state election commission
-
ఏపీ డీజీపీకి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు
ఢిల్లీ: ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో అక్రమాలపై మూడు రోజుల్లోగా జవాబు చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది. డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై దర్యాప్తు జరపాలన్న వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి ఫిర్యాదుపై ఏపీ ఎన్నికల సంఘం స్పందించింది.ఏపీ డీజీపీ నుంచి వివరణ కోరింది. -
‘స్థానిక’ సన్నాహాలు
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు మరో మూడు నెలల సమయం పట్టే అవకాశమున్నా, ఎన్నికల పనుల్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ, రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) పూర్తిస్థాయిలో నిమగ్నమైంది. శనివారం జిల్లాలు, మండల స్థాయిలో పోలింగ్ కేంద్రాలను గుర్తించి దానికి సంబంధించిన జాబితాలను జిల్లా, మండల కేంద్రాల్లో ప్రచురించారు. రాష్ట్రవ్యాప్తంగా 570 జెడ్పీటీసీ, 5,817 ఎంపీటీసీ స్థానాల్లో పోలింగ్ కేంద్రాలు ఉన్నట్టు ప్రకటించారు. మరోవైపు ఓటర్ల జాబితాకు సంబంధించిన కసరత్తు సాగుతోంది.ఎన్నికలు వాయిదా పడుతున్నాయనే భావనలో ఉండొద్దని, ఆయా పనులకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తూనే ఉండాలని అధికారులు, సిబ్బందికి పంచాయతీరాజ్ కమిషనరేట్ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాలు, సిబ్బందికి శిక్షణ తదితరాలన్నీ పూర్తిచేసి, ఎప్పుడు ఎన్నికల షెడ్యూల్ వచ్చినా వెంటనే ఎన్నికల విధుల్లో దిగేందుకు సిద్ధంగా ఉండాలని ఈ ఆదేశాల్లో స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు ఎన్నికల ఏర్పాట్లపై జెడ్పీ సీఈవోలు, డీపీవోలు, ఇతర క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందితో వీడియో, టెలీ కాన్ఫరెన్స్‌లు, గూగుల్‌మీట్‌లు నిర్వహిస్తూనే ఉన్నారు. ఎస్ఈసీ ఆదేశాలకు అనుగుణంగా... ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా పీఆర్ శాఖ ద్వారా పోలింగ్ కేంద్రాల జాబితా, ఓటర్ల జాబితాను సిద్ధం చేసింది. పైగా సిబ్బందికి కూడా దీనికి సంబంధించిన శిక్షణను కూడా పూర్తి చేసింది. శనివారం పోలింగ్ స్టేషన్లు ఖరారు కావడంతో టీ–పోల్ యాప్‌లో పోలింగ్ కేంద్రాల వారీగా 500 నుంచి 700 ఓటర్లను మ్యాపింగ్ చేసి ఆయా కేంద్రాలకు కేటాయించాల్సి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, రిజర్వేషన్లు ఇతర అంశాలకు సంబంధించి హైకోర్టులోనూ కేసు విచారణ సాగుతున్న విషయం తెలిసిందే. కోర్టుకు ఆయా విషయాలపై వివరణ ఇవ్వాల్సి ఉంటుందని, జిల్లా నుంచి గ్రామస్థాయి వరకూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని పీఆర్ శాఖ ఆదేశించింది. పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఏవి ముందు నిర్వహించాల్సి వచ్చినా, అందుకు పూర్తిస్థాయిలో సన్నద్ధమై ఉండాలని సూచించింది. కులగుణనలో రెండోవిడతలో వివరాల సేక రణ, పరిశీలన, ఆపై కేబినెట్ భేటీలో సమగ్ర నివేదిక ఆమోదం, ఆపై అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి, బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల కల్పనకు చట్టబద్ధత కల్పించేలా బిల్లు పెట్టి కేంద్రానికి, పార్లమెంట్‌కు పంపించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు మరికొన్ని నెలల సమయం పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
ఈసీ అఖిలపక్షంలో ట్విస్ట్.. నోటాను వ్యతిరేకించిన కాంగ్రెస్
హైదరాబాద్, సాక్షి: స్థానిక సంస్థల ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ఇవాళ నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. పంచాయితీ ఎన్నికల్లో నోటాను ప్రవేశపెట్టాలన్న ప్రతిపాదనను అధికార కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. దీంతో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే భేటీ ముగిసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా.. పంచాయితీ ఎన్నికల్లో నోటాను ప్రవేశపెట్టాలని ఈసీ ప్రతిపాదన చేసింది. దీనికి కాంగ్రెస్ తప్ప.. అన్ని రాజకీయ పార్టీల దాదాపుగా సానుకూలంగానే స్పందించాయి. నోటాతో ఎన్నిక ఖర్చు ఎక్కువ అని, ఒకవేళ నోటాతో ఎన్నిక నిర్వహించినా సెకండ్ లార్జెస్ట్ పార్టీనే విజేతగా ప్రకటించాలని కాంగ్రెస్ ఈసీని కోరింది. నోటాపై అభిప్రాయం సేకరణలో బీఆర్ఎస్ సానుకూలంగా స్పందించింది. ఏకగ్రీవానికి.. బెదిరింపులు, బలప్రదర్శన చేసే అవకాశం ఉందని ఈసీకి తెలిపింది. అలాగే.. కొత్త మండలాల వివరాలను రాజకీయ పార్టీలకు ఇవ్వాలని ఈసీని కోరింది. ఇక.. సుప్రీం కోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నందున అభిప్రాయం ఇప్పుడే చెప్పలేమని పేర్కొంది. అలాగే.. రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఈ విషయంపై నిర్ణయం తీసుకునే అధికారం లేదని గుర్తు చేసింది. పంచాయతీ ఎన్నికల నిర్ణయం ప్రభుత్వమే తీసుకోవాలని స్పష్టం చేసింది. నోటాతో ఎన్నిక ఉండాలని సుప్రీంకోర్టు ఇప్పటికే చెప్పిందని సీపీఎం గుర్తు చేసింది. అభ్యర్థి కంటే నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే రీ-ఎలక్షన్ కరెక్ట్ కాదు. ఎన్నిక కండక్ట్ చేయడం అవసరం.. నోటాకు ఎక్కువ ఓట్లు అనేది తర్వాత చర్చ అని వామపక్ష పార్టీ అభిప్రాయపడింది. ఇక.. తెలంగాణ టీడీపీ తమ అభిప్రాయాన్ని రెండు మూడు రోజుల్లో చెప్తామనగా, సింగిల్ అభ్యర్థిగా అయినా నోటా ఉండాలని జనసేన పార్టీ ఈసీకి విజ్ఞప్తి చేసింది.ఇదీ చదవండి: స్థానిక సంస్థల్లో ‘నోటా’ ఎందుకంటే.. -
TG: స్థానిక సంస్థల్లో అభ్యర్థిగా ‘నోటా’!
హైదరాబాద్, సాక్షి: స్థానిక సంస్థల ఎన్నికల్లో ‘నోటా’ బటన్ అంశాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం సీరియస్‌గా పరిశీలిస్తోంది. ఈ మేరకు ఇవాళ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశంలో ఈ అంశాన్ని చర్చించనున్నట్లు సమాచారం. దీంతో ఏకగ్రీవాలు ఉంటాయా? ఉండవా? అనే దానిపై ఇవాళ ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉండనుంది. ట్రయల్ ప్రతిపాదికన పంచాయితీ ఎన్నికల్లో ‘నోటా’ను నామమాత్రపు అభ్యర్థిగా ఈసీ పెట్టాలనుకుంటోంది. అభ్యర్థుల కంటే నోటాకు ఎక్కువ ఓట్లు పడితే.. ఆ స్థానంలో మళ్లీ ఎన్నిక నిర్వహించాలని భావిస్తోంది. అయితే ఇప్పటికే ఈ పద్ధతిని పలు రాష్ట్రాలు పాటిస్తున్నాయి. తాజా నిర్ణయం అమలైతే.. ఒకే ఒక్క నామినేషన్ దాఖలైన పరిస్థితుల్లో అక్కడ నోటా కూడా ఉంటుంది. అభ్యర్థికి ఓటు వేయడం ఇష్టం లేకపోతే.. ఓటర్లు నోటా బటన్ నొక్కొచ్చు. అంతే తప్ప ఏకగ్రీవాలు ఉండకూడదనే అంశంపై ఇవాళ్టి సమావేశంలో చర్చించబోతున్నారు. దీంతో రాజకీయ పార్టీల నుంచి స్పందన ఎలా ఉండనుందా? అనే ఉత్కంఠ నెలకొంది. సాధారణంగా.. పంచాయితీ ఎన్నికల్లో వార్డుమెంబర్లు, సర్పంచ్ పదవులు చాలా చోట్ల ఏకగ్రీవాలు అవుతుంటాయి. ఇవన్నీ వేలంపాట తరహాలోనే ఉంటున్నాయనే ఫిర్యాదుల నేపథ్యంలోనే.. ఇప్పుడీ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఇక.. పంచాయతీ ఎన్నికల నిర్వహణ, ఓటర్ల తుదిజాబితా ఖరారుపై ఈసీ ఇవాళ్టి సమావేశంలో చర్చించనుంది. మరోవైపు ఎన్నికల సంఘంతో పాటు ఇటు ప్రభుత్వం కూడా తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై ఫోకస్ పెంచింది. న్యాయ పరమైన చిక్కులు తలెత్తకుండా జాగ్రత్త పడుతోంది. మరో నాలుగు రోజుల్లో రిజర్వేషన్లు ఫైనల్ చేసే యోచనలో ఉంది ప్రభుత్వం. -
కూటమి కాలకేయుల సాక్షిగా.. ప్రజాస్వామ్యం ఖూనీ
సాక్షి ప్రతినిధి, తిరుపతి, సాక్షి, అమరావతి, నెట్వర్క్: ఆదిమ తెగల్లోనూ కానరాని అకృత్యాలు టీడీపీ కూటమి సర్కారు పాలనలో ఆవిష్కృతమయ్యాయి! పట్టపగలు.. తిరుపతి నడి రోడ్డుపై పోలీసులు, జనం సాక్షిగా ప్రజాస్వామ్యం ఖూనీ అయింది. తాలిబన్లు.. ఐసిస్.. హమాస్ ఉగ్రమూకలను తలదన్నే రీతిలో మునిసిపల్ ఉప ఎన్నికల్లో పచ్చ ముఠాలు దాడులకు తెగబడి విధ్వంసం, భయోత్పాతం సృష్టించాయి! పలు మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో చైర్మన్లు, డిప్యూటీ మేయర్లు, వైస్ చైర్మన్ పదవులకు సోమవారం జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ నేతలు అరాచకాలకు తెగబడ్డారు. అసలు ఒక్క సీటు కూడా గెలవని చోట్ల.. తమకు ఏమాత్రం సంఖ్యా బలం లేని చోట్ల భయపెట్టి నెగ్గేందుకు కూటమి పార్టీలు కుతంత్రాలకు దిగాయి. ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ వాడుకుంటూ అధికార దుర్వినియోగానికి బరి తెగించాయి. బల ప్రయోగం, అక్రమాలు, అరాచకాలు, ప్రలోభాలతో ప్రజాస్వామ్య వ్యవస్థకే కళంకం తెచ్చేలా వ్యవహరించాయి. మునిసిపల్ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీ గుర్తులతో జరిగాయి. అలాంటిది.. ఒక పార్టీ గుర్తుపై నెగ్గిన వారిని భయపెట్టి, ప్రలోభాలకు గురి చేసి ఇంత దారుణంగా ఫిరాయింపులకు ప్రోత్సహిస్తుంటే.. అసలు ఇక ఎన్నికలు ఎందుకు? పార్టీ గుర్తులు ఎందుకు? అని ప్రజలు తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. నాగరికత, ఆధునిక పోకడలు ఏమాత్రం ఎరుగని ఆటవిక జాతులు.. ప్రజాస్వామ్యం అంటే పరిచయం లేని దేశాల్లో మాత్రమే కనిపించే ఘటనలు ఏడుకొండలవాడి సాక్షిగా చోటు చేసుకోవడం నివ్వెరపరుస్తోందని పేర్కొంటున్నారు. తిరుపతి డిప్యూటీ మేయర్ ఉప ఎన్నికలో నెగ్గేందుకు కూటమి పార్టీల గూండాలు అరాచకం సృష్టించారు. ఉప ఎన్నికలో పాల్గొనేందుకు వాహనంలో వెళ్తున్న వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల బస్సు ఆపి రాడ్లతో అద్దాలు పగలగొట్టి లోపలకు చొరబడి దాడులకు తెగబడ్డారు. బస్సులో ఉన్న కార్పొరేటర్లపై దాడిచేసి చొక్కా పట్టుకుని ఈడ్చుకెళ్లారు. మహిళా కార్పొరేటర్ల ఆర్తనాదాలు ఖాకీల చెవికెక్కలేదు. కార్పొరేటర్లను బలవంతంగా లాక్కెళుతున్న కూటమి గూండాల వాహనాలకు పోలీసులు దగ్గరుండి దారిచ్చి సాగనంపడం నివ్వెరపరుస్తోంది. పోలీసుల సాక్షిగా కూటమి గూండాలు చిత్తూరు, తిరుపతిలో సృష్టించిన అరాచకం ఇదీ!! రాష్ట్రంలో స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికలు జరిగే వాతావరణం లేదని అధికార మదంతో టీడీపీ నేతలు సవాల్ విసరడంపై ప్రజాస్వామ్యవాదుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. మూడు నగర కార్పొరేషన్లు, ఏడు మున్సిపాలిటీల్లో ఖాళీ అయిన డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు సోమవారం ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నోటిఫికేషన్ జారీ చేయగా టీడీపీ నేతల దౌర్జన్యాలు, దాడులు, బెదిరింపులతో ఐదు చోట్ల ఎన్నికలు వాయిదా పడటం గమనార్హం.వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల బస్సును అడ్డుకుంటున్న టీడీపీ నాయకుడు అన్నా రామచంద్రయ్య, గూండాలు అర్ధరాత్రి నుంచి అరాచకం..మూడేళ్ల క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరుపతి కార్పొరేషన్లో మొత్తం 49 డివిజన్లకు గానూ 48 చోట్ల వైఎస్సార్సీపీ గెలుపొందింది. భూమన అభినయరెడ్డి సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడంతో తిరుపతి డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ పదవులకు రాజీనామా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డిప్యూటీ మేయర్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడింది. కూటమికి ఒక్క కార్పొరేటరే ఉన్నా అధికార బలంతో దాన్ని దక్కించుకునేందుకు కుట్రలకు తెర తీశారు. గత ఐదు రోజులుగా వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల ఆస్తులను ధ్వంసం చేయడంతోపాటు రాత్రిపూట పోలీసులను వారి ఇళ్లకు పంపి కేసులు బనాయిస్తామంటూ బెదిరించారు. ఎస్వీ యూనివర్సిటీ సెనెట్ హాలులో సోమవారం డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలనే కుయుక్తులతో కూటమి నేతలు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను కిడ్నాప్ చేసేందుకు సిద్ధమయ్యారు. వారంతా చిత్తూరులో ఉన్నారని తెలుసుకుని ఆదివారం అర్ధరాత్రి రిసార్ట్స్‌లో చొరబడ్డారు. మహిళా కార్పొరేటర్లు అని కూడా చూడకుండా తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కుమారుడు మదన్, పులిగోరు మురళి, జేబీ శ్రీనివాసులు, అనుచరులు గదుల తలుపులు బాదుతూ వీరంగం సృష్టించారు. గదుల్లో ఉన్న మహిళలు, చిన్నారులు ఆందోళనతో భూమన అభినయరెడ్డికి సమాచారం ఇవ్వడంతో పార్టీ శ్రేణులతో కలసి అక్కడకు చేరుకున్నారు. టీడీపీ మూకలు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. అనంతరం కార్పొరేటర్లంతా సోమవారం వేకువజామున 3 గంటల ప్రాంతంలో తిరుపతిలోని భూమన కరుణాకరరెడ్డి నివాసానికి చేరుకున్నారు. బస్సుని అడ్డుకుని.. అద్దాలు ధ్వంసం చేసిడిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక కోసం సోమవారం ఉదయం 11 గంటలకు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లంతా భూమన నివాసం నుంచి ప్రత్యేక బస్సులో ఎస్వీ యూనివర్సిటీలోని సెనెట్ హాలు వద్దకు బయలు దేరారు. దాదాపు 25 మంది కార్పొరేటర్లు, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం అందులో ఉండగా వర్సిటీ సమీపంలో వారి బస్సును కూటమి గూండాలు అడ్డుకున్నారు. సుమారు 500 మంది ఒకేసారి బస్సుపైకి దూసుకొచ్చి పోలీసుల సమక్షంలోనే రాడ్లతో అద్దాలను పగులగొట్టారు. లోపలకు చొరబడి బస్సు తలుపు తెరిచారు. బస్సులో ఉన్న కార్పొరేటర్లు అమరనాథరెడ్డి, అనీష్‌రాయల్, మోహన్‌కృష్ణ యాదవ్, బోగం అనిల్, వెంకటేష్‌పై దాడిచేసి చొక్కా పట్టుకుని ఈడ్చుకెళ్లారు. అప్పటికే సిద్ధంగా ఉన్న వాహనాల్లో కార్పొరేటర్లను బలవంతంగా ఎక్కించారు. బస్సులో ముందు వైపు కూర్చున్న మహిళా కార్పొరేటర్లను నెట్టుకుంటూ లోపలకు చొరబడడంతో భయభ్రాంతులకు గురయ్యారు. పోలీసులు ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు. కార్పొరేటర్లను కాపాడకపోగా మిగిలిన వారిపై దౌర్జన్యానికి దిగారు.ఎంపీ, సాక్షి ప్రతినిధులపై దాడికార్పొరేటర్లతో పాటు బస్సులో ఉన్న ఎంపీ గురుమూర్తిపై కూడా కూటమి గూండాలు దాడికి యత్నించారు. ఈ అరాచకాలను చిత్రీకరిస్తున్న సాక్షి ప్రతినిధి, ఫోటోగ్రాఫర్పై దాడి చేశారు. ఎమ్మెల్యే కుమారుడు మదన్, సునీల్ చక్రవర్తి ఫోటోగ్రాఫర్ చేతిలోని రూ.రెండు లక్షలు విలువచేసే కెమెరాను ధ్వంసం చేశారు. సెల్ఫోన్లో చిత్రీకరిస్తున్న సాక్షి ప్రతినిధిపై కూడా దాడికి తెగబడ్డారు. ఉదయం 10.15 గంటల నుంచి 10.45 వరకు యధేచ్ఛగా సాగిన విధ్వంసంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. కోరం లేదని డూప్లికేట్ కార్పొరేటర్లతో..నలుగురు కార్పొరేటర్లను కిడ్నాప్ చేస్తే గెలుపు తమదేనని ధీమాతో ఉన్న కూటమి నేతలకు వైఎస్సార్సీపీ షాక్ ఇచ్చింది. కిడ్నాప్‌నకు గురైన కార్పొరేటర్లను ప్రవేశపెట్టే వరకు తాము ఉప ఎన్నికలో పాల్గొనబోమని మిగతావారు వర్సిటీ సెనెట్ హాలు బయటే ఆగిపోయారు. ఉప ఎన్నిక జరగాలంటే కోరం ఉండాలి. అంటే.. 50 మంది కార్పొరేటర్లలో సగం మందైనా ఉంటేగానీ ఉప ఎన్నిక ప్రారంభం కాదు. దీంతో కూటమి నేతలు మరో ఎత్తుగడ వేశారు. నలుగురు జనసేన మహిళలకు మాస్క్‌లు అమర్చి సెనెట్ హాలు లోపలకు పంపేందుకు యత్నించారు. ఈ కుట్రలను పసిగట్టిన ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం హాలు వద్దకు చేరుకోవడంతో ఆ యత్నాలు విఫలమయ్యాయి. దీంతో ఉప ఎన్నికను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారి శుభం బన్సల్ ప్రకటించారు. నలుగురితో బలవంతంగా వీడియో...డిప్యూటీ మేయర్ పదవిని కైవశం చేసుకునేందుకు టీడీపీ మూకలు కిడ్నాప్ చేసిన నలుగురు కార్పొరేటర్ల చేత బలవంతంగా మాట్లాడించి ఓ వీడియోను విడుదల చేశారు. గొడవల కారణంగా తాము సురక్షిత ప్రాంతానికి చేరుకున్నామంటూ ఒకే డైలాగ్ నలుగురితో చెప్పించి వీడియో తీశారు. అది ఒకే ప్రాంతంలో చేసినట్లు తెలుస్తోంది. పక్కన ఎవరో బలవంతంగా చెప్పిస్తున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నలుగురి వీడియోలను టీడీపీ మీడియా కో ఆర్డినేటర్ శ్రీధర్‌వర్మ తన ఫోన్ నుంచి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం గమనార్హం. కాగా భూమన అభినయ్‌పై అక్రమ కేసు బనాయించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.అడ్డదారిలో స్టాండింగ్ కమిటీ కైవశంగుంటూరు స్టాండింగ్ కమిటీని టీడీపీ అడ్డదారిలో కైవశం చేసుకుంది. 56 మంది సభ్యులకుగానూ కేవలం 11 మంది బలం మాత్రమే ఉన్న కూటమి వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లను ప్రలోభాలకు గురి చేసి తమవైపు తిప్పుకుంది. స్వయంగా ఎమ్మెల్యేలను కార్పొరేటర్ల ఇళ్లకు పంపి పచ్చ కండువా కప్పారు. సోమవారం స్టాండింగ్ కమిటీ ఎన్నిక సందర్భంగా బ్యాలెట్ పేపర్‌పై సీరియల్ నంబర్లు వేసి బెదిరింపులకు దిగి గెలుపొందారు. కాగా కార్యాలయం బయట కూటమి సభ్యులు డబ్బులు పంచుకుంటూ మీడియాకు చిక్కారు.సగం చోట్ల వాయిదా...పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ, ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మున్సిపల్ చైర్మన్ పదవులతో పాటు తిరుపతి నగర కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్, కాకినాడ జిల్లా తుని, పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ పదవుల ఎన్నికలు వాయిదా పడ్డాయి. నోటిఫి కేషన్ జారీ చేసిన సగం చోట్ల ఎన్నికలు జరగకుండా వాయిదా పడడం గతంలో ఎప్పుడూ లేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. వాయిదా పడిన ఐదు చోట్ల మంగళవారం ఉదయం 11 గంటలకు ఎన్నికలు నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఎన్ని కల కమిషన్ కార్యాలయ అధికారులు తెలిపారు. ⇒ టీడీపీ కూటమికి బలం లేకపోయినా నూజివీడు మున్సిపాల్టీలో వైస్ చైర్మన్, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్, నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో రెండు వైస్ ౖచైర్మన్లు, ఏలూరు కార్పొరేషన్లో రెండు డిప్యూటీ మేయర్ పదవులను అధికారం అండతో చేజిక్కించుకుంది. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ పదవిని సొంతం చేసుకుంది. తిరుపతిలో డిప్యూటీ మేయర్, పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో చైర్మన్, ఎన్టీఆర్ జిల్లా నందిగామలో చైర్మన్, పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో వైస్ చైర్మన్, కాకినాడ జిల్లా తునిలో వైస్ చైర్మన్ పదవిలో బలవంతంగా లాక్కునేందుకు ప్రయత్నించి విఫలమైంది. ⇒ కృష్ణా జిల్లా నూజివీడు మున్సిపాల్టీలో టీడీపీకి బలం లేకపోయినా తొమ్మిది మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను బెదిరించి లొంగదీసుకుని వైస్ చైర్మన్ పదవిని దక్కించుకుంది. ఇందుకోసం మంత్రి కొలుసు పార్ధసారథి ఆదివారం రాత్రి కౌన్సిలర్ల ఇళ్లకు వెళ్లి మరీ బెదిరింపులకు పాల్పడ్డారు. ⇒ హిందూపురం మున్సిపాల్టీలో మొత్తం 38 కౌన్సిలర్లకు వైఎస్సార్సీపీ 29, టీడీపీ 6 గెలుచుకుంది. అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న సీఎం చంద్రబాబు బావమరిది బాలకృష్ణ 13 మందిని ప్రలోభపెట్టి తమ వైపు తిప్పుకున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే ఓట్లను కూడా ఉపయోగించుకుని ౖచైర్మన్ పదవిని మోసపూరితంగా తమ పరం చేసుకున్నారు.⇒ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో 54 కార్పొరేటర్లకు 54 సీట్లను వైఎస్సార్సీపీ గెలిచినా.. ఖాళీ అయిన డిప్యూటీ మేయర్ పదవిని అధికార దుర్వినియోగంతో టీడీపీ మద్దతిచ్చిన స్వతంత్ర అభ్యర్థికి కట్టబెట్టారు. మంత్రి నారాయణ, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి బెదిరింపులు, ప్రలోభాలతో వారిని తమ వైపు తిప్పుకుని ఆ పదవిని అక్రమంగా కైవశం చేసుకున్నారు. ⇒ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో రెండు వైస్ ౖచైర్మన్ పదవులను బెదిరింపులకు గురి చేసి టీడీపీ మద్దతుదారులకు కట్టబెట్టారు. 20 వార్డుల్లో 18 చోట్ల వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు ఉండగా 12 మందిని ప్రలోభపెట్టి ప్యాకేజీలు ఇచ్చి తమ వైపు తిప్పుకున్నారు. ఫిరాయిపుదారుడిని వైస్ చైర్మన్ అభ్యర్థిగా నిలబెట్టి పదవి దక్కేలా చేశారు. ⇒ ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లో బలం లేకపోయినా రెండు డిప్యూటీ మేయర్ పదవులను టీడీపీ అక్రమంగా చేజిక్కించుకుంది. కేవలం ముగ్గురు మాత్రమే కార్పొరేటర్లున్న టీడీపీ రెండు డిప్యూటీ మేయర్ పదవులను గెలుచుకోవడాన్ని బట్టి ఆ పార్టీ ఏ స్థాయిలో అక్రమాలకు పాల్పడిందో అర్థం చేసుకోవచ్చు. ⇒ పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని ఒక్క కౌన్సిలర్ కూడా లేని టీడీపీ తన ఖాతాలో వేసుకోవడానికి విఫలయత్నం చేసింది. అక్కడున్న మొత్తం 33 మంది కౌన్సిలర్లు వైఎస్సార్సీపీకి చెందిన వారే. వైస్ చైర్మన్ ఎన్నిక కోసం వారంతా మున్సిపల్ కార్యాలయానికి వెళుతుంటే టీడీపీ నేతలు అడ్డుకున్నారు. గడువు లోపు వైఎస్సార్సీపీ అభ్యర్థి నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారు. దీంతో కమిషనర్ ఎన్నికను వాయిదా చేశారు. ⇒ కాకినాడ జిల్లా తుని మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని అడ్డగోలుగా తమ పరం చేసుకునేందుకు టీడీపీ యత్నించింది. అక్కడి 30 మంది కౌన్సిలర్లు వైఎస్సార్సీపీకి చెందిన వారే అయినా వారి తరఫు అభ్యర్థిని నామినేషన్ వేయకుండా పోలీసుల సాయంతో టీడీపీ నేతలు అడ్డుకున్నారు. ఇక్కడ కూడా కమిషనర్ ఎన్నికను వాయిదా వేశారు.డిప్యూటీ మేయర్ ఎన్నిక నిష్పాక్షికంగా జరిగేలా చూడండి సాక్షి, అమరావతి: తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక విషయంలో జిల్లా ఎస్పీకి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నిక నిష్పాక్షికంగా, ప్రశాంతంగా జరిగేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఎన్నిక జరిగే ఎస్వీ యూనివర్సిటీ, సెనెట్ హాల్ బయట కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలంది. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లకు పోలీస్ ఎస్కార్ట్ ఏర్పాటు చేయాలని ఎస్పీని ఆదేశించింది. ఈ మేరకు వైఎస్సార్సీపీ దాఖలు చేసిన అత్యవసర పిటిషన్‌పై హైకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. నందిగామ, పాలకొండపై కాగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ మున్సిపల్ చైర్పర్సన్ పదవిని భర్తీ చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ నాదెండ్ల హారిక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా.. పార్వతీపురం మన్యం జిల్లాలోని పాలకొండ నగర పంచాయతీ చైర్పర్సన్ ఎన్నిక నిమిత్తం జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఖాళీగా ఉన్న 19 వార్డుకు ముందు ఎన్నిక నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఎం.స్వర్ణకుమారి దాఖలు చేసిన వ్యాజ్యంపై తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేశారు. -
ముందు పరిషత్.. తర్వాత పంచాయతీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. రాజకీయ పార్టీల గుర్తులపై జరిగే మండల పరిషత్ (ఎంపీటీసీ), జిల్లా పరిషత్ (జెడ్పీటీసీ) ఎన్నికలను తొలుత నిర్వహించాలని.. అనంతరం పార్టీల గుర్తులు లేకుండా జరిగే గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలిసింది. మరోవైపు ఈ రెండింటినీ కొన్నిరోజుల అంతరంతో జరపాలనే ప్రతిపాదనతోపాటు.. వీలైతే సమాంతరంగా ఒకేసారి నిర్వహించాలనే ఆలోచన కూడా ఉ న్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పష్టత రాకున్నా.. తొలుత పరిషత్‌లకు, తర్వాత పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించే అవకాశమే ఎక్కువని అధికార వర్గాలు చెబుతున్నాయి. మంగళవారం ఉదయం జరిగే రాష్ట్ర కేబినెట్ భేటీ, తర్వాత నిర్వహించే శాసనసభ ప్రత్యేక సమావేశంలో స్థానిక ఎన్నికలకు సంబంధించి స్పష్టత వస్తుందని వివరిస్తున్నాయి. రిజర్వేషన్ల పెంపుపై తీర్మానం చేసి.. సమగ్ర కుటుంబ సర్వే, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు (ప్రస్తుతమున్న 28 శాతం నుంచి 42 శాతానికి), ఎస్సీ వర్గీకరణ నివేదిక తదితర అంశాలపై మంగళవారం కేబినెట్లో భేటీలో చర్చించి, నిర్ణయాలు తీసుకోనున్నారు. అనంతరం బీసీ రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో చర్చించి తీర్మానం చేస్తారు. అయితే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చూస్తే.. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కలుపుకొని 50శాతానికి మించకూడదు. కానీ రాష్ట్రంలోని ప్రత్యేక పరిస్థితులు, కులగణన, బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదికల ఆధారంగా బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి, ఆమోదం కోసం పార్లమెంటుకు పంపే అవకాశం ఉంది. అందులోనూ న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా పంచాయతీలు, మండలాలు, జిల్లాల్లో స్థానికంగా ఎస్సీ, ఎస్టీ, బీసీల జనాభాకు తగ్గట్టుగా రిజర్వేషన్లు కల్పించే అవకాశం కూడా ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ నెల 15లోగా షెడ్యూల్! స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ నెల 15వ తేదీలోగా షెడ్యూల్ విడుదల కానున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. రెండు వారాల్లో మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు.. తర్వాత వారం గడువిచ్చి గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తిచేయవచ్చని అంటున్నాయి. వచ్చే నెల మొదట్లో ఇంటర్ పరీక్షలు, 21 నుంచి టెన్త్ పరీక్షలు ఉన్నందున.. టెన్త్ పరీక్షలు మొదలయ్యేలోగా స్థానిక ఎన్నికల ప్రక్రియ ముగించాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. రాజకీయ పార్టీల గుర్తులపై ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి, వాటిని ఒక విడతలో ముగించాలని భావిస్తున్నట్టు తెలిసింది. గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా, అభ్యర్థులంతా స్వతంత్రులుగానే పోటీ చేసే విధానంలో జరుగుతాయి కాబట్టి.. వాటిని విడిగా నిర్వహించనున్నట్టు సమాచారం. పంచాయతీ ఎన్నికలను గతంలో మాదిరిగా మూడు విడతల్లో నిర్వహించి.. ఏ విడతకు ఆ విడతలో పోలింగ్ ముగిశాక సాయంత్రమే ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. 2018లో నిర్వహించిన విధంగానే ఈసారి కూడా బ్యాలెట్ పేపర్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలుత పార్టీ గుర్తులపై జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తే రాజకీయంగా ప్రయోజనకరంగా ఉంటుందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు పేర్కొన్న నేపథ్యంలో.. దీనివైపు మొగ్గుచూపుతున్నట్టు తెలిసింది. ఎంపీటీసీ స్థానాల పునర్విభజనపై సమీక్ష రాష్ట్రంలో మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ (ఎంపీటీసీ) స్థానాల పునర్విభజనకు సంబంధించి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ (పీఆర్ ఆర్డీ) అధికారులు చర్యలు చేపట్టారు. ఒక్కో మండలంలో కనీసం ఐదు ఎంపీటీసీ స్థానాలు ఉండేలా చూడటం, రాష్ట్రవ్యాప్తంగా కొన్ని గ్రామాలను సమీపంలోని మున్సిపాలిటీల్లో విలీనం చేసిన నేపథ్యంలో మార్పులు చేర్పులు, కొత్తగా ఏర్పడిన 34 మండలాల్లో ఎంపీటీసీ సీట్ల పునర్వ్యవస్థీకరణ తదితర అంశాలపై సోమవారం కసరత్తు పూర్తి చేశారు. జిల్లాల వారీగా పునర్విభజన (కార్వింగ్) చేసిన ఎంపీటీసీ స్థానాల వివరాలతో మండల పరిషత్ కార్యాలయాల్లో తుది జాబితాలను ప్రచురించారు. ఎన్నికల సంఘం కసరత్తు ముమ్మరం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న తీరుపై అన్ని జిల్లాల స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు (ఏసీఎల్బీ), ఇతర అధికారులతో రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్‌కుమార్ టెలీకాన్ఫరెన్స్, గూగుల్ మీట్లు నిర్వహించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి గ్రామ పంచాయతీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితాలు సిద్ధం చేయడం, గ్రామ పంచాయతీల మ్యాపింగ్, ఎంపీటీసీ స్థానాలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓటర్ల లెక్కలు, పోలింగ్ స్టేషన్ల గుర్తింపు, ఎన్నికలు జరిపేందుకు అందుబాటులో ఉన్న సిబ్బంది, బ్యాలెట్ బాక్స్‌లు, ఇతర రవాణా ఏర్పాట్లు, రిటర్నింగ్ అధికారుల (ఆర్వోల) నియామకం, ఆర్వోలు, సిబ్బందికి శిక్షణ, బ్యాలెట్ పేపర్ల ముద్రణ తదితర అంశాలపై సమీక్షించారు. -
Telangana: స్థానిక పోరుకు రెఢీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఫిబ్రవరి నెలాఖరులోగా లేదా మార్చి మూడో వారంలో ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు తెలిపాయి. మార్చి మొదటివారంలో ఇంటర్ పరీక్షలు, మార్చి 21 నుంచి పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. దీనితో వచ్చే నెల చివర్లోగానీ, ఆ రెండు పరీక్షల మధ్య సమయంలో (మార్చి 17, 18 నాటికి)గానీ ఎన్నికల ప్రక్రియ ముగించవచ్చని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వచ్చే నెల 5న కేబినెట్ భేటీ ఉంటుందని, స్థానిక ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకుంటారని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ కూడా తెలిపారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ మొదలైన నేపథ్యంలో స్థానిక ఎన్నికల ప్రక్రియ చేపట్టవచ్చా అన్న సందేహాలున్నా.. ఆ కోడ్ స్థానిక ఎన్నికలకు అడ్డుకాబోదని ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ ఒకరు అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించి.. స్థానిక ఎన్నికలకు సన్నాహాల్లో భాగంగానే సమగ్ర కుల సర్వే నివేదిక ఫిబ్రవరి 2న మంత్రివర్గ ఉప సంఘానికి చేరనుందని అధికారవర్గాలు తెలిపాయి. ఉప సంఘం ఆ నివేదికపై చర్చించి తగిన ప్రాధాన్యతాంశాలతో మంత్రివర్గానికి నివేదిక అందిస్తుందని వెల్లడించాయి. ఫిబ్రవరి 5న జరిగే కేబినెట్ భేటీలో ఉప సంఘం నివేదిక, బీసీ రిజర్వేషన్ల పెంపు, డెడికేటెడ్ కమిషన్ చేసిన సిఫార్సులపై చర్చించనున్నట్టు తెలిసింది. ఫిబ్రవరి 6 లేదా 7వ తేదీన అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ తీర్మానం చేసి, కేంద్రానికి పంపించనున్నట్టు సమాచారం. ఎంపీటీసీ స్థానాల డీలిమిటేషన్ ప్రక్రియ మొదలు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ), పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సన్నాహాలు మొదలుపెట్టాయి. రెవెన్యూ మండలాల పరిధి, స్థాయికి తగినట్టుగా మండల ప్రజాపరిషత్ (ఎంపీపీ)ల పునర్విభజన చేపట్టాలని జిల్లా కలెక్టర్లకు గురువారం పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి డీఎస్ లోకేశ్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఒక్కో ఎంపీటీసీ స్థానంలో 3వేల నుంచి 4 వేల మధ్య జనాభా ఉండేలా రూపకల్పన (కార్వింగ్) చేయాలని సూచించారు. 2011 జనాభా లెక్కలకు అనుగుణంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను ‘కార్వింగ్’ చేయాలని ఆదేశించారు. శుక్రవారం వరకు ఎంపీటీసీ స్థానాల ముసాయిదా ప్రచురించి.. శుక్ర, శనివారాల్లో అభ్యంతరాలకు గడువు ఇవ్వాలని.. శని, ఆదివారాల్లో వాటిని పరిష్కరించి 3వ తేదీన తుది ప్రచురణ చేయాలని సూచించారు. కొత్త జిల్లాలకు అనుగుణంగా జెడ్పీటీసీలు, రెవెన్యూ మండలాలకు తగ్గట్టుగా ఎంపీటీసీ స్థానాల పునర్విభజన ఉండాలని స్పష్టం చేశారు. మున్సిపాలిటీల్లో పంచాయతీల విలీనం వల్ల ఎంపీటీసీ స్థానాలు ప్రభావితమైన చోట, నిర్ణీత జనాభాకు మించి, లేదా తక్కువగా ఉన్నచోట పక్కనే ఉన్న స్థానాలతో సర్దుబాటు చేయడం, లేక కొత్త స్థానాలు ఏర్పాటు చేయడం వంటి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎన్నికల ఏర్పాట్లలో ఎస్ఈసీ.. స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వ నిర్ణయం కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఎదురుచూస్తోంది. తేదీలపై ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందిన వెంటనే నోటిఫికేషన్ విడుదల చేసి... రెండు, మూడు వారాల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ మేరకు ఏర్పాట్లు కూడా మొదలపెట్టినట్టు సమాచారం. ఎన్నికల నిర్వహణ కోసం బ్యాలెట్ పత్రాల ప్రింటింగ్‌కు ఏర్పాట్లతోపాటు సర్పంచ్ పదవికి 30దాకా, వార్డు మెంబర్లకు 20 దాకా వివిధ ఫ్రీసింబల్స్ (ఎన్నికల చిహ్నాలను) సిద్ధం చేసినట్టు జిల్లాల్లో అధికారులు చెబుతున్నారు. పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు, వివిధ శాఖల నుంచి నోడల్ అధికారుల నియామకం, బ్యాలెట్ బాక్స్‌లను సైతం సిద్ధం చేసుకోవడంలో నిమగ్నమైనట్టు చెబుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో పెంపు సాధ్యమేనా? బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచుతామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ సర్కారు ఇప్పుడు చర్యలు చేపట్టింది. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు అన్నీ కలిపి 50శాతం మించరాదని గతంలోనే సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో.. బీసీ రిజర్వేషన్ల పెంపు సాధ్యమేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నేరుగా 42 శాతం రిజర్వేషన్లు ప్రకటించడం కాకుండా... ఎక్కడికక్కడ పంచాయతీలు, మండలాలు, జిల్లా పరిషత్‌ల పరిధిలోని జనాభా ప్రామాణికంగా వేర్వేరుగా రిజర్వేషన్లు అమలు చేసే యోచన కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అంటే ఎస్సీ, ఎస్టీల జనాభా అధికంగా ఉన్నచోట బీసీలకు తక్కువగా, బీసీల జనాభా ఎక్కువగా ఉన్నచోట 42 శాతం దాకా రిజర్వేషన్లు ఇచ్చేలా ప్రయత్నం చేయవచ్చని అంటున్నారు. కానీ ఇది ఆచరణ సాధ్యమేనా అన్న సందేహాలు వస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీపరంగా స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం నుంచి 50 శాతం దాకా టికెట్లు ఇవ్వవచ్చనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. -
ఓటుకే భద్రత లేదు!
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల తంతు ప్రహసనంలా మారింది. ఈ జాబితాలో పేరు ఉండాలంటే ప్రతిసారి ఓటు హక్కు నమోదు చేసుకోవాలని చెబుతుండడం అందరికీ ఇబ్బంది అవుతోంది. వచ్చే ఏడాది మార్చి నెలలో ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు తాజాగా షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా, గతంలో ఓటుహక్కు వినియోగించుకున్న పట్టభద్రుల జాబితా లేదని, మళ్లీ కొత్తగా నమోదుకు చర్యలు చేపట్టింది. కొరిటెపాడు(గుంటూరు): ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని అర్హులైన పట్టభద్రులంతా సెప్టెంబర్ 30వ తేదీ నుంచి ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో తమ ఓటు నమోదు చేసుకోవాల్సి ఉంది. ఈ ఎన్నికలు జరిగే ప్రతిసారీ ఇలా ఓటు హక్కు నమోదు చేసుకోవాలంటే ఎలా అంటూ ఓటర్లు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు లేకపోయినా.. పట్టభద్రులైతే చాలు ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఎమ్మెల్సీకి పోటీ చేసే అభ్యర్థికి తొలి, ద్వితీయ, తృతీయ ప్రాధాన్య ఓట్ల ద్వారా కనీసం 50 శాతంపై అనుకూలంగా పడితేనే విజయం వరిస్తుంది. 3 లక్షలు దాటే అవకాశం ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని 2019 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2,48,799 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో కేవలం 1,14,325 (45.79 శాతం) మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. మార్చి 2025లో జరిగే పట్టభద్రుల ఎన్నికలకు సుమారు 3 లక్షల మందికిపైగా నమోదు చేసుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. నమోదు నిబంధనలు ఇవీ.. » ఈ ఎన్నికలు జరిగే నియోజకవర్గాల పరిధిలో ఏదైనా డిగ్రీ పూర్తి చేసినవారు మళ్లీ తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలి. » ఫాం 18 వినియోగించుకుని దరఖాస్తు అందించాలి. » సెపె్టంబర్ 30 నుంచి నవంబర్ 6వ తేదీ వరకు ఆన్లైన్లో, ఆఫ్‌లైన్‌లో నమోదుకు అవకాశం ఉంది. » ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే.. అధికారులు నేరుగా ఇంటి చిరునామాకు వచ్చి ధ్రువపత్రాలను పరిశీలిస్తారు. » ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే ఎలాంటి పరిశీలనా ఉండదు. » ఫాం 18లో వివరాలను తొలుత పూరించాలి. ఆధార్ కార్డు, డిగ్రీ సర్టిఫికెట్ నకలు, నివాస ధ్రువపత్రం సెట్‌గా చేసి మండల తహసీల్దార్, గ్రామ సచివాలయం, మీ సేవా కేంద్రాల్లో అందించవచ్చు. హక్కులను హరించినట్టే.. పట్టభద్రుల ఎన్నికలు జరుగుతున్న ప్రతిసారీ ఓటు నమోదు చేయించుకోమనడం సరికాదు. దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేయకుండా ఏకపక్షంగా ఉత్తర్వులు ఇవ్వడమంటే ప్రజల హక్కులను హరించినట్లే. గతంలో పట్టభద్రుల ఎన్నికల్లో ఓటు వేసిన వారిని కొత్తగా నమోదు నుంచి మినహాయించాలి. – తూము వెంకటేశ్వరరెడ్డి, బీకాం, గుంటూరు పునరాలోచన అవసరం పట్టభద్రుల ఓటు నమోదును గ్రామ సచివాలయాల్లో చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలి. ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ఓటు నమోదు పట్టభద్రులను అనుమానించడమేనని భావిస్తున్నాం. దీనిపై ఎన్నికల కమిషన్ పునరాలోచన చేయాలి.– ఎం.నరేంద్రరెడ్డి, బీఏ, గుంటూరు -
నేడు రాజకీయ పార్టీలతో ఎస్ఈసీ భేటీ
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వ హణకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) వేగం పెంచింది. రాష్ట్రంలోని 12,769 గ్రామపంచాయతీల పాలక మండళ్ల పదవీకాలం ముగిసి ఏడునెలలు దాటుతున్న నేప థ్యంలో ముందుగా పంచాయతీ ఎన్నికల నిర్వహ ణకు రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా శనివారం అన్ని రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారధి సమావేశం నిర్వహించనున్నారు. ఎన్ని కల నిర్వహణ తీరు, ఓటర్ల జాబితాల ఖరారు, పోలింగ్ స్టేషన్ల ఏర్పాట్లు.. తదితరాలపై పార్టీల నేతలకు స్పష్టతనివ్వనున్నారు. ఓటర్ల జాబితాల ఖరారు, పోలింగ్ స్టేషన్లు, ఇతర ఏర్పాట్లను సెప్టెంబర్ ఆఖరులోగా పూర్తిచేయాలని చూస్తున్నారు. ఓటర్ల జాబితాల ప్రచురణ ముగిశాక రాష్ట్ర ప్రభు త్వం నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల వివరాలు అందిన వెంటనే అదేరోజు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ఎస్ ఈసీ సన్నా హాలు చేస్తోంది.స్థానిక ఎన్నికల్లోనూ అన్నీ కలుపుకుని 50% రిజర్వేషన్లు మించరాదని సుప్రీంకోర్టు ఆదే శాలున్న విషయం తెలిసిందే. అయితే అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని మేనిఫెస్టోలో హామీనిచ్చింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థి తుల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు ఎలా సాధ్యమన్న విషయం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వపరంగా చేస్తున్న ఏర్పాట్లను బట్టి చూస్తే అక్టోబర్ చివర్లో లేదా నవంబర్ మొదట్లో గ్రామపంచాయతీ, కొన్నిరోజుల వ్యవధి తర్వాత మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. సెప్టెంబర్ 8న ఎస్ఈసీ పార్థ సారధి మూడేళ్ల పదవీకాలం ముగియ నుంది. అయితే ఇప్పటికే ఆయన ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రక్రియను మొదలుపెట్టినందున, ఆయన ఆధ్వర్యంలోనే ఎన్నికలు పూర్తి చేసేందుకు ప్రభుత్వం మొగ్గు చూపవచ్చని సమాచారం. -
ఈ సడలింపులు.. ‘పచ్చ’సిరాతో!
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల సందర్భంలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఒక నిబంధనావళి రూపొందించిందంటే అది దేశవ్యాప్తంగా అమలు జరగాలి. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో నిబంధన అంటూ ఏమీ ఉండదు. అలాగే, గత ఎన్నికల్లో లేని నిబంధన.. అదే విధంగా దేశంలో ఎక్కడాలేని నియమం ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే అమలు చేస్తున్నారంటే ఏమనుకోవాలి? పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు విషయంలో ఇప్పుడు రాష్ట్రంలో ఇదే జరుగుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు భిన్నంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన సడలింపులు ఇప్పుడు రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఎందుకంటే.. ఈ సడలింపులు టీడీపీ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ఉద్దేశపూర్వకంగా ఇచ్చిందని స్పష్టంగా తెలిసిపోతోంది కాబట్టి. గత ఎన్నికల్లో లేని సడలింపుల్ని.. పైగా ఇంకెక్కడా లేని మినహాయింపులను ఇక్కడే అమలుచేయడం.. అది కూడా టీడీపీ చెప్పింది చెప్పినట్లుగా రాష్ట్ర ఎన్నికల సంఘం తలూపుతూ చేయడం చూస్తుంటే.. రాష్ట్రంలో ఎన్నికల సంఘం.. టీడీపీ సంఘంలా వ్యవహరిస్తోందని కాక ఇంకేమనాలి?కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు భిన్నంగా..నిజానికి.. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫారంపై అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం చేసి, స్టాంప్ లేకపోయినా.. తన పేరు, డిజిగ్నేషన్ వివరాలను చేతితో రాస్తే ఆమోదించాలని గతేడాది జూలై 19న కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) మార్గదర్శకాలు జారీచేసింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఇవే మార్గదర్శకాలు అమలవుతున్నాయి. కానీ.. రాష్ట్రంలో టీడీపీ నేతల విజ్ఞప్తి మేరకు ఈ మార్గదర్శకాలను సడలిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్‌కుమార్ మీనా ఈనెల 25న ఉత్తర్వులు జారీచేశారు. అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం ఉంటే చాలు.. డిజిగ్నేషన్ పూర్తి వివరాలను చేతితో రాయకపోయినా సరే.. ఆ సంతకంపై ఏమైనా అనుమానం వస్తే రిటర్నింగ్ ఆఫీసర్ (ఆర్వో), జిల్లా ఎన్నికల అధికారి వద్ద ఉన్న సంబంధిత అటెస్టింగ్ అధికారి సంతకంతో సరిపోల్చుకుని పోస్టల్ బ్యాలెట్‌ను పరిగణనలోకి తీసుకునేలా సడలింపు ఇవ్వడంపై రాజకీయ పక్షాలు నివ్వెరపోతున్నాయి. ఎన్నికల సంఘం పచ్చపాతం మరోసారి బహిర్గతమైందని విమర్శిస్తున్నాయి. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు సందర్భంగా ఇది వివాదాలకు దారితీస్తుందని.. శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.మరీ ఇంత ‘పచ్చ’పాతమా?..పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ల వద్ద ఎన్నికల సంఘం ఏర్పాటుచేసిన అటెస్టింగ్ ఆఫీసర్లు కొంతమంది సీల్ వేయకుండా కేవలం సంతకాలు మాత్రమే చేశారని.. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని తమ ఓట్లను తిరస్కరించకుండా ఆమోదించేలా చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్‌కుమార్ మీనాకు టీడీపీ నుంచి పలు విజ్ఞాపనలు వచ్చాయి. వాటిని పరిగణనలోకి తీసుకున్న ఆయన.. 2023, జూలై 19న కేంద్ర ఎన్నికల సంఘం జారీచేసిన మార్గదర్శకాలను ఉటంకిస్తూ ఈనెల 25న ఉత్తర్వులు జారీచేశారు. వాటి ప్రకారం.. డిక్లరేషన్ ఫారం మీద అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం, పేరు, హోదా (డిజిగ్నేషన్) పూర్తి వివరాలు తప్పనిసరిగా ఉండాలి. ఇవి ఉండి స్టాంప్ లేకపోయినా వాటిని పరిగణనలోకి తీసుకోవచ్చు. ఈ నిబంధన దేశవ్యాప్తంగా అమలవుతోంది. కానీ.. అటెస్టింగ్ ఆఫీసర్ స్టాంప్ లేకపోయినా.. పేరు, డిజిగ్నేషన్ వివరాలను చేతితో రాయకపోయినా.. సంతకం ఉంటే చాలు.. దానిపై ఏమైనా అనుమానం వస్తే దాన్ని రిటర్నింగ్ ఆఫీసర్, జిల్లా ఎన్నికల అధికారి వద్ద ఉన్న సంబంధిత అటెస్టింగ్ ఆఫీసర్ సంతకంతో సరిపోల్చుకుని పోస్టల్ బ్యాలెట్‌ను పరిగణనలోకి తీసుకోవాలంటూ సడలింపు ఇవ్వడం గమనార్హం.పోస్టల్ బ్యాలెట్ ఆమోదానికి ఇతర నిబంధనలివీ..⇒ పోస్టల్ బ్యాలెట్ పేపర్ వెనుక రిటర్నింగ్ ఆఫీసరుగానీ లేదా ఫెసిలిటేషన్ సెంటర్ ఇన్‌ఛార్జి సంతకం తప్పనిసరిగా ఉండాలి. ⇒ బ్యాలెట్ పేపర్ వెనుక సంతకం విషయంలో ఏమైనా సందేహాలొస్తే సీరియల్ నెంబర్ ప్రకారం కౌంటర్ ఫైల్‌ను పరిశీలించి అది నిజమైన బ్యాలెట్ అవునా కాదా అని నిర్థారించుకోవాలి. ఒకవేళ సందేహం ఉంటే వాటిని తిరస్కరించాలి.⇒ ఓటరు కవర్–బీ మీద సంతకంలేదన్న కారణంతో కూడా ఓటును తిరస్కరించకూడదు. డిక్లరేషన్ ఫాం–13ఏ ప్రకారం ఓటరును గుర్తించవచ్చు. ఇవికాక.. బ్యాలెట్ పేపర్ ఉండే ఇన్నర్ కవర్ ఫారం–13బీని తెరవకుండానే ఈ సమయాల్లో ఓటును తిరస్కరించవచ్చు.⇒ కవర్–బీని తెరవగానే, ఓటరు డిక్లరేషన్ ఫారం లేకపోతే, డిక్లరేషన్ ఫారంపై గెజిటెడ్ లేదా అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం లేకపోయినా, ఫారం–13ఏ, ఫారం–13బీలో బ్యాలెట్ సీరియల్ నెంబర్లు వేర్వేరుగా ఉంటే బ్యాలెట్ పేపర్ తెరవకుండానే తిరస్కరించొచ్చు.⇒ ఈ విధానం అంతా పూర్తయి బ్యాలెట్ పేపరు తెరిచిన తర్వాత.. ఎవరికీ ఓటు వేయకపోయినా.. ఒకరి కంటే ఎక్కువ మందికి ఓటువేసినా.. అనుమానాస్పద బ్యాలెట్ పేపరుగా గుర్తించినా.. బ్యాలెట్ పేపరు చిరిగిపోయినా.. అది నిజమైన బ్యాలెట్ అని నిర్థారించడానికి అవకాశంలేని సమయంలో.. రిటర్నింగ్ ఆఫీసరు ఇచ్చిన కవర్–బీ లేకపోయినా.. ఓటరు ఎవరో గుర్తించే విధంగా ఏమైనా గుర్తులు, లేక రాతలున్న సందర్భాల్లో తిరస్కరింవచ్చు. -
TS: డూప్లికేట్ ఓట్లపై ఫోకస్.. ఈసీ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల వేళ ఎలక్షన్ కమిషన్ డూప్లికేట్ ఓట్లపై ఫోకస్ పెట్టింది. హైదరాబాద్ నగరంలో రికార్డు స్థాయిలో డూప్లికేట్ ఓట్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం గుర్తించింది. ఈ క్రమంలో తెలంగాణలో ఉన్న 33 లక్షల ఓటర్లను తొలగించింది. ప్రధానంగా హైదరాబాద్ జిల్లాలో 5 లక్షల డూప్లికేట్ ఓట్లు తొలగించినట్లు ఈసీ పేర్కొంది. హైదరాబాద్‌లో అత్యధికంగా జూబ్లీహిల్స్, చాంద్రాయణగుట్టలో డూప్లికేట్ ఓట్లు ఉన్నట్లు ఈసీ గుర్తించింది. ఇక.. రాష్ట్ర వ్యాప్తంగా గత రెండేళ్లలో 32.8 లక్షల మంది ఓటర్లను తొలగించినట్లు ఈసీ పేర్కొంది. మరోవైపు.. గత రెండేళ్లలో దాదాపు 60.6 లక్షల మంది కొత్త ఓటర్లు చేరినట్లు సీఈఓ వికాస్ రాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. జూబ్లీహిల్స్, చంద్రయాన్‌గుట్ట-61వేలు, ముషీరాబాద్, మలక్ పేట్- నాంపల్లి, బహదూర్‌పూర్‌లో 41వేల డూప్లికేట్ ఓట్లు, యాకుత్‌పురాలో-48 వేలు ఉన్నట్లు గుర్తించినట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ చెప్పారు. ఒక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే 53,000 షిఫ్టెడ్ ఓట్లు ఉన్నట్లు ఎన్నికల అధికారులు గుర్తించారు చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురాలో వరుసగా 59,289 ఓట్లు, 48,296 డూప్లికేట్ ఓట్లు గుర్తించామని ఎన్నికల సంఘం వెల్లడించింది. -
సార్వత్రిక ఎన్నికలు.. తొలిరోజు ప్రముఖుల నామినేషన్లు
Upadates తెలంగాణలో మల్కాజిగిరి లోక్‌సభ స్థానానికి భాజపా తరఫున మాజీ మంత్రి ఈటల రాజేందర్ నామినేషన్ వేశారు. నల్గొండ లోక్‌సభ బీజేపీ అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. భువనగిరి స్థానానికి ప్రజావాణి పార్టీ అభ్యర్థిగా లింగిడి వెంకటేశ్వర్లు రెండు సెట్ల నామినేషన్ పత్రాలను ఆర్వోకు అందజేశారు. సంగారెడ్డి జహీరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్ మొదటి సెట్ నామినేషన్ సురేష్ షెట్కార్ తరపున నామినేషన్ వేసిన కాంగ్రెస్ నాయకులు ఈ నెల 24న సురేష్ షెట్కార్ నామినేషన్ కార్యక్రమానికి హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ: డీకే అరుణ నామినేషన్ దాఖలు భారతీయ జనతా పార్టీ తరఫున నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన డీకే అరుణ కార్యక్రమంలో పాల్గొన్న రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి మహారాష్ట్ర నామినేషన్ సమర్పించిన సుప్రియా సూలే ఎన్సీపీ (శరద చంద్ర పవార్) పార్టీ సిట్టింగ్ ఎంపీ సుప్రియా సూలే నామినేషన్ దాఖలు చేశారు బారామతి స్థానంలో పోటీలో ఉన్నారు Maharashtra: NCP-SCP sitting MP and candidate from Baramati, Supriya Sule files her nomination papers. Sunetra Pawar, wife of Maharashtra Deputy CM Ajit Pawar has been fielded by NCP against NCP-SCP MP Supriya Sule from Baramati. pic.twitter.com/8uS99KwDTk — ANI (@ANI) April 18, 2024 తెలంగాణ నల్లగొండ లోక్ సభ స్థానంలో తొలి నామినేషన్ దాఖలు ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేసిన మాజీ ఐఏఎస్ చొల్లేటి ప్రభాకర్ బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి తరపున తొలి సెట్టు నామినేషన్ సమర్పించిన పార్టీ నేతలు తెలంగాణ కాసేపట్లో ప్రారంభం కానున్న నామినేషన్ల ప్రక్రియ నేడు తెలంగాణ బీజేపీ అభ్యర్థులు ఈటల రాజేందర్, డీకే అరుణ, రఘునందన్ రావు నామినేషన్ వేయనున్నారు నాలుగో విడత లోక్ సభ ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల ప్రక్రియ షురూ ఏపీ, తెలంగాణ సహ పది రాష్ట్రాలలో 96 ఎంపీ సీట్లకు నాలుగో విడతలో ఎన్నికలు ఏప్రిల్ 18 నుంచి నామినేషన్ల స్వీకరణ ఏప్రిల్ 25 నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ ఏప్రిల్ 26 నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 29 నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం మే 13న పోలింగ్ నాలుగో విడతలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిషా, ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పశి్చమబెంగాల్, బిహార్, జార్ఖండ్, ఢిల్లీ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి తెలంగాణలోని 17, ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ స్థానాలకు నాలుగో విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. The Gazette notification has been issued for the 4th phase of general elections. Polling will take place for 96 Lok Sabha seats across 10 states Andhra Pradesh, Bihar, Jharkhand, Madhya Pradesh, Maharashtra, Odisha, Telangana, Uttar Pradesh, West Bengal, and Jammu & Kashmir.… pic.twitter.com/xyjCS0xesf — ANI (@ANI) April 18, 2024 సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో విడత ఎన్నికల ప్రక్రియకు రంగం సిద్ధం అయ్యింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశంలోని 10 రాష్ట్రాల్లోని 96 లోక్‌సభ నియోజకవర్గాలకు మే 13న పోలింగ్ జరుగనుంది. గురువారం ఉదయం నాలుగో విడత ఎన్నికల ప్రక్రియకు గెజిట్ నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత ఈ విడతకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ 96 లోక్‌సభ స్థానాల్లో పోటీకి సిద్ధమయ్యే అభ్యర్థులకు ఏప్రిల్ 25 వరకు నామినేషన్లు దాఖలు చేసుకొనేందుకు అవకాశం కలి్పంచారు. 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 26 న జరుగనుంది. అనంతరం ఏప్రిల్ 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. కాగా నాలుగో విడతలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిషా, ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్, బిహార్, జార్ఖండ్, ఢిల్లీ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. తెలంగాణలోని 17, ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ స్థానాలకు నాలుగో విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ స్థానాలు, ఒడిషాలోని 28 అసెంబ్లీ నియోజకవర్గాలకు నాలుగో విడతలో పోలింగ్ జరుగనుంది. -
ఏపీలో కొనసాగుతున్న నామినేషన్ల ప్రక్రియ
Updates ఏలూరు జిల్లా : నూజివీడు బరిలో టీడీపీ రెబల్ అభ్యర్ధి ముద్రబోయిన వెంకటేశ్వరరావు స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసిన ముద్రబోయిన నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు అందజేసిన ముద్రబోయిన వెంకటేశ్వరరావు టీడీపీ నేత, మాజీ మంత్రి పరిటాల సునీతకు ఎదురు దెబ్బ రాప్తాడు నియోజకవర్గంలో ఇండిపెండెంట్ గా నామినేషన్ దాఖలు చేసిన టీడీపీ నేత ప్రొఫెసర్ రాజేష్ టీడీపీ రాప్తాడు ఎమ్మెల్యే, అనంతపురం ఎంపీ టిక్కెట్లు ఆశించి భంగపడ్డ ప్రొఫెసర్ రాజేష్ పరిటాల సునీత ఓటమే లక్ష్యంగా స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన టీడీపీ రెబల్ అభ్యర్థి రాజేష్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా... రామచంద్రపురం ఆర్డీఒ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసిన వైఎస్సార్సీపీ అభ్యర్థి పిల్లి సూర్య ప్రకాష్.... పిల్లి సూర్యప్రకాష్ రెండు సెట్లు నామినేషన్లు దాఖలు చేయగా, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఒక సెట్ నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారి సుధా సుధా సాగర్‌కు అందజేత. అనంతపురం ఆర్డీవో కార్యాలయంలో ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి తరపున ఒక సెట్ నామినేషన్ దాఖలు చేసిన వైఎస్సార్సీపీ నేతలు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో హిందూపురం పార్లమెంటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బోయ శాంత తరపున ఒక సెట్ నామినేషన్ దాఖలు అన్నమయ్య : రాజంపేటంలో అట్టహాసంగా వైఎస్సార్సీపీ అభ్యర్థి నామినేషన్ అసెంబ్లీ స్థానానికి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన అకేపాటి అమరనాథరెడ్డి సబ్ కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ సమర్పించిన అమరనాథరెడ్డి నామినేషన్ కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తిరుపతి కిలివేటి సంజీవయ్య నామినేషన్ దాఖలు సూళ్లూరుపేట రిటర్నింగ్ ఆఫీస్ కార్యాలయంలో మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేసిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కిలివేటి సంజీవయ్య హాజరైన ఎన్డీసిసిబి బ్యాంక్ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి, వైసీపీ నాయకుడు వేనాటి రామచంద్రారెడ్డి, కలికి మాధవరెడ్డి ఎన్టీఆర్ జిల్లా నామినేషన్ సమర్పించిన నల్లగట్ల స్వామిదాస్ తిరువూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆర్డీవో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించిన నల్లగట్ల స్వామిదాస్ కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ ఇన్చార్జ్ పూనూరు గౌతమ్ రెడ్డి తూర్పుగోదావరి తలారి వెంకట్రావు నామినేషన్ దాఖలు కొవ్వూరులో ఆర్డిఓ ఆఫీస్ వద్ద 10 వేలమంది పార్టీ కార్యకర్తలు అభిమానులతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తలారి వెంకట్రావు నామినేషన్ దాఖలు చేశారు నెల్లూరు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కర్నూలు జిల్లా నామినేషన్ వేసిన బుట్ట రేణుక ఎమ్మిగనూరులో పెద్ద ఎత్తున ర్యాలీతో బయలుదేరి తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసిన వైఎస్సార్సీపీ అభ్యర్థి బుట్ట రేణుక పాల్గొన్న ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, ఎంపీ అభ్యర్థి బీవై రామయ్య, వీరశైవ లింగాయత్ కార్పోరేషన్ చైర్మన్ రుద్ర గౌడ్ వైఎస్సార్ జిల్లా నామినేషన్ వేసిన రఘురామి రెడ్డి మైదుకూరు తహసిల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామి రెడ్డి పాల్గొన్న వైఎస్ అవినాష్ రెడ్డి , ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ తదితరులు భూమన అభినయ్ రెడ్డి నామినేషన్ దాఖలు తిరుపతి నియోజకవర్గం వైఎస్సార్సీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన భూమన అభినయ్ రెడ్డి అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి వెంట మేయర్ డాక్టర్ శిరీషా, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, స్టాండింగ్ కమిటీ సభ్యుడు వెంకటేష్ తదితరులతో కలిసి నామినేషన్ దాఖలు నామినేషన్ వేసిన పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లిలో అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ఆర్సిపి అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి నామినేషన్ దాఖలు చేసిన ఎం.సీ విజయనందరెడ్డి చిత్తూరులో అటహాసంగా నామినేషన్ దాఖలు చేసిన వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎం సి విజయనందరెడ్డి పాల్గొన్న డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఎంపీ రెడ్డప్ప, చంద్రగిరి అసెంబ్లీ అభ్యర్థి మోహిత్ రెడ్డి తదితరులు నామినేషన్ దాఖలు చేసిన కావలి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వైఎస్సార్సీపీ తరుఫున కావలి ఎమ్మెల్యే అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు ఏపీలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అయింది ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఈ నెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ, 26న పరిశీలన నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 29 వరకు గడువు కాసేపట్లో ప్రారంభం కానున్న నామినేషన్ ప్రక్రియ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు ఎన్నిక శ్రీశైలం వైఎస్సార్సీపీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న చక్రపాణిరెడ్డి ఎమ్మిగనూరు వైఎస్సార్సీపీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న బుట్టా రేణుక మంగళగిరి టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న లోకేష్ చిత్తూరు వైఎస్సార్సీపీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న విజయానందరెడ్డి దర్శి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న శివ ప్రసాద్‌రెడ్డి నాలుగో విడత లోక్ సభ ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల ప్రక్రియ షురూ ఏపీ, తెలంగాణ సహ పది రాష్ట్రాలలో 96 ఎంపీ సీట్లకు నాలుగో విడతలో ఎన్నికలు ఏప్రిల్ 18 నుంచి నామినేషన్ల స్వీకరణ ఏప్రిల్ 25 నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ ఏప్రిల్ 26 నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 29 నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం మే 13న పోలింగ్ నేటి నుంచే ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ప్రారంభం నేడు నాలుగో విడత లోక్ సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ షురూ ఏపీ, తెలంగాణ సహ పది రాష్ట్రాలలో 96 ఎంపీ సీట్లకు నాలుగో విడతలో ఎన్నికలు ఏప్రిల్ 18 నుంచి నామినేషన్ల స్వీకరణ ఏప్రిల్ 25 నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ ఏప్రిల్ 26 నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 29 నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం మే 13న పోలింగ్ ఏ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తున్నారు? ఏ జిల్లాలో ఎవరెవరు బరిలో ఉన్నారు? ఈ లింకు నొక్కండి. ఎన్నికల సమస్త సమాచారం ఒకచోట చూడండి. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు, 25 లోక్‌సభ స్థానాలకు గురువారం ఉ.11 గంటల నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. నాల్గవ దశ ఎన్నికల్లో భాగంగా మే 13న రాష్ట్రంలో జరిగే ఈ ఎన్నికలకు గురువారం కేంద్ర ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ జారీచేయనుంది. దీంతో ఈనెల 18 నుంచి ఏప్రిల్ 25 వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది. అతి కీలకమైన ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముఖేష్ కుమార్ మీనా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పార్లమెంట్ స్థానాలకు పోటీచేసే అభ్యర్థులు ఆయా కలెక్టరేట్లలో.. అసెంబ్లీ స్థానాలకు పోటీచేసే అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల ప్రధాన కేంద్రాల్లో ఎన్నికల కోడ్‌ను పాటిస్తూ నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుందన్నారు. నామినేషన్ల ప్రక్రియను పూర్తిగా రికార్డు చేసేందుకు నామినేషన్లు స్వీకరించే గదిలో అభ్యర్థులు ప్రవేశించే ద్వారాల వద్ద సీసీ కెమేరాలను ఏర్పాటుచేసినట్లు ఆయన తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో భాగంగా అభ్యర్థుల ఊరేగింపులను, నామినేషన్ల దాఖలు ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేస్తామన్నారు. ఈ క్రతువులో అభ్యర్థుల భవితవ్యాన్ని 4.10 కోట్ల మంది ఓటర్లు నిర్ణయించనున్నారు. ఇప్పటికే ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించడంతో తొలిరోజు నుంచే నామినేషన్ల దాఖలు ప్రక్రియ మొదలుకానుంది. వీటిని ఏప్రిల్ 26 వరకు పరిశీలించి, 29 వరకు ఉపసంహరణకు సమయమిస్తారు. మే 13న పోలింగ్ కాగా.. జూన్ 4 ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఉ.11 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ.. ఎన్నికల నోటిఫికేషన్ గురువారం జారీకాగానే నామినేషన్ల దాఖలు ప్రక్రియ వెంటనే ప్రారంభమవుతుంది. సంబంధిత అసెంబ్లీ లేదా లోక్‌సభ స్థానం రిటర్నింగ్ ఆఫీసు కార్యాలయంలో ఉ.11 గంటల నుంచి మ.3 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ప్రభుత్వం ప్రకటించిన సెలవు రోజుల్లో స్వీకరించరు. ఒక అభ్యర్థి గరిష్టంగా నాలుగు సెట్ల నామినేషన్లు వెయ్యొచ్చు. ఒక అభ్యర్థి ఏదైనా రెండు స్థానాల్లో మాత్రమే పోటీచేసే అవకాశముంది. ఎంపీ అభ్యర్థి అయితే ఫారం–2ఏ, ఎమ్మెల్యే అభ్యర్థయితే ఫారం–2బీ ఉపయోగించాల్సి ఉంటుంది. అభ్యర్థులు సువిధ యాప్ ద్వారా ఆన్లైన్లో నామినేషన్లు, అఫిడవిట్లను దాఖలు చేయవచ్చు. అయితే, వాటి కాపీలను భౌతికంగా ఆర్వోలకు అందజేయాల్సి ఉంటుంది. ఎన్నికల సంఘం గుర్తించిన రాజకీయ పార్టీల అభ్యర్థి కి స్థానికంగా ఉండే ఒక ఓటరు ప్రతిపాదన (ప్రపోజర్‌గా) సంతకం చేయాల్సి ఉంటుంది. అదే ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు 10 మంది ప్రతిపాదించాలి. ఒక ఓటరు ఎంతమంది అభ్యర్థుల కైన ప్రపోజ్ చేయడానికి ఎన్నికల సంఘం అనుమతించింది. నామినేషన్ దాఖలు సందర్భంగా ప్రతీ అభ్యర్థి కొన్ని కచ్చితమైన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. నామినేషన్ వేయడానికి వెళ్లే సమయంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి 100 మీటర్ల పరిధిలోనికి కేవలం మూడు వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. నామినేషన్ దాఖలు చేసేటప్పుడు రిటర్నింగ్ అధికారి గదిలోకి అభ్యర్థి తో కలిపి కేవలం ఐదుగురికి మాత్రమే అనుమతి ఉంటుంది. నామినేషన్లు దాఖలు చేసినప్పుడు ఫారం–ఏ, ఫారం–బీలు కూడా సమర్పించవచ్చు. లేకపోతే నామినేషన్ల చివరి రోజున 3 గంటలలోపు వీటిని సమర్పించాల్సి ఉంటుంది. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నామినేషన్ల స్వీకరణకు సంబంధించి హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటుచేశారు. ఫారం–26 తప్పనిసరి.. ఇక నామినేషన్ దాఖలుతోపాటు ఫారం–26 (అఫిడవిట్) కూడా అభ్యర్థులు విధిగా సమర్పించాలి. ఇది నామినేషన్ల చివరి తేదీ ఏప్రిల్ 25, మ.3 గంటల లోపు ఇవ్వొచ్చు. ఫారం–26 స్టాంప్ పేపర్ విలువ రూ.10 కంటే ఎక్కువ ఉండాలి. భౌతిక స్టాంప్ పేపర్ అందుబాటులో లేకపోతే ఈ–స్టాంప్ పేపర్ ఉపయోగించవచ్చు. ఫారం–26 అంటే.. పోటీచేసే అభ్యర్థులు తన కుటుంబసభ్యుల ఆస్తులు, అప్పులతోపాటు క్రిమినల్ కేసులు, న్యాయస్థానాల్లో విచారణలో ఉన్న అన్ని కేసుల వివరాలను పొందుపరచాల్సి ఉంటుంది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీకి చెందిన అభ్యర్థి అయితే ఆ పార్టీకి కేటాయించిన గుర్తును నామినేషన్ ఫారంలో రాయాలి. అదే ఇతర అభ్యర్థులైతే ఫ్రీ సింబల్స్ నుండి తనకు నచ్చిన మూడు గుర్తులను కోరుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ రిజిస్టర్ అయివుండి, గుర్తింపు పొందని పార్టీలు ఎన్నికల సంఘం నుండి కామన్ సింబల్ కేటాయించినట్లయితే ఆ గుర్తును నామినేషన్ ఫారంలో రాయాలి. నామినేషన్ రుసుం ఇలా.. పార్లమెంటు అభ్యర్థి అయితే రూ.25,000లు, అసెంబ్లీ అభ్యర్థి అయితే రూ. 10,000లు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఈ రుసుంలో 50 శాతం రాయితీ కల్పించారు. వీరు సామాజిక ధ్రువపత్రాన్ని విధిగా సమర్పించాల్సి ఉంటుంది. నామినేషన్ వేసిన తర్వాత ప్రతి అభ్యర్థి రిటర్నింగ్ అధికారి ముందు ప్రమాణం చేయాల్సి ఉంటుంది. ప్రతి అభ్యర్థి నామినేషన్‌తో పాటు లేటెస్ట్ పాస్‌పోర్టు సైజ్ ఫొటో (2 ్ఠ2.5 సెం.మీ) ఇవ్వాల్సి ఉంటుంది. నామినేషన్ వేసిన తరువాత అభ్యర్థి రశీదుతోపాటు స్కూృట్నీ తేదీ, సమయం.. నామినేషన్ ఉపసంహరణ తేదీ, సమయం.. గుర్తులు కేటాయించే తేదీ, సమయం తెలిపే నోటీసులను అధికారుల నుంచి తీసుకోవాలి. నామినేషన్ల దాఖలుకు అభ్యర్థులు 13 రకాల పత్రాలను తీసుకురావల్సి ఉంటుంది. నేటి నుంచి అభ్యర్థుల ఖర్చు కౌంట్ నామినేషన్ల పర్వం ప్రారంభైన నాటి నుంచి అంటే గురువారం నుంచే అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు పోటీచేసే అభ్యర్థుల ఖర్చును ఆయా అభ్యర్థుల ఖాతాలో నమోదు చేస్తారు. పత్రికల్లో వచ్చే పెయిడ్ న్యూస్, ప్రకటనలు, వార్తలను సైతం అభ్యర్థి ఖాతా కింద లెక్కిస్తారు. అసెంబ్లీ స్థానాలకు పోటీచేసే అభ్యర్థి రూ.40 లక్షల వరకు ఖర్చు పెట్టొచ్చు. అలాగే, ఎంపీ అభ్యర్థి రూ.95 లక్షల వరకు వ్యయం చెయ్యొచ్చు. అభ్యర్థుల ఖర్చును ఎప్పటికప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన నోడల్ అధికారులు పర్యవేక్షిస్తారు. అభ్యర్థులు ఎన్నికల వ్యయానికి ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాను తెరవాలి. ముఖ్యమైన తేదీలు నామినేషన్ల దాఖలు చివరి తేదీఏప్రిల్ 25 గురువారం ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ జారీ ఏప్రిల్ 18 గురువారం నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 26 శుక్రవారం నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ ఏప్రిల్ 29 సోమవారం పోలింగ్ తేదీ మే 13 సోమవారం ఓట్ల లెక్కింపు జూన్ 4 మంగళవారం ఎన్నికల ప్రక్రియ ముగింపు తేదీజూన్ 6 గురువారం -
‘గురి తప్పలేదు అంటే..’ దాడిపై సజ్జల అనుమానం
-
సీఎం జగన్‌పై హత్యాయత్నం ఘటన: ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనపై వైఎస్సార్సీపీ నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. సీఈఓతో వైఎస్సార్సీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మల్లాది విష్ణు సహా వైస్సార్సీపీ నేతలు భేటీ అయ్యారు. సీఎం వైఎస్ జగన్‌పై జరిగిన దాడి వెనుక కుట్ర కోణం ఉందని ఈసీకీ వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘సీఎం జగన్‌పై జరిగిన దాడి ఘటనపై ఈసీకి ఫిర్యాదు చేశాం. సీఎం జగన్ ఎడమ కన్నుపై దాడి జరిగింది. ఈ ఘటనను ప్రధాని మోదీ సహా అందరూ ఖండించారు. రాజకీయాలకు అతీతంగా పలు రాష్ట్రాల నేతలు కూడా ఖండించారు. విపక్ష నేతలు రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారు. దాడిపై ఘటనపై టీడీపీ నేతల వ్యాఖ్యలు హేయమైనవి. దాడిలో పవర్ఫుల్ ఆయుధం వాడారు. షార్ప్ షూటర్‌తో దాడి చేసినట్లు ఉంది. చంద్రబాబు రెచ్చగొట్టే విధంగా మాట్లడుతున్నారు. రాజకీయాల్లో ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. చంద్రబాబు, టీడీపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా.. నియంత్రించాలని ఈసీని కోరాం. ఈ దాడి పథకం ప్రకారమే జరిగినట్టు స్పష్టం అవుతోంది. దాడికి ఉపయోగించిన ఆబ్జెక్ట్ చాలా వేగంతో సీఎం జగన్ కంటిపై తగిలి వెల్లంపల్లి కంటికి తగిలింది. కొంచెం ఉంటే వెల్లంపల్లి కన్నుపోయేది’ అని సజ్జల అన్నారు దాడికి సంబంధించి ఎన్నికల సంఘానికి ఇచ్చిన ఫిర్యాదు.. ఇక్కడ క్లిక్ చేయండి చదవండి: సీఎం జగన్‌పై హత్యాయత్నం ఘటనపై కేసు నమోదు -
పార్టీల శాశ్వత కార్యాలయాల్లో హోర్డింగులు తొలగించొద్దు
సాక్షి, అమరావతి: రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో శాశ్వత ప్రాతిపదికన ఉన్న రాజకీయ పార్టీల కార్యాలయాల్లో హోర్డింగులను కొనసాగించవచ్చని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టంచేశారు. స్థానిక చట్టాలు, అనుమతుల మేరకు ప్రస్తుతం ఉన్న రాజకీయ ప్రకటనల హోర్డింగులను కొనసాగించాలని జిల్లా ఎన్నికల అధికారులను ఆయన ఆదేశించారు. రాష్ట్ర సచివాలయం నుంచి బుధవారం ఆయన అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖేష్‌కుమార్ మీనా మాట్లాడుతూ మంగళవారం అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం సందర్భంగా పార్టీల శాశ్వత కార్యాలయాల్లో హోర్డింగులను తొలగించడంతోపాటు పలు సమస్యలను తమ దృష్టికి తీసుకువచ్చాయని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తాత్కాలిక ప్రాతిపదికన ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాల్లో 4గీ8 అడుగుల బ్యానర్, ఒక జెండాను అనుమతించాలని అధికారులకు చెప్పారు. రాజకీయ పార్టీల కార్యక్రమాలకు ముందస్తు అనుమతి తప్పనిసరని, అయితే ఇందుకు 48 గంటల ముందుగా సువిధా పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉందన్నారు. అత్యవసర పరిస్థితిల్లో రాజకీయ పార్టీల నుంచి ఆఫ్‌లైన్ ద్వారా కూడా దరఖాస్తులను స్వీకరించి, ఆ వివరాలను ఎన్కోర్ పోర్టల్‌లో నమోదుచేసి సకాలంలో తగిన అనుమతులను జారీచేయాలని సూచించారు. ఇంటింటి ప్రచారంపై త్వరలో నిర్ణయం ముందుగా అనుమతి పొందిన తర్వాతే అభ్యర్థులు ఇంటింటి ప్రచారానికి వెళ్లాలనే నిబంధన సరికాదని, దానిని పునఃసమీక్షించాలని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు కోరారని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఈ నిబంధన అమలు విషయంలో భారత ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. ఈ అంశంపై త్వరలోనే సరైన నిర్ణయం తీసుకుంటామన్నారు. అదేవిధంగా రాజకీయ పార్టీల ప్రకటనలకు సంబంధించి భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలతోపాటు ఆంధ్రప్రదేశ్ పురపాలక చట్టం, స్థానిక సంస్థల చట్టం, జీవీఎంసీ చట్టాలను పరిగణనలోకి తీసుకుని అనుమతులు మంజూరు చేయాలని జిల్లా ఎన్నికల అధికారులకు సూచించారు. నిబంధనల మేరకు ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన వాణిజ్య స్థలాలతోపాటు కార్యాలయాల్లో కూడా ఎటువంటి రాజకీయ ప్రకటనలు, హోర్డింగులు, పోస్టర్లు, బ్యానర్లను అనుమతించవద్దని స్పష్టంచేశారు. ప్రస్తుతం జాతీయ, ప్రధాన రహదారుల పక్కన ఉన్న హోర్డింగులను అన్ని రాజకీయ పార్టీలకు సమాన ప్రాతిపదికన కేటాయించాలని, నూతన హోర్డింగులకు అనుమతి ఇవ్వొద్దని చెప్పారు. ప్రైవేటు భవనాలపై వాల్ పెయింట్లకు అనుమతిలేదని, ఇప్పటికే ఉన్నవాటిని వెంటనే చెరిపించేయాలన్నారు. సమావేశంలో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, అదనపు సీఈవోలు పి.కోటేశ్వరరావు, ఎంఎన్ హరీంధరప్రసాద్, జాయింట్ సీఈవో ఎ.వెంకటేశ్వరరావు, డిప్యూటీ సీఈవోలు కె.విశ్వేశ్వరరావు, ఎస్.మల్లిబాబు తదితరులు పాల్గొన్నారు. -
AP: ESMSపై కొనసాగుతున్న శిక్షణ కార్యక్రమం
సాక్షి, విజయవాడ: ఎన్నికల నిర్బంధ నిర్వహణ వ్యవస్థ వినియోగంపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయంలో ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలకు ఇస్తున్న శిక్షణా కార్యక్రమం కొనసాగుతోంది. రాష్ట్రంలో త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో ప్రేరేపిత రహిత ఎన్నికల పర్యవేక్షణను పెంపొందించేందుకు భారత ఎన్నికల సంఘం ఈ ‘ఎన్నికల నిర్బంధ నిర్వహణ వ్యవస్థ’ను (Election Seizure Management System - ESMS) రూపొందించింది. దీని వినియోగంపై ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయంలో శిక్షణ కార్యక్రమం కొనసాగుతోంది. 2023 డిసెంబర్లో చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరాం, రాజస్థాన్. తెలంగాణ రాష్ట్రాలకు జరిగిన సాధారణ ఎన్నికల్లో తొలిసారి ఈ వ్యవస్థను విజయవంతంగా వినియోగించారు. ఆ అనుభవంతో త్వరలో ఎన్నికలు జరుగునున్న రాష్ట్రాల్లో కూడా ఈ విధానాన్ని అమలుపరిచేందుకు భారతీయ ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది అనేక రకాల రాష్ట్ర, కేంద్ర ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల ద్వారా ఫీల్డ్ నుంచి వచ్చే సీజర్లపై (నిర్బంధములపై ) నిజ-సమయ నవీకరణల కోసం ఉపయోగించే ఒక సాంకేతిక వేదిక. ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల మధ్య అంతరాయం లేని సమన్వయం, గూఢచార భాగస్వామ్యాన్ని నిర్ధారించడం ఈ వ్యవస్థ ప్రధాన లక్ష్యం. భారతీయ ఎన్నికల సంఘం నుంచి వచ్చిన అధికారుల బృందం కర్ణాటక రాష్ట్రంలో ఇస్తున్న శిక్షణా కార్యక్రమాన్ని వెబ్ లింకు ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులు, జిల్లా ఎన్నికల అధికారులు, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల నోడల్ అధికారులు. పరిశీలిస్తున్నారు. ఈ శిక్షణా కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా, అదనపు సీఈవో పి. కోటేశ్వరరావు తదితరులతో పాటు పోలీస్, ఎక్సైజ్, ఇన్కమ్ టాక్స్, వాణిజ్య, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో తదితర ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల అధికారులు పాల్గొన్నారు. -
ఇక ‘పంచాయతీ’ సమరం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమౌతోంది. ప్రస్తుత గ్రామ పంచాయతీ పాలకమండళ్ల పదవీకాలం ఫిబ్రవరి 1తో ముగియనున్న నేపథ్యంలో.. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సన్నాహాల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) నిమగ్నమైంది. రాజ్యాంగం ప్రకారం పంచాయతీరాజ్ (పీఆర్) సంస్థల ఐదేళ్ల పదవీకాలం ముగియడానికి ముందే, నూతన తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం పీఆర్ సంస్థల టర్మ్ ముగియడానికి మూడు నెలల ముందే ఎన్నికలు పూర్తిచేయాల్సి ఉంటుంది. దీంతో జనవరిలో లేదా ఫిబ్రవరిలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అనుమతినివ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల షెడ్యూల్‌తో సహా ప్రతిపాదనలు పంపించనున్నట్టు ఎస్ఈసీ వర్గాలు వెల్లడించాయి. దాదాపు నెల రోజుల పాటు ఈ ఎన్నికల ప్రక్రియ సాగనుంది. అయితే వచ్చే మార్చి, ఏప్రిల్‌లలో లోక్‌సభ ఎన్నికలు జరిగే అవకాశాలుండటం, ఆ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు చేయాల్సి ఉన్నందున ఈలోగా రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదనే వాదన కూడా వినిపిస్తోంది. కొత్త సర్కార్ కుదరదంటుందా? పంచాయతీ ఎన్నికల తేదీలపై తుది నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిది కావడంతో, వెంటనే మరో ఎన్నికల సమరానికి కొత్త ప్రభుత్వం మొగ్గు చూపక పోవచ్చుననే అభిప్రాయాన్ని ఉన్నతాధికారులు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ తన ఎన్నికల ప్రణాళికలో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతామని, ఉప కులాల వారీగా కూడా రిజర్వేషన్లు ఇస్తామని, ఆరు నెలల్లో దీనికి సంబంధించి బీసీ కమిషన్ నివేదిక తెప్పించుకున్నాక తదుపరి చర్యలు చేపడతామని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వకుళాభరణం కృష్ణమోహన్ నేతృత్వంలోని బీసీ కమిషన్ విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సిఉంది. అయితే ఈ ప్రక్రియ పూర్తవడానికి కొంత సమయం పట్టొచ్చునని అంచనా వేస్తున్నారు. వరుసగా జీపీ, ఎంపీపీ, జెడ్పీపీ, మున్సిపల్ పోల్స్ రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా తొలుత గ్రామ పంచాయతీ (జీపీ), ఆ తర్వాత కొన్ని నెలలకే మండల, జిల్లా ప్రజా పరిషత్ (ఎంపీపీ, జెడ్పీపీ), మరికొన్ని నెలల తర్వాత మున్సిపల్ ఎన్నికలు జరగాల్సి ఉంది. జీపీ ఎన్నికల నిర్వహణకు రిటర్నింగ్ ఆఫీసర్లు, పోలింగ్ సిబ్బంది ఎంపిక, నియామకం అనేది కీలకమైన నేపథ్యంలో ఈ నెల 30 లోగా దీనికి సంబంధించిన కసరత్తు పూర్తి చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్లను ఎస్ఈసీ ఆదేశించింది. ఈ ప్రక్రియకు సంబంధించి అనుసరించాల్సిన విధానంపై, ఈ ఎన్నికల నిర్వహణపై శిక్షణ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లకు ఎస్ఈసీ కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్ సర్క్యులర్ పంపించారు. పోలింగ్ బూత్‌లలో 200 మంది ఓటర్లకు ఒక ప్రిసైడింగ్ అధికారి, ఒక పోలింగ్ అధికారిని నియమించాలని సూచించారు. 201 నుంచి 400 ఓటర్ల దాకా ఒక ప్రిసైడింగ్ అధికారి, ఇద్దరు పోలింగ్ అధికారులను, 401 నుంచి 650 వరకు ఓటర్లకు ఒక ప్రిసైడింగ్ అధికారి, ముగ్గురు పోలింగ్ అధికారులను నియమించాలని తెలిపారు. ఏదైనా వార్డులో ఓటర్ల సంఖ్య 650 దాటితే రెండు పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. గతంలో మాదిరిగా ప్రతి జిల్లాలో మూడు విడతలుగా ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ ఏర్పాట్లు చేస్తున్నందున, మొదటి దశలో ఎన్నికలు నిర్వహించిన రిటర్నింగ్, ప్రిసైడింగ్, పోలింగ్ ఆఫీసర్ల సేవలను మూడో దశ ఎన్నికల నిర్వహణకు ఉపయోగించుకోవాలని సూచించారు. -
తర్వరలోనే పంచాయతీ పోరు.. ఏర్పాట్లకు ఆదేశించి రాష్ట్ర ఎన్నికల సంఘం!
నల్లగొండ: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. 2024 ఫిబ్రవరి 1తో గ్రామ పంచాయతీ పాలక వర్గాల పదవీ కాలం పూర్తి కానుంది. పదవీ కాలం ముగిసే మూడు మాసాల ముందుగానే ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నందున అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలకు సంబంధించి రిటర్నింగ్, ప్రిసైడింగ్, పోలింగ్ అధికారులను నియమించాలని సూచించింది. డిసెంబరు 30లోగా ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారులు, సిబ్బంది నియామకంతో పాటు ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి, నివేదికలు పంపించాలని కలెక్టర్లను ఆదేశించింది. దీంతో జిల్లాలో కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారులు దీనికి సంబంధించిన ఏర్పాట్లపై దృష్టి సారించారు. మూడు నెలల ముందుగానే నిర్వహించాలి.. జిల్లాలో గతంలో 844 గ్రామ పంచాయతీలుండగా, వాటి ఫరిధిలో మొత్తం 7,440 వార్డులు ఉన్నాయి. అయితే ఈ పాలకవర్గాల పదవీ కాలం 2024 పిబ్రవరి 1తో ముగియనుంది. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం పదవీ కాలం ముగిసే మూడు మాసాల ముందుగానే ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నందున ఎన్నికల సంఘం బుధవారం గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పూనుకుంది. అందుకు సంబంధించి డిసెంబర్ 30లోగా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. అయితే జిల్లాలోని నకిరేకల్ మండలంలోని 7 గ్రామ పంచాయతీలు మొదట మున్సిపాలిటీలో చేరాయి. తర్వాత కోర్టు ఆదేశాలతో తిరిగి గ్రామ పంచాయతీలుగా మారాయి. అప్పట్లో వాటి పదవీ కాలం పూర్తయిన తర్వాత తిరిగి ఎన్నికలు నిర్వహించలేదు. ప్రస్తుతం ఆ గ్రామ పంచాయతీలు కలుపుకుని మొత్తం 844 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. పంచాయతీ ఎన్నికలకు క్లస్టర్ల ఏర్పాటు పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కొన్ని గ్రామాలను కలుపుకుని క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నారు. ఆయా క్లస్టర్ల పరిధిలో స్టేజీ1, స్టేజీ2 అధికారులను నియమించనున్నారు. స్టేజీ 1 పరిధిలో అధికారులంతా నామినేషన్ల ప్రక్రియ పూర్తి చేయనుండగా స్టేజీ 2 పరిధిలోని అధికారులు ఎన్నికల నిర్వహణను పూర్తి చేయనున్నారు. ప్రతి వార్డు ఒక నియోజకవర్గం గ్రామ పంచాయతీల్లోని ప్రతి వార్డును ఒక నియోజక వర్గంగా ఏర్పాటు చేయనున్నారు. ఆయా వార్డుల్లో ఓటర్లను బట్టి పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. 650 మంది ఓటర్లుంటే రెండు పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. 200 మంది ఓటర్లకు ఒక పోలింగ్ స్టేషన్ 200 మంది ఓటర్లకు ఒక పోలింగ్ స్టేషన్ చొప్పున ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం సూచించింది. అందుకు పోలింగ్ నిర్వహణకు ఒక ప్రిసైడింగ్ అధికారి, ఒక పోలింగ్ అధికారిని నియమించాలి. అలాగే 201 నుంచి 400 ఓటర్ల వరకు ఒక ప్రిసైడింగ్ అధికారి, ఇద్దరు పోలింగ్ అధికారులు, 401 నుంచి 650 ఓటర్లకు ఒక ప్రిసైడింగ్ అధికారి, ముగ్గురు పోలింగ్ అధికారులను నియమించాల్సి ఉంటుంది. వీరందరికి ఎన్నికలకు సంబంధించిన శిక్షణను కూడా ఇవ్వాలి. ఎన్నికల నిర్వహణకు ఎంత మంది అధికారులు, సిబ్బంది అవసరమో, దానిపై 20 శాతం సిబ్బందిని అదనంగా తీసుకుని రిజర్వులో ఉంచేలా అధికారులు, సిబ్బందిని ఎంపిక చేయాలని సూచించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విధులు నిర్వహించిన ఉద్యోగులకు సంబంధించి జాబితా తీసుకుని అందులో అవసరమైన వారిని గుర్తించాలని సూచించింది. డిసెంబరు 30వ తేదీలోగా ఎన్నికల నిర్వహణకు సంబంధించి సిబ్బంది అందరిని గుర్తించి ఆ డేటాను టీపోల్ అప్లికేషన్ ద్వారా అప్లోడ్ చేయాలని సూచించింది. మూడు దశల్లో ఎన్నికలు జిల్లాలో ఉన్న 844 గ్రామ పంచాయతీలకు సంబంధించి మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆయా జిల్లాల్లో మొదటి విడత కొన్ని గ్రామ పంచాయతీలకు, రెండో విడత మరికొన్ని, మూడో విడత మిగిలిన గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించే విధంగా ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు. అయితే ఎన్నికల ముసాయిదా జాబితాను సిద్ధం చేసుకోవాలని సూచించారు. అధికారుల నియామకం విషయంలో వారి స్థాయిని బట్టి చూసుకోవాలని ఆదేశించింది. అయితే ఎన్నికలు మూడు దశల్లో జరుగుతున్నందున మొదటి గ్రామ పంచాయతీ స్టేజీ 1 రిటర్నింగ్ అధికారులు, ప్రీసైడింగ్ అధికారులు, పోలింగ్ అధికారులు మూడు దశల్లో ఎన్నికలకు ముసాయిదాలు సిద్ధం చేయాల్సి ఉంది. ఈ మూడు దశలకు సంబంధించి ర్యాండమైజేషన్ పద్ధతిలో పోలింగ్ సిబ్బందిని గుర్తించాలని ఆదేశించింది. దీంతో జిల్లా యంత్రాంగం అందుకు అవసరమైన ఏర్పాట్లపై దృష్టి సారించింది. -
వినిపిస్తోందా.. మూడో స్వరం
ప్రజాస్వామ్య సౌధమైన శాసనసభలో మూడో స్వరం వినిపించేందుకు ట్రాన్స్జెండర్లు ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. వరంగల్ తూర్పు సెగ్మెంట్ నుంచి బీఎస్పీ అభ్యర్థి గా పోటీ చేసేందుకు రామన్నపేటకు చెందిన చిత్రపు పుష్పిత లయకు తాజాగా అవకాశం లభించగా, గత ఎన్నికల్లో గోషామహల్ నుంచి బీఎల్ఎఫ్ అభ్యర్థి గా పోటీ చేసిన చంద్రముఖి కూడా ఈసారి ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇక ట్రాన్స్జెండర్లతో పాటు ప్రజల్లో ఓటు అవగాహనకు రాష్ట్ర ఎన్నికల ప్రచార కర్తగా వరంగల్‌కు చెందిన ట్రాన్స్‌జెండర్ లైలాను రాష్ట్ర ఎన్నికల కమిషన్ నియమించింది. ఆమె తమ కమ్యూనిటీ వారు ఓటు నమోదు చేసుకునేందుకు అవగాహన కలిగిస్తున్నారు. – సాక్షిప్రతినిధి, వరంగల్/హైదరాబాద్ రాష్ట్రంలో సుమారు 50 వేల మందికి పైగా ట్రాన్స్జెండర్లు ఉన్నట్లు స్వచ్చంద సంస్థలు అంచనా వేస్తున్నాయి. కానీ ఓటర్లుగా నమోదైన వారి సంఖ్య మాత్రం చాలా తక్కువగా ఉంది. ట్రాన్స్జెండర్ల పట్ల సమాజం నుంచి ఎదురయ్యే వివక్ష, అవమానాలు, వేధింపుల కారణంగానే చాలామంది ‘మగవారు’గానే మనుగడ కొనసాగిస్తున్నట్టు ఆయా సంస్థలు చెబుతున్నాయి. అన్ని జీవన సమూహాల్లాగే ట్రాన్స్జెండర్లు కూడా స్వేచ్ఛా యుతమైన జీవనాన్ని కొనసాగించే హక్కును కలిగి ఉన్నట్లు గతంలో వెలువరించిన సుప్రీంకోర్టు తీర్పు వారికి గొప్ప ఆత్మస్థైర్యాన్ని కలిగించింది. మరోవైపు వివిధ స్వచ్చంద సంస్థలు, ప్రజాసంఘాలు, హక్కులసంఘాల నుంచి వారికి సంపూర్ణమైన మద్దతు, అండదండలు లభించాయి. దీంతో ట్రాన్స్ జెండర్లు సంఘటితమయ్యారు. తమ ఉనికిని బలంగా చాటుకొనేందుకు ఎన్నికలను ఒక అస్త్రంగా మలుచుకున్నారు. తీవ్రమైన వివక్ష, అణచివేతకు గురవుతున్న ట్రాన్స్జెండర్ల అస్తిత్వాన్ని చాటుకొనేందుకు, ఆకాంక్షలనువెల్లడించేందుకు చట్టసభలను వేదికగా చేసుకోవాలని భావిస్తున్నట్లు చిత్రపు పుషి్పత లయ, చంద్రముఖి చెబుతున్నారు. బీఎస్పీ కార్యకర్త నుంచి అభ్యర్థిగా చిత్రపు పుష్పిత లయ ప్రస్థానం వరంగల్ రామన్నపేటకు చెందిన చిత్రపు పుష్పిత లయ బీఎస్పీ పార్టీ కార్యకర్తగా ఢిల్లీలో ఐదేళ్లు పనిచేశారు. ఆ తర్వాత డాక్టర్ అంబేడ్కర్ అసోసియేషన్ మహిళా అధ్యక్షురాలిగా పనిచేశారు. రెండేళ్ల నుంచి వరంగల్ తూర్పు బీఎస్పీ నియోజకవర్గ ఇన్చార్జ్గా పనిచేస్తున్నారు. అసెంబ్లీలో అడుగు పెట్టేందుకు ట్రాన్స్జెండర్ల తరఫున తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈసారి స్వతంత్ర అభ్యర్థి గా చంద్రముఖి ట్రాన్స్జెండర్ల అస్తిత్వాన్ని చాటుకొనేందుకు మరోసారి ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్టు మువ్వల చంద్రముఖి వెల్లడించారు. భరతనాట్య కళాకారిణి. వ్యాఖ్యాత, సినీనటి అయిన చంద్రముఖి దశాబ్దకాలంగా ట్రాన్స్‌జెండర్స్ హక్కుల కోసం పోరాడుతున్నారు. ప్రజాస్వామ్య సౌధంలో మూడోస్వరాన్ని వినిపించేందుకే 2018లో ట్రాన్స్జెండర్ల ప్రతినిధిగా, బీఎల్ఎఫ్ అభ్యర్థి గా గోషామహల్ నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆమెకు 1125 ఓట్లు లభించాయి. ఈ సారి మాత్రం స్వతంత్ర అభ్యర్థిగా నిలబడాలనుకుంటున్నట్లు చెప్పారు. ఏ నియోజకవర్గం నుంచి అనేది ఇంకా నిర్ణయించుకోలేదన్నారు. ఎన్నికల ప్రచారకర్తగా లైలా.. మహబూబాబాద్ జిల్లాలోని అన్నారం గ్రామానికి చెందిన లైలా అలియాస్ ఓరుగంటి లక్ష్మణ్ డిగ్రీ చదువుకునే రోజుల్లో హిజ్రావైపు మళ్లారు. పూర్తిస్థాయి ట్రాన్స్‌జెండర్‌గా మారి డబుల్ పీజీ కూడా చేశారు. 20 ఏళ్ల నుంచి మ్యారీ అనే స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో హెచ్ఐవీ ప్రాజెక్ట్‌లో హెల్త్ వర్కర్‌గా పనిచేస్తూ వరంగల్‌లో ఉంటున్నారు. రాష్ట్ర హిజ్రాల వెల్ఫేర్ సంఘం సభ్యురాలుగా కూడా ఎన్నికయ్యారు. వారి కమ్యూనిటీ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రస్థాయిలో కృషి చేస్తున్నారు. ఈమె సేవలను గుర్తించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ ఏడాది సెపె్టంబర్ 19వ తేదీన ఎన్నికల ప్రచారకర్త (అంబాసిడర్)గా నియమించడం విశేషం. -
ప్రగతి భవన్‌కు ఎన్నికల సంఘం నోటీసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారనే ఫిర్యాదు మేరకు నోటీసులు జారీ అయినట్లు తెలుస్తోంది. ప్రగతి భవన్ సీఎం అధికారిక భవనం. అయినప్పటికీ.. అందులో బీఆర్ఎస్ తన కార్యక్రమాలు నిర్వహిస్తుస్తోంది అని ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై తదుపరి చర్యల్లో భాగంగా అధికారులు గురువారం సుదీర్ఘంగా చర్చించారు. గురువారం సాయంత్రం సీఈవో వికాస్ రాజ్‌తో హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ భేటీ అయ్యారు. ఈ ఫిర్యాదులో ఎవరికి నోటీసులు ఇవ్వాలనే దానిపై చర్చలు జరిపారు. చివరకు.. ప్రగతి భవన్ నిర్వహణ అధికారులు నోటీసులు పంపారు. క్లిక్ చేసి వాట్సాప్ ఛానెల్ ఫాలో అవ్వండి -
జడ్జి జయకుమార్ సస్పెన్షన్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్,రాష్ట్ర ఎన్నికల సంఘం, మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌లపై కేసు నమోదు చేయాలంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు జడ్జి జయకుమార్‌పై హైకోర్టు సస్పెన్షన్ వేటు వేసింది. ఉత్తర్వుల విషయంలో ఆయన అనుసరించాల్సిన విధానాలు పాటించలేదని అభిప్రాయపడింది. ఆయన పదవిలో ఉంటే నిష్పక్షపాతంగా విచారణ సాగేందుకు ఆటంకం కలుగుతుందని సస్పెండ్ చేస్తూ..ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు..విచారణ పూర్తిగా ముగిసే దాకా హైదరాబాద్ విడిచి వెళ్లరాదని జడ్జిని ఆదేశించింది. 2018, డిసెంబర్లో ఎన్నికలు జరిగిన సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్‌ను శ్రీనివాస్‌గౌడ్ ట్యాంపరింగ్ చేశారని, అయినా అధికారులు పట్టించుకోలేదని పేర్కొంటూ మహబూబ్‌నగర్‌కు చెందిన చలువగాలి రాఘవేంద్రరాజు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో ప్రైవేట్ పిటిషన్ వేశారు. నామినేషన్తోపాటే అఫిడవిట్ దాఖలు చేశారని, అయితే తర్వాత ఆ అఫిడవిట్‌ను సవరించారని పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన జడ్జి జయకుమార్..ఎన్నికల అధికారులు, మంత్రి, రెవెన్యూ అధికారులపై కేసు నమోదు చేయాలని పోలీసులను జూలై 31న ఆదేశించారు. అయితే కోర్టు ఆదేశించినా పోలీసులు అధికారులు, మంత్రిపై కేసు నమోదు చేయలేయడం లేదని పిటిషనర్ రాఘవేంద్రరాజు జడ్జి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆగస్టు 11న విచారణ చేపట్టిన జడ్జి.. సాయంత్రం 4 గంటల్లోగా కేసు నమోదు చేసి, రాత పూర్వకంగా వివరాలు వెల్లడించాలని ఆదేశించారు. పోలీసులు మంత్రితోపాటు ఎన్నికల అధికారులపై కేసు నమోదు చేశారు. ఎన్నికల అఫిడవిట్లో మార్పులకు సీఈసీకి ఎలాంటి సంబంధం లేకపోయినా ప్రజాప్రతినిధుల కోర్టు జడ్జి తన పరిధి దాటి వ్యవహరించారని.. విచారణ జరపాలని పేర్కొంటూ కేంద్ర ఎన్నికల సంఘం తరఫున సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ధర్మేంద్రశర్మ తెలంగాణ హైకోర్టుకు వినతిపత్రం సమర్పించారు. ఈ మొత్తం అంశంపై హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ విచారణ చేపట్టి.. నివేదిక అందజేశారు. సీఆర్పీసీ సెక్షన్ 200 ప్రకారం రాఘవేంద్రరాజు ప్రైవేట్ దావా వేసినప్పుడు.. ఎలాంటి ప్రాథమిక విచారణ చేపట్టకుండానే, పిటిషనర్ వాంగ్మూలం తీసుకోకుండానే, సీఆర్పీసీ సెక్షన్ 156(3) కింద దర్యాప్తు చేయాలని జడ్జి ఆదేశా>లు జారీ చేశారు. విధి నిర్వహణలో లోపాలున్నాయని చెప్పారు. కేంద్ర ఎన్నికల కమిషన్ వినతిపత్రం, రిజిస్ట్రార్ జనరల్ నివేదిక ఆధారంగా జడ్జిపై క్షమశిక్షణ చర్యలు తీసుకోవాలని హైకోర్టు నిర్ణయించింది. తక్షణం విధుల నుంచి తప్పుకుని మొదటి అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి, 15 అదనపు చీఫ్ జడ్జి(సిటీ సివిల్ కోర్టు)కు బాధ్యతలు అప్పగించాలని ఆదేశించింది. -
19 పార్టీలకు ‘స్థానిక’ ఎన్నికల్లో రిజర్వు గుర్తులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో స్థానిక సంస్థలకు జరిగే ఎన్నికలకు మొత్తం 19 రాజకీయ పార్టీలకు గుర్తులు కేటాయిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) శుక్రవారం నోటిఫికేషన్ జారీచేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల కొన్ని రాజకీయ పార్టీలను గుర్తింపు కలిగిన జాతీయ పార్టీల జాబితాల నుంచి తొలగించి, మరికొన్నింటిని చేర్చడంతోపాటు రాష్ట్రాల్లో గుర్తింపు కలిగిన జాబితాలో మార్పులు చేస్తూ నోటిఫికేషన్ జారీచేసిన విషయం తెలిసిందే. ఆ నోటిఫికేషన్‌కు అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్.. గుర్తింపు కలిగిన జాతీయ, రాష్ట్ర పార్టీల వివరాలతో ఈ కొత్త నోటిఫికేషన్‌ను జారీచేసింది. రాష్ట్రంలో అధికార వైఎస్సార్సీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీతో సహా కేంద్ర ఎన్నికల సంఘం వద్ద జాతీయ పార్టీల గుర్తింపు ఉన్న ఆమ్ ఆద్మీ, బీఎస్సీ, బీజేపీ, సీపీఎం, కాంగ్రెస్ పార్టీలు ఆయా పార్టీల ఎన్నికల గుర్తులు కలిగి ఉంటాయని ఆ నోటిఫికేషన్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి కె.ఆర్.బి.హెచ్.ఎన్.చక్రవర్తి పేర్కొన్నారు. తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీ సహా వివిధ రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన మరో 11 రాజకీయ పార్టీలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ గుర్తింపు కలిగిన రాజకీయ పార్టీలుగా గుర్తిస్తూ, కేంద్ర ఎన్నికల సంఘం వద్ద ఆయా రాజకీయ పార్టీల గుర్తులనే అవి కలిగి ఉంటాయని వివరించారు. నిబంధనల ప్రకారం.. గత అసెంబ్లీ ఎన్నికల్లో నిర్ణీత ఓట్ల శాతం గానీ, అసెంబ్లీలో సీట్ల సంఖ్యను గానీ పొందలేక, కేంద్ర ఎన్నికల సంఘం వద్ద ప్రత్యేక గుర్తును కలిగి ఉండే రిజిస్టర్డ్ పార్టీ జాబితాలో స్థానాన్ని కూడా కోల్పోయిన జనసేన పార్టీకి రాష్ట్ర ఎన్నికల కమిషన్ మాత్రం రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ విత్ రిజర్వుడ్ సింబల్ (ప్రత్యేక గుర్తింపు కలిగి ఉండే రిజిస్టర్డ్ పార్టీగా) గుర్తిస్తున్నట్టు ఆ నోటిఫికేషన్లో పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం వద్ద ప్రత్యేక గుర్తును కలిగి ఉండే రిజిస్టర్డ్ పార్టీ జాబితాలో లేని పార్టీలకు సైతం రాష్ట్ర ఎన్నికల కమిషన్ గుర్తుల కేటాయింపు నిబంధనలు 5 (ఏ) (బీ) ప్రకారం.. రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రంలో ఎక్కడైనా 15 ఎంపీటీసీ స్థానాలు లేదా మూడు జెడ్పీటీసీ స్థానాలు లేదా 15 మున్సిపల్ వార్డు స్థానాలు లేదా 15 నగర కార్పొరేషన్ వార్డులు గెల్చుకున్న పార్టీలకు ప్రత్యేక ఎన్నికల గుర్తు కలిగి ఉండే రిజిస్టర్డ్ పార్టీగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ గుర్తిస్తుందని తెలిపారు. దీనికి తోడు రాష్ట్ర ఎన్నికల కమిషన్ గుర్తుల కేటాయింపు నిబంధనలు 5 (ఏ) (బీ–1)ప్రకారం.. రాష్ట్ర అసెంబ్లీలో కనీస ఒక సభ్యుడు ఉన్న ప్రతి పార్టీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్ద ప్రత్యేక రిజర్వు సింబల్‌ను పొందే అర్హత ఉంటుందని పేర్కొన్నారు. ఇంకొక 94 రాజకీయ పార్టీలను కూడ రాష్ట్ర ఎన్నికల కమిషన్ రిజిస్టర్డ్ పార్టీలుగా గుర్తించినప్పటికీ, వాటికి మాత్రం ఎటువంటి రిజర్వు సింబల్ కేటాయించని పార్టీల జాబితాల్లో పేర్కొంది. -
‘స్థానిక’ ఖాళీలపై ఎన్నికల కమిషన్ కదలిక
సాక్షి, హైదరాబాద్: వివిధ స్థానిక సంస్థల్లో ఖాళీలు ఏర్పడిన పలు ప్రజాప్రతినిధుల స్థానాల ఎన్నికల నిర్వహణకు అనుమతినివ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరనున్నట్టు స్టేట్ ఎలక్షన్ కమిషన్(ఎస్ఈసీ) వర్గాలు వెల్లడించాయి. పలు సర్పంచ్, ఎంపీటీసీ, వార్డుసభ్యులు, ఇతర పోస్టులకు ఎన్నికలెందుకు నిర్వహించడం లేదంటూ తాజాగా ఎస్ఈసీకి, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలు ఎన్ని రోజుల్లోగా నిర్వహిస్తారో వెల్లడించాలని, అందుకు నెల రోజుల సమయం కూడా కోర్టు ఇచ్చిన నేప థ్యంలో ప్రభుత్వానికి ఎస్ఈసీ విజ్ఞప్తి చేయను న్నట్టు తెలుస్తోంది. దీంతోపాటు కోర్టు నోటీస్ జారీకి సంబంధించిన ఆర్డర్ కాపీ ఎస్ఈసీకి, పీఆర్ శాఖకు చేరేందుకు మరికొన్ని రోజుల సమయం పట్టొచ్చని అంచనా వేస్తున్నారు. ఆ లోగా ఖాళీ స్థానాలకు ఎన్నికల నిర్వహణకు గ్రీన్‌సిగ్నల్ కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్టు ఎస్ఈసీ వర్గాలు తెలిపాయి. పీఆర్ శాఖ కమిషనర్‌కు కూడా కోర్టు నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో ఆయా అంశాల ప్రాతిపదికన సమా« దానం పంపేందుకు సిద్ధమ వుతున్నట్టు తెలుస్తోంది. నూతన పీఆర్ చట్టం ప్రకారం... స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ తేదీలకు సంబంధించి ప్రభుత్వ సమ్మతి, ఆమోదంపొందాకే ఎస్ఈసీ వాటిని ఖరారు చేయాల్సి ఉంటుందనే నిబంధన విధించారు. వివిధ గ్రామీణ స్థానికసంస్థల ప్రజాప్రతినిధుల పదవీకాలం 2024 జనవరిలో ముగియనుంది. ఖాళీలు ఏర్పడిన స్థానాలకు ఇంకా 9 నెలల పదవీ కాలం మాత్రమే మిగిలి ఉంది. అయితే ఏదైనా కారణంతో స్థానిక సంస్థల పోస్టులు ఖాళీ అయితే ఆరునెలల్లో భర్తీ చేయాల్సి ఉండగా, వీటి ఎన్నిక మాత్రం వాయిదా పడుతూ వస్తోంది. మినీ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సందిగ్ధత వివిధ గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లోని ప్రజా ప్రతినిధుల పోస్టులు ఆరువేలకుపైగా ఖాళీలు ఏర్పడి రెండేళ్లు కావొస్తున్నా వాటికి ఎన్నికలు నిర్వహించకపోవడం చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో వేడెక్కిన రాజకీయ వాతావరణంలో ఈ ‘మినీ పంచాయతీ’ఎన్నికలు జరుగుతాయో, లేదోననే చర్చ ఆసక్తికరంగా మారింది. గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచాక ఎన్నికల వ్యయం వెల్లడించకపోవడం, విధుల నిర్వహణలో అలస త్వం ప్రదర్శించడం, అక్రమాలు, పీఆర్ చట్ట ఉల్లంఘనకు పాల్పడటం వంటి కారణాలతో కొన్ని సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, వార్డు సభ్యులు, మున్సిపల్ వార్డు సభ్యుల పోస్టులు ఖాళీ అయ్యా యి. వీటికి ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని సవాల్ చేస్తూ న్యాయవాది భాస్కర్ వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా ఎస్ఈసీకి, పీఆర్ కమిషనర్లకు తాజాగా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. -
ఓటమి తట్టుకోలేక కౌంటింగ్‌పై బీజేపీ ఆరోపణలు.. మంత్రి జగదీష్ రెడ్డి
సాక్షి, నల్గొండ: మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్‌పై పొలిటికల్ వార్ నడుస్తోంది. ఈసీ తీరుపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కౌంటింగ్ మందకొడిగా సాగడంపై అనుమానాలు వ్యక్తం చేస్తోంది. రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడిలో జాప్యంపై సీరియస్ అయ్యింది. ఫలితాల వెల్లడిలో ఏ పొరపాటు జరిగినా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చిరించింది. అయితే బీజేపీ ఆరోపణలను టీఆర్ఎస్ ఖండించింది. ఓటమి తట్టుకోలేకే కాషాయ పార్టీ ఆరోపణలు చేస్తోందని మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. అధికారులను భయపెట్టడం సరికాదని విమర్శించారు. కాగా మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ హోరాహోరీగా సాగుతోంది. 5వ రౌండ్ ముగిసే సరికి టీఆర్ఎస్ 1,631 ఓట్లతో ముందంజలో ఉంది. కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి స్వగ్రామం లింగంవారిగుడెంలో టీఆర్ఎస్ 340 ఓట్లు లీడ్ సాధించింది. మీడియా ఆందోళన మునుగోడు కౌంటింగ్ కేంద్రం వద్ద మీడియా ప్రతినిధులు ఆందోళన చేపట్టారు. తమకు కనీసం సమాచారం ఇవ్వడం లేదని నిరసన వ్యక్తం చేశారు. చదవండి: Munugode Bypoll 2022 Result: ఆధిక్యంలో టీఆర్ఎస్ -
కారు గుర్తును పోలి 8 గుర్తులు.. ఈసీని కలిసిన టీఆర్ఎస్ నేతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ను టీఆర్ఎస్ నేతలు కలిశారు. కారు గుర్తును పోలి ఉన్న 8 గుర్తులను మార్చాలని విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్‌పై క్షుద్ర పూజల ఆరోపణలు చేస్తున్న బండి సంజయ్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఎన్నికల అధికారిని కలిసినవారిలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ భాను ప్రసాద్, పార్టీ జనరల్ సెక్రటరీ సోమ భరత్ ఉన్నారు. చదవండి: చిక్కుల్లో మంత్రి మల్లారెడ్డి.. బయటపడిన వీడియో.. ఆయన స్పందన ఇదే.. కాగా, కేసీఆర్ చాలా రోజుల నుంచి తాంత్రిక పూజలు చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. తనకు ఉన్న సమాచారం మేరకు తాంత్రికుడు చెప్పడం వల్లే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని, ప్రస్తుతం ఉన్న టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి) అన్న పేరుకు కాలం ముగిసిందని, ఆ పేరుతో వెళ్తే తలకిందులేసి తపస్సు చేసినా పార్టీ గెలవదని తాంత్రికుడు చెప్పాడని, అందుకే తాంత్రికుల సూచనతో బీఆర్ఎస్గా పేరు మార్చారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్కు జెండా లేదు.. ఎజెండా లేదు. దేశాన్ని ఉద్ధరించడానికి బీఆర్ఎస్ పెట్టలేదని.. కేవలం దెయ్యాలు, రాక్షస పూజలు చేస్తున్నాడు కాబట్టే వారి మాటలు విని పార్టీ పేరు మార్చాడని బండి సంజయ్ ఘాటు విమర్శలు చేశారు. -
ఎస్ఈసీ చెంతకు అన్నాడీఎంకే పంచాయితీ.. పన్నీరు సెల్వం ఫిర్యాదు, పళని స్వామి వ్యూహాలు
సాక్షి,చెన్నై: అన్నాడీఎంకే పంచాయితీ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు చేరింది. పార్టీలో పరిణామాలపై పన్నీరు సెల్వం ఈసీకి ఫిర్యాదు చేశారనే.. సమాచారంతో పళని శిబిరం వ్యూహాలకు పదును పెట్టింది. ఇక, గత వారం జరిగిన అన్నాడీఎంకే సర్వ సభ్య సమావేశంలో కోర్టు ధిక్కారం జరిగినట్టు హైకోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలైంది. అన్నాడీఎంకేలో పన్నీరు సెల్వం, పళని స్వామి మధ్య నెలకొన్న వివాదం బుల్లి తెర ధారావాహికను తలపించే విధంగా మలుపులతో ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. తనకు వ్యతిరేకంగా పళని శిబిరం దూకుడు పెంచడంతో ఎత్తుకు పైఎత్తు వేసే పనిలో పన్నీరు సెల్వం ఉన్నారు. అన్నాడీఎంకేలో తాజాగా చోటు చేసుకున్న వివాదాలు, సమన్వయ కమిటీ కన్వీనర్ అనుమతి లేకుండా జూలై 11న మరో మారు సర్వసభ్య సమావేశానికి ఏర్పాట్లు చేయడం వంటి పరిణామాలను వివరిస్తూ పన్నీరు సెల్వం కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఆ సమావేశాన్ని అడ్డుకోవడమే కాకుండా, రెండాకుల చిహ్నాన్ని మరోమారు స్తంభింపజేయడానికి తగ్గ వ్యూహాల్లో పన్నీరు ఉన్నట్టు ప్రచారం జోరందుకుంది. ఇది కాస్త పళని శిబిరంలో కలవరాన్ని రేపినా, సమర్థంగా ఎదుర్కొనేందుకు తగిన వ్యూహాలకు మద్దతుదారులు పదును పెట్టారు. సర్వసభ్య సమావేశానికి ఎలాంటి ఆటంకం కలగకుండా, పార్టీలో పన్నీరు రూపంలో ఎదురు అవుతున్న పరిణామాలను ఎన్నికల కమిషన్‌కు వివరించేందుకు తగ్గ నివేదిక సిద్ధం చేసే పనిలో పళని మద్దతు నేతలు ఉండటం విశేషం. అదే సమయంలో శ్రీవారు వెంకటాచలపతి ప్యాలెస్ వేదికగా సర్వసభ్య సమావేశం జరిగి తీరుతుందని అన్నాడీఎంకే ప్రిసీడియం చైర్మన్ తమిళ్ మగన్ హుస్సేన్ మంగళవారం ప్రకటించారు. పెరిగిన బలం పళనిస్వామికి రోజురోజుకూ బలం పెరుగుతోంది. పన్నీరు సెల్వం వెన్నంటి ఉన్న వారిలో 9 మంది సర్వ సభ్య సమావేశం సభ్యులు మంది మంగళవారం పళనికి జై కొట్టారు. అన్నాడీఎంకేలో మొత్తం 2,665 మంది సర్వసభ్య సమావేశం సభ్యులు ఉండగా, 2,432 మంది పళని వైపు ఉన్నారు. ఇదిలా ఉండగా, పన్నీరు సెల్వం మద్దతు దారులు తనపై దాడిచేశారని వ్యాసార్పాడికి చెందిన పళనిస్వామి మద్దతిస్తున్న మారిముత్తు పోలీసుల్ని ఆ›శ్రయించారు. దీంతో పన్నీరు సెల్వం మద్దతుదారులు 10 మందిపై కేసు నమోదైంది. కాగా, గత వారం జరిగిన అన్నాడీఎంకే సర్వ సభ్య సమావేశంలో కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు.. పిటిషన్ దాఖలైంది. షణ్ముగం అనే సర్వసభ్య సమావేశం సభ్యుడు ఈ పిటిషన్ దాఖలు చేశారు. సమావేశ నిర్వహణకు కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు, సూచనల్ని అన్నాడీఎంకే వర్గాలు విస్మరించినట్టు పేర్కొంటూ ఈ పిటిషన్ దాఖలు చేశారు. నియోజకవర్గాల్లో చిన్నమ్మ పురట్చి పయనం అన్నాడీఎంకేలో పరిణామాల నేపథ్యంలో దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ కూడా వ్యూహాలకు పదును పెట్టిన విషయం తెలిసిందే. కేడర్‌ను తన వైపునకు తిప్పుకునే విధంగా పురట్చి పయనానికి తిరుత్తణి వేదికగా ఆమె శ్రీకారం చుట్టారు. ఈ పర్యటనను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తగ్గ రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నారు. కరూర్ నుంచి నియోజకవర్గాల వారీగా తన పర్యటన సాగే విధంగా చిన్నమ్మ పర్యటన ఏర్పాట్లు చేసుకుంటుండటం గమనార్హం. చదవండి: HYD: మోదీ పర్యటనకు భారీ భద్రత.. ‘సాలు మోదీ.. సాలు దొర’ ఫ్లెక్సీ వార్ -
సర్పంచ్ పదవికి వేలం పాట.. ఓర్ని! అన్ని లక్షలేందిరా సామీ..
భువనేశ్వర్/బొలంగీరు: రాష్ట్రంలో మూడంచెల పంచాయతీరాజ్ ఎన్నికల తొలి దశలోనే ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఇలా ప్రారంభమైందో లేదో పలుచోట్ల పదవుల వేలం పాట చోటుచేసుకుంటుండడం సంచలనం రేకిత్తిస్తోంది. తాజాగా బొలంగీరు జిల్లాలో సర్పంచ్ పదవిని వేలం వేసిన సంఘటన మంగళవారం వెలుగుచూసింది. దీనివెనక నిజానిజాల నిగ్గు తేల్చాలని జిల్లా కలెక్టరుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. వివరాలిలా ఉన్నాయి.. బొలంగీరు జిల్లా, పుంయింతొల మండలం, బిలెయిసొర్డా పంచాయతీలో సర్పంచ్ పదవి వేలం పాట జరిగింది. ఎన్నికల ప్రారంభ దశలోనే ఇటువంటి ఘటన తారసపడడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇదే పంచాయతీలో బిలెయిసొర్డా, బొందొనొకొటా, కొస్రుపల్లి గ్రామాలు ఉన్నాయి. ఆయా గ్రామాల్లో మొత్తం 15 వార్డులు ఉన్నాయి. ఇక్కడి సర్పంచ్ స్థానం రిజర్వేషన్ సాధారణ వర్గాలకు కేటాయించారు. అయితే గ్రామ సమగ్రాభివృద్ధికి సర్పంచ్ అభ్యర్థిని ఏకగ్రీవం చేసుకోవాలనే సంకల్పం గ్రామస్తుల్లో బలపడింది. ఈ క్రమంలో ఈ నెల 16వ తేదీన గ్రామసభ ఏర్పాటు చేశారు. చదవండి: తగ్గేదేలే..! తొలిసారి అసెంబ్లీ బరిలోకి సీఎం యోగి ఆదిత్యనాథ్ స్థానిక జగన్నాథ మందిరం ఆవరణ వేదికగా జరిగిన ఈ సమావేశానికి పంచాయతీలో 3 గ్రామాల ప్రజలు(ఓటర్లు), ఔత్సాహిక సర్పంచ్ అభ్యర్థులు హాజరయ్యారు. తర్వాత సర్పంచ్ పదవి కోసం వేలం పాట ప్రారంభించారు. గ్రామ ప్రగతి కోసం పలువురు ఔత్సాహిక అభ్యర్థులు ముందస్తు ఆర్థికపరమైన హామీలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ఉత్సాహం కనబరిచారు. మొత్తం నలుగురు వ్యక్తులు సర్పంచ్ పదవి కోసం వేలం పాటలో పాల్గొని, పోటీపడగా చివరికి సుశాంత ఛత్రియా అనే వ్యక్తి అధిక వేలం పాటతో సర్పంచ్ పదవిని దక్కించుకున్నట్లు సమాచారం. రూ.7 లక్షల నుంచి మొదలై.. త్వరలో జరిగే పంచాయతీ ఎన్నికల్లో ఆయన మాత్రమే సర్పంచ్ అభ్యర్థి అని, వేరెవ్వరూ ఆ పదవి కోసం నామినేషన్లు దాఖలు చేయకూడదన్నది వేలం పాట ఒప్పందం. దీంతో సుశాంత ఛత్రియానే బిలెయిసొర్డా పంచాయతీ సర్పంచ్ అని స్థానికంగా వినిపిస్తోంది. సర్పంచ్ పదవి కోసం రూ.7 లక్షల నుంచి మొదలైన వేలం పాట ఆఖరికి రూ.44.10 లక్షలు ధర పలికినట్లు జోరుగా చర్చ సాగుతోంది. అయితే ఇదంతా అవాస్తవమని సుశాంత ఛత్రియా కొట్టిపారేశారు. గ్రామ ప్రగతికి విరాళంగా రూ.44 వేలు మాత్రమే తాను అందజేసేందుకు అంగీకరించినట్లు ఆయన తెలిపారు. తనను ఏకగ్రీవంగానే గ్రామసభ ఎన్నుకుంటుందన్న నమ్మకం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చదవండి: Punjab Assembly Election 2022: ఆప్‌కు ముప్పు: విజయావకాశాలను దెబ్బతీసేలా నివేదిక దాఖలుకు ఆదేశాలు.. బిలైసొర్డా పంచాయతీ సర్పంచ్ పదవి వేలం పాట సంఘటనపై క్షేత్ర స్థాయిలో దర్యాప్తు నిర్వహించి, వాస్తవాలతో సమగ్ర నివేదిక దాఖలు చేయాలని ఎన్నికల కమిషన్ జిల్లా అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది. సర్పంచ్ పదవి రూ.44.10 లక్షలకు వేలం వేసినట్లు ప్రధాన ఆరోపణ కాగా, ఈ క్రమంలో దానిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి, వాస్తవ, అవాస్తవాలను తెలియజేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి ఆర్.ఎన్.సాహు బొలంగీరు జిల్లా కలెక్టరు చంచల్ రాణాకు లేఖ జారీ చేయడం విశేషం. గతంలోనూ ఏకగ్రీవమే.. ప్రధానంగా ఎన్నికల వ్యయం పరిమితం చేసేందుకు ఈ విధానానికి గ్రామసభ ఏకీభవించింది. ఈసారి జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థి గరిష్ట వ్యయ పరమితి రూ.2 లక్షలుగా ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో అంతకన్నా తక్కువ ఖర్చుతో(రూ.44 వేలు) గ్రామంలో సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం అవుతుందని ఆయన సర్దిచెప్పుకొచ్చాడు. 2017లో జరిగిన పంచాయతీ ఎన్నికలో ఇక్కడి సర్పంచ్‌గా రీతా బొఢియా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం గమనార్హం. గుర్తింపు ఇవ్వలేం.. ఇలాంటి ప్రక్రియలో సర్పంచ్‌గా ఎన్నికైన వ్యక్తికి ఎటువంటి గుర్తింపు ఇవ్వలేమని స్థానిక అధికారులు స్పష్టం చేశారు. ఎన్నికల నిబంధనల ప్రకారం సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తి, సంబందిత ఫారం నింపాల్సి ఉంటుందన్నారు. ఇలా ఓ పద్ధతి ప్రకారం వెళ్లిన వ్యక్తికే సర్పంచ్ పదవి దక్కుతుందని, ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చని, ఆఖరికి వేలం పాటలో పాల్గొన్న వ్యక్తి అయినా కావొచ్చని అధికారులు తేల్చి చెప్పారు. -
4న రెండో ఉపాధ్యక్ష పదవులకు ఎన్నిక
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా మండల పరిషత్ రెండో ఉపాధ్యక్ష పదవులకు ఈ నెల 4వ తేదీ మంగళవారం ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి మండలాల వారీగా ప్రత్యేక సమావేశాల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తరఫున ఎంపీడీఓలు ఇప్పటికే ఎంపీటీసీలకు సమాచారం ఇచ్చారు. ఈ ప్రక్రియ శుక్రవారం సాయంత్రానికే పూర్తయిందని కమిషన్ కార్యాలయ అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ కార్యక్రమాల పర్యవేక్షణలో స్థానిక ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం మరింత పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మండల పరిషత్‌లో రెండో ఉపాధ్యక్ష పదవిని ఏర్పాటుచేస్తూ ఇటీవలే అసెంబ్లీలో చట్ట సవరణ చేసిన విషయం తెలిసిందే. దీనికి ముందే గుంటూరు జిల్లా దుగ్గిరాల మినహా మిగిలిన 649 మండలాల్లో మండల పరిషత్ అధ్యక్ష, ఒక ఉపాధ్యక్ష పదవులతో పాటు కోఆప్టెడ్ సభ్యుని ఎన్నిక జరిగింది. ప్రభుత్వ చట్ట సవరణ నేపథ్యంలో ఈ 649 మండలాల్లో రెండో ఉపాధ్యక్ష పదవికి కూడా ఎన్నిక నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని డిసెంబరు 28న నోటిఫికేషన్ జారీచేశారు. దీంతో నాలుగో తేదీ ఉ.11 గంటలకు అన్నిచోట్లా మండల పరిషత్ ప్రతేక సమావేశాలు మొదలై, ఎంపీటీసీ సభ్యులు రెండో ఉపాధ్యక్షుడిని ఎన్నుకుంటారు. మరోవైపు.. విశాఖ జిల్లా మాకవరం ఎంపీపీ రాజీనామాతో ఆ స్థానానికి కూడా అదే రోజున ఎన్నిక నిర్వహిస్తారు. అలాగే, చిత్తూరు జిల్లా రామకుప్పం, గుర్రంకొండలో మండలాధ్యక్ష పదవులకు, కృష్ణాజిల్లా ఆగిరిపల్లిలో మొదటి ఉపాధ్యక్ష పదవికి ఎన్నిక జరుగుతుంది. రాజీనామా కారణంగా ఖాళీగా ఉన్న కర్నూలు జెడ్పీ చైర్మన్ ఎన్నిక కూడా మంగళవారం జరుగుతుంది. కోరం ఉంటేనే ఎన్నిక మండల పరిషత్ రెండో ఉపాధ్యక్ష ఎన్నికవిధివిధానాలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసింది. రెండో ఉపాధ్యక్ష ఎన్నిక నిమిత్తం జరిగే ప్రత్యేక సమావేశానికి కనీస కోరంగా మండల పరిషత్‌లో ఉండే మొత్తంలో ఎంపీటీసీ సభ్యుల సంఖ్యలో సగానికి పైగా సభ్యులు హాజరు తప్పనిసరని కమిషన్ స్పష్టంచేసింది. లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారి పరిధిలోని మండల పరిషత్ సమావేశాల్లో పాల్గొనవచ్చని, అయితే, వారికి ఎన్నికలో ఓటు హక్కు ఉండదని తెలిపింది. -
AP MPTC And ZPTC Election 2021 Results Live: విస్సన్నపేట జడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం
AP MPTC And ZPTC Election Live Updates 05:30PM ►సాయంత్రం 5.30 గంటల వరకు వెలువడిన జెడ్పీటీసీ ఫలితాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 11, టీడీపీ 3 స్థానాలు గెలుచుకున్నాయి. ఇందులో నాలుగు స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన పదిస్థానాలకు ఎన్నికలు జరిగాయి. ►ఎంపీటీసీ ఫలితాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవాలతో కలిపి 127, టీడీపీ 32, బీజేపీ 6, ఇతరులు 4స్థానాలను గెలుచుకున్నారు. మొత్తం 123 స్థానాలకు ఎన్నికలు జరగగా మరో 50 స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవం అయ్యాయి. 03:18PM పశ్చిమగోదావరి జిల్లా ►ఎన్నిక జరిగిన పెనుగొండ జడ్పీ స్థానాన్ని వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. ఎన్నికలు జరిగిన ఎంపీటీసీ స్థానాలు-14 ►వైఎస్సార్సీపీ-10 ►టీడీపీ-3 ►జనసేన-1 03:05PM తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం ఎన్నికలు జరిగిన ఎంపీటీసీ స్థానాలు - 21 ►వైఎస్సార్సీపీ - 9 ►టీడీపీ - 6 ►జనసేన - 3 ►ఇండిపెండెంట్ - 1 ►సీపీఎం - 1 ►సీపీఐ - 1 02:50PM తూర్పుగోదావరి జిల్లా ►ఏటపాక మండలంలో 11 ఎంపీటీసీ స్థానాలకు ముగిసిన ఓట్ల లెక్కింపు.. ►12 ఎంపీటీసీ స్థానాలు ఏటపాక మండలంలో ఉండగా కన్నాయిగూడెం ఎంపీటీసీ స్థానం వైఎస్సార్సీపీ ఏకగ్రీవం . ఎన్నికలు జరిగిన 11 స్థానాల్లో.. ► ఏటపాక - వైఎస్సార్సీపీ ► రాయనపేట - వైఎస్సార్సీపీ ► నెల్లిపాక - వైఎస్సార్సీపీ ► గుండాల - వైఎస్సార్సీపీ ► లక్ష్మీపురం - వైఎస్సార్సీపీ ► చోడవరం - టీడీపీ ► గొమ్ముకొత్తగూడెం - టీడీపీ ► నందిగామ - టీడీపీ ► టీపీ వీడు - టీడీపీ ► కృష్ణవరం - సీపీఐ ► విస్సాపురం - సీపీఎం మొత్తం 12 ఎంపీటీసీ స్థానాలకు గాను వైఎస్సార్సీపీ 6, సీపీఎం 1, సీపీఐ 1, టీడీపీ 4 గెలుచుకున్నాయి. 02:45PM కృష్ణా జిల్లా విస్సన్నపేట జడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం ►విస్సన్నపేట జడ్పీటీసీగా భారీ మెజార్టీతో గెలుపొందిన భీమిరెడ్డి లోకేశ్వరరెడ్డి ►లోకేశ్వరరెడ్డికి మిఠాయి తినిపించి అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి అనంతపురం: హిందూపురం నియోజకవర్గంలో గెలుపొందిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను ఎమ్మెల్సీ ఇక్భాల్, గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ ఎల్ఎం మోహన్ రెడ్డి అభినందించారు. 02:35PM విశాఖపట్నం ►టీడీపీ కంచుకోట ఆనందపురం జడ్పీటీసీగా వైఎస్సార్సీపీ అభ్యర్థి కోరాడ వెంకట్రావు ఘన విజయం ►1983 జిల్లా పరిషత్ ఆవిర్భావం నుంచి ఆనందపురంలో టీడీపీ అభ్యర్థులదే గెలుపు ►తొలిసారి 3576 ఓట్లతో వైఎస్సార్సీపీ అభ్యర్థి కోరాడ వెంకట్రావు జడ్పీటీసీగా విజయం ►ఆనందపురంలో టీడీపీ కంచుకోట శిథిలమైంది ►ఇది సీఎం జగన్‌కి కృతజ్ఞతగా ప్రజలు ఇచ్చిన గెలుపు - భీమిలి వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ ముత్తంశెట్టి మహేష్ 02:30PM అనంతపురం జిల్లా ►చిలమత్తూరు వైఎస్సార్ సీపీ జడ్పీటీసీ అభ్యర్థి అనూష 3,025 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 02:20PM నెల్లూరు జిల్లా ►ముగిసిన కోట ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ ►వైఎస్సార్సీపీ అభ్యర్థి షేక్ మొబీన్ భాష విజయం సాధించారు. 1.52PM ప.గో జిల్లాలో ముగిసిన పరిషత్ ఎన్నికల కౌంటింగ్ 15 ఎంపీటీసీ స్థానాలకు గాను తాళ్ళపూడి (మం) వేగేశ్వరపురం ఎంపీటీసీ- 2 వైఎస్సార్సీపీ అభ్యర్థి కొమిరెడ్డి వీర రాఘవమ్మ ఏకగ్రీవం కాగా 14 ఎంపీటీసీ, పెనుగొండ జడ్పీటీసీ స్థానానికి జరిగిన ఎన్నికలు 10 ఎంపీటీసీ స్థానాలు, పెనుగొండ జెడ్పీ స్థానాన్ని కైవసం చేసుకున్న వైఎస్సార్సీపీ జనసేన-1,టీడీపీ-3 ఎంపీటీసీ స్థానాలకు పరిమితం పెనుగొండ జడ్పీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థి పోడూరి గోవర్ధని 4,300 ఓట్లు మెజారిటీ తో గెలుపు అత్తిలి(మం)పాలూరు ఎంపీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థి శరఖడం రామలింగ విష్ణు మూర్తి 257 ఓట్ల మెజారిటీతో గెలుపు అత్తిలి (మం) ఈడూరు ఎంపీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థి సుంకర నాగేశ్వరరావు 225 ఓట్ల మెజారిటీతో గెలుపు భీమడోలు (మం) అంబరుపేట ఎంపీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థి దాసరి విజయ భాను 10 ఓట్ల మెజార్టీ తో గెలుపు... చాగల్లు ఎంపీటీసీ - 5 వైఎస్సార్సీపీ అభ్యర్థి ఉన్నమట్ల విజయకుమారి 969 ఓట్ల మెజార్టీతో గెలుపు దెందులూరు-1 ఎంపీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థి తాళ్లూరి నాగరాజు 85 ఓట్ల మెజారిటీతో గెలుపు దెందులూరు (మం) కొవ్వలి ఎంపీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థి గొల్ల నాగరాజు 58 ఓట్ల మెజార్టీ తో గెలుపు జంగారెడ్డిగూడెం (మం) లక్కవరం ఎంపీటీసీ- 2 వైఎస్సార్సీపీ అభ్యర్థి దల్లి వెంకట మోహన్ రెడ్డి 428 ఓట్ల మెజార్టీ తో గెలుపు. కుక్కునూరు (మం) మాధవరం ఎంపీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థి కుండా సూర్యనారాయణ182 ఓట్ల మెజారిటీతో గెలుపు నిడదవోలు(మం) తాళ్లపాలెం ఎంపీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్ధి బయ్యే కృష్ణబాబు 41 ఓట్ల మెజార్టీతో గెలుపు. పెరవలి (మం) కానూరు 2 ఎంపిటిసి వైఎస్సార్సీపీ అభ్యర్థి మత్తల ఉషారాణి 256 ఓట్లు మెజార్టీతో గెలుపు 1.20PM పశ్చిమగోదావరి: ► పెనుగొండ జడ్పీటీసీ స్థానంలో వైఎస్సార్సీపీ విజయం. వైఎస్సార్సీపీ అభ్యర్థి పోడూరి గోవర్ధని 4,300 ఓట్లు మెజారిటీతో గెలుపు 1.03PM కృష్ణా జిల్లా: ► జి.కొండూరు జడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. 4,893 ఓట్ల మెజారిటీతో మంద జక్రధరరావు విజయం ► విస్సన్నపేట జడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. 9,656 ఓట్ల భారీ మెజార్టీతో భీమిరెడ్డి లోకేశ్వరరెడ్డి విజయం 12.43PM ► నంద్యాల జడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకున్న వైఎస్సార్సీపీ అభ్యర్థి గోపవరం గోకుల్ కృష్ణ రెడ్డి. 12.20PM ప్రకాశం జిల్లా ►పర్చూరు మండలం చెరుకూరు-2 ఎంపీటీసీ స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్ది షేక్ బీస్మల్లా 878 ఓట్ల మోజార్టితో గెలుపు. ►పెద్దారవీడు మండలం తంగిరాలపల్లి ఎంపీటీసీ స్థానంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఉప్పలపాటి భాగ్యరేఖ 252 ఓట్ల మెజారిటీతో గెలుపు ► యద్దనపూడి మండలం పోలూరు ఎంపీటీసీగా వైఎస్సార్సీపీ అభ్యర్థి షేక్ ఖాసిం వలి 556 ఓట్లతో విజయం ► పీసీపల్లి మండలం మురుగుమ్మి ఎంపీటీసీలో వైఎస్సార్సీపీ అభ్యర్థి చెరుకూరి సతీష్ 61 ఓట్లతో విజయం 12.00PM చిత్తూరు: ► కుప్పం నియోజకవర్గంలో కొనసాగుతున్న వైఎస్సార్సీపీ ప్రభంజనం ► శాంతిపురం మండలం 64 పెద్దూరులో వైఎస్సార్సీపీ ఎంపీటీసీ స్థానాన్ని కైవసం చేసుకుంది. 11.54AM విజయనగరం ► గరివిడి మండలం వెదురుల్లవలస ఎంపీటీసీ స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి గుడివాడ శ్రీరాములు విజయం ► బలిజిపేట మండలం పెదపెంకి ఎంపీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థి గుల్లిపల్లి సునీత 1357 ఓట్ల మెజార్టీతో గెలుపు ► మెంటాడ మండలం కుంటినవలస ఎంపీటీసీలో వైఎస్సార్సీపీ అభ్యర్థి రావాడ ఈశ్వర రావు 610 ఓట్లు ఆధిక్యంతో గెలుపు ► నెల్లిమర్ల మండలం బూరాడపేట ఎంపీటీసీలో వైఎస్సార్సీపీ అభ్యర్థి సంగంరెడ్డి జగన్నాధం గెలుపు 11.48AM శ్రీకాకుళం ► హిరమండలం మండలం హిరమండలం 3 ఎంపీటీసీ స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి మీసాల రజినీ183 ఓట్ల మెజార్టీతో గెలుపు ► టెక్కలి 5వ వార్డు ఎంపీటీసీ స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి బసవల సంధ్యారాణి 897 ఓట్ల మెజారిటీతో గెలుపు ► రేగిడి మండలం ఉంగరాడ ఎంపీటీసీలో వైఎస్సార్సీపీ అభ్యర్థి పిల్లా రోజా 93 ఓట్ల మెజార్టీతో గెలుపు ►బూర్జ మండలం బూర్జ ఎంపీటీసీలో టీడీపీ అభ్యర్థి గెలుపు. ► కొత్తూరు మండలం దిమిలి ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి గెలుపు ► ఆమదాల వలస మండలం కట్యాచారులుపేట ఎంపీటీసీలో టీడీపీ అభ్యర్థి గెలుపు 11.15AM శ్రీకాకుళం ► కంచిలి మండలం తలతంపర ఎంపీటీసీలో వైఎస్సార్సీపీ అభ్యర్థి బృందావన్ సాహు(538) ఓట్ల మెజారిటీతో విజయం ► కవిటి మండలం కొజ్జిరియా ఎంపీటీసీలో వైఎస్సార్సీపీ అభ్యర్ధి కందుల దశరథ రావు 145 ఓట్ల మెజారిటీతో విజయం ► సీతంపేట-2 స్థానంలో వైస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి సవర చంద్రశేఖర్ 779 ఓట్ల మెజారిటీతో గెలుపు ► కంచిలి మండలం కుంబరినువంగా ఎంపీటీసీలో టీడీపీ అభ్యర్థి గెలుపు 11.03AM గుంటూరు ► ప్రత్తిపాడు మండలం నడింపాలెం-2 ఎంపీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థి పూర్ణి వెంకటేశ్వరరావు 200 ఓట్ల మెజారిటీతో గెలుపు. ► బెల్లంకొండ మండలం వెంకటాయపాలెం ఎంపీటీసీగా వైఎస్సార్సీపీ అభ్యర్థి చిట్టెంశెట్టి శివనాగమణి 587 ఓట్ల మెజారిటీతో గెలుపు. ► వేమూరు-1 వైఎస్సార్సీపీ అభ్యర్థి చెల్లం చర్ల కామేశ్వరి 467 ఓట్ల మెజారిటీతో విజయం ►చావలి-2 స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి సోమరవుతు జయలక్ష్మి 345 ఓట్ల మెజారిటీతో విజయం. 10.50AM విశాఖపట్నం: ► గోలుగొండ మండలం పాకలపాడు ఎంపీటీసీగా వైస్సార్సీపీ అబ్యర్ధి ఏళ్ల లక్మి దుర్గ 439 ఓట్లతో గెలుపు ► మాడుగుల మండలం వంటర్లపాలెంలో వైస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి అభ్యర్థి దండి నాగరత్నం 79 ఓట్లు తేడాతో గెలుపు. చిత్తూరు: ► నగరి రూరల్ మండలం నంబాకం ఎంపీటీసీ స్థానంలో 63 ఓట్లు మెజారిటీతో వైఎస్సార్సీపీ అభ్యర్థి గుణ శేఖర్‌రెడ్డి గెలుపు ►ఎస్ఆర్పురం మండలం వి.వి.పురం ఎంపీటీసీ స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆదిలక్ష్మి 269 ఓట్లతో విజయం ► గుడుపల్లి మండలం కనమనపల్లి ఎంపీటీసీ స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి వరలక్ష్మి 494 ఓట్లు మెజార్టీతో గెలుపు 10.40AM కర్నూలు: ►చగలమర్రి -3 ఎంపీటీసీ స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి వెళ్లంపల్లి వెంకటలక్ష్మీ గెలుపు ►చకరాజువేముల ఎంపీటీసీ స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి షాజహాన్ విజయం ►మల్లెపల్లి ఎంపీటీసీ స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి వై. మమత గెలుపు ► కృష్ణగిరి మండలం టి. గోకులపాడు ఎంపీటీపీగీ వైస్సార్సీపీ అభ్యర్ది రమేశ్వరమ్మ 60 ఓట్ల మెజార్టీతో గెలుపు ► ఆదోని మండలం ధానపురం గ్రామంలో వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి హనుమయ్య 157 ఓట్లతో విజయం. ► ఆదోని మండలం బైచిగేరి గ్రామంలో వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి కె.నాగభూషణ్ రెడ్డి 58 ఓట్లతో విజయం. ► ఆదోని మండలం హనువల్ గ్రామంలో వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి సి.ఇరన్న 437 ఓట్లతో గెలుపు. 10.30AM తూర్పు గోదావరి జిల్లా ► మారేడుమిల్లి మండలం దొర చింతలపాలెం ఎంపీటీసీగా వైఎస్సార్సీపీ అభ్యర్థి విజయం. ► సీతానగరం మండలం కాటవరం ఎంపీటీసీ స్థానంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తాడేపల్లి వెంకట్రావు 362 ఓట్ల మెజారిటీతో విజయం కృష్ణాజిల్లా ►పెనుగంచిప్రోలు మండలం కొనకంచి ఎంపీటీసీగా వైఎస్సార్సీపీ అభ్యర్థి కనగాల శ్రీనివాసరావు 602 ఓట్ల మెజార్టీతో గెలుపు ► నూజివీడు మండలం దేవరగుంట ఎంపీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్ధి నక్కా శ్రీనివాసరావు గెలుపు ► నాగాయలంక మండలం పర్రచివర ఎంపీటీసీ స్థానంలో 395 ఓట్ల మెజార్టీతో బుడిపల్లి ఆదిశేషు గెలుపు ► ఆగిరిపల్లి మండలం ఈదర-1 ఎంపీటీసీ స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా దొండపాటి కుమారి 30 ఓట్ల మెజారిటీతో గెలుపు అనంతపురం ►చిలమత్తూరు మండలం కొడికొండ ఎంపీటీసీ స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఇర్షాద్ బేగం గెలుపు ► పరిగి మండలం శాసనకోట ఎంపీటీసీ స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి నాగజ్యోతి 213 ఓట్ల మెజార్టీతో విజయం ► కొండాపూర్ ఎంపీటీసీ స్థానంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సునంద విజయం ► వానవోలు ఎంపీటీసీ రెండవ స్థానంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గాయత్రి బాయి విజయం ► గోరంట్ల-3 ఎంపీటీసీ స్థానంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సోమశేఖర్ విజయం ► డి.హీరేహాల్ మండలం చెర్లోపల్లి ఎంపీటీసీ టీడీపీ అభ్యర్థి మొండి మల్లికార్జున 315 ఓట్లతో విజయం. ► మడకశిర మండలం గోవిందాపురం ఎంపీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థి తాళ్లికేరమ్మ 82 ఓట్లతో విజయం ► పెనుకొండ మండలం రాంపురం ఎంపీటీసీ టీడీపీ అభ్యర్థి పద్మావతి విజయం. ► ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండలం మల్లెపల్లి-1 ఎంపీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థి చిలక మస్తాన్ రెడ్డి 409 ఓట్ల మెజార్టీ తో విజయం ► నార్పల మండలం బి. పప్పూరు ఎంపీటీసీగా పద్మాకర్ రెడ్డి 137 మెజారిటీతో ఘన విజయం ► కనగానపల్లి మండలం కొనాపురం వైస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి జీ. రాజేశ్వరి 369 ఓట్లతో విజయం 10.20AM ►నెల్లూరు జిల్లా: ► సైదాపురం మండలం ఆనంతమడుగు ఎంపీటీసీ స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి లెబాకు వెంకటరమణయ్య 270 ఓట్ల మెజారిటీతో విజయం ► గంగవరం ఎంపీటీసీలో 292 ఓట్ల మెజారిటీతో వైఎస్సార్సీపీ అభ్యర్థి సుమిత్రమ్మ విజయం కృష్ణాజిల్లా: ► ఆగిరిపల్లి (మం) ఈదర -1 ఎంపీటీసీలో దొండపాటి కుమారి(వైఎస్సార్సీపీ) 30 ఓట్లతో గెలుపు ► గన్నవరం (మం) చినఅవుటుపల్లి ఎంపీటీసీలో గంతోటి ప్రశాంతి(వైఎస్సార్సీపీ) 470 ఓట్లతో విజయం ► నూజివీడు (మం) దేవరగుంట ఎంపీటీసీలో నక్కా శ్రీనివాసరావు ( వైఎస్సార్సీపీ) 1150 ఓట్లతో గెలుపు ► నాగాయలంక (మం) పర్రచివర ఎంపీటీసీలో బుడిపల్లి ఆదిశేషు( వైఎస్సార్సీపీ) 395 ఓట్లతో గెలుపు ► ముదినేపల్లి (మం) ముదినేపల్లి ఎంపీటీసీలో మరీదు నాగలింగేశ్వరరావు( వైఎస్సార్సీపీ) 523 ఓట్లతో విజయం ► పెనుగంచిప్రోలు (మం) కొనకంచి ఎంపీటీసీలో కనగాల శ్రీనివాసరావు(వైఎస్సార్సీపీ) 602 ఓట్లతో గెలుపు ► ముదినేపల్లి (మం) వణుదుర్రు ఎంపీటీసీలో గుమ్మడి వెంకటేశ్వరరావు( టీడీపీ) 279 ఓట్లతో గెలుపు 10.14AM పశ్చిమ గోదావరి జిల్లా: ► భీమడోలు మండలం అంబరుపేట ఎంపీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థి దాసరి విజయభాను 10 ఓట్ల మెజార్టీతో గెలుపు ► దెందులూరు1 ఎంపీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థి తాళ్లూరి నాగరాజు 80 ఓట్ల మెజారిటీతో గెలుపు ► పెరవలి మండలం కానూరు 2 ఎంపీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థి మత్తల ఉషారాణి 256 ఓట్లు మెజార్టీతో గెలుపు ► కుక్కునూరు మండలం మాధవరం ఎంపీటీసీ స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి కుండా సూర్యనారాయణ182 ఓట్ల మెజారిటీతో గెలుపు ► అత్తిలి మండలంలోని పాలూరు ఎంపీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థి శరఖడం రామలింగ విష్ణు మూర్తి 257 ఓట్ల మెజారిటీతో గెలుపు ► చాగల్లు ఎంపీటీసీ 5 స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి మట్ల విజయకుమారి 969 ఓట్ల మెజార్టీతో గెలుపు ► జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం ఎంపీటీసీ- 2లో వైఎస్సార్సీపీ అభ్యర్థి దల్లి వెంకట మోహన్ రెడ్డి 428 ఓట్ల మెజార్టీతో గెలుపు. ► నిడదవోలు మండలంలోని తాళ్లపాలెం ఎంపీటీసీలో వైఎస్సార్సీపీ అభ్యర్థి బి.కృష్ణబాబు 40 ఓట్ల మెజారిటీతో గెలుపు 10.05AM ► వైఎస్సార్ జిల్లా ► ప్రొద్దుటూరు మండలం నంగానూరుపల్లి ఎంపీటీసీ వైఎస్సార్సీపీ చెందిన కృష్ట పాటి సంధ్య విజయం ► ముద్దనూరు మండలం కొర్రపాడు వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి పుష్పలత 420 ఓట్ల మెజార్టీతో గెలుపు ► జమ్మలమడుగు జడ్పీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థిని అశ్విని 650 ఓట్ల మెజార్టీతో గెలుపు ►కృష్ణాజిల్లా : గన్నవరం మండలం చిన్నఅవుటపల్లి ఎంపీటీసీ వైఎస్సార్సీపీ కైవసం ►వైఎస్సార్ సీపీ అభ్యర్థి గంతోటి ప్రశాంతి 470 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 09.20AM ► కృష్ణా జిల్లా: విస్సన్నపేట జడ్పీటీసీ పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల ఫలితాలు ►మొత్తం పోలైన ఓట్లు-32 ►వైఎస్సార్సీపీ-14 ►బీఎస్సీ -6 ►బీజేపీ-1 ►టీడీపీ-0 ►కాంగ్రెస్-0 ►సీపీఎం-3 ►చెల్లని ఓట్లు -8 08.30AM ► పశ్చిమ గోదావరి జిల్లా: చాగల్లు ఎంపీటీసీ స్థానానికి కౌంటింగ్ కొనసాగుతోంది. రెండు టేబుళ్ల ద్వారా కౌంటింగ్ అధికారులు నిర్వహిస్తున్నారు. ► నెల్లూరుజిల్లా: బాలాయపల్లి మండల పరిషత్ కార్యాలయంలో వెంగమాంబాపురం ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ►కోవూరు నియోజకవర్గం గంగవరం ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. కోడూరు మండల పరిషత్ కార్యాలయం కౌంటింగ్ సెంటర్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమలు చేశారు. ►కోట బిట్ 2 ఎంపీటీసీ ఎన్నికల కౌటింగ్ కోట మండల పరిషత్ కార్యాలయంలో కొనసాగుతోంది. 08.00AM ► రాష్ట్రంలోని 10 జడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ► పెనడ, విస్పన్న పేట, జి. కొడూరు జడ్పీటీసీ స్థానాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ► విజయనగరం: జిల్లాలోని 9 ఎంపీటీసీ స్థానాలకు ఓట్ల లెక్కిపు ప్రారంభమైంది. ► శ్రీకాకుళం: జిల్లాలోని ఒక జడ్పీటీసీ, 15 ఎంపీటీసీ స్థానాలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ► కర్నూల్ జిల్లా: వెల్దుర్తి మండలం మల్లెపల్లి ఎంపీటీసీ స్థానానికి ప్రారంభమైన కౌంటింగ్. కృష్ణగిరి మండలం టి. గోకులపాడు ఎంపీటీసీ స్థానానికి ప్రారంభమైన కౌంటింగ్. 07.57AM ► మరికాసేపట్లో ప్రారంభం కానున్న రాష్ట్రంలోని 10 జడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మంగళవారం ఎన్నికలు జరిగిన పది జెడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాల ఓట్లను గురువారం లెక్కించనున్నారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం తెలిపింది. ఎంపీటీసీ స్థానాల్లో ఫలితాలు ఉదయం పది గంటలకు తేలతాయని, జెడ్పీటీసీ స్థానాల్లో మధ్యాహ్నం 12 గంటలకల్లా తుది ఫలితం వెల్లడించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆ 757 ఓట్లతో తేలనున్న జమ్మలమడుగు జెడ్పీటీసీ ఫలితం వీటితోపాటు సెప్టెంబరు 19న రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల సమయంలో కేవలం రెండు పోలింగ్ బూత్‌లలో ఓట్ల లెక్కింపునకు వీలులేని పరిస్థితిలో ఫలితం ప్రకటన వాయిదాపడిన వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు జెడ్పీటీసీ స్థానం విజేత ఎవరో కూడా గురువారం తేలనుంది. అప్పట్లో ఈ జెడ్పీటీసీ స్థానంలో లెక్కింపు జరిగినంతవరకు వైఎస్సార్సీపీ అభ్యర్థి.. ఆ తర్వాత స్థానంలో ఉన్న బీజేపీ అభ్యర్థి కంటే 517 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు. ఆ జెడ్పీటీసీ స్థానం పరిధిలోని గొరిగనూరు ఎంపీటీసీ స్థానంలో మొత్తం 827 మంది ఓటర్లున్న రెండు పోలింగ్ కేంద్రాల్లో పోలైన ఓట్లు తడిసి లెక్కింపునకు వీలుగా లేవని అప్పట్లో కౌంటింగ్ సిబ్బంది తేల్చారు. మొదటి రెండు స్థానాల్లో ఉన్న అభ్యర్థుల మధ్య ఓట్ల తేడా 517గా ఉండడం, లెక్కించకుండా మిగిలిపోయిన ఓట్లు అంతకంటే ఎక్కువ ఉండడంతో అప్పట్లో ఆ ఎన్నికల ఫలితాన్ని ప్రకటించకుండా వాయిదా వేశారు. తాజాగా ఆ రెండు పోలింగ్ బూత్‌లలో మంగళవారం పోలింగ్ నిర్వహించగా 757 ఓట్లు పోలయ్యాయి. ఈ 757 ఓట్లే ఇప్పుడు ఆ జెడ్పీటీసీ విజేతను నిర్ణయించనున్నాయి. అప్పట్లో ఓట్లు తడిసిన కారణంగా ఆరు ఎంపీటీసీ స్థానాల ఫలితాల ప్రకటనను వాయిదావేశారు. రీ పోలింగ్ నిర్వహించడంతో ఆ ఆరు ఎంపీటీసీ స్థానాల ఫలితాలు కూడా గురువారం తేలనున్నాయి. -
AP MPTC And ZPTC Elections 2021: ముగిసిన పోలింగ్
-
AP: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు.. ముగిసిన పోలింగ్
రాష్ట్రంలో 10 జడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల పోలింగ్ సాయత్రం 5 గంటలకు ముగిసింది. ఈ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. క్యూలైన్లలో ఉన్న ఓటర్లకు ఓటు వేసే అవకాశం కల్పిస్తామని ఎన్నికల అధికారులు తెలిపారు. కాగా, ఈ నెల 18న ఓట్ల లెక్కింపు జరగనుంది. Live Updates TIME: 5:00PM అనంతపురం: అనంతపురం జిల్లాలోని చిలమత్తూరు జెడ్పీటీసీ, 16 ఎమ్పీటీసీలకు జరిగిన ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ కేంద్రాల గేట్స్‌ను అధికారులు మూసేశారు. 5 గంటల తర్వాత క్యూలైన్లలో ఉన్న వారికి మాత్రమే ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. జెడ్పీటీసీ, ఎమ్పీటీసీ ఎన్నికల్లో 65 శాతం పోలింగ్ నమోదైంది. Time 4:00 PM ►నెల్లూరు జిల్లా: కోట జడ్పీ హైస్కూల్లో జరుగుతున్న ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ సరళిని ఆర్డీఓ మురళీకృష్ణ పరిశీలించారు. సాయంత్రం 4 గంటలవరకు 56.3 శాతం పోలింగ్ నమోదు. ►పశ్చిమగోదావరి జిల్లా: పెనుగొండ మండలం జెడ్పీటీసీ ఎన్నికలో సాయంత్రం 4 గంటల వరకు 65.2 శాతం పోలింగ్ నమోదు. ► గుంటూరు జిల్లా: శావల్యాపురం మండలం వేల్పూర్ లో జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలకు వెళ్లిన టీడీపీ అభ్యర్థి పారా హైమావతి ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించారు. ఈ విషయాన్ని ఓటర్లు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. పోలింగ్ కేంద్రంలో క్యూ లైన్ లో ఓటర్ ను ప్రభావితం చేస్తున్న హైమావతిని పోలీసులు బయటికి పంపించారు. దీంతో ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ► తూర్పు గోదావరి జిల్లా: కోరుకొండ మండలం పశ్చిమ గానుగూడెంలో 4గంటలకు నమోదైన పోలింగ్ శాతం 73.64%. ► ప్రకాశం జిల్లా: పెద్దారవీడు మండలం తంగిరాల పల్లి ఎంపీటీసీ స్థానానికి సంబంధించి 4 గంటలకు 72.23% పోలింగ్ నమోదు. Time 3:00 PM ► కర్నూలు జిల్లా జిల్లాలో నంద్యాల జడ్పీటీసీ, బైచిగేరి, ధనాపురం, హానవాలు, చాగలమర్రి, టి. గోకులపాడు, మల్లేపల్లి, చాకరాజువేముల ఎంపీటీసీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో మధ్యాహ్నం 3 గంటలకు 57.33 శాతం పోలింగ్ నమోదు. ► నెల్లూరు జిల్లా కోవూరు మండలం గంగవరం ఎంపీటీసీ ఎన్నికలో 3 గంటలకు 62 శాతం పోలింగ్ నమోదు ► పశ్చిమగోదావరి జిల్లా: సాయంత్రం 3 గంటల వరకు నుగొండ మండలం జడ్పీ, ఎంపీటీసీ 59.97 శాతం పోలింగ్ శాతం. ► కృష్ణా జిల్లా జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ పెడన జడ్పీటీసీ 61.20 శాతం జి.కొండూరు జడ్పీటీసీ 54.92 శాతం విస్సన్నపేట జడ్పీటీసీ 44.49 శాతం ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ఆగిరిపల్లి (మం) ఈదర-1: ఎంపీటీసీ 74.88 శాతం గన్నవరం (మం) చినఅవుటుపల్లి - ఎంపీటీసీ 60.90 శాతం నూజివీడు (మం) దేవరకుంట - ఎంపీటీసీ 67.69 శాతం నాగాయలంక (మం) పర్రచివర - ఎంపీటీసీ 57.62 శాతం ముదినేపల్లి (మం) ముదినేపల్లి-2: ఎంపీటీసీ 49.23 వణుదుర్రు ఎంపీటీసీ 56.59 శాతం పెనుగంచిప్రోలు (మం) కొనకంచి- ఎంపీటీసీ 67.62 శాతం Time: 2:00 PM ► ప్రకాశం జిల్లా: పిసి పల్లి మండలం మురుగమ్మి ఎంపీటీసీ స్థానంలో ఇప్పటివరకు 78% పోలింగ్ నమోదు నమోదైంది. ► విశాఖ జిల్లా : ఆనందపురం మండలం వెల్లంకి, వేములవలస జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ మల్లికార్జున సందర్శించారు. జిల్లాలో జరుగుతున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఇప్పటివరకు 51 శాతం పోలింగ్ నమోదైంది. ► నెల్లూరు జిల్లా: సైదాపురం మండలం ఆనంతమడుగు ఎంపీటీసీ స్థానాన్నికి జరుగుతున్న పోలింగ్ సరళిని ఎన్నికల పరిశీలకులు బసంత్ కుమార్, గూడూరు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి పరిశీలించారు. ► తూర్పుగోదావరి జిల్లా: ♦ ఎటపాక మండలం 12 ఎంపీటీసీ స్థానాలకు 2 గంటలకు 69.4% శాతం పోలింగ్ నమోదైంది. ♦ వి ఆర్ పురం మండలం, చిన్నమట్టపల్లి ఎంపీటీసీ స్థానానికి 71% ఓటింగు నమోదు. ♦ కపిలేశ్వరపురం మండలం వాక తిప్ప నాగులచెరువు ఎంపీటీసీ స్థానానికి సంబంధించి 2 గంటలకు పోలింగ్ శాతం 55.90% ఓటింగు నమోదు. ♦ సీతానగరం మండలం కాటవరం ఎంపీటీసీ స్థానాలు సంబంధించి 2గంటలకు పోలింగ్ శాతం 60.6% ఓటింగు నమోదు. ♦ ఏజెన్సీ ప్రాంతం కావడంతో ముందస్తు ప్రణాళిక ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకే ముగిసిన పోలింగ్ .వి ఆర్ పురం మండలం, చిన్నమట్టపల్లి ఎంపీటీసీ స్థానానికి 72% పోలింగ్ నమోదు. Time: 1.25 PM ►గుంటూరు జిల్లా: ప్రత్తిపాడు మండలం నడింపాలెంలో జరుగుతున్న ఎంపీటీసీ ఎన్నికలను గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరీఫ్ పరిశీలించారు. ► కృష్ణాజిల్లా: మధ్యాహ్నం 1 గంట వరకు జి.కొండూరు జడ్పీటీసీలో 43.7 శాతం, విస్సన్నపేట జడ్పీటీసీలో 36 శాతం, పెడన జడ్పీటీసీ 48 శాతం పోలింగ్ నమోదైంది. ► కర్నూలు: జిల్లాలో నంద్యాల జడ్పీటీసీ, బైచిగేరి, ధనాపురం, హానవాలు, చాగలమర్రి, టి. గోకులపాడు, మల్లేపల్లి, చాకరాజువేముల ఎంపీటీసీ స్థానాల్లో మధ్యాహ్నం ఒంటి గంట 50.18 శాతం పోలింగ్. ► పశ్చిమగోదావరిజిల్లా: జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం12 గంటల వరకు పెనుగొండ జడ్పీటీసీలో 39.63 శాతం పోలింగ్ నమోదైంది. Time: 12.25 PM 10 జడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ► కృష్ణా జిల్లాలోని జి.కొండూరులో జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ సిద్దార్ధ్ కౌశల్ పరిశీలించారు. Time: 11.25 AM ► 10 జడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ► కృష్ణా జిల్లా: ఉదయం 11 గంటలకు జడ్పీటీసీ పోలింగ్ శాతాలు.. జి.కొండూరు జడ్పీటీసీ-28.18 శాతం, విస్సన్నపేట జడ్పీటీసీ- 16 శాతం, పెడన జడ్పీటీసీ-26.80 శాతం నమోదైంది. Time: 10.25 AM ► 10 జడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. Time: 9.30 AM ► 10 జడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ► కృష్ణాజిల్లా: ఉదయం 9 గంటలకు జీ.కొండూరు జడ్పీటీసీ పోలింగ్‌లో 10 శాతం, విస్సన్నపేట జడ్పీటీసీ పోలింగ్‌లో 8.5 శాతం, పెడన జడ్పీటీసీ పోలింగ్‌లో 10.24 శాతం పోలింగ్ నమోదైంది. ► కర్నూల్ జిల్లా: కృష్ణగిరి మాండలం టి.గోకులపాడు ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌లో 9 గంట వరకు 18.94 శాతం పోలింగ్ నమోదైంది. Time: 8.30 AM ► 10 జడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. వృద్దులు, వికలాంగులుకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇబ్బంది లేకుండా పోలింగ్ కేంద్రల వద్ద ఎన్నికల అధికారులు వీల్ చైర్లను ఏర్పాటు చేశారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ పోలీసులు అమలు చేస్తున్నారు. Time: 7.20 AM ► రాష్ట్రంలోని 10 జడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవాడానికి పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. Time: 7.00 AM ► రాష్ట్రంలోని 10 జడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. వివిధ కారణాలతో అప్పట్లో ఆగిపోయిన, గెలిచినవారు చనిపోయిన కారణంగా ఆయా స్థానాల్లో ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. మంగళవారం 954 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ► ఈ పోలింగ్‌లో 8,07640 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. జడ్పీటీసీ స్థానాల్లో 40 మంది, ఎంపీటీసీ స్థానాల్లో 328 మంది పోటీలో ఉన్నారు. ఓట్లను ఈనెల 18న లెక్కిస్తారు. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 10 జెడ్పీటీసీ స్థానాలకు, 123 ఎంపీటీసీ స్థానాలకు మంగళవారం ఎన్నికలు జరగనున్నాయి. వివిధ కారణాలతో అప్పట్లో ఆగిపోయిన, గెలిచినవారు చనిపోయిన కారణంగా ఆయా స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇవికాకుండా గతంలో ఓట్ల లెక్కింపు సమయంలో తడిసిన ఓట్ల కారణంగా లెక్కింపు ఆగిపోయిన వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు జెడ్పీటీసీ స్థానంలో రెండు బూత్‌లతోపాటు మరో ఆరు ఎంపీటీసీ స్థానాల్లోను మంగళవారం ఫ్రెష్ (రీ) పోల్ నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు చెప్పారు. మొత్తం 14 జెడ్పీటీసీ స్థానాలు, 176 ఎంపీటీసీ స్థానాల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీచేశారు. వీటిలో నాలుగు జెడ్పీటీసీ స్థానాలు, 50 ఎంపీటీసీ స్థానాల ఎన్నిక ఏకగ్రీవం అయిన సంగతి తెలిసిందే. మూడు ఎంపీటీసీ స్థానాల్లో ఎవరూ నామినేషన్ల దాఖలు చేయకపోవడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. మిగిలినచోట్ల 954 పోలింగ్ కేంద్రాల్లో మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. జెడ్పీటీసీ స్థానాల్లో 40 మంది, ఎంపీటీసీ స్థానాల్లో 328 మంది పోటీలో ఉన్నారు. మొత్తం 8,07,640 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఓట్లను ఈనెల 18న లెక్కిస్తారు. -
టీడీపీ అక్రమాలు.. ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, అమరావతి: టీడీపీ అక్రమాలపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. ఎస్ఈసీ నీలం సాహ్నికి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, నారాయణమూర్తి ఫిర్యాదు చేశారు. మున్సిపల్, జెడ్పీ ఉప ఎన్నికల్లో టీడీపీ కుట్రలకు తెరలేపిందని లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు రాజకీయ విలువలను దిగజారుస్తున్నారన్నారు. కుప్పంలో టీడీపీ నేతలు అమర్నాథ్రెడ్డి, పులివర్తి నాని దౌర్జనాలు చేస్తున్నారన్నారు. కుప్పం పర్యటనలో లోకేష్ న్యాయస్థానాల విలువలను దిగజార్చేలా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు ఓటర్లను భయపెడుతూ, ప్రలోభాలకు గురిచేస్తున్నారని లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. చదవండి: kuppam: ఓటర్లను నేరుగా ప్రలోభపెడుతున్న చంద్రబాబు ‘‘కుప్పం వెళ్లాలని చంద్రబాబు స్పెషల్ ఫ్లైట్ సిద్ధం చేసుకున్నారు. చంద్రబాబుకు కుప్పంలో ఓటు లేదు. ఎందుకు వెళ్తున్నారు. టీడీపీ అరాచకాలపై ఆధారాలతో సహా ఈసీకి ఫిర్యాదు చేశాం. కుప్పంలో చంద్రబాబు ఓటరు కాదు.. నారావారి పల్లెలో కూడా బాబుకు ఓటు లేదు. దొంగ ఓట్లు వేయించే కల్చర్ టీడీపీదే.. ప్రశాంతంగా ఉన్న ఏరియాలో అలజడి సృష్టించాలని టీడీపీ కుట్రలు చేస్తోందని’’ లేళ్ల అప్పిరెడ్డి దుయ్యబట్టారు. -
22న నెల్లూరు మేయర్ ఎన్నిక
సాక్షి, అమరావతి: నెల్లూరు నగర మేయర్‌తో పాటు ఇద్దరు డిప్యూటీ మేయర్ల ఎన్నిక ఈ నెల 22న నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఆదివారం నోటిఫికేషన్ జారీ చేశారు. సోమవారం ఎన్నికలు జరుగుతున్న ఆకివీడు (ప.గో), జగ్గయ్యపేట, కొండపల్లి (కృష్ణా), దాచేపల్లి, గురజాల (గుంటూరు), దర్శి (ప్రకాశం), బుచ్చిరెడ్డిపాలెం (నెల్లూరు), బేతంచెర్ల (కర్నూలు), కమలాపురం, రాజంపేట (వైఎస్సార్), పెనుకొండ (అనంతపురం), కుప్పం (చిత్తూరు) మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో చైర్మన్ల ఎన్నికను అదే రోజు నిర్వహిస్తారు. ఆయా మునిసిపాలిటీల్లో రెండేసి చొప్పున వైస్ చైర్మన్ పదవులకు ఆ రోజే ఎన్నికలు జరుపుతారు. ఆయా నగర, పట్టణ, నగర పంచాయతీల్లో డివిజన్, వార్డు స్థానాలకు సోమవారం ఉ.7 గంటల నుంచి సా.5 గంటల వరకు పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. బుధవారం ఓట్ల లెక్కింపు చేపడతారు. ఆయా చోట్ల పరోక్ష పద్ధతిలో మేయర్, డిప్యూటీ మేయర్, మునిసిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లను ఎన్నుకునేందుకు అక్కడ గెలిచిన అభ్యర్థులతో 22వ తేదీన ఉ.11 గంటలకు నగరపాలక సంస్థ, మునిసిపాలిటీ, నగర పంచాయతీల వారీగా ప్రత్యేక సమావేశాలు జరపాలని ఎస్ఈసీ ఆయా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఇందుకు ఆయా మునిసిపాలిటీల్లో గెలిచిన అభ్యర్థులకు మేయర్, చైర్మన్ల ఎన్నికకు సంబంధించిన సమాచారాన్ని 18వ తేదీలోగా వ్యక్తిగతంగా తెలియజేయాలని పేర్కొన్నారు. డిప్యూటీ, వైస్ చైర్మన్ల ఎన్నిక ఇలా.. మేయర్, చైర్మన్ ఎన్నిక పూర్తయిన తర్వాతనే డిప్యూటీ మేయర్, వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ ప్రారంభించాలని.. ఎక్కడైనా వివిధ కారణాలతో మేయర్, చైర్మన్ ఎన్నిక వాయిదా పడితే డిప్యూటీ మేయర్, వైస్ చైర్మన్ల ఎన్నికలు కూడా వాయిదా పడినట్టే అవుతుందని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. 22న జరగాల్సిన ఎన్నికలు వాయిదా పడినచోట 23వ తేదీన తిరిగి ఎన్నిక జరిపేందుకు ఆయా జిల్లా కలెక్టర్లు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. జెడ్పీ వైస్ చైర్మన్, ఎంపీపీ ఎన్నికలు సైతం.. ► విజయనగరం జెడ్పీలో ఇద్దరు వైస్ చైర్మన్లకు గాను ఒకరు ఇటీవల మృతి చెందడంతో ఆ పదవికి కూడా ఈ నెల 22వ తేదీన ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని వేరొక నోటిఫికేషన్ జారీ చేశారు. ► గతంలో ఎంపీపీ ఎన్నిక వాయిదా పడిన వాల్మీకిపురం, గుడిపల్లి (చిత్తూరు)తోపాటు తాజాగా ఎంపీటీసీ ఎన్నికలు జరిగిన ఎటపాక (తూ.గో) మండలంలో మండలాధ్యక్ష పదవులకు ఈ నెల 22వ తేదీన ఎన్నిక నిర్వహిస్తారు. ఆయా మండలాల్లో ఒక్కొక్క ఉపాధ్యక్ష , ఒక్కో కో–ఆప్టెడ్ సభ్యుని స్థానాలకు అదే రోజు ఎన్నికలు నిర్వహిస్తారు. గతంలో ప్రత్యేకంగా ఒక్క మండల ఉపాధ్యక్ష పదవి ఎన్నిక వాయిదా పడిన నరసరావుపేట (గుంటూరు), గాలివీడు, సిద్ధవటం (వైఎస్సార్)లలో 22నే ఉపాధ్యక్ష ఎన్నికలు నిర్వహిస్తారు. ► ఈ ఏడాది జనవరి–ఫిబ్రవరి నెలలో పంచాయతీ ఎన్నికలు జరిగినప్పుడు వార్డు సభ్యుల ఆధ్వర్యంలో పరోక్ష పద్ధతిన జరగాల్సిన ఉప సర్పంచ్ ఎన్నిక వాయిదా పడింది. అలా మిగిలిపోయిన 130 గ్రామ పంచాయతీల్లోనూ 22వ తేదీనే ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించాలని ఎస్ఈసీ జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులిచ్చారు. -
కుప్పంలో టీడీపీ అక్రమాలపై ఈసీకి ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ
-
కుప్పంలో టీడీపీ అక్రమాలపై ఈసీకి ఫిర్యాదు
సాక్షి, అమరావతి: కుప్పంలో టీడీపీ అక్రమాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్‌కి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిని కలిసిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, నవరత్నాలు వైస్ చైర్మన్ నారాయణమూర్తి వినతిపత్రం అందజేశారు. అనంతరం లేళ్ల అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 'ఈ ఎన్నికల్లో చంద్రబాబు పడుతున్న పాట్లు చూస్తే జాలి కలుగుతోంది. 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు ఈ ఎన్నికల్లో ఉనికిని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా 80శాతం ప్రజలు వైఎస్సార్సీపీకి పట్టం కడుతున్నారు. కుప్పంలో చంద్రబాబు ఓటుకి రూ. 5వేలు ఇస్తున్నారు. అనేక రకాలుగా ప్రలోభ పెట్టేలా మాట్లాడుతున్నారు. ఏ కేసులో అయినా 48 గంటల్లో స్టే తెచుకుంటామంటూ లోకేష్ న్యాయ స్థానాల్ని అవమానించేలా మాట్లాడుతున్నారు' అని లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. చదవండి: (తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త..) -
ఈ ‘పరిషత్’ ఎన్నికల్లో చిటికెన వేలిపై ‘సిరా’ గుర్తు
సాక్షి, అమరావతి: ఓటు హక్కు వినియోగించుకున్న ఓటరుకు సాధారణంగా ఎడమ చెయ్యి చూపుడు వేలిపై సిరా గుర్తు పెడుతుంటారు. కానీ.. ఈ నెల 16న జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటు వేసే ఓటరుకు ఎడమ చిటికెన వేలిపై సిరా గుర్తు వేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని బుధవారం నోటిఫికేషన్ జారీ చేశారు. చదవండి: 4 జెడ్పీటీసీలు ఏకగ్రీవమే పలుచోట్ల 14న సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు.. 16న పలుచోట్ల ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఒకే గ్రామంలో సర్పంచ్, వార్డు సభ్యుడు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నిక జరిగే అవకాశం ఉండటంతో ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో ఓటరుకు ఎడమ చెయ్యి చూపుడు వేలిపైనా.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటరు ఎడమ చెయ్యి చిటికెన వేలిపైన సిరా గుర్తు వేయాలని పేర్కొంది. -
AP: 4 జెడ్పీటీసీలు ఏకగ్రీవమే
సాక్షి, అమరావతి: ఏకగ్రీవంగా గెలిచిన విజేతలు ప్రమాణ స్వీకారానికి ముందే చనిపోవడంతో మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్న మూడు జెడ్పీటీసీ స్థానాలు ఈసారి కూడా ఏకగ్రీవాలే అయ్యాయి. మూడింటికి మూడు చోట్లా మరోసారి వైఎస్సార్సీపీ అభ్యర్ధులే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైఎస్సార్ జిల్లా లింగాల, గుంటూరు జిల్లా కారంపూడి, కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల జెడ్పీటీసీ స్థానాల్లో గతంలో ఏకగ్రీవంగా గెలిచిన వారు మరణించడంతో ఈ నెల 16న ఉప ఎన్నిక నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. మంగళవారంతో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియగా అన్ని చోట్లా అధికార పార్టీ అభ్యర్ధులే బరిలో నిలవడంతో ఆయా స్థానాలు ఏకగ్రీవమైనట్లు రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు. కలకడ.. వైఎస్సార్సీపీదే ఇక వీటికి తోడు మొన్నటి ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియకు, పోలింగ్‌కు మధ్య పోటీలో ఉన్న వివిధ పార్టీల అభ్యర్థులు మరణించడంతో వాయిదా పడ్డ 11 జెడ్పీటీసీ స్థానాలకు కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహిస్తోంది. వీటిల్లో ఒక జెడ్పీటీసీ స్థానాన్ని అధికార వైఎస్సార్సీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. చనిపోయిన అభ్యర్ధికి సంబంధించిన రాజకీయ పార్టీ నుంచి అదనంగా నామినేషన్ దాఖలుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అవకాశం ఇచ్చింది. చిత్తూరు జిల్లా కలకడ జెడ్పీటీసీ స్థానంలో మరణించిన టీడీపీ అభ్యర్థికి బదులుగా ఆ పార్టీ నుంచి ఎవరూ పోటీలో నిలవలేదు. అక్కడ వైఎస్సార్సీపీ అభ్యర్ధి ఒక్కరే పోటీలో ఉండడంతో ఆ జెడ్పీటీసీ స్థానం ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు. మిగిలిన 10 జెడ్పీటీసీ స్థానాల్లో మొత్తం 40 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. సర్పంచి, వార్డు పదవులకు 14న పోలింగ్ రాష్ట్రవ్యాప్తంగా 500 గ్రామ పంచాయతీల పరిధిలో 69 సర్పంచి, 533 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరగనుండగా మంగళవారం సాయంత్రానికి నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. 30 సర్పంచి స్థానాల్లో ఎన్నిక ఏకగ్రీవంగా ముగిసింది. మరో 4 చోట్ల ఒక్కరు కూడా నామినేషన్లు దాఖలు చేయలేదు. మిగిలిన 35 చోట్ల 109 మంది పోటీలో ఉండగా అక్కడ ఈ నెల 14వ తేదీ పోలింగ్ జరగనుంది. 533 వార్డు సభ్యుల పదవుల్లో 380 చోట్ల ఎన్నిక ఏకగ్రీవమైంది. మరో 85 చోట్ల ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. మిగిలిన 68 వార్డుల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా 192 మంది పోటీలో ఉన్నారు. 50 ఎంపీటీసీలు ఏకగ్రీవం.. ఎన్నికలు ఆగిపోవడం, గెలిచిన వారు మృతి చెందడం లాంటి కారణాలతో 176 ఎంపీటీసీ స్థానాల్లో తాజాగా ఎన్నికలు నిర్వహిస్తుండగా నామినేషన్లు ఉపసంహరణ ప్రక్రియ ముగిసే సమయానికి 50 చోట్ల ఏకగ్రీవాలయ్యాయి. ఇందులో 46 చోట్ల అధికార వైఎస్సార్సీపీ ఏకగ్రీవంగా గెలుచుకోగా మూడు చోట్ల టీడీపీ, ఒక చోట ఇండిపెండెంట్ అభ్యర్ధి ఏకగ్రీవంగా గెలుపొందారు. మరో మూడు ఎంపీటీసీ స్థానాల్లో ఒక్కరు కూడా నామినేషన్ దాఖలు చేయలేదు. మిగిలిన 123 చోట్ల ఎన్నికలు జరగనుండగా 328 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగేచోట ఈ నెల 16వ తేదీన పోలింగ్ జరగనుంది. -
అక్కడ మధ్యాహ్నం 2 వరకే పోలింగ్
సాక్షి, అమరావతి: ఈ నెల 16న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగే చోట సా.5 గంటల వరకు పోలింగ్ జరుగుతున్నప్పటికీ.. తూర్పు గోదావరి జిల్లాలోని 14 ఎంపీటీసీ స్థానాల్లో మాత్రం మ.2 గంటల వరకే పోలింగ్ నిర్వహించనున్నారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో శాంతిభద్రతల అంశానికి సంబంధించి జిల్లా కలెక్టర్ నుంచి అందిన నివేదిక మేరకు.. ఆ జిల్లాలో ఏటపాక మండలంలోని 12 ఎంపీటీసీ స్థానాలతో పాటు వీఆర్ పురంలోని చినమట్టపల్లి ఎంపీటీసీ, మారేడుమిల్లి మండలంలోని దొరచింతలవాని పాలెం ఎంపీటీసీ పోలింగ్ సా.5 గంటల వరకు కాకుండా మ.2 గంటల వరకే కొనసాగుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఆదేశాలు జారీచేశారు. 14, 16 తేదీల్లో సెలవు: ఇక గ్రామ సర్పంచి, వార్డు సభ్యుల ఎన్నికలు జరిగే చోట ఈ నెల 14న.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగే చోట ఈనెల 16న ప్రభుత్వ కార్యాలయాలతోపాటు ఇతర అన్ని రకాల సంస్థలకు సెలవు ప్రకటిస్తూ పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీచేశారు. అలాగే, పంచాయతీ ఎన్నికలు జరిగే చోట పోలింగ్ ముగిసే సమయానికి 44 గంటల ముందు నుంచీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగే చోట 48 గంటల ముందు నుంచి మద్యం అమ్మకాలను నిలుపుదల చేయాలని కూడా ఉత్తర్వులిచ్చారు. ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ సాక్షి, అమరావతి/నెల్లూరు సిటీ: నెల్లూరు కార్పొరేషన్‌తోపాటు 12 మునిసిపాలిటీలు, నగర పంచాయతీలతో పాటు వివిధ కార్పొరేషన్లలో జరుగుతున్న 353 డివిజన్లు, వార్డుల్లో ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారం ముగిసింది. నెల్లూరు కార్పొరేషన్లో 54 డివిజన్లకు ఎన్నికలు జరుగుతుండగా 8 డివిజన్లలో వైఎస్సార్సీపీ అభ్యర్థులు మాత్రమే బరిలో నిలిచినట్టు తెలిసింది. అనధికారికంగా అందిన సమాచారం మేరకు.. గుంటూరు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీలో ఒక వార్డులో, గురజాల నగర పంచాయతీలో ఆరు వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు మాత్రమే బరిలో ఉన్నారు. ప్రకాశం జిల్లా దర్శిలో ఒక వార్డు, చిత్తూరు జిల్లా కుప్పం మునిసిపాలిటీలో ఒక వార్డులో వైఎస్సార్సీపీ అభ్యర్థులు మినహా మిగిలినవారు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో ఈ వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఎన్నిక దాదాపు ఏకగ్రీవమేనని, అధికారిక ప్రకటన మాత్రమే వెలువడాల్సి ఉందని సమాచారం. గతంలో ఎన్నికలు నిలిచిన, గెలిచినవారి మరణంతో ఖాళీ అయిన వార్డులకు ప్రస్తుతం ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ తరహాలో ఎన్నికలు జరుగుతున్న గుంటూరు జిల్లా మాచర్ల మునిసిపాలిటీలోని 8వ వార్డు, రేపల్లెలోని 16, మచిలీపట్నంలో 32, నూజివీడు 27వ వార్డులో నామినేషన్ల ఉపసంహరణల అనంతరం వైఎస్సార్సీపీ అభ్యర్థులే బరిలో ఉన్నారు. -
ఆగిన మునిసిపాలిటీల్లో త్వరలో ఎన్నికలు?
సాక్షి, అమరావతి: నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మరో 12 మునిసిపాలిటీలలో వచ్చే నెల 7 లేదా 8 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్(ఎస్ఈసీ) తగిన ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ ఏడాది మార్చిలో మునిసిపల్ ఎన్నికలు నిర్వహించిన సమయంలో వివిధ కారణాలతో నాలుగు మునిసిపల్ కార్పొరేషన్లతో పాటు 32 మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. అప్పట్లో ఎన్నికలు ఆగిన వాటిల్లో.. నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు చంద్రబాబు సొంత నియోజకవర్గంలోని కుప్పం మునిసిపాలిటీ, బుచ్చిరెడ్డిపాలెం(నెల్లూరు), ఆకివీడు(పశ్చిమగోదావరి), జగ్గయ్యపేట, కొండపల్లి(కృష్ణా), దాచేపల్లి, గురజాల(గుంటూరు), దర్శి(ప్రకాశం), బేతంచెర్ల(కర్నూలు), కమలాపురం, రాజంపేట(వైఎస్సార్), పెనుకొండ(అనంతపురం) మునిసిపాలిటీలలో తాజాగా ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. వీటికి సంబంధించి సోమవారం, లేదంటే మంగళవారం ఎన్నికల నోటిఫికేషన్ కూడా జారీ చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ఆయా చోట్ల.. నోటిఫికేషన్ జారీ చేసిన మరుసటి రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ చేపట్టి.. నెలాఖరులోగానే ఆ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఈ ఏడాది మార్చిలో మునిసిపల్ ఎన్నికలు జరిగిన ఏడు నగర పాలక సంస్థల పరిధిలో వివిధ కారణాలతో ఎన్నికలు నిలిచిపోయిన 12 డివిజన్లకు, మరో 13 మునిసిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో 14 వార్డులకు కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ సందర్భంగానే ఎన్నికలు నిర్వహించనుంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని తాజాగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశం కూడా నిర్వహించారు. అలాగే శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పంచాయతీరాజ్, మునిసిపల్ శాఖల కమిషనర్లు కూడా టెలి కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. మునిసిపల్ ఎన్నికలకు ముందు.. ఆ తర్వాత.. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 14 మండలాల్లో జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు 71 గ్రామాల్లో సర్పంచ్, 176 స్థానాల్లో ఎంపీటీసీ ఎన్నికలను కూడా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. అన్నింటికీ కలిపి ఒకే రోజు వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేసే అవకాశం ఉంది. మునిసిపల్ ఎన్నికలు జరిగే తేదీకి ఒక్క రోజు ముందు సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు, ఆ తర్వాత రోజు మునిసిపల్ ఎన్నికలు నిర్వహించి.. ఆ మరుసటి రోజు జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా గెలిచి చనిపోయిన కారంపూడి(గుంటూరు), లింగాల(వైఎస్సార్), కొలిమిగుండ్ల(కర్నూలు) స్థానాలతో పాటు, పోలింగ్ జరగక ముందు పోటీలో ఉన్న అభ్యర్థులు చనిపోయిన కారణంగా ఎన్నిక నిలిచిన మరో 11 మండలాల్లో జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. -
కోరం లేకపోయినా.. ఎంపీపీ ఎన్నిక
సాక్షి, అమరావతి: రెండుసార్లు ప్రత్యేక సమావేశాలు నిర్వహించినా మండల ప్రజాపరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నికలు వాయిదా పడిన మండలాల్లో ఈ నెల 8వ తేదీన నిర్ణీత కోరం లేకపోయినా ఆ ఎన్నికలను యథావిధిగా జరిపేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చింది. గత నెల 24న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఎంపీపీ, ఉపాధ్యక్ష ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ రోజు ఎక్కడైనా ఎన్నిక జరగకపోతే ఆ మరుసటి రోజు 25వ తేదీన ఎన్నిక నిర్వహించారు. అయినప్పటికీ రాష్ట్రంలో 21 మండలాల్లో 8 ఎంపీపీ పదవులకు, 20 మండలాల్లో ఉపాధ్యక్ష, 6 చోట్ల కో–అప్టెడ్ సభ్యుల ఎన్నిక వాయిదా పడింది. ఆయా మండలాల్లో ఎన్నిక వాయిదా పడ్ద పదవులకు తిరిగి ఈ నెల 8న ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించి కోరం నిబంధనలపై జిల్లా అధికారులకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. మొదట ఎంపీపీ.. ఆ తరువాతే ఉపాధ్యక్ష ఎన్నికలు ► ఎంపీపీ, ఉపాధ్యక్ష ఎన్నికలు ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన నేపథ్యంలో 8వ తేదీన నిర్ణీత కోరం లేకపోయినా నిబంధనల ప్రకారం ఎన్నికను యథావిధిగా జరుపుకోవచ్చు. అయితే ఎంపీపీ, ఉపాధ్యక్ష ఎన్నిక రెండూ నిర్వహించాల్సిన చోట మొదట ఎంపీపీ ఎన్నిక పూర్తయిన తర్వాత ఉపాధ్యక్ష ఎన్నిక నిర్వహించుకోవాలి. ► ఆరు మండలాల్లో కో–అప్టెడ్ సభ్యుల ఎన్నిక కూడా జరగాల్సి ఉంది. ఈ ఎన్నికకు మాత్రం తప్పనిసరిగా కోరం ఉండాలి. 8వ తేదీన నిర్ణీత కోరం లేక కో–అప్టెడ్ సభ్యుని ఎన్నిక నిర్వహించే పరిస్థితి లేకపోతే.. అదే మండలంలో ఎంపీపీ, ఉపాధ్యక్ష ఎన్నిక కూడా జరగాల్సి ఉంటే ఆ మండలాల్లో 9వ తేదీన కోరంతో సంబంధం లేకుండా ఎంపీపీ, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నిక జరుపుకోవచ్చు. ► ఒకవేళ 8వ తేదీ కో–అప్టెడ్ సభ్యుని ఎన్నిక జరగాల్సిన మండలాల్లో ఆ పదవికి ఎవరూ నామినేషన్లు దాఖలు చేయకపోయినా, లేదంటే నామినేషన్లు దాఖలు చేసిన వారందరూ తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నా, ఆ కో–అప్టెడ్ సభ్యుని ఎన్నికను పక్కనపెట్టి ఎంపీపీ, ఉపాధ్యక్ష ఎన్నికను కోరంతో సంబంధం లేకుండా జరుపుకోవచ్చు. -
ప్రభుత్వ ఉద్యోగులూ.. జాగ్రత్త!
2018 అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఇల్లందకుంట మండలం మల్యాల గ్రామంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు రవీందర్ టీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ప్రచారం నిర్వహించారని ఫిర్యాదులొచ్చాయి. రంగంలోకి దిగిన అధికారులు విచారణ జరపగా నిజమేనని తేలడంతో సస్పెన్షన్ వేటు వేశారు. అవే ఎన్నికల్లో చొప్పదండి మండలం ఆర్నకొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సీఈవో కుమారస్వామి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని ఫిర్యాదులొచ్చాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గాను ఆయన సస్పెండ్ అయ్యారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పదుల సంఖ్యలో ఉద్యోగులపై ఇలాగే వేటు పడింది. అందుకే ఉద్యోగులూ.. జాగ్రత్త!. సాక్షి, కరీంనగర్: హుజూరాబాద్ ఉపఎన్నికపై దేశ, రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగులు ఏమాత్రం ఏమరుపాటుగా వ్యవహరించినా వేటుపడటం ఖాయమే. ఎన్నికల నిబంధనల అమలులో ఉన్నతాధికారులు పక్కాగా వ్యవహరిస్తున్నారు. ప్రచారంలో పాల్గొన్నా, మద్దతు తెలిపినా సస్పెన్షన్ వేటు పడనుంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చినందున అధికారాలు ఎన్నికల సంఘానికి బదిలీ అయ్యాయి. దీంతో ఉద్యోగులు అనుచితంగా వ్యవహరిస్తే వేటు వేయడానికి సిద్ధమైంది. ఉద్యోగులు కేవలం తమ విధులకే పరిమితం కావాలి తప్ప ఏ రాజకీయ పక్షానికి వత్తాసు పలకొద్దని ఎన్నికల అధికారులు హెచ్చరిస్తున్నారు. నిరంతర నిఘాతోపాటు వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్ పోస్టులపై కూడా ఓ కన్నేశారు. ఎన్నికల్లో నాయకులు ఎలా ప్రచారం చేసుకున్నా, ఎటువంటి వ్యాఖ్యలు చేసినా ఏర్పడే ప్రభావం కన్నా ప్రభుత్వ ఉద్యోగులు చేసే ప్రచారం, వారి వ్యవహార శైలి మాత్రం పెనుచిక్కులు తేనుంది. సభలు, సమావేశాలు వద్దు ప్రభుత్వ ఉద్యోగులు తమను ఎవరూ గమనించడం లేదనుకొని ఎవరి సభలోనైనా లేదా సమావేశంలోనైనా పాల్గొంటే చాలు వేటు పడినట్లే. దానికి సంబంధించి వీడియో లేదా ఫొటోలు అధికారులకు అందినా, సామాజిక మాధ్యమాల్లో ట్రోల్ అయినా జరగాల్సిన నష్టం జరుగుతుంది. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఏదో ఒక రాజకీయ పక్షానికి సానుకూలంగానో, వ్యతిరేకంగానో ఉంటూ సందర్భం వచ్చినప్పుడు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తుంటారు. ఇప్పుడిది పెనుముప్పే. అందుకే రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసే సమావేశాలకు హాజరు కాకపోవడమే ఉత్తమం. ఇష్టానుసారంగా మాట్లాడటం, పరనింద, ప్రభుత్వ పథకాలపై నిందలు మోపడం వంటి చర్యలకు దిగే ప్రభుత్వ ఉద్యోగులపై కఠినచర్యలు చేపట్టేందుకు ఎన్నికల సంఘం తన నిబంధనలకు మరింత పదును పెడుతోంది. గతంలో ఎన్నికల కోడ్ అమలులోకి వస్తూనే అంగన్వాడీలపై వేటు వేశారు. గతంలో అంగన్వాడీ, ఐకేపీ సిబ్బంది ఎన్నికల్లో చురుగ్గా పాల్గొనేవారు. ప్రస్తుతం దూరంగా ఉంటున్నారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఫోన్లు చేసి, మద్దతు కోరినా దయచేసి తమను ఎన్నికల్లోకి లాగొద్దని సూచిస్తున్నారు. సెల్ఫోన్లతో కష్టాలు.. సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోవడంతో క్షణాల్లో సమాచారం విశ్వవ్యాప్తమవుతోంది. స్మార్ట్ఫోన్లు లేనివారు లేకపోగా ఉన్నవారు అధునాతన ఫీచర్లను వినియోగిస్తున్నారు. ఇదే క్రమంలో ఉద్యోగులు సెల్‌ఫోన్ ద్వారా విస్తృతంగా వాడుతున్న ఫేస్బుక్, వాట్సాప్ గ్రూపుల్లో రాజకీయ పార్టీలకు అనుకూలంగా లేదా ప్రతికూలంగా పోస్టులు చేసినా చర్యలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. తొలుత విధుల నుంచి తొలగించాకే మరో ఆలోచన ఉంటుంది. ఉద్యోగులు ఎటువైపు? హుజూరాబాద్ ఉపఎన్నిక సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు ఏ పార్టీ వైపు ఉన్నారన్న చర్చ జోరందుకుంది. కొన్ని సంఘాలు ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే, మరికొన్ని ప్రతికూలం అంటున్నాయి. ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదని, ఆశించిన ప్రయోజనాలను కల్పించలేకపోయిందన్న ఆరోపణలున్న నేపథ్యంలో ఉద్యోగుల తీర్పు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సీపీఎస్ విధానంపై ఉద్యోగులు సర్కారుపై గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. పాత పెన్షన్ విధానాన్ని ఎవరు అమలుపరిస్తే వారికే తమ మద్దతు ఉంటుందని అంతర్గతంగా నిర్ణయించుకున్నట్లు సమాచారం. చదవండి: సిట్టింగ్‌లకు నో ఛాన్స్.. సుమారు 150 మందికి అవకాశం లేదు ! -
హుజురాబాద్ ఉప ఎన్నిక: ఆట ఆరంభం.. ఎవరూ తగ్గడం లేదు
సాక్షి, కరీంనగర్: రెండు తెలుగు రాష్ట్రాలు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణం రానేవచ్చింది. ఎట్టకేలకు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) హుజూరాబాద్ ఉప ఎన్నిక షెడ్యూలు విడుదల చేసింది. షెడ్యూలు విడుదలతో జిల్లాలో అసలైన రాజకీయ ఆట మొదలైంది. ఈటల రాజేందర్ హుజూరాబాద్ స్థానానికి రాజీనామా చేసిన దాదాపు నాలుగునెలల సుదీర్ఘ సమయం తరువాత షెడ్యూల్ రావడంతో నేతల నిరీక్షణకు తెరపడింది. ఇక అసలైన కదనరంగంలోకి కొదమసింహాల్లా దూకనున్నారు. వాస్తవానికి రాజేందర్ రాజీమానాతోనే జిల్లాలో ఉపఎన్నిక వాతావరణం మొదలైంది. రెండు ప్రధాన పార్టీలు ఈ ఉపఎన్నికను ప్రతిష్టాకంగా తీసుకోవడంతో ఎవరూ ఎక్కడా తగ్గడం లేదు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా అత్యంత పకడ్బందీగా నిర్వహించ తలపెట్టిన ఈ ఎన్నిక నిర్వహణను అధికారులు సైతం సవాలుగా తీసుకున్నారు. కాగా.. హుజూరాబాద్ ఓటర్ల సంఖ్య 2.36,283గా అధికారులు తేల్చారు. గత ఎన్నికలతో పోలిస్తే దాదాపు 10 వేల మంది ఓటర్లు పెరగడం గమనార్హం. నామినేషన్ల ప్రక్రియ ముగిసేనాటికి స్వల్ప మార్పులు చోటుచేసుకోవచ్చని అధికారులు వివరించారు. విమర్శలు– ప్రతివిమర్శలు.. ► రాజేందర్ రాజీనామా అనంతరం హుజూ రాబాద్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. చిన్నపామునైనా పెద్దకర్రతో కొట్టాలన్న ఆలోచనతో కేసీఆర్ తన మాస్టర్‌ప్లాన్‌ను అనుకున్నట్లుగానే అమలు చేస్తున్నారు. ► దళితబంధు పథకం అమలుకు చకచకా రూ.2000 కోట్లు విడుదల చేశారు. లబ్ధి దారుల సర్వే కూడా అంతే వేగంగా పూర్తయింది. 10 మందికిపైగా లబ్ధిదారులకు యూనిట్ల గ్రౌండింగ్ జరిగిపోయింది. ► మరోవైపు మంత్రి హరీశ్‌రావు, జిల్లా మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్‌లతో కలిసి రాజేందర్ విమర్శలకు ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి వెళ్లింది వ్యవహారం. ఒకదశలో వ్యక్తిగత దూషణలకు దిగిన సందర్భాలూ ఉన్నాయి. ► టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, సీఎం కేసీఆర్, హరీశ్‌రావులను టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేస్తున్నారు. అదే సమయంలో హరీశ్‌రావు కూడా దీటుగానే ప్రత్యారోపణలు చేస్తున్నారు. ► బీజేపీ విధానాలను, పెట్రో ధరల పెంపును, ప్రైవేటీకరణ, ప్రభుత్వాస్తుల విక్రయం తదితర విషయాలపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. డబుల్ డోస్ లేకుంటే అంతే.. ► కేంద్రం ఎన్నికల సంఘం ఉపఎన్నికల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ డబుల్ డోస్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తప్పనిసరి చేసింది. రాజకీయ పార్టీల నేతలు–విధుల్లో పాల్గొనే అధికారులు సెకండ్ డోస్ సర్టిఫికేట్ లేకుండా అనుమతించరు. ► ఇప్పటికే హుజూరాబాద్ వ్యాప్తంగా దాదా పు 80శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయింది. మిగిలిన వారికి కూడా అధికారులు త్వరలోనే పూర్తి చేయనున్నారు.ఈ నేపథ్యంలో ప్రధానపార్టీల రాజకీయ నేతలు, కార్యకర్తల్లో చాలామంది డబుల్ డోస్ వేసుకోలేదు. దీంతో రెండో డోస్ కోసం మధ్యాహ్నం నుంచి ఉరుకులు పరుగులు తీస్తున్నారు. 30న అభ్యర్థిని ప్రకటించనున్న కాంగ్రెస్? ► ఈ ఏడాది ఏప్రిల్ నుంచి హుజూరాబాద్ రాజకీయం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది. ► ఇప్పటికే టీఆర్ఎస్ తమ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను ప్రకటించింది. బీజేపీ నుంచి రాజేందర్ పోటీ చేస్తారు. ఇక ప్రధా న ప్రతిపక్షాల్లో ఒకటైన కాంగ్రెస్ పార్టీ మాత్రం హుజూరాబాద్ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయక పోగా.. ఈనెల 30న అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు చెబుతున్నారు. దామోదర రాజనర్సింహ నేతృత్వంలోని కమిటీ నలుగురు పేర్లను తెరపైకి తీసుకొ చ్చింది. వీరిలో కొండా సురేఖ, పత్తి కృష్ణారెడ్డి, కవ్వంపల్లి సత్యనారాయణ, ప్యాట రమేశ్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ► మరోవైపు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పగ్గాలు చేపట్టాక దూకుడుగా వెళుతున్నా రు. ఆయన సభలకు హాజరవుతున్న ఉమ్మడి జిల్లా నేతలు తమ అనుచరులను తరలించడంలో పెద్దగా ఆసక్తి చూపడం లేదన్న విమర్శలు ఉన్నాయి. చదవండి: వేడెక్కిన రాజకీయం: హుజూరా‘బాద్షా’ ఎవరో? -
ఆగిపోయిన చోట ఎన్నికల నిర్వహణపై కసరత్తు
సాక్షి, అమరావతి : వివిధ కారణాలతో సర్పంచి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఆగిపోయిన చోట తిరిగి నిర్వహించే అంశంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టి పెట్టింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలంసాహ్ని గురువారం పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఆ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో నీలంసాహ్నితో భేటీ అయ్యారు. ఎన్నికలు ఆగిపోయిన స్థానాల వివరాలు అందజేశారు. తిరిగి ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే విషయంపై చర్చించినట్లు తెలిసింది. -
జెడ్పీ, ఎంపీటీసీ సభ్యులకు నేడు, రేపటి నుంచి ఐదేళ్ల పదవీ కాలం
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఎంపీటీసీ సభ్యులుగా గెలిచిన వారి పదవీ కాలం శుక్రవారం నుంచి, జెడ్పీటీసీ సభ్యుల పదవీ కాలం శనివారం నుంచి ప్రారంభమై ఐదేళ్ల పాటు కొనసాగుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలంసాహ్ని గురువారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు 2020 మార్చి 7వ తేదీన నోటిఫికేషన్ జారీ చేయగా, పోలింగ్ 2021 ఏప్రిల్ 8న, కౌంటింగ్ ప్రక్రియ సెప్టెంబర్ 19వ తేదీన ముగిశాయి. మధ్యలో 2020 మార్చిలో 2,371 మంది ఎంపీటీసీ సభ్యులుగా, 126 మంది జెడ్పీటీసీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వారి పదవీ కాలం కూడా ఇదీ రీతిలో ఉంటుందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయ అధికారులు స్పష్టం చేశారు. -
ఏపీ: నేడు మండల పరిషత్ అధ్యక్షుల ఎన్నికలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మండల పరిషత్ అధ్యక్షుల (ఎంపీపీ) ఎన్నికలు శుక్రవారం జరగనున్నాయి. ఎంపీపీతో పాటు ప్రతి మండలానికి ఒకరు చొప్పున కో ఆప్టెడ్ సభ్యునితో పాటు మండల ఉపాధ్యక్ష పదవులకు కూడా ఎన్నికలు జరుగుతాయి. మండల పరిధిలో ఎంపీటీసీ సభ్యులుగా ఎన్నికైన వారు చేతులు ఎత్తే విధానంలో ఈ ఎన్నికలను నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించి అన్ని చోట్ల ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రత్యేక సమావేశాల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌తో పాటు జిల్లాలో పంచాయతీరాజ్ శాఖ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. నిర్ణీత కోరం ప్రకారం.. మండల పరిధిలో కొత్తగా ఎన్నికైన మొత్తం ఎంపీటీసీ సభ్యుల్లో కనీసం సగం మంది హాజరైతేనే ఎంపీపీ, ఉపాధ్యక్ష పదవితో పాటు కో ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10,047 ఎంపీటీసీ స్థానాల్లోని 9,583 స్థానాల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రత్యేక సమావేశాలు ప్రారంభమవుతాయి. ఏకగ్రీవంగా ఎన్నికైన వారితో సహా కొత్తగా ఎన్నికైన సభ్యులందరితో ఆ సమావేశంలోనే ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆ తర్వాత కో ఆప్టెడ్ సభ్యుని ఎన్నిక నిర్వహిస్తారు. సాయంత్రం 3 గంటలకు మరొకసారి సమావేశం నిర్వహించి, తొలుత ఎంపీపీ పదవికి ఆ తర్వాత ఉపాధ్యక్ష పదవికి ఎన్నిక జరుపుతారు. కాగా, ఉదయం 10 గంటల నుంచే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఏదైనా సమస్య వస్తే ఇలా.. ► ఏదైనా కారణం వల్ల కో ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక జరగని పక్షంలో ఆయా మండలాల్లో తదుపరి జరగాల్సిన ఎంపీపీ, ఉపాధ్యక్ష ఎన్నికలను వాయిదా వేస్తారు. ఒకవేళ కో ఆప్టెడ్ ఎన్నిక పూర్తయి, ఎంపీపీ ఎన్నికకు ఆటంకం ఏర్పడితే, సంబంధిత మండలంలో ఆ తర్వాత జరగాల్సిన ఉపాధ్యక్ష పదవికి ఎన్నిక వాయిదా పడుతుందని రాష్ట్ర కమిషన్ కార్యాలయ అధికారులు వెల్లడించారు. ► శుక్రవారం జరగాల్సిన ఎన్నిక వాయిదా పడిన మండలాల్లో శనివారం ఎన్నిక నిర్వహించుకోవచ్చని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలంసాహ్ని ఇప్పటికే అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. రెండో రోజు కూడా వివిధ కారణాలతో కోఆప్టెడ్ సభ్యుల ఎన్నిక వాయిదా పడినప్పటికీ, సరిపడా కోరం ఉంటే ఎంపీపీ.. ఉపాధ్యక్ష పదవులకు ఎన్నిక నిర్వహించవచ్చని గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
‘పరిషత్’ పీఠాలలో మహిళలకు అగ్రాసనం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఏడు జెడ్పీ చైర్మన్ పదవులు, 335 ఎంపీపీ పదవులను ప్రభుత్వం మహిళలకు రిజర్వు చేసింది. ఇందుకు సంబంధించిన రిజర్వేషన్లను 2020 మార్చిలో ఖరారు చేసి, అప్పట్లోనే గెజిట్ నోటిఫికేషన్లను విడుదల చేసింది. దీంతో ఈ నెల 24, 25 తేదీల్లో జరగనున్న ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ పదవులకు ఎన్నికలు ఈ రిజర్వేషన్ల ప్రతిపాదికనే జరగనున్నాయి. ఇక రాష్ట్రంలో మొత్తం 13 జెడ్పీ చైర్మన్లకుగానూ ఎస్టీ, ఎస్సీ మహిళ, ఎస్సీ జనరల్, బీసీ జనరల్‌కు ఒక్కొక్కటి చొప్పున, బీసీ మహిళలకు రెండు, జనరల్ మహిళకు మూడు, జనరల్ కేటగిరికి నాలుగు జెడ్పీ చైర్మన్ల పదవులను రిజర్వు చేశారు. 660 ఎంపీపీ పదవులకు గాను 338 ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించారు. మైనార్టీలకు 686 కోఆప్టెడ్ పదవులు ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ పదవుల ఎన్నికలతో పాటు అదే రోజుల్లో మండల, జిల్లా పరిషత్‌లో కోఆప్టెడ్ సభ్యుల ఎన్నికలు కూడా జరగనున్న విషయం తెలిసిందే. ప్రతి మండలానికి ఒకరు చొప్పున 660 మండల పరిషత్‌లలో, జిల్లాకు ఇద్దరేసి చొప్పున 13 జిల్లా పరిషత్‌లో కోఆప్టెడ్ సభ్యులను ఎన్నుకుంటారు. పంచాయతీరాజ్ నిబంధనల ప్రకారం మైనార్టీ వర్గాలకు చెందిన వారిని మాత్రమే మండల, జిల్లా పరిషత్‌లో కోఆప్టెడ్ సభ్యులుగా ఎన్నుకోవాల్సి ఉంటుందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయ అధికారులు వెల్లడించారు. ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, పార్శీలు తదితరులతో పాటు తెలుగు మినహా మిగిలిన భాషలను మాతృభాషగా గుర్తింపు పొందిన వారు కోఆప్టెడ్ పదవులు పొందేందుకు అర్హులవుతారని వారు తెలిపారు. దీని ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా మండల పరిషత్‌లలో 660 మంది.. జిల్లా పరిషత్‌లలో 26 మంది కోఆప్టెడ్ సభ్యులుగా ఎన్నికయ్యే అవకాశముంది. -
MPTC, ZPTC Election Results: ఆ ఎనిమిది చోట్లా ఫలితాలు నిలిపివేత
సాక్షి, అమరావతి: ఏడు ఎంపీటీసీ, ఒక జెడ్పీటీసీ స్థానాల ఎన్నికల ఫలితాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) నిలిపివేసింది. వాటి పరిధిలోని మొత్తం 18 బూత్‌లలో రీపోలింగ్ నిర్వహించాలని జిల్లా అధికారులకు ఎస్ఈసీ ఆదేశించింది. ఆ బూత్‌లకు సంబంధించిన బ్యాలెట్ పత్రాలు పూర్తిగా తడిసిపోయి లెక్కింపునకు వీలుగా లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు జెడ్పీటీసీ స్థానంలోని గొరిగనూర్ ఎంపీటీసీ పరిధిలోనున్న రెండు పోలింగ్ బూత్‌లలో మొత్తం 742 ఓట్లు పూర్తిగా తడిసిపోయాయి. అయితే, అక్కడి ఓట్లన్నీ లెక్కించగా, అత్యధిక ఓట్లు దక్కించుకున్న అభ్యర్థి, రెండో స్థానంలో ఉన్న అభ్యర్థి మధ్య 517 ఓట్ల తేడా ఉంది. దీంతో అక్కడ రెండు బూత్‌ల పరిధిలో తడిసిపోయిన 742 ఓట్లు కీలకంగా మారాయి. దీంతో ఆ ఫలితాన్ని నిలిపివేయాలని జిల్లా అధికారులను ఎస్ఈసీ ఆదేశించింది. అదే సమయంలో గొరిగనూర్ ఎంపీటీసీ ఫలితాన్ని కూడా నిలిపివేశారు. బ్యాలెట్ పత్రాలు తడిసిపోయిన రెండు బూత్‌లలో రీపోలింగ్ నిర్వహించి, ఆ ఓట్ల ఆధారంగా జమ్ములమడుగు జెడ్పీటీసీ, గొరిగనూర్ ఎంపీటీసీ స్థానం ఫలితాలను అధికారులు ప్రకటిస్తారు. అలాగే.. ► శ్రీకాకుళం జిల్లా మందస మండలం అంబుగం ఎంపీటీసీ పరిధిలోని నాలుగు పోలింగ్ బూత్‌లు, ఆమదాలవలస కాత్యాచారులపేట ఎంపీటీసీ పరిధిలోని ఒక బూత్ పరిధిలో ఎక్కువ సంఖ్యలో బ్యాలెట్ పత్రాలు తడిసిపోవడంతో ఆ రెండు ఎంపీటీసీ స్థానాల ఫలితాలను కూడా నిలిపివేసి, అక్కడ రీ పోలింగ్ నిర్వహించాలని ఎస్ఈసీ ఆదేశించింది. ► ఇదే కారణంతో విశాఖపట్నం జిల్లా గోలుగొండ మండలం పాకాలపాడు ఎంపీటీసీ స్థానం ఫలితాన్నీ నిలిపివేశారు. అక్కడ రెండు బూత్‌లో రీపోలింగ్ నిర్వహిస్తారు. ► తూర్పు గోదావరి జిల్లా మారేడుమల్లి మండలం దోరచింతలపాలెం ఎంపీటీసీ, పెద్దాపురం మండలం పులిమేరు ఎంపీటీసీ స్థానం ఫలితాలను కూడా నిలిపివేశారు. దోరచింతలపాలెంలో ఏడు, పులిమేరులో ఒక బూత్‌లలో రీ పోలింగ్‌కు ఆదేశించారు. ► వైఎస్సార్ జిల్లా ముద్దనూరు మండలం కొర్రపాడు ఎంపీటీసీ ఫలితం కూడా బ్యాలెట్ పత్రాలు తడిసిన కారణంగానే నిలిచిపోయింది. ఇక్కడ ఒక బూత్ పరిధిలో రీపోలింగ్ జరుగుతుంది. ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ల ఎన్నికలను ఈ నెల 24, 25 తేదీలలో నిర్వహించేందుకు ఇప్పటికే నోటిఫికేషన్ జారీచేసినందున ఈ 18 చోట్లా 25వ తేదీ తర్వాతే రీ పోలింగ్ నిర్వహించే అవకాశముందని ఎస్ఈసీ అధికారులు వెల్లడించారు. -
25న జెడ్పీ చైర్మన్ల ఎన్నిక
సాక్షి, అమరావతి: పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తి కావడంతో పరోక్ష పద్ధతిలో జరిగే మండల పరిషత్ అధ్యక్ష(ఎంపీపీ), జిల్లా పరిషత్ (జెడ్పీ) చైర్మన్ పదవులకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదివారం నోటిఫికేషన్ జారీ చేసింది. 24న ఎంపీపీ, 25న జెడ్పీ చైర్మన్ల ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎస్ఈసీ నీలం సాహ్ని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఎంపీపీ ఎన్నిక జరిగే రోజే మండల కో ఆప్టెడ్ సభ్యుడు, మండల ఉపాధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతాయి. ఇక జెడ్పీ చైర్మన్ ఎన్నిక నిర్వహించే రోజే ప్రతి జిల్లాలో ఇద్దరు కో ఆప్టెడ్ సభ్యులు, ఇద్దరు వైస్ చైర్మన్ల ఎన్నిక జరుగనుంది. ప్రమాణ స్వీకారం ముగియగానే కో ఆప్టెడ్ ఎన్నిక మండల పరిషత్‌లలో 24వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రత్యేక సమావేశం నిర్వహించి కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అదే రోజు కో ఆప్టెడ్ సభ్యుడి ఎన్నిక జరుగుతుంది. ఎంపీపీ, ఉపాధ్యక్ష పదవుల కోసం సాయంత్రం విడిగా సమావేశం నిర్వహిస్తారు. జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్లకు విడిగా ఎన్నిక 25వతేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు అన్ని జిల్లా పరిషత్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించి కొత్తగా జెడ్పీటీసీ సభ్యులుగా ఎన్నికైన వారితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అదే సమావేశంలో ఇద్దరు కో ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక జరుగుతుంది. సాయంత్రం విడిగా సమావేశం నిర్వహించి జెడ్పీ చైర్మన్, ఇద్దరు వైస్ చైర్మన్ల ఎన్నిక చేపడతారు. వాయిదా పడ్డ చోట్ల మర్నాడు నిర్వహణ ఒకవేళ ఏదైనా కారణాలతో ఉదయం కో ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక జరగని పక్షంలో ఆయా మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లలో సాయంత్రం జరగాల్సిన ఎంపీపీ, ఉపాధ్యక్ష, జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికలను కూడా వాయిదా వేసి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయానికి సమాచారం ఇవ్వాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. మండల పరిషత్‌లో 24వ తేదీన కో ఆప్టెడ్ సభ్యుడితో పాటు ఎంపీపీ, ఉపాధ్యక్ష పదవుల ఎన్నిక వాయిదా పడిన పక్షంలో మరుసటి రోజు 25వ తేదీన నిర్వహించేందుకు రిటర్నింగ్ అధికారులు ఏర్పాట్లు చేసుకోవాలని నోటిఫికేషన్లో ఆదేశించారు. జిల్లా పరిషత్‌లలో 25వ తేదీన జరగాల్సిన ఎన్నిక వాయిదా పడిన పక్షంలో 26వ తేదీన ఎన్నికలు నిర్వహించేందుకు స్థానిక రిటర్నింగ్ అధికారి చర్యలు చేపట్టాలని సూచించారు. -
AP MPTC, ZPTC Election Results: పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనం
లైవ్ అప్డేట్స్.. రాష్ట్రవ్యాప్తంగా 637 జెడ్పీటీసీ స్థానాల ఫలితాలు వెల్లడి కాగా వాటిలో 627 జెడ్పీటీసీ స్థానాలు వైఎస్సార్సీపీ సొంతం చేసుకుని తిరుగులేని ఆధిక్యతను ప్రదర్శించింది. ఇక ఎంపీటీసీ స్థానాల విషయానికి వస్తే ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల్లో వైఎస్సార్సీపీ ఏకంగా 8,075 ఎంపీటీసీ స్థానాలు గెలుచుకుని విజయ ఢంకా మోగించింది. ఇప్పటివరకు వెల్లడైన ఎంపీటీసీ స్థానాల ఫలితాలు ఇలా ఉన్నాయి. కృష్ణా: 648 ఎంపీటీసీ స్థానాల్లో 568 చోట్ల వైఎస్సార్సీపీ గెలుపు. ప్రకాశం: 784 ఎంపీటీ\సీ స్థానాల్లో 668 చోట్ల వైఎస్సార్సీపీ విజయకేతనం నెల్లూరు: 562 ఎంపీటీసీ స్థానాల్లో 400 వైఎస్సార్సీపీ 312 సొంతం చేసుకుని తిరుగులేని విజయం సొంతం చేసుకుంది. తూర్పు గోదావరి: 998 స్థానాల్లో 538 సొంతం చేసుకున్న వైఎస్సార్సీపీ. పశ్చిమ గోదావరి: 781 స్థానాల్లో 577 వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. విశాఖపట్టణం: 612 ఎంపీటీసీ స్థానాలకు వైఎస్సార్సీపీ 450 గెలుచుకుంది. విజయనగరం: 549 ఎంపీటీసీ స్థానాల్లో 433 వైఎస్సార్సీపీ కైవసం శ్రీకాకుళం: 668 ఎంపీటీసీ స్థానాల్లో 562 వైఎస్సార్సీపీ గెలుపు. వైఎస్సార్ కడప: 549 స్థానాల్లో 433 వైఎస్సార్సీపీ విజయం సాధించింది. అనంతపురం: 841 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్ సీపీ 763 సొంతం చేసుకుంది. చిత్తూరు: 886 ఎంపీటీసీ స్థానాల్లో 822 సొంత చేసుకుని వైఎస్సార్సీపీ తిరుగులేని ఆధిక్యత ప్రదర్శించింది. కర్నూలు: 807 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్సీపీ 718 గెలుపొందింది. రాష్ట్రవ్యాప్తంగా 412 జెడ్పీటీసీ స్థానాల ఫలితాలు వెల్లడి కాగా వాటిలో 404 జెడ్పీటీసీ స్థానాలు వైఎస్సార్సీపీ సొంతం చేసుకుని తిరుగులేని ఆధిక్యతను ప్రదర్శించింది. ఇక ఎంపీటీసీ స్థానాల విషయానికి వస్తే ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల్లో వైఎస్సార్సీపీ ఏకంగా 5,462 ఎంపీటీసీ స్థానాలు గెలుచుకుని విజయ ఢంకా మోగించింది. పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ పీఠం కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది. 48 స్థానాల్లో ఇప్పటికే 35 స్థానాల్లో విజయం సాధించింది. మరికొన్ని స్థానాల ఫలితాలు రావాల్సి ఉంది. ఎంపీటీసీ ఇప్పటివరకు 6,242 ఎంపీటీసీ స్థానాల ఫలితాలు వెలువడ్డాయి. వీటిలో అత్యధికంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 5,273 స్థానాలు కైవసం చేసుకుని విజయకేతనం ఎగురవేసింది. జెడ్పీటీసీ ఇక జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి 354 స్థానాల ఫలితాలు ప్రకటించారు. వీటిలో 348 జెడ్పీటీసీలను సొంతం చేసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్ని జిల్లాల జెడ్పీ పీఠాలను కైవసం చేసుకుంది. నాలుగు టీడీపీకి, రాగా ఒకటి సీపీఐ, స్వతంత్రుడు మరొకరు గెలిచారు. కోనసీమలోనూ వైఎస్సార్సీపీ జెండా రెపరెపలాడుతోంది. వెలువడుతున్న ఎన్నికల ఫలితాలన్నీ వైఎస్సార్సీపీ ఖాతాలోనే పడుతున్నాయి. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధిక జెడ్పీటీసీ స్థానాలను సొంతం చేసుకుంటోంది. విజయనగరం: నెల్లూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాల సరసన విజయనగరం చేరింది. విజయనగరంలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. ఉన్న 34 జెడ్పీటీసీ స్థానాల్లో ఆ పార్టీ విజయం సాధించింది. వైఎస్సార్ కడప జిల్లా: కడప జిల్లాలో 50 జెడ్పీటీసీ స్థానాలకు 46 వైఎస్సార్ సీపీ సొంతం చేసుకుంది. ప్రకాశం జిల్లా: ప్రకాశంలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. జిల్లాలోని 56 జెడ్పీటీసీ స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. చిత్తూరు జిల్లా: జెడ్పీ ఎన్నికలతో పాటు మండల పరిషత్ ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీ భారీ ఆధిక్యత ప్రదర్శించింది. చిత్తూరు జిల్లాలో 886 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్సీపీ 822 సొంతం చేసుకుని విజయదుంధుబి మోగించింది. కాగా టీడీపీ కేవలం 25 స్థానాల్లో గెలిచింది. ఈ విజయంతో వైఎస్సార్సీపీ 65 మండల పరిషత్‌లను సొంతం చేసుకుంది. నెల్లూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్. ఆయా జిల్లాల్లోని ఉన్న జెడ్పీటీసీ స్థానాలన్నింటిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది. కృష్ణా జిల్లా: 46 జెడ్పీటీసీ స్థానాల్లో 23 వైఎస్సార్సీపీ సొంతం. గుంటూరు: 54 జెడ్పీటీసీ స్థానాల్లో 27 వైఎస్సార్సీపీ విజయం ప్రకాశం: 56 స్థానాల్లో 56 సొంతం చేసుకున్న వైఎస్సార్సీపీ నెల్లూరు: జిల్లాలో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఉన్న 46 స్థానాలను వైఎస్సార్సీపీ సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది. విశాఖపట్టణం: 39 స్థానాల్లో 30 వైఎస్సార్సీపీ గెలుపు విజయనగరం: 34 జెడ్పీటీసీ స్థానాల్లో 25 వైఎస్సార్సీపీ విజయం సాధించింది. శ్రీకాకుళం: 38 జెడ్పీటీసీ స్థానాల్లో 20 వైఎస్సార్సీపీ కైవసం అనంతపురం: 63 స్థానాల్లో 35 సొంతం చేసుకున్న వైఎస్సార్సీపీ చిత్తూరు: 63 జెడ్పీటీసీ స్థానాల్లో 63 వైఎస్సార్సీపీ విజయం వైఎస్సార్ కడప: 50 స్థానాల్లో 44 గెలిచిన వైఎస్సార్సీపీ కర్నూలు: జెడ్పీటీసీ ఎన్నికల్లో ఉన్న 53లో 51 స్థానాలను వైఎస్సార్సీపీ సొంతం చేసుకుంది. తూర్పు గోదావరి: 61 జెడ్పీటీసీలకు 5 చోట్ల వైఎస్సార్సీపీ గెలిచింది. పశ్చిమ గోదావరి: 48 జెడ్పీటీసీ స్థానాల్లో 32 వైఎస్సార్సీపీ కైవసం. జిల్లా పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటివరకు 186 జెడ్పీటీసీ ఫలితాలు రాగా 184లో వైఎస్సార్సీపీ విజయం సాధించింది. జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయదుంధుబి. రాష్ట్రంలోని 13 జిల్లా పరిషత్‌లలో 11 జెడ్పీలు కైవసం చేసుకుంది. 144 జెడ్పీటీసీ స్థానాల్లో 142 వైఎస్సార్సీపీ సొంతం విజయనగరం జిల్లా: శృంగవరపుకోట నియోజకవర్గం లక్కవరపుపేట జెడ్పీటీసీ వైఎస్సార్సీపీ విజయం అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం: ముదిగుబ్బ జెడ్పీటీసీ వైఎస్సార్సీపీ విజయం గుంతకల్లు నియోజకవర్గం: గుత్తిలో జెడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం గుంతకల్లు నియోజకవర్గం: గుంతకల్లు జెడ్పీటీసీ వైఎస్సార్సీపీ విజయం కృష్ణాజిల్లా: పెడన నియోజకవర్గం కృత్తివెన్ను జెడ్పీటీసీ వైఎస్సార్సీపీ విజయం. పశ్చిమ గోదావరి: ఉంగుటూరు నియోజకవర్గం గణపవరం జెడ్పీటీసీ వైఎస్సార్సీపీ విజయం శ్రీకాకుళం: చీపురుపల్లి నియోజకవర్గం గుర్ల జెడ్పీటీసీ వైఎస్సార్సీపీ విజయం శ్రీకాకుళం: పాలకొండ నియోజకవర్గం వీరఘట్టం జెడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం ప్రకాశం: కందుకూరు గుడ్లూరు జెడ్పీటీసీ వైఎస్సార్సీపీ విజయం అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం బుక్కపట్నం జెడ్పీటీసీ వైఎస్సార్సీపీ గెలుపు ఆమడగూరు జెడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం ఓబులదేవచెరువు వైఎస్సార్సీపీ విజయం కొత్తచెరువు జెడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం నల్లమాడ జెడ్పీటీసీ వైఎస్సార్సీపీ విజయం బుక్కపట్నం వైఎస్సార్సీపీ సొంతం అనంతపురం: దర్శి నియోజకవర్గం కురిచేడు వైఎస్సార్సీపీ విజయం. చిత్తూరు: జీడీ నెల్లూరు నియోజకవర్గం ఎస్సార్ పురం జెడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం. 13,335 ఓట్ల మెజార్టీతో రమణ ప్రసాద్ రెడ్డి విజయం. వైఎస్సార్ కడప: రాజంపేట నియోజకవర్గం నందలూరు జెడ్పీటీసీ వైఎస్సార్సీపీ వశం. కర్నూలు: శ్రీశైలం నియోజకవర్గం మహానంది జెడ్పీటీసీ వైఎస్సార్సీపీ సొంతం. విశాఖపట్టణం: అనకాపల్లి నియోజకవర్గం అనకాపల్లి జెడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం. విశాఖపట్టణం: పాడేరు నియోజకవర్గం పాడేరు జెడ్పీటీసీ వైఎస్సార్సీపీ విజయం. ►అనంతపురం: పెనుగొండ నియోజకవర్గం పెనుగొండ జడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. 8,856 ఓట్ల మెజార్టీతో శ్రీరాములు గెలుపొందారు. పెనుగొండ నియోజకవర్గం సోమందేవపల్లి జడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. 4,348 ఓట్ల మెజార్టీతో డీసీ అశోక్ గెలుపు పొందారు. ►ఇప్పటివరకు 3129 ఎంపీటీసీ ఫలితాలు వైఎస్సార్సీపీ-2773, టీడీపీ-267, బీజేపీ-7 విశాఖపట్నం: యలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి జడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. 16,097 ఓట్ల మెజార్టీతో ధూళి నాగరాజు గెలుపొందారు. విశాఖ: అరకు నియెజకవర్గం పెదబయలు జడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. 500 ఓట్ల మెజార్టీతో బొంజుబాబు గెలుపొందారు. ప్రకాశం: యర్రగొండపాలెం నియోజకవర్గం యర్రగొండపాలెం జడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. 12,906 ఓట్ల మెజార్టీతో విజయభాస్కర్ గెలుపొందారు. చిత్తూరు జిల్లా: మదనపల్లి నియోజకవర్గం నిమ్మనపల్లి జడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. 5,464 ఓట్ల మెజార్టీతో ప్రమీలమ్మ గెలుపొందారు. మదనపల్లి నియోజకవర్గం రామ సముద్రం జడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. 9, 875 ఓట్ల మెజార్టీతో సీహెచ్ రామచంద్రారెడ్డి గెలుపొందారు. విజయనగరం: గజపతినగరం జడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. 17,971 ఓట్ల మెజార్టీతో గార తవుడు గెలుపొందారు. అనంతపురంలో రెచ్చిపోయిన టీడీపీ నేతలు అనంతపురం: జిల్లాలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. ఆత్మకూరు మండలం ముట్టాల ఎంపీటీసీ స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి విజయం సాధించారు. 65 ఓట్లతో వైఎస్సార్సీపీ అభ్యర్థి పుణ్యశ్రీ విజయం సాధించారు. దాంతో టీడీపీ నేతలు వాదనకు దిగారు. ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో వైఎస్సార్సీపీ విజయం పామర్రు మండలం నిమ్మకూరు ఎంపీటీసీ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. నిమ్మకూరును నారా లోకేష్ దత్తత తీసుకోగా, ఆయనను ప్రజలు విశ్వసించలేదు. చరిత్రలో తొలిసారి పామర్రు ఎంపీపీని వైఎస్సార్సీపీ దక్కించుకుంది. వైఎస్సార్సీపీ ప్రభంజనం చిత్తూరు: పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించింది. జీడీ నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్పురం జడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. 13,335 ఓట్ల మెజార్టీతో రమణ ప్రసాద్‌రెడ్డి గెలుపొందారు. జీడీ నెల్లూరు నియోజకవర్గం పాల సముద్రం జడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. 6,758 ఓట్ల మెజార్టీతో అన్బలగన్ గెలుపొందారు. చంద్రబాబుకు షాక్.. పరిషత్ ఎన్నికల్లో నారావారిపల్లిలో చంద్రబాబుకు షాక్ తగిలింది. నారావారిపల్లి ఎంపీటీసీ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి గంగాధరం పరాజయం పొందారు. 1,347 ఓట్ల మెజార్టీతో వైఎస్సార్సీపీ అభ్యర్థి రాజయ్య గెలుపొందారు. టీడీపీకి అభ్యర్థికి కేవలం 307 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ►ఇప్పటివరకు 1562 ఎంపీటీసీ ఫలితాలు వెలువడ్డాయి. వైఎస్సార్సీపీ 1399, టీడీపీ 120, బీజేపీ 7. ►వైఎస్సార్‌జిల్లా పరిషత్ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. 50కిగాను ఇప్పటివరకు 40 స్థానాలను వైఎస్సార్సీపీ గెలుచుకుంది. ప్రకాశం: త్రిపురాంతకం జడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. 10,930 ఓట్ల మెజార్టీతో మాకం జాన్‌పాల్ గెలుపొందారు. ప్రకాశం: కొనకనమిట్ల జడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం. 16,681 ఓట్ల మెజార్టీతో అక్కి దాసరి ఏడుకొండలు గెలుపు ప్రకాశం: గుడ్లూరు జడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం. 11,464 ఓట్ల మెజార్టీతో కొరిసిపాటి బాపిరెడ్డి గెలుపు ప్రకాశం: కురిచేడు జడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం. 5,930 ఓట్ల మెజార్టీతో వెంకట నాగిరెడ్డి గెలుపు ►పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ హవా కొనసాగుతోంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాల్లో ఫ్యాన్ దూసుకుపోతోంది. అనేక చోట్ల సింగిల్ డిజిట్‌కే టీడీపీ పరిమితమైంది. ►వైఎస్సార్ జిల్లా: నందలూరు జడ్పీటీసీ వైఎస్సార్ కైవసం చేసుకుంది. 20,849 ఓట్ల మెజార్టీతో గడికోట ఉషారాణి విజయం సాధించారు. ►కర్నూలు జిల్లాలో ఇప్పటివరకు 202 ఎంపీటీసీ ఫలితాలు.. మిగిలిన 282 ఎంపీటీసీ స్థానాలకు కొనసాగుతున్న కౌంటింగ్ వైఎస్సార్సీపీ-184, టీడీపీ-15 బీజేపీ-1, ఇతరులు-2 ►వైఎస్సార్ జిల్లాలో ఇప్పటివరకు 20 ఎంపీటీసీ ఫలితాలు దేవినేని ఉమా ఇలాకాలో వైఎస్సార్సీపీ హవా స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్సీపీ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. విజయవాడ: దేవినేని ఉమా ఇలాకాలో వైఎస్సార్సీపీ హవా ప్రదర్శించింది. గొల్లపూడిలో 10 ఎంపీటీసీలకు 10 వైఎస్సార్సీ కైవసం చేసుకుంది. ►వైఎస్సార్ జిల్లా: రాజుపాలెం మండలంలో వైఎస్సార్సీపీ క్లీన్‌స్వీప్. 9 ఎంపీటీసీ స్థానాలకు 9 వైఎస్సార్సీపీ కైవసం. ►విజయనగరం: మెరముడిదం మండలంలో వైఎస్సార్సీపీ క్లీన్‌స్వీప్. 16 ఎంపీటీసీలకు 16 వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. ►అనంతపురం: తాడిమర్రి మండలంలో వైఎస్సార్సీపీ క్లీన్‌స్వీప్. 9 ఎంపీటీసీ స్థానాలకు 9 వైఎస్సార్సీపీ కైవసం. ►చిత్తూరు: నిమ్మనపల్లి మండలంలో వైఎస్సార్సీపీ క్లీన్‌స్వీప్. 9 ఎంపీటీసీ స్థానాలకు 9 వైఎస్సార్సీపీ కైవసం ►ప్రకాశం: మర్రిపూడి మండలంలో వైఎస్సార్సీపీ క్లీన్‌స్వీప్. 11 ఎంపీటీసీ స్థానాలకు 11 వైఎస్సార్సీపీ కైవసం ►ప్రకాశం: మార్కాపురం జడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. 15,315 మెజార్టీతో వైఎస్సార్సీ అభ్యర్థి బాపన్నరెడ్డి విజయం సాధించారు. ►విశాఖపట్నం: 45 ఓట్ల మెజార్టీతో జీకే వీధి ఎంపీటీసీ(వైఎస్సార్సీపీ) గెలుపు ►ప్రకాశం: తుర్లుపాడు జడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. 10,335 ఓట్ల మెజార్టీతో వైఎస్సార్సీపీ అభ్యర్థి వెన్న ఇందిర గెలుపు పొందారు. ►ప్రకాశం: జిల్లాలో రెండు జడ్పీటీసీలు వైఎస్సార్సీపీ కైవసం ►చిత్తూరు: ఎస్ఆర్పురం జడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. 13,335 ఓట్ల మెజార్టీతో రమణ ప్రసాద్‌రెడ్డి గెలుపొందారు. ►కర్నూలు: మహానంది జడ్పీటీసీ వైఎస్సార్సీపీ కైవసం. 13,288 ఓట్ల మెజార్టీతో కేవీఆర్ మహేశ్వర్‌రెడ్డి గెలుపు పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ హవా చిత్తూరు: పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ హవా కొనసాగుతోంది. 1573 ఓట్ల మెజార్టీతో బుగ్గపట్నం ఎంపీటీసీ(వైఎస్సార్సీపీ) గెలుపు పొందారు. 1073 ఓట్ల మెజార్టీతో టీ.సదుం ఎంపీటీసీ(వైఎస్సార్సీపీ) గెలుపొందారు. ప్రశాంతంగా ఎన్నికల కౌంటింగ్ పరిషత్ ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా కొనసాగుతుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. రాత్రి లోపు పూర్తిస్థాయి ఫలితాలు ప్రకటిస్తామన్నారు. ఐదారు చోట్ల బ్యాలెట్ బాక్సుల్లో నీళ్లు చేరాయని తెలిపారు. బ్యాలెట్ బాక్సులు పూర్తిగా తెరిచాక స్పష్టత వస్తుందని ఆయన తెలిపారు. ►విజయనగరం: 44 ఓట్ల మెజార్టీతో గంజాయి భద్ర ఎంపీటీసీ(వైఎస్సార్సీపీ) గెలుపు ►అనంతపురం: 1331 ఓట్ల మెజార్టీతో వెన్న పూసపల్లి ఎంపీపీటీ(వైఎస్సార్సీపీ) గెలుపు ►కృష్ణా జిల్లా: 180 ఓట్ల మెజార్టీతో పాములంక ఎంపీటీసీ(వైఎస్సార్సీపీ) గెలుపు ►కృష్ణా: 585 ఓట్ల మెజార్టీతో ఆటపాక ఎంపీటీసీ(వైఎస్సార్సీపీ) గెలుపు ►విజయనగరం: 1629 ఓట్ల మెజార్టీతో ఉత్తరవల్లి ఎంపీటీసీ( వైఎస్సార్సీపీ) గెలుపు) ►ప్రకాశం: 1645 ఓట్ల మెజార్టీతో సంతమాగులూరుఏ-1 ఎంపీటీసీ(వైఎస్సార్సీపీ) గెలుపు ►ప్రకాశం: 434 ఓట్ల మెజార్టీతో ఊళ్లపాలెం ఎంపీటీసీ(వైఎస్సార్సీపీ) గెలుపు మాచర్ల నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ క్లీన్‌స్వీప్ గుంటూరు: మాచర్ల నియెజకవర్గంలో వైఎస్సార్సీపీ క్లీన్‌స్వీప్ చేసింది. ఐదు జీడ్పీటీసీ స్థానాలకు ఐదూ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. 71 ఎంపీటీసీ స్థానాలకు 71 వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. బాబు ఇలాకాలో ఫ్యాన్ గాలి.. చిత్తూరు జిల్లా: చంద్రబాబు ఇలాకాలో ఫ్యాన్ గాలి వీచింది. కుప్పం మండలం టీ సద్దుమూరు ఎంపీటీసీ స్థానం వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. టీడీపీ అభ్యర్థిపై వైఎస్సార్సీపీ అభ్యర్థి అశ్విని 1073 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. ►విజయనగరం: పరిషత్ ఎన్నికలల్లో వైఎస్సార్సీపీ హవా కొనసాగుతోంది. సీతానగరం మండలంలో 17 ఎంపీటీసీ స్థానాలకు ఆరు ఏకగ్రీవం కాగా, మిగిలిన 11 ఎంపీటీసీ స్థానాల్లో 5 చోట్ల వైఎస్సార్సీపీ విజయం సాధించింది. ►పశ్చిమగోదావరి: 613 ఓట్ల మెజార్టీతో శ్రీరామపురం ఎంపీటీసీ(వైఎస్సార్సీపీ) గెలుపు ►వైఎస్సార్ జిల్లా: 490 ఓట్ల మెజార్టీతో ఎస్.కొత్తపల్లి ఎంపీటీసీ(వైఎస్సార్సీపీ గెలుపు ►వైఎస్సార్ జిల్లా: 1682 ఓట్ల మెజార్టీతో పెద్దకారంపల్లి ఎంపీటీసీ (వైఎస్సార్సీపీ) గెలుపు ►వైఎస్సార్ జిల్లా: 490 ఓట్ల మెజార్టీతో ఎస్.కొత్తపల్లి ఎంపీటీసీ(వైఎస్సార్సీపీ గెలుపు ►వైఎస్సార్ జిల్లా: 1682 ఓట్ల మెజార్టీతో పెద్దకారంపలల్లి ఎంపీటీసీ (వైఎస్సార్సీపీ) గెలుపు ►కృష్ణా: 372 ఓట్ల మెజార్టీతో అక్కపాలెం ఎంపీటీసీ (వైఎస్సార్సీపీ) గెలుపు ►చిత్తూరు: 616 ఓట్ల మెజార్టీతో పాత వెంకటాపురం ఎంపీటీసీ(వైఎస్సార్సీపీ) గెలుపు ►వైఎస్సార్ జిల్లా: 883 ఓట్ల మెజార్టీతో ఊటుకురు-2 ఎంపీటీసీ(వైఎస్సార్సీపీ) గెలుపు ►అనంతపురం: 882 ఓట్ల మెజార్టీతో దంచర్ల ఎంపీటీసీ( వైఎస్సార్సీపీ) గెలుపు ►అనంతపురం: 729 ఓట్ల మెజార్టీతో అమ్మలదిన్నె ఎంపీటీసీ(వైఎస్సార్సీపీ) గెలుపు ►చిత్తూరు: 1573 ఓట్ల మెజార్టీతో బుగ్గపట్నం ఎంపీటీసీ(వైఎస్సార్సీపీ) గెలుపు ►అనంతపురం: రామగిరి జడ్పీటీసీ పోస్టల్ బ్యాలెట్లో వైఎస్సార్సీపీ ఆధిక్యం ►వైఎస్సార్ జిల్లా: జమ్మలమడుగు జడ్పీటీసీ పోస్టల్ బ్యాలెట్లో వైఎస్సార్సీపీ ఆధిక్యం ►వైఎస్సార్ జిల్లా: బంటుపల్లి జడ్పీటీసీ పోస్టల్ బ్యాలెట్లో వైఎస్సార్సీపీ ఆధిక్యం ►పశ్చిమగోదావరి: జీలుగుమిల్లి జడ్పీటీసీ పోస్టల్ బ్యాలెట్లో వైఎస్సార్సీపీ ఆధిక్యం ►కృష్ణా: పెడన జడ్పీటీసీ పోస్టల్‌బ్యాలెట్‌లో వైఎస్సార్సీపీ ఆధిక్యం ►పోస్టల్ బ్యాలెట్లో వైఎస్సార్సీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ►నెల్లూరు: 766 ఓట్ల మెజార్టీతో ఆమంచర్ల ఎంపీటీసీ(వైఎస్సార్సీపీ) గెలుపు ►పశ్చిమగోదావరి: వేలేరుపాడు జడ్పీటీసీ పోస్టల్ బ్యాలెట్లో వైఎస్సార్సీపీ ఆధిక్యం ►నెల్లూరు: కలిగిరి జడ్పీటీసీ పోస్టల్ బ్యాలెట్లో వైఎస్సార్సీపీ ఆధిక్యం వైఎస్సార్ జిల్లా: జమ్మలమడుగు జడ్పీటీసీ పోస్టల్ బ్యాలెట్లో వైఎస్సార్సీపీ ఆధిక్యం ►అనంతపురం: కనగాపల్లి జడ్పీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థి మారుతి ప్రసాద్ ఆధిక్యం ఉరవకొండ జడ్పీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థి పార్వతమ్మ ఆధిక్యం తనకల్లు జడ్పీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థి జక్కల జ్యోతి ఆధిక్యం పెద్దవడుగూరు జడ్పీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థి భాస్కర్‌రెడ్డి ముందంజ కంబదూరు జడ్పీటీసీ పోస్టల్ బ్యాలెట్లో వైఎస్సార్సీపీ ఆధిక్యం ►వైఎస్సార్ జిల్లా: కమలాపురం మండలం దేవరాజుపల్లి దేవరాజుపల్లి ఎంపీటీసీ (వైఎస్సార్సీపీ) గెలుపొందారు. 186 ఓట్ల మెజార్టీతో వైఎస్సార్సీపీ అభ్యర్థి చెన్నకేశవరెడ్డి విజయం సాధించారు. ►విజయనగరం: జిల్లా వ్యాప్తంగా పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 31 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. 31 జడ్పీటీసీ, 487 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్ జరుగుతోంది. కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి ఆన్లైన్ ద్వారా ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను జిల్లా కలెక్టర్ పర్యవేక్షిస్తున్నారు. ►పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం డివిజన్ పరిధిలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. పోస్టల్ బ్యాలెట్లో వైఎస్సార్సీపీ ఆధిక్యంలో ఉంది. ►ఆంధ్రప్రదేశ్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. 515 జడ్పీటీసీ, 7216 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్ జరుగుతోంది. ► 7,219 ఎంపీటీసీ.. 515 జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసిన వారి భవితవ్యం తేలబోతోంది. హైకోర్టు తీర్పు కారణంగా ఐదున్నర నెలలుగా ప్రజా తీర్పు స్ట్రాంగ్ రూంలకే పరిమితం అయిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 8వ తేదీన ఆయా స్థానాలకు జరిగిన పోలింగ్‌లో మొత్తం 1,29,55,980 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ►ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో పూర్తి స్థాయిలో కోవిడ్ నింబంధనలు పాటించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఇప్పటికే జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కౌంటింగ్ సిబ్బందితో పాటు అభ్యర్థుల తరుఫున హాజరయ్యే ఏజెంట్లు కరోనా వ్యాక్సినేషన్ వేయించుకొని ఉండాలనే ఆదేశాలు వెళ్లాయి. ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి మండలాల వారీగా ఒక్కో స్థానానికి ఒకటి చొప్పున 7,219 టేబుళ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 515 జెడ్పీటీసీ స్థానాల ఓట్ల లెక్కింపు కోసం వేరుగా 4,008 టేబుళ్లను సిద్ధం చేశారు. జిల్లాల వారీగా.. శ్రీకాకుళం: 37 జడ్పీటీసీ, 590 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్ విజయనగరం: 31 జడ్పీటీసీ, 487 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్ విశాఖపట్నం: 37 జడ్పీటీసీ, 612 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్ తూర్పు గోదావరి: 61 జడ్పీటీసీ, 996 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్ పశ్చిమ గోదావరి: 45 జడ్పీటీసీ, 781 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్ కృష్ణా: 41 జడ్పీటీసీ, 648 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్ గుంటూరు : 45 జడ్పీటీసీ, 571 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్ ప్రకాశం: 41 జడ్పీటీసీ, 368 ఎంపీటీసీ స్థానాలకుకౌంటింగ్ నెల్లూరు: 34 జడ్పీటీసీ, 362 ఎంపీటీసీ స్థానాలకుకౌంటింగ్ చిత్తూరు: 33 జడ్పీటీసీ, 419 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్ వైఎస్సార్: 12 జడ్పీటీసీ, 117 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్ కర్నూలు: 36 జడ్పీటీసీ, 484 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్ అనంతపురం: 62 జడ్పీటీసీ, 781 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్ సాక్షి, అమరావతి: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు ఎట్టకేలకు ఆదివారం వెల్లడి కాబోతున్నాయి. 7,219 ఎంపీటీసీ.. 515 జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసిన ఏడాదిన్నర తర్వాత నేడు వారి భవితవ్యం తేలబోతోంది. ఏప్రిల్ 8వ తేదీన ఆయా స్థానాలకు జరిగిన పోలింగ్‌లో మొత్తం 1,29,55,980 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. హైకోర్టు తీర్పు కారణంగా ఐదున్నర నెలలుగా ప్రజా తీర్పు స్ట్రాంగ్ రూంలకే పరిమితం అయిన విషయం తెలిసిందే. చదవండి: ఆ 23 మంది గెలిస్తే అక్కడ మళ్లీ ఎన్నికలే మూడు రోజుల క్రితమే హైకోర్టు డివిజన్ బెంచ్ ఓట్ల లెక్కింపునకు అనుమతించడంతో రాష్ట్ర వ్యాప్తంగా 206 కేంద్రాల్లోని 209 ప్రదేశాలలో ఓట్ల లెక్కింపు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఒక్కో కౌంటింగ్ కేంద్రంలో మండలాల వారీగా వేర్వేరుగా ఓట్ల లెక్కింపు కోసం వేర్వేరు హాళ్లను సిద్ధం చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు జిల్లాల్లో చేపట్టిన ఏర్పాట్లపై సమీక్షించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని శనివారం ఉదయం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులతో కలిసి ఓట్ల లెక్కింపు ప్రక్రియలో మొత్తం 44,155 మంది సిబ్బంది పని చేయనున్నారు. పూర్తి స్థాయిలో ఏర్పాట్లు ► ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో పూర్తి స్థాయిలో కోవిడ్ నింబంధనలు పాటించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఇప్పటికే జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కౌంటింగ్ సిబ్బందితో పాటు అభ్యర్థుల తరుఫున హాజరయ్యే ఏజెంట్లు కరోనా వ్యాక్సినేషన్ వేయించుకొని ఉండాలనే ఆదేశాలు వెళ్లాయి. ► ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి మండలాల వారీగా ఒక్కో స్థానానికి ఒకటి చొప్పున 7,219 టేబుళ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 515 జెడ్పీటీసీ స్థానాల ఓట్ల లెక్కింపు కోసం వేరుగా 4,008 టేబుళ్లను సిద్ధం చేశారు. చదవండి: 30 వరకు నైట్ కర్ఫ్యూ ఐదున్నర నెలల తర్వాత.. బ్యాలెట్ బాక్స్‌లు దాచి ఉంచిన స్ట్రాంగ్ రూంలను పోలింగ్ జరిగిన ఐదు నెలల తర్వాత తెరవనున్నారు. దీంతో మొదట బ్యాలెట్ బాక్స్‌లు శుభ్రం చేసుకోవడం వంటి కారణాలతో ఓట్ల లెక్కింపు ప్రక్రియ నీర్ణీత సమయం కంటే కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. దీనికితోడు బ్యాలెట్ పేపరు ద్వారా ఎన్నికలు కావడంతో లెక్కింపు ప్రక్రియ ఆలస్యమవుతుందని అధికారులు భావిస్తున్నారు. అయినప్పటికీ మధ్యాహ్నం రెండు గంటల సమయానికి దాదాపు అన్ని చోట్ల ఎంపీటీసీ ఎన్నికల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని.. జెడ్పీటీసీ ఫలితాలు మాత్రం రాత్రి వరకు సమయం పట్టే అవకాశం ఉందని అధికారుల వర్గాలు పేర్కొన్నాయి. అన్ని జాగ్రత్తల మధ్య కౌంటింగ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ సూచించిన మేరకు పూర్తి స్థాయిలో కోవిడ్ జాగ్రత్తలను పాటిస్తూ.. ఓట్ల లెక్కింపునకు తగిన రక్షణ ఏర్పాట్లు చేశాం. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేలా సిబ్బందికి శిక్షణ ఇచ్చాం. అభ్యర్థి, కౌంటింగ్ ఏజెంట్లు రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తయినట్లు ధృవీకరణ పత్రం చూపాలి. లేదా ర్యాపిడ్ యాంటి జెన్ టెస్ట్/ఆర్టీపీసీఆర్ టెస్ట్‌లో నెగటివ్ ఉంటేనే లెక్కింపు కేంద్రం లోపలికి అనుమతిస్తామని ఇప్పటికే తెలిపాం. రాష్ట్ర స్థాయిలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం. 13 జిల్లాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షించడానికి 13 మంది అధికారులను నియమించాం. – గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి -
రేపు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్
-
206 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా 206 కేంద్రాల్లో ఆదివారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 8వ తేదీన పోలింగ్ జరిగిన నాటి నుంచి గత ఐదున్నర నెలలుగా బ్యాలెట్ బాక్స్‌లను భద్రపరిచిన చోట కౌంటింగ్ నిర్వహించేందుకు కలెక్టర్ల నేతృత్వంలో అధికారులు అన్ని చర్యలు చేపట్టారు. ఒక్కొక్క కేంద్రంలో మండలాల వారీగా వేర్వేరుగా ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అభ్యర్థులందరికీ కౌంటింగ్ కేంద్రాల వివరాలతో రిటర్నింగ్ అధికారులు శుక్రవారం సమాచారం అందించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. పెద్ద ఎత్తున బ్యాలెట్ పత్రాలను లెక్కించాల్సి రావడం, రాత్రి వరకు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉన్నందున జనరేటర్లను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ హాల్లోకి బ్యాలెట్ బాక్సులను తరలించే సమయంలో సీసీటీవీ కవరేజ్ చేయనున్నారు. ఏకకాలంలో రెండింటి లెక్కింపు.. ఒక్కో మండలానికి సంబంధించి ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు జరిగే చోటే జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు కూడా చేపడతారు. ఏకకాలంలో రెండింటి ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. సగం టేబుళ్లలో ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు, మరో సగం టేబుళ్లలో జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు జరుగుతుందని కమిషన్ వర్గాలు తెలిపాయి. ఎంపీటీసీ పరిధిలోని ఓట్లన్నింటినీ ఒక డ్రమ్‌లో, మండలంలోని మొత్తం జడ్పీటీసీ ఓట్లన్నింటినీ మరో డ్రమ్‌లో వేసి కలగలపి తర్వాత 25 ఓట్ల చొప్పున కట్టలు కడతారు. ఆ తర్వాత జడ్పీటీసీ ఓట్లను వెయ్యి చొప్పున ఒక్కో టేబుల్‌కు పంపిణీ చేసి లెక్కిస్తారు. ఎంపీటీసీ స్థానాల వారీగా అక్కడి ఓట్లన్నింటినీ ఒకే టేబుల్‌పై ఒకేవిడతలో లెక్కిస్తారు. ఒక్కో టేబుల్ వద్ద ఒక్కో ఏజెంట్ చొప్పున నియమించుకునేందుకు అభ్యర్థులను అనుమతించారు. లెక్కింపులో 42,360 మంది సిబ్బంది ఓట్ల లెక్కింపులో మొత్తం 42,360 మంది సిబ్బంది పాల్గొంటారు. 11,227 మంది కౌంటింగ్ సూపర్వైజర్లుగా, 31,133 మంది కౌంటింగ్ అసిస్టెంట్లుగా వ్యవహరిస్తారు. వీరు కాకుండా 89 మందిని అదనపు అబ్జర్వర్లుగా ఆయా జిల్లా కలెక్టర్లు నియమించారు. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కించి తరువాత బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్ల లెక్కింపు చేపడతారు. బ్యాలెట్ పేపరు రంగు ఆధారంగా రెండు రకాల ఓట్లను వర్గీకరిస్తారు. కౌంటింగ్ సమయంలో సిబ్బంది సందేహాల నివృత్తి కోసం కమాండ్ కంట్రోలు రూమ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. అభ్యంతరాలు వ్యక్తమయ్యే చోట ఒక్కసారి మాత్రమే రీ కౌంటింగ్‌కు అనుమతిస్తారు. మరోవైపు కౌంటింగ్ పర్యవేక్షణ కోసం జిల్లాకో ఐఏఎస్ అధికారిని పరిశీలకులుగా నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేశారు. కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలి: సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్ ఓట్ల లెక్కింపు సజావుగా పూర్తయ్యేలా పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్ ఆదేశించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద కోవిడ్ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని సిబ్బంది, ఏజెంట్లు తప్పనిసరిగా టీకాలు తీసుకుని ఉండాలని స్పష్టం చేశారు. ఆయా కేంద్రాల వద్ద 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ విధించి గుమిగూడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 24 గంటలు కంట్రోల్ రూం: ద్వివేది కౌంటింగ్ అధికారుల సందేహాలను నివృత్తి చేసేందుకు 24 గంటలూ పని చేసేలా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని శాంతి భద్రతల అదనపు డీజీపీ రవిశంకర్ చెప్పారు. కేంద్రాల వద్ద శానిటేషన్ చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ కలెక్టర్లకు సూచించారు. సమావేశంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి కె.కన్నబాబు తదితరులు పాల్గొన్నారు. -
AP: 19న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్
సాక్షి, అమరావతి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ధర్మాసనం తాజాగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఈనెల 19వ తేదీన ‘పరిషత్’ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను చేపట్టి అదేరోజు ఫలితాలను వెల్లడించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని గురువారం రాత్రి నోటిఫికేషన్ జారీ చేశారు. ఆదివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా న్యాయస్థానం ఆదేశాల మేరకు కోవిడ్ నియంత్రణ చర్యలను కట్టుదిట్టంగా అమలు చేయాలని, విజయోత్సవాలు నిర్వహించరాదని ఎస్ఈసీ స్పష్టం చేశారు. పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఈనెల 18వతేదీ సాయంత్రం ఐదు గంటలలోగా కౌంటింగ్ ఏజెంట్ల వివరాలను ఆర్వోలకు అందచేయాలని సూచించారు. చదవండి: గ్రహణం వీడింది: సజ్జల ఆ వ్యాఖ్యలపై ఆక్షేపణ.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు అంతకుముందు ఉదయం హైకోర్టు ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఓట్ల లెక్కింపు సందర్భంగా కోవిడ్ మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. ఓట్ల లెక్కింపు చేపట్టవద్దని, ఫలితాలను వెల్లడించవద్దని గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేసింది. మరోవైపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు గతంలో ఏ దశలో నిలిచిపోయాయో అక్కడి నుంచి తిరిగి నిర్వహించేందుకు వీలుగా మళ్లీ తాజా నోటిఫికేషన్ జారీ చేయాలని ఆదేశిస్తూ సింగిల్ జడ్జి ఈ ఏడాది మే 21న ఇచ్చిన ఆదేశాలను ధర్మాసనం రద్దు చేసింది. ఈ తీర్పులో ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిపై న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలను ధర్మాసనం ఆక్షేపించింది. అలాంటి వ్యాఖ్యలు ఎంత మాత్రం అవసరం లేదని పేర్కొంది. సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేసినందున, ఆ తీర్పులోని వ్యాఖ్యలకు అంత ప్రాధాన్యం ఉండదని ధర్మాసనం స్పష్టం చేసింది. సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని దాఖలు చేసిన అప్పీల్‌ను అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ జవలాకర్ ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. చదవండి: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ నిమిత్తం ఈ ఏడాది ఆగస్టు 1న ఎన్నికల కమిషనర్ జారీ చేసిన నోటిఫికేషన్ పోటీ చేసే అభ్యర్థులందరికీ సమాన అవకాశాలు కల్పించలేదనడం అర్థం కాకుండా ఉందని తీర్పులో హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆ నోటిఫికేషన్ రాష్ట్రంలో పోటీ చేసే అభ్యర్థులందరికీ వర్తిస్తున్నప్పుడు అది ఏ రకంగా అభ్యర్థుల హక్కులను హరిస్తుందో అర్థం కావడం లేదంది. వాస్తవానికి జనసేన నేత అభ్యర్థన ఎన్నికలను ఎక్కడ ఆపారో ఆ దశ నుంచి కాకుండా తిరిగి మొదటి నుంచి పెట్టాలన్నదేనని, అయితే ఈ అభ్యర్థనను సింగిల్ జడ్జి తన తీర్పులో తిరస్కరించారని ధర్మాసనం తెలిపింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నాలుగు వారాల ముందు ఎన్నికల నియామావళిని అమలు చేయాలన్న వర్ల రామయ్య అభ్యర్థనను జనసేన నేత వ్యాజ్యంలో పరిగణలోకి తీసుకున్నారని అనుకున్నా.. ఏప్రిల్ 1న ఎన్నికల నోటిఫికేషన్ సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఉద్దేశపూర్వకంగా ఇచ్చారని సింగిల్ జడ్జి పేర్కొనడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ధర్మాసనం తన తీర్పులో స్పష్టం చేసింది. ఎన్నికల కమిషనర్ ఏప్రిల్ 1న ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడమే కాకుండా, ఎన్నికలను నిలుపుదల చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై వెంటనే ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేయడాన్ని సింగిల్ జడ్జి తన తీర్పులో తప్పుపట్టారని, ఇది ఎంత మాత్రం సరికాదని ధర్మాసనం తెలిపింది. చట్టబద్ధంగా అప్పీల్ దాఖలు చేసినప్పుడు దాన్ని విమర్శించాల్సిన అవసరం లేదని సూచించింది. ‘సుప్రీం’ ఆదేశాలను పాటించినట్లే ఎన్నికల నిర్వహణకు నాలుగు వారాల ముందు నియమావళిని అమలు చేయాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులను గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా అమలు చేశారని, ఇది సుప్రీంకోర్టు ఆదేశాలను సంతృప్తిపరచడమే అవుతుందని తీర్పు సందర్భంగా హైకోర్టు స్పష్టం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలకు 4 వారాల ముందు ఎన్నికల నియమావళిని అమలు చేయాలన్నది సుప్రీంకోర్టు ఆదేశమే తప్ప, ప్రతీ ఎన్నికకు 4 వారాల ముందు నియమావళిని అమలు చేయాలన్నది సుప్రీంకోర్టు ఉద్దేశం కాదని పేర్కొంది. పిటిషన్లో ప్రస్తావించకున్నా.. మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు నాలుగు వారాల పాటు ఎన్నికల నియమావళిని అమలు చేయనప్పుడు టీడీపీ నేత వర్ల రామయ్య ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని ధర్మాసనం తన తీర్పులో ప్రస్తావించింది. జనసేన నేత చిల్లపల్లి శ్రీనివాసరావు తన వ్యాజ్యంలో ఎన్నికల నియమావళి ఉల్లంఘన గురించి కనీసం ఎలాంటి అభ్యర్థన చేయలేదని తెలిపింది. అయినప్పటికీ సింగిల్ జడ్జి తన తీర్పులో ఎన్నికల నియమావళి ఉల్లంఘనను జనసేన ప్రస్తావించిందని, నియమావళిని అమలు చేయకపోవడం వల్ల పోటీ చేసే అభ్యర్థుల హక్కులకు విఘాతం కలిగినట్లు నిరూపించారని అందులో పేర్కొన్నారని ధర్మాసనం తెలిపింది. సింగిల్ జడ్జి తన తీర్పులో పేర్కొన్న విషయాలను జనసేన నేత తన పిటిషన్లో ప్రస్తావించలేదని ధర్మాసనం స్పష్టం చేసింది. -
మా వల్ల కాదు బాబోయ్.. 15వ తేదీలోపు ఎన్నికలు అసాధ్యం!
సాక్షి, చెన్నై: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ మళ్లీ జాప్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆరు నెలలు గడువు కోరుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టులో శనివారం పిటిషన్ దాఖలు చేయడంతో ఈ వాదనకు మరింత బలం చేకూర్చుతోంది. నేపథ్యం ఇదీ.. రాష్ట్రంలో కొత్తగా ఆవిర్భవించిన విల్లుపురం, కళ్లకురిచ్చి, తిరునల్వేలి, తెన్కాశి, వేలూరు, రాణి పేట, తిరుపత్తూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లోని జిల్లా, యూనియన్, పట్టణ, గ్రామ పంచాయతీల అధ్యక్షులు, వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. మిగిలిన జిల్లాల్లో ఈ ప్రక్రియ ముగిసింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 15 కార్పొరేషన్లు, 120 మేరకు మునిసిపాలిటీలకు కూడా ఎన్నికలు జరగాల్సి ఉంది. కొత్త జిల్లాల్లోని స్థానిక సంస్థలు, రాష్ట్రంలోని నగర, మునిసిపాలిటీలకు సెపె్టంబరు 15లోపు ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. చదవండి: వీడని మిస్టరీ: అంతులేని ‘కొడనాడు’ కథ ఇందుకు తగ్గ పనులు రాష్ట్రంలో శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే వార్డుల విభజన ముగించి, ఓటర్ల జాబితా ప్రకటించారు. అలాగే, ఈనెల 6న కోయంబేడులోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో గుర్తింపు పొందిన పార్టీలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సమావేశానికి సిద్ధమయ్యారు. ఈ పరిస్థితుల్లో సెపె్టంబరు 15లోపు ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని.. ఈ మేరకు మరో ఆరు నెలలు గడువు కోరుతు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ‘కొత్త’ తలనొప్పి.. ఎన్నికల ఏర్పాట్లు వేగంగా సాగుతున్న నేపథ్యంలో రెండు రోజుల క్రితం రాష్ట్రంలో 6 మేజర్ మునిసిపాలిటీల ను కార్పొరేషన్లుగాను, 30 మేజర్ పట్టణ పంచాయతీలకు మునిసిపాలిటీ హోదా కలి్పస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పరిణామాలతో రాష్ట్రంలో కార్పొరేషన్ల సంఖ్య 21గాను, మునిసిపాలిటీల సంఖ్య అదనంగాను పెరిగింది. దీంతో ఆయా సంస్థల్లో వార్డుల విభజనతో పాటుగా ఇతర అంశాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం మళ్లీ దృష్టి సారించాల్సిన పరిస్థితి ఏర్పడింది. చదవండి: కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో కొత్త బ్రేక్.. 5 నిముషాల సమయం ఈ సమయంలో కోర్టు ఉత్తర్వుల మేరకు ఈనెల 15లోపు ఎన్నికలు నిర్వహించలేమంటూ ఎస్ఈసీ పిటిషన్లో పేర్కొంది. ఇది సోమవారం విచార ణకు వచ్చే అవకాశం ఉంది. కాగా ఈ విషయాలపై నగరాభివృద్ధి శాఖ మంత్రి కేఎన్ నెహ్రు మీడియాతో మాట్లాడు తూ ఎన్నికల నిర్వహణలో జాప్యం అనివార్యం అని.. అన్ని సమస్యలను సకాలంలో పరిష్కరిస్తే డిసెంబర్ నాటికి ఈ ప్రక్రియను ముగించే అవకాశం ఉందన్నారు. -
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై తీర్పు వాయిదా
సాక్షి, అమరావతి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను తిరిగి నిర్వహించేందుకు వీలుగా తాజా నోటిఫికేషన్ ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ)ను ఆదేశిస్తూ సింగిల్ జడ్జి జారీచేసిన ఉత్తర్వులను సవాలుచేస్తూ ఎన్నికల కమిషనర్ దాఖలు చేసిన అప్పీల్‌పై హైకోర్టులో గురువారం వాదనలు ముగిశాయి. వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ వ్యవహారంలో తమ వాదనలు కూడా వినాలంటూ ఆ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు కొందరు దాఖలు చేసిన అనుబంధ వ్యాజ్యాలను అనుమతిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. సింగిల్ జడ్జి ఇటీవల ఇచ్చిన తీర్పుపై గురువారం ధర్మాసనం విచారణ జరిపింది. ఎస్ఈసీ తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నాలుగు వారాల ఎన్నికల నియమావళిని అమలుచేశాకే ఈ ఎన్నికలు నిర్వహించామని చెప్పారు. కోవిడ్‌వల్ల గతంలో ఎన్నికలు ఏ దశలో అయితే నిలిచిపోయాయో అక్కడి నుంచే కొనసాగించామన్నారు. దీనిని సింగిల్ జడ్జి సైతం సమర్థించారని వివరించారు. ఓట్ల లెక్కింపు ఒక్కటే మిగిలి ఉందని, బ్యాలెట్ బాక్సుల రక్షణ నిమిత్తం రోజుకు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఖర్చు అవుతోందని ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అడిగిందొకటి.. ఇచ్చింది మరొకటి... అలాగే, పోలింగ్ తేదీకి నాలుగు వారాల ముందు నుంచి ఎన్నికల నియమావళిని అమలుచేసేలా ఆదేశాలివ్వాలంటూ టీడీపీ నేత వర్ల రామయ్య పిటిషన్ దాఖలు చేయగా, ఎన్నికలను మొదటి నుంచి నిర్వహించేలా ఆదేశాలివ్వాలంటూ జనసేన పార్టీ మరో పిటిషన్ వేసిందన్నారు. కానీ, ఎన్నికల తేదీకి నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్‌ను అమలుచేయాలని జనసేన కోరలేదన్నారు. అయితే.. సింగిల్ జడ్జి మాత్రం వర్ల రామయ్య పిటిషన్‌ను కొట్టేసి, జనసేన పిటిషన్లో మాత్రం ఎన్నికల తేదీకి నాలుగు వారాల ముందు నియమావళిని అమలుచేయాలంటూ తీర్పునిచ్చారని నిరంజన్‌రెడ్డి ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అలాగే, ఎన్నికల కమిషనర్ గురించి సింగిల్ జడ్జి పలు వ్యాఖ్యలు చేశారని, వాటిని తీర్పు నుంచి తొలగించాలని కోరారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని సింగిల్ జడ్జి తీర్పును రద్దుచేయాలని నిరంజన్‌రెడ్డి ధర్మాసనాన్ని కోరారు. జనసేన తరఫున న్యాయవాది వి.వేణుగోపాలరావు వాదనలు వినిపించగా.. ఎన్నికల్లో పోటీచేసిన ఓ అభ్యర్థి తరఫున న్యాయవాది వీఆర్ఎన్ ప్రశాంత్ వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్. శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ, పిటిషనర్లు లేవనెత్తని అనేక అంశాలపై సింగిల్ జడ్జి ఉత్తర్వులిచ్చారని తెలిపారు. ఈ ఎన్నికల కోసం రూ.160 కోట్ల మేర ఖర్చయిందని.. అందువల్ల ఓట్ల లెక్కింపునకు అనుమతినివ్వాలని కోరారు. అందరి వాదనలు విన్న ధర్మాసనం, తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. -
మిగిలిన మునిసి‘పోల్స్’కు కసరత్తు
సాక్షి, అమరావతి: నెల్లూరు, శ్రీకాకుళం నగరపాలక సంస్థలతో పాటు ఇంతకుముందు ఎన్నికలు ఆగిపోయిన 11 మునిసిపాలిటీలకు త్వరలో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ఇందుకు సంబంధించి రెండు రోజుల క్రితం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని మునిసిపల్ శాఖ అధికారులతో ప్రాథమిక సమావేశం నిర్వహించారు. మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ఎంఎం నాయక్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి కె.కన్నబాబు ఆ సమావేశంలో పాల్గొన్నారు. గత ఏడాది మార్చి నెలలో రాష్ట్రమంతటా మునిసిపల్ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేయగా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో పోలింగ్ నిర్వహించిన విషయం తెలిసిందే. అప్పట్లో 75 మునిసిపాలిటీలు, 12 నగరపాలక సంస్థలకు మాత్రమే ఎన్నికలు జరగ్గా.. వివిధ కారణాలతో 32 మునిసిపాలిటీలతో పాటు 4 నగరపాలక సంస్థలకు ఎన్నికలు నిలిచిపోయాయి. వాటిలో అకివీడు (పశ్చిమ గోదావరి), జగ్గయ్యపేట, కొండపల్లి (కృష్ణా), దాచేపల్లి, గురజాల (గుంటూరు), దర్శి (ప్రకాశం), బుచ్చిరెడ్డిపాలెం (నెల్లూరు), కుప్పం (చిత్తూరు), బేతంచర్ల (కర్నూలు), కమలాపురం (వైఎస్సార్), పెనుకొండ (అనంతపురం) మునిసిపాలిటీలతో పాటు నెల్లూరు, శ్రీకాకుళం నగరపాలక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు కోర్టు ఆటంకాలు ఏవీ లేవని మునిసిపల్ అధికారులు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఆయా మునిసిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు అధికారికంగా నివేదిక ఇవ్వాలని ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని మునిసిపల్ అధికారులకు సూచించినట్టు తెలిసింది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఓటర్ల జాబితాల తయారీ, వార్డులు, డివిజన్ల వారీగా రిజర్వేషన్ల ఖరారు వంటి అంశాలను నివేదికలో పేర్కొనాలని సూచించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులను అంచనా వేసుకుని, ఆయా మునిసిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తగిన కార్యాచరణను సిద్ధం చేసుకోనున్నట్టు కమిషన్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. గ్రామీణ ఎన్నికలకూ సన్నద్ధం గ్రామాల్లో నిలిచిపోయిన సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల గురించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఆరా తీశారు. శనివారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్, ఇతర అధికారులతో సాహ్ని భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు పోలింగ్ ముగిసినప్పటికీ.. కోర్టు ఆదేశాల మేరకు కౌంటింగ్ ప్రక్రియ నిలిచిపోయిన అంశం సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చింది. మరోవైపు అప్పట్లో గ్రామ పంచాయతీల విలీనం, వర్గీకరణ వంటి కారణాలతో ఎన్నికలు ఆగిపోయిన 259 చోట్ల సర్పంచ్, వాటి పరిధిలోని వార్డు పదవులకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని పంచాయతీరాజ్ అధికారులు వివరించారు. నామినేషన్లు దాఖలు కాకపోవడం వల్ల నిలిచిపోయిన వివిధ గ్రామ పంచాయతీల పరిధిలో దాదాపు 223 వార్డుల్లో కూడా ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని తెలియజేసినట్టు సమాచారం. దాదాపు 452 ఎంపీటీసీ స్థానాలు, 22 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉందని కూడా ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకొచ్చినట్టు తెలిసింది. ఇప్పటికే ఎన్నికలు జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో కౌంటింగ్ నిర్వహించే అంశంపై బుధవారం హైకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో.. మిగిలిన గ్రామీణ సంస్థల ఎన్నికలపై కోర్టు తీర్పు ఆధారంగా తదుపరి కార్యాచరణ చేపట్టాలని ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. -
ఏలూరు కార్పొరేషన్ వైఎస్సార్సీపీ కైవసం
లైవ్ అప్డేట్స్ వైఎస్సార్సీపీ ప్రభంజనం ►ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ ముగిసింది. ఏలూరు కార్పొరేషన్‌ను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. ఏలూరు మేయర్ పీఠం వైఎస్సార్సీపీ దక్కించుకుంది. 50 డివిజన్ల ఫలితాలు వెల్లడికాగా, 47 డివిజన్లలో వైఎస్సార్సీపీ గెలుపు సాధించింది. కేవలం 3 స్థానాలకే టీడీపీ పరిమితమైంది. ► 1వ డివిజన్ ఎ.రాధిక (వైఎస్సార్సీపీ) విజయం ►2వ డివిజన్ వైఎస్సార్సీపీ అభ్యర్ధి నరసింహారావు గెలుపు, 787 ఓట్ల మెజార్టీతో జె.నరసింహారావు విజయం. ► 3వ డివిజన్ బి.అఖిల (వైఎస్సార్సీపీ) విజయం ► 4వ డివిజన్ డింపుల్ (వైఎస్సార్సీపీ) విజయం, 744 ఓట్ల మెజార్టీతో డింపుల్ గెలుపు ► 5వ డివిజన్ జయకర్ (వైఎస్సార్సీపీ) విజయం, 865 ఓట్ల మెజార్టీతో జయకర్ విజయం ► 10వ డివిజన్ పైడి భీమేశ్వరరావు (వైఎస్సార్సీపీ) గెలుపు, 812 ఓట్ల మెజార్టీతో పైడి భీమేశ్వరరావు విజయం ► 11వ డివిజన్ కోయ జయగంగ (వైఎస్సార్సీపీ) గెలుపు, 377 ఓట్ల మెజార్టీతో కోయ జయగంగ విజయం ► 12వ డివిజన్ కర్రి శ్రీను (వైఎస్సార్సీపీ) గెలుపు, 468 ఓట్ల మెజార్టీతో కర్రి శ్రీను విజయం ► 17వ డివిజన్ టి.పద్మ (వైఎస్సార్సీపీ) విజయం, 755 ఓట్ల మెజార్టీతో టి.పద్మ గెలుపు ► 18వ డివిజన్ కేదారేశ్వరి (వెస్సార్సీపీ) విజయం, 1012 ఓట్ల మెజార్టీతో కేదారేశ్వరి గెలుపు ► 19వ డివిజన్ వై.నాగబాబు (వెస్సార్సీపీ) విజయం, 1012 ఓట్ల మెజార్టీతో వై.నాగబాబు విజయం ► 22వ డివిజన్ సుధీర్‌బాబు (వైఎస్సార్సీపీ) గెలుపు ► 23వ డివిజన్ కె.సాంబ (వైఎస్సార్సీపీ) విజయం, 1823 ఓట్ల మెజార్టీతో కె.సాంబ గెలుపు ► 24వ డివిజన్ మాధురి నిర్మల (వైఎస్సార్సీపీ) గెలుపు, 853 ఓట్ల మెజార్టీతో మాధురి నిర్మల విజయం ► 25వ డివిజన్ గుడుపూడి శ్రీను (వైఎస్సార్సీపీ) గెలుపు ►26వ డివిజన్ అద్దంకి హరిబాబు(వైఎస్సార్సీపీ) గెలుపు, 1,111 ఓట్ల మెజార్టీతో అద్దంకి హరిబాబు విజయం ► 31వ డివిజన్ లక్ష్మణ్ (వైఎస్సార్సీపీ) విజయం, 471 ఓట్ల మెజార్టీతో లక్ష్మణ్ గెలుపు ► 32వ డివిజన్ సునీత రత్నకుమారి (వైఎస్సార్సీపీ) గెలుపు ► 33వ డివిజన్ రామ్మోహన్రావు (వైఎస్సార్సీపీ) విజయం, 88 ఓట్ల మెజార్టీతో రామ్మోహన్రావు గెలుపు ►36వ డివిజన్ హేమ సుందర్ (వైఎస్సార్సీపీ) విజయం ►38వ డివిజన్ వైఎస్సార్సీపీ అభ్యర్ధి విజయం, 261 ఓట్ల మెజార్టీతో హేమా మాధురి గెలుపు ►39వ డివిజన్ వైఎస్సార్సీపీ అభ్యర్ధి విజయం, 799 ఓట్ల మెజార్టీతో కె.జ్యోతి విజయం ►40వ డివిజన్ టి.నాగలక్ష్మి (వైఎస్సార్సీపీ) గెలుపు, 758 ఓట్ల మెజార్టీతో టి.నాగలక్ష్మి విజయం ► 41వ డివిజన్ వైఎస్సార్సీపీ అభ్యర్ధి కల్యాణి విజయం, 547 ఓట్ల మెజార్టీతో కల్యాణి దేవి విజయం ► 42వ డివిజన్ వైఎస్సార్సీపీ అభ్యర్ధి విజయం, 79 ఓట్ల మెజార్టీతో ఎ.సత్యవతి విజయం ► 43వ డివిజన్ జె.రాజేశ్వరి (వైఎస్సార్సీపీ) గెలుపు ► 45వ డివిజన్ ముఖర్జీ (వైఎస్సార్సీపీ) గెలుపు, 1058 ఓట్ల మెజార్టీతో ముఖర్జీ విజయం ► 46వ డివిజన్ వైఎస్సార్సీపీ అభ్యర్ధి ప్యారీ బేగం విజయం, 1,232 ఓట్ల మెజార్టీతో ప్యారీ బేగం గెలుపు ► 48వ డివిజన్ స్వాతి శ్రీదేవి (వైఎస్సార్సీపీ) విజయం, 483 ఓట్ల మెజార్టీతో స్వాతి శ్రీదేవి గెలుపు ►50వ డివిజన్ షేక్ నూర్జహాన్ (వైఎస్సార్సీపీ) విజయం, 1495 ఓట్ల మెజార్టీతో షేక్ నూర్జహాన్ గెలుపు ► 26 డివిజన్లలో వైఎస్సార్సీపీ ముందంజ ► 50వ డివిజన్ వైఎస్సార్సీపీ అభ్యర్ధి షేక్ నూర్జహాన్ ఆధిక్యం ►ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ హవా ►20 డివిజన్లలో వైఎస్సార్సీపీ ముందంజ ►41వ డివిజన్లో వైఎస్సార్‌సీపీఅభ్యర్ధి కల్యాణి విజయం ► 8వ డివిజన్లో ఫైనల్ కౌంటింగ్ కొనసాగుతోంది. ► 2,10, 31, 33, 36, 39, 45, 46, 47 డివిజన్లలో ఫైనల్ కౌంటింగ్ కొనసాగుతోంది. ► ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ► 50 పోస్టల్ బ్యాలెట్లలో పోలైన ఓట్లు 15, ► వైఎస్సార్సీపీ- 11, చెల్లనవి- 2, నోటా-1, టీడీపీ-1 ► ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ► తొలుత 50 పోస్టల్ బ్యాలెట్ ఓట్లను కౌంటింగ్ సిబ్బంది లెక్కిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్లింపు అనంతరం డివిజన్ల వారీగా ఓట్ల లెక్కిస్తారు. ప్రతీ టేబుల్‌కి ప్రతీ రౌండ్లో1000 ఓట్ల లెక్కిస్తారు. ప్రతీ టేబుల్‌కి 25 ఓట్లని బండిల్‌గా కట్టి 40 బండిల్స్‌గా లెక్కిస్తారు. ఓట్ల లెక్కింపు స్వయంగా జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ పర్యవేక్షిస్తున్నారు. ► ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రారంభమైంది. సాక్షి, ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఏలూరు శివారులోని సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపునకు అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. 47 డివిజన్లకు 48 టేబుల్స్‌పై ఒకే రౌండ్లో ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 12 గంటలకల్లా పూర్తై తుది ఫలితాలు వెల్లడికాన్నాయి. నలుగురు సీనియర్ ఆఫీసర్లను నాలుగు కౌంటింగ్ హాళ్లకు సూపర్ వైజర్లుగా నియమించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద సీసీటీవీ కెమెరా, వీడియోగ్రఫీతో పర్యవేక్షించనున్నారు. కౌంటింగ్ సిబ్బంది అందరికీ కోవిడ్ టెస్టులు, మాస్క్, ఫేస్ షీల్డ్ లేనిదే కౌంటింగ్ హాలులోకి అనుమతి నిరాకరిస్తామని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని అధికారులు తెలిపారు. కాగా, ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి 50 డివిజన్లలో ఇప్పటికే మూడు డివిజన్లు వైఎస్సార్సీపీకి ఏకగ్రీవమైన సంగతి తెలిసిందే. మార్చిలో ఎన్నికలు ముగిసిన నాటి నుంచి ఫలితాల కోసం ఎంతో ఉత్కంఠగా వేచిచూస్తున్న అభ్యర్థుల గెలుపోటములు నేడు వెల్లడి కానున్నాయి. -
పరిషత్ ఎన్నికల రద్దు ఆదేశాలు నిలుపుదల
సాక్షి,అమరావతి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను తిరిగి నిర్వహించేందుకు వీలుగా తాజా నోటిఫికేషన్ ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ఆదేశిస్తూ సింగిల్ జడ్జి జారీ చేసిన ఉత్తర్వుల అమలును హైకోర్టు నిలిపివేసింది. అయితే ఈ అప్పీల్‌పై తేలేవరకు ఓట్ల లెక్కింపు చేపట్టరాదని, ఫలితాలను వెల్లడించరాదని ఎన్నికల కమిషన్‌ను హైకోర్టు ఆదేశించింది. అప్పీల్‌పై పూర్తిస్థాయిలో విచారణ నిర్వహిస్తామని పేర్కొంటూ తదుపరి విచారణను జూలై 27కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు గతంలో ఏ దశలో అయితే నిలిచిపోయాయో అక్కడి నుంచి తిరిగి నిర్వహించేందుకు వీలుగా మళ్లీ నోటిఫికేషన్ జారీ చేయాలంటూ సింగిల్ జడ్జి గత నెల 21న ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సీజే నేతృత్వంలోని ధర్మాసనం తాజాగా విచారణ జరిపింది. సింగిల్ జడ్జి తప్పు చేశారు...! రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. పోలింగ్ తేదీకి 4 వారాల ముందు ఎన్నికల నియమావళిని అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ టీడీపీ నేత వర్ల రామయ్య పిటిషన్ దాఖలు చేయగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను మొదటి నుంచి నిర్వహించేలా ఆదేశించాలంటూ జనసేన నేత చిల్లపల్లి శ్రీనివాసరావు వేర్వేరుగా పిటిషన్లు వేశారని తెలిపారు. నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్ అమలు చేయాలని శ్రీనివాసరావు తన పిటిషన్లో కోరలేదన్నారు. అయితే సింగిల్ జడ్జి మాత్రం వర్ల రామయ్య పిటిషన్‌ను కొట్టివేసి శ్రీనివాసరావు పిటిషన్లో ఎన్నికల తేదీకి నాలుగు వారాల ముందు నియమావళిని అమలు చేయాలంటూ ఉత్తర్వులిచ్చారన్నారు. ఈ విషయంలో సింగిల్ జడ్జి తప్పు చేశారని వివరించారు. ఈ సమయంలో జనసేన తరఫు న్యాయవాది వి.వేణుగోపాలరావు స్పందిస్తూ ఎన్నికల తేదీకి నాలుగు వారాల ముందు నియమావళిని అమలు చేయాలని వాదనల సమయంలో న్యాయమూర్తి దృష్టికి తెచ్చామని చెప్పారు. క్షుణ్ణంగా విచారణ అవసరం... ఈ మొత్తం వ్యవహారంపై లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. ఆగస్టు మొదటి వారంలో విచారణ జరుపుతామని ధర్మాసనం పేర్కొనగా జూలై మొదటి వారంలో చేపట్టాలని నిరంజన్‌రెడ్డి అభ్యర్థించారు. ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చిన బ్యాలెట్ బాక్సులను తిరిగి ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఇప్పుడు ఎన్నికలు ఏవీ లేవు కదా? అని ధర్మాసనం ప్రశ్నించగా తమిళనాడులో స్థానిక ఎన్నికలు జరగనున్నాయని నిరంజన్‌రెడ్డి చెప్పారు. జూలై మొదటి వారంలో సాధ్యం కాదని, అనేక ముఖ్యమైన కేసులను ఆ వారంలో విచారించాల్సి ఉందని ధర్మాసనం తెలిపింది. ఈ నేపథ్యంలో జూలై 27న విచారణ జరుపుతామని పేర్కొంటూ సింగిల్ జడ్జి ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడే మిగిలింది.. నిరంజన్‌రెడ్డి వాదనలను కొనసాగిస్తూ ఇప్పటికే పరిషత్ ఎన్నికలు పూర్తయ్యాయని, ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి మాత్రమే మిగిలి ఉందన్నారు. అందువల్ల సింగిల్ జడ్జి ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతున్నామన్నారు. రాజ్యాంగంలోని అధికరణ 226 కింద హైకోర్టు తనకున్న అధికారాలను ఎన్నికల నిర్వహణకు ఉపయోగించాలే కానీ అడ్డుకునేందుకు వాడరాదన్నారు. ఎన్నికల ప్రక్రియ ఒకసారి మొదలయ్యాక∙అసాధారణ పరిస్థితుల్లో మినహా న్యాయస్థానాలు జోక్యం చేసుకోరాదని సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తు చేశారు. ఎన్నికల ప్రక్రియలో న్యాయస్థానాల జోక్యానికి సంబంధించిన రాజ్యాంగంలోని అధికరణలు 243 ఓ, 329లకు సింగిల్ జడ్జి తనదైన శైలిలో భాష్యం చెప్పారని, అది ఎంతమాత్రం సరికాదన్నారు. 2019 నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. అప్పీల్‌పై వీలైనంత త్వరగా విచారణ జరిపేందుకు వీలుగా నిర్దిష్టంగా ఒక తేదీని ఖరారు చేసి తుది విచారణ చేపట్టాలని కోరారు. -
పరిషత్ ఎన్నికలు: సింగిల్ బెంచ్ ఆదేశాలను సవాల్ చేస్తూ ఎస్ఈసీ పిటిషన్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల రద్దును సవాల్ చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇదే విషయమై గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ.. ఎస్ఈసీ డివిజన్ బెంచ్‌కు వెళ్లింది. నిబంధనల ప్రకారమే ఎన్నికలు నిర్వహించామని ఎస్ఈసీ తమ పిటిషన్లో పేర్కొంది. ఎన్నికల నిర్వహణలో సుప్రీం ఆదేశాలను తూచా తప్పకుండా పాటించామని తెలిపింది. కాగా, ఏపీలో పరిషత్ (ఎంపీటీసీ, జడ్పీటీసీ) ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ మే 21న తీర్పును వెలువరించింది. పరిషత్ ఎన్నికలకు కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని ఎస్ఈసీని ఆదేశించింది. -
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై అప్పీల్
సాక్షి, అమరావతి: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ హైకోర్టు డివిజన్ బెంచ్‌లో అప్పీల్ దాఖలు చేసింది. దీనికి సంబంధించి గురువారమే పిటిషన్ దాఖలు ప్రక్రియ పూర్తైందని, పిటిషన్‌కు నెంబరు కేటాయింపు లాంటి అంశాలు న్యాయస్థానం పరిశీలనలో ఉన్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఎన్నికల ప్రక్రియపై హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సరిదిద్ది పోలింగ్ ప్రక్రియ కూడా ముగిసిన నేపధ్యంలో కౌంటింగ్‌కు అనుమతించాలంటూ పిటిషన్లో అభ్యర్థించినట్లు అధికారులు వెల్లడించారు. ఏడాదికిపైగా ఎన్నికల ప్రక్రియ.. వరుసగా చోటు చేసుకున్న వివిధ పరిణామాలతో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ ఏడాదికిపైగా సుదీర్ఘంగా కొనసాగుతోంది. పరిషత్ ఎన్నికలకు మొదట 2020 మార్చి 7వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయింది. అంటే ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయి ఇప్పటికి ఏడాది దాటిపోయింది. నామినేషన్ల దాఖలు, ఉపసంహరణ ప్రక్రియ కూడా ముగిసి తుది అభ్యర్ధుల జాబితాలు ఖరారైన తర్వాత అప్పటి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ కరోనా పేరుతో ఆ ఎన్నికల ప్రక్రియను వాయిదా వేశారు. ఈ ఏడాది ఆరంభంలో గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించిన సమయంలోనే పరిషత్ ఎన్నికలు కూడా నిర్వహించేందుకు అవకాశం ఉన్నా నిమ్మగడ్డ కావాలనే ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేశారన్న ఆరోపణలున్నాయి. నిమ్మగడ్డ స్థానంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని బాధ్యతలు చేపట్టిన అనంతరం ఈ ఏడాది ఏప్రిల్ 8వతేదీన మధ్యలో ఆగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు పోలింగ్ ప్రక్రియను పూర్తి చేశారు. అయితే, టీడీపీ, జనసేన తదితర పార్టీలు పరిషత్ ఎన్నికలపై కోర్టును ఆశ్రయించడంతో మే 21న ఆగిపోయిన ఎన్నికల కొనసాగింపునకు ఏప్రిల్ 1న రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ తీర్పు హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలు వెలువరించింది. గెలిచినా ఏడాదిగా నిరీక్షణ.. 2020 మార్చిలో పరిషత్ ఎన్నికల నామినేషన్ల సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 126 జడ్పీటీసీ, 2,371 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిశాయి. హైకోర్టు తాజా తీర్పు తర్వాత కూడా ఆ ఏకగ్రీవాలన్నీ యధాతథంగానే కొనసాగుతాయని రాష్ట్ర ఎన్నికల కమిషన్ గతంలోనే స్పష్టం చేసింది. అయితే రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి కాకపోవడంతో వారంతా అధికారికంగా విధుల్లో చేరే పరిస్థితి లేదు. గెలిచిన తర్వాత కూడా దాదాపు ఏడాదికిపైగా వారంతా పదవీ బాధ్యతలు చేపట్టకుండా ఎదురుచూస్తూనే ఉన్నారు. 11 ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి పరిషత్ ఫలితాలతో లింక్ శాసన మండలిలో స్థానిక సంస్థల కోటాకు సంబంధించి 11 ఎమ్మెల్సీ స్థానాలు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. ఖాళీగా ఉన్న ఆ 11 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగాలంటే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ తప్పనిసరిగా పూర్తి కావాలని అధికార వర్గాలు తెలిపాయి. నిబంధనల ప్రకారం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో గెలిచిన వారితో పాటు మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన వారు జిల్లాలవారీగా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీలను ఎన్నుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో స్థానిక సంస్థల కోటాలో ఖాళీగా ఉన్న 11 ఎమ్మెల్సీ స్థానాలను అధికార వైఎస్సార్సీపీ ఖాయంగా గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో మండలిలో అధికార వైఎస్సార్సీపీ బలం మరింత పెరగకుండా అడ్డుపడేందుకే టీడీపీ, జనసేన లాంటి పార్టీలు ఉద్దేశపూర్వకంగా న్యాయ వివాదాలు సృష్టిస్తూ పరిషత్ ఎన్నికల ఫలితాల వెల్లడికి ఆటంకాలు కల్పిస్తున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఏకగ్రీవాలు యథాతథం
సాక్షి, అమరావతి: పరిషత్ ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ ఏకగ్రీవమైన ఎంపీటీసీ, జడ్పీటీసీలు యథాతథంగా ఉంటారని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికార వర్గాలు శుక్రవారం స్పష్టం చేశాయి. 2020 మార్చిలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 126 జడ్పీటీసీ స్థానాలు, 2,371 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమైన సంగతి తెలిసిందే. 2020 మార్చిలో జరిగిన నామినేషన్ల ప్రక్రియను హైకోర్టు రద్దు చేయలేదని.. కరోనా అనంతరం మధ్యలో ఆగిపోయిన ఎన్నికలను తిరిగి నిర్వహించడానికి ఇచ్చిన నోటిఫికేషన్‌ను మాత్రమే రద్దు చేసిందని రాష్ట్ర ఎన్నికల సంఘం, పంచాయతీరాజ్ శాఖ అధికార వర్గాలు వెల్లడించాయి. హైకోర్టు తీర్పుపై మీడియా, కొన్ని రాజకీయ పార్టీలు తప్పుగా ప్రచారం చేస్తున్నాయని వివరించాయి. 2020 మార్చిలో మధ్యలో ఆగిపోయిన ఎన్నికలను 2021 ఏప్రిల్‌లో తిరిగి నిర్వహించేటప్పుడు నోటిఫికేషన్‌కు, పోలింగ్‌కు మధ్య 4 వారాల గడువును పాటించలేదని మాత్రమే కోర్టు తప్పుపట్టిందని తెలిపాయి. ఈ ఏడాది ఏప్రిల్ 1న జారీ చేసిన నోటిఫికేషన్‌నే కోర్టు రద్దు చేసిందన్నాయి. 2020 మార్చిలో ఇచ్చిన ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం.. నామినేషన్ల ఉపసంహరణ వరకు జరిగిన ప్రక్రియంతా చెల్లుబాటులో ఉన్నట్లేనని వెల్లడించాయి. హైకోర్టు తాజా తీర్పు ప్రకారం.. ఏప్రిల్ 8న జరిగిన పోలింగ్ ప్రక్రియ మాత్రమే రద్దు అయినట్టుగా భావించాలని, అంతకు ముందు జరిగిన నామినేషన్లన్నీ చెల్లుబాటులో ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. తాజా తీర్పుపై డివిజన్ బెంచ్‌లో సవాల్ చేయాలని ఎస్ఈసీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. -
మే 3 తర్వాత ఎన్నికలు పెట్టొద్దు
-
మే 3 తర్వాత ఎన్నికలు పెట్టొద్దు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 3న మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత... కరోనా కేసులు తగ్గే వరకూ రాష్ట్రంలో ఎక్కడా ఎన్నికలు నిర్వహించరాదని ఎన్నికల కమిషన్, రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ ఉత్తర్వులను ఎన్నికల కమిషన్‌కు తెలియజేయాలని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్‌కు స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఆదేశించింది. ఏప్రిల్ 30తో రాత్రి కర్ఫ్యూ గడువు ఉత్తర్వులు ముగుస్తుండటంతో తర్వాత ఎటువంటి చర్యలు తీసుకుంటారో తెలియజేయాలంటూ గతంలో ఆదేశించిన నేపథ్యంలో కరోనా నియంత్రణ చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాలను ధర్మాసనం మరోసారి విచారించింది. ఉదయం 10.45 గంటల ప్రాంతంలో ఈ కేసులు విచారణకు రాగా... భోజన విరామం సమయానికి ప్రభుత్వ నిర్ణయాన్ని చెబుతామని అడ్వకేట్ జనరల్ (ఏజీ) నివేదించారు. తర్వాత 1.30 గంటల ప్రాంతంలో తిరిగి ఈ కేసులు విచారణకు రాగా... ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని, పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటుందని ఏజీ నివేదించారు. దీంతో ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘నిన్నటి నుంచి విచారణను ఈ రోజుకు వాయిదా వేశాం. ఇంత తీవ్రమైన అంశంపై నిర్ణయం తీసుకోవడానికి 24 గంటల సమయం సరిపోలేదా? ధర్మాసనం సహనాన్ని పరీక్షిస్తున్నారు. ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోనుందో చెప్పాలని 27న ఆదేశించాం. ఏజీ విజ్ఞప్తి మేరకు 28కి కేసు వాయిదా వేశాం. 28న ఏజీ మరోసారి చేసిన విజ్ఞప్తి మేరకు ఈ రోజు విచారించాం. అయినా ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేదని చెప్పడం తీవ్ర అభ్యంతరకరం. మరికొన్ని గంటల్లో అంటే అర్ధరాత్రితో కర్ఫ్యూ గడువు ఉత్తర్వులు ముగియనున్నాయి. అర్ధరాత్రి తర్వాత జరిగే పరిణామాలకు ఎవరు బాధ్యులు? ప్రభుత్వానికి నిర్ణయం తీసుకోవడం చేతకాకపోతే మేమే తగిన ఉత్తర్వులు జారీచేస్తాం’అని ధర్మాసనం హెచ్చరించిం ది. ఈ దశలో ఏజీ జోక్యం చేసుకొని కోర్టు ఉత్తర్వులు జారీచేయాలని కోరారు. కార్యనిర్వహణ వ్యవస్థ అధికారాల్లో జోక్యం చేసుకోరాదనే ఉద్దేశంతో అడిగినంత గడువు ఇస్తున్నామని, తమ నుంచి ఊహించిన దాని కంటే తీవ్రమైన ఉత్తర్వులు ఉంటాయని ధర్మాసనం హెచ్చరించింది. తిరిగి 45 నిమిషాల్లో ఈ కేసును విచారిస్తామని, అప్పటిలోగా ప్రభుత్వ నిర్ణయాన్ని చెప్పాలంటూ మరోసారి విచారణ వాయిదా వేసింది. కర్ఫ్యూ పొడిగించాం: ఏజీ రాత్రి కర్ఫ్యూను ఈనెల 8వ తేదీ ఉదయం 5 గంటల వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఈ మేరకు జారీ చేసిన జీవోను అడ్వకేట్ జనరల్ (ఏజీ) ధర్మాసనానికి సమర్పించారు. జీవోను పరిశీలించిన ధర్మాసనం సంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వం తన నిర్ణయాన్ని తెలియజేయకుండా తాము ఆదేశాలు జారీచేసే అవకాశం కల్పించి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని చెప్పింది. 3వ తేదీ తర్వాత స్థానిక సంస్థల కు, ఇతర ఉప ఎన్నికలు ఏమైనా పెడుతున్నారా అని ఏజీని ప్రశ్నించగా... లేదని తెలిపారు. కరోనా కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టే వరకూ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించరాదని ధర్మాసనం స్పష్టం చేసింది. కరోనా నియంత్రణకు అన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను ఈనెల 5కు వాయిదా వేసింది. మధ్యంతర ఉత్తర్వులు జూన్ 30 వరకు పొడిగింపు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు అనూహ్యంగా పెరుగుతున్న నేపథ్యంలో పలు కేసుల్లో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్లు హైకోర్టు ఫుల్ కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ ఎంఎస్ రామచందర్‌రావు, జస్టిస్ రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఆదేశించింది. -
ప్రాణాలకన్నా ఎన్నికలు ముఖ్యమా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు వేలల్లో పెరుగుతున్న వేళ ప్రజల ప్రాణాలకన్నా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడం ముఖ్యమా అని హైకోర్టు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ప్రశ్నిం చింది. రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయంతో సంబంధం లేకుండా ఎస్ఈసీ స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవాల్సిందని, రాజ్యాంగబద్ధమైన సంస్థ ఇంత నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం ఏమిటంటూ మండిపడింది. ఎన్నికల ప్రాంతాల్లో ఎవరైనా కరోనాతో మరణిస్తే అందుకు ఎవరిది బాధ్యతని నిలదీసింది. ‘ప్రపంచమంతా కరోనా సునామీలా విరుచుకుపడుతున్నా ఎస్ఈసీ అధి కారులకు పట్టదా? వారు భూమ్మీదే ఉన్నారా? మరేదైనా గ్రహంపై ఉన్నారా? ఇప్పుడు ఎన్నికలు పెట్టకపోతే ఆకాశం కూలిపోతుందా? భూమి బద్దలవుతుందా?’ ’ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా నియంత్రణకు సంబంధించి దాఖలైన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లి, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం గురువారం మరోసారి విచారణ చేపట్టింది. ఎస్ఈసీ దాఖలు చేసిన అఫిడవిట్‌పై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఎస్ఈసీ కార్యదర్శి అశోక్‌కుమార్ ధర్మాసనం ఎదుట హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసినందుకే... రాష్ట్రంలో పరిస్థితుల దృష్ట్యా ఎన్నికలు నిర్వహించాలా వద్దా అన్న అంశంపై పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాశామని, రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేశాకే నోటిఫికేషన్ ఇచ్చామని అశోక్‌కుమార్ వివరించారు. ఎన్నికల విధుల్లో ఎందరు అధికారులు పాల్గొంటున్నారని ధర్మాసనం ప్రశ్నించగా 7,695 ఉపాధ్యాయులు, ఇతర ప్రభుత్వాధికారులు, 2,557 మంది పోలీసులు పాల్గొంటున్నారని వివరించారు. వారిలో ఎందరు కరోనా బారినపడ్డారని ధర్మాసనం ప్రశ్నించగా శుక్రవారం ఎన్నికల సామ్రగ్రి తీసుకునేందుకు సిబ్బంది రావాల్సి ఉన్నందున అప్పుడు తెలిసే అవకాశం ఉందని అశోక్‌కుమార్ బదులిచ్చారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ఏడు మున్సిపాలిటీల్లోని ఓటర్లతోపాటు సిబ్బంది, పోలీసుల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారని మండిపడింది. పోలీసులు, ఇతర అధికారులను ఎన్నికల విధులకు కేటాయించడం వల్ల వారిపై ఒత్తిడి పెంచుతున్నారని వ్యాఖ్యానించింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక కోర్టుల జోక్యానికి వీల్లేదని, కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఎన్నికలు ఆపాలంటూ ఇచ్చిన వినతిపత్రంపై తగిన చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీని సింగిల్ జడ్జి ఈ నెల 19న ఆదేశించిన విషయాన్ని ధర్మాసనం గుర్తుచేసింది. ఈ నెల 20 నుంచి ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ పెట్టినా ఎస్ఈసీ తగిన చర్యలు తీసుకోలేదంటూ అసహనం వ్యక్తం చేసింది. మున్సిపల్ చట్టంలోని సెక్షన్ 195 ప్రకారం అంటువ్యాధులు ప్రబలినప్పుడు ఎన్నికలను వాయిదా వేయవచ్చని, రాష్ట్రంలో పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా ఎస్ఈసీకి కనిపించట్లేదా? అని ప్రశ్నించింది. కరోనా పరీక్షలు ఎందుకు తగ్గించారు? రాష్ట్రంలో కరోనా కేసులు అనూహ్యంగా తగ్గుతున్నాయని, దీని వెనుకున్న మర్మం ఏమిటని ధర్మాసనం ఏజీని ప్రశ్నించింది. పరీక్షలను ఉద్దేశపూర్వకంగానే మూడు రోజుల నుంచి తగ్గించారని, దీంతోనే కేసుల సంఖ్య తగ్గుతోందని అభిప్రాయపడింది. 26న 92 వేల పరీక్షలు చేస్తే 10,122 కేసులు వచ్చాయని, 27న 82 వేల పరీక్షలు చేస్తే 8 వేల కేసులు వచ్చాయని, 28న 80 వేల పరీక్షలు చేస్తే 7,994 కేసులు వచ్చాయని పేర్కొంది. పరీక్షలు తగ్గితే కేసులూ తగ్గుతాయని, కేసులు తగ్గుతున్నాయి కాబట్టి ఎన్నికలు నిర్వహించుకోవచ్చని మభ్యపెట్టేందుకే పరీక్షలు తగ్గించారంటూ మండిపడింది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అంచనా వేయరా ? ‘క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేయరా? ప్రజలు కరోనాతో యుద్ధం చేస్తున్నా కనిపించట్లేదా? ప్రపంచమంతా కరోనా సెకండ్ వేవ్ ఫిబ్రవరిలోనే ప్రారంభమైనా ఏప్రిల్‌లో నోటిఫికేషన్ ఎలా ఇస్తారు? ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించకపోతే వచ్చే ప్రమాదం ఏమిటి? ఎనిమిదేళ్ల క్రితం జీహెచ్ఎంసీలో ఎన్నికలు నిర్వహించకుండా స్పెషల్ ఆఫీసర్‌తో ఏడాదిన్నర పాలన కొనసాగించారు? అదే తరహాలో కరోనా కేసులు తగ్గే వరకూ స్పెషల్ ఆఫీసర్‌ను నియమిస్తే వచ్చే ప్రమాదం ఏమిటి? కొన్ని మున్సిపాలిటీల్లో జూన్ వరకు, మరికొన్నింటిలో జూలై వరకు ఎన్నికలు నిర్వహించేందుకు సమయం ఉంది. కనీసం అప్పటి వరకు కూడా ఆగకుండా ఆగమేఘాలపై ఎన్నికలు నిర్వహించాలన్న ఆతృత ఎందుకు? స్థానిక పరిస్థితులను పట్టించుకోకుండా గడువులోగా ఎన్నికలు నిర్వహించాలన్న నిబంధనలను గుడ్డిగా అనుసరించాలా? ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలను వాయిదా వేసే అవకాశం ఉన్నా ఎందుకు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు? వారంపాటు ర్యాలీలు, సభలకు ఎందుకు అనుమతించారు? ప్రచార సమయం కుదింపును ఎందుకు పట్టించుకోలేదు?’ అంటూ ఎస్ఈసీ కార్యదర్శికి ధర్మాసనం శరపరంపరగా ప్రశ్నలు సంధించింది. ఇందుకు సమాధానం ఇవ్వలేక అశోక్‌కుమార్ మౌనంగా ఉండిపోయారు. ఎన్నికల నిర్వహణకు ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నామని, గెలిచిన అభ్యర్థులతోపాటు ఇద్దరు మాత్రమే వచ్చి ఎన్నికల అధికారి దగ్గర అధికారిక పత్రాలను తీసుకోవాలని, విజయోత్సవ ర్యాలీలు నిర్వహించరాదని ఆదేశించామన్నారు. 30 తర్వాత ఏం చర్యలు తీసుకుంటారు? రాత్రి కర్ఫ్యూ అమలుపై ఇచ్చిన ఉత్తర్వులు శుక్రవారం (30వ తేదీ)తో ముగుస్తాయని, ఆ తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోనున్నారో తెలియజేయాలని ధర్మాసనం అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్‌ను ఆదేశించింది. తాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో మాట్లాడానని, శుక్రవారం పరిస్థితిపై సమీక్షించాక తగిన నిర్ణయం తీసుకుంటామన్నారని ఆయన తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ చివరి నిమిషం వరకు ఆగడం ఎందుకని, ముందే నిర్ణయం తీసుకోవచ్చు కదా అని ప్రశ్నించింది. ఎన్నికల ప్రాంతాల్లో 30 నుంచి 3వ తేదీ వరకు మద్యం అమ్మకాలను నిలిపివేసే దిశగా నిర్ణయం తీసుకోవాలని, అప్పుడే పరిస్థితులు అదుపులో ఉంటాయని సూచించింది. 30వ తేదీ తర్వాత తీసుకోనున్న చర్యలపై ప్రభుత్వ నిర్ణయాన్ని తెలియజేయాలని ఆదేశిస్తూ విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఎస్ఈసీ తీరు అలా ఉంది... ‘యుద్ధం చేయాల్సిన అవసరం లేకున్నా సైన్యాధికారి ఆదేశిస్తే సైనికులు చావుకు ఎదురెళ్లాల్సిందే. అలా 600 మంది సైనికులు సైన్యాధ్యక్షుని ఆదేశాలను కాదనలేక వెళ్లి మృత్యువాతపడ్డారు. ఇప్పుడు ఎస్ఈసీ తీరు అలాగే ఉంది. కరోనా విజృంభిస్తూ ప్రజల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నా సిబ్బందిని, పోలీసులను విధులకు హాజరుకావాలని ఆదేశిస్తోంది. ప్రమాదం అని తెలిసినా వారు ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహించాల్సిందే’ అంటూ ఓ బ్రిటిష్ రచయిత రాసిన 600 సోల్జర్స్ డెత్ వ్యాలీ కవితను జస్టిస్ హిమాకోహ్లి ప్రస్తావించారు. -
ఎస్ఈసీ అధికారులు అంగారక గ్రహంపై ఉన్నారేమో?
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికలు సజావుగా, జాగ్రత్తగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ప్రజలు గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. మద్యం షాపులు మూసివేయాలని ప్రభుత్వానికి సూచించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేపట్టిన హైకోర్టు విచారణకు ఎస్ఈసీ కార్యదర్శి హాజరయ్యారు. ఈ మేరకు మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై హైకోర్టు పలు సూచనలు చేసింది. రాష్ట్ర ఎన్నికల సంఘం తీరు అత్యంత బాధాకరంగా ఉందని హైకోర్టు పేర్కొంది. ఎన్నికల సంఘం పనితీరు సరిగా లేదని కరోనా విపత్తులో ఎన్నికలు వాయిదా వేయకుండా ముందుకెళ్లడం బాధాకరమని విచారం వ్యక్తం చేసింది. ఎన్నికల విధుల్లో 2557 మంది పోలీసులు సహా 7695 మంది ఉద్యోగులు పాల్గొంటున్నారని ఎస్ఈసీ తెలపగా.. ప్రజలు, ఉద్యోగుల ప్రాణాలను పణంగా పెట్టి ఎన్నికల నిర్వహిస్తున్నారని హైకోర్టు తెలిపింది. గతంలో హైదరాబాద్ మేయర్ స్థానం ఏడాదిన్నర ఖాళీగా ఉంది కదా అని ధర్మాసనం గుర్తు చేసింది. ఉద్యోగులు చేస్తారా? చస్తారా అనే పరిస్థితి కల్పించారని వ్యాఖ్యానించింది. ప్రపంచమంతా కరోనాతో యుద్ధం చేస్తుంటే.. ఎస్ఈసీ దృష్టి ఎన్నికలపై ఉందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎస్ఈసీ అధికారులు అంగారక గ్రహంపై ఉన్నారేమో? అని మండిపడింది. ప్రభుత్వం కూడా ఎన్నికలకు సన్నద్ధత వ్యక్తం చేయడం ఆశ్చర్యంగా ఉందని పేర్కొంది. చదవండి: ఆకాశం మీద పడినా ఎన్నికలు జరగాలా?: తెలంగాణ హైకోర్టు -
ఎస్ఈసీపై తెలంగాణ హైకోర్టు అసహనం
-
ఆకాశం మీద పడినా ఎన్నికలు జరగాలా?: తెలంగాణ హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఎన్నికల సంఘంపై తెలంగాణ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కరోనా పరిస్థితులపై ఉన్నత న్యాయస్థానం గురువారం విచారణ జరిపింది. క్లిష్ట పరిస్థితుల్లో ఎన్నికలకు ఎందుకు వెళ్లారంటూ హైకోర్టు ప్రశ్నించింది. ప్రజల ప్రాణాల కంటే ఎన్నికలు విలువైనవా? అని వ్యాఖ్యానించింది. యుద్ధం వచ్చినా.. ఆకాశం మీద పడినా ఎన్నికలు జరగాలా? అంటూ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వ ఏకాభిప్రాయంతోనే ఎన్నికలు నిర్వహిస్తున్నామని ఎస్ఈసీ తెలిపింది. మరి ఫిబ్రవరిలో కోవిడ్ రెండో దశ మొదలైతే.. ఏప్రిల్‌లో నోటిఫికేషన్ ఎందుకిచ్చారని హైకోర్టు ప్రశ్నించింది. ఎన్నికల ప్రక్రియపై ప్రభుత్వాన్ని అడగాల్సిన అవసరం ఏంటని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఎన్నికల వాయిదాకు సొంతంగా నిర్ణయం తీసుకునే అధికారం మీకు లేదా? అని ఎస్ఈసీని ప్రశ్నించింది. ఎస్ఈసీ వివరణ సంతృప్తికరంగా లేదని హైకోర్టు పేర్కొంది. కాసేపట్లో ఎన్నికల సంఘం అధికారులు విచారణకు రావాలని హైకోర్టు ఆదేశించింది. చదవండి: కరోనా బాధితులకు గుడ్ న్యూస్: ఫోన్ కొడితే.. ఇంటి వద్దకే.. కొనసాగుతున్న కరోనా ఉధృతి, రికార్డు స్థాయిలో కేసులు -
మున్సిపల్ ఎన్నికలు యథాతధం: ఎస్ఈసీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలపై వివాదం రాజుకున్న సంగతి తెలిసిందే. కోవిడ్ మహమ్మారి విజృంభిస్తోన్న వేళ ఎన్నికలు నిర్వహించడం ప్రమాదం.. నిలిపివేయాలని కోరుతూ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ కోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టు ఈ అభ్యర్థనను తోసిపుచ్చడమే కాక రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు విన్నవించాలని సూచిందింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు యథాతధంగా నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి తెలిపారు. ‘‘ఈనెల 30న 2 కార్పొరేషన్లు, 5 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్నాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మున్సిపల్ ఎన్నికల నిర్వహిస్తాం. ప్రభుత్వ సూచన మేరకు యథావిధిగా ఎన్నికలు నిర్వహిస్తాం’’ అని పార్థసారధి తెలిపారు. కాంగ్రెస్ నేత షబ్బీర్‌అలీ ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నైట్ కర్ఫ్యూను అమలు చేసిందని ... ఈ సమయంలో ఎన్నికలు నిర్వహించకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటీషనర్ కోరారు. కాగా లంచ్ మోషన్ పిటిషన్‌ను విచారించేందుకు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ నిరాకరించారు. ఎన్నికల కమిషన్‌కు మరోసారి విన్నవించాలని పిటీషనర్‌కు చీఫ్ జస్టిస్ సూచించారు. ఇప్పటికే హైకోర్టు సింగిల్ బెంచ్ ఎన్నికలను ఆపలేమని చెప్పడంతో డివిజన్ బెంచ్‌లో పిటీషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో ఎస్ఈసీ ఎన్నికల నిర్వహణకే మొగ్గు చూపింది. చదవండి: మున్సి‘పోరు’: టీఆర్ఎస్ సరికొత్త రాజకీయం -
ఓట్ల లెక్కింపునకు అనుమతినివ్వండి
సాక్షి, అమరావతి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటనకు అనుమతినివ్వాలని హైకోర్టును రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) అభ్యర్థించింది. కౌంటింగ్, ఫలితాల ప్రకటనను పూర్తి చేసి, ఆ తరువాత ఎంపీపీ, జెడ్పీపీపీల కోఆప్టెడ్ సభ్యులు, చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికను కూడా పూర్తి చేస్తామని, దీంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ సంపూర్ణమవుతుందని వివరించింది. వీలైనంత త్వరగా కొత్త పాలక వర్గాలు బాధ్యతలు చేపడితే మేలన్న ఉద్దేశంతోనే ఈ అభ్యర్థన చేస్తున్నామంది. కోవిడ్ సెకండ్ వేవ్ సవాలు విసురుతోందని, అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో దీనిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొంది. హైకోర్టు ధర్మాసనం ఆదేశాల మేరకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓటింగ్ అనంతరం బ్యాలెట్ బ్యాక్సులను కట్టుదిట్టమైన భద్రత మధ్య స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచామంది. గతంలో టీడీపీ నేత వర్ల రామయ్య, జనసేన నేత చిల్లపల్లి శ్రీనివాసరావు దాఖలు చేసిన పిటిషన్‌కు సంబంధించి హైకోర్టులో ఎన్నికల కమిషన్ కార్యదర్శి కె.కన్నబాబు గురువారం పూర్తిస్థాయి కౌంటర్ దాఖలు చేశారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నియమావళి విషయంలో టీడీపీ, జనసేన నేతలు దాఖలు చేసిన వ్యాజ్యాలపై గురువారం న్యాయమూర్తి జస్టిస్ దుర్గాప్రసాదరావు విచారణ జరిపారు. పూర్తిస్థాయి వాదనల నిమిత్తం న్యాయమూర్తి తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేశారు. కాగా, వర్ల రామయ్య, చిల్లపల్లి శ్రీనివాసరావు పిటిషన్లను గతంలో విచారించిన సింగిల్ జడ్జి.. ఎన్నికలను వాయిదా వేయాలని తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఆ తీర్పుపై ఎస్ఈసీ ధర్మాసనాన్ని ఆశ్రయించింది. ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరపడానికి ధర్మాసనం అనుమతిచ్చిన విషయం విదితమే. అయితే ఎన్నికల ఫలితాలు ప్రకటించవద్దని ధర్మాసనం ఆదేశించిన నేపథ్యంలో ఎస్ఈసీ తన కౌంటర్లో ఫలితాల ప్రకటనకు అభ్యర్థించింది. ఎన్నికలను ఆపాలనే లక్ష్యంతోనే టీడీపీ నేత పిటిషన్ దాఖలు చేశారని, దానిని కొట్టివేయాలని కన్నబాబు కౌంటర్లో అభ్యర్థించారు. ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వుల కాపీని పరిశీలన నిమిత్తం తమ ముందుంచాలని ఎస్ఈసీ తరఫు న్యాయవాది సన్నపురెడ్డి వివేక్ చంద్రశేఖర్‌ను న్యాయమూర్తి ఆదేశించారు. అలాగే బీజేపీ నేతలు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కూడా ఈ వ్యాజ్యాలకు జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు. చదవండి: టీడీపీ మాజీ మంత్రి ఉమకు సీఐడీ నోటీసు ఆరోగ్యశ్రీలో ఉచితంగా గుండెమార్పిడి -
బల్దియా పోరుకు సిద్ధం..
సిద్దిపేట బల్దియా పోరుకు సిద్ధమైంది. బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారికంగా జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ఎన్నికల ప్రక్రియను కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహించాలని ఆదేశించింది. ఎన్నికల నిర్వహణలో భాగంగా వార్డుల పునర్విభజన పూర్తైన విషయం తెలిసిందే. రెండో ఘట్టంగా కుల గణన ప్రక్రియ కొనసాగుతోంది. అలాగే ఈ నెల 14లోగా పోలింగ్ కేంద్రాల తుది జాబితాను ప్రకటించాలని సూచించింది. – సిద్దిపేటజోన్ వార్డుల వారిగా ఓటరు తుది జాబితా ఈనెల 11లోగా విడుదల చేయాలని, అదేవిధంగా వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాల తుది జాబితాను ఈనెల 14లోగా ప్రచురించాలని నోటిఫికేషన్ జారీ చేసింది. మరోవైపు మున్సిపల్ ఎన్నికల కోసం అధికారుల నియామక ప్రక్రియ పూర్తి చేసి రాష్ట్ర ఎన్నికల సంఘానికి జాబితా అందజేయాలని ఆదేశించింది. ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు ఈనెల 12లోగా శిక్షణ పూర్తి చేయాలని సూచించింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేసుకోవాలని అవసరమైన సిబ్బంది నియమాలను, సామగ్రి, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, భద్రత, బ్యాలెట్‌పేపర్ల ముద్రణ, ఇండెలిబుల్ ఇంక్ తదితర ఏర్పాట్లు చూడాలని ఈసీ సూచించింది. త్వరలో పరిశీలకుల నియామకం సిద్దిపేట మున్సిపల్ పరిధిలో గతంలో ఉన్న పోలింగ్ కేంద్రాల సంఖ్య ప్రస్తుత అవసరమైన కేంద్రాల సంఖ్య సరిపోల్చి వాడుకోవాలని సూచనలు చేసింది. బ్యాలెట్ బాక్స్‌లు అవసరమైన మేరకు వాటిని తయారు చేసి సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది. వార్డ్ వారీగా బ్యాలెట్ పేపర్లను అంచనా వేసుకొని ముద్రణ కోసం ప్రింటింగ్ ప్రెస్‌లను గుర్తించాలని ఆదేశించింది. సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కలెక్టర్ ఆధ్వర్యంలో కొనసాగుతుందని, ఎన్నికల నోటిఫికేషన్ నుంచి కోడ్ అమలులో ఉంటుందని, సాధారణ, వ్యయ పరిశీలకులను త్వరలో నియమిస్తామని కమిషన్ పేర్కొంది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎన్నికల ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా యంత్రాంగానికి ఈసీ సూచనలు చేసింది. పోలింగ్ కేంద్రాల నోటిఫికేషన్ సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ పోలింగ్ కేంద్రాల గుర్తింపు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు ఈసీ సెక్రటరీ అశోక్‌కుమార్ పేరిట ఉత్తర్వులు జారీ చేశారు. ►ఏప్రిల్ 8న పోలింగ్ కేంద్రాల డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ►8 నుంచి 11వ తేదీ వరకు ఫిర్యాదుల స్వీకరణ ►9న రాజకీయ పార్టీల సమావేశం ►12న ఫిర్యాదుల పరిష్కారం ►14న పోలింగ్ కేంద్రాల తుది జాబితా సిద్ధంగా ఉన్నాం ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నాం. ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా మేము సమర్థవంతంగా నిర్వహిస్తాం. షెడ్యూల్ మేరకు ఒక్కో ప్రక్రియ నిర్వహిస్తున్నాం. ఎన్నికల నిర్వహణ కోసం అవరసమైన సిబ్బంది, అధికారుల నియామకాలను కలెక్టర్ అనుమతితో చేపడుతాం. – రమణాచారి, మున్సిపల్ కమిషనర్ -
వైఎస్సార్ జిల్లా: టీడీపీ అభ్యర్థి వీరంగం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు మాస్క్ ధరించి ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. భారీ భద్రత నడుమ ఓటింగ్ సరళి సజావుగా సాగుతోంది. అయితే ఎన్నికల నిర్వహణను జీర్ణించుకోలేని టీడీపీ పలుచోట్ల దౌర్జన్యానికి తెగబడుతోంది. వైఎస్సార్ జిల్లా చాపాడు మండలం అయ్యవారిపల్లెలో టీడీపీ అభ్యర్థి రాజేశ్వరి వీరంగం సృష్టించారు. ఓటు వేయడం తెలియని ఓ వృద్ధురాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తోందంటూ బ్యాలెట్ పేపర్‌ను బయటకు తీసుకువచ్చారు. ఇక రాజేశ్వరి దౌర్జన్యాన్ని పోలీసులు అడ్డుకోవడంతో వారితో ఆమె వాగ్వాదానికి దిగారు. దీంతో పోలింగ్ కేంద్రంలో కాసేపటి వరకు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా పరిషత్ ఎన్నికల షెడ్యూల్‌కు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ నెల 1న జారీ చేసిన నోటిఫికేషన్లో తదుపరి చర్యలన్నీ నిలిపివేస్తూ సింగిల్ జడ్జి మంగళవారం జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ధర్మాసనం రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో, షెడ్యూల్ ప్రకారం ఈ ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైంది. 515 జెడ్పీటీసీ, 7220 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. జిల్లాల వారీగా పోలింగ్ జరిగే స్థానాలు శ్రీకాకుళం: 37 జెడ్పీటీసీ, 590 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ విజయనగరం: 31 జెడ్పీటీసీ, 487 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ విశాఖపట్నం: 37 జెడ్పీటీసీ, 612 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ తూర్పు గోదావరి: 61 జెడ్పీటీసీ, 1000 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ పశ్చిమగోదావరి: 45 జెడ్పీటీసీ, 781 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ కృష్ణా: 41 జెడ్పీటీసీ, 648 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ గుంటూరు: 45 జెడ్పీటీసీ, 571 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ ప్రకాశం: 41 జెడ్పీటీసీ, 387 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ నెల్లూరు: 34 జెడ్పీటీసీ, 362 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ చిత్తూరు: 33 జెడ్పీటీసీ, 419 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ వైఎస్ఆర్ జిల్లా: 12 జెడ్పీటీసీ, 117 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ కర్నూలు: 36 జెడ్పీటీసీ, 484 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ అనంతపురం: 62 జెడ్పీటీసీ, 782 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ -
ఏపీ పరిషత్ ఎన్నికలు
-
ఏపీలో ముగిసిన పరిషత్ ఎన్నికల పోలింగ్
Time: సాయంత్రం 5 గంటలు ఏపీలో పరిషత్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. క్యూలైన్లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 47.42 శాంతం పోలింగ్ నమోదైంది. Time: సాయంత్రం 4 గంటలు ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్నం 3 గంటల వరకు 47.42 శాతం పోలింగ్ నమోదైంది. శ్రీకాకుళం జిల్లా-46.46 శాతం విజయనగరం జిల్లా-56.57 శాతం విశాఖ జిల్లా- 55.29 శాతం తూర్పు గోదావరి- 51.64 శాతం పశ్చిమగోదావరి జిల్లా-55.4 శాతం కృష్ణా జిల్లా-49 శాతం గుంటూరు జిల్లా- 37.65 శాతం ప్రకాశం జిల్లా- 34.19 శాతం నెల్లూరు జిల్లా -41.8 శాతం చిత్తూరు జిల్లా-50.39 శాతం వైఎస్సార్ జిల్లా- 43.77 శాతం కర్నూలు జిల్లా- 48.40శాతం అనంతపురం జిల్లా: 45.70 శాతం Time: మధ్యాహ్నం 1.30 గంటలు ఏపీ పరిషత్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ► విశాఖపట్నం: కొయ్యూరు మండలం శరభన్నపాలెం గ్రామంలో అరకు పార్లమెంటు సభ్యరాలు ఎంపీ గోడ్డేటి మధవి ఓటు హక్కు వినిమెగించుకున్నారు. ► కర్నూలు: పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామంలో వైఎస్సార్సీపీ జిల్లా సమన్వయ కర్త బైరెడ్డి సిద్దార్థరెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ► విశాఖపట్నం: చోడవరం మండలం అంబేరుపురం పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే కరణం ధర్మ శ్రీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. Time: మధ్యాహ్నం 1.00 గంట ఏపీలో పరిషత్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటు వేయడానికి ఓటర్లు క్యూ లైన్లలో బారులు తీరారు. ► అనంతపురం: తోపుదుర్తి గ్రామంలో రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ► తూర్పుగోదావరి: తుని మండలం ఎస్.అన్నవరం జీపీహెచ్ స్కూల్లో ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా దంపతులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ► కృష్ణా : గన్నవరం బాలుర హైస్కూల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌లో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ► శ్రీకాకుళం: చంద్రబాబు నిర్ణయాన్ని మాజీ ఎమ్మెల్యే కలమట వెంకట రమణ ధిక్కరించారు. ఆయన తన భార్య ఇందిరతో కలిసి మాతల గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొత్తూరు మండలం మాతలలో టీడీపీ ఎంపీటీసీగా కలమట ఇందిర పోటీ చేశారు. Time: మధ్యాహ్నం 12.30 గంటలు ► శ్రీకాకుళం: పాతపట్నంలో ఎమ్మెల్యే రెడ్డి శాంతి, ఆమె కుటుంసభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ► శ్రీకాకుళం: జిల్లాలోని ఆముదాలవలసలో ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్ధానిక సంస్ధల ఎన్నికలు చాల శక్తివంతమైనవి అని తెలిపారు. ప్రజాస్వామ్యానికి ఊపిరి పోసే పెద్ద ప్రక్రియలో ఓటు చాల ముఖ్యమైనదని చెప్పారు. ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకొఇవాలన్నారు. ప్రజలు తమ ఓటు ద్వారా ఇచ్చిన తీర్పుకే అత్యంత ప్రాధాన్యత ఉంటుందని గుర్తు చేశారు. ► గుంటూరు: పెదనందిపాడు మండలం రాజుపాలెంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై టీడీపీ వర్గీయులు దాడికి తెగపడ్డారు. పోలింగ్ బూత్ వద్ద నిలబడి ఓటర్లకు తెలుగుదేశం పార్టీకి ఓటేయమని టీడీపీ నాయకులు చెబుతున్నారు. దీంతో టీడీపీ నాయకులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ నాయకులు అభ్యంతరం తెలిపారు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో రెచ్చిపోయిన టీడీపీ నాయకులు వైఎస్సార్సీపీ నాయకులపై దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు వైఎస్సార్సీపీ నాయకులు గాయపడ్డారు. Time: మధ్యాహ్నం 12 గంటలు ఏపీలో పరిషత్ ఎన్నికల పోలింగ్ కొనసాగుంతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 11 గంటల వరకు 21.65 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. జిల్లాల వారీగా పోలింగ్ నమోదు శాతాలు శ్రీకాకుళం జిల్లాలో 19.32 శాతం పోలింగ్ నమోదు విజయనగరం జిల్లాలో 25.68 శాతం పోలింగ్ నమోదు విశాఖపట్నం జిల్లాలో 24.14 శాతం పోలింగ్ నమోదు తూర్పుగోదావరి జిల్లాలో 25.00 శాతం పోలింగ్ నమోదు ప.గో జిల్లాలో 23.40 శాతం పోలింగ్ నమోదు కృష్ణా జిల్లాలో 19.29 శాతం పోలింగ్ నమోదు గుంటూరు జిల్లాలో 15.85 శాతం పోలింగ్ నమోదు ప్రకాశం జిల్లాలో 15.05 శాతం పోలింగ్ నమోదు నెల్లూరు జిల్లాలో 20.59 శాతం పోలింగ్ నమోదు కర్నూలు జిల్లాలో 25.96 శాతం పోలింగ్ నమోదు అనంతపురం జిల్లాలో 22.88 శాతం పోలింగ్ నమోదు వైఎస్ఆర్ జిల్లాలో 19.72 శాతం పోలింగ్ నమోదు చిత్తూరు జిల్లాలో 24.52 శాతం పోలింగ్ నమోదు ► నెల్లూరు: పొదలకూరు మండలం తోడేరు గ్రామంలో జడ్పీటీసీ పోలింగ్‌లో సర్వేపల్లి ఎమ్మెల్యే , వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. Time: ఉదయం 11.30 ► నెల్లూరు: ఎఎస్‌పేట మండలం పొనుగోడులో పరిషత్ ఎన్నికల పోలింగ్ నిలిచిపోయింది. రేపు(శుక్రవారం) రీ పోలింగ్ నిర్వహించాలని జిల్లా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. బీజేపీ ఏజెంట్ ప్రసాద్ బ్యాలెట్ బాక్స్‌ను ఎత్తుకెళ్లి నీటితొట్టిలో వేయటంతో వివాదం నెలకొంది. అడ్డుకునేందుకు యత్నించిన అధికారులను ప్రసాద్ తోసేసి బాక్స్ ఎత్తుకెళ్లాడు. ప్రస్తుతం బీజేపీ ఏజెంట్ ప్రసాద్ పరారీలో ఉన్నాడు. Time: ఉదయం 11.00 ఏపీ పరిషత్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. కృష్ణా జిల్లా గన్నవరం బాలుర హైస్కూల్లో పోలింగ్ బూత్‌లను సీపీ బత్తిన శ్రీనివాసులు పరిశీలించారు. విజయవాడ సిటీ పరిధిలోని 8 మండలాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందని తెలిపారు. తొలి మూడు గంటల్లో 13 శాతం ఓట్లు పోలయ్యాయని చెప్పారు. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి మండలానికి డీసీపీ స్థాయి అధికారిని నియమించామని చెప్పారు. ఇప్పటి వరకు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదన్నారు. ప్రజలు తమ ఓటు హక్కును ప్రశాంత వాతావరణంలో వినియోగించుకోవాలన్నారు. Time: ఉదయం 10.30 ► నెల్లూరు: ఎఎస్‌పేట మండలం పాముగోడులో పోలింగ్ కేంద్ర వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామంలో వృద్ధుడి ఓటు విషయంలో పోలింగ్ కేంద్రం వద్ద గొడవ జరిగింది. ఓటు వేసేందుకు వచ్చిన వైఎస్సార్సీపీ కార్యకర్తను అడ్డుకోవడంతో వివాదం చెలరేగింది. బీజేపీ ఏజెంట్ బ్యాలెట్ బాక్స్‌ను నీళ్లలో ముంచేయడంతో ఎన్నికలు అధికారులు పోలింగ్ నిలిపివేశారు. అడ్డుకునేందుకు యత్నించిన అధికారులను తోసేసి బీజేపీ ఏజెంట్ ప్రసాద్ బ్యాలెట్ బాక్స్ ఎత్తుకెళ్లి నీళ్లల్లో వేశాడు. ► తూర్పుగోదావరి: అమలాపురం రూరల్ మండలం సాకుర్రు గున్నేపల్లి పోలింగ్ వద్ద ఘర్షణ చోటు చేసుకుంది. బ్యాలెట్ పత్రాలపై జనసేన పార్టీ గుర్తు లేకపోవడంతో అభ్యర్థి ఆందోళన చేశారు. దీంతో పోలింగ్ ప్రక్రియను అధికారులు నిలిపివేశారు. ► విశాఖపట్నం: అరకు వ్యాలీలో ఎమ్మెలే చెట్టి ఫాల్గుణ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ► కర్నూలు: పాములపాడు మండలం మద్దూరు గ్రామంలో ఎమ్మెల్యే ఆర్థర్ ఓటు వేశారు. ► చిత్తూరు: చిత్తూరు మండలం పాలూరులో ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొన్న భీముని చెరువులో సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం ఓటు హక్కు వినియోగించుకున్నారు. Time: ఉదయం 10.00 ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 9 గంటల వరకు 7.76 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో 8.99 శాతం పోలింగ్ నమోదు విజయనగరం జిల్లాలో 9.01 శాతం పోలింగ్ నమోదు విశాఖ జిల్లాలో 8.83 శాతం పోలింగ్ నమోదు తూ.గో జిల్లాలో 4.59 శాతం పోలింగ్ నమోదు ప.గో జిల్లాలో 9.26 శాతం పోలింగ్ నమోదు కృష్ణా జిల్లాలో 9.32 శాతం పోలింగ్ నమోదు గుంటూరు జిల్లాలో 7.52 శాతం పోలింగ్ నమోదు ప్రకాశం జిల్లాలో 6.53 శాతం పోలింగ్ నమోదు నెల్లూరు జిల్లాలో 6.36 శాతం పోలింగ్ నమోదు చిత్తూరు జిల్లాలో 7.29 శాతం పోలింగ్ నమోదు వైఎస్ఆర్ జిల్లాలో 4.81 శాతం పోలింగ్ నమోదు కర్నూలు జిల్లాలో 9.58 శాతం పోలింగ్ నమోదు అనంతపురం జిల్లాలో 7.76 శాతం పోలింగ్ నమోదు ► తాడేపల్లి: కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పోలింగ్ ప్రక్రియపై నిఘా పెట్టి, వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్నామని రాష్ట్ర ఎన్నికల అధికారి గిరిజా శంకర్ తెలిపారు. అన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. 3,530 మందితో నిరంతరం వెబ్ కాస్టింగ్ జరుగుతోందని తెలిపారు. ► శ్రీకాకుళం: సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ఎస్పీ అమిత్‌బర్థార్ పర్యవేక్షించారు. శాంతి భద్రత చర్యలను సమీక్షించారు. Time: ఉదయం 9.30 పరిషత్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు పెద్ద ఎత్తున ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. ► విశాఖపట్నం: పాడేరు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ పోలింగ్ కేంద్రంలో పాడేరు ఎమ్మెల్యే కొట్టగూలీ భాగ్యలక్ష్మి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ► కృష్ణా: జిల్లాలోని నందివాడ మండలం జొన్నపాడు గ్రామంలో రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్‌ను చూసి భయపడి చంద్రబాబు పారిపోయాడని తెలిపారు. 2024 ఎన్నికల్లో కూడా చంద్రబాబు పారిపోతాడని చెప్పారు. పంచాయతీ ఎన్నికల మాదిరే, పరిషత్ ఎన్నికలు కూడా ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని అన్నారు. ► కృష్ణా: జిల్లా చందర్లపాడులో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్రావు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అవనిగడ్డలో ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, జడ్పీటీసీ అభ్యర్థి చింతలపూడి లక్ష్మీనారాయణ, దివి మార్కెట్ యార్డ్ చైర్మన్ కడవకోల్లు నరసింహారావు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ► పశ్చిమ గోదావరి: దెందులూరు నియోజకవర్గంలోని దుగ్గిరాల గ్రామంలోని అతి సమస్యత్మాక పోలింగ్ కేంద్రాం వద్ద జరుగుతున్న పోలింగ్ ప్రక్రియను ఏలూరుడీఎస్పి డాక్టర్ దిలీప్ కిరణ్ పరిశీలించారు. సమస్యత్మాక, అతి సమస్యత్మాక కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన పోలీసు భద్రత ఏర్పాటు చేశామని తెలిపారు. పోలింగ్ ప్రారంభమైన తర్వాత ఇప్పటి వరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ఓటర్లు తమ ఓటు హాక్కు వినియోగించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ► వైఎస్ఆర్ జిల్లా: నందలూరు మండలంలో చెన్నయ్యగారిపల్లెలో ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జునరెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. Time: ఉదయం 9.00 పరిషత్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటు వేయడానికి ఓటర్లు క్యూలైన్లలో బారులు తీరారు. ► తూర్పు గోదావరి: మామిడికుదురు మండలంలో జనసేన కార్యకర్తలు వీరంగం సృష్టించారు. పెదపట్నంలంక-సత్తెమ్మపేటలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడికి తెగపడ్డారు. ఓటర్లకు జనసేన డబ్బు పంచుతుండగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. జనసేన కార్యకర్తల దాడిలో నలుగురు వైఎస్సార్సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. ► శ్రీకాకుళం: పాలకొండలోని వీరఘట్టం మండలం వండువలో ఎమ్మెల్యే కళావతి ఓటు హక్కును వినియోగించుకున్నారు. Time: ఉదయం 8.30 ►వైఎస్ఆర్ కడప: జిల్లాని చాపాడు మండలం అయ్యవారిపల్లెలో టీడీపీ అభ్యర్థి దౌర్జన్యానికి తెగపడ్డారు. టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి రాజేశ్వరి బ్యాలెట్ పేపర్‌ను బయటకు తీసుకువచ్చారు. ► అనంతపురం: జిల్లాలో ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాల్లో నిఘా పెట్టామని ఎస్పీ సత్యయేసుబాబు తెలిపారు. తాడిపత్రి, రాప్తాడు, ధర్మవరంలో భారీ భద్రత ఏర్పాటు చేశామన్నారు. సున్నితమైన ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశామని పేర్కొన్నారు. Time: ఉదయం 8.00 పరిషత్ ఎన్నికల పోలింగ్ కోనసాగుతోంది. ఓటర్లు పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకోవడానికి తరలివస్తున్నారు. గుంటూరు పెదకాకానిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. Time: ఉదయం 7.30 పరిషత్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటు వేయడానికి ఓటర్లు తరలివసున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం కొండలరావు పాలెంలో ఎమ్మెల్యే కొఠారి అబ్బాయి చౌదరి ఓటు హక్కు వినియోగించుకున్నారు. Time: ఉదయం 7.00 ఆంధ్రప్రదేశ్‌లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఓటర్లు మాస్క్ ధరించి ఓటు హక్కు వినియోగించుకోవడానికి తరలివస్తున్నారు. 515 జెడ్పీటీసీ, 7220 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్ర 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 2గంటల వరకే పోలింగ్ జరుగుతుంది. కోవిడ్ నేపథ్యంలో ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. Time: ఉదయం 6.50 ఆంధ్రప్రదేశ్‌లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. 515 జెడ్పీటీసీ, 7220 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్ర 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 2గంటల వరకే పోలింగ్ జరుగుతుంది. జెడ్పీటీసీ ఎన్నికల బరిలో 2,058 మంది అభ్యర్థులు, ఎంపీటీసీ ఎన్నికల బరిలో 18,782 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పరిషత్ ఎన్నికల కోసం 27,751 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. పరిషల్ ఎన్నికల పోలింగ్‌లో 2,46,71,002 మంది తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. జిల్లాల వారీగా పోలింగ్ జరిగే స్థానాలు శ్రీకాకుళం: 37 జెడ్పీటీసీ, 590 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ విజయనగరం: 31 జెడ్పీటీసీ, 487 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ విశాఖపట్నం: 37 జెడ్పీటీసీ, 612 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ తూర్పు గోదావరి: 61 జెడ్పీటీసీ, 1000 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ పశ్చిమగోదావరి: 45 జెడ్పీటీసీ, 781 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ కృష్ణా: 41 జెడ్పీటీసీ, 648 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ గుంటూరు: 45 జెడ్పీటీసీ, 571 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ ప్రకాశం: 41 జెడ్పీటీసీ, 387 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ నెల్లూరు: 34 జెడ్పీటీసీ, 362 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ చిత్తూరు: 33 జెడ్పీటీసీ, 419 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ వైఎస్ఆర్ జిల్లా: 12 జెడ్పీటీసీ, 117 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ కర్నూలు: 36 జెడ్పీటీసీ, 484 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ అనంతపురం: 62 జెడ్పీటీసీ, 782 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ సాక్షి, అమరావతి: ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు అడ్డంకి తొలగిపోయింది. పరిషత్ ఎన్నికల షెడ్యూల్‌కు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ నెల 1న జారీ చేసిన నోటిఫికేషన్లో తదుపరి చర్యలన్నీ నిలిపివేస్తూ సింగిల్ జడ్జి మంగళవారం జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను తాజాగా హైకోర్టు ధర్మాసనం రద్దు చేసింది. షెడ్యూల్ ప్రకారం ఈ ఎన్నికల నిర్వహణకు అనుమతినిచ్చింది. అయితే సింగిల్ జడ్జి వద్ద ఉన్న రిట్ పిటిషన్ పరిష్కారం అయ్యేవరకు ఓట్ల లెక్కింపు చేపట్టవద్దని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. అదేవిధంగా ఫలితాలను కూడా ప్రకటించవద్దని స్పష్టం చేసింది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయిన తరుణంలో ఎన్నికలను నిలిపివేయడం సరికాదని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అప్పీల్‌ను పరిష్కరిస్తున్నట్లు పేర్కొన్న ధర్మాసనం.. సింగిల్ జడ్జి ముందున్న రిట్ పిటిషన్ ఏ రోజైతే విచారణకు ఉందో ఆ రోజు విచారణకు వచ్చేలా చూడాలని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది. ఎన్నికలను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సమయంలోనే వర్ల రామయ్య రిట్ పిటిషన్‌ను సింగిల్ జడ్జి అనుమతినిచ్చినట్లయిందని ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. వాస్తవానికి సింగిల్ జడ్జి వద్ద రిట్ పిటిషన్ అపరిష్కృతంగా ఉందని తెలిపింది. తాజాగా ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశాలు ఇవ్వడం ద్వారా సింగిల్ జడ్జి తుది తీర్పునిచ్చినట్లయిందని ధర్మాసనం పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాల తరువాత జరిగిన గ్రామ పంచాయతీ, పురపాలక ఎన్నికల సందర్భంగా నాలుగు వారాల పాటు ఎన్నికల నియమావళిని అమలు చేయలేదన్న విషయాన్ని సింగిల్ జడ్జి పరిగణలోకి తీసుకోలేదని ధర్మాసనం ఆక్షేపించింది. వర్ల రామయ్య ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునే అంశంపై సింగిల్ జడ్జి నిర్దిష్టంగా తేల్చలేదని వివరించింది. ఈ మొత్తం వ్యవహారంలో అనేక వివాదాస్పద అంశాలున్నాయని, వీటన్నింటిపై రిట్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా తేల్చాల్సి ఉందంది. అందువల్ల అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. -
పరిషత్ పోరుపై 'స్టే'.. నేటి ఉదయం విచారణ
సాక్షి, అమరావతి: పరిషత్ పోరుకు సర్వం సిద్ధమైన దశలో హఠాత్తుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిలిపివేస్తూ సింగిల్ జడ్జి మంగళవారం మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్వులపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ హైకోర్టులో రాత్రి హౌస్ మోషన్ రూపంలో అప్పీల్ దాఖలు చేసింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేయాలని అభ్యర్థిస్తూ కమిషన్ కార్యదర్శి కన్నబాబు దాఖలు చేసిన ఈ అప్పీల్‌ను హైకోర్టు ధర్మాసనం బుధవారం ఉదయం 8 గంటలకు విచారించే అవకాశం ఉంది. సుప్రీం ఆదేశాలకు భిన్నంగా ఉన్నందున.. గురువారం జరగాల్సిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ నెల 1న జారీ చేసిన నోటిఫికేషన్లో తదుపరి చర్యలన్నీ తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకు నిలిపివేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు మంగళవారం అంతకుముందు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల తేదీకి నాలుగు వారాల ముందు ఎన్నికల నియమావళిని అమలు చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను ఎన్నికల కమిషన్ అమలు చేయలేదని, సుప్రీం ఆదేశాలకు భిన్నంగా ఉన్నందున నిలుపుదల చేయడం తప్పనిసరి అని పేర్కొన్నారు. అయితే సమయానుసారం ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత కమిషన్‌పై ఉన్నందున సుప్రీంకోర్టు ఆదేశాలను తు.చ. తప్పకుండా అమలు చేస్తామని పేర్కొంటూ తాజాగా నోటిఫికేషన్ జారీ చేయాలని సూచించారు. ఈ వివరాలతో ఈ నెల 15కల్లా అఫిడవిట్ దాఖలు చేయాలని ఎన్నికల కమిషన్‌ను ఆదేశిస్తూ టీడీపీ నేత వర్ల రామయ్య దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను అనుమతించారు. ఇదే సమయంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిమిత్తం గత ఏడాది మార్చి, మే నెలల్లో ఎన్నికల కమిషన్ జారీ చేసిన నోటిఫికేషన్లలో తదుపరి చర్యలన్నీ నిలుపుదల చేసేందుకు నిరాకరించారు. ఏపీ పంచాయతీరాజ్ ఎన్నికల నిర్వహణ నిబంధన రూల్ 7 ప్రకారం పరిస్థితులను బట్టి ఎన్నికల కార్యక్రమాన్ని మార్చడం, రీ నోటిఫై చేసే అధికారం ఎన్నికల కమిషన్‌కు ఉందని స్పష్టం చేస్తూ బీజేపీ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను కొట్టివేశారు. ఏ దశలో ఎన్నికలు నిలిచిపోయాయో ఆ దశ నుంచే కొనసాగిస్తే ఎన్నికల్లో పోటీ చేసే హక్కును నిరాకరించినట్లేనన్న బీజేపీ వాదనను కూడా న్యాయస్థానం తిరస్కరించింది. ప్రత్యేక పరిస్థితుల్లో జోక్యం చేసుకోవచ్చు.... ‘సాధారణంగా న్యాయస్థానాలు ఒకసారి ఎన్నికల ప్రక్రియ మొదలైన తరువాత ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకునేందుకు రాజ్యాంగంలోని అధికరణ 226 కింద తనకున్న విశేషాధికారాలను ఉపయోగించవు’ అని విచారణ సందర్భంగా జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు పేర్కొన్నారు. ‘ఈ విషయంలో అధికరణ 329 ప్రకారం నిషేధం ఉంది. అభ్యంతరం ఉన్న వ్యక్తులు సంబంధిత అథారిటీ ముందు ఎన్నికల పిటిషన్ దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎన్నికల అంశాల్లో అధికరణ 226 కింద న్యాయస్థానాలు న్యాయ సమీక్ష చేయరాదనడం అవాస్తవం. మోహిందర్ సింగ్ గిల్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం, న్యాయస్థానాలు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో జోక్యం చేసుకోవచ్చు. ఉదాహరణకు నిష్పాక్షిక ఎన్నికలకు అడ్డంకులు, అందరికీ ఎన్నికల్లో పోటీ చేసే సమాన అవకాశాలు కల్పించకపోవడం, ఎన్నికల పురోగతిని అడ్డుకోవడం, చట్ట ప్రకారం ఎన్నికలను నిర్వహించకపోవడం లాంటి చర్యలకు ఎన్నికల కమిషనర్ పాల్పడినా, ఉత్తర్వులు జారీ చేసినా అందులో న్యాయస్థానాలు జోక్యం చేసుకుని ఎన్నికలు నిరాటంకంగా జరిగేలా చూడవచ్చు. ఎన్నికల కమిషనర్, రిటర్నింగ్ అధికారుల తప్పులు ఎన్నికల షెడ్యూల్, పురోగతిని ప్రభావితం చేస్తుంటే అప్పుడు న్యాయస్థానాల జోక్యానికి అనుమతి ఉంది. ఎన్నికలను నిలుపుదల చేసేందుకు పిటిషన్ వేస్తే న్యాయస్థానం అందుకు తన విశేషాధికారాలను ఉపయోగించదు. ప్రత్యామ్నాయాలను చూసుకోవాలని పిటిషనర్‌కు చెబుతుంది’ అని తెలిపారు. నాలుగు వారాల పాటు నియమావళి.. ‘ఎన్నికలు తిరిగి నిర్వహించే ముందు ప్రభుత్వాన్ని సంప్రదించాలని కమిషన్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎన్నికల తేదీకి నాలుగు వారాల ముందు నియమావళిని తిరిగి అమలు చేయాలని ఆదేశించింది. ఈ ఉత్తర్వులను బట్టి చూస్తే ఎన్నికల నియమావళి అమలు విషయంలో సుప్రీంకోర్టు కమిషన్‌కు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. నియమావళి నాలుగు వారాల పాటు ఎన్నికలు జరిగే తేదీ వరకు అమల్లో ఉండాలన్నది సుప్రీంకోర్టు ఉత్తర్వుల ఉద్దేశం. నాలుగు వారాల గడువు గరిష్ట పరిమితి అన్న ఎన్నికల కమిషన్ తరఫు సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదనతో ఈ న్యాయస్థానం ఏకీభవించడం లేదు. ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టు ఉత్తర్వుల నుంచి పక్కకు తప్పుకున్నందున ఈ న్యాయస్థానం ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోగలదు. సుప్రీంకోర్టు ఆదేశాలకు ప్రతి ఒక్కరూ లోబడి ఉండాలి. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయడం మినహా ఎన్నికల కమిషన్‌కు మరో మార్గం లేదు. ఒకవేళ ఆ ఉత్తర్వుల అమల్లో ఇబ్బంది ఉందని ఎన్నికల కమిషన్ భావిస్తే సుప్రీంకోర్టు నుంచి తగిన ఆదేశాలు పొందాల్సింది. అంతే తప్ప ఏకపక్ష నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదు’ అని జస్టిస్ దుర్గాప్రసాదరావు తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణ ఓ దైవ కార్యం... ‘ఎన్నికల నిర్వహణ అనేది అలంకారప్రాయ సంప్రదాయం కాదు. అది ఒక దైవ కార్యం. సుప్రీంకోర్టు చెప్పిన విధంగా ఎన్నికల నియమావళిని అమలు చేయకపోతే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పే నైతిక హక్కు కమిషన్‌కు లేదు. తద్వారా మొత్తం ఎన్నికల ప్రక్రియ బలహీనమవుతుంది. ప్రస్తుత కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకార ఎన్నికల కమిషన్ నడుచుకోకపోవడం స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక, పారదర్శక ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించడమే. ఈ పరిస్థితుల్లో ఈ న్యాయస్థానం అధికరణ 226 కింద తనకున్న విశేషాధికారాలను ఉపయోగించి ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడం అనివార్యం’ అని పేర్కొంటూ తదుపరి విచారణను ఈ నెల 15కి వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ దుర్గాప్రసాదరావు ప్రకటించారు. ఎన్నికల నియమావళి అమలు తప్పనిసరి కాదు... ‘వర్ల రామయ్య వ్యక్తిగత హోదాలో దాఖలు చేసిన రిట్ పిటిషన్‌కు విచారణార్హత ఉందని చెప్పడం ద్వారా సింగిల్ జడ్జి తప్పు చేశారు. వ్యక్తిగత హోదాలో దాఖలు చేసిన ఈ వ్యాజ్యాన్ని కొట్టేసి ఉండాల్సింది. వర్ల రామయ్య ఏమీ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి కాదు. ఎన్నికల నియమావళికి చట్టబద్ధమైన దన్ను ఏదీ లేదు. నియమావళి తప్పనిసరి అని ఏ చట్టంలో లేదు. ఎన్నికల నియమావళి అన్నది భారత ఎన్నికల సంఘం అనుసరిస్తున్న ఓ విధానం మాత్రమే. ఒక్క మాటలో చెప్పాలంటే రాజకీయ పార్టీలను, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను నియంత్రించేందుకు తీసుకొచ్చిన ఓ మార్గదర్శకమే. అందువల్ల ఎన్నికల నియామవళి అమలు పూర్తిగా ఎన్నికల కమిషన్ విచక్షణపై ఆధారపడి ఉంటుంది. నియమావళి అమలు విషయంలో చట్టమే లేనప్పుడు, ఎన్నికల నియామావళి అమలు విషయంలో నిర్ణీత కాల వ్యవధి ఏదీ లేదన్న విషయాన్ని సింగిల్ జడ్జి పరిగణలోకి తీసుకుని ఉండాల్సింది. పరిస్థితులను బట్టి నియమావళి అమలు విషయంలో ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కమిషన్‌కు తన బాధ్యతలు ఏమిటో బాగా తెలుసు. కమిషన్ పనితీరు విషయంలో న్యాయస్థానాల జోక్యానికి పరిమితులున్నాయి. నియమావళి అమలు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మొత్తానికి భాష్యం చెప్పాలే కానీ ఒక్కో వాక్యానికి కాదు. ఎన్నికలను వాయిదా వేస్తూ గతంలో ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఎన్నికల కమిషన్ స్వతంత్రతను సమర్థించడం వల్లే జోక్యం చేసుకోలేదు. ఎన్నికల నియమావళి నిరవధికంగా కొనసాగడానికి వీల్లేదని సుప్రీంకోర్టు చెప్పింది. తద్వారా అన్నీ అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోతాయంది. అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకునే సుప్రీంకోర్టు ఎన్నికల నియమావళికి నాలుగు వారాల గరిష్ట గడువు విధించింది. నాలుగు వారాల కన్నా తక్కువ కాకూడదన్నదే సుప్రీంకోర్టు ఉద్దేశం. అంతేకానీ నాలుగు వారాలు కచ్చితంగా అమలు చేయాలన్నది ఉద్దేశం కాదు. ఎన్నికల కమిషన్ విధుల్లో జోక్యం చేసుకోరాదన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులను సింగిల్ జడ్జి పూర్తిస్థాయిలో పరిగణలోకి తీసుకోలేదు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని సింగిల్ జడ్జి ఉత్తర్వులను రద్దు చేయాలని అభ్యర్థిస్తున్నాం’ – అప్పీల్లో ధర్మాసనానికి ఎన్నికల కమిషన్ కార్యదర్శి కన్నబాబు వినతి -
డివిజన్ బెంచ్‌లో ఎస్ఈసీకి అనుకూలంగా తీర్పు రావాలి: సజ్జల
సాక్షి, అమరావతి: రెండు రోజుల్లో రాష్ట్రంలో పరిషత్ ఎన్నికలు జరగనుండగా.. ఏపీ హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం అందుబాటులో ఉన్న పార్టీ ముఖ్యనేతలతో చర్చించారు. తదుపరి చర్యలపై సమాలోచనలు జరిపారు. ఈ నేపథ్యంలో పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామాకృష్ణా రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘ఎన్నికల విషయంలో టీడీపీ పిల్ల చేష్టలకు పాల్పడుతోంది. పరిషత్ ఎన్నికలు బహిష్కరించిన టీడీపీ.. హైకోర్టుకు వెళ్లడంలో అర్థం లేదు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఏడాది క్రితం పూర్తి కావాల్సినవి.. కానీ ఆనాడు కూడా అన్యాయంగా, దురుద్దేశపూర్వకంగా ఎన్నికలను వాయిదా వేశారు’’ అని సజ్జల గుర్తు చేశారు. ‘‘పరిషత్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ప్రచారం ముగిసింది.. రెండు రోజుల్లో పోలింగ్ ఉండగా.. కోర్టుకు వెళ్లారు. ఈ అంశంలో ఎస్ఈసీ త్వరగా హౌస్‌మోషన్ పిటిషన్ వేయాలని ప్రభుత్వం కోరుకుంటుంది. కోవిడ్ విస్తరిస్తోన్న పరిస్థితుల్లో ఎన్నికలు త్వరగా పూర్తయితే చాలా మేలు జరిగేది. కోర్టుకు వెళ్లకుండా ఉంటే ఎన్నికలు త్వరగా పూర్తయ్యేవి. దాంతో వ్యాక్సినేషన్ త్వరగా పూర్తి చేసేందుకు అవకాశం ఉండేది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలకు అడ్డంకులు సృష్టించడం అన్యాయం. డివిజన్ బెంచ్‌లో ఎస్ఈసీకి అనుకూలంగా తీర్పు రావాలి’’ అని సజ్జల కోరుకున్నారు. చదవండి: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ఏపీ హైకోర్టు స్టే -
నేటితో ముగియనున్న ‘పరిషత్’ ప్రచారపర్వం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పరిషత్ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఏప్రిల్ 8వ తేదీన జరుగనున్న ఎన్నికలు, 10వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇలా ఉండగా పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది సోమవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించి పలు సూచనలు జారీ చేశారు. కోవిడ్–19 నిబంధనలు పాటిస్తూ ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదేశించారు. పోలింగ్ సామగ్రి, పోలింగ్ సిబ్బందికి శిక్షణ, రవాణా ఏర్పాట్లు, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, సమాచార కేంద్రాలు, ఎన్నికల నిబంధనలు, కౌటింగ్ ఏర్పాట్లు వంటి అంశాలపై ద్వివేది సమీక్షించారు. 8న ప్రభుత్వ సెలవు.. నేగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1881 ప్రకారం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఏప్రిల్ 8వ తేదీన సెలవుదినంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ఏపీపీఆర్ యాక్ట్ 225ఏ ప్రకారం ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ముందస్తుగా 48 గంటల పాటు మద్యం అమ్మకాలను నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1988 ప్రకారం 8వ తేదీని ఉద్యోగులు, కార్మికులకు వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించింది. ఎన్నికల తేదీని స్థానిక సెలవుగా ప్రకటించడంతో ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించాలని ఆదేశించింది. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల భవనాలను ఒక రోజు ముందు నుంచి..అనగా 7వ తేదీ నుంచి వినియోగించుకోవడానికి అనుమతించింది. ప్రభుత్వ ఉద్యోగులు ఓటర్లను ప్రభావితం చేయరాదని, అలాగే ఎవరికి ఓటు వేశామన్న విషయాన్ని కూడా బహిర్గతం చేయకూడదని స్పష్టం చేసింది. చిటికెన వేలుపై సిరా గుర్తు గురువారం జరుగనున్న పరిషత్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే వారికి ఎడమ చేతి చిటికెన వేలుసై సిరా గుర్తు వేయాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. గత పంచాయతీ ఎన్నికల్లో ఎడమ చేతి చూపుడు వేలుకు సిరా గుర్తు వేసినందున అది ఇంకా చెరగకపోవడంతో చిటికెన వేలుకు సిరా గుర్తు వేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. -
తమిళనాడు ఎన్నికలు: గంటల వ్యవధిలో 428 కోట్లు సీజ్
చెన్నై: మరికొద్ది గంటల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా, ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్(ఎస్ఈసీ) 428 కోట్లు విలువ చేసే బంగారం, నగదు, ఇతరత్రా విలువైన వస్తువులను సీజ్ చేసింది. ఓటర్లకు పంచడానికి సిద్ధంగా ఉంచిన రూ. 225.5 కోట్ల నగదు, రూ.200 కోట్లకుపైగా విలువైన బంగారం, మద్యం, గృహోపకరణాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎన్నికలకు ముందు 72 గంటలు అత్యంత కీలకమని, ఈ సమయంలోనే రాజకీయ పార్టీలు ప్రజలను ప్రలోభపెట్టే అవకాశం ఉందని ఈసీ వివరించింది. కాగా, గడిచిన 24 గంటల్లో చెన్నై సహా కోయంబత్తూర్, తిరుప్పూర్, కరూర్ తదితర నగరాల్లోని అనుమానిత ప్రాంతాల్లో అధికారులు దాడులు నిర్వహించారు. బృందాలుగా విడిపోయిన అధికారులు ఆయా ప్రాంతాల్లో సోదాలు చేయగా 428 కోట్ల సొత్తు పట్టుబడినట్టు తెలుస్తోంది. ఎన్నికల సందర్భంగా అక్రమ సొత్తు బయటపడిన నగరాల్లో కరూర్ అగ్రస్థానంలో ఉండగా, తర్వాత స్థానాల్లో కోయంబత్తూర్, తిరుప్పూర్, చెన్నై నగరాలు ఉన్నాయని ఈసీ పేర్కొంది. చదవండి: బాక్సర్ కావాల్సిన కుర్రాడు గ్యాంగ్‌స్టర్‌గా మారాడు.. -
పోటీలో ఉన్న పార్టీల అభ్యర్థులు చనిపోయిన చోట వేరుగా ఎన్నికలు
సాక్షి, అమరావతి: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో గుర్తింపు ఉన్న రాజకీయ పార్టీల తరఫున పోటీలో ఉండి, పోలింగ్‌కు ముందే మరణించిన వారి స్థానాల్లో ఈ నెల 8న కాకుండా వేరుగా.. వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) కసరత్తు చేపట్టింది. కరోనాతో ఏడాది క్రితం వాయిదా పడిన ఈ ఎన్నికల ప్రక్రియలో 2020 మార్చి 14న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఎన్నికల్లో ఏకగ్రీవంగా గెలిచిన వారితో పాటు పోటీలో ఉన్న మొత్తం 116 మంది అభ్యర్థులు చనిపోయినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్, పంచాయతీరాజ్ శాఖ అధికారులు నిర్ధారించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం.. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో ఉండి మరణించిన చోట మాత్రం ఈనెల 8నే పోలింగ్ యథావిధిగా నిర్వహిస్తున్నారు. కానీ, గుర్తింపు కలిగిన రాజకీయ పార్టీ తరఫున పోటీలో ఉండి అభ్యర్థి చనిపోయిన చోట మాత్రం ఎన్నికను తాత్కాలికంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే. 94 చోట్ల ఎన్నికలు వాయిదా ► ఎంపీటీసీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన 14 మంది అభ్యర్థులతో పాటు పోటీలో ఉన్న 87 మందితో కలిపి మొత్తం 101 మంది.. జెడ్పీటీసీ ఎన్నికల్లో ఏకగ్రీవమైన వారిలో ఇద్దరు, పోటీలో ఉన్న మరో 13 మంది కలిపి మొత్తం 15 మంది మరణించినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్, పంచాయతీరాజ్ శాఖ అధికారులు వెల్లడించారు. ► పోటీలో ఉండి మరణించిన 87 మంది ఎంపీటీసీ అభ్యర్థుల్లో ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు. నిబంధనల ప్రకారం.. ఈ ఐదు స్థానాల్లో ఈనెల 8న ఎన్నికలు యథావిధిగా కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు. కానీ, మిగిలిన 82 మంది గుర్తింపు కలిగిన రాజకీయ పార్టీల తరఫున పోటీలో ఉన్నందున అక్కడ ఎన్నికలు తాత్కాలికంగా వాయిదా వేశారు. ► పోటీలో కొనసాగుతూ మరణించిన 13 మంది జెడ్పీటీసీ అభ్యర్థుల్లో ఒకరు స్వతంత్ర అభ్యర్థి. ఆ స్థానంలో ఎన్నిక యథావిధిగా 8న ఎన్నిక జరుగుతుంది. గుర్తింపు కలిగిన పార్టీ అభ్యర్థులు చనిపోయిన 12 చోట్ల మాత్రం ఎన్నికలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ► ఇలా 82 ఎంపీటీసీ స్థానాలలో.. 12 జెడ్పీటీసీ స్థానాల్లో కలిపి మొత్తం 94 చోట్ల ఎన్నికలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఇక్కడ రాజకీయ పార్టీ తరఫున మాత్రమే మరో అభ్యర్థితో నామినేషన్‌కు అవకాశం ఇస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ► ఎన్నికలు వాయిదా పడిన 94 స్థానాల్లో తిరిగి ఎన్నికలు నిర్వహించేందుకు వారం రోజులలోపే కొత్త నోటిఫికేషన్ జారీచేసే అవకాశముందని ఎస్ఈసీ వర్గాలు వెల్లడించాయి. అయితే, వీటితో పాటు ఏకగ్రీవంగా గెలుపొందిన అభ్యర్థులు (ఎంపీటీసీ సభ్యులు 14 మంది, జెడ్పీటీసీ సభ్యులు ఇద్దరు) చనిపోయిన చోట్ల ఎన్నికలు జరిపే విషయంపై ఎస్ఈసీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. -
ఆటంకాలు లేవని తేలాకే నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: మధ్యలో ఆగిపోయిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు నిబంధనల ప్రకారం ఎటువంటి ఆటంకాలు, అడ్డంకులు లేవని స్పష్టత వచ్చాకే ఎన్నికల కొనసాగింపునకు నోటిఫికేషన్ విడుదల చేసినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. తాను ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన వెంటనే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎక్కడ దాకా జరిగాయి, ఏవి ఎక్కడ ఆగిపోయాయన్న దానిపై సమీక్షించానని చెప్పారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, జిల్లా కలెక్టర్లు తదితరులతో ఎన్నికల సన్నద్ధతపై చర్చించాకే నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ‘రాష్ట్రంలో ఏడాది కిందట మధ్యలో ఆగిపోయిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఈ ఏడాది జనవరి 8వ తేదీనే తిరిగి మొదలైంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాయి. మునిసిపల్ ఎన్నికలు పూర్తయ్యాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు కూడా 2020 మార్చి 14వ తేదీకే నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయింది. కరోనా కారణంగా అప్పుట్లో ఎన్నికల వాయిదా పడ్డాయి. పోటీలో ఉండే అభ్యర్థుల జాబితాలు అప్పుడే ఖరారయ్యాయి. బ్యాలెట్ పేపర్ల ముద్రణ పూర్తయింది. ఏకగ్రీవంగా ఎన్నికైనవారికి రిటర్నింగ్ అధికారులు గెలుపు ధ్రువీకరణ పత్రాలు కూడా అందజేశారు. ఆ ఎన్నికలను కొనసాగించకుండా ఉండడానికి ఎటువంటి కారణాలు లేవు. అన్ని పరిశీలించాకే నిర్ణయం తీసుకున్నాం. ఈ నెల 8వ తేదీ ఎన్నికల పోలింగ్, 9న అవసరమైన చోట రీపోలింగ్ నిర్వహిస్తాం. 10వ తేదీన ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి ఉంటాయి..’ అని వివరించారు. ఎన్నికలు ఎక్కడ ఆగిపోయి ఉన్నాయో అక్కడ నుంచే మొదలు పెట్టినట్టు చెప్పారు. నోటిఫికేషన్ విడుదలతో పోటీలో ఉన్న అభ్యర్థులు శుక్రవారం నుంచే ప్రచారం కొనసాగించుకోవచ్చన్నారు. ఎన్నికల కోడ్ గురువారం రాత్రి నుంచే అమల్లోకి వచ్చిందని తెలిపారు. ఎన్నికల ప్రచారంలోను, పోలింగ్ సమయంలోను కరోనా జాగ్రత్తలు తీసుకునేలా కలెక్టర్లు, ఎస్పీలకు స్పష్టమైన ఆదేశాలిచ్చినట్లు చెప్పారు. ఏకగ్రీవాలపై ఇప్పటికే కోర్టు తీర్పిచ్చింది ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో ఏకగ్రీవాలపై ఇప్పటికే హైకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి ఎన్నికల నిర్వహణకు ఇబ్బందులు లేవని మీడియా ప్రతినిధులు అడిగిన ఒక ప్రశ్నకు నీలం సాహ్ని బదులిచ్చారు. ‘ఎన్నికలు ఇంకా ఆపడానికి నిబంధనల ప్రకారం ప్రత్యేకించి ఏ కారణాలు లేవు. ఎన్నికల నిర్వహణ ఇంకా ఆలస్యమయ్యే కొద్ది కరోనా వాక్సినేషన్ సమస్యలున్నాయి. ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉంది. అన్ని పరిస్థితులు పరిశీలించాక ఇప్పుడు ఎన్నికలు కొనసాగించడమే సముచితమం’ అని భావించినట్టు చెప్పారు. అందరి సహకారం అవసరం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిష్పక్షపాతంగా, స్వేచ్చగా, పూర్తి పారదర్శకంగా నిర్వహించడానికి ఓటర్లు, రాజకీయ పార్టీలు సహా అందరి సహకారం అవసరమని చెప్పారు. ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి వారినుంచి సలహాలు, సూచనలు తీసుకున్నట్టు తెలిపారు. స్థానిక ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఫిర్యాదుల సెల్ ఏర్పాటు చేసిందని, ఎలాంటి ఫిర్యాదులు, వినతులు వచ్చినా సత్వరమే పరిష్కరిస్తామని ఆమె చెప్పారు. -
ఏపీ ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని నియమితులయ్యారు. నీలం సాహ్ని పేరును గవర్నర్ బీబీ హరిచందన్ ఆమోదించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్య సలహాదారుగా నీలం సాహ్ని ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త ఎన్నికల కమిషనర్ నియామకానికి సంబంధించి ముగ్గురు రిటైర్ట్ ఐఏఎస్ అధికారులతో కూడిన ప్యానల్‌ను రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కార్యాలయానికి పంపించిన సంగతి తెలిసిందే.. ప్రస్తుత ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ పదవీ కాలం ఈ నెల 31తో ముగియనుంది. చదవండి: పోలవరం ప్రాజెక్టు: మరో కీలక అంకం పూర్తి.. -
ఏపీ: ఎస్ఈసీ పదవికి ముగ్గురి పేర్లు ప్రతిపాదన
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త ఎన్నికల కమిషనర్ నియామకానికి సంబంధించి ముగ్గురు రిటైర్ట్ ఐఏఎస్ అధికారులతో కూడిన ప్యానల్‌ను రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కార్యాలయానికి పంపించింది. ప్రస్తుత ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ పదవీ కాలం ఈ నెల 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి, ప్రస్తుతం సీఎం ముఖ్య సలహాదారుగా ఉన్న నీలంసాహ్ని, మరో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, నవరత్నాల పర్యవేక్షణ సలహాదారు ఎం.శామ్యూల్, ఇంకో రిటైర్డ్ ఐఏఎస్, ప్రస్తుతం రాష్ట్ర పునర్విభజన విభాగం బాధ్యతలు నిర్వహిస్తున్న ఎల్.ప్రేమచంద్రారెడ్డి పేర్లతో కూడిన ప్యానల్‌ను రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ విశ్వభూషణ్‌కు నివేదించింది. ఈ ముగ్గరిలో గవర్నర్ ఎవరి పేరును ఆమోదిస్తే.. వారిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ప్రభుత్వం నియమిస్తుంది. ఈ నియామకం జరిగితే వీలైనంత త్వరగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయించి కోవిడ్ వ్యాక్సినేషన్‌పై దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. -
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు.. ఎస్ఈసీని ఆదేశించలేం
సాక్షి, అమరావతి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ)కు ఆదేశాలిచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రస్తుతానికి ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని లేదా మూడ్రోజుల పాటు సెలవుపై వెళ్తుండటాన్ని బట్టి ఎన్నికల కమిషనర్ ఎన్నికల బాధ్యతల నుంచి తప్పుకున్నారన్న ప్రాథమిక నిర్ణయానికి రాలేమని హైకోర్టు స్పష్టంచేసింది. అంతేకాక.. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌ను ఈ వ్యాజ్యంలో వ్యక్తిగత ప్రతివాదిగా చేర్చడంతో పాటు ఆయనపై తీవ్రమైన ఆరోపణలు చేశారని, అలాగే దురుద్దేశాలు ఆపాదించినందువల్ల మధ్యంతర ఉత్తర్వులు జారీచేసే ముందు కౌంటర్ దాఖలు చేసేందుకు ఆయనకు అవకాశమివ్వాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు ఆదేశాలు జారీచేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్ ఈ దశలో కోరజాలరని తేల్చిచెప్పింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఎన్నికల కమిషన్, నిమ్మగడ్డ రమేశ్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. కమిషన్ నిర్ణయాలపై న్యాయ సమీక్ష చేయవచ్చు పంచాయతీ, పురపాలక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అఖండ విజయం సాధించడంతో, తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలను కాపాడేందుకు, ఆ పార్టీని మరిన్ని ఇబ్బందుల నుంచి తప్పించేందుకే నిమ్మగడ్డ ఇప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించడం లేదంటూ గుంటూరు జిల్లా పాలపాడుకు చెందిన మెట్టు రామిరెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఎన్నికల నిర్వహించేలా ఎన్నికల కమిషన్‌కు ఆదేశాలిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలని ఆయన అనుబంధ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై గత వారం విచారణ జరిపి నిర్ణయాన్ని వాయిదా వేసిన న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు మంగళవారం తన నిర్ణయాన్ని వెలువరించారు. ఎన్నికల కమిషన్ నిర్ణయాలు న్యాయ సమీక్షకు అతీతమైనవి కావని, వాటిపై సమీక్ష చేయవచ్చునని అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలతో ఈ న్యాయస్థానం ఏకీభవిస్తోందని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. న్యాయ సమీక్ష రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో భాగమని తెలిపారు. నిమ్మగడ్డపై ఆరోపణలు చాలా తీవ్రమైనవి ‘ఇక ఈ వ్యాజ్యంలో చేసిన ఆరోపణల విషయానికొస్తే.. ఈ కోర్టు అభిప్రాయం ప్రకారం అవి చాలా తీవ్రమైనవి. నిమ్మగడ్డ రమేశ్‌ను వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చారు. ఆయనకు పక్షపాతాన్ని ఆపాదించారు. ఈ పక్షపాతానికి కొన్ని ఘటనలను కూడా ఉదహరించారు. అధికార పార్టీపట్ల శత్రుభావంతో వ్యవహరించారని ప్రమాణ పూర్వకంగా ఈ వ్యాజ్యంలో చెప్పారు. నిమ్మగడ్డ రమేశ్ తీరును మోసపూరితంగా, దురుద్దేశపూర్వకంగా, ఏకపక్షంగా, అక్రమాలుగా వర్గీకరించారు. కౌంటర్లు ఆహ్వానించిన తరువాత వీటన్నింటిపై కూడా లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉందన్నది ఈ కోర్టు అభిప్రాయం. ఈ విషయంలో ముఖ్యంగా నిమ్మగడ్డ రమేశ్ నుంచి కౌంటర్ ఆహ్వానించాలి. పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగియడానికి (ఈనెల 18) ముందు ప్రస్తుత పిటిషన్ దాఖలైంది. సాధారణంగా ఓ అధికార వ్యవస్థ తీసుకున్న నిర్ణయం తప్పయితే, తగిన నిర్ణయం తీసుకోవాలని మాత్రమే ఆ వ్యవస్థను ఈ న్యాయస్థానం ఆదేశించగలుగుతుంది. అంతేతప్ప దానిని ఫలానా విధంగా చేసి తీరాలని ఆదేశించలేదు. ప్రస్తుత కేసులో నిమ్మగడ్డ రమేశ్‌పై తీవ్రమైన ఆరోణలున్న నేపథ్యంలో కౌంటర్ దాఖలు చేసేందుకు ఆయనకు అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు కోరే హక్కు పిటిషనర్‌కు లేదు’.. అని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
నిమ్మగడ్డ దాగుడుమూతలు
సాక్షి, అమరావతి: గతేడాది మధ్యలో నిలిపివేసిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించకుండా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ దాగుడుమూతలాడుతున్నారు. ఈ అంశాలపై వివరణ ఇచ్చేందుకు శుక్రవారం తనను అత్యవసరంగా కలవాలని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆదేశించినప్పటికీ నిమ్మగడ్డ మాత్రం తాను హైదరాబాద్‌లో ఉన్నానంటూ సమాచారమిచ్చి ముఖం చాటేయడం గమనార్హం. ఏడాది క్రితం మధ్యలో నిలిపివేసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను మార్చి నెలాఖరులోగా పూర్తి చేసేలా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను ఆదేశించాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ గురువారం గవర్నర్‌ను కలిసి విన్నవించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా కరోనా మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజారోగ్యం దృష్ట్యా కేవలం ఆరు రోజుల ప్రక్రియ మాత్రమే మిగిలిఉన్న ఆ ఎన్నికలను పూర్తి చేసేలా ఆదేశించాలని సీఎస్ కోరారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల కారణంగా రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ మందగించిన నేపథ్యంలో ఆరు రోజుల్లో ముగిసిపోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియను త్వరగా పూర్తి చేస్తే వ్యాక్సినేషన్‌ను పూర్తి స్థాయిలో వేగవంతంగా చేపట్టవచ్చని ప్రభుత్వం తరపున సీఎస్ నివేదించారు. ఈ క్రమంలో ఈ అంశాలపై చర్చించేందుకే తనను అత్యవసరంగా కలవాలని గవర్నర్ తన కార్యాలయ ముఖ్య కార్యదర్శి ద్వారా నిమ్మగడ్డకు సమాచారం ఇచ్చినప్పటికీ ఆయన హాజరు కాలేదు. సెలవు కాదు.. విధుల్లోనే ఉన్నా నిమ్మగడ్డ శుక్రవారం సెలవులో లేరని, అధికారికంగా ఆయన విధుల్లోనే ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. గత నాలుగు రోజులుగా నిమ్మగడ్డ హైదరాబాద్‌లోని తన ఇంటి నుంచి విధులు నిర్వహిస్తున్నారని, 18న జరిగిన మేయర్, మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికలను ఆయన అక్కడ నుంచే పర్యవేక్షించారని పేర్కొన్నాయి. కాగా ఈ నెల 22 నుంచి 24వతేదీ వరకు ఎల్టీసీపై తమిళనాడులోని మధురై, రామేశ్వరం పర్యటనకు వెళ్లేందుకు గవర్నర్ అనుమతి కోరినట్లు తెలిసింది. కలవకపోవడం ధిక్కారమే.. కరోనా వ్యాక్సినేషన్ కారణంగా అధికార యంత్రాంగం అంతా ఈ ప్రక్రియలో నిమగ్నమైనందున ఈ ఏడాది జనవరిలో ఎన్నికల నిర్వహణకు అనుకూల పరిస్థితులు లేవని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ వైద్య ఆరోగ్య శాఖ నివేదికతో సహా ఎస్ఈసీకి తెలియచేశారు. అయినప్పటికీ ఎన్నికలు జరిపి తీరాల్సిందేనని పట్టుబట్టి నిమ్మగడ్డ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను మొదలుపెట్టిన విషయం తెలిసిందే. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు ఆగమేఘాలపై నిర్వహించి ఏడాది క్రితం మధ్యలో ఆపేసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల గురించి మాత్రం పట్టించుకోలేదు. న్యాయపరంగా ఎటువంటి ఆటంకాలు లేకపోయినా ఉద్దేశపూర్వకంగానే నిమ్మగడ్డ ఆ ఎన్నికల నిర్వహణకు సుముఖత చూపడం లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఈ అంశాలపై చర్చించేందుకు తనను అత్యవసరంగా కలవాలని గవర్నర్ ఆదేశించినా ఏవో సాకులు చెప్పి రాకపోవడం నిమ్మగడ్డ ధిక్కార ధోరణికి నిదర్శనమనే చర్చ అధికార, రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. -
ఏపీ ఎస్ఈసీకి హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రాష్ట్ర ఎన్నికల సంఘానికి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఏకగ్రీవాలపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఏకగ్రీవాలపై దర్యాప్తు చేసే అధికారం ఎస్ఈసీకి లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఎస్ఈసీ ఉత్తర్వులను హైకోర్టు కొట్టేసింది. ఈ మేరకు ఏకగ్రీవంగా ఎన్నికైన ఎంపీటీసీ, జడ్పీటీసీలను తక్షణమే అధికారికంగా ప్రకటించాలని హైకోర్టు ఎస్ఈసీని ఆదేశించింది. తక్షణమే ఎంపికైన అభ్యర్ధులకు డిక్లరేషన్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే, గత ఏడాది మార్చ్15న కరోనా కారణంగా జెడ్పీటీసీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. వాయిదా పడే సమయానికి నామినేషన్ల ఉపసంహరణ కూడా పూర్తి అయింది. రాష్ట్ర వ్యాప్తంగా 660 జెడ్పీటీసీ స్ధానాలకి నోటిఫికేషన్ విడుదల కాగా, 8 జెడ్పీటీసీ స్ధానాలకు కోర్టు వివాదాలతో ఎన్నికల ప్రక్రియ ఆగిపోయింది. మిగిలిన 652 జెడ్పీటీసీ స్ధానాలకి 126 జెడ్పీటీసీలు వైఎస్సార్సీపీకి ఏకగ్రీవం అయ్యాయి. వైఎస్సార్ కడప జిల్లాలో 50 జెడ్పీటీసీ స్ధానాలకు 38, చిత్తూరులో 65 స్ధానాలకి 30, కర్నూలు జిల్లాలో 53 స్ధానాలకి 16, ప్రకాశంలో 56 స్ధానాలకి 14 జెడ్పీటీసీ స్ధానాలు, నెల్లూరులో 46కు 12, గుంటూరులో 57కు 8 స్ధానాలు, కృష్ణాలో 49కి రెండు స్ధానాలు, పశ్చిమ గోదావరి 48కి రెండు స్ధానాలు, విజయనగరంలో 34 స్ధానాలకు మూడు, విశాఖపట్నంలో 39కి ఒక జెడ్పీటీసీ స్థానం వైఎస్సార్సీపీకి ఏకగ్రీవం అయింది. అనంతపురం, శ్రీకాకుళం, తూర్పుగోదావరిలోఏకగ్రీవాలు కాలేదు. ఏకగ్రీవాలైన 126 మంది జెడ్పీటీసీలను అధికారికంగా ప్రకటించి మిగిలిన 526 జెడ్పీటీసీ స్ధానాలకు ఎస్ఈసీ ఎన్నికలు జరిపించాల్సి ఉంది. చదవండి: 126 జెడ్పీటీసీ, 2,406 ఎంపీటీసీలు ఏకగ్రీవం అమరావతి భూ కుంభకోణంపై సమగ్ర నివేదిక -
ఒక్కసారే రీ కౌంటింగ్‌కు అనుమతి
సాక్షి, అమరావతి: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను అన్నిచోట్లా రాత్రి 8 గంటలకల్లా పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ జిల్లాల కలెక్టర్లతోపాటు మున్సిపల్ శాఖ కమిషనర్, ఎన్నికలు జరిగిన మున్సిపాలిటీ/కార్పొరేషన్ కమిషనర్లకు సూచించారు. కౌంటింగ్ సందర్భంగా ఒక అంకె ఓట్ల తేడా ఉన్నచోట మాత్రమే రీకౌంటింగ్ నిర్వహించాలని, రెండంకెల ఓట్ల తేడా ఉన్నప్పుడు అభ్యర్థులెవరైనా రీకౌంటింగ్ కోరితే రిటర్నింగ్ అధికారులు నిర్ణయం తీసుకునే ముందు సంబంధిత జిల్లా కలెక్టర్‌తో మాట్లాడాలని తెలిపారు. కేవలం ఒకసారి మాత్రమే రీకౌంటింగ్‌కు అనుమతించాలని ఆయన స్పష్టం చేశారు. కౌంటింగ్ సమయంలో అనుసరించాల్సిన విధివిధానాలపై నిమ్మగడ్డ శనివారం ఆదేశాలు జారీ చేశారు. అన్నిచోట్ల వీడియో కెమేరాల ద్వారా, లేదంటే సీసీ కెమేరాలు, వెబ్‌కాస్టింగ్ పర్యవేక్షణలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను చేపట్టాలని ఆదేశించారు. ఆ వీడియో ఫుటేజీని ఎన్నికల రికార్డుల్లో భద్రపరచాలని సూచించారు. కౌంటింగ్ ప్రక్రియలో విద్యుత్ అంతరాయాల్లేకుండా చర్యలు తీసుకోవాలని, కౌంటింగ్ కేంద్రాల్లో అవసరమైతే జనరేటర్లు ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచనలిచ్చారు. -
సాఫీగా ‘పట్టభద్రుల’ ఎన్నికలు
సాక్షి, హైదరాబాద్: శాసనమండలి పట్టభద్రుల కోటా ఎన్నికలు సాఫీగా సాగేందుకు అందరూ సహకరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితాపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నామని, తప్పుడు సమాచారం ఇచ్చిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టభద్రుల ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఎన్నికల నిర్వహణలో కోవిడ్ నిబంధనలు పూర్తిస్థాయిలో అమలు చేస్తామని, ఓటర్లను ప్రలోభాలకు గురిచేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పట్టభద్రులు తమ ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాలు అవకాశం కల్పించాలని సూచించారు. పోలింగ్ తీరుతెన్నులపై అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్, సీసీ కెమెరాలు, ఇతర కెమెరాలతో వీడియోగ్రఫీ చేయిస్తున్నట్లు వెల్లడించారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు సంబంధించి ఇప్పటి వరకు సుమారు 50 ఫిర్యాదులు అందాయని, ఎవరు నిబంధనలు ఉల్లంఘించినా చర్యలు తీసుకుంటామన్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడం పౌరుల బాధ్యతని.. తద్వారా ప్రజాస్వామ్యం పటిష్టమవుతుందన్నారు. పోలింగ్ రోజున అభ్యర్థికి రెండు వాహనాలతో పాటు ప్రతీ జిల్లాకు అదనంగా ఒక వాహనం ఉపయోగించుకునే అవకాశం ఉంటుందన్నారు. ఓటర్ స్లిప్పుల పంపిణీ కూడా పూర్తయిందని శశాంక్ గోయల్ వెల్లడించారు. సున్నితమైన పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ చేయడంతో పాటు, ఈ నెల 17న ఓట్ల లెక్కింపు ప్రక్రియను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. -
పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో అక్రమాలు లేవు
సాక్షి, అమరావతి: గ్రామ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఎటువంటి అక్రమాలు, అవకతవకలు జరగలేదని రాష్ట్ర ఎన్నికల కమిషన్ శుక్రవారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సమయంలో కరెంట్ నిలిపివేసి ఫలితాలను తారుమారు చేశారని, నిబంధనలకు విరుద్ధంగా పలుచోట్ల రీకౌంటింగ్ నిర్వహించారని ఫిర్యాదులు రావడంతో అన్ని జిల్లాల కలెక్టర్లు, పంచాయతీ రాజ్‌శాఖ కమిషనర్ నుంచి నివేదికలు తెప్పించుకున్నట్టు కమిషన్ తెలిపింది. కొన్ని చిన్న సంఘటనలు జరిగినప్పటికీ, వాటిలో తీవ్రంగా పరిగణించాల్సినవి ఏమీ లేవని పేర్కొంది. ఎక్కడా కూడా కరెంట్ నిలిపివేసి ఫలితాలను మార్చినట్టు నిర్ధారణ కాలేదని తెలిపింది. గుంటూరు జిల్లాలో నాలుగు పంచాయతీల్లో ఎక్కువ ఓట్ల తేడా ఉన్నా, రీ కౌంటింగ్ నిర్వహించినట్టు తెలిసిందని, వాటిపై జిల్లా కలెక్టరు నుంచి సమగ్ర నివేదిక తెప్పించుకున్నానని, రీకౌంటింగ్‌లో ఎటువంటి అవకతవకలు జరిగినట్లు నిర్ధారణ కాలేదని వెల్లడించింది. ఓట్ల లెక్కింపుపై వచ్చిన ఆరోపణలు పూర్తి నిరాధారమైనవని రాష్ట్ర ఎన్నికల కమిషన్ పేర్కొంది. -
18న మేయర్ల ఎన్నిక
సాక్షి, అమరావతి: నగర పాలక సంస్థల్లో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులతో పాటు మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో చైర్ పర్సన్, వైస్ చైర్పర్సన్ పదవులకు ఈనెల 18న ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఆ రోజు ఉ.11గంటలకు ఎక్కడికక్కడ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ నిర్ణయించారు. ఏలూరు మినహా 11 నగర పాలక సంస్థలు, 75 మున్సిపాలిటీల్లో పరోక్ష పద్ధతిలో ఈ ఎన్నికలు జరుగుతాయి. 14న జరిగే మున్సి‘పోల్స్’ ఓట్ల లెక్కింపు సందర్భంగా నగర పాలక సంస్థల్లో కార్పొరేటర్లుగా ఎన్నికైన వారు మేయర్, డిప్యూటీ మేయర్లను ఎన్నుకుంటారు. అలాగే, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వార్డు సభ్యులుగా ఎన్నికైన వారు చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లను ఎన్నుకుంటారు. ఈ ఎన్నికలను పురస్కరించుకుని ఎన్నికల కమిషన్ ప్రిసైడింగ్ అధికారులను నియమించింది. వీరు ముందుగా విజేతలతో ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్, చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ల ఎన్నికలను చేపడతారు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఓటు హక్కు ఈ ఎన్నికల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఎక్స్ అఫిషియో హోదాలో ఓటు హక్కు ఉంటుంది. వీరు ముందుగా తమ పేర్లు నమోదు చేసుకోవాలి. ► లోక్‌సభ సభ్యుడు లేదా ఎమ్మెల్యే తాము గెలిచిన నియోజకవర్గ పరిధిలో ఒకటి కంటే ఎక్కువ పట్టణాలు ఉంటే ఏదో ఒకచోట మాత్రమే ఎక్స్ అఫిషియో సభ్యునిగా తమ పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వారి నియోజకవర్గ పరిధిలో ఒకటే పట్టణం ఉంటే అందులోనే అతను ఎక్స్ అఫిషియో సభ్యునిగా పరిగణిస్తారు. ► రాజ్యసభ సభ్యునికి మున్సిపాలిటీ ప్రాంతాల్లో ఎక్కడ ఓటు హక్కు కలిగి ఉంటుందో ఆ నగర పాలక సంస్థ లేదంటే మున్సిపాలిటీలో అతనిని ఎక్స్ అఫిషియో సభ్యునిగా గుర్తిస్తారు. ఇక ఎమ్మెల్సీలు కూడా తాము ఎన్నికయ్యే సమయంలో ఏ మున్సిపాలిటీ లేదా నగర పాలక సంస్థలో ఓటు హక్కు కలిగి ఉంటారో అక్కడే అతనిని ఎక్స్ అఫిషియో సభ్యునిగా గుర్తిస్తారు. కోరం ఉంటేనే ఎన్నిక నగర పాలక సంస్థలు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలోని ఓటు హక్కు ఉన్న మొత్తం సభ్యులలో కనీసం సగం మంది 18న జరిగే ప్రత్యేక సమావేశానికి హాజరైతేనే ఆయాచోట్ల మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ల ఎన్నికను నిర్వహిస్తారు. గంట వ్యవధిలో కనీసం సగం మంది సభ్యులు హాజరుకాని పక్షంలో కోరం లేని కారణంగా ఎన్నికను ప్రిసైడింగ్ అధికారి వాయిదా వేస్తారని ఎన్నికల కమిషన్ అధికారులు వెల్లడించారు. విప్ జారీచేసే అధికారం లేని జనసేన ఇదిలా ఉంటే.. ఈ ఎన్నికల్లో గెలుపొందిన తమ అభ్యర్థులకు విప్ జారీచేసే అధికారం ఆయా పార్టీలు కలిగి ఉంటాయి. అధికార వైఎస్సార్సీపీ, తెలుగుదేశంతో సహా జాతీయ స్థాయిలో, వివిధ రాష్ట్రాలలో గుర్తింపు పొందిన మొత్తం 18 రాజకీయ పార్టీలు ఈ ఎన్నికలో విప్ జారీ చెయ్యొచ్చు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆయా రాజకీయ పక్షాలకు లేఖలు రాసింది. కానీ, విప్ జారీచేసే అధికారం ఉన్న పార్టీల జాబితాలో జనసేన లేదు. కేంద్ర ఎన్నికల సంఘం వద్ద గుర్తింపు కలిగిన రాజకీయ పార్టీగా నమోదై ఉండి.. ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్ద కూడా నమోదు చేసుకుని ఉంటే అలాంటి పార్టీలకు మాత్రమే ఈ ఎన్నికల్లో విప్ జారీచేసే అధికారం ఉంటుందని ఎన్నికల కమిషన్ వర్గాలు తెలిపాయి. కానీ, రాష్ట్రంలో జనసేన గుర్తింపు కలిగిన రాజకీయ పార్టీ కాదని.. కేవలం రాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్ద ప్రత్యేక గుర్తు రిజర్వుడు చేయబడిన రిజిస్టర్డ్ పార్టీ మాత్రమే అయినందున ఆ పార్టీని విప్ జారీచేసే అధికారం ఉన్న పార్టీల జాబితాలో చేర్చలేదని ఆ వర్గాలు వివరించాయి. -
ఓటెత్తిన పురం
సాక్షి, అమరావతి: పురపాలక ఎన్నికల్లో ఓట్లు పోటెత్తాయి. 12 నగరపాలక సంస్థలు, 71 పురపాలక సంఘాలు/నగర పంచాయతీలకు బుధవారం నిర్వహించిన ఎన్నికల్లో ఏకంగా 62.28 శాతం పోలింగ్ నమోదైంది. నగరపాలక సంస్థల కంటే పురపాలక సంఘాలు/నగర పంచాయతీల్లో పోలింగ్ శాతం ఎక్కువగా నమోదు కావడం గమనార్హం. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరిగిన 12 నగరపాలక సంస్థల్లో 57.14 శాతం పోలింగ్ నమోదు కాగా.. 71 పురపాలక సంఘాలు/నగర పంచాయతీల్లో 70.66 శాతం ఓట్లు పోలయ్యాయి. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఏకగ్రీవమైనవాటిని మినహాయించగా 12 నగరపాలక సంస్థల్లోని 581 డివిజన్ల్లో 2,569 మంది, 71 పురపాలక సంఘాలు/నగర పంచాయతీల్లోని 1,633 వార్డుల్లో 4,981 మంది అభ్యర్థులు పోటీ చేశారు. మొత్తం మీద 7,550 మంది ఎన్నికల బరిలో నిలిచారు. నగరపాలక సంస్థల పరిధిలో 4,626, పురపాలక సంఘాలు/నగర పంచాయతీల పరిధిలో 3,289 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచే పోటెత్తిన ఓటర్లు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో బుధవారం ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. మహిళలు, వృద్ధులు సైతం ఓటింగ్ పట్ల ఆసక్తి చూపారు. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ దంపతులు విజయవాడలో తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు క్యూలైన్లలో ఉన్నవారిని కూడా ఓట్లు వేసేందుకు అనుమతించారు. ఓటర్ స్లిప్పులు లేకపోయినా ఓటర్ల జాబితాలో ఉన్నవారు ఏదో ఒక గుర్తింపు కార్డు తీసుకువస్తే ఓటింగ్‌కు అవకాశమిచ్చారు. పటిష్ట భద్రతా ఏర్పాట్లు పోలింగ్ ముగిశాక బ్యాలెట్ బాక్సులను సంబంధిత ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోని స్ట్రాంగ్ రూములకు తరలించారు. సీసీ కెమెరాలతోపాటు స్ట్రాంగ్ రూముల వద్ద పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఓట్లేసిన 48.30 లక్షల మంది.. ► పోలింగ్ నిర్వహించిన 12 నగరపాలక సంస్థలు, 71 పురపాలక సంఘాలు/నగర పంచాయతీల్లో మొత్తం 77,56,200 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 48,30,296 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. ► అత్యధికంగా 75.93 శాతం ఓటింగ్‌తో తూర్పుగోదావరి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ► 75.49 శాతం పోలింగ్‌తో ప్రకాశం జిల్లా రెండో స్థానంలో, 71.52 శాతంలో శ్రీకాకుళం జిల్లా మూడో స్థానంలో నిలిచాయి. ► కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 55.87 శాతం పోలింగ్ నమోదైంది. నగరపాలక సంస్థల్లో టాప్‌లో ఒంగోలు ► నగరపాలక సంస్థల్లో 75.52 శాతం పోలింగ్‌తో ఒంగోలు మొదటి స్థానంలో నిలిచింది. ► 71.14 శాతం పోలింగ్‌తో మచిలీపట్నం రెండో స్థానంలో, 66.06 శాతం పోలింగ్‌తో చిత్తూరు మూడో స్థానంలో ఉన్నాయి. ► కర్నూలులో అత్యల్పంగా 49.26 శాతం ఓట్లు పోలయ్యాయి. పురపాలక సంఘాలు/నగర పంచాయతీల్లో మొదటి స్థానంలో గూడూరు ► 85.98 శాతం పోలింగ్‌తో గూడూరు (కర్నూలు జిల్లా) నగర పంచాయతీ మొదటి స్థానంలో నిలిచింది. ► 83.04 శాతం ఓటింగ్‌తో అద్దంకి రెండో స్థానంలో, 82.24 శాతం ఓటింగ్‌తో మండపేట మూడో స్థానంలో ఉన్నాయి. ► ఆదోనిలో అత్యల్పంగా 50.05 శాతం ఓట్లు పోలయ్యాయి. పురపాలక ఓట్ల లెక్కింపు కోసం విస్తృత ఏర్పాట్లు.. పురపాలక ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఓట్ల లెక్కింపుపై రాష్ట్ర ఎన్నికల కమిషన్, పురపాలక శాఖ అధికారులు దృష్టి సారించారు. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు నేపథ్యంలో కౌంటింగ్ సిబ్బందికి ఇప్పటికే శిక్షణ పూర్తి చేశారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ కౌంటింగ్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ► ఎన్నికలు నిర్వహించిన 12 నగరపాలక సంస్థల్లో మొత్తం 2,204 కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 9,788 మంది అధికారులు, సిబ్బందిని నియమించారు. వారిలో కౌంటింగ్ సిబ్బంది 7,412 మంది కాగా కౌంటింగ్ సూపర్వైజర్లు 2,376 మంది. ► ఎన్నికలు నిర్వహించిన 71 పురపాలక సంఘాలు/నగర పంచాయతీల్లో ఓట్ల లెక్కింపు కోసం 1,822 కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 7,136 మంది అధికారులు, సిబ్బందిని నియమించారు. వారిలో కౌంటింగ్ సిబ్బంది 5,195 మంది కాగా కౌంటింగ్ సూపర్వైజర్లు 1,941 మంది ఉన్నారు. -
పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిన జిల్లా యంత్రాంగం
-
'పుర పోరు'కు సర్వం సిద్ధం
-
నిబంధనల మేరకే నామినేషన్ల ఉపసంహరణ
సాక్షి, అమరావతి: తమకు తెలియకుండా తమ సంతకాలను ఫోర్జరీ చేసి నామినేషన్లను ఉప సంహరించారని, అందువల్ల తమ డివిజన్లలో ఎన్నికలను నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 18 డివిజన్లకు చెందిన టీడీపీ అభ్యర్థులు దాఖలు చేసిన వ్యాజ్యాల్లో హైకోర్టు ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వ లేదు. ఈ వ్యవహారంలో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయ మూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. అంతకు ముందు ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీకుమార్ స్పందిస్తూ.. పిటిషనర్లకు సంబంధించిన ప్రతిపాదితులే వారి నామినేష న్లను ఉపసంహరించారని తెలిపారు. అందు వల్ల ఈ వ్యాజ్యంలో పిటిషనర్లు కోరినట్లుగా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని కోరారు. ప్రభుత్వ న్యాయవాది చింతల సుమన్ జోక్యం చేసుకుని.. ఈ 18 డివిజన్లలో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారు లు ఫారం–10 జారీచేశారని తెలిపారు. తిరుపతి 7వ డివిజన్‌పై విచారణ వాయిదా తిరుపతి 7వ డివిజన్ ఎన్నికల నిలిపివేతను సవాలు చేస్తూ ఆ డివిజన్లో నామినేషన్ వేసిన సుజాత దాఖలు చేసిన వ్యాజ్యంపై తదుపరి విచారణను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు ఈనెల 15కి వాయిదా వేశారు. -
'పుర పోరు'కు సర్వం సిద్ధం
సాక్షి, అమరావతి: పురపాలక ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రాష్ట్రంలో 12 నగర పాలక సంస్థలు, 71 పురపాలక సంఘాలు/నగర పంచాయతీల్లో బుధవారం పోలింగ్ నిర్వహించేందుకు పురపాలక శాఖ, రాష్ట్ర ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేశాయి. అయితే, ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికలను నిలుపుదల చేస్తూ హైకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేయడంతో అక్కడ ఎన్నికల నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. అయితే, కోర్టు ఉత్తర్వులను రద్దు చేయాలని, బుధవారం ఎన్నికల నిర్వహణకు అనుమతించాలని కోరుతూ పురపాలక శాఖ మంగళవారం హైకోర్టును ఆశ్రయించనుంది. తదుపరి ఉత్తర్వులను అనుసరించి అక్కడ ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటారు. ఇదిలావుండగా.. మునిసిపల్ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం 5 గంటలతో ముగిసింది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బ్యాలెట్ విధానంలో పోలింగ్ నిర్వహిస్తారు. భారీగా ఏకగ్రీవాలు.. ఏలూరు సహా 12 నగరపాలక సంస్థల్లో 671 డివిజన్లు, 75 పురపాలక సంఘాలు/నగర పంచాయతీల్లో 2,123 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నామినేషన్లు స్వీకరించింది. కాగా, ఈ సారి గణనీయంగా వార్డులు ఏకగ్రీవమయ్యాయి. నగరపాలక సంస్థల్లో 89 డివిజన్లు, పురపాలక సంఘాలు/నగర పంచాయతీల్లో 490 వార్డుల్లో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పులివెందుల, పుంగనూరు, పిడుగురాళ్ల, మాచర్ల పురపాలక సంఘాల్లో అన్ని వార్డులూ ఏకగ్రీవం కావడం విశేషం. నగర పాలక సంస్థల పరిధిలో 582 డివిజన్లు, పురపాలక సంఘాల పరిధిలో 1,633 వార్డులకు పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అదృష్టం పరీక్షించుకోనున్న 7,552 మంది అభ్యర్థులు నామినేషన్ల ఉపసంహరణ అనంతరం మునిసిపల్ ఎన్నికల్లో మొత్తం 7,552 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో నగరపాలక సంస్థల పరిధిలో 2,571 మంది, పురపాలక సంఘాలు/నగర పంచాయతీల పరిధిలో 4,981 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో 78,71,272 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. వారిలో పురుషులు 38,72,264 మంది కాగా.. మహిళలు 39,97,840 మంది, ఇతరులు 1,168 మంది ఉన్నారు. మొత్తం ఓటర్లలో నగరపాలక సంస్థల పరిధిలో 48,31,133 మంది ఉండగా, పురపాలక సంఘాలు/నగర పంచాయతీల పరిధిలో 30,40,139 మంది ఉన్నారు. 7,915 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు రాష్ట్రవ్యాప్తంగా 7,915 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. వాటిలో నగరపాలక సంస్థల పరిధిలో 4,626 ఉండగా పురపాలక సంఘాలు/నగర పంచాయతీల్లో 3,289 ఉన్నాయి. మొత్తం పోలింగ్ కేంద్రాల్లో 4,788 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. 2,468 కేంద్రాలు సున్నితమైనవిగా గుర్తించగా.. 2,320 పోలింగ్ కేంద్రాలు అతి సున్నితమైనవిగా గుర్తించారు. 48,723 మంది పోలింగ్ సిబ్బంది ఒక్కో పోలింగ్ కేంద్రానికి 1+4 చొప్పున పోలింగ్ సిబ్బందిని కేటాయించారు. వారిలో ఒక ప్రిసైడింగ్ అధికారి, సహాయ ప్రిసైడింగ్ అధికారితోపాటు ఇతర పోలింగ్ సిబ్బంది ముగ్గురు ఉన్నారు. వారితోపాటు రూట్ అధికారులు, జోనల్ అధికారులు, మైక్రో అబ్జర్వర్లను నియమించారు. మొత్తం మీద 48,723 మంది ఉద్యోగులను పోలింగ్ నిర్వహణ కోసం కేటాయించారు. పోలింగ్‌కు అవసరమైన బ్యాలెట్ బాక్సులు, బ్యాలట్ పత్రాలు, ఇతర మెటీరియల్‌ను ఆయా పట్టణాల్లోని పంపిణీ కేంద్రాలకు తరలించారు. అక్కడి నుంచి మంగళవారం ఉదయం నుంచి పోలింగ్ అధికారులు, సిబ్బందికి వాటిని అందజేస్తారు. పోలింగ్ అధికారులు, సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు బస్సులు, ఇతర వాహనాలను ఏర్పాటు చేశారు. ‘ఏలూరు’ ఎన్నికపై నేడు స్పష్టత ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో 50 డివిజన్లు ఉండగా.. మూడు డివిజన్లు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 47 వార్డులకు ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం బుధవారం పోలింగ్ నిర్వహించేందుకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. కాగా, ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయంటూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం ఎన్నికలను నిలుపుదల చేస్తూ తీర్పు వెలువరించింది. కాగా, కోర్టు ఉత్తర్వులను రద్దు చేయాలని, బుధవారం పోలింగ్‌ను యథాతథంగా నిర్వహించేందుకు అనుమతించాలని కోరుతూ పురపాలక శాఖ మంగళవారం హైకోర్టును ఆశ్రయించనుంది. కోర్టు అనుమతిస్తే ముందుగా నిర్ణయించిన ప్రకారం ఏలూరు సహా 12 నగర పాలక సంస్థలు, 71 పురపాలక సంఘాలు/నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తారు. -
తిరుపతి 7వ డివిజన్ ఎన్నికల వాయిదాపై హైకోర్టులో పిటిషన్
సాక్షి, అమరావతి: తిరుపతి నగరంలో 7వ డివిజన్ ఎన్నికను నిలిపేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) ఈ నెల 4న జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆ డివిజన్లో నామినేషన్ దాఖలు చేసిన సీహెచ్.సుజాత హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల కమిషన్ ఉత్తర్వులను రాజ్యాంగ విరుద్ధంగా, చట్ట విరుద్ధంగా ప్రకటించి వాటిని రద్దుచేయాలని కోరుతూ ఆమె శుక్రవారం అత్యవసరంగా లంచ్‌మోషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు విచారణ జరిపారు. ఈ సందర్భంగా సుజాత తరఫు న్యాయవాది వీఆర్ఎన్ ప్రశాంత్ వాదనలు వినిపిస్తూ.. ఎన్నికను నిలిపేసే అధికారం ఎన్నికల కమిషన్‌కు లేదన్నారు. ఎం.విజయలక్ష్మి తన నామినేషన్‌ను ఉపసంహరించుకుని, ఇప్పుడు తన సంతకాన్ని ఎవరో ఫోర్జరీ చేసి తన నామినేషన్‌ను ఉపసంహరించారని చెబుతున్నారని తెలిపారు. నామినేషన్ ఉపసంహరణ విషయంలో రిటర్నింగ్ అధికారిపై ఆమె ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. దీనిపై విచారణ జరిపిన జిల్లా ఎన్నికల అధికారి రిటర్నింగ్ అధికారికి క్లీన్చిట్ ఇచ్చారని వివరించారు. ఎన్నికల్లో అక్రమాలు, తప్పుడు పద్ధతులపై అభ్యంతరాలుంటే వారు ఎన్నికల ట్రిబ్యునల్‌ను ఆశ్రయించడమే మార్గమని చట్టం చెబుతోందన్నారు. ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీకుమార్ వాదనలు వినిపిస్తూ.. అభ్యర్థి ఆమోదం లేకుండా ఆమె ఏజెంట్ ఆమె నామినేషన్‌ను ఉపసంహరించారని, ఇలాంటి సందర్భాల్లో జోక్యం చేసుకునే అధికారం ఎన్నికల కమిషన్‌కు ఉందని చెప్పారు. ఏ దశలోనైనా జోక్యం చేసుకునే అధికారం కమిషన్‌కు ఉందన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై ఇప్పటికే విచారణకు ఆదేశించామని, సోమవారం నాటికి ఆ విచారణ వివరాలు తెలుస్తాయని చెప్పారు. విచారణలో అంతా సవ్యంగా జరిగినట్లు తేలితే ఎన్నికను కొనసాగిస్తామన్నారు. అందువల్ల విచారణను సోమవారానికి వాయిదా వేయాలని అభ్యర్థించారు. ఇందుకు అంగీకరించిన న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు విచారణను సోమవారానికి వాయిదా వేశారు. -
జెడ్పీటీసీ, ఎంపీటీసీ వ్యాజ్యాల్లో విచారణ 8కి వాయిదా
సాక్షి, అమరావతి: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి దాఖలైన వ్యాజ్యాల్లో తదుపరి విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. అప్పటికల్లా కౌంటర్లు దాఖలు చేసి, ఆ కాపీలను పిటిషనర్లు, ఇతర ప్రతివాదులకు అందచేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. అప్పటికల్లా కౌంటర్లు దాఖలు చేయకపోతే, ఈ వ్యాజ్యాల్లో కౌంటర్లు లేనట్లుగానే భావించి విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతేడాది జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా బలవంతంగా నామినేషన్లను ఉపసంహరించారని నిర్ధారణ అయితే, ఆ అభ్యర్థుల నామినేషన్లను పునరుద్ధరించాలని కలెక్టర్లను ఆదేశిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గత నెల 18న ఉత్తర్వులిచ్చారు. బలవంతపు నామినేషన్ల ఉపసంహరణపై వచ్చే ఫిర్యాదులను స్వీకరించి, వాటిపై ఫిబ్రవరి 20వ తేదీకల్లా నివేదికివ్వాలని ఆదేశించారు. ఈ ఉత్తర్వులకనుగుణంగా అదేరోజు ప్రెస్‌నోట్ జారీ చేశారు. ఈ ఉత్తర్వులను, ప్రెస్‌నోట్‌ను రాజ్యాంగ విరుద్ధంగా, ఏకపక్ష చర్యగా ప్రకటించి.. రద్దు చేయాలని కోరుతూ పలువురు పిటిషన్లు వేశారు. అలాగే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు తాజాగా నోటిఫికేషన్ జారీచేసేలా ఆదేశాలివ్వాలంటూ జనసేన పార్టీ పిటిషన్ వేసింది. ఈ వ్యాజ్యాలన్నీ గత వారం విచారణకు రాగా, కౌంటర్ల దాఖలుకు ఎన్నికల కమిషన్ గడువు కోరింది. ఇందుకు అంగీకరించిన న్యాయమూర్తి.. మార్చి 3 వరకు గడువిచ్చారు. తాజాగా శుక్రవారం ఈ వ్యాజ్యాలు విచారణకు రాగా, పిటిషనర్ల తరఫు న్యాయవాదుల్లో ఒకరైన వివేక్ చంద్రశేఖర్, ప్రభుత్వ న్యాయవాది చింతల సుమన్‌లు స్పందిస్తూ.. ఇప్పటివరకు ఎన్నికల కమిషన్ కౌంటర్లు దాఖలు చేయలేదన్నారు. ఈ వ్యాజ్యాలను అడ్డంపెట్టుకుని జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణను జాప్యం చేయాలని ఎన్నికల కమిషన్ భావిస్తోందన్నారు. ఈ నెల 3వ తేదీకల్లా కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు స్పష్టంగా ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేశారు. ఈ వ్యాజ్యాలను అడ్డంపెట్టుకుని జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణను జాప్యం చేయాలని ఎన్నికల కమిషన్ భావిస్తోందని సుమన్ అన్నారు. అందుకే కౌంటర్ల దాఖలులో జాప్యం చేస్తోందన్నారు. ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాది అశ్వనీకుమార్ స్పందిస్తూ.. కౌంటర్ల దాఖలులో జరిగిన జాప్యానికి కోర్టును క్షమాపణ కోరారు. విచారణను సోమవారానికి వాయిదా వేస్తే, ఆలోగా కౌంటర్ల కాపీలను అందరికీ అందచేస్తామని అభ్యర్థించారు. ఇందుకు న్యాయమూర్తి అంగీకరిస్తూ విచారణను సోమవారానికి వాయిదా వేశారు. -
వైఎస్సార్ సీపీ బలాన్ని నిరూపించిన చంద్రబాబు
తాను అధికారంలో ఉన్న కాలంలో 2018లో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికల ఊసు కూడా ఎత్తకుండా, ఇప్పుడు అవే ఎన్నికల కోసం ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద ఒత్తిడి తెచ్చిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికలను ఎందుకు తెచ్చిపెట్టుకున్నానురా అని తీరికగా విచారిస్తూ ఉండివుంటారు! ఆయన భయం ఆయనది. తన కాలంలో నియమితులైన నిమ్మగడ్డ పదవీకాలం ఈ నెలా ఖరుతో ముగుస్తుంది. ‘మనవాడు’ ఉన్నప్పుడే ఎన్నికలకు వెళ్తే ఎన్నో కొన్ని పంచాయతీలైనా దక్కకపోతాయా అని ఆశ పడ్డారు. తీరా ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక మొత్తం స్థానాల్లో పాతిక శాతం వైసీపీకి ఏకగ్రీవాలు కావడంతో చంద్రబాబు గుండె గుభేలుమంది. ఆ దెబ్బకు ఠారెత్తిపోయి ఏమి మంత్రం ప్రయోగించారో గానీ అకస్మాత్తుగా నిమ్మగడ్డ రమేష్‌కుమార్ గారికి కరోనా భూతం కళ్ళముందు ప్రళ యతాండవం చేసింది. ప్రభుత్వంతో సంప్రదించకుండా ఏకపక్షంగా ఎన్నికలను నిరవధికంగా వాయిదా వేసి చేతులు దులుపుకున్నారు. అయితే మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ కొందరు ఉద్యమం చేస్తుండటంతో చంద్రబాబులో మళ్ళీ సరికొత్త ఆశలు చిగురించాయి. జగన్ మీద వ్యతిరేకత ప్రబలిందని రంగుల స్వప్నాల్లో విహరించారు. ఎన్నికల కమిషనర్ చంద్ర బాబు సంగీతానికి అనుగుణంగా డ్యాన్సులు చెయ్యడం మొదలైంది. కరోనా పేరు చెప్పి ఎన్నికలను ఎక్కడ ఆపారో, అక్కడినుంచే మళ్ళీ మొదలుపెడతామని కోర్టుకు హామీ ఇచ్చిన సంగతిని నిర్లక్ష్యం చేసి కొత్తగా పంచాయితీ ఎన్ని కలకు నోటిఫికేషన్ ఇచ్చారు. నిజాయితీపరులైన ఉన్నతా ధికారులను అవమానిస్తూ, వారి ఉద్యోగ జీవితాన్ని కూడా సర్వనాశనం చెయ్యడానికి తెగించారు. వారి సర్వీస్ రికా ర్డుల్లో అభిశంసనను నమోదు చెయ్యాలని ఆదేశించారు. వారికి ఉద్యోగ విరమణకు సంబంధించిన ప్రయోజనాలు కూడా రావని బెదిరించారు. తన చిత్తానుసారం కలెక్టర్లను, ఎస్పీలను బదిలీ చేశారు. నిమ్మగడ్డ ఇస్తున్న ఇలాంటి ఆదేశాల వెనుక ఆడించే శక్తి ఏమిటో అందరికీ తెలుసు. తెలుగుదేశం అనుకూల పచ్చ మీడియా అయితే నిమ్మగడ్డ ఈ శతాబ్దపు టీఎన్ శేషన్ అనీ, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించిన విక్రమార్కుడనీ, ఆకాశానికి ఎత్తేసింది. పచ్చ విశ్లేషకులను కూర్చోబెట్టుకుని చంద్రబాబు గ్రాఫ్ విపరీతంగా పెరిగిపోవడంతో జగన్ భయపడిపోతు న్నాడనీ, నిమ్మగడ్డ కీర్తి ఆచంద్రతారార్కం వెలిగిపోతుందనీ భజించడంలో మునిగితేలాయి. కరోనా టీకా కార్యక్రమానికి విఘాతం కలుగుతుందని ప్రభుత్వం ఎంత మొత్తుకున్నా ప్రయోజనం లేకపోయింది. ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు తల ఊపక తప్పలేదు. నిమ్మగడ్డ ఆదేశాలన్నీ రాజ్యాంగ విరుద్ధమని అందరికీ తెలుసు. అయినప్పటికీ ప్రభుత్వం సంయమనంతో వ్యవహ రించింది. ‘కేంద్ర ఎన్నికల సంఘానికున్న అధికారాలన్నీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఉంటాయని’ సుప్రీంకోర్టు చేసిన ఒక వ్యాఖ్యను పట్టుకుని ఎన్నికల కోడ్ ముగిసేంతవరకూ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం తన చెప్పు కింద తేలులా పడివుండాలని నిమ్మగడ్డ ఆశించారు. ప్రభుత్వం ఏనాడో ప్రకటించిన ఇళ్ల స్థలాల పంపిణీని అడ్డుకున్నారు. ఇంటిం టికీ రేషన్ సరుకులను అందించే వాహనాల రంగులను మార్చాలన్నారు. చివరకు సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డిని హౌస్ అరెస్ట్ చెయ్యాలనీ, ఆయన మీడియా ముందు మాట్లాడకూడదనీ ఆంక్షలు విధించారు. ఇవే ఆంక్షలను ఆ మరునాడు మరొక మంత్రి కొడాలి నానిమీద కూడా విధించారు. ఇల్లిల్లూ తిరిగి ప్రజలకు పింఛన్ అందించే వలంటీర్ల నుంచి ఫోన్లు స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. విశేషం ఏమిటంటే, ఎన్నికల ప్రక్రియ మొదలయ్యే వరకు నిమ్మగడ్డకు అనుకూలంగా తీర్పులు ఇచ్చిన హైకోర్టు, ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక నిమ్మగడ్డ ఇస్తున్న ఆదేశాలను ఏమాత్రం ఆమోదించలేకపోయింది. నిమ్మగడ్డ నిరంకుశ ఆదేశాలు ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగడానికి ఆటంకంగా ఉన్నాయని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయ పడటంతో కథ అడ్డం తిరిగింది. నిమ్మగడ్డ ఇచ్చిన ప్రతి ఆదేశాన్ని కోర్టులు కొట్టేశాయి. మంత్రుల నిర్బంధం నుంచి వలంటీర్ల ఫోన్ల వరకు నిమ్మగడ్డ ఇచ్చిన ఆదేశాలన్నీ చెల్లని కాసులుగా తేలిపోయాయి. ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించడమే ఎన్నికల సంఘం విధి తప్ప వారికి అంతులేని అధికారాలేవీ రాజ్యాంగం ప్రకారం లేవని స్పష్టం చేసినట్లయింది. పంచాయతీ ఎన్నికల ఫలితాలతోనే తెలుగుదేశం సత్తా ఏమిటో వెల్లడయింది. పంచాయతీ ఎన్నికలకు కూడా మేనిఫెస్టోను విడుదల చేసి ఎన్నికల చరిత్రను తిరగరాసింది తెలుగుదేశం. ఆ మేనిఫెస్టో రాష్ట్రం మొత్తం చేరిపోయాక తీరి కగా దాన్ని రద్దు చేస్తున్నట్లు నిమ్మగడ్డ ఆదేశాలు జారీ చేశారు. వైసీపీ మీద తెలుగుదేశం తరపున కాకి వెళ్లి కబురు చేసినా ఆగమేఘాలమీద చర్యలు తీసుకున్న నిమ్మగడ్డ... తెలుగుదేశం మీద వైసీపీ నాయకులు వెళ్లి ఫిర్యాదులు చేసినా నిమ్మకు నీరెత్తిన చందంగా వ్యవహరించారు. అయినప్పటికీ ఎనభై శాతం పంచాయతీలు వైసీపీ పరం కావడంతో తెలుగుదేశం కూసాలు కదిలిపోయి నట్లయింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు పంచా యతీ ఎన్నికల్లో శృంగ భంగం కాగానే మునిసిపల్ ఎన్నికల్లో అయినా తమ ప్రతాపాన్ని చాటాలని ఎన్ని యుక్తులు పన్నినప్పటికీ వాటిల్లోనూ అధికభాగం ఇప్పటికే వైసీపీ ఖాతాలోకి చేరిపోయాయి. కొన్ని చోట్ల అయితే తెలుగుదేశం పార్టీకి ఒక్క వార్డు కూడా దక్కలేదు. మరీ ఘోరం ఏమి టంటే మొన్నటిదాకా తిరుగు లేని అధికారాన్ని చలాయించిన టీడీపీ తరపున నామినేషన్లు వెయ్యడానికి అభ్యర్థులు కూడా దొరకలేదు! ఇప్పుడు వచ్చిన మునిసిపల్ ఫలితాలను చూశాక చంద్రబాబునాయుడుకు భవిష్యత్ దర్శనం బహు బాగా అయ్యుంటుంది. రాష్ట్రంలోని డెబ్బై అయిదు మునిసి పాలిటీల్లో తెలుగుదేశం పార్టీకి ఒక్కటి కూడా దక్కే అవకాశం కనిపించడం లేదు. అలాగే కార్పొరేషన్లు కూడా! ఈ ఫలితాల వలన తెలుగుదేశం గత రెండేళ్లలో రవ్వంత కూడా పుంజు కోలేదనీ, పైగా ఇంకా అణిగిపోయిందనీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రాభవం గత అసెంబ్లీ ఎన్నికలకన్నా మరింతగా పెరిగిందనీ విస్పష్టంగా ప్రజలకు తెలిసిపోయింది. అనవస రంగా వైసీపీ బలం తగ్గలేదని ఎందుకు నిరూపించానా అని చంద్రబాబు ఇప్పుడు అంతర్మథనానికి గురి అవుతుం టారు! ఏం చేస్తాం మరి? చేసుకున్న వారికి చేసుకున్నంత అని పెద్దలు చెప్పారు కదా! ఇలపావులూరి మురళీమోహనరావు వ్యాసకర్త సీనియర్ రాజకీయ విశ్లేషకులు -
మున్సిపల్ ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీదే హవా..
సాక్షి, తాడేపల్లి: తామందరమూ ఊహించిన విధంగానే మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ హవా కొనసాగిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. బుధవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందనడానికి ఈ ఎన్నికల్లో జరిగిన ఏకగ్రీవాలే నిదర్శనమన్నారు. ఏకగ్రీవాలు అధికంగా జరగడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగినా ఇవే ఫలితాలు ఉండేవని పేర్కొన్నారు. సుపరిపాలన అందిస్తే ప్రజల ఆశీస్సులు ఉంటాయనేది ఈ ఫలితాల ద్వారా స్పష్టమవుతోందన్నారు. ఫలితాలు వైఎస్సార్సీపీ అనుకూలంగా ఉంటాయని తెలిసే చంద్రబాబు కోవిడ్ చూపి ఎన్నికలను వాయిదా వేయించాడన్నారు. ఎస్ఈసీ విషయంలో చంద్రబాబు రోజుకో తీరులో మాట్లాడుతున్నాడని విమర్శించారు. ఒక రోజు మెరునగధీరుడు అన్నారు.. ఇప్పుడేమో ఎస్ఈసీ మారిపోయాడంటున్నాడన్నారు. వలంటీర్ల సర్వీసులపై ఆంక్షలు పెట్టాలని ఎస్ఈసీ కుట్రలు పన్నినప్పటికీ, కోర్ట్ ఆ కేసును కొట్టేసిందని గర్తుచేశారు. ఎస్ఈసీ అధికార దుర్వినియోగం చేసి మళ్లీ నామినేషన్ వేయండని టీడీపీ వారిని కోరినా ఎవరూ ముందుకు రాలేదన్నారు. ఆ పార్టీపై నమ్మకం పోయింది కాబట్టే నామినేషన్ వేసే నాధుడే కరువయ్యాడన్నారు. పంచాయతీ ఎన్నికల్లో మేనిఫెస్టో విడుదల చేయడం అంత చెండాలం లేదనుకుంటే, ఇప్పుడు మళ్లీ మేనిఫెస్టో విడుదల చేయడం హాస్యాస్పదమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న అంశాలను మేనిఫెస్టోలో పెట్టడం విడ్డూరంగా ఉందని, దీనిపై తాము ఈసీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. 2014 మున్సిపల్ మేనిఫెస్టోలో 2 రూపాయలకే 20 లీటర్ల తాగునీరు, ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, ఆతరువాత ఆ ఊసే లేదన్నారు. ప్రజలు ప్రశ్నిస్తారనే భయంతో మేనిఫెస్టోని వెబ్ సైట్ నుంచి తీసేసిన ఘనుడు చంద్రబాబు అని ధ్వజమెత్తారు. అధికారమే లేకుంటే మున్సిపల్ పన్నులు ఎలా తగ్గిస్తాడని చంద్రబాబును నిలదీశారు. చంద్రబాబుని పంచాయతీకి, మున్సిపాల్టీకి ముఖ్యమంత్రిని చేయాలని ఎద్దేవా చేశారు. ఆస్తి పన్ను సవరణకు సంబంధించి పారదర్శకంగా చట్టం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఆస్తిపన్నుపై చంద్రబాబు ఎన్ని అబద్దాలు చెప్పినా ప్రజలు నమ్మరన్నారు. పంచాయతీల కంటే పట్టణ ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ అధిక స్థానాల్లో గెలుస్తందన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. -
అన్నీ ఆయనే చేసేస్తే.. ఎన్నికల ట్రిబ్యునల్ ఎందుకు!
సాక్షి, అమరావతి: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగిసిన తరువాత పలువురు అభ్యర్థులకు నామినేషన్ల దాఖలుకు అనుమతిస్తూ ఎన్నికల కమిషనర్ ఉత్తర్వులు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ వైఎస్సార్, చిత్తూరు జిల్లాలకు చెందిన పలువురు అభ్యర్థులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఎన్నికల కమిషన్ ఉత్తర్వులను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి రద్దు చేయాలని హైకోర్టును కోరారు. కమిషన్ ఉత్తర్వుల అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్ధించారు. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు మంగళవారం విచారణ జరిపారు. గడువు ముగిశాక మళ్లీ అవకాశం ఇవ్వడం చట్టవిరుద్ధం పిటిషనర్ల తరఫున వీఆర్ రెడ్డి, ప్రశాంత్ వాదనలు వినిపిస్తూ.. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తరువాత తిరిగి నామినేషన్లు దాఖలు చేసేందుకు అనుమతి ఇవ్వడం ఏపీ మున్సి’పాలిటీల చట్టానికి విరుద్ధమన్నారు. గత ఏడాది మొదలైన మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆయా వార్డులు, డివిజన్లకు పిటిషనర్లు మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారని తెలిపారు. కరోనా వల్ల ఎన్నికలు వాయిదా పడటంతో పిటిషనర్లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించడం అప్పట్లో సాధ్యం కాలేదన్నారు. ఒకే నామినేషన్ వచ్చిన చోట అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నికయినట్టు ప్రకటిస్తామని అప్పట్లో ఎన్నికల కమిషనర్ తెలిపారని వివరించారు. అయితే, బలవంతంగా నామినేషన్లు ఉపసంహరణ జరిగిన వ్యక్తుల, బెదిరింపుల వల్ల నామినేషన్లు వేయని వ్యక్తుల నామినేషన్లను పునరుద్ధరించాలంటూ జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశిస్తూ ఎన్నికల కమిషనర్ ఇటీవల ఉత్తర్వులిచ్చారని తెలిపారు. ఈ ఉత్తర్వులకు అనుగుణంగా పలుచోట్ల నామినేషన్ల దాఖలుకు అవకాశం ఇచ్చారని తెలిపారు. సహేతుక కారణాలు, తగిన ఆధారాలు లేకపోయినప్పటికీ నామినేషన్ల దాఖలుకు అవకాశం ఇచ్చారని తెలిపారు. వాస్తవానికి ఓసారి నామినేషన్ల దాఖలు గడువు ముగిసిన తరువాత తిరిగి నామినేషన్ దాఖలుకు అవకాశం ఇవ్వడం చట్ట విరుద్ధమని, ఇందుకు ఏ చట్టం కూడా అంగీకరించదని వారు వివరించారు. ఇలా చేసే అధికారం ఎన్నికల కమిషనర్‌కు లేదన్నారు. ఒకవేళ పిటిషనర్ల నామినేషన్లపై ఎవరికైనా అభ్యంతరం ఉంటే చట్టబద్ధంగా ఏర్పాటైన ఎన్నికల ట్రిబ్యునల్ ముందు సవాల్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇది తప్ప మరో ప్రత్యామ్నాయం లేదన్నారు. ఎన్నికల కమిషనర్ పరిధి దాటి వ్యవహరిస్తున్నారు.. ప్రభుత్వ న్యాయవాది చింతల సుమన్ వాదనలు వినిపిస్తూ.. విశేషాధికారాల పేరుతో ఎన్నికల కమిషనర్ ఇష్టానుసారం వ్యవహరించడానికి వీల్లేదన్నారు. ఎన్నికల కమిషనర్ అధికారాలకూ పరిమితులు ఉన్నాయని, ఈ విషయాన్ని హైకోర్టు, సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పాయన్నారు. రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించే ఎన్నికల అధికారులు ఓ సారి నామినేషన్లు ఆమోదించిన తరువాత అందులో ఎన్నికల కమిషనర్ జోక్యం చేసుకోవడానికి వీల్లేదని, ఎన్నికల అధికారే సుప్రీం అని హైకోర్టు గతంలోనే తీర్పునిచ్చిందన్నారు. ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు చోటుచేసుకున్నాయని తేలినా వాటిపై ఎన్నికల ట్రిబ్యునల్‌కు వెళ్లాలని చట్టం చెబుతోందన్నారు. ఎన్నికల ట్రిబ్యునల్ చేయాల్సిన పనులను ఎన్నికల కమిషనర్ చేయడానికి వీల్లేదన్నారు. అన్నీ ఎన్నికల కమిషనరే చేసేస్తే, ఇక ఎన్నికల ట్రిబ్యునల్ ఎందుకని ప్రశ్నించారు. అక్రమాలు జరిగాయని ఎన్నికల కమిషనరే నిర్ధారిస్తే, ఎన్నికల ట్రిబ్యునల్ చేయడానికి ఏమీ ఉండదన్నారు. ఫిర్యాదులు వచ్చినందునే... ఎన్నికల కమిషన్ తరఫున న్యాయవాది అశ్వనీకుమార్ వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరిగినప్పుడు వాటిపై స్పందించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై ఉందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బలవంతపు నామినేషన్లు ఉపసంహరణ, నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం వంటి ఘటనలపై కమిషన్‌కు అనేక ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా నివేదికలు తెప్పించుకుని పరిశీలించాకే.. మళ్లీ నామినేషన్ల దాఖలుకు ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చినట్టు తెలిపారు. ఎన్నికల కమిషన్‌కు విశేషాధికారాలు ఉన్నాయని ఆయన తెలిపారు. 14 చోట్ల నామినేషన్ల దాఖలుకు అనుమతినిచ్చామని, అయితే కేవలం 4 చోట్ల మాత్రమే నామినేషన్లు దాఖలయ్యాయని తెలిపారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు ఈ వ్యాజ్యాలపై బుధవారం ఉత్తర్వులు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. -
వార్డు వాలంటీర్లపై ఎస్ఈసీ కఠిన ఆంక్షలు
-
వార్డు వాలంటీర్లపై ఎస్ఈసీ కఠిన ఆంక్షలు
సాక్షి,కృష్ణా: రానున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వార్డు వాలంటీర్లను ఎన్నికల విధుల నుంచి దూరంగా ఉంచాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారి చేసింది. ఈ మేరకు ఎస్ఈసీ కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లకు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గాని ఎన్నికల విధుల్లో వాలంటీర్లు ఉండకూడదు. ఫోటో ఓటరు స్లిప్పుల పంపిణీలో వాలంటీర్లు పాల్గొనకూడదని ఉత్తర్వుల్లో తెలిపింది. ఎన్నికల సమయంలో వాలంటీర్ల పై నిఘా ఉంచడంతో పాటు... వారి ఫోన్లను స్వాధీనం చేసుకోవాలి. ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉంటుందనే ఈ ఆదేశాలు ఇస్తున్నట్లు ఎస్ఈసీ తెలిపింది. నిబంధనలకు విరుద్ధంగా వాలంటీర్లను వినియోగిస్తే ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద భావించి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని పేర్కొంది. చదవండి: మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలి -
84 వార్డుల్లో సింగిల్ నామినేషన్లే..
సాక్షి, అమరావతి: మున్సిపల్ ఎన్నికల్లో 84 మున్సిపల్ వార్డులు, నగర పాలక డివిజన్లలో సింగిల్ నామినేషన్లు మాత్రమే దాఖలు కావడంతో ఆ స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి. తిరుపతి నగర పాలక సంస్థలోని 6 డివిజన్లతోపాటు వివిధ మున్సిపాలిటీలలోని 78 వార్డుల్లో ఒక్కొక్క అభ్యర్థి మాత్రమే పోటీలో ఉన్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో 12 నగర పాలక సంస్థలకు, 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు మార్చి 10న పోలింగ్ నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయడం తెలిసిందే. ఆయా నగర పాలక సంస్థలు, మున్సిపాలిటీల్లో గతేడాది మార్చిలోనే ఎన్నికల ప్రక్రియ మొదలై నామినేషన్ల దాఖలు, నామినేషన్ల పరిశీలన ముగిశాక ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఎన్నికల ప్రక్రియ ఆగినచోట నుంచే ప్రారంభిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ తాజా నోటిఫికేషన్ జారీ చేయడం తెలిసిందే. ఈ విషయంలో జోక్యానికి హైకోర్టు నిరాకరించడంతో మున్సిపల్ ఎన్నికలు సాఫీగా కొనసాగేందుకు వీలేర్పడింది. ఆయా మున్సిపాలిటీల్లో నామినేషన్ల పరిశీలన పూర్తవడం తెలిసిందే. పులివెందుల, రాయచోటి, పుంగనూరు మున్సిపాలిటీల్లో అత్యధిక వార్డుల్లో ఒక్క నామినేషన్ చొప్పునే దాఖలవడం విశేషం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందుల మున్సిపాలిటీలో మొత్తం 33 వార్డులుండగా.. అందులో 21 వార్డులకు సింగిల్ నామినేషన్లు దాఖలయ్యాయి. వైఎస్సార్ జిల్లాలోని రాయచోటి మున్సిపాలిటీలో మొత్తం 34 వార్డులుండగా.. 21 చోట్ల ఒక్కో అభ్యర్థి మాత్రమే నామినేషన్లు వేశారు. చిత్తూరు జిల్లా పుంగనూరు మున్సిపాలిటీలో మొత్తం 31 వార్డులకు పదహారుచోట్ల ఒక్కరే పోటీలో ఉన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపాలిటీలో 26 వార్డులకు పది, గుంటూరు జిల్లా మాచర్ల మున్సిపాలిటీలో 31 వార్డులకు పదిచోట్ల ఒక్క నామినేషన్ చొప్పునే దాఖలయ్యాయి. పులివెందుల, రాయచోటి, పుంగనూరు మున్సిపాలిటీల్లో సగానికిపైగా వార్డుల్లో సింగిల్ నామినేషన్లే ఉండడం.. అవన్నీ అధికారపార్టీకి చెందినవారివే కావడంతో ఈ మూడుచోట్ల మున్సిపల్ చైర్మన్ పదవులు వైఎస్సార్సీపీ పరమైనట్టేనని భావించవచ్చు. పంచాయతీల ఫలితాలు చూశాక... ఎన్నికలు జరుగుతున్న 12 నగర పాలక సంస్థలు, 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో మంగళవారం(మార్చి 2వ తేదీ) నుంచి నామినేషన్ల ఉప సంహరణ ప్రక్రియ మొదలవనుంది. ఉపసంహరణకు బుధవారం మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఉంది. ఇటీవలి గ్రామపంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభిమానులే 80 శాతానికిపైగా సర్పంచ్ పదవులను గెలుచుకోవడం తెలిసిందే. రాష్ట్ర ప్రజలు ఏకపక్షంగా వైఎస్సార్సీపీ అభిమానులకే ఓట్లేయడం చూశాక పట్టణ ప్రాంతాల్లో బరిలో ఉన్న ఇతర పార్టీల అభ్యర్థులు పలువురు మున్సిపల్ ఎన్నికల్లోనూ ఇదే ఒరవడి ఉంటుందన్న భావనతో పోటీ నుంచి విరమించుకునేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. వాటిలో ఒక్క వార్డుకూ నామినేషన్లు వేయని టీడీపీ మున్సిపల్ ఎన్నికల్లో మూడు మున్సిపాలిటీల్లో టీడీపీ అభ్యర్థులు ఒక్క వార్డుకూ నామినేషన్లు వేయకపోవడం గమనార్హం. ఇందులో సీఎం వైఎస్ జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందుల మున్సిపాలిటీ ఉంది. ఇక్కడ 33 వార్డులుండగా.. 21 వార్డుల్లో సింగిల్ నామినేషన్లు దాఖలయ్యాయి. మిగతా వార్డులలో ఇద్దరు కంటే ఎక్కువమంది నామినేషన్లు దాఖలైనప్పటికీ, అందులో ఎక్కువచోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థులే ఇద్దరేసి చొప్పున పోటీలో ఉన్నారు. కనీసం ఒక్క వార్డులోనూ టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయలేదు. జమ్మలమడుగు మున్సిపాలిటీలోనూ ఇదే పరిస్థితి. ఆ మున్సిపాలిటీలో బీజేపీ, జనసేన, ఇండిపెండెంట్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. గుంటూరు జిల్లా మాచర్ల మున్సిపాలిటీలోనూ కనీసం ఒక్క వార్డులోనూ టీడీపీ అభ్యర్థులు నామినేషన్ వేయకపోవడం గమనార్హం. ఆ మున్సిపాలిటీలో సింగిల్ నామినేషన్ దాఖలైన పదివార్డులు గాక మిగతా 21 వార్డులకు రెండేసి నామినేషన్లు చొప్పున దాఖలైనప్పటికీ, వారంతా వైఎస్సార్సీపీకి చెందినవారే. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఆ పార్టీ అభ్యర్థులు ప్రతి వార్డులో ఒక్కరే బరిలో నిలిస్తే.. ఆ మున్సిపాలిటీలోని వార్డులన్నీ ఏకగ్రీవం కావడానికి వీలుంది. -
1న పార్టీల నేతలతో ఎస్ఈసీ భేటీ
సాక్షి, అమరావతి: మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ కొనసాగింపునకు షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సోమవారం రాజకీయ పార్టీలతో సమావేశం కావాలని నిర్ణయించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు, రాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్ద ప్రత్యేక ఎన్నికల చిహ్నం పొందేందుకు అర్హత ఉన్న ఇతర రిజిస్టర్డ్ పార్టీల ప్రతినిధులతో సోమవారం సమావేశం నిర్వహిస్తున్నట్టు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సన్నద్ధత కోసం శని, ఆది, సోమవారాల్లో తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలలో ప్రాంతీయ సదస్సులను నిర్వహించనున్నట్టు తెలిపారు. -
‘ఈ–వాచ్’పై ఎస్ఈసీ పూర్తిగా స్పందించాల్సి ఉంది
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) సొంతంగా రూపొందించుకున్న ఈ–వాచ్ యాప్ విషయంలో ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ (ఏపీటీఎస్ఎల్) లేవనెత్తిన 24 సందేహాలు, అభ్యంతరాల్లో కేవలం ఆరింటికే ఎస్ఈసీ స్పందించిందని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. మిగిలిన వాటికి స్పందన రావాల్సి ఉందని తెలిపింది. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. తదుపరి విచారణను మార్చి 5కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలితతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ–వాచ్ యాప్‌ను ఉపయోగించకుండా నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీచేయడంతో పాటు కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వ యాప్‌లైన ‘సీ–విజిల్’, ‘నిఘా’ యాప్‌లను ఉపయోగించేలా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ ప్రకాశం జిల్లా ఇంకొల్లు గ్రామానికి చెందిన న్యాయవాది కట్టా సుధాకర్, గుంటూరు జిల్లా తెనాలికి చెందిన అంగ్రేకుల నాగేశ్వరరావు, తెనాలి మండలం బుర్రిపాళేనికి చెందిన అడుసుమల్లి అజయ్‌కుమార్ హైకోర్టులో వేర్వేరుగా పిల్స్ దాఖలు చేయడం, విచారణ జరిపిన ధర్మాసనం ఈ–వాచ్ యాప్‌ను వినియోగంలోకి తేవద్దని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించటం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ జరిపింది. -
ఎన్నికల నోటిఫికేషన్లో జోక్యం చేసుకోలేం..
సాక్షి, అమరావతి: పురపాలక ఎన్నికల ప్రక్రియను గత ఏడాది నిలిచిపోయిన చోటునుంచే కొనసాగించేందుకు వీలుగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) ఈ నెల 15న జారీచేసిన నోటిఫికేషన్ విషయంలో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. ఈ దశలో ఎస్ఈసీ నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ఏ రకమైన మధ్యంతర ఉత్తర్వులు జారీచేసినా.. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకున్నట్లు అవుతుందని పేర్కొంది. మధ్యంతర ఉత్తర్వులు ఇస్తే, ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలగడమే కాకుండా, ఎన్నికల కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు కూడా అవుతుందని తెలిపింది. న్యాయస్థానాలు ఆదేశాలు ఇచ్చినప్పుడు, సహేతుక కారణాలు ఉన్నప్పుడు మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియను సవరించే, మార్చే అధికారం ఎన్నికల కమిషన్‌కు ఉందని స్పష్టం చేసింది. కోవిడ్ మహమ్మారి, తద్వారా తలెత్తిన కార్యనిర్వాహక ఇబ్బందుల వల్ల పురపాలక ఎన్నికలు వాయిదా పడ్డాయని, ఈ కారణాలు సహేతుకమైనవేనని, ఇందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని తెలిపింది. ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించిందని గుర్తుచేసింది. ఏ కారణంగానైనా ఎన్నికలు వాయిదా వేయరాదని కిషన్‌సింగ్ తోమర్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు గుర్తుచేసింది. రాజ్యాంగం ఇచ్చిన బాధ్యతను నిర్వర్తించేందుకే ఎన్నికల కమిషన్ గతంలో వాయిదా వేసిన ఎన్నికల ప్రక్రియను తిరిగి మొదలు పెట్టిందని తెలిపింది. ఈ కారణాల చేత మధ్యంతర ఉత్తర్వుల కోసం పిటిషనర్లు దాఖలు చేసిన అనుబంధ వ్యాజ్యాలను కొట్టేస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. తాజా నోటిఫికేషన్ కోరుతూ వ్యాజ్యాలు పురపాలక ఎన్నికలు వాయిదా పడిన చోటునుంచే మొదలవుతాయంటూ ఈ నెల 15న ఎన్నికల కమిషనర్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ నోటిఫికేషన్‌ను రాజ్యాంగ విరుద్ధంగా, పంచాయతీరాజ్ చట్ట నిబంధనలకు విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన నక్కా యశోదా, కంచు మధుసూదన్, అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన చిప్పిడి విష్ణువర్ధన్‌రెడ్డి, మరో ఆరుగురుతో పాటు మరికొందరు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. మున్సిపల్ ఎన్నికలకు తాజా నోటిఫికేషన్ జారీచేసేలా మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలని కోరుతూ అనుబంధ వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ అనుబంధ వ్యాజ్యాలపై పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు వేదుల వెంకటరమణ, పి.వీరారెడ్డి, ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్, మున్సిపల్ కార్పొరేషన్ల తరఫున ఎన్.రంగారెడ్డి, ఎన్నికల కమిషన్ తరఫున ఎన్.అశ్వనీకుమార్ వాదనలు వినిపించారు. వీరి వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు గత వారం ఉత్తర్వులను రిజర్వ్‌లో ఉంచారు. ఈ నెల 15న జారీచేసిన నోటిఫికేషన్ విషయంలో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేస్తూ ఆయన శుక్రవారం తన నిర్ణయాన్ని వెలువరించారు. -
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు లైన్ క్లియర్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు లైన్ క్లియర్ అయింది. రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ దాఖలైన 16 మధ్యంతర పిటిషన్లను హైకోర్టు శుక్రవారం తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ఎస్ఈసీ నోటిఫికేషన్ ప్రకారమే ఎన్నికలు జరగనున్నాయి. కాగా, 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపల్, నగర పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గతంలో షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం మార్చి 10న మున్సిపల్ ఎన్నికలు..14న ఓట్ల లెక్కింపు జరగనుంది. మార్చి 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోపు నామినేషన్ల ఉపసంహరణ గడువు.. అనంతరం అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్నారు. మార్చి 8వ తేదీ సాయంత్రంతో అభ్యర్థుల ప్రచారం ముగియనుంది. అవసరమైతే మార్చి 13న రీ పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. మార్చి 14న ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. చదవండి : తాడిపత్రిలో బయటపడ్డ ‘జేసీ’ ప్రలోభాలు మలి విడత పురపోరుకు సై! -
తాజా నోటిఫికేషన్ అక్కర్లేదు
సాక్షి, అమరావతి: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు తాజాగా నోటిఫికేషన్ జారీ చేయాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) హైకోర్టుకు నివేదించింది. గత ఏడాది జారీ చేసిన నోటిఫికేషన్‌కు కొనసాగింపుగా ఈ నెల 18న ప్రొసీడింగ్స్ ఇచ్చినట్టు ఎస్ఈసీ తరఫు న్యాయవాది అశ్వనీ కుమార్ తెలిపారు. గతేడాది ఇచ్చిన నోటిఫికేషన్ ఇంకా మనుగడలో ఉండగా, కొత్త నోటిఫికేషన్ ఇవ్వడం సాధ్యం కాదని వివరించారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక దాన్ని ప్రశ్నించడానికి వీల్లేదన్నారు. అసలు ఈ వ్యాజ్యానికి విచారణార్హత లేదన్నారు. ఇప్పటికే ఇదే అంశంపై వ్యాజ్యాలు దాఖలై ఉన్నాయని, ఈ వ్యాజ్యాన్ని కూడా వాటితో పాటు కలిపి విచారించాలని కోర్టును కోరారు. ఇందుకు అంగీకరించిన కోర్టు ఈ వ్యాజ్యాన్ని కూడా ఇదే అంశంపై దాఖలైన వ్యాజ్యంతో జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు బుధవారం ఉత్తర్వులిచ్చారు. గత ఏడాది జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అనేక అక్రమాలు జరిగాయని, ఈ నేపథ్యంలో తాజాగా నోటిఫికేషన్ జారీచేసేలా ఆదేశించాలని కోరుతూ జనసేన పార్టీ కార్యదర్శి శ్రీనివాసరావు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పంచాయతీ ఎన్నికలు ముగిశాయి రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ముగిశాయని ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాది అశ్వనీ కుమార్ హైకోర్టుకు తెలిపారు. ఈ దృష్ట్యా గ్రామాల్లో ఇంటింటికీ రేషన్ పథకాన్ని అడ్డుకోవద్దంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలు చేసిన అప్పీల్‌పై తదుపరి విచారణ అవసరమో లేదో ఎన్నికల కమిషనర్‌తో మాట్లాడి చెబుతామన్నారు. ఇందుకు అంగీకరిం చిన హైకోర్టు తదుపరి విచారణను మార్చి 1వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు సీజే జస్టిస్ ఎ.కె. గోస్వామి, జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్‌తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. -
ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు..
సాక్షి,అమరావతి: పంచాయతీ ఎన్నికల ఫలితాలు తమ పనితీరుకు దర్పణం పట్టాయని హోంమంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. మంగళవారం సుచరిత మీడియాతో మాట్లాడుతూ.. 'ప్రజలంతా మా నాయకుడు జగన్ వెంట ఉన్నారని మరోమారు స్పష్టం అయ్యింది. రానున్న మున్సిపల్ ఎన్నికల్లోనూ మరింత విజయం సాదించే దిశగా కృషి చేస్తున్నాం. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు చంద్రబాబు గెలవలేక మాపై విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు ఒక్క పేదవానికి ఇల్లు ఇచ్చిన పరిస్థితి లేదు. మా సీఎం వైఎస్ జగన్ 30 లక్షల మందికి సొంతింటి కల సాకారం చేస్తున్నారు. పట్టణాల్లో ప్రతి ఒక్క పేదవాడికి గూడు దొరికింది. ఒక్కొక్క ఇంటికి కనీసం 4 నుంచి 6 సంక్షేమ పథకాలు అందాయి. ప్రజలంతా ఆనందంగా ఉన్నారు...మున్సిపల్ ఎన్నికల్లో మాకే పట్టం కడతారు. పోలీసులను ఉపయోగించి గెలిచామన్న చంద్రబాబు వ్యాఖ్యలు అర్ధరహితం. ఆయనలా వ్యవస్థలను వాడుకోవడం మాకు చేతకాదు. ప్రజాస్వామ్యం, వ్యవస్థలపై గౌరవం ఉంది. స్వయంగా ఎస్ఈసీనే ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరిగాయని కితాబు ఇచ్చారు. ' అంటూ సుచరిత తెలిపారు. -
మున్సిపల్ ఎన్నికలు..ఎస్ఈసీ కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి : త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్లపై రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. నామినేషన్ వేసి మృతి చెందిన అభ్యర్థుల స్థానంలో ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన చేసింది. ఈ నెల 28వ తేదీ మధ్యాహ్నం 3 గంటలలోపు నామినేషన్ దాఖలుకు గడువుగా పేర్కొంది. వివిధ పార్టీల అభ్యర్థులు 56 మంది మృతి చెందినట్లు ఎస్ఈసీ ప్రకటించింది. ( బలవంతపు ఉపసంహరణలపై ఫిర్యాదుల్ని స్వీకరించండి ) కాగా, 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపల్, నగర పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గత సోమవారం షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం మార్చి 10న మున్సిపల్ ఎన్నికలు..14న ఓట్ల లెక్కింపు జరగనుంది. మార్చి 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోపు నామినేషన్ల ఉపసంహరణ గడువు.. అనంతరం అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్నారు. మార్చి 8వ తేదీ సాయంత్రంతో అభ్యర్థుల ప్రచారం ముగియనుంది. అవసరమైతే మార్చి 13న రీ పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. మార్చి 14న ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. -
ఎస్ఈసీకి ఎదురుదెబ్బ.. ఆ అధికారం మీకెక్కడుంది!?
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు న్యాయస్థానంలో మరోసారి చుక్కెదురైంది! ఏకగ్రీవాలను నీరుగార్చి తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించి భంగపడింది. గతేడాది అర్ధాంతరంగా ఆగిపోయిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా బలవంతంగా నామినేషన్లను ఉపసంహరించారని నిర్ధారణ అయితే ఆ అభ్యర్థుల నామినేషన్లను పునరుద్ధరించాలని కలెక్టర్లను ఆదేశిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఈ నెల 18న జారీ చేసిన ఆదేశాల విషయంలో హైకోర్టు జోక్యం చేసుకుంది. ఒకే ఒక నామినేషన్ దాఖలైన చోట ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తూ ఎన్నికల అధికారి ఫాం – 10 జారీ చేసిన ఏకగ్రీవాలపై ఈ నెల 23వతేదీ వరకు ఎలాంటి విచారణ జరపవద్దని ఎన్నికల కమిషన్, అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఒకవేళ ఫాం – 10 జారీ చేయని చోట ఏవైనా చర్యలు తీసుకుంటే ఈ నెల 23 వరకు వెల్లడించరాదని ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేస్తూ న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల కాపీని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లకు పంపాలని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించారు. ఇవీ పిటిషన్లు... ఎన్నికల కమిషనర్ ఉత్తర్వులను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి రద్దు చేయాలని కోరుతూ చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం, ఆరడిగుంట, సింగిరిగుంట ఎంపీటీసీలుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఫాం 10 అందుకున్న డి.నంజుండప్ప, ఏ.భాస్కర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పీలేరు ఎంపీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఫాం 10 అందుకున్న ఏటీ రత్నశేఖర్‌రెడ్డి కూడా మరో వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. లంచ్ మోషన్ రూపంలో దాఖలైన ఈ వ్యాజ్యాలపై పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి, వీఆర్ఎన్ ప్రశాంత్, ఎస్ఆర్ వివేక్ చంద్రశేఖర్‌లు వాదించగా ఎన్నికల కమిషన్ తరఫున ఎన్.అశ్వనీకుమార్ వాదించారు. ఆర్వోల విధుల్లో కమిషనర్ జోక్యం చేసుకోరాదు.. ‘రాజ్యాంగంలోని అధికరణ 243 కే కింద తన అధికారాలకు అడ్డులేదని ఎన్నికల కమిషనర్ భావిస్తున్నారు. రిటర్నింగ్ అధికారులు ఏం చేయాలో నిబంధనల్లో స్పష్టంగా ఉంది. వారి విధుల్లో ఎన్నికల కమిషనర్ జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. ఒకే అభ్యర్థి బరిలో ఉంటే ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి తక్షణమే ప్రకటించి ఫాం 10 ఇవ్వాలని నిబంధనలు చెబుతున్నాయి. కానీ ఎన్నికల కమిషనర్ చట్టాలను ఖాతరు చేయకుండా సూపర్మ్యాన్లా వ్యవహరిస్తున్నారు’ అని పిటిషనర్ల తరపు న్యాయవాది మోహన్‌రెడ్డి నివేదించారు. పిటిషనర్ల తరఫున మరో న్యాయవాది వీఆర్ఎన్ ప్రశాంత్ వాదనలు వినిపిస్తూ ఓ అభ్యర్థి ఎన్నికైనట్లు ప్రకటించి ధ్రువీకరణ పత్రం జారీ చేసిన తరువాత అభ్యంతరాలుంటే ఎన్నికల ట్రిబ్యునల్ ముందు పిటిషన్ దాఖలు చేసుకోవడం ఒక్కటే మార్గమన్నారు. ఎన్నికల కమిషన్ ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయక ముందే దాఖలైన ఈ వ్యాజ్యాలకు విచారణార్హత లేదని కమిషన్ తరపు న్యాయవాది అశ్వనీకుమార్ పేర్కొన్నారు. ఆ అధికారం మీకెక్కడుంది..? ఈ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ విచారణకు ఆదేశించే అధికారం ఎన్నికల కమిషన్‌కు ఉందా? ఆ అధికారం మీకు ఎక్కడి నుంచి వచ్చింది? అని ఎన్నికల కమిషన్ తరపు న్యాయవాదిని ప్రశ్నించారు. చట్టంలో ఏమీ చెప్పనప్పుడు మాత్రమే 243 కే కింద అధికారం ఉంటుందని సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తు చేస్తూ ఈ వ్యవహారంలో క్షుణ్నంగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పిటిషనర్లు ప్రస్తావించిన అంశాలకు ప్రాథమిక ఆధారాలున్నాయని స్పష్టం చేస్తూ విచారణను వాయిదా వేశారు. -
ఏకగ్రీవాలను రద్దు చేసే అధికారం కోర్టుకు కూడా లేదు
సాక్షి, కృష్ణా: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలతో మొదలైన ఏకగ్రీవాల పరంపర జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ కొనసాగేలా ఉంది. కోవిడ్ కారణంగా 2020 మార్చి 15న వాయిదా పడ్డ ఎన్నికల ప్రక్రియను కొనసాగించాలని ఎన్నికల కమిషన్ ఆలోచిస్తుంది. ఈ క్రమంలో గతంలో నోటిఫికేషన్ జారీ చేసిన సమయంలో పలు జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. త్వరలోనే ఎస్ఈసీ ఈ ఎన్నికలు నిర్వహించాaని భావిస్తుండగా.. గతంలోని ఏకగ్రీవాలను రద్దు చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వివాదంపై హైకోర్టు న్యాయవాది జనార్ధన్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఎన్నికల్లో ఏకగ్రీవాలకు ఫారం 10లో.. ఎన్నికల్లో గెలిచినవారికి ఫారం 23లో ధ్రువీకరణ ఇస్తారు. ఏకగ్రీవమైనా.. ఎన్నికల్లో గెలిచినా.. ఒకసారి ధృవీకరణ పత్రం ఇచ్చాక రద్దు చేసే అధికారం ఎవరికీ లేదు. ఎస్ఈసీ, కోర్టులకు కూడా దీన్ని రద్దు చేసే అధికారం లేదు. కేవలం ఓడిపోయిన వ్యక్తి మాత్రమే ఆర్టికల్ 329 ప్రకారం జిల్లా కోర్టులో ఎలక్షన్ పిటిషన్ వేసుకోవాలి. విచారణ తర్వాతే కోర్టు తీర్పు ఇస్తుంది’’ అని తెలిపారు. -
ఆ ఎన్నికల ప్రక్రియ కొనసాగింపుపై ఆలోచన: నిమ్మగడ్డ
సాక్షి, అమరావతి: వాయిదా వేసిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియను కొనసాగించాలని ఎన్నికల కమిషన్ ఆలోచిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. కోవిడ్ కారణంగా 2020 మార్చి 15న ఎన్నికలు వాయిదా çపడ్డాయి కాబట్టి.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నిలను మళ్లీ మొదటి నుంచి ప్రారంభించాలని కొన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల కమిషన్‌ను కోరాయన్నారు. ఈ విషయంలో ఎన్నికల కమిషన్ న్యాయ సలహా తీసుకుని, ఎన్నిలను సక్రమంగా నిర్వహించేందుకు సంసిద్ధమవుతోందని తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ►మున్సిపల్ ఎన్నికల నామినేషన్లకు సంబంధించి తమతో బలవంతంగా నామినేషన్లు ఉపసంహరింపజేశారని ఎవరైనా ఫిర్యాదు చేస్తే, వాటిపై విచారించి మాకు నివేదించమని కలెక్టర్లను ఇప్పటికే ఆదేశించాము. ►జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియలో కూడా బలవంతంగా నామినేషన్లను ఉపసంహరింప చేశారని ఫిర్యాదులు వస్తే పరిశీలించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించాం. అటువంటి ఉదంతాలు ఉన్నట్లు నిర్ధారణ అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 243–కె ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ తన విచక్షణాధికారాలను ఉపయోగిస్తుంది. ►రిటర్నింగ్ అధికారులకు, పోలీసులకు చేసిన ఫిర్యాదులు, ఆయా ఘటనలకు సంబంధించి వచ్చిన వార్తల వివరాలను ఆధారాలుగా జోడించి ఫిర్యాదు చేయవచ్చు. ఎవరైనా స్థానికంగా ఫిర్యాదు చేసే అవకాశం లేకపోతే నేరుగా ఎన్నికల కమిషన్‌ను సంప్రదించి ఫిర్యాదు చేయొచ్చు. ►బలవంతంగా నామినేషన్‌ను ఉప సంహరింప జేశారని నిర్ధారణ అయితే, ఆ అభ్యర్థుల నామినేషన్లను పునరుద్ధరించే అధికారాన్ని జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్లకు ఇచ్చాము. ఇలాంటి ఫిర్యాదులేవైనా ఉంటే.. విచారించి మొత్తం ప్రక్రియను ఈ నెల 20లోపు పూర్తి చేసి కమిషన్‌కు నివేదిక ఇవ్వాలని ఆదేశించాం. ►ఏజెన్సీ ప్రాంతాల్లో సుమారు 350 పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఎన్నికల బహిష్కరణ పిలుపును తిరస్కరించి, గిరిజన ఓటర్లు పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొనడం సంతోషం. మూడో విడత పోలింగ్‌లో కూడా గ్రామీణ ప్రాంత ఓటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొనడం.. ప్రజాస్వామ్యంపై వారికి ఉన్న విశ్వాసాన్ని ఇనుమడింప జేసింది. -
కౌంటింగ్ వీడియో తీయండి
సాక్షి, అమరావతి: సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామ పంచాయతీల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియను తప్పనిసరిగా వెబ్‌కాస్టింగ్ లేదా సీసీ కెమెరా లేదా వీడియోగ్రఫీ ద్వారా రికార్డు చేయించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఈ మేరకు కమిషన్ కార్యదర్శి కన్నబాబు కలెక్టర్లతో పాటు డీపీవోలు, ఎస్పీలకు లేఖలు రాశారు. మొత్తం నాలుగు విడతల పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో ఇప్పటికే రెండు దశలు పూర్తవగా.. మూడు, నాలుగో దశ ఎన్నికల ఓట్ల లెక్కింపు సమయంలో చేపట్టాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. ► కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో ఆ ప్రాంతంలో కరెంటు సరఫరాకు అంతరాయం కలుగకుండా విద్యుత్ శాఖ అధికారులకు తగిన సూచనలు జారీ చేయాలి. అదే సమయంలో జనరేటర్లు కూడా ఏర్పాటు చేసుకోవాలి. ► కౌంటింగ్ అనంతరం పోటీలో ఉన్న ప్రధాన అభ్యర్థుల మధ్య అతి స్వల్పంగా ఒక అంకె (సింగిల్ డిజిట్) ఓట్ల తేడా ఉన్నప్పుడు మాత్రమే నిబంధనల ప్రకారం ఒక్కసారి రీ కౌంటింగ్‌కు అనుమతించాలి. రెండు అంకెల (డబుల్ డిజిట్) ఓట్ల తేడా ఉంటే అనుమతించవద్దు. ► కౌంటింగ్ కేంద్రాలలోకి ముందుగా అనుమతి పొందిన వ్యక్తులను మాత్రమే అనుమతించాలి. ఇతరులను రానీయకూడదు. ► సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక, పెద్ద గ్రామ పంచాయతీల్లో కౌంటింగ్ పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలి. -
అభ్యర్థి చనిపోతే ఎన్నిక వాయిదా
సాక్షి, అమరావతి: గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేసి, పరిశీలనలో ఆ నామినేషన్ సక్రమమే అని నిర్ధారణ జరిగిన తర్వాత అభ్యర్ధి మరణించిన పక్షంలో ఆ మున్సిపల్ వార్డు/ కార్పొరేషన్ డివిజన్లో ఎన్నిక వాయిదా వేసేందుకు సంబంధిత రిటర్నింగ్ అధికారికి ప్రత్యేక అధికారాలు ఉన్నాయని రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. అలాగే రాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్ద ప్రత్యేక ఎన్నికల గుర్తును పొందిన రిజిస్టర్డ్ రాజకీయ పార్టీ అభర్థి మరణించినా ఎన్నిక వాయిదా వేయవచ్చునని తెలిపింది. మున్సిపల్, నగర పాలక సంస్థల ఎన్నికలలో భాగంగా గతంలో జరిగిన నామినేషన్ దాఖలు ప్రక్రియకు, తాజాగా ఇప్పటి ఎన్నికల ప్రక్రియకు మధ్య దాదాపుగా ఏడాది అంతరం ఏర్పడింది. ఈ ఏడాది సమయంలో కొన్నిచోట్ల పోటీలో ఉన్న అభ్యర్థులు మరణించారు. ఈ నేపథ్యంలో ఉత్పన్నమైన సందేహాలపై వివరణ ఇస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయ కార్యదర్శి కన్నబాబు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పోటీలో ఉన్న అభ్యర్థి మరణించినప్పుడు రిటర్నింగ్ అధికారి ఎలా వ్యవహరించాలో తెలియజేయడంతో పాటు, నామినేషన్ల ఉపసంహరణ నిబంధనలను వెల్లడించారు. అభ్యర్థులు చనిపోయినటువంటి ప్రత్యేక పరిస్థితులలో రిటర్నింగ్ అధికారి.. స్పష్టమైన ఆధార సహిత వివరాలు సేకరించిన తర్వాతనే ఎన్నికల వాయిదాపై నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. వాయిదా వేస్తే ఆ వివరాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు తెలియజేయాలని సూచించారు. -
కొడాలి నాని పిటిషన్‌పై విచారణ వాయిదా
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికలు ముగిసే రోజైన ఈనెల 21 వరకు మీడియాతో మాట్లాడకుండా ఎస్ఈసీ జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ మంత్రి కొడాలి నాని వేసిన పిటిషన్‌పై విచారణ ఎల్లుండికి వాయిదా పడింది. ఎన్నికలు ముగిసేవరకు తనను మీడియాతో మాట్లాడకుండా నిరోధిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిని సవాలు చేస్తూ మంత్రి కొడాలి నాని పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల కమిషనర్ జారీచేసిన ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమని, ఏకపక్షమైనవని ప్రకటించి, వాటిని కొట్టేయాలని కోరుతూ ఆయన హైకోర్టులో శనివారం హౌస్‌మోషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం తేలేంత వరకు మీడియాతో మాట్లాడకుండా ఎస్ఈసీ ఇచ్చిన ఉత్తర్వుల అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలని అభ్యర్థించారు. కాగా ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను హైకోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది. చదవండి : (మరో మంత్రిపై నిమ్మగడ్డ ఆంక్షలు) (నిన్న ఆంక్షలు.. నేడు కేసులు) -
ఎస్ఈసీ ఉత్తర్వులు నిలిపేయండి
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికలు ముగిసే రోజైన ఈనెల 21 వరకు తనను మీడియాతో మాట్లాడకుండా నిరోధిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్ శుక్రవారం జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల కమిషనర్ జారీచేసిన ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమని, ఏకపక్షమైనవని ప్రకటించి, వాటిని కొట్టేయాలని కోరుతూ ఆయన హైకోర్టులో శనివారం హౌస్‌మోషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం తేలేంత వరకు మీడియాతో మాట్లాడకుండా ఎస్ఈసీ ఇచ్చిన ఉత్తర్వుల అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలని అభ్యర్థించారు. ఇందులో ఎన్నికల కమిషన్ కార్యదర్శి, కృష్ణాజిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, కృష్ణాజిల్లా ఎస్పీ (గ్రామీణ)లను ప్రతివాదులుగా చేర్చారు. ఈ వ్యాజ్యాన్ని హైకోర్టు ఆదివారం విచారించే అవకాశం ఉంది. పిటిషన్లో కొడాలి నాని ఏం పేర్కొన్నారంటే.. ఆధారాలు చూపకుండా నోటీసు ‘ఎన్నికల కమిషనర్‌ను కించపరిచేలా, కమిషన్ స్థాయిని తగ్గించేలా మాట్లాడానని, దీనిపై వివరణ ఇవ్వాలంటూ ఎన్నికల కమిషన్ కార్యదర్శి నాకు షోకాజ్ నోటీసు ఇచ్చారు. కమిషన్‌కు సంతృప్తి కలిగించేలా బహిరంగంగా వివరణ ఇవ్వాలన్నారు. వేటి ఆధారంగా నాకు షోకాజ్ నోటీసు ఇచ్చారో ఆ ఆధారాలను నాకు ఇవ్వలేదు. అయినా.. నాకిచ్చిన తక్కువ సమయంలోనే నేను వివరణ ఇచ్చాను. ఎన్నికల కమిషన్ స్థాయిని తగ్గించేలా నేను వ్యాఖ్యలు చేయలేదని.. రాజ్యాంగ వ్యవస్థలపట్ల నాకు గౌరవం ఉందన్న విషయాన్ని తెలియజేశాను. కానీ, నా వివరణను పరిగణనలోకి తీసుకోకుండా విస్మయకరంగా ఈ నెల 21 వరకు నన్ను మీడియాతో మాట్లాడకుండా నిరోధిస్తూ ఎన్నికల కమిషన్ కార్యదర్శి ఉత్తర్వులిచ్చారు. సభలు, సమావేశాల్లో కూడా మాట్లాడకూడదని ఆంక్షలు విధించారు. దీంతో రాజ్యాంగం నాకిచ్చిన భావప్రకటన స్వేచ్ఛను హరించినట్లయింది. అంతేకాక.. నాపై కేసు పెట్టాలని ఎస్పీని ఆదేశించారు. కానీ, ఎన్నికల కమిషన్‌కు వ్యతిరేకంగా నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని పునరుద్ఘాటిస్తున్నా’.. అని మంత్రి వివరించారు. -
మీడియాతో మాట్లాడొచ్చు..
సాక్షి, అమరావతి: మీడియాతో ఈ నెల 17వ తేదీ వరకు మాట్లాడకుండా తనను నిరోధిస్తూ ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ కృష్ణా జిల్లా పెడన శాసనసభ్యుడు జోగి రమేశ్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. మీడియాతో మాట్లాడుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ పిటిషన్‌పై లంచ్ మోషన్ ద్వారా అత్యవసర విచారణకు న్యాయమూర్తి డీవీఎస్ఎస్ సోమ యాజులు అంగీకరించారు. జోగి రమేశ్ తరఫు న్యాయవాది వీఆర్ఎన్ ప్రశాంత్ వాదనలు వినిపిస్తూ.. మూడు రాజకీయ పార్టీలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఈ ఉత్తర్వులిచ్చే ముందు పిటిషనర్‌కు ఎలాంటి నోటీసు ఇవ్వలేదని, వివరణ తీసుకోలేదని తెలిపారు. మీడియాతో మాట్లాడటం ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడం కాదని, ఎన్నికల కమిషన్ పరిధి దాటి వ్యవహరించిందని వివరించారు. వాస్తవానికి ఏ అభ్యర్థి కూడా పిటిషనర్‌పై ఫిర్యాదు చేయలేదని తెలిపారు. అనంతరం ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాది ఎన్. అశ్వనీ కుమార్ వాదనలు వినిపిస్తూ.. కమిషన్ తన ముందున్న ఆధారాలను బట్టే జోగి రమేశ్‌కు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. జిల్లా ఎన్నికల యంత్రాంగం నుంచి క్లీన్చిట్ వస్తే, కమిషన్ తన ఉత్తర్వులను వెనక్కి తీసుకుం టుందని కోర్టుకు నివేదించారు. అనంతరం న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేస్తూ.. పిటిషనర్ ఎమ్మెల్యే కాబట్టి, ఆయన కొన్ని ప్రజా సంబంధిత బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుం దన్నారు. అందువల్ల సభలు, సమావేశాలు, ర్యాలీల్లో పార్టీ విధానాలు, విజయాల గురించి మాట్లాడుకోవచ్చని స్పష్టం చేశారు. అయితే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులతో మాట్లాడానికి వీల్లేదని, ఓటర్లను ఏ రకంగానూ ప్రభావితం చేయరాదని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 15వ తేదీకి వాయిదా వేశారు. -
ముగిసిన రెండో దశ ప్రచారం.. 13న ఎన్నిక
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో తొలి దశ పంచాయతీ ఎన్నికలు ముగియగా ఇప్పుడు రెండో దశ ఎన్నికలకు వేళయింది. రెండో దశ ఎన్నికల ప్రచారం గురువారంతో ముగిసింది. ఈనెల 13వ తేదీన మొత్తం 2,786 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్ కలిసి చర్చించారు. ఈ మలి దశ ఎన్నికలకు సంబంధించి చివరి రోజు గురువారం రాత్రి 7.30 గంటలకు ప్రచారం ముగిసింది. చివరి రోజు కావడంతో అభ్యర్థులు, వారి అనుచరులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తీవ్రంగా శ్రమించారు. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేశారు. రెండో విడతలో 13 జిల్లాలలోని 18 రెవెన్యూ డివిజన్లలోని మొత్తం 3,328 పంచాయతీలలో 33,570 వార్డుల ఎన్నికకు ప్రకటన విడుదల అయ్యింది. వీటిలో 539 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 2,786 పంచాయతీలలో ఎన్నికలు జరగనుండగా మొత్తం 7,510 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వార్డులు 12,605 ఏకగ్రీవమవడంతో మిగిలిన 20,796 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. వార్డులకు 44,879 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అదృష్టం పరీక్షించుకోనున్న అభ్యర్థులు 13 జిల్లాల్లో ఫిబ్రవరి 13వ తేదీన ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు రెండో విడత ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అనంతరం అదే రోజు సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఇక ఏజెన్సీలోని పంచాయతీలో ఎన్నికలు మధ్యాహ్నం 1.30 గంటల వరకే ఉంటాయి. ఇక్కడ పోలింగ్ పూర్తయిన వెంటనే కౌంటింగ్ ప్రారంభిస్తారు. ఫలితాల వెల్లడి అనంతరం ఉపసర్పంచ్ ఎంపిక కూడా అదే రోజు కొనసాగుతుంది. రెండో విడతలో 13 జిల్లాల్లోని 18 రెవెన్యూ డివిజన్లోని 167 మండలాల్లో శనివారం ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో పాటు తొలి విడతలో కౌంటింగ్ నిలిచిపోయిన తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం కందరాడలో కలెక్టర్ ఆదేశాల మేరకు రీ పోలింగ్ నిర్వహిస్తారు. రెండో విడతలో ఎన్నికలు జరిగే ప్రాంతాలు శ్రీకాకుళం జిల్లా: టెక్కలి, పాలకొండ రెవెన్యూ డివిజన్లలోని 10 మండలాలు విజయనగరం జిల్లా: పార్వతీపురం డివిజన్లో 15 మండలాలు విశాఖపట్నం జిల్లా: నర్సీపట్నం రెవెన్యూ డివిజన్లోని 10 మండలాలు తూర్పుగోదావరి జిల్లా: రాజమహేంద్రవరం, రంపచోడవరం డివిజన్లలోని 14 మండలాలు పశ్చిమగోదావరి జిల్లా: కొవ్వూరు డివిజన్లోని 13 మండలాలు కృష్ణా జిల్లా: గుడివాడ డివిజన్లోని 9 మండలాలు గుంటూరు జిల్లా: నరసరావుపేట డివిజన్ 11 మండలాలు ప్రకాశం జిల్లా: ఒంగోలు, కందుకూరు డివిజన్లలోని 14 మండలాలు నెల్లూరు జిల్లా: ఆత్మకూరు డివిజన్లోని 10 మండలాలు కర్నూలు జిల్లా: కర్నూలు, నంద్యాల డివిజన్లలోని 13 మండలాలు అనంతపురం జిల్లా: ధర్మవరం, కల్యాణదుర్గం డివిజన్లోని 19 మండలాలు వైఎస్సార్ కడప జిల్లా: కడప రెవెన్యూ డివిజన్ 12 మండలాలు చిత్తూరు జిల్లా: మదనపల్లి రెవెన్యూ డివిజన్ 17 మండలాలు ఏపీ, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ఈసీ దక్షిణాది పర్యటన: 15 తర్వాత మినీ సమరం? -
జిల్లాల వారీగా గ్రామపంచాయతీ ఫలితాలివే..
సాక్షి, అమరావతి: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో వైఎస్సార్సీపీ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. పల్లెల్లో పార్టీ అభిమానుల ఆనందోత్సాహాలు మిన్నంటాయి. ఇదే ఊపుతో రెండు, మూడు, నాలుగు విడతల పంచాయతీ ఎన్నికల్లోనూ విజయదుందుభి మోగిస్తామని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తొలిదశలో 12 జిల్లాల పరిధిలోని 3,249 గ్రామ పంచాయతీల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్(ఎస్ఈసీ) ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయగా 525 చోట్ల సర్పంచులు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఇందులో 90 శాతం వైఎస్సార్సీపీ అభిమానులే ఉండడం గమనార్హం. ఏకగ్రీవాల అనంతరం 2,724 పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 2,721 చోట్ల మంగళవారం పోలింగ్ జరిగింది. శ్రీకాకుళం జిల్లాలో ఓ పంచాయతీలో ఎవరూ నామినేషన్ వేయనందున, నెల్లూరు జిల్లాలో ఒక గ్రామంలో ప్రజలు ఎన్నికలను బహిష్కరించడంవల్ల పోలింగ్ జరగలేదు. తూర్పుగోదావరి జిల్లాలో ఒక సర్పంచి అభ్యర్థి బ్యాలెట్ బాక్సు ఎత్తుకుపోవడంవల్ల పోలింగ్ నిలిచిపోయింది. ఈ మూడు పంచాయతీల్లో ఎన్నికలు/రీపోలింగ్ నిర్వహించాల్సి ఉంది. ఏకగ్రీవాలతో కలిపి మిగిలిన 3,246 పంచాయతీల ఫలితాలు బుధవారం తెల్లవారుజాముకు వెల్లడయ్యాయి. ఇందులో ఏకగ్రీవాలతో కలిపి 2,640 మంది వైఎస్సార్సీపీ అభిమానులు సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. 81.25 శాతం పంచాయతీల పాలనాధికారాలను ప్రజలు అధికారపార్టీ అభిమానులకు అప్పగించారు. 510 గ్రామాల్లో మాత్రమే టీడీపీ అభిమానులు సర్పంచులుగా ఎన్నికయ్యారు. అనగా 15.66 శాతం పంచాయతీలకే వారు పరిమితమయ్యారు. తొలివిడత ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు రావడంతో టీడీపీ అభిమానుల్లో తీవ్ర నైరాశ్యం నెలకొంది. ఇక ఇతరులకు 96 పంచాయతీలు దక్కాయి. -
రెండో దశలో 539 ఏకగ్రీవాలు..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశలో రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాల జాబితాను రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాలోని 167 మండలాల పరిధిలో 3,328 పంచాయతీలకుగాను 539 ఏకగ్రీవమయినట్లు ఎస్ఈసీ ప్రకటించారు. మిగిలిన 2786 పంచాయతీలకు ఈనెల 13న ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎస్ఈసీ వెల్లడించారు. రెండో దశలో జిల్లాల వారీగా ఏకగ్రీవాల వివరాలు.. శ్రీకాకుళం: 278 పంచాయతీలకి గాను 41 పంచాయతీలు ఏకగ్రీవం విజయనగరం: 415కి గాను 60 ఏకగ్రీవం విశాఖ: 261కి గాను 22 ఏకగ్రీవం తూర్పు గోదావరి: 247కి గాను 17 ఏకగ్రీవం పశ్చిమ గోదావరి: 210కి గాను 15 ఏకగ్రీవం కృష్ణా: 211కి గాను 36 ఏకగ్రీవం గుంటూరు: 236కి గాను 70 ఏకగ్రీవం ప్రకాశం: 277కి గాను 69 ఏకగ్రీవం నెల్లూరు: 194కి గాను 35 ఏకగ్రీవం చిత్తూరు: 276కి గాను 62 ఏకగ్రీవం అనంతపురం: 308కి గాను 15 ఏకగ్రీవం వైఎస్ఆర్ జిల్లా: 175కి గాను 40 ఏకగ్రీవం కర్నూలు: 240కి గాను 57 ఏకగ్రీవం -
'ఈ–వాచ్'లో లోపాలెన్నో
సాక్షి, అమరావతి: ఎస్ఈసీ సొంతగా తయారు చేసుకున్న ఈ–వాచ్ యాప్‌లో సాంకేతిక, భద్రతాపరమైన లోపాలను ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ (ఏపీటీఎస్) గుర్తించిందని ప్రభుత్వ న్యాయవాది చింతల సుమన్ మంగళవారం హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఎన్నికల కమిషన్ ఈ–వాచ్ యాప్ అభివృద్ధి కోసం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన సోర్స్ కోడ్‌ను ఉపయోగిస్తున్నట్టు ఏపీటీఎస్ పరీక్షల్లో తేలిందని, ఇది అతి పెద్ద భద్రతా లోపమని తెలిపారు. తమ సోర్స్ కోడ్ వాడుకునేందుకు సాంఘిక సంక్షేమ శాఖ అనుమతి ఇచ్చినట్టు ఎన్నికల కమిషన్ ఎలాంటి ధ్రువీకరణ పత్రం చూపలేదని కోర్టుకు నివేదించారు. ఆ సోర్స్ కోడ్‌ను ఉపయోగించడం వల్ల సాంఘిక సంక్షేమ శాఖ సమాచారానికి భద్రతాపరంగా ముప్పు ఉంటుందని చెప్పారు. ప్రభుత్వం రూపొందించిన ఈ–నిఘా యాప్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉపయోగించుకుంటే ప్రభుత్వానికి ఏమైనా అభ్యంతరం ఉందా అని హైకోర్టు ప్రశ్నించగా.. ఎలాంటి అభ్యంతరం లేదని సుమన్ కోర్టుకు నివేదించారు. ఏపీటీఎస్ కోరిన వివరాలను అందచేయాలని ఎన్నికల కమిషన్‌కు సూచిస్తూ.. అప్పటివరకు ఈ–వాచ్ యాప్ వాడొద్దంటూ హైకోర్టు గత వారం ఇచ్చిన ఉత్తర్వులు అమల్లో ఉంటాయని తెలిపింది. తదుపరి విచారణను ఈ నెల 17కి వాయిదా వేస్తూ ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. ఈ–వాచ్ యాప్‌ను ఉపయోగించకుండా నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వం యాప్‌లైన ‘సీ విజిల్’, ‘నిఘా’ యాప్‌లను ఉపయోగించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ప్రకాశం జిల్లా ఇంకొల్లు గ్రామానికి చెందిన న్యాయవాది కట్టా సుధాకర్, గుంటూరు తెనాలికి చెందిన అంగ్రేకుల నాగేశ్వరరావు, తెనాలి మండలం బుర్రిపాలెంకు చెందిన అడుసుమల్లి అజయ్‌కుమార్ వేర్వేరుగా దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై మంగళవారం విచారణ జరిపింది. ప్రభుత్వ న్యాయవాది పలు అంశాలను కోర్టుకు నివేదించిన దరిమిలా ఈసీ తరఫు న్యాయవాది ఎన్.అశ్వనికుమార్ వాదనలు వినిపిస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించిన సీ–విజిల్ యాప్‌ను పంచాయతీ ఎన్నికల కోసం వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని, అందుకు అనుమతివ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఈ–నిఘా యాప్ పని చేయడం లేదని కోర్టుకు తెలిపారు. దీనిపై ధర్మాసనం ప్రభుత్వ వివరణ కోరింది. ఆ యాప్‌ను ఎన్నికల కమిషన్ ఉపయోగించుకునేందుకు ప్రభుత్వానికి అభ్యంతరం లేదని సుమన్ తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం ఏపీటీఎస్ కోరిన వివరాలను అందచేయాలని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. ఏపీటీఎస్ సర్టిఫికెట్ ఇస్తే తప్ప ఈ–వాచ్ యాప్ వినియోగంలోకి వచ్చే అవకాశం లేదు కాబట్టి అప్పటివరకు ఏ రకంగానూ వినియోగంలోకి తేవద్దంటూ గతవారం తామిచ్చిన ఉత్తర్వులు అమల్లో ఉంటాయని తెలిపింది. -
తుదివిడత పంచాయతీల్లో నేటి నుంచి నామినేషన్లు
సాక్షి, అమరావతి: తుది విడతలో ఈనెల 21న ఎన్నికలు జరగాల్సిన గ్రామ పంచాయతీల్లో బుధవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. 13 జిల్లాల పరిధిలో 162 మండలాల్లోని 3,299 పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్, పంచాయతీరాజ్‌శాఖ ఏర్పాట్లు చేస్తున్నాయి. ఆయా గ్రామాల్లో సర్పంచ్ పదవులతో 34,112 వార్డు పదవులకు ఎన్నికలు జరుగుతాయి. బుధవారం ఉ.10.30 నుంచి 12వ తేదీ సా.5 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. మూడో విడత సర్పంచి బరిలో 17,664 మంది మూడో విడతగా ఈనెల 17న ఎన్నికలు జరగనున్న 3,323 పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసింది. సర్పంచి పదవులకు 17,664 మంది బరిలో ఉన్నారు. 31,516 వార్డు సభ్యుల పదవులకు 77,447 మంది పోటీలో ఉన్నారు. 2వ విడతలో 539 సర్పంచ్‌లు ఏకగ్రీవం రెండో విడతగా ఈనెల 13న ఎన్నికలు జరిగే 3,328 గ్రామ పంచాయతీల పరిధిలో 539 సర్పంచి పదవులు ఏకగ్రీవమైనట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయ అధికారులు తెలిపారు. ఆయా పంచాయతీల పరిధిలోని 33,570 వార్డు పదవుల్లో 12,605 వార్డు పదవులకు కూడా ఏకగ్రీవంగా ఎన్నిక జరిగినట్లు అధికారులు తెలిపారు. -
ఈ-వాచ్ యాప్‌పై వెనక్కు తగ్గిన ఎస్ఈసీ
సాక్షి, అమరావతి: ఎస్ఈసీ ప్రవేశపెట్టిన ఈ-వాచ్ యాప్‌పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. యాప్‌పై అనేక అభ్యంతరాలు నమోదు కావడంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెనక్కు తగ్గింది. యాప్‌ను ఉపసంహరించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ఎస్ఈసీ కోర్టుకు స్పష్టం చేసింది. ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ సెక్యూరిటీ సర్టిఫికేషన్‌కు అభ్యంతరాలు తెలియజేసినందున, యాప్‌ను విత్‌డ్రా చేసుకుంటామని ఎస్ఈసీ తరఫు న్యాయవాది కోర్టులో పేర్కొన్నారు. దీంతో ఈ కేసుపై తదుపరి విచారణ ఈనెల 17కు వాయిదా పడింది. -
రాష్ట్రపతి పర్యటన: మంత్రి పెద్దిరెడ్డికి అనుమతి
సాక్షి, అమరావతి: రాష్ట్రపతి పర్యటనలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ పంచాయతిరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రాష్ట్ర హైకోర్టు అనుమతి ఇచ్చింది. మంత్రి పెద్దిరెడ్డిని ఫిబ్రవరి 21వ తేదీ వరకు నిర్భందించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఎస్ఈసీ ఆదేశాలను సవాలు చేస్తూ.. మంత్రి పెద్దిరెడ్డి ఆదివారం హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం రాష్ట్రపతి పర్యటనలో పాల్గొనందుకు అనుమతినిచ్చింది. మంత్రి పెద్దిరెడ్డి తరుపున న్యాయవాది సీవీ మోహన్ రెడ్డి వాదనలు వినిపించారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆ శాఖ మంత్రిగా రాష్ట్రంలో పర్యటించాల్సిన బాధ్యత అతనిపై ఉందని న్యాయస్థానానికి వివరించారు. పటిషనర్ వాదనలు విన్న న్యాయస్థానం ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు తుది తీర్పు వెలువరించనున్నది. చదవండి: నిర్బంధ ఉత్తర్వులు ఏకపక్షం రాష్ట్రంలో నాలుగు దశల పంచాయతీ ఎన్నికలు ముగిసే ఫిబ్రవరి 21వ తేదీ వరకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఆయన ఇంటి నుంచి బయటకు రాకుండా నియంత్రించాలని డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను ఆదేశిస్తూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రాజ్యాంగంలోని 243 కె నిబంధన ద్వారా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా తనకు ఉన్న విశేషాధికారాలతో ఈ ఆదేశాలు జారీ చేశానని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 16 రోజుల పాటు మంత్రి పెద్దిరెడ్డిని మీడియాతో కూడా మాట్లాడకుండా నియంత్రించాలని చెప్పిన విషయం తెలిసిందే. -
‘పంచాయతీ’ల్లో ఏకగ్రీవాలు కొత్తకాదు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏకగ్రీవాలపై ఎన్నికల కమిషన్ వివరణ కోరడం తొందరపాటు చర్య అని, పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు కొత్తేమీకాదని మంత్రులు బొత్స సత్యనారాయణ, వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. రాజ్యాంగానికి, చట్టాలకు లోబడి తొలినుంచి పంచాయతీ ఏకగ్రీవ ఎన్నికలు ఉంటున్నాయని తెలిపారు. విజయనగరంలో శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడారు. మంత్రి బొత్స మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువగా ఏకగ్రీవం అయితే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు. గత ఎన్నికలతో పోల్చితే ఒక శాతం మాత్రమే అదనంగా జరిగిన దానికే ఎన్నికల కమిషన్ ఎలా వివరణ కోరుతుందని ప్రశ్నించారు. ఈ విషయాన్ని గుర్తించి ఎన్నికల కమిషన్ పునరాలోచించుకోవాలని అన్నారు. మంత్రి వెలంపల్లి మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల్లో గందరగోళం సృష్టించి, అశాంతి రేకెత్తించాలని ఎన్నికల కమిషన్ ప్రయత్నిస్తోందని అన్నారు. విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. -
ఏకగ్రీవాలను అడ్డుకునే హక్కెక్కడిది?
సాక్షి, అమరావతి: చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏకగ్రీవాలను నిలిపేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలను వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ తప్పుబట్టారు. ఇది అప్రజాస్వామికమని మండిపడ్డారు. చట్ట విరుద్ధంగా చంద్రబాబు మేనిఫెస్టో విడుదల చేస్తే దాన్ని రద్దుచేసి సరిపెట్టడమేంటని ప్రశ్నించారు. ఆయనపై చర్యలెందుకు తీసుకోలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దుగ్గిరాలలో ఆర్నెల్లు ఉండకపోతే ఓటివ్వరనే కనీస సూత్రం తెలియని వ్యక్తికి రాజ్యాంగ పదవిలో ఉండే హక్కులేదన్నారు. చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో జరిగిన ఏకగ్రీవాలను నిలిపేస్తూ ఆదేశాలివ్వడం దుర్మార్గమన్నారు. చంద్రబాబుది చిత్తూరు.. నిమ్మగడ్డది గుంటూరు జిల్లా కావడంవల్లే ఇలా అప్రజాస్వామిక నిర్ణయం తీసుకున్నారా అని నిలదీశారు. ఏకగ్రీవమే వద్దని చంద్రబాబు, నిమ్మగడ్డ తీర్మానించుకుంటే కోర్టుకెళ్లి చెప్పాలని, దమ్ముంటే చట్టాలు తేవాలని జోగి రమేష్ సవాల్ చేశారు. గ్రామీణ ప్రజలు శాంతియుత వాతావరణంలో ఏకగ్రీవాలకు మొగ్గు చూపుతుంటే వీరికెందుకు దుగ్ధ అని జోగి ప్రశ్నించారు. వ్యవస్థలను అడ్డుపెట్టుకుని రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవడమే చంద్రబాబు లక్ష్యమన్నారు. చంద్రబాబుకు తొత్తుగా, ఆయన రాసే స్క్రిప్టు చదివే వ్యక్తిగా నిమ్మగడ్డ మిగిలిపోతున్నారని ఎద్దేవా చేశారు. ఎన్ని కుట్రలు చేసినా ప్రజలంతా జగన్‌వైపే ఉన్నారని జోగి రమేష్ తెలిపారు. నిమ్మగడ్డ నిలిపేసినా, ఏకగ్రీవమైన సర్పంచ్‌లంతా కొనసాగుతారని తెలిపారు. -
‘ఈ వాచ్’ను వినియోగించొద్దు
సాక్షి, అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వ అధికారిక యాప్‌లను కాకుండా రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) ఈ–వాచ్ పేరుతో రూపొందించిన ప్రైవేట్ యాప్‌ను ఈ నెల 9వ తేదీ వరకు వినియోగంలోకి తీసుకు రావొద్దని హైకోర్టు ఆదేశించింది. ఈ వాచ్ యాప్‌ను ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ (ఏపీటీఎస్ఎల్) పరిశీలించవచ్చని స్పష్టం చేసింది. ఈ వాచ్ యాప్‌పై నిషేధం విధించి, ‘సీ విజిల్’, ‘నిఘా’ యాప్‌లను ఉపయోగించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ప్రకాశం జిల్లా ఇంకొల్లు గ్రామానికి చెందిన న్యాయవాది కట్టా సుధాకర్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఇదే అభ్యర్థనలతో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన అంగ్రేకుల నాగేశ్వరరావు, తెనాలి మండలం బుర్రిపాళెంకు చెందిన అడుసుమల్లి అజయ్‌కుమార్‌లు వేర్వేరుగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ మూడు వ్యాజ్యాలపై శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఆ రెండు యాప్‌లను పక్కన పెట్టేశారు.. ‘ఎన్నికల నిర్వహణకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా ‘సీ విజిల్’ పేరుతో యాప్‌ను తయారు చేసింది. జీయో ట్యాగ్‌తో కూడిన ఈ యాప్ చాలా సౌకర్యవంతంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ‘నిఘా’ యాప్ కూడా చాలా సమర్థవంతంగా పని చేస్తుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ యాప్‌లను పక్కనపెట్టి భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా లేని ఈ వాచ్ యాప్‌ను రూపొందించింది. ఇప్పటి వరకు సెక్యూరిటీ ఆడిట్ జరగలేదు. ఏపీటీఎస్ఎల్ సంస్థ ధ్రువీకరణ పత్రం ఇస్తేనే యాప్ ప్రజలకు అందుబాటులోకి వస్తుంది’ అని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ఎస్.శరత్, వీఆర్ రెడ్డి కొవ్వూరి, జీఆర్ సుధాకర్.. ప్రభుత్వం తరఫున ప్రభుత్వ న్యాయవాది చింతల సుమన్ వాదనలు వినిపించారు. ఆడిట్ కోసం పంపాం ఈ వాచ్ యాప్‌ను రాత్రికి రాత్రే రూపొందించలేదని, వివరాలన్నింటినీ సీల్డ్ కవర్లో కోర్టు ముందు ఉంచుతామని ఎస్ఈసీ తరఫు న్యాయవాది అశ్వనీకుమార్ చెప్పారు. ఆడిట్ సర్టిఫికెట్ కోసం ఎన్నికల కమిషన్ కార్యదర్శి గురువారం ఏపీ సెక్యూరిటీ సర్వీసెస్‌కు అభ్యర్థన పంపారన్నారు. ప్రాథమిక పరిశీలనకు కనీసం ఐదు రోజుల సమయం పడుతుందని తెలిపారు. సీల్డ్ కవర్ వ్యవహారాలు వద్దు : హైకోర్టు – సీల్డ్ కవర్ వ్యవహారాలు వద్దు. అంత రహస్యం ఇక్కడేమీ లేదు. ఈ వాచ్ యాప్ రూపకల్పనకు ఎంత మొత్తం ఖర్చు చేశారు? కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వాల యాప్‌లను ఎందుకు ఉపయోగించలేదు? – ఎన్నికల నియమావళి జనవరి 8 నుంచి అమల్లో ఉండగా, ఇప్పుడు ఈ వాచ్ యాప్ తీసుకొచ్చి ప్రయోజనం ఏమిటి? అడిట్ సెక్యూరిటీ సర్టిఫికెట్ లేకుండా ఈ యాప్‌ను ఎలా వినియోగిస్తారు? – ఈ మొత్తం వ్యవహారంపై లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉంది. ఈ వాచ్ యాప్ పరిశీలన కోసం విచారణను ఈ నెల 9వ తేదీకి వాయిదా వేస్తున్నాం. అప్పటి వరకు ఈ యాప్‌ను అమల్లోకి తీసుకురావడానికి వీల్లేదు. -
ఎస్ఈసీ తెచ్చిన ప్రైవేటు యాప్‌నకు హైకోర్టు బ్రేక్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. ఎస్ఈసీ తయారు చేసిన యాప్‌నకు ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ నుంచి సెక్యూరిటీ సర్టిఫికేషన్ వచ్చేంతవరకు, ఈ యాప్ వినియోగాన్ని నిలిపివేయాలని న్యాయస్థానం ఆదేశించింది. కాగా పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈ- వాచ్ పేరుతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఓ యాప్‌ను విడుదల చేశారు. దీని ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తామని తెలిపారు. అయితే ప్రైవేటు యాప్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఈ- వాచ్‌కు సెక్యూరిటీ సర్టిఫికెట్ ఉందా అని ఎస్ఈసీ తరఫు న్యాయవాదిని ప్రశ్నించగా, 5 రోజుల్లో తీసుకువస్తామని సమాధానమిచ్చారు. ఈ నేపథ్యంలో అప్పటి వరకు ఈ యాప్‌ను ఉపయోగించవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 9వ తేదీకి వాయిదా వేసింది. చదవండి: టీడీపీ మేనిఫెస్టోను రద్దు చేసిన ఎస్ఈసీ -
టీడీపీ మేనిఫెస్టోను రద్దు చేసిన ఎస్ఈసీ
సాక్షి, అమరావతి: టీడీపీకి రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం గట్టిషాక్ ఇచ్చింది. టీడీపీ మేనిఫెస్టోను రద్దు చేస్తున్నట్లు ఎస్ఈసీ తెలిపింది. మేనిఫెస్టోపై టీడీపీ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో ఎస్ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.కాగా వెంటనే మేనిఫెస్టోను వెనక్కు తీసుకోవాలంటూ టీడీపీకి ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలకు పంపిన మేనిఫెస్టో కాపీలను వెనక్కి తీసుకోవాలని సూచించింది. టీడీపీ మేనిఫెస్టోతో ఎలాంటి ప్రచారం నిర్వహించొద్దని ఎస్ఈసీ స్పష్టం చేసింది. చదవండి: తొలి విడత: ఇప్పటివరకు జిల్లాల వారీగా ఏకగ్రీవాలు పార్టీలకు సంబంధం లేకుండా జరిగే పంచాయతీ ఎన్నికలకు టీడీపీ మేనిఫెస్టో ప్రకటించడంపై ఎస్ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేయగా... మేనిఫెస్టోపై టీడీపీని ఎస్ఈసీ వివరణ కోరింది. టీడీపీ నుంచి సంతృప్తికర సమాధానం రాకపోవడంతో మేనిఫెస్టోను రద్దు చేసినట్లు ఎస్ఈసీ ప్రకటించింది. -
ఇంటింటికీ రేషన్ పథకం పేదల కోసమే..
రాష్ట్ర ప్రభుత్వం నుంచి వినతి అందుకున్న 5 రోజుల్లో దానిపై తగిన నిర్ణయం వెలువరించాలి. అనుమతి విషయంలో అంతిమ నిర్ణయం ఎన్నికల కమిషన్‌దే. నిర్ణయం తీసుకునే ముందు ఇంటింటికీ రేషన్ పథకం వల్ల పెద్ద సంఖ్యలో పేదలు లబ్ధి పొందుతారన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. – హైకోర్టు సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన ‘ఇంటింటికీ రేషన్’ పథకం పేద ప్రజల కోసం ఉద్దేశించిందని, అందువల్ల ఈ పథకం అమలు జరగాల్సిన అవసరం ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ పథకం ఓ రాజకీయ పార్టీ చేపట్టిన కార్యక్రమం ఎంత మాత్రం కాదని, అది ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమమని తెలిపింది. అందువల్ల రాజకీయ నాయకులతో, రాజకీయాలతో సంబంధం లేకుండా ఇంటింటికీ రేషన్ పథకాన్ని అధికారుల ద్వారా అమలు చేసుకోనివ్వడానికి అనుమతి ఇవ్వడంలో తప్పులేదని అభిప్రాయపడింది. ఈ పథకం అమలు ఎందుకు అవసరమో తగిన ఆధారాలతో వివరిస్తూ ఎన్నికల కమిషన్‌ను 48 గంటల్లో ఆశ్రయించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర అధికారులకు వాదనలు వినిపించే అవకాశం ఇవ్వాలని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ జోయ్ మాల్య బాగ్చీ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త పథకం కాదు.. జూలైలోనే సీఎం ప్రకటించారు.. ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా> సంచార వాహనాల ద్వారా ఇంటింటికీ రేషన్ పథకాన్ని ఫిబ్రవరి 1 నుంచి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఈ పథకం అమలును నిలిపేసే దిశగా ఈ నెల 28న ప్రొసీడింగ్స్ జారీ చేశారు. వీటిని సవాలు చేస్తూ పౌర సరఫరాల శాఖ ముఖ్య కార్యదర్శి అత్యవసరంగా హైకోర్టులో హౌస్ మోషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ బాగ్చీ తన ఇంటి వద్ద నుంచి విచారణ జరిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ, ఇంటింటికీ రేషన్ పథకం కొత్త పథకం ఎంత మాత్రం కాదని వివరించారు. 2019 జూలైలోనే ముఖ్యమంత్రి అసెంబ్లీ వేదికగా ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటన చేశారని తెలిపారు. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం నాణ్యమైన బియ్యాన్ని, సంచులను, సంచార వాహనాలను సైతం సమకూర్చుకుందని తెలిపారు. లబ్ధిదారుల జాబితా కూడా సిద్ధమైందని కోర్టుకు నివేదించారు. పార్టీల రహితంగా ఎన్నికలు జరుగుతున్నప్పుడు పార్టీ రంగులపై ఎన్నికల కమిషన్ లేవనెత్తున్న అభ్యంతరాల్లో అర్థం లేదన్నారు. ఎన్నికల నియమావళిలో ఓ పథకంపై పూర్తిగా నిషేధం విధించాలని ఎక్కడా లేదని తెలిపారు. సంచార వాహనాల రంగులపైనే కమిషన్ అభ్యంతరం ఈ సమయంలో జస్టిస్ బాగ్చీ జోక్యం చేసుకుంటూ.. ‘ఈ పథకం అమలు కన్నా, ఈ పథకం కోసం ఉపయోగిస్తున్న వాహనాలపైనే ఎన్నికల కమిషన్‌కు అభ్యంతరం ఉన్నట్లు కనిపిస్తోంది. వాహనాలపై అధికార పార్టీ రంగులను పోలిన రంగులు ఉండటంపై ఎన్నికల కమిషన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వివరణ కోరింది. అంతే తప్ప ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. అందువల్ల మీ వాదన విని, తగిన నిర్ణయం తీసుకునేందుకు ఇరుపక్షాలకు కొంత గడువునిస్తాం’ అని తెలిపారు. తర్వాత ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీ కుమార్ వాదనలు వినిపిస్తూ, ఇంటింటికీ రేషన్ పథకం ఉపయోగాలను, పేదలకు ఆ పథకం అవసరాన్ని ఎన్నికల కమిషన్ పరిగణనలోకి తీసుకుందని తెలిపారు. అయితే ఈ పథకం అమలు కోసం ఉపయోగిస్తున్న సంచార వాహనాలపై అధికార పార్టీ రంగులను పోలిన రంగులు ఉన్నాయంటూ కమిషన్‌కు అనేక ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. అందువల్ల తుది నిర్ణయం తీసుకునేంత వరకు పథకం అమలును వాయిదా వేయాలని కమిషన్ తెలిపిందన్నారు. అధికారుల ద్వారా అమలు మేలు.. ప్రవర్తనా నియమావళి నిబంధనలను పరిశీలిస్తే.. కొత్త పథకాలపై, ఇప్పటికే కొనసాగుతున్న పథకాలపై ఎన్నికల కమిషన్ నిషేధం విధించడాన్ని తప్పుపట్టలేమని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఇదే సమయంలో కమిషన్ ఓ పథకంపై నిషేధం విధించేటప్పుడు, ఆ పథకం స్వభావం ఏంటి.. పథకం అమలు ఏ దశలో ఉంది.. పథకం కొనసాగింపు అవసరం ఎంత వరకు ఉంది.. పథకం అమలు లేదా వాయిదా ప్రజా ప్రయోజనాలకు విరుద్ధం అవుతుందా.. ఇలా పలు అంశాలను పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా ప్రయోజనాల నిమిత్తం అలాంటి పథకాలపై పూర్తి నిషేధం విధించడం కన్నా, ఆ పథకాలను ఎలాంటి రాజకీయ ప్రమేయం, రాజకీయ నేతల ప్రమేయం, అభిమానుల ఉత్సవాలు వంటివి లేకుండా, అధికారుల ద్వారా అమలు చేయించడంపై కమిషన్ నిర్ణయం తీసుకోవడం మేలన్నారు. ఈ పథకం ప్రజల ప్రయోజనార్థం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకమన్న దాంట్లో ఎలాంటి సందేహం లేదన్నారు. ప్రభుత్వ ఆందోళనను విస్మరించడానికి వీల్లేదు.. ‘ఆహార హక్కు, పౌష్టికాహార హక్కును ఈ దేశంలో ప్రతీ పౌరునికి రాజ్యాంగం ప్రసాదించింది. ఇదే సమయంలో ఎన్నికలను స్వేచ్ఛగా, ప్రశాంతంగా, నిష్పాక్షికంగా నిర్వహించాల్సిన బాధ్యతను కూడా ఎన్నికల కమిషన్‌కు రాజ్యాంగం కట్టబెట్టింది. ఈ రెండింటి మధ్య సమతుల్యం ఎలా చేయాలన్నది ఎన్నికల కమిషన్ మొదటగా నిర్ణయం తీసుకోవాలి. కమిషన్ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకునే, ఇంటింటికీ రేషన్ పథకం అమలును నిలిపేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని పరిధి దాటి తీసుకున్న నిర్ణయంగా, పక్షపాత నిర్ణయంగా, దురుద్దేశపూరిత నిర్ణయంగా చెప్పలేం. అయితే కమిషన్ నిర్ణయం వల్ల నిత్యావసరాలను ఆకలితో అలమటిస్తున్న వారికి అందచేయకపోవడంపై ప్రభుత్వం వ్యక్తం చేస్తున్న ఆందోళనను ఎంత మాత్రం విస్మరించడానికి వీల్లేదు’ అని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి పొందడానికి ఈ పథకాన్ని తీసుకురాలేదన్న అడ్వొకేట్ జనరల్ వాదనను న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో ప్రస్తావించారు. నోటిఫికేషన్ జారీ చేసినప్పటి నుంచి ఎన్నికల ప్రక్రియకు ఎన్నికల కమిషన్ రథసారథి అవుతుందని, ప్రస్తుతం అమలవుతున్న పథకాలు, కొత్త çపథకాల అమలుతో సహా ప్రతీ ప్రభుత్వ చర్యను పర్యవేక్షించవచ్చని జస్టిస్ బాగ్చీ తెలిపారు. ఆ పథకాలు రాజకీయ లబ్ధి కోసం కాకుండా పేదల ప్రయోజనం కోసం అమలయ్యేలా ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేయవచ్చన్నారు. -
ఏపీ: ముగిసిన తొలి విడత నామినేషన్లు
సాక్షి, అమరావతి: తొలి విడత ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీల్లో నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఆదివారం సా.5 గంటలతో ముగిసింది. విజయనగరం జిల్లా మినహా మిగిలిన 12 జిల్లాల్లో మొదటి విడతలో 3,249 గ్రామ పంచాయతీలకు, 32,504 వార్డు పదవులకు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే.. మొత్తం నామినేషన్ల సంఖ్యపై స్పష్టత రానందున రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) కార్యాలయం ఆ సంఖ్యను వెల్లడించలేదు. ఇక సోమవారం ఉ.8 గంటల నుంచి నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ) కార్యక్రమం ప్రారంభమవుతుంది. దీనిపై అభ్యంతరాలుంటే ఫిబ్రవరి 2వ తేదీ సా.5 గంటల వరకు సంబంధిత ఆర్డీవోల వద్ద తెలియజేయవచ్చు. వాటిపై 3న తుది నిర్ణయం ప్రకటిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 4వ తేదీ మ.3 గంటల వరకు అవకాశం కల్పిస్తారు. ఆ వెంటనే ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామ పంచాయతీల వివరాలతోపాటు పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాలను ఎక్కడికక్కడ సంబంధిత రిటర్నింగ్ అధికారులు ప్రకటిస్తారు. ఒకరి కంటే ఎక్కువమంది అభ్యర్థులు పోటీలో ఉన్నచోట ఫిబ్రవరి 9న ఉ.6.30 నుంచి మ.3.30 వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అదేరోజు సా.4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు. నామినేషన్లు ఆశాజనకం: నిమ్మగడ్డ మొదటి విడత ఎన్నికల్లో పోటీ చేసేందుకు భారీ సంఖ్యలో ఆశావహులు నామినేషన్లు వేయడంపై ఎస్ఈసీ నిమ్మగడ్డ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. జిల్లాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం నామినేషన్లు ఆశాజనకంగా ఉన్నాయన్నారు. -
ఎన్నికల యాప్‌పై రహస్యమెందుకు?
సాక్షి, అమరావతి: ఎన్నికల యాప్‌కు సంబంధించి తలెత్తిన అనుమానాలను వెంటనే నివృత్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ను బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి డిమాండ్ చేశారు. యాప్ వివరాలను ఇంత రహస్యంగా ఉంచాల్సిన అవసరమేమిటో చెప్పాలన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ట్వీట్ చేశారు. ‘కేంద్ర ఎన్నికల సంఘం లాగా ఈ యాప్ ద్వారా అందే ఫిర్యాదులను మీరు పరిగణనలోకి తీసుకుంటారా? సహజంగా ఇలాంటి వ్యవస్థల్ని కేంద్ర ప్రభుత్వ అదీనంలోని నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ గానీ, రాష్ట్ర ప్రభుత్వ ఐటీ విభాగం గానీ నిర్వహిస్తుంటుంది. మరి ఈ ప్రత్యేక యాప్‌ను ఎవరు తయారు చేశారు? ఈ యాప్ విషయాలను ఎందుకు రహస్యంగా ఉంచారు? ఇది ఎన్నికల సెల్ పర్యవేక్షణలో తయారైందా? లేదా? అనే విషయం ప్రకటిస్తే ఇంకా మంచిది. ఇది ఒక రాజకీయ పార్టీ తయారు చేసిన యాప్ అంటూ ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. వాస్తవమేమిటో ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత రాష్ట్ర ఎన్నికల కమిషన్ మీద ఉంది’ అని విష్ణువర్ధన్‌రెడ్డి ట్వీట్ చేశారు. ఉండవల్లి వ్యాఖ్యలు దేశభద్రతకే ముప్పు.. బీజేపీ, ఆర్ఎస్ఎస్పై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అర్థం పర్ధం లేని వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ నేత సుదీష్ రాంబొట్ల విమర్శించారు. శనివారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. ఉండవల్లి వ్యాఖ్యలను ఖండించకపోతే దేశ భద్రతకే ముప్పు వాటిల్లుతుందన్నారు. వివేకానంద, అంబేడ్కర్ రచనలను వక్రీకరించారని.. ఈ అంశాలపై చర్చకు రావాలని ఉండవల్లికి సవాల్ విసిరారు. -
‘ఆ యాప్‌పై ప్రచారం జరుగుతోంది.. క్లారిటీ ఇవ్వండి!’
సాక్షి, అనంతపురం : పంచాయతీ ఎన్నికల యాప్‌పై ఎస్ఈసీ ప్రజలకు క్లారిటీ ఇవ్వాలని, వాస్తవాలు ఏంటో బయటపెట్టాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. శనివారం ట్విటర్ వేదికగా ఆయన స్పందిస్తూ.. ‘‘ పంచాయతీ ఎన్నికల యాప్ గురించి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ గారు వివాదానికి తెరదించండి. ఈ యాప్ విషయంలో వివరాలను రహస్యగా ఉంచాల్సిన అవసరం ఏంటి? యాప్ ఎన్నికల సెల్ పర్యవేక్షణలో ఉందా?.. తయారైందా లేదా అనే విషయం ప్రకటిస్తే ఇంకా మంచిది. ఒక వేళ ఈ యాప్ ఎన్నికల సెల్ పర్యవేక్షణలో ఉంటే.. ఈ ’యాప్’కు రికార్డింగ్ మెసేజ్‌లు, ఫొటోలు, ఫిర్యాదులు పంపవచ్చా? కేంద్ర ఏన్నికల సంఘం లాగా ఈ యాప్ ద్వారా అందే ఫిర్యాదులను మీరు పరిగణిస్తారా?. ( నిమ్మగడ్డ లేఖ.. లక్ష్మణ రేఖ దాటిందా ) సహజంగా ఇలాంటి టెక్నాలజీ వ్యవస్థల్ని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్ఐటీసీ)గానీ, రాష్ట్ర ప్రభుత్వ ఐటీ విభాగం గానీ నిర్వహిస్తుంది. ఈ ఎన్నికల కోసం ప్రత్యేక యాప్‌ను ఎవరు తయారు చేశారు? 3,249 గ్రామాల్లో ఫిబ్రవరి 9వ తేదీన పోలింగ్ జరగబోతుంది. కొందరు దీని మీద ఒక రాజకీయ పార్టీ తయారు చేసిన యాప్ అని ఇప్పటికే సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేస్తున్నారు. వాస్తవం ఏంటో బహిరంగంగా ప్రజలకు వెంటనే తెలియజేయాల్సిన బాధ్యత రాష్ట్ర ఎన్నికల కమిషన్ మీద ఉంది’’ అని పేర్కొన్నారు. -
నిమ్మగడ్డ లేఖ.. లక్ష్మణ రేఖ దాటిందా
సాక్షి, అమరావతి: రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర అధిపతి హోదాలో ఉన్న గవర్నర్ విశ్వభూషణ్‌ను శాసించే రీతిలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ లేఖ రాయడంపై న్యాయ కోవిదులు, నిపుణులు, రాజకీయ పరిశీలకులు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గవర్నర్‌ను ఉద్దేశించి శుక్రవారం రాసిన లేఖలో నిమ్మగడ్డ ఉపయోగించిన భాష, తద్వారా ప్రస్ఫుటమైన భావం తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని, తద్వారా రేఖ దాటారని స్పష్టం చేస్తున్నారు. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తన పనితీరును విమర్శిస్తున్నారని నిమ్మగడ్డ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. అయితే ఆయన అంతటితో ఆగకుండా తన ఫిర్యాదుపై స్పందించి గవర్నర్ ఏం చేయాలో కూడా నిర్దేశించడం కచ్చితంగా పరిధి దాటటమేనని నిపుణులు తేల్చి చెబుతున్నారు. ఆదేశించే అధికారం ఎక్కడిది? ‘ఈ వ్యవహారంపై రాష్ట్ర అడ్వొకేట్ జనరల్‌ను సంప్రదించవద్దు... కేంద్ర అటార్నీ జనరల్‌నే సంప్రదించండి’ అని హుకుం జారీ చేస్తున్నట్లుగా గవర్నర్‌కు చెప్పడమంటే.. తన దృష్టికి వచ్చిన ఓ అంశంపై ఎలా వ్యవహరించాలో గవర్నర్‌కు తెలియదన్నట్లుగా నిమ్మగడ్డ వ్యవహార శైలి ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ‘గవర్నర్ తన దృష్టికి వచ్చిన అంశాలపై ఉన్నతాధికారులు, రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నవారు, నిపుణులను సంప్రదించి తగిన విధంగా స్పందిస్తారు. అది ఆయన విచక్షణాధికారాలకు సంబంధించిన విషయం. కానీ అందులో నిమ్మగడ్డ అనుచిత జోక్యం చేసుకోవడం ద్వారా తన పరిధిని పూర్తిగా అతిక్రమించారు’ అని రాజ్యాంగ నిపుణుడు ఒకరు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర అడ్వొకేట్ జనరల్‌ను సంప్రదించవద్దని, కేంద్ర అటార్నీ జనరల్‌నే సంప్రదించాలని గవర్నర్‌ను ఆదేశించే అధికారం ఎన్నికల కమిషనర్‌కు ఎక్కడిదని వ్యాఖ్యానించారు. ఆనవాయితీ ప్రకారం చూసినా.. ‘నిమ్మగడ్డకు విశ్వాసం లేకుంటే ఆయన సంప్రదించకూడదు. కానీ గవర్నర్ ఎందుకు సంప్రదించకూడదో అర్థం కావడం లేదు. అంటే తనకు విశ్వాసం లేదు కాబట్టి గవర్నర్ కూడా విశ్వసించరాదని ఆదేశించినట్లుగా ప్రవర్తించారు. అడ్వొకేట్ జనరల్‌పై గవర్నర్ తన పరిశీలనతో ఓ అంచనాకు వస్తారు. సంప్రదించాలో లేదో ఆయన నిర్ణయించుకుంటారు. అంతేగానీ తన ఆంతర్యాన్ని గవర్నర్‌పై రుద్దాలని ఎస్ఈసీ భావించడం సరికాదు’ అని ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. సాధారణంగా రాజ్యాంగపరమైన నిబంధనలు, ఇతర అంశాలపై గవర్నర్ తొలుత రాష్ట్ర అడ్వొకేట్ జనరల్‌నే పిలిపించి మాట్లాడటం సంప్రదాయమని గుర్తు చేశారు. చివరిసారిగా చెబుతున్నా.... నిమ్మగడ్డ హుకుం జారీ చేసినట్లుగా ఈ అంశంపై న్యాయస్థానంలో కేసు వేస్తానని గవర్నర్‌ను హెచ్చరించే ధోరణిలో లేఖ రాయడంపై సర్వత్రా విస్తుపోతున్నారు. ‘మీకు చివరిసారిగా చెబుతున్నా..’ అని గవర్నర్‌నుద్దేశించి లేఖలో పేర్కొనడం తీవ్ర అభ్యంతరకరమని రాజ్యాంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ‘మంత్రులకు సూచించండి... నిర్దేశించండి... వారి నుంచి హామీ తీసుకోండి’ అంటూ లేఖ రాయడం గవర్నర్‌ను ఆదేశిస్తున్నట్లుగా ఉందని తేల్చి చెబుతున్నారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మరో రాజ్యాంగబద్ధ పదవిలోనే ఉన్న అడ్వొకేట్ జనరల్‌ను తూలనాడుతూ, అవమానిస్తున్నట్లుగా లేఖలో సంబోధించడం.. చివరకు గవర్నర్‌ను సైతం ఆదేశించేలా లేఖ రాయడం కచ్చితంగా లక్ష్మణ రేఖను దాటటమేని పేర్కొంటున్నారు. -
టీడీపీ మేనిఫెస్టో నిబంధనల ఉల్లంఘనే
సాక్షి, అమరావతి: పార్టీల రహితంగా జరిగే పంచాయతీ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు శుక్రవారం ఫిర్యాదు చేసింది. ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధమని, తక్షణమే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని కోరింది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి, అధికార ప్రతినిధి అంకంరెడ్డి నారాయణమూర్తి, రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి, హైకోర్టు లీగల్ సెల్ ప్రతినిధులు రాజేశ్వర్‌రెడ్డి, మేకల రవికుమార్ ఎన్నికల సంఘం జాయింట్ సెక్రటరీ రామారావును కలిసి లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి మద్దిపాటి వెంకటరాజు ‘పల్లె ప్రగతి–పంచసూత్రాలు’ పేరుతో ప్రచురించిన ఎన్నికల మేనిఫెస్టోను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు గురువారం విడుదల చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందులో ఓటర్లను ప్రభావితం చేసేలా పలు పథకాలు, హామీలు పొందుపర్చారని తెలిపారు. పార్టీ రహితంగా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలని.. పార్టీ గుర్తులు, కరపత్రాలు, ఫ్లెక్సీలు రాజకీయ పార్టీలు వాడకూడదని చట్టం స్పష్టంచేస్తోందని కమిషన్ దృష్టికి వారు తీసుకెళ్లారు. అయితే, టీడీపీ ఇందుకు విరుద్ధంగా మేనిఫెస్టో విడుదల చేయడం నిబంధనలను ఉల్లంఘించడమేనని తెలిపారు. మేనిఫెస్టో వల్ల గ్రామాల్లో రాజకీయ ఉద్రిక్తతలు పెరిగి ఎన్నికల లక్ష్యం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తంచేశారు. మేనిఫెస్టో ప్రతులను పంచాయతీల్లో పంచేందుకు టీడీపీ చేసే ప్రయత్నాలను అడ్డుకోవాలని.. నిబంధనలు ఉల్లంఘించిన చంద్రబాబు, ఆయన అనుచరులపై -
టీడీపీ కుట్రకు యాప్ దన్ను
సాక్షి, అమరావతి: పార్టీలకు అతీతంగా జరగాల్సిన పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం ప్రయోజనాలే లక్ష్యంగా భారీ కుట్రకు పావులు కదులుతున్నాయి. మొదటి నుంచీ తెదేపా అధినేత చంద్రబాబునాయుడి కనుసన్నల్లో పనిచేస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. దీన్లోనూ తన వంతు పాత్ర పోషిస్తున్నారనేందుకు బలమైన ఆధారాలు కనిపిస్తున్నాయి. కరోనా వేళ వ్యాక్సిన్ తీసుకుంటున్న ఉద్యోగుల ప్రాణాలను ఫణంగా పెట్టి ఏకపక్షంగా ఎన్నికల షెడ్యూలు విడుదల చేయటం.. అధికారుల బదిలీలతో పాటు నోటీసులు కూడా ఇవ్వకుండా అధికారుల్ని అభిశంసిస్తూ (సెన్సూర్) ఉత్తర్వులివ్వటం.. ఏకగ్రీవాలను ప్రోత్సహించాల్సింది పోయి వ్యతిరేకించేలా వాŠయ్ఖ్యానించటం చేసిన ఈసీ.. ఈ సారి ఎన్నికలను వెబ్‌కాస్టింగ్ బదులు యాప్ ద్వారా పర్యవేక్షిస్తామంటూ కొత్త ఎత్తుగడకు తెరతీశారు. బుధవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ఎన్నికల వెబ్‌క్యాస్టింగ్ అంశం చర్చకు వచ్చింది. అయితే వెబ్ కాస్టింగ్ క్వాలిటీ బాగుండటం లేదంటూ నిమ్మగడ్డ అసంతృప్తి వ్యక్తంచేశారు. పైపెచ్చు ఎన్నికల ప్రక్రియపై ఫిర్యాదులు చేయడానికి ఒక యాప్ అవసరమన్నారు. దానికి రాష్ట్ర ప్రభుత్వం తాలూకు నిఘా యాప్ ఉంది కదా? అని ఓ అధికారి చెప్పగా... తనకు అది అవసరం లేదని నిమ్మగడ్డ సమాధానమిచ్చారు. ఈ ఫిర్యాదుల కోసం కేంద్ర ఎన్నికల కమిషన్ ఒక యాప్‌ను తీసుకొచ్చిందని, అలాంటిదే తానూ తయారు చేయించానని, దాన్ని వాడతామని ఆయన చెప్పటంతో విస్తుపోవటం అధికారుల వంతయింది. ఎందుకంటే యాప్‌కు సంబంధించి ఆయన ఇతరత్రా ఏ వివరాలూ వెల్లడించలేదు. పైపెచ్చు ఇప్పటిదాకా యాప్ గురించి ఎన్నికల కమిషనర్ కార్యాలయం కూడా ఎలాంటి ప్రకటనా చేయలేదు. అయినా ఎన్నికల ప్రక్రియపై ఫిర్యాదులు చేయడానికి ఎన్నికల కమిషనర్ తన సొంత యాప్‌ను తయారు చేయించటమేంటి? దాన్ని ఇప్పటిదాకా గోప్యంగా ఉంచటమేంటి? ఒకవేళ అలాంటివేవైనా తయారు చేయిస్తే ఇప్పటికే ప్రభుత్వానికి సమాచారమిచ్చి ఉండాలి కదా? ఏ కంపెనీ తయారు చేసింది? ఆ కంపెనీకి ఆ పని ఎవరు అప్పగించారు? ప్రయివేటు కంపెనీల డేటా చౌర్యం ఎన్ని అనర్ధాలకు దారి తీస్తోందో తెలియంది కాదు కదా? అసలు ఎన్నికల కమిషనర్ తనే సొంతంగా తనకు నచ్చిన కంపెనీతో ఇలాంటివి తయారు చేయించొచ్చా? వీటిని ప్రజాస్వామ్య బద్ధంగా జరిగే ఎన్నికల్లో వినియోగించవచ్చా? ఇదేమైనా ఆయన సొంత వ్యవహారమా? అధికారులను వేధిస్తున్న ఈ ప్రశ్నల్లో ఏ ఒక్కదానికీ ఈసీ అయితే జవాబివ్వలేదు. మాటలకు, చేతలకు పొంతనలేని నేపథ్యంలో ఎన్నికల్లో పారదర్శకత కూడా ప్రశ్నార్థకమేనని వస్తున్న వ్యాఖ్యలకు మరింత బలం చేకూరుతున్నట్లవుతోంది. అంతా తెదేపా కనుసన్నల్లోనే... ఎన్నికల కమిషనర్‌గా తీసుకున్న ప్రతి నిర్ణయమూ వివాదాస్పదమవుతుండటం వెనక తెలుగుదేశం ప్రయోజనాలు కాపాడాలన్న ఉద్దేశమే కనిపిస్తోంది. ఈ యాప్ విషయంలోనూ అదే తీరు. పోలింగ్ రోజున తెలుగుదేశం పార్టీ తరపున మాజీ ఇంటిలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వర్రావు, మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ ఈ యాప్ ద్వారా హైదరాబాద్ నుంచి ఎన్నికలను పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారని పేరు వెల్లడి కావటానికి ఇష్టపడని తెలుగుదేశం నాయకుడొకరు చెప్పారు. పైపెచ్చు పార్టీ రహితంగా జరిగే ఈ ఎన్నికల్లో ఏకగ్రీవాలకు అడ్డుకట్ట వేయటానికి చంద్రబాబు ఏకంగా టీడీపీ తరఫున మ్యానిఫెస్టోనే విడుదల చేశారు. తమ పార్టీ వారంతా ఎక్కడికక్కడ నామినేషన్లు వేయాలని పిలుపునిచ్చారు. తమ పార్టీకి బలం లేని గ్రామాల్లోనూ నామినేషన్లు వేయించాలని, ఏకగ్రీవ ఎన్నిక జరిగేందుకు అవకాశం ఉన్న గ్రామాల్లో ఘర్షణలు సృష్టించాలని వ్యూహం పన్నినట్లు సమాచారం. దీనికోసం ఏకంగా ఓ ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే యాప్ గురించి ఎక్కువ వివరాలు వెల్లడించకుండా నిమ్మగడ్డ గోప్యత పాటిస్తున్నారని, పోలింగ్ నాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ యాప్ ద్వారా ఎక్కువ ఫిర్యాదులు చేసేలా... వాటిని సమీక్షించి వారికి అనుకూలమైన నిర్ణయాలు తీసుకునేలా వ్యూహం రచించారని సమాచారం. అందుకనే తాను మరో రెండు నెలల పాటు ఈసీగా పదవిలో ఉండగానే ఎన్నికల ప్రక్రియను జరిపించడానికి ఆయన తొందరపడుతున్నట్లు చెబుతున్నారు. నిజానికి శాసన సభ, లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్ సరళిని పరిశీలించేందుకు భారత ఎన్నికల సంఘం ‘వెబ్ కాస్టింగ్’ ప్రక్రియను విజయవంతంగా అమలు చేస్తోంది. ఇక ఫిర్యాదుల విషయానికొస్తే రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పకడ్బందీగా నిఘా యాప్‌ను నిర్వహిస్తోంది. వీటన్నిటినీ కాదని సొంత యాప్‌ను పెడతానని ఆయన చెప్పటమే విచిత్రమని అధికారులు వాపోతున్నారు. బాబుతో బంధం ఈనాటిది కాదు... గతేడాది రాష్ట్ర ప్రభుత్వానికి కనీస సమాచారం ఇవ్వకుండా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను అర్ధంతరంగా వాయిదా వేయడంతోనే రాష్ట్ర ప్రజలకు ఈసీ నిజ స్వరూపం తెలిసింది. తనకు భద్రత కల్పించాలంటూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు నిమ్మగడ్డ రాసిన ఓ లేఖ టీడీపీ అనుకూల మీడియా సంస్థలో తయారైందంటేనే ఆయనకు వారికి మధ్య ఎంత బలమైన సంబంధాలున్నాయో ఊహించుకోవచ్చు. రాజ్యాంగ పదవిలో ఉన్న ఓ వ్యక్తి కేంద్ర హోం శాఖకు రాసిన లేఖలో ప్రజలెన్నుకున్న ముఖ్యమంత్రిని విమర్శించారు. పైపెచ్చు విచారణలో భాగంగా ఆ లేఖ ఈసీ కార్యాలయంలో తయారైంది కాదని అక్కడి కంప్యూటర్లను పరిశీలించాక ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. ఆ తరవాత కూడా ఆయన తన కంప్యూటర్లను తనకివ్వాలని కోరటం గమనార్హం. ఆ మధ్య హైదరాబాద్‌లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో ప్రతిపక్ష నేత చంద్రబాబుతో సన్నిహితంగా ఉండే ఇద్దరు నేతలతో ఎందుకు భేటీ అయ్యారనేది ఇప్పుడు బయటపడుతున్న కుట్రలకు సజీవ సాక్ష్యమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. చంద్రబాబుకు బినామీగా పేరున్న ఓ మీడియా అధిపతి ఆధ్వర్యంలో పన్నెండేళ్ల క్రితం ఓ ఎల్లో టీవీ ఛానెల్ ప్రారంభమైంది. కొత్తగా ఏర్పడిన ఆ ఛానల్‌కు రేటింగ్ దక్కేందుకు ‘రాజ్‌భవన్‌లో రాసలీలలు’ పేరిట రహస్య కెమెరాలతో చిత్రీకరించిన వీడియో ఫుటేజీ సదురు ఎల్లో టీవీ ఛానల్‌కు మాత్రమే లీక్ అవడం వెనుక కుట్ర దాగి ఉందని అప్పట్లోనే గుప్పుమంది. ప్రస్తుత ఎస్ఈసీ ఆ సమయంలో నాటి గవర్నర్‌కు ప్రత్యేక కార్యదర్శిగా పనిచేశారు. ఇక చంద్రబాబు ప్రభుత్వం నిమ్మగడ్డ కుమార్తెకు భారీగా లబ్ది చేకూర్చిన వైనం ఇప్పటికే బయటపడింది. ‘యాప్’ యమ డేంజర్ – యాప్‌ను పోలింగ్ అధికారులు, ప్రైవేటు వ్యక్తులు కూడా డౌన్లోడు చేసుకోవచ్చు. – ఈ విధానంలో ఫిర్యాదుదారుడు తన ఫిర్యాదుకు అనుకూలంగా ఆడియో, వీడియోలను పంపించే అవకాశం ఉంటుంది. – అంటే జరిగిన సంఘటన జరిగినట్టుగా కాకుండా తమ వాదనకు తగ్గ రీతిలో పంపించవచ్చు. ఫోన్లోని యాప్ ద్వారా ఫిర్యాదు చేస్తున్న వ్యక్తి ఏది అనుకుంటే అది ఫిర్యాదుకు ఆధారంగా పంపించవచ్చు. ఉదాహరణకు ఇద్దరు వ్యక్తులు ఘర్షణ పడితే ఒకరు మాత్రమే దాడి చేసిన దృశ్యాలను యాప్ ద్వారా పంపించొచ్చు. అవతలి వ్యక్తి కూడా దాడి చేసినప్పటికీ ఆ విషయాన్ని రికార్డు చేయకుండా వాస్తవాలను తొక్కిపెట్టవచ్చు. ఇలా ఎన్నో విధాలుగా వాస్తవాలను వక్రీకరిస్తూ అందుకు అనుగుణంగా ఆధారాలను సృష్టించవచ్చు. – అంతే కాదు...యాప్ నిర్వహణను ఎవరైనా ప్రైవేటు సంస్థకు అప్పగిస్తారు. ఆ సంస్థలోని తమ వ్యక్తుల ద్వారా వాస్తవాలను వక్రీకరించవచ్చు.సెంట్రల్ స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదులలో ఎంపిక చేసిన వాటి ఆధారంగా చర్యలు తీసుకుంటే అభ్యంతరం తెలిపే అవకాశం ఉండదు. –యాప్ ద్వారా ఎడిట్ చేసిన వీడియో, ఆడియోలు పంపిస్తే...వాటి ఆధారంగా ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. – అవి ట్యాంపర్ చేసిన వీడియోలు, ఆడియో రికార్డులు అని రుజువు చేయాలంటే వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించాలి. ఇదంతా చాలా పెద్ద ప్రక్రియ. ఇంతలో ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటే సక్రమంగా ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్న అభ్యర్థులు నష్టపోవాల్సి వస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే... ‘వెబ్ కాస్టింగ్ అన్నది ఆబ్జెక్టివ్( పారదర్శక విధానం)...యాప్ సబ్జెక్టివ్ (తమ ఫిర్యాదుకు అనుకూలంగా ఆధారాలు సృష్టించే విధానం). ఇంతటి వివాదాస్పద నిర్ణయానికి కమిషనర్ ఎందుకు తీసుకుంటున్నారన్నది అంతుపట్టనిదేమీ కాదు. అతని వ్యవహారశైలి ముందునుంచి వివాదాస్పదమే. అఖిలభారత సర్వీసు అధికారిగా 23 ఏళ్లుగా నేను ఆయనను గమనిస్తున్నాను. ఓ రాజ్యంగబద్దమైన పదవిలో ఉండటానికి ఎంత మాత్రం అర్హత లేని వ్యక్తి. మళ్లీ చెపుతున్నా వెబ్ కాస్టింగ్ అన్నది ఫ్యాక్ట్, యాప్ అన్నది ట్యాంపర్. –ఓ మాజీ ఐఎఎస్ అధికారి -
పంచాయతీ ఎన్నికల్లో స్వల్ప మార్పులు
సాక్షి,విజయవాడ: పంచాయితీ ఎన్నికలలో స్వల్ప మార్పులు చేసినట్లు గురువారం రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో పేర్కొంది. పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లా కలెక్టర్ల వినతి మేరకు ఎన్నికలు జరగాల్సిన పంచాయితీలలో మార్పులు చేసినట్లు స్పష్టం చేసింది. ప్రకాశం జిల్లాలో ఒంగోలు డివిజన్ లో 20 మండలాలకు గాను 15కు మాత్రమే తొలిదశలో ఎన్నికలు నిర్వహించనుండగా.. మిగిలిన ఐదు మండలాలకు రెండవ దఫాలో ఎన్నికలు జరగనున్నాయి. పంగులూరు, కోరిశపాడు, ఎస్.మాగులూరు, అద్దంకి, బల్లికురవ మండలాలలో పంచాయితీలకి ఫిబ్రవరి 9కి బదులు 13వ తేదీన రెండవ దఫాలో ఎన్నికలు నిర్వహించనున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో గోపాలపురం మండలానికి 3వ దఫాకు బదులుగా 2వ దఫాలోనే ఎన్నికలు నిర్వహించనుండగా.. ఏలూరు డివిజనులోని నాలుగు మండలాలకు నాల్గవ దఫా బదులుగా మూడవ దఫాలోనే ఎన్నికలు జరపనున్నారు. చింతలపూడి, కామవరపుకోట, లింగపాలెం,టి.నర్సాపురం మండలాలలోని పంచాయితీలకి ఫిబ్రవరి 21 బదులు ఫిబ్రవరి 17న మూడవ దఫాలో ఎన్నికలు నిర్వహించనున్నారు. కాగా పశ్చిమలో మిగిలిన మండలాలకు మాత్రం ముందుగా నిర్ణయించిన ప్రకారం నాల్గవ దఫాలో ఎన్నికలు జరపనున్నట్లు ఎస్ఈసీ పేర్కొంది. -
'చంద్రబాబు.. నిమ్మగడ్డల డీఎన్ఏ ఒక్కటే'
సాక్షి, అమరావతి: ప్రభుత్వ నిర్ణయాల పట్ల ఎస్ఈసీ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 'ప్రభుత్వ నిర్ణయాల పట్ల ఎస్ఈసీ కక్షపూరితంగా వ్యవహరిస్తుంది.చంద్రబాబు కుట్రలో నిమ్మగడ్డ భాగస్వామిగా ఉన్నారు. ఎన్నికల విధులను నిమ్మగడ్డ దుర్వినియోగం చేస్తున్నారు. సీనియర్ అధికారుల పట్ల ఎస్ఈసీ వాడిన భాష సరికాదు. తన పరిధిలో లేని అంశాలను ప్రస్తావిస్తూ నిమ్మగడ్డ లేఖ రాశారు.అధికార యంత్రాంగాన్ని అస్థిరపరచాలని ఎస్ఈసీ చూస్తున్నారు. చంద్రబాబు, నిమ్మగడ్డ డీఎన్ఏ ఒక్కటే. నిమ్మగడ్డ ఎస్ఈసీగా ఉండటం రాష్ట్రం ఖర్మ. దేశవ్యాప్తంగా జనవరి 16న సీఈసీ ఓటర్ల జాబితా విడుదల చేసింది..గ్రామాల వారీగా ఓటర్ల జాబితా సిద్ధం చేయాలంటే కనీసం 2 నెలలు పడుతుంది. 2 నెలల తర్వాత కానీ ఎన్నికలు జరపలేమని నిమ్మగడ్డకు కూడా తెలుసు.. అందుకే అధికారులపై ఆరోపణలు చేస్తున్నారు. చదవండి: పంచాయతీ ఎన్నికలు: రాజుకుంటున్న వేడి! అడ్డగోలుగా ఇచ్చిన ఆర్డర్స్‌ను అమలు చేయలేం.. ఉద్యోగులు, అధికారుల్లో నిమ్మగడ్డ టెర్రర్ క్రియేట్ చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికలు పార్టీలకతీతంగా జరుగుతాయి. ఎన్నికల్లో ప్రభుత్వంపై బురద చల్లాలని చూస్తున్నారు. చంద్రబాబు నిర్ణయాలను నిమ్మగడ్డ అమలు చేస్తున్నారు. ఎస్ఈసీ కేవలం సిఫారసు మాత్రమే చేయగలరు... అడ్డగోలుగా ఇచ్చిన ఆర్డర్స్‌ను ప్రభుత్వం అమలు చేయదు. అధికారులెవరు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలి. అధికారుల విషయంలో నిమ్మగడ్డ చేసిన దాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. మా అధికారులను రక్షించుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మహా అయితే ఈ కొద్దీ రోజులు డ్యూటీ నుంచి పక్కన పెట్టొచ్చు. ఆ రోజు ఇదే చంద్రబాబు.. ఇదే ద్వివేదిని ఛాంబర్ లోకి వెళ్లి ఈసీ అంటే పెద్దాదా అని ప్రశ్నించారు. ఇప్పుడు మరో రకంగా వ్యవహరిస్తున్నారు. చదవండి: ఎన్నికలకు ఏమాత్రం భయపడం: సజ్జల ఏకగ్రీవాలు కొత్తగా జరుగుతున్నాయా? ఏకగ్రీవాలను ప్రోత్సహించాల్సింది పోయి...ఒక్క ఓటు ఉన్నా నామినేషన్ వేయాలి అని చంద్రబాబు అనడం దేనికి సంకేతం? పార్టీ రహితంగా ఉన్న ఎన్నికల్లో ఆయన ఎందుకు అంత ఘీంకరించడం? ఏకగ్రీవాలు కొత్తగా జరుగుతున్నాయా? గతంలో కూడా జరిగాయి కదా.. ఎప్పుడైతే నిమ్మగడ్డ పక్షపాతంగా వ్యవహరిస్తున్నపుడే ఆయనపై గౌరవం పోయింది. ఎప్పుడు ఈ పీడ వదులుతుందో తెలియదు కానీ... అద్దంలో ముఖం చూసుకుంటే దెయ్యం కనపడుతుంది. 20 రోజుల తర్వాత ఆ పార్టీ సమాధి కావడం ఖాయం. ఈలోగా ఉద్యోగులు, అధికారుల్లో అభద్రత పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీ వెంట ప్రభుత్వం ఉంది..ఇలాంటి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎస్ఈసీ ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కు పంపనున్నాం.. అధికారులను క్రిమినల్ పరువు నష్టం వేయాల్సిందిగా సూచిస్తున్నామంటూ' తెలిపారు. -
గోపాలకృష్ణ, గిరిజాశంకర్‌ల బదిలీ!
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ సూచన మేరకు పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ, కమిషనర్ గిరిజా శంకర్లను బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే, గుంటూరు, చిత్తూరు కలెక్టర్లను, తిరుపతి పట్టణ ఎస్పీని బదిలీ చేయడంతో పాటు కొత్తవారి నియామకం నిమిత్తం మూడేసి పేర్లతో ప్యానల్ పంపాల్సిందిగా ఎస్ఈసీ కోరినందున ఈ మేరకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే, వీరిలో ఎస్ఈసీ సూచించిన వారిని ఆ విధుల్లో నియమించాలని కూడా నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ కావాల్సి ఉంది. -
ఫిబ్రవరి 9 తొలిదశ పోలింగ్
సాక్షి, అమరావతి: రాష్ట ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) పంచాయతీ ఎన్నికల షెడ్యూలును సవరించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ సోమవారం నోటిఫికేషన్లు జారీచేసి ఎన్నికల ప్రక్రియ పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 5కు బదులు 9న ఎన్నికలు ప్రారంభమవుతాయి. ఈనెల 25న మొదటి దశ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ప్రారంభించి నాలుగు దశల్లో వచ్చేనెల 17 నాటికి ఎన్నికలు ముగిస్తామని నిమ్మగడ్డ ఈనెల 23న ప్రకటించి నోటిఫికేషన్ జారీచేశారు. అయితే, ఎన్నికల నిర్వహణకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు జరగనందున మొదటి దశ ఎన్నికలను చివరి దశకు మారుస్తూ రీ షెడ్యూలు చేశారు. కోవిడ్–19 వ్యాక్సినేషన్ జరుగుతున్నందున ఎన్నికలను వాయిదా వేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయడం, అలాగే.. సమయం లేకపోవడంవల్ల జిల్లాల్లో మొదటి దశ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు జరగలేదు. కానీ, ఎన్నికలు నిర్వహించాల్సిందేనని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించడంతో సోమవారం రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను రీషెడ్యూలు చేసినట్లు ఎస్ఈసీ ఉత్తర్వులు జారీచేసింది. పాత నోటిఫికేషన్ ప్రకారం ఫిబ్రవరి 5, 9, 13, 17 తేదీల్లో నాలుగు దశల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. సవరించిన షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరి 9, 13, 17, 21 తేదీల్లో జరుగుతాయి. ఫిబ్రవరి 17తో ముగియాల్సిన ఎన్నిక ప్రక్రియ 21తో ముగుస్తుంది. పాత నోటిఫికేషన్ ప్రకారం ఫిబ్రవరి 5న జరగాల్సిన తొలి దశ ఎన్నికలు సవరించిన షెడ్యూలు ప్రకారం చివరి దశలో ఫిబ్రవరి 21న జరుగుతాయి. అలాగే, రెండో దశ ఎన్నికలు సవరించిన షెడ్యూల్ ప్రకారం మొదటి దశలో జరుగుతాయి. మూడో దశవి రెండో దశగానూ, నాలుగో దశవి మూడో దశగానూ జరుగుతాయి. కాగా, కోర్టు కేసులు ఉన్న.. పరిపాలనా, న్యాయపరమైన కారణాలవల్ల ఎన్నికల నిర్వహణకు వీల్లేని గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్లు జారీచేయరాదని ఎస్ఈసీ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సవరించిన షెడ్యూలు ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లోని 51 రెవెన్యూ డివిజన్ల పరిధిలో నాలుగు దశల్లో ఈ ఎన్నికలు జరుగుతాయి. కొన్ని రెవెన్యూ డివిజన్ల పరిధిలోని కొన్ని మండలాల్లో ఒక దశలోనూ, మరికొన్ని మండలాల్లో మరో దశలోనూ ఎన్నికలు జరుగనున్నాయి. ► తొలి దశ కింద 18 రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 173 మండలాల్లో ఫిబ్రవరి 9న పోలింగ్ జరుగుతుంది. ► రెండో దశలో 18 రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 169 మండలాల్లో 13న.. ► మూడో దశలో 19 రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 171 మండలాల్లో 17న.. ► నాలుగో దశలో 14 రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 146 మండలాల్లో 21న పోలింగ్ జరుగుతుంది. -
సమన్వయంతో పనిచేయాలి
సాక్షి, న్యూఢిల్లీ: పంచాయతీ ఎన్నికల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం సమన్వయంతో పనిచేయాలని సుప్రీంకోర్టు సూచించింది. పంచాయతీ ఎన్నికల విషయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిర్ణయాన్ని సమర్థిస్తూ హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ రుషీకేష్ రాయ్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఎన్నికల వాయిదాకు నిరాకరించింది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల వివాదంలో, ఎన్నికల కమిషనర్ నిర్ణయాల్లో జోక్యం చేసుకోబోమని పేర్కొంది. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తూ.. ఈ నెల 16న ప్రారంభమైన కరోనా వ్యాక్సినేషన్లో భాగంగా లక్షలాది మంది ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు టీకా ఇవ్వాల్సిన ప్రక్రియ పూర్తికాక ముందే ఎన్నికల నిర్వహణ సరికాదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతుండగా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని అన్నారు. కరోనా వ్యాక్సిన్ భద్రత, పకడ్బందీ పంపిణీ బాధ్యత పోలీసులదేనని, వారికి ఫిబ్రవరి తొలివారంలో వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉందని తెలిపారు. వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, ఉపాధ్యాయులు.. ఇలా ఎన్నికలతో ముడిపడి ఉన్న అనేక మంది సిబ్బందికి వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉందన్నారు. ఎన్నికల విధుల్లో పాలుపంచుకోబోయే 94 వేల మంది పోలీసులు సహా ఐదు లక్షల మంది సిబ్బందికి వ్యాక్సిన్ వేయాల్సి ఉందన్నారు. ఎన్నికలు, వ్యాక్సినేషన్ ముఖ్యమేనన్న హైకోర్టు.. ఆ రెండింటిలో ఏది ముందు జరపాలి అన్న విషయాన్ని స్పష్టంగా చెప్పలేదని, వ్యాక్సినేషన్ కాకుండా ఎన్నికల విధుల్లో పాల్గొనాలని పోలీసులకు చెప్పలేం కదా అని ముకుల్ రోహత్గి కోర్టుకు తెలిపారు. వాస్తవాలు వివరిస్తున్నాం.. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఇలాగే కోర్టుకు వస్తున్నారని ధర్మాసనం వ్యాఖ్యానించగా.. వాస్తవం వివరిస్తున్నామని ముకుల్ రోహత్గి తెలిపారు. దేశంలో ఎక్కడా ఎన్నికలు జరగడం లేదా అని ధర్మాసనం ప్రశ్నించగా.. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఓ పద్ధతిగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని రోహత్గి వివరించారు. విజయవంతంగా వ్యాక్సినేషన్ పూర్తి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. హెల్త్ వర్కర్స్కు జనవరి చివరికల్లా వ్యాక్సినేషన్ పూర్తవుతుందని, ఆ తర్వాత కనీసం నాలుగు వారాలు సమయం ఇచ్చి.. మార్చి 1 నుంచి ఎన్నికల నిర్వహణ చేపట్టేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. తాము ఏ కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకం కాదని వ్యాక్సినేషన్ నేపథ్యంలోనే వాయిదా కోరుతున్నామని ధర్మాసనానికి తెలిపారు. ప్రతి ఒక్కరి విధుల్ని మేం నిర్ణయించలేం జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ స్పందిస్తూ.. ‘వాస్తవ పరిస్థితి వేరేలా ఉండి ఉండొచ్చు. కానీ, మహమ్మారి సమయంలోనూ కేరళలో ఎన్నికలు జరిగాయి. ప్రతి ఒక్కరి విధులను మేం నిర్ణయించలేము. కొన్ని నిర్ణయాలు ఎన్నికల కమిషనర్ తీసుకోవాల్సి ఉంటుంది’ అని అభిప్రాయపడ్డారు. ఎన్జీవోల తరఫు సీనియర్ న్యాయవాది పరాగ్ త్రిపాఠి వాదనలు వినిపిస్తూ.. మూడు వారాల పాటు ఎన్నికలు వాయిదా వేయాలని కోరారు. కేరళలో ఎన్నికల అనంతరం కేసులు పెరిగిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ వ్యవహారంలో ఇతరుల జోక్యం తగదన్న ధర్మాసనం.. అథారిటీల మధ్య ఇగో వల్లనే ఈ పరిస్థితికి (లాలెస్‌నెస్) కారణంగా భావిస్తున్నామని పేర్కొంది. మూడు వారాలు వాయిదా వేయాలని పరాగ్ చేసిన విజ్ఞప్తిని కూడా ధర్మాసనం తోసిపుచ్చింది. పిటిషన్‌ను కొట్టివేస్తున్నామని పేర్కొంది. వైద్యుల తరఫు సీనియర్ న్యాయవాది సాజన్పూవయ్య వాదనలు ప్రారంభించగా.. వైద్యులంటే గౌరవం ఉందని, కానీ అందరిలాగానే వాయిదా కోరుతున్నారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఉద్యోగుల తరఫున సీనియర్ న్యాయవాది బీహెచ్ మర్లపల్లే వాదనలు ప్రారంభిస్తుండగా.. ఉద్యోగుల వైఖరిని ధర్మాసనం తప్పుపట్టింది. బహిరంగ ప్రకటనలు చేయడం సరికాదని పేర్కొంది. మార్చిలో ఎన్నికలు నిర్వహించాలని మర్లపల్లే విజ్ఞప్తి చేశారు. అసలు ఉద్యోగుల జోక్యమే సరికాదని పేర్కొన్న ధర్మాసనం పిటిషన్లు కొట్టివేస్తున్నట్లు పేర్కొంది. -
ఎన్నికలు.. వ్యాక్సినేషన్.. ఏకకాలంలో ఎలా?
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్రంలో ప్రారంభించిన కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పంచాయతీ ఎన్నికలు.. ఒకేసారి రెండూ ఎలా నిర్వహించాలో మార్గనిర్దేశం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఒకవైపు ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 16న దేశవ్యాప్తంగా ప్రారంభించిన కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం రాష్ట్రంలో చురుగ్గా కొనసాగుతోందని పేర్కొంది. మరోవైపు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్‌తోపాటు న్యాయస్థానాల మార్గదర్శకాల నేపథ్యంలో రాష్ట్రంలో త్వరలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని నివేదించింది. ఈ రెండు లక్ష్యాలను ఏకకాలంలో ఎలా సాధించాలో మార్గదర్శనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్‌కు సోమవారం లేఖ రాశారు. అందులో ముఖ్యాంశాలు ఇవీ... వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతోంది ‘ప్రధాని నరేంద్రమోదీ ఈనెల 16న దేశవ్యాప్తంగా ప్రారంభించిన కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్‌లో కూడా కొనసాగుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో 3.8 లక్షల మంది ఫ్రంట్‌లైన్ ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సినేషన్ పూర్తి చేశాం. తరువాత 73,188 మంది పోలీసు సిబ్బందితోపాటు మరో 7 లక్షల మంది ఫ్రంట్‌లైన్ ఉద్యోగులకు వ్యాక్సినేషన్ చేయించాల్సి ఉంది. పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ విభాగాలతోపాటు ఫ్రంట్‌లైన్ ఉద్యోగులకు 2,041 ప్రదేశాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించాం. వ్యాక్సిన్లూ వారికే... ఎన్నికల విధులూ వారే ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించి ప్రక్రియ ప్రారంభించింది. రాష్ట్రంలో దాదాపు 1,35,000 పోలింగ్ కేంద్రాలుండగా ఐదు లక్షల మందికిపైగా పోలీసు, పంచాయతీరాజ్, రెవెన్యూ, విద్యా శాఖ ఉద్యోగులను ఎన్నికల విధులకు నియోగించాల్సి ఉంది. వారందరూ కోవిడ్ నియంత్రణలో ఫ్రంట్లైన్లో ఉన్నవారే. అదే ఫ్రంట్‌లైన్ ఉద్యోగులను ఎన్నికల విధుల కోసం వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న పోలింగ్ కేంద్రాల్లో నియోగించాల్సి ఉంది. పోలీసు సిబ్బంది విషయంలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది. రాష్ట్రంలో 73,188 మంది మాత్రమే ఉన్న పోలీసు సిబ్బంది 1,35,000 పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంది. వారిలోనే కొంతమందిని ఎన్నికల నియమావళి పరిశీలన, నాన్ బెయిలబుల్ వారంట్ల జారీ లాంటి విధుల్లో నియోగించాల్సి ఉంది. దీంతో ఒక్కొక్కరికి సగటున వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న మూడేసి పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల విధులు కేటాయించాల్సిన పరిస్థితి నెలకొంది. ఎన్నికల కమిషన్ నియమావళి ప్రకారం పోలింగ్ సిబ్బందిని వారు పనిచేస్తున్న, నివసిస్తున్న ప్రాంతాలకు దూరంగా ఉన్న కేంద్రాల్లో విధులు కేటాయించాలి. పనిచేసే చోట వ్యాక్సిన్... మరోచోట విధులు పోలింగ్ విధుల కోసం పెద్ద ఎత్తున అధికారులు, సిబ్బందిని తరలించడంలో పలు సమస్యలు తలెత్తనున్నాయి. ఉద్యోగులకు ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న ప్రదేశాల్లోనే వ్యాక్సినేషన్ వేయాల్సి ఉంది. కానీ ఉద్యోగులను పోలింగ్ విధుల కోసం ఇతర ప్రాంతాలకు తరలిస్తే వారికి వ్యాక్సినేషన్ సాధ్యపడదు. కోవిడ్ వ్యాక్సిన్ మొదటి డోసు ఒక కేంద్రంలో తీసుకున్న సిబ్బంది రెండో డోసు కోసం అదే కేంద్రంలో అందుబాటులో ఉండరు. ఆ తరువాత వారిని కొంతకాలం వైద్య, ఆరోగ్య సిబ్బంది పర్యవేక్షణలో ఉంచడం సాధ్యం కాదు. ఏఈఎఫ్ఐ (యాంటీ ఎఫెక్ట్స్ ఫాలోయింగ్ ఇమ్యూనైజేషన్) ప్రోటోకాల్ ప్రకారం వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఎలాంటి అవాంఛనీయ సమస్యలు తలెత్తకుండా పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో ఒకరు, దేశంలో మరికొందరు వ్యాక్సిన్ తీసుకున్న వారు మృత్యువాత పడ్డారన్న విషయం మీకు తెలిసిందే. వ్యాక్సిన్ తీసుకున్నవారు ఎలాంటి ఒత్తిడికి గురి కాకూడదు, ప్రశాంత వాతావరణంలో ఉండాలి, వైద్య ఆరోగ్య సిబ్బంది పరిశీలనలో ఉంచాలని కోవిడ్ ప్రోటోకాల్ సూచిస్తోంది. ఎలా చేయాలో మీరే చెప్పండి.. హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. హైకోర్టు ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు, కోవిడ్ వ్యాక్సిన్ రెండూ నిర్వహించాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఓవైపు పంచాయతీ ఎన్నికల నిర్వహణ, మరోవైపు కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కొనసాగించడం అనే రెండు లక్ష్యాలను సాధించడం ఎలాగో రాష్ట్ర ప్రభుత్వానికి మార్గనిర్దేశం చేయాల్సిందిగా కోరుతున్నా. -
రచ్చ చేయడం మానేయండి: ముద్రగడ
సాక్షి, తూర్పుగోదావరి: రాష్ట్ర ప్రభుత్వం పట్ల రాష్ట్ర ఎన్నికల సంఘం అనుసరిస్తున్న వైఖరిపై మాజీ ఎంపీ, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం విచారం వ్యక్తం చేశారు. ఉద్యోగంలో ఉండి రాజకీయాలు చేయడం మంచిది కాదని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు హితవు పలికారు. ఇటువంటి పరిస్థితి భారతదేశంలోనే మొదటిసారి చూస్తున్నా అంటూ ఆయన వ్యవహారశైలిని విమర్శించారు. ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేయండి.. అవకాశం ఉంటే సలహాలు ఇవ్వాలని సూచించారు.(చదవండి: ‘పంచాయతీ’: ఒట్టు.. ఇదీ లోగుట్టు!) అదే విధంగా అదృశ్య శక్తి ఎవరో వెనక ఉండి నిమ్మగడ్డను నడిపిస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై నిమ్మగడ్డ చేస్తున్నదాడిని మీడియా ద్వారా చూస్తున్నానని.. రాష్ట్రంలో పరిస్థితిని బట్టి ఎన్నికలు నిర్వహించేందుకు ప్రయత్నాలు చేయాలే తప్ప రాజకీయ నాయకులలాగా పట్టుదలకు పోవడం మంచిగా లేదన్నారు. రచ్చ చేయడం మానేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ముద్రగడ పద్మనాభం నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు లేఖ రాశారు. (చదవండి: నేడు సుప్రీంకోర్టులో ‘పంచాయతీ’ ) -
ఎన్నికల కమిషన్ నిర్ణయంతో.. 3 లక్షల మందికి నష్టం
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికలను 2019 ఓటర్ల జాబితా ఆధారంగా నిర్వహించడంవల్ల దాదాపు 3 లక్షల మంది తమ ఓటు హక్కును కోల్పోతున్నారని.. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని ఎన్నికల కమిషన్‌కు తగిన ఆదేశాలు జారీచేయాలని కోరుతూ హైకోర్టులో సోమవారం పిటిషన్ దాఖలయ్యే అవకాశం ఉంది. గుంటూరు జిల్లాకు చెందిన విద్యార్థిని ధూళిపాళ్ల అఖిల ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేయనున్నారు. కొత్తగా ఓటు హక్కు వచ్చిన తమకు దానిని వినియోగించుకునే అవకాశం కల్పించకపోవడం రాజ్యాంగ విరుద్ధమని న్యాయస్థానానికి అఖిల నివేదించనున్నారు. ఎన్నికల కమిషన్ నిర్ణయంవల్ల తనలాగా కొత్తగా ఓటు హక్కు వచ్చిన 3 లక్షల మంది నష్టపోతారని వివరించనున్నారు. 18ఏళ్లు నిండిన వారికి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని రాజ్యాంగంలోని అధికరణ 326 కల్పిస్తోందని తెలుపనున్నారు. అందువల్ల ఈ విషయంలో జోక్యం చేసుకుని ఎన్నికల నోటిఫికేషన్ అమలును నిలిపేస్తూ ఉత్తర్వులివ్వాలని ఆమె కోరనున్నారు. -
క్యాంపులు నిర్వహించొద్దు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల నేపథ్యంలో ఏ రాజకీయ పార్టీ లేదా అభ్యర్థి, ఎన్నికైన ప్రతినిధులతో ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగాగానీ ఎలాంటి క్యాంపులు(శిబిరాలు) నిర్వహించొద్దని రాష్ట్ర ఎన్నికల కమిషన్(ఎస్ఈసీ) స్పష్టం చేసింది. లంచం లేదా ప్రలోభాలకు గురిచేయొద్దని, రాజకీయ పార్టీలు, మేయర్ / డిప్యూటీ మేయర్ వంటి పదవులను ఆశిస్తున్న వారు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అక్రమపద్ధతులు పాటించడం, ప్రోత్సహించడం చేయొద్దని పేర్కొంది. జీహెచ్ఎంసీ చట్టం, భారత శిక్షాస్మృతి(ఐపీసీ)లలోని నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహణ ప్రారంభసమయానికి 48 గంటల ముందు నుంచి ఎలాంటి ప్రచారం లేదా ప్రచార కార్యకలాపాలు చేపట్టవద్దని, ఈ నిషేధం ఈ ఎన్నికలు పూర్తయ్యేవరకు కొనసాగుతుందని స్పష్టం చేసింది. శనివారం ఈ మేరకు ప్రత్యేక ప్రవర్తనా నియమావళిని ఎస్ఈసీ జారీ చేసింది. ప్రభావితం చేయొద్దు..: రాజకీయపార్టీలు జారీ చేసిన విప్‌లకు వ్యతిరేకంగా ఓటు చేసే విధంగా ఎన్నికైన సభ్యులను ప్రభావితం చేయవద్దని ఎస్ఈసీ తెలిపింది. రాజకీయ పార్టీలు, ఆ పార్టీల అభ్యర్థుల్లో ఎవరైనాగానీ పరోక్ష ఎన్నికల్లో ఓటర్లు వారి ఓటుహక్కులను వినియోగించే సందర్భంలో వారిని ప్రలోభపరచడానికి ప్రయత్నించొద్దని తెలిపింది. ఏదైనా రాజకీయపార్టీ, మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు పోటీ పడుతున్నవారు ఓటర్లు, వారి ఓటింగ్ హక్కులను వినియోగించుకునే సందర్భంలో పార్టీ విప్‌ను ధిక్కరించేందుకుగాను ప్రోత్సాహకంగా వారికి ఎలాంటి పదవిని ఇవ్వజూపొద్దని పేర్కొంది. అధికార పార్టీ లేదా ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు/అధికారులు సర్టిఫికెట్లు, లైసె న్సులు, కాంట్రాక్టు పనులు, పెండింగ్ కేసులను ఎత్తివేయడం, పెండింగ్ బిల్లులు చెల్లించడం, కాంట్రాక్టుల పునరుద్ధరణ, ఇతర ప్రోత్సాహకాలు, ఇతర పద్ధతుల్లో దుర్వినియోగానికి ప్రయత్నిం చొద్దని స్పష్టం చేసింది. ఎన్నికల సందర్భంగా ప్రత్యర్థులపై విచారణ సం స్థల ద్వారా కేసుల నమోదు లేదా చార్జి షీట్ల దాఖలు/రూపకల్పన, అరెస్టులు, నాన్ బెయిలబుల్ వారెంట్లు వంటి వాటి అమలులో పక్షపాతానికి పాల్పడవద్దని పేర్కొంది. -
అటు ఎన్నికలు.. ఇటు వ్యాక్సినేషన్ రెండూ ముఖ్యమే
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికల నిర్వహణ నిమిత్తం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ నెల 8న జారీ చేసిన షెడ్యూల్ అమలును నిలిపివేస్తూ సింగిల్ జడ్జి జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం రద్దు చేసింది. రాష్ట్ర ప్రజలకు అటు ఎన్నికలు.. ఇటు కోవిడ్ వ్యాక్సినేషన్ రెండూ అత్యంత ముఖ్యమేనని ధర్మాసనం స్పష్టం చేసింది. అందువల్ల వాటిని ప్రశాంతంగా, విజయవంతంగా పూర్తి చేసేందుకు కృషి చేయాలని సూచించింది. ఎన్నికల షెడ్యూల్‌ను నిలిపివేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఎన్నికల కమిషన్ దాఖలు చేసిన అప్పీల్‌ను ధర్మాసనం అనుమతించింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. కాగా ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తీర్పులో సవివరంగా పరిణామాలు పంచాయతీ ఎన్నికల నిర్వహణ నిమిత్తం ఎన్నికల కమిషన్ జారీ చేసిన షెడ్యూల్‌ను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి ఎన్నికల షెడ్యూల్ అమలును నిలిపివేస్తూ ఈ నెల 11న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయగా దీన్ని సవాలు చేస్తూ ఎన్నికల కమిషన్ రిట్ అప్పీల్ దాఖలు చేసింది. ఈ అప్పీల్‌పై విచారణ జరిపిన సీజే నేతృత్వంలోని ధర్మాసనం ఈ నెల 19న తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా సీజే ధర్మాసనం గురువారం 38 పేజీల తీర్పును వెలువరించింది. 2018లో ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పు మొదలు ఇటీవల సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల వరకు స్థానిక ఎన్నికల విషయంలో హైకోర్టులో జరిగిన పరిణామాలన్నింటినీ ధర్మాసనం తీర్పులో సవివరంగా పొందుపరిచింది. ఎన్నికలను నిర్వహించడం సాధ్యమవుతుందా? వేగంగా నిర్వహించడం సాధ్యమవుతుందా? తదితర అంశాలపై అంతిమ నిర్ణయం తీసుకోవాల్సింది ఎన్నికల కమిషనేనని కిషన్‌సింగ్ తోమర్ కేసులో సుప్రీంకోర్టు ప్రస్తావించిందని ధర్మాసనం తెలిపింది. ఎన్నికల కమిషన్ తన విచక్షణాధికారాన్ని సక్రమంగా ఉపయోగిస్తుందని భావించాలే కానీ వక్రబుద్ధితో చూడటానికి వీల్లేదని మొహీందర్ గిల్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ధర్మాసనం ప్రస్తావించింది. సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో ఆ వివరణ లేదు ‘రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసిందని సింగిల్ జడ్జి తన ఉత్తర్వులో పేర్కొనడం సరికాదు. రాష్ట్ర ప్రభుత్వంతో ఎన్నికల కమిషన్ సంప్రదింపులు జరిపింది. ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం వ్యక్తం చేసిన అభిప్రాయాలతో ఎన్నికల కమిషనర్ ఏకీభవించకపోయి ఉండొచ్చు. ప్రభుత్వం అందించిన వివరాలను పరిగణలోకి తీసుకోవడంలో ఎన్నికల కమిషన్ విఫలమైందన్న సింగిల్ జడ్జి.. ఏ వివరాలను పరిగణనలోకి తీసుకోలేదన్న దానిపై తన ఉత్తర్వుల్లో ఎలాంటి కారణాలను చెప్పలేదు. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఎన్నికల నిర్వహణ ఏ రకంగా అడ్డంకులు కలిగిస్తుందో సింగిల్ జడ్జి తన ఉత్తర్వుల్లో ఎలాంటి ప్రాథమిక వివరణ ఇవ్వలేదు. కోవిడ్ వ్యాక్సినేషన్, పంచాయతీ ఎన్నికలను మేళవించడం వల్ల కేటగిరి 1, కేటగిరి 2 వ్యాక్సినేషన్‌కు ఏ రకంగానూ ఇబ్బంది లేదన్న నిర్ణయానికి వచ్చిన తరువాతే, మూడో కేటగిరి వ్యాక్సినేషన్‌కు ముందే స్థానిక ఎన్నికలను పూర్తి చేయాలని ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది’ అని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. ‘రెండున్నరేళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న ఎన్నికలను నిర్వహించాల్సిన బాధ్యతను పూర్తి చేసేందుకు ఎన్నికల కమిషన్ ఈ నెల 8న షెడ్యూల్ విడుదల చేసింది. ఎన్నికల కమిషనర్ తన చట్టబద్ధతమైన అధికారాన్ని ఉపయోగించే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ అంతిమంగా చూడాల్సింది రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుందా? లేదా? అన్నదే’ అని పేర్కొంది. ఆ అప్పీల్‌కు విచారణార్హత ఉంది ‘ఎన్నికల విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారంటూ ఎన్నికల కమిషనర్ రాసిన లేఖలను అడ్వొకేట్ జనరల్ ఈ కోర్టు ముందు ఉంచారు. ఎన్నికల కమిషనర్ మితిమీరిన భాషను వాడకుండా ఉంటే మంచిది. స్థానిక ఎన్నికలు ఏప్రిల్ లేదా మే లో జరుగుతాయని అధికార పార్టీ సీనియర్ నేత చెప్పిన దాని ఆధారంగా తన హయాంలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదంటూ ఎన్నికల కమిషనర్ అభిప్రాయం వ్యక్తీకరించారని అడ్వొకేట్ జనరల్ చెబుతున్నారు. పార్టీ నేత చెప్పిన దాన్ని పరిగణనలోకి తీసుకుని ఎన్నికల కమిషనర్ ఎన్నికల నిర్వహణకు నిర్ణయం తీసుకున్నారే తప్ప క్షేతస్థాయి పరిస్థితులను పరిగణనలోకి తీసుకోలేదన్న అడ్వకేట్ జనరల్ వాదనను ఆమోదించలేం. ఎన్నికల కమిషన్ దాఖలు చేసిన ఈ అప్పీల్‌కు విచారణార్హత ఉంది. సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ‘జడ్జిమెంట్’ నిర్వచన పరిధిలోకే వస్తాయి. దీనికి సంబంధించి ఎన్నికల కమిషనర్ తరఫు న్యాయవాది ఆదినారాయణరావు వాదనతో ఏకీభవిస్తున్నాం’ అని ధర్మాసనం పేర్కొంది. -
హైకోర్టు తీర్పుపై సుప్రీంకు
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ ఇచ్చిన షెడ్యూల్‌ను సమర్థిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తీర్పు అమలును నిలిపేయాలని కోరుతూ పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గురువారం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి స్థాయిలో కొనసాగుతున్న సమయంలో ఎన్నికలు నిర్వహించడం ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టడమే అవుతుందని ప్రభుత్వం పిటిషన్లో పేర్కొంది. వ్యాక్సినేషన్ సమయంలో ఎన్నికలు నిర్వహించవచ్చన్న నిర్ణయం తీసుకోవడానికి ఎన్నికల కమిషనర్ ఏమీ వైద్య నిపుణుడు కారని, ఆయన ఏ వైద్య నిపుణుడినీ సంప్రదించ లేదని తెలిపింది. వ్యాక్సినేషన్ ఎంత ముఖ్యమో తెలియచేస్తూ ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఎన్నికలు చేపట్టడం సరికాదంటూ తాము లేవనెత్తిన అభ్యంతరాలను ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా తిరస్కరించిందని వివరించింది. చిత్తశుద్ధితో ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా ఎన్నికల కమిషన్ బేఖాతరు చేసిందని తెలిపింది. ఈ ఒక్క కారణంతో హైకోర్టు తీర్పును రద్దు చేయవచ్చని చెప్పింది. ప్రభుత్వం తన పిటిషన్లో ఇంకా ఏం చెప్పిందంటే.. ఇప్పుడు ఎన్నికలంటే ప్రజల ప్రాణాలకు ముప్పే ► పోలీసు యంత్రాంగం మొత్తానికి ఫిబ్రవరి మొదటి వారంలో వ్యాక్సిన్ ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాం. ఇదే సమయంలో ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. పోలీసులందరూ వ్యాక్సిన్ తీసుకోవడం, వ్యాక్సిన్ రవాణా, భద్రతకు చర్యలు తీసుకోవడం, ఎన్నికల విధుల్లో పాల్గొనడం వంటివి ఏక కాలంలో చేయాల్సి ఉంటుంది. ఇది ఆచరణ సాధ్యం కాని పని. ► ఈ ఏడాది మార్చిలో ఎన్నికల కమిషనర్ పదవీ విరమణ చేస్తున్నారు. తన హయాంలోనే ఎన్నికలు నిర్వహించాలన్న ఏకైక ఉద్దేశంతో ప్రజల ప్రాణాలను పణంగా పెడుతూ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. ఇప్పుడు ఎన్నికలు పెడితే, వ్యాక్సినేషన్ తీసుకోకుండా ప్రజలు ఎన్నికల్లో పాల్గొనే పరిస్థితి వస్తుంది. ఇది వారి ప్రాణాలకు ముప్పుగా మారుతుంది. ఈ వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకోవడంలో హైకోర్టు విఫలమైంది. పోలీసులు భద్రత కల్పించ లేరు ► ఎన్నికల కమిషన్ గతంలో ఇచ్చిన షెడ్యూల్‌ను కోవిడ్ కారణంగా చూపి వాయిదా వేసిన విషయాన్ని హైకోర్టు పరిగణనలోకి తీసుకోవాల్సింది. వ్యాక్సినేషన్ సమయంలో పోలీసులు ఎన్నికలకు భద్రత కల్పించడం అసాధ్యం. వ్యాక్సిన్ రవాణా, స్టాక్ పాయింట్ల వద్ద భద్రత వంటివి పోలీసులే చూసుకోవాలి. వ్యాక్సిన్ బ్లాక్ మార్కెట్లోకి రాకుండా అడ్డుకోవడం, వ్యాక్సిన్ దారి మళ్లకుండా చూడటం, నకిలీలు చెలామణిలోకి రాకుండా చూడటం వంటివి కూడా పోలీసులే చేయాలి. ఫిబ్రవరిలో పోలీసులందరూ వ్యాక్సిన్ తీసుకుంటారు. అలాంటి సమయంలో వారు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే అవకాశం ఉండదు. ఈ విషయాలన్నింటినీ హైకోర్టు పరిగణనలోకి తీసుకుని ఉండాల్సింది. ప్రభుత్వ అభ్యంతరాలు పట్టించుకోలేదు ► రాష్ట్ర ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండానే ఎన్నికల నిర్వహణకు నిర్ణయం తీసుకోవచ్చా? ప్రభుత్వ అభ్యంతరాలను బేఖాతారు చేసి ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయడం సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధం కాదా? ఎన్నికల కమిషనర్ పూర్తిగా దురుద్దేశాలతో వ్యవహరించారు. ► కేటగిరి 1, కేటగిరి 2 కిందకు వచ్చే వారికి అవసరమైన 9.8 లక్షల వ్యాక్సిన్లను ఇప్పటికే అందుకున్నాం. కేటగిరి 1 కిందకు వచ్చే ఆరోగ్య కార్యకర్తలకు జనవరి చివరి కల్లా వ్యాక్సినేషన్ పూర్తవుతుంది. కేటగిరి 2లోకి వచ్చే పోలీసులు, పురపాలక, రెవిన్యూ ఉద్యోగులకు ఫిబ్రవరి మొదటి వారంలో వ్యాక్సినేషన్ మొదలవుతుంది. ఆ తరువాత 50 ఏళ్లు పైబడిన, 50 ఏళ్ల లోపు బీపీ, సుగర్ వ్యాధిగ్రస్తులకు వ్యాక్సిన్ ఇస్తారు. ► వీటిని పరిగణనలోకి తీసుకోవడంలో ఎన్నికల కమిషన్ దారుణంగా విఫలమైంది. ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలను ఎన్నికల కమిషన్ పరిగణనలోకి తీసుకుందని హైకోర్టు చెప్పడం సరికాదు. ముందస్తుగా తీసుకున్న నిర్ణయం ఆధారంగానే ఎన్నికల కమిషన్ సంప్రదింపులు జరిపిందే తప్ప, చిత్తశుద్ధితో వ్యవహరించలేదు. ఎన్నికల కమిషనర్ తన లేఖల్లో ఉపయోగించిన భాష ఏ మాత్రం సరిగా లేదని చెప్పిన హైకోర్టు, మరో వైపు ఆయనకు దురుద్దేశాల్లేవని చెప్పడం సబబు కాదు. పురపాలక సంఘాల ఎన్నికల విషయాన్ని పక్కన పెట్టేసి, పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఇది దురుద్దేశంతో తీసుకున్న నిర్ణయం. ఈ విషయాన్ని హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. ప్రాణాలు పణంగా పెట్టలేం.. రాష్ట్రంలో స్థానిక ఎన్నికల్ని వాయిదా వేయాలని కోరుతూ సుప్రీంను ఆశ్రయించనున్నాం. కరోనా నేపథ్యంలో ఉద్యోగుల ప్రాణాలను పణంగా పెట్టలేం, అవసరమైతే ఎన్నికల్ని బహిష్కరిస్తాం. హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికలు, కేరళ స్థానిక ఎన్నికల తర్వాత వేలాదిమంది ఉద్యోగులు కరోనా బారిన పడ్డారు. ఏపీలో ఎన్నికలు జరిపితే ఏడు లక్షలమందికిపైగా ఉద్యోగులు విధుల్లో పాల్గొనాల్సి ఉంటుంది. వారందరి పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. – ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు అవసరమైతే ఎన్నికలు బహిష్కరిస్తాం సాక్షి, అమరావతి: రాష్ట్రంలో స్థానిక ఎన్నికల్ని వాయిదా వేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు పలు ఉద్యోగసంఘాల నాయకులు గురువారం మీడియాతో చెప్పారు. ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఉద్యోగుల తరఫున ఈ పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. కరోనా నేపథ్యంలో ఉద్యోగుల ప్రాణాలను పణంగా పెట్టలేమని, అవసరమైతే ఎన్నికల్ని బహిష్కరిస్తామని పేర్కొన్నారు. ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్, ఎన్జీవో అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ 22 కేసులున్నప్పుడు ఎన్నికలు వాయిదా వేసి, రోజుకు 200 కేసులు వస్తున్నప్పుడు ఎన్నికలు పెట్టడం సరికాదని చెప్పారు. హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికలు, కేరళ స్థానిక ఎన్నికల తర్వాత వేలాది మంది ఉద్యోగులు కరోనా బారిన పడ్డారని తెలిపారు. కరోనా సమయంలో 7,200 మంది ఉద్యోగులు చనిపోయారని చెప్పారు. ఎన్నికలు జరిపితే 7 లక్షలమందికిపైగా ఉద్యోగులు విధుల్లో పాల్గొనాల్సి ఉంటుందని, వారి పరిస్థితి ఆందోళనకరంగా మారుతుందన్నారు. ఏపీ ఎన్జీవో అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి వ్యాక్సినేషన్ పూర్తయ్యేవరకు వాయిదా వేయాలి స్థానిక ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన తీర్పు మేము ఆశించిన విధంగా లేదు. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం. వ్యాక్సినేషన్ పూర్తయ్యే వరకు ఎన్నికలు వాయిదా వేయాలని కోరుతున్నాం. ఈ ప్రక్రియ రెండునెలల్లో పూర్తవుతుంది. – కె.వెంకట్రామిరెడ్డి, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ చైర్మన్ మా ప్రాణాలు పణంగా పెట్టి ఎన్నికలు పెడతారా? ఎన్నికల కమిషనర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. మా ప్రాణాలు పణంగా పెట్టి ఎన్నికలు నిర్వహించడం అవసరమా? ఎస్ఈసీ నిమ్మగడ్డ ఉద్యోగులపైన ఎందుకు ఇంత కఠినంగా వ్యవహరిస్తున్నారో చెప్పాలి. ఇది సరైన పద్ధతి కాదు. అవసరమైతే విచక్షణాధికారాలను ఉపయోగించాలని గవర్నర్‌ను కోరాం. – బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ జేఏసీ చైర్మన్ ఎన్నికలకు సిద్ధంగా లేం స్థానిక ఎన్నికలకు సిద్ధంగా లేమని ఇప్పటికే స్పష్టం చేశాం. ఎన్నికల్లో ఉపాధ్యాయులు చాలా కీలకం. ప్రతి ఉపాధ్యాయుడు వెయ్యిమందిని కలిసి వారి మధ్యలో పనిచేయాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడు కరోనా వ్యాప్తి చాలా సులువుగా జరుగుతుంది. ఇప్పటికే చాలామంది టీచర్లు చనిపోయారు. మళ్లీ మా ప్రాణాల మీదకు తేవడం సరికాదు. ఈ విషయాలు సుప్రీంకోర్టుకు తెలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్లో ఇంప్లీడ్ అవుతాం. – గిరిప్రసాద్, శ్రీధర్, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వాయిదా వేయాలి ఉపాధ్యాయుల శ్రేయస్సు దృష్ట్యా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యేవరకు స్థానిక ఎన్నికలు వాయిదా వేయాలి. ఉపాధ్యాయుల అభిప్రాయాలు తెలిపేందుకు మేం కూడా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం. – జాలిరెడ్డి, వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ చైర్మన్ -
'ఎస్ఈసీ పిటిషన్ ఆమోదయోగ్యంగా లేదు'
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికలు నిలిపివేయాలంటూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ లో రాష్ట్ర ఎన్నికల సంఘం పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఏజీ శ్రీరామ్ తన వాదన వినిపించారు. 'రాష్ట్ర ఎన్నికల కమిషన్ దాఖలు చేసిన రిట్ అప్పీల్ విచారణకు ఆమోదయోగ్యమైనది కాదు.ఎన్నికల ప్రక్రియలో కొన్ని సందర్భాల్లో కోర్టులు జోక్యం చేసుకోవచ్చు.సీఎస్, పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి రాసిన లేఖను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పరిగణనలోకి తీసుకోలేదు. ఎస్ఈసీ ఏకపక్షంగా వ్యవహరించింది.. ఆ దురుద్దేశంతోనే ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసిందని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న కరోనా వ్యాక్సినేషన్ గురించి ఏజీ శ్రీరామ్ ధర్మాసనంకు వివరించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఫ్రంట్ లైన్ వారియర్స్ ప్రభుత్వం ముందు వ్యాక్సిన్ అందిస్తుందని పేర్కొన్నారు. -
జీహెచ్ఎంసీ: వచ్చే నెల 15లోగా మేయర్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ హైదరాబాద్ (జీహెచ్ఎంసీ)కి కొత్తగా ఎన్నికైన 150 మంది కార్పొరేటర్ల పేర్లు ఎట్టకేలకు గెజిట్‌లో నమోదయ్యాయి. రిజర్వేషన్లు, పార్టీలవారీగా కార్పొరేటర్ల వివరాలతో శనివారం గెజిట్ నోటిఫికేషన్ జారీ అయింది. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు వెలువడిన ఐదు వారాల తర్వాత అధికారికంగా వారి పేర్లను రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్ఈసీ) గెజిట్‌లో ప్రచురించింది. బల్దియాలో ఇంతకు ముందెన్నడూ పాలకమండలి గడువు ముగిశాకే ఎన్నికలు జరిగినందున ఇలాంటి పరిస్థితి ఎదురవలేదు. ప్రస్తుత పాలకమండలి గడువు వచ్చేనెల పదో తేదీవరకు ఉండటం, అప్పటివరకు కొత్త పాలకమండలి కొలువుదీరే అవకాశం లేకపోవడంతో ఇప్పటిదాకా గెజిట్ నోటిఫికేషన్ వెలువరించలేదు. నిబంధనల మేరకు గెజిట్‌లో ప్రచురించాక నెలరోజుల్లోగా కొత్తపాలకమండలి సభ్యుల ప్రమాణం, మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరగాల్సి ఉంది. దీంతో వచ్చే నెల 15 లోగా ఈ కార్యక్రమాలు పూర్తికానున్నాయి. మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయడంతోపాటు వారి ఎన్నికకు ఎన్నికల అధికారిగా గ్రేటర్ పరిధిలోని జిల్లాలకు చెందిన కలెక్టర్ లేదా జాయింట్ కలెక్టర్‌ను నియమిస్తారని సంబంధిత అధికారి తెలిపారు. మేయర్‌ఎన్నిక ఇలా.. ఎన్నికైన కార్పొరేటర్లు మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు అర్హులు. మేయర్ పదవికి మహిళారి జర్వేషన్ ఉన్నందున మహిళలే పోటీచేయాల్సి ఉంది. కార్పొరేటర్లతోపాటు జీహెచ్ఎంసీలో ఎక్స్అఫీషియో సభ్యులుగా ఉన్న రాజ్యసభ, లోక్‌సభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా ఓటు వేసే అర్హత ఉంది. మేయర్ ఎన్నికకు ఎక్స్అఫీషియో సభ్యులుసహ మొత్తం సభ్యుల్లో కనీసం 50 శాతం మంది హాజరైతేనే కోరం ఉన్నట్లుగా భావిస్తారు. నిర్ణీత వ్యవధిలోగా తగినంతమంది ఓటర్లు రాకపోతే మర్నాటికి వాయిదా వేస్తారు. అప్పుడు కూడా కోరం లేకపోతే ఎన్నికల సంఘం సూచనల మేరకు కోరం లేకపోయినప్పటికీ మేయర్ ఎన్నిక నిర్వహిస్తారని అధికారులు పేర్కొన్నారు. ఈ ఎన్నికలో విప్ వర్తిస్తుంది. బహిరంగంగా చేతులెత్తడం ద్వారా ఎన్నికను నిర్వహిస్తారు. 27న బడ్జెట్ సమావేశం? ప్రస్తుత సభ్యులతో చివరి సర్వసభ్య సమావేశాన్ని ఈ నెలాఖరులోగా నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. ప్రతి మూడు నెలలకోసారి సర్వసభ్య సమావేశం జరగాల్సి ఉండగా, కోవిడ్ నేపథ్యంలో గత ఏడాది మార్చి నుంచి ఇప్పటివరకు జరగలేదు. మరోవైపు వచ్చే ఆర్థిక సంవత్సరానికి(2021–22) సంబంధించి జీహెచ్ఎంసీ బడ్జెట్ కూడా పాలకమండలి ఆమోదం పొందాల్సి ఉంది. ఇప్పటికే స్టాండింగ్ కమిటీ ఆమోదం పొందిన బడ్జెట్ నిర్ణీత గడువు జనవరిలోగా జనరల్‌బాడీ సమావేశంలో ఆమోదం పొందాల్సి ఉంది. ఈ నేపథ్యంలో జనవరి 27న పాలకమండలి సాధారణ సర్వసభ్య సమావేశం, బడ్జెట్ భేటీ రెండూ కూడా ఒకేరోజు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది. అయితే, అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. సంబంధిత అధికారులు వీటికి సంబంధించిన పనుల్లో నిమగ్నమయ్యారు. -
మహిళల కన్నా పురుషులే అధికం..
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని ఓటర్ల తుది జాబితా విడుదలైంది. జనవరి 15 నాటికి రాష్ట్రంలో మొత్తం 3,01,65,569 మంది ఓటర్లు ఉన్నారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) డాక్టర్ శశాంక్ గోయల్ వివరాలు వెల్లడించారు. జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం పురుష ఓటర్లు 1,51,61,714 కాగా, మహిళా ఓటర్లు 1,50,02,227 మంది ఉన్నారు. అంటే మహిళల కన్నా పురుష ఓటర్లు 1,59,487 మంది అధికంగా ఉన్నారు. మొత్తం ఓట్లలో సర్వీస్ ఓటర్లు 13,703 మంది ఉన్నారు. అలాగే రాష్ట్రంలో ఇతర ఓటర్ల (థర్డ్ జండర్ ) సంఖ్య 1,628గా పేర్కొన్నారు. గత నవంబర్ 16న ప్రకటించిన ముసాయిదా (డ్రాఫ్ట్) ఓటర్ల జాబితాలో 3,00,55,327 ఓటర్లుండగా, కొత్తగా 2,82,497 ఓటర్లు జాబితాలో చేరారు. డబుల్ ఓట్లు, తొలగించినవి కలుపుకొని మొత్తం 1,72,255 ఓట్ల తొలగించాక రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,01,65,569గా నమోదైంది. దీంతో పాటు రాష్ట్రంలో మొత్తం పోలింగ్ బూత్‌ల సంఖ్య 34,708గా ఉన్నట్లు సీఈవో ప్రకటించారు. చదవండి: ఓటర్లు.. ఆమే నిర్ణేత 20–49 ఏళ్ల లోపు ఓటర్లే 2,15,27,426 మంది... రాష్ట్రంలో వయస్సు వారీగా చూస్తే అత్యధికంగా 20 నుంచి 49 ఏళ్లలోపు వారు 2,15,27,426 మంది ఉన్నారు. అంటే మొత్తం ఓట్లలో దాదాపు మూడో వంతు శాతం ఉన్నారు. వీరిలో 20–29ఏళ్ల మధ్యలోని వారు 62,57,483 మంది, 30–39 ఏళ్ల లోపు 89,28,827 మంది, 40–49 ఏళ్ల లోపు 63,41,116 మంది ఉన్నారు. నవయువ(18–19 ఏళ్ల వారు) ఓటర్లు 1,09,733 మంది ఉండగా, 50–59 ఏళ్ల మధ్యలో 42,31,789 మంది, 60–69 మధ్యలో 25,91,067 మంది, 70–79 మధ్యలో 12,87,859 ఉన్నారు. 80 ఏళ్లు పైబడిన వారు 4,17,695 మంది ఉన్నారు. 20 జిల్లాల్లో మహిళా ఓటర్లు ఎక్కువ ... రాష్ట్రంలో మొత్తం 20 జిల్లాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. ఇందులో అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో పురుషుల కంటే మహిళా ఓటర్లు 68,628 అధికంగా ఉన్నారు. అలాగే ఖమ్మం జిల్లాలో 26,443 మంది, నిర్మల్ జిల్లాలో 22,601 మంది మహిళా ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. -
ఆమే నిర్ణేత
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) శుక్రవారం విడుదల చేసిన ఓటర్ల తుది జాబితాలో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. రాష్ట్రంలో నిర్ణాయక శక్తిగా అవతరించారు. జనవరి 15 నాటికి రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 4,05,08,222 (సర్వీస్, ఎన్నారై ఓటర్లతో కలిపి) ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కె.విజయానంద్ ప్రకటించారు. ఇందులో పురుష ఓటర్ల సంఖ్య 2,00,30,486 ఉండగా, మహిళా ఓటర్ల సంఖ్య 2,04,73,601గా నమోదైంది. రాష్ట్రంలో పురుషుల కంటే 4,43,115 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. థర్డ్ జెండర్ ఓటర్లు 4,135.. సర్వీస్ ఓటర్లు 66,844, ఎన్నారై ఓటర్లు 7,070 మంది ఉన్నారు. నవంబర్ 11న విడుదల చేసిన ముసాయిదా జాబితాతో పోలిస్తే ఓటర్ల సంఖ్య 3,62,353 పెరిగింది. ముసాయిదా జాబితా తర్వాత 4,25,860 మంది కొత్త ఓటర్లు నమోదు కాగా, 63,507 మందిని తొలిగించారు. తుది ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో గతంలో పోలింగ్ స్టేషన్ల సంఖ్య 45,836 ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 45,917కి చేరింది. రాష్ట్ర జనాభాలో ప్రతి 1,000 మంది జనాభాకు 752 మంది ఓటర్లుగా నమోదయ్యారు. ఓటర్ల సంఖ్యలో 18 నుంచి 19 ఏళ్ల మధ్యలో ఉన్న వారి సంఖ్య 2,83,301గా ఉంది. నవంబర్‌లో ప్రకటించిన ముసాయిదా జాబితాపై డిసెంబర్ 15 వరకు అభ్యంతరాలను స్వీకరించి, పరిశీలన అనంతరం జనవరి 15న తుది జాబితా ఎస్ఎస్ఆర్–2021ను విడుదల చేసినట్లు ఎస్ఈసీ పేర్కొంది. తుది జాబితాను జిలాల్ల వారీగా రాజకీయ పార్టీలకు డీఈవో/ఈఆర్వోల ద్వారా ఇస్తామని, సీఈవో వెబ్సైట్లో కూడా అప్లోడ్ చేశామని పేర్కొంది.