
సాక్షి, అమరావతి: చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ కారణమైన అధికారులను సస్పెండ్ చేస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల విధుల్లో అలసత్వం వహించిన ఐదు పోలింగ్ కేంద్రాల్లోన్ని ప్రిసైడింగ్ ఆఫీసర్లు (పీవో), అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ల (ఏపీవో)ను సస్పెండ్ చేస్తూ తక్షణం వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా చిత్తూరు జిల్లా కలెక్టర్‌కు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేది సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా అయిదు పోలింగ్ కేంద్రాల్లో ఉన్న ప్రైవేటు వ్యక్తులను గుర్తించి వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి ఆ వివరాలను ఇవ్వాల్సిందిగా కోరారు. ఏప్రిల్ 11న జరిగిన ఎన్నికల్లో ఈ ఐదు పోలింగ్ కేంద్రాల్లో జరిగిన తప్పులు, ఆ అధికారులపై ఎందుకు చర్యలు తీసుకుంటున్నది ఎన్నికల సంఘం ఆ ఉత్తర్వుల్లో వివరంగా పేర్కొంది.
ఎన్.ఆర్. కమ్మల్లి(321): చాలా మంది ఓటర్లకు సాయంగా ప్రైవేటు వ్యక్తులు రావడమే కాకుండా ఓటింగ్ కంపార్టమెంట్ వద్ద ఓటు వేసేటప్పుడు కూడా ఉన్నారు. ఇది ఓటు రహస్యం అనే నిబంధనను ఉల్లంఘించడమే. అదే విధంగా నలుగురైదుగురు వ్యక్తులు పోలింగ్ కేంద్రాల్లో ఎటువంటి ఐడీ కార్డులు లేకుండా స్వేచ్ఛగా తిరగడం కనిపించింది. మరికొంత మంది ఓటర్లకు సహాయకులుగా వచ్చిన వారు ఓటరు బదులు వారే ఓట్లు వేశారు. కొన్ని చోట్ల ఓటరు లేకుండానే మరో వ్యక్తి ఓటు వేయడం జరిగింది. దీనిపై ప్రిసైడింగ్ ఆఫీసర్లు, ఇతర అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తే ప్రైవేటు వ్యక్తులు, పోలింగ్ ఏజెంట్లు వాగ్వివాదానికి దిగడమే కాకుండా బెదిరింపులకు దిగారు. పోలింగ్ కేంద్రాల్లో సెల్‌ఫోన్లను కూడా యధేచ్చగా వినియోగించారు.
పుల్లివర్తిపల్లి(104): మధ్యాహ్నం 2.24 నిమిషాలకు రెండు ఓటింగ్ కంపార్టమెంట్ల వద్ద ఇద్దరు ప్రైవేటు వ్యక్తులు నిలబడి ఓటరు బదులు వారే ఓట్లు వేయడం జరిగింది. ఇలా ఓటింగ్ ముగిసే వరకు ఓటర్ల బదులు వారే ఓట్లు వేశారు.
కొత్తకండ్రిగ(316): మధ్యాహ్నం 12.25 – 1.25 మధ్య సమయంలో పోలింగ్ కేంద్రంలో వ్యక్తుల మధ్య పరస్పర వాగ్వాదాలు జరిగాయి. పోలింగ్ ఏజెంట్లుగా కనిపిస్తున్న వారు ఓటరుతో పాటు కంపార్టమెంటు వరకు వెళ్లి ఓటరు బదులు వారే ఓటు వేశారు. పోలింగ్ ముగిసే వరకు ఇదే ప్రక్రియ కొనసాగింది.
కమ్మపల్లి(318): అసలు ఓటరు బదులు ఒకే వ్యక్తి ఓట్లు వేయడం జరిగింది. ఉదయం 8.50 నిమిషాల సమయంలో పోటీలో ఉన్న అభ్యర్థి డాక్టర్ చెవిరెడ్డి భాస్కర రెడ్డి పోలింగ్ కేంద్రంలోకి రావడం పోలింగ్ కేంద్రంలో ఉన్న వ్యక్తులతో వాడిగావేడిగా వాదనలు జరిగాయి. ఇక మధ్యాహ్నం 2.30
Comments
Please login to add a commentAdd a comment