాలైంది. రాహుల్ రెండు విడతలుగా నాలుగు పార్లమెంట్ స్థానాలు చేవెళ్ల, నల్లగొండలో ఒక విడతలో, జహీరాబాద్, నాగర్‌కర్నూల్‌లో మరో విడతలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చేవెళ్లలో జరిగిన ప్రచార సభల్లోనే హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానాల అభ్యర్థులు పాలుపంచుకున్నారు. నల్లగొండ సభకు భువనగిరి అభ్యర్థితోపాటు కార్యకర్తలు హాజరయ్యారు. జహీరాబాద్ సభకు మెదక్, నిజామాబాద్, నాగర్‌కర్నూల్ సభకు మహబూబ్‌నగర్ అభ్యర్థులు హాజరయ్యారు. అయితే ఇందులో నల్లగొండ నుంచి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ ఒక్కరే గెలిచారు. మిగతా చోట్ల జరిపిన సభల్లో అభ్యర్థులంతా ఓటమి పాలయ్యారు. ఇందులో చేవెళ్ల అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, జహీరాబాద్ అభ్యర్థి మదన్ మోహన్‌రావులు మాత్రమే 8 వేల కన్నా తక్కువ ఓట్లతో ఓటమి పాలవగా, మిగతా చోట్ల అభ్యర్థులంతా భారీ మెజార్టీలతో ఓటమి చెందారు. రాహుల్ తన ప్రసంగాల్లో రాష్ట్రానికి సంబంధించి కాళేశ్వరం ఎత్తిపోతల అంచనాల పెంపు, అవినీతి, కుటుంబ పాలనపై విమర్శలు చేశారు. దీంతోపాటే రఫేల్ యుద్ధ విమానాల కుంభకోణంతోపాటు, అధికారంలోకి వస్తే ఏడాదికి రూ.72 వేల ఆర్థికసాయం అంశాలను ప్రస్తావించారు. అయినా రాహుల్ ప్రచారం చేసిన పార్లమెంట్ నియోజకవర్గాల్లో అది పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. -
ఫ్యాన్ గాలికి.. సై'కిల్'
రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభంజనానికి తెలుగుదేశం పార్టీ కకావికలమైంది. 2019 ఎన్నికల్లో అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల్లో ఫ్యాను గాలి హోరులో తెలుగుదేశం అభ్యర్ధులు అనేక స్థానాల్లో కొట్టుకుపోయారు. స్పీకర్, మంత్రులు, సీనియర్ నాయకులు సైతం పరాజయం పాలయ్యారు. టీడీపీ చరిత్రలోనే కాదు, రాష్ట్ర చరిత్రలో కూడా ఏ పార్టీకి ఇలాంటి పరాభవం ఎదురుకాలేదు. ఇంతటి ఘోరమైన పరాభవాన్ని చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ చవిచూసింది. హామీలన్నీ గాలికొదిలేసి.. గత ఐదేళ్లుగా చంద్రబాబు సాగించిన ప్రజా వ్యతిరేక పాలనతో విసిగిపోయిన ఓటర్లు టీడీపీకి గుణపాఠం చెప్పారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. – సాక్షి, అమరావతి మహామహుల ఓటమి ప్రస్తుత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాల్లో 20 మాత్రమే దక్కాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు కేబినెట్లోని మంత్రుల్లో అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావు, నిమ్మకాయల చినరాజప్ప మినహా తక్కిన వారంతా ఓటమి చెందారు. పార్టీలో ఓటమి ఎరుగని నేతలుగా పేరుపడ్డ సీనియర్ నేతలు సైతం ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనంలో కొట్టుకుపోయారు. 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ఇప్పటివరకు 9సార్లు ఎన్నికలు జరిగాయి. ఏనాడూ ఇంతటి ఘోరపరాభవాన్ని టీడీపీ ఎదుర్కొనలేదు. - టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళావెంకటరావు ఎచ్చెర్లలో ఎలాంటి రాజకీయ అనుభవం లేని, తొలిసారిగా పోటీకి దిగిన వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి గొర్లె కిరణ్ చేతిలో పరాజయం పాలయ్యారు. - సీనియర్ నాయకుడు, స్పీకర్ కోడెల శివప్రసాదరావు గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఓటమిపాలయ్యారు. - ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేష్ గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి ఓడిపోయారు. - చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన మంత్రి నారాయణ నెల్లూరులో పోటీచేసి వైఎస్సార్సీపీ గాలిలో కొట్టుకుపోయారు. - మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రడు, పితాని సత్యనారాయణ, జవహర్, దేవినేని ఉమామహేశ్వరరావు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డి, భూమా అఖిలప్రియ, అమర్నాధరెడ్డి.. ఇలా మంత్రులంతా ఇంటిబాటపట్టారు. - విశాఖ జిల్లా అరకులో వైఎస్సార్సీపీ తరపున గెలిచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు నక్సల్స్ చేతిలో హతమవ్వగా.. ఆయన కుమారుడు కిడారి శ్రావణ్‌ను టీడీపీలోకి తీసుకొని మంత్రి పదవి కట్టబెట్టారు. ఈ ఎన్నికల్లో తండ్రి చనిపోయిన సెంటిమెంటు కూడా కలసిరాక శ్రావణ్ ఓడిపోయారు. విచిత్రమేమంటే ఇక్కడ టీడీపీకి వచ్చిన ఓట్ల కంటే నోటాకు ఎక్కువ ఓట్లు వచ్చాయి. టీడీపీకి మాయని మచ్చ తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఇంతటి ఘోర పరాభవం మాయనిమచ్చగా మిగిలిపోనుంది.ఆ పార్టీ ఇదివరకెన్నడూ ఇంత ఘోరంగా ఓడిపోలేదు. రాష్ట్ర చరిత్రలో కూడా ఇలాంటి అపజయం వేరే పార్టీకి కూడా రాలేదు. చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు ఎంతలా దూరమైందో ఈ ఎన్నికల తీర్పు స్పష్టం చేస్తోంది. గడచిన అయిదేళ్ల కాలంలో చంద్రబాబు అప్రజాస్వామిక పాలన, అవినీతి అక్రమాలు చూసిన ప్రజలు విసుగెత్తిపోయారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా? ఎప్పుడు గుణపాఠం చెబుదామా? అని అన్ని వర్గాల ప్రజలు ఎదురుచూశారు. కర్షకులు, కార్మికులు, ఉద్యోగులు, మహిళలు, బీసీలు, నిరుద్యోగులు, విద్యార్ధులు.. ఇలా ఒకరేమిటి అన్ని వర్గాల ప్రజలు చంద్రబాబు పాలనలో నానా అవస్థలు పడ్డారు. హామీలన్నీ గాలికి 2014 ఎన్నికల్లో 600కు పైగా హామీలు ఇచ్చి, ప్రజలను మభ్యపెట్టి, బీజేపీ, జనసేన పార్టీల మద్దతులో చంద్రబాబు అధికారంలోకి రాగలిగారు. అధికారంలోకి వచ్చాక తాను ఇచ్చిన హామీలను ఒక్కదాన్నీ నిలబెట్టుకోలేదు. వ్యవసాయ రుణాల మాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి.. ఇలా అనేక హామీలను గాలికి వదిలేశారు. పైగా రైతులతో సహ అన్ని వర్గాల ప్రజలను తీవ్ర వేధింపులకు గురిచేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ కార్మికులు, ఇలా ఒకరేమిటి అందరినీ వేధించారు. అంతేకాకుండా జన్మభూమి కమిటీలంటూ తన పార్టీ నాయకుల ద్వారా ప్రజలను దోపిడీ చేశారు. వేల కోట్ల దోపిడి రాష్ట్రంలోని పోలవరం ప్రాజెక్టు నుంచి అన్ని ప్రాజెక్టుల పనుల్లో, కాంట్రాక్టు పనుల్లో వేలకోట్ల మేర దోపిడీ చేశారు. ఇసుక నుంచి బొగ్గువరకు, మట్టినుంచి గనుల వరకు.. అన్ని వనరులను టీడీపీ నేతలు కొల్లగొట్టారు. అడ్డు వచ్చిన వారిపై అక్రమ కేసులు బనాయించి వేధించారు. రాష్ట్రానికి సంజీవని వంటి ప్రత్యేక హోదాను తన స్వార్థంకోసం ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకోవడానికి కేంద్రానికి తాకట్టు పెట్టి రాష్ట్ర ప్రజల నోట్లో మట్టి కొట్టారు. ప్రత్యేక హోదా అన్నవారిపై కేసులు పెట్టించారు. చివరకు తన రాజకీయ అవసరాలకోసం కేంద్రం నుంచి బయటకు వచ్చి ప్రత్యేక హోదా పల్లవి అందుకున్నా ప్రజలు ఆయన మాటలు విశ్వసించలేదు. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిచ్చి టీడీపీలోకి చేర్చుకోవడమే కాకుండా.. వారిలో నలుగురికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టిన తీరును రాష్ట్ర ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. ప్రజాధనం వృథా రాష్ట్రం తీరని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా దీక్షలు, విదేశీ యాత్రలంటూ చంద్రబాబు వందలకోట్ల నిధులు వృధాగా ఖర్చు చేశారు. కొత్తగా రేషన్‌కార్డులు, పెన్షన్లు, నిరుపేదల చిన్నచిన్న అవసరాలకు నిధులు లేవంటూ ఇలా వృధా చేయడం ప్రజల్లో వ్యతిరేకతను పెంచింది. రైతుల నుంచి తీసుకున్న భూములను తనకు కావలసిన వారికి వందల ఎకరాలను చాలా తక్కువ ధరలకు ధారదత్తం చేశారు. పోలీసు విభాగం సహ పలు శాఖలను తన సొంత పనులకు, రాజకీయ అవసరాలకు వాడుకుంటూ వ్యవస్థలను నీరుగార్చారు. ముఖ్యంగా పోలీసు అధికారులను చట్టం ప్రకారం పనిచేయనివ్వకుండా కేవలం ప్రత్యర్థి పార్టీలను వేధించడానికి, ఎమ్మెల్యేలను కొనుగోలు చేయించడానికి ఇతర అప్రజాస్వామిక పనులకు వాడుకోవడం ప్రజలలో టీడీపీ పట్ల వ్యతిరేకతను పెంచింది. ప్రస్తుత ఎన్నికల ఫలితాల్లో ఇవన్నీ ప్రతిబింబించి తెలుగుదేశాన్ని మట్టికరిపించాయి. ప్రస్తుతం వెలువడిన ఫలితాలు తెలుగుదేశంపై, చంద్రబాబుతో సహ ఆపార్టీ నేతలకు చెంపపెట్టులాంటిదేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తొలిసారి ఒంటరిపోటీలో దిగి తెలుగుదేశం గతంలో ఏనాడూ ఒంటరిగా పోటీచేయలేదు. ఈసారి కూడా జనసేన, కాంగ్రెస్ పార్టీలతో తెరచాటు ఒప్పందాలతో చంద్రబాబు ఒంటరి పోరుకు దిగారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిక ద్వారా ఎన్నికల్లో గండం గట్టెక్కవచ్చన్న అభిప్రాయంతో ఇలా చేసినా ఆ ప్రయోగం వికటించినట్లు ప్రస్తుత ఎన్నికల ఫలితాలు తేటతెల్లం చేస్తున్నాయి. చంద్రబాబునాయుడు 1995లో తన మామ ఎన్టీరామారావును వెన్నుపోటు పొడిచి అడ్డదారిలో గద్దెనెక్కారు. 1999లో బీజేపీ అండతో, వాజిపేయి హవాలో విజయం సాధించారు. 2004లో పొత్తుల్లో పోటీచేసి ఓడిపోయి బీజేపీ వల్లనే ఓటమి అంటూ నెపాన్ని ఆపార్టీపైకి నెట్టేశారు. 2009 ఎన్నికల్లో మహాకూటమి అంటూ పలు పార్టీలను కలుపుకొని పోటీకి దిగినా చంద్రబాబుకు పరాభవం తప్పలేదు. 2014లో తిరిగి బీజేపీతో పొత్తులు, మోడీ ప్రభంజనం, జనసేన మద్దతుతో అత్తెసరు ఓట్ల మెజార్టీతో అధికారంలోకి వచ్చారు. ఈ గణాంకాలు చూస్తే ఏనాడూ చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం ఒంటరిగా పోటీచేసి గెలుపొందలేదు. కేవలం ఇతర పార్టీల మద్దతుతోనే బతికిబట్టకట్టిందన్నది తేటతెల్లం. ఈ ఎన్నికల్లోనూ ఎన్ని మాయోపాయాలు పన్నినా ప్రజలు టీడీపీని, చంద్రబాబును గట్టిగా తిరస్కరించారు. పలు జిల్లాల్లో ఖాతా తెరవని వైనం గతంలో తెలుగుదేశం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఆపార్టీ కొన్ని జిల్లాల్లో ఖాతాలనూ తెరవలేకపోయింది. కడప, నెల్లూరు, విజయనగరం, కర్నూలు జిల్లాల్లో ఒక్క స్థానాన్నీ గెల్చుకోలేకపోయింది. కొన్నిజిల్లాల్లో ఒకటి, రెండు స్థానాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది. ‘పార్టీకి ఇంతటి ఘోరమైన ఫలితాలు వస్తాయని కలలో కూడా ఊహించలేకపోతున్నాం. ఒకప్పుడు అన్నివర్గాలు ముఖ్యంగా బీసీలు వెన్నెముకగా ఉన్న టీడీపీకి ఇంటి ఘోరపరాజయం ఎదురవ్వడానికి పార్టీ అధిష్ఠానం తీరే కారణం. ఒంటెత్తుపోకడలు, మితిమీరిన అవినీతి అక్రమాలు, విచ్చలవిడితనంతో ప్రభుత్వమంటేనే ప్రజల్లో ఏవగింపు కలిగేలా చంద్రబాబు చేశారు. పార్టీకి, పార్టీ యంత్రాంగానికి దూరం పెంచేశారు. నాయకులే కాదు గ్రామస్థాయిలో కూడా జన్మభూమి కమిటీల పేరిట చేసిన దుర్మార్గాలు ప్రజల్లో పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకతను పెంచాయి. వాటిఫలితమే ప్రస్తుత ఫలితాలు’ అని పార్టీ సీనియర్‌నేత ఒకరు వ్యాఖ్యానించారు. ఎన్ని మాయోపాయాలు పన్నినా ఈ ఎన్నికల్లో గెలిచేందుకు చంద్రబాబు చేయని కుట్రలు, కుతంత్రాలు లేవు. ఒకపక్క జనసేనతో లోపాయికారీ ఒప్పందాలు కొనసాగిస్తూ.. మరోవైపు ఆ పార్టీని వేరుగా బరిలోకి దించి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలేందుకు ప్రయత్నించారు. ఏకంగా జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు అపాయింట్మెంటు కూడా ఇవ్వని మాయవతితో మాట్లాడించి బీఎస్పీతో జనసేనకు పొత్తులు కుదిర్చారు. ఆ పార్టీ అభ్యర్ధులను తానే నిర్ణయించడమే కాకుండా.. ఏకంగా వారికి కావలసిన ఆర్థిక వనరులు కూడా చంద్రబాబు సమకూర్చారు. మరోవైపు కేఏపాల్‌ను ప్రజాశాంతి పార్టీని బరిలోకి దించి ఓట్లు చీల్చేందుకు ప్రయత్నించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పోలిన విధంగా కండువాలు, జెండాలు ఏర్పాటు చేయించారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఫ్యాను గుర్తును పోలి ఉండేలా హెలికాప్టర్ గుర్తును కూడా ప్రజాశాంతి పార్టీకి రావడం ద్వారా ఓట్లు చీలుతాయనుకున్నారు. కానీ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు మాయమాటలు, చేష్టలు గమనించి ఈ ఎన్నికల్లో స్పష్టమైన తీర్పునిచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీనీ నెరవేర్చకుండా మోసం చేయడమే కాకుండా .. ఈ ఎన్నికల ముందు మళ్లీ పసుపు కుంకుమ, పెన్సన్ల మొత్తం పెంపు, నిరుద్యోగ భృత వంటివి తెరపైకి తెచ్చినా చంద్రబాబును ప్రజలు విశ్వసించలేదు. నానాటికీ తీసికట్టుగా టీడీపీ ప్రస్తుత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సీట్లు చూస్తుంటే.. గతంలో ఏ పార్టీకి ఇంతట ఆదరణ లేదన్నది సుస్పష్టమవుతోంది. 1983లో ఎన్టీరామారావు టీడీపీని స్థాపించి పోటీచేసిన స్థానాలు 290 కాగా.. గెలిచిన స్థానాలు 204 అంటే 70.30 శాతం స్థానాలను గెల్చుకున్నారు. అదే 1985లో వివిధ పార్టీలతో పొత్తులు కుదుర్చుకొని 250 స్థానాల్లో టీడీపీ పోటీచేయగా.. 202 (80శాతం) చోట్ల గెలిచింది. మళ్లీ 1994లో వివిధ పార్టీలతో పొత్తుల్లో 251 స్థానాల్లో పోటీచేసిన టీడీపీ 216 (86శాతం) స్థానాల్లో గెలుపొందారు. అదే చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారింది. 1999లో బీజేపీతో పొత్తుల్లో 269 స్థానాల్లో పోటీచేసిన టీడీపీ 180 (66 శాతం) స్థానాలకు పరిమితమైంది. ఆ తరువాత 2004, 2009లో వరుసగా ఓటమి పాలైంది. 2014లో బీజేపీ, జనసేన పొత్తుల్లో 163 స్థానాల్లో పోటీచేసి 102 (62 శాతం) స్థానాల్లో నిలిచింది. ఆ ఎన్నికల్లో టీడీపీ కి సీట్లు పెరిగినా ఓట్ల శాతం మాత్రం చాలా తక్కువే. ఆ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ కన్నా కేవలం 1.96 ఓట్లు మాత్రమే అదనంగా సాధించి ప్రభుత్వంలోకి వచ్చింది. ఈసారి ఎన్నికల్లో టీడీపీ పరిస్థితి మరింత దిగజారింది. రాత్రివరకు వెలువడిన ఫలితాల ప్రకారం టీడీపీ 175 నియోజకవర్గాల్లో తొలిసారిగా ఒంటరిగా పోటీచేసింది. ఆ పార్టీకి కేవలం 20 స్థానాలు మాత్రమే సాధించగలిగింది. ఇక ఓట్ల శాతాలు భారీగా తగ్గినట్లు ఆయా అభ్యర్దులకు వచ్చిన మెజార్టీలు చెబుతున్నాయి. -
బలమైన సైనిక శక్తిగా భారత్
న్యూఢిల్లీ: తాజాగా దక్కిన అధికారం ప్రధాని నరేంద్ర మోదీ పెట్టుబడి నిబంధనలను మరింత సడలించేందుకు అవకాశం ఇస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాగైతే రిలయన్స్, మహీంద్రా, టాటా వంటి భారత ప్రైవేట్ రంగ దిగ్గజాలు వేల కోట్లు రక్షణ రంగంలో పెట్టుబడులుగా పెడతాయి. అప్పుడు భారత్‌ను ఓ పెద్ద సైనిక శక్తిగా తీర్చిదిద్దాలనే మోదీ ఆకాంక్ష నెరవేరుతుంది. స్వాతంత్య్రా నంతరం భారత రాజకీయ నాయకత్వం ముసాయిదా విధాన రూపకల్పనలో సైన్యాన్ని పక్కనపెట్టి ఔత్సాహికులకు, ఆ రంగంతో సంబంధం లేనివారికి, పిరికివాళ్లకు స్థానం కల్పించింది. ఫలితంగా భారత వ్యూహాత్మక లక్ష్యాలు ఎదుగూబొ దుగూ లేకుండా ఉండిపోయాయి. మోదీ రంగంలోకి దిగేవరకు ఇదే కొనసాగింది. యుద్ధాలు గెలవడానికి అవసరమైన విధులు నిర్వర్తించడానికి వీలుగా సాయుధ దళాల్లోకి వృత్తి నిపుణులను అనుమతించిన తొలి ప్రధానిగా మోదీ నిలిచారు. ఈ నేపథ్యంలోనే స్వాతంత్య్రానంతరం మొదటిసారిగా పాకిస్తాన్ ఉగ్ర దాడులకు భీకర ఎదురుదాడులతో భారత్ ప్రతిస్పందించడం ప్రారంభించింది. ఒక దెబ్బకు రెండు దెబ్బలు తీయాలనే మోదీ విధానానికి బాలాకోట్ దాడులు ఓ చక్కని ఉదాహరణ. జమ్మూకశ్మీర్‌లో 40 మంది జవాన్లను ఆత్మా హుతి బాంబర్ పొట్టన పెట్టుకున్న నేపథ్యంలో బాలాకోట్‌లో భారత సైన్యం వైమానిక దాడులు నిర్వహించింది. 12 యుద్ధవిమానాలు పాక్‌లోని అంతర్జా తీయ సరిహద్దు వెంబడి ఉగ్ర శిబిరాలపై బాంబుల వర్షం కురిపించాయి. భారత్ దాడులను ఆపడంలో పాక్ అసమర్ధత బట్టబయలైంది. మోదీ దూకుడు గా వ్యవహరించిన తీరు ఓ సైనిక శక్తిగా పాక్‌ను బాగా క్షీణింపజేసింది. ఈ పరిస్థితుల్లో మోదీ మళ్లీ ప్రధాని కావడమనేది పాకిస్తాన్‌కు రుచించని వార్తే. -
పదోసారి హైదరాబాద్ మజ్లిస్ వశం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ లోక్‌సభ స్థానంలో మజ్లిస్ పార్టీ వరసగా పదో విజయాన్ని నమోదు చేసుకుంది. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ తాజా ఎన్నికల్లో ఈ స్థానంలో ఘన విజయం సాధించారు. పోటీ చేసిన ప్రతిసారీ మెజారిటీని పెంచుకుంటూ వస్తున్న అసదుద్దీన్ ఈసారి భారీ మెజారిటీని సొంతం చేసుకున్నారు. ఆయన దాదాపు 2.82 లక్షల ఓట్ల మెజారిటీని సొంతం చేసుకున్నారు. హైదరాబాద్ పార్లమెంటు స్థానం నుంచి ఆయనకు ఇది వరసగా నాలుగో విజయం. గత ఎన్నికల్లో 2.02 లక్షల ఓట్ల మెజారిటీ సంపాదించారు. ఇప్పటికి వరుసగా పదిసార్లు ఈ స్థానాన్ని కైవసం చేసుకున్న మజ్లిస్‌పార్టీకి ఇదే అతిపెద్ద మెజారిటీ కావటం విశేషం. పాతనగరంలో తనకు తిరుగులేదని మజ్లిస్ పార్టీ మరోసారి నిరూపించుకుంది. ఈ పార్లమెంటు స్థానం పరిధిలో ఒక్క గోషామహల్ అసెంబ్లీ స్థానం తప్ప మిగతా ఏడు స్థానాలూ మజ్లిస్ చేతిలోనే ఉన్నాయి. ఎన్నికలకు ముందే ‘గెలుపు’.. కారు.. సారు... పదహారు.. నినాదంతో ఎన్నికల్లో ప్రచారం చేసిన టీఆర్ఎస్ తాను 16 స్థానాలు గెలుస్తున్నట్టు పేర్కొంది. ఆ పార్టీ అభ్యర్థి బరిలో ఉన్నప్పటికీ, హైదరాబాద్‌లో గెలుపు మాత్రం మజ్లిస్‌దేనని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికలకు ముందే ప్రకటించటం విశేషం. గత పార్లమెంటు ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసిన భగవంతరావునే బీజేపీ ఈసారి కూడా బరిలో నిలిపింది. తమ పార్టీ విజయం సాధిస్తుందని పేర్కొంటూ చివరి వరకు పోటీ ఇచ్చింది. కానీ అధికార పక్షం మజ్లిస్ విజయాన్ని పోలింగ్‌కు ముందే చెప్పేయటంతో అక్కడ పోటీ అంత రసవత్తరం కాదని తేలిపోయింది. మజ్లిస్ కేడర్‌లో కొంత నిరుత్సాహం అసెంబ్లీ ఎన్నికల్లో ఏడుకు ఏడు సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానాలను, పార్లమెంటు ఎన్నికల్లో హైదరాబాద్ సిట్టింగ్ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకుని మజ్లిస్ పార్టీ జోష్‌లోనే ఉంది. కానీ, లోలోన మాత్రం ఆ పార్టీ నేతల్లో ఈసారి కొంత నిరుత్సాహం ఆవరించింది. నగరంలోని ఒక్క రాజేంద్రనగర్ అసెంబ్లీ స్థానం మినహా కొత్త చోట్ల పోటీ చేయలేదు. రాజేంద్రనగర్‌లో టీఆర్ఎస్ గెలవడంతో మజ్లిస్ శ్రేణులు డీలా పడ్డాయి. గతంలో సికింద్రాబాద్ పార్లమెంటు స్థానంలో గట్టి పోటీ ఇచ్చినా, ఈసారి టీఆర్ఎస్కు మేలు చేసే క్రమంలో సికింద్రాబాద్‌లో పోటీ చేయలేదు. అటు అసెంబ్లీ స్థానాలు, ఇటు పార్లమెంటు స్థానాలకు సంబంధించి కొత్త స్థానాల్లో పోటీ చేయకపోవటం ఆ పార్టీ శ్రేణుల్లో నిర్లిప్తతకు కారణమైంది. ఔరంగాబాద్‌లో మజ్లిస్ విజయం... మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో మజ్లిస్ పార్టీ విజయం సాధించింది. ఇది ఆ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇప్పటి వరకు మహారాష్ట్ర నుంచి ఎమ్మెల్యేలను గెలిపించుకున్న మజ్లిస్ పార్టీ తొలిసారి ఒక ఎంపీ స్థానాన్ని సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి ఇంతియాజ్ జలీల్ దాదాపు 5 వేల ఓట్ల మెజారిటీతో ఎంపీగా గెలిచారు. అసదుద్దీన్ ఒవైసీతోపాటు ఆయన సోదరుడు, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, పార్టీలోని మిగతా ఎమ్మెల్యేలు విడతలవారీగా అక్కడ ప్రణాళికాబద్ధంగా ప్రచారం నిర్వహించారు. ఇంతకాలం పార్లమెంటులో ఒక్క సీటుకే పరిమితమైన మజ్లిస్ తరఫున ఈసారి దర్జాగా ఇద్దరు ప్రవేశించనున్నారు. -
టీడీపీ కుట్రలకు చెల్లు చీటీ...
సాక్షి, అమరావతి: చంద్రబాబు కుట్రలు, కుయుక్తులు, పన్నాగాలు, మాయోపాయాలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సరైన రీతిలో తగిన బుద్ధి చెప్పారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అడ్డుకోవడానికి ఆయన వేసిన అడ్డదిడ్డమైన ఎత్తులను ఏకపక్ష తీర్పుతో చిత్తు చేశారు. వైఎస్ జగన్‌కు బ్రహ్మరథం పడుతూ... రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల చరిత్రలోనే పెద్దఎత్తున ఆమోదంతో, కనీవిని ఎరుగని భారీ మెజార్టీలతో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించారు. ఈ సునామీలో మంత్రులు సహా తెలుగుదేశం పార్టీ హేమాహేమీలు ఘోర పరాజయం పాలయ్యారు. అన్ని ఎత్తులను తుడిచిపెట్టేశారు... వైఎస్సార్ కాంగ్రెస్ పారీ, వైఎస్ జగన్‌ను అడ్డుకునేందుకు దశాబ్దం నుంచి టీడీపీ అధ్యక్షుడిగా, ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు రాజకీయంగానే కాక ఇతర మార్గాల్లోనూ అనేక పన్నాగాలు పన్నారు. ఈ ఎన్నికల్లో వాటిని పరాకాష్టకు తీసుకెళ్లారు. ఎలాగైనా గెలవాలనన్నట్లుగా టీడీపీ ఎంచుకున్న అడ్డదారులను, చివరకు ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న వైఎస్ జగన్‌పై హత్యాయత్నానికి తెగబడటాన్నీ ప్రజలు ఎప్పటికప్పుడు పసిగట్టి గట్టిగా తిప్పికొట్టారు. పురిట్లోనే గొంతు నులిమేయాలని... 2011 సమయంలో దేశంలో అత్యంత బలీయ నాయకురాలైన సోనియాగాంధీని ఎదిరించి... కాంగ్రెస్ పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేసి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన మరుక్షణమే చంద్రబాబు దొంగదెబ్బకు సిద్ధమయ్యారు. ఆ ఏడాది ఉప ఎన్నికల్లో వైస్సార్సీపీ అభ్యర్థులు అత్యధిక మెజార్టీలతో గెలవడంతో తమకు, తమ పార్టీలకు వైఎస్ జగన్, వైఎస్సార్ కాంగ్రెస్ పెనుముప్పని ఊహించిన చంద్రబాబు... ఏకంగా బద్ధ శత్రువు, ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌తో చేతులు కలిపారు. ప్రతిపక్ష నాయకుడిగా ప్రజా సమస్యలను పట్టించుకోకుండా, వైఎస్సార్ కాంగ్రెస్‌ను అణగదొక్కడంపైనే దృష్టిపెట్టారు. అధికార పార్టీ అరాచకాలను పట్టించుకోలేదు. కానీ, దీనిని వైఎస్సార్ కాంగ్రెస్ అసెంబ్లీలో నిలదీసింది. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. టీడీపీ మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడింది. చివరకు జగన్‌పై తప్పుడు కేసులు పెట్టించి సీబీఐని ఉసిగొల్పారు. 2014లో నలుగురూ ఒక్కటై 2014 సాధారణ ఎన్నికల నాటికి కాంగ్రెస్ సీనియర్ నేతలను టీడీపీలో చేర్చుకోవడమే కాక ఆ పార్టీతో తెరవెనుక ఒప్పందంతో వారి ఓట్లు తమకు పడేలా చంద్రబాబు వ్యూహాలు పన్నారు. ఓవైపు వైఎస్సార్ కాంగ్రెస్‌ను ఓడించే సత్తా లేక, షరా మామూలుగా ఒంటరి పోరుకు భయపడి బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారు. మరోవైపు సినీ నటుడు పవన్ కల్యాణ్ నుంచి బేషరతు మద్దతుకు పాకులాడారు. అన్నిటికి మంచి నీచస్థాయికి దిగజారి... వైఎస్సార్ కాంగ్రెస్ మహిళా నేతలపై అసత్య ఆరోపణలు చేయించారు. రూ.వేల కోట్లను మంచి నీళ్లలా వెదజల్లి, కులాల వారీగా ఓటర్లను చీల్చి అనారోగ్యకర వాతావరణం సృష్టించారు. అయినా, కేవలం 1.96 (5 లక్షల ఓట్లు) శాతం ఓట్ల తేడాతోనే నెగ్గగలిగారు. అధికారంలోకి వచ్చాక మరిన్ని కుతంత్రాలు విభజిత రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన మరునాటి నుంచే మరిన్ని కుట్రలు పన్నారు చంద్రబాబు. 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకోవడమే కాక, నలుగురికి మంత్రి పదవులిచ్చారు. ప్రజా సమస్యలు ప్రస్తావించనీయకుండా మందబలంతో అసెంబ్లీలో ఆ పార్టీని అడ్డుకున్నారు. ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయి... రాష్ట్రానికి సంజీవని వంటి ప్రత్యేక హోదాను చంద్రబాబు తాకట్టు పెడితే, వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరంతరం దానిపై ఆందోళనలు చేపట్టి డిమాండ్‌ను సజీవంగా ఉంచారు. కాపు రిజర్వేషన్ ఉద్యమం సందర్భంగా తుని వద్ద రైలును దహనం చేసి ఆ కుట్రలో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలను ఇరికించేందుకు యత్నించారు. రాజధాని ప్రాంతంలో రైతుల పక్షాన నిలిచిన వైఎస్సార్ కాంగ్రెస్ నేతలపై కేసులు బనాయించి జైలుకు పంపారు. ఇన్ని చేసినా వైఎస్సార్ కాంగ్రెస్ ఆత్మ స్థైర్యంతో ప్రజల వెనుక నిలిచి పోరాటం కొనసాగించింది. ఎన్నికల కుట్రలెన్నెన్నో 2019 సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ చంద్రబాబుకు అడ్డులేకుండా పోయింది. అధికారం అడ్డంపెట్టుకుని నిబంధనలు, రాజ్యాంగ పరిధులను విస్మరించి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని అణచేందుకు ప్రయత్నాలు చేశారు. టీడీపీ అరాచక పాలనలో నలిగిపోతున్న ప్రజానీకాన్ని ఓదార్చేందుకు ప్రజా సంకల్ప యాత్ర పేరిట వైఎస్ జగన్ సుదీర్ఘ పాదయాత్ర చేపడితే అడ్డుకొనేందుకు చంద్రబాబు, తెలుగుదేశం నేతలే కాక కొందరు పోలీసు ఉన్నతాధికారులు అడ్డగోలుగా వ్యవహరించారు. చివరకు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో హత్యాయత్నానికీ ఒడిగట్టారు. ఆ కేసును తప్పుదోవ పట్టించేలా ప్రయత్నించారు. ఎన్నికల్లో ఓటమి తథ్యమన్న అభిప్రాయానికి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చేందుకు ఆపసోపాలు పడ్డారు. జనసేన పార్టీతో లోపాయికారీ ఒప్పందాలు చేసుకుంటూ ఆ పార్టీ అన్ని నియోజకవర్గాల్లో పోటీకి దిగేలా చూశారు. ఆ పార్టీకి అభ్యర్ధులను ఎంపిక చేయడమే కాక వారికి రూ.కోట్లకు కోట్లు సమకూర్చారు. హెలికాప్టర్ గుర్తుతో, పార్టీ జెండాలు, కండువాలు ఒకేలా ఉండేలా చేసి ప్రజాశాంతి పార్టీ అంటూ కేఏ పాల్‌ను బరిలో దించి వైఎస్సార్ కాంగ్రెస్ ఓట్లు చీల్చేందుకు చంద్రబాబు కుట్ర పన్నారు. ఈవీఎంలపై నెపాన్ని నెట్టే ప్రయత్నం ఇన్ని చేసినా ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ వైపే ఉండటంతో చంద్రబాబు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఘోర పరాజయం తప్పదని తెలిసిపోవడంతో సాకులు వెదికారు. ఈవీఎంల వల్లనే ఓడామని చెప్పుకొనేందుకు వాటిపై పెద్ద రాద్ధాంతమే లేవదీశారు. తన వైఫల్యాలు, ఓటమిని కప్పిపుచ్చుకునేందుకు జాతీయ స్థాయి పోరాటమంటూ తిరిగారు. -
మోదం... ఖేదం!
సాక్షి, హైదరాబాద్ : లోక్‌సభ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి మిశ్రమ అనుభవాన్ని మిగిల్చాయి. కేంద్రంలో అధికారం వస్తుందని ఆశించినా కూడా రెండోసారీ అందని ద్రాక్షగానే మిగలడంతో డీలాపడిన ఆ పార్టీ శ్రేణులకు రాష్ట్రంలోని ఫలితాలు కొంత ఊరటనిచ్చాయనే చెప్పాలి. ముఖ్యంగా 2014 ఎన్నికలతో పోలిస్తే తెలంగాణలో సీట్లు, ఓట్లు పెరగడంతో పార్టీ నేతలు ఊపిరిపీల్చుకున్నారు. అయితే, బీజేపీ రూపంలో దూకుడుగా వస్తున్న ప్రతిపక్షాన్ని దీటుగా ఎదుర్కోవాల్సి ఉంటుందనే సంకేతాలను కూడా ఈ లోక్‌సభ ఫలితాలు ఇవ్వడంతో పార్టీ నేతల్లో అంతర్మథనం మొదలయింది. మొత్తం మీద ఓ వైపు కేంద్రంలో అధికార దక్కకపోవడం, తెలంగాణలో ఫలితాలు ఆశాజనకంగా ఉండటం, ప్రతిపక్ష స్థానం కోసం మరోపార్టీ ముందుకు వస్తుండటం... వెరసి రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు ఈ లోక్‌సభ ఫలితాలు మోదంతో పాటు ఖేదాన్ని కూడా మిగిల్చాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసెంబ్లీలో మెజార్టీ.. ఇప్పుడు ఢమాల్ గత ఏడాది డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రమంతటా టీఆర్ఎస్ ఘన విజయం సాధించగా, ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాల పరిధిలో కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యత లభించింది. ఈ 2 నియోజకవర్గాల్లోని మెజార్టీ అసెంబ్లీ స్థానాలను కూడా కాంగ్రెస్ పార్టీనే కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ 2 స్థానాలపై కాంగ్రెస్ గంపెడాశలు పెట్టుకున్నప్పటికీ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి ఫలితాలు తారుమారు కావడం గమనార్హం. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థులు లక్షపైచిలుకు ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. గత ఎన్నికల్లో గెలుపొందిన నల్ల గొండలో మళ్లీ గెలుపొందినా, నాగర్‌కర్నూల్‌లో ఓడిపోయారు. నల్లగొండలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 25వేల పైచిలుకు మెజార్టీతో గెలుపొందగా, నాగర్‌కర్నూల్‌లో దాదాపు 2 లక్షల ఓట్ల తేడాతో మాజీ ఎంపీ మల్లు రవి ఓడిపోవడం గమనార్హం. కమల వికాసంతో కలవరం... ఇక, కాంగ్రెస్ గెలుపోటముల మాట అటుంచితే రాష్ట్రంలో బీజేపీ రూపంలో మరో పార్టీ ప్రతిపక్ష స్థానం కోసం ముంచుకొస్తుందన్న రీతిలో వచ్చిన ఫలితాలు కాంగ్రెస్ పార్టీని కలవరపెడుతున్నాయి. తమ కంటే ఓ సీటు ఎక్కువే గెలుపొందిన కమలనాథులు అదే రీతిలో ఓట్లు కూడా సాధించి ఓ రకంగా తెలంగాణలో కాంగ్రెస్‌ను సవాల్ చేసే స్థాయికి చేరుకున్నారు. పైగా, కేంద్రంలో బీజేపీకే మళ్లీ అధికారం దక్కడంతో ఆ పార్టీ నేతలు రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారిస్తారని, అదే జరిగితే తమ మనుగడ ఏమవుతుందోననే ఆందోళన కూడా కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతోంది. ‘అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్‌సభ ఫలితాలు మాకు ఊరటనిచ్చిన మాట వాస్తవమే. ముఖ్య నేతలు గెలుపొందడం శుభపరిణామం. అయితే, రాష్ట్రంలో బీజేపీ మాకు గట్టి ప్రత్యర్థిగా తయారవుతుందన్న విషయాన్ని మా పార్టీ నేతలు గ్రహించాలి. పార్టీ మనుగడ కొనసాగాలంటే, ప్రతిపక్ష స్థానం నిలబెట్టుకోవాలంటే కమలనాథులతో కచ్చితంగా పోటీ పడాల్సిందే’ అని టీపీసీసీ ముఖ్య నేత ఒకరు వ్యాఖ్యానించారు. మొత్తం మీద సంతోషంతో పాటు ఆందోళన కలిగించేలా వచ్చిన లోక్‌సభ ఫలితాలు రాష్ట్ర కాంగ్రెస్ భవిష్యత్తును ఎటు వైపునకు తీసుకెళ్తాయో వేచి చూడాల్సిందే. గతం కంటే నయమే... తెలంగాణ ఏర్పాటయిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో కేవలం 2 లోక్‌సభ స్థానాల్లోనే కాంగ్రెస్ విజయం సాధించింది. నల్లగొండ నుంచి గుత్తా సుఖేందర్‌రెడ్డి, నాగర్‌కర్నూలు నుంచి నంది ఎల్లయ్య మాత్రమే గెలిచారు. అయితే, ఈసారి మాత్రం ఏకంగా 4 స్థానాల్లో విజయం సాధించడం, పార్టీలోని కీలక నేతలు గెలుపొందడం శ్రేణులకు ఉత్సాహాన్ని మిగిల్చింది. ముఖ్యంగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌తో పాటు పార్టీ ఫైర్బ్రాండ్లు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్‌రెడ్డి పార్లమెంట్‌లోకి అడుగుపెడుతుండటం పార్టీ భవిష్యత్తుపై సానుకూల సంకేతాలను ఇచ్చినట్టయింది. సీట్లతో పాటు ఓట్ల శాతం పెరగడం, జహీరాబాద్ లాంటి టీఆర్ఎస్ కంచుకోటలో కూడా గట్టిపోటీ ఇవ్వడం ఆ పార్టీకి మంచి పరిణామమనే చెప్పాలి. -
జగన్ ప్రచారం... వైఎస్సార్సీపీ జయకేతనం
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్ ప్రచారం వైఎస్సార్సీపీకి అఖండ విజయం అందించింది. ఆయన ఎన్నికల సభలు నిర్వహించిన నియోజకవర్గాల్లో 88 శాతం స్థానాల్లో పార్టీ విజయఢంకా మోగించడం ఇందుకు నిదర్శనం. జాతీయ స్థాయిలోనూ ఇది అందరి దృష్టి ఆకర్షిస్తోంది. ప్రచారంలో భాగంగా వైఎస్ జగన్ రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేశారు. ఫిబ్రవరి 6న తిరుపతిలో సమర శంఖారావం సభతో శ్రీకారం చుట్టారు. ఏప్రిల్ 9 వరకు 13 జిల్లాల్లో 73 సభల్లో పాల్గొన్నారు. రోజుకు రెండు, మూడు సభల్లో పాల్గొనడం విశేషం. ఏప్రిల్ 9న గుంటూరు, తిరుపతిలలో సభలతో ఈ పర్వాన్ని ముగించారు. ఆయన ప్రచారం చేసిన 73 నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ ఏకంగా 64 చోట్ల ఘన విజయం సాధించడం ప్రాధాన్యం సంతరించుకుంది. మొత్తమ్మీద తిరుపతి, కడప, అనంతపురం, ఏలూరు, నెల్లూరు, కాకినాడ, నర్సీపట్నం, నెల్లిమర్ల, పి.గన్నవరం, పాణ్యం, రాయదుర్గం, రాయచోటి, పోలవరం, అవనిగడ్డ, వేమూరు, కావలి, పలమనేరు, పులివెందుల, పలాస, పాడేరు, పిఠాపురం, చిలకలూరిపేట, తిరువూరు, ఆదోని, తాడిపత్రి, మదనపల్లె, పార్వతీపురం, పాయకరావుపేట, ముమ్మడివరం, చింతలపూడి, వినుకొండ, నందిగామ, సంతనూతలపాడు, బద్వేల్, మైదుకూరు, నగరి, నందికొట్కూరు, ఎమ్మిగనూరు, మడకశిర, పెనుకొండ, గూడరు, గిద్దలూరు, దర్శి, శృంగవరపుకోట, పెందుర్తి, భీమవరం, సత్తెనపల్లి, గురజాల, ఒంగోలు, మైలవరం, నెల్లూరు, నంద్యాల, కల్యాణదుర్గం, జమ్మలమడుగు, విజయవాడ సెంట్రల్, రాజానగరం, అనకాపల్లి, గాజువాక, మచిలీపట్నం, ఏలూరు, కాకినాడ రూరల్, మంగళగిరి, కర్నూలు నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ నెగ్గింది. -
డేంజర్ జోన్లో టీఆర్ఎస్: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో 8 స్థానాల్లో విజయం సాధిస్తామని తాము భావించామని, అయితే 3 స్థానాల్లో గెలుపొందినా తాము సేఫ్ జోన్లో ఉన్నామని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ లో బీజేపీ 4 పార్లమెంటు స్థానాల్లో గెలుపొందడం వల్ల తమకేమీ నష్టం లేదని, టీఆర్ఎస్ మాత్రం డేంజర్ జోన్ లో పడిందన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు మంచి తీర్పు ఇచ్చారని, ఉత్తమ్, కోమటిరెడ్డి, రేవంత్‌ల రూపంలో మూడు పులులు విజయం సాధించాయని చెప్పారు. భవిష్యత్తులో తమ పార్టీ నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లబోరని, టీఆర్ఎస్ నేతలే బీజేపీలోకి వెళతారని చెప్పారు. పీసీసీ అధ్యక్షుడిగా ఇప్పుడు పులులు అవసరం లేదని, వేదమంత్రాలు చదివే సాత్వికులు కావాలని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. -
కంచుకోటలకు బీటలు
అనేక దశాబ్దాలుగా గెలుస్తూ తమ కంచుకోటలుగా భావించే నియోజకవర్గాల్లోనూ ఈసారి తెలుగు దేశం ఘోరంగా ఓడింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కేబినెట్లోని ముగ్గురు మంత్రులు మినహా మిగతావారంతా వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభంజనంలో కొట్టుకుపోయారు. రాష్ట్రంలో టీడీపీకి 47 వరకు స్థానాల్లో గట్టి పట్టుంది. పార్టీ ఆవిర్భావం తర్వాత గత 36 ఏళ్లలో జరిగిన 8 ఎన్నికల్లో టీడీపీ ఏడు నుంచి ఆరుసార్లు వీటిలో గెలుపొందింది. ఇలాంటి పలు స్థానాలు ఈసారి వైఎస్సార్ కాంగ్రెస్ ఖాతాలో చేరిపోయాయి. మిగతా వాటిలోనూ తీవ్ర పోటీ ఎదురైంది. చంద్రబాబు కుప్పంలో ఎప్పుడూ 50 వేల పైగా ఓట్లతో గెలుస్తుండగా ఇప్పుడది 30 వేల లోపునకు పడిపోయింది. హిందూపురంలో ఆయన బావ మరిది, సినీ హీరో బాలకృష్ణకూ ఇదే పరిస్థితి ఎదురైంది. ఈ రెండూ కాక ఇప్పటివరకు టీడీపీ ఏడుసార్లు గెలిచిన నియోజకవర్గాలు 16, ఆరుసార్లు గెలిచినవి 29 వరకు ఉన్నాయి. వీటిలో చాలాచోట్ల ఈసారి ఆ పార్టీ మట్టికరిచింది. సాక్షి, అమరావతి: - శ్రీకాకుళం జిల్లా పలాసలో (గతంలో సోంపేట) 2009లో తప్ప అన్ని ఎన్నికల్లోనూ టీడీపీ విజయం (మొత్తం ఏడుసార్లు) సాధించింది. ఇప్పుడు మాత్రం టీడీపీ అభ్యర్థి గౌతు శిరీషను వైఎస్సార్సీపీ అభ్యర్థి సీదిరి అప్పలరాజు ఓడించారు. విజయనగరం జిల్లా నెలిమర్ల (ఏడుసార్లు నెగ్గింది)లోనూ ఆ పార్టీకి పరాభవం తప్పలేదు. వైఎస్సార్సీపీ అభ్యర్థి బి.అప్పలనాయుడు... టీడీపీ అభ్యర్థి నారాయణను పరాజయం పాల్జేశారు. - 2004లో తప్ప అన్నిసార్లూ గెలుస్తూ వచ్చిన విజయనగరంలో సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతి రాజు కుమార్తె అదితి గజపతి రాజు (టీడీపీ)... వైఎస్సార్సీపీ నేత కోలగట్ల వీరభద్ర స్వామి చేతిలో ఓడారు. ఇదే జిల్లా శృంగవరపు కోటలోనూ టీడీపీ ఏడుసార్లు గెలిచింది. తాజాగా వైఎస్సార్సీపీ అభ్యర్థి కె.శ్రీనివాస్... కోళ్ల లలిత కుమారి (టీడీపీ)ని ఓడించారు. - పాయకరావుపేటలో టీడీపీ 8 ఎన్నికల్లో ఒకేసారి ఓడింది. ఇప్పుడు వైఎస్సార్సీపీ నెగ్గింది. - ఏడుసార్లు గెలిచిన పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో వంగలపూడి అనిత (టీడీపీ)... వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి తానేటి వనిత చేతిలో పరాయం పాలయ్యారు. ఆచంటలో మంత్రి పితాని సత్యనారాయణ... వైఎస్సార్సీపీ అభ్యర్థి శ్రీరంగనాథ రాజు చేతిలో ఓడారు. టీడీపీ ఏడుసార్లు నెగ్గిన నర్సాపురం, గోపాలపురంలలోనూ వైఎస్సార్సీపీ పాగా వేసింది. - ఏడుసార్లు గెలిచిన కృష్ణా జిల్లా నందిగామను వైసీపీ హవాలో టీడీపీ చేజార్చుకుంది. -1989లో తప్ప అన్ని ఎన్నికల్లోనూ గుంటూరు జిల్లా పొన్నూరులో టీడీపీ విజయం సాధించగా... ఇప్పుడు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ వైఎస్సార్సీపీ అభ్యర్థి కిలారి రోశయ్య చేతిలో ఓడిపోయారు. - అనంతపురం జిల్లా పెనుగొండలో టీడీపీ సీనియర్ నేత బీకే పార్థసారథి... వైఎస్సార్సీపీ అభ్యర్థి చేతిలో ఎం.శంకరనారాయణ చేతిలో ఓడారు. - చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు సుధీర్‌రెడ్డి... వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి మధుసూదన్‌రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. - కర్నూలు జిల్లా పత్తికొండలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కుమారుడు కేఈ శ్యాంబాబును దించగా వైసీపీ అభ్యర్థి కంగాటి శ్రీదేవి చేతిలో ఓడారు. హేమాహేమీలకు పరాభవం 1983 నుంచి ఆరుసార్లు నెగ్గిన 29 నియోజకవర్గాల్లో చాలావరకు టీడీపీ చేజారాయి. ఆ జాబితా చూస్తే... - పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి కిమిడి కళా వెంకటరావు ఎచ్చెర్ల (శ్రీకాకుళం జిల్లా)లో వైఎస్సార్ సీపీ అభ్యర్థి గొర్లె కిరణ్‌పై ఓడారు. - విశాఖ జిల్లా భీమిలి, చోడవరం, మాడుగుల, అనకాపల్లి వైస్సార్సీపీ హస్తగతమయ్యాయి. నర్సీపట్నంలో టీడీపీ సీనియర్ నేత, మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు వైఎస్సార్సీపీ అభ్యర్థి ఉమాశంకర్ గణేశ్ చేతిలో ఓడారు. - రంపచోడవరం, తుని, తాడేపల్లిగూడెం, తణుకు, ఉంగుటూరుల్లోనూ సైకిల్ పంక్చరైంది. - రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనాలకు నెలవైన దెందులూరు (పశ్చిమగోదావరి)లో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను ఓటర్లు తిరస్కరించారు. చింతలపూడిలోనూ వైఎస్సార్సీపీ జెండా రెపరెపలాడింది. - కృష్ణా జిల్లా మైలవరంలో మంత్రి దేవినేని ఉమా వైసీపీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ చేతిలో పరాజయం చవిచూశారు. అవనిగడ్డలో డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్... వైసీపీ అభ్యర్థి సింహాద్రి రమేష్ చేతిలో ఓడిపోయారు. - గుంటూరు జిల్లా వినుకొండ, ప్రత్తిపాడు, నెల్లూరు జిల్లా కోవూరు, చిత్తూరు జిల్లా సత్యవేడు, అనంతపురం జిల్లా ధర్మవరం, కల్యాణదుర్గం, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుల్లో ఆ పార్టీ పరాజయం పాలైంది. -
అలసత్వమే ముంచింది!
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీకి లోక్‌సభ ఎన్నికలు మిశ్రమ ఫలితాలను అందించాయి. 5 నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 88 స్థానాలు గెలుచుకుని రెండోసారి అధికారంలోకి వచ్చింది. అనంతరం ఇద్దరు స్వతంత్రులు, 11 మంది కాంగ్రెస్, ఒక టీడీపీ ఎమ్మెల్యే టీఆర్ఎస్లో చేరారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ పూర్తిగా ఢీలా పడింది. 6 నెలలైనా కాకముందే లోక్‌సభ ఎన్నికలొచ్చాయి. టీఆర్ఎస్ క్యాడర్ ఒకరకమైన అతివిశ్వాసంలో ఉండిపోయింది. గెలుపు తమదే అన్న ధోరణితో పార్టీ క్యాడర్లో, కింద స్థాయి నేతల్లో అలసత్వం నెలకొంది. 16 సీట్లలో గెలుపు అనే టీఆర్ఎస్ నినాదానికి తగినట్లుగా జిల్లా, నియోజకవర్గాల నేతలు పని చేయలేకపోయారు. ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీతో తమకు పోటీ లేనేలేదనే ధోరణితో వ్యవహరించారు. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ మాత్రం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తమ బలం చూపెట్టాలనే ప్రయత్నంలో నిమగ్నమయ్యా యి. టీఆర్ఎస్ అభ్యర్థులు, మంత్రులు క్రీయాశీలకంగా పని చేసినా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆశించిన మేరకు సమన్వయం కనిపించలేదు. మరోవైపు బీజేపీ, కాంగ్రెస్ గెలుపు కోసం మొదట వేర్వేరుగా పని చేశాయి. పోలింగ్ దగ్గరపడుతున్న కొద్దీ స్థానిక నేతలు వ్యూహం మార్చారు. బీజేపీ, కాంగ్రెస్‌లో ఏ పార్టీలో బలమైన అభ్యర్థి ఉంటే మిగిలిన పార్టీ వారి కి మద్దతిచ్చి ఎక్కువ ఓట్లు పోలయ్యేలా పరస్పరం అంగీకారం కుదుర్చుకున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ క్షేత్రస్థాయిలో కలిసిపోయినట్లు కనిపించినా టీఆర్ఎస్ పెద్దగా పట్టించుకోలేదు. ఫలితం ఆశించినట్లు రాకపోవడానికి అధికార పార్టీలో నెలకొన్న అలసత్వమే కారణమని టీఆర్ఎస్ ముఖ్య నేతలు చెబుతున్నారు. పోల్ మేనేజ్మెంట్ విషయంలో తమ క్యా డర్ ఒకింత నిర్లక్ష్యంగానే వ్యవహరించిందని అం టున్నారు. కాంగ్రెస్, బీజేపీల వ్యూహాన్ని బట్టి ప్రతివ్యూహం అమలులో తమ పార్టీ నేతలు విఫలమయ్యారని చెబుతున్నారు. రెండు పార్టీలు కలసి పని చేయడం వల్లే పలు కీలక నియోజకవర్గాల్లో అధికార పార్టీకి ప్రతికూల ఫలితాలు వచ్చాయని టీఆర్ఎస్ ముఖ్యులు నిర్ధారణకు వస్తున్నారు. మార్పులతో... లోక్‌సభ అభ్యర్థుల ఖరారులో టీఆర్ఎస్ వ్యూహం మిశ్రమ ఫలితాలనిచ్చింది. సిట్టింగ్ ఎంపీలను మా ర్చిన స్థానాల్లో విజయాల శాతం ఎక్కువగానే ఉంది. కొత్త వారిని బరిలోకి దింపిన మహబూబాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, ఖమ్మం, చేవెళ్ల, పెద్దపల్లి స్థానాలను గెలుచుకోగా, నల్లగొండ, సికింద్రాబాద్, మల్కాజ్‌గిరిలో ఓడిపోయింది. సిట్టింగ్ ఎంపీలు బరిలో దిగిన ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, భువనగిరి స్థానాల్లో టీఆర్ఎస్ ఓడిపోగా.. మెదక్, వరంగల్, జహీరాబాద్‌లో గెలిచింది. -
18 స్థానాలు మైనస్
సాక్షి, హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల్లో 88 స్థానాల్లో గెలుపొందిన అధికార టీఆర్ఎస్.. పార్లమెంటు ఎన్నికల్లో ఆ జోరును కొనసాగించలేకపోయిందని గురువారం వెలువడిన లోక్‌సభ ఫలితాలు చెపుతున్నాయి. ఈఫలితాల్లో 9 పార్లమెంటు నియోజకవర్గాల్లో విజయం సాధించిన టీఆర్ఎస్ రాష్ట్రంలోని 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్పష్టమైన ఆధిక్యతను కనబర్చగలిగింది. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 18 స్థానాల్లో టీఆర్ఎస్ ఆధిక్యత తగ్గిపోయిందని ఫలితాల లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఇతర పార్టీల విషయానికి వస్తే.. కాంగ్రెస్ పార్టీ 22 చోట్ల, బీజేపీ 21 స్థానాల్లో ఆధిక్యతను కనబర్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో 19 స్థానాల్లో గెలుపొందిన కాంగ్రెస్‌కు 3చోట్ల అధికంగా మెజారిటీ రాగా, కేవలం ఒక్క స్థానం గెలిచిన బీజేపీ ఏకంగా 20 స్థానాలు ఎక్కువగా 21 చోట్ల ఆధిక్యత కనబర్చింది. మజ్లిస్ మాత్రం 6 చోట్ల తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 7 స్థానాలకు గాను ఆరింట మెజార్టీ నిలబెట్టుకున్న ఎంఐఎం, తాను పోటీ చేయని నాంపల్లి అసెంబ్లీ పరిధిలో టీఆర్ఎస్కు ఆధిక్యత తెచ్చిపెట్టింది. స్వల్ప నష్టమే కానీ.. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పార్లమెంటు ఎన్నికల్లో 18 స్థానాల్లో టీఆర్ఎస్ ఆధిక్యత కోల్పోయింది. అయితే, గతం కన్నా పార్లమెంటు స్థానాలు కూడా తగ్గడం, తమ కంచుకోటల్లో కాంగ్రెస్, బీజేపీలకు ఆధిక్యత రావడం ఆ పార్టీని కొంత ఇబ్బందుల్లోకి నెట్టింది. మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో మహబూబ్‌నగర్, బాల్కొండ, సనత్‌నగర్, నిర్మల్ స్థానాల్లో టీఆర్ఎస్ ఆధిక్యత కోల్పోగా, మంత్రులతో పాటు ఆ పార్టీ ముఖ్యులు ప్రాతినిధ్యం వహిస్తోన్న సిరిసిల్ల, సిద్దిపేట, హుజూరాబాద్, పాలకుర్తి, మేడ్చల్, వనపర్తి, ధర్మపురి స్థానాల్లో టీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబర్చింది. కాగా, సీఎం కేసీఆర్ నియోజకవర్గమైన గజ్వేల్‌లో ఆ పార్టీ మరోసారి భారీ మెజార్టీ దక్కించుకుంది. ఓడిన చోట్ల గెలుపు కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత కనబర్చిన 22 నియోజకవర్గాల్లో 17 చోట్ల మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన హుజూర్నగర్, నకిరేకల్, మునుగోడు, మంథని, ఎల్బీనగర్ నియోజకవర్గాల్లో మాత్రమే ఈసారి కూడా మెజార్టీ సాధించింది. అయితే, సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నాగార్జునసాగర్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి నియోజకవర్గమైన జగిత్యాల, ఉత్తమ్ పద్మావతి ఓడిపోయిన కోదాడ, మాజీ మంత్రి షబ్బీర్‌అలీ నియోజకవర్గమైన కామారెడ్డిల్లో ఈసారి కాంగ్రెస్‌కు టీఆర్ఎస్ కన్నా ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. ఇక, బీజేపీ విషయానికి వస్తే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన గోషామహల్లో తన స్పష్టమైన ఆధిక్యాన్ని నిలబెట్టుకున్న బీజేపీ ఈసారి టీఆర్ఎస్ కంచుకోటలయిన చాలా నియోజకవర్గాల్లో మెజార్టీ సాధించింది. ఉత్తర తెలంగాణలోని 12 అసెంబ్లీ నియోజక వర్గాల్లో బీజేపీ ఆధిక్యత సాధించడం విశేషం. పార్టీల వారీగా ఆధిక్యత స్థానాలు టీఆర్ఎస్ సిరిసిల్ల, హుజూరాబాద్, హుస్నాబాద్, సూర్యాపేట, నల్లగొండ, ఆలేరు, తుంగతుర్తి, జనగామ, సిర్పూర్, భూపాలపల్లి, ములుగు, సిద్దిపేట, మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్చెరు, దుబ్బాక, గజ్వేల్, పెద్దపల్లి, ధర్మపురి, మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి, పాలకుర్తి, పరకాల, స్టేషన్‌ఘన్‌పూర్, వరంగల్ (ఈస్ట్), వరంగల్ (వెస్ట్), వర్ధన్నపేట, తాండూరు, మేడ్చల్, కంటోన్మెంట్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఖమ్మం, పాలేరు, మధిర, వైరా, సత్తుపల్లి, కొత్తగూడెం, అశ్వారావుపేట, నారాయణపేట, కొడంగల్, దేవరకద్ర, జడ్చర్ల, షాద్‌నగర్, వనపర్తి, గద్వాల, ఆలంపూర్, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్, ముథోల్, నాంపల్లి, నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్, భద్రాచలం, పినపాక, ఇల్లెందు, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, ఆందోల్, నారాయణఖేడ్, జుక్కల్, బాన్సువాడ, నిజామాబాద్ (అర్బన్), బోధన్. కాంగ్రెస్ దేవరకొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడ, నకిరేకల్, మునుగోడు, ఇబ్రహీంపట్నం, భువనగిరి, మంథని, రామగుండం, పరిగి, వికారాబాద్, ఉప్పల్, ఎల్బీనగర్, మల్కాజ్గిరి, నిర్మల్, ఖానాపూర్, చేవెళ్ల, జహీరాబాద్, ఎల్లారెడ్డి, కామారెడ్డి. బీజేపీ కరీంనగర్, చొప్పదండి, వేములవాడ, మానకొండూరు, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, బోథ్, అంబ ర్‌పేట, ముషీరాబాద్, సికింద్రాబాద్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సనత్‌నగర్, మక్తల్, మహబూబ్‌నగర్, గోషామహల్, ఆర్మూర్, నిజామాబాద్ (రూరల్), బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల. మజ్లిస్ మలక్‌పేట, కార్వాన్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పుర, బహుదూర్‌పుర. -
స్పీడు తగ్గిన కారు
సాక్షి, హైదరాబాద్ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ సత్తాచాటింది. మొత్తం 17 స్థానాలకు గానూ 9 చోట్ల గెలిచి ఆధిపత్యం చాటుకుంది. డిసెంబర్లో తెలంగాణ శాసనసభకు జరిగిన ముందస్తు ఎన్నికల్లో 119 సీట్లకు గానూ 88 సీట్లలో గెలిచి ప్రభంజనం సృష్టించినట్లే.. లోక్‌సభ ఎన్నికల్లోనూ అదే ఊపును కొనసాగిస్తామని టీఆర్ఎస్ నాయకత్వం ఆశించింది. టీఆర్ఎస్ 16 స్థానాలు, మిత్రపక్షం మజ్లిస్‌కు ఓ స్థానం కలిపి రాష్ట్రంలోని మొత్తం 17 లోక్‌సభ స్థానాలను తామే దక్కించుకుంటామని ప్రకటించింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో 11 లోక్‌సభ స్థానాల్లో నెగ్గిన టీఆర్ఎస్ తాజా ఎన్నికల్లో 9 స్థానాలకు పరిమితమైంది.సంఖ్యాపరంగా రెండు స్థానాలను కోల్పోయింది. మూడు సిట్టింగ్ స్థానాల్లో పార్టీ అభ్యర్థులు ఓడిపోగా, టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి అందని ద్రాక్షగా ఉన్న నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానాన్ని కైవసం చేసుకుంది. నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచి టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ, సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత.. బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో 71,057 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. కరీంనగర్ స్థానంలో సిట్టింగ్ ఎంపీ, పార్టీ కీలక నేత బోయినపల్లి వినోద్‌కుమార్.. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ చేతిలో 89,508 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. ఆదిలాబాద్ సిట్టింగ్ టీఆర్ఎస్ ఎంపీ జి.నగేశ్‌పై.. బీజేపీ అభ్యర్థి సోయం బాపూరావు 58,493 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇక టీఆర్ఎస్ గెలిచిన స్థానాలను పరిశీలిస్తే.. కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై చేవెళ్ల నుంచి డాక్టర్ జి.రంజిత్ రెడ్డి 14,391 ఓట్ల బొటాబొటీ మెజారిటీతో గెలుపొందారు. మెదక్ నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి.. కాంగ్రెస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్‌పై భారీ 3,16,427 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఖమ్మంలో చివరి నిమిషంలో టీఆర్ఎస్లో చేరి ఎంపీగా బరిలో దిగిన నామా నాగేశ్వర్ రావు.. కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరిపై 1,68,062 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. మహబూబాబాద్ నుంచి మాలోతు కవిత.. కాంగ్రెస్ అభ్యర్థి పి.బలరాం నాయక్‌పై 1,46,663 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. మహబూబ్‌నగర్ నుంచి మన్నె శ్రీనివాస్ రెడ్డి.. బీజేపీ అభ్యర్థి డీకే అరుణపై 77,829 ఓట్ల తేడాతో గెలుపొందారు. నాగర్ కర్నూల్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి పోతుగంటి రాములు.. కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ మల్లురవిపై 1,89,748 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. పెద్దపల్లి నుంచి బొర్లకుంట వెంకటేష్ నేత.. కాంగ్రెస్ అభ్యర్థి ఆగం చంద్రశేఖర్‌పై 95,180 ఓట్ల తేడాతో గెలిచారు. వరంగల్ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్.. కాంగ్రెస్ అభ్యర్థి దొమ్మాటి సాంబయ్యపై 3,50,298 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్ కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్‌రావుపై 6,229 ఓట్ల స్వల్ప తేడాతో గట్టెక్కారు. ఉనికి కాపాడుకున్న కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికలు, తదనంతర ఫలితాలతో రోజురోజుకూ అస్తిత్వాన్ని కోల్పోతున్న కాంగ్రెస్ పార్టీకి ఈ ఫలితాలు కొత్త శక్తినిచ్చాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో రెండు లోక్‌సభ స్థానాలను మాత్రమే గెలిచిన కాంగ్రెస్, తాజా ఎన్నికల్లో 3 స్థానాలను గెలుచుకుంది. నల్లగొండ నుంచి పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహా రెడ్డిపై గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన ఇద్దరు పార్టీ సీనియర్లు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎ.రేవంత్ రెడ్డి లోక్‌సభ ఎన్నికల్లో సత్తాచాటారు. భువనగిరి నుంచి టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌పై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 5,219 ఓట్ల స్వల్పమెజారిటీతో గెలుపొందారు. మల్కాజ్గిరి నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డిపై ఎ.రేవంత్ రెడ్డి 10,919 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కమల వికాసం! తెలంగాణ గడ్డపై కమలం పువ్వు వికసించింది. రాష్ట్రంలోని నాలుగు లోక్‌సభ స్థానాలను అనూహ్యంగా గెలుచుకుని అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీ, టీఆర్ఎస్ కీలక నేత కల్వకుంట్ల కవితను ఓడించడం ద్వారా స్థానిక బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ జాయింట్ కిల్లర్‌గా నిలిచారు. 179 మంది రైతులు బరిలో దిగడంతో దేశం దృష్టిని ఆకర్షించిన ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. మరోవైపు, సిట్టింగ్ స్థానమైన సికింద్రాబాద్‌ను బీజేపీ నిలబెట్టుకుంది. గత ఎన్నికల్లో బండారు దత్తాత్రేయ ఇక్కడినుంచి విజయం సాధించగా.. ఈసారి బీజేపీ ఎంపీగా పోటీచేసిన పార్టీ సీనియర్‌నేత కిషన్ రెడ్డి స్పష్టమైన మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థి తలసాని సాయి కిరణ్ యాదవ్‌పై గెలుపొందారు. అయితే.. కరీంనగర్లో బీజేపీ పోటీ ఇస్తుందని భావించినా.. అనూహ్యంగా బండి సంజయ్ విజయం సాధించడంతో పార్టీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఆదిలాబాద్‌లో చివరి నిమిషంలో బీజేపీలో చేరి టికెట్ సంపాదించిన సోయం బాపూరావు కూడా స్పష్టమైన మెజారిటీతో గెలుపొందారు. -
చాలా సంతోషంగా ఉంది
-
ప్రజలు ఇచ్చిన ఈ తీర్పు చరిత్రాత్మకం
-
ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయం : వైఎస్ జగన్
సాక్షి, అమరావతి : ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టింస్తోంది. వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. లోక్‌సభ, అసెంబ్లీ ఫలితాల్లో ఫ్యాన్ హవా కొనసాగుతోంది. కాగా, ఎన్నికల ఫలితాలపై వైఎస్ జగన్ ఫేస్బుక్ పేజీలో స్పందించారు. 'వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించిన అశేష ప్రజానికానికి.. పెద్ద ఎత్తున ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య ఔన్నత్యాన్ని చాటి చెప్పిన యావత్ రాష్ట్ర ప్రజలకు ... హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.. రాష్ట్ర ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను' అని ఫేస్‌బుక్‌పేజీలో పోస్ట్ చేశారు. -
రాష్ట్రవ్యాప్తంగా వీచిన ఫ్యాన్ గాలి
-
జేడీఎస్‌తో కాంగ్రెస్ కటీఫ్ యోచన
సాక్షి, బెంగళూరు: జేడీఎస్‌తో మైత్రి వల్ల లాభం కంటే నష్టమే వచ్చిందని కాంగ్రెస్ అంతర్మథనంలో పడినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఎగ్జిట్ పోల్స్, నిఘా వర్గాలు వెల్లడించిన నేపథ్యంలో మైత్రిని వదులుకునేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. జేడీఎస్‌తో కలసి ఎన్నికల్లో పోటీ చేస్తే గత లోకసభ ఎన్నికల్లో కంటే కూడా అధిక స్థానాలు గెలుచుకుంటామని బరిలో దిగగా, ఈసారి అంతకంటే తక్కువ స్థానాలు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ చూసి హస్తవాసులు నిరాశలోకి కూరుకుపోయారు. జేడీఎస్‌తో పొత్తు వల్లే కాంగ్రెస్ బలం తగ్గిపోయిందని కొందరు నేతలు అనుమానిస్తున్నారు. పాత మైసూరు, కరావళి ప్రాంతాల్లో సంకీర్ణ కూటమి వల్ల కాంగ్రెస్ బలం బాగా తగ్గిపోయిందని పలువురు కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఎమ్మెల్యేలకు సిద్ధు నిర్దేశం ఎగ్జిట్ పోల్స్, నిఘా వర్గాల వివరాల మేరకు కాంగ్రెస్ పార్టీ గత సారి కంటే కూడా తక్కువ సీట్లు సాధించనుంది. దీంతో కొందరు సీనియర్ నేతలు దీనిపై విచారం వ్యక్తంచేసినట్లు సమచారం. స్వయంగా మాజీ సీఎం సి ద్ధరామయ్య కూడా తన అసంతృప్తిని కొందరు ఆప్తు ల వద్ద వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రస్తుత రాజకీ య అయోమయంలో కాంగ్రెస్‌పార్టీలోని అసంతృప్త ఎమ్మెల్యేలు తమ మార్గాన్ని తాము నిర్ధారించుకోవాలని సిద్ధరామయ్య సూచించినట్లు తెలుస్తోంది. పరోక్షంగా మైత్రి పక్షాన్ని వీడాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సిద్ధరామయ్య సూచించినట్లు తెలిసింది. ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ నిర్లిప్త ధోరణి మరోవైపు బీజేపీ గురువారం ఫలితాల తర్వాత పూర్తి స్థాయిలో ఆపరేషన్ కమలను నిర్వహించాలని పథకం వేస్తోంది. ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి రిసార్టు రాజకీయాలకు తెరలేపడం లేదు. ఉద్ధేశపూర్వకంగానే జేడీఎస్‌తో మైత్రికి తెగదెంపులు చేసుకోవాలని కాంగ్రెస్ యోచిస్తోంది. రెండు రోజుల క్రితం రమేశ్ జారకిహోళి ఢిల్లీ పర్యటనను కూడా కాంగ్రెస్ పార్టీ తేలిగ్గా తీసుకుంది. దీంతో ఉద్ధేశపూర్వకంగానే కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మైత్రి వల్ల పాత మైసూరులో కాంగ్రెస్ పార్టీ తన ఓటు బ్యాంకును కొద్దిగా కోల్పోవడం, కోలారు వంటి బలమైన మద్దతున్న చోట బీజేపీ గట్టి పోటీ ఇవ్వడం చూసి మైత్రి నుంచి బయటకు రాకపోతే భవిష్యత్తులో మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. -
ఆ ఇద్దరిలో ఎవరు గెలిచినా రికార్డే
కోలారు: లోక్‌సభ ఎన్నికల్లో అత్యంత కీలకమైన ఘట్టానికి నేడు తెరపడనుంది. కొద్ది గంటల్లో ప్రారంభం కానున్న ఓట్ల లెక్కింపు కోసం జిల్లా ప్రజలు యావత్తు కళ్లుకాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఈవీఎంల్లో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనుంది. కోలారు లోక్‌సభ బరిలో నిలిచిన 14 మందిలో విజేతలు ఎవరో..పరాజితులు ఎవరో గురువారం తేలనుంది. కోలారు నగరంలోని డిగ్రీ కళాశాలలో ఓట్ల లెక్కింపునకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. కోలారు లోక్‌సభ ఎన్నికల చరిత్రలోనే మొదటి సారిగా కాంగ్రెస్, బీజేపీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఫలితాలు ఎలా ఉంటాయోనని అభ్యర్థులైన కెహెచ్ మునియప్ప( కాంగ్రెస్), ఎస్.మునియప్ప(బీజేపీ)ల్లో గుండె దడ ప్రారంభమైంది. కాగా కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల్లో ఎవరు గెలిచినా సరికొత్త రికార్డు అవుతుంది. గెలుపుపై ఉభయ నేతల్లోనూ ధీమా లోక్‌సభ ఎన్నికల్లో విజయంపై కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు తమదే గెలుపని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 7 సార్లు నియోజవకవర్గం నుంచి పోటీ చేసి వరుస విజయాలు సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి కెహెచ్ మునియప్పకు ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మునిస్వామి నుంచి గట్టి పోటీ ఎదురైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కెహెచ్ మునియప్ప విజయం కోసం అపసోపాలు పడాల్సి వచ్చింది. కెహెచ్ మునియప్పకు టికెట్ ఇవ్వరాదని జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ వరకు వెళ్లి ప్రయత్నాలు చేశారు. అయితే అధిష్టానం ఆయన్నే ఎంపిక చేసింది. అనంతరం ఎన్నికల ప్రచారంలో కూడా కాంగ్రెస్ నాయకులు స్వంత పార్టీ తరఫున ప్రచారం చేయడానికి ముందుకు రాలేదు. ఇలా పార్టీలోని కుంపటి మునియప్ప విజయానికి అడ్డుపడుతుందని పలువురు అంచనా వేశారు. అయితే రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉండడం వల్ల జేడీఎస్‌కు చెందిన నాయకులు కొంతమంది కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ప్రచారం చేయడంతో మునియప్ప కొంతవరకు ఊపిరి పీల్చుకున్నారు. జిల్లాలో బీజేపీకి గట్టి పునాదులు లేవు. అయితే కాంగ్రెస్ పార్టీలో కెహెచ్ మునియప్పపై ఉన్న అసంతృప్తినే పెట్టుబడిగా చేసుకుని అసంతృప్త కాంగ్రెస్ నాయకుల సహకారంతో బీజేపీ అభ్యర్థి మునిస్వామి విజయం కోసం శతవిధాలుగా ప్రయత్నాలు చేశారు. ఈ ఎన్నికలలో విజయం తనదేనని మునిస్వామి ఆత్మ విశ్వాసంతో ఉన్నారు. ఎవరూ గెలిచినా రికార్డే ఈ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్,బీజేపీ అభ్యర్థుల్లో ఎవరూ విజయం సాధించినా అది రికార్డు అవుతుంది. కాంగ్రెస్ అభ్యర్థి మునియప్ప వరుసగా 7 సార్లు విజయం సాధించారు. ఆయన ఈ పర్యాయం గెలిస్తే భారీ రికార్డు అవుతుంది. ఎందుకంటే ఒక నియోజకవర్గంలో వరసగా 8 సార్లు విజయం సాధించిన వారు ఇంతవరకు ఎవరూ లేరు. అదేవిధంగా బీజేపీ అభ్యర్థి ఎస్. మునిస్వామి విజయం సాధించినా అది సరికొత్త రికార్డు అవుతుంది. కోలారు రిజర్వు లోక్‌సభ నియోజవకర్గంలో ఇంతవరకు బీజేపీ అభ్యర్థులు ఎవరూ విజయం సాధించలేదు. -
ఎగ్జిట్ ఫలితాలు చూసి ఆందోళన వద్దు
న్యూఢిల్లీ: ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూసి ఆందోళన చెందవద్దని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వచ్చేవరకు అప్రమత్తంగా ఉండాలని కార్యకర్తలకు సూచించారు. ‘రాబోయే 24 గంటలు మనకు చాలా కీలకం. అప్రమత్తంగా ఉండండి. ధైర్యాన్ని కోల్పోకండి. మనం సత్యం కోసం పోరాడుతున్నాం. తప్పుడు ఎగ్జిట్ ఫలితాలను చూసి నిరాశచెందకండి. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. మీ కష్టం ఎప్పటికీ వృథా కాదు’ అని బుధవారం ట్వీట్ చేశారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలు, వదంతులను చూసి నిరాశచెందవద్దని ఇటీవల ప్రియాంక గాంధీ కూడా పార్టీ కార్యకర్తలకు సూచించిన విషయం తెలిసిందే. -
వైఎస్‌జగన్‌కు ఘన స్వాగతం
సాక్షి, అమరావతి, గన్నవరం, సాక్షి హైదరాబాద్: ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో గుంటూరు జిల్లా తాడేపల్లిలోని స్వగృహానికి చేరుకున్న ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి బుధవారం గన్నవరం విమానాశ్రయంలో పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. గురువారం ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను తాడేపల్లిలోని తన నివాసం నుంచే ఆయన వీక్షించనున్నారు. జగన్ తన సతీమణి వైఎస్ భారతితో కలసి హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం 6.30 గంటలకు గన్నవరం చేరుకున్నారు. పార్టీ రాజకీయ ప్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా ఆయన వెంట ఉన్నారు. అనంతరం రోడ్డు మార్గాన తాడేపల్లి చేరుకున్న వారికి పార్టీ ఎంపీలు వి.విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఎదురేగి స్వాగతం పలికారు. జగన్ రాక సందర్భంగా తాడేపల్లిలోని నివాసం, పార్టీ కార్యాలయ పరిసరాలన్నీ సందడిగా మారాయి. పార్టీ కార్యకర్తలు, మీడియా ప్రతినిధుల కోలాహలం ఎక్కువగా కనిపించింది. జగన్ నివాస పరిసరాల్లో పోలీస్ భద్రతను పెంచడంతోపాటు అదనపు బలగాలను నియమించారు. ఎయిర్‌పోర్టుకు భారీగా నేతలు, కార్యకర్తల రాక విమానాశ్రయంలో స్వాగతం పలికినవారిలో వైఎస్సార్ సీపీ మచిలీపట్నం పార్లమెంటరీ అధ్యక్షుడు కొలుసు పార్ధసారధి, పార్టీ రాజకీయ సలహా కమిటీ సభ్యుడు డాక్టర్ దుట్టా రామచంద్రరావు, పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్యే దాసరి వెంకట బాలవర్దనరావు, డివై.దాసు, పార్టీ ఎంపీ అభ్యర్థులు పొట్లూరి వీరప్రసాద్, నందిగం సురేష్, రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థులు యార్లగడ్డ వెంకట్రావు, మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్, చంద్రగిరి యేసురత్నం, కైలే అనిల్‌కుమార్, బొప్పన భవకుమార్ తదితరులున్నారు. జగన్ రాక సందర్భంగా గన్నవరం ఎయిర్‌పోర్టుకు కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. వైఎస్ జగన్‌కు పటిష్ట భద్రత గుంటూరు జిల్లా తాడేపల్లిలో వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాసం వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలని ఏపీ పోలీసు శాఖ ఆదేశాలు జారీ చేసింది. జగన్ ‘జడ్’ కేటగిరీ భద్రతలో ఉన్నందున ఆ మేరకు పోలీసు సిబ్బందిని ఇవ్వాలని, ఆయన సంచారానికి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఏర్పాటు చేయాలని పేర్కొంది. జగన్ బుధవారం హైదరాబాద్‌లోని తన ఇంటి నుంచి బయల్దేరేటప్పుడు శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకూ ఈ భద్రతా ఏర్పాట్లు సమకూర్చాలని ఏపీ పోలీసు శాఖకు చెందిన అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు(ఇంటెలిజెన్స్) ఈ నెల 21న ఒక సందేశాన్ని తెలంగాణ పోలీసులకు పంపగా, వారు ఆ మేరకు భద్రతా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి తాడేపల్లి నివాసానికి జగన్ చేరుకున్నపుడు, ఆ తరువాత కూడా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సమాచారం కోసం ఈ సందేశాన్ని ఏపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుకు కూడా పంపారు. -
వైఎస్సార్సీపీలో విజయోత్సాహం
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం తథ్యమని ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో తేటతెల్లం కావడంతో పార్టీ అభ్యర్థులు, నేతలు, కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో ఓట్ల లెక్కింపు కోసం సన్నద్ధమయ్యారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను(ఈవీఎం) నిందిస్తూ నానా యాగీ చేయడంతో పాటు కౌంటింగ్ ప్రక్రియను వీలైనంతగా వివాదాస్పదం చేసి, గొడవలకు దిగాలని తెలుగుదేశం పార్టీ నాయకులు కుట్ర పన్నిన నేపథ్యంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని తమ ఏజెంట్లు, నాయకులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సూచించింది. ప్రతి రౌండ్ ఫలితం లెక్కింపు జరిగేటప్పుడు, ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద ఎట్టి పరిస్థితుల్లోనూ ఏమరుపాటుకు గురి కాకుండా ఎప్పటికప్పుడు పరిస్థితులను గమనిస్తూ ఉండాలని సూచనలు జారీ చేసింది. కల నెరవేరబోతోంది రాష్ట్రంలో నెలన్నర రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు గురువారం తెరపడనుంది. ఐదేళ్లుగా అధికార తెలుగుదేశం పార్టీ కుట్రలు, కుతంత్రాలను ఛేదించుకుంటూ తెగించి పోరాడిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు కౌంటింగ్‌లో సానుకూల ఫలితాలు రాబోతున్నాయని సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారు. విజయం పట్ల పార్టీలోని అన్నిస్థాయిల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలన్న తమ కల నెరవేరబోతోందని వైఎస్సార్సీపీ నేతలు చెబుతున్నారు. ఓట్ల కౌంటింగ్ కేంద్రాల్లో వైఎస్సార్సీపీ ఏజెంట్లుగా మెరికల్లాంటి కార్యకర్తలను ఎంపిక చేసి నియమించారు. ఈ నెల 16వ తేదీన విజయవాడలో వారికి నిపుణులతో శిక్షణ కూడా ఇప్పించారు. కేంద్రాల వద్ద అల్లర్లు జరగకుండా ఎన్నికల సంఘం ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినప్పటికీ తగిన జాగ్రత్తల్లో ఉండాలని కౌంటింగ్ ఏజెంట్లకు సూచించారు. ప్రత్యర్థి పార్టీల ఏజెంట్లలో ఎవరైనా నేర చరితులు, గొడవలు సృష్టించే వారు ఉన్నట్లయితే ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా జరిగేలా చూసుకోవాల్సిన బాధ్యత వైఎస్సార్సీపీ ఏజెంట్లపై ఉందని, ఏవైనా అభ్యంతరాలుంటే కౌంటింగ్ సూపర్వైజర్లకు, రిటర్నింగ్ అధికారులకు లిఖితపూర్వకంగా తెలియజేయాలని, అవి వారికి అందినట్లు ధ్రువీకరణలు తీసుకోవాలని చెప్పారు. ఓట్ల లెక్కింపుపై సీనియర్ నేతల సమీక్ష పోలింగ్ ముగిశాక ఈవీఎంలపై తెలుగుదేశం పార్టీ చేస్తున్న యాగీ, ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఆ పార్టీ వ్యవహరిస్తున్న తీరు చూశాక రాష్ట్రంలో అవాంఛనీయ ఘటనలు జరగబోతున్నాయన్న అనుమానాలు ప్రజల్లో రోజురోజుకూ బాగా బలపడుతున్నాయి. టీడీపీ పన్నాగాలను పసిగట్టిన వైఎస్సార్సీపీ నేతలు వెంటనే అప్రమత్తమయ్యారు. ఆయా జిల్లాల నాయకులు, కీలక స్థానాల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ తగిన సూచనలు జారీ చేస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి కూడా నేతలు, అభ్యర్థులతో మాట్లాడారు. టీడీపీ కుట్రల పట్ల జాగరూకత వహించాలని ఉద్బోధించారు. పార్టీ సీనియర్ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వి.విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఇతర నేతలు కంతేటి సత్యనారాయణరాజు, నార్నె శ్రీనివాసరావుతో సహా పలువురు నాయకులు తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కార్యాలయానికి చేరుకుని, ఓట్ల లెక్కింపుపై సమీక్షించారు. విజయసాయిరెడ్డి పలు కౌంటింగ్ కేంద్రాలను సందర్శించారు. అక్కడి ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. -
కౌంటింగ్‌ను వివాదాస్పదం చేయండి
సాక్షి, అమరావతి: ఓటమి భయంతో ఓట్ల లెక్కింపును వివాదాస్పదం చేసేందుకు టీడీపీ అడ్డదారులు అన్వేషిస్తోంది. కౌంటింగ్ సమయంలో అల్లర్లు సృష్టించేందుకు టీడీపీ సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం. టీడీపీ రాష్ట్ర నేతల నుంచి జిల్లాల్లో ముఖ్య నాయకులు, క్యాడర్‌కు ఈ మేరకు స్పష్టమైన సూచనలు అందాయి. టీడీపీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు ఇప్పటికే ఈవీఎంలతోపాటు ఎన్నికల సంఘంపై అడ్డగోలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే కౌంటింగ్ సందర్భంగా అల్లర్లు రేకెత్తించి వైఎస్సార్ సీపీపై నిందలు వేయాలని ఇప్పటికే టీడీపీ రాష్ట్ర కార్యాలయం నుంచి క్యాడర్‌కు ఆదేశాలు వెలువడ్డాయి. తమకు ప్రతికూల ఫలితాలు వచ్చే కౌంటింగ్ సెంటర్ల వద్ద ఘర్షణలకు దిగాలని సూచించారు. ఏదో ఒక నెపంతో కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్లు గందరగోళం సృష్టించాలని, ఎన్నికల అధికారులతో వాగ్వాదానికి దిగాలని ఆదేశించినట్లు తెలిసింది. అలాంటి వైఖరి ఉన్నవారినే టీడీపీ కౌంటింగ్ ఏజెంట్లుగా నియమించాలని అగ్ర నాయకత్వం ఆదేశించడం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. ఘర్షణకు దిగటంపై శిక్షణ టీడీపీ ఓడిపోయిన ప్రతి చోటా రీకౌంటింగ్‌కు పట్టుబట్టి ఒత్తిడి తేవాలని ఆదేశించారు. అన్ని వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించాల్సిందిగా పట్టుబట్టాలని సూచిస్తున్నారు. కౌంటింగ్ సమయంలో ఎలా గొడవ చేయాలనే అంశంపై ఇప్పటికే టీడీపీ ఏజెంట్లకు శిక్షణ ఇచ్చి ఓ బుక్‌లెట్‌ను సైతం పంపిణీ చేశారు. ఫిర్యాదులపై రెండు నమూనా పత్రాలను తయారు చేసి ముఖ్య నాయకులకు పంపారు. వీటి ఆధారంగా కౌంటింగ్‌లో గొడవలకు దిగాలనేది టీడీపీ ముఖ్య నాయకుల పథకంగా కనిపిస్తోంది. వంద శాతం వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించాలనే డిమాండ్‌ను తెరపైకి తెచ్చి ఘర్షణకు దిగాలనేది వారి వ్యూహంగా చెబుతున్నారు. ఈవీఎంలపై నెంబర్లు కనపడటం లేదని, అధికారులు పారదర్శకంగా వ్యవహరించడం లేదంటూ ఫిర్యాదులు చేసి ఫలితాల్లో జాప్యం జరిగేలా చూడాలని సూచిస్తున్నారు. మరోవైపు సీఎం చంద్రబాబు బుధవారం ఉండవల్లిలోని తన నివాసంలో అందుబాటులో ఉన్న నాయకులతో కౌంటింగ్‌పై చర్చించారు. పార్టీ అభ్యర్థులు, ముఖ్య నాయకులు, ఏజెంట్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి కౌంటింగ్ సందర్భంగా ఏం చేయాలనే దానిపై పలు సూచనలు చేశారు. -
తొలి ఫలితం నరసాపురం, మదనపల్లి
సాక్షి, అమరావతి: ఓట్ల లెక్కింపులో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, చిత్తూరు జిల్లా మదనపల్లి నియోజకవర్గాల అభ్యర్థుల భవితవ్యం అందరికంటే ముందుగా తేలిపోనుంది. ఈ రెండు నియోజకవర్గాల్లో 13 రౌండ్లలోనే ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది. కర్నూలు నియోజకవర్గంలో అత్యధికంగా 33 రౌండ్లు పూర్తి చేయాల్సి ఉన్నందున ఫలితం చివరన వెలువడే అవకాశముంది. పులివెందుల, నందిగామ, ఆళ్లగడ్డ, పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు 30 రౌండ్లకుపైగా పట్టే అవకాశం కనిపిస్తోంది. జిల్లాల్లో చిత్తూరు ఫలితం ముందుగా.. సాధారణంగా కౌంటింగ్ హాళ్లలో ప్రతి నియోజకవర్గానికి 14 టేబుళ్లను ఏర్పాటు చేస్తారు. ఈసారి ఓట్ల లెక్కింపు త్వరగా పూర్తి చేసేందుకు కౌంటింగ్ హాళ్లను బట్టి టేబుళ్ల సంఖ్యను పెంచుకోవడానికి ఎన్నికల సంఘం అనుమతించింది. చిత్తూరు జిల్లాలో కొన్నిచోట్ల 16 నుంచి 20 వరకు టేబుళ్లను ఏర్పాటు చేశారు. దీంతో అన్నిటి కంటే ముందుగా చిత్తూరు జిల్లా ఫలితాలు వెలువడే అవకాశముంది. మదనపల్లి, పుంగనూరు, చంద్రగిరి, తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గాల్లో 20 టేబుళ్లను సిద్ధం చేయడంతో ఫలితాలు వేగంగా వెలువడనున్నాయి. కృష్ణా జిల్లా నందిగామలో అత్యల్పంగా 7 టేబుళ్లను ఏర్పాటు చేశారు. చాలా నియోజకవర్గాల్లో 18 నుంచి 24 రౌండ్లలో లెక్కింపు పూర్తి కానుంది. ఇలా తెలుసుకోవచ్చు.. ఎన్నికల సరళి, ఫలితాలను ఎప్పటికప్పుడు తెలియచేసేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఒక రౌండు లెక్కింపు పూర్తి కాగానే ఫలితాలను కౌంటింగ్ కేంద్రం వద్ద మైక్‌లో వెల్లడించడంతోపాటు మీడియా ప్రతినిధులకు కనిపించేలా డిస్ప్లే బోర్డులను ఏర్పాటు చేశారు. ప్రతి రౌండు ఫలితాలను ‘సువిధ’ యాప్‌లో కూడా అప్లోడ్ చేయనున్నారు. దేశవ్యాప్తంగా ఫలితాలను తెలుసుకునేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను, యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. https:// results. eci. gov. in వెబ్సైట్ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు. ‘ఓటర్స్ హెల్ప్ లైన్’ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా కూడా ఫలితాల సరళిని తెలుసుకోవచ్చు. -
తుపాకుల నీడలో కౌంటింగ్
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు శాఖ అప్రమత్తమైంది. నరాలు తెగే ఉత్కంఠను రేపుతున్న ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పోలీసు వలయంలో నిర్వహించేలా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అదనపు పోలీసు బలగాలను రంగంలోకి దించారు. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఏప్రిల్ 11న ఎన్నికల రోజున రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలు జరిగిన సంగతి తెలిసిందే. ఎన్నికల అనంతరం కూడా టీడీపీ వర్గీయులు మునుపెన్నడూ లేని రీతిలో గ్రామాలపై దాడులు కొనసాగించారు. రీపోలింగ్‌ను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాద్ధాంతం చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. మరోవైపు ఈవీఎంలు, వీవీ ప్యాట్ల విషయంలో ఎన్నికల సంఘాన్ని తప్పుపడుతూ గల్లీ నుంచి ఢిల్లీ దాకా చంద్రబాబు నానా యాగీ చేశారు. తమ నాయకుడి దారిలోనే టీడీపీ శ్రేణులు మరింత దూకుడుగా వ్యవహరించాయి. పార్టీ కార్యకర్తలు, నాయకులతో నిర్వహించిన సమావేశాలు, టెలికాన్ఫరెన్స్‌ల్లో చంద్రబాబు హింసను ప్రేరేపించే వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా జాతీయ, ప్రాంతీయ సర్వే సంస్థలు, మీడియా చానళ్లు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని స్పష్టం కావడంతో టీడీపీ శ్రేణుల్లో ఉక్రోశం కట్టలు తెంచుకుంది. ఈ నేపథ్యంలోనే కౌంటింగ్ సమయంలో వివాదాలు చెలరేగే అవకాశం ఉందని నిఘా వర్గాలు గుర్తించాయి. అల్లర్లు, ఘర్షణలు చోటుచేసుకోకుండా రాష్ట్ర పోలీసు యంత్రాంగం పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టింది. కేంద్ర హోంశాఖ హెచ్చరిక కౌంటింగ్ సందర్బంగా రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం ఉందని కేంద్ర హోంశాఖతో పాటు నిఘా వర్గాలు కూడా బుధవారం హెచ్చరించాయి. అల్లర్లు, ఘర్షణలు జరగకుండా ముందస్తుగా భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేలా మొత్తం 25,224 మంది పోలీసు సిబ్బంది విధులు నిర్వహిస్తారని డీజీపీ ఇప్పటికే ప్రకటించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద నాలుగంచెల భద్రత కల్పిస్తున్నారు. సీసీ కెమెరాలు, బాడీ వోర్న్ కెమెరాలు, డ్రోన్లు, కమ్యూనికేషన్ పరికరాలను వినియోగిస్తున్నారు. వాటిని రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయం, జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయాలకు అనుసంధానిస్తున్నారు. ర్యాలీలు.. గుంపులపై నిషేధాజ్ఞలు ఓట్ల లెక్కింపు కేంద్రాలతోపాటు రాష్ట్రంలోని అన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో సీఆర్పీసీ 144, పోలీస్ యాక్ట్ 30 సెక్షన్లు అమల్లోకి తెచ్చారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడం, గుంపులు గుంపులుగా జనం ఒక చోట గుమికూడడం, మైక్‌లు వాడటాన్ని నిషేధించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. కౌంటింగ్ సెంటర్‌కు కిలోమీటర్ దూరం వరకూ నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయి. ముందస్తు చర్యల్లో భాగంగా అనుమానిత వ్యక్తులు, అల్లర్లు సృష్టిస్తారనుకునే వారిని పోలీసులు బైండోవర్ చేశారు. రౌడీషీటర్లు, అనుమానితులను పోలీసు కస్టడీలోకి తీసుకుంటున్నారు. కౌంటింగ్ సందర్భంగా ఈ నెల 22వ తేదీ రాత్రి నుంచి 24వ తేదీ ఉదయం వరకూ రాష్ట్రంలోని బార్ అండ్ రెస్టారెంట్లు, మద్యం దుకాణాలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబు, వైఎస్ జగన్ నివాసాల వద్ద బందోబస్తు సీఎం చంద్రబాబు, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాసాల వద్ద పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ అనంతరం చంద్రబాబు, జగన్ నివాసాల వద్దకు పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు చేరుకునే అవకాశం ఉన్నందున పోలీసులు భద్రతను పెంచారు. ఇరువురు నేతల నివాసాల వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తు ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) ఎల్వీ సుబ్రహ్మణ్యం బుధవారం సమీక్షించారు. -
కొత్త ఎంపీలకు హోటల్ బస ఉండదు
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడనున్న వేళ లోక్‌సభ సెక్రటేరియట్ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా పార్లమెంటుకు ఎన్నికైన సభ్యులకు ఇకపై హోటళ్లలో తాత్కాలిక బసను కల్పించబోమని తెలిపింది. వెస్ట్రన్ కోర్టు, దానికి అనుబంధంగా నిర్మించిన నూతన భవనంతో పాటు స్టేట్ భవన్స్‌లో బసను ఏర్పాటుచేస్తామని చెప్పింది. ‘కొత్త ఎంపీలకు హోటళ్లలో బస కల్పించే సంప్రదాయానికి ముగింపు పలికాం’ అని లోక్‌సభ ప్రధాన కార్యదర్శి స్నేహలత శ్రీవాస్తవ ఢిల్లీలో మీడియాతో చెప్పారు. గతంలో హోటల్ బసల కారణంగా ప్రభుత్వ ఖజానాపై అనవసరమైన భారం పడుతోందన్న విమర్శలు గతంలో వచ్చాయి. 2014 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా 300 మందికిపైగా ఎంపీలు కొత్తగా ఎన్నికయ్యారు. అయితే అప్పటివరకూ ఎంపీలుగా కొనసాగిన నేతలు అధికారిక నివాసాలను ఖాళీ చేయకపోవడంతో, నూతన ఎంపీలకు లోక్‌సభ కార్యాలయం హోటళ్లలో బసను ఏర్పాటుచేసింది. దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై రూ.30 కోట్ల భారం పడింది. దీంతో విమర్శలు ఎదురుకావడంతో వెస్ట్రన్ కోర్టులో 88 బ్లాకులున్న భవనాన్ని నిర్మించారు. -
ఈసీ అనుమతి తర్వాతే తుది ఫలితం
సాక్షి, అమరావతి: రౌండ్ల వారీగా ఫలితాల ప్రకటనకు ఎన్నికల సంఘం(ఈసీ) అనుమతి అవసరం లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో) గోపాలకృష్ణ ద్వివేది చెప్పారు. కానీ, తుది ఫలితాన్ని మాత్రం ఈసీ అనుమతి తర్వాతే ప్రకటించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా, పూర్తి పారదర్శకంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియను పూర్తి చేయడానికి అన్ని చర్యలు చేపట్టామని వెల్లడించారు. 36 కేంద్రాల్లో 350 కౌంటింగ్ హాళ్లలో 25,000 మందికి పైగా సిబ్బంది ఓట్ల లెక్కింపులో పాల్గొంటున్నట్లు తెలిపారు. ఆయన బుధవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. రాజకీయంగా చాలా సున్నితమైన రాష్ట్రం కావడంతో ఏపీకి కేంద్రం 10 కంపెనీల అదనపు బలగాలను పంపిస్తోందని అన్నారు. ఇప్పటికే రాష్ట్రానికి 45 కంపెనీల కేంద్ర బలగాలు వచ్చాయని పేర్కొన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశామన్నారు. కౌంటింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరం నుంచి ఎలాంటి వాహనాలను అనుమతించేది లేదన్నారు. రాష్ట్రంలో మొత్తం 3.05 లక్షల పోస్టల్ బ్యాలెట్లు జారీ చేయగా, 21వ తేదీ నాటికి 2.62 లక్షలు ఆర్వోలకు చేరాయని, అలాగే 60,250 సర్వీసు ఓటర్లకు గాను 30,760 ఓట్లు చేరినట్లు తెలిపారు. గతంతో పోలిస్తే ఈసారి పోస్టల్ బ్యాలెట్లు భారీగా ఉండటంతో వీటి లెక్కింపు కోసం ప్రత్యేకంగా అదనపు టేబుళ్లను ఏర్పాటు చేశామన్నారు. రాజకీయ పార్టీలు సహకరించాలి ‘‘ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు మొదలవుతుంది. ఆ తర్వాత 8.30 గంటల నుంచి ఈవీఎంల లెక్కింపు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం కల్లా ఫలితాల ట్రెండ్‌పై ఒక స్పష్టత వస్తుంది. రాత్రికల్లా అధికారికంగా ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది. ఓట్ల లెక్కింపులో పాటించాల్సిన నిబంధనలు, విధివిధానాలపై సిబ్బందికి పూర్తిస్థాయిలో శిక్షణ ఇచ్చాం. ఈవీఎంలో తలెత్తే సాంకేతిక సమస్యలను పరిష్కరించడానికి ప్రతి నియోజకవర్గానికి ఇద్దరు చొప్పున సాంకేతిక నిపుణులను అందుబాటులో ఉంచాం. కౌంటింగ్ సెంటర్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. ప్రతి టేబుల్ వద్ద ఒక సూపర్వైజర్, ఇద్దరు సహాయకులు, ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు. ఓట్ల లెక్కింపు విషయంలో పుకార్లు, వదంతులను నమ్మొద్దు. రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసే విధంగా సహకరించాలని రాజకీయ పార్టీలను కోరుతున్నాం. కొన్నిచోట్ల నేరచరిత్ర ఉన్న వారిని కౌంటింగ్ ఏజెంట్లుగా నియమించినట్లు ఫిర్యాదులు అందాయి. వీటిని పరిశీలించి, నేర చరిత్ర ఉన్న వారిని తొలగించాల్సిందిగా కలెక్టర్లకు ఆదేశాలను జారీ చేశాం. నేర చరిత్ర ఉన్న వారిని ఏజెంట్లుగా చివరి నిమిషంలో కూడా తిరస్కరించే అధికారం ఎన్నికల సంఘానికి ఉంది. ఈ విషయం దృష్టిలో పెట్టుకొని రాజకీయ పార్టీలు ఎలాంటి ఆరోపణలు లేని, క్రమశిక్షణ కలిగిన వ్యక్తులను ఏజెంట్లుగా నియమించుకోవాలి’’ అని ద్వివేది సూచించారు. ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించం ‘‘కౌంటింగ్ ఏజెంట్లు లెక్కింపు కేంద్రాల్లోకి వారితో పాటు తీసుకెళ్లే వస్తువులను నిర్ధారిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోకి ఏజెంట్లు కేవలం పెన్ను/పెన్సిల్, తెల్ల కాగితాలు/నోట్ ప్యాడ్, ఫారం–17సీ, పోలింగ్ ముగిసిన తర్వాత సంబంధిత పోలింగ్ కేంద్రానికి చెందిన ప్రిసైడింగ్ అధికారి జారీ చేసిన డూప్లికేట్ కాపీలను తీసుకెళ్లాలి. ప్రిసైడింగ్ అధికారి జారీ చేసిన ఫారం–17సీని కౌంటింగ్ హాల్లో ఓట్ల లెక్కింపు సమయంలో ఉపయోగపడేలా, సరి చూసుకొనేందుకు అనుమతిస్తాం. సెల్‌ఫోన్‌తో సహా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి అనుమతించే ప్రసక్తే లేదు’’ అని గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. -
కర్ణాటక సంకీర్ణంలో టెన్షన్.. టెన్షన్
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో సీఎం కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్–కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఏడాది ముచ్చటే కానుందా? సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే కర్ణాటకలో బీజేపీ ‘ఆపరేషన్ కమల’ను ప్రారంభించనుందా? అంటే రాజకీయ విశ్లేషకులు అవుననే సంకేతాలు ఇస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్‌లో అంచనా వేసినట్లు మొత్తం 28 లోక్‌సభ సీట్లలో బీజేపీ 18 నుంచి 25 స్థానాలు దక్కించుకుంటే కర్ణాటకలో కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వం కూలిపోతుందని వ్యాఖ్యానిస్తున్నారు. ఇందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని చెప్పారు. 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీకి గతేడాది జరిగిన ఎన్నికల్లో బీజేపీ 104 మంది ఎమ్మెల్యేలతో అతిపెద్ద పార్టీగా అవతరించగా, కాంగ్రెస్(77), జేడీఎస్(37) పార్టీలు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అయితే యడ్యూరప్ప ప్రభుత్వం అసెంబ్లీలో 111 మంది సభ్యుల మద్దతు ఉన్నట్లు బలనిరూపణ చేసుకోలేకపోయింది. దీంతో ఓ బీఎస్పీ ఎమ్మెల్యే, మరో స్వతంత్ర అభ్యర్థి మద్దతుతో జేడీఎస్–కాంగ్రెస్ పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాయి. సొంత గూటిలో అసమ్మతి సెగలు కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవులు దక్కని అసమ్మతి నేతలను బీజేపీ లక్ష్యంగా చేసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. శుక్రవారం తెల్లవారేసరికి కుమారస్వామి ప్రభుత్వం కూలిపోతుందని కేంద్ర మంత్రి సదానంద గౌడ జోస్యం చెప్పారు. కర్ణాటకలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు అన్నీ సిద్ధమయ్యాయని వ్యాఖ్యానించారు. మరోవైపు ఇందుకు తగ్గట్లు కాంగ్రెస్‌లోనూ అసమ్మతి స్వరాలు పెరుగుతున్నాయి. కేపీసీసీ చీఫ్ గుండూరావు ఫ్లాప్ షో అనీ, సిద్దరామయ్య ఓ మూర్ఖుడనీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఓ బఫూన్ అని ఆ పార్టీ సీనియర్ నేత రోషన్ బేగ్ విరుచుకుపడ్డారు. వీరివల్ల కర్ణాటకలో కాంగ్రెస్ భ్రష్టుపట్టిపోయిందని ఘాటుగా విమర్శించారు. మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే కె.సుధాకర్ స్పందిస్తూ ఈవీఎంలపై పార్టీ హైకమాండ్ పోరాటాన్నే తప్పుపట్టారు. కర్ణాటకలో సంకీర్ణ కూటమి బీటలు వారుతోందని చెప్పేందుకు ఇవన్నీ సాక్ష్యాలేనని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. రమేశ్ ఆధ్వర్యంలో ‘ఆపరేషన్ కమల’.. కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యే రమేశ్ జర్కిహోలీ ‘ఆపరేషన్ కమల’లో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో ఢిల్లీలో సమావేశమైన రమేశ్, కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు అమలుచేయాల్సిన వ్యూహంపై చర్చించినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఈ క్రమంలోనే తనతో పాటు మహేశ్ కుమతిహళ్లి, భీమా నాయక్, జేఎన్ గణేశ్ సహా 22 మంది అసంతృప్త కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని ఆయన షాకు వివరించినట్లు సమాచారం. గెలిచినఎంపీలతో మే 24న సమావేశం కావాలని యడ్యూరప్ప నిర్ణయించారు. మా ప్రభుత్వమే కొనసాగుతుంది: సీఎం కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం కూలిపోతుందన్న వాదనల్ని సీఎం కుమారస్వామి తోసిపుచ్చారు. తన ప్రభుత్వం మిగిలిన నాలుగేళ్ల కాలాన్ని విజయవంతంగా పూర్తిచేసుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. -
ఒకరికొకరు టచ్‌లో విపక్ష నేతలు
న్యూఢిల్లీ: ఒకవేళ ఎన్డీయేకి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ రానిపక్షంలో, వెంటనే స్పందించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేందుకు వీలుగా ప్రతిపక్ష పార్టీల అగ్రనేతలు ఒకరితో మరొకరు టచ్‌లో ఉండనున్నారు. విపక్షాలన్నిటినీ ఒకతాటిపైకి తెచ్చేందుకు వీలుగా నిరంతర సంప్రదింపుల్లో ఉండాలని ఎన్డీయేతర పార్టీల నేతలు నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. ఈ వర్గాల కథనం ప్రకారం.. ఎన్డీయేకి మెజారిటీ రాని పక్షంలో తమను ఒక సముదాయం (బ్లాక్)గా పేర్కొంటూ విపక్షాలు రాష్ట్రపతికి ఒక లేఖ రాస్తాయి. ఏకైక అతిపెద్ద పార్టీ విషయంలో తమకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా కోరతాయి. ఈ మేరకు విపక్ష పార్టీలు ఇప్పటికే పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించాయి. ఎన్నికల బరిలో 724 మంది మహిళలు సార్వత్రిక ఎన్నికల బరిలో 8,049 మంది అభ్యర్థులు ఉండగా, వీరిలో 724 మంది మహిళలు ఉన్నట్లు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ సంస్థలు తెలిపాయి. 17వ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధికంగా 54 మంది మహిళా అభ్యర్థులను బరిలోకి దించగా, బీజేపీ 53 మందితో రెండో స్థానంలో నిలిచింది. బీఎస్పీ 24 మంది మహిళా అభ్యర్థులతో మూడో స్థానంలో ఉంది. 222 మంది మహిళలు స్వతంత్రులుగా బరిలో నిలిచారు. -
నేడే ప్రజా తీర్పు
సాక్షి, అమరావతి: టెన్షన్.. టెన్షన్.. టెన్షన్..41 రోజుల టెన్షన్‌కు నేటితో తెర పడనుంది. ఓటరు దేవుళ్ల తీర్పు వెల్లడికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఎన్నికల ఫలితాలపై నెలకొన్న ఉత్కంఠ మరికొద్ది గంటల్లోనే వీడనుంది. గురువారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లను, తరువాత సర్వీసు ఓట్లను లెక్కిస్తారు. 8.30 గంటల నుంచి ఈవీఎంల్లో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఎగ్జిట్ పోల్స్ ద్వారా ప్రజా తీర్పు ఎలా ఉండనుందో ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు వెలువడటం తెలిసిందే. ఏప్రిల్ 11వ తేదీన రాష్ట్ర అసెంబ్లీకి, లోక్‌సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించినా దేశవ్యాప్తంగా ఏడు విడతల ఎన్నికలు పూర్తి కావాల్సి ఉండటంతో ఫలితాల కోసం ఈ దఫా ఏకంగా 41 రోజులు ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. పోలింగ్‌కు, కౌంటింగ్‌కు మధ్య గతంలో ఎప్పుడూ ఇన్ని రోజుల వ్యవధి లేకపోవడంతో అందరిలోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. జగన్‌కే పట్టం గట్టిన ఎగ్జిట్ పోల్స్ ఆదివారం వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌కే జై కొట్టాయి. దీంతో గురువారం వెలువడే ఫలితాలు ఎలా ఉంటాయో అంతా ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారు. పోలింగ్‌కు ముందు, పోలింగ్ రోజుతో పాటు తరువాత నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నీ వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం ఖాయమని తేల్చి చెప్పాయి. లగడపాటి చిలక జోస్యాన్ని నమ్ముకున్న టీడీపీ ఊహలకు నేటి మధ్యాహ్నంతో తెరపడనుంది. అసెంబ్లీ ఎన్నికల బరిలో 2,118 మంది రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికల్లో 2,118 మంది అభ్యర్ధులు పోటీ పడ్డారు. 25 ఎంపీ సీట్లకు 319 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు. వైఎస్సార్ సీపీ ఎవరితోనూ పొత్తులు లేకుండా ఒంటరిగా అన్ని సీట్లకు పోటీ చేసింది. టీడీపీ లోపాయికారీ పొత్తులతో కాంగ్రెస్, జనసేనలతో ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించింది. చివరిలో వీవీ ప్యాట్ స్లిప్‌ల లెక్కింపు నేడు మధ్యాహ్నం 12 గంటల కల్లా ఫలితాల సరళి వెల్లడి కానుండటంతో ఏ పార్టీ అధికారం దక్కించుకుంటుందో స్పష్టం కానుంది. ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు పూర్తి అయినప్పటికీ ప్రతి నియోజకవర్గంలో ఐదు చొప్పున వీవీ ప్యాట్ స్లిప్‌లను కూడా చివరిలో లెక్కించనున్నారు. ఇందుకు కొంత సమయం పడుతుంది. దీంతో అధికారికంగా ఫలితాల ప్రకటనలో జాప్యం కానుంది. అయితే ఈవీఎంల ఓట్ల లెక్కింపు ముగియగానే విజేత ఎవరనేది దాదాపుగా తేలిపోనుంది. -
వీవీప్యాట్ లెక్కింపు చివర్లోనే
న్యూఢిల్లీ: ఎంపిక చేసిన ఐదు పోలింగ్ కేంద్రాలలో ఈవీఎం ఓట్ల లెక్కింపునకు ముందే వీవీప్యాట్ చీటీల లెక్కింపు జరపాలన్న 22 విపక్ష పార్టీల డిమాండ్‌ను ఎన్నికల కమిషన్ తిరస్కరించింది. ఇది ఆచరణ సాధ్యం కాదని తెలిపింది. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. విపక్ష పార్టీలకు చెందిన ప్రతినిధుల బృందం మంగళవారం ఈసీని కలసి ఈ మేరకు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై మంగళ, బుధవారాల్లో రెండు దఫాలుగా లోతుగా చర్చించామని, మొత్తం మీద, ముఖ్యంగా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఇది ఆచరణ సాధ్యం కాదని, విపక్షాల డిమాండ్‌కు అంగీకరించే అవకాశం లేదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిపింది. కాగా రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులతో పాటే అభ్యర్థుల కౌంటింగ్ ఏజెంట్లను కూడా అనుమతించే అంశంపై ఇప్పటికే తగిన ఆదేశాలిచ్చినట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. ఈవీఎంలకు సంబంధించి ఇప్పటికే అమల్లో ఉన్న మార్గదర్శకాలను అనుసరించి నడుచుకోవాల్సిందిగా ఏప్రిల్ 8 నాటి తీర్పులో ఈసీని సుప్రీం ఆదేశించింది. ఈవీఎం ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత చివర్లో వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాలని ఆ మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి. పూర్తిగా బలహీన కమిషన్ : కాంగ్రెస్ ఈసీ నిర్ణయంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. పూర్తి బలహీన కమిషన్‌గా ఈసీని కాంగ్రెస్ అభివర్ణించింది. ఈసీ ఈవీఎంలను బీజేపీకి విజయాన్ని చేకూర్చే ‘ఎలక్ట్రానిక్ విక్టరీ మిషన్లు’గా ఏమన్నా మార్చిందా అంటూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ ప్రశ్నించారు. అలాగే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎన్నికల నియమావళి)ను ‘మోదీస్ క్యాంపెయిన్ కోడ్’గా (మోదీ ప్రచార నియమావళి) మార్చారా? అంటూ నిలదీశారు. ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షాల ఒత్తిళ్లకు ఈసీ లొంగిపోయిందని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యానికి చీకటి దినమని అన్నారు. ఎన్నికల కమిషన్ ఈ విధంగా వ్యవహరించడం విచారకరం, దురదృష్టమని పేర్కొన్నారు. ఈసీ నిర్ణయం సుప్రీంకోర్టు ఉత్తర్వుల స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి విమర్శించారు. శాంపిల్‌ను తొలుత పరీక్షించాలన్న ప్రాథమిక సూత్రానికి ఈసీ ఎందుకు కట్టుబడటం లేదో అర్ధం కావడం లేదని ఆయన అన్నారు. డీఎంకే సైతం ఈసీ నిర్ణయాన్ని తప్పుబట్టింది. ఎన్నికల కమిషన్ కేవలం ప్రదాని మోదీ మాటే వింటుందా? అని ఆ పార్టీ సీనియర్ నేత దొరైమురుగన్ ప్రశ్నించారు. విపక్షాల వినతి రాజ్యాంగ విరుద్ధం: అమిత్ వీవీ ప్యాట్లను తొలుత లెక్కించాలన్న విపక్షాల వినతి రాజ్యాంగ విరుద్ధమని అమిత్ షా అన్నారు. ఆరో విడత ఎన్నికల తర్వాతే విపక్షాలు ఈవీఎంలకు వ్యతిరేకంగా మాట్లాడటం మొదలుపెట్టాయని, ఎగ్జిట్ పోల్స్ తర్వాత దాన్ని మరింత తీవ్రం చేశాయని విమర్శించారు. ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా ఈవీఎంల విశ్వసనీయతను ఎలా ప్రశ్నిస్తారని బుధవారం నాటి ట్వీట్లలో ఆయన ప్రశ్నించారు. మూడు వ్యాజ్యాలను (పిల్స్) విచారించిన తర్వాతే ఎన్నికల ప్రక్రియకు సుప్రీంకోర్టు తుదిరూపునిచ్చిందని అమిత్ షా చెప్పారు. వీవీప్యాట్లపై విపక్షాల అసహనం ఎన్నికల్లో వారి ఓటమికి సంకేతంగా కేంద్ర మంత్రి, బీజేపీ మిత్రపక్ష నేత రాంవిలాస్ పాశ్వాన్ చెప్పారు. -
అల్లర్లకు టీడీపీ కుట్ర
సాక్షి, అమరావతి: అధికారాంతమున తెలుగుదేశం పార్టీ బరి తెగిస్తోంది. ఓట్ల లెక్కింపు సందర్భంగా రాష్ట్రంలో అల్లర్లు, అలజడులు రేపేందుకు పన్నాగం పన్నుతోంది. శాంతిభద్రతల సమస్యలు సృష్టించి, ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అక్రమాలకు పాల్పడాలన్నదే ఆ పార్టీ లక్ష్యం. టీడీపీ కుట్రను కేంద్ర నిఘా వర్గాలు గుర్తించడంతో అసలు బండారం బట్టబయలైంది. ఈ మేరకు టీడీపీ కుతంత్రంపై కేంద్ర ఇంటలిజెన్స్ బ్యూరో(ఐబీ) కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు నివేదిక అందజేసింది. దాంతో ఓట్ల లెక్కింపు సందర్భంగా ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఎన్నికల సంఘానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సమాచారం ఇచ్చినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఐబీ వర్గాల సమాచారం ప్రకారం.. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు విఘాతం కలిగించేందుకు టీడీపీ పక్కాగా పన్నాగం పన్నింది. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోని అధికారులు, సిబ్బందితో టీడీపీ ఏజెంట్లు కుమ్మక్కయ్యేందుకు వ్యూహం పన్నారని ఐబీ గుర్తించింది. తద్వారా వీవీ ప్యాట్లోని స్లిప్పులను గల్లంతు చేయడం టీడీపీ ఏజెంట్ల అసలు ఉద్దేశం. అందుకోసం అవసరమైతే వీవీ ప్యాట్ స్లిప్పులను నమిలి మింగేయాలని కూడా టీడీపీ అధిష్టానం తమ ఏజెంట్లకు నిర్దేశించినట్లు సమాచారం. అనంతరం ఈవీఎంలోని ఓట్లకు, వీవీ ప్యాట్లలోని స్లిప్పులకు మధ్య తేడా ఉందని టీడీపీ ఏజెంట్లే లెక్కింపు కేంద్రాల్లో ఆందోళనకు దిగుతారు. అప్పటికే బయట ఉన్న టీడీపీ నేతలు, కార్యకర్తలు వెంటనే ఆందోళనలను ఉధృతం చేస్తారు. ఆ వెనువెంటనే దాడులకు దిగుతూ కౌంటింగ్ కేంద్రాల వద్ద భయోత్పాతాన్ని సృష్టిస్తారు. తద్వారా శాంతిభద్రతలకు విఘాతం కల్పించి ఏకంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియను అడ్డుకోవడమే వారి లక్ష్యం. ఇక టీడీపీ కచ్చితంగా ఓడిపోతుందన్న అంచనా ఉన్న నియోజకవర్గాల లెక్కింపు కేంద్రాల వద్దకు వైఎస్సార్సీపీ ఏజెంట్లను అనుమతించకూడదని టీడీపీ ఎత్తుగడ వేస్తోంది. అందుకోసం కొందరు రిటర్నింగ్ అధికారులతో టీడీపీ కుమ్మక్కైంది. వైఎస్సార్సీపీ ఏజెంట్లు లేకుండా చేసి ఓట్ల లెక్కింపు ప్రక్రియను తమకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. టీడీపీ ఓడిపోతుందని స్పష్టమవుతున్న నియోజకవర్గాల కౌంటింగ్ కేంద్రాల వద్ద మరింతగా బరి తెగించాలని టీడీపీ ఎత్తుగడ వేస్తోంది. ఆ కేంద్రాల వద్ద శాంతిభద్రతల సమస్యను సృష్టించేందుకు ఎంతకైనా తెగించాలని తమ శ్రేణులకు టీడీపీ నాయకత్వం ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఆయా నియోజకవర్గాల ఎన్నికల ఫలితాలను ప్రకటించకుండా అడ్డుకోవాలన్నది టీడీపీ కుతంత్రం. అందుకోసం పెద్దఎత్తున దాడులకు తెగబడేందుకు టీడీపీ సంఘ విద్రోహ శక్తులను ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ముందస్తుగానే మోహరిస్తోందని ఐబీ నివేదించింది. సున్నిత నియోజకవర్గాలివీ... టీడీపీ అల్లర్లు, అలజడులు సృష్టించే అవకాశాలున్న నియోజకవర్గాల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘానికి ఐబీ నివేదించింది. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అల్లర్లకు ఆస్కారం ఉన్న నియోజకవర్గాలు ఇవీ... అనంతపురం: తాడిపత్రి, రాప్తాడు, ఉరవకొండ, పెనుకొండ, హిందూపూర్ కర్నూలు: ఆళ్లగడ్డ, బనగానపల్లె, ఆదోని, డోన్, పత్తికొండ వైఎస్సార్: జమ్మలమడుగు, మైదుకూరు, రైల్వే కోడూరు, కమలాపురం, కడప చిత్తూరు: తంబళ్లపల్లె, పలమనేరు, చంద్రగిరి, శ్రీకాళహస్తి, తిరుపతి నెల్లూరు: నెల్లూరు టౌన్, నెల్లూరు రూరల్, ఆత్మకూరు, కొవ్వూరు, ప్రకాశం: చీరాల, అద్దంకి, కొండేపి, కనిగిరి గుంటూరు: పెదకూరపాడు, సత్తెనపల్లి, మంగళగిరి, ప్రత్తిపాడు, చిలకలూరిపేట కృష్ణా: మైలవరం, విజయవాడ సెంట్రల్, విజయవాడ తూర్పు, గన్నవరం, గుడివాడ పశ్చిమ గోదావరి: దెందులూరు, ఏలూరు, తణుకు, ఆచంట తూర్పు గోదావరి: కొత్తపేట, రామచంద్రాపురం, కాకినాడ రూరల్, అమలాపురం విశాఖపట్నం: భీమిలి, గాజువాక, పెందుర్తి విజయనగరం: బొబ్బిలి, చీపురుపల్లి శ్రీకాకుళం: నరసన్నపేట, ఆమదాలవలస అప్రమత్తంగా ఉండండి కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సందర్భంగా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల అధికారిని ఆదేశించింది. ఈవీఎంలలో ఓట్ల లెక్కింపును మొదట పూర్తి చేయాలని స్పష్టం చేసింది. అనంతరం ఈవీఎంలను సురక్షితంగా మళ్లీ భద్రపర్చాలని సూచించింది. ఆ తరువాతే వీవీ ప్యాట్ల స్లిప్పుల లెక్కింపు ప్రక్రియ చేపట్టాలని స్పష్టం చేసింది. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించింది. అసాంఘిక, అనధికార వ్యక్తులు ఎవరూ లెక్కింపు కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ఉండకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని నిర్దేశించింది. ఓట్ల లెక్కింపు సందర్భంగా టీడీపీ అరాచకాలు సృష్టించేందుకు కుట్ర పన్నిందన్న నిఘా వర్గాల సమాచారం అధికార వర్గాలను ఆందోళన పరుస్తోంది. -
మరికొన్ని గంటల్లో లోక్‌సభ ఫలితాలు
న్యూఢిల్లీ: నరాలు తెగే ఉత్కంఠకు నేడు తెరపడనుంది. దిగువసభ ఎన్నికల్లో పోటీ చేసిన జాతీయ, ప్రాంతీయ పార్టీలకు చెందిన 8,049 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఏప్రిల్ 11 మొదలు మే 19 వరకు ఏడు విడతల్లో.. ఆరోపణలు, ప్రత్యారోపణలు, వ్యక్తిగత దూషణలతో హోరాహోరీగా సాగిన 17వ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడనున్నాయి. ఈ మేరకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని ఈసీ అధికారులు తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల చరిత్రలోనే మొదటిసారిగా ఈవీఎంల్లోని ఓట్ల వివరాలను వీవీప్యాట్ల చీటీలతో ఈసీ సరిపోల్చనుంది. ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 2–3 మధ్యే పూర్తయిపోయినా వీవీప్యాట్ల చీటీలను కూడా లెక్కించాల్సి ఉండటంతో ఫలితాలు సాధారణ సమయం కన్నా ఐదారు గంటలు ఆలస్యంగా వెలువడే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా గురువారమే వెలువడనున్నాయి. చౌకీదార్ చోర్‌హై నుంచి మొదలై.. ఈ ఎన్నికల్లో ప్రధాన పక్షాలైన ఎన్డీయే, యూపీఏకి చెందిన బీజేపీ, కాంగ్రెస్ తదితర పార్టీలు హోరాహోరీ ప్రచారం నిర్వహించాయి. చౌకీదార్ చోర్ హై, అవినీతిపరుడు నంబర్ 1, ఖాకీ అండర్వేర్ వంటి కటువైన ఆరోపణలు.. స్వాతంత్య్రానంతరం ఎన్నడూ లేనివిధంగా ఈసారి ఎన్నికలను వేడెక్కించాయి. బీజేపీ 437 మంది, కాంగ్రెస్ 423 మంది అభ్యర్థులను బరిలో నిలిపాయి. 19న చివరి విడత ఎన్నికలు ముగియగా.. కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే తిరిగి అధికార పీఠాన్ని అధిరోహిస్తుందని చాలావరకు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. నరేంద్ర మోదీ వ్యక్తిగత చరిష్మాతో 2014లో ఎలాగైతే ఎన్డీయే అధికారం చేజిక్కించుకుందో.. ఈసారి కూడా అలాగే ఆ కూటమి విజయం సాధిస్తుందని పేర్కొన్నాయి. పెరుగుతున్న నిరుద్యోగం, రైతుల్లో అసంతృప్తి, ఆర్థిక వ్యవస్థ మందగమనం కారణంగా బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బ తగులుతుందని విపక్షాలు పేర్కొన్నాయి. మోదీ, కేంద్రమంత్రులు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, యూపీఏ చైర్పర్సన్ సోనియా తదితరులు లోక్‌సభ ఎన్నికల బరిలో ఉన్నారు. 542 స్థానాలకే ఎన్నికలు విపక్ష పార్టీలు మంగళవారం ఈవీఎంల ట్యాంపరింగ్‌పై ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల లెక్కింపులో పారదర్శకతను పాటించాల్సిందిగా ఆ పార్టీలు ఈసీని కోరాయి. మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు గాను 542 నియోజకవర్గాల్లో మాత్రమే ఎన్నికలు జరిగాయి. పెద్దయెత్తున నగదు పంపిణీ ఆరోపణల నేపథ్యంలో తమిళనాడులోని వెల్లూరులో ఎన్నికను ఈసీ రద్దు చేసింది. 2014 ఎన్నికల్లో బీజేపీకి 282 సీట్లు రాగా 44 సీట్లతో కాంగ్రెస్ గతంలో ఎన్నడూలేని విధంగా పరాజయాన్ని మూటగట్టుకుంది. 2009లో కాంగ్రెస్ 206 సీట్లు సాధించింది. అప్రమత్తంగా ఉండండి: హోం శాఖ గురువారం కౌంటింగ్ సందర్భంగా కేంద్ర హోం శాఖ అన్ని రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన జారీ చేసింది. అవాంఛనీయ సంఘటనలు, హింస చోటు చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో జాగ్రత్త వహించాల్సిందిగా రాష్ట్రాల సీఎస్‌లను, డీజీపీలను కోరింది. స్ట్రాంగ్‌రూమ్‌లు, ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద భద్రతకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించింది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, బిహార్, త్రిపుర రాష్ట్రాలకు చెందిన కొన్ని సంస్థలు, కొందరు వ్యక్తులు చేసిన ప్రకటనలు హింసకు దారితీయవచ్చని, కౌంటింగ్ ప్రక్రియకు అంతరాయం కలిగించవచ్చునంటూ కేంద్ర భద్రతా సంస్థలకు సమాచారం అందినట్లు అధికారి ఒకరు వెల్లడించారు. ఓట్ల లెక్కింపు ఇలా... పోస్టల్ బ్యాలెట్లతో పాటే ఈవీఎం ఓట్ల లెక్కింపు వీవీప్యాట్ల లెక్కింపుతో ఫలితాలు ఆలస్యం! ఎన్నికల ఫలితాల వెల్లడికి ఇంకా కొన్ని గంటల సమయమే ఉంది. అయితే లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారిగా వీవీప్యాట్ల ఓట్లను లెక్కించి, వాటిని ఈవీఎంలలో నమోదైన ఓట్లతో సరిపోల్చే ప్రక్రియ చేపట్టడం వల్ల ఫలితాలు సాధారణం కంటే అయిదారు గంటలు ఆలస్యంగా వెలువడే అవకాశముంది. ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 2–3 గంటల మధ్య పూర్తయిపోయినా, వీవీప్యాట్ల చీటీలను కూడా లెక్కించాల్సి రావడంతో అధికారిక ఫలితాలు వచ్చేసరికి రాత్రి 8 దాటిపోతుందని అంచనా. ఆర్వోల ప్రతినతో మొదలు.. గురువారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. రిటర్నింగ్ అధికారి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ఓట్ల రహస్యాన్ని కాపాడతామని ప్రతిజ్ఞ చేస్తారు. ఆ మేరకు పత్రాన్ని బయటకి చదివిన తర్వాతే ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. సాధారణంగా సాయుధ బలగాలు, కేంద్ర పోలీసు సిబ్బంది, రాష్ట్ర పోలీసు సిబ్బంది, ఇతర నియోజకవర్గాల్లో ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బందికి చెందిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లను తొలుత లెక్కిస్తారు. దౌత్యవేత్తలు, ఇతర దేశాల్లోని భారత రాయబార కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది ఓట్లను కూడా సర్వీసు ఓట్ల కిందే పరిగణిస్తారు. ఈసారి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 18 లక్షలు నమోదు కాగా రికార్డు స్థాయిలో 16.49 లక్షల ఓట్లు పోలయ్యాయి. వాటిని మే 17నే ఆయా రిటర్నింగ్ అధికారులకు అందజేశారు. పోస్టల్ బ్యాలెట్లు భారీగా ఉన్న నేపథ్యంలో వాటితో పాటు ఈవీఎంల ఓట్ల లెక్కింపు రెండూ ఒకేసారి జరపాలని ఈసీ నిర్ణయించినట్లు కమిషన్ అధికారి ఒకరు వెల్లడించారు. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లకు ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఉండే హక్కు ఉంటుంది. వారి సమక్షంలోనే కౌంటింగ్ సాగుతుంది. వీవీప్యాట్ల చీటీల లెక్కింపు ఎలాగంటే.. ఈవీఎంల లెక్కింపు పూర్తయిన తర్వాతే వీవీప్యాట్ల స్లిప్పుల్ని లెక్కించే ప్రక్రియ మొదలవుతుంది. సుప్రీంకోర్టు సూచనల మేరకు ఒక్కో శాసనసభ నియోజకవర్గం పరిధిలోని ఎంపిక చేసిన అయిదు పోలింగ్ స్టేషన్లలో వీవీప్యాట్ల స్లిప్పులను లెక్కించాల్సి ఉంది. ఈ పోలింగ్ కేంద్రాలను లాటరీ ద్వారా ఎంపిక చేస్తారు. దేశవ్యాప్తంగా మొత్తం 10.3 లక్షల పోలింగ్ స్టేషన్లు ఉండగా.. వీవీప్యాట్ల లెక్కింపు ప్రక్రియ 20,600 పోలింగ్ స్టేషన్లలో జరగనుంది. 25 వీవీప్యాట్ చీటీలను ఒక కట్టగా కట్టి లెక్కించి ఆయా అభ్యర్థుల బాక్సుల్లో వేస్తారు. వాటిని ఈవీఎం డిస్ప్లేలతో పోల్చి చూస్తారు. ఒకవేళ రెంటికీ మధ్య తేడా వస్తే మరోసారి లెక్కిస్తారు. అలా మూడు సార్లు లెక్కించినా సరిపోలకపోతే వీవీప్యాట్లలో ఫలితాలనే తుదిగా పరిగణనలోకి తీసుకుంటారు. ఒక వీవీ ప్యాట్ అయిన తర్వాతే, మరో వీవీప్యాట్ లెక్కిస్తారు. ఒక్కో వీవీ ప్యాట్‌ను లెక్కించడానికి గంట సమయం పట్టొచ్చు. 5 వీవీప్యాట్లలో చీటీల లెక్కింపు పూర్తి కావడానికి 5 గంటలు పట్టే అవకాశం ఉంది. వీవీప్యాట్ చీటీలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, లేదంటే అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి మాత్రమే లెక్కిస్తారు. అలా లెక్కించిన తర్వాత తుది ఫలితాలను అధికారికంగా ప్రకటిస్తారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఈవీఎంలు మొరాయించినా, వాటిలో లోపాలు తలెత్తినా, ఎన్నికల కమిషన్ దృష్టికి అధికారులు తీసుకువెళతారు. పోలింగ్ కేంద్రంలో అప్పటి పరిస్థితులను బట్టి రీ పోలింగ్‌కు ఆదేశిస్తారు. పోటీ చేసిన అభ్యర్థులు, పార్టీల ఏజెంట్ల నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేకపోతే కౌంటింగ్ ముగిసినట్టు రిటర్నింగ్ అధికారి ప్రకటిస్తారు. -
జనాదేశం శిరోధార్యం
ఈసారి సార్వత్రిక ఎన్నికలలో ప్రచారం జరిగినంత భీకరంగా, అనాగరికంగా, అరాచకంగా, అడ్డ గోలుగా మునుపెన్నడూ జరగలేదు. ప్రజల సమస్యలపైన చర్చించకుండా, ఐదేళ్ళలో ప్రభుత్వ సాఫల్యవైఫల్యాలను సమీక్షించకుండా మతంపైనా, కులంపైనా, పాకిస్తాన్‌పైనా, సరిహద్దు యుద్ధం పైనా, రఫేల్ యుద్ధవిమానాలపైనా ఆరోపణలూ, ప్రత్యారోపణలతో ప్రచారపర్వం ప్రచండ మారుతం వలె సాగింది. రాజకీయ ఉష్ణోగ్రతలు తారస్థాయికి చేరుకున్నాయి. నైతిక విలువలు పాతాళానికి దిగజారాయి. ప్రధాన పక్షాలైన బీజేపీ, కాంగ్రెస్‌లు సర్వశక్తులూ ఒడ్డి చావోరేవో అన్న విధంగా ప్రచారం చేశాయి. ఈ ఎన్నికలను అధ్యక్ష తరహా ఎన్నికలుగా మార్చడంలో బీజేపీ విజయం సాధించింది. ప్రధాని నరేంద్రమోదీకి అనుకూలమా, వ్యతిరేకమా అన్నట్టు ఒక రెఫ రెండం మాదిరి జరిగిన ఎన్నికల ఫలితాలు ఈ రోజు వెల్లడి కానున్నాయి. మొదటి దశ పోలింగ్ ఏప్రిల్ 11న జరిగితే ఏడవ, తుది దశ పోలింగ్ మే 19న నిర్వహించారు. ఫలితాల కోసం 42 రోజుల నిరీక్షణ నేటితో ముగుస్తున్నది. ఎగ్జిట్‌పోల్స్ ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో వెల్లడించినప్పటికీ ఓట్లు లెక్కపెట్టేవరకూ ఓటమిని అంగీకరించేందుకు ఎవ్వరూ సిద్ధంగా లేరు. యుద్ధంలో, ప్రేమలో ఏదైనా చెల్లుబాటు అవుతుందంటారు. ఎన్నికల పోరాటంలోనూ మాటల ఈటెలు ప్రత్యర్థులను వేధించడం సహజం. ఒక వైపు ఎన్నికల సంఘం, మరో వైపు సర్వో న్నత న్యాయస్థానం హద్దులు చూపుతున్నప్పటికీ ఎన్నికల పూనకంలో నాయకులు సకల మర్యాద లనూ మంటగలిపారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం)పైన 22 ప్రతిపక్షాలు దాడి చేయడం, సుప్రీంకోర్టు హితవు చెప్పినా వినకుండా ఎన్నికల సంఘానికి పదేపదే వినతిపత్రాలను సమర్పించడం ప్రహసనసదృశంగా సాగింది. ఓడినవారూ, ఓడిపోతామని భయపడేవారు మాత్రమే ఈవీఎంలను తప్పుపడతారనీ, విజేతలు ఈవీఎంల గురించి ఫిర్యాదు చేయరని అనడానికీ ఢిల్లీలో మొన్నటి వరకూ జరిగిన రభసే కారణం. ఈవీఎంలతో పాటు వీవీప్యాట్స్ (స్లిప్పుల)ను కూడా లెక్కించాలంటూ ప్రతిపక్షాలు చేసిన వాదనను సుప్రీంకోర్టు, ఈసీ తిరస్కరించాయి. 2014లో ఇదే ఈవీఎంల పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు. నిరుడు రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో గెలుపొంది ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ఈవీఎంలపైన ఫిర్యాదు చేయలేదు. ఈసారి ఓటమి అనివార్యమని ముందే తెలుసుకున్న చంద్రబాబు అదే పనిగా జాతీయ స్థాయి ప్రతిపక్ష నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేసి ఈవీఎంలను ఒక భయంకర సమ స్యగా భూతద్దంలో చూపించి హడావుడి చేశారు. ఓడిపోతామని ముందే తెలుసుకున్నవారు ఈవీ ఎంలతోపాటు ఎగ్జిట్‌పోల్స్‌ని కూడా విశ్వసించరు. గెలిచినప్పుడు ఈవీఎంలను ఒప్పుకుంటూ, ఓడినప్పుడు వాటిని తప్పుపడుతూ మాట్లాడే రాజకీయ నాయకుల అభిప్రాయాలకు విలువ ఇవ్వ నక్కరలేదు. 50 శాతం వీవీప్యాట్స్‌ను లెక్కించాలంటూ అర్థం లేని డిమాండ్లు పెట్టిన ప్రతిపక్షాల ప్రతిపాదనలను ఎన్నికల సంఘం తిరస్కరించడం ముమ్మాటికీ సమంజసమే. ఎన్నికల సంఘంలో ముగ్గురు సభ్యులు ఉంటారనీ, ముగ్గురికీ సమానాధికారాలు ఉంటాయనీ, మెజారిటీ ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలనీ రాజ్యాంగంలోని 324 అధికరణలోని రెండో క్లాజ్ స్పష్టం చేస్తున్నది. ఈ ఎన్నికలలో ఎన్నికల సంఘం సభ్యులకు కొన్ని అంశాలపైన ఏకాభిప్రాయం లేదని వెల్లడైంది. ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో మోదీ నియమావళికి విరుద్ధంగా మాట్లాడా రంటూ కాంగ్రెస్‌పార్టీ చేసిన ఫిర్యాదును కొట్టివేస్తూ ప్రధానికి ‘క్లీన్చిట్’ ఇవ్వడాన్ని ఎన్నికల కమిష నర్ అశోక్ లావాసా వ్యతిరేకించారు. తన అభ్యంతరాలను నమోదు చేయాలనీ, బహిర్గతం చేయా లని లావాసా పట్టుపడుతున్నారు. బహిర్గతం చేయనవసరం లేదని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా అనడం వివాదాస్పదమైంది. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించవలసిన ఎన్నికల సంఘం దాపరికం పాటించడంలో అర్థం లేదు. నియమావళిని ఉల్లంఘించిన రాజకీయ నేతలు ఒకటి, రెండు, మూడు రోజులపాటు ప్రచారంలో పాల్గొనరాదంటూ ఎన్నికల సంఘం శిక్షాత్మక చర్యలు తీసుకోవడం ఇదే ప్రథమం. ఇందుకు సుప్రీంకోర్టు దన్ను ఉంది. ఎన్నికల సంఘం క్రమంగా రూపుదిద్దుకుంటున్న సంస్థ. నిష్పక్షపాతంగా, న్యాయంగా, ధర్మంగా ఎన్నికలు నిర్వహించడమే కాకుండా సూత్రబద్ధంగా నిర్వహిస్తున్నట్టు ప్రజలకు విశ్వాసం కలిగించడమే ఈ సంఘం కర్తవ్యం. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ అత్యంత ప్రధానమైనది. ఈ వ్యవస్థపైన ప్రజలు విశ్వాసం కోల్పోతే భారత ప్రజాస్వామ్య దుర్గం బీటలువారుతుంది. ఎన్నికల ప్రచారంలో పెడ ధోరణులు ప్రబలి మతసామరస్యానికీ, సౌభ్రాతృత్వానికీ, సంస్కారానికీ భంగం కలిగే విధంగా రాజకీయ నాయకుల ప్రసంగాలు సాగాయి. ఎన్నికలలో ఎవరు గెలిచినా, ఎవరు ఓడినా గెలుపోటములను సమభావంతో స్వీకరించాలనీ, ఆటలో అరటి పండుగా పరిగణించాలనీ, ఎన్నికలలో పాల్గొనడమే ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడమనే స్ఫూర్తితో వ్యవహరించాలనీ అందరూ గ్రహిం చాలి. రాజీవ్‌గాంధీ అత్యంత అవినీతిపరుడుగా తనువు చాలించాడు అని ఎన్నికల ప్రచారంలో ధ్వజమెత్తిన మోదీ రాజీవ్ 27వ వర్ధంతి సందర్భంగా మాజీ ప్రధానికి నివాళులు చెప్పడం సంస్కారం అనిపించుకుంటుంది. కానీ, కాస్త కృతకంగా కూడా కనిపిస్తుంది. అందుకే ఉన్నత పదవులలో ఉన్నవారు ఆచితూచి మాట్లాడాలి. దివంగత నాయకులపైన ఆరోపణలు చేయడం సరికాదు. ఎన్నికల ప్రక్రియ ఆఖరి ఘట్టంలో ప్రవేశించిన కారణంగా ఎన్నికల ప్రచారంలో సృష్టిం చిన విభేదాలను తొలగించడానికీ, అగాధాలను పూడ్చడానికీ రాజకీయ పార్టీలన్నీ శక్తివంచన లేకుండా ప్రయత్నించాలి. భారతదేశ సమైక్యతకూ, సమగ్రతకూ భంగం కలిగించే ధోరణులను విడ నాడాలి. వైషమ్యాలకు స్వస్తి చెప్పాలి. ప్రజలతీర్పును అన్ని పార్టీలూ శిరసావహించాలి. ప్రజలు నిర్దేశించిన పాత్రను రాజకీయ నాయకులు వినమ్రంగా పోషించాలి. -
ఉత్తరాది ఆధిపత్యం ప్రమాదకరం
ఉత్తర, దక్షిణ భారత ప్రాంతాల మధ్య స్వాతంత్య్ర పూర్వ కాలం నుంచీ కొనసాగుతున్న అంతరాలు దేశ రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాలపై ఎంతో ప్రభావాన్ని కలిగిస్తున్నాయి. ప్రధానంగా ఈ రెండు ప్రాంతాలమధ్య ఉన్న మత, సామాజికపరమైన వైవిధ్యాలను వైరుధ్యాలుగా చిత్రీకరిస్తూ ప్రజల మధ్య ఘర్షణ వాతావరణం సృష్టిస్తున్నారు. భాష, సంస్కృతి విషయంలో ఒక ప్రాంతానికి చెందిన కొన్ని వర్గాల ఆలోచనలు, అభిప్రాయాలను యావత్ దేశంపై బలవంతంగా రుద్దే పరిస్థితి తీవ్ర పరిణామాలకు దారి తీయనుంది. ప్రత్యేకించి కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ పాలనలో ఉత్తరాది ఆధిపత్య ధోరణి తారస్థాయికి చేరింది. అయితే దక్షిణ భారత దేశాన్ని చిన్నచూపు చూడటంలో అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ దొందూ దొందే కావడం గమనార్హం. ‘‘భారతదేశంలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాల మధ్య ఎంతో వైవిధ్యం ఉన్నది. ఉత్తర దేశం మూఢనమ్మకాలతో మునిగి ఉంటే, దక్షిణ ప్రాంతం హేతు దృక్పథంతో ఉన్నది. ఉత్తరం ఛాందసవాదంలో ఉంటే, దక్షిణం ప్రగతిశీలమైన బాటలో ఉన్నది. విద్య విషయంలో దక్షిణం ముందడుగు వేస్తుంటే, ఉత్తరభారతం వెనుకబడి ఉంది. సాంస్కృతిక పరంగా దక్షిణం ఆధుని కతను సంతరించుకుంటే, ఉత్తరం ప్రాచీన దశలోనే ఉంది’’ ఇవి 1955 లోనే బాబాసాహెబ్ అంబేడ్కర్ నోటివెంట దొర్లిన అక్షర సత్యాలు. భాషా ప్రయుక్తరాష్ట్రాల విషయమై రాష్ట్రాల పునర్వవ్యస్థీకరణ సంఘానికి అందజేసిన నివేదికలోని అంశమిది. భారతదేశంలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాల మధ్య ఉన్న ఈ వ్యత్యాసం ఎన్నో ఇతర అంశాలను ప్రభా వితం చేస్తుందని అంబేడ్కర్ అంత ముందుగానే ఆలోచించగలిగారు. ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశంపైన ఆధిపత్య ధోరణితో వ్యవహరిస్తోందనీ, ఇది ప్రజాస్వామిక దృక్పథానికి విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. దాదాపు ఆరు దశాబ్దాల క్రితమే అంబేడ్కర్ చెప్పిన మాటలు ఈ నాటికీ అక్షరసత్యాలుగా మనముందు సాక్షాత్కరిస్తు న్నాయి. ఈ రెండు ప్రాంతాల మధ్య కొనసాగుతున్న ఈ అంతరాలు భారతదేశ రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల మీద ఎంతో ప్రభా వాన్ని కలిగిస్తున్నాయి. ఒకరకంగా ఉత్తర భారతదేశంలో మొలకెత్తిన తిరోగమన భావజాలాలన్నింటినీ దక్షిణాదిపై రుద్దుతున్నట్టు చరిత్ర రుజువుచేస్తోంది. ముఖ్యంగా మతపరమైన, సామాజికపరమైన వైవి«ధ్యా లను వైరుధ్యాలుగా చిత్రీకరిస్తూ ప్రజల మధ్య ఒక ఘర్షణ వాతావర ణాన్ని సృష్టిస్తున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు రెండూ కూడా దక్షిణాది మీద వ్యతిరేక భావాన్ని కలిగి ఉన్నారు. ముఖ్యంగా 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ అనుసరించిన విధా నాలు దక్షిణాదిని కలవరపరుస్తున్నాయి. ఒక ప్రాంతానికి చెందిన కొన్ని వర్గాల ఆలోచనలను, అభిప్రాయాలను యావత్ దేశంపై బలవం తంగా రుద్దే పరిస్థితి దీర్ఘకాలంలో తీవ్రపరిణామాలకు దారితీస్తుందనడా నికి అనేక ఉదాహరణలున్నాయి. ఉత్తరాదిలో ఒక వర్గం ఆలోచనలను, దేశం మొత్తం ఆచరించాలనే ధోరణిని ఈ ప్రభుత్వం ప్రదర్శిస్తున్నది. ఒక మతం ప్రాతిపదికగా దేశాన్ని పాలించాలనుకునే బీజేపీ ప్రభుత్వ విధానాలను దక్షిణ భారత దేశం ఏనాడూ ఆమోదించలేదు. కారణం ఈ నేలకున్న చారిత్రక చైతన్య లక్షణం కావచ్చు. లేదంటే ఈ ప్రాంతంలో ఉద్భవించిన అనేకానేక ఉద్య మాలు కావచ్చు. ఈ ప్రాంతాన్ని ఇవే నిత్యచైతన్యస్రవంతిలో ఓలలాడేలా చేశాయి. మూర్ఖత్వానికీ, మూఢత్వానికీ ఇక్కడ చోటు తక్కువనే చెప్పాలి. దక్షిణాదిలో సాగిన కుల వ్యతిరేక పోరాటాలూ, సాంఘిక సంస్కరణో ద్యమాలూ ఈ ప్రాంత ప్రజలను చైతన్యపథంలో నడిపాయి. హిందూ మతంలోని మూఢవిశ్వాసాలనూ, కుల అణచివేతనూ, వివక్షనూ ఈ ఉద్యమాలు తిప్పికొట్టాయి. అందులో ముఖ్యంగా తమిళనాడులో ఆయో తీదాస్, రామస్వామి నాయకన్, కేరళ అయ్యంకాలి, ఆనాటి హైదరా బాద్ సంస్థానంలో భాగ్యరెడ్డి వర్మ ఆంధ్రప్రాంతంలో త్రిపురనేని రామ స్వామి చౌదరి లాంటి వాళ్ళు ఎంతో స్ఫూర్తిని అందించారు. అయితే సరిగ్గా ఈ చైతన్యమే ఉత్తరాదిలో కొరవడిందని ఆనాడు అంబేడ్కర్ స్పష్టం చేశారు. సరిగ్గా అదే నేడు అడుగడుగునా రుజువ వుతూ వస్తున్నది. ప్రజాస్వామిక వ్యవస్థలో మత స్వేచ్ఛ అనేది ఒక ప్రాథమిక సూత్రం. కానీ బీజేపీ, దాని నాయకత్వంలో నడుస్తున్న ప్రభుత్వ శక్తులూ హిందూ మత రక్షణకు బదులుగా, ఇతర మతాలను ధ్వంసం చేయాలనుకోవడం మనకు ఇటీవలికాలంలో అత్యంత ఆందో ళన కలిగించిన అంశం. ఇతర మతాల ప్రజల ఆహారపుటలవాట్ల మీద గోమాంసం పేరుతో వందల మందిపై దాడిచేయడం, కొందరిని హత్య చేయడం మొదలెట్టి దేశమంతటా ఇటువంటి దాడులు జరపాలని భావించారు. కానీ అదిసాధ్యం కాలేదు. దక్షిణ భారతీయులు హిందువు లైనప్పటికీ ఇతర మతాల ఆచార వ్యవహారాలను తక్కువగా చూడలేదు. ఈ ప్రాంత ప్రజల జీవనాధారం మీద దాడిచేయాలనుకోలేదు. ఉత్తర, దక్షిణ ప్రాంతాల మధ్య ఒకే అంశంపై ఉన్న వ్యత్యాసాన్ని వరల్డ్ వాల్యూ సర్వే బయటపెట్టింది. దీని ప్రకారం హిందూ మతం ఒక్కటే అనుసరిం చదగినదని ఉత్తరాది అధికంగా భావిస్తే, దక్షిణాదిలో దానిని అంగీక రించే వాళ్ళ శాతం తక్కువ. అదేవిధంగా అన్ని మతాలూ సమానమనే భావనలో కానీ, ఇరుగుపొరుగు వాళ్ళు ఇతర మతస్థులు ఉండకూడదనే విషయంలోగానీ, రెండు ప్రాంతాల మధ్య ఎంతో వ్యత్యాసమున్నది. ముఖ్యంగా ముస్లింల పట్ల అవలంబిస్తున్న వైఖరిలో రెండు ప్రాంతాలు భిన్నంగా వ్యవహరిస్తున్నాయని, ఈ సర్వే వెల్లడించింది. ఇటీవల ఎన్నికల సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ హిందూ మతం, హిందూత్వంపై చేసిన వ్యాఖ్యలు కూడా దక్షిణ, ఉత్తర ప్రాంతాల ఆలోచనలను ప్రతిబింబిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ హిందూ మత సాంప్రదాయాలకు ప్రాధాన్యతనిస్తూనే, ముస్లిం ప్రజల సంక్షే మంపై దేశంలో ఏ ప్రభుత్వం చూపించని శ్రద్ధను కనబరుస్తున్నది. ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటుగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ముస్లింలకోసం అమలుచేస్తున్నది. అంతేకాకుండా 200కు పైగా రెసిడెన్షియల్ పాఠశాల లను ముస్లింల కోసం నిర్వహిస్తున్నదంటే ఇది దక్షిణ భారతదేశం అవలంభిస్తున్న మత సహనానికి నిదర్శనం. అట్లాగే కర్నాటక, కేరళ, తమిళనాడులలో తెలంగాణలో లాగా ఇంత ప్రాధాన్యత ఇవ్వకపో యినా, ద్వేషభావం కలిగించలేదు. దీనికి విరుద్ధమైన వైఖరిని బీజేపీ ఉత్తరప్రదేశ్‌లో అనుసరిస్తున్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లోగానీ, ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లోగానీ, ముస్లింలను కనీసం ఒక్కటంటే ఒక్క స్థానం నుంచి కూడా పోటీకి నిలపలేకపోయింది. ఎందుకంటే అక్కడి హిందు వుల్లో కరుడుగట్టిన ముస్లిం వ్యతిరేకతను సొమ్ముచేసుకోవడానికి, ఇతర హిందువుల ఓట్లను రాబట్టుకోవడానికి ముస్లిం వ్యతిరేకతను రాజకీయం చేశారు. చేస్తున్నారు. అదేవిధంగా ఉత్తరభారతదేశ ప్రజాస్వామిక వ్యతి రేక ధోరణిని బాబాసాహెబ్ అంబేడ్కర్ గతంలోనే ఉదహరించారు. యావద్దేశానికి హిందీ అధికార భాషగా ఉండాలనే విషయంలో రాజ్యాంగ సభలో జరిగిన చర్చలో సభ్యులు 78–78 అనే సంఖ్యతో సమం చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆనాటి నాయకత్వం తమ పార్టీ సభ్యులతో చర్చలు జరిపి ఒప్పించి, వ్యతిరేకించే వారిలో ఒకరిని సభకు హాజరుకాకుండా చూడడంవల్ల 78–77 తేడాతో హిందీ భాష అధికార భాష కాగలిగింది. రాజకీయంగా కూడా దక్షిణ భారతదేశం ఎప్పుడూ ఉత్తర భారత దేశంపైన ఆధారపడే స్థితిని కల్పించారు. లోక్‌సభలో ఎక్కువ సీట్లు ఉత్తర భారతదేశంలో ఉండడం వల్ల ఇప్పటికే పీ.వీ.నరసింçహారావు మినహా మరే దక్షిణ భారత నేత కూడా పూర్తికాలం ప్రధానమంత్రిగా కొనసాగలేక పోయారు. దేవెగౌడ కొద్దికాలమే ప్రధాని పదవిలో ఉండగలిగారు. ప్రధానమైన మంత్రిత్వ శాఖలు కూడా ఉత్తర భారతీయులే ఎక్కువగా అధిష్టించారు. రాష్ట్రపతి పాలనగానీ, ప్రభుత్వాలను బర్తరఫ్ చేసే ప్రక్రియ కూడా దక్షిణ భారతదేశంలోనే ఎక్కువగా జరిగిందని రాజ కీయ పరిశీలకులు భావిస్తున్నారు. వీటన్నింటి ఫలితంగానే దక్షిణాదిలో ప్రాంతీయ పార్టీల ఆవిర్భావం జరిగిందని భావించక తప్పదు. తెలుగు దేశం పార్టీ ఎన్టీఆర్ హయాంలో కేంద్రానికి వ్యతిరేకంగా ఏర్పడి, తెలుగు ఆత్మగౌరవమనే ప్రాతిపదిక మీద అధికారంలోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ప్రజలు నినదిస్తే, స్పందించకపోవడం వల్లనే తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించింది. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇమడక పోవడంవల్లనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవసర మైంది. తమిళనాడులో ఢిల్లీని ఎదిరించే రాజకీయాలతోనే అక్కడి పార్టీలైన డీఎంకే, అన్నాడిఎంకే పనిచేస్తున్నాయి. కర్నాటకలో కూడా జెడీఎస్ ఒక ప్రాంతీయ పార్టీగానే వ్యవహరిస్తున్నది. ఆ పార్టీ నాయకులు కూడా ఢిల్లీలో అవమానానికి గురవుతున్నారు. దేవెగౌడ ఒక సమయంలో ప్రత్యక్షంగా నాతో వ్యక్తం చేసిన అభిప్రాయాలను ఇక్కడ చెప్పడం సందర్భోచితం అని భావిస్తున్నాను. ప్రధానిగా పదవికి రాజీనామా చేసిన తర్వాత హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా మాట్లాడుతూ, ‘‘ఢిల్లీ ఒక నియంతల కుటీరం. అది రాజ కీయంగానూ, నివాసపరంగానూ, సమాజపరంగానూ రాజధానిగా సరిపోదు. దక్షిణాది నాయకులంటే, అక్కడి రాజకీయనాయకత్వానికి మాత్రమే కాదు, అధికార యంత్రాంగం కూడా చాలా చులకనగా చూస్తారు’’ అని వాపోయారు. ఇటువంటి సందర్భాలు దక్షిణాది నాయ కులందరికీ అనుభవమే తప్ప అబద్ధం కాదు. ఇటీవల ఈ ఆధిపత్య ధోరణి, దక్షిణాది రాష్ట్రాల పట్ల చిన్నచూపు మరింత ఎక్కువైందని స్పష్ట మౌతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు రావాల్సిన హక్కులు, నిధుల నుంచి పూర్తిగా దాటవేయడం మనం చూస్తూనే ఉన్నాం. కేరళ రాష్ట్రంలో ఘోరమైన వరదలు వచ్చి, వేల కోట్ల నష్టం వాటిల్లి, వంద లాది మంది మృత్యువాత పడితే ఆదుకోవడంలో చూపిన అలక్ష్యం ఎవ రినైనా కుంగదీయకపోదు. ఒకవైపు సామాజిక, సాంస్కృ తిక అంత రాలూ, రెండో వైపు వివక్ష, నియంతృత్వ పోకడలు భవి ష్యత్‌లో ఉత్తర, దక్షిణ ప్రాంతాల మధ్య మరింత అగా«థాన్ని సృష్టించక మానవు. రాజ్యాంగ నిర్మాతల ఆశయాలను, రాజ్యాంగ విలువలను పాలకులూ ప్రజలూ పాటిస్తే ఈ ప్రమాదాన్ని నివారించవచ్చు. వ్యాసకర్త: మల్లెపల్లి లక్ష్మయ్య; సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077 -
కౌంటింగ్‌లో అల్లర్లకు టీడీపీ ప్లాన్
సాక్షి, అమరావతి : ఎన్నికల ఫలితాలపై 43 రోజుల ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. ఎవరు విజేతగా నిలుస్తారో.. ఎవరు పరాజయాన్ని చవిచూస్తారో.. కొన్ని గంటల్లో తేలిపోనుంది. చంద్రబాబునాయుడుకు ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకోవడంతో కౌంటింగ్‌ను వివాదాస్పదంగా చేయాలని టీడీపీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఏపీ ఎన్నికల ఫలితాల్లో తమకు ప్రతికూలంగా వచ్చే కౌంటింగ్ సెంటర్ల వద్ద అల్లర్లు సృష్టించాలని చంద్రబాబు నాయుడు భారీ స్కెచ్ వేశారు. టీడీపీ ఏజెంట్ల ద్వారా కౌంటింగ్ సెంటర్ల వద్ద గొడవలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీనిలో భాగంగా గొడవలు దిగే మనస్తత్వం ఉన్నవారినే ఏజెంట్లుగా పెట్టాలని నిర్ణయించారు. ఓడిపోయిన ప్రతి చోటా రీకౌంటింగ్ చేయాలని గొడవలు చేసేలా ఆదేశాలు జారీ చేశారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా వందశాతం వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించేలా గొడవలు చేయాలని ఆదేశించారు. ఇప్పటికే టీడీపీ ఏజెంట్లకు రెండు సార్లు శిక్షణ ఇవ్వగా, బుధవారం మరోసారి ఏజెంట్లందరికీ గొడవలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ప్రతి ఏజెంట్‌కు చంద్రబాబు నాయుడు ఫోటోతో ముంద్రించిన ఒక ప్రత్యేకమైన బుక్‌లెట్‌ను కూడా ఇచ్చారు. ముందుగానే రెండు ఫిర్యాదు నమూనా పత్రాలను టీడీపీ తయారు చేసింది. ఓట్ల లెక్కింపు సందర్భంగా వందశాతం వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించే డిమాండ్‌ను తెరపైకి తీసుకురావాలని చూస్తున్నారు. ఏపీ హైకోర్టు, సుప్రీం కోర్టు తీర్పులకు విరుద్ధంగా ఫిర్యాదులకు భారీ స్కెచ్ వేశారు. ఓడిపోయే చోట ప్రతి రౌండ్లోనూ రీకౌంటింగ్‌కు గొడవ చేయాలని ఏజెంట్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈవీఎంలపై నెంబర్లు కనపడలేదని ఫిర్యాదు చేయాలని ఏజెంట్లకు సూచించారు. పదేపదే ఫిర్యాదులు చేసి, ఎన్నికల ఫలితాల్లో జాప్యం జరిగేలా చూడాలని టీడీపీ ఏజెంట్లకు శిక్షణ ఇచ్చారు. వీటిపైన ఎన్నికల సంఘం కూడా దృష్టిపెట్టింది. ఇలాంటి వివాదాలు వచ్చినప్పుడు ఎలా చేయాలన్నదానిపై ఆర్ఓలు, అబ్జర్వర్లకు ఈసీ ప్రత్యేక మార్గదర్శకాలు ఇవ్వనుంది. -
‘బీజేపీ గెలిస్తే.. ఊరు విడిచి వెళ్తాం’
లక్నో : గత ఏడాది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బులంద్‌షహర్ ప్రాంతంలోని నయాబన్స్ గ్రామంలో చేలరేగిన హింసాకాండ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నాటి దుర్ఘటనలో ఓ పోలీస్ అధికారితో పాటు మరో పౌరుడు కూడా మరణించాడు. ఈ సంఘటన పట్ల దేశ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమయ్యింది. ప్రతిపక్షాలు యోగి ఆదిత్యనాథ్ మీద మండిపడ్డాయి. బీజేపీ ప్రభుత్వంలో ముస్లింలకు రక్షణ కరువయ్యిందని ఆరోపించాయి. ఈ ఘటన జరిగి ఇప్పటికి దాదాపు ఆరు నెలలు కావస్తోంది. ఈలోపు సార్వత్రిక ఎన్నికలు కూడా వచ్చేశాయి. ప్రధాని పీఠాన్ని అధిరోహించేది ఎవరో మరి కొన్ని గంటల్లో తేలీపోతుంది. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్ని ‘ఔర్ ఏక్ బార్ మోదీ సర్కార్’ అని తేల్చేశాయి. కానీ అసలైన ఫలితాలు వచ్చే వరకూ ప్రతి ఒక్కరిలోను టెన్షనే. ఈ నేపథ్యంలో గోరక్షకులు జరిపిన మూక దాడితో ఒక్క సారిగా వార్తల్లో నిలిచిన నయాబన్స్ గ్రామంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేసింది ఇండియా టుడే. ఆ వివరాలు గ్రామస్తుల మాటల్లోనే.. ‘ఒకప్పుడు మా పిల్లలు(ముస్లిం), వారి పిల్లలు(హిందువులు) కలిసి ఆడుకునే వారు. పండుగలను కూడా కలిసే జరుపుకునే వాళ్లం. ఏ కుటుంబంలో ఐనా ఓ వ్యక్తి అనారోగ్యానికి గురయినా.. చనిపోయినా గ్రామస్తులంతా వారికి తోడుగా నిలిచేవారు. ఒకరినొకరం వరసలతో పిల్చుకుంటూ.. ఆనందంగా గడిపేవాళ్లం. కానీ ఎప్పుడైతే బీజేపీ అధికారంలో వచ్చిందో అప్పటి నుంచి పరిస్థితుల్లో నెమ్మదిగా మార్పు రావడం ప్రారంభించింది. హిందూ - ముస్లింల మధ్య అనుబంధం క్రమంగా తగ్గడం ప్రారంభమయ్యింది’ అన్నారు. అంతేకాక ‘యోగి ఆదిత్యనాథ్ యూపీ సీఏంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మా పరిస్థితి మరి దిగజారి పోయింది. యోగి తీసుకువచ్చిన ‘హిందూ ఫస్ట్ నినాదం’.. మా బతుకులను ఇబ్బందుల్లోకి నెట్టిసింది. క్రమంగా మా మధ్య దూరం ప్రారంభమయ్యింది. మాట తీరులో కూడా తేడా వచ్చేసింది. హిందూ - ముస్లింలను విడదీయడమే మోదీ, యోగిల ఏకైక అజెండా’ అంటున్నారు నయాబన్స్ ముస్లింలు. అంతేకాక ‘ఈ నేపథ్యంలో గత ఏడాది డిసెంబరులో జరిగిన మూక హత్య మా రెండు వర్గాల మధ్య దూరాన్ని మరింత పెంచింది. గ్రామంలో దాదాపు 4 వేల మంది జనాభాలో మా సంఖ్య కేవలం 400 మాత్రమే. ఇంతటి ఉద్రిక్త పరిస్థితుల నడుమ మా గ్రామంలో ఉండటం మంచిది కాదు అనిపిస్తుంది. మమ్మల్ని మేం రక్షించుకోవడం కోసం ఊరు విడిచి వెళ్తున్నాం. ఆర్థిక పరిస్థితులు బాగా ఉన్న కుటుంబాలన్ని ఇప్పటికే గ్రామాన్ని వదిలి వెళ్లాయి. ఈ సారి కూడా బీజేపీనే అధికారంలోకి వస్తే.. మిగతా కుటుంబాలు కూడా గ్రామం విడిచిపెట్టి వెళ్తా’యని తెలిపారు. అంతేకాక ఈ దాడికి బాధ్యులుగా చేస్తూ.. 21 మంది మీద కేసు నమోదు చేశారు. వారంతా కొన్ని రోజుల పాటు జైలు జీవితం కూడా అనుభవించారు. ఈ క్రమంలో షఫ్రుద్దీన్ సైఫి అనే వ్యక్తి మాట్లాడుతూ.. ‘నేను కల్లో కూడా పోలీసు స్టేషన్ పేరు తల్చుకోలేదు.. పోలీస్ స్టేషన్ లోపల ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు.. నేరం అనే మాటను పలకడమే పాపంగా భావించే వ్యక్తి మీద తప్పుడు ఆరోపణలు చేసి జైలుకు పంపిస్తే.. అతని మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో మీరు కనీసం ఊహించలేరు. ఈ సంఘటనతో నా కుటుంబం చాలా భయపడింది. దాంతో గ్రామం వదిలి.. వేరే ఊరుకు అది కూడా మొత్తం ముస్లింలు ఉండే ప్రాంతానికి వెళ్లిపోయాం. ఇప్పుడు మేం చాలా ధైర్యంగా ఉన్నామ’ని తెలిపారు. -
‘రేపటితో రాజకీయ నిరుద్యోగిగా చంద్రబాబు’
సాక్షి, అమరావతి : ఏపీలో ఎన్నికల కౌంటింగ్‌ను నిలిపి వేయించడానికి చంద్రబాబునాయుడు చేయని కుతంత్రం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి మండిపడ్డారు. వీవీప్యాట్ల లెక్కింపు పేరుతో రెండు సార్లు సుప్రీంలో పిటిషన్ వేసి ఓడిపోయాడని తెలిపారు. తన అనుకూల వ్యక్తులతో ఏపీ హైకోర్టు, సుప్రీం కోర్టులో మరోసారి అత్యవసర పిటిషన్లు దాఖలు చేయించినా తిరస్కరణకు గురయ్యాయని ట్విటర్లో చురకలంటించారు. '23వ తేదీతో రాజకీయ నిరుద్యోగిగా మారే చంద్రబాబు కొత్త వర్క్ కోసం ఎక్కని గడప, దిగని గడప లేదన్నట్టు తిరుగుతున్నాడు. ఈయనకు ఉపాధి కల్పించే స్థితిలో వారెవరూ లేరు. వాళ్లే అసలు ఉద్యోగం లేకనో, సగం పనితోనో కాలం గడుపుతున్నారు. ఒక ప్రయోజనకర కార్యక్రమం కోసం ప్రయాణాలు చేస్తే అందరూ ప్రశంసిస్తారు. చంద్రబాబు తిరుగుళ్లు మాత్రం ఊసుపోక చేస్తున్న దేశదిమ్మరి యాత్రల్లా ఉన్నాయి. ఓటమి తప్పదని తెలిసి తనను తాను ఊరడించుకునేందుకు ప్రాంతీయ నేతల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాడు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లకు అనుబంధంగా అమర్చిన ప్రింటర్‌లాంటి పరికరాలే వీవీప్యాట్లు. ఈవీఎంలలో నమోదైన ఓట్ల ఆధారంగానే లెక్కింపు ఉంటుంది. వీవీప్యాట్లను ముందు లెక్కించాలనే వాదన చూస్తే, గుర్రం బలంగా ఉందో లేదో చూడకుండా దాని తోకను కొలవాలనే మూర్ఖపు డిమాండులాగా కనిపిస్తోంది. సోనియాతోపాటు, ఉత్తరాది నేతలకూ సీన్ అర్థమైంది. ఎన్డీయే మళ్లీ అధికారంలోకి వస్తుందని మాయా, స్టాలిన్ అటు దూకేందుకు సిద్ధమవుతున్నారు. ఫెవికాల్ బాబా మాత్రం ఇవేమీ పట్టనట్టు ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని రాష్ట్రపతికి లేఖ ఇద్దాం అంటుంటే బాబు మానసిక స్థితిని వారు అనుమానిస్తున్నారు' అని విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు.