పులి అనూష
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉన్నత విద్య అభ్యసిస్తూనే గ్రామ రాజకీయాల్లో కీలకమైన ఎంపీటీసీగా ఎన్నికయ్యారు. సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి ఎంపీటీసీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఎంసీఏ విద్యార్థి పులి అనూష ఘన విజయం సాధించారు. మహిళలకు రిజర్వ్ అయిన ఈ స్థానం నుంచి జరిగిన ముఖాముఖి పోటీలో టీఆర్‌ఎస్ అభ్యర్థి పడాల శ్రీజపై అనూష 72 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. నాలుగునెలలక్రితం జరిగిన సర్పంచ్ ఎన్నికల్లోనూ పోటీచేసిన అనూష ఓటమి పాలు కాగా, ఈసారి ఎంపీటీసీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేశారు. సర్పంచ్‌గా పోటీ చేసి ఓడిపోయిన అనూషకు గ్రామస్తులు బాసటగా నిలిచారు.
మాజీ ఎంపీటీసీ పులి వెంకటేశం కూతురైన అనూష కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్‌లోని శ్రీ చైతన్య కళాశాలలో ఎంసీఏ తృతీయ సంవత్సరం చదువుతోంది. పిన్న వయసు 23 సంవత్సరాలలోనే గ్రామ ఎంపీటీసీగా, అది కూడా స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తంచేస్తున్నారు. తమ కళాశాల విద్యార్థిని అనూష ఇండిపెండెంట్‌గా పోటీచేసి టీఆర్‌ఎస్ అభ్యర్థిపై విజయం సాధించడం పట్ల కళాశాల యాజమాన్యం, విద్యార్థులు హర్షం వ్యక్తంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment