ఏ పార్టీ మద్దతు లేకుండానే రాష్ట్రంలోని 32 జెడ్పీ పీఠాలను కైవసం చేసుకోబోతున్నామని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంపై తెలంగాణ ప్రజలు సంపూర్ణ విశ్వాసం కనబరిచారని అన్నారు. తెలంగాణ పరిషత్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.