parishad elections
-
ఓబీసీ రిజర్వేషన్ రద్దు.. ఓటు అడిగేందుకు రావద్దు..
సాక్షి, ముంబై: మహారాష్ట్రలోని భండారా– గోండియా జిల్లా పరిషత్ ఎన్నికల నేపథ్యంలో భండారా జిల్లాల్లోని ఓ గ్రామంలో వినూత్న బోర్డులు దర్శనమిస్తున్నాయి. దయచేసి ఓట్లు అడిగేందుకు రావద్దని గ్రామస్తులు తమ ఇంటి ముందు బోర్డులు పెట్టారు. ఓబీసీ రిజర్వేషన్ రద్దు కావడంతో నిరసనగానే వారు ఇలా బోర్డులు ఉంచారని తెలిసింది. ఓబీసీ రిజర్వేషన్ రద్దు కావడంతో ఓబీసీలలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భండారా తాలూకాలోని పిపరీ గ్రామంలోని ఓబీసీ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ గ్రామంలో నివసించే ప్రజలలో అత్యధికంగా ఓబీసీ కేటగిరివారే ఉన్నారు. దీంతో వీరందరూ డిసెంబర్ 21వ తేదీన జరగబోయే జిల్లా పరిషత్ ఎన్నికల కోసం దయచేసి ఎవరూ ఓటు అడిగేందుకు రావద్దని బోర్డులను తమ ఇళ్ల ముందు అమర్చి వినూత్నంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్రామంలో ఏర్పాటు చేసిన బోర్డులు జిల్లాతోపాటు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. చదవండి: (ఓటర్ ఐడీతో ఆధార్ అనుసంధానానికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్) -
పశ్చిమ గోదావరి జిల్లాలో జోరుగా పరిషత్ ఎన్నికల ప్రచారం
-
రెండేళ్ల పాలనకు నిదర్శనమే ఈ ప్రజా తీర్పు: మంత్రి బొత్స
సాక్షి, విజయనగరం: రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల జెడ్పీ స్థానాలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. సీఎం వైఎస్ జగన్ నాయకత్వాన్ని ఓటర్లందరూ సమర్థించారు. మాపై పూర్తి విశ్వాసాన్ని ఉంచారు. ఈ పదవుల వలన మరింత బాధ్యత పెరిగింది. మేము ఇంకా కష్టపడి పనిచేయాలని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఉన్న జెడ్పీటీసీ అభ్యర్థులు వందకి వంద శాతం గెలుపొందారు. అందరికీ పార్టీ తరపున, వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అందరూ కష్టపడి పనిచేయాలని కోరుతున్నా. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్‌గా నూతనంగా ఎన్నికైన మజ్జి శ్రీనివాస్‌రావుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చదవండి: ('భారత్ బంద్‌కు వైఎస్సార్సీపీ సంపూర్ణ మద్దతు') జిల్లా ప్రజలకు మాట ఇస్తున్నాం. గెలిపించిన ప్రజల ఆశయాలను వమ్ము చేయకుండా ప్రజల కోసం పాలన చేపడతాం. వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఎన్నికలను ఛాలెంజ్‌గా తీసుకున్నారు. టీడీపీ ఒకవైపు పోటీ చేసి మరోవైపు ఎన్నికకు దూరంగా ఉన్నాం అంటూ కుంటి సాకులు చెప్పింది. రెండేళ్ల పాలనకు నిదర్శనమే ఈ ప్రజా తీర్పు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కూడా వైఎస్సార్సీపీయే విజయం సాధిస్తుందిని మంత్రి అన్నారు. సీఎం వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు: జెడ్పీ చైర్మన్ చైర్మన్‌గా అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సీఎం జగన్ పరిపాలన, సంక్షేమం వలనే ప్రజా విజయం సాధించాం. ప్రతి ఒక్కరి ఆలోచన తీసుకొని, గ్రామ స్వరాజ్యం కోసం పాటుపడతా. సీఎంకు పేరు, గౌరవం తెచ్చే విధంగా బాధ్యతలను నిర్వహిస్తాను. ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటా. పదవి ఉన్నా.. లేకున్నా ఒకేలా ఉంటా అని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాస్‌రావు అన్నారు. చదవండి: (ఎన్నికల బహిష్కరణ టీడీపీ డ్రామానే: బొత్స) -
పశ్చిమలో బట్టబయలైన టీడీపీ, జనసేన చీకటి పొత్తు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం, జనసేన పార్టీల చీకటి పొత్తు రాజకీయం పరిషత్ ఎన్నికల సాక్షిగా బట్టబయలైంది. ఆచంట మండలంలో టీడీపీ అభ్యర్థికి మండల పరిషత్ ఎన్నికల్లో జనసేన మద్దతిచ్చింది. మరోవైపు వీరవాసరంలో జనసేన మెజారిటీ స్థానాల్లో గెలుపొందినా.. తక్కువ స్థానాల్లోనే గెలుపొందిన టీడీపీకి ఎంపీపీ ఎన్నికల్లో మద్దతు ఇవ్వడం గమనార్హం. ఈ రెండు మండలాల్లోనూ ఈ అపవిత్ర పొత్తు ద్వారా టీడీపీ ఎంపీపీ స్థానాలను కైవసం చేసుకోగా.. జనసేన మండల పరిషత్ ఉపాధ్యక్ష పదవులతో సరిపెట్టుకుంది. మరోపక్క దీనిపై జిల్లాలోని జనసేన పార్టీకి చెందిన ఒక వర్గంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. సోమవారం జిల్లాలో మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికలు నిర్వహించారు. ఆచంట మండలంలో 17 ఎంపీటీసీ స్థానాలకు గాను టీడీపీ 7, వైఎస్సార్సీపీ 6, జనసేన 4 స్థానాల్లో విజయం సాధించాయి. జెడ్పీటీసీ స్థానాన్ని టీడీపీ దక్కించుకుంది. ఇక్కడ ఎంపీపీ ఎన్నికకు 9 మంది సభ్యుల మద్దతు అవసరం కాగా, జనసేనకు చెందిన నలుగురు సభ్యులు టీడీపీకి మద్దతు ఇవ్వడంతో ఎంపీపీ స్థానాన్ని ఆ పార్టీ దక్కించుకుంది. ఇక్కడ వైస్ చైర్మన్ పదవిని జనసేనకు ఇచ్చారు. దీనిపై జనసేనలోని మండల స్థాయి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక వీరవాసరం మండలంలో సీన్ రివర్స్‌గా ఉంది. జెడ్పీటీసీ స్థానంతో పాటు మెజార్టీ ఎంపీటీసీల్లో జనసేన గెలుపొందినా ఎంపీపీ స్థానాన్ని మాత్రం టీడీపీకి కట్టబెట్టింది. వీరవాసరం మండలంలో 19 ఎంపీటీసీ స్థానాలకు గాను 8 జనసేన, 7 వైఎస్సార్సీపీ, 4 టీడీపీ గెలుపొందాయి. జనసేన, టీడీపీకి చెరొక ఓటు అంటూ ఆ రెండు పార్టీలు ముందస్తు ప్రచారం చేసుకున్నాయి. దీనిలో భాగంగా 4 ఎంపీటీసీ స్థానాలు మాత్రమే ఉన్న టీడీపీకి ఎంపీపీ స్థానం కట్టబెట్టడం గమనార్హం. 8 ఎంపీటీసీలున్న జనసేన వైస్ చైర్మన్ పదవితో సరిపెట్టుకుంది. -
ఎంపీపీ ఎన్నికలు: కోఆప్టెడ్ సభ్యుల ఎన్నికకు ముగిసిన నామినేషన్లు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మండల పరిషత్ అధ్యక్షుల (ఎంపీపీ) ఎన్నికలు శుక్రవారం జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కోఆప్టెడ్ సభ్యుల ఎన్నికకు నామినేషన్లు ముగిశాయి. మధ్యాహ్నం 12 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. అనంతరం నామినేషన్ల పరిశీలన కార్యక్రమం ఉంటుంది. మధ్యాహ్నం 1 గంటకు కో ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఎంపీపీ, వైస్ ఎంపీపీల ఎన్నిక ప్రక్రియ ప్రారంభం అవుతుంది. చేతులు ఎత్తే పద్దతిలో ఎంపీపీ, వైస్ ఎంపీపీలను ఎన్నుకుంటారు. ఇటీవల ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు విడుదల కాగా వైఎస్సార్సీపీ అత్యధిక స్థానాలు గెలుపొంది రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఎంపీపీ స్థానాలు కూడా భారీగా వైఎస్సార్సీపీ తన ఖాతాలో వేసుకోనుంది. చదవండి: ఏపీ: నేడు మండల పరిషత్ అధ్యక్షుల ఎన్నికలు -
ఏపీ: నేడు మండల పరిషత్ అధ్యక్షుల ఎన్నికలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మండల పరిషత్ అధ్యక్షుల (ఎంపీపీ) ఎన్నికలు శుక్రవారం జరగనున్నాయి. ఎంపీపీతో పాటు ప్రతి మండలానికి ఒకరు చొప్పున కో ఆప్టెడ్ సభ్యునితో పాటు మండల ఉపాధ్యక్ష పదవులకు కూడా ఎన్నికలు జరుగుతాయి. మండల పరిధిలో ఎంపీటీసీ సభ్యులుగా ఎన్నికైన వారు చేతులు ఎత్తే విధానంలో ఈ ఎన్నికలను నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించి అన్ని చోట్ల ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రత్యేక సమావేశాల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌తో పాటు జిల్లాలో పంచాయతీరాజ్ శాఖ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. నిర్ణీత కోరం ప్రకారం.. మండల పరిధిలో కొత్తగా ఎన్నికైన మొత్తం ఎంపీటీసీ సభ్యుల్లో కనీసం సగం మంది హాజరైతేనే ఎంపీపీ, ఉపాధ్యక్ష పదవితో పాటు కో ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10,047 ఎంపీటీసీ స్థానాల్లోని 9,583 స్థానాల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రత్యేక సమావేశాలు ప్రారంభమవుతాయి. ఏకగ్రీవంగా ఎన్నికైన వారితో సహా కొత్తగా ఎన్నికైన సభ్యులందరితో ఆ సమావేశంలోనే ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆ తర్వాత కో ఆప్టెడ్ సభ్యుని ఎన్నిక నిర్వహిస్తారు. సాయంత్రం 3 గంటలకు మరొకసారి సమావేశం నిర్వహించి, తొలుత ఎంపీపీ పదవికి ఆ తర్వాత ఉపాధ్యక్ష పదవికి ఎన్నిక జరుపుతారు. కాగా, ఉదయం 10 గంటల నుంచే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఏదైనా సమస్య వస్తే ఇలా.. ► ఏదైనా కారణం వల్ల కో ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక జరగని పక్షంలో ఆయా మండలాల్లో తదుపరి జరగాల్సిన ఎంపీపీ, ఉపాధ్యక్ష ఎన్నికలను వాయిదా వేస్తారు. ఒకవేళ కో ఆప్టెడ్ ఎన్నిక పూర్తయి, ఎంపీపీ ఎన్నికకు ఆటంకం ఏర్పడితే, సంబంధిత మండలంలో ఆ తర్వాత జరగాల్సిన ఉపాధ్యక్ష పదవికి ఎన్నిక వాయిదా పడుతుందని రాష్ట్ర కమిషన్ కార్యాలయ అధికారులు వెల్లడించారు. ► శుక్రవారం జరగాల్సిన ఎన్నిక వాయిదా పడిన మండలాల్లో శనివారం ఎన్నిక నిర్వహించుకోవచ్చని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలంసాహ్ని ఇప్పటికే అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. రెండో రోజు కూడా వివిధ కారణాలతో కోఆప్టెడ్ సభ్యుల ఎన్నిక వాయిదా పడినప్పటికీ, సరిపడా కోరం ఉంటే ఎంపీపీ.. ఉపాధ్యక్ష పదవులకు ఎన్నిక నిర్వహించవచ్చని గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
సీఎంకు పంచాయతీరాజ్ శాఖ కృతజ్ఞతలు
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా పూర్తి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తగిన తోడ్పాటును అందించిందని అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం జగన్‌కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్ కమిషనర్ ఎం.గిరిజా శంకర్ కృతజ్ఞతలు తెలిపారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం వారు సీఎం జగన్‌ను కలిశారు. -
పచ్చ మీడియా రాతలపై విరుచుకుపడ్డ జగన్ !
-
‘వైఎస్సార్సీపీ విజయాన్ని ఎల్లో మీడియా వక్రీకరించింది’
-
ZPTC MPTC: ఎన్నికల గ్రాండ్ విక్టరీపై సిఎం వైఎస్ జగన్ స్పందన
-
ఎన్నికల బహిష్కరణ టీడీపీ డ్రామానే: బొత్స
సాక్షి, అమరావతి: పరిషత్ ఎన్నికల బహిష్కరణ టీడీపీ ఆడిన డ్రామా అని మునిసిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందిస్తున్న సంక్షేమాభివృద్ధి పాలనకు ప్రజలు మరోసారి పట్టం కట్టారని చెప్పారు. ప్రతిపక్షం తన పాత్రను పోషించకుండా ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని అబద్ధాలు ప్రచారం చేసిందన్నారు. ఓట్లు వేసిన ప్రజలకు ఏమీ తెలియదు.. వారు అమాయకులని అనుకుంటే పొరపాటేనని ఆయనన్నారు. చంద్రబాబుకి ఓటమిని అంగీకరించే ధైర్యంలేదని.. పరాజయాన్ని అంగీకరించి ఫలితాలను విశ్లేషించుకోవాలని బొత్స హితవు పలికారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్ వద్ద సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మళ్లీ ఎన్నికలు పెట్టాలన్న టీడీపీ నేత అచ్చెన్నాయుడి వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరంలేదని కొట్టిపారేశారు. సీఎం జగన్ గృహ నిర్మాణాలపై సోమవారం సమీక్ష నిర్వహించారని.. సుమారు 60 లక్షల మందికి శాశ్వత ఇళ్ల పట్టాలను ఇవ్వాలన్నదే ఆయన ఆలోచనన్నారు. దీనిపై విధివిధానాల గురించి ముఖ్యమంత్రి సమీక్షించారని బొత్స తెలిపారు. త్వరలోనే 80 వేల టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేస్తామని ఆయన వెల్లడించారు. ‘పరిషత్’ ఎన్నికల కౌంటింగ్ నిర్వహించాలని తీర్పు వచ్చిన రోజు నుంచి టీడీపీలో ఆందోళన మొదలైందన్నారు. తమ సమస్యలు పరిష్కరించే ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరిస్తారని ఎన్నికల ఫలితాలతో నిరూపితమైందని మంత్రి తెలిపారు. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు పనైపోయిందని.. టీడీపీకి ప్రజల్లో మనుగడ లేదనేది స్పష్టమవుతోందని మంత్రి చెప్పారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలతో టీడీపీ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు. నామినేషన్లకు ముందే ఎన్నికల బహిష్కరణ నిర్ణయాన్ని ప్రకటించి ఉండాల్సిందని.. అవి పూర్తయిన అనంతరం చేతకాక బహిష్కరించారని బొత్స చెప్పారు. ప్రజాతీర్పు స్ఫూర్తితో సీఎం జగన్ ప్రజాసేవకు పునరంకితమవుతారన్నారు. అచ్చెన్నాయుడు రాజీనామా చేయాలి ప్రభుత్వాన్ని రద్దు చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేయడం సరైంది కాదన్నారు. అచ్చెన్నాయుడుని తన పదవికి రాజీనామా చేయమనండి.. తానూ చేస్తానని.. ఇద్దరం పోటీచేసి తేల్చుకుందామని బొత్స సత్యనారాయణ చెప్పారు. స్థాయిని తగ్గించుకునేలా టీడీపీ నేతలు మాట్లాడొద్దన్నారు. చంద్రబాబుని చంపడానికి, కొట్టడానికే ఆయన ఇంటికి వైఎస్సార్సీపీ నేతలు వెళ్లారనడం సరికాదని చెప్పారు. చదవండి: ఈ ఫలితాలు నా బాధ్యతను మరింత పెంచాయి: సీఎం జగన్ -
ఈ ఫలితాలు నా బాధ్యతను మరింత పెంచాయి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ప్రజలందరి చల్లని దీవెనలతో పరిషత్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించిన సందర్భంగా సీఎం వైఎస్ జగన్ సోమవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో మాట్లాడుతూ.. ఈ ఫలితాలు ప్రతి కుటుంబం, ప్రతి మనిషి పట్ల తన బాధ్యతను మరింత పెంచాయని తెలిపారు. పరిషత్ ఎన్నికల విజయాన్ని అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. అక్షరాల 13,081 పంచాయతీలకు గాను 10,536 పంచాయతీల్లో(81 శాతం) వైఎస్సార్సీపీ మద్దతుదారులను ప్రజలు ఎన్నుకున్నారని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ ఏకంగా 75కు 74 చోట్ల (99 శాతం) వైఎస్సార్ అభ్యర్థులే గెలిచారని తెలిపారు. 86 శాతం ఎంపీటీలు, 98 శాతం జడ్పీటీసీ స్థానాల్లో గెలిపిచారని సీఎం జగన్ తెలిపారు. ప్రతి ఎన్నికల్లో సడలని ఆప్యాయతను ప్రజలు అందిస్తున్నారని చెప్పారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామని తెలిపారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని కొన్ని శక్తులు ప్రయత్నించాయన్నారు. అన్యాయపు మీడియా సంస్థలు అబద్ధాన్ని నిజం చేయాలని చూశారని అన్నారు. ప్రతిపక్షం ఓటమిని కూడా అంగీకరించలేని పరిస్థితుల్లో ఉందని తెలిపారు. ప్రజలకు మంచి జరగకుండా ప్రతిపక్షం అడ్డుకుంటోందన్నారు. కోవిడ్ పేరుతో గతంలో కౌంటింగ్ కూడా వాయిదా వేయించారని మండిపడ్డారు. ప్రభుత్వానికి తోడుగా ఉన్న ప్రజలకు రుణపడి ఉంటానని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. చదవండి: MPTC, ZPTC elections results: పంచాయతీ, మునిసిపల్‌ను మించి జైత్రయాత్ర ఏపీ పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ సరికొత్త రికార్డు -
నిమ్మకూరులో వైఎస్సార్సీపీ విజయం
నిమ్మకూరు (పామర్రు): టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ స్వగ్రామమైన నిమ్మకూరులో వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి దాసరి అశోక్‌కుమార్ జయకేతనం ఎగురవేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పాలనకు ప్రజలు ఆకర్షితులై వైఎస్సార్సీపీకి మద్దతుగా నిలిచారని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అశోక్‌కుమార్ తన ప్రత్యర్థి వీరాంజనేయులుపై తొలుత రెండు ఓట్ల తేడాతో విజయం సాధించారు. దీనికి ప్రత్యర్థి రీ కౌటింగ్ జరపాలని డిమాండ్ చేయగా రీ కౌంటింగ్‌లో అశోక్‌కుమార్‌కు మరో 6 ఓట్లు ఆధిక్యం రాగా మొత్తం 8 ఓట్లు మెజార్టీతో విజయం సాధించారు. చదవండి: ప్రజాప్రయోజనాలకే పెద్దపీట -
నారా చంద్రబాబునాయుడు ఘోర పరాజయం
సాక్షి ప్రతినిధి, తిరుపతి: కుప్పం నియోజకవర్గంలోని జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో టీడీపీ ఓటమి సరే కానీ, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఓడిపోవడం ఏమిటని అనుకుంటున్నారా! అయితే ఈ లెక్క చూడండి. బాబుకు ఘోర పరాభవంతో కూడిన పరాజయం దక్కిందని అందరూ ఒప్పుకుంటారు. చివరికి టీడీపీ శ్రేణులు కూడా. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కుప్పం నుంచి ఓ రకంగా చావు తప్పి కన్నులొట్టపోయిన చందంగా చంద్రబాబు గెలుపొందారు. అప్పటికి వరుసగా ఆరుసార్లు గెలిపించిన కుప్పంలో ఈ దఫా కొన్ని రౌండ్లలో వెనక్కు వెళ్లి, మరికొన్ని రౌండ్లలో ముందుకొచ్చి మొత్తంగా కుప్పం నుంచే ఏడోసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగోలా బయటపడ్డారు. కానీ ఆ తర్వాత జరిగిన ప్రతి స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ చంద్రబాబుకు దారుణ పరాజయమే మిగిలింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలోని 89 పంచాయతీలకు గాను 74 చోట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరచిన అభ్యర్థులు విజయం సాధించగా, 14 చోట్ల టీడీపీ మద్దతుదారులు, ఒక చోట కాంగ్రెస్ పార్టీ మద్దతుదారు విజయం సాధించారు. తాజాగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల్లోనూ టీడీపీ తుడిచి పెట్టుకుపోయింది. గుడుపల్లె, శాంతిపురం, రామకుప్పం, కుప్పం జెడ్పీటీసీ స్థానాలను వైఎస్సార్సీపీ అభ్యర్థులు భారీ మెజారిటీతో చేజిక్కించుకున్నారు. వైఎస్సార్సీపీ కుప్పం జెడ్పీటీసీ అభ్యర్థి ఏడీఎస్ శరవణ 17,358 ఓట్ల మెజారిటీతో విజయం సాధించగా, గుడుపల్లె అభ్యర్థి కృష్ణమూర్తి 11,928 ఓట్ల ఆధిక్యతతో, శాంతిపురం అభ్యర్థి శ్రీనివాసులు 16,893 ఓట్ల ఆధిక్యతతో.. రామకుప్పం అభ్యర్థి కే రాఘవరెడ్డి 16,118 ఓట్ల ఆధిక్యంతో టీడీపీ అభ్యర్థులపై విజయం సాధించారు. వైఎస్సార్సీపీ ఏకపక్ష విజయం నాలుగు మండలాల్లోని మొత్తం 68 ఎంపీటీసీ స్థానాలకు గాను 63 స్థానాలను (ఇందులో ఒకటి ఏకగ్రీవం) వైఎస్సార్సీపీ భారీ మెజారిటీతో గెలుచుకుంది. కేవలం మూడు ఎంపీటీసీలు మాత్రమే టీడీపీ గెలుపొందగా, రెండు ఎంపీటీసీ స్థానాల్లో అభ్యర్థుల మృతితో ఎన్నిక జరగలేదు. కుప్పం మండలంలోని 21 ఎంపీటీసీ స్థానాలకు 20 స్థానాల్లో ఎన్నికలు జరగ్గా... వైఎస్సార్సీపీ 18 చోట్ల విజయం సాధించగా, టీడీపీ రెండింట మాత్రమే గెలుపొందింది. గుడుపల్లె మండలంలో 13కు గాను 12 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలు జరగ్గా, అన్నింటినీ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. రామకుప్పం మండలంలో 16కు 16, శాంతిపురం మండలంలో 18కి 17 ఎంపీటీసీ స్థానాలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. మొత్తంగా కుప్పం నియోజకవర్గంలోని నాలుగు జెడ్పీటీసీల్లో వైఎస్సార్సీపీకి 84,160 ఓట్లు, టీడీపీకి 21,863 ఓట్లు వచ్చాయి. ఈ లెక్కన వైఎస్సార్సీపీకి 62,297 ఓట్ల ఆధిక్యం లభించింది. ఇలా అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన ప్రతి ఎన్నికలోనూ వైఎస్సార్సీపీ ఏకపక్షంగా విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఇది చంద్రబాబుకు దక్కిన ఘోర పరాభవంగానే రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. చిత్తూరులో టీడీపీ చిత్తు చిత్తు ► చంద్రబాబునాయుడి సొంత జిల్లా చిత్తూరులో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేసిన కుప్పం మినహా మిగిలిన 13 అసెంబ్లీ నియోజకవర్గాలనూ వైఎస్సార్సీపీనే గెలుచుకుంది. ఇప్పుడు కుప్పంతో సహా మొత్తం 14 నియోజకవర్గాల్లోని అన్ని జెడ్పీటీసీ స్థానాల్లోనూ వైఎస్సార్సీపీ అభ్యర్థులే తిరుగులేని విజయం సాధించారు. ► జిల్లాలో మొత్తం 65 జెడ్పీటీసీ స్థానాలుండగా, 30 స్థానాలు గతంలోనే ఏకగ్రీవమయ్యాయి. రెండు స్థానాల్లో అభ్యర్థుల మృతితో ఎన్నికలు నిలిచిపోగా, మిగిలిన 33 స్థానాల్లో జరిగిన ఎన్నికల కౌంటింగ్‌లో అన్ని స్థానాల్లోనూ వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. గెలుపొందిన ప్రతి స్థానంలోనూ టీడీపీ అభ్యర్థులపై భారీ ఓట్ల మెజారిటీ రావడం విశేషం. ► జిల్లాలోని 886 ఎంపీటీసీ స్థానాల్లో 410 చోట్ల వైఎస్సార్సీపీకి, టీడీపీకి 8, సీపీఐకి 1, ఇతరులకు 14 స్థానాల్లో ఏకగ్రీవాలయ్యాయి. 34 ఎంపీటీసీ స్థానాల్లో వివిధ కారణాల వల్ల ఎన్నికలు జరగలేదు. ఎన్నికలు జరిగిన 419 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 389 స్థానాల్లో విజయం సాధించగా, టీడీపీ కేవలం 25 స్థానాలతో సరిపెట్టుకుంది. స్వతంత్రులు ఐదు చోట్ల గెలుపొందారు. ► మొత్తంగా ఎన్నికలు జరగని 34 స్థానాలను మినహాయిస్తే, 852 ఎంపీటీసీలకు గాను799 స్థానాల్లో వైఎస్సార్సీపీ, 33 స్థానాల్లో టీడీపీ, సీపీఐ 1, ఇతరులు 19 చోట్ల గెలుపొందారు. మొత్తంగా చూస్తే.. టీడీపీ ఆవిర్భావం తర్వాత జిల్లాలో ఇంతటి దారుణమైన ఫలితాలను తొలిసారిగా చవిచూసిన బాధ కంటే, చివరికి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఈ స్థాయిలో పార్టీ కుప్పకూలడం ఇప్పుడు ఆ పార్టీ నేతలకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. కుప్పంలో చరిత్ర తిరగరాసిన ఫ్యాన్ చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ తొలిసారిగా చరిత్ర తిరగ రాసింది. జెడ్పీటీసీ వ్యవస్థ మొదలైన తర్వాత మొదటిసారిగా టీడీపీకి అక్కడ బోణీ లేకుండా పోయింది. 1989 నుంచి స్థానిక సంస్థలకు సంబంధించిన ప్రతి ఎన్నికలోనూ టీడీపీ పై చేయి సాధిస్తూ వచ్చింది. 2006లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో శాంతిపురం జెడ్పీటీసీ సభ్యుడిగా కాంగ్రెస్ అభ్యర్థి సుబ్రహ్మణ్యంరెడ్డి గెలుపొందారు. మిగిలిన మూడు చోట్ల టీడీపీ అభ్యర్థులే గెలుపొందారు. అదే ఏడాది రామకుప్పం ఎంపీపీగా కాంగ్రెస్ అభ్యర్థి వెంకటమ్మ గెలుపొందారు. మిగిలిన ఎంపీపీలన్నీ టీడీపీ గెలిచింది. 2014లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో నాలుగు జెడ్పీటీసీ స్థానాలు, అన్ని ఎంపీపీలనూ టీడీపీనే గెలుచుకుంది. అయితే 2021లో మొత్తం సీన్ రివర్స్ అయింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన, కుప్పంలో జరిగిన అభివృద్ధి పనుల వల్లే ఇక్కడి ప్రజలు సైకిల్‌కు పంక్చర్ చేసి, ఫ్యాన్‌కు పట్టం కట్టారు. చంద్రబాబు సొంతూరులో వైఎస్సార్సీపీ జెండా ప్రతిపక్ష నేత చంద్రబాబు స్వగ్రామం చంద్రగిరి నియోజకవర్గం నారా వారిపల్లెలోనూ వైఎస్సార్సీపీ అభ్యర్థి తిరుగులేని విజయం సాధించారు. నారావారిపల్లె గ్రామం ఉన్న చిన్నరామాపురం ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి రాజయ్య, టీడీపీ అభ్యర్థి గంగాధరంపై 1,399 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. ఎంపీటీసీ పరిధిలో మొత్తం 3,040 ఓట్లు ఉంటే 2,061 ఓట్లు పోలయ్యాయి. ఆదివారం జరిగిన కౌంటింగ్‌లో వైఎస్సార్సీపీకి 1,704 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి గంగాధరంకు కేవలం 305 ఓట్లు వచ్చాయి. చంద్రబాబుకు రాజకీయ జీవితం ప్రసాదించిన చంద్రగిరి మండలంలోని 16 ఎంపీటీసీలు, ఒక జెడ్పీటీసీ స్థానం సైతం వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఇక్కడ టీడీపీ ఒక్క ఎంపీటీసీ స్థానం కూడా గెలవలేదు. -
AP MPTC, ZPTC elections results: వారెవా.. వలంటీర్!
పలాస/జంగారెడ్డిగూడెం: ఇప్పటికే వలంటీర్లు ఎంతో మంది సర్పంచ్‌లుగా ఎన్నికై ప్రజా సేవ చేస్తున్నారు. అదే కోవలో ఇప్పుడు మరికొందరు వలంటీర్లు చేరారు. పరిషత్ ఎన్నికల్లో ఎంపీటీసీ సభ్యులుగా ఎన్నికయ్యారు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం బ్రాహ్మణతర్లా ఎంపీటీసీ స్థానానికి పోటీ చేసిన ఆ గ్రామ వలంటీర్ తుంగాన రమణమ్మ భారీ మెజారిటీతో గెలుపొందారు. సమీప ప్రత్యర్థి బంగారి జ్యోతిపై 1,199 ఓట్ల మెజారిటీ సాధించారు. పేద రైతు కుటుంబం నుంచి వచ్చిన రమణమ్మ ఇంటర్ వరకూ చదివారు. జీవనోపాధి కోసం వలంటీర్‌గా పనిచేస్తున్నారు. తన సేవల ద్వారా అతి తక్కువ కాలంలోనే గ్రామంలో మంచి పేరు తెచ్చుకుని ఎంపీటీసీ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. అలాగే పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం నిమ్మలగూడెం వలంటీర్‌గా పనిచేస్తున్న తానిగడప నిర్మలకుమారి కూడా అమ్మపాలెం ఎంపీటీసీగా గెలుపొందారు. తాను పనిచేస్తున్న నిమ్మలగూడెం గ్రామం అమ్మపాలెం ఎంపీటీసీ సెగ్మెంట్ పరిధిలో ఉంది. తన సమీప ప్రత్యర్థి, జనసేన అభ్యర్థి దాసరి ప్రవీణ్‌కుమార్‌పై 567 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. బీఈడీ వరకూ చదివిన నిర్మలకుమారి.. వలంటీర్‌గా తనకున్న అనుభవంతో మరింత సమర్థంగా ప్రజా సేవ చేస్తానని చెప్పారు. ఆమెను ఎమ్మెల్యే వీఆర్ ఎలీజా అభినందించారు. -
ఓటమి భయంతోనే బహిష్కరణ నాటకం
సాక్షి, అమరావతి: పరిషత్ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని ముందే ఊహించి ప్రతిపక్ష టీడీపీ ఏడాదిన్నరగా ఏదో ఒక సాకుతో ఎన్నికల ప్రక్రియకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించినట్లు స్పష్టమవుతోంది. అధికార పార్టీకి వందకు వంద శాతం అనుకూలంగా వచ్చిన ఎన్నికల ఫలితాలపై కూడా ఆత్మ వంచనకు పాల్పడుతూ తాము ఎన్నికలను బహిష్కరించడం వల్లే ఇలాంటి ఫలితాలు వచ్చాయంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుండటం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. నిజానికి ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష టీడీపీ పార్టీ గుర్తుతో తన అభ్యర్థులకు బి–ఫామ్‌లు ఇచ్చింది. ఎన్నికల్లో అభ్యర్థులనూ నిలబెట్టింది. ప్రచారం కూడా చేయించింది. చివరకు పంచాయతీ, మునిసిçపల్ ఎన్నికల ఫలితాలకు మించి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజాదరణ ఉన్నట్లు అర్థమయ్యేసరికి పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ఉత్తుత్తి ప్రకటన చేసింది. అయితే విపక్షం ఎన్నికల్లో ప్రచారమూ చేసింది, డబ్బులూ పంచింది. కానీ ఎన్ని చేసినా ఫలితం లేదని బోధపడటంతో అసలు పరిషత్ ఎన్నికల పోటీ నుంచి తాము తప్పుకున్నట్లు ఇప్పుడు మరో నాటకాన్ని రక్తి కట్టిస్తోంది. ఏడాది పాటు దాటవేత టీడీపీ అధికారంలో ఉన్న సమయంలోనే సర్పంచుల పదవీ కాలం ముగిసినా ఓటమి భయంతో దాదాపు ఏడాది పాటు పంచాయతీ ఎన్నికలు నిర్వహించకుండా దాటవేస్తూ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆ ఫలితాలను చూసి బెంబేలెత్తి స్థానిక సంస్థల ఎన్నికలు జరగకుండా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో సహా ఆ పార్టీ నేతలంతా అడుగడుగునా అడ్డుపడిన విషయం తెలిసిందే. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కాగానే గ్రామ స్వరాజ్యానికి ప్రాధాన్యమిస్తూ ఆరేడు నెలలకే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై దృష్టి సారించగా, ఈ ప్రక్రియ మొదలు కాకముందే టీడీపీ నేతలు రిజర్వేషన్లపై కోర్టులో కేసులు దాఖలు చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉపాధి హామీ పథకం స్టేట్ కౌన్సిల్ సభ్యుడిగా నామినేటెడ్ పదవి పొందిన బిర్రు ప్రతాప్‌రెడ్డి రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతానికి పైబడి రిజర్వేషన్లు అమలు చేయడంపై కోర్టును ఆశ్రయించారు. ఓటమి భయంతో టీడీపీ నేత దాఖలు చేసిన కేసు కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్లను హైకోర్టు 50 శాతానికి పరిమితం చేసింది. ఎట్టకేలకు బరిలోకి.. ఎట్టకేలకు 2020 మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాగా టీడీపీ తరఫున పోటీకి అభ్యర్థులు మొహం చాటేశారు. రాష్ట్రంలో 660 జెడ్పీటీసీ స్థానాలుండగా 652 స్థానాలకు అప్పటి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. టీడీపీ 482 స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది. జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీకి 170 చోట్ల విపక్షాలకు అభ్యర్థులే లేకపోవడం గమనార్హం. ఇందులో 126 జెడ్పీటీసీ స్థానాలు వైఎస్సార్సీపీకి ఏకగ్రీవం కాగా ఎన్నికలు జరిగిన 44 చోట్ల టీడీపీ సహా ఇతర విపక్ష అభ్యర్థులు పోటీ చేయలేదు. ఎంపీటీసీ ఎన్నికల్లోనూ ప్రతిపక్షానికి 3,032 చోట్ల అభ్యర్థులే కరువయ్యారు. వారంలో పోలింగ్ ఉందనగా.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత మరో వారం రోజుల్లో పోలింగ్ నిర్వహించనున్న సమయంలో నాటి ఎస్ఈసీ నిమ్మగడ్డ కరోనా పేరుతో ప్రభుత్వానికి కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా ఆ ఎన్నికలను అర్థంతరంగా వాయిదా వేశారు. చంద్రబాబు ప్రోద్బలంతో టీడీపీ ప్రయోజనాల కోసమే నిమ్మగడ్డ ఎన్నికలను హఠాత్తుగా వాయిదా వేశారని వెల్లడవుతోంది. ఆ సమయంలో నిమ్మగడ్డ కేంద్రానికి ఓ లేఖ రాయడం, అది టీడీపీ రాష్ట్ర కార్యాలయంలోనే తయారైందన్న విమర్శలు వచ్చాయి. అవకాశం ఉన్నా నిర్వహించకుండా.. అర్థంతరంగా వాయిదా వేసిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను పక్కన పెట్టేసిన నిమ్మగడ్డ రమేష్ ఈ ఏడాది జనవరి–ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించారు. ఎన్నికల కోడ్ పేరుతో అధికార యంత్రాంగాన్ని బెదిరిస్తూ తన గుప్పిట్లో పెట్టుకునేందుకు యత్నించారు. మంత్రులు, ఐఏఎస్ అధికారులపై ఏకపక్షంగా చర్యలకు సిఫార్సులు చేశారు. అయినా 80 శాతం స్థానాల్లో వైఎస్సార్సీపీ సానుభూతిపరులే గెలిచారు. నిమ్మగడ్డ రమేష్ పదవిలో ఉన్నంతకాలం అవకాశం ఉన్నా పరిషత్ ఎన్నికలను నిర్వహించలేదన్న విమర్శలున్నాయి. న్యాయ వివాదాలతో లెక్కింపు జాప్యం.. నిమ్మగడ్డ తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్ని వాయిదా పడిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు ఏప్రిల్ 1వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసి 8న పోలింగ్ జరపాలని నిర్ణయించగా టీడీపీ నేత వర్ల రామయ్య హైకోర్టులో కేసు వేశారు. ఆయనతోపాటు ఇతర పార్టీల నేతలు వేసిన కేసులు కారణంగా పోలింగ్ జరిగిన తర్వాత కూడా ఓట్ల లెక్కింపు దాదాపు ఐదున్నర నెలలు ఆలస్యమైంది. ఓటమి భయంతో ఒక పక్క కేసులు వేసి అడ్డుకుంటూ మరోపక్క పార్టీ అభ్యర్థులకు టీడీపీ బీ ఫామ్‌లిచ్చి పోటీలో నిలిపింది. పరిషత్ ఎన్నికలను తమ పార్టీ బహిష్కరించినట్లు బుకాయిస్తూ మరోవైపు పార్టీ తరఫున బరిలో దిగిన అభ్యర్థులతో యథావిధిగా ప్రచారాన్ని నిర్వహించింది. సైకిల్ గుర్తుతో పోటీ చేసిన అభ్యర్థులు గెలిచేందుకు సర్వశక్తులూ ఒడ్డారు. టీడీపీ నిజంగానే ఎన్నికల్ని బహిష్కరిస్తే ఆ పార్టీ సంప్రదాయ ఓటర్లు ఎన్నికలకు దూరమై పోలింగ్ శాతం తగ్గిపోయి ఉండాలి కదా? అని ప్రశ్నిస్తున్నారు. ప్రజలు ఆ పార్టీని మరోసారి ఘోరంగా తిరస్కరించినట్లు ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. -
పంచాయతీ, మునిసిపల్‌ను మించి జైత్రయాత్ర
సరిగ్గా రెండున్నరేళ్ల కిందట ఆరంభమైందీ జైత్రయాత్ర. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 86 శాతం సీట్లు... అంటే ఏకంగా 151 స్థానాలు గెలిచి దీన్ని ఆరంభించారు వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఆ చరిత్రాత్మక విజయాన్ని తక్కువ చేయటానికి నానా వక్రభాష్యాలూ చెప్పారు చంద్రబాబు, ఆయన తెలుగుదేశం!. ఈ ఏడాది ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల్లోనూ అదే పునరావృతం. 80 శాతానికిపైగా స్థానాలు వైఎస్సార్‌సీపీవే. అవి పార్టీ రహిత ఎన్నికలు కావటంతో... వైఎస్సార్సీపీ సీట్లూ తమ ఖాతాలో వేసేసుకుని బుకాయింపులకు దిగింది టీడీపీ. అంతలో మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికలొచ్చాయి. 98.6 శాతం మున్సిపాలిటీలు... 100 శాతం కార్పొరేషన్లు వైసీపీ పరమయ్యాయి. తరవాత జరిగిన మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లోనూ అంతే.. టీడీపీ ఎన్ని డ్రామాలాడినా... అదే ఫలితం వెల్లడయింది. తిరుగులేని ఆధిక్యంతో 13 జిల్లా పరిషత్‌లు, 99.95% మండల పరిషత్‌లలో వైఎస్సార్సీపీ విజయదుందుభి మోగించింది. ఈ సారి చంద్రబాబుకు తగిలిన దెబ్బ ఎలాంటిదంటే... సొంత నియోజకవర్గం కుప్పం కాదుకదా... సొంత ఊరు నారావారి పల్లెలోనూ పరాజయం తప్పలేదు. ఆయన భార్య దత్తత తీసుకున్న నిమ్మకూరులోనూ పరాభవమే. దీనికి చంద్రబాబు భాష్యమేంటో తెలుసా..? అభ్యర్థులను ఎంపిక చేసి.. బీ–ఫారాలిచ్చి... డబ్బులిచ్చి... ప్రచారం చేసి కూడా.. తాము ఎన్నికల్లో పోటీ చేయలేదని, బాయ్‌కాట్ చేశామని చెబుతున్నారు. మరి బాయ్‌కాట్ చేస్తే 7 జెడ్పీటీసీ స్థానాలు ఎలా గెలుస్తారు? దాదాపు 923 మంది టీడీపీ అభ్యర్థులు ఎంపీటీసీలుగా ఎలా గెలుస్తారు? అసలు పోటీ చేయకుంటే జనం వీళ్లకెందుకు ఓట్లేస్తారు? ప్రతి పరాజయానికీ చంద్రబాబు అండ్ కో ఎన్ని సాకులు చెబుతున్నా ఒక్కటి మాత్రం నిజం. ప్రజల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డికి తిరుగులేని ఆదరణ ఉంది. ఈ జగన్నాథ రథాన్ని జనమే నడిపిస్తూ అపూర్వ విజయాల్ని కట్టబెడుతుండడమే ఇందుకు నిదర్శనం. దేశంలో మండల, జిల్లా పరిషత్ ఎన్నికల చరిత్రలో ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్సీపీ నూతన అధ్యాయాన్ని లిఖించింది. ఇదివరకెన్నడూ లేని రీతిలో.. ఏ రాష్ట్రంలోనూ కనీ వినీ ఎరుగని రీతిలో అన్ని జిల్లా పరిషత్‌లను, 99 శాతానికిపైగా మండల పరిషత్ (ఇతర రాష్ట్రాల్లో బ్లాక్‌లు)లను కైవసం చేసుకుంది. వైఎస్ జగన్ ప్రభుత్వ సంక్షేమాభివృద్ధికి ప్రజలు మరోమారు పట్టం కట్టారు. ఎవరెన్ని కుట్రలు చేసినా, నిశ్శబ్దంగా బ్యాలెట్ ద్వారా బుద్ధి చెప్పారు. కష్టకాలంలో ఆదుకున్న జననేత వెంటే అడుగులో అడుగు వేశారు. జగన్నాథ రథాన్ని ముందుకు నడిపిస్తున్నారు. సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్సీపీకి బ్రహ్మరథం పట్టారు. రెండేళ్లుగా సంక్షేమ, అభివృద్ధి పథకాలతో సుపరిపాలన అందిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని మనస్ఫూర్తిగా ప్రజలు ఆశీర్వదించారు. తూర్పున శ్రీకాకుళం నుంచి పశ్చిమాన అనంతపురం వరకూ అన్ని జిల్లాల్లోనూ చారిత్రక విజయాన్ని అందించారు. రాష్ట్రంలో 13 జిల్లా పరిషత్‌లను కైవసం చేసుకోవడం ద్వారా వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. 99.95 శాతం మండల పరిషత్‌లను చేజిక్కించుకోవడం ద్వారా రికార్డు సృష్టించింది. దేశంలో మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఏ రాష్ట్రంలోనూ ఒకే పార్టీ అన్ని జిల్లా పరిషత్‌లను దక్కించుకోవడం, 99.95 శాతం మండల పరిషత్‌లను కైవసం చేసుకోవడం ఇదే ప్రథమం. రాష్ట్రంలో 660 జడ్పీటీసీ స్థానాలకుగానూ 126 జడ్పీటీసీ స్థానాలను వైఎస్సార్సీపీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. మరో 19 స్థానాలకు వివిధ కారణాల వల్ల ఎన్నికలు జరగలేదు. 515 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. 10,047 ఎంపీటీసీ స్థానాలకుగానూ 2,233 స్థానాల్లో వైఎస్సార్సీపీ, 95 స్థానాల్లో టీడీపీ, 43 స్థానాల్లో ఇతరులు వెరసి 2,371 స్థానాల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వివిధ కారణాల వల్ల 457 స్థానాలకు ఎన్నికలు జరగలేదు. 7,219 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోలైన ఓట్లను ఎన్నికల అధికారులు ఆదివారం లెక్కించి, ఫలితాలు ప్రకటించారు. 13 జిల్లా పరిషత్‌లూ వైఎస్సార్సీపీ కైవసం ఆదివారం ప్రకటించిన ఫలితాలు, ఏకగ్రీవంగా ఎన్నికైన జెడ్పీటీసీ స్థానాలతో కలిపి చూస్తే.. 13 జిల్లా పరిషత్తుల్లోనూ వైఎస్సార్సీపీ తిరుగులేని ఆధిక్యం సాధించి.. క్లీన్ స్వీప్ చేసింది. 13 జిల్లా పరిషత్ అధ్యక్షులుగా వైఎస్సార్సీపీ అభ్యర్థులే ఎన్నిక కావడానికి మార్గం సుగమమైంది. జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలను చూస్తే.. కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు జిల్లాల్లో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. కృష్ణాజిల్లాలో 2, మిగతా ఐదు జిల్లాల్లో ఒక్కో జెడ్పీటీసీ స్థానానికే టీడీపీ పరిమితమైంది. మండల పరిషత్‌ల్లోనూ అఖండ విజయం ఎంపీటీసీ ఎన్నికల్లో ఆదివారం ప్రకటించిన ఫలితాలు, ఏకగ్రీవంగా ఎన్నికైన స్థానాలతో కలిపి చూస్తే. మండల పరిషత్‌లోనూ వైఎస్సార్సీపీ అఖండ విజయాన్ని సాధించింది. 99.95 శాతం మండల పరిషత్‌లలో తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది. ఆ మండల పరిషత్ ప్రెసిడెంట్లుగా వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఎన్నిక కావడానికి లైన్ క్లియర్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో పేర్కొనే మండలాలనే కర్ణాటక, పశ్చిమబెంగాల్, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో బ్లాక్‌లుగా పేర్కొంటారు. దేశంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో ఒకే పార్టీ 99.95 శాతం మండల పరిషత్ లేదా బ్లాక్‌లను చేజిక్కించుకున్న దాఖలాలు లేకపోవడం గమనార్హం. ప్రభుత్వ సంక్షేమాభివృద్ధికి పట్టం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అధికారం చేపట్టాక తొలి ఏడాదిలోనే 95 శాతానికిపైగా అమలు చేయడం ద్వారా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల మన్ననలు అందుకున్నారు. సీఎం వైఎస్ జగన్ రెండేళ్లుగా అందిస్తున్న సుపరి పాలన.. అమలు చేస్తున్న నవరత్నాలు, సంక్షేమాభివృద్ధి పథకాలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. రాష్ట్రంలో 2019లో జరిగిన ఎన్నికల్లో 50 శాతం ఓట్లు సాధించిన వైఎస్సార్సీపీ.. 86.28 శాతం శాసనసభ స్థానాలు(151), 88 శాతం లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకుని విజయభేరి మోగించింది. టీడీపీ కోటలను వైఎస్సార్సీపీ బద్ధలు కొట్టడంతో ఆపార్టీ శ్రేణులు చెల్లాచెదురయ్యాయి. అధికారం చేపట్టిన తర్వాత సుపరిపాలన.. సంక్షేమాభివృద్ధి పథకాలతోపాటూ కరోనా కష్ట కాలంలో వెన్నుదన్నుగా నిలవడం ద్వారా సీఎం వైఎస్ జగన్ ప్రజలకు మరింత చేరువయ్యారు. దాంతో 2019 ఎన్నికలతో పోల్చితే వైఎస్సార్సీపీకి ప్రజల్లో ఆదరణ మరింతగా పెరిగిందే తప్ప ఏమాత్రం తగ్గలేదు. పంచాయతీ ఎన్నికల్లో 80.47 శాతం గ్రామ పంచాయతీలను వైఎస్సార్సీపీ మద్దతుదారులు దక్కించుకున్నారు. ఎన్నికలు జరిగిన 75 మున్సిపాల్టీల్లో 74 వైఎస్సార్సీపీ ఆఖండ విజయం సాధించింది. 12 నగర పాలక సంస్థలను చేజిక్కించుకోవడం ద్వారా క్లీన్ స్వీప్ చేసింది. టీడీపీ ఉనికి పాట్లు నానాటికీ వైఎస్సార్సీపీపై ప్రజల్లో ఆదరణ పెరిగపోతుండటంతో మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటీచేసేందుకు ప్రతిపక్షం టీడీపీకి అభ్యర్థులే కరవయ్యారు. ఐదేళ్లలో అడ్డగోలుగా దోపిడీ చేసి.. దాచుకున్న కరెన్సీ నోట్ల కట్టలను వెదజల్లి ఎలాగోలా మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అభ్యర్థులను బరిలోకి దించారు. ఆదిలోనే ఘోర పరాజయం తప్పదని గ్రహించి.. అదే జరిగితే టీడీపీ ఉనికే ప్రశ్నార్థకమవుతుందని ఆందోళన చెందారు. ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు పైకి ప్రకటించి.. లోలోన బరిలోకి దించిన అభ్యర్థులకు భారీ ఎత్తున ఇం‘ధనం’ అందించారు. టీడీపీ ఉనికిని కాపాడుకోవడానికి మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు జరగనివ్వకుండా నాటి ఎస్ఈసీ నిమ్మగడ్డతో కలిసి కుట్రలు చేశారు. ఈ ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్ ఒక్క మాట మాట్లాడలేదు.. ఓటు వేయండని అడిగింది లేదు. సుపరిపాలన.. సంక్షేమాభివృద్ధి పథకాలు.. కష్టకాలంలో అండదండగా నిలుస్తూ సీఎం అంటే ఇలా ఉండాలి అని విమర్శకులు కూడా ప్రశంసించే రీతిలో పనిచేస్తూ వస్తున్నారు. రెండేళ్లలోనే ఇంత చేసిన సీఎం వైఎస్ జగన్‌కు అవకాశం ఇస్తే మరింత చేస్తారని జనం నమ్మారు. ఓట్ల రూపంలో వైఎస్సార్సీపీకి పట్టం కట్టారు. మూడు రాజధానుల ప్రాంతాల్లోనూ వైఎస్సార్సీపీకి అఖండ విజయాన్ని కట్టబెట్టడం ద్వారా వికేంద్రీకరణతోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమని చాటిచెప్పారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా కుట్రలు చేసిన టీడీపీకి, ఇతర ప్రతిపక్షాలకు కర్రుకాల్చి వాత పెట్టారు. 2014లో అలా.. నేడు ఇలా.. 2014లో ఉమ్మడి రాష్ట్రంలోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి. విభజన తర్వాత ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఈ ఎన్నికల్లో టీడీపీతో పోటాపోటీగా వైఎస్సార్సీపీ తలపడింది. అప్పట్లో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో టీడీపీ 5,208 స్థానాల్లో గెలిస్తే.. వైఎస్సార్సీపీ 4,207 స్థానాల్లో గెలుపొందింది. జెడ్పీటీసీ ఎన్నికల్లో 373 టీడీపీ గెలిస్తే, వైఎస్సార్సీపీ 275 స్థానాల్లో గెలిచింది. అప్పట్లో వైఎస్సార్, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లా పరిషత్ స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యాన్ని కనబర్చి సత్తా చాటుకుంది. ప్రస్తుతం జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో ఆదివారం అర్ధరాత్రి వరకు 616 స్థానాలు వైఎస్సార్సీపీ చేజిక్కించుకుంటే, కేవలం టీడీపీ 7 స్థానాలకే పరిమితం కావడం గమనార్హం. ఇప్పుడు జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో 8,200 స్థానాల్లో వైఎస్సార్సీపీ ఆఖండ విజయం సాధిస్తే, టీడీపీ 923 స్థానాలకు దిగజారింది. దివాలా తీసిన టీడీపీ ప్రజలు వైఎస్సార్సీపీని డిస్టింక్షన్ మార్కులతో పాస్ చేసి మా బాధ్యతను మరింత పెంచారు. ప్రస్తుత ఫలితాలతో దివాలా తీసి, ఐపీ పెట్టిన దశలో టీడీపీ ఉంది. –ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ ఫలితాలే నిదర్శనం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలు సీఎం జగన్ రెండేళ్ల పరిపాలనకు నిదర్శనం. పల్లె నుంచి పట్నం వర కు ప్రతి ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీకి బ్రహ్మరథం పట్టారు. దమ్ముంటే 19 మంది టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికలకు సిద్ధం కావాలి. – నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కుప్పం అసెంబ్లీ స్థానంలో గెలుస్తాం టీడీపీ కంచుకోట అని చెప్పుకుంటున్న కుప్పంలోనూ పరిషత్ ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్సీపీకే పట్టం కట్టారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పంలో ఘనవిజయం సాధిస్తాం. – పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి -
తెలుగుదేశం పార్టీ ప్రజల విశ్వాసం కోల్పోయింది : జూపూడి
-
పరిషత్ ఎన్నికల కౌంటింగ్ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
-
హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును స్వాగతిస్తున్నాం: సజ్జల
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలోని జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు సంబంధించి ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్వాగతించారు. ఆయన గురువారం తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని తెలిపారు. ఇన్ని రోజులు పరిషత్ ఎన్నికల ప్రక్రియకు పట్టిన గ్రహణం వీడిందని పేర్కొన్నారు. ప్రజస్వామ్య ప్రక్రియను అడ్డుకునే కుట్రలు చేశారని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలోనే స్థానిక ఎన్నికలు జరగాల్సి ఉందని, ఎన్నికలు జరపకుండా బాబు వాయిదా వేసుకుంటూ వచ్చారని ధ్వజమెత్తారు. ఆ తర్వాత రిజర్వేషన్ల అంశంతో మరికొంత సమయం వాయిదా పడిందన్నారు. గత ఏడాది మార్చిలో ఎన్నికల ప్రక్రియ జరగాల్సి ఉండగా అప్పటికే ఎస్ఈసీ నిమ్మగడ్డ కరోనా పేరుతో ఎన్నికలను వాయిదా చేశారని సజ్జల తెలిపారు. ప్రభుత్వంతో చర్చించకుండానే నిమ్మగడ్డ ఎన్నికలను వాయిదా వేశారని పేర్కొన్నారు. టీడీపీ కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలనే నిమ్మగడ్డ అమలు చేశారని అన్నారు. ఏకగ్రీవాలను కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారని విమర్శించారు. చదవండి: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఎన్నికల ప్రక్రియను హత్య చేసిన దోషి చంద్రబాబు అని సజ్జల మండిపడ్డారు. అడ్డదారులు తొక్కడమే బాబు నైజం అని దుయ్యబట్టారు. ఏడాది తర్వాత ఈ రోజుకు గ్రహణం వీడిందన్నారు. మహిళల భద్రతో కోసం దిశ చట్టం తీసుకోచ్చామని తెలిపారు. 53 లక్షల మందికిపైగా దిశ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారని పేర్కొన్నారు. దిశ చట్టం ప్రతులను తగులబెట్టారంటే లోకేష్ మానసికస్థితి అర్థం చేసుకోవాలన్నారు. దిశ చట్టం వల్ల మహిళల్లో ధైర్యం పెరిగిందని, తమకు ఎదురవుతున్న సమస్యలపై ఫిర్యాదులు చేయగలుగుతున్నారని సజ్జల పేర్కొన్నారు. -
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు కొట్టేసింది. కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించుకోవచ్చని డివిజన్ బెంచ్ తెలిపింది. గురువారం ఉదయం ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను హైకోర్టు సమర్థించింది. ఈ ఏడాది ఏప్రిల్ 8న 515 జెడ్పీటీసీ, 7220 ఎంపీటీసీలకు ఎన్నికలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 10న కౌంటింగ్ నిర్వహించాల్సి ఉండగా హైకోర్టు సింగిల్ బెంచ్ ఉత్తర్వులతో వాయిదా పడింది. మొదటి నుంచి ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు సింగిల్ బెంచ్ ఉత్తర్వులు జారీచేసింది. సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై హైకోర్టు డివిజన్ బెంచ్‌ని ఎస్ఈసీ ఆశ్రయించింది. డివిజన్ బెంచ్ ఉత్తర్వుల మేరకే జడ్పీటీసి, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించామని ఎస్ఈసీ తెలిపింది. మళ్లీ ఎన్నికలు నిర్వహించడం ఈ పరిస్థితులలో అసాధ్యంతో పాటు కోట్లాది రూపాయిలు వృధా అవుతాయని ఎస్ఈసీ పేర్కొంది. నేడు హైకోర్టు.. కౌంటింగ్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో న్యాయ పరమైన చిక్కులు తొలిగాయి. దీంతో కౌంటింగ్ ప్రక్రియకు ఎస్ఈసీ కసరత్తు ప్రారంభించింది. చదవండి: సైదాబాద్ చిన్నారి కేసు: నిందితుడు రాజు ఆత్మహత్య! సీఎం జగన్ లేఖపై తక్షణం స్పందించిన విదేశాంగ శాఖ -
ఏపీ: సర్వత్రా ఉత్కంఠ.. ‘పరిషత్’ ఎన్నికలపై నేడే తీర్పు
సాక్షి, అమరావతి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టు గురువారం తీర్పు వెలువరించనుంది. ఉదయం 10.30 గంటలకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం తీర్పు ఇవ్వనుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు గతంలో ఏ దశలో అయితే నిలిచిపోయాయో అక్కడి నుంచి తిరిగి నిర్వహించేందుకు వీలుగా మళ్లీ తాజా నోటిఫికేషన్ జారీచేయాలని ఆదేశిస్తూ సింగిల్ జడ్జి ఇటీవల తీర్పు ఇచ్చారు. (చదవండి: సీఎం జగన్ లేఖపై తక్షణం స్పందించిన విదేశాంగ శాఖ) ఈ తీర్పును రద్దుచేయాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దాఖలు చేసిన అప్పీలుపై ఆగస్టు 5న విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది. తిరిగి ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా తాజా నోటిఫికేషన్ ఇవ్వాలన్న సింగిల్ జడ్జి ఉత్తర్వులను ధర్మాసనం సమర్థిస్తుందా? లేక పూర్తయిన ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు చేయాలని ఆదేశిస్తుందా? అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.(చదవండి: జేసీ బ్రదర్స్‌కు టీడీపీ ఝలక్) -
సింగిల్ జడ్జి ఆదేశాలను రద్దు చేయండి
సాక్షి, అమరావతి: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను గతంలో ఏ దశలో అయితే నిలిచిపోయాయో అక్కడి నుంచి తిరిగి నిర్వహించాలని ఆదేశిస్తూ సింగిల్ జడ్జి గత నెల 21న ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ధర్మాసనం ముందు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) అప్పీల్ దాఖలు చేశారు. సింగిల్ జడ్జి ఆదేశాలను రద్దు చేయాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఈ అప్పీల్‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ జరపనుంది. కేసుతో సంబంధం లేని అంశాల ప్రస్తావన సింగిల్ జడ్జి తన తీర్పులో ఈ కేసుతో ఏమాత్రం సంబంధం లేని అంశాలను ప్రస్తావించారని, అంతర్జాతీయ ఒడంబడికలు, అవసరానికి మించి తీర్పులను ప్రస్తావించారని ఎస్ఈసీ నివేదించారు. టీడీపీ నేత వర్ల రామయ్య, జనసేన దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన సింగిల్ జడ్జి, జనసేన పిటిషన్ ఆధారంగా తీర్పు వెలువరించారన్నారు. ఎన్నికల తేదీకి 4 వారాల ముందు నియమావళి అమలు చేయాలని జనసేన తన పిటిషన్లో ఎక్కడా కోరలేదని, అయినా సింగిల్ జడ్జి ఆ అంశం ఆధారంగా ఎన్నికలను రద్దు చేశారని ఎస్ఈసీ పేర్కొన్నారు. 4 వారాల ముందు నియమావళి అమలు చేయాలని వర్ల రామయ్య కోరితే సింగిల్ జడ్జి ఆ పిటిషన్‌ను కొట్టివేశారన్నారు. సింగిల్ జడ్జి తీర్పులో పరస్పర విరుద్ధమైన అంశాలనేకం ఉన్నాయన్నారు. సింగిల్ జడ్జి వ్యాఖ్యలు సరికాదు.. సింగిల్ జడ్జి ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడమే కాకుండా తనపై వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. సింగిల్ జడ్జి అలా మాట్లాడకుండా ఉండాల్సిందన్నారు. ఓ రాజ్యాంగ సంస్థగా హైకోర్టు స్వతంత్రంగా విధులు నిర్వహిస్తున్న మాదిరిగానే ఎన్నికల కమిషనర్ కూడా బాధ్యతలు నిర్వర్తిస్తారని తెలిపారు. సింగిల్ జడ్జి చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలను తీర్పు నుంచి తొలగించాలని కోరారు. ఉమ్మడిగా వర్తిస్తుంది.. స్థానిక సంస్థల కాలపరిమితి 2018–19లోనే ముగిసిందని, వాటికి సత్వరమే ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై ఉందన్న విషయాన్ని సింగిల్ జడ్జి విస్మరించారన్నారు. సుప్రీంకోర్టు స్థానిక సంస్థల ఎన్నికలు అని తన ఉత్తర్వుల్లో చెప్పిందే కానీ ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామ పంచాయతీ అంటూ వేర్వేరుగా చెప్పలేదన్నారు. అందువల్ల 4 వారాల ఎన్నికల నియమావళి అమలు అన్ని ఎన్నికలకు ఉమ్మడిగా వర్తిస్తుందన్నారు. కాబట్టి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నాలుగు వారాల నియమావళి అమలు చేయలేదన్న వాదన చెల్లదన్నారు. సుప్రీం ఎన్నోసార్లు చెప్పింది.. ఎన్నికల ప్రక్రియ ఒకసారి మొదలయ్యాక అందులో జోక్యం చేసుకోరాదని సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో తీర్పులిచ్చిందని, సింగిల్ జడ్జి అందుకు విరుద్ధంగా వ్యవహరించి, ఎన్నికలను రద్దు చేశారని ఎస్ఈసీ వివరించారు. ఎన్నికల నిర్వహణకు రూ.150 కోట్ల ప్రజాధనం ఖర్చు అయిందన్న విషయాన్ని సింగిల్ జడ్జి పరిగణలోకి తీసుకోలేదన్నారు. -
పరిషత్ ఎన్నికలు: సింగిల్ బెంచ్ ఆదేశాలను సవాల్ చేస్తూ ఎస్ఈసీ పిటిషన్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల రద్దును సవాల్ చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇదే విషయమై గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ.. ఎస్ఈసీ డివిజన్ బెంచ్‌కు వెళ్లింది. నిబంధనల ప్రకారమే ఎన్నికలు నిర్వహించామని ఎస్ఈసీ తమ పిటిషన్లో పేర్కొంది. ఎన్నికల నిర్వహణలో సుప్రీం ఆదేశాలను తూచా తప్పకుండా పాటించామని తెలిపింది. కాగా, ఏపీలో పరిషత్ (ఎంపీటీసీ, జడ్పీటీసీ) ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ మే 21న తీర్పును వెలువరించింది. పరిషత్ ఎన్నికలకు కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని ఎస్ఈసీని ఆదేశించింది. -
‘పరిషత్ ఎన్నికల తీర్పుపై డివిజన్ బెంచ్‌కు ప్రభుత్వం’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు ఫైనల్ కాదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. తీర్పు కాపీ వచ్చాక ఏమి చేయాలనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. గతంలో సింగిల్ బెంచ్ స్టే ఇస్తే డివిజన్ బెంచ్ ఎన్నికలు జరిపించిన విషయం మనం చూశాం అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. తీర్పు కాపీ వచ్చాక ఆ తీర్పును సవాల్ చేస్తూ, డివిజన్ బెంచ్‌కు వెళ్లే అవకాశం కూడా ఉందన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం తప్పా ఒప్పా అనేది పక్కన పెడితే, ఎన్నికల ప్రక్రియ ప్రారంభించిన తరువాత ఏ న్యాయ వ్యవస్థ కూడా ఇందులో జోక్యం చేసుకోకూడదని గతంలో ఇచ్చిన జడ్జిమెంట్స్ అనేకం ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. డివిజన్ బెంచ్ ఇచ్చే తీర్పునుబట్టి సుప్రీం కోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉంటుందని తెలిపారు. ఒక బెంచ్‌కు మరో బెంచ్‌కు మధ్య అభిప్రాయాలు మారుతూ ఉంటాయని చెప్పారు. ఈ విషయం ఫైనల్ అయ్యే వరకు టీడీపీ, జనసేనలు తమ తమ పద్ధతుల్లో వాదనలు చేస్తూనే ఉంటారన్నారు. ఏదేమైనా తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వస్తుందని ఆశిస్తున్నానని చెప్పారు. చదవండి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఏకగ్రీవాలు యథాతథం పరిషత్ ఎన్నికలు మళ్లీ పెట్టండి -
ఎన్నికలు ఆపడం అన్యాయం
సాక్షి, అమరావతి: పరిషత్ ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు దురదృష్టకరం, అన్యాయమని ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ తీర్పును ప్రభుత్వం డివిజన్ బెంచ్‌లో సవాల్ చేస్తుందని చెప్పారు. చిల్లర రాజకీయాలతో ప్రజాతీర్పును అడ్డుకుని టీడీపీ సంబరపడటం సిగ్గుచేటన్నారు. ఆ పార్టీ కుసంస్కారానికి ఇది నిదర్శనమని మండిపడ్డారు. ప్రజాక్షేత్రంలో నేరుగా వైఎస్ జగన్‌ను ఎదుర్కొనే దమ్ము లేకే చంద్రబాబు దొంగదెబ్బ తీస్తున్నారని ధ్వజమెత్తారు. ఏ శక్తుల అండతో బాబు రెచ్చిపోతున్నారో ప్రజలందరికీ తెలుసన్నారు. ఈ మేరకు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల శుక్రవారం మీడియాతో మాట్లాడారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకేమన్నారంటే.. నిమ్మగడ్డ హయాం నుంచే.. కరోనా నేపథ్యంలోనూ ఎన్నికల ప్రక్రియను యజ్ఞంలా పూర్తిచేస్తే.. న్యాయస్థానం దీన్ని సీరియస్‌గా తీసుకోలేదన్న భావన ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. ఎన్నికలు హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాల ప్రకారమే జరిగాయి. ఎన్నికలను ఆపాలని కోర్టుకెళ్లినవారి ఉద్దేశం ప్రజలకు తెలుసు. మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ హయాం నుంచే ఈ దాగుడుమూతలు మొదలయ్యాయి. ప్రభుత్వం సిద్ధంగా ఉంటే ఎన్నికలు వాయిదా వేశారు.. వద్దంటే ఎన్నికలన్నారు,. ప్రజా తీర్పును ఆపిన టీడీపీ నేతలకు ప్రజా జీవితంలో ఉండే అర్హతే లేదు. ఇలాంటి కుయుక్తులతో తాత్కాలిక ఆనందం పొందుతారేమో కానీ.. ఎప్పుడు ఎన్నికలు జరిగినా జగన్‌వైపే జనం ఉంటారు. టీడీపీ, దాని వెనుక ఉన్న శక్తులు ఆయనను అడ్డుకోలేవు. వ్యవస్థలను, మీడియాను టీడీపీ అడ్డుపెట్టుకుని.. ఎంపీ రఘురామకృష్ణరాజుపై సీఐడీ పోలీసులు పెట్టిన దేశద్రోహం కేసును సుప్రీంకోర్టు పరిగణనలోనికి తీసుకుంది. దీన్నిబట్టి ఆయనపై మోపిన కేసులకు ప్రాథమిక ఆధారాలున్నాయని కోర్టు గుర్తించినట్టే. సీఐడీ విచారణకు సహకరించాలని చెప్పడంతోపాటు అడ్డూ అదుపు లేకుండా హద్దుమీరి చేస్తున్న ఆయన చర్యలకు అడ్డుçకట్ట వేసింది. జగన్ ప్రభుత్వానికి రాజకీయ, వ్యక్తిగత కక్షలూ లేవు. ప్రజల కోసం పనిచేయాలని, వారి ఆశీస్సులు సంపాదించాలన్న ఏకైక అజెండా తప్ప. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ధూళిపాళ్ల నరేంద్ర.. ఇలా ఎవరిపైనైనా ప్రాథమిక ఆధారాలున్నందునే కేసులు పెట్టారు. అధికారంలో ఉన్నా మేం ఎవరినీ వేధించడం లేదు. అధికారంలో లేకున్నా టీడీపీ వాళ్లే వ్యవస్థలను, మీడియాను అడ్డుపెట్టుకుని సీఎం జగన్‌ను ఇబ్బంది పెడుతున్నారు. ఇలాంటి కుయుక్తులను ఎదుర్కొనే శక్తి మాకుంది. ప్రజలే మా బలం. గతంలోనూ జగన్‌పై కుట్రలు చేసి పెట్టిన కేసులన్నీ అబద్ధాలని తేలిపోతున్నాయి. అంతా చంద్రబాబు డ్రామా రఘురామకృష్ణరాజును వైద్యం కోసం టీడీపీకి అనుకూలమైన రమేశ్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. తీసుకెళ్లకపోతే నేరమంటున్నారు.. వివాదం సృష్టిస్తున్నారు. ఆ ఆస్పత్రికి ఉన్న విశ్వసనీయత ఏంటి? కోవిడ్ మరణాలతో ఆ ఆస్పత్రి వెలుగులోకొచ్చింది. కేసులున్న ఆస్పత్రిని కోరుకోవడంలో అర్థమేంటి? ఏ శక్తులు వాళ్లకు అండగా ఉంటున్నాయో ప్రజలకు తెలుసు. కోర్టుకొచ్చినప్పుడు బాగానే ఉన్నారు. ఆ తర్వాతే పోలీసులు కొట్టారని డ్రామా మొదలుపెట్టారు. నిజంగా ఆయనకు గాయమై ఉంటే కోర్టులో నడవగలరా? వాహనంలో వెళ్తూ నొప్పి కూడా లేకుండా మీడియాతో మాట్లాడగలరా? మీసం తిప్పగలరా? సీఐడీ ఆధ్వర్యంలో పరీక్షలు చేయించినప్పుడు బయటపడని గాయాలు.. ఆ తర్వాత ఎలా వచ్చాయో.. మధ్యలో ఏం జరిగిందో తేలాలి. ఇదంతా చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన డ్రామా. కేసులో తన బండారం బయటపడుతుందని డ్రామాను బాబు మరింత ముందుకు తీసుకెళ్లారు. -
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఏకగ్రీవాలు యథాతథం
సాక్షి, అమరావతి: పరిషత్ ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ ఏకగ్రీవమైన ఎంపీటీసీ, జడ్పీటీసీలు యథాతథంగా ఉంటారని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికార వర్గాలు శుక్రవారం స్పష్టం చేశాయి. 2020 మార్చిలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 126 జడ్పీటీసీ స్థానాలు, 2,371 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమైన సంగతి తెలిసిందే. 2020 మార్చిలో జరిగిన నామినేషన్ల ప్రక్రియను హైకోర్టు రద్దు చేయలేదని.. కరోనా అనంతరం మధ్యలో ఆగిపోయిన ఎన్నికలను తిరిగి నిర్వహించడానికి ఇచ్చిన నోటిఫికేషన్‌ను మాత్రమే రద్దు చేసిందని రాష్ట్ర ఎన్నికల సంఘం, పంచాయతీరాజ్ శాఖ అధికార వర్గాలు వెల్లడించాయి. హైకోర్టు తీర్పుపై మీడియా, కొన్ని రాజకీయ పార్టీలు తప్పుగా ప్రచారం చేస్తున్నాయని వివరించాయి. 2020 మార్చిలో మధ్యలో ఆగిపోయిన ఎన్నికలను 2021 ఏప్రిల్‌లో తిరిగి నిర్వహించేటప్పుడు నోటిఫికేషన్‌కు, పోలింగ్‌కు మధ్య 4 వారాల గడువును పాటించలేదని మాత్రమే కోర్టు తప్పుపట్టిందని తెలిపాయి. ఈ ఏడాది ఏప్రిల్ 1న జారీ చేసిన నోటిఫికేషన్‌నే కోర్టు రద్దు చేసిందన్నాయి. 2020 మార్చిలో ఇచ్చిన ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం.. నామినేషన్ల ఉపసంహరణ వరకు జరిగిన ప్రక్రియంతా చెల్లుబాటులో ఉన్నట్లేనని వెల్లడించాయి. హైకోర్టు తాజా తీర్పు ప్రకారం.. ఏప్రిల్ 8న జరిగిన పోలింగ్ ప్రక్రియ మాత్రమే రద్దు అయినట్టుగా భావించాలని, అంతకు ముందు జరిగిన నామినేషన్లన్నీ చెల్లుబాటులో ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. తాజా తీర్పుపై డివిజన్ బెంచ్‌లో సవాల్ చేయాలని ఎస్ఈసీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. -
పరిషత్ ఎన్నికలు మళ్లీ పెట్టండి
సాక్షి, అమరావతి: పోలింగ్ ప్రక్రియ పూర్తయి అంతా ఫలితాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను మళ్లీ నిర్వహించాలని రాష్ట్ర హైకోర్టు స్పష్టంచేసింది. ఎన్నికల తేదీకి నాలుగు వారాల ముందు నుంచీ ఎన్నికల నియమావళి అమల్లో ఉండాలని, ఈ మేరకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయలేదు కాబట్టి ఈ ఎన్నికలను మళ్లీ నిర్వహించాలని జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తితో కూడిన సింగిల్ జడ్జి ధర్మాసనం శుక్రవారం తీర్పునిచ్చింది. ‘‘ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు గతంలో ఏ దశలో అయితే నిలిచిపోయాయో అక్కడి నుంచి తిరిగి నిర్వహించాలి. ఎన్నికల తేదీకి 4 వారాల ముందు నుంచి ఎన్నికల నియమావళిని అమలు చేయాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులను తూచా తప్పకుండా అమలు చేస్తూ, ఎన్నిల నిర్వహణ నిమిత్తం తాజా నోటిఫికేషన్ జారీ చేయాలి. ఈ ఏడాది ఏప్రిల్ 8న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా ఎన్నికల కమిషన్ ఏప్రిల్ 1న నోటిఫికేషన్ జారీ చేసింది. అది చట్టవిరుద్ధమైన నోటిఫికేషన్ కనక దానిని రద్దు చేస్తున్నాం’’ అని న్యాయస్థానం తన తీర్పులో పేర్కొంది. ఎన్నికల్లో పోటీ విషయంలో జససేన పార్టీ అభ్యర్థులకు సమాన అవకాశాలు కల్పించేలా ఆ నోటిఫికేషన్ లేదని కూడా హైకోర్టు ఆక్షేపించింది. ‘‘ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకునే విషయంలో రాజ్యాంగంలోని అధికరణ 243ఓ ప్రకారం ఎలాంటి నిషేధం లేదని కోర్టు స్పష్టం చేసింది. నాలుగు వారాల ముందు నుంచి ఎన్నికల నియమావళిని అమలు చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహిస్తోందంటూ తెలుగుదేశం పార్టీ నేత వర్ల రామయ్య దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఈ నోటిఫికేషన్ వల్ల తన చట్టబద్ధమైన, న్యాయబద్ధమైన, రాజ్యాంగబద్ధమైన హక్కుల ఉల్లంఘన జరిగిందని నిరూపించడంలో వర్ల రామయ్య విఫలమయ్యారని, అందువల్ల ఫలానా విధంగా వ్యవహరించేలా ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని కోరజాలరని హైకోర్టు తేల్చి చెప్పింది. పరిషత్ ఎన్నికలు గతంలో ఎక్కడ నిలిచిపోయాయో ఆ దశ నుంచి కాకుండా మొదటి నుంచి తిరిగి నిర్వహించేలా ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని కోరుతూ బీజేపీ నేత పాతూరి నాగభూషణంతో పాటు మరికొందరు వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్‌ను జారీ చేయాలన్న జనసేన పార్టీ పిటిషన్‌ను న్యాయమూర్తి పాక్షికంగా అనుమతించారు. టీడీపీ, బీజేపీ, జనసేన వేర్వేరుగా పిటిషన్లు... ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల తేదీకి నాలుగు వారాల ముందు నుంచి ఎన్నికల నియమావళిని అమలు చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహిస్తోందంటూ తెలుగుదేశం నేత వర్ల రామయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మొదట విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, ఎన్నికలకు 4 వారాల ముందు ఎన్నికల నియమావళిని అమలు చేయకపోవడం సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమంటూ పరిషత్ ఎన్నికలను ఆపేస్తూ ఏప్రిల్ 6న ఉత్తర్వులిచ్చారు. వీటిపై ఎన్నికల కమిషన్ ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ముందు అప్పీలు చేసింది. విచారణ జరిపిన ధర్మాసనం... షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించుకునేందుకు అనుమతినిచ్చింది. అయితే ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడిని మాత్రం చేపట్టొద్దని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. అలాగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల వ్యాజ్యాలపై తుది విచారణ జరిపి తీర్పునివ్వాలని సింగిల్ జడ్జిని ధర్మాసనం కోరింది. అయితే పరిషత్ ఎన్నికలు ఏ దశలో అయితే నిలిచిపోయాయో అక్కడి నుంచి నిర్వహించే నిమిత్తం ఈసీ ఏప్రిల్ 1న జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేసి, తాజాగా నామినేషన్లు దాఖలు చేసేందుకు నోటిఫికేషన్లు ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలంటూ జనసేన నేత చిల్లపల్లి శ్రీనివాసరావు హైకోర్టులో పిటిషన్ వేశారు. అలాగే ఎన్నికలను మొదటి నుంచి నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ బీజేపీ నేత నాగభూషణం తదితరులు మరో పిటిషన్ వేశారు. వీటన్నిటిపై న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ఇరుపక్షాల వాదనలు విన్నారు. శుక్రవారం ఆయన టీడీపీ, జనసేన పిటిషన్లలో ఉమ్మడి తీర్పు, బీజేíపీ పిటిషన్లో వేరుగా తీర్పు వెలువరించారు. వర్ల రామయ్య, బీజేపీ పిటిషన్లను కొట్టేసిన న్యాయమూర్తి, జనసేన పిటిషన్‌ను పాక్షికంగా అనుమతించారు. న్యాయమూర్తి తన తీర్పులో ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీ తీరును తప్పుపట్టారు. ఎన్నికల కమిషనర్‌ను ఉద్దేశించి ఘాటైన పదజాలం ఉపయోగించారు. ఎన్నికల కమిషనర్ సొంత భాష్యం చెప్పారు... ‘ఎన్నికల తేదీకి నాలుగు వారాల ముందు ఎన్నికల నియమావళిని అమలు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వుల పట్ల ఎన్నికల కమిషనర్ అవిధేయత చూపుతూ ఏప్రిల్ 8న ఎన్నికల నిర్వహించేందుకు వీలుగా ఏప్రిల్ 1న నోటిఫికేషన్ ఇస్తూ తొందరపాటు నిర్ణయం తీసుకున్నారు. తద్వారా ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు లేకుండా చేశారు. దీంతో జనసేన పార్టీ అభ్యర్థులకు పూడ్చలేని నష్టం జరిగింది. ఎన్నికల కమిషనర్ గతంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. తరువాత ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు. బాధ్యతలు తీసుకున్న రోజునే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియను పునః ప్రారంభించారు. ధృవీకరించిన కౌంటర్‌ను దాఖలు చేయలేదు. కారణాలేంటో ఆమెకే తెలుసు. కోర్టు తీర్పును ఆసాంతం చదవాలి. తీర్పులో అక్కడ కొంత, ఇక్కడ కొంత తీసుకుని దాని ఆధారంగా భాష్యం చెప్పడానికి వీల్లేదు. ఎన్నికల కమిషనర్ సుప్రీంకోర్టు తీర్పును చదవకుండా సొంత భాష్యం చెప్పారు. సుప్రీంకోర్టు చెప్పిన నాలుగు వారాల గడువు గరిష్ట పరిమితి అన్న నిర్ణయానికి వచ్చారు. దీన్ని ఆమోదించబోం.’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు. ‘‘ఏప్రిల్ 1 నోటిఫికేషన్ సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినట్లు ఈ కోర్టు భావిస్తోంది. సుప్రీం ఆదేశాలకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాల్సిందే. అయితే రాజ్యాంగ వ్యవస్థ అయిన ఎన్నికల కమిషన్ మాత్రం సుప్రీంకోర్టు ఉత్తర్వులను అగౌరవపరించింది. అందువల్ల ఏప్రిల్ 1న ఎన్నికల కమిషన్ జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నా’ అని జస్టిస్ సత్యనారాయణమూర్తి తన తీర్పులో వివరించారు. ఎన్నికల కమిషనర్ తొందరపాటు వల్ల అంత ఖర్చు... ‘గత ఏడాది జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో హింస, దౌర్జన్యాలు జరిగాయన్న కారణంతో ఎన్నికల ప్రక్రియను మొత్తం రద్దు చేసి తాజా నోటిఫికేషన్ జారీ చేసేందుకు ఆదేశాలు ఇవ్వడం సాధ్యం కాదు. ఎన్నికల నిర్వహణకు ఇప్పటికే రూ.160 కోట్లు ఖర్చు చేశామని, అందువల్ల మళ్లీ ఎన్నికలకు ఆదేశిస్తే ఖజానాపై భారం పడుతుందన్న ఎన్నికల కమిషన్ తరపు సీనియర్ న్యాయవాది వాదనలను కోర్టు తోసిపుచ్చుతోంది. గతంలో సింగిల్ జడ్జి ఎన్నికలను నిలిపేసినప్పుడు, ప్రభుత్వం చాలా హడావుడిగా ధర్మాసనాన్ని ఆశ్రయించి, ఎన్నికల నిర్వహణ ఉత్తర్వులు పొందింది. అప్పుడు ప్రభుత్వం కొంత ఓపిక పట్టి ఉంటే, ఎన్నికలకు ఖర్చు పెట్టిన డబ్బును కొంత కాలం వరకైనా ఆదా చేసి ఉండేది’ అని న్యాయమూర్తి స్పష్టం చేశారు. -
‘ఎన్నికలు జరపమని డివిజన్ బెంచే తీర్పు చెప్పింది’
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్ ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. హైకోర్టు తీర్పు దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఎన్నికలు జరపమని గతంలో ఇదే డివిజన్ బెంచ్ తీర్పు చెప్పిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ తీర్పు ఆధారంగానే రాష్ట్ర ఎన్నికల కమీషన్ (ఎస్ఈసీ) ఎన్నికలు నిర్వహించిందని పేర్కొన్నారు. ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పుడు కరోనా పేరుతో ఎన్నికలు వాయిదా వేసిన విషయాన్ని గుర్తు చేశారు. కాగా, ప్రజాక్షేత్రంలో గెలవలేమని తెలుసుకున్న టీడీపీ దుర్మార్గపు ఎత్తుగడలు వేస్తుందని, అందులో భాగంగా కోర్టుల్లో కేసులు వేస్తూ పాలనకు అడ్డు తగులుతుందని ఆరోపించారు. ప్రతిపక్ష నేతలు చిల్లర రాజకీయాలు చేస్తూ సంబరపడుతున్నారని, వారు ఎన్ని కుట్రలు పన్నినా అంతమ విజయం తమదేనని సజ్జల పేర్కొన్నారు. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా తాము సిద్ధమని, ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే పట్టం కడతారని జోస్యం చెప్పారు. చంద్రబాబు డైరెక్షన్లో డ్రామాకు తెరలేపారు.. రఘురామకృష్ణరాజుపై నమోదైన సీఐడీ కేసులో ఎలాంటి అభ్యంతరాలు లేవని సజ్జల స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన ఎటువంటి వ్యాఖ్యలు చేశారో ప్రజలందరు గమనించారని, ఈ డ్రామా మొత్తం చంద్రబాబు డైరెక్షన్లోనే సాగిందని ఆయన ఆరోపించారు. రఘురామకృష్ణరాజును రమేష్ ఆస్పత్రికి పంపలేదని ఎలా అడుగుతారని, అసలు రమేష్ ఆస్పత్రిలోనే పరీక్షలు ఎందుకు చేయాలి ప్రశ్నించారు. గుంటూరు నుంచి సికింద్రాబాద్ వెళ్లేటప్పుడు ఆయన సొంత వాహనంలో వెళ్లారని, ఆ సమయంలో ఏదైనా జరిగి ఉండొచ్చన్న అనుమానానన్ని వ్యక్తం చేశారు. అతని కాలు నిజంగా ఫ్రాక్చర్ అయితే కారులో కాళ్లు, చేతులు చూపిస్తూ విన్యాసాలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. బెయిల్ రిజక్ట్ అయ్యి రాజద్రోహం కేసు నిలబడుతుందనే భయంతోనే ఆయన ఈ డ్రామాలన్నింటికీ తెరలేపుతున్నాడని ఆరోపించారు. -
ఏపీ పరిషత్ ఎన్నికలను రద్దు చేసిన హైకోర్టు
-
కొటియాలో ఒడిశా ఆంక్షలు
సాలూరు: పరిషత్ ఎన్నికల్లో కొటియా గిరిజనులు ఓటు హక్కు వినియోగించుకోకుండా ఒడిశా ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోంది. కోవిడ్ వ్యాప్తిని సాకుగా చూపుతూ కొరాపుట్ జిల్లా కలెక్టర్ అబ్దుల్ ఎమ్.అక్తర్ 144 సెక్షన్ విధించడంతో ఒడిశా అధికారులు బుధవారం ప్రత్యేక బలగాలతో కొటియా గ్రామాలకు చేరుకున్నారు. గిరిజన ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తూ తోణాం, మోనంగి పోలింగ్ కేంద్రాలకు వెళ్లకుండా పట్టుచెన్నేరులో రహదారులపై రాళ్లు అడ్డంగా వేసి దారిని దిగ్బంధించి భయానక వాతావరణం సృష్టిస్తున్నారని స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పేర్కొన్నారు. ఈ గ్రామాలకు సంబంధించి గంజాయిభద్ర ఎంపీటీసీ స్థానానికి నేరెళ్లవలస సంత పోలింగ్ కేంద్రంలో ఓటు వేయాల్సి ఉంది. ఒడిశా ప్రభుత్వం కల్పిస్తున్న అడ్డంకులతో పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఓటు వేసేందుకు వెళ్లకూడదని ఆంక్షలు విధిస్తున్నట్లు గిరిజనులు చెబుతున్నారు. పోలింగ్ నిర్వహణకు వెళ్లిన సిబ్బందిని కూడా అడ్డుకోవడంతో సీఐ అప్పలనాయుడు, తహసీల్దార్ శ్రీనివాసరావు, ఆర్వో మధుసూదనరావు నేరెళ్లవలస చేరుకున్నారు. ఒడిశా బలగాలు వారికి 144 సెక్షన్ ప్రతిని చూపించాయి. దీనిపై బుధవారం రాత్రి 10 గంటల సమయంలో చర్చలు సాగుతున్నాయి. ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఐటీడీఏ పీవో ఆర్.కూర్మనాథ్ తెలిపారు. ఆంధ్రా–ఒడిశా సరిహద్దు పోలింగ్ స్టేషన్లో వివాదం కొత్తూరు: శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం.. ఆంధ్ర–ఒడిశా సరిహద్దులోని కౌశల్యాపురం పోలింగ్ స్టేషన్లో ఆంధ్ర–ఒడిశా రాష్ట్రాల మధ్య వివాదం నెలకొంది. కౌశల్యాపురం ప్రాథమిక పాఠశాలలో పరిషత్ ఎన్నికల పోలింగ్ కోసం ఆంధ్రా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఒడిశా అధికారులు బుధవారం పోలింగ్ స్టేషన్ వద్దకు వచ్చి భూభాగానికి సంబంధించిన వివాదం కోర్టులో ఉన్నందున ఎన్నికలు నిర్వహించొద్దంటూ ఆంధ్రా అధికారులకు చెప్పారు. ఈ విషయమై ఇరు రాష్ట్రాలకు చెందిన అధికారులు చర్చించారు. అనంతరం అధికారులు దీనిపై పాలకొండ ఆర్డీవో, సీతంపేట ఐటీడీఏ పీవోలకు ఫిర్యాదు చేశారు. వెంటనే పీవో.. కౌశల్యాపురం పాఠశాల వద్దకు చేరుకుని ఇరు రాష్ట్రాల అధికారుల నుంచి వివరాలు సేకరించారు. ఒడిశా అధికారులతో పీవో మాట్లాడి గురువారం పాఠశాలలో ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారు. -
వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థిపై టీడీపీ శ్రేణుల దాడి
శాంతిపురం(చిత్తూరు జిల్లా): పరిషత్ ఎన్నికలను కోర్టు వాయిదా వేయడంతో శాంతిపురంలో సంబరాలు చేసుకున్న తెలుగు తమ్ముళ్లు ఓ ఎంపీటీసీ అభ్యర్థి, వాహన డ్రైవర్లపై దాడికి పాల్పడ్డారు. మంగళవారం సాయంత్రం కేజీఎఫ్ సర్కిల్ వద్దకు వైఎస్సార్సీపీ ప్రచార వాహనం రావడంతో టీడీపీకి చెందిన గోపాల్, ఉయ్యాల జయరామిరెడ్డి, రమేష్, వెంకటాచటం, ఆంజనేయరెడ్డిలు అడ్డుకున్నారు. సౌండ్ సిస్టంను, జనరేటర్‌ను బలవంతంగా ఆపేసి చెంగుబళ్ల ఎంపీటీసీ అభ్యర్థి రమేష్, వాహన డ్రైవర్ మణిలపై దాడి చేశారు. ప్రచార వాహనంలోని జాక్ రాడ్ తీసుకుని వారిని తరిమికొట్టారు. దీంతో రమేష్ చేతికి గాయమైంది. దీనిపై బాధితులురాళ్లబూదుగూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా జయరామిరెడ్డి కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ వర్గీయుల దాడి విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ శ్రేణులు క్షణాల్లో పెద్ద సంఖ్యలో మండల కేంద్రానికి చేరుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఇరు వర్గాల మోహరింపుతో పలమనేరు జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. పోలీసులు అక్కడకు చేరుకుని ఇరువర్గాలనూ పంపించి వేశారు. వైఎస్సార్సీపీ నేతపై రాడ్డుతో దాడి ఇదిలా ఉండగా మఠం పంచాయతీలోని కేపీ మిట్టలో టీడీపీ వర్గీయుల దాడిలో వైఎస్సార్సీపీ బూత్ కన్వీనర్ నూరుల్లా తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడి కథనం మేరకు.. మంగళవారం రాత్రి గ్రామంలో రెండు కుటుంబాల మధ్య భూ వివాదం సాగుతోంది. గొడవను పరిష్కరించేందుకు నూరుల్లా వెళ్లాడు. అయితే నూరుల్లాపై కక్షతో ఉన్న టీడీపీ కార్యకర్తలు యారబ్, సాధిక్లు నూరుల్లాతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో నూరుల్లాను సాధిక్ గట్టిగా పట్టుకోగా.. టాటాసుమో టూల్ కిట్‌లో ఉండే రాడ్డుతో నూరుల్లా తలపై యూరబ్ కొట్టాడు. తీవ్ర గాయాల పాలైన నూరుల్లాను కుప్పం ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
అఖిలప్రియ ధిక్కార స్వరం
ఆళ్లగడ్డ: పరిషత్ ఎన్నికల్లో పాల్గొనరాదని టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై మాజీ మంత్రి అఖిలప్రియ ధిక్కారస్వరాన్ని వినిపించారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పరిషత్ ఎన్నికల్లో బరిలో ఉన్న టీడీపీ అభ్యర్థులు విజయం కోసం ప్రయత్నించాలని సూచించారు. సోమవారం ఆమె ఆళ్లగడ్డలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గంలో ఎక్కడా పరిషత్ ఎన్నికలను బాయ్‌కాట్ చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఆరు మండలాల్లోనూ తమ పార్టీ అభ్యర్థులు పోటీలో ఉంటారని చెప్పారు. వారి తరఫున ప్రచారం చేసి ఓట్లు అభ్యర్థిస్తామని తెలిపారు. పోటీలో టీడీపీ అభ్యర్థులు లేని చోట, అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన స్థానాల్లో సైకిల్ గుర్తుకు బదులు నోటాకు ఓటు వేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. -
పరిషత్ ఎన్నికల రోజున సెలవు ప్రకటించాలి: ఎస్ఈసీ
సాక్షి, అమరావతి: పరిషత్ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునేలా పోలింగ్ రోజున(ఏప్రిల్ 8) సెలవు ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నీలం సాహ్ని ప్రభుత్వాన్ని కోరారు. పోలింగ్ జరిగే ప్రాంతాల్లో కార్యాలయాలు, వ్యాపారాలు బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్ ప్రదేశాల్లో అన్ని నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలి కలెక్టర్లను ఆదేశించారు. ఎన్నికల విధుల నిర్వహణకు ప్రభుత్వ వాహనాలు వినియోగించుకునే వెసులుబాటు కల్పిస్తూ జీఓ జారీ చేశారు. వాహనాలు వినియోగానికి అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. పబ్లిక్ మీటింగ్‌ల నిర్వహణకు రాజకీయ పార్టీలు తప్పనిసరిగా పర్మిషన్ తీసుకోవాలని.. ఒకే ప్రదేశంలో, ఒకే సమయానికి మీటింగ్‌లు నిర్వహించాల్సి వన్తే ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికే అనుమతులిస్తామని స్పష్టం చేశారు. పోలింగ్ విధుల్లో ఉన్న ప్రభుత్వ సిబ్బంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ రాజకీయ పార్టీకి మద్దతుగా పనిచేయరాదని, అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల కమీషన్ ఆదేశాలను అధికారుల వద్దకు చేర్చే బాధ్యత జిల్లా కలెక్టర్లదేనని స్పష్టం చేశారు. పంచాయితీ ఎన్నికల్లో చూపుడు వేలుకు వేసిన ఇంక్ మార్క్ ఇంకా పోయి ఉండదు కాబట్టి పరిషత్ ఎన్నికల్లో ఎడమ చేతి చిటికెన వేలుకు ఇంక్ రాసేలా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. -
పరిషత్ ఎన్నికల్లో ‘కారు’కే పట్టం
సాక్షి, హైదరాబాద్: జిల్లా, మండల ప్రజా పరిషత్ ఎన్నికలకు సంబంధించి బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) అధికారికంగా తుది ఫలితాలను ప్రకటించింది. పరిషత్ ఎన్నికల్లో 3,548 ఎంపీటీసీ, 449 జెడ్పీటీసీ స్థానాలు గెలుచుకోవడం ద్వారా అధికార టీఆర్ఎస్ ఇతర పార్టీలపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. కాంగ్రెస్‌పార్టీ 1,392 ఎంపీటీసీ, 75 జెడ్పీటీసీ సీట్లను గెలుచుకుని రెండోస్థానానికి పరిమితమైంది. 549 ఎంపీటీసీ సభ్యులు, నలుగురు జెడ్పీటీసీ సభ్యులు స్వతంత్రులుగా ఎన్నికయ్యారు. బీజేపీ 208 ఎంపీటీసీ, 8 జెడ్పీటీసీ స్థానాలు గెలుచుకోగలిగింది. సీపీఐ 38, సీపీఎం 40, టీడీపీ 21, ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన, ఎస్ఈసీ వద్ద నమోదైన రాజకీయపార్టీలకు 20 ఎంపీటీసీ స్థానాలు వచ్చాయి. గుర్తింపు పార్టీలకు రెండు జెడ్పీటీసీ సీట్లు వచ్చాయి. బుధవారం ఈ మేరకు ఫలితాల ప్రకటన, రాజకీయపార్టీల వారీగా గెలుచుకున్న పరిషత్ స్థానాలకు చెందిన నివేదికను ఎస్ఈసీ విడుదల చేసింది. ఒక్క జెడ్పీటీసీని దక్కించుకోని వామపక్షాలు సీపీఐ,సీపీఎం టీడీపీలకు ఒక్క జెడ్పీటీసీ సీటు కూడా దక్కలేదు. మంగళవారం అర్ధరాత్రి వరకు ఎస్ఈసీ వెబ్సైట్లో పరిషత్ ఎన్నికల ఫలితాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ తాజావి ప్రకటిస్తూ వచ్చారు. అయితే మంగళవారం అర్ధరాత్రి దాటాక కూడా పూర్తి ఫలితాలపై రిటర్నింగ్ అధికారుల నుంచి నివేదికలు అందకపోవడంతో బుధవారం ఈ మేరకు అధికారిక ప్రకటనను వెలువరించారు. మొత్తం 534 మండల ప్రజా పరిషత్ (ఎంపీపీ)ల పరిధిలోని 5,817 ఎంపీటీసీ స్థానాల్లో, 538 జెడ్పీటీసీ స్థానాల్లో ఎన్నికలకు ఎస్ఈసీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ స్థానాలకు గత నెల 6,10,14 తేదీల్లో మూడు విడతల్లో ఎన్నికలు ముగిశాక, మంగళవారం ఓట్ల లెక్కింపు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే శుక్రవారం పరోక్ష పద్ధతుల్లో ఎన్నికైన∙ఎంపీటీసీ సభ్యులు ఎంపీపీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులను, శనివారం జెడ్పీటీసీ సభ్యులు జెడ్పీపీ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లను ఎన్నుకోనున్నారు. దీంతో రాష్ట్రంలో పరిషత్ ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. ప్రస్తుతం జెడ్పీపీ, ఎంపీపీ పదవులకు ఎన్నికైన వారు పాత పాలకమండళ్ల పదవీకాలం ముగిశాక జూలై మొదటివారంలో అధికారికంగా పదవీ బాధ్యతలను స్వీకరించాల్సి ఉంది. -
ఇది అసాధారణ విజయం : కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : ఏ పార్టీ మద్దతు లేకుండానే రాష్ట్రంలోని 32 జెడ్పీ పీఠాలను కైవసం చేసుకోబోతున్నామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంపై తెలంగాణ ప్రజలు సంపూర్ణ విశ్వాసం కనబరిచారని అన్నారు. తెలంగాణ పరిషత్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టీఆర్ఎస్ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు ఏకపక్షంగా తీర్పు ఇచ్చారని.. దేశ చరిత్రలో ఎక్కడలేని విధంగా టీఆర్ఎస్ విజయాన్ని సొంతం చేసుకుందన్నారు. ఇది అసాధారణ విజయమని చెప్పారు.ఆరు జిల్లాలో ప్రత్యర్థులు ఖాతానే తెరవలేదని వ్యాఖ్యానించారు. ఈ గెలుపు తమపై బాధ్యత పెంచిందన్నారు. టీఆర్ఎస్ గెలుపు కోసం శ్రమించిన గులాబీ సైనికులకు ధన్యవాదాలు తెలిపారు. -
ప్రజలు ఏకపక్షంగా తీర్పు ఇచ్చారు
-
2 ఓట్లతో గెలుపు.. లాటరీలో అనూహ్య ఫలితం
సాక్షి, నిజామాబాద్ : జిల్లాలో పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఆర్మూరు మండలం పిప్రిలో ఓట్ల లెక్కింపులో వింత పరిస్థితి నెలకొంది. తొలుత ఓ అభ్యర్థి గెలవగా.. రీ కౌంటింగ్‌లో పరిస్థితులు మారిపోయాయి. చివరకు విజేత ఎవరో తెలుసుకోవడానికి లాటరీ తీయాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. తొలుత పిప్రికి సంబంధించి అధికారులు ఓట్ల లెక్కింపు చేపట్టగా రెండు ఓట్ల మెజారిటీతో టీఆర్ఎస్ ఎంపీటీసీ అభ్యర్థి విజయం సాధించారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన బీజేపీ అభ్యర్థి రీకౌంటింగ్‌కు పట్టుబట్టారు. వారి విజ్ఞప్తి మేరకు అధికారులు రీకౌంటింగ్ చేపట్టారు. ఈ సారి అధికారులు ఓట్లు లెక్కించగా టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులకు సమానంగా ఓట్లు(690) వచ్చాయి. దీంతో విజేత ఎవరో తెలుసుకోవడానికి అధికారులు లాటరీ తీయగా.. బీజేపీ అభ్యర్థిని విజయం వరించింది. దీంతో అధికారులు బీజేపీ అభ్యర్థి ఎర్రవ్వను గెలిచినట్టు ప్రకటించారు. -
క్యాంప్‌లు నిర్వహిస్తే కోడ్ ఉల్లంఘించినట్టే
సాక్షి, హైదరాబాద్: క్యాంపు రాజకీయాలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్(ఎస్ఈసీ) స్పష్టతనిచ్చింది. వివిధ పరిషత్ పదవులకు నిర్వహించే పరోక్ష ఎన్నికల సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులతో క్యాంప్ రాజకీయాలు నిర్వహిస్తే అది ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకే వస్తుందని వివిధ రాజకీయపార్టీలకు ఎస్ఈసీ తెలిపింది. కౌంటింగ్‌కు, ఎన్నికల నిర్వహణకు మధ్య మూడురోజుల వ్యవధి ఉన్నందున క్యాంప్ రాజకీయాలకు ఆయా పార్టీలు ఆస్కారం కల్పించినట్టు రుజువైతే నియమ, నిబంధనల ప్రకారం ఎస్ఈసీ చర్యలు చేపడుతుందని హెచ్చరించింది.ఈ నెల 7న మండల ప్రజాపరిషత్(ఎంపీపీ), 8న జిల్లా ప్రజా పరిషత్ (జెడ్పీపీ) పదవులకు నిర్వహించే ఎన్నికలకు సంబంధించిన అంశాలపై వివిధ రాజకీయ పార్టీలతో ఎస్ఈసీ శనివారం ఎస్ఈసీ కార్యాలయంలో అవగాహన సమావేశాన్ని నిర్వహించింది. మండల, జిల్లా ప్రజాపరిషత్ కో ఆప్టెడ్ సభ్యులు, ఎంపీపీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, జెడ్పీపీ చైర్పర్సన్, వైస్‌చైర్‌పర్సన్ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాల గురించి వివరించారు. కోఆప్టెడ్ ఎన్నికలకు పాటించాల్సిన నియమ, నిబంధనలు, జెడ్పీపీ, ఎంపీపీ ఎన్నికలకు రాజకీయ పార్టీలు విప్‌లు ఎలా జారీచేయాలి, ఎప్పటిలోగా వాటిని పంపించాలి తదితర అంశాలను గురించి రాజకీయపార్టీల ప్రతినిధులకు వివరించారు. ఈ ఎన్నికల్లో ఎస్ఈసీ నిర్దేశించిన మార్గదర్శకాలు ఏమిటీ, రాజకీయ పార్టీలవారీగా పాటించాల్సిన విధానాలు ఏమిటన్న దానిపై అవగాహన కల్పించారు. ఎంపీపీ, జెడ్పీపీ పదవులకు నిర్వహించే ప్రత్యేక సమావేశా ల్లో కోరం లేకపోతే ఏం చేయాలి, ఆ ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానాలను వివరిం చారు. ఎస్ఈసీ తీసుకున్న చొరవ వల్లే మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగుతోందని వారు పేర్కొన్నారు. సమావేశంలో కమిషనర్ వి.నాగిరెడ్డి, కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్, సంయుక్తకార్యదర్శి జయసింహారెడ్డి పాల్గొన్నారు. సమావేశానికి జి.నిరంజన్, మర్రి శశిధర్‌రెడ్డి(కాంగ్రెస్), శ్రీనివాసరెడ్డి, గట్టు రామచంద్రరావు (టీఆర్ఎస్), ఎన్.బాలమల్లేశ్(సీపీఐ), నంద్యాల నర్సింహారెడ్డి(సీపీఎం), ఇతరపార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. -
‘చే’ జారొద్దు!
సాక్షి, హైదరాబాద్: మండల, జిల్లా పరిషత్ అధ్యక్ష పీఠాలకు ఈ నెల 7, 8 తేదీల్లో జరగనున్న ఎన్నికల్లో అప్రమత్తంగా వ్యవహరించాలని టీపీసీసీ నిర్ణయించింది. మెజార్టీ స్థానాల్లో తమ సభ్యులు గెలిచే అవకాశం ఉన్నందున అధ్యక్ష ఎన్నికలు పూర్తయ్యే వర కు జాగ్రత్తగా ఉండాలని, ఎప్పటికప్పుడు గెలిచిన సభ్యులతో సమావేశాలు నిర్వహిస్తూ, సమన్వయం చేసుకుంటూ సాగాలని పార్టీ నేతలకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూచించారు. స్థానిక ఎన్నికల ఫలితాలపై గురువారం సాయంత్రం గాంధీభవన్‌లో టీపీసీసీ ముఖ్య నేతలు, డీసీసీ అధ్యక్షులతో ఉత్తమ్ సమావేశమయ్యారు. ఎంపీపీ, జెడ్పీ చైర్పర్సన్ ఎన్నికల విషయంలో ఉన్న సాంకేతిక అంశాలపై సమావేశంలో చర్చించారు. ముఖ్యంగా విప్ జారీ చేసే అధికారంతో పాటు విప్‌ను ఉల్లంఘిస్తే సదరు సభ్యుడిపై వేటు పడే అవకాశం ఉండ టంతో విప్ల జారీని పకడ్బందీగా పూర్తి చేసి రిటర్నింగ్ అధికారులకు అందజేయాలని నిర్ణయించారు. మండల, జిల్లా పరిషత్ అధ్యక్ష ఎన్నికల్లో విప్ జారీ చేసే అధికారాన్ని జిల్లా కాంగ్రెస్ కమిటీలకు ఉత్తమ్ అప్పగించారు. జూన్ 2న అన్ని జిల్లాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించాలని పార్టీ నేతలకు సూచించారు. జూన్ 4న జరిగే కౌంటింగ్ ప్రక్రియ గురించి స్థానిక నేతలకు అవగాహన కల్పించాలని, ఎక్కడకూడా టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా ఉండేలా స్థానిక నాయకత్వాలను అప్రమత్తం చేయాలని చెప్పారు. కౌంటింగ్ పూర్తయ్యాక గెలిచిన సభ్యులతో 5, 6 తేదీల్లో సమావేశాలు నిర్వహించి, అధ్యక్ష ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలకు పదును పెట్టాలన్నారు. ఇందుకు 25 జిల్లాలకు టీపీసీసీ నుంచి పరిశీలకులను నియమించారు. ఈ పరిశీలకులే కౌంటింగ్ నుంచి చైర్పర్సన్ ఎన్నికల వరకు ఆయా జిల్లాల్లో పూర్తి బాధ్యతలు తీసుకోవాలని చెప్పారు. రాహుల్ గాంధీనే ఏఐసీసీ అధ్యక్షుడిగా కొనసాగాలని సమావేశంలో తీర్మానం చేశా రు. మాజీ మంత్రి షబ్బీర్‌అలీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జె.కుసుమకుమార్‌తో పాటు పలువురు సీనియర్ నేతలు, డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు. పరిశీలకులు వీరే.. ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (సూర్యాపేట), మల్లు భట్టి విక్రమార్క (ఖమ్మం), కె.జానారెడ్డి (నల్లగొండ), షబ్బీర్‌అలీ (కామారెడ్డి), రేవంత్‌రెడ్డి (మేడ్చల్), పొన్నం ప్రభాకర్ (కరీంనగర్), జె.కుసుమకుమార్ (మెదక్), జి.చిన్నారెడ్డి (వనపర్తి), సీహెచ్ వంశీచందర్‌రెడ్డి (మహబూబ్‌నగర్), సంపత్‌కుమార్ (గద్వాల), పొన్నాల లక్ష్మయ్య (జనగామ), కోమటిరెడ్డి వెంకటరెడ్డి (భువనగిరి), టి.జీవన్‌రెడ్డి (జగిత్యాల), డి.శ్రీధర్‌బాబు (భూపాలపల్లి), సీతక్క (ములుగు), జగ్గారెడ్డి (సంగారెడ్డి), కొండా విశ్వేశ్వర్‌రెడ్డి (వికారాబాద్), మల్లురవి (నాగర్‌కర్నూల్), పి.సుదర్శ¯న్‌రెడ్డి (నిజామాబాద్), ఎ.మహేశ్వర్‌రెడ్డి (ఆదిలాబాద్), కె.ప్రేంసాగర్‌రావు (మంచిర్యాల), దొంతి మాధవరెడ్డి (మహబూబాబాద్), సీహెచ్ విజయరమణారావు (పెద్దపల్లి), కె.లక్ష్మారెడ్డి (రంగారెడ్డి), పాల్వాయి హరీశ్ (ఆసిఫాబాద్). మరో ఎనిమిది జిల్లాలకు పరిశీలకులను నేడో, రేపో ప్రకటించనున్నారు. కోటి మంది తరఫున అడుగుతున్నాం: ఉత్తమ్ ‘తెలంగాణలోని కోటి మంది కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుల తరఫున అడుగుతున్నాం. రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్షుడిగా కొనసాగాలి’ అని ఉత్తమ్ కోరారు. ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్‌గాంధీనే కొనసాగాలని కోరుతూ గురు వారం గాంధీభవన్‌లో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్, మాజీ ఎంపీ వి.హనుమంతరావులు దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు సంఘీభావం తెలిపిన ఉత్తమ్ మాట్లాడుతూ, రాహుల్ అహర్నిశలు పార్టీ కోసం కష్టపడ్డారని చెప్పారు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో పార్టీ అధ్యక్షుడిగా కొనసాగాలన్నదే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఏకగ్రీవ నిర్ణయమని ఉత్తమ్ చెప్పారు. అనంతరం ఆయన కిషన్, వీహెచ్‌లకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో షబ్బీర్‌అలీ, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, పైలట్ రోహిత్‌రెడ్డి, మల్లు రవి, మల్రెడ్డి రంగారెడ్డి, మదన్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. -
జెడ్పీలపై టీఆర్ఎస్ నజర్
హైదరాబాద్ : స్థానిక సంస్థల్లో పాగా వేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి లక్ష్యం పెట్టుకుంది. రాష్ట్రంలోని 32 జిల్లా పరిషత్‌లు, 538 మండల పరిషత్ అధ్యక్ష పదవులను కైవసం చేసే ఉద్దేశంతో వ్యూహం రచిస్తోంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకుంటామని టీఆర్ఎస్ ధీమాతో ఉంది. అనంతరం అన్ని జెడ్పీ, ఎంపీపీలను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో ప్రణాళిక రూపొందిస్తోంది. ఎంపీపీలను గెలుచుకునే బాధ్యతను ఎమ్మెల్యేలకు, జెడ్పీలు గెలిచే బాధ్యతను ఉమ్మడి జిల్లాల మంత్రులకు అప్పగించింది. ఎమ్మెల్యేలు, మంత్రులు సమన్వయంతో పని చేసి అన్ని పదవులను టీఆర్ఎస్ గెలుచుకునేలా వ్యవహరించాలని అధిష్టానం సూచించింది. అధిష్టానం ఆదేశాల మేరకు మంత్రుల ఆధ్వర్యంలో ఆయా ఉమ్మడి జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో సమావేశాలు జరుగుతున్నాయి. పార్టీ అధిష్టానం నిర్ణయించిన వారికి జెడ్పీ చైర్పర్సన్ పదవి దక్కేలా, ఈ ఎన్నిక వ్యవహారాన్ని సాఫీగా పూర్తి చేసేందుకు ప్రతీ జిల్లాకు పార్టీ తరఫున ఓ ఇన్చార్జీని నియమిస్తున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో కొత్తగా ఏర్పడిన ఆరు జిల్లాలకు పార్టీ తరఫున ప్రత్యేకంగాఇన్చార్జీలను నియమించారు. మిగిలిన జిల్లాలకు ఇదే విధానం అమలు చేయాలని నిర్ణయించారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గంలోని ఎంపీటీసీలను సమన్వయపరిచాలని కేటీఆర్ ఆదేశించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాల్లో ఆ పార్టీ తరుఫున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన వారికి బాధ్యత అప్పగించారు. అలాగే గెలిచిన జెడ్పీటీసీలను వెంటనే మంత్రులు సమన్వయం చేసి జెడ్పీ చైర్పర్సన్ ఎన్నిక సాఫీగా పూర్తయ్యేలా చూడాలని సూచించారు. రాష్ట్రంలో 5,817 ఎంపీటీసీ, 538 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 158 ఎంపీటీసీ స్థానాలు, 4 జెడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. వీటిలో 4 జెడ్పీటీసీ స్థానాలను, 152 ఎంపీటీసీ స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకుంది. పోలింగ్ జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల ఫలితాలు జూన్ 4 వెల్లడికానున్నాయి. ఫలితాలు వచ్చిన వెంటనే నియోజకవర్గాల వారీగా ఎంపీటీసీలను సమన్వయం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే మంత్రుల ఆధ్వర్యంలో జెడ్పీటీసీ సభ్యుల సమన్వయ ప్రక్రియ జరగనుంది. వరంగల్, మహబూబాబాద్ నేతలకు కేటీఆర్ అభినందనలు... లోక్‌సభ ఎన్నికల్లో బాగా పని చేశారని ఉమ్మడి వరంగల్ జిల్లా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు. వరంగల్ లోక్‌సభలో పసునూరి దయాకర్ రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచారని, మహబూబాబాద్‌లో మాలోతు కవిత మంచి ఆధిక్యంతో గెలిచారని అన్నారు. ఈ స్థానాల ఇన్‌చార్జీగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఎమ్మెల్యేలతో సమన్వయంతో పని చేయడం వల్లే టీఆర్ఎస్ అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధించారన్నారు. పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆధ్వర్యంలో కొత్తగా ఎన్నికైన లోక్‌సభ సభ్యులు పసునూరి దయాకర్, మాలోతు కవిత, రాజ్యసభ సభ్యుడు గుండా ప్రకాశ్, ఎమ్మెల్యేలు డి.ఎస్. రెడ్యానాయక్, టి.రాజయ్య, అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, బి.శంకర్‌నాయక్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, బానోతు హరిప్రియ, పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బి.వెంకటేశ్వర్లు, ఎం.శ్రీనివాస్‌రెడ్డి, సత్యవతిరాథోడ్, వరంగల్ మేయర్ గుండా ప్రకాశ్, మాజీ ఎంపీ సీతారాంనాయక్ తదితరులు మంత్రి కేటీఆర్‌ను కలిశారు. వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించేలా అంతా సమన్వయంతో పని చేయాలని కేటీఆర్ ఆదేశించారు. అన్ని జెడ్పీ చైర్పర్సన్, ఎంపీపీ పదవులు టీఆర్ఎస్ వారే ఎన్నికయ్యేలా వ్యూహం అమలు చేయాలన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని ఆరు జిల్లాలకు జెడ్పీ చైర్పర్సన్ ఎన్నికలకు ఇన్చార్జీలను నియమించారు. వరంగల్ అర్భన్–గుండా ప్రకాశ్‌రావు/దాస్యం వినయభాస్కర్, వరంగల్ రూరల్–పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, జనగామ–బోడికుంటి వెంకటేశ్వర్లు, మహబూబాబాద్–నాగుర్ల వెంకటేశ్వర్లు, ములుగు–నన్నపునేని నరేందర్, భూపాలపల్లి–బండా ప్రకాశ్‌ను ఇన్‌చార్జీలుగా నియమించినట్లు టీఆర్ఎస్ ప్రకటన జారీ చేసింది. జెడ్పీలపై అధిష్టాన నిర్ణయం... మండల పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నిక ఆయా ఉమ్మడి జిల్లాల స్థాయిలోనే పూర్తి చేసుకోవాలని టీఆర్ఎస్ అధిష్టానం మంత్రులకు, ఎమ్మెల్యేలకు సూచించింది. ఎమ్మెల్యేల అభీష్టం మేరకు ఎంపీపీ పదవులను భర్తీ చేయాలని మంత్రులకు స్పష్టం చేసింది. జెడ్పీ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ పదవులపై అధిష్టానం నిర్ణయం తీసుకోనుంది. జిల్లాల వారీగా రిజర్వేషన్లను పరిశీలించి రాష్ట్రం యూనిట్‌గా జెడ్పీ చైర్పర్సన్ పదవులకు అభ్యర్థులను నిర్ణయించనున్నారు. జెడ్పీ చైర్పర్సన్ ఎన్నిక రోజున టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనేది పార్టీ అధిష్టానం మంత్రులకు సమాచారం ఇవ్వనుంది. దీనికి అనుగుణంగా జిల్లాల్లో ఎన్నిక ప్రక్రియను పూర్తి చేయాలని అధిష్టానం ఆదేశాలిచ్చింది. -
పరిషత్ ఎన్నికల కౌంటింగ్ 4న
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో మూడు విడతల్లో 5,817 ఎంపీటీసీ స్థానాలు, 534 జెడ్పీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియకు రంగం సిద్ధమైంది. జూన్ 4న ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలుపెట్టి అదే రోజు మధ్యాహ్నం నుంచి ఫలితాలు ప్రకటిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) ప్రకటించింది. ఫలితాలు వెలువడిన 2–3 రోజుల వ్యవధిలోనే అంటే 7వ తేదీన ఎంపీపీ అధ్యక్ష పదవులకు, 8న జెడ్పీ చైర్పర్సన్ల ఎన్నిక కూడా పూర్తి చేయనున్నట్లు సమాచారం. ఈ మేరకు పంచాయతీరాజ్ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం సవరించి ఆర్డినెన్స్‌ను జారీ చేసిన నేపథ్యంలో పరిషత్ ఓట్ల కౌంటింగ్‌ను చేపట్టేందుకు వీలు ఏర్పడింది. పరిషత్ ఫలితాలు ప్రకటించాక ఎన్నికైన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు పరోక్ష పద్ధతుల్లో జెడ్పీ, ఎంపీపీ అధ్యక్షుల ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ విడిగా నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో ఫలితాలు వెలువడ్డాక 2, 3 రోజుల్లోనే జిల్లా ప్రజాపరిషత్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నిక నిర్వహణకు ఎస్ఈసీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎస్ఈసీ సవరణలు... పరిషత్ ఫలితాలు ప్రకటించిన 40 రోజుల తర్వాత జెడ్పీపీ, ఎంపీపీల ఎన్నికలు నిర్వహిస్తే ప్రలోభాలకు అవకాశం ఉంటుందని వివిధ రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేయడంతో ఈ నెల 27న కౌంటింగ్ నిర్వహించాలనే నిర్ణయాన్ని ఎస్ఈసీ వాయిదా వేయడం తెలిసిందే. ఫలితాలు వెలువడ్డాక ఎక్కువ జాప్యం చేయకుండా జెడ్పీపీ, ఎంపీపీల ఎన్నిక నిర్వహణకు వీలుగా మార్గదర్శకాల్లో సవరణ చేయాలని కోరుతూ ఎస్ఈసీ రాసిన లేఖపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ చట్ట సవరణకు ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ప్రత్యేక సమావేశం ద్వారా చైర్మన్ల ఎన్నిక నిర్వహించాలని, అయితే ప్రస్తుత పాలకవర్గాల పదవీకాలం పూర్తయిన తర్వాతే కొత్త చైర్పర్సన్లు, అధ్యక్షులు బాధ్యతలు స్వీకరించాలని ఆర్డినెన్స్‌లో పేర్కొంది. తదనుగుణంగా గతంలోని నిబంధనలను మారుస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. జెడ్పీలు, ఎంపీపీలను ఎన్నుకునేందుకు నిర్వహించే ప్రత్యేక సమావేశంలో జడ్పీ చైర్పర్సన్లను జెడ్పీటీసీలు, ఎంపీపీ అధ్యక్షులను ఎంపీటీసీలు పరోక్ష పద్ధతిలో ఎన్నుకుంటారు. వైస్ చైర్పర్సన్లు, ఎంపీపీ ఉపాధ్యక్షుల ఎన్నిక కూడా ఇదే తరహాలో జరుగుతుంది. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
పరిషత్ ఫలితాల వెల్లడి తేదీ ఖరారు
సాక్షి, హైదరాబాద్ : జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల వెల్లడికి ముహర్తం ఖరారైంది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆ రోజున ఉదయం 8 గంటలకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు ప్రారంభం కానున్నట్టు తెలిపింది. అంతేకాకుండా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల వెల్లడితో పాటు జిల్లా పరిషత్ చైర్పర్సన్, వైఎస్ చైర్పర్సన్, మండల పరిషత్ అద్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు జరిగే పరోక్ష ఎన్నికలను త్వరగా నిర్వహించేందుకు కూడా మార్గం సుగమమైన సంగతి తెలిసిందే. ఈ మేరకు పంచాయతీరాజ్ చట్టంలో సవరణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఆర్డినెన్స్ జారీ చేసింది. దీంతో ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు ప్రమాణస్వీకారం కంటే ముందే చైర్పర్సన్లను ఎన్నుకునే వెసులుబాటు కలిగింది. కాగా, రాష్ట్రంలో మూడు దశలో జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఈ నెల 14న ముగిశాయి. ఈ ఎన్నిలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఈ నెల 27న చేపట్టాలని ఎన్నికల సంఘం ముందుగా నిర్ణయించింది. అయితే రాజకీయపక్షాల విజ్ఞప్తి మేరకు మే 27న నిర్వహించాల్సిన కౌంటింగ్‌ను ఎస్ఈసీ వాయిదా వేసింది. తాజాగా జూన్ 4 ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్టు ప్రకటించింది. -
పరిషత్ తొలి భేటీకి నిబంధనలు సవరించాలి
సాక్షి, హైదరాబాద్: పరిషత్ ఎన్నికల ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటించిన వెంటనే జిల్లా ప్రజాపరిషత్ (జెడ్పీపీ), మండల ప్రజాపరిషత్ (ఎంపీపీ)ల మొదటి సమావేశాన్ని నిర్వహించేందుకు వీలుగా ప్రస్తుతమున్న నిబంధనలను సవరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరి నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) తెలిపింది. ఈ నిబంధనలు సవరించడం ద్వారా పరిషత్ ఫలితాలు వెలువడ్డాక ఎక్కువ ఆలస్యం లేకుండా ఎన్నికైన సభ్యులు పరోక్ష పద్ధతుల్లో జెడ్పీపీ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, ఎంపీపీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులను ఎన్నుకునే వీలుంటుందని ఎస్ఈసీ కార్యదర్శి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన అందగానే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు తేదీని ఎస్ఈసీ ప్రకటిస్తుందన్నారు. సోమవారం జరగాల్సిన పరిషత్ ఓట్ల లెక్కింపును వాయిదా వేసిన నేపథ్యంలో మళ్లీ కౌంటింగ్ నిర్వహించే తేదీని ఎస్ఈసీ ప్రకటించాల్సి ఉంది. -
జూన్ రెండోవారంలోగా ‘పరిషత్’ కౌంటింగ్!
సాక్షి, హైదరాబాద్: పరిషత్ ఎన్నికల కౌంటింగ్‌ను జూన్ రెండోవారంలో నిర్వహించే అవకాశముంది. రంజాన్ పండుగ ముగిశాక 12వ తేదీలోగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపును పూర్తిచేయవచ్చని సమాచారం. రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరిగిన దృష్ట్యా పాఠశాలలకు వేసవి సెలవులను జూన్ 11 వరకు పొడిగించిన నేపథ్యంలో అప్పటిలోగా కౌంటింగ్ పూర్తిచేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్(ఎస్ఈసీ)యోచిస్తున్నట్టు తెలిసింది. బ్యాలెట్ బాక్సులను ఎక్కువగా పాఠశాలలు, విద్యాసంస్థలలోని స్ట్రాంగ్‌రూమ్‌లలో భద్రపరచడంతోపాటు ఆయా చోట్ల కౌంటింగ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేశారు. విద్యార్థుల చదువులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే మే 27న కౌంటింగ్ నిర్వహణకు ఎస్ఈసీ ఇదివరకు షెడ్యూల్ విడుదల చేసింది. అయితే, పరిషత్ ఫలితాలు వెల్లడయ్యాక, జెడ్పీపీ చైర్మన్లు, ఎంపీపీ అధ్యక్షుల ఎన్నికను 40 రోజుల తర్వాత నిర్వహిస్తే సభ్యులను అధికార పార్టీ ప్రలోభాలకు గురిచేసి తమవైపు తిప్పుకునే అవకాశం ఉందని ఎస్ఈసీకి వివిధ రాజకీయపక్షాలు ఫిర్యాదు చేశాయి. అందువల్ల ఓట్ల లెక్కింపు వాయిదా వేయడం లేదా కౌంటింగ్ కాగానే జెడ్పీపీ, ఎంపీపీల ఎన్నికకు చర్యలు తీసుకోవాలని కోరాయి. రాజకీయపక్షాల విజ్ఞప్తి మేరకు... రాజకీయపక్షాల విజ్ఞప్తి మేరకు సోమవారం నిర్వహించాల్సిన కౌంటింగ్‌ను ఎస్ఈసీ వాయిదా వేసింది. ఫలితాలు వెలువడ్డాక ఎన్నికైన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు జెడ్పీపీ, ఎంపీపీలను ఎన్నుకుని, ఆ తర్వాత ప్రమాణస్వీకారం చేసేలా ప్రస్తుతమున్న పీఆర్ చట్ట నిబంధనలు సవరించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జూలై మొదటివారంలో ప్రస్తుత జెడ్పీ చైర్పర్సన్లు, ఎంపీపీ అధ్యక్షుల పదవీకాలం ముగిసిన తర్వాతే కొత్తవారు ప్రమాణస్వీకారం చేపట్టేలా చేస్తే సరిపోతుందని చెబుతున్నారు. అంతేకాకుండా ఫలితాలు ప్రకటించాక, పరోక్షపద్ధతుల్లో చైర్పర్సన్లు, అధ్యక్షుల ఎన్నికకు ఇంత వ్యవధి ఉండాలన్న నిబంధనను సవరిస్తే సరిపోతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఉపసర్పంచ్‌లను ఎన్నుకుంటున్న తరహాలోనే జెడ్పీపీ, ఎంపీపీల ఎన్నికను కూడా పూర్తిచేస్తే సమస్యలుండవని పేర్కొంటున్నారు. ఇందుకనుగుణంగా ప్రభుత్వం నుంచి స్పందన రాగానే జూన్ 12వ తేదీలోగా కౌంటింగ్ ముగించి జెడ్పీపీ, ఎంపీపీల ఎన్నికకు చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. పాత సభ్యుల పదవీకాలం ముగియకముందే కొత్త సభ్యుల ఎన్నిక పూర్తిచేసి, ఆ తర్వాత ప్రమాణస్వీకార కార్యక్రమాల నిర్వహణకు వీలుగా కొత్త పీఆర్ చట్టాన్ని సవరించాల్సి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా మినహా... ఉమ్మడి ఖమ్మం జిల్లా మినహా మిగిలిన జిల్లాల్లోని ఎంపీటీసీ సభ్యుల పదవీకాలం జూలై 3వ తేదీ వరకు ఉంది. పరిషత్ ఓట్ల లెక్కింపు తర్వాత జూలై 4వ తేదీన కొత్త జెడ్పీటీసీ సభ్యులు బాధ్యతలు చేపట్టాలి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం ఆగస్టు 5 తర్వాత ఎంపీపీ, ఆగస్టు 6 తర్వాత జెడ్పీ చైర్మన్ల ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. కొనసాగనున్న కోడ్... ఓటింగ్ ముగిసినా కౌంటింగ్, ఫలితాల ప్రకటన, చైర్పర్సన్లు, అధ్యక్షుల ఎన్నిక వంటి ప్రక్రియ పూర్తికానందున స్థానిక ఎన్నికల కోడ్ కొనసాగుతుందని ఎస్ఈసీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యే వరకు కొత్త నిర్ణయాలు తీసుకోవడం, నియమ, నిబంధనలు ఉల్లంఘించేలా కార్యక్రమాలు చేపట్టడం వంటివి చేయవద్దని చెబుతున్నారు. జెడ్పీపీ, ఎంపీపీల ఎన్నిక పూర్తయ్యాకే కోడ్ ముగుస్తుందని తెలిపారు. -
కౌంటింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు: నాగిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి అధికారులకు సూచించారు. కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనే అధికారులు, సిబ్బందికి శిక్షణా కార్యక్రమాలు పూర్తి చేయాలన్నారు. శుక్రవారం ఇక్కడి ఎస్ఈసీ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, సీఈవోలు, డిప్యూటీ సీఈవోలు, ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కౌంటింగ్ ఏర్పాట్లను సమీక్షించారు. నాగిరెడ్డి మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. సిబ్బందికి శిక్షణ పూర్తయ్యాక ర్యాండమైజేషన్ చేపట్టాలని, కౌంటింగ్ సూపర్వైజర్లు, అసిస్టెంట్ సూపర్వైజర్లు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్ఈసీ కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్, జాయింట్ సెక్రటరీ జయసింహారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నార -
‘ప్రాదేశికం’లో ప్రాభవం.. కాంగ్రెస్‌లో కొత్త ఆశలు
సాక్షి, హైదరాబాద్: పరిషత్ పోరుపై ప్రతిపక్ష కాంగ్రెస్ గట్టి ఆశలే పెట్టుకుంది. ముగిసిన మూడు విడతల ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్కు మెజార్టీ స్థానాల్లో గట్టిపోటీ ఇచ్చామని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. కనీసంగా 20 జిల్లా పరిషత్‌లలో టీఆర్ఎస్ను దీటుగా ఎదుర్కొన్నామని, ఆయా స్థానాల్లో మెజార్టీ పీఠాలు కైవసం చేసుకుంటామని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా అర్బన్ ప్రాంతం ఎక్కువగా ఉన్న జిల్లాలు, గ్రామీణ జిల్లాలే అయినా చిన్న జిల్లాలు, పాత జిల్లా కేంద్రాలున్న చోట్ల ఓటర్లను తమ వైపు తిప్పుకోగలిగామని, మిగిలిన చోట్ల కూడా శక్తిమేరకు పోరాడామని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. కాగా, ప్రాదేశిక ఎన్నికలపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండలాల వారీగా నివేదికలు తెప్పించుకుని ఫలితాలపై బేరీజు వేస్తున్నారు. ‘ప్రాదేశికం’లో కాంగ్రెస్ ప్రాభ వం చాటుతుందని అంచనా వేస్తున్నారు. 10 పీఠాలన్నా దక్కాలి ప్రస్తుతమున్న పరిస్థితుల్లో క్షేత్రస్థాయిలో గట్టిపోటీనే ఇచ్చినా జిల్లా పరిషత్ పీఠాలు దక్కించుకునే విషయంలో చాలా కష్టపడాల్సి వస్తుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో టీఆర్ఎస్ కన్నా ఒకటి, రెండు జడ్పీటీసీ స్థానాలు ఎక్కువగానే సాధించినా అధికార పార్టీకి ఉన్న ఎమ్మెల్యేల బలంతో పరిషత్ పీఠం చేజారుతుందని వారు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని కనీసం 10 జడ్పీ స్థానాలయినా దక్కుతాయా లేదా అన్నదానిపై లెక్కలు కడుతున్నారు. ఈ లెక్కల కోసమే టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండలాల నుంచి తెప్పించుకున్న నివేదికలపై కసరత్తు చేస్తున్నారని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. స్థానిక అభ్యర్థుల గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్న జిల్లాలకు చెందిన ఫలితాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని, ఏ మాత్రం అవకాశం ఉన్నా జిల్లా పరిషత్ పీఠం చేజారిపోకుండా వ్యూహం రచిస్తున్నారని అంటున్నాయి. అదే విధంగా ఎంపీటీసీల విషయంలో కూడా మంచి ఫలితాలే సాధిస్తామని, కనీసం 100–150 ఎంపీపీ పీఠాలు కూడా దక్కే అవకాశాలున్నాయని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు. వీటిపై కూడా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ బృందం భారీ కసరత్తే చేస్తోందని తెలుస్తోంది. అవసరమైతే క్యాంపులు ప్రాదేశిక ఎన్నికల ఫలితాలు ఈనెల 27నే వస్తున్నప్పటికీ జడ్పీ చైర్మన్లు, ఎంపీపీల ఎన్నిక కోసం జూలై4 వరకు ఆగాల్సి ఉంటుంది. అప్పటివరకు పాత సభ్యుల పదవీకాలం ఉన్నందున ఆ తర్వాతే కొత్త సభ్యులతో చైర్మన్లను ఎన్నుకుంటారు. అంటే ఈ ప్రక్రియ ప్రారంభం కావడానికి, ఫలితాలకు నెలకు పైగా సమయం ఉంది. ఈలోపు ఏం జరుగుతుందనే దానిపై కూడా కాంగ్రెస్ నేతలు ఓ అంచనాకు వస్తున్నారు. గెలిచిన సభ్యుల సాయంతో జిల్లా లేదా మండల పరిషత్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం స్పష్టంగా ఉంటే అవసరమైతే నెలరోజుల పాటు క్యాంపులు నిర్వహించే ప్రణాళికలు కూడా రూపొందిస్తున్నారు. దీంతో పాటు టీఆర్ఎస్కు మేలు జరిగేలా తమ పార్టీకి చెందిన కొత్త జడ్పీటీసీలు, ఎంపీటీసీలు నిర్ణయం తీసుకోకుండా వారిని కూడా వీలున్నంత మేర కట్టడి చేసేందుకు పథకాలు రూపొందిస్తున్నారు. అటు తమకు దక్కాల్సిన వాటిని దక్కించుకోవడంతో పాటు తమ ద్వారా టీఆర్ఎస్కు మేలు చేకూరకుండా అన్ని జాగ్రత్తలను ఇప్పటి నుంచే తీసుకుంటున్నామని, ఫలితాల తర్వాత వ్యూహం అధికారికంగా వెల్లడవుతుందని టీపీసీసీ ముఖ్య నేత ఒకరు వెల్లడించడం గమనార్హం. -
యాదాద్రి ఫస్ట్, వికారాబాద్ లాస్ట్
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 6, 10, 14 తేదీల్లో జరిగిన పరిషత్ ఎన్నికల్లో మొత్తం 77.46 శాతం ఓటింగ్ నమోదవగా అందులో మహిళలు 77.68 శాతం, పురుషులు 77.24 శాతం, ఇతరులు 7.64 శాతం ఓటేశారు. జిల్లాలవారీగా చూస్తే 87.02 శాతం పోలింగ్‌తో యాదాద్రి భువనగిరి జిల్లా తొలిస్థానం లో నిలవగా వికారాబాద్ జిల్లా అత్యల్పంగా 70.40 శాతంతో చివరి స్థానంలో నిలిచింది. 534 జెడ్పీటీసీ స్థానాలకు(ఏకగ్రీవమైన 4 స్థానాలు మినహా) 2,426 మంది, 5,659 ఎంపీటీసీ స్థానాలకు (158 ఏకగ్రీవా లు మినహా) 18,930 మంది పోటీపడ్డారు. జెడ్పీటీసీ స్థానాలకు సగటున ఐదుగురు, ఎంపీటీసీ స్థానాలకు సగటున ముగ్గురు ఎన్నికల బరిలో నిలిచారు. పార్టీలవారీగా పోటీ చేసిన అభ్యర్థులు, ఎన్నికల నిర్వహణ కు సంబంధించిన గణాంకాలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి బుధవారం విడుదల చేశారు. ఈ ఎన్నికల్లో మొత్తం 32,045 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా వాటిలో 2,488 పోలింగ్ బూత్ లలో ఎస్ఈసీ వెబ్ కాస్టింగ్ నిర్వహించింది. మొత్తం 2,879 రిటర్నింగ్ అధికారులను నియమించింది. ఎన్నికల విధుల కోసం 1.86 లక్షల మంది సిబ్బంది ని ఎంపిక చేసింది. 54,604 మంది భద్రతా సిబ్బంది ని సేవల వినియోగించుకుంది. సాధారణ పరిశీలకులుగా 15 మందిని, వ్యయ పరిశీలకులుగా 37 మందిని, సహాయ వ్యయ పరిశీలకులుగా 528 మందిని, మైక్రో అబ్జర్వర్లుగా 2,832 మందిని నియమించింది. మొత్తం 65 వేల బ్యాలెట్ బాక్సులు, దాదాపు 3.5 కోట్ల బ్యాలెట్ పత్రాలు ముద్రించారు. ఓటేసినందుకు గుర్తుగా వేసే నల్లటి సిరా రంగు కోసం 42 వేల ఇండెలిబుల్ ఇంక్ ఫాయల్స్ ఉపయోగించారు. 1.6 లక్షల పేపర్ సీళ్లను ఉపయోగించారు. -
ఐదుగంటల్లోపే ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 27న ఉదయం 8 గంటల నుంచి 32 జిల్లాల్లోని 123 కౌంటింగ్ కేంద్రాల్లోని 978 హాళ్లలో పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి తెలిపారు. ఓట్ల లెక్కింపు కోసం 11,882 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 23,647 కౌంటింగ్ అసిస్టెంట్లను నియమించినట్లు తెలియజేశారు. ముందుగా ఎంపీటీసీ స్థానాల్లో లెక్కింపు చేపట్టి విజేతలను ప్రకటించాకే.. జెడ్పీటీసీ స్థానాల్లో ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. 27న సాయంత్రం 5 గంటల లోపు లెక్కింపు ప్రక్రియ పూర్తి చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. బ్యాలెట్ బాక్స్‌లను భద్రపరచడానికి రాష్ట్రవ్యాప్తంగా 536 స్ట్రాంగ్‌రూమ్‌లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మూడువిడతల్లో జరిగిన పరిషత్ పోలింగ్ ప్రశాంతంగా ముగియడం.. మొత్తంగా కలిపి 77.46% పోలింగ్ నమోదు కావడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తంచేశారు. గ్రామపంచాయతీ ఎన్నికలతో ఈ పోలింగ్‌శాతం కొంత తగ్గినా లోక్‌సభ (62.69%), అసెంబ్లీ (73.40) ఎన్నికలతో పోలిస్తే పోలింగ్ శాతం పెరగడం హర్షనీయమన్నారు. బుధవారం ఎస్ఈసీ కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్, సంయుక్త కార్యదర్శి జయసింహారెడ్డిలతో కలిసి నాగిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ సాంకేతిక కారణాలతో కేవలం మూడు ఎంపీటీసీ స్థానాల్లో మాత్రమే రీపోలింగ్‌కు ఆదేశించామన్నారు. ఈ ఎన్నికల్లో ఎక్కడా కూడా ఒకరికి బదులుగా మరొకరు ఓటేసిన ఉదంతాలు చోటు చేసుకోలేదన్నారు. పంచాయతీ ఎన్నికల్లో టెండర్ ఓటింగ్ కారణంగా 7 చోట్ల రీపోలింగ్ నిర్వహించామన్నారు. పోలింగ్‌బూత్‌లో ఓటేశాక సెల్ఫీ దిగడం, ఓటేసిన బ్యాలెట్ పేపర్ల ప్రదర్శన వంటి వాటి విషయంలో నాలుగు కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. ‘ఏకగ్రీవానికి 10 లక్షలు’పై సీరియస్ నాగర్‌కర్నూలు జిల్లా గగ్గల్లపల్లి ఎంపీటీసీ స్థానం ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు ఒక అభ్యర్థికి రూ.10 లక్షలిచ్చి ప్రలోభాలకు గురిచేసినట్టు తేలడం చాలా తీవ్రమైన విషయమన్నారు. ఒక ఎంపీటీసీ స్థానంలో ఇంతపెద్దమొత్తంలో డబ్బు దొరకడంతో ఆ స్థానంలో ఎన్నిక రద్దుచేసినట్టు చెప్పారు. దీనికి పాల్పడ్డ వ్యక్తిపై క్రిమినల్ కేసు నిరూపితమైతే ఆరేళ్లపాటు ఏ ఎన్నికల్లో పోటీచేయకుండా నిషేధం విధించేలా చర్యలు చేపడతామన్నారు. ఈ ఎన్నికల్లో భాగంగా ఎనిమిది చోట్ల ఎంపీటీసీ బ్యాలెట్‌పత్రాలు తారుమారు కాగా, అప్పటికే ఐదుచోట్ల అప్పటికే ఓటేసిన ఓటర్లను పిలిపించి పరిస్థితిని చక్కదిద్దగలిగారన్నారు. మరో రెండు చోట్ల రీపోలింగ్ నిర్వహించగా, వనపర్తి జిల్లా పానగల్ మండలం కదిరిపాడు ఎంపీటీసీ స్థానానికి శుక్రవారం రీపోలింగ్ నిర్వహిస్తామన్నారు. మొత్తం 1.56 కోట్ల మంది గ్రామీణ ఓటర్లలో 1.20 కోట్ల మంది ఓటేశారని చెప్పారు. ఈ ఎన్నికల సందర్భంగా మొత్తం రూ.1.09 కోట్ల విలువైన నగదును, రూ. 1.04 కోట్ల విలువైన మద్యం, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) ఉల్లంఘనకు సంబంధించి 119 ఫిర్యాదులు అందాయన్నారు. మొత్తం 220 ఫిర్యాదులు దాఖలు కాగా, 386 కేసుల్లో ఎఫ్ఐఆర్లు నమోదు చేశామన్నారు. 359 కేసుల్లో చర్యలు తీసుకోగా, మరో పదికేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. కౌంటింగ్ ఇలా! స్ట్రాంగ్ రూంల వద్ద భద్రతా బలగాల డబుల్ సెక్యూరిటీ కవర్ ఉంటుందన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను మూడు దశల్లో నిర్వహిస్తున్నట్టు చెప్పారు. మొదటి దశలో బ్యాలెట్ పేపర్లు, సదరు బూత్‌లో ఉన్న ఓటర్ల వివరాలతో లెక్కిస్తారని, ఇది పోలింగ్ కేంద్రాల వారీగా జరుగుతుందన్నారు. ఆ తర్వాత వీటిని బండిల్ చేస్తారని, అనంతరం ఎంపీటీసీ, జెడ్పీటీసీల వారీగా విడదీసి ఒక్కో బండిల్లో 25 బ్యాలెట్ పత్రాలు ఉంటాయన్నారు. రెండో దశలో ఎంపీటీసీ ఎన్నికకు కౌంటింగ్ మొదలుపెడుతారని, ఒక్కో ఎంపీటీసీ స్థానానికి రెండు టేబుళ్లు, రెండు రౌండ్లు ఉంటాయన్నారు. ప్రతీ ఎంపీటీసీ అభ్యర్థి ఇద్దరు కౌంటింగ్ ఏజెంట్లను నియమించుకోవాలని సూచించారు. ప్రతి బ్యాలెట్ పేపర్‌ను ఓపెన్ చేసి చెల్లుబాటు అవుతుందా లేదా అనేది ఏజెంట్ల ముందు చూస్తారని, చెల్లుబాటు అయితే ఎంపీటీసీ స్థానాల్లోని ట్రేల్లో వేస్తారని, అనుమానాలు వ్యక్తం చేస్తే మాత్రం రిటర్నింగ్ అధికారుల దగ్గరకు పంపించి, నిర్ణయం తీసుకుంటారన్నారు. అభ్యంతరాలున్న బ్యాలెట్లపై రిటర్నింగ్ అధికారులతో తుది నిర్ణయం ఉంటుందన్నారు. ముందుగా ఎంపీటీసీ స్థానాల్లో ఓట్లను లెక్కిస్తామని, ఆ తర్వాత జెడ్పీటీసీ ఓట్లను లెక్కిస్తామని, ఒక రౌండ్లో వెయ్యి ఓట్లు లెక్కిస్తామని, ఒక్కో స్థానానికి రెండు రౌండ్లు ఏర్పాటు చేశామన్నారు. మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ సిద్ధంగా ఉందని నాగిరెడ్డి చెప్పారు. గత జూన్ నుంచే ఈ ఎన్నికల నిర్వహణకు కసరత్తు మొదలుపెట్టామన్నారు. ప్రస్తుత మున్సిపాలిటీ పాలకవర్గాల పదవీ కాలం జూలై మొదటివారంలో ముగుస్తుందన్నారు. అయితే ప్రభుత్వపరంగా మున్సిపాలిటీ వార్డుల పునర్విభజన పూర్తిచేయాల్సి ఉందన్నారు. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకున్న పక్షంలో ఓటర్ల జాబితాలు సిద్ధం చేసి రిజర్వేషన్లు ఖరారు చేశాక మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అవకాశం ఉంటుందన్నారు. జూలై మొదటి వారంలోనే కొత్తసభ్యులు ఉమ్మడి ఖమ్మం మినహా అన్నిజిల్లాల్లో ప్రస్తుత మండల ›ప్రజా పరిషత్ (ఎంపీపీ)ల పదవీకాలం జూలై 3తో, జెడ్పీల పదవీకాలం జూలై 4తో పూర్తవుతుందని నాగిరెడ్డి చెప్పారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఎంపీపీల పదవీకాలం ఆగస్టు 5తో, జెడ్పీల పదవీకాలం ఆగస్టు 6తో ముగియనుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా మినహా మిగిలిన చోట్ల కొత్త ఎంపీటీసీలు జూలై 4న బాధ్యతలు చేపడతారని, ఆ తర్వాత ఎంపీపీ అధ్యక్షుల ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. పాత జెడ్పీటీసీల పదవీకాలం జూలైæ 4న ముగుస్తుండడంతో 5న కొత్త సభ్యులు బాధ్యతలు చేపడతారన్నారు. జెడ్పీ చైర్మన్ల ఎన్నిక కోసం నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. -
ముగిసిన ‘పరిషత్’ పోరు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పరిషత్ ఎన్నికల పోలింగ్ సంరంభం ముగిసింది. మంగళవారం జరిగిన తుది విడత ఎన్నికల్లో 77.81% పోలింగ్ నమోదైంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 88.40 శాతం, నారాయణపేట జిల్లాలో అత్యల్పంగా 68.53 శాతం ఓటింగ్ రికార్డయింది. దీంతో మూడు విడతలుగా మొత్తం 538 జెడ్పీ టీసీ, 5,817 ఎంపీటీసీ స్థానాలకు (వాటిలో 4 జెడ్పీటీసీ, 162 ఎంపీటీసీ ఏకగ్రీవమయ్యాయి) పోలింగ్ ముగిసినట్లు అయింది. ఓట్ల లెక్కింపు ఈ నెల 27న ఉదయం 8 గంటలకు మొదలుకానుంది. లెక్కింపు పూర్తయ్యాక ఫలితాలు ప్రకటిస్తారు. ఈ ఏడాది జూలై 3, 4 తేదీల్లో ప్రస్తుత జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల పదవీకాలం ముగుస్తుండ డంతో కొత్తగా ఎన్నికయ్యే స్థానిక ప్రజాప్రతినిధులు ఆ తర్వాతే బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. ఈ నెల 6న జరిగిన తొలి దశ పోరులో 76.80%, ఈ నెల 10న జరిగిన రెండో విడతలో 77.63% పోలింగ్ నమోదవడం తెలిసిందే. తుది విడత ఎన్నికల్లోనూ గ్రామాల్లో ఓట్ల చైతన్యం వెల్లి విరిసింది. జిల్లాలవారీగా సగటున 75% వరకు పోలింగ్ నమోదైంది. కొన్ని మండలాలు, గ్రామాల్లో 90 శాతం నుంచి 96 శాతం వరకు పోలింగ్ నమోదు కావడం విశేషం. ఆఖరి విడతలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు ఉదయం నుంచి పోలింగ్ స్టేషన్ల వద్ద బారులు తీరారు. వర్షం కారణంగా స్టేషన్ ఘన్‌పూర్‌లో పోలింగ్‌కు కొంతమేర ఇబ్బందులు ఏర్పడినా ఓటర్లు క్యూలో నిరీక్షించి మరీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం మూడు దశల్లో కలిపి వివిధ స్థానాల్లోని బ్యాలెట్ పత్రాలు ఒకచోట కలగలిసి పోవడంతో రెండు ఎంపీటీసీ స్థానాల్లో రీ పోలింగ్‌కు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) ఆదేశించింది. 205 కేంద్రాల్లో గంట ముందే ముగింపు... మూడో విడతలో భాగంగా 1,738 ఎంపీటీసీ స్థానాలు, 161 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 30 ఎంపీటీసీలు, ఒక జెడ్పీటీసీ స్థానం ఏకగ్రీవమయ్యాయి. దీంతో 1,708 ఎంపీటీసీ స్థానాలతోపాటు తొలి విడుతలో వాయిదా పడిన సిద్దిపేట జిల్లా అల్వాల్, రంగారెడ్డి జిల్లా అజీజ్‌నగర్ ఎంపీటీసీ స్థానాలు కలుపుకొని మొత్తం 1,710 ఎంపీటీసీలకు పోలింగ్ పూర్తయింది. ఇందులో 160 జెడ్పీటీసీ స్థానాలకు 741 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఈ విడతలో మొత్తం 9,494 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేయగా 654 స్టేషన్లలో ఎస్ఈసీ వెబ్‌కాస్టింగ్ నిర్వహించింది. ఐదు జిల్లాల్లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లోని 205 పోలింగ్ కేంద్రాల్లో గంట ముందుగానే పోలింగ్ ముగించారు. మిగతా చోట్ల యథావిధిగా సాయంత్రం 5 గంటల వరకు కొనసాగించారు. మూడో విడతలో జిల్లాలవారీగా ఓటింగ్ శాతం... జిల్లా పోలింగ్ శాతం ఆదిలాబాద్ 74.26 కుమరం భీం ఆసిఫాబాద్ 75.65 మంచిర్యాల 75.58 నిర్మల్ 78.53 జగిత్యాల 73.06 రాజన్న సిరిసిల్ల 74.99 భద్రాద్రి కొత్తగూడెం 74.35 ఖమ్మం 86.47 గద్వాల 77.81 నాగర్‌కర్నూల్ 75.41 వనపర్తి 74.58 నారాయణపేట 68.53 మెదక్ 76.89 సంగారెడ్డి 78.57 సిద్దిపేట 75.76 కామారెడ్డి 75.35 నిజామాబాద్ 72.01 నల్లగొండ 85.50 సూర్యాపేట 85.04 యాదాద్రి భువనగిరి 88.40 రంగారెడ్డి 83.28 వికారాబాద్ 70.85 జనగామ 76.25 భూపాలపల్లి 70.19 మహబూబాబాద్ 79.56 వరంగల్ రూరల్ 81.73 ములుగు 72.31 -
ప్రశాంతంగా కొనసాగుతున్న పరిషత్ పోలింగ్..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పరిషత్ ఎన్నికల మూడో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతొంది. ఎండ తీవ్రత ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో ఉదయమే పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. దీంతో తొలి రెండుగంటల్లో 19 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మూడో విడతలో భాగంగా 27 జిల్లాల్లో 161 జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా.. 741మంది పోటీ చేస్తున్నారు. ఇక 1738 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా.. 5,723మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మూడో విడతలో 30 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. -
పోలింగ్ బూత్‌లో ఫొటోలు తీస్తే చర్యలు
సాక్షి, హైదరాబాద్: పరిషత్ ఎన్నికల సందర్భంగా పోలింగ్ బూత్‌లలో ఫొటోలు తీసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది. కొంతమంది పోలింగ్ సిబ్బంది, ఓటర్లు పోలింగ్ సందర్భంగా ఓటు వేస్తున్న ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారని, అలాంటి వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్ కుమార్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇలా ఫొటోలు తీసే వారికి రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 2 వేల వరకు జరిమానా విధిస్తారని పేర్కొన్నారు. -
మూడో విడత పరిషత్ ఎన్నికలకు సిద్ధం
సాక్షి, హైదరాబాద్: మూడో విడత పరిషత్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 14న మూడో విడత పోలింగ్ నేపథ్యంలో మంచిర్యాల, కొమురంభీం ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంక ర్ భూపాలపల్లి జిల్లాల్లో మాత్రం ఆదివారం సాయం త్రం 4 గంటలకు ప్రచారాన్ని ముగించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. మిగిలిన పరిషత్ మూడో విడత ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో సాయంత్రం 5 వరకు ప్రచారం పూర్తి చేయాలని పేర్కొంది. 161 జెడ్పీటీసీ, 1,738 ఎంపీటీసీ స్థానా ల్లో ఎన్నికలు జరగనున్నాయి. ర్యాలీలు, బహిరంగ సభలను నిషేధించారు. పార్టీ జెండాలు, బ్యానర్లు ఇంకా ఉంటే కేసులు నమోదు చేస్తామని ఎస్ఈసీ పేర్కొంది. టీవీలు, రేడియోల్లో ప్రచారాన్ని ఆపేశా రు. మూడో విడత పోలింగ్ ముగిసే వరకు ఆయా ప్రాంతాల్లో పరిషత్ ఎన్నికల ప్రచారాన్ని, ఎన్నికల గుర్తులను ప్రసారం చేయరాదని, బహిరంగంగా గుర్తులతో తిరగరాదని ఎస్ఈసీ తెలిపింది. గ్రామాలు, ప్రాదేశిక నియోజకవర్గాలు, మండలాల వారీగా పరిశీలకులు, వ్యయ పరిశీలకులు తిరుగుతున్నారు. ఇక ప్రచారం కోసం వచ్చిన స్థానికేతరులైన నేతలు రెండో విడత ఎన్నికల జరిగే ప్రాంతాల్లో ఉండరాదని ఎస్ఈసీ ఆదేశించింది. అలాంటి వారు ఉంటే కేసు నమోదు చేయాలని ఎన్నికల అధికారులకు సూచించారు. ఇప్పటికే తొలి, రెండు విడతల్లో పరిషత్ ఎన్నికలు ముగిశాయి. అన్ని విడతల ఫలితాలు ఈ నెల 27న వెలువడనున్నాయి. రూ. 3.22 లక్షల నగదు స్వాధీనం పరిషత్ ఎన్నికల్లో భాగంగా ఆఖరి విడత పోరు కోసం ఓటర్లను మభ్య పెట్టేందుకు తరలిస్తున్న నగదు, మద్యాన్ని పట్టుకున్నారు. వరంగల్, మంచిర్యాల, ఖమ్మం, నల్లగొండ, గద్వాల, మహబూబ్‌నగర్, మహబూబాబాద్ జిల్లాల్లో రూ.3,22,140 నగదు, రూ.9.45 లక్షల విలువైన మద్యాన్ని స్వాధీ నం చేసుకున్నారు. పరిషత్ ఎన్నికల్లో ఇప్పటివరకు మొత్తం రూ.87,11,290 నగదును స్వాధీనం చేసుకోగా.. అత్యధికంగా నల్లగొండ జిల్లాలో రూ.64 లక్షలు పట్టుకున్నారు. ఇక 280 మందిపై కేసు నమోదు చేసి, 233 మందిని అరెస్ట్ చేశారు. -
నేడు రెండో విడత పరిషత్ పోలింగ్
సాక్షి, హైదరాబాద్: రెండో విడత పరిషత్ ఎన్నికల పోరుకు సర్వం సిద్ధమైంది. శుక్రవారం జరగనున్న ఈ ఎన్నికల్లో 179 జెడ్పీటీసీ స్థానాలకు 805 మంది, 1,850 ఎంపీటీసీ స్థానాలకు 6,146 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఈ విడతలో ఒక జెడ్పీటీసీ, 63 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. రెండోవిడత ఏకగ్రీవాల్లో ఒక ఎంపీటీసీ మినహా మిగతా స్థానాలన్నీ టీఆర్ఎస్ ఖాతాలో పడిన విషయం తెలిసిందే. పోలింగ్ ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. (నక్సల్ ప్రభావిత 5 జిల్లాల పరిధిలోని కొన్ని జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల పరిధిలో గంట పోలింగ్ కుదించారు. మొత్తం 10,371 పోలింగ్ కేంద్రాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే అధికారులు పూర్తిచేశారు. గురువారం ఉదయం నుంచే ఎన్నికల సిబ్బంది తమకు కేటాయించిన స్థానాలకు చేరుకోవడం మొదలైంది. శుక్రవారం 31 జిల్లాల పరిధిలో (మేడ్చల్ జిల్లాలో తొలివిడతలోనే ఎన్నికలు పూర్తి) కరీంనగర్, పెద్దపల్లి, మహబూబ్‌నగర్, వరంగల్ అర్బన్ జిల్లాల్లో పరిషత్ ఎన్నికలు ముగుస్తాయి. మిగిలిన 27 జిల్లాల్లో ఈ నెల 14న తుది విడత ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ నెల 27న అన్ని విడతలకు కలిపి పరిషత్ ఫలితాలు ప్రకటిస్తారు. కాగా, గురువారం రూ.3.19 లక్షల విలువైన మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు మొత్తం కలిపి రూ. 83.61 లక్షల విలువైన నగదును, రూ.89.86 లక్షల విలువైన ఇతర వస్తువులను పోలీసులు, ఇతర అధికారులు జప్తుచేశారు. ఇప్పటివరకు 215 ఎఫ్ఐఆర్లు నమోదు చేయగా, 188 కేసుల్లో చర్యలు తీసుకున్నారు. మూడోవిడత జాబితా సిద్ధం... ఈ నెల 14న జరిగే మూడో విడత ఎన్నికలకు సంబంధించి రాజకీయపార్టీలు, ఇండిపెండెంట్లవారీగా పోటీచేసే అభ్యర్థుల జాబితా సిద్ధమైంది. అభ్యర్థులకు ఎన్నికల గుర్తులు కేటాయింపుతో ఈ విడతకు సంబంధించి రాజకీయపార్టీలు, అభ్యర్థుల ప్రచారం ఊపందుకుంది. ఈ విడతకు సంబంధించి 12వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఎన్నికల ప్రచారాన్ని ముగించాల్సి ఉంటుంది. 1,738, ఎంపీటీసీలు, 161 జెడ్పీటీసీలకు... మూడో విడతలో 161 మండలాల పరిధిలో 1,738 ఎంపీటీసీ, 161 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎంపీటీసీలకు 5,726 మంది అభ్యర్థులు, జెడ్పీటీసీలకు 741 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. జెడ్పీటీసీ స్థానాల్లో ఎన్నికల విషయానికొస్తే సగటున ఐదు మంది చొప్పున అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఇదిలాఉంటే రెండో విడతలోనే ఎన్నికలు ముగియడంతో కరీంనగర్, పెద్దపల్లి, మహబూబ్‌నగర్, మేడ్చల్–మల్కాజిగిరి, వరంగల్అర్భన్ జిల్లాల్లో మూడో విడతలో ఎన్నికలు లేవు. -
పాత ప్రాదేశిక సభ్యులకే ఓటు హక్కు
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం జరుగుతున్న పరిషత్ ఎన్నికల్లో గెలిచే జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం లేదు. మూడు విడతల్లో సాగుతున్న పరిషత్ ఎన్నికలు ఈనెల 14న ముగుస్తుండగా, ఈ నెల 23న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక, 27న నిర్వహించే ఓట్ల లెక్కింపు అనంతరం పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు. మూడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పాత సభ్యులకు ఓటింగ్ అవకాశం ఇవ్వకుండా కొత్తగా ఎన్నికయ్యే జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులకు ఆ హక్కును కల్పించాలంటూ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయమై ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో)కి కాంగ్రెస్, ఆ పార్టీ మిత్రపక్షాలు వినతిపత్రం సమర్పించిన సంగతి తెలిసిందే. దీంతో పాటు ఈ అంశంపై కాంగ్రెస్ నేతలు ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ను కూడా కలుసుకున్నారు. రాష్ట్ర ఎన్నికల అధికారులు టీఆర్ఎస్కు వత్తాసు పలుకుతూ కొత్తగా ఎన్నికవుతున్న పరిషత్ ప్రాదేశిక సభ్యులకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశాన్ని నిరాకరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు నిర్వహిస్తున్న ఎన్నికల్లో కొత్తగా ఎన్నికయ్యే జెడ్పీటీసీ, ఎంపీటీసీల పదవీ కాలం జూలై మొదటివారంలోనే మొదలు కానున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీ స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికల్లో కొత్త సభ్యులు ఓటు వేసే అవకాశం లేదని రాష్ట్ర ఎన్నికల అధికారులు తెలిపారు. అదీగాకుండా ఈ స్థానాలకు జరుగుతున్న వి ఉప ఎన్నికలు కాబట్టి, పాత సభ్యులే ఓటేసేం దుకు అవకాశం ఉంటుందన్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి ఎమ్మెల్యేలుగా గెలవడంతో తమ ఎమ్మెల్సీ స్థానాలకు రాజీనామా చేశారు. అంతకు ముందే కొండా మురళీధర్‌రావు కూడా తన ఎమ్మెల్సీ సీటును వదులుకున్నారు. ఈ నేపథ్యంలో వారు రాజీనామాలిచ్చిన 6 నెలల్లోగా స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీ ఖాళీలను భర్తీ చేయాల్సి ఉండడంతో ఇటీవల ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీచేసింది. -
రెండో విడత పరిషత్పోరు రేపే
సాక్షి, హైదరాబాద్: రెండో విడత పరిషత్ పోరుకు రంగం సిద్ధమైంది. శుక్రవారం జరగనున్న ఎన్నికల కు సంబంధించి బుధవారం సాయంత్రం 5 గంట లకు ప్రచారం ముగిసింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) రెండో విడత పోలింగ్‌కు అవసరమైన పూర్తి ఏర్పాట్లు చేసింది. ఈ విడతలో ఎన్నికలు జరగనున్న జిల్లాలు, మండలాల వారీగా బ్యాలెట్ బ్యాక్స్‌లు, బ్యాలెట్ పేపర్లు సిద్ధం చేసి, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ప్రాదేశిక నియోజకవర్గాల వారీగా కేటాయించారు. వీటిని గురువారం ఉదయం నుంచి పోలింగ్ స్టేషన్ల వారీగా గ్రామాలకు తరలిస్తారు. 31 జిల్లాల పరిధిలో (తొలివిడత మేడ్చల్ జిల్లాలో పూర్తి) శుక్రవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు, ఐదు జిల్లాల్లోని కొన్ని నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో 4 వరకు పోలింగ్ నిర్వహిస్తారు. రెండో విడతలో కరీంనగర్, పెద్దపల్లి, మహబూబ్‌నగర్, వరంగల్ అర్బన్ జిల్లాల్లో పరిషత్ ఎన్నికలు ముగుస్తాయి. మిగిలిన 27 జిల్లాల్లో ఈ నెల 14న తుది విడత ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ నెల 27న అన్ని విడతలకు కలిపి పరిషత్ ఫలితాలు ప్రకటిస్తారు. ఆ తర్వా త ఎస్ఈసీ నిర్ణయించే తేదీల్లో జెడ్పీపీ చైర్పర్సన్లు, వైస్ చైర్మ న్లు, ఎంపీపీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులను పరోక్ష పద్ధతిలో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఎన్నుకుంటారు. రెండో విడతలో 1 జెడ్పీటీ సీ, 63 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం కావడంతో 179 జెడ్పీటీసీ, 1,850 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. రెండో విడత ప్రచారం చేస్తే చర్యలు: ఎస్ఈసీ రెండోవిడత ఎన్నికల ప్రచారం ముగిసిన నేపథ్యంలో అభ్యర్థులు ప్రచార ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తామని బుధవారం ఎస్ఈసీ స్పష్టం చేసింది. ప్రచార నిర్వహణ కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన రాజకీయ పార్టీల నేతలు, ప్రచార నిర్వాహకులు ప్రస్తుతం ఎన్నికలు జరిగే ప్రాంతాలు వదిలిరావాలని ఆదేశించింది. ఇదిలా వుండగా, ఈ నెల 14న జరగనున్న తుది విడత ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. 12న సాయంత్రం 5 వరకు ఎన్నికల ప్రచారం నిర్వహణకు అవకాశం ఉండటంతో ప్రచారం జోరు పెరిగింది. మూడో విడతలో 161 జెడ్పీటీసీలు, 1,738 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. -
రెండు ఎంపీటీసీలకు రీపోలింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెండు ఎంపీటీసీ స్థానా ల్లో రీపోలింగ్ జరగనుంది. సోమవారం జరిగిన మొదటి విడత పరిషత్ ఎన్నికల్లో భాగంగా అభ్యర్థుల బ్యాలెట్ పత్రాలు కలసిపోవడంతో ఈ స్థానాల విష యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసు కుంది. రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ మండ లం అజీజ్‌నగర్ ఎంపీటీసీ, సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండలం అల్వాల్ ఎంపీటీసీ స్థానాలకు ఈ నెల 14 న మూడో విడత ఎన్నికల్లో భాగంగా రీపోలింగ్ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి ఆదేశించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక ఎంపీటీసీ స్థానంలో బ్యాలెట్‌పత్రాలు కలసిపోయినా, దీన్ని సకాలంలో గుర్తించడంతో సోమవారమే సరిచేసి ఎన్నికలు నిర్వహించారు. రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లోని ఈ రెండు ఎంపీటీసీ స్థానాల్లో ఓటర్లకు తప్పుడు బ్యాలెట్ పేపర్లను పంపిణీ చేసిన నేపథ్యంలో మళ్లీ ఎన్నికల నిర్వహణకు నోటి ఫికేషన్ జారీచేయాలని అధికారులను ఎస్ఈసీ ఆదేశించింది. ఈ స్థానాల్లోని ఓటర్లకు ఈ నెల 14న నిర్వహించే రీపోలింగ్ సందర్భంగా ఎడమ చేతి నాలుగో వేలిపై సిరాచుక్క వేయాలని సూచించింది. కాగా, పరిషత్ ఎన్నికల్లో భాగంగా తనిఖీల సందర్భంగా ఇప్పటివరకు రూ.1.6 కోట్ల విలువైన నగదు, మద్యం, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఒక్కరోజే రూ.3.95 లక్షల నగదు, రూ.1.6 లక్షల విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు 86 ఫిర్యాదులందాయి. మొత్తం 190 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి వాటిపై చర్యలు చేపట్టినట్లు ఎస్ఈసీకి పోలీస్ శాఖ తెలిపింది. -
నేడు రెండోవిడత ప్రచారానికి తెర
సాక్షి, హైదరాబాద్: రెండో విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచారం బుధవారం సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. రెండో విడతలో భాగంగా ఈ నెల 10న (శుక్రవారం) ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల ఓటింగ్ సమయం ముగియడానికి 48 గంటల ముందు ప్రచారాన్ని నిలిపివేయాల్సి ఉంది. 179 జెడ్పీటీసీ స్థానాలకు 805 మంది, 1,850 ఎంపీటీసీ స్థానాలకు 6,146 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. రెండో విడతలో ఒక జెడ్పీటీసీ, 63 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం కాగా, అందులో ఒక్క ఎంపీటీసీ మినహా మిగతా స్థానాలన్నీ టీఆర్ఎస్ గెలుచుకుంది. జెడ్పీటీసీ స్థానాల్లో టీఆర్ఎస్–179, కాంగ్రెస్–177, బీజేపీ–148, టీడీపీ–60, సీపీఐ–20, సీపీఎం–19, ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీలు, రాష్ట్రంలో ఎస్ఈసీ వద్ద రిజిస్టర్ అయిన పార్టీలు–40, ఇండిపెండెంట్ అభ్యర్థులు–162 మంది బరిలో నిలిచారు. ఎంపీటీసీ స్థానాల విషయానికొస్తే టీఆర్ఎస్–1,848, కాంగ్రెస్–1,698, బీజేపీ–895, టీడీపీ–173, సీపీఐ–87, సీపీఎం–92, ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీలు, రాష్ట్రంలో ఎస్ఈసీ వద్ద రిజిస్టర్ అయిన పార్టీలు–101, ఇండిపెండెంట్ అభ్యర్థులు–1,249 మంది పోటీలో ఉన్నారు. ‘రెండో విడత’కు సర్వం సిద్ధం శుక్రవారం జరగనున్న రెండో విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. ఆయా ప్రాదేశికవర్గ నియోజకవర్గాల వారీగా బ్యాలెట్ పత్రాలను విడదీసి పోలింగ్‌కు సిద్ధం చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల సంఖ్యకు తగ్గట్టు అవసరమైన మేర బ్యాలెట్బాక్సులు సిద్ధం చేసుకోవడంతో పాటు ఎన్నికల సిబ్బందికి డ్యూటీల కేటాయింపు, బందోబస్తు, ఎన్నికల సరంజామాను అందుబాటులో పెట్టుకుంటున్నారు. ఈ నెల 14న జరగనున్న మూడో విడత ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ముగియడంతో రాజకీయపార్టీలు, ఇండింపెండెంట్ల వారీగా పోటీచేసే అభ్యర్థుల జాబితా సిద్ధమైంది. అభ్యర్థులకు ఎన్నికల గుర్తులు కేటాయింపుతో ఈ విడతకు సంబంధించి రాజకీయపార్టీలు, అభ్యర్థుల ప్రచారం ఊపందుకుంటోంది. 12వతేదీ సాయంత్రం 5 గంటల లోపు తుది విడత ఎన్నికల ప్రచారాన్ని పార్టీలు, అభ్యర్థులు ముగించాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని 5 జెడ్పీటీసీ, 42ఎంపీటీసీ స్థానాలకు మొదటి విడతలోనే ఎన్నికలు పూర్తయ్యాయి. మిగతా జిల్లాలకు రెండు, మూడో విడతల్లో ఎన్నికలుంటాయి. -
తొలి విడత‘ స్థానికం’లో 76.80% పోలింగ్
సాక్షి, హైదరాబాద్: పరిషత్ ఎన్నికల తొలివిడత పోరులో 76.80% పోలింగ్ నమోదైంది. సోమవారం సాయంత్రం 5 వరకు పోలైన ఓట్లకు అనుగుణంగా ఎస్ఈసీ ఈ వివరాలను వెల్లడించింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 86.19% నమోదు కాగా, మంచిర్యాల జిల్లాలో అత్యల్పంగా 66.86% పోలింగ్ రికార్డయింది. మొదటి దశ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అక్కడక్కడా స్వల్పఘటనలు, చిన్న చిన్న ఇబ్బందులు మినహా పోలింగ్ సాఫీగా సాగిం దని అధికారులు వెల్లడించారు. శాంతిభద్రతలపరం గా కూడా అక్కడక్కడా చిన్న చిన్న సమస్యలు మినహా తొలివిడత ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందన్నారు. మండుటెండలను కూడా లెక్కచేయకుండా మండలాలు, గ్రామస్థాయిల్లో ఓటర్లు ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఉదయం ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్‌లో పాల్గొనగా, మధ్యా హ్నం కొంత మందకొడిగా సాగింది. సాయంత్రం పోలింగ్ సమ యం ముగిసే సమయానికి పెద్దసంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. మొదటిదశలో భాగంగా మొత్తం 32 జిల్లాల పరిధిలోని 195 జెడ్పీటీసీ, 2,096 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. నక్సల్ ప్రభావిత ఐదు జిల్లాల పరిధిలోని 640 ఎంపీటీసీ, 75 జెడ్పీటీసీ స్థానాల్లో భద్రతా కారణాల దృష్ట్యా ఓటింగ్ సమయాన్ని గంటకు కుదించడంతో సాయంత్రం 4కి పోలింగ్ ముగిసింది. ఈ ప్రాంతాల్లో 70% వరకు ఓట్లు నమోదైనట్టు సమాచారం. ఈ నెల 10న రెండో విడత, 14న తుది విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. మే 27న మూడు విడతల పరిషత్ ఎన్నికలకు కలిపి ఒకేసారి ఫలితాలు ప్రకటిస్తారు. ఆ తర్వాతే జెడ్పీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, ఎంపీపీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులను ఎన్నుకుంటారు. కొన్నిచోట్ల ఇబ్బందులు సిద్దిపేట, రంగారెడ్డి, యాదాద్రి జిల్లాల్లో కొన్నిచోట్ల ఎంపీటీసీ బ్యాలెట్ పత్రాలు కలిసిపోవడంతో పోలిం గ్ అధికారులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ విషయాన్ని ముందుగా పోటీలో ఉన్న అభ్యర్థులే గుర్తించి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అధికారులు వెంటనే స్పందించి నివారణ చర్యలు చేపట్టారు. బ్యాలెట్ పత్రాలను వేరు చేసి సంబంధిత పోలింగ్ బూతులకు పంపారు. బ్యాలెట్ పేపర్ల సైజు ఒకేలా ఉండడం, పోటీచేసే అభ్యర్థుల సంఖ్య కూడా అంతే ఉండటంతో ఈ సమస్య తలెత్తినట్టుగా అధికారులు గుర్తించారు. మరికొన్ని చోట్ల ప్రింటింగ్ ప్రెస్‌ల్లో ప్యాకింగ్ సమయంలోనే ఈ బ్యాలెట్‌పత్రాలు కలిసిపోవడంతో సమస్యలు తలెత్తాయి. మొదట యాదాద్రి భువనగిరిజిల్లాలో ఈ సమస్యను గుర్తించి, జరిగిన తప్పిదాన్ని అధికారులు సవరించుకోవడంతో పోలింగ్ కొనసాగింది. సిద్దిపేట, రంగారెడ్డి జిల్లాలోనూ కొన్ని చోట్ల ఇలాంటి ఘటనలు జరగడంతో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న దానిపై మంగళవారం నిర్ణయం తీసుకుంటా మని ఎస్ఈసీ కార్యదర్శి అశోక్‌కుమార్ ‘సాక్షి’ కి తెలిపారు. మొదటి విడత ఎన్నికల్లో భాగంగా 12,094 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. వాటిలో రాష్ట్రవ్యాప్తంగా 972 పోలింగ్ కేంద్రాల్లో ఎస్ఈసీ వెబ్‌కాస్టింగ్ నిర్వహించింది. సోమవారం పరిషత్ ఎన్నికల పోలిం గ్ సందర్భంగా ఎస్ఈసీ ప్రధానకార్యాలయం నుంచి వెబ్‌కాస్టింగ్‌ను అధికారులు పరిశీలించారు. -
ఎన్నికల పోలింగ్‌కు వడదెబ్బ ఎఫెక్ట్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా పరిషత్ తొలిదశ ఎన్నికల పోలింగ్‌పై వడదెబ్బ ఎఫెక్ట్ కనిపిస్తోంది. ఎండ ప్రభావంతో చాలా చోట్ల పోలింగ్ కేంద్రాలు వెలవెలబోతున్నాయి. 44డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఉదయం 7 నుంచి 9 వరకు ఓటర్లు బారులు తీరినా, 10 తర్వాత పోలింగ్ కేంద్రాలు బోసిపోయాయి. ఎండ దెబ్బకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. -
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
-
కొనసాగుతున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్
సాక్షి, హైదరాబాద్ : పరిషత్ తొలిదశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. గ్రామీణ ప్రాంతాల్లోని స్థానిక సంస్థల్లో అత్యంత కీలకంగా మారిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈ విడతలో భాగంగా 195 జెడ్పీటీసీ స్థానాలకు 882 మంది, 2,096 ఎంపీటీసీ స్థానాల్లో 7,072 మంది (2 జెడ్పీటీసీ, 68 ఎంపీటీసీ ఏకగ్రీవాలు మినహాయించి)అభ్యర్థులు పోటీ పడుతున్నారు. సోమవారం సాయంత్రం 5 వరకు (5 నక్సల్ ప్రభావిత జిల్లాల్లో సాయంత్రం 4 గంటల వరకే) సాగనుంది. నాగరకర్నూల్ జిల్లా గగ్గనపల్లి ఎంపీటీసీ స్థానంలో ఏకగ్రీవ ఎన్నికను రద్దుచేయడంతో పాటు, ఆ స్థానానికి విడిగా ఎస్ఈసీ నోటిఫికేషన్ ఇచ్చి తర్వాత ఎన్నిక నిర్వహించనుంది. రాష్ట్రంలోని 32 జిల్లాల పరిధిలో మొత్తం 5,857 ఎంపీటీసీ స్థానాలు, 539 జెడ్పీటీసీ స్థానాలుండగా.. ములుగు జిల్లా మంగపేట మండలంలో ఎన్నికలు జరగడం లేదు. దీంతో 538 జడ్పీటీసీ, 5,817 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలుంటాయి. -
నేడే పరిషత్ తొలి పోరు
సాక్షి, హైదరాబాద్: పరిషత్ తొలిదశ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లోని స్థానిక సంస్థల్లో అత్యంత కీలకంగా మారిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈ విడతలో భాగంగా 195 జెడ్పీటీసీ స్థానాలకు 882 మంది, 2,096 ఎంపీటీసీ స్థానాల్లో 7,072 మంది (2 జెడ్పీటీసీ, 68 ఎంపీటీసీ ఏకగ్రీవాలు మినహాయిం చి)అభ్యర్థులు పోటీ పడుతున్నారు. సోమవారం ఉద యం 7 గంటలకు పోలింగ్ మొదలై సాయంత్రం 5 వరకు (5 నక్సల్ ప్రభావిత జిల్లాల్లో సాయంత్రం 4 గంటల వరకే) సాగనుంది. నాగరకర్నూల్ జిల్లా గగ్గనపల్లి ఎంపీటీసీ స్థానంలో ఏకగ్రీవ ఎన్నికను రద్దుచేయడంతో పాటు, ఆ స్థానానికి విడిగా ఎస్ఈసీ నోటిఫికేషన్ ఇచ్చి తర్వాత ఎన్నిక నిర్వహించనుంది. రాష్ట్రంలోని 32 జిల్లాల పరిధిలో మొత్తం 5,857 ఎంపీటీసీ స్థానాలు, 539 జెడ్పీటీసీ స్థానాలుండగా.. ములుగు జిల్లా మంగపేట మండలంలో ఎన్నికలు జరగడం లేదు. దీంతో 538 జడ్పీటీసీ, 5,817 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలుంటాయి. ఆదివారం ఉదయం నుంచే ఎస్ఈసీ పోలింగ్ కేంద్రాలకు సామగ్రిని చేరవేసింది. పోలింగ్ సిబ్బంది, ప్రిసైడింగ్ అధికారులు పోలింగ్ స్టేషన్లకు చేరుకున్నారు. ఇంక్, బ్యాలెట్ పత్రాలు, కవర్లు, బ్యాలెట్ బాక్స్‌లన్నీ సిద్ధం చేశారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి, కార్యదర్శి ఆశోక్ కుమార్‌లు ఆయా జిల్లాల్లో ఏర్పాట్లను వీడి యో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ ఎన్నికల సందర్భంగా కొన్ని పోలింగ్‌బూత్‌లలో వెబ్‌కాస్టింగ్‌ను ఏర్పాటుచేశారు. ఎస్ఈసీ ప్రధాన కార్యాలయంలో వెబ్‌కాస్టింగ్‌ను ప్రత్యక్షంగా పరిశీలిం చేందుకు ఏర్పాట్లుచేశారు. ఇవన్నీ నిషిద్ధం బ్యాలెట్ పెట్టెలు, పత్రాలతో ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నందున పార్టీల ఏజెంట్లతో సహా ఎవరూ కూడా పోలింగ్ బూత్‌లలోకి వాటర్‌బాటిళ్లు, అగ్గిపెట్టెలు, ఇంక్ బాటిళ్లు తదితరాలను తీసుకెళ్లరాదని ఎస్ఈసీ స్పష్టంచేసింది. పోలింగ్ స్టేషన్లలో ఏజెంట్లకు నీళ్లు, చాయ్ కూడా సరఫరా చేయరాదని పేర్కొంది. పోలింగ్ సందర్భంగా సిబ్బంది కూడా టీ తదితరాలు తీసుకోకుండా ఉంటే మంచిదని సూచించింది. మారణాయుధాలను తీసుకువెళ్లకూడదని, పోలింగ్ బూత్ పరిసరాల్లో గుమిగూడి ఉండరాదని, వాహనాలను పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల దూరంలో నిలపాలని, చుట్ట, బీడీ, సిగరెట్ వంటి పొగాకు వస్తువులు, అగ్గిపెట్టె, లైటర్ వంటి వాటిని కూడా పోలింగ్ బూత్‌ల్లోకి తీసుకవెళ్లరాదని స్పష్టం చేసింది. ఓటేసిన తర్వాత బ్యాలెట్ పేపర్లను సరైన రీతిలో మడిచి బాక్స్‌ల్లో వేయాలని ఎన్నికల సంఘం సూచించింది. ఈ మేరకు పలు సూచనలు జారీ చేశారు. ఒకరి ఓటును మరోకరు వేశారని పోలింగ్ అధికారులు చెబితే.. మీ దగ్గరున్న ఆధారాలతో ఎన్నికల అధికారులను అడిగి టెండరు ఓటును అడిగి వేయవచ్చు. వికలాంగులు తమ వెంట ఒకరిని సహాయకుడిగా తీసుకెళ్లవచ్చు. అంధ ఓటర్లు పోలింగ్ అధికారుల సాయం తీసుకోవచ్చు. ఇటీవలే లోక్‌సభ ఎన్నికలు ముగియడంతో.. ఈ ఎన్నికల సందర్భంగా ఓటేసిన వారికి ఎడమచేతి చూపుడు వేలికి ఇంక్ ముద్ర వేశారు. దీంతో ఈ ఎన్నికల్లో ఎడమచేతి మధ్య వేలికి సిరా గుర్తు వేస్తారు. ఎంపీటీసీలకు పింక్ కలర్ బ్యాలెట్ రాష్ట్రంలో బ్యాలెట్ పద్ధతిన పరిషత్ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఎంపీటీసీ సభ్యులకు గులాబీ రంగు బ్యాలెట్, జెడ్పీటీసీ అభ్యర్థులకు తెలుపు కలర్ బ్యాలెట్‌ను ఖరారు చేశారు. పార్టీలకు కేటాయించే గుర్తులతో పాటు.. స్వతంత్రులకు 100 రకాల గుర్తులను ఖరారు చేశారు. పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల వారీగా నామినేషన్లు ఫైనల్ కావడంతో.. బరిలో నిలిచిన అభ్యర్థుల గుర్తులతో బ్యాలెట్ పత్రాలను ముద్రించారు. ఎంపీటీసీ అభ్యర్థికి గులాబీ రంగు, జెడ్పీటీసీ అభ్యర్థుల కోసం తెలుపు రంగు బ్యాలెట్ పేపరు ఇస్తారు. గుర్తుపై ముద్ర వేసిన తర్వాత పేపర్‌ను ఎడమ నుంచి కుడికి 3మడతలుగా చేసి ఎంపీటీసీ, జెడ్పీటీసీల కోసం వేర్వేరుగా ఏర్పాటు చేసిన పెట్టెల్లో వేయాలి. పేపర్‌ను పైనుంచి కిందకు మడచవద్దు. పైనుంచి కిందకు మడిస్తే ఒక గుర్తుకు వేసిన ముద్ర మరో గుర్తుపై పడే అవకాశం ఉంటుంది. అలా రెండు గుర్తులపై ముద్ర పడితే చెల్లని ఓటుగా పరిగణిస్తారు. -
ఎన్నికల దృష్ట్యా ఓయూ పరీక్షలు వాయిదా
హైదరాబాద్: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల దృష్ట్యా సోమ, మంగళవారాల్లో (6,7వ తేదీలు) జరి గే ఓయూ పరిధిలోని పరీక్షలన్నీ వాయిదా వేసినట్లు అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేశ్ తెలిపారు. తిరిగి పరీక్షలను నిర్వహించే తేదీలను త్వరలో ప్రకటిస్తామన్నారు. ఇతర పరీక్షల్లో ఎలాంటి మార్పులేదని స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు ఉస్మానియా వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. -
పరిషత్... ప్రతిష్టాత్మకం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పరిషత్ పోరు రసవత్తరంగా సాగుతోంది. స్థానిక ఎన్నికలను అన్ని పార్టీలూ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాయి. గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఎంపీటీసీ ఎన్నికలు కీలకంగా మారడంతో గ్రామాల్లో ప్రలోభాలు కూడా భారీగా ఉన్నాయి. పోటీ ఎక్కువగా ఉన్న స్థానాల్లో రూ. 2 వేల వరకు నేతలు పంచుతున్నారు. రాష్ట్రంలో 838 జెడ్పీటీసీ స్థానాలకు, 5,817 ఎంపీటీసీ స్థానాలకుగాను ఇప్పటివరకు మూడు జెడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవమైతే వాటన్నింటినీ టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అలాగే 132 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమైతే అందులో 129 స్థానాలను టీఆర్ఎస్, రెండు స్థానాల్లో కాంగ్రెస్, ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి ఎన్నికయ్యారు. మొత్తం మూడు దశల్లో పరిషత్ ఎన్నికలు జరగనుండగా తొలిదశ పోలింగ్ సోమవారం జరగనుంది. ఈ నెల 10న రెండో దశ, 14న మూడోదశ ఎన్నికలు ఉన్నాయి. టీఆర్ఎస్లో ఎమ్మెల్యేలే అంతా... జిల్లాలు, మండలాల పునర్విభజన అనంతరం తొలిసారి పరిషత్ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 32 జెడ్పీలు, 838 ఎంపీపీలు ఉన్నాయి. అన్నింట్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు లక్ష్యంగా అధికార పార్టీ వ్యూహాలు రచిస్తోంది. పోటీ జరుగుతున్న ప్రతి స్థానంలోనూ టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచేలా ప్రయత్నించాలని అధిష్టానం పార్టీ ఎమ్మెల్యే లను ఆదేశించింది. టీఆర్ఎస్లో పరిషత్ ఎన్నికల గెలుపు బాధ్యతలను పూర్తిగా ఎమ్మెల్యే లకు, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జీలకు అప్పగిం చారు. జెడ్పీ, ఎంపీపీల కైవసం లక్ష్యంగా పని చేయాలని ఎమ్మెల్యేలను ఆదేశించింది. అభ్యర్థుల ఎంపికలో కొన్నిచోట్ల అసంతృప్తులు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు సవాల్‌గా మారాయి. సీనియర్లకు, విధేయులకు అవకాశం ఇవ్వడంలేదని విమర్శలు వస్తున్నాయి. ఎమ్మెల్యేలు మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా అన్ని స్థానాల్లో గెలుపు లక్ష్యంగా ఎన్నికల వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ‘గులాబీ’ని నిలువరించాలని... అసెంబ్లీ ఎన్నికల పరాజయంతో డీలా పడిన కాంగ్రెస్... గ్రామ స్థాయిలో పార్టీ పునాదులను పటిష్ట పరుచుకోవాలని లక్ష్యం నిర్దేశించుకుంది. పరిషత్ ఎన్నికలతో ఈ పని పూర్తి చేయాలని భావిస్తోంది. టీఆర్ఎస్ ఏకగ్రీవంగా ఏ స్థానంలోనూ విజయం సాధించకుండా వ్యవహరించాలని అన్ని అసెంబ్లీ స్థానాల కాంగ్రెస్ ఇన్‌చార్జీలకు పీసీసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యూహం కొంతవరకు ఫలించిందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. సర్పంచ్ ఎన్నికలతో పోలిస్తే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు తగ్గాయని స్థానికంగా కాంగ్రెస్ భావిస్తోంది. 20కిపైగా జెడ్పీలను కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది. కొన్ని జెడ్పీ స్థానాలకు అభ్యర్థులను ముందుగానే ప్రకటించింది. అన్ని స్థానాల్లో గట్టి పోటీ ఇచ్చే వ్యూహంతో అసెంబ్లీ నియోజకవర్గాల కాంగ్రెస్ ఇన్చార్జీలు పని చేస్తున్నారు. భవిష్యత్‌పై బీజేపీ గంపెడాశలు... అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ పరాజయం తర్వాత డీలా పడిన బీజేపీకి లోక్‌సభ ఎన్నికలతో కొంత ఊపు వచ్చింది. ఐదారు లోక్‌సభ స్థానాల్లో టీఆర్ఎస్తో హోరాహోరీ తలపడినట్లు బీజేపీ ముఖ్య నేతలు చెబుతున్నారు. అదే ఊపుతో పరిషత్ ఎన్నికల్లోనూ వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో కమలదళం పోటీ చేస్తోంది. ప్రతి జెడ్పీలోనూ, ప్రతి ఎంపీపీలనూ ప్రాతినిధ్యం లక్ష్యంగా బీజేపీ పరిషత్ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. ఎక్కువ స్థానాల్లో గెలుపు ఉమ్మడి జిల్లాలవారీగా ఇన్చార్జీలను నియమించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ప్రధాన పోటీదారుగా ఉండాలని భావిస్తున్న బీజేపీ... గ్రామాల్లో కీలకమైన ఎంపీటీసీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగానే తీసుకుంటోంది. మొదటిసారి బరిలో టీజేఎస్... కోదండరాం నేతృత్వంలోని తెలంగాణ జనసమితి... పరిషత్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తోంది. రాజకీయ పార్టీలకు క్షేత్రస్థాయిలో బలం పెంచే కీలకమైన ఎన్నికల్లో టీజేఎస్ మొదటిసారి పరీక్షను ఎదుర్కొంటోంది. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా కొన్ని స్థానాల్లో ఇతర పార్టీల అభ్యర్థులకు మద్దతిస్తోంది. టీజేఎస్ అధినేత ఎం. కోదండరాం స్వయంగా పరిషత్ ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొంటున్నారు. పరిషత్ ఎన్నికల్లో నమోదయ్యే ఓటింగ్ శాతంపై టీజేఎస్ భవితవ్యం ఆధారపడి ఉంటుందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వామపక్షాలు వేర్వేరుగా... అసెంబ్లీలో విడిగా పోటీ చేసి ప్రతికూల ఫలితాలను రుచి చూసిన సీపీఎం, సీపీఐ పార్టీలు... లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేశాయి. పరిషత్ ఎన్నికల్లో మాత్రం మళ్లీ వేర్వేరుగా పోటీ చేస్తున్నాయి. ఖమ్మం, నల్లగొండ ఉమ్మడి జిల్లాల్లో బలం చాటేందుకు రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. వాపక్ష పార్టీలు పోటీ చేయని కొన్ని స్థానాల్లో స్థానిక నాయకత్వం నిర్ణయం మేరకు ఇతర ప్రతిపక్ష పార్టీలకు మద్దతు ఇస్తున్నాయి. పరిమిత స్థానాల్లో టీడీపీ పోటీ... లోక్‌సభ ఎన్నికల పోటీ విషయంలో చేతులెత్తేసిన టీడీపీ... పరిషత్ ఎన్నికల్లో మాత్రం పోటీ చేస్తోంది. స్థానికంగా నాయకులు ఉన్న కొన్ని స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ టీడీపీ అభ్యర్థులు బరిలో నిలిచారు. అయితే రాష్ట్ర నాయకత్వం మాత్రం పరిషత్ ఎన్నికలను పట్టించుకున్న దాఖలాలు కనిపించడంలేదు. -
రేపే పరిషత్ ‘తొలిపోరు’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో తొలివిడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. సోమవారం జరగనున్న ఈ ఎన్నికలకు సంబంధించి శనివారం సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగిసింది. పరిషత్ ఎన్నికల్లో భాగంగా 197 జెడ్పీటీసీ, 2,166 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరగనుండగా.. వాటిలో రెండు జెడ్పీటీసీ, 69 ఎంపీటీసీలు ఏకగ్రీవం కావడంతో.. మిగిలిన స్థానాలకు సోమవారం పోలింగ్ నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) అన్ని ఏర్పాట్లు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయంగా స్థానిక సంస్థల ఎన్నికలు కీలకంగా మారాయి. వీటికి సంబంధించిన పోలింగ్ బూత్‌లు, బ్యాలెట్‌పత్రాల ముద్రణ, నిర్వహణ సిబ్బంది, ఇతరత్రా అన్ని అంశాల్లో అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. పోలింగ్ స్టేషన్ల దగ్గర 144 సెక్షన్ విధించడంతో పాటు, తొలిదశ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో మద్యం అమ్మకాలపై నిషేధం విధించారు. సమస్యాత్మక, సున్నితమైన ప్రాంతాల్లో పోలీసు బందోబస్తు మరింత పెంచారు. మూడు విడతలుగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగనుండగా.. సోమవారం (6న) మొదటి దశ, 10న రెండో విడత, 14న మూడోవిడత ఎన్నికలుంటాయి. ఈ ఎన్నికలు ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్నాయి. మావోయిస్టు ప్రభావిత 5 జిల్లాల్లో మాత్రం సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగుస్తుంది. ఎంపీటీసీకి సగటున ముగ్గురు పోటీ తొలివిడతలో 195 మండలాల్లో 2,157 ఎంపీటీసీ స్థానాలకుగానూ.. 7,702 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. వారిలో అత్యధికంగా టీఆర్ఎస్ నుంచి 2,094, కాంగ్రెస్ నుంచి 1,867, బీజేపీ తరఫున 1,057, సీపీఎం అభ్యర్థులుగా 138, టీడీపీ నుంచి 107, సీపీఐ తరఫున 82, ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీలు, ఎస్ఈసీ వద్ద రిజిస్టర్ అయిన పార్టీల నుంచి 61, ఇండిపెండెంట్లుగా 1,666 మంది అభ్యర్థులున్నారు. మొత్తంగా చూస్తే సగటున ఒక్కో ఎంపీటీసీ స్థానానికి ముగ్గురేసి మంది.. ఆదిలాబాద్, మంచిర్యాల, సిరిసిల్ల, భద్రాద్రి, నాగర్‌కర్నూలు, సంగారెడ్డి, మేడ్చల్, ములుగు జిల్లాల్లో నలుగురు చొప్పున పోటీపడుతున్నారు. 195 జెడ్పీటీసీ స్థానాల్లో 882 మంది బరిలో ఉన్నారు. అత్యధికంగా ఇందులోనూ.. టీఆర్ఎస్ నుంచి 195, కాంగ్రెస్ తరఫున 190, బీజేపీ అభ్యర్థులుగా 171 మంది పోటీ చేస్తుండగా.. సీపీఎం (22 మంది), టీడీపీ (63), సీపీఐ (14), ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీలు, ఎస్ఈసీ వద్ద రిజిస్టర్ అయిన పార్టీలు (34), ఇండిపెండెంట్లు (193 మంది) తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే సగటున ఒక్కో జెడ్పీటీసీ స్థానానికి నలుగురేసి పోటీచేస్తున్నారు. కొత్తగూడెం, ఖమ్మం, జనగాం, మహ బూబాబాద్, వరంగల్ (రూరల్) జిల్లాల్లో ఆరుగురు చొప్పున, ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జోగుళాంబ, సంగారెడ్డి, సూర్యాపేట, నల్లగొండ, రంగారెడ్డి, వరంగల్ (అర్బన్) జిల్లాల్లో అయిదుగురు చొప్పున అభ్యర్థులు బరిలో ఉన్నారు. ‘మూడు’లో మిగిలింది 11,677 అభ్యర్థులే! రెండో విడతలో పరిషత్ ఎన్నికలు జరిగే ప్రాదేశిక నియోజకవర్గాల్లో ప్రచారం కొనసాగుతోంది. ఈ నెల 10న రెండో విడత పోలింగ్ జరగనుండగా 8న ప్రచారం ముగియనుంది. మూడో విడత నామినేషన్లకు శనివారం పరిశీలన ముగిసింది. దీంతో 161 జెడ్పీటీసీ, 1,738 ఎంపీటీసీ స్థానాల్లో 11,677 నామినేషన్లు అర్హత సాధించాయి. వీటిలోనూ ఉపసంహరించుకునే వారికి సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు అవకాశం ఇచ్చారు. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో.. నక్సల్ ప్రభావిత 5 జిల్లాల్లో పరిషత్ పోలింగ్ సమయం గంట కుదించారు. ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి, జయశంకర్, ములుగు జిల్లాల పరిధిలోని 75 జెడ్పీటీసీ, 640 ఎంపీటీసీ స్థానాల్లో ఈ గంట కుదింపు పాటిస్తారు. సమస్యాత్మక ప్రాంతాల్లో శాంతియుతంగా పోలింగ్, ఓటింగ్ ముగిశాక సుదూర ప్రాంతాల నుంచి బ్యాలెట్బాక్సులు, సిబ్బంది సకాలంలో మండల, జిల్లా కేంద్రాలకు చేరుకునేందుకు సమయాన్ని కుదించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు డీజీపీ లేఖ రాశారు. ఈ మేరకు సమయాల్లో మార్పులు తీసుకుంటూ ఎస్ఈసీ ఆదేశాలిచ్చింది. మొదటివిడతలో భాగంగా తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలు 217 ఎంపీటీసీ స్థానాల్లో (ఐదు జిల్లాలు) ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ప్రచారపర్వం ముగియడంతో.. స్థానికేతరులైన నేతలు మండల కేంద్రాల్లో ఉండరాదని పోలీసులు, ఎన్నికల అధికారులు ఆదేశించారు. ఈ స్థానాల్లో 7 నుంచి 4 వరకే! తొలివిడతలో ఎన్నికలు జరిగే స్థానాల్లో.. కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని బెజ్జూరులో 8, చింతలమానేపల్లిలో 8, దహేగాంలో 8, కౌటాలలో 9, పెంచికలపేట్‌లో 4, సిర్పూర్ (టీ) పరిధిలో 8 ఎంపీటీసీ స్థానాల్లో.. బెల్లంపల్లి జిల్లాలో బెల్లంపల్లిలో 8, భీమినిలో 4, కన్నేపల్లిలో 5, కాసిపేటలో 9, నెన్నెలలో 7, తాండూరులో 9, వేమనపల్లిలో 5 ఎంపీటీసీ స్థానాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అశ్వా పురంలో 12, చర్లలో 12, దుమ్ముగూడెంలో 13, ముల్కలపల్లిలో 10, పాల్వంచలో 10, టేకులపల్లిలో 14 ఎంపీటీసీ స్థానాలు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భూపాలపల్లిలో 11, ములుగు ఘణపురంలో 10, రేగొండలో 17 స్థానాల్లో, ములుగు జిల్లాలో వాజేడులో 7, వెంకటాపురంలో 9, ఏటూరునాగారంలో 9, కన్నాయిగూడెంలో 4, సమ్మక్క–సారక్క తాడ్వాయిలో 7 స్థానాల్లో ఉదయం 7 నుంచి 4 వరకే పోలింగ్ జరగనుంది. రెండో విడతలోనూ ఈ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఇవే నిబంధనలు వర్తించనున్నాయి. -
ఎంపీటీసీలకు 439,జెడ్పీటీసీలకు 79 నామినేషన్లు
సాక్షి, హైదరాబాద్: తుది విడత పరిషత్ ఎన్నికల్లో భాగంగా ఎంపీటీసీ స్థానాలకు 439, జెడ్పీటీసీ సీట్లకు 79 నామినేషన్లు దాఖలయ్యాయి. వచ్చే నెల 14న జరగనున్న తుదిదశ ఎన్నికలకు గురువారంతో నామినేషన్ల సమర్పణ ముగియనుంది. నామినేషన్ల దాఖలు తొలిరోజు (మంగళవారం) జెడ్పీటీసీలకు.. టీఆర్ఎస్ 24, కాంగ్రెస్ 16, బీజేపీ 12, సీపీఐ 7, సీపీఎం 4, ఇండిపెండెంట్ 14 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఎంపీటీసీలకు టీఆర్ఎస్ 158, కాంగ్రెస్ 135, బీజేపీ 52, సీపీఐ 12, సీపీఎం 5, టీడీపీ 4, గుర్తింపు పొందిన, ఎస్ఈసీ వద్ద రిజిష్టరైన పార్టీలు 3, ఇండిపెండెంట్ 70 మంది నామినేషన్లు వేశారు. ఈ మూడో విడతలో భాగంగా 1,738 ఎంపీటీసీలకు, 161 జెడ్పీటీసీలకు ఎన్నికలు జరగనున్నాయి. గురువారం సాయంత్రం 5 గంటలకు నామినేషన్ల సమర్పణ ముగిశాక, శుక్రవారం సాయంత్రం 5 వరకు పరిశీలన, ఆ తర్వాత చెల్లుబాటయ్యే నామినేషన్లను ప్రకటిస్తారు. ఈ నెల 6, 10ల్లో జరిగే మొదటి, రెండు విడతల ఎన్నికలతో కలిపి, 3 విడతల్లో పడిన ఓట్లను మే 27న ఉదయం 8 తర్వాత లెక్కించి, అది ముగియగానే ఫలితాలను ప్రకటించనున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో భాగంగా బుధవారం ఒక్కరోజే నల్లగొండ జిల్లాలో రూ.64 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నా రు. వివిధ జిల్లాల్లో రూ.73,661 విలువైన మద్యాన్ని జప్తు చేశారు. ఇప్పటివరకు మొత్తం కలిపి రూ.76.40 లక్షల నగదు, రూ.17.50 లక్షల విలువైన ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన నివేదిక ఆధారంగా తెలుస్తోంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులు సమర్పించే వ్యయ ఖాతాలను కనీసం 3 సార్లు వ్యయ పరిశీలకులు తనిఖీ చేయాలన్న గత ఆదేశాలను కనీసం ఒక్కసారి పరిశీలించేలా ఎస్ఈసీ బుధవారం సవరించింది. -
రెండో విడతలో 14,670 నామినేషన్లు
సాక్షి, హైదరాబాద్: రెండో విడత పరిషత్ ఎన్నికల్లో భాగంగా మొత్తం 14,670 నామినేషన్లు దాఖల య్యాయి. ఈ విడతలో ఎన్నికలు జరగనున్న 180 జెడ్పీటీసీ స్థానాలకు 2,008 నామినేషన్లు, 1,913 ఎంపీటీసీ సీట్లలో 12,552 నామినేషన్లు సమర్పించారు. తిరస్కరణకు గురైన నామినేషన్లకు సంబం ధించి మంగళవారం జెడ్పీటీసీ అభ్యర్థులపై కలెక్టర్లు, ఎంపీటీసీ అభ్యర్థులపై ఆర్డీఓలు, సబ్ కలెక్టర్లు అప్పీళ్లను స్వీకరించిన నేపథ్యంలో బుధవారం సాయం త్రం 5 గంటలలోగా వాటిని పరిష్కరిస్తారు. మే 2న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇచ్చి, సాయంత్రం 3 గంటల తర్వా త పోటీచేసే అభ్యర్థుల తుది జాబితా విడుదల చేస్తారు.ఈనెల 10న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతాయి. పార్టీల వారీగా నామినేషన్లు... ఈ విడతలో 180 జెడ్పీటీసీ స్థానాల్లో: టీఆర్ఎస్ నుంచి 525, కాంగ్రెస్ నుంచి 482, బీజేపీ నుంచి 231, టీడీపీ నుంచి 82, సీపీఎం నుంచి 33, సీపీఐ నుంచి 27, ఎంఐఎం నుంచి 3, గుర్తింపు పొందిన ఇతర పార్టీల నుంచి 61, ఇండిపెండెంట్లు 213 మంది అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. ఎంపీటీసీ స్థానాల్లో: టీఆర్ఎస్ నుంచి 4,214, కాంగ్రెస్ నుంచి 3,175, బీజేపీ నుంచి 1,289, టీడీపీ నుంచి 266, సీపీఎం నుంచి 171, సీపీఐ నుంచి 114, ఎంఐఎం నుంచి 6, వైసీపీ నుంచి 1, గుర్తింపు పొందిన ఇతర పార్టీల నుంచి 137, ఇండిపెండెంట్లు 1,533 మంది నామినేషన్లు వేశారు. -
ప్రతిష్టాత్మకం..పరిషత్ ఎన్నికలు
బెల్లంపల్లి : పరిషత్ ఎన్నికలు టీఆర్ఎస్, కాంగ్రెస్ పక్షాలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. అసెంబ్లీ , గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మాదిరిగానే ఈఎన్నికల్లోనూ సత్తాచాటాలని టీఆర్ఎస్ తహతహలాడుతుండగా కనీసం పరిషత్ ఎన్నికల్లోనైనా నెగ్గి పరువు దక్కించుకోవాలనే కాంక్షతో కాంగ్రెస్ ముందుకు సాగుతోంది. ఆ రెండు పక్షాలు ఎన్నికల్లో విజయం సాధించడమే ప్రధాన లక్ష్యంగా పోరాడుతున్నాయి. అందులో భాగంగానే సమర్థులైన అభ్యర్థులను పోటీలోదింపి ప్రచార పర్వం సాగిస్తున్నాయి. అయితే మారిన పరిణామాలతో ప్రతీచోట ఎన్నిక ఏ ఒక్కరాజకీయ పార్టీకి అంత ఈజీగా లేకపోవడంతో చెమటోడ్చాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎక్కడా ఏకపక్షంగా ఏ పార్టీ అభ్యర్థికి విజయావకాశాలు కానరావడం లేదు. ఈ తీరు ఆయాపక్షాల అభ్యర్థుల్లో గుబులు పుట్టిస్తోంది. పోటీలో ఈసారి ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఉండటంతో ఎన్నికలు రసవత్తరంగా జరుగనున్నాయి. ఎన్నికల్లో గెలుపు సాధించడమే ప్రధాన కర్తవ్యంగా రెండు ప్రధాన పక్షాలు ముందుకు సాగుతుండటంతో ఓటర్ల ఆదరణ ఎవరికి ఉంటుందనేది ఆసక్తికరంగా ఉంది. అసెంబ్లీ నియోజకవర్గంలో... బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు తొలిదఫాలో జరగనున్నాయి. ఇందుకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ గడువు ఆదివారంతో ముగిసింది. నియోజకవర్గంలోని 7 జెడ్పీటీసీ స్థానాలకు ఏకంగా 27 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. తాండూర్, కన్నెపల్లి జెడ్పీటీసీ సా ్థనాల్లో ఆరుగురు అభ్యర్థులు, కాసిపేటలో నలుగురు అభ్యర్థులు, నెన్నెల , భీమిని, బెల్లంపల్లి మండలాల్లో ముగ్గురు అభ్యర్థుల చొప్పున పోటీకి సిద్ధమయ్యారు. వేమనపల్లి మండలంలో మా త్రం ఇద్దరు అభ్యర్థుల మధ్య పోటీ జరుగుతోంది. ఏకగ్రీవానికి ‘నై’ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలకు ప్రాధాన్యత ఇవ్వగా పరిషత్ ఎన్నికల్లో మాత్రం ఆ పాచిక ఎక్కడా సరిగా పారలేదు. ప్రతీచోట పోటీ చేయడానికే ఔత్సాహిక అభ్యర్థులు మరీ ముఖ్యంగా యువకులు ఆసక్తి చూపించారు. రిజర్వేషన్ ప్రాతిపదికన మహిళలు కూడా అధికసంఖ్యలోనే పోటీలో ఉన్నారు. ఓ ప్రధానరాజకీయ పార్టీ అక్కడక్కడ తమ అభ్యర్థులు ఏకగ్రీవం కావడానికి ఆదిలో పావులు కదిపినా ప్రయోజనం లేకుండా పోయింది. అన్నిచోట్ల కూడా పోటీకీ అభ్యర్థులు సిద్ధపడటం, ప్రలోభాలకు ఆకర్షితులు కాకపోవడంతో పోటీ అనివార్యమైంది. కాగా ఎన్నికల ప్రచారపర్వం మరో రెండు, మూడురోజుల్లో ఊపందుకునే అవకాశాలు ఉన్నాయి. ఎంపీటీసీ బరిలో 166 మంది 47 ఎంపీటీసీ స్థానాల్లో 166 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. కాసిపేట మండలంలో ఉన్న 9 స్థానాల్లో అత్యధికంగా 42 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా తాండూర్లోని 9 స్థానాలకు 39 మంది, బెల్లంపల్లిలోని 8 స్థానాలకు 26 మంది, నెన్నెలలో 7స్థానాలకు 19 మంది. కన్నెపల్లిలో 5 స్థానాలకు 18 మంది, వేమనపల్లిలో 5 స్థానాలకు 14 మంది పోటీలో ఉన్నారు. భీమిని మండలంలో 4 స్థానాలు ఉండగా 8 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. చిన్నగుడిపేట ఎంపీటీసీ స్థానం ఏకగ్రీవమైంది. ఇక్కడ ఐదుగురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయగా ఆఖరిరోజు నలుగురు అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. అయితే సదరు అభ్యర్థి ఎన్నికను ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఆ ఒక్కస్థానంలో మినహా ఇతర అన్ని జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో హోరాహోరీగా పోటీ కనిపిస్తోంది. -
డుమ్మా కొడితే పదవులకు గండమే!
సాక్షి, హైదరాబాద్: జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్లు మొదలుకొని ఎంపీటీసీ సభ్యుల వరకు అధికారాలతోపాటు విధులు, బాధ్యతలను కొత్త పంచాయతీరాజ్ చట్టంలో ప్రభుత్వం నిర్దేశించింది. కొత్త సభ్యులు విధులు సక్రమంగా నిర్వహించేలా చట్టంలో ఆయా అంశాలను పొందుపర్చారు. పాలకవర్గాలు ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించేలా కట్టుదిట్టమైన నిబంధనలను విధించారు. మూడు విడతల్లో జరగనున్న పరిషత్ ఎన్నికల నేపథ్యంలో కొత్తగా ఎన్నికయ్యే జిల్లా, మండల పరిషత్ సభ్యులకు కొత్త చట్టం ప్రకారం వివిధ నిబంధనలు అమల్లోకి రానుండడంతో వాటికి ప్రాధాన్యం ఏర్పడింది. మండలాధ్యక్షుల బాధ్యతలు... కొత్తచట్టంలో ఎంపీపీ అధ్యక్షులపై మరిన్ని బాధ్యతలను పెట్టారు. నిర్లక్ష్యం చేసేవారిపై చర్యలతో పాటు కొన్ని పరిమితులు కూడా విధించింది. మండల ప్రజా పరిషత్ తీర్మానాలను అమలు చేసేలా ఎంపీడీవోలపై పరిపాలనాపరమైన నియంత్రణాధికారాన్ని ఉపయోగించే అవకాశం ఎంపీపీలకు కల్పించారు. సర్వసభ్య సమావేశాలకు అధ్యక్షత వహించడం, ప్రజా పరిషత్ రికార్డుల పర్యవేక్షణపై పూర్తి హక్కులు కల్పించారు. వరదలు, అగ్ని ప్రమాదాలు, భూకంపాలు, అంటు వ్యాధులు ప్రబలడం, తాగునీటి సరఫరా నిలిచిపోవడం వంటి అత్యవసర పరిస్థితుల్లో అధ్యక్షులు సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం, సంబంధిత అధికారులు, ఎంపీడీవోలతో చర్చించి, ప్రజల సేవ, భద్రత నిమిత్తం అత్యవసర పనుల నిర్వహణకుగాను ఎంపీపీలకు అధికారాలిచ్చారు. అత్యవసర పనులు నిర్వహించాక, వాటిని సర్వసభ్య సమావేశాల్లో మండల పరిషత్‌కు తప్పనిసరిగా సమర్పించాలి. అయితే, ప్రభుత్వ నిబంధనలు, ఉత్తర్వులను ఉల్లంఘించే నిర్మాణపు పనులు, ఇతర పనుల కోసం అధికారులపై ఒత్తిడి తేవడం, ఆదేశాలిచ్చే విషయంలో ఎంపీపీలపై ఆంక్షలు విధించారు. 15 రోజులు రాకుంటే... జడ్పీ చైర్పర్సన్లు, ఎంపీపీ అధ్యక్షులు వరసగా 15 రోజులపాటు జడ్పీ, మండల కార్యాలయానికి రాకపోతే వారిని విధుల్లోంచి తప్పించే నిబంధన విధించారు. ఆ విధంగా విధులకు హాజరుకాని జడ్పీ చైర్పర్సన్ స్థానంలో వైస్చైర్మన్లకు బాధ్యతలు అప్పగించాల్సి ఉంటుంది. ఎంపీపీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు 15 రోజులు వరుసగా ఆఫీసులకు రాకపోతే సంబంధిత ఎంపీడీవోలు ఆ బాధ్యతలను నిర్వహించాల్సి ఉంటుంది. ఎంపీపీల పరిధిలో జరిగే పనుల్లో నిర్లక్ష్యం, ఆస్తుల నష్టం వంటి అంశాలపై సంబంధిత అధికారులకు తెలియజేయాల్సిన బాధ్యత ఎంపీపీ అధ్యక్షులు, ఎంపీటీసీ సభ్యులపైనే ఉంటుంది. ఈ విషయంలో వారు ప్రత్యక్షంగా చర్యలు తీసుకునే అధికారం లేదు. మండల పరిషత్‌కు వచ్చిన నిధులన్నీ పరిషత్ నిధిగా ఏర్పాటు చేసి, అందరి ఆమోదంతో వినియోగించాలి. వచ్చిన నిధులను ప్రభుత్వ ఖజానాలోనే జమ చేయాలి. ఉద్యోగ భద్రత పథకం, ఇతర వేతనాలు, ఉపాధి నిధులను జాతీయ బ్యాంకులు, సహకార బ్యాంకులు, పోస్ట్ ఆఫీసుల్లో జమ చేసేలా కొత్త పీఆర్ చట్టం నిబంధనల్లో పొందుపరిచారు. పెరిగిన ఎంపీటీసీల భాగస్వామ్యం... గ్రామ పంచాయతీల్లో ఎంపీటీసీల భాగస్వామ్యం పెరగనుంది. ప్రతి ఐదేళ్లకు గ్రామ పంచాయతీ దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళిక, వార్షిక ప్రణాళికను ఎంపీటీసీ సభ్యులు ఆమోదించాలి. తమ నియోజకవర్గం పరిధిలోని ప్రజల్లో స్వయం సహాయçస్ఫూర్తిని, చొరవను పెంపొందించడం, జీవన ప్రమాణాలు పెంచడంలో పరిషత్ సభ్యులు కీలకపాత్ర పోషించాల్సి ఉంటుంది. గ్రామ పంచాయతీల పన్నువిధానాల్లో మార్పులు తీసుకువచ్చే అధికారం పరిషత్ సభ్యులకు కల్పించారు. మండలం, జిల్లా, ఇతర విధానాల ద్వారా గ్రామ పంచాయతీలకు అందే నిధులతోపాటు నేరుగా గ్రామపంచాయతీ పన్నులను వసూలు చేసే బాధ్యతలను పరిషత్ సభ్యులకు అప్పగిస్తారు. భూమి సెస్సు, స్థానిక సెస్సులను గరిష్ట పరిమితికి లోబడి, సర్‌చార్జ్ రూపంలో పన్నులను విధించే అధికారం పరిషత్ సభ్యులకు ఉంటుంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పంచాయతీ కార్మిక బడ్జెట్ ప్రణాళికలను ఆమోదించడం, పనుల పర్యవేక్షణ ఇకపై ఎంపీటీసీ సభ్యులు నిర్వహించవచ్చు. వయోజన విద్య కార్యక్రమాల పర్యవేక్షణ, ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ కార్యకలాపాల అమలు, స్వయం సహాయక బృందాలతో స్వయం ఉపాధి, జీవనోపాధి పథకాలు, బ్యాంకులతో అనుసంధానం వంటి వాటిని పరిషత్ సభ్యులే నిర్వహించాల్సి ఉంటుంది. గ్రామాల్లో రక్షిత మంచినీటి పథకాన్ని నిర్వహించే అధికారం పరిషత్ సభ్యులకు కల్పించారు. ఇందు కోసం ఏదైనా సంస్థతో నిర్వహణ ఒప్పందం, నిర్మాణ పనుల అమలు, నిర్వహణ వీరి ప్రత్యేకమైన బాధ్యత. ప్రభుత్వ వైద్యశాలలు, శిశు సంక్షేమ కేంద్రాల నిర్వహణ అధికారం ఎంపీటీసీలకే కల్పించారు. -
ఏకగ్రీవం కావాలి
సాక్షి, హైదరాబాద్: జిల్లా, మండల పరిషత్ ఎన్నికలను టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. మొత్తం 32 జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవులను కచ్చితంగా గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎంపీపీల విషయంలోనూ ఇదే వ్యూహంతో ఉంది. ఎన్నికలు జరుగుతున్న అన్ని స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆ పార్టీ ఎమ్మెల్యేలను ఆదేశించారు. ప్రతి స్థానంలోనూ టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పరిషత్ ఎన్నికల రెండోదశ నామినేషన్ దాఖలు ప్రక్రియ ముగుస్తున్న నేపథ్యంలో పలువురు ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్లో మాట్లాడారు. జిల్లా పరిషత్ చైర్మన్లుగా పలువురు సీనియర్ నేతలకు అవకాశం ఇస్తున్నామని, వారి గెలుపు బాధ్యతను స్వయంగా చూడాలని ఆదేశించారు. టీఆర్ఎస్లోని సీనియర్ నేతలు కొందరికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాలేదని, అలాంటి వారికి పార్టీ ఇప్పుడు జెడ్పీ చైర్పర్సన్ పదవిని ఇవ్వాలని నిర్ణయించిందని చెప్పారు. జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థుల గెలుపు విషయంలో ఎమ్మెల్యేలు అంతా తామై వ్యవహరించాలని సూచించారు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీ ఎన్నికల విషయంలో అవకాశం ఉన్న ప్రతి స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా చూడాలని ఆదేశించారు. స్వయంగా రంగంలోకి దిగండి... మొదటిదశ ఎన్నికలు జరుగుతున్న 197 జెడ్పీటీసీ, 2,166 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొదటిదశ ఎన్నికల నామినేషన్ ఉపసంహరణ గడువు ఆదివారంతో ముగిసింది. అయితే టీఆర్ఎస్ అభ్యర్థులు ఆశించిన సంఖ్యలో ఏకగ్రీవంగా ఎన్నిక కాలేదనే అభిప్రాయంతో ఆ పార్టీ అధిష్టానం ఉంది. రెండుమూడు అసెంబ్లీ సెగ్మెంట్లు మినహా అన్ని చోట్ల ప్రతిపక్షాల అభ్యర్థులు పోటీలో ఉంటున్నారని గుర్తించింది. దీనిపై టీఆర్ఎస్ అధిష్టానం పలువురు ఎమ్మెల్యేలకు సూచనలు చేసింది. రెండు, మూడో దశల్లో అయినా స్వయంగా రంగంలోకి దిగి ఏకగ్రీవంగా టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచేలా చూడాలని ఆదేశించింది. రెండోదశలో 180 జెడ్పీటీసీ, 1,913 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆదివారం రెండోదశ నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసింది. టీఆర్ఎస్ అధిష్టానం ఆదేశాలతో పలువురు ఎమ్మెల్యేలు రంగంలోకి దిగి ఏకగ్రీవ ఎన్నిక కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసే క్రమంలో అనుసంధానంగా ఉండే పరిషత్ వ్యవస్థలపై పూర్తి ఆధిప్యతం ఉండాలని టీఆర్ఎస్ భావిస్తోంది. రాష్ట్రంలో 538 జెడ్పీటీసీ, 5,817 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. అన్ని స్థానాల్లో కచ్చితంగా తమ అభ్యర్థులను గెలిపించుకుంటే ప్రభుత్వ లక్ష్యాలు ప్రజలకు వేగంగా చేరుతాయని భావిస్తోంది. దీంతో అన్ని స్థానాల్లోనూ గెలుపే లక్ష్యంగా టీఆర్ఎస్ వ్యూహం అమలు చేస్తోంది. -
తొలి విడత ప్రచారం షురూ!
సాక్షి, హైదరాబాద్: తొలివిడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితా ప్రచురణతో రాజకీయ పార్టీలు, స్వతంత్రుల గుర్తుల వారీగా బ్యాలెట్ పేపర్ల ముద్రణలో అధికారులు నిమగ్నమయ్యారు. ఆదివారం సాయంత్రం 5 గంటల తర్వాత బరిలో నిలిచిన అభ్యర్థులు, వారికి కేటాయించిన గుర్తులను రిటర్నింగ్ అధికారులు ఖరారు చేసి, అభ్యర్థుల జాబితాలు ప్రకటించారు. వచ్చేనెల 6న 197 జెడ్పీటీసీ, 2,166 ఎంపీటీసీ స్థానాలకు మొదటి విడత ఎన్నికలుండడంతో రాజకీయ పార్టీల గుర్తులతో బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్నకు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు లేదా నాలుగు రోజుల్లోనే వీటి ముద్రణ పూర్తిచేసి, పోలింగ్‌కు సంబంధించి ఏర్పాట్లు చేపట్టాల్సి ఉంది. ఈ విడత ఎన్నికల ప్రచారం కూడా ఆదివారం సాయంత్రం నుంచే మొదలైంది. నేడు రెండో విడత నామినేషన్ల పరిశీలన రెండోదశ పరిషత్ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ఆదివారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. సోమవారం సాయంత్రం 5 వరకు నామినేషన్లను పరిశీలించి, 5 గంటల తర్వాత చెల్లుబాటయ్యే నామినేషన్ల జాబితా సిద్ధం చేస్తారు. తిరస్కరణకు గురైన నామినేషన్లపై మంగళవారం సాయంత్రం 5 గంటలలోగా అప్పీలు చేసుకోవాలి. మే1న సాయంత్రం 5లో గా వాటిని పరిష్కరిస్తారు. 2న నామినేషన్ల ఉపసం హరణ గడువు ముగిశాక, అదేరోజుసాయంత్రం పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. వచ్చేనెల 10న రెండో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. శనివారం వరకు 1,913 ఎంపీటీసీ స్థానాలకు 4, 652, 180 జెడ్పీటీసీ స్థానాలకు 660 నామినేషన్లు దాఖలయ్యాయి. రెండోదశకు నామినేషన్ల ప్రక్రియ ఆఖరు రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. -
‘పరిషత్’ ప్రచారానికి వేళాయె!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పరిషత్ ఎన్నికల ప్రచారానికి వేళైంది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల తర్వాత జిల్లా, మండల స్థాయిల్లో ఎన్నికల ప్రచారంతో వేడి పుట్టించేందుకు రాజకీయ పార్టీలు సిద్ధమయ్యాయి. రాజకీయ పార్టీల ఎన్నికల చిహ్నాలతో, ఆ పార్టీలు అధికారికంగా పోటీకి నిలిపే అభ్యర్థులతో ప్రచారానికి రంగం సిద్ధమైంది. వచ్చే నెల 6న తొలి విడత ఎన్నికల నేపథ్యంలో, ఆ విడతలో బరిలో నిలిచే తుది అభ్యర్థుల జాబితాను ఆదివారం సాయంత్రం 5 గంటల తర్వాత ప్రకటించనున్నారు. అలాగే గుర్తులు కూడా కేటాయిస్తారు. తొలి విడత ప్రచారం మే 4వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. తొలి విడత ప్రచారం నేపథ్యంలో ఎస్ఈసీ మార్గదర్శకాలను విడుదల చేసింది. కాగా జిల్లా ఎన్నికల అధికారులు, జనరల్ అబ్జర్వర్ల విచారణ తర్వాతే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఏకగ్రీవాలపై ప్రకటన చేయాలని స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే... అభ్యర్థులను బెదిరించినా, ఎత్తుకెళ్లినా... ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తూ దొరికినా ఏడాది జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశాలున్నట్లు ఎస్ఈసీ స్పష్టం చేసింది. ఈ అక్రమ పద్ధతుల్లో గెలిచిన వారిని పదవి నుంచి తొలగించడంతోపాటు ఆరేళ్లు ఎలాంటి పదవులకు పోటీ చేయకుండా అనర్హత వేటు వేస్తామని హెచ్చరించింది. ఎన్నికల ప్రచారంలో దేవాలయాలు, మసీదులు, చర్చిలు, ఇతర ప్రార్థనా స్థలాలను ఎన్నికల ప్రచార, చర్చా వేదికలుగా ఉపయోగించడం, ఇతరులను రెచ్చగొట్టేలా మాట్లాడితే చర్యలు తీసుకునే అధికారాన్ని స్థానిక అధికారులకు కల్పించారు. అభ్యర్థుల తుది జాబితాను తెలుగు అక్షరమాల క్రమంలో రిటర్నింగ్ అధికారులు ప్రకటిస్తారు. పోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితాలో తెలుగు అక్షరమాల ప్రకారం మొదటి వ్యక్తికి ఎన్నికల కమిషన్ ప్రకటించిన గుర్తుల్లో మొదటి గుర్తును, రెండో అభ్యర్థికి రెండో గుర్తును కేటాయిస్తారు. ఒకవేళ బరిలో నిలిచే అభ్యర్థుల్లో ఇద్దరి పేర్లు ఒకేలా ఉంటే నామినేషన్ సంఖ్య ఆధారంగా గుర్తులను కేటాయించేందుకు నిర్ణయం తీసుకున్నారు. వేలం వేస్తే వేటే... ఏకగ్రీవాల కోసం వేలం వేసి ఓటర్లను కొనుగోలు చేయడం, ప్రలోభాలకు గురిచేయడం, అభివృద్ధి సాధన కోసం అంటూ ఆయా పోస్టులను వేలం వేస్తే జైలు, జరిమానా, అనర్హత వేటు వేసే అధికారం ఎస్ఈసీకి ఉంది. ఏకగ్రీవాలను వెంటనే ప్రకటించకుండా విచారణ చేయాలని నిర్ణయించిన విషయాన్ని ఎస్ఈసీ పేర్కొంది. గతంలో ఏకగ్రీవాలను రిటర్నింగ్ అధికారులే ప్రకటించేవారు. కానీ ఈ సారి ఏకగ్రీవమైనట్లుగా దరఖాస్తు చేసుకోవాలని, దాన్ని జిల్లా కలెక్టర్ లేదా ఎన్నికల అధికారి లేదా జనరల్ పరిశీలకులు విచారణ చేసి, ఆ తర్వాత జిల్లా కలెక్టరే ప్రకటిస్తారంది. విచారణలో అనైతిక వ్యవహారాలు, డబ్బు ప్రభావం వంటివి బయటకు వస్తే... రద్దు చేసే అధికారం కలెక్టర్‌కు కల్పించారు. -
తొలి విడత జెడ్పీటీసీలకు 2,104 నామినేషన్లు
సాక్షి, హైదరాబాద్: తొలి విడత మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో భాగం గా 197 జెడ్పీటీసీ స్థానా లకు 2,104 నామినేషన్లు, 2,166 ఎంపీటీసీ స్థానాలకు 15,036 నామినేషన్లు దాఖల య్యాయి. బుధవారంతో తొలి దశ నామినేషన్ల దాఖలు గడువు ముగిసింది. జెడ్పీటీసీ సీట్లలో టీఆర్ఎస్ నుంచి 748, కాంగ్రెస్ నుంచి 551, బీజేపీ నుంచి 276, టీడీపీ నుంచి 80, సీపీఎం నుంచి 66, సీపీఐ నుంచి 34, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి 3, ఇండిపెండెంట్లు 301, ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన, రాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్ద రిజిష్టర్ అయిన రాజకీయపార్టీల నుంచి 45 మంది అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. ఎంపీటీసీ స్థానాల్లో టీఆర్ఎస్ నుంచి 5,762 మంది, కాంగ్రెస్ నుంచి 4,178, బీజేపీ నుంచి 1,576, సీపీఎం నుంచి 284, టీడీపీ నుంచి 227, సీపీఐ నుంచి 182, ఎంఐఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల నుంచి చెరొకరు, ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన, రాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్ద రిజిష్టర్ అయిన రాజకీయ పా-ర్టీల నుంచి 113 మంది, 2,712 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. -
ప్రభుత్వ వాహనాలను వాడొద్దు..
సాక్షి, హైదరాబాద్: జిల్లా, మండల పరిషత్ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ వాహనాలను వినియోగించే విషయంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను విడుదల చేసింది. సీఎంతో పాటు మావోయిస్టులతో ప్రాణ హాని ఉన్న రాజకీయవేత్తలకు మాత్రమే వాడేలా నిబంధనలు రూపొందించింది. ఎన్నికల ప్రక్రియ స్వేచ్ఛగా, తటస్థంగా జరిగేందుకు వీలుగా ప్రభుత్వ వాహనాలను వారు తప్ప ఇంకెవరూ వాడకూడదని తాత్కాలికంగా నిషేధం విధించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు, జాయింట్ సెక్టార్ అండర్‌టేకింగ్స్, స్థానిక సంస్థలు, జిల్లా ప్రజా పరిషత్‌లు/మండల ప్రజాపరిషత్‌లు, మార్కెటింగ్ బోర్డులు, సహకార సంఘాలు, స్వయం ప్రతిపత్తి గల జిల్లా కౌన్సిలర్లకు చెందిన ట్రక్కులు, లారీలు, టెంపోలు, జీప్‌లు, కార్లు, రిక్షాలు, బస్సులు వేటిని కూడా ప్రచారానికి వినియోగించకూడదని స్పష్టం చేసింది. కేంద్ర,రాష్ట్ర మంత్రులు సహా ఈ సంస్థలకు చెందిన ఏ ఒక్కరు కూడా ఈ వాహనాలను అధికారిక పర్యటనల నెపంతో కానీ, డబ్బు చెల్లించి కానీ ప్రచారానికి, ఎన్నికల పర్యటనలకు వినియోగించడాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు వెల్లడించింది. పోలింగ్ ముగిసే వరకు ఈ వాహనాల వినియోగంపై జిల్లా అధికార యంత్రాంగం, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, అవి దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ నిబంధనలను అభ్యర్థులు లేదా రాజకీయ పార్టీలు ఉల్లంఘిస్తే ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణిస్తుందని తెలిపింది. అనుమతి తీసుకోవాలిలా.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారం కోసం వినియోగించే వాహనాలకు అనుమతులను సబ్ కలెక్టర్/ఆర్డీవో నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే రాష్ట్ర స్థాయి నేతలు (స్టార్ క్యాంపెయినర్లు) మాత్రం ప్రచార వాహనాల కోసం అనుమతులను పంచాయతీరాజ్ కమిషనర్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. గురువారం ఈ మేరకు పీఆర్ కమిషనర్‌కు ఎస్ఈసీ కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్ లేఖ రాశా రు. గతంలో పోటీచేసిన అభ్యర్థులు, రాజకీయ పార్టీలకు ఎన్నికల ప్రచారం కోసం వాహనాల అనుమతి అధికారం ఆర్డీవోలకు ఉండగా తాజాగా దాన్ని మార్చేశారు. రాష్ట్ర స్థాయి రాజకీయ పార్టీల నేతలు ఆర్డీవో వద్ద వాహనాల అనుమతి తీసుకోవడం సాధ్యం కాదని ఈ మేరకు మార్పులు చేశారు. -
ముఖ్యులు... బంధువులు
సాక్షి, హైదరాబాద్: జిల్లా పరిషత్ చైర్మన్ పదవుల కోసం టీఆర్ఎస్లో పోటీ తీవ్రంగా ఉంది. పలువురు సీనియర్ నేతలు, మాజీ ప్రజా ప్రతినిధులు ఈ పదవి కోసం పోటీ పడుతున్నారు. అనుకూల రిజర్వేషన్లున్న చోట పలువురు మంత్రులు, ఎమ్మెల్యేల బంధువులు సైతం ప్రయత్నాలు చేస్తున్నారు. జెడ్పీటీసీలుగా పోటీలోకి దిగుతున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపికపై టీఆర్ఎస్ అధిష్టానం ఎమ్మెల్యేలకు, నియోజక వర్గ ఇన్‌చార్జీలకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. దీంతో ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ ఇన్చార్జులు జెడ్పీ చైర్మన్ పదవే లక్ష్యంగా బీ ఫారాలను పంపిణీ చేస్తున్నారు. పలువురు ఎమ్మెల్యేలు తమ ఇంట్లోని వారినే జెడ్పీటీసీలుగా పోటీ చేయిస్తున్నారు. జెడ్పీ చైర్మన్ పదవి రాకున్నా.. నియోజకవర్గంలో తమ తరఫున పార్టీ వ్యవహారాలను చక్కబెడతారనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నారని తెలుస్తోంది. మరికొందరు టీఆర్ఎస్ సీనియర్ నేతలు అధిష్టానం ఆమోదంతో జెడ్పీటీసీలుగా పోటీలోకి దిగుతున్నారు. టీఆర్ఎస్లో మొదటి నుంచి పని చేస్తున్న వారికి, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాని వారికి టీఆర్ఎస్ అధిష్టానం కొన్ని చోట్ల అవకాశం కల్పిస్తోంది. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు బలంగా ఉన్న స్థానాల్లోని టీఆర్ఎస్ నేతలకు అధికారికంగా పదవి ఇచ్చి అక్కడ పార్టీని బలోపేతం చేసే దిశగానూ వ్యూహం అమలు చేస్తోంది. పరిషత్ ఎన్నికల్లో తొలిదశ నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో పలువురు ముఖ్యులు జెడ్పీ చైర్మన్ పదవి కైవసం చేసుకోవడమే లక్ష్యంగా జెడ్పీటీసీలుగా పోటీ చేస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే కోవా లక్ష్మికి, పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్‌గా మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకు అవకాశం ఇస్తున్నట్లు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. వీరిద్దరూ 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. 2018 ఎన్నికల్లో ఓడారు. దీంతో వీరికి మళ్లీ అవకాశం ఇవ్వాలని టీఆర్ఎస్ అధినేత నిర్ణయించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా చైర్పర్సన్ తుల ఉమకు ఈసారి జగిత్యాల జిల్లా పరిషత్ చైర్మన్‌గా టీఆర్ఎస్ అధిష్టానం అవకాశమివ్వాలని భావిస్తోంది. తుల ఉమ కథలాపూర్‌లో పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నల్లగొండ జిల్లా పరిషత్ చైర్మన్‌గా బండ నరేందర్‌రెడ్డికి అవకాశం ఇస్తున్నట్లు కేసీఆర్ ఆయనకు చెప్పినట్లు తెలిసింది. యాదాద్రి భువనగిరి జిల్లా చైర్మన్ పదవిని ఎలిమినేటి సందీప్‌రెడ్డికి, సూర్యాపేట జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌గా కోదాడ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జి కె.శశిధర్‌రెడ్డి భార్యకు అవకాశం ఇవ్వాలని టీఆర్ఎస్ అధిష్టానం యోచిస్తోంది. అయితే వీరిద్దరూ పోటీకి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ పదవి లింగాల కమల్‌రాజ్‌కు దక్కే అవకాశం కనిపిస్తోంది. కమల్‌రాజ్ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మధిర నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మరో నేత మట్టా దయానంద్ సైతం ఈ పదవిని ఆశించారు. అయితే జెడ్పీటీసీగా పోటీ చేసేందుకు గ్రామీణ ప్రాంతంలో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకుంటే అవకాశం రాలేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోసం మాజీ ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారు. ఇల్లెందు మాజీ ఎమ్మెలే కోరం కనకయ్య టేకులపల్లి జెడ్పీటీసీగా నామినేషన్ దాఖలు చేశారు. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు జెడ్పీ చైర్మన్ పదవే లక్ష్యంగా జెడ్పీటీసీగా పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్‌కు రెండోసారి చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్న పట్నం సునీతా మహేందర్‌రెడ్డికి ఈ సారి వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్‌గా టీఆర్ఎస్ అధిష్టానం అవకాశం కల్పిస్తోంది. సునీతా మహేందర్‌రెడ్డి ప్రస్తుతం తాండూరు నియోజకవర్గం కోట్‌పల్లి జెడ్పీటీసీ పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. సునీతారెడ్డి భర్త పట్నం మహేందర్‌రెడ్డి గత ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. తాండూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. రంగారెడ్డి జెడ్పీ చైర్పర్సన్ పదవి సైతం ఈసారి జనరల్ మహిళకు రిజర్వు అయ్యింది. మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కోడలు అనిత ఈ పదవే లక్ష్యంగా మహేశ్వరం జెడ్పీటీసీగా పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇటు పట్నం మహేందర్‌రెడ్డి అన్న కుమారుడు పట్నం అవినాశ్‌రెడ్డి రంగారెడ్డి జెడ్పీ పరిధిలోని షాబాద్ జెడ్పీటీసీగా పోటీ చేసేందుకు బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. రంగారెడ్డి జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ పదవిని ఆశిస్తున్నారు. మేడ్చల్ జెడ్పీ చైర్మన్ పదవి కోసం కీలక నేతల బంధువులు పోటీలోకి దిగారు. మంత్రి చామకూర మల్లారెడ్డి సమీప బంధువు ఎం.శ్రీనివాస్‌రెడ్డి మూడుచింతలపల్లి మండలం జెడ్పీటీసీగా పోటీ చేస్తున్నారు. ఎం.శ్రీనివాస్‌రెడ్డి భార్య సైతం ఇదే స్థానంలో నామినేషన్ దాఖలు చేశారు. మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే ఎం.సుధీర్‌రెడ్డి కుమారుడు శరత్‌చంద్రారెడ్డి ఘట్కేసర్ నుంచి పోటీ చేస్తున్నారు. వరంగల్ రూరల్ జిల్లా జెడ్పీ చైర్మన్ పదవి లక్ష్యంగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సతీమణి జ్యోతి నామినేషన దాఖలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. భూపా లపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లోని శాయంపేట జెడ్పీటీసీగా జ్యోతి పోటీ చేయనున్నారు. మహబూబ్‌నగర్‌లో సుధాకర్‌రెడ్డికి.. మహబూబ్‌నగర్ జెడ్పీ చైర్పర్సన్ పదవి మాజీ ఎమ్మెల్యే స్వర్ణా సుధాకర్‌రెడ్డికి దక్కే అవకాశాలున్నాయి. భూత్పూరు మండలం జెడ్పీటీసీ అభ్యర్థి గా ఆయన బుధవారం నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యే వెంకటేశ్వర్రెడ్డి్డ పాల్గొన్నారు. దీంతో ఆయనకీ పదవిని ఖాయం చేసినట్లు తెలుస్తోంది. నిజామాబాద్‌లో ఎవరికో.. నిజామాబాద్ జెడ్పీ చైర్మన్ పదవిని టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి దాదన్న గారి విఠల్‌రావుకు కేటాయించే అవకాశముంది. ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కొడుకు జగన్ చైర్మన్ పదవే లక్ష్యంగా ధర్పల్లి జెడ్పీటీసీగా పోటీ చేస్తున్నారు.్ల స్పీకర్ పోచారం కుమారుడు సురేందర్‌రెడ్డి చైర్మన్ పదవిని ఆశిస్తూ కోటగిరి నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతు న్నారు. కామారెడ్డి జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌గా.. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా జెడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు భార్యకు అవకాశం ఇచ్చే అంశాన్ని టీఆర్ఎస్ అధిష్టానం పరిశీలిస్తోంది. మంచిర్యాలలో ఓదేలు సతీమణికి..A మంచిర్యాల జెడ్పీ చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే నల్లా ల ఓదెలు భార్య భాగ్యలక్ష్మికి అవకాశం ఇవ్వాలని టీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయించింది. ఆదిలాబా ద్ జెడ్పీ చైర్మన్‌గా అనిల్‌జాదవ్‌కు అవకాశం ఇవ్వా లని నిర్ణయించినట్లు తెలిసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జెడ్పీ చైర్మన్ శోభారాణికి నిర్మల్ జెడ్పీ చైర్మన్‌గా అవకాశమివ్వాలని పార్టీ భావిస్తోంది. -
రెండోరోజు ‘జెడ్పీటీసీ’కి 154 నామినేషన్లు
సాక్షి, హైదరాబాద్: తొలివిడత పరిషత్ ఎన్నికలకు సంబంధించి మంగళవారం ఎంపీటీసీ స్థానాలకు 1,278, జెడ్పీటీసీ స్థానాలకు 154 నామినేషన్లు దాఖలయ్యాయి. బుధవారంతో మొదటి దశ ఎన్నికల నామినేషన్ల సమర్పణ ప్రక్రియ ముగియనుంది. నామినేషన్ల దాఖలు మొదలైన సోమవారం జెడ్పీటీసీలకు 91, ఎంపీటీసీలకు 665 నామినేషన్ పత్రాలను సమర్పించిన విష యం తెలిసిందే. మే 6న జరగనున్న మొదటి విడత ఎన్నికల్లో 195 మండలాల్లోని 197 జెడ్పీటీసీ సీట్లకు, 2,166 ఎంపీటీసీ సీట్లకు అభ్యర్థులు పోటీపడుతున్నారు. మంగళవారం 1,248 మం ది ఎంపీటీసీ అభ్యర్థులు, 1,278 నామినేషన్లు, 147 మంది జెడ్పీటీసీ అభ్యర్థులు, 154 నామినేషన్లు సమర్పించారు. సంగారెడ్డి జిల్లాలో 9 జెడ్పీటీసీ స్థానాలకు 15మంది అభ్యర్థులు 16 నామినేషన్లు, నల్లగొండ జిల్లాలో 10 స్థానాలకు 11 మంది 11 నామినేషన్లు, పెద్దపల్లిలో 7 స్థానాలకు 9 మంది, 10 నామినేషన్లు దాఖలు చేశారు. సంగారెడ్డి జిల్లాలోని 9 మండలాల్లోని 103 ఎంపీటీసీ స్థానాలకు 135 మంది అభ్యర్థులు 138 నామినేషన్లు, నల్లగొండ జిల్లా 10 మండలాల్లోని 109 ఎంపీటీసీలకు 96 అభ్యర్థులు, 97 నామినేషన్లు వేశారు. -
ఎస్ఈసీ ఆఫీసులో గ్రీవెన్స్ సెల్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) ప్రధాన కార్యాలయంలో ప్రత్యేకంగా ఫిర్యాదుల (కంప్లెయింట్స్, గ్రీవెన్స్ సెల్) విభాగాన్ని ఏర్పాటు చేశారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా అభ్యర్థులు, రాజకీయ పార్టీల ఫిర్యాదులు, సందేహాల నమోదుకు దీనిని ఏర్పాటు చేసినట్లు ఎస్ఈసీ కార్య దర్శి అశోక్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నేపథ్యంలో ఈ సెల్ 24 గంటలు పని చేస్తుందని పేర్కొన్నారు. అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఎన్నికలకు సంబంధించిన సందేహాల నివృత్తికి, ఫిర్యాదుల నమోదుకు 040–29802895, 040–29802897 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
ఆడా ఉంటా.. ఈడా ఉంటా
సాక్షి, హైదరాబాద్: పరిషత్ ఎన్నికల నేపథ్యంలో పలువురు నేతలు మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి నేతలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) నిబంధనలు ఆయాచిత వరంగా కలిసి వస్తున్నాయి. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే వరకు ఆయా ప్రాదేశిక నియోజకవర్గాల్లో ఓటర్లుగా నమోదైన వారికి పరిషత్ బరిలో పోటీకి ఎస్ఈసీ నిబంధనలు అవకాశం కల్పిస్తున్నాయి. గతంలో జీహెచ్ఎంసీ, ఇతర కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో కార్పొరేటర్లుగా, కౌన్సెలర్లుగా బరిలో దిగిన వారితోసహా వివిధ మున్సిపాలిటీలలో పోటీచేసి మున్సిపల్ చైర్మన్ పదవులు అనుభవించిన వారు సైతం మళ్లీ జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటీకి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో, కొత్తగా ఏర్పడిన జిల్లాల పరిధి లో వివిధ పార్టీల నేతలు స్థానిక పదవులకోసం పావు లు కదుపుతున్నారు. జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్, మండల ప్రజా పరిషత్ అధ్యక్ష పదవులపై కన్నేశారు. ఈ విధంగా తమ ఓటు పట్టణ ప్రాంతం నుంచి గ్రామీణ ప్రాంతానికి మార్చుకోవడం సాంకేతికంగా తప్పేమి లేకపోయినా, నిబంధనలు కల్పించిన అవకాశంతో అటు మున్సిపాలిటీల్లో, ఇటు జిల్లా, మండల పరిషత్‌లో చక్రం తిప్పే అవకాశం జిల్లా, మండలస్థాయి నేతలకు కలుగుతోంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ఎంతో ముందుగానే జెడ్పీపీలు మొదలుకుని ఎంపీటీసీల వరకు ఎస్టీ, ఎస్సీ, బీసీ రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. దీంతో పరిషత్ పదవుల ఆశావహులంతా పరిషత్ రిజర్వేషన్లకు అనుగుణంగా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. దీనికి అనుగుణంగా తమ ఓటును పట్టణ, మున్సిపల్ ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు మార్చుకున్నారు. అంతేకాకుండా గతంలో ఉమ్మడి జిల్లాల్లో జెడ్పీ చైర్‌పర్సన్‌గా వ్యవహరించిన వారు, జిల్లాల పునర్విభజనతో తమ ఓటును మరోచోటికి మార్చుకుని అక్కడి జెడ్పీ పీఠంపై కన్నేశారు. తమ తమ రిజర్వేషన్లను బట్టి ఆయా జెడ్పీటీసీ స్థానాలను ఎంచుకుని పోటీకి సిద్ధపడుతున్నారు. ►మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కోడలు అనితారెడ్డి గతంలో మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని మీర్‌పేట ఎంపీటీసీగా పోటీచేసి ఓడారు. 2016లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఆర్కేపురం కార్పొరేటర్‌గా పోటీ చేసేందుకు తమ ఓటును మున్సిపాలిటీకి మార్చుకున్నారు. తాజాగా మళ్లీ జెడ్పీటీసీగా పోటీ చేసేందుకు ఓటును గ్రామీణ ప్రాంతంలోకి మార్చుకున్నారు. ►ఇటీవల టీఆర్ఎస్లో చేరిన భూపాలపల్లి డీసీసీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి 2006లో జరిగిన వరంగల్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో కార్పొరేటర్‌గా పోటీ చేశారు. తాజాగా వరంగల్ రూరల్ జిల్లా జెడ్పీ చైర్మన్ పదవిని ఆశిస్తున్నారు. దీని కోసం మళ్లీ గ్రామీణ ప్రాంతంలో ఓటును నమోదు చేసుకుని పోటీకి సిద్ధమయ్యారు. ►రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం జెడ్పీటీసీ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగుతున్న భూపతిగళ్ల మహిపాల్ స్వస్థలం ఆదిబట్ల. ఇది ఇటీవల పురపాలికగా మారింది. తాజాగా మండలంలోని చర్లపటేల్‌గూడ గ్రామ ఓటరుగా మారారు. ►ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతారెడ్డి.. తాజాగా కోట్‌పల్లి జెడ్పీటీసీగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే, ఈ స్థానం వికారాబాద్ జిల్లా పరిధిలోకి వస్తుండడంతో ఆమె యాలాల మండలంలో ఓటరుగా చేరారు. గతంలో ఆమెకు షాబాద్ మండలంలో ఓటు హక్కు ఉండేది. -
అక్కడా వారిదే పెత్తనం!
సాక్షి, హైదరాబాద్: పరిషత్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి వ్యూహం ఆ పార్టీలోనే చర్చనీయాంశమైంది. పరిషత్ ఎన్నికల బీఫారాల పంపణీ బాధ్యతను ఎమ్మెల్యేలకు అప్పగించారు. డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున 88 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వైరాలో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన రాములునాయక్, రామగుండంలో ఏఐఎఫ్బీ తరఫున గెలిచిన కోరుకుంటి చందర్ ఫలితాలు వెల్లడైన వారంలోనే టీఆర్ఎస్లో చేరారు. అనంతరం టీడీపీకి చెందిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, కాంగ్రెస్‌కు చెందిన 11 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సెగ్మెంట్లలో బీఫారాల పంపిణీలో ఇబ్బందులు లేవు. ఇతర పార్టీల తరఫున గెలిచి టీఆర్ఎస్లో చేరిన 14 మంది ఎమ్మెల్యేల సెగ్మెంట్లలోనూ పరిషత్ ఎన్నికల టీఆర్ఎస్ బీఫారాల పంపిణీ బాధ్యతను ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకే అప్పగించారు. అయితే, ఈ నియోజకవర్గాల్లో పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయినవారిలో ఆందోళన నెలకొంది. అభ్యర్థుల ఎంపికలో తమకు పెద్దగా ప్రాధాన్యం లేకపోవడంపట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తొలివిడత నామినేషన్ దాఖలు ప్రక్రియ బుధవారం ముగిసిపోతుంది. కాగా, కాంగ్రెస్‌కు చెందిన ఒకరు లేదా ఇద్దరు ఎమ్మెల్యేలు బుధవారం టీఆర్ఎస్లో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేల అభీష్టం... టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయినవారికి ఈ బాధ్యతలు ఉంటాయని భావించారు. అయితే ఆయా నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధికసంఖ్యలో టీఆర్ఎస్లో చేరడంతో పరిస్థితి మారిపోయింది. బీఫారాల పంపిణీ, టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు వ్యవహారాలను వీరే చూసుకోవాలని పార్టీ అధిష్టానం ఆదేశించింది. ఈ మేరకు బీఫారాలను ఎమ్మెల్యేలకే ఇచ్చారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసి ఓడిపోయినవారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు తమతో ఉన్నవారికి పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రావడంలేదని అంటున్నారు. పరిషత్ అభ్యర్థుల ఎంపికలో టీఆర్ఎస్లోని ద్వితీయ శ్రేణి నేతలకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నా రు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలసి ఈ విషయంపై విన్నవించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.