తమిళనాడులో సెక్స్‌ సైకో అరెస్ట్‌ | MBA graduate arrested for blackmailing woman | Sakshi
Sakshi News home page

తమిళనాడులో సెక్స్‌ సైకో అరెస్ట్‌

Published Thu, Aug 2 2018 4:19 AM | Last Updated on Wed, Sep 26 2018 6:15 PM

MBA graduate arrested for blackmailing woman - Sakshi

దినేశ్‌ కుమార్‌

సాక్షి ప్రతినిధి, చెన్నై: సాఫ్ట్‌వేర్‌ సాయంతో మహిళల వ్యక్తిగత సంభాషణలు, వీడియోలు, ఫొటోలను సంపాదించి వారిని బ్లాక్‌మెయిల్‌ చేస్తున్న ఓ నీచుడ్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. సొంత చెల్లిసహా పలువురు బంధువుల అర్ధ నగ్న ఫొటోలు, వీడియోలు ఇతని వద్ద ఉండటంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. చివరికి నిందితుడ్ని పోలీసులు కటకటాల వెనక్కిపంపారు. తమిళనాడులోని రామనాథపురం జిల్లా తామరైకుళం గ్రామానికి చెందిన దినేశ్‌ కుమార్‌ ఎంసీఏ చదివాడు. బంధువుల పెళ్లిళ్లు, శుభకార్యాలకు హాజరయ్యే అమ్మాయిలు, వివాహితులతో చనువుగా మాట్లాడేవాడు.

ఫోన్‌కాల్‌ చేయాలని వారి ఫోన్‌ అడిగి తీసుకుని ‘ట్రాక్‌ వ్యూ’ అనే రహస్య యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసి తన ఫోన్‌తో అనుసంధానం చేసేవాడు. దీంతో ఆ అమ్మాయిల ఫోన్లలోని వ్యక్తిగత సంభాషణలు, అర్ధనగ్న ఫొటోలు, వీడియోలు దినేశ్‌ ఫోన్‌లోకి చేరేవి. తర్వాత తన కోరిక తీర్చకుంటే వీటిని ఇంటర్నెట్‌లో పెడతానని బెదిరించి వారిపై అఘాయిత్యానికి పాల్పడేవాడు. ఈ క్రమంలో ఓ యువతికి  దినేశ్‌ ఫోన్‌చేశాడు. దీంతో సదరు యువతి తన సమస్యను సోదరికి చెప్పింది. సోదరి సలహాతో దినేశ్‌ను ఓ చోటికి రావాలని కోరింది. అక్కడికొచ్చిన దినేశ్‌ను చూసి బాధితురాలు, ఆమె సోదరుడు, బంధువులు విస్తుపోయారు.

వరుసకు తమ్ముడైన వ్యక్తే ఇలా దారుణానికి పాల్పడటంతో దినేశ్‌ను చావబాది పోలీసు లకు అప్పజెప్పారు. 80 మంది యువతులు, వివాహితల డేటాను దినేశ్‌ ఈ మార్గంలో సంపాదించాడు. దర్యాప్తులో దొరికిన డేటాలో దినేశ్‌ సొంత చెల్లెలి వివరాలూ ఉండటం పోలీసులను విస్తుగొలిపేలా చేసింది. లొంగిన మహిళలపై అఘాయిత్యానికి పాల్పడి వారి దుస్తుల్ని దాచుకున్న దినేశ్‌.. లొంగని వారి వీడియోలు, సంభాషణల్ని అశ్లీల సైట్లకు అమ్మిన ట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిపై ఐటీ దుర్వినియోగం, మహిళలపై వేధింపులు సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదుచేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement