సాక్షి, హైదరాబాద్: తొలి విడత మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో భాగం గా 197 జెడ్పీటీసీ స్థానా లకు 2,104 నామినేషన్లు, 2,166 ఎంపీటీసీ స్థానాలకు 15,036 నామినేషన్లు దాఖల య్యాయి. బుధవారంతో తొలి దశ నామినేషన్ల దాఖలు గడువు ముగిసింది. జెడ్పీటీసీ సీట్లలో టీఆర్‌ఎస్ నుంచి 748, కాంగ్రెస్ నుంచి 551, బీజేపీ నుంచి 276, టీడీపీ నుంచి 80, సీపీఎం నుంచి 66, సీపీఐ నుంచి 34, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి 3, ఇండిపెండెంట్లు 301, ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన, రాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్ద రిజిష్టర్ అయిన రాజకీయపార్టీల నుంచి 45 మంది అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. ఎంపీటీసీ స్థానాల్లో టీఆర్‌ఎస్ నుంచి 5,762 మంది, కాంగ్రెస్ నుంచి 4,178, బీజేపీ నుంచి 1,576, సీపీఎం నుంచి 284, టీడీపీ నుంచి 227, సీపీఐ నుంచి 182, ఎంఐఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల నుంచి చెరొకరు, ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన, రాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్ద రిజిష్టర్ అయిన రాజకీయ పా-ర్టీల నుంచి 113 మంది, 2,712 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్లు వేశారు.
Comments
Please login to add a commentAdd a comment