dinesh kumar
-
అతనికి ఉరే సరి: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య కేసులో రంగారెడ్డి జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. అత్యంత పాశవికంగా చిన్నారిపై దారుణానికి ఒడిగట్టిన దినేశ్‌కు ఉరిశిక్షే సబబని చెప్పింది. రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో 2017లో నమోదైన ఈ కేసులో నిందితుడు దినేశ్‌కుమార్‌ను రంగారెడ్డి జిల్లా కోర్టు 2021లో దోషిగా తేల్చింది. ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. దీనిపై దినేశ్ హైకోర్టులో సవాల్ చేయగా, ట్రయల్ కోర్టు నిర్ణయం సబబేనంటూ.. ఉరిశిక్షను ఖరారు చేస్తూ బుధవారం హైకోర్టు తీర్పునిచ్చింది. అప్పీల్‌ను కొట్టివేస్తూ ట్రయల్ కోర్టు నిర్ణయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం కనిపించడం లేదంది. ఇలాంటి కేసుల్లో నిందితులకు సత్వరం శిక్షలు పడితేనే.. బాధితులకు కొంతైనా న్యాయం జరుగుతుందని చెప్పింది. దినేశ్ అప్పీల్‌పై జస్టిస్ శామ్ కోషి, జస్టిస్ సాంబశివరావు నాయుడు విచారణ చేపట్టారు. కేసు పూర్వాపరాలు...హైదరాబాద్‌లోని అల్కాపురి టౌన్షిప్లో ఒడిశాకు చెందిన భార్యభర్తలు పనిచేసేవారు. మధ్యప్రదేశ్‌కు చెందిన దినేశ్ అక్కడే సెంట్రింగ్ పనిచేసేవాడు. ఒడిశా దంపతులతో కలిసిమెలిసి ఉండేవాడు. 2017, డిసెంబర్ 12న ఇంటి ముందు ఒంటరిగా ఆడుకుంటున్న వారి ఐదేళ్ల కుమార్తెకు చాక్లెట్ల ఆశ చూపి నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లాడు. అత్యాచారానికి పాల్పడటమే కాకుండా బండరాయితో మోది హత్య చేశాడు.నేరం అంగీకరించిన నిందితుడుచిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు.. చిన్నారి చివరిసారిగా దినేశ్‌తో కనిపించిందనే ఆధారంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి దుస్తులకు అంటుకున్న గునుగు పూలను గమనించి అతడే నేరం చేశాడని నిర్ధారణకు వచ్చారు. దినేశ్‌ను అరెస్ట్ చేశారు. కిడ్నాప్, అత్యాచారం, హత్యతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. కేసులో వేగంగా విచారణ చేపట్టిన రంగారెడ్డి జిల్లా కోర్టు 2021, ఫిబ్రవ రిలో దినేశ్‌ను దోషిగా నిర్ధారిస్తూ మరణ శిక్ష విధించింది. తలారి లేడు.. ఉరి కంబమూ లేదు..రాష్ట్రంలోని జైళ్లలో ఎక్కడా నేరస్తులకు ఉరి శిక్ష అమలు చేసేందుకు తలారి లేడు.. కంబమూ లేదు. రాష్ట్ర పరిధిలో ఉరిశిక్ష అమలు జరిగి దాదాపు నాలుగు దశాబ్దాలకు పైనే అయ్యింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌లోని ముషీరాబాద్, రాజమండ్రి జైళ్లలో ఉరి తీసేందుకు వీలు ఉండేది. అయితే ముషీరాబాద్ జైలు తీసేసిన తర్వాత ఉరి అమలు చేసే వీలు లేకుండాపోయింది. చర్లపల్లిలో స్థలం ఉన్నా.. నిర్మాణం చేపట్టలేదు. అలాగే తలారి కావాల్సి వస్తే ఇతర ప్రాంతాల నుంచో లేదా ఇక్కడే ఎవరన్నా ముందుకొస్తే వారికి శిక్షణ ఇప్పించో అమలు చేయాల్సిన పరిస్థితి. దినేశ్‌కు హైకోర్టు ఉరి శిక్ష ఖరారు చేసిన నేపథ్యంలో ఇది చర్చనీయాంశంగా మారింది.‘అమానుషమైన దారుణాలకు పాల్పడితే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో.. ఇలాంటి మరణ శిక్షల ద్వారా తెలియజేయాలి. అయితే, మరణశిక్షపై భిన్నాభిప్రాయాలున్నాయి. మరణశిక్షకు బదులుగా మారేందుకు అవకాశం ఇచ్చేలా జీవితఖైదు విధిస్తే సరిపోతుందని కొందరు అభిప్రాయపడుతుంటారు. ఇలాంటి వారు బాధితురాలి తల్లిదండ్రుల పరిస్థితిని కూడా అర్థం చేసుకోవాలి. తమ ఐదేళ్ల కుమార్తె తప్పిపోయిన తర్వాత బాధితురాలి తల్లిదండ్రులు మొదటిసారిగా ఆమె మృతదేహాన్ని చూసినప్పుడు, ఆమె ప్రైవేట్ భాగాలపై గాయాలతో నగ్నంగా పడి ఉండటాన్ని చూసినప్పుడు ఎంత విలవిలలాడిపోయారో ఎవరికీ తెలియదు. చిన్నారి తలపై బండరాళ్లతో కొట్టారు. నేరం జరిగిన ఏడేళ్ల తర్వాత కూడా ఆ దృశ్యం తల్లిదండ్రుల మదిలో మెదులుతూనే ఉంటుంది’ –హైకోర్టు ధర్మాసనం -
బాలినేని కుటుంబానికి సంబంధం లేదు
ఒంగోలు అర్బన్/సబర్బన్: ‘నకిలీ డాక్యుమెంట్లు, స్టాంపు పేపర్లు, ఫోర్జరీలతో ఒంగోలులో జరిగిన భూ అక్రమాలతో ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్, ఎస్పీ మలికాగర్గ్ స్పష్టంచేశారు. బాలినేనిపైన, ప్రభుత్వంపైన చేసిన ఆరోపణల్లో ఎటువంటి వాస్తవం లేదన్నారు. ఒంగోలు భూదందాపై సిట్ దర్యాప్తును బాలినేని కుటుంబం ముందుకు సాగనివ్వడంలేదంటూ కథనాలు ప్రచురించటం సరికాదని చెప్పారు. బాలినేని కుటుంబం దర్యాప్తును ఎప్పుడూ అడ్డుకోలేదని అన్నారు. అవాస్తవాలను, అసత్య కథనాలను ప్రచురిస్తే అవి రాజకీయ జీవితంలో ఉండేవారి భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తాయన్నారు. ఇలాంటి కథనాలు ప్రచురించేటప్పుడు, ప్రసారం చేసేటప్పుడు సరైన వివరణ తీసుకోవాలని చెప్పారు. ఒంగోలులో నకిలీ డాక్యుమెంట్లతో జరిగిన భూ కబ్జాలపై సిట్ దర్యాప్తు వివరాలను కలెక్టర్, ఎస్పీ శుక్రవారం ఇక్కడ మీడియాకు వివరించారు. భూ కబ్జాలపై ఒంగోలు జెడ్పీటీసీ, మేయర్ గంగాడ సుజాత, మరికొందరు ఇచ్చిన వేర్వేరు ఫిర్యాదుల మేరకు సిట్ ద్వారా నిష్పాక్షికమైన, వేగవంతమైన దర్యాప్తు చేస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. ఎమ్మెల్యే బాలినేని సోదరుడు వేణుగోపాల్‌రెడ్డి భూమి వివాదంలో ఉందని, దాన్ని భూ కబ్జా కోవలోకి తేవటం çసరికాదని అన్నారు. ఆ భూమి 40 ఏళ్లుగా బ్యాంకు లావాదేవీల ప్రక్రియలో ఉందన్నారు. సివిల్ పంచాయితీలను కూడా భూ కబ్జాల కింద కథనాలుగా ఇవ్వడం వల్ల సిట్ దర్యాప్తు పక్కదారి పట్టే ప్రమాదం ఉందన్నారు. నకిలీ డాక్యుమెంట్లు, భూకబ్జాల వ్యవహారంపై లోతైన దర్యాప్తు జరిపి, బాధితులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డే స్వయంగా చెప్పారన్నారు. సిట్‌లో ఇద్దరు ఏఎస్పీలు, ముగ్గురు డీఎస్పీలు, 17 మంది సీఐలు, ఎస్సైలు ఇతర పోలీస్ సిబ్బంది ముమ్మరంగా పని చేస్తున్నారని చెప్పారు. రెవెన్యూ విభాగం తరఫున జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో రిజిస్ట్రేషన్ శాఖ, మార్కాపురం, కనిగిరి సబ్ డివిజన్ల పరిధిలోని ఆర్డీవోలు సిట్ సబ్ కమిటీ సభ్యులుగా వ్యవహరిస్తున్నాయని తెలిపారు. ఫోర్జరీ, నకిలీ స్టాంపులు, నకిలీ డాక్యుమెంట్ల కుంభకోణంపై ఒంగోలు మండలం ముక్తినూతలపాడుకు చెందిన ఒకరు సెప్టెంబర్ 28న ఫిర్యాదు ఇవ్వడంతో భూ కబ్జాల వ్యవహారం వెలుగు చూసిందని కలెక్టర్ చెప్పారు. దీనిపై విచారణ చేపట్టగా లాయర్‌పేటలోని ఒక ఇంట్లో పూర్ణచంద్రరావు, మరికొందరితో కూడిన బృందం ఈ అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలిసిందన్నారు. ఆ ఇంట్లో మీ సేవ బ్లాంక్ సర్టిఫికెట్లు, రిజిస్ట్రేషన్ స్టాంప్ పేపర్లు, పలు ప్రభుత్వ అధికారులకు సంబంధించిన రబ్బర్ స్టాంపులు లభించాయన్నారు. ఇటువంటి అనేక ఫిర్యాదులు రావడంతో సిట్ ఏర్పాటు చేసి లోతైన విచారణ చేపట్టామని తెలిపారు. ఇప్పటి వరకు 572 డాక్యుమెంట్లు, 60 రబ్బర్ స్టాంప్‌లు, 1,224 జ్యుడిషియల్ స్టాంప్‌లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మార్కాపురం, కనిగిరి పరిధిలో కూడా 5 కేసులు నమోదయ్యాయన్నారు. ప్రైవేటు వ్యక్తుల భూములతో పాటు ప్రభుత్వ భూముల డీకే పట్టాల విషయంలోనూ నకిలీ వ్యవహారాలు జరిగాయని తెలిపారు. ఈ దందా పన్నెండేళ్లకు పైగా జరుగుతున్నట్లు తెలిసిందన్నారు. ఎక్కువ కాలం ఎటువంటి లావాదేవీలు జరగని ఖాళీ స్థలాలకు నకిలీ వీలునామా, జీపీఏ వంటివి సృష్టించి మోసాలకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలిందని చెప్పారు. ఎటువంటి సమస్యలు లేని స్థలాలకు సైతం నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి, వాటిని గొడవల్లోకి తెచ్చి, కోర్టుల్లో స్టే ఆర్డర్ వంటివి పొందినట్లు కూడా తెలిసిందన్నారు. నకిలీ డాక్యుమెంట్లతో భూములను బ్యాంకుల్లో తనఖా పెట్టిన సంఘటనలు కూడా ఉన్నాయన్నారు. ఈ వ్యవహారాల్లో అక్రమాలపై లోతైన దర్యాప్తు చేసి కారకులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని చెప్పారు. బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు, ప్రభావం లేకుండా పూర్తి స్వేచ్ఛగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ అంశంపై స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వాలపై ఆరోపణలు చేయడం వారిని వ్యక్తిగతంగా బాధించడమే అవుతుందని చెప్పారు. విషయాలను పూర్తిగా తెలుసుకుని వార్తా పత్రికలు, టెలివిజన్ ఛానళ్లు వార్తలను ప్రచురించడం, ప్రసారం చేయడం చేయాలన్నారు. ఎస్పీ మలికాగర్గ్ మాట్లాడుతూ ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నామని, సిట్ బృందం వేగంగా, నిరంతరాయంగా దర్యాప్తు చేస్తోందని తెలిపారు. దీనిపై ఇప్పటివరకు 54 కేసులు నమోదయ్యాయన్నారు. పూర్ణచంద్రరావు బృందంలో 72 మంది ఉన్నారని, వారిలో 38 మందిని ఇప్పటికే అరెస్టు చేశామని తెలిపారు. మిగిలిన వారిని త్వరలో అరెస్టు చేస్తామన్నారు. ఈ వ్యవహారంలో బాధితులకు న్యాయం చేయాలని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మొదటి నుంచి చెబుతున్నారన్నారు. సిట్ దర్యాప్తుపై బాలినేని ప్రభావం ఉందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. -
1902 నెంబర్‌ను ప్రతి గడపకు తీసుకెళ్ళేలా చర్యలు: కలెక్టర్లు
సాక్షి, అమరావతి: ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన క్యాంప్ కార్యాలయం నుంచి మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా 1902 టోల్ ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లు, ఎస్పీలు మాట్లాడారు. ఏమన్నారో వారి మాటల్లోనే.. ఈ కార్యక్రమాన్ని మరింతగా ముందుకు తీసుకెళతాం గడిచిన ఆరు నెలలుగా మీరు ఇస్తున్న సూచనల మేరకు మా జిల్లాలో జిల్లా స్ధాయిలో ప్రత్యేక యూనిట్‌ను ఏర్పాటుచేశాం, కలెక్టర్, జేసీల నేతృత్వంలో ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ పనిచేస్తుంది, ఇందులో ఒక స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కన్వీనర్‌గా ఉన్నారు, అన్ని ప్రభుత్వ విభాగాలలో వస్తున్న వినతులు, ఫిర్యాదులు పరిశీలించడం, మండల స్ధాయిలో కూడా పరిశీలించేలా చర్యలు తీసుకున్నాం, ప్రతి గ్రీవియెన్స్‌ను పరిశీలించడం, మానిటరింగ్ చేయడం జరుగుతుంది. సంబంధిత వార్త: ప్రజలకు సేవ చేసేందుకే సేవకుడిగా ఇక్కడికి వచ్చాను: సీఎం జగన్ మా జిల్లాలో వస్తున్న గ్రీవియెన్స్‌ను పరిష్కరించడం, రీ ఓపెన్ అయిన వాటిని పరిష్కరించడం చేస్తున్నాం. మీ సూచనల ప్రకారం గ్రామ సచివాలయం నుంచి జిల్లా కేంద్రం వరకు అందరూ పర్యవేక్షిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మీ పేరు ఉండడం వల్ల నాణ్యతతో కూడిన పరిష్కారం వచ్చేలా చర్యలు తీసుకున్నాం, ప్రతి సచివాలయంలో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు, మీ సూచనలు సలహాలు పాటించి ఈ కార్యక్రమాన్ని మరింతగా ముందుకు తీసుకెళతాం. మా జిల్లా యంత్రాంగం అంతా సర్వసన్నద్ధంగా ఉంది. థాంక్యూ సార్. -దినేష్ కుమార్, కలెక్టర్, ప్రకాశం జిల్లా ఎలాంటి జాప్యం లేకుండా పరిష్కారం సార్, ఈ కార్యక్రమాన్ని జిల్లా అధికార యంత్రాంగం అంతా వీక్షిస్తుంది. మేం మా దగ్గరకు వచ్చే గ్రీవియెన్స్ పరిష్కారానికి పూర్తి మెకానిజాన్ని సిద్దం చేసుకున్నాం, 24 గంటలు పనిచేసేలా కాల్ సెంటర్ ఏర్పాటుచేశాం, స్పెషల్ ఆఫీసర్ కూడా పరిశీలిస్తున్నారు, ఫిర్యాదు చేసిన వ్యక్తి సమస్య పరిష్కారం అవగానే చిరునవ్వుతో వెనుదిరగాలి అనే విధంగా ముందుకెళుతున్నాం, గడిచిన కొద్ది వారాలుగా మేం ఈ కార్యక్రమానికి పూర్తి సన్నద్దమై ఉన్నాం. జిల్లా స్ధాయి నుంచే కాదు మండల స్ధాయి నుంచి కూడా అధికారులు సిద్దంగా ఉన్నారు, ఎలాంటి జాప్యం లేకుండా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నాం, ఇప్పటికే జిల్లా అధికారులకు తగిన విధంగా శిక్షణ కూడా ఇచ్చాం, గ్రీవియెన్స్ పరిష్కారం తర్వాత ఇతరులకు ఉపయోగపడేలా మార్గదర్శకాలు కూడా రూపొందిస్తున్నాం. ఇది ఒక కొత్త శకానికి నాంది పలుకుతుంది.! -నిషాంత్‌కుమార్, కలెక్టర్, పార్వతీపురం మన్యం జిల్లా 1902 నెంబర్‌ను ప్రతి గడపకు తీసుకెళ్ళేలా చర్యలు జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి అన్ని చర్యలు తీసుకున్నాం, జిల్లా స్ధాయిలో, మండల స్ధాయిలో ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్లలో అవసరమైన పోలీస్ సిబ్బందిని నియమించాం, ఇప్పటికే అవగాహన తరగతులు నిర్వహించాం, 1902 నెంబర్‌ను ప్రతి గడపకు తీసుకెళ్ళేలా చర్యలు తీసుకున్నాం, డైలీ స్టేటస్ రిపోర్ట్‌ను తీసుకుని పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరిస్తాం, పిటీషన్‌ను నిర్ణీత కాలపరిధిలో పరిష్కరిస్తున్నారా లేదా అని జిల్లా స్ధాయిలో పర్యవేక్షణ జరుగుతుంది, అన్ని శాఖల సమన్వయంతో పిటీషనర్‌కు న్యాయం జరిగేలా చూస్తాం, సివిల్ కేసుల పరిష్కారానికి మండల, జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సహకారం తీసుకుంటాం. ఫీడ్ బ్యాక్ మెకానిజాన్ని కూడా ఏర్పాటుచేశాం, ఈ కార్యక్రమం దేశానికే రోల్‌మోడల్ అవుతుందని భావిస్తున్నాం. అన్భురాజన్, ఎస్పీ, వైఎస్సార్ కడప జిల్లా -
4,39,068 మంది లబ్దిదారులకు రూ.658.60 కోట్ల సాయం
-
Bapatla: వరి నాట్లు వేసిన కలెక్టర్లు
బాపట్ల: అది బాపట్ల జిల్లాలోని మురుకొండపాడు గ్రామం. శివారున జలయజ్ఞంలో తడిసిన పంట పొలం. మరో వైపు ఆకాశాన భగభగ మండుతున్న భానుడు.. ఇంతలో ఓ కూలీల బృందం ఆ పంట చేలో వడివడిగా అడుగులు వేసింది. అప్పటికే పరిచి ఉన్న వరి మొక్కలను చేత పట్టారు ఆ కూలీలు. ఎరట్రి ఎండలో నేలమ్మ ఒడిలో మట్టి గంధంలో తడిసిన ఆ కూలీలే కలెక్టర్ దంపతులు. ఒకరు ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, మరొకరు బాపట్ల జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్. ఆదివారం మురుకొండపాడు వరి చేలోకి వీరు తమ కుటుంబంతో సహా వచ్చి వరినాట్లు వేశారు. గంటకు పైగా వరి మొక్కలు నాటారు. అక్కడికే క్యారేజీలు తెప్పించుకొని గట్టుపై కూర్చుని భోజనం చేశారు. -
తొలి సినిమాతోనే హీరోగా గుర్తింపు రావడం హ్యాపీ
ఇటీవల విడుదలైన జయమ్మ పంచాయితీ చిత్రం తనకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిందని చిత్ర కథానాయకుడు కదంబాల దినేష్‌కుమార్ అన్నారు. పాలకొండ పట్టణంలోని ఆంజనేయనగర్ కాలనీకి చెందిన ఆయన సినిమా విడుదల అనంతరం గురువారం స్వగృహానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తాను పట్టణంలోనే ఓ జిమ్ నిర్వహిస్తున్నానని చెప్పారు. సినీరంగంపై ఉన్న మక్కువతో ముమ్మర ప్రయత్నం చేశానని, ఈ నేపథ్యంలో జయమ్మ పంచాయితీలో అవకాశం లభించినట్లు తెలిపారు. మండలంలోని కోటిపల్లికి చెందిన కలివరపు విజయ్‌కుమార్ దర్శకత్వంలో ఇదీ ప్రాంతంలో చిత్రాన్ని తెరకెక్కించిన వైనాన్ని వివరించారు. స్థానికంగా పలువురు ఇందులో నటించడంతో చిత్రానికి మరింత బలం చేకూరిందని, ప్రముఖ దర్శకుడు సుకుమార్ తన నటనకు అభినందనలు తెలియజేయడం మర్చిపోలేని విషయమన్నారు. ప్రముఖ నటి, బుల్లితెర యాంకర్ సుమ ప్రధాన భూమిక పోషించిన ఈ చిత్రానికి ప్రజల్లో, సినీ వర్గాల్లో మంచి ఆదరణ రావడం సంతోషంగా ఉందన్నారు. తొలి సినిమాతోనే హీరోగా గుర్తింపు రావడం పట్ల ఎంతో ఆనందంగా ఉందన్నారు. కుటుంబసభ్యులు, స్నేహితుల సహకారంతోనే ఇది సాధ్యమైందని సంతృప్తి వెలిబుచ్చారు. ఇటీవల సాక్షి లైవ్ షో ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం లభించిందని తెలిపారు. చదవండి: క్రాక్ సినిమా కథ నాదే: రచయిత ఫిర్యాదు కరాటే కల్యాణిపై శ్రీకాంత్ సంచలన ఆరోపణలు -
8 ఏళ్ల కృషి ఫలించి సుమతో నటించే ఛాన్స్ దక్కింది
‘‘గ్రామంలో అల్లరి చిల్లరిగా తిరిగే ఓ పూజారి అనిత అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు.. మా ప్రేమకు చిన్న సమస్య వస్తుంది. మరోవైపు జయమ్మ (సుమ)కు ఓ సమస్య ఉంటుంది. ఆమె సమస్యకూ మా సమస్యకూ లింక్ ఉంటుంది.. అది ఏంటనేది సినిమాలో చూడాల్సిందే’’ అని హీరో దినేష్ కుమార్ అన్నారు. యాంకర్ సుమ కనకాల లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘జయమ్మ పంచాయితీ’. విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దినేష్ కుమార్, షాలినీ జంటగా నటించారు. బలగ ప్రకాశ్ నిర్మించిన ఈ సినిమా మే 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా దినేష్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘నాది శ్రీకాకుళం జిల్లా పాలకొండ. విజయ్ కుమార్‌ది మా ఊరే అయినప్పటికీ ఆడిషన్స్ ద్వారా నన్ను ఎంపిక చేశారు. ఎనిమిదేళ్లుగా నేను చేస్తున్న కృషి ఫలించి ఏకంగా సుమగారి సినిమాలో అవకాశం రావడం, అది కూడా ఆమెతో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా నటుడిగా నన్ను నేను నిరూపించుకునే అవకాశం ఇచ్చింది’’ అన్నారు. చదవండి: నాతో కాకపోతే ఇంకొకరిని వెతుక్కో.. కాబోయే భర్త ఏమన్నాడంటే నిజజీవితానికి భిన్నంగా.. హీరోయిన్ షాలినీ మాట్లాడుతూ– ‘‘మా అమ్మది మొగల్తూరు, నాన్నది హైదరాబాద్. నేను హైదరాబాద్‌లో పెరిగాను. సినిమాలపై ఆసక్తి ఎక్కువ. తమిళంలో షార్ట్ ఫిలిం చేశాను. ఆ తర్వాత కొన్ని రెస్టారెంట్ యాడ్స్ కూడా చేశాను. ‘జయమ్మ పంచాయితీ’ సినిమాకు ఆడిషన్ ద్వారా ఎంపిక చేశారు. నా పాత్రకూ, జయమ్మ పాత్రకు మధ్య పెద్దగా సన్నివేశాలు ఉండవు. ఈ సినిమాలో నా నిజ జీవితానికి భిన్నమైన పాత్ర పోషించాను. అందరూ మెచ్చుకునేలా నా పాత్ర ఉంటుంది’’ అన్నారు. చదవండి: మళ్లీ పెళ్లి చేసుకుంటానేమో! చెప్పలేం అంటున్న హీరోయిన్ -
విద్యార్థుల తరలింపునకు ఏపీఎన్ఆర్టీఎస్ చర్యలు
సాక్షి, అమరావతి : ఉక్రెయిన్‌లో విద్య కోసం వెళ్లి అక్కడ చిక్కుకున్న ఏపీ విద్యార్థులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలను చేపట్టింది. అక్కడి ఏపీ విద్యార్థులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వారిలో ధైర్యాన్ని నింపే కార్యక్రమాన్ని ఏపీఎన్ఆర్టీఎస్ (ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ) చేస్తోంది. ఇప్పటికే సీఎం వైఎస్ జగన్ ఏపీ విద్యార్థులను క్షేమంగా తీసుకొచ్చే విషయమై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రికి లేఖ కూడా రాశారు. ప్రస్తుతం అక్కడ విమాన ప్రయాణాలపై నిషేధం (నో ఫ్ల్లయింగ్ ఆంక్షలు) ఉండటంతో విమాన సర్వీసులు నడవడంలేదని, అవి మొదలుకాగానే విద్యార్థులందరినీ వెనక్కి తీసుకురానున్నట్లు ఏపీఎన్ఆర్టీఎస్ సీఈఓ దినేష్‌కుమార్ ‘సాక్షి’కి తెలిపారు. రెండ్రోజుల క్రితం 30 మందిని స్వస్థలాలకు క్షేమంగా తీసుకువచ్చామన్నారు. అలాగే, ప్రస్తుతం యుద్ధ వాతావరణం నెలకొన్న ప్రాంతాల్లో సుమారు 200 మంది విద్యార్థులున్నారని, వీరితో ఎప్పటికప్పుడు ఏపీఎన్ఆర్టీఎస్ అధికారులు మాట్లాడుతూ వారికి మనోధైర్యాన్ని కలిగించడంతోపాటు అవసరమైన సహకారాన్ని అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. అక్కడి విద్యార్థులు అంతా ధైర్యంగానే ఉన్నారని, కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ఎవరూ బయట సంచరించవద్దని చెప్పామన్నారు. ఉక్రెయిన్‌లో ఉన్న వారి వివరాలను ఏపీఎన్ఆర్టీ సేకరించడంతోపాటు స్థానిక ఎంబసీలో పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా వారికి సూచించినట్లు దినేష్‌కుమార్ తెలిపారు. ప్రత్యేక అధికారుల నియామకం ఇక ఉక్రెయిన్ నుంచి విద్యార్థులను క్షేమంగా స్వస్థలాలకు తీసుకొచ్చే బాధ్యతను ఇద్దరు అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. రాష్ట్ర అంతర్జాతీయ సహకార ప్రత్యేక అధికారి, రిటైరైన విదేశీ వ్యవçహారాల అధికారి గీతేష్ శర్మతో పాటు నోడల్ అధికారి రవిశంకర్‌లకు ఈ బాధ్యతలను అప్పగించింది. గీతేష్ శర్మను 7531904820 నంబర్లో, రవిశంకర్‌ను 9871999055 నెంబర్లలో సంప్రదించవచ్చని ప్రభుత్వం తెలిపింది. అలాగే, ఇతర అత్యవసర సాయం కోసం ఏపీఎన్ఆర్టీఎస్ అధికారులను 0863–2340678 నంబర్, లేదా 91–8500027678 నంబర్‌ను వాట్సప్ ద్వారా సంప్రదించాలని కోరింది. అంతేకాక.. ఉక్రెయిన్‌లో భారతీయుల కోసం ప్రత్యేంగా +380–997300428, +380–997300483 హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులో ఉంచింది. మరోవైపు.. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను క్షేమంగా స్వదేశానికి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోందని, వీటిని వినియోగించుకోవడం ద్వారా రాష్ట్ర ప్రజలను క్షేమంగా స్వస్థలాలకు తీసుకురావడానికి ఏపీఎన్ఆర్టీఎస్ ప్రణాళికలను సిద్ధంచేసిందని దినేష్‌కుమార్ వెల్లడించారు. -
ఇద్దరు సీఎస్ల నియామకానికి నెల ముందే ఒకే జీవో
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియామకానికి సంబంధించి టీడీపీ, దాని అనుకూల మీడియా పచ్చి అబద్ధాలు వల్లిస్తూ బురద చల్లేందుకు ప్రయత్నిస్తుండటంపై అధికార వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. ప్రస్తుత సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్ ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ తదుపరి సీఎస్‌గా సమీర్‌శర్మ నియమితులైన విషయం తెలిసిందే. అయితే సీఎస్ నియామకంపై 20 రోజులు ముందు జీవో ఇవ్వడం రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ జరగలేదంటూ ఓ దినపత్రిక దుష్ప్రచారం చేస్తుండటాన్ని తప్పుబడుతున్నారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉండగా ఇద్దరు సీఎస్‌లను నియమిస్తూ ఒకే జీవో జారీ చేయడం టీడీపీ అనుకూల మీడియాకు కనిపించకపోవడం విడ్డూరంగా ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. చంద్రబాబు సీఎంగా ఉండగా అజేయ కల్లంను సీఎస్‌గా నియమిస్తూ జారీ చేసిన జీవోలో ఆయన పదవీ కాలం మరో నెల ఉండగానే తదుపరి సీఎస్‌గా దినేశ్‌కుమార్‌ను అందులోనే పేర్కొన్నారు. ఈమేరకు 27–02–2017న జీవో 456 ఇచ్చారు. మరి అప్పుడు సంప్రదాయం, గౌరవం లాంటివి గుర్తు రాలేదా? అని ప్రశ్నిస్తున్నారు. ఒక్క జీవో.. ఇద్దరు సీఎస్‌లు టీడీపీ హయాంలో సాధారణ పరిపాలన (రాజకీయ) శాఖ కార్యదర్శిగా ఉన్న ఎన్. శ్రీకాంత్ జీవో ఆర్టీ 456 జారీ చేశారు. అప్పటి సీఎస్ సత్యప్రకాశ్ టక్కర్ 28–02–2017న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో అజేయ కల్లంను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్లు ఆ జీవోలో పేర్కొన్నారు. కల్లం 31–03–2017న పదవీ విరమణ చేయనున్నందున 01–04–2017 నుంచి సీఎస్‌గా దినేశ్‌కుమార్‌ను నియమిస్తున్నట్లు అదే జీవోలో పేర్కొన్నారు. ఓ సీఎస్ నియామకం రోజునే, ఆయన పదవీ విరమణకు ఇంకా నెల సమయం ఉండగానే అదే జీవోలో తదుపరి సీఎస్ దినేశ్‌గా పేర్కొంటూ చంద్రబాబు సర్కారు జీవో ఇచ్చిందని అధికార వర్గాలు గుర్తు చేస్తున్నాయి. ఆ విషయాన్ని మభ్యపుచ్చుతూ రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారంటూ అసత్య కథనాలు ప్రచురించడం ద్వారా టీడీపీ అనుకూల మీడియా విలువలకు పాతరేసిందని పేర్కొంటున్నాయి. సీఎస్‌గా అజేయ కల్లం నియామక జీవోలోనే పదవీ విరమణ గురించి ప్రస్తావించడంకూడా చంద్రబాబు హయాంలోనే జరిగిందని వ్యాఖ్యానిస్తున్నాయి. -
నాలుగు దఫాలుగా ఎన్నికలు: ఇంచార్జి కలెక్టర్
సాక్షి, గుంటూరు: పంచాయతీ ఎన్నికలు నాలుగు దఫాలుగా జరుగుతాయని, వీటిని పారదర్శకతతో నిర్వహిస్తామని గుంటూరు ఇంచార్జి కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. ఇప్పటికే మొదటి విడత ఎన్నికల కోసం అధికారులకు ట్రైనింగ్ నిర్వహించామని ముప్పై వేల మంది అధికారులు ఎన్నికల విధుల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. బ్యాలెట్ పేపర్లను కూడా సిద్ధంగా ఉంచామని, 11 వేల బ్యాలెట్ బాక్సులు అందుబాటులో ఉంచామన్నారు. కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించేలా ఏర్పాట్లు చేశామని స్పష్టం చేశారు. జిల్లాలో ఎన్నికల కోడ్‌ను, లా అండ్ ఆర్డర్‌ను కచ్చితంగా అమలు చేస్తామన్నారు. గతంలో జరిగిన ఘటనలు మళ్ళీ జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. నోడల్ అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల కోడ్ అమలు, శాంతి భద్రతల అమలు కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశామని తెలిపారు. (చదవండి: ఎన్నికల విధుల్లో పాల్గొనండి) బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రతి చోటా అవసరమైన బందోబస్తులను ఏర్పాటు చేశాం. ఎన్నికల విధుల్లో ఉన్న ప్రతి అధికారికి స్పష్టమైన నిబంధనలు ఇచ్చాం. అధికారులు పక్షపాతంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఎలాంటి సస్యలు తలెత్తినా 08632218089, 08632222750 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వవచ్చు. ఎన్నికల విధుల్లో పాల్గొనే వారు ఎన్నికల కమిషన్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. ఫ్రీ అండ్ ఫెయిర్ నెస్ విధానంలో ఎన్నికలు జరుగుతాయి. దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతున్నాం" అని దినేష్ కుమార్ తెలిపారు. (చదవండి: ఏకగ్రీవాలతో గ్రామ స్వరాజ్యం) నెల్లూరు: ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నాలుగు దఫాల్లో జరగనున్న ఎలక్షన్స్‌కు నిర్దిష్టమైన ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 941 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తుండగా 15 లక్షల 72 వేల మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారన్నారు. 390 గ్రామాలను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించామని అక్కడ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. పారదర్శకంగా ఎన్నికలు జరిగేందుకు అందరూ సహకరించాలని, ఎన్నికల కోడ్‌కు లోబడి నడుచుకోవాలని కోరారు. కర్నూలు: గ్రామ పంచాయతీ ఎన్నికలను శాంతియుత వాతావరణంలో నిర్వహిస్తామని కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండియన్ పేర్కొన్నారు. జిల్లాలో మొదటి విడతలో జరగనున్న 193 గ్రామ పంచాయతీ ఎన్నికలపై సర్వం సిద్ధం చేశామన్నారు. ఈ ఎన్నికలపై మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు. 10,212 పోలింగ్ స్టేషన్లు ఉండగా ఇందులో 377 సమస్యత్మక ప్రాంతాలు, 255 అతి సమస్యాత్మకమైన ప్రాంతాలుగా గుర్తించామన్నారు. జిల్లాలో 35 ఎస్టీ, ఎస్సీ 191, బిసిలకు 256, జనరల్ 490, జనరల్ మహిళ 497, జనరల్ మెన్ 476 గా మొత్తం 972 రిజర్వేషన్లు కల్పించామని చెప్పారు. మొదటి విడత క్రింద 12 మండలాల్లోని 193 సర్పంచ్ స్థానాలకు ఎలక్షన్స్ నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికే 47 లక్షల బ్యాలెట్ పత్రాలను సిద్దం చేశామన్నారు. ఎన్నికల నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. -
కరోనా: మిషన్.. మే 15
సాక్షి, నరసరావుపేట: నరసరావుపేటలో కోవిడ్–19 జీరో కేసులే లక్ష్యంగా ‘మిషన్ మే 15’ కోసం ప్రతి విభాగం పాటుపడుతుందని కోవిడ్–19 నియంత్రణ ప్రత్యేకాధికారి, తెనాలి సబ్ కలెక్టర్ దినేష్‌కుమార్ స్పష్టం చేశారు. ఈ క్రమంలో మంగళవారం నుంచి మరో మూడు రోజులు సంపూర్ణ లాక్‌డౌన్‌ను విధిస్తున్నట్టు ప్రకటించారు. సోమవారం ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పోలీసు, రెవెన్యూ విభాగాల అధికారులతో కలిసి కమాండ్ కంట్రోల్ రూమ్‌లో పరిస్థితిపై సమీక్షించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు. (ఉరి వేసుకుని ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్ ఆత్మహత్య) నరసరావుపేట కరోనా హాట్‌స్పాట్‌గా మరిందన్నారు. ఈ పరిస్థితుల్లో గత ఐదురోజులుగా సంపూర్ణ లాక్డౌన్ ప్రకటించి సోమవారం ఒక రోజు వెసులుబాటు కల్పించామన్నారు. ఈ క్రమంలోనే జీరో కేసులే లక్ష్యంగా మిషన్ మే 15 అమలు కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించామన్నారు. మున్సిపాలీ్టలో ప్రభుత్వ ఆరోగ్య విభాగం ద్వారా అనుమానితులు అందరికీ కోవిడ్–19 పరీక్షలు చేస్తామన్నారు. ప్రజలు సామాజిక దూరం పాటించకుండా ఇళ్ల ముందు మూకుమ్మడిగా కూర్చోవటం, ఒకే చోట గుమికూడి ఆటలు ఆడటం సరికాదన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి మాట్లాడుతూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. నిత్యావసరాలు, మందులు డోర్ డెలివరీ ద్వారా అందజేస్తామన్నారు. వైరస్ నియంత్రణలో భాగంగా ఒక్క నరసరావుపేటలోనే 3,500 పరీక్షలు చేయగా ఇది బిహార్ రాష్ట్రం మొత్తం చేసిన దానికంటే ఎక్కువ అన్నారు. రెడ్‌జోన్ వరవకట్టను జల్లెడ పట్టి 1,200 మందికి పరీక్షలు చేశామన్నారు. ప్రతి ఒక్కరూ మాస్‌్కలు ధరించి, స్వీయ నియంత్రణ పాటించాలన్నారు. సమావేశంలో ఆర్డీవో ఎం.వెంకటేశ్వర్లు, డీఎస్పీ ఎం.వీరారెడ్డి, ట్రైనీ డీఎస్పీ మాధవరెడ్డి, ప్రజారోగ్యశాఖ ఈఈ ఎ.శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. జనతా బజార్ సందర్శన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వినుకొండరోడ్డులోని ఆర్టీసీ బస్టాండ్ పక్కనే ఉన్న జనతా బజార్‌ను సోమవారం ఉదయం నరసరావుపేట కోవిడ్–19 ప్రత్యేకాధికారి దినేష్‌కుమార్‌తో కలిసి సందర్శించారు. జనతా బజార్లలో ప్రభుత్వం నిర్ధేశించిన ధరలకే విక్రయాలు జరపాలని లేకుంటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. -
పవన విద్యుత్ వెనుక ‘బాబు డీల్స్’ నిజమే
రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉంది. మిగులు విద్యుత్‌ను విక్రయించే స్థితిలో ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో కొత్తగా.. అదికూడా యూనిట్ రూ.4.84 చొప్పున పవన విద్యుత్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. – కేబినెట్ ఫైలులో అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్ సాక్షి, అమరావతి: అప్పట్లో మిగులు విద్యుత్ పుష్కలంగా ఉంది. మరోవైపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా, ఇంధన శాఖ కార్యదర్శి, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు ప్రైవేట్ పవన విద్యుత్ కొనుగోలు చేయడం సరికాదని నెత్తీనోరూ బాదుకున్నారు. అయినా.. అడ్డగోలు ఒప్పందాలతో అధిక ధరలు చెల్లించి మరీ మాజీ సీఎం చంద్రబాబు విద్యుత్ కొనుగోలు చేశారు. ఈ వ్యవహారం వెనుక ‘చంద్రబాబు డీల్స్’ నడిచాయని తేటతెల్లమవుతోంది. పవన విద్యుత్ కొనుగోలును అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్, అప్పటి ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్, అప్పటి ఆర్థిక శాఖ అధికారులు తీవ్రంగా వ్యతిరేకించారు. వారి మాటల్ని ఖాతరు చేయని చంద్రబాబు 2017 సెప్టెంబర్ 9న కేబినెట్ సమావేశం నిర్వహించి.. అధిక ధరకు (యూనిట్ రూ.4.84) పవన విద్యుత్ కొనుగోలు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. పీపీఏల సమీక్ష సరికాదట రాష్ట్ర ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ప్రైవేట్ పవన, సోలార్ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలను సమీక్షించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. ఇదిలావుంటే.. ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం విలేకరుల సమావేశం నిర్వహించి ఒప్పందాలను ఎందుకు సమీక్షిస్తున్నామనే విషయాన్ని వెల్లడించారు. దీనిపై చంద్రబాబు నాయుడు బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పీపీఏలను సమీక్షించడం సరికాదని, అన్ని ఒప్పందాలను సక్రమంగానే చేసుకున్నామని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా అధికారులు తప్పుడు సమాచారం ఇస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. కేబినెట్ ఫైలులో స్పష్టం చేసినా.. సుజ్లాన్ అండ్ యాక్సిస్ ప్రైవేట్ విద్యుత్ సంస్థల నుంచి 837.20 మెగావాట్ల పవన విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన కేబినెట్ ఫైలులో అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్ తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. అప్పటి ఇంధన శాఖ కార్యదర్శి అజయ్‌జైన్‌తో పాటు ఆర్థిక శాఖ అధికారులూ ఆ కేబినెట్ ఫైలులో పవన విద్యుత్ కొనుగోళ్లను గట్టిగా వ్యతిరేకించారు. పవన విద్యుత్‌ను ఎందుకు కొనుగోలు చేయకూడదో కేబినెట్ ఫైలులో స్పష్టం చేశారు. అయినా.. వారి అభిప్రాయాలను తోసిరాజన్న చంద్రబాబు ఎక్కువ ధరకు పవన విద్యుత్ కొనుగోలు చేశారు. ఈ విషయం 2017 సెప్టెంబర్ 9న చంద్రబాబు నిర్వహించిన కేబినెట్ సమావేశం అజెండాలోని సుజ్లాన్ అండ్ యాక్సిస్ నుంచి పవన విద్యుత్ కొనుగోలు వ్యవహారం బట్టబయలు చేస్తోంది. ఎస్పీడీసీఎల్ నిరాకరించినా.. గత ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ కో–ఆర్డినేషన్ కమిటీ (ఏపీ పీసీసీ) 2017 ఫిబ్రవరి 4న సమావేశమై 2017–18 ఆర్థిక సంవత్సరం నుంచి 2020–21 వరకు 837.20 మెగా వాట్ల పవన విద్యుత్ కొనుగోలుపై చర్చించింది. ఈ సమావేశంలో ఏపీ ఎస్పీడీసీఎల్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) చేసుకునేందుకు నిరాకరించింది. జాతీయ టారిఫ్ పాలసీ (ఎన్టీపీ) 2016లో నిర్ధారించిన మేరకు సంప్రదాయేతర ఇంధన వనరులను పోటీ టెండర్ల (కాంపిటేటివ్ బిడ్డింగ్) ద్వారానే కొనుగోలు చేయాలని స్పష్టం చేసిందని ఇందుకు ఇంకా మార్గదర్శకాలను కేంద్రం ఖరారు చేయలేదని, ఏపీ పీసీసీ పేర్కొంది. కాంపిటేటివ్ బిడ్డింగ్ మార్గదర్శకాలపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ కూడా రాసింది. రూ.వెయ్యి కోట్ల భారం విద్యుత్ వినియోగంలో సంప్రదాయేతర ఇంధన వనరులు ఉండాలనే ఏపీ ఈఆర్సీ నిబంధనలను ఇప్పటికే అమలు చేసినందున కొత్తగా పవన విద్యుత్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని అప్పటి ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్ కేబినెట్ ఫైలులో స్పష్టం చేశారు. సర్కారు నిర్ణయాన్ని అమలు చేస్తే తక్కువ ధరకు ఇప్పటికే విద్యుత్ ఇస్తున్న ప్రాజెక్ట్‌లను మూసివేయాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. దీని వల్ల డిస్కమ్‌లపై అదనపు ఆర్థిక భారం పడుతుందని స్పష్టం చేశారు. సుజ్లాన్ అండ్ యాక్సిస్ నుంచి 837.20 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేస్తే ఏటా రూ.250 కోట్ల చొప్పున నాలుగేళ్లలో రూ.వెయ్యి కోట్ల మేర డిస్కమ్‌లపై అదనపు భారం పడుతుందని వెల్లడించారు. సుజ్లాన్ అండ్ యాక్సిస్ సంస్థకు పారిశ్రామిక విధానంలో రాయితీలు కల్పించినందున పవన విద్యుత్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని కూడా స్పష్టం చేశారు. అప్పటికే రాష్ట్రంలో 12,014 మిలియన్ యూనిట్ల విద్యుత్ మిగులు ఉందని, మరో మూడేళ్ల వరకు అదనపు విద్యుత్ కొనాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఏపీ డిస్కమ్స్ ఏ కంపెనీలతోనూ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకోవాల్సిన అవసరం లేదని, భవిష్యత్‌లో కొనాల్సి వస్తే టెండర్ల ద్వారానే చేయాలని అజయ్‌జైన్ కేబినెట్ ఫైలులో వివరంగా పేర్కొన్నారు. ఇంధన శాఖ వెలిబుచ్చిన అభిప్రాయాలనే ఆర్థిక శాఖ కూడా వ్యక్తం చేసింది. ఆత్మహత్యా సదృశమే ‘రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉంది. మిగులు విద్యుత్‌ను విక్రయించే స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో కొత్తగా.. అదికూడా యూనిట్ రూ.4.84 చొప్పున పవన విద్యుత్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు’ అని అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్ కేబినెట్ ఫైలులో స్పష్టం చేశారు. డిస్కమ్‌లు ఇప్పటికే రూ.2 వేల కోట్ల అప్పుల్లో ఉన్నాయని, అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేస్తే మరింత భారం పడుతుందని పేర్కొన్నారు. ఈ నిర్ణయం డిస్కమ్‌లకు ఆత్మహత్యా సదృశమే అవుతుందన్నారు. బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకే పవన, సౌర విద్యుత్ దొరుకుతున్న నేపథ్యంలో గతంలో కుదుర్చుకున్న పీపీఏలను కూడా సమీక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు. అయినా.. చంద్రబాబు సర్కారు విద్యుత్ కొనుగోలు చేసి డిస్కమ్‌లను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసింది. -
సీఎం సారూ.. తప్పు తప్పు
సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న అక్రమ నిర్ణయాలను, ప్రభుత్వ దోపిడీ విధానాలను ఇప్పటిదాకా పనిచేసిన నలుగురు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు(సీఎస్) గట్టిగా ప్రతిఘటించారు. టీడీపీ సర్కారు అవినీతి, అక్రమాలపై మాజీ సీఎస్‌లు ఐవైఆర్ కృష్ణారావు, అజేయ కల్లాం ఇప్పటికే బహిరంగంగా గళమెత్తిన సంగతి తెలసిందే. రాష్ట్రంలో ప్రభుత్వ పెద్దలు బరితెగించారని, విచ్చలవిడిగా అవినీతి కార్యక లాపాలు సాగుతున్నాయని పలు వేదికలపై తెలియజేస్తున్నారు. సీఎస్‌లుగా పనిచేసిన మరో ఇద్దరు ఐఏఎస్ అధికారులు సత్యప్రకాశ్ టక్కర్, దినేశ్ కుమార్‌లు బయటకు వచ్చి బాహాటంగా మాట్లాడకపోయినప్పటికీ సీఎస్ హోదాలో వారు టీడీపీ ప్రభుత్వ దోపీడీ చర్యలను తీవ్రంగా వ్యతిరేకించారు. సంబంధిత ఫైళ్లపై తమ అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడించారు. సర్కారు తప్పుడు నిర్ణయాలతో రాష్ట్ర ఖజానాకు ఎలాంటి నష్టం వాటిల్లుతుందో తెలయజేశారు. సాధారణంగా కేబినెట్ గానీ, ముఖ్యమంత్రి గానీ ప్రజలకు ఆర్థిక ప్రయోజనం కలిగించే సబ్సిడీ పథకాలపై అధికారులు వద్దన్నప్పటికీ నిర్ణయాలు తీసుకుంటారు. రాష్ట్ర ఖజానాపై, ప్రజలపై భారం పడే నిర్ణయాలను అధికారులు వద్దంటే ఏ ముఖ్యమంత్రి, కేబినెట్ తీసుకోదు. అయితే, చంద్రబాబు మాత్రం స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ఖజానాకు గండికొడుతూ పలు నిర్ణయాలు తీసుకున్నారు. సీఎస్ వ్యతిరేకించారని చట్టాన్నే మార్చేశారు రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో స్విస్ చాలెంజ్ విధానంలో సింగపూర్ కంపెనీల ప్రతిపాదనలను చట్టానికి విరుద్ధంగా ముందుగా ముఖ్యమంత్రి ఆమోదించేసిన తరువాత సీఎస్ నేతృత్వంలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీకి పంపించడంపై అప్పటి సీఎస్ సత్యప్రకాశ్ టక్కర్ ఘాటుగా స్పందించారు. ఇదేం పద్ధతి అని ప్రశ్నించారు. సంబంధిత ఫైల్‌ను తొలుత ముఖ్యమంత్రి ఆమోదించిన తర్వాత అధికారులకు పంపడంపై ఉన్నతస్థాయి సమావేశంలో టక్కర్ విస్మయం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎనేబిలింగ్ చట్టం(ఏపీఐడీఈఏ) నిబంధన ప్రకారం స్విస్ చాలెంజ్ విధానంలో సింగపూర్ కంపెనీలు చేసిన ప్రతిపాదనలను సీఆర్డీఏ అధ్యయనంచేసిన తరువాత సీఎస్ నేతృత్వంలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీ పరిశీలనకు పంపించాలి. ఆ అథారిటీకి విస్తృత అధికారాలున్నాయి. అయితే, ఇందుకు విరుద్ధంగా సింగపూర్ కంపెనీల ప్రతిపాదనలపై ఆర్థిక మంత్రి నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ రెండుసార్లు చర్చలు జరిపింది. అంతకు ముందు సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు సంప్రదింపులు జరిపారు. మంత్రుల కమిటీ, సీఎం ఆమోదించిన తరువాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అధారిటీకి ప్రతిపాదనలను పంపించారు. దీనిపై సీఎస్ టక్కర్ తీవ్రంగా స్పందించారు. సీఎం, మంత్రుల కమిటీ ఆమోదం తెలిపాక ఇక మంత్రివర్గానికి పంపాలి తప్ప అధికారులతో కూడిన అథారిటీకి కాదన్నారు. ప్రభుత్వ పెద్దలు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అధికారులు కూడా ఆమోదించారని చిత్రీకరించడానికి సీఎస్ నేతృత్వంలోని అథారిటీకి పంపించారని ఉన్నతాధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది స్విస్ చాలెంజ్ విధానంలా లేదని, నామినేషన్ విధానంలా ఉందని పేర్కొన్నారు. సింగపూర్ కంపెనీల ప్రతిపాదనలపై నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయం తీసుకోలేమని సీఎస్ టక్కర్ తేల్చిచెప్పారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏకంగా చట్టాన్నే మార్చేశారు. సీఎస్ నేతృత్వంలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీని తొగిస్తూ చట్టంలో సవరణలు తీసుకొచ్చారు. ఇదే అంశంపై హైకోర్టులో ప్రజా ప్రయోజనం వ్యాజ్యం(పిల్) దాఖలైంది. కోర్టు విచారణకు స్వీకరించి ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అసైన్డు భూదందాకు బ్రేక్ కాకినాడ సెజ్‌కు గతంలో కేటాయించిన 1,589.74 ఎకరాల్లో 1,396.91 ఎకరాల అసైన్డ్ భూమితోపాటు 72 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ మొత్తం భూమిని పరిశ్రమల కోసమంటూ రైతుల నుంచి సేకరించి కాకినాడ సెజ్‌కు లీజుకిచ్చారు. అయితే, ఇప్పుడు ఆ అసైన్డ్ భూములను విక్రయించాలంటే సాధ్యం కాదని టక్కర్ స్పష్టం చేశారు. ఈ భూములను ప్రైవేట్ సంస్థకు విక్రయించేందుకు వీలుగా ఎస్ఈజడ్ నుంచి తొలుత ఏపీఐఐసీ డీనోటిఫై చేసింది. రైతుల నుంచి సేకరించిన అసైన్డ్ భూములను లీజుకు కాకుండా సర్వహక్తులతో ప్రైవేట్ సంస్థ పేరిట రిజిస్ట్రేషన్ చేయడం నిబంధనలకు విరుద్ధమని, దీనికి ఒప్పుకునే ప్రసక్తే లేదని టక్కర్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఎన్నిసార్లు ఒత్తిడి తెచ్చినా ఆయన అంగీకరించలేదు. డిస్కంలను ముంచేస్తారా? రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు భారీ విద్యుత్ కొనుగోలు కుంభకోణానికి తెరతీయగా దాన్ని అడ్డుకోవడానికి సీఎస్‌గా పనిచేసి, ఇటీవల రిటైరైన దినేశ్ కుమార్ అన్ని ప్రయత్నాలు చేశారు. అయినా సరే ముఖ్యమంత్రి కేబినెట్లో పెట్టి మరీ ప్రైవేట్ విద్యుత్ సంస్థకు ఆర్థిక ప్రయోజనం కలిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో మిగలు విద్యుత్ ఉందని, ఎక్కువ ధరకు సుజ్లాను ప్రైవేట్ సంస్థ నుంచి పవన్ విద్యుత్ కొనుగోలుకు అంగీకరించరాదని సీఎస్ దినేశ్ కుమార్ స్పష్టం చేశారు. విద్యుత్ పంపిణీ సంస్థలు(డిస్కంలు) ఇప్పటికే నష్టాల్లో కొనసాగుతున్నాయని, పవన విద్యుత్‌ను యూనిట్ రూ.4.84 చొప్పున కొనుగోలు చేయడానికి ఒప్పందాలు చేసుకోవడం తగదని చెప్పారు. ఇప్పటికే ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తున్న ఒప్పందాలను సమీక్షించి, తక్కువ ధరకు కరెంటు కొనుగోలు చేయడంపై దృష్టి సారించాలని సూచించారు. సుజ్లాన్‌తో కొనుగోలు ఒప్పందం చేసుకుంటే నాలుగేళ్లలో డిస్కంలపై రూ.1,000 కోట్ల అదనపు భారం పడుతుందని, దీన్ని చివరకు విద్యుత్ వినియోగదారులే భరించాల్సి వస్తుందని పేర్కొన్నారు. అయినా ముఖ్యమంత్రి లెక్కచేయలేదు. హిందూజా థర్మల్ విద్యుత్తు కేంద్రం నుంచి కరెంటు కొనుగోలు ఒప్పందాలు చేసుకోవద్దని కూడా ప్రభుత్వానికి దినేష్‌కుమార్ స్పష్టం చేశారు. సాగునీటి ప్రాజెక్టుల్లో అక్రమాలపై నిలదీత ప్రభుత్వ పెద్దల ఒత్తిడి మేరకు హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం అంచనా వ్యయాన్ని రూ.6,850 కోట్ల నుంచి ఏకంగా రూ.11,722 కోట్లకు పెంచేస్తూ జలవనరుల శాఖ ప్రతిపాదనలు పంపింది. ఈ ప్రతిపాదనలను సర్కార్ ఆమోదించక ముందే ప్రభుత్వ పెద్దలు పాత కాంట్రాక్టర్లపై 60సీ నిబంధన కింద వేటు వేసి.. మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని పెంచేసి, కోటరీ కాంట్రాక్టర్లకు కట్టబెట్టి, భారీగా కమీషన్లు దండుకునేందుకు స్కెచ్ వేశారు. అంచనా వ్యయాన్ని పెంచేసే ప్రతిపాదనలను అంగీకరించే ప్రశ్నే లేదని సీఎస్ టక్కర్ తేల్చిచెప్పారు. దాంతో సీఎం చంద్రాబు హంద్రీ–నీవా అంచనా వ్యయాన్ని పెంచే ప్రతిపాదనపై కేబినెట్లో ఆమోదముద్ర వేయించారు. ఏలేరు ఆధునికీకరణ, చింతలపూడి ఎత్తిపోతల పథకం విస్తరణ పనుల టెండర్లలో కాంట్రాక్టర్లు, ప్రభుత్వ పెద్దలు కుమ్మక్కు కావడాన్ని హైపవర్ కమిటీ ఛైర్మన్ హోదాలో సీఎస్ దినేష్‌కుమార్ నిలదీశారు. కాంట్రాక్టర్లు కుమ్మక్కై అధిక ధరలకు షెడ్యూళ్లు దాఖలు చేస్తే టెండర్ల విధానానికి అర్థం ఏముంటుందని ప్రశ్నించారు. ఈ అక్రమాలను సహించేది లేదని సీఎస్ దినేష్‌కుమార్ పేర్కొనడంతో ఏకంగా టెండర్ల విధానంలో హైపవర్ కమిటీ పాత్ర లేకుండా ప్రభుత్వం దాన్ని రద్దు చేయడం గమనార్హం. -
అర్జున అవార్డు గ్రహీత.. ఐస్‌క్రీమ్‌లు అమ్ముతున్నాడు!
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో రజత పతక విజేత... ‘అర్జున’ అవార్డు గ్రహీత...ఈ ఘనతలేవీ కూడా ఒక అంతర్జాతీయ బాక్సర్‌కు చిరుద్యోగం, ఆర్థిక భద్రతను ఇవ్వలేకపోయాయి. ఫలితంగా అప్పులు తీర్చుకునేందుకు అతను రోడ్డుపై ఐస్ క్రీమ్‌లు అమ్ముకోవాల్సిన దీన స్థితి! 30 ఏళ్ల భారత వెటరన్ బాక్సర్ దినేశ్ కుమార్ పరిస్థితి ఇది. చాలా మందిలాగే హరియాణాలోని బాక్సింగ్ అడ్డా భివాని నుంచి వెలుగులోకి వచ్చిన దినేశ్ అంతర్జాతీయ స్థాయిలో 17 స్వర్ణాలు, 1 రజతం, 5 కాంస్యాలు సాధించాడు. 2010లో చైనాలోని గ్వాంగ్జౌలో జరిగిన ఆసియా క్రీడల్లో దినేశ్ 81 కేజీల విభాగంలో రజత పతకం సాధించాడు. అతని ప్రదర్శనకు గాను అదే ఏడాది రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా ‘అర్జున’ పురస్కారం కూడా అందుకున్నాడు. 2014 కామన్వెల్త్ క్రీడలకు కొద్ది రోజుల ముందు జరిగిన రోడ్డు ప్రమాదం అతని కెరీర్‌ను ప్రమాదంలో పడేసింది. ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగం లేని దినేశ్ గత నాలుగేళ్లలో తీవ్రంగా ఆర్థిక కష్టాలు ఎదుర్కొన్నాడు. ‘నన్ను బాక్సర్‌గా తీర్చిదిద్దేందుకే మా నాన్న ఎన్నో అప్పులు చేశారు. అవన్నీ తీరక ముందే నాకు ప్రమాదం జరిగింది. చికిత్స కోసం మళ్లీ అప్పులు చేయాల్సి వచ్చింది. ఒక అంతర్జాతీయ ఆటగాడిగా నాకు గత ప్రభుత్వంతో పాటు ఇప్పటి ప్రభుత్వం కూడా ఎలాంటి సహాయం చేయలేదు. చిన్నపాటి ఉద్యోగం కూడా లేదు. ఇప్పుడు నాకు రోజు గడవడంతో పాటు అప్పులు తీర్చాలంటే మరో మార్గం లేదు. అందుకే ఇలా తోపుడు బండిపై రోడ్డు మీద కుల్ఫీ (ఐస్‌క్రీమ్)లు అమ్మేందుకు సిద్ధమయ్యాను’ అని దినేశ్ కుమార్ ఆవేదనగా చెప్పాడు. 2018 ఆసియా క్రీడల విజేతలకు భారీ మొత్తంలో నగదు పురస్కారాలు ప్రకటించిన హరియాణా ప్రభుత్వం దినేశ్లాంటి గత విజేతను ఇప్పటిౖకైనా ఆదుకుంటుందేమో వేచి చూడాలి. -
లక్ష్య సాధనకు నిరంతర కృషి
సాక్షి, అమరావతి: విభజన తర్వాత రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నందున ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) పదవిని సమర్థంగా నిర్వహించడం సవాలు వంటిదని అనిల్ చంద్ర పునేఠ పేర్కొన్నారు. దినేష్ కుమార్ నుంచి నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆయన ఆదివారం మధ్యాహ్నం 3.45 గంటలకు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పునేఠ మీడియాతో మాట్లాడారు. ‘ఇప్పటికి 34 ఏళ్ల ఉద్యోగ జీవితం పూర్తయి 35వ ఏట సర్వీసులో అడుగుపెట్టాను. 2015 నుంచి ఇప్పటి వరకూ రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్‌గా పనిచేశాను. నా సేవలను గుర్తించి అత్యంత బాధ్యతాయుతమైన సీఎస్ పదవి ఇవ్వడం సంతోషంగా ఉంది. నాపై మరింత గురుతర బాధ్యత పెరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆదాయాన్ని, సంతోష సూచికను పెంచాలి. ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తా. ప్రభుత్వ పథకాల ఫలితాలపై అధికార యంత్రాంగం దృష్టి పెట్టాలి. ప్రతిదానిని సమీక్షించి లక్ష్యాలు నిర్దేశించుకుంటాం. టీమ్‌వర్క్‌తో రాష్ట్ర పగతికి పాటుపడతాం’ అని పునేఠ వివరించారు. అన్ని విభాగాల మధ్య సమన్వయంతో ఉత్తమ ఫలితాలు సాధించి తద్వారా రాష్ట్ర ప్రగతికి కృషి చేస్తామన్నారు. తొలిపోస్టింగ్‌లోనే అత్యంత ఆనందం ‘నా ఉద్యోగ జీవితంలో సంతోషం కలిగించిన, ఆనందం మిగిల్చిన పనులు అనేకం ఉన్నాయి. చెప్పాలంటే అన్నీ సంతోషం కలిగించాయి’ అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు పునేఠ జవాబిచ్చారు. అన్నింటికంటే ఎక్కువ ఆనందం, సంతృప్తి కలిగించింది ఏమిటని ప్రశ్నించగా.. ‘వైఎస్సార్ జిల్లా రాజంపేటలో సబ్ కలెక్టరుగా నేను ఉద్యోగ జీవితం ఆరంభించాను. ఆ తర్వాత పలు జిల్లాల్లో కలెక్టరుగాను, వివిధ శాఖల్లో కార్యదర్శి, ముఖ్యకార్యదర్శి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగాను పనిచేశాను. రాజంపేటలో సబ్ కలెక్టరుగా ఉన్నప్పుడు నాకు వచ్చిన వినతుల్లో ఒక్కటి కూడా పెండింగ్‌లో పెట్టకుండా అందరికీ సాధ్యమైన మేలు చేయడం నాకు అత్యంత మరపురాని ఆనందం మిగిల్చింది. ఇంటి స్థలాల కోసం అర్జీలిచ్చిన ప్రతి ఒక్కరికీ ఐదు సెంట్ల స్థలానికి పట్టాలిచ్చాను. వ్యవసాయ భూమి కోసం దరఖాస్తు చేసిన వారికి 3 నుంచి ఐదు ఎకరాల చొప్పున భూమి పట్టాలు ఇచ్చాను’ అని పునేఠ గుర్తు చేసుకున్నారు. కాగా, సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించే సమయంలో అనిల్ చంద్ర పునేఠ ఆదిదంపతులైన పార్వతీ పరమేశ్వరుల పటాన్ని పట్టుకుని చాంబర్లోకి ప్రవేశించారు. అనంతరం దినేష్ కుమార్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పునేఠను దినేష్ కుమార్ ఆలింగనం చేసుకుని అభినందించారు. -
టెక్నాలజీ సాయంతో బ్లాక్‌మెయిలింగ్
-
తమిళనాడులో సెక్స్ సైకో అరెస్ట్
సాక్షి ప్రతినిధి, చెన్నై: సాఫ్ట్వేర్ సాయంతో మహిళల వ్యక్తిగత సంభాషణలు, వీడియోలు, ఫొటోలను సంపాదించి వారిని బ్లాక్మెయిల్ చేస్తున్న ఓ నీచుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. సొంత చెల్లిసహా పలువురు బంధువుల అర్ధ నగ్న ఫొటోలు, వీడియోలు ఇతని వద్ద ఉండటంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. చివరికి నిందితుడ్ని పోలీసులు కటకటాల వెనక్కిపంపారు. తమిళనాడులోని రామనాథపురం జిల్లా తామరైకుళం గ్రామానికి చెందిన దినేశ్ కుమార్ ఎంసీఏ చదివాడు. బంధువుల పెళ్లిళ్లు, శుభకార్యాలకు హాజరయ్యే అమ్మాయిలు, వివాహితులతో చనువుగా మాట్లాడేవాడు. ఫోన్‌కాల్ చేయాలని వారి ఫోన్ అడిగి తీసుకుని ‘ట్రాక్ వ్యూ’ అనే రహస్య యాప్ ఇన్స్టాల్ చేసి తన ఫోన్‌తో అనుసంధానం చేసేవాడు. దీంతో ఆ అమ్మాయిల ఫోన్లలోని వ్యక్తిగత సంభాషణలు, అర్ధనగ్న ఫొటోలు, వీడియోలు దినేశ్ ఫోన్లోకి చేరేవి. తర్వాత తన కోరిక తీర్చకుంటే వీటిని ఇంటర్నెట్లో పెడతానని బెదిరించి వారిపై అఘాయిత్యానికి పాల్పడేవాడు. ఈ క్రమంలో ఓ యువతికి దినేశ్ ఫోన్‌చేశాడు. దీంతో సదరు యువతి తన సమస్యను సోదరికి చెప్పింది. సోదరి సలహాతో దినేశ్‌ను ఓ చోటికి రావాలని కోరింది. అక్కడికొచ్చిన దినేశ్‌ను చూసి బాధితురాలు, ఆమె సోదరుడు, బంధువులు విస్తుపోయారు. వరుసకు తమ్ముడైన వ్యక్తే ఇలా దారుణానికి పాల్పడటంతో దినేశ్‌ను చావబాది పోలీసు లకు అప్పజెప్పారు. 80 మంది యువతులు, వివాహితల డేటాను దినేశ్ ఈ మార్గంలో సంపాదించాడు. దర్యాప్తులో దొరికిన డేటాలో దినేశ్ సొంత చెల్లెలి వివరాలూ ఉండటం పోలీసులను విస్తుగొలిపేలా చేసింది. లొంగిన మహిళలపై అఘాయిత్యానికి పాల్పడి వారి దుస్తుల్ని దాచుకున్న దినేశ్.. లొంగని వారి వీడియోలు, సంభాషణల్ని అశ్లీల సైట్లకు అమ్మిన ట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిపై ఐటీ దుర్వినియోగం, మహిళలపై వేధింపులు సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదుచేశారు. -
భారీగా ఐఏఎస్‌ల బదిలీలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. అలాగే వెయిటింగ్లో ఉన్న పలువురు ఐఏఎస్‌లకు పోస్టింగ్‌లు ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్ కుమార్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. వైఎస్సార్, విజయనగరం జిల్లాలకు కొత్త కలెక్టర్లు నియమితులయ్యారు. వైఎస్సార్ జిల్లా కలెక్టర్‌గా చేవూరు హరికిరణ్, విజయనగరం జిల్లాకలెక్టర్గా ఎం.హరి జవహర్లాల్ నియ మితులయ్యారు. ప్రస్తుతం వైఎస్సార్ జిల్లా కలెక్టర్‌గా ఉన్న టి.బాబూరావు నాయు డును గిరిజన కో–ఆపరేటివ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బదిలీ చేశారు. విజయనగరం జిల్లా కలెక్టర్‌గా ప్రస్తుతం పనిచేస్తున్న వివేక్ యాదవ్‌ను ఎస్సీ కో–ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బదిలీ చేశారు. -
ప్రేమ వ్యవహారాన్ని బయట పెట్టడంతోనే..
చిత్తూరు, మదనపల్లె క్రైం: మదనపల్లెలోని వెంకటేశ్వర లాడ్జి ఎదుట ఈ నెల 16వ తేదీ అర్ధరాత్రి జరిగిన దినేష్‌కుమార్ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. స్నేహితుల మధ్య ప్రేమ వ్యవహారం బయటపెట్టడంతోనే హత్య జరిగినట్టు తేల్చారు. హత్యకు పాల్పడిన ముగ్గురిని టూటౌన్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. డీఎస్పీ ఎం.చిదానందరెడ్డి, సీఐ సురేష్‌కుమార్ విలేకరులతో మాట్లాడారు. పట్టణంలోని సుభాష్‌రోడ్ ఎక్స్‌టెంక్షన్ గుర్రప్ప నాయుడు వీధిలో ఉంటున్న కన్నెమడుగు రవికుమార్, అంజమ్మ దంపతుల ఒక్కగా నొక్క కుమారుడు కె.దినేష్‌కుమార్(26)ని అదే ప్రాంతానికి చెందిన సగటు ఉదయ్‌కుమార్(28), సయ్యద్ ఇర్ఫాన్(27), ఎస్.నోమన్(28) స్నేహితులని తెలి పారు. వీరు పీవోపీ పనులతో పాటు మెకానిక్ గ్యారేజీలకు వేస్ట్ వ్యాపారం చేస్తున్నారని పేర్కొన్నారు. వ్యాపార నిమిత్తం తరచూ బెంగళూరు వెళ్లేవారని చెప్పారు. అక్కడ ఉండే మదనపల్లె రామారావు కాలనీకి చెందిన చిరంజీవిని కలిసేవారని తెలిపారు. చిరంజీవికి ఉదయ్‌కుమార్, సయ్యద్ ఇర్ఫాన్, ఎస్.నోమన్ మంచి స్నేహం ఏర్పడిందన్నారు. ఈ క్రమంలో చిరంజీవి ప్రియురాలు హైదరాబాదులో ఇటీవల ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. దీంతో భయపడిన అతను తనపై అక్కడి పోలీసులు కేసు పెట్టారేమోనని తెలుసుకునేందుకు సయ్యద్ ఇర్ఫాన్, నోమన్, ఉదయ్‌కుమార్‌ను హైదరాబాదు పంపించాడన్నారు. అంతేగాక ఈ విషయం ఎవరికీ చెప్పకుండా ఉండాలని చిరంజీవి వారిని కోరాడని తెలిపారు. యువతి ఆత్మహత్య విషయం బయటికి పొక్కడంతో.. యువతి ఆత్మహత్య విషయం బయట కు పొక్కడంతో దినేష్‌కుమార్, ఉదయ్ కుమార్ గొడవపడ్డారని చెప్పారు. దీంతో దినేష్‌కుమార్‌ను హతమార్చాలని ఉదయ్‌కుమార్ పథకం పన్నాడని తెలిపారు. మదనపల్లె ఆర్టీసీ బస్టాండు సమీపంలోని వెంకటేశ్వర లాడ్జిలో ఉన్న దినేష్‌కుమార్‌ను ఇర్ఫాన్, నోమన్ సాయంతో ఈ నెల 16న మద్యం తాగిం చి అర్ధరాత్రి వేళ లాడ్జి కిందకు తీసుకొచ్చి మాటల్లో పెట్టారన్నారు. అప్పటికే అక్కడ వేట కొడవలితో పొంచి ఉన్న ఉదయ్‌కుమార్ వెనక నుంచి వచ్చి తల పై ఒక్కసారిగా నరకడంతో దినేష్‌కుమార్ కుప్పకూలిపోయాడన్నారు. గమనించిన స్థానికులు అతన్ని ఆటోలో ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయాడని డాక్టర్లు తెలిపారని పేర్కొన్నారు. పరారైన నిందితుల కోసం సీఐ సురేష్‌కుమార్, ఎస్ఐలు నాగేశ్వరరావు, క్రిష్ణయ్య, సిబ్బంది రాజేష్ తదితరులు గాలింపు చర్యలు చేపట్టారని తెలిపారు. నిందితులు పుంగనూరు రోడ్డులోని కనుమలో గంగమ్మ ఆలయం వద్ద ఉండగా అరెస్టు చేశామన్నారు. నిందితులను పట్టుకోవడంలో చొరవ చూపిన సీఐ, ఎస్ఐలతో పాటు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. -
ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోళ్లెందుకు?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉన్నప్పటికీ ప్రైవేట్ విద్యుత్ కంపెనీల నుంచి ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోళ్లు చేయడంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్ కుమార్ మండిపడ్డారు. రాష్ట్రంలోనే కాకుండా దేశమంతటా ప్రస్తుతం విద్యుత్‌కు ఎలాంటి డిమాండ్ లేకపోయినా, మిగులు విద్యుత్ ఉన్నా.. ఎక్కువ ధరకు రాష్ట్రంలో పవన విద్యుత్ కొనుగోళ్లు జరపడాన్ని సీఎస్ తీవ్రంగా పరిగణించారు. ఇప్పటికే డిస్కమ్స్ ఏడాదికి రూ.2,000 కోట్ల నష్టాల్లో కూరుకుపోతున్నాయని, ఇలాంటి సమయంలో ఎక్కువ ధరకు కొనుగోళ్లు జరపడం కారణంగా డిస్కమ్స్‌పై పెనుభారం పడుతోందన్నారు. ఈ నేపధ్యంలో ప్రస్తుత విద్యుత్ కొనుగోలు ఒప్పందాలన్నింటినీ తిరిగి సమీక్షించాలని సీఎస్ స్పష్టం చేశారు. -
27న రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష
సాక్షి, అమరావతి: రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్ ఈ నెల 27న అమరావతి సచివాలయం, ఆచార్య నాగార్జున వర్సిటీ వద్ద జరిగే కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్ రాష్ట్రపతి పర్యటనపై బుధవారం డీజీపీ సాంబశివరావుతో సహా ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రపతి పర్యటనకు ఏర్పాట్లను సక్రమంగా చేయాలని సంబంధిత శాఖల అధికారులను సీఎస్ ఆదేశించారు. 27న కోవింద్ విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి హెలికాఫ్టర్‌లో నాగార్జున వర్సిటీకి చేరుకుని అక్కడ జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. -
రాష్ట్రానికి పెరిగిన ఐఏఎస్ పోస్టుల సంఖ్య 28
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి ఐఏఎస్ పోస్టుల సంఖ్య పెరిగింది. కేడర్ రివ్యూలో భాగంగా కొత్తగా 28 ఐఏఎస్ పోస్టులను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్ కుమార్ బుధవారం నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రస్తుతం రాష్ట్రానికి 211 ఐఏఎస్ పోస్టులు ఉండగా ఆ సంఖ్య ఇప్పుడు 239కి పెరిగింది. అంటే కొత్తగా 28 పోస్టులు పెరిగినట్లు. ప్రస్తుతం ఒక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు రెండు అదనపు ప్రధాన కార్యదర్శులు పోస్టులున్నాయి. -
వెనుకబడిన జిల్లాలంటే నిర్లక్ష్యమా?
సాక్షి, అమరావతి: రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి కేంద్రం ఇచ్చిన నిధులను వ్యయం చేయడంలో చంద్రబాబు సర్కారు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. ఆ వ్యయానికి చెందిన లెక్కలను కూడా సక్రమంగా చెప్పడం లేదు. వీటిని నీతి ఆయోగ్ బయ టపెట్టింది. లెక్కల్లో వ్యత్యాసాలు ఉన్నాయ ని, వాటికి వివరణ ఇస్తేనే తదుపరి నిధులు విడుదల చేస్తామని స్పష్టం చేసింది. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి కేంద్రం ఇచ్చిన నిధులకు వాస్తవ లెక్కలతో పాటు చేపట్టిన పనుల్లో వ్యత్యాసాలపై వివరణ ఇవ్వాలని నీతి ఆయోగ్ డైరెక్టర్ జె. కిశోర్ శర్మ బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్ కుమార్‌కు లేఖ రాశారు. కేంద్ర నిధుల్లో ఇంకా రూ. 279.92 కోట్లకు వినియోగ పత్రాలను పంపించాలని స్పష్టం చేశారు. విశాఖ జిల్లాలో 2016–17 ఆర్థిక సంవత్సరంలో మంజూరు చేసిన పనుల సంఖ్య తొలుత చెప్పిన దానికి ఆ తరువాత చెప్పిన దానికంటే ఎందుకు తగ్గాయని ఆ లేఖలో నీతి ఆయోగ్ ప్రశ్నించింది. ఈ ఏడాది జనవరిలో వైఎస్సార్ జిల్లాలో 1,257 పనులు పూర్తయినట్లు నివేదిక పంపారని, గత నెలలో పంపిన నివేదికలో పూర్తయిన పనులు 394 మాత్రమేనన్నారని ఇంత వ్యత్యాసం ఎందుకు వచ్చిందో చెప్పాలంది. అలాగే విశాఖ జిల్లాలో కూడా పనులు ఎందుకు తగ్గిపోయాయని నిలదీసింది. చిత్తూరు జిల్లాకు రూ. 101.93 కోట్లను విడుదల చేస్తే కేవలం రూ. 51.31 కోట్లే వినియోగించడానికి, లెక్కల వ్యత్యాసాలకు కారణాలు ఏమిటో వివరణ ఇవ్వాలని, అప్పుడే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రూ. 350 కోట్లు విడుదలపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంటుందని నీతి ఆయోగ్ డైరెక్టర్ స్పష్టం చేశారు. ఈ జిల్లాలకు గత మూడేళ్ల కాలంలో మంజూరు చేసిన పనుల్లో సగం కూడా పూర్తి చేయక పోవడం గమనార్హం. -
ఆస్తులపై ఆదేశాలను ఉపసంహరించుకోండి
కేంద్ర హోంశాఖ కార్యదర్శికి ఏపీ సీఎస్ ఘాటైన లేఖ సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర పునిర్వభజన చట్టం షెడ్యూల్ పదిలోని సంస్థల ఆస్తులు, అప్పులు పంపిణీపై ఇటీవల కేంద్ర హోంశాఖ జారీ చేసిన ఆదేశాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్ తీవ్రంగా స్పందించారు. ఎక్కడి ఆస్తులు అక్కడే అంటూ కేంద్ర హోంశాఖ జారీ చేసిన ఆదేశాలను తక్షణం ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అంతే కాకుండా ఉన్నత విద్యా మండలి ఆస్తులు, అప్పుల విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేసేందుకు వీలుగా ఆదేశాల జారీ చేయాలని కేంద్ర హోంశాఖను డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ మహర్షికి ఘాటైన లేఖ రాశారు. ఉన్నత విద్యా మండలి ఆస్తుల విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్లకు అనుగుణంగా ఉందని, చట్టంలోనే ఆస్తులు, అప్పులను జనాభా నిష్పత్తిలో పంపిణీ చేసుకోవాలని ఉందని కేంద్ర హోంశాఖ కార్యదర్శికి రాసిన లేఖలో దినేశ్ కుమార్ పేర్కొన్నారు. అయితే సుప్రీం తీర్పును అమలు చేయకుండా కేంద్ర హోంశాఖ ఎక్కడి ఆస్తులు అక్కడే అంటూ ఆదేశాలు ఇవ్వడం సుప్రీం తీర్పునకు విరుద్ధమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఎక్కడి ఆస్తులు అక్కడే అంటూ జారీ చేసిన ఆదేశాలను ఉపసంహరించుకోవడంతో పాటు సుప్రీం తీర్పునకు అనుగుణంగా పదవ షెడ్యూల్ సంస్థల ఆస్తులు, అప్పులు పంపిణీ చేసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేయాల్సిందిగా కోరారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్ 48తో పాటు 47 కూడా చూడాలని, ఇందుకు అనుగుణంగానే స్థిర, చరాస్తులతో పాటు భూమి, స్టోర్స్, ఆర్టికల్స్ ఇతర వస్తువులను ఇరు రాష్ట్రాల మధ్య పంపిణీ చేసుకోవాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రానికి హైదరాబాద్ రాజధానిగా ఉన్నందున అన్ని ఆస్తులు తెలంగాణలోనే ఉంటాయని, రాష్ట్రం విడిపోయినందున ఏపీకి ఏమీ రావని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే సుప్రీం కోర్టు తీర్పులో రాష్ట్ర పునర్విభజన చట్టంలోని 48, 47 సెక్షన్ల మేరకు ఆస్తులతో పాటు అప్పులు, ఆర్థికపరమైన సర్దుబాటు ఉన్నట్లు పేర్కొన్న విషయాన్ని లేఖలో గుర్తు చేశారు. -
తెలంగాణకు విద్యుత్ ఆపేద్దాం!
సీఎస్‌తో సమావేశంలో అధికారులు సాక్షి, అమరావతి: తెలంగాణకు విద్యుత్ నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉన్నతాధికారులు సూత్రప్రాయంగా నిర్ణయించుకున్నారు. ఏపీకి రావాల్సిన బకాయిలపై అవసరమైతే కేంద్రానికి ఫిర్యాదు చేయాలని నిశ్చయించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ నేతృత్వంలో వెలగపూడిలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య ఉన్న విద్యుత్ వివాదాలపై చర్చించారు.