సాక్షి, తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది సోమవారం తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం శ్రీవారి దర్శనార్థం తిరుమల వెళ్లిన ఆయనకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాల అనంతరం ద్వివేది మాట్లాడుతూ.. ఏపీలో ఎన్నికలు విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. రికార్డు స్థాయిలో మహిళలు, వికలాంగులు, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదు అయ్యాయని వెల్లడించారు. దేశ వ్యాప్తంగా పోలింగ్‌లో ఏపీ రెండో స్థానాంలో నిలిచిందని ప్రకటించారు. కాగా ఏపీ ఎన్నికల సందర్భంగా ఈవీఎంలు పెద్ద ఎత్తున మొరాయించాయని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. దీనిపై ద్వివేది స్పందిస్తూ.. అదంతా తప్పుడు ప్రచారం అన్నారు. కేవలం రెండు శాతానికి మించి ఈవీఎంలు మొరాయించలేదని.. వీలైనంత త్వరలోనే వాటిని కూడా మరమత్తులు చేయించామని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రశాంతంగా జరిగే సహరించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment