Gopal Krishna Dwivedi
-
ఏపీకి నాలుగు స్కోచ్ అవార్డులు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ను నాలుగు స్కోచ్ అవార్డులు వరించాయి. 2021 సంవత్సరానికి గాను జౌళి, పశు సంవర్ధక, మత్స్యసంపద, వ్యవసాయ, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలకు ఈ అవార్డులు దక్కాయి. శనివారం ఢిల్లీలోని ఇండియా హాబిటాట్ సెంటర్లో జరిగిన 83వ స్కోచ్ సమ్మిట్‌లో ఇండియా గవర్నెన్స్ ఫోరం అవార్డులను ప్రదానం చేసింది. ఆంధ్రప్రదేశ్ పశు సంవర్ధక, మత్య్స సంపద, డెయిరీ అభివృద్ధి శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అవార్డును అందుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అమలవుతున్న పశు సంరక్షక యాప్, ఈ–ఫిష్, ఆర్బీకే స్థాయిలో పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్లు, విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్లు, రాష్ట్రవ్యాప్తంగా నిర్మిస్తున్న హార్బర్లు వంటి అనేక అంశాలను ఇతర రాష్ట్రాలతో బేరీజు వేసుకొని దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా ఏపీని ఎంపిక చేశారని తెలిపారు. అంతేగాక వ్యవసాయ రంగంలో రైతు భరోసా కేంద్రాలు వన్ స్టాప్ సొల్యూషన్‌గా ఉన్నాయని తెలిపారు. దేశంలోనే ఆర్బీకే వంటి వ్యవస్థ ఏదీ లేదని, దేశానికి ఇది దిక్సూచి అని స్కోచ్ సంస్థ ప్రశంసించి ఏపీకి వ్యవసాయ రంగంలో అవార్డు ఇచ్చిందని పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలనా దక్షత, ప్రజలకు మేలు చేసేందుకు ఆయన పడుతున్న తపన కారణంగానే ఈ అవార్డులు వచ్చాయని మంత్రి తెలిపారు. ఇలాంటి అవార్డులు ప్రజలకు మరింత సేవ చేసేందుకు ఉత్సాహాన్ని పెంపొందిస్తాయని అన్నారు. కాగా జౌళి శాఖలో వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం కింద అనంతపురం జిల్లాకు అవార్డు లభించింది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో వైఎస్సార్ చేయూత, గ్రామ, వార్డు సచివాలయాలకు ఇచ్చిన అవార్డును శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది అందుకున్నారు. -
ఎంపీడీవోలకు నెరవేరుతున్న పాతికేళ్ల కల
సాక్షి, అమరావతి: పాతికేళ్లుగా ఎంపీడీవోలు కంటున్న కలలు నెరవేరుతున్నాయి. 25 సంవత్సరాల కిందట ఎంపీడీవోలుగా ఉద్యోగంలో చేరినవారు కూడా అప్పటి నుంచి పదోన్నతులు లేకుండా ఇంకా అలాగే కొనసాగుతున్నారు. ఉద్యోగ విరమణ చేసేలోగా ఒక్క పదోన్నతి వస్తుందా అని వాళ్లంతా ఎదురుచూస్తున్నారు. వారి కల ఇప్పుడు నేరవేరబోతుంది. ఎంపీడీవోలకు పదోన్నతి కల్పించడానికి వారి క్యాడర్‌కు పైస్థాయిలో తగినన్ని పోస్టులు లేకపోవడంతో వారి పదోన్నతి ప్రక్రియ ఇన్నాళ్లు నిలిచిపోయింది. ఈ సమస్యను పరిష్కరిస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. గ్రామీణాభివృద్ధిశాఖలో 149 పోస్టుల్లో ఆన్‌డ్యూటీ లేదా డిప్యుటేషన్ రూపంలో ఎంపీడీవోలను మాత్రమే పదోన్నతులపై నియమించేలా సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. గ్రామీణాభివృద్ధిశాఖలోని కమిషనర్ కార్యాలయంలో ఉపాధిహామీ పథకం, వాటర్‌షెడ్ పథకం విభాగాల్లో 9 కేటగిరీల్లో 15 పోస్టులు, జిల్లాల్లోని డ్వామా పీడీ కార్యాలయాల్లో మరో 9 కేటగిరీల్లో 134 పోస్టులు కలిపి మొత్తం 149 పోస్టుల్లో ఆన్‌డ్యూటీ లేదా డిప్యుటేషన్ విధానంలో ఎంపీడీవోలను మాత్రమే పదోన్నతి ద్వారా నియమించనున్నట్లు గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. ఆ 149 పోస్టుల్లో ప్రస్తుతం డిప్యుటేషన్, ఆన్‌డ్యూటీలో కొనసాగుతున్నవారు నిర్ణీత సర్వీసు కాలం ఆ పోస్టుల్లోనే కొనసాగుతారని, భవిష్యత్‌లో ఆ పోస్టుల్లో ఏర్పడే ఖాళీల్లోనే ఎంపీడీవోలను పదోన్నతిపై నియమించనున్నట్లు తెలిపారు. 200 మందికిపైగా ఒకేసారి పదోన్నతి.. పాతికేళ్లుగా ఎంపీడీవోలు పదోన్నతులకు నోచుకోని అంశంపై జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే దృష్టి పెట్టారు. దీంతో పదోన్నతులకు వేచి ఉన్నవారికి ఒకేసారి పెద్దసంఖ్యలో పదోన్నతులు కల్పించేందుకు కసరత్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖలో రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఇప్పటికే డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ (డీఎల్డీవో) పోస్టు వ్యవస్థను ఏర్పాటు చేసి కొత్తగా 51 డీఎల్డీవో పోస్టులను ఎంపీడీవోలకు పదోన్నతి ద్వారా భర్తీకి ఇప్పటికే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇప్పుడు కొత్తగా మరో 149 పోస్టుల కోసం పదోన్నతికి వీలు కల్పించింది. ఒకేసారి 200 మందికిపైగా ఎంపీడీవోలకు పదోన్నతి దక్కేలా కసరత్తు చేస్తున్నట్లు గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు తెలిపారు. -
అక్కడ మధ్యాహ్నం 2 వరకే పోలింగ్
సాక్షి, అమరావతి: ఈ నెల 16న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగే చోట సా.5 గంటల వరకు పోలింగ్ జరుగుతున్నప్పటికీ.. తూర్పు గోదావరి జిల్లాలోని 14 ఎంపీటీసీ స్థానాల్లో మాత్రం మ.2 గంటల వరకే పోలింగ్ నిర్వహించనున్నారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో శాంతిభద్రతల అంశానికి సంబంధించి జిల్లా కలెక్టర్ నుంచి అందిన నివేదిక మేరకు.. ఆ జిల్లాలో ఏటపాక మండలంలోని 12 ఎంపీటీసీ స్థానాలతో పాటు వీఆర్ పురంలోని చినమట్టపల్లి ఎంపీటీసీ, మారేడుమిల్లి మండలంలోని దొరచింతలవాని పాలెం ఎంపీటీసీ పోలింగ్ సా.5 గంటల వరకు కాకుండా మ.2 గంటల వరకే కొనసాగుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఆదేశాలు జారీచేశారు. 14, 16 తేదీల్లో సెలవు: ఇక గ్రామ సర్పంచి, వార్డు సభ్యుల ఎన్నికలు జరిగే చోట ఈ నెల 14న.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగే చోట ఈనెల 16న ప్రభుత్వ కార్యాలయాలతోపాటు ఇతర అన్ని రకాల సంస్థలకు సెలవు ప్రకటిస్తూ పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీచేశారు. అలాగే, పంచాయతీ ఎన్నికలు జరిగే చోట పోలింగ్ ముగిసే సమయానికి 44 గంటల ముందు నుంచీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగే చోట 48 గంటల ముందు నుంచి మద్యం అమ్మకాలను నిలుపుదల చేయాలని కూడా ఉత్తర్వులిచ్చారు. ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ సాక్షి, అమరావతి/నెల్లూరు సిటీ: నెల్లూరు కార్పొరేషన్‌తోపాటు 12 మునిసిపాలిటీలు, నగర పంచాయతీలతో పాటు వివిధ కార్పొరేషన్లలో జరుగుతున్న 353 డివిజన్లు, వార్డుల్లో ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారం ముగిసింది. నెల్లూరు కార్పొరేషన్లో 54 డివిజన్లకు ఎన్నికలు జరుగుతుండగా 8 డివిజన్లలో వైఎస్సార్సీపీ అభ్యర్థులు మాత్రమే బరిలో నిలిచినట్టు తెలిసింది. అనధికారికంగా అందిన సమాచారం మేరకు.. గుంటూరు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీలో ఒక వార్డులో, గురజాల నగర పంచాయతీలో ఆరు వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు మాత్రమే బరిలో ఉన్నారు. ప్రకాశం జిల్లా దర్శిలో ఒక వార్డు, చిత్తూరు జిల్లా కుప్పం మునిసిపాలిటీలో ఒక వార్డులో వైఎస్సార్సీపీ అభ్యర్థులు మినహా మిగిలినవారు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో ఈ వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఎన్నిక దాదాపు ఏకగ్రీవమేనని, అధికారిక ప్రకటన మాత్రమే వెలువడాల్సి ఉందని సమాచారం. గతంలో ఎన్నికలు నిలిచిన, గెలిచినవారి మరణంతో ఖాళీ అయిన వార్డులకు ప్రస్తుతం ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ తరహాలో ఎన్నికలు జరుగుతున్న గుంటూరు జిల్లా మాచర్ల మునిసిపాలిటీలోని 8వ వార్డు, రేపల్లెలోని 16, మచిలీపట్నంలో 32, నూజివీడు 27వ వార్డులో నామినేషన్ల ఉపసంహరణల అనంతరం వైఎస్సార్సీపీ అభ్యర్థులే బరిలో ఉన్నారు. -
సిలికా శాండ్ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించండి
సాక్షి, అమరావతి: సిలికా శాండ్ ఆధారిత పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించాలని గనులు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ఖనిజ వనరులను సద్వినియోగం చేసుకుంటూ ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని పెంచుకోవాలన్నారు. తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో మంగళవారం గనుల శాఖ అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. ఎలాంటి అవినీతికి తావు లేకుండా గనుల శాఖలో పారదర్శక విధానాలను తీసుకువచ్చామన్నారు. ఆన్లైన్ దరఖాస్తులు, ఈ–పర్మిట్ విధానం ద్వారా ఎలాంటి జాప్యం లేకుండా అనుమతులు మంజూరు చేస్తున్నామన్నారు. ప్రభుత్వం గనుల లీజుల విషయంలో తీసుకుంటున్న నిర్ణయాల వల్ల గత ఏడాది కంటే ఈ ఏడాది ఆదాయం పెరుగుతుందని చెప్పారు. ఈ మేరకు అధికారులు కూడా బాధ్యతతో వ్యవహరించాలని కోరారు. ఏపీఎండీసీ ద్వారా రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రాజెక్టులను ప్రారంభించామని, వాటి ద్వారా కూడా అదనపు ఆదాయం ప్రభుత్వానికి సమకూరుతుందని అధికారులు తెలిపారు. సిలికా శాండ్, కాల్సైట్, ఐరన్ ఓర్, గ్రానైట్ ఖనిజాలను వెలికితీయడం ద్వారా రెవెన్యూ వనరులను పెంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వివరించారు. ఈ సమావేశంలో గనులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, గనుల శాఖ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి, జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్, ఏపీఎండీసీ జీఎం (మైన్స్) కేదార్‌నాథ్‌రెడ్డి, జీఎం (కోల్) లక్ష్మణరావు, డీజీఎం నతానేయల్ తదితరులు పాల్గొన్నారు. -
అగ్రిగోల్డ్ బాధితులకు ఆగస్టు 24న డబ్బులు
సాక్షి, అమరావతి: అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట కల్పిస్తూ రూ.20 వేలలోపు డిపాజిట్ చేసిన వారికి ఆగస్టు 24వ తేదీన డబ్బులు చెల్లించనున్నట్లు సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. ఇప్పటికే రూ.10 వేల లోపు డిపాజిట్ చేసిన అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బులు చెల్లించిన విషయం తెలిసిందే. ‘స్పందన’లో భాగంగా సీఎం మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ఆగస్టులో చేపట్టనున్న కార్యక్రమాలను ప్రకటించడంతో పాటు కోవిడ్, ఉపాధి హామీ పనులు, వైఎస్సార్ అర్బన్ క్లినిక్స్, గృహ నిర్మాణం, ఇళ్ల స్థలాల పంపిణీ తదితర అంశాలపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి (వైద్య ఆరోగ్యశాఖ) ఆళ్ల నాని, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్, డీజీపీ గౌతం సవాంగ్, ల్యాండ్ అడ్మినిస్టేషన్ చీఫ్ కమిషనర్ నీరబ్ కుమార్ ప్రసాద్, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, గృహనిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, పట్టణాభివృద్ధి, పురపాలకశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి ఉషారాణి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి(హెచ్ఆర్) శశిభూషణ్ కుమార్ పాల్గొన్నారు. సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ.. ఇళ్ల నిర్మాణ పనులపై సమీక్ష మొదటి విడతలో 15.6 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టాం. ఇందులో 10.01 లక్షల ఇళ్ల పనులు ప్రారంభం అయ్యాయి. లే అవుట్లలో నీరు, కరెంట్ చాలావరకూ కల్పించారు. మిగిలిపోయిన సుమారు 600కిపైగా లే అవుట్లలో నీటి వసతిని కల్పించేలా వెంటనే చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వమే ఇళ్లు కట్టించి ఇవ్వాలన్న ఆప్షన్‌ను 3.18 లక్షల మంది ఎంచుకున్నారు. వీరిలో 20 మందితో ఒక గ్రూపు ఏర్పాటు చేయాలి. స్థానికంగా మేస్త్రీలను గుర్తించి పనులను ఆ గ్రూపులకు అనుసంధానం చేయాలి. ఆగస్టు 10 కల్లా గ్రూపుల ఏర్పాటు పూర్తికావాలి. వర్షాలు ప్రారంభమైనందున ఇసుక పంపిణీలో అవాంతరాలు లేకుండా చూసుకోవాలి. ఇళ్ల నిర్మాణం ద్వారా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది. టిడ్కో ఇళ్లకు అనర్హులైన వారి స్థానంలో కొత్త లబ్ధిదారులను ఎంపిక చేయాలి. వచ్చే స్పందన లోగా ఈ పని పూర్తి కావాలి. ఇక ముందూ ఫోకస్డ్గా టెస్టులు ఇక ముందూ ఫోకస్డ్గా కోవిడ్ టెస్టులు జరగాలి. లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు చేయాలి. ఎవరైనా కోరితే వారికి కూడా పరీక్షలు చేయాలి. ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాలి. థర్డ్‌వేవ్ వస్తుందో లేదో తెలియదు కానీ మనం అప్రమత్తంగా ఉండాలి. మందులు, బయోమెడికల్ ఎక్విప్మెంట్లను సిద్ధం చేసుకోవాలి. వ్యాక్సినేషన్ రాష్ట్రంలో 1.53 కోట్ల మందికి ఇప్పటివరకూ ఒక డోసు వాక్సిన్ ఇచ్చాం. దాదాపు 7 కోట్ల డోసులు అవసరం ఉంటే 1.53 కోట్ల డోసులు వేశాం. వ్యాక్సినేషన్ విషయంలో ఇంకా మనం చాలా దూరం వెళ్లాల్సి ఉంది. 45 ఏళ్లకు పైబడ్డ వారికి 75.89 శాతం మందికి వ్యాక్సిన్ ఇచ్చాం. దీన్ని 90 శాతం వరకూ తీసుకెళ్లాలి. తర్వాత మిగిలిన ప్రాధాన్యతా వర్గాలకు వ్యాక్సిన్లు ఇవ్వాలి. టీచర్లు, గర్భిణులు, కాలేజీ విద్యార్థులకు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ రేటు 2.82 శాతం ఉంది. రెండో వేవ్‌లో కొన్ని జిల్లాల్లో 25 శాతం పాజిటివిటీ రేటు చూశాం. క్రమంగా తగ్గుతూ వచ్చింది. కోవిడ్ నివారణకు కలెక్టర్లు నుంచి గ్రామ సచివాలయ సిబ్బంది, వలంటీర్లు, ఆశావర్కర్లు, డాక్టర్లు, ఏఎన్ఎంలు అందరూ కలసికట్టుగా పనిచేశారు. అందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. నిర్మాణ పనులు వేగవంతం కావాలి గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, వైఎస్సార్ హెల్త్‌క్లినిక్స్, ఏఎంసీ, బీఎంసీల నిర్మాణంపై దృష్టిపెట్టండి. రాష్ట్రవ్యాప్తంగా 10,929 గ్రామ సచివాలయాలను నిర్మిస్తున్నాం. సచివాలయాల నిర్మాణంలో కృష్ణా, నెల్లూరు, తూర్పు గోదావరి జిల్లాలు వెనకబడి ఉన్నాయి. కలెక్టర్లు దీనిపై ధ్యాస పెట్టాలి. సెప్టెంబరు 30 కల్లా నిర్మాణ పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి. 10,408 ఆర్బీకేలు నిర్మిస్తున్నాం. ఆర్బీకేలలో బేస్మెంట్ లెవల్లో తూర్పు గోదావరి, కృష్ణా, కర్నూలు జిలాల్లో నిర్మాణాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. డిసెంబరు 31 కల్లా పూర్తిచేసేలా దృష్టిపెట్టాలి. 4,530 గ్రామ పంచాయతీలకు ఫైబర్ కనెక్షన్లు డిసెంబర్ కల్లా వస్తాయి. ఆ సమయానికి డిజిటల్ లైబ్రరీలను పూర్తిచేయడంపై దృష్టిపెట్టాలి. డిజిటల్ లైబ్రరీలను పూర్తిచేస్తే సంబంధిత గ్రామాల నుంచే వర్క్‌ఫ్రం హోం అవకాశాలను కల్పించగలుగుతాం. ఆగస్టు 15 కల్లా వీటి నిర్మాణాలు ప్రారంభించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి. స్పందన కార్యక్రమాన్ని మళ్లీ ప్రారంభించడం సంతోషకరం. కోవిడ్ కారణంగా ఇన్నాళ్లుగా జరగలేదు. మళ్లీ పునఃప్రారంభం కావడం సంతోషకరం. ప్రజలకు మంచి జరిగే కార్యక్రమం ఇది. ఇళ్ల పట్టాల పంపిణీ మొదటి దశలో 30 లక్షలకుపైగా ఇళ్ల పట్టాలు ఇచ్చాం. 3,69,448 మందికి కోర్టు కేసుల కారణంగా అందలేదు. ఈ కేసులు త్వరగా పరిష్కారమై వారికి మంచి జరగాలని దేవుడిని కోరుకుంటున్నా. ఇళ్ల పట్టాల మంజూరుకు సంబంధించి 10,007 దరఖాస్తులు పెండింగులో ఉన్నాయి. వీటిని వెంటనే పరిశీలించి అర్హులను గుర్తించాలి. అర్హులుగా తేల్చిన 1,90,346 మందికి వెంటనే పట్టాలు ఇవ్వాలి. ఇందులో ప్రస్తుతం ఉన్న లే అవుట్లలో దాదాపు 43 వేల మందికి పట్టాలు, మరో 10,652 మందికి ప్రభుత్వ స్థలాల్లోనే పట్టాలు ఇవ్వాలి. మరో 1.36 లక్షల మందికిపైగా లబ్ధిదారులకు భూ సేకరణ చేయాల్సి ఉంది. ఆ ప్రక్రియను వెంటనే పూర్తిచేయాలి. 15 నుంచి జగనన్న పచ్చతోరణం.. ఆగస్టు 15 నుంచి 31 వరకూ రాష్ట్రవ్యాప్తంగా కోటి మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. దీన్ని చేరుకునేలా కలెక్టర్లు చొరవ తీసుకోవాలి. ఆగస్టు 5 నాటికి మొక్కల కొనుగోలుకు సంబంధించి టెండర్లు ఖరారు కావాలి. మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలి. గ్రామాల్లో సర్పంచులు, వలంటీర్లు, సచివాలయ సిబ్బందిని ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలి. మొక్కలు నాటగానే సరిపోదు. నీరు పోయడం, సంరక్షణపై దృష్టిపెట్టాలి. మొక్కలు పచ్చగా కళకళలాడేలా శ్రద్ధ వహించాలి. -
ఉపాధి హామీ పనుల్లో ఏపీ సరికొత్త రికార్డు
సాక్షి, అమరావతి: ఉపాధిహామీ పనుల్లో ఏపీ సరికొత్త రికార్డు నమోదు చేసింది. లక్ష్యాన్ని మించి పనిదినాలను కల్పించిన ప్రభుత్వ యంత్రాంగం చరిత్ర సృష్టించింది. కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం జూన్ 30 నాటికి 16 కోట్ల పనిదినాలు కల్పించాల్సిం ఉండగా.. ఏపీ ప్రభుత్వం రికార్డు స్థాయిలో 16.7 కోట్ల పనిదినాలు కల్పించి రికార్డు సృష్టించింది. ఈ సందర్భంగా లక్ష్యం చేరుకోవడంలో ఎంతో శ్రమించిన ఉద్యోగులను పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాల కృష్ణ ద్వివేది ప్రశంసించారు. -
ఇసుక రీచ్‌ల సబ్ లీజుల పేరిట భారీ మోసం
సాక్షి, అమరావతి/ భవానీపురం (విజయవాడ): రాష్ట్రంలో ఇసుక రీచ్‌లను సబ్ లీజుకు ఇస్తామని బురిడీ కొట్టిస్తూ రాష్ట్రంలో భారీ దందాకు పన్నాగం పన్నిన ముఠా గుట్టురట్టైంది. ఇప్పటికే ఆ ముఠా పలు జిల్లాల్లో ఇసుక రీచ్‌లు సబ్ లీజుకు ఇస్తామని చెప్పి ఏడుగురి నుంచి రూ.3.50 కోట్లు కొల్లగొట్టిందని వెలుగు చూసింది. ఈ ముఠాకు చెందిన ఆరుగురిపై విజయవాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏపీలో ఇసుక రీచ్‌ల తవ్వకాల కోసం నిర్వహించిన టెండర్లను ఢిల్లీకి చెందిన జయప్రకాశ్ (జేపీ) గ్రూప్ దక్కించుకున్న విషయం తెలిసిందే. కాగా జేపీ గ్రూప్ నుంచి ఇసుక రీచ్‌ల సబ్ లీజు కాంట్రాక్టు తాము పొందామని సుధాకర ఇన్ఫ్రా టెక్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ఓ ముఠా ఘరానా మోసానికి తెరతీసింది. హైదరాబాద్ చిరునామాతో ఆ కంపెనీని ఏర్పాటు చేసినట్టు చెబుతూ విజయవాడ గొల్లపూడిలోని ఓ ఇంటి నుంచి దందా మొదలుపెట్టింది. ఇందుకోసం రాష్ట్ర గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది సంతకాన్ని సైతం ఫోర్జరీ చేసి మరీ డాక్యుమెంట్లు సృష్టించింది. ఇసుక రీచ్‌లు కావాలంటే రూ.40 కోట్లు చెల్లించాలంటూ.. సుధాకర ఇన్ఫ్రా టెక్ కంపెనీకి సబ్ లీజుకు కోట్ల రూపాయలు చెల్లించిన కొందరు తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక రీచ్‌లలో తవ్వకాలకు ప్రయత్నించగా జేపీ గ్రూప్ సిబ్బంది అడ్డుకున్నారు. దాంతో తాము సుధాకర ఇన్ఫ్రా టెక్ కంపెనీ నుంచి సబ్ లీజుకు తీసుకున్నామని చెప్పడంతో జేపీ గ్రూప్ సిబ్బంది నివ్వెరపోయారు. ఈ విషయాన్ని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఎస్ఈబీ అధికారులు, జేపీ గ్రూప్ ప్రతినిధులు కలిసి ఈ ఇసుక సబ్ లీజుల అక్రమ బాగోతాన్ని తెలుసుకునేందుకు రంగంలోకి దిగారు. జేపీ గ్రూప్ మేనేజర్ విశ్వనాథన్ సతీష్ విజయవాడ భవానీపురంలోని సుధాకర ఇన్ఫ్రా టెక్ కంపెనీ ప్రతినిధులు ఉన్న ఇంటికి వెళ్లి ఇసుక రీచ్‌ల సబ్‌లీజు కోసం వచ్చానని చెప్పారు. ఈ క్రమంలో కొప్పురావూరి ప్రవీణ్ కుమార్, మల్లంపాటి శ్రీనివాసరావు, ముక్కోలు నాగమల్లేశ్వరరావు తమను తాము సుధాకర ఇన్ఫ్రా టెక్ కంపెనీ ప్రతినిధులుగా పరిచయం చేసుకున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో మూడేళ్లపాటు ఇసుక రీచ్‌లు సబ్ లీజుకు ఇచ్చేందుకు రూ.40 కోట్లు చెల్లించాలని చెప్పారు. తమ కంపెనీ జేపీ గ్రూప్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఇసుక రీచ్‌లను సబ్ లీజుకు తీసుకున్నట్టు సృష్టించిన ఫోర్జరీ పత్రాలు చూపించారు. సుధాకర ఇన్ఫ్రా టెక్ కంపెనీ ప్రతినిధి కె.సురేంద్రనాథ్ తమ కంపెనీ తరఫున శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఇసుక రీచ్‌లను సబ్ లీజుకు ఇచ్చే అధికారాన్ని నీలాపు తిరుమలరెడ్డి (విశాఖపట్నం), వెలంపల్లి రఘు నరసింహరాజు (హైదరాబాద్)లకు అప్పగించినట్టు మరో ఫోర్జరీ పత్రాలను చూపారు. వారిని నమ్ముతున్నట్టుగానే వ్యవహరించిన జేపీ గ్రూప్ ప్రతినిధి సతీష్ అక్కడ నుంచి వచ్చేశారు. అనంతరం తమ కంపెనీ పేరుతో ఘరానా మోసానికి పాల్పడుతున్న ఆరుగురిపై భవానీపురం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. తెలంగాణలోనూ ఫోర్జరీ పత్రాలతో మోసం పోలీసులు ఘరానా మోసానికి పాల్పడుతున్న కొప్పురావూరి ప్రవీణ్ కుమార్, మల్లంపాటి శ్రీనివాసరావు, ముక్కోలు నాగ మల్లేశ్వరరావు, సురేంద్రనాథ్, నీలాపు తిరుమలరెడ్డి, వెలంపల్లి రఘు నరసింహరాజు, తదితరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ వ్యవహారంపై కూపీ లాగగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ముఠా ఇప్పటికే వివిధ జిల్లాల్లో ఇసుక రీచ్‌లను సబ్లీజుకు ఇస్తామని చెప్పి రూ.3.50 కోట్లు వసూలు చేసినట్టు వెల్లడైంది. ఆ కంపెనీ బ్యాంకు ఖాతాల్లో రూ.2 కోట్లు ఉన్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. ఈ ముఠా గతంలో తెలంగాణలో కూడా ఫోర్జరీ పత్రాలతో మోసానికి పాల్పడటంతో సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. విజయవాడ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. -
నేటితో ముగియనున్న ‘పరిషత్’ ప్రచారపర్వం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పరిషత్ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఏప్రిల్ 8వ తేదీన జరుగనున్న ఎన్నికలు, 10వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇలా ఉండగా పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది సోమవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించి పలు సూచనలు జారీ చేశారు. కోవిడ్–19 నిబంధనలు పాటిస్తూ ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదేశించారు. పోలింగ్ సామగ్రి, పోలింగ్ సిబ్బందికి శిక్షణ, రవాణా ఏర్పాట్లు, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, సమాచార కేంద్రాలు, ఎన్నికల నిబంధనలు, కౌటింగ్ ఏర్పాట్లు వంటి అంశాలపై ద్వివేది సమీక్షించారు. 8న ప్రభుత్వ సెలవు.. నేగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1881 ప్రకారం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఏప్రిల్ 8వ తేదీన సెలవుదినంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ఏపీపీఆర్ యాక్ట్ 225ఏ ప్రకారం ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ముందస్తుగా 48 గంటల పాటు మద్యం అమ్మకాలను నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1988 ప్రకారం 8వ తేదీని ఉద్యోగులు, కార్మికులకు వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించింది. ఎన్నికల తేదీని స్థానిక సెలవుగా ప్రకటించడంతో ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించాలని ఆదేశించింది. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల భవనాలను ఒక రోజు ముందు నుంచి..అనగా 7వ తేదీ నుంచి వినియోగించుకోవడానికి అనుమతించింది. ప్రభుత్వ ఉద్యోగులు ఓటర్లను ప్రభావితం చేయరాదని, అలాగే ఎవరికి ఓటు వేశామన్న విషయాన్ని కూడా బహిర్గతం చేయకూడదని స్పష్టం చేసింది. చిటికెన వేలుపై సిరా గుర్తు గురువారం జరుగనున్న పరిషత్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే వారికి ఎడమ చేతి చిటికెన వేలుసై సిరా గుర్తు వేయాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. గత పంచాయతీ ఎన్నికల్లో ఎడమ చేతి చూపుడు వేలుకు సిరా గుర్తు వేసినందున అది ఇంకా చెరగకపోవడంతో చిటికెన వేలుకు సిరా గుర్తు వేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. -
'నో ఆన్లైన్ బుకింగ్.. ఎక్కడినుంచైనా ఇసుకను తీసుకెళ్లొచ్చు'
సాక్షి, విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ఇసుక విధానంతో ప్రజలకు ఎంతో మేలు కలుగుతుందని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. సోమవారం విలేకరులతో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఇసుక టెండర్ల విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఈ కొత్త పాలసీ ఎంతో పారదర్శకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులు, ప్రజల నుండి వచ్చిన ఫీడ్ బ్యాక్ తీసుకుని పాలసీలో మార్పులు చేసి నూతన ఇసుక విధానాన్ని ప్రవేశ పెట్టామని చెప్పారు. నిర్ణయించిన ధరకే ఇసుక అమ్మకాలు జరుగుతున్నాయని, ప్రతీ నియోజకవర్గానికి ఒక ఇసుక రీచ్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అన్ని రీచ్‌ల్లోనూ ఒకే ధర అమలు చేస్తున్నామని, ప్రతి ఇసుక రీచ్ వద్ద 20 వాహనాలు ఏర్పాటు చేసిట్లు చెప్పారు. రాష్ట్రంలో ప్రతి రీచ్‌ల్లోనూ ధరను ముందే నిర్ణయిస్తున్నామని, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లేకుండా వినియోగదారులు నేరుగా వచ్చి వారి సొంత వాహనాల్లో ఇసుకను తీసుకెళ్లొచ్చని, నాణ్యతను పరిశీలించి తమకు నచ్చినచోట ఇసుక తీసుకెళ్లే వెసులుబాటు ఉందని వివరించారు. ఇసుక తవ్వకాలు, అమ్మకాలను ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించడంపై వస్తోన్న ఆరోపణలపై ఆయన స్పందిస్తూ.. 'ఇసుక తవ్వకాలు, రీచ్‌ల నిర్వహణ, అమ్మకాలకు సంబంధించి టెండర్లను ఆహ్వానించాం. ఎవ్వరైనా పాల్గొనేందుకు వారం రోజులు అదనపు సమయం కూడా ఇచ్చాం. పూర్తి పారదర్శకంగా టెండర్లను నిర్వహించాం. ఇందులో భాగంగానే జనవరి 4న ఎంఎస్టీసీతో ఒప్పందం కుదుర్చుకున్నాం. ఈ సంస్థ టెండర్ల విధానంలో ఎంతో అనుభవం ఉన్న ఏజెన్సీ. మూడు ప్యాకేజీల కు కచ్చితంగా నిబంధనలు పెట్టాం. సాంకేతిక, ఆర్థిక అర్హతలు అన్ని ముందే పరిశీలించాం. ఏడాదికి సుమారు వెయ్యి కోట్లు ఇసుకను సరఫరా చెయ్యగలరు. ప్రతి 15 రోజులకు ప్రభుత్వానికి టెండర్ సంస్థ డబ్బులు చెల్లించాలి. 70 శాతం రీచ్ లు ఖచ్చితంగా నిరంతరం అందుబాటులో ఉండాలి. ఇసుక కొరత సృష్టించడానికి వీలు లేకుండా నిబంధనలు రూపొందించాం. వాళ్ళు ప్రభుత్వాన్ని మోసం చెయ్యలేరు. ప్రతి రీచ్ దగ్గర టన్ను ఇసుక 475 ధర ను ఖరారు చేశాం. దానికి అదనంగా రవాణా ఛార్జీల ఉంటాయి' అని స్పష్టం చేశారు. చదవండి : విశాఖలో బీఎస్–6 ఇంధన ఉత్పత్తి స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణకు ఒప్పుకోం: విజయసాయిరెడ్డి -
నేటి రాత్రికే గ్రామాలకు..
సాక్షి, అమరావతి: తొలి విడత పంచాయతీ ఎన్నికలు ఈ నెల 9వతేదీన జరగనున్న నేపథ్యంలో పోలింగ్ సిబ్బంది ఎన్నికల సామగ్రితో సహా ముందు రోజు రాత్రికే ఆయా గ్రామాలకు చేరుకునేలా జిల్లా అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఆదేశించారు. ఎన్నికల ఏర్పాట్లపై గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజాశంకర్ ఆదివారం సాయంత్రం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. బ్యాలెట్ పేపర్లు, స్వస్తిక్ మార్క్, రబ్బర్ స్టాంప్‌లు, ఇండెలిబుల్ ఇంకు తదితర సామాగ్రిని సిబ్బంది సోమవారం మధ్యాహ్నం కల్లా తీసుకుని ఆయా పోలింగ్ బూత్‌లకు చేరుకోవాలని, రిటర్నింగ్ అధికారులు, పీవోలు పోలింగ్ ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని ద్వివేది పేర్కొన్నారు. ఆయా రూట్లలో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద బ్యారికేడ్లతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని, ఓట్ల లెక్కింపు రాత్రంతా జరిగే పక్షంలో తగినన్ని లైట్లను సిద్ధం చేసుకోవాలని కమిషనర్ గిరిజా శంకర్ సూచించారు. సిబ్బందికి భోజనం తదితర సదుపాయాలను కల్పించాలని, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. వెబ్‌కాస్టింగ్ ద్వారా నిఘా.. వెబ్ కాస్టింగ్ ద్వారా అన్ని కేంద్రాలపై నిఘా వేయాలని, కంట్రోల్ రూం ద్వారా వెబ్‌కాస్టింగ్‌ను నిరంతరం పర్యవేక్షించాలని గిరిజా శంకర్ సూచించారు. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటే రికార్డు చేసిన డేటాను వినియోగించుకునేందుకు నిక్షిప్తం చేయాలన్నారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా అన్ని చర్యలు తీసుకోవాలని, మాస్కులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలన్నారు. వీటి కొనుగోళ్లకు అవసరమైన నిధులను ఎంపీడీవోలకు పంపాలని జిల్లా అధికారులను కమిషనర్ ఆదేశించారు. అవసరమైతే నాలుగో దశలో విధులు కేటాయించిన ఎంపీడీవోలను కూడా మొదటి దశకు వినియోగించుకోవాలని కమిషనర్ సూచించారు. -
వైఎస్సార్ ఆసరా నగదుపై ఆంక్షలు లేవు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా పొదుపు సంఘాల మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బును బ్యాంకులు లబ్ధిదారుల అంగీకారం లేకుండా, సంఘం లేదా సంబంధిత మహిళల వ్యక్తిగత అప్పులకు జమ చేసుకోవడానికి వీల్లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. మహిళలు ఆ డబ్బును ఏ అవసరాలకైనా వినియోగించుకోవచ్చని, వీటిపై ఎటువంటి ఆంక్షలు ఉండవని కూడా పేర్కొంది. ఈ మేరకు వైఎస్సార్ ఆసరా పథకం విధివిధానాలను ఖరారు చేస్తూ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ► 2019 ఏప్రిల్ 11వ తేదీ నాటికి పొదుపు సంఘాలకు బ్యాంకులో ఉన్న అప్పు మొత్తాన్ని ఆసరా పథకం ద్వారా ఈ ఆర్థిక ఏడాది నుంచి నాలుగు విడతల్లో సంబంధిత సంఘం సేవింగ్స్ ఖాతాలో జమ చేయనున్నట్టు ఉత్తర్వులో పేర్కొన్నారు. ► సంఘాల ఖాతాల్లో నగదు జమ అయిన తర్వాత ఆ సంఘంలోని మహిళల వ్యక్తిగత బ్యాంకు ఖాతాలో నగదు జమ చేయడంతో పాటు సంఘం మినిట్స్ బుక్‌లోనూ, మహిళల వ్యక్తిగత బ్యాంకు పాస్ బుక్‌లలోనూ ఆ వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలి. ► 2019 ఏప్రిల్ 11 నాటికి ఏదైనా సంఘాన్ని బ్యాంకు ఎన్పీఏగా గుర్తించి ఉంటే అలాంటి సంఘాలకు ఈ పథకం వర్తించదు. సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితా.. ► వైఎస్సార్ ఆసరా ద్వారా లబ్ధి పొందుతున్న మహిళల ప్రాథమిక జాబితాలను ఈనెల 25న అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉంచనున్నట్టు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈవో తెలిపారు. ► ఈ నెల 28న స్థానికంగా సోషల్ ఆడిట్ నిర్వహించి, 29న లబ్ధిదారుల జాబితాలు గ్రామ, వార్డు సచివాలయాలతో పాటు సెర్ప్, మెప్మా వెబ్సైట్లలోనూ ఉంచుతారు. ► అర్హత ఉండీ ఆ జాబితాలో పేరు లేని వారి నుంచి ఫిర్యాదుల స్వీకరణకు సెర్ప్, మెప్మాలు జిల్లా స్థాయిలో ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ► స్పందన కాల్ సెంటర్, సెర్ప్, మెప్మా ప్రధాన కార్యాలయాల్లోనూ ఫిర్యాదులు స్వీకరించనున్నారు. సెప్టెంబర్ 11న పథకం ప్రారంభం 2019 ఏప్రిల్ 11వ తేదీ అంటే అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తేదీ నాటికి అక్కచెల్లెమ్మలకు ఉన్న పొదుపు సంఘాల రుణాల మొత్తం సొమ్మును నాలుగు దఫాలుగా నేరుగా చేతికే అందిస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తేదీ నాటికి బ్యాంకర్ల కమిటీ ప్రాథమిక నివేదిక ప్రకారం 9,33,180 పొదుపు సంఘాల పేరిట రూ. 27,168 కోట్ల మేర రుణాలు ఉన్నాయి. సెప్టెంబర్ 11న వైఎస్సార్ ఆసరా పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నట్లు ఇప్పటికే సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. -
2.5 ఎకరాలకు ఒక ఉచిత బోరు
సాక్షి, అమరావతి: సన్న, చిన్న కారు రైతులకు ‘వైఎస్సార్ రైతు భరోసా’ పథకం ద్వారా ఉచిత బోర్ వెల్స్ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్టు గ్రామీణాభివృద్ది శాఖ ప్రకటించింది. నవరత్నాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. దీని అమలుకు సంబంధించి శుక్రవారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వుల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. ► బోరు డ్రిల్లింగ్ కార్యకలాపాలు చేపట్టే ముందు సంబంధిత రైతు పొలంలో హైడ్రో–జియోలాజికల్, జియోఫిజికల్ సర్వే నిర్వహిస్తారు. ఆ తర్వాతే బోరు బావుల నిర్మాణ ప్రక్రియ మొదలు పెట్టాలి. ► భూగర్భ జల మట్టం ప్రస్తుతం ప్రమాదకర స్థాయిలో ఉన్నట్టు గుర్తించిన 1,094 రెవెన్యూ గ్రామాల పరిధిలో ఈ పథకాన్ని అమలు చేయరు. అర్హతలు, విధివిధానాలు.. ► రైతుకు కనీసం 2.5 ఎకరాల భూమి ఉండాలి. అంత భూమి లేకపోతే పక్కనున్న రైతులతో కలిసి గ్రూపుగా ఏర్పడవచ్చు. ఒక రైతుకు గరిష్టంగా 5 ఎకరాల లోపు భూమి ఉండవచ్చు. ఈ అర్హతలు ఉన్న రైతులు బోరు బావి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే అంతకు ముందు ఆ భూమిలో ఎలాంటి బోరు బావి నిర్మాణం చేపట్టి ఉండకూడదు. ► అర్హత కలిగిన లబ్ధిదారుడు పట్టాదార్ పాస్ బుక్, ఆధార్ కార్డు కాపీతో గ్రామ సచివాలయంలో లేదా నేరుగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ► పంచాయతీ కార్యదర్శి క్షేత్ర స్థాయి పరిశీలన అనంతరం తదుపరి అనుమతికి ఎంపీడీవోకు ఆ దరఖాస్తు వెళుతుంది. జిల్లా మొత్తంలో ఎంపిక చేసిన రైతుల జాబితాలను డ్వామా పీడీలకు ఎంపీడీవోలు అందజేస్తారు. ► బోరు బావి మంజూరు అనంతరం ఆ çసమాచారాన్ని గ్రామ సచివాలయం ద్వారా రైతుకు తెలియజేస్తారు. -
చంద్రబాబు, రామోజీలకు లీగల్ నోటీసు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ప్రతిష్టను మంటగలపడమే లక్ష్యంగా అసత్య అభియోగాలు మోపిన విపక్ష నేత చంద్రబాబునాయుడు, తప్పుడు వార్తలు ప్రచురించిన ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలు పరువు నష్టం దావాతోపాటు చట్ట ప్రకారం ప్రభుత్వం తీసుకునే సివిల్, క్రిమినల్ చర్యలకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర భూగర్భ గనుల శాఖ హెచ్చరించింది. ఈ మేరకు మాజీ సీఎం చంద్రబాబుతోపాటు ఉషోదయా పబ్లికేషన్స్ (ఈనాడు), ఆమోద పబ్లికేషన్స్ (ఆంధ్రజ్యోతి)కి లీగల్ నోటీసులు జారీచేసినట్లు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, సంచాలకులు వెంకటరెడ్డి శనివారం మీడియా సమావేశంలో తెలిపారు. వాస్తవాలను దాచిపెట్టి ప్రభుత్వంపై దురుద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేయడం.. అసత్య కథనాలు ప్రచురించడాన్ని వారు తప్పుబట్టారు. కనీసం తమ వాదన (వాస్తవాలను) ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు చోటు కల్పించనందునే తాము మీడియా ముందుకు రావాల్సి వచ్చిందని వారు వివరించారు. ద్వివేది పేర్కొన్న అంశాల్లో ముఖ్యమైనవి.. మీడియా సమావేశంలో మాట్లాడుతున్న గోపాలకృష్ణ ద్వివేది. చిత్రంలో వెంకటరెడ్డి ► గుంటూరు జిల్లాలో సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్‌కు సున్నపురాయి మైనింగ్ లీజును కేంద్ర ప్రభుత్వ చట్టం ప్రకారమే 50 ఏళ్లకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వందకు వంద శాతం కేంద్రం నిబంధనల ప్రకారమే ఈ జీఓ ఇచ్చాం. ► వాస్తవం ఇది కాగా.. ప్రభుత్వానికి, గనుల శాఖకు చెడ్డపేరు తెచ్చేలా ‘సొంత సంస్థకు లీజు పెంపా?’ అంటూ ‘ఈనాడు’.. ‘సొంత కంపెనీకి మేలు సిగ్గుచేటు’ అంటూ ఆంధ్రజ్యోతి ఈనెల 10న తప్పుడు కథనాలు ప్రచురించాయి. ‘సరస్వతి’కి వందకు వంద శాతం చట్టబద్ధంగానే ప్రభుత్వం లీజును పొడిగించిందని చంద్రబాబుకు తెలుసు. ఆయన కుట్రతోనే అసత్య అభియోగాలు చేశారు. ఈ రెండు పత్రికలూ కూడా దురుద్దేశంతో ఈ తప్పుడు కథనాలు ప్రచురించాయి. ప్రభుత్వాన్ని అప్రదిష్టపాల్జేయాలనే కుట్రే ఇందుకు కారణం. ► అందువల్ల 15 రోజుల్లోగా బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, లేనిపక్షంలో చట్టపరంగా ప్రభుత్వం సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటుందంటూ చంద్రబాబుతోపాటు ఆ రెండు సంస్థలకు లీగల్ నోటీసులు జారీచేశాం. ► ఒక పత్రిక (ఈనాడు) ఖండన వార్త ప్రచురించినా అది ఏమాత్రం సంతృప్తిగాలేదు. మరో పత్రిక అసలు రిజాయిండర్నే ప్రచురించలేదు. ► కేంద్ర ప్రభుత్వ గనులు, ఖనిజాల అభివృద్ధి–నియంత్రణ సవరణ చట్టం–2015 ప్రకారం.. ఇప్పటివరకూ 31 సంస్థలకు మైనింగ్ లీజులను 50 ఏళ్లకు పెంచుతూ జీఓలు ఇచ్చాం. ఇందులో సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ కూడా ఒకటి. ఇందులో ఏమీ తప్పులేకపోయినా ఆ పత్రికలు తప్పుడు వార్తలు ప్రచురించాయి. ► అసత్య ఆరోపణలు చేసిన చంద్రబాబు, తప్పుడు.. నిరాధార వార్తలు ప్రచురించిన ఆ పత్రికలు బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. లేకపోతే చట్టపరంగా పరువు నష్టం దావా వేయడంతోపాటు ప్రభుత్వం క్రిమినల్, సివిల్ చర్యలు తీసుకుంటుంది. అసలేం జరిగిందంటే.. ► సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్‌కు 2009 మే 18న అప్పటి ప్రభుత్వం 613 హెక్టార్ల సున్నపురాయి మైనింగ్ లీజును మంజూరు చేస్తూ జీఓ జారీచేసింది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆ ఏడాది అక్టోబర్ 9న దీనిని రద్దుచేస్తూ ఉత్తర్వులిచ్చింది. ► ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం 2015లో గనులు, ఖనిజాల (అభివృద్ధి, నియంత్రణ) సవరణ (ఎంఎండీఆర్–2015) చట్టం తెచ్చింది. ఇది అమల్లోకి వచ్చిన నాటికే మైనింగ్ లీజులున్న సంస్థలు దరఖాస్తు చేసుకుంటే లీజును 50 ఏళ్లకు కచ్చితంగా పొడిగించాలని ఈ చట్టంలోని సెక్షన్ 8ఎ (3) స్పష్టంగా చెబుతోంది. ► అప్పట్లో టీడీపీ కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం లో భాగస్వామి కూడా. దీని ప్రకార మే చంద్ర బాబు అనేక సంస్థలకు మైనింగ్ లీజులను 50 ఏళ్లకు పొడిగిస్తూ జీఓలు ఇచ్చారు. ► ఇలా ఇప్పటివరకు 31 సంస్థలకు అనుమతులు జారీ అయ్యాయి. వీటిల్లో రాంకో సిమెంట్స్, జైపే బాలాజీ సిమెంట్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్ వంటి సంస్థలకు వందలాది ఎకరాల లీజును 50ఏళ్లకు చంద్రబాబు సర్కారు పొడిగించింది. ► ఈ నేపథ్యంలో.. కక్షపూరితంగా తమ లీజును రద్దుచేశారంటూ ‘సరస్వతీ పవర్’ హైకోర్టుకు వెళ్లగా వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ► హైకోర్టు ఆదేశాల మేరకు గనుల శాఖ ‘సరస్వతి’ లీజు పునరుద్ధరిస్తూ 2019 డిసెంబరు 12న జీఓ 109 జారీచేసింది. ఇప్పుడేం జరిగిందంటే.. ► ‘సరస్వతి పవర్’ లీజును 50 ఏళ్లకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 8న జీఓ ఇచ్చింది. ఇందులో ఏమైనా తప్పు ఉంటే విపక్ష నేతగా చంద్రబాబు ఏదైనా మాట్లాడవచ్చు. కానీ, ఇది కేవలం సీఎం వైఎస్ జగన్‌ది అయినందున లీజు పొడిగించారని ఆయన ఇష్టమొచ్చిన రీతిలో ఆరోపణలు చేశారు. చంద్రబాబు, రామోజీలకు లీగల్ నోటీసు వారంలో క్షమాపణ చెప్పాలి ఈనాడు ఎడిటర్‌కూ నోటీసులు నాణ్యమైన బియ్యం పంపిణీ కోసం ఉద్దేశించిన సంచులను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి సంబంధించిన సంస్థ నుండి ప్రభుత్వం టెండర్లు వేయకుండానే కొనుగోలు చేసిందంటూ ఆరోపణలు చేసిన చంద్రబాబు, ఆ వార్తను ప్రచురించినందుకు ఈనాడు ఫౌండర్ డైరెక్టర్ సీహెచ్ రామోజీరావు, ఎడిటర్ ఎం.నాగేశ్వరరావులకు రాష్ట్ర ప్రభుత్వం లీగల్ నోటీసు జారీచేసింది. ఈ నోటీసు అందిన ఏడు రోజుల్లోగా క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం కింద పరిగణించి దావా వేస్తామని హెచ్చరించింది. తప్పుడు ఆరోపణలు చేసినందుకుగాను ఐపీసీ 499, 500, 501, 502 సెక్షన్ల కింద శిక్ష తప్పదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాసరెడ్డి పేరిట జారీచేసిన నోటీసులో పేర్కొన్నారు. ఈనాడు, టైమ్స్ ఆఫ్ ఇండియాలో టెండర్ ప్రకటన నిజానికి పాలీ ప్రొపెలిన్ సంచుల కొనుగోలుకు సంబంధించి పౌర సరఫరాల శాఖ గత ఏడాది డిసెంబర్ 3న ఈనాడు, టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలో టెండరు ప్రకటన ఇచ్చింది. ఈ–రివర్స్ టెండరు విధానాన్ని పౌర సరఫరాల శాఖ పక్కాగా నిర్వహించి పాలీ ప్రొపలిన్ సంచులను కొనుగోలు చేసింది. కానీ, ‘తన సొంత పాలిమర్స్ సంస్థ నుంచి టెండరు లేకుండా సంచులు సరఫరా చేస్తున్నారు’ అంటూ సీఎం వైఎస్ జగన్ ప్రతిష్టను దిగజార్చే విధంగా చంద్రబాబు ఆరోపించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలను ఈనాడులో ప్రచురించారని ఆ నోటీసులో వివరించారు. కానీ, సంచుల కొనుగోలులో పౌర సరఫరాల శాఖ ఏ సంస్థకూ అనుకూలంగా వ్యవహరించలేదని అధికారులు అందులో పేర్కొన్నారు. చంద్రబాబు ఆరోపణలు చేసినట్లు ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి, వారి అనుబంధ సంస్థలకు ఎటువంటి ప్రమేయం లేకపోయినా తప్పుడు ఆరోపణలు చేశారన్నారు. -
చంద్రబాబుకు ఏపీ ప్రభుత్వం నోటీసులు
సాక్షి, విజయవాడ: ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా తప్పుడు కథనాలు ప్రచురించిన వార్తా పత్రికలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆమోద పబ్లికేషన్స్, ఉషోదయా పబ్లికేషన్స్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర భూగర్భగనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేదీ శనివారం మీడియా మాట్లాడారు. మైనింగ్‌పై అసత్య ఆరోపణలు చేసినవారిపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా ఉందని అన్నారు. ఆయా సంస్థలు, వ్యక్తులు 15 రోజుల్లో బేషరతుగా క్షమాపణ చెప్పాలని లేని పక్షంలో పరువునష్టం దావా వేస్తామని ద్విదేదీ స్పష్టం చేశారు. తప్పుడు కథనాలకు సంబంధించి ఆయా పత్రికలు స్పందించిన తీరు సంతృప్తికరంగా లేనందునే మీడియా ముందుకు వచ్చినట్టు ఆయన చెప్పారు. (చదవండి: టమాటో ఛాలెంజ్‌తో రైతులకు ఊరట) -
ఇసుక ఇబ్బందులకు.. రెండ్రోజుల్లో చెక్
సాక్షి, అమరావతి: ఇసుక బుకింగ్స్‌లో ఎదురవుతున్న ఇబ్బందులను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. రెండ్రోజుల్లో ఇందుకు సంబంధించిన సమస్యలన్నింటినీ పూర్తిగా పరిష్కరించనుంది. ఇందులో భాగంగా ప్రజలకు అవసరమైనంత ఇసుకను అందుబాటులోకి తీసుకురానుంది. ఆన్లైన్ బుకింగ్‌లో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి రావడంతో వాటన్నింటికీ చెక్ పెట్టనుంది. ఇక నుంచి బల్క్ బుకింగ్స్‌పై నిర్ణయం తీసుకునే అధికారాన్ని జాయింట్ కలెక్టర్లకు అప్ప చెప్పింది. ఈ మేరకు రాష్ట్ర భూగర్భ గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రెండ్రోజుల క్రితం సీఎం నిర్వహించిన సమీక్షలో తీసుకున్న నిర్ణయాలు తక్షణమే అమలుచేస్తామని, స్టాక్ పాయింట్లలో ఇసుక నిల్వలు పెంచుతామని ఆయన వెల్లడించారు. ఆయన ఇంకా ఏం పేర్కొన్నారంటే.. ► ఇసుక బుకింగ్ కోసం ప్రతి రోజూ మధ్యాహ్నం పోర్టల్ ఓపెన్ చేసిన కొద్దిసేపటికే బుకింగ్స్ అయిపోతున్నాయి. దీనివల్ల మిగిలిన వినియోగదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయనే విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీన్ని అధిగమించేందుకు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా కూడా ఇసుక బుకింగులకు అనుమతిస్తూ ఉత్తర్వులిస్తున్నాం. మరింత పారదర్శకంగా బుకింగ్ జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. ► సొంత అవసరాలకే ఇసుక బుకింగ్స్ జరుగుతున్నాయా? లేదా? అన్న విషయం సచివాలయాల ద్వారా నిర్ధారించే వ్యవస్థను ఏర్పాటుచేస్తాం. ► అలాగే, బల్క్ బుకింగ్స్‌కు అనుమతిచ్చే అధికారం జాయింట్ కలెక్టర్లకే ఇచ్చాం. ► ప్రస్తుతం రోజుకు సగటున 1.25 లక్షల టన్నుల ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. దీనిని మూడు లక్షల టన్నులకు పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ► రానున్న వర్షాకాలం అవసరాల కోసం మొత్తం డెబ్బై లక్షల టన్నుల ఇసుకను నిల్వచేస్తున్నాం. వలస కూలీలు వెళ్లిపోవడంతో ఇబ్బందులు ► గతంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలు ఎక్కువగా ఇసుక తవ్వకాలు జరిపేవారు. కరోనా లాక్డౌన్ కారణంగా పనులు నిలిపివేయడంతో కూలీల్లో అధిక శాతం స్వరాష్ట్రాలకు వెళ్లిపోయారు. ► దీంతో ప్రస్తుతం స్థానికంగా వున్న కూలీలతోనే ఇసుక తవ్వకాలు జరపాల్సిరావడంవల్ల కొంత సమస్య ఏర్పడింది. ► ఇసుక తవ్వకాల్లో నైపుణ్యం వున్న వలస కూలీలను తిరిగి రప్పించేందుకు కలెక్టర్ల ద్వారా ప్రయత్నిస్తున్నాం. ► పట్టాభూముల్లో ఇసుక నాణ్యతను టెక్నికల్ టీం పరిశీలించిన తరువాతే అనుమతిస్తున్నాం. -
గ్రామ సచివాలయాల్లోనే ప్రాథమిక వైద్య సేవలకు అదనపు భవనం
సాక్షి, అమరావతి: గ్రామాల్లో స్థానికులకు అవసరమైన ప్రాథమిక వైద్య సేవలన్నీ సంబంధిత గ్రామ సచివాలయంలోనే అందేలా ప్రతి గ్రామ సచివాలయ కార్యాలయంలో వైద్య ఆరోగ్య విభాగ కేంద్రాన్ని నిర్మించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతోపాటు రైతు సేవా కేంద్రం ఏర్పాటుకు కూడా 2291 చదరపు అడుగుల విస్తీర్ణంలో అదనపు భవనాలను నిర్మించాలని పేర్కొంది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి గ్రామ సచివాలయంలో 932 చదరపు అడుగులలో రూ. 14.95 లక్షలతో వైద్య సేవల కేంద్రం, 1359 చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.21.80 లక్షలతో రైతు సేవా కేంద్రాల నిర్మాణానికి ఆదేశాలు జారీ చేశారు. ► వైద్య వసతి కేంద్రానికి అయ్యే ఖర్చులో 50 వైద్య ఆరోగ్య శాఖ, మరో 50 శాతం ఉపాధి హామీ పథకం మెటీరియల్ నిధుల నుంచి ఖర్చు చేస్తారు. ► రైతు సేవ కేంద్రం నిర్మాణానికయ్యే ఖర్చులో 90 శాతం ఉపాధి హామీ పథకం మెటీరియల్ నిధుల నుంచి, 10 శాతం వ్యవసాయ శాఖ భరిస్తాయి. ► ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 9500 గ్రామ సచివాలయాలను కొత్తగా నిర్మించడం, ఆధునీకరించడం వంటి పనులు జరుగుతున్నాయి. అక్కడే ఈ అదనపు భవనాల వసతి నిర్మాణానికి ఆదేశాలిచ్చారు. ► దీనికి సంబంధించి ఇప్పటి వరకు 2908 చోట్ల తగిన భూమిని అధికారులు గుర్తించారు. మిగిలిన చోట్ల ఈ గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. -
పంచాయతీ కార్యదర్శుల సేవలు అభినందనీయం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యలను గ్రామీణ ప్రజల దాకా చేర్చడంలో పంచాయతీ కార్యదర్శుల కృషి అభినందనీయమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఒక ప్రకటనలో ప్రశంసించారు. వలంటీర్లు, పారిశుద్ధ్య కార్మికులు కూడా అంకితభావంతో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ► తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, బోరు బావులు, డ్రైనేజీ వ్యవస్థలను పర్యవేక్షించడం వంటి కీలక విధులతో పాటు ప్రజారోగ్యానికి సంబంధించి పంచాయతీ కార్యదర్శులు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. ► సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్షలకు అనుగుణంగా ఈ నెల ఒకటో తేదీనే లబ్ధిదారులకు పింఛన్లు అందించి పంచాయతీ కార్యదర్శులు, ఇతర సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు సరికొత్త రికార్డు సృష్టించారు. ► కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వ సూచనల మేరకు ప్రజలు భౌతిక దూరాన్ని పాటిస్తూ, అవసరమైన జాగ్రత్తలు తీసుకునేలా ప్రజలను చైతన్యవంతం చేయడంలో పంచాయతీ, సచివాలయ, వలంటీర్ల వ్యవస్థ విజయవంతంగా పనిచేస్తోంది. ► కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా వైద్య సిబ్బందిని అప్రమత్తం చేయడం, ఎప్పటికప్పుడు సమాచారాన్ని క్షేత్రస్థాయి నుంచి ప్రభుత్వ ఉన్నత స్థాయి వరకు అందజేయడంలో పంచాయతీ వ్యవస్థ మహత్తర కృషి చేస్తోంది. ► దేశంలోనే ఆదర్శవంతమైనవిగా సచివాలయ, వలంటీర్ల వ్యవస్థలు గుర్తింపు సాధించడం గర్వకారణ ం. ► అనేక రాష్ట్రాలకు మన ప్రభుత్వం రూపొందించి, అమలు చేస్తున్న ఈ వ్యవస్థలు స్ఫూర్తిదాయకంగా, మార్గదర్శకంగా నిలవడం ఉద్యోగులు, వలంటీర్ల చిత్తశుద్ధికి నిదర్శనం. ► ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడం, పరిశుభ్రతతో, ముందు జాగ్రత్తలతో కరోనా వంటి మహమ్మారి కట్టడికి చిత్తశుద్ధితో సేవలందించడంలో ఉద్యోగులు సైనికుల్లా పనిచేస్తున్నారు. -
వలంటీర్లు, సచివాలయ సిబ్బంది సేవలు కీలకం
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న అన్ని చర్యలను.. ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గ్రామాల్లో ప్రతి కుటుంబానికి, ప్రతి పౌరుడికి తెలియజేసే ప్రక్రియలో వార్డు వలంటీర్లు వారధిగా పనిచేయాల్సి ఉంటుందని పంచాయతీరాజ్ శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల్లో వలంటీర్లు, గ్రామ సచివాలయాల సిబ్బంది, మండల స్థాయిలో ఈవోపీఆర్డీలు, ఎంపీడీవోలు, జిల్లా స్థాయిలో జెడ్పీ సీఈవోలు, డీపీవోలు ఎలాంటి విధులు నిర్వహించాలన్న దానిపై స్పష్టత ఇస్తూ ఆ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. - గ్రామ పరిధిలో పారిశుద్ధ్యం మెరుగుదలకు అవసరమైన చర్యల్లో పాలుపంచుకోవాలి. - కరోనా వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పించడంలో నాయకత్వ బాధ్యతలు తీసుకోవాలి. - గ్రామ పరిధిలో కరోనా వైరస్ అనుమానితులను వేరుగా ఉంచడం, బాధితులకు చికిత్స అందించడంలో ఆరోగ్య కార్యకర్తలు, గ్రామ కార్యదర్శులను సమన్వయం చేసుకోవాలి. - ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజలు ఏం చేయకూడదు.. ఏం చేయాలన్న దానిపై అవగాహన కల్పించాలి. - సామాజిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రతలో భాగంగా చేతులు కడుక్కోవడం వంటి జాగ్రత్తలు నిరక్షరాçస్యులకు సైతం అర్థమయ్యేలా తెలియజెప్పాలి. - గ్రామ పరిధిలో నివారణ చర్యలను వీలైనన్ని సార్లు నిరంతరం సందర్శించాలి. జెడ్పీ సీఈవోలు.. డీపీవోలు - జిల్లా పరిధిలో కరోనా తీసుకుంటున్న చర్యల అమలులో సీఈవోలు, డీపీవోలు సంపూర్ణ సమన్వయంతో పనిచేయాలి. - కలెక్టర్ నాయకత్వంలో జిల్లాలో కంట్రోల్ రూమ్‌లో కలిసి పనిచేయడం.. జిల్లాలోని గ్రామాల్లో పారిశుద్ధ్య పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షించడం. ఈవోపీఆర్డీల బాధ్యతలివీ.. - పారిశుద్ధ్య అవసరాలకు అనుగుణంగా బ్లీచింగ్ పౌడర్ వంటి వాటిని గ్రామ సచివాలయాలకు తగిన పరిమాణంలో అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవడం. - గ్రామాల వారీగా వాస్తవ పరిస్థితిని ఉన్నతాధికారులకు తెలియజేయడం. ఎంపీడీవోలు - ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ మండలానికి నాయకత్వ బాధ్యతలు తీసుకోవాలి. - ప్రభుత్వం ఆదేశించిన లాక్ డౌన్ చర్యలను మండల స్థాయిలో కచ్చితంగా అమలు చేయడం. - ఏ పరిస్థితినైనా ఎదుర్కొనడానికి రోజంతా అందుబాటులో ఉండటం. వలంటీర్ల విధులు ఇలా - వలంటీర్లు విధుల్లో వారికి కేటాయించిన 50 కుటుంబాల్లోని సభ్యుల ఆరోగ్యం చాలా ముఖ్యమైన అంశం. ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటూ ఆ వివరాలను గ్రామ సచివాలయాల ద్వారా వెంటనే ఆరోగ్య శాఖకు తెలియజేయాలి. - కరోనా అనుమానిత వ్యక్తి లేదా వ్యాధి సోకిన వారు ఉంటే వారు పూర్తిగా కోలుకునే వరకు గ్రామీణ ఆరోగ్య కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలి. - కేటాయించిన 50 ఇళ్ల పరిధిలో పారిశుద్ధ్య పరిస్థితుల మెరుగుదలకు సచివాలయ సిబ్బందితో కలిసి చర్యలు తీసుకోవాలి. - గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలు పని ప్రదేశంలో తగిన జాగ్రత్తలు, సామాజిక దూరం పాటించేలా చూడాలి. -
బయోమెట్రిక్ లేకుండానే ఏప్రిల్‌లో పింఛన్ల పంపిణీ
కోవిడ్ వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా ఏప్రిల్ నెలలో జరగాల్సిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో బయోమెట్రిక్ విధానానికి తాత్కాలికంగా స్వస్తి పలకాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సాక్షి, అమరావతి: కోవిడ్ వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా ఏప్రిల్ నెలలో జరగాల్సిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో బయోమెట్రిక్ విధానానికి తాత్కాలికంగా స్వస్తి పలకాలని ప్రభుత్వం నిర్ణయించింది. పారదర్శకత కోసం పంపిణీ చేసే సమయంలో లబ్ధిదారుల నుంచి తమ పింఛను డబ్బులు ముట్టినట్టు సంతకాలు తీసుకుంటారు. నిరక్షరాస్యులైతే, వారికి పింఛను డబ్బులు పంపిణీ చేసినట్టు ఒక ఫొటో తీసి, వలంటీరు వద్ద మొబైల్ యాప్‌లో అప్లోడ్ చేస్తారు. ఈ మేరకు తగిన చర్యలు చేపట్టాలంటూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. సాధారణ పరిస్థితుల్లో పింఛన్ల పంపిణీలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా బయోమెట్రిక్ విధానంతో వేలి ముద్రలను సరిపోల్చుకొని డబ్బులు చెల్లించడం గత కొంత కాలంగా కొనసాగుతోంది. అయితే ఒకే బయోమెట్రిక్ మెషీన్ ద్వారా వరుసగా పలువురు లబ్ధిదారుల నుంచి వేలి ముద్రలను సేకరించడం వల్ల కోవిడ్ వైరస్ వ్యాపించే అవకాశం ఉంటుందనే అనుమానంతో ప్రభుత్వం ముందస్తు చర్యల్లో భాగంగా నేరుగా పింఛను డబ్బుల పంపిణీకి ఆమోదం తెలిపింది. రేషన్ సరుకులకు ఈ–పాస్ నుంచి మినహాయింపు ఏప్రిల్ నెలకు సంబంధించి రేషన్ కార్డులపై ఇచ్చే సబ్సిడీ సరుకుల పంపిణీలో ఈ–పాస్ యంత్రాలను వినియోగించకూడదని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. రేషన్ డీలర్లు లబ్ధిదారుల వివరాలను పాత విధానం ప్రకారం రికార్డు పుస్తకంలో నమోదు చేసి సరుకులు ఇవ్వనున్నారు. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ఈ–పాస్ యంత్రాల వాడకాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి పౌర సరఫరాల శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి కోన శశిధర్‌కు లేఖ రాసిన విషయం తెలిసిందే. రేషన్ సరుకుల కోసం వచ్చే లబ్ధిదారులు ఈ–పాస్ మెషిన్లో ఒకరి తర్వాత మరొకరు వేలిముద్రలు వేయడం వల్ల కరోనా వైరస్ విస్తరించే అవకాశం ఉందని లేఖలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అధికారులు కేంద్ర ఆహార శాఖ దృష్టికి తీసుకెళ్లగా.. ఏప్రిల్ నెల సరుకులను దేశమంతటా మాన్యువల్ పద్ధతిలోనే పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ నెలకు సంబంధించి పూర్వ పద్ధతిలోనే సరుకులు పంపిణీ చేయాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు కోన శశిధర్ చెప్పారు. -
‘స్థానిక’ షెడ్యూల్ నేడే
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్రంలో ముఖ్యమైన రాజకీయ పార్టీలన్నింటితో తుది సంప్రదింపులు పూర్తయ్యాయని, శనివారం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్.రమేష్‌కుమార్ ప్రకటించారు. శుక్రవారం సాయంత్రం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో వివిధ రాజకీయ పక్షాలతో సమావేశం అనంతరం కమిషన్ కార్యదర్శి రామసుందర్‌రెడ్డి, జాయింట్ సెక్రటరీ సత్యరమేష్‌లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయ పార్టీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తాయని, ఇది అందరిలోనూ ఏకాభిప్రాయం తెచ్చేందుకు ఉద్దేశించిన సమావేశం కాదన్నారు. ఎన్నికల ప్రక్రియను సరళీకృతం చేసే నిర్మాణాత్మక సూచనలను పరిగణలోకి తీసుకుంటున్నామన్నారు. అంతకుముందు ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్‌లతో కలసి కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహిస్తున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు, ఉన్నతాధికారులు గిరిజా శంకర్, జి.విజయ కుమార్, ఎన్నికల కమిషనర్ కార్యాలయ కార్యదర్శి ఎస్.రామసుందర రెడ్డి, జాయింట్ కార్యదర్శి ఏవీ సత్యరమేష్, విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ఎన్నికల కమిషనర్ ఏమన్నారంటే.. – పరీక్షలు జరుగుతున్న సమయంలో ఎన్నికలు నిర్వహించడం ఇబ్బందని కొన్ని పార్టీలు సమావేశంలో ప్రస్తావించాయి. ఈ నెల చివరి వారంలో మొదలయ్యే పదో పరీక్షలను వాయిదా వేసి ఏప్రిల్‌లో నిర్వహిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఎన్నికల నిర్వహణకు అనుకూల వాతావరణం ఉందని కమిషన్ భావించేందుకు ఇది కూడా కారణం. – సభలు, సమావేశాల నిర్వహణకు కలెక్టర్ ద్వారా అనుమతులిస్తాం. – గతంలో జారీ అయిన కుల ధృవీకరణ పత్రాలను ఉపయోగించుకోవచ్చు. ఎన్నికల నిమిత్తం మీసేవ కేంద్రాలకు అందే దరఖాస్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించాం. – కరోనా వైరస్ వల్ల మన దగ్గర పెద్దగా ఇబ్బంది లేదనేది నా అభిప్రాయం. –– ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేవన్నీ శిక్షార్హమైనవేనని గతంలోనూ నిబంధనలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ప్రత్యేక చట్టంతో ప్రయోజనం ఉంటుంది. అనర్హత వేటు తప్పు నిర్ధారణ అయిన తర్వాతే ఉంటుంది. –– వలంటీర్లను ఎన్నికల విధుల్లోకి తీసుకోవద్దని కొన్ని పార్టీలు సూచించాయి. సిబ్బంది తగ్గితే ఏపీపీఎస్సీ ద్వారా నియమితులైన గ్రామ సచివాలయ సిబ్బందిని వినియోగించుకుంటాం. అంగన్వాడీ కార్యకర్తలను ఇంకు మార్పిడి లాంటి పనులు అప్పగిస్తాం. ప్రభుత్వేతర సిబ్బందిని ఉపయోగించుకోవాల్సిన అవసరం లేదు. ––హేతుబద్ధంగానే ఎన్నికల షెడ్యూల్. అన్నీ దృష్టిలో పెట్టుకొనే నోటిఫికేషన్ ఇస్తాం. ––కొత్తగా ఓటర్లను చేర్చుకోవడం ఇప్పుడు సాధ్యం కాదు. –– ఈవీఎంలపై రాజకీయ పార్టీలు అపనమ్మకం వ్యక్తం చేస్తున్నాయి. బ్యాలెట్ పేపరుతో ఎన్నికలు నిర్వహిస్తున్నాం. అయితే రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఈవీఎంలపై సంపూర్ణ విశ్వాసం ఉంది. –– ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాకే ప్రవర్తనా నియమావళి అమలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పరిధిలోకి వస్తుంది. కోడ్ అమలు వచ్చిన నాటి నుంచి ఫిర్యాదులపై పరిశీలిస్తాం. ‘2018 లో స్థానిక సంస్థలు ఎన్నికలు జరగాల్సి ఉంది. ప్రతిపక్ష టీడీపీ ఎన్నికలు అంటే భయపడుతోంది. కరోనా వైరస్ ఉందంటూ పారిపోతోంది. ఎన్నికలు జరగకుండా కుట్రలు చేస్తోంది’ ––జోగి రమేష్, వైసీపీ ఎమ్మెల్యే. ‘పరీక్షలు ఉన్నందున విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడాలి’ –––పాతూరి నాగభూషణం..బీజేపీ ‘మద్యం, ధన ప్రభావం లేకుండా ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేలా చేయాలన్న సీఎం వాఖ్యలను స్వాగతిస్తున్నాం. మా పార్టీ ఇదే వైఖరితో ఉంది. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడాలి’ ––వెంకటేశ్వరరావు, సీపీఎం నేత ‘స్థానిక ఎన్నికలు వాయిదా వేయాలని కోరాం’ – జల్లి విల్సన్, మాజీ ఎమ్మెల్సీ , సీపీఐ ‘ఎన్నికల నిర్వహణకు ఇది సరైన సమయం కాదు. కరోనా వైరస్ ప్రభావం ఉందని చెప్పాం. రిజర్వేషన్ల అంశం కోర్టులో ఉండగా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు’ ––వర్ల రామయ్య, టీడీపీ. గవర్నర్‌తో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భేటీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్.రమేష్ కుమార్ శుక్రవారం గవర్నర్ విశ్వ భూషణ్ హరిచందన్‌తో రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై గవర్నర్‌కు నివేదించారు. ఎన్నికలు నిర్వహించేందుకు తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్ -
తెల్లవారుజాము నుంచే పింఛన్ల పంపిణీ
-
ఏపీలో తెల్లవారుజాము నుంచే పింఛన్ల పంపిణీ
సాక్షి, అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 58.99లక్షల పింఛన్ లబ్ధిదారులకు ఈ తెల్లవారుజామునుంచే పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. అదివారం సెలవు రోజు అయినప్పటికీ పింఛన్‌దారులకు వారి ఇంటి వద్దే డబ్బులు అందజేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు వలంటీర్లు లబ్ధిదారుల ఇంటి వద్దకు చేరుకుని పింఛన్లు పంచుతున్నారు. ఉదయం 7 గంటల కంతా 11శాతంపైగా మందికి పింఛన్ పంపిణీ పూర్తిచేసినట్లు పంచాయితీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలక్రిష్ణ ద్వివేది ట్విటర్ ద్వారా పేర్కొన్నారు. ఈ మధ్యాహ్నంకంతా వందశాతం పింఛన్ల పంపిణీ పూర్తిచేయనున్నట్లు తెలిపారు. కాగా, వలంటీర్ల ద్వారా లబ్ధిదారుల ఇళ్ల వద్దే పింఛన్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం ఫిబ్రవరి నెల నుంచి ప్రారంభించిన విషయం తెలిసిందే. పింఛన్లు పంపిణీ చేసేందుకు వలంటీరు తమ పరిధిలో ఉండే ఫించనుదారులందరినీ ఒక చోటుకు పిలిపించడం చేయరాదని స్పష్టంగా ఆదేశాలు జారీ అయ్యాయి. బయోమెట్రిక్ విధానం ద్వారా లబ్ధిదారుల వేలి ముద్రలు తీసుకున్న తర్వాత నగదు పంపిణీ చేస్తున్నారు. ఈ ప్రక్రియతో సంబంధం లేని ప్రైవేట్ వ్యక్తులను లబ్ధిదారుల ఇళ్ల వద్దకు తీసుకెళ్లొద్దని వలంటీర్లకు సూచనలు జారీఅయ్యాయి. శరవేగంగా ఇంటి వద్దకే పింఛన్ పంపిణీ లబ్ధిదారుల ఇంటి వద్దకే పింఛన్ పంపిణీ కార్యక్రమం శరవేగంగా సాగుతోంది. ఉదయం 6 గంటలనుంచే గడపగడపకు పింఛన్ పంపిణీ మొదలైంది. వలంటీర్లు లబ్ధిదారుల ఇంటి వద్దకు చేరుకుని పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. ఉదయం 8 గంటలకు 26,20,673 మందికి.. 9 గంటలకు 31లక్షల మందికి పింఛన్ పంపిణీ పూర్తయింది. ఈ మధ్యాహ్నంకంతా దాదాపు 60 లక్షల మందికి రూ. 1,384 కోట్ల పింఛన్ పంపిణీ కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ పూర్తి రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో పింఛన్ పంపిణీ పూర్తయింది. గ్రామ/వార్డు వలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు ఉదయం నుంచే పింఛన్ల పంపిణీ జరిగింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏపీలో పింఛన్ల పంపిణీ జరిగింది. గత నెల కంటే ఈ నెల అదనంగా 4.30 లక్షల పింఛన్లు మంజూరు అయ్యాయి. గత నెలలో పింఛన్లు అందని లబ్ధిదారులకు 2 నెలల పింఛన్ కలిపి అందజేశారు. దాదాపు 3.30 లక్షల మందికి 2 నెలల పింఛన్ అందజేశారు. తొలి రోజే పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని అధికార యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఉదయం నుంచే శరవేగంగా ఇంటింటికీ పింఛన్లు పంపిణీ మొదలైంది. మ.12 గంటల వరకు 43.9 లక్షలకుపైగా పింఛన్లు పంపిణీ అయ్యాయి. ప్రతి 50 ఇళ్లకు ఓ వలంటీర్ చొప్పున డిజిటల్ మ్యాపింగ్ ద్వారా ఐరిస్, వేలిముద్రలతో లబ్దిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. -
ఉగాది లోపే ‘స్థానిక’ సమరం!
సాక్షి, అమరావతి: పంచాయతీరాజ్ ఎన్నికలపై హైకోర్టు తీర్పు సానుకూలంగా వెలువడే పక్షంలో ఉగాది లోపే రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఒక దశకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల, ఓటింగ్, లెక్కింపు అన్నీ పండుగ లోపే పూర్తి చేయటంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ కసరత్తు చేస్తోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్.రమేష్‌కుమార్ దీనిపై చర్చించేందుకు శుక్రవారం పోలీసు, పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. శాంతి భద్రతల అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యదర్శి ఎస్.రామసుందర్‌రెడ్డి ఇందులో పాల్గొన్నారు. ఆగిన నిధులు రూ.5,000 కోట్లకుపైనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనందువల్ల 2018 ఆగస్టు తర్వాత రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే 14వ ఆర్థిక సంఘం నిధుల విడుదల నిలిచిపోయిన విషయం తెలిసిందే. గ్రామ పంచాయతీలకు రూ.3,710 కోట్లు ఆగిపోగా మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలకు రూ.1,400 కోట్లు దాకా నిధులు నిలిచిపోయాయి. మార్చి నెలాఖరుతో 14వ ఆర్థిక సంఘం ఐదేళ్ల గడువు ముగుస్తున్నందువల్ల ఆ నిధులను కేంద్రం నుంచి తెచ్చేందుకు వీలైనంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఐదారు నెలలుగా అన్ని చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలను మొత్తం మూడు దశల్లో నిర్వహించాలని యోచిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్.రమేష్‌కుమార్ గతంలోనే ప్రకటించారు. నేడు లేదా సోమవారం తీర్పు వెలువడే అవకాశం స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల వ్యవహారంపై టీడీపీ సానుభూతిపరులు కోర్టుకు వెళ్లడంతో ఎన్నికలు వాయిదా పడిన విషయం తెలిసిందే. హైకోర్టు తన తీర్పును శనివారం లేదంటే సోమవారం వెలువరించే అవకాశం ఉందని భావిస్తున్నారు. తీర్పు అనుకూలతను బట్టి మార్చి నెలాఖరులోగా ఎన్నికలు జరిపి కేంద్రం నుంచి నిధులు తేవాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా కేంద్ర నిధుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉగాదిలోపే ఒక దశ ఎన్నికల ప్రక్రియ ముగించేలా కసరత్తు చేస్తోంది. పరీక్షల మధ్య సెలవు తేదీల్లో.. ఇంటర్, పదో తరగతి పరీక్షలు మార్చిలో మొదలై ఏప్రిల్ మధ్య వరకు జరగనున్నాయి. విద్యార్ధులకు ఇబ్బందులు లేకుండా పరీక్షలకు మధ్య ఎక్కువ సెలవులు ఉన్న తేదీల్లో పోలింగ్ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ యోచిస్తోంది. అందుకనుగుణంగా పోలీసు భద్రత కల్పించడంపై శుక్రవారం జరిగిన సమావేశంలో చర్చించారు. అవసరమైతే పొరుగు రాష్ట్రాల నుంచి అదనపు బలగాలు తెప్పించే అంశాన్ని పరిశీలించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్ సూచించారు. దీనిపై రెండు రోజుల్లో పోలీసు శాఖ తరఫున రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు నివేదిక అందజేస్తామని శాంతిభద్రతల విభాగపు అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్ తెలిపారు. ఒకవేళ రిజర్వేషన్ల శాతాన్ని తగ్గిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించిన పక్షంలో అందుకనుగుణంగా ఇప్పటికే ఖరారు చేసిన రిజర్వేషన్లలో మార్పులు చేర్పులు ఎంత వేగంగా చేయగలరనే అంశాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పంచాయతీరాజ్ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. -
‘దిశ’ పథకం అమలుకు రూ.47.93 కోట్ల నిధులు
సాక్షి, అమరావతి: దిశ పథకం అమలుకు పాలనా అనుమతులు ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రూ.47.93 కోట్ల నిధులను విడుదల చేస్తున్నట్టు పేర్కొంది. ప్రభుత్వం కేటాయించిన నిధులతో దిశ పోలీసు స్టేషన్లు, ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర హోంశాఖ తెలిపింది. మరోవైపు ప్రభుత్వ విభాగాల్లో మహిళలపై లైంగిక వేధింపులను అరికట్టేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. హోంశాఖ ఆదేశాల నేపథ్యంలో పనిచేసే చోట లైంగిక వేధింపుల నిరోధానికి, పర్యవేక్షణకు కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు పంచాయితీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు. మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం 2013 ప్రకారం ఈ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ కమిటీలో ఏడుగురు అధికారులు, సిబ్బంది ఉంటారని తెలిపారు. ‘దిశ’ చట్టంపై రాష్ట్రపతి నుంచి ఆమోదం రానందున ప్రస్తుతానికి దిశ పథకంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. -
‘స్పందన’ సమస్యలకు అధిక ప్రాధాన్యం
సాక్షి, అమరావతి బ్యూరో: ‘స్పందన’లో వస్తున్న సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యమివ్వాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది అధికారులకు సూచించారు. ప్రజా హృదయ స్పందనను మానవీయ కోణంలో పరిశీలించి సంతృప్త స్థాయిలో పరిష్కారం చూపాలన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో స్పందన అర్జీల పరిష్కారంపై కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన జిల్లా, పురపాలక, మండల స్థాయి అధికారులకు నిర్వహించిన అవగాహన సదస్సులో శుక్రవారం ఆయన మాట్లాడారు. జనవరి నుంచి అన్ని గ్రామ, వార్డు సచివాలయాలు పూర్తి స్థాయిలో పనిచేస్తాయని, వాటిలో స్పందన కౌంటర్లు నిర్వహిస్తారని తెలిపారు. ఇకపై స్పందనలో వచ్చే అర్జీల పరిష్కార తీరుపై సోషల్ ఆడిట్ నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారన్నారు. పెన్షన్, రేషన్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ కార్డులను జనవరి నుంచి అందజేయడానికి ప్రభుత్వం సన్నద్ధమవుతోందన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజాశంకర్ మాట్లాడుతూ స్పందనలో అర్జీలను చిరునవ్వుతో స్వీకరిస్తే సగం సమస్య పరిష్కరించినట్టేనన్నారు. ప్రజలకు సుపరిపాలన అందించడమే సీఎం లక్ష్యమని, అందుకనుగుణంగా అధికారులు వ్యవహరించాలని సూచించారు. రాష్ట్రంలో 53 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని, జనవరి నాటికి మరో 7 లక్షల మందికి ఇస్తామన్నారు. పట్టణ పాలన కమిషనర్ విజయకుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు ప్రజాసేవలో అంకితభావంతో నిష్పక్షపాతంగా పనిచేయాలన్నారు. సదస్సులో కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల కలెక్టర్లు ఇంతియాజ్, ముత్యాలరాజు, విజయవాడ నగరపాలకసంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్, పౌరసరఫరాల శాఖ సీఈవో అరుణ్‌బాబు, సెర్ప్ సీఈవో రాజబాబు, తదితరులు పాల్గొన్నారు. -
సీఎం ఇచ్చిన స్వేచ్ఛతోనే.. పారదర్శకంగా పరీక్షలు
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామకాలలో ఎలాంటి రాజకీయ జోక్యానికి తావులేకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం వల్ల ఈ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా సాగుతోందని ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం తెలిపారు. రాజకీయ జోక్యం లేకుంటే ఏ పనిలోనైనా అధికారుల పనితీరు అద్భుతంగా ఉంటుందనేందుకు ఈ ఉద్యోగాల నియామక ప్రక్రియే నిదర్శనమన్నారు. ఉద్యోగాల రాతపరీక్షల ముగింపు సందర్భంగా రాష్ట్ర స్థాయి పరీక్షల కమిటీ చైర్మన్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పరీక్షల కమిటీ కంట్రోలర్, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్,మున్సిపల్ శాఖ కమిషనర్ విజయ్‌కుమార్, సీఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్‌తో కలిసి అజేయ కల్లం సోమవారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. రికార్డు స్థాయిలో కొత్త ఉద్యోగాలు: అజేయ కల్లం రికార్డు సంఖ్యలో ఉద్యోగాలకు ఎటువంటి తప్పులకు తావు లేకుండా అత్యంత పకడ్బందీగా, తక్కువ సమయంలో అంతా హర్షించే విధంగా పరీక్షలను నిర్వహించడం అద్భుతమన్నారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒకే విడతలో 1.34 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలను చేపట్టిన చరిత్ర ఎప్పుడూ లేదని, వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన మూడు నెలల లోపే ఎన్నికల హామీ మేరకు రికార్డు స్థాయిలో ఉద్యోగాల భర్తీని చేపట్టారని తెలిపారు. ఇప్పుడు భర్తీ చేస్తున్నవి ఈ ప్రభుత్వం కొత్తగా సృష్టించిన ఉద్యోగాలని, ఇవేమీ ఖాళీ అయిన ప్రభుత్వ ఉద్యోగాలు కాదన్నారు. ఏ సర్కారైనా సంవత్సరానికి 1,000 ఉద్యోగ ఖాళీలను కూడా భర్తీ చేసే పరిస్థితుల్లో లేని సమయంలో ఇన్ని ప్రభుత్వ ఉద్యోగాలను కొత్తగా సృష్టించి, నియామకాలు చేపట్టడం ఒక చరిత్రగా అభివర్ణించారు. పరీక్షల నిర్వహణలో గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్, విజయకుమార్, జిల్లా కలెక్టర్లు, రాష్ట్ర, జిల్లా స్థాయి సిబ్బంది పనితీరును ఆయన ప్రశంసించారు. ఎంపికయ్యే ఉద్యోగులను వారి సొంత ఊరిలో నియమించాలా.. వద్దా? అన్నదానిపై ఇంకా ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం జరగలేదని, దీనిపై విధాన పరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అజేయ కల్లాం తెలిపారు. 90 శాతం మంది హాజరు: గిరిజా శంకర్ ఉద్యోగ రాతపరీక్షలకు 21.69 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే, 19.49 లక్షల మంది హాజరయ్యారని, దాదాపు 90 శాతం మంది హాజరవడం విశేషమని పరీక్షల రాష్ట్ర స్థాయి కంట్రోలర్‌గా వ్యవహరించిన గిరిజా శంకర్ చెప్పారు. తొలిరోజు ఉదయం 12 లక్షల మందికి పైగా హాజరు కావాల్సిన పరీక్షకు ఏకంగా 93 శాతం మంది హాజరయ్యారన్నారు. పరీక్ష రాసే వారు ముఖ్యంగా మహిళా అభ్యర్ధులు ఇబ్బంది పడకూడదని వారు నివసించే ప్రాంతానికి 40–50 కిలోమీటర్ల లోపు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఎన్నికల తరహాలో ఈ పరీక్షలను కూడా నిర్వహించినట్టు చెప్పారు. ఫలితాల వెల్లడి, నియామక ప్రక్రియలోనూ ఇంతే పారదర్శకంగా పని చేస్తామన్నారు. జవాబు పత్రాల స్కానింగ్ వేగంగా సాగుతుందని, ఈనెల 18, 19వ తేదీల్లో ఫలితాలు వెల్లడించేందుకు ప్రయత్నం చేస్తున్నామని ప్రకటించారు. సమర్ధంగా పరీక్షల నిర్వహణలో అభ్యర్ధుల సహకారం మరవలేనిదన్నారు. చరిత్రాత్మక ఘట్టం: ద్వివేది ఇన్ని లక్షల ఉద్యోగాల భర్తీ.. 22 లక్షల మందికి రాతపరీక్షలు.. ఇంత పకడ్బందీగా పరీక్షల నిర్వహణ.. ఇదో ‘హిస్టారిక్ ఈవెంట్’ అని పరీక్షల కమిటీ చైర్మన్ గోపాలకృష్ణ ద్వివేది పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణలో చిన్న పొరపాటు దొర్లినట్టు ఎక్కడా చిన్న ఫిర్యాదు కూడా రాలేదన్నారు. డిగ్రీ అభ్యర్ధులు పోటీ పడే స్థాయిలో ప్రశ్నాపత్రం రూపకల్పన ఉందన్నారు. 25 శాతం సులభమైనవి, మరో 25 శాతం కఠినమైనవి, 50 శాతం యావరేజ్ ప్రశ్నలతో ఉందన్నారు. పరీక్ష పూర్తి పారదర్శకంగా జరిగిందనేందుకు అభ్యర్ధులకు ఓఎమ్మార్ షీటు నకలు ఇంటికే ఇచ్చామని, ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి? ర్యాంకు ఎంత? అన్నది ఫలితాల్లో స్పష్టంగా తెలిసిపోతుందన్నారు. పరీక్షల నిర్వహణలో ఏపీపీఎస్సీ, ఏపీ ఎస్సీఈఆర్టీ తదితర సంస్థల సహకారం ఉందన్నారు. జిల్లాల వారీగా, పోస్టుల వారీగా, కేటగిరీలవారీగా ర్యాంకులను ప్రకటిస్తామన్నారు. ఉద్యోగ నియామకాల్లో ఇంటర్వూ్యలు ఉండవని, ఇప్పటికీ కొన్ని పత్రికలు తప్పుడు కథనాలు రాస్తున్నాయని చెప్పారు. యూపీఎస్సీ స్థాయిలో నిర్వహణ: విజయకుమార్ పారదర్శకంగా, స్వేచ్ఛగా పరీక్షలు నిర్వహించాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు విజయవంతంగా పూర్తి చేసినట్లు మున్సిపల్ కమిషనర్ విజయకుమార్ తెలిపారు. పరీక్షల కంట్రోలర్ గిరిజా శంకర్ సూచనలు, జిల్లా కలెక్టర్లు, సిబ్బంది సహకారంతో యూపీఎస్సీ స్థాయిలో పరీక్షలు నిర్వహించగలిగామన్నారు. యూపీఏస్‌సీలోనూ ఒకే విడతలో 14 లక్షల మందికి మించి దరఖాస్తులు చేసుకోరని, అందులోనూ 7–8 లక్షల మందికి మించి హాజరు ఉండదన్నారు. దాదాపు 22 లక్షల మంది దరఖాస్తుదారుల్లో 90 శాతం మంది పరీక్షలకు హాజరు కావడం రికార్డుగా పేర్కొన్నారు. మార్కులు, మెరిట్ ఆధారంగానే ఉద్యోగాలు వస్తాయని స్పష్టం చేశారు. -
‘సచివాలయ’ పరీక్షలకు 92.77 శాతం హాజరు
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన రాత పరీక్షలు తొలిరోజు ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ప్రశాంతంగా మొదలయ్యాయి. 92.77 శాతం మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఉదయం పరీక్షకు 12,53,974 మంది హాజరు కావాల్సి ఉండగా, 11,62,164 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం పరీక్షకు 2,95,980 మంది హాజరు కావాల్సి ఉండగా, 2,72,420 మంది హాజరయ్యారు. మొత్తం 1,26,728 ఉద్యోగాలకు 21.69 లక్షల మంది పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ఆరు రోజుల పాటు ఈ పరీక్షలు జరగనున్నాయి. తొలిరోజు 92.77 శాతం హాజరు నమోదు కావడం అంటే నియామక ప్రక్రియ పూర్తిస్థాయిలో విజయవంతమైనట్టేనని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కర్నూలు జిల్లా పాములపాడు మండలం వేంపెంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పత్తికొండ జెడ్పీ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రాల్లో ఓఎంఆర్ షీట్లు తారుమారయ్యాయి. వేంపెంట అభ్యర్థులకు పత్తికొండ అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లు, పత్తికొండ అభ్యర్థులకు వేంపెంట అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లు వచ్చాయి. ఈ పొరపాటును గుర్తించిన అధికారులు వెంటనే అదనపు ఓఎంఆర్ షీట్లను సమకూర్చారు. రెండు కేంద్రాల్లో పరీక్ష ఆలస్యంగా ప్రారంభం కావడంతో అభ్యర్థులకు అదనంగా ఒక గంట సమయం కేటాయించారు. ఈ ఒక్క సంఘటన మినహా తొలిరోజు పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. అధికారుల ప్రత్యేక చర్యలు మండల కేంద్రాల్లో సైతం పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం హాజరు శాతం అత్యధికంగా నమోదు కావడానికి కారణమని అధికారులు పేర్కొంటున్నారు. ఆదివారం పరీక్షలకు హజరు కావాల్సిన అభ్యర్థుల్లో 16 వేల మంది శనివారం సాయంత్రం వరకు హాల్‌టిక్కెట్ డౌన్లోడ్ చేసుకోలేదు. అధికారులు వారికి ప్రత్యేకంగా మెసేజ్‌లు పంపారు, వాయిస్ కాల్స్ చేశారు. ఇలాంటి ప్రత్యేక చర్యలతో హాజరు శాతం పెరిగిందని అంటున్నారు. ప్రాథమిక ‘కీ’ విడుదల తొలిరోజు జరిగిన రాత పరీక్షల ప్రాథమిక ‘కీ’ని పరీక్షల నిర్వహణ కమిటీ చైర్మన్, కన్వీనర్లు గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్ ఆదివారం సాయంత్రం విడుదల చేశారు. దీనిపై మూడు రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరిస్తారు. ప్రతి పరీక్ష జరిగిన తేదీకి ఐదు రోజుల అనంతరం తుది ‘కీ’ని విడుదల చేస్తారు. 23–25 తేదీల మధ్య మెరిట్ జాబితాలు రాత పరీక్షల జవాబు పత్రాలైన ఓఎమ్మార్ షీట్లను అన్ని జిల్లాల నుంచి నాగార్జున యూనివర్సిటీకి తరలించే ప్రక్రియ మొదలైంది. ఈ నెల 3వ తేదీ నుంచి ఓఎమ్మార్ షీట్ల స్కానింగ్ ప్రక్రియ మొదలవుతుందని గోపాలకృష్ణ ద్వివేది చెప్పారు. రోజుకు 4 లక్షల షీట్ల స్కానింగ్ పూర్తవుతుందన్నారు. అన్ని పరీక్షల ఓఎమ్మార్ షీట్లను రెండు విడతల పాటు స్కానింగ్ చేసే ప్రక్రియ 15 రోజుల్లో పూర్తి చేస్తామని గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్ వెల్లడించారు. ఈ నెల 23–25 తేదీల మధ్య ఉద్యోగాల వారీగా రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల మెరిట్ జాబితాలను ప్రకటించే అవకాశం ఉందన్నారు. గుండెపోటుతో అభ్యర్థి మృతి గ్రామ సచివాలయ ఉద్యోగ పరీక్ష రాస్తూ గుండెపోటుతో ఓ అభ్యర్థి మృతి చెందాడు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణానికి చెందిన గుడాల నరేష్ (30) పూలపల్లి శ్రీగౌతమి స్కూల్లో పరీక్షకు హాజరయ్యాడు. పరీక్ష ప్రారంభమైన అనంతరం నరేష్‌కు గుండెలో నొప్పి రావడంతో విధుల్లో ఉన్న ఏఎన్ఎం పరీక్షించిన అనంతరం పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం భీమవరం వర్మ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ వైద్య సేవలు పొందుతూ మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో గుడాల నరేష్ మరణించాడు. పరీక్ష కోసం వచ్చి బిడ్డకు జన్మనిచ్చింది సచివాలయం ఉద్యోగ పరీక్ష రాసేందుకు వచ్చిన అభ్యర్థిని పరీక్ష రాయకుండానే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలం బురదగాలి కొత్తపాళేనికి చెందిన ఎర్రబోతు సుప్రియ గూడూరులో గ్రామ సచివాలయ పరీక్ష రాసేందుకు వచ్చింది. నిండుగర్భిణి కావడంతో పరీక్ష సమయానికి పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. వెంటనే గూడూరులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మగబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ పుట్టినందుకు సంతోషపడాలో, పరీక్ష రాయలేనందుకు బాధపడాలో అర్థం కావడం లేదని సుప్రియ పేర్కొంది. పరీక్షకు తండ్రి, కుమార్తె, కుమారుడు హాజరు గ్రామ సచివాలయ ఉద్యోగ పరీక్షకు తండ్రి, కుమార్తె, కుమారుడు హాజరయ్యారు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం చంద్రంపేట గ్రామానికి చెందిన చోళ్ల మోహనరావు, ఆయన కుమార్తె ఇందిర, కుమారుడు నరేష్కుమార్ గ్రామ సచివాలయం ఉద్యోగానికి పరీక్ష రాశారు. మోహన్‌రావు శ్రీనివాస కళాశాల, ఇందిర నారాయణ కళాశాల, నరేష్కుమార్ ఆర్కే జూనియర్ కాలేజీలో పరీక్షకు హాజరయ్యారు. శ్రీకాకుళం జిల్లా పలాస జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సచివాలయ పరీక్షకు ఓ రిమాండ్ ఖైదీ హాజరయ్యాడు. తొలిరోజు విజయవంతం పటిష్టమైన ప్రణాళిక, జిల్లా కలెక్టర్లు, సిబ్బంది సహకారం, సమన్వయం వల్లే గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షలు విజయవంతంగా మొదలయ్యాయని పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్ తెలిపారు. తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పరీక్షల తీరును, ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో మాట్లాడుతూ.. గతంలో ఎప్పుడూ ఇంత పెద్ద సంఖ్యలో ఏ ప్రభుత్వ శాఖ పరీక్షలు నిర్వహించలేదన్నారు. పరీక్ష కేంద్రాలను అభ్యర్థులకు అందుబాటులో ఏర్పాటు చేయడం వల్ల హాజరు శాతం పెరిగిందన్నారు. అభ్యర్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్‌లు ఏర్పాటు చేసిందని, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీస్ శాఖ సహకరించిందని చెప్పారు. పరీక్షల నిర్వహణలో లోపాలు తలెత్తకుండా జిల్లా కలెక్టర్లకు సహకారం అందించేందుకు ఒక్కొక్క ప్రత్యేక అధికారిని జిల్లాలకు ముందుగానే పంపినట్టు వివరించారు. వారు పరీక్షల ఏర్పాట్లలో కలెక్టర్లకు పూర్తిగా సహకరించారని, తాము రూపొందించిన ప్రత్యేక బుక్లెట్ ఆధారంగా ఏర్పాట్లు చేసుకున్నారని చెప్పారు. వచ్చే ఐదు రోజుల్లో నిర్వహించే పరీక్షలకు జిల్లా కేంద్రాలు, పట్టణాల్లోనే పరీక్షా కేంద్రాలు ఉండటం వల్ల అభ్యర్థులు సులువుగా చేరుకోవచ్చన్నారు. గ్రామ సచివాలయాల్లో భర్తీ చేయనున్న పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ పోస్టులన్నీ భర్తీ అయ్యే అవకాశాలు లేవని చెప్పారు. మొత్తం 9,886 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేస్తే 6,265 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. మిగిలిన పోస్టుల్ని భర్తీ చేసే బాధ్యతను ప్రభుత్వం ఆ శాఖకు అప్పగించే అవకాశాలున్నాయని చెప్పారు. కాగా, విజయవాడలోని పలు కేంద్రాలను పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్ పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. మున్సిపల్ శాఖ కమిషనర్ విజయకుమార్ గుంటూరు, నెల్లూరులోని పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. అభ్యర్థుల కోసం 1,945 ఆర్టీసీ బస్సులు సచివాలయ పోస్టుల రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల కోసం ఏపీఎస్ ఆర్టీసీ పెద్ద ఎత్తున రవాణా సౌకర్యం ఏర్పాటుచేసినట్లు సంస్థ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. తొలి రోజు ఆదివారం పరీక్షకు హాజరైన అభ్యర్థుల కోసం వారి సమీప జిల్లా కేంద్రాలకు రాష్ట్రవ్యాప్తంగా 1945 బస్సులను నడిపింది. ఈ సందర్భంగా సంస్థ ప్రధాన బస్స్టేషన్లలో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటుచేసింది. పరీక్ష సామగ్రిని జిల్లా కేంద్రాలకు తరలించేందుకు, పరీక్ష కేంద్రాలకు అవసరమైన ఏర్పాట్ల నిమిత్తం సుమారు 16 గూడ్స్ ట్రాన్స్‌పోర్టు వాహనాలను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. ఈ నెల 8వ తేదీ వరకు జరగనున్న రాత పరీక్షలకు అభ్యర్థుల రద్దీని బట్టి ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని అధికారవర్గాలు తెలిపాయి. 470 స్పెషల్ సర్వీసులు వినాయకచవితి వరుస సెలవుల తర్వాత తిరుగు ప్రయాణం అయ్యే ప్రయాణికుల కోసం ఆర్టీసీ సోమవారం సాయంత్రం 470 స్పెషల్ సర్వీసులు నడిపేందుకు ఏర్పాట్లు పూర్తిచేసినట్టు ఆపరేషన్స్ విభాగం పేర్కొంది. అవసరానికి అనుగుణంగా రద్దీ ఉన్న మార్గాల్లో నడిపేందుకు విజయవాడ పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్‌లో మరో 109 బస్సు సర్వీసులను అందుబాటులో ఉంచామని తెలిపింది. ఈ నెల 4వ తేదీన కూడా అవసరమైన మేరకు స్పెషల్ బస్సులు నడపనున్నట్టు పేర్కొంది. -
కిడ్నీ వ్యాధి సమస్యకు శాశ్వత పరిష్కారం
సాక్షి, అమరావతి: దశాబ్దాల తరబడి శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్న కిడ్నీ వ్యాధి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ ప్రాంతంలో రూ.600 కోట్లతో సమగ్ర మంచి నీటి పథకం నిర్మాణానికి అనుమతి తెలిపింది. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధి ప్రబలడానికి, రోగులు ఎక్కువగా ఉండడానికి అక్కడి ప్రజలు తాగే నీరు కారణమని పలువురు నిపుణులు ప్రభుత్వానికి నివేదికలు అందజేశారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలోని బోర్ల ద్వారా సేకరించిన నీటినే మంచినీటి పథకాల ద్వారా తాగునీరు అందిస్తున్నారు. ఇకపై బయటి ప్రాంతం నుంచి నదీ జలాలను ఆ ప్రాంతానికి తరలించి ప్రజల తాగునీటి అవసరాలకు సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం జిల్లాలోని రేగులపాడు వద్ద ఒక రిజర్వాయర్‌ను నిర్మించాలని ప్రణాళిక రూపొందించింది. ప్రభుత్వ చర్యల వల్ల జిల్లాలోని పలాస–కాశీబుగ్గ, ఇచ్ఛాపురం పట్టణాలతో పాటు ఏడు మండలాల పరిధిలోని 807 నివాసిత ప్రాంతాల్లోని లక్షలాది మంది ప్రజలకు ఉపయోగం కలగనుంది. ఈ సమగ్ర మంచినీటి ప్రాజెక్టు నిర్మాణానికి పరిపాలన పరమైన అనుమతి తెలుపుతూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ట ద్వివేది బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలో శ్రీకాకుళం జిల్లా పర్యటన సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ఈ పథకానికి శంకుస్థాపన చేయనున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ప్రాజెక్టు వల్ల ప్రయోజనం పొందే మండలాలు 7 కంచిలి, కవిటి, వజ్రపుకొత్తూరు,పలాస–కాశీబుగ్గ, మందస, సోంపేట, ఇచ్ఛాపురం -
సచివాలయ పరీక్ష షెడ్యూల్లో స్వల్ప మార్పులు
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శుల పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పులు జరిగాయి. అభ్యర్థుల నుంచి వచ్చిన సూచనల మేరకు పరీక్షల షెడ్యూల్లో మార్పులు చేసినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 1, మధ్యాహ్నం నిర్వహించాల్సిన ఇంజనీరింగ్ అసిస్టెంట్ (గ్రేడ్ 2), వార్డుల కనీస సౌకర్యాల కార్యదర్శి (గ్రేడ్ 2) పరీక్షలను సెప్టెంబర్ 7 ఉదయానికి వాయిదా వేశారు. వార్డు శానిటేషన్, పర్యావరణ కార్యదర్శి పరీక్షను సెప్టెంబర్ 8, ఉదయం నుంచి అదే రోజు మధ్యాహ్నానికి మార్చారు. మిగిలిన పరీక్షల షెడ్యూల్లో ఎలాంటి మార్పులు లేవని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. మారిన పరీక్షల షెడ్యూల్ ఇలా.. సెప్టెంబర్ 1, ఉదయం పంచాయతీ కార్యదర్శి, మహిళా పోలీసు, పిల్లల సంరక్షణ సహాయకురాలు, సంక్షేమం, విద్య సహాయకులు, వార్డు అడ్మినిస్ట్రేటివ్ కార్యదర్శి సెప్టెంబర్ 1, మధ్యాహ్నం గ్రామీణ రెవెన్యూ ఆఫీసర్, గ్రామీణ సర్వేయర్, గ్రామీణ వ్యవసాయ సహాయకులు, గ్రామీణ ఉద్యావన సహాయకులు, గ్రామీణ మత్యశాఖ సహాయకులు, పంచాయతీ కార్యదర్శి డిజిటల్ సహాయకులు, పశుసంవర్థకశాఖ సహాయకులు, వార్డు ఆరోగ్య కార్యదర్శులు (మహిళలు), గ్రామీణ సెరీకల్చర్ సహాయకులు సెప్టెంబర్ 7, ఉదయం ఇంజనీరింగ్ అసిస్టెంట్, వార్డుల కనీస సౌకర్యాల కార్యదర్శి సెప్టెంబర్ 8, ఉదయం వార్డు ప్రణాళిక, నియంత్రణ కార్యదర్శి, వార్డు సంక్షేమ, అభివృద్ధి కార్యదర్శి సెప్టెంబర్ 8, మధ్యాహ్నం వార్డు విద్య, డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి, వార్డు శానిటేషన్, పర్యావరణ కార్యదర్శి -
‘ఎన్నికలు విజయవంతంగా నిర్వహించాం’
సాక్షి, తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది సోమవారం తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం శ్రీవారి దర్శనార్థం తిరుమల వెళ్లిన ఆయనకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాల అనంతరం ద్వివేది మాట్లాడుతూ.. ఏపీలో ఎన్నికలు విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. రికార్డు స్థాయిలో మహిళలు, వికలాంగులు, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదు అయ్యాయని వెల్లడించారు. దేశ వ్యాప్తంగా పోలింగ్‌లో ఏపీ రెండో స్థానాంలో నిలిచిందని ప్రకటించారు. కాగా ఏపీ ఎన్నికల సందర్భంగా ఈవీఎంలు పెద్ద ఎత్తున మొరాయించాయని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. దీనిపై ద్వివేది స్పందిస్తూ.. అదంతా తప్పుడు ప్రచారం అన్నారు. కేవలం రెండు శాతానికి మించి ఈవీఎంలు మొరాయించలేదని.. వీలైనంత త్వరలోనే వాటిని కూడా మరమత్తులు చేయించామని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రశాంతంగా జరిగే సహరించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
గవర్నర్‌కు కొత్త ఎమ్మెల్యేల జాబితా
సాక్షి, అమరావతి: రాష్ట్ర శాసనసభకు గత నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 175 స్థానాలకు ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారని గవర్నరు ఈఎస్ఎల్ నరసింహన్‌కు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెలిపింది. తాజాగా ఎన్నికైన ఎమ్మెల్యేలందరి పేర్లతో నివేదికను గవర్నరుకు ఆదివారం అందజేసింది. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈఓ) గోపాలకృష్ణ ద్వివేది, ఈసీఐ ప్రిన్సిపల్ సెక్రటరి ఎస్కే రోడాల, అదనపు ప్రధాన ఎన్నికల అధికారులు సుజాత శర్మ, వివేక్ యాదవ్ తదితరులతో కూడిన బృందం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నరును కలిసి కొత్త ఎమ్మెల్యేల జాబితాను సమర్పించింది. దీంతో ప్రభుత్వం 175 మంది ఎమ్మెల్యేలు ఎన్నికైనట్లు వారి పేర్లతో గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. -
దేశంలో అత్యధిక పోలింగ్ ఏపీలోనే
సాక్షి, అమరావతి: ఇంతవరకు ఏ ఎన్నికల్లోనూ నమోదుకాని విధంగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ నమోదు కావడం గర్వంగా ఉందంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది శనివారం ట్వీట్ చేశారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో 80.31 శాతం పోలింగ్ నమోదయ్యిందన్నారు. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా కేవలం 67.47 శాతం పోలింగ్ నమోదు కావడం గమనార్హం. ఏప్రిల్ 11న జరిగిన ఎన్నికల్లో 79.64 శాతం ఓట్లు నమోదు కాగా పోస్టల్ బ్యాలెట్లు, సర్వీసు ఓట్లు పరిగణనలోకి తీసుకున్న తర్వాత మొత్తం పోలింగ్ 80.31 శాతానికి చేరింది. 2014లో నమోదైన 78.41 శాతంతో పోలిస్తే ఈ ఏడాది 1.9 శాతం అదనంగా ఓటింగ్ నమోదయింది. అదే విధంగా దేశ సగటుతో పోలిస్తే రాష్ట్రంలో ఏకంగా 12.84 శాతం అదనంగా ఓట్లు పోలయ్యాయి. పెద్ద రాష్ట్రాల్లో ఈ స్థాయి ఓటింగ్ మన రాష్ట్రంలో మాత్రమే నమోదైనట్లు ఎన్నికల సంఘం గణాంకాలు చెబుతున్నాయి. చిన్న రాష్ట్రాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే 81.79 శాతం ఓటింగ్‌తో అస్సాం మొదటిస్థానంలో నిలిచింది. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా మహిళలు, దివ్యాంగులు, పోస్టల్ బ్యాలెట్, సర్వీసు ఓట్లుపెద్దఎత్తున నమోదైనట్లు ద్వివేది తన ట్వీట్లో పేర్కొన్నారు. అదేవిధంగా ఈవీఎంలో నమోదైన ఓట్లకు వీవీప్యాట్ స్లిప్పులకు ఎక్కడా తేడా వచ్చినట్టు ఫిర్యాదు నమోదు కాలేదని ద్వివేది స్పష్టం చేశారు. -
పలుచోట్ల కౌంటింగ్‌కు అంతరాయం..!
సాక్షి, అమరావతి : సాంకేతిక సమస్యల కారణంగా పలు ప్రాంతాల్లో కౌంటింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. దీనిపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప, రైల్వే కోడూరు, చిలకలూరి పేట, నూజివీడు రిటర్నింగ్ అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. సాంకేతిక సమస్యలు తలెత్తితే వెంటనే కమాండ్ కంట్రోల్‌ని సంప్రదించాలని సూచించారు. ఏ కారణంతోను కౌంటింగ్ ఆపొద్దని, రూల్ బుక్ అమలు చేయాలని ఆదేశించారు. ప్రతి సమస్యకు ఈసీ నిర్దిష్ట పరిష్కారాలు సూచించిందని వెల్లడించారు. సందేహాలను నివృత్తి చేసుకోడానికి రూల్ పొజిషన్ చెక్ చేసుకోవాలని సూచించారు. (ఏపీ అసెంబ్లీ ఫలితాలు: లైవ్ అప్డేట్స్ ) ఇక భీమవరం కౌంటింగ్ కేంద్రం వద్ద జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. సమాచారశాఖ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలు ఇన్‌టైమ్‌లో వెల్లడించడం లేదని మీడియా ప్రతినిదులు ఆరోపించారు. అంతకుముందు టిఫిన్ లేదంటూ కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం నియోజకవర్గానికి చెందిన ఏజెంట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కొక్క ఏజెంట్ నుండి 400 వసూలు చేసిన అధికారులు సౌకర్యాలు కల్పించలేదని ఆరోపించారు. ఇక ఏపీ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పష్టమెన ఆదిక్యం కనబరుస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ 140కి పైగా అసెంబ్లీ, 13 లోక్‌సభ స్థానాల్లో ఆదిక్యంలో ఉంది. -
ఈసీ అనుమతి తర్వాతే తుది ఫలితం
సాక్షి, అమరావతి: రౌండ్ల వారీగా ఫలితాల ప్రకటనకు ఎన్నికల సంఘం(ఈసీ) అనుమతి అవసరం లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో) గోపాలకృష్ణ ద్వివేది చెప్పారు. కానీ, తుది ఫలితాన్ని మాత్రం ఈసీ అనుమతి తర్వాతే ప్రకటించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా, పూర్తి పారదర్శకంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియను పూర్తి చేయడానికి అన్ని చర్యలు చేపట్టామని వెల్లడించారు. 36 కేంద్రాల్లో 350 కౌంటింగ్ హాళ్లలో 25,000 మందికి పైగా సిబ్బంది ఓట్ల లెక్కింపులో పాల్గొంటున్నట్లు తెలిపారు. ఆయన బుధవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. రాజకీయంగా చాలా సున్నితమైన రాష్ట్రం కావడంతో ఏపీకి కేంద్రం 10 కంపెనీల అదనపు బలగాలను పంపిస్తోందని అన్నారు. ఇప్పటికే రాష్ట్రానికి 45 కంపెనీల కేంద్ర బలగాలు వచ్చాయని పేర్కొన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశామన్నారు. కౌంటింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరం నుంచి ఎలాంటి వాహనాలను అనుమతించేది లేదన్నారు. రాష్ట్రంలో మొత్తం 3.05 లక్షల పోస్టల్ బ్యాలెట్లు జారీ చేయగా, 21వ తేదీ నాటికి 2.62 లక్షలు ఆర్వోలకు చేరాయని, అలాగే 60,250 సర్వీసు ఓటర్లకు గాను 30,760 ఓట్లు చేరినట్లు తెలిపారు. గతంతో పోలిస్తే ఈసారి పోస్టల్ బ్యాలెట్లు భారీగా ఉండటంతో వీటి లెక్కింపు కోసం ప్రత్యేకంగా అదనపు టేబుళ్లను ఏర్పాటు చేశామన్నారు. రాజకీయ పార్టీలు సహకరించాలి ‘‘ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు మొదలవుతుంది. ఆ తర్వాత 8.30 గంటల నుంచి ఈవీఎంల లెక్కింపు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం కల్లా ఫలితాల ట్రెండ్‌పై ఒక స్పష్టత వస్తుంది. రాత్రికల్లా అధికారికంగా ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది. ఓట్ల లెక్కింపులో పాటించాల్సిన నిబంధనలు, విధివిధానాలపై సిబ్బందికి పూర్తిస్థాయిలో శిక్షణ ఇచ్చాం. ఈవీఎంలో తలెత్తే సాంకేతిక సమస్యలను పరిష్కరించడానికి ప్రతి నియోజకవర్గానికి ఇద్దరు చొప్పున సాంకేతిక నిపుణులను అందుబాటులో ఉంచాం. కౌంటింగ్ సెంటర్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. ప్రతి టేబుల్ వద్ద ఒక సూపర్వైజర్, ఇద్దరు సహాయకులు, ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు. ఓట్ల లెక్కింపు విషయంలో పుకార్లు, వదంతులను నమ్మొద్దు. రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసే విధంగా సహకరించాలని రాజకీయ పార్టీలను కోరుతున్నాం. కొన్నిచోట్ల నేరచరిత్ర ఉన్న వారిని కౌంటింగ్ ఏజెంట్లుగా నియమించినట్లు ఫిర్యాదులు అందాయి. వీటిని పరిశీలించి, నేర చరిత్ర ఉన్న వారిని తొలగించాల్సిందిగా కలెక్టర్లకు ఆదేశాలను జారీ చేశాం. నేర చరిత్ర ఉన్న వారిని ఏజెంట్లుగా చివరి నిమిషంలో కూడా తిరస్కరించే అధికారం ఎన్నికల సంఘానికి ఉంది. ఈ విషయం దృష్టిలో పెట్టుకొని రాజకీయ పార్టీలు ఎలాంటి ఆరోపణలు లేని, క్రమశిక్షణ కలిగిన వ్యక్తులను ఏజెంట్లుగా నియమించుకోవాలి’’ అని ద్వివేది సూచించారు. ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించం ‘‘కౌంటింగ్ ఏజెంట్లు లెక్కింపు కేంద్రాల్లోకి వారితో పాటు తీసుకెళ్లే వస్తువులను నిర్ధారిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోకి ఏజెంట్లు కేవలం పెన్ను/పెన్సిల్, తెల్ల కాగితాలు/నోట్ ప్యాడ్, ఫారం–17సీ, పోలింగ్ ముగిసిన తర్వాత సంబంధిత పోలింగ్ కేంద్రానికి చెందిన ప్రిసైడింగ్ అధికారి జారీ చేసిన డూప్లికేట్ కాపీలను తీసుకెళ్లాలి. ప్రిసైడింగ్ అధికారి జారీ చేసిన ఫారం–17సీని కౌంటింగ్ హాల్లో ఓట్ల లెక్కింపు సమయంలో ఉపయోగపడేలా, సరి చూసుకొనేందుకు అనుమతిస్తాం. సెల్‌ఫోన్‌తో సహా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి అనుమతించే ప్రసక్తే లేదు’’ అని గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. -
ఏపీలో మధ్యాహ్నం 2గంటలకు తొలి ఫలితం!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తొలి ఫలితం గురువారం మధ్యాహ్నం 2 గంటలకు వెలువడే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. కౌంటింగ్ ఏర్పాట్లపై ఆయన బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. మధ్యాహ్నం 12 గంటల వరకూ ట్రెండ్ తెలిసిపోతుందని, రేపు అర్థరాత్రికి మొత్తం ఫలితాలు వెల్లడిస్తామని ఆయన తెలిపారు. ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు ఉంటే వీవీ ప్యాట్లు లెక్కిస్తామని, కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కౌంటింగ్ తర్వాత రీ పోలింగ్ జరిగే అవకాశం చాలా తక్కువ అని ద్వివేది అభిప్రాయపడ్డారు. కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని, పాదర్శకంగా ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుందని ద్వివేది తెలిపారు. ఉదయం 8 గంటలకు పోస్టల్, సర్వీస్ ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. 36 కేంద్రాల్లో 350 కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు చేశామని, అసెంబ్లీ, లోక్‌సభకు వేర్వేరుగా పరిశీలకులను నియమించినట్లు చెప్పారు. అలాగే అసెంబ్లీ, లోక్‌సభకు వేర్వేరుగా లాటరీలు తీసి వీవీ ప్యాట్లు లెక్కిస్తామన్నారు. ఫలితాలను సరిచూసుకోవడానికి వీవీ ప్యాట్ల స్లిప్పులు ఉపయోగించనున్నట్లు ద్వివేది తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఉంటుందని, 100 మీటర్ల దూరం నుంచి వాహనాలకు అనుమతి లేదని, సుమారు 25వేలమంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సువిధ యాప్,ఈసీఐ వెబ్సైట్లో ఫలితాలు చూసుకోవచ్చని ద్వివేది తెలిపారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఏపీలో మధ్యాహ్నం 2గంటలకు తొలి ఫలితం!
-
సాంకేతిక సమస్య వల్ల ఫలితం తేలకపోతే రీపోలింగ్
సాక్షి, అమరావతి: ఎన్నికల లెక్కింపులో సాంకేతిక సమస్య వల్ల ఫలితం తేలకపోతే రీపోలింగ్‌కు ఆదేశించే అధికారం ఎన్నికల సంఘానికి ఉందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. సాంకేతిక సమస్యలతో ఈవీఎంలు మొరాయించి, వీవీప్యాట్ స్లిప్పుల లెక్కలో తేడా వచ్చినప్పుడు, ఈ ఓట్లే అభ్యర్థి విజయాన్ని నిర్దేశించే విధంగా ఉంటే కౌంటింగ్ ముగిసిన తర్వాత కూడా సంబంధిత బూత్‌లో రీపోలింగ్ నిర్వహించవచ్చని చెప్పారు. అప్పటిదాకా ఆ నియోజకవర్గ ఫలితాన్ని నిలిపివేస్తామన్నారు. ద్వివేది మంగళవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. అవసరమైతే రీపోలింగ్ నిర్వహించాల్సి వస్తుందనే ఎన్నికల ప్రవర్తనా నియమావళి మే 27 అర్ధరాత్రి వరకు అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. మధ్యాహ్నం 2 గంటలకల్లా ఈవీఎంల లెక్కింపు పూర్తి! ‘‘కౌంటింగ్ రోజు పొరపాట్లు, అవకతవకలకు ఆస్కారం లేకుండా ఎన్నికల సంఘం జారీచేసిన మార్గదర్శకాలను అందరూ కచ్చితంగా పాటించాల్సిందే. లెక్కింపు కేంద్రాల్లో అవకతవకలకు పాల్పడ్డా, గొడవలు సృష్టించినా ఎంతటి వారినైనా ఉపేక్షించే ప్రసక్తే లేదు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు కార్యక్రమం ప్రశాం తంగా ముగియడానికి అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలి. కౌంటింగ్‌లో ఎటువంటి అనుమానాలకు తావు లేకుండా ఈవీఎంలకు ఉండే మూడు సీళ్లను ఏజెంట్ల సమక్షంలోనే తెరుస్తాం. పోలైన ఓట్లు, టేబుళ్ల సంఖ్య ఆధారంగా ఈవీఎంల లెక్కింపు సమయం ఆధారపడి ఉటుంది. మధ్యాహ్నం రెండు గంటలకల్లా ఈవీఎంల లెక్కింపు పూర్తవుతుందని అంచనా వేస్తున్నాం. పోస్టల్, సర్వీస్ ఓట్ల లెక్కింపు కోసం ప్రతి 500 ఓట్లకు ఒక కౌంటింగ్ టేబుల్ ఏర్పాటు చేస్తున్నాం’’అని గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. అంతకుముందు ఆయన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎన్నికల ప్రత్యేక పరిశీలకుడు వినోద్ జుట్షీతో కలిసి విజయవాడ నుంచి జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు, ఇతర పరిశీలకులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కౌంటింగ్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈవీఎంల ద్వారా లెక్కింపు సమయంలో మాక్పోపోల్ ఓట్లు, ఫారం 17సి విషయంలో ఇప్పటికే జారీచేసిన ఉత్తర్వులను తప్పనిసరిగా అమలు చెయ్యాలన్నారు. మార్గదర్శకాలకు అనుగుణంగా కౌంటింగ్ ఏజెంట్లను అనుమతించాలని చెప్పారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో క్రమశిక్షణ కలిగి ఉండాలని పేర్కొన్నారు. అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్ మాట్లాడుతూ.. ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతా ఏర్పాట్లు చేశామని చెప్పారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా కౌంటింగ్ ఏర్పాట్లపై వినోద్ జుట్షీ సంతృప్తి వ్యక్తం చేశారు. -
ఈవీఎం మొరాయిస్తే వీవీప్యాట్లు లెక్కిస్తాం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై దృష్టి సారించినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేది తెలిపారు. కౌంటింగ్ ఏర్పాట్లు, భద్రతా చర్యలపై సోమవారం జిల్లాల ఎన్నికల పరిశీలకులు, ఎస్పీలు, సీపీలు, ఆర్వోలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ సాంకేతిక కారణాల వల్ల ఈవీఎంలు తెరుచుకోకపోతే వాటి స్థానంలో వీవీప్యాట్ల స్లిపులను లెక్కించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిందని వెల్లడించారు. ఈవీఎంకు సంబంధించి బ్యాటరీ రీప్లేస్మెంట్, కంట్రోల్ యూనిట్ మరమ్మతులు సాధ్యం కానప్పుడు వీవీప్యాట్లను లెక్కిస్తామన్నారు. లెక్కింపు సమయంలో మొరాయించిన ఈవీఎంలను పక్కకు పెట్టి మిగిలిన ఈవీఎంలతో ఓట్ల లెక్కింపు కొనసాగిస్తామన్నారు. చివర్లో మొరాయించిన ఈవీఎంల పరిస్థితి పరిశీలించి కేంద్ర పరిశీలకులు, ఆర్వో తగు నిర్ణయం తీసుకుంటారన్నారు. ఓట్ల లెక్కింపులో ఫారం 17సీ అత్యంత కీలకమైనదని, ఈ ఫారంలోని వివరాలతో సరిపోలితేనే కౌంటింగ్ ప్రక్రియ ముందుకు సాగుతుందన్నారు. కౌంటింగ్‌కు ముందు మాక్‌పోల్ నివేదిక లెక్కలు కూడా సరిపోవాలన్నారు. ఒకవేళ మాక్‌పోల్ ఓట్లు తొలగించకుండా అంటే సీఆర్సీ చేయకుండా పోలింగ్ కొనసాగించి ఉంటే పీవో డైరీ ఆధారంగా ఆ ఓట్లను తొలగించి లెక్కింపు చేపట్టాల్సి ఉంటుందన్నారు. అలాగే సీఆర్సీ చేయని వీవీప్యాట్లను లాటరీ విధానంలో ఐదు ఎంపిక చేసే ర్యాండమైజేషన్ నుంచి తొలగిస్తున్నట్లు తెలిపారు. కౌంటింగ్ సమయంలో సందేహాలు తలెత్తితే పోలింగ్ డైరీ ఆధారంగా ఆర్వోలు నిర్ణయం తీసుకుంటారని, ఓట్ల లెక్కలపై పార్టీల మధ్య భేదాభిప్రాయాలు వస్తే ఆర్వోనే తుది నిర్ణయం తీసుకుంటారన్నారు. అభ్యర్థుల మధ్య పోటీ గట్టిగా ఉండి మెజార్టీ స్వల్పంగా ఉంటే ఆర్వో, కేంద్ర పరిశీలకులు రీ–కౌంటింగ్‌కు ఆదేశించే అవకాశం ఉందన్నారు. ఈ రీకౌంటింగ్‌లో మొత్తం ఈవీఎంలు చేయాలా లేక సర్వీస్ ఓట్లు, పోస్టల్ బ్యాలెట్లకే పరిమితం చేయాలా అన్నది కూడా వారే నిర్ణయిస్తారన్నారు. సీఎం వ్యాఖ్యలపై ఖండన కౌంటింగ్ ఏజెంట్లకు 17సీ ఫారంలు ఇవ్వడం లేదని, కనీస ఆహార ఏర్పాట్లు కూడా చేయడం లేదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ద్వివేది ఖండించారు. కౌంటింగ్ హాల్లో ఎన్ని టేబుళ్లు ఉంటే అంత మంది ఏజెంట్లను అనుమతిస్తామని, అలాగే ఏజెంట్లకు 17సీ ఫారం కూడా తప్పకుండా ఇస్తామన్నారు. అలాగే ఏజెంట్లకు ఎప్పటికప్పుడు ఆహారాన్ని ప్యాకెట్ల రూపంలో అందించే విధంగా తగు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. -
చంద్రగిరిలో రీపోలింగ్ కారకులపై సస్పెన్షన్ వేటు
సాక్షి, అమరావతి: చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ కారణమైన అధికారులను సస్పెండ్ చేస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల విధుల్లో అలసత్వం వహించిన ఐదు పోలింగ్ కేంద్రాల్లోన్ని ప్రిసైడింగ్ ఆఫీసర్లు (పీవో), అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ల (ఏపీవో)ను సస్పెండ్ చేస్తూ తక్షణం వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా చిత్తూరు జిల్లా కలెక్టర్‌కు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేది సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా అయిదు పోలింగ్ కేంద్రాల్లో ఉన్న ప్రైవేటు వ్యక్తులను గుర్తించి వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ వివరాలను ఇవ్వాల్సిందిగా కోరారు. ఏప్రిల్ 11న జరిగిన ఎన్నికల్లో ఈ ఐదు పోలింగ్ కేంద్రాల్లో జరిగిన తప్పులు, ఆ అధికారులపై ఎందుకు చర్యలు తీసుకుంటున్నది ఎన్నికల సంఘం ఆ ఉత్తర్వుల్లో వివరంగా పేర్కొంది. ఎన్.ఆర్. కమ్మల్లి(321): చాలా మంది ఓటర్లకు సాయంగా ప్రైవేటు వ్యక్తులు రావడమే కాకుండా ఓటింగ్ కంపార్టమెంట్ వద్ద ఓటు వేసేటప్పుడు కూడా ఉన్నారు. ఇది ఓటు రహస్యం అనే నిబంధనను ఉల్లంఘించడమే. అదే విధంగా నలుగురైదుగురు వ్యక్తులు పోలింగ్ కేంద్రాల్లో ఎటువంటి ఐడీ కార్డులు లేకుండా స్వేచ్ఛగా తిరగడం కనిపించింది. మరికొంత మంది ఓటర్లకు సహాయకులుగా వచ్చిన వారు ఓటరు బదులు వారే ఓట్లు వేశారు. కొన్ని చోట్ల ఓటరు లేకుండానే మరో వ్యక్తి ఓటు వేయడం జరిగింది. దీనిపై ప్రిసైడింగ్ ఆఫీసర్లు, ఇతర అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తే ప్రైవేటు వ్యక్తులు, పోలింగ్ ఏజెంట్లు వాగ్వివాదానికి దిగడమే కాకుండా బెదిరింపులకు దిగారు. పోలింగ్ కేంద్రాల్లో సెల్ఫోన్లను కూడా యధేచ్చగా వినియోగించారు. పుల్లివర్తిపల్లి(104): మధ్యాహ్నం 2.24 నిమిషాలకు రెండు ఓటింగ్ కంపార్టమెంట్ల వద్ద ఇద్దరు ప్రైవేటు వ్యక్తులు నిలబడి ఓటరు బదులు వారే ఓట్లు వేయడం జరిగింది. ఇలా ఓటింగ్ ముగిసే వరకు ఓటర్ల బదులు వారే ఓట్లు వేశారు. కొత్తకండ్రిగ(316): మధ్యాహ్నం 12.25 – 1.25 మధ్య సమయంలో పోలింగ్ కేంద్రంలో వ్యక్తుల మధ్య పరస్పర వాగ్వాదాలు జరిగాయి. పోలింగ్ ఏజెంట్లుగా కనిపిస్తున్న వారు ఓటరుతో పాటు కంపార్టమెంటు వరకు వెళ్లి ఓటరు బదులు వారే ఓటు వేశారు. పోలింగ్ ముగిసే వరకు ఇదే ప్రక్రియ కొనసాగింది. కమ్మపల్లి(318): అసలు ఓటరు బదులు ఒకే వ్యక్తి ఓట్లు వేయడం జరిగింది. ఉదయం 8.50 నిమిషాల సమయంలో పోటీలో ఉన్న అభ్యర్థి డాక్టర్ చెవిరెడ్డి భాస్కర రెడ్డి పోలింగ్ కేంద్రంలోకి రావడం పోలింగ్ కేంద్రంలో ఉన్న వ్యక్తులతో వాడిగావేడిగా వాదనలు జరిగాయి. ఇక మధ్యాహ్నం 2.30 -
ఏపీలో 34చోట్ల 55కేంద్రాల్లో కౌంటింగ్
సాక్షి, అమరావతి: రీపోలింగ్ ముగియడంతో ఎన్నికల సంఘం కౌంటింగ్‌పై దృష్టి సారించింది. ఆంధ్రప్రదేశ్‌లో 34 చోట్ల 55 కేంద్రాల్లో కౌంటింగ్ ప్రక్రియకు 13 జిల్లాల కలెక్టర్లు ఏర్పాట్లు చేపట్టారు. ఈ నెల 23వ తేదీ ఉదయం ఎనిమిది గంటల నుంచి ఓట్ల క్కింపు ప్రారంభం కానుంది. ఇందుకోసం 25వేలమంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం కౌంటింగ్ ప్రక్రియకు 200మంది పరిశీలకులను నియమించింది. గురువారం ఉదయం ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. 8.30 గంటల నుంచి ఈవీఎంల లెక్కింపు ప్రారంభిస్తారు. ఒక నియోజకవర్గంలో ఈవీఎంల లెక్కింపు అన్ని రౌండ్లు పూర్తయిన తరువాత ఐదు వీవీప్యాట్ యంత్రాలను లాటరీ విధానంలో తీస్తారు. ఆ వీవీ ప్యాట్‌ల్లోని స్లిప్పులను లెక్కించడం పూర్తయిన తరువాతనే ఆ నియోజకవర్గ ఫలితాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు తెలియజేసిన తరువాత అధికారికంగా వెల్లడిస్తారు. వీవీప్యాట్ యంత్రాల్లో స్లిప్పులు లెక్కించడానికి సమయం పట్టనుంది. అందువల్ల అధికారికంగా ఫలితాల వెల్లడికి ఆలస్యమైనప్పటికీ ఈవీఎంలు లెక్కించిన తరువాత అనధికారికంగా ఫలితాలు తెలిసిపోతాయి. మరోవైపు ఏపీ సీఈవో గోపాలకృష్ణ ద్వివేది కౌంటింగ్ ఏర్పాట్లు, భద్రతా చర్యలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల ఎన్నికల పరిశీలకులు, ఎస్పీలు, సీపీలు, ఆర్వోలు ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.అనంతరం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేశారు. ‘కౌంటింగ్‌లో వీవీ ప్యాట్‌లో స్లిప్పులు, ఫారం-17సీ లెక్కలతో సరిపోవాలి. కౌంటింగ్‌కు ముందు మాక్ పోల్ రిపోర్టు కూడా లెక్కలతో సరిపోవాలి. వీవీ ప్యాట్ స్లిప్పులు ఈవీఎం ఓట్లతో సరిపోవాలి. ఎన్నికల లెక్కింపులో సందేహాలు వస్తే పోలింగ్ డైరీ రిపోర్టుల ఆధారంగా నిర్ణయం ఉంటుంది. సాంకేతిక సమస్యలు, వివాదాలు తలెత్తిన చోట ఫలితాలపై ఈసీదే నిర్ణయం. మొరాయించిన ఈవీఎంల లెక్కింపు కౌంటింగ్ చివర్లో జరుపుతాం. ఓట్ల లెక్కింపుపై పార్టీల మధ్య భేదాభిప్రాయాలు వస్తే ఆర్వోదే నిర్ణయాధికారం. ఏదైనా కేంద్రంలో తక్కువ మార్జిన్ వస్తే రీకౌంటింగ్‌కు అవకాశం ఉంటుంది. రీకౌంటింగ్ నిర్ణయాధికారం ఆర్వో, అబ్జర్వర్లదే’ అని తెలిపారు. -
గొడవలకు ఆస్కారం.. టీడీపీపై ఫిర్యాదు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేదీని మంగళగిరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి(ఆర్కే) శనివారం కలిశారు. మంగళగిరి కౌంటింగ్‌లో టీడీపీ గొడవలు సృష్టించే అవకాశం ఉందని ఫిర్యాదు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘాన్నే సీఎం చంద్రబాబు నాయుడు బెదిరిస్తున్నందువల్ల మంగళగిరిలో కౌంటింగ్ సిబ్బందిని కూడా భయపెట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. సీఎం తనయుడు నారా లోకేశే అభ్యర్థి కావడంతో వివాదాలను ప్రోత్సహించి ఫలితాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించే ప్రమాదం ఉందని ఎన్నికల అధికారికి తెలిపారు. ప్రశాంతంగా కౌంటింగ్ జరగాలంటే పోలీస్ సిబ్బందిని మంగళగిరిలో అదనంగా నియమించాలని కోరారు. మంగళగిరి కౌంటింగ్‌పై అదనపు అభ్జర్వర్ని కూడా నియమించాలని విన్నవించారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : టీడీపీపై ఎపీ ఈసీసి ఆర్కే ఫిర్యాదు -
టీడీపీపై ఎపీ ఈసీసి ఆర్కే ఫిర్యాదు
-
తప్పు జరిగినందువల్లే రీపోలింగ్‌కు ఈసీ నిర్ణయం
-
ఇది ప్రజాస్వామ్యమేనా?
సాక్షి, అమరావతి: ‘ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఇంత ఘోరంగా జరుగుతాయా? చంద్రగిరిలో పోలింగ్ వీడియోలు చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తోంది. ఎన్నికల్లో కొందరు సిబ్బంది కుమ్మక్కైతే ఎన్నికల సంఘం చూస్తూ కూర్చోవాలా?’ అని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది ఆగ్రహం వ్యక్తం చేశారు. ద్వివేది శుక్రవారం సచివాలయంలో విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. తొలుత చంద్రగిరిలో ఎన్నికలు సవ్యంగా జరిగినట్లు నివేదికలు వచ్చాయని, కానీ రీ–పోలింగ్ కోరుతూ అందిన ఫిర్యాదులపై వీడియోలను పరిశీలిస్తే ప్రజాస్వామ్యం ఇలా ఉంటుందా? అనిపించేలా దారుణమైన పరిస్థితులు కనిపించాయని వెల్లడించారు. అన్ని ఫుటేజ్‌లు పరిశీలించిన తర్వాతే రీ–పోలింగ్‌కు సూచిస్తూ ఈసీకి సిఫార్సు చేశామని స్పష్టం చేశారు. చంద్రగిరిలో ఏం జరిగిందన్న విషయంపై స్పష్టమైన ఆధారాలున్నాయని తెలిపారు. చంద్రగిరిలో ఈసీ రీ పోలింగ్‌కు ఆదేశించడంపై ఎవరైనా కోర్టుకు వెళ్తే దీనికి సంబంధించిన అన్ని ఆధారాలను న్యాయస్థానానికే సమర్పిస్తామని ద్వివేది ప్రకటించారు. వీడియో ఫుటేజ్‌లు చూశాక మాట్లాడాలి.. ఎన్నికల సందర్భంగా జరిగిన అక్రమాలను దాచిపెట్టాలనో లేక ఎవరినో కాపాడాలనో తాము చూడటం లేదని ద్వివేది పేర్కొన్నారు. రీ పోలింగ్‌పై ఆరోపణలు చేస్తున్నవారు ఒకసారి ఈ వీడియో ఫుటేజ్‌లు చూసి మాట్లాడాలన్నారు. చంద్రగిరిలో ఎన్నికల సమయంలో తప్పు జరగడం వల్లే ఈసీ స్పందించిందని, ఫిర్యాదు ఆలస్యంగా అందడం వల్లే ఒకేసారి రీ–పోలింగ్ నిర్వహించలేక పోయామని వివరించారు. ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా పనిచేస్తోందని, ప్రతి ఫిర్యాదును పరిశీలించి చర్యలు తీసుకుంటోందని తెలిపారు. నిర్లక్ష్యం ప్రదర్శిస్తే సహించం: టీడీపీ రీ–పోలింగ్ కోరుతున్న 18 చోట్ల కూడా వీడియో ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నట్లు ద్వివేది తెలిపారు. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఏ ఒక్క అధికారిని వదిలిపెట్టేది లేదని, చంద్రగిరిలోని ఐదు పోలింగ్ కేంద్రాల్లో పీవో, ఏపీవోలపై కఠిన చర్యలుంటాయన్నారు. పోలింగ్ కేంద్రాల్లో అనధికారిక వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామన్నారు. మరో రెండు చోట్ల రీ–పోలింగ్‌కు సిఫార్సు చిత్తూరు జిల్లాలోని మరో రెండు పోలింగ్ కేంద్రాల్లో కూడా కలెక్టర్ రీ పోలింగ్‌కు సిఫార్సు చేసినట్లు ద్వివేది తెలిపారు. వీడియో ఫుటేజ్ పరిశీలించిన తర్వాత 310, 323 కేంద్రాలలో రీ పోలింగ్‌కి సిఫార్సు చేసినట్లు పేర్కొన్నారు. దీనిపై సీఈసీ అనుమతి కోరుతూ నివేదిక పంపినట్లు చెప్పారు. రేపు చంద్రగిరిలో రీ పోలింగ్‌కు పటిష్ట భద్రత చంద్రగిరిలో ఆదివారం రీ పోలింగ్ నిర్వహించే ఐదు కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలను ద్వివేది ఆదేశించారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద 250 మంది సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేయడంతోపాటు పోలింగ్ కేంద్రాల లోపల, బయట సీసీ కెమెరాలను అమర్చాలని ఆదేశించారు. ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ద్వివేది నియమావళిని వివరించారు. ఎన్నికల విధులకు సంబంధించి పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వాలని సూచించారు. రీ పోలింగ్ సందర్భంగా ఓటరు ఎడమ చేయి మధ్య వేలికి సిరా గుర్తు వేయాలన్నారు. ఎండల నేపథ్యంలో ఇబ్బంది లేకుండా షామియానాలు, తాగునీటి సౌకర్యం కల్పించాలని పేర్కొన్నారు. -
పీవో, ఏపీవోపై కఠిన చర్యలు ఉంటాయి
-
అనధికార వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాం : ద్వివేదీ
అమరావతి: చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో తప్పులు జరిగినందువల్లే రీపోలింగ్‌కు ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదీ స్పష్టం చేశారు. ఫిర్యాదు ఎవరిచ్చినా ఈసీ చర్యలు చేపడుతుందని అన్నారు. టీడీపీ కోరిన 18 చోట్ల కూడా వీడియో ఫుటేజీలు పరిశీలిస్తున్నామని చెప్పారు. రీపోలింగ్ జరిగే 5 కేంద్రాల్లో పీవో, ఏపీవోపై కఠిన చర్యలు ఉంటామని పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఉన్న అనధికార వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని అన్నారు. ఎన్నికల సిబ్బంది కుమ్మక్కైతే ఈసీ చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. చంద్రగిరిలో ఏం జరిగిందో స్పష్టమైన ఆధారాలున్నాయని పునరుద్ఘాటించారు. దీనిపై అవసరమైతే కోర్టుకు వివరిస్తామని చెప్పారు. (చదవండి : ఏపీలో ఐదు చోట్ల రీపోలింగ్ ) మొదట్లో అక్కడ అంతా బాగుంది అని నివేదికలు వచ్చాయని ఆయన చెప్పుకొచ్చారు. ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా పనిచేస్తోందని ద్వివేదీ పేర్కొన్నారు. ఎన్నికల్లో జరిగిన అక్రమాలను దాచిపెట్టాలనో, ఎవరినో కాపాడాలి అనో ఈసీ భావించడం లేదని చెప్పారు. చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్పీతో శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలీసు బందోబస్తు, రీపోలింగ్ నిర్వహణ పై సమీక్ష చేశారు. రీపోలింగ్ పై విస్తృత ప్రచారం కల్పించాలని ఆదేశాలు జారీచేశారు. ఈ నెల 19 (ఆదివారం)న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ కేంద్రాల్లో(అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు) రీపోలింగ్ జరగనుంది. 321-ఎన్ఆర్ కమ్మపల్లి, 104- పులివర్తి వారి పల్లి, 316- కొత్త ఖండ్రిగ, 318-కమ్మపల్లి, 313-వెంకట రామాపురం పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల ఆదేశాలు జారీ చేసింది. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : పీవో, ఏపీవోపై కఠిన చర్యలు ఉంటాయి -
చిత్తూరు జిల్లా కలెక్టర్‌తో ఏపీ ఈసీ వీడియో కాన్ఫరెన్స్
-
రీపోలింగ్‌పై కలెక్టర్, ఎస్పీలతో ద్వివేదీ సమీక్ష
అమరావతి: చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో జరిగే రీపోలింగ్‌పై చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. పోలీస్ బందోబస్తు, రీపోలింగ్ నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు. రీపోలింగ్‌పై విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ఎండల తీవ్రత దృష్ట్యా పోలింగ్ బూత్‌ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచన చేశారు. స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎటువంటి పొరపాట్లకు అవకాశం లేకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని అధికారులకు సూచనలు చేశారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : చిత్తూరు జిల్లా కలెక్టర్‌తో ఏపీ ఈసీ వీడియో కాన్ఫరెన్స్ -
సెలవుపై వెళ్లిన ద్వివేదీ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి(సీఈఓ) గోపాల కృష్ణ ద్వివేదీ సెలవుపై వెళ్లారు. రేపటి నుంచి ఈ నెల 15 వరకు ద్వివేదీ సెలవులోనే ఉండనున్నారు. తిరిగి ఈ నెల 16న సచివాలయానికి ద్వివేదీ రానున్నారు. స్క్రీనింగ్ కమిటీ ఖరారు చేసిన క్యాబినేట్ అజెండాను కేంద్ర ఎన్నికల సంఘానికి సీఈఓ ద్వివేదీ పంపారు. కేంద్ర ఎన్నికల కమిషన్(సీఈసీ) నుంచి అనుమతి రావడానికి కనీసం రెండు రోజుల సమయం పట్టే అవకాశముంది. సోమవారం సాయంత్రానికి క్యాబినేట్‌పై సీఈసీ నుంచి స్పష్టత రావచ్చని అధికారులు భావిస్తున్నారు. గోపాల కృష్ణ ద్వివేదీ సెలవుపై వెళ్లనుండటంతో క్యాబినేట్ ఎజెండా మరింత ఆలస్యం అయ్యే అవకాశముంది. -
ఈసీ ద్వివేదీని కలిసిన వైఎస్ఆర్సీపీ నేతలు
-
పోస్టల్ బ్యాలెట్స్‌పై వైఎస్సార్ సీపీ ఫిర్యాదు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు బుధవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలిశారు. ఎమ్మెల్యే తిప్పేస్వామి, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ పోస్టల్ బ్యాలెట్స్‌లో అవకతవకలపై సీఈవోకు ఫిర్యాదు చేశారు. అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో 108 మందికి రెండు పోస్టల్ బ్యాలెట్స్ ఇచ్చారంటూ ఎమ్మెల్యే తిప్పేస్వామి ఆధారాలతో సహా సమర్పించారు. దీనిపై ఆర్వో సమాధానం చెప్పలేదని, బాధ్యులపై చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్ సీపీ నేతల ఫిర్యాదుపై స్పందించిన ద్వివేది... దీనిపై నివేదిక పంపాలంటూ అనంతపురం జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. కాగా ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటముల్లో పోస్టల్ బ్యాలెట్లు కీలకంగా మారుతున్నాయి. అందుకే తమ ప్రభుత్వ పనితీరుపట్ల విముఖంగా ఉన్న ఉద్యోగులకు ఓటు హక్కు లేకుండా చేసేందుకు టీడీపీ పెద్దలు కుట్ర పన్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు పోస్టల్ బ్యాలెట్స్ అవకతవకలపై ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య న్యాయపోరాటానికి దిగింది. 40 వేల మంది ఉద్యోగుల ఓటుహక్కును అధికారులు హరించారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్ పై విచారణకు హైకోర్టు వెకేషన్ బెంచ్ నిరాకరించింది. సుప్రీం కోర్టును ఆశ్రయించి ఓటుహక్కు సాదిస్తామంటున్న ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య నేతలు పేర్కొన్నారు. -
ఓట్ల లెక్కింపులో అప్రమత్తంగా ఉండండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రాజకీయ వాతావరణం కాక మీద ఉన్న నేపథ్యంలో 23న జరిగే కౌంటింగ్‌లో అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం సచివాలయంలో ఓట్ల లెక్కింపుపై రిటర్నింగ్ అధికారులు, ఇతర అధికారులతో ఆయన రాష్ట్ర స్థాయి శిక్షణా సమావేశం నిర్వహించారు. కౌంటింగ్‌లో ఎటువంటి తప్పులు దొర్లకుండా, ఎన్నికల నిబంధనల మేరకు నిష్పక్షపాతంగా ఓట్ల లెక్కింపు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కౌంటింగ్‌కు వచ్చే రాజకీయ పార్టీల ఏజెంట్లకు ప్రతి అంశంపై అవగాహన ఉంటుంది కాబట్టి అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ఏవైనా ఈవీఎంల్లో సమస్యలొస్తే వాటిని చివరి రౌండ్‌కు మార్చి అప్పుడు పరిశీలించాలని సూచించారు. అదేవిధంగా మాక్ పోలింగ్ సందర్భంగా నమోదైన ఓట్లను కొన్ని చోట్ల వీవీ ప్యాట్స్ నుంచి తొలగించకపోతే వాటిని అభ్యర్థుల సమక్షంలో లెక్కించి వారికి వివరించాలన్నారు. మాక్ పోలింగ్ వివరాలు అన్ని పార్టీల ఏజెంట్ల వద్ద ఉంటాయి కాబట్టి వాటితో సరిపోల్చి వివరించాల్సిందిగా కోరారు. స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి కౌంటింగ్ హాళ్లకు ఈవీఎంలు తీసుకువచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, గందరగోళానికి తావు లేకుండా ఉండేందుకు లోక్‌సభ, శాసనసభ బ్యాలెట్ బాక్సులు తీసుకొచ్చే సిబ్బందికి ప్రత్యేక డ్రెస్ కోడ్ ఇవ్వాలన్నారు. ఈ శిక్షణా కార్యక్రమానికి హాజరైన కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఆర్వోలు, ఏఆర్వోలు నియోజకవర్గ స్థాయిలో కౌంటింగ్‌లో పాల్గొనే సిబ్బందికి శిక్షణ ఇవ్వాల్సిందిగా కోరారు. తొలిసారి వీవీప్యాట్లను కూడా లెక్కిస్తుండటంతో దీనిపై సిబ్బందికి తగిన అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి ఏజెంటుకు ఐడీ కార్డు కౌంటింగ్ హాల్లోకి ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్ఫోన్లను అనుమతించేది లేదని ద్వివేది స్పష్టం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులు తప్ప ఇతరులెవరూ సెల్ఫోన్లు లోపలికి తీసుకువెళ్లడానికి వీల్లేదన్నారు. కాబట్టి సెల్ఫోన్లను భద్రపరచడానికి తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే కౌంటింగ్ ఏజెంట్ల వివరాలను పోలీసులు పరిశీలించి నేరచరిత్ర ఉంటే తిరస్కరించాలని సూచించారు. ప్రతి ఏజెంటుకు ఐడీ కార్డు ఇవ్వడంతోపాటు ఎన్నికల ఫలితాలను ఎప్పటికప్పుడు మీడియాకు తెలిపేలా సెంట్రల్ పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయాలన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఉద్యోగుల్లో అభద్రతా భావాన్ని తొలగించాలి ఉద్యోగులు గతంలో ఎన్నో ఎన్నికల్లో విధులు నిర్వహించినా ఈసారి ఎదుర్కొన్నంత ఒత్తిడి ఎప్పుడూ ఎదుర్కోలేదని జాయింట్ కలెక్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు బాబూరావు.. ద్వివేది దృష్టికి తీసుకొచ్చారు. ఎన్నికల సిబ్బందిలో ఉన్న అభద్రతా భావాన్ని తొలగించాలని కోరారు. ఈ సందర్భంగా 12 మంది అధికారులపై తీసుకున్న చర్యలపై పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ద్వివేది స్పందిస్తూ.. ఉద్దేశపూర్వకంగా ఎవరిపైనా చర్యలు తీసుకోలేదని, ఎంతవరకు తప్పు చేస్తే ఆ మేరకే చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఈ సమావేశంలో అదనపు ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్, సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి డి.మార్కండేయులు, జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, ఎన్ఐసీ అధికారులు, ఇతర ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు. -
‘ఏజెంట్లపై పోలీసు విచారణ కూడా జరిపించండి’
అమరావతి: రాజకీయ పార్టీలకు సంబంధించిన కౌంటింగ్ ఏజెంట్ల గురించి పోలీసు విచారణ కూడా జరిపించాలని స్థానిక ఎన్నికల అధికారులకు ఏపీ సీఈఓ గోపాల కృష్ణ ద్వివేదీ సూచించారు. మంగళవారం కౌంటింగ్ జిల్లా స్థాయి అధికారుల శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గోపాల కృష్ణ ద్వివేదీ, కౌంటింగ్ సిబ్బంది శిక్షణలో పలు సూచనలు చేశారు. కౌంటింగ్ సిబ్బంది ఎంపికలో జాగ్రత్త వహించాలని కోరారు. సమస్య వచ్చిన పోలింగ్ బూత్‌ల కౌంటింగ్‌ని చివరి రౌండ్‌కు మార్పు చేయాలని చెప్పారు. మాక్‌పోల్ చేసిన ఓట్లు కూడా వీవీపాట్స్‌లో కలిసి పోయి ఉంటే ఏజెంట్లు, అభ్యర్థుల సమక్షంలొ కౌంటింగ్ చేసి వివరించండని అన్నారు. మాక్ పోల్ వివరాలు అన్ని పార్టీ ఏజెంట్ల వద్ద ఉంటాయి కాబట్టి సమస్య ఉండదన్నారు. పోస్టల్ బ్యాలెట్లు 23వ తేదీ ఉదయం 7 గంటల 59 నిమిషాల వరకు తీసుకోవచ్చునని చెప్పారు. నిబంధనల ప్రకారం పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ నిర్వహించాలని సూచన చేశారు. సమస్య ఉండి.. అవసరమైతే తప్ప రీకౌంటింగ్‌కి అనుమతి ఇవ్వవద్దని సూచన చేశారు. ఎప్పుడూ ఇలా ఒత్తిడి ఎదుర్కోలేదు చాలా ఎన్నికల్లో విధులు నిర్వహించాం.. ఎప్పుడూ ఈవిధంగా ఒత్తిడి ఎదుర్కోలేదని జాయింట్ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బాబూరావు వ్యాఖ్యానించారు. 12 మంది ఎన్నికల అధికారులపై చర్యలు తీసుకునే విషయంలో పునరాలోచన చేయండని బాబూరావు, ద్వివేదీకి విన్నవించారు. ఒత్తిడి వల్ల కిందస్థాయిలో కొన్ని తప్పులు జరిగిన మాట వాస్తవమేనని చెప్పారు. ఎన్నికల సిబ్బందిలో అభద్రతా భావాన్ని తొలగించాలని కోరారు. దీనిపై ద్వివేది స్పందిస్తూ..తప్పు ఎంతవరకు చేస్తే అంతవరకే చర్యలు తీసుకున్నామని అన్నారు. ఉద్దేశపూర్వకంగా ఎవరిపై చర్యలు తీసుకోలేదన్నారు. కావాలని అధికారులు తప్పులు చేయరు..కొంతమంది నిర్లక్ష్యం వల్ల తప్పులు జరిగాయన్నారు. కౌంటింగ్ విషయంలో నిర్లక్ష్యం వీడి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
ముగిసిన రీపోలింగ్
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని ఐదుచోట్ల సోమవారం జరిగిన రీపోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని, భారీగా 81.48 శాతం పోలింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తం ఐదు బూత్‌ల్లో 5,064 ఓటర్లకుగాను 4,079 మంది ఓటు హక్కును వినియోగించుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘ ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఎన్నికల ముగిసిన తర్వాత సోమవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలోని కేశనుపల్లిలో 956 మంది ఓటర్లకు గాను 853 మంది (89.23శాతం), గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని నల్లచెరువులో 1,376 మంది ఓటర్లకు 1,053 మంది (75.04శాతం), ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలోని కలనూతలో 1,070 మంది ఓటర్లకు 931 మంది (87.01శాతం), నెల్లూరు జిల్లాలోని కోవూరు నియోజకవర్గంలోని ఇసుకపాలెంలో 1,084 ఓటర్లకు 819 మంది (75.55శాతం), ఇదే జిల్లా సూళ్ళూరుపేట నియోజకవర్గంలోని అటకానితిప్పలో 578 ఓటర్లకు 470 మంది (84.23శాతం) ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలిపారు. ఈ ఐదుచోట్ల ఎక్కడా ఈవీఎంలలో సాంకేతిక సమస్యలుగానీ, శాంతిభద్రతల సమస్యగానీ ఉత్పన్నం కాలేదన్నారు. ఎండలు ఎక్కువగా ఉన్నప్పటికీ పకడ్బందీ ఏర్పాట్లుచేసిన అధికారులకు ద్వివేది అభినందనలు తెలిపారు. కౌంటింగ్‌పై దృష్టి రాష్ట్రంలో పూర్తిస్థాయిలో పోలింగ్ ప్రక్రియ పూర్తికావడంతో మంగళవారం జిల్లా నుంచి ఎంపికచేసిన 8–10 మంది అధికారులకు కౌంటింగ్‌పై శిక్షణ ఇవ్వనున్నామన్నారు. 17లోగా జిల్లాలోని ఓట్ల లెక్కింపు సిబ్బందికి శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. నియోజకవర్గానికి కనీసం 14 టేబుళ్లు తక్కువ కాకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అదనపు టేబుళ్ల ఏర్పాటుకు నాలుగు జిల్లాలు అనుమతి కోరాయని.. వీటికి త్వరలోనే కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిస్తుందన్నారు. ఓట్ల లెక్కింపునకు సుమారుగా 25,000 మంది సిబ్బంది అవసరమవుతారని, వీరిని పారదర్శకంగా ఎంపికచేసే విధంగా ఏర్పాట్లు చేసినట్లు ద్వివేది తెలిపారు. వీవీప్యాట్ల లెక్కింపు పూర్తయ్యాక అధికారిక ఫలితాలను ప్రకటిస్తామన్నారు. రూల్స్ ప్రకారం నడుచుకోవాలి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో సీఎం కేబినెట్ సమావేశం నిర్వహించవచ్చా లేదా అన్నది ఎన్నికల నిబంధనల్లో స్పష్టంగా ఉందని, దీనిపై తాను ప్రత్యేకంగా ఎటువంటి వివరణ ఇవ్వాల్సిన అవసరంలేదని ద్వివేది స్పష్టంచేశారు. అధికారులంతా నిబంధనల ప్రకారమే నడుచుకోవాలని, దీనిపై ఏమైనా సందేహాలుంటే తన దృష్టికి తీసుకువస్తే కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లి వివరణ తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో ఓ పక్క రీపోలింగ్ జరుగుతున్న సమయంలో సీఎం పోలవరం పర్యటన చేయడంపై విలేకరుల అడిగిన ప్రశ్నకు కూడా నిబంధనలు చూసుకోండంటూ ద్వివేది సమాధానమిచ్చారు. నాయకులు చేసే వ్యాఖ్యలపై తాను స్పందించబోనన్నారు. గ్రూపు–2 పరీక్షల్లో అడిగిన ప్రశ్నలపై కొన్ని ఫిర్యాదులు వచ్చాయని, దీనిపై అధికారుల నుంచి నివేదిక కోరినట్లు ద్వివేది తెలిపారు. -
ఐదు కేంద్రాల్లో నేడే రీ పోలింగ్
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా మూడు జిల్లాల్లోని ఐదు కేంద్రాల్లో సోమవారం రీ పోలింగ్ కోసం ఈసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 5.30 గంటలకే మాక్ పోలింగ్ నిర్వహించేలా ఆదేశించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. గుంటూరు, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లోని ఐదు కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు రీ పోలింగ్ జరుగుతుందని చెప్పారు. రీ పోలింగ్ ఏర్పాట్లపై ఆదివారం ఆయన మీడియాకు వివరాలను విడుదల చేశారు. మాక్ పోలింగ్ కోసం ఆయా పార్టీ ఏజెంట్లు ఉదయం 5.30కే ఎన్నికల కేంద్రాలకు చేరుకోవాలని ద్వివేది సూచించారు. రీ పోలింగ్ పకడ్బందీగా నిర్వహించేలా రిటర్నింగ్ అధికారి, సహాయ ఆర్ఓ, అధికారులు, సిబ్బందికి సూచనలు జారీ చేసినట్టు వివరించారు. ప్రతి ఓటరుకు ఓటర్ స్లిప్పులు అందచేశామన్నారు. రీ పోలింగ్ కేంద్రాల వద్ద బెల్ ఇంజనీర్లును సిద్ధంగా ఉంచడంతోపాటు రిజర్వ్ ఈవీఎంలు కూడా సిద్ధం చేసినట్టు వివరించారు. పోలింగ్ విధుల్లో 1,200 మంది పోలీస్ సిబ్బంది రీ పోలింగ్ నేపథ్యంలో పోలీస్ శాఖ భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. ఏప్రిల్ 11న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ పోలింగ్ కేంద్రాల్లో ఒక్కో కానిస్టేబుల్ మాత్రమే బందోబస్తు విధుల్లో ఉండటం గమనార్హం. హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఈసారి రీ పోలింగ్ కేంద్రాల్లో మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. డీజీపీ ఠాకూర్, శాంతి భద్రతల విభాగం అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్ బందోబస్తు ఏర్పాట్లను సమీక్షించి ఎస్పీలకు పలు సూచనలు చేశారు. అవసరాన్ని బట్టి ఒక్కోచోట 250 నుంచి 300 మంది సిబ్బందిని మోహరించనున్నారు. రీ పోలింగ్ నిర్వహించే ఐదు కేంద్రాల్లో 5,064 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనుండగా 1,200 మంది భద్రతా సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. దాదాపుగా ప్రతి నలుగురు ఓటర్లకు ఒక పోలీసు చొప్పున నియమించారు. మూడంచెల భద్రతా వ్యవస్థలో భాగంగా మొదటి అంచెలో పోలింగ్ కేంద్రం వద్ద భద్రత ఉంటుంది. రెండో అంచెలో పోలింగ్ కేంద్రం నుంచి 100 మీటర్ల దూరం వరకు ఉండే ప్రాంతాన్ని ఇన్నర్ కార్డన్‌గా వ్యవహరిస్తారు. మూడో అంచెలో తనిఖీ పాయింట్లు, పికెట్లు ఉంటాయి. అవుటర్ కార్డన్‌గా వ్యవహరించే వాహనాలు నిలిపే ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. రీ పోలింగ్ బందోబస్తు కోసం ఆరుగురు అదనపు ఎస్పీలు, 13 మంది డీఎస్పీలు, 29 మంది సీఐలు, 78 మంది ఎస్సైలు, 85 మంది ఏఎస్సైలు, 402 మంది కానిస్టేబుళ్లు, 28 మంది హోంగార్డులు, 25 మంది మహిళా పోలీసులు, నలుగురు ఆర్ఎస్సైలు, 34 మంది ఏఆర్ హెచ్‌సీలతోపాటు 8 ప్లటూన్ల ఏపీఎస్పీ సిబ్బందిని కేటాయించారు. రీ పోలింగ్ సందర్భంగా తనిఖీల కోసం 14 చెక్‌పోస్టులు, 26 పికెట్లు, 7 మొబైల్ పెట్రోలింగ్ పార్టీలు, 3 ఏరియా డామినేషన్ పార్టీలు, 22 షాడో పార్టీలు. 16 నిఘా కెమెరాలు, 88 బాడీవార్న్ కెమెరాలను ఏర్పాటు చేశారు. రీ పోలింగ్ కేంద్రాలు ఇవే... గుంటూరు జిల్లా నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గంలోని 94వ పోలింగ్ స్టేషన్ (కేశానుపల్లి – 956 మంది ఓటర్లు), గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని 244 పోలింగ్ స్టేషన్ (నల్లచెరువు – 1,376 మంది ఓటర్లు), ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని 247 పోలింగ్ స్టేషన్ (కలనూతల 1,070 మంది ఓటర్లు), ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ సెగ్మెంట్లోని 41 పోలింగ్ స్టేషన్ (ఇసుకపాలెం 1,084 మంది ఓటర్లు), సూళ్లూరు పేట అసెంబ్లీ సెగ్మెంట్ 197 పోలింగ్ స్టేషన్ (అటకానితిప్ప 578 మంది ఓటర్లు) పరిధిలో రీ పోలింగ్ నిర్వహించనున్నారు. -
నాలుగు జిల్లాల్లో కోడ్ సడలింపు
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వేగవంతంగా సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో ఎన్నికల నిబంధనలను సడలిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయిం తీసుకుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చిన లేఖను పరిశీలించాక తూర్పుగోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంజిల్లాల్లో ఎన్నికల నిబంధనలను సడలిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘ కార్యదర్శి కేపీ సింగ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదికి లేఖ రాశారు. తుపాను సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా ఈ నాలుగు జిల్లాల్లో ఎన్నికల నిబంధనలను సడలించినట్లు ద్వివేది తెలిపారు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ వర్షాలు అధికంగా కురిసిన విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో స్ట్రాంగ్ రూమ్‌లు భద్రంగా ఉన్నాయని, వర్షాలకు తడవకుండా వాటిని ప్లాసిŠట్క్ షీట్లతో కవర్ చేసినట్లు చెప్పారు. రీ–పోలింగ్‌కు సిద్ధం రాష్ట్రంలో మే 6న నిర్వహించనున్న రీ–పోలింగ్ ఏర్పాట్లకు సంబంధించి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎస్పీలతో వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ద్వివేది సమీక్ష నిర్వహించారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా ఆయా ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. రీ–పోలింగ్ ప్రక్రియను అత్యంత ప్రశాంతంగా నిర్వహించాలని మాక్ పోలింగ్, ఇతర పోలింగ్ ప్రక్రియలను పకడ్బందీగా నిర్వహించాలని చెప్పారు. ఆయా పోలింగ్ కేంద్రాల పరిధిలో టెంట్లు, ఇతర మౌలిక వసతులైన తాగునీరు తదితర ఏర్పాట్లను పూర్తిచేశామని, బందోబస్తుకు సంబంధించిన అన్ని చర్యలు తీసుకున్నట్టు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ఎన్నికల అధికారులు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌లు సీఈవోకు వివరించారు. రీ–పోలింగ్ కేంద్రాల పరిధిలో ఇప్పటికే విస్తృత ప్రచారం చేపట్టినట్లు తెలిపారు. ఆయా కేంద్రాల పరిధిలో వెబ్–కాస్టింగ్¬తో పాటు మాన్యువల్ వీడియోగ్రాఫింగ్ కూడా చేస్తున్నట్లు అధికారులు వివరించారు. రీ–పోలింగ్ జరిగే ఐదు పోలింగ్ కేంద్రాల పరిధిలో ఐదుగురు ప్రత్యేక పరిశీలకులను నియమించామని, ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద బెల్ ఇంజినీర్లను అందుబాటులో ఉంచనున్నట్లు ద్వివేది తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల కార్యాలయం నుంచి అదనపు ఎన్నికల అధికారులు సుజాతశర్మ, వివేక్ యాదవ్¬తో పాటు ఇతర అధికారులు, సాంకేతిక సిబ్బంది హాజరయ్యారు. అంతకుముందు సర్వీసు ఓట్ల లెక్కింపుపై కేంద్ర ఎన్నికల సంఘ ఐటీ సంచాలకులు వీఎన్ శుక్లా, రాష్ట్ర ఎన్నికల అధికారులు, జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న వివేక్‌యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో 60,250 మంది సర్వీసు ఓటర్లున్నారని, శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా 13,000 మంది ఉన్నట్లు తెలిపారు. మే 23న ఓట్ల లెక్కింపు ప్రక్రియలో భాగంగా సర్వీసు ఓట్లు, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియను తొలుత చేపడతామని, ఈ విషయంలో ఇప్పటికే సంబంధిత జిల్లా ఎన్నికల అధికారులకు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు వివరాలు పంపినట్లు వివరించారు. కడప జేసీపై చర్యలకు సిఫార్సు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను విడుదల చేయొద్దని స్పష్టమైన ఆదేశాలు జారీచేసినప్పటికీ వైఎస్సార్ కడప జిల్లాలో రెండు థియేటర్లలో సినిమా ప్రదర్శించడంపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ థియేటర్ల లైసెన్సులు రద్దు చేయాలని జిల్లా అధికారులకు ఆదేశాలిచ్చినట్టు ద్వివేది తెలిపారు. సినిమా ప్రదర్శనను అడ్డుకోలేకపోయిన జేసీ కోటేశ్వరరావుపై చర్యలకు సీఈసీకి నివేదిక ఇచ్చినట్టు వివరించారు. -
రీ పోలింగ్‌కు పటిష్ట భద్రత
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రీ–పోలింగ్ జరిగే ఐదు బూత్‌లను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించి, వాటివద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. గుంటూరు జిల్లాలో రెండు, ప్రకాశంలో ఒకటి, నెల్లూరు జిల్లాలో రెండు చోట్ల ఈనెల 6న రీ–పోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిన సంగతి తెలిసిందే. గుంటూరు జిల్లాలో ఒకచోట శాంతిభద్రతల సమస్య, మరోచోట ఈవీఎం మొరాయించడంతో రీ–పోలింగ్‌కు ఈసీఐ అనుమతి కోరినట్లు ద్వివేది గురువారం ఇక్కడ తెలిపారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని నల్లచెరువు బూత్ నంబరు 244లో శాంతి భద్రతల సమస్య తలెత్తిందని, అలాగే నరసరావుపేట నియోజకవర్గం కేసానుపల్లి గ్రామంలో 94వ బూత్‌లో ఈవీఎం మొరాయించడంతో పోలింగ్ ఆగిపోయిందని చెప్పారు. అదేవిధంగా ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని కలనూతలలోని 247వ బూత్‌లో ఈవీఎం స్లీపింగ్ మోడ్‌లోకి వెళ్లిపోవడంతో ఇంకా 50 మంది ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉన్నప్పటికీ పోలింగ్‌ను అర్ధంతరంగా ఆపివేయాల్సి వచ్చిందన్నారు. నెల్లూరు జిల్లాలో పోలింగ్ సిబ్బంది చేసిన పొరపాటు వల్ల తిరుపతి పార్లమెంటు పరిధిలో మాత్రమే రెండు బూత్‌లలో రీ–పోలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కొవ్వూరు అసెంబ్లీ సెగ్మెంట్‌పరిధిలో ఇసుకపల్లిపాలెంలోని బూత్ నంబర్ 41, సూళ్లూరుపేట సెగ్మెంట్ పరిధిలో అటకానితిప్ప బూత్ నంబరు 197లో కేవలం పార్లమెంటు స్థానానికి మాత్రమే రీ–పోలింగ్ నిర్వహించనున్నారు. రీ–పోలింగ్‌కు కావాల్సిన అదనపు ఈవీఎంలు, వీవీప్యాట్, బెల్ ఇంజనీర్లను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. ఈ బూత్‌లలో సీసీ కెమేరాలను ఏర్పాటు చేసి పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు పరిశీలించనున్నట్లు ద్వివేది వివరించారు. ఆరవ తేదీ ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ కొనసాగుతుందని ఆయన తెలిపారు. -
6న ఐదు కేంద్రాల్లో రీ పోలింగ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఈ నెల 6వ తేదీన మూడు జిల్లాల్లోని ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి ఆదేశాలు వచ్చినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో బూత్ నంబర్ 94, గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలోని బూత్ నంబర్ 244, నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో బూత్ నంబర్ 41, సుళ్లూరుపేట నియోజకవర్గంలో బూత్ నంబర్ 97, ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం బూత్ నంబర్ 197లో రీ పోలింగ్ జరగనుంది. ఈ మేరకు అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషనర్ ఆదేశించారు. చివరిలోనే వీవీ ప్యాట్ల లెక్కింపు.. ఓట్ల లెక్కింపు సమయంలో వీవీప్యాట్‌లో నమోదైన ఫలితాలనే పరిగణనలోకి తీసుకుంటామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. వీవీప్యాట్ల లెక్కింపుపై వివిధ వర్గాల నుంచి అనేక అనుమానాలు వ్యక్తమవుతుండటంతో రాష్ట్ర ఎన్నికల సంఘం మరోసారి వివరణ ఇచ్చింది. కౌంటింగ్ అన్ని రౌండ్లు పూర్తయిన తర్వాత చివరలో నియోజకవర్గంలోని 5 వీవీప్యాట్లను లాటరీ విధానంలో ఎంపిక చేసి లెక్కిస్తారని, ఈవీఎంలో ఉన్న ఓట్లకు, వీవీప్యాట్‌లో ఉన్న ఓట్లకు తేడా వస్తే.. మరోసారి రీకౌంటింగ్ చేస్తారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. బుధవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈవీఎం, వీవీప్యాట్ల ఓట్లను లెక్కింపు చేస్తారని, ఒకవేళ తేడా వస్తే వీవీప్యాట్‌లో నమోదైన ఓట్లనే పరిగణనలోకి తీసుకుంటారని ఆయన తెలిపారు. దీనికి అనుగుణంగా అప్పటికే ఈవీఎంలో లెక్కించిన ఓట్లను సవరణ చేసి తుది ఫలితాన్ని ప్రకటిస్తారని చెప్పారు. వీవీప్యాట్లను ఎలా లెక్కించాలో ఎన్నికల సంఘం స్పష్టమైన నిబంధనలను రూపొందించిందని, దీని ప్రకారం బ్యాంకులో క్యాషియర్ కౌంటర్‌కు ఏర్పాటు చేసిన విధంగా మెష్ ఏర్పాటు చేసి ఆర్వో, అబ్జర్వర్ల సమక్షంలో లెక్కించాల్సి ఉంటుందన్నారు. ఒక వీవీప్యాట్ లెక్కించిన తర్వాతే∙మరో వీవీప్యాట్ లెక్కిస్తారని తర్వాత అధికారికంగా తుది ఫలితం ప్రకటిస్తారని వివరించారు. ఆంక్షల సడలింపునకు ప్రతిపాదన రాలేదు.. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికల నిబంధనావళిని సడలించాలంటూ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి ప్రతిపాదన రాలేదని ద్వివేది స్పష్టం చేశారు. ఆంక్షల సడలింపు కావాలంటే కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపాల్సి ఉంటుందని, ప్రభుత్వం నుంచి అటువంటి ప్రతిపాదన రాగానే తక్షణం పంపిస్తామన్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించాలన్న విషయం ఎన్నికల నిబంధనావళిలో స్పష్టంగా ఉందని చెప్పారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరచిన ఈవీంఎలు తడవకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఇప్పటికే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో స్ట్రాంగ్ రూమ్‌ల కిటికీలు, గుమ్మాలు, పైకప్పులను మూడు వరుసల్లో ప్లాస్టిక్ కవర్లతో కప్పినట్లు తెలిపారు. అగ్ని ప్రమాదాలు, వర్షాలు వచ్చినా దెబ్బతినకుండా ఉండే భవనాలనే స్ట్రాంగ్ రూమ్‌లుగా ఎంపిక చేశామని, అభ్యర్థులు ఈవీఎంల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ద్వివేది స్పష్టం చేశారు. మెజార్టీ తగ్గితే పోస్టల్ బ్యాలెట్ రీకౌంటింగ్ తప్పనిసరి.. ఈసారి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని సవరణలు చేసిందని ద్వివేది తెలిపారు. గతంలో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తయితే కానీ ఈవీఎంల లెక్కింపు మొదలయ్యేది కాదని, ఈసారి పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు మొదలైన అరగంట తర్వాత ఈవీఎంల లెక్కింపు మొదలు పెట్టడానికి అనుమతిచ్చారని తెలిపారు. అలాగే పోలైన మొత్తం పోస్టల్ బ్యాలెట్ల కంటే అభ్యర్థి మెజార్టీ తక్కువగా ఉంటే రెండోసారి పోస్టల్ బ్యాలెట్లను రీకౌంటింగ్ చేయాల్సి ఉంటుందన్నారు. ఉదాహరణకు మొత్తం పోలైన పోస్టల్ బ్యాలెట్లు 3,000 ఉంటే అభ్యర్థికి మెజారిటీ 2000 మాత్రమే వస్తే ఎవరి అభ్యర్థనలతో సంబంధం లేకుండానే కచ్చితంగా పోస్టల్ బ్యాలెట్లు రీకౌంటింగ్ చేస్తారన్నారు. -
ఈవీఎం-వీవీప్యాట్ లెక్కలు సరిపోలకపోతే..
అమరావతి: వీవీప్యాట్ కౌంటింగ్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయని ఏపీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది చెప్పారు. అమరావతిలో గోపాలకృష్ణ ద్వివేది మాట్లాడుతూ.. ప్రతి అసెంబ్లీకి ఐదు చొప్పున వీవీ ప్యాట్లను లెక్కించాల్సి ఉందన్నారు. ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ పరిధిలో వేర్వేరుగా వీవీప్యాట్ల లెక్కింపు ఉంటుందని, ఈవీఎంల లెక్కింపు పూర్తయ్యాకే వీవీప్యాట్ల లెక్కింపు ఉంటుందని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక దాని తర్వాత మరో వీవీప్యాట్ లెక్కింపు జరుగుతుందని వెల్లడించారు. నియోజకవర్గంలో ప్రతి పోలింగ్‌స్టేషన్‌కు ఒక్కో గుర్తింపు కార్డు ఇస్తారని తెలిపారు. కార్డుపై వివరాలు కనిపించకుండా లాటరీ ద్వారా వీవీప్యాట్ల ఎంపిక చేస్తారని చెప్పారు. అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో కంటైనర్ ద్వారా వీవీప్యాట్ కార్డుల ఎంపిక చేస్తామని వెల్లడించారు. వీవీప్యాట్ కార్డులు అందరికీ చూపిన తర్వాతే లాటరీలో వినియోగిస్తామని అన్నారు. ఆర్ఓ, అభ్జర్లవర్ల సమక్షంలోనే వీవీప్యాట్ స్లిప్పుల కౌంటింగ్ ఉంటుందని స్పష్టం చేశారు. ఈవీఎం ఓట్లు, వీవీ ప్యాట్ స్లిప్పుల్లో తేడా వస్తే మ్యాచ్ అయ్యేవరకు రీకౌంటింగ్ చేస్తామని పేర్కొన్నారు. ఈవీఎం, వీవీప్యాట్ లెక్కలు సరిపోలకపోతే వీవీప్యాట్‌లో వచ్చిన ఓట్లే పరిగణలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. -
సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందించను
అమరావతి: రాజకీయ పార్టీలు చేసే వ్యాఖ్యలపై తాను స్పందించనని, సొంత నిర్ణయాలు తీసుకోకుండా నిబంధనలను తూ.చ తప్పకుండా అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ఎన్నికల సంఘానికి రాసిన లేఖపై స్పందించనన్నారు. శుక్రవారం సచివాలయంలో కలిసిన విలేకరులతో ద్వివేది మాట్లాడుతూ సొంత నిర్ణయాలు ఏమీ తీసుకోవడం లేదని, కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చిన ఆదేశాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఎన్నికల నిబంధనావళికి సంబంధించిన పుస్తకాలను అన్ని రాజకీయ పార్టీలకు, అభ్యర్థులకు అందచేసినట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాల్లోని అధికారులు నిబంధనలను పాటిస్తున్నారా లేదా అన్న విషయంతో నాకు సంబంధం లేదని, తాను మాత్రం నిబంధనల ప్రకారం నడుచుకుంటున్నామన్నారు. ఇతర రాష్ట్రాలు నిబంధనలు పాటిస్తున్నాయా లేదా అన్నది కేంద్ర ఎన్నికల సంఘం చూసుకుంటుందన్నారు. -
మే 23న కౌంటింగ్ ఏర్పాట్లపై సీఎస్ దిశానిర్దేశం
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని 13 జిల్లాల ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ,సీఈఓ గోపాలకృష్ణ ద్వివేది బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎస్ ఈ సందర్భంగా మే 23న జరిగే కౌంటింగ్ ఏర్పాట్లుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి తగినంత శిక్షణ లేకపోవడం, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లతో సరిపుచ్చడంతో పోలింగ్ సందర్భంగా గందరగోళ పరిస్థితులు తలెత్తాయని, కౌంటింగ్ సమయంలో అవి పునరావృతం కాకుండా జాగ్రత్తపడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం... జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఓట్ల లెక్కింపుకు నెల రోజులు సమయం ఉందని కౌంటింగ్ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్లు స్వయంగా పరిశీలించి అవపసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేయాల్సిన టేబుల్స్, సీటింగ్ వంటివి సక్రమంగా ఉండేలా చూడాలని చెప్పారు. కౌంటింగ్ సిబ్బందికి పూర్తిస్థాయిలో మెరుగైన శిక్షణ ఇవ్వాలని ఈ విషయంలో ఏమాత్రం రాజీపడవద్దని సీఎస్ స్పష్టం చేశారు. కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లే రహదారులపై ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేయాలని, కౌంటింగ్ రోజున లేదా కౌంటింగ్ అనంతరం అల్లర్లు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎస్పీలకు సీఎస్ ఆదేశాలు ఇచ్చారు. పోలింగ్ నిర్వహణకు అవసరమైన బలగాలు.. ఈ సమావేశంలో పాల్గొన్న డీజీపీ ఆర్పీ ఠాకూర్ మాట్లాడుతూ... 2014తో పోలిస్తే తక్కువగా పోలీస్ ఫోర్సు ఉన్నా కలెక్టర్లు,ఎస్పీలు టీం వర్క్‌తో చిన్నపాటి సంఘటనలు మినహా ఎన్నికలను సజావుగా నిర్వహించారని వివరించారు. పోలింగ్ అనంతరం జరిగిన సంఘటనలపై వాటికి బాధ్యులైన వారిని చాలా వరకూ అరెస్టు చేశామన్నారు. కౌంటింగ్ తర్వాత కూడా హింసాత్మక సంఘటనలు జరిగే అవకాశం ఉన్నందున తగిన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఎస్పీలను ఆదేశించారు. రీపోలింగ్ జరగనున్న పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిర్వహణకు అవసరమైన పోలీస్ బలగాలను తరలిస్తామన్నారు. స్ట్రాంగ్ రూముల వద్ద మూడు అంచెల భద్రతా ఏర్పాట్లుతో నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతోందని వివరించారు. కలెక్టర్లు, ఎస్పీల పర్యవేక్షణలో సీసీ టీవీలతో నిఘా సార్వత్రిక ఎన్నికల్లో 65శాతం పైగా దివ్యాంగులు ఓటు హక్కును వినియోగించుకోవడం, మారుమూల గిరిజన ప్రాంతాలు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సైతం పోలింగ్ శాతం పెరగడం సిబ్బంది కృషికి నిదర్శనమని సీఈఓ ద్వివేది అన్నారు. రాష్ట్రంలో స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద మూడు అంచెల పటిష్టమైన బందోబస్తు ఉందని, సీసీ టీవీల నిఘాతో కలెక్టర్లు, ఎస్పీల పర్యవేక్షణలో నిరంతరం కొనసాగుతోందని, స్ట్రాంగ్ రూమ్ భద్రతపై ఆర్వోలు రోజూ తనిఖీ చేసి నివేదికలు సమర్పిస్తున్నారని చెప్పారు. స్ట్రాంగ్ రూముల భద్రతపై ఎవరికి అనుమానాలు అవసరం లేదని, ఎవరెవరు సందర్శిస్తున్నారనేది రికార్డ్ చేస్తున్నట్లు చెప్పారు. కౌంటింగ్ నిర్వహణకు సంబంధించిన సిబ్బందికి మూడు దశల శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి కౌంటింగ్ కేంద్రం పరిధిలో మీడియా కేంద్రం ఉండేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. కౌంటింగ్ కేంద్రాలల్లోకి మొబైల్ ఫోన్లు అనుమతి లేనందున వాటిని తీసుకుని భద్రపర్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. -
అవన్నీ పుకార్లే, నమ్మొద్దు: ద్వివేది
సాక్షి, అమరావతి: స్ట్రాంగ్ రూమ్‌ల భద్రతపై ఎలాంటి సందేహాలు వద్దని, ఈవీఎంలను భద్రపరిచిన గదుల్లోకి ఎవరికీ ప్రవేశం ఉండదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఈవీఎంలను భద్రపరిచిన ప్రదేశాల్లో మూడంచెల భద్రతా వ్యవస్థ ఉంటుందన్నారు. రాజకీయా పార్టీలు, తమ ఏజెంట్లను స్ట్రాంగ్ రూమ్ సమీపంలోని కంట్రోల్ రూమ్‌లలో ఉంచవచ్చని తెలిపారు. అలాగే ఈవీఎంలను భద్రపరిచిన ప్రాంతాల్లో ఇంటర్నెట్ సదుపాయం ఉండదన్నారు. అపోహలకు తావివ్వకుండా ఉండేలా భద్రత ఏర్పాటు చేస్తామన్నారు. చిత్తూరు జిల్లాలో స్ట్రాంగ్ రూమ్లపై వచ్చినవి పుకార్లు మాత్రమేనని ద్వివేది కొట్టిపారేశారు. స్ట్రాంగ్ రూమ్‌లలో ఈవీఎంలు సురక్షితంగా ఉన్నాయని, పుకార్లను ప్రచారం చేసేవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని దివ్వేది ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ద్వివేదిని కలిసిన మేరుగ నాగార్జున కాగా అంతకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున ....సీఈవో గోపాలకృష్ణ ద్వివేదిని కలిశారు. వేమూరు నియోజకవర్గంలో అకృత్యాలు, దాడులపై చర్యలు తీసుకోకపోగా బాధితులపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. టీడీపీ రౌడీలపై పెట్టిన కేసుల్లో పురోగతి లేదని, పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని మేరుగ నాగార్జున తెలిపారు. బాధ్యులను వదిలేసి బాధితులను వేధిస్తున్నారని అన్నారు. దళితులపైనా, అండగా నిలిచిన ఇతర కులస్తులపైనా పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని సీఈవో దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం మేరుగ నాగార్జున మాట్లాడుతూ టీడీపీ నేతలు, పోలీసులు సిగ్గుమాలిన చర్యలకు పాల్పడుతున్నారన్నారు. ఎన్నికల కమిషన్నే సవాల్ చేస్తున్న టీడీపీ నేతలు గ్రామాల్లో నియంతల్లా వ్యవహరిస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రక్రియతోపాటు రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్న చంద్రబాబు అండ్ కో పై ఎన్నికల కమిషన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులని చెప్పుచేతల్లో పెట్టుకుని టీడీపీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని చూస్తోందన్నారు. వ్యవస్థను తన జేబు సంస్థగా మార్చుకున్న చంద్రబాబు పరిపాలన కొనసాగిస్తున్నారని మేరుగ నాగార్జున మండిపడ్డారు. -
ఏఆర్వోలపై ఈసీ వేటు
సాక్షి, అమరావతి : ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆరుగురు అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన మొత్తం 12 మంది అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘానికి నాలుగు రోజుల క్రితం విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. వీటిని పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం.. నూజివీడు, సూళ్లూరుపేట, కోవూరు ఆర్వోలపై అభియోగాలు నమోదు చేయాలని ఆదేశించి.. ముగ్గురు ఏఆర్వోలపై సస్పెన్షన్ వేటు వేసింది. ఇప్పటికే నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఆర్వో, ఏఆర్వోలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడమే కాకుండా సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. మరికొంతమంది అధికారులకు షోకాజ్ నోటీసులను జారీ చేసింది. త్వరలో మిగిలిన అధికారులపై చర్యలు తీసుకునే అవకాశముంది. ఆ వార్తలతో సంబంధం లేదు: సీఈవో ద్వివేదీ ఈవీఎంలకు సంబంధించి ‘అధికారుల నిర్లక్ష్యమా, పెద్దల డైరెక్షనా?’అనే వార్త తో పాటు ‘మొరాయింపు కుట్ర’కథనం తో కేంద్ర ఎన్నికల కమిషన్‌కు గానీ, తన కు గానీ, ఇతర అధికారులకు గానీ సంబంధం లేదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదీ శుక్రవారం పేర్కొన్నారు. -
చంద్రబాబు కోడ్ ఉల్లంఘనలపై ఈసీ దృష్టి...
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల నియామావళిని ఉల్లంఘించడంపై రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. నిబంధనలకు విరుద్ధంగా సీఎం...ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారంటూ రాజకీయ పార్టీలు, వివిధ వర్గాల నుంచి ఫిర్యాదులు రావడంతో...దీనిపై నివేదిక ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఏపీ సీఈవో గోపాలకృష్ణ ద్వివేది ఆదేశించిన విషయం తెలిసిందే. చదవండి...(అంతా నా ఇష్టం!) ఈసీ ఆదేశాలతో ముఖ్యమంత్రి సమీక్షలో పాల్గొన్న అధికారులకు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం శుక్రవారం నోటీసులు పంపించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షలో పాల్గొనడంపై సీఎస్...సీఆర్డీఏ, జల వనరుల శాఖ వివరణ కోరారు. అలాగే సమీక్షల్లో పాల్గొన్న అధికారులు కూడా వివరణ ఇవ్వాలని సీఎస్ ఆదేశించారు. కాగా చంద్రబాబు నాయుడు గతంలో ఏ ముఖ్యమంత్రి వ్యవహరించని విధంగా ఎన్నికల నియమావళిని తుంగలో తొక్కారు. పోలవరం ప్రాజెక్ట్, సీఆర్డీఏ పనులపై సమీక్ష నిర్వహించిన విషయం విదితమే. -
చంద్రబాబు సమీక్షలపై ఫిర్యాదులు అందాయి
సాక్షి, అమరావతి : ప్రభుత్వ శాఖలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమకు ఫిర్యాదు చేసిందని ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఇందులో భాగంగా ప్రజా వేదికలో చంద్రబాబు సమావేశాల నిర్వహణపై వైఎస్సార్ సీపీ అభ్యంతరాలు వ్యక్తం చేసిందని పేర్కొన్నారు. ఈ విషయాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నివేదిక కోరతామని వెల్లడించారు. గురువారమిక్కడ ద్వివేది విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణపై కొన్ని ఫిర్యాదులు వచ్చాయని.. వాటిపై జిల్లా కలెక్టర్ల నివేదికలు కోరామని తెలిపారు. ఎన్నికల విధుల్లో తప్పుచేసిన వారిపై తప్పకుండా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణ ఖర్చు రూ. 600 కోట్లు.. ఎన్నికల నిర్వహణలో జిల్లాల అధికారులు కష్టపడి పనిచేశారని ద్వివేది పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ కోసం దాదాపు 600 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయని.. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రూ. 300 కోట్లు, కేంద్ర ప్రభుత్వం రూ. 300 కోట్లు వెచ్చించిందని తెలిపారు. ఇందులో పోలీసు సిబ్బంది కోసం రూ. 180 కోట్లు వ్యయమైందని వెల్లడించారు. ఈ క్రమంలో ఎన్నికల సిబ్బంది రెమ్యూనరేషన్ వివాదాలు పరిష్కరించమని జిల్లా కలెక్టర్లకు ద్వివేది సూచించారు. ఎన్నికల సంఘం గైడ్ లైన్స్ ప్రకారం సిబ్బందికి చెల్లింపులు జరపాల్సి ఉంటుందని తెలిపారు. చదవండి : సీఎం చంద్రబాబు సమీక్షలకు సీఎస్ దూరం కాగా పోలింగ్ ముగిసినప్పటికీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి వచ్చే నెల 27వ తేదీ వరకు అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. అప్పటి వరకు ముఖ్యమంత్రిగానీ, మంత్రులు గానీ ఎటువంటి అధికారిక సమీక్షలు నిర్వహించరాదని ఎన్నికల నియావళి స్పష్టం చేస్తోంది. కేవలం ప్రకృతి వైపరీత్యాల సంభవించిన సమయంలో లేదా శాంతి భద్రతలకు విఘాతం సంభవించడం వంటి అత్యవసర పరిస్థితిల్లో చక్కపెట్టేందుకు మాత్రమే సీఎం వ్యక్తిగత పర్యవేక్షణ, సమీక్ష చేయవచ్చునని, మిగతా ఎటువంటి సమీక్షలు చేయరాదని ఎన్నికల ప్రవర్తనా నియామవళి స్పష్టం చేస్తోంది. అయితే గతంలో ఏ ముఖ్యమంత్రి వ్యవహరించని విధంగా చంద్రబాబు ఇప్పుడు నియావళిని తుంగలో తొక్కుతూ నిన్న (బుధవారం) పోలవరం ప్రాజెక్టుపై ప్రజావేదిక నుంచి సమీక్ష నిర్వహించగా గురువారం ఏకంగా సచివాలయానికి వచ్చి సీఎం కుర్చీలో కూర్చుని మరీ సీఆర్డీఏ పనులపై సమీక్ష నిర్వహించి అందరినీ విస్మయపరిచారు. -
‘ఆర్వోలను బాధ్యుల్ని చేయవద్దు’
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి గోపాల కృష్ణ ద్వివేదిని ఏపీ డిప్యూటీ కలెక్టర్ అసోసియేషన్ సభ్యులు గురువారం కలిశారు. ఎన్నికల నిర్వహణలో ఆర్వోలను బాధ్యులను చేస్తూ నిర్ణయాలు తీసుకోవద్దని సీఈఓని సభ్యులు కోరారు. ద్వివేదిని కలిసిన అనంతరం కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ పి.బాబూ రావు విలేకరులతో మాట్లాడారు. ఏపీలో ఓట్ల పోలింగ్ శాతం పెరగడానికి సీఈఓ ద్వివేదీ బాగా కృషి చేశారని కొనియాడారు. ఓట్లు మిస్ అయ్యాయని ఫిర్యాదులు లేవు..ఒత్తిడి ఉన్నా బాగా పని చేశామని తెలిపారు. ఎన్నికల సంఘం సూచనల మేరకు ఓటర్ల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. ర్పాట్లు సరిగా లేవని కొన్ని ఫిర్యాదులు వచ్చిన మాట వాస్తవమేనన్నారు. క్షేత్రస్థాయిలో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చిన మాట నిజమేనన్నారు. కింద స్థాయి సిబ్బందిలో కొందరికి ఎన్నికల నిర్వహణా అనుభవం లేకపోవడం వల్ల కొన్ని పొరపాట్లు జరిగాయన్నారు. ఉద్దేశపూర్వకంగా ఎవరూ తప్పుచేయలేదని, వాటికి ఆర్వోలను బాధ్యులు చేస్తూ చర్యలు తీసుకోవద్దని ద్వివేదీని కోరామని తెలిపారు. విచారణ చేసి ఎవరు పొరపాటు చేశారో వారిపైనే చర్యలు తీసుకోవాలని ద్వివేదిని కోరినట్లు వెల్లడించారు. ద్వివేదీని కలసిన నూజివీడు రైతులు వైఎస్సార్సీపీ రైతు విభాగం అధ్యక్షులు ఎంవీఎస్ నాగిరెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదీని నూజివీడు రైతులు కలిశారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వకుండా టీడీపీ నేతలు ఇబ్బంది పెడుతున్నారని ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక చెక్కుల పంపిణీ అధికారులు మాత్రమే చేయాలి..కానీ టీడీపీకి ఓటు వేస్తేనే చెక్కులు ఇస్తామని నిలిపివేశారని ద్వివేదీకి నాగిరెడ్డి వివరించారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత కూడా చెక్కులు ఇవ్వకుండా టీడీపీ నాయకులు ఇబ్బంది పెడుతున్నారని ద్వివేదీకి ఫిర్యాదు చేశారు. -
చంద్రబాబు తీరుపై ఈసీ అభ్యంతరం
సాక్షి, అమరావతి : యథేచ్ఛగా ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరుపై ఎన్నికల కమిషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. మంత్రులు, అధికారులతో సమీక్షలు, వీడియో కాన్ఫరెన్సో్లు నిర్వహించురాదని ఈసీ ఈ సందర్భంగా స్పష్టం చేసింది. అంతేకాకుండా ఎన్నికల కోడ్ నిబంధనలను సీఈవో గోపాలకృష్ణ ద్వివేది మరోసారి గుర్తు చేశారు. చంద్రబాబు సమీక్షలపై పలువురు మీడియా ప్రతినిధులు సీఈవోను సంప్రదించగా, ఎన్నికల కోడ్ చూస్తే మీకే తెలుస్తుందని ఆయన సమాధానం ఇచ్చారు. చదవండి....(జూన్ 8 వరకూ నేనే ముఖ్యమంత్రి) కాగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వ్యవహారాలపై సమీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన పోలవరం, సీఆర్డీఏపై సమీక్ష జరిపారు. అయితే సమీక్షలు చేయడం కూడా ఎన్నికల కోడ్ ఉల్లంఘనే అని ఈసీ వర్గాలు స్పష్టం చేయడంతో ముఖ్యమంత్రి హోంశాఖపై సమీక్షను రద్దు చేసుకున్నారు. -
నిర్లక్ష్యమా..పెద్దల డైరెక్షనా?
సాక్షి, అమరావతి: ఇటీవల జరిగిన ఎన్నికలను 2014లో కంటే సమర్థవంతంగా నిర్వహించినప్పటికీ తప్పుడు ప్రచారం కొనసాగుతుండటం వెనుక ఉన్న శక్తులపై ఎన్నికల కమిషన్ దృష్టి సారించడంతో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కొంత మంది అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడమే ఇందుకు ప్రధాన కారణమని ప్రాథమికంగా వెల్లడైంది. ప్రధానంగా మూడు జిల్లాల అధికారులు ఉద్దేశ పూర్వకంగా విధుల నిర్వహణలో అలసత్వం వహించినట్లు తేలింది. ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు వస్తే సరి చేయడం కోసం బెంగళూరు నుంచి 600 మంది సాంకేతిక నిపుణులను రప్పించి, ప్రతి నియోజకవర్గానికి ముగ్గురు చొప్పున కేటాయించినా వారిని ఉపయోగించుకోనట్లు తేలింది. కనీసం వీరికి రూట్ మ్యాప్‌లు కూడా ఇవ్వలేదన్న విషయంలో తెలియడంతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందువల్లే కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పలుచోట్ల అర్ధరాత్రి వరకు పోలింగ్ కొనసాగిందని భావిస్తున్నారు. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 37, ప్రకాశంలో 25, గుంటూరు జిల్లాలో 21 చోట్ల రాత్రి తొమ్మిది దాటాక కూడా పోలింగ్ జరిగినట్లు గుర్తించారు. ఈవీఎంల మొరాయింపుపై అనుమానం అన్ని జిల్లాలో సక్రమంగా పనిచేసిన ఈవీఎంలు కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోనే మాటిమాటికి మొరాయించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్నిచోట్ల ఆరేడు సార్లు ఈవీఎంలు మార్చడం వెనుక ఉద్దేశపూర్వక కుట్ర ఏమైనా దాగి ఉందా అనే విషయంపై ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టి సారిస్తోంది. ఉదాహరణకు కృష్ణా జిల్లా తీసుకుంటే మైలవరం నియోజకవర్గంలో అర్ధరాత్రి దాటినా పోలింగ్ జరగడం, నూజివీడు నియోజకవర్గంలో ముందస్తు సమాచారం ఇవ్వకుండా వినియోగించని ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి మార్చడం, పెనమలూరు నియోజకవర్గంలో ఎన్నికల తర్వాత ఈవీఎంలను చాలా ఆలస్యంగా స్ట్రాంగ్ రూమ్‌లకు చేర్చడం.. ఇలా ఒకే జిల్లా నుంచి పలు ఫిర్యాదులు వస్తుండటంపై ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉద్దేశ పూర్వకంగా తప్పులు చేసిన అధికారులపై ఎఫ్ఐఆర్లను నమోదు చేయడానికి కూడా వెనుకాడమని ద్వివేది హెచ్చరించారు. సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత కూడా పోలింగ్ జరగడానికి గల కారణాలు రాత పూర్వకంగా ఇవ్వాలని 13 జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. కొన్ని చోట్ల ఏర్పాట్లు సరిగా చేయకపోవడానికి గల కారణాలను కూడా తెలియజేయాలన్నారు. రాజంలో మైనర్లు ఓటు వేసిన ఘటనల్లో వెంటనే నివేదికలు పంపాలంటూ ఆదేశాలు జారీ చేశారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో పోలింగ్ మరుసటి రోజు రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా ఈవీఎంలను ఆర్వో అప్పగించలేదన్న విషయమై కలెక్టర్‌ను నివేదిక కోరామని, అయితే అలాంటిదేమీ లేదని కలెక్టర్ నివేదిక ఇచ్చారని ద్వివేది చెప్పారు. చర్యలు మొదలు పెట్టిన ఈసీ ఈవీఎంల భద్రత విషయంలో కొంత మంది అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైనంపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. ఎన్నికల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి, పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై ఎలక్షన్ కమిషన్ చర్యలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 12 మంది అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫార్సు చేసినట్లు దివ్వేది తెలిపారు. ఇప్పటికే నూజివీడు రెవెన్యూ డివిజన్ సబ్ కలెక్టర్ స్వప్నిల్ దినకర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తహసీల్దారు పి.తేజేశ్వరరావుపై సస్పెన్షన్ వేటు వేశారు. కృష్ణా యూనివర్సిటీ భవనంలో భద్రపరిచిన నూజివీడు నియోజకవర్గ రిజర్వు ఈవీఎంల తరలింపుపై అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిగా పనిచేస్తున్న నూజివీడు తహసీల్దార్ తేజేశ్వరరావుకు ఎన్నికల అధికారులు కొద్ది రోజుల క్రితమే షోకాజ్ నోటీసు జారీ చేశారు. స్ట్రాంగ్ రూంలలో ఉన్న ఈవీఎంలను కదలించకూడదని ఎన్నికల కమిషన్ నుంచి స్పష్టమైన ఆదేశాలున్నప్పటికీ వీటిని ఎందుకు తరలించారనే విషయమై ఉన్నతాధికారులు విస్తృత విచారణ చేపట్టారు. అర్ధరాత్రి ఈవీఎంల తరలింపు వివాదం, ఈవీఎం స్ట్రాంగ్ రూంలో అనధికారిక వ్యక్తుల ప్రవేశంపై మరో ఇద్దరు అధికారులపై చర్యలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిఫార్సు చేసింది. ఐదు చోట్ల రీపోలింగ్‌కు అవకాశం గూంటూరు జిల్లా నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని 94వ పోలింగ్ కేంద్రం, గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని నల్లచెరువులో ఉన్న 244వ పోలింగ్ కేంద్రం, నెల్లూరు అసెంబ్లీ పరిధిలోని ఇసుకపల్లిలో గల 41వ పోలింగ్ కేంద్రం, సూళ్లూరుపేట నియోజకవర్గం అటకానితిప్పలోని 197వ కేంద్రం, ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలోని 247వ పోలింగ్ కేంద్రాలలో రీపోలింగ్ నిర్వహించాలని సీఈసీకి సిఫారసు చేశారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం తుది నిర్ణయం వెలువరించాల్సి ఉంది. -
కలెక్టర్ల తీరుపై సీఈవో ద్వివేది ఆగ్రహం
-
వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలపై కేసులు పెట్టారు
-
నన్ను,నా కుటుంబాన్ని చంపే ప్రయత్నం జరిగింది
-
కోడెలపై సీఈఓకు వైఎస్సార్సీపీ ఫిర్యాదు
అమరావతి: గుంటూరు జిల్లా ఇనిమెట్లలోని 160వ పోలింగ్ స్టేషన్‌లోనికి ప్రవేశించి టీడీపీ నేత కోడెల శివ ప్రసాద్ చేసిన హైడ్రామాపై వైఎస్సార్సీపీ నేతలు ఆంధ్రప్రదేశ్ సీఈఓ గోపాలకృష్ణ ద్వివేదీకి ఫిర్యాదు చేశారు. ఎన్నికల ప్రధానాధికారిని కలిసిన వారిలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అంబటి రాంబాబు, మర్రి రాజశేఖర్, సామినేని ఉదయభాను, ఎంవీఎస్ నాగిరెడ్డి తదితరులు ఉన్నారు. అనంతరం వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విలేకరులతో మాట్లాడుతూ..ఇనిమెట్లలోని 160 పోలింగ్ స్టేషన్లో కోడెల శివ ప్రసాద్ కచ్చితంగా దౌర్జన్యానికి పాల్పడ్డారని, అందుకు ఆ సమయంలో తీసిన వీడియోలే సాక్ష్యమన్నారు. దౌర్జన్యానికి సంబంధించి రాజుపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదని పేర్కొన్నారు. దౌర్జన్యం చేసిన కోడెలతో కుమ్మక్కై వైఎస్సార్సీపీ నేతలపై కేసులు పెట్టారని ఆరోపించారు. జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన తర్వాతే కోడెలపై రాజుపాలెం పోలీసులు కేసు నమోదు చేశారని వెల్లడించారు. చట్ట విరుద్దంగా ప్రవర్తించిన పోలీసులపై కూడా చర్యలు తీసుకోవాలని సీఈఓ ద్వివేదీకి విన్నవించారు. -
ఏపీలో ఐదు పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్
-
ఏపీలో ఐదు చోట్ల రీపోలింగ్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదికలు పంపారు. నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో రెండేసి చొప్పున.. ప్రకాశం జిల్లాలో ఒక చోట రీపోలింగ్‌కు స్థానిక కలెక్టర్లు ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేదీకి నివేదికలు పంపారు. ఆయన వాటిని పరిశీలించిన అనంతరం ఐదు చోట్ల రీపోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫార్సు చేశారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వీవీ ప్యాట్ స్లిప్పులపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనకు సంబంధించి స్థానిక ఆర్ఓ, ఏఆర్ఓలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తునకు ఆదేశించారు. పోలీసు విచారణలో నిజాలు నిగ్గుతేలుతాయని, ఎన్నికల విధుల్లోని సిబ్బంది పొరపాట్లు చేస్తే శిక్ష తప్పదని ఎన్నికల ప్రధానాధికారి గోపాల కృష్ణ ద్వివేది చెప్పారు. -
ఎందుకు ఈ యాగీ?
-
సాక్ష్యాలతో సహా స్పష్టత ఇచ్చిన ద్వివేది..
-
ఓటర్లకు కృతజ్ఞతలు: ద్వివేది
అమరావతి: ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లకు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది కృతజ్ఞతలు తెలిపారు. సాంకేతిక సమస్యలు ఎదురైనా ఓటర్లు ఓపికగా ఓటు హక్కు వినియోగించుకోవడం అభినందనీయమన్నారు. పోలింగ్ ప్రక్రియకు సహకరించిన ఎన్నికల అధికారులు, సిబ్బంది సేవలు ప్రశంసనీయమన్నారు. ఎన్నికల ప్రక్రియలో సహకరించిన రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు ధన్యవాదాలు తెలియజేశారు. 94వ పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్‌కు సిఫార్సు గుంటూరు జిల్లా నరసరావుపేటలో 94వ పోలింగ్ కేంద్రంతో పాటు గుంటూరు వెస్ట్ నియోజకవర్గ పరిధిలోని 244వ పోలింగ్ స్టేషన్లో రీపోలింగ్‌కు జిల్లా కలెక్టర్ సిఫార్సు చేశారు. ఈ ప్రతిపాదనలను సీఈఓ ద్వివేదీ , కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు. -
స్వల్ప ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతం
-
పుకార్లను నమ్మొద్దు : ద్వివేది
సాక్షి, అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఈవీఎంలపై మీడియాలో వస్తున్న వార్తలు నిజం కావని.. సాయంత్రం ఆరు గంటల్లోపు క్యూలైన్లలో ఉన్న ప్రతీ ఒక్కరికి అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు. అదేవిధంగా ఒకరికి ఓటు వేస్తే ఇంకొకరికి వెళ్తుందనేది కూడా దుష్ప్రచారమేనని.. దయచేసి పుకార్లను నమ్మవద్దని ఓటర్లకు విఙ్ఞప్తి చేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అన్ని పోలింగ్ కేంద్రాల్లో మాక్ పోల్ నిర్వహించినట్లు తెలిపారు. అయితే కొన్నిచోట్ల మాక్ పోల్ తర్వాత వచ్చిన రిజల్ట్స్‌ను డిలీట్ చేయకపోవడం వల్ల కొన్ని సమస్యలు తలెత్తాయని పేర్కొన్నారు. మొత్తం ఆరు పోలింగ్ స్టేషన్లలో ఈవిధంగా జరిగిందని.. అయితే అసలు పోలింగ్ ప్రారంభం కాలేదని వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. ఆరు చోట్ల ఈవీఎంలు దెబ్బతిన్నగా, 328 ఈవీఎంలలో సమస్యలు వచ్చాయని.. ప్రస్తుతం వాటిని సరిచేశామని పేర్కొన్నారు. ఈవీఎంలను ధ్వంసం చేసిన వారిని పోలీసులు వెంటనే అరెస్టు చేసి కేసు నమోదు చేశారని వెల్లడించారు. 12 ప్రాంతాల్లో స్వల్ప ఘటనలు జరిగాయని, పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితి చక్కదిద్దారని పేర్కొన్నారు. ఆరోపణలు కాదు.. ఆధారాలు కావాలి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 41 శాతం పోలింగ్ నమోదైందని ద్వివేదీ వెల్లడించారు. ‘కొన్నిచోట్ల ఆలస్యం జరిగిన మాట వాస్తవమే. ఆరుగంటలలోపు పోలింగ్ కేంద్రాల్లో ఉన్నవారికి రాత్రి పది గంటల వరకైనా సరే కచ్చితంగా ఓటు హక్కు కల్పిస్తాం. 25 చోట్ల ఇష్యూలు ఉన్నట్లు దృష్టికి వచ్చింది. వాటిని అధిగమిస్తాం. 30 శాతం ఈవీఎంలు పనిచేయడం లేదన్న ఆరోపణలను నేను ఖండిస్తున్నా. నా దగ్గర ఉన్న ఆధారాలను బట్టి నేను మాట్లాడుతున్నాను. అంతేగానీ అనవసరంగా ఆరోపణలు చేస్తే ఏమీ చేయలేం. ఒకవేళ ఆరోపణలు చేసే వారు ఆధారాలతో సహా వచ్చినపుడు, నిజంగానే సమస్య ఉందని భావిస్తే తప్పకుండా రీపోలింగ్‌కు వెళ్తాం. కొన్నిచోట్ల ఈవీఎంలు సరిగానే పనిచేస్తున్నా సిబ్బంది పొరపాట్ల వలన చిన్న చిన్న సమస్యలు తలెత్తాయి. కలెక్టర్లతో మాట్లాడి సమస్యలు ఎప్పటికప్పుడు పరిస్థితి పర్యవేక్షిస్తున్నాం. కాబట్టి ఈవీఎంలపై దుష్ప్రచారం సరైంది కాదు. కొన్ని ఛానళ్లలో వస్తున్న పుకార్లను నమ్మొద్దు’ అని ప్రజలకు విఙ్ఞప్తి చేశారు. -
ఆఖరి ఎత్తులు!
ఆంధ్రప్రదేశ్‌లో మరికొన్ని గంటల్లో పోలింగ్ జరగబోతున్నదనగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు యధావిధిగా తనకు తెలిసిన విద్యలన్నీ ప్రదర్శించారు. బుధవారం అమరావతి లోని సచివాలయంలో ఉన్న ఎన్నికల కమిషన్ కార్యాలయానికి పోయి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదీతో ఆయన ప్రవర్తించిన తీరు అందరినీ విస్మయపరిచింది. ఎన్నికల ప్రచారానికి గడువు మంగళవారం సాయంత్రం 6 గంటలతో ముగిసిపోయింది. ఆ తర్వాత ఏ నాయకుడూ ప్రచారానికి దిగకూడదు. ఎన్నికల నియమావళి ఇందుకు అంగీకరించదు. కానీ చంద్రబాబు తాను అన్నిటికీ అతీతుడనని భావిస్తారు. అందుకే పదవీభ్రష్టత్వం ఖాయమని ఖరారైన చివరి నిమిషంలో కూడా దింపుడు కళ్లం ఆశతో ఏదో హడావుడి చేసి మీడియాకెక్కాలని తెగ తాపత్రయపడ్డారు. అందుకు ఏకంగా ఎన్నికల కమిషన్ కార్యాలయాన్నే ఆయన ఎంచుకున్నారు. ద్వివేదీతో అమర్యాద కరంగా ప్రవర్తించి అడ్డగోలుగా మాట్లాడారు. బెదిరింపులకు దిగారు. వేలు చూపిస్తూ స్వరం పెంచి ఆయన మాట్లాడిన తీరు అధికార యంత్రాంగాన్ని మాత్రమే కాదు... రాజకీయవర్గాలనూ, ప్రజ లనూ కూడా ఆశ్చర్యపరిచింది. ‘మీరు పోస్ట్‌మాన్ డ్యూటీ చేస్తారా... కేంద్ర ఎన్నికల సంఘం చెప్పి నట్టు ఎలా చేస్తారు?’ అంటూ బాబు ప్రశ్నించడం హాస్యాస్పదం. రాష్ట్ర ఎన్నికల సంఘం తన చెప్పు చేతల్లో నడవాలన్నది ఆయన ఉద్దేశం కాబోలు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇంత దిగజారి మాట్లాడటం ఊహకందనిది. ఈ మాటల్లో కొత్తేమీ లేదు. గత కొన్నిరోజులుగా రోడ్ షోల్లో ఏకరువు పెడుతున్న ఆరోపణలే అవన్నీ. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, డీజీని, ముగ్గురు ఎస్పీలను బదిలీ చేయడం ఆయనకు పరమ అభ్యంతరకరం. తాను ఏం చేసినా అన్ని వ్యవస్థలూ అచేతనంగా ఉండిపోవాలని ఆయన భావిస్తున్నారు. ఏ పరిస్థితుల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) బదిలీ చేసింది? ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు, మరికొందరు పోలీస్ అధికారులపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి, వారిలో ముగ్గురిపై చర్య తీసుకుంది. కానీ ఆ చర్యను వమ్ము చేసి తనకు అత్యంత ప్రీతి పాత్రుడైన వెంకటేశ్వరరావు బదిలీని ఆపాలని చంద్రబాబు ప్రయత్నించారు. అందుకోసం వరస బెట్టి జారీచేసిన మూడు జీవోలు బాబు మానసిక స్థితికి, ఆయన మార్క్ పాలనకూ అద్దం పడ తాయి. ఆ ముగ్గురు అధికారులనూ బదిలీ చేస్తూ ఒక జీవో, వారిలో కేవలం ఇద్దరిని మాత్రమే బదిలీ చేస్తూ మరో జీవో, ఎన్నికల సంఘం పరిధిలోకి వచ్చే అధికారుల జాబితాలో ఇంటెలిజెన్స్ చీఫ్‌ను మినహాయిస్తూ ఇంకొక జీవో విడుదల చేశారు. ఈ మూడు జీవోల మధ్యా కొన్ని గంటల వ్యవధి మాత్రమే ఉన్నదని, పైగా ఇందులో ఆఖరుగా విడుదలచేసిన జీవోను ఎన్నికల సంఘం చర్యను వమ్ము చేసేందుకు వీలుగా వెనకటి తేదీ నుంచి అమలయ్యేలా జారీ చేశారని గమనిం చుకుంటే బాబు సర్కారు అనైతికత ఏ స్థాయిలో ఉందో అర్ధమవుతుంది. చెప్పాలంటే ఈ జీవోల జారీలో ఆనాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠ వాస్తవానికి పోస్ట్‌మాన్‌లా ప్రవర్తిం చారు. ఇష్టంగానో, అయిష్టంగానో బాబు అభీష్టాన్ని నెరవేర్చారు తప్ప నిబంధనలేం చెబుతు న్నాయో, తన కర్తవ్యమేమిటో గమనించుకోలేకపోయారు. అందువల్లే సీఈసీ ఆయనపై కూడా చర్య తీసుకోవాల్సి వచ్చింది. తనపై విరుచుకుపడుతున్న బాబును ఈ జీవోల సంగతేమిటని కెమెరాల సాక్షిగా ద్వివేదీ నిలదీసి ఉంటే ఏమయ్యేది? వీటన్నిటినీ పట్టించుకోకుండా ఎన్నికల సంఘం ప్రేక్షకపాత్ర వహించాలా అని ప్రశ్నిస్తే బాబు పరువు ఏమయ్యేది? ఇక్కడ మరో ముఖ్య విషయం గమనించాలి. ఈ బదిలీలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లో తాము జోక్యం చేసు కోలేమని హైకోర్టు తోసిపుచ్చింది. ఎన్నికల సంఘం పనితీరుపై ఏ పార్టీకైనా అసంతృప్తి ఉండటం తప్పేమీ కాదు. నియమావళిని సక్రమంగా అందరితో పాటించేలా చేయడంలో అది విఫలమవుతున్నదనో, ఉల్లంఘనలు జరుగు తున్నా పట్టించుకోవడంలేదనో ఆరోపించదల్చుకుంటే అందుకు తగిన ఆధారాలను అందించాలి. తగిన వేదికల వద్ద ఫిర్యాదు చేయాలి. దేశంలో అందరికన్నా తానే సీనియర్ రాజకీయవేత్తనని, తనకు అపార అనుభవమున్నదని తరచు చెప్పుకునే బాబుకు ఇలాంటి అంశాలు ఇంకా తెలియ లేదంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆయనకు తెలియక కాదు. ఏ పనైనా ఆయన తెలిసే చేస్తారు. తెలుసుకునే చేస్తారు. ఎవరూ తనని గమనించరని, గమనించినా నిలదీయరని అపార విశ్వాసం. ఏ వ్యవస్థా తనను ప్రశ్నించదన్న ధీమా. అంతక్రితం తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్నప్పుడైనా, మూడేళ్లక్రితం తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక టీఆర్ఎస్ ఎమ్మెల్యేను నోట్ల కట్టలు పంపి ప్రలోభపరచాలని ప్రయత్నించినప్పుడైనా ఆయన ఈ ధీమాతోనే బరితెగించారు. ఇప్పుడు యావత్తు అధికార యంత్రాంగాన్నీ గుప్పెట్లో పెట్టుకోవాలనుకుంటున్నది ఈ ధీమాతోనే! నిజానికి షెడ్యూల్ ప్రకటించిననాటినుంచి బాబు య«థేచ్ఛగా కోడ్ ఉల్లంఘిస్తున్నారు. తాను ఆపద్ధర్మ సీఎంనన్న సంగతి మరిచి ఆర్థిక శాఖ ఉన్నతాధికారులను పిలిపించుకుని మొబిలైజేషన్ అడ్వాన్సులకింద, నీరు–చెట్టు పథకం కింద నిధుల సంతర్పణ చేశారు. ఎన్నికల సంఘం దగ్గర మాత్రమే ఉండే కలర్ ఫొటోలతో కూడిన జాబితాలనూ, పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేసి సొంత పార్టీ ప్రయోజనాలకు వినియోగించుకున్నారు. పలు జిల్లాల్లో పోలీసుల ద్వారా, తమ పార్టీ వారి ద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ నేతలనూ, కార్యకర్తలనూ బెదరగొట్టాలని చూస్తున్నారు. నిజానికి ఇలాంటి అంశాల్లో ఎన్నికల సంఘం కఠినంగా ఉండటం లేదన్న అసంతృప్తి అందరిలో ఉంది. ఇన్ని ఉల్లంఘనలకు పాల్పడుతూ తమకేదో తీరని అన్యాయం జరిగిందని బాబు శోకాలు పెడుతున్నారు. ఇప్పటికే ఒక స్పష్టమైన నిర్ణయానికొచ్చిన ప్రజానీకాన్ని ఇలాంటి కపట నాటకాలు ఏమార్చలేవు. బాబు తన అప్రజాస్వామిక వైఖరికి స్వస్తి చెప్పి వ్యవస్థలను గౌరవించడం నేర్చుకోవాలి.