
గోపాల్ కృష్ణ ద్వివేది(పాత చిత్రం)
అమరావతి: చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో జరిగే రీపోలింగ్‌పై చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. పోలీస్ బందోబస్తు, రీపోలింగ్ నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు. రీపోలింగ్‌పై విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు.
ఎండల తీవ్రత దృష్ట్యా పోలింగ్ బూత్‌ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచన చేశారు. స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎటువంటి పొరపాట్లకు అవకాశం లేకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని అధికారులకు సూచనలు చేశారు.
సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
చిత్తూరు జిల్లా కలెక్టర్‌తో ఏపీ ఈసీ వీడియో కాన్ఫరెన్స్
Comments
Please login to add a commentAdd a comment