ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గోపాల కృష్ణ ద్వివేది
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదికలు పంపారు. నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో రెండేసి చొప్పున.. ప్రకాశం జిల్లాలో ఒక చోట రీపోలింగ్‌కు స్థానిక కలెక్టర్లు ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేదీకి నివేదికలు పంపారు. ఆయన వాటిని పరిశీలించిన అనంతరం ఐదు చోట్ల రీపోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫార్సు చేశారు.
నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వీవీ ప్యాట్ స్లిప్పులపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనకు సంబంధించి స్థానిక ఆర్‌ఓ, ఏఆర్‌ఓలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తునకు ఆదేశించారు. పోలీసు విచారణలో నిజాలు నిగ్గుతేలుతాయని, ఎన్నికల విధుల్లోని సిబ్బంది పొరపాట్లు చేస్తే శిక్ష తప్పదని ఎన్నికల ప్రధానాధికారి గోపాల కృష్ణ ద్వివేది చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment