MPTC and ZPTC results
-
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాల్లోనూ ఏకపక్షమే..
సాక్షి, అమరావతి: గత రెండున్నరేళ్లుగా ఏ ఎన్నిక జరిగినా రాష్ట్ర ప్రజలు ఒకే రకమైన తీర్పు ఇస్తూ వస్తున్నారు. గతంలో వివిధ కారణాలతో ఆగిపోయిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు తాజాగా జరిగిన ఎన్నికల్లోనూ అధికార వైఎస్సార్సీపీ తన ఆధిక్యతను చాటుకుంది. జమ్మలమడుగుతో సహా 11 జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి గురువారం ఫలితాలను ప్రకటించగా 8 చోట్ల వైఎస్సార్సీపీ విజయభేరీ మోగించింది. మూడు చోట్ల టీడీపీ గెలిచింది. 129 ఎంపీటీసీ స్థానాల ఫలితాలను ప్రకటించగా 85 వైఎస్సార్సీపీ దక్కించుకుంది. 33 చోట్ల టీడీపీ నెగ్గింది. ఐదు చోట్ల జనసేన, ఒకచోట బీజేపీ, సీపీఎం రెండు చోట్ల, సీపీఐ ఒక చోట, స్వతంత్రులు రెండు చోట్ల గెలిచారు. ఏకగ్రీవాలతో కలిపి 12 జెడ్పీటీసీలు.. మొత్తం 14 జెడ్పీటీసీ, 176 ఎంపీటీసీ స్థానాలకు ఈ నెల ఒకటవ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన విషయం తెలిసిందే. వీటికి తోడు సెప్టెంబరులో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు సమయంలో ఓట్లు తడిచిపోవడంతో లెక్కించేందుకు వీలు కాక ఫలితాల ప్రకటన నిలిపివేసిన జమ్మలమడుగు జెడ్పీటీసీ, మరో ఆరు ఎంపీటీసీ స్థానాల్లో కొన్ని బూత్‌లకు కూడా తాజాగా ఎన్నికలు జరిగాయి. మూడు ఎంపీటీసీ స్థానాల్లో ఒక్కటి కూడా నామినేషన్లు దాఖలు కాకపోవడంతో అక్కడ ఎన్నికలు మళ్లీ వాయిదా పడ్డాయి. కాగా నాలుగు జెడ్పీటీసీ స్థానాలతో పాటు 50 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నిక ఏకగ్రీవంగా ముగిసిన విషయం తెలిసిందే. ఏకగ్రీవమైన నాలుగు జెడ్పీటీసీ స్థానాలను అధికార వైఎస్సార్సీపీ దక్కించుకోగా ఎంపీటీసీ స్థానాల్లో 46 వైఎస్సార్సీపీ, మూడు టీడీపీ, ఒక చోట స్వతంత్రులు గెలిచారు. ఈ నేపథ్యంలో మొత్తం 15 జెడ్పీటీసీ స్థానాలకుగానూ 12 వైఎస్సార్సీపీకి దక్కగా 179 ఎంపీటీసీ స్థానాల్లో 131 అధికార పార్టీ విజయం సాధించింది. + -
ప్రజాహిత పాలనదే గెలుపు
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అపూర్వ విజయం సాధించింది. జిల్లా పరిషత్ స్థానాల్లో 99%, మండల పరిషత్ స్థానా ల్లో 90% సీట్లు సంపాదించి తనకు తిరుగులేదని రుజువు చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో గానీ, పార్లమెంటు ఎన్నికల్లో గానీ ఓట్లు వేసింది ఈ ఓటర్లే. సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ గుర్తు ప్రాధాన్యం వహించినా, పార్టీలకు అతీతంగా అభ్యర్థి మంచితనం, బలం, పనివిధానం కూడా లెక్కలోకి వస్తాయి. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నా నూటికి తొంభై శాతంపైగా వైసీపీ మీద నమ్మకంతోనే ఓటు వేసినట్టు స్పష్టం. ఇది జగన్ రెండు సంవత్సరాల పైచిలుకు పాలనకు మెజారిటీ ప్రజలు తెలిపిన ఆమోద ముద్ర. దశాబ్దాలుగా తమ సమస్యలకు పరిష్కారం లభించాలని ఆశిస్తున్న సామాన్య ప్రజలకు జగన్ పాలన అభయహస్తం ఇచ్చిందనే చెప్పవచ్చు. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీ మీద క్రమంగా వ్యతిరేకత పెరుగుతుంది. ఉపఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ వ్యతిరేకత వ్యక్తమవుతుంది. కానీ వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చినప్పటినుండి ప్రభుత్వంపై సానుకూలత, ప్రతిపక్షంపై వ్యతిరేకత పెరుగుతోంది. బహుళ ప్రజల అనుకూల వైఖరి వల్ల జగన్ ప్రజల హృదయాలను గెలువగలిగారు. ప్రతిపక్షం పేరుతో చంద్రబాబునాయుడు చేయిస్తున్న అభివృద్ధి నిరోధక ఉద్యమాలు, ఉత్తుత్తి పోరాటాలను ప్రజలు నమ్మడం లేదు. అంతేకాకుండా తెలుగుదేశం పాలనలో ఐదేండ్లూ ఆంధ్రప్రజలు ఏ మార్పునూ చూడకుండా శుష్క వాగ్దానాలను మాత్రమే అనుభవించారు. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాతైనా చంద్రబాబు తన వైఖరిని మార్చుకోకుండా ప్రజల చిరకాల వాంఛయైన ఇంగ్లిష్ మాధ్యమాన్ని వ్యతిరేకించడం, అభివృద్ధి వికేంద్రీకరణకు తావిచ్చే బహుళ రాజధానులను వ్యతిరేకించే పేరుతో ప్రతీఘాత ఉద్యమాలను చేయడం తప్ప నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించ లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాజశేఖరరెడ్డి గెలిచినప్పుడూ, రెండేళ్ళ క్రితం జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పడూ ఒకే తీరు మాటలన్నారు చంద్రబాబు. తనను ఓడించిన తెలుగు ప్రజలు పశ్చాత్తాప పడాలి అన్నారు. అలా తన వైఫల్యాలను తెలుసుకోకుండా ప్రజలను తప్పు పడుతున్నారు కాబట్టే తెలుగుదేశం పార్టీని అవసాన దశకు తీసుకొచ్చారు. వైసీపీకి పడుతున్న ఓట్లు ప్రతిపక్షాలు బలంగా లేకపోవడం వల్ల వస్తున్నవి కాదు. జగన్ గత రెండేళ్లుగా చేస్తున్న పనుల వల్ల అనుకూలంగా పడుతున్న ఓట్లు. ఏ ప్రాపంచిక దృక్పథమూ, అభివృద్ధి నమూనా లేకుండా అధికార పార్టీ వైఫల్యాలతో మాత్రమే గెలవాలనుకునే పార్టీలకు జగన్ గెలుపు చక్కని గుణపాఠం. పాజిటివ్, పర్మనెంట్ ఓటుబ్యాంకును పెంచుకోవడానికి జగన్ అవలంభిస్తున్న విద్య, వైద్య, ఉద్యోగ, వ్యవసాయిక విధానాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. నవరత్నాలు, అమ్మఒడి, జగనన్న దీవెన, ఆరోగ్యశ్రీ, గ్రామ వలంటీర్ల వ్యవస్థ, పార్టీ మార్పిడులను ప్రోత్సహించక పోవడం లాంటి అనేక అంశాలతో విలువలతో కూడిన రాజకీయాలకు తెరలేపారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని ఆధునిక వసతులు సమకూర్చడం, పూర్తి స్టాఫ్‌ను ఇవ్వడం, దేశంలో ఎక్కడా లేని విధంగా కోవిడ్–19ను కూడా ఆరోగ్యశ్రీలో చేర్చి పేదల పాలిట పెన్నిధి పాలకుడిగా జగన్ వార్తల్లోకి ఎక్కారు. రెండేళ్ల స్వల్ప కాలంలోనే గణనీయమైన మార్పులు తెచ్చి ప్రజల హృదయాల్లో స్థానాన్ని స్థిరం చేసుకుంటున్నారు. తనది వాగ్దాన, వాగాడంబర ప్రభుత్వం కాదు; ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం అని నిరూపిస్తున్నారు కాబట్టే ప్రజల మెప్పు పొందుతున్నారు. బద్వేల్ ఉపఎన్నికలోనూ జగన్ పాలన వైసీపీకి ఘన విజయాన్ని చేకూర్చుతుందన్నది వాస్తవం. డా.కాలువ మల్లయ్య వ్యాసకర్త కథా, నవలా రచయిత. మొబైల్: 91829 18567 -
శ్రీకాకుళం జిల్లాలోని అన్ని జడ్పీటీసీలను కైవసం చేసుకున్న వైఎస్ఆర్సీపీ
-
ప్రభుత్వంపై తప్పుడు ప్రచారానికే ఎల్లో మీడియా పరిమితం: సజ్జల
-
ఆత్మవిమర్శకు బదులు.. అపనిందలేస్తారా?: సజ్జల
సాక్షి, తాడేపల్లి: మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయంపై ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఆత్మవిమర్శ చేసుకోకుండా సీఎం వైఎస్ జగన్‌పై అపనిందలేస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. కుప్పం నియోజకవర్గంలో 66 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగితే కేవలం 3 స్థానాల్లో మాత్రమే టీడీపీ అభ్యర్థులను చంద్రబాబు గెలిపించగలిగారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో నివాసం ఉంటూ వలస పక్షుల్లా రాష్ట్రానికి వచ్చే చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్, బాబు భాగస్వామి పవన్ కళ్యాణ్.. సీఎం వైఎస్ జగన్‌కు నానాటికీ ప్రజల్లో పెరుగుతున్న మద్దతును చూసి ఓర్వలేక పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే.. ►ఇటీవల జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి 69.55 శాతం ఓట్లు వస్తే.. టీడీపీకి 22.27%, జనసేనకు 3.83%, బీజేపీకి 2.32% ఓట్లు వచ్చాయి. ►ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి 64.8%, టీడీపీకి 25.27%, జనసేనకు 4.34%, బీజేపీకి 1.48% ఓట్లు వచ్చాయి. ►2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి వచ్చిన ఓట్లు 50 శాతం అయితే.. ఇప్పుడు జెడ్పీటీసీల్లో దాదాపుగా 70శాతం ఓట్లు వచ్చాయి. పరిషత్ ఎన్నికల్లోనూ తిరుగులేని విజయం సా«ధించింది. సీఎం వైఎస్ జగన్, వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనపై ప్రజల ఆదరణ, విస్పష్టమైన అభిమానం వ్యక్తమైంది. ►గత రెండున్నరేళ్లుగా ఏపీలో ప్రతిపక్షాలు, ముఖ్యంగా టీడీపీ నిరాశ, నిస్పృహలతో సీఎం జగన్, రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తోంది. ఎల్లో మీడియా అయితే రోజూ అసత్య కథనాలతో సీఎం ప్రజాస్వామ్య పరిపాలనపై దాడిచేస్తున్నాయి. చెంప చెళ్లుమనిపించేలా తీర్పిచ్చినా.. ►‘పరిషత్’ ఫలితాలు వచ్చాకైనా టీడీపీకి సిగ్గు వస్తుందనుకున్నాం. అసలు ఎక్కడ లోపం ఉందో చూసుకోకుండా తాము ఎన్నికలు బహిష్కరించామని చంద్రబాబు అంటున్నారు. నిజంగా ఎన్నికలు బహిష్కరించి ఉంటే.. ఎందుకు అభ్యర్థులను పోటీకి దింపారు.. అయినా ప్రజలు చెంప చెళ్లుమనిపించేలా తీర్పు ఇచ్చారు. ►ఎంపీటీసీ ఎన్నికల్లో నియోజకవర్గాల వారీగా చూస్తే అచ్చెన్నాయుడు 4, బాలకృష్ణ 7, దేవినేని ఉమా 3, పరిటాల సునీత 9, ధూళిపాళ నరేంద్ర 12 స్థానాల్లో మాత్రమే వారి నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించుకున్నారు. కానీ, అత్యంత హీనంగా సాధించింది చంద్రబాబే. అయినా ఆయనకు బుద్ధిరాలేదు. ►ఎక్కడో గుజరాత్లో హెరాయిన్ దొరికితే.. దానికి సీఎం వైఎస్ జగన్‌కు ముడిపెడుతూ అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ►ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లో అక్కడక్కడా చెదరుమదురు ఘటనలు జరిగాయే తప్ప టీడీపీ, ఒక వర్గం మీడియా ఆశించినట్లు ఏమీ జరగలేదు. తప్పుడురాతలతో వంకరబుద్ధి చూపిస్తే ఎలా.. పరిషత్ ఎన్నికల ఫలితాల తర్వాత కూడా చంద్రబాబుతోపాటూ ఆయన్ని మోసే మీడియాలో ఏమాత్రం మార్పురాలేదు. నిధులు మళ్లించేస్తున్నారంటూ ‘ఈనాడు’ అక్కసు వెళ్లగక్కుతూ కథనం అచ్చేసింది. నిజానికి.. సివిల్ సప్లైస్ నుంచి రూ.5,800 కోట్లు, స్టేట్ డ్రింకింగ్ వాటర్ కార్పొరేషన్ నుంచి రూ.940 కోట్లు, స్టేట్ ఇరిగేషన్ డెవలప్మెంట్ ప్రాజెక్టు నుంచి రూ.1,200 కోట్లు, రైతు సాధికార సంస్థ నుంచి రూ.450 కోట్లు మొత్తం రూ.8,390 కోట్లను 2019 ఎన్నికలకు ముందు టీడీపీ సర్కారు పసుపు–కుంకుమకు మళ్లించేసింది. అదే సమయంలో ఆర్బీఐ నుంచీ రూ.5వేల కోట్లు డ్రా చేసి.. పసుపు–కుంకుమకు మళ్లించారు. మరి ఆ రోజు మీ పత్రిక ఎందుకు వీటి గురించి రాయలేదు? మీ బాధ ఏంటి? రాష్ట్ర ప్రభుత్వానికి అప్పు పుట్టకూడదు.. కేంద్రం మద్దతు ఇవ్వకూడదు.. కోర్టులు ద్వారా ఆడ్డుకోవాలి.. ఇవే మీ కుట్రలు, కుతంత్రాలు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటే సంతోషం కేంద్రంతో పవన్ కళ్యాణ్‌కున్న సత్సంబంధాలు ఉపయోగించి స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుని ఆ క్రెడిట్ వాళ్లే తీసుకుంటే చాలా సంతోషం. ఇక ఎంపీపీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలవకూడదనే ఉద్దేశంతో బీజేపీ, జనసేనకు టీడీపీ మద్దతిచ్చింది. కాపు, వైశ్య కార్పొరేషన్లు టీడీపీ హయాంలోనే బీసీ శాఖ పరిధిలో ఉన్నాయి. బ్రాహ్మణ కార్పొరేషన్ ఉత్తర్వులపై విమర్శలు చేయడం అంటే.. కోడిగుడ్డు మీద ఈకలు పీకడంలాంటిదే. వీటన్నింటినీ ఈబీసీ కిందకు మార్చే అవకాశముంది. మండల పరిషత్ రెండో ఉపాధ్యక్ష పదవిని కొత్తగా సృష్టిస్తూ ఆర్డినెన్స్ తేవాలని నిర్ణయించాం. చదవండి: Andhra Pradesh: డిగ్రీ కోర్సులు.. ఆంగ్ల మాధ్యమంలోనే! ‘మహిళా సంరక్షణ కోసం ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోంది’ -
టీడీపీ కుట్రలకు ప్రజలు సరైన గుణపాఠం చెప్పారు:కాకాణి
సాక్షి, నెల్లూరు: వైఎస్సార్సీపీ విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గంలో గెలుపొందిన ఎంపీటీసీ, జడ్పీటీసీలను ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కాకాణి గోవర్ధనరెడ్డిలు అభినందించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ..రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి, సంక్షేమం జరుగుతోందని తెలిపారు. రూ.లక్ష కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాలో సీఎం వైఎస్ జగన్ జమ చేశారని గుర్తు చేశారు. సీఎం వైఎస్ జగన్ పాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. ప్రజాదరణతో వైఎస్సార్సీపీ మెజారిటీ గతానికంటే పెరుగుతోందన్నారు. ఎన్నికల కమీషన్ అడ్డుపెట్టుకొని చంద్రబాబు కుట్రలు చేశారని మండిపడ్డారు. ఓటమిని ముందే పసిగట్టి బహిష్కరణ డ్రామా ఆడారని దుయ్యబట్టారు. టీడీపీ కుట్రలకు ప్రజలు సరైన గుణపాఠం చెప్పారని అన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ.. ఎంపీటీసీ 65 స్థానాలకి ఎన్నిక జరిగితే 63 స్థానాల్లో వైఎస్సార్సీపీ కైవసం చేసుకుందని తెలిపారు. ఆరుకి ఆరు జడ్పీటీసీలూ కైవసం చేసుకొన్నామని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కంటే స్థానిక సంస్థల్లో ఓట్ల శాతం పెరిగిందని గుర్తుచేశారు. నియోజకవర్గంలో ప్రతీ ఎన్నికకీ ప్రజాదరణ పెరుగుతోందని, సీఎం వైఎస్ జగన్ చేపట్టిన సంక్షేమం వల్లే జిల్లాలో ప్రతిపక్షానికి ఒక్క జడ్పీటీసీ కూడా దక్కలేదని అన్నారు. సీఎం వైఎస్ జగన్ నాయకత్వానికి రాష్ట్రంలో తిరుగులేదని, నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేస్తామని అన్నారు. -
పరిషత్ ఫలితాలతో విపక్షాల్లో గుబులు: వెల్లంపల్లి
-
పరిషత్ ఫలితాలతో విపక్షాల్లో గుబులు: వెల్లంపల్లి
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ పరిషత్ ఎన్నికల ఫలితాల అనంతరం విపక్షాల్లో గుబులు మొదలయ్యింది అని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘వైఎస్సార్సీపీ మినహా రాష్ట్రంలో మిగతా పార్టీలకు చోటు లేదని ప్రజలు మరో సారి రుజువు చేశారు. మాటల మనిషి కాదు చేతల మనిషి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. అందుకు నిదర్శనమే పరిషత్ ఎన్నికల ఫలితాలు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబు మాటలు నమ్మే స్థితిలో లేరు. అందుకే నిమ్మకూరు, నారావారిపల్లేలో ప్రజలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి జై కొట్టారు’’ అని తెలిపారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ అసత్య ఆరోపణలు చేస్తోంది. రాష్ట్ర ప్రజలు చంద్రబాబు మాటలు నమ్మే పరిస్థితుల్లో లేరు. అమరావతి పేరుతో చంద్రబాబు ప్రజలను మోసం చేశాడు. ఆయన గ్రాఫిక్స్‌ను ప్రజలు నమ్మలేదు. అందుకే పరిషత్ ఎన్నికల్లో ప్రజలు ఏకపక్షంగా తీర్పు ఇచ్చారు. పరిషత్ ఎన్నికల ఫలితాల్లో 80శాతం పైగా ఓట్లు మాకు వచ్చాయి. ఫలితాల తర్వాత ఇప్పుడు మేము బహిష్కరించాం అని జబ్బలు చరుచుకుంటున్నారు’’ అని వెల్లంపల్లి విమర్శించారు. ‘‘చంద్రబాబు, లోకేష్‌ని మేము ప్రవాస ఆంధ్రులని అనుకుంటున్నాం. ఒక గెస్ట్ లాగా ఏపీకి వచ్చి గెస్ట్‌హౌస్‌లో ఉండి వెళతారు. సొంత కొడుకును చిత్తుగా ఓడించారని ప్రజల మీద చంద్రబాబుకు కోపం. ఫామ్‌హౌస్‌లలో కూర్చున్న వారు కూడా మాదక ద్రవ్యాల గురించి మాట్లాడుతున్నారు. పోలీస్ కమిషనర్ కూడా స్పష్టం చేశారు.. అయినా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. డ్రగ్స్ తీసుకున్న లక్షణాలు లోకేష్, బోండా ఉమాలాంటి వారికే ఉన్నట్లు కనిపిస్తున్నాయి. లేదంటే గంజాయి వ్యాపారం చేసిన అయ్యన్నకు ఈ లక్షణాలు ఉన్నాయేమో’’ అని వెల్లంపల్లి విమర్శించారు. -
బాబు కంటే బాలయ్యే బెటర్!
సాక్షి, అమరావతి: పరిషత్ ఎన్నికల్లో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు కంటే ఆయన బావమరిది నందమూరి బాలకృష్ణే మెరుగైన ఫలితాలు సాధించడం ఆసక్తికరంగా మారింది. దేశంలోనే సీనియర్ నాయకుడినని చెప్పుకునే చంద్రబాబు కుప్పంలో కేవలం 3 ఎంపీటీసీ స్థానాలను మాత్రమే సాధించగా బాలకృష్ణ తాను ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురంలో 7 ఎంపీటీసీలను గెలిపించుకున్నారు. పలువురు టీడీపీ నాయకులు ఇప్పుడు ఈ విషయం గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. పలువురు ఇతర నాయకులు కూడా తమ నియోజకవర్గాల్లో చంద్రబాబుతో పోలిస్తే మెరుగైన ఫలితాలను సాధించినట్లు చర్చించుకుంటున్నారు. కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 66 ఎంపీటీసీలకుగానూ ముచ్చటగా మూడు చోట్ల మాత్రమే టీడీపీని చంద్రబాబు గెలిపించగలిగారు. నాలుగు మండలాల్లో జెడ్పీటీసీ స్థానాల్లో ఓడిపోయారు. చివరికి చంద్రగిరి నియోజకవర్గంలోని చంద్రబాబు సొంత గ్రామం నారావారిపల్లెలోనూ టీడీపీని గెలిపించలేక చేతులెత్తేశారు. అన్ని చోట్లా పోటీ చేసి.. సింగిల్ డిజిట్‌కే పరిమితం రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ టీడీపీ అభ్యర్థులు పోటీ చేశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల కోసం హోరాహోరీగా పోరాడినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందు నిలవలేకపోయారు. 641 జెడ్పీటీసీలకు 482 చోట్ల టీడీపీ అభ్యర్థులు పోటీ చేశారు. గెలిచింది మాత్రం ఆరు జెడ్పీటీసీ స్థానాల్లోనే. అలాగే 6,558 ఎంపీటీసీ స్థానాల్లో పోటీ చేసి 930 చోట్ల నెగ్గారు. కుప్పంలో కూడా ఇంత దారుణంగా ఓడిపోవడం ఏమిటని టీడీపీ నాయకులు వాపోతున్నారు. పార్టీ ముఖ్య నాయకులు చాలామంది తమ నియోజకవర్గాల్లో రెండంకెల ఎంపీటీసీ స్థానాలను గెలిపించుకోలేక బోల్తాపడ్డారు. చంద్రబాబు పరిస్థితి వారి కంటే దీనంగా మారడం టీడీపీ క్యాడర్‌కు మింగుడు పడడంలేదు. ఆ 7 జిల్లాల్లో చిత్తూరు.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు తాను ప్రాతిని«థ్యం వహిస్తున్న చోట చంద్రబాబు కంటే కాస్త మెరుగ్గా నాలుగు ఎంపీటీసీలను గెలిపించుకున్నారు. ధూళిపాళ్ల నరేంద్ర, చింతమనేని ప్రభాకర్, నిమ్మల రామానాయుడు, బండారు సత్యనారాయణమూర్తి లాంటి నాయకులు రెండంకెల ఎంపీటీసీలను సాధించారు. జెడ్పీటీసీల్లోనూ చంద్రబాబు పార్టీ నాయకుల కంటే బాగా వెనుకబడిపోయారు. కుప్పంలో నాలుగింటిలో ఒక్క జెడ్పీటీసీని కూడా గెలిపించుకోలేకపోయారు. ఆరు జిల్లాల్లో ఒక్కో జెడ్పీటీసీని మాత్రమే టీడీపీ గెలవగా ఏడు జిల్లాల్లో అసలు ఖాతా తెరవలేదు. ఆ ఏడు జిల్లాల్లో చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు ఉండడం తమకు తీవ్ర అవమానకరమని సీనియర్ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ నాయకుడు అయ్యన్నపాత్రుడు తన సొంత మండలం నర్సీపట్నంలో జెడ్పీటీసీని గెలిపించుకోగా చంద్రబాబు కుప్పంలో ఒక్క జెడ్పీటీసీని కూడా సాధించలేకపోయారు. సొంత నియోజకవర్గంలోనే పార్టీని బతికించలేకపోయిన చంద్రబాబు ఇక రాష్ట్రంలో పార్టీని ఎలా నడిపిస్తారనే ప్రశ్నలు పార్టీ వర్గాల నుంచే గట్టిగా వినిపిస్తున్నాయి. -
CM YS Jagan: బాధ్యత పెంచిన గెలుపు
సాక్షి, అమరావతి: పరిషత్ ఎన్నికల్లో ప్రజలు చేకూర్చిన అఖండ విజయం రాష్ట్ర ప్రభుత్వంపైన, తనపైనా బాధ్యత మరింత పెంచిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా వైఎస్సార్సీపీకి ఎంపీటీసీల్లో 86 శాతం, జెడ్పీటీసీల్లో 98 శాతం స్థానాల్లో అపూర్వ విజయం అందించిన ప్రజలనుద్దేశించి సీఎం జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయం నుంచి మాట్లాడారు. కొన్ని అన్యాయమైన మీడియా సంస్థలు టీడీపీ ఓటమిని జీర్ణించుకోలేక వైఎస్సార్సీపీ విజయానికి వక్రభాష్యం చెబుతూ తప్పుడు రాతలు రాస్తున్నాయని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీల పరంగా, పార్టీల గుర్తుపై జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో టీటీపీ పోటీ చేసినప్పటికీ బహిష్కరించినట్లుగా చిత్రీకరిస్తూ వైఎస్సార్సీపీ సునాయాస విజయంగా ఈనాడు పత్రిక వక్రభాష్యం రాసిందని, ఇలాంటి అన్యాయమైన ఈనాడు లాంటి పత్రిక ప్రపంచంలో ఎక్కడా ఉండదని వ్యాఖ్యానించారు. పరిషత్ ఎన్నికల్లో విజయం సాధించిన ప్రతీ అక్కచెల్లెమ్మ, సోదరుడికి ముఖ్యమంత్రి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఇంత ఘన విజయం అందించిన ప్రతీ తాత, అవ్వ, అక్కచెల్లెమ్మలు, సోదరులు, స్నేహితులకు కృతజ్ఞతలు తెలియచేశారు. గతంలో ఎన్నడూ లేని అపూర్వ విజయం అదించిన ప్రజలకు సదా రుణపడి ఉంటానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మీ చల్లని దీవెనలతో మొదలైంది.. ఈరోజు మీరు చేకూర్చిన అఖండ విజయం ప్రభుత్వంపైనా, నాపైనా బాధ్యతను మరింత పెంచింది. 2019 ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలకుగానూ 151 స్థానాలు, 25 పార్లమెంట్ స్థానాలకుగానూ 22 చోట్ల గెలిపించారు. 50 శాతం పైచిలుకు ఓట్లతో, 86 «శాతం అసెంబ్లీ సీట్లతో, 87 శాతం పార్లమెంట్ సీట్లతో దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో ఈ ప్రయాణం మొదలైంది. పంచాయతీల్లోనూ అదే ఆదరణ.. ఆ తర్వాత మీ అందరికీ తెలిసిన విషయమే. గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. రాష్ట్రంలో 13,081 పంచాయతీలకుగానూ 10,536 చోట్ల అంటే అక్షరాలా 81 శాతం పంచాయతీలలో అధికార పార్టీ మద్దతుదారులను ప్రజలు ఎన్నుకున్నారు. పట్టణ స్థానిక సంస్థల్లో ప్రభంజనం.. దాని తర్వాత మునిసిపల్ ఎన్నికలు జరిగాయి. 75 నగర పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ఏకంగా 74 చోట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఆదరించారు. 99 శాతం స్థానాల్లో విజయం చేకూర్చారు. ఇక 12 చోట్ల మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగ్గా 12కి 12 చోట్ల వంద శాతం వైఎస్సార్ సీపీ అభ్యర్థులను ప్రజలు గెలిపించారు. ఇప్పుడు పరిషత్ ఎన్నికల్లోనూ.. ఆ తర్వాత నిర్వహించిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు తాజాగా వచ్చాయి. దాదాపుగా 9,583 ఎంపీటీసీలకుగానూ 8,249 ఎంపీటీసీలు.. అంటే 86 శాతం ఎంపీటీసీల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులనే ప్రజలు గెలిపించారు. 638 జడ్పీటీసీలకుగానూ 628 జడ్పీటీసీలు (సీఎం సమీక్ష జరుగుతున్న సమయానికి ఉన్న సమాచారం ప్రకారం. ఆ తరువాత ఇవి 630కి పెరిగాయి) అంటే 98 శాతం జడ్పీటీసీలను దేవుడి దయ, ప్రజల చల్లని దీవెనలతో సాధించాం. 95 శాతానిపైగా హామీలు అమలు.. ప్రతి ఎన్నికలోనూ ఎక్కడా కూడా సడలని ఆప్యాయత, ప్రేమానురాగాలతో ప్రజలంతా ప్రభుత్వానికి తోడుగా నిలబడ్డారు. దేవుడి దయ వల్ల ఈ రెండున్నరేళ్లలో ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన వాటిలో 95 శాతానికి పైగా అమలు చేయగలిగాం. అందరి మన్ననలు పొందగలిగాం. ఇందుకు ప్రజలందరికీ సదా రుణపడి ఉంటాం. అవరోధాలు, ఇబ్బందులు.. కానీ ఇక్కడ కొన్ని విషయాలను ఈరోజు మీ అందరితో పంచుకుంటున్నా. ప్రభుత్వానికి అవరోధాలు, ఇబ్బందులు కల్పించాలని కొన్ని శక్తులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఒకవైపు కోవిడ్‌తో డీల్ చేస్తున్నాం. మరోవైపు దుష్ప్రచారాలు చేస్తున్న ప్రతిపక్షంతోపాటు ఈనాడు దినపత్రిక, ఆంధ్రజ్యోతి, టీవీ– 5 లాంటి అన్యాయమైన మీడియా సంస్థలున్నాయి. అబద్ధాలను నిజం చేయాలని ప్రయత్నిస్తూ రకరకాల కుయుక్తులు పన్నుతున్నాయి. ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చిత్రీకరిస్తున్నాయి. కేవలం వాళ్లకు సంబంధించిన మనిషి అధికార పీఠంపై కూర్చోలేదు కాబట్టి, ఎంత ఫాస్ట్‌గా వీలైతే అంత ఫాస్ట్‌గా ముఖ్యమంత్రిని దించేసి వాళ్ల మనిషిని కూర్చోబెట్టాలనే దుర్మార్గపు బుద్ధితో చంద్రబాబును భుజాన వేసుకుని నడుస్తున్నాయి. ప్రజా దీవెనను జీర్ణించుకోలేకే ఇలాంటి రాతలు ఈ ఎన్నికల్లోనే కాదు. ఇంతకు ముందు చెప్పినట్లుగా 2019 ఎన్నికల్లో 86 శాతం అసెంబ్లీ సీట్లు, 88 శాతం ఎంపీ సీట్లతో ప్రయాణాన్ని ప్రారంభించి సర్పంచ్ ఎన్నికల్లో 81 శాతం పార్టీ మద్దతుదారులే విజయం సాధించడం, మున్సిపల్ ఎన్నికల్లో 99 శాతం, వంద «శాతం కార్పొరేషన్లను గెలుచుకోవడం, ఇప్పుడు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో 86 శాతం, 98 శాతంతో ప్రజలు వైఎస్సార్ సీపీకి ఘన విజయాన్ని చేకూర్చడాన్ని జీర్ణించుకోలేకే ఇలాంటి రాతలు రాస్తున్నారు. పార్టీ గుర్తులపై జరిగిన ఎన్నికలకు వక్రభాష్యాలా? ఇక్కడ ఆశ్చర్యం కలిగించే మరో విషయం ఏమిటంటే పార్టీల గుర్తులతో జరిగిన ఈ ఎన్నికల్లో ప్రజలంతా ఇంత బాగా ఆశీర్వదించి ప్రభుత్వాన్ని దీవిస్తే అది మింగుడు పడక విపక్షం, దానికి కొమ్ము కాసే మీడియా వక్రభాష్యాలు చెబుతున్నాయి. ఇవి సాక్షాత్తూ పార్టీ గుర్తులతో జరిగిన ఎన్నికలు. పార్టీ రహిత ఎన్నికలు కావు. పార్టీల గుర్తుతో జరిగిన ఈ ఎన్నికల్లో ప్రతి పార్టీ వారి అభ్యర్థులకు ఏ ఫామ్స్, బీ ఫామ్స్ కూడా ఇచ్చాయి. వాటి ఆధారంగా అభ్యర్థులకు ఆయా పార్టీల గుర్తులు కేటాయించారు. ఏ స్థాయిలో అడ్డుకుంటున్నారో మీరే చూస్తున్నారు.. ఓటమిని అంగీకరించలేరు. వాస్తవాలను ఒప్పుకోరు. ఇటువంటి అన్యాయమైన మీడియా సామ్రాజ్యం, ప్రతిపక్షం నడుమ ప్రజలకు మేలు చేయడానికి అడుగులు వేస్తుంటే మంచి జరగకుండా అడ్డుకునే పరిస్థితులు ఏ స్థాయిలో ఉన్నాయో మీరే చూస్తున్నారు. ప్రజలకు ఏ కాస్త మంచి జరుగుతున్నా వెంటనే తప్పుడు వార్తలు, కోర్టులో కేసులు వేయడం ద్వారా అడ్డుకుంటున్న పరిస్థితులను అంతా చూస్తున్నాం. ఇటువంటి అన్యాయమైన పరిస్థితుల్లో కూడా దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో ఈ ప్రభుత్వం చల్లగా నడుస్తోందని సవినయంగా తెలియచేస్తున్నా. ఏడాదిన్నర క్రితమే పూర్తై ఉంటే.. ఈ ఎన్నికల ప్రక్రియ నిజానికి ఒకటిన్నర సంవత్సరం క్రితం మొదలైంది. రకరకాల పద్ధతుల్లో ఎన్నికలు జరగకుండా చూడాలని ప్రయత్నం చేశారు. వాయిదా వేయించారు. కోర్టులకు వెళ్లి స్టేలు కూడా తెచ్చారు. చివరకు ఎన్నికలు ముగిసిన తర్వాత కౌంటింగ్ కూడా ఆర్నెళ్ల పాటు వాయిదా వేయించారు. ఇవే ఎన్నికలు ఏడాదిన్నర క్రితమే పూర్తై ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉంటే కోవిడ్ సమయంలో ప్రజలకు ఎంతో ఉపయోగం జరిగేదన్న ఇంగితజ్ఞానం కూడా ప్రతిపక్షానికి లేకుండా పోయిన పరిస్థితులను చూశాం. మరింత కష్టపడి మంచి చేస్తాం.. ఇటువంటి అన్యాయమైన పరిస్థితుల్లో కూడా ప్రజలందరి చల్లని దీవెనలు, దేవుడి దయతో ఇంత మంచి ఫలితాలు వచ్చినందుకు మనసారా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. ఇవాళ కష్టపడుతున్న దానికన్నా కూడా ఇంకా ఎక్కువ శ్రమించి ప్రజలకు మరింత మేలు చేస్తామని హామీ ఇస్తున్నా. ఇదెక్కడి పీడ..? ఈరోజు ఆశ్చర్యకరమైన ఓ వార్త చూశా. విపక్షం ఓడిపోయిన తర్వాత కనీసం ఓటమిని కూడా హుందాగా అంగీకరించలేని పరిస్థితిలో ఈనాడు పేపర్ ఉంది. ‘పరిషత్ ఏకపక్షమే.. జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో వైకాపా సునాయాస గెలుపు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల బహిష్కరణతో పోటీ నామమాత్రం...’ అని రాశారు. నిజంగా ఇది పేపరా? ఇదేమన్నా పేపర్‌కు పట్టిన పీడా? ఇంత అన్యాయమైన పేపర్లు బహుశా ప్రపంచంలో ఎక్కడా ఉండవేమో...! – సీఎం జగన్ -
పచ్చ మీడియా రాతలపై విరుచుకుపడ్డ జగన్ !
-
‘వైఎస్సార్సీపీ విజయాన్ని ఎల్లో మీడియా వక్రీకరించింది’
సాక్షి, విశాఖపట్నం: అధికారంలోకి రాగానే 90 శాతం హామీలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెరవేర్చారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గతంలో పంచాయతీ ఎన్నికలు పెట్టాలంటేనే చంద్రబాబు భయపడ్డారన్నారు. (చదవండి: ఏపీ పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ సరికొత్త రికార్డు) ‘కరోనా పేరుతో ఎన్నికలను చంద్రబాబు వాయిదా వేయించారు. ఎన్నికల నిర్వహణ, ఫలితాలపై చంద్రబాబు ఎన్నో అడ్డంకులు యత్నించారు. ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులకు బీఫారమ్ ఇచ్చింది చంద్రబాబే. వైఎస్సార్సీపీ విజయాన్ని ఎల్లో మీడియా వక్రీకరించి వార్తలు రాస్తోంది. ప్రతి ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీదే విజయం. పంచాయతీ ఎన్నికల నుంచి పరిషత్ ఎన్నికల వరకు వైఎస్సార్సీపీదే గెలుపు. కరోనా సంక్షోభంలోనూ ప్రభుత్వం ప్రజలకు అండగా నిలిచిందని’’ గుడివాడ అమర్నాథ్ అన్నారు. ‘‘అయ్యన్న పాత్రుడు ఒక గంజాయి డాన్. ఎన్నికల ఫలితాలు పక్కదారి పట్టించేందుకు అయ్యన్నపాత్రుడుతో సీఎం జగన్‌పై చంద్రబాబు విమర్శలు చేయించారు. పరిషత్ ఎన్నికలపై అయ్యన్న ఎందుకు నోరు మెదపడం లేదని’’ గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. చదవండి: టీడీపీకి ఓటమిని అంగీకరించే ధైర్యం లేదు: బొత్స -
ప్రజలు వైఎస్ఆర్సీపీకి బ్రహ్మరథం పట్టారు:ఎమ్మెల్యే ఉషాశ్రీ చరణ్
-
కుప్పంలో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది:కడప మేయర్ సురేష్ బాబు
-
స్ధానిక ఎన్నికలపై బాబు కుట్రలు
-
ZPTC MPTC: ఎన్నికల గ్రాండ్ విక్టరీపై సిఎం వైఎస్ జగన్ స్పందన
-
ఏపీ పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ సరికొత్త రికార్డు
సాక్షి, విజయవాడ: పరిషత్ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్సీపీ సరికొత్త రికార్డ్ సృష్టించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం నమోదు చేసింది. అన్ని జడ్పీ చైర్మన్ల స్థానాలను వైఎస్సార్సీపీ దక్కించుకుని, 100 శాతం జడ్పీ ఛైర్మన్లను దక్కించుకున్న పార్టీగా రికార్డు సాధించింది. ఆదివారం విడుదలై షరిషత్ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్సీపీ విజయ ఢంకా మోగించింది. చదవండి: MPTC, ZPTC elections results: పంచాయతీ, మునిసిపల్‌ను మించి జైత్రయాత్ర ఇప్పటివరకు 7212 ఎంపీటీసీ స్థానాలకు ఫలితాలు విడుదల కాగా.. వైఎస్సార్సీసీ 5998 స్థానాలతో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది. కాగా, టీడీపీ 826 స్థానాలకు పరిమితమైంది. అదే విధంగా 512 జడ్పీటీసీ స్థానాల్లో ఫలితాల్ని ప్రకటించగా, వైఎస్సార్సీసీ 502 స్థానాలు గెలుచుకుంది. టీడీపీ-6, జనసేన-2, సీసీఎం-1,ఇతరులు-1 జడ్పీటీసీ స్థానాలకు పరిమితమయ్యాయి. -
గెలిచింది.. కానీ ఆమె లేదు!
కర్లపాలెం(బాపట్ల): పాపం.. ఆమె మరణించి గెలిచింది. ఎన్నికలు పూర్తయిన కొద్ది రోజులకే మృతిచెందిన ఆమె.. ఆదివారం జరిగిన ఓట్ల లెక్కింపులో ఎంపీటీసీగా విజయం సాధించింది. ఆమె బతికున్నట్టయితే ఎంపీపీగా ఎన్నికై ఉండేది కూడా. గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం–1 సెగ్మెంట్ నుంచి ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేసిన ఝాన్సీలక్ష్మి ఎన్నికల అనంతరం అనారోగ్యంతో మరణించారు. వైఎస్సార్సీపీ కర్లపాలెం మండల అధ్యక్షుడు దొంతిబోయిన సీతారామిరెడ్డి సతీమణి అయిన ఆమెను కర్లపాలెం ఎంపీపీ అభ్యర్థిగా పార్టీ అధిష్టానం ప్రకటించింది కూడా. సమీప టీడీపీ అభ్యర్థి పిట్ల వేణుగోపాల్‌రెడ్డిపై 134 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఆమె గెలిచిందని తెలియగానే.. ఆమెను తలుచుకుని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఇదిలా ఉండగా ఆమె భర్త సీతారామిరెడ్డిని పార్టీ నాయకులు ఊరేగింపుగా ఇంటి వరకూ తీసుకురావడంతో కుటుంబ సభ్యులు, కార్యకర్తలు ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం ఝాన్సీలక్ష్మి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చదవండి: Jupudi Prabhakar Rao: టీడీపీకి గుండు సున్నానే.. -
Youngest MPTC: చిన్న వయసులోనే.. ‘ఎంపీటీసీ’!
ద్వారకా తిరుమల: అతి చిన్న వయసులోనే ఎంపీటీసీ సభ్యురాలిగా గెలుపొందిన ఆ యువతిని పలువురు అభినందిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం సత్తెన్నగూడేనికి చెందిన 21 ఏళ్ల మానుకొండ షహీల డిగ్రీ పూర్తి చేసింది. ఇటీవలే ఆమెకు వివాహమైంది. మండలంలోని పంగిడిగూడెం–1 ఎంపీటీసీ స్థానానికి వైఎస్సార్సీపీ తరఫున బరిలో నిలిచి.. 557 ఓట్లకు పైగా మెజారిటీతో గెలుపొందింది. ఆమెను ఎమ్మెల్యే తలారి వెంకట్రావు తదితరులు అభినందించారు. మానుకొండ షహీల -
Jupudi Prabhakar Rao: టీడీపీకి గుండు సున్నానే..
సాక్షి, అమరావతి: టీడీపీ ఎన్నికల్లో పోటీ చేసినా, చేయకపోయినా దక్కే ఫలితం గుండు సున్నానే అని ప్రభుత్వ సలహాదారు (సామాజిక న్యాయం) జూపూడి ప్రభాకరరావు ఎద్దేవా చేశారు. సీఎం వైఎస్ జగన్ గత రెండున్నరేళ్లుగా సామాజిక విప్లవ పంథాను అనుసరిస్తున్నారని తెలిపారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జూపూడి ప్రభాకరరావు ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకు ఏ రోజూ రాజకీయాధికారం దక్కని వర్గాలకు ఇప్పుడు దాన్ని అందించిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. కొన్ని కుటుంబాలకే పరిమితమైన పదవులను బడుగు, బలహీనవర్గాలకు కూడా వందల్లో, వేలల్లో అందించారని కొనియాడారు. భారత రాజ్యాంగానికి ప్రతిరూపంగా సామాజిక న్యాయం ఏపీలోనే అమలవుతోందని సామాజిక న్యాయ నిపుణులు, శాస్త్రవేత్తలు సైతం కొనియాడుతున్నారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు సీఎంకు ఇస్తున్న మద్దతు చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారన్నారు. అందుకే ప్రజల దృష్టి మళ్లించేందుకు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో గెలవలేమని తెలుసుకుని ముందుగానే కాడి పారేసి పారిపోయారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రజల నమ్మకాన్ని పోగొట్టుకున్నారన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందుకున్న బడుగు, బలహీన వర్గాలన్నీ సీఎం జగన్‌కి అండగా నిలుస్తున్నారని తెలిపారు. టీడీపీతో ఉన్న వర్గాలేవో చంద్రబాబు చెప్పగలరా అని ప్రశ్నించారు. ఎస్సీలపై చంద్రబాబు వాడిన భాషను ఎప్పటికీ ఈ వర్గాలు మరిచిపోవన్నారు. దళిత మహిళా హోం మంత్రి సుచరితపై టీడీపీ మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి మాటలను ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. అలాంటి మాటలను నియంత్రించకుండా నవ్వుతూ కూర్చున్న చంద్రబాబు, టీడీపీ నేతలను ఏమనాలి అని ప్రశ్నించారు. చదవండి: AP MPTC, ZPTC elections results: వారెవా.. వలంటీర్! -
‘‘చంద్రగిరిలో చంద్రబాబు శంకరగిరి మాన్యాలు పట్టారు’’
సాక్షి, తాడేపల్లి: ‘‘ఆంధ్రప్రదేశ్ పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ దూసుకుపోతుంది. ఇంత చక్కని ఫలితాలు అందించిన ప్రజలకు కృతజ్ఞతలు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జనరంజక పాలన చేస్తున్నారు కాబట్టే ఇంత మంచి ఫలితాలు వస్తున్నాయి’’ అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘స్థానిక సంస్థలకు చాలా ప్రాముఖ్యత ఉంది. మహాత్మా గాంధీ చెప్పినట్లు స్థానికంగా పరిపాలన జరగాలి. ఈ ఎన్నికలు సరైన సమయంలో జరగాలని రాజ్యాంగంలో పొందుపరిచారు. కానీ గత ప్రభుత్వంలోనే గడువు ముగిసింది. రాజ్యాంగపరంగా ఎన్నికలు జరపాలి. చంద్రబాబు గెలవలేమని ఎన్నికలు పెట్టకుండా పారిపోయాడు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికలు పెట్టాలని కృషి చేశారు. అప్పుడు ప్రారంభించిన ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతోంది’’ అన్నారు. ‘‘ఈ లోపు చంద్రబాబు, ఆయనతో కలిసి కొన్ని దుష్ట శక్తులు ఎన్నో కుట్రలు చేశారు. అర్ధాంతరంగా వాయిదా వేయడం నుంచి ఎన్నికలు జరిగినా ఫలితాలను ప్రకటించకుండా చేశారు. అన్ని అవరోధాలు దాటుకుని ఈ రోజు ఫలితాలు వస్తున్నాయి. దీంతో మేము బహిష్కరించాం అని మాట్లాడుతున్నారు. పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో నువ్వు, నీ కొడుకు కాలికి బలపం కట్టుకుని తిరిగారు.. ఫలితాలు ఏమైనా మారాయా. కుప్పం కూడా కుప్పకూలి పోయింది... చంద్రగిరి శంకరగిరి మాన్యాలు పట్టింది. ఇక టీడీపీ మూసేయడానికి సిద్ధంగా ఉంది...తెలుసుకోలేకపోతే నీ ఖర్మ’’ అన్నారు అంబటి. ‘‘ఈ ఫలితాలు జగన్మోహన్రెడ్డి జనరంజక పాలన చేస్తున్నాడు కాబట్టే వస్తున్నాయి. ఇలాంటి చక్కని ఫలితాలను ఇస్తున్న ప్రజలకు కృతజ్ఞతలు. ఏ ఎన్నికలైనా ఒకే ఫలితాలను ఇస్తున్నారు కుట్రలు కుతంత్రాలు తప్ప ప్రజల మధ్యకు వెళ్లి గెలవాలని చంద్రబాబుకి లేదు. ఆయన అధికారంలోకి వచ్చిందే కుట్రల వల్ల మమ్మల్ని 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పరిపాలించమని ప్రజలు అధికారం ఇచ్చారు. ఇప్పుడు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. కావాలంటే టీడీపీ మొత్తం రాజీనామా చేయండి... మీ నియోజకవర్గాల్లో పోటీ చేసి తేల్చుకుందాం’’ అంటూ అంబటి సవాలు విసిరారు. చదవండి: పూర్తి ప్రజామోదంతో మెరుగైన పరిపాలన చేస్తాం: మంత్రి కురసాల -
‘ప్రజలు సీఎం జగన్‌ను గుండెల్లో పెట్టుకున్నారు’
అమరావతి: ప్రతిపక్షాలు ఎన్నో కుట్రలు, కేసులతో ఎన్నికల రద్దుకోసం ప్రయత్నం చేశాయని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో వైఎస్సార్సీపీ హవా కొనసాగుతున్న నేపథ్యంలో మంత్రి అనిల్ కుమార్ ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫలితాల తీరు చూస్తుంటే గతంలో వచ్చిన ఫలితాల కంటే అత్యధిక స్థానాలను వైఎస్సార్సీపీ సొంతం అయ్యే అవకాశం స్పష్టంగా కనబడుతోందన్నారు. ఈ ఫలితాలే సీఎం వైఎస్ జగన్ పాలనకు నిదర్శనమని తెలిపారు. కాగా, తాము ఎన్నికలను బహిష్కరించాం అంటున్న నేతలకు సిగ్గుందా.. అని సూటిగా ప్రశ్నించారు. టీడీపీ అభ్యర్థులను నిలబెట్టి ప్రచారం చేసింది. కానీ, ఘోరమైన ఫలితాలు వస్తాయని ముందే తెలిసి పారిపోయిందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు టీడీపీ వైపు ఎందుకుంటారు? ఆయా వర్గాలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన సంక్షేమ ఫలాలకు తగినట్టుగా ఫలితాలు వచ్చాయని అన్నారు. ప్రజలంతా వైఎస్ జగన్‌ను గుండెల్లో పెట్టుకుని తీర్పునిస్తున్నారని అన్నారు. కొందరు నాయకులు హైదరాబాద్‌లో ఉంటేనే మంచిదని.. ఇక్కడ అడుగుపెడితే కుట్రలు చేస్తారని మండిపడ్డారు. మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డను అడ్డుపెట్టుకుని కుట్ర చేయాలనుకున్న వారికి ప్రజలు బుద్ధి చెప్పారని తెలిపారు. మున్సిపాలిటీ, పంచాయతీ ఫలితాల్లో వైఎస్సార్సీపీ తిరుగులేని మెజారిటీ సాధించిందని చెప్పారు. చాలా చోట్ల ఏకగ్రీవాలు అయ్యాయని టీడీపీ నేత అచ్చెన్న మాట్లాడుతున్నాడు.. అసలు ఆయా చోట్ల ఆ పార్టీకి ఒక్కరు కూడా నామినేషన్ వేయడానికి దిక్కులేదని ఎద్దేవా చేశారు. ఫలితాలను చూసి చంద్రబాబు అయ్యన్నతో మాట్లాడిస్తున్నట్టుందని మండిపడ్డారు. తమకు చేతకాదా? తాము తిట్టలేమా? కానీ తమకు సంస్కారం ఉందని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. చదవండి: బాబు ఇలాకాలో ఫ్యాన్ హవా -
కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్న అధికారులు
-
AP ZPTC MPTC: కుప్పంలో ప్రశాంతంగా ఎన్నికల కౌంటింగ్
-
మ్యాగజైన్ స్టోరీ 17 September 2021
-
ఏపీ పరిషత్ ఎన్నికలు: సింగిల్ బెంచ్ ఆదేశాలపై స్టే
సాక్షి, అమరావతి: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై సింగిల్ బెంచ్ ఆదేశాలపై డివిజన్ బెంచ్ స్టే విధించింది. ఎన్నికలు రద్దు చేయాలన్న సింగిల్ బెంచ్ ఆదేశాలను నిలిపి వేసింది. సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై హైకోర్టు డివిజన్ బెంచ్ శుక్రవారం స్టే విధించింది. జులై 27న సమగ్ర విచారణ జరుపుతామని డివిజన్ బెంచ్ తెలిపింది. తదుపరి ఉత్తర్వుల వచ్చే వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోకూడదని ఆదేశించింది. సుప్రీం ఆదేశాల మేరకే ఎన్నికలు జరిపామని ఎస్ఈసీ లాయర్ కోర్టుకు వివరించారు. చదవండి: ఏపీ ప్రభుత్వానికి యూఎస్ కాన్సులేట్ అభినందనలు శ్రీశైలంలో తెలంగాణ విద్యుదుత్పత్తిని ఆపండి -
ఏపీ ఎస్ఈసీకి హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రాష్ట్ర ఎన్నికల సంఘానికి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఏకగ్రీవాలపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఏకగ్రీవాలపై దర్యాప్తు చేసే అధికారం ఎస్ఈసీకి లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఎస్ఈసీ ఉత్తర్వులను హైకోర్టు కొట్టేసింది. ఈ మేరకు ఏకగ్రీవంగా ఎన్నికైన ఎంపీటీసీ, జడ్పీటీసీలను తక్షణమే అధికారికంగా ప్రకటించాలని హైకోర్టు ఎస్ఈసీని ఆదేశించింది. తక్షణమే ఎంపికైన అభ్యర్ధులకు డిక్లరేషన్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే, గత ఏడాది మార్చ్15న కరోనా కారణంగా జెడ్పీటీసీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. వాయిదా పడే సమయానికి నామినేషన్ల ఉపసంహరణ కూడా పూర్తి అయింది. రాష్ట్ర వ్యాప్తంగా 660 జెడ్పీటీసీ స్ధానాలకి నోటిఫికేషన్ విడుదల కాగా, 8 జెడ్పీటీసీ స్ధానాలకు కోర్టు వివాదాలతో ఎన్నికల ప్రక్రియ ఆగిపోయింది. మిగిలిన 652 జెడ్పీటీసీ స్ధానాలకి 126 జెడ్పీటీసీలు వైఎస్సార్సీపీకి ఏకగ్రీవం అయ్యాయి. వైఎస్సార్ కడప జిల్లాలో 50 జెడ్పీటీసీ స్ధానాలకు 38, చిత్తూరులో 65 స్ధానాలకి 30, కర్నూలు జిల్లాలో 53 స్ధానాలకి 16, ప్రకాశంలో 56 స్ధానాలకి 14 జెడ్పీటీసీ స్ధానాలు, నెల్లూరులో 46కు 12, గుంటూరులో 57కు 8 స్ధానాలు, కృష్ణాలో 49కి రెండు స్ధానాలు, పశ్చిమ గోదావరి 48కి రెండు స్ధానాలు, విజయనగరంలో 34 స్ధానాలకు మూడు, విశాఖపట్నంలో 39కి ఒక జెడ్పీటీసీ స్థానం వైఎస్సార్సీపీకి ఏకగ్రీవం అయింది. అనంతపురం, శ్రీకాకుళం, తూర్పుగోదావరిలోఏకగ్రీవాలు కాలేదు. ఏకగ్రీవాలైన 126 మంది జెడ్పీటీసీలను అధికారికంగా ప్రకటించి మిగిలిన 526 జెడ్పీటీసీ స్ధానాలకు ఎస్ఈసీ ఎన్నికలు జరిపించాల్సి ఉంది. చదవండి: 126 జెడ్పీటీసీ, 2,406 ఎంపీటీసీలు ఏకగ్రీవం అమరావతి భూ కుంభకోణంపై సమగ్ర నివేదిక -
కాంగ్రెస్‌లో.. ‘కోమటిరెడ్డి’ కలకలం !
కాంగ్రెస్ పార్టీపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి శనివారం చేసిన విమర్శలు జిల్లాలో కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని వీడగా.. తాజాగా రాజగోపాల్‌రెడ్డి కూడా పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడంతో.. ఆయన కూడా పార్టీ వీడుతారనే చర్చ సాగుతోంది. సాక్షిప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలను గెలుచుకున్న ఆనందం కాంగ్రెస్‌లో ఆవిరి అవుతున్నట్లే కనిపిస్తోంది. ఆ ఎన్నికల్లో వచ్చిన విజయం అందించిన ఉత్సాహం పట్టుమని నెల రోజులు కూడా నిలబడలేదని సగటు కాంగ్రెస్ కార్యకర్త ఉసూరుమంటున్నారు. స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి, స్థానిక సంస్థల ఎన్నికల్లో అపజయాన్ని దిగమింగుకుంటున్న తరుణంలోనే ఆ పార్టీ నాయకుడు, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన ప్రకటన కలకలం రేపుతోంది. ఆయన ప్రకటన దుమారం కేవలం నల్లగొండ జిల్లాకే పరిమితం కావడం లేదు. పార్టీ నాయకత్వం తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన రాజగోపాల్‌రెడ్డి అడుగులు కమలం గూటివైపు వడివడిగా పడుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికిప్పుడు బీజేపీలో చేరాలన్న నిర్ణయం తీసుకోలేదని ఆయన చెబుతున్నా.. అంతిమంగా తీసుకోబోయే నిర్ణయం మాత్రం అదే అయివుంటుందని చెబుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకత్వం పూర్తిగా విఫలమైన తరుణంలో ఇక టీఆర్ఎస్కు ఏకైక ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని ఆయన కుండబద్దలు కొట్టారు. దీంతో జిల్లా కాంగ్రెస్ శ్రేణులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఉత్తమ్, కుంతియాపై.. విమర్శలు.. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకత్వమంతా ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ మాజీ నేత, సీనియర్ నాయకుడు కుందూరు జానారెడ్డి, మాజీ మంత్రి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మరో సీనియర్, మాజీ మంత్రి ఆర్.దామోదర్‌రెడ్డి వంటి నేతలున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌లో, ప్రధానంగా దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉన్న జిల్లాగా ఉమ్మడి నల్లగొండకు పేరుంది. దానికి తగినట్లే మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో రెండుకు రెండు ఎంపీ స్థానాలను గెలుచుకుంది. అంతకు ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడు స్థానాలకే పరిమితం అయినా.. రాష్ట్రంలో వీచిన టీఆర్ఎస్ గాలిని తట్టుకుని సాధించిన విజయం కావడంతో ఆ పార్టీ వర్గాలు కొంత సంతృప్తిగానే ఉన్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో రాజగోపాల్‌రెడ్డి చేసిన ప్రకటన ప్రకంపనలు సృష్టిస్తోంది. జిల్లాకే చెందిన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌పైనా ఆయన వ్యాఖ్యలు చేశారు. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా రాజగోపాల్‌రెడ్డి ఇటు ఉత్తమ్‌పైనా, అటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ ఆర్సి.కుంతియాపైనా త్రీవస్థా యిలో ధ్వజమెత్తారు. ఇప్పుడు సరిగ్గా అదే ఇద్దరు నేతల వైఫలమ్యే రాష్ట్ర కాంగ్రెస్ దుస్థితికి కారణమని వేలెత్తి చూపారు. పీసీసీ పీఠం దక్కదని తెలిసే.. తిరుగుబాటు చేశారా? రాష్ట్ర కాంగ్రెస్ సారథ్యం కోసం ఎప్పటి నుంచే కోమటిరెడ్డి సోదరులు ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఆ పీఠంపై రాజగోపాల్‌రెడ్డికి ఆశ ఉందని పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్ర నాయకత్వ మార్పు ఉంటుందని అప్పట్లో జాతీయ నాయకత్వం సంకేతాలు ఇచ్చిందని, కానీ, మార్పు మాత్రం జరగలేదన్న అసంతృప్తి వీరిలో ఉందంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా.. ఎంపీ టికెట్ దక్కించుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజయం సాధించారు. స్థానిక ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి జిల్లా నాయకులు ఎవరూ ముందుకు రాకపోవడంతో మళ్లీ కోమటిరెడ్డి సోదరులే ముందుకు వచ్చి, రాజగోపాల్ రెడ్డి భార్య లక్ష్మిని పోటీకి నిలబెట్టి, విజయం కోసం బాగానే ఖర్చుపెట్టారు. ఈ ఎన్నికల్లో జిల్లా సీనియర్లుగానీ, టీపీసీసీ చీఫ్‌గానీ సీరియస్‌గా తీసుకుని పనిచేయలేదన్నది రాజగోపాల్‌రెడ్డి అభియోగం. జిల్లా పరిషత్ ఎన్నికల్లో సైతం కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లాలోని 31 మండలాలకు గాను 23 మండలాల్లో, రంగారెడ్డి తదితర జిల్లాల్లోనూ బాధ్యతలు మీదేసుకుని పనిచేశారు. ఇంత చేసినా.. జాతీయ నాయకత్వం గుర్తించకపోవడం, పీసీసీ పదవికి సోదరుల పేర్లను పరిశీలించకపోవడంతో రాజగోపాల్‌రెడ్డి తిరుగుబాటు జెండా ఎగరేశారని విశ్లేషిస్తున్నారు. అడుగులు.. కమలం గూటివైపేనా..? కాంగ్రెస్ నాయకత్వాన్ని తూర్పారా బట్టిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరుతారన్న అభిప్రాయమూ వ్యక్తం అవుతోంది. ఒకవైపు కాంగ్రెస్ నాయకత్వ వైఫల్యాలను ఎండగడుతూనే.. అదేస్థాయిలో బీజేపీని పొగిడిన వైనం చూస్తే.. ఆయన కమలం గూటికి చేరడం ఖాయమని అర్థమవుతోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాగా, తన తమ్ముడు రాజగోపాల్‌రెడ్డి చేసిన ప్రకటనపై, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందించ లేదు. జిల్లా కాంగ్రెస్‌కు పెద్దదిక్కుగా ఉన్న కోమటిరెడ్డి సోదరులు ఇప్పుడెలాంటి నిర్ణయం తీసుకుంటారు? రాజగోపాల్‌రెడ్డి ఒక్కరే పార్టీ మారుతారా? అయితే, వెంకట్‌రెడ్డి కాంగ్రెస్‌లోనే కొనసాగుతారా..? లేక ఆయనా మరేదైనా నిర్ణయం తీసుకుంటారా..? అన్న ప్రశ్నలు ప్రస్తుతం కాంగ్రెస్ కార్యకర్తల మదిని తొలుస్తున్నాయి. -
చివరి ‘నాలుగు’ మాటలు!
సాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లాల పునర్విభజనలో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా నాలుగు జిల్లా పరిషత్‌లుగా విడిపోయింది. పాత పాలకవర్గం పదవీ కాలం ముగియకపోవడంతో ఇన్నాళ్లూ ఉమ్మడిగానే సభలు, సమావేశాలు నిర్వహించారు. ఇటీవల పరిషత్ ఎన్నికలు ముగియడం.. పాలక వర్గాల పదవీ కాలం దగ్గరపడడం.. కొత్త పాలకవర్గం కొలువుదీరిన తర్వాత ఏ జిల్లాలో ఆ జెడ్పీ సమావేశాలు జరుపుకోనున్నారు. ప్రస్తుతం చివరిగా ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్ సమావేశం శనివారం నిర్వహించనున్నారు. పునర్విభజన తర్వాత ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిషత్‌లకు ఇటీవల ఎన్నికలు జరిగాయి. ఇక నుంచి ఆ జిల్లాల్లోనే జెడ్పీ సమావేశాలు నిర్వహించనున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్ పాలకవర్గం హయాంలో ఐదేళ్లలో రూ.42.12కోట్లతో ఉమ్మడి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. 2014, ఆగస్టు 6వ తేదీన ప్రారంభమైన జెడ్పీ పాలక వర్గ పదవీకాలం ఈ ఏడాది ఆగస్టు 6వ తేదీన ముగియనున్నది. 2014లో ఉమ్మడి జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌గా టీడీపీకి చెందిన గడిపల్లి కవిత ఎన్నిక కాగా.. రాష్ట్రస్థాయిలో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆమె టీఆర్ఎస్లో చేరారు. అయితే పదవీ కాలం మరి కొద్దినెలల్లో ముగుస్తుందనగా.. చైర్పర్సన్ పదవికి ఆమె రాజీనామా చేయడంతో వైస్ చైర్మన్ బరపటి వాసుదేవరావు జెడ్పీ చైర్మన్‌గా వ్యవహరించే అవకాశం వచ్చింది. 2014లో జరిగిన జెడ్పీ తొలి సాధారణ సమావేశానికి చైర్పర్సన్ హోదాలో గడిపల్లి కవిత అధ్యక్షత వహించగా.. చివరి సాధారణ సమావేశానికి వైస్ చైర్మన్‌గా ఉన్న వాసుదేవరావు చైర్మన్ హోదాలో అధ్యక్షత వహించే అవకాశం లభించింది. ఒకే పదవీ కాలంలో ఇద్దరు పనిచేసే అరుదైన అవకాశం ఈ హయాంలోనే లభించడం రాజకీయంగా విశేషంగా భావిస్తున్నారు. కొత్తగా ఏర్పడిన ఖమ్మం జిల్లా పరిషత్ పాలకవర్గంలో ప్రస్తుత జెడ్పీటీసీలు ఎవరూ తిరిగి ఎన్నిక కాలేదు. అయితే జెడ్పీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న బరపటి వాసుదేవరావు మాత్రం కొత్తగూడెం జిల్లా పరిషత్ పరిధిలోని పాల్వంచ జెడ్పీటీసీ సభ్యుడిగా తిరిగి ఎన్నికయ్యారు. కొత్తగా ఏర్పడిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్‌లో సభ్యుడిగా.. ఉమ్మడి జిల్లా పరిషత్‌కు చైర్మన్‌గా వ్యవహరించే అరుదైన అవకాశం సైతం ఆయనకే లభించింది. అనేక ప్రజా సమస్యలపై వివిధ రాజకీయ పక్షాల నుంచి గెలుపొందిన జెడ్పీటీసీ సభ్యులు.. జిల్లా పరిషత్ సాధారణ సమావేశం వేదికగా.. తమ వాణిని వినిపించడంతోపాటు రాష్ట్రస్థాయి సమస్యలపై స్పందించి తీర్మానాలు చేయాలని పట్టుపట్టిన సందర్భాలు సైతం అనేకం. జిల్లాను రెండేళ్ల క్రితం వణికించిన డెంగీ జ్వరాలను అరికట్టాలని, దీనిపై ప్రభుత్వం స్పందించాలని జెడ్పీ సమావేశం వేదికగా అన్ని రాజకీయ పక్షాలు మూకుమ్మడిగా చేసిన విజ్ఞప్తికి ప్రభుత్వం స్పందించి ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసింది. తాగు, సాగునీరు, విద్య, వైద్యం, వ్యవసాయం వంటి ప్రజా సమస్యలపై ఈ ఐదేళ్లలో ప్రజాప్రతినిధులతోపాటు వివిధ పార్టీల నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు తమ గళాన్ని వినిపించారు. అయితే తమ మండలాల పరిధిలో అనేక సమస్యలున్నా వాటిని పరిష్కరించుకునే ఆర్థిక వెసులుబాటు, నిధులు మంజూరు చేసుకునే పరిస్థితి జెడ్పీటీసీలకు లేకపోవడంతో కొంత నిరాశ నిస్పృహలు వారిలో అలముకున్నాయనే ప్రచారం ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్ సమావేశం శనివారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించనున్నారు. వ్యవసాయం, ఉపాధిహామీ, వైద్య, ఆరోగ్య శాఖలపై సమీక్షించనున్నారు. దీనికి సంబంధించిన ప్రగతి నివేదికలను అధికారులు ప్రజాప్రతినిధులకు చదివి వినిపించనున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇదే చివరి సమావేశం కావడంతో ప్రజాప్రతినిధులు, అధికారులు సమావేశంలో పాల్గొని పలు అంశాలపై క్షుణ్ణంగా చర్చించనున్నట్లు భావిస్తున్నారు. వ్యవసాయ శాఖ సమీక్షలో రాయితీపై విత్తనాల సరఫరా, రైతుబంధు, రైతుబీమా, ప్రధానమంత్రి కృషి సమ్మాన్ నిధి, ఎరువుల సరఫరా, మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణపై.. అలాగే జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ శాఖల నిర్వహణపై పూర్తి చర్చ నిర్వహించనున్నారు. ఇక ఉపాధిహామీ పథకంలో భాగంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలపై.. వైద్య, ఆరోగ్య శాఖ ప్రగతి నివేదికను అధికారులు ప్రజాప్రతినిధులకు వినిపించిన అనంతరం.. దీనిపై చర్చ కొనసాగనున్నది. ఐదేళ్లలో ప్రత్యేక తీర్మానాలు 2014 నుంచి నేటి జిల్లా పరిషత్ సమావేశం వరకు పలు అంశాలపై చర్చించి.. తీర్మానాలు చేశారు. 2019, సెప్టెంబర్ 29న నిర్వహించిన సమావేశంలో పలు అంశాలపై చర్చించిన అనంతరం జిల్లాలోని గిరిజన, బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు చదువుకుంటున్న ప్రభుత్వ పాఠశాలలను రేషనలైజేషన్ కింద మూసివేయకుండా కొనసాగించాలని తీర్మానం చేశారు. జిల్లాలోని వర్షాభావ పరిస్థితుల దృష్టా అన్ని మండలాలను కరవు మండలాలుగా ప్రకటించాలని, నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయాలని తీర్మానించారు. 2015, సెప్టెంబర్ 5న జరిగిన జెడ్పీ సమావేశంలో బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని తీర్మానం చేశారు. 2017, నవంబర్ 5న నిర్వహించిన సమావేశంలో భక్తరామదాసు కళాక్షేత్రం జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం ఆధీనంలోనే ఉండాలని తీర్మానించారు. రూ.42.12కోట్లతో అభివృద్ధి పనులు ఐదేళ్లలో జిల్లా పరిషత్ నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. రూ.42,12,93,608లతో అభివృద్ధి పనులను చేపట్టారు. ఎస్ఎఫ్సీ, టీఎఫ్సీ, సీనరేజి, జెడ్పీటీసీ నిధులు, ఇసుక వేలం, స్టాంప్ డ్యూటీ ద్వారా వచ్చిన నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఈ నిధులతో సీసీ రోడ్ల నిర్మాణం, సైడ్ డ్రెయిన్లు, పాఠశాల భవనాలు, ప్రభుత్వ కార్యాలయ భవనాల నిర్మాణాలు అధికంగా చేపట్టారు. ఇందులో దాదాపు 85 శాతం పనులు పూర్తయ్యాయి. మిగతా పనులు కొనసాగుతున్నాయి. -
పెట్టు‘బడి’ మాసం
పాపన్నపేట(మెదక్): పాఠశాలలు ఈనెల 12వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. జిల్లాలో 119 ప్రైవేట్ పాఠశాలలుండగా సుమారు 25 వేల మంది విద్యార్థులున్నారు. బడిగంటలు మోగే సమయం దగ్గర పడుతున్న కొద్దీ తల్లిదండ్రుల గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. ధనవంతులు.. ఉద్యోగులు.. రైతులు .. చిరుద్యోగులు.. మధ్య తరగతి వారంతా ఆంగ్ల మాధ్యమంపై మోజుతో తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలల్లో చదివించడానికే మొగ్గు చూపుతున్నారు. ఇందుకోసం అప్పులు చేయడానికి సైతం వెనుకాడడం లేదు. కొంతమందైతే కేవలం పిల్లల చదవుల కోసమే పొలాలు కౌలు కిచ్చి..పెద్ద మనుషులను ఇంటి దగ్గరే వదిలి.. పట్నం వెళ్లి కిరాయి రూములు తీసుకొని నివాసం ఉంటున్నారు. జూన్ నెల వచ్చిందంటే గుబులే.. జూన్ నెల వచ్చిందంటే చాలు అటు విద్యార్థుల తల్లిదండ్రుల్లో..ఇటు రైతన్నల్లో ఆందోళన ప్రారంభమవుతోంది. ప్రైవేట్ పాఠశాలల్లో ఏటా ఫీజులను 10 నుంచి 15 శాతం పెంచుతూ పోతున్నారు. నడక సరిగా రాని చిన్నారిని నర్సరీలో చేర్చాలంటే ఏటా కనీసం రూ.20 వేలు చెల్లించాల్సి వస్తోంది. ఫీజు రూ.12 వేలు కాకుండా, బుక్స్, బ్యాగ్‌లు, టై, షూ, సాక్స్, యూనిఫాం, చివరకు పుస్తకాలకు వేసే కవర్లు కూడా వారి దగ్గరే కొనాల్సి ఉంటుంది. ఇక ఇతర గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులకు బస్సు ఫీజు కింద ఏడాదికి రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నారు. నాలుగు, ఆపై తరగతులు చదువుతున్న విద్యార్థులకు యూనిఫాంలు బయట కొనే అవకాశం ఉన్నప్పటికీ, పాఠశాలల యాజమాన్యాలు సూచించిన రెడీమేడ్ షాప్‌ల్లో వారు చెప్పిన ధరలకే కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇక 6,8వ తరగతుల నుంచి కొన్ని పాఠశాలలు ఐఐటీ ఫౌండేషన్ పేరిట క్లాసులు నడుపుతున్నాయి. ఇవన్నీ కలిపి తల్లిదండ్రులకు తడిసి మోపెడవుతోంది. -
గులాబీ జోరు
మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష, కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక శుక్రవారం ముగిసింది. ఆయా మండల కేంద్రాల్లో ఎన్నికల అధికారులు చేతులెత్తే పద్ధతిన ఎన్నిక ప్రక్రియ నిర్వహించారు. జిల్లాలో 20 ఎంపీపీ స్థానాలు ఉండగా అంతా అనుకున్నట్లే జరిగింది. టీఆర్ఎస్ 13 ప్రాదేశిక పీఠాలను కైవసం చేసుకుంది. మూడింట కాంగ్రెస్ (రేగోడ్, చిన్నశంకరంపేట, నర్సాపూర్), రెండు చోట్ల స్వతంత్రులు (తూప్రాన్, చేగుంట) ఎంపీపీ పదవులను చేజిక్కించుకున్నారు. మరో రెండు స్థానాల్లో ఎన్నిక వాయిదా పడింది. చిన్నశంకరంపేటలో వైస్ ఎంపీపీని ఎన్నుకోలేదు. ఆ సమయంలో సభ్యులు లేకపోవడంతో అధికారులు వాయిదా వేశారు. ఎంపీపీ ఎన్నిక సందర్భంగా తూప్రాన్, నార్సింగిలో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. నర్సాపూర్‌లో కాంగ్రెస్, టీఆర్ఎస్ బలం సమానంగా ఉండడంతో ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కో ఆప్షన్ సభ్యులను డ్రా పద్ధతిన ఎన్నుకున్నారు. మరోవైపు వెల్దుర్తి, నార్సింగిలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. సాక్షి, మెదక్ : చిలప్‌చెడ్‌లో కో ఆప్షన్ సభ్యుడిని ఎన్నుకున్నప్పటికీ.. ఎంపీపీ ఎన్నిక సమయంలో ఎంపీటీసీ సభ్యులు హాజరుకాకపోవడంతో అధికారులు శని వారానికి వాయిదా వేశారు. ఎవరిని ఎన్నుకో వాలో సమన్వయం లేకపోవడంతో ఎంపీటీసీ సభ్యులు హాజరు కాలేదని తెలుస్తోంది. టేక్మాల్‌లో కోఆప్షన్ సభ్యుడిగా మజాహర్ నామినేషన్ వేయగా.. ఎంపీటీసీ సభ్యులెవరూ బలపర్చలేదు. దీంతో అధికారులు వాయిదా వేశారు. త్వరలో ఉన్నతాధికారులు దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు. వెల్దుర్తి ఎంపీపీ ఎన్నికలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ ఎంపీపీ పరిధిలో 12ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. టీఆర్ఎస్ నాలుగు, కాంగ్రెస్ ఐదు, స్వతంత్రులు ముగ్గురు గెలుపొందారు. టీఆర్ఎస్కు చెందిన వెల్దుర్తి–2 ఎంపీటీసీగా గెలిచిన మోహన్‌రెడ్డి మిగతా టీఆర్ఎస్ ఎంపీటీసీలు ముగ్గురు, స్వతంత్రులు ముగ్గురితో కలిసి క్యాంప్‌నకు వెళ్లారు. మోహన్‌రెడ్డిని ఎంపీపీగా ఎన్నుకోవాలని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి సైతం సూచించారు. ఎన్నిక సమయంలో క్యాంప్ నుంచి తిరిగి వస్తున్న క్రమంలో టీఆర్ఎస్కు చెందిన ముగ్గురు ఎంపీటీసీలు (మానెపల్లి, కొప్పులపల్లి, అచ్చంపేట) వాహనం దిగి వెళ్లిపోయారు. ఆ తర్వాత వారు కాంగ్రెస్ ఎంపీటీసీలతో కలిసి చర్చించారు. టీఆర్ఎస్కు చెందిన మానెపల్లి ఎంపీటీసీ సభ్యురాలు స్వరూపను ఎంపీపీగా ఎన్నుకున్నారు. కాంగ్రెస్‌కు చెందిన వెల్దుర్తి–1 ఎంపీటీసీ సుధాకర్‌గౌడ్‌ను వైస్ ఎంపీపీగా ఎన్నుకున్నారు. తూప్రాన్‌లో గలాటా ఎంపీపీ ఎన్నిక సందర్భంగా తూప్రాన్‌లో గలాటా చోటుచేసుకుంది. ఘనాపూర్ ఎంపీటీసీ సభ్యురాలు గడ్డి స్వప్న గెలిచిన వెంటనే కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. ఆమే ఎంపీపీగా ఎన్నికయ్యారు. వైస్‌ఎంపీపీగా వెంకటయ్యపల్లి ఎంపీటీసీ సభ్యురాలు శరణ్య, కో ఆప్షన్ సభ్యుడిగా గుండ్రెటిపల్లికి చెందిన కాంగ్రెస్ నాయకుడు మున్వర్ పాషా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో టీఆర్ఎస్కు చెందిన మల్కాపూర్ ఎంపీటీసీ సభ్యురాలు పంజాల వెంకటమ్మ కొడుకు ఆంజనేయులు అక్కడికి చేరుకుని పేపర్లను చించి వేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. టీఆర్ఎస్, కాంగ్రెస్ బాహాబాహీకి దిగడంతో అప్రమత్తమైన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. నార్సింగి.. సీన్ చేంజ్ ! అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి అన్నట్లు నార్సింగి ఎంపీపీ పీఠం ఎన్నికలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. నార్సింగి ఎంపీపీ పరిధిలో ఐదు ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. టీఆర్ఎస్ రెండు, కాంగ్రెస్ ఒకటి, స్వతంత్రులు (టీఆర్ఎస్ రెబెల్స్) రెండు స్థానాల్లో గెలుపొందారు. టీఆర్ఎస్ అధిష్టానం నార్సింగి–2 ఎంపీటీసీ ఆకుల సుజాతను ఎంపీపీగా, వల్లూరు ఎంపీటీసీ చిందం సబితను వైస్ ఎంపీపీగా నిర్ణయించింది. ఎంపీపీ ఎన్నిక సమయంలో శుక్రవారం సీన్ రివర్సైంది. అనూహ్యంగా శేరిపల్లి నుంచి కాంగ్రెస్ తరఫున గెలిచిన బండారు సంతోష.. టీఆర్ఎస్కు చెందిన వల్లూరు ఎంపీటీసీ చిందం సబితను అధ్యక్ష స్థానం కోసం ప్రతిపాదించారు. జప్తిశివనూర్ ఎంపీటీసీ మైలారం సుజాత కూడా సబితకు మద్దతు పలకడంతో ఆమె ఎంపీపీగా ఎన్నికయ్యారు. ఆకుల సుజాత వర్గీయులు ఆగ్రహానికి గురై ఎంపీటీసీ సంతోష భర్త గొండా స్వామిపై దాడికి దిగారు. పోలీసులు ఇరువురిని శాంతింపజేసి అక్కడి నుంచి పంపించి వేశారు. రిటర్న్ గిఫ్ట్! గత ప్రాదేశిక ఎన్నికల్లో ఆకుల సుజాత భర్త ఆకుల మల్లేశం గౌడ్ కాంగ్రెస్ తరఫున నార్సింగి–2 ఎంపీటీసీ సభ్యుడిగా గెలుపొందారు. ఈ సమయంలో కాంగ్రెస్ నుంచి ముగ్గురు ఎంపీటీసీలుగా గెలుపొందారు. చేగుంట మండలంలో టీఆర్ఎస్ పూర్తి స్థాయిలో మెజార్టీ సాధించి ముదం శ్రీనివాస్‌ను ఎంపీపీగా ప్రకటించి క్యాంప్‌నకు తరలించారు. ఇదే క్యాంప్‌లో ఉన్న ఉప్పరపల్లి ఎంపీటీసీ అల్లి రమను ఎన్నిక సమయంలో అనూహ్యంగా ఆకుల మల్లేశం గౌడ్ ఎంపీపీ పదవికి ప్రతిపాదించారు. అనుకోకుండా అల్లి రమ ఎంపీపీగా.. ఆకుల మల్లేశం గౌడ్ వైస్ ఎంపీపీగా ఎన్నికయ్యారు. తాజాగా ఇలాంటి పరిస్థితే మల్లేశం గౌడ్‌కు ఎదురై ఆమె భార్య సుజాతకు పదవి దక్కకుండా పోయిందని చర్చించుకుంటున్నారు. నర్సాపూర్ డ్రా.. నర్సాపూర్‌లో డ్రా పద్ధతిన ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కో ఆప్షన్ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ ఎంపీపీ పరిధిలో మొత్తం పది ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. టీఆర్ఎస్, కాంగ్రెస్ చెరో ఐదు స్థానాలను గెలుచుకున్నాయి. అధికారులు మూడు పదవులకు డ్రా తీశారు. కాంగ్రెస్‌కు చెందిన అహ్మద్‌నగర్ ఎంపీటీసీ సభ్యురాలు జ్యోతిని ఎంపీపీ పదవి వరించింది. వైస్ ఎంపీపీగా టీఆర్ఎస్కు చెందిన చిన్నచింతకుంట ఎంపీటీసీసీ సభ్యుడు వెంకటనర్సింగరావు, కో ఆప్షన్ సభ్యుడిగా టీఆర్ఎస్కు చెందిన ఎండీ.అఫ్జల్ ఇమ్రాన్‌ను అదృష్టం వరించింది. రేగోడ్ అంతా కాంగ్రెస్మయమైంది. మొత్తం ఏడు ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. కాంగ్రెస్ నాలుగు, టీఆర్ఎస్ మూడింట్లో గెలుపొందాయి. ఎంపీపీగా కాంగ్రెస్‌కు చెందిన పుర్ర సరోజన ఎన్నికయ్యారు. ఈమె గజ్వాడ నుంచి ఎంపీటీసీ సభ్యురాలిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వైస్ ఎంపీపీగా కాంగ్రెస్‌కు చెందిన ఆర్ ఇటిక్యాల నుంచి ఎంపీటీసీగా గెలిచిన ఇలీటం వినీల ఏకగ్రీవమయ్యారు. చిన్నశంకరంపేట ఎంపీపీ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఈ ఎంపీపీ పరిధిలో 12 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. కాంగ్రెస్ ఏడు.. టీఆర్ఎస్ నాలుగు.. స్వతంత్ర అభ్యర్థి ఒక్కరు గెలుపొందారు. కాంగ్రెస్‌కు ఆధిక్యం ఉండగా.. జంగరాయి ఎంపీటీసీ ఆవుల భాగ్యలక్ష్మిని ఎంపీపీగా ఎన్నకున్నారు. కోఆప్షన్ సభ్యుడిగా కంగ్రెస్‌కు చెందిన శిన్నశంకరంపేట వాసి దూదేకుల ఫరీద్ ఎన్నికయ్యారు. వైస్ ఎంపీపీ ఎన్నిక కోరం లేక వాయిదా పడింది. -
గులాబీ నేతలే మండలాధీశులు
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: మండల పరిషత్‌లన్నీ గులాబీమయమయ్యాయి. ప్రాదేశిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్ జిల్లాలో 27 మండలాలకు గాను, 24 మండల పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలను కైవసం చేసుకుంది. ఒక్క రెంజల్ మండల ఎంపీపీ స్థానాన్ని మాత్రం బీజేపీ దక్కించుకోగలిగింది. బోధన్, చందూరు మండలాల ఎంపీపీ, వైస్‌ఎంపీపీల ఎన్నికలు వాయిదా పడ్డాయి. ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌కు ఒక్క ఎంపీపీ స్థానం కూడా దక్కలేదు. చందూరులో మూడింటిలో రెండు ఎంపీపీ స్థానాలను కాంగ్రెస్ దక్కించుకున్నప్పటికీ.. బలపరిచే ఎంపీటీసీ లేకపోవడంతో అధికారులు ఈ ఎన్నికను వాయిదా వేశారు. బోధన్ మండల ఎంపీపీ ఎన్నిక కూడా వాయిదా పడింది. ఈ మండల ఎన్నిక కాస్త వివాదానికి దారితీసింది. ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈనెల4న జరిగింది. జిల్లాలో 299 ఎంపీటీసీ స్థానాలకు గాను 188 ఎంపీటీసీ స్థానాల్లో విజయం సాధించిన టీఆర్ఎస్ అదే స్థాయిలో 24 ఎంపీపీ పదవులను కైవసం చేసుకుంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో మోస్తారు 34 స్థానాలు సాధించిన బీజేపీ రెంజల్లో ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకోగలిగింది. 11 ఎంపీటీసీ స్థానాల్లో ఐదు ఎంపీటీసీలు గెలుచుకున్న కమలం పార్టీ స్వతంత్ర ఎంపీటీసీ మద్దతుతో ఎంపీపీ పీఠాన్ని దక్కించుకోగలిగింది. కత్తులు దూసుకున్న పార్టీలు కలిశాయి పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో కత్తులు దూసుకున్న టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఎంపీపీ ఎన్నికలకు వచ్చే సరికి మిలాఖత్ అయ్యాయి. నవీపేట్ ఎంపీపీ, వైస్‌ఎంపీపీ పదవుల విషయంలో ఈ రెండు పార్టీల ఎంపీటీసీలు చెట్టాపట్టాలేసుకుని పదవులను పంచుకోవడం ఆసక్తికరంగా మారింది. నవీపేట్ మండలంలో 16 ఎంపీటీసీలుండగా, టీఆర్ఎస్ ఏడు స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ ఐదు, బీజేపీ మూడు స్థానాల్లో విజయం సాధించాయి. ఇండిపెండెంట్ ఒక స్థానంలో గెలిచారు. ఏడు స్థానాలు గెలిచిన టీఆర్ఎస్కు బీజేపీ ఎంపీటీసీలు మద్దతు ఇవ్వడం గమనార్హం. దీంతో ఎంపీపీ పదవి టీఆర్ఎస్కు దక్కింది. ఇందుకు గాను బీజేపీకి వైస్ ఎంపీపీ పదవి దక్కింది. వరుస ఎన్నికల్లో నువ్వా నేనా అన్నట్లు కత్తులు దూసుకున్న ఈ రెండు పార్టీల ఎంపీటీసీలు పదవుల విషయానికి వస్తే మిలాఖత్ అవడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. ఒంటరైన కాంగ్రెస్.. కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో ఒక్క ఎంపీపీ పదవి కూడా దక్కలేదు. చందూరులో మూడింటిలో రెండు ఎంపీటీసీలను గెలుచుకున్నప్పటికీ., ఆ ఎ న్నిక కూడా వాయిదా పడింది. దీంతో 45 ఎంపీటీసీలు గెలుచుకున్న హస్తం పార్టీ ఒక్క ఎంపీపీ స్థానాన్ని కూడా దక్కించుకోలేక పోయింది. కాగా ఎడపల్లి ఎంపీపీ స్థానం సాంకేతికంగా కాంగ్రెస్ ఖాతాల్లో పడినప్పటికీ., ఎంపీపీగా ఎన్నికైన ఎంపీటీసీ టీఆర్ఎస్లో చేరడంతో ఆ ఒక్క స్థానం కూడా టీఆర్ఎస్ ఖాతాలో పడినట్లయింది. చందూరు, బోధన్ ఎన్నిక నేటికి వాయిదా.. ముందు ఊహించినట్లుగానే చందూరు, బోధన్ ఎంపీపీ, వైస్‌ఎంపీపీల ఎన్నికలు నేడు జరుగనున్నాయి. చందూరులో మూడు ఎంపీటీసీ స్థానాలకు గాను రెండు ఎంపీటీసీ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది. ఒకటి టీఆర్ఎస్కు దక్కిన విషయం విదితమే. మూడింటిలో రెండు స్థానాలున్న కాంగ్రెస్ ఎంపీపీ పదవి కోసం నామినేషన్ వేయగా, ప్రతిపాదించే ఎంపీటీసీ ఉన్నప్పటికీ, బలపరిచే ఎంపీటీసీ లేకపోవడంతో ఈ ఎన్నికను అధికారులు నిలిపివేశారు. దీంతో కాంగ్రెస్‌కు దక్కుతుందని అనుకున్న ఈ ఒక్క స్థానం కూడా దక్కకుండా పోయింది. బోధన్ ఎన్నిక కూడా వాయిదా పడింది. సరైన కోరం లేదనే కారణంగా అధికారులు ఈ ఎన్నికను నిలిపేశారు. ఈ విషయంలో ఎన్నికల అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారనే అభిప్రాయం వ్యక్తమైంది. -
జెడ్పీ చైర్మన్ ఎన్నిక.. నేడే!
సాక్షిప్రతినిధి, నల్లగొండ : నల్లగొండ జిల్లా ప్రజా పరిషత్‌పై తొలిసారి గులాబీ జెండా ఎగరనుంది. 31 జెడ్పీటీసీ స్థానాలకు అత్యధికంగా 24 జెడ్పీటీసీలను సొంతం చేసుకున్న టీఆర్ఎస్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోనుంది. శనివారం నాటి ఎన్నిక లాంఛనమే కానుంది. నార్కట్‌పల్లి జెడ్పీటీసీ సభ్యుడు బండా నరేందర్ రెడ్డి పేరు ఖరారైందని పార్టీ వర్గాలు తెలిపాయి. మిర్యాలగూడ జెడ్పీటీసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి కూడా చైర్మన్ పదవిని ఆశించారు. కానీ, ఆయనకు మరో పదవి రూపంలో గుర్తింపు ఇస్తామని పార్టీ నాయకత్వం నచ్చజెప్పినట్లు చెబుతున్నారు. పార్టీ వర్గాల సమాచారం మేరకు జిల్లా పరిషత్‌లో ప్రధానమైన నాలుగు పదవులను నాలుగు నియోజకవర్గాలకు కేటాయించారని చెబుతున్నారు. వైస్ చైర్మన్ పదవి నాగార్జునసాగర్ నియోజకవర్గానికి కేటాయించినట్లు సమాచారం. అనుముల జెడ్పీటీసీ సభ్యుడు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఇరుగి పెద్దులు పేరు ఖరారైందని తెలుస్తోంది. కోఆప్షన్ సభ్యుల విషయానికొస్తే మిర్యాలగూడ, నల్లగొండ నియోజకవర్గాలకు కో–ఆప్షన్ సభ్యుల పదవులు ఇవ్వాలని నిర్ణయించారని అంటున్నారు. మిర్యాలగూడ నియోజకవర్గం మాడ్గులపల్లి మండలం ఆగమోత్కూరు మాజీ సర్పంచ్ మోసిన్ అలీ, నల్లగొండ నియోజకవర్గం నుంచి క్రిస్టియన్ సామాజిక వర్గానికి చెందిన జాన్ శాస్త్రి పేర్లపై చర్చ జరిగిందని అంటున్నారు. దేవరకొండ నియోజకవర్గానికి జెడ్పీ స్టాండింగ్ కమిటీల్లో అవకాశం కల్పిస్తామ హామీ ఇచ్చారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఎన్నికల లాంఛనమే...! జిల్లాలోని 31 జెడ్పీటీసీ సభ్యులకుగాను టీఆర్ఎస్ 24 మందిని, కాంగ్రెస్ ఏడుగురు సభ్యులను గెలచుకున్నాయి. దీంతో అత్యధిక మెజారిటీ ఉన్న టీఆర్ఎస్ అభ్యర్థి చైర్మన్‌గా ఎన్నిక కావడం లాంఛనమే. జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల అనంతరం సభ్యులను క్యాంపులకు తరలించారు. జిల్లా ఇన్చార్జ్, మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి నేతృత్వంలో క్యాంప్ ఏర్పాటైంది. వీరంతా శనివారం జరిగే జెడ్పీ చైర్మన్ ఎన్నికకు ఉదయం 10 గంటల కల్లా జిల్లా పరిషత్‌కు చేరుకుంటారు. ముందుగా కోఆప్షన్ సభ్యుల ఎన్నిక, ఆ తర్వాత చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుంది. దీనికి సంబంధించి జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. -
నేడు జెడ్పీచైర్మన్ ఎన్నిక
ఆదిలాబాద్‌అర్బన్: జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షుడు (జెడ్పీచైర్మన్), ఉపాధ్యక్షుడు (వైస్‌చైర్మన్) పదవులకు శనివారం ఎన్నిక జరగనుంది. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉదయం 9 గంటల నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. కలెక్టర్ పర్యవేక్షణలో జరిగే ఈ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. కాగా, ముందుగా మైనార్టీ వర్గానికి చెందిన ఇద్దరిని కోఆప్షన్ సభ్యులుగా ఎన్నుకుంటారు. అనంతరం చైర్పర్సన్, వైస్‌చైర్మన్ ఎన్నిక చేపడుతారు. జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్, కోఆప్షన్ సభ్యుల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి వంద మీటర్ల వరకు 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. పరిషత్ చుట్టూ పక్కల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. ఎన్నిక ప్రక్రియ ఇలా.. కోఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియలో భాగంగా శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. శనివారం ఉదయం 10 గంటల వరకు కోఆప్షన్ సభ్యుల పోటీకి నామినేషన్లు స్వీకరిస్తారు. మధ్యాహ్నం 12 గంటల వరకు నామినేషన్లను పరిశీలించి, ఒంటి గంట వరకు నామినేషన్ ఉపసంహరణకు అవకాశమిస్తారు. ఒకవేళ ఒక అభ్యర్థే పోటీపడితే వారినే ఎన్నికైనట్లుగా ప్రకటిస్తారు. పోటీ ఉంటే ఎన్నిక నిర్వహించి గెలుపొందిన వారిని ప్రకటిస్తారు. నూతనంగా ఎన్నికైన సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించాల్సి ఉంటుంది. తద్వారా మధ్యాహ్నం 3 గంటల సమయంలో చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నిక చేపడుతారు. ఈ ప్రక్రియకు కొత్తగా ఎన్నికైన జెడ్పీటీసీలందరూ హాజరుకానున్నారు. ఎవరికో చైర్మన్ గిరి.. జిల్లాలో 17 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ తొమ్మిది జెడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకోగా, బీజేపీ 5, కాంగ్రెస్ 5 చొప్పున జెడ్పీటీసీ స్థానాలు దక్కించుకున్నాయి. అయితే టీఆర్ఎస్ పార్టీ గెలిచిన స్థానాలు మేజిక్ ఫిగర్‌కు కరెక్ట్‌గా సరిపోవడంతో ఎవరిని జెడ్పీ అధ్యక్ష పీఠం ఎక్కిస్తారనేది ఉత్కంఠగా మారింది. ఏ ఒక్క సభ్యుడిని పట్టించుకోకున్నా.. ఇబ్బందులు తలెత్తే అవకాశాలుండడంతో అందరిని కలుపుకొని పోయే దిశగా ఆ పార్టీ అడుగులు వేసేందుకే ఇంత వరకు చైర్మన్ అభ్యర్థిని ప్రకటించలేదని పలువురు చర్చించుకుంటున్నారు. అయితే టీఆర్ఎస్ తరఫున నేరడిగొండ జెడ్పీటీసీగా గెలుపొందిన అనిల్ జాదవ్, నార్నూర్ జెడ్పీటీసీగా గెలుపొందిన రాథోడ్ జనార్దన్‌ల పేర్లు అధ్యక్ష పదవి రేసులో ప్రధానంగా వినిపిస్తుండగా.. భీంపూర్ జెడ్పీటీసీగా గెలుపొందిన సుధాకర్ పేరు కూడా పరిశీలనలోకి వస్తున్నట్లు సమాచారం. అయితే అనుభవం, సీనియార్టీని దృష్టిలో ఉంచుకొని అభ్యర్థి ఎంపిక చేపడితే నేరడిగొండ, నార్నూర్ జెడ్పీటీసీలుగా గెలుపొందిన వారిద్దరిలో ఎవరో ఒకరు చైర్మన్ కానున్నారు. -
చెట్టాపట్టాల్!
సాక్షి, ఆదిలాబాద్: సిద్ధాంతాల పరంగా ఆ రెండు పార్టీలు పూర్తిగా వ్యతిరేకం.. అయితేనేం పరిస్థితులకు అనుగుణంగా అవి ఏకమయ్యాయి. టీఆర్ఎస్కు వ్యతి రేకంగా కలిసి పనిచేస్తున్నాయి. దీంతో బీజేపీ, కాంగ్రెస్‌ల కొత్త రాజకీయంతో ఆదిలాబాద్ ప రిషత్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఈ కొత్త సమీకరణ లు గులాబీ పార్టీని నిలువరించేలా చేశాయి. రెండు ఎంపీపీ స్థానాలను టీఆర్ఎస్కు దక్కకుండా చూశాయి. మరో ఎంపీ పీ స్వతం త్ర అభ్యర్థికి దక్కడంలో కీలక పాత్ర వహించాయి. ఈ మార్పు ఇప్పుడు ఆదిలాబాద్ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. నేడు జెడ్పీ చైర్మన్ ఎన్నిక జరగనుండగా ఈ కలయిక టీఆర్ఎస్లో గుబులు రేపుతోంది. విప్ జారీ.. నేడు జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్, కోఆప్షన్ సభ్యుల ఎన్నిక జరగనుండగా కాంగ్రెస్, బీజేపీల కలయిక టీఆర్ఎస్ను షాక్‌కు గురి చేస్తోంది. ఆదిలాబాద్ జెడ్పీలో 17 స్థానాలు ఉండగా, టీఆర్ఎస్ 9, బీజేపీ 5, కాంగ్రెస్ 3 గెలుచుకున్న విషయం తెలిసిందే.. మెజార్టీ 9 మంది సభ్యులను టీఆర్ఎస్ గెలిచినా జెడ్పీపీఠం దక్కించుకోవడంలో ఆ పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేశాయి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు. ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావులు జెడ్పీ పీఠం దక్కించుకునేందుకు ఎత్తులు వేస్తున్నారు. బీజేపీ నుంచి ఇటీవల ఎంపీగా గెలిచిన సోయం బాపురావు, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్ జెడ్పీ పీఠం టీఆర్ఎస్కు దక్కకుండా కాంగ్రెస్ మద్దతుతోనైనా నిలువరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ఇటీవల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన రాథోడ్ రమేశ్, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు భార్గవ్ దేశ్‌పాండేలు కలిసి టీఆర్ఎస్కు పీఠం దక్కకుండా బీజేపీతో జత కలిసి తాజా రాజకీయాలు తమకు అనువుగా మలుచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. శనివారం జెడ్పీ చైర్మన్ ఎన్నికకు సంబంధించి ఆయా పార్టీల వారీగా ఇప్పటికే సభ్యులకు విప్ జారీ చేశారు. పార్టీ ఆదేశాలకు అనుగుణంగా సభ్యులు నడుచుకోవాలని సూచించారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న టీఆర్ఎస్ సభ్యులకు, మాజీ ఎమ్మెల్యే యెండ్ల లక్ష్మీనారాయణ బీజేపీ సభ్యులకు, జిల్లా అధ్యక్షుడు భార్గవ్‌దేశ్ పాండే కాంగ్రెస్ సభ్యులకు విప్‌ను జారీ చేసే అధికారాన్ని పార్టీలు కట్టబెట్టాయి. దీనికి సంబంధించి ఈ ముగ్గురు జిల్లా కలెక్టర్ దివ్యదేవరాజన్‌కు పార్టీ పత్రాలను శుక్రవారం అందజేశారు. దీంతో సభ్యులకు ఆయా పార్టీల వారీగా విప్ జారీ చేశారు. నేడు జరిగే ప్రాదేశిక ఎన్నికల్లో సభ్యులు పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన పక్షంలో వారి సభ్యత్వం రద్దు చేసేందుకు ఈ విప్ అధికారం పార్టీ అధిష్టానం కల్పించింది. దీంతో ఈ ఎన్నికలు తాజా రాజకీయాలను వేడెక్కించాయి. టీఆర్ఎస్ 10కే పరిమితం.. మండల పరిషత్ అధ్యక్ష స్థానాలను అధికంగా కైవసం చేసుకోవాలన్న టీఆర్ఎస్ ఆశలకు గండి పడింది. ఆదిలాబాద్, బేల, భీంపూర్, బోథ్, గాదిగూడ, జైనథ్, నార్నూర్, నేరడిగొండ, తాంసి, ఉట్నూర్‌లలో ఆ పార్టీ మెజార్టీ సాధించడంతో ఎంపీపీ పీఠాలను కైవసం చేసుకోవడం సులువైంది. అయితే శుక్రవారం జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఆయా మండలాల్లో ఇతర పార్టీల్లోని సభ్యులను జత చేసుకోవడం ద్వారా 10 కంటే ఎక్కువ ఎంపీపీ స్థానాలు సాధించగలుగుతుందని అంచనా వేసినా అవన్నీ కల్లలైపోయాయి. తలమడుగులో కాంగ్రెస్‌కు మెజార్టీ ఉండడంతో ఎంపీపీ పీఠాన్ని కైవసం చేసుకుంది. బజార్హత్నూర్, ఇంద్రవెల్లిల్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. బజార్హత్నూర్లో మొత్తం ఎంపీటీసీ స్థానాలు 8 ఉండగా బీజేపీ 4, టీఆర్ఎస్ 3, కాంగ్రెస్ 1 గెలుపొందాయి. బీజేపీకి ఒక సభ్యుడి మద్దతు అవసరం ఉండగా కాంగ్రెస్ మద్దతు ఇవ్వడంతో అక్కడ బీజేపీకి ఎంపీపీ పీఠం దక్కింది. ఉపాధ్యక్ష పదవిని కాంగ్రెస్ ఇవ్వడం ద్వారా ఈ రెండు పార్టీల కలయిక సాధ్యమైంది. ఇక ఇంద్రవెల్లిలో 11 ఎంపీటీసీ స్థానాలుండగా టీఆర్ఎస్ 4, బీజేపీ 4, స్వతంత్రులు ఇద్దరు, కాంగ్రెస్ ఒకరు గెలుపొందారు. ఇక్కడ టీఆర్ఎస్, బీజేపీకి మరో ఇద్దరు సభ్యులు మద్దతు ఇచ్చిన పక్షంలో ఆయా పార్టీల్లో ఎవరికైనా పీఠం దక్కేది. అయితే ఒక స్వతంత్ర, ఒక కాంగ్రెస్ అభ్యర్థి బీజేపీకి మద్దతు ఇవ్వడంతో ఇంద్రవెల్లి ఎంపీపీ కూడా బీజేపీకే దక్కింది. ఇక్కడ కూడా మద్దతిచ్చిన కాంగ్రెస్ ఎంపీటీసీకి ఉపాధ్యక్ష పదవికి దక్కింది. ఈ విధంగా పొత్తుధర్మం కొనసాగిస్తూ జెడ్పీ చైర్మన్ ఎన్నికకు ముందుకు కదులుతున్నారు. ఇక ఇచ్చోడలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇక్కడ 13 ఎంపీటీసీ స్థానాలకు ఐదు స్థానాల్లో టీఆర్ఎస్ గెలుపొంది పీఠం కైవసం చేసుకుంటుందని అందరు అనుకున్నారు. ప్రధానంగా ఆ పార్టీకి కేవలం మరో ఇద్దరి మద్దతు అవసరం ఉండగా, అనూహ్యంగా ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా ప్రీతం రెడ్డికి బీజేపీ, కాంగ్రెస్ సపోర్ట్ చేయడం గమనార్హం. టీఆర్ఎస్లో 5 గురు ఎంపీటీసీలు గెలవగా ఇద్దరు విప్‌ను దిక్కరించి స్వతంత్ర అభ్యర్థికి మద్దతు పలకడం గమనార్హం. తద్వారా ఇచ్చోడ వంటి మేజర్ మండలంలో టీఆర్ఎస్ను కాంగ్రెస్, బీజేపీలు తమ రాజకీయ ఎత్తుగడలతో నిలువరించడం గమనార్హం. అలాగే గుడిహత్నూర్, మావలలో ఎంపీపీ ఎన్నికలు కోరం లేక వాయిదా పడ్డాయి. గుడిహత్నూర్‌లో సభ్యులు సమాయానికి రాకపోవడంతో ఎన్నిక వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ మండలంలో మొత్తం 9 స్థానాలు ఉండగా టీఆర్ఎస్ 4, కాంగ్రెస్ 3, బీజేపీ 2 గెలుచుకున్న విషయం విధితమే. అలాగే మావలలో 3 స్థానాలు ఉండగా..ఒక సభ్యుడు గౌర్హాజరు కావడంతో ఎన్నిక వాయిదా పడింది. ఇక్కడ టీఆర్ఎస్ 1, కాంగ్రెస్ 1, ఇండిపెండెంట్ 1 స్థానం గెలుచుకున్నాయి. జంప్ దేనికి సంకేతం.. టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన ఇద్దరు ఎంపీటీసీలు పార్టీ విప్‌ను దిక్కరించి ఒక స్వతంత్ర అభ్యర్థికి మద్దతు ఇవ్వడం ఇచ్చోడలో ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీ నియమాలను దిక్కరిస్తే సహించలేని టీఆర్ఎస్కు ఈ జంప్ ఆందోళన కలిగిస్తోంది. ప్రధానంగా శనివారం జెడ్పీలో పార్టీ పరంగా విప్ జారీ చేసినా ఎన్నిక పరిస్థితులు ఎలా ఉంటాయోనని ఆ పార్టీకి ఆందోళన కలిగిస్తోంది. ఆదిలాబాద్ జెడ్పీ చైర్మన్ ఎస్టీ (జనరల్) రిజర్వు ఉండగా, ఈ పార్టీ నుంచి 9 మంది సభ్యుల్లో ముగ్గురు ఎస్టీ జెడ్పీటీసీలు ఉన్నారు. నేరడిగొండ, నార్నూర్, భీంపూర్ జెడ్పీటీసీలు అనిల్ జాదవ్, రాథోడ్ జనార్దన్, కుమ్ర సుధాకర్‌లు గెలుపొందారు. వీరిలో నుంచి ఎవరికి జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా బరిలోకి దింపుతారనేది ఇప్పు డు ప్రాధాన్యత సంతరించుకుంది. అనిల్ జాదవ్, రాథోడ్ జనార్దన్‌లు లంబాడా సామాజికవర్గం కాగా, కుమ్ర సుధాకర్ ఆదివాసీ సామాజిక వర్గానికి చెందినవారు. జిల్లాలో ఇటీవల సోయం బాపురావు ఎంపీగా గెలుపొందడంతో బీజేపీ ప్రభంజనం పెరిగింది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎత్తుగడలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. జెడ్పీలో నేడు జరగబోయే ఎన్నికలో ఏకగీవ్రంగా జరుగుతుందా, లేని పక్షంలో బీజేపీ, కాంగ్రెస్ కలిసి అభ్యర్థిని రంగంలోకి దించుతాయా? అనేది ఆసక్తికరమే.. అయితే టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరుంటారనే దానిపై అంచనాలతో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేసే పరిస్థితులను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ప్రాదేశిక ఎన్నికల చివరి ఘట్టం చైర్మన్ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. -
17 ఎంపీపీ పిఠాలు టీఆర్ఎస్కే..
సాక్షి, నాగర్‌కర్నూల్: జిల్లాలోని రెండు ఎంపీపీ స్థానాలు మినహా అన్నింటిని టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. అన్ని మండలాల్లోనూ గులాబీ పార్టీ తన హవాను కొనసాగించింది. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో జరిగిన ఎంపీపీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. 17 మండలాల్లో మెజార్టీ ప్రాతిపదికన ఓటింగ్ నిర్వహించి ఎంపీపీ అభ్యర్థులను ఎన్నుకోగా, ఎంపీటీసీ స్థానాలు సమానంగా వచ్చిన రెండు మండలాల్లో మాత్రమే లాటరీ పద్ధతి ద్వారా ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, కో ఆప్షన్ సభ్యులను ఎన్నుకున్నారు. ఎంపీడీఓ కార్యాలయాల్లో సంబంధిత అధికారుల పర్యవేక్షణలో ఎన్నికలు జరిగాయి. ఎలాగైనా మెజార్టీ స్థానాలను దక్కించుకోవాలన్న పట్టుదలతో టీఆర్ఎస్ పార్టీ నేతలు వ్యవహరించారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పెంట్లవెల్లిలో ఒకరినొకరు తోసుకున్నారు. నాగర్‌కర్నూల్ మండలానికి సంబంధించి కోర్టు పరిధిలో కేసు ఉండడంతో ఎన్నిక వాయిదా పడింది. మొత్తంగా మండల పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కో ఆప్షన్ సభ్యులు ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. 17ఎంపీపీ స్థానాలు టీఆర్ఎస్ కైవసం జిల్లాలోని 20 మండలాల్లో 212 ఎంపీటీసీ స్థానాలుంటే గోప్లాపూర్, గంట్రావుపల్లి ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం కాగా, గగ్గలపల్లి ఎంపీటీసీ స్థానానికి ఎన్నికలు నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో మొత్తం 209 ఎంపీటీసీ స్థానాలకు మూడు విడతల్లో జరిగిన ఎన్నికల్లో 135 స్థానాల్లో టీఆర్ఎస్ ఎంపీటీసీ అభ్యర్థులు విజయం సాధించగా, కాంగ్రెస్ పార్టీ 52 స్థానాలకే పరిమితమైంది. బీజేపీ 4 స్థానాల్లో, సీపీఐ 2స్థానాల్లో, ఇండిపెండెంట్లు 16 స్థానాల్లో విజయం సా«ధించారు. ఏకగ్రీవం అయిన రెండు ఎంపీటీసీ స్థానాలు కూడా టీఆర్ఎస్ అభ్యర్థులే గెలవడంతో ఆ పార్టీ 137 స్థానాల్లో విజయం సాధించింది. అయితే శుక్రవారం నాగర్‌కర్నూల్ మండల పరిషత్ స్థానానికి మినహా 19 మండలాల్లో ఎంపీపీ ఎన్నికలు నిర్వహించారు.ఇందులో అధికార పార్టీ 17, కాంగ్రెస్ రెండు స్థానాలు దక్కించుకున్నాయి. వైస్ ఎంపీపీల విషయానికి వస్తే టీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 4, ఇండిపెండెంట్లు 2 స్థానాలను దక్కించుకున్నారు. కో ఆప్షన్‌కు సంబంధించి 17 టీఆర్ఎస్, రెండు కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. లింగాల, ఉప్పునుంతల మండలంలో లాటరీ పద్ధతిలో ఎంపీపీ ఎంపిక జరిగింది. లింగాలలో కాంగ్రెస్ పార్టీకి ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కో ఆప్షన్లు దక్కాయి. ఉప్పునుంతలలో ఎంపీపీ, కో ఆప్షన్ టీఆర్ఎస్ పార్టీ, వైస్ ఎంపీపీ కాంగ్రెస్ పార్టీకి దక్కాయి. కొల్లాపూర్ నియోజకవర్గంలో జూపల్లి, హర్షవర్ధన్‌రెడ్డి వర్గాల మధ్య నువ్వా నేనా అన్న తరహాలో ఎన్నికలు జరిగాయి. పెంట్లవెల్లిలో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసలు రంగప్రవేశం చేసి లాఠీచార్జీతో ఇరు వర్గాలను చెదరగొట్టారు.ఇరు వర్గాలు టీఆర్ఎస్ పార్టీ చెప్పుకున్నప్పటికీ కోడేరు, పెంట్లవెల్లి, పెద్దకొత్తపల్లి మండలాల్లో జూపల్లి వర్గం ఎంపీపీ స్థానాలను కైవసం చేసుకోగా, కొల్లాపూర్‌లో హర్షవర్ధన్‌రెడ్డి వర్గం దక్కించుకుంది. బిజినపల్లి మండలంలో 20 ఎంపీటీసీ స్థానాలకు టీఆర్ఎస్ పార్టీకి 10ఎంపీటీసీలు, కాంగ్రెస్‌కు 8, ఒకటి సీపీఐ, ఒకచోట ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించారు. ఎంపీపీ స్థానం ఎలాగైనా దక్కించుకోవాలనే ఉద్దేశంతో నేరుగా ఎమ్మెల్యే మర్రిజనార్దన్‌రెడ్డి రంగంలోకి దిగి కాంగ్రెస్ ఎంపీటీసీని తమవైపు తిప్పుకొని అతనికి వైస్ ఎంపీపీ ఇచ్చి ఎంపీపీ స్థానాన్ని దక్కించుకున్నారు. -
ఎంపీపీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి
మెదక్ రూరల్: మండల ప్రజా పరిషత్ అధ్యక్ష ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ ధర్మారెడ్డి పేర్కొన్నారు. ఎంపీపీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో ప్రిసైడింగ్ అధికారులు, ఎంపీడీఓలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పరోక్ష ఎన్నికలకు సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లు ముందుగానే చేసుకోవాలని సూచించారు. సమావేశ మందిరంలో ఎంపీటీసీలుగా ఎంపికైన వారు ఒకవైపు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లాంటి ప్రత్యేక ఆహ్వానితులు కూర్చునేందుకు మరోవైపు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఎన్నికల రోజున ముందుగా కోఆప్షన్ సభ్యుల ఎన్నిక కోసం నామినేషన్లను స్వీకరించడం జరుగుతుం దన్నారు. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ గడువు తర్వాత అభ్యర్థి ఎన్నికను అధికారికంగా ప్రకటించాలన్నారు. కోఆప్షన్ సభ్యుడి ఎన్నిక జరిగేందుకు సరైన కోరం లేనట్లయితే సరిపడా సభ్యులు వచ్చేంత వరకు అధికారులు వేచి చూడాలన్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడి ఎన్నిక నిర్వహించేందుకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. ఎలాంటి అనుమానాలకు చోటివ్వకుండా పారదర్శకంగా పరోక్ష ఎన్నికలను నిర్వహించాలన్నారు. సమావేశంలో జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ లక్ష్మీబాయి, డీపీఓ హనోక్‌తో పాటు ప్రిసైడింగ్ అధికారులు, ఎంపీడీఓలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
విలీనంతో వీక్!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఒకప్పుడు జిల్లాను శాసించిన కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ప్రాతినిధ్యం కరువైంది. కాంగ్రెస్‌కు ఆశాకిరణాలుగా భావించిన ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, పైలెట్ రోహిత్‌రెడ్డిలు పార్టీని వీడి కారెక్కడం హాట్ టాపిక్‌గా మారింది. సీఎల్పీని అధికార టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేయాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి గురువారం వినతిపత్రం అందజేశారు. వినతిపత్రం సమర్పించిన వారి జాబితాలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఉండటం చర్చనీయాంశమైంది. వీరి విజ్ఞప్తిని స్పీకర్ ఆమోదించారు. ఇకపై వీరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా కొనసాగుతారు. మొన్నటి శాసనసభ ఎన్నికల తర్వాత మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్కు దగ్గరయ్యారు. సీఎం కేసీఆర్‌తో సైతం ఆమె భేటీ అయ్యారు. అయితే తన కుమారుడి రాజకీయ భవిష్యత్‌తో పాటు తనకు మంత్రి పదవి ఇస్తారన్న హామీ మేరకు ఆమె టీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధపడినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కొన్ని రోజులకే ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా ఆమెను అనుసరించారు. ఆ వెంటనే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో భేటీ కావడంతో ఆయన పార్టీ మారడంపై స్పష్టత వచ్చింది. హస్తం గుర్తుపై ఎమ్మెల్యేలుగా గెలిచిన వీరిద్దరూ అప్పటి నుంచి కాంగ్రెస్‌కు దూరంగా ఉంటూ వచ్చారు. టీఆర్ఎస్ నాయకులతో సత్సంబంధాలు కొనసాగించడంతోపాటు లోక్‌సభ, ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయానికి కృషిచేశారు. మరోపక్క ఏడాది కిందట టీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురై కాంగ్రెస్ గూటికి చేరిన వికారాబాద్ డీసీసీ అధ్యక్షులు, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి కూడా తిరిగి సొంత గూటికి చేరారు. అనూహ్యంగా సీఎల్పీని విలీనం చేయాలని విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యేల్లో ఈయన ఒకరు కావడం రాజకీయంగా పెనుదుమారం రేపింది. కాగా, సాంకేతికంగా ఈ ముగ్గురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే. అయితే సీఎల్పీ విలీనానికి స్పీకర్ ఆమోదం తెలపడంతో అధికారికంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా పరిగణిస్తారు. ఆత్మస్థైర్యం నింపితేనే.. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ జిల్లాలో కష్టాల్లో చిక్కుకుంది. మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో చాలా మంది కాంగ్రెస్ నాయకులు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ జాబితాలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు సైతం ఉన్నారు. ఆ తర్వాత తమ నియోజకవర్గాల అభివృద్ధి పేరిట ఎమ్మెల్యేలు సైతం కారెక్కారు. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బలహీన పడింది. అయినా పంచాయతీ ఎన్నికల్లో చెప్పుకోదగ్గ రీతిలో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు సర్పంచ్‌లుగా నెగ్గారు. ఆ తర్వాత చేవెళ్ల లోక్‌సభ స్థానం చేజారినప్పటికీ అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే అధిక సంఖ్యలో ఓట్లు రాబట్టింది. తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లోనూ కాంగ్రెస్ ఉనికి చాటుకుంది. 257 ఎంపీటీసీల్లో 73 స్థానాలను, 21 జెడ్పీటీసీలకుగాను.. నాలుగింటిని హస్తగతం చేసుకుంది. ఈ ఫలితాలను విశ్లేషిస్తే నాయకులు, ఎమ్మెల్యేలు పార్టీలు మారినా ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు చెక్కుచెదరలేదని తెలుస్తోంది. అయితే, టీఆర్ఎస్లో సీఎల్పీ విలీనం, జిల్లాకు చెందిన ముగ్గురు కీలక నేతలు అధికారికంగా కారెక్కడంతో పార్టీ బలహీనపడినట్టే. ఈ పరిణామంతో పార్టీ శ్రేణులు అంతర్మథనంలో పడ్డారు. -
వీడనున్న పీటముడి!
సాక్షి ప్రతినిధి, వరంగల్: జిల్లా పరిషత్ చైర్మన్లు, మండల పరిషత్ అధ్యక్ష పదవులు ఎవరికి దక్కనున్నాయనే అంశంపై నెలకొన్న సస్పెన్స్ శుక్రవారం ఉదయానికి వీడిపోనుంది. ఉమ్మడి వరంగల్‌లోని ఆరు జిల్లా పరిషత్ చైర్మన్లు గెలుచుకునేంత స్థాయిలో స్పష్టమైన మెజార్టీ టీఆర్ఎస్కు లభించింది. దీంతో పాటు 70కి 70 ఎంపీపీ స్థానాలను కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో ఆ పార్టీ అధిష్టానం పావులు కదుపుతోంది. ఇందులో 62 ఎంపీపీ స్థానాలకు గాను సరిపడా సంఖ్యాబలం ఉన్నప్పటికీ మిగతా ఎనిమిది స్థానాలను కూడా దక్కించుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఇందుకోసం స్వతంత్రులు, ఇతర పార్టీల నుంచి గెలిచిన వారితో మంతనాలు జరుపుతున్నారు. కాగా, ఉమ్మడి జిల్లాలోని 70 మంది జెడ్పీటీసీల్లో 62 మందిని, 781 ఎంపీటీసీ సభ్యుల్లో 541కి పైగా సభ్యులను క్యాంపులకు తరలించారు. నేడు ఎంపీపీల ఎన్నిక ఎంపీపీల ఎన్నిక శుక్రవారం జరగనుండగా ఉదయం 10 గంటల నుంచి ప్రక్రియ మొదలవుతుంది. అధికారికంగా సాయంత్రం 4 గంటలకు ఎంపీపీని ప్రకటించనున్నారు. ఇక శనివారం జిల్లా పరిషత్ చైర్మన్ల ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు నేతృత్వంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో సమాలోచన చేసిన అనంతరం చైర్మన్లు, అధ్యక్షులపై ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. చైర్మన్లు, అధ్యక్షుల పేర్లను సీల్డ్ కవర్లో ఎన్నికలకు కొద్ది గంటల ముందు జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులకు ఇన్‌చార్జ్‌లకు చేరవేస్తే.. ఆ మేరకు చైర్మన్లు, అధ్యక్షులను ఎన్నుకుంటారు. విడుదలైన నోటిఫికేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆరు జిల్లా పరిషత్ చైర్మన్లు, 70 మండల పరిషత్ అధ్యక్ష పదవుల ఎన్నికలు శుక్రవారం, శనివారం న్నికలు జరగనున్నాయి. మండల పరిషత్ అధ్యక్ష పదవి ఎన్నికకు గురువారం నోటిఫికేషన్ విడుదల కాగా, జెడ్పీ చైర్మన్ ఎన్నికలకు రేపు ప్రకటన విడుదల చేయనున్నారు. ఈ ఎన్నికలకు కొన్ని గంటల ముందే చైర్మన్లు, అధ్యక్షులెవరనే అంశంపై స్పష్టత రానుంది. మూడు ఓకే... ములుగు జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా కుసుమ జగదీష్ పేరును మొదటల్లోనే ప్రకటించగా, ఇటీవల కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన గండ్ర వెంకటరమణారెడ్డి భార్య గండ్ర జ్యోతికి వరంగల్ రూరల్ జెడ్పీ చైర్మన్ ఇచ్చేందుకు ఒప్పందం జరిగినట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆమె శాయంపేట జెడ్పీటీసీ బరిలోకి దిగి విజయం సాధించారు. వరంగల్ అర్బన్‌కు సంబంధించి ఎల్కతుర్తి నుంచి జెడ్పీటీసీగా గెలుపొందిన భీమదేవరపల్లికి చెందిన డాక్టర్ సుధీర్‌కుమార్ పేరు ఖాయం చేసినట్లు చెబుతున్నారు. ఈ మూడు మినహాయిస్తే మహబూబాబాద్, జనగామ, భూపాలపల్లి జయశంకర్ జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థులపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఎస్సీ మహిళకు కేటాయించిన భూపాలపల్లి జయశంకర్ జెడ్పీ చైర్మన్ పీఠం కోసం జక్కు శ్రీహర్షిణి(కాటారం జెడ్పీటీసీ) పేరు ఖరారైనట్లు గురువారం ప్రచారం మొదలైంది. జనగామ జెడ్పీ చైర్మన్ కోసం జనగామ, చిల్పూరు, లింగాల గణపురం, తరిగొప్పుల నుంచి జెడ్పీటీసీలుగా గెలిచిన నిమ్మతి దీపికారెడ్డి, పాగాల సంపత్ రెడ్డి, గుడి వంశీధర్‌రెడ్డి, ముద్దసాని పద్మజారెడ్డి జెడ్పీ చైర్మన్ కోసం పదవి పోటీపోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మహబూబాబాద్ జెడ్పీ చైర్మన్ కోసం మొదటి నుంచి ఎమ్మెల్యే రెడ్యా నాయక్ కోడలు నిత్య రవిచంద్ర పేరు వినిపించినా ఆమె పోటీకే దిగలేదు. ప్రస్తుతం గూడూరు, బయ్యారం, నర్సింహులపేట నుంచి జెడ్పీటీసీలుగా గెలిచిన గుగులోతు సుచిత్ర, అంగోతు బిందు, భూక్యా సంగీత నడుమ పోటీ ఉన్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఆరుగురు జెడ్పీ చైర్మన్లతోపాటు మండల పరిషత్ అధ్యక్షులెవరనేది ఎన్నికకు కొద్దిగంటల ముందు మాత్రమే వెల్లడి కానుంది. క్యాంపుల్లో ఇన్‌చార్జ్‌ల చర్చలు ఆరు జెడ్పీ పీఠాలు, మొత్తానికి మొత్తం మండల పరిషత్‌లను కైవసం చేసుకోవాలనే వ్యూహంతో ఫలితాలు వెలువడిన రోజునే జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులను అధికార టీఆర్ఎస్ పార్టీ క్యాంపులకు తరలించింది. హైదరాబాద్‌తో పాటు చుట్టూ ఉన్న రిసార్ట్‌లతో పాటు యాదగిరిగుట్ట, పాపికొండలు తదతర ప్రాంతాల్లో ఈ క్యాంపులు కొనసాగుతున్నాయి. జెడ్పీ చైర్మన్, మండల పరిషత్ అధ్యక్షుల ఎన్నికపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమై చర్చించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలుపొందిన పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డిని బుధవారం తీసుకెళ్లిన మంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యేలు కేటీఆర్, కేసీఆర్‌ను కలిసిన అనంతరం ఈ అంశంపై కూడా చర్చించినట్లు తెలిసింది. అంతే కాకుండా వైస్ చైర్మన్లు, కో–ఆప్షన్ సభ్యుల ఎన్నికపై కూడా మంతనాలు జరిపినట్లు సమాచారం. ఇదే సమయంలో అన్నీ జెడ్పీ చైర్మన్ల ఎంపిక ప్రక్రియను సమన్వయం చేసేందుకు ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరిస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎంపీ బండా ప్రకాష్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, పెద్ది సుదర్శన్‌రెడ్డిలు క్యాంపుల్లో ఉన్న జెడ్పీటీసీ, ఎంపీటీసీలతో చర్చలు జరిపి ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. దీనికి తోడు ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతల అభిప్రాయాలు, అధినేత కేసీఆర్ సూచన మేరకు శుక్రవారం ఉదయమే ఎంపీపీలు, వైస్ ఎంపీపీ, కో–ఆప్షన్ సభ్యుల పేర్లు, శనివారం ఉదయం జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్, కో–ఆప్షన్ సభ్యుల పేర్లను సీల్డ్ కవర్ల ద్వారా వెల్లడించేందుకు సన్నాహాలు చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం. -
నేడే ఎంపీపీల ఎన్నిక
సాక్షిప్రతినిధి, నల్లగొండ : మండల అధ్యక్షుల ఎన్నికకు అన్ని ఏర్పాట్లు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 31 మండలాల్లో మండల అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నిక శుక్రవారం ఆయా మండలాల్లో జరగనుంది. ఇప్పటికే మండల ప్రాదేశిక నియోజకవర్గాల (ఎంపీటీసీ)కు జరిగిన ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను అధికార టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. 31 మండలాల్లో 349 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగగా, టీఆర్ఎస్ అత్యధికంగా 191 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ 134 స్థానాలకు పరిమితమైంది. అయితే, మండల అధ్యక్ష పదవుల విషయానికి వస్తే.. టీఆర్ఎస్ ఖాతాల్లో 18 మండలాలు చేరనున్నాయి. మరో ఆరు మండలాల్లో కాంగ్రెస్ మండల అధ్యక్షులు కొలువు దీరనున్నారు. ఇంకో ఏడు మండలాల్లో మాత్రం ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాలేదు. దీంతో ఈ మండలాల్లో స్వతంత్రులు, ఇతర పార్టీలకు చెందిన ఎంపీటీసీ సభ్యుల పాత్ర కీలకం కానుంది. జిల్లాలో 31 మండలాల్లో ఎంపీపీ పదవుల కోసం ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నిక ల్లో గెలిచిన మొత్తం సభ్యుల్లో పార్టీలు నిర్ణయించిన 62మంది మండల అధ్యక్షులు, ఉపాధ్యక్షులుగా శుక్రవారం ఎన్నిక కానున్నారు. దీనికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. క్యాంపుల్లో ఉన్న వారంతా ఉదయం 10 గంటల వరకు నేరుగా ఎంపీడీఓ కార్యాలయాలకు చేరుకుంటారు. సభ్యులు చేతులు ఎత్తే పద్ధతి ద్వారా ఎంపీపీని ఎన్నుకోనున్నారు. ముందుగా కో–ఆప్షన్ సభ్యుల ఎన్నిక జరుగుతుంది. ఆ తర్వాత ఎంపీపీ, వైస్ ఎంపీపీల ఎన్నిక జరుగుతుంది. ఎన్నిక జరిగే కార్యాలయాలకు వంద మీటర్ల దూరం వరకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేíశారు. ఇక, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్కో మండలంలో ఒక్కో విధంగా అటు అధికార టీఆర్ఎస్, ఇటు ప్రతిపక్ష కాంగ్రెస్ ఆయా పార్టీలతో పొత్తులకు వెళ్లాయి. అయితే.. టీఆర్ఎస్ ఏ పార్టీ సహకారం లేకుండానే ఏకంగా 18 మండలాల్లో అధ్యక్ష పీఠాలను కైవసం చేసుకునే మెజారిటీని సాధించింది. ఆరు మండలాల్లో కాంగ్రెస్‌కు ఇదే స్థితి ఉంది. మిగిలిన ఏడు మండలాలకు సంబంధించి టీఆర్ఎస్ ఖాతాలో చేరే మండలాలే ఎక్కువగా ఉంటాయని ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. ఆ.. ఏడు చోట్ల ఉత్కంఠ! ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాని పెద్దవూర, వేములపల్లి, తిప్పర్తి, చండూరు, చిట్యాల , నకిరేకల్, కేతేపల్లి మండలాల్లో ఏ పార్టీకి చెందిన వారు అధ్యక్షులు అవుతారో..? విధిలేని పరిస్థితిలో మద్దతు తెలిపే వారే ఏకంగా పదవిని దక్కించుకుంటారో అన్న చర్చ జరుగుతోంది. వేములపల్లి మండలంలో 7 ఎంపీటీసీ స్థానాలను ఉన్నాయి. ఇక్కడ ఎంపీపీ పదవిని దక్కించుకోవాలంటే నాలుగు ఎంపీటీసీ సభ్యుల బలం ఉండాలి. కానీ, టీఆర్ఎస్ తరఫున ముగ్గురు సభ్యులు మాత్రమే విజయం సాధించారు. కాంగ్రెస్ నుంచి ఇద్దరు, సీపీఎం నుంచి ఒకరు విజయం సాధించారు. మరో స్వతంత్ర అభ్యర్ధి గెలిచారు. టీఆర్ఎస్ అధ్యక్ష స్థానాన్ని దక్కించుకోవాలంటే ఇండిపెండెంట్ ఒక్కరు మద్దతిస్తే చాలు. అదే కాంగ్రెస్ కైతే.. సీపీఎంతో పాటు, ఇండిపెండెంట్.. అంటే ఇద్దరి మద్దతు అవసరం ఉంది. పెద్దవూర మండలంలో 11 ఎంపీటీసీ స్థానాలున్నాయి. ఇక్కడ టీఆర్ఎస్, కాంగ్రెస్‌లు సమానంగా చెరో 5 స్థానాల్లో గెలిచాయి. మరో స్థానంలో ఇండిపెండెంట్ గెలిచారు. ఇప్పుడు ఈ రెండు పార్టీల్లో ఎవరు అధ్యక్షుడు కావాలన్నా, ఆ ఇండిపెండెంట్ మద్దతు తప్పని సరి. తిప్పర్తి మండంలోనూ ఇదే సీన్. ఇక్కడ 9 ఎంపీటీసీ స్థానాలుంటే టీఆర్ఎస్, కాంగ్రెస్‌లు సమానంగా చెరో 4 చోట్ల గెలిచాయి. ఒక ఇండిపెండెంట్ విజయం సాధించారు. ఆ ఇండిపెండెంట్ మద్దతు ఎవరికి దక్కింతే ఆ పార్టీకి మండల అధ్యక్ష పదవి వరించే అవకాశం ఉంది. చండూరు మండలంలో 11 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, ఆరు స్థానాలు గెలిచిన పార్టీకి మండల అధ్యక్ష పదవి దక్కుతుంది. కానీ, కాంగ్రెస్ 5 స్థానాలను గెలుచుకున్నా.. మరో సభ్యుడి కొరత ఏర్పడింది. ఇక్కడ టీఆర్ఎస్ 4 ఎంపీటీసీ స్థానాలను గెలచుకుంది. కాగా, సీపీఐ, బీజేపీలు చెరో స్థానంలో గెలిచాయి. ఈ రెండు పార్టీల్లో ఒకరు మద్దతిస్తే కాంగ్రెస్‌కు మండల అధ్యక్ష పదవి దక్కుతుంది. అదే టీఆర్ఎస్కు అవకాశం రావాలంటే.. సీపీఐ, బీజేపీ రెండూ మద్దతివ్వాల్సి ఉంటుంది. నకిరేకల్ నియోజకవర్గంలోనే అత్యధికంగా మూడు మండలాల్లో ఈ పరిస్థితి నెలకొంది. చిట్యాల మండలంలో 12 ఎంపీటీసీ స్థానాలకు గాను.. ఏడు స్థానాలు వచ్చిన పార్టీకి మండలం దక్కేది. కానీ, టీఆర్ఎస్ 6 స్థానాల దగ్గరే నిలిచిపోయింది. మరొక్క సభ్యుడి మద్ధతు లభిస్తే చాలు. కాగా, ఈ మండలంలో కాంగ్రెస్ కేవలం 2 స్థానాలు గెలుచుకుంది. సీపీఎం ఒక చోట గెలిచింది. మరో ముగ్గురు స్వతంత్రులు గెలిచారు. కాంగ్రెస్, సీపీఎం, స్వంతంత్రులు ముగ్గురు కలిసినా అవకాశ దక్కే చాన్సులేదు. దీంతో ఒక సభ్యుడిని తమ వైపు తిప్పుకోగలితే చిట్యాల టీఆర్ఎస్ సొంతం అవుతుంది. గెలిచిన ముగ్గురు స్వతంత్రుల్లో టీఆర్ఎస్ రెబల్స్ ఉన్నారని, వారి మద్ధతు తమ పార్టీకే ఉంటుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నకిరేకల్‌లో 9 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. ఏ పార్టీకైనా ఐదు స్థానాలు గెలిస్తే మండల అధ్యక్ష పదవి దక్కుతుంది. కానీ, టీఆర్ఎస్ 4 స్థానాల దగ్గరే నిలిచిపోయింది. 3చోట్ల కాంగ్రెస్ గెలిస్తే.. స్వతంత్రులు మరో ముగ్గురు గెలిచారు. ఇప్పుడు వారే కీలకంగా మారారు. వీరిలో కూడా టీఆర్ఎస్ రెబల్స్ ఉన్నారని చెబుతున్నందున.. ఇక్కడా టీఆర్ఎస్కే అవకాశం ఉందంటున్నారు. కేతేపల్లి మండలంలో 11 స్థానాలకు గాను ఆరు సీట్లు గెలుచుకుంటే.. ఎంపీపీ పదవి దక్కుతుంది. కానీ, టీఆర్ఎస్కు కేవలం ఐదుగురు సభ్యులు మాత్రమే ఉన్నారు. కాంగ్రెస్ నాలుగు చోట్ల , మరో ఇద్దరు స్వతంత్రులు గెలిచారు. టీఆర్ఎస్కు ఒక్కరు మద్ధతిస్తే సరిపోతుంది. ఇక్కడ కాంగ్రెస్‌కు అవకాశం దక్కాలంటే ఇండిపెండెంట్లు ఇద్దరూ మద్దతివ్వాలి. మొత్తంగా ఈ ఏడు చోట్లా ఒక్క చండూరు మినహా మిగిలిన ఆరు చోట్ల అధికార పార్టీకే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. -
గులాబీ మండలాధీశులు గులాబీ మండలాధీశులు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: అప్రతిహత విజయంతో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో గులాబీ జెండాలను ఎగరేసిన టీఆర్ఎస్ కీలకమైన మండల ప్రజాపరిషత్ పీఠాలను తన వశం చేసుకోబోతుంది. ఉమ్మడి జిల్లాలోని 58 మండలాల్లో కేవలం మూడు చోట్ల మినహా 55 చోట్ల టీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎంపీటీసీలే మండలాధీశులుగా బాధ్యతలు చేబట్టబోతున్నారు. ఇప్పటికే క్యాంపుల్లో ఉన్న ఆయా మండలాల నుంచి గెలిచిన టీఆర్ఎస్ ఎంపీటీసీలు, వారికి మద్దతు ఇస్తున్న ఇతర పార్టీల విజేతలు శుక్రవారం నేరుగా మండల కార్యాలయాలకు చేరుకుని బాధ్యతలు స్వీకరించబోతున్నారు. కొత్త మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నికకు సంబంధించి అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. గెలిచిన ఎంపీటీసీలు చేజారిపోకుండా ఎమ్మెల్యేల సహకారంతో చైర్మన్ అభ్యర్థులు క్యాంపుల కోసం ఇప్పటికే హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో మకాం వేశారు. చేతులెత్తేసిన కాంగ్రెస్, బీజేపీ టీఆర్ఎస్ కన్నా ఒకటి రెండు చోట్ల ఎక్కువ సంఖ్యలో సీట్లు గెలిచిన మండలాలను సైతం కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకోలేక చేతులెత్తేసింది. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి, రామడుగు మండలాల్లో టీఆర్ఎస్ కన్నా ఎక్కువ మెజారిటీ ఉన్నప్పటికీ క్యాంపు రాజకీయాలు నడిపే సాహసం చేయలేక చేతులెత్తేసింది. ఈ లోపు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు వైరిపక్షంలోని సభ్యులను తమ క్యాంపుల్లోకి తీసుకెళ్లారు. చొప్పదండిలో నాలుగు ఎంపీటీసీలు గెలుచుకున్న బీజేపీ సైతం తమకు మద్దతు పలికిన ఇండిపెండెంట్లు, కాంగ్రెస్ సభ్యులను కాపాడుకోలేక పోయింది. బీజేపీ నాయకులు కాళేశ్వరంలో క్యాంపు నడిపినా టీఆర్ఎస్ వాళ్లు క్యాంపు నుంచే తమకు అవసరమైన సభ్యులను తీసుకెళ్లారు. ఇక్కడ రెండు సీట్లు మాత్రమే గెలిచిన టీఆర్ఎస్ ఎంపీపీ పదవిని దక్కించుకోబోతుంది. దీంతో కరీంనగర్ జిల్లాలో 15 ఎంపీపీలకు మొత్తంగా టీఆర్ఎస్ వశమైనట్టే. పెద్దపల్లిలో చక్రం తిప్పిన ‘దాసరి’ పెద్దపల్లి జిల్లాలో సైతం టీఆర్ఎస్ రాజకీయం ముందు కాంగ్రెస్, బీజేపీ నిలబడలేకపోయాయి. పెద్దపల్లి, జూలపల్లి, రామగిరిలో ప్రతిపక్ష పార్టీలకు అవకాశం ఉన్నప్పటికీ ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి రాజకీయంతో ఈ మూడు మండలాలు కూడా టీఆర్ఎస్కే అనుకూలమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికే పెద్దపల్లి, జూలపల్లి మండలాల్లో ఇతర పార్టీలు, ఇండిపెండెంట్లుగా గెలిచిన వారిని తమ వైపు తిప్పుకున్న ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి రామగిరి మండలంలో కూడా సగం సగంగా ఉన్న కాంగ్రెస్ బలాన్ని తగ్గించేందుకు వ్యూహాన్ని అమలు చేసినట్లు సమాచారం. ఇక్కడ టీఆర్ఎస్, కాంగ్రెస్ ఆరేసి సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ నుంచి ఒకరిద్దరిని తమ వైపు తిప్పుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. కాంగ్రెస్ ఖాతాలోకి వేములవాడ రూరల్, బీర్పూరు, జగిత్యాల అర్బన్.. జగిత్యాల జిల్లాలో రెండు సీట్లు కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లనున్నాయి. జిల్లాలో 18 మండలాలకుగాను 16 చోట్ల టీఆర్ఎస్కు స్పష్టమైన మెజారిటీ ఉండగా, బీర్పూరులో కాంగ్రెస్ జెడ్పీటీసీ స్థానంతోపాటు మెజారిటీ మండలాలను గెలుచుకుంది. జగిత్యాల అర్బన్‌లో సైతం కాంగ్రెస్‌కే మెజారిటీ వచ్చింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఈ రెండు చోట్ల ఖాతా తెరవనుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ రూరల్ సైతం కాంగ్రెస్ ఖాతాలోనే పడనుంది. ఇక్కడ పార్టీ నేత ఆది శ్రీనివాస్ పావులు కదిపి గెలిచిన కాంగ్రెస్ సభ్యులతోపాటు మద్ధతుదారులను క్యాంపుకు పంపించారు. దీంతో వేములవాడ రూరల్ కాంగ్రెస్ వశం కావడం ఖాయమైనట్లే. -
అధ్యక్షులెవరో?
ఆదిలాబాద్‌అర్బన్: మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ), మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షులు (వైస్‌ఎంపీపీ) పదవులకు శుక్రవారం ఎన్నిక జరగనుంది. మొదటగా కోఆప్షన్ సభ్యులను, తర్వాత అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఉదయం 9 నుంచి 10 గంటల సమయంలో కోఆప్షన్ సభ్యుల నామినేషన్లు స్వీకరణ, అనంతరం వాటి పరిశీలన జరుగుతుంది. పోటీలో నిల్చున్న అభ్యర్థులను ప్రకటించి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇస్తారు. తర్వాత ప్రత్యేక సమావేశం నిర్వహించి కోఆప్షన్ సభ్యులను ఎన్నిక చేపట్టి గెలుపొందిన వారిని ప్రకటిస్తారు. ఒకవేళ ఒక అభ్యర్థే పోటీపడితే వారినే ఎన్నికైనట్లుగా ప్రకటిస్తారు. అనంతరం ఎంపీపీ ఎన్నిక జరుగుతుంది. కో–ఆప్షన్ సభ్యుల ఎన్నిక పూర్తికాకపోతే ఎంపీపీ అధ్యక్ష ఎన్నిక నిర్వహణకు అవకాశం ఉండదు. ఎంపీపీ పదవుల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో ఆయా పదవులకు సంబంధించి రిజర్వేషన్లను పొందుపర్చిన విషయం తెలిసిందే. అయితే ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులకున్న నియమ నిబంధనలు కోఆప్షన్ సభ్యులకు కూడా వర్తించనున్నాయి. మండలంలో ఒకరిని, జెడ్పీలో ఇద్దరి చొప్పున మైనార్టీ వర్గాలకు చెందిన వారిని కోఆప్షన్ సభ్యులుగా ఎన్నుకోనున్న విషయం తెలిసిందే. రేపు జెడ్పీ చైర్పర్సన్ ఎన్నిక.. జిల్లా పరిషత్ చైర్పర్సన్, వైస్‌చైర్మన్, కోఆప్షన్ సభ్యుల ఎన్నికకు సంబంధించి శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసి శనివారం ఎన్నిక చేపట్టనున్నారు. ముందుగా ఉదయం 10 గంటల వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించి మధ్యాహ్నం వరకు పరిశీలిస్తారు. తద్వారా నామినేషన్ల ఉపసంహరణ చేపట్టి ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశం ఎన్నికైన వారిలో సగం మంది సభ్యుల కోరం ఉంటేనే ఎన్నిక నిర్వహించిన కోఆప్షన్ సభ్యులను ఎన్నుకుంటారు. సాయంత్రం 3 గంటల సమయంలో జిల్లా పరిషత్ అద్యక్ష పదవి ఎన్నికకు సంబంధించి సమావేశం నిర్వహించి గెలుపొందిన వారిని ప్రకటిస్తారు. చైర్పర్సన్, వైస్‌చైర్మన్, కోఆప్షన్ సభ్యుల ఎన్నిక చేపట్టేందుకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరిస్తారు. ముందుగా నూతనంగా ఎన్నికైన సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి జెడ్పీలో ఇద్దరు కోఆప్షన్ సభ్యులను ఎన్నుకుంటారు. అనంతరం చైర్పర్సన్, వైస్‌చైర్మన్ ఎన్నికలు జరుపుతారు. ఇందుకు అటు మండల పరిషత్ కార్యాలయాల్లో, ఇటు జిల్లా పరిషత్ కార్యాలయంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, మండలాధ్యక్షుడితోపాటు ఉపాధ్యక్షుల ఎన్నికల ప్రక్రియ ఒక్క రోజు, జెడ్పీచైర్‌పర్సన్, వైస్చైర్మన్ల ఎన్నికలు ఒక్కో రోజులోనే పూర్తి కానున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలతో మొదలుకొని ఫలితం ప్రకటించేంత వరకు ప్రాసెస్ ప్రకారం ఒకేరోజులో ప్రక్రియ చేపడుతారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరించిన ఆర్వోలే మండల అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నికలకు ప్రిసైడింగ్ అధికారులుగా వ్యవహరిస్తారు. ఈ మేరకు ఆయా అధ్యక్షుల ఎన్నికకు సంబంధించిన ఎస్ఈసీ ఇది వరకే షెడ్యూల్ కూడా జారీ చేసింది. కోఆప్షన్ సభ్యుల నియమ నిబంధనలు మైనార్టీ వర్గానికి చెందిన వారై ఉండాలి. ఎంపీపీ పరిధిలో అయితే మండలంలో, జిల్లా పరిషత్‌లో అయితే జిల్లాలో ఎక్కడో ఒక చోట ఓటు హక్కు కలిగి ఉండాలి. కోఆప్షన్ సభ్యుడిగా పోటీ చేసే వ్యక్తి స్థానిక ఓటరై ఉండాలి. వయసు 21 ఏళ్లకు తక్కువగా ఉండొద్దు ఎంపీపీ, జెడ్పీ కోఆప్షన్ సభ్యులుగా ఎన్నికయ్యే వారికి ఇద్దరు పిల్లల నిబంధనను వర్తింపజేస్తున్నారు. ఎంపీపీ, జెడ్పీ ఎన్నిక కోసం నిర్వహించే ప్రత్యేక సమావేశానికి వారిని ఆహ్వానిస్తారు. ఇద్దరు అభ్యర్థులకు సమాన ఓట్లు వస్తే డ్రా పద్ధతి ద్వారా నిర్ణయాన్ని ప్రకటిస్తారు. పరిషత్ కార్యాలయాల వద్ద 144 సెక్షన్.. శుక్ర, శనివారాల్లో మండల అధ్యక్ష, ఉపాధ్యక్షుల, జెడ్పీ చైర్పర్సన్, వైస్ చైర్మన్, కోఆప్షన్ సభ్యుల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని మండల పరిషత్ కార్యాలయాలతోపాటు జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. కార్యాలయాల నుంచి వంద మీటర్లలోపు ఈ సెక్షన్ అమలులో ఉంటుంది. పరిషత్ కార్యాలయాలకు వెళ్లేందుకు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులకు, సభ్యులకు, ఇతరులకు పాస్‌లు జారీ చేస్తారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయనున్నారు. -
పరిషత్ పీఠంపై టీఆర్ఎస్
ఉమ్మడి పాలమూరులో టీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా మారింది. గ్రామపంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు ఏ ఎన్నికలు జరిగినా పూర్తి ఆధిక్యత సాధిస్తోంది. వరుస విజయాలతో ప్రత్యర్థులకు అందనంత వేగంతో ‘కారు’ పార్టీ దూసుకుపోతోంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల తరహాలోనే పరిషత్ ఎన్నికల్లో సత్తా చాటింది. మెజార్టీ ఎంపీపీ స్థానాలతో పాటు జెడ్పీ పీఠాలను క్లీన్‌స్వీప్ చేసే దిశగా అడుగులు వేస్తోంది. సాక్షి, నాగర్‌కర్నూల్: జరిగిన ప్రతి ఎన్నికల్లో వరుస విజయాలను నమోదు చేసుకుంటూ టీఆర్ఎస్ బలాన్ని మరింత పెంచుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 13అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందిన ఆ పార్టీ, సర్పంచ్ ఎన్నికల్లోనూ మెజార్టీ గ్రామ పంచాయతీలను కైవసం చేసుకుంది. అనంతరం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రెండు పార్లమెంట్ స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లోనూ పూర్తి స్థాయి మెజార్టీ సాధించింది. ఉమ్మడి జిల్లాలో మహబూబ్‌నగర్, నారాయణపేట, నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల జెడ్పీపీఠాలపై గులాబీ జెండా ఎగరవేయనుంది. ప్రాదేశిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. పరిషత్ ఎన్నికల ఫలితాలు వెలువడడంతో జెడ్పీచైర్మన్, వైస్ చైర్మన్, ఎంపీపీ ఎన్నికలపై కసరత్తు చేస్తున్నారు. మెజార్టీ సాధించిన టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే జెడ్పీ చైర్మన్ల ఎంపికపై ఒక స్పష్టమైన వైఖరితో ఉన్నారు. శుక్రవారం ఎంపీపీ, శనివారం జెడ్పీ చైర్మన్ల ఎన్నికలు జరగనున్నాయి. అందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రస్తుతం ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు ప్రత్యేక శిబిరాల్లో ఉన్నారు. శుక్రవారం జరగనున్న ఎంపీపీ ఎన్నికకు నేరుగా ఎంపీటీసీలు రానున్నారు. ‘పేట’ జెడ్పీ పీఠం ఎవరికో..? ప్రాదేశిక ఎన్నికల్లో గులాబీ పార్టీ ప్రభవంజనం సృష్టించింది. ఒక్కడా కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పెద్దగా పోటీ ఇవ్వలేకపోయాయి. మహబూబ్‌నగర్, నారాయణపేట, నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల ఐదు జిల్లాల్లోనూ మెజార్టీ జెడ్పీటీసీ స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మొత్తం 71 జడ్పీటీసీ స్థానాలకు 65 స్థానాల్లో అధికార పార్టీ విజయం సాధించింది. కాంగ్రెస్ 5, బీజేపీ ఒక్క స్థానంతో సరిపెట్టుకున్నాయి. అన్ని జిల్లాల్లోనూ సంపూర్ణ మెజార్టీ రావడంతో జెడ్పీ చైర్మన్ల పీఠాలను సైతం సొంతం చేసుకోనుంది. మహబూబ్‌నగర్ జెడ్పీ చైర్మన్‌గా స్వర్ణసుధాకర్‌రెడ్డి(భూత్పూర్), నాగర్‌కర్నూల్ జెడ్పీ చైర్మన్‌గా పోతుగంటి భరత్(కల్వకుర్తి), వనపర్తి జెడ్పీ చైర్మన్‌గా లోక్‌నాథ్‌రెడ్డి(వనపర్తి), గద్వాల జెడ్పీ చైర్మన్‌గా సరిత(మానవపాడు)పేర్లు దాదాపు పార్టీ అధిష్టానం ఖరారు చేసినట్లు సమాచారం. నారాయణపేట జిల్లా నుంచి అంజనమ్మ (కృష్ణా), అశోక్‌కుమార్ (ఊట్కూర్), వనజ (మక్తల్), అంజలి (నారాయణపేట) జెడ్పీ పీఠం ఆశించగా చర్చల తర్వాత ఇద్దరు తప్పుకున్నారు. ప్రస్తుతం అశోక్‌కుమార్, వనజలో ఎవరో ఒకరిని ఫైనల్ చేసే అవకాశం ఉంది. నాగర్కర్నూల్కి సంబంధించి ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, గద్వాల, వనపర్తికి సంబంధించి మంత్రి నిరంజన్‌రెడ్డి, నారాయణపేట, మహబూబ్‌నగర్‌కు శ్రీనివాస్‌గౌడ్‌లకు జెడ్పీ చైర్మన్ ఎంపిక చేసే బాధ్యతను అధిష్టానం అప్పగించింది. గెలిచిన సభ్యులు శిబిరాల్లో ఉండగా, ఆయా పార్టీల అధినేతలు వ్యూహ రచనల్లో మునిగిపోయారు. మెజార్టీ ఎంపీపీ స్థానాలు కారు ఖాతాలోకే.. ఉమ్మడి జిల్లాలోని 790 ఎంపీటీసీ స్థానాలకు 524 స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. కాంగ్రెస్ కేవలం 148 స్థానాలకే పరిమితం కాగా బీజేపీ 46 ఎంపీటీసీ స్థానాల్లో విజయం సాధించింది. 90 శాతం పైగా ఎంపీపీ స్థానాలకు టీఆర్ఎస్కు స్పష్టమైన ఆధిక్యం ఉంది. ఎంపీపీ స్థానాలు కూడా అన్ని జిల్లాల్లో ఒకటి రెండు మినహా క్లీన్‌స్వీప్ చేసింది. అయితే మెజార్టీ లేని మండలాల్లోనూ ఎలాగైనా ఎంపీపీ స్థానాలు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లగా, బిజినేపల్లి, లింగాల, వెల్దండ, ఉప్పునుంతల, కోడేరు మండలాల్లో ఇరుపార్టీలకు పూర్తిస్థాయి మెజార్టీ రాకపోవడంతో ఎలాగైనా దక్కించుకోవాలనే కసరత్తు చేశారు. ఈ మండలాలు ఎవరి ఖాతాలోకి వెళుతాయో శుక్రవారం తేలనుంది. మహబూబ్‌నగర్ జిల్లాలోనూ మిడ్జిల్, చిన్నచింతకుంట మండలాల్లో మాత్రమే మెజార్టీ సాధించలేదు. నారాయణపేట జిల్లాలోనూ ధన్వాడ, మక్తల్ మినహా అన్ని మండలాల్లో టీఆర్ఎస్ మెజార్టీ సొంతం చేసుకుంది. కొల్లాపూర్ నియోజకవర్గంలో రెబల్, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఒకటి చేసేందుకు నేతలు ఇప్పటికే చర్చలు జరిపారు. మెజార్టీ ఎవ్వరిదనేది తేలాల్సి ఉంది. గద్వాలలో మానవపాడు, ఉండవెల్లి తప్పా అన్నింటా పూర్తి మెజార్టీ వచ్చింది. వనపర్తి జిల్లాలో 12 మండలాల్లో టీఆర్ఎస్కు మెజార్టీ రాగా, రేవల్లిలో కాంగ్రెస్ ఆధిక్యం ప్రదర్శించింది. వీపనగండ్లలో జూపల్లి వర్గం ఇండిపెండెంట్లుగా పోటీ చేసి ఎక్కువ స్థానాలు సాధించారు. నేడు ఎంపీపీ ఎన్నిక మండల పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కో ఆప్షన్ సభ్యుల ఎన్నికల కోసం శుక్రవారం ఉదయం 10గంటలకు నామినేషన్లు స్వీకరిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు పరిశీలించి పోటీలో ఉన్న వారి పేర్లను ప్రకటిస్తారు. ఒంటిగంట వరకు ఉపసంహరణకు గడువు ఇస్తారు. మొదట కో ఆప్షన్ సభ్యులను ఎన్నుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 3గంటలకు మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నిక ఉంటుంది. అందుకు అన్ని మండల పరిషత్ కార్యాలయాల్లో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. విప్ ధిక్కరిస్తే వేటే ఎంపీటీసీ సభ్యులు విప్‌ను దిక్కరిస్తే పార్టీ సభ్యత్వం కోల్పోనున్నారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకునే అధికారాన్ని ప్రిసైడింగ్ అధికారికి రాష్ట్ర ఎన్నికల సంఘం కల్పించింది. తమ సభ్యుడు విప్ ధిక్కరించారంటూ ఆ పార్టీ విప్ నుంచి రాత పూర్వకంగా మూడు రోజుల్లో నివేదిక అందించాల్సి ఉంటుంది. సభ్యత్వాన్ని ఎందుకు రద్దు చేయరాదో తెలపాలంటూ ప్రిసైడింగ్ అధికారి సంబంధిత సభ్యుడికి నోటీసు జారీ చేస్తారు. దీనికి వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలి. ఆ తర్వాత విప్ ధిక్కారణ జరిగిందా లేదా అన్నదానిపై ప్రిసైడింగ్ అధికారి రెండు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తారు. అయితే గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు ఎన్నిక జరిగే రోజు మధ్యాహ్నం 11గంటలలోగా విప్ ధిక్కరించిన అభ్యర్థుల పేర్లను ఆర్డీఓకు సమర్పించాల్సి ఉంటుంది. అలాగే ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నిక కోసం నిర్వహించే సమావేశాలకు కనీసం సగం మంది సభ్యులు హాజరు కావాల్సి ఉంటుంది. అప్పుడే కోరం ఉన్నట్లు పరిగణించి ప్రక్రియను చేపడతారు. నిర్ణీత సమయానికల్లా కోరం మేరకు సభ్యులు రాకపోతే మరుసటి రోజుకు వాయిదా వేస్తారు. -
‘కుర్చీ’ కమల్‌కే..!
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్‌గా లింగాల కమల్రాజుకు అవకాశం ఇవ్వాలని టీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. అధికారికంగా ఆయన పేరును శుక్రవారం ప్రకటించే అవకాశం ఉంది. ఈనెల 8వ తేదీన జెడ్పీ చైర్మన్ పదవికి ఎన్నిక ఉండడంతో పార్టీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. జిల్లాలో మెజార్టీ స్థానాలను గెలుచుకున్న టీఆర్ఎస్కు జిల్లా పరిషత్ చైర్మన్ పదవి సునాయాసంగా లభించే అవకాశం ఏర్పడింది. మొత్తం 20 జెడ్పీటీసీలకుగాను.. 17 జెడ్పీటీసీలను ఆ పార్టీ గెలుపొందింది. దీంతో జెడ్పీ చైర్మన్‌గా ఎవరిని నియమించాలనే అంశంపై టీఆర్ఎస్ అధినేత జిల్లా నేతలతో చర్చించి.. కమల్‌రాజు పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇక జిల్లాస్థాయిలో చైర్మన్ తర్వాత అత్యంత ప్రాధాన్యం కలిగిన వైస్ చైర్మన్ పదవిపై మాత్రం నెలకొన్న పీటముడి ఇంకా వీడలేదు. వివిధ సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని వైస్ చైర్మన్ పదవికి అభ్యర్థిని ఖరారు చేయాలని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పలు సామాజిక వర్గాల నుంచి టీఆర్ఎస్ తరఫున జెడ్పీటీసీలుగా ఎన్నికైన వారిలో అనేక మంది ఈ పదవిని ఆశిస్తుండడంతో పేరును ఖరారు చేయడానికి పార్టీ పలు కోణాల్లో కసరత్తు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వైస్ చైర్మన్ పదవితోపాటు రెండు కోఆప్షన్ సభ్యుల పదవులకు సైతం అదేరోజు ఎన్నిక జరుగుతుండడంతో ఆ పేర్లను సైతం ఖరారు చేయాల్సి ఉంది. ‘వైస్’పై ఆలోచన.. జెడ్పీ చైర్మన్ పదవి ఎస్సీ జనరల్ కావడంతో.. వైస్ చైర్మన్ పదవిని మహిళలకు కేటాయించే అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పదవి తెలంగాణ ఉద్యమ నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి గెలిచిన జెడ్పీటీసీల్లో ఒకరిని వరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పాలేరు నియోజకవర్గ పరిధిలోని నేలకొండపల్లి జెడ్పీటీసీగా గెలుపొంది.. ఉద్యమ నేపథ్యం కలిగి.. బీసీ వర్గానికి చెందిన ధనలక్ష్మి అభ్యర్థిత్వం వైపు పార్టీ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో వైస్ చైర్మన్ పదవిని బీసీలకు కేటాయించడంతోపాటు మహిళను ఎంపిక చేసినట్లు అవుతుందనే దానిపై పార్టీ యోచిస్తున్నట్లు సమాచారం. అలాగే పెనుబల్లి జెడ్పీటీసీ, బీసీ వర్గానికి చెందిన చక్కిలాల మోహన్‌రావు పేరును సైతం పార్టీ పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక జెడ్పీ చైర్మన్ పదవికి మధిర నియోజకవర్గం నుంచి గెలుపొందిన మధిర జెడ్పీటీసీ లింగాల కమల్‌రాజును ఎంపిక చేయాలని నిర్ణయించిన అధిష్టానం.. వైస్ చైర్మన్ పదవికి ధనలక్ష్మి పేరు పరిశీలనలో ఉండడంతో ఇక రెండు కోఆప్షన్ పదవుల్లో సత్తుపల్లి, వైరా నియోజకవర్గాలకు చెందిన పార్టీ నేతలకు అవకాశం ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైస్ చైర్మన్ పదవి కోసం అనేక మంది జెడ్పీటీసీలు గట్టిగా పట్టుపట్టడమే కాకుండా.. తమ అభీష్టాన్ని నెరవేర్చుకోవడం కోసం ముఖ్య నేతల ద్వారా అధిష్టానాన్ని ఒప్పించే పనిలో నిమగ్నమైనట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటివరకు ఖమ్మం జిల్లా పరిషత్‌లో అంతర్భాగంగా ఉండి.. కొత్త జిల్లా పరి షత్గా ఏర్పడిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పదవి ఎవరిని వరిస్తుందనే అంశం సామాజిక సమీకరణాల ఆధారంగా ఖమ్మం జెడ్పీ వైస్ చైర్మన్ పదవి ఖరారు వ్యవహారంతో ముడిపడి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక జిల్లాలోని 20 మండల ప్రజా పరిషత్‌లకు అధ్యక్ష, ఉపాధ్యక్ష, కోఆప్షన్ సభ్యుల కోసం ఈనెల 7వ తేదీన అధికారులు ఆయా మండల కార్యాలయాల్లో ఎన్నికను నిర్వహించనున్నారు. మెజార్టీ స్థానాలు టీఆర్ఎస్ కైవసం చేసుకునే అవకాశం ఉన్నా.. కొన్నిచోట్ల ఎంపీపీ పదవులు ఎవరిని వరించాలన్నా స్వతంత్ర అభ్యర్థులదే కీలక నిర్ణయంగా మారే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ జిల్లా లోని వివిధ మండలాల్లో తమకు గల బలాబలాల ఆధారంగా ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కోఆప్షన్ సభ్యులను గెలుచుకునేందుకు అవసరమైన వ్యూహాలను రూపొందించింది. -
నీకా..నాకా!?
సాక్షి, జనగామ: జిల్లాలోని జెడ్పీటీసీ స్థానాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ క్వీన్‌స్వీప్ చేసింది. 12 స్థానాల్లోను 12 చోట్లా తిరుగులేని మెజార్టీతో విజయం సాధించింది. ప్రతిపక్షమే లేకుండా గ్రాండ్ విక్టరీని సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు గెలుపొందిన అభ్యర్థుల్లో జెడ్పీ చైర్మన్ ఎవరనేది ఆసక్తిగా మారుతోంది. జెడ్పీ చైర్మన్ స్థానం జనరల్‌కు కేటాయించారు. విజయం సాధించిన వారిలో చాన్స్ ఎవరి దక్కుతుందనేది సర్వత్రా ఆసక్తిగా మారింది. గుడి, పాగాల మధ్య తీవ్ర పోటీ జెడ్పీటీసీలుగా గెలుపొందిన సభ్యుల్లో లింగాల ఘనపురం నుంచి విజయం సాధించిన గుడి వంశీధర్‌రెడ్డి, చిల్పూర్ మండలం నుంచి విజయం సాధించిన పాగాల సంపత్‌రెడ్డి మధ్య తీవ్రస్థాయిలో పోటీ నెలకొన్నది. ఇద్దరు జెడ్పీ చైర్మన్ పదవిని ఆశిస్తున్నారు. మొదటి నుంచి జెడ్పీ చైర్మన్ స్థానంపై ఆశలు పెట్టుకొని జెడ్పీటీసీ ఎన్నికల బరిలోకి దిగారు. పోటీ చేసిన ఇద్దరు విజయం సాధించడంతో చైర్మన్ కూర్చీ పోటీ పడుతున్నారు. జనరల్ స్థానం కావడంతో ఇద్దరిలో ఒక్కరికే అవకాశం దక్కే అవకాశం ఉంది. చివరి నిమిషంలో ఏమైన సమీకరణలు మారితే మహిళలకు చైర్మన్ పదవిని కట్టబెట్టే అవకాశాలున్నాయి. మహిళలకు చాన్స్ వస్తే తరిగొప్పుల నుంచి గెలుపొందిన ముద్దసాని పద్మజారెడ్డి పేరును పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. వంశీధర్‌కు అధిష్టానం ఆశీస్సులు రఘునాథపల్లి మండలం మాదారం గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ గుడి వంశీధర్‌రెడ్డికి పార్టీ అధిష్టానం ఆశీస్సులున్నాయి. కేటీఆర్ ప్రేరణతో రాజకీయాల్లోకి వచ్చిన అనతికాలంలో టీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతోపాటు జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డితో మంచి సంబంధాలున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రెండు గ్రామాలను ఏకగ్రీవం చేయడంలో కీలకంగా వ్యవహరించారు. మాదారం గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తున్నారు. అయితే సొంత మండలం రఘునాథపల్లిలో రిజర్వేషన్ కలిసి రాక పోవడంతో లింగాల ఘనపురం నుంచి జెడ్పీటీసీ బరిలోకి దిగి భారీ మెజార్టీతో విజయం సాధించారు. వంశీధర్‌రెడ్డి తరుఫున స్వయంగా మంత్రి దయాకర్‌రావు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మంత్రి దయాకర్‌రావు అండదండలతోపాటు పార్టీ పెద్దల సపోర్టు ఉండడంతో జెడ్పీ చైర్మన్ వంశీధర్‌రెడ్డికే దక్కే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. ప్రాదేశిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచే చైర్మన్ రేసులో యువనేత ఉండడం విశేషం. ఉద్యమకారుడిగా సంపత్‌రెడ్డి చిల్పూర్ మండలం నుంచి గెలుపొందిన పాగాల సంపత్‌రెడ్డి తెలంగాణ ఉద్యమకారుడిగా గుర్తింపు ఉంది. 2001 నుంచి పార్టీలో పని చేస్తున్నారు. ఉమ్మడి స్టేషన్ ఘన్పూర్ మండల అధ్యక్షుడిగా వ్యవహరించారు. ప్రస్తుతం రైతు సమన్వయ సమితి నియోజకవర్గ కో కన్వీనర్‌గా కొనసాగుతున్నారు. మొదటి నుంచి తెలంగాణ ఉద్యమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. స్థానిక ఎమ్మెల్యేతోపాటు ఎన్నికల ఇన్చార్జి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పార్టీ నేతలతో సంబంధాలున్నాయి. చిల్పూర్ జనరల్ స్థానం నుంచి గెలుపొందడంతో చైర్మన్ రేసులో సంపత్‌రెడ్డి ఉన్నారు. ఘన్పూర్ కోటాలోనే చైర్మన్.. జిల్లాలోని స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం నుంచే జెడ్పీ చైర్మన్ పదవి దక్కే అవకాశం ఉంది. పాలకుర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఎర్రబెల్లి దయాకర్‌రావు రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. జనగామ నుంచి రైతు సమన్వయ సమితి జిల్లా కో ఆర్డినేటర్ పదవి ఇచ్చారు. ఇక స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం నుంచే జెడ్పీ చైర్మన్ పదవిని ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇందులో లింగాల ఘనపురం, చిల్పూర్ మండలాలు ఘన్పూర్ నియోజకవర్గంలోనే ఉన్నాయి. ఈ రెండు మండలాల నుంచి గెలుపొందిన వంశీధర్‌రెడ్డి, పాగాల సంపత్‌రెడ్డిలో ఒక్కరికి చాన్స్ దక్కే అవకాశం ఉంది. నేడో రేపో చైర్మన్ అభ్యర్థిని పార్టీ నేతలు ప్రకటించే అవకాశం ఉంది. -
క్యాంప్‌లు షురూ
ప్రాదేశిక ఫలితాలు వెల్లడయ్యాయి. ప్రలోభ పర్వానికి తెరలేచింది. మండల పరిషత్ పీఠాలే లక్ష్యంగా రాజకీయాలు ఊపందుకున్నాయి. టీఆర్ఎస్దే ఆధిక్యం అయినప్పటికీ.. కాంగ్రెస్ సైతం పట్టవదలకుండా ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ క్రమంలో అటు కారు, ఇటు హస్తం నేతలు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పలు మండలాలకు సంబంధించిన ఎంపీటీసీ సభ్యులను క్యాంప్‌లకు తరలించారు. అంతేకాదు.. పలు మండలాల్లో ఎంపీపీ పీఠంపై టీఆర్ఎస్లో ద్విముఖ పోటీ నెలకొంది. ఈ క్రమంలో ఎవరికి వారు వేర్వేరుగా క్యాంప్ రాజకీయాలకు తెరలేపినట్లు సమాచారం.ప్రధానంగా నర్సాపూర్, నార్సింగి, తూప్రాన్, వెల్దుర్తి మండలాలకు సంబంధించి ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడం.. స్వతంత్రులే కీలకం కావడంతో అందరి దృష్టి వీటిపైనే కేంద్రీకృతమైంది. సాక్షి, మెదక్ : జిల్లాలో 20 ఎంపీపీ స్థానాలు ఉండగా.. మెజార్టీ స్థానాల్లో టీఆర్ఎస్ ఎంపీటీసీ అభ్యర్థులే గెలుపొందారు. అల్లాదుర్గం, చిలప్‌చెడ్, హవేళి ఘణాపూర్, కౌడిపల్లి, కొల్చారం, మనో హరాబాద్, మెదక్, నిజాంపేట, పాపన్నపేట, రామాయంపేట, పెద్దశంకరంపేట, శివ్వంపేట పరిధిలో ‘కారు’కే స్పష్టమైన ఆధిక్యత లభిం చింది. ఈ 12 మండలాల్లో ఎంపీపీ స్థానాలు టీఆర్ఎస్కే దక్కుతాయనేది సుస్పష్టం. చేగుంట మండలానికి సంబంధించి మొత్తం 13 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. టీఆర్ఎస్ అభ్యర్థులునలుగురు, స్వతంత్ర అభ్యర్థులు తొమ్మిదిమంది గెలుపొందారు. స్వతంత్రులంతాటీఆర్ఎస్ రెబల్స్ కావడం విశేషం. ఈ లెక్కన చేగుంట ఎంపీపీ పీఠం టీఆర్ఎస్ ఖాతాలో చేరే అవకాశం ఉంది. రేగోడు, చిన్న శంకరంపేట, టేక్మాల్ మండలాల పరిధిలో కాంగ్రెస్‌కే అధిక సంఖ్యలో ఎంపీటీసీ స్థానాలు దక్కాయి. ఈ మూడు మండలాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకోకుంటే ఎంపీపీ స్థానాలు కాంగ్రెస్‌వే. రసకందాయంలో నాలుగు పీఠాలు నర్సాపూర్, నార్సింగి, తూప్రాన్, వెల్దుర్తి మండలాల్లో ఎంపీపీ పీఠాలపై అస్పష్టత నెలకొంది. పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో ఈ నాలుగు పీఠాలు రసకందాయంలో పడ్డాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ఎవరికి వారు తీవ్రంగా యత్నిస్తుండడంతో నాటకీయ పరిణా మాలు చోటుచేసుకుంటున్నాయి. నార్సింగికి సంబంధించి మొత్తం ఐదు ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. టీఆర్ఎస్ రెండు, కాంగ్రెస్ ఒకటి, స్వతంత్ర అభ్యర్థులు ఇద్దరు గెలుపొందారు. స్వతంత్రులు ఎటు మొగ్గు చూపితే వారే ఎంపీపీ పీఠాన్ని దక్కించుకోనున్నారు. ఇక్కడ టీఆర్ఎస్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తూప్రాన్‌లో ఐదు ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. కాంగ్రెస్ రెండు, టీఆర్ఎస్ ఒకటి, స్వతంత్రులు ఇద్దరు గెలుపొందారు. ఇక్కడ స్వతంత్రులు కీలకం కానున్నారు. వెల్దుర్తిలో 12 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. కాంగ్రెస్ ఐదు, టీఆర్ఎస్ నాలుగు, స్వతంత్రులు ముగ్గురు విజయం సాధించారు. ఇండిపెండెంట్లు ముగ్గురు మూకుమ్మడిగా ఎటు మొగ్గు చూపుతారో.. వారే ఎంపీపీ పీఠాన్ని కైవసం చేసుకోనున్నారు. ఎంపీపీ పీఠాలు ఇలా.. మెదక్ నియోజకవర్గ పరిధిలోని మెదక్ ఎంపీపీ జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. దీని పరిధిలో మొత్తం ఏడు ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఐదింటిలో టీఆర్ఎస్, రెండింటిలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. టీఆర్ఎస్కు స్పష్టమైన ఆధిక్యం రాగా.. ఎంపీపీకి ప్రధానంగా ర్యాలమడుగు నుంచి పోటీ చేసిన యమున జయరాంరెడ్డి పేరు వినపడుతోంది. ఈ మేరకు ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డిని కలిసి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. హవేళిఘనాపూర్ ఎంపీపీ జనరల్‌కు రిజర్వ్ అయింది. దీని పరిధిలో 12 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. 11 స్థానాల్లో టీఆర్ఎస్.. ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. టీఆర్ఎస్కే ఆధిక్యం ఉండగా.. ఆ పార్టీ నుంచి ప్రధానంగా ఇద్దరు ఎంపీపీ పీఠానికి పోటీపడుతున్నారు. కూచన్‌పల్లికి చెందిన శేరి నారాయణరెడ్డి, తొగిటకు చెందిన మాణిక్‌రెడ్డి మధ్య పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. శేరి నారాయణరెడ్డి స్వయానా ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన శేరి సుభాష్‌రెడ్డి సోదరుడు కాగా.. మాణిక్‌రెడ్డి టీఆర్ఎస్ జిల్లా నాయకుడు, రాజకీయ అనుభవం ఉంది. ఈ క్రమంలో ఎంపీపీ పీఠం కోసం ఎవరికి వారు ముమ్మరంగా యత్నిస్తున్నట్లు తెలిసింది. ఇద్దరు టీఆర్ఎస్కే చెందినప్పటికీ ఈ పదవి ఎవరిని వర్తిస్తుందనే అంశం జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. శివ్వంపేట ఎంపీపీ స్థానం ఓసీ జనరల్‌కు రిజర్వ్ అయింది. దీని పరిధిలో 12 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. టీఆర్ఎస్ పది, స్వతంత్రులు ఇద్దరు విజయం సాధించారు. శివ్వంపేట నుంచి ఎంపీటీసీగా విజయం సాధించిన తాజామాజీ ఎంపీపీ కల్లూరు హరికృష్ణ మరోసారి పీఠాన్ని అధిరోహించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈయనకు పార్టీ అధిష్టానం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ మేరకు ఎంపీటీసీ సభ్యులను క్యాంప్‌నకు తరలిలించినట్లు తెలిసింది. మరోవైపు కొత్తపేట, పాంబండ ఎంపీటీసీ సభ్యులు సత్తిరెడ్డి, రమాకాంత్‌రెడ్డి సైతం ఎంపీపీ పదవిని చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు వినికిడి. కొల్చారం ఎంపీపీ పదవి బీసీ మహిళకు రిజర్వ్ అయింది. 10 ఎంపీటీసీ స్థానాలో ఏడు టీఆర్ఎస్.. ముగ్గురు స్వతంత్రులు విజయం సాధించారు. టీఆర్ఎస్కే ఆధిక్యం ఉండగా.. ఎవరూ క్యాంప్‌నకు వెళ్లలేదు. ఎనగండ్ల, రంగంపేట్, రాంపూర్ ఎంపీటీసీ సభ్యులు ఎవరికి వారు ఎంపీపీ పదవికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. మనోహరబాద్ ఎంపీపీ బీసీ మహిళకు రిజర్వ్ అయింది. దీని పరిధిలో ఎంపీటీసీ స్థానాలు ఏడు కాగా.. టీఆర్ఎస్–5, స్వతంత్రులు ఇద్దరు (టీఆర్ఎస్ రెబెల్స్) గెలుపొందారు. వీరిలో కల్లకళ్–2 అభ్యర్థి పురం నవనీత తరఫున కుచారం, రంగాయిపల్లి, లింగారెడ్డి పేట్‌కు చెందిన ఎంపీటీసీ సభ్యులు ఎలక్షన్‌రెడ్డి ఆధ్వర్యంలో క్యాంపునకు వెళ్లినట్లు సమాచారం. మనోహరబాద్ అభ్యర్థి పొట్లోళ లత తరఫున పర్కిబందా, కల్లకళ్–1 ఎంపీటీసీ సభ్యులు జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి తరçఫున వేరే క్యాంప్‌నకు వెళ్లారు. నిజాంపేట ఎంపీపీ బీసీ జనరల్‌కు రిజర్వ్ అయింది. దీని పరిధిలో ఎనిమిది ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. ఆరింటిలో టీఆర్ఎస్, ఒకరు చొప్పున కాంగ్రెస్, స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. రిజర్వేషన్ ప్రకారం నçష్కల్ నుంచి గెలిచిన దేశెట్టి సిద్ధరాములుకు మాత్రమే అవకాశం ఉండగా.. ఎంపీటీసీ అభ్యర్థులను క్యాంప్‌నకు తరలించినట్లు తెలుస్తోంది. రామాయంపేట ఎంపీపీ ఎస్సీకి రిజర్వ్ అయింది. మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి స్వగ్రామమైన కోనాపూర్ నుంచి ఎంపీటీసీగా గెలుపొందిన భిక్షపతిని ఇదివరకే ఎంపీపీగా ప్రకటించినట్లు సమాచారం. ఈ మేరకు టీఆర్ఎస్ అభ్యర్థులను క్యాంపునకు తరలించినట్లు తెలిసింది. చేగుంట ఎంపీపీ స్థానం ఓసీ జనరల్‌కు రిజర్ కాగా.. దీని పరిధిలో మొత్తం 13 ఎంపీటీసీ స్థానాలున్నాయి. గెలిచిన తొమ్మిది మంది స్వతంత్ర అభ్యర్థులకు ఎనిమిది మంది క్యాంపులో ఉన్నారు. వీరిలో చందాయిపేట్, చేగుంట, రెడ్డిపల్లి ఎంపీటీసీ సభ్యులు రామచంద్రం, మసుల శ్రీనివాస్, శంభుని రవి ఎంపీపీ కోసం పోటీ పడుతున్నారు. నార్సింగి ఎంపీపీ స్థానం జనరల్ మహిళకు రిజర్వ్ కాగా.. దీని పరిధిలో ఐదు ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. గెలుపొందిన వారిలో ఇద్దరు స్వతంత్రులు. ఒక కాంగ్రెస్ అభ్యర్థి క్యాంపునకు తరలి వెళ్లారు. నార్సింగి ఎంపీటీసీ ఆకుల సుజాతను ఎంపీపీగా చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. రేగోడ్ ఎంపీపీ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. దీని పరిధిలో ఏడు ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. కాంగ్రెస్ నాలుగింట గెలుపొందింది. గజ్వాడకు చెందిన ఎంపీటీసీ సభ్యురాలు సరోజన ఎంపీపీ అయ్యే అవకాశం ఉంది. అయినా.. కాం గ్రెస్ సభ్యులు క్యాంపునకు వెళ్లినట్లు తెలిసింది. నర్సాపూర్ ఎంపీపీ పదవిని ఎస్టీ మహిళకు రిజర్వ్ చేశారు. దీని పరిధిలో పది ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. కాంగ్రెస్, టీఆర్ఎస్ ఐదు చొప్పున గెలుపొందాయి. టీఆర్ఎస్కు చెందిన చిప్పలుతుర్తి ఎంపీటీసీ సంధ్యారాణి.. కాంగ్రెస్‌కు చెందిన అహ్మద్‌నగర్ ఎంపీటీసీ జ్యోతిలో ఎవరోఒకరు పీఠాన్ని అధిరోహించే అవకాశం ఉంది. టీఆర్ఎస్ యాదగిరిగుట్టలో క్యాంప్ పెట్టినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్‌కు వెళ్తున్నారు. అక్కడి నుంచి శ్రీశైలం వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం. కౌడిపల్లి ఎంపీపీ పదవి ఎస్టీ జనరల్‌కు రిజర్వ్ అయింది. దీని పరిధిలో పది ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఇందులో టీఆర్ఎస్ తొమ్మిది.. కాంగ్రెస్ ఒక స్థానంలో గెలుపొందింది. సలబతపూర్ ఎంíపీటీసీ సభ్యుడు రాజు, మహమ్మద్ నగర్ ఎంపీటీసీ సభ్యురాలు సునీత ఎంపీపీ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. వెల్దుర్తిలో 12 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. కాంగ్రెస్ ఐదు, టీఆర్ఎస్ నాలుగు, స్వతంత్రులు ముగ్గురు (టీఆర్ఎస్ రెబల్స్) గెలుపొందారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ తమతమ సభ్యులను క్యాంప్‌లకు తరలించగా.. స్వతంత్రులు ముగ్గురూ ఎటూ వెళ్లలేదు. దీంతో ఈ పీఠంపై అనిశ్చితి నెలకొంది. తూప్రాన్‌లో ఎంపీపీ పీఠం కాంగ్రెస్‌కే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఎంపీపీ రిజర్వేషన్ బీసీ మహిళ కాగా.. రెండు చొప్పున కాంగ్రెస్, స్వతంత్ర.. ఒకరు టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందారు. స్వతంత్ర అభ్యర్థిని బీసీ మహిళ గడ్డి స్వప్న కాంగ్రెస్‌లో చేరడంతో ఆమే ఎంపీపీ కానున్నట్లు తెలుస్తోంది. పెద్దశంకరంపేటలో శ్రీనివాస్, అల్లాదుర్గంలో అనిల్‌రెడ్డి ఎంపీపీలుగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. పాపన్నపేటకు చెందిన ఎంపీటీసీలు తీర్థయాత్రకు.. చిన్నశంకరంపేట, టేక్మాల్ ఎంపీటీసీ సభ్యులు క్యాంప్‌లకు తరలివెళ్లినట్లు తెలిసింది. తొలి జెడ్పీ పీఠం మనోహరాబాద్కే.. జిల్లా పరిషత్ తొలి పీఠంతోపాటు ఎంపీపీ పదవులు ఎవరిని వర్తిస్తాయనే దానిపై జిల్లావ్యాప్తంగా జోరుగా చర్చ సాగుతోంది. జిల్లా పరిషత్ పీఠం బీసీ మహిళకు రిజర్వ్ కాగా.. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని మెదక్ జిల్లాకు చెందిన మనోహరాబాద్‌కు దక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ స్థానంలో టీఆర్ఎస్ తరఫున జెడ్పీటీసీ అభ్యర్థిగా బరిలో నిలిచిన హేమలతా శేఖర్‌గౌడ్ 5,579 ఓట్ల భారీ మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్‌పై విజయం సాధించారు. ఆమెకే జిల్లా పరిషత్ తొలి పీఠం దక్కుతుందని స్థానిక టీఆర్ఎస్ నేతలు సైతం పూర్తి విశ్వాసంతో ఉండడం విశేషం. -
వైస్ చైర్మన్ పదవికి పోటాపోటీ
సాక్షి, రంగారెడ్డి జిల్లా: మండల, జిల్లా పరిషత్ ఫలితాలు తేలడంతో అందరి దృష్టి ఎంపీపీ, జెడ్పీ చైర్పర్సన్, వైస్ చైర్మన్ స్థానాలపై పడింది. జెడ్పీ చైర్‌పర్సన్‌గా డాక్టర్ తీగల అనితారెడ్డికి టీఆర్ఎస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆమె ఎన్నిక లాంఛనమేనని తెలుస్తోంది. ఇక.. వైస్ చైర్మన్ పదవిపై ఆశావహులు గురిపెట్టారు. ఈ స్థానానికి రిజర్వేషన్‌తో సంబంధం లేకపోవడంతో ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. ప్రధానంగా ముగ్గురి పేర్లు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి సొంత అన్న కుమారుడు పట్నం అవినాష్‌రెడ్డి ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పటికే పట్నం ఫ్యామిలీ నుంచి నలుగురికి పదవులు దక్కాయి. కొడంగల్‌కు నరేందర్‌రెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తుండగా.. మహేందర్‌రెడ్డి తాజాగా ఎమ్మెల్సీగా నెగ్గారు. అలాగే వికారాబాద్ జిల్లా కోట్‌పల్లి నుంచి జెడ్పీటీసీగా గెలుపొందిన ఈయన సతీమణి సునితారెడ్డిని ఆ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ పదవికి ఖరారు చేశారు. అంతేగాక షాబాద్ నుంచి అవినాష్‌రెడ్డి జెడ్పీటీసీగా నెగ్గారు. ఈ క్రమంలో అవినాష్‌కు జెడ్పీ వైస్‌చైర్సన్‌గా అవకాశం ఇస్తారా? అనే అంశం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఆయన వైపు మొగ్గుచూపితే పార్టీలో అసంతృప్తి వ్యక్తమయ్యే పరిస్థితులు ఉన్నాయని సొంత పార్టీ నేతలు అనుకుంటున్నారు. పార్టీని ఆది నుంచి నమ్ముకున్న వారికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కుమారుడు శ్రీకాంత్ కూడా బరిలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఎమ్మెల్యే సతీమణి కూడా నవాబుపేట జెడ్పీటీసీగా, రెండో కోడలు ఎంపీటీసీగా గెలుపొందారు. ఈ కుటుంబంలోనూ నలుగురికి పదవులు వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో వైస్ చైర్మన్ పదవిని కూడా కట్టబెడతారా అనేది ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది. రేసులో వెంకటేష్ కూడా.. తలకొండపల్లి జెడ్పీటీసీగా ఆల్ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్బీ) తరఫున అత్యధిక మెజారిటీతో గెలుపొంది అందరి దృష్టిని ఆకర్షించిన ఉప్పల వెంకటేశ్ కూడా రేసులో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. ఏఐఎఫ్బీ నుంచి నెగ్గినప్పటికీ.. ఈయన టీఆర్ఎస్ పార్టీ సానుభూతిపరుడని తెలుస్తోంది. ఈయనకు వైస్ చైర్మన్ పదవి ఖరారు చేస్తే గులాబీ కండువా కప్పుకునేందుకు సుముఖంగా ఉన్నట్లు వెంకటేష్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. దీనికితోడు ఆయన తలకొండపల్లి మండలంలో ఆరు ఎంపీటీసీ స్థానాల్లో తన వర్గాన్ని గెలిపించుకుని సత్తా చాటారు. స్థానిక రాజకీయాల వల్ల టీఆర్ఎస్ నుంచి టికెట్ లభించకున్నా ఏఐఎఫ్బీ నుంచి పోటీచేసి తనకున్న మంచిపేరుతో మెజారిటీ స్థానాలను సొంతం చేసుకున్న వెంకటేష్ పట్ల అధికార పార్టీ సానుకూలంగా స్పందిస్తుందని ఆయన అనుయాయులు నమ్మకంతో ఉన్నారు. వీరితోపాటు మరికొందరు కూడా రేసులో ఉన్నట్లు సమాచారం. ఇలా ఆశా వహ అభ్యర్థులు తమ మార్గాల్లో వైస్ చైర్మన్ పదవి కోసం విస్తృతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. తెరమీదకు బీసీ నినాదం జెడ్పీ పీఠం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి పేరు ఖరారైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైస్ చైర్మన్ పదవిని బీసీలకు కేటాయించాలన్న డిమాండ్ తెరపైకి వస్తోంది. బీసీ అంశానికి అధిష్టానం కట్టుబడి ఉంటే.. ప్రధానంగా వినిపిస్తున్న అవినాష్, శ్రీకాంత్, వెంకటేష్ పేర్లను పక్కన పెట్టినట్లే. అవినాష్‌ది రెడ్డి సామాజిక వర్గం కాగా, శ్రీకాంత్.. ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు. ఇక వెంకటేష్ ఆర్యవైశ్యులు. ఈ నేపథ్యంలో ఇతరుల పేర్లు పరిశీలనలోకి వచ్చే వీలుంది. తద్వారా ఆశావహుల సంఖ్య కూడా భారీగానే ఉండనుంది. మొత్తం మీద జెడ్పీ చైర్ పర్సన్ ఎన్నిక జరిగే 8వ తేదీనే వైస్ చైర్మన్‌ను కూడా ఎన్నుకుంటారు. అంటే ఏదో తేదీలోగా వైస్ చైర్మన్ పదవికి పార్టీ ఎవరిని ఖరారు చేస్తుందో తేలనుంది. అధిష్టానం ఖరారు చేసిన వ్యక్తికే ఆ పదవి దక్కుతుందని పార్టీ సీనియర్ నేతలు పేర్కొంటున్నారు. ఎంపీపీ పీఠాలకు బేరాలు.. మండల రాజకీయాల్లో కీలకమైన ఎంపీపీ పదవికి తీవ్ర పోటీ కనిపిస్తోంది. అధికార పార్టీకి తొమ్మిది మండలాల్లో స్పష్టమైన మెజారిటీ రావడంతో ఆ ఎంపీపీ స్థానాలు అధికార పార్టీ ఖాతాలో పడే అవకాశం ఉంది. అయినా కొందరు నేతలు క్యాంప్ రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. దురదృష్టం వెంటాడితే ఏదైనా జరగొచ్చన్న ముందస్తు చర్యగా ఎంపీటీసీలతో శిబిరం నిర్వహిస్తూ చేజారకుండా జాగ్రత్త వహిస్తున్నారు. ఇక హంగ్ ఏర్పడిన 11 స్థానాలనూ సొంతం చేసుకునేందుకు టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. ఈ మండలాల్లో ఎంపీపీ స్థానాలను సాధించడంలో.. స్వతంత్రులు, ఇతర పార్టీల నేతలు కీలకంగా మారుతున్నారు. వీరిని ఆకర్షించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. మరోపక్క చేవెళ్ల, మంచాల ఎంపీపీ స్థానాలను హస్తగతం చేసుకునేందుకు కాంగ్రెస్ కూడా రంగంలోకి దిగింది. వీరి ఎన్నికలో కీలకమైన ఎంపీటీసీలను తమవైపు తిప్పుకునేందుకు శాయశక్తులా ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇలా ఆయా పార్టీల అవసరాలను గమనించిన కొందరు ఎంపీటీసీలు తమ కోరికల చిట్టాను వారి ముందు పెడుతున్నారు. తమకు ఎంపీపీ లేదా వైస్ ఎంపీపీ పదవులు ఇస్తేనే ముందుకు వస్తామని నిర్మొహమాటంగా చెబుతున్నారు. మొత్తం మీద ఎంపీసీల ఎన్నిక సరవత్తరంగా మారుతోంది. -
జెడ్పీ చైర్‌పర్సన్‌గా దఫేదార్ శోభ!
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవికి నిజాంసాగర్ జెడ్పీటీసీ సభ్యురాలు దఫేదార్ శోభ పేరును టీఆర్ఎస్ అధిష్టానం ఖరారు చేసింది. ఓట్ల లెక్కింపు పూర్తయిన తరువాత జెడ్పీటీసీ సభ్యులను హైదరాబాద్‌కు తరలించారు. జిల్లాలో 22 జెడ్పీటీసీలకుగాను టీఆర్ఎస్ పార్టీనుంచి 14 మంది సభ్యులు విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఆ పార్టీకి చెందిన వారే జెడ్పీ చైర్మన్‌తో పాటు వైస్ చైర్మన్ పదవులు పొందనున్నారు. జెడ్పీ చైర్మన్ పదవి బీసీ మహిళకు రిజర్వు కాగా, ప్రస్తుత జెడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు భార్య శోభ నిజాంసాగర్ నుంచి గెలుపొందడంతో ఆమెను జెడ్పీ చైర్మన్‌గా ఎంపిక చేశారు. వైస్ చైర్మన్‌గా.. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పదవిని కామారెడ్డి నియోజక వర్గానికి ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పార్టీ అధిష్టానాన్ని కోరారని సమాచారం. తనకు మొదటి నుంచి ముఖ్య అనుచరుడిగా ఉన్న మాచారెడ్డి జెడ్పీటీసీ సభ్యుడు మిన్కూరి రాంరెడ్డి పేరును సూచించినట్లు తెలిసింది. బీబీపేట జెడ్పీటీసీ సభ్యుడు ప్రేమ్‌కుమార్ కూడా వైస్‌చైర్మన్ పదవిని ఆశిస్తున్నారు. మిన్కూరి రాంరెడ్డికే వైస్ చైర్మన్ పదవి దక్కుతుందని భావిస్తున్నారు. -
మెజారిటీ జెడ్పీటీసీలు ఉన్నా..
జెడ్పీ చైర్మన్ స్థానం దక్కించుకునేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ కంటే తొమ్మిది జెడ్పీటీసీ స్థానాలను అధికంగా టీఆర్ఎస్ గెలుచుకుంది. రెండేసి స్థానాలు పొందిన కాంగ్రెస్, బీజేపీలు మ్యాజిక్ ఫిగర్‌కు దరిదాపుల్లో కూడా లేవు. అయినా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా టీఆర్ఎస్ తన జెడ్పీటీసీ సభ్యులను శిబిరానికి తరలించింది. జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల విషయంలో శుక్రవారం రాత్రి పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. అధినేత కేసీఆర్ సూచించిన వారికి ఈ పదవులు దక్కే అవకాశాలున్నాయి. శనివారం ఉదయం జెడ్పీలో జరిగే ప్రత్యేక సమావేశానికి జెడ్పీటీసీలు క్యాంపు నుంచి నేరుగా వచ్చి హాజరవుతారు. చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకుంటారు. మరోవైపు ఎంపీపీ పదవుల కోసం పెద్ద ఎత్తున ముడుపుల రాజకీయానికి తెరలేచింది. స్వతంత్రుల మద్దతు కీలకంగా మారిన చోట రూ.లక్షల్లో నజరానాలతో పాటు, వైస్ ఎంపీపీ పదవిని కొందరు డిమాండ్ చేస్తుండటం గమనార్హం. ఎంపీపీ పదవుల కోసం అధికార పార్టీ టీఆర్ఎస్లోనే పోటా పోటీ నెలకొనడం ఆసక్తి కరంగా మారింది. మండల పరిషత్ చైర్మన్ల ఎన్నిక శుక్రవారం నిర్వహించనున్నారు. సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : జిల్లా పరిషత్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు టీఆర్ఎస్కు పూర్తి మెజారిటీ వచ్చినా ఆ పార్టీ క్యాంపును నిర్వహిస్తోంది. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా జెడ్పీటీసీలందరినీ శిబిరానికి తరలించింది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో కేర్ ఆస్పత్రి సమీపంలోని ఓ ప్రైవేటు వసతిగృహానికి తరలించారు. పరిషత్ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే మంగళవారం రాత్రికే హైదరాబాద్ రావాలని జెడ్పీటీసీలందరికి ఆ పార్టీ నుంచి ఆదేశాలందాయి. చాలా మట్టుకు జెడ్పీటీసీలు అదేరోజు రాత్రి క్యాంపునకు వెళ్లగా, కొందరు బుధవారం చేరుకున్నారు. 27 జెడ్పీటీసీ స్థానాలకు గాను, 23 స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకున్న విషయం విదితమే. చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ కంటే తొమ్మిది జెడ్పీటీసీ స్థానాలను అధికంగా గెలుచుకుంది. ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు రెండేసి జెడ్పీటీసీలను దక్కించుకున్నాయి. ఈ రెండు పార్టీలు కలిసినా మ్యాజిక్ ఫిగర్‌కు దరిదాపుల్లో లేకపోయినప్పటికీ., టీఆర్ఎస్ పార్టీ ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా జెడ్పీటీసీలను క్యాంపునకు తరలించడం చర్చనీయాంశంగా మారింది. అధినేత సూచించిన వారికే.. జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల విషయంలో శుక్రవారం రాత్రి పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. అధినేత కేసీఆర్ సూచించిన వారికి ఈ పదవులు దక్కే అవకాశాలున్నాయి. దీంతో చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుంది.? వైస్‌చైర్మన్‌గా ఎవరిని ఎన్నుకుంటారనేదానిపై ఇప్పటికే ఆ పార్టీ ము ఖ్యనేతలకు సంకేతాలున్నాయి. ఈ విషయమై సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు స్పీకర్ పోచా రం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు జెడ్పీటీసీలతో సమావేశం కానున్నారు. చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల విషయంలో అధిష్టానం నిర్ణయానికి స భ్యులందరూ కట్టుబడి ఉండాలని ఇప్పటికే జె డ్పీటీసీలందరినీ ఆదేశించారు. కాగా ఈ పదవుల కోసం గెలుపొందిన జెడ్పీటీసీలు ఎవరికి వారే ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఆయా ని యోజకవర్గ ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకుంటున్నారు. చైర్మన్ రేసులో నలుగురి పేర్లు ప్రముఖంగావినిపిస్తుండగా,వైస్ చైర్మన్ పదవి కోసం మోస్రా జెడ్పీటీసీ భాస్కర్‌రెడ్డి స్పీకర్ పోచారం ఆశీస్సుల కోసం ప్రయత్నిస్తున్నారు. నేరుగా జెడ్పీ సమావేశానికే.. హైదరాబాద్ క్యాంపులో ఉన్న జెడ్పీటీసీలందరినీ నేరుగా జిల్లా పరిషత్ ప్రత్యేక సమావేశానికి తీసుకురానున్నారు. చైర్మన్, వైస్ చైర్మన్, కోఆప్షన్ సభ్యులను ఎన్నుకునేందుకు శనివారం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జెడ్పీ సమావేశ మందిరంలో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నిర్ణయించిన విషయం విదితమే. ఇప్పటికే జెడ్పీటీసీలందరికీ ఎన్నికల నోటీసులు అందజేశారు. దీంతో జెడ్పీటీసీ సభ్యులందరినీ నేరుగా ఆరోజు ఉదయం ఈ సమావేశానికి ప్రత్యేక బస్సుల్లో తీసుకువచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
అయిననూ.. పోయిరావలే!
సాక్షిప్రతినిధి, నల్లగొండ : గులాబీ నేతలు క్యాంపుల బాట పట్టారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల ఫలితాలు వెలువడిన వెంటనే టీఆర్ఎస్ నాయకత్వం తమ సభ్యులను వివిధ ప్రాంతాలకు తరలించింది. జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. అయినా.. ముందు జాగ్రత్తగా ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ తమ ప్రతినిధులను క్యాంపులకు తరలి వెళ్లాలని హుకుం జారీ చేశారని పార్టీ వర్గాల సమాచారం. ఫలితాలు వెలువడిన తర్వాత రాత్రికి రాత్రి ఈ ఆదేశాలు జారీ అయ్యాయని, టీఆర్ఎస్ తరఫున గెలిచిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు బుధవారం ఉదయమే వేర్వేరుగా క్యాంపులకు వెళ్లిపోయారని చెబుతున్నారు. 31 జెడ్పీటీసీ స్థానాలున్న నల్లగొండ జిల్లా పరిషత్‌ను కైవసం చేసుకోవాలంటే 16 మంది సభ్యుల బలం ఉండాలి. కానీ, ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఏకంగా.. 24 మంది సభ్యులతో కావాల్సిన సంఖ్య కంటే అదనంగా మరో ఎనిమిది మంది తో బలంగానే ఉంది. ప్రతిపక్ష కాంగ్రెస్ కేవలం 7 స్థానాల్లో విజయానికే పరిమితమైంది. ఇంత మెజారిటీ ఉన్నా.. ఈనెల 8వ తేదీన జెడ్పీ చైర్మన్ ఎన్నిక జరిగే వరకు 24 మంది సభ్యులతో క్యాంపు ఏర్పాటు చేయాలని పార్టీ అధినాయకత్వం నిర్ణయించడం విశేషం. ఇదంతా ముందు జాగ్రత్తతోనే ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని .. పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా, జెడ్పీటీసీ సభ్యుల క్యాంపుల ఏర్పాటు బాధ్యతను మాజీ ఎంపీ, రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డికి అప్పజెప్పారు. జెడ్పీ చైర్మన్ ఎన్నికల ఇన్చార్జ్గా పార్టీ నాయకత్వం ఆయనను నియమించిన విషయం తెలిసిందే. ఆయన నేతృత్వంలోనే క్యాంపు ఏర్పాటయ్యిందని సమాచారం. ఈనెల 8వ తేదీన జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరిగే సమయానికి వీరందరినీ క్యాంపునుంచి జిల్లా కేంద్రానికి తీసుకురానున్నారు. ఎంపీటీసీల క్యాంపుల బాధ్యత ఎమ్మెల్యేలకు.. మరో వైపు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎంపీటీసీ సభ్యులతోనూ క్యాంపులు ఏర్పాటు చేశారు. వీటిని బాధ్యతను ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు అప్పజెప్పారని సమాచారం. జిల్లా వ్యాప్తంగా 31 మండలాలకు గాను అత్యధిక ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకున్న టీఆర్ఎస్కు 18 ఎంపీపీ (మండల పరిషత్ ప్రెసిడెంట్) పదవులు దక్కుతున్నాయి. ఆరు మండలాలను కాంగ్రెస్ కైవసం చేసుకోగా.. ఇంకో ఏడు చోట్ల మాత్రం ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. ఈ మండలాల్లో ఒక విధంగా ఇరు పార్టీలకూ సమాన అవకాశాలు ఉన్నాయి. ఒక్క చండూరు మినహా మిగిలిన ఆరు స్థానాల్లో టీఆర్ఎస్కు అవకాశం ఉందని, ఈ మండలాల్లో టీఆర్ఎస్ రెబల్స్ గెలవడమే కారణమని అంటున్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న పార్టీ నాయకత్వం మొత్తంగా తమ సభ్యులందరినీ క్యాంపులకు తరలించింది. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గం పరిధిలోని ఎంపీటీసీ సభ్యులను ఇప్పటికే క్యాంపుల్లో పెట్టారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ జిల్లాలోని 349 ఎంపీటీసీ స్థానాలకు గాను 191 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, సీపీఐల స్థానాలు పోను ఇతరులు 14 మంది ఉండగా వారిలో అత్యధికులు టీఆర్ఎస్ నుంచి టికెట్ దక్కక రె»బల్స్గా పోటీ చేసి గెలిచిన వారే. ఇప్పుడు వీరందరినీ కాపాడుకునేందుకు క్యాంపులకు తీసుకువెళ్లారని అంటున్నారు. గత నెల 31వ తేదీన జరిగిన నల్లగొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక కోసం టీఆర్ఎస్ క్యాంపులను ఏర్పాటు చేసింది. ఇప్పుడు కొత్తగా ఎన్నికైన సభ్యులనూ క్యాంపులకు తరలించింది. ఎంపీపీ, వైస్ ఎంపీపీ పదవులకు ఈ నెల 7వ తేదీన ఎన్నిక జరగాల్సి ఉంది. కాగా, ఆ రోజే వారందరినీ క్యాంపులనుంచి ఆయా మండలాలకు తీసుకువస్తారని చెబుతున్నారు. మొత్తానికి కావాల్సినంత మెజారిటీ ఉన్నా. అత్యధిక స్థానాలను కైవసం చేసుకునేంత బలం ఉన్నా.. ముందు జాగ్రత్తతో టీఆర్ఎస్ క్యాంపులను ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. -
తిరుగులేని టీఆర్ఎస్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: తెలంగాణ ఉద్యమానికి బాసటగా నిలిచి టీఆర్ఎస్ను నెత్తికెత్తుకున్న ఉమ్మడి జిల్లా మరోసారి ఆ పార్టీకి అండగా నిలిచింది. ఇతర పార్టీలేవీ దరికి చేరనంతగా గులాబీ దళం ఓట్ల సునామీ సృష్టించింది. ఉమ్మడి కరీంనగర్ పరిధిలోని నాలుగు జిల్లాల్లో ఎక్కడా ప్రతిపక్షం ఆనవాళ్లు కూడా కనిపించని రీతిలో ప్రాదేశిక ఎన్నికల ఫలితాలు వెలువడడం ఆ పార్టీ నేతలను సైతం సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. ఓడిపోతుందనుకొన్న మండలాల్లో సైతం టీఆర్ఎస్ విజయబావుటా ఎగరవేయడం పట్ల ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల ఆనందానికి అవధులు లేవు. కరీంనగర్ జిల్లాలో ఏకంగా 15 జెడ్పీటీసీలతో క్లీన్‌స్వీప్ చేసిన టీఆర్ఎస్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో కేవలం ఒక్కో జెడ్పీటీసీని కాంగ్రెస్‌కు కోల్పోయింది. పెద్దపల్లి జిల్లాలో రెండు జెడ్పీటీసీలు కాంగ్రెస్ వశమయ్యాయి. ఫలితాలకు ముందు హోరాహోరీ పోరు జరిగిందని భావించిన పలు మండలాలు కూడా ఏకపక్షంగా టీఆర్ఎస్ వశమవడం గమనార్హం. అసెంబ్లీ ఫలితాల కన్నా పెరిగిన బలం అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే పుట్ట మధు ప్రాతినిధ్యం వహించిన మంథని నియోజకవర్గం కాంగ్రెస్ వశమైంది. రామగుండంలో టీఆర్ఎస్ మరో సిట్టింగ్ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఓటమి పాలయ్యారు. ధర్మపురిలో మంత్రి కొప్పుల ఈశ్వర్ కేవలం 500 లోపు ఓట్లతోనే విజయం సాధించారు. కానీ ప్రాదేశిక ఎన్నికల్లో ఫలితాలు తారుమారయ్యాయి. మంథనిలోని నాలుగు మండలాల్లో టీఆర్ఎస్ విజయబావుటా ఎగరవేయగా, రామగుండం, ధర్మపురిలోని అన్ని జెడ్పీటీసీలు గులాబీ ఖాతాలోకే చేరాయి. కేవలం పెద్దపల్లి అసెంబ్లీ పరిధిలోనే రెండు జెడ్పీటీసీలు కాంగ్రెస్ చేతికి చిక్కాయి. ఈ మండలాలు కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్చార్జి సీహెచ్.విజయరమణారావు పుట్టి పెరిగిన ప్రాంతాలు కావడం, టీఆర్ఎస్ అభ్యర్థుల పట్ల కొంత వ్యతిరేకత వంటి పరిణామాలతో కాంగ్రెస్ వశమయ్యాయి. పెద్దపల్లి జిల్లాలో మరో మూడు మండలాలు కూడా కాంగ్రెస్ వశమవుతాయని ఆ పార్టీ నేతలు భావించినప్పటికీ, టీఆర్ఎస్ గణనీయంగా ఓట్లు రాబట్టుకుంది. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని హుస్నాబాద్ మినహా అన్ని సెగ్మెంట్లలో టీఆర్ఎస్ హవా సునామీని తలపించింది. కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో జెడ్పీటీసీలతోపాటు ఎంపీటీసీలు కూడా గులాబీ పార్టీ కైవసం చేసుకొని కొత్త చరిత్ర సృష్టించింది. పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్, చొప్పదండి, మానకొండూరు, వేములవాడ నియోజకవర్గాల్లో కలిపి టీఆర్ఎస్పై బీజేపీ దాదాపు లక్షన్నర ఓట్ల మెజారిటీ సాధించగా, ప్రాదేశిక ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఊహించనన్ని ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు పత్తా లేకుండా పోయారు. మంత్రి ఈటల ప్రాతినిధ్యం వహించిన హుజూరాబాద్‌తోపాటు చొప్పదండి, మానకొండూరు, కరీంనగర్ , సిరిసిల్ల, కోరుట్ల, ధర్మపురి స్థానాల్లో ఒక్క సీటు కూడా ప్రతిపక్షానికి దక్కకపోవడం గమనార్హం. సంక్షేమ ఫలాలు మరవని పల్లె జనం టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆసరా పింఛన్లు, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర ప్రభావం చూపాయనేందుకు ఈ ఫలితాలే నిదర్శనం. పార్లమెంటు ఎన్నికల్లో యువత, విద్యార్థులు తల్లిదండ్రులు, కుటుంబసభ్యులతో ‘కేసీఆర్‌కు సంబంధం లేని ఎన్నికలు’ అని చెప్పించి ఓట్లు వేయించిన కారణంగానే కరీంనగర్, నిజామాబాద్ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీకి మెజారిటీ వచ్చిందనే విషయం ఈ ఫలితాలతో తేటతెల్లమైంది. సంక్షేమ పథకాల లబ్ధి కొనసాగాలంటే టీఆర్ఎస్ నాయకులు ఉంటేనే సాధ్యమవుతుందని భావించి, ప్రాదేశిక ఎన్నికల్లో ఓట్ల వర్షం కురిపించారని స్పష్టమవుతోంది. కాగా ప్రాదేశిక ఎన్నికలకు నగర, పట్టణ ప్రాంతపు ఓటర్లు దూరంగా ఉండడం కూడా టీఆర్ఎస్ మెజారిటీ పెరిగేందుకు కారణమైందని రాజకీయ విశ్లేషకుల అంచనా. మంత్రులు, ఎమ్మెల్యేలు హ్యాపీ టీఆర్ఎస్కు అందిన ఈ విజయం పట్ల ఉమ్మడి జిల్లాలోని ఇద్దరు మంత్రులు ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్‌తోపాటు ఎమ్మెల్యేలు సైతం ఆనందంతో తబ్బిబ్బవుతున్నారు. పల్లె జనం తమ వెంటే ఉన్నారని, ఫలితాలు వెయ్యేనుగుల బలాన్నిచ్చాయని కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్నారు. పార్లమెంటు ఎన్నికల ఫలితాల తరువాత కొంత ఇబ్బంది పడ్డ ఎమ్మెల్యేలు మంగళవారం ఫలితాలు వెలువడ్డ తరువాత సంబరాలు చేసుకున్నారు. కరీంనగర్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కార్యకర్తలతో కలిసి ఉత్సవాలు జరుపుకున్నారు. -
‘పరిషత్’ ఆఫీసులెక్కడ?
ఆదిలాబాద్‌అర్బన్: జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలు వెలువడ్డాయి. మండలానికో జెడ్పీటీసీ, ఆయా మండలాల పరిధిలో ఉన్న స్థానాలను బట్టి ఎంపీటీసీ సభ్యులు కొత్తగా ఎన్నికయ్యారు. ఈనెల 7న మండల పరిషత్ అధ్యక్షుడితోపాటు వైస్‌ఎంపీపీ, కో–ఆప్షన్ సభ్యులను కూడా ఎన్నుకోనున్నారు. దీనికి ముందు కొత్తగా ఎన్నికైన ఎంపీటీసీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఎన్నిక జరపాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇది వరకే షెడ్యూల్ జారీ చేసింది. ఇందుకు అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఎంపీపీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల పదవీ కాలం జూలై 4 వరకు ఉంది. ఆ లగా నూతన మండల పరిషత్‌లను ఏర్పాటు చేస్తారా? లేక పాత మండలాల్లోనే కొనసాగిస్తారా? అనేది ఆసక్తిగా మారింది. కొత్త పాలకవర్గం కొలువుదీరి వారి వారి మండల పరిషత్ కార్యాలయాల్లో పాలన సాగించాలంటే నూతన పరిషత్‌లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే నూతనంగా ఎన్నికైన ఎంపీపీ, ఎంపీటీసీలు జూలై 5న ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడిన మండలాల్లో ఎంపీపీ కార్యాలయాలు ఎక్కడ ఏర్పాటు చేస్తారని ఆయా మండలాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నూతన రెవెన్యూ మండలాలను పరిషత్ మండలాలుగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రాదేశిక ఎన్నికలకు ముందే జిల్లా అధికారులను ఆదేశించింది. దీనిపై అధికారులు అప్పట్లో ఎంపీపీ కార్యాలయాల కోసం అద్దె భవనాలు, సౌకర్యాలు ఉండి ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాలను పరిశీలించారు. ఉనికిలోకి నూతన మండల పరిషత్‌లు. జిల్లాలో 17 మండలాలు ఉన్నాయి. ఇందులో పాత మండలాలు 13 ఉండగా, పునర్విభజన సమయంలో కొత్తగా నాలుగు మండలాలు ఏర్పాటయ్యాయి. జైనథ్, బేల, తలమడుగు, గుడిహత్నూర్, నేరడిగొండ, బజార్హత్నూర్, బోథ్, ఇంద్రవెల్లి, ఉట్నూర్, తాంసి, ఆదిలాబాద్, ఇచ్చోడ, నార్నూర్ మండలాలు ఉండగా, తాంసి పరిధిలోని భీంపూర్ కొత్త మండలంగా ఏర్పాటైంది. ఇలాగే ఆదిలాబాద్ నుంచి మావల, ఇచ్చోడ నుంచి సిరికొండ, నార్నూర్ నుంచి గాదిగూడ మండలాలు కొత్తగా ఏర్పాటయ్యాయి. నూతన మండలాలు ఏర్పాటై దాదాపు మూడేళ్లు గడుస్తున్నా ఇంత వరకు రెవెన్యూ మండలాలుగానే కొనసాగుతున్నాయి. కొత్త మండలాల్లో కొనసాగే పరిషత్ పాలన మాత్రం పాత మండలాల నుంచే కొనసాగుతోంది. దీనికి తోడు కొత్త మండలాలకు ఇప్పటికీ ఎంపీడీవోలను నియమించకపోవడంతోపాటు పాత మండలాల ఎంపీడీవోలను ఇన్చార్జిలుగా ప్రభుత్వం కొనసాగిస్తూ వస్తోంది. దీంతో మండల పరిషత్‌లో ఏవైనా పనులుంటే పాత మండల కార్యాలయాలకే రావాల్సి వస్తోంది. ఇక నుంచి నూతన మండల పరిషత్‌లు ఉనికిలోకి రానుండడంతో ప్రజల బాధలు తీరనున్నాయి. కొత్త పరిషత్, పాలకవర్గం కొలువుదీరిన వెంటనే అధికారులను, సిబ్బందిని, సామగ్రిని కొత్త మండలాలకు కేటాయించే అవకాశాలు కన్పిస్తున్నాయి. అధికారుల సన్నాహాలు కొత్తగా ఏర్పడిన మండలాలకు సంబంధించి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పాత మండలాలతో పాటే పూర్తయ్యాయి. దీంతో నూతన మండలాల ఎంపీపీ, వైస్‌ఎంపీపీ, ఇతర పదవులకు ప్రత్యేకంగానే ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. సాధారణంగా ఎంపీపీ కార్యాలయాల్లోనే ఎంపీపీ, ఇతర పదవులకు ఎన్నిక నిర్వహిస్తారు. అందుకు ఎంపీపీ కార్యాలయాలను ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఎంపీడీవో, సూపరింటెండెంట్, అకౌంట్స్ అధికారి, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లతోపాటు స్వీపర్లను కూడా కొత్త మండలాలకు కేటాయించాల్సి ఉంది. మొదట కార్యాలయాలకు భవనాలను ఎంపిక చేసిన తర్వాత దశల వారీగా సిబ్బంది కేటాయింపు, ఇతర కార్యక్రమాలను పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. కొరవడిన స్పష్టత కొత్త మండలాల్లో ఎంపీడీవో కార్యాలయాలను ఎక్కడ ఏర్పాటు చేస్తారో ఇప్పటికీ స్పష్టత లేదు. కొత్తగా ఏర్పడిన భీంపూర్ మండలం ఎంపీడీవో కార్యాలయం ఎక్కడ ఏర్పాటు చేస్తారనే దానిపై సందిగ్ధం నెలకొంది. ఈ మండలంలో తహసీల్దార్ కార్యాలయం పంచాయతీ భవనంలో కొనసాగుతోంది. ఇక్కడ ప్రభుత్వ, అద్దె భవనాలు దొరకడం కొంత కష్టమే. దీంతో తహసీల్ కార్యాలయం పక్కనే ఒక రూంలో పంచాయతీ భవనం కొనసాగుతోంది. ఇదిలా ఉంటే బాద్‌రూరల్ మండలం నుంచి విడిపోయిన మావల మండలం పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. మావల మండల రెవెన్యూ తహసీల్ కార్యాలయం పట్టణంలోని ప్రభుత్వ ఉద్యోగుల నివాస గృహాల్లో కొనసాగుతోంది. ఇక్కడ మండల పరిషత్ ఏర్పాటుకు నూతన భవనం వెతకాల్సి ఉంది. అలాగే గాదిగూడ, సిరికొండ మండలాల్లో కూడా ప్రభుత్వ భవనాలు, అద్దె భవనాలు దొరకడం కష్టంగా మారిన నేపథ్యంలో పరిషత్ ఏర్పాటు అధికారులకు ఓ విధంగా సవాల్‌గా మారిందని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా, కొత్త మండలాల్లో ప్రభుత్వ భవనాల నిర్మాణాలు ఇప్పటికీ చేపట్టపోగా, ఉన్న ప్రభుత్వ భవనాలు, అద్దె భవనాల్లోనే కాలం వెల్లదీయాల్సి వస్తోంది. -
పీఠంపై గురి
సాక్షి, ఆదిలాబాద్: జెడ్పీ పీఠం చుట్టూ రాజకీయం మొదలైంది. టీఆర్ఎస్కు మెజార్టీ దక్కడంతో ఆశావహులు జిల్లా పరిషత్ చైర్మన్ పదవి కోసం ముమ్మర ప్రయత్నాలు మొదలు పెట్టారు. అధిష్టానందే తుది నిర్ణయం అయినా నేతల ప్రాప్తి కోసం పాట్లు పడుతున్నారు. ఆశావహులను బుజ్జగించి అధిష్టానం ఎవరి పేరును నిర్ణయిస్తుందో జెడ్పీ చైర్మన్ ఎన్నిక రోజే తేలనుంది. అధిష్టానం పంపించే సీల్డ్ కవర్లో ఎవరి పేరు ఉండబోతుందోనన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది. అప్పటి వరకు ఈ ఉత్కంఠ కొనసాగనుంది. ఆశావహుల జోరు పదిహేడు మంది జెడ్పీటీసీ సభ్యుల్లో టీఆర్ఎస్ మెజార్టీ 9 మంది సభ్యులను గెలిచిన విషయం తెలిసిందే. ఇందులో ముగ్గురు ఎస్టీ అభ్యర్థులు అనిల్ జాదవ్, రాథోడ్ జనార్దన్, కుమ్ర సుధాకర్‌లు ఉన్నారు. ఈ ముగ్గురిలో ఎవరైనా చైర్మన్ పదవిని అధిరోహించనున్నారు. అనిల్ జాదవ్ చైర్మన్ పీఠం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా ఆయనకు ఉమ్మడి జిల్లా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆశీస్సులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో అనిల్ జాదవ్ కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు ఐకే రెడ్డితో సఖ్యత ఉంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు అనిల్ టీఆర్ఎస్లో చేరారు. అప్పుడు ఉమ్మడి జిల్లా మంత్రి ఐకే రెడ్డి ఆధ్వర్యంలో అప్పటి ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావు, రాష్ట్ర డెయిరీ చైర్మన్ లోక భూమారెడ్డిల సమక్షంలో కేటీఆర్ అనిల్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరినప్పుడే జెడ్పీ చైర్మన్ పదవి విషయంలో భరోసా ఇచ్చారని అనిల్ తన సన్నిహితులతో తెలిపినట్లు తెలుస్తోంది. అయితే ఎంపీ అభ్యర్థి గోడం నగేశ్ ఓటమి నేపథ్యంలో అధిష్టానం అనిల్‌ను పరిగణలోకి తీసుకుంటుందా? లేదా.. అనేది ఆసక్తికరంగా మారింది. మరో పక్క బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అనిల్‌కు చైర్మన్ పదవిని కట్టబెట్టే విషయంలో వ్యతిరేకంగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న సైతం అనిల్ విషయంలో కొంత దూరంగా ఉన్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో అధిష్టానం రాజకీయ అనుభవం ఉన్న అనిల్‌ను చైర్మన్‌గా పరిగణలోకి తీసుకుంటుందా? లేదా? అనేది ఎన్నిక వరకు తెలియని పరిస్థితి నెలకొంది. రాథోడ్‌కు మద్దతు.. నార్నూర్ జెడ్పీటీసీగా గెలిచిన రాథోడ్ జనార్దన్‌కు ఎమ్మెల్యేలు మద్దతిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. అయితే నార్నూర్ మండలం ఆసిఫాబాద్ నియోజకవర్గంలోకి వస్తుంది. ఆసిఫాబాద్ జెడ్పీ చైర్పర్సన్ పీఠాన్ని కోవలక్ష్మి అధిరోహించనున్న నేపథ్యంలో అదే నియోజకవర్గంలోని నార్నూర్ జెడ్పీటీసీ రాథోడ్ జనార్దన్‌కు ఆదిలాబాద్ జెడ్పీ పీఠాన్ని కేటాయిస్తారా? అనేది ఆసక్తికరమే. అయితే ఆసిఫాబాద్‌లో జెడ్పీ చైర్పర్సన్ అభ్యర్థి ఆదివాసీ కావడం, రాథోడ్ జనార్దన్ లంబాడా సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో అధిష్టానం ఒక వేళ ఆయన పేరును పరిగణలోకి తీసుకుంటే ఈ అంశం ఒక్కటే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఆదివాసీ సామాజిక వర్గానికి చెందిన జెడ్పీటీసీకి చైర్మన్ పదవి ఇవ్వాలనే అంశం తెరపైకి వచ్చినప్పుడు కేవలం ఇప్పుడు గెలిచిన 9 మందిలో భీంపూర్ జెడ్పీటీసీ కుమ్ర సుధాకర్ ఒక్కరే ఉండటం గమనార్హం. సీల్డ్ కవర్లో ఎవరి పేరు ఉంటుందా? అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. కొనసాగుతున్న శిబిరం.. టీఆర్ఎస్ నుంచి గెలిచిన జెడ్పీటీసీల శిబిర రాజకీయ కొనసాగుతోంది. గత మూడు రోజులుగా 17 మంది సభ్యులు శిబిరానికి వెళ్లిపోగా, తాజాగా ఫలితాల అనంతరం ఓడిపోయిన జెడ్పీటీసీ అభ్యర్థులు తిరిగి వచ్చారు. ఆ తొమ్మిది మంది మాత్రం ఎక్కడ ఉన్నారనేది రహస్యంగా ఉంచారు. ఆదిలాబాద్ జెడ్పీ ఎన్నిక విషయంలో టీఆర్ఎస్ అధిష్టానం సీరియస్‌గా ఉండడంతో తాజా రాజకీయాలు వేడెక్కాయి. ప్రధానంగా టీఆర్ఎస్ 9 మంది మెజార్టీ సభ్యులను గెలిచినప్పటికీ, బీజేపీ ఐదు, కాంగ్రెస్ మూడు గెలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. జెడ్పీ చైర్మన్ ఎన్నిక విషయంలో టీఆర్ఎస్ పార్టీ విప్ జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. సంఖ్యాబలం 9లో ఒకటి తేడా వచ్చినా పీఠం తారుమారయ్యే పరిస్థితి ఉండడమే దీనికి కారణంగా కనిపిస్తోంది. -
గులాబీ.. జోరు
పాలమూరు: రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికార పార్టీ కావడంతో స్థానికంగానూ ఆ పార్టీ బలంగా ఉండాలని పల్లె ఓటర్లు భావించారు. గ్రామస్థాయిలో ఉన్న పటిష్ట క్యాడర్ ఆ పార్టీకి అదనపు బలం చేకూర్చింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను వల్లెవేస్తూ.. గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తామని ముఖ్య నేతలు ప్రచారం చేయడం సత్ఫలితాలిచ్చింది. ముఖ్యంగా జిల్లాలో అన్నిచోట్లా ఎమ్మెల్యేలు ఆ పార్టీకి చెందినవారే కావడం, స్థానికంగానూ టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తేనే ప్రయోజనం ఉంటుందనే ఉద్దేశంతో ఓటర్లు వారికే మద్దతు పలికినట్లు తెలుస్తోంది. జిల్లాలో జెడ్పీటీసీ స్థానాలను క్లీన్ స్వీప్ చేయడంతోపాటు అత్యధిక ఎంపీటీసీ స్థానాల్లోనూ ఆ పార్టీ అభ్యర్థులకే పట్టం కట్టారు. జిల్లాలో క్లీన్ స్వీప్.. మహబూబ్‌నగర్ జెడ్పీపీఠంపై మరోసారి గులాబీ జెండా ఎగిరింది. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం ప్రదర్శించిన జిల్లా పరిషత్‌లో తొలిసారి అధికార టీఆర్ఎస్ జెడ్పీచైర్మన్ పదవిని దక్కించుకుంది. జిల్లాలో మొత్తం 14కు 14 స్థానాలను క్లీన్ స్వీప్ చేస్తూ సత్తా చాటింది. ప్రస్తుత ఫలితాల్లో అన్ని మండలాల్లోనూ సంపూర్ణ ఆధిక్యం ప్రదర్శించింది. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే ఈ ఫలితాలు అధికార పార్టీని మరింత సంతృప్తినిచ్చాయి. పార్టీ ఇది వరకే తమ జెడ్పీచైర్మన్ అభ్యర్థిగా స్వర్ణమ్మను ప్రకటించడంతో ఆమె జడ్పీ చైర్మన్ కావడం లాంఛనమే. మహబూబ్‌నగర్, జడ్చర్ల, దేవరకద్ర, మక్తల్, నారాయణపేట సెగ్మెంట్లలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉండటం ఆ పార్టీకి మరింత బలం చేకూర్చింది. అధినాయకత్వం అభ్యర్థులను ఆచితూచి ఎంపిక చేయగా.. జెడ్పీటీసీ, ఎంపీటీసీల విజయానికి మంత్రి శ్రీనివాస్‌గౌడు పెద్దన్న పాత్ర తీసుకొని ఇతర ఎమ్మెల్యేలను కలుపుకొని క్షేత్రస్థాయిలో చురుగ్గా సాగారు. ఫలితంగా 14 జెడ్పీటీసీ, 111 ఎంపీటీసీ స్థానాల్లో భారీ విజయం నమోదు చేశారు. అన్నిచోట్లా ‘చే’జారాయి.. ప్చ్.. కాంగ్రెస్ పార్టీ మళ్లీ ఓడింది. మహబూబ్‌నగర్ జిల్లాతోపాటు నారాయణపేట జిల్లాలోనూ జెడ్పీటీసీ స్థానాలు కోల్పోయింది. మహబూబ్‌నగర్‌లో ఉన్న 14 జెడ్పీటీసీ స్థానాల్లో ఒక్కచోట కూడా ఖాతా తెరవలేకపోయింది. నారాయణపేట జిల్లాలో 11 జెడ్పీటీసీ స్థానాల్లో కేవలం మద్దూరు స్థానాన్ని మాత్రం దక్కించుకుంది. రెండు జిల్లాల్లో కలిపి 58 ఎంపీటీసీ స్థానాలు కైవసం చేసుకోగలిగింది. అధిష్టానం చిన్నచూపు, జిల్లాలో కాంగ్రెస్ నాయకుల మధ్య అంతర్గత విభేదాలతోపాటు అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్లి ఓట్లను అభ్యర్థించడంలో వెనుకబడ్డారు. కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న మండలాల్లో సైతం టీఆర్ఎస్ పాగా వేసింది. కాంగ్రెస్ జెడ్పీటీసీ అభ్యర్థులు కనీస స్థాయిలో కూడా పోటీ ఇవ్వలేకపోయారు. 2018 అసెంబ్లీ ఎన్నికల నుంచి జిల్లాలో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ముఖ్య నాయకులు పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరడంతో స్థానిక ఎన్నికలు వచ్చేసరికి పరిస్థితి దయనీయంగా మారింది. పట్టుబిగించని బీజేపీ జిల్లాలో ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థికి గట్టి పోటీ ఇచ్చిన బీజేపీ స్థానిక ఎన్నికల్లో మాత్రం పట్టుబిగించలేకపోయింది. ప్రాదేశిక ఎన్నికల్లో ఆ పార్టీ మూడో స్థానానికి పరిమితం కావడం విశేషం. మహబూబ్‌నగర్ జిల్లాలో 14 జెడ్పీటీసీ స్థానాల్లో ఒక్కటి కూడా దక్కించుకోలేకపోయింది. ఇక 169 ఎంపీటీసీ స్థానాల్లో కేవలం 6 స్థానాల్లో విజయం సాధించింది. నారాయణపేట జిల్లాలో 11 జెడ్పీటీసీ స్థానాలకు గాను కేవలం ధన్వాడ జెడ్పీటీసీ స్థానం సొంతం చేసుకుంది. అలాగే 140 ఎంపీటీసీలో 25 స్థానాల్లో విజయం వరించింది. లోక్‌సభ ఎన్నికలతో పోల్చి చూడగా ఈసారి వచ్చిన ఓట్ల సంఖ్య చాలా వరకు తగ్గింది. స్థానిక నాయకులు కేంద్రం చేసే అభివృద్ధిని ప్రజలకు వివరించడంలో వెనుకబడినట్లు తెలుస్తోంది. దీంతోపాటు క్షేత్రస్థాయిలో సరైన క్యాడర్ లేకపోవడం కూడా ఒక కారణంగా అనిపిస్తోంది. -
రేసులో ముగ్గురు..
సాక్షి, కొత్తగూడెం: పరిషత్ ఎన్నికల ఫలితాల ప్రకటన తర్వాత జిల్లాలో ఆసక్తికర వాతావరణం నెలకొంది. జిల్లా ప్రజాపరిషత్ విషయంలో అధికార టీఆర్ఎస్ పార్టీ 21 జెడ్పీటీసీలకు గాను 16 గెలుచుకుని స్పష్టమైన ఆధిక్యత సాధించింది. జిల్లా పరిషత్ చైర్మన్ విషయంలో ఎన్నికలకు ముందే స్పష్టత వచ్చింది. టేకులపల్లి నుంచి జెడ్పీటీసీగా విజయం సాధించిన కోరం కనకయ్య పేరును ఇప్పటికే టీఆర్ఎస్ అధిష్టానం ప్రకటించింది. ఇక కనకయ్య ఆ పీఠం ఎక్కడం లాంఛనమే. అయితే జిల్లా ప్రజాపరిషత్ వైస్ చైర్మన్ విషయంలో మాత్రం తీవ్ర ఉత్కంఠ, ఆసక్తి నెలకొన్నాయి. ఇందుకు కొంతమేర పోటీ ఉంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ నుంచి గెలిచిన జెడ్పీటీసీ సభ్యులను జిల్లా ఇన్చార్జి(జిల్లా పరిషత్ ఎన్నికల ప్రక్రియ కోసం)గా ఉన్న ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వద్దకు బుధవారం తీసుకెళ్లారు. అయితే పినపాక నియోజకవర్గంలో మొత్తం 7 జెడ్పీటీసీలకు గాను టీఆర్ఎస్ 6 స్థానాల్లో గెలుపొందింది. గుండాల జెడ్పీటీసీని న్యూడెమోక్రసీ కైవసం చేసుకుంది. టీఆర్ఎస్కు చెందిన ఆరుగురు సభ్యులను పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు మంగళవారం రాత్రే హైదరాబాద్ తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో వైస్ చైర్మన్ పీఠం దక్కించుకునేవారెవరనే విషయమై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ముందంజలో కంచర్ల... చుంచుపల్లి నుంచి జెడ్పీటీసీగా గెలిచిన కంచర్ల చంద్రశేఖర్‌రావు వైస్ చైర్మన్ పీఠం రేసులో ముందంజలో ఉన్నారు. రాష్ట్ర విభజనకు ముందే రెండుసార్లు టీఆర్ఎస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా ఆయన సేవలందించారు. ఈ నేపథ్యంలో కంచర్లకు నేరుగా కేసీఆర్‌తోనే సంబంధాలు ఉన్నాయి. దీంతో సహజంగానే ఈ పదవి కోసం రేసులో ఉన్నారు. కంచర్లకు అవకాశం దక్కనుందని కొత్తగూడెం నియోజకవర్గంలో చర్చ నడుస్తోంది. మరోవైపు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆశీస్సులతో దమ్మపేట నుంచి జెడ్పీటీసీగా గెలుపొందిన పైడి వెంకటేశ్వరరావు రేసులోకి వచ్చారు. ఆది నుంచి తుమ్మలకు ముఖ్య అనుచరుడిగా ఉన్న పైడి.. తనకు అవకాశం దక్కుతుందనే ఆశాభావంతో ఉన్నారు. అదేవిధంగా అశ్వారావుపేట నియోజకవర్గంలో టీఆర్ఎస్కు ప్రాతినిథ్యం వహించే ఎమ్మెల్యే లేకపోవడంతో ఇక్కడి నుంచి వైస్ చైర్మన్ ఉంటే పార్టీకి మరింత మేలు కలుగుతుందని పలువురు కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. తుమ్మల సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక మణుగూరు నుంచి జెడ్పీటీసీగా విజయం సాధించిన పోశం నర్సింహారావు సైతం వైస్ చైర్మన్ పదవి ఆశిస్తున్నారు. ఆయనకు పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు మద్దతు ఉంది. రేగా వ్యూహంతో నియోజకవర్గంలో గుండాల మినహా మిగిలిన ఆరు చోట్ల టీఆర్ఎస్ జెడ్పీటీసీలు భారీ మెజారిటీతో గెలుపొందారు. పైగా రేగాకు టీఆర్ఎస్ అధిష్టానం వద్ద మంచి పలుకుబడి ఉంది. ఈ నేపథ్యంలో పోశం ప్రయత్నాలు సైతం గట్టిగానే ఉన్నట్లు తెలుస్తోంది. జెడ్పీ వైస్ చైర్మన్ పీఠం కోసం త్రిముఖ పోటీ ఉండడంతో జిల్లాలో ఉత్కంఠ నెలకొంది. కొన్ని మండల పరిషత్‌లలో అస్పష్టత.. జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం విషయమై కచ్చితమైన స్పష్టత ఉండగా, వైస్ చైర్మన్ విషయమై ఉత్కంఠ కలిగిస్తోంది. మరోవైపు కొన్ని మండల ప్రజాపరిషత్‌ల విషయంలోనూ అస్పష్టత నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక శిబిరాలు నిర్వహించక తప్పడం లేదు. చర్ల మండలంలో కాంగ్రెస్, సీపీఎం కూటమికి, దుమ్ముగూడెంలో సీపీఎం, సీపీఐ కూటమికి మెజారిటీ ఉంది. ఇల్లెందు, టేకులపల్లి మండలాల్లో మాత్రం టీఆర్ఎస్కు సంపూర్ణ మెజారిటీ ఉంది. అశ్వారావుపేట, దమ్మపేట, చండ్రుగొండ మండలాల్లో టీఆర్ఎస్కు పూర్తి మెజారిటీ ఉంది. అన్నపురెడ్డిపల్లి మండలంలో 6 ఎంపీటీసీలకు గాను టీఆర్ఎస్, కాంగ్రెస్ లకు చెరో మూడు దక్కాయి. ఇక ములకలపల్లి మండలంలో ఏ పార్టీకీ తగినన్ని సీట్లు రాకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. అశ్వాపురం, మణుగూరు, పినపాక, కరకగూడెం మండలాల్లో టీఆర్ఎస్కు సంపూర్ణ మెజారిటీ దక్కింది. బూర్గంపాడు మండలంలో ఎంపీటీసీలకు ఎన్నికలు జరుగలేదు. గుండాల మండలంలో న్యూడెమోక్రసీకి మెజారిటీ సీట్లు వచ్చాయి. ఆళ్లపల్లి మండలంలో టీఆర్ఎస్కు రెండు, కాంగ్రెస్‌కు ఒకటి, సీపీఐకి ఒకటి వచ్చాయి. జూలూరుపాడు, పాల్వంచ మండలాల్లో టీఆర్ఎస్కు సంపూర్ణ మెజారిటీ ఉంది. చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి మండలాల్లో టీఆర్ఎస్కు కేవలం ఒక్క ఎంపీటీసీ అవసరం ఉంది. ఈ మండలాల్లో ఇండిపెండెంట్లు కీలకం కానున్నారు. సుజాతనగర్ మండలంలో మాత్రం రాజకీయం రసవత్తరంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆయా మండలాల్లో ఇప్పటికే క్యాంపులు నిర్వహిస్తున్నారు. -
ఉత్కంఠ రేపిన.. నార్కట్‌పల్లి
సాక్షిప్రతినిధి, నల్లగొండ : నార్కట్‌పల్లి జెడ్పీటీసీ ఫలితం తీవ్ర ఉత్కంఠ రేపింది. టీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్య ఫలితం దోబూచులాడగా.. చివరకు టీఆర్ఎస్ అభ్యర్థి బండా నరేందర్ రెడ్డి 11 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించారు. ఓట్లను తిరిగి లెక్కించాలంటూ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ ఎన్నికల్లో బండా నరేందర్ రెడ్డికి 16,722 ఓట్లు పోల్‌కాగా, కోమటిరెడ్డి మోహన్‌రెడ్డికి .. 16,711 ఓట్లు వచ్చాయి. దీంతో 11 ఓట్ల మెజారిటీతో బండా విజయం సాధించినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. టీఆర్ఎస్ తమ జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిగా బండా నరేందర్‌రెడ్డిని నిర్ణయించింది. బహిరంగంగా ప్రకటించకున్నా.. పార్టీ శ్రేణులకు ఈ సమాచారం ఉంది. పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలందరికీ తమ చైర్మన్ అభ్యర్థి బండా నరేందర్ రెడ్డి అని వివరించింది. దీంతో ఈస్థానంలో గెలుపు కోసం జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు ప్రచా రం చేశారు. నామినేషన్ దాఖలు రోజే సభ నిర్వహించారు. హోంమంత్రి మహమూద్ అలీ సైతం మండల కేంద్రంలో పర్యటించి వెళ్లారు. మొత్తం గా టీఆర్ఎస్ ఈ స్థానాన్ని కీలకంగా భా వించింది. అదే సమయంలో కాంగ్రెస్‌నుంచి కోమటిరెడ్డి మోహన్‌రెడ్డి పోటీకి దిగారు. ఆయనను జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా టీపీసీసీ ముందుగానే ప్రకటిం చింది. దీంతో ఈ స్థానంలో ఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ రేపింది. మరో వైపు టీఆర్ఎస్ ముందు జాగ్రత్తగా.. మిర్యాలగూడ నుంచి మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయం సింహారెడ్డిని పోటీకి పెట్టింది. నార్కట్‌పల్లిలో అనుకోనిది ఏదైనా జరిగి ప్రతి కూల ఫలితం వస్తే.. తిప్పనకు అవకాశం ఇస్తారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరిగింది. ఈ కారణంగానే జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా టీఆర్ఎస్ అధికారికంగా ఎవరి పేరును బహిరంగంగా ప్రకటించలేదని చెబుతున్నారు. ఇప్పుడు ఇటు నార్కట్‌పల్లి, అటు మిర్యాలగూడ రెండు చోట్లా టీఆర్ఎస్ గెలిచింది. బండా ఎన్నిక లాంఛనమేనా..? నార్కట్‌పల్లి నుంచి జెడ్పీటీసీ సభ్యుడిగా విజయం సాధించిన బండా నరేందర్ రెడ్డిని జెడ్పీ చైర్మన్‌గా ఎన్నుకోవడం లాంఛనమేనని అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బహిరంగంగా ఆయన పేరును చైర్మన్ పదవికి ప్రకటించక పోయినా.. ముందే నిర్ణయం జరిగిపోయిందని చెబుతున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి టీఆర్ఎస్లో కొనసాగుతున్న ఆయన అధినేత కేసీఆర్‌కు విధేయుడిగా ఉన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో టీఆర్ఎస్కు సుదీర్ఘ కాలం అధ్యక్షుడిగా పనిచేశారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ... ఇలా, ప్రతీ ఎన్నికల సందర్భంలో ఆయన టికెట్ ఆశించడం, భంగపడడం ఆనవాయితీగా జరిగేది. చివరకు రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా అవకాశం ఇచ్చారు. ఈ లోగా జెడ్పీ ఎన్నికలు ఖరారు కావడంతో జెడ్పీ చైర్మన్ అవకాశం ఇవ్వడం కోసమే నామినేటెడ్ పోస్టుకు రాజీనామా చేయించారని పేర్కొంటున్నారు. 31 జెడ్పీటీసీ స్థానాలున్న నల్లగొండ జిల్లా పరిషత్‌లో తాజా ఎన్నికల్లో టీఆర్ఎస్ ఏకంగా 24 స్థానాలు గెలుచుకుంది. దీంతో తొలిసారి నల్లగొండ జెడ్పీపై గులాబీ జెండా ఎగరనుంది. బండా నరేందర్ రెడ్డి పేరును ప్రకటిస్తారని పార్టీ వర్గాలు అంటున్నా.. మరోవైపు తనకూ అవకాశం వస్తుందని తిప్పన విజయసింహారెడ్డి ఆశాభావంతో ఉన్నారని చెబుతున్నారు. సంక్షేమ పథకాలే నన్ను గెలిపించాయి ‘‘నార్కట్‌పల్లిలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రాజగోపాల్ రెడ్డిలు ఎంపీ, ఎమ్మెల్యేలు. వారి కుటుంబ సభ్యులు వారు డబ్బులు ఖర్చు చేసి నన్ను ఓడించేందుకు శత విధాలుగా ప్రయత్నించారు. వాటన్నింటినీ ఎదురీది విజయం సాధించానంటే కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే గెలిపించాయి. నార్కట్‌పల్లి ప్రజలు వారి డబ్బులు లెక్క చేయకుండా నన్ను ఆశీర్వదించి గెలిపించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3 జెడ్పీ చైర్మన్స్థానాలు టీఆర్ఎస్సే కైవసం చేసుకుంటుందని ముందుకు చెప్పిన విధంగానే విజయం సాధించాం. ’’ – బండా నరేందర్ రెడ్డి -
కారు.. టాప్‌గేరు
పెద్దపల్లి: ప్రాదేశిక ఎన్నికల ఫలితాల్లో కారు టాప్‌గేర్‌లో దూసుకపోయింది. అధికార టీఆర్ఎస్ పార్టీకి ఎదురులేకుండా పోయింది. 13 జెడ్పీటీసీ స్థానాల్లో 11 స్థానాల్లో గులాబీ జెండా ఎగురవేయగా.. కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాలకే పరిమితమైంది. 13 మండలాల్లో 12 చోట్ల సులభంగా ఎంపీపీలు ఎన్నికయ్యేలా టీఆర్ఎస్ ఎంపీటీసీలు విజయం సాధించారు. పెద్దపల్లి మండలంలో మాత్రం టీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ పార్టీ ఒక స్థానం తక్కువ గెలుచుకుంది. 17 ఎంపీటీసీ స్థానాల్లో తొమ్మిది స్థానాలు గెలిచిన వారు ఎంపీపీగా గెలవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది, టీఆర్ఎస్కు ఏడు, బీజేపీ నుంచి ఒకరు, ఫార్వర్డ్‌బ్లాక్ నుంచి మరొకరు గెలుపొందారు. దీంతో ఆ ఇద్దరి మద్దతుతో పెద్దపల్లి ఎంపీపీ పదవి కూడా టీఆర్ఎస్ దక్కించుకునే అవకాశం ఉంది. దీంతో జిల్లాలో 13వ ఎంపీపీ పదవులు టీఆర్ఎస్ ఖాతాలోనే జమకానున్నాయి. 89 ఎంపీటీసీలు టీఆర్ఎస్వే.. జిల్లాలోని 138 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఇందులో టీఆర్ఎస్ పార్టీ 89, కాంగ్రెస్ పార్టీ 34, బీజేపీ 5, ఫార్వర్డ్‌బ్లాక్, ఇండిపెండెంట్లు 10 మంది విజయం సాధించారు. ఎలిగేడు మండలంలో ఆరు ఎంపీటీసీ స్థానాలకు మొత్తం స్థానాలు టీఆర్ఎస్ గెలుచుకోవడం విశేషం. ఇక అన్ని మండలాల్లో టీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకోవడంతో అధికార పార్టీకి ప్రాదేశిక ఎన్నికలు ఊపునిచ్చాయి. కాంగ్రెస్ ఖాతాలో రెండే జెడ్పీటీసీలు.. రామగుండం నియోజకవర్గంలో రెండు జెడ్పీటీసీ స్థానాలు, మంథని నియోజకవర్గంలో నాలుగు స్థానాలు జెడ్పీటీసీ పదవులు టీఆర్ఎస్ గెలుచుకుంది. పెద్దపల్లి నియోజకవర్గంలోని ఆరు జెడ్పీపీటీసీ స్థానాల్లో నాలుగింటిని టీఆర్ఎస్ పార్టీ గెలుచుకోగా సుల్తానాబాద్‌లో మినుపాల స్వరూప(కాంగ్రెస్‌పార్టీ), ఓదెలలో గంట రాములు(కాంగ్రెస్‌పార్టీ) విజయం సాధించారు. మంథనికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు ప్రాతిని«థ్యం వహిస్తుండగా, రామగుండం, పెద్దపల్లి నియోజకవర్గాలకు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగా కోరుకంటి చందర్, దాసరి మనోహర్‌రెడ్డి పనిచేస్తున్నారు. ముగ్గురు ఎమ్మెల్యేలు ఈ ఎన్నికలను సవాలుగా తీసుకున్నప్పటికీ మంథనిలో కాంగ్రెస్‌పార్టీకి ఒక్క జెడ్పీ స్థానం కూడా దక్కలేదు. పెద్దపల్లిలో రెండుస్థానాలను టీఆర్ఎస్పార్టీ కోల్పోయింది. రామగుండంలో మాత్రం రెండింటికి రెండు టీఆర్ఎస్ ఖాతాలో చేరాయి. మంత్రి కొప్పుల ఈశ్వర్ బావ ఆముల నారాయణ అంతర్గాం జెడ్పీటీసీగా పోటీ చేశారు. పోస్టాఫీస్ ఉద్యోగానికి రాజీనామ చేసి ఎన్నికల బరిలో ఉన్న నారాయణను ఓటర్లు గెలిపించారు. ఎదురులేని పుట్టమధు.. పెద్దపల్లి తొలి జెడ్పీ చైర్మన్‌గా పుట్టమధు ఎన్నిక ఇక లాంఛనప్రాయమే.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన పుట్టమధును జెడ్పీచైర్మన్ అభ్యర్థిగా స్వయాన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. దీంతో పార్టీలో రెండో పేరు పరిశీలన లేకుండాపోయింది. ప్రాదేశిక ఎన్నికలు ఆరంభం నుంచి పుట్టమధు తన గెలుపుతోపాటు ఇతర మండలాల్లోని జెడ్పీటీసీ సభ్యుల గెలుపు కోసం పార్టీ వ్యూహరచన చేసింది. 13 జెడ్పీటీసీ స్థానాల్లో ఏడు గెలుచుకోవడం ద్వారా జెడ్పీ చైర్మన్ కైవసం చేసుకోవాలని ఎన్నిక బరిలో దిగారు. ఫలితాల్లో పార్టీ ఊహించినదానికంటే ఎక్కువ స్థానాలు రావడంతో ఇక పుట్టమధుకు ఎదురులేకుండా పోయింది. ఈనెల 8న జరిగే జడ్పీ చైర్మన్ ఎన్నికల్లో పుట్టమధు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. టీఆర్ఎస్ పార్టీకి, పెద్దపల్లికి తొలి జడ్పీ చైర్మన్‌గా పుట్టమధుకు అవకాశం దక్కనుంది. ముగ్గురికి భారీ మెజార్టీ.. ఇద్దరికీ అత్యల్పం జెడ్పీటీసీ ఎన్నికల్లో ముగ్గురు భారీ మెజార్టీతో విజయం సాధించగా, ఇద్దరు చివరిక్షణం వరకు టెన్షన్‌కు గురయ్యారు. 13 స్థానాల్లో 8 చోట్ల అభ్యర్థుల జాతకాలు ఐదారో రౌండ్ వరకు తేలిపోయాయి. ముగ్గురైతే కమాన్‌పూర్‌లో పుట్టమధు, ధర్మారంలో పద్మజ, జూలపల్లిలో బొద్దుల లక్ష్మీనర్సయ్య మొదటి రెండు, మూడు రౌండ్లలోనే తమ జాతకం ఖరారైంది. విజేతలుగా దాదాపు తేలిపోయారు. అయితే ఓదెలలో గంట రాములు 153 ఓట్ల మెజార్టీ, రామగిరిలో మాదరవేని శారద 268 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇద్దరూ రీకౌంటింగ్కోసం దరఖాస్తు చేసేందుకు ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్న సమయంలోనే విజేతలుగా అధికారులు ప్రకటించారు. -
తల్లీకూతుళ్ల విజయం
ఆసిఫాబాద్: పరిషత్ ఎన్నికల్లో కుమురంభీం జిల్లాలో తల్లీ కూతుళ్లు గెలుపొంది రికార్డు సృష్టించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన కోవ లక్ష్మి పరిషత్ ఎన్నికల్లో జెడ్పీ చైర్పర్సన్ అభ్యర్థిగా బరిలో దిగగా, కూతురు కోవ అరుణ సిర్పూర్(యు) నుంచి పోటీ చేశారు. ఈ క్రమంలో కోవ లక్ష్మి జైనూర్ జెడ్పీటీసీగా ఏకగ్రీవం కాగా, మంగళవారం జరిగిన కౌంటింగ్‌లో కూతురు అరుణ సిర్పూర్(యు) జెడ్పీటీసీగా 5,088 ఓట్లు సాధించగా, సమీప ప్రత్యర్థిపై 3,444 ఓట్ల మెజార్టీ సాధించి ఘనవిజయం సాధించారు. జిల్లాలోని రెండు జెడ్పీటీసీ స్థానాలు తల్లీ కూతుళ్లు కైవసం చేసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. జిల్లాలోని అత్యధిక జెడ్పీటీసీ స్థానాలు టీఆర్ఎస్ కైవసం చేసుకోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికైన కోవ లక్ష్మి జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నిక కానుంది. -
ఓడి.. గెలిచారు!
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మంగళవారం ప్రాదేశిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.. ఇందులో కొంత మంది భారీ మెజారిటీతో గెలుపొందగా.. మరికొందరు స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిని చవిచూశారు. ఈ క్రమంలోనే సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన పలువురు అభ్యర్థులు.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు.. ఇక్కడ సానుభూతో.. మరే ఇతర కారణం చెతనో వారు గెలుపు తీరాలకు చేరుకున్నారు. విశేషమేమిటంటే.. ఐదు నెలల వ్యవధిలోనే ఓటర్ల తీర్పు మారడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. నాగర్‌కర్నూల్: నియోజకవర్గంలో సర్పంచ్‌గా పోటీ చేసి ఓటమిపాలైన పలువురు అభ్యర్థులు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో గెలుపొంది ఔరా అనిపించారు. మండలంలోని పెద్దముద్దునూరు గ్రామానికి చెందిన చిక్కొండ శ్రీశైలం సర్పంచ్‌గా పోటీ చేసి ఓడిపోయారు. అయితే మండలం జెడ్పీటీసీ బీసీ జనరల్ స్థానానికి కేటాయించడంతో జెడ్పీటీసీగా టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి గెలుపొందారు. అలాగే తాడూరు మండల కేంద్రానికి చెందిన మల్లయ్య సర్పంచ్‌గా పోటీ చేసి ఓడిపోయారు. ఎంపీటీసీలో జనరల్ మహిళకు రిజర్వేషన్ రావడంతో తన భార్య రేణుకను పోటీలో ఉంచగా 1,100 ఓట్ల మెజారిటీతో గెలిచింది. బిజినేపల్లి మండలం పాలెంకు చెందిన శ్రీనివాస్‌గౌడ్ సర్పంచ్ ఎన్నికల్లో తన భార్య సుమలతను బరిలో నిలపగా ఓటమిపాలైంది. ప్రస్తుతం శ్రీనివాస్‌గౌడ్ ఎంపీటీసీగా పాలెం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఎంపీటీసీలుగా నలుగురు.. ఉప్పునుంతల (అచ్చంపేట): మండలంలో నలుగురు అభ్యర్థులు గత సర్పంచ్ ఎన్నికల్లో ఓటమిని చవిచూసి తిరిగి ఎంపీటీసీ ఎన్నికల్లో విజయం సాధించారు. ఉప్పునుంతల సర్పంచ్‌గా ఓడిపోయిన అరుణ ప్రస్తుతం ఉప్పునుంతల–1 స్థానం నుంచి ఎంపీటీసీగా గెలుపొందారు. అలాగే ఉప్పునుంతల–2 నుంచి ఎంపీటీసీగా గెలుపొందిన వెంకటేష్ గత సర్పంచ్ ఎన్నికల్లో దేవదారికుంటతండా సర్పంచ్‌గా పోటీచేసి ఓడిపోయారు. ఫిరట్వానిపల్లి ఎంపీటీసీగా ప్రస్తుతం గెలుపొందిన మల్లేష్ భార్య గత సర్పంచ్ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయింది. జప్తీసదగోడు ఎంపీటీసీ గెలుపొందిన ఇటిక్యాల కవిత భర్త తిర్పతిరెడ్డి గత సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోయారు. బల్మూరు మండలం రామాజిపల్లిలో సర్పంచ్‌గా ఓడిపోయిన శాంతమ్మ ప్రస్తుతం ఎంపీటీసీగా మండలంలోనే 785 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. సర్పంచ్‌గా ఓడి.. జెడ్పీటీసీగా.. కొల్లాపూర్: నియోజకవర్గంలో పలువురు అభ్యర్థులు సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి చవి చూసి, ప్రాదేశిక ఎన్నికల్లో గెలుపొందారు. పెంట్లవెల్లి జెడ్పీటీసీగా గెలుపొందిన చిట్టెమ్మ సర్పంచ్ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిచెందారు. అలాగే పెద్దకొత్తపల్లి మండల జెడ్పీటీసీగా గెలుపొందిన గౌరమ్మ కూడా గత సర్పంచ్ ఎన్నికల్లో మారెడుమాన్‌దిన్నె గ్రామ సర్పంచ్‌గా పోటీ చేసి ఓడిపోయారు. మల్లేశ్వరం సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి చెందిన ఈశ్వరమ్మ ఇప్పుడు అదే గ్రామ ఎంపీటీసీగా గెలిచింది. చెన్నపురావుపల్లి సర్పంచ్‌గా పోటీచేసి ఓడిపోయిన రామచంద్రయ్య ప్రస్తుతం ఎంపీటీసీగా గెలుపొందారు. లచ్చనాయక్‌తండా సర్పంచ్‌గా ఓడిన నిరంజన్‌నాయక్ తనయుడు ఇప్పుడు పాండునాయక్ నార్లాపూర్ ఎంపీటీసీగా గెలిచారు. చంద్రకల్ సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి చెందిన సీపీఐ నాయకులు బాల్‌నర్సింహ భార్య ఇందిరమ్మ ఇప్పుడు ఎంపీటీసీగా గెలిచారు. మాచినేనిపల్లి సర్పంచ్ సుధారాణి సింగోటం ఎంపీటీసీగా గెలిచారు. ఆమె కొల్లాపూర్ ఎంపీపీ పదవి చేపట్టబోతున్నారు. ఆమె ఎంపీపీగా గెలవడంతో త్వరలోనే సర్పంచ్ పదవికి రాజీనామా చేయనున్నారు. వెల్దండ: మండలంలోని అజిలాపూర్‌లో లక్ష్మమ్మ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎంపీటీసీగా అవకాశం రావడంతో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలుపొందారు. అలాగే వెల్దండకు చెందిన విజేందర్‌రెడ్డి సర్పంచ్‌గా ఓడిపోగా.. ఎంపీటీసీ జనరల్ మహిళ రిజర్వేషన్ కావడంతో ఆయన భార్య ఉమ పోటీ చేసి బీజేపీ అభ్యర్థిగా గెలుపొందారు. బొల్లంపల్లిలో సర్పంచ్‌గా వెంకట్‌రెడ్డి భార్య ఓటమి చెందారు. వెంకట్‌రెడ్డి బొల్లంపల్లి కాంగ్రెస్ ఎంపీటీసీగా పోటీ చేసి గెలుపొందగా.. నగారగడ్డతండా సర్పంచ్ జైపాల్‌నాయక్ పోటీ చేసి ఓటమిపాలయ్యాడు. చెదురుపల్లి ఎంపీటీసీగా టీఆర్ఎస్ నుంచి జైపాల్‌నాయక్ భార్య విజయ ను పోటీలో ఉంచి భారీ మెజార్టీతో గెలుపొందారు. 441 ఓట్ల మెజారిటీతో.. ఊర్కొండ (కల్వకుర్తి): మండలంలోని మాధారం గ్రామానికి చెందిన అరుణ్‌కుమార్‌రెడ్డి గత ఎన్నికలలో సర్పంచ్‌గా పోటీచేసి, తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నిఖిల్‌రెడ్డిపై 299 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యాడు. అయితే మే నెలలో జరిగిన మండల పరిషత్ ఎన్నికల్లో భాగంగా మాధారం జనరల్‌కు కేటాయించడంతో, పార్టీ తిరిగి అరుణ్‌కుమార్‌రెడ్డిని ఎంపీటీసీ అభ్యర్ధిగా ప్రకటించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీచేసిన అల్వాల్రెడ్డిపై 441 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కల్వకుర్తి రూరల్: మండలంలోని తాండ్రకు చెందిన ఎల్లమ్మ గత సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చవిచూసింది. ఓటమికి భయపడకుండా ఎంపీటీసీగా పోటీ చేసి ఘన విజయం సాధించింది. దీంతో సర్పంచ్‌గా ఓడిపోయినా ఎంపీటీసీగా గెలవడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. -
‘గులాబీ’ జోష్
ఎన్నికల్లో తమకు ఎదురులేదని టీఆర్ఎస్ మరోసారి నిరూపించుకుంది. ప్రాదేశిక ఎన్నికల్లోనూ అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. జిల్లాలో 20 జెడ్పీటీసీ స్థానాలకు 18, ఎంపీటీసీ స్థానాలు 189కి 117 కైవసం చేసుకుని ‘కారు’ సత్తా చాటుకుంది. కాంగ్రెస్ రెండో స్థానంతో సరిపెట్టుకోగా.. బీజేపీ ఖాతా తెరవకుండా చతికిలబడింది. మరోవైపు గెలిచిన స్వతంత్రుల్లో చాలా మంది టీఆర్ఎస్ రెబల్స్ ఉండడం విశేషం. టీఆర్ఎస్ గెలుపుతో ఆ పార్టీ శ్రేణుల్లో సంబరాలు మిన్నంటాయి. సాక్షి, మెదక్ : జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లో ‘గులాబీ’ గుబాళించింది. ఇప్పటికే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో జిల్లావ్యాప్తంగా ‘కారు’ జోరు కొనసాగగా.. ప్రాదేశిక ఎన్నికల్లోనూ అదే హవా వీచింది. జిల్లాలో 20 జెడ్పీటీసీ స్థానాలకు 18... 189 ఎంపీటీసీలకు 117 స్థానాల్లో విజయం సాధించి.. మరోసారి సత్తా చాటుకుంది. కాంగ్రెస్ రెండో స్థానంలో నిలవగా.. పలు చోట్ల మాత్రమే పోటీలో ఉన్న బీజేపీ ఖాతా తెరవడంలో విఫలమైంది. మరోవైపు గెలిచిన 28 మంది స్వతంత్రుల్లో చాలా మంది టీఆర్ఎస్ రెబల్స్ ఉండడం విశేషం. మొత్తానికీ.. తొలి జెడ్పీ చైర్పర్సన్ పదవిని టీఆర్ఎస్ చేజిక్కించుకునేలా ఆ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం లభించగా.. ఎంపీపీ స్థానాలు సైతం అధికంగా ‘కారు’కే దక్కనున్నాయి. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ నెల 7న ఎంపీపీ, వైస్ ఎంపీపీలు.. 8న జెడ్పీచైర్మన్లు/జెడ్పీ చైర్పర్సన్లను, వైస్ చైర్మన్లను ఎన్నుకోనున్నారు. పోలీసుల భారీ బందోబస్తు జిల్లాలో గత నెల ఆరు, పది, 14వ తేదీల్లో మూడు విడతలుగా జిల్లా, మండల పరిషత్ ఎన్నికలు జరిగాయి. మొదటి విడతలో ఆరు మండలాల పరిధిలో.. రెండో విడతలో ఆరు మండలాల పరిధిలో.. చివరి విడతలో ఎనిమిది మండలాల పరిధిలో ఎన్నికలు జరిగాయి. జిల్లాలో 20 జెడ్పీటీసీ.. 189 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. 20 జెడ్పీటీసీ స్థానాలకు 74 మంది పోటీపడ్డారు. అదేవిధంగా.. 189 ఎంపీటీసీ స్థానాల్లో ఐదు ఏకగ్రీవం (జూపల్లి, చండి, దామెర చెరువు, రాయిలాపూర్, నందగోకుల్) అయ్యాయి. ఇవిపోనూ మిగిలిన 184 స్థానాల్లో 582 మంది బరిలో ఉన్నారు. ఎన్నికల కమిషన్ రీ షెడ్యూల్ ప్రకారం పోలీసుల భారీ బందోబస్తు మధ్య జిల్లాల్లో ఏర్పాటు చేసిన నాలుగు కౌంటింగ్ కేంద్రాల్లో మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించిన అధికారులు.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ బండిల్స్ వేరు చేశారు. సుమారు ఉదయం 11.30 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగింది. ఆ తర్వాత ముందుగా ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు చేపట్టారు. మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు పూర్తయింది. లంచ్ తర్వాత అధికారులు జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు మొదలుపెట్టారు. 14 ఎంపీపీ స్థానాలు టీఆర్ఎస్వే.. మూడింటిలో స్వతంత్రులే కీలకం జిల్లాలో 20 ఎంపీపీ స్థానాలు ఉండగా.. మెజార్టీ స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకోనుంది. ఈ మేరకు ఆధిక్యం వచ్చింది. మొత్తం 20 ఎంపీపీ స్థానాల్లో 14 పీఠాలు ‘గులాబీ’కే చెందుతాయనేది సుస్పష్టం. చిన్నశంకరంపేట, టేక్మాల్‌లో కాంగ్రెస్‌దే ఆధిపత్యం కాగా.. నార్సింగి, తూప్రాన్, వెల్దుర్తి పీఠాలు అటా.. ఇటా అన్నట్లు ఉన్నాయి. ఈ మూడు స్థానాల్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. నార్సింగికి సంబంధించి మొత్తం ఐదు ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. టీఆర్ఎస్ రెండు, కాంగ్రెస్ ఒకటి, స్వతంత్ర అభ్యర్థులు ఇద్దరు గెలుపొందారు. స్వతంత్రులు ఎటు మొగ్గు చూపితే వారే ఎంపీపీ పీఠాన్ని దక్కించుకోనున్నారు. ఇక్కడ టీఆర్ఎస్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తూప్రాన్‌లో ఐదు ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. కాంగ్రెస్ రెండు, టీఆర్ఎస్ ఒకటి, స్వతంత్రులు ఇద్దరు గెలుపొందారు. ఇక్కడ స్వతంత్రులు కీలకం కానున్నారు. వెల్దుర్తిలో 12 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. కాంగ్రెస్ ఐదు, టీఆర్ఎస్ నాలుగు, స్వతంత్రులు ముగ్గురు విజయం సాధించారు. ఇండిపెండెంట్లు ముగ్గురు మూకుమ్మడిగా ఎటు మొగ్గు చూపుతారో.. వారే ఎంపీపీ పీఠాన్ని కైవసం చేసుకోనున్నారు. చేగుంటలో 13 ఎంపీటీసీ స్థానాలు ఉండగా టీఆర్ఎస్ నాలుగుచోట్ల విజయం సాధించగా స్వతంత్రులు 9 చోట్ల గెలుపొందారు. ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచినవారిలో టీఆర్ఎస్ రెబల్స్ అధికంగా ఉన్నట్లు సమాచారం. ఈ లెక్కన చేగుంట పీఠం టీఆర్ఎస్కు దక్కే అవకాశం ఉంది. జెడ్పీటీసీ విజేతలు వీరే.. పెద్దశంకరంపేట జెడ్పీటీసీ స్థానాన్ని ‘కారు’ కైవసం చేసుకుంది. టీఆర్ఎస్ అభ్యర్థి విజయరామరాజు 1,251 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. టీఆర్ఎస్కు 12,316 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి రాయిని మధుకు 11,021 ఓట్లు వచ్చాయి. రేగోడు జెడ్పీటీసీగా కాంగ్రెస్ అభ్యర్థి యాదగిరి 855 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈయనకు 7,274 ఓట్లురాగా.. సమీప ప్రత్యర్థి టీఆర్ఎస్కు చెందిన వినోద్‌కుమార్‌కు 6,399 ఓట్లు పోలయ్యాయి. హవేళిఘణాపూర్ జెడ్పీటీసీ సభ్యురాలిగా టీఆర్ఎస్ అభ్యర్థి సుజాత 5,728 ఓట్ల భారీ మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థిని భూదేవిపై గెలుపొందారు. సుజాతకు 12,930 ఓట్లు రాగా.. భూదేవికి 7,202 ఓట్లు మాత్రమే వచ్చాయి. చిన్నశంకరంపేట జెడ్పీటీసీ సభ్యురాలిగా టీఆర్ఎస్ అభ్యర్థిని మాధవిరాజు 3512 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఈమెకు 12525 ఓట్లు రాగా.. సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌కు చెందిన ప్రియానాయక్కు 9013 ఓట్లు మాత్రమే దక్కాయి. టేక్మాల్ జెడ్పీటీసీగా కాంగ్రెస్ అభ్యర్థి శర్వాణి సరోజ 1,713 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈమెకు 10,507 ఓట్లు రాగా.. సమీప ప్రత్యర్థి టీఆర్ఎస్కు చెందిన ఇస్తారి స్వప్నకు 8,794 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. నిజాంపేట జెడ్పీటీసీ సభ్యుడిగా టీఆర్ఎస్కు చెందిన పంజా విజయ్‌కుమార్ 5,517 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈయనకు 9558 ఓట్లు రాగా.. ప్రత్యర్థి కాంగ్రెస్‌కు చెందిన లింగంగౌడ్కు 4041 ఓట్లు మాత్రమే వచ్చాయి. మెదక్ జెడ్పీటీసీగా టీఆర్ఎస్ అభ్యర్థి లావణ్యరెడ్డి 2,165 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆమెకు 7,763 ఓట్లు రాగా.. సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌కు చెందిన హైమావతికి 5,598 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. వెల్దుర్తి జెడ్పీటీసీ సభ్యుడిగా టీఆర్ఎస్కు చెందిన రమేష్‌గౌడ్ 977 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఈయనకు 10,729 ఓట్లు రాగా.. సమీప కాంగ్రెస్ అభ్యర్థి నర్సింహారెడ్డికి 9,752 ఓట్లు మాత్రమే దక్కాయి. అల్లాదుర్గం జెడ్పీటీసీగా టీఆర్ఎస్కు చెందిన సౌందర్య 308 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఈమెకు 8,006 ఓట్లు రాగా.. సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌కు చెందిన లక్ష్మికి 7,698 ఓట్లు మాత్రమే వచ్చాయి. శివ్వంపేట జెడ్పీటీసీగా టీఆర్ఎస్ అభ్యర్థి మహేష్‌గుప్తా 12,350 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. ఈయనకు 17,888 ఓట్లు రాగా.. సమీప కాంగ్రెస్ అభ్యర్థికి 5,595 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. నర్సాపూర్ జెడ్పీటీసీగా టీఆర్ఎస్ అభ్యర్థి బాబ్యనాయక్ 2,779 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నాయక్‌కు 11,386 ఓట్లు రాగా.. సమీప కాంగ్రెస్ అభ్యర్థి దేవిసింగ్‌కు 8,607 ఓట్లు మాత్రమే వచ్చాయి. తూప్రాన్ జెడ్పీటీసీ సభ్యురాలిగా టీఆర్ఎస్ అభ్యర్థిని బసవన్నగారి రాణి 1,804 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. టీఆర్ఎస్కు 5,915 ఓట్లు రాగా.. సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌కు చెందిన ఆకుల రాజమణికి 4,111 ఓట్లు మాత్రమే దక్కాయి. చేగుంట జెడ్పీటీసీగా టీఆర్ఎస్ అభ్యర్థి ముదం శ్రీనివాస్ 1,456 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఈయనకు 10,338 ఓట్లు రాగా.. ప్రత్యర్థి అయిన స్వతంత్ర అభ్యర్థి రాజిరెడ్డికి 8,882 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. నార్సింగి జెడ్పీటీసీ సభ్యుడిగా టీఆర్ఎస్కు చెందిన భానపురం కృష్ణారెడ్డి 960 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈయనకు 4,378 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి రమణకు 3,418 ఓట్లు మాత్రమే వచ్చాయి. మనోహరాబాద్ జెడ్పీటీసీ సభ్యురాలిగా టీఆర్ఎస్కు చెందిన ర్యాకల హేమలత శేఖర్‌గౌడ్ 5,579 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఆమెకు 9,638 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్‌కు 4,059 ఓట్లు మాత్రమే దక్కాయి. పాపన్నపేట జెడ్పీటీసీగా టీఆర్ఎస్ అభ్యర్థిని షర్మిలారెడ్డి గెలుపొందారు. తన సమీప కాంగ్రెస్ అభ్యర్థిని జంగం స్వప్నపై 6,770 ఓట్లు మెజార్టీతో విజయం సాధించారు. షర్మిలారెడ్డికి 18,423.. స్వప్నకు 11,653 ఓట్లు వచ్చాయి. చిలప్‌చెడ్ జెడ్పీటీసీగా టీఆర్ఎస్కు చెందిన చిలుముల శేషసాయిరెడ్డి.. కాంగ్రెస్ అభ్యర్థి నారాయణరెడ్డిపై 4,447 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. శేషసాయిరెడ్డికి 8,260 ఓట్లు, నారాయణరెడ్డికి 3,813 ఓట్లు పోలయ్యాయి. రామాయంపేట జెడ్పీటీసీగా టీఆర్ఎస్ అభ్యర్థిని సంధ్య 2,858 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈమెకు 6,259 ఓట్లు రాగా.. సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌కు చెందిన రాజేశ్వరికి 3,401 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థిని రాధకు 3,311 ఓట్లు పోలయ్యాయి. కౌడిపల్లి జెడ్పీటీగా టీఆర్ఎస్కు చెందిన కవిత 5,823 ఓట్ల ఆధిక్యంతో విజయబావుటా ఎగురవేశారు. ఈమెకు 12,752 ఓట్లు రాగా.. సమీప కాంగ్రెస్ అభ్యర్థిని అనితకు 6,929 ఓట్లు వచ్చాయి. కొల్చారం జెడ్పీటీసీగా టీఆర్ఎస్ అభ్యర్థి ముత్యంగారి మేఘమాల గెలుపొందారు. ఆమెకు 11,631 ఓట్లు రాగా.. సమీప కాంగ్రెస్ అభ్యర్థికి 6,065 ఓట్లు వచ్చాయి. 5,566 ఓట్ల తేడాతో మేఘమాల విజయం సాధించారు. చిన్నశంకరంపేట, చేగుంటలో క్రాస్‌ఓటింగ్ చిన్న శంకరంపేట మండలంలో క్రాస్‌ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. ఇక్కడ 12 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. టీఆర్ఎస్ నాలుగు, కాంగ్రెస్ ఏడు, స్వతంత్రులు ఒక స్థానాన్ని గెలుచుకున్నారు. ఎంపీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే ఆధిక్యం కాగా.. జెడ్పీటీసీ స్థానానికి సంబంధించి టీఆర్ఎస్ అభ్యర్థి 3,512 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందడం గమనార్హం. చేగుంటలో కూడా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. ఇక్కడ 13 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. తొమ్మిది స్థానాల్లో స్వతంత్రులు గెలుపొందారు. టీఆర్ఎస్ నాలుగుకే పరిమి తమైంది. ఇదే క్రమంలో జెడ్పీటీసీగా టీఆర్ఎస్కు చెందిన అభ్యర్థి 1,456 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. -
ప్రజల గుండెల్లో టీఆర్ఎస్, కేసీఆర్!
సాక్షి ప్రతినిధి, వరంగల్: అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజలకు చేరువైన టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ నాయకత్వంపై మరోసారి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు తమ సంపూర్ణ విశ్వాసాన్ని ప్రకటించారని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. కాంగ్రెస్, విపక్షాలు ఎన్ని తప్పుడు ఆరోపణలు చేసినా... ఉమ్మడి వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ ప్రభంజనం కొనసాగిందని, ప్రజలంతా టీఆర్ఎస్ వెంటే ఉన్నారనడానికి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతో మరోసారి రుజువైందని తెలిపారు. హన్మకొండలోని తన నివాసంలో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. పరిషత్ ఎన్నికల పలితాల్లో కారు స్పీడును ఏ పార్టీ అందుకోలేకపోయిందని.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వచ్చిన ఈ ఫలితాలు చరిత్రలో రికార్డుగా నమోదు కానున్నాయని మంత్రి దయాకర్‌రావు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ పాలనపై నమ్మకంతో రాష్ట్ర ప్రజలంతా టీఆర్ఎస్ వెంటే ఉన్నారని అన్నారు. వరుస విజయాలను అందిస్తున్న రాష్ట్ర ప్రజలు, ఉమ్మడి వరంగల్ జిల్లా ఓటర్లు, ఈ విజయ పరంపరలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికీ మంత్రి కతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నూతనంగా ఏర్పడిన ఆరు జిల్లాల్లో మొత్తం 70 జెడ్పీటీసీ స్థానాలకు గాను 62 టీఆర్ఎస్ గెలువడం సామాన్యమైన విషయం కాదన్నారు. ఆరు జిల్లాల్లోని 70 మండలాల్లో 781 ఎంపీటీసీలకు గాను 541 ఎంపీటీసీలను టిఆర్ఎస్ కైవసం చేసుకోగా.. మరో 50 మందికి పైగా టీఆర్ఎస్ అభిమానులే గెలిచారని వెల్లడించారు. తద్వారా ఆరు జిల్లా పరిషత్‌లతో పాటు 60కి పైగా మండల పరిషత్‌లపై గులాబీ జెండా ఎగురవేయబోతున్నామని మంత్రి దయాకర్‌రావు పేర్కొన్నారు. ప్రజలు అందించిన ఈ విజయాలతో తమ బాధ్యత ఇంకా పెరిగిందని, రాష్ట్రాన్ని అభివృద్ది చేయడమే లక్ష్యంగా ఆ పనిలో నిమగ్నమవుతామని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఇటీవల కొన్ని సీట్లు రావడంతో సంబర పడుతున్నాయని.. జాతీయ పార్టీల వల్ల కొంత అయోమయం నెలకొన్నా పరిషత్ ఎన్నికల్లో ఆ పార్టీలు కనుమరుగయ్యాయని అన్నారు. కాగా, ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయంతో గులాబీ శ్రేణులు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలసి మిఠాయిలు పంచి, టపాసులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి.. జెడ్పీటీసీ, ఎంపీటీసీలను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్, చైర్మన్లు మర్రి యాదవరెడ్డి, నాగుర్ల వెంకటేశ్వర్, సాంబారి సమ్మారావు పాల్గొన్నారు. -
క్లీన్ స్వీప్
సాక్షి, వరంగల్ రూరల్: పరిషత్ ఎన్నికల్లో కారు జోరుకు ఇతర పార్టీలు బ్రేక్‌లు వేయలేకపోయాయి. జిల్లాలో 16 జెడ్పీటీసీ స్థానాలకు గాను టీఆర్ఎస్ అన్ని స్థానాలు గెలిచి ప్రభంజనం సృష్టించింది. ప్రజల్లో టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉన్న నమ్మకాన్ని ఈ ఫలితాలు రుజువుచేశాయి. విపక్ష పార్టీలు టీఆర్ఎస్ను మాత్రం ఢీకొనలేకపోయాయి. డిసెంబర్, 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో, ఇటీవల జరిగిన లోకసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. అదే జోరు పరిషత్ ఎన్నికల్లో కోనసాగింది. బ్యాలెట్లో సైతం టీఆర్ఎస్కే పట్టం కట్టారు. జిల్లాలో మూడు దశలల్లో పరిషత్ ఎన్నికలు జరిగాయి. మే 6, 10, 14వ తేదిల్లో పరిషత్ ఎన్నికలు జరిగాయి. 16 జెడ్పీటీసీలు, 178 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఏడు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మూడు విడతలల్లో 4,89,861 ఓట్లకు గాను 3,89,869 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 16 జెడ్పీటీసీ స్థానాలకు 131 మంది, 171 ఎంపీటీసీ స్థానాలకు 778 మంది పోటీ చేశారు. జిల్లాలో మూడు కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మంగళవారం ఆయా కేంద్రాల్లో కౌంటింగ్‌ను నిర్వహించారు. వరంగల్ రూరల్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని వర్ధన్నపేట, పర్వతగిరి, రాయపర్తి, గీసుకొండ, సంగెం మండలాలకు సంబంధించిన కౌంటింగ్ వరంగల్ ఖమ్మం రోడ్‌లోని గణపతి ఇంజనీరింగ్ కళాశాల, నర్సంపేట రెవెన్యూ డివిజన్ పరిధిలోని నర్సంపేట, ఖానాపురం, చెన్నారావుపేట, దుగ్గొండి, నల్లబెల్లి, నెక్కొండ మండలాలకు సంబంధించినవి నర్సంపేట మహేశ్వరంలోని బాలాజీ స్కూల్, పరకాల రెవెన్యూ డివిజన్ పరిధిలోని పరకాల, నడికూడ, శాయంపేట, ఆత్మకూరు, దామెర మండలాలకు సంబంధించినవి పరకాలలోని గణపతి డిగ్రీ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరగింది. జిల్లా వ్యాప్తంగా అన్ని జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు కలిపి 1,282 టెబుల్‌లను ఏర్పాటు చేసి కౌంటింగ్ చేశారు. 16కు 16 టీఆర్ఎస్వే వరంగల్ రూరల్ జిల్లాలో 16 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. 16 జెడ్పీటీసీ స్థానాలకు 131 మంది పోటీ చేశారు. 16 స్థానాల్లో టీఆర్ఎస్కు చెందిన అభ్యర్థులే గెలుపొందారు. జిల్లాలో టీఆర్ఎస్కు ఇతర పార్టీలు ఎక్కడా పోటీ ఇవ్వలేకపోయాయి. 16 స్థానాలు టీఆర్ఎస్కే దక్కడంతో ఇక చైర్పర్సన్ ఎన్నిక సులభతరం కానుంది. ఇతర పార్టీల నుంచి ఎవరు గెలుపొందకపోవడంతో టీఆర్ఎస్కే జెడ్పీ పీఠం దక్కనుంది. 127 స్థానాల్లో టీఆర్ఎస్ జిల్లాలో మూడు దశలల్లో పరిషత్ ఎన్నికలు జరిగాయి. 178 ఎంపీటీసీ స్థానాలుండగా 7 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 171 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగగా 778 మంది పోటీ చేశారు. 178 స్థానాల్లో 127 టీఆర్ఎస్, 45 కాంగ్రెస్, 6 స్థానాల్లో స్వతంత్రులు గెలుపొందారు. వర్ధన్నపేటలో కాంగ్రెస్ పార్టీకి స్థానం కూడా దక్కలేదు. నర్సంపేట, గీసుకొండ మండలాల్లో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ స్థానాలను దక్కించుకుంది. ఈ రెండు మండలాల్లో కాంగ్రెస్ పార్టీనే ఎంపీపీలు దక్కించుకునే అవకాశాలున్నాయి. మిగతా అన్ని మండలాలల ఎంపీపీలను టీఆర్ఎస్ దక్కించుకునే అవకాశాలున్నాయి. -
కామారెడ్డి జిల్లాలోనూ.. గులాబీ జెండా
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా పరిషత్‌పై గులాబీ జెండా ఎగిరింది. మెజారిటీ జెడ్పీటీసీ స్థానాలను గెలుచుకున్న టీఆర్ఎస్ పార్టీకి చెందిన సభ్యురాలే తొలి జెడ్పీ చైర్పర్సన్ పీఠం అలంకరించనున్నారు. గత నెల 6, 10, 14 తేదీలలో మూడు విడతల్లో 22 జెడ్పీటీసీ స్థానాలతో పాటు 236 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. 22 జెడ్పీటీసీలకుగాను టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు 14 చోట్ల విజయం సాధించారు. ఎనిమిది చోట్ల కాంగ్రెస్ గెలిచింది. జెడ్పీటీసీ ఎన్నికలలో బీజేపీ బోణీకొట్టలేదు. కాగా జిల్లాలో 236 ఎంపీటీసీ స్థానాలుండగా.. 19 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయిన విషయం తెలిసిందే. ఏకగ్రీవ ఎంపీటీసీ స్థానాలతో కలిపి టీఆర్ఎస్ పార్టీ 149 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీకి 61 స్థానాలు, బీజేపీకి నాలుగు స్థానాలు దక్కాయి. 22 చోట్ల స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. చైర్‌పర్సన్‌గా దఫేదార్ శోభ! ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ దఫేదార్ రాజు భార్య శోభ నిజాంసాగర్ జెడ్పీటీసీ సభ్యురాలిగా విజయం సాధించారు. ఆమెకే జెడ్పీ చైర్‌పర్సన్‌గా అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ పార్టీనుంచి 14 మంది జెడ్పీటీసీలు గెలుపొందారు. ఇందులో నిజాంసాగర్ నుంచి గెలిచిన దఫేదార్ శోభ, బిచ్కుంద జెడ్పీటీసీ భారతి, బీర్కూర్ జెడ్పీటీసీ స్వరూప మాత్రమే బీసీ మహిళలు. జెడ్పీ పీఠం బీసీ మహిళకు రిజర్వు అయిన నేపథ్యంలో జెడ్పీ చైర్పర్సన్ అవకాశం ముగ్గురికే ఉంటుంది. అయితే ముగ్గురిలో దఫేదార్ శోభకే చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి. ఈ విషయమై ఇప్పటికే పార్టీ నేతలు ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. బాన్సువాడలో టీఆర్ఎస్ హవా అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న బాన్సువాడ నియోజకవర్గంలో టీఆర్ఎస్ హవా కొనసాగింది. పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఇక్కడ 20 వేల మెజారిటీ లభించింది. పోచారం తనయుడు భాస్కర్‌రెడ్డి నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం చేసిన ప్రయత్నాలు సక్సెస్ అయ్యాయి. నియోజకవర్గంలోని బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలాల్లో జెడ్పీటీసీ స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అలాగే మూడు మండలాల్లో 26 ఎంపీటీసీ స్థానాలుండగా.. 25 స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానానికే పరిమితమైంది. నేతల సొంత మండలాల్లో ఎదురుగాలి.. జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు మాజీ ఎమ్మెల్యేల సొంత మండలాల్లో ఎదురుగాలి తగిలింది. జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజక వర్గాలు ఉండగా.. కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల్లో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేల సొంత మండలాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించడం గమనార్హం. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ సొంత మండలం లింగంపేట. ఇక్కడ టీఆర్ఎస్ జెడ్పీటీసీ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన శ్రీలత విజయం సాధించారు. కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సొంత మండలమైన భిక్కనూరులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పద్మ గెలుపొందారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ సింధే సొంత మండలమైన జుక్కల్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లక్ష్మీబాయి గెలిచారు. కాగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి సొంత మండలమైన తాడ్వాయి మండలంలో మాత్రం టీఆర్ఎస్సే గెలుపొందింది. తాడ్వాయిలో మెజారిటీ ఎంపీటీసీ స్థానాలనూ టీఆర్ఎస్ గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జనార్దన్‌గౌడ్ సొంత మండలమైన నాగిరెడ్డిపేటలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. షబ్బీర్ సొంత మండలంలో.. మాజీ మంత్రి షబ్బీర్ అలీ సొంత మండలమైన మాచారెడ్డిలో టీఆర్ఎస్ హవా కొనసాగింది. జెడ్పీటీసీ అభ్యర్థిగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన మిన్కూరి రాంరెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఇక్కడ 13 ఎంపీటీసీ స్థానాలకుగాను 10 చోట్ల టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందగా, రెండుచోట్ల మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. ఒక ఎంపీటీసీ స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. మాజీ ఎమ్మెల్యే గంగారాం భార్య ఓటమి కాంగ్రెస్ పార్టీకి చెందిన జుక్కల్ మాజీ ఎమ్మెల్యే సౌదాగర్ గంగారాం భార్య సావిత్రమ్మ పెద్దకొడప్గల్ జెడ్పీటీసీగా పోటీచేసి ఓటమి చెందారు. పెద్దకొడప్గల్ మండలంలో ఆరు ఎంపీటీసీ స్థానాలకు గాను ఐదు చోట్ల టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. ఒక్కచోట మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు. -
జెడ్పీపై గులాబీ జెండా
సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా కొనసాగింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే పరిషత్ ఎన్నికల్లోనూ పునరావృతమయ్యాయి. జిల్లాలో 27 జెడ్పీటీసీ స్థానాలకు గాను 23 స్థానాలను గెలుచుకుని జిల్లా పరిషత్‌లో తిరుగులేని మెజారిటీని సాధించింది. మరోమారు జిల్లా పరిషత్‌పై గులాబీ జెండాను ఎగురవేయనుంది. 27 మండల పరిషత్‌లుండగా 26 మండల పరిషత్‌లను కైవసం చేసుకునేందుకు స్పష్టమైన మెజారిటీæ సాధించింది. మొత్తం 299 ఎంపీటీసీ స్థానాలకు గాను 188 స్థానాలను కైవసం చేసుకుంది. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలతో కాస్త నిరుత్సాహానికి గురైన గులాబీ శ్రేణుల్లో పరిషత్ ఎన్నికల్లో ఘన విజయం నూతనోత్తేజాన్ని నింపినట్లయింది. రెండు జెడ్పీటీసీ స్థానాలు, 45 ఎంపీటీసీ స్థానాలను దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ రెండో స్థానానికి పరిమితమైంది. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలతో ఊపు మీదున్న బీజేపీ కూడా రెండు జెడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకుంది. 34 ఎంపీటీసీ స్థానాల్లో విజయం సాధించింది. స్వతంత్రులు కూడా ఈ ఎన్నికల్లో సత్తా చాటారు. 32 ఎంపీటీసీ స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. జిల్లాలోని 27 జెడ్పీటీసీ స్థానాలకు గాను మాక్లూర్ జెడ్పీటీసీ స్థానం ఏకగ్రీవమైన విషయం విధితమే. టీఆర్ఎస్ అభ్యర్థి దాదన్నగారి విఠల్‌రావు ఎన్నికయ్యారు. 26 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అలాగే 13 ఎంపీటీసీ స్థానాలు టీఆర్ఎస్ ఏకగ్రీవంగా దక్కించుకోగా 286 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మూడు విడతల్లో పోలింగ్ జరగగా, ఓట్ల లెక్కింపు మంగళవారం చేపట్టారు. నిజామాబాద్ నగరంలోని నిర్మల హృదయ పాఠశాల, బోధన్, ఆర్మూర్ సమీపంలోని మునిపల్లిలో కౌంటింగ్ జరిగింది. పలు పరిషత్‌లు టీఆర్ఎస్ క్లీన్ స్వీప్.. పలు మండల పరిషత్‌లను టీఆర్ఎస్ క్లీన్‌స్వీప్ చేసింది. బాల్కొండ మండల పరిషత్ పరిధిలో తొమ్మిదింటికి తొమ్మిది ఎంపీటీసీ స్థానాలను దక్కించుకుంది. అలాగే కమ్మర్‌పల్లిలో పదింటికి పది ఎంపీటీసీ స్థానాల్లో విజయం సాధించి ఇతర పార్టీలకు ప్రాతినిధ్యం లేకుండా చేసింది. ఇందల్వాయిలోనూ 11 స్థానాలకు 10 స్థానాల్లో విజయం సాధించింది. ఆ ఒక్క స్థానం స్వతంత్ర అభ్యర్థికి దక్కింది. ‘స్థానికంలో కాంగ్రెస్ కుదేలు.. వరుస ఓటమితో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ పార్టీకి ప్రాదేశిక ఎన్నికల ఫలితాలు కూడా నిరాశను మిగిల్చా యి. గతంలో జిల్లా పరిషత్‌లో మంచి ప్రాతినిధ్య వహించిన కాంగ్రెస్ పార్టీ ఈసారి కేవలం రెండు జెడ్పీటీసీ స్థానా లకే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. చందూరు, ఏర్గట్ల జెడ్పీటీసీ స్థానాలు మాత్రమే కాంగ్రెస్‌కు దక్కాయి. చందూరు ఎంపీపీ పరిధిలో మూడు ఎంపీటీసీ స్థానాలుండగా రెండు చోట్ల కాంగ్రెస్ విజయం సాధించి మండల పరిషత్‌ను దక్కించుకోగలిగింది. బీజేపీకి గతంలో కంటే కాస్త మెరుగైన ఫలితాలు.. పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కమలం పార్టీ గత స్థానిక సంస్థల ఎన్నికల కంటే ఈసారి మెరుగైన ఫలితాలను సాధించింది. రెంజల్, నందిపేట్ జెడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకుని జిల్లా పరిషత్‌లో తొలిసారిగా కాలు మోపుతోంది. పలు జెడ్పీటీసీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు రెండో స్థానంలో నిలిచారు. మరోవైపు గతంలో ఎన్నడూ లేనివిధంగా 34 ఎంపీటీసీ స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. పలు మండల పరిషత్‌లతో కొంత మేరకు ప్రాతినిధ్యాన్ని దక్కించుకుంది. సత్తా చాటిన స్వతంత్రులు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు కూడా సత్తా చాటారు. 32 ఎంపీటీసీ స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందడం గమనార్హం. గ్రామాల్లో ఉన్న పలుకుబడి, పేరు ప్రఖ్యాతులు, ప్రజలకు అందుబాటులో ఉండటం వంటి అంశాలు స్వతంత్రుల విజయానికి కారణమ నే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ టిక్కెట్లు దక్కని వారు కొందరు స్వతంత్రులుగా బరిలోకి దిగి విజయం సాధించారు. -
గులాబీ.. గుబాళింపు!
సాక్షిప్రతినిధి, నల్లగొండ : గులాబీ.. గుబాళించింది. జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ పార్టీ తొలిసారి జిల్లా పరిషత్ పీఠంపై గులాబీ జెండాను ఎగుర వేయనుంది. 31 జెడ్పీటీసీ (జిల్లా ప్రాదేశిక నియోజకవర్గాలు) స్థానాలకు గాను టీఆర్ఎస్ ఏకంగా 24 చోట్ల విజయ దుందుభి మోగించింది. గట్టి పోటీ ఇస్తుందనుకున్న కాంగ్రెస్ కేవలం 7 జెడ్పీటీసీ స్థానాలకే పరిమితం కాగా, ఇతర ఏ పార్టీ ఖాతా తెరవలేదు. ఇక, ఎంపీటీసీల (మండల ప్రాదేశిక నియోజకవర్గాలు ) విషయానికి వస్తే.. జిల్లా వ్యాప్తంగా 349 స్థానాలకు గాను టీఆర్ఎస్ 191 స్థానాలతో పట్టు నిరూపించుకుంది. మొత్తంగా 31 మండల ప్రజాపరిషత్‌లకు గాను ఆ పార్టీ ఇప్పటికిప్పుడు 18 ఎంపీపీ స్థానాలను కైవసం చేసుకున్నట్టే. కాంగ్రెస్‌కు ఆరు మండలాలే దక్కనుండగా, మరో ఏడు మండలాల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్‌కు ఎంపీపీ పదవులను పొందేందుకు సమాన అవకాశాలు ఉన్నాయి. ఈ మండలాల్లో ఇండిపెండెంట్లు కీలకం కానున్నారు. మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నిక ఈనెల 7వ తేదీన, జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక 8వ తేదీన జరగనున్నాయి. ఉసూరుమన్న కాంగ్రెస్ ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రెండు లోక్‌సభ స్థానాలను గెలుచుకున్న కాంగ్రెస్ ఆనందమంతా స్థానిక సంస్థల ఫలితాలతో ఆవిరైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దేవరకొండ, మిర్యాలగూడ, నల్లగొండ... ఈ మూడు రెవెన్యూ డివిజన్లలో ఎక్కడా పట్టు నిరూపించలేక పోయింది. దేవరకొండ డివిజన్లో పది మండలాలకు గాను కేవలం పీఏపల్లిలో మాత్రమే జెడ్పీటీసీ స్థానాన్ని గెలచుకుంది. మిర్యాలగూడ డివిజన్లోని పది మండలాలకు గాను.. మాడ్గులపల్లి, త్రిపురారం, నిడమనూరు జెడ్పీటీసీ స్థానాల్లో గెలిచింది. ఇక, నల్లగొండ డివిజన్ పరిధిలోని పదకొండు మండలాల్లో నల్లగొండ, చండూరు, కేతేపల్లి జెడ్పీటీసీ స్థానాలు కాంగ్రెస్ వశమయ్యాయి. ఎంపీపీల విషయంలోనూ కాంగ్రెస్‌కు చేదు ఫలితాలు తప్పలేదు. దేవరకొండ డివిజన్లో చందంపేట, కొండమల్లేపల్లి, చింతపల్లి, మర్రిగూడ మండలాల్లో, మిర్యాలగూడ డివిజన్లో త్రిపురారం, నల్లగొండ డివిజన్లో నల్లగొండ మండలాన్ని కాంగ్రెస్ దక్కించుకుంది. దీంతో మొత్తంగా ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి ఏడు జెడ్పీటీసీ స్థానాలు, ఆరు ఎంపీపీ పదవులు దక్కుతున్నాయి. ఈ ఎన్నికల్లో సీపీఎం 5, బీజేపీ 4, సీపీఐ 1 ఎంపీటీసీ స్థానాలను గెలుచుకోగా, స్వతంత్రులు/రెబల్స్ .. 14 చోట్ల గెలిచారు. కాంగ్రెస్, ఇతరులు పొత్తులతో పోటీ చేసిన కొన్ని మండలాల్లో కాంగ్రెస్ ఎంపీపీ స్థానా న్ని గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఈ నెల 7వ తేదీన జరగనున్న ఎంపీపీల ఎన్నికల్లో ఏ పార్టీ అవకాశం దక్కుతుందో తేలనుంది. ఆ ఏడు .. ఎవరికి ? జిల్లాలోని 31 మండలాల్లో మెజారిటీ ఎంపీటీసీ స్థానాలు గెలుచుకుని 18 చోట్ల టీఆర్ఎస్, 6 చోట్ల కాంగ్రెస్ ఎంపీపీ పదవులు పొందడం ఖాయంగా కనిపిస్తుండగా.. మరో ఏడు చోట్ల మాత్రం ఇరు పార్టీలకూ సమాన అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఈ ఏడు మండలాలు ఏ పార్టీ ఖాతాలో చేరుతాయనే చర్చ మొదలైంది. పెద్దవూర, వేములపల్లి, చండూరు, చిట్యాల, తిప్పర్తి, కేతేపల్లి, నకిరేకల్ మండలాల్లో అటు టీఆర్ఎస్కు గానీ, ఇటు కాంగ్రెస్‌కు గానీ ఎంపీపీ పదవిని దక్కించుకునేందుకు అవసరమైన మెజారిటీ రాలేదు. ఈ ఏడు మండలాల్లో ఇండిపెండెంట్లు , సీపీఎం, ఇతరులు కీలకం కానున్నారు. సహజంగానే.. అధికార పార్టీ ఈ ఏడు ఎంపీపీలను కైవసం చేసుకునేందుకు మంతనాలు మొదలు పెట్టింది. కొన్ని మండలాల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీటీసీ టికెట్లు దక్కని వారే రెబల్స్‌గా పోటీ చేసి గెలవడంతో వారు తమకే మద్దతుగా నిలుస్తారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
పరిషత్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం
-
ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు
ఆదిలాబాద్‌అర్బన్: జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా జరిగింది. 17 జెడ్పీటీసీ, 158 ఎంపీటీసీ స్థానాలకు మేలో మూడు విడతలుగా ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. గత నెల 6, 10, 14వ తేదీల్లో ఆయా ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు పోలైన ఓట్లను మంగళవారం లెక్కించారు. ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కాగా, రాత్రి వరకు కొనసాగింది. జిల్లాలో ఐదు లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేయగా, జిల్లా కేంద్రంలో మూడు, బోథ్‌లో ఒకటి, ఉట్నూర్‌లో ఒక లెక్కింపు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్, జైనథ్, బేల, తాంసి, భీంపూర్, తలమడుగు, ఇచ్చోడ, సిరికొండ, మావల, గుడిహత్నూర్ మండలాల ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్లను జిల్లా కేంద్రంలో లెక్కించగా, నేరడిగొండ, బోథ్, బజార్హత్నూర్ మండలాల్లోని ఆయా స్థానాల ఓట్లను బోథ్ మండల కేంద్రంలో లెక్కించారు. ఇక ఇంద్రవెల్లి, నార్నూర్, గాదిగూడ, ఉట్నూర్ మండలాల్లోని ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్లను ఉట్నూర్‌లోని బీఈడీ కళాశాలలో లెక్కింపు ప్రక్రియ చేపట్టారు. గత పక్షం రోజుల నుంచి పరిషత్ లెక్కింపుపై దృష్టి సారించిన అధికారులు కౌంటింగ్‌లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. జిల్లా కేంద్రంతోపాటు బోథ్, ఉట్నూర్లలోని కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా కొనసాగింది. కాగా, ఆయా కేంద్రాల్లో జరుగుతున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దివ్యదేవరాజన్, సాధారణ పరిశీలకులు చిరంజీ వులు, ఎస్పీ విష్ణు ఎస్.వారియర్ పరిశీలించారు. మధ్యాహ్నం ఎంపీటీసీ, సాయంత్రం జెడ్పీటీసీ.. ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన లెక్కింపు ప్రక్రియ 11 గంటల వరకు నెమ్మదిగా జరిగింది. దీంతో మొదటి ఫలితం రావడానికి చాలా సమయం పట్టింది. ముందుగా ఎంపీటీసీ ఓట్లను, తర్వాత జెడ్పీటీసీ ఓట్లను లెక్కించారు. కొన్ని మండలాల్లోని అన్ని ఎంపీటీసీ స్థానాల ఓట్ల లెక్కింపునకు దాదాపు ఏడు గంటల సమయం పట్టగా, ఇంకొన్ని మండలాల ఓట్ల లెక్కింపు త్వరగానే పూర్తయింది. లెక్కింపు ప్రారంభమైన మూడు గంటల అనంతరం ఒక్కో స్థానం ఫలితాలు వెల్లడి కావడంతో కేంద్రాలకు వచ్చిన అభ్యర్థులు, ఏజెంట్లలో ఉత్కంఠ మొదలైంది. ఒక స్థానం తర్వాత ఒక స్థానం ఫలితాలు ఒక్కోక్కటిగా వెల్లడించడంతో గెలిచిన వారు ఆనందంగా, ఓడిన వారు నీరసంగా కన్పించారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించిన అధికారులు అనంతరం బ్యాలెట్ బాక్సుల్లో ఉన్న బ్యాలెట్ పత్రాల లెక్కింపు చేపట్టారు. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల వారీగా పత్రాలను వేరు చేశారు. మళ్లీ ఆయా స్థానాలకు పోటీ చేసిన అభ్యర్థుల వారీగా సెపరేట్ చేశారు. అనంతరం 25 బ్యాలెట్ పత్రాలకు ఒక బండల్ చొప్పున కట్టకట్టడంతో మొదటి ఫలితం రావడానికి చాలా సమయం పట్టింది. అలా కట్టకట్టిన అనంతరం లెక్కింపు ప్రారంభించారు. ఈ ప్రక్రియ అంతా ఆయా పార్టీల ఏజెంట్ల ముందు జరగడంతో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. ఫలితాల వెల్లడి ప్రారంభమైన రెండు గంటల్లోపే అన్ని ఎంపీటీసీ స్థానాల ఫలితాలు పూర్తయ్యాయి. ఒక్కో మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలు ఉండడంతో అక్కడ పూర్తి ఫలితాల వెల్లడికి కొద్ది సమయం పట్టింది. మూడు నుంచి ఐదు ఎంపీటీసీ స్థానాలు ఉన్న మండలంలో జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపును మధ్యాహ్నమే చేపట్టగా, ఆ మండలాల జెడ్పీటీసీ ఫలితాలు సాయంత్రం 4 గంటల నుంచే మొదలయ్యాయి. కేంద్రాల చుట్టు పక్కల భారీ భద్రత పరిషత్ ఓట్ల లెక్కింపు కేంద్రాల చుట్టూ పక్కల భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. డీఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో లెక్కింపు కేంద్రాలు ఉండగా, ఆయా కేంద్రాల్లోని కౌంటింగ్ హాళ్ల ముందు మండల ఎస్సైలకు బందోబస్తు బాధ్యతలు అప్పగించారు. సదరు మండలం ఓట్ల లెక్కింపు హాల్ వద్ద అదే మండల ఎస్సై, ఇతర పోలీసులు భద్రత బాధ్యతలు నిర్వర్తించడంతో కౌంటింగ్ హాళ్ల ముందు, లోపల ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూశారు. ఆ మండల పరిధిలోని ఏజెంట్లుగా అందరు తెలిసిన వారుండడంతో లెక్కింపు ప్రశాంతంగా జరిగింది. దీంతోపాటు లెక్కింపు కేంద్రాలకు ముందు రోడ్లపై ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ హాల్ ప్రశాంత వాతావరణంలో ఉంచేందుకు రోడ్డుపై భారీకేడ్లు ఏర్పాటు చేసి అక్కడి నుంచి రాకపోకలు కొనసాగించే ప్రజలను, వాహనాలను దారి మళ్లీంచారు. దీంతో ఎక్కడా కూడా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా లెక్కింపు ప్రశాంతంగా కొనసాగింది. -
జెడ్పీ పీఠం టీఆర్ఎస్దే..
సాక్షి, ఆదిలాబాద్: జిల్లాల విభజన తర్వాత ఆదిలాబాద్ జిల్లా జెడ్పీ పీఠాన్ని తొలిసారి టీఆర్ఎస్ పార్టే దక్కించుకుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ ఈ పార్టీయే జెడ్పీని పాలించింది. ఈ ఎన్నికల్లో గులాబీ పార్టీ జోరు కొనసాగినా కాషాయం పార్టీ నుంచి తీవ్ర పోటీ ఎదురైంది. హస్తం పార్టీ కూడా తాను తక్కువ కానన్నట్టు ఢీకొట్టడంతో కారు పూర్తిస్థాయిలో ప్రభంజనం సృష్టించకపోయినా మెజార్టీ సాధించింది. మండలాల్లో అధ్యక్ష పీఠాలను అత్యధికంగా టీఆర్ఎస్ సాధించినా సిట్టింగ్ స్థానాల్లో ఓటమి పాలైంది. తద్వారా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోరాట పటిమ చూపాయి. నువ్వా.. నేనా? ఆదిలాబాద్ జిల్లాలో జెడ్పీటీసీ స్థానాలు 17 ఉండగా, టీఆర్ఎస్ మెజార్టీ తొమ్మిది స్థానాలను సాధించింది. అయితే ఒకట్రెండు స్థానాల్లో టీఆర్ఎస్ గెలుపు సాధించని పక్షంలో జెడ్పీ పీఠం కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్, బీజేపీల్లో సమీకరణలు మారినా ఆశ్చర్యపోనక్కర్లేదన్న చర్చ సాగింది. అయితే టీఆర్ఎస్ మెజార్టీ సాధించడంతో ఈ చర్చ పక్కన పడింది. బీజేపీ టీఆర్ఎస్కు గట్టి పోటీనిచ్చింది. ఐదు స్థానాల్లో విజయం సాధించింది. ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ ప్రభావం స్పష్టంగా కనిపించింది. లోక్‌సభ ఎన్నికల్లోనే ఆ పార్టీ అభ్యర్థి సోయం బాపురావు ఎంపీగా గెలిచిన విషయం తెలిసిందే. ఈ ప్రాదేశిక ఎన్నికల్లోనూ బీజేపీ ప్రభావం ఉంటుందని మొదటి నుంచి అనుమానిస్తుండగా, అనుకున్న దానికంటే ఎక్కువే ప్రభావం చూపింది. ఇక కాంగ్రెస్ మూడుస్థానాలను గెలుపొంది గత ప్రాదేశికఎన్నికల కంటే ఈసారి బెటర్ అనిపించింది. గత ప్రాదేశిక ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం ఒకేఒక జెడ్పీటీసీ గెలవగా, ఈ సారి మూడుకు ఎగబాకింది. పది ఎంపీపీలు టీఆర్ఎస్ ఖాతాల్లోకే.. జిల్లాలో పది మండల పరిషత్ అధ్యక్ష పీఠాలను టీఆర్ఎస్ కైవసం చేసుకోనుంది. పది మండలాల్లో ఆ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చింది. ఎంపీటీసీ స్థానాలను అధికంగా గెలుపొందింది. కాంగ్రెస్, బీజేపీ చెరో మండలంలో గెలుపొందారు. గుడిహత్నూర్, బజార్హత్నూర్, ఇచ్చోడ, ఇంద్రవెల్లిలలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు గెలుపొందినా ఏ పార్టీ కూడా స్పష్టమైన మెజార్టీ సాధించలేదు. దీంతో ఇక్కడ టీఆర్ఎస్కు వేరే పార్టీల నుంచి ఎంపీటీసీలు మద్దతు ఇచ్చిన పక్షంలో ఆ మండల అధ్యక్ష పదవులు టీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్తాయి. లేనిపక్షంలో బీజేపీ, కాంగ్రెస్‌లకు ఒప్పందం కుదిరితే ఆ మండలాలు ఆయా పార్టీలు అధ్యక్ష పదవులను దక్కించుకునే ఆస్కారం ఉంది. ఈనెల 7న మండల అధ్యక్ష ఎన్నిక జరగనుండగా, ఇప్పుడు ఈ మండలాల్లో ఎవరు ఎంపీపీఅవుతారనేది ఆసక్తి నెలకొంది. ఒకవేళ తమ సిద్ధాంతాలు కాదని కాంగ్రెస్, బీజేపీలు జత కడతాయా.. లేనిపక్షంలో టీఆర్ఎస్ కాంగ్రెస్, బీజేపీల నుంచి ఎంపీటీసీలను తమవైపు తిప్పుకుంటుందా.. ఈ మూడు రోజుల్లో రాజకీయాలు ఎలా మారుతాయనేది ఆసక్తికరంగా మారింది. -
టీఆర్ఎస్కే 4 జెడ్పీ పీఠాలు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ప్రాదేశిక ఎన్నికల్లో మరోసారి కారు దూసుకుపోయింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల నాటి ఫలితాల కన్నా మిన్నగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో టీఆర్ఎస్ హవా కొనసాగింది. ఉమ్మడి కరీంనగర్‌లోని నాలుగు జిల్లా పరిషత్ చైర్పర్సన్లను ఏకపక్షంగా కైవసం చేసుకునే మెజారిటీ సాధించిన టీఆర్ఎస్, ఎంపీపీ స్థానాల్లో కూడా దాదాపు అన్ని మండలాలను సొంతం చేసుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఉమ్మడి జిల్లాలోని 58 జెడ్పీటీసీలకు గాను 54 స్థానాలను కైవసం చేసుకున్న టీఆర్ఎస్ తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించింది. కేవలం నాలుగు స్థానాలతో కాంగ్రెస్ రెండోస్థానంలో నిలవగా, బీజేపీ ఖాతా తెరవలేదు. కరీంనగర్ జిల్లాలోని 15 జెడ్పీటీసీ స్థానా లను టీఆర్ఎస్ క్లీన్‌స్వీప్ చేయడం విశేషం. పెద్దపల్లి జిల్లాలో మాత్రమే 15 స్థానాలకు గాను పదమూడు చోట్ల టీఆర్ఎస్ విజయం సాధించగా, సుల్తానాబాద్, ఓదెల మండలాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయాన్ని అందుకున్నారు. ఇక జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో కేవలం ఒక్కో సీటులో కాంగ్రెస్ గెలిచింది. ఇక ఎంపీటీసీ స్థానాల్లో కూడా ఉమ్మడి జిల్లాలోని 653 స్థానాలకు 402 స్థానాల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ 114 స్థానాలకు పరిమితం కాగా, బీజేపీ 47, సీపీఐ 3, టీడీపీ ఒక స్థానంలో గెలుపొందింది. కాగా ఇండిపెండెంట్ అభ్యర్థులు కాంగ్రెస్ తరువాత అత్యధికంగా 86 స్థానాల్లో విజయం సాధించడం గమనార్హం. కాగా టీఆర్ఎస్ మెజారిటీ ఎంపీపీ స్థానాలను కైవసం చేసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. దాదాపు అన్ని మండలాల్లో మిగతా పక్షాల కన్నా టీఆర్ఎస్ అభ్యర్థులే ఎక్కువగా విజయం సాధించడంతో ఎంపీపీల గెలుపు నల్లేరు మీద నడకే. 9 నియోజకవర్గాల్లో క్లీన్ స్వీప్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్(సిద్దిపేట జిల్లా) మినహా 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 58 జెడ్పీటీసీ స్థానాల్లో టీఆర్ఎస్ 54 గెలుచుకొని పార్లమెంటు తీర్పుకు స్థానిక ఫలితాలకు సంబంధం లేదని నిరూపించింది. కరీంనగర్ నియోజకవర్గంలోని రెండు జెడ్పీటీసీ స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకోగా, కొత్తపల్లి మండలంలో ఏకంగా 8 ఎంపీటీసీలను ఆ పార్టీ కైవసం చేసుకొంది. ఇక్కడ ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి భారీ మెజారిటీ రావడం గమనార్హం. పెద్దపల్లి నియోజకవర్గంలో సుల్తానాబాద్, ఓదెల స్థానాలు, వేములవాడ నియోజకవర్గంలోని చందుర్తి, జగిత్యాలలోని బీర్పూరు మినహా మిగతా 9 అసెంబ్లీ సెగ్మెంట్లలో కారు క్లీన్‌స్వీప్ చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్‌కు కోల్పోయిన మంథని నియోజకవర్గంలో ఈసారి అన్ని సీట్లను టీఆర్ఎస్ కైవసం చేసుకొంది. జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థి పుట్టా మధు కమాన్‌పూర్ నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించారు. రామగుండంలో సైతం కోరుకంటి చందర్ నేతృత్వంలో టీఆర్ఎస్ క్లీన్‌స్వీప్ చేసింది. ఎంపీ సంజయ్‌కు మెజారిటీ ఇచ్చిన స్థానాల్లో సైతం... ఇటీవల పార్లమెంటు ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ ఎంపీ సంజయ్‌కుమార్‌కు మెజారిటీ ఇచ్చిన అన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులే భారీ మెజారిటీతో గెలుపొందడం గమనార్హం. కరీంనగర్, మానకొండూరు, చొప్పదండిలలో టీఆర్ఎస్ క్వీన్‌స్వీప్ చేయగా, వేములవాడలో కేవలం ఒక్క సీటును కాంగ్రెస్‌కు కోల్పోయింది. కాగా బీజేపీ ఈ నియోజకవర్గాల్లో ఒక్క జెడ్పీటీసీ స్థానాన్ని గెలుచుకోలేదు. చొప్పదండిలో మాత్రం కొన్ని ఎంపీటీసీ స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. జెడ్పీ పీఠాలు వీరికే! ఉమ్మడి జిల్లాలోని నాలుగు జిల్లా పరిషత్‌లలో టీఆర్ఎస్ జెండా ఎగురుతుండడంతో పీఠాలపై ఆసీనులు అయ్యేదెవరో దాదాపుగా తేలిపోయిం ది. పెద్దపల్లిలో పుట్ట మధు, సిరిసిల్లలో కోనరావుపేట జెడ్పీటీసీ న్యాలకొండ అరుణ ఇప్పటికే ఖరా రయ్యారు. కరీంనగర్లో మంత్రి ఈటల ప్రాతిని ధ్యం వహిస్తున్న హుజూరాబాద్ సెగ్మెంట్ పరిధి లోని ఇల్లందకుంట జెడ్పీటీసీ కనుమల్ల విజయ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యే అవకాశం ఉంది. ఆమె గతంలో కూడా జమ్మికుంట జెడ్పీటీసీగా వ్యవహరించిన నేపథ్యంలో ఆమెకే చాన్స్. ఇక జగి త్యాల(బీసీ జనరల్)లో బుగ్గారం జెడ్పీటీసీ బాది నేని రాజేందర్‌కు అవకాశం దక్కనుందని సమాచారం. కోరుట్ల జెడ్పీటీసీ దారిశెట్టి లావణ్య కూడా రేసులో ఉన్నప్పటికీ, జనరల్ బీసీకి రిజర్వు అయిన ఈ స్థానంలో లావణ్యకు అవకాశం అనుమానమే. -
ఎంపీటీసీగా ఎంసీఏ విద్యార్థి అనూష
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉన్నత విద్య అభ్యసిస్తూనే గ్రామ రాజకీయాల్లో కీలకమైన ఎంపీటీసీగా ఎన్నికయ్యారు. సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి ఎంపీటీసీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఎంసీఏ విద్యార్థి పులి అనూష ఘన విజయం సాధించారు. మహిళలకు రిజర్వ్ అయిన ఈ స్థానం నుంచి జరిగిన ముఖాముఖి పోటీలో టీఆర్ఎస్ అభ్యర్థి పడాల శ్రీజపై అనూష 72 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. నాలుగునెలలక్రితం జరిగిన సర్పంచ్ ఎన్నికల్లోనూ పోటీచేసిన అనూష ఓటమి పాలు కాగా, ఈసారి ఎంపీటీసీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేశారు. సర్పంచ్‌గా పోటీ చేసి ఓడిపోయిన అనూషకు గ్రామస్తులు బాసటగా నిలిచారు. మాజీ ఎంపీటీసీ పులి వెంకటేశం కూతురైన అనూష కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్‌లోని శ్రీ చైతన్య కళాశాలలో ఎంసీఏ తృతీయ సంవత్సరం చదువుతోంది. పిన్న వయసు 23 సంవత్సరాలలోనే గ్రామ ఎంపీటీసీగా, అది కూడా స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తంచేస్తున్నారు. తమ కళాశాల విద్యార్థిని అనూష ఇండిపెండెంట్‌గా పోటీచేసి టీఆర్ఎస్ అభ్యర్థిపై విజయం సాధించడం పట్ల కళాశాల యాజమాన్యం, విద్యార్థులు హర్షం వ్యక్తంచేశారు. -
కారు..జోరు..
సాక్షి, నాగర్‌కర్నూల్: ప్రాదేశిక ఎన్నికల్లో గులాబీ పార్టీ తన సత్తా చాటింది. మెజార్టీ స్థానాలను కైవసం చేసుకొని కారు జోరును ప్రదర్శించింది. అసెంబ్లీ, పార్లమెంట్, సర్పంచ్ ఎన్నికల్లో వరుస విజయాలు సాధించిన టీఆర్ఎస్ పార్టీ మంగళవారం వెలువడిన పరిషత్ ఎన్నికల్లోనూ జయకేతనం ఎగురవేసింది. జిల్లాలో మెజార్టీ మండల, జిల్లా పరిషత్ పీఠాలను కైవసం చేసుకోనుంది. మొత్తం 20 జెడ్పీటీసీ స్థానాలకు 17 స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకోగా, 3 జెడ్పీటీసీ స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ విజయం సాధించింది. ఎంపీటీసీ స్థానాల్లోనూ మెజార్టీ స్థానాలు అధికార పార్టీ గెలుపొందింది. అమ్రాబాద్ మండలంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయి మెజార్టీ సాధించింది. బిజినపల్లి, కోడేరు, ఉప్పునుంతల, లింగాల మండలాల్లో హంగ్ ఏర్పడింది. జిల్లాలో నాలుగు కేంద్రాల్లో ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ సాయంత్రం వరకు కొనసాగింది. ముందుగా ఎంపీటీసీ పోస్టల్ బ్యాలెట్లను, ఆ తర్వాత ఎంపీటీసీ బ్యాలెట్ పత్రాలను అనంతరం జెడ్పీటీసీ ఓట్లను లెక్కించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా జరిగింది. కలెక్టర్ శ్రీధర్ కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించారు. 17 జెడ్పీటీసీ స్థానాల్లో టీఆర్ఎస్ విజయం జిల్లాలోని 20 జెడ్పీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 17 స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. మూడు స్థానాల్లో కాంగ్రెస్ నెగ్గింది. తాడూరు మండల జెడ్పీటీసీ స్థానాన్ని కాంగ్రెస్ అభ్యర్థి రోహిణి 83 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తిమ్మాజీపేట జెడ్పీటీసీగా టీఆర్ఎస్ అభ్యర్థి బి.దయాకర్‌రెడ్డి 3,418 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నాగర్‌కర్నూల్ జెడ్పీటీసీ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి శ్రీశైలం 2,967 ఓట్లతో నెగ్గాడు. లింగాల జెడ్పీటీసీగా టీఆర్ఎస్ అభ్యర్థి కాట్రావత్ భాగ్యమ్మ 2,362 ఓట్లతో గెలుపొందారు, అమ్రాబాద్ జెడ్పీటీసీ అభ్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ అనురాధ 2,362 ఓట్లతో నెగ్గారు. బల్మూర్ జెడ్పీటీసీగా టీఆర్ఎస్ అభ్యర్థి వల్లపు లక్ష్మమ్మ 2,572 ఓట్లతో, కొల్లాపూర్ జెడ్పీటీసీగా టీఆర్ఎస్ అభ్యర్థి జూపల్లి భాగ్యమ్మ 8,176 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఊర్కొండ మండల జెడ్పీటీసీగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శాంతికుమారి 2,209 ఓట్లతో గెలుపొందారు. బిజినపల్లి జెడ్పీటీసీగా టీఆర్ఎస్ అభ్యర్థి హరిచరణ్‌రెడ్డి 3,584 ఓట్లతో, వెల్దండ జెడ్పీటీసీ టీఆర్ఎస్ అభ్యర్థి విజితారెడ్డి 5,065 ఓట్లతో, పెంట్లవెల్లి జెడ్పీటీసీగా టీఆర్ఎస్ అభ్యర్థి చిట్టెమ్మ 3,761 ఓట్లతో, చారగొండ జెడ్పీటీసీగా టీఆర్ఎస్ అభ్యర్థి బాలాజీసింగ్ 3,454 ఓట్ల మెజారీటీతో విజయం సాధించారు. తెలకపల్లి జెడ్పీటీసీగా టీఆర్ఎస్ అభ్యర్థి పద్మావతి 2,264 ఓట్లతో, అచ్చంపేట జెడ్పీటీసీగా టీఆర్ఎస్ అభ్యర్థి మూడావత్ మంత్రయ్య 3,717 ఓట్లతో, వంగూరు మండల జెడ్పీటీసీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెంకటనర్సింహారెడ్డి 532 ఓట్లతో, పెద్దకొత్తపల్లి జెడ్పీటీసీగా టీఆర్ఎస్ అభ్యర్థి గౌరమ్మ 11,610 ఓట్లతో, కోడేరు జెడ్పీటీసీగా టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త రమాదేవి 5,661 ఓట్ల మెజారీటీతో విజయం సాధించారు. కల్వకుర్తి జెడ్పీటీసీగా టీఆర్ఎస్ అభ్యర్థి పోతుగంటి భరత్‌ప్రసాద్ 2,150 ఓట్లతో, ఉప్పునుంతల జెడ్పీటీసీ అభ్యర్థిగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రతాప్‌రెడ్డి 264 ఓట్లు, పదర జెడ్పీటీసీ అభ్యర్థిగా టీఆర్ఎస్ అభ్యర్థి రాంబాబు 986 ఓట్లతో నెగ్గారు. జెడ్పీ చైర్మన్‌గా పోతుగంటి భరత్ పేరు దాదాపుగా ఖరారు చేసినట్లు సమాచారం. ఎంపీటీసీల్లోనూ టీఆర్ఎస్దే పైచేయి జిల్లాలోని 212 ఎంపీటీసీ స్థానాలుంటే గోప్లాపూర్, గంట్రావుపల్లి ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం కాగా, గగ్గలపల్లి ఎంపీటీసీ స్థానానికి ఎన్నికలు నిర్వహించలేదు. మిగిలిన 209 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. 135 స్థానాల్లో టీఆర్ఎస్ ఎంపీటీసీ అభ్యర్థులు విజయం సాధించగా కాంగ్రెస్ పార్టీ 52 స్థానాలకే పరిమితమైంది. బీజేపీ 2 స్థానాల్లో, సీపీఐ 2 స్థానాల్లో, ఇండిపెండెంట్లు 16 స్థానాల్లో విజయం సా«ధించారు. ఏకగ్రీవం అయిన రెండు ఎంపీటీసీ స్థానాలు కూడా మొత్తం టీఆర్ఎస్ అభ్యర్థులు 137 స్థానాల్లో విజయం సాధించినట్లు అవుతుంది. జిల్లాలోని 20 మండలాల్లో మెజార్టీ మండలాల్లో పరిషత్ పీఠాలను టీఆర్ఎస్ కైవసం చేసుకోనుంది. ఒక్క అమ్రాబాద్ మండలంలో మాత్రమే కాంగ్రెస్ పార్టీకి పూర్తిస్థాయి మెజార్టీ వచ్చింది. అక్కడ మొత్తం 9 స్థానాల్లో ఎనిమిదింటిని కాంగ్రెస్ కైవసం చేసుకోగా, టీఆర్ఎస్కు ఒకటే స్థానం దక్కింది. మరోవైపు ఉప్పునుంతల, లింగాల మండలాల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు సమానంగా ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకున్నారు. బిజినేపల్లి, కోడేరు మండలాల్లో హంగ్ ఏర్పడింది. ఈ నాలుగు మండలాల్లో క్యాంప్ రాజకీయాలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. 7న ఎంపీపీ, 8న జెడ్పీ చైర్మన్ ఎన్నిక.. 7న ఎంపీపీ, 8న జెడ్పీ చైర్మన్ కోసం ఎన్నికలు నిర్వహించేలా ఈసీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో 15 మండలాల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే ఎంపీటీసీలుగా గెలుపొందడంతో ఆ మండలాల్లో అధికార పార్టీకే ఎంపీపీ పీఠాలు దక్కనున్నాయి. తొలి జెడ్పీ చైర్మన్ పీఠం కూడా టీఆర్ఎస్ ఖాతాలోనే పడనుంది. ప్రాదేశిక పోరులో గులాబీ దళం విజయం సాధించడంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో నూతనోత్సాహం తెచ్చింది. బల్మూర్ మండలం రామాజిపల్లి ఎంపీటీసీగా గెలుపొందిన టీఆర్ఎస్ అభ్యర్థిని అభినందిస్తున్న ఎమ్మెల్యే గువ్వల -
పల్లెలన్నీ గులాబీలే
సాక్షి, హైదరాబాద్: పరిషత్ పోరులో గులాబీ గుబాళిం చింది. బ్యాలెట్ పేపర్ ద్వారా జరిగిన ఈ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ విజయదుందుభి మోగించింది. రాష్ట్రంలోని 32 జిల్లా పరిషత్ స్థానాలను క్లీన్ స్వీప్ చేసింది. ఒక్కచోట కూడా కాంగ్రెస్ పార్టీ కనీస పోటీ ఇవ్వలేకపోయింది. మొత్తం 538 జెడ్పీటీసీ స్థానాలకు గానూ 451 చోట్ల టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొం దగా, కాంగ్రెస్ 73 స్థానాల్లో, బీజేపీ 8 స్థానాల్లో, ఇతరులు 5 స్థానాల్లో విజయం సాధించారు. ఎంపీటీసీ ఎన్నికల్లోనూ కారు దూసుకుపోయింది. రాష్ట్రంలో మొత్తం 3,556 ఎంపీటీసీ స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. కాంగ్రెస్ పార్టీ 1,396 చోట్ల గెలుపొం దగా.. బీజేపీ 208 చోట్ల, లెఫ్ట్ పార్టీలు, టీడీపీ, ఇతరులు కలిపి 649 స్థానాల్లో విజయం సాధించారు. గెలిచిన ఎంపీటీసీ స్థానాలను బట్టి చూస్తే.. 537 మండల పరిషత్‌లలో 415 ఎంపీపీ పీఠాలను అధికార టీఆర్ఎస్ కైవసం చేసుకునే అవకాశం ఉంది. 60 ఎంపీపీ స్థానాల్లో కాంగ్రెస్‌కు మెజార్టీరాగా.. 4 స్థానాల్లో ఇతరులు గెలుపొందే అవకాశం కనిపిస్తోంది. 53 చోట్ల ఏ పార్టీకీ ఎంపీపీ పీఠం దక్కించుకునే మెజార్టీ రాలేదు. అయితే, వీటిలో కూడా మెజార్టీ స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తమ్మీద 60% ఎంపీటీసీ, 84% జెడ్పీటీసీ స్థానాలను గెలుచుకుని రాష్ట్రంలో తమకు తిరుగులేదని టీఆర్ఎస్ మరోసారి నిరూపించుకుంది. టీఆర్ఎస్కు స్పష్టమైన ఆధిక్యం... పరిషత్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యత కనబర్చింది. జెడ్పీటీసీ ఎన్నికల్లో 12 జిల్లాల్లో దాదాపు స్వీప్ చేసింది. కరీంనగర్, వరంగల్ రూరల్, అర్బన్, జనగామ, గద్వాల, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని అన్ని జెడ్పీటీసీ స్థానాలను గెలుపొందగా, మరో 6 చోట్ల కేవలం ఒక్క స్థానంలో మాత్రమే ఓటమి పాలైంది. మిగిలిన జిల్లాల్లో కూడా కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు నామమాత్రపు సీట్లు మాత్రమే సాధించడం గమనార్హం. ఎంపీపీలను కూడా అదే స్థాయిలో టీఆర్ఎస్ కైవసం చేసుకోనుంది. కాంగ్రెస్ విషయానికి వస్తే కనీసం 10 జిల్లా పరిషత్ స్థానాల్లో తాము గట్టిపోటీ ఇస్తామని ఆ పార్టీ నేతలు వేసుకున్న అంచనాలు తలకిందులయ్యాయి. కనీసం ఒక్క చోట కూడా టీఆర్ఎస్కు పోటీ ఇచ్చే స్థాయిలో ఆ పార్టీ నిలవలేకపోయింది. రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం ఉమ్మడి జిల్లాలపై ఆ పార్టీ పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి. ఎంపీటీసీల విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ కేవలం నాలుగో వంతు స్థానాల్లోనే గెలుపొందింది. అభ్యర్థుల ఖరారు, పోలింగ్ వ్యూహాలు సరిగా అమలు చేయలేక ఆరు జిల్లాల్లోని జెడ్పీటీసీల్లో ఖాతా కూడా తెరవలేక చతికిలపడింది. ఉనికి చాటుకున్న బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లో 4 చోట్ల అనూహ్య విజయం సాధించి రాష్ట్రంలో టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయమని చెప్పుకుంటున్న బీజేపీకి రాష్ట్రంలో సంస్థాగత బలం లేదని మరోమారు రుజువైంది. పరిషత్ ఎన్నికల్లో ఆ పార్టీ కేవలం 208 ఎంపీటీసీ స్థానాలు, 8 జెడ్పీటీసీ స్థానాల్లో మాత్రమే విజయం సాధించగలిగింది. కనీసం ఒక్క ఎంపీపీని కూడా గెల్చుకునే స్థాయిలో సీట్లు సాధించలేకపోయింది. సీపీఎం, టీడీపీ, సీపీఐ, ఇతర పార్టీలు అక్కడక్కడా గెలుపొందాయి. టీఆర్ఎస్ జోరుకు ఈసారి స్వతంత్రులు కూడా తట్టుకోలేకపోయారు. రాష్ట్రంలో కేవలం 500కు పైగా ఎంపీటీసీ స్థానాల్లో మాత్రమే స్వతంత్రులు విజయం సాధించారు. జెడ్పీటీసీ స్థానాల్లో అయితే కేవలం 5 చోట్ల మాత్రమే గెలుపొందారు. -
ఇది అసాధారణ విజయం : కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : ఏ పార్టీ మద్దతు లేకుండానే రాష్ట్రంలోని 32 జెడ్పీ పీఠాలను కైవసం చేసుకోబోతున్నామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంపై తెలంగాణ ప్రజలు సంపూర్ణ విశ్వాసం కనబరిచారని అన్నారు. తెలంగాణ పరిషత్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టీఆర్ఎస్ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు ఏకపక్షంగా తీర్పు ఇచ్చారని.. దేశ చరిత్రలో ఎక్కడలేని విధంగా టీఆర్ఎస్ విజయాన్ని సొంతం చేసుకుందన్నారు. ఇది అసాధారణ విజయమని చెప్పారు.ఆరు జిల్లాలో ప్రత్యర్థులు ఖాతానే తెరవలేదని వ్యాఖ్యానించారు. ఈ గెలుపు తమపై బాధ్యత పెంచిందన్నారు. టీఆర్ఎస్ గెలుపు కోసం శ్రమించిన గులాబీ సైనికులకు ధన్యవాదాలు తెలిపారు. -
ప్రజలు ఏకపక్షంగా తీర్పు ఇచ్చారు
-
2 ఓట్లతో గెలుపు.. లాటరీలో అనూహ్య ఫలితం
సాక్షి, నిజామాబాద్ : జిల్లాలో పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఆర్మూరు మండలం పిప్రిలో ఓట్ల లెక్కింపులో వింత పరిస్థితి నెలకొంది. తొలుత ఓ అభ్యర్థి గెలవగా.. రీ కౌంటింగ్‌లో పరిస్థితులు మారిపోయాయి. చివరకు విజేత ఎవరో తెలుసుకోవడానికి లాటరీ తీయాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. తొలుత పిప్రికి సంబంధించి అధికారులు ఓట్ల లెక్కింపు చేపట్టగా రెండు ఓట్ల మెజారిటీతో టీఆర్ఎస్ ఎంపీటీసీ అభ్యర్థి విజయం సాధించారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన బీజేపీ అభ్యర్థి రీకౌంటింగ్‌కు పట్టుబట్టారు. వారి విజ్ఞప్తి మేరకు అధికారులు రీకౌంటింగ్ చేపట్టారు. ఈ సారి అధికారులు ఓట్లు లెక్కించగా టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులకు సమానంగా ఓట్లు(690) వచ్చాయి. దీంతో విజేత ఎవరో తెలుసుకోవడానికి అధికారులు లాటరీ తీయగా.. బీజేపీ అభ్యర్థిని విజయం వరించింది. దీంతో అధికారులు బీజేపీ అభ్యర్థి ఎర్రవ్వను గెలిచినట్టు ప్రకటించారు. -
అప్డేట్స్ : జడ్పీటీసీ ఫలితాల్లో కనబడని కాంగ్రెస్
ఎంపీటీసీ ఫలితాల్లో టీఆర్ఎస్కు గట్టిపోటినిచ్చిన కాంగ్రెస్ జడ్పీటీసీ ఫలితాల్లో బొక్కబోర్లాపడింది. ఒక్క కామారెడ్డిలో తప్ప మరెక్కడా కూడా కాంగ్రెస్ తన బలాన్ని ప్రదర్శించలేకపోయింది. కామారెడ్డిలో కూడా టీఆర్ఎస్ 14స్థానాల్లో గెలవగా, కాంగ్రెస్ 8 స్థానాలతో సరిపెట్టుకుంది. మిగతా జిల్లాల్లో కాంగ్రెస్ ఒకటి, రెండు స్థానాలకే పరిమితమైంది. టీఆర్ఎస్ మంత్రి మల్లారెడ్డికి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తన సొంత మనుషులను గెలిపించుకోలేక నానా తంటాలు పడుతున్నారు. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో అల్లుడు ఓటమి చెందగా.. నేడు జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీచేసిన బామ్మర్ది కూడా పరాజయం పాలయ్యాడు. ఎంపీటీసీ ఫలితాల్లో కారు దూసుకెళ్లింది. మొత్తం 5817 స్థానాల్లో టీఆర్ఎస్ 3379 స్థానాలను కైవసం చేసుకోగా.. కాంగ్రెస్ 1290, బీజేపీ 201, ఇతరులు 577 స్థానాల్లో విజయం సాధించారు. భువనగిరి మండలం వీరెల్లి ఎంపీటీసీ స్థానంలో 3 ఓట్ల ఆధిక్యంతో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించగా... ప్రత్యర్థి అభ్యర్థి రీకౌంటింగ్ కోరాడు. దీంతో రీకౌంటింగ్‌లో ఇరువురికి సమాన ఓట్లు వచ్చాయి. చివరకు టాస్ వేయగా టీఆర్ఎస్ అభ్యర్థిని విజయం వరించింది. నల్లగొండ జిల్లాలో ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు ముగిసింది. మొత్తం 349 స్థానాల్లో టీఆర్ఎస్ 191, కాంగ్రెస్ 132, బీజేపీ 3, సీపీఎం 5, సీపీఐ 2, ఇతరులు 16 స్థానాలను కైవసం చేసుకున్నారు. మేడ్చల్ జిల్లాలోని 5 మండలాల్లో మొత్తం 42 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. టీఆర్ఎస్ 18, కాంగ్రెస్ 13, బీజేపీ 1, స్వతంత్రులు 10స్థానాలను కైవసం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లాలో టీఆర్ఎస్ 128, కాంగ్రెస్ 76, బీజేపీ 18, స్వతంత్రులు 26, ఇతరులు 9 ఎంపీటీసీలను గెలుచుకున్నారు నిజామాబాద్ జిల్లాలో 299 ఎంపీటీసీ స్థానాలకు గాను టీఆర్ఎస్ 188, కాంగ్రెస్ 39, బీజేపీ 32, స్వతంత్రులు 27 స్థానాల్లో విజయం సాధించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మొత్తం 123 ఎంపిటిసి స్థానాలకు గానూ.. టీఆర్ఎస్ 72, కాంగ్రెస్ 18, బీజేపీ 8, స్వతంత్రులు 25స్థానాల్లో విజయం సాధించారు. జగిత్యాల జిల్లాలోని మొత్తం 214 ఎంపీటీసీ స్థానాల్లో.. టీఆర్ఎస్ 142, కాంగ్రెస్ 36, బీజేపీ 19, స్వతంత్రులు 17స్థానాల్లో గెలుపొందారు. కరీంనగర్ జిల్లాలోని మొత్తం 178 ఎంపీటీసి స్థానాల్లో.. టీఆర్ఎస్ 99, కాంగ్రెస్ 26, బీజేపీ 15, సీపీఐ 3, స్వతంత్రులు 31, టీడీపీ 1, టీఆర్ఎస్ రెబల్ 2, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ 1 స్థానంలో గెలుపొందింది. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలోని 13 ఎంపీటీసీ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు 10 చోట్ల, స్వతంత్రులు 3 చోట్ల గెలుపుపొందారు. నారాయణపేట జిల్లాలో మొత్తం 140 ఎంపీటీసీలు ఉండగా.. టీఆర్ఎస్ 86, కాంగ్రెస్ 18, బీజేపీ 25, ఇతరులు 11 మంది గెలుపొందారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని 168 ఎంపీటీసీ స్థానాల్లో.. ఇప్పటివరకు టీఆర్ఎస్ 106 స్థానాలను కైవసం చేసుకోగా, కాంగ్రెస్ 37, బీజేపీ 6, ఇతరులు 10స్థానాల్లో గెలుపొందారు. వనపర్తి జిల్లాలో.. మొత్తం 127 ఎంపీటీసీ స్థానాల్లో.. ఇప్పటివరకు టీఆర్ఎస్ 77స్థానాల్లో దూసుకుపోతుండగా.. కాంగ్రెస్ 7, ఇతరులు 13స్థానాల్లో విజయఢంకా మోగించారు. జోగులాంబ గద్వాల జిల్లాలో.. మొత్తం 138 ఎంపీటీసీ స్థానాలకు గానూ ఇప్పటివరకు టీఆర్ఎస్ 36, కాంగ్రెస్ 2, బీజేపీ 1, ఇతరులు 4 స్థానాల్లో గెలుపొందారు. ఖమ్మం జిల్లాలో సీపీఎం తన పట్టును కోల్పోతోంది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమనేని వీరభద్రం స్వగ్రామం తెల్దారుపల్లిలో, సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ స్వగ్రామం నారాయణ పురంలో ఇప్పటివరకు ఓటమి ఎరుగని సీపీఎం పార్టీ మొదటిసారి ఓటమిని చవిచూసింది. ఈ గ్రామాల్లో టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందారు. 5817 ఎంపీటీసీలకు గాను 2436 చోట్ల ఫలితాలు వెలువడ్డాయి. టీఆర్ఎస్ 1584, కాంగ్రెస్ 502, బీజేపీ 99, ఇతరులు 251 చోట్ల విజయం సాధించారు. 538 జెడ్పీటీసీలకు గాను 5 చోట్ల ఫలితాలు వెలువడ్డాయి. టీఆర్ఎస్ 5, కాంగ్రెస్ 0, బీజేపీ 0, ఇతరులు 0 విజయం సాధించారు. చేవెళ్ల మండలంలో.. 17 ఎంపీటీసీలకు గాను.. కాంగ్రెస్ 5, టీఆర్ఎస్ 3 చోట్ల గెలుపు కరీంనగర్ జిల్లా : జమ్మికుంట మండలంలోని 10 ఎంపీటీసీ స్థానాల్లో టీఆర్ఎస్ 7, టీఆర్ఎస్ రెబల్ 2, స్వతంత్రులు ఒకచోట విజయం నిజామాబాద్ - ఆర్మూరు ఎంపీపీని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మొత్తం 16 ఎంపీటీసీ స్థానాలకుగాను టీఆర్ఎస్ 09, బీజేపీ 04, కాంగ్రెస్ 1, ఇండిపెండెంట్లుడే 1, మరోస్థానంలో ఫలితం వెలువడాల్సి ఉంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇప్పటివరకూ వెలువడిన ఎంపీటీసీ ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యం కనబరుస్తోంది. టీఆర్ఎస్ 70, కాంగ్రెస్ 25, బీజేపీ 10, స్వతంత్ర్రులు 5 స్థానాల్లో విజయం సాధించారు. మేడ్చల్ జిల్లా - కీసర మండలం అంకిరెడ్డి పల్లి స్వతంత్ర అభ్యర్థి కవిత 301 ఓట్ల మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థిపై విజయం. నిజామాబాద్ జిల్లా - వర్ని మండలం శంకోర టీఆర్ఎస్ ఎంపీటీసీ అభ్యర్థి మూడ్ పద్మ వసంత్ రావు 74 తో గెలుపు ఖమ్మం జిల్లా - వేంసూర్ మండలం లచ్చన్నగూడెం టిఆర్ఎస్ ఎంపీటీసీ అభ్యర్థి నాగేశ్వరవు 1000 ఓట్లతో గెలుపు ఖమ్మం జిల్లా - వేంసూర్ మండలం రామన్నపాలెం టీఆర్ఎస్ ఎంపీటీసీ అభ్యర్థి పుచ్చకాయల లక్ష్మి 1048 ఓట్లతో గెలుపు నిజామాబాద్ జిల్లా - ఆర్మూర్ మండలం ఆలూరు-2 టీఆర్ఎస్ ఎంపీటీసీ అభ్యర్థి లక్ష్మీ గెలుపు మెదక్ - నార్సింగ్ మండలం శేర్పల్లి కాంగ్రెస్ ఎంపీటీసీ అభ్యర్థి 167 ఓట్ల మెజార్టీతోవిజయం నిజామాబాద్ - నందిపేట్ మండలం నూత్పల్లి స్వతంత్ర ఎంపీటీసీ అభ్యర్థి సంజీవ్ గెలుపు నిజామాబాద్ - జిల్లా అన్నారం గ్రామ బీజేపీ ఎంపీటీసీ అభ్యర్థి సంజీవ్ గెలుపు నిజామాబాద్ - బోధన్ మండలం కొప్పర్గ టీఆర్ఎస్ ఎంపీటీసీ అభ్యర్థి 303 ఓట్ల మెజార్టీతో గెలుపు భద్రాద్రి కొత్తగూడెం - ఆళ్లపల్లి మండలం అనంతోగు టీఆర్ఎస్ ఎంపీటీసీ అభ్యర్థి మంజుభార్గవి గెలుపు సంగారెడ్డి జిల్లా-సంగారెడ్డి మండలం కోతలాపూర్ కాంగ్రెస్ ఎంపీటీసీ అభ్యర్థి సమీల్ 36 ఓట్ల మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థి పై గెలుపొందారు. సంగారెడ్డి జిల్లా-కంది మండలం ఎద్దుమైలారం-4లో ఎంపీటీసీ ఇండిపెండెంట్ అభ్యర్థి తమ్మిరెడ్డి శ్రీనివాస్ 57 ఓట్లతో గెలుపొందారు. భూపాలపల్లి జిల్లా- మహదేవ్పూర్ మండలం అంబటిపల్లి, సూరారం గ్రామాల్లోని బ్యాలెట్ పేపర్లు చెదలు పట్టాయి. ఈ విషయాన్ని డీపీవో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అక్కడ కౌంటింగ్ నిలిచిపోయింది. కౌంటింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు సందర్శించారు. ఖమ్మం రూరల్ మండలంలోని పొన్నెకల్ గ్రామ పరిధిలోని కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రం వద్ద విలేకరులు ఆందోళన చేపట్టారు. మీడియా సెంటర్లోకి సెల్ ఫోన్లు అనుమతించక పోవడంతో కౌంటింగ్ కేంద్రం వద్ద విలేకరులు అసంతృప్తి వ్యక్తం చేశారు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ : ఖమ్మం జిల్లా-మధిర మండల జడ్పీటీసీ పోస్టల్ బ్యాలెట్లో..36 ఓట్లకు గాను.. టీఆర్ఎస్ 25, కాంగ్రెస్ 11 జగిత్యాల జిల్లా-గొల్లపల్లి మండల జడ్పీటీసీ పోస్టల్ బ్యాలెట్లో.. 30 ఓట్లు పోలవగా.. టీఆర్ఎస్ 24, కాంగ్రెస్ 4 , రిజెక్టు 2 జగిత్యాల జిల్లా- మెట్పల్లి మండల జడ్పీటీసీ పోస్టల్ బ్యాలెట్లో.. 18 ఓట్లు పోలవగా టీఆర్ఎస్ 6, బీజేపీ 10, స్వతంత్రులకు 2 ఓట్లు వచ్చాయి. జగిత్యాల జిల్లా-మల్లాపూర్ మండల జడ్పీటీసీ పోస్టల్ బ్యాలెట్లో..7 ఓట్లు పోలవగా.. 5 ఓట్లు రిజెక్టు అయ్యాయి. టీఆర్ఎస్ 1, బీజేపీ 1 జగిత్యాల జిల్లా-కథలాపూర్ మండల జడ్పీటీసీ పోస్టల్ బ్యాలెట్లో..12 ఓట్లు పోలవగా.. టీఆర్ఎస్ 5, కాంగ్రెస్ 6, నోటా 1 పెద్దపల్లి జిల్లా- ముత్తారం మండల జడ్పీటీసీ పోస్టల్ బ్యాలెట్లో..28 ఓట్లు పోలవగా.. టీఆర్ఎస్ 14, కాంగ్రెస్ 14 సాక్షి, హైదరాబాద్ : జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మధ్యాహ్నానానికి ఫలితాల సరళి తెలియనుంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్ఈసీ) ఏర్పాట్లు పూర్తిచేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 123 కేంద్రాల్లోని 978 కౌంటింగ్ హాళ్లలో లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఉదయం ఆరు గంటలలోపే సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ సెంటర్లకు తరలించారు. ముందుగా ఎంపీటీసీ స్థానాల్లో ఓట్లను లెక్కించి, ఆ తర్వాత జెడ్పీటీసీ ఓట్లను లెక్కించేలా ఏర్పాట్లు చేశారు. ఒక రౌండ్లో వెయ్యి ఓట్లు లెక్కిస్తారు. ఒక్కో స్థానానికి రెండు రౌండ్లు ఏర్పాటు చేశారు. 35,529 మంది కౌంటింగ్ సిబ్బంది... పరిషత్ ఓట్ల లెక్కింపునకు మొత్తం 35,529 మంది కౌంటింగ్ సిబ్బందిని నియమించారు. ముందుగా పోలింగ్ కేంద్రాల వారీగా బ్యాలెట్ పేపర్లు, సదరు బూత్‌లో ఉన్న ఓటర్ల వివరాలతో లెక్కించనున్నారు. ఆ తర్వాత వీటిని బండిల్ చేసిన అనంతరం ఎంపీటీసీ, జెడ్పీటీసీల వారీగా విడదీసి ఒక్కో బండిల్లో 25 బ్యాలెట్ పత్రాలు చుడతారు. రెండో దశలో ఎంపీటీసీ ఎన్నికకు కౌంటింగ్ మొదలవుతుంది. ఒక్కో ఎంపీటీసీ స్థానానికి రెండు టేబుళ్ల, రెండు రౌండ్లు ఏర్పాటు చేశారు. ప్రతీ బ్యాలెట్ బాక్స్‌ను తెరిచి, వాటిలోని బ్యాలెట్ పత్రాలను కుప్పలుగా పోసి 25 చొప్పున కట్టలు చేస్తారు. ఇలా ఒక్క రౌండ్లో వెయ్యి ఓట్లను కట్టలుగా చేస్తారు. మొత్తం కట్టలు చేసిన తర్వాత ఎంపీటీసీ స్థానాల్లో ఓట్లను లెక్కిస్తారు. ఈ ప్రక్రియలో కట్టలు చేయడం మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.. అందువల్ల మధ్యాహ్నం 12 తర్వాతే బ్యాలెట్ పత్రాలను లెక్కించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఓట్ల లెక్కింపునకు ప్రతీ ఎంపీటీసీ అభ్యర్థి ఇద్దరు కౌంటింగ్ ఏజెంట్లను నియమించుకోవాలని ఎస్ఈసీ సూచించింది. ప్రతి బ్యాలెట్ పత్రాన్ని విప్పి అది చెల్లుబాటు అవుతుందా లేదా అనేది ఏజెంట్ల ఎదుటే పరిశీలిస్తారు. ఏజెంట్‌కు చూపించాక చెల్లుబాటయ్యే బ్యాలెట్ పత్రాలను ఎంపీటీసీ స్థానాల్లోని ట్రేల్లో వేస్తారు. ఏవైనా అనుమానాలు వ్యక్తమైతే రిటర్నింగ్ అధికారుల పరిశీలనకు పంపించి, నిర్ణయం తీసుకుంటారు. అంతేతప్ప అభ్యర్థుల బ్యాలెట్ పత్రాలు పట్టుకునే వీలుండదు. పరిశీలన కోసం ఏజెంట్లకు బ్యాలెట్ పత్రాలు ఇవ్వరు. అభ్యంతరాలున్న బ్యాలెట్లపై రిటర్నింగ్ అధికారులదే తుది నిర్ణయమని ఎస్ఈసీ ఇదివరకే స్పష్టం చేసింది. మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు పరిషత్ ఓట్ల లెక్కింపు పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. వెబ్సైట్లో ఎప్పటికప్పుడు ఫలితాలు... జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడికి సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు ఎస్ఈసీ వెబ్సైట్లో అందుబాటులోకి రానున్నాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలు అంటూ వైబ్సైట్లో ఆప్షన్లు ఇచ్చిన చోట క్లిక్ చేస్తే అప్పటివరకు కౌంటింగ్ పూర్తయిన స్థానాల ఫలితాలు వెలువడనున్నాయి. రాజకీయ పార్టీల గుర్తులపై ఈ ఎన్నికలు జరగనున్నందున ఏ పార్టీ అభ్యర్థి గెలుపొందారనేది ఆన్లైన్లో తెలుసుకునే వీలు కల్పించారు. ఓట్ల లెక్కింపు వేగం పుంజుకుంటున్న కొద్దీ మధ్యాహ్నం తర్వాత పరిషత్ ఫలితాల సరళి వెల్లడి కానుంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ బ్యాలెట్ పత్రాలను విడివిడిగా బండిళ్లు చేయడానికి అధిక సమయం పట్టనున్నందున మధ్యాహ్నం తర్వాతే వాటిని లెక్కించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కౌంటింగ్ సరళిని బట్టి ఏడెనిమిది రౌండ్ల తర్వాత ఈ ఫలితాల ట్రెండ్‌పై స్పష్టత వచ్చే అవకాశముంది. ఓట్ల లెక్కింపు, ఫలితాల సందర్భంగా అభ్యర్థులు, వారి అభిమానులు ర్యాలీలు నిర్వహించకుండా ఎస్ఈసీ ఇదివరకే ఆదేశాలు జారీచేసింది. రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న ఓట్ల లెక్కింపు తీరును ప్రధాన కార్యాలయంలోని మీటింగ్ హాల్లో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్, ఇతరత్రా ఏర్పాట్ల ద్వారా ఎస్ఈసీ అధికారులు పర్యవేక్షించనున్నారు. 21,356 మంది అభ్యర్థులు.. ఈ ఎన్నికల్లో మొత్తం జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు 21,356 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. మూడు విడతలు కలుపుకుని 5,659 ఎంపీటీసీ స్థానాలకు 18,930 మంది, 534 జెడ్పీటీసీ స్థానాలకు 2,426 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. ఒక్కో ఎంపీటీసీ స్థానానికి సగటున ముగ్గురు చొప్పున, ఒక్కో జెడ్పీటీసీ స్థానానికి సగటున ఐదుగురు చొప్పున తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మే నెల 6, 10, 14 తేదీల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. 27న ఈ ఎన్నికల కౌంటింగ్‌నకు తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) ఆ తర్వాత జూన్ 4కు మార్చిన విషయం తెలిసిందే. పాత పాలక మండళ్లు, సభ్యుల పదవీకాలం ముగియకుండానే కొత్తగా ఎన్నికయ్యే జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయకుండానే ఎంపీపీ అధ్యక్షులు, జెడ్పీ చైర్పర్సన్ల ఎన్నిక నిర్వహించుకునేందుకు వీలు కల్పిస్తూ కొత్త పీఆర్ చట్టానికి రాష్ట్ర ప్రభుత్వం సవరణ చేసింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఫలితాలు ప్రకటించాక, 7న ఎంపీపీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, 8న జెడ్పీ చైర్పర్సన్లు, వైస్చైర్పర్సన్లను ఎన్నుకునే అవకాశం ఏర్పడింది. -
పరిషత్ ఫలితాలు వాయిదా వేయాలి
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల చివరివరకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాల వెల్లడిని వాయిదా వేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డికి బుధవారం బీజేపీ బృందం విజ్ఞప్తి చేసింది. ఫలితాలు వెలువడ్డాక జెడ్పీపీ చైర్పర్సన్లు, ఎంపీపీ అధ్యక్షుల ఎన్నికకు నెలకుపైగా వ్యవధి ఉంటున్నందున పెద్దఎత్తున క్యాంప్ రాజకీయాలు, ప్రలోభాల పర్వానికి తెరతీసినట్టు అవుతుందని కమిషనర్ దృష్టికి తీసుకొచ్చింది. బుధవారం ఎస్ఈసీ కార్యాలయంలో నాగిరెడ్డికి బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం వినతిపత్రం సమర్పించింది. రాష్ట్రంలో చిన్న జిల్లా పరిషత్‌లు ఏర్పడిన నేపథ్యంలో క్యాంప్ రాజకీయాలు పెరిగే అవకాశమున్నందున పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపును వాయిదా వేయాలని వారు కమిషనర్‌ను కోరారు. తమ విజ్ఞప్తిపై కమిషనర్ సానుకూలంగా స్పందించారని చెప్పారు. ప్రలోభాలకు అవకాశం: కె.లక్ష్మణ్ దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న సమయంలో బీసీ రిజర్వేషన్లను తుంగలో తొక్కి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించారని లక్ష్మణ్ విమర్శిం చారు. కమిషనర్‌కు వినతిపత్రం ఇచ్చాక ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 27న పరిషత్ ఫలి తాలు వెలువడ్డాక, జూలై 12న జెడ్పీపీ చైర్పర్సన్ ఎన్నికలు ఉంటాయని అధికారులు చెబుతున్నారని, ఇంత వ్యవధి ఇస్తే పెద్దఎత్తున ప్రలోభాలకు అవకాశంతో పాటు గెలిచిన అభ్యర్థులను అధికార పార్టీకి అనుకూలంగా తిప్పుకునే అవకాశాలు పెరుగుతాయన్నారు. అందువల్ల స్థానిక సంస్థల ఓట్ల లెక్కింపును జూన్ ఆఖరు వరకు వాయిదా వేయాలని కమిషనర్ ను కోరామన్నారు. కమిషనర్‌ను కలిసిన వారిలో ఎమ్మెల్సీ రామచంద్రరావు తదితరులున్నారు. -
పరిషత్ ఫలితాలు వాయిదా వేయండి: చాడ
కరీంగనగర్: పరిషత్ ఎన్నికల ఫలితాలను వాయిదా వేయాలని ఎన్నికల సంఘాన్ని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి కోరారు. లేదంటే ఫలితాలు వెలువడిన నాలుగైదు రోజుల్లో జెడ్పీ చైర్మన్, ఎంపీపీ ఎన్నిక నిర్వహించాలని డిమాండ్ చేశారు. జూలై 3 వరకు జెడ్పీటీసీ, ఎంపీటీసీల పదవీ కాలం ఉన్నప్పటికీ ముందుస్తు ఎన్నికలు నిర్వహించారని, గడువు ముగిసే వరకు జెడ్పీ చైర్మన్ , ఎంపీపీ ఎన్నిక నిర్వహించకుంటే క్యాంపు రాజకీయాలను ఎన్నికల సంఘం, ప్రభుత్వం ప్రోత్సహించినట్లే అవుతుందన్నారు. ప్రస్తుతం రాజకీయాలు వ్యాపారంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బు భారీగా ఖర్చు చేసి గెలిచి డబ్బు సంపాదనపైనే ప్రజాప్రతినిధులు దృష్టిపెడుతున్నారని వ్యాఖ్యానించారు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో అవినీతికి సీఎం కేసీఆరే బాధ్యత వహించాలన్నారు. ఇంటర్ ఫలితాల్లో అక్రమాలకు, విద్యార్థుల ఆత్మహత్యలకు బాధ్యులుగా మంత్రి జగదీశ్వర్ రెడ్డిని భర్తరఫ్ చేయాలని చాడ డిమాండ్ చేశారు. -
ఐదుగంటల్లోపే ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 27న ఉదయం 8 గంటల నుంచి 32 జిల్లాల్లోని 123 కౌంటింగ్ కేంద్రాల్లోని 978 హాళ్లలో పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి తెలిపారు. ఓట్ల లెక్కింపు కోసం 11,882 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 23,647 కౌంటింగ్ అసిస్టెంట్లను నియమించినట్లు తెలియజేశారు. ముందుగా ఎంపీటీసీ స్థానాల్లో లెక్కింపు చేపట్టి విజేతలను ప్రకటించాకే.. జెడ్పీటీసీ స్థానాల్లో ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. 27న సాయంత్రం 5 గంటల లోపు లెక్కింపు ప్రక్రియ పూర్తి చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. బ్యాలెట్ బాక్స్‌లను భద్రపరచడానికి రాష్ట్రవ్యాప్తంగా 536 స్ట్రాంగ్‌రూమ్‌లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మూడువిడతల్లో జరిగిన పరిషత్ పోలింగ్ ప్రశాంతంగా ముగియడం.. మొత్తంగా కలిపి 77.46% పోలింగ్ నమోదు కావడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తంచేశారు. గ్రామపంచాయతీ ఎన్నికలతో ఈ పోలింగ్‌శాతం కొంత తగ్గినా లోక్‌సభ (62.69%), అసెంబ్లీ (73.40) ఎన్నికలతో పోలిస్తే పోలింగ్ శాతం పెరగడం హర్షనీయమన్నారు. బుధవారం ఎస్ఈసీ కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్, సంయుక్త కార్యదర్శి జయసింహారెడ్డిలతో కలిసి నాగిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ సాంకేతిక కారణాలతో కేవలం మూడు ఎంపీటీసీ స్థానాల్లో మాత్రమే రీపోలింగ్‌కు ఆదేశించామన్నారు. ఈ ఎన్నికల్లో ఎక్కడా కూడా ఒకరికి బదులుగా మరొకరు ఓటేసిన ఉదంతాలు చోటు చేసుకోలేదన్నారు. పంచాయతీ ఎన్నికల్లో టెండర్ ఓటింగ్ కారణంగా 7 చోట్ల రీపోలింగ్ నిర్వహించామన్నారు. పోలింగ్‌బూత్‌లో ఓటేశాక సెల్ఫీ దిగడం, ఓటేసిన బ్యాలెట్ పేపర్ల ప్రదర్శన వంటి వాటి విషయంలో నాలుగు కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. ‘ఏకగ్రీవానికి 10 లక్షలు’పై సీరియస్ నాగర్‌కర్నూలు జిల్లా గగ్గల్లపల్లి ఎంపీటీసీ స్థానం ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు ఒక అభ్యర్థికి రూ.10 లక్షలిచ్చి ప్రలోభాలకు గురిచేసినట్టు తేలడం చాలా తీవ్రమైన విషయమన్నారు. ఒక ఎంపీటీసీ స్థానంలో ఇంతపెద్దమొత్తంలో డబ్బు దొరకడంతో ఆ స్థానంలో ఎన్నిక రద్దుచేసినట్టు చెప్పారు. దీనికి పాల్పడ్డ వ్యక్తిపై క్రిమినల్ కేసు నిరూపితమైతే ఆరేళ్లపాటు ఏ ఎన్నికల్లో పోటీచేయకుండా నిషేధం విధించేలా చర్యలు చేపడతామన్నారు. ఈ ఎన్నికల్లో భాగంగా ఎనిమిది చోట్ల ఎంపీటీసీ బ్యాలెట్‌పత్రాలు తారుమారు కాగా, అప్పటికే ఐదుచోట్ల అప్పటికే ఓటేసిన ఓటర్లను పిలిపించి పరిస్థితిని చక్కదిద్దగలిగారన్నారు. మరో రెండు చోట్ల రీపోలింగ్ నిర్వహించగా, వనపర్తి జిల్లా పానగల్ మండలం కదిరిపాడు ఎంపీటీసీ స్థానానికి శుక్రవారం రీపోలింగ్ నిర్వహిస్తామన్నారు. మొత్తం 1.56 కోట్ల మంది గ్రామీణ ఓటర్లలో 1.20 కోట్ల మంది ఓటేశారని చెప్పారు. ఈ ఎన్నికల సందర్భంగా మొత్తం రూ.1.09 కోట్ల విలువైన నగదును, రూ. 1.04 కోట్ల విలువైన మద్యం, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) ఉల్లంఘనకు సంబంధించి 119 ఫిర్యాదులు అందాయన్నారు. మొత్తం 220 ఫిర్యాదులు దాఖలు కాగా, 386 కేసుల్లో ఎఫ్ఐఆర్లు నమోదు చేశామన్నారు. 359 కేసుల్లో చర్యలు తీసుకోగా, మరో పదికేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. కౌంటింగ్ ఇలా! స్ట్రాంగ్ రూంల వద్ద భద్రతా బలగాల డబుల్ సెక్యూరిటీ కవర్ ఉంటుందన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను మూడు దశల్లో నిర్వహిస్తున్నట్టు చెప్పారు. మొదటి దశలో బ్యాలెట్ పేపర్లు, సదరు బూత్‌లో ఉన్న ఓటర్ల వివరాలతో లెక్కిస్తారని, ఇది పోలింగ్ కేంద్రాల వారీగా జరుగుతుందన్నారు. ఆ తర్వాత వీటిని బండిల్ చేస్తారని, అనంతరం ఎంపీటీసీ, జెడ్పీటీసీల వారీగా విడదీసి ఒక్కో బండిల్లో 25 బ్యాలెట్ పత్రాలు ఉంటాయన్నారు. రెండో దశలో ఎంపీటీసీ ఎన్నికకు కౌంటింగ్ మొదలుపెడుతారని, ఒక్కో ఎంపీటీసీ స్థానానికి రెండు టేబుళ్లు, రెండు రౌండ్లు ఉంటాయన్నారు. ప్రతీ ఎంపీటీసీ అభ్యర్థి ఇద్దరు కౌంటింగ్ ఏజెంట్లను నియమించుకోవాలని సూచించారు. ప్రతి బ్యాలెట్ పేపర్‌ను ఓపెన్ చేసి చెల్లుబాటు అవుతుందా లేదా అనేది ఏజెంట్ల ముందు చూస్తారని, చెల్లుబాటు అయితే ఎంపీటీసీ స్థానాల్లోని ట్రేల్లో వేస్తారని, అనుమానాలు వ్యక్తం చేస్తే మాత్రం రిటర్నింగ్ అధికారుల దగ్గరకు పంపించి, నిర్ణయం తీసుకుంటారన్నారు. అభ్యంతరాలున్న బ్యాలెట్లపై రిటర్నింగ్ అధికారులతో తుది నిర్ణయం ఉంటుందన్నారు. ముందుగా ఎంపీటీసీ స్థానాల్లో ఓట్లను లెక్కిస్తామని, ఆ తర్వాత జెడ్పీటీసీ ఓట్లను లెక్కిస్తామని, ఒక రౌండ్లో వెయ్యి ఓట్లు లెక్కిస్తామని, ఒక్కో స్థానానికి రెండు రౌండ్లు ఏర్పాటు చేశామన్నారు. మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ సిద్ధంగా ఉందని నాగిరెడ్డి చెప్పారు. గత జూన్ నుంచే ఈ ఎన్నికల నిర్వహణకు కసరత్తు మొదలుపెట్టామన్నారు. ప్రస్తుత మున్సిపాలిటీ పాలకవర్గాల పదవీ కాలం జూలై మొదటివారంలో ముగుస్తుందన్నారు. అయితే ప్రభుత్వపరంగా మున్సిపాలిటీ వార్డుల పునర్విభజన పూర్తిచేయాల్సి ఉందన్నారు. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకున్న పక్షంలో ఓటర్ల జాబితాలు సిద్ధం చేసి రిజర్వేషన్లు ఖరారు చేశాక మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అవకాశం ఉంటుందన్నారు. జూలై మొదటి వారంలోనే కొత్తసభ్యులు ఉమ్మడి ఖమ్మం మినహా అన్నిజిల్లాల్లో ప్రస్తుత మండల ›ప్రజా పరిషత్ (ఎంపీపీ)ల పదవీకాలం జూలై 3తో, జెడ్పీల పదవీకాలం జూలై 4తో పూర్తవుతుందని నాగిరెడ్డి చెప్పారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఎంపీపీల పదవీకాలం ఆగస్టు 5తో, జెడ్పీల పదవీకాలం ఆగస్టు 6తో ముగియనుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా మినహా మిగిలిన చోట్ల కొత్త ఎంపీటీసీలు జూలై 4న బాధ్యతలు చేపడతారని, ఆ తర్వాత ఎంపీపీ అధ్యక్షుల ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. పాత జెడ్పీటీసీల పదవీకాలం జూలైæ 4న ముగుస్తుండడంతో 5న కొత్త సభ్యులు బాధ్యతలు చేపడతారన్నారు. జెడ్పీ చైర్మన్ల ఎన్నిక కోసం నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. -
పల్లెపోరులో.. దుమ్ము దులిపారు
పల్లెపోరులో జోరుగా ‘ఫ్యాన్’గాలి వీచింది. తిరుగులేని మెజార్టీతో జిల్లా పరిషత్ పీఠాన్ని దక్కించుంది. అత్యధిక మండలాధ్యక్ష పీఠాలను దక్కించుకునేందుకు స్పష్టమైన మెజార్టీ సాధించింది. ‘పుర’పోరులో టీడీపీ విజయం సాధించిన ప్రొద్దుటూరు, మైదుకూరు, జమ్మలమడుగు ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలను వైఎస్సార్సీపీ చేజిక్కించుకుని తన ఆధిపత్యాన్ని చాటింది. జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ సింహభాగం స్థానాల్లో విజయం సాధించడంతో పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో కూడా ఇవే ఫలితాలు పునరావృతమవుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు మునిసిపాలిటీలను దక్కించుకున్నామనే ఆనందం 24గంటలు కూడా లేకుండా పోవడంతో టీడీపీ శ్రేణులు నిర్వేదానికి లోనయ్యాయి. సాక్షి, కడప: స్థానికపోరులో తమకు తిరుగులేదని వైఎస్సార్కాంగ్రెస్పార్టీ మరోసారి నిరూపించుకుంది. మంగళవారం వెలువడిన ఫలితాలలో వైఎస్సార్సీపీ తిరుగులోని ఆధిత్యాన్ని ప్రదర్శించింది. జిల్లాలో 50 జెడ్పీటీసీ, 559 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. వీటిలో 24 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. తక్కిన 535 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. తొలివిడతలో ఏప్రిల్ 6న 29 మండలాలకు, మలివిడతలో ఏప్రిల్ 11న 21 మండలాలకు పోలింగ్ జరిగింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఫలితాలు వెలువరించకూడదని కొందరు కోర్టుకు వెళ్లడంతో ఫలితాలను మే 13న ప్రకటించాలని కోర్టు ఆదేశించింది. దీంతో మంగళవారం కౌంటింగ్ నిర్వహించారు. జమ్మలమడుగు డివిజన్‌కు సంబంధించిన మండలాలకు మదీనా ఇంజనీరింగ్ కాలేజీలో, రాజంపేట డివిజన్‌ను శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజీలో, కడప డివిజన్ కౌంటింగ్‌ను కేశవరెడ్డి స్కూలులో లెక్కించారు. ఉదయం 8గంటల నుంచి అర్ధరాత్రి వరకూ కౌంటింగ్ సాగింది. జెడ్పీ పీఠం వైఎస్సార్సీపీకే కడప జిల్లా పరిషత్ పీఠం వైఎస్సార్సీపీ వశమైంది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఎంపీటీసీ ఓట్లను లెక్కించారు. ఆపై జెడ్పీటీసీ ఓట్లను గణించారు. పులివెందుల జెడ్పీటీసీ ఫలితం మొదటగా వెల్లడైంది. జిల్లాలోని 50 జెడ్పీటీసీ స్థానాల్లో 42 స్థానాలను దక్కించుకుని జిల్లా పరిషత్ అధ్యక్షపీఠాన్ని దక్కించుకునేందుకు స్పష్టమైన మెజార్టీని వైఎస్సార్సీపీ సాధించింది. ఆ నాలుగింటిలో మూడు చోట్ల వైఎస్సార్సీపీ హవా సోమవారం వెలువడిన మునిసిపల్ ఫలితాల్లో పార్టీ శ్రేణులు కూడా ఊహించని విధంగా జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేలు స్థానాలను టీడీపీ దక్కించుకుంది. దీంతో ఆయా అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలను కూడా టీడీపీ దక్కించుకుంటుందని ‘తెలుగుతమ్ముళ్లు’ సంబరపడ్డారు. అయితే వారి ఆనందం 24గంటలు కూడా గడవకముందే ఆవిరైంది. ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, మైదుకూరు ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలను వైఎస్సార్సీపీ దక్కించుకుని టీడీపీది బలుపు కాదని వాపే అని తేల్చింది. జమ్మలమడుగు జెడ్పీటీసీ స్థానాన్ని 8,886 ఓట్ల మెజార్టీతో దక్కించుకుంది. అలాగే 9 ఎంపీటీసీ స్థానాల్లో ఏకగ్రీవమైన 4స్థానాలతో పాటు మరో మూడు స్థానాల్లో గెలుపొంది 7 స్థానాలతో ఎంపీపీ పీఠాన్ని కైవసం చేసుకుంది. ఇక్కడ కేవలం రెండు ఎంపీటీపీ స్థానాల్లో మాత్రమే టీడీపీ గెలిచింది. దీంతో జమ్మలమడుగు మండలంలో తమ ఆధిపత్యానికి తిరుగులేదని దేవగుడి సోదరులు నిరూపించుకున్నారు. ప్రొద్దుటూరు జెడ్పీటీసీ స్థానాన్ని కూడా వైఎస్సార్ సీపీ దక్కించుకుంది. అలాగే 24 ఎంపీటీసీ స్థానాల్లో 17 చోట్ల విజయం సాధించి భారీ మెజార్టీతో మండలాధ్యక్ష స్థానాన్ని దక్కించుకుంది. టీడీపీ ఆరుచోట్ల విజయం సాధించింది. ఇది వరకే ఆపార్టీకి ఒక స్థానం ఏకగ్రీవమైంది. అలాగే మైదుకూరులో కూడా ‘ఫ్యాన్’గాలి జోరుగా వీచింది. జెడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకుంది. 9 ఎంపీటీసీ స్థానాల్లో 6 చోట్ల గెలుపొంది ఎంపీపీ స్థానాన్ని దక్కించుకుంది. ఈ మూడు చోట్ల వైఎస్సార్సీపీకి భారీ మెజార్టీ దక్కడంతో ఎమ్మెల్యే ఎన్నికల్లో ఈ స్థానాల్లో తిరుగులేని మెజార్టీ సాధిస్తామని వైఎస్సార్సీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. రఘురాముని ఇలాఖాలో ‘ఫ్యాన్’ హవా వైఎస్సార్సీపీ మైదుకూరు నియోజకవర్గ అభ్యర్థి శెట్టిపల్లి రఘురామిరెడ్డి సొంత మండలం చాపాడులో ‘ఫ్యాన్’గాలికి సైకిల్ ఎదురు నిలువలేకపోయింది. భారీ మెజార్టీతో జెడ్పీటీసీ స్థానాన్ని వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. 12 ఎంపీటీసీ స్థానాల్లో ఇప్పటికే ఏకగ్రీవమైన రెండిటితో కలిపి 11 స్థానాలలో విజయం సాధించి తిరుగులేని మెజార్టీతో మండలపీఠాన్ని దక్కించుకుంది. ఇక్కడ కేవలం ఒక్క ఎంపీటీసీ స్థానంలో మాత్రమే టీడీపీ గెలిచింది. లేదంటే క్లీన్‌స్వీప్ అయ్యేది. చాపాడు మాజీ మండలాధ్యక్షుడు, డీఎల్ అనుచరుడు ద్వార్శల గురివిరెడ్డి సొంత ఎంపీటీసీ లక్ష్మిపేటను 541 ఓట్లతో వైఎస్సార్సీపీ చేజిక్కించుకుంది. పులివెందులలో క్లీన్‌స్వీప్ పులివెందుల నియోజకవర్గంలోని లింగాల, సింహాద్రిపురం మండలాల్లో వైఎస్సార్సీపీ క్లీన్‌స్వీప్ చేసింది. వీటితో పాటుఇంకా పలు మండలాల్లో వైఎస్సార్సీపీ క్లీన్‌స్వీప్ చేసింది. వేంపల్లిలో ఎమ్మెల్సీ సతీశ్‌రెడ్డి సొంత ఎంపీటీసీని కూడా వైఎస్సార్సీపీ దక్కించుకుంది. వేంపల్లి జెడ్పీటీసీతో పాటు ఎంపీపీ పీఠం కూడా వైఎస్సార్సీపీ ఖాతాలోకి చేరింది. ఈ ఫలితాలతో వైఎస్సార్సీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. సార్వత్రిక ఎన్నిల్లో ఇంతకంటే మరింత మెరుగైన ఫలితాలు వెల్లడవుతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు.