పరిషత్‌ ఎన్నికలు: సింగిల్‌ బెంచ్‌ ఆదేశాలను సవాల్‌ చేస్తూ ఎస్‌ఈసీ పిటిషన్‌ | State Election Commission Filed A Petition Challenging The Cancellation Of Parishad Elections In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

పరిషత్‌ ఎన్నికలు: సింగిల్‌ బెంచ్‌ ఆదేశాలను సవాల్‌ చేస్తూ ఎస్‌ఈసీ పిటిషన్‌

Published Wed, Jun 23 2021 8:53 PM | Last Updated on Wed, Jun 23 2021 9:19 PM

State Election Commission Filed A Petition Challenging The Cancellation Of Parishad Elections In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల రద్దును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఇదే విషయమై గతంలో సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన ఆదేశాలను సవాల్‌ చేస్తూ.. ఎస్‌ఈసీ డివిజన్‌ బెంచ్‌కు వెళ్లింది. నిబంధనల ప్రకారమే ఎన్నికలు నిర్వహించామని ఎస్‌ఈసీ తమ పిటిషన్‌లో పేర్కొంది. ఎన్నికల నిర్వహణలో సుప్రీం ఆదేశాలను తూచా తప్పకుండా పాటించామని తెలిపింది. కాగా, ఏపీలో పరిషత్‌ (ఎంపీటీసీ, జడ్పీటీసీ) ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ మే 21న తీర్పును వెలువరించింది. పరిషత్‌ ఎన్నికలకు కొత్తగా నోటిఫికేషన్‌ ఇవ్వాలని ఎస్‌ఈసీని ఆదేశించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement