mca student
-
వరంగల్‌లో ప్రేమోన్మాది ఘాతుకం.. చున్నీతో చేతులు కట్టేసి..
సాక్షి, వరంగల్: అతనికీ, ఆమెకు ఓ పెళ్లిలో పరిచయమైంది. తరచూ ఫోన్లో మాట్లాడుతుండేవాడు. తర్వాత ప్రేమిస్తున్నానని చెప్పాడు. ఆమె నిరాకరించింది. దీంతో ఆగ్రహంతో రగలిపోతున్న ఆ యువకుడు ఆ విద్యార్థిని ఇంట్లోనే ఆమె గొంతుకోసి పరారయ్యాడు. తీవ్రంగా రక్తస్రావం అవుతున్న ఆమెను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతోంది. హనుమకొండ జిల్లాలోని సుబేదారి పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి. దూరంగా పెట్టిందని దారుణం వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని లక్నెపల్లి గ్రామానికి చెందిన పోలంపల్లి రాములు, రేణుకల కుమార్తె (23) కాకతీయ యూనివర్సిటీలో ఎంసీఏ ఫైనలియర్ చదువుతోంది. రాములు కుటుంబం హనుమకొండ గాంధీనగర్‌లోని ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది. రాము లు వెల్డింగ్ షాపులో దినసరి కూలీగా పనిచేస్తుండగా, రేణుక ఇళ్లల్లో పనిచేస్తోంది. వారి కుమార్తె పోటీ పరీక్షల కోసం గత కొంతకాలంగా హైదరాబాద్‌లో కోచింగ్ తీసుకుంటోంది. ఆమె రెండేళ్ల క్రితం వరంగల్ జిల్లా సంగెం మండలం మొండ్రాయి గ్రామంలో జరిగిన తన మేనమామ కూతురు పెళ్లికి వెళ్లింది. అప్పుడు అక్కడే పక్కింటిలో ఉండే అజార్‌తో పరిచయం ఏర్పడింది. ఒకరి ఫోన్ నంబర్ మరొకరు ఇచ్చిపుచ్చుకున్నారు. ఆ సమయంలో అజార్ ఐటీఐ పూర్తిచేసి కారు డ్రైవర్‌గా పనిచేస్తుండేవాడు. ఫోన్ లో మాట్లాడుకుంటున్న క్రమంలో అజార్ ప్రేమిస్తున్నానని చెప్పడంతో ఆమె తనకు ఇష్టం లేదని చెప్పింది. ఆమెను ఒప్పించడానికి అజార్ చాలా ప్రయత్నించాడు. అయితే కొంత కాలంగా హైదరాబాద్‌లో ఉంటున్న ఆమె అతన్ని పూర్తిగా దూరం పెట్టింది. కాగా శుక్రవారం ఉదయమే ఇంటికి వచ్చిన ఆమె తల్లిదండ్రులిద్దరూ పనికి వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉంది. అప్పటికే స్నేహితుల ద్వారా ఆమె హనుమకొండకు వస్తున్న విషయం తెలుసుకున్న అజార్ ఆమె ఇంటికి వెళ్లాడు. చున్నీతో ముఖాన్ని చుట్టేసి ముందుగానే తనవెంట తెచ్చుకున్న కూరగాయలు కోసే కత్తితో ఆమె గొంతు కోసి పరారయ్యాడు. తీవ్ర గాయంతో అరుచుకుంటూ బయటకు వచ్చిన ఆమెను స్థానికులు 108లో ఎంజీఎంకు తరలించారు. చదవండి👉🏾 ఫేస్బుక్ చాటింగ్.. మార్ఫింగ్ చేసిన వీడియోలతో బ్లాక్ మెయిల్ ప్రాణాపాయం తప్పింది.. ఆస్పత్రిలో ఆ విద్యార్థిని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. పెళ్లిలో పరిచ యం అయిన అజార్ ప్రేమించాలం టూ వేధించేవాడని, తను ఇంకో వ్యక్తి తో మాట్లాడుతున్నట్లు అసూయపడి కోపం పెంచుకుని దాడి చేశాడని ఆమె చెప్పినట్లు సుబేదారి ఇన్స్పెక్టర్ రాఘవేందర్ తెలిపారు. అజార్‌ను అరెస్టు చేసి 307, 354, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు చెప్పారు. బాధితురాలికి ఆర్ఐసీయూ వార్డులో చికిత్స అందిస్తున్నామని, ప్రాణాపాయస్థితి నుంచి బయట పడిందని ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్లు విద్యార్థినిని పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. తమిళిసై తీవ్ర విచారం ప్రేమోన్మాది దాడి చేసిన ఘటనపై గవర్నర్ తమిళిసై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్‌తో ఫోన్లో మాట్లాడారు. మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. కాగా నిందితుడిని కఠినంగా శిక్షించాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. చదవండి👉🏾 మల్కాజ్గిరి మహిళ హత్యలో ట్విస్ట్.. -
ఎంపీటీసీగా ఎంసీఏ విద్యార్థి అనూష
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉన్నత విద్య అభ్యసిస్తూనే గ్రామ రాజకీయాల్లో కీలకమైన ఎంపీటీసీగా ఎన్నికయ్యారు. సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి ఎంపీటీసీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఎంసీఏ విద్యార్థి పులి అనూష ఘన విజయం సాధించారు. మహిళలకు రిజర్వ్ అయిన ఈ స్థానం నుంచి జరిగిన ముఖాముఖి పోటీలో టీఆర్ఎస్ అభ్యర్థి పడాల శ్రీజపై అనూష 72 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. నాలుగునెలలక్రితం జరిగిన సర్పంచ్ ఎన్నికల్లోనూ పోటీచేసిన అనూష ఓటమి పాలు కాగా, ఈసారి ఎంపీటీసీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేశారు. సర్పంచ్‌గా పోటీ చేసి ఓడిపోయిన అనూషకు గ్రామస్తులు బాసటగా నిలిచారు. మాజీ ఎంపీటీసీ పులి వెంకటేశం కూతురైన అనూష కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్‌లోని శ్రీ చైతన్య కళాశాలలో ఎంసీఏ తృతీయ సంవత్సరం చదువుతోంది. పిన్న వయసు 23 సంవత్సరాలలోనే గ్రామ ఎంపీటీసీగా, అది కూడా స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తంచేస్తున్నారు. తమ కళాశాల విద్యార్థిని అనూష ఇండిపెండెంట్‌గా పోటీచేసి టీఆర్ఎస్ అభ్యర్థిపై విజయం సాధించడం పట్ల కళాశాల యాజమాన్యం, విద్యార్థులు హర్షం వ్యక్తంచేశారు. -
టెక్నాలజీ సాయంతో బ్లాక్‌మెయిలింగ్
-
తమిళనాడులో సెక్స్ సైకో అరెస్ట్
సాక్షి ప్రతినిధి, చెన్నై: సాఫ్ట్వేర్ సాయంతో మహిళల వ్యక్తిగత సంభాషణలు, వీడియోలు, ఫొటోలను సంపాదించి వారిని బ్లాక్మెయిల్ చేస్తున్న ఓ నీచుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. సొంత చెల్లిసహా పలువురు బంధువుల అర్ధ నగ్న ఫొటోలు, వీడియోలు ఇతని వద్ద ఉండటంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. చివరికి నిందితుడ్ని పోలీసులు కటకటాల వెనక్కిపంపారు. తమిళనాడులోని రామనాథపురం జిల్లా తామరైకుళం గ్రామానికి చెందిన దినేశ్ కుమార్ ఎంసీఏ చదివాడు. బంధువుల పెళ్లిళ్లు, శుభకార్యాలకు హాజరయ్యే అమ్మాయిలు, వివాహితులతో చనువుగా మాట్లాడేవాడు. ఫోన్‌కాల్ చేయాలని వారి ఫోన్ అడిగి తీసుకుని ‘ట్రాక్ వ్యూ’ అనే రహస్య యాప్ ఇన్స్టాల్ చేసి తన ఫోన్‌తో అనుసంధానం చేసేవాడు. దీంతో ఆ అమ్మాయిల ఫోన్లలోని వ్యక్తిగత సంభాషణలు, అర్ధనగ్న ఫొటోలు, వీడియోలు దినేశ్ ఫోన్లోకి చేరేవి. తర్వాత తన కోరిక తీర్చకుంటే వీటిని ఇంటర్నెట్లో పెడతానని బెదిరించి వారిపై అఘాయిత్యానికి పాల్పడేవాడు. ఈ క్రమంలో ఓ యువతికి దినేశ్ ఫోన్‌చేశాడు. దీంతో సదరు యువతి తన సమస్యను సోదరికి చెప్పింది. సోదరి సలహాతో దినేశ్‌ను ఓ చోటికి రావాలని కోరింది. అక్కడికొచ్చిన దినేశ్‌ను చూసి బాధితురాలు, ఆమె సోదరుడు, బంధువులు విస్తుపోయారు. వరుసకు తమ్ముడైన వ్యక్తే ఇలా దారుణానికి పాల్పడటంతో దినేశ్‌ను చావబాది పోలీసు లకు అప్పజెప్పారు. 80 మంది యువతులు, వివాహితల డేటాను దినేశ్ ఈ మార్గంలో సంపాదించాడు. దర్యాప్తులో దొరికిన డేటాలో దినేశ్ సొంత చెల్లెలి వివరాలూ ఉండటం పోలీసులను విస్తుగొలిపేలా చేసింది. లొంగిన మహిళలపై అఘాయిత్యానికి పాల్పడి వారి దుస్తుల్ని దాచుకున్న దినేశ్.. లొంగని వారి వీడియోలు, సంభాషణల్ని అశ్లీల సైట్లకు అమ్మిన ట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిపై ఐటీ దుర్వినియోగం, మహిళలపై వేధింపులు సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదుచేశారు. -
ఎంసీఏ విద్యార్థిని ఆత్మహత్య
మైలవరం (కృష్ణా జిల్లా) : మైలవరంలోని ఓ ప్రైవేటు హాస్టల్లో కె.చంద్రిక(20) అనే విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. చంద్రిక స్థానికంగా ఉన్న లక్కిరెడ్డి బాల్‌రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఎంసీఏ సెకండియర్ చదువుతోంది. చంద్రిక స్వస్థలం గుంటూరు జిల్లా నరసరావుపేట మండల ముప్పాళ్ల గ్రామం. ఘటనాస్థలంలో పోలీసులు సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రైలు కింద పడి ఎంసీఏ విద్యార్థి మృతి
వరంగల్: వరంగల్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి బోడ శ్రీనివాస్(25) అనే ఎంసీఏ విద్యార్థి మృతి చెందాడు. మృతుడు కాకతీయ యూనివర్సిటీ విద్యార్థిగా గుర్తించారు. చనిపోయిన ప్రదేశంలో ఎటువంటి సూసైడ్ నోట్ దొరక్కపోవడంతో ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. శ్రీనివాస్ సొంతూరు మంగంపేట మండలం నర్సాపూర్ గ్రామం. తండ్రి చాన్నాళ్ల కిందే చనిపోయాడు. తల్లి టైలరింగ్ పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. ఒక్కగానొక్క కొడుకు చనిపోవటంతో ఆ కుటుంబం దుఃఖసాగరంలో మునిగిపోయింది.